Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ

$
0
0

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. గతంలో ఇదే కేసులో చిదంబరం కుమారుడు కార్తీని కూడా ఈడీ ప్రశ్నించిన విషయం విదితమే. ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం ఫారిన్ ఇనె్వస్టిమెంట్ నిధులకు అక్రమంగా పచ్చజెండా ఊపిన విషయం విదితమే.


రాజకీయ జన్మనిచ్చింది సిరసిల్లే:కేటీఆర్

$
0
0

సిరిసిల్ల: తనకు రాజకీయ జన్మనిచ్చింది సిరసిల్ల ప్రజలేనని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన బుధవారంనాడు సిరిసిల్లలో పర్యటించారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఇక్కడకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. సిరిసిల్లను ‘సిరిశాల’గా మారుస్తానని అన్నారు. రాబోయే మూడేళ్లలో సిరిసిల్లకు రైలుకూత వినిపిస్తానని అన్నారు. మీ అండతో టీఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా మారుస్తానని అన్నారు. జిల్లాలోని 13 మండలాల్లోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు.

బీజేపీ వల్ల చిన్నపార్టీలకు చేటు

$
0
0

న్యూఢిల్లీ: ఎన్డీయే వల్ల చిన్న పార్టీలకు చేటు అని, బీజేపీ చిన్న పార్టీలను నాశనం చేయాలని చూస్తుందని రాష్ట్రీయ లోకసమతా పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వాహా వెల్లడించారు. ఆయన బుధవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, బీజీపీ అహంకారం వల్ల బయటకు వచ్చానని వెల్లడించారు. తనకు ఎదురైన అనుభవమే ఎన్డీయేలోని ఇతర పార్టీలకు ఎదురవుతుందని అన్నారు.

ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణ స్వీకారం

$
0
0

అనంతపురం: జిల్లాలోని మడకసిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈమేరకు అసెంబ్లీలో బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కృష్ణాజలాలను హంద్రీనీవా ద్వారా తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు.

గెలుపు ఏకపక్షం కావాలి:చంద్రబాబు

$
0
0

అమరావతి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఏకపక్షం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన టీడీపీ పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ మళ్లీ రావాలి అనే నినాదంతో కర్యాకర్తలు ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ‘సెమీ క్రిస్మస్ వేడుకలు, 30న జరిగే జయహో బీసీ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నింగిలోకి దూసుకువెళ్లిన జీఎస్వీఎల్ ఎఫ్11

$
0
0

నెల్లూరు: శ్రీహరి కోట నుంచి జీఎస్వీఎల్ ఎఫ్11 వాహన నౌక నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ వాహన నౌక ద్వారా జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన దీన్ని భారతదేశం పంపిన 35వ సమాచార ఉపగ్రహం.

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు.. సిద్ధం చేయాలి

$
0
0

కరీంనగర్, డిసెంబర్ 18: 2018-19లో జరుగనున్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఆర్‌డిఓలతో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2018 నవంబర్ 6వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్ట్భద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని తెలిపారు. 2018 నవంబర్ 6వ తేదీ తరువాత ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచాలని, 2019 జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరించాలని, ఆ తదుపరి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఓటరు జాబితాలో పొందుపరచాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్ట్భద్రులు, ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదుకోసం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 20 లోగా విచారణ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తుల వివరాలను ఆయా జిల్లాల్లోని డివిజన్ల ఆర్‌డిఓల నుంచి కలెక్టర్ తీసుకున్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, మెట్‌పల్లి, బెల్లంపల్లి సబ్ కలెక్టర్లు రాహుల్, గౌతమ్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఆర్‌డిఓలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగికి రెండేళ్ల జైలు
కరీంనగర్ (లీగల్), డిసెంబర్ 18: ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే లంచం తీసుకుంటూ పాల్పడ్డ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లోక వేణుగోపాల్ (53)కు కరీంనగర్ ప్రత్యేక ఎసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్ రావు రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన కోరి సత్యనారాయణ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో ఎస్‌టిడి టెలీఫోన్ బూత్, జిరాక్స్ సెంటర్‌ను నిర్వహిస్తుండేవాడు. 2009 వరకు టెండర్ గడువు ముగియడంతో 2010లో టెండర్‌ను నిర్వహించారు. ఆయా టెండర్‌లో సత్యనారాయణ షీల్డ్ కవరణలో టెండర్ వేయగా కేవలం ఒకటే టెండర్ రావడంతో ఆయా టెండర్‌ను రద్దు చేశారు. దీనిపై వికలాంగుడైన సభ్యురాలైన తనకు టెండర్ ఇప్పించాలని కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. 10.11. 2010న ఆసుపత్రిలోని సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న లోక వేణుగోపాల్‌ను కలువగా కలెక్టర్ ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పత్రాలను ఇప్పించాలని కోరాడు. ఇందుకుగాను పది వేల రూపాయల లంచం ఇస్తేనే ఆయా పత్రాలను మంజూరు చేస్తానని డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వలేని సత్యనారాయణ 12.11.2010న ఎసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో పథకం ప్రకారరం ఎసీబీ అధికారులు వల పన్ని నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. తగిన సాక్షాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర్ రావు నిందితుడైన వేణుగోపాల్‌పై నేరం రుజువు కావడంతో రెండు సంవత్సరాల కఠిన కారాగారపు జైలుశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. కాగా, నిందితుడైన లోక వేణుగోపాల్ కామారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ విభాగంలో సీనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం
- ఎమ్మెల్యే సుంకె రవి శంకర్
గంగాధర, డిసెంబర్ 18: రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అన్నారు. గంగాధర వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ధాన్యం కుప్పలను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులు తీసుకువచ్చిన ధాన్యం తడుస్తుందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు రైతులకు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకూడదని, ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి ఆదుకోవడంతో పాటు త్వరితగతిన డబ్బులు తమ ఖాతాలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

చలి పంజా

$
0
0

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 18: జిల్లాపై చలి పంజా విసురుతోంది. ఇటు పెథాయ్ తుఫాను, అటు చల్లటి గాలుల భీభత్సం జిల్లా వాసులను వణికిస్తోంది. రెండు రోజులుగా మధ్యాహ్నం అయినా సూర్యకిరణాలు మాత్రం భూమిని తాకకపోవటంతోజిల్లా వాసులు గజ గజలాడుతున్నారు. నిరంతరం వీస్తున్న ఈదురు,శీతల గాలులు పలుచోట్ల వృద్ధుల పాలిట యమపాశాలవుతున్నాయి. చలి పులికి తట్టుకోలేక ఇప్పటికే జిల్లాలో పలువురు మరణించగా, లెక్కలేనంత మంది ఆస్పత్రుల పాలయ్యారు. విద్యార్థులు పాఠశాలలు, విద్యాలయాలకు డుమ్మా కొట్టి, తమ ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ముసుగుతన్నుతున్నారు. చిన్నారులు, వృద్దుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత బాగా పెరుగుతుండగా, వీధి వ్యాపారులు, వేకువ జామున పనులు చేసుకునేవారు బాగా ఇబ్బందులనెదుర్కొంటున్నారు. సాయంత్రం ఐదింటి నుంచే చలి తన ప్రతాపాన్ని చూపుతుండగా, అత్యధిక మంది జనాలు తమ తమ పనులు వదిలి, ఇళ్ళకే పరిమితమవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే తగిన మేరకు ఉలెన్ దుస్తులు ధరించి, వెళ్తున్నారు. అయినా, వెంటనే వచ్చి ఇళ్ళలో చలి మంటలు కాగుతున్నారు. యువత, మద్యవయస్కులను సైతం చలి బెంబేలెత్తిసుండగా, మిగతావారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండటంతోపగటిపూట చలిగాలుల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటుండగా, పెథాయ్ తుఫాను ప్రభావంతోపగటిపూట ఉష్టోగ్రతలు పడిపోయి, కేవలం 20నుంచి 21 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే నమోదువుతున్నట్లు తెల్పుతున్నారు. దీనికితోడు ఉత్తర దిక్కు నుంచి వచ్చే గాలుల ప్రభావంతో రాత్రిపూట చలి తీవ్రత మరింతగా పెరుగుతుండగా, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం కోరుతుంది.


కేసముద్రం ముద్దు.. ఇనుగుర్తి మాకొద్దు..

$
0
0

కేసముద్రం, డిసెంబర్ 18: ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మండలంలో విలీన గ్రామాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం కోర్కొండపల్లి వాసులు రాస్తారోకో నిర్వహించి తమను కేసముద్రంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం కోర్కొండపల్లి బాటలో కోమటిపల్లి గ్రామస్తులు కలిసి.. తమ గ్రామాన్ని ఇనుగుర్తిలో విలీనం చేయవద్దని, కేసముద్రం మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తొర్రూర్-కేసముద్రం ప్రధాన రహాదారిపై గంట పాటు రాస్తారోకో నిర్వహించా రు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం పేరుతో తమకు అసౌకర్యంగా ఉన్న ఇనుగుర్తిలో కలపడం ఏమిటన్నారు. గతంలో కూడా ఇలాగే అధికారులు గ్రామసభలు నిర్వహించగా, తాము ససేమిరా అన్నామని, ఆ మేరకు గ్రామసభ తీర్మాణం కూడా చేశామన్నారు. అయితే తాజాగా మళ్లీ ఇనుగుర్తిలో తమ గ్రామాన్ని విలీనం చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం వచ్చిందన్నారు. తమ గ్రామాన్ని ఎట్టి పరిస్థితిలో ఇనుగుర్తిలో కలపకూడదని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి అధికారులకు ఫిర్యాదు చేయాలని నచ్చజెప్పడంతో విరమించారు. కాగా కేసముద్రం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న తమ గ్రామా న్ని ఇనుగుర్తిలో కలిపి ఇబ్బందుల పాలు చేయవద్దని కోరుతూ కోర్కొండపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంగళవారం మహబుబాబాద్ కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం సమర్పించారు.

కేయూకు ‘ఉత్తమ వాలెబుల్ స్టూడెంట్స్’
కేయూ క్యాంపస్, డిసెంబర్ 18: కాకతీయ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఈ నెల 10 నుండి 15 వరకు తమిళనాడులోని అలగప్ప విశ్వవిద్యాలయంలో నిర్వహించిన నేషనల్ ఇంటిగ్రేషన్ శిభిరంలో 10 మంది వాలంటీర్లు పాల్గొని మోస్ట్ వాలెబుల్ స్టూడెంట్స్‌గా ఎంపికైనారని ప్రోగ్రాం కో- ఆర్టీనేటర్ డాక్టర్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు.

ధ్యానంతో రోగాలు దరిచేరవు
సిద్ధేశ్వర పిరమిడ్ కేంద్రం ప్రారంభోత్సవంలో పత్రిజీ
బచ్చన్నపేట, డిసెంబర్ 18: శ్వాసమీద ద్యాస ఉంచి చేసే ధ్యానం మనిషిని సిద్దపురుషునిగా మరుస్తుందని జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ హితబోధ చేశారు. మంగళవారం కొడువటూరు సిద్దుల గుట్టపై దాతల విరాళాల రూ. 12లక్షల వ్యయంతో నిర్మించిన సిద్ధేశ్వర పిరమిడ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి, నిత్యాన్నదాన భవన నిర్మాణానికి శంఖుస్థాపచేశారు. 150 మంది ఒక్కేసారి ద్యానం చేయగల ఈ పిరమిడ్ కేంద్రంలో పలువురుతోకలిసి ముందుగా కాసేపు ద్యానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జంతువులను, పక్షులను చంపి తిననే హక్కును ఎవరు కల్పించారని ప్రశ్నించారు. ప్రాణంపోస్తే శక్తిలేన్నప్పుడు ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్నారు. ధాన్యం చేయడం వల్ల రోగాలు ధరిచేరవని, వైదులే అవసరంలేదని వివరించారు. నీటిలో మునితే స్నానం అంటారు. శ్వాసపై ద్యాస పెడితే ధ్యానం అంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొడువటూరు మాజీ సర్పంచ్ గంగం సతీష్‌రెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు రామయ్య, లక్ష్మినారయణ, పలు ప్రాంతాలనుంచి వచ్చిన పిరమిడ్ సభ్యులు పాల్గొన్నారు.

స్పీకర్‌పై కక్ష కట్టి ఓడించారు
* విశ్వ బ్రాహ్మణ రూరల్ జిల్లా అధ్యక్షుడు శంకరాచారి
శాయంపేట, డిసెంబర్ 18: భూపాలపల్లి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్ మధుసూధనాచారిని ఉన్నత వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్ధులు కక్ష్య కట్టి ఓడించారని వరంగల్ రూరల్ జిల్లా విశ్వబ్రహ్మణ జిల్లా అధ్యక్షుడు వినుకొండ శంకరాచారి ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విశ్వ బ్రహ్మణ సంఘం నుండి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ఎకైక వ్యక్తి సిరికొం డ మధుసూధనాచారి.. భూపాలపల్లి నియోజకవర్గంలో 3,500 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని అటువంటి వ్యక్తి ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. భూపాలపల్లిని జిల్లా చేయడంలో సిరికొండ పాత్ర కీలకం అని అన్నారు. ఇప్పుడు గెలిచిన గండ్ర వెంకటరమణరెడ్డి, ఇసుక మాఫియా, కల్తి పెట్రోల్ వంటి అక్రమాలతో వచ్చిన డబ్బును విచ్చల విడిగా ఖర్చు చేయడంతో పాటు మద్యం ఓటర్లకు, చీరల పంపిణీ చేశారని, మరో అభ్యర్ధి ఒక్క సారి జెడ్పీటీసీగా గెలిచి పనికి ఆహార బియ్యాన్ని పక్కదారి పట్టించి కోట్లు గట్టించారని అన్నారు. ఈ సమావేశంలో మండల విశ్వ బ్రహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి వినుకొండ రాజ్‌కుమార్, తెరాస నాయకుడు గదె రాజేందర్, ముంజల నాగరాజు, బాసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పెథాయ్‌తో పలు రైళ్లు అలస్యం
కాజీపేట, డిసెంబర్ 18: పెథాయ్ తుఫానుతో కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సంబల్‌పూర్ నుం చి నాందేడ్ వెళ్లాల్సిన నాగవల్లి ఎక్స్‌ప్రెస్ నిర్ణీత సమయాని కన్నా మూడుగంటలు ఆలస్యంగా కాజీపేటకు చేరుకుంది. ముంబై భువనేశ్వర్ కోణా ర్క్ ఎక్స్‌ప్రెస్ గంటన్నర ఆలస్యంగా, హౌరా-హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ గంటన్నర, ఆదిలాబాద్-తిరుపతి క్రిష్ణా ఎక్స్‌ప్రెస్‌లు నిర్ణీత సమయాని కన్నా గంట సేపు ఆలస్యంగా చేరుకున్నాయి.సికింద్రాబాద్ నుంచి బలర్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ నిర్ణీత సమయాని కన్నా 20నిమిషాల ఆలస్యంగా చేరుకుందని రైల్వే అధికారులు తెలిపారు.

గొర్రెల యూనిట్‌తో ఆదాయం రెట్టింపు

$
0
0

వరంగల్, డిసెంబర్ 18: యాదవులు ఆదాయాన్ని జీవన ప్రమాణాలను పెం చుటకు జిల్లాలో ఇప్పటి వరకు 6144 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసినట్లు వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో పశుసంవర్ధకశాఖ అధికారులు, పాల సేకరణ సంస్ధలతో నిర్వహించిన సమావేశంలో గొర్రెల యూనిట్లు, పాడి గేదెలు, పాడి ఆవుల పంపిణీ ప్రక్రియను సమీక్షించారు. 75శాంతం రాయితీతో 1.25 లక్షల విలువైన గొర్రెల యూనిట్‌తో కుటుంబాల ఆధాయాన్ని రెట్టింపు చేయాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి ఇచ్చిన గొర్రెలతో లబ్ధిచేకూర్చేందుకు నిరంతరం అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మొదటి జాబితా ద్వారా 5,511 యూనిట్లు గ్రౌండింగ్ చేశామని తెలిపారు. రెండవ జాబితా ద్వారా 5,744 యూనిట్ల లక్ష్యానికి ఇప్పటి వరకు 663 యూనిట్లు గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. మిగిలిన యూనిట్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు గ్రౌండింగ్ చేసేందు కు నెలకు రెండు వేల యూనిట్లను కొనుగోలు చేయాలని తెలిపారు. అయితే వరంగల్ అర్బన్ జిల్లాకు కర్నూల్ జిల్లాలోని అర్బన్, సెమీ అర్బ న్ ప్రాంతాలుగావున్న మూడు మండలాలు కేటాయించినందున యూనిట్ల కొనుగోలులో ఇబ్బందిగా ఉన్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దానికి స్పందిస్తూ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులతో మాట్లాడి మొత్తం కర్నూల్ జిల్లా పరిధిలో యూనిట్ల కొనుగోలుకు వెసులుబాటు కల్పిస్తానని కలెక్టర్ హామి ఇచ్చారు. ఈ నెల 24 నుండి గొర్రెల యూనిట్లు పంపిణీ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుండి మొదటి విడుతగా 10 కోట్లు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ప్రతి గొర్రెకు ఇన్స్‌రెన్సు తప్పనిసరి అని, ఇన్స్‌రెన్సు ప్రతిని లబ్ధిదారునికి ఇవ్వాలని స్పష్టం చేశారు. యూనిట్ల గ్రౌండింగ్‌పై ప్రత్యేక రిజిష్టర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. లబ్ధిదారులు, అధికారుల సమస్యలను తెలుసుకుని స్పందించుటకు వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేయాలని తెలిపారు. మొదటి లిస్ట్‌లో చనిపోయిన 650 గొర్రెలకు ఇన్స్‌రెన్సు క్లైయిమ్ చేసినట్లు తెలిపారు. వాటిలో 399 గొర్రెలను ఇన్స్‌రెన్స్ మంజూరు అయినందున తిరిగి కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పశువైద్యాధికారి పరంజ్యోతి, ఎడి శ్రీనివాస్, విజయ్‌డైరీ, డీడీ చంద్రశేఖర్, ముల్కనూర్ జియం భాస్కర్‌రెడ్డి, కరీంనగర్ డైరీ మేనేజర్ నర్సింహా పాల్గొన్నారు.

షీ టీమ్స్‌తో మహిళల్లో ఆత్మవిశ్వాసం
నేర రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతాం: షీ టీమ్స్ ఇన్‌చార్జి ఏసీపీ బాబురావు
నక్కలగుట్ట, డిసెంబర్ 18: నేర రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని, షీ టీమ్స్ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచాయని, ఆకతాయి పనులు చేసి జీవితాలను నష్టపరుచుకోవద్దని షీ టీమ్స్ ఇన్‌చార్జి ఏసీపీ బాబురావు అన్నారు. వరంగల్ సీపీ రవీందర్ ఆదేశానుసారం వరంగల్ రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్, హన్మకొండ ప్రైవేట్ హాస్టళ్లు, ఖాజీపేట ప్రాంతాలలో విద్యార్థినులు, మహిళలను వేధిస్తున్న 25 మంది ఆకతాయిలను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం షీ టీమ్స్ ఇన్సిపెక్టర్ శ్రీనివాసరావు అధ్వర్యంలో ఆకతాయిల తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించిన కౌన్సిలింగ్‌లో బాబురావు మాట్లాడు తూ విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనపుడు ధైర్యంగా భయపడకుండా వచ్చి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేస్తే, నిందుతులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మహిళలకు భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. అబ్బాయిలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రతి విషయం తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. షీ టీమ్స్ తెలియజేస్తే పరువుపోతుందని భావించరాదని తెలిపారు. మహిళా హాస్టళ్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా వారికి ఇబ్బంది కలిగిస్తే యాజమాన్యాలపైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆటోలలో మహిళలు ప్రయాణం చేసే సమయంలో ఆటో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసే మహిళల ఐడెంటిటీ బయటకు రాకుండా చూస్తున్నామని, దీంతో ఫిర్యాదులు పెరుగుతున్నాయని, బాధితులకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. మహిళలను వేధిస్తూ 3 సార్లు పట్టుబడితే వారిపై నిర్భయ ఆక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

బ్యాంక్ అధికారులమంటూ ఖాతాదారునికి ఫోన్

$
0
0

సంగెం, డిసెంబర్ 18: బ్యాంక్ అధికారులమంటూ అకౌంట్ దారునికి ఫోన్ చేసి ఎటియం పిన్ కోడ్ తెలుసుకున్న ఓ అపరిచితుడు డబ్బులు డ్రా చేసుకున్న సంఘటన సంగెం మండలం కొత్తగూడెం గ్రామంలో వెలుగుచూసింది. కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎనబోతుల సాంబయ్యకు ఓ అపరిచితుడు ఫోన్ చేసి మీరు ఎస్‌బీఐ ఎటీఎంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యా దు హెడ్ ఆఫీస్ వచ్చినది. మీకు ఇతర బ్యాంకులలో ఖాతా ఉంటే అట్టి బ్యాంక్ ఎటీయంపై ఉన్న డిజిటల్ నెంబర్లు చెపితే మీకు ఓటీపీ వస్తుందని ఆ ఓటిపి నెంబర్‌ను మాకు తెలిపితే మీరు చేసిన ఫిర్యాదు వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పారు. సాంబయ్యకు హింది రాకపోవడంతో అర్ధం కాక తన కోడలకు ఫోన్ ఇవ్వడంతో ఓటీపీ నెంబర్‌ను అపరిచితులకు తెలిపింది. దీంతో బాధితుడికి చెందిన సంగెం ఆంధ్రాబ్యాంక్ సంబంధించిన ఖాతా నుండి రూ. 44వేలు డ్రా చేసినట్లు బాధితుడు సెల్‌కు మెసెజ్ రావడంతో సదరు బాదితుడు సంగెం ఎస్సైకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు

చలి తీవ్రతకు ముగ్గురి మృతి
సంగెం/నల్లబెల్లి, డిసెంబర్ 18: చలి తీవ్రత తట్టుకోలేక ముగ్గురు మృతి చెందారు. సోమవారం రాత్రి సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం రౌతు కొమురమ్మ(90) సంవత్సరాలు చలి తీవ్రత తట్టుకోలేక ఇంట్లోనే మృతిచెందినది. మృతురాలు కు నలుగురు కుమారులు, మూడో కుమారుడు మాజీ సర్పంచ్ లక్ష్మయ్య కావడంతో ఇతర గ్రామాల సర్పంచ్‌లు మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రీయలలో పాల్గొన్నారు. అలాగే నల్లబెల్లి మండలంలోని రెండు గ్రామాలలో చలి తీవ్రతను తట్టుకోలేక ఇద్దరు మృతిచెందిన మంగళవారం వెలుగు చూసింది. నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన ఇంగోలి వీరన్న(58) అనే వృద్దుడు చలి తీవ్రతను తట్టుకోలేక తెల్లవారుజామున 3గంటలకు మృతిచెందినట్లు బందువులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే విధంగా నారక్కపేట గ్రామానికి చెందిన శ్రీపతి ఐలమ్మ(65) వృద్దురాలు చలి తీవ్రతతో మృతిచెందింది.

విద్యుత్ ఆదాకు సౌర విద్యుత్ కేంద్రం
హంటర్‌రోడ్, డిసెంబర్ 18: స్మార్ట్ సీటీ మిషన్ క్రింద సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక చేపట్టనున్నట్లు బల్దియా కమిషనర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో లీ అసోసియేట్ ప్రతినిధులతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు డీపీఆర్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతూ విద్యుత్ చార్జీల ఆదా కోసం బల్దియా ద్వారా స్మార్ట్ సీటీ మిషన్‌లో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక చేస్తునట్లు ఆయన తెలిపారు. విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థలం, సబ్ స్టేషన్ ఏర్పాటు తదితర సమగ్ర వివరాలతో పూర్తి కార్యాచరణ నివేదిక సమర్పిచాలని ఆయన అన్నారు.

రైతులకు నష్టపరిహారం అందించాలి
ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్
ఏటూరునాగారం, డిసెంబర్ 18: మండల వ్యాప్తంగా పెథాయ్ తుఫాన్‌తో నష్టపోయిన వరి, మిర్చి రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నా రు. మంగళవారం మండలంలోని చిన్నబోయినపల్లి, రామన్నగూడెం, రాంనగర్‌లతోపాటు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను, పంట పొలాల్లోవున్న ధాన్యాన్ని, మిర్చి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫోన్లో కలెక్టర్‌తో పాటు వ్యవసాయ, హార్టీ కల్చర్ అధికారులతో మాట్లాడారు. ఐకెపి, జిసిసి, పిఎసిఎస్‌ల ద్వారా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన పంట నష్టాన్ని వ్యవసాయ, హార్టీకల్చర్ అధికారులు సర్వేచేసి వరి, మిర్చి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడి అందించాలన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, పంట నష్టంతోపాటు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు రఘు, వెంకన్న, రామయ్య, ఖలీల్, దేవేందర్, రాము, కోటయ్య, చిన ఎల్లయ్య, బాలరాజు రాధిక తదితరులు పాల్గొన్నారు.

జనవరి 2 తర్వాత పంచాయతీ ఎన్నికలు

$
0
0

హంటర్‌రోడ్, డిసెంబర్ 18: జనవరి 2 తర్వాత ఎప్పుడైన గ్రామ పంచాయతీ ఎన్నిలకు నోటిఫికేషన్ వెలువడవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి వీడియో కాన్పరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. జనవరి 2 తరువాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానునట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని సరిచూసుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల నిర్వహాణకు సర్వం సిద్దం చేసినట్లు ఆయన వివరించారు. జిల్లాలో 130 పంచాయతీలు ఉన్నాయని, ఐనవోలు మండలం, ఒంటిమామిడిపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం పదవీ కాలం 2020 వరకు ఉన్నందున 129 గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ ఎస్ దయానంద్, జెడ్పీ సీఈవో విజయ్‌గోపాల్, డీపీవో యం ఏ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

రేపు వరంగల్‌కు కేటీఆర్ రాక
టీఆర్‌ఎస్ అర్బన్ కార్యాలయానికి శంకుస్థాపన * భారీగా స్వాగత ఏర్పాట్లు..

వరంగల్, డిసెంబర్ 18: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల చేపట్టిన కేటీఆర్ మొదటి సారిగా వరంగల్ జిల్లా పర్యటనను ఎంచుకున్నారు. ఉద్యమ జిల్లా కావడంతో కేటీఆర్ ప్రధానంగా వరంగల్ జిల్లాకు రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా బాల సముద్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం వరంగల్ కేడీసీ కళాశాల గ్రౌండ్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంగళవారం కడియం శ్రీహరి పర్యవేక్షించారు. ముందుగా జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళా తోరణం వద్ద కేటీఆర్ ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుండి జనగామ ప్రిస్టన్ గ్రౌండ్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఉం టుంది. ఆ తర్వాత వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయానికి శంఖుస్ధాపన చేసి అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టాల్సి ఉన్నందున పార్టీని పటిష్టం చేసి రానున్న పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుబాటలో తీసుకెళ్లాడానికి సమర్ధుడైన కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీ మరింత పటిష్టం అవుతుందనే తమ విశ్వాసం అని అన్నారు.మొదటి నుండి ఓరుగల్లు టీఆర్‌ఎస్ పార్టీ వెంట కేసీఆర్‌కు అండగా నిలిచిన జిల్లా అని అన్నారు. 2014,2018 ఎన్నికల్లో కూడా ఈ జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టారని కడియం వెల్లడించారు.

ఆదిశిలాక్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

$
0
0

మల్దకల్, డిసెంబర్ 18: ఆదిశిలాక్షేత్రానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 5.30గంటలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సతీసమేతంగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ అర్చకులు మధుసూధనాచార్యులు, రమేషాచార్యులు, ఆలయ చైర్మన్ ప్రహ్లాద్‌రావు సాదరంగా స్వాగతం పలికి ఉత్తరద్వారం ద్వారా దర్శించుకోవడానికి ముందుగా పూజలు చేసి ప్రారంభించారు. సాయంత్రం 4గంటల వరకు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ కృష్ణ , సిఐ జక్కుల హనుమంతు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అదేవిధంగా సద్దలోనిపల్లి గ్రామంలోని కిష్టస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని అమరవాయి ఎంపీటీసీ అలివేలమ్మ, కృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం గోపూజా కార్యక్రమాన్ని చేశారు. మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ బండ్ల లక్ష్మిదేవమ్మ, డీఆర్‌డీవో ఏపీడీ శారద మల్దకల్ తిమ్మప్పస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాద్‌రావు, మధుసూధన్‌రెడ్డి, కేశవచారి, అరవిందరావు, సీతారామిరెడ్డి, నరేంధర్, చంద్రశేఖర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, నల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు రూ. 15.22 కోట్ల బీమా
*కలెక్టర్ శే్వతా మహంతి
వనపర్తి, డిసెంబర్ 18: ప్రదాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద మొదటి సారి జిల్లా రైతులు రూ.15కోట్ల 22లక్షల 37వేల 492ల బీమా పొందినట్లు జిల్లా కలెక్టర్ శే్వతామహంతి మంగళవారం తెలిపారు. 2017 సంవత్సరం ఖరీఫ్ పంట రుణాలు పొందిన రైతులు ఈ పథకం కింద పంటల బీమా చేయగా సరైన పంట దిగుబడి రానందున పై మొత్తాన్ని బీమాగా పొందినట్లు ఆమె తెలిపారు. 2018 సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 31 వరకూ ఈ పథకం కింద పంటల బీమాను చేసుకోవచ్చునని అందువల్ల జిల్లాలోని రైతులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రైతులు ఇప్పటి వరకు తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్ చేసుకోవాలని , రుణాల రెన్యూవల్‌తో పాటు బ్యాంకు మేనేజర్లే ఈపంటల బీమాను చేస్తారని ఆమె తెలిపారు. వనపర్తి జిల్లాకు ఈ ప్రధాన మంత్రి ఫజల్ బీమా యోజన కింద వేరుశనగ, వరి, మినుము పంటలకు బీమా చేసుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందని రైతులు కూడా ఈ పథకం కింద పంటల బీమాను చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు.

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
* ఉమ్మడి జిల్లాల మత్స్య పరిశ్రమ అధ్యక్షులు సత్యనారాయణ
కొత్తకోట, డిసెంబర్ 18: మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మత్స్యపరిశ్రమ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు సత్యనారాయణ, ఎంపీపీ గుంతవౌనిక , సింగిల్‌విండో చైర్మన్ రావుల సురేందర్‌నాథ్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ జగన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బీపీఆర్ గార్డెన్‌లో వివిధ గ్రామాలకు మంజూరైన ద్విచక్రవాహనాలను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులకు ద్విచక్రవాహనాలు తీసుకున్న లబ్ధిదారులకు అయిదు సంవత్సరాల ఇన్సూరెన్స్‌తో పాటు రూ.5లక్షల ప్రమాద బీమా ఉంటుందని వారన్నారు. అలాగే వాహనాలతో పాటు ఐస్‌బాక్సులు, ఎలక్ట్రానిక్ కాంటాలను పంపిణీ చేశామని , ఒక్కొక్క వాహనం రూ.50వేలు ఉంటుందని అందులో రూ.12వేలు ప్రీమియం చెల్లిస్తే రూ. 37వేలు సబ్సిడీ ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాకు గాను 2200 వాహనాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 150 వాహనాలను పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు 32 రకాల సబ్సిడీ వాహనాలను ఇస్తుందని చేపల చెరువుకు గాను రూ.8లక్షల 50వేలు సబ్సిడి ఇస్తుందని , ఈ చేపల చెరువు పరిశీలన కోసం ఇరిగేషన్ , రెవెన్యూ, పిషరిస్ అధికారులు పరిశీలించనున్నట్లు తెలిపారు. కేసీ ఆర్ మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ది చేస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. ఇందుకు వాహానాల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌కె గనీ, బాల్‌నారాయణ, మోహన్‌కుమార్, విష్ణువర్దన్‌రెడ్డి, రంగాస్వామి, వామన్‌గౌడ్, సత్యంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా!

$
0
0

కోస్గి, డిసెంబర్ 18: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని వెంటనే నెరవేర్చి అభివృద్ధిని మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తానని కోడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారి నియోజకవర్గంలో పర్యటించి మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో వెలసిన ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు. త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో పర్యటించి నియోజకవర్గ అభివృద్ధికి కావల్సిన కార్యచరణ రూపొందించి టీఆర్‌ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పర్యటనలో రాష్ట్ర నాయకులు కేటీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే రాబోవు పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని, అప్పుడే ప్రజా సమస్యలు తొలగి బంగారు తెలంగాణ సాద్యమవుతుందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు అందరికి సద్వినియోగం అవుతాయని ఆయన తెలిపారు. అనంతరం కోడంగల్ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ అనితాబాల్‌రాజ్, వైస్‌ంపీపీ దోమరాజేశ్వర్, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అన్నకిష్టప్ప, నాయకులు మాస్టర్‌శ్రీనివాస్, వెంకట్‌నర్సిములు, డి.కే నగేష్, కుమ్మరి బిచ్చప్ప,శ్యామ్, వెంకట్‌స్వామిలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఫలితాలు విడుదల
జాబితాలో అవకతవకలు * భగ్గుమన్న నిరుద్యోగులు * విచారణకు డిమాండ్

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 18: ఈనెలాఖరులోగా గ్రామపంచాయతీలలో పంచాయతీ కార్యదర్శుల నియామకం పూర్తి చేయాలని సీఏం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేశారు. జిల్లాలో 311 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేస్తూ హాల్‌టికెట్లను పత్రికలలో ప్రకటనల ద్వారా జిల్లా పంచాయతీ అధికారి మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను చూసిన నిరుద్యోగులు, విద్యార్థులు అధికారుల నిర్వాకంపై భగ్గుమంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కలిక ప్రాతిపదికన నియామకాలు చేసినప్పటికీ, ఈ ఉద్యోగం పొందేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవడంతోపాటు రాత్రంబవళ్లు కష్టపడి చదువుకొని మంచి స్కోరింగ్ సాధించేందుకు ఎంతో శ్రమించి పరీక్షను మంచిగా రాశామని, తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే గట్టినమ్మకంతో ఎదురుచూశామని పలువురు నిరుద్యోగులు సాయిప్రసాద్, శివప్రసాద్, పరమేశ్ తదితరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పత్రికలలో ప్రకటించిన ఫలితాలను పరిశీలిస్తే ఒకే హాల్ టికెట్ నెంబర్లైన 5308662, 2918044 నెంబర్లు రెండు చోట్ల ఉన్నాయని, ఒకే వ్యక్తికి రెండు ఉద్యోగాలు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. అధికారులు ప్రకటించిన ఫలితాలను బట్టి చూస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, రోస్టర్ ప్రకారం కేటగిరి వారిగా ఫలితాలను ఇవ్వలేదని, ఏ కేటగిరిలో ఎంత వరకు కట్ ఆఫ్ ఉందని అధికారులను అడిగితే సరైన సమాధానం రావడంలేదన్నారు. కలెక్టరేట్ వద్దకు చేరి దీనిపై నిరసన తెలుపుతూ కేటగిరి వారిగా వివరాలను ఇవ్వాలని అడిగితే డీపీవో కార్యాలయంకు వెళ్లమని సమాధానం వచ్చిందని, అక్కడికి వెళ్లి డీపీవోను అడిగితే పొంతనలేని సమాధానాలు ఇస్తూ దాటవేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఒకసారి ఒక్కొక్క కేటగిరికి చెందిన కట్ ఆఫ్ మార్కులు చెబితే దానికంటే ఎక్కువగా మార్కులు వచ్చిన వారు ఉన్నారని, వారికి ఉద్యోగం ఎందుకు రాలేదని ప్రశ్నిస్తే జీఎన్టీ నుంచే సెలక్షన్ లిస్టు వచ్చిందని సమాధానం ఇచ్చారని, అంతకుముందు జీఎన్టీ నుంచి 1:5 ప్రకారమని ఒకసారి, 1:3 ప్రకారం జాబితా వస్తే వాటిని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా క్రోడీకరించి అర్హులను ఎంపిక చేశామని చెప్పారని, ఏప్రాతిపదికన ఎంపిక చేశారో చెప్పాలని చెప్పితే సమాధానం రావడంలేదని వాపోయారు. అధికారుల సమాధానాలు, ఎంపిక చేసి ప్రకటించిన ఫలితాలను చూస్తే అనేక అనుమానాలు ఉన్నాయని, ఈ నియామకాలను వెంటనే ఆపేసి సమగ్రమైన విచారణ జరిపించి అర్హులైన వారినే ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఎంపికైన వారి మార్కులు, ఓఎంఆర్ షీట్ తదితర వాటిని బహిర్గతం చేసి పారదర్శకతాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఎంపిక తీరుపై ప్రభుత్వంపై పోరాటం చేయడంతోపాటు న్యాయస్థానంను ఆశ్రయిస్తామని పలువురు నిరుద్యోగులు అన్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు సంబంధిత అధికారి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు.

వనపర్తి జిల్లాకు దేశంలోనే గుర్తింపు తెస్తా

$
0
0

పెబ్బేరు, డిసెంబర్ 18: ఉద్యమాల పురిటి గడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే వనపర్తి జిల్లాకు దేశంలోనే గుర్తింపు తీసుకోస్తానని ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం మొట్టమొదటి సారిగా పెబ్బేరు మండలంలో కృతజ్ఞతా యాత్రతో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామిని దర్శించుకొని కంచిరావుపల్లి, గుమ్మడం, యాపర్ల, తిప్పాయిపల్లి, అయ్యవారిపల్లి, వెంకటాపురం తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున్న పూలు జల్లుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టానని ఆయన గుర్తు చేశారు. ఓడినా గెలిచినా ప్రజలతోనే ఉంటూ వారి అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేశానని తెలిపారు. దాని ఫలితంగా ప్రజలు తనకు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ఈ గెలుపుతో తనపై బరువు బాధ్యతలు మరింత పెంచారని , ప్రజల సేవకుడిగా పని చేస్తూ గ్రామ గ్రామాల్లో సకల సౌకర్యాలు , వౌలిక వసతులు కల్పించి ప్రజల బాగు కోసం కృషి చేస్తానని ఆయన హామీచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న సన్నిహితంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే కాక దేశంలోనే వనపర్తి జిల్లాను ఆగ్ర పథాన నిలుపుతానని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన వెంట టీ ఆర్ ఎస్ నాయకులు మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ గౌనిబుచ్చారెడ్డి, మాజీ జడ్పిటిసి కర్రెస్వామి, టీ ఆర్ ఎస్ మండల అద్యక్షులు హరిశంకర్‌నాయుడు, ఎంపిపి పద్మావతి వెంకటరమణ, ఆయా గ్రామాల నాయకులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.
చలి గాలుల బీభత్సం!
* రెండు రోజులుగా కమ్ముకున్న మబ్బులు
* పెథాయ్ తుపాను ప్రభావంతో ప్రజలు గజగజ
కోస్గి, డిసెంబర్ 18: పొరుగు రాష్ట్రంలో పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తీవ్ర గాలులతో ఓవైపు వర్షాలు కురుస్తుంటే.. గత రెండు రోజులుగా కోస్గి పట్ణంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయ చలిగాలులతో ప్రజలను బంబేలెతిస్తోంది. గత రెండు రోజులుగా గాలిలో తేమశాతం పెరగడంతో ఎముకలు కొరికే విధంగా చలిగాలులు వీయడంతో జనాలు ఇళ్ళకే పరిమితమయ్యే పరిస్థితి దాపురించాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రజలు ఉన్ని దుస్తువులైన స్వెట్టర్లు, మఫ్లర్లు, మంకీటోపీలులను భారీగా కొనుగోరు చేస్తున్నారు. ఉద్యోగస్తులు, మార్కెట్లో అత్యవసర పనులు ఉన్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ జాగ్రత్తలతో బయట అక్కడక్కడ కనిపిస్తున్నారు. మరో రెండు రోజులు వాతావరణంలో ఎలాంటి మార్పులు లేకుండా ఇలేగా శీతల గాలులు వీస్తే చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
* మరో ఇద్దరికి గాయాలు
వెల్దండ, డిసెంబర్ 18: హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై గల వెల్దండ మండలం చెర్కూర్ బస్సుస్టేజి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. వెల్దండ ఎస్సై పెండెం వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కల్వకుర్తి నుంచి హైద్రాబాద్‌కు టీఎస్08ఇఎంఓ 0129 గల కారు చెర్కుర్ బసుస్టేజి సమీపంలో అదుపు తప్పి చెట్టుకు ఢీ కోట్టిన సంఘటనలో కల్వకుర్తి పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కుడముల రవీందర్‌రెడ్డి(50), హైద్రాబాద్‌లోని జిల్లేలాగూడకు చెందిన మాజీ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి(55) మృతి చెందారు. అదే విధంగా కల్వకుర్తికి చెందిన తలసాని సింహారెడ్డి, కొత్తుర్‌కు చెందిన సుదర్శన్‌రెడ్డి గాయపడ్డారు. కాగ కారుప్రమాదంలో త్రీవంగా గాయపడిన రవీందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి స్పహ తప్పి పడిపోవడంతో కొన ఊపిరితో ఉన్నట్లు నాడి కొట్టుకుంటున్నట్లు గ్రహించిన ఎస్సై పెండెం వీరబాబు హూటా హూటీన తన పోలీస్ వాహనంతో పాటు మరో వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ అసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఇరువురు మృతి చెందినట్లు తెలిపారు. ఆమేరకు వెల్దండ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. సుదర్శన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్‌కు తరలించారు.


భక్తి శ్రద్ధ్దలతో వైకుంఠ ఏకాదశి

$
0
0

మహబూబ్‌నగర్, డిసెంబర్ 18: ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని భక్తులు వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు. అందులో బాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ముక్కోటి ఏకాదశిని ఎంతో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. భక్తకోటికి ఇలవేల్పులు గల ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవాలయాలకు భక్తుల తాకిడి కనిపించింది. భక్తులు భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండే భక్తలు అయా దేవాలయాల దగ్గర బారులు తీరి నిలిచారు. దక్షిణాయణంలో యోగ నిద్రలోకి వెళ్లిన మహా విష్ణువు ఈ రోజునే మెల్కొటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత సంచరించుకుంది. జిల్లాలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి దేవాలయాలకు తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీయడంతో పోలీసులు సైతం స్వామి వారి దర్శనానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తును నిర్వహించారు. ఇకపోతే జిల్లాలోనే పేదల తిరుపతిగా భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ మన్యంకొండ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వేలాది మంది భక్తులు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తరలివచ్చారు. కోనేరులో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్నారు. గోవిందనామస్మరణతో మన్యంకొండ మార్మోగింది. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పట్టణంలోని కాటన్‌మిల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వేలాది మంది తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. దేవాలయంలోని వైకుంఠ ద్వారం నుండి మొదలుకుని దాదాపు అర్ర కిలోమిటర్ మేర భక్తులు క్యూలైన్‌లో నిలిచారు. వేవాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడంతో పోలీసులు సైతం అక్కడికి చేరుకుని బందోబస్తును నిర్వహించారు. దేవాలయం వారు సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మరో పుణ్య క్షేత్రమైన కురుమూర్తి స్వామి దేవాలయానికి సైతం వేలాది మంది తరలివచ్చారు. కాంచన గుహగా పేరొందిన కురుమూర్తి కొండలు వెంకటేశ్వర స్వామి నామస్మరణంతో మార్మోగాయి. గ్రామ గ్రామాన వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో కొనసాగాయి. కృష్ణానది తీరన గల వైష్ణవ ఆలయాలకు భక్తుల తాకిడి కనపించింది. కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసిన భుక్తలు స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీరంగాపూర్ పద్మనాభ స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తడంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకోవడానికి రావడంతో ఆ ప్రాంత మంతా భక్త జన సందోహంగా మారింది. ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకుని అయా దేవాలయాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. విధ్యుత్ దీపాలతో పాటు మామిడి తోరణాలతో దేవాలయాలు ముస్తాబు చేశారు. తెల్లవారుజాము నుండి మొదలుకుని రాత్రి వరకు వైష్టవ దేవాలయాలకు భక్తులు వెళ్లి స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకుని వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా వైకుంఠ ఏకాదశి

$
0
0

కంఠేశ్వర్, డిసెంబర్ 18: సకల శుభాలను కలిగించే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం నగరంలోని జెండా బాలాజీ మందిరం, నీలకంఠేశ్వరాలయం, సుభాష్‌నగర్‌లోని రామాలయం, ఖిల్లా రామాలయం, చక్రం గుడి, శంభులింగేశ్వరాలయం తదితర ఆలయాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుండే ఆలయాల వద్ద క్యూ లైన్లలో భక్తులు బారులుతీరి కనిపించారు. జెండా బాలాజీ ఆలయమంతా గోవింద నామస్మరణలతో మారుమోగింది. ఈ సందర్భంగా నీలకంఠేశ్వరాలయ అర్చకుడు సుభాష్ పంతులు మాట్లాడుతూ, విష్ణుమూర్తికి ఇష్టమైన తిథి ఏకాదశి అని, చంద్రమాసం ప్రకారం ప్రతి మాసం శుక్ల పక్షంలో 11వ తిథి, కృష్ణపక్షంలో 11వ తిథియే ఏకాదశి అని, నెలకు రెండు ఏకాదశులు అంటే ఏడాదికి 24ఏకాదశులు వస్తాయన్నారు. కాబట్టి చాలా మంది భక్తులు ప్రతి నెలలో వచ్చే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంటారని అన్నారు. దీనికి సంబంధించి విష్ణు పురాణాల్లో అనేక కథలు ఉన్నాయన్నారు. గరుడ వాహనదారుడైన మహావిష్ణువు ఈ ముక్కోటి ఏకాదశి రోజున దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు తన దివ్యరూపంలో దర్శనమిస్తారని అన్నారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటుంటారని తెలిపారు. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కోట్లల్లో ఏకాదశి వ్రతాలు చేసిన దానితో సమానమని విష్ణు పురాణాల్లో రాసి ఉందన్నారు. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండేవారు సత్యవ్రతాన్ని, బ్రహ్మచర్యాన్ని పాటించాలన్నారు. రోజంతా హరినామాన్ని జపిస్తే మేలు జరుగుతుందన్నారు. కాగా, ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేకంగా ఉత్తర ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆలయాల్లోని ఉత్సవమూర్తుల విగ్రహాలను ఉత్తర ద్వారంలో వేంచేయింపజేసి సుందరంగా అలంకరించారు. ఉదయం ఐదు గంటల నుండి ఉత్తర ద్వారం తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అప్పటికే బారులుతీరిన భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. మధ్యాహ్న సమయం వరకు కూడా ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది.

విజృంభిస్తున్న వ్యాధులు రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

నిజామాబాద్, డిసెంబర్ 18: వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ముప్పిరిగొంటున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు సుస్తీ బారినపడుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అనేక మంది వ్యాధుల బారిన పడుతున్నారు. ఆస్థమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారితో పాటు చిన్నారులు, వృద్ధుల పరిస్థితి అయితే దయనీయంగా మారింది. చలి తీవ్రత ఒక్కసారిగా ఊహించని రీతిలో పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. పెథాయ్ తుపాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో మంగళవారం కూడా చలి తీవ్రత కొనసాగింది. తుపాను ప్రభావం అనే కాకుండా గత వారం రోజుల నుండి కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండడంతో చలి అందరినీ వణికిస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. చలి తీవ్రతకు తోడు పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది కొరత, వారిని పర్యవేక్షించే అధికారులు, సిబ్బంది తగినంతగా లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. ప్రతి పల్లెలోనూ పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. మురుగునీటి కాల్వలను శుభ్రపర్చకపోవడం, రోడ్లపై వేసిన చెత్తాచెదారం పేరుకుపోవడం, తాగునీటి పైపులైన్‌లకు లీకేజీ వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన వైద్య ఆరోగ్యశాఖ మొద్దు నిద్రను వీడలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు సరిపడా మందులను అందుబాటులో పెట్టకపోవడంతో మారుమూల ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వర్తించే సిబ్బంది స్థానికంగా ఉంటూ, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టి ప్రజలను చైతన్యపర్చాలని జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా, కిందిస్థాయి సిబ్బంది స్థానికంగా ఉండకుండా పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులకు గురైన వారు వైద్య చికిత్సల కోసం సర్కారీ దవాఖానాలకు వెళ్తే ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేక ఉసూరుమంటూ వెనుదిరిగి వస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పేద కుటుంబాలకు చెందిన వారు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుని అప్పుల పాలవుతున్నారు. జనావాసాల నడుమే అపరిశుభ్రత తాండవిస్తుండడంతో దోమలు, ఈగలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని తెలుస్తోంది. సర్కార్ మందులకు విరివిగా నిధులు విడుదల అవుతున్నా, పీహెచ్‌సీలలో మాత్రం మందుల కొరత వెంటాడుతోంది. వాంతులు, విరేచనాలు, మలేరియా, డెంగ్యూ, దగ్గు, జలుబు వంటి వ్యాధులతో ప్రజలు సర్కారు ఆసుపత్రులకు వెళ్లినా, అక్కడ సరైన వైద్యం అందడం లేదు. ఫలితంగా గ్రామీణ, మండల ప్రజలు పట్టణాలు, నగరాలలోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు వివిధ టెస్టుల పేరుతో వేలల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. సదరు ల్యాబ్‌లతో పాటు మెడికల్ షాపుల కూడా డాక్టర్లకు చెందినవే ఉండడంతో అవసరం లేకపోయినా ఎక్కువ మోతాదులో మందులు రాస్తున్నారని, వాటిని కొనుగోలు చేసేందుకు బడుగు జీవులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఇకనైనా జిల్లా యంత్రాంగం స్పందించి, వైద్య ఆరోగ్య, పంచాయతీ శాఖలను సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లక్ష్మీనృసింహునికి ప్రత్యేక పూజలు
భీమ్‌గల్, డిసెంబర్ 18: భీమ్‌గల్ మండలంలోని లింబాద్రిగుట్ట వద్ద గల శ్రీ లక్ష్మీనర్సింహస్వామికి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పాలాభిషేకం, జలాభిషేకం నిర్వహించి రంగు రంగుల పూలతో అందంగా అలంకరించారు. ఉదయం 5గంటల 30 నిమిషాలకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
పల్లికొండ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
భీమ్‌గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామికి వేద బ్రాహ్మణులైన ప్రమోద్, వేణులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి పాలాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి వారిని రంగు రంగుల పూలతో అందంగా అలంకరించారు. అనంతరం వైకుంఠ ఏకాదశి పర్వదిన ప్రాధాన్యత గురించి బ్రాహ్మణోత్తములు భక్తులకు విశదపర్చారు. పల్లికొండ గ్రామంతో పాటు పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యంతో పునీతులయ్యారు.

ముసురుతో తడిసి ముద్దయిన నగరం
కంఠేశ్వర్, డిసెంబర్ 18: పెథాయ్ తుపాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా మేఘాలు కమ్ముకుని ఒక మోస్తారుగా కురిసిన వర్షంతో నిజామాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. ఎటుచూసినా ప్రధాన రోడ్లు మొదలుకుని కాలనీలన్నీ బురదమయంగా మారాయి. చంద్రశేఖర్ కాలనీ, గౌతంనగర్, సాయినగర్, నాగారం, ధర్మపురి హిల్స్, వెంగళ్‌రావ్‌కాలనీ, వినాయక్‌నగర్, ఆటోనగర్, మాలపల్లి, దుబ్బ తదితర ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారాయి. ఓపెన్ ప్లాట్స్ జలమయం అయ్యాయి. ఇక పెథాయ్ తుఫాన్‌తో తీవ్ర చలిగాలులు వీయడంతో ప్రజలు తమ దైనందిన పనులను చాలావరకు వాయిదా వేసుకుంటూ ఇళ్లను వీడి బయటకు వచ్చేందుకు సాహసించలేదు. అత్యవసర పనులు ఉన్న వారు చలి బారి నుండి తమనుతాము కాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, చలి తీవ్రత అధికంగా ఉన్నందున ఆరోగ్య విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. ప్రత్యేకించి చిన్నారులు, వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

మహాభారతంలో ఉపాఖ్యానాలు-78

$
0
0

పూర్వం కాశీరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. వారు యుక్త వయస్కులై స్వయంవరానికి సిద్ధంగా ఉన్నారు. రాజు వారి స్వయంవరానికి సమస్త దేశాల రాజులను ఆహ్వానించాడు. ఆ స్వయంవరానికి తన తమ్ముడైన విచిత్రవీర్యుని కోసం, భీష్ముడు కూడా వెళ్లాడు. అతను అక్కడ సమావేశమైన రాజులందరినీ హెచ్చరించి, తాను ఆ కన్యలను తన తమ్ముని కోసం తీసుకొనిపోతున్నాని చెప్పి వారిని రథం పైకి ఎక్కించాడు. ఎందుకంటే వారు పరాక్రమమే శుల్కంగా కలవారు. రాజులందరికీ భీష్ముని పైన కోపం వచ్చి అతనితో యుద్ధానికి సిద్ధమైనారు. కాని భీష్ముడు వారిపై బాణవర్షం కురిపించి వారందరినీ ఓడించాడు. తర్వాత అతను ఆ కన్యలను తీసుకొని హస్తినాపురానికి వచ్చి వారిని సత్యవతికి అప్పగించాడు. అతను సత్యవతి పాదాలకు మ్రొక్కి ఇలా అన్నాడు. ‘‘అమ్మా! వీరు కాశీరాజు కుమార్తెలు. పరాక్రమమే వీరికి శుల్కం. కనుక నేను అందరి రాజులను జయించి నా తమ్ముని కోసం వీళ్ళను తెచ్చాను’’.
సత్యవతి వారిని చూసి చాలా సంతోషించింది. వివాహం ఇక జరుగబోతుందనగా కాశీరాజు పెద్ద కూతురు అంబ మెల్లగా సత్యవతితో తాను సాళ్వరాజుని వరించానని చెప్పింది. ఆమె మాటలు విన్న భీష్ముడు తన పొరపాటు తెలుసుకొని ఆమెను సాళ్వరాజు దగ్గరకు పంపాడు. ఆమె సాళ్వరాజు దగ్గరకు వెళ్ళి ‘‘నేను నీ గురించే వచ్చేశాను’’ అంది.
అంబ మాటలు విని సాళ్వరాజు ఇలా అన్నాడు. ‘‘సుందరీ! నేను భీష్ముని చేతిలో ఓడిపోయాను. అతను మమ్మల్నం దరినీ జయించి నిన్ను గెలుచు కున్నాడు. నీవు పరాయి సొత్తు అయినావు. నిన్ను నేను భార్యగా స్వీకరించలేను. ధర్మం తెలిసిన నేను పరాయి స్ర్తీని ఎలా స్వీకరిస్తాను? కనుక నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళు. ఇక్కడ సమయం వ్యర్థం చేసుకోకు.’’
అంబ సాళ్వుని అనునయిస్తూ ఇలా అంది. ‘‘రాజా! దయచేసి అలా అనకు. నేను భీష్మునితో ఆనందంగా వెళ్ళలేదు. అతడు అందరు రాజులను జయించి నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళాడు. నేను ఏ తప్పు చేయలేదు.
నీ పట్ల అనురాగం కల నన్ను విడిచిపెట్టడం ధర్మం కాదు. నేను భీష్మునితో మన విషయం చెప్పి అతని అనుమతితోనే ఇక్కడకు వచ్చాను. ఆ భీష్ముడు నన్ను కోరలేదు. నా చెల్లెళ్ళను తన తమ్మునికిచ్చి వివాహం చేశాడు. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ భర్తగా వరించలేదు. నినే్న కోరుకున్నాను. కనుక నన్ను భార్యగా స్వీకరించు’’.
అంబ ఇలా వేడుకుంటూ ఉన్నా సాళ్వుడు ఆమెను స్వీకరించడానికి ఇష్టపడలేదు.
అతను ఇలా అన్నాడు. ‘‘వెళ్ళు, వెళ్ళు! నేను భీష్మునికి భయపడుతున్నాను. భీష్ముడు నిన్ను పరిగ్రహించాడు. నాకు నువ్వు అక్కరలేదు’’.
అంబ ఏడుస్తూ అక్కడినుండి బయలుదేరింది. ఆమె ఇలా మనసులో చింతించింది. ‘‘నాలా ఇలాంటి దుస్థితిలో ఉన్నవారు ఎవరూ లేరు. బంధువులకు ముందే దూరమయ్యాను. ఇప్పుడు సాళ్వుడు కూడా తిరస్కరించాడు. మళ్ళీ హస్తినాపురికి తిరిగి వెళ్ళలేను. ఇప్పుడు ఎవరిని నిందించను? నన్నా లేక వీరుడైన భీష్ముడినా లేక నాకు స్వయంవరం ప్రకటించిన మా తండ్రినా?
వీర్యశుల్కంగా నన్ను జనం మధ్యలో నిలబెట్టిన
వివేకశూన్యుడు అయిన నా తండ్రికీ, భీష్మునికీ, నాకూ బుద్ధిలేదు. నాకు జరిగిన ఈ అన్యాయానికి భీష్ముడే కారణము కనుక తపస్సు చేసి శక్తి సంపాదించుకొని, భీష్మునిపై ప్రతీకారం తీర్చుకుంటాను’’.
ఈ విధంగా ఆలోచిస్తూ మునుల ఆశ్రమాలకు వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపింది. అక్కడి మునులతో అంబ తన విషయాలు అన్నీ చెప్పింది. ఆ ఆశ్రమంలో గొప్ప తపస్వి అయిన శైఖావత్యముని ఉన్నాడు. అతను ఆమెతో ఇలా అన్నాడు - ‘‘ఈ స్థితిలో ఆశ్రమవాసులై తపస్సు చేసుకొనే మునులు నీకు ఏమి సహాయం చేయగలరు?’’
అంబ ఇలా అంది - ‘‘నా మీద దయచూపండి. నేను సన్యాసాశ్రమం స్వీకరించి తపస్సు చేసుకుంటాను’’. అప్పుడు ముని ఆమెను ఓదార్చి తక్కిన వారితో ఆమె పని సానుకూలమయ్యేటట్లు ప్రయత్నం చేయాలని చెప్పాడు.
అప్పుడు మునులందరూ అంబ కోసం ఏదో ఒకటి చేయాలని అనుకొన్నారు. కొందరు ఆమెను తండ్రి ఇంటికి పంపే యాలనుకున్నారు. కొందరు భీష్ముని నిందించాలనుకొన్నారు. ఇంకొందరు ఆమెను సాళ్వునికి నచ్చచెప్పి అతనికి అప్ప జెప్పాలన్నారు. కొందరు ఆ పని వద్దన్నారు. వారంతా ఆమెతో ఇలా అన్నారు. ‘‘అమ్మా! నీవు సన్యాసం స్వీకరించవద్దు. నీవు నీ తండ్రి దగ్గరకు వెళ్ళు. అతను ఏం చేయాలో అది చేస్తాడు. తండ్రి యొక్క ఆశ్రయం లాగ ఇంకే ఇతర ఆశ్రయముండదు. స్ర్తీలకు భర్త కాని, తండ్రికాని గతి. కష్టకాలంలో తండ్రి ఆశయంలో ఉండడమే స్ర్తీలకు ఉత్తమం. ఆశ్రమంలో ఉంటే అనేక కష్టాలు రావచ్చు. తండ్రి దగ్గర అలాంటి కష్టాలు ఉండవు’’.
అప్పుడు అంబ వారందరికీ నమస్కరించి ఇలా అన్నది. ‘‘మహాత్ములారా! నేను తిరిగి కాశీరాజు ఇంటికి వెళ్ళను. అలా వెళితే బంధువులందరిలో అవమానం పాలవుతాను. కనుక మీ తాపసుల సమక్షంలో తపస్సు చేసుకుంటాను. ఇలాంటి కష్టం మరల వచ్చే జన్మలో కలగకూడదనే తపస్సు చేస్తానం టున్నాను’’.
ఇంకావుంది...

స్వాధ్యాయ సందోహం-173

$
0
0

రెండు రాజ్యాల మధ్య వైర భావాలు పొడసూపితే అవి ఒకదానినొకటి దురాక్రమణ చేసేందుకు తీవ్ర ప్రయత్నంచేస్తాయి. ఆ సమయంలో ఆ దేశంలోని ఉత్సాహవంతులైన వీరులు- పౌరులు తమ దేశాధిపతి, సేనాధిపతి లేదా నాయకునితో ఎలా ప్రసంగిస్తారో దానిని ఈ మంత్రం వివరిస్తూంది.
‘‘శత్రువులు మా నెత్తిమీదకు వచ్చిపడ్డారు. వారు మమ్ములను తమకు దాసులుగా చేసుకొనేందుకు ఎత్తులు వేస్తున్నారు. మీ నేతృత్వంలో మేము వారి ఎత్తులను-ప్రయత్నాలను వమ్ముచేస్తాం. శతృవులు మమ్ములను యుద్ధానికి కవ్విస్తున్నారు.
వారు తమ సైనిక బలం పైన- బాహుబలంపైన చాలా దృఢ విశ్వాసంతో ఉన్నారు. వారిని మేము పరాజితులను చేయగలమన్న పూర్తివిశ్వాసం మాకుంది. మీరు మాకు నాయకత్వం వహించండి. సైన్యాన్ని యుద్ధంలో విజయపథంగా నడిపించడమొక కళ. వివిధ మనస్తత్వాలు గల అనేకుల్ని స్వదేశంకోసం ప్రాణాలర్పించే తెగువగలవారిగా శత్రువులపైకి నడిపించడం మాటలేమీకాదు. దీనికి బుద్ధిచాతుర్యం, దూరదృష్టి మొదలైన గుణాలెంతో ముఖ్యం.
ఇలా ప్రసంగించినవారు సహితం బలహీన క్షణాలలో తమ శక్తియుక్తులను మరచి మరల భీరువులై దైవాన్ని ఎలా ప్రార్థిస్తారో క్రింది మంత్రం ఇలా వివరిస్తూంది.
వి న ఇంద్ర మృధో జహి నీచా యచ్ఛపృతన్యతః
అధమం గమయా తమో యో అస్మాన్ అభిదాసతి॥ అథ.1-21-2.
భావం:- ఓ ఇంద్రా! నీవు హంతకులను వధించు. కలహప్రియులై మాతో యుద్ధం చేసేవారిని క్రియాహీనులుగా చేయి. మమ్ము ఓడించి దాసులుగా చేసుకోదలచిన- వారిని ఘోరాంధకారంలోనికి త్రోసివేయి.
కాబట్టి అలసత్వమూ, అజాగ్రత్త పరాజయానికి ప్రథమ సోపానాలు. నీవు విజయాన్ని కోరుకొంటే ‘స త్వం నో వర్ధప్రయసా శచీవసో’ ‘‘అభివృద్ధియే ధనంగాగలవాడా!
నీవు మమ్ము ధర్మపురుషార్థంతో ముందుకు నడిపించు’’అని నాయకుణ్ణి అర్థించాలి. ఎవరికి కూడ దుడుకుతనంతో ప్రవర్తిస్తే విజయం లభించదు. క్షణికమైన ముఖప్రీతి మాటలకు పొంగిపోయి తమ భుజబల దర్పంతో శత్రువులమీద విరుచుకొని పడితే విజయం మాత్రం వరించదు. అట్టి దుడుకు చేష్ట చివరకు నిరాశనే కలిగిస్తుంది.
ఆ దశలో మనిషి బుద్ధి స్థిరంగా ఉండదు. నీతి శాస్తజ్ఞ్రులు చెప్పిన ‘బుద్ధి ర్యస్య బలం తస్య నిర్బుద్ధేస్తు కుతోబలమ్’ బుద్ధిగల వాడిదే బలం. బుద్ధిహీనుడికి బలమెక్కడుంటుంది? అన్న వచనానుసారం మనిషికి నిజమైన బలం బుద్ధియే. కాబట్టి సేనా నాయకుడు బుద్ధిమంతుడై యుండాలి.
అందుకే మంత్రంలో సేనానాయకుణ్ణి ‘శచీవసు’=బుద్ధియే ధనంగా గలవాడని పేర్కొంది. అట్టి వానికి హితం ఆయన అనుచరులలో కూడ ఇమిడి ఉంటుంది. అందుకే వేదం ‘్ధయ జిన్వ వసువిదః’ ‘‘విజయ ధనాన్ని చేకూర్చే బుద్ధిని ఉత్తేజపరచుము’’అని మంత్రంలో ప్రతిపాదించింది. కాబట్టి నాయకుడు బుద్ధిమంతుడు, బుద్ధిమంతులైన అనుయాయులు, దేశంలోని పౌరజనం కూడ బుద్ధిమంతులు అయితేనే ఆ దేశానికి ఎటువైపు నుండియు భయం సంభవించదు.
ఓ అగ్నీ! నీవు సక్రమ మార్గంలో
ధనప్రదానం చేస్తావు
నూ నో అగ్నే- వృకేభిః స్వస్తి వేషి రాయః పథిభిః పర్ష్యంహః
తా సూరిభ్యో గృణతే రాసి సుమ్నం మదేమ శతహిమాః సువీరాః॥
ఋ.6-4-8॥
భావం:- ఓ అగ్నీ! నిష్కపటమైన మార్గంలో సుఖదాయకమైన ధనాన్ని మాకు నిస్సందేహంగా ప్రదానంచేస్తున్నావు. దానివలన మా దుర్గతుల నుండి మమ్ము సరిదిద్ది కాపాడుతున్నావు. నిన్ను ప్రార్థన చేసినవానికి ఉత్తమ విద్వాంసులనుండి ధనాన్ని దానినుండి సుఖాన్ని అనుగ్రహిస్తున్నావు. ఉత్తమ వీరులమైన మేము వందల యేండ్లు ఆనందంగా ఉంటాం.
ఇంకావుంది...

సుందరకాండ

$
0
0

ఇయంవై కద్రూరసౌ సువర్ణీ
ఛందాగంసి సౌపర్ణేయాః
ఈమె కద్రువు. ఈమె సుపర్ణి. ఈ సుపర్ణికి ఛందస్స్య రూపులైన ముగ్గురు పుత్రులున్నారు. వారు సౌవర్ణేయులు. జగతి త్రిషుటప్పు గాయత్రి అని వాళ్ళ పేర్లు.
సా బ్రవీదప్మై వై పితరౌ, పుత్రాన్ బిభృతస్తృతీ
య స్వామితో దివి. సోమస్తమాహరం.
తేనాత్మానం
నిష్క్రీణీయే ష్వితి మా కద్రువవోచదితి.
(కృ.య.వేద సంహిత 6-1-6)
దేవలోకానికి వెళ్లి సోమాన్ని తీసికొని రండి అని కద్రువు చెప్పిందట. సోమమంటే అమృతమే. అందుకని. మొదటి కొడుకు జగతి బయలుదేరివెళ్ళేడు. దేవతల చేతులో ఓడి రెండు రెక్కల వంటి రెండక్షరాల్ని పోగొట్టుకొని వచ్చేడు. అంతవరకు పదునాలుగక్షరాలతో ఉన్న జగతి పండ్రెండుక్షరాలు కలదైందట.
ఆ తరువాత
త్రిషుటప్పు బయలుదేరివెళ్ళేడు. అతనికీ ఇదీ జరిగింది. తనూ రెండక్షరాలను పోగొట్టుకొని వచ్చేడు. అందువలన ఆనాటి నుండి పదమూడక్షరాలు కల త్రిష్టుప్పు పదకొండు అక్షరాలు కలదైంది. ఆ తరువాత గాయత్రి బయలుదేరి వెళ్ళి దేవతలతో దెబ్బలాడి జయించి సోమలతతోబాటు తన సోదరులు పోగొట్టుకొనిన నాలుగు అక్షరాలనూ కూడా తెచ్చేడు. కనుక అనాటి నుండి గాయత్రి ఎనిమిది అక్షరాలు కలదైందట అనివేదం చెబుతున్నది.
ఆంజనేయ స్వామి అమృత దర్శనాన్ని చేయగల నేత్రం గాయత్రి గరుడుని నేత్రం. అందుకని స్వామి తనను సువర్ణునిగ భావించుకొన్నాడు.
ఆ తరువాత-
పిబన్నివ బభౌచాపి సోర్మిజాలం మహార్ణవం
పిపాసురివ చా కాశం దదృశే సమహాకపి?
తస్య విద్యుత్ప్రభాకారే వాయుమార్గాను సారిణ?
నయనే విప్రకాశేతే పర్వతస్థావినా నలౌ.
సముద్రాన్ని త్రాగుతున్నాడా? అన్నట్టు గమనాన్ని ప్రారంభించి ఆకాశాన్ని త్రాగబోతున్నాడా! అన్నట్లు ఎగిరి విద్యుత్ప్రభాకారంగా వాయు మార్గాన్ని అనుసరించేడట. అసలే ఎఱ్ఱనైన స్వామి ముఖం ఉదయకాల సంధ్యాకాంతి చేత మరింత ఎఱ్ఱబడి సంధ్యాకాల సూర్య మండలంలా ఉంది. ఈ విధంగా వివిధ గతుల్లో ఎగురు తూన్న స్వామిని సముద్రుడు చూసేడు.
అహమిక్ష్వాకు నాధేన
సగరేణ వివర్ధితః
ఇక్ష్వాకు సచివశ్ఛాయం
నా వ నీదితు మర్హతి.
నేను ఇక్ష్వాకు రాజైన సగరుని చేత వృద్ధి పొందేను. ఈయన ఇక్ష్వాకుకు సచివుడు. ఈయన్ని కష్టపెట్టడం తగదు. అనుకొన్నాడు.
మనమెవరిని ప్రత్యక్షంగా కష్టపెట్టక పోయినా కష్టపడుతూన్న వానిని చూచి ఆ కష్టాన్ని తొలగింపగల సామర్థ్యం మనకున్నా తొలగింపడానికి ప్రయత్నం చేయకపోవడము కూడా- కష్టపెట్టడమే. సముద్రుడిలా ఆలోచించేడు.
తన యందున్న మైనాకుణ్ణి ప్రోత్సహించేడు.
అస్యసాహ్యం మయా కార్యమిక్ష్వాకుకులవర్తినః
మమ హీక్ష్వాకవ? పూజ్యా? పరం పూజ్యతమాస్తవ.
కురుసాచివ్య మస్మాకం ననః కార్యమతి క్రమేత్
కర్తవ్య మకృతం కార్యం సతాం
మన్యుముదీరయేత్.
నాయనా! చేయవలసిన పనికి సమయం దాటి పోకుండా నాకొక సహాయం చేయి.
ఇంకావుంది...

Viewing all 69482 articles
Browse latest View live