న్యూఢిల్లీ, ఆగస్టు 24: రానున్న రెండునెలల్లోగా 60 కోట్ల డాలర్ల మూ లధనాన్ని సమకూర్చని పక్షంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూసివేయాల్సిన పరిస్థితి రాగలదని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (సిఏపిఏ) తెలిపింది. ప్రమోటర్ రోజువారీగా నిధులు సమకూర్చిన ఫలితంగా కింగ్‌ఫిషర్ ఇప్పుడు పనిచేయగల్గుతోంది. అయితే ముందుముం దు నష్టాలు పెరిగిపోతే పరిస్థితి ఇలాగే కొనసాగదు. 2012-13 తొలి క్వార్టర్‌లో కంపెనీ ప్రమోటర్లు 133.9 మిలియన్ డాలర్లు ఇనె్వస్ట్ చేశారు. కానీ ఎయిర్‌లైన్స్ మనుగడ సాగించడానికి ఇది ఏమాత్రం సరిపోదని భారత విమానయాన రంగం తొలి త్రైమాసిక పనితీరుపై వెల్లడించిన ఒక నివేదికలో సిఏపిఏ పేర్కొంది. నిర్ధిష్ట పెట్టుబడుల విధానం లేకపోతే కింగ్‌ఫిషర్ టర్నెరౌండ్ సాధించడం కష్టమని నివేదిక తెలిపింది. రానున్న రెండునెలల్లోగా సుమారుగా 60 కోట్ల డాలర్ల పెట్టుబడులు చేయని పక్షంలో కింగ్‌ఫిషర్ నిర్వహణ మూతపడే స్థితి వస్తుందని, అయితే ఇది తాత్కాలికం కావచ్చునని సిఏపిఏ తెలియజేసింది. ఎయిర్‌లైన్స్ పునర్‌నిర్మాణం వల్ల ఇప్పటికే భారీ ఎక్స్‌పోజర్ కలిగివున్న బ్యాంకులకు మరింత భారం కాగలదని పేర్కొంది. కాగా, కింగ్‌ఫిషర్ మార్కెట్ వాటా గత జూన్ నాటికి 3.4 శాతానికి దిగజారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ మొత్తం నష్టాలు 220- 260 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగలవని నివేదిక అంచనా వేసింది. అలాగే ఈఏడాది జూన్ క్వార్టర్‌లో కంపెనీ రూ.650.78 కోట్ల నష్టాన్ని ప్రకటించడం తెలిసిందే.
* సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ నివేదిక వెల్లడి
english title:
moo
Date:
Saturday, August 25, 2012