సాహితి’లో 27-8-12 నాటి ఎ.కె.ప్రభాకర్ వ్యాసం చదివాను. సాహిత్యం తునకలైపోతోందని బాధపడ్డారు. ఐతే ఎవరు చేశారు తునకలు? వర్గవాదులు నయాశిష్టుల్లా ప్రవర్తిస్తూ అందరినీ దూరం చేసుకుంటున్నారు. అస్తిత్వవాదుల, అణగారిన వర్గాల సహకారం లేకుండా ఉద్యమాలు సాధ్యమా? డెబ్బై ఏళ్ళనుండి జరుగుతున్న పోరాటాలలో ఓడిన పాళ్ళే ఎక్కువ. దళిత, గిరిజన, వెనుకబడిన ప్రజల త్యాగాలతో పేరుతెచ్చుకుని తమ అస్తిత్వం నిలుపుకుంటున్నారు. వాళ్ళు తమకు తాము ఒంటరి అయి, నున్న ముట్టకు నామాల కాకి అని దూరంగా ఉంటే ప్రజాస్వామ్య భావనకి స్థానం ఉందా. ఐక్యతకి గండికొట్టే వారి వైపునుండి మాట్లాడ్డం సబబుకాదు. జితెన్ మరాండి లాంటి వారి గురించి కావ్యాలు వచ్చాయి. వాటిని ప్రస్తావించకపోవడం పెద్ద లోపం. అస్తిత్వ వాదాలను గేలి చేస్తూ వారిని కలసి రమ్మనడం, స్పందించాలనడం నొసటితో వెక్కిరిస్తూ నోటితో రమ్మనడమే. కేవలం వర్గదృక్పథం తనంతకు తాను గొప్పది కాదు. సిద్ధాంతం ఆధిపత్యం నెరపడానికైతే దాన్ని స్వీకరించరు ప్రజలు. ప్రజల మన్నన పొందలేని వర్గవాదులు మరింత సంకుచితం కాక తప్పదు. - సాగి రామచంద్రరావు, హైదరాబాదు
సాహితి’లో 27-8-12 నాటి ఎ.కె.ప్రభాకర్ వ్యాసం చదివాను.
english title:
spandana
Date:
Monday, September 3, 2012