Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మసీదుల వద్ద పరిశుభ్రంగా ఉంచండి

$
0
0

నెల్లూరు , ఆగస్టు 12: రంజాన్‌మాసం సందర్భంగా మసీదుల వద్ద పరిసరాలను వీలైనంతవరకు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని నగర శాసనసభ్యులు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆదేశించారు. ఆదివారం ఇరువురు ఎమ్మెల్యేలు స్థానిక బాలాజీనగర్‌లోని పెద్ద మసీదు, చిన్న మసీదుల వద్ద శానిటేషన్, మంచినీటి సౌకర్యాలను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కాలువలను అన్ని చోట్ల శుభ్రం చేయాలని కేవలం మసీదుల వద్ద శుభ్రం చేసి మిగతాచోట్ల వదిలివేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మసీదు చుట్టుపక్కల వీధులను పరిశీలించారు. పైపు లైన్లుకోసం తవ్వివేసి ప్యాచ్ వర్కులు చేయకపోవడాన్ని గమనించి రెండురోజుల్లో ప్యాచ్ వర్కులు పూర్తి చేయాలన్నారు. గ్యాంగ్‌మెన్‌ను పెట్టి కాలువల్లో సిల్ట్ తీయించాలని తీసిన సిల్టును అక్కడే వదిలేయకుండా ట్రాక్టర్ల ద్వారా తొలగించాలన్నారు. ఈకార్యక్రమంలో రాజకుమార్, సందానిబాషా,ఖాజామోహిద్దీన్, షమీమ్, ననే్నసాహెబ్, కొట్టె వెంకటేశ్వర్లు, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

ఇరుకళల పరమేశ్వరి ఆలయం వద్ద టూరిజం యాక్టివిటీస్‌కు నిధులు మంజూరు
నెల్లూరు , ఆగస్టు 12: సింహపురి గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద టూరిజం యాక్టివిటీస్, ల్యాండ్ స్కేపింగ్, ఫెన్సింగ్, బిల్డింగ్ నిర్మాణం, ఆడిటోరియం నిర్మాణానికి టూరిజం కార్పొరేషన్ ద్వారా 2కోట్లరూపాయల నిధులు మంజూరు చేసినట్టు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. ఆదివారం నగర శాసనసభ్యులు ముంగమూరుతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆనం మాట్లాడుతూ 13వ శతాబ్దంలో నిర్మించిన ఇరుకళల పరమేశ్వరి ఆలయం బొంతరాళ్లతో నిర్మించిన కారణంగా ఇకపై ఈ ఆలయంలో అభివృద్ధి పనులన్నీ బొంతరాళ్లతో చేస్తామన్నారు. ఆనం రామానారాయణరెడ్డి పర్యాటక శాఖామంత్రిగా ఉన్నప్పుడు 60లక్షల రూపాయల వ్యయంతో పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. తిరిగి ఇప్పుడు మంత్రి సహకారంతో 2కోట్ల రూపాయలు టూరిజం కార్పొరేషన్ ద్వారా వచ్చాయన్నారు. 13వ ఆర్ధిక సంఘం ద్వారా 15లక్షల రూపాయల నిధులు విడుదలయ్యాయన్నారు. ఈ మొత్తం నిధులను ఆలయం అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పారు. భక్తులు అంబలి, పొంగళ్లు, మొక్కుబడులు తీర్చుకోవడానికి వీలుగా భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మిస్తామన్నారు. ఆడిటోరియం నిర్మిస్తామని చెప్పారు. ఆలయ మండప ముఖద్వారాలు, దేవాలయ ముఖద్వారాలు నిర్మిస్తామని పూర్వపు శోభ తగ్గకుండా నిర్మాణం చేస్తామన్నారు. ఇందుకు ఆర్కియాలజీ సలహా కూడా తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, టూరిజం, ఆర్కియాలజీ శాఖలు ఆలయ నిధుల వినియోగంలో పాల్గొంటాయన్నారు. నగరంలోని రాజరాజేశ్వరి ఆలయం, మూలపేట శివాలయం, రంగనాయకులపేట ఆలయాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నగరశాసనసభ్యులు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి సహకారంతో పూర్తి చేశామని అదేవిధంగా నవాబుపేట శివాలయం, నగరంలోని ఇతర ఆలయాలు కూడా అభివృద్ధి చేస్తామన్నారు. శ్రీ్ధరకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు తో నగరాభివృద్ధి చేయగలుగుతున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మాణాలు ఏ విధంగా చేయాలో పంచాయతీరాజ్ శాఖాధికారులతో చర్చించారు. ఈకార్యక్రమంలో మదన, మాధవాచారి, హరి, అలహరి విజయ, దిలీప్, ఇఓ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు
నెల్లూరు , ఆగస్టు 12: నారాయణ హాస్పిటల్ సహకారంతో ఎన్‌ఎండి చారిటీస్‌లో ఆదివారం చిన్న పిల్లల వ్యాధి నిపుణులు డాక్టర్ భరత్ 50మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేశారు. ఈసందర్భంగా డాక్టర్ భరత్ మాట్లాడుతూ వైద్య శిబిరం ద్వారా పిల్లల తల్లిదండ్రులకు పిల్లల వ్యాధుల పట్ల అవగాహన కలిగించామన్నారు. ఎన్‌ఎండి చారిటీస్ చైర్మన్ సయ్యద్ నిజాముద్దీన్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉచితంగా నిర్వహించే వైద్యశిబిరాలను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో సయ్యద్ పాషామొహిద్దీన్,షేక్, జహీర్, ఉమర్, సీతారామయ్య, మీరామొహిద్దీన్, రఫి, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.

వానమామలై వరదాచారిని విశ్వకవిగా గుర్తించాలి
నెల్లూరు , ఆగస్టు 12: అభినవ పోతన వానమామలై వరదాచార్యులు తెలంగాణలోని వరంగల్లు ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ ఆయన్ని విశ్వకవిగా గుర్తించాలని రాష్టప్రతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రిటైర్ట్ సంస్కృత అధ్యాపకులు బండి విశ్వనాధం పేర్కొన్నారు. నెల్లూరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక హోటల్ సప్తగిరి కాన్ఫరెన్స్ హాలులో అభినవ పోతన వానమామలై వరదాచారి శతజయంతిని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న విశ్వనాధం మాట్లాడుతూ వానమామలై రచించిన పోతన చరిత్రలో వరదాచార్యులు తనను పోతనగా అభివర్ణించుకుని రచించారన్నారు. ఆయన రచించిన కావ్యాలలోని పలు పద్యాలను ఈసందర్భంగా బండి చదివి వినిపించారు. వరదాచార్యులు పోతన చరిత్రను రచించడానికి దాదాపు 12ఏళ్ల సమయం పట్టిందని ముద్రణకు మరో 12సంవత్సరాలు పట్టిందని చెప్పారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న పద్యకళాపరిషత్ అధ్యక్షులు మెట్టు రామచంద్రప్రసాద్ మాట్లాడుతూ వానమామలై ఆంధ్ర దేశం గర్వించదగిన కవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అధినేత వి చంద్రవౌళి మాట్లాడుతూ వరదాచారి జయంతి రోజైన ఆగస్టు 16న ప్రభుత్వం తెలుగుభాషా పద్య దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశానికి నెరసం అధ్యక్షులు ఎ జయప్రకాష్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ప్రధాన వక్త బండి విశ్వనాధంను నెరసం పక్షాన ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో నెరసం ప్రధాన కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ, కోశాధికారి మాటేటి రత్న ప్రసాద్, నెరసం సభ్యులు డిటి హరికృష్ణ, వి రాజగోపాల్‌రెడ్డి, సుందరేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు.

మిషనరీస్‌ఆఫ్ చారిటీస్‌కు 10వేలు విరాళం
నెల్లూరు , ఆగస్టు 12: హృదయ స్పందన సమర్పణలో ఇటీవల టౌన్‌హాలులో చిత్రకళా ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా నిర్వాహకులు నెల్లూరు జాయింట్ రిజిస్ట్రార్ పూడి నరేంద్ర, చిత్రకారులు బి కళాసాగర్ స్థానిక భక్తవత్సలనగర్‌లోని మదర్‌థెరెసా మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌లో ఉన్న అసహాయుల సహాయార్థం 10వేల రూపాయల నగదు అందచేశారు. ఈమేరకు నగదు, ప్రదర్శన సందర్భంగా సందర్శకులు సమర్పించిన కానుకలతో కలిపి ఆదివారం చారిటీస్ నిర్వాహకులకు అందచేశారు.

ఆవాజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
నెల్లూరు , ఆగస్టు 12: ఆవాజ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆటోనగర్‌లోని మైనార్టీస్ రెసిడెన్సీ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు చెందిన వైద్యబృందం వైద్యశిబిరంలో పాల్గొని చిన్నారులను పరీక్షించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా అవసరమైనవారికి మందులు అందచేశారు. ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై డాక్టర్ దత్తాత్రేయులు వివరించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, ఆవాజ్ నగర నాయకులు ఎస్‌ఎం బాషా, ఎస్‌కె జిలానీ, డాక్టర్లు ఆంజనేయులు, కృష్ణప్రసాద్, రామిరెడ్డి, ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎస్‌కె రియాజ్,ఎస్‌కె రషీద్, ఎస్‌డి రఫి తదితరులు పాల్గొన్నారు.

కళాకారులను ఆదరించాలి
నెల్లూరు , ఆగస్టు 12:కళారంగంలో ఎందరో కళాకారులు కళారంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నారని వృద్ధాప్యంలో వారు ఆదరణ లేక ఆర్ధాకలితో పస్తులుంటున్నారని అలాంటి కళాకారులను ఆదుకోవాలని ప్రముఖ గాయకులు పాటూరు శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. కేతా అంకులు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సుబేదారుపేటలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పాటూరు మాట్లాడుతూ వృద్ధ కళాకారులు ప్రభుత్వం ఇచ్చే 5వందల రూపాయల పెన్షన్ సరిపోక అర్ధాకలితో అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్నారని చెప్పారు. పెన్షన్‌ను వెయ్యిరూపాయలకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సేవకుడు ముదిగొండ శ్రీనివాసులు మాట్లాడుతూ పేదల కోసం నిధిని ఏర్పాటుచేసి ఆదుకుంటామన్నారు. ఈసందర్భంగా గాయకుడు దుర్గం మధుసూధనరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కొమ్మన సీతారామస్వామి, కళాకారులు పాల్గొన్నారు. కేతా ట్రస్టు వ్యవస్థాపకులు కేతా సుబ్బారావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్ట్భద్రత కల్పించాలి
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 12: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక బడ్జెట్‌లోఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుచేసి దళిత, బహుజనులను ఆదుకోవాలని దళిత విద్యార్థిసేన జిల్లా అధ్యక్షుడు అరవ పూర్ణప్రకాష్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్లను, సభ్యులను వెంటనే నియమించాలని, మురికివాడల్లో జీవిస్తున్న వారికి జెఎన్‌యుఆర్‌ఎం నిధులతో నిర్మిస్తున్న ఇళ్లు కేటాయించి ఆదుకోవాలని కోరారు. విలేఖర్ల సమావేశంలో దళిత నాయకులు వెంకయ్య,వెంకట్, శ్రీనివాసులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషి చేయాలి
నెల్లూరు కల్చరల్, ఆగస్టు 12: ముదిరాజ్ కులస్థుల్లో ఎక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారని అలాంటివారిని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎ బాలకోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆమని గార్డెన్సలో ముదిరాజ్ సేవా సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం, ముదిరాజ్ కులస్తుల ఉచిత వివాహ పరిచయ వేదిక జరిగాయి. ఈసందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 46 మండలాల్లో తాము పర్యటించినపుడు ఎక్కువ శాతం ముదిరాజ్ కులస్థులు పేదరికంలో ఉన్నట్టు గుర్తించామన్నారు. వివాహ పరిచయవేదిక ప్రతి ఆదివారం నిర్వహిస్తామన్నారు. ముదిరాజ్ కులస్థులు ఐక్యంగా ఉండి అందరి సమస్యలు తీర్చేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని కోరారు. ఈకార్యక్రమంలోకార్యదర్శి సురేష్, రమణయ్య, సూరిబాబు, మురళి, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, రవి, వెంకటాచలం, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ కిషోర్, డాక్టర్ చైతన్య, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు సంఘం, సభ్యులు పాల్గొన్నారు.

,

* ఎమ్మెల్యేలు ఆనం, ముంగమూరు ఆదేశం
english title: 
masjid

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>