Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాల్పుల మోత.. రాళ్ల వర్షం

$
0
0

తార్నాక, సెప్టెంబర్ 27: తెలంగాణ మార్చ్‌కు ఇంకా మూడు రోజుల వ్యవధి ఉండగానే ఉస్మానియా క్యాంపస్ రణరంగంగా మారిపోయింది. గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న క్యాంపస్ గురువారం కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన గలాటా సాయంత్రమైనా కొనసాగింది. తెలంగాణ మార్చ్‌కు ముందే ఓయు జెఎసి విద్యార్థులు కవాతును నిర్వహించాలని సంకల్పించారు. కాని జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరామ్ విద్యార్థి జెఎసితో చర్చలు జరిపి కవాతును సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదావేయించారు. అయితే మార్చ్‌కు అనుమతిలేదని అడ్డుకుంటామని పోలీసు అధికారులు ఒకవైపు చెబుతుంటే మరోవైపు జరిపి తీరుతామని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని తెలంగాణ వాదులు తెగేసి చెప్పడంతో ఉత్కంఠ (1వపేజీ తరువాయ) పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు నగర శివారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని పలు కూడళ్లలో భారీగా బలగాలను మోహరించి తెలంగాణవాదులను అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం. దీంతో ముందు జాగ్రత్తచర్యగా జెఎసివాదులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉస్మానియా క్యాంపస్‌ను కూడా పోలీసు దిగ్బంధంలో ఉంచారు.
ఈస్ట్‌జోన్ పోలీసులు బయటివారిని లోనికి, లోపలివారిని బయటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కాగా గురువారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జలదృశ్యం వరకు విద్యార్థి కవాతును నిర్వహించాలని సంకల్పించి ఆర్ట్స్ కళాశాల నుంచి వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు ఎన్‌సిసి గేట్‌వద్ద భారీగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును, సాయుధ బలగాలను మోహరించారు. పోలీసులు ముందు జాగ్రత్తచర్యగా ఎన్‌సిసి గేట్ ప్రాంతంలో విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించకుండా వారికి ఆ ప్రాంతంలో రాళ్లు లేకుండా చేశారు. కాగా ఎన్‌సిసి గేట్ వరకు చేరుకున్న విద్యార్థులు గేట్ వద్ద బైఠాయించి కొండాలక్ష్మణ్ బాపూజీ ఆశయసాధనకు తాము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణను ఇస్తామని కేంద్రం తెలంగాణ ప్రజలను ఘోరంగా మోసం చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం విద్యార్థులు గేట్‌ను తోసుకుని బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఇంతలో కొంతమంది విద్యార్థులు ఆవేశంతో పోలీసులపైకి రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు కూడా ప్రతిగా విద్యార్థులపైకి బాష్పవాయు గోళాలుప్రయోగించారు. దీంతో క్యాంపస్ కాల్పులమోతలతో దద్దరిల్లిపోయింది. అటునుంచి ఆందోళన లేడీస్ హాస్టల్ ప్రాంతానికి ప్రాకింది. అక్కడి నుంచి విద్యార్థులు బయటికి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కూడా ఇరువర్గాల మధ్య హోరాహోరీ రాళ్లదాడి, ప్రతిగా పోలీసుల కాల్పులు చోటు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్ర వరకు ఓయులోని లేడీస్‌హాస్టల్, బి హాస్టల్, మంజీరాహాస్టల్ తదితర ప్రాంతాల్లో పోలీసులకు, విద్యార్థులకు మధ్య రాళ్లు, బాష్పవాయుగోళాల వర్షం కురుస్తూనే ఉంది. కాగా ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న ఓయు క్యాంపస్ గురువారం జరిగిన ఆందోళనలతో మరోసారి రాజుకుంది.
30న సహించేది లేదు
నేడు జరిగిన ఆందోళన ఆరంభం మాత్రమేనని ఈనెల 30న పోలీసులు అడ్డుకోవాలని చూస్తే మాత్రం తాము సహించేది లేదని విద్యార్థి జెఎసి నేతలు పేర్కొన్నారు. రాజ్‌భవన్‌కు తాళం వేస్తామని ఎవరు అడ్డుకుంటారో చూస్తామని వారు ఆవేశంగా ప్రసంగించారు. పోలీసుల లాఠీలు, తూటాలు ఉద్యమాన్ని అడ్డుకోలేవని తెలంగాణను ప్రకటించచడం తప్ప గత్యంతరం లేదని జెఎసి నేతలు పేర్కొన్నారు.
ఓయు పరిధిలోని పరీక్షలు వాయిదా
ఈ నెల 28,29 తేదీల్లో ఓయు పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఓయు రిజిస్ట్రార్ కిషన్‌రావు పేర్కొన్నారు. అదే విధంగా పిజి అడ్మిషన్లు కూడా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. తదుపరి షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రజలకు కూడు,గూడు
వికారాబాద్, సెప్టెంబర్ 27: ప్రజలకు ఇల్లు, బట్టలు, తిండి కల్పించాలనే ఉద్దేశంతో గత ఎనిమిది సంవత్సరాలుగా 78 సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎన్‌ఎఫ్‌బిఎస్ పథకం కింద ఐదు వేల రూపాయల చొప్పున 36 మంది లబ్ధిదారులకు, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కింద ఆరుగురికి చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశామని, ఏప్రభుత్వమూ చెక్కులు వచ్చాయి తీసుకెళ్ళండని లబ్ధిదారులకు చెప్పిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి లబ్ధి పొందుతున్నాడన్నారు. పథకాలపై అధికారులు ప్రచారం నిర్వహించడం లేదన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద జిల్లాకు 16 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, రాని వారికి త్వరలో అందుతాయని, మర్పల్లి మండలంలోని రైతులకు మూడు వారాల్లో సబ్సిడీ డబ్బు ఇవ్వాలని అధికారులకు ఆదేశించామన్నారు. వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాల్లో పేదలు ఎక్కువగా ఉన్న దరిమిలా ప్రతి తహశీల్దార్ కార్యాలయానికి రెండు పథకాల కింద 10 నుండి 15 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. తీసుకున్న డబ్బులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బు వచ్చిన వారు బ్యాంకులో పెట్టుకుని వచ్చిన వడ్డీతో జీవనం సాగించాలని సూచించారు. వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఆవరణలోనే తహశీల్దార్ కార్యాలయం ఉండేలా 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించామని కాంగ్రెస్ నాయకులు సి.అనంతయ్య కోరిన మేరకు తెలిపారు. ఈకార్యక్రమంలో వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్.శశాంక్‌రెడ్డి, పిసిసి కార్యదర్శి వి.సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ రత్నారెడ్డి, వికారాబాద్ తహశీల్దార్ నాగవీరేశం తదితరులు పాల్గొన్నారు.
-- సమ్మె నోటీసుపై యూనియన్ నాయకులతో --

నేడు జలమండలి యాజమాన్యం చర్చలు

చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 27: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా అపరిష్కృతంగా వున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధికార వాటర్ వర్క్స్ ఎంప్లారుూస్ యూనియన్ ఎపి జలమండలి యాజమన్యానికి ఇటీవల సమ్మె నోటీసును అందించింది. యాజమాన్యం యూనియన్ నాయకులతో వివిధ అంశాలపై చర్చించేందుకు ఆహ్వానించింది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ శ్యామలరావు ఆధ్యక్షతన ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాయలంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి వాటర్‌వర్క్స్ ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులు హాజరు కావాలని జలమండలి యాజమాన్యం లిఖిత పూర్వకంగా ఆహ్వానించిందని యూనియన్ అసోసియేషట్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, కార్యదర్శులు ఎస్.సుధాకర్, మహ్మద్ జహంగీర్, అస్మత్‌అలీ (ఇక్బాల్), కోశాధికారి ఎఎన్ అంబియా, ఉపాధ్యక్షులు జి.వెంకటేశ్ యాదవ్, సి.రాజు తెలిపారు. సమావేశం విజయవంతం అయితేనే తామిచ్చిన నోటీసును తిరిగి తీసుకుంటామని లేకపోతే యధావిధిగా వాటర్‌వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తరఫున అక్టోబర్ 4వ తేదీనుంచి చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని యూనియన్ అసోసియేట్ అధ్యక్షుడు కె.రాజిరెడ్డి తెలిపారు.

విద్యార్థి తలను
గోడకు కొట్టిన
టీచర్
కీసర, సెప్టెంబర్ 27: ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి తలను తరగతి గోడకు బలంగా కొట్టడంతో విద్యార్థి తలకు తీవ్ర గాయమైన సంఘటన రాంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చర్లపల్లి ప్రాంతానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి సునీల్ రోజు మాదిరిగానే రాంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు వచ్చాడు. గణితం ఉపాధ్యాయుడు సెలవుపెట్టడంతో ఆ తరగతిని ప్రధానోపాధ్యాయుడు ఫణిరాజు తీసుకున్నాడు. గణితం నోట్‌పుస్తకాలు తేని కొందరు విద్యార్థులను నిల్చోబెట్టాడు. ప్రతి విద్యార్థిని మందలిస్తూ వచ్చాడు. సునీల్ దగ్గరకు రాగానే కోపంతో తలను పట్టుకుని గోడకు కొట్టాడు. గోడకు మేకు ఉండటంతో అది కాస్తా సునీల్ తలకి గుచ్చుకుంది. తీవ్రంగా రక్తంకారడంతో భయాందోళన చెందిన ఫణిరాజు వెంటనే అతడిని 108 అంబులెన్స్‌లో చికిత్సకు తరలించాడు. ఇది తెలిసిన విద్యార్థి సంఘాలు ప్రధానోపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఎంఇఓ రాంప్రసాద్ డిఇఓ సోమిరెడ్డికి దీనిపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎంఇఓ ఫణిరాజును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడిగా ఎంఇఓ రాంప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు.

అక్టోబర్ 26 నుంచి పాఠశాల
విద్యార్థులకు కంటి పరీక్షలు: కలెక్టర్ రిజ్వీ
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 27: పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు చేసేందుకు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 26వరకు స్క్రినింగ్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రిజ్వీ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటుకు తీసుకోవాలసిన చర్యలపై విద్యా, వైద్య శాఖలతోపాటు సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉన్న 807 ప్రభుత్వ పాఠశాలలు, 1144 ఎయిడెడ్ పాఠశాలలతోపాటు 249 మదర్సాలలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కొంత మంది టీచర్లను గుర్తించి వారికి కంటి పరీక్ష నిర్వహణపై ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా విలీన విద్య కోఆర్డినేట్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రొగ్రాం మేనేజర్, ఆర్‌విఎం స్కూల్ హెల్త్ ఆఫీసర్, జవహార్ బాల ఆరోగ్య రక్ష కో-ఆర్డినేటర్, ఉప విద్యాశాఖ అధికారి(ట్రైబల్) సభ్యులుగా జిల్లా స్థాయి యాక్షన్ కమిటీగా రూపొంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని రిజ్వీ తెలిపారు. మూడు విడతలో కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుశీందర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అనంతరెడ్డి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రొగ్రాం మేనేజర్ డా.రవీందర్‌గౌడ్, డిఇవో సుబ్బారెడ్డి, జేబార్ కోఆర్డినేటర్ పాల్గొన్నారు.

సామాజిక రుగ్మతల నివారణకు కృషి
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 27: యువజన సర్వీసుల సేవలను విద్యా, వైద్య, సామాజిక రుగ్మతల నిర్మూలనకు వినియోగించేందుకు కృషి చేయాలని అదనపు జెసి జి.రేఖారాణి అన్నారు. హైదరాబాద్ నెహ్రూ యువ కేంఅద 2012-13 వార్షిక ప్రణాళిక ఖరారు చేసేందుకు సలహా మండలి సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. గురువారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉందని, బస్తీలలో విద్యా వ్యాప్తి, విద్యా విలువల కోసం విద్యార్థులు చదువుకునేలా కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య శాఖ నిర్వసించే వైద్యశిబిరాలపై బస్తీ పేదవర్గలలో ఆరోగ్యం పట్ట శ్రద్ధ వహించేలా చేయాలని సూచించారు. యువతకి డ్రైవింగ్, కుకింక్, సేవావిభాగం, సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి పొందేందుకు వీలుగా పరిశ్రమల శాఖ నుంచి తగిన శిక్షణ కల్పించాలని అన్నారు. బస్తీలలో బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో సిపివో బలరాం, పరిశ్రమల జిఎం ప్రశాంత్, డిపిఆర్‌వో చంద్రశేఖర్, యువజన సంక్షేమ అధికారి సత్యనారాయణరెడ్డి, అదనపు డిఎంహెచ్‌వో, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్ ఆర్.వెంకటేశం, మలక్‌పేట యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్‌వైకె వలంటీర్ దివ్య పాల్గొన్నారు.

మోడ్రన్ ట్రాఫిక్ సిగ్నల్ పనులను పరిశీలించిన సివి ఆనంద్
ఖైరతాబాద్, సెప్టెంబర్ 27: జంటనగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించే నిమిత్తం నూతనంగా ఏర్పాటు చేస్తున్న మోడ్రన్ ట్రాఫిక్ సిగ్నల్స్ పనులను గురువారం కమిషనర్ సి.వి.ఆనంద్ పరిశీలించారు. పంజాగుట్ట కేసీపి జంక్షన్ వద్ద పనులు కొనసాగుతుండగా ఉదయం ఆ పనులను పరిశీలించిన కమీషనర్ సిబ్బంది పలు సూచనలు చేశారు. పూర్తిగా సూర్యరశ్మితో పనిచేసే ఈ సిగ్నల్స్ ద్వారా సిగ్నల్స్ వద్ద వాహనదారులకు ఇబ్బందులు తగ్గనున్నాయి. బిహెచ్‌ఇఎల్ ఇంజనీర్లు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. జంటనగరాల్లో సుమారు 220 జంక్షన్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ఇసి మార్పులను ఓటర్లకు తెలపాలి
వికారాబాద్, సెప్టెంబర్ 27: ఎన్నికల కమీషన్ చేసిన మార్పులను ఓటర్ల వద్దకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత బూతు స్థాయి అధికారులపై ఉందని వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి సూచించారు. గురువారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఓటర్ల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలన్నారు. చిన్న చిన్న విషయాలకు ఉద్యోగాలు పోయే ప్రమాదముంటుందన్నారు. పరీక్ష పాసవ్వాలని, 50 మార్కులకు నిర్వహించే పరీక్షలో 25 మార్కులు సాధించాలన్నారు. సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బంటారం, మర్పల్లి, మోమిన్‌పేట, ధారూర్ తహసిల్దార్‌లు గౌతంకుమార్, గోవిందరావు, ప్రేంకుమార్, రామహరిప్రసాద్, వికారాబాద్ డిప్యూటి తహసిల్దార్ బాల్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఘనంగా జాషువ 117వ జయంతి
నల్లకుంట, సెప్టెంబర్ 27: సమతా సాహితీ వేదిక ఆధ్వర్యంలో గుర్రం జాషువ జయంతి సభ గురువారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులు ఆర్వీ రమణమూర్తి మాట్లాడుతూ ప్రజల కోసం కవిత్వం రాసిన గొప్ప కవి, ఆయన రచనలు నేటికీ సమకాలిన సమాజానికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. ఆనాటి కవులు, రచయిలు సృష్టించిన సాహిత్యం అత్యున్నతమైనదని అన్నారు. నేటి రచయిలు రేపటి సమాజానికి స్ఫూనిచ్చే రచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమతాసాహితీ వేదిక వ్యవస్ధాపక అధ్యక్షులు కాకుమాను ప్రసాద్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్త డా.రావూరి భరద్వాజ, ప్రముఖ రచయిత్రి డా.ముక్తేవిభారతి, గానసభ అధ్యక్షులు డా.కళావేంకటదీక్షితులు, డా.దార్ల వెంకటేశ్వర్లు, డా.వెలిదండ నిత్యానందరావు తదితరులు గుఱ్ఱం జాషువా సాహిత్యాన్ని కొనియాడుతూ మాట్లాడారు. ఈ సందర్భంగా బోయి భీమన్న సాహితీనిధి అధ్యక్షులు హైమవతి భీమన్నకు, డా.కె.ఆనందన్, పిజె ఆనంద్, తాళ్ళూరి లాబన్‌బాబులకు అతిథులు నిర్వాహక సంస్థ పక్షాన ఘనంగా సత్కరించారు. కాకుమాను శశిశ్రీ సభకు స్వాగతం పలికారు.

జీవ వైవిధ్య సదస్సులో పర్యాటక రంగం కీలకం
ముషీరాబాద్, సెప్టెంబర్ 27: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో పర్యాటకరంగం అత్యంత కీలకపాత్ర పోషించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి వట్టి వసంతకుమార్ పేర్కొన్నారు. శాఖను మరింత పటిష్టపరిచి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రవీంద్రభారతిలో అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి వసంతకుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి, సేవలను విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సిఎండి చందనాఖాన్, పర్యాటక శాఖ సంచాలకులు కాంతీలాల్ దండేలు మాట్లాడుతూ పర్యాటక రంగ సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా టూరిజం ఎక్స్‌లెన్స్ అవార్డుల విజేతలకు మంత్రి చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు. క్లాసిఫైడ్ హోటల్స్‌గా ఫైవ్‌స్టార్, డీలక్స్ రాష్ట్ర విభాగంలో పార్క్ హయత్ (హైదరాబాద్), ఫైవ్‌స్టార్ విభాగంలో లియోనియా (షామీర్‌పేట), ఫోర్‌స్టార్ విభాగంలో హోటల్ దశపల్లా (విశాఖపట్టణం), అలాగే రీజన్-1గా డివి మనోహర్ (విజయవాడ), త్రీస్టార్ హోటల్స్ విభాగంలో తులిఫ్ ఇన్ (ఆబిడ్స్), మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ టూరిజం ప్రాజెక్టు క్రింద అర్కాలీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (గుంటూరు), బెస్ట్ థీమ్డ్ బేస్డ్ రిసార్ట్‌గా గోల్కొండ రిసార్ట్ అండ్ స్పా (హైదరాబాద్), బెస్ట్ స్టేట్ రెస్టారెంట్ ది గోల్కొండ హోటల్ (హైదరాబాద్)లకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ విశిష్టతను చాటి చెప్పే సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించారు.

గ్లోబల్ ఆస్పత్రికి ‘ఎక్సలెంట్ హెల్త్‌కేర్’ అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, ఆధునిక పరికరాలతో అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న నగరంలోని గ్లోబల్ ఆస్పత్రికి ఈ ఏటా ఎక్సలెంట్ హెల్త్‌కేర్ అవార్డు దక్కింది. ఫార్మాసెట్యూకల్ లీడర్‌షిప్‌ను విస్తరించటంలో గ్లోబల్ ఆస్పత్రి అద్భుత వైద్యాలయంగా గుర్తిస్తూ ముంబైకి చెందిన ఫ్రంట్ అండ్ సలివాన్ హెల్త్‌కేర్ సంస్థ ఈ అవార్డును ప్రకటించినట్లు బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో గ్లోబల్ ఆస్పత్రి చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. కె. రవీంథ్రనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిరోజుల క్రితం ముంబైలో ఈ అవార్డును మహారాష్ట్ర గవర్నర్ శంకర్‌నారాయణన్ చేతుల మీదుగా స్వీకరించినట్లు ఆయన వివరించారు. 1999లో ప్రారంభమైన గ్లోబల్ ఆస్పత్రి ఇంతింతటై వటుడింతై అన్నట్టు అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు వైద్య రంగంలో దేశ ప్రతిష్టను నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. 1999 నుంచి క్రమంగా నగరంలోని రెండు శాఖలు, చెన్నై, బెంగుళూరులో శాఖలను తెరిచినట్లు, త్వరలోనే ముంబైలో కూడా ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అవయవ మార్పిడితో పాటు మూలకణ చికిత్సలో కూడా గ్లోబల్ ఆస్పత్రి ఎంతో ఆశించిదగిన కృషి చేసిందని వివరించారు. దీంతో పాటు కీ హోల్ సర్జరీ, పిన్ హోల్ సర్జరీలు నిర్వహిస్తూ సరికొత్త ఆధునిక శస్తచ్రికిత్సలకు గ్లోబల్ ఆస్పత్రి మరింత చేరువైందని వివరించారు. దీంతో పాటు వైద్య సదుపాయాలు పెరుగుతున్న కొద్ధీ వత్తిడి, కదలికలు, తక్కువ జీవితం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవటం, కొన్ని రసాయనాలు చల్లిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయని, వీటన్నింటిని ఎదుర్కొవాలంటే ప్రతి ఒక్కరిలో వైద్య రంగానికి సంబంధించిన చాలా విషయాలపై అవగాహన అవసరమని డా. రవీంథ్రనాథ్ తెలిపారు.

‘తాండూర్ సంఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడతా’
వికారాబాద్, సెప్టెంబర్ 27: ఇటీవల తాండూర్‌లో జరిగిన సంఘటనపై అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడతామని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక శ్రీరామమందిరంలో వినాయక నిమజ్జనంపై హిందూ ఉత్సవసమితి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాండూర్ సంఘటన సద్దుమణిగేలా రాష్ట్ర హోంమంత్రి సబితారెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. సమయం ప్రకారం వినాయక విగ్రహాలను తరలించి, శోభాయాత్రను తొందరగా ముగించుకోవాలన్నారు. మద్యం సేవించే వారిని పోలీసులకు అప్పగించే బాధ్యత యువతదే అన్నారు. చెరువులో నీరు చాలా తక్కువగా ఉన్నందున చాలా పెద్ద క్రేన్ తెప్పిస్తున్నామని, మరొకటి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్‌కుమార్ మాట్లాడుతూ చెరువు వద్ద రెండు క్రేన్‌లు అవసరమన్నారు. కొంపల్లి వరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. తాండూర్ సంఘటనలో ఒకే వర్గానికి చెందిన వారిని అరెస్ట్ చేయడం సమంజసం కాదని అన్నారు. ప్యాటమల్లేశం మాట్లాడుతూ స్వాగత వేదికలను రోడ్లపై కాకుండా పక్కన ఏర్పాటు చేసుకోవాలని, శోభాయాత్రలో భక్తి పాటలనే ఉపయోగించాలన్నారు. సమావేశంలో హిందూ ఉత్సవసమితి కన్వినర్ కృష్ణపంతులు, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు ఎల్.శశాంక్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ఆర్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బి.సంజీవరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పి.శ్రీనివాస్, సేవాదళ్ అధ్యక్షులు జి.చంద్రశేఖర్, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ కె.జయదేవ్, బిజెపి పట్టణ ప్రధానకార్యదర్శి పోకల సతీష్, విజయభాస్కర్‌రెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు బందెప్పగౌడ్, టిఆర్‌ఎస్‌వి ప్రధానకార్యదర్శి శివప్రసాద్, కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌ముదిరాజ్ పాల్గొన్నారు.

గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక బస్సులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, చార్మినార్, సెప్టెంబర్ 27: మహానగరంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా, ప్రతిష్టాత్మకంగా జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవానికి ఆర్టీసి గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు జోన్ ఎగ్జిక్యూటీవ్ ఎ. కోటేశ్వరరావు తెలిపారు. ముఖ్యంగా నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నగరంలో నిత్యం రద్ధీగా ఉండే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అదనంగా 359 బస్సులను నడుపుతున్నట్లు కూడా వివరించారు. ఈ బస్సులను 29వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి అదే రోజు అర్థరాత్రి దాటే వరకు నడుపనున్నట్లు తెలిపారు. కాచిగూడ, బషీర్‌బాగ్ రూట్‌లో 8బస్సులు, కోఠి, ఆలిండియా రేడియో రూట్‌లో 10, టోలీచౌకీ లక్డీకాపూల్ మధ్య 15, రాంనగర్, బషీర్‌బాగ్ 8, బిహెచ్‌ఇఎల్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, అలాగే ఖైరతాబాద్‌ల మీదుగా 10, యూసుఫ్‌గూడ మీదుగా కొండాపూర్ నుంచి లక్డీకాపూల్ వరకు 10, దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు 10బస్సులు, ఎల్బీనగర్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు 10, వనస్థలిపురం నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పది, మిథానీ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు పది, హిమాయత్‌నగర్, లిబర్టీల మీదుగా ఉప్పల్ నుంచి 20, ఉప్పల్ నుంచి ఇందిరాపార్కు వరకు ఇరవై, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇందిరాపార్కుకు 21, రిసాలాబజార్ నుంచి ఇందిరాపార్కుకు పది, ఇసిఐఎల్ నుంచి ఇందిరాపార్కుకు 24, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఖైరతాబాద్‌కు 15, మల్కాజ్‌గిరి నుంచి ఇందిరాపార్కుకు 5, జీడిమెట్ల నుంచి ఖైరతాబాద్ మీదుగా లక్డీకాపూల్‌కు 15, జగద్గిరిగుట్ట, లక్డీకాపూల్, ఖైరతాబాద్‌కు 15, సనత్‌నగర్ నుంచి లక్డీకాపూల్‌కు 10, కూకట్‌పల్లి నుంచి ఖైరతాబాద్ మీదుగా లక్డీకాపూల్ వరకు 15, కెపిహెచ్‌బి కాలనీ నుంచి ఖైరతాబాద్ మీదుగా లక్డీకాపూల్ వరకు 10, లింగంపల్లి నుంచి ఖైరతాబాద్‌కు 15, పటాన్‌చెరు నుంచి ఖైరతాబాద్‌కు 15, బోరబండ నుంచి ఖైరతాబాద్‌కు 15, కొత్తపేట నుంచి ఇందిరాపార్కుకు ఆరు, జామియా ఉస్మానియా నుంచి ఇందిరాపార్కుకు 5, రాజేంద్రనగర్ నుంచి లక్డీకాపూల్‌కు 7, బాచిపల్లి నుంచి ఖైరతాబాద్‌కు పది, గాజుల రామారం నుంచి ఖైరతాబాద్‌కు పది బస్సులను నడుపనున్నట్లు ఆయన తెలిపారు. అయితే బస్సులకు ‘గణేష్ నిమజ్జనం స్పెషల్’ అనే బోర్డులు ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేశారు. చార్మినార్ వైపు వెళ్లే బస్సుల శనివారం ఉదయం నుంచి పోలీసులు, ఆర్టీసి అధికారుల సమన్వయంతో అఫ్జల్‌గంజ్ వరకు మాత్రమే నడుపనున్నట్లు తెలిపారు. ఈ బస్సుల రాకపోకలను 24 డిపో మేనేజర్లు, నలుగురు డివిజనల్ మేనేజర్లు, ఇద్దరు రీజినల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు, సూపర్‌వైజర్లు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సుల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక కమ్యూనికేషన్ కోసం కోఠి ఉమెన్స్ కాలేజీ (9959226160), రేతిఫైల్ బస్ స్టేషన్(9959226154)లను సంప్రదించవచ్చునని కోటేశ్వరరావు సూచించారు.

హైదరాబాద్ జిల్లా జూనియర్ అథ్లెటిక్ జట్లు
చాంద్రాయణగుట్ట, సెప్టెంబర్ 27: విజయవాడలో అక్టోబర్ 2వ తేదీనుంచి 4 వరకు జరుగనున్న ఆంధ్రప్రదేశ్ జూనియర్ స్టేట్ అధ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే హైదరాబాద్ జిల్లా జట్లను ప్రకటించారు. జట్టుకు ఎంపికైన అథ్లెట్లు ఒరిజినల్ వయస్సు ధృవీకరణ పత్రాలతో హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రతినిధులకు అక్టోబర్ 1వ తేదీన ఉదయం ఆరు గంటలకు సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో రిపోర్టు చేయాల్సి వుంటుందని అసోసియేషన్ కార్యదర్శి డా.రాజేష్‌కుమార్ తెలిపారు. జట్ల వివరాలు: అండర్-20 సి.సంజీవ్, పి.బాలక్రాంతిరాజ్, బి.సురేందర్, రామాంజనేయులు, నితేష్‌కుమార్, నూతన్‌కుమార్, డిఎస్ రాహుల్, పిఎన్ సాయికుమార్, హరికేష్‌వౌర్య, ఎన్.మధు, సయ్యద్ అహ్మద్, ఉజ్మా, మహ్మద్ మునావర్ అలీ, రాజేంద్రసింగ్, ఎల్.దయానంద. దేవేందర్‌కుమార్, రింకూసింగ్, సురేందర్‌సింగ్. అండర్-18 బాలురు - ప్రవీణ్‌మూర్తి, ఎ.రవికుమార్, కె.అనిల్‌కుమార్, జి.సాయిరాం, ఎల్.్భషణం, అంకిత్‌కుమార్ పాఠక్, అనిష్‌కుమార్ పాఠక్, విఘ్నేష్, దుర్గ్ వి చౌహాన్, విఘ్నేష్‌కుమార్, ఎం.నీలకంఠ, వికాష్, జ్ఞానేశ్వర్, మొహిత్ సునీల్, ధర్మేందర్ యాదవ్. అండర్-16 బాలురు - కె.రాజు, ఎస్.శుభం, సయ్యద్ జీబ్రాయిన్, లాల్‌సింగ్, ఎం.రవీందర్, అర్జున్ పటేల్, డి.రవికిరణ్, వి.సాయికుమార్, కృష్ణకుమార్, బిత్వేశ్వర్, మహ్మద్ ఇక్రార్, నీరజ్‌కుమార్, అంకిత్‌కుమార్, కుందన్‌కుమార్, చంద్రప్రకాష్, విక్కీ. అండర్-14 బాలురు: బి.రాజేష్, అతీమ్, బాలాజీ, ఎం.రవీందర్, వి.కె.యేష్, ఈశ్వర్‌జిత్, నితిన్‌కుమార్. బాలికల విభాగం: అండర్-20- ఎం.యువశ్రీ, సాహితీ, ఎం.శృతి. అండర్-18- మినిత, శృతి, పి.శ్రీలత, వృందా, శివానీ సింగ్. అండర్-16 హర్షిని, నవ్య, ఎం.సాహితీ, హఫీజా, జైనన్ ఫాతిమా, అమతుల్లా పర్మార్. అండర్-14- అస్మిత, దిశ, రిమా, ప్రణీత. జట్టు కోచ్‌గా: కె.ఎం శిష్టి, మేనేజర్‌గా నారాయణలు వ్యవహరిస్తారు.

విఘ్నేశ్వర ఆలయంలో హోమం

ఉప్పల్, సెప్టెంబర్ 27: మేడిపల్లిలోని శ్రీ చంద్రవౌళీశ్వర చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక కార్యసిద్ధి వినాయక ఆలయంలో పంచకల్పిత హోమం జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన హోమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి, ట్రస్టు చైర్మన్ ఎం.జశ్వంత్‌రెడ్డి, సభ్యులు ఆంజనేయశాస్ర్తీ, సూర్యనారాయణమూర్తి, శివలింగంశర్మ, చిరంజీవి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగన్ బయటకు వస్తాడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలు నుండి బెయిల్‌పై త్వరలో బయటకు వస్తాడని పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో రాష్ట్రం పరిపాలన అదుపుతప్పిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వపాలన సరిగా లేక ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై సబ్సిడి పరిమితం వంటి సమస్యలు, ప్రధానంగా రైతులు విద్యుత్ కోతతో అల్లాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆమె ధ్వజమెత్తారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి తరహాలో ప్రజల సమస్యలను తీర్చడానికి జగన్ బయటకు వస్తారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రూ.1.54లక్షలకు లడ్డూ
ఉప్పల్: గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బోడుప్పల్ పంచాయతీ కార్యాలయం సమీపంలో బాపూజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర మండపం వద్ద గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనం సందర్భంగా లడ్డూకు వేలం పాట నిర్వహించారు. స్థానిక వ్యాపారి పొన్నం రవిగౌడ్ రూ.1.54 లక్షలకు దక్కించుకున్నారు. గత సంవత్సరం లడ్డూను పొన్నం మురళీగౌడ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ముడిమేల కృష్ణాగౌడ్, సభ్యులు పొద్దుటూరి వెంకటేశ్‌గుప్త, కొత్త వెంకటేశ్‌గౌడ్, పొన్నం మురళీగౌడ్, తరుణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ముగుస్తున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలు
జీడిమెట్ల: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగియనుండటంతో ఆయావినాయక మండపాల వద్ద అన్నసంతర్పణ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని గణపతులను ఆయా వినాయక ఉత్సవ కమిటీ వారు నిమజ్జనం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట డివిజన్‌లో అన్నదాన కార్యక్రమాలు జోరుగా సాగాయి. డివిజన్‌లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యుడు కూన శ్రీశైలంగౌడ్, కార్పొరేటర్ జగన్ ప్రారంబించారు. అదేవిధంగా దేవమ్మబస్తీ, సీసలబస్తీ, రింగ్‌బస్తీ, మగ్ధూమ్‌నగర్, పాపిరెడ్డినగర్, అంజయ్యనగర్, షిరిడీహిల్స్ తదితర ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలను జగన్ ప్రారంబించారు. అదేవిధంగా గుబురుగుట్ట, సంజయ్‌గాంధీనగర్‌లో స్థానిక బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక బస్తీ నాయకులు నారాయణ, శ్యామ్, శంకర్, బాల్‌రాజ్, ఆంజనేయులు, మహేశ్, రాకేశ్, సుమన్, శీనుప్రారంబించారు. ఈ సందర్భంగా గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బోయిన్‌పల్లిలో ఘనంగా నిమజ్జనం
కంటోనె్మంట్: బోయిన్‌పల్లిలో రాణాప్రతాప్ యువసేన ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికి రామన్న చెరువులో గురువారం నిమజ్జనం చేశారు. తొమ్మిదిరోజులుగా పూజలు అందుకున్న గణేశునికి సాయంత్రం బోయిన్‌పల్లి పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. కోలాటాలు, చెక్క్భజనలు, రకరకాల కళాకృతులతో విన్యాసాలు, మహాకాళి అవతారాలు పురజనులను ఎంతగానో ఆకర్షించాయి.
కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఉప్పల్ రైతులకు న్యాయం చేస్తా : కలెక్టర్

ఉప్పల్, సెప్టెంబర్ 27: రెండు వారాల్లో రైతుల సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎ.వాణీప్రసాద్ హామీ ఇచ్చారు. ఉప్పల్ నల్లచెరువు కింద సర్వే నెంబర్ 76నుండి 87, 90, 96 నుండి 102లో 30 ఎకరాల 30 గుంటల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, రైతులకు నష్టపరిహారం కింద ఇవ్వడానికి రూ.6కోట్ల 29లక్షల 32వేలు ఆర్డీఓ వద్ద ఉన్నాయని బాధిత రైతులు మేకల దయాసాగర్‌రెడ్డి, బట్కిరి రమేశ్, రాజిరెడ్డి, లక్ష్మిభాయి, యశోద తదితరులు పేర్కొన్నారు. అయితే నష్టపరిహారం కింద డబ్బులు వద్దని, ఇదే ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చే ప్యాకేజిని ఇచ్చేవిదంగా సత్వర చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన కలెక్టర్ రైతుల పెండింగ్ సమస్యలను పరిష్కరించగలనని హామీ ఇచ్చారు.
భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
ఉప్పల్-రామంతాపూర్ మధ్య మూసీ నాలా స్థలాలను కబ్జాచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి రామంతాపూర్ డివిజన్ నాయకుడు మేకల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతలు మాచర్ల ప్రతిభ, కొట్టాల బాల్‌రాజ్, పి.సోమిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు గురువారం ఉప్పల్‌కు వచ్చిన జిల్లా కలెక్టర్ వాణీప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు. కోట్ల విలువ చేసే సుమారు 4 ఎకరాల స్థ

* ‘మార్చ్’కు ముందే రాజుకున్న ఓయు క్యాంపస్ * క్షణక్షణం ఉత్కంఠ *్భరీగా తరలివచ్చిన బలగాలు
english title: 
kalpula

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>