Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఎందుకొచ్చాం దేవుడా!

$
0
0

నిజామాబాద్, డిసెంబర్ 22: స్థానికంగా ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో కుటుంబ పోషణకై విదేశాలకు వెళ్తున్న వారికి అడుగడుగునా మోసాలే ఎదురవుతున్నాయి. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఇదే తరహాలో మలేషియాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల కార్మికులు నెలల తరబడి అక్కడే చిక్కుబడిపోయి నరకయాతన అనుభవిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్‌కు చెందిన బీ.మహేష్ అనే బాధితుడు మలేషియాలో తనతో పాటు వందలాది మంది తెలుగు రాష్ట్రాల కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి వాట్సప్ వీడియో ద్వారా అతని కుటుంబ సభ్యులతో పాటు కి వివరించడంతో గల్ఫ్ ఏజెంట్ల మోసం మరోమారు తెరపైకి వచ్చింది. నాలుగు మాసాల క్రితం తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఆంధ్రాలోని మరికొన్ని ప్రాంతాల యువకులను మంచి కంపెనీల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏజెంట్లు నమ్మబలికి మలేషియాకు పంపించారు. వీసాల పేరిట ఒక్కొక్కరి వద్ద నుండి 50వేలు మొదలుకుని లక్ష రూపాయల వరకు వసూలు చేశారు.
అయితే వారికి కంపెనీ వీసాలు సమకూర్చకుండా విజిటింగ్ వీసాలపై పంపించారు. ఈ విషయమై మలేషియాకు చేరుకున్న తరువాత గ్రహించిన బాధితులు కొందరు ఏజెంట్లను ప్రశ్నిస్తే, మూడు నెలల్లోపే వర్క్ పర్మిట్లు వస్తాయని, నిశ్చింతగా కంపెనీల్లో చేరి పనుల్లో నిమగ్నం కావాలని భరోసా కల్పించారు. దీంతో బాధితులంతా మలేషియాలోని ఆయా కంపెనీల్లో కార్మికులుగా కొనసాగగా, మూడు మాసాల అనంతరం సదరు కంపెనీలు వారికి వర్క్ పర్మిట్లు లేవనే సాకుతో బయటకు వెళ్లగొట్టాయి. వారు చేసిన శ్రమకు వేతనం కూడా చెల్లించకపోవడం, పాస్‌పోర్టులు ఏజెంట్ల ప్రతినిధుల వద్దే ఉండిపోవడంతో బాధితులంతా స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు వీలు లేక మలేషియాలోనే చిక్కుబడిపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చిన్నపాటి ఒక గదిలో పదుల సంఖ్యలో కార్మికులను కుక్కేసి, రోజులో ఒకే పూట అన్నం అందిస్తున్నారని బాధితులు తమ దైన్య స్థితిని వీడియో ద్వారా వివరించడంతో వారి కుటుంబ సభ్యులు కంటికి మింటికి ధారగా కన్నీరు కారుస్తున్నారు. తమను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ మలేషియాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినప్పటికీ, అక్కడి అధికారులు తమ గురించి అసలేమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. బాధితులు స్వదేశానికి తిరిగి రావాలంటే ప్రస్తుతం వారికి భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి వారికి అవుట్ పాస్‌లు జారీ చేయించి, విమాన టిక్కెట్లను సమకూర్చాల్సిన అవసరం ఉందని గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి పేర్కొన్నారు.
దురదృష్టవశాత్తు అక్కడి ఎంబసీ అధికారులు తెలుగు కార్మికుల బాధల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మలేషియాలో చిక్కుకున్న వారికి తోడ్పాటును అందించి వారిని స్వస్థలాలకు రప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ తరహా సంఘటనలు పదేపదే పునరావృతం కాకుండా ఉండేందుకు విజిటింగ్ వీసాల నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


లోకాయుక్త ఏర్పాటుకు ఉద్యమ కార్యాచరణ:జేపీ

$
0
0

వరంగల్, డిసెంబర్ 22: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా సాగాలంటే స్వయం ప్రతిపత్తి కలిగిన లోకాయుక్త తక్షణ అవసరమని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. జాతీయ స్ధాయిలో లోక్‌పాల్, రాష్ట్ర స్ధాయిలో లోకాయుక్తలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో కోరలు లేని లోకాయుక్త కాకుండా స్వయం ప్రతిపత్తి కలిగిన నిష్పాక్షపాతంలో కూడిన లోకాయుక్త అవసరమన్నారు. దీని కోసం అవినీతి వ్యతిరేక సంస్ధ జ్వాలాతో పాటు వివిధ జిల్లాల్లోని స్వచ్చంద సంస్ధలతో కలిసి లోక్ సత్తా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్దమవుతుందని వెల్లడించారు. శనివారం హన్మకొండలో లోక్‌సత్తా, జ్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. లోకాయుక్త ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమ కార్యచరణ సిద్దం చేస్తున్నామని, జనవరి 4న హైదరాబాద్‌లో వివిధ స్వచ్చంద సంస్ధలతో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ వివరాలను ప్రకటిస్తామని అన్నారు.
ఏసీబీకి పట్టించిన పౌరుడికి సన్మానం
లంచం అడిగిన దేవాదయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను అవినీతి నిరోధకశాఖకు పట్టించిన పౌరుడిని డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ నగదు పురస్కారంతో ఘనంగా సన్మానించారు. అవినీతి వ్యతిరేఖ సంస్ధ జ్వాలా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చిలుపూరు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జయశంకర్ కారణ్య నియామకం కోసం 50వేల రూపాయల లంచం అడిగారు. ఎసీబీకి పట్టించిన వైద్య రమేష్‌ను జ్వాల స్వచ్చంద సంస్ధ 15 వేల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది.

సాగర్ ఆయకట్టులో రబీ పంటకు నీరు

$
0
0

నల్లగొండ, డిసెంబర్ 22: శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లలో అందుబాటులో ఉన్న నీటీని రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేటాయింపులు చేస్తు కృష్ణాబోర్డు అనుమతినివ్వడంతో నాగార్జున సాగర్ ఆయకట్టు కుడి, ఎడమకాలువల కింద యాసంగి పంటలకు నీటి విడుదలకు మార్గం సుగమమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమకాలువకు ఈనెల 26నుండి నీటి విడుదలకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపికి 38.40, తెలంగాణకు 46.90టీఎంసిల నీటి వినియోగానికి బోర్డు అనుమతించింది.
ఇందులో తెలంగాణకు సంబంధించి ఎడమకాలువకు 22.90టీఎంసీలు, ఏఎమ్మార్పీ ఎత్తిపోతలకు తాగునీటి కింద మూడు టీఎంసిలు, మిషన్ భగీరథకు 5టీఎంసిలు, హైద్రాబాద్ తాగునీటికి 8టీఎంసిల నీటి విడుదలకు అనుమతించారు. ఏపి ప్రభుత్వానికి శ్రీశైలం ప్రాజెక్టు నుండి ముచ్చుమర్రి లిఫ్టు ఇరిగేషన్‌కు 6.69టీఎంసిలు, సాగర్ రైట్ కెనాల్‌కు 18.61టీఎంసిలు, ఎడమకాలువకు 3.43టీఎంసిలు, కృష్ణా డెల్టాకు 4.67టీఎంసిలు కృష్ణాబోర్డు తెలిపింది. సాగర్ ఆయకట్టు కింద ఇప్పటికే రైతులు యాసంగి పంట సాగుకు వరినార్లు పోసుకుని నీటి విడుదల కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. కృష్ణాబోర్డు నీటి విడుదల అనుమతి ప్రకటనతో సాగర్ కుడి, ఎడమకాలువల రైతులు ఇక యాసంగి పంటల సాగు పనుల్లో వేగం పెంచనున్నారు. సాగర్ ఎడమకాలువ కింద మొదటి జోన్ పరిధిలో నల్లగొండ జిల్లాలో 1లక్ష 53,542ఎకరాలు, సూర్యాపేటలో 2లక్షల 07,159ఎకరాలు, ఖమ్మం జిల్లా పరిధిలో 7,263ఎకరాలతో కలిపి మొత్తం 3లక్షల 68వేల 224ఎకరాలున్నాయి. వారబంధీ పద్ధతిలో నీటి విడుదలకు అనుమతించడంతో ఇక యాసంగి పంటలకు సాగర్ ఆయకట్టు రైతాంగం సాగు పనులను ముమ్మరం చేసింది. అయితే మొదటి జోన్ పంటల సాగుకు కనీసం 35నుండి 40టీఎంసిల నీరు అవసరమున్నందునా నీటీని రైతులు పొదుపుగా వాడితేనే యాసంగి పంట గట్టేక్కనుంది.

సిరిసిల్లలో కలకలం పేలిన జిలెటిన్‌స్టిక్స్

$
0
0

సిరిసిల్ల, డిసెంబర్ 22: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. ఈ సంఘటనలో మహిళ గాయాలకు గురైంది. శనివారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో చెత్త కుప్పను కాల్చినపుడు ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో, చెత్త కుప్పల్లో జిలెటిన్‌స్టిక్స్ నిలువలు దాచి ఉంచగా, చెత్తను కాల్చే సమయంలో ఊహించని విధంగా పేలి, స్థానిక శాంతినగర్‌కు చెందిన బొద్దుల సత్తవ్వ(32) అనే మహిళ గాయాలకు గురైంది. ఖాళీ ప్రదేశంలో రోడ్డు పక్కన ప్రైవేటు స్థలంలో పెరిగిన మొక్కల మద్య ఉన్న చెత్తను సత్తవ్వ దగ్ధం చేసినపుడు ఒకే సారి జిలెటిన్‌స్టిక్స్ పేలడంతో ఆమె శరీరమంతా గ్లాస్ ముక్కలు గుచ్చుకున్నాయి. గాయాలకు గురైన ఆమె భయంతో ఇంటిలోకి పరుగెత్తింది. మతి స్థిమితం సరిగా లేని సత్తవ్వ ఏమి జరిగిందో తెలియక భయానికి లోనైంది. సంఘటన జరిగిన వెంటనే ప్రజలు పరుగెత్తుకుని రావడం, సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. సత్తవ్వను ఆసుపత్రికి తరలించి, సంఘటన స్థలంలో బాంబు స్క్వాడ్‌లతో సోదాలు నిర్వహించగా, చెట్ల పొదల మద్య వందకు పైగా జిలెటిన్‌స్టిక్స్ లభ్యమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు వీటిని చెట్ల పొదల మద్య దాచి ఉంచారని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై సీఐ శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించి, దర్యాప్తు జరిపారు. అయితే ఖాళీ స్థలం పక్కన ఇంటిలో గుట్టలను బాల్‌స్ట్ చేసే వడ్డెరలు అద్దెకు ఉండేవారని తెలిసింది. ఇటీవలే వారు ఇళ్ళు ఖాళీ చేసి పోవడంతో, ఈ జిలెటిన్‌స్టిక్స్ నిలువలను వారే దాచి ఉంచవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా చెత్త కుప్పల వద్ద ప్లాస్టిక్ గ్లాసులు, తదితర వస్తువులు ఏరుకుని సత్తవ్వ జీవిస్తుందని, ఆ కోవలోనే ఇటీవలే ఒక ఫంక్షన్‌లో వినియోగించిన ప్లాస్టిక్ గ్లాసులను ఏరుకోవడానికి వెళ్ళి, అక్కడ మంటలు పెట్టినపుడు ఈ సంఘటనకు దారి తీసినట్టు తెలిసింది. కాగా సత్తవ్వ సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

స్వైన్ సైరన్

$
0
0

హైదరాబాద్, : మహానగరంలో మరోసారి స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. పెథాయ్ తుపాను కారణంగా నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం వాతావరణం బాగా చల్లబడటంతో జనం స్వైన్‌ఫ్లూ భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే బస్తీలు, మురికివాడల్లో వేలాది మంది స్వైన్ ఫ్లూ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్నారు. రోజురోజుకి రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి చల్లదనం పెరగటంతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన నెలకొంది. అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు తమ ఆర్థిక స్తోమతకు తగిన విధంగా స్థానిక క్లీనిక్‌లలో వైద్యం చేయించుకుని సరిపెట్టుకుంటున్నారు. కానీ గత సంవత్సరం కూడా ఇదే తరహాలో చలికాలంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభించినపుడు అనుమానిత లక్షణాలతో పదుల సంఖ్యలో రోగులు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చేరగా, వారిలో కొందరు మృత్యువు బారిన కూడా పడిన సందర్భాలున్నాయి. అనుమానిత లక్షణాలతో బాధపడుతూ స్థానిక క్లీనిక్‌లలో వైద్యం చేయించుకున్న తర్వాత ఒక్కసారిగా పరిస్థితి విషమించటంతో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఉస్మానియా ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు ఏరియా ఆసుపత్రులతో పాటు ప్రైవేటు క్లీనిక్‌ల వద్ద సాయంత్రం కాగానే, జలుబు, జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్న రోగులు అత్యధిక సంఖ్యలో కన్పిస్తున్నారు.
రోజురోజుకీ చల్లబడుతున్న వాతావరణంతో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా, రోగాల బారిన పడటం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నా, నగరంలో కనీసం వ్యాధి నివారణ చర్యలు కూడా చేపట్టడటంలో జిల్లా వైద్యారోగ్యశాఖ విఫలమైంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలే అవకాశమున్నట్లు కొద్దిరోజుల క్రితం మొట్టమొదటి సారిగా ప్రకటించిన జీహెచ్‌ఎంసీ సైతం దోమలు, వ్యాధుల నివారణకు ఫాగింగ్ వంటి చర్యలను చేపట్టడంలో ఘోరంగా విఫలమైంది. ఇదేమిటీ అని ప్రశ్నిస్తే కొన్ని సర్కిళ్లలో ఎంటామలజీ విభాగం అధికారులు, సిబ్బంది ఇంకా తాము ఎన్నికల విధుల్లోనే బిజీగా ఉన్నామని చెప్పుకోవటం గమనార్హం.
ఆహార నాణ్యతపై నియంత్రణ ఏదీ?
వాతావరణం చల్లబడినపుడు, తరుచూ వర్షాలు కురిసినపుడు ప్రతి ఒక్కరూ తీసుకునే ఆహారం, తాగే నీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ మహానగరంలో చిన్నాచితక కలుపుకుని సుమారు లక్ష పై చిలుకు ఉన్న ఆహార విక్రయ కేంద్రాలు విక్రయించే ఆహారంలో నాణ్యత ఎంత ఉంటుందన్న విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు.
ఇలాంటి సీజన్‌లోనే ఆహార విక్రయ కేంద్రాలపై నిఘాను ముమ్మరం చేసి, ప్రజల ఆరోగ్యానికి హానీ చేయని ఆహారాన్ని విక్రయించేలా, పరిశుభ్రమైన నీటిని అందించేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత బల్దియాపైనే ఉంది. కానీ బల్దియాలోని హెల్త్, శానిటేషన్, ఫుడ్ విభాగం అధికారులు తమకేమీ పట్టనట్టుగా ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకులిచ్చే అమ్యామ్యాలు స్వీకరిస్తూ తమపనైపోయిందని అనుకుంటున్నారు. కానీ నగరంలోని పలు హోటళ్లు, మెస్‌లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ హోటళ్లలో విక్రయించే ఆహారంలో నాణ్యత లోపం ఏర్పడి ప్రజలు అనారోగ్యం పాలైతే తప్పా, చర్యలు చేపట్టరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ట్రాయ్ పెంచిన ఎంఆర్‌పీ రేట్లపై పునరాలోచించాలి
హయత్‌నగర్, డిసెంబర్ 22: టెలికామ్ రెగ్యులేటరీ అథారిటి ఆఫ్ ఇండియా(టాయ్) ఆదేశాల మేరకు కొత్త విధానాన్ని అమలు చేయకుండా పెంచిన ఎంఆర్‌పీ రేట్లపై పునరాలోచించాలని రాష్ట్ర ఐఎన్‌టీయుసీ అధ్యక్షుడు, కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 31 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. మిద్దెల జితేందర్ మాట్లాడుతూ కేబుల్ చార్జీలు పెంచితే సామాన్యుడు భరించలేడని, దాంతో ఇష్టమైన ఛానెళ్లకు దూరమయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ నిర్ణయాలు సామాన్యులకు గొడ్డలి పెట్టని పేర్కొన్నారు. సామాన్యులను దృష్టిలో ఉంచుకొని ధరలను నిర్ణయించాలని కోరారు. వినియోగ దారులు సహనం వహించి ఆపరేటర్లకు మద్దతు ఇవ్వాలని కోరారు.
రేవ్ పార్టీ పై షీటీం డీసీపీ విచారణ
శామీర్‌పేట, డిసెంబర్ 22: సెలబ్రీటీ క్లబ్‌లో రేవ్ పార్టీపై దాడి చేసిన సంఘటన స్థలాన్ని షీటీం అడ్మిన్ డీసీపీ అనసూయ పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌తో సందర్శించారు. ఈ రేవ్ పార్టీలో విటులుగా దొరికిన గజ్వేల్ ప్రాంతానికి చెందిన ఏడుగురు వైద్యులతో పాటు ముగ్గురు యువతులు, ఒక మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. రేవ్ పార్టీ నిర్వాహకంపై వీరి వెనుక ఉన్న భాగోతంపై సరైన రీతిలో విచారణ జరిపుతామని తెలిపారు. రేవ్ పార్టీల పేరిట అసభ్య నృత్యాలు, క్లబ్‌లలో డ్రగ్స్ సరఫరా, విచ్చల విడిగా అక్రమ మద్యం సరఫరా చేస్తే ఆయా క్లబ్‌లకు చెందిన లైసెన్స్‌లను రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

త్వరలో ఆస్తిపన్ను పెంపు

$
0
0

హైదరాబాద్, : మహానగరవాసులపై ఆస్తిపన్ను భారాన్ని పెంచేందుకు రంగం సిద్ధమైంది. నగరంలోని 30 సర్కిళ్లలో సుమారు 13లక్షల పై చిలుకు బకాయిదార్లు ప్రతి ఏటా దాదాపు రూ. 1400 కోట్లు ఆస్తిపన్ను రూపంలో జీహెచ్‌ఎంసీకి చెల్లిస్తున్నారు.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వేల రూపాయల కోట్ల అభివృద్ధి పనులు జరగటం, రొటీన్ మెయింటనెన్స్, సిబ్బంది జీతభత్యాలు వంటి వాటికి మరో రెండు నెలల్లో తీవ్ర స్థాయిలో నిధుల కొరత ఏర్పడే అవకాశముండటంతో ఆస్తి పన్ను పెంచేందుకు అధికారులు రంగం సిద్దం చేశారు. కానీ వచ్చే ఫిబ్రవరి రెండు, మూడో వారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్, ఆ తర్వాత మార్చిలో ఎన్నికలు వచ్చే అవకాశమున్నందున ఆస్తిపన్ను పెంపును వర్తమాన ఆర్థిక సంవత్సరానికి మినహాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరం నుంచే సుమారు ఐదు శాతం ఆస్తిపన్నును పెంచేందుకు వీలుగా బల్దియా గత కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి మొత్తం కసరత్తు పూర్తి చేసి,ప్రతిపాదనలను కూడా తయారు చేశారు. కానీ అంతలో సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లటం, ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొనటంతో ఇపుడు ఆస్తిపన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం పంచాయతీ ఎన్నికలపై, మరో మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ఎలా ఉంటుందోనన్న విషయాన్ని గమనించిన సర్కారు, పన్ను పెంపునకు బల్దియా సిద్ధం చేసిన ప్రతిపాదనలను మరికొద్ది నెలలు పక్కనబెట్టాలని వౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం. బల్దియా అధికారులు చేసిన కసరత్తు ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-2020)కి ఆస్తిపన్నును పెంచే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ. 1400 కోట్లను వసూలు చేసుకున్న బల్దియా, వర్తమాన ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1500 కోట్ల కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో సుమారు రూ.30కోట్ల నుంచి రూ.40 కోట్ల తగ్గినా, గత సంవత్సరం కన్నా రూ.60 కోట్ల నుంచి 70 కోట్లు అదనంగా వసూలు చేసుకుని కలెక్షన్‌ను రూ. 1470 కోట్లకు పెంచుకునే అవకాశాలున్నాయి. ఒక వేళ వచ్చే ఆర్థిక సంవత్సరం(2019-2020) ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత 2019 మార్చి నుంచి ఐదు శాతం ఆస్తిపన్నును పెంపును వర్తింపజేసినా, బల్దియా అదే మరో రూ. 70 కోట్ల నుంచి రూ.80 కోట్ల మధ్య అదనంగా ఆదాయం సమకూరే అవకాశముంది.

జీతాల చెల్లింపులకు ప్రభుత్వ అంగీకారం కౌన్సిల్ విజయం

$
0
0

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 22: విజయవాడ నగర పాలక సంస్థ ఉద్యోగులకు 010 జీతాల చెల్లింపులకు ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడమే కాకుండా రానున్న 2019 ఏప్రిల్ ఆర్ధిక సంవత్సరం నుంచి జీతాల చెల్లింపులకు సన్నాహాలు చేయడం హర్షనీయమని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం వీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము నగర పాలన చేపట్టిన నాటి నుంచి వీఎంసీ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 010 జీతాలపై సుమారు 50 సార్లు ప్రభుత్వ పెద్దలకు పలు వినతిపత్రాలను అందించడం జరిగిందని, కాగా, విన్నవించిన పలుమార్లు ఆడిట్ రిపోర్టు అంటూ అడ్డంకులు సృష్టించి జాప్యం చేస్తున్న వైనంపై శుక్రవారం మరలా ప్రిన్సిపల్ సెక్రటరీ తో మాట్లాడి తీవ్ర వత్తిడి తీసుకురావడంతో ప్రస్తుతం ఎటువంటి అడ్డంకులు లేకుండానే రానున్న ఏప్రిల్ ఆర్ధిక సంవత్సరం నుంచి 010 జీతాల చెల్లింపులకు తగు చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇది వీఎంసీ టీడీపీ పాలన విజయంగా చెప్పుకోవచ్చన్న మేయర్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ మంత్రి పీ నారాయణ లకు కూడా తాము పలుమార్లు వినతిపత్రాలను అందించిన ఫలితమే ప్రస్తుతం ఆ ఫైల్‌కు చలనం వచ్చిందన్నారు. 010 జీవో ద్వారా ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా ఉద్యోగులకు జీతాలను చెల్లిస్తే వీఎంసీ ఖజానాపై ఆర్ధిక భారం తగ్గి, ప్రస్తుతం జీతాలకు చెల్లిస్తున్న 40 కోట్లకు పైగా నిధులు నగర అభివృద్ధికి వినియోగించే అవకాశం ఉందన్నారు. రానున్న రోజుల్లో వీఎంసీ కి ఆర్ధిక కష్ట నష్టాలు తీరనుండటమే కాకుండా వీఎంసీ ఉద్యోగుల చిరకాల కోరికగా మిగిలిన 010 జీతాల చెల్లింపులు తమ పాలనా హయాంలో నెరవేరుతున్న ఉదంతం సర్వత్రా అభినందనీయమన్నారు. ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించి బాధ్యతగా తమ విధులను నిర్వర్తించడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలందించి వీఎంసీ ప్రతిష్టను మరింత పెంపొందించాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, కోఅప్షన్ సభ్యుడు సిద్దెం నాగేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర జట్టుకు తొలి విజయం
* జాతీయ స్థాయి టెన్నిస్‌బాల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్‌బాల్ క్రికెట్ అసోసియేషన్, గోస్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం 29వ జాతీయ స్థాయి సీనియర్ టెన్నిస్‌బాల్ క్రికెట్ పురుషులు, మహిళల చాంపియన్‌షిప్ స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ప్రారంభమైంది. గోస్పోర్ట్స్ సీఈఓ సీఆర్ మోహన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగనున్న చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో 20 రాష్ట్రాల జట్లు, మహిళల విభాగంలో 16రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి. మొత్తం రెండు పిచ్‌లను సిద్ధం చేశారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులోనూ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టైటిల్ స్పాన్సర్‌గా గోస్పోర్ట్స్, కోస్పాన్సర్‌గా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ వ్యవహరిస్తోంది. ఒక్కో ఇన్నింగ్‌కు 8ఓవర్లు, 9మంది క్రీడాకారులు ఆడతారు. కార్యక్రమంలో టెన్నిస్‌బాల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఇమ్రాన్ లహరీ, రాష్ట్ర కార్యదర్శి ఆర్‌డీ ప్రసాద్, రోటరీ మిడ్‌టౌన్ విజయవాడ అధ్యక్షుడు చిన్నం మధుబాబు, తదితరులు పాల్గొన్నారు. తొలి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ జట్లు తలపడగా 8 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన జార్ఖండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆంధ్ర జట్టు 8ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. 62 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ 8 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 54 పరుగులే చేసింది. మరో మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరీ జట్లు తలపడగా 51 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ విజయం సాధించింది. టాస్ గెలిచిన ఉత్తరప్రదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. 8 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. 79 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరీ 8 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో కర్నాటకపై 3వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ జట్టు గెలుపొందింది. టాస్ గెలిచిన మధ్యప్రదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కర్నాటక 8 ఓవర్లలో 63 పరుగులకు అలౌటైంది. 64 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ 7 ఓవర్లలో 6వికెట్లనష్టానికి 67 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 6వికెట్ల తేడాతో చత్తీస్‌గఢ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగి 7.1 ఓవర్లలో 52 పరుగులకు అలౌటైంది. 53 పరుగుల లక్ష్యంతో బరిలోకు దిగిన చత్తీస్‌గఢ్ 5.3 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి విజేతగా నిలిచింది.

జిల్లాస్థాయి స్కూల్ క్రికెట్ లీగ్ ప్రారంభం
విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 22: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మూలపాడులోని ఏసీఏ క్రికెట్ గ్రౌండ్స్‌లో నోరి శివరామకృష్ణ మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సంఘ కార్యదర్శి ఎ యల్లారావు, సంయుక్త కార్యదర్శి సీఆర్ మోహన్, మూలపాడు గ్రౌండ్స్ అడ్మిన్ మేనేజర్ కె రమేష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో కుమార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, సెయింట్ జాన్స్ స్కూల్ జట్లు తలపడగా 65 పరుగుల తేడాతో కుమార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కుమార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 25 ఓవర్లలో 108 పరుగులకు అలౌటైంది. ఆదిత్య 39, సుబ్రహ్మణ్యం 20 పరుగులు చేశారు. 109 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ జాన్స్ 11 ఓవర్లలో 43 పరుగులకు అలౌటైంది. మరో మ్యాచ్‌లో సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌పై 6 వికెట్ల తేడాతో కేకేఆర్ గౌతమ్ స్కూల్ గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సెయింట్ ఆన్స్ 25 ఓవర్లలో 116 పరుగులకు అలౌటైంది. సుధీర్ 51 పరుగులు చేశాడు. 117 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ గౌతమ్ స్కూల్ 20.4 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అక్షయ్ 35 పరుగులు చేశాడు.

పోటో..ఎస్‌పి 4
జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు సరోజ్
విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 22: పీబీ సిద్ధార్థ కళాశాలకు చెందిన జేబీ సరోజ్ బాస్కెట్ బాల్ సీనియర్ ఆంధ్రప్రదేశ్ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డా. ఎం రమేష్ తెలిపారు. గుజరాత్‌లో జరగనున్న జాతీయ స్థాయి సీనియర్ బాస్కెట్ బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటాడన్నారు. ఈసందర్భంగా సరోజ్‌ను కళాశాల కన్వీనర్ పీఎల్‌ఎన్ ప్రసాద్, డీన్ రాజేష్, డైరెక్టర్ వి బాబురావు, వ్యాయామ విద్యా సంచాలకులు డా. ఎన్ శ్రీనివాసరావు, తదితరులు అభినందించారు.

24న జిల్లా ఫుట్‌బాల్ సీనియర్ జట్టు ఎంపిక
విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 22: జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అడ్‌హాక్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లా సీనియర్ ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అడ్‌హాక్ కమిటీ కోఆర్డినేటర్ ఎన్ రవికుమార్ తెలిపారు. ఈ ఎంపికలు ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో 24న ఉదయం 9గంటలకు జరుగుతాయని చెప్పారు.

రాహుల్ పోరాటంతోనే జీఎస్టీపై దిగివచ్చిన కేంద్రం

$
0
0

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 22: ప్రధాని మోదీ అనాలోచితంగా అమలులోకి తీసుకొచ్చిన జీఎస్టీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన పోరాట ఫలితంగానే తగ్గింపు చర్యలకు కేంద్రం దిగివచ్చిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో మొదటిగా కాంగ్రెస్ ప్రతిపాదించిన జీఎస్టీని ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన బీజేపీ పాలకులు అధికారంలోకి రాగానే 5స్లాబుల విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన మోదీ జీఎస్టీ ఘనత తనదేనంటూ ప్రచార ఆర్భాటం చేశారని శనివారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రస్తుతం జీఎస్టీ విధానంతో తీవ్రంగా నష్టపోవడమే కాకుండా వ్యయ భారాలు మోస్తున్న ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతకు కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు. ప్రజలకు అండగా రాహుల్ నేతృత్వంలో జీఎస్టీపై పలుమార్లు, పలు విధాలుగా ఉద్యమాలను చేపట్టి ప్రజలను చైతన్యపర్చినట్టు తెలిపారు. గబ్బర్‌సింగ్ టాక్స్ మాదిరిగా ఉన్న ప్రస్తుత జీఎస్టీని 2019లో రాహుల్ ప్రధాని అవ్వగానే సరళతరం చేయనున్నట్టు తెలిపారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు గుర్తుచేశారు. అనాలోచిత జీఎస్టీ విధానంతో మోదీ ప్రభుత్వం ప్రజల మీద లక్షల కోట్ల దోపిడీ చేసి పెట్టుబడిదారులకు రాయితీల రూపంలో అందించటం గమనార్హమని, రైతుల విషయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం మార్పు చేయాలని దేశ రైతులకు వ్యతిరేకంగా 3సార్లు ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వంపై రైతుల మద్దతుతో రాహుల్‌గాంధీ చేపట్టిన ఉద్యమ ఫలితంగానే ఆర్డినెన్స్ వెనక్కివెళ్లడం కాంగ్రెస్ విజయమని రఘువీరారెడ్డి వివరించారు.

పచ్చదనంతో కాల్వగట్ల అభివృద్ధి
ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి వెల్లడి
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 22: నగర పరిధిలోని నదీ కాల్వగట్లకు మహర్దశ పట్టనుంది. దుర్భర వాతావరణంలో ఉన్న నదీ కాల్వగట్లను సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే కాకుండా పిల్లల ఆట ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఏడీసీ సీఎండీ డీ లక్ష్మీపార్థసారథి వీఎంసీ అధికారులతో కలిసి నగర పరిధిలోని పలు కాల్వగట్లను పరిశీలించారు. బందర్ కాలువపై 4.8 కి.మీ మేర మొక్కలతో గ్రీనరీ అభివృద్ధి చేయడమే ఆకుండా చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్కింగ్, మరుగుదొడ్ల ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. అలాగే సుందరీకరణలో భాగంగా కాలవ ఒడుడపై మట్టి కిందకు జారిపోకుండా టోవాల్స్ ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఏడీసీ ఈఈ బ్రహ్మయ్యకు సూచించారు. తదుపరి కనకదుర్గమ్మ వారధి వద్ద నిర్మాణ దశలో ఉన్న బుద్ధ చక్ర పనులను ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయితో కలిసి పరిశీలించిన సీఎండీ లక్ష్మీపార్ధసారధి ఆయా పనులపై నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. రైవస్, ఏలూరు, కాలవల ముఖద్వారాలను అభివృద్ధి చేసి వాటిని సుందరీకరించేందుకు డిజైన్లను రూపొందించి అంచనాలను సిద్ధం చేయాలని తెలిపారు. ఈ పర్యటనలో ఏడిసీ పట్టణ ప్రణాళిక విభాగాధిపతి పీ సురేష్‌బాబు, వీఎంసీ ఈఈ జీ ఓంప్రకాష్, ఎఫ్‌ఆర్వో డి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం

$
0
0

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 22: జిల్లాలో చిన్న పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉదయం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ మైక్రో, స్మాల్, మీడియం, ఎంటర్‌ప్రైజర్స్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ కింద జిల్లాలో 67 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామన్నారు. 3 దరఖాస్తులను తిరస్కరించామని తెలిపారు. బీసీలకు -4, ఎస్సీలకు 19, ఎస్టీలకు 6, ఇతరులకు 36 మంజూరు చేశామన్నారు. మొత్తం యూనిట్లకు 4 కోట్ల 8లక్షల 21వేల 426 రూపాయలు మంజూరు చేశామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే యూనిట్ల మంజూరు చేయడం జరిగిందని, ఔత్సాహికులైన పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే యువతకు యూనిట్ల మంజూరుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని, స్వయం ఉపాధిలో భాగంగా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీకాంతం కోరారు. ఈ సమావేశంలో వీఎంసీ కమిషనర్ జే నివాస్, సబ్ కలెక్టర్లు మీషాసింగ్, స్వప్నీల్ దినకర్, జేసీ -2 పీ బాబూరావు, జల్లా పరిశ్రమల అధికారి కె సుధాకర్, ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు.

అక్రమ మైనింగ్‌పై 5 కేసుల నమోదు
కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 22: జిల్లా వ్యాప్తంగా అక్రమ మైనింగ్ చర్యలకు పాల్పడుతున్న వారిపై 5 కేసులు నమోదు చేసినట్టు బీ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. గత వారం రోజులుగా ప్రత్యేక దాడులు నిర్వహించిన నేపథ్యంలో 5 కేసులను నమోదు చేయడమే కాకుండా, 48వేల రూపాయను జరిమానా విధించి వసూలు చేశామన్నారు. వీటిలో 3 కేసులు రోడ్డు మెటల్, 2కేసులు మట్టి రవాణాకు సంబంధించినవని తెలిపారు. సివిల్ సప్లయ్ అధికారులు 2 షాపులపై దాడులు నిర్వహించి రూ.31వేల 200ల విలువైన 26 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారని, ఫుడ్ సేఫ్టీ అధికారులు గత వారం రోజులుగా 48 మిఠాయిల దుకాణాలు, హోటళ్లు, షాపులపై దాడులు నిర్వహించి నమూనాలను సేకరించి నివేదిక కోసం హైదరాబాద్‌కు పంపినట్టు కలెక్టర్ లక్ష్మీకాంతం వివరించారు.

నకిలీ ఎరువుల తయారీ దందా

$
0
0

విజయవాడ (క్రైం), డిసెంబర్ 22: అక్రమంగా నకిలీ ఎరువులు, మందులు తయారు చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.15లక్షలు విలువైన సరకు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన తాడికొండ శ్రీనివాసరావు(45) గతంలో అగ్రికల్చర్ మ్యాట్రిక్స్, హైదరాబాద్ కెమికల్స్‌లో మార్కెటింగ్ శాఖలో పనిచేశాడు. ప్రస్తుతం విజయవాడ వచ్చి హైదరాబాద్ నుంచి ఎరువులను ఇక్కడకు తీసుకొచ్చి విజయవాడ పరిసర ప్రాంత షాపులకు విక్రయాలు జరిపాడు. మూడు సంవత్సరాల నుంచి నున్న ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని తనకు మార్కెటింగ్ ద్వారా ఉన్న అనుభవంతో ప్రభుత్వం అనుమతి లేకుండా గుమస్తాగా కోడి శ్రీనివాస్ సహకారంతో అమృత్, మార్వెల్, త్రిసూల్, గ్రోబెస్ట్, సుప్రీం గోల్డ్, తీన్‌మార్, లియోజ్‌మీ, టెజ్‌మీ, డాలర్ అనే వివిధ రకాల పేర్లతో తయారు చేసిన రసాయన ఎరువులను, మందులను ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేసి కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో, తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో విక్రయాలు సాగిస్తున్నాడు. ప్రస్తుతం నున్న నుంచి మకాం మార్చి భవానీపురం కబేళా ఇండ్రస్టీ ఏరియా, రామరాజ్యనగర్ నాలుగో లైనులో రెండు అంతస్తుల భవనం కింద పోర్షన్ అద్దెకు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్‌కుమార్, సీఐ సురేష్‌రెడ్డి బృందం నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో దాడులు నిర్వహించారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని భవానీపురం పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

విద్యాసంస్థలు, ప్రభుత్వాఫీసులకు
ఫైబర్నెట్ కనెక్షన్లు
కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి
విజయవాడ (క్రైం), డిసెంబర్ 22: జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఫైబర్‌నెట్ సౌకర్యం కల్పించనున్నామని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన జిల్లాలో ఫైబర్‌నెట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 66 వేల కుటుంబాలకు ఫైబర్‌నెట్ సౌకర్యం కల్పించామని, మిగిలిన కుటుంబాలకు కూడా దశలవారీగా ఈ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఈనెలకు 149 రూపాయలకే టీవీ కార్యక్రమాలు, టెలిఫోన్, ఇంటర్‌నెట్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తోందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. టీవీ ద్వారా 304 ఛానళ్లను వీక్షించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, పోలీస్టేషన్లు, ఎండిఓ కార్యాలయాలు, ఎమ్మెర్వో కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఫైబర్‌నెట్ కనెక్షన్ పొందవచ్చని ఇందుకు సంబంధించి సెటప్ బ్యాక్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సమావేశంలో జెసి విజయకృష్ణన్, సబ్‌కలెక్టర్ మీషా సింగ్, స్వప్‌నీల్ దినకర్, జెసి-2 పి బాబూరావు, విఎంసి కమిషనర్ జె నివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో పోస్టింగ్‌లపై
ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఫిర్యాదు
విజయవాడ (క్రైం), డిసెంబర్ 22: సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్యలపై హల్‌ఛల్ చేస్తున్న అసభ్యకరమైన పోస్టులపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య స్వయంగా సీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో శృతి మించ ప్రత్యర్ధుల మీద, వారిని కించపరిచే రీతిలో కులాలను అగౌరవపరిచేవిధంగా రెండు వర్గాల మధ్య వైరుధ్యాలు పెంచే రీతిలో పోస్టింగ్‌లు పెడుతూ రాక్షసానందం పొందుతూ వారి మానసిక వికలత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 11న ఉదయం 7:56 నిముషాలకు వర్ర రవీంద్రరెడ్డి అనే వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన నన్ను కించపరిచే రీతిలో ‘అవునురా మాదిగోడ వర్లిగా’ అని సంబోధిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడునుద్ధేశించి ‘ మీ కమ్మబాబును ఓడించడం కోసం మా రెడ్డి పార్టీ వైసీపీ పుట్టింది’ అని సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో కులాలను కించపరుస్తూ రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే రీతిలో బెదిరిస్తూ రాయనలవి కాని బూతు మాటలతో పోస్టింగ్‌లు పెట్టడం జరిగింది. ఇది చూసిన నేను మానసిక క్షోభకు గురయ్యాను. ఈ దుశ్చర్యకు పాల్పడిన వర్ర రవీంద్రరెడ్డిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య సీపికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన సీపి పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మహిళా ప్రయాణికుల రక్షణకు
పైలెట్ ప్రాజెక్టుగా ‘అభయ్’
* కలెక్టర్ లక్ష్మీకాంతం
విజయవాడ (క్రైం), డిసెంబర్ 22: మహిళా ప్రయాణికుల రక్షణకు ‘అభయ్’ కార్యక్రమం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా స్ధాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. విశాఖ జిల్లా మాదిరిగా ఇక్కడ కూడా అభయ్ తీసుకువస్తున్నామని, దీనిలో భాగంగా ఆటోలో డివైజ్‌లు ఏర్పాటు చేసి ఐఓటి పద్దతి ద్వారా మహిళా ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే గుర్తించే విధంగా సాంకేతికతను పోలీసు రవాణాశాఖకు అనుసంధానం చేశామని చెప్పారు. ఆటోడ్రైవర్ సీటు కింద ఏర్పాటు చేస ఈ డివైజ్ వల్ల మహిళా ప్రయాణీకులను ఆటోడ్రైవర్లు తప్పుదోవ పట్టించినా, మహిళా ప్రయాణీకులు వెళ్ళే ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు దారి మళ్లించినా ఇ-డివైజ్ ద్వారా రవాణా, పోలీసుశాఖకు సమాచారం అందుతుందన్నారు. మొదటి దశగా 50 ఆటోలకు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, విఎంసి కమిషనర్ జె నివాస్, సబ్ కలెక్టర్లు మిషాసింగ్, స్వప్నిల్ దినకర్, జేసీ-2 బాబూరావు, డీసీపీ ట్రాఫిక్ శంకర్‌రెడ్డి, ఏసీపీ నాగరాజు, డీటీసీ మీరా ప్రసాద్, డిఎంహెచ్‌ఓ డాక్టర్ రమేష్, డిఇఓ రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పెథాయ్‌తో తమలపాకు రైతుల కుదేలు

$
0
0

తోట్లవల్లూరు, : పెథాయ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన తమలపాకు రైతులకు న్యాయం చేస్తామని హార్టికల్చర్ అధికారి లఘుపతి పేర్కొన్నారు. హెచ్‌ఓ లఘుపతి, ఎంపిహెచ్‌ఓ శ్రీనివాస్, విఆర్‌ఓ శ్రీనివాసరావు, మండల తెలుగురైతు అధ్యక్షుడు నెక్కలపూడి మురళీ తోట్లవల్లూరు లంకలో పడిపోయిన తమలపాకు తోటలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా లఘుపతి ఏ రైతు ఎంత మేర నష్టపోయాడో పేర్లతో సహా వివరాలు నమోదు చేసుకున్నారు. సుమారు 10 ఎకరాల్లో తమలపాకు తోటలు పడిపోయినట్లు గుర్తించారు. రైతులు మాట్లాడుతూ తమలపాకు తోటలకు లక్షల్లో పెట్టుబడి పెట్టామని, తీరా కోతకు వచ్చే సమయానికి తుఫాన్ ప్రభావంతో సుడిగాలి వలే వచ్చి తోటలు పడిపోయాయని వాపోయారు.

వంద కిలోల గంజాయ పట్టివేత

$
0
0

అవనిగడ్డ, డిసెంబర్ 22: గత కొంత కాలంగా దివిసీమ మీదుగా సాగుతున్న అక్రమ గంజాయి తరలింపుకు అవనిగడ్డ పోలీసులు అడ్డుకట్ట చేశారు. ముందస్తు సమాచారం మేరకు అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు నేతృత్వంలో పులిగడ్డ చెక్ పోస్టు వద్ద శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.22లక్షలు విలువ చేసే 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇరువురు వ్యక్తులని అరెస్టు చేసి మీడియా ముందు హాజరు పరిచారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన జింకల మద్దిలేటి, షేక్ మహబూబ్ వలిలు రిజిష్టర్ నెంబరు ప్లేటు లేని మహేంద్ర బోలెరో పిక్ ఆఫ్ ట్రక్‌లో రెండు కేజీలు చొప్పున నల్ల క్యారీ బ్యాగ్‌లో ప్యాక్ చేసిన 100 కేజీల గంజాయిని తరలిస్తున్నారు. దీనిపై ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు అవనిగడ్డ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నవీన్ నరసింహమూర్తి నేతృత్వంలో ఎస్‌ఐ సందీప్ పులిగడ్డ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ గంజాయిని పట్టుకున్నారు. వీరిని పోలీసులు విచారించగా ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుండి గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. పట్టుబడ్డ నిందితుల్లో జింకల మద్దిలేటి గతంలో తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం పోలీసు స్టేషన్‌లో అక్రమ గంజాయి తరలింపుపై కేసు నమోదు అయ్యింది. కృష్ణాజిల్లా హనుమాన్ ఇంజన్ పోలీసు స్టేషన్‌లోనూ మద్దిలేటిపై కేసు నమోదు కాగా పరారీలో ఉన్నాడు. పెద్ద మొత్తంలో గంజాయిని దివిసీమలో పట్టుబడటం ఇదే ప్రథమం కావడం విశేషం. అయితే గత కొంత కాలంగా దివిసీమ మీదుగా గంజాయి అక్రమ రవాణా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఘోరంగా గోవుల తరలింపు

$
0
0

మైలవరం, : జాతికి ఎనలేని మేలు చేసే గోవులను మాంసం ముద్దలుగా మారుస్తున్నారు. ఎనిమిది, పది మాత్రమే రవాణా చేసే లారీల్లో సుమారు 50 వరకు ఆవులను కుక్కి తరలించుకుపోతున్నారు. ఎలాగూ ప్రాణం తీసేస్తామని భావించి వారు చాలా దారుణంగా హింసించి మరీ తరలిస్తున్నారు. ఇనుప రాడ్లతో వాటి కాళ్లు విరగ్గొట్టి లారీల్లో జీవశ్చవాల్లా తీసుకెళుతున్నారు. వాటిని ఒకేసారి చంపేస్తే కూడా అవి అంతగా బాధపడవు. లారీల్లో తరలించేటప్పుడు పైకి కనిపిస్తే గో ప్రేమికులు వాటిని రక్షించడానికి వాహనాన్ని ఎక్కడ నిలిపేస్తారోనన్న ఉద్దేశంతో కాళ్లు విరగ్గొట్టడమే కాకుండా తలెత్తకుండా తాళ్లతో మెడను వంచేసి కడుతున్నారు. ఎక్కడో సమాచారం వస్తే తప్ప లారీల్లో ఆవులను తరలిస్తున్నారన్న అనుమానం కూడా రాదు. మైలవరం ప్రాంతంలో పదుల సంఖ్యలో ఆవులను తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు. ‘గో హత్య మహాపాతకమని’ మన పురాణాలు ఘోషిస్తున్నా మాంసం ముద్దలుగా మార్చడం మాత్రం మానడం లేదు. అంతేకాకుండా ఆవులను మాంసంగా మార్చి విపణిలో విక్రయించడం నేరమని మన చట్టాలు కూడా చెబుతున్నాయి. ఎన్ని ఉన్నా వాటి తరలింపు మాత్రం ఆగడం లేదు. ఇంతెందుకు పశువుల సంతలపై పోలీసులు ఓ కనే్నసి ఉంచితే వీటిని అరికట్టొచ్చు కదా. ఎవరో సమాచారం ఇస్తే తప్ప తెలుసుకోలేని స్థితిలో మన పోలీసు వ్యవస్థ ఉండడం గర్హనీయం. నిత్యం వందలాది పశువులు వధశాలలకు తరలిపోతూనే ఉన్నాయి. పశువులను పెంచడం భారం కావడం, గ్రాసం కొనలేక అయిన కాడికి పశు సంపదను మనమే నాశనం చేసుకోవడం విచారకరం. ‘మనకే తిండి లేదు’ వాటికేం పెడతామన్న ‘ప్రశ్న’తో వాటిని వదిలించుకుంటున్నారు. ఎండుగడ్డిని వివిధ అవసరాల నిమిత్తం వాడుతుండడం కూడా గ్రాసం ప్రియమైంది. నిత్యం పదుల సంఖ్యల లారీల్లో ఎండుగడ్డి మెట్ట ప్రాంతాలకు తరలిపోతోంది. రైతు వద్ద ఒక ఆవు ఉంటే సులభంగా పది ఎకరాలు సాగు చేయవచ్చని మేధావులు అనేకమంది ఘోషిస్తున్నారు. ఎవరెంత మంది ఎన్నివిధాలుగా చెబుతున్నా జాతికి ఉపయోగపడాల్సిన గో సంపదను చంపి ఆహారంగా భుజించడం మన పతనాన్ని మనమే కోరుకున్నట్టు అవుతుంది.

కేసీపీ సిమెంట్స్ విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ

$
0
0

జగ్గయ్యపేట : మండలంలోని వేదాద్రి గ్రామ సమీపంలో గల హేమాద్రి సిమెంట్స్ విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ శనివారం విజయవాడ ప్రాంతీయ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ప్రస్తుతం ప్లాంట్ ఆవరణలో ఆధునీకరణతో పాటు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 0.198 మిలియన్ టన్నుల నుండి 0.660 మిలియన్ టన్నులకు పెంచేందుకు సంస్థ నిర్ణయించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ 2 బాబూరావు ప్రజల నుండి పర్యావరణ, ఆరోగ్యానికి సంబంధించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పర్యావరణ శాఖ నివేదిక ద్వారానే అనుమతులకు సంబంధించి నిర్ణయం జరుగుతుందన్నారు. సంస్థ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ మాట్లాడుతూ 1995లో 95కోట్ల వ్యయంతో పరిశ్రమ స్థాపించడం జరిగిందని, తదుపరి 300 టన్నుల సామర్థ్యం ఉత్పత్తిని 600 టన్నులకు పెంచడం జరిగిందన్నారు. అన్ని నిబంధనలు పాటించడం వల్ల ఇంత వరకు తమ సంస్థపై ఎలాంటి ఆరోపణలు లేవని వివరించారు. ఈ సమయంలో బీజెపి నేతలు కీసర రాంబాబు, నోముల రఘులు సంస్థ అధికారుల అభిప్రాయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసారు. బీజెపీ నేతలపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ గ్రామ పరిధిలో సిమెంట్ కర్మాగారం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ఎక్కడి నుండో వచ్చి రాజకీయం చేసి అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీజెపీ నేతలు, మాజీ సర్పంచ్ జగజ్జీవన్‌రామ్, చల్లా వైకుంఠరావుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకొని ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడి తోపులాటలు జరగడంతో జెసీ ఆదేశాల మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. తదుపరి అంశాల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి జెసీ వారి నుండి వ్యక్తం అయిన అనుమానాలకు సంస్థ అధికారుల ద్వారా వివరణ ఇప్పించారు. చిల్లకల్లు, జగ్గయ్యపేట ఎస్‌ఐలు చిరంజీవి, శ్రీహరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.

బాక్సర్‌గా.. వరుణ్

$
0
0

‘్ఫదా, తొలిప్రేమ’ చిత్రాల రూపంలో వరుస విజయాలను అందుకున్న మెగా హీరో వరుణ్‌తేజ్ ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం బ్యాక్‌డ్రాప్‌లో ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చన విషయం తెలిసిందే. తెలుగులో మొదటిసారి అంతరిక్ష నేపథ్యంలో సినిమ ఆరావడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా వరుణ్ మరో సినిమాకి కూడా రెడీ అవుతున్నాడు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ఈ ప్రొడక్షన్‌లో ఫస్ట్ సినిమాను వరుణ్‌తేజ్‌తో చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటించనున్నాడట.


హిందీ సినిమాకి సై

$
0
0

టాలీవుడ్ సంచలన స్టార్ విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా బాలీవుడ్‌లో ఒక చిత్రం చేయబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరణ్‌జోహార్‌తో ఈయన ఒక చిత్రం చేయబోతున్నాడని అందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. అయితే కరణ్‌జోహార్ మూవీ విషయం ఏమో కాని తాజాగా ఒక హిందీ సినిమాకు విజయ్ దేవరకొండ సైన్ చేశాడు. హిందీలో విజయ్ దేవరకొండ ఎంట్రీ హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉండబోతుంది. ఇండియాకు ప్రథమ ప్రపంచ కప్‌ను తీసుకువచ్చిన కపిల్‌దేవ్ బయోపిక్‌గా ‘83’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. కపిల్‌దేవ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఖబీర్‌ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రపంచ కప్ సాధించిన తర్వాత ఇండియాలో క్రికెట్‌కు అనూహ్యంగా ఆదరణ పెరిగింది. ఇండియాలో క్రికెట్‌కు ఇంతగా ఆదరణ కలిగేలా చేసిన కపిల్‌దేవ్ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 1983 ప్రపంచ కప్ సిరీస్‌లో టీం ఇండియా తరఫున కపిల్‌దేవ్‌తోపాటు కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రను విజయ్ దేవరకొండ పోషించబోతున్నాడు. కపిల్ మరియు కృష్ణమాచారి శ్రీకాంత్‌లు మంచి స్నేహితులు. సినిమాలో కృష్ణమాచారి పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ‘86’ చిత్రంలో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించబోతున్న నేపథ్యంలో సినిమాపై సౌత్‌లో కూడా భారీగా ఈ చిత్రంకు రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్ తెలుగులో ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.

మరింత అందంగా రాశి

వీళ్లంతే.. హిట్టు టైపు

$
0
0

ప్రతి ఏడాది కొత్త కొత్త సినిమాలు, కొత్త హీరోలు, హీరోయిన్లు వచ్చినట్టే దర్శకులూ వస్తూనే ఉంటారు. అయితే ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన ప్రతి దర్శకుడూ సక్సెస్ అందుకోలేదు. తమలోని ప్రతిభకు పదునుపెట్టి, మూసకథలకు చెక్ పెడుతూ సరికొత్త పంథాతో నడిచిన దర్శకులు హిట్టు కొట్టకాపోలేదు. కేరాఫ్ కంచరపాలెం, ఆర్‌ఎక్స్ 100, అ, గూఢచారి, ఛలో, తొలిప్రేమ, టాక్సీవాలా లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెలుగు పరిశ్రమకు అందించి అభిమానులకు కొత్త రుచులు చూపించారు దర్శకులు. ఈ ఏడాది తమ టాలెంట్‌తో సత్తా చాటిన కొత్త దర్శకులను ఒక్కసారి గుర్తు చేసుకుంటే..
*
ఏడాది ఆరంభంలోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వెంకీ కుడుముల ‘ఛలో’తో ప్రేక్షకులకు కొత్త రుచులు పంచాడు. పూర్తిస్థాయి ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఆంధ్రా- తమిళనాడు బోర్డర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఛలో సినిమా మ్యూజికల్ హిట్ అనిపించుకుని కొత్త ఏడాదిలోకి ప్రేక్షకుల్ని చలో అంటూ నడిపించింది. కంటెంట్‌వున్న దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న ఆనందంతో, తదుపరి చిత్రంగా నితిన్‌తో ‘ భీష్మ’ తెరకెక్కించే పనిలో బిజీ అయపోయాడు వెంకీ. లిస్ట్‌లో రెండో పేరుగా చెప్పుకోవలసింది వెంకీ అట్లూరి గురించి. నటుడిగా పరిశ్రమకు పరిచయమైనా, దర్శకత్వంపై దృష్టిపెట్టి మెగా హీరో వరుణ్‌తేజ్‌తో తొలిప్రేమ కథను నడిపించాడు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఎవర్‌గ్రీన్ టైటిల్‌ను తన కొత్త కథకు పెట్టుకుని తనదైన శైలిలో వినూత్నంగా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఫిదా తరువాత వరుణ్‌తేజ్‌కు సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ, తాజాగా అఖిల్‌తో మిస్టర్ మజ్ను తెరకెక్కించే పనిలో పడ్డాడు.
సంచలన దర్శకుడు వర్మ శిష్యుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి తొలి చిత్రంతోనే ప్రేక్షకుల నాడిపట్టాడు. నిజ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించిన ఆర్‌ఎక్స్ 100 ద్వారా బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ లాంటి యంగ్ టాలెంట్స్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ బోల్డ్ కంటెంట్‌తో యూత్‌ఫుల్ మెసేజ్ ఇచ్చాడు. తన జీవితంలో జరిగిన యదార్థ సంఘటనను అద్భుతంగా ఆవిష్కరించి కమర్షియల్ విజయాన్ని సాధించాడు.
ఇప్పటివరకు చాలారకాల సినిమాలు చూసాం. కానీ పబ్లిక్‌లో పబ్లిక్ లైఫ్‌తో సినిమా తీసి ప్రేక్షకుల చేత ప్రశంసలందుకోవడం మాత్రం వెంకటేష్ మహాతోనే మొదలైందేమో. ఆయన తీసిన సినిమా కేరాఫ్ కంచరపాలెం. అసలు నటనంటే ఏమిటో తెలియని కొత్తవారికి నటన నేర్పించి కంచరపాలెం ఊరి నేపథ్యంలో మానవ సంబంధాలకు దగ్గరగా కథను అల్లుకుని నేమ్ అండ్ ఫేమ్‌లేని నటులు, నిర్మాతతో తొలి ప్రయత్నంలో పెద్ద ప్రయోగమే చేసి సక్సెస్ బాట పట్టారు యువ దర్శకుడు మహా. రాజవౌళి, క్రిష్, సుకుమార్‌లాంటి మేటి దర్శకులతో శెభాష్ అనిపించుకున్నాడు.
ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీని బేస్ చేసుకుని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తొలి ప్రయత్నంలోనే కొత్త ప్రయోగానికి తెరతీశాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. శరీరం, ఆత్మల నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కామెడీ థ్రిల్లర్‌ను రూపొందించి హిట్ అందుకున్నాడు. కథను ఆసక్తికరంగా మలచాలేకానీ హారర్ చిత్రాలకూ ప్రేక్షకాదరణ ఉంటుందని టాక్సీవాలా చిత్రంతో మరోసారి నిరూపించాడు. అర్జున్‌రెడ్డితో సంచలన స్టార్‌గామారిన విజయ్ దేవరకొండకు మరో తిరుగులేని హిట్ అందించాడు.
తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. సరికొత్త ప్రయోగం ‘అ’ అంటూ తీసిన సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. కథ చెప్పి నానిని ఒప్పించి నిర్మాతగా మార్చేశాడు. మూస చిత్రాలతో విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులకు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను అందించి టాలెంట్ వున్న దర్శకుడిగా విమర్శకుల ప్రశంసల్ని దక్కించుకున్నాడు.
స్టార్ రైటర్‌గా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న వక్కంతం వంశీ దర్శకుడిగా మారి అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అంటూ ఓ దేశభక్తి సినిమా చేశాడు. భారీ అంచనాలమధ్య విడుదలైన సినిమా ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓ మంచి సినిమా చేశాడన్న టాక్ సంపాదించాడు వక్కంతం. కానీ ఇక్కడ సక్సెస్ మతమే కొలమానం కాబట్టి ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.
హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్‌కూడా దర్శకత్వం అంటే మక్కువతోనే ఇండస్ట్రీకి వచ్చాడు. అనుకోకుండా హీరోగా మారిన అతగాడి ఆంబిషన్ అయిన డైరెక్షన్ చేయడానికి సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. చి.ల.సౌ అనే టైటిల్‌తో తనలోని డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసుకున్నాడు. ఎప్పటినుండో హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని హీరో సుశాంత్‌కు మంచి సినిమా ఇచ్చాడు. రుహానీ శర్మ లాంటి యంగ్ టాలెంట్ వున్న హీరోయిన్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
జేమ్స్‌బాండ్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లో వున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చిత్రాలను రూపొందించడం కత్తిమీద సామే. అయితే డెబ్యూ చిత్రంతో పెద్ద సాహసమే చేశాడు శశికిరణ్. గూఢచారి చిత్రంతో మైమరిపించే విన్యాసాలు, అద్భుతమైన టేకింగ్‌తో హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఇక వీరితోపాటు ‘నీది నాది ఒకే కథ’ అంటూ దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన సినిమా మంచి విజయం అందుకుంది. ‘నన్ను దోచుకుందువటే’ దర్శకుడు ఆర్‌ఎస్ నాయుడు, భైరవపాలెం దర్శకుడు సిద్దార్థ తాతాలు, యూటర్న్‌తో పవన్‌కుమార్, సుబ్రహ్మణ్యపురం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి- ఇలా చాలామంది యువ దర్శకులు ఈ ఏడాదిలో డెబ్యూ చిత్రాల ద్వారా సత్తా చాటారు.

సంక్రాంతి రేస్‌లో ‘పేట’

$
0
0

సర్కార్, నవాబ్ వంటి భారీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన అభిరుచిగల నిర్మాత వల్లభనేని అశోక్ హ్యాట్రిక్ దిశగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పెట్టా’చిత్రాన్ని ‘పేట’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వల్లభేని అశోక్ మాట్లాడుతూ.. ‘సూపర్ స్టార్ రజినీకాంత్ రొరింగ్ పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా తెరపైకెక్కిన ‘పేట’చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బారాజ్ రజినీకాంత్‌కు వీరాభిమాని. అందుకే రజినీకాంత్‌ను ఆయన తెరకెక్కించిన విధానం తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు. అలాగే ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి పాత్రలు ఆకట్టుకుంటాయి. అటు మాస్ ఆడియెన్స్‌ను, ఇటు క్లాస్ ఆడియెన్స్‌ను కట్టిపడేసే కమర్షియల్ అంశాలున్న మంచి చిత్రమిది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నాం’ అన్నారు. త్రిష, సిమ్రాన్, విజయ్ సేతుపతి, బాబీ సింహ, నవాజుద్దీన్ సిద్ధికి నటిస్తున్నారు.

స్వాధ్యాయ సందోహం-176

$
0
0

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
‘కార్యం వా సాధయేయం శరీరం నా పాతయేయమ్’ ‘కార్యాన్నైనా సాధిస్తాను మరణించైనా మరణిస్తాను’ అన్న పెద్దల వచనాల్ని ఈ విషయంలో పాటించాలి. చావోబ్రతుకో మనిషియే నిర్ణయించుకోవాలి. అందుచేత ‘దోషావస్త ర్దీదివాంసమను ద్యూన్’ రాత్రింబవళ్లు ప్రకాశమానుడైన ఆ దైవానికి సేవచేసుకోవాలి అని వేదం నిర్దేశిస్తూంది. ఒక దినంచేసి పది దినాలు ఆరాధన మానివేయడం కూడా ఉత్తమం కాదు.
శరీర పోషణకు ప్రతిదినమూ నియమిత సమయాలలో ఆహారాన్ని భుజించి ఎలా సుఖంగా ఉంటున్నామో అదే రీతిగా ఆత్మను పరిపుష్టం చేసికొనేందుకు నియమానుసారం భగవదారాధన ఈ జన్మలోనే చేసుకోవాలి. అదే ఉత్తమ మానవుని జీవన విధానం.
**
డబ్బు ఎక్కువుంటే దానం చేయి- తక్కువుంటే తృప్తి పడు.
ఉత్తిష్ఠతావ పశ్చతేంద్రస్య భాగమృత్వియమ్‌
యది శ్రాతం జుహోతన యద్యశ్రాతం మమత్తన॥ ఋ.7-72-1.
భావం:- ఓ జనులారా! మీరందరు మేల్కొనండి. సంపదకు చెందిన వ్యవస్థీకృత విభాగాన్ని లోతుగా పరిశీలించండి. ఒకవేళ మీ సంపద సంపూర్ణమైయుంటే భగవదర్పణం చేయండి. అంటే భగవంతుడు మానవ హృదయాలలో ఉంటాడు కాబట్టి సంపదను మానవ సమాజపరం చేయండి. ఒకవేళ మీ సంపద అసంపూర్ణమైయుంటే ఉన్నదానితో సంతృప్తిగా ఉండండి.
వివరణ:- మానవ సమాజం గురించి వేదం చెప్పిన సూత్రాలు చాలా ఉదాత్తమైనవి. మానవ సమాజం ధన-్ధన్యాలతో మహదైశ్వర్యంతో తులతూగుతూ ఉండాలని వేదం ఆక్షాంక్షించింది. ఆకాంక్షను సాధించేందుకు ‘ఉత్తిష్ఠ’‘లెమ్ము’ అని వేదం ప్రబోధించింది. మానవ సమాజాభివృద్ధికి చేసే కృషిలో కేవలమొక వ్యక్తి ప్రయత్నంగాగాక సమష్టిగా ప్రయత్నం జరగాలని వేదం సమష్టి ప్రయత్నానికి ప్రాధాన్యమిస్తూ ప్రబోధించింది.
సమాజంలో కొందరు అధికులు మరికొందరు అధములుగా ఉంటే ఆ సమాజం అంగవైకల్యంగల మనిషి వంటిదే అవుతుంది. అందుకే వేదం ఉత్తిష్ఠత ‘‘మీరందరు లేవండి’’అని జాగృతపరచింది. జాగృతులై ఏమిచేయాలి? ‘ఆవపశ్యతేంద్రస్య భాగముత్వియమ్’ ఐశ్వర్య సాధక వ్యవస్థలోగల విభాగాన్ని లోతుగా పరిశీలించు’మని వేదం హెచ్చరించింది. ఈ హెచ్చరికనే కఠోపనిషత్తు (1-3-14) ‘ఉత్తిష్ఠత. జాగృత. ప్రాష్యవరాన్ని బోధత’ ‘లే. మేలుకో, శ్రేష్ఠమైన ద్రవ్యాలనుపొంది చైతన్యవంతుడవు కమ్ము’’అని యథాతథంగా పునరుద్ఘాటించింది.
పరిశీలిస్తే వేదోపనిషత్తులు చెప్పిన ఆ రెండు వాక్యాలు ఒకదానికొకటి సమానార్థకాలే. ‘అవపశ్యత’అని వేదం చెప్పినా ‘వరాన్నిబోధత’ అని ఉపనిషత్తుచెప్పినా రెండింటి అంతరార్థాలు ఒకటే. అయినా ఉపనిషత్తు చెప్పిన వర-శ్రేష్ఠం అన్న పదం కంటే ఈ ఋగ్వేద మంత్రంలోని ‘ఋత్వియం’ వ్యవస్థీకృతమైన భాగం అన్న పదంలో ఒక విశేషార్థం లోతుగా పరిశీలిస్తే ద్యోతకమవుతుంది. సృష్టిలోని సమస్త పదార్థాలమీద సర్వులకు సమాన హక్కులున్నాయి. ఎవరూ అధికులు కారు. ఎవరూ అధములుకారు. ఈ విభాగం విచారణారహితంగా చేసింది కాదు. కాని వారివారి సంపాదనా విధానాన్ని అనుసరించి చేయబడింది. కాకపోతే ఎవరు ఉత్తములు, ఎవరు అధములుగా అవుతారో వేదం వివరించింది. అంటే జీవితంలో ఎవరు ఎట్టిపనిని చేస్తారో దానిననుసరించి సృష్టిలోని పదార్థాలను ఎక్కువగాని తక్కువగాని పొందుతారు అని వేదం వివరించింది. ఈ విషయ వివరణకే ఈ మంత్రం పర్యాప్తంకాలేదు. ఎవరు తమ సత్కర్మచేత సృష్టిలోని అధికమైన ఐశ్వర్యాన్ని పొందితే ‘యది శ్రాతం జుహోతన’ అధికమైన ఆ ఐశ్వర్యాన్ని హోమం చేయుమని వేద మాదేశిస్తూంది. అంటే తన ఐశ్వర్యాన్ని మానవోపకారార్థంగా వినియోగించమని వేదమనోగం. ఆ విధంగా చేసే సమయంలో ‘ఇదం న మమ’ ఇది నాదికాదు. పూర్తిగా నీదే అన్న సంపూర్ణ్భావనతో భగవదర్పణం చేయాలని వేదాదేశం.

ఇంకావుంది...

Viewing all 69482 articles
Browse latest View live