ముంబయి, ఆగస్టు 24: వడ్డీరేట్లతో ముడిపడిన రియల్టీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన పలు షేర్లలో అమ్మకాలతో శుక్రవారం స్టాక్‌మార్కె ట్ ఒడిదుడుకుల మధ్య సాగింది. ప్రధాన సూచీలు నష్టాలు నమోదు చేశాయి. పార్లమెంటులో చల్లారని బొగ్గు గొడవ, రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్లలోని బలహీన సంకేతాలు దేశీయ విపణిలో సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ఆర్థిక సంస్కరణలు ముందుకుసాగే అవకాశాలు దాదాపు శూన్యమనే నిరాశ మార్కెట్ వర్గాలను చుట్టుముట్టింది. ఈరోజు ఒకదశలో 125 పాయింట్లు క్షీణించిన బిఎస్‌ఇ సెనె్సక్స్ సెషన్ చివర్లో పాక్షికంగా కోలుకుంది. చివరికి 67.01 పాయింట్ల నష్టంతో 17,783.21 వద్ద క్లోజైంది.
అదేవిధం గా ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 28.65 పాయింట్లు తగ్గి 5386.70 వద్ద ముగిసింది. ద్రవ్య విధాన చర్యలకు ద్రవ్యోల్బణం కేంద్రబిందువు అని రిజర్వ్ బ్యాంక్ గురువారం చేసిన ప్రకటన బేరిష్ సెంటిమెంట్‌కు దారితీసిందని బ్రోకర్లు పేర్కొన్నారు. ఇనె్వస్టర్లు, ఫండ్స్ రియల్టీ, బ్యాంకింగ్, ఆటో షేర్లలో లాభాల స్వీకరణ జరిపారని వీరు తెలిపారు. ఇన్ఫోసిస్, రిల్, ఐసిఐసిఐ, టాటాస్టీల్, ఎల్ అండ్ టి, ఎస్‌బిఐ, మహీంద్ర వంటి కీలక షేర్ల క్షీణ త మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది. ఓఎన్‌జిసి, ఐటిసి, కోల్ ఇండియా షేర్లకు లాభాలు మార్కెట్ స్వల్ప రికవరీకి తోడ్పడ్డాయి. సెనె్సక్స్ గ్రూప్‌లోని 17 కౌంటర్లు నష్టపోగా, 13 కౌంటర్లు లాభాలు నమోదు చేశాయి.
*సెనె్సక్స్ మరో 67 పాయింట్లు డౌన్
english title:
r
Date:
Saturday, August 25, 2012