హైదరాబాద్, ఆగస్టు 24: రాబోయే మూడేళ్లలో రూ.150 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కాబ్ సేవలను విస్తరించనున్నట్లు కార్జ్ ఆన్ రెంట్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. శుక్రవారం నాడిక్కడ ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ, సెల్ఫ్ డ్రైవ్ సర్వీసులను ప్రారంభించిన సంస్థ మేనేజింగ్ డైరక్టర్ రాజీవ్ విజె విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఓ కంపెనీ భారత దేశంలో ఈ విధమైన అసంఘటిత విభాగంలో నాణ్యమైన సేవలందించేందుకు ప్రవేశించడం ఇదే తొలిసారి అని తెలిపింది. తమ కంపెనీ ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి రూ.250 రాబడిని ఆర్జించిందని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా ఇంటర్‌సిటీ ట్రావె ల్ మార్కెట్ 5000 మిలియన్ రూపాయల వరకు ఉండవచ్చని అంచనా ఉందని అన్నారు. గత నాలుగున్నరేళ్లగా ఈసీ క్యాబ్స్ పేరుతో రేడియో టాక్సీ సేవలను అందిస్తున్న తమ కంపెనీ ఇంటర్‌సిటీ, ఇంట్రా సిటీ, సెల్ఫ్ డ్రైవ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో 20 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 2000 సంవత్సరంలో ఈ రంగంలో అడుగుపెట్టిన సంస్థ ప్రస్తుతం 17 నగరాలు, 7 అతిపెద్ద విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు.
రాబోయే మూడేళ్లలో రూ.150 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడం
english title:
ra
Date:
Saturday, August 25, 2012