ఒంగోలు, అక్టోబర్ 10: మీ ఆశీర్వాదం పొందేందుకు చాలా సమయం ఉంది అయినా మిమ్మల్ని అభివద్ధి చేసేందుకే వచ్చానని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కమార్‌రెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో రెండవ రోజు అయిన బుధవారం ఇందిరమ్మబాటను చేపట్టారు. జిల్లాలోని దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కంభం ప్రాంతాలలో ఆయన ఇందిరమ్మబాట చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. తమ ప్రభుత్వం మాయమాటలు చెప్పేది కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం 26వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దర్శి నియోజకర్గం కురిచేడు మండలం బూదనంపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఇందిరజలప్రభ పథకం కింద లబ్ధిపొందిన రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో అట్టడుగు వర్గాలను ఉన్నస్థాయికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సాగులోలేని భూములను అభివృద్ధి పరిచి పేద ప్రజలకు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఇందిరజలప్రభ పథకం కింద 10లక్షల ఎకరాలను అభివృద్ధి చేసేందుకు 1800కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈపథకం అమలు ద్వారా నిరుపేద కుటుంబాలకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపనుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికే ఇందిరమ్మబాట కార్యక్రమం ద్వారా గ్రామలలో పర్యటిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రైతు కూలీలుగా ఉన్నవారిని రైతులగా తయారు చేయాలన్న లక్ష్యంతోనే ఈపథకాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం 26వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
తమది మహిళల పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభివృద్ధి నామమాత్రం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గిరిజనులకు 156కోట్ల రూపాయలు బడ్జెట్‌లో పెడితే 2004-09కాంగ్రెస్ ప్రభుత్వంలో 342కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. ఈసంవత్సరం బడ్జెట్‌లో 1562కోట్ల రూపాయలు ఎస్టీలకు ఖర్చు పెడుతున్నామని ఆయన సగర్వంగా చెప్పుకున్నారు. గత 10సంవత్సరాల కంటే ఈసంవత్సరం పెట్టిన బడ్జెట్ ఎక్కువ అని తెలిపారు. ఎస్టీల అభివృద్ధికి తాము పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. మాటలతో కడుపునిండదని సంక్షేమ పథకాలకు డబ్బులు ఖర్చు పెడితే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా 12వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాజీవ్ యువకిరణాల ద్వారా ప్రైవేటు ఉద్యోగాలలో ఎస్టీలను చేర్చనున్నట్లు తెలిపారు. లక్షా 50వేల మందికి ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రెండు గిరిజన బెటాలియన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈబెటాలియన్‌లో గిరిజనులు రిక్రూట్‌మెంట్ చేస్తామన్నారు. రాబోయే రెండుమూడేళ్లలో చెంచుల జీవితాలలో మార్పు వస్తుందన్నారు. దళితులను అన్ని విదాల ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మానుగుంట మహీధర్‌రెడ్డి, సాకె శైలజానాథ్, కొండ్రు మురళి, బాలరాజు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాజ్యసభ సభ్యుడు జెడి శీలం తదితరులు పాల్గొన్నారు.
దర్శి నియోజకవర్గానికి
సిఎం వరాలు
దర్శి, అక్టోబర్ 10: నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం దర్శి పంచాయితీ పరిధిలోని 133/33 కెవి విద్యుత్ ఉపకేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి నియోకవర్గంలో పరిష్కారానికి నోచుకోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సిఎం దర్శి నుండి గంగవరం రోడ్డులోని దోర్నపువాగుపై బ్రిడ్జికి నిధులు మంజూరు, దర్శి నుండి అద్దంకి రోడ్డు రెండులైన్ల ఏర్పాటు, దర్శి పంచాయతీకి డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పరచడానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఎంపి, ఎమ్మెల్యే కుటుంబాలకు తనకు ఎప్పటి నుండో అవినాభావ సంబంధాలు ఉన్నాయని, ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి తన చిన్న తమ్ముడులాంటి వాడని, అన్ని నియోజకవర్గాలకన్న నీ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూసుకుంటానన్నారు. రైతులు కరెంట్ విషయం ప్రశ్నించగా ఎంత ఖర్చు చేసినా కరెంట్ సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో కరెంట్ లేదన్నారు. కాని త్వరలోనే కరెంట్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. డ్వాక్రా మహిళలను ఉద్ధేశించి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకోసం ప్రభుత్వం స్ర్తి శక్తి భవనాలు, వడ్డీలేని రుణాలు, స్ర్తి నిధిలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని, మహిళల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. రైతుల కోసం 18 కోట్ల రూపాయలతో 133 సబ్ స్టేషన్ ఏర్పాట్లు చేశామన్నారు. మహిళలు తాగునీటి సమస్యపై ప్రశ్నించగా తాగునీటి కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు మహీధర్‌రెడ్డి, సాకే శైలజానాథ్, పి సత్యనారాయణ, బాలరాజు, రాజ్యసభ సభ్యుడు జెడి శీలం, ఎమ్మెల్సీ పోతుల రామారావు, ఎమ్మెల్యే ఉగ్రనర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో చీరాల డిఎస్పీ మృతి
చీరాల, అక్టోబర్ 10: చీరాల డిఎస్పీ జె మురళీ కృష్ణ(54) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలో మురళీకృష్ణ ఇక్కడ ఎస్‌ఐగా కూడా విధులు నిర్వర్తించారు. అనంతరం చీరాలనుంచి ఒంగోలుకు బదిలీపై వెళ్ళారు. 2011 నవంబర్ నెల 21న చీరాల డిఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. గత మూడు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల స్వల్పంగా కోలుకున్నా తిరిగి మంగళవారం విషమంగా ఉండటంతో గుంటూరు వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మృతదేహాన్ని ఒంగోలులోని ఆయన స్వగ్రహానికి తరలించారు. మురళీకృష్ణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహమై అమెరికాలో ఉంటున్నారు. రెండవ కుమార్తె వివాహం కావలసి ఉంది. ఈమె పూనేలో ఉద్యోగం చేస్తున్నారు.
90 లక్షలతో దళిత కుటుంబాలకు చేయూత
కురిచేడు, అక్టోబర్ 10: రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఇందిర జల ప్రభ పథకం కింద కురిచేడు మండలం బూదనంపాడు గ్రామంలో 30 దళిత కుటుంబాలు దారిద్య్రరేఖను అధికమించనున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ఇందిరమ్మ బాట 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం బూదనంపాడు గ్రామసమీపంలోని పందిళ్లపాయ బ్లాకులో డ్రిల్లింగ్ చేసిన డీప్‌బోర్లను ప్రారంభించారు. అనంతరం ఉద్యానవన క్షేత్రంలో మామిడి మొక్కలను నాటారు. 90 లక్షల రూపాయల ఖర్చుతో 98 ఎకరాల భూమికి సాగు నీరందించే విధంగా ప్రతిపాదనలు చేసినట్టు ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా 67.39 లక్షలు నాబార్డు ద్వారా 17.02 లక్షలు, సూక్ష్మసేద్యం పథకం ద్వారా 6.37 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇప్పటికి 23 లక్షల రూపాయలు ఖర్చు చేసి మూడు డీప్‌బోర్లు నిర్మించారు. మరో ఐదు డీప్‌బోర్ల నిర్మాణం చేయాల్సివుంది. ఇది పూర్తయినట్లయితే ఈభూముల్లో పండ్లతోటలతోపాటు అంతర్గత పంటలు సాగు చేసుకొని దళిత కూలీలు రైతులుగా ఎదిగేందుకు దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఈకార్యక్రమంలో డ్వామా పిడి రమేష్‌కుమార్, ఎపిడిలు మాలకొండయ్య, భవానీ, కాత్యాయని, దర్శి పిఓ సౌజన్యవాణి తదితరులు పాల్గొన్నారు.
సిఎం ముఖాముఖి ఏర్పాట్లలో అపశ్రుతి...
ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి
సంతనూతలపాడు, అక్టోబర్ 10: ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మృతి చెందాడు. గురువారం సంతనూతలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో జరిగే ఇందిరమ్మబాటలో ముఖాముఖి కార్యక్రమానికి బుధవారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సంతనూతలపాడు పంచాయతీ, స్థానిక శాంతినగర్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు రాంకూరి ఆదాం (23) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ క్రిందపడి మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబం విషాదంలో మునిగి పోయింది.
ఉద్రిక్తల నడుమ రాంకూరి మృతదేహం రిమ్స్‌కు తరలింపు
సిఎం సభా ఏర్పాట్లలో ప్రమాదవశాస్తు ట్రాక్టర్ క్రిందపడి చనిపోయిన రాంకూరి కుటుంబాన్ని ఆదుకోవాలని గురువారం ప్రతిపక్ష పార్టీలైన సిపిఎం, టిడిపి, వై ఎస్ ఆర్ సిపి నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఎంపిడి ఓ కార్యాలయాన్ని దిగ్బంధం చేసి మృతుని కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని కోరగా అధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో ప్రతిపక్షపార్టీ నాయకులు ఎంపిడి ఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆదాము కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబ సభ్యులలో ఒకరికి శాశ్విత ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. ప్రతిపక్ష పార్టీతోపాటు కుటుంబ సభ్యులు, రాంకూరి కులస్థులు స్థానిక వైద్యశాల నుండి తీసుకొని వెళుతుండగా దీనిని పోలీసుల అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సిఐ విభూషణం మృతుని కుటుంబ సభ్యులకు, ప్రతిపక్ష నాయకులకు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయన ఫోన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యేను, ఇతర అధికారులతో సంప్రదించారు. ఎమ్మెల్యే కలెక్టర్‌తో మాట్లాడి మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుండి అందాల్సిన ప్రయోజనాలను ఇప్పిస్తామని, మృతుని కుటుంబ సభ్యులకు ఎకరా పొలం, ఇంటి స్థలం ఇస్తామన్నారు. వ్యక్తిగతంగా 50 వేల రూపాయుల అందజేశానని సిఐకి ఫోన్‌లో చెప్పడంతో అదే సమాచారాన్ని కుటుంబ సభ్యులకు, ప్రతిపక్ష పార్టీల నాయకులకు తెలపడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా వై ఎస్ ఆర్‌కాంగ్రెస్ పార్టీ దుంపాచెంచిరెడ్డి మృతుడు ఆదాము కుటుంబానికి 25 వేల రూపాయల నగదును ప్రకటించారు. తెలుగుదేశం మండల తెలుగు యువత అధ్యక్షులు చెరుకూరి శ్రీనివాసరావు కూడా 15 వేల రూపాయలు అర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం రాంకూరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సిఐ విభూషణం, ఎస్సై కె ఆరోగ్యరాజ్, స్థానిక ప్రతిపక్షం పార్టీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, కత్తినేని శ్రీనివాసరెడ్డి, చెరుకూరి శ్రీనివాసరావు, గుంటూరి శ్రీనివాసరావు, నెరసుల వెంకటేశ్వర్లు, బంకా సుబ్బారావు, తేళ్ళ ప్రభుదాసు పాల్గొన్నారు.
శ్రీకాకుళం...
‘్థఠ్మల్’ను రద్దు చేయండి
సంతబొమ్మాళి, అక్టోబర్ 10: జీవవైవిధ్య సదస్సుకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించడం కంటే విషతుల్యమైన మానవులకు హాని కలిగించే థర్మల్ పవర్‌ప్లాంట్లను రద్దు చేస్తే మంచిదని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం సీతారాంపురం వద్ద జరిగిన థర్మల్ ప్లాంట్ వ్యతిరేక సభలో ఆయన మాట్లాడారు. కాకరాపల్లి, తంపరలో పవర్‌ప్లాంటు నిర్మించవద్దని గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం దారుణమన్నారు. థర్మల్ పవర్‌ప్లాంట్లను ప్రజలు వద్దని కోరుతున్నా రాష్ట్ర మంత్రులు రోజుకో విధంగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాణాలు తెగించైనా కాకరాపల్లి థర్మల్ ప్లాంట్‌ను అడ్డుకుంటామని తమ్మినేని హెచ్చరించారు. థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ముగ్గురు అమాయకులు మృతి చెంది వందలాది మందికి గాయాలు కాగా వేలాది మందిపై పోలీసు కేసులున్నాయని, అటు ప్రభుత్వం గాని, ఇటు యజమాన్యం గాని స్పందించడం లేదన్నారు. వడ్డితాండ్రలో రిలేనిరాహారదీక్షలు సాగుతుండగా హనుమంతునాయుడుపేట పంచాయతీలో గల వందలాది మంది తిరుగుబాటు చేసి మరో నిరాహారదీక్ష శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. సీతారాంపురం రహదారిపై థర్మల్ వాహనాలు వెళ్లనీయకుండా అడ్డుకున్నా బాధితులపై పోలీసులు కేసులు బనాయించడం సరైంది కాదన్నారు. థర్మల్ పవర్ ప్లాంటుకు వ్యతిరేకంగా పంచాయతీలో వున్న ప్రజలు గత 8 రోజులుగా రహదారిపై వంటావార్పూ చేస్తూ థర్మల్‌ను వ్యతిరేకిస్తున్న సమయంలో పోలీసులు ఆపేందుకు ప్రయత్నించకూడదన్నారు. సీతారాంపురం జంక్షన్ వద్ద తమ్మినేని సీతారామ్ సభకు రావడం, నినాదాలు చేయడంతో మరింత ఉద్రిక్తత వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకుడు తాండ్ర ప్రకాశ్, హన్నురావు, కారుణ్య్‌ఖత్రొ, నర్శింగరావు, కృష్ణమూర్తి, జనార్థన్, సోంపేట పోరాట కమిటీ నాయకుడు ఢిల్లీశ్వరరావు, స్థానిక మాజీ సర్పంచ్, పోరాట కమిటీ నాయకుడు భాస్కర్‌తోపాటు రైతులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు
15 మంది విద్యార్థులు ఎంపిక
నరసన్నపేట, అక్టోబర్ 10: ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోటీలలో నరసన్నపేటకు చెందిన విద్యార్థులు వివిధ ఆటల పోటీల్లో రాణించి రాష్టస్థ్రాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా.కె.అప్పారావు విద్యార్థులను అభినందించారు. రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికైన వారిలో కె.నివాస్, హరీష్, కె.కిరణ్, మదన్‌కుమార్, రాజు, రాజశేఖర్, ఎన్.రాజు, త్రోబాల్ పోటీలకు బి.జగన్, కిరణ్, పరుగుపందెంలో జ్యోతి, వెయిట్‌లిఫ్టింగ్‌లో శ్రీనివాసరావులు ఉన్నారు. విద్యార్థులు రాష్టస్థ్రాయి క్రీడలకు ఎంపిక కావడం పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు వై.పోలినాయుడు, గోపి, ఉపాధ్యాయులు విశే్వశ్వరరావు, వేణుగోపాలరావు, మెట్ట మోహనరావు, గోవిందరాజులు అభినందించారు.
పస్తులుంటున్నాం
..ఎచ్చెర్ల, అక్టోబర్ 10: మండలం అరిణాం అక్కివలస పరిధిలో నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమలో గత మూడు మాసాల నుండి ఉత్పత్తులు నిలిపివేసిన కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఉద్యోగులు, కార్మికులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక విలేఖరులతో వారు మాట్లాడుతూ జూన్ 30న జరిగిన భారీ పేలుడు కారణంగా అప్పటి నుండి పరిశ్రమ యాజమాన్యం జీత, భత్యాలలో కోత విధించడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలు, అలాగే తమపై ఆధారపడిన తల్లిదండ్రులు అభద్రతకు లోనై మానసిక వేదనకు గురవుతున్నామని వాపోయారు. సుమారు 1500 కుటుంబాలు ఫ్యాక్టరీ మీద ఆధారపడి బతుకుబండి సాగిస్తున్నాయని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని యాజమాన్యం, జిల్లా పరిపాలనా యంత్రాంగం పరిశ్రమను పునఃప్రారంభించాలని కోరారు. గత మూడు మాసాల నుంచి పరిశ్రమలో ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా అన్ని భద్రతా చర్యలు పూర్తి చేసినప్పటికీ పునః ప్రారంభించడంలో జాప్యం జరుగడం వల్ల ఉద్యోగ, కార్మిక కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కె.మురళీకృష్ణ, విఎస్.ఎన్.వర్మ, జి.వి.ఎస్.శివరాం, సిహెచ్.శ్రీనివాసరావు, మధుసూధనరావు, జె.లక్ష్మణరావు, శంకర్రావు, బంగార్రాజు, జి.చంద్రశేఖర్, సి.హెచ్.సత్యనారాయణ, ఎల్.రాజారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ
ఎచ్చెర్ల, అక్టోబర్ 10: భారీ పేలుడు సంభవించి పరిసర గ్రామాల ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీసేందుకు దారితీసిన నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు అధికారులు నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ గ్రామంలోనే జరిపించాలని చిలకపాలెం గ్రామస్థులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఆర్డీఒ గణేష్‌కుమార్ ఆదేశాల మేరకు తహశీల్దార్ వి.శివబ్రహ్మానంద్ బుధవారం ఎ.ఎ.వలస, అల్లినగరం, చిలకపాలెం గ్రామాల్లో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణకు కొంతమంది వ్యక్తులను ఎంపిక చేయాలని సూచించారు. ఎ.ఎ.వలస నుండి తొమ్మిది మంది, అల్లినగరం నుంచి నలుగురిని ఎంపిక చేశారు. చిలకపాలెం గ్రామస్థులు గ్రామంలోనే పరిశ్రమపై అభిప్రాయ సేకరణ జరిపించాలని పట్టుబట్టారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహశీల్దార్ స్పష్టం చేశారు. గత కొంతకాలంగా బాధిత గ్రామాల తరపున ఉద్యమబాట సాగిస్తున్న పోరాట కమిటీ ప్రతినిధులు, పరిశ్రమ యాజమాన్యం మధ్య ఇదే అంశంపై రగడ చోటుచేసుకుంది. పేలుడు ఘటన సంభవించి మూడు నెలలవ్వడంతో కాలుష్య నియంత్రణ మండలి తాత్కాలికంగా ఉత్పత్తులు సాగించేందుకు అనుమతులిచ్చినప్పటికీ స్థానికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఎలా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తుందోనన్న చర్చ నెలకొంది.
క్రీడా స్ఫూర్తిని చాటండి
* వర్సిటీ ప్రిన్సిపాల్ చంద్రయ్య
బలగ, అక్టోబర్ 10: విద్యార్థులంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి ఉత్తమ ప్రతిభను చూపాలని అంబేద్కర్ యూనివర్శిటీ ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో అంబేద్కర్ యూనివర్శిటీ అనుబంధ కళాశాలలకు సంబంధించి క్రీడాపోటీల ఎంపికలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలు విద్యార్థులకు అవసరమని, రోజుకు ఒక గంటైనా క్రీడలకు కేటాయించాలన్నారు. ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆర్.గోపాలరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎల్.దేవానందం మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ఎంతగానో ప్రోత్సాహమందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలిపింక్ సంఘ కార్యదర్శి పి.సుందర్రావు, వర్శిటీ స్పోర్ట్స్ బోర్డు సభ్యులు సురేఖ, ఫిజికల్ డైరెక్టర్లు ఎం.శ్రీనివాస్, సి.హెచ్.్భస్కర్ తదితరులు పాల్గొన్నారు.