Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Articles on this Page

(showing articles 39641 to 39660 of 41370)
(showing articles 39641 to 39660 of 41370)

older | 1 | .... | 1981 | 1982 | (Page 1983) | 1984 | 1985 | .... | 2069 | newer

  0 0

  1884వ సంవత్సరము నాటికే యాతని యన్వర్థనామము కలకలత్తా నగరమందందంటను వ్యాపింప, నాతనియునికి జన సమూహముల నాకర్షింపసాగెను. ప్రాణాపాయకరమగు స్థితిలోనున్నను, వైద్యులును శిష్యులు నెంత వలదనినను, అఖండ విశ్వమానవ ప్రేమచే నాతడు తన యంత్యదిన పర్యంతము జన సమూహములకు బోధించుచునే యుండెను. ‘‘ఈ శరీర మేమైననేమి? ఒక్క జీవికి సాయమొనర్పగలిగినచో, వేయి పర్యాయములు కుక్కనై పుట్టుటకైన సంసిద్ధుడను’’ అని యాతడు ప్రకటించెను. స్వార్థరాహిత్యమునకు-ప్రేమానురాగములకు ఇంతకంటె పరమవాధి యెద్ది?
  శ్రద్ధ్భాక్తులతో ప్రియిశిష్యులు శ్రీరామకృష్ణుని సేవించుచు, ఆతని మహోపదేశములను బడయుచు, ఆత్మ వికాసము నొందసాగిరి. ఈ సమయమున వారల హృదయములందు పాదుకొనిన సోదరభావమే కాలక్రమమున శాఖోపశాఖలతో జగద్వ్యాప్తమై మించిన శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘ సంస్థయను మహావృక్షమునకు బీజమై యొప్పెను. సాక్షాత్కరము నొందవలయునను తీవ్ర వాంఛతో గురు సంసేవనమే భగవదారాధనమను విశ్వాసముతో బాలశిష్యులు నరేంద్రనాథు (వివేకానందు)ని నాయకత్వమున శ్రీరామకృష్ణుని సేవించుచుండ, చికిత్సకు వ్యయమును ఇంటియద్దెను గృహస్థ శిష్యులు భరింపసాగిరి. గురుదేవుని వ్యాధి శిష్యులనందరను ఇట్లైక్యసూత్రబద్ధుల నొనర్చెను. వ్యాధి యెంత తీవ్రముగానున్నను, ఆధ్యాత్మ శక్తి శ్రీరామకృష్ణునియందీ సమయమున మూర్త్భీరించెను. దివ్యానుభూతుల నాతడనేకుల కనుగ్రహింపసాగెను. 1886 సంవత్సరము జనవరి యొకటవ తేదీ నాతడు తన యాశ్వీరచనము గోరినభక్తులలందెల్ల తన దివ్య సంకల్పముచే బ్రహ్మశక్తిని మేల్కొల్పెను. లోకకల్యాణార్థము నరేంద్రునకాతడు గొంత కాలమునకు బిమ్మట తన దివ్యశక్తులను బ్రసాదించెను. గుర్వనుగ్రహమున నరేంద్రుడింతకు ముందుగనే నిర్వికల్ప సమాధ్యనుభవమును బొందిన ధన్యాత్ముడు.
  శ్రీరామకృష్ణుడించుమించుగా నొక సంవత్సరము వ్యాధిగ్రస్తుడై యుండెను. అంత్యదినము పర్వెత్తుకొనివచ్చినది. శ్రావణకృష్ణ ప్రతిపత్ భానువారము రాత్రి ఇంచుమించుగా ఒంటిగంటకు (1886వ సంవత్సరము ఆగస్టు 16వ తేదిని) శ్రీరామకృష్ణుడఖండ సచ్చిదానందమయ పరబ్రహ్మైక్యము నొందెను.
  శ్రీరామకృష్ణుడు తన భౌతిక శరీరమును జాలించెను. ఐననేమి? అతని దివ్య భావములు సజీవములై, శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘములై దేశ సేవనే కాక ప్రపంచ సేవను సల్పుచుండుట లేదా?
  ఉపదేశ సారము శ్రీరామకృష్ణుడు బోధించినదేమి? ‘మాటలమూలమునకంటె చేతల మూలమున’ నాతడెక్కువ బోధించెననుట ముమ్మాటికి నిజము. అతని దివ్యోపదేశము లాతని జీవితమున రూపుదాల్చినవి. ఆతడెన్నడును వ్రాసి యెరుగడు, ఉపన్యసించి ఎరుగడు, కాని తన బోధనలనన్నింటిని సంభాషణ రూపమున జిజ్ఞాసువుల కొసగెను. ఈ సంభాషణములను గొన్నిటిని శిష్యులతి జాగరూకతతో వ్రాసి భద్రపరిచి యున్నారు. కాని రుూ మూలములైనను అతని బోధనలను సమగ్రముగా దెలుపునని చెప్పజాలము. వాగ్రూపమున - సంభాషణ రూపమున ఆతడొనరించిన బోధనలలో శిష్యులు స్వయముగా వ్రాసియుంచినవన్నియు -విస్తారమగు వాఙ్మయమున బహు గ్రంథములలో గాన నగు నాతని యమూలోప్యదేశములన్నియు థారూపమున ‘శ్రీరామకృష్ణ బోధామృతము’న క్రోడీరింపబడియున్నవి.

  - ఇంకా ఉంది
  *
  శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి


  0 0
 • 12/23/18--09:00: సుందరకాండ
 • ‘‘సఖ్యం సాప్తపదీనం’’ అన్నట్లు సరిగ్గా ఏడు మాటలు మాట్లాడేడు. ముందుకు వెళ్ళి పోతున్నాడు. అలా వెళ్ళి పోతూన్న స్వామిని ఆపైని ఉన్న దేవతలు చూసేరు.
  తద్ద్వితీయం హనుమతో దృష్ట్యా కర్మసుదుష్కరం
  ప్రశశం సుస్సురాస్సర్వే సిద్ధాశ్చ పరమర్షయః
  రెండవ దుష్కర కర్మను దాటేడని ఆనందించేరు. రెండవది ఇది అయితే మొదటిదేమిటి? సముద్రాన్ని దాటతానని బయలుదేరడం. ఆ సాహసం లేకనే వేలాది వానరులు జీవచ్ఛవాలై సముద్రపుటొడ్డున పడి ఉన్నారు. ఆ దుష్కర కర్మను స్వామి చేసేడు. ఇది రెండవది. ఇది దుష్కర కర్మ ఎందుకయింది?
  స్వామి సాధన దశలో లోభాన్ని జయించేడు. ముందుకు నడుస్తున్నాడు.
  ఇప్పుడే దేవతలే విఘ్నాన్ని కలిగించడానికి ప్రయత్నించేరు. ఒక్కొకప్పుడిలా జరుగుతుంది. మనవాళ్ళే మన పట్టుదలని భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. దానిక్కారణాలనేక ముంటాయి. సరే - సురసును పిలిచేరు.
  అయం వాతాత్మజ శ్రీ్శమాన్ ప్లవతే సాగరోపరి
  హనుమాన్నాను తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర.
  అని ప్రేరేపించేరు. జాగ్రత్త. ప్రశశంసుస్సురా ఆయన శ్రీమంతుడు అని హెచ్చరించేరు. ఆయన సముద్ర తరణం చేస్తున్నాడు. ఆ కర్మకు ఒక ముహూర్త కాలం విఘాన్ని కలిగించు అంతే - అన్నారు.
  సాధకుడు జితక్రోధుడు కావాలి.
  ఆత్మార్పణ శీలి కావాలి. మతి మంతుడు కావాలి.ఆవిడ మహాఘోర రూపంతో వచ్చింది.
  మమభక్షః ప్రతిష్టస్త్వమీశ్వరైర్వానర్షభ
  అహం త్వాం భక్షయిష్యా ప్రవిశేదం మమాననం నీవు నాకాహారానివి. నిన్ను ఈశ్వరులు పంపించేరు నీవు నానోట్లో ప్రవేశించు. నేను నిన్ను తినగలను.
  ఆవిడ నిజానే్న చెప్పింది. ఏమని?
  నీవు నాకు ఈశ్వరుడిచ్చిన భోజనానివి కావు. నావంటి దేవతలిచ్చేరు. కనుక ఇందులో ఈశ్వరాజ్ఞ లేకపోవచ్చు. కనుక నా అంతట నేను తినటం కుదరదు. నీ అంతట నీవు ఈ నోట్లో ప్రవేశించు. ఇదీ నిజం అందుకని స్వామి. ప్రహృష్టవదనశ్రీ్శమాన్ ఇదం వచనమబ్రవీత్.
  ఆనందించేడు. తనను ఈశ్వరుడు మరొక కార్యానికి పంపించేడు. ఈమెకు ఆహారం అవటమెలా? సాధనే ఐశ్వర్యం. అది కలవానికి విఘ్నాలు ఉత్సాహానే్న ఇస్తాయి. అందుకనీ స్వామి ఆనందించేడు.
  రామోదాశరథిర్నామా
  ప్రవిష్టో దండకావనం
  లక్ష్మణేన సహభ్రాత్రా
  వైదేహ్యాచా పి భార్యయా.
  అంటూ రామకథను ప్రారంభించేడు.
  స్వామి చాలా చోట్ల రామకథను చెబుతాడు.
  స్వయంప్రభకు చెబుతాడు. ఇక్కడ సురసకు చెబుతాడు.
  అశోక వనంలో చెట్టుమీద కూర్చుని సీతకు చెబుతాడు. సందర్భాన్ననుసరించి ప్రారంభం జరుగుతుంది. చెప్పటంలో భేదమూ ఉంటుంది.
  ఇక్కడి విశేషం ఏమిటంటే -
  అథవా మైథిలీం దృష్ట్యా రామం చాక్లిష్టకారిణం
  ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే.
  అనటం వరకూ మాత్రమే. ఆవిడ అంగీకరించలేదు.
  నాతివర్తేన్మాం కశ్చిదేషవరోమమ. అని అంటుంది. నిన్నా పటంలో నా గొప్పదముందని కాదు. ఇది నాకున్న వరం.
  *

  ఇంకావుంది...


  0 0

  సృష్టి పరాకాష్ఠ
  15,000 సంవత్సరాల కిందట ఆదియోగి తన శిష్యులైన సప్తర్షులకు యోగాన్ని అందిస్తూ, సృష్టిలో మనిషి ఎట్లా పరివర్తన చెందుతారో ఆయన వివరిస్తున్నారు.
  మొదటి రూపం మత్సం (జల చరం), తరువాత కూర్మం - ఉభయచరం. క్షీరదాలలో మొదటిది వరాహం. తరువాత ఆయన సగం జంతువు, సగం మనిషి గురించి చెప్పారు. తర్వాత వామనుడు - మరుగుజ్జు. ఆ తర్వాత పూర్తి మానవుడు, కాని భావోద్వేగ విషయంలో చంచలుడు. తర్వాత ఆయన ఒక శాంతి పూర్ణ పురుషుడి గురించి, ప్రేమ జీవి గురించి, ధ్యానజీవి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఒక మార్మికుడైన వ్యక్తి - ఇతర విషయాలను అనుభవంలోకి తెచ్చుకోగలిగిన వ్యక్తి - ఇలాంటి వ్యక్తి రావాల్సి ఉంది. అంటే, ఈ సందర్భంలో ఆయన ఈ భూగోళం మీద మానవ వికాసం గురించి మాట్లాడుతున్నారు.
  అప్పుడు సప్తర్షులు ఆదియోగిని ఇలా అడిగారు, ‘‘మనిషి అంతకుమించి ఇంకా వికసించలేడా?’’ అని. దానికి ఆదియోగి ఇలా చెప్పారు,
  ‘‘సౌరవ్యవస్థలో విపరీతమైన మార్పులు సంభవిస్తే తప్ప మీ శరీరం ఇంతకుమించి వికసించలేదు; భౌతిక సూత్రాలు దానికి అనుమతించవు’’. ఇవ్వాళ ఆధునిక శాస్తజ్ఞ్రులు (న్యూరో సైంటిస్టులు) దాదాపు ఇదే విషయం చెప్తున్నారు. ‘‘మన మెదడు ఇంతకంటే పెరిగే అవకాశం లేదా? పెద్ద మెదడుతో ఎక్కువ పనులు చేయగలం కదా!’’ అని ఎవరైనా అడిగితే, వాళ్లిలా చెప్తున్నారు, ‘‘మనిషి మెదడుకు ఇంతకంటే వికసించే అవకాశం లేదు. దీనికి కారణం నాడీ (neuron) సంబంధ నియమాలు కావు, భౌతిక నియమాలే’’. వాటిని మెరుగ్గా వాడడం మాత్రమే నేర్చుకోగలం తప్ప దాన్ని మరింత పెంపొందించలేం, అలా పెంపొందించాలంటే దానిలోకి మరిన్ని నాడీ క్ణాల్ని కూరాలి. మనమలా చేసినట్లయితే, ఇప్పడు ఉన్న స్పష్టత పోతుంది’’. ఇలా కొంతమంది పిల్లలు ఉన్నారు - వారికి అద్భుతమైన మేధస్సు ఉంది కాని, స్పష్టత లేదు. కాలక్రమంలో ప్రాకృతిక ఆవృత్తులు కొన్ని నాడీ కణాలను చంపి వేస్తాయి. అది ఒక సమతుల్య స్థితిని తీసుకువస్తుంది. నాడీ కణాలు తగ్గకపోతే, వారు సాధారణ స్థితికి రారు.
  మెదడు పెరగడానికి మరో పద్ధతి దాని న్యూరాన్ల పరిమాణం పెరగడం. అప్పుడు మెదడు ఉపయోగించే శక్తి ఎంత అధికమవుతుందంటే, భౌతిక శరీరం అంత శక్తిని సరఫరా చేయలేదు. మెదడు విశ్రాంతిగా ఉన్నప్పుడు అది మీ శక్తి మొత్తంలో కొంతభాగాన్ని వాడుకుంటుంది. ఒకవేళ న్యూరాన్ల పరిమాణం పెరిగినట్లయితే అవి ఖర్చుపెట్టే శక్తి చాలా ఎక్కువ. అంత శక్తిని భౌతిక శరీరం అందించలేదు. దీనికి కారణం భౌతిక సూత్రాలే తప్ప నాడీ సంబంధమైన నియమాలు కావు. ఆదియోగి ఈ విషయం 15,000 సంవత్సరాల కిందటే చెప్పారు.
  సమన్వయం
  సౌర వ్యవస్థతో సమన్వయంతో ఉండేట్లుగా యోగాఅభ్యాసాల వ్యవస్థ తయారుచేసాం. దీని వల్ల మీ శారీరక ఆరోగ్యం, మానసిక సమతౌల్యం, ఆధ్యాత్మిక స్వస్థతలు అసలు ఒక సమస్యగా తలెత్తకుండా సహజంగానే హాయిగా గడిచిపోతాయి. మొత్తం వ్యవస్థతో మీరు సమన్వయంలో ఉంటే ఇదంతా సహజంగానే జరిగిపోతుంది. ఇవ్వాళ మనమిదంతా నిర్లక్ష్యం చేసి జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ పద్ధతిలో మీరు స్వస్థతతో ఉండలేరు. అన్ని రకాల సౌకర్యాలూ ఉన్న సమాజాలతో ప్రపంచాన్ని నిర్మించడంకోసం మనం కష్టపడుతూ వచ్చాం. కాని మనిషి అంతర్గత స్వస్థతను సాధించడంకోసం మనం శ్రమించవలసినంత శ్రమించ లేదు. అర్థం లేని విశ్వాస వ్యవస్థల అవసరం లేకుండానే అంతర్గత సంభావ్యాలను అందించే వౌలిక సదుపాయం మనక్కావాలి; ఒక మనిషి తన అంతరంగంలోకి తిరిగి తనను తాను అనే్వషించుకొనే వౌలిక సదుపాయం కావాలి. నేను అంతరంగ అనే్వషణ మీ అనుభూతిలోకి రావడం గురించి మాట్లాడుతున్నాను, మానసికంగా విశే్లషించడం గురించి కాదు. అది జరగకపోతే పరిసరాలపట్ల స్పృహ అన్నది కేవలం ఒక ఫాషనో, చాపల్యమో తప్ప మరొకటి కాదు.
  ఇంకావుంది...


  0 0

  భీష్ముని మాటలతో పరశురామునికి ఆగ్రహం కలిగింది. అతను భీష్మునితో ఇలా అన్నాడు. ‘‘భీష్మా! అదృష్టంకొద్దీ నాతో తలపడాలనుకుంటున్నావు. పద కురుక్షేత్రానికి. అక్కడ నా బాణాల చేత చచ్చిన నీవు కాకులకు, గ్రద్ధలకు ఆహారమవుతుంటే నీ తల్లి గంగాదేవి చూస్తుందిలే’’. అలా అంటున్న పరశురాముని శిరసు వంచి ప్రణామం చేసి భీష్ముడు కురుక్షేత్రానికి బయలుదేరాడు. అతను తెల్లని కవచం ధరించి తెల్లని ధనుస్సు పట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు. అప్పటికే అక్కడ పరశురాముడు ఉన్నాడు. వారివురి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూడడానికి అక్కడికి బ్రాహ్మణులు, తాపసులు, ఇంద్రసహితంగా దేవతాగణాలు వచ్చారు.
  అప్పుడు భీష్ముని తల్లి గంగ అక్కడికి వచ్చి గురువైన పరశురామునితో యుద్ధం చేయవద్దని చెప్పింది. తాను భార్గవరామునితో శిష్యునితో యుద్ధం చేయవద్దని యాచిస్తానని చెప్పింది. ఆమె ఇలా అంది. ‘‘ఇలాంటి పంతం పట్టకు. జమదగ్ని సుతునితో యుద్ధం కోరుకోకు. అతను రుద్రునితో సమానమైన పరాక్రమం కలవాడు, క్షత్రియ సంహారకుడు’’.
  అప్పుడు భీష్ముడు తల్లికి మ్రొక్కి జరిగినదంతా వివరించాడు. అప్పుడు గంగ పరశురాముని దగ్గరకు వెళ్లి అతడిని భీష్ముని క్షమించమని వేడుకొంది. దానికి పరశురాముడు ఇలా అన్నాడు. ‘‘్భష్ముడిని ఆపు. అతను నేను చెప్పినట్లు చేయలేదు. అందుకని అతడితో యుద్ధానికి సిద్ధమయ్యాను’’
  ఇలా గంగతో అని భార్గవరాముడు భీష్మునితో పోరుకు సిద్ధమయ్యాడు. గంగ వారిద్దరినీ పోరు నుంచి ఆపలేకపోయింది. భీష్ముడు పరశురా మునితో తాను రథం మీద ఉండి కవచంతో ఉన్నాడు కనుక అతన్ని కూడా కవచం తొడుక్కొని రథం మీద యుద్ధానికి రమ్మన్నాడు. దానికి పరశు యాడు ఇలా సమాధానమిచ్చాడు.
  ‘‘కురునందనా! నాకు ఈ భూమే రథం. వేదాలే గుర్రాలు. వాయువే సారథి. గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే వేదమాతలే కవచం’’ ఇలా అంటూ అతను భీష్మునిపై బాణవర్షం కురిపించాడు. భీష్ముడు అప్పుడు తన గురువుని రథం మధ్యలో చూచాడు. ఆ రథం నగరమంత విశాలంగా ఉంది. అది అతని మనస్సుచేత సృష్టించ బడింది. అతను కవచం ధరించి, ధనుస్సు, బాణాలు పట్టుకొని ఉన్నాడు. అతనికి ఇష్టుడైన అకృతవ్రణుడు సారథిగా ఉన్నాడు. భీష్ముడు రథం మీద నుంచి దిగి బ్రాహ్మణశ్రేష్ఠుడైన భార్గవరాముని సమీపించి నమస్కరించి తనకు జయం కలగాలని ఆశీర్వదించ మన్నాడు.
  పరశు రాముడు ఇలా అన్నాడు - ‘‘కురువంశశ్రేష్ఠా! అభివృద్ధి కోరుకొనేవారు ఇలాగే చేయాలి. నీవు ధైర్యంగా యుద్ధం చేయి. నిన్ను జయించడానికి నేను ఇక్కడకు వచ్చాను కనుక నీకు జయం కలగాలని ఆశీర్వదించను. నీ ప్రవర్తనకు నేను సంతోషిం చాను.’’
  అప్పుడు భీష్ముడు రామునితో ఇలా అన్నాడు. ‘‘బ్రాహ్మణోత్తమా! నీ గురుత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఈ ధర్మయుద్ధంలో నా ప్రతిజ్ఞావాక్యాన్ని విను. నీ శరీరగతమైన వేదాలమీద గానీ, గొప్పదైన నీ బ్రాహ్మణ్యం మీద కాని, నీ తపస్సు మీద కాని నేను దాడి చేయను. నీవు ఆశ్రయించిన క్షత్రియధర్మం మీద దాడి చేస్తాను. బ్రాహ్మణుడు శస్త్రాలను ధరించడం ద్వారా క్షత్రియుడవుతాడు’’. ఇలా అంటూ భీష్ముడు అతనిపై బాణవర్షం కురిపించాడు. అవి రాముని శరీరంలో గుచ్చుకున్నాయి. గాయాలనుండి కారుతున్న రక్తంతో అతను ధాతుజలాన్ని విడుస్తున్న మేరుపర్వతంలా ప్రకాశించాడు. కాని అతను వెంటనే లేచి వాడి బాణాలను కురిపించగా భీష్ముడు తన బాణవర్షంతో అతన్ని నిశే్చతనుడిని చేశాడు. గురువు ఆ స్థితిలో పడి ఉండడం చూసి భీష్ముడు తనను తాను నిందించుకున్నాడు.
  ఇంతలో సూర్యుడస్తమించడంతో ఆనాటి యుద్ధం ముగిసింది. సూర్యోదయం కాగానే మరల వారిద్దరూ యుద్ధం మొదలుపెట్టారు. పరశురాముడు భీష్మునిపై భయంకరంగా మండుతున్న బాణాలను ప్రయోగించాడు. వాటిని భీష్ముడు తునకలు చేశాడు. అప్పుడు భార్గవరాముడు అస్త్రాలని ప్రయోగించాడు. అతడు వేసిన దివ్యాస్త్రాలను భీష్ముడు తాను కూడా దివ్యాస్త్రాలు వేసి అడ్డుకున్నాడు. పరశురామునికి కోపం వచ్చి భీష్ముని దగ్గరకు వచ్చి అతని వక్షఃస్థలం మీద కొట్టగా అతను మూర్ఛపోయి రథం మీద కూలబడి పోయాడు. సూతుడు అతన్ని వెంటనే దూరంగా తీసుకొనిపోయాడు.
  భీష్ముడు మూర్ఛపోవడం చూసి అంబ మొదలైనవారు సంతోషంగా కోలాహలం చేశారు. అప్పుడు తెలివి వచ్చిన భీష్ముడు రథసారథితో తన్ను రాముడు ఉన్న చోటికి తీసుకుపొమ్మన్నాడు. అక్కడికి వెళ్లి అతను పరశురామనిపై మరల బాణవర్షం కురిపించాడు. వాటిని రాముడు ఖండించాడు. భీష్ముడు ఒక కాలాగ్ని వంటి బాణాన్ని ప్రయోగించి రాముని మూర్ఛపోయేటట్లు చేశాడు. అతను పడిపోగానే అందరూ హాహాకారాలు చేశారు. మునులందరు అతని దగ్గరికి పరుగెత్తి వెళ్ళి నీళ్ళు జల్లి ఆశీస్సులతో అతన్ని సేదతీర్చారు. అప్పుడు పరశురాముడు లేచి ఆగ్రహంతో భీష్మునిపైకి లక్షల బాణాలు వేశాడు. వాటిని భీష్ముడు ఖండించాడు. ఈ విధంగా యుద్ధంలో వదిలిన బాణాలు ఆకాశం అంతా నిండి సూర్యుడిని కన్పడ కుండా చేశాయి. ఇంతలో సూర్యాస్తమయం కావడంతో యుద్ధం ఆనాటికి ఆగింది.
  మూడవనాడు యుద్ధం మొదలవగానే పరశురాముడు అనేక దివ్యాస్త్రాలను వర్షంలాగ భీష్మునిపై కురిపించాడు. భీష్ముడు ప్రాణాలు సైతం లెక్కించక ఆ దివ్యాస్త్రాలను, తాను ప్రయోగించిన అస్త్రాలతో నిరోధించాడు.
  ఇంకావుంది...


  0 0

  విశాఖపట్నం(స్పోర్ట్స్), డిసెంబర్ 23: బెంగాల్ జట్టుతో జరుగుతున్న గ్రూప్-బి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు దీటైన సమాధానాన్ని ఇచ్చింది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ అర్ధ సెంచరీ, జ్యోతిసాయి కృష్ణ 43 పరుగులతో బ్యాటింగ్‌లో మెరియడంతో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆంధ్రా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ 123 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 64 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచి జట్టును ముందుకు నడిపించాడు. జ్ఞానేశ్వర్, జ్యోతిసాయి కృష్ణతో కలిసి రెండో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అంతకుముందు ఆరు వికెట్లకు 194 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ జట్టు 300 పరుగులు చేసి, ఆలౌట్ అయింది. జట్టులో వ్రిట్టిక్ బిజోయ్ చటర్జీ 76, ప్రదీప్త ప్రమాణిక్ 43 పరుగులు చేయగా ఆంధ్రా బౌలర్లు శశికాంత్ 55 పరుగులకు అయిదు వికెట్లు, ఫృద్వీరాజ్ 81 పరుగులకు మూడు వికెట్లు వంతున పడగొట్టి బెంగాల్ జట్టును కట్టడి చేశారు.


  0 0

  గుత్తి, డిసెంబర్ 23 : రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని పాతపేటకు చెందిన జిలాన్ కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సమీప బంధువుల దిన కర్మకు హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు. అయితే కారు గుత్తి మండల పరిధిలోని కరిడికొండ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో జిలాన్ బాషా భార్య ఫజులున్(28), కుమారుడు లియాన్‌వాహిద్(2) అక్కడికక్కడే మృతి చెందగా గుత్తి ప్రభుత్వాసుపత్రితో చికిత్స పొందుతూ జిలాన్‌బాషా మేనల్లుడు ఖాదీర్‌బాషా(10) మృతి చెందాడు. అలాగే జిలాన్‌బాషా, రిషాచష్మి, బాబిన్ తీవ్రంగా గాయపడ్డారు.


  0 0

  విజయవాడ, డిసెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల పెంపునకు పీఆర్‌సీ రిపోర్టు ఆలస్యమవుతున్న నేపథ్యంలో గత జూలై నుండి 34శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని యుటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ, పీ బాబురెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన సంఘ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశంలో సాబ్జీ మాట్లాడుతూ డిసెంబర్ 28న జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న ధర్నాకు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బాబురెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న రెండు విడతల డీఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ అమలుకు ఆలస్యమైతే అంతవరకు 34శాతం ఇంటీరియం రిలీఫ్ జూలై నుండి వర్తింపచేస్తూ అమలు చేయాలని కోరారు. జనవరి 8, 9 తేదీల్లో జరగనున్న సార్వత్రిక సమ్మెకు యుటీఎఫ్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయ జీతాల చెల్లింపుపై జారీ చేసిన 132 జీవోను రద్దు చేయాలని, హామీ పత్రాల ఉపాధ్యాయులకు బకాయిలు పూర్తిగా చెల్లించాలని, రూ. 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, సర్వీస్ రూల్స్‌పై కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అడ్‌హాక్ సర్వీసు రూల్స్ రూపొందించి ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని సమావేశం తీర్మానించిందని తెలిపారు. సమావేశంలో యుటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేఎస్‌ఎస్ ప్రసాద్, సహాధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, బీ శ్రీదేవి, కోశాధికారి కే శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు డీ రాము, మహమ్మద్ జిలాన్ పాల్గొన్నారు.


  0 0

  విజయవాడ, డిసెంబర్ 23: ఏపీఎస్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు, కార్మికులకు వచ్చే పింఛన్లు, ఇతరత్రా ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా తెల్ల రేషన్ కార్డుల జారీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించిన ఫైల్ తాజాగా ప్రభుత్వం వద్దకు చేరింది. గత గుర్తింపు సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ ఫైల్ కదిలింది. తెల్ల రేషన్ కార్డులకు సంబంధించిన వార్షిక ఆదాయ పరిమితులు తెలపాలంటూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు లేఖ రాయటం, దీనిపై ఆయన గ్రామాల్లో రూ. 60వేలు, పట్టణాల్లో రూ. 75వేలు వార్షిక ఆదాయం అర్హతగా ఉందని సమాధానమిచ్చారు. అయితే వార్షిక ఆదాయాన్ని గ్రామాల్లో రూ. 1.20 లక్షలు, పట్టణాల్లో రూ. 1.50 లక్షలకు పెంచేందుకు ఆర్టీసీ ప్రతిపాదనలు పంపింది. విశ్రాంత ఉద్యోగులు, కార్మికులు తక్షణం ఆర్టీసీ డిపో మేనేజర్ల ద్వారా తమ ఆదాయ వివరాలను ఆధార్ కార్డు సహా తెలపాలని సంస్థ అడ్మినిస్ట్రేషన్ ఈడీ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు.


  0 0

  మెళియాపుట్టి, డిసెంబర్ 23: రాష్ట్ర ప్రజలకు గత ఎన్నికలలో ప్రజల ఓట్లు కోసం ఆచరణకు సాధ్యంకాని పథకాలు ప్రవేశపెట్టి తప్పుతోవతో మభ్యపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ప్రజలు గుణపాఠం చెప్పాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం మెళియాపుట్టి మండలం, జంతూరు గ్రామంలో పాదయాత్ర చేశారు. జగన్మోహనరెడ్డి పాతపట్నం వైసీపీ సమన్వయకర్త రెడ్డిశాంతి ఆధ్వర్యంలో పాతపట్నం, హిరమండలం, ఎల్‌ఎన్ పేట, మెళియాపుట్టి, కొత్తూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ వారు చెప్పిన సమస్యలను విన్నారు. జంతూరు నుంచి దారిపొడవునా ప్రజలు, మహిళలు మంచినీటి బిందెలతో నీరాజనాలు పలికారు. రాష్ట్రంలో చంద్రబాబు పుణ్యంతో పరిశ్రమలు మూతపడ్డాయని, మరికొన్ని పరిశ్రమలు మూతపడ్డానికి సిద్దంగా ఉన్నాయని, నిరుద్యోగులకు చేయూతను ఇచ్చేందుకు ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టకుండా తన రాజకీయ స్వలాభం కోసం జనాకర్షణ పథకాలు ప్రవేశపెట్టి, ముఖ్యంగా మహిళలు, దళితులు, గిరిజనులకు మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ ప్రతినిధులు టి.రఘురామ్, భూమాన కరుణాకరరెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, కంబాల జోగులు, దువ్వాడ శ్రీనివాస్, బి.లక్ష్మమ్మ, అన్నపూర్ణమ్మ, వైసీపీ నాయకులు అప్పారావు, వై.ఖగేశ్వరరావు, బి.లక్ష్మి, డి.బాలరాజు, పేరాడ తిలక్, జానకమ్మ, గిరిజనులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

  చిత్రం..పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి


  0 0

  విజయవాడ, డిసెంబర్ 23: ముఖ్యమంత్రి శే్వతపత్రాల విడుదల పేరిట ఆర్భాటం చేయడం మినహా వాస్తవాలను ప్రజల ముందుంచలేదని, తొలిగా ప్రజల ముందుంచిన శే్వతపత్రంలో కొత్త విషయమేమీలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర హాని కలిగించిన ఎన్‌డీఏ ప్రభుత్వంలో నాలుగేళ్లు భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి చేసిన హాని గురించి కనీసం ఆత్మవిమర్శ లేదన్నారు. బీజేపీ విద్రోహంలో తెలుగుదేశం పాత్రను మరుగుపర్చడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని, ప్రత్యేక ప్యాకేజీతో ఎంతో మేలు జరుగుతుందని నాడు చంద్రబాబు చెప్పడంపై కనీసం పశ్చాత్తాపం లేదన్నారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి సహా వివిధ ప్రజాసంఘాలు, ఇత ర ప్రతిపక్షాలూ నాలుగున్నరేళ్లుగా నిలకడగా సాగిస్తున్న ఉద్యమాలను మాటమాత్రంగానైనా ప్రస్తావించకుండా, స్కూల్ పిల్లలను, స్కీమ్ వర్కర్లను బలవంతంగా తరలించి సర్కారు ఖర్చుతో నిర్వహించిన ధర్మపోరాట దీక్ష గురించిన డబ్బా కొట్టుకోవడం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పిదాలను హుందాగా అంగీకరించాలన్నారు. లేకుంటే ఈ శే్వతపత్రాలు చరిత్రలో నల్లపత్రాలుగానే మిగిలిపోతాయంటూ వారు ఎద్దేవా చేశారు.


  0 0

  విజయవాడ, డిసెంబర్ 23: రాహుల్ గాంధీ హీరోగా చంద్రబాబు సినిమా తీస్తున్నారని జగన్ చేసిన ఎగతాళి వ్యాఖ్యలపై పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి తీవ్రంగా స్పందించారు. మోదీ హీరోగా జగన్ తీసే అట్టర్ ఫ్లాప్ సినిమా కంటే రాహుల్ హీరోగా చంద్రబాబు తీసే సినిమా సూపర్ హిట్ అవుతుందని, దీంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఆదివారం ఆయనిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రధాన మంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ ప్యాకేజీ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు వస్తాయని, రాష్ట్రానికి వరప్రసాదిని అయిన పోలవరం పూర్తవుతుందన్నారు. అలాగే కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్ వస్తాయన్నారు. 6 వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా అవుతాయన్నారు. అసెంబ్లీని బహిష్కరించి, లోక్‌సభకు రాజీనామా చేసి ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోయిన జగన్‌కు, ఆ పార్టీ నాయకులకు రాజకీయాలెందుకని తులసీరెడ్డి ప్రశ్నించారు.


  0 0

  ఒంగోలు, డిసెంబర్ 23: రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి ఒక రైతు ప్రతినిధి అసెంబ్లీ, పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నాడే రైతు సమస్యలు పరిష్కారం అవుతాయని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలులో దివంగత మాజీ ప్రధాని చౌదురి చరణ్‌సింగ్ 116వ జయంతి, జాతీయ రైతు దినోత్సవ సభ జరిగింది. ఈ సభకు ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షుడు చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా చౌదరి చరణ్‌సింగ్ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక ఎక్కువ మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టిసారిస్తున్నారని అన్నారు. పంటల సాగులో నష్టాలు వస్తుండడంతో వ్యవసాయాన్ని వదిలేస్తున్నారని అన్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే భవిష్యత్‌లో పంటల ఉత్పత్తి తగ్గి ఇతర దేశాల నుండి పంటలను మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం అన్నపూర్ణ దేశమని, రైతే భారదేశానికి వెనె్నముక అని అలాంటి మన దేశంలో ఇటువంటి పరిస్థితి భవిష్యత్‌లో రాకూడన్న ఉద్దేశ్యంతోనే మన వ్యవసాయానికి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు యువతను వ్యవసాయ రంగంలోకి తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో తగిన మేర ఆదాయం వస్తే యువత తిరిగి వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తారని ఆయన తెలిపారు. అందులో భాగంగానే తాను గత కొంతకాలంగా దేశంలోని వ్యవసాయంపై అధ్యయనం చేస్తూ అన్ని వ్యవసాయ పరిశోధనశాలలను సందర్శించానని చెప్పారు. ఈసందర్భంగా కొంతమంది అనుభవజ్ఞులైన రైతు సంఘాల నాయకులు, రైతులను కలుస్తూ వారి సూచనలు, సలహాలను తీసుకోవడంతో పాటు, రైతులు చేస్తున్న ఆందోళనా కార్యక్రమాలలో కూడా తాను ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించి ఇస్తే రైతులు నష్టాలపాలు కారన్నారు. ఎన్నికల సమయంలో దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తాం, సబ్సిడీ రుణాలు బ్యాం కుల ద్వారా ఇస్తామంటూ తాత్కాలిక హామీలతో రైతుల జపం చేస్తూ అధికారంలోకి వచ్చినవారు ఆ తరువాత వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే రైతులకు మేలు జరగటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీకన్నా రైతుకు రుణ విముక్తి జరిగినప్పుడే రైతు సంతోషంగా ఉంటాడని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తాను ఒక ఆలోచన చేస్తున్నానని, ప్రతి జిల్లాకు ఒక మేనిఫెస్టోను ప్రణాళికాబద్దంగా తయారు చేసి రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
  చిత్రం..రైతు దినోత్సవ సభలో ప్రసంగిస్తున్న సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ


  0 0

  భీమవరం, డిసెంబర్ 23: ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయదుంధుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా వ్యూహత్మకంగా అడుగులువేస్తోంది. తెలంగాణలో టీడీపీతో జట్టుకట్టి గత ఎన్నికల కంటే ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆచితూచి అడుగువేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏఐసీసీ ముఖ్య నాయకులు కొందరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యులతో సమాలోచనలు సాగిస్తున్నట్టు విశ్వసనీయంగ తెలిసింది. తెలంగాణ ఎన్నికలకు ముందు పీసీసీ కొందరివద్ద నుంచి పొత్తు అంశం పై సమాచారాన్ని సేకరించింది. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పొత్తు అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీల వారీగా అభిప్రాయ సేకరణచేస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకుంటే ఎందుకు పెట్టుకోవాలి, వద్దు అనుకుంటే గల కారణాలను కూడా చెప్పమంటున్నట్టు సమాచారం. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్లలో చాలామంది ఇక్కడ పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదని పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్బవించిన తెలుగుదేశం పార్టీతో పొత్తువద్దని తేల్చి చెబుతున్నట్లు సమాచారం. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే తెలంగాణ మాదిరిగా ఫలితాలు వస్తాయని కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రాహుల్ దూతలకు సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వివిధ జిల్లాల్లో పర్యటించిన సమయంలో పొత్తు పై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా పొత్తు పొట్టుకుంటే తెలంగాణాలో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో చూశారు కదా అని సహచరులకు చెబుతున్నట్టు సమాచారం.
  2019 ఎన్నికలను టార్గెట్ చేసిన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఆంధ్రాకు ప్రత్యేక హోదాను ఇచ్చేది తామేనని చెబుతూ ప్రజల్లోకి చొచ్చుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇదే నినాదాన్ని అధికార తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకువెళున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుతో పోటీచేస్తాయా లేదా అన్నది ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే తేల్చాల్సి వుంటుందని పలువురు కాంగ్రెస్ సీనియర్లు పేర్కొంటున్నారు.


  0 0

  పిఠాపురం, డిసెంబర్ 23: మానవులు మృగాలుగా మారుతున్నారనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా చూపించే ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. లైంగిక దాడికి పసి పిల్లల నుండి వృద్ధురాళ్ల వరకు వదిలిపెట్టని మానవ మృగాలు తాజాగా పశువులనూ వదిలి పెట్టక, తాము పశువుల కంటే హీనమని నిరూపించుకున్నారు. పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో శనివారం అర్థరాత్రి దాటాక ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. పిఠాపురం రూరల్ పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం పిఠాపురం మండలం గోకివాడ-బి.కొత్తూరు గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారిలో గోకివాడకు చెందిన నా మా బుచ్చిబాబు పశువుల మకాం ఉంది. ఇం దులో ఆవులు, దూడలు, గిత్తలున్నాయి. శనివా రం అర్ధరాత్రి దాటిన తరువాత కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పశువులకు కట్టిన తాళ్లను తెంచి వదిలేశారు. ఇందులో ఒక ఆవును పొ లానికి కొద్ది దూరంలో ఉన్న తాటిచెట్టు వద్దకు తీసుకెళ్లి, బలంగా కాళ్లను తాళ్లతో కట్టి లైంగికదాడికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారు జా మున పశువుల మకాం వద్దకు వెళ్లిన రైతు బుచ్చిబాబు పశువులు లేకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. పొలానికి కొద్ది దూరంలో తాటిచెట్టుకు తాళ్లతో కట్టేసి ఆవు పైకిలేవలేని స్థితిలో పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం తెలిపి, పిఠాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కదల్లేని స్థితిలో ఉన్న ఆవుకు వైద్య పరీక్షలు చేయించారు. ఆవుకు వైద్యం చేసిన పిఠాపురం మండలం మల్లాం వైద్యాధికారి తిరుమలరావు ఆవుమానం (కరిమి)లో పురుషుని వీ ర్యకణాలు ఉన్నట్లు నిర్థారించారు. ఆవుపై లైం గిక దాడికి పాల్పడ్డారని దీనిని పశుప్రాయత అంటారని వివరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పిఠాపురం రూరల్ ఎస్సై పివిఆర్ మూర్తి రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎంతో పవిత్రంగా చూసే ఆవుపై ఇటువంటి దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ ఆవుపై దాడికి పాల్పడ్డవారిని వెంటనే గుర్తించి శిక్ష పడేలా చేయాలని పోలీసులను కోరారు.
  చిత్రం..లైంగిక దాడి జరిగి కదల్లేని స్థితిలో ఉన్న గోమాత


  0 0

  పిఠాపురం, డిసెంబర్ 23: రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో త్వరలో విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ‘దగా..కుట్ర’ అనే పాటపై సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ వెల్లడించారు. ముఖ్యమంత్రిని కించపరుస్తూ పాడిన ‘దగా..కుట్ర’ పాటను వెంటనే బ్యాన్ చేయాలని సెన్సార్ బోర్డుకు ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొంటున్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి పిఠాపురంలోని తన కార్యాలయంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసి పిటిషన్ పత్రాలను విలేఖర్లకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ రామ్‌గోపాల్ వర్మ ఓ ఉన్మాదని, పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తూ వివాదాలు సృష్టించడమే అతడి నైజమన్నారు. ఇప్పుడు అతనికి వైసీపీ నేతలు తోడయ్యారని, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి వైసీపీ యువజన నాయకుడన్నారు. దీన్నిబట్టి ఈ చిత్రం వెనక వైసీపీ హస్తం ఉందని స్పష్టమవుతోందన్నారు. అప్పట్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను అస్త్రంగా ఉపయోగించి, ఇప్పుడు సినిమా తీసి ముఖ్యమంత్రిపై దుష్ప్రచారం చేయడం ఎంత వరకూ సమంజసమన్నారు. త్వరలో ఎన్నికల సమీపిస్తున్నందున ఎన్నికల్లో వైసీపీ తోత్తుగా ఉన్నవాళ్లంతా చేసే కుట్రలో భాగమని అభివర్ణించారు. రాచరికంలోనే కుట్రలు కుతంత్రాలు ఉంటాయని, ప్రజాస్వామ్యంలో అవి కుదరవన్నారు. రామ్‌గోపాల్ వర్మకు కేవలం రాచరికం విధానాలు తప్పితే ప్రజాస్వామ్య విలువలు తెలియవన్నారు. రాబోయే కాలంలో సినిమా విడుదలను అడ్డుకుంటామన్న ఎమ్మెల్యే వర్మ, తక్షణమే ఈసినిమా తీస్తున్న నిర్మాత రాకేష్‌రెడ్డి, దర్శకత్వం వహిస్తున్న రామ్‌గోపాల్ వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
  గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు..
  గుంటూరు, డిసెంబర్ 23: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై తప్పుడు కథనాలతో వారిని కించపరిచేలా ‘వెన్నుపోటు’ పేరుతో యూట్యూబ్‌లో విడుదల చేసిన పాటకు సంబంధించి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై గుంటూరు పోలీస్ స్టేషన్‌లో కొందరు ఆదివారం ఫిర్యాదు చేశారు. గుంటూరుకు చెందిన సిరిపురపు శ్రీ్ధర్, నల్లపనేని అమరనాథ్, తదితరులు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఈమేరకు ఫిర్యాదు చేశారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో వల్ల సమాజంలో అలజడులు సృష్టించాలని నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్ జగన్ కుట్ర పన్నారని వారు ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రతిష్ఠను దిగజార్చేలా, సీఎం పరువుకు భంగం కలిగేలా ఈ వీడియో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు కోరారు.
  చిత్రం..హైకోర్టులో వేసే పిటిషన్ పత్రాలు చూపిస్తున్న ఎమ్మెల్యే వర్మ


  0 0

  విజయవాడ, డిసెంబర్ 23: అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లను యుద్ధప్రాతిపదికన చెల్లించి, ఆత్మహత్యలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరో ఉద్యమ రూపానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని ధర్నాచౌక్ దగ్గర ఆదివారం 13 జిల్లాలకు చెందిన బాధితులు రిలే దీక్షలు ప్రారంభించారు. దీక్షలను అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్షుడు బీ విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి వీ తిరుపతిరావు, గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, కృష్ణా జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు ప్రారంభించి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ బాధితుల కష్టార్జితాన్ని అగ్రిగోల్డ్ యాజమాన్యం కొల్లగొట్టిందని, ఆ డబ్బు తిరిగి ఇప్పించాలనే ఏకైక లక్ష్యంతోనే అసోసియేషన్ ఏర్పడిందన్నారు. ఈ నెల 28 నుంచి తాము చేపట్టబోయే నిరవధిక దీక్ష వాయిదా వేసుకోవాలని పత్రికా ముఖంగా అసోసియేషన్‌కు ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విజ్ఞప్తి చేశారని తెలిపారు. బాధితుల డిమాండ్ల సాధన కోసం 28నుంచి రిలే దీక్షలు, తనతో పాటు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, తిరుపతిరావుతో తలపెట్టనున్న నిరవధిక దీక్ష యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.


  0 0

  గుంటూరు, డిసెంబర్ 23: స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ప్రధానిగా పీవీ నర్సింహారావుదేనని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ సిరిపురపు శ్రీ్ధర్ అన్నారు. గుంటూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం పీవీ వర్ధంతిని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుకోడానికి ద్వారాలు తెరచిన ఘనత పీవీకే దక్కుతుందన్నారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని దేశానికి తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం సమర్థంగా నడిపిన నేత పీవీ అని నివాళులు అర్పించారు. ఎంపీగా నంద్యాల నుంచి పీవీ పోటీ చేస్తే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ టీడీపీ నుంచి అభ్యర్థిని నిలబెట్టకుండా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనతను టీడీపీకి దక్కించారన్నారు. రాష్ట్రానికి నిధుల సమస్య ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ను పీవీ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురోగమన దిశలో నడిపిస్తున్నారని శ్రీ్ధర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా ఎండవల్లి, తదితరులు పాల్గొన్నారు.


  0 0

  విజయవాడ, డిసెంబర్ 23: రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ పెరుగుతూ మధుమేహం, తదితర వ్యాధుల బారి నుంచి ఉపశమనం పొందేందుకు చిరుధాన్యాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. రోజులో కనీసం ఒకసారైనా చిరుధాన్యాలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. మారుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా చౌకధరల దుకాణాల ద్వారా రాగులు, తెల్లజొన్న సరఫరా చేస్తోంది. గడచిన మూడు నెలల్లో వీటికి డిమాండ్ పెరగటం ప్రజల ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పునకు అద్దం పడుతోంది. చౌకధరల దుకాణంలో బియ్యం బదులుగా రాగులు లేదా జొన్నలను కిలో రూపాయి చొప్పున తీసుకునే వీలు ప్రభుత్వం కల్పించింది. రాగులు, జొన్నల పంపిణీని తొలుత రెండేసి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టినప్పటికీ ప్రజల నుంచి పెరిగిన ఆదరణను గమనించి రాష్ట్రం అంతటా అమలు చేస్తున్నారు. రాగుల పంపిణీకి తొలుత 4000 టన్నులు సరఫరా చేసేందుకు ప్రతిపాదించగా, అక్టోబర్‌లో 2215 టన్నుల మేర ఇండెంట్ పెట్టారు. ఆ నెలలో కేవలం 810 టన్నులు మాత్రమే కార్డుదారులు తీసుకెళ్లారు. డిసెంబర్ నాటికి ఇండెంట్ 2262 టన్నులకు చేరుకోగా, 3475 టన్నులు పంపిణీ చేశారు. తెల్లజొన్న కూడా అక్టోబర్‌లో 2640 టన్నుల మేర ఇండెంట్ ఉండగా, 1531 టన్నులను పంపిణీ చేశారు. డిసెంబర్ నాటికి 1561 టన్నులను పంపిణీ చేశారు. దీంతో మూడునెలల్లో 5036 టన్నులను సరఫరా చేయడం విశేషం. రాగులకు సంబంధించి చిత్తూరు, అనంతపురం, కృష్ణా, కడపలో ఎక్కువ వినియోగం నమోదు కాగా, జొన్నలు కర్నూలులో ఎక్కువగా తీసుకెళ్లినట్లు వివరాలు తెలియచేస్తున్నాయి.
  జనవరి నుంచి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఈమేరకు ఎక్కువ మొత్తంలో రాగులు, జొన్నలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరా సంస్థ జనరల్ మేనేజర్ వి వెంకటరమణ ఆదివారం ఇక్కడ తెలిపారు. రాగుల వినియోగం రాష్ట్రంలో అంతటా ఉందని, జొన్నలకు ఎక్కువ డిమాండ్ కర్నూలులో మాత్రమే ఉందన్నారు. వీటి సరఫరాపై పరిమితిని ఎత్తివేశామని, బియ్యం బదులు ఎంత కావాలన్నా తీసుకునే వెసులుబాటు కల్పించామని ఆయన వెల్లడించారు.


  0 0

  విజయవాడ, డిసెంబర్ 23: రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం సోమవారం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే 61.43 శాతం పనులు పూర్తి చేసుకుని శరవేగంగా నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన రేడియల్ గేట్ల ఏర్పాటు పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 48 రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందులో తొలి గేటు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం తొలి గేటును నిలబెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ప్రారంభించనున్నారు. మిగిలిన 47గేట్లు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు, వెడల్పు 15.9 అడుగులు. మొత్తం గేట్ల తయారీకి 18వేల టన్నుల ఉక్కు అవసరమవుతుందని అంచనా. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు 61.98 శాతం పూర్తయ్యాయి. గేట్ల నిర్మాణానికి రూ. 530కోట్ల రూపాయలు వ్యయం అవుతోంది. గేట్లను నిలబెట్టేందుకు హైడ్రాలిక్ సిలిండర్లు వినియోగిస్తారు. ఒక్కో సిలిండర్ బరువు 250 టన్నులు కాగా, వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. గేట్ల ఏర్పాటులో హైడ్రాలిక్ సిలిండర్లతో పాటు సెల్ఫ్ లూబ్రికేటింగ్ బుష్‌లు కీలకంగా ఉంటాయి. వీటిని జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. మొత్తం 96 బుష్‌లు అవసరం అవుతాయి. ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ 500 టన్నుల బరువును ఎత్తుతుంది. ఒక్కో గేటు 300 టన్నుల బరువు ఉంటుంది. గేట్‌ను ఎత్తి నిలబెట్టేందుకు వీలుగా ఇప్పటికే కొన్ని హైడ్రాలిక్ సిలిండర్లు ప్రాజెక్టు ప్రాంతానికి తరలించగా, మరికొన్ని కొద్దిరోజుల్లో రానున్నాయి. తొలిగేటును ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్టను మే చివరి నాటికి పూర్తిచేసి గ్రావిటీ ద్వారా నీటిని అందించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రాజెక్టు ఎత్తు 129 అడుగులు, పొడవు 9560 అడుగులు ఉంటుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సహా సాగు, మంచినీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది.


  0 0

  రాజమహేంద్రవరం, డిసెంబర్ 23: సంఘ్ పరివార్ అజెండాతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జాతీయ కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో పనిచేస్తూ అన్ని రంగాలను భ్రష్టుపట్టించిందన్నారు. ఏఐటీయూసీ అనేది కార్మికుల చరిత్ర అని, అన్ని వర్గాల్లో ఉందన్నారు. అంతర్జాతీయంగా పది దేశాల్లో స్ఫూర్తిదాయకంగా పనిచేస్తోందన్నారు. సీపీఐ, ఏఐటీయూసీ అనుబంధ రాజమహేంద్రవరంలోని జట్లు లేబర్ యూనియన్ 75 సంవత్సరాల వజ్రోత్సవ బహిరంగ సభ రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో ఆదివారం జరిగింది. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మీసాల సత్యనారాయణ నేతృత్వంలో జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షుడు కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో కౌర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 1920లో ఆవిర్భవించిన ఏఐటీయూసీ స్వాతంత్రోద్యమంలో కూడా సేవలందించిందన్నారు.
  లాలాలజపతిరాయ్ వ్యవస్థాపక అధ్యక్షునిగా ప్రారంభమైన ఏఐటీయూసీ పోరాట ఫలితంగా దేశంలో ఎన్నో కార్మిక చట్టాలు వచ్చాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా పది దేశాల్లో ఏఐటీయూసీ పనిచేస్తోందన్నారు. ప్రధాని మోదీ అన్ని రంగాలను భ్రష్టు పట్టించారని కౌర్ ఆరోపించారు. దేశాన్ని ప్రైవేటీకరించి, అంబానీలకు దోచిపెడుతున్నారన్నారు. దశల వారీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఫిబ్రవరిలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.దేశంలో నల్లడబ్బును వెలికితీస్తానని చెప్పిన మోదీ దేశంలో అతిపెద్ద అవినీతి ప్రభుత్వంగా మార్చారని అమర్‌జిత్ కౌర్ ఆరోపించారు. అవినీతి డబ్బు వెనక్కి తీసుకురాలేదు సరికదా దేశాన్ని అంబానీలకు తాకట్టు పెట్టే విధంగా శాసనాలు చేస్తున్నారని ఆరోపించారు.
  రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో పరారవుతున్న బడా వ్యక్తులకు మోదీ కొమ్ము కాస్తున్నారని అమర్‌జిత్ కౌర్ ఆరోపించారు.


older | 1 | .... | 1981 | 1982 | (Page 1983) | 1984 | 1985 | .... | 2069 | newer