Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

శాంతమే రక్షణవలయం

$
0
0

సుమతి శతకకారుడు బద్దెన ‘‘తన శాంతమె తనకు రక్ష’’ అని అనడంలో శాంతగుణమే మానవులను కాపాడుతుందని చెప్పాడు. వాగ్గేయకారుడు, నాదబ్రహ్మ అయిన త్యాగరాజు తన కీర్తనలో ‘‘శాంతము లేక సౌఖ్యము లేదు’’ అనీ అన్నారు. శాంతం వల్లనే సర్వ సుఖాలకు మూలాధారం శాంతగుణమే అని తెలుస్తోంది. భూదేవి అంత ఓర్పు స్ర్తిలకు ఉంటుందని అంటారు. అయతే సముద్రమంత సహనం, ఉదారగుణం ప్రతివారికీ అవసరమే. ఆ రెండు ఉన్నాపుడే శాంతి కలుగుతుంది.
శాంత గుణానికి ప్రతీక ధర్మరాజు. ధర్మరాజును కౌరవ సభకు ఆహ్వానించి అతనిని మాయాజూదంలో ఓడించి దుర్యోధనాదులు దురాగతాలు చేశారు. భీమార్జునులు సహించలేక అక్కడికక్కడే ఎదిరించి అడ్డుకోవడానికి ఉద్యుక్తులయ్యారు. ఆవేశంతో ఊగిపోయారు. శాంత స్వభావుడైన ధర్మరాజు అది గమనించి తన సోదరులను వారించి శాంతపరచాడు. లేకుంటే కురుసభ రణరంగంగా మారి ఉండేది. ధర్మరాజు యొక్క శాంతగుణమే పాండవులకు రక్షణగా నిలిచింది.
శాంతగుణం కలిగి ఉండడం మానవుల బలహీనతగా అనుకోకూఢదు. చేతగానితనంఅని అసలు అనుకోకూడదు. శాంతంగా ఉండటానికి కూడా ఒక హద్దు ఉంటాయ. మితిమీరిన ఆగడాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటే సహనం నశించి శాంతగుణం స్థానంలో కోపం వచ్చి చేరే అవకాశముంటుంది.
ఇంద్రప్రస్థపురంలో మయసభా నిర్మాణానంతరం పాండవులు శ్రీకృష్ణునికి రాజసూయయాగంలో అగ్రసనాధిపత్యం కట్టబెట్టారు. అది గిట్టని శిశుపాలుడు సభలోనే అందరి ఎదుటా శ్రీకృష్ణుని దూషించడం చేస్తాడు. ఆ దూషణాలనన్నిటినీ శ్రీకృష్ణుడు శాంతగుణంతో సహిస్తాడు. వంద దూషణలు దాటిన తరువాత శాంతగుణం స్థానాన్ని కోపం ఆవహిస్తుంది. దుష్టశిశుపాల మస్తకాన్ని సుదర్శన చక్ర ప్రయోగంతో ఖండిస్తాడు శ్రీకృష్ణుడు.
ఎదుటివారు తప్పు చేసినా వూరుకున్నారు అంటే మనలని క్షమించారు అనుకోవాలి కాని మరేం ఫర్వాలేదు అని ముందుకు పోతే బోర్లాపడుతారు.
దుష్టశిక్షణ సమయంలో కాస్తంత ఆవేశం వస్తుంది. ఆవేశం ఎంతైనా అనర్థదాయకమే. ఆవేశం తెచ్చుకున్నావరు, ఆవేశం ఎవరిపైన చూపితేవారు ఇద్దరూ నష్టపోతారు. ఒక్కోసారి తన కోపమే తనకు శిక్ష అన్నట్టుగా కోపం వస్తే మనిషి శరీరం అనేక వ్యాధులకు గురి అవుతుంది. చేస్తున్న పని ఆగిపోతుంది. అన్నీ నష్టాలే జరుగుతాయ. కోపం నియంత్రణలో ఉండడమే ఎప్పటికైనా మేలు.
ఓసారి విష్ణ్భుక్తుడైన అంబరీషుని ఏకాదశవ్రత చేస్తున్నాడు. ద్వాదశి గడియలు వచ్చాయ. వ్రతాన్ని పారణ చేసే సందర్భంగా జలపానం చేశాడనే నెపంతో శపింపబూనాడు దుర్వాసుడు. అంబరీషుడు మహా విష్ణువును ప్రార్థించాడు. అంతే విష్ణుచక్రం దుర్వాసునిమీదకు విష్ణుమూర్తి పంపించాడు. ఆ విష్ణుచక్రం దుర్వాసుని వెంబడించింది.ఇక చేసేది లేక నా కోపం నాకే ముప్పు తెచ్చిందనుకుని అంబరీషుని శరణువేడాడు. చూశారా. విషయం ఏమిటి అన్నది లేకుండా కోపం తెచ్చుకుంటే ఏలాభం?
శ్రీరామచంద్రుడు ఆవేశం లేకుండా నే 14వేలమంది రాక్షసులను సంహరించాడు. మంచి మాట చెప్పిన విభీషణుని తిస్కరించి అవమానించి చివరకు రావణుడు రామునిచేతిలో సంహరించబడ్డాడు. కోపం వచ్చినా దాన్ని నియంత్రించుకునే శక్తి ఆంజనే యునికి ఉంది కనుక గొప్ప వీరాధివీరునిగా పేరుతెచ్చుకున్నాడు.
కోపం రావచ్చు. కాని అదిధర్మాగ్రహమై ఉండాలి. కోపం రాని మనిషి ఉండడుకదా. శాంత గుణాన్ని ప్రతివారూ అలవరచుకొంటే సర్వవేళలా సుఖ సంతోషాలతో జీవించవచ్చు.


శ్రీ నరసింహ శతకము

$
0
0

సీ॥ పద్మలోచన సీసపద్యముల్ నీ మీదఁ
జెప్పఁబూనితినయ్య చిత్తగింపు
గణయతి ప్రాస లక్షణముఁ జూడను లేదు
పంచకావ్యశ్లోక పఠనలేదు
అరమకాండ త్రయం బరిసి చూడగలేదు
శాస్ర్తియ గ్రంథముల్ చదువలేదు
నీ కటాక్షంబున నే రచించితి ఁగాని
ప్రజ్ఞ నాయదిగాదు ప్రస్తుతింప
తే॥ తప్పుకడనేమి సద్భక్తి తక్కువౌనె!
చెఱకునకు వంక పోనేమి చెడునె తీపి?
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార నరసింహ! దురిత దూర!
భావం: ఓ నరసింహాస్వామీ! కమలనేత్రా! నేను నీ మీద సీసపద్యాలు చెప్పాలనుకున్నాను. దయతో స్వీకరింపుము.్ఛందోనియమాలైన గణయతి ప్రాసల్ని నేను పాటించలేదు. పంచకావ్యాలు, అమరం, శాస్త్రాలు నేను చదువలేదు. నీ దయ ని ఆసరగా గ్రహించి ఈ కృతి వ్రాసినాను. అంతేకాని నాకు తెలివితేటలు లేవు. చెరకుగడ వంకరగా పెరిగినా దాని తీపికిలోటేమీ కలుగనట్లే నీ దయను పొందిన నేను కృతిలో ఏవైనా తప్పులు దొర్లించినా నా భక్తికి లోపమేమి లేదు సుమా.

అనంతం-11

$
0
0

ఇప్పుడు పట్టు యింకా స్పష్టంగా కనిపిస్తున్నది.
తేనె పట్టునిండా చలన రహితంగా కుదురుకున్న తేనెటీగలు ఉదయభానుడి వెల్తురు కిరణాలు పరావర్తనం చెందుతూ మిణుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి!
పట్టు సగభాగంమీద ఎండ పొడపడుతూ, మిగిలిన సగ భాగం నీడలో వుంటే- గ్రహణం విడుస్తున్న చందమామలా వుందా తేనెపట్టు!
వాళ్ళు ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. ‘‘జాగ్రత్త’’అని హెచ్చరించుకున్నారు, కనుసైగలతోటే!
పట్టుకొట్టి తేనె పిండటం అంత సులభంకాదు. పైగా, అది అందరికీ సాధ్యంకాదు. ఏమాత్రం అజాగ్రత్తగావున్నా ప్రమాదం తప్పదు.
అవకాశం యిస్తే కసితీరా కుడతాయి తేనెటీగలు.
ఒళ్ళంతా కదుములు తేలి, ములుకులతో చేసిన గాయాలనుంచి రక్తం పాయలుగా కార్తున్నా, అవ్వోపట్టాన మనిషిని విడిచిపెట్టవు.
తేనెటీగలు కుట్టి చనిపోయినవాళ్ళు చాలామంది ఉన్నారు.
అదీ కాకుండా,
అనుభవం లేనివాళ్ళు తేనెపట్టు కొడితే దిగుబడికూడా తగ్గుతుంది పట్టులో వున్న మొత్తం తేనె చేతికి అందదు.
మైనంతో చేసిన గదుల్లావుండే తేనెపట్టు పిండి బుంగలకు తేనె పట్టటంలో చిన్న పొరపాటు జరిగినా తేనె దగుబడి తగ్గిపోతుంది. మైనంలా వుండే తేనె పట్టు చిదురైపోతుంది.
ఆ బాధ వాళ్ళకు లేదు!
బాణావతు, కాళీచరణ్ ఇద్దరూ తేనెపట్లు కొట్టి, తేనె పిండటంలో అనుభవం ఉన్నవాళ్ళే!
‘‘రెడీ...?’’అని బాణావతు అడిగాడు.
‘‘అవల్రైట్’’ అన్నాడు కాళీచరణ్.
వాళ్ళు అక్కడ్నించి కదిలివెళ్ళారు. అక్కడక్కడా వున్న అడవి చిదుగులు ఏరితెచ్చారు. సరిగ్గా తేనెపట్టు క్రింద నేలమీద గుట్టగావేశారు.
‘‘నిప్పెట్టెగావాలి’’ కాళీచరణ్ అడిగాడు.
‘‘రెడీగుంది’’అంటూ బొడ్లోనుంచి అగ్గిపెట్టె బైటికి తీశాడు బాణావతు.
ఇద్దరూ మందపాటి కంబళ్ళు కప్పుకున్నారు.
చిదుగులకు నిప్పంటించటమే తరువాయి!
నిప్పు అంటించగానే చిదుగులు మండి దట్టమైన పొగలు విడుస్తాయి.
పొగ తేనెటీగల్ని ఆక్రమించి ఊపిరి ఆడకుండా చెయ్యటంతో దూరంగా పారిపోతాయి.
అప్పుడు పిండాలి తేనె.
అగ్గిపుల్ల గీసి అడవి చిదుగులకు అగ్గి అంటించాడు బాణావతు కొంచెం దూరం జరిగి నిలబడి చిదుగుల వైపే చూస్తున్నాడు.
బాగా ఎండినట్టున్నాయి! చిదుగులు కణకణామండుతూ, గాలివాటుకు ఒంపులు తిరుగుతూన్న మంటలు నేలమీద కదిలే నీడబొమ్మలు గీస్తున్నాయి!
చిటపట్లాడుతూ మండుతున్న చిదుగుల్లోంచి తెలుపూ, నలుపూ పొగలు విడతల వారిగా వెలువడుతున్నాయి. చిన్న, పెద్ద పొగ మేఘాల్లావున్న పొగలు తేనెపట్టును పరామర్శించి, గాలి తరంగాల వెంట దూరంగా సాగిపోతోన్నాయి.
బాణావతు. కాళీచరణ్ కళ్ళు విశాలంచేసి చిదుగులవైపే చూస్తున్నారు.
పట్టుమీద కదలకుండా కుదురుకున్న తేనెటీగలు నెమ్మదిగా కదలసాగాయి. అప్పుడే వాటికి చలనం వచ్చినట్టుంది. లుకలుకలాడ్తున్నాయి.
చిదుగుల మంటసెగకూ పొగకూ తట్టుకోలేక, వొళ్ళూకళ్ళూ మండి- పట్టుమీదనుంచి లేచి పారిపోయే సన్నాహాల్లో ఉన్నట్టుంది!
అప్పుడు ఇద్దరూ ఒకళ్ళ వైపొకళ్ళు చూశారు. ‘్భద్రం’అన్నట్టు సైగలు చేసి, తేనెటీగలకు తమ ఒళ్ళు కంపించకుండా కంబళ్ళు జాగ్రత్తగా కప్పుకొని కుదుటపడ్డారు.
అలాంటప్పుడు తేనెటీగల ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది!
పువ్వు పువ్వుకూ తిరిగి మకరందం సేకరించి, తేనెపట్టు మైనం గదుల్లో దాచుకొని కొసరికొసరి పిల్ల తేనెటీగలకు తాగిస్తూవుంటే- వాటి తేనెకోసం దౌర్జన్యం ప్రదర్శించే మనుషుల్ని అవ్వసలికి విడిచిపెట్టవు’.
కోపంతో రెచ్చిపోతాయి.
తిరుగుబాటు చేస్తాయి.
చుట్టుముట్టి, వళ్ళంతా సూదులు పొడిచి, జల్లెడ చేస్తాయి. ఓ పట్టాన విడిచిపెట్టవు. వాటి బారినుంచి బైటపడటం తేలిక కాదు.
‘‘భద్రంరొరేయ్’’అని కాళీచరణ్‌ను బాణావతు హెచ్చరించాడు.
ఇద్దరూ కంబళ్ళను కొంచెం తొలగించి తదేకంగా తేనెటీగల వైపే చూస్తున్నారు.
పారిపోయినవి పారిపోగా పట్టుమీద యింకా చాలా తేనెటీగలున్నాయి. ఈగలన్నీ వెళ్ళిపోవాలంటే కొంత సమయం పడుతుంది.
‘‘సిత్రంగుంటుంది కదూ?’’ అసందర్భంగానే కాళీచరణ్‌తో బాణావతు అన్నాడు.
కాళీచరణ్ అయోమయానికి గురయ్యాడు.
సమాధానం చెప్పలేదు.
‘‘తేనె పట్ల యవ్వారఁవే’’
‘‘అవును! ఒక్కోసారి పిసరంత పట్టులో సెరువంత తేనొచ్చుద్ది. ఒక్కోసారి సెరువంత పట్టులో శారెడంతగూడా రాదు.’’
‘‘ఏంటికంటావ్?’’ బాణావతు అడిగాడు.
‘‘గాచారఁవ్.’’
‘‘వల్లకాడు గాదూ.’’
‘‘ఐతే, ఏంటిదంటావూ?’’అన్నాడు కాళీచరణ్.
‘‘పిల్ల తేనెటీగె లాగిన పట్టులో తేనుండదు. అంతే.’’
‘‘ఇంతకీ తేనె మన అతికారఁవ్ ఈగెల్దా? మడుసుల్దా?’’అని యధాలాపంగానే కాళీచరణ్ అడిగాడు.
బాణావతు వౌనంగా అతనివైపు చూశాడు.
‘‘ఈగెలు దాపెట్టుకున్న తేనె మడుసులు నూకటఁవ్ తప్పుగదూ?’’
ఏం సమాధానం చెప్పాలో బాణావతుకు తోచలేదు. ఒక్క క్షణం ఆగి, ‘‘అంతా నూకితే తప్పే’’అన్నాడు. అంతకన్నా ఏంచెప్పాలో అతని బుర్రకి తోచలేదు.
నాలుగు అడుగులువేసి, చిదుగుల దగ్గరికి వెళ్ళాడు. ఓ పొడవాటి వెదురుకట్టెతో చిదుగుల్ని ఎగదోశాడు. అవ్వి మళ్ళీ కణకణా మండసాగాయి.
పట్టునింకా విడిచిపెట్టని తేనెటీగలుకూడా ఒక్కొక్కటే పట్టువదలి పారిపోతోన్నాయి.
ఈగలన్నీ వెళ్ళింతర్వాత ఇద్దరూ కప్పుకున్న కంబళ్ళుతీసి ప్రక్కనపెట్టి, తేనెపట్టు దగ్గరికి వెళ్ళారు.
(ఇంకా ఉంది)

కాలాతీత వ్యక్తులు- పి. శ్రీదేవి

$
0
0

కల్యాణినా? ఇందిరనా?
సాహిత్యాన్ని"aesthatic exploration world'అనుకుంటే Exploration of Forces అని కూడ అనుకుంటే "Transforming a mild society into an active and emotional one'అనీ. అట్లాగే "giving courage to the weat'అని కూఢా చెప్పుకుంటే- ఆ లక్షణాలన్నీ ఉన్న గొప్ప నవల కాలాతీత వ్యక్తులు.
చాలా కాలంగా, మనం గొప్ప నవలకు ప్రధాన లక్షణాలుగా చెప్పుకునే సంక్లిష్ట జీవితము. సజీవమైన పాత్రలూ, పాత్రల మధ్య సంఘర్షణా వగైరాల- కాలాన్ని దాటి మనం చాలాముందుకు వచ్చాము. ఇవాళ రచనను, బలమైన ఆయుధంగా చెప్పుకుంటున్నాము. గొప్ప రచన పాఠకుడికి ఒక తాత్త్విక దర్శనాన్ని అందించాలని కూడా చెప్పుకుంటున్నాము.
ఈ గొప్ప సుగుణాలన్నీ కలిగిన నవల కాలాతీత వ్యక్తులు. నవలలో ఇన్‌గ్రేడియంట్స్‌గా ఉన్న పై సుగుణాల్ని ఒక్కొక్కటే చర్చించుకుందాం!
ముందుగా కథ-అతి సాధారణమైనది! వైజాగ్‌లోనో, మరో పట్టణంలోనో, లేదా మీ, మా ఊళ్ళో ఎక్కడైనా జరిగే కథ! పెద్దగా మలుపులు లేవు! ఒక మరణం, ఒక దుఃఖం మినహాయిస్తే యిందులో గుండెల్ని పిండివేసే సంఘటనలు లేవు.
గొప్ప ప్రేమలు, గొప్ప త్యాగాలు వగైరా గిమ్మిక్కులు లేవు. స్థూలంగా చెప్పాలంటే- ఒక కల్యాణి, ఒక ఇందిర- ఒకానొక జీవితపు చౌరస్తాలో కొన్ని అనుభవాలు, కొందరు మనుషుల పరిచయాల మీదుగా - కాలం స్కేలుపై ఎలా నడిచివెళ్లేరు అనేదే! ఆ ఇద్దరి ప్రయాణపు విశేషాలే ఈ నవల. అయితే ఈ ప్రయాణం ఏ దిశకు అనే తాత్త్విక శోధనే ఈ నవల ప్రత్యేకత.
రెండో ఇన్‌గ్రేడియంట్ కాలం- పందొమ్మిది వందల నలభై, యాభైల మధ్యన జరిగిన కథే గానీ ఈ కథ నిరంతరము జరుగుతూంటుంది. కల్యాణి, ఇందిర ప్రోజన్సీ నిత్యం మనకు కనిపిస్తుంటారు. అయితే పోరాటాల ఇందిరల సంఖ్య- కొద్దికొద్దిగా పెరుగుతున్న పందొమ్మిది వందల తొంభైలనాడు ఈ నవలను మరోసారి గుర్తుచేసుకోవటం సమయోచితమైన పని.
మరో ఇన్‌గ్రేడియంట్ సమాజం రెండు ప్రపంచ యుద్ధాల తర్వాతి సమాజం- ఆర్థిక మాంద్యం, చదువుల మీద శ్రద్ధచూపుతున్న యువతరం, సినిమాలు, సంగీతాలు, బీచ్ షికార్లు అంటూ జీవితపు మొనాటనీ బ్రేక్ చెయ్యాలనే కొత్త సరదాలు, యువతీ యువకుల స్నేహాల్ని ఇంతింతలు కళ్లుచేసుకొని చూడడాలు, ఇంటా బయటా, ఆఫీసుల్లో స్ర్తిలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైనం- గుర్తుపట్టారా! మన సమాజమే! పరిణామాల్ని, వేగాల్ని ఇంకా వంటబట్టించుకోని తొలినాటి మన సమాజం.
మరో ఇన్‌గ్రేడెంట్ పాత్రలు
ఒక ప్రకాశం, ఒక కృష్ణమూర్తి, ఒక డాక్టరు చక్రవర్తి- కథానాయకులో మహానాయకులో అనడానికి వీలులేని మామూలు మనుషులు. ప్రకాశం పిరికితనానికి, అవకాశవాదానికి ఒక మెటాఫర్. కృష్ణమూర్తి కొద్దిగా లోవెలుగు వున్న పాత్రలు. సుఖవాదిగా జీవితాన్ని మొదలుపెట్టి వసుంధర, ఇందిర లాంటి గొప్ప వ్యక్తుల సాన్నిహిత్యంలో క్రమంగా ట్రాన్స్‌ఫార్మ్ అవటం మొదలుపెట్టిన వ్యక్తి. డాక్టరు చక్రవర్తి. సులోచనారాణి నవలల్లోని నాయకుడికి ప్రోటో టైపు.
ఇక కాన్వాసంతా నిండిన ఇద్దరు స్ర్తిమూర్తులు కల్యాణి, ఇందిరలు గురించి ముందే చెప్పుకున్నాము. చివరగా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఇందిర తండ్రి ఆనందరావు. ఆదర్శవాదంలోంచి వ్యక్తివాదంలోకి ప్రయాణిస్తున్న 1950ల నాటి తెలుగు సమాజానికి ప్రతీక ఈ పాత్ర. ఇవాళ మార్కెట్ ఎకానమీ రోజుల్లో- దేశమంతా ఈ ఆనందరావు క్లోనింగ్ సంగతి కుప్పలుకుప్పలుగా పెరుగుతుంది.
- సశేషం

మానవ సేవే మాధవ సేవ

$
0
0

భగవంతుడు ఇచ్చిన మానవ జన్మను సార్థకం చేసుకోవడం అందరూ కోరుకో వలసింది. సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఏ ఇతర జీవికి భగవంతుడు ఇవ్వని వరం మనిషికి మాట్లాడే రూపంలో ఇచ్చాడు. మన మాటలు, చేతలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులను వేధించే విధంగా ఏదీ ఉండకూడదు. ప్రతి మనిషి తోటి వారికి సాయం అందించాలి. మనకు సాయం చేసే వారికే కాకుండా, అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేయగలడం దైవత్వం. ఇది అందరికీ రాదు. కానీ ఎవరికీ హాని చేయకపోవడమే అన్నింటికన్నా మంచిది. వ్యాసుడు పరులకు ఉపకారం చేయడమే పుణ్యకార్యమని పరులకు అహితం చేయడమే పాపకార్యమని చెప్పారు కదా. అందుకే మనం మంచి చేయకపోయనా ఎవరూ అడగరు కానీ చెడు మాత్రం చేయకూడదు. ఎదుటి మనిషికే కాదు ఏ ప్రాణికీ చెడు చేయకూడదు. ప్రకృతి లో ఉన్న నీరు , గాలి, ఛెట్లు అన్నీ పరోపకారం చేస్తూ మనిషిని కూడా స్వార్థం ఇంచుక మానుకొని ఇతరులకు సాయం చేయాలని చెప్తుంటాయ.
గంధపుచెట్టు తనను నరికేవాడికి కూడా సుగంధాలు అందించే విధంగా మన జీవన విధానం ఉండాలి. ఎపుడైనా సరే మనకు తెలియకుండా ఎదుటివాడికి మన వల్ల నష్టం, కష్టం కలిగితే, అది తెలుసుకుని పశ్చాత్తాపపడి, మరోపర్యాయం అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి.
భగవంతుడి సేవ చేస్తూ, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి. పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తూ ఉండాలి. భగవంతుడు మనకు ఇచ్చిన సంపదలో కొంతభాగమైనా పేదలకు, తోటివారికి ఇచ్చి ఆదుకోవాలి. ప్రతిరోజూ కొంత సమయాన్నైనా భగవన్నామస్మరణలో గడపాలి.్భగవద్గీతలో చెప్పినట్టు మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి, దాని వల్ల వచ్చే ఫలితాన్ని భగవంతుడికే వదిలివేయాలి. మనిషి జీవితం భగవంతుడి చేతుల్లో నడుస్తుంది. మనం నిమిత్తమాత్రులం. అంతా మనం అనుకున్నట్టు సాగదు. ఎంతటివారికైనా కర్మానుసారం జీవితం నడుస్తుంది. భగవంతుడు ఇచ్చిన గడువు తీరిపోగానే ఈ లోకం వదిలి వెళ్లిపోక తప్పదు. తనువు చాలించిన సమయంలో మేలు చేసినవాళ్లు, చేయంచికున్నవాళ్లు, లేదా మనం ద్వేషించిన వారు ఎవరూ రారు. కాని ద్వేషం, ఆశ అనేవి వాసనారూపంలో పాపపుణ్యాల రూపంలో వెంట వస్తాయ. వాటి వల్లనే మరుజన్మలో సుఖదుఃఖాలు కలుగుతుంటాయ. అందుకే ఎపుడైనా కష్టం వస్తే ఏ జన్మలో చేసుకున్న పాపమో అని వాపోతుంటాం. తెలిసి ఏ పాపమూ మానవ జన్మలో చేయకూడదు.
ఈ లోకంలో పనికిరాని వస్తువు కాని ప్రాణి కానీ లేదు. ఏ ప్రాణికి ఉండాల్సిన అర్హత వాటికి కలిగిఉన్నాయ. అందుకే నేను ఎక్కువ నీవు తక్కువ అనే తారతమ్యాలను పెట్టుకోకూడదు. సమభావం అలవర్చు కోవాలి. సమబుద్ధితో ప్రాణులన్నిటీ చూడాలి. అసలు అందరిలోను, అన్నింటిలోను పర మాత్మ చైతన్యరూపంలో ఉన్నాడన్న సత్యాన్ని నమ్మితే ఎవరికీ ఎగ్గుచేయాలని అనిపించదు.
అత్యాశవల్ల మనిషి తనను తానే పతనావస్థకు చేర్చుకుంటున్నాడు. జరిగిందేదో మంచికే జరిగింది, జరుగుతున్నది మంచికే జరుగుతుంది, జరగబోయేది కూడా మంచికే జరుగుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. జీవితంలో నీతిగా, నిజాయితీగా ఉంటూ ప్రశాంతంగా జీవించాలి. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి

maatata

$
0
0
Cross Image: 
Date: 
Monday, December 17, 2018

చలికాలంలో మేకప్

$
0
0

శీతాకాలంలో ముఖ చర్మాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే పగిలిన చర్మంపై ఎటువంటి మేకప్ అయినా ముఖంపై సరిగ్గా అమరదు. అందుకే ముఖంపై క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ పూస్తుంటే చర్మం పగుళ్లు లేకుండా అందంగా ఉంటుంది.
* మేకప్‌కు ముందు ముఖాన్ని మృదువైన లిక్విడ్ సోప్‌తో శుభ్రం చేసుకోవాలి. లేదంటే సున్నిపిండితో ముఖాన్ని కడుక్కోవాలి. తరువాత చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
* ఆరాక చర్మపురంగుకి, తత్త్వానికీ నప్పే షేడ్‌లో ఫౌండేషన్‌ను వేసుకోవాలి. పదినిముషాలు పాటు పూర్తిగా ఆరిన తరువాత మేకప్‌ను మొదలుపెట్టాలి.
* శీతాకాలంలో కనురెప్పలపై స్మోకీ లుక్ చాలా బాగుంటుంది. కనురెప్పలపైన స్మోకీ లుక్ కోసం ముదురురంగులో పెన్సిల్ లైనింగ్ వేసుకోవాలి.
* ముందుగా పెదాలపై ముదురు వర్ణంలో ఉన్న లిప్‌స్టిక్‌ను బేస్‌గా వేసుకోవాలి. దానిపై మీరు ఏ రంగు వేసుకోవాలనుకున్నారో ఆ రంగును వాడాలి. అప్పుడే పెదాలు అందంగా, తీర్చిదిద్దినట్లుంటాయి. అదీకాక లిప్‌స్టిక్ చాలాసేపటివరకు తాజాగా ఉంటుంది.
* ఈ కాలంలో ముఖానికి బేస్‌గా న్యూట్రల్ షేడ్స్‌ను మాత్రమే వాడాలి. ముదురు వర్ణాలు వాడినట్లైతే ముఖం పొడిబారినట్లుగా కనిపిస్తుంది. ఈ వాతావరణంలో వీలైనంత ఆయిలీగా ఉంటేనే ముఖం మెరుస్తున్నట్లుంది. *

దాల్చిన చెక్కతో లాభాలు

$
0
0

వేపచెట్టులోని ప్రతి భాగమూ ఉపయోగకరమే.. ఔషధయుక్తమే.. అలాగే దాల్చిన చెక్క కూడా.. ఈ చెట్టులోని దాదాపు ప్రతి భాగమూ ముఖ్యమైనదే.. దీన్ని ఒక్కసారి వేస్తే చాలు.. కాస్తూనే ఉంటుంది. ఇది ఎవర్‌గ్రీన్ పంట. మసాలా దినుసులు లేని వంటగదిని ఊహించలేము కదా.. అందులోనూ దాల్చిన చెక్కని.. ఖచ్చితంగా మసాలాకూరల్లో దాల్చినచెక్క పడాల్సిందే.. లేకపోతే వంటకు రుచి రాదు. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో దీని ఆదరణ మరీ ఎక్కువ. కేరళలో పండించే సుగంధ ద్రవ్యాల పంటల్లో దాల్చిన చెక్కకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఇది సుంగధ ద్రవ్యంగానే కాదు ఔషధ పరంగా కూడా కూడా దీనిలో పుష్కలమైన గుణాలున్నాయి. అందుకే మనదేశంలో కేరళలో దీన్ని ఎక్కువగా పండిస్తారు. దాల్చిన చెట్టు బెరడు నుంచి వచ్చిన పట్టను ఎండబెట్టి దాల్చిన చెక్క పేరుతో మార్కెట్లో అమ్ముతుంటారు. మనదేశంలో దొరికే దాల్చిన చెక్క రకం పేరు ‘తమాలా’. మనదేశంలోని మలబారుతీరం దీని పుట్టినిళ్లట.
నిజానికి దాల్చినచెక్క ప్రపంచానికి ఎప్పుడో తెలుసు.. క్రీ.పూ. 2000 నాటి కాలంలో ఈజిప్టులో దాల్చిన చెక్క వాడకం అధికంగా ఉండేదట. దీని పుట్టుకపై స్పష్టమైన ఆధారాలు లేవుకానీ చైనాలో పుట్టిందని ఓ శాస్తవ్రేత్త తెలిపితే.. కాదు అనీ ఇది శ్రీలంక పుట్టిందని.. అందుకే భారతదేశంలోకి త్వరగా రాగలిగిందని మరో శాస్తవ్రేత్త అన్నాడు. అంతేకాదు.. ప్రాచీన కాలంలో దీన్ని కానుకలా ఉపయోగించేవారట. దాల్చిన చెక్కలను కానుకగా ఇచ్చి దేవతల మొక్కులు చెల్లించుకునేవారట. ఆ సంప్రదాయం ఎక్కువగా ఉన్న రోమన్లు, గ్రీకు ప్రజల్లో ఉండేదని చరిత్ర చెబుతోంది. దీన్ని ప్రసాదంగా భావించేవారు కాబట్టి దీన్ని వంటల్లో ఉపయోగించేవారు కాదట. అందుకని వంటల్లో దీని ఉపయోగంపై కొన్ని సంవత్సరాల పాటు నిషేధం విధించారు. అయితే దీన్ని తొలిసారి వంటల్లో వాడిన ఘనత మాత్రం చైనాదేనని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.
సుగుణాలు
* దాల్చిన చెక్కను మధుమేహ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ పది గ్రాముల చొప్పున తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది.
* టైప్-2 మధుమేహ రోగుల్లో గ్లూకోజ్ నియంత్రణకు దాల్చిన చెక్క బాగా ఉపయోగపడిందని ఓ అధ్యయనంలో తేలింది. కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ శాస్తవ్రేత్తల పరిశోధనలో వెల్లడైంది. సుమారు 543 మంది టైప్-2 మధుమేహగ్రస్థులకు రోజుకు 120 మిల్లీగ్రాముల నుంచి ఆరు గ్రాముల వరకు మాత్రల రూపంలో ఇచ్చారు. ఈ మాత్రలు ఉపయోగించని వారితో పోలిస్తే ఉపయోగించిన వారిలో చక్కెర స్థాయిలు మెరుగ్గా తగ్గడాన్ని గమనించారు.
* శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో దాల్చినచెక్క మెరుగైనపాత్ర పోషిస్తుందని పరిశోధకుల పరిశీలన.
* దాల్చిన చెక్క నుంచి తీసిన నూనెతో మధుమేహానికి ఔషధాలు కూడా తయారుచేస్తున్నారు.
* దాల్చిన చెక్క ఆకుల పసరును కాలిన గాయాలకు మందుగా ఉపయోగిస్తారు.
* పొడిదగ్గు ఉన్నవారు దాల్చిన చెక్క ఆకుల చూర్ణాన్ని ఔషధంగా వాడతారు.
* మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలున్నవారు ఇంగ్లీషు మందులు జోలికిపోకుండా ఇంట్లోనే దాల్చిన చెక్క సహాయంతో నయం చేసుకోవచ్చు. *


రంగవల్లి

$
0
0

సరస్వతి,
సఫిల్‌గూడ,
హైదరాబాద్

తండ్రినే అరెస్ట్ చేయమన్న చిన్నారి..

$
0
0

తమిళనాడుకు చెందినది హనీఫా జారా.. వయస్సు ఏడు సంవత్సరాలు.. రెండో తరగతి చదువుతోంది.. కానీ ఆ పాప తన తండ్రిని అరెస్ట్ చేయమని పోలీసులకు లేఖ రాసింది.. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని అంబూర్‌లో హనీఫా జారా తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే వారి ఇంట్లో మరుగుదొడ్డి లేదు. ఆ ప్రాంతంలో చాలామంది ఇళ్లలో ఈ సౌకర్యం లేదు. కొంతమంది ఇళ్లలో ఉన్నా వాటిని ఉపయోగించడం లేదు. హనీఫాకు ఆరుబయట మలవిసర్జనకు వెళ్లడం చాలా సిగ్గుగా ఉండేదట.. అందుకే చాలా చిన్నప్పుడు అంటే నాలుగు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పునే తండ్రిని ఇంట్లోనే మరుగుదొడ్డి కట్టించమని అడిగిందట. అప్పుడు ఆమె తండ్రి క్లాసులో ఫస్టు వస్తే ఇంట్లోనే మరుగుదొడ్డి కట్టిస్తానని హనీఫాకు మాటిచ్చాడట.. అప్పటినుంచి హనీఫా క్లాసులో టాపర్‌గా వస్తూనే ఉంది. పైగా బహిరంగ మలవిసర్జన వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి స్కూల్లో తరచుగా చెప్పడంతో పాప ఇంట్లో కూడా టాయిలెట్ కట్టించమని తండ్రిని చాలాకాలం నుండి కోరుతోంది. ఇప్పుడు హనీఫా రెండో తరగతి చదువుతోంది. ఇప్పటికీ హనీఫా తండ్రి మరుగుదొడ్డి కట్టించలేదట. దాంతో తన తండ్రి మోసం చేస్తున్నాడనుకుని ఆ చిన్నారి పోలీస్ స్టేషన్‌కు ఓ లేఖ రాసింది. ఆ లేఖలో ఆ అమ్మాయి ఈ వివరాలన్నీ తెలుపుతూ.., 3నేను నర్సరీ నుంచి క్లాస్ టాపర్‌గా ఉన్నాను. ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్నాను. కానీ ఇంకా మా నాన్న ఇంట్లో టాయిలెట్ కట్టించలేదు. ఇంకా కట్టిస్తాననే చెబుతున్నాడు. మా నాన్న నన్ను మోసం చేస్తున్నాడు.. దయచేసి మా నాన్నను అరెస్టు చేయండి. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే టాయిలెట్ ఎప్పుడు కట్టిస్తాడో చెబుతూ ఆయన సంతకంతో ఒక లేఖ ఇప్పించండి..2 అని కోరింది. ఈ కంప్లైంట్ తన తల్లితో కలిసి స్కూలుకు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో అందించింది హనీఫా.. పైగా హనీఫా తనతో పాటు తనకు వచ్చిన ట్రోఫీలు, మెరిట్ సర్ట్ఫికెట్లు తీసుకుని వాటన్నింటినీ పోలీసు అధికారి టేబుల్ మీద పెట్టి.. వీటిని తీసుకుని నాకు టాయిలెట్ కట్టించగలరా? అని అడిగిందట.. ఆమె మాటలకు ఆ పోలీసు అధికారి ఖంగుతిన్నాడట..
వెంటనే పోలీసు అధికారి హనీఫా తండ్రి ఎహ్సానుల్లాను పిలిపించాడు. పోలీసు అధికారి పిలుపుతో తన కూతురికి, భార్యకు ఏమైనా అయ్యిందేమో అనుకుంటూ అతను పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడట. అక్కడికి వచ్చాక తన కూతురు తనపై ఫిర్యాదు ఇచ్చిందని తెలిసి అతను ఆశ్చర్యపోయాడట.. కాసేపు ఏం మాట్లాడాలో తెలీని ఆ తండ్రి కొద్దిసేపటికి కోలుకుని.. 3టాయిలెట్ కట్టడం ప్రారంభించాను. కానీ దాన్ని పూర్తిచేయడానికి డబ్బు సరిపోలేదని, అందుకే ఆపేశాను. అందుకే హనీఫాతో నాకు కాస్త సమయం ఇవ్వు అని అడిగాను. కానీ హనీఫా వినలేదు. నేను ఆమెకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, తను నాతో మాట్లాడ్డమే మానేసింది. కొద్దిరోజులుగా హనీఫా నాతో మాట్లాడటం లేదు2 అని చెబుతున్నాడు హనీఫా తండ్రి ఎహ్సానుల్లా.. అలాగే తన కూతురు రాసిన ఉత్తరం చూసిన ఆ తండ్రి.. 3అధికారులకు లేఖలు ఎలా రాయాలో.. హనీఫా నన్ను చూసే నేర్చుకుంది.. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అధికారులకు, రాజకీయ నేతలకు తానే లేఖలు రాస్తుంటానని, అది చూసిన పాప ఇప్పుడు తనపైనే ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది..2 అని నవ్వుతూ ఆ తండ్రి పోలీసు అధికారులతో చెప్పాడు. ప్రస్తుతానికి ఎహ్సానుల్లా ఎలాంటి ఉద్యోగం, ఉపాధి లేకుండా ఉన్నాడు.
కానీ హనీఫా మాత్రం ఈ విషయంలో చాలా విసిగిపోయింది. 3ఎంతకాలం నేను ఒకేదాని కోసం నేను ఎంత కాలం అడగాలి? ఎప్పుడడిగినా డబ్బులు లేవనే చెబుతున్నాడు.. అందుకే పోలీసులకు లేఖ రాశాను2 అంటుంది ఆ చిన్నారి. హనీఫా అన్నింట్లోనూ ఫస్టే.. ఆటల్లోనూ, పాటల్లోనూ, చదువులోనూ ఎప్పుడూ ముందుంటుంది.
పాప వివరంగా రాసిన ఆ లేఖ చదివిన తర్వాత, అందరికీ ఆ చిన్నారిపై సానుభూతి పెరిగింది. పోలీసులు కూడా ఆ చిన్నారికి అండగా నిలిచారు. ఆమె ఫిర్యాదులో నిజాయితీకి వారు చలించిపోయారు. అందుకే ఆ చిన్నారి సమస్యకు వారు పరిష్కారం చూపించాలని అనుకున్నారు.
అధికారులు
హనీఫా నిజాయితీగా రాసిన లేఖ జిల్లా అధికారులను కూడా స్పందింపచేసింది. వెంటనే వారు హనీఫా ఉంటున్న గ్రామంలో 500 టాయిలెట్లు కట్టడానికి నిధులు మంజూరు చేశారు. సిటీ కమీషనర్ మాట్లాడుతూ.. 3పాప ఫిర్యాదు చూసి చాలా సంతోషం వేసింది. స్కూళ్లలో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసిన టాయిలెట్ లేనివారు.. వాటి గురించి వారి తల్లిదండ్రులను గట్టిగా అడగాలని మేం విద్యార్థులను ప్రోత్సహించాం.. ఆ ఫలితమే ఇది.. విద్యార్థులు స్వచ్ఛ భారత్ దిశగా ఇలా సాగుతే ఇక దేశానికి కావలసిదేం ఉంది.. ఇక జాతీయ స్వచ్ఛ భారత్ కోసం ఈ చిన్నారి(హనీఫా)తోనే స్థానికంగా ప్రచారం చేయించాలని అనుకుంటున్నాం2 అని చెప్పారు.
ఏది ఏమైనా తన లేఖకు ఇంత స్పందన వచ్చినందుకు చాలా సంతోషపడుతోంది హనీఫా. ముఖ్యంగా ఆరుబయట మలవిసర్జనకు వెళ్లకుండా తన ఇంటికే టాయిలెట్ వచ్చినందుకు మరింత ఆనందపడుతోంది. గత కొన్ని రోజులుగా ఎహ్సానుల్లాతో మాట్లాడని హనీఫా.. పోలీసులు నచ్చజెప్పడంతో చివరికి తన తండ్రిపై కోపం వీడింది. ఇప్పుడు తండ్రితో మాట్లాడుతోంది హనీఫా..
*

చిత్రాలు.. హనీఫా జారా *హనీఫా పోలీసులకు రాసిన లేఖ
*స్టేషన్‌లో పోలీసు అధికారులతో హనీఫా జారా

సర్కారులో మాకూ భాగస్వామ్యం

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వంలో తమకూ భాగస్వామ్యం కల్పించాలని, ముఖ్యంగా సీమాంధ్ర భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని సీమాంధ్ర సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో తెలంగాణలోని సీమాంధ్రులంతా టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి తమ మద్దతునిచ్చారని సీమాంధ్ర సంఘం నాయకులు ఆర్.రమణా రెడ్డి (ఆర్‌ఆర్ రెడ్డి), జీఎన్ సత్యనారాయణ, వాసుదేవ్ రాయల, అశ్వత్థామ రెడ్డి, బోడ భాస్కర్, వెంకటేశ్వర రావు, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సహకారంతో ఎన్నికలకు ముందు కూకట్‌పల్లిలో నిర్వహించిన సీమాంధ్రుల ఆత్మీయ సమ్మేళనానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారని ఆర్‌ఆర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ సమ్మేళనంలో కేటీఆర్ ప్రసంగిస్తూ సీమాంధ్రుల రక్షణ బాధ్యత తమదేనని భరోసా కల్పించారని ఆయన చెప్పారు. కేటీఆర్ ఇచ్చిన భరోసాతో తెలంగాణలోని సీమాంధ్రులంతా టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేశారని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, కుద్బుల్లాపూర్, శేరిలింగంపల్లి తదితర నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ అత్యధికంగా సీమాంధ్రులు నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 నుంచి 50 లక్షల మంది సీమాంధ్రులు ఉంటారని ఆయన వివరించారు. తెలంగాణలో సీమాంధ్రులకు రక్షణ ఉందన్న నమ్మకంతోనే సీమాంధ్రులంతా టీఆర్‌ఎస్‌కు సంఘీభావం ప్రకటించారని ఆయన తెలిపారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి తెలంగాణలోని సీమాంధ్రుల పట్ల కపట ప్రేమ చూపించారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బోగస్ సర్వే వెల్లడించి అయోమయానికి గురి చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు.

పెథాయ్ తుఫాన్‌పై రైల్వే శాఖ అలర్ట్

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 16: తరుముకొస్తున్న పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టం వస్తుందన్న ప్రకటనలతోరైల్వేశాఖ అప్రమత్తం అయ్యింది. నేడు, రేపు తుఫాన్ ప్రభావంతో రైల్వే ప్రయాణీకులకు ఇబ్బందులు కల్గకుండా ఉండడానికి ఆహార పొట్లాలు, తాగునీరు, సెల్టర్లును ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న రైల్వే ఆస్థులకు ప్రమాదం జరిగితే యుద్ధప్రాతిపధికన చర్యలు చేపట్టడానికి రైల్వే యంత్రాంగం సన్న సిద్ధమవుతోంది. తుఫాన్ దెబ్బతో రైల్వే మార్గాల్లో ప్రమాద సంఘటనలు జరిగిన ప్రాంతాలకు హుటాహుటిన రైల్వే సిబ్బంది తరలించడానికి వాహనాలను సిద్ధం చేయాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రా ప్రాంతల్లో ఉన్న అన్ని రైల్వే స్టేషన్ మేనేజర్లర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గుంటూరు, విజయవాడ రైల్లే స్టేషన్‌లలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. రైల్వే ప్రయాణీకులు సమాచారం కోసం 9121271447- 9121271447 (విజయవాడ) గుంటూరు 9701379981- 0863-2254161 పోన్లను సంప్రదించవచ్చునని సీపీఆర్ ఉమాశంకర్ తెలిపారు.

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 16: గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అంతేకాకుండా బీసీ సంఘాలతో కూడా చర్చించాలని ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు కొత్తదేమీ కాదని, 2010లోనే తీర్పు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. 2013లో గ్రామ ఎన్నికలు, 2014లో ఎంపీటీసీ, జెడ్‌పిటీసీ ఎన్నికలు 34 శాతం రిజర్వేషన్లలో జరిగాయని ఆయన తెలిపారు. 2016లో మున్సిపల్ ఎన్నికలు కూడా 34 శాతం రిజర్వేషన్లతో జరిగాయని, ఇప్పుడు కూడా ఇదే పద్ధతిలో జరపడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని, కోర్టు తీర్పును అధిగమించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని, బీసీ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.

నిర్భయ చట్టాన్ని అమలు చేయాలి

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 16: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ చట్టాలను పగడ్భందిగా అమలు చేయకపోవడంతో స్ర్తిలపై లైంగిక వేధింపులు నానాటికి పెరిగిపోతున్నాయని పీవోడబ్ల్యూ రాష్ట్ర శాఖ తప్పుపట్టింది. ఆదివారం హైదారాబాద్ విద్యానగర్ మార్క్స్ భవనంలో పీవోడబ్ల్యూ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయి మాట్లాడుతూ దేశ వ్యాపితంగ పని స్థాలాల్లో మహిళలపై లైంగిక వైధింపులు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ వర్మ నేతృత్వంలో కమిషన్ సూచించిన అంశాలపై పాలక ప్రభుత్వాలు స్పందించడంలేదని ఆమె ధ్వజమెత్తారు.

ఎన్నికలకు ముందే బీసీ వర్గీకరణపై అధ్యయనం జరగాలి

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 16: పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల జనాభా దామాషా ప్రకారమే రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సమగ్ర సర్వే ప్రకారం బీసీల జనాబా 52 శాతం ఉందని తేలిందన్నారు. బీసీ కులాల గణన, సామాజిక, ఆర్థిక అంశాలు, వెనుకబాటుతనంపై అధ్యయనం చేయాలని హైకోర్టు ఆదేశించినా అధ్యయనం జరుగలేదంది. గాంధీభవన్‌లో ఆదివారం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ, బీసీ కులాల వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు ఖరారు అయితేనే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. పంచాయతీరాజ్ ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించకుండా యథాతథంగా అమలు చేయాలన్నారు. బీసీ కులాల వారీగా వెనుకబాటు తనంపై తక్షణమే శాస్ర్తియంగా అధ్యయనం చేయాలన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ తరఫున రాసిన లేఖను దాసోజు మీడియాకు విడుదల చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ ఉప కులాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయింపునకు సమగ్ర బీసీ కుల గణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు.


మజ్లిస్ శాసనసభాపక్షం నేతగా మళ్లీ అక్బరుద్దీన్ ఎన్నిక

$
0
0

హైదరాబాద్, డిసెంబర్ 16: మజ్లిస్ శాసనసభాపక్షం నాయకునిగా మళ్లీ అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్నికయ్యారు. ఆదివారం మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ పార్టీ శాసనసభాపక్షం నేతగా అక్బరుద్దీన్ ఒవైసీ పేరును ప్రతిపాదించగా, మిగతా సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆ తీర్మానాన్ని బలపరిచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎమోజి నయ్యా!!

$
0
0

వినదగు నెవ్వరు చెప్పిననే
విజ్ఞుల అభిభాషణ అవసరం లేదు
ఆహ్వాన విన్నపం చాలనే -
అతిరధులు, మహారధులనబడే
మహా నాయకుల మహోపన్యాసాల
ఆకర్షణలతో హాజరయే
నేల ఈనిందా,
చీమలపుట్ట పొదిగిందా అనిపించే
పిడికిలి తెరచిన హస్తాలు
రెపరెపలాడించే రెండు వ్రేళ్లు
ఎవరు చెప్పినా, ఏమి చెప్పినా
వీడు పిలిచినా, వాడు పిలిచినా
వీటికి, వాటికి, వేటికైనా
స్వచ్ఛందంగా, చేరవేతగా అయనా వచ్చే
ఎప్పుడో, ఏదో జరుగుతుందనే మేలు కోసం
ఎదురుచూపుల ఆశాజీవులు!

పునీతుల మైపోవావాలనే తపనతో
పుష్కరిణి స్నానాలాచరించే
భక్తజన సందోహ సమావేశ
కరతాళ ధ్వనుల ఆలయ ప్రాంగణం.

మొదటిరోజు సినిమా టిక్కెట్ క్యూ
తదనంతర నిష్క్రమించే జనం
మ్యాచ్‌కై క్రిక్కిరిసిన క్రికెట్ ప్రాంగణం
జబ్బుల జనాలతో నిండిన ప్రజావైద్యశాలలు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న
కూడళ్లలోని స్కూళ్ళలోంచి
గార్ద్భ భారంతో పరుగులు తీసే
భావి భారత బాలలు
వేచి వేచి విసిగిపోయ
రావలసిన బస్సు రాగానే
రయ్‌మని పరుగులు తీసే జనం

జనం, జనం, ప్రభంజనం!
జల ప్రవాహం లాంటి జన ప్రవాహం!
జన సందోహ దర్శనానంతర కెవ్వు కేకతో
చరవాణి చాటింగ్‌లో
ఆలోచనాత్మక, విస్మయ
భావ వ్యక్తీకృత సంకేత
ఎమోజి నైపోయాను!

మెరిసిందో చిన్న చిలిపి ఆలోచన
ఉద్భవించిందో ఉన్న విషయం
అప్పటి విన్న విషయం
‘ముగ్గురు వద్దు, ఇద్దరు హద్దు,
ఒక్కరు ముద్దు’
‘పరిమిత కుటుంబం..
పండంటి సంసారం’ -
ఆ ఊసప్పటి మాట
ఇంకా నీ సంతతి నింతింత చేస్కోమంటున్న
ఏలినవారి సూచనతో
ఎమోజి నయపోయా!

నైపాల్ అంతరంగం.. అక్షరాలతో ప్రయాణం

$
0
0

దేన్నయినా సృష్టించడానికి కూర్చున్న తొలి క్షణాలలోనే, అంటే ఆరంభంలోనే, ఆ సృష్టించబడ్డ వస్తువుకి సంబంధించిన శిథిలావశేషాల చిత్రాన్ని చూడగలగడం, దానికి గల అవకాశాన్ని ఊహించగలగడం - ఇది నా స్వభావం. ట్రినిడాడ్‌లో నేను గడిపిన నా చిన్నతనం నాటి మా కుటుంబ పరిస్థితులు ఇందుకు కొంత కారణం కావచ్చు. మేము నివాసంవున్న ఆ సగం కూలిపోయిన ఇళ్ళు, ఎన్నో స్థానచలనాలూ, ఫలితంగా మామూలుగానే మా మనసులలో పేరుకుపోయిన అనిశ్చితత్వము. ఈ తరహా అనిశ్చితి, బహుశా, నా అంతరాంతరాలలోకి బలంగా కూరుకుపోయి, అనువంశికంగా దిగుమతి అయినటువంటిదైన నన్ను తయారుచేసిన నా చరిత్రతోపాటు వచ్చినదది.
ఆరేళ్ళ క్రితం- ఆ వయసులో ఆరేళ్ళ యవ్వనకాలం అంటే దాదాపు సగం జీవితం అన్నట్లుగా లెక్క- పోర్టు ఆఫ్ స్పెయిన్‌లో ప్రతిదీ నా వీడ్కోలుతో అలంకరించబడి వున్నట్లుగా నాకు కనుపించింది. ప్రతి వస్తువులోనూ నా ప్రయాణం తాలూకు ఉత్సాహం, న్యూయార్క్, సౌతాంటన్, లండన్, ఆక్సుఫొర్డ్ లాంటి లోకప్రసిద్ధ ప్రదేశాలకు నా సుదీర్ఘ ప్రయాణం తాలూకు ఉత్సాహంతో మెరిసిపోతున్నట్లుగా కనుపించింది. ప్రతి మెరుపులోనూ నిశ్చయమై కనుపించిన రచయిత జీవితం, ఒక అద్భుతమైన కల, అందమైన మహానగరం జీవితం. అయితే, ఆరేళ్ళ తరువాత ఇప్పుడు, నేను వదిలేశాననుకున్న ఆ ప్రపంచమే నాకోసం ఎదురుచూస్తున్నది. కుంచించుకుపోయి వుంది ఆ ప్రపంచం, దానితో సమానంగా నేనూ కుంచించుకుపోయానని నాకు అనిపిస్తోంది.
లండన్‌లో నాకెవరూ గైడు-మార్గదర్శకుడు- లేడు. అయితే, అక్కడ అప్పటి వర్తమానంతో నా భూత కాలాన్ని, అందులో జరిగిపోయిన సంగతులను జోడించి బేరీజువేసే వాళ్ళు, నా మనోస్థైర్యాలనూ దౌర్బల్యాలనూ పరిశీలనగా చూసి గుర్తుంచుకునే వాళ్ళుకూడా అక్కడ ఎవ్వరూ లేరు. నాకు నచ్చిన వ్యక్తిత్వాన్ని నేను ఎంచుకొని అలాంటి వ్యక్తిగా కనుపించే స్వాతంత్య్రం అప్పుడు అక్కడ నాకు వుంది. కనుకనే, చాలా తేలికపాటిదైన, ఆకర్షణీయంగా కనబడేదైనట్టిది, ఫాషన్ గురించి అతి శ్రద్ధ చూపించే వ్యక్తి బాగా డబ్బు ఖర్చుపెట్టే ‘కొలొనియెల్’ వ్యక్తిత్వాన్ని నేనప్పుడు ఎంచుకున్నాను, నా ‘స్కాలర్‌షిప్’ ఆదాయంతో సంబంధం లేకుండా.
రచయితగా నేనొక ప్రారంభం చేశాను. కానీ, నేను రాసిన రెండు పుస్తకాలలో ఏదీ ఇంకా ప్రచురణ కాలేదు; నాకు ముందు మరి దారి కనుపించలేదు; మరింకో పుస్తకాన్ని గురించిన ఆలోచన కూడా ఏదీ నా మనస్సులో లేదు. ఆరేళ్ళక్రితం నేనొక అప్పుడప్పుడే యవ్వనంలోకి కళ్ళనిండా ఎన్నో కలలతో అడుగుపెడుతూన్న ఒక పిల్లవాడిని... ఎవ్వరికీ జవాబివ్వవలసిన అవసరం లేని చిన్న వాడిని. ఇప్పుడు అలా లేదు, నా తండ్రి గతించాడు; చుట్టూ అప్పులు పేరుకుపోయాయి; కుటుంబ బాధ్యతలు నామీద పడ్డాయి. కానీ నేను వాటిని మోయగలిగే స్థితిలో లేను. నన్ను నేనే పోషించుకోలేని స్థితి నాది. నావద్ద ఉన్నది ఒకటే కొత్తగా నేను గుర్తించిన విద్య; నేను చేయగలిగినదీ, నన్ను నేను పోషించుకోవడానికి నేను చేయాల్సినదీ, నేను ఇంగ్లాండు వెళ్ళిపోవడం- నాకు అదిప్పుడేమీ ఒక కలల ప్రదేశం కాదు; కేవలం రేడియోకి పనికివచ్చే వ్రాతలతోనూ, పత్రికలకు చిరు వ్యాసాలతోనూ, నా పుస్తకాలు ప్రచురించబడే దాకా, రచయితగా నాకు ఒక చిన్నపాటి జీవితాన్ని అందించగల ప్రదేశం.
ఇంగ్లాండులో ఇంతకాలం గడిపాక కూడా, నాలో ఇంకా కొత్త ప్రదేశానికి సంబంధించిన బెరుకుతనం గూడుకట్టుకుని ఉండేది; ముక్తసరి సమాధానాలిచ్చే మొగమాటమనేదే లేనితనం, మనది కాని ప్రదేశంలో ఉన్నామన్న భావన, పరిసరాలనుంచి నాకు నేనే అనుభవించే ఏదో వింత దనం, నాదైన పూర్తి ఏకాంతం. (ఇంగ్లండులోనే) ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళిన ప్రతిసారీ- వేరే ఎవ్వరికైనా అది ఒక ఆహ్లాదకరమైన అనుభవం అయ్యేటువంటిది- నాకు మాత్రం మానకుండా వున్న ఎప్పటిదో ఒక పాత గాయాన్ని ఎవరో బలంగా పట్టి కెలుకుతున్నటువంటి అనుభూతి కలిగేది. ఒక గదినుంచి మరో గదికి, ఒక ప్రదేశాన్నుంచి మరో కొత్త ప్రదేశానికి, అలా అలా మారుకుంటూ దూరంగా, ఇంకా దూరంగా, చివరికి నగరం నడిబొడ్డునుంచి అంచులకు చాలా దూరంగా! ఆ ఇళ్ళు, అవి అందించే తాత్కాలికత, పెళుసుదనపు అనుభూతి. పైపై పొరల మీదనే చదును చేయబడిన వ్యవసాయ భూములపై పైపైన నిర్మించబడిన తాత్కాలిక నివాస ప్రదేశాలవి. ఆ అంగళ్ళు! ఆ వార్తల ఏజెంట్లు! ప్రతిచోటు చేరిన కొద్ది రోజులలోనే నిరాసక్తంగా తయారయేది. నాలో చాలా అసహనం పెరిగిపోయేది. గమనం తప్ప వేరే ఏ కారణమూ లేకుండా, ఒక ప్రదేశాన్నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించేవాడిని. పక్కన దాచి వుంచుకున్న కొద్దిపాటి డబ్బును ఇందుకోసం ఖర్చుపెట్టేవాడిని.
ఒక మాట తప్పనిసరిగా చెప్పాలి, అదేమంటే మనలో చాలామందిమి ధనానికి పేదలం. అయినా దీనిని గురించి పెద్దగా పట్టించుకోవాల్సింది లేదు. కారణమేమంటే, మనలో చాలామందికి చాలా పెద్ద మొత్తంలో రాసులు రాసులుగా ధనార్జన చేయడం అంటే ఏదో చెప్పలేని భయం, కాకపోతే అదెలాగో తెలియనితనం. నా ప్రయత్నాలలో నేను సఫలీకృతుడనౌతానని నాకు పూర్తినమ్మకం. నేను బ్యాంకుకు 150000 డాలర్లు అప్పువున్న రోజులలో కూడా నా ఈ నమ్మకానికి సడలింపు ఉండేది కాదు, నా మనసుకు అది ఒక ఇబ్బందికర ఆలోచనగా అనిపించేది కాదు.
ఎదుటి వ్యక్తి కళ్ళలో మనకు మనం ఎలా కనబడతామో, తుది సారాంశంగా అలా అవుతాం మనం. మనం మనల్ని వదిలి బయటికి రావడానికి ప్రయత్నించినపుడల్లా స్థూలంగా, మనకు పొడిగింపులాంటి వ్యక్తులకోసమే వీధిలో వెతుకుతాం. నగరంకోసం వెదుకుతాం, కానీ చిన్నచిన్న గుహల లాంటి వ్యక్తిగత ఆవాసాల సాంద్ర సముదాయాన్ని ఎదుటగా చూస్తాం. అది మరెక్కడో కాదు, నగరంలోనే మనకుమనం ఒక్కరమే అయిన ఏకాంత వ్యక్తులం అనే విషయం పదే పదే మన తలపులకు గుర్తుచేయబడుతుంది. అయినప్పటికీ, నగరం అనే ఒక అమోఘమైన సంఘటిత భావన మన మనస్సులను ఎప్పుడూ ఆవహించే వుంటుంది; నగరమనే ఒక ఆనందమయమైనదనిపించే ఒక అనంతాత్మకోసం వెదుకులాడుతాం, అది దొరికేది కాదని అనుభవం చెబుతున్నప్పటికీ, తెలిసి తెలిసీ! నా రహస్యాలను నేనెప్పుడూ గౌరవించలేదు, భద్రంగా దాచుకోలేదు. దానికి అనుగుణంగానే నా బహుసున్నితమైన జ్ఞాపకశక్తి వాటిల్లో చాలా వాటిని తుడిచేసి, తగిన విధంగా సంపాదకత్వం నిర్వహించి, మొత్తంమీద నా బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను ఒక అస్పష్టమైన చలనచిత్రపు ముక్కగా మార్చేసింది. కానీ ఆ కాస్త కూడా నన్ను బాధపెట్టడానికి సరిపోయేంత సమర్ధత కలిగినదిగా వుంటుంది.
అత్యద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగి వుండడం కూడా సరైనది కాదు. అది బాధకు హేతువుగా పరిణమిస్తుంది.
బాధను ఒక స్థాయి దాకానే ఇతరులతో పంచుకోవడం సబబు. ఆ స్థాయిని మించి పంచుకోవాలని చూడడం సాహసమే అవుతుంది. మా టీచర్‌కోసం చేతిలో ఒక ఆపిల్ పండుతో వెళ్ళడం స్కూలుకు సంబంధించిన నా మొదటి జ్ఞాపకమే. ఇది నాకు ఎప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, ఇసబెల్లాలో ఆపిల్ పండ్లే దొరకవు. బహుశా అది ఆరంజి పండు అయి వుండొచ్చు. కానీ నా జ్ఞాపకశక్తి మాత్రం ఆపిల్ పండు అనే భీష్మించుకు కూర్చుంటుంది. ఇంతకుమునుపు చెప్పిన నా జ్ఞాపకశక్తికి సంబంధించిన ఎడిటింగులో ఏదో తప్పు జరిగింది. కానీ, ఏమిటి చెయ్యడం? ఇప్పుడు నా జ్ఞాపకంలో ఆ ఎడిటింగ్ చేయబడిన కూర్పే నిక్షిప్తమై వుంది. విజయం విజయమే; ఒకసారి అది సంభవించిందంటే దాని గురించి అదే లోకానికి పూర్తిగా అర్థమయ్యేలా తెలియజేసుకుంటుంది. శిఖరం ఎక్కేటప్పుడు దారిలో ఎదురయ్యే వ్యక్తులతో స్నేహంగానూ, కరుణతోనూ వ్యవహరించమని పెద్దల సూక్తి. కారణమేమంటే, శిఖరం మీద నుంచి దిగేటప్పుడు లేదా అంత ఎత్తునుంచి (ఏదైనా ప్రమాదం జరిగో, కాకుంటే కర్మకాలో) పడిపోయేప్పుడు దారిలో ఎదురయ్యే వ్యక్తులు కూడా వారే అయివుంటారు కాబట్టి. రోజులో అప్పుడు ఎటువంటి మనఃస్థితిలో వున్నా, కూడదీసుకుని కలం చేత పట్టుకుని అక్షరాలతో ముందుకు కదలడమే రచయిత జీవితమంటే!
(The Enigma of Arrival, The Mimic Men అనే పేర్లుగల రెండు రచనలలో, కథనం మధ్యలో సర్.వి.ఎస్.నైపాల్ తన గురించి తాను సందర్భానుసారంగా వ్రాసుకున్న వాక్యాలకు భావానువాద చిత్రణ ఈ వ్యాసం.)

ఎవరైనా ఉన్నారా?

$
0
0

ఇప్పుడందరూ ఏమిటో
వౌనాన్ని ముఖానికి తగిలించుకుని
ఒంటరితనాన్ని మోసుకుని తిరుగుతున్నారు
మాట్లాడాల్సిన మాటలన్నిటినీ గుండెల్లో పాతేసి
చీకట్లోకి నడిచిపోతున్నారు
సూర్యుడిని మబ్బుల్లో కప్పెట్టి
దిగులు మేఘాల దొంతరలను పేర్చుకుంటూ
రాత్రులకు ప్రాణం పోసుకుంటున్నారు
తోటలోని అందమైన పూలను ఆరాధించడం మాని
రాలిన ఆకులను లెక్కెడుతూ
కృంగి కృశించి పోతున్నారు
కన్నీళ్లను కూజాల కొద్దీ నింపి
దుఃఖాన్ని పోగుజేసుకుంటూ
ఎవరూ లోపలికి ప్రవేశించకుండా
ఇనుప కచ్చడాలను నిర్మించుకుంటున్నారు
పొరలు పొరలుగా గతపు గుర్తులను ఒలుచుకుంటూ
గరళాన్ని మింగలేక మానలేక అవస్థలు పడుతూ
మట్టిలో కలిసిపోతున్నారు
ప్రశాంతమైన నదిలా ప్రవహించడం మాని
అలల కెరటాలై లోపల్లోపలే విరుచుకుపడుతున్నారు
ఒత్తిళ్ల ముళ్ల మధ్యన నలిగి
రక్తాన్ని స్రవిస్తూ చిక్కి శల్యమై పోతున్నారు
ఇక్కడెవరైనా ఉన్నారా
కాస్త వారి రెపరెపలాడుతున్న
ప్రాణజ్యోతిలో ఆశల చమురు పోసి వత్తి ఎగదోయడానికి?
ఒకరైనా దయచేసి వచ్చి
ఈ జీవితాలకు కాస్తంత ప్రేమను భరోసాగా ఇచ్చి
కొండంత అండగా నిలబడండి
ఒక్క కిరణమైనా జొరబడకుండా
వారు పటిష్టంగా నిర్మించుకున్న జైలులో
మగ్గుతున్న వారందరినీ
బయటకు తెచ్చి వెలుగు టానిక్ పట్టి కళ్లలో కాసిని కాంతిదీపాలు వెలిగించండి

శ్రీనాథుని కనకాభిషేకము

$
0
0

ఆంధ్ర సాహితీ చరిత్రలో ఒక అపూర్వమైన సన్నివేశం శ్రీనాథుని కనకాభిషేక సత్కారం. ఇటువంటి గొప్ప సత్యారాన్ని పొందిన తొలి తెలుగు కవి శ్రీనాధుడే. కనకాభిషేక సత్కార క్రమాన్ని గూర్చి రాజ్యలక్ష్మీ పీఠికాతంత్రంలో ఇలా ఉందని శ్రీ వేటూరి ప్రభాకరశాస్ర్తీగారు చెప్పారు. ‘రాజు విద్వద్గోష్ఠిలో అసమాన వైదుష్యము చూపిన వారికి కనకాభిషేక సత్కారము గావింప వలయుననియు, కనకాభిషేకమనగా సభామధ్యమున ఆ మహాకవిని లేదా విద్వాంసుని ఒక ఉన్నతాసనముపై కూర్చండబెట్టి వారి శిరముపై జలమును గుమ్మరించినట్లు బంగారు నాణెములతో అభిషేకించవలయుననియు, అట్లు కుమ్మరించిన నాణెములను దర్శించవచ్చిన విద్వాంసులకు పంచి పెట్టవలయుననియు అందు కలదు!
శ్రీనాధుడీ కనకాభిషేక సత్కారాన్ని పొందాడనడానికి వారి ఈ పద్యమే సాక్ష్యం.
సీ॥ దీనారటంకాల తీర్థమాడించితి
దక్షిణాధీ శుముత్యాల శాల
పగులగొట్టించి తుద్భట వివాదప్రౌఢి
గౌడడిండిమ భట్టు కంచుఢక్క
చంద్ర భూషక్రియాశక్తి రాయలయొద్ద
పాదుకొల్పితి సార్వభౌమ బిరుదు
పలుకుతోడైతాంధ్ర భాషా మహాకావ్య
నైషధ గ్రంథ సందర్భమునకు
గీ॥ ఎటుల మెప్పించెదోనన్ను ఇంక మీద
రావు సింగ మహీపాలు ధీవిశాలు
నిండు కొలువున నెలకొని యుండినీవు
సకల సద్గుణ నికురంబ! శారదాంబ!
ఇంకా శ్రీనాధుని బావమరిదియైన దగ్గుపల్లి దుగ్గన తన నాసికేతోపాఖ్యానంలో
‘‘కవి సార్వభౌముడై కరాట విభుచేత
కనక రత్నాభిషేకములుగనిన
శ్రీనాధ సుకవి కూరిమిసేయు మఱదివి’’
- అని చెప్పుకొన్న పద్యం కూడా శ్రీనాధుడు కనకాభిషేక సన్మానితుడని తెలియజేస్తోంది.
మరొక ప్రబలమైన సాక్ష్యం రాధామాధవ కవిది.
ఇతడు విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయల అనంతరం పరిపాలించిన అచ్యుత దేవరాయల ఆస్థానంలోని వాడు.
అదే ఆ స్థానంలో శ్రీనాధునిచే ఓడింపబడిన డిండిముని ముని మనుమడైన రాజనాధుడు కూడా ఉండేవాడు.
రాధామాధవ కవి చెప్పిన ఆ పద్యమిదే-
శా॥ ‘‘సూనా స్త్రప్రమదామదస్ఫురిత వక్షోజాత కాఠిన్యమున్
బూనం జాలు వచో విలాసమున నింపుల్ మీఱ కర్ణాటక
క్ష్మానాధేంద్రు సభన్ కవిత్వ విజయోత్సాహంబు గైకొన్న మా
శ్రీనాధుం కవి సార్వభౌముగొలుతున్ సేవాంజలుల్ గీల్కొనన్‌॥
ఇట్లా తరతరాలూ గుర్తుండిపోయే అపూర్వమైన కనకాభిషేక సత్కారం వేటూరి వారు, ఆరుద్రగారు కొర్లపాటి శ్రీరామమూర్తిగారు మొదలైన పెద్దలు అభిప్రాయపడినట్లు శ్రీనాధునికి క్రీ.శ.1430 నుండి 1435 మధ్యకాలంలో రెండవ ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో జరిగిందని చెప్పవచ్చు. ఈ రెండవ ప్రౌఢ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ.1423 నుండి 1447 వరకు దిగ్విజయంగా పరిపాలించాడు. కొండవీటిరెడ్డి రాజులకు విద్యాధికారిగా ఉన్న శ్రీనాధుడు విజయనగరానికెందుకెళ్ళాడని ప్రశ్నించుకుంటే మనకు వచ్చే సమాధానమిది.
కొండవీటిరెడ్డి రాజ్యం పతనమైన తరువాత కొంత రెడ్డిరాజ్యం రాజమహేంద్రవరంలో రాజిల్లుతూ ఉండేది. కొండవీటి వారికీ, రాజమహేంద్రవరం వారికీ వైరం. అందుకే శ్రీనాధుడు ముందు రాజమహేంద్రవరం వెళ్ళలేదు. (తరువాత కొంత కాలానికి వెళ్ళాడనుకోండి అది వేరే సంగతి). కొండవీటి రాజ్య పతనానంతరం దేశ సంచారం చేస్తూ శ్రీనాధుడు వినుకొండ వల్లభరాయణ్ణి కలుసుకున్నాడు. వల్లభరాయుడికి శ్రీనాధుడంటే వల్లమాలిన అభిమానమూ. గురుత్వమూ కొంతకాలం శ్రీనాధుడు వల్లభరాయడి ఆతిధ్యంలో గడిపాడు. ఆ సమయంలోనే శ్రీనాధుడు అతడి చేత క్రీడాభిరామాన్ని వ్రాయించాడో లేక తానే వ్రాశాడో ఇతమిద్ధంగా తెలియటం లేదు గానీ, వినుకొండ వల్లభరాయుడివల్ల విజయ నగరానికి శ్రీనాధుడు పయనమయ్యాడు.
అప్పటికే విజయనగర సామ్రాజ్యం కవి పండిత పోషణకు పేరెన్నికగన్నది. వినుకొండ వల్లభరాయడు విజయనగరంలో మహా పలుకుబడిగల వాడు. కారణం, వినుకొండ వల్లభరాయడి తాత తండ్రులు మంత్రులుగా, దండనాధులుగా విజయనగరం కొలువులో ఉన్నవాళ్ళే. వల్లభరాయడి తండ్రి తిప్పన్న మంత్రి. ఇతడు విజయనగరంలో రాయలవారి రత్నభాండాగారానికి అధికారి. అంటే ఖజానా అధికారి వంటి పదవి. ఇలాటి స్నేహితుడు దొరకటంవల్ల శ్రీనాధుడు విజయనగర ప్రయాణానికి ఉత్సాహపడ్డాడు. తన కవితాశక్తికి అక్కడ సముచితమైన సత్కారం జరుగుతుందని ఆశించాడు. వెంటనే శ్రీనాధుడు విద్యానగరమైన విజయ నగరానికి వెళ్ళాడు. అక్కడ ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో ముమ్మయ్య అనే కవిని కలుసుకున్నాడు. బహుశా వల్లభరాయుడే వీరిరువురికీ పరిచయం కల్పించాడు కాబోలు. ముమ్మయ్య, శ్రీనాధుడూ ఇరువురూ కవిత్వాలను కలబోసుకున్నారు. శ్రీనాధుడతనితో తన కవితాశక్తినిలా తెలియజేశాడు.
సీ॥ పంపావిరూపాక్ష బహు జటాజూటికా
రగ్వధ ప్రసవ సౌరభ్యములకు
తుంగభద్రా సముత్తుంగ వీచీఘటా
గంభీర ఘుమ ఘుమారంభములకు
కళసాపుర ప్రాంత కదళీవనాంతర
ద్రాక్షాలతా ఫలస్తబకములకు
కర్ణాటకామినీ కర్ణహాలుకరత్న
తాటంక యుగ ధాళ ధళ్యములకు
గీ॥ నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత
తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు
ప్రౌఢ దేవేంద్ర రాయ భూపాల వరుని
సమ్ముఖంబున దయ చూడుముమ్మ సుకవి॥
ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో ముమ్మకవితోపాటు ‘కవిసార్వభౌమ’ బిరుదాన్ని ధరించిన అరుణగిరినాధుడనే పేరుగల మహా పండితుడైన డిండిముడు కూడా ఉండేవాడు. ఈ డిండిముని పూర్వులు కూడా అసమాన ప్రతిభావంతులే. వీరందరినీ ‘డిండిముడు’ అనే బిరుదనామంతో పిలిచేవారు. డిండిమము (కంచు ఢక్క) కలిగిన వారు కావటంవల్ల వీరు డిండిములయ్యారు. ఈ అరుణగిరినాధ డిండిముని పితామహుడు గొప్ప పండితుడు. తండ్రి అష్ట్భాషా కవితా సామ్రాజ్య పట్ట్భాషిక్తుడు. ఇతని మాతామహుడు (తల్లి తండ్రి) శైవ వేదాంత పారంగతుడు. విజయ డిండిమముగలవాడు. ఈ మాతా మహుని నుండే అరుణ గిరినాధుడు ‘డిండిమ’ బిరుదును సొంతం చేసుకున్నాడు. ‘బిరుద డిండిమ వాజ్య సంతాడిత వినుత కవిమండలుడు. డిండిమ కవి సార్వభౌముడు’ అన్నది ఇతని బిరుదు. ఈ అరుణ గిరినాధ డిండిముని వైభవాన్ని, దర్పాన్నీ తెలిపే చాటువొకటుంది.
అగ్రే డిండిమ తాడనంతత ఇతోవంది వ్రజోద్భోషణం
ద్విత్రాశ్చిత్రపటాః కియంతి బిరుదు ప్రోతాని పద్యానినః
అస్తాంతా పదిదం మహేశమకుటీ కోటీర కల్లోలినీ
కల్లోల ప్రతిమల సూక్తి విభవైర్ద్వేష్యాన్వి జేష్యామహే॥
- మాకు ముందు విజయ డిండిమము మ్రోయుట, వందిమాగధుల స్తోత్రములు, చిత్రపటముల ఊరేగింపులు జరుగుచుండగా వెడలుమేము పరమేశ్వరుని జటాజూటములోని గంగాతరంగములతో ప్రతిఘటింపజాలు మావాగ్వైభవముతో ప్రత్యర్థి పండితులనోడించెదమని
ఈ శ్లోకం చెపుతోంది. ఇట్టి వాద కుశలతయు పాండిత్య దర్పముగల డిండిమునితో శ్రీనాధునికి విజయ నగర సభాప్రవేశానికి ముందే ముమ్మకవి సమక్షంలోనో లేక మరెక్కడో వివాదం తటస్థించినట్టుంది. దానికి సాక్ష్యమీ పద్యం.
చ॥ తరువున గాండివంబిడడె ధర్మజునానకిరీలు, ఏనువా
క్సరసిజనేత్ర యానతి విచారము చొప్పున గర్వహీనతన్
మరలి తెనుంగు భూమి కసమానగతిన్ కొనిపోవువాడనై
బిరుదులు నారివాగుకడ బెట్టితి సత్కవిసార్వభౌముడన్‌॥
ఇలా నేనూ కవి సారభౌముణ్ణే అని శ్రీనాధుడు ప్రకటించుకోవడం డిండిమునకు దుస్సహమైంది. కోప కారణమైంది కూడా. చాలా కాలం శ్రీనాధునకు సభా ప్రవేశం కలుగకుండా అడ్డుపడినట్లున్నాడు డిండిముడు ఈ కారణంతోనే. కొంతకాలం విజయనగరంలోనే కాలం వెళ్ళబుచ్చుతూ శ్రీనాధుడు ఇలా భావించాడు.
కంటికి నిద్రవచ్చునె? సుఖంబగునేరతికేళి? జిహ్వకున్
వంటకమించునే? యితర వైభముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగల యట్టి మనుష్యునకెట్టి వానికిన్
కంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు కల్గినన్?
(శ్రీనాధుని కాశీఖండంలోనిదీ పద్యం)
అని డిండిముణ్ణి ఓడించడానికి శ్రీనాధుడు తహతహలాడాడు.
శా॥ కుల్లాయుంచితి, కోకచుట్టితి మహాకూర్వార్వాసమున్ దొడ్గితిన్
వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసలితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లా యంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచు బోనాడితిన్
తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాధుడన్.
అంటూ తాను కర్ణాటక సాంప్రదాయబద్ధమైన వేషం ధరించాననీ, ఇష్టంకాని తిండినీ తిన్నాననీ తన్ను దయజూడమని కన్నడ రాజ్యలక్ష్మిని వేడుకున్నాడు శ్రీనాధుడు. ప్రౌఢ దేవరాయల దర్శనం లభించలేదు కానీ, శ్రీనాధుని గురించి అతడో ‘కయ్యాలమారి’ అని ప్రౌఢ దేవరాయల సముఖంలో ఎవరో అనటం శ్రీనాధుని దృష్టికి వచ్చింది. అందుకు ప్రతిగా
సీ॥ డంబు సూపి ధరాతలంబుపై దిరుగాడు
కవి మీదగాని నా కవచమేయ
దుష్ప్రయోగంబుల దొరకొని చెప్పెడు
కవి శిరస్సున గాని కాలు చాప
సంగీత సాహిత్య సరస విద్యలనేర్చు
కవుల ఱొమ్ములుగాని కాల్చి విడువ
చదివి చెప్పగనేర్చి సభయందు విలసిల్లు
కవినోరుగాని వ్రక్కలుగదన్న
దంటకవులకు బలువైన యింటి మగడ
కవుల వాదంబు వినవేడ్క గల్గెనేని
నన్ను బిలిపింపు మాస్థాన సన్నిధికిని
లక్షణోపేంద్ర! ప్రౌఢ రాయక్షితీంద్ర!
- అంటూ తనకు కుకవులతోనూ, మదాంధులైన పండితులతోనే విరోధమనీ, నావిద్యను పరీక్షించదలచుకుంటే సభను ఏర్పాటుచేయమనీ ప్రౌఢ దేవరాయలను శ్రీనాధుడు అర్ధించాడు. విద్యావిషయ సరసుడైన ప్రౌఢ దేవరాయలు సభ ఏర్పాటుచేశాడు. శ్రీనాధునికీ, డిండిమునికీ మధ్య జరిగే విద్యావివాద వినోదానికై సకల ఏర్పాట్లు జరిగాయి. ఈ విద్యావివాదానికి న్యాయ నిర్ణేతగా చంద్ర భూషణ క్రియాశక్తిరాయల్ని నియమించాడు. చంద్రభూష క్రియాశక్తి రాయలు, ప్రౌఢ దేవరాయలకు కులగురువు. శ్రీనాధునికీ డిండిమునకూ విద్యావివాదం హోరాహోరీగా, ఉద్భటంగా జరిగింది. రాధా మాధవకవి పద్యాన్నిబట్టి చూస్తే ఈ విద్యావివాదం కవిత్వ విషయంలోనే జరిగిందని ఊహించవచ్చు. ప్రౌఢ దేవరాయలు ఈ సందర్భంలో బాలను, యువతిని, బ్రౌఢను, లోలను గూర్చి నాలుగు పద్యములు చెప్పుమని కోరగా శ్రీనాధుడు చెప్పెనట!
(వీటిని వేటూరివారి ‘చాటుపద్య మణిమంజరి’ రెండవ భాగమున చూడవచ్చు). ప్రౌఢ దేవరాయలూ సంతృప్తి చెందాడు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన చంద్రభూష క్రియాశక్తి రాయలు విజయం శ్రీనాధుడిదేనిన నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. అంత పటాతోపంగా మ్రోగించుకుంటూ తిరిగే డిండిముని కంచు ఢక్కను నిండు పేరోలగంలో శ్రీనాధుడు పగులగొట్టించాడు. కవిసార్వభౌమ బిరుదమూ శ్రీనాధునకివ్వబడింది. ఆ సందర్భంలో ఇతర నృపులను పొగిడిన దోషం పోవడానికి కనక స్నానం చేయించమని శ్రీనాధుడీ విధంగా కోరాడు.
చ॥ జననాధోత్తమ! దేవరాయనృపతీ! చక్రేశ! శ్రీ వత్సలాం
ఛన సంకాశ! మహాప్రభావ! హరి! రక్షాదక్ష! నాబోటికిన్
కునృపస్తోత్ర సముద్భవంబయిన వాగ్దోషంబు శాంతంబుగా
కనక స్నానము జేసిగాక పొగడంగా శక్యమే దేవరన్‌॥
అంతా ప్రౌఢదేవరాయలు తన ముత్యాలశాలలో కవిపండిత మధ్యంలో అత్యంత వైభవోపేతంగా శ్రీనాధునికి దీనారటంకాలతో కనకాభిషేకం చేశాడు. ఆ సందర్భంలో
శా॥ జోటీ! భారతి! యార్భటిన్ మెరయుమీ చోద్యంబుగా నేన
రాటాధీశ్వరు ప్రౌఢదేవనృపతిన్ నాసీరధాటీ చమూ
కోటీ ఘోటక ధట్టి కకకాఖురపుటీ కుట్టాక సంఘట్టన
స్ఫోటీ దూత ధరా జశ్చుళికితాంభోటికిన్ ప్రశంసించె॥
అని ప్రౌఢదేవరాయల్ని ప్రశంసిస్తూ శ్రీనాథుడు ప్రౌఢమైన పద్యం చెప్పాడు. కనకాభిషేకం తరువాత కొన్నాళ్ళు శ్రీనాథుడు కర్ణాట దేశంలో ఉండి అక్కడి రాజునూ, విద్వాంసులనూ ఆనందింపజేసి ఉంటాడు. అందుకే ‘కర్ణాట దేశ కటక పద్మవహేళి శ్రీనాథ భట్టమే అని తనను తాను చెప్పుకున్నాడు. అలా కర్ణాట రాజ సభా కమలాలను వికసింప జేసే సూర్యుడిలాగా వెలిగిపోయాడు శ్రీనాధుడు. కర్ణాట దేశంలో శ్రీనాధుడు పొందిన ఈ అసమాన కనకాభిషేక గౌరవం అజరామరం. అనన్య సామాన్యం.

Viewing all 69482 articles
Browse latest View live