ఆరోగ్యానికి మాంసాహారం కంటే శాకాహారమే ఎంతో మేలన్న వాస్తవాన్ని ప్రచారం చేయడంలో అమెరికా మహిళా సాకర్ స్టార్ బ్రాండీ చాస్టయిన్ నడుం బిగించింది. రోడ్ ఐలాండ్ (ఆర్ఐ)లోని నార్త్ ప్రావీన్స్ యూత్ సాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొని, ఫిట్‌నెస్‌కు శాకాహారం ఎంత అవసరమో వివరించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించి శాకాహార విశిష్ఠతను గురించి వివరిస్తానని ఆమె అంటున్నది. పనిలోపనిగా బ్రాండీ చాస్టెన్ చిన్నారులకు ఈ ఆటలో పాఠాలు నేర్పుతున్నది. న్యూయార్క్‌లోని బఫెలో సాకర్ క్లబ్‌కు ఇటీవల హాజరైన ఆమె వారితో కలిసి ఫుట్‌బాల్ ఆడింది. వారికి మెళకువలు నేర్పింది. సాకర్‌కు అమెరికాలో ఎంతో ఆదరణ ఉందని, ప్రపంచ కప్‌ను సాధించే సత్తావున్న క్రీడాకారులను తయారు చేయడమే తన లక్ష్యమని చాస్టెన్ అంటున్నది.
ఆరోగ్యానికి మాంసాహారం కంటే శాకాహారమే ఎంతో మేలన్న
english title:
vegitarian
Date:
Wednesday, October 17, 2012