Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

మేడిగడ్డ, కనె్నపల్లిని సందర్శించిన సీఎం

$
0
0

కరీంనగర్, జనవరి 1:రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సందర్శించి సాయంత్రం 6గంటలకు కరీంనగర్ తీగెల గుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఉమ్మడి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకు చేరుకొని పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం కనె్నపల్లి పంప్‌హౌజ్‌కు చేరుకొని అక్కడ పనులు పరిశీలించి అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. సాయంత్రం 6గంటలకు హెలికాప్టర్ ద్వారా నగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పలువురు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్ వెంట సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ ఉన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ రాజేందర్‌రావు, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, రసమయి బాలకిషన్, దాసరి మనోహర్‌రెడ్డి, సంకె రవిశంకర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, టెఫ్క్ఫా చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, మేయర్ సర్ధార్ రవీందర్‌సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, వి. మోహన్‌రెడ్డి, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ జీ.వీ. శ్యామ్ ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్లు ప్రావీణ్య, రాజర్షిషా, పోలీస్ కమిషనర్ వీ.బీ. కమలాసన్‌రెడ్డి, జడ్పీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే రెండోసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌కు మంగళవారం ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన ఆయన రాత్రి జిల్లా కేంద్రంలో బస చేసేందుకు ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా నేటి ఉదయం 10గంటలకు జగిత్యాల జిల్లా రాజేశ్వర్‌రావుపేట, రాంపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న పంప్‌హౌజ్ పనులు పరిశీలించనున్నారు.
మోగిన పంచాయతీ నగారా
* పల్లె పోరుకు షెడ్యూలు విడుదల
* జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు
* మొదటి విడత ఈనెల 7, రెండో విడత 11,
మూడో విడతకు 16న నోటిఫికేషన్ విడుదల
* గ్రామాల్లో కూసిన ఎన్నికల కోడ్
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 1: ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ నగారా ఎట్టకేలకు కొత్త ఏడాది మొదటిరోజున మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేయటంతో, ఎన్నికల కోడ్ కూయగా, పల్లె పోరు మొదలైంది. జిల్లాలోని 313 గ్రామపంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా, నోటిఫికేషన్‌లు విడుదలైన నాటినుంచే నామినేషన్లు కూడా స్వీకరించనున్నారు.
జనవరి 7న తొలిదశ నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆరోజు నుంచి, ఈనెల 9వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 10న స్క్రూటినీ, 11న ఉపసంహరణ, 21న పోలింగ్, మధ్యాహ్నం లెక్కింపు, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.
అలాగే, రెండో విడతగా ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, నామినేషన్లకు తుదిగడువు ఈనెల 13కాగా, 14న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ, 25న పోలింగ్, మధ్యాహ్నం 2గంటల నుంచి లెక్కింపు, అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు. 16న మూడో విడత నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు18గా నిర్ణయించారు. 19న పరిశీలన, 20వ తేదీన ఉపసంహరణ, ఈనెల 30న పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి, ఆతర్వాత ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపుచేసి, అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించనుండగా, మొదటిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటాకు స్థానం కల్పించారు. మొదటి విడతగా చొప్పదండి మండలంలోని 16 గ్రామాలు, గంగాధర మండలంలోని 33, కరీంనగర్ రూరల్ మండలంలోని 17, కొత్తపల్లి మండలంలోని 8, రామడుగు మండలంలోని 23గ్రామాలతోకలిపి 97పంచాయితీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. రెండోవిడత చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాలు, గనే్నరువరం మండలంలోని 16, తిమ్మాపూర్ మండలంలోని 23, మానకొండూర్ మండలంలోని 27, శంకరపట్నం మండలంలోని 24 గ్రామాలతో కలిపి 107 పంచాయితీల్లో, మూడో విడతగా ఇల్లందకుంట మండలంలోని 18, జమ్మికుంట మండలంలోని 20, హుజురాబాద్ మండలంలోని 19, వెనె్కపల్లి సైదాపూర్ మండలంలోని 26, వీణవంక మండలంలోని 26గ్రామాలు కలిపి 109 పంచాయితీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.పంచాయితీ ఎన్నికల షెడ్యూలు విడుదల కావటంతో పల్లెల్లో రాజకీయ వేడి పెరిగింది. పల్లెపీఠంపై ఆసీనులయ్యేందుకు ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా, కుర్చీని చేజిక్కించుకునేందుకు వ్యూహ,ప్రతివ్యూహాలు పన్నడం గ్రామాలల్లో మొదలైంది.
కరీంనగర్ కమిషనరేట్‌లో..
హైవే పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభం

కరీంనగర్, జనవరి 1: కరీంనగర్ కమిషనరేట్‌లో మంగళవారం హైవే పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభమయ్యాయి. పోలీస్ పరేడ్ గ్రౌండులో ఏర్పాటైన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డితో కలిసి హైవే పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. హైవే పెట్రోలింగ్ నిర్వహణకు కరీంనగర్ కమీషనరేట్‌కు మూడు వాహనాలు మంజూరయ్యాయి. ఈ వాహనాలు ఒకటి రాజీవ్ రహదారిలో, మరో రెండు వరంగల్, జగిత్యాల రహదారుల్లో రేయింబవళ్లు పెట్రోలింగ్‌లను నిర్వహిస్తాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రమాదాల నియంత్రణకు ఈ పెట్రోలింగ్‌లను నిర్వహిస్తున్నారు. ఏదైనాప్రమాదంజరిగిన సమాచారం అందిన వెంటనే ఈ వాహనాల్లో పనిచేసే అధికారులు 108, ఇతర అంబులెన్స్‌లకు సమాచారం అందించి సత్వరం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంలో గాయపడిన బాధితులను అంబులెన్స్‌ల కోసం ఎదురుచూడకుండా ఒక గంట వ్యవధిలో మెరుగైన వైద్యసదుపాయం ఉన్న ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు నియమనిబంధనలను పాటించాలన్నారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించక వాహనాలను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపడం వల్లనే ఎక్కువశాతం ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. వాహనదారులు రక్షణ కోసం సీటుబెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు. పోలీసులు తనిఖీల సందర్భంగా పట్టుకుంటారనే భయంతోనే తనిఖీలు ఉన్న ప్రాంతాల్లో సీటుబెల్ట్, హెల్మెట్‌లను ధరిస్తున్నారని, ఇది సరైందికాదని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ పెట్రోలింగ్ వాహనాల్లో విధులను నిర్వహించే పోలీసులు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉందని గుర్తించిన ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలన్నారు. పెట్రోలింగ్ నిర్వహణ సందర్భంగా రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా నిలిచి ఉన్న వాహనాలను రోడ్డుకు కింది భాగంలో దింపి, బ్లింకింగ్ లైట్లను వేయించాలని సూచించారు. గత సంవత్సరం కమిషనరేట్‌లో జాతీయ, రాష్ట్ర రహదారుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు ఎక్కువ రక్తస్రావం జరుగకుండా ప్రథమ చికిత్స చేసి ఒక గంట వ్యవధిలోపు మెరుగైన ఆసుపత్రుల్లో చేర్పించినట్లయితే 50 శాతం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను రక్షించవచ్చని చెప్పారు. పెట్రోలింగ్ వాహనాల విధులను నిర్వహించే పోలీసులు అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖ పేరు ప్రతిష్టలను పెంపొందించాలని కోరారు. విధి నిర్వహణను సంతృప్తికరంగా కొనసాగించాలన్నారు. బాధ్యతలు విస్మరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్.శ్రీనివాస్ (పరిపాలన), పి.సంజీవ్ కుమార్ (లా అండ్ ఆర్డర్), విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్‌పి జె.రామారావు, ఏసీపీలు డాక్టర్ పి.అశోక్, శ్యామ్‌సుందర్, శోభన్ కుమార్, టి.కృపాకర్, రాగ్యానాయక్‌లతో పాటుగా పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


శాంతి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ

$
0
0

మహబూబ్‌నగర్, జనవరి 1: ప్రజలకు శాంతిభద్రతలను కల్పించడంలో ప్రత్యేకశ్రద్ద ఉంటుందని శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. మంగళవారం 2019నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె కేక్‌ను కట్ చేసి పోలీసులతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. అదేవిధంగా మానసిక వికలాంగులతో కలిసి నూతన సంవత్సర కేక్‌ను కట్ చేసి వారికి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు జిల్లా కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో శాంతిభధ్రతల విషయంలో రాజీపడేది లేదని రానున్న పంచాయతీ ఎన్నికలను కూడా పకడ్బందిగా నిర్వహించడంలో పోలీసుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలను తరచూ గ్రామాల్లో ఆలజడులకు కారణమయ్యే వారిని గుర్తించి బైండోవర్ చేయడం జరుగుతుందని ఎస్పీ వెల్లడించారు. ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులు గ్రామపంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు సేవలు ఎంతో అవసరం అన్నారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు. 2019సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించేలా ఉండాలని ఆ దిశగా పోలీసుల ప్రయత్నం కూడా ఉంటుందన్నారు. గత ఏడాదిలో జరిగిన అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరంలో కూడా ఎలాంటి అలజడులకు తావు ఇవ్వకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది అంతా ఎన్నికల సిజన్ అని పోలీసులు అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎదైన తప్పు జరిగితే పోలీసులపై నేపం నెట్టే అవకాశం ఉంటుందని అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లాలని ఎస్పీ పిలుపునిచ్చారు. 2019సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో ఉండి మరింత అభివృద్ధి చెంది పోలీసులకు వందశాతం సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అడిషన్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ భాస్కర్, సిఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
తాడూరు, జనవరి 1: మండల కేంద్రమైన తాడూరులో మంగళవారం సాయంత్రం గ్రామానికి చెందిన అంపటి శ్రీనివాసులు ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రముఖ న్యాయవాది ఏమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఛత్రపతి విగ్రహాన్ని శ్రీనివాసులు రూ.1.40లక్షలతో నిర్మించి గ్రామంలో ప్రతిష్టించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఛత్రపతి శివాజీ జీవితంలోని ముఖ్య ఘట్టాల గురించి వివరించి, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమయ్య, శ్రీనివాసులు, చంద్రయ్య, వీరాచారి, శివాజీయూత్ బృందం తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులు పూర్తయితేనే బంగారు తెలంగాణ
* రూ.300 కోట్లు ఇస్తే భూసేకరణ పూర్తవుతుంది
* ఏదుల రిజర్వాయర్ పనులు వేగవంతం
* విశ్రాంత ఇంజనీర్ చంద్రవౌళి బృందం
కొల్లాపూర్/ కోడేరు, జనవరి 1: రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులు పూర్తయితేనే బంగారు తెలంగాణ అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడుతున్నారని విశ్రాంత ఇంజనీయర్లు తెలిపారు. మంగళవారం మండలంలోని ఎల్లూరు గ్రామపంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఎల్లూరు మొదటి రిజర్వాయర్ దగ్గర సొరంగ పనులను పరిశీలించారు.
నార్లాపూర్‌లోని 8.5టీఎంసీలు నిలువ ఉండే రిజర్వాయర్ పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఇంజనీయర్ల ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రవౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, జగదీశ్వర్, ముత్యంరెడ్డి, చంద్రవౌళి, వెంకటేశ్ తదితరులు మాట్లాడుతూ రిజర్వాయర్ పనులలో 44 ఎకరాల భూమి అవసరంకాగా ప్రస్తుతం 10 ఎకరాలు కొని మట్టిని తరలిస్తున్నామని, అదేవిధంగా మరో 34 ఎకరాలలో భూమిని తీసుకొని మట్టిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత ఇంజనీయర్లు, ఏజెన్సీ ప్రతినిధులు తెలిపినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ కావాలంటే ముందుగా ప్రాజక్టులు పూర్తి కావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రాజెక్టుల పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి తగిన నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతోనే తాము కాలేశ్వరం, పాలమూరు రంగారెడ్డి తదితర ప్రాజెక్టులను పర్యటించి పరిశీలించడం జరుగుతుందన్నారు.
తాము ఇచ్చే నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4 తరువాత ప్రాజెక్టులను సందర్శించి స్వయంగా పరిశీలించి నిధులను కేటాయించడం, త్వరతగతిన పనులు పూర్తి అయ్యేందుకు అన్నీ రకాలుగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇది ఇలా ఉండగా ఎల్లూరు దగ్గర ఎంజీకేఎల్‌ఐ మిషన్ భగీరథ తదితర పనులు జరుగుతుండటంతో ఎల్లూరు, కొల్లాపూర్ రహదారులు పూర్తిగా పాడైన ఈ రహదారులను మెరుగుపర్చాలని ఎల్లూరు రైతులు విశ్రాంత ఇంజనీయర్లకు వినతిపత్రాన్ని అందచేశారు.
ఏదుల రిజర్వాయర్ వద్ద..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు త్వరతగతిన జరగాలంటే భూసేకరణ ప్రధాన అంశమని ఇందుకు ప్రభుత్వం రూ.300 కోట్లు తక్షణమే విడుదల చేస్తే ఐదువందల భూసేకరణ పూర్తవుతుందని విశ్రాంత ఇంజనీయర్ల ఆసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రవౌళి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక మేరకు ఐదుమందితో కూడిన బృందంతో నార్లాపూర్, ఏదుల రిజర్వయర్లు, పంపుహౌజ్‌ల పనులను పరిశీలించిన అనంతరం ఏదుల రిజర్వాయర్ కట్టపై ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బృందం సభ్యులతో కూడి ఆయన మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరిశీలిస్తే నార్లాపూర్ రిజర్వాయర్, పంపుహౌజ్ పనులకన్నా ఏదుల రిజర్వాయర్, పంపుహౌజ్ పనులు చురుకుగా కొనసాగుతున్నాయన్నారు. భూసేకరణ బాగా జరిగిందని ఇంజనీయర్లు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు శ్రద్ద వహించి పనులు చేస్తున్నందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు. నార్లాపూర్ పనులు ఆశించిన వేగంగా జరగడంలేదన్నారు.
గత నెల నుంచి ఈనెల 4 వరకు రాష్ట్రంలోని నిర్మాణ ప్రాజెక్టులను పరిశీలించి పూర్తి స్థాయి నివేదికను ముఖ్యమంత్రికి అందచేస్తామని ఆయన అన్నారు. శ్రీశైలం డ్యాం దగ్గర నీరు లీకేజీ అవుతున్నట్లు తెలిసిందని, అలాగే గుడిపల్లి రిజర్వాయర్ వద్ద నాలుగు మోటార్లను నడిపిస్తే నీరు సరిపోవడంలేదని అంటున్నారని వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట విశ్రాంత ఇంజనీయర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, డి. జగదీశ్వర్, ఎస్.ముత్యంరెడ్డి, టీ. వెంకటేశంలు ఉన్నారు.

మోగిన పంచాయతీ ఎన్నికల నగారా

$
0
0

మహబూబ్‌నగర్, జనవరి 1: ఉత్కంఠతకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మంగళవారం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో గ్రామాల్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. గత వారం రోజులుగా ఎప్పుడెప్పుడా అని చర్చించుకుంటున్న తరుణంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. మొదటిదశ ఎన్నికలను జనవరి 21వ తేదిన రెండవదశ ఎన్నికలను జనవరి 25న, మూడవదశ ఎన్నికలను జనవరి 30వ తేదీన నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 7వ తేది నుండి 9వ తేదీ వరకు మొదటిదశ జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించనున్నారు. 10న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మొదటిదశ ఎన్నికల ప్రచారం గడువు 19వ తేది 5గంటల వరకు ముగియనుంది. అదేవిధంగా ఈ నెల 11 నుండి 13 వరకు రెండవదశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. 14న నామినేషన్ల పరిశీలన, 17న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. రెండవ దశ పోలింగ్ 25వ తేదీన పూర్తి కానుంది. ఈ నెల 30వ తేదదీన మూడవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 16వ తేది నుండి 18వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ, 19వ తేదిన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 2గంటల నుండి ఓట్లలెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. అదేరోజు సర్పంచుల ఎన్నిక కూడా పూర్తి కానుంది. ఉపసర్పంచ్ ఎన్నికలు కూడా అదేరోజు నోటిఫికేషన్ అక్కడి ఎన్నికల అధికారులు పూర్తి చేయనున్నారు. ఇకపోతే మొదటివిడత ఎన్నికలకు ఆరురోజులు మాత్రమే ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. రెండవ విడత ఎన్నికలకు కూడా అదే సమయం ఉండడం, మూడవ విడతకు కూడా కేవలం ఆరురోజుల ప్రచారం సమయం ఉండడంతో నాయకుల్లో ఓ పక్కా ఆనందం ఉన్నా, మరోపక్క ఓటర్లను మల్చుకోవడానికి ఇంత గడువు ఉండడంతో ఎలా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక పల్లెల్లో పోరు మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామపంచాయతీ ఎన్నికల కొలాహలం ప్రారంభం అయ్యింది. నేటి నుండే గ్రామాల్లో ఎన్నికల నియమావళి ఆమలులోకి వచ్చింది. సంక్రాంతి పండుగ సమయంలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అయినప్పటికిని పోలింగ్ 21వ తేది ఉండడంతో సంక్రాంతి పండుగ కూడా ఎన్నికల వాతావరణంలో కొనసాగనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1672 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఈ దఫా ఎన్నికల్లో 836గ్రామపంచాయతీలు మహిళలకు రిజర్వేషన్ కోటాలో వెళ్లిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన గ్రామపంచాయతీ చట్టంలో అనేక అంశాలను పొందుపర్చడం, అందులో ప్రధానంగా మహిళలకు 50శాతం రిజర్వేషన్లు వందశాతం గిరిజనులు ఉన్న గ్రామాలు కూడా వారికే కేటాయించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏది ఎమైనప్పటికిని మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది.
సంబురంగా కొత్త సంవత్సర వేడుకలు
* దేవాలయాల్లో భక్తుల కిటకిట * పార్కుల్లో జనం సందడి

మహబూబ్‌నగర్, జనవరి 1: 2019 నూతన సంవత్సర ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 2019 నూతన సంవత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్పడి మహబూబ్‌నగర్ జిల్లాలో జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఎంతో అత్యంత వైభవంగా ఉల్లాసంగా జరుపుకున్నారు. జిల్లాలోని దేవాలయాల్లో భక్తుల రద్ది కనిపించింది. అదేవిధంగా జిల్లాలోని అన్ని పార్కులలో జనం కోలహలం కనిపించింది. ముఖ్యంగా ప్రధాన దేవాలయాల్లో భక్తుల తాకిడి నెలకొంది. జిల్లాలోని ప్రధాన పార్కులైన మయూరి పార్కు, పిల్లలమర్రికి సందర్శలకుల తాకిడి కనిపించింది. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయినా జూరాల ప్రాజెక్టు దగ్గర సైతం సందర్శకులు సందడి నెలకొంది. ఇకపవతే మయూరి పార్క్‌కు వెల9ది మంది సందర్శకులు తరవలిరావడంతో ఆ ప్రాంతమంతా సందర్శకులతో కిటకిటలాడింది. పిల్లలమర్రికి సందర్శకులు వేలాదిగా తరలిరావడంతో అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇకపోతే మయూరి పార్క్ దగ్గర జనం సందడే సందడి అని చెప్పవచ్చు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఈ రెండు పర్యాటక కేంద్రాలు ప్రసిద్ది చెందిన ప్రాంతాలకు జనం పోటెత్తడంతో పోలీసులు సైతం అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని ప్రధాన దేవాలయాలు జోగుళాంబా అమ్మవార్శిక్తిపీఠంలో భక్తుల సందడి నెలకొంది. నూతనసంతవత్సరం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తమకు లభించాలని అమ్మవారిని మొక్కుల ద్వారా కోరుకున్నారు. జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మదేవి ఆలయం భక్తులతో కిటకిటలాండింది. మహబూబ్‌నగర్ సమీపంలోని మన్యంకొండ దేవాలయానిక భక్తులు పోటేత్తారు. దాంతో పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కాటన్ మిల్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి ఉదయం నుండే భక్తుల తాకిడి నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో దేవాలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సర వేడుకలను మహబూబ్‌నగర్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రొస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఎస్పీ రేమారాజేశ్వరి పాల్గొన్ని ప్రజలకు 2019 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మయూరి పార్క్‌లో జరిగిన వేడుకలు అంబరాన్నంటాయి.
బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కొనసాగించాలి
* మాజీ మంత్రి చిత్తరంజన్‌దాసు
కల్వకుర్తి, జనవరి 1: బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికే 34 శాతం గల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించడం జరిగిందని, రిజర్వేషన్లు తగ్గించడంతో బీసీలు రాజ్యాంగం కల్పించిన హక్కులను కోల్పోతారని, 34 శాతం రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించాలని మాజీ మంత్రి చిత్తరంజన్‌దాసు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ అథితి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను రాజకీయంగా అణిచి వేయడానికే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల తగ్గింపు చేసేందుకు అర్డినెన్స్‌ను జారీ చేసిందని వెంటనే అట్టి అర్డినెన్స్‌ను రద్దు చేసి 34 శాతవ రిజర్వేషన్లను కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన గుర్తు చేశారు. విలేఖరుల సమావేశంలో అరెకటిక సంక్షేమ సంఘం తాలుకా అధ్యక్షుడు సోమాజీ, బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలుకా అధ్యక్షుడు రాజేందర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు శశి, జంగయ్య, లక్ష్మయ్య, గోపాల్ తదితరులు ఉన్నారు.

మోగిన పంచాయతీ నగరా

$
0
0

సూర్యాపేట, జనవరి 1: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో పంచాయతీ పోరుకు నగరా మోగినట్లయింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలో 475 గ్రామపంచాయతీలు, 4,322వార్డు స్ధానాలు ఉండగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ షెడ్యూల్‌ను వెలువరించింది. ఈమేరకు ఈనెల 21, 25, 30 తేదీలలో పోలింగ్ జరగనుంది. జిల్లాలో సూర్యాపేట, కోదాడ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని ఉన్న 23 మండలాల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహిస్తారు. మొదటివిడత ఎన్నికలకు ఈనెల 7, రెండవ విడతకు ఈనెల 11న, మూడో విడతకు ఈనెల 16న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. మొదటి విడతన ఏడు మండలాలు, రెండో విడతన తొమ్మిది మండలాలు, మూడవ విడతన ఏడు మండలాలల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా పరిధిలో కేవలం రెండు రెవెన్యూ డివిజన్‌లు మాత్రమే ఉండటం వల్ల రెండు డివిజన్‌ల పరిధిలోని మండలాల్లో మూడు విడతల ఎన్నికల నిర్వహించేలా విభజించారు. మొదటి విడతలో కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాలోని 161 సర్పంచ్, 1456 వార్డుసభ్యుల స్ధానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడత కోసం 7న నోటిఫికేషన్ జారీచేసి నామినేషన్‌ల స్వీకరణ చేపడతారు. ఈనెల 9వరకు నామినేషన్‌లు స్వీకరించి 10న పరిశీలన పూర్తిచేసి 11న ఉపసంహరణల అనంతరం జనవరి 21న ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం నుండి లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రెండో విడతలో హుజూర్‌నగర్, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని హుజూర్‌నగర్, మఠంపల్లి, చిలుకూరు, తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల మండలాల్లోని 160 గ్రామాల్లోని సర్పంచ్‌లు, 1462 వార్డుస్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం ఈనెల 11న నోటిఫికేషన్ జారీచేసి 13వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. 14న పరిశీలన చేపట్టి 15న నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం జనవరి 25న పోలింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. అదేవిధంగా మూడోవిడతలో సూర్యాపేట, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), మేళ్లచెర్వు, చింతలపాలెం, గరిడేపల్లి, నేరుడుచర్ల, పాలకీడు మండలాల్లోని 154 పంచాయతీలు, 1404 వార్డుస్థానాలకు ఎన్నికల నిర్వహణకు గాను జనవరి 16న ప్రకటన విడుదల చేసి 18వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. 19న పరిశీలన పూర్తిచేసి 20న ఉపసంహరణల అనంతరం ఈనెల 30న పోలింగ్ నిర్వహించి వెనువెంటనే లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా జిల్లాలో వార్డుస్థానాల సంఖ్యను పరిశీలిస్తే గరిడేపల్లి మండలంలో అత్యధికంగా 294వార్డులున్నాయి. ఈ మండలంలో పంచాయతీల సంఖ్య 32. అతితక్కువ వార్డు స్థానాలతో హుజూర్‌నగర్ మండలంలో 110 వార్డులు ఉండగా మొత్తం 11పంచాయతీలు ఈ మండలంలో ఉన్నాయి.

ఉదయభానుడి కిరణాలతో..
పసిడి తళుకులీనిన యాదాద్రి ఆలయం
* అబ్బురంగా తిలకించిన భక్తజనం
యాదగిరిగుట్ట, జనవరి 1: అద్భుత శిల్పసంపదతో నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయం నూతన సంవత్సరం మంగళవారం తెల్లవారుజామున పసిడివర్ణ శోభితంగా తళుకులీనింది. నల్లసరం కృష్ణశిలలతో నిర్మితమైన ఆలయం గోపురాలపై ఉదయభానుడి కిరణాలు పడిన సమయంలో గోపురాలు, శిఖరాలు బంగారువర్ణ కాంతులతో తళుక్కుమనగా ఈ అపురూప దృశ్యాలను భక్తులు అబ్బురంగా తిలకించారు. సూర్యభగవానుడి కిరణాలు ఎలాగైతే సప్తరాజగోపురాలపై మెల్లగా పడుతు వృద్ధి చెందుతూ వెళ్లగా కిరణాల విస్తరణను అనుసరించి గోపురాలపై బంగారు వర్ణ కాంతులు సైతం అలాగే పెరుగుతు కనువిందు చేశాయి. సూర్యకిరణాలు పూర్తిగా గోపురాలపై పడిన పిదప శే్వతకాంతులుగా మారిపోయాయి. తెల్లవారుజామున నూతన ఆలయం ముంగిట ఉన్న భక్తులు ఉదయభానుడి లేత కిరణా వెలుగుల్లో స్వర్ణకాంతులతో మెరిసిన పంఛనారాసింహుడి నూతన ఆలయాన్ని చూసి ఆలయ నిర్మాణాన్ని కొనియాడటం కనిపించింది.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కల్పించాలి
- కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి
కోదాడ, జనవరి 1: శాంతి భద్రతలలో కోదాడ డివిజన్ అగ్ర స్థానంలో ఉందని, 2019లో కూడా ఎలాంటి మచ్చ లేకుండా అందరూ పనిచేసి ప్రజలతో మమేకమై మంచిపేరు తెచ్చుకోవాలని ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి కోరారు. కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, రామినేని ట్రాన్స్‌పోర్టు యజమాని రామినేని శ్రీనివాసరావు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా డివిజన్ పరిధిలోని డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ నూతన సంవత్సరంలో ఎలాంటి గొడవలు లేకుండా శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఆనందంగా జీవించాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి, రూరల్ సీఐ రవి కుమార్, మునగాల సీఐ శివశంకర్ గౌడ్, హుజూర్‌నగర్ సీఐ శ్రీ్ధర్, డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు పాల్గొన్నారు.
కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ గుత్తా
దేవరకొండ, జనవరి 1: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌ను మంగళవారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో పార్టీ వర్కింగ్ అధ్యక్ష హోదాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు కూడా ఉన్నారు.

సీఎం ప్రాజెక్ట్ సందర్శన బాట--- రైతన్నలో చిగురిస్తున్న ఆశలు

$
0
0

నల్లగొండ, జనవరి 1: తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ సాగుతాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల సత్వర పూర్తికి ప్రాజెక్టుల సందర్శన బాట పట్టడం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై జిల్లా వాసుల్లో ఆశలు రేపింది. జిల్లాలో సీఎం కేసీఆర్ స్వయంగా శంకుస్థాపన చేసిన డిండి ఎత్తిపోతల పథకంతో పాటు గత ప్రభుత్వాలు మొదలుపెట్టిన ఉదయ సముద్రం (బ్రాహ్మణవెల్లంల) ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టుల పెండింగ్ పనులపై ఉమ్మడి జిల్లా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లు, వాటి కాలువలతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలు జిల్లా సాగుతాగునీటి వసతుల కల్పన దిశగా పురోగతిలో ఉన్నాయి. సీఎం కేసీఆర్ సందర్శన, సమీక్షల పిదపనైనా నత్తనడకన సాగుతున్న ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనుల్లో కదలిక వచ్చి పనులు వేగవంతం కావాలని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 3లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు, తాగునీటి వసతి కల్పనకు 2005లో రూ.2,813 కోట్లతో చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ (ఎఎమ్మార్పీ) సొరంగం ప్రాజెక్టు పనులు 2010 కల్లా పూర్తికావాల్సివున్నా నేటికి ఆగుతుసాగుతునే ఉన్నాయి. తొలుత 2012కు ఒకసారి, 2017 డిసెంబర్, తదుపరి 2020 అక్టోబర్‌కు గడువు పొడగించారు. సొరంగం ఒకటిలో ఆగిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనులన్ని చూస్తే అప్పట్లోగా కూడా పనుల పూర్తిపై సందేహాలున్నాయి. పనుల జాప్యంతో 2005లో కుదిరిన కాంట్రాక్టు ఒప్పందం రూ.1,925 కోట్ల అంచనా వ్యయం నుండి నేడు రూ.4200 కోట్లకు పెరిగింది. పెరిగిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం పొందినా నేటికి రూ.2202 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. సొరంగం-1 అవుట్, ఇన్‌లెట్ పనులు 43.93 కిలోమీటర్లు తవ్వాల్సివుండగా 32.68 కిలో మీటర్లు పూర్తయ్యాయి. మరో 11.52 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సివుంది. ఏడు నెలల క్రితం టనె్నల్ బేరింగ్ మిషన్ మరమ్మతులకు గురికాగా పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వాన్ని రూ.60 కోట్లు అడ్వాన్స్ కోరడంతో ప్రభుత్వం అంగీకారం తెలిపింది. సొరంగం-2 పనులు 7.92 కిలోమీటర్లు పూర్తవ్వగా 5.10కిలోమీటర్ల లైనింగ్ సైతం పూర్తయింది. టీబీఎం మిషన్ రిపేర్‌తో పనులు ఏడునెలలుగా నిలిచిపోయాయి. మొత్తం 13ఏళ్లలో ఏడాదికి సగటున 2.50కిలోమీటర్ మాత్రమే తవ్వడం గమనార్హం. అంచనా విలువకు రూ.1400 కోట్ల మేరకు అదనంగా ఖర్చవుతున్నా పనులు పూర్తికావడం లేదు. ప్రస్తుతం టీబీఎం మిషన్ విదేశాల నుండి చెన్నై పోర్టుకు రాగా మరమ్మతు సామగ్రి, నిపుణులు రావాల్సి వుంది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన నక్కలగండి రిజర్వాయర్ పనులు సైతం ఆలస్యంగా సాగుతున్నాయి.
ఎస్‌ఎల్‌బీసీలో అంతర్భాగమైన ఉదయ సముద్రం ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకు సాగుతాగు నీరందించేందుకు 2007లో రూ.700 కోట్లతో చేపట్టిన ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులు సైతం పూర్తి కాలేదు. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో పనుల్లో వేగం పెంచి ట్రయల్న్ వరకు వచ్చి ఆగారు. ప్రాజెక్టులో భాగమైన 10.62 కిలోమీటర్ల సొరంగం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన 1200 ఎకరాల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్, సర్జ్‌పూల్, పంప్‌హౌస్, కుడి, ఎడమకాలువల నిర్మాణాలు పూర్తి కావాల్సివుంది. తొలివిడతగా 50వేల ఎకరాలకు నీరందిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించినా ఎన్నికల ప్రక్రియతో పనుల్లో పర్యవేక్షణ కరువైంది.
అదేవిధంగా సీఎం కేసీఆర్ 2015 జూన్‌లో శంకుస్థాపన చేసిన ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం రెండున్నర ఏళ్లలో పూర్తి చేస్తామన్న హామీ నెరవేరడంలో తీవ్ర జాప్యం సాగుతోంది. దీంతో ఈ దఫా ప్రాజెక్టుల సందర్శనలో కాళేశ్వరం పిదప డిండి ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారిస్తుండటంతో పనుల్లో వేగం తధ్యమని భావిస్తున్నారు. రూ.6.500 కోట్ల అంచనా వ్యయంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుండి వచ్చే అర టీఎంసీ వరద నీటిని డిండికి మళ్లించి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు కృష్ణా సాగు, తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు డిజైన్లలో తరుచూ మార్పులు చోటుచేసుకోగా రిజర్వాయర్ల సంఖ్య, కాలువల దూరం పెరిగి ప్రస్తుతం 4.70 లక్షల ఎకరాల మేరకు సాగునీరందించాలని నిర్ధేశించారు. జిల్లాలో ప్రాజెక్టులో భాగంగా తొలుత చేపట్టిన శివన్నగూడెం, కిష్టరాంపల్లి, గొట్టిముక్కల, సింగరాజుపల్లి, చింతపల్లి రిజర్వాయర్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
మరోవైపు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు కాళేశ్వరం నీళ్లను అందించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లు అసంపూర్తిగానే ఉండగా, కాలువల పనులు సగానికిపైగా పూర్తయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలకు జిల్లా పరిధిలో ఏటా గోదావరి నీటి కొరత ఏర్పడుతుండటంతో ఈ కాలువల పరిధిలోనికి ఆయకట్టుకు కూడా కాళేశ్వరం నీళ్లు అందించాలని డిజైన్ చేశారు. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్టులతో పాటు జిల్లాలో సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేసిన మూసీ పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువల పొడగింపు పనులను సైతం పూర్తి చేయాల్సివుంది. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాటతో తమ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులు వేగవంతమవుతాయన్న ఆశలు జిల్లా వాసుల్లో రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలి
* జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమర్
సూర్యాపేట, జనవరి 1: ప్రభుత్వ అధికారులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ దుగ్యాల అమోయ్‌కుమార్ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు, మండలాల అధికారులు, పలు రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సంవత్సరం 2019లో జిల్లాలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు కృషి చేయాలని కోరారు. రైతులకు ఈ సంవత్సరంలో అధిక దిగుబడులు సాధించాలని సుఖశాంతులతో వర్ధిల్లాలన్నారు. వౌలిక వసతులతో పాటు విద్య, ఆరోగ్య ప్రజలందరికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈసందర్భంగా కేక్‌కట్ చేశారు. ఈ వేడుకలల్లో సంయుక్త కలెక్టర్ డీ. సంజీవరెడ్డి, డీఆర్‌డీఎ పీడీ కిరణ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం రాంపతి, వ్యవసాయ అధికారిణి జ్యోతిర్మయి, పరిశ్రమలశాఖ జియం బాబురావు, భూసర్వే అధికారి శ్రీనివాసులు, బీసీ సంక్షేమాధికారి జ్యోతి, ఉద్యానవనశాఖ అధికారి శ్రీ్ధర్, ఆర్డీఓలు మోహన్‌రావు, కిషన్, సమాచారశాఖ ఏడీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ షెడ్యూల్ విడుదల
మూడు విడతల్లో పోలింగ్
నల్లగొండ జిల్లాలో 844 పంచాయతీలకు ఎన్నికలు

నల్లగొండ, జనవరి 1: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. మూడు వితడలుగా జనవరి 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుండి ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి రానుంది. పోలింగ్ ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2గంటలకు ముందుగా వార్డుల వారి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, తదుపరి సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, అదే రోజు ఉపసర్పంచ్‌ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు.
తొలి విడత ఎన్నికలకు సంబంధించి జనవరి 7నుండి 9వరకు నామినేషన్ల స్వీకరణ, 10న పరిశీలన, 11 అప్పీల్, 12న పరిష్కారం, 13న ఉపసంహరణ, పోటీల ఉన్న అభ్యర్థుల జాబితా వెల్లడి ప్రక్రియ నిర్వహిస్తారు. రెండో విడతకు సంబంధించి 11నుండి 13వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 17న ఉపసంహరణ ఉంటుంది. మూడో విడతకు సంబంధించి 16 నుండి 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 20న పరిశీలన, 21న ఉపసంహరణ, అభ్యర్థుల జాబితా వెల్లడి ఉంటుంది. నల్లగొండ జిల్లాకు సంబంధించిన 844 పంచాయతీలకు, 7344 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 9లక్షల 31,319 మంది ఓటర్లు ఉన్నారు.
తొలి విడతలో దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీలకు, రెండో విడతలో మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని గ్రామపంచాయతీలకు, మూడో విడతలో నల్లగొండ రెవెన్యూ డివిజన్ మండలాల పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం నల్లగొండ జిల్లాలో 844పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, చందంపల్లి, చందుపట్ల, కడపర్తి, నెల్లిబండ, నోముల, తాటికల్, గుండ్లగూడెం పంచాయతీల పదవి కాలం ముగియ్యనందునా వాటికి ఎన్నికలు నిర్వహించడం లేదు.

పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు
* పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా
హుజూర్‌నగర్, జనవరి 1: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం హుజూర్‌నగర్‌లోని తన నివాసంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని కేక్ కట్ చేసి పంచిపెట్టిన అనంతరం పత్రికల వారితో మాట్లాడారు. 2019లో రాహుల్‌గాంధీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా తెలంగాణ రాష్ట్రంలో మావంతు గట్టిగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాలలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని ఆయన అన్నారు. అన్ని మండలాలకు మండల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తారని, వీరు అన్ని గ్రామాలు పర్యటించి అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయగా నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని 22 శాతానికి తగ్గించి అన్యాయం చేయటం బాధాకరమన్నారు. 2019లో ప్రజలందరికి మేలు జరగాలని, సుఖ, సంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్దిస్తున్నట్లు చెప్పారు. పంటలు బాగా పండాలని, మద్దతు ధర వచ్చి రైతులు, కూలీల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితమవుతామని, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల ప్రజలు 5 సార్లు వరుసగా తనను ఎమ్మెల్యేగా గెలిపించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలను తమ కుటుంబంగా భావించి తమ శక్తి మేరకు మేలు చేస్తామని గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనులు వేగవంతగా పూర్తి చేయటానికి శాసనసభలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. ప్రజాహిత కార్యక్రమాల్లో ఘర్షణ రహితంగా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని గతంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దామని భవిష్యత్‌లో కూడా కృషి చేస్తామని చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తాన న్నారు. అంతకు ముందు పలు మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జునరావు, మాజీ సర్పంచ్ గొట్టె రామయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతిరెడ్డి సంజీవరెడ్డి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరిలో పాస్‌పోర్టు సేవలు ప్రారంభం
పాస్‌పోర్ట్ సేవాకేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎంపీ బూర నర్సయ్యగౌడ్
భువనగిరి, జనవరి 1: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పాసుపోర్టు కేంద్రాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ బూర మాట్లాడుతూ జిల్లా ప్రజలు పాసుపోర్టు పొందేందుకు హైదరాబాద్‌కు వెళ్లే అవసరంలేకుండా సేవలను జిల్లా కేంద్రంలోనే పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సేవా కేంద్రాన్ని మంజూరు చేయించినట్లు తెలిపా రు. పాసుపోర్టు అవసరమున్న ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాస్‌పోర్టు పొందాలన్నారు. సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన గుర్తుచేశారు. తన హయాంలో 523 కిలోమీటర్ల జాతీయ రహదారుల ఏర్పాటుకు కృషిచేయడమేగాక, జాతీయ రహదారులలో ప్రమాదాల నివారణ కోసం అండర్‌పాస్‌ల నిర్మాణాలను మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ భువనగిరిలో పాసుపోర్టు సేవాకేంద్రాన్ని ఏర్పాటుచేయడం హర్షనీయమన్నారు. ఈ అవకాశాన్ని అవసరమున్న ప్రతి ఓక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో పోస్టల్‌శాఖ ఉన్నత అధికారులతోపాటు, మున్సిపల్ చైర్మన్ నువ్వుల ప్రసన్న, జిల్లా గ్రంధాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బర్రె మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నూతన సంబురాలు
కేక్ కట్ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యేలు
ఆలయాలు కిటకిట.. పూజల్లో కలెక్టర్ కుటుంబం
నల్లగొండ రూరల్, జనవరి 1: జిల్లా కేంద్రంలో నూతన సంవత్సర సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం రాత్రి 12గంటలు కాగానే పట్టణ యువత కేరింతలు కొడుతూ కేక్‌కట్ చేసి గత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన ఏడాదికి స్వాగతం తెలిపి సంబరాల్లో ఇంటిల్లాపాది మునిగి తేలారు. తమ తమ సన్నిహితులకు, స్నేహితులకు ఫోన్‌లు చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం పట్టణంలోని పలు దేవాలయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కుటుంబ సభ్యులతో కలిసి రామగిరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
నల్లగొండ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, స్ధానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డిలు పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్‌ను జిల్లా ఎస్పీ రంగనాథ్, జేసీ నారాయణ రెడ్డి, ఆయా శాఖల అధికారులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

హత్యకేసు కొట్టివేత

$
0
0

మార్కాపురం టౌన్, జనవరి 2: హత్యకేసులో సాక్ష్యాలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ 6వ అదనపుజిల్లా జడ్జి జి రామకృష్ణ బుధవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. మార్కాపురం డివిజన్ పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన నాలి సాంబయ్యను 2012లో గోతం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గొడ్డలితో నరికి చంపాడు. అది మనస్సులో ఉంచుకొని నాలి సాంబయ్య అన్న నాలి సాలయ్య, బావ అంగిరేకుల శ్రీనులు 2014లో గోతం వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై గొబ్బూరు నుంచి సోమేపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గొబ్బూరు బ్రిడ్జి వద్ద కాపుకాసి అడ్డుకొని గొడ్డళ్లతో నరికి చంపారని బంధువులు పెద్దారవీడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే సాక్షులను విచారించిన పిదప సదరు నిందితులపై నేరం రుజువు కానందున బుధవారం కేసు కొట్టివేస్తూ జడ్జి రామకృష్ణ తీర్పు ఇచ్చారు. నిందితుల తరపున న్యాయవాదులు భూపని కాశయ్య, గుమ్మా వెలుగొండయ్య వాదించారు.

లారీ, బస్సు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు

$
0
0

టంగుటూరు,జనవరి 2:టంగుటూరుకు దక్షిణ వైపున ఉన్న సర్వీసురోడ్డులో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు నెల్లూరు నుండి ఒంగోలు వైపు వెళ్తున్న ఆర్‌టిసి ఎక్స్‌ప్రెస్ టంగుటూరుకు దక్షిణవైపున ఉన్న సర్వీసు రోడ్డు సమీపంలోకి రాగానే ఒంగోలునుండి శింగరాయకొండ వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఆర్‌టిసి బస్సును ఢీకొనటంతో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈప్రమాదంలో వాయల వెంకటేశ్వర్లు, బత్తుల రాధాకృష్ణ, మాలె వెంకటకృష్ణారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఆర్‌టిసి బస్ డ్రైవరు చాకచాక్యంతో వ్యవహరించటంతో పెనుప్రమాదం తప్పింది. సంఘటనా స్థలాన్ని స్థానిక ఎస్‌ఐ పరిశీలించి క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్‌కు తరలించి కేసు దర్యాప్తుచేస్తున్నారు.

సమస్యల పరిష్కార వేదిక జన్మభూమి

$
0
0

దర్శి, జనవరి 2 : రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. బుధవారం దర్శి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేంద్రంపై పోరాడుతున్నారని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ధర్మపోరాట దీక్షను చేపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 16 వేల 500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతు, డ్వాక్రా రుణాలమాఫీ, రాష్ట్రంలో నదులు అనుసంధానం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర నిధులతో వేగవంతంగా పోలవరం పనులు చేపట్టడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గోదావరి నదిని పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేసినట్లు చెప్పారు. కృష్ణానదిని పెన్నానదికి అనుసంధానం చేయడానికి నగరికల్లు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు, విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, విభజన హామీలోని 19 అంశాలను అమలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో 20 వేల కోట్ల తో 30 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ నెల 9వ తేదిన రామాయపట్నం వద్ద పేపర్‌మిల్లుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రామాయపట్నం ఓడరేవు, ఉద్యావన యూనివర్సిటీ, చిరు ధాన్యల పరిశీధనా కేంద్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారన్నారు. దర్శి నియోజకవర్గంలో మూడు వేల కోట్ల రూపాయాలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో 144 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కరణం బలరాం మాట్లాడుతూ దర్శి నియోజకవర్గాన్ని మంత్రి శిద్దా రాఘవరావు ప్రథమస్థానంలో నిలిపారని, నియోజక వర్గ పరిధిలోని సమస్యలపై వెంటనే స్పందించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపారన్నారు. రానున్న రోజుల్లో కూడా మంత్రి సేవలు ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. రైతుల వద్ద ఉన్న వరి, శనగ, పత్తి, కంది పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు చేసి ఆదుకుందన్నారు. రైతులకు సాగునీటి సమస్యలు రాకుండా పంటలకు సాగర్ కాలువల ద్వారా సాగునీటిని అందించడం జరిగిందన్నారు. కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ జిల్లాలో 1028 గ్రామ పంచాయతీల్లో 330 మున్సిపల్ వార్డుల్లో ఈనెల 2వ తేది నుండి 11వ తేదీ వరకు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అధికారులు ఒక్క రోజంతా గ్రామాల్లో ఉండి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో రెండు లక్షల పది వేల మందికి రేషన్‌కార్డులు మంజూరు చేయడం జరిగిందని, ఉమ్మడి కుటుంబాల నుండి విడిపోయిన వారికి ప్రత్యేకంగా ఈ జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. జిల్లాలో ఎన్‌టిఆర్ భరోసా క్రింద మూడు లక్షల 52 వేల మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తగా జిల్లాలో 16 వేల మందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 11వ తేది జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో రేషన్ కార్డులు, పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాలో చంద్రన్న బీమా పథకం కింద 14 వేల మందికి 160 కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు చెప్పారు. జిల్లాలో చంద్రన్న పెళ్లి కానుకల పథకం కింద 50 వేల నుండి లక్ష రూపాయల వరకు వివాహా ప్రోత్సాహాకాల కింద మూడున్నర కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు చెప్పారు. జిల్లా ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం కింద 95 వేల గృహాలను మంజూరు చేశామన్నారు. జిల్లాలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద 640 కోట్ల రూపాయలతో 2200 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. జిల్లాలో పారిశ్రామిక ప్రోత్సాహాల కింద 246 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో టంగుటూరు ప్రకాశం పంతులు పేరు మీద యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో పేపర్ మిల్లు స్థాపించడానికి జిల్లాకు 30 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు పేపర్ ఫుల్స్ కంపెనీ ముందుకొచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. జన్మభూమి మా ఊరు ప్రతిజ్ఞను ప్రజలతో మంత్రి శిద్దా రాఘవరావు చేయించారు. 78 స్వయం సహాయక సంఘాలకు రెండు కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎంపీపీ పూసల సంజీవయ్య, జడ్పిటిసి స్టీవెన్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి డి రఫీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడి కృష్ణవేణి, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహశీల్దార్ విజయకుమారి, కనీస వేతనాల అమలు బోర్డు డైరెక్టర్ శోభారాణి, వైస్ ఎంపీపీ మారం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అన్నివర్గాలను మోసం చేసిన చంద్రబాబు

$
0
0

ఒంగోలు, జనవరి 2 : రైతుల నుండి పొదుపు మహిళలు, యువకుల వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైఎస్‌ఆర్‌సిపి ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గ అధ్యక్షులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. రావాలి జగన్... కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలోని 45వ డివిజన్‌లోని శ్రీనగర్ కాలనీలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటీ కూడా పూర్తిగా నెరవేర్చలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాదు చివరికి జిల్లాకు వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టు విషయంలోనూ కాలం వెళ్లదీస్తున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి పెన్షన్ ద్వారా ఏడాదికి 24వేల నుండి 48 వేల వరకు అందుతాయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా లక్ష రూపాయల నుండి పదిలక్షల రూపాయల వరకు సాయం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇల్లు లేని పేదలందరికీ రెండు లక్షల నుండి ఐదు లక్షల రూపాయల వరకు వెచ్చించి ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి పేద కుటుంబంలో పిల్లలను బడికి పంపినందుకు సంవత్సరానికి 15 వేల రూపాయలు అందిస్తామన్నారు. ఈ విధంగా ప్రతి కుటుంబానికి వివిధ పథకాల ద్వారా ఏటా లక్ష నుండి ఐదులక్షల రూపాయల వరకు లబ్థి పొందేలా జగన్ విధి విధానాలు అమలు చేస్తారని భరోసా ఇచ్చారు. నవరత్నాలకు సంబంధించిన కరపత్రాలను బాలినేని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, పార్టీ నాయకులు నరాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీసీలను మోసం చేస్తున్న పార్టీలు

$
0
0

అనంతపురం, జనవరి 2: జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు పేర్కొన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సంఘం విస్తృత స్థాయి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఏబీసీడీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. చట్టసభలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధనకు, బీసీలకు రాజ్యాధికారం కోసం బీసీ కులాలన్నీ ఏకం కావాలన్నారు. రాజకీయ పార్టీలు ఫెడరేషన్‌ల పేరుతో బీసీ కులాలను విడదీస్తున్నాయన్నారు. ప్రతి జిల్లా కేంద్రలోను బీసీ భవన్‌ను నిర్మించాలన్నారు.
తొలగించిన ఉద్యోగులను
విధుల్లోకి తీసుకోవాలి
అనంతపురం, జనవరి 2: జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)లో తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. తొలగించిన ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజు కొనసాగాయి. దీక్షలకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఈటే నాగరాజు హాజరై దీక్షలకు మద్దతు పలికారు.

3నుండి పెన్షనర్ల డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్ నమోదు
అనంతపురం సిటీ, జనవరి 2: జిల్లా వ్యాప్తంగా 2019 సంవత్సరానికి ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం పెన్షనర్ల సౌలభ్యం కోసం ఈ నెల 3వ తేదీ నుండి 21వ తేదీ వరకు డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రీజనల్ ఫీఎఫ్ కమీషనర్-2 రవితేజా కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జీవన్ ప్రమాణ పత్ర(డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్ నమోదును ఈ నెల 3, 4వ తేదీన అనంతపురం ఆర్‌టీసీ రీజనల్ ఆఫీసునందు, 7, 8వ తేదీలో హిందూపురం ఆర్‌టీసీ డిపోలో, 9న గుంతకల్ ఆర్‌టీసీ డిపోనందు, 10న కదిరి డిపోనందు, 17న కళ్యాణదుర్గం ఆర్‌టీసీ డిపోనందు 18న తాడిపత్రి ఆర్‌టీసీ డిపోనందు, 21న ధర్మవరం ఆర్‌టీసీ డిపోనందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగానే సార్వత్రిక సమ్మె
అనంతపురం సిటీ, జనవరి 2: కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగానే జనవరి 8, 9వ తేదీల్లో దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ఫ్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు సార్వత్రిక సమ్మెకు సంబందించిన పోస్టర్‌ను బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో విడుదల చేశారు.

ఆసరా లేని పేదలకు ఎన్‌టీఆర్ భరోసా
ఒక వరం
అనంతపురం సిటీ, జనవరి 2: రాష్ట్రంలో ఆసరా లేని నిరుపేదల పాలిట పెద్ద దిక్కుగా అవతరించి ఎన్‌టీఆర్ భరోసా పథకాన్ని ఒక వరంగా అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని 36వ డివిజన్ కార్పొరేటర్ పి.రాజారావు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 36వ డివిజన్ పరిధిలోని ఝూన్సీలక్ష్మిబాయి నగర పాలక ప్రాథమిక పాఠశాలనందు ఎన్‌టీఆర్ భరోసా కరపత్రాలను విడుదల చేశారు.

జన్మభూమి పేర రాజకీయ ప్రచారం

$
0
0

హిందూపురం టౌన్, జనవరి 2 : శే్వతపత్రాల విడుదల పేర అంకెల గారడి ప్రదర్శిస్తూ జన్మభూమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రచారం చేస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ ఓబుళు విమర్శించారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శే్వతపత్రంలో అంకెల గారడి తప్పకు ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. ఐదు విడతలుగా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో ఏమాత్రం ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. పన్నుల రూపంలో ప్రజల నుండి లక్షల కోట్లు ఖజానాకు జమ అవుతున్నాయన్నారు. అయితే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ కార్మిక ద్రోహులేనని ఆరోపించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కుదించి కార్మికులను అన్యాయం చేసే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పట్టిసీమ ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీటిని అందిస్తామని ప్రగల్భాలు పలికిన టీడీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేసింది తప్ప సాధించింది శూన్యమన్నారు. పట్టిసీమ ద్వారా అదనంగా ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చారో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగం చంద్రబాబు హయాంలో పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. విత్తనాలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 4, 5వ విడతల రుణమాఫీ ఇప్పటి వరకు జరగలేదని, కౌలు రైతులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో నిత్యావసరాలు, పెట్రోలు, డీజలు ధరలు విపరీతంగా పెరిగిపోయి నిరుద్యోగ సమస్య తాండవిస్తోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనట్లు విమర్శించారు. గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలకు కూడా మంగళం పాడారన్నారు. నాలుగున్నరేళ్లుగా ఎలాంటి ఉద్యోగులు భర్తీ చేయకుండా ప్రస్తుతం డీఎస్సీకి మంచి స్పందన వచ్చిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇకపోతే స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ చుట్టపుచూపుగా వస్తూ ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులకు సాగు నీరు అందిస్తామని చెప్పి ప్రస్తుతం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. కియా కార్ల పరిశ్రమలో స్థానికులకు ఏమాత్రం ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. ఆయా సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

గుల్జార్ పేటలో దోమతెరల పంపిణీ
అనంతపురం, జనవరి 2: నగరంలోని గుల్జార్ పేటలో 17వ డివిజన్ కార్పొరేటర్ షుకూర్ ఆధ్వర్యంలో ఉచితంగా దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లిటిల్ ఫ్లవర్ కళాశాల కరస్పాండెంట్ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోమలు అధికంగా ఉండటంతో పేద ప్రజలకు ఉచితంగా 150 మందికి దోమతెరలు పంపిణీ చేశారు.

సంపూర్ణ రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు నాయకత్వం అవసరం

$
0
0

రాయదుర్గం, జనవరి 2 : రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ప్రజాసంక్షేమం, సంపూర్ణ రాష్ట్భ్రావృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. బుధవారం పట్టణంలోని 1-2వ వార్డుల్లో జన్మభూమి - మావూరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు అన్నివిధాలా ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.24300 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరని అన్యాయం చేశారన్నారు. ఇలాంటి అనేక ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు ఎంతగానే శ్రమించారన్నారు. కాగా నియోజకవర్గానికి నీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారుల అనుసంధానం, టెక్స్‌టైల్ పార్కు లాంటి అనేక అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందించారని వివరించారు. ఇలాంటి నాయకత్వంలోనే రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. కావున ప్రజలు నిండు మనస్సుతో మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
* మంత్రి కాలవ శ్రీనివాసులు
కణేకల్లు, డిసెంబర్ 2 : కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత టీడీపీకే దక్కుతుందని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని జక్కలవడికిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రం విడిపోయి అనేక కష్టాలు ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారన్నారు. కాగా జక్కలవడికిలో రూ.1.24కోట్లతో 12 మంది రైతు కూలీలకు 34.16 ఎకరాల స్థలాన్ని పంపిణీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో సీసీ.రోడ్ల నిర్మాణం, తాగునీటి పైపులైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. 64 ఎన్టీఆర్ గృహాలను రూ.1.20 కోట్లతో నిర్వహిస్తున్నామన్నారు. చంద్రన్న పసుపు కుంకుమ కింద రూ.22 లక్షలు, చంద్రన్న బీమా కింద ముగ్గురికి ఆర్థిక సాయం, రైతు రుణమాఫీ, పెన్షన్‌లు తదితర సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. కావున చంద్రబాబును మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

తీవ్ర అన్యాయం చేసిన కేంద్రం

$
0
0

రామగిరి, జనవరి 2: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిందని, ద్రోహానికి కూడా హద్దు లేకుండా ప్రధానమంత్రి మోదీ చేసిన మోసాలు ప్రజలు గమనిస్తున్నారని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కుంటిమద్ది గ్రామంలో జరిగిన 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన్మభూమికి సంబంధించి సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. శాఖల వారీగా జరిగిన ప్రగతిపై లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ జన్మభూమి మా ఊరులో విభజన సమస్యల పరిష్కారానికి కార్యాచరణ గురించి చర్చించడం జరుగుతుందన్నారు. అమరావతి నిర్మాణానికి మట్టి, నీరు తెచ్చి ప్రధానమంత్రి రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లారని, ఆయన చేసిన ద్రోహానికి వెంకన్న పాదాల చెంతనే సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాటం సాగించారన్నారు. ప్రత్యేక హోదా 5 కోట్ల ఆంధ్రుల గుండెచప్పుడు అని విభజన చట్టంలోని అంశాలన్నింటినీ నెరవేర్చాల్సిందేనన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనలు తెలిపినా ప్రధానమంత్రి మారలేదన్నారు. కొన్ని రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం, మన రాష్ట్రానికి వచ్చే సరికి ఇచ్చిన నిధులను కూడా వెనక్కు తీసుకున్నారన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెబుతూ నిధులను మాత్రం అరకొరగా ఇస్తున్నారని దీంతో రాష్ట్ర బడ్జెట్‌తోనే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా సీఎంగా చంద్రబాబు ఉన్నంత వరకు ఏమి చేయలేరని ఆమె పేర్కొన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుక, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు, రైతు రథం ట్రాక్టర్లు, సామూహిక సీమంతాలు మంత్రి చేతులమీదుగా నిర్వహించారు.

చంద్రబాబుకు మరోసారి మద్దతివ్వాలి
* మావోయిస్టు మాజీ నేత పోతుల సురేష్
గోరంట్ల, జనవరి 2 : రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అపార అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరోసారి మద్దతు ఇవ్వాలని మావోయిస్టు మాజీ నేత పోతుల సురేష్ కోరారు. బుధవారం స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ నవ్యాంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఏదైనా అసంతృప్తి ఉన్నా దాన్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం టీడీపీని మరోసారి గెలిపించాలన్నారు. రాజధాని భూసేకరణపై చంద్రబాబు, జగన్ నడుమ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాల కోసం 33 వేల ఎకరాల భూములు సేకరించాల్సి వచ్చిందన్నారు. విభజన తర్వాత రాష్ట్రం ఇప్పుడిప్పుడే ప్రగతి పథంలో పయనిస్తోందని, ఈ పరిస్థితుల్లో అధికార మార్పిడి మంచి కాదన్నారు. కులమతాలు, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా అన్నివర్గాలు టీడీపీని గెలిపించాలన్నారు.
హిందూపురం పార్లమెంట్ బరిలో..
హిందూపురం పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నానని పోతుల తెలిపారు. ప్రస్తుత ఎంపీ నిమ్మల ఎంతో అనుభవజ్ఞుడని, ఆయన ఎమ్మెల్యేగా గానీ, రాజ్యసభకుకాని వెళ్లాలని సూచించారు. ఈ ప్రతిపాదనను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే తుది నిర్ణయం అధిష్ఠానందే అన్నారు.

రైల్లో నుండి మహిళను తోసిన నిందితుడు అరెస్టు

$
0
0

అనంతపురం, జనవరి 2: ధర్మవరం పరిధిలో డిసెంబర్ 18న కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైల్లో నుండి నిండు గర్భిణిను కిందకు తోసి, ఆమె దగ్గర నుండి బంగారు నగలు దోచుకున్న ముద్దాయిని పోలీసులు పట్టుకున్నారు. సంఘటన జరిగిన 15 రోజుల్లో కేసును ఛేదించి ముద్దాయిని పట్టుకోవడం జరిగిందని రైల్వే ఎస్పీ సిద్దార్థ కౌశల్ పేర్కొన్నారు. ఈమేరకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కోదండరామ కల్యాణ మండపంలో బుధవారం విలేఖరుల సమావేశంలో కేసు వివరాలను రైల్వే ఎస్పీ వెల్లడించారు. ముద్దాయి వేలాయుధం రాజేంద్రన్ (37) తమిళనాడులోని తిరువిర్కాడుకు చెందిన వాడు. నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని సైఫుల్లా ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రాజేంద్రన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముద్దాయి రెండేళ్ల నుండి జిల్లా పరిధిలో వివిధ ప్రదేశాలలో రైల్వే దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. గతంలో చెన్నైలో వివిధ ప్రాంతాలలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడి, అక్కడి పోలీసులు పట్టుకుంటారని తన దృష్టిని రాష్ట్రం వైపు మళ్లించాడు. వివిధ రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఈక్రమంలో గత డిసెంబర్ 18వ తేదీన తెల్లవారుజామున 5.30 - 6.00గంల మధ్యలో కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలులో శిరీషా అనే వివాహితను చంపి దోపిడీ చేయాలని ప్రయత్నించాడని, రైల్వే సిబ్బంది తక్షణం స్పందించడంతో ఆ ప్రయత్నం విఫలమైందన్నారు. చివరగా అదే రైలులో అదే బోగీలో కాపుకాచి ఉదయం సుమారు 6.00 - 6.30 గం.ల మధ్యలో బీ-1 బోగీలో ప్రయాణిస్తున్న దివ్యశ్రీ అనే ఏడు నెలల గర్భిణిని గొల్లపల్లి రైల్వే గేటు సమీపంలో నెట్టివేశాడు. ఆమెకు తీవ్రంగా రక్తస్రావం అవుతున్నా సుమారు 50 మీటర్ల దూరం వరకు ఆమెను లాక్కొని వెళ్లి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకుని వెళ్లాడు. దొంగిలించిన నగలను చెన్నైలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో తనఖా పెట్టినట్లు తెలిపాడు. నిందితుడు నుండి దివ్యశ్రీ నుండి లాక్కొన్న బంగారు ఉంగరం, రెండు మొబైల్ ఫోన్లు, ఒక కత్తి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడుపై నేరాలన్నీ రైలు బోగీ తలుపుల వద్ద కాపుకాచి వాష్‌రూమ్‌కు వచ్చే మహిళలపై దాడి చేసేవాడు. నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్న రైల్వే పోలీసులను ఎస్పీ అభినందించారు.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

$
0
0

కదిరి, జనవరి 2: కదిరి రూరల్ చెర్లోపల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెలలో జల హారతి ఇచ్చేందుకు వస్తున్న సందర్బంగా బుధవారం కలెక్టర్ వీరపాండ్యన్, విప్ అత్తార్ చాంద్‌బాషాతో కలసి పరిశీలించారు. జల హారతి ఇచ్చే ప్రదేశం, హెలీప్యాడ్, పైలాన్, బహిరంగ సభ జరిగే ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌కు చెర్లోపల్లి వాసులు కలసి రిజర్వాయర్‌లో నీళ్లు నిల్వ ఉంచడం వల్ల తమ గ్రామం ఊట్లు పడతాయని, అంతేగాకుండా తమ పొలాలు కూడా ముంపునకు గురికావడం వల్ల తమకు వ్యవసాయం కూడా లేదని, తమకు మరోచోట ఇల్లు మంజూరు చేసి పరిహారం ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా మూడు నెలలుగా తమకు ఉపాధి పనులకు సంబంధించి డబ్బులు కూడా తమ ఖాతాలో పడలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన సంబందిత అధికారులను పంపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల కలెక్టర్లతో జరిగిన వీడియో కానె్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెర్లోపల్లి రిజర్వాయర్‌లో ఈ నెలాఖరులోగా జల హారతి ఇచ్చేందుకు వస్తున్నట్లు చెప్పడంతో ఏర్పాట్లు పరిశీలనకు రావడం జరిగిందన్నారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.5 టీఎంసీల నీరు వచ్చిందని, మరో నాలుగు రోజుల్లో 0.3 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి జల హారతి ఇవ్వడంతో పాటు పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తారన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభాస్వరూపారాణి, హంద్రీనీవా ఈఈ రమేష్‌బాబు, డీఈ నారాయణ, సమాచార శాఖ ఏడీ జయమ్మ, కదిరి ఆర్‌డీఓ రామ్మెహన్, డీఎస్పీ శ్రీలక్ష్మి, ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డి, రూరల్ సీఐ మన్సూరుద్దీన్, ఎస్సైలు ఖాజాహుస్సేన్, వెంకటస్వామి పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే జన్మభూమి
*కలెక్టర్ వీరపాండ్యన్
ప్రజల అన్ని రకాల చర్చలు, సమస్యలు పరిష్కారం కోసమే జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వీరపాండ్యన్ తెలిపారు. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అబివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని దరఖాస్తుదారునికి రసీదు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దరఖాస్తులు ఇచ్చిన సమస్యను ఈ జన్మభూమి కార్యక్రమంలో అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. జిల్లాకు సాగునీటి కోసం ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చు చేసి హంద్రీ నీవా కాలువలు రిజర్వాయర్లు, చెరువులు నిర్మించిందన్నారు. కరువు నివారణ కోసం జిల్లాకు కృష్ణా జలాల ద్వారా 170 టీఎంసీల నీరు తీసుకువచ్చిందన్నారు. కదిరి నియోజకవర్గంలోని చెర్లోపల్లి రిజర్వాయర్‌లో త్వరలో ముఖ్యమంత్రి జల హారతి చేపడతానరన్నారు. మున్సిపాలిటీ పరధిలో ప్రభుత్వం 4 వేల గృహాలు నిర్మిస్తుంటే కేవలం 1700 మంది మాత్రమే జీ ప్లస్ త్రీ గృహాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారన్నారు.


పీఎన్‌బీకి ఈసీబీ ద్వారా 265 మిలియన్ డాలర్లు

$
0
0

ముంబయి, జనవరి 2: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) హౌసింగ్ ఫైనాన్స్ విభాగం తాజాగా ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీ) ద్వారా 265 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకుంది. డిసెంబర్ నెల చివరి వారంలో ఈ నిధులను సమకూర్చుకున్నామని, దీనిని గృహ రుణాల కోసం వినియోగిస్తామని మీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘జాయ్‌విల్లే-హించావాడీ’ ప్రాజెక్టును గత ఏడాది ప్రారంభించామని, ఇది 2022 సంవత్సరానికి పూర్తవుతుందని వివరించింది. దీని కోసం 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొంది. ముంబయి, పుణేతోపాటు పశ్చిమ బంగాల్‌లోని కొన్ని నగరాల్లోనూ గృహ నిర్మాణాలను చేపడతామని వివరించింది.

లాభపడనున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు

$
0
0

ముంబయి, జనవరి 2: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)కు సంబంధించిన మొండి బకాయిల విషయంలో రిజర్వుబ్యాంకు తీసుకున్న నిర్ణ యం పట్ల బ్యాంకర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో బ్యాంకులకు పెద్దయెత్తున ఉన్న వత్తిడి దీనివల్ల తగుతుందని స్థానిక బ్రోకరేజ్ కంపెనీ అధ్యయన నివేదిక వెల్లడించింది.
ఎంఎస్‌ఎంఈల్లో బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించలేక డీఫాల్టర్లుగా మారిన పరిశ్రమలకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద 25 కోట్ల రూపాయల వరకు రుణాన్ని పునర్వ్యవస్థీకరణ (రీస్ట్రక్చర్) చేయాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వత్తిడిమేరకే ఇలాంటి నిర్ణయం ఆర్బీఐ తీసుకుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ‘మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) రుణ వసూళ్ల విషయంలో పెద్ద స్థాయిలో వత్తిడిని ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని బుధవారం విడుదల చేసిన కోటక్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది. ప్రత్యేకించి నష్టాల్లో సాగుతూ రుణాలివ్వడంపై ఆంక్షలున్న ‘ప్రాంప్ట్ కరెక్టివ్ ఆక్షన్ ఫ్రేమ్ వర్క్’ (పీసీఏఎప్‌డబ్ల్యు) పథకం కింద ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల మేలు కలుగుతుందని ఆ నివేదిక వివరించింది. ‘సెంట్రల్ బ్యాంకు నోటిఫికేషన్ మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. రుణాల వసూళ్లు ఆలస్యం అవుతాయని సంకేతాలుండటం వల్ల బ్యాంకర్లు తదుపరి రుణాలివ్వడానికి వెనుకంజ వేశారు. ఈక్రమంలో కేంద్ర నిర్ణయం బ్యాంకర్లు ఆరోగ్యకరమైన అభివృద్ధిని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వ సానుకూల నిర్ణయం దోహదపడుతుంద’ని ఆ నివేదిక పేర్కొంది. గత యేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న గణాంకాలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది.
రుణాలను పునర్వ్యవస్థీకరించిన బ్యాం కులకు ఆ అప్పులు సైతం స్థిరాస్తుల జాబితాలోకి చేరుతాయి. ప్రత్యేకించి డీమానిటరైజేషన్, జీఎస్టీ వల్ల దెబ్బతిన్న బ్యాంకులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తం కాగలదని నివేదిక వివరించింది.

బులియన్

$
0
0

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము : రూ. 3,066.00
8 గ్రాములు : రూ. 24,528.00
10 గ్రాములు : రూ. 30,660.00
100 గ్రాములు : రూ. 3,06,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము : రూ. 3,279.144
8 గ్రాములు : రూ. 26,233.152
10 గ్రాములు : రూ. 32,791.44
100 గ్రాములు : రూ. 3,27,914.4
వెండి
8 గ్రాములు : రూ. 331.20
10 గ్రాములు : రూ. 414.00
100 గ్రాములు : రూ. 4.140.00
ఒక కిలో : రూ. 41,400.00
*
హైదరాబాద్‌లో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము : రూ. 3,039.00
8 గ్రాములు : రూ. 24,312.00
10 గ్రాములు : రూ. 30.390.00
100 గ్రాములు : రూ. 3,03,900.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము : రూ. 3,250.267
8 గ్రాములు : రూ. 26,002.136
10 గ్రాములు : రూ. 32,502.67
100 గ్రాములు : రూ. 3,25,026.7
వెండి
8 గ్రాములు : రూ. 331.20
10 గ్రాములు : రూ. 414.00
100 గ్రాములు : రూ. 4.140.00
ఒక కిలో : రూ. 41,400.00

షేర్ మార్కెట్ పతనం

$
0
0

ముంబయి, జనవరి 2: కొత్త సంవత్సరం ప్రారంభ ఉత్సాహం బుధవారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఏమాత్రం కనిపించలేదు. ఉదయం లావాదేవీలు ప్రారంభమైన మరుక్షణం నుంచే అమ్మకాల ఒత్తిళ్లు పెరిగాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ నీరసపడడంతో, దాని ప్రభావం బీఎస్‌ఈపైనా కనిపించింది. పెరుగుతున్న అమ్మకాలకు అడ్డుకట్ట పడే అవకాశం కనిపిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకానొక దశలో సెనె్సక్స్ 500 పాయింట్లకుపైగా నష్టపోయింది. అయితే, చివరి క్షణాల్లో దేశీయ మదుపరులు వాటాల కొనుగోళ్ల పట్ల కొంత ఆసక్తిని ప్రదర్శించడంతో కోలుకున్న సెనె్సక్స్ 363.05 పాయింట్ల నష్టంతో బయటపడి, 35,891.52 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ ఒక శాతం నష్టాన్ని ఎదుర్కోగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) 1.08 శాతం నష్టాన్ని చవిచూసింది. 117.60 పాయింట్ల పతనమైన నేపథ్యంలో నిఫ్టీ 10,792.50 పాయింట్ల వద్ద నిఫ్టీ ముగిసింది.
లావాదేవీలతోపాటు పెట్టుబడిదారుల అమ్మకాల ఒత్తడి కూడా ప్రారంభమైంది. అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా లేకపోవడంతో, భారత మార్కెట్ సైతం ఆ ప్రభావానికి లోనుగాక తప్పలేదు. అమ్మకాల ఒత్తిళ్లు కొనసాగి, సెనె్సక్స్ పతనం కొనసాగింది. వేదాంత, టాటా స్టీల్, మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా మోటార్స్, మారుతీ, హీరో మోటోకార్ప్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, కోల్ ఇండియా తదితర కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. వీటి సగటు పతనం 4.48 శాతంగా నమోదైంది. అయితే, అదృష్టం కొద్దీ కొన్ని కంపెనీల వాటాలు లాభాలను సంపాదించి పెటాటయి. అలాంటి కంపెనీల్లో సన్ ఫార్మా, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. వీటి వాటాలకు సుమారు మూడు శాతం లాభం వచ్చింది. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మందగించడంతో, దేశీయ ఆటో స్టాక్స్ నష్టాలపాలయ్యాయి. డిసెంబర్‌లో ఆశాజనకంగా లేని ఆటో స్టాక్స్‌కు నెలాఖరులో డిమాండ్ పెరుతుందని అంతా ఆశించారు. కానీ, కొత్త సంవత్సరం డిమాండ్ కూడా ప్యాసింజర్ వాహనాలపై పడలేదు. మాక్రో ఆర్థిక రంగంలో అనిశ్చితి కొనసాగిన కారణంగా, ఆటో రంగం నష్టాలను ఎదుర్కొంది. ఇలావుంటే, రూపాయి మారకం విలువ తగ్గడం కూడా సెనె్సక్స్ పతనానికి మరో కారణమైంది.
డాలర్ విలువ 70.60 రూపాయలుగా నమోదైంది. 63 పైసల పతనం సహజంగానే మార్కెట్‌ను ప్రభావితం చేసింది. మరోవైపు, ముడి చమురు ధర కూడా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయుల్ ధర 1.25 శాతం తగ్గి, బ్యారెల్‌కు 53.12 డాలర్ల వద్ద ముగిసింది. మొత్తం మీద అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుకులు ప్రభావం చూపిన కారణంగా భారత స్టాక్ మార్కెట్‌కు కూడా నష్టాలు తప్పలేదు.

స్మిత్, వార్నర్, కేమరాన్‌కు మరో ఛాన్స్ ఇవ్వండి

$
0
0

సిడ్నీ, జనవరి 2: గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన ఒక టెస్టు మ్యాచ్ సందర్భంగా బాల్‌ట్యాంపరింగ్ వివాదంలో కూరుకుపోయి ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్న సీనియర్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కేమరాన్ బాంక్రాఫ్ట్‌కు మరొక అవకాశం ఇచ్చి చూడాలని ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ టిమ్ పైన్ ఆ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశాడు. తమ జట్టులో ఈ దిగ్గజ ఆటగాళ్లు లేనిలోటు ఎవరూ భర్తీ చేయలేరని అంటూ వారికి మరొకమారు జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశం ఇస్తే తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని అన్నాడు. అయితే, బాల్‌ట్యాంపరింగ్ ద్వారా దేశ క్రికెట్‌కు తీరని మచ్చను తీసుకువచ్చిన ఆ ముగ్గురు ఆటగాళ్ల విషయంలో క్రికెట్ అభిమానులు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో టిమ్ పైన్ తాజాగా చేసిన విజ్ఞప్తిపై వారి స్పందన ఎలా ఉంటుందో తెలియాలి. ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉందని అంటూ దేశ ప్రజలు సైతం ఆ ముగ్గురు క్రికెటర్ల విషయంలో సరైన విధంగా స్పందిస్తారనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నాడు.

Viewing all 69482 articles
Browse latest View live