లోచన అక్షర భాషలోకి రావడమే ఒక అనువాదం
అది శబ్దరూపంగా, దృశ్యమయంగా మారడం
అనువాదానికి చేసిన అనువాదం
జంత్ర వాద్య సమ్మేళనమంతా
నరాల మీద నర్తించే హృదయానువాదం
అనువాదం- రెండు ముఖాలున్న నాణెం’’ అని అంటానే్నను. నా దృష్టిలో అనువాదం సులభమైన ప్రక్రియ కాదు. ఎంతో బరువుబాధ్యతలతో కూడుకున్న పని. ఈ కష్టమైన పనిని తెలుగులో ఎంతోమంది సమర్ధవంతంగా నిర్వహించారు. కొంతమంది ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. అన్ని ప్రక్రియల్లో అనువాద రచనలు వస్తూ ఉన్నా కవిత, కథ మాత్రం కొంచెం ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. అటు విశ్వకవుల కవిత్వం, ఇటు భారతీయ కవుల కవిత్వం అనువాదాల ద్వారా తెలుగు పాఠకులకు అందుతూనే ఉంది. తెలుగు కవిత్వం అలరించినట్టుగానే వారిని అనువాద కవిత్వం కూడా అలరిస్తూనే ఉంది.
ఒక్కోసారి గొప్ప కవితకు గొప్ప అనువాదం లభిస్తే, తెలుగు కవిత్వాన్ని పక్కనపెట్టి, కవిత్వానువాదానికి తలలూపి, అనుభూతించిన సందర్భాలూ ఉన్నాయి. ఇది కవిత స్థాయినిబట్టి జరుగుతుంటుంది. తెలుగులో రాసినదైనా, దానికొక స్థాయి లేకపోతే, ఊహాశక్తి సరిపడినంత లేకపోతే, పదాలు అందంగా, ఒద్దికగా ఒదిగి భావాన్ని బహిర్గతం చేయకపోతే అది పాఠకులకు ఆనందాన్నివ్వదు. ఇతర భాషలో రాసిన కవితైనా ప్రతిభావంతుడైన అనువాదకుడి చేతిలో, మంచి తెలుగులో, తెలుగు వాతావరణానికి అనువుగా మారి, ఒక స్థాయినందుకుంటే... అది పాఠకులకు విపరీతంగా నచ్చుతుంది.
‘‘ఆమె వాకిట ధూళియగుదును అచటనే నన్నుంచుడీ
ఉదయ మలయానిలమునైనను ఊడ్చుటకు రానీకుడీ’’
ఇది అనువాద కవిత అంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కాని, ఇది మిర్జా అసదుల్లాఖాన్ గాలిబ్ ఉర్దూ కవితను మహాకవి దాశరథి తెలుగులోకి తెచ్చిన తీరు.
మూల రచనలో ఉన్న భావాన్ని ఏదో విధంగా మరో భాషలోకి మార్చినంత మాత్రాన అనువాదం పూర్తయినట్టు కాదు. అందులో ఎన్నో దశలున్నాయి. ఎడిట్ చేసుకోవాలి... సంక్షిప్తం చేసుకోవాలి. లేదా విస్తరం చేసుకోవాలి. అన్వయించుకోవాలి. మార్పులు, చేర్పులు చేసుకోవాలి. అంతా అయ్యాక సమతూకం చూసుకోవాలి. సరళంగా, సాఫీగా, రచన మూల భాషలో సాగినట్టు సాగుతుందా లేదా అనేది బేరీజు వేసుకోవాలి. ఇదంతా అనువాదకుడికి రెండు భాషల మీద సాధికారత ఉన్నప్పుడే జరుగుతుంది.
అనువాద రచన మూల రచనకు ఏమాత్రం తక్కువది కాదు. ఒక రకంగా అది సమాంతర సృజనాత్మకత. విభిన్న సంస్కృతుల మధ్య అనువాదకుడు సంధానకర్త అవుతాడు. ద్యిఇ్ఘజచ్ఘీఆజ్యశ యచి షఖఆఖూళ కు దారులు వేస్తాడు. ఇంతాచేస్తే ఏ అనువాదమూ పరిపూర్ణం కాదు. కాని మంచి అనువాదంకోసం నిరంతరం పరితపిస్తూ ఉండాలి. య్యజూ ఆ్ఘశఒ్ఘఆ్య జ్యూళఒ శ్యఆ ఛిజశజూ ఆ్దళ జదఆ త్యీజూ, దళ జ్పళఒ ఆ్దళ త్యీజూ.
‘‘ఒకానొక హృధయవేదనకు చేసిన
సరళమైన అనువాదం- కన్నీరు.
బాధను మరో భాషలోకి మార్చిన భాష- కవిత్వం
నిన్ను నువ్వు పోల్చుకుని చూసుకోవడానికి
అధ్యయనం చేసుకోవడానికి
అద్దపు అనువాదం కావాలన్నారు కొందరు
మానవ సేవే మాధవసేవగా
ప్రతిబింబిస్తుందన్నారు పెద్దలు’’-అన్న కవితా చరణాలు అనువాదకులకు శిరోధార్యం కావాలి!
ఉదాహరణకు మనమిక్కడ నోబెల్ గ్రహీత పాబ్లో నెరూడ కవితను పరిశీలిద్దాం. చిలీలో పుట్టిన లాటిన్ అమెరికన్ కవి పాబ్లో నెరూడ 1904-1973 మధ్యకాలంలో జీవించాడు. కవిత్వం ఏదో కొద్దిమంది ఉన్నత వర్గాలకోసం కాదని, మానవ ఇతిహాసంలోంచి మానవ సమైక్యతను సాధిస్తూ అశేష జనవాహినికోసం ముందుకు సాగాల్సిన ఒక జీవధార అని గుర్తెరిగాడు. కవిగా, చరిత్రకారుడిగా నిలబడ్డాడు. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత కమ్యూనిస్ట్‌పార్టీలో చేరిన నెరూడ తన దృక్పథంలో వచ్చిన మార్పులన్నీ కవిత్వంలో ప్రతిఫలింపజేశాడు. ఒక ‘పదం’ శీర్షికతో నెరూడ రాసిన కవితకు తెలుగు అనువాదం ఇలా ఉంది.
‘‘పదం అర్థంతో నిండిపోయింది
జీవితంతో పరిపక్వమయింది
ప్రతిదీ పుట్టుకతో శబ్దాలతో, స్పష్టతతో
చేయాల్సి ఉంటుంది
ఒక్కోసారి నడిపించడంతో, కూల్చడంతో
చావుతో కూడా చేయాల్సి ఉంటుంది.
మానవ పదం ఒక గుణితాక్షరం
విస్తరిస్తున్న వెలుగూ లలిత కళల మేలుకలయిక
అది రక్తపు వ్యవహార సరళి
ఇక్కడే నిశ్శబ్దమంతా మూటగట్టేది
ఇక్కడే మానవ పదం ఒక పరిపూర్ణతను సాధించేది
అందుకే కదా- మాట్లాడకపోవడమనేది
మనుషులకు మరణం లాంటిదయ్యిందీ?
పదాల ఆకృతి- మానవాకృతి లాంటిదేననుకుని
నేను పదాలమీదుగా వెళ్ళిపోతాను.
లోచన అక్షర భాషలోకి రావడమే ఒక అనువాదం
english title:
a
Date:
Monday, September 3, 2012