సంతబొమ్మాళి, అక్టోబర్ 10: జీవవైవిధ్య సదస్సుకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించడం కంటే విషతుల్యమైన మానవులకు హాని కలిగించే థర్మల్ పవర్‌ప్లాంట్లను రద్దు చేస్తే మంచిదని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం సీతారాంపురం వద్ద జరిగిన థర్మల్ ప్లాంట్ వ్యతిరేక సభలో ఆయన మాట్లాడారు. కాకరాపల్లి, తంపరలో పవర్‌ప్లాంటు నిర్మించవద్దని గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం దారుణమన్నారు. థర్మల్ పవర్‌ప్లాంట్లను ప్రజలు వద్దని కోరుతున్నా రాష్ట్ర మంత్రులు రోజుకో విధంగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాణాలు తెగించైనా కాకరాపల్లి థర్మల్ ప్లాంట్‌ను అడ్డుకుంటామని తమ్మినేని హెచ్చరించారు. థర్మల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ముగ్గురు అమాయకులు మృతి చెంది వందలాది మందికి గాయాలు కాగా వేలాది మందిపై పోలీసు కేసులున్నాయని, అటు ప్రభుత్వం గాని, ఇటు యజమాన్యం గాని స్పందించడం లేదన్నారు. వడ్డితాండ్రలో రిలేనిరాహారదీక్షలు సాగుతుండగా హనుమంతునాయుడుపేట పంచాయతీలో గల వందలాది మంది తిరుగుబాటు చేసి మరో నిరాహారదీక్ష శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. సీతారాంపురం రహదారిపై థర్మల్ వాహనాలు వెళ్లనీయకుండా అడ్డుకున్నా బాధితులపై పోలీసులు కేసులు బనాయించడం సరైంది కాదన్నారు. థర్మల్ పవర్ ప్లాంటుకు వ్యతిరేకంగా పంచాయతీలో వున్న ప్రజలు గత 8 రోజులుగా రహదారిపై వంటావార్పూ చేస్తూ థర్మల్‌ను వ్యతిరేకిస్తున్న సమయంలో పోలీసులు ఆపేందుకు ప్రయత్నించకూడదన్నారు. సీతారాంపురం జంక్షన్ వద్ద తమ్మినేని సీతారామ్ సభకు రావడం, నినాదాలు చేయడంతో మరింత ఉద్రిక్తత వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకుడు తాండ్ర ప్రకాశ్, హన్నురావు, కారుణ్య్‌ఖత్రొ, నర్శింగరావు, కృష్ణమూర్తి, జనార్థన్, సోంపేట పోరాట కమిటీ నాయకుడు ఢిల్లీశ్వరరావు, స్థానిక మాజీ సర్పంచ్, పోరాట కమిటీ నాయకుడు భాస్కర్‌తోపాటు రైతులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు
15 మంది విద్యార్థులు ఎంపిక
నరసన్నపేట, అక్టోబర్ 10: ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోటీలలో నరసన్నపేటకు చెందిన విద్యార్థులు వివిధ ఆటల పోటీల్లో రాణించి రాష్టస్థ్రాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా.కె.అప్పారావు విద్యార్థులను అభినందించారు. రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికైన వారిలో కె.నివాస్, హరీష్, కె.కిరణ్, మదన్‌కుమార్, రాజు, రాజశేఖర్, ఎన్.రాజు, త్రోబాల్ పోటీలకు బి.జగన్, కిరణ్, పరుగుపందెంలో జ్యోతి, వెయిట్‌లిఫ్టింగ్‌లో శ్రీనివాసరావులు ఉన్నారు. విద్యార్థులు రాష్టస్థ్రాయి క్రీడలకు ఎంపిక కావడం పట్ల వ్యాయామ ఉపాధ్యాయులు వై.పోలినాయుడు, గోపి, ఉపాధ్యాయులు విశే్వశ్వరరావు, వేణుగోపాలరావు, మెట్ట మోహనరావు, గోవిందరాజులు అభినందించారు.
పస్తులుంటున్నాం
..ఎచ్చెర్ల, అక్టోబర్ 10: మండలం అరిణాం అక్కివలస పరిధిలో నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమలో గత మూడు మాసాల నుండి ఉత్పత్తులు నిలిపివేసిన కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఉద్యోగులు, కార్మికులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక విలేఖరులతో వారు మాట్లాడుతూ జూన్ 30న జరిగిన భారీ పేలుడు కారణంగా అప్పటి నుండి పరిశ్రమ యాజమాన్యం జీత, భత్యాలలో కోత విధించడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలు, అలాగే తమపై ఆధారపడిన తల్లిదండ్రులు అభద్రతకు లోనై మానసిక వేదనకు గురవుతున్నామని వాపోయారు. సుమారు 1500 కుటుంబాలు ఫ్యాక్టరీ మీద ఆధారపడి బతుకుబండి సాగిస్తున్నాయని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని యాజమాన్యం, జిల్లా పరిపాలనా యంత్రాంగం పరిశ్రమను పునఃప్రారంభించాలని కోరారు. గత మూడు మాసాల నుంచి పరిశ్రమలో ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా అన్ని భద్రతా చర్యలు పూర్తి చేసినప్పటికీ పునః ప్రారంభించడంలో జాప్యం జరుగడం వల్ల ఉద్యోగ, కార్మిక కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కె.మురళీకృష్ణ, విఎస్.ఎన్.వర్మ, జి.వి.ఎస్.శివరాం, సిహెచ్.శ్రీనివాసరావు, మధుసూధనరావు, జె.లక్ష్మణరావు, శంకర్రావు, బంగార్రాజు, జి.చంద్రశేఖర్, సి.హెచ్.సత్యనారాయణ, ఎల్.రాజారావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలోనే ప్రజాభిప్రాయ సేకరణ
ఎచ్చెర్ల, అక్టోబర్ 10: భారీ పేలుడు సంభవించి పరిసర గ్రామాల ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీసేందుకు దారితీసిన నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమను తిరిగి తెరిపించేందుకు అధికారులు నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణ గ్రామంలోనే జరిపించాలని చిలకపాలెం గ్రామస్థులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఆర్డీఒ గణేష్‌కుమార్ ఆదేశాల మేరకు తహశీల్దార్ వి.శివబ్రహ్మానంద్ బుధవారం ఎ.ఎ.వలస, అల్లినగరం, చిలకపాలెం గ్రామాల్లో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణకు కొంతమంది వ్యక్తులను ఎంపిక చేయాలని సూచించారు. ఎ.ఎ.వలస నుండి తొమ్మిది మంది, అల్లినగరం నుంచి నలుగురిని ఎంపిక చేశారు. చిలకపాలెం గ్రామస్థులు గ్రామంలోనే పరిశ్రమపై అభిప్రాయ సేకరణ జరిపించాలని పట్టుబట్టారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తహశీల్దార్ స్పష్టం చేశారు. గత కొంతకాలంగా బాధిత గ్రామాల తరపున ఉద్యమబాట సాగిస్తున్న పోరాట కమిటీ ప్రతినిధులు, పరిశ్రమ యాజమాన్యం మధ్య ఇదే అంశంపై రగడ చోటుచేసుకుంది. పేలుడు ఘటన సంభవించి మూడు నెలలవ్వడంతో కాలుష్య నియంత్రణ మండలి తాత్కాలికంగా ఉత్పత్తులు సాగించేందుకు అనుమతులిచ్చినప్పటికీ స్థానికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ఎలా అభిప్రాయ సేకరణ నిర్వహిస్తుందోనన్న చర్చ నెలకొంది.
క్రీడా స్ఫూర్తిని చాటండి
* వర్సిటీ ప్రిన్సిపాల్ చంద్రయ్య
బలగ, అక్టోబర్ 10: విద్యార్థులంతా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించి ఉత్తమ ప్రతిభను చూపాలని అంబేద్కర్ యూనివర్శిటీ ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో అంబేద్కర్ యూనివర్శిటీ అనుబంధ కళాశాలలకు సంబంధించి క్రీడాపోటీల ఎంపికలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడలు విద్యార్థులకు అవసరమని, రోజుకు ఒక గంటైనా క్రీడలకు కేటాయించాలన్నారు. ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆర్.గోపాలరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎల్.దేవానందం మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ఎంతగానో ప్రోత్సాహమందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలిపింక్ సంఘ కార్యదర్శి పి.సుందర్రావు, వర్శిటీ స్పోర్ట్స్ బోర్డు సభ్యులు సురేఖ, ఫిజికల్ డైరెక్టర్లు ఎం.శ్రీనివాస్, సి.హెచ్.్భస్కర్ తదితరులు పాల్గొన్నారు.