ఒంగోలు , ఆగస్టు 12: యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా యువనేత రాహుల్‌గాంధీ సూచనల మేరకు త్వరలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఒంగోలు పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా తెలిపారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు తయారుచేసినట్లు చెప్పారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని 34 మండలాలలో ఈ శిక్షణా తరగుతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందుగా శిక్షణా తరగతులు నిర్వహించేందుకు విద్యార్హత కలిగిన 30 సంవత్సరాలు పైబడిన ఆసక్తిగల వారిని మాస్టర్ కోచ్‌లుగా ఎంపిక చేస్తున్నామన్నారు. వారందరికి సరైన శిక్షణ ఇచ్చి ఆ తరువాత యువజన కాంగ్రెస్ నాయకులు, మాస్టర్ కోచ్‌లతో కలిసి పార్లమెంట్ పరిధిలోని 34 మండలాలలో పర్యటించి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. మాస్టర్ కోచ్‌లుగా వెళ్ళడానికి ఆసక్తిగలవారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నేతలు బంకా చిరంజీవి, బి ఆర్ గౌస్, హనీఫ్, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా యువనేత రాహుల్‌గాంధీ
english title:
training clases
Date:
Monday, August 13, 2012