పాలకొల్లు, అక్టోబర్ 20: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు షర్మిల పాదయాత్ర ఒక సవాల్ అని మాజీ పార్లమెంటు సభ్యుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య అన్నారు. పాలకొల్లులో శనివారం తన గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ను ప్రజల మధ్య తిరగకుండా ఒక పథకం ప్రకారం ఈ రెండు పార్టీలు చేస్తున్నారని, వీరి కుట్రలు ఇక చెల్లవని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ మూటముల్లె సర్దుకొని రాజీకాయలు వదిలి అస్తస్రన్యాసం చేయటమే ఇక మిగిలి ఉందన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ ఎవరిపై ఎక్కుపెట్టిన బాణం అని వ్యాఖ్యానించటం, పార్టీలో అవినీతి ఎక్కడ ఉందని షర్మిల అడిగినా కళ్లు తెరవలేదని ఆయన అన్నారు. బొత్సా తన మిత్రుడేనని, తాము నూటికి నూరుపాళ్లు నీతిపరులమని చెప్పగల దమ్ము ఉందా అని ఆయనను ప్రశ్నిస్తున్నాని అన్నారు. ఇక ఆయన ఆటలు సాగవని హెచ్చరిస్తున్నానని ఆయన అన్నారు. జగన్ వద్ద అనేక అస్త్రాలు ఉన్నాయని, షర్మిల పాదయాత్ర ఒక అస్త్రం మాత్రమేనని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పెద్దలు, తెలుగుదేశం నాయకుడు కలిసి పన్నుతున్న కుట్రలను ఛేదించడం కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టడం, రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలని, రాజన్న సంక్షేమ పథకాలు కొనసాగించాలని తలబెట్టిన ఈ పాదయాత్ర జనసంక్షేమ యాత్రని ఆయన వెల్లడించారు. దీనిని మరో ప్రస్థానంగా భావించాలని, స్వర్ణయుగం రావడానికి వాడిన బ్రహ్మాస్తమ్రని ఆయన అన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ లేకుండా చేసి చీకటి రాష్ట్రంగా మార్చారని, వండుకోవటానికి గ్యాస్ సామాన్యుడు కొనలేని పరిస్థితి కల్పించి తిరిగి కట్టెల పొయిలు పెట్టుకునేలా చేశారని ఆయన అన్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలలకు రీయింబర్స్‌మెంటు సకాలంలో విడుదల చేయకుండా వాటిని మూసివేసే పరిస్థితి కల్పించారని ఆయన ఆరోపించారు. పేదవారికి పెద్ద చదువులు చదువుకునే అవకాశాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం కళాశాలలే లేకుండా చేసే పరిస్థితి కల్పించి, ఫీజులు పెంచి రీయింబర్స్‌మెంటు కోత విధించి అసలు పేదలు ఉన్నత చదువులు మానేలా చేశారని ఆయన ఆరోపించారు. ఎరువుల ధరలు పెరిగాయని, సాగు నీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతన్నలపై పన్నులపై పన్నులు విధిస్తూ రైతు జీవన విధానానికి అడ్డుగా నిలిచారని ఆయన విమర్శించారు. సిబిసిఐడిని అడ్డుపెట్టుకొని బెయిల్ రాకుండా చేసి ప్రజలకు దూరం చేశామన్న భ్రమలో ఉన్నారన్నారు. షర్మిల పాదయాత్రకు లభించిన స్పందనతో కంగారు పడి చేస్తున్న ప్రకటనలను ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు అడ్రస్ గల్లంతయ్యే రోజు దగ్గరలోనే ఉందని ఆయన వెల్లడించారు. జగన్ జైలులో పెట్టిన మరెక్కడ పెట్టినా ఆయన ప్రభంజనాన్ని ఆపలేరని, సూర్యుడిని అరచేతితో ఆపాలనుకోవటం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ సమావేశంలో నడపన చిన సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం అభివృద్ధికి కృషి చేయాలి
కొవ్వూరు, అక్టోబర్ 20: దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న, ఎందరో మహా పండితులను, మేధావులను దేశానికి అందించిన కొవ్వూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు లింగాల నరసింహారెడ్డి అన్నారు. కొవ్వూరు ప్రాతఃస్మరణీయులు తల్లాప్రగడ సూర్యనారాయణరావు పంతులుచే 1912వ సంవత్సరంలో విజయదశమి రోజున ప్రారంభించిన ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా విద్యాపీఠంలో ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం శతవర్షపూర్తి మహోత్సవాలను వైభవంగా పూర్వ విద్యార్థి సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి సమాజంలో విలువలు దిగజారుతున్నాయని, సమాజంలో విలువలు కాపాడేందుకు, సమాజాన్ని సంస్కరించేందుకు ఉత్తమమైనది సంస్కృతమని, అటువంటి సంస్కృత భాషను నేర్చుకుని మంచి సమాజం ఏర్పడడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. వంద సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంస్థ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడడం శుభపరిణామమన్నారు. సమాజంలో ప్రస్తుతం మంచి, చెడుల మధ్య ఘర్షణ జరుగుతోందని, కలికాలం ప్రభావంతో చెడుకు ఆకర్షణ వస్తోందన్నారు. సమాజం మంచి మార్గంలో నడవాలంటే ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం వంటి విద్యాసంస్థలతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా వివేకానంద పార్ద శతజయంతి ఉత్సవం నిర్వహించారు. 3విద్యాపీఠ భావి కర్తవ్య చింతనము2 అనే అంశంపై పలువురు ప్రసంగించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లూరి ఇంద్రకుమార్, తిరుమల తిరుపతి దేవస్థానం గణనాంకధికకారి కె సత్యానంద్, శేష శైలేంద్ర, జఠావల్లభుల జగన్నాథం, విద్యాపీఠం కోశాధికారి చోరగుడి వెంకట సుబ్బారావు, హిందూ నగారా సంపాదకులు తులసి సూర్యప్రకాష్, మముక్షజన మహాపీఠాధిపతులు శ్రీ సీతారామ గురుదేవులు, దోర్భల ప్రభాకర శర్మ, అనుపిండి చక్రధరరావు, భైరవమూర్తి తదితరులు పాల్గొన్నారు.
దేవాలయాల్లో న్యాయమూర్తి పూజలు
హైకోర్టు న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి శనివారం కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో శ్రీ సుందరి సమేత సుందరేశ్వరస్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించారు. శ్రీ బాలాత్రిపుర సుందరి దేవికి కుంకుమపూజలు చేశారు. అనంతరం శ్రీ షిర్డీసాయి ఆలయంలో, శ్రీ రామానంద గౌడీయమఠంలో పూజలు నిర్వహించారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు షర్మిల పాదయాత్ర ఒక సవాల్ అని మాజీ పార్లమెంటు
english title:
s
Date:
Sunday, October 21, 2012