లింగ నిష్పత్తిని లెక్కించడంలో పాత పద్ధతులకు స్వస్తి పలకాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. శిశువు పుట్టినపుడే లింగ నిష్పత్తిని గణించేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్ర స్ర్తి, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా లింగ నిష్పత్తిని పరిశీలిస్తే ఆడశిశువుల సంఖ్య తగ్గుతున్నట్లు గుర్తించారు. ఆరేళ్ల లోపు పిల్లలను పరిగణనలోకి తీసుకుని స్ర్తి, పురుషుల నిష్పత్తిని లెక్కించడం ఇంతవరకూ అమలు చేస్తున్న విధానం. దీని వల్ల లింగ నిష్పత్తి వివరాలు తెలుసుకోవడంలో విపరీతమైన జాప్యం జరుగుతోం ది. అప్పుడే పుట్టిన శిశువులను సైతం పరిగణనలోకి తీసుకుని, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉం చాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, లింగ నిర్థారణ పరీక్షల ద్వారా ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని, భ్రూణహత్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని కూడా స్ర్తి, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి సూచించింది. లింగ నిష్పత్తిని మెరుగు పరచేందుకు జాతీయ విధానాన్ని ఖరారు చేయాలని ఈ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సలహా మండలి తాజాగా సిఫారసు చేసింది.
ika
english title:
ika kotha
Date:
Wednesday, September 26, 2012