Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

దసరాలోపు నామిటేడ్ పోస్టుల భర్తీ

$
0
0

హన్మకొండ, అక్టోబర్ 17: దసరా పండుగలోపు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తుందని, జిల్లాలో పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి అవకాశం దక్కేలా కృషి చేస్తానని ప్రభుత్వ చీఫ్‌విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షునిగా గండ్ర పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకుని పనె్నండవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండలోని డిసిసి భవన్‌లో అభినందన సభ జరిగింది. అర్బన్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో రమణారెడ్డి మాట్లాడుతూ 2001, అక్టోబర్ 17వ తేదీన పార్టీ మాజీ అధ్యక్షుల సహకారం, యూపిఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆశీస్సులు, అప్పటి పిసిసి చీఫ్ ఎం.సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సరోజిని పుల్లారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో జిల్లా అధ్యక్ష పదవి చేపట్టానని పేర్కొన్నారు. అధికారం చేపట్టినప్పటినుండి జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, నాయకుల సహకారంతో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి శక్తివంచనలేకుండా కృషి చేసానని అన్నారు. 2004, 2009లో జరిగిన ఎన్నికలతోపాటు 2005 వరంగల్, జనగామ మున్సిపల్, సహకార ఎన్నికలు, 2006 జిల్లాపరిషత్, 2007లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంకోసం ఎనలేని కృషి చేసానని తెలిపారు. పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎదో ఒక సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని చేయనిది చేసినట్టు, చేసిన పనిని చేయనట్లు కల్పితాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికోసం పనిచేస్తునే ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమానికి ముందుగా అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును రమణారెడ్డి కట్ చేసారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు రమణారెడ్డికి పూలమాలలువేసి, పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, ఎఐసిసి సభ్యురాలు డాక్టర్ హరిరమాదేవి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య, నాయకులు శ్రీనాధ్, సురేందర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, కిషన్, సరళాదేవి, మల్లారెడ్డి, బాబురావు పాల్గొన్నారు.
క్రీడల్లో విజయం దక్కేదాక పోరాడాలి
* విద్యలోనూ రాణించాలి
* క్రీడాకారులకు కెయు విసి ఉద్బోధ
నెక్కొండ, అక్టోబర్ 17: క్రీడాకారులు క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వెంకటరత్నం ఉద్భోదించారు. నెక్కొండ మండలం అలంకానిపేటలో 15వ అంతర్‌జిల్లా బాలబాలికల నెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలో విస్తృతమైన వనరులు ఉన్నప్పటికీ ఒలంపిక్ లాంటి పథకాల్లో వెనకబడి ఉండగా జమైక చిన్నదేశాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయని అన్నారు. పద్ధతులతో రాణిస్తే లక్ష్యాన్ని అధిగమించవచ్చని కులం, ప్రాంతం, భాష ఏవి అడ్డుకావని స్పష్టం చేశారు. జిల్లాలో పది నుంచి 15మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నైపుణ్యాన్ని నిరూపించుకునే ధృడసంకల్పం క్రీడాకారుల్లో ఉండాలని సూచించారు. ఎంచుకున్న క్రీడలో విజయం దక్కేదాక పోరాడాలని, ప్రయత్న లోపం ఉండవద్దని అన్నారు. కెయు పరిధిలోని మూడు జిల్లాలో 36 విభాగాల్లో పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల కోసం రూ.40లక్షలు వెచ్చిస్తున్నామని వెల్లడించారు. ఇకమీదట విశ్వవిద్యాలయ స్థాయి క్రీడలను జిల్లాల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. దీనిద్వారా గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని అన్నారు. నెట్‌బాల్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు కాకతీయ యూనివర్సిటీలో ఈ క్రీడకు అవసరమైన నిధులు కేటాయించి కురుక్షేత్రలో జరిగే పోటీలకు జట్టును పంపించేలా చూస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెట్‌బాల్ అసొసియేషన్ కార్యదర్శి సోమేశ్వర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యారావు, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐలయ్య, సురేష్‌కుమార్, ఎంపిడిఓ కృష్ణప్రసాద్, పిఇటి అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, యూటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్రవణ్‌కుమార్, రతన్‌సింగ్, తెదెపా మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చిట్టయ్య, నాయకులు కనకయ్య, రవికుమార్, వివిధ యువజన సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

ఓపెన్ స్కూల్ పరీక్షల్లో
మాస్ కాపీయంగ్
మహబూబాబాద్, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌స్కూల్ సొసైటీ నిర్వహిస్తున్న పదవతరగతి, ఇంటర్ పరీక్షలు అంతా ‘ఓపెన్’గానే జరుగుతున్నాయి. రెగ్యులర్ తరగతులకు హాజరుకాలేని వారి కోసం ఈ పరీక్షలు మంగళవారం ప్రారంభమవ్వగా, మహబూబాబాద్ డివిజన్ కేంద్రంలోని ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయంగ్ హోరెత్తుతోంది. పలు పరీక్షా కేంద్రాలను పత్రికా విలేఖరులు బుధవారం పరిశీలించగా మాస్ కాపీ తతంగం బయటపడింది. పరీక్షలు రాసే అభ్యర్థులు నేరుగా చీటిలు, పుస్తకాలు, గైడ్లు తీసుకుని వెళ్లి పక్కన పెట్టుకుని చూస్తూ రాస్తుండగా, ఫొటోలు తీస్తున్న విలేఖరులను చూసి కొందరు పరీక్షలు రాసే అభ్యర్థులైతే పుస్తకాలు వదిలేసి పారిపోయారు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల నుండి కొందరు ‘ఓపెన్’గా పరీక్షలు రాసేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.300నుండి రూ.500 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల కోసం వరంగల్ జిల్లాలో 18 ఇంటర్ కేంద్రాలు, మూడు టెన్త్ కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 5 వేల మంది హాజరవుతున్నారు. పాఠశాలకు, కళాశాలకు రెగ్యులర్‌గా వెళ్లే అవకాశం లేని వారి కోసం ప్రభుత్వం ఓపెన్‌స్కూల్ విధానంలో రెండేళ్లకోమారు పరీక్షలు నిర్వహిస్తోంది. గృహిణులు, నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు తదుపరి ప్రమోషన్ల కోసం ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. 16ఏళ్లు నిండిన వారు నేరుగా టెన్త్, టెన్త్ పాసైన వారు ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చు. రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ పూర్తిచేయాలంటే ప్రతి ఏట రెగ్యులర్ విధానంలో ఆరేసి సబ్జెక్టులు రాయవలసి ఉండగా, అదే ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఇంటర్మీడియట్ రెండేళ్లకు కలిపి మొత్తం ఐదు పేపర్లు రాస్తే సరిపోతుంది. ఈ కారణంగా అనేక మంది ఓపెన్‌స్కూల్ పరీక్షలకు ఉత్సాహం చూపిస్తున్నారు
కాపీయింగ్‌పై చర్యలు తప్పవు
జిల్లా కోఆర్డినేటర్
ఓపెన్‌స్కూల్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జరుగుతున్న ఫిర్యాదులు తమకు చేరాయని, మహబూబాబాద్ సెంటర్ల వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఓపెన్‌స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్ సురేష్ తెలిపారు.

ఇద్దరు దారుణ హత్య
హత్యలతో సంబంధం లేదన్న న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ నేత గోపన్న
గూడూరు, అక్టోబర్ 17: గూడూరు మండలంలోని బొద్దుగొండ శివారులో ఇద్దరు గిరిజన యువకులు మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. బొద్దుగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని చిల్లగండితండాకు చెందిన గుగులోతు దస్రూ (38), గుగులోతు రాజు(35) మంగళవారం ఉదయం బ్యాంకు పని నిమిత్తం తండా నుండి ద్విచక్రవాహనంపై గూడూరుకు వెళ్లారు. కాగా మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బొద్దుగొండకు చేరుకుని, ఓ బెల్టుషాపులో మద్యం సేవించి, మరికొంత మద్యాన్ని కొనుగోలు చేసి వాహనంలో పెట్టుకున్నట్లు సమాచారం. అయితే మంగళవారం రాత్రి పదిగంటలకు కూడా దస్రూ ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన దస్రూ భార్య భర్తకు ఫోన్ చేసింది. రింగ్ అయిన ఎంతసేపటికి కూడా దస్రూ ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చి జ్యోతి తన మరిది భజన్‌నాయక్‌ను బుధవారం ఉదయం దస్రూ ఆచూకీ కోసం బొద్దుగొండకు పంపించింది. అయితే బొద్దుగొండకు చెందిన చెవిటి వీరన్న బుధవారం తెల్లవారుజామున బహిర్భూమి కోసం గ్రామ శివారు పొలాల వద్దకు వెళ్లాడు. బొద్దుగొండ-చిల్లగండి తండా మార్గమద్యంలోని మూల మలుపు సమీపంలో పగడాల భూషయ్య పొలంలో ఇద్దరి మృతదేహాలు కన్పించాయి. ఇదే సమయంలో భజన్‌నాయక్ బొద్దుగొండ నుండి తండాకు వస్తుండగా వీరన్న ఆపి సంఘటనా స్థలం వద్ద పడి ఉన్న మృతదేహాలను చూపించాడు. తన అన్న దస్రూ, బంధువు రాజు మృతదేహాలు గుర్తించి, కుటుంబ సభ్యులకు తెలపగా తండా వాసులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలం వద్దకు తరలివచ్చారు. దస్రూ మెడ, ముఖం, తల భాగాలపై ఐదు చోట్ల గోడ్డలి గాట్లు ఉన్నాయి. రాజు మెడ, తలపై, మోచేతిపై గొడ్డలి గాట్లు ఉన్నాయి. తొలుత దస్రూను హతమార్చిన తర్వాత రాజును హతమార్చినట్లు సంఘటనా స్థలిని బట్టి తెలుస్తోంది. దస్రూ భార్య జ్యోతి, రాజు భార్య కమల, వారి బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ హత్యలపై దస్రూ భార్య జ్యోతి, రాజు భార్య కమల రెండు కోణాల్లో ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేశారు. 2004 సంవత్సరంలో ఎర్రగుంట తండా వద్ద జరిగిన బాదావత్ రాంచందర్ హత్యలో దస్రూ నిందితుడని, రాంచందర్ బంధువులు హతమార్చి ఉంటారని ఆమె విలపిస్తూ తెలిపింది. అదే విధంగా దస్రూ మరదలు పార్వతి 2009వ సంవత్సరంలో కురవి మండలంలో హత్యకు గురైందని, అప్పట్లో ఈ హత్యను న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ నాయకుడు గోపనే్న చేయించాడని తన భర్త దస్రూ అప్పట్లో ఆరోపించాడని ఆమె పేర్కొంది. ఈక్రమంలోనే గోపనే్న తన భర్త దస్రూను హత్య చేయించి ఉండవచ్చని వీరిద్దరిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆమె పోలీసులకు తెలిపింది. కాగా దస్రూ, రాజుల హత్యలతో తమకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ నేత, జిల్లా సహాయ కార్యదర్శి గోపన్న ఒక ప్రకటనలో తెలిపారు.
సంఘటనా స్థలిని
పరిశీలించిన ఎఎస్పీ
బొద్దుగొండ - చిల్లగండితండా మార్గమద్యంలో ఇద్దరు గిరిజన యువకులు మంగళవారం అర్ధరాత్రి దారుణహత్యకు గురికాగా సంఘటనా స్థలాన్ని బుధవారం ఉదయం ములుగు ఎఎస్పీ, నర్సంపేట ఇన్‌చార్జి డిఎస్పీ సెంథిల్‌కుమార్ పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్ బృందాలు వచ్చాయి. హత్యకు గురైన దస్రూ, రాజు భార్యలు జ్యోతి, కమల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద హత్యలుగా కేసు నమోదు చేసినట్లు గూడూరు సిఐ రాజశేఖరరాజు తెలిపారు.
దస్రూ వెంట వెళ్లడమే రాజును బలిగొన్నారా!
దస్రూ వెంట వెళ్లడమే రాజును బలిగొన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయ. రాజు దస్రూకు కుమారుడు వరుస కాగా ఉన్నత విద్యావంతుడు. ఎంత చదివినా తండాలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రాజు భార్య కమల ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. రాజుకు తండాలో పది ఎకరాలకు పైచిలుకు పొలం ఉంది. అయితే మంగళవారం ఉదయం దస్రూతో వెళ్లిన రాజు శవమై కన్పించడంతో దుండగులు తమను ఎక్కడ గుర్తుపడుతాడోననే కోణంలో రాజుకు కూడా హతమార్చి ఉంటారని, సాక్ష్యం లేకుండా చేయడమే లక్ష్యంతో దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దస్రూతో వెళ్లకపోతే రాజు ప్రాణాలు దక్కేవని తండా వాసులు కొందరు చెబుతున్నారు.

ఆర్‌ఎం కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన
* కొత్తబస్టేషన్ వద్ద కార్మికుల సామూహిక దీక్ష
హన్మకొండ, అక్టోబర్ 17: ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నగరంలోని హన్మకొండ కొత్తబస్‌స్టేషన్ వద్ద తెలంగాణ మజ్ధూర్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం సామూహిక రిలే నిరాహరదీక్ష చేపట్టారు. జిల్లాలోని ఎనిమిది డిపోలకు చెందిన టిఎంయు నాయకులు, సభ్యులు వేర్వేరుగా చేపట్టిన రిలే నిరాహారదీక్షా శిబిరాలను టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, టిఎంయు జిల్లా గౌరవ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌ఎం నేషనల్ మజ్ధూర్ యూనియన్, ఆర్టీసీ సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలంగాణ కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తూ టిఎంయు కార్మికులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కార్మికులతో ఒవర్ డ్యూటీలు చేపిస్తూ ఇష్టానుసారంగా బదిలీలు చేయడమే కాకుండా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని కార్మికులుగా చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. సమయానికి బస్సులు ఇవ్వకుండా అదనపు విధులు నిర్వహింపజేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సులను నర్సంపేట డిపోకు తరలించి డిపోను ఎత్తివేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్‌ఎం కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడి, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమాలతోపాటు అన్ని డిపోల పరిధిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ దీక్షలలో తెలంగాణ మజ్ధూర్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిఆర్ రెడ్డి, రీజినల్ అధ్యక్షులు ఇఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి బికె రెడ్డి, ఎనిమిది డిపోలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
సంస్కృతి, పండుగలపై అవగాహన కల్పించేందుకే
చిత్రలేఖన పోటీలు
బాలసముద్రం, అక్టోబర్ 17: విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, పండగలపై అవగాహన కలిపించడానికి బతుకమ్మ సంస్కృతిపై పోటీలు నిర్వహించామని డిపిఆర్వో కె.వెంకటరమణ అన్నారు. బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొని బతుకమ్మ పండగ ఉట్టిపడేలా తమదైన శైలిలో కళాత్మకంగా చిత్రాలు గీశారని అన్నారు. ఈ చిత్రాలకు ప్రముఖ అర్టిస్ట్ కమలాకర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించి ఎంపిక చేశారని, త్వరలో వారికి బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. సమాచారశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.మనోహరాచారి ఈ పోటీలను పరిశీలించారు. విద్యార్థులకు చిత్రలేఖనంపై ఆసక్తి పెంపొందించడానికి, అలాగే పండగలపై అవగాహన కలగడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పౌరసంబంధాల అధికారి ఇవి.కిరణ్మయి, పబ్లిసిటి అసిస్టెంట్ జి.విధువౌళి పర్యవేక్షించగా, ములుగు డివిజనల్ పౌరసంబంధాల అధికారి ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సాధించుకున్న హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది
ములుగు, అక్టోబర్ 17: కల్లుగీత కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించకుండా పోరాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని కల్లుగీత కార్మిక సంఘం ములుగు డివిజన్ అధ్యక్షుడు పులి నర్సయ్య గౌడ్ విమర్శించారు. బుధవారం ములుగులోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 1న నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకటిస్తారని గీత కార్మికులు ఎదురు చూశారని తీరా ఎక్సైజ్ పాలసీ ప్రకటించకుండా పాత విధానాన్ని అమలుచేయాలని ఎక్సైజ్ అధికారులకు సర్కూలర్ పంపారని అన్నారు. పెండింగ్‌లో ఉన్న గీత కార్మికుల పెన్షన్ వెంటనే ఇవ్వాలని, వితంతువులకు, వికలాంగులకు కూడా కల్లుగీత సొసైటీ స్కీం క్రింద పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డివిజన్‌లోని సొసైటీలలో సగం మందికి కూడా సభ్యత్వం, గుర్తింపుకార్డులు లేవని, వెంటనే అర్హులైన వారందరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

* పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి అవకాశం * ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర
english title: 
d

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>