న్యూఢిల్లీ, ఆగస్టు 24: లిస్టెడ్ కంపెనీలకు చెందిన ఉద్యోగ సంక్షేమ ఫథకాలు, ట్రస్ట్‌లు సెకండరీ మార్కెట్ నుంచి తమ కంపెనీ షేర్లు కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తున్నట్లు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబి శుక్రవారం ప్రకటించింది. అలాగే ఎంప్లాయి స్టాక్ ఆప్షన్ స్కీమ్ (ఇఎస్‌ఒఎస్), ఎంప్లాయి స్టాక్ పర్చేజ్ స్కీమ్ (ఇఎస్‌పిఎస్) మార్గదర్శకాల పరిధిలోకి వీటిని చేర్చేందుకు షేర్ల కొనుగోళ్లతో ప్రమేయం ఉన్న తమఉద్యోగ సంక్షేమ పథకాల గురించిన పూర్తి వివరాలు తమకు తెలియజేయాలని సెబి లిస్టెడ్ కంపెనీలను ఆదేశించనుంది. సెబి ఇఎస్‌ఒఎస్, ఇఎస్‌పిఎస్ మార్గదర్శకాలు లిస్టెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ స్కీముల ద్వారా రివార్డులు ఇచ్చేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగ సంక్షేమ స్కీములు, ట్రస్ట్‌లకు తామే నిధులు కల్పించి తమ సెక్యూరిటీల నిర్వహణకు ప్రేరేపిస్తూ షేర్ల ధరలపై ప్రభావం చూపేందుకు అక్రమ లావాదేవీలకు పాల్పడతాయన్న ఆందోళనతో సెబి ఈవిధానాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మూలధనం తగ్గింపునకు లేదా కొన్ని రెగ్యులేటరీ అవసరాలకు తప్పితే కంపెనీలు తమ సొంత షేర్లను కొనుగోలు చేయడాన్ని సెబి నిబంధనలు అనుమతించవు.
కంపెనీ షేర్లు, లేదా హోల్డింగ్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు సదరు సంస్థలు ఎలాంటి రుణాలు, హామీలు, ఇతర ఆర్థికపరమైన సహకారం చేయడాన్ని కూడా ఈ నిబంధనలు అనుమతించవు. అయితే ఉద్యోగుల సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటుకు నిధులు సమకూర్చితే, ట్రస్ట్ ఆ నిధులతో తమ కంపెనీ లేదా హోల్డింగ్ కంపెనీకి చెందిన షేర్లను కొనుగోలు చేయడానికి సెబి ఈ నిబంధనలు వర్తించవు. ఉద్యోగ సంక్షేమ స్కీములు, ట్రస్ట్‌లు సెబి ఇఎస్‌ఒఎస్, ఇఎస్‌పిఎస్ మార్గదర్శకాల పరిధిలోకి రానందున, దీనివల్ల కంపెనీ ప్రమోటర్లు అదనపు ఓటింగ్ హక్కుల కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ట్రస్ట్‌లపై నియంత్రణ కలిగివుంటాయని సెబి భావిస్తోంది.
లిస్టెడ్ కంపెనీలకు చెందిన ఉద్యోగ సంక్షేమ ఫథకాలు,
english title:
u
Date:
Saturday, August 25, 2012