Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

54 కోల్ బ్లాకుల వేలం

న్యూఢిల్లీ, ఆగస్టు 24: సుదీర్ఘ ప్రక్రియ జరగాల్సివున్న కారణంగా ఈ ఏడాది 54 బొగ్గు బ్లాకుల వేలం సాధ్యం కాదని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ తెలియజేశారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ పద్ధతిన కోల్ బ్లాకుల కేటాయింపు ఈఏడాదిలో సాధ్యపడే అవకాశం లేదని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో చెప్పారు. మా ప్రభుత్వం పారదర్శక విధానాన్ని విశ్వసిస్తుంది. వేలం పద్ధతిన కేటాయించబోయే అన్ని కోల్ బ్లాకులను గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. 54 బొగ్గు బ్లాకుల వేలానికి రిజర్వ్ ధర నిర్ణాయక విధానంపై క్రిసిల్ తమ నివేదికను సమర్పించగానే బిడ్డింగ్ ప్రక్రియను మొదలుపెడతామని తెలిపారు. వేలం ప్రక్రియ యావత్తూ ఖచ్చితంగా, పారదర్శకంగా కొనసాగుతుందన్నారు.

ఈ ఏడాది సాధ్యం కాదు: జైస్వాల్
english title: 
54 cole

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>