న్యూఢిల్లీ, ఆగస్టు 24: జపాన్‌కు చెందిన విఖ్యాత కార్ల కంపెనీ టయోటా మోటార్ తమ సరికొత్త నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం సెడాన్ కారును శుక్రవారం భారత విపణిలోకి విడుదల చేసింది. కేమ్రి పేరు గల ఈ మోడల్‌ని రూ.23.8 లక్షల ప్రారంభ ధర (్ఢల్లీ ఎక్స్‌షోరూమ్) వద్ద అందుబాటులో వుంచారు. కిర్లోస్కర్ గ్రూప్‌తో కలిసి ఉమ్మడిగా భారత్‌లో కార్యకలాపాలు జరిపే టయో టా కొత్త కేమ్రి కార్లను తమ బెంగళూరు ప్లాంటులో అసెంబ్లింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఏడవతరం కేమ్రి మోడల్. దీన్ని భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయాలని తలపెట్టామని టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఎండీ హిరోషి నకగవా శుక్రవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈకారు పది ప్రాంతాల్లో తయారుచేస్తున్నామని, బెంగళూరు 11వ ఉత్పత్తి కేంద్రం అవుతుందని వివరించారు. కేమ్రి ఒక్క పెట్రోల్ వెర్షన్ మాత్రమే లభిస్తుందని టికెఎం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్‌సింగ్ ఈ సందర్భంగా వెల్లడించారు.
జపాన్‌కు చెందిన విఖ్యాత కార్ల కంపెనీ టయోటా మోటార్ తమ సరికొత్త నెక్స్ట్ జనరేషన్ ప్రీమియం సెడాన్ కారును
english title:
b
Date:
Saturday, August 25, 2012