హైదరాబాద్, ఆగస్టు 24: నాణ్యమైన విద్యుత్ ఉత్పాదనకు, వినియోగానికి ప్రభుత్వం, పరిశ్రమలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అన్నారు. విద్యుత్ వినిమయం, యాజమాన్యంపై పరిశ్రమలు దృష్టిపెట్టాలని ఆమె కోరారు. సక్రమంగా విద్యుత్‌ను వినియోగించుకోకపోవడం, దుబారా వల్ల 20 శాతం విద్యుత్ వృథాఅవుతోందన్నా రు. విద్యుత్‌ను ప్రమాణాలతో వినియోగించుకోవడం అనే అంశంపై సిఐఐ శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు విద్యుత్‌ను వినియోగించుకునే విషయమై పర్యవేక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమలు ఎనర్జీ ఆడిట్‌ను అమలు చేయాలన్నారు. దీని వల్ల విద్యుత్ దుబారాను నిలువరించవచ్చన్నారు. పవన, సౌర విద్యుత్ రంగాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు.
ఈ తరహా విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ మాట్లాడుతూ ప్రభుత్వం, పరిశ్రమలు, వినియోగదారులు ఏకత్రాటిపైకి వచ్చి విద్యుత్ సంరక్షణకు కృషిచేయాలన్నారు. ఇంధన వృథాపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు.
జపాన్‌కు చెందిన జెట్రో సంస్ధ చీఫ్ డైరెక్టర్ జనరల్ వై యమ్దా మాట్లాడుతూ వినియోగదారులకు ఇంధనాన్ని ఆదా చేసే పరికరాలు ఇవ్వాలన్నారు. గత రెండు దశాబ్ధాలుగా జపాన్ ప్రభు త్వం ఈ రంగంలో కృషి చేస్తోందన్నారు.
* సిఐఐ సదస్సులో మిన్ని మాథ్యూ సూచన
english title:
v
Date:
Saturday, August 25, 2012