Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 1955 | 1956 | (Page 1957) | 1958 | 1959 | .... | 2067 | newer

  0 0

  డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

  ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

  1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
  2. ఉండమ్మా బొట్టు పెడతా -చిత్రానికి సంభాషణల రచయిత?
  3. అంతులేని కథలో -అరె ఏమిటి లోకం.. పాట పాడిన గాయకురాలు?
  4. అబ్బాయితో అమ్మాయి చిత్రంలో నాగశౌర్య ప్రియురాలు ఎవరు?
  5. అక్కినేని ఇల్లరికం చిత్రానికి కథారచయిత ఎవరు?
  6. ఎన్టీఆర్ దేశద్రోహులు చిత్రానికి నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్?
  7. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా.. అంటూ సంక్రాంతి లక్ష్మిని పిలిచిన గాయకుడు?
  8. దశావతారం చిత్రంలో కమల్ పోషించిన ముసలి బామ్మ పాత్ర పేరు?
  9. హాస్యనటుడు రేలంగికి ఏ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ ప్రకటించారు?
  10. పక్క చిత్రంలోని హీరోయిన్ ఎవరు?

  సమాధానాలు- 107

  1. టచ్ చేసి చూడు
  2. అనసూయ
  3. సినారె
  4. రక్తకన్నీరు
  5. భలేదొంగలు
  6. అక్కినేని ఆనందరావు
  7. దివాకర్‌బాబు
  8. గంధడ గుడి
  9. గీతాంజలి
  10. లావణ్య త్రిపాఠి

  సరైన సమాధానాలు రాసిన వారు

  కాసుల మహేశ్‌బాబు, కర్నూలు
  జి శివానందరావు, పాలకొల్లు
  యన్ శృతికీర్తి, బొబ్బిలి
  టీవీఎస్ ప్రియాంక, విజయవాడ
  సిహెచ్ గాయత్రి, హైదరాబాద్
  టిఆర్ దీప్తి, కోదాడ
  పి ప్రసన్నకుమార్, ఆదిలాబాద్
  కెజీవి మోహన్, రాళ్లపాడు
  ఎస్ మనస్విత, హైదరాబాద్
  పివి శివప్రసాదరావు, అద్దంకి
  ఆర్‌వి రావు, శ్రీకాకుళం
  సి రమాదేవి, బాగ్‌అంబర్‌పేట
  ఎస్‌ఆర్ శ్రీవాత్సవ, బెంగళూరు
  ఎస్ శ్రీహరి, బెంగుళూరు
  బీఆర్ మాడుగుల, అద్దంకి

  పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36,
  సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03


  0 0

  ప్రతి సినిమాకీ ముందు మీడియా వద్ద తన స్టామినా చెప్పుకునే కుర్ర హీరో బెల్లంకొండ సాయ శ్రీనివాస్ ఈసారీ -మాస్, యాక్షన్ చాలా ఇష్టమని చెప్పడం వరకూ బాగానే ఉంది. కానీ, చేసిన సినిమాలన్నీ అదే యాక్షన్ కోణంలో ఉన్నా, అతన్ని రక్షించగలిగే సినిమా ఒక్కటీ దొరకలేదు. యాక్షన్, మసాలాకు ఎక్కువ అవకాశమున్న కథనే ఎంచుకుని చేసిన ‘కవచం’ సినిమా సైతం హీరోని ఏమాత్రం ఒడ్డెక్కించలేకపోయంది. మాస్ హీరోగా నిలదొక్కుకోడానికి భారీ బడ్జెట్‌తో, స్టార్ తారాగణంతో పట్టువదలని విక్రమార్కుడిలా శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నా -కాలం మాత్రం అనుకూలించడం లేదు. కొత్త హీరోలంతా స్క్రీన్‌పై సత్తా చాటుతున్నా -నటనలో ఎంతో ఈజ్ చూపిస్తున్న బెల్లంకొండకు మాత్రం నిరాశే మిగులుతోంది. ప్రయోగాత్మక సినిమాల సీజన్ నడుస్తున్న తరుణంలో తరువాతి ప్రాజెక్టు అయనా ట్రెండ్ మార్చి ఆడియన్స్ ముందుకొస్తే సరే. లేదంటే -ఆ హీరో అంతే అన్న పరిస్థితి ఎదుర్కోక తప్పదేమో.
  -పవిత్ర, అల్లవరం
  నిజంగా అంతే..
  వీళ్లు కూడ ఇంతే-నంటూ రచయత శ్రీనివాస్ రాసిన కథనం చాలా బాగుంది. చేస్తున్న చిత్రాలు వరుసపెట్టి బోల్తా కొడుతున్నా.. ఎందుకు? అని తమనుతాము ప్రశ్నించుకోకుండా ఆడియన్స్ మీదకు ఏడబాదుడు చిత్రాలు వదులుతున్న హీరోలు ఇక మారరేమో. కొంత గ్యాప్ తీసుకుని అయనా కొత్త మేకోవర్, కొత్త తరహా కథలు, వైవిధ్యమైన నటన చూపాలన్న ఆలోచన వాళ్లలో రాకపోవడం దారుణం. మా సినిమా మా ఇష్టం అనుకుంటే ఎవ్వరూ ఏం చేయలేరుగానీ, కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే అవుతుందిగా. షార్ప్‌నెస్‌తో వస్తున్న కొత్త దర్శకులు, కొత్త రచయతలతో వాళ్లెందుకు పని చేయరో ఎప్పటికీ అర్థంకాని విషయం. స్టార్ హీరోలే ప్రయోగాలు చేస్తుంటే.. వాల్యూ సంపాదించుకోలేక పోతున్న వీళ్లు మాత్రం మొనాటీనే ప్రేమించడం క్షమించలేనిదే.
  -కర్రి నాగేంద్ర, శ్రీకాకుళం
  ఫ్లాష్‌బ్యాక్ బావుంది
  ఫ్లాష్‌బ్యాక్ అట్ 50 శీర్షికన ప్రచురిస్తున్న పాత చిత్ర కథారాజాలు అద్భుతంగా ఉంటున్నాయ. ఇలాంటి శీర్షికలనే ఇటీవల కొన్ని ఆంగ్ల పత్రికలూ పాఠకుల కోసం నిర్వహిస్తుండటం కనిపిస్తోంది. కానీ, వెనె్నలలో రచయత సీవీఆర్ మాణిక్యేశ్వరి చాలాకాలంగా నిర్వహిస్తున్న ఈ శీర్షిక నిజంగా అద్భుతం. ఒకపక్క పాత చిత్రాల్లోని కథా కథనాలు, పాటల విశేషాలను తెలుపుతూనే -తెరవెనుక విశేషాలనూ సవివరంగా అందిస్తుండటం గ్రేట్. గతవారం ప్రచురించిన ఎన్టీఆర్ సారంగధర చిత్ర విశేషాలు ఆకట్టుకున్నాయ. వ్యాసాన్ని చదువుతున్నపుడు -స్క్రీన్‌మీది సన్నివేశాలు మస్కిష్కంగా మెదిలేంత పట్టుతో రాసిన రచయతకు అభినందనలు. ఇలాంటి గొప్ప చిత్రాల వివరాలు మరిన్ని అందిస్తారని ఆశిస్తూ..
  -కె లింగేశ్వరరావు, ప్రొద్దుటూరు
  ఎవరి మెప్పుకోసం..
  ఈమధ్య వెనె్నలలో ప్రచురించిన బయోపిక్‌ల డైలమా వ్యాసం బాగుంది. ఏ ఉద్దేశ్యంతో ఆ సినిమాలు తీస్తున్నారో ప్రేక్షకులకు అర్ధంకాని విషయం. ఏ వ్యక్తి జీవితం తీసుకున్నా ఎన్నో అంశాలు, వైఫల్యాలు, విజయాలు ముడిపడి ఉంటాయి. అలాంటి వాటిలో తమకు అనుకూలమైన విషయాలనే చిత్రీకరించడం న్యాయం కాదు. ఎన్టీఆర్ బయోపిక్ తీసుకుంటే ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అవడంతో ముగుస్తుంది అంటున్నారు, ఎందుకో? ఎన్టీఆర్ చివరిసారిగా (1994) ముఖ్యమంత్రి అవడం చూపిస్తే, ఆయన ద్వితీయ వివాహం, వైస్రాయ్ ఉదంతం, కుటుంబ కలహాలన్నీ చూపాలి. మరిన్ని ఈ విషయాలన్నీ చూపెట్టలేనప్పుడు అది బయోపిక్ ఎలా అవుతుంది? ఎవర్ని మెప్పించడానికి ఈ చిత్రాలు?
  -ఎంఎ కుమార్,
  రామచంద్రాపురం
  వాళ్లూ దర్శకులంటే
  1955లో విడుదలైన ‘దొంగరాముడు’ చిత్రానికి కెవి రెడ్డి దర్శకుడు. చిత్రం ప్రారంభానికిముందు అనేక విమర్శలు వచ్చాయి. పౌరాణిక, జానపద చిత్రాల దర్శకుడైన కెవి రెడ్డి ‘దొంగరాముడు’ చిత్రానికి దర్శకత్వం వహించటం సాధ్యమయ్యే పనేనా? అంటూ ఆక్షేపణలు చేశారు ఆనాటి చలనచిత్ర ప్రముఖులు.
  గుండమ్మకథ (1962) చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించినప్పుడూ, ఆయన సాంఘిక చిత్రాల దర్శకునిగా పనికిరాడని బల్లగుద్ది వాదించారు. కాని ఆక్షేపణలు వమ్మయ్యాయ. ఆ రెండు చిత్రాలు ఎంత విజయవంతమయ్యాయో ఆనాటి తరం ఈనాటితరం ప్రేక్షకులకు తెలీంది కాదు? అందుకే ఆక్షేపణలు, విమర్శలు సినిమాల విజయంతో లేచిన దుమ్ములో కలిసిపోయాయి!
  -కెవిపి రావు, కందుకూరు
  పుర్రెకో బుద్ధి
  మీటూ ఉద్యమం ఇప్పుడు బాలీవుడ్‌ని తాకింది గాని హాలీవుడ్‌లో ఎప్పుడో రాజుకుంది. ఒక పరిష్కార మార్గం లాగ అక్కడ ఇంటిమసీ డైరెక్టర్లు అనే కొత్త కానె్సప్ట్ వచ్చింది. శృంగార సన్నివేశాల చిత్రీకరణలో హీరోహీరోయిన్‌ని ఎక్కడ, ఎలా టచ్ చేయాలి? ఎంతసేపు ఎలా కౌగలించుకోవాలి? ఎంతసేపు ఎలా ముద్దుపెట్టుకోవాలి అనే అంశాల్ని ఈ ఇంటిమసీ డైరెక్టర్లు వివరించి పర్యవేక్షిస్తారు. ఇంటిమసీ అంటే సాన్నిహిత్యం. ఈ కొత్త కానె్సప్ట్ డైరెక్టర్లవల్ల మీటూ సమస్య చల్లారుతుందని హాలీవుడ్ ఆలోచన. అక్కడ ఏ కానె్సప్ట్ వచ్చినా అది క్రమంగా బాలీవుడ్‌కి అక్కడనుంచి ఇతర వుడ్‌లకు రావచ్చు. చిత్రసీమలో ఇప్పుడున్న 24క్రాఫ్టులు ఇకపై 25 అవుతాయేమో!
  - ధర్మజేత, గొడారిగుంట


  0 0
 • 12/15/18--06:55: కన్నతల్లి
 • కృష్ణా జిల్లా కోలవెన్నలో 1914లో జన్మించారు కోవెలమూడి సూర్య ప్రకాశరావు (కెఎస్ ప్రకాశరావు). ప్రజానాట్య మండలిలో సభ్యునిగా సమర్ధవంతమైన పాత్ర పోషించారు. నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో ‘అపవాదు’, ‘పత్ని’ చిత్రాల్లో నాయక పాత్రలు పోషించారు. ‘బభ్రువాహన’ పౌరాణిక చిత్రంలోనూ నటించిన తరువాత, ఒకవైపు నటన మరోవైపు దర్శకత్వంలో మెళుకువలు సాధించారు. పిమ్మట నిర్మాతగామారి యల్‌వి ప్రసాద్ దర్శకత్వంలో ‘ద్రోహి’ (1948) చిత్రాన్ని రూపొందించారు. అందులో హీరోగా నటింటి, పెండ్యాల నాగేశ్వరరావును సంగీత దర్శకునిగా సినీ రంగానికి పరిచయం చేశారు. 1949లో ప్రకాష్ స్టూడియో నిర్మించి అదే బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో ‘మొదటిరాత్రి’ (కెఎస్ ప్రకాశరావు, జి. వరలక్ష్మి హీరో హీరోయిన్లు), తరువాత ‘దీక్ష’ (ఈ సినిమాతోనే ఆత్రేయ సినీ రంగానికి పరిచయమయ్యారు) నిర్మించారు. 1953లో ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి వరలక్ష్మి ప్రధాన పాత్రగా కెఎస్ ప్రకాశరావు తన స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రమే -కన్నతల్లి.

  హిందీ చిత్రాలు ‘ఔరత్’, న్యూ థియేటర్స్‌వారి ‘సౌగంధ’ ఆధారంగా రచయితలు తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సుంకర, వాసిరెడ్డివంటి ప్రముఖులు ఈ చిత్రానికి పాటలు, కథా రచన సమకూర్చటం ఓ విశేషం కాగా, ప్రముఖ గాయని పి సుశీల, నటీమణి రాజసులోచన ఈ చిత్రం ద్వారానే సినీ రంగానికి పరిచయం కావటం మరో విశేషం.

  ఫొటోగ్రఫీ: బిఎస్ జాగిర్థార్
  కళ: ఘోడ్ గాంకర్
  ఎడిటింగ్: ఎవిఎస్ సుబ్బారావు
  నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
  సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
  సహనిర్మాత: భావన్నారాయణ
  నిర్మాత, దర్శకుడు: కెఎస్ ప్రకాశరావు.

  చలపతి (ఆర్ నాగేశ్వరరావు), శాంత (జి వరలక్ష్మి) దంపతులు. వారికి రాము (అక్కినేని), శంకరం (నంబియార్) పిల్లలు. తల్లి మాటలు చెవినిపెట్టక బాధ్యతారహితంగా ప్రవర్తించిన చలపతి అప్పులపాలవుతాడు. కుటుంబ బాధ్యతలు వదిలిపెట్టి సన్యాసులతో కలిసి దూరంగా వెళ్లిపోతాడు. ఆత్మస్థయిర్యంతో శాంత పొలం పనులు చేసుకుంటూ బిడ్డలను పెంచుతుంది. తల్లి కష్టం అర్థం చేసుకున్న రాము చదువుకు స్వస్తిచెప్పి తల్లితోపాటు శ్రమపడతాడు. అలా ఒక దుకాణం నడిపే స్థాయికి వస్తాడు. హైస్కూలు చదువు పూర్తిచేసిన శంకరాన్ని పక్కింటి అమ్మాయి గౌరి (వసంత) ఇష్టపడుతుంటుంది. కాలేజీలో చేరేందుకు పట్నం వెళ్లిన శంకరం, అక్కడ చెడు సావాసంతో వ్యసనాలకులోనై చంచల అనే ఓ యువతి మాయలో పడతాడు. అన్న రాము తన చదువుకోసం పంపిన డబ్బును శంకరం వృధాగా ఖర్చు చేస్తుంటాడు. నిజం తెలుసుకున్న రాము తమ్ముని నిలదీసి చివరకు అవమానింపబడటంతో, అతనికి డబ్బు కట్టడి చేస్తాడు. గౌరి ప్రేమకోసం కుమారుని మార్చాలనే ఉద్దేశ్యంతో పట్నం వెళ్తుంది శాంత. అక్కడ శంకరం ఆవేశంతో చంచలను హత్యచేయగా, కుమారుడి క్షేమం కోసం ఆ నేరం తనమీద వేసుకుని జైలుకెళ్తుంది శాంత. తల్లి కోసం పట్నంవెళ్లిన రాముకు శంకరం విషయం చెపుతాడు. తనకోసమే ఇంతటి త్యాగానికి ఒడిగట్టిందని జైలుకు వెళ్లి తల్లివద్ద బోరున విలపిస్తాడు. ఆమె అతన్ని వారించి అన్నతో కలిసి వెళ్లమని చెబుతుంది. అదే సమయానికి పక్క సెల్‌లో అరెస్టైవున్న చలపతి ఈ విషయం గ్రహించి శాంతను, ఆమె కృషిని ప్రశంసిస్తాడు. శిక్ష అమలుకోసం శాంత పోలీసులతో కలిసి దూరంగా వెళ్లిపోవటంతో చిత్రం ముగుస్తుంది. చిత్రంలో చిన్నతనంలో రాముగా సుధాకర్, హాస్టల్ వార్డెన్‌గా రమణారెడ్డి, శంకర్ స్నేహితుడు శర్మగా పేకేటి శివరాం, ఇంకా కోడూరు అచ్చయ్య, యక్షగాన నృత్యంలో రాజసులోచన, పసుమర్తి కృష్ణమూర్తి కనిపిస్తారు.
  దర్శకులు కెఎస్ ప్రకాశరావు చిత్రంలోని సన్నివేశాలను ఎంతో ఆకట్టుకునేలా ఆర్ధ్రత, పట్టుతో తీర్చిదిద్దారు. చలపతి తల్లి మాటలు లెక్కించక వృధా ఖర్చులు చేయటం, ఇల్లొదిలి వెళ్లిపోవటం; శాంత ‘నీదారి నీవు చూసుకున్నావా?’ అని భర్తగురించి వేదన పడుతూనే, పిల్లల కోసం పలు కష్టమైన పనులు నిబ్బరంగా చేయటంలాంటి దృశ్యాలు హృదయాన్ని ద్రవింపచేసేలా తీశారు. ఇరుగు పొరుగుల మాటలు శాంతంగా భరించే సన్నివేశాలు మనల్ని కదిలిస్తాయి. కష్టం విలువ తెలిసిన రాము బాధ్యతగా మెలగటం, అది తెలియని శంకరం అన్నను ఎదిరించి లెంపకాయ కొట్టడం; రాములో కొంత ఆవేశం, తిరిగి ఆలోచన చేసే సన్నివేశాల్లో ఆర్థ్రత ఉట్టిపడుతుంది. తల్లి ఒంటరితనంతో మాటలు పడటం, విస్తళ్లు కుడుతూ కష్టపడటం, ఆ సన్నివేశాల్లో రాము రియాక్షన్ దర్శకుడు ప్రకాశరావు ప్రతిభకు అద్దంపడతాయి. గౌరీ సూచనపై శంకరాన్ని చక్కదిద్దాలని తల్లి శాంత పట్నంవెళ్లటం, శంకరం నేరాన్ని తనపై వేసుకోవటం.. టైటిల్‌కు న్యాయం చేసే సన్నివేశాలు. సన్యాసులతో అరెస్టయిన చలపతి జైలులో మొదట శాంతను చూసి ‘నీవు మాత్రం ఏం సాధించావు, నా పక్కనే వున్నావు’ అని హేళన చేస్తాడు. కొడుకు శంకరం కోసం ఆమె చేసిన త్యాగం తెలిసుకొని ఆమెకు నమస్కరిస్తాడు. శిక్ష కోసం పోలీసులతో కలిసి దూరంగా వెళ్లిపోతున్న శాంతను చూసి రాము, శంకరం, గౌరి, ఊళ్లొని ముఖ్యులు పరుగున వచ్చి దుఃఖించే సన్నివేశాలు మనసును హత్తుకుంటాయి. చెడు అలవాట్లకు గురైన బిడ్డలపట్ల మాతృవేదన, బాధ్యతను ఎంతో హృద్యంగా చిత్రీకరించి బరువైన ముగింపుతో చిత్రానికి ప్రత్యేకత అందించారు కెఎస్ ప్రకాశరావు.
  బారిష్టరు పార్వతీశం ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు జి వరలక్ష్మి. ‘స్వప్నసుందరి’, ‘పెళ్లిచేసి చూడు’, ‘దొంగల్లో దొర’, ‘దొంగలున్నారు జాగ్రత్త’వంటి పలు చిత్రాల్లో అక్కినేని, ఎన్టీఆర్, ఇతర హీరోల సరసన ఎంతో ఈజ్‌తో నటించి మెప్పించారు. పెదవి విరుపులు, కనుచూపుల కొసమెరుపులు, పాత్రోచితమైన అమాయకత్వాన్ని వైరుద్యంగా ప్రదర్శించగల ధీశాలి ఆమె. ఈ చిత్రంలో అక్కినేని, నంబియార్‌లకు తల్లిగా గుండె నిబ్బరం, గాంభీర్యాలతో కూడిన శాంత పాత్రను సునాయాసంగా పోషించి పరిపూర్ణత కలిగించారు. ఆమెకు తగ్గట్టు రాముగా అక్కినేని అంతే ధీటుగా, సౌమ్యంగా, కొండొకచో కోపం, నిరసన, విసుగువంటి భావాలను లిప్తకాలం, ఆపైన వెంటనే మరోభావం.. ఇలా బాధ్యత, అభిమానం కలిగిన పెద్దకొడుకుగా ఎంతో సంయమనంతో కూడిన నటనను ప్రదర్శించారు. మిగిలిన పాత్రధారులు ప్రాతోచితంగా మెప్పిస్తే, శంకరంగా తమిళనటుడు నంబియార్ ఆ పాత్రకున్న లక్షణాలను ఈజ్‌తో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.
  చిత్రగీతాలు: యక్షగాన నృత్యగీతం -గుమ్మనే ముద్దుగుమ్మనే (గానం: పసుమర్తి కృష్ణమూర్తి, లలిత బృందం, రచన: శ్రీశ్రీ, ఆరుద్ర). సన్యాసులు పాడే గీతం -సాంబసదాశివ సాంబశివా (గానం: మాధవపెద్ది బృందం, రచన శ్రీశ్రీ -ఆరుద్ర). -సిరికించి చెప్పడు (్భవగతం నుంచి, గానం: జి వరలక్ష్మి). మరో భాగవత పర్వం -లావొక్కింతయు లేదు (గానం: పి సుశీల). చిన్నతనంలో సుధాకర్ విస్తళ్లు అమ్ముతూ పలు వ్యాపారాలు చేస్తూ పాడే గీతం చివరలో రిపీటవ్వటం, జి వరలక్ష్మి, అక్కినేనిపై చిత్రీకరణ -చూస్తారెందుకు రారండి (గానం: ఎం సరోజిని, రచన: తాపీ ధర్మారావు). చంచలపై చిత్రీకరించి గీతం -డేగలాగ వస్తా తూనీగలాగా వస్తా (గానం: కె రాణి, రచన: ఆరుద్ర). చంచల, శంకరంపై గీతం -ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం (గానం: కె రాణి, ఎఎం రాజా, రచన: ఆరుద్ర). తమ్మునిచే అవమానింపబడిన రాముపై చిత్రీకరించిన గీతం -చూశావా చివరికిదే నా చావా (గానం: ఘంటసాల, రచన ఆత్రేయ). ఘంటసాల మరో గీతం -ఎంత మంచిదానవోయమ్మ నీదెంత’’ (రచన: శ్రీశ్రీ, ఆరుద్ర). ఈ చిత్రం ద్వారా గాయకురాలు సుశీల పరిచయమైన గీతం -ఎందుకు పిలిచావెందుకు ఈల వేసి (గానం: పి సుశీల, ఏఎం రాజా, రచన: శ్రీశ్రీ, ఆరుద్ర).
  కన్నతల్లి చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని కొద్ది మార్పులతో నర్గీస్, సునీల్‌దత్, రాజేంద్రకుమార్, రాజ్‌కుమార్‌లతో హిందీలో ‘మదరిండియా’గా రూపొందించారు. దీనినే తిరిగి తెలుగులో జగ్గయ్య, జమున ప్రధాన పాత్రలతో ‘బంగారు తల్లి’గా, ఆ తరువాత జయసుధ ముఖ్యపాత్రలో శక్తి పేరుతో నిర్మించారు.
  కన్నతల్లి చిత్రం ఆర్థిక, హార్ధిక విజయం సాధించింది. కానీ ఈ చిత్రం తమిళ వర్షన్ ‘ప్రెటతాయి’ నిరాశపర్చింది.
  1951లో ‘స్ర్తి సాహసం’ చిత్రంలో కస్తూరి శివరావు జంటగా నటించిన సి వరలక్ష్మి, కన్నతల్లి చిత్రంలో అక్కినేని సరసన గయ్యాళి భార్యగా నటించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన పెండ్యాల నాగేశ్వరరావు పేద రైతు పెళుమాళ్లు (గౌరి తండ్రి)గా కనిపించటం విశేషం.


  0 0

  హుషారు * బాగోలేదు

  తారాగణం: తేజస్ కంచెర్ల, అభినవ్, దినేష్‌తేజ్, రాహుల్ రామకృష్ణ, దక్ష నగార్కర్, ప్రియ వడ్లమాని, రమ్య,
  సంగీతం: రధన్
  ఛాయాగ్రహణం: రాజు తోట
  నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, రియాజ్
  దర్శకత్వం: శ్రీహర్ష కొనుగంటి
  =============================================================
  యూత్‌ని ఆకట్టుకునే సినిమాలు తీయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ఉంటారు. తాజాగా హుషారు సినిమా కూడా కేవలం యూత్‌ని టార్గెట్ చేసి తెరకెక్కించిన చిత్రమే. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దనేష్‌తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన హుషారు ఆడియన్స్‌కి ఎంత వినోదం పంచిందో చూద్దాం.
  కథ: చైతన్య (అభినవ్), ఆర్య (తేజస్ కంచెర్ల), ధ్రువ్ (దినేష్‌తేజ్), బంటీ (తేజ్), స్కూల్‌స్థాయి నుంచీ స్నేహితులు. ఆడుతూ పాడుతూ కాలేజీ జీవితాన్ని గడిపేస్తారు. చదువుమీద శ్రద్ధ పెట్టని వీళ్లంటే ఇంట్లో వాళ్లకేకాదు, ఊరందరికీ చిన్నచూపే. కానీ అదేం పట్టించుకోకుండా తమకు నచ్చినట్టు జీవితాన్ని లాగించేస్తుంటారు ఈ కుర్రాళ్లు. అలాంటి సమయంలోనే చైతన్య క్యాన్సర్ బారిన పడతాడు. మిగతా వాళ్లనూ కష్టాలు చుట్టుముడతాయి. ఈ స్థితిలో సమస్యల నుంచి బయటపడటానికి నలుగురూ ఏం చేశారు. దానివల్ల ఎదురైన సంఘటనలు ఏమిటి? వీరి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అన్నది మిగతా కథ.
  బుద్ధిగా చదువుకుని క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగం తెచ్చుకుని, తర్వాత టైమ్ టు టైమ్ ఆఫీసుకెళ్లి, ఒక క్రమపద్ధతిలో జీవితాన్ని గడిపేయడమే సక్సెస్ కాదు. వయసుకుతగ్గ ఆటలు ఆడి, అన్ని అల్లర్లూ చేసి, ఒడుదొడుకులన్నీ చూసి, చివరగా అభిరుచికి తగిన ఉపాధి చూసుకుని జీవితంలో స్థిరపడమనే సందేశాన్నిచ్చే సినిమా ‘హుషారు’. జీవితంలో అన్ని రుచులూ ఉండాలని చెబుతూ, నలుగురు సగటు కుర్రాళ్ల జీవితంలోని అల్లరినంతా సినిమాలో చూపించారు. వాళ్లు చదువును నిర్లక్ష్యం చేస్తారు. చీటికి మాటికీ మందుకొడతారు. అమ్మాయిలకోసం వెంపర్లాడతారు. గొడవలు పడతారు. అడల్ట్ వీడియోలు చూస్తారు. బాధ్యత తెలియకుండా ప్రవర్తిస్తారు. మరీ ఇంత అల్లరేంటి? ఇంత జులాయితనం ఏంటి? అనిపిస్తారు. అయితే ఇలాంటి ప్రవర్తనకు చింతించాల్సిందేమీ లేదని, ఈ అల్లర్లు, జులాయితనమే ఒక దశ దాటాక జీవితంలో గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని చెప్పడానికి ప్రయత్నించిన చిత్రమిది.
  ప్రధాన పాత్రధారులంతా బాగా చేశారు. అందరిలోకి తేజస్ హుషారుగా, తడబాటూ లేకుండా నటించాడు. అభినవ్ పాత్రకు తగ్గట్టుగా సాఫ్ట్‌గా కనిపించాడు. తేజ్, దినేష్ ఇద్దరూ కామెడీ పండించడంలో కీలకంగా వ్యవహరించారు. నలుగురి నటన సహజంగా అనిపించింది. రాహుల్ రామకృష్ణ గురించి చెప్పాల్సిన పని లేదు.అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. స్క్రీన్ టైం తక్కువే కానీ, అతడి కెరీర్లో గుర్తుంచుకోదగ్గ పాత్ర. హీరోయిన్లలో ప్రియా వడ్లమాని గ్లామర్‌తో ఆకట్టుకుంది. దక్ష నగార్కర్ ఫర్వాలేదు. మిగతా నాయికలు నామమాత్రం. తారాగణమంతా పాత్రోచిత ప్రదర్శనే చేశారు.
  సాంకేతికంగా చూస్తే -రథన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరుతో మెప్పించాడు. ఇప్పటికే పాపులరైన ‘ఉండిపోరాదే’ పాట సినిమాలోనూ మంచి ఫీలింగ్ కలిగించింది. అదేకాక ‘పిచ్చాక్’ ‘నాననాననా’ పాటలూ వినసొంపుగానే ఉన్నాయి. పాటల చిత్రీకరణ ఓకే. రాజు తోట ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టే ఉన్నాయి. ఇక దర్శకుడు శ్రీహర్ష కొనుగంటికి ఈతరం పట్టణాల్లో ఉండే యూత్ ఆలోచనలపై, వాళ్ల అభిరుచులపై మంచి అవగాహనే ఉంది. వారికి నచ్చే అంశాలతో సినిమా తీశాడు. దర్శకుడిగా బలమైన ముద్ర వేయలేకపోయినా, తనకున్న పరిమితుల్లో టార్గెటెడ్ ఆడియన్స్‌ను మెప్పించగలిగే ప్రయత్నం చేస్తూనే, కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. సినిమాలో సగం చర్చ బీరు గురించే. ప్రతి రెండో సీన్లోనూ ఎవరో ఒకరి చేతిలో బీరు కనిపిస్తూనే ఉండటం సినిమాను మైనస్. సినిమాలో కీలక ఎపిసోడ్ మొత్తం బీరు చుట్టూ తిరుగడం బోరు కొడుతుంది. అభ్యంతరకర సన్నివేశాలు, ద్వందార్థ సంభాషణలు మంచి సినిమా అన్న ఫీల్‌కు అడ్డంపడ్డాయి. దర్శకుడి టార్గెట్ యూత్ అనుకుంటే -కుటుంబ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి దగ్గరకాలేరు. ప్రస్తుత సినిమాల్లో సమాజ సభ్యతపైనా దర్శకుడు దృష్టిపెడుతుంటే -శ్రీహర్ష ఆ విషయాన్ని విస్మరించడం ఒకవిధంగా ప్రమాదం. నిజానికి దీనిపై చర్చే అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే -ట్రైలర్‌లోనే సినిమా ఏమిటో చెప్పేశాడు కనుక.
  ఇక -ద్వితీయార్థంలో నలుగురు కుర్రాళ్ల క్రైసిస్ సన్నివేశాలనూ -సీరియస్ టోన్‌తో నడిపించకపోవడం వికటించింది. కుర్రాళ్ల అల్లరి బోర్‌డమ్‌కు చేరుతున్న సమయంలో, రాహుల్ రామకృష్ణను దింపి వినోదం పంచే ప్రయత్నం చేశాడు. పిచ్చాక్ సాంగ్‌తోపాటు, కొన్ని సంభాషణలు యూత్‌ని ఆకట్టుకుంటాయి. యూత్, అడల్ట్స్‌కు మాత్రమేనంటూ చిత్ర బృందం ఇచ్చిన వార్నింగ్ నిజమైంది. అడల్ట్ కామెడీ విషయంలో హద్దులేకపోవడం కుర్రాళ్లకు కిర్రాక్ హుషారే. కథ ఒక తీరున నడవకున్నా, యూత్‌ను టార్గెట్ చేసిన సీన్లు పేలాయి. ప్రధాన పాత్రల్లో ఒక పాత్ర క్యాన్సర్‌తో బాధపడుతుంటే -అతడి మీద ‘నా పేరు ముఖేష్’ తరహా యాడ్ రూపొందించాడంటే దర్శకుడు ఏం కోరుకున్నాడో అర్థంచేసుకోలేకపోలేం. ఒకవర్గం ప్రేక్షకులు ఈ సినిమా నుంచి ఏం ఆశిస్తారో, దర్శకుడు ఆ విషయంలో మాత్రం నియమం తప్పిన వినోదానే్న అందించాడు.


  0 0

  భైరవగీత * బాగోలేదు

  తారాగణం: ధనంజయ, ఐరా మోర్, విజయ్ రామ్, రాజా బల్వాడి సంగీతం: రవిశంకర్
  సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి
  మాటలు: రామ్ వంశీ
  నిర్మాతలు: అభిషేక్ నామా, భాస్కర్ రాశి
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిద్ధార్థ తాతోలు
  =============================================================

  తను తీసే సినిమాలపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయాన్ని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘హిట్ ఫ్లాప్ పట్టించుకోకుండా నచ్చిన సినిమా తీస్తా. చూస్తే చూడండి, లేదంటే లేదు’ అనే టైపు ఆయన. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయనే చెప్పుకున్నాడు కూడా. కొద్దికాలం క్రితం ‘ఆఫీసర్’ అనే ఫ్లాప్‌ను అలాగే వదిలాడు వర్మ. కాస్త గ్యాప్ తీసుకుని ఈసారి నిర్మాతగా ‘్భరవగీత’ను ప్రేక్షకుల ముందుకుతెచ్చాడు. శిష్యుడు, డెబ్యూ దర్శకుడైన సిద్ధార్థ తాతోలు ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన భైరవ, గీతల లవ్ స్టోరీ ఇది.
  కథ: భైరవ (్ధనంజయ) ఫ్యాక్షన్ నాయకుడు సుబ్బారెడ్డి దగ్గర నమ్మిన బంటు. అతని కుటుంబం తరతరాలుగా ఫ్యాక్షన్ నాయకుల దగ్గరే ఊడిగం చేస్తూంటుంది. తన బతుకూ నాయకుడికే అంకితం కట్టుబానిసలా బతికేస్తుంటాడు. ఆక్రమంలో ఓ ఆపదనుంచి సుబ్బారెడ్డి కూతురు గీత (ఇర్రామోర్)ని రక్షిస్తాడు. దాంతో గీత భైరవను ప్రేమిస్తుంది. అదే సమయంలో తండ్రి తనకు ఇష్టంలేని పెళ్లి కుదర్చడంతో, ఇంటినుంచి భైరవతో సహా పారిపోతుంది. భైరవపై కక్షగట్టిన ఫ్యాక్షనిస్టు, అతన్ని అంతమొందించాలని పంతం పడతాడు. ఈ క్రైసిస్‌ను అధిగమించి తన బానిస బతుకును మార్చుకోడానికి భైరవ ఏంచేశాడు? ఎలా తిరుగుబాటుకు దిగాడు? భైరవ, గీతలు ఒక్కటయ్యారా? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
  ఒకప్పుడు -నటీనటుల నుంచి తనకు కావాల్సిన అతిని తీసుకోవడంలో వర్మ సక్సెస్. ఒకప్పుడు అదే వైవిధ్యంగా జనాలకు కనెక్టయ్యేది. అందుకే వర్మ సినిమాలంటే -ఆడియన్స్‌కు ఓ ఇంట్రెస్ట్. ‘్భరవగీత’లో శిష్యుడు సిద్ధార్థ సైతం అదే స్ట్రాటజీ ప్రదర్శించాలని అనుకున్నాడు. ఆక్రమంలో హీరో ధనంజయ మంచి నటుడనే విషయం అర్థమైనా, చాలాచోట్ల అవసరానికి మించి తీసుకోవడం ఓవర్ డోస్ అయిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో కొన్నిచోట్ల సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో, స్క్రీన్ ప్రజెన్స్ బావుంది అనిపించాడంతే. హీరోయిన్ ఐరా మోర్ ఓ రేంజ్ అందాలు చూపించేసింది. కథకు కీలకం ఆమే అయినా, కుర్రాళ్లకు మాత్రం కనువిందుగా మిగిలిపోయింది. నటనపరంగా చెప్పుకోవడానికి అంత లేదు. విలన్ పాత్రల్లో విజయ్‌రామ్, రాజా బల్వాడి ఎక్కువే చేసి విసుగుపుట్టించారు. మిగతా నటీనటులు పాత్రోచిత ఔచిత్యానే్న ప్రదర్శించారని అనిపిస్తుంది.
  టెక్నికల్ విషయాల్లోకొస్తే.. దర్శకుడికంటే నిర్మాత గురించే ఎక్కువ మాట్లాడుకోవాలి. కారణం -నిర్మాత ఓ బలమైన దర్శకుడు కనుక. దర్శకుడిగా వర్మ సినిమాల్లో కనిపించే విజువల్స్, మ్యూజిక్కే నిర్మాతగా చేసిన సినిమాలోనూ కనిపించాయి. ఒకరకంగా ఇది వర్మ చేత ప్రభావితమైన దర్శకుడు చేసిన సినిమా అనుకోవాలి. జగదీశ్ కెమెరా చిత్ర విచిత్రమైన యాంగిల్స్, క్లోజప్ షాట్లు చూపిస్తే, రవిశంకర్ సంగీతమూ తగినంత పాత్ర పోషించింది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకింత బోర్. పాటలు ఫర్వాలేదు. నిర్మాణ విలువలు, సంభాషంలు ఓకే. దర్శకుడు సిద్దార్థ తాతోలు మీద వర్మ ప్రభావం ఎక్కువగానే కనిపించింది. వర్మ స్టయిల్లో సినిమా తీసి ఆయన్ని మెప్పించాలన్నట్టే ఆడియన్స్‌కి తోస్తుంది. ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పనిచేసే కుర్రాడు.. అతన్ని కూతురు ప్రేమించటం.. అందుకు కులాల అంతరాలతో తండ్రి అడ్డుచెప్పటం.. అతనే్న పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ భీష్మించటం.. కుర్రాడ్ని తీసుకుని పారిపోవడం.. ఫ్యాక్షన్ నాయకుడు అగ్గిమీద గుగ్గిలం.. ఇద్దరి మధ్యా పోరు, హీరో తిరుగుబాటు. కథానాయకుడి గెలుపుతో కథ సుఖాంతం. ఇలాంటి కథలు ఎన్ని రాలేదు. మరోవైపు హీరో హీరోయిన్ల ఘాటు రొమాన్స్ కథను ఎక్కడికో లాక్కెళ్లిపోయేలా చేసింది. మితిమీరిన హింసే యాక్షన్ ఘట్టాలన్న భ్రమలో దర్శకుడు నానా హంగామా చేశాడనిపిస్తుంది.
  రామ్‌గోపాల్ వర్మ 90ల్లో సినిమాలు జనాలకు కొత్తగా అనిపించేవి. అప్పటిదాకా ఎన్నడూ చూడని విజువల్స్.. మ్యూజిక్.. టేకింగ్.. ప్రేక్షకుడికి కొత్తదనం అందించేవి. కథను నేరేట్ చేసే విధానంలోనూ ఒకింత కొత్తదనం కనిపించేది. హింసతో ముడిపడిన సినిమాల్లో ఇంటెన్సిటీనే వేరుగా ఉండి ప్రేక్షకులపై ప్రభావం చూపేది. దీంతో కొత్తతరహా సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు వర్మ ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ రాను రాను అది కాస్తా రొటీన్ అయ్యింది. భైరవగీతలో అదే కనిపించింది. సినిమా మొదలైన తీరుతోనే ఏంజరగబోతోందో అర్థమైపోతుంది. కొత్తగా.. ఆసక్తికరం అనిపించే సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. ఫ్యాక్షన్ నాయకుడి కూతురు తమ పనివాడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించడం కష్టమేమీ కాదు. ఆ అంచనాలకు తగ్గట్టే కథ నడుస్తుంది. అచ్చంగా వర్మ స్టయిల్లో ఎక్కడపడితే అక్కడ కెమెరా పెట్టడం.. క్లోజప్స్ చూపించడం.. నటీనటులంతా అవసరానికి మించి హావభావాలు పలికించేస్తుండటం.. సన్నివేశాల్లో బలం లేకపోయినా ఏదో జరిగిపోతున్నట్టు బ్యాగ్రౌండ్ స్కోర్ బాదేయడం.. ఇలా భైరవగీత కాసేపటికే ప్రేక్షకుల్ని విసుగెత్తించింది. వర్మ మార్క్ సినిమా అంటే ఒకప్పుడు ప్లస్, ఇప్పుడు మైనస్సై కూర్చుంది.


  0 0

  ఒడియన్ * బాగోలేదు

  తారాగణం: మోహన్‌లాల్, మంజువారియర్, ప్రకాష్‌రాజ్, మనోజ్‌జోష్, సనాఅల్త్ఫ్, సిద్ధిక్, నందు, కైలాస్, సంతోష్, ఇన్నోసెంట్
  సంగీతం: ఎం.జయచంద్రన్,
  నిర్మాతలు: రామ్ దగ్గుబాటి, ఎ.సంపత్‌కుమార్, ఆంటోనీ పెరంబవూర్.
  దర్శకత్వం: వి.ఎ.శ్రీకుమార్ మీనన్.
  ===============================================================
  వైరుధ్యమైన పాత్రనేదైనా, వైవిధ్యవంతంగా ప్రదర్శించగల ప్రజ్ఞ ఉన్న నటుల్లో మోహన్‌లాల్ ఒకరన్నది నిర్వివాదాంశం. అందుకనే ఆయన్ని ‘సంపూర్ణ నటుడు’ అని కూడా అంటారు. మరి అలాంటి సంపూర్ణ నటుణ్ణి ‘ఒడియన్’ (కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న తినేకురిసి గ్రామంలో ఉండే ఓ తెగకు చెందిన వ్యక్తులు) పాత్రలో చూపడంలో దర్శకుడు వి.ఎ.శ్రీకుమార్ మీనన్ పడిన తడబాటువల్ల అంతగా రాణించలేదు. బహుశా దర్శకుడికిది తొలి చిత్రమై వుండడంవల్ల కావచ్చు. ఇక వివరాల్లోకి వెళితే...
  తమ శత్రువులను భయపెట్టి ఇబ్బందుల పాల్చేయడానికి కొన్ని అతీత శక్తులుగల ‘ఒడియన్’ తెగకు చెందిన వ్యక్తుల్ని కేరళ రాష్ట్రంలో కొందరు వినియోగిస్తుంటారు. అలాంటి వర్గానికి చెందిన వ్యక్తి ఒడియన్ మాణిక్యం (మోహన్‌లాల్). అయితే ఒడియన్ మాణిక్యం పేరిట తన స్వార్థంకోసం రాజారావు (ప్రకాష్‌రాజ్), ప్రభ (మంజువారియర్), ఆమె సోదరి భర్త రవిని అంతం చేస్తాడు. అలా తనపై పడిన నిష్కారణ నిందను చెరుపుకుని, ప్రభ కుటుంబాన్ని మాణిక్యం ఎలా రక్షించాడన్నది మిగతా కథ. ఎంచుకొన్న విషయంలోనే జన సమ్మతంకాని అంశాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ‘నేను నీకు అప్పచెప్పిన పనికి చెందిన వ్యక్తుల్ని భయపెడతానే కానీ చంపను’ అని మాటిమాటికీ అనే మాణిక్యం, అసలు అలా భయపెట్టడం, ఆసుపత్రిపాలు చేయడమన్నది ఎంతవరకూ ఒప్పుకోలు విషయమో ఆలోచించాలి. అలాగే తాను కోరుకునే జంతు రూపంలో మారే ప్రక్రియను పొందిన మాణిక్యం శక్తిని తెరపై చూపడంలో అదేదో ఫాన్సీ డ్రెస్ పోటీల్లో ముఖానికి మాస్క్‌వేసుకున్నట్లు ఉంది తప్ప అంతకుమించి స్థాయి కనపడలేదు. మరి సినిమాకు ఆయువుపట్టైన ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణలోనూ ఇంతటి అలక్ష్యం డైరెక్టర్ ఎలా వహించారో అర్ధంకాదు. అదే విధంగా సినిమా నిడివి (దాదాపు రెండు గంటల నలభైఏడు నిమిషాలు) విషయంలోనూ చాలా ఉదాసీనత చూపారు. అనేకానేక సన్నివేశాలు అనవసరమైనవి తాండవించాయి. ఉదాహరణకు జ్యోతిష్యాలు చెప్పే శాస్ర్తీని భయపెట్టడానికి రాజారావు ప్రోద్బలంతో సాగే ఒడియన్ తరహా విన్యాసాలూ వగైరావి నిర్దాక్షిణ్యంగా తొలగించవచ్చు. అలాఅలా కనీసం అరగంట చిత్రాన్నైనా తొలగించి ఉంటే సినిమా కాస్తంత ఆసక్తిదాయకంగా ఉండేది. ఇక చివరలో పతాక సన్నివేశాల పోరాటం కూడా చాలా సుదీర్ఘంగా ఉండి విసుగు కలిగించింది. అదే రీతిలో ప్రభ అపారంగా నమ్మే మాణిక్యం, తన భర్తనెలా చంపుతాడన్న అణుమాత్రపు అనుమానమైనా వ్యక్తపరచకుండా వెంటనే అతనిపై అందరిలాగే నిందనువేసినట్లు చూపడం ఆ పాత్ర రూపకల్పనకే మచ్చ తెచ్చినట్లైంది. వీటన్నింటికీ మించి సినిమాలో కొన్ని వర్తమాన సన్నివేశాల వివరణలో లెక్కకుమించిన ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ చూపడంతో అసలు ఏది ఇప్పటి సీనో, ఏది గడిచిపోయిన సంఘటనో అన్న దానిపై సామాన్య ప్రేక్షకుడు గందరగోళపడ్డాడు. ఇలాంటి అస్తవ్యస్థాలను పక్కకుపెట్టి మిగతా అంశాలు పరిశీలిస్తే- మోహన్‌లాల్ మాణిక్యం పాత్రలో సన్నివేశం- కథా అనుమతించినమేరకు చాలాబాగా నటించాడు అన్నది వేరే చెప్పనక్కరలేని అంశం. అయితే ముందు పేర్కొన్నట్లు అది ఇంకా బాగా శోభిల్లడానికి దర్శకుడు సమర్ధ విధానంలో కృషిచేసి తెరపై ఆవిష్కృతం చేసినట్లైతే మరీ బాగుండేది. మోహన్‌లాల్‌కు దీటుగా చెప్పుకోవాల్సిన పాత్ర ప్రభది. మాణిక్యంమీద అనురాగం, అంధురాలైన చెల్లెలు ఇతర కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతను వ్యక్తీకరించడంలో సమగ్ర నటనని ఈ పాత్ర పోషించిన మంజువారియర్ చూపారు. ముఖ్యంగా తాను భర్తపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబంపై తనకున్న బాధ్యతను ఏమాత్రం విస్మరించకుండా చూసిన నిగ్రహపూర్వక నటన ప్రశంసార్హమైనది. ప్రత్యేకంగా భావప్రకటనలో చూపిన క్లారిటీ ఎన్నదగినది. రాజారావుగా ప్రకాష్‌రాజ్‌కిలాంటివి షరామామూలు పాత్రమే. తన మార్కు నటన మరోసారి ఇందులో చూపారు. సినిమాకు పెట్టని ఆభరణాలు షాజీకుమార్ కెమేరా, పీటర్‌హైన్స్ పోరాట సన్నివేశాలు కేరళ అందాల్ని చూపడంలో షాజీ బేష్ అనిపించారు. ‘మేఘం కురిసెలే, కుసుమం విరిసిలే’ పాటలో కెమేరా పనితనం బాగుంది. కళ్లులేనివారి అంతరంగాన్ని సంభాషణాకర్త ఇందులో బాగా పలికించారు. (కళ్లులేని నాకు మీనాక్షి (చేప వంటి కనులు కలది) అని పేరుపెట్టడమేమిటో, చేపల్ని నేను చూడలేను, కానీ నన్ను అవి చూడగలవు.. అనడం లాంటవి, అలాగే ‘చీకట్లో ఒడియన్’కాదు చీకటే ఒడియన్ అన్న డైలాగ్సూ సినిమా విధానానికి పనికివచ్చాయి. జయచంద్రన్ స్వరాల్లో పెద్దగా చెప్పుకోదగ్గవి లేవు. టైటిల్ సాంగే కాస్తంత ఉత్తేజకరంగా ఉంది. ‘అంబారీ, అంబారీ, తెచ్చేలే పూల అంబారీ, పాట రచనాపరంగా బాగుంది. ఒక ప్రత్యేకమైన ‘తెగ’వివరాల్ని తెరకెక్కించే ఈ తరహా ప్రక్రియలో అంతేస్థాయి ప్రత్యేక పటిష్టతలను రూపకల్పనలో అవలంభించి ఉంటే ‘ఒడియన్’ ఓవరాల్‌గా అందర్నీ అలరించేది.


  0 0

  బాలీవుడ్‌లో ప్రేమ వ్యవహారాలు సర్వసాధారణం. కొన్ని ప్రేమలు పెళ్లివరకూ వెళ్తుంటే, మరికొన్ని డేటింగుల వద్దే ఢమాల్‌మంటాయి. ఇటీవలే బాలీవుడ్ హాట్ లవర్లు దీపిక రణ్‌వీర్‌లు పెళ్లితో దంపతులైన విషయం జగద్వితం. అయితే తాజాగా మరో బాలీవుడ్ జంట పెళ్లిపీటలెక్కే అవకాశం లేకపోలేదని బీ టౌన్ టాక్. అలియాభట్- రణబీర్ కపూర్‌లు ప్రేమలో ఉన్నారని చాలాకాలంగానే అక్కడి మీడియా కోడైకూస్తుంది. అయితే ఇప్పటివరకు ఇద్దరూ ఆ విషయంపై ఎలాంటి స్పందనా వెల్లడించలేదు. అయితే ఈ జంట మాత్రం పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇక ఆమధ్య సోనమ్‌కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఇద్దరు కలిసి తెగ హంగామా చేశారు కూడా. దీంతో ఇద్దరి మధ్యా ప్రేమ ఖాయమని, పెళ్లే తరువాయని బాలీవుడ్ మీడియా కథనాలు గుప్పించింది. అయినా ఆలియా -రణబీర్ నుంచి రియాక్షన్ లేదు. అయితే తాజాగా అలియా తండ్రి, దర్శకుడు మహేష్‌భట్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. వాళ్లిద్దరి రిలేషన్‌పై కామెంట్ చేస్తూ -రణ్‌బీర్ అంటే తనకు ఇష్టమని, మంచి వ్యక్తి అంటూ కితాబిచ్చాడు. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుసుకోవడానికి పనిలేని ఆరాలు అవసరం లేదు. వారి బంధం సవ్యంగానే సాగుతోంది. ఆ బంధాన్ని పెళ్లివరకు తీసుకెళ్తారా? లేదా? అనేది కాలం నిర్ణయిస్తుంది. అన్ని సవ్యంగా సాగితే వచ్చే ఏడాదే పెళ్లి ఉండొచ్చు అని మహేష్‌భట్ తేల్చేశాడు. దీంతో ఆలియా, రణబీర్‌ల మ్యాటర్ క్లియరైనట్టేనని బీటౌన్‌లో మళ్లీ చర్చ మొదలైంది.


  0 0

  సముద్ర పుత్రుడు ** ఫర్వాలేదు

  తారాగణం: జేసన్ మొమోవా, అంబర్ హియర్డ్, విల్లెమ్ డఫో, ప్యాట్రిక్ విల్సన్, డోల్ఫ్ లన్డ్‌గ్రెన్,
  యయా అబ్దుల్ మటీన్-2, నికోల్ కిడ్‌మన్
  సంగీతం: రూపర్డ్ గ్రెగ్సన్, విలియమ్స్
  ఎడిటింగ్: కిర్క్ మెర్రి
  సినిమాటోగ్రఫీ: డాన్ బర్జెస్
  స్క్రీన్‌ప్లే: డేవిడ్ విస్లీ, విల్‌బెల్
  నిర్మాతలు: పీటర్ సఫ్రాన్, రాబ్ కోవన్
  దర్శకత్వం: జేమ్స్ వాన్
  =====================================================

  హాలీవుడ్ సినిమా అంటేనే భారీతనం. దానికితోడు సూపర్ హీరో సినిమాలంటే టికెట్ కోసుకుంటారు. అందుకే హాలీవుడ్ నుంచి భారీ యాక్షన్ లోడెడ్ చిత్రాలు ఎన్ని దిగుమతవుతున్నా -వాటికి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అలాంటి కోవలో వచ్చిన మరో భారీ చిత్రమే ఆక్వామెన్. తెలుగు అనువాదంలో సముద్ర పుత్రుడు. జేమ్స్‌వాన్ తెరకెక్కించిన సినిమాలో టైటిల్ పాత్రను ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ మొమోవా పోషించాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం యాక్షన్ ప్రియులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
  కథ:
  భూమీద బతుకుతున్న ఆర్థర్ కర్రీ (జేసన్ మొమోవా)కి తన అసలు వారసత్వ రాజ్యం సముద్ర గర్భంలోని కింగ్ అట్లాంటిస్ అని తెలుస్తుంది. అట్లాంటిస్ రాజ కుటుంబంలోని కుద్రదారుల కారణంగా -సముద్ర రాజ్యాలు, తన ప్రజలకు ముప్పువాటిల్లుతోందని తెలిసి -తన శక్తియుక్తులు, సాహసాలతో వాళ్లను ఎలా రక్షించి ‘ఆక్వామేన్’గా అవతరించాడన్న జానపద కథ ఇది.
  లైట్‌హౌస్ వాచ్‌మన్‌గా పని చేస్తున్న టామ్ కర్రీ (టిమ్యూరా మారిసన్) విధి నిర్వహణలో ఉండగా, సముద్రపుటొడ్డున స్పృహ తప్పి పడివున్న యువతిని గుర్తిస్తాడు. ప్రాణాలతోనే ఉందని గమనించి ఆమెను రక్షించే ప్రయత్నంలో ఓ రహస్యం తెలుసుకుంటాడు. ఆమె మామూలు యువతి కాదని, సప్త సముద్ర రాజ్యాల్లో ఒకటైన అట్లాంటిస్ మహారాణి అట్లాన్నా (నికోల్ కిడ్‌మన్)నే తాను రక్షించానని తెలుసుకుంటాడు. ఇష్టంలేని పెళ్లి కారణంగా సముద్ర రాజ్యాన్ని వీడి భూప్రాంతానికి వచ్చేసినట్టు అట్లాన్నా చెబుతుంది. ప్రాణాపాయం నుంచి తనను కాపాడిన భూవాసి టామ్‌కు ఆకర్షితురాలవుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. టామ్, అట్లాన్నా దంపతులకు కలిగిన సంతానమే ఆర్థర్ క్రరీ (జేమ్స్ మొమోవా). ఆనందంగా సాగిపోతున్న అట్లాన్నా జీవితంలోకి మళ్లీ అట్లాంటిస్ రాజ్యవాసులు వస్తారు. అట్లాన్నా భూమీదే ఉందన్న విషయం తెలుసుకుని దాడులకు ఉపక్రమిస్తారు. శక్తివంతులైన అట్లాంటిస్ రాజ్య దుండగుల వల్ల తన భర్త, కొడుకుకు ఎలాంటి ఆపాదా కలుగకూడదన్న ఆలోచనతో -అట్లాన్నా వాళ్లకు లొంగిపోతుంది. బందీగా అట్లాంటిస్ రాజ్యానికి వెళ్లిపోతూ ‘రెండు రాజ్యాలను ఏకం చేయగల అతి శక్తిమంతుడు తన కుమారుడు’ అని భర్తకు చెబుతుంది. పెరిగి పెద్దవాడైన ఆర్థర్ కర్రీకి సముద్ర రాజ్య యువరాణి మెరా (అంబర్ హియర్డ్) ద్వారా ఓ విషయం తెలుస్తుంది. అట్లాంటిస్ సహా సముద్ర రాజ్యాలకు తన కుటుంబీలకుల నుంచి ముప్పు పొంచివుందని, ప్రజలు దుష్టపాలనను చవిచూస్తున్నారని చెబుతుంది. దీంతో ఆర్థర్ తాను ఏ రాజ్యానికి చెందినవాడో తేల్చుకోవాల్సిన పరిస్థితి అసన్నమవుతుంది. కారణజన్ముడైన ఆర్థర్ కర్రీ సముద్ర రాజ్యమైన అట్లాంటిస్ ఎలా చేరుకున్నాడు? తల్లిని కలుసుకున్నాడా? భూమీద పుట్టిన తనకు నీటిమడుగులోనూ జీవించే శక్తివుందని ఎలా తెలిసింది? కర్తవ్య నిర్వహణకు ఎలాంటి సాహసాలను ప్రదర్శించి ‘ఆక్వామేన్’గా అవతరించాడన్నది మిగతా కథ.
  నిజానికి దీని మూల కథ తెలుగు జానపద కథలకు దగ్గర పోలికలతో కనిపిస్తుంది. కాకపోతే -రెండు రాజ్యాల మధ్య కుట్రలు, కుతంత్రాలు, కథానాయకుడి ప్రణయం.. లాంటి అంశాలు మన కథల్లో కనిపిస్తే, వీటినే భూమి, సముద్రం (ఒకవిధంగా పాతాళం) అనే రెండు ప్రపంచాల మధ్య సాగే కథగా ఆక్వామేన్‌ను చిత్రీకరించినట్టు అర్థమవుతుంది. కాకపోతే హాలీవుడ్‌లో సూపర్ హీరోయిజం కథలు ఏస్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కనుక -ఆ స్థాయిలోనే దర్శకుడు జేమ్స్ వాన్ ఆడియన్స్ అబ్బురపడేలా సన్నివేశాలను తెరకెక్కించాడు. డీసీ కామిక్స్‌లో పిల్లలను అమితంగా ఆకట్టుకున్న ఆక్వామేన్ పాత్రకు వాన్ ప్రాణం పోసిన తీరును తక్కువ చేయలేం. ఉభయచర జీవిగా ఆక్వామేన్‌కు ఉండే శక్తులు, సాహసోపేత సన్నివేశాలను దర్శకుడు చూపించిన తీరు పిల్లలేకాదు, పెద్దలు సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. ఆక్వామేన్ పాత్రను తీర్చిదిద్దడమే కాదు, భారీ బడ్జెట్‌తో సన్నివేశాలను రిచ్‌గా చిత్రీకరించడమే సినిమాకు ప్రాణమైంది. భారీ ట్విస్టులు, పజిల్స్‌ని పెట్టకుండా కథను మామూలుగా నేరేట్ చేయడం గొప్పగా అనిపించింది. అందుబాటులోకి వచ్చిన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో సీజీఐలో సృష్టించిన సముద్రగర్భ ప్రపంచం ఆడియన్స్‌కు ఓ వింతే. ఆక్వామేన్ కోసం తానో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించానని ప్రచార కార్యక్రమాల సమయంలో దర్శకుడు వాన్ చెప్పినట్టే -స్క్రీన్‌మీద ఆడియన్స్‌కు ఆ అనుభూతి అందించాడు. సముద్ర గర్భంలోని పోరాట సన్నివేశాలు, భారీ జంతువులతో భీకర యుద్ధాలను చూపించడానికి ఒకింత నిడివి ఎక్కువ తీసుకున్నా -యూనిట్ మొత్తం ఎంత కష్టాపడ్డారన్నది ఆడియన్స్‌కు అందిన అనుభూతిలోనే తెలుస్తుంది. హాలీవుడ్ చిత్రమే అయినా -కమర్షియల్ ఫార్మాట్‌లో భాగంగా ఆక్వామేన్‌తో ప్రినె్సస్ ప్రణయ సన్నివేశాల్ని బలవంతంగా చొప్పించారని ఒకటి రెండుచోట్ల అర్థమవుతుంది.
  ఇక ఆర్థర్ కర్రీ పాత్రను దర్శకుడు వాన్ తీర్చిదిద్దడం ఒకఎత్తయితే -దానికి ప్రాణం పోయడంలో జేసన్ మొమోవా కృషి కనిపిస్తుంది. తనకు ఉభయచర జీవి శక్తులు ఉన్నాయని తెలిసిన తరువాత -జేసన్ హావభావాలు, వీరోచిత ప్రదర్శనతో పాత్రను పీక్స్‌కు తీసుకెళ్లాడు. సముద్ర పుత్రుడు ఇలానే ఉంటాడన్న నమ్మకం కలిగేలా పాత్రలో ఒదిగిపోయాడు. భూమి, సముద్ర గర్భంలో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాల్లో జేసన్ నటన బావుంది. పాట్రిక్ విల్సన్, నికోల్ కిడ్‌మన్, అంబర్ హియర్డ్, విల్లెమ్ డఫోలు సైతం తమ పాత్రలతో సినిమాకు ప్రాణం పోశారు. సముద్ర గర్భంలోని రాజ్యాలు, భూమీద రాజ్యాల మధ్య కథ సాగితే ఇలానే ఉంటుందా? అన్నంతగా సన్నివేశాల్లో ఆడియన్స్ లీనమైపోతాం. యుద్ధాల కోసం వినియోగించే సముద్ర జంతువుల సృష్టి దర్శకుడు వాన్ క్రియేటివిటీకి పరాకాష్టం. ఆడియన్స్‌ని మరోలోకంలోకి తీసుకెళ్లేందుకు సంగీత సారథలు రూపర్డ్ గ్రెగ్సన్, విలియమ్స్ కృషిని ప్రత్యేకంగానే ప్రస్తావించాలి. కిర్క్ మెర్రి షార్ప్ ఎడిటింగ్, డాన్ బర్జెస్ రిచ్ సినిమాటోగ్రఫీ, కథను ఎంతవరకు ఎప్పుడు ఎలా చెప్పాలన్న విషయంలో డేవిడ్ విస్లీ జోన్‌సన్- మెక్ గోల్డ్‌రిక్, విల్‌బెల్ ప్రదర్శించిన స్క్రీప్‌ప్లే పనితనం సినిమాకు హైలెట్ పాయింట్స్. హాలీవుడ్ చిత్రమేదైనా నిర్మాణ విలువలను ఎంచిచూపించే పనుండదు. ఆ విషయంలో నిర్మాతలు పీటర్ సఫ్రాన్, రాబ్ కోవన్‌ల గురించి గొప్పగానే చెప్పాలి.


  0 0

  స్క్రీన్‌పై ఇన్నోసెంట్ రొమాన్స్‌ను పండించిన గోపీచంద్, రాశిఖన్నా మరోసారి ఆ టేస్ట్‌ను ఆడియన్స్‌కి అందించేందుకు సిద్ధమవుతున్నారట. హీరో గోపీచంద్ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్‌లు లేకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుని మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు కమిటైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ఇతర ప్రీప్రొక్షన్ పనులు జరుగుతున్నాయి. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక చిత్రంలో హీరోయిన్‌గా రాశి ఖన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే గోపీచంద్ -రాశి ఖన్నాలు ‘జిల్’ చిత్రంలో ఇన్నోసెంట్ రొమాన్స్‌ను టేస్ట్ చూపించారు. స్టైలిష్ మూవీగా విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్న చిత్రంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండటంతో -మరోసారి వారినే ఖరారు చేయాలని దర్శకుడు తిరు నిర్ణయించినట్టు సమాచారం. ‘జిల్’ సినిమా సమయానికి బొద్దుగావున్న రాశి ఖన్నా -ఇటీవలి కాలంలో స్లిమ్ స్ట్రక్చర్‌ను డెవలప్ చేసింది. ఇప్పుడు గోపీచంద్ -రాశి ఖన్నా పెయిర్ మరింత అందంగా కనిపించే అవకాశం ఉందని యూనిట్ భావిస్తోందట.


  0 0

  సురేష్ ప్రొడక్షన్స్‌కు ప్రాణప్రతిష్ఠ సలిపి డి.రామానాయుడు మొట్టమొదటిసారిగా నిర్మించిన ‘రాముడు-్భముడు’ ఆంధ్ర దేశంలో జైత్రయాత్ర సాగించింది. యన్.టి.రామారావు ద్విపాతాభినయం చేసిన మొట్టమొదటి చిత్రమిది. డి.వి.నరసరాజు అద్భుతమైన కథా సంవిధానానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. 1959లో వ్రాసిన రుూ స్క్రిప్టు నిర్మాతలెవ్వరూ ముందుకురాని కారణంగా నరసరాజుగారు దాదాపు ఐదేళ్లు తనవద్దే వుంచుకున్నారు. ‘అంతా మనవాళ్లే’, ‘రోజులు మారాయి’, ‘పెద్దరికాలు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన తాపీ చాణక్య చొరవతో డి.రామానాయుడుముందుకొచ్చి సొంత బ్యానర్‌పై నిర్మాణానికుపక్రమించారు.
  అమాయకుడైన జమీందార్ రాముడు తన బావ పానకాలు పెట్టే బాధలు భరించలేక యిల్లువదలి అచ్చం తన పోలికే వున్న ధీమంతుడైన భీముడు జీవితంలో ప్రవేశించటం, భీముడు రాముని యిల్లుచేరి పానకాలు భరతం పట్టటం, చివరకు యిద్దరూ కవల పిల్లలని తెలియటం చిత్రకథ. చిత్రమైన మలుపులతో ఆద్యంతం రక్తికట్టించే విధంగా అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉంది. దర్శకుడు తాపీ చాణక్యను టాప్ గ్యాలరీలో నిలబెట్టిందీ చిత్రం. పెండ్యాల సంగీతం ప్రేక్షకుల గుండెల్లో పూలు పూయించింది. ‘తెలిసిందీ లే!’, ‘అదే అదే’, ‘వుందిలే మంచికాలం’, ‘దేశమ్ము మారిందోయ్’ పాటలు ఆంధ్ర దేశమంతటా మారుమ్రోగాయి. ఈ చిత్రంకోసం సి.నారాయణరెడ్డి వ్రాసిన ‘తలుచుకుంటే మేను పులకించేను’ పాట రికార్డింగ్ జరిగినా చిత్రీకరించలేదు. కొసరాజు సిగరెట్‌పై వ్రాసిన ‘సరదా సరదా సిగరెట్టు’ డ్రామా స్టయిల్‌లో సాగే కొసరాజు వ్రాసిన ‘తగునా యిది మామా’ ప్రేక్షకుల్ని అలరించాయి. యన్.టి.ఆర్ ప్రక్కన చక్కని గ్లామరస్ టచ్‌లో జమున, యల్.విజయలక్ష్మి మరబొమ్మల్లా తిరిగారు. రంగనాథంగా యస్.వి.రంగారావు, విలన్ పానకాలుగా రాజనాల, సుశీలగా శాంతకుమారి, మామాఅల్లుళ్లుగా రమణారెడ్డి, రేలంగి వారి మధ్య గిరిజ చలాకీగా నటించారు.
  ఈ చిత్రం ఆధారంగా విజయావారు తమిళంలో ‘ఎంగవీట్టు పిళ్ళై’ హిందీలో దిలీప్‌కుమార్‌తో ‘రామ్ ఔర్ శ్యామ్’నిర్మించారు. చలం నిర్మించిన ‘బుల్లెమ్మ బుల్లోడు’ జి.పి.సిప్పీ హేమమాలినితో నిర్మించిన ‘సీతా ఔర్ గీతా’ అనిల్‌కపూర్ నటించిన ‘కిషన్ కన్హాయా’ విజయా నిర్మించిన ‘గంగమంగ’ చిత్రాలు ‘రాముడు-్భముడు’ పోలికవే. ఇన్ని చిత్రాలకు కారణభూతమైన కథను సృష్టించిన రచయిత అభినందనీయులు.


  0 0

  స్వాతికిరణం చిత్రంలోని -తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ.. అన్న పాట నాకు చాలా ఇష్టం. భూపాలరాగ సమయంలోని కాస్మిక్ నేచర్‌ని మనసు పొరల్లోకి తీసుకొస్తున్నంత గొప్పగా ఉంటుంది. ప్రకృతి నుంచి పాట తీయమంటే మైమర్చిపోయి రాసే సిరివెనె్నల సీతారామ శాస్ర్తీ మమతపెట్టి రాసిన గీతమిది. ‘ఈ దోవ పొడవునా కువకువల స్వాగతం/ నీ కాలి అలికిడికి మెలకువల వందనం’ అన్న ఎక్స్‌ప్రెషన్ అత్యద్భుతం.
  ఈ పూల రాగాల పులకింత గమకాలు/ గారాబు కవనాల గాలి సంగతులు/ నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు/ పల్లవించును ప్రభూ పవళించు భువనాలు/ భాను మూర్తీ../ నీ ప్రాణ కీర్తన విని/ పలుకనీ ప్రణుతులని ప్రణవ శ్రుతిని/ పాడనీ ప్రకృతినీ ప్రథమ కృతినీ.. అంటూ చరణమిచ్చిన సీతారామశాస్ర్తీ కలానికి వందనం సమర్పించాల్సిందే. ఇదొకవంతైతే సంగీత దర్శకుడు కెవి మహదేవన్ ఈ పాటకిచ్చిన స్వరబాణీని పొద్దునే్న వింటే -మానసిక రోగాలన్నీ మటుమాయమన్నంత హాయి కలుగుతుంది. దూరంగా కొండకోనలు రారుూరప్పలు, వాటిమధ్యనుంచి ఉరకలేస్తూ పరుగులెత్తే గోదావరి.. ఒడ్డున పెద్ద చెట్టు.. దానికింద బాలనటుడు మంజునాథ్. ఈ పాటలో కె విశ్వనాథ్ మనోహర దృశ్యం ఇక్కడినుంచే మొదలవుతుంది. ప్రకృతి ప్రథమ కృతికి ఆచార సంప్రదాయాన్ని నేపథ్యంగా చూపిస్తూ -్భనోదయంలో ఆడియన్స్‌ని తడిసి ముద్ద చేసిన విశ్వనాథ్‌కు హ్యాట్సాఫ్. ఇక పాటకు అత్యంత ప్రాణప్రథంగా చెప్పుకోవాల్సిన సంగతి -వాణీ జయరాం గొంతు. పూజ గంటతో మొదలయ్యే పాట శృతికి మృదంగనాదం తోడైనపుడు -వాణీ (సంగీత సరస్వతి) గొంతు ప్రకృతినుంచి వినిపించే ఓంకారనాదంలా అనిపిస్తుంది. తారాస్థాయిలోనూ గొంతులోని మాధుర్యాన్ని రుచిచూపిస్తూ ‘ప్రభూ..’ (సూర్యభగవానుడు) అని పిలిచే విధానం అత్యద్భుతం. ఆ నాద మాధుర్యాన్ని అనుభవించాలే తప్ప, మాటల్లో చెప్పడం కష్టం. పాట కుర్రాడు మంజునాథ్ పాడతాడు కనుక అదే పసితనాన్ని గొంతులో చూపించి, పాట ముగింపు పంక్తిని రాధిక పాడుతుంది కనుక ఆ ఉచ్ఛారణలో మెచ్యూరిటీ చూపించిన వైనం వాణీ జయరామ్‌కే చెల్లింది. ఈ పాటంటే నాకు చాలా చాలా ఇష్టం.


  0 0

  కొయ్యూరు, డిసెంబర్ 15 : ఆంధ్ర జాతి గర్వించదగ్గ పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని ఎంపీడీ ఓ రెహమాన్ అన్నారు. శనివారం మండలంలోని నడింపాలెం పంచాయతీలో సంక్రాంతి పారిశుధ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం గ్రామంలో పారిశుధ్యాన్ని పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు, స్థానికులతో కలిసి వీధుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. పరిసరాలు పరిశుభ్రత పాటిస్తే రోగాలను నివారించవచ్చని సూచించారు. ఈకార్యక్రమంలో ఇ ఓ ఆర్‌డీ వరలక్ష్మితో పాటు పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

  ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన
  కొయ్యూరు, డిసెంబర్ 15: ప్రతీ ఒక్కరూ పొదుపును అలవర్చుకోవాలని ఎపీ గ్రామీణ వికాస్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని చీడిపాలెంలో బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కళాజాత బృంద సభ్యులు బ్యాంకుల ద్వారా పొదుపు చేసుకోవడం, ప్రభుత్వ పథకాలు ఖాతాదారులకు సేవలందించే సేవలపై బుర్రకథ రూపంలో వివరించారు. అనంతరం బీ ఎం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పథకాలు, రాయితీల లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే కొనసాగుతున్నాయన్నారు. ప్రతీ ఒక్కరూ పొదుపు చేయడం అలవర్చుకోవాలన్నారు. ఇది భావితరాలకు ఎంతో మేలని సూచించారు.
  సుదర్శన యాగానికి విశేష స్పందన
  కోటవురట్ల, డిసెంబర్ 15: మండలంలో కైలాసపట్నం రాజగోపాలస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన సుదర్శన యాగానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుంచి భక్తులు సుదర్శన యాగంలో పాల్గొని పండ్లు, పుష్పాలు సమర్పించారు . త్రిదండి శ్రీరంగరామానుజ జీయర్‌స్వామి శిష్యబృందం, వేద పండితులు సాంప్రదాయ బద్దంగా నిర్వహించిన ఈ యాగంలో మాజీ ఎమ్మెల్సీ డీవీ ఎస్ రాజు దంపతులు పాల్గొన్నారు. పెరుమాళ్ళుకు క్షీరాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ధనుర్మాసాన్ని పురష్కరించుకుని ముందుగా ఈయాగాన్ని నిర్వహించామన్నారు. ఈకార్యక్రమం అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సిద్ధాబత్తుల నాగేశ్వరరావు దంపతులు , గ్రామ పెద్దలు సిద్దాబత్తుల సత్యనారాయణ, డీవీ రావు, రమణ తదితరులు పాల్గొన్నారు.

  గ్రామాల్లో పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు
  కోటవురట్ల, డిసెంబర్ 15: రానున్న సంక్రాంతిని పురష్కరించుకుని గ్రామాల్లో పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా గ్రామాల్లో యంత్రాల సహాయంతో మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారు. చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. శనివారం లింగాపురంలో జేసీబీతో మురికి కాలువలను శుభ్రం చేసారు. ఈకార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్చ సంక్రాంతి కార్యక్రమాన్ని మండలంలో చేపడుతున్నామన్నారు. సంక్రాంతికి గ్రామాలన్నింటినీ అందంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంజీవరావు, నాయకులు సుర్ల శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.


  0 0

  కశింకోట, డిసెంబర్ 15: స్థానిక ఎమ్మెల్యే పీలాగోవిందసత్యనారాయణ అకస్మితంగా మండల కేంద్రమైన కశింకోటలో ఉన్న ప్రాధమిక ఆరోగ్యకేంద్రంను శనివారం తనిఖీ చేసారు. మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే ఆసుపత్రి వద్దకు వెళ్లడంతో బోజనం చేసేందుకు సిద్దమవుతున్న వైద్యాధికారులు, సిబ్బంది ఒక్కసారిగా పరుగులు తీసారు. అయితే ఆసుపత్రిలో గర్భిణీ స్ర్తిలను ఇక్కడ ఏ విధంగా సదుపాయాలు జరుగుతున్నాయని, చంద్రన్నకిట్ తదితర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీసారు. గర్భిణీ స్ర్తిలతో సుమారుగా గంటసేపు మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోగులను జాగ్రత్తగా చూసుకోవాలని, ఒ.పి పెంచాలని అవసరమైతే రోగులకు అదనపు గదులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మందు ఇక్కడ దొరికే విధంగా ఉండాలని, మరీ ఎక్కువగా ఎమర్జెన్సీ అయితే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పంపించాలని, సాద్యమైనంత వరకు ఇక్కడే సమస్య పరిష్కారం అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని, స్వచ్చ్భారత్ పాటించాలని, పరుపులు, దిండులు మార్పించాలని ఫోన్‌ద్వారా డిఎంహెచ్‌ఓకి , హెల్త్‌సూపర్‌వైజర్ సూరిశెట్టి శ్రీనివాస్‌కి మిగిలిన వైద్యసిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. ఈయన వెంట ఎంపిపి పంచదార్ల లక్ష్మీ, డిసిసిబి డైరక్టర్ శిదిరెడ్డిశ్రీనివాసరావు, దేశం నాయకులు ఉగ్గిన రమణమూర్తి, ఎంపిటిసి బాబర్ తదితరులు ఉన్నారు.

  భగవద్గీత పోటీల్లో విజేతలకు బహుమతులు
  కశింకోట, డిసెంబర్ 15: స్తానిక అయ్యప్పస్వామి దేవాలయంలో శ్రీ భగవద్గీత ఆరవ అధ్యాయం కంఠస్థ పోటీలను విశ్వహిందూపరిషత్ కశింకోట వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం జరిగాయి. ఈ పోటీలో పాల్గొనేందుకు స్థానిక వివేకానందస్కూల్, నేతాజీ స్కూల్, విజ్ఞానదుర్గా స్కూల్, ఎంపిపి గర్ల్స్ స్కూల్, ఎంపియుపి స్కూల్, తాళ్లపాలెం గాయిత్రీ స్కూల్ నుండి విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. మొదటి విభాగం, రెండవ విభాగం, మూడవ విభాగంలలో ప్రధమ, ద్వితియ, తృతియ బహుమతులను నిర్వాహకులు అందజేసారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కడిమిశెట్టి లక్ష్మీ, అడ్వకేట్ ఓరుగంటి సోమేశ్వరరావు, రిటైర్డ్ తెలుగుపండిట్ వ్యవహించారు. నిర్వాహకులు అధ్యక్షకార్యదర్శులు శిష్టి అప్పారావు, వైఎ రాజు, తాజామాజీ సర్పంచ్ తిరుచోళ్ల నాగేశ్వరీ, శ్రీకాళహస్థి, నాగబాబు, జనపరెడ్డి హరనాధ్, యడ్లబాలప్రసాద్, వి అచ్చుతాంబ తదితరులు పాల్గొన్నారు. వీటిలో విజేతలుగా గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేసారు.

  బీజేపీ కనుమరుగు తధ్యం
  కొయ్యూరు, డిసెంబర్ 15: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో బీజేపీ ఓటమి తధ్యమని చింతపల్లి ఎ ఎంసీ చైర్మెన్ చిట్టిబాబు అన్నారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వరహాలబాబుతో కలిసి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని , రాష్ట్ర ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసగించిందన్నారు. చంద్రబాబు ప్రభంజనం దేశంలో ప్రారంభమైందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా నిరంతర కృషితో ముందుకు తీసుకుపోతున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. ఆంధ్ర ప్రజలను మోసగించిన బీజేపీ పతనం ప్రారంభమైందని, ఇందుకు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లోని ఫలితాలే నిదర్శనం అన్నారు. దేశాన్ని అధోగతిపాలు చేస్తున్న బీజేపీకి వత్తాసు పలుకుతున్న వైసీపీ, జనసేనలు రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

  మాజీ ఎంపీటీసీ మృతి
  కొయ్యూరు, డిసెంబర్ 15: సీపీ ఐ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ వంతల అచ్చన్న(63)) శుక్రవారం రాత్రి మృతి చెందారు. కొమ్మిక పంచాయతీ కర్నికం పాలెంకు చెందిన అచ్చన్న కమ్యూనిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో ప్రజలకు సేవలందించారు. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే దేముడు రామరాజ్యంల నేతృత్వంలో వివిధ సమస్యలు, భూ పోరాటాల్లో చురుగ్గా పాల్గొనే వారు. ఆయన మృతి పట్ల సీపీ ఐ జిల్లా సహాయ కార్యదర్శి జి.సత్యనారాయణ, మండల కార్యదర్శి దేముడు, నేతలు కనకరాజు , మాదల సత్తిబాబు, చిన్నారావు తదితరులు సంతాపం తెలియజేసారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.


  0 0

  పాడేరు, డిసెంబర్ 15: ప్రముఖ శాస్తవ్రేత్త, మాజీ రాష్టప్రతి దివంగత అబ్ధుల్ కలాంను విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సూచించారు. ఇంటర్‌మీడియట్ బోర్డు స్వర్ణోత్సవాల సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభించిన ర్యాలీని ఆమె శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి లోకానికి కలాం మార్గనిర్ధేశికులని అన్నారు. విద్యార్థుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగిన ఆయన వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమించారని ఆమె చెప్పారు. శాస్తవ్రేత్తగా కలాం సాధించిన విజయాలు ప్రపంచం గర్వించతగినవని, ఆయన అడుగుజాడల్లో విద్యార్థులు పయనిస్తే తాము కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చునని ఆమె అన్నారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించిన వారు ఎందరో ఉన్నత పదవులను చేపట్టారని ఈశ్వరి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ విద్యను సద్వినియోగం చేసుకుంటే రానున్న కాలంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు డి.ఎస్.పి. రాజ్‌కమల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.్భమశంకరరావు, అద్యాపకులు కె.పార్వతి, కె.సూరిబాబు, ఎం.ఎస్.ఎస్.వర్మ, ఒ.రాజారావు, ఎస్.క్రాంతికుమార్, ఉద్యోగుల సంఘం నాయకుడు ఎస్.గంగరాజు, విద్యర్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

  పొట్టి శ్రీరాముల వర్థంతి వేడుకలు
  పాడేరు, డిసెంబర్ 15: అమరజీవి పొట్టి శ్రీరాములు 66వ వర్థంతిని పాడేరులో శనివారం నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది శ్రీరాములు వర్థంతి వేడుకలను నిర్వహించి వౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన సేవలను అధికారులు, ఉద్యోగులు స్మరించుకున్నారు. కాగా స్థానిక అక్షర పబ్లిక్ పాఠశాల ఆవరణలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.విజయకమార్, ఐ.టి.డి.ఎ. పరిపాలన అధికారి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి కొండలరావు, పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  గిరిజన యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలి
  అరకులోయ, డిసెంబర్ 15: గిరిజన యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి మరింత రాణించేలా ప్రోత్సహించాలని వైసీపీ ఎస్.టి.సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు చెప్పారు. స్థానిక ఎన్.టి.ఆర్. మైదానంలో వై.ఏస్.ఆర్. స్మారక వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆయన శనివారం ప్రారభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ గిరిజన యువకులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేరిట స్మారక టోర్నమెంట్‌ను అరకులోయలో నిర్వహిస్తున్నామని అన్నారు. విశాఖ ఏజెన్సీలో గిరిజన క్రీడాకారులకు ప్రోత్సాహం కరువవ్వడంతో క్రీడల్లో రాణించలేకపోతున్నారని ఆయన చెప్పారు. దినదినానికి కనుమరుగవుతున్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు నియోజకవర్గం స్థాయిలో పోటీలు ఏర్పాటు చేసామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గం పరిధిలోని 135 పంచాయతీల నుంచి 102 జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయని, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలిచిన జట్లలో మొదటి బహుమతి కింద 50 వేలు, ద్వితీయ స్థానం జట్టుకు 25 వేలు, తృతీయ స్థానంకు 15 వేలు, చతుర్థశి స్థానంలో నిలిచిన జట్టుకు 10 వేల రూపాయలు నగదు బహుమతిని అందిస్తామని ఆయన వివరించారు. పోటీల్లో పాల్గొన్న అన్న జట్లకు ఉచితంగా వాలీబాల్ కిట్లను పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వాలీబాల్‌ను గిరిజన ప్రాంతాలలో ఆచరించేలా స్ఫూర్తి కలిగించేందుకు అరకులోయలో దీనిని నిర్వహిస్తున్నట్టు ఆయన అన్నారు. గిరిజన యువత క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని, యువకులు క్రమం తప్పకుండా క్రీడల్లో పాల్గొంటే శరీరానికి, మనస్సుకు హాయిగా ఉంటుందని రవిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సమర్డి భాస్కరరావు, పాంగి చిన్నారావు, విజయకుమార్, మత్యరాజు, సుక్రయ్య, కొండలరావు, సుందరరావు, రమణమూర్తి, సుబ్రహ్మాణ్యం, రాందాసు, ప్రసాద్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

  పొట్టి శ్రీరాములుకు నివాళి
  అరకులోయ, డిసెంబర్ 15: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 67వ వర్థంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఎం.పి.డి.ఒ. విజయకుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

  క్రేన్ వాహనం వస్తే వాహనదారులకు హాడల్
  అనకాపల్లి టౌన్, డిసెంబర్ 15: ఆదమరచి వాహనాన్ని రోడ్డుపై పార్కుచేసి ఇతర పనులుపై ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి వచ్చేసరికి ఆ వాహనం కనిపించకపోతే నేరుగా పోలీస్టేషన్‌కు వెళ్ళవల్సిందే. పట్టణంలోట్రాఫిక్‌ని నియంత్రించడానికి ప్రత్యేక చర్యల్లోభాగంగా గత కొన్ని రోజులు క్రితం ట్రాఫిక్ క్రేన్ వాహనం వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు నుండి అనేక పనులుపై వచ్చేవారు తమ వాహనాలను ఆయా దుఖాణాలు ఎదురుగా రోడ్డుకు ఇరువైపులా పార్కుంగ్ చేసి వచ్చిన పనుల్లో నిమగ్నమై ఉంటారు. అయితే పార్కుంగ్ చేసిన వాహనాలు బైక్, కారు, ఆటోతదితర వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉందని పోలీసులకు ఏ మాత్రం అనిపించినా ఈ వాహనాలను క్రేన్ వాహనంలోఎక్కించి స్టేషన్‌కు తరలిస్తున్నారు. వాహన దారుడు వచ్చిన పని ముగించుకొని వాహనం వద్దకు వచ్చేసరికి సంబందిత వాహనం కనిపించదు. నిత్యం క్రేన్ వాహనం ప్రధానా మార్గాల్లో సంచరించి ఇటువంటి చర్యలు తీసుకోవడంతో వాహనదారులు రోడ్డుపై వాహనాన్ని పార్కుంగ్ చేయడానికి వెనుకాడుతున్నారు. శనివారం స్థానిక పూడిమడక రోడ్డులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రోడ్డుపై పార్కుంగ్ చేసిన రెండు బైక్‌లను పోలీస్టేషన్‌కు తరలించారు.దీంతోఈ వాహనం ఏ మార్గంలో సంచరించినా ఆయా ప్రాంతాల్లో వాహనదారులు హాడలిపోతున్నారు.

  తుమ్మపాల సుగర్స్ విజయం ప్రజాసంఘాలదే
  *టన్నుకు మూడువేలు ప్రకటించాలి *సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నర్సింగరావు
  అనకాపల్లి టౌన్, డిసెంబర్ 15: గత మూడు సీజన్లునుండి మూతపడి ఉన్న తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకోవడం వెనుక ప్రజా సంఘాలు కృషి, పోరాట పలితమేనని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు అభినందన వ్యక్తం చేసారు. శనివారం ఆయన సుగర్ ఫ్యాక్టరీని సందర్శించి కార్మికులు చేస్తున్న అయిలింగ్ పనులను పరిశించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సీజన్లుగా ఫ్యాక్టరీ మూతపడి ఉండడంతో చెరకురైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కార్మికులు, రైతులు, ప్రజాసంఘాలు చేసిన పోరాటాలకు ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి తిరిగి క్రషింగ్‌కు సిద్దం చేయడం పట్ల కార్మికులను అభినందించారు.ప్రభుత్వం ఈ నిర్ణయం నాలుగేళ్ళక్రితం తీసుకొని ఉంటే ఈపాటికి ఫ్యాక్టరీ ఆదునీకరణ పూర్తిఅయి ఉండేదన్నారు. 42మంది కార్మికులు, పదిమంది రైతులు చనిపోయి ఉండక పోనని వ్యాఖ్యానించారు. చెరకు రైతులకు టన్నుకు మూడువేలు చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాధం అన్నారు. ఈ పర్యటనలో కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎ బాలకృష్ణ, సిఐటియు డివిజన్ అధ్యక్షులు మళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  పాడేరు, అరకులోయ, డిసెంబర్ 15: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) విచారణ చేపట్టనుంది. ఈ సంఘటనపై ఎన్.ఐ.ఎ.తో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి సమగ్ర విచారణకు అప్పగించినట్టు తెలుస్తోంది. అరకులోయ ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు సెప్టెంబర్ 23వ తేదిన హత్య చేసిన సంగతి తెలిసిందే. డుంబ్రిగుడ మండలంలో గ్రామ దర్శిని కార్యక్రమానికి వీరిద్దరు నేతలు వెళుతుండగా లివిటిపుట్టు గ్రామం వద్ద మావోయిస్టులు వీరిని అదుపులోకి తీసుకుని హత్య చేయడం ప్రభుత్వ యంత్రాంగాన్ని నివ్వేరపరిచింది. ఈ సంఘటన అప్పటిలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా మావోయిస్టుల ఘాతుకంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీంతో నేతల జంట హత్యలపై విచారణకు సిట్ బృందాన్ని నియమించి సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి ఫకీరప్ప ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలపై సిట్ బృందం అరకులోయలో మకాం వేసి ముమ్మర దర్యాప్తు నిర్వహించగా ఈ సంఘటనతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసారు. అయితే సిట్ బృందం నిర్వహించిన విచారణ తీరుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. నేతల జంట హత్య సంఘటనపై సిట్ చేసిన విచారణ పారదర్శకంగా లేదని, ఈ బృందం దర్యాప్తులో కూడా పలు అనుమానాలు ఉన్నట్టు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సిట్ దర్యాప్తును పక్కనపెట్టి ఎన్.ఐ.ఎ.తో విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ కేసును వారికి అప్పగించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్య ఘటనపై ఎన్.ఐ.ఎ. మరికొద్ది రోజులలోనే విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది. జాతీయ దర్యాప్తు సంస్థలోని ఎస్.పి. కేడర్ అధికారి ఈ సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. నేతల హత్య సంఘటనపై ఇప్పటికే ఎన్.ఐ.ఎ. అధికారులు ప్రాధమిక సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. త్వరలోనే వీరు అరకులోయ ప్రాంతంలో పర్యటించి నేతల హత్యలపై లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తోంది.


  0 0

  గాజువాక, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలను దక్కించుకుంటుందని స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహవాగ్ అన్నారు. మెడిటెక్ జోన్ ప్రపంచ స్థాయిలో కీర్తింపబడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ వైద్య ఉపకరణాల సదస్సు-2018ను విశాఖపట్నం కేంద్రంగా పెదగంట్యాడలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని క్రికెటర్ వీరేంద్ర సెహవాగ్ అన్నారు. పెదగంట్యాడలో గల ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్‌లో మూడు రోజులు పాటు నిర్వహించిన అంతర్జాయ వైద్య పరికరాల సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేశారు. వీరేంద్ర సెహవాగ్ ఎపి మెడిటెక్ జోన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య పరికరాల అవసరాలు ప్రపంచ వ్యాప్తంగా అధికం అయిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అనేక పరిశ్రమలు వైద్య పరికరాలను తయారు చేస్తున్నారన్నారు. అయితే భారతదేశం వైద్య పరికరాలను తయారీలో కాస్త వెనకంజలో ఉందని, అత్యధిక వైద్య పరికరాలను వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి అన్నారు. దీనికారణంగా వైద్య పరీక్షల ధరలు సామాన్యలకు అందుబాటులో లేవన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ దేశాల సరసన నిలబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడిటెక్ జోన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు. దీంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 270 ఎకరాల్లో మెడిటెక్ జోన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మెడిటెక్ జోన్‌లో సుమారు 240 వైద్య పరికరాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసే వీలు ఉందన్నారు. ఇప్పటికే 80 పరిశ్రమలు మెడిటెక్ జోన్‌లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని, వచ్చే ఏడాది జనవరికి సుమారు 20 పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్నారు. మెడిటెక్ జోన్‌లో సింగల్ విండో విధానాన్ని అనుసరించి అనుమతులను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. మెడిటెక్ జోన్‌లో పరికరాల తయారీ, ధ్రువీకరణ, టెస్టింగ్ సైతం ఒకే చోట జరుగుతుందన్నారు. దీనికోసం 18 ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 3డి ల్యాబ్స్ సైతం వీటిలో ఉన్నాయన్నారు. సైంటిస్టులు సైతం వారి వారి ఐడియాలను అభివృద్ధి చేసుకునే అవకాశం మెడిటెక్ జోన్‌లో ఉందన్నారు. రెండు నెలలు క్రితం మెడిటెక్ జోన్‌ను సందర్శించడం జరిగిందని, ఆ సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనిపించలేదన్నారు. రెండు నెలల్లో మెడిటెక్ జోన్‌కు కేటాయించిన స్థలం స్వరూపమే మారిందన్నారు. అందాలతో కొలువుదీరిన విశాఖపట్నానికి క్రికెట్ ఆడేందుకు పలు మార్లు వచ్చానన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చెందితున్న విశాఖపట్నం తనకు ఎంతో ఇష్టం అని ఆయన స్పష్టం చేశారు. మెడిటెక్ జోన్ విజన్‌ను ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ మెడిటెక్ జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందించిన ప్రోత్సాహాన్ని ఆమె కొనియాడారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం మెడిటెక్ జోన్‌లో భాగస్వామం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన కృషికి ఆమె కృతజ్ఞతులు తెలిపారు. 90 దేశాల నుండి 1046 మంది ఈ సదస్సుకు హాజరయ్యారన్నారు. సదస్సుకు హాజరైన ప్రతీ ఒక్కరు మెడిటెక్ జోన్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. మెడిటెక్ జోన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేంద్రశర్మ మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సును మెడిటెక్ జోన్‌లో ఏర్పాటు చేసే విధంగా కృషి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఆయన కృతజ్ఞతులు తెలిపారు. అలాగే సదస్సుకు హాజరైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదులు తెలియజేశారు. శనివారం జరిగిన ముగింపు కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు పుదిచ్చేరి ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి విష్ణులు పాల్గొన్నారు.

  మూడు రోజుల మెడ్‌టెక్ సదస్సులో
  ముగ్గురు ఉమ్మడి రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం

  అక్కిరెడ్డిపాలెం/ ఉక్కునగరం, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్‌లో మూడు రోజులు పాటు నిర్వహించిన అంతర్జాతీయ వైద్య ఉపకరణాల సదస్సు-2018కి ఉమ్మిడి తెలుగు రాష్ట్రాల నుండి ముగ్గురు విద్యార్థులు పాల్గొనే అవకాశం ప్రపంచ ఆరోగ్య సంస్థ కల్పించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మహ్మద్ బాజీ, దేవిరెడ్డి నవ్య, ఓం సాయిలకు ఈ అరుదైన అవకాశం దక్కింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబిఎ చదువుతున్న మహ్మద్ బాజీతో పాటు గుంటూరు చలపతి ఇన్సుట్యూట్ ఆప్ ఫార్మాసూటికల్స్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న దేవిరెడ్డి నవ్య, ఓం సాయిలు ఉన్నారు. అయితే వీరికి సహాయంగా మరో విద్యార్థిని వారణాసి వాసంతి విచ్చేశారు. విశాఖపట్నం ఎయులో ఎంబిఎ చదువుతున్న బాజీ వైద్య ఉపకరణాల చైన్ విధానంపై ప్రజెంట్ చేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే చలపతి ఇన్సుట్యూట్ ఆప్ ఫార్మాసూటికల్స్ కళాశాలకు చెందిన దేవిరెడ్డి నవ్య, ఓం సాయిలు మెడికల్ ఉపకరణాల్లో ఒక అరుదైన డివైస్‌ను రూపొందిస్తున్నారు.


  0 0

  గాజువాక/ఉక్కునగరం, డిసెంబర్ 15: ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెదగంట్యాడ వద్ద ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్‌లో మూడు రోజులు పాటు నిర్వహించిన అంతర్జాతీయ వైద్య ఉపకరణాల సదస్సు-2018 విజయవంతంగా ముగించింది. అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలకు చెందిన 1046 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రతినిధులంతా విశాఖనగరంలో గల పలు హోటళ్లుల్లో వసంత కల్పించారు. నగరం నుండి ప్రతీ రోజు ప్రత్యేక వాహనాల్లో మెడిటెక్ జోన్‌కు తీసుకు రావడం, సదస్సు అనంతరం తిరిగి వాహనాల్లో హోటళ్లుకు చేర్చడం జరిగింది. అంతర్జాతీయ సదస్సు ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అలాగే మెడిటెక్ జోన్‌ను జాతికి అంకితం చేశారు. మొదటి దశ పనులను ప్రారంబించడం, రెండవ దశ పనులకు శంకుస్థాపన చేశారు. రెండవ రోజు సదస్సుకు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, అశ్వినీకుమార్ చౌబేలు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు మెడిటెక్ జోన్ బ్రాండ్ అంబాసిడర్ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహవాగ్ హాజరయ్యారు. సదస్సు ముగింపు అనంతరం విదేశీయ అతిధులంతా తిరిగి ప్రయాణం అయ్యారు. శనివారం మధ్యాహ్నాం నుండే అతిధులు వారి వారి లగేజీలను సరుదుకుని తిరిగి ప్రయాణం కావడం కనిపించింది. సదస్సు ముగింపు అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్య అధికారులంతా తిరిగి ప్రయాణం అయ్యారు. అతిధులకు శుక్రవారం నగరంలో ఒక ప్రైవేటు హోటల్‌లో విందు ఇచ్చారు. విందుకు విదేశీయ అతిధులు అధికంగా హాజరయ్యారు. సదస్సు అనంతరం అబ్దుల్ కలాం కాన్వన్షన్ హాల్‌లో గల మినీ ఆడిటోరియంలో వైద్య ఉపకరణాలపై సెమినార్స్‌ను నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది సైంటిస్టులు, వైద్యులు హాజరయ్యారు. విదేశీయ డెలిగేట్స్‌కు సెమినార్‌లో సైంటిస్టులు, వైద్యులు డౌట్స్‌ను నివృత్తి చేశారు. అతిధులంతా మెడిటెక్ పార్కులో గల వివిధ పరిశ్రమలను సందర్శించారు. అలాగే వైద్య ఉపకరణాల తయారీ అనంతరం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక 18 ల్యాబ్స్‌ను అతిధులు సందర్శించారు. అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన విదేశీయ, స్వదేశీయ అతిధులను ఆంధ్రభూమి పలకరించింది. మెడిటెక్ జోన్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికిందన్నారు. ఆహ్లాదమైన వాతావరణం మధ్య అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి మెడిటెక్ జోన్ ప్రపంచంలో ఎక్కడా లేదని, అన్ని ఒకే చోట లభించడం అరుదు అన్నారు. మెడిటెక్ జోన్ మంచి ఫలితాలు ఇస్తుందన్న భావం వ్యక్తం చేశారు. విదేశీయ పెట్టుబడులకు ఇటువంటి సదస్సులు దోహద పడుతాయన్న భావాన్ని వ్యక్తం చేశారు.


  0 0

  విశాఖపట్నం, డిసెంబర్ 15: విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని మండల్లాలోని ప్రజలకు తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, ప్రాథమిక ఆరోగ్యశాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఓ హోటల్‌లో శనివారం ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉన్న తాగు నీటి సమస్యలపై సమావేశం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఎదుర్కోంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన మంత్రి తక్షణమే మరమ్మత్తులకు గురైన నీటి ట్యాంక్‌లను బాగుచేసి గిరిజనులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అదే విధంగా గిరిజనులకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకొవాలన్నారు.
  కరెన్సీ మార్పిడి అంతంత మాత్రమే...
  గాజువాక, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్‌ను దృష్టిలో పెట్టుకుని మెడిటెక్ జోన్‌లో ఏర్పాటు చేసిన థామస్ కుక్ మనీ ఎక్సేంజ్ బ్యాంక్ సేవలను అంతంత మాత్రమేగానే వినియోగించుకున్నారు. వందలాది మంది విదేశీయ డెలిగేట్స్‌ను దృష్టిలో పెట్టుకుని థామస్ కుక్‌కు సంబంధించి బ్యాంకు అధికారులు అంతర్జాతీయ సదస్సు జరిగిన చోట ప్రత్యేక ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేశారు. మూడు రోజులు పాటు మనీ ఎక్సేంజ్ కౌంటర్‌ను కేవలం 26 మంది విదేశీయ డెలిగేట్స్ మాత్రమే వినియోగించుకున్నారని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. అయితే దాదాపు 1200 మంది వరకు మనీ ఎక్సేంజ్ చేస్తారని నిర్వాహకులు తెలిపారు. కానీ కేవలం 26 మంది మాత్రమే కరెన్సీ మార్పిడి చేసుకున్నా. కరెన్నీ మార్పిడి చేసుకున్న విదేశీయ డెలిగేట్స్ నుండి బ్యాంకు అధికారులు పాస్ పోర్టు జెరాక్స్ తీసుకున్నారు. మనీ ఎక్సేంజ్ అనంతరం బ్యాంకు అధికారులు రశీదులను డెలిగేట్స్‌ను అందించారు. అయితే మనీ ఎక్సేంజ్ ద్వారా థామస్ కుక్ బ్యాంక్‌కు ఎంత లాభం వచ్చిందా అన్న విషయాన్ని, ఎంతమేన మనీ ఎక్సేంజ్ అయిందన్న విషయాన్ని బ్యాంకు అధికారుల బయటకు పెట్టలేదు.


  0 0

  విశాఖపట్నం, డిసెంబర్ 15: మహా విశాఖ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షన్ -2019లో ఉత్తమ స్థానాన్ని సాధించడానికి నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీర్ లక్ష్మీనారాయణ అన్నారు. జీవీ ఎంసీ పాత సమావేశ మందిరంలో శనివారం స్వచ్చసర్వేక్షన్ నిబంధలను తదితర వాటిపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ స్వచ్చసర్వేక్షన్ నిబంధనల ప్రకారం తడి-పొడి చెత్త సేకరణ, విభజన కంపోస్టింగ్ ఎల్ సోర్స్ ద్వారా స్వచ్చ విశాఖ సాధించాలని హితువు పలికారు. బయోడిగ్రేడుబుల్, నాన్ బయోడిగ్రేడబుల్, రీసైకిల్ ద్వారా ఘన వ్యర్థాలల నిర్వహణ సాధించాలన్నారు. ఎవరు చెత్తను ఉత్పత్తి చేస్తున్నారో ఆయా సంస్థలు, ప్రజలు చెత్త తోలగింపు బాధ్యత వహించాలన్నారు. ప్రతీ రోజు వెయ్యి మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని, 300 నుంచి 400 మెట్రిక్ టన్నుల తడిచెత్త సేకరిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ రూల్స్ అమలవుతున్నప్పటికీ శతశాతం సాధించలేక పోతున్నామని, ప్రజలు ప్రత్యామ్నాయంగా గుడ్డ,పేపర్ కవర్లును వినియోగించుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవీ ఎంసీ అదనపు కమిషనర్ జీవీవీ ఎస్ మూర్తి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ హేమంత్, జోనల్ కమిషనర్లు, వైద్యాధికారులు, పట్టణ ప్రణాళికాధికారులు తదితరులు పాల్గొన్నారు.

  21న మున్సిపల్ కార్మికలు చలో విజయవాడ
  విశాఖపట్నం, డిసెంబర్ 15: మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి తెలిపారు. శనివారం జగదాంబ సిటూ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు వినతి పత్రం ఇచ్చి సాముహిక రాయభారం నిర్వహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్మికులు 13రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, అధికారులు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నేరవేరకపోవడంతో కార్మికులంతా తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో మరోసారి సమ్మెకు దిగుతామన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి నూకరాజు, ఉపాధ్యక్షుడు అప్పలరాజు, సహాయ కార్యదర్శి ఈశ్వరరావు, రమణ, నాయడు తదితరులు పాల్గొన్నారు.


  0 0

  విశాఖపట్నం, డిసెంబర్ 15: విద్యుత్‌శాఖ ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దయ్యాయి. ఎటువంటి పరిస్థితుల్లోను ఏ ఒక్కరూ సెలవు పెట్టేందుకు వీల్లేదంటూ శనివారం ఈపీడీసీఎల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. తుపాను కారణంగా ఎదురయ్యే నష్టాలను అత్యంత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతిఒక్కరూ సైనికుల్లా సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే ఈపీడీసీఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర ఆదేశాలు జారీ చేశారు. ఇందులోభాగంగా విశాఖ జిల్లా ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సూర్యప్రకాష్ శనివారం ఉదయం నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగరంలో ఆపరేషన్ సర్కిల్ కార్యాలయంతోపాటు అనకాపల్లి, పాయకరావుపేట, జోన్-1,2 కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యుత్‌కు సంబంధించిన ఏ విధమైన పిర్యాదులునైనా దీని ద్వారా 0891-2718091 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే ప్రతీ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రెండు క్రేన్లు, మరో రెండు జనరేటర్లను ముందస్తుగానే అందుబాటులో ఉంచామన్నారు. సాగరతీరం ప్రాంతాల్లో ఉండే సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్ల పరిరక్షణ, దెబ్బతినే ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు సత్వరమే చేపట్టేందుకు వీలుగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే తుపాను కారణంగా దెబ్బతినే విద్యుత్ వ్యవస్థను ఎప్పటికపుడు పునరుద్ధరించడం కోసం 1500 మంది ఉద్యోగులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. క్షేత్రస్థాయి నుంచి ప్రతిఒక్కరూ శని,ఆదివారాల్లో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సోమవారం మధ్యాహ్నం తుపాను తీరం దాటేంత వరకు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు.

  తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి
  * జీవీ ఎంసీలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు * టోల్‌ఫ్రీ నెంబర్ 1800-425-00009
  విశాఖపట్నం, డిసెంబర్ 15: తుఫాను హెచ్చరికల కేంద్రం, ఆర్‌టీజీ ఎస్ సూచనల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీవీ ఎంసీ కమిషనర్ హరినారాయణన్ కోరారు. ఫెథాయి తుఫాన్‌ను ఎదుర్కోవడానికి అన్ని జోన్లలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారని, అధికారులు విధి నిర్వహాణకు సంసిద్థంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా భారీ వర్షాలు, తుఫాను దృష్ట్యా అప్రమత్తంగా ఉంటూ, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సమాచారాన్ని అందించాలన్నారు. దీని కోసం జీవీ ఎంసీలో టోల్‌ఫ్రీ నెంబర్ 180042500009కు ఫోన్‌చేసి అధికారులు, సిబ్బందిని సంప్రదించాలని, లేకుంటే ప్రధాన కార్యాలయం నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. తుఫాన్ తీవ్రత ముగిసే వరకూ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

  ఆవిష్కరణలకు ఏయూ సంపూర్ణ ప్రోత్సహం
  * ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు
  విశాఖపట్నం, డిసెంబర్ 15: విద్యార్థులు నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలకు వర్శిటీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు అన్నారు.శనివారం ఉదయం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో రోల్ ఆఫ్ ఐపి ఆర్ ఇన్నోవేషన్ మేనేజ్‌మెంట్ అండ్ అకడామీ- ఇండ్రస్టీ కొలాబరేషన్ ఒక రోజు వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేధో హక్కులను, ఆలోచనలను పరిరక్షించడం ఎంతో అవసరమన్నారు. నూతన ఆవిష్కరణలు జరిపే వారు పేటెంట్‌లు పొందే దిశగా ప్రయత్నించాలని, తద్వారా దేశానికి ఎంతో ప్రతిష్ట పెరుగుతుందన్నారు. ఎన్ ఆర్‌డీసీ సీ ఎండీ డాక్టర్ హెచ్.పురుషోత్తం మాట్లాడుతూ మేధో హక్కుల పరరక్షణతోనే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఉన్నతంగా రాణించడం సాధ్యపడుతుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మేధో హక్కుల సంరక్షణ, పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. ప్రశ్నించే తత్వం, అణ్వేషనాసక్తిని విద్యార్థుల్లో పెంపోందించడం ఎంతో అవసరమన్నారు. సి ఎస్ ఐ ఆర్- ఐ ఐసిటి ఛీప్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్‌వి సత్యనారాయణ మాట్లాడుతూ పరిశ్రమలు, విద్యా వ్యవస్థలు, ప్రభుత్వం సమన్వయంతో సమిష్టిగా పనిచేస్తే ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వ పరంగా దీనికి ఎంతో సహకారం అవసరం ఏర్పడుతుందన్నారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీ ఈవో విన్నీ పాత్రో మాట్లాడుతూ కళాశాల నుంచి పరిశ్రమల ఆవిర్భావం జరుగుతాయన్నారు. కాఫీరైట్, ఐపి ఆర్‌లపై విస్తృత అవగాహన కలిగి ఉండాలని,నేడు దశాబ్థాల చరిత్ర కలిగిన సంస్థల కంటే ఆంకుర పరిశ్రమలల్లోనే ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయన్నారు. సదస్స సమన్వయకర్త ఆచార్య పి.జె రావు,సిజిపిడిటి ఎం కార్యాలయ అసిస్టెంట్ కంట్రోలర్ డాక్టర్ ఉషారావు, ఎన్‌ఆర్‌డిసిఐఫి ఎఫ్‌సి మేనేజర్ బికె సాహు, తదితరులు పాల్గొన్నారు.

  సంక్షేమ పథకాలు నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలి
  * జిల్లా పరిషత్ చైర్‌పర్స్‌న్ లాలం భవానీ భాస్కర్
  విశాఖపట్నం, డిసెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిర్థేశించిన లక్ష్యాల మేరకు త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా జిల్లా పరిషత్ చైర్‌పర్స్‌న్ లాలం భవానీ భాస్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన జెడ్పీ ప్రజాపరిషత్ స్థాయి సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. రాష్ట్భ్రావృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. డ్వామా పీడీ దయానిది మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు జరుగుతున్నాయన్నారు. ఫారం పాండ్స్, ఘన వ్యర్థాల నిర్వహణ షెడ్లు, ఆట స్థలాలు, ఇంకుడు గుంతలు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు, శ్మాసన వాటిక నిర్మాణాలు, మొక్కలు పెంపకం తదితర పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీ ఆర్ గృహ నిర్మాణాలకు సంబంధించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన లబ్ధిదారులకు గృహాలను కేటాయించడం జరిగిందన్నారు. ఎస్సీ కార్పోరేషన్ ఈడీ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న ఎస్సీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి 60శాతం సబ్సిడితో స్వయం ఉపాధి పథకాలను అందిస్తామన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగశే్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 116 పరిశ్రమలను స్థాపించి సుమారు 80వేల మందికి పైగా ఉపాధి అవకాశం కల్పిస్తున్నామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ జిల్లాలో మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ప్లూ తదితర వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటూ అవసరమైన మందులను అందిస్తున్నామన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ గీతాదేవి మాట్లాడుతూ ఆదరణ పథకం ద్వారా 43,856 మందికి పనిముట్లు అందించడానికి చర్యలు చేపడుతున్నామని, ఈ నెల 28న మెగా గ్రౌడింగ్ మేళా నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీ ఎం చంద్రబాబు హాజరు కానున్నారన్నారు. ఈ స్థాయి సంఘ సమావేశాలకు శాసనమండలి సభ్యులు పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, పీలా గోవింద సత్యనారాయణ, జెడ్పీ సీ ఈవో రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
  ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లును అభినందించిన వీసీ
  విశాఖపట్నం, డిసెంబర్ 15: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆటల్ బీహరి వాజ్‌పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యానిటరింగ్ ఆన్డ్ అలైడ్ స్పోట్స్, దర్శశాల, హిమాచల్ ప్రదేశాల్లో నిర్వహించిన జాతీయ సాహస శిక్షణా శిబిరంలో పాల్గొన్న పది మంది ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులను ఏయూ వీసీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సాహస శిక్షణ శిబిరంలో శిక్షణ పొందడంతో విద్యార్థులు, క్రమశిక్షణ, ధైర్యం భవిష్యత్‌లో ఎలాంటి విప్తత్తులైన ఎదుర్కోనే యుక్తి పెంపోందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కో- ఆర్డినేటర్ ఆచార్య సంపత్‌కుమార్, రమణ కుమార్ పాల్గొన్నారు.


older | 1 | .... | 1955 | 1956 | (Page 1957) | 1958 | 1959 | .... | 2067 | newer