Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

శ్రీ పరమహంస బోధామృతము

$
0
0

వానిని దాటి యవి పోజాలవు. విశిష్టాద్వైతముయొక్క సంపూర్ణావస్థయం దఖండ సచ్చిదానంద వస్తువును తద్బాహ్య రూపమును సమముగా సత్యములని కనుగొనవచ్చును.
జీవులయెడ తన యనంత కారుణ్యముచే భగవానుడవతరించును.అబహ్మ మార్గమును-్ధర్మ మార్గమును -లోకమునకుదెలుపుటకై ఆత్మశక్తికిని పవిత్రతకును నిలయమగు నొకానొక దివ్య మానవ రూపమున నాతడావిర్భవించును. వివిధ దేశ కాలములలో లోకమునకు అధ్యాత్మిక జీవన మార్గములను జూపిన ధర్మస్థాపకులందరను ఇట్టి యవతార పురుషులే -లేదా ఈశ్వరాదేశమునొందిన మహనీయులే. వారి నారాధించుటయు వారి జీవితచరితములను ధ్యానించుటయు ఆత్మవికాసమునకు సులభోపాయములు.
జీవుని వ్యక్తిత్వమునకు ఈశ్వర చైతన్యముతో సన్నిహిత సంబంధముగలదు; ఏలన పరమేశ్వర చైతన్యమే ఉపాధిబద్ధమైన జీవరూపమున భాసించుచున్నది.కావున ప్రతి జీవియందును దివ్యత్వము -ఈశ్వరత్వము -గర్భితముగానున్నది. బాహ్యాంతర ప్రకృతులను వశమొనర్చుకొని యంతర్గతముగానున్న ఈశ్వరత్వమును ప్రకాశితమొనర్చుటయే జీవిత పరమావధి. సరియగుమనోభావముతో నవలభించినచో, సమస్త ధర్మమార్గములును ఈయాత్మ వికాసము నొనగూర్చునవియే.
బ్రహ్మ సాక్షాత్కారమును బొందుటకై జ్ఞానయోగము, కర్మయోగము, భక్తియోగము, రాజయోగము నను ముఖ్యమగు యోగములలో దేనిని గాని, కొన్నిటినిగాని, అన్నిటినిగాని అవలంభింపనగును.
పారమార్థిక జీవమునకు ప్రధానాంగము బలము. శారీర మానసికాధ్యాత్మిక బలము. బలమే పుణ్యము, దౌర్బల్యమే పాపము. బలమునకంతకును మూల కారణము నమిమ్క-తన యందును భగవంతునియందును నమ్మిక; ఆత్మనిరసనము లేక స్వయముగా తాన పాపిననుకొనుట ధర్మ లక్షంము కానేరదు. అటిట దౌర్బల్యమును త్రోసిరాజనవలయును. ఏలన స్వతస్సిద్ధమగు తన దివ్యత్మును ధ్యానించుటచే మానవుడు పాపముక్తుడు కాగలడు గాని, ‘‘నేను పాపిని, పాపి’’నని కుందుచుండుటచే విముక్తుడు కాజాలడు. నిజముగా ‘అమృతపుత్రు’డగు మానవుని పాపియనుటకంటె మహాపాపము మఱియొకటి లేదు.
అవినీతిపరుడగువాడు- పాపమునకు వెరవనివాడు- పారమార్థికుడగు కలలోని వార్త. సమస్త నీతి నియమములకును మూలాధారము స్వార్థరాహిత్యము, స్వార్థరాహిత్యమునకు మూలాధారము వైరాగ్యము.వైరాగ్యమనగా కామినీ కాంచనసంగత్యాగము. వినిర్మల వర్తనమున, సర్వభూతహితాచారణమున, సర్వేశ్వరుని బొందవలయునను పరితాపమున, వైరాగ్యమును ప్రజ్లలించును. ఇట్టి వైరాగ్యముచే వినిర్మలమగు హృదయమున భగవానుడు ప్రతిఫలించును. దుర్లభమగు మానవజన్మము నెత్తియు భగవద్దర్శనము నొందనివాని జీవితము-తుదకందులకై తగు సాధనయైన నొనర్పనివాని జీవితము -నిరర్థకము, నిరర్థకము!
జీవుని పరమావధి
1. రాత్రి కాలమున ఆకాశమున నీకు అనేక నక్షత్రములు కన్పించుచున్నవి. సూర్యోదయమైన పిమ్మట అవి కనబడుటలేదు. అందుచే నీవు పగటివేళ ఆకాశమున నక్షత్రములు లేవనవచ్చునా? ఓ నరుడా! అజ్ఞాన దశలో నీవు భగవంతుని కనుగొనజాలని కారణమున భగవంతుడు లేడనబోకుము.
2. దుర్లభమగు మానవజన్మము నెత్తియు ఈ జన్మముననే భగవంతుని దెలిసికొన యత్నింపనివాని జీవితము నిరర్థకము.
ఇంకా ఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి


పరివర్తనతోనే శాంతి

$
0
0

దర్శన స్థితిలో ఉండడమంటే ఏమిటి? మీ శరీరం ఒక నిర్దిష్టమైన ప్రకంపనలు కలిగి ఉంటుంది, మీ భావోద్వేగం మరోరకమైన ప్రకంపనలు కలిగి ఉంటుంది. మీరు మీలో ఉన్న ప్రాణమని పిలిచే దానిలో మరోరకమైన ప్రకంపనలు ఉంటాయి. దర్శనస్థితిలో ఉండడమంటే ఈ జీవితాన్ని అత్యంత సున్నితంగా ప్రకంపించనివ్వడమే. జీవితం లోని సున్నితత్వం, మార్దవం శరీరాన్ని ఆలోచనను, భావోద్వేగాన్ని అధిగమించి నప్పుడు - అప్పుడు మీరు నిజంగా దర్శన స్థితిలో ఉన్నారన్నమాట. అప్పుడు మీరు నిజంగా గ్రహించే స్థితిలో ఉన్నారన్నమాట.
అంటే జరిగేదేమిటి? దర్శనంలో జరిగేదేమిటిటంటే - అనంతమైన దాన్ని గ్రహించడానికి అవసరమైన సాధనాలు మీ దగ్గర లేవు. కానీ ఆ సాధనాలు లేకుండానే, దర్శనంలో అనంతత్వపు కోణాన్ని మీరు రుచి చూడగలరు. అంటే ఉదాహరణకు, మీకు నాలుక లేకపోయినా మీరు వంట రుచి చూడగలగడం లాంటిది అన్నమాట.
ఆయనాతం - పరిమితులను సులువుగా అధిగమించగలిగే సమయం
ఈ గ్రహ జీవన పరిమాణంలోనూ ఇంకా దానిమీద ఉన్నటువంటి సమస్త జీవకోటి జీవన పరిమాణంలోనూ, సంవత్సరంలో మనకి డిసెంబర్ నెలలో వచ్చే ఆయనాంతం మొదలుకొని రెండవ అమావాస్య వరకు లేదా మరో పదిహేను రోజులు కలుపుకుని మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఉన్న ఈ కాలం ఎంతో ఫలవంతమైనది. ఎవరైతే ప్రయత్నపూర్వకంగా వారి పరిమితులను అధిగమించాలి అని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అది ఫలించడం ఎంతో తేలిక. ఈ సమయాన్ని సద్వినియోగించుకోవడానికి ఎన్నో పను లు చేసేవారు. చెట్లు, మొక్కలు ఈ సమయంలో ఫలిస్తాయి, పుష్పిస్తాయి. ఇది కేవలం వాతావరణం సహకరించడం వల్ల మాత్రమే కాదు, ఇది పంచ భూతాలలో ఉన్న మార్పు వల్ల కూడాను. ఇవి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఈ ఐదు పంచభూతాలల్లో ఒకటైనది, మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషించేది, మనం ఎవరు అన్న దాన్ని నిర్ణయించేది ‘నీరు’. ఈ సమయంలో నీరు అత్యధికంగా ఈ భూమండలం మీద ఉంటుంది. ఇలా సమయం గడుస్తున్న కొద్దీ చాలా నీరు ఆవిరైపోయి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మీరు చూసిన్లయితే ఇప్పుడు ఆకాశంలో ఒక్క మేఘం కూడా కనబడటం లేదు. కాని ఎండాకాలం వస్తున్నకొద్దీ చాలా నీరు ఇంకిపోయి పైకి మేఘాల రూపంలో వెళ్ళిపోతుంది. చాలావరకు నీరు ఈ గ్రహాన్ని వదిలేసి మరోచోట దాని స్థానం తీసుకుం టుంది. అందుకే ఈ సమయంలో ఎక్కడ చూసినా సరే, ముఖ్యంగా ఈ ఉత్తరాది దిశలో శీతాకాలం అయిపోగానే ఈ మండలం మీద నీరు పుష్కలంగా ఉన్నప్పుడు, ఈ సమయంలో మనం, మన మానవ శరీరంలో ఏదయినా వౌళికంగా మార్చుకోవాలి అనుకుంటే ఇది ఎంతో ముఖ్యమైన సమయం.
మనం ఒక విషయం అర్ధంచేసుకోవాల్సింది ఏంటంటే, యోగ సాంప్రదాయంలో మన ధోరణి మార్చడం గురించో లేదా ఆలోచనా విధానం మార్చడం గురించి ఎప్పుడూ చెప్పలేదు. అందుకే చూడండి యోగులకు అంత గొప్ప ధోరణి ఏమి ఉండదు. ఒకరి ఆలోచనా సరళిలో మార్పు తీసుకురావడం అన్నది ఈ రోజులలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ మీలో వౌళికమైన మార్పు, పరివర్తన అన్నది లేకుండా, మీలో ఎలాంటి అనుభూతి లేకుండా కేవలం మీ ధోరణి మార్చుకుంటే అది మిమ్మల్ని, ఈ ప్రపంచాన్ని మోసపుచ్చుకోవడం మాత్రమే అవుతుంది. ఏదో ఒకరోజున, మీలో వౌళికంగా ఏమి మారలేదు అన్న విషయం మీకు తెలుస్తుంది. అలా ప్రయత్నం చేసేవారికి జీవితం మిమ్మల్ని మళ్ళీ బాధపెట్టడం మొదలు పెడుతుంది. బయట చూసేవారికి, మీరు మంచితనానికి, శ్రేయస్సుకి మారుపేరుగా కనబడుతూ ఉండి ఉండచ్చు. కానీ ఎదో ఒకరోజున మీలో మీరు ఎంత ఘర్షణలో ఉన్నారోనన్న విషయం మీకు తెలిసిపోతుంది.
ఇంకావుంది...

అనంతం-19

$
0
0

అడివి పుత్రులకు జన్మలో అందని భోజనం..
రాగ్యా అభిమానంగా గరుడాచలం వైపు చూశాడు.
ఎంత మంచివాడు గరుడాచలం!
అడవి పుత్రుడని అంటరాని వాడని నాగరికత తెలియని అజ్ఞాని అనీ తిరస్కరించి దూరంగాపెట్టకుండా తనతో సమానంగా చూస్తున్నాడు.
గొప్పవాళ్ళ మందే తాగిస్తూ, గొప్పవాళ్ళ భోజనం పెడుతూ, సిగరెట్లిస్తూ- తన సరసన కూర్చోపెట్టి ఆదరిస్తున్నాడంటే-
మనిషి రూపంలోవున్న దేవుడు గరుడాచలం!
రాగ్యా భావోద్వేగంతో చలించిపోయాడు.
భోజనాల అనంతరం కొంతసేపు విశ్రాంతి తీసుకొని, ఇద్దరూ అడవికి బయల్దేరారు.
‘‘సెక్యూరిటీ పంపించమంటారా’’అని ఎవ్వరో అడిగారు.
గరుడాచలం ‘్ఫక్కున’నవ్వాడు!
ఒంటరి పక్షిలా అప్పటిదాకా సందుల్లోగొందుల్లో కాలినడకన తిరిగేవాడూ; వ్యసనాల వత్తిడి తట్టుకోలేక వారకాంతలకోసం వీధుల్లో సంచరించేవాడూ, క్లబ్బుల్లో బీడీ బంకులదగ్గరా తచ్చాడేవాడూ-
జనం కర్మంచాలక ప్రజాప్రతినిధి ఐతే వెంటనే వాడికి సెక్యూరిటీ!
బజ్జీల బండ్లదగ్గర నిల్చున్నప్పుడు లేని ప్రాణహాని ఎమ్మెల్లేనో ఎంపీనో అయిన మరుక్షణమే ఎలా వస్తుంది?
అదో స్టేటస్ సింబల్!
అలాంటి వాళ్ళను చంపి బుల్లెట్లు వృధాచేసికొనే మూర్ఖులుండరని వాళ్ళకూ తెలుసు!
పాత బాకీ వసూళ్ళకు గన్‌మేన్లను పంపించేవాడూ. పెళ్ళాం పూలకోసం పాలపాకెట్లకోసం పిల్లల బిస్కెట్లకోసం, కూరగాయలకోసం సెక్యూరిటీని పంపించేవాళ్ళూ..
సెక్యూరిటీ పేరిట ప్రజాధనం కోట్లు తగలేస్తున్నారు.
‘‘అవసరం లేదు’’అన్నాడు గరుడాచలం.
రాగ్యా గరుడాచలం అడవికి బయల్దేరారు.
* * *
వాల్యా ఏడుస్తూనే ఉన్నాడు..
వరి బువ్వ కావాలిట!
పోలీసు దెబ్బలకు వొళ్ళంతా కడుములు తేలి, ఒకవైపు బాణావతు కదల్లేని స్థితిలోవుంటే, వరి బువ్వకోసం ఎలా వాల్యా?
అడవి బ్రతుకే శాపమై క్షణంక్షణం భయంభయంగా బ్రతుకుతూ, ప్రభుత్వాధికారుల నిర్బంధాలకు గురౌతూ, శాపగ్రస్థుల్లా-జీవచ్ఛవాలై జీవిస్తుంటే,
కడుపున పుట్టిన బిడ్డకు పట్టెడన్నం పెట్టలేని దౌర్భాగ్యస్థితిని తల్చుకొని బాణావతు గుండె పగిలిపోదూ!
దెబ్బల బాధకు మూలుగుతూ నిస్త్రాణగా పడివున్న భర్తకు వాల్యా ఏడుపు వినిపించకూడదనుకొన్నది లక్ష్మీబాయి. వాడ్ని సముదాయించమని చాంద్‌నీ దగ్గర విడిచిపెట్టి వచ్చింది.
వాల్యాని సముదాయించి ఏడుపుమాన్పించటం ఓపట్టాన చాంద్‌నీ వల్ల కూడా కావటంలేదు. వాడికి మళ్ళీ వరిబువ్వ గుర్తొచ్చింది.
ఎమ్మెల్లే వచ్చి మానిన గాయాన్ని కెలికాడు!
ఇప్పుడేం చెయ్యాలి?
ఏడుపెలా మాన్పించాలి?
చాంద్‌నీ ఆలోచించింది! వాల్యాకి జాంపండ్లంటే ఇష్టం.
‘‘జాంప్లొండు గావాల్నా’’అని అడిగింది.
‘‘కావాలి’’అన్నాడు వాల్యా, ఆశగా చూస్తూ.
అడవిన దొరికే జాంపండ్ల వైపుకు వాల్యా మనసు మళ్ళించి తాత్కాలికంగా ఏడుపు మాన్పించగలదేమో కానీ... సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఏమిటి?
మళ్ళీ వాడికి వరిబువ్వ గుర్తొస్తే-
ప్రపంచంలోని ఆకలి బాధంతా గొంతులోకి తెచ్చుకొని జాలిగా దీనంగా హృదయవిదారకంగా ఏడుస్తాడు. ప్రపంచ అన్నార్తుల సమ్మేళనంలో భారత ప్రతినిధిలా ఆకలి కేకలు వినిపిస్తాడు.
ఆర్తనాదాల్లో, విలాపాల్లో, వెక్కిళ్ళలో, కన్నీళ్ళలో, దహించే కడుపుమంటలో మన దౌర్భాగ్యాన్ని బొమ్మకట్టి చూపిస్తాడు.
‘‘జాఁవ పొండ్లుగావాలి’’అన్నాడు వాల్యా.
చాందినీ కూడా జాంపండ్లమీదికి మనసుపోయింది!
చెట్టుకే పండిన జాంపండ్లు చాలా మధురంగా వుంటాయి.
నెమలి గుట్ట దగ్గర్లో వున్న నీటి కొలను చుట్టూ చాలా జామ చెట్లున్నాయి. చేతికి అందుతాయి కూడా!
‘‘కొలనుకాడికి బోదాఁవా’’ వాల్యాని అడిగింది.
‘‘జాఁవ పొండ్లుంటయ్యా.’’
‘‘తిన్నన్ని.’’
‘‘కొన్నిదెచ్చి దాపెట్టుకుందాఁవు’’అన్నాడు వాల్యా.
ఇద్దరూ బయల్దేరారు.
తండాదాటి, అడవిదారిలో జాగ్రత్తగానడుస్తూ కొలనువైపుకు సాగిపోతోన్నారు.
దూరంగా ఏదో పక్షి వికృతంగా అరిచింది!
వాల్యా భయపడ్డాడు.
అమాంతం చాంద్‌నీ కాళ్ళను వాటేసుకున్నాడు.
తూలిపడబోయి, తమాయించుకుంది. వాల్యాకి ధైర్యంచెప్పింది.. మళ్ళీ నడక..
కొలను దగ్గరికి చేరారు. విరిగ కాసిన జామచెట్లు చాలా వున్నాయక్కడ.
వాల్యా సంతోషం పట్టలేకపోయాడు. కేరింతలు కొడుతూ చెట్లదగ్గరికి వెళ్ళాడు.
చాంద్‌నీ కూడా వెళ్ళింది.
వాల్యా తలెత్తి జాంపండ్లవైపే చూస్తున్నాడు.
బాగా పండిన జాంపండ్లు ఎర్రగా, దోరగా పండిన పండ్లు ఎరుపు తెలుపూ రంగుల మిశ్రమంలా కనువిందు చేస్తున్నాయి.
ఆకుల పసరు వాసన, జాంపండ్ల తీపి వాసనా జత కలిసిన పరిమళం ఏదో గాలివెంట వస్తోంది.
వాల్యా చేతులు పైకెత్తి ఎగుర్తున్నా జాంపండ్లు అందటం లేదు.
చాంద్‌నీ వైపు జాలిగా చూసాడు.
నవ్వుతూ వెళ్ళింది. చేతులు చాపింది. చాలా పండ్లు కోసి వాల్యాకిచ్చింది.
ఇద్దరూ అక్కడే నేలమీద కూర్చొని కడుపునిండా తిన్నారు.
మిగిలిన జాం పండ్లు వాల్యా తలగుడ్డలో మూటకట్టి నెత్తిమీద పెట్టుకోబోయింది.
‘‘పొండ్లమూట నాకియ్యి’’అని వాల్యా మారాంచేసాడు.
‘‘మొయ్యలేవు’’అన్నది చాంద్‌నీ.
‘‘సిన్న మూటే!’’
‘‘మొయ్యలేవు.’’
(ఇంకా ఉంది)

వ్యక్తివికాసం శక్తిప్రదాయకం

$
0
0

పతంజలి యోగసూత్రాలు (ద్విభాషా వచన గ్రంథం)
రచయిత:చింతగుంట సుబ్బారావు
పుటలు :152 వెల : రూ.80/-లు
ప్రతులకు చింతగుంట సుబ్బారావు, 4-102, ILTD COLONY EXTN కొత్తపేట , పేరాల (పో) చీరాల - 523157
------------------------------------------------------------------------------------------------------------------------------
మనిషి మనుగడకు కావలసినవి నాలుగు విధాలైన బలాలు. అవి 1. శారీరక బలం,2. మానసిక బలం, 3. ఆర్థికబలం, పరిసర జనబలం (కుటుంబ స్నేహితులు, సంఘం) వీటిలో చివరివి రెండు ఆయా వైయక్తిక పరిస్థితులను బట్టి సంప్రాప్తమవుతాయి. కానీ మొదట రెండూ అంటే శారీరక, మానసిక బలాలు మనిషి తనయొక్క ప్రత్యేక శ్రద్ధ, అభ్యాసం, వాటి కొనసాగింపులను బట్టి సాధించుకోవచ్చు.
ఈ రెండురకాల బలాలను ఒకే ప్రయత్నంలో ఒకేసారిగా సాధించుకోవడానికి అవసరమైన సాధన సూత్రాలను యోగసూత్రాలు అంటారు. అలాంటి యోగ సూత్రాలను ఛాయామాత్రంగా వేథం చెప్తే పతంజలి మహర్షి విపులంగా చెప్పాడు. సుమారు రెండువేల సంవత్సరాల నాడు ఆ పతంజలి యోగ సూత్రాలను యథాతథంగా తెలుగు, దేవనాగర లిపులలో క్రోడీకరిస్తూ వాటికి వ్యాఖ్యాన పూర్వక సమగ్ర భావాన్ని ఆంగ్ల ఆంధ్రభాషలలో ఒక దానికింద ఒకటిగా సరళ భాషా సుందర వచనంలో అందించే పుస్తకం. ‘‘పతంజలి యోగసూత్రాలు’’.
ఇందులో యోగము - దాని లక్ష్యముల, 2. యోగము -సాదన, 3. యోగమూ -యోగసిద్ధులు, 4. యోగము- మోక్షము అని నాలుగు విభాగాలున్నాయి. అన్ని విభాగాల్లోనూ కలిపి మొత్తం 193 సూత్రాలున్నాయి.
ఏ సూత్రానికా సూత్రం (సూక్తి) సాధకుడు -లేక యోగాభ్యాసి ఏ మాత్రం ఏకాగ్రత చూపించినా ప్రతిదీ ఆచరణ యోగ్యమే. ఆచరణ సాధ్యమే. ముఖ్యంగా మానసిక సమతౌల్య సాధన, లక్ష్యసిద్దుల పరంగా
ఉదా: ‘‘శౌచ సంతోష తపస్స్వా ధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః’’
రెండవ అధ్యాయంలో 32 వ సూత్రం.
‘‘శౌచం( purity ) సంతోషం ( contentment) తపస్సు ( Penance or Austeriy) స్వాధ్యాయం, (Study ఈశ్వర ప్రణిధానం (Dedication to God) ఈ ఐదింటి సాధనను ఒక దీక్షతో అభ్యాసం చేస్తే అవి శీఘ్రంగా సత్ఫలితాన్నిస్తాయి. (సద్యః అప్పటి కప్పుడే) అయితే వీటి యొక్క ప్రాయోగిక అభ్యాసంలో స్వార్థ ప్రయోజనం ప్రేరణ కాకుండా చూసుకోవాలి. ఇంత సులభగ్రాహ్యంగా యోగం అంటే ఏమిటో (మానసిక కర్మపరంగా)పుస్తకం మొత్తం తనకు తానే జిజ్ఞాసువైన పాఠకుని ఎవరినైనా చదివిస్తూ పోతుంది. ఇది రచయిత సరళ రచనా నిపుణతకు తార్కాణం.
అంతఃకరణం చతుష్టయం అంటే చిత్తం, మనస్సు, బుద్ధి, అహంకారం, అనే నాలుగు అధిభౌతిక సాంకేతిక పదాలకు అర్థాలు మొదలైన విశేషాంశాలు కూడా ఈ పుస్తకంలో ప్రస్తావితాలయినాయి. సుబ్బారావుగారు చేసిన తేలికైన వివరణ ద్వారా అర్థ విపులీకరణ కోసం భర్తృహరి సూక్తుల ఆంధ్రానువాద పద్యాల వంటి వి కూడా ఉన్నాయి అక్కడక్కడ.
ఇది నేడు మార్కెట్లో కనిపిస్తున్న వ్యక్తిత్వ వికాసం personality development మొదలైన పుస్తకాలం కంటే విలువైన మార్గదర్శక గ్రంథం.

కొల్లాయి గట్టితేనేమి? మహీధర రామమోహనరావు

$
0
0

అయినా వినకుండా కూతురును చదివించాడు. అందుకు కోపంతో తెగతెంపులు చేసుకొని స్వరాజ్యం భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు. కూతురును కాపురానికి పంపటానికి ఇష్టపడినా, చదువుకున్న ఆడపిల్ల వొద్దని వాళ్లు తలుపులు మూసేశారు. చేసేదేమీ లేక ఇరవై ఏళ్ల స్వరాజ్యం కాలేజీలో చదువుకుంటోంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రామనాధం అబ్బాయి నాయుడు ఆధునిక దృక్పథానికీ, స్వరాజ్యం తెగువకూ ఆకర్షితుడయ్యాడు.
ఈ రామనాధానికి కూడా అప్పటికి నాలుగు సంవత్సరాల క్రితమే పెళ్లయింది. అతడి మామ నారాయణమూర్తి పోలీస్ ఆఫీసర్- రాజభక్తి పరాయణుడు. తన అల్లుడు జాతీయోద్యమంలో పాల్గొన్నందున అల్లుడిపై లాఠీఛార్జి చేసినవాడు. అల్లుని జైలుశిక్షకు గురిచేసినవాడు. తన కూతురును కాపురానికి పంపటానికి వీల్లేదన్నాడు. ఈ విధంగా రామనాధం వైవాహిక జీవితమూ చెడిపోయింది.
రామనాధం పెంపుడు తండ్రి పరమ నైష్ఠికుడు. సంప్రదాయాలనూ, ఆచారాలనూ మంటగలిపినందున రామనాధాన్ని వెలివేశాడు. రామనాధం వెలియై ఊరికి దూరంగా తనతోటలో పాక వేసుకొని జీవిస్తూ తన ఆశయాలనూ, ఆదర్శాలనూ నెరవేర్చటానికి కృషి చేస్తుంటాడు. స్వరాజ్యం అతని బాటలో నడుస్తుంది. కొంత సంఘర్షణ తర్వాత స్వరాజ్యాన్ని రామనాధం వివాహం చేసుకుంటాడు. అతడు నెలకొల్పిన ‘ఖద్దరు ఉత్పత్తి కేంద్రాన్ని’ దర్శించటానికి గాంధీ ముంగండ రావటంతో నవల ముగుస్తుంది.
ఇదీ నవలలోని ప్రధాన ఇతివృత్తం.
1920 ప్రాంతాలో ఆంధ్రదేశంలో సాగిన జాతీయోద్యమాన్ని చిత్రించటం మాత్రమే కాదు ఈ నవల ధ్యేయం-ఆతరంలో తెలుగుదేశం సాంస్కృతిక జీవితాన్ని విశే్లషించటం రచయిత ప్రధాన ఆంతర్యం. కరడుగట్టిన ఫ్యూడల్ సమాజంలోకి ఆధునిక బూర్జువా భావజాలం ప్రవేశిస్తున్న చారిత్రక దశలో ఆ రెండింటి మధ్య చోటుచేసుకున్న సంఘర్షణను చెప్పటం ఒక బాధ్యతగా రచయిత ఈ నవలను రాశాడు.
రామనాధం ఆధునిక భావాలు కలిగినవాడు. అప్పుడప్పుడే సమాజంలో ప్రవేశిస్తున్న బూర్జునా భావజాలంతో ప్రభావితుడైనవాడు. అన్నికులాలపట్ల సమదృష్టి, స్ర్తి విద్య పట్ల గౌరవం, ఫ్యూడల్ ఛాందస ఆచారాల పట్ల వ్యతిరేకత, వర్ణాతర వివాహాల పట్ల సుముఖత, అస్పృస్యతను పాటించకపోవటం, దేశం పట్ల బాధ్యత కలిగి వుండటం, ఇంగ్లీషు చదువు.. ఇవీ బూర్జువా భావజాలంలోని కొన్ని లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలిగిన పాత్రగా రామనాధాన్ని రచయిత సృష్టించాడు. ఇతడి స్వగ్రామం ముంగండ- ఆ గ్రామం ఈ లక్షణాలన్నింటికీ వ్యతిరేక భావజాలం కలిగినది- ఫ్యూడల్ భావజృలంతో కరడుగట్టిన ఆ గ్రామాన్ని రచయిత నవలలో ప్రధాన కేంద్రం చేయటంలో ఉద్దేశం రెండు భిన్నమైన భావజాలాల మధ్య సంఘర్షణ వాతావరణాన్ని ఏర్పాటుచేయటం కోసమే! ముంగండలో దళితులకు, చెరువు నీరు తాకటానికి అర్హత లేదు. అగ్రవర్ణాలవాళ్లు, వాళ్ల కడవల్లోకి పోసిన నీళ్లే గతి! రామనాధం ఈ పద్ధతిని వ్యతిరేకించాడు. తన తోటలోని బావిలో వాళ్లు నీళ్లు తోడుకోవడానికి వెసులుబాటు కల్పించాడు.
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీనరసింహ శతకము

$
0
0

సీ. అర్ధివాండ్రకు నీక3హాని చేయుటకంటె
తెంపుతో వసనాభిఁ దినుట మేలు
ఆడుబిడ్డల సొమ్ము నపహరించుట కంటె
బండఁ గట్టుక నూత ఁ బడుట మేలు
పరుల కాంతల బట్టి బల్మిఁగూడుట కంటె
బడబాగ్ని కీలలఁ బడుట మేలు
బ్రతుకఁ జాలక దొంగ పనులు చేయుట కంటె
కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు
తే. జలజదలనేత్ర! నీ భక్తజనుల తోడ
జగడమాడుటకంటెను చావు మేలు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహై దురిత దూర!

భావం: ఓ నరసింహస్వామీ! చేయెత్తి అడుక్కుతినే వారికి పెట్టకుండా వారిని బాధించడాని కంటె విషం త్రాగటం మేలు. కన్నబిడ్డల సొత్తు అపహరించడానికంటె ఉరితాడు బిగించుకుని చావడం మేలు. పరస్ర్తిలని బలవంతంగా అనుభవించడానికంటె అగ్గిలో దూకి చావడం మేలు. జీవించలేక దొంగపనులు చేయడానికంటె కొంగుజాపి ముష్టి ఎత్తుకోవడం మేలు. ఓ తండ్రీ! నీ భక్తులతో పేచీ పడడానికి బదులు చావే మంచిది.

maatata

$
0
0
Cross Image: 
Date: 
Wednesday, December 26, 2018

వస్తున్నాడు.. ఫలక్‌నుమా దాస్

$
0
0

వినూత్న కానె్సప్ట్‌లతో సక్సెలు సాధించి వెళ్లిపోమాకే, ఈ నగరానికేమైంది లాంటి చిత్రాల్లో నటించిన విశ్వక్సేన్ ఇప్పుడు ఫలక్‌నుమా దాస్‌గా వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కరాటే రాజు నిర్మాతగా వన్‌మాయే క్రియేషన్స్‌పై విశ్వక్సేన్ సినిమాస్, టెరనోవ పిక్చర్స్ అనుసంధానంతో విశ్వక్సేన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫలక్‌నుమా దాస్. చిత్రంలో సలోని మిశ్రా, హర్షిత్ గౌర్, ప్రశాంతిలు ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్ చేశారు. మూడు రోజులు వినా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలో నటించాడు. క్రిస్మస్ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను పూరి జగన్నాథ్ చేతులమీదుగా విడుదల చేశారు. చిత్ర నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ ఇది హైదరాబాద్ బేస్డ్ స్టోరీ కావడంతో ఇక్కడ నేటివిటి, కల్చర్‌ని కలర్‌ఫుల్‌గా చూపించాము. యూనిట్ కష్టపడి పని చేసిందని, అవుట్‌పుట్ బాగా రావడం హ్యాపీగా ఉందన్నారు.


నాకు ఇదో బెస్ట్ ఆల్బమ్

$
0
0

పడి పడి లేచె మనసు చిత్రం తన కెరీర్‌లో ఓ బెస్ట్ ఆల్బమ్‌గా నిలుస్తుందని హీరో శర్వానంద్ ఆనందం వ్యక్తం చేశాడు.
శర్వా, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మించిన చిత్రం ‘పడి పడి లేచే మనసు’ రెండు రోజుల క్రితం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో శర్వా మాట్లాడుతూ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అన్నారు. చిత్రంపై కొన్ని సద్విమర్శలు వచ్చాయని, నచ్చిన అంశాలు భవిష్యత్ పునరావృతం కాకుండా చూసుకుంటానన్నాడు. అందరి సలహాలో మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తానన్నాడు.
కార్యక్రమంలో కల్పిక మాట్లాడుతూ బ్యూటిఫుల్ ఫీల్, మ్యూజిక్, విజువల్, ఎమోషన్స్‌వున్న సినిమాలు తక్కువగా వస్తుంటాయి, అలాంటి తక్కువ జాబితాలోని చిత్రం పడి పడి లేచే మనసు అంటూ కితాబిచ్చారు. నిర్మాత చెరుకూరి సుధాకర్ మాట్లాడుతూ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

భిన్నమైన పాత్రలవైపే

$
0
0

ఎక్కడి పోతావు చిన్నవాడా చిత్రంలో అవకాశం వచ్చినపుడే చెప్పాను -వైవిధ్యమైన పాత్రలైతేనే చేస్తానని. అప్పటి నుంచీ అదే పాటిస్తున్నా. బ్లఫ్ మాస్టర్‌లోనూ ఓ ఇన్నోసెంట్ గాళ్‌గా మిమ్మల్ని అలరిస్తా. సహజంగానే నాకు హారర్ జోనర్ అంటే ఇష్టం. అందుకు తగ్గట్టే మంచి పాత్రలు దొరికాయ. ఈ ఏడాది నాకు లక్కీ. పది సినిమాలు చేసేశాను.

ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన నందితా శే్వత మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. భిన్నమైన పాత్రల్లో నటిస్తానంటూ చెప్పిన ఈమె సెలెక్టివ్‌గా పాత్రలను ఎంచుకుంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ‘బ్లఫ్‌మాస్టర్’ చిత్రంతో వచ్చే 28న థియేటర్లకు వస్తోంది. గోపీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 28న విడుదలవుతున్న సందర్భంగా నందిత శే్వత మీడియాతో ముచ్చట్లు. తెలుగులో ఇది మూడో సినిమా. మొదటి సినిమా ఎక్కడి పోతావు చిన్నవాడా సమయంలో చెప్పినట్టే వైవిధ్యమైన పాత్రలకే ఓకె చెబుతున్నాను. బ్లఫ్ మాస్టర్‌లో ఆడియన్స్‌ని మెప్పించే ఇన్నోసెంట్ గాళ్‌గా కనిపిస్తాను. నా పాత్ర పేరు అవని. సినిమాలో అంతా బ్లఫ్‌మాస్టర్సే. వారిలో ఒక మంచి అమ్మాయిగా భిన్నమైన షేడ్స్‌లో నా పాత్ర సాగుతుంది. దర్శకుడు గోపీ గణేష్ ఈ కథ చెప్పినపుడు బాగా నచ్చింది. ఇది తమిళంలో హిట్టయిన సినిమాకు రీమేకే అయినా, తమిళ చిత్రంలోని లాగ్‌లైన్ మాత్రమే తీసుకుని కథని భిన్నంగా మలిచాడు దర్శకుడు. సినిమా విడుదల కోసం ఆతృతగా చూస్తున్నా. ఈ ఏడాది నా కెరీర్ అద్భుతంగా సాగడంపట్ల హ్యాపీగా ఉంది. తమిళ, తెలుగు భాషల్లో కలిపి పదికి పైగా సినిమాలు చేశా. మరో ఆరేడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం కన్నడలో హీరో యాష్‌తో కిరాతక అనే సినిమా చేస్తున్నా. దాంతోపాటు తెలుగులో ప్రేమకథాచిత్రం 2, కల్కి, రక్షణ, అభినేత్రి 2 సినిమాలు చేస్తున్నాను. నాకూ హారర్ జోనర్ చాలా ఇష్టం. అయితే అభినేత్రి మాత్రం హారర్ కాదు, సరికొత్త ప్రయోగం’ అంది నందిత.

పూరితో రామ్

$
0
0

కొంతకాలంగా సరైన సక్సెస్‌లు లేక డైరెక్టర్స్ రేస్‌లో వెనుకపడ్డాడు పూరి జగన్నాథ్. చాలా గ్యాప్ తీసుకొని ఎనర్జిటిక్ రామ్‌తో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. రామ్ ప్రస్తుతం ఈ సినిమా కోసం న్యూలుక్‌ను ట్రై చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం కొత్త ఏడాది జనవరిలో సెట్స్‌మీదకు వెళ్లి, మేలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పూరి టూరింగ్ టాకీస్ పతకంపై పూరి, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, ఆ లోటును తీర్చుకునేందుకు ఈసారి పూరికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.

కొత్త కథకే పట్టం (రివ్యూ 2018)

$
0
0

రోతను పక్కనపెట్టి కొత్త కథలకు, కొత్తదనానికి పట్టంగట్టింది పరిశ్రమ. గత రెండేళ్లలో -తెలుగు పరిశ్రమ వైవిధ్యమైన కథలతో తన ఉనికి చాటుకుందన్న విమర్శకుల ప్రశంసలే ఇందుకు ఉదాహరణ. ముఖ్యంగా ఈ ఏడాది మరింత ప్రత్యేకమని చెప్పొచ్చు. ప్రయోగాత్మక చిత్రాలతో ఈసారి టాలీవుడ్ ప్రత్యేక అనుభూతులు అందించిందని ప్రేక్షకుడే గొంతెత్తి మరీ చెబుతున్నాడు.

కొత్తొక వింత పాతొక రోత -అన్నది పెద్దల మాట. ఔను! కొత్తగా అనగానే కనెక్టవ్వడం సహజం. రిపీట్ చేస్తే -రోత పుట్టిందంటూ విసిరి కొడతారు. చాలాకాలంగా -తెలుగు సినిమా ఈ రోత పరిస్థితినే ఎదుర్కొంటోంది. కొత్త కథతో వస్తున్నామని విడుదలకు ముందు చేసే ప్రకటనలు -తీరా థియేటర్‌లోకి వెళ్లిన తరువాత కనిపించేది కాదు. తెలుగు చిత్రాలన్నీ పక్కా కమర్షియల్ ఫార్మెట్‌లోనే సాగుతాయని, సినిమాలన్నీ ఒకే తీరులో ఉంటాయన్న విమర్శలను భారంగా మోస్తూనే ఉంది పరిశ్రమ. అయితే కొద్దికాలంగా ఈ విమర్శలు వినిపించడం లేదు. కారణం -రోతను పక్కనపెట్టి కొత్త కథలకు, కొత్తదనానికి పట్టంగట్టింది పరిశ్రమ. గత రెండేళ్లలో -తెలుగు పరిశ్రమ వైవిధ్యమైన కథలతో తన ఉనికి చాటుకుందన్న విమర్శకుల ప్రశంసలే ఇందుకు ఉదాహరణ. ముఖ్యంగా ఈ ఏడాది మరింత ప్రత్యేకమని చెప్పొచ్చు. ప్రయోగాత్మక చిత్రాలతో ఈసారి టాలీవుడ్ ప్రత్యేక అనుభూతులు అందించిందని ప్రేక్షకుడే గొంతెత్తి మరీ చెబుతున్నాడు. అలా వైవిధ్యంగా వచ్చిన చిత్రాలను అక్కున చేర్చుకుని భుజాన మోసి గొప్ప ఫలితాలూ అందించాడు. క్రియేటివిటీ చూసిస్తే కమర్షియాలిటీ అదే పెరుగుతుందని అనుభవంలోకి తెచ్చిన చిత్రాలు ఈసారి తక్కువేం లేవు.
ఆరు పాటలు.. నాలుగు ఫైట్లు.. ఓ తెలుగు సినిమా -అనే పరిస్థితిలో కనిపిస్తున్న గొప్ప మార్పు ఇది. ఆడియన్స్ అభిరుచులు మారడం ఒకటైతే, ఆడియన్స్ కోరుకున్నది ఇవ్వక తప్పని పరిస్థితి పరిశ్రమకు రావడం -వెరసి ఈ ఏడాది కథకు ఒకింత పదును పెరిగిందని చెప్పక తప్పదు. అందుకే కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ రూటు మార్చారు. కొత్త దారికి వచ్చారు. వైవిధ్యమైన కథలను ఒడిసిపడుతున్నారు. సృజనాత్మక, ప్రయోగాత్మక చిత్రాలను స్క్రీన్‌పై ఆవిష్కరించారు. పరభాషా కథలను ఎవరు తెచ్చుకుని సినిమాలు తీసే పరిస్థితి నుంచి, పరభాషా పరిశ్రమలు సైతం దృష్టిని మనవైపు తిప్పించిన కొత్త కథల కథాకమామీషు ఏమిటో చూద్దాం.
తెలుగులో రివేంజ్ డ్రామాలు తక్కువేం కాదు. కాకపోతే, లవ్ ట్రాక్ బలపడిన తరువాత రివేంజ్ రొటీన్‌గా మారింది. కథకు కాస్త చిత్రిక పడితే రివేంజ్‌ను మించిన సక్సెస్ ఫార్ములా ఉండదని మరోసారి నిరూపించాడు దర్శకుడు సుకుమార్. పల్లెటూరి కుర్రాడు చిట్టిబాబు పగను ఇతృవృత్తంగా తీసుకుని బిగింపు కథనంతో కథను నడిపించి ‘రంగస్థలం’ చేశాడు. కథనాయకుడు ‘చెవిటి’వాడైనా, స్టార్ ఇమేజ్‌ను పక్కనపెట్టి రామ్‌చరణ్ ఆ పాత్రను చేయడం కథకు మరింత బలమిచ్చింది. అంటే స్టార్ హీరోలు కథలకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోడానికి ఈ ఒక్క అంశం చాలు. విభిన్నమైన ప్రయోగం రామ్‌చరణ్‌కు తిరుగులేని హీరోయిజం తెచ్చిపెట్టింది. 1980లనాటి సాదా సీదా రివేంజ్ స్టోరీని క్లైమాక్స్ ట్విస్ట్‌తో బిగ్గెస్ట్ హిట్ చేశాడు సుకుమార్. రంగస్థలం సినిమా టాలీవుడ్‌లోనే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలబడింది. మార్పులో ఇది తొలి మెట్టు.
అదే దిశగా సాగిన మరో సాహసం -మహానటి. ఆ సాహసానికి ఒడిగట్టింది దర్శకుడు నాగ్ అశ్విన్. మహానటి సావిత్రి బయోపిక్‌లో ‘నిజాయితీతో కూడిన మ్యాజిక్’ చూపించాడు. అలనాటి మహానటి సావిత్రి కథలోని ముఖ్యాంశాలను స్క్రీన్‌పై చూపించి నేటితరానికి ఆమెను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. బయోపిక్‌ల కోణంలో నిజానికి ఇదో కొత్త కోణం. విడుదలకు ముందు సినిమా ఆడుతుందా? లేదా? అన్న సంశయాలకు -ప్రేక్షకుడు సరైన ఫలితం అందించి సమాధానమిచ్చాడు. మహానటి సరికొత్త ప్రయోగాలకు ఓ పునాధి.
జనరల్‌గా రాయలసీమ ఫ్యాక్షన్ అంటే రెండు గ్రూపుల మధ్య నరుక్కోవడాలే తెలుగు సినిమాలో ఇన్నాళ్లూ చూశాం. పగా ప్రతీకార ఘట్టం తరువాత ఆవిష్కృతమయ్యే నరమేధ నష్టాలను ఫ్యాక్షన్ చిత్రంగా కొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కుర్రక్షేత్ర యుద్ధం తరువాత -పగవాడి కుటుంబంలో జీవచ్ఛవాలుగా మిగిలిన వారి బతుకు కష్టం ఎంత భయానకంగా ఉంటుందోనన్న మహాభారత సారాన్ని కథగా మలచుకున్నాడు. నష్ట నివారణకు యువ ఫ్యాక్షన్ లీడర్ చేసిన ప్రయత్నమే -అరవింద సమేత వీర రాఘవ. రొటీన్ ఫ్యాక్షన్ సినిమాల మాదిరిగానే ఆరంభంలో భారీ ఫైట్‌తో సినిమా మొదలుపెట్టినా, ఆడియన్స్ చిటికెన వేళ్లు పట్టుకుని ఎమోషన్స్ కథలోకి తీసుకెళ్లిన త్రివిక్రమ్ మాయ వైవిధ్యమే. యుద్ధం తర్వాత కుటుంబాల పరిస్థితి, వారి బాధలను కళ్లకు చూపిస్తూ దర్శకుడిగా తన బాధ్యతను ఆడియన్స్ అనుభవంలోకి, ఆలోచనల్లోకి తీసుకెళ్లిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. అచ్చంగా ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన ‘అ’ కూడా ప్రేక్షకులకు భిన్నమైన వినోదాత్మక రుచులనే అందించింది. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కొత్త కథ, ఏకంగా హీరో నానిని నిర్మాతగా మార్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా తెలుగు పరిశ్రమలో కొత్త ప్రయోగమే. ఇక గత ఏడాది అర్జున్‌రెడ్డి ఇంపాక్ట్ ఈ ఏడాదీ కొనసాగింది. అదే ఇంపాక్ట్‌తో ఓ రియల్ లైఫ్ స్టోరీని ఆర్‌ఎక్స్ 100గా పరిచయం చేశాడు కొత్త దర్శకుడు అజయ్‌భూపతి. బోల్డ్ కంటెంట్‌తో నిజ జీవిత ప్రేమకథను ఆవిష్కరించే ప్రయత్నం విజయవంతమైంది. ఇంతవరకు ఓ హీరోయిన్‌ని చూడని ఓ నెగెటివ్ క్యారెక్టర్‌లో కొత్త హీరోయిన్ పాయల్‌ని చూపించి సరికొత్త క్లైమాక్స్‌తో ప్రయోగం చేసి సక్సెస్ అందుకున్నాడు భూపతి. కొత్త కథల కోణంలో మన ప్రమేయం లేకుండానే ఆలోచనల్లోకి చొరబడేది అడవి శేష్ -గూఢచారి. తెలుగు పరిశ్రమ మర్చిపోతున్న డిటెక్టివ్ కోణాన్ని వెతికి పట్టుకుని ఆడియన్స్ ముందు పెట్టాడు దర్శకుడు శశి. ఈ సినిమా ఆడియెన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియెన్స్. హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో స్పై థ్రిల్లర్‌గా వచ్చిన సినిమాను అక్కున చేర్చుకున్నారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్ అందుకోవడం ఓ విశేషం. ఇక -ఊరి జనాన్ని పొగేసి అదే ఊరి కథతో జనాన్ని స్టార్స్ చేసేశాడు దర్శకుడు వెంకటేష్ మహా. ఆ సినిమా -కేరాఫ్ కంచరపాలెం. కంచరపాలెంలోని కొందరి జీవితాల్ని సెల్యూలాయిడ్ మీదకు ఆవిష్కరించడంలో వెంకటేష్ కృషి తక్కువేం కాదు. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా విడుదలకు ముందే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఏమాత్రం అనుభవం లేని కంచరపాలెం స్థానికులతో వెంకటేష్ మహా చేసిన ప్రయోగం ఎవర్‌గ్రీన్. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా కామెడీ, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్‌కూ ఆడియన్స్ కనెక్టయితే, గత ఏడాది ఘాజీతో ప్రేక్షకులను సబ్‌మెరీన్‌లోకి తీసుకెళ్లి చక్కర్లు కొట్టించిన సంకల్ప్, ఈసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లి అద్భుతాన్ని చూపించాడు. తెలుగులో మొదటి స్పేస్ చిత్రం తెచ్చిన దర్శకుడిగా మన్ననలు అందుకంటున్నాడు. ఇవి మచ్చుకు మాత్రమే. ఈ ఏడాది వచ్చిన చిత్రాలను కాస్త లోతుకెళ్లి పరిశీలిస్తే -రోతను విసిరికొట్టి కొత్తదనానికి, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిచ్చిన సినిమాలు ఎన్నో కనిపిస్తాయి.

క్రిస్మస్ వేడుకల్లో ఎంపీ, ఎమ్మెల్యే

$
0
0

నేలకొండపల్లి, డిసెంబర్ 25: క్రిస్మస్ పర్వదినంను పురస్కరించుకుని మండలంలో ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంగళవారం చెన్నారం గ్రామంలో క్రిస్మస్ వేడుకలలో ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్ని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్‌లు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఏసుక్రిస్తు మనవాళి మనుగడుకు చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరు ప్రయనించాలన్నారు. అలాగే ఆరెగూడెం గ్రామంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్ని ప్రత్యేక ప్రార్ధనలు చేసి కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ లోక రక్షకుడైన ఏసుక్రిస్తు అందరి ప్రభు అన్ని అన్నారు. ఈ సందర్భంగా ఎంపి, ఎమ్మెల్యేలు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ మండల కార్యదర్శి సైదారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కందాల జితెందర్‌రెడ్డి, హుస్సెన్, అంజనీ, జగన్ తదితరులు పాల్గొన్నారు.

బాబా ఆలయంలో అయ్యప్ప దీక్షాపరులకు నిత్యాన్నదానం
* వైభవంగా కొనసాగుతున్న కార్యక్రమం
కామేపల్లి, డిసెంబర్ 25: దృఢ సంకల్పం, కార్యదీక్షా, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటే ఎంతటి మహత్కార్యాన్నయినా సులువుగా సాగించవచ్చని నిరూపిస్తున్నారు స్థానిక అయ్యప్ప భక్తమండలి సభ్యులు. అన్నదానం మహాదానమంటూ దీక్ష తీసుకున్న అయ్యప్ప స్వాములకు నిత్యం ఉచితంగా బిక్ష అందించాలనే సంకల్పంతో రెండునెలల క్రితం స్థానిక షిరిడిసాయి మందిరంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దీక్షాస్వాములు నిత్యం తమ తమ వ్యాపకాల్లో నిమగ్నమై సమయానికి బిక్ష చేయలేనటువంటి వారికి ఉచితంగా బిక్ష అందించాలనే తపనతో స్థానిక సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయ్యప్ప మండలి సభ్యులైన మెండ్రు పుల్లయ్య గురుస్వామి, తాళ్ళూరి జనార్దన్‌పూజారి, ఆరుద్ర బ్రహ్మం తదితరుల నేతృత్వంలో అన్నదానం వైభవంగా సాగుతోంది. 200మందికి పైగా నిత్యం బిక్ష చేస్తుంటారు. వీరందరికి ఉచితంగా బిక్ష అందించేందుకు ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినదైనప్పటికీ సంకల్ప బలం, దాతల విరాళాలతో నిర్విగ్నంగా సాగుతోంది. కేవలం బిక్ష వరకే కాకుండా నిత్యం ఆలయ ప్రాంగణంలో మహాపడిపూజ, అయ్యప్ప పూజా కార్యక్రమాలు నిర్విగ్నంగా కొనసాగుతున్నాయి. జనవరి 10వ తేదీ వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఉదయం, సాయంత్రం వందల సంఖ్యలో అయ్యప్పలు చేరి పడిపూజ కార్యక్రమాలు, భజనలు చేస్తుండటంతో ఈ ప్రాంతమంతా అయ్యప్ప నామ స్మరణతో మార్మోగుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. షిరిడి సాయిమందిర చైర్మన్ నాగార్జునాగుప్తా సహకారంతో గ్రామస్తులు, ఇతర అయ్యప్ప దీక్షాస్వాములు, దాతల సహకారంతో తాము ఈ కార్యక్రమాన్ని నిర్విగ్నంగా కొనసాగిస్తున్నట్లు గురుస్వాములు పేర్కొన్నారు. ప్రారంభంలో ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించగలమా అనే సంశయమున్నప్పటికీ అయ్యప్పస్వామి కృపతో నిర్విగ్నంగా సాగుతుందని పేర్కొన్నారు.

భక్తరామదాసు మందిరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

$
0
0

నేలకొండపల్లి, డిసెంబర్ 25: పరమభక్తగ్రేసరుడు, భద్రాచల ఆలయ నిర్మాత, ప్రముఖ వాగ్గేయకారుడు కంచర్ల గోపయ్య (భక్తరామదాసు) జన్మస్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ కుటుంబ సభ్యులతో సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో జిల్లా కలెక్టర్ దంపతులకు అర్చకులు రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తరామదాసు చరిత్రను, మందిరం విశిష్టితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మందిరానికి మంజూరైన అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణను పరిశీలించి నిధులతో ఎక్కడ ఏది నిర్మించాలని కమిటి సభ్యులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని వాటికి సంబంధించిన పనులను ప్రారంభిస్తామన్నారు. ఈ నిధులకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను వెంటనే నియమించి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. దీనికి అందరి సహకారం ఉండాలన్నారు. అనంతరం ఎంతో ప్రసిద్ధిగాంచిన బౌద్ధస్తూపంను సందర్శించి అక్కడి చరిత్రను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య, సాధు రాధాకృష్ణమూర్తి, పెండ్యాల గొపాలకృష్ణమూర్తి, సుధాకర్‌రావు, పంతంగి పవన్‌కుమార్‌శర్మ, పాపాయ్యశర్మ, వేణు, మనే్న కోటేశ్వరరావు, లక్ష్మయ్య, సామాల కోటేశ్వరరావు, పెండ్యాల వాసుదేవరావు, ఎంపిటిసి చిలకల సీతారావమ్మ, కడియాల నరేష్, విఆర్‌వో జానిమియా మారుతి చంద్రం, వాజీద్, ఉన్న వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

తృటిలో తప్పిన కారు ప్రమాదం

$
0
0

వేటపాలెం, డిసెంబర్ 25: వేటపాలెం-సంతరావూరు గ్రామాల మధ్య ఉన్న మలుపులో మంగళవారం అదుపుతప్పి కారు బోల్తాపడి కాల్వలో పడిన సంఘటన జరిగింది. ఇంకొల్లునుంచి చీరాలకు వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదకరమైన మలుపు వద్ద కారును అదుపుచేసే క్రమంలో బోల్తా పడి కాల్వలో పడింది. అయితే కాలువలో నీరు తక్కువగా ఉండటంచే ఎటువంటి ప్రమాదం జరగలేదు. మలుపుతిరిగే సమయంలో ప్రమాదసూచికలను తెలియజేసే ప్రకటన బోర్డులు లేకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రమాద మలుపులు వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేయడం ఎంతైనా అవసరం.


అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

$
0
0

యర్రగొండపాలెం, డిసెంబర్ 25: పట్టణంలోని స్థానిక వాచస్పతి స్కూల్ పక్కన నివాసం ఉంటున్న వ్యక్తి అనారోగ్య కారణంగా ఇంటిలోని వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈసంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాల మేరకు బేల్దారిగా జీవనం కొనసాగిస్తున్న పట్టణానికి చెందిన నక్కా రవి గత సంవత్సరం కిందట పక్షవాతం వచ్చి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇతనికి నలుగురు కుమారులు, ఒక భార్య ఉన్నారు. వారంరోజుల కిందట తన భార్య కోటేశ్వరమ్మ నరసరావుపేట పట్టణానికి వెళ్ళిందని, వివాహమైన కుమారులు వేర్వేరుగా జీవనం కొనసాగిస్తున్నారని, ఇంటిలో చిన్నకుమారుడు, మృతుడు కలిసి ఉండేవారన్నారు. అనారోగ్య కారణంగా జీవనం కష్టసాధ్యం కావడంతో ఇంటి దొడ్డిలోని వేపచెట్టుకు తాడు సహాయంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భక్తిశ్రద్ధలతో క్రీస్తు జన్మదిన వేడుకలు

$
0
0

మార్కాపురం టౌన్, డిసెంబర్ 25: జీసస్ జన్మదినమైన క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. దళితవాడలు నక్షత్ర వెలుగులతో ఆధ్యాత్మికశోభను సంతరించుకోగా సోమవారం అర్థరాత్రి నుంచి ఏసు రాక కోసం కీర్తనలు పటిస్తూ క్యాండిళ్లు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంగళవారం క్రిస్మస్ ప్రార్థనలు పట్టణంలోని చర్చిల్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఎల్‌ఇఎఫ్ చర్చిలో కేకు కట్ చేసి ప్రార్థనలకు హాజరుకాగా మాజీఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. టౌన్ హల్లెలూయ చర్చి, తెలుగు బాప్టిస్టు చర్చి, ఎబిఎం కాంపౌండ్ చర్చిల్లో ఆయన ప్రార్థనలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల పూర్వం పశువుల పాకలో గొర్రెల మందలో జన్మించిన యేసుప్రభువు సర్వజనులకు ముక్తిమార్గం చూపారని అన్నారు. జగతికి ప్రేమ, శాంతి, త్యాగ సందేశాన్ని అందించిన క్రీస్తు బోధనలు సర్వమానవాళి మార్పుకు దోహదపడ్డాయని అన్నారు. ఎన్‌ఎస్ నగర్‌లోని తెలుగు బాప్టిస్టు చర్చిలో రెవరెండ్ జోన్‌ధాన్ ముఖ్యఅతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. లోకరక్షకుడైన క్రీస్తు భూమిపైకి వచ్చిన సందేశాన్ని వివరించారు. పరిపూర్ణ మానవత్వాన్ని పొందడమే నిజమైన క్రైస్తవ్యం అని, జీసెస్ బోధనలు ఆచరించి ప్రతిఒక్కరూ పాపపరిహారం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి యేసుదాసు, గుంటూరు సివిల్ సప్లై డిఎం చంద్రలీలా, తహశీల్దార్ జైపాల్, ఉప తహశీల్దార్ కిరణ్ పాల్గొన్నారు.
* క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశంపార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి పట్టణంలోని 40 క్రైస్తవ ప్రార్థన మందిరాలకు కేకులను పంపిణీ చేశారు.

సీఎం ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తా

$
0
0

మార్కాపురం టౌన్, డిసెంబర్ 25: ముఖ్యమంత్రి ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పశ్చిమప్రాంతం నుంచి పోటీ చేస్తానని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త బోదనపు అశోక్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఇమ్మడి కాశీనాథ్ నివాసగృహాంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కాపురం డివిజన్ అన్నిరంగాల్లో వెనుకబడి ఉందని, తనవంతు సహకారంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనకు రాజకీయాల్లో రాణించాలనే ఆసక్తి ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తానని అన్నారు. ఇన్సోటెక్ అధినేతల్లో ఒకడిగా ఉన్న తాను మార్కాపురం డివిజన్ మోక్షగుండంవాసినన్నారు. పారిశ్రామికంగా 32 సంవత్సరాల అనుభవం గడించినట్లు తెలిపారు. 8 దేశాల్లో తమ సాఫ్ట్‌వేర్ కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయని, 15వేలమందికిపైగా తమ సంస్థల్లో ఉద్యోగులుగా పని చేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం ప్రాంతంలోనూ వెలుగొండ ప్రాజెక్టు పూరె్తైన తరువాత తమ పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు. ఇన్ఫోటెక్ అధినేతల్లో మరొకరైన మోహన్‌రెడ్డి తాను ఇరువురం సోదరులమని తెలిపారు. చిన్ననాటి నుంచి విలువలతో పెరిగామని, స్వగ్రామమైన మోక్షగుండంను దత్తత తీసుకొని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు సొంత నిధులను వెచ్చించినట్లు తెలిపారు. కంభం పట్టణంలోని తమ నివాస గృహాన్ని కంటి వైద్యశాల నిర్వహణకు విరాళంగా అందచేసినట్లు తెలిపారు. తమ సంస్థల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 15వేల మంది పేదవిద్యార్థులను చదివించినట్లు, వేలాదిమందికి వైద్యసేవలు అందించినట్లు తెలిపారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంటుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు 65 కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనను గుర్తించి ఎపి స్కిల్ డెవలప్‌మెంటు రాష్ట్ర డైరెక్టర్‌గా నియమించారని, ఆయన ఆశీర్వాదం ఉంటే రాజకీయాల్లో రాణించాలని ఆశిస్తున్నానన్నారు. ప్రజాసేవలో అందరికంటే ముందు అగ్రభాగాన ఉంటానని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్టన్రాయకులు డాక్టర్ మనె్న రవీంద్ర, ఇమ్మడి కాశీనాథ్, టీడీపీ జిల్లా అధికారప్రతినిధి శాసనాల వీరబ్రహ్మాం, శ్రీశైలం ట్రస్టుబోర్డు మాజీసభ్యులు పత్తి వెంగన్నతోపాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సాగునీటి ఎత్తిపోతల పథకాలు పూర్తి

$
0
0

ఒంగోలు,డిసెంబర్ 25: ముండ్లమూరు మండలంలో 150కోట్లరూపాయలతో నాలుగు సాగునీటి ఎత్తిపోతల పథకాలను పూర్తిచేశామని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. మంగళవారం తన నివాసంలో ముండ్లమూరు మండలంలో సాగునీటి ఎత్తిపోతల పథకాలను ఏర్పాటుచేసినందుకు రైతులు మంత్రినికలిసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వంచర్యలు తీసుకుందన్నారు. ముండ్లమూరు మండలంలో గుండ్లకమ్మ నదిమీద మారెళ్ల వద్ద రెండు, గంగన్నపాలెం వద్ద రెండు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటుచేశామన్నారు. ఎత్తిపోతల పధకాల నిర్మాణం వలన వేల ఎకరాల భూములు సాగులోకి వచ్చాయన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను సందర్శించేందుకు రైతులు, ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముండ్లమూరు ఎంపీపీ ఎం వెంకట్రావు, నాయకులు రాఘవరెడ్డి, పిచ్చిరెడ్డి, ఎం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో క్రిస్మస్ సంబరాలు

$
0
0

ఒంగోలు,డిసెంబర్ 25:జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ పండగను క్రైస్తవులు వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా జిల్లాలోని అన్ని చర్చీలు విద్యుత్‌కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. పండగ సందర్భంగా క్రైస్తవులు మంగళవారం ఉదయానే్న భక్తిశ్రద్ధలతో చర్చిల్లోకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. పాస్టర్లు క్రైస్తవులను ఉద్దేశించి సందేశాలను వినిపించారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని జూవియట్ చర్చిలో క్రైస్తవులు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పండగ సందర్భంగా ముందుగా సోమవారం రాత్రి క్రైస్తవులు, పాస్టర్లు, రాజకీయ ప్రముఖులు చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించి క్యాండిల్స్‌ను వెలిగించారు. క్రిస్మస్ పండగ సందర్భంగా జిల్లాలోని వివిధ రాజకీయపార్టీలకు చెందిన ప్రముఖులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండగ సందర్భంగా ముందుగానే ప్రభుత్వపరంగా సెమీక్రిస్మస్ వేడుకలను జిల్లా యంత్రాంగం నిర్వహించింది.
జిల్లాకేంద్రమైన ఒంగోలులోని ఎష్కోలు, దిలివింగ్ ఇవాంజలికల్ ఫెలోపిష్, హోసన్న మందిరం, చిన్నతెరేసమ్మ, జేరూసలాం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు క్రైస్తవులు చేశారు. ఇదిలాఉండగా క్రిస్మస్ పండగ సందర్బంగా వస్తద్రుకాణాలతోపాటు, వివిధ వాణిజ్య దుకాణాలు క్రైస్తవులతో నిండిపోయాయి. ఇదిలాఉండగా క్రిస్మస్ పండగ సందర్భంగా క్రైస్తవులకు హిందువులు, ముస్లింలు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండగ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాపోలీసు యంత్రాంగం చర్చిల వద్ద ఇతర కూడళ్ల వద్ద పోలీసులను మోహరించి శాంతిభద్రతలను కాపాడారు.

Viewing all 69482 articles
Browse latest View live