కనిగిరి , ఆగస్టు 12: రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయని, అధికారపార్టీ కాంగ్రెస్‌పాలన అధ్వాన్నంగా ఉందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ సిద్ధా రాఘవరావు ఆరోపించారు. ఆదివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార కాంగ్రెస్‌పార్టీ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందిందని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. వ్యాట్‌టాక్స్ పెంపు కారణంగా వ్యాపారస్తులు రోడ్డున పడ్డారని, అలాగే నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచిందన్నారు. వాన్‌పిక్ ఒప్పందాన్ని రద్దుచేయాలని, వాన్‌పిక్‌పై టిడిపి పోరాటాలు ఉద్ధృతం చేస్తుందని, వాన్‌పిక్ వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఆయన ఆరోపించారు. తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వస్తే వ్యాట్‌టాక్స్ ఎత్తివేతకు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు అధికమయ్యాయని, వేళాపాళాలేని విద్యుత్‌కోతలు, గంటల తరబడి విద్యుత్ కోతల కారణంగా పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమది రైతుల ప్రభుత్వం అని గొప్పలుచెప్పుకునే కాంగ్రెస్ ఆరైతుల అభ్యున్నతికి కృషి చేయక రైతాంగాన్ని నష్టాల ఊబిలోకి తోసివేసిందన్నారు. రైతులకు 9గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత తెలుగుదేశంపార్టీదేనని, రైతుల అభ్యున్నతికి టిడిపి పోరాటాలు చేపడుతుందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలలో బిసిలకు 100సీట్లు కేటాయించడం ఆనందదాయకమని, అలాగే ముస్లిం, మైనార్టీలకు సముచిత స్థానం ఇచ్చిన ఘనత టిడిపిదేనన్నారు. టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కదిరి బాబూరావు మాట్లాడుతూ గత ఎన్నికలలో సానుభూతి పవనాలు ఎక్కువగా ఉన్నాయని, 2014లో టిడిపి ఘన విజయం సాధిస్తుదంని, అన్ని వర్గాల ప్రజలలో టిడిపిపై ఆదరణ ఎక్కువగా ఉందని, అన్ని ప్రాంతాలలో తెలుగుదేశంపార్టీ పటిష్టంగా ఉందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ వాణిజ్యవిభాగం జిల్లా నాయకులు ఎస్.సుబ్బారావు, టిడిపి నాయకులు బేరి పుల్లారెడ్డి, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, డి.రఘునాధకాశిరెడ్డి, కటకం చలపతిరావు, ఎరీక్షన్‌బాబు, గవదగట్ల మాలకొండయ్య, ఆర్.శ్రీనివాసరెడ్డి, ఫయాజ్, షేక్ బుజ్జా, షేక్ మస్తాన్‌వలి, బారాహిమామ్ తదితరులు పాల్గొన్నారు.
* టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ సిద్ధా రాఘవరావు
english title:
development
Date:
Monday, August 13, 2012