డెంగీ వ్యాధి నేడు ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించి బాధపెడుతున్నది. దీని నివారణకు 60 సంవత్సరాల క్రితమే హోమియో మందులను డాక్టర్ ‘మైత్రా’ అనువారు ‘టిస్యూ రెమిడీస్’ అనే గ్రంథంలో తెలిపియున్నారు. వాటి వివరాలను ఈ క్రింది విధముగా తెలిపియున్నారు (ఈ గ్రంథానికి విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ గారు 1940లో పరిచయము వ్రాసినారు).
1. జ్వరము ఉన్నప్పుడు- పెర్రంఫాస్, నేట్రిం సల్ఫులను మారుస్తూ ఇవ్వవలెను.
2. చర్మముపై మంటలున్నచో- కాలీసల్ఫు- నేట్రింసల్ఫు మారుస్తూ ఇవ్వవలెను.
3. తలకాయనొప్పికి- కాలీఫాసు- ఫెర్రంఫాసు మారుస్తూ ఇవ్వవలెను.
4. పై మందులను 3 పొటెన్సీలో పెద్దవారికి 5 బిళ్ళలు, పిల్లలకు 3 బిళ్ళలు చొప్పున వాడవలెను.
5. వ్యాధి రాకుండా వుండుటకై ఫెర్రంఫాసు 3ఎక్స్ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 నాలుగు గంటలకు వాడవెను.
5. నేట్రింసల్ఫు 3ఎక్స్ మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 8 గంటలకు వాడవలెను.
ఇట్లువాడినచో, తామరాకును నీరు అంటని విధముగా చుట్టుప్రక్కల వ్యాధి ప్రబలంగా ఉన్ననూ వ్యాధి శరీరమునకు సోకదు.
డాక్టర్ బి.వి. ప్రసాదరావు, 56.11.9. విద్యానగర్,
రాజమండ్రి, తూ.గో. జిల్లా. 0882-3290950