విజయనగరం (కంటోనె్మంట్), అక్టోబర్ 17: రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు బుధవారం స్థానిక డిఎస్‌ఎ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. జిల్లాబ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో క్రికెట్‌కు సమానంగా షటిల్ బ్యాడ్మింటన్ ప్రజాదరణను పొందుతుందని అభిప్రాయపడ్డారు. బ్యాడ్మింటన్ ఆరోగ్య పరంగా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ లీగ్ పోటీల్లో బాలురు విభాగంలో 67 మంది వ్యక్తిగత పోటీల్లో పాల్గొనగా వీరిలో 8 మందిని, డబుల్స్‌లో 23 మంది క్రీడాకారులకుగాను 7 జట్లును, బాలికలు సింగిల్స్ విభాగంలో 19 మందికి ఆరుగురు, డబుల్స్ విభాగంలో రెండు జట్లును ఎంపిక చేశారు.
‘త్రిశతాబ్ది ఉత్సవాలు
విజయవంతం చేయండి’
విజయనగరం (కంటోనె్మంట్), అక్టోబర్ 17: సంస్థాన త్రిశతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని బిఎస్‌ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి.ఎస్.ఆర్ మూర్తి కోరారు. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట నిర్మాణానికి శంకుస్థాపన చేసి, విజయదశమికి మూడు శతాబ్దాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా రచతల సంఘం, మోజాయిక్ సాహిత్య సంస్థ, బి.ఎస్,ఆర్ ఫౌండేషన్లు సంయుక్తంగా ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొజాయిక్ సాహితీ సంస్థ ప్రతినిధి రామానంద తీర్థ, సాహితీవేత్త జగదాత్రి, సాగిశివ సీతరామరాజు కళాపీఠం అధ్యక్షుడు ఎస్.ఎస్.ఎస్.ఎస్.వి.ఆర్.ఎం. పాల్గొన్నారు.
వసతి గృహం
రికార్డులు స్వాధీనం
లక్కవరపుకోట, అక్టోబర్ 17 : మండలం కేంద్రంలో గల బిసి వసతి గృహ కార్యాలయం తాళాలను విరగకొట్టి తహశీల్థార్ సమక్షంలో అసిస్టెంట్ బిసి సంక్షేమాధికారి కె. సూరిబాబు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వసతి గృహంలో పని చేసిన సంక్షేమాధికారి టి. సూర్యనారాయణ విధులకు గైర్హాజరు కావటంతో ఉన్నతాధికారులు విధుల నుండి తాత్కాలికంగా నిలువుదల చేశారు. దీంతో ఆయన కార్యాలయం తాళాలు ఇవ్వకుండా ఉండటంతో సిబ్బందికి ఆరు నెలల నుండి వేతనాలు ఇవ్వలేక పోయామని సూరిబాబు తెలిపారు. బుధవారం రికార్డులు స్వాదీనం చేసుకున్నప్పటికీ పూర్తిస్థాయి రికార్డులు దొరక లేదని ఆయన కోరారు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన పరిధిలో 12 బిసి వసతి గృహాలు ఉన్నాయని వీటి మరమ్మత్తులకు గాను రూ. 15 లక్షలు మంజూరైనాయని, ఎల్. కోట వసతి గృహానికి మాత్రం లక్షా అరవైవేలు మంజూరైనాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్ధార్ జి. రాములమ్మ, ఇన్‌చార్జి సంక్షేమాధికారి జామి సన్యాసిరావు వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి శ్రీకారం
డెంకాడ, అక్టోబర్ 17 : ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరానికి బుదవారం శ్రీకారం చుట్టారు మండలంలో పినతాడివాడలో గుర్తించిన సిరిమాను చెట్టును నిరికి వేతతో సంబరాలకు అంకురార్పణ జరిగినట్లు అయింది. వేలాది మంది భక్తులు జయజయ ద్వానాలు మధ్య సినిమాను చెట్టుకు భారీ ఎత్తున పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి తాళ్ళపూడి బాస్కరరావు, డిసిసి అద్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కాంగ్రెస్ నాయకులు, ఆలయ అసిస్టెంట్ కమీషనర్ శ్యామలాదేవి అధికారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దార్మిక ధర్మకర్త దాట్ల విజయరామరాజు, కాంగ్రెస్ నాయకులు పిళ్ళా విజయకుమార్ , మండల తహశీల్ధార్ రామకృష్ట పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందొబస్తు ఏర్పాటు చేసారు. రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు
60 మంది క్రీడాకారులు ఎంపిక
పార్వతీపురం, అక్టోబర్ 17: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి హాకీ జట్టు ఎంపికలో కార్యక్రమంలో 60 మంది విద్యార్థులు రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 14 విభాగంలో బాలికలు 15 మంది, బాలురు 15 మంది వంతున ఎంపికయ్యారు. అండర్ 17 విభాగంలో కూడా బాలికలు, బాలురు 15 మంది వంతున ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వీరంతా రాష్టస్థ్రాయిలో జరిగే హాకీ పోటీలకు వెళ్లనున్నారు. ఈ ఎంపిక కార్యక్రమానికి వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.వాసుదేవరావునాయుడు, నాగభూషణరావు పాల్గొని ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ డిఇఒ పి జార్జి ఎబినైజర్ పరిశీలించారు.
‘కలప అక్రమ రవాణా నిరోధానికి చర్యలు’
పార్వతీపురం, అక్టోబర్ 17: జిల్లాలో కలప అక్రమ రవాణాదారుల నుండి ఈ ఏడాది రూ.32లక్షల అపరాద రుసుం వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని జిల్లా అటవీశాఖాధికారి ఐకెపి రాజు తెలిపారు. బుధవారం ఆయన పార్వతీపురం అటవీశాఖాకార్యాలయం పనితీరును పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే అక్రమ రవాణాదారుల నుండి రూ.12లక్షలు వసూలు చేశామన్నారు. మార్చినాటికి మిగిలిన రుసుము వసూలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని 100 హెక్టార్ల విస్తీర్ణంలో టేకు నర్సరీ బెడ్లు పెంపకం చేపడుతున్నామని, మరో పది హెక్టార్ల విస్తీర్ణంలో రోజ్ ఉడ్, ఏగిస, నేరేడు తదితర జాతుల మొక్కల పెంపకం చేపడుతున్నట్టు తెలిపారు. ఈ పెంపకానికి దాదాపురూ.15 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. రెండేళ్లపాటు పెరిగిన ఈనర్సరీల్లోని మొక్కలను రైతులకు సామాజిక అటవీశాఖ ద్వారా పంపిణీ చేపడతామని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి 2200 టేకుబెడ్లు ద్వారా 10 లక్షల వరకు టేకు మొక్కలు రావచ్చునన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. జిల్లాలో ఏనుగుల సంచారం లేదని, అయితే శ్రీకాకుళం జిల్లా వీరఘట్టాం సరిహద్దుప్రాంతంలో ఏనుగుల సంచారం ఉన్నట్టు సమాచారం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని గిరిజనులకు సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పిస్తున్నామన్నారు. వీటిలో కొత్తగా ఎలాంటి అధునాతన పద్ధతులు అవలంబించి సేద్యం చేయడానికి చట్ట ప్రకారం అవకాశం లేదన్నారు. గతంలో మాదిరిగానే సేద్యం చేసే అవకాశాలున్నాయన్నారు. అదిలాబాదు, ఖమ్మం జిల్లాల మాదిరిగా విజయనగరం జిల్లా ఐఎపి జిల్లాలుగా పూర్తిస్థాయిలో ఎంపిక కానందున అటవీప్రాంతంలోని రోడ్లు, ఇతర సదుపాయాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతి లేదన్నారు. అయితే ప్రభుత్వపరంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి అనుమతి కోసం ప్రతిపాదించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం అటవీశాఖ రేంజ్ అధికారి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రహదారి సౌకర్యం కల్పించాలంటూ
గిరిజనుల 16 కిలోమీటర్ల పాదయాత్ర
గుమ్మలక్ష్మీపురం, అక్టోబర్ 17:తమ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ గిరిజనులు వినూత్నంగా తమ సమస్యను అదికారుల దృష్టికి తీసుకువచ్చారు. చెప్పులు వేసుకోకుండా పాదయాత్ర చేసి మండల కేంద్రానికి చేరుకున్నారు. మండలంలోని గుణద గ్రామం మీదుగా టెంకసింగి, కోసంగి భద్ర వరకు తారు రోడ్డును నిర్మించాలంటూ ఈ గ్రామాలకు చెందిన సుమారు 100మంది యువత బుధవారం పాదరక్షలు లేకుండా 16కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అంత దూరం నడిచి మండల కేంద్రానికి వచ్చారు. వివిధ విభాగాల అధికారులను కలిశారు. ఈ సందర్భంగా యువ గిరిజనసంఘం నాయకులు కె.అప్పలస్వామి, తిరుమలలు మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యంతోపాటు ఉపాధి హామీ పనిదినాలను వంద రోజుల నుంచి రెండువందల రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలను తగ్గించి, విద్యుత్ కోతలను నివారించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం ఐ.టి.డి.ఏ. పి.ఓ. ప్రతీ బుధవారం గుమ్మలక్ష్మీపురంలో గిరిజన దర్భార్ నిర్వహించాలని కోరారు. అలాగే గిరిజన గ్రామాల్లో నాటుసార అమ్మకాలు, బెల్ట్‌షాపులను ఎత్తివేయాలని, ఏజెన్సీలో వైద్యసేవలను మెరుగుపర్చాలని కోరారు. అనంతరం మండల తహశీల్దారు రామకృష్ణ, మండల ప్రత్యేకాధికారి జి.మురళి, ఎం.పి.డి.ఓ. లక్ష్మణరావులకు వినతిపత్రాలు అందజేశారు.
‘ఆరోగ్యశ్రీ ద్వారా 51 వేల మందికి శస్త్ర చికిత్సలు’
బొబ్బిలి, అక్టోబర్ 17: జిల్లాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 119 కోట్లతో 51 వేల మంది రోగులకు ఉచితంగా ఆపరేషన్లు చేసినట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కో- ఆర్డినేటర్ ఉషశ్రీ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా నిరుపేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎటువంటి సమాచారం కావల్సిన 104 ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. 935 రకాల రోగులకు సంబంధించిన వైద్యాన్ని ఈ పథకం ద్వారా పొందవచ్చునన్నారు. రక్తం, మెదడుకు సంబంధించిన కొన్ని రకాలైన వ్యాధులకు ఈ పథకంలో చికిత్స అందించలేకపోతున్నట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ వైద్యాధికారులను సంప్రదిస్తుండటంతో కొంత మంది రోగులను పక్కదోవ పట్టిస్తున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి వారు లక్షలాది రూపాయలతో చికిత్సలు చేయించుకోవల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అలాగే జిల్లాలో 92 ఆరోగ్యమిత్రులున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికి ఎటువంటి అనారోగ్యంతో ఉన్న బాధితులు ఆరోగ్య మిత్రలను కలిస్తే వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా ఎక్కువగా చిన్న పిల్లల వ్యాధులు, గైనిక్ సమస్యలు పరిష్కారమవుతున్నట్లు తెలిపారు. కొంత మందికి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం వైద్యసేవలందిస్తున్నామన్నారు.పార్వతీపురం, కొత్తవలసలతోపాటు విజయనగరంలో ఆరు ఆసుపత్రుల ద్వారా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు సేవలందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
‘రాష్ట్రావతరణ ఉత్సవాలను
ఘనంగా నిర్వహించాలి’
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నవంబర్ ఒకటోతేదీన ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మయ్య ప్రతీ ఏడాది నిర్వహించే విధంగా ఉత్సవాలలో శాఖల అభివృద్ధి ప్రదర్శించే స్టాళ్లను, ఉపకరణాల పంపిణీ ఏర్పాటు చేయాలన్నారు. ఆరోవిడత భూ పంపిణీకి పట్టాలను అందించేలా ఏర్పాటు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారికి సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు మర్యాదలు చేయాలని ఆర్డీఒ జి.రాజకుమారి, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అయిదో బెటాలియన్ వారికి, పారిశుద్ధ్యం, మంచినీటి ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామికి సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని డిఇఒ కృష్ణారావును ఆదేశించారు. వేదిక వద్ద 108 వాహనాన్ని ఉంచాలని, ప్రధమ చికిత్స కిట్లతో వైద్యసిబ్బంది ఉండేలా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మికి సూచించారు. ఈ సమావేశంలో జాయింట్‌కలెక్టర్ పి.ఎ.శోభ, అదనపుజాయింట్‌కలెక్టర్ ఎం.రామారావుతోపాటు పలువిభాగాల అధికారులు పాల్గొన్నారు.
ర్యాగింగ్‌పై విద్యార్థుల ఫిర్యాదు
నెల్లిమర్ల, అక్టోబర్ 17: ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైతే కఠిచర్యలు తప్పవని ఒఎస్‌డి డి.వి శ్రీనివాసరావు హెచ్చరించారు. మిమ్స్ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు విద్యార్థులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మిమ్స్ కళాశాలకు చెందిన కొంతమంది సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడుతూ మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ర్యాగింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ కార్తికేయ ఒఎస్‌డి శ్రీనివాసరావు విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఒఎస్‌డి శ్రీనివాసరావు బుధవారం మిమ్స్ వైద్యకళాశాలలో విద్యార్థులను విచారించారు. అనంతరం ఆయన విద్యార్థులతో ర్యాగింగ్‌పై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ ఒక అనాగరిక చర్యని, ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ బి.నాగేశ్వరరావు, ఎస్సై వరప్రసాద్‌లు ఒఎస్‌డి వెంట ఉన్నారు. కళాశాల డీన్ టి.ఎ.వి నారాయణరాజు మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్ జరగలేదని, కావాలనే బయట వ్యక్తుల తప్పుడు ఫిర్యాదులు చేసినట్లు ఆయన తెలిపారు.
‘యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు’
విజయనగరం (్ఫర్టు), అక్టోబర్ 17: పైడితల్లి అమ్మవారి జాతరను దృష్టిలో పట్టణంలో యుద్ధప్రాతిదికన అభివృద్థిపనులు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో పలువిభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందస్వామి మాట్లాడుతూ అమ్మవారి జాతరకు లక్షలాదిమంది భక్తులు వస్తారని, వీరి సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నారు. మంచినీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ముఖ్యమైన ప్రాంతాల్లో మల,మూత్రవిసర్జనశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పట్టణంలో రోడ్ల మరమ్మతులను త్వరితగతిన పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు 12లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. సిరిమాను తిరిగే సమయంలో భక్తులు విసిరే అరటిపళ్లను యుద్ధప్రాతిదికన తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందుకు సీనియర్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను వినియోగించాలన్నారు. జాతర సందర్భంగా మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల వీధిలైట్లను ఏర్పాటు చేయాలన్నారు. పాడైన వాటిలో స్థానంలో కొత్తలైట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
విద్యుతత్ కోతలతో
మూతపడుతున్న చిన్న పరిశ్రమలు
సీతానగరం, అక్టోబర్ 17: ప్రభుత్వం విధిస్తున్న విద్యుత్ కోతల వల్ల చిన్న పరిశ్రమల యాజమాన్యంతోపాటు చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మేరకు రైసుమిల్లులు, కొత్తమిషన్, వెల్డింగ్ షాపులు, నెట్ సెంటర్లు, జెరాక్స్ షాపులు, తదితర యజమానులు విద్యుత్ కోతల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీని వలన ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు పనిలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటు గృహ వినియోగదారుల కష్టాలు వర్ణణాతీతం. ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటుందో, ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ విద్యుత్ కోతల వలన నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్న పరిశ్రమలకు వారంలో మూడు రోజులు పవర్ హాలిడే ప్రకటించడం వలన తీవ్రంగా నష్టపోతున్నామని చిన్న పరిశ్రమల యాజమాన్యం ఎం.్ధనుంజయరావు, తదితరులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా విద్యుత్ కోతలను నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
‘దసరాకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు’
పార్వతీపురం, అక్టోబర్ 17: దసరా పురస్కరించుకుని పార్వతీపురం డిపోనుండి ప్రత్యేక సర్వీసులు నడపడానికి చర్యలు తీసుకున్నామని పార్వతీపురం ఆర్టీసీ డిపోమేనేజర్ ఎన్‌వి ఎస్ వేణుగోపాల్ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 18నుండి 23 వరకు నడిపే సర్వీసుల్లో భాగంగా పార్వతీపురం-విశాఖపట్నం, బొబ్బిలి-విజయనగరంల మధ్య ఆరుప్రత్యేక బస్సులు నడపడంతోపాటు 30 సింగిల్ ట్రిప్పులు అదనంగా నడపుతున్నట్టు తెలిపారు. తిరుగుప్రయాణం ఈనెల 25వ తేదీ నుండి నడుపుతామన్నారు. దూర ప్రాంత సర్వీసులు నడిపేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా పార్వతీపురం నుండి 7.45,15.15 గంటలకు విజయవాడకు నడిపే సర్వీసులు నడుతామన్నారు. ఇందుకు రూ.407 టికెట్టు ఉంటుందన్నారు. రాజమండ్రికి 5.15,9.45 గంటలకు బయలు దేరుతాయని ఇందుకు చార్జీ రూ.280 ఉంటుందన్నారు. కాకినాడ ఉదయం 7.15 గంటలకు బయలుదేరుతుందని చార్జీ రూ.249లు ఉంటుందని, హైదరాబాదుకు మధ్నాహ్నం 2 గంటలకు నడుపుతామని దీనికి రూ.731 టికెట్టు, రామచంద్రాపురం 10.45 గంటలకు నడపుతామని దీనికి రూ.282లు, తాడేపల్లిగూడేంకు ఉదయం 5.30 గంటలకు, మళ్లీ సాయంత్రం 17.30 గంటలకు సర్వీసులు నడుపుతామన్నారు. దీనికి రూ.3.19 టిక్కెట్టు ధరగా ఉంటుందన్నారు. పార్వతీపురం నుండి బొబ్బిలికి నడిపే పల్లెవెలుగు నాన్‌స్టాప్ సర్వీసులకు బస్‌ఛార్జి టికెట్ కేవలం రూ.15కే నడుపుతున్నందున పూర్తిస్థాయిలో ప్రయాణికులు ఈ సర్వీసులు వినియోగించుకోవాలని కోరారు.
అదనపు సర్వీసులకు ప్రతిపాదనలు
ఈ ఏడాది వివిధ వర్గాల ప్రయాణికుల విజ్ఞప్తిమేరకు సర్వాపాడు, కోసర, కెమిశీల తదితర ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు బస్ సర్వీసులు నడపాడానికి ప్రతిపాదనలు చేశామని డిఎం వేణుగోపాల్ తెలిపారు. అదేవిధంగా బొబ్బిలి, మక్కువ తదితర ప్రాంతాలకు అదనపుసర్వీసులు నడపడానికి ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ సమావేశంలో డిపోమేనేజర్‌తో వేణుగోపాల్‌తో అసిస్టెంట్ ఇంజనీరు (మెకానికల్) డి జాన్ సుందరం, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) ఎస్.సంగమేషు పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థుల మృతిపై
రౌండ్ టేబుల్ సమావేశం
గుమ్మలక్ష్మీపురం, అక్టోబర్ 17: గిరిజన విద్యార్థుల మరణాలపై బహిరంగ విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని గుమ్మలక్ష్మీపురంలో బుధవారం జరిగిన అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు రౌండు టేబుల్ సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రామస్వామి, పిఆర్‌టియు నాయకులు బోయక నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు ఎం రమణ, అవినాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం ధర్మారావు, టిడిపి నాయకులు పాడి సుధ, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఎం భూషణ మాట్లాడుతూ ఈ ఏడాది వివిధ గిరిజన సంక్షేమ సంస్థలలో చదువుతున్న 8 మంది విద్యార్థులు మృతిచెందారని, ఇందుకు గల కారణాలను అధికారులు వెలుగులోకి తీయాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల మరణాలపై తగిన దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని కోరుతూ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. మృతిచెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల రూపాయలు చొప్పున ఎక్స్‌గ్రేసియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
వసతి గృహాల్లో ప్రతి నెల వైద్య శిబిరాలు నిర్వహించి పౌష్టికాహారం అందించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలో ఎఎన్‌ఎంలను నియమించాలని, గిరి బాలరక్ష పథకం ద్వారా ప్రతి విద్యార్థికి హెల్త్‌కార్డులు అందించాలని, 50 ఏళ్లు దాటిన పురుషులను బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియమించాలని డిమాండ్ చేశారు.
‘విద్యారంగ సమస్యల పరిష్కారంలో
ప్రభుత్వం విఫలం’
బొబ్బిలి, అక్టోబర్ 17: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు పర్యాయాలు ముఖ్యమంత్రికి వినతులు అందించినా ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయగౌరి స్పష్టం చేశారు. స్థానిక సంస్థానం ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 900 ఎంఇఒ పోస్టులను భర్తీ చేయాలని ఎయిడెడ్ పాఠశాలలో రేషనలైజేషన్, పదోన్నతుల ప్రక్రియను నవంబర్ లోగా పూర్తిచేయాలని కోరినట్లు తెలిపారు. డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న 274 లెక్చరర్ల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. 398 రూపాయల వేతనంపై పనిచేస్తున్న టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, జీతాలపై ప్రీ ఆడిట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు, సూచనల మేరకు పాఠశాలలో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని, అవసరం అనుకుంటే యుటిఎఫ్ తరుపున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యుటిఎఫ్ కార్యవర్గ సభ్యులు వరప్రసాద్, పి సత్యంనాయుడు, వెంకటినాయుడు, తదితరులు పాల్గొన్నారు.