పాప్ కార్న్
=========
వివక్ష లేని క్రీడ..
ప్రతి క్రీడలోనూ పురుషులు, మహిళల విభాగాల్లో విడివిడిగా పోటీలు ఉంటాయి. ప్రైజ్ మనీ నుంచి టోర్నీ నిబంధనల వరకూ వివక్ష చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఎలాంటి వివక్ష లేకుండా ఆడే ఒకే ఒక ఆట కోర్ఫ్ బాల్. ఇందులో పురుషులు, మహిళలు కలిసి ఆడతారు. ఒక్కో జట్టులో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉంటారు.
ఉపాధ్యాయుడి ఆవిష్కరణ
స్ప్రింగ్‌ఫీల్డ్‌లోని వైఎంసిఎలో ఉపాధ్యాయుడిగా పని చేసిన జేమ్స్ నైస్మిత్ 1891లో బాస్కెట్‌బాల్ క్రీడను కనిపెట్టాడు. ఆరంభంలో బుట్టలను కట్టి ఆడేవారు. తర్వాతి కాలంలో వైరుతో తయారు చేసిన బాస్కెట్స్ రంగ ప్రవేశం చేశాయి.
టూల్ కిట్ తమ వెంటే..
వౌంటెయిన్ బైక్ పోటీల్లో పాల్గొనే వాళ్లంతా టూల్ కిట్‌ను తమవెంట తప్పక తీసుకెళ్లాలి. చిన్నచిన్న మరమ్మతులు స్వయంగా చేసుకోవాలి. పెద్ద సమస్య వస్తే ‘అసిస్టెంట్ జోన్స్’ వద్ద నిపుణులను సంప్రదించే అవకాశం ఉంటుంది. ప్రమాదకరమైన క్రీడల్లో ఇదీ ఒకటైనప్పటికీ, ఎంతోమంది రేస్‌లో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతారు.
రెడ్ కార్డుల మ్యాచ్..
పరాగ్వేలో స్పోర్టివో అమెలియానో, జనరల్ కాబల్లెరో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకూ ఉద్రిక్తంగా సాగింది. ఆ మ్యాచ్‌లో మొత్తం 20 రెడ్ కార్డ్‌లను రిఫరీ చూపాడు. అంటే, మ్యాచ్ చివరి క్షణాల్లో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే మైదానంలో ఉన్నారన్నమాట.
చిచ్చర పిడుగు..
అంతర్జాతీయ సాకర్ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడు ఎవరో తెలుసా? నార్మన్ వైట్‌సైడ్ రికార్డు సృష్టించాడు. 17 సంవత్సరాల 47 రోజుల వయసులో మ్యాచ్ ఆడి, అంతకు ముందు పీలే నెలకొల్పిన రికార్డును అతను బద్దలు చేశాడు. అప్పట్లో సాకర్ చిచ్చర పిడుగు అనిపించుకున్నాడు వైట్ సైడ్.