నల్లగొండ , అక్టోబర్ 14: జగజ్జనని శ్రీ కనక దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఈనెల 16(మంళగవారం) నుండి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో పాత్తబస్తీలో పేరుగాంచిన శ్రీశ్రీశ్రీ సంతీషిమాత దేవాలయాలం, రామగిరిలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గా ఓంకారేశ్వరాస్వామి దేవాలయం, కలెక్టరేట్ సమీపంలోని సరస్వతి అమ్మవారి దేవాలయాలను అంగరంగవైభంగా తీర్చిది అలంకరించారు. అదే విధంగా హైదరాబాద్ రోడ్డులోగల జమ్మి చెట్టు వివేకనందనగర్, వీటికాలనీ, పాతబస్తీ, ప్రకాశంబజార్, దేవరకొండ రోడ్డు, మిర్యాలగూడరోడ్డు, బిటిఎస్ దుర్గ అమ్మవారి ఆలయం, గడియారం సెంటర్‌లోని హనుమన్‌దేవాలయంలో తదితర ప్రాంతాలలో అమ్మవారి నవరాత్రి ఉత్సవ విగ్రహాలను నెలకొల్పి నవరాత్రి ఉత్సవాలను అక్టోబర్ 24వరకు నిర్వహించేందుకు సిద్ధవౌతున్నారు. దుర్గా అమ్మవారిని ప్రతిష్టించేందుకు మండపాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 16న బాల త్రిపురా సుందరి, 17న గాయిత్రిమాత, 18న శ్రీ లలితా త్రిపురా సుందరిదేవి,19న అన్నపూర్ణదేవి, 20న మహాలక్ష్మీదేవి, 21న సరస్వతిదేవి, 22న శ్రీ దుర్గాదేవి, 23న మహిషాసుర మర్దినిదేవి, 24న శ్రీ రాజరాజేశ్వరిదేవి రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనుంది.
19న సాముహిక కుంకుమార్చన..
జిల్లా కేంద్రంలోని సుప్రస్థి రామగిరిలో గల శ్రీశ్రీశ్రీ కనకదుర్గా ఓంకారేశ్వరాస్వామి వారి దేవాలయంలో ఈనెల 19న సాముహిక లక్ష కుంకుమార్చన కార్యక్రమంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు వాసుదేవ రజినికాంత్‌శర్మ తెలియచేశారు. అదే విధంగా అన్ని దేవాలయాలలో కుంకుమ పూజలు చేయనున్నారు.
బటర్‌ఫ్లై లైట్ల వెలుతురులో రహదారి
* వెలుగులు నింపుకున్న రహదారి
చిట్యాల, అక్టోబర్ 14: జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయి. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మండల కేంద్రంలో రహదారి మద్యలో ఉన్న బటర్‌ఫై లైట్లను తొలగించబడి ఏడాది దాటింది. విస్తరణ పనులను చేపట్టిన జిఎంఆర్ సంస్థ రహదారిని నిర్మించాక అధునాత బటర్‌ఫ్లై లైట్లను అమర్చింది. చాలా రోజుల తరువాత చిట్యాల పట్టణంలో రహదారి లైట్ల వెలుతురులో కనిపించింది. ఇరువైపులా ఏర్పాటు చేసిన లైట్లతో రహదారి లైట్లతో అందంగా కనబడుతుంది. చాలా రోజులకు రహదారి వెలుగులను నింపుకున్నదని స్థానికులు లైట్ల వెలుతురునూ చూస్తూ ఆనందిస్తున్నారు. మొత్తంమీద మండల కేంద్రంలో జాతీయ రహదారిపై వెలుగులు నిండాయి.
నేడు డయల్ యువర్ ఎస్పీ
నల్లగొండ , అక్టోబర్ 14: జిల్లాలో ప్రజల సమస్యలను పరిష్కరంకై నేడు సోమవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంను నిర్వహిస్తు జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1గంట వరకు 08682-222305్ఫన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో నేరుగాకూడా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.