ఏలూరు, అక్టోబర్ 20 : రాష్ట్ర ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు భీమడోలు మండలం గుండుగొలను చేరుకుని స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం గన్నవరం నుండి విమానంలో బయలుదేరి హైదరాబాద్ వెళతారు.
23న మంత్రి సునీతారెడ్డి రాక
ఏలూరు, అక్టోబర్ 20 : రాష్ట్ర ఇందిరా క్రాంతి పధం, మహిళా శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమ శాఖల మంత్రి వి సునీతారెడ్డి ఈ నెల 23వ తేదీ ఉదయం 4.30 గంటలకు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో తాడేపల్లిగూడెం చేరుకుని అనంతరం వెంకట్రామన్నగూడెం డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన యూనివర్శిటీ అతిధిగృహంలో బస చేస్తారు. ఉదయం 9 గంటలకు స్థానికంగా ఏర్పాటైన కార్యక్రమాల్లో పాల్గొని దీపం గ్యాస్ కనెక్షన్లు, జాతీయ కుటుంబ సహాయ పధకం చెక్కులు, వడ్డీలేని రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం ఉద్యాన యూనివర్శిటీ అతిధిగృహంలో బస చేసి రాత్రికి తాడేపల్లిగూడెం నుండి గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి హైదరాబాద్ వెళతారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజు ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం
english title:
r
Date:
Sunday, October 21, 2012