Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి

$
0
0

కరీంనగర్, జనవరి 2: బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంక్షించారు. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా మంగళవారం కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్‌కువచ్చి బస చేయగా, బుధవారం ఉదయం కలిసేందుకువచ్చిన వీఐపీలు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ పుష్పగుచ్చాలు అందించారు. రెండో విడుత ఎన్నికల అనంతరం మొదటి సారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు జిల్లాలోని అన్నిప్రభుత్వ విభాగాల అధికారులు మర్యాద పూర్వకంగా (కలిశారు. అలాగే అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారితో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కట్టుగా అభివృద్ది పనులు పూర్తి చేసి బంగారు తెలంగాణ సాధనలో తమవంతు భాగస్వామ్యం ఉండాలని ఆకాక్షించారు. అనంతరం పేరుపేరున అధికారులను, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు. గత జ్ఞాపకాలు వారితో పంచుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు నేరుగా తనకు ఇవ్వాలని సూచించారు. అనుకోని ఆప్యాయతకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉబ్బితబ్బిబయ్యారు. కేసీఆర్‌ను కలిసి వారిలో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డిజిపి మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమీషనర్ కమలాసన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

రాజేశ్వర్‌రావుపేట
రివర్స్‌పంపింగ్‌నిర్మాణ పనులు పరిశీలన
ఇబ్రహీంపట్నం, జనవరి 2: కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ నుండి ఎస్సారెస్పీకి నీటిని తరలించి రైతుల కష్టాలను తీరుస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట్ శివారులో వరదకాలువపై నిర్మిస్తున్న రివర్స్ పంపింగ్ పనుల పరిశీలించారు. మధ్యాహ్నం 1.45కు చేరుకోవాల్సింది 2గంటలు అలస్యంగా 4.15కు చేరుకొని అధికారులు, ఇంజనీర్లతో కలిసి మొదట గ్యాలరీని పరిశీలించి నిర్మాణపనుల అలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజనీర్లు, అధికారులతో కాసేపు పనుల్లో వేగం పెంచేందుకు దిశానిర్దేశం చేశారు. సీఎంకు ప్రజాప్రతినిధులు,అధికారులుపుష్పగుచ్ఛం అందించారు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియగా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, సీఎస్ కే.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇఎన్‌సీ మురళీధర్, నవయుగ చైర్మన్ విశే్వశ్వరరావు,ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూశర్మ, జడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు,ప్రశాంత్‌రెడ్డి,ఎఎస్పీ మురళీధర్,డీఎస్పీలు మల్లారెడ్డి, ప్రతాప్, సీఐలు, ఎస్సైలు అధికారులు పాల్గొన్నారు.

సుందిల్ల బ్యారేజీ పనులను
పరిశీలించిన సీఎం కేసీఆర్
మంథని, జనవరి 2: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుబంధంగా నిర్మిస్తున్న సుందిళ్ల బ్యారేజి, గుంజపడుగు పంప్‌హౌస్ పనులను ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం రోజున పరిశీలించారు. ఇక్కడ నిర్మిస్తున్న కాల్వ పనులను పర్యవేక్షించారు. పంప్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన పురోగతి పనుల వివరాలను ఇంజనీరింగ్ నిపుణుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సుందిల్ల బ్యారేజీ సాంకేతిక వివరాలను సి ఎం తెలుసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు క్షేత్ర స్థాయిలో పర్యటనలో భాగంగా కెసి ఆర్ ముఖ్యమంత్రిగా రెండవ సారి ఎన్నికైన తరువాత మంథని మండలంలోని సుందిల్ల, గుంజపడుగు ప్రాజెక్ట్‌లో సందర్శించారు. ఈ సందర్భంగా సీఎంకు జిల్లా కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు స్వాగతం పలికారు.

సాగునీరు అందించడంలో
ప్రభుత్వం విఫలం
* మంథని ఎమ్మెల్యే శ్రీ్ధర్ బాబు
కాల్వశ్రీరాంపూర్, జనవరి 2: రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీ్ధర్ బాబు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ డి-83, డి-86 కాలువల ద్వారా నీరు ఎందుకు విడుదల చేయడం లేదని? ప్రశ్నిస్తూ ఇరిగేషన్ మంత్రి, సంబంధిత అధికారులు లేక రైతులు తమ సాగునీటి కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. రెండు సంవత్సరాల తరువాత వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు నీటి గురించి పర్యటిస్తున్న కేసిఆర్ గత రెండు సంవత్సరాలుగా కాలువ నీరు అందించక రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. వెంటనే ఎస్సారెస్పీ సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట చేతి ధర్మయ్య, శశిభూషణ్ కాచె, ఎం.డి.మునీర్, చదువు రాంచంద్రారెడ్డి, ఆడెపు రాజు, మేడి అశోక్, బంగారు రమేష్, గాదనవేన సదయ్య తదితరులు ఉన్నారు.
వరదకాల్వతో బీడు భూములు సాగులోకి వస్తాయి
కరీంనగర్ రూరల్, జనవరి 2: 10 సంవత్సరాలుగా కొత్తపల్లి మండలంలోని 5 గ్రామాల ప్రజలు, రైతులు గత పాలకుల నిర్లక్ష్యంతో తీవ్ర నీటీ ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అచంపల్లి వరుద కాల్వ నిర్మాణం పూర్తయితే బీడు భూములు సాగులోకి వస్తాయని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం కొత్తపల్లి మండలంలోని నాగులమల్యాల వద్ద వరుద కాల్వ, తూము నిర్మాణం పనులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నాగులమల్యాల, కమాన్‌పూర్, ఎలగందల్, ఆసీఫ్‌నగర్, బద్దిపల్లి గ్రామాల్లో గత 10 సంవత్సరాలుగా గర్షకుర్తి, విలాసాగర్‌ల నుండి ప్రకృతి సహజంగా వచ్చే వరుదకాల్వ ద్వారా నీరు ఈ 5 గ్రామాలకు వచ్చేదని తెలిపారు. టీఆర్‌ఎస్ ఆధికారంలోకి వచ్చిన తర్వాత నాగులమల్యాల వద్ద వరుదకాల్వ నిర్మాణంకు 2 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టిందన్నారు. పనుల జాప్యం వల్ల అంచనా వ్యయం పెరిగిందని తెలిపారు.

త్వరలో ధర్మపురి
స్వామిని దర్శిస్తా..
* సీఎం చంద్రశేఖర్‌రావు
ధర్మపురి, జనవరి 2: అతి త్వరలో ధర్మపురి క్షేత్ర సందర్శనకు వస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం కరీంనగర్‌లోని తెలంగాణ భవన్‌లో ధర్మపురి శా సనసభ్యులు కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. దేవస్థానం పక్షాన ఎమ్మెల్యే ఈశ్వర్ స్వామి వారి శేషవ్రస్తాలను, ప్రసాదాదులను కేసిఆర్‌కు అందజేశారు. బొజ్జా రమేశ శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్య ఆయనకు వైదికాశీస్సులు అందజేశా రు. ఈ సందర్భంగా ధర్మపురి దేవస్థానాన్ని సందర్శించాలని కేసిఆర్‌ను ఆహ్వానించిన క్రమంలో ఆయన నరసింహ స్వామి దర్శనం చేసుకుంటానని, తాము అతి త్వరలో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించు కుంటామని హామీ ఇచ్చారు. దేవస్థాన అభివృద్ధికి ఈ సంవత్సర బడ్జెట్‌లో 50కోట్ల నిధులను కెటాయించిన విషయాన్ని గుర్తుచేస్తూ, క్షేత్ర, దేవస్థాన అభివృద్ధికి ఇతోధిక చేయూత అందించ గలమని ప్రకటించారు.

ఎలక్షన్ల లొల్లి మొదలైంది..
* పోటీ చేసేది మావోడే.. గెలిచేది మేమే..
* జోరందుకున్న విందు రాజకీయాలు
* అలకలతో కలకలం రేపుతున్న యువత
* ఆశావహుల బుజ్జగింపులు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 2: సర్పంచ్‌ల సం‘గ్రామా’నికి షెడ్యూలు విడుదలకావటంతోనే, పల్లెల్లో ఎలక్షన్ల లొల్లి మొదలైంది. నిన్నటి దాకా అంతా కలిసి మెలిసి ఎమ్మెల్యేలకు మద్ధతు తెలిపిన వారంతా, నేడు గ్రూపులుగా విడిపోయి..పోటీ చేసేది మావోడే..గెలిచేది మేమే అంటూ గ్రామాల్లో ప్రచారం కూడా చేయటం ఆరంభించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు..మావోన్ని గెలిపిచ్చుకుంటాం..సర్పంచ్ కుర్చీలో కూకోపెడుతామంటూ ప్రతినబూనుతున్నారు. దీంతో ఊళ్ళల్లో ఉంటూ ఊరొళ్ళకు అంతో ఇంతోమంచి చేద్దామనే భావనతో పోటీ చేసేందుకు ముందుకొచ్చేటొళ్ళంతా వెనుకడుగేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కొంతమంది రాజకీయ రుచి మరిగిన నాయకులు ఔత్సాహిక యువతను నిరుత్సాహ పరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. సర్పంచ్ గిరీ అంటే ఆశామాశీయా..అది మీతోనేమైతది...పోరగాళ్ళు ...రోజుకు ఎంతమందిని సముదాయించాలే.. ఎంతమందికి జవాబులు చెప్పాలే...సప్డేక ఏదో ఓపని చేసుకోపోండ్లి. ఓట్లంటే ఉత్తగనే అనుకుంటండ్లా ..మీకేం అనుభవముంది... ఆశామషీగా మాట్లాడుతండ్లు. ఎంత ఖర్సుంటంది, ఎన్ని లెక్కలుంటయి, ఇంకెన్ని రాజకీయాలుంటయ్.. అంటుండటంతో పల్లెపీఠంపై మక్కువతో ఉన్న యూత్ పోటీ చేయటంపై సందిగ్దంలో పడుతున్నారు. పల్లె రాజకీయాల్లోకి యువత ప్రవేశిస్తే.. ఏళ్ళనాటి నుంచి ఏలుతున్న పెద్దమనుషుల పలుకుబడి తగ్గిపోయి, పట్టించుకునే వారుండరనేది అడ్డుపుల్లలేసే వారి ఆలోచన అంటూ ఊరును, ఊళ్ళోని జనాలను దోచుకునేందుకు అనుభవం అవసరం కావాలె కానీ, ఊరి బాగోగులు చూసుకునేందుకు అనుభవమెందుకంటూ కొంతమంది యువకులు మండిపడుతున్నారు. మంచి చేసేందుకు వ్యక్తిత్వం, నిబద్ధత, దృఢచిత్తం అవసరం కానీ, వయసు ప్రామాణికమా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా అక్కడక్కడా ఎదురవుతున్నాయి. దీంతోడాంభికాలు కొట్టేవారు వెనక్కుతగ్గుతుండగా, పోటీలో ఖచ్చితంగా ఉంటారనే వారిని బుజ్జగింపులకు దిగుతున్నారు. దావత్‌లు పెడుతూ ఆశావహులను పిలిచి, తమకు మద్ధతుగా ఉండాలంటూ, మరోసారి అవకాశం కల్పిస్తామంటూ ఒప్పించే యత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో తమకు హాండిచ్చారంటూ మరికొంత మంది యువకులు అలకలకు దిగుతుండగా, వారికి స్పష్టమైన హామీలిస్తూ, తమవెంట తిప్పుకునేందుకు రిజర్వేషన్లు అనుకూలించిన నేతలు నానాతంటాలు పడుతుండగా, నోటిఫికేషన్‌కు ముందే రాజకీయాలు ర సకందాయంలో పడ్డాయి.


ఆలస్యం కావొద్దు

$
0
0

భూపాలపల్లి/మహదేవ్‌పూర్, జనవరి 2: కాళేశ్వ రం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రెండో రోజు ముఖ్యమంత్రి పర్యటన అన్నారం బ్యారేజి వద్ద కొనసాగింది. ఉదయం 11 : 30 నిమిషాలకు కరీంనగర్ నుండి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా కనె్నపల్లి పంప్‌హౌజ్‌కు చేరుకున్నారు. మొదట కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థాన చైర్మన్, ఆలయ అర్చకులు శాలువాలతో ముఖ్యమంత్రిని సన్మానించి స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం పంప్‌హౌజ్ నుండి గ్రావిటి కెనాల్‌కు అటవీ మార్గం గుండా సీఎం 13 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో సీఎం ప్రయాణించారు. కాల్వ పనులను పరిశీలించిన ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 13 కిలోమీటర్ల పొడవున 29 స్టెక్చర్లు ఉన్నాయని, ఇరుపక్కల కాంక్రీటుతో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేసిన అప్కాన్ కంపెనీ ఇం జనీరింగ్ అధికారులను సీఎం అభినందించారు. అనంతరం సీఎం అధికారులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల బీడు భూమి సాగులోకి రావడంతో పాటు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న రైతుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మార్చి 31 నాటి కి వందశాతం పూర్తి చేయాలని, అందుకు అధికారులు, నిర్మాణ సంస్థలు అంకిత భావంతో పని చేయాలన్నారు. కనె్నపల్లి పంప్‌హౌజ్ నుండి అన్నారం బ్యారేజి వరకు నిర్మిస్తున్న గ్రావిటి కెనాల్ పనులలో కార్మికుల సంఖ్యను పెంచి మూడు షిప్ట్‌లలో పనులు కొనసాగించాలన్నారు. పనులు శాశ్వతంగా ఉండేలా నాణ్యతా ప్రమాణాలతో పని చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అన్నారం బ్యారేజి పనులు చివరి దశలో ఉండటం తో సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇంజనీర్లను కూడా ఈ సందర్బంగా అభినందించారు. ప్రాజెక్టు వలన భూములు కోల్పోయిన దామెరకుంట రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు వివేక్, సీ ఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎం ఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎస్పీ ఆర్ భాస్కరన్, సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు, ఆప్కా నిర్మాణ సంస్థ డైరెక్టర్ పరేట్కర్, భూపాలపల్లి ఆర్డీవో వెంకటాచారి, కె ఎన్ ఎన్ రావు, మల్లిఖార్జున్‌రావు, శేఖర్‌దాస్, డీ ఈ ప్రకాశ్, సుధాకర్‌లతో పాటు కాళేశ్వర స్వామి ఆలయ చైర్మన్ బొమ్మెర వెంకటేశం, ఈవో మారుతి తదితరులు ఉన్నారు.

టీఆర్‌ఎస్‌లో చేరిక ప్రచారం
అవాస్తవం
జిల్లా కేంద్రం తరలించవద్దనే సీఎంని కలిసా..: ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి, జనవరి 2 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని మరో చోటికి తరలించవద్దనే ఉద్దేశంతోనే జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును మేడిగడ్డ పర్యటన సందర్బంగా కలవడం జరిగిందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం భూపాలపల్లి పట్టణంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గండ్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలవడంలో వేరే ఇతర ఉద్దేశ్యాలేమి లేవని, జిల్లా కేంద్రం విషయంతో పాటు నియోజక వర్గంలో నూతనంగా ఏర్పాటు కావలసిన మండలాలు, గ్రామ పంచాయతీల విషయంపై ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించానన్నారు. అదేవిధంగా జిల్లాలో మరికొన్ని డివిజన్‌లు కూడా ఏర్పాటు చేయాల్సిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయ న సానుకూలంగా స్పందించారన్నారు. కొందరు అవగాహన లేని వ్యక్తులు తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అసత్య ప్రచారాలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. జిల్లా అభివృద్ది విషయంలో నియోజకవర్గంలో కల్పించాల్సిన సౌకర్యాలపై సీఎం ని కలవడం తన బాధ్యతగా భావిస్తున్నానే తప్పా ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. తనపై నమ్మకంతో ఓట్లేసిన ప్రజల కోసం నిరంతరం పని చేస్తానే తప్పా పార్టీని మారే ప్రసక్తే లేదని ఆయ న అన్నారు. జిల్లా విషయంలో సానుకూలంగా స్పం దించిన ముఖ్యమంత్రికి ఆయన ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. మొగుళ్లపల్లికి సంబంధించిన ఓ అధికారి రిజర్వేషన్‌లలో తప్పులు చేశారని గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రమేష్ గౌడ్, చల్లూరి సమ్మయ్య, రాజిరెడ్డి, కటకం జనార్దన్, దార పూలమ్మ, రాజబాబు, భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ మండీ టెండర్లు షురూ..
కేసముద్రం మార్కెట్లో ప్రయోగం సక్సెస్ * ‘ఆంధ్రభూమి’ వార్తకు స్పందన
కేసముద్రం, జనవరి 2: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో అధికారులు ఇంటర్ మండీ టెండర్లు ప్రారంభించా రు. కేసముద్రం మార్కెట్లో ఏడాదిన్నర క్రితం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ (ఈనామ్) విధానం ప్రవేశపెట్టారు. ఈనామ్‌లో కేసముద్రంతో పాటు రాష్ట్రంలోని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు సైతం ఆన్‌లైన్ ద్వారా టెండర్లు వేసి ఇంటర్ మండీ విధానంలో వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఖరీదు చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో ఇంటర్‌మండీ విధానాన్ని అనుసందానించకపోవడంతో ఇంత కాలంగా కేసముద్రం మార్కెట్లో లైసెన్స్ పొందిన వ్యాపారులు మాత్రమే సరుకులు ఖరీదు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఎక్స్‌లెన్సీ అవార్డు రేసులో కేసముద్రం మార్కెట్‌ను నిలిపేందుకు మార్కెటింగ్‌శాఖ నిర్ణయించిన నేపథ్యంలో ఈనామ్ అమలులో లోపాలపై ‘ఆంధ్రభూమి’లో గత ఆదివారం ప్రచురించిన కథనంపై అధికారుల్లో కదలిక వచ్చింది. అవార్డుకు ఎంపికవ్వాలంటే ఈనామ్‌లో ప్రవేశపెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేయాల్సి ఉండటం తో ఉన్నతాధికారులు హుటాహుటిన ‘ఇంటర్‌మండీ’ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం నాడు ఇంటర్‌మండీ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ మార్కెట్లలో వ్యాపారం నిర్వహించే ట్రేడర్ల చేత పలు వ్యవసాయ ఉత్పత్తులను ఖరీదు చేయించారు. కేసముద్రం మార్కెట్లో వైఫై ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఈనామ్ టెండర్ హాల్ ఏర్పాటు చేశారు. అలాగే వ్యాపారులు నేరుగా టెండర్లు వేయడం, బిడ్డింగ్ ఓపెన్ చేసిన తరువాత విన్నర్ లీస్ట్ పరిశీలించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించారు. దీనితో కేసముద్రం మార్కెట్లో వ్యాపారం నిర్వహించే ట్రేడర్లతో పాటు ఆయా ప్రాం తాల వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తుల ఖరీదులకు శ్రీకారం చుట్టినట్లయ్యింది. అయితే ఇది ‘నామ్’కే వాస్తేగా కాకుండా నిరంతరంగా సాగేలా చూస్తే వ్యాపారుల మద్య పోటీ పెరిగి రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయి. ఎడాదిన్నరగా ఈనామ్ అమలు చేస్తున్నా ఇంటర్ మండీ విధానాన్ని అమలు చేయడంలో మీనమేషాలు లెక్కించిన ఎట్టకేలకు ‘ఆంధ్రభూమి’ కథనంతో ఇంటర్‌మండీ ఆన్‌లైన్ టెండర్లు చేపట్టడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనామ్‌కు సాంకేతిక సహాకారం అందిస్తున్న ఎన్‌ఎఫ్‌సీఎల్ సంస్థ అధికారులతో మాట్లాడి ఇంటర్‌మండీ ప్రారంభానికి చర్యలు చేపట్టి, తొలుత ఈనామ్ అమలు చేస్తున్న సమీప మార్కెట్లను ప్రయోగాత్మకంగా అనుసందానించామని, ఈ ప్రయోగం సక్సెస్ అయినందున త్వరలో రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలోని వ్యాపారులతో మాట్లాడి వారిని కూడా ఇంటర్‌మండీలో చేరుస్తామని మార్కెట్ కార్యదర్శి మల్లేషం ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.

13 నుంచి ఐనవోలు జాతర
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడండి: కలెక్టర్ ప్రశాంత్
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, జనవరి 2: ఈ నెల 13 నుండి నిర్వహించే ఐనవోలు జాతరకు తరలివచ్చే భక్తులకు సంతృప్తి కలిగే విధంగా పారిశుద్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం మల్లిఖార్జునస్వామి దేవస్ధానంలో 2019 సంవత్సరం బ్రహోత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 10లోపు శాఖల వారిగా నిర్ధేశించిన పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అధికారులు ఆయా పనులను స్వయంగా పర్యవేక్షించాలని తెలిపారు. దేవస్ధానం అభివృద్ధికి చేపట్టిన డ్రైనేజీ, రోడ్ పనులను పూర్తి చేయాలని చెప్పారు. హైద్రబాద్, వరంగల్, ఖమ్మం మార్గల నుండి వచ్చే భక్తుల సౌకర్ధ్యాం మరుగుదొడ్లు, మంచినీటి వసతి, వీదిలైట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మహాశివరాత్రి, ఉగాది వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ నెల 13న ఉత్సవాలు ప్రారంభంవుతాయని 15వ తేదిన మకర సంక్రాంతి సందర్భంగా రాత్రి ప్రభల బండ్లు తిరుగుతాయని, 17న మహాసంప్రోక్ష సమారాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 12 నుండి శానిటేషన్ పనులను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమీపంలోని మండలాల నుండి గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బందిని రప్పించాలని ఎంపీడీవోకు సూచించారు. అలాగే వరంగల్ మున్సిపాలిటి నుండి 70 మంది కార్మికులను, పర్యవేక్షకులను, రెండు స్వచ్చా ఆటోలను ఏర్పాటు చేయాలని తెలిపారు. బందోబస్తుకై మూడు ప్రాం తాలలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పా టు చేయాలని చెప్పారు. భద్రతకై దేవస్ధానం పరిధిలో ఉన్న 30 సీసీ కెమెరాలను అదనంగా మరో 30 కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకా ర్ధ్యం తాత్కాలిక బస్టాండ్‌ను నెలకొల్పి 100 బస్సులను నడపాలని తెలిపారు. ఐనవోలుకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఆయా డిపో మేనేజర్లు రిజనల్ మేనేజర్లతో సమన్వయం చేసుకోవాల ని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఐనవోలు దేవస్ధానం ప్రాధాన్యత దృష్ట్యా శాశ్వత బాస్టాండ్ నిర్మాణాకి స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు. 24 గంటల పాటు అత్యవసర మందు లు, వైద్యులు, సిబ్బంది, 108వాహనంతో ప్రత్యేక వైద్య శిభిరాన్ని నిర్వహించాలని చెప్పారు. తాగునీటి ఎద్దటి రాకుండా మోబైల్ పార్టీని ఏర్పాటు చేసి ధర్మసాగర్‌నుండి వచ్చే నీటి పరిస్థితిని మానిటరింగ్ చేయించాలని తెలిపారు. అన్ని మార్గలలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వ పరంగా కల్పించిన వసతులు, దారుల గురించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ మద్యం విక్రయాలను నిరోదించాలని తెలిపారు. జాతరను సందర్శించే భక్తుల సంఖ్యను లెక్కించుటకు ఎంట్రెన్స్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యంపీపీ, రవీందర్‌రావు, అన్ని శాఖల అధికారులు హాజరైయ్యారు. అంతకు ముందు పూర్ణకుంభ మంగళవాయిద్యాలతో ఆలయ అర్చకులు అధికారులు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు స్వాగతం పలికారు.

పరకాలను జిల్లా చేయాలి
పరకాల, జనవరి 2: పరకాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం న్యాయవాదులు ర్యాలీగా వెళ్లి పరకాల ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా న్యాయవాద జెఎసి చైర్మన్ ఓంటేరు రాజవౌళి మాట్లాడుతూ నిజాం రాజుల కాలం నుంచి పరకాల ఒక పెద్ద తాలుకా కేంద్రంగా, రెవెన్యూ డివిజన్‌గా కొనసాగిందన్నారు. జిల్లాల పునర్విభజనలో పరకాలతో సమానవైన తాలుకాలైన మహబూబాబాద్, జనగాంను జిల్లాలుగా ఏర్పాటు చేసి పరకాలకు మాత్రం అన్యాయం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ సారి సీఎం ఎన్నికైన తరువాత అదనంగా రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని చెప్పారు. 20 మండలాలతో కూడిన భూపాలపల్లి జిల్లా నుండి ములుగును సమ్మక్క సారలమ్మ జిల్లాగా చేస్తున్నందున పరకాల డివిజన్‌ను భూపాలపల్లి జిల్లాలో కలిపి పరకాలను జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు మేరుగు శ్రీనివాస్, చంద్రవౌళి, వెంకటరమణ, బందెల స్వామి, తోట పరమేశ్వర్, రాజేందర్, రవికుమార్, మచ్చ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల కోడ్‌తో
సద్దిమూట ప్రారంభం వాయిదా
కేసముద్రం, జనవరి 2: కేసముద్రం మార్కెట్లో రైతులకు రాయితీపై మధ్యాహ్న భోజన పథకం ‘సద్దిమూట’ ప్రారంభం పంచాయతీ ఎన్నికల కోడ్‌తో వాయిదా వేసినట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేషం తెలిపారు. హరేక్రిష్ణ ఫౌండేషన్, మార్కెట్ కమిటీ, దాతల సంయుక్త ఆధ్వర్యంలో నేటి (గురువారం)నుండి సద్దిమూట కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రారంభ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే ఆజ్మీరా సీతారాంనాయక్, బానోత్ శంకర్‌నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్‌తో పాటు కలెక్టర్ శివలింగయ్య, మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారులు హాజరుకావాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు వాయిదా వేసినట్లు కార్యదర్శి తెలిపారు. అలాగే ప్రాధమిక ఆరోగ్య కేం ద్రం ప్రారంభం కూడా వాయిదా పడినట్లు ఆయన తెలిపారు.

‘పంచాయతీ’ పోటీకి నిబంధనలు ఇవే..
భూపాలపల్లి, జనవరి 2 : జరగనున్న స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పకుండా నామినేషన్ పత్రాలలో వారి వివరాలను పూరించాలని చెబుతున్నారు.
21 సంవత్సరాలు నిండి ఉండాలి: పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే వారు 21 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి. వీరు ఓటు హక్కు కలిగి ఉండాలి. సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ప్రతిపాదిలు స్థానిక గ్రామ పంచాయతీలో ఓటు హక్కు కలిగి ఉండాలి. వార్డు సభ్యుడుని ప్రతిపాదించేవారు సంబంధిత వార్డులో ఓటరై ఉండాలి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి 1995 మే 31 నాటికి ముగ్గురు సంతానం ఉంటే అర్హునికి పరిగణిస్తారు. ఆ తరువాత సంవత్సరంలో ముగ్గురు సంతానం కలిగిన వారికి అనర్హునిగా పరిగణిస్తారు. పిల్లలను దత్తత ఇచ్చినప్పుడు ఆ పిల్లలు సొంత తల్లిదండ్రులకు చెందినవారుగానే గుర్తించబడుతారు.
పోటీ చేసేందుకు అర్హులెవరు..: రేషన్ డీలర్లు పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు. అంగన్‌వాడీలు మాత్రం పోటీకి అనర్హులు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు పోటీ చేయాలంటే నామినేషన్ దాఖలు చేసే నాటికి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభుత్వంచే ఆమోదించబడాలి. అలాగే నీటి వినియోగదారులు, సహకార సంఘాల సభ్యులు, స్వచ్చంద సంస్థలు, మత సంస్థల చైర్మన్‌లు పోటీకి అనర్హులు. ఆర్టీసి, సింగరేణి సంస్థలో పనిచేసే వారు కూడా అనర్హులుగానే పరిగణిస్తారు.
పూర్తి సమాచారం ఇవ్వాలి: ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు నామినేషన్‌తో పాటు వ్యక్తిగత సమాచార డిక్లరేషన్‌లో ఏదైనా సమాచారాన్ని దాచి ఉంచినా, తప్పుగా పేర్కొ న్నా తుది బరిలో నిలిచే అవకాశాన్ని మాత్రం కొత్త చట్టం కల్పించింది. దీనిని నిరూపిస్తూ రుజువులతో సహా ఎవరైనా అభ్యంతరం చెప్పినప్పటికి నామినేషన్‌లు తిరస్కరించడం జరగ దు. అయితే డిక్లరేషన్ పత్రాలను నోటీసు బోర్డుపై ప్రదర్శించిన క్రమంలో ఆ సమాచారం తప్పని రిటర్నింగ్ అధికారి భావిస్తే స్థానిక కోర్టులో ఐపీసీ 177, సీ ఆర్ పీసీ 195 ప్రకారం స్థానిక కోర్టులో ఫిర్యాదు చేసే వీలుంటుంది. కానీ నామినేషన్ మాత్రం తొలగించబడదు. ఎవరైనా మతిస్థిమితం లేని వ్యక్తులు నామినేష న్ వేసినట్లు ఆధారాలతో నిరూపిస్తే మాత్రం అనర్హత వేటు పడుతుంది. కాగా నామినేషన్ వేసిన వ్యక్తి ప్రతిపాదితులుగా ఉన్న వారి సంతకాలను ఫోర్జరి చేసినట్లు రిటర్నింగ్ అదికారి భావిస్తే నామినేషన్ తిరస్కరించే వీలుంటుంది.
నామినేషన్ వివరాలు: పంచాయతీ ఎన్నికల్లో పోటీ అభ్యర్థులకు రిజర్వేషన్ విషయంలో రాయితీ ఉంటుంది. సర్పంచ్ పదవికి ఎస్సీ,ఎస్టీ, బీసీలు రూ. 1000, ఇతరులు రూ. 2వేలు చెల్లించాల్సి ఉంటుంది. వార్డుకు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి. జనరల్ స్థానాల్లో కూడా ఇదే విధంగా వర్తిస్తుంది.
దోషిగా ఉండొద్దు: ఒక వ్యక్తి క్రిమినల్ కోర్టులో దోషిగా నిర్దారించబడితే ఆ రోజు నుంచి ఐదేళ్ల వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే వీలు లేదు. విచారణ అనంతరం దోషిగా నిర్దారించబడిన వ్యక్తి స్టే లేదా బెయిల్ పొందినప్పటికి ఎన్నికల్లో అనర్హుడిగానే గుర్తింపబడుతాడు.

పేదలందరికీ వంటగ్యాస్ కనెక్షన్‌లు
తెల్లరేషన్‌కార్డు ఉన్న వారంతా వినియోగించుకోవాలి: హెచ్‌పీ ఏరియా సెల్స్ మేనేజర్
మహబూబాబాద్, జనవరి 2: పేదలందరికి వంటగ్యాస్ కనెక్షన్ అందించాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ఉజ్వలయోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఈ పథకాన్ని అర్హులందరు వినియోగించుకోవాలని హిందుస్థాన్ పెట్రోలియం ఏరియా సెల్స్‌మేనేజర్ జి.రాజ్‌కుమార్ అన్నారు. మహబూబాబాద్‌లో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. రూ.12,800 కోట్ల వ్యయంతో 5 కోట్ల మంది నిరుపేద లబ్ధిదారులకు వంటగ్యాస్ కనెక్షన్‌లు అందించే లక్ష్యంతో 2015లో కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారందరు ఈ పథకం ద్వారా లబ్ధిపొందడానికి అర్హులే అన్నారు. తమ ఆధార్‌కార్డులను సమీపంలోని హెచ్‌పి గ్యాస్ డిస్టిబ్యూటర్‌లకు చూపినట్లైతే వారిపేరుపై గతంలో గ్యాస్ కనెక్షన్ ఉందో లేదో చెబుతారన్నారు. గ్యాస్ కనెక్షన్ లేనట్లైతే ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ పొందే అవకాశం లభిస్తుందని తెలిపా రు. గ్యాస్ కనెక్షన్‌తోపాటు స్టౌవ్ కూడా అందజేస్తారని రాజ్‌కుమార్ చెప్పారు. 14.2కిలోల గ్యాస్ కనెక్షన్ ద్వారా సబ్సిడితో కలుపుకొని రూ.867 మాత్రమే ఉందని ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేనివారికి ఉజ్వల స్కీమ్ కింద 5కిలోల సిలిండర్, రూ.350కి అందజేస్తామన్నారు. ఎమైన గ్యాస్ ప్రమాదం జరిగి మరణిస్తే వారికి రూ.6లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగితే యూనివర్సల్ నెంబర్ 1906కు ఫొన్ చేయాలని ఇతర సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 18002666696కు ఫొన్‌చేయాలని ఆయన తెలిపారు. పల్లెల్లో ఈ పథకం గురించి ప్రజలకు తెలియపరుచాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిచేకూరేలా చూడాలని తెలిపారు.

8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
మహబూబాబాద్ టౌన్, జనవ రి 2: కేంద్రప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8,9 తేదీలలో దేశవ్యాప్త సమ్మేను విజయవంతం చేయాలని సీఐటియు జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, ఎఐటియుసి జిల్లా కార్యద ర్శి బి.అజయ్, ఐఎఫ్‌టియు జిల్లా కార్యదర్శి సూర్యం, మధార్‌లు పిలుపునిచ్చారు. మానుకోటలో బుధవారం వారు ఇక్కడ మాట్లాడారు. నేడు స్థానిక గాంధీపార్కు లో జిల్లా సదస్సును నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ఉదయం 11గంటలకు జరిగే ప్రదర్శనలో కార్మిక, విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొనాలని తెలిపారు. మోదీ నాయకత్వలో బీజేపీ గత నాలుగున్నర ఏళ్లుగా ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నా రు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు.

యూనివర్సిటీకి భూములివ్వం
ములుగుటౌన్, జనవరి2: ప్రేమ్‌నగర్‌లో నిర్మించనున్న యూనివర్సిటీకి తమ పంట పొలాలను ఇవ్వమని ములుగు ఆర్డీవో రమాదేవికి బుధవారం రైతులు వినతిపత్రం అందించారు. 837 సర్వే నెంబర్ గల భూమిని 1971 సంవత్సరం లో ప్రభుత్వం అసైన్డ్ చేసి తమకు అప్పగించిందని, నాటి నుంచి కాస్తు చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. ఈ భూమి యూనివర్సిటీ కోసం మా నుంచి తీసుకుంటే తమ బ్రతుకులు జీవనోపాది కోల్పోయి రోడ్డున పడుతామని, వ్యవసాయం తప్ప జీవించడానికి మా కుటుంబాలకు మరొకటి లేదని అన్నారు. మా కుటుంబాలకు ప్రభుత్వం నుండి న్యాయం చేయాలని తెలిపారు. వీరికి మద్దతుగా ఎమ్మార్పీ ఎస్ జాతీయ కార్యదర్శి ఇరుగు పైడి, జిల్లా కార్యదర్శి పెండల మొగిలి ఉన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు లింగస్వామి, రాజయ్య, సమ్మ య్య, రాజేందర్, కార్తీక్, సారయ్య, రాజు, కుమార్ ఉన్నారు.

బాలకార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
వరంగల్, జనవరి 2: వరంగల్ అర్బన్ జిల్లాను బాలకార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దుటకు అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్లైల్-5 సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మికుల పరిరక్షణకుగాను ఆపరేషన్ స్లైల్ ద్వారా తప్పిపోయిన వీధి బాలలు మరియు బాలకార్మికుల రక్షణకు సంరక్షణ కల్పించే లక్ష్యంగా జిల్లాలో పోలీస్‌శాఖ, స్ర్తి, శిశుసంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్యశాఖ, క్రీడలు, సిడబ్ల్యూసి చైల్డ్‌లైన్, స్వచ్చంద సంస్ధల భాగస్వామ్యంతో బాల కార్మికుల నిర్మూలణకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జనవరి 1 నుండి 31వ తేది వరకు ఆపరేషన్ స్లైల్ ద్వారా జిల్లాలోని బాలకార్మికులను గుర్తించి వారి పరిరక్షణకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 1 నుం డి 14 సంవత్సరాలలోపు బాల కార్మికులను గుర్తించుటకు గాను హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇటుక తయారి కేంద్రాలు, రైల్వేస్టేషన్లు తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించాలని ఆయన కోరారు. స్వాదార్ ఇన్‌స్ట్యూట్‌లను తరుచూ పరివేక్షించడం దావరా ఆయా కేంద్రాలలో బాలకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడం సులభతరం జరగుతుందని అందుకుగాను పోలీస్ శాఖ, శిశు సంక్షేమ శాఖ తనిఖీలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 103 బాలకార్మికులును గుర్తించి చైల్డ్ ప్రొటేక్షన్ సెంటర్‌లో రక్షణ కల్పించడంతో పాటు వారికి విద్యాపరంగా కేజివీబీ పాఠశాల, మోడల్ పాఠశాలలో ప్రవేశాలు కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కేఎంసీలో వైద్య పరీక్షలు నిర్వహించి సర్ట్ఫికెట్లు వారంలోగా అందజేయాలని తద్వారా బాలకార్మికులువున్న యాజమాన్యంపై త్వరితగతిన కేసులు నమోదు చేయుటకు సులభత రం అవుతుందని అందుకు వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి శైలజకుమారి, జిల్లా బాలకార్మికుల, సంరక్షణ అధికారి సంతోష్‌కుమార్, లీగల్ ప్రొటెక్షన్ అధికారి సతీష్ పాల్గొన్నారు.

ప్రాజెక్టులను పూర్తి చేసి..

$
0
0

నాగర్‌కర్నూల్, జనవరి 2: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న కాలేశ్వరం, పాలమూరు,రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీతో సహా వివిధ సాగునీటి ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేసి నిర్దేశించిన ఆయకట్టుకు నీరందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, ఇట్టి పనుల పురోగతిని తెలుసుకునేందుకే తాము ప్రాజెక్టులను సందర్శిస్తున్నామని విశ్రాంత ఇంజనీయర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రవౌళి, ముత్యంరెడ్డి, వేణుగోపాల్, వెంకటేశంలు ఎస్‌ఎల్‌బీసీ పనులు జరుగుతున్న జిల్లాలోని దోమలపెంటకు ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను పరిశీలించి, పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. అక్కడి నుంచి మనె్నవారిపల్లిలో జరుగుతున్న ఎస్‌ఎల్‌బీసీ రెండోవైపు జరుగుతున్న పనులను పరిశీలించారు. 40 కి.మీ పొడవున టన్నల్ తవ్వాల్సి ఉండగా దాదాపుగా రెండువైపుల కలుపుకొని 30 కి.మీ వరకు తవ్వి, సుమారు రూ.15వందల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, టన్నల్‌లో నీరు లీకేజీ అవుతుండటంతో పనులు జరగడంలేదని, నీటిని తోడెయ్యడంతోపాటు లీకేజీని అరికట్టి పనులను చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈయేడాది చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను ఇవ్వడం జరుగుతుందన్నారు. మంగళవారం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లు, పంపుహౌజ్ నిర్మాణం కోసం టన్నల్ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. కేఎల్‌ఐ ప్రాజెక్టులోని మూడో లిప్టు గుడిపల్లి లిప్టు వద్ద నాలుగు మోటార్లను ప్రారంభిస్తే సర్జ్ఫిల్‌లో వాటర్ లేవల్ తగ్గిపోతున్న విషయం తెలియడంతో బుధవారం ఈ లిప్టు పనులను పరిశీలించినట్లు తెలిపారు. ఇప్పటికే దీనిపై సాంకేతిక నిపుణుల కమిటి సందర్శించి ఇక్కడి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందని, దానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయన్నారు. కేఎల్‌ఐ ప్రాజెక్టుకు సంబంధించి టన్నల్ లైనింగ్, కాలువలు, బ్యాకింగ్ తదితర మిగులు పనులను పూర్తిచేసేందుకు అధికారులు ఆరునెలల సమయం కోరుతున్నారని, ఈ సయమంలో ప్రాజెక్టుకు సంబంధించిన మూడు లిప్టుల పంపులను పూర్తిగా ఆపేయాల్సి ఉందని, దీనిపై కూడా సీఎంకు నివేదికను ఇస్తామన్నారు. తాము సందర్శించిన ప్రాజెక్టులకు సంబంధించిన వాటిపై ఆధ్యాయనం చేసిన అంశాలతోపాటు ఆయా ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు తెలిపిన వాటిని క్రోడీకరించి సమగ్రమైన నివేదికను రూపొందించి ఈనెల 4న సీఏంకు అందచేయనున్నట్లు శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వీటిపై సీఏం రాష్టస్థ్రాయి అధికారులతో సమీక్షించిన అనంతరం ఈ ప్రాజెక్టులను సీఏం స్వయంగా సందర్శించి పరిశీలించనున్నట్లు వెల్లడించారు. వారి వెంట కేఎల్‌ఐ, పీఆర్‌ఎల్‌ఐ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదాం
* ప్రతి పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెడుతాం
* డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 2: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని గ్రామపంచాయతీతో పాటు వార్డు సభ్యులు, ఇతర ఏ ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి తీరుతుందని డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉబెదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉందని గ్రామస్థాయి నాయకులు, వార్డుమెంబర్లు, సర్పంచు అభ్యర్థులుగా తప్పకుండా నిలబడాలని అందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ సహకారం ఉంటుందన్నారు. టీ ఆర్ ఎస్ నాయకుల ఆగడాలను ఎదుర్కోంటామని వారు వేస్తున్న ఎత్తులను చిత్తు చేయాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి గ్రామపంచాయతీలను బలవంతంగా ఏకగ్రీవాలకు టీ ఆర్ ఎస్ నాయకులు దిగే అవకాశం ఉందని ఎక్కడ కూడా టీ ఆర్ ఎస్ నాయకులకు అవకాశం ఇవ్వొద్దన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులను పోటీలో దింపుతున్నామని ఆయన వెల్లడించారు. శాసనసభ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని ఈ దిశగా ప్రజల్లో మమేకమై కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచు, వార్డు సభ్యులను గెలిపించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ్ ముదిరాజ్, ఎన్‌పి వెంకటేష్, రంగారావు, కరుణాకర్‌గౌడ్, లక్ష్మణ్, యాదయ్య, బెనహర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో మధ్యవేలికి ఇంకు గుర్తు
నాగర్‌కర్నూల్, జనవరి 2:ఈనెలలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు జరిగే మూడు విడతల ఎన్నికలలో ఓటు వేసిన ఓటరుకు మధ్యవేలిపై ఇంకు గుర్తు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలనే శాసనసభ ఎన్నికలు జరిగినందున ఓటు వేసిన వారి ఎడమ చేతి చూపుడు వేలికి వేసిన ఇంకు మార్కు ఇంకా వేలికి ఉండే అవకాశాలు ఉన్నందున పంచాయతీ ఎన్నికలలో ఎడమ చేతి మధ్యవేలికి ఇంకు మార్క్ పెట్టాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధికి
అందరినీ కలుపుకొని పోదాం
* ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి
వనపర్తి, జనవరి 2: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆమోదించిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని గ్రామాల్లో వాతావరణాన్ని కలుషితం చేయవద్దని, గ్రామాలాభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్దామని ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం తన నివాసంలో అన్ని మండలాల ముఖ్యనేతలతో నిర్వహించిన ఆయన ప్రసంగించి పలు సూచనలు చేశారు. పార్టీల వారీగా ప్రజలను వీడదిసి గ్రామాలలో వర్గాలను పెంచి పోషించే సంస్కృతికి అడ్డుకట్ట వేద్దామని, ప్రజలతో చర్చించి ఎక్కువ మంది ప్రజలు సూచించిన వ్యక్తులకు అవకాశం ఇచ్చి వీలైనంత వరకు ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవానికి ప్రయత్నించాలని , అనివార్య పరిస్థితిలో ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ప్రజలకు సమస్యను వివరించి వారి మద్దతును పొందే ప్రయత్నం చేయాలని సూచించారు. ఎవరు గెలిస్తే గ్రామాభివృద్ధి జరుగుతుంది, ఎవరు ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించగలుగుతారు అన్న విషయాన్ని ప్రజలతో చర్చించి వారు సూచించిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఎవరు దీనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దని ఆయన సూచించారు. ముఖ్య నేతలు గ్రామాల వారిగా ఎక్కువ మంది ప్రజలను కలిసి వారితో చర్చించాలని , పార్టీలో ఉన్న నేతలు అంతా ఒక తాటి మీద ఉండి ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.

31 పంచాయతీల్లో 26 ఎస్టీలకే..
* సరైన అభ్యర్థుల కోసం చర్చలు
* తండాల్లో ఏకగ్రీవానికి సమావేశాలు

అచ్చంపేట, జనవరి 2: పంచాయతి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో కొత్త గ్రామ పంచాయాతీల్లో చర్చలు మొదలవుతున్నాయి. మండలంలోని 31 గ్రామ పంచాయతీల్లో 26 గ్రామ పంచాయతీలు ఎస్టీలకే రిజర్వు అవడంతో మండలంలో వారికే అగ్రభాగం కేటాయించారు. అందుల్లో ఏజేన్సి ప్రాంతంలో ఉన్నా 18 పంచాయతీలు ఎస్టీలకు మరో 5 పంచాయతీలు వందశాతం గిరిజనుల జనాభా ఉండండతో వారికే కేటాయించడంతో పాటుప్లేన్ గ్రామాల్లో ఆరుశాతం జనాభా ప్రతిపాదికతన మరో మూడు పంచాయతీలు ఎస్టీలకే కేటాయించారు. 4 జనరల్ , 1 ఎస్సీలకు కేటాయించారు. బుధవారం మండల పరిధిలోని బుడ్డతాండ, పెద్దతాండ గ్రామ పంచాయతీల్లో సరైన సర్పంచ్ అభ్యర్థుల కోసం చర్చలు జరిగాయి. మిగతాగ్రామపంచాయతీలలోకూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అన్ని రంగాల్లో బలమైన అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. కొత్తగాగ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డ తాండల్లో ఏకగ్రీవాల కోసం సమావేశాలు జరుగున్నాయి. అనంతరం పలువురు తాండ నాయకులు మాట్లాడుతూ తమ తాండను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ప్రభుత్వం గుర్తించడమే కాకుండా ఎన్నికలు నిర్వహించి స్వయం పరిపాలనకు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.
పంటకోత ప్రయోగాలపై అవగాహన
* హాజరైన సీపీవో, డీఏవో

నాగర్‌కర్నూల్, జనవరి 2: వ్యవసాయశాఖ, ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా పంటకోత ప్రయోగాలపై బుధవారం ఎఈవోలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సింగారెడ్డిలు పాల్గొని పలు అంశాలపై వివరించారు. ఈ సీజన్‌లో జిల్లాలో వేరుశనగ పంటను యూనిట్‌గా ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 227 యూనిట్ల పంట కోత ప్రయోగాలు చేయుటకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయాధికారులను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో చేసిన పంట కోత ప్రయోగాలకు సంబందించిన అన్ని వివరాలను కేంద్రం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో వందశాతం నమోదు చేయాలన్నారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎడీఎలు, జిల్లా , డివిజన్ గణకాంల అధికారులు పాల్గొన్నారు.
నాలుగేళ్లుగా ముందుకు సాగని ఆర్వోబీ పనులు
* నిర్మాణం కాకముందే కూలిన దిమ్మెలు
*నాణ్యతపై పలు అనుమానాలు
* గడువును పొడిగించుకుపోతున్న అధికారులు
* నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు
* కలెక్టర్ ఆదేశించినా ఫలితం శూన్యం
గద్వాల, జనవరి 2: ఆర్వోబి నిర్మాణం సంవత్సరాల తరబడి కొనసాగుతున్నది. ఒకవైపు పనులు జరుగుతుండగా మరోవైపు నిర్మించిన సిమెంటు దిమ్మెలు కూలిపోయాయి. ఎంతో నాణ్యతతో పకడ్బందిగా అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన ఆర్వోబి నిర్మాణ పనులు కాంట్రాక్టర్, జిల్లా అధికారుల నిర్లక్ష్యకారణంగా నాణ్యతకు తిలోదకాలిచ్చి ఆర్వోబి నిర్మాణం చేస్తుండడంతో ఒకవైపు పనులు జరుగుతుండగానే మరోవైపు నిర్మించిన ఆర్వోబి దిమ్మెలు కూలిపోయాయి. దీంతో ఆర్వోబి నిర్మాణం నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. ఒకవైపు జిల్లా కలెక్టర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్, జిల్లా ఆర్‌అండ్‌బి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రెండు, మూడు రోజులకే సిమెంటు దిమ్మెలు కూలిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పనులను తక్కువరేట్లకు దక్కించుకొని పనులు చేయకుండా సంవత్సరాల తరబడి పొడగించుకుపోయి ఇప్పుడు అధికారులు సీరియస్ కావడంతో పనులను వేగవంతం చేయాల్సింది పోయి నాణ్యతవై అనుమానాలు కలిగేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాణ్యతకు తిలోదకాలు..
దేశంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనుల్లో నాణ్యత లోపించి పలు పట్టణాలలో ఆర్వోబిలు కూలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గద్వాల పట్టణంలో నిర్మిస్తున్న ఆర్వోబి పనులు ఆది నుంచి నాణ్యత పాటించడంలేదని పట్టణ ప్రజలు బహిరంగానే విమర్శిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, పాలకులు నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా పర్యవేక్షించే వారు లేరని ప్రజలు మండిపడుతున్నారు. గత ఏడాది రైల్వే బ్రిడ్జి గోడలకు పెట్టు సిమెంటు దిమ్మెలు పడి ఒక్కరికి తీవ్రగాయాలైన సంఘటన చోటు చేసుకుంది. గత నెలలో సిమెంటు గోడలు కూలడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు ఎలాంటి నాణ్యత పాటించకపోవడంతో ఇటీవల బ్రిడ్జి గోడలు కుప్పకూలాయంటే ఆర్వోబి నిర్మాణ నాణ్యత ఏవిధంగా పాటించారో అర్థమవుతుంది.
గేటు పడటంతో ప్రయాణికుల నరకయాతన..
నిత్యం హైదరాబాద్ నుండి గద్వాల మీదుగా తిరుపతి, బెంగుళూరు తదితర ప్రాంతాలకు రైళ్లు వెళ్తుంటాయి. మొదటి రైల్వే గేటు ప్రాంతంలో ఆర్వోబి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రెండో రైల్వే గేటు మీద వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం రైళ్ల రాకపోకలతో రెండవ రైల్వే గేటు పడిన ప్రతిసారి వాహనదారులు గంటల తరబడి ఆగాల్సివస్తుంది. అత్యవసర సమయాల్లో కర్నూల్, హైదరబాద్ ఆసుపత్రులకు వెళ్లు రోగులు కూడా ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. మొదటి రైల్వే గేటు ప్రాంతంలో నిర్మిస్తున్న ఆర్వోబి పూర్తి అయితే కాని ప్రజలకు, వాహనదారులకు ఈసమస్య నుంచి విముక్తి లభించదు.
ఆర్వోబి నిర్మాణంలో నిర్లక్ష్యం..
గద్వాల పట్టణంలోని ఆర్వోబి నిర్మాణ పనుల కోసం రూ. 23కోట్లు మంజూరయ్యాయి. జనవరి 8, 2014 కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈపనులు 2016 జనవరి 7వ తేది నాటికి పూర్తి చేయాల్సి ఉన్నది. కాని తనకు మరో ఏడాది గడువుఇస్తే పూర్తి చేస్తానని అధికారులను కోరిన ఒప్పందం తేదీ ముగిసినప్పటి నుంచి నేటి వరకు 3 ఏళ్లు అవుతున్నా కాంట్రాక్టర్ పనులను ఎంతటికి పూర్తి చేయడం లేదు.
ఆర్వోబి పనులు త్వరిగతిన పూర్తి చేయాలని అనేక సార్లు ఆర్వోబి పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించిన కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకవచ్చిన ఏమాత్రం చలనం లేదు. గతంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనేక సార్లు రోడ్లు, భవనాలు, కాంట్రాక్టర్లతో ఆర్వోబి పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించి హెచ్చరికలు చేసిన పూర్తి చేయలేకపోయారు. గడువు మీద గడువు కోరిన పూర్తి చేస్తామన్నా ఆర్వోబి నేటి వరకు కూడ అసంపూర్తిగానే మిగిలింది. అసలు కాంట్రాక్టర్ నుంచి సబ్ కాంట్రాక్టర్ పనులను తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, దాంతో పాటు పనులను దక్కించుకునేందుకు పోటికి పోయి ఆర్‌అండ్‌బి శాఖ కోడ్ చేసిన అంచనాలకంటే తక్కువ ధరకు టెండర్ వేయడం వల్లే పనులను పూర్తిచేయలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై కలెక్టర్, రాష్ట్ర అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పనులు పూర్తికి కృషి చేయాలి
తెలంగాణ ప్రభుత్వం రెండోసారి కూడ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు, ఆ పార్టీ నాయకులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసినా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఆడపిల్లలపై ఆగని వివక్ష..!

$
0
0

నల్లగొండ, జనవరి 2: దేశం సాంకేతికంగా చంద్రయాన్ వైపు దూసుకెళ్తున్న నేటి సమాజంలో ఆడపిల్లల పట్ల లింగ వివక్ష అనాగరికం కొనసాగుతున్న తీరు రేపటి అమ్మల భవిష్యత్‌ను మొగ్గలోనే తుంచేస్తోంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తల్లి గర్భంలోని శిశువు మొదలుకుని వివాహం వరకు ఆడపిల్లల సంరక్షణకు పలు సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గిరిజన తండాల్లో, మారుమూల గ్రామాల్లో ఆడపిల్లల పట్ల నిరాదరణ ఆగకపోవడం ఆందోళన కల్గిస్తోంది. తండాల్లో శిశు విక్రయాలు, ప్రభుత్వ పునరావాస కేంద్రాలైన శిశుగృహాల్లో తమ పిల్లలను తల్లితండ్రులు పేగుబంధాన్ని సైతం కాదనుకుని వదిలేస్తున్న ఘటనలు తరుచు వెలుగుచూస్తు నాగరిక సమాజాన్ని వెక్కిరిస్తున్నాయి. తాజాగా పెద్దవూరా మండలంలో ఇద్దరు ఆడపిల్లల విక్రయ ఘటనలు వెలుగుచూడం మరోసారి లింగ వివక్షను వెలుగులోకి తెచ్చింది. అధిక సంతానం, పేదరికం, నిరక్షరాస్యత, వంశోద్ధారకుడికై మూఢ విశ్వాసం తండాల్లో ఆడపిల్లల భవిష్యత్‌కు శాపాలుగా మారాయి. ప్రభుత్వ శాఖల అధికారులు గ్రామాల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా, ఆడపిల్లల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల విస్తృత ప్రచారం సాగిస్తున్నా మళ్లీమళ్లీ ఆడపిల్లల విక్రయాలు, శిశుగృహాలకు అప్పగించే ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు శిశు గృహాలకు చేరిన ఆడపిల్లల్లో 173 చిన్నారులను దత్తత ఇవ్వగా ప్రస్తుతం మరో 44 మంది ఆడపిల్లలు శిశుగృహాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గత నాలుగేళ్లలో ఒక్క దేవరకొండ డివిజన్ నుండే 81 మంది ఆడపిల్లలు శిశుగృహకు చేరడం తండాల్లో లింగ వివక్ష సమస్యను చాటుతోంది. ఐసీడీఎస్ చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ అమలుతో గర్భవతి దశ నుండి ప్రసవం వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసి వారిపై నిఘా ఉంచుతున్నా ఆడపిల్లల అమ్మకాలు చోటుచేసుకోవడం ప్రభుత్వం యంత్రాంగానికి సవాల్‌గా మారింది. మన ఇంటి లక్ష్మి పేరుతో స్ర్తి, శిశు సంక్షేమశాఖల, అనుబంధ శాఖల అధికారుల బృందాలు తండాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన పెద్దగా మార్పు తేలేకపోతోంది.
పథకాలున్నా.. పరివర్తన కరువే..!
ఆడపిల్లల సంక్షేమానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా వాటి అండతో తమ పిల్లలను పోషించుకుని, చదివించుకోవాలన్న పరివర్తన, చైతన్యం గిరిజనుల్లో కరువైపోతోంది. ఆడపిల్లల సంక్షేమానికి కేంద్రం సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టు ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలతో పోషకాహారం, ఆరోగ్యం, పూర్వప్రాథమిక విద్య వంటి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. బేటీ బచావో బేటీ పడావో, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోజన పథకం, ఆరోగ్య లక్ష్మి, అమ్మఒడి, కేసీఆర్‌కిట్, కస్తూరిభా పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, కల్యాణలక్ష్మీ వంటి పథకాలు అమలవుతున్నాయి. వీటి ద్వారా గర్భస్థ శిశువు నుండి పెళ్లి వరకు ఆడపిల్లల సంరక్షణకు ప్రభుత్వం వివిధ రకాల సహాయం అందిస్తోంది. ఐనప్పటికి తండాల్లో ఆడపిల్లల పట్ల నిరాదరణ కొనసాగుతుంది. ఆడపిల్లలను శిశుగృహాలకు అప్పగించడం, లేదా అమ్ముకోవడం వంటి ఘటనలకు పాల్పడుతున్న తల్లిదండ్రుల్లో ఎక్కువగా అధిక సంతానమున్నవారే ఉంటున్నారు. మగపిల్లాడి కోసం నలుగురు, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం గిరిజన తండాల్లో అధికంగా కనిపిస్తోంది. ఇక పట్టణాల్లో సాగుతున్న లింగ వివక్ష మరింత దారుణంగా ఉంది. గర్భస్త పిండ నిర్ధారణ నివారణ చట్టాలున్నా స్కానింగ్ కేంద్రాల ఆర్థిక దుర్మార్గాలకు ఆడపిల్లలు గుట్టుచప్పుడు కాకుండా అమ్మకడుపులోనే బలవుతున్నారు. స్కానింగ్ కేంద్రాల అత్యాశ ఆడపిల్లకు అమ్మకడుపునే బలిపీఠంగా మారుస్తోంది. ఈ నేపధ్యంలో లింగ వివక్ష నిర్మూలన, గిరిజన తండాల్లో అధిక సంతానం, స్కానింగ్ కేంద్రాలపై నిఘాలతో ప్రభుత్వ యంత్రాంగం లింగ వివక్ష నిర్మూలన దిశగా మరింత పగడ్బందిగా చర్యలు చేపట్టాల్సిన అవసరముందని బాలల హక్కుల పరిరక్షణ సంఘాలు కోరుతున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా.. * తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్

మోత్కూర్, జనవరి 2: తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేయనున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తెలిపారు. బుధవారం మోత్కూర్ మున్సిపాలిటీతో పాటు దాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సూరారం యాదగిరితో పాటు పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కిశోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఎగిరేటట్లుగా ప్రతి ఒక్కరు కృషిచేసి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఏప్రిల్ 1 నుండి రూ.2,016ల చొప్పున ప్రభుత్వం పెన్షన్ ఇవ్వనుందని, దీనితో నియోజకవర్గంలో అదనంగా 10వేల మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం కింద ఈ ఏడాది నుంచి రూ. 5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. పొడిచెడు మల్లయ్య చెరువు నుండి దాచారం గ్రామ సముద్రం చెరువులోకి కాలువ ద్వారా నీటిని అందించేందుకు కలసికట్టుగా పని చేద్దామన్నారు. సమావేశం రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ సీహెచ్. మహేంద్రనాథ్, ఎంపీపీ ఓర్సు లక్ష్మి, టీఆర్‌ఎస్ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మేందర్‌రెడ్డి, నాయకులు యాకూబ్‌రెడ్డి, సోమల్లు, వస్తాదు, వెంకటేశ్వర్లు, రాజిరెడ్డి పాల్గొన్నారు.

యాదగిరీశుడికి ఘనంగా నిత్యారాధనలు
యాదగిరిగుట్ట, జనవరి 2: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు, ఆర్జిత సేవలు శాస్తయ్రుక్తంగా సాగాయి. వేకువ జామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేశారు. బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా ప్రతిష్ఠామూర్తులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంధ పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కవచమూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం పాంచరాత్రాగమశాస్త్రానుసారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవోత్సవం నిర్సహించారు. బాలాలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో స్వామి అమ్మవార్లకు వెండి జోడి సేవోత్సవం నిర్వహించారు.

కోటి ఎకరాల మాగాణి సీఎం కేసీఆర్ ధ్యేయం
* రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి
* ఎస్‌ఎల్‌బీసీ సందర్శించిన విశ్రాంత ఇంజనీర్ల బృందం
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జనవరి 2: తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం బృందం బుధవారం నల్లగొండ-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టును, జిల్లా పరిధిలోని కిష్టంరాంపల్లి, శివన్నగూడెం డిండి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్‌ల పనులను పరిశీలించింది. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పెండింగ్ ప్రాజెక్టులను సందర్శిస్తున్న క్రమంలో వారు సదరు ప్రాజెక్టులను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఆదేశాలతో తాము పెండింగ్ ప్రాజెక్టుల పనులను పరిశీలిస్తున్నామన్నారు. అందులో భాగంగా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ ఎంట్రీపాయింట్ సొరంగం పనులను పరిశీలించి, తదుపరి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను, పిదప శివన్నగూడెం రిజర్వాయర్ పనుల పురోగతిని పరిశీలించామన్నారు. ప్రాజెక్టుల భూసేకరణ, నిర్వాసితుల సమస్య, కాంట్రాక్టర్ల సమస్యలు, సాంకేతిక సమస్యలపై ప్రాజెక్టుల వారిగా సీఎం కేసీఆర్‌కు నివేధించనున్నామన్నారు. ప్రభుత్వం తాము నివేదించిన అంశాలను పరిశీలించి ప్రాజెక్టుల పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల పనుల పూర్తి పట్ల చిత్తశుద్ధితో ఉన్నారని, ప్రజలు కూడా ఆయనపై నమ్మకం ఉంచి రెండోసారి అధికారం అప్పగించడంతో ప్రాజెక్టుల పనుల పూర్తిపై అందరిలో భరోసా నెలకొందన్నారు. కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారని, పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మారుతాయన్నారు. ఎస్‌ఎల్‌బిసిస రంగం పనుల్లో 13.7 కిలోమీటర్ల పనులు ఒకవైపు, మనె్నవారిపల్లి నుండి 19 కిలోమీటర్ల పనుల సొరంగం పనులు ఇంకోవైపు పూర్తయ్యాయన్నారు. ఇప్పటికే సొరంగం పనులకు 1400 కోట్ల ఖర్చు జరిగిందని, ప్రతి రోజు నిమిషానికి 96490 లీటర్ల నీటిని సొరంగం నుండి బయటకు తోడుతూ పనులు జరిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
* ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి
సూర్యాపేటటౌన్, జనవరి 2: రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల అభివృద్ధే టీ ఆర్ ఎస్ ధ్యేయమని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చివ్వెంల మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు అయన సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. ఈసందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తూ పాలనలో ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రంగాలు, వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ అందరిని తెలంగాణ బిడ్డలుగానే భావించి వివక్షలేని పాలన అందించాలని అన్ని సందర్భాల్లో చెబుతుంటారని తెలిపారు. కొత్త, పాత తేడా లేకుండా కార్యకర్తలంతా కలసి ముందుకు సాగాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడడమే నాయకులు, కార్యకర్తల ప్రధాన బాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు రౌతు నర్సింహారావు, మారిపెద్ది శ్రీనివాస్, భూక్యా వెంకటేశ్వర్లు, లచ్చిరాంనాయక్, జూలకంటి సుధాకర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, నంధ్యాల సోమిరెడ్డి, పారెపల్లి సురేష్‌కుమార్, నరేష్‌రెడ్డి, వెంకన్న, నారాయణ, శ్రీనివాస్, నాగరాజు, చక్రు, పిట్ల సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
నల్లగొండ రూరల్, జనవరి 2: గ్రామ పంచాయతీల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల మోడల్ కోడ్ అమలులోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఉదయాధిత్య భవన్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణపై నోడల్, మండల పర్యవేక్షణాధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్‌లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయరాదన్నారు. జిల్లాలో మొత్తం యంత్రాంగం వివిధ శాఖలు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయన్నారు. ఆర్డీవోలు డిప్యూటీ ఎన్నికల అధికారులుగా వ్యవహారిస్తారని, సిబ్బందికి సెలవులు మంజూరు చేయవద్దని, అత్యవసరమైతే అనుమతి తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వాహణకు నోడల్ అధికారులను నియమించామని, ఆర్డీవోలు డివిజన్ స్థాయిలో ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమిస్తారన్నారు. ఎంపీడీవోలు సైతం అధికారులను నియమిస్తారన్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల అంశాలపై వాట్సాప్‌లో ఉన్నతాధికారులకు నివేధించాలన్నారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగతుతాయని, మొదట దేవరకొండ డివిజన్, రెండో దశలో మిర్యాలగూడ, మూడో దశలో నల్లగొండ డివిజన్ పంచాయతీలవేనన్నారు. ఈ ఎన్నికల నిర్వాహణ శిక్షణ సమావేశాలకు అధికారులు, సిబ్బంది హాజరుకావాలన్నారు. జాయింట్ కలెక్టర్ సీ.నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రచార హోర్డింగ్‌లు, గోడలపై రాతలు తొలగించాలని, మండల స్థాయిలో ఎన్నికల కోడ్ అమలు, పరిశీలన బృందాలను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో రవీంధ్రనాథ్, డీపీవో శ్రీకాంత్, డిప్యూటీ కలెక్టర్ రోహిత్, డీఆర్‌డీఏ పీడీ శేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

రాష్ట్రంలో స్తంభించిన ప్రజాపాలన
బీసీల రిజర్వేషన్‌పై కేసీఆర్‌కు చిత్తశుద్ధి కరువు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రంగారెడ్డి
మిర్యాలగూడ టౌన్, జనవరి 2: రాష్ట్రంలో ఎన్నికలు జరిగి నేటికి 23 రోజులైన మంత్రివర్గం లేదు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం లేకపోవడంతో పాలన స్తంభించినట్టు ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 23 రోజులైనా మంత్రివర్గ ఏర్పాటు జరగకపోవడం, అసెంబ్లీ సమావేశం నిర్వహించకపోవడం కేసీఆర్ నియంత పోకడల వింతల్లో ఇదొకటని ఎద్దేవా చేశారు. పంచాయతీల్లో బీసీల రిజర్వేషన్‌ను 34 నుండి 23కు తగ్గించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ విషయంలో గతంలో రాష్ట్రంలోని కాంగ్రేస్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకుపోగా ఈసారి వరకు రిజర్వేషన్ 34తో నిర్వహించాలని పేర్కొన్నదని, ఆ విషయం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం, నష్టం తీవ్రంగా జరుగుతుందని, సుప్రీం కోర్టు దృష్టిలో ఉంచుకుని 34 శాతం బీసీలకు పంచాయతీలను కేటాయించాలని కోరారు. పంచాయతీల ఎన్నికల షెడ్యుల్ విడుదల కాక ముందునుంచే సర్పంచ్ పదవులకు వేలం పాట మొదలైందన్నారు. పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించి ఫలితాలను అన్ని పంచాయతీల్లో పోలింగ్ అయిన అనంతరం ప్రకటించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ అనంతరం లెక్కింపు పంచాయతీల్లో కూడా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. లేకుంటే ముందు గెలిచిన సర్పంచ్‌ల ప్రభావం 2, 3 విడతల ఎన్నికలపై పడుతుందన్నారు. అదే విధంగా పంచాయతీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు అంతా అయోమయ పరిస్థితిలో ప్రభుత్వం జరుపుతున్నదని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేష్, మాలి పురుషోత్తంరెడ్డి, జగదీశ్చంద్ర, చంద్రశేఖర్‌యాదవ్, రవినాయక్, మహ్మద్‌బిన్‌సయిద్, పాపానాయక్, ప్రకాష్‌నాయక్, శశిధర్‌రెడ్డి, కోటిరెడ్డి, ఆర్.శ్రీనివాస్, రామ్మూర్తి పాల్గొన్నారు.

రిటైర్‌మెంట్ పెంపును
డిసెంబర్ నుంచి వర్తింపజేయాలి
* ఎమ్మెల్సీ పూల రవీందర్
నాగార్జునసాగర్, జనవరి 2: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌మెంట్ వయసు పెంపును గత సంవత్సరం డిసెంబర్ నెల నుండి వర్తింపు అయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ పూల రవీందర్ కోరారు. బుధవారం నాడు నాగార్జుసాగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళశాల ప్రసంగంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు జయకుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరై ఆయన మాట్లాడారు. పైలాన్‌కాలనీలో అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తు డిసెంబర్ 31తో ఉద్యోగ విరమణ పొందిన జయకుమార్ దంపతులను ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్‌టీయూ రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం ముందంజలో ఉందన్నారు. ఉద్యోగ విరమణ వయస్సును పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షనీయమన్నారు. దాని తగ్గట్టుగా డిసెంబర్ నెలలో ఉద్యోగ విరమణ పొందిన వారికి వర్తించేలా వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో పవిత్రమైన వృత్తి అని మెరుగైన సమాజాన్ని తయారుచేయడంలో ఉపాధ్యాయుడు ముందు ఉండాలని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకులు బిక్షంగౌడ్, సుధాకర్, ప్రకాష్, రవీందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సక్రు, పరమేష్, శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మి పాల్గొన్నారు.
ఆసుపత్రికి వచ్చేవారి పట్ల చిన్నచూపు తగదు
* నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల
* జిల్లా కేంద్రాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నల్లగొండ రూరల్, జనవరి 2: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తనిఖీ చేశారు. ఈసందర్భంగా పలు వార్డులలో ఆయన కలియ తిరిగి రోగులను కలిసి వారికి అందుతున్న వైద్యం, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో మెడికల్ కళాశాల, ఇతర అన్ని విభాగాలను తిరిగి వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవఖానకు పేదవారే వస్తారనీ, వారి పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్షం వహించరాదనీ, చిన్న చూపు చూడరాదని, వైద్యులు సమయ పాలన పాటించాలన్నారు. ప్రభుత్వ దవఖానకు వచ్చిన రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యతమైన వైద్యాన్ని అందించాలన్నారు. జిల్లా దవఖాన అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

సిద్దిపేట ప్రాంతంలో ఆక్సిజన్ పార్కులు

$
0
0

సిద్దిపేట, జనవరి 2: సిద్దిపేట ప్రాంతంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇచ్చేలా అర్బన్ ఆక్సిజన్ పార్క్‌లు రూపుదిద్దుకుంటున్నాయని, త్వరలో ఈ పార్కులు అందుబాటులోకి రానున్నట్లు మాజీ మంత్రి, హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా మర్పడగ గ్రామ శివారు నాగుల బండ సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతున్న అర్బన్ అక్సిజన్ పార్క్ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రోజు,రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని ప్రజలు తట్టుకునేలా మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులో తెచ్చేలా ప్రయత్నమని, ఆ దిశగా అటవీ శాఖాధికారులు, అర్బన్ ఆక్సిజన్ పార్కులు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ఫారెస్టుల్లో పర్యాటకులు సైతం సందర్శించేందుకు వీలుగా అదనపు హంగులు సమకూర్చాలని, పలు సూచనలు చేస్తు, అర్బన్ పార్కుతో పాటు, ఆక్సిజన్ పార్కు వివరాలపై ఆటవి శాఖ అధికారులను ఆరా తీశారు. అర్బన్ పార్కులో 9 కిలోమీటర్లు మేర కాలినడక నడుస్తు కలియ తిరిగి, అక్కడ పెంచుతున్న మొక్కలను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్బన్ పార్కు సుందరికరణలో భాగంగా దాదాపు 340 ఎకరాల్లో 10కిలోమీటర్ల మేర బౌండరీలు మూసివేసి, ఆటవి సంపదను రక్షిస్తు ప్రజలకు అవగాహనతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కావాల్సిన రీతిలో చర్యలు తీసుకుంటున్నట్లు ఆటవి శాఖాధికారులు వివరించారు. పట్టణ ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించేలా, ఈ పార్కు సుందరీకరణ ఉండాలని అటవీ శాఖాధికారులకు హరీష్‌రావు సూచించారు. ఈ మేరకు చుట్టుకొలతల్లో 14 స్కైర్ మీటర్ల మేర అర్బన్ పార్కును చేపట్టినట్లు జిల్లా ఆటవీ శాఖాధికారి శ్రీ్ధర్ తెలిపారు. ప్రకృతి దర్శనం, ఉద్యానవనం ఏర్పాటు, 10 ఎకరాల్లో ఆక్సిజన్ పార్కు, 9కిలోమీటర్ల మేర నడక దారులు, ఓపెన్ జిమ్స్, పార్కు ప్రాంత ఆవరణలో అక్కడ, అక్కడ చిన్నారులకు ఆట విడుపు కేంద్రాలు, రాశీవనం, నక్షత్ర వనం, 30 ఫీట్ల ఎత్తులో ఉండే గడియారం, గజబౌళీలు, ధ్యాన మందిరం, బట్టర్‌ఫ్లై పార్కు, హెర్బల్ పార్కు, పార్కు మధ్యలో ఉన్న కుంటను సుందరికరణ చేసి అక్కడికి వచ్చిన వారికి పిక్నిక్ పార్కులా, అనువుగా, ఆహ్లాదం పంచేలా ఏర్పాట్లు ఉండాలని ఆటవి శాఖాధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటవి శాఖ సిద్దిపేట రెంజ్ అధికారి లక్ష్మణ్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
పెద్దశంకరంపేట, జనవరి 2: ఏ మతం వారైనా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుంటే మానసిక ప్రశాంతత దొరుకుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహాముద్ అలీ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఉన్న తబ్క్ అజ్మీర్ దర్గాను సందర్శించి ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతతతో పాటు జీవితం సాలఫ్యం అవుతుందన్నారు. ఎందరో మహానుభావులు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని ప్రజలకు ఆధ్యాత్మికతపై అవగాహణ కల్పిస్తుండటం వల్ల ఎంతో మంది ఆధ్యాత్మికం వైపు మల్లుతున్నారని, ఇది శుభ పరిణామం అన్నారు. అజ్మీర్ దర్గా వ్యవస్థాపకులు డాక్టర్ రహీమ్ చిస్తీ తన చిన్ననాటి బాల్యమిత్రుడని, ఆయన ఆహ్వానం మేరకు దర్గాను సందర్శించానని తెలిపారు. ఈ సందర్భంగా దర్గాకు ఆయన ఛాదర్‌ను సమర్పించి ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడని, అది గుర్తుంచుకొని అందరు కలిసిమెలసి ఉంటూ సామాజిక సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస లౌకిక వాదానికి ఎప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు. కులమతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని, అన్ని కులమతాల వారికి సమాన ప్రాతినిథ్యం కల్పించిన ఏకైక పార్టీ తెరాస పార్టీ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్ విగ్రం రామాగౌడ్, జాతీయ ఆహార సభ్యులు విగ్రం శ్రీనివాస్‌గౌడ్, మండల తెరాస అధ్యక్షులు విజయరామరాజు, మైనార్టీ నాయకులు మోయిజ్‌ఖాన్, రైతు సమన్వయ సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేష్‌గౌడ్, మురళీపంతులు, మాజీ సర్పంచ్ జంగం శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సామగ్రిని
మండల కేంద్రాలకు తరలించాలి
- డీపీఓకు కలెక్టర్ ధర్మారెడ్డి ఆదేశం
మెదక్, జనవరి 2: పంచాయితీ ఎన్నికల నిర్వాహణకు వినియోగించే సామాగ్రిని మండల కేంద్రాలకు త్వరితగతిన పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో నిల్వ ఉంచిన ఎన్నికల సామాగ్రిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన పూర్తి స్థాయి సామాగ్రి జిల్లాకు చేరుకుందా అని డీపీఓ హనూక్‌ను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన సామాగ్రిని మండలంలో ఉన్న పంచాయితీల వారిగా విభజించి తక్షణం పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు విడతల్లో ఎన్నికల నిర్వాహణ ఉన్నందున మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించే మండలాలకు ఎన్నికల సామాగ్రి సత్వరం చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన పుస్తకాలు అందజేయాలన్నారు. ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు అవసరమైనవన్ని పుస్తకాలను తెప్పించాలని సూచించారు. ఎన్నికలను నిర్వహించే అధికారులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిర్వాహణ పుర్తయిన వెంటనే కౌటింగ్ నిర్వహించేందుకు అవసరమైన సామాగ్రిని సైతం అధికారులకు అందుబాటలో ఉంచాలన్నారు. ఎన్నికల నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీపీఓకు కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు.

సంగారెడ్డిలో కేరళ సీఎం
దిష్టిబొమ్మ దగ్ధం
* శబరిమలలో మహిళల ప్రవేశం సరికాదు
సంగారెడ్డి టౌన్, జనవరి 2: శబరిమలలో ఎన్నోయేళ్లుగా వస్తున్న ఆచారాన్ని కాదని, ఆలయంలో మహిళల ప్రవేశం సరికాదని, ఇది హిందూ మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని సంగారెడ్డి అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, కేరళ సీఎం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించారు. బుధవారం సంగారెడ్డిలో కేరళ సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అత్యంత ప్రవిత్రంగా భావించే ఆలయంలోకి మహిళల ప్రవేశం ఎందుకని మండిపడ్డారు. దీనికి కారణం కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రేనని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు రాము, మోహన్, వెంకటస్వామి, సంతోష్, నరేష్, మల్లేశం, బీజేపీ నాయకులు ద్వారక రవి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ నరసింహన్‌ను కలసిన
జాతీయ యూత్ అవార్డు గ్రహీతలు
గజ్వేల్, జనవరి 2: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను జాతీయ యూత్ అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింలు నేతృత్వంలో బుధవారం రాష్ట్ర యువజన సంఘాల నేతలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక, సేవా కార్యక్రమాలను గవర్నర్ నరసింహన్ దృష్టికి తెచ్చారు. అయితే పల్లె ప్రాంతాల అభివృద్దితోనే దేశ పురోగతి ఆధారపడి ఉందని, ఇందుకోసం యువత నడుం బిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు జాతీయ యూత్ అవార్డు గ్రహీత, రాష్ట్ర యువజన సంఘాల ప్రధాన కార్యదర్శి దేశబోయిని నర్సింలు తెలిపారు. అయితే యువజన సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలకు గవర్నర్ నరసింహన్ సహకారం కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ యూత్ అవార్డు గ్రహీతలు సామల వేణు, కలింగ శేఖర్, నాగేశ్వర్‌రావు, రాజ్ కుమార్, కిరణ్‌కుమార్, రాజేందర్, మహేశ్, సిద్దిపేట జిల్లా ప్రతినిదులు సాదక్‌పాషా, మర్కంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శబరిమలైలో యువతుల ప్రవేశం దురదృష్టకరం
జరగబోయే పరిణామాలకు పాలకులదే బాధ్యత * రామకోటి భక్తసమాజం వ్యవస్థాపకులు రామరాజు
గజ్వేల్, జనవరి 2: హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పాలకులు వ్యవహరిస్తే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని రామకోటి భక్తసమాజం వ్యవస్థాపక చైర్మెన్ రామకోటి రామరాజు పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. కేరళ సర్కార్ నిర్లక్ష్యం ఫలితంగానే కోర్టు తీర్పు వెలువడగా, ఎంతో నియమనిష్టలతో దీక్ష చేసే అయ్యప్పల భక్తి భావనను దెబ్బతీసే విధంగా యువతులను శబరిమలై క్షేత్రంలోకి పంపించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హిందూ దేశంలో హిందువులకే రక్షణ లేకపోతుండగా, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షించాల్సిన సర్కార్‌లు అందుకు భిన్నంగా వ్యవహరించడం దురదృష్టకరం కాగా, కేరళతోపాటు ఏ రాష్ట్రంలో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించే ప్రభుత్వాలకు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆ దిశగా రామకోటి భక్తసమాజం దృష్టి సారించి హిందువులను చైతన్యం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. దేశంలో ఏ మతం, ఏ కులంవారైనా జీవించే హక్కు ఉండగా, పాలకులు మాత్రం ఓట్ల కోసం, సీట్ల కోసం మతాల ప్రాతిపదికన వివిద పథకాలు అమలు చేస్తూ హిందువులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియమనిష్టలతో దీక్షాకాలం పూర్తి చేసుకొని అయ్యప్ప దర్శనానికి వెళ్లిన స్వాములను బాధించే విధంగా బిందూ, కనకదుర్గ అనే యువతులు బొట్టు లేకుండా కెమరాలు వెంట బెట్టుకొని కేరళ పోలీసుల సహకారంతో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప గడప దొక్కడాన్ని ఏ ఒక్క హిందువు జీర్ణించుకోలేకపోతుండగా, కేరళ సర్కార్‌కు త్వరలోనే తగిన గుణపాఠం జరుగుతుందని హెచ్చరించారు.

జాతీయస్థాయి క్రీడాకారునికి
సీఐ ఆర్థిక సాయం
చేర్యాల, జనవరి 2: మండలంలోని ముస్త్యాల జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎండి అజహర్ అనే విద్యార్ది హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్- 14 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి ఎంపిక కాగా అతనికి చేర్యాల సిఐ రఘు బుధువారం 3వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈనెల 15 నుండి హర్యానా రాష్ట్రంలో ఇసార్‌లో జరుగు క్రీడలలో అజహర్ ఆడనున్నందున పేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో సీఐ ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ విద్యార్దులు చదువుతో పాటు క్రీడలలో సైతం ముందుకు రావాలని అన్నారు.

ప్రముఖ సిద్దాంతి చంద్రశేఖరశర్మ దంపతులకు
మాధవానంద సరస్వతీ తీర్థ ఆశీస్సులు
గజ్వేల్, జనవరి 2: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాంపూర్ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతితీర్థను బుధవారం ప్రముఖ వాస్తు సిద్ధాంతి, శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా శ్రీ విద్యాధరి క్షేత్రం వద్ద చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, వేద విద్యకు అందిస్తున్న చేయూత, నాచగిరి శ్రీ క్షేత్రం వ్యవహారాలను స్వామీజీ దృష్టికి తెచ్చారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ భక్తుల సౌకర్యాల కల్పనలో నిమగ్నమవ్వాలని శ్రీ మాధవానంద తీర్థ స్వామీజి సూచించారు. ఈ కార్యక్రమంలో వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర సేవికా సమితి అధ్యక్షురాలు యాయవరం అరుణ, ఆలయ మేనేజర్ రఘుపవన్ తదితరులు ఉన్నారు.

భూముల జాయింట్ సర్వే పూర్తి చేయాలి
- అధికారులకు జేసీ నగేష్ ఆదేశం
మెదక్, జనవరి 2: రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భూములను జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో తహశీల్దార్లు, అటవిశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అటవీ భూములను సాగు చేసుకొని జీవనం సాగించే వ్యక్తులకు భూ యాజమాన్య హక్కు పత్రాలను అటవీశాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే జరిపాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ ఆధారంగా యుద్ధ ప్రాతిపదికన సర్వేను పూర్తి చేయాలన్నారు. గ్రామాల వారిగా అటవీభూముల వివరాలను తహశీల్దార్లకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ జాబితా ప్రకారం అధికారులు సంయుక్తంగా సర్వే జరిపి నివేదికను త్వరితగతిన అందజేయాలన్నారు. ఈ భూములకు అటవి భూ యాజమాన్య హక్కు పత్రం మాత్రమే ఉంటుందన్నారు. ఈ భూములు కలిగిన రైతుల వివరాల నమోదుకు ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లో పహాణిలో నమోదు చేయకూడదని తహశీల్దార్లను ఆదేశించారు. జాయింట్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తహశీల్దార్లు, ఫారెస్ట్ అధికారులకు జేసీ సూచించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ పద్మజారాణితో పాటు తహశీల్దార్లు, ఎఫ్‌ఆర్వోలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లాలో 30(ఏ) యాక్ట్ అమలు
- ఎస్పీ కుమారి చందనాదీప్తి
మెదక్, జనవరి 2: 2019 జనవరి 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30ఎ పోలీస్ యాక్ట్ అమలులోకి వచ్చిందని ఎస్పీ చందనాదీప్తి బుధవారం మాట్లాడుతూ తెలిపారు. ఈ యాక్ట్ ప్రకారం పోలీసుల అనుమతులు లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ఆమె వెల్లడించారు. ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేఖ కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని చందనాదీప్తి హెచ్చరించారు. ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

పంచాయతీ పోరుకు నగారా మోగడంతో
రాజకీయ యుద్ధ వాతావరణం

* గ్రామాల్లో కత్తులు దూసుకుంటున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు
* నియోజకవర్గంలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు
* 148 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు రంగం సిద్ధం
గజ్వేల్, జనవరి 2: పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నేతలకు ఎన్నికల కమిషన్ నగారా మోగించడంతో ఆరంభంలోనే గ్రామాల్లో రాజకీయ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. నియోజకవర్గం లోని గ్రామాలలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడే కత్తులు దూసు కుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీతో టీఆర్‌ఎస్ నేతలు రెట్టించిన ఉత్సాహంతో దూసుకెల్తుండగా, పోయిన పరువును కాపాడు కునేందుకు కాంగ్రెస్ తన వంతు యత్నాలను ముమ్మరం చేస్తూ ఓటర్ల ను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలోని గజ్వేల్, కొండపాక, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, వర్గల్ మండలా ల పరిదిలోని 148 పంచాయతీలలో 2వ విడతలో ఎన్నికలు జరగనుండగా, ఇందుకోసం ఇప్పటికే అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియను సిద్దం చేసింది. ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకరోజు ముందుగానే పంచాయతీలు, వార్డుసభ్యుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయగా, గజ్వేల్ మండలంలో 25 పంచాయతీలకుగాను 230 వార్డులుగా ఎంపిక చేశారు. అలాగే జగదేవ్‌పూర్ మండలంలో 29 పంచాయతీలకుగాను 256 వార్డులు, ములుగు మండలంలో 26 పంచాయతీలకుగాను 222 వార్డులు, వర్గల్ మండలంలో 27 పంచాయతీలకుగాను 238 వార్డులు, కొండపాక మండలంలో 25 పంచాయతీలకుగాను 238 వార్డులు, మర్కూక్ మండలంలో 16 పంచాయతీలకుగాను 140 వార్డుల రిజర్వేషన్‌లు పూర్తి చేసి ఎన్నికల కమీషన్‌కు నివేదించారు. అయితే 2వ విడతలో జరగనున్న ఈ గ్రామపంచాయతీల ఎన్నికలకుగాను 11న నోటిఫికేషన్ జారీ చేయనుండగా, ప్రచారానికి 14 రోజుల గడువు విదిస్తూ ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు యంత్రాంగం దృష్టి పెట్టింది.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో పెరిగిన తీవ్ర పోటీ
గ్రామపంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో సర్పంచ్ పదవిని ఆశిస్తున్న నేతల మద్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే గ్రామాల్లో విందు రాజకీయాలు ప్రారంభం కాగా, తమకు ఎలాగు పార్టీ పెద్దల ఆశిస్సు లు ఉంటాయనే నమ్మకంతో ఉన్న నేతలు తమ ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టారు. అయితే ఒకే పార్టీ నుండి పోటీ తీవ్రంగా ఉండడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారగా, చివరకు ఎటు దారి తీస్తుందో నని ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే బుజ్జగింపు ల పర్వం ఆరంభం కాగా, రోజురోజుకూ వేడెక్కుతున్న రాజకీయంతో గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు తమ నిఘాను ముమ్మరం చేస్తూ చర్యలు చేపట్టారు.

‘ప్రయాణ’ వైపరీత్యం..

$
0
0

ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రయాణీకులను ‘వీలు’ను బట్టి దోపిడీ చేయడం నడుస్తున్న చరిత్ర! ఇలా దోపిడీ చేయడాన్ని గతంలో ‘నల్లబజారు’- బ్లాక్ మార్కెటింగ్- అని పిలిచేవారు, ‘బ్లాక్ మార్కెటింగ్’ చేసేవారిని ప్రభుత్వాలు శిక్షించేవి, ప్రజలు నిరసించేవారు. ప్రస్తుతం ఇలాంటి దోపిడీ సక్రమ వ్యవస్థగా చెలామణి అవుతోంది! వినియోగదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ‘్ధర’ను ‘వెల’ను ‘శుల్కాన్ని’ ‘సుంకాన్ని’ పెంచడం గతంలో ‘బ్లాక్ మార్కెటింగ్’.. ప్రస్తుతం ఈ ‘నల్లబజారు’ను నల్లబజారు అనడానికి వీలులేదు.. ఇలా అవసరాన్ని ఆసరాగా చేసుకొని వినియోగదారులను, ప్రయాణీకులను, సేవలను పొందే వారిని దోచుకొనడానికి ప్రస్తుతం ‘ప్రీమియమ్ ప్రయిసింగ్’- ప్రాధాన్యాన్ని బట్టి వెలను నిర్ణయించడం-, ‘డైనమిక్ ప్రయిసింగ్- బహముఖ క్రియాశీలతను బట్టి వెలను నిర్ణయించడం- వంటి గౌరవప్రదమైన పేర్లను పెట్టారు! ఇలాంటి చిత్ర విచిత్ర నామధేయాల వల్ల ‘నల్లబజారు’ వంటి వికృతులు నాగరిక పద్ధతులుగా చెలామణి అవుతుండడం ప్రపంచీకరణ సృష్టించిన మాయ.. సినిమా టిక్కెట్టును అసలు వెలకంటె రూపాయికి అధికంగా అమ్మిన ‘‘మురికి బట్టల వాణ్ని’’ పోలీసులు కసిగా కొట్టుకుంటూ స్టేషన్‌కు ఈడ్చుకువెళ్లి శిక్షించేవారు.. ఇది గతం... ప్రయాణీకుల అవసరాన్ని బట్టి ‘ఆటోరిక్షా’ ‘క్యాబ్’ ‘బస్సు’ ‘రైలు’ విమానం ధరలను పెంచిపారేసి ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్న ‘‘మురికి హృదయాల’’ వాణిజ్యవేత్తలను పోలీసులు శిక్షించడం లేదు.. ఇది వర్తమానం! గతంలో ‘బ్లాక్ మార్కెట్’-నల్లబజారు- పేరుతో నిరసనలకు, శిక్షలకు గురి అయిన పద్ధతులన్నీ ఇప్పుడు ‘ప్రీమియమ్ ప్రయిసింగ్’ ‘డైనమిక్ ప్రయిసింగ్’ వంటి గౌరవప్రదమైన పేర్లతో చెలామణి అవుతున్నాయి. జనానికి ‘్ధ్యసలేదు.. ఇలా సేవల- సర్వీసెస్- పేరుతో దోపిడీ జరుగుతోంది. దోపిడీ చేస్తున్న వాణిజ్య సంస్థలను శిక్షించడం అసంభవమన్నది ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- వ్యవస్థీకరించిన వికృత వాస్తవం! వాణిజ్య సంస్థల యజమానులు ప్రభుత్వ నిర్వాహకులకు లంచాలిచ్చి విధానాన్ని ప్రభావితం చేయడం గత చరిత్ర. ఇలా ప్రభావితం చేయడం కూడ ‘అపవాదం’మాత్రమే.. కొన్ని సందర్భాలలో మాత్రమే కొన్ని పథకాలు, పరిశ్రమలు, కొనుగోళ్లు వ్యవహారాలలో మాత్రమే ఈ ప్రభావ వైపరీత్యం ప్రస్ఫుటించేది. వాణిజ్య అక్రమ లాభార్జనపరులు రాజకీయవేత్తలుగా, ప్రభుత్వ నిర్వాహకులుగా రూపమెత్తి ఉండడం ‘ప్రపంచీకరణ’ వ్యవస్థ మొదలైన తరువాత నడిచిపోతున్న అక్రమ కలాపం. అక్రమ కలాపాలు ‘సక్రమం’గా మారిపోతుండడానికి మరో పేరు ‘ప్రపంచీకరణ’! ‘బ్లాక్ మార్కెటింగ్’ ప్రస్తుతం ‘ప్రీమియర్ ప్రయిసింగ్’ పేరుతో, ‘డైనమిక్ ప్రయిసింగ్’ పేరుతో కొనసాగుతోంది!!
హైదరాబాదు వంటి నగరాలలో ‘ఓలా’ ‘ఉబర్’ వంటి సంస్థలు ‘క్యాబ్’లను ‘ఆటోరిక్షాల’ను నడిపిస్తున్నాయి. ఈ సంస్థల ‘క్యాబ్’లు రంగప్రవేశం చేయకముందు దేశవ్యాప్తంగా నగరాలలో పెద్ద పట్టణాలలో ‘కిరాయి కార్లు’- టాక్సీలను రహదారిపై నిలబడిన ప్రయాణీకులు కుదుర్చుకునేవారు. ‘టాక్సీ’లను యజమానులు నడిపేవారు లేదా యజమానుల వద్ద ‘టాక్సీ’లను అద్దెకు తీసుకొని ‘చోదకులు’- డ్రయివర్లు- నడుపుకునేవారు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎంత సొమ్ము చెల్లించాలన్నది ప్రభుత్వాలు నిర్ణయించేవి! ‘ఓలా’ ‘ఉబర్’ సంస్థలు రంగప్రవేశం చేసిన తరువాత దేశవ్యాప్తంగా లక్షల మంది యజమానుల ‘కార్’-టాక్సీ- క్యాబ్-లు స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయాయి. ఈ ఘరానా సంస్థల పోటీకి తట్టుకోలేక చిన్న చిన్న ‘ప్రయాణ సేవల సంస్థలు’ మూతపడిపోయాయి. అందువల్ల గతంలోవలె ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాలలోను, పెద్ద పట్టణాలలోను ప్రయాణీకులు ‘టాక్సీస్టాండ్’వద్ద కాని, రహదారిపై నిలబడి కాని ‘కారు’- టాక్సీ- క్యాబ్-ను కుదుర్చుకొనడానికి వీలులేదు. అలాంటి సదుపాయం గతమైంది, హతమైంది.. హతం చేసిన వారు ‘ఓలా’ ‘ఉబర్’ సంస్థల వారు. ప్రభుత్వాలు ఈ ‘వాణిజ్య హంతకుల’ను శిక్షించడం లేదు, ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటె వివిధ రాష్ట్రాలలోని ప్రభుత్వ నిర్వాహకులకు ఈ సంస్థలలో భాగస్వామ్యం ఉందట.. ఉందా? లేదా? అన్నది ధ్రువపడని అంశం! కానీ ‘ఓలా’ ‘ఉబర్’ సంస్థలు తమ ‘క్యాబ్’లలో ఎక్కి ప్రయాణిస్తున్నవారిని రాత్రింబగళ్లు దోపిడీ చేస్తుండడం మాత్రం ధ్రువపడిన వాస్తవం! ప్రభుత్వ నిర్వాహక రాజకీయ వేత్తలు ప్రజల, ప్రయాణీకుల అవసరాల పట్ల క్రూరమైన పాశవికమైన పైశాచికమైన ఘోరమైన నిర్లక్ష్యం వహించి ఉండడం ‘ఓలా’ ‘ఉబర్’ వంటి సంస్థల ఆర్థిక నేరాలు సక్రమమైన కలాపాలుగా సాగిపోతుండడానికి కారణం..
ఇలా ఈ రెండు సంస్థల గుత్త్ధాపత్యం వల్ల ‘ప్రయాణీకుల’కు భయంకరమైన అసౌకర్యం ఏర్పడిపోయింది. ఎక్కడపడితే అక్కడ ‘క్యాబ్’ దొరకదు. ‘‘నాగరికుల’’ ప్రయాణ స్వాతంత్య్రాన్ని ఈ సంస్థలు హరించి వేశాయి. ‘ఓలా’క్యాబ్ ఎక్కాలి లేదా ‘ఉబర్’ క్యాబ్ కోసం పడిగాపులు పడి ఉండాలి! ఈ ‘క్యాబ్’ ఎక్కదలచినవారి వద్ద ‘లావణ్యవాణి’- స్మార్ట్ఫోన్- తప్పనిసరిగా ఉండాలి, దానికి ‘అంతర్జాల’- ఇంటర్‌నెట్ అనుసంధాన వ్యవస్థ- ఏర్పడి ఉండాలి! అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రయాణీకులు తాము ఉన్నచోట నుంచి గమ్యానికి పోవడానికి వీలుగా ‘ఓలా లేదా ‘ఉబర్’ - ‘క్యాబ్’ను రప్పించుకోగలరు. ‘ఇవి’ లేనివారు ఆటోరిక్షాను ఎక్కిపోవాలి, ‘బస్’కోసం నిలబడి ఉండాలి. లేదా ప్రయాణం రద్దు చేసుకోవాలి! బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు నెలకొల్పిన ‘బందిఖానా’లలో ప్రజలు బందీలుగా మారిపోతుండడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! గతంలో ఒకటి, రెండు, మూడు, నాలుగు ‘కార్ల’ను అద్దెకు నడిపిన యజమానులు, చోదకులు ప్రస్తుతం ‘ఓలా’ ‘ఉబర్’ సంస్థలలో వెట్టిచాకిరి చేస్తున్న కూలీలు! ఇలా వికేంద్రీకృత, మానవీయ భారతీయ ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృత స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థగా, పెట్టుబడుదారుల అక్రమ వాణిజ్య సామ్రాజ్యంగా మారిపోతుండడం ప్రపంచీకరణ... హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ నుంచి ఒక ప్రయాణీకుడు ‘ఓలా’ క్యాబ్ ఎక్కి సికిందరాబాద్ రైలుస్టేషన్‌కు వెళ్లి తిరిగి వచ్చాడు! వెళ్లినప్పుడు ‘క్యాబ్’ ప్రయాణ శుల్కం నూట యాబయి రూపాయలు, గంట తరువాత తిరిగి వచ్చినప్పుడు అదే దూరానికి నాలుగువందల యాబయి రూపాయలు.. ఇదీ ‘డైనమిక్’ ప్రయిజింగ్! ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’- విదేశీయ సంస్థల- వికృత స్వభావం స్వదేశీయ ప్రభుత్వేతర సంస్థలను ఆవహించి ఉంది. ప్రభుత్వేతర సంస్థల స్వభావం ప్రభుత్వరంగ సంస్థలను ఆవహించి ఉంది. ఇదీ ప్రపంచీకరణవల్ల మనకు జరిగిన ‘‘మేలు’’! అందువల్ల ఈ ‘డైనమిక్ ప్రయిసింగ్’ పద్ధతి ప్రభుత్వ సంస్థల బస్సులలోను, రైలు సంస్థలలోను కూడ అమలు జరుగుతోంది. పూణె నగరం నుంచి హైదరాబాద్‌కు ‘స్లీపర్ క్లాస్’- శయనయానం- టిక్కెట్టు వెల మూడువందల ముప్పయి రూపాయలు. కానీ ప్రీమియర్ ‘తత్కాల్’ టిక్కెట్టు ధర వెయ్యినుంచి పది హేనువందల రూపాయల మధ్య నడుస్తోందట! హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఒకే సంస్థవారి విమానంలో మూడువేల రూపాయలు ప్రయాణ శుల్కం కావచ్చు లేదా పదకొండు వేల రూపాయలు కావచ్చు! అదే విమానం, అదే ప్రయాణం.... దోపిడీ జరిగిపోతున్న తీరు ఇది!
హైదరాబాద్‌లో ‘ఆటోరిక్షా’లో పయనించడానికి ప్రభుత్వం నిర్ధారించిన కనీసపు ధర ఇరవై రూపాయలు. ‘ఓలా’ సంస్థవారు ఈ కనీసపు శుల్కాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకు పెంచేశారు. ఇలా వాణిజ్య సంస్థలు సమాంతర ప్రభుత్వాలను నిర్వహిస్తుండడం హరించిపోతున్న దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి మరో నిదర్శనం. అందువల్ల ‘ఆటోరిక్షాల’లో మీటర్లు తిరగవు. చోదకులు చెప్పినంత సొమ్మును ప్రయాణీకులు ఇవ్వాల్సిందే..!

మన క్రికెట్‌దే హవా!

$
0
0

మూడేళ్లుగా క్రికెట్ క్రీడలో ‘విరాట్ కొహ్లీ బ్యాటింగ్‌దే హవా!’ జయభేరి మోగిస్తూ, తిరుగులేని ‘బ్యాటింగ్ కింగ్’గా మనవాడు నిలిచాడు. అది ‘టెస్ట్ మ్యాచ్’ అయినా ‘వన్ డే’ లేదా ‘ఇరవై-ఇరవై’ పోటీ అయినా అతని బ్యాట్ మెరుపులు మెరిపించింది. ఇప్పుడు ఇండియాకి ఆస్ట్రేలియా మీద చరిత్రాత్మక గెలుపు-34 సంవత్సరాల తర్వాత- కళ్లు జిగేల్ మనిపించే మెరుపులాగ ప్రసాదించిన 2018 సంవత్సరం- వివాదగ్రస్తుడయిన ఇండియన్ కెప్టెన్‌కి తిరుగులేని ‘నెంబర్ వన్’ స్థానాన్ని ప్రసాదించింది.
ప్రత్యర్థుల మీద బ్యాట్‌తోనే గాక, నోటితో కూడా ‘కస్సున’ కలియబడిపోయినా, వర్తమాన క్రికెట్‌లో కొహ్లీ పుణ్యమాని- ఇండియన్ క్రికెట్‌దే ‘హవా’గా చెలరేగుతోంది. విరాట్ 2018లో మొత్తం పదమూడు సెంచరీలు చేశాడు. అమితవేగంగా సాధించిన ఆ పరుగుల్లో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు వున్నాయి.
మూడేళ్లుగా- ‘నేనే మొనగాణ్ని’ అన్నట్లు ఐ.సి.సి. టెస్ట్ ర్యాకింగ్‌ల్లో కింగ్- ‘నెంబర్ వన్’గా రాణిస్తున్న విరాట్ కొహ్లీకి మరోవైపు నోటి దురుసుతనం ఎక్కువే! ఫీల్డులో దూకుడూ ఎక్కువే. వివాదగ్రస్తుడే అయినా- అతనికి 2018 చాలా గొప్పగా అచ్చొచ్చింది. రికార్డుల మీద రికార్డులు అతనికి ‘్భజకీర్తులై’ రాణిస్తున్నాయి. ఇది మనకి ‘క్రికెట్ నామ సంవత్సరమా?’ అన్నట్లుగా, ఇండియా - మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా జట్టుని పచ్చడి చేసి మరీ బోర్డర్-గవాస్కర్ కప్పుకి దగ్గిరగా చేరి యిప్పుడు నాలుగో టెస్ట్ ఆడుతున్నది. ‘రెండూ- ఒకటి’ ఆధిక్యంతో వున్న విరాట్ బృందానికి ఇంకొక్క గెలుపు దక్కితే- ‘కప్పు’- ఫుల్‌గా మనకి లభిస్తుంది. లేదా ‘సిరీస్ సమం’ అయితే - ఆర్నెళ్లు కప్పు మనదగ్గరే వుంటుంది- ఓటమి భయం లేదు.
చిత్రం ఏమిటీ అంటే, రుూ కప్పు ఎవ్వరి పేర స్థాపితమై రాణిస్తున్నదో- ఆ లెజెండ్స్ ఈ ఆటని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. అన్నింటినీ మించి- మన ఉపఖండానికి క్రికెట్ వ్యామోహం లేదా అదంటే ‘వేలం వెఱ్ఱి’ అన్న మాటను కూడా 2018 రుజువు చేసింది మరోసారి.
బంగ్లాదేశ్‌లో 2018 మళ్లీ హసీనా చేతిలోనే- నువ్వేనమ్మా అందరికన్నా ‘హసీనా’ని (అందగత్తె) అన్నట్లు ప్రభుత్వ పగ్గాలు పెట్టేస్తే- జనాలు ఆ గెలుపులో ‘క్రికెటర్ మోర్తాజా’కొక రికార్డు విజయం వుంది. బంగ్లాదేశ్ వన్ డే టీమ్ కెప్టెన్ ముషారఫ్ మోర్తాజా తనకి సీటు యిచ్చిన అవామీ లీగ్‌కి, బండ మెజారిటీ (రెండు లక్షల డెబ్బయి నాలుగు వేల ఓట్లు)తో గెల్చి- ఉపఖండంలోని క్రికెట్ ప్రభావాన్ని రుజువుచేశాడు.
కేవలం క్రికెట్ ఆట పేరుప్రఖ్యాతుల మీదనే ఇమ్రాన్ ఖాన్- మన శత్రు దేశం పాకిస్తాన్‌కి ప్రధానమంత్రి అయినాడు. ప్రధాని నరేంద్ర మోదీ గారి మహోన్నత అధికార పక్షం భాజపాకూడా- ‘రేపు 2019లో పార్లమెంట్‌లో మిమ్మల్ని కూర్చోబెడతాం రండ’ని క్రికెటర్లకి కన్నుగీటుతోంది...
మన దేశంలో ఐ.పి.ఎల్. అనే ఎండాకాలం క్రికెట్ జాతరకు మొత్తం హోల్ వరల్డ్ క్రికెట్‌కి ‘‘్ఫదా’’! ఇంతకాలం సౌరభ్ గంగూలీ పేరిట వున్న రికార్డుని (17 విజయాలు) కూడా యిప్పుడు సమం చేసి, దాన్ని దాటబోతున్నాడు మన దూకుడు దురుసు మాస్టర్ విరాట్. విదేశీ గెడ్డమీద లోగడ మన ‘చొక్కా వీరుడు’ సౌరభ్ గంగూలీ మహాశయుడు పదిహేడు విజయాలు సాధించాడు. ఆ ‘చొక్కా’ని - యిప్పుడు చాలారకాలుగా విరాట్ కొహ్లీ లాక్కుంటున్నాడు. అంతటి దూకుడు మనవాడికే వుంది. విదేశీ గడ్డమీద మాత్రం ‘పిల్లులు’.. పెరట్లో ‘పిచ్’ల మీద ‘పులులు’అన్న అపవాదును మన క్రికెట్ టీము చెరిపేస్తోంది. 2016లో 2,595; ఆనక 2017లో 2,818; 2018లో 2,653 ‘రన్స్’ జేగీయమానంగా చేసిన విరాట్ ఒక్కడే మన విజయపరంపరకి కారణం కాదు. మన ఫాస్ట్ బౌలింగ్ ‘రాటు’ దేలింది. కపిల్ దేవ్ మన ఫాస్ట్ మీడియమ్ బౌలర్‌గా తొలి వరల్డ్ కప్ విజేతగా- ఆల్ రౌండర్‌గా ఖ్యాతిగాంచినా నాటి మన ‘‘స్పీడు’’ మాస్టర్లు అంతా- ‘ ఫాస్ట్ మీడియా’ అన్న లేబిల్ తగిలించుకున్న వాళ్లే! గానీ, యివాళ మన ఇషాంత్, షమీ, బుమ్రా, యాదవ్ లాంటి అనుభవజ్ఞులు బంతి విసిరితే ప్రత్యర్థి జట్టు వీరుల పాదాల కింద భూమి కంపిస్తోంది. ముఖ్యంగా, అందరిలోకీ కుర్రాడు జస్‌ప్రీత్ బుమ్రా- రానురానూ టెస్ట్ మ్యాచ్‌ల్లో కూడా ఆడి మొనగాడిననిపించుకున్నాడు. ‘‘బూమ్... బూమ్... బుమ్రా- గా యార్కర్ బంతుల సుడిగాలి లాగా రాణిస్తూన్న రుూ పైలాపచ్చీస్ బంతివీరుడు- మొన్నటి ‘బాక్సింగ్ డే’- క్రికెట్‌లో బంతులు కాదు- పిడుగులు కురిపించాడు. మన అశ్విన్‌కి దెబ్బతగలటంతో వాళ్ల ‘నాధన్‌లైన్’ సింహంలా విజృంభిస్తూ- మొత్తం 3 టెస్టులకీ 17 వికెట్లు లాక్కుంటే- ‘‘ఆగు బ్రదర్! నా వికెట్లు కూడా లెక్కెట్టుకో’’- అన్నట్లు జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 20 వికెట్లు లాగేసి, వరల్డ్ రికార్డుని జేబులో వేసుకున్నాడు.
కపిల్ దేవుడే అన్నాడు- ‘‘ఓరి పిడుగా! నువ్వు నా అంచనాల్నే తిప్పి కొట్టేశావు’’- అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. అలనాటి ‘కపిల్ డెవిల్’.
బుమ్రా 3 రకాల క్రికెట్‌లలోను యిక మీదట ‘మస్ట్’ అయినాడు. ఎన్నడో 2004లో రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ- పాక్, బంగ్లాదేశ్ గడ్డలపై ఘన విజయాలు సాధించారు. ఆనక 2010లో వీరేంద్ర సెహవాగ్, ఎమ్మెస్ ధోనీల నాయకత్వంలో మన జట్టు ఒకే ఏడాది సీమాంతర విజయాలు నాలుగింటిని సాధించింది. అంతే... తర్వాత ఖ్యాతి- క్రెడిట్ యిప్పుడు- 2018 మన క్రికెట్ వీరులదే! దక్షిణాఫ్రికానీ, ఇంగ్లండ్‌నీ వోడించి, యిప్పుడు ఆస్ట్రేలియాని మూడు సముద్రాల నీళ్లు తాగించిమరీ వోడిస్తున్నారు అనిపిస్తోంది. విదేశీ గడ్డమీద, యింకా మూడునెలల పాటు మనవాళ్లు క్రికెట్ ఆడవలసి వుంది. ఈ ‘‘ఊపూ’, ఈ ‘‘దూకుడూ’’ ఇలాగే కొనసాగాలి. ప్రపంచకప్‌ను మనం ఈ ‘వేడి’తో సాధించాలి.
లెట్ పీపుల్ సే.. ఇండియా దటీజ్ క్రికెట్!

‘దండన’ పేరిట శిక్షలు దారుణం

$
0
0

ఉపాధ్యాయులు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులు చేసే చిన్న తప్పులకు సైతం పెద్దశిక్షలు వేయడం తరచుగా మనం గమనిస్తున్నాం. విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని, హోం వర్క్ చేయలేదని, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని, ఫీజులు సకాలంలో చెల్లించలేదని, టై బెల్టు, షూ, యూనిఫాం లాంటివి ధరించలేదనే చిన్న చిన్న విషయాలకు కూడా ఉపాధ్యాయులు అనవసరంగా ఆవేశపడి విద్యార్థులను అమానవీయంగా శిక్షిస్తున్నారు. ఎండలో నిలబెట్టడం, బెత్తంతో కొట్టడం, బట్టలు ఊడదీసి నిలబెట్టడం, గోడ కుర్చీ వేయించడం, మోకాళ్ళపై కూర్చోబెట్టడం లాంటి ‘శిక్ష’లు విధిస్తున్నారు. ఇలా ఉపాధ్యాయులు విద్యార్థులకు ‘దండన’ పేరిట శిక్షలు వేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పిల్లలను దండించాల్సిన సందర్భాలలో ఉపాధ్యాయులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థులు చేసిన తప్పులకు కారణాలను వెతకాలి. వాటికి పరిష్కార మార్గాలను అనే్వషించాలి. విద్యార్థి తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించాలి. అప్పటికీ విద్యార్థులు తమ తప్పులను సరిదిద్దుకోలేకపోతే ఉపాధ్యాయులు ముందుగా వారిని హెచ్చరించాలి. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులను, సంరక్షకులను సంప్రదించి తగు జాగ్రత్తలను తీసుకోమని చెప్పాలి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ప్రధానోపాధ్యాయులకో, విద్యాశాఖ అధికారులకో ఫిర్యాదుచేయాలి కానీ విద్యార్థులను కఠిన దండనలకు, శిక్షలకు గురిచేయకూడదు.
ఉపాధ్యాయులు తొందరపడి విద్యార్థులను శారీరకంగా హింసించడం దుర్మార్గమైనది, చట్టవిరుద్ధమైనది. ఉపాధ్యాయులు తాము విద్యార్థులను అదుపులో ఉంచడం కోసమే దండించామని చెబుతుంటారు. అందులో నిజమెంత? క్రమశిక్షణలో ఏకైక ఉద్దేశం ఏమిటంటే మనకు కావలసిన ప్రవర్తనను విద్యార్థులకు నేర్పడం. వారు తమ అనుచిత ప్రవర్తనను గుర్తించుకొనేలా, సరైన మార్గంలో పయనించేలా చేయాలి. ఇది దండనల ద్వారా సాధ్యమవుతుందా? అన్న విషయాన్ని టీచర్లు, పాఠశాల నిర్వాహకులు బేరీజు వేసుకోవాలి.
ఉపాధ్యాయులు ఏమీ చేయకూడదని ఎవరూ చెప్పరు. అయితే, పిల్లల్ని కొట్టడం, గుంజీళ్లు తీయించడం, గోడ కుర్చీ వేయించడం, చెంప దెబ్బలు వేయించడం, పరిగెత్తించడం, ఎండలో నిలబెట్టడం, జుట్టుపట్టి లాగడం, కర్రతో లేదా ఇతర వస్తువులతో కొట్టడం వంటి పనులన్నీ శారీరక దండన కిందకు వస్తాయి. విద్యార్థులను శారీరక దండనలకు గురిచేయకూడదు. అదే విధంగా పిల్లలను మానసికంగా హింసించడం అంటే వారిని అందరి ఎదుట తిట్టడం, కించపరచడం, ఆటలలో, పాటలలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వకపోవడం, తరగతి గది నుంచి ఇంటికి పంపించి వేయడం, తల్లిదండ్రులను రప్పించి వారి ముందు తిట్టడం, ఇతరులతో పోల్చడం, అవమానించడం, తరగతి గదిలోకి అనుమతించకపోవడం, చీదరించుకోవటం, పేర్లుపెట్టడం, తల్లిదండ్రులు చేసే పనిని, కులాన్ని అపహాస్యం చేయడం, ఆరోగ్య స్థితిని, శారీరక స్థితిని చూసి వెక్కిరించడం, గేటుముందు నిలబెట్టడం, అంగ వైకల్యాన్ని వెక్కిరించడం ఇలాంటివన్నీ మానసిక దండన కిందకు వస్తాయి. ఇలాంటి పనులకు ఉపాధ్యాయులు ఎన్నడూ చేయకూడదు. కుల, మత, భాష, రంగు, జాతి, లింగ, ప్రాంతం మొదలైన వాటిలో తేడా చూపడాన్ని వివక్షగా చెప్పవచ్చు.
ప్రస్తుత పరిస్థితులలో పాఠశాలల్లో విద్యార్థినులు లైంగిక వేధింపులకు సైతం గురవుతున్నారు. బాలురపైనా పలురకాల వేధింపులు చూస్తున్నాము. విద్యార్థులను ఎటువంటి వివక్షకు, లైంగిక వేధింపులకు గురిచేయకూడదు. ఉపాధ్యాయులు విద్యార్థులను దండనలకు గురిచేయడంలో కారణాలు విశే్లషిస్తే పని ఒత్తిడి, పాఠశాల యాజమాన్యం లక్ష్యాలను నిర్దేశించడం, వాటిని చేరుకోవడంలో ఆందోళన, విద్యార్థులపై తల్లిదండ్రులు ఆకాంక్షలు పెరిగిపోవడం తదనుగుణంగా విద్యార్థి స్థాయిని గమనించకుండా విద్యార్థిని ఒత్తిడికి గురిచేయడం నేడు సర్వసాధారణమైంది. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థలు నేడు అనుసరిస్తున్న వ్యాపార ధోరణులు, ఉపాధ్యాయులలో తగిన శిక్షణ లేకపోవడం, విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోకపోవడం, టీచర్లకు ఉద్యోగ భద్రత లేకపోవడం, సరైన అధ్యయనం చేయకుండా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయలేక దండించడం, ఉపాధ్యాయులలో ఉన్న అసహనం ఇవన్నీ కారణమవుతున్నాయి.
చట్టాలు ఏం చెబుతున్నాయి...?
ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం-2009 సెక్షన్ 17 ప్రకారం శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నేరం. ఏ బాలుడు, బాలిక కూడా శారీరక శిక్షలకు, మానసిక వేధింపులకు గురికాకూడదు. దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఉద్యోగ నియమాల ప్రకారం ఉపాధ్యాయులు క్రమశిక్షణ చర్యలకు గురవుతారు. దండిస్తేనే చదువు వస్తుందని నమ్మడం, తమకు అలాగే చదువు వచ్చింది కాబట్టి తాము బోధించే వారికి కూడా అలాగే బోధించడం సరైనదని భావించడం అనేది ఒక అపోహ. భయపెట్టినప్పుడు మాత్రమే పిల్లలు క్రమశిక్షణతో ఉంటారని భావించడం లాంటి విశ్వాసాలను ఉపాధ్యాయులు విడనాడాలి.
పిల్లలు బాగా చదవాలని కోరికతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని ఒత్తిడికి గురిచేయడం వల్ల ప్రతికూల స్వభావం ఏర్పడుతుందే తప్ప ఆశించిన ఫలితాలు నెరవేరవు. దండన అనేది మనం ఏమి ఆశించి విధిస్తున్నాం? దండనకు, అభ్యసనానికి మధ్య సంబంధం ఏమిటి? అనే విషయాలు తెలుసుకోవాలి. పిల్లల్లో అభ్యసనం అనేది వారికి కల్పించిన బోధనాభ్యసన ప్రక్రియలు, కల్పించిన అవకాశాలు, నైపుణ్యాలు, ఆసక్తులు, వైఖరులు మొదలైన వాటినిబట్టి ఆధారపడి ఉంటుంది. పిల్లలను నియంత్రించడం ద్వారా, దండనల ద్వారా అభ్యసనం సాధ్యం కాదు. భయపూరిత వాతావరణంలో అభ్యసనం జరగదు. పిల్లల్లో ఆశించిన అభ్యసనం, సామర్థ్యాలు రాకపోతే అందుకు కారణాలను అనే్వషించి, పరిష్కార మార్గాలను అనే్వషించి అమలు చేయాలి. అందుకు విరుద్ధంగా విద్యార్థుల స్వేచ్ఛను హరించడం, వారిని దండనలకు గురిచేయడం ఎంతమాత్రం తగదు. పిల్లల స్వభావానికి వ్యతిరేకమైన విధానాలను అవలంబించకుండా ఇంట్లోనూ, పాఠశాలలోను పిల్లల స్వభావాన్ని అర్థం చేసుకొని బాల్యాన్ని ఒక నిర్మాణాత్మక దశగా గుర్తించాలి. భయ రహిత వాతావరణాన్ని కల్పించాలి. అటువంటి సందర్భాలలో మాత్రమే ఆశించిన ఫలితాలను సాధించవచ్చు. ఎలాంటి దండనలు,వివక్షలు లేకుండా ఉండటం, విద్యార్థుల భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశాలు కల్పించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం, ఒత్తిడి లేకుండా లక్ష్యాలను సాధించడం వంటివి భయరహిత వాతావరణంలోనే సాధ్యమవుతుంది. అటువంటి భయరహిత వాతావరణానికి, విద్యార్థుల స్వేచ్ఛా వ్యక్తీకరణకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు పాటుపడాలి.


దండకారణ్యంలో ప్రశాంతత ఎండమావేనా?

$
0
0

‘పిడికిలి బిగించాక కరచాలనం చేయలేం..’ అని అలనాడు ప్రధాని ఇందిరా గాంధీ అన్న మా టలు నేడు పాలకులకు, మావోయిస్టులకు మధ్య నెలకొన్న సంఘర్షణకు అతికినట్లు సరిపోతాయి. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మావోయిస్టులతో చర్చల ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ చర్చలు జరిగితే- ప్రభుత్వం, మావోయిస్టులు ‘పిడికిలి’ బిగించి కరచాలనం చేసేందుకు ప్రయత్నిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. తుపాకీ మోతలు, మందుపాతరల పేలుళ్లతో దద్దరిల్లుతున్న దండకారణ్యంలో శాంతి కుసుమం వికసించాలంటే అటు ప్రభుత్వం, ఇటు మావోలు చిత్తశుద్ధితో చర్చల ప్రక్రియను జరపాలి. తమ పార్టీ గెలిస్తే మావోలతో చర్చలు జరుపుతామని కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ సంకేతాలు పంపడం ఆహ్వానించదగిన పరిణామం. దండకారణ్యంలో ‘బుల్లెట్‌కు బుల్లెట్’అనే విధానం విఫలమైందని, కొత్త ఆలోచనలతో చర్చలు జరిపే తరుణం ఆసన్నమైందని బాగేల్ అన్నారు.
దండకారణ్యంలో పారా మిలటరీ బలగాల క్యాంపులు ఎక్కువగా ఉన్నాయి. ఇలా బలగాలను మోహరించడం వల్ల ఉపయోగం లేదని బాగేల్ పేర్కొన్నా, ఆచరణలో ఆయన మాటలను అధికార యంత్రాంగం వింటుందనే నమ్మకం లేదు. ఎదురుకాల్పుల సంఘటనల్లో ఎంతమంది మరణించారని మృతదేహాలను లెక్కించుకోవడం లాంటి పరిస్థితులు పునరావృతం కానివ్వమని కొత్త సీఎం అంటున్నారు. బస్తర్ అభివృద్ధికి, దండకారణ్యంలో శాంతికి మావోలతో చర్చలే శరణ్యమని బాగేల్ నమ్ముతున్నారు.
కాంగ్రెస్‌కు 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో అధికారం వచ్చింది. అధికారం చేపట్టాక- ముఖ్యమంత్రులు జనం సమస్యలపై ఉల్లాసపరిచే ప్రకటనలు చేయడం రివాజు. కాలం గడిచే కొద్దీ తాను సమాజాన్ని శాసించే శక్తులు, బ్యూరోక్రసీ, ఆధిపత్యం చలాయించే వర్గాల మధ్య పావుననే విషయాన్ని ప్రతి ముఖ్యమంత్రి గ్రహించేందుకు ఎక్కువ కాలం పట్టదు. అధికారాన్ని రుచిమరిగిన నేతలు మావోలతో చర్చల ప్రక్రియ అనే సంక్లిష్టమైన పాలనా నిర్ణయాలను అమలు చేసే శక్తిని సహజంగానే కోల్పోతారు. ఛత్తీస్‌గఢ్ లాంటి వెనకబడిన చిన్న రాష్ట్రంలో పరిస్ధితి గురించి పెద్దగా మదింపువేయాల్సిన పనిలేదు. చర్చలు జరుగుతాయా? లేదా? అనే విషయం పక్కనపెడితే, ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు దండకారణ్యంలోకి వెళ్లాయి. ఈ చర్చలపై పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంస్థలు, జర్నలిస్టులు, ప్రజాస్వామ్య సంఘాలు, అధికారంలోకి ఎప్పటికీ రాని కొన్ని పార్టీల నేతలు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారు. వీరంతా వాస్తవానికి అతీతంగా ఆలోచించి అద్భుతాలు జరుగుతాయనుకుంటారు.
పదిహేనేళ్లుగా దండకారణ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చర్చల వల్ల ఉద్రిక్తతలు సడలితే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. ప్రశాంత పరిస్థితుల్లో మావోలు కూడా స్థిమితంగా ఆలోచించేందుకు తగిన అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే తమ సుదీర్ఘ పోరాటంలో మావోయిస్టులు కోలుకోలేని దెబ్బతిన్నారు. చర్చలు జరిగినంత మాత్రాన మావోలు ఆయుధాలు వదలరు, జన జీవన స్రవంతిలోకి రారు. చర్చల వల్ల- కాలదోషం పట్టిన సిద్ధాంతాలతో పోరాడుతున్న మావోల్లో తప్పనిసరిగా పరివర్తన వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ చరిత్రను తిరగేస్తే రాజకీయంగా ఏ వాదం కూడా తుడిచిపెట్టుకుపోదు. క్లిష్ట పరిస్థితుల్లో మావోలు రెండడుగులు వెనక్కి వేసినా అదను చూసి మరో అడుగు ముందుకేస్తారు.
దండకారణ్యం 2005 వరకు ప్రశాంతంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోలతో చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తీవ్రవాద సిద్ధాంతాలను అమలు చేసే నక్సలైట్లతో పెద్ద ఎత్తున చర్చలు జరపడం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ చర్చల వల్ల కొంతకాలం శాంతి నెలకొంది. ఈ చర్చలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు హోం మంత్రి కుందూరు జానారెడ్డి దక్షతతో నిర్వహించారు. అప్పటి పోలీసు ఉన్నతాధికారులు కూడా చర్చలు జయప్రదం కావాలని కోరుకున్నారు. నక్సలైట్ నేతలను హైదరాబాద్‌కు ఆహ్వానించి వారికి అన్ని సదుపాయాలు కల్పించారు. ఆ తర్వాత అనేక కారణాలతో చర్చ లు విఫలమయ్యాయి. అనేక ఎదురుకాల్పుల ఘటనల్లో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు మృతి చెందారు. సామాజిక, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో మార్పులు, సంక్షేమ పథకాల అమలు, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మావోల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన చర్చలు, విధి విధానాలను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇప్పుడు పరిశీలించాలి. ఇక్కడ తలెత్తిన లోపాలేమైనా ఉంటే సరిచేసుకోవాలి.
2005 నుంచి 2018 వరకు 14 ఏళ్ల పాటు దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని విశే్లషిస్తే- 3165 మంది పౌరులు, 1999 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది, 2897 మంది నక్సలైట్లు కలిపి 8066 మంది మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లో 832 మంది పౌరులు, 1022 మంది పోలీసులు, 1093 మంది నక్సలైట్లు కలిపి 2947 మంది, ఆంధ్రాలో 276 మంది పౌరులు, 37 మంది పోలీసులు, 429 మంది నక్సలైట్లు కలిపి 747 మంది, 2014లో తెలంగాణ అవతరించిన తర్వాత గత ఐదేళ్లలో 8 మంది పౌరులు, 16 మంది నక్సలైట్లు కలిపి 24 మంది, ఒడిశాలో 345 మంది పౌరులు, 196 మంది పోలీసులు, 248 మంది నక్సలైట్లతో సహా 789 మంది మరణించారు.
2005లో చర్చల తర్వాత తలెత్తిన పరిణామాలను విశే్లషిస్తే కొంత కాలం తుపాకుల మోత తగ్గినా, ఆ తర్వాత ప్రభుత్వం ఆదేశం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేయడం, మావోలు కూడా హింసాత్మక ఘటనలకు పాల్పడడంతో ఎన్‌కౌంటర్లకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందే నక్సలైట్లు దండకారణ్య ప్రాంతానికి తరలివెళ్లారు. ఆ తర్వాత గిరిజనుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాటానికి దిగారు. వామపక్ష తీవ్రవాదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశాకు మకాం మార్చినట్లు స్పష్టమవుతుంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు ఖర్చుపెడుతున్నాయి. ఈ పథకాలు నిర్దేశించిన ఫలితాలు అందిస్తున్నాయా? లేదా? అనే విషయం పక్కన పెడితే- పేదలు ఆకలితో అలమటించే పరిస్థితులు లేకుండా చేశారు. టెక్నాలజీని వినియోగించుకుని సంక్షేమ ఫలాలను అన్ని వర్గాలకు ప్రభుత్వాలు అలవాటు చేశాయి. ప్రజలు కూడా భోగలాలసకు అలవాటుపడడంతో ఆశ్చర్యకరంగా వామపక్ష తీవ్రవాదానికి నిలువనీడ లేకుండాపోయింది.
ఆంధ్ర, తెలంగాణల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో రైతులు, రైతుకూలీలు, శ్రామిక, కార్మికవర్గాల్లో చోటు చేసుకున్న మార్పులు తాత్కాలికమే. భూసంస్కరణలు పూర్తిగా అమలు కాలేదు. పేదవర్గాల్లో బయటకు కనపడే మార్పు శాశ్వతంగా ఉండకపోవచ్చు. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి నిధుల కొరత తలెత్తితే ముందుగా వేటుపడేది సంక్షేమ రంగంపైనే. కంటికి కనపడేదంతా నిజం కాదు. బయటకు అంతా పచ్చగా కనపడుతున్నా సంపద పంపిణీ లేదు. ‘పేదవాడికి భోజనం చేసేందుకు చేపను ఇవ్వకు.. చేపలను ఏ విధంగా పట్టాలో నేర్పించాలి..’ అనే సిద్థాంతానికి తిలోదకాలిచ్చేశారు. ఓటుబ్యాంకు కోణంలో అర్హత లేని వారికి కూడా సంక్షేమాన్ని వర్తింప చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విధానం బెడిసికొట్టక తప్పదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే మళ్లీ భూమి సమస్య తెరపైకి వస్తుంది.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నంబాళ్ల కేశవరావు ఎన్నిక కావడంతో రానున్న రోజుల్లో ఆ పార్టీ- సరికొత్త విస్తరణ, అర్బన్ నక్సలిజం ఎత్తుగడలతో ముందుకు వస్తుంది. ప్రస్తుతం నక్సలైట్లపై పోలీసు బలగాలు టెక్నాలజీ సహాయంతో పైచేయి సాధించాయి. నక్సలైట్లు తమ రాజకీయ అజెండా కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు. వీరికి పోలీసులు శత్రువులు కారు. సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ చేయాలనే సిద్ధాంతాన్ని వ్యతిరేకించే పార్టీలు అధికారంలో ఉంటాయి. ఈ ప్రభుత్వాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు పోలీసుల భుజం మీద తుపాకీ పెట్టి నక్సలైట్లను నిర్వీర్యం చేయాలని చూస్తాయి. ఈ హింసాక్రీడలో బలయ్యేది పోలీసులు, నక్సలైట్లు, సాధారణ పౌరులే. పోలీసు సంస్కరణలకు మూల పురుషుడు, రిటైర్డు పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రకాశ్ సింగ్ - ‘నేను నక్సలైట్ల గురించి నిస్సంకోచంగా చెప్పేందుకు వెనకాడను. నక్సలైట్లలో చాలా మంది రాజకీయ సిద్ధాంతాలకు ప్రేరేపితులై వచ్చారు. ఒక ఉదాత్తమైన లక్ష్యం కోసం పోరాడుతున్నామనే భావనతో ఉన్నారు. ప్రస్తుతం మన చట్టసభల్లో చొరబడిన నేరగాళ్ల కంటే నక్సలైట్లే మేలు. క్రిమినల్స్ సైతం మంత్రులు అవుతున్నారు’ అని చెప్పారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి రిటైర్డయిన ఎం.కృష్ణ్ధర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ,‘్భరత్‌లో మావోయిస్టు పార్టీ ఉద్యమం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మధ్య ఉన్న వ్యత్యాసానికి నిదర్శనం. పోలీసు చర్యల ద్వారా నక్సలైట్ సమస్యను పరిష్కరించలేం’ అన్నారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రానున్న రోజుల్లో నక్సలైట్లతో చర్చల ప్రక్రియను ఎలా ప్రారంభించబోతుందనే విషయమై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 15 ఏళ్లుగా దండకారణ్యంలో రక్తం ఏరులై పారుతోంది. ఈ రాష్ట్రంలో ఇంద్రావతి, ప్రాణహిత, శబరి, గోదావరి నదుల మధ్య విస్తరించి ఉన్న దండకారణ్యంలో శాంతి నెలకొనేందుకు ప్రభుత్వం పెద్ద అడుగు వేయాలి. రాజ్యాంగ విధులు కాపాడేందుకు పోలీసు బలగాలను నక్సలైట్లపైనే వినియోగించడమా ? నక్సలైట్లు కూడా కాలదోషం పట్టిన సిద్ధాంతాలను వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలి. తెలుగురాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ఉద్యమ వ్యాప్తిలో కీలకపాత్ర వహించిన ప్రజా గాయకుడు గద్దర్ కూడా చివరకు బుల్లెట్ కంటే బ్యాలెట్ పదునైన ఆయుధం అని ప్రకటించాడు. భార్యతో కలిసి వచ్చి ఓటు వేశారు. భారతీయ సాంస్కృతిక, సామాజిక వ్యవస్థలకు వ్యతిరేకమైన వామపక్ష తీవ్రవాదం ద్వారా నక్సలైట్లు సాధించేదేమీ లేదు. జనజీవన స్రవంతిలోకి వారు అడుగుపెట్టి, భ్రష్టుపట్టిన రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పేలా ప్రజాస్వామ్య పంథాలో నడవాలి.

సీ ఎం పర్యటన రద్దు

$
0
0

రాజాం, జనవరి 3: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరో విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రాజాం పర్యటన ఐదో తేదీన ఖరారు చేశారు. అయితే గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాష్టమ్రంత్రి కళా వెంకటరావుకు సీ ఎం పర్యటన రద్దయినట్టు సందేశం పంపడంతో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పర్యటన వాయిదా పడిందని, ఈ నెల 12 వరకు జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న దృష్ట్యా ఏదో ఒక రోజు రాజాం వచ్చే సూచనలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే శ్రీకాకుళం రోడ్డులో ఏడు ఎకరాల స్థలాన్ని చదును చేసి వేదిక ఏర్పాటుకు సిద్దం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని మరమ్మతులన్నీ గురువారం యుద్దప్రాతిపదికన చేపట్టారు. ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, మున్సిపల్ ఇతర శాఖల అధికారుల సమన్వయంతో వేదిక తయారు చేస్తున్న తరుణంలో ఈ సమాచారం రావడంతో అధికారులంతా వెనక్కి తిరిగారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
*ఎమ్మెల్యే కలమట
హిరమండలం, జనవరి 3: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. గురువారం లోకొండ, సీది గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. లోకొండ నుంచి మన్మాన్‌గూడకు కోటి 86 లక్షలతో బీటీ రహదారి, సీది నుంచి కిట్టాలపాడుకు రూ.3 కోట్లతో బీటీ రోడ్డు, మజ్జిగూడెం ఎత్తిపోతల పథకాన్ని ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మజ్జిగూడెం ప్రాంతలోనిర్వహించిన సమావేశంలో కలమట వెంకటరమణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చిరకాల వాంఛ అయిన ఎత్తిపోతల పథకానికి సాధించడం ఎంతైనా ఆనందంగా ఉందన్నారు. సీది, ఎస్‌జేపురం, సవరబొంతు తదితర గ్రామాలకు చెందిన 730 గ్రామాలకు సాగనీరు అందుతుందన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో 8 వేల ఎకరాలకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందడం జరుగుతుందన్నారు. గిరిజన గ్రామాల ప్రాంతాలకు కూడా రహదారి సౌకర్యం ఏర్పడుతుందన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అలాగే భగరీధపురం, ఎం. ఎల్.పురం జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొని సంక్షేమపథకాలు అందించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సమస్యలపై ప్రజలు నిలదీత
హిరమండలం, జనవరి 3: ప్రజా సమస్యలపై ప్రజలు నిలదీసిన సంఘటనలు గురువారం జన్మభూమి కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి. భగీరధపురం, ఎం ఎల్‌పురం గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో అధికారులను నిలదీశారు. అర్హులైన వారికి పింఛన్లు అందించలేదన్నారు. ప్రచార ఆర్భాటానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కాశీవిశ్వనాధం, ఎం ఈవో రాంబాబు, ఈవో పీ ఆర్‌డీ విజయలక్ష్మీ తదితరులున్నారు.

చంద్రబాబువి కుట్ర రాజకీయాలు
*బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ రవీంద్రబాబు
ఎల్ ఎన్‌పేట, జనవరి 3: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్ దుప్పల రవీంద్రబాబు అన్నారు. గురువారం మండలంలోని పెద్దకొల్లివలస, ఎల్ ఎన్‌పేట జంక్షన్‌లో ఇంటింటా బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా మార్చి కేంద్రం ఏమీ సాయం చేయడం లేదని ప్రచారం చేయడం తగదన్నారు. పథకాలన్నీ అవినీతిమయంగా తయారయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చంద్రబాబు ఏవీ సంపూర్ణంగా నెరవేర్చలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ

సమస్యల పరిష్కారానికి జన్మభూమి

$
0
0

పలాస, జనవరి 3: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్ అన్నారు. పలాస మండలంలోని బంటుకొత్తూరు, అమలకుడియా పంచాయతీల్లో, పలాస మున్సిపాలిటీలోని 3వ వార్డు, తాళభద్రలో జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర ఏళ్లుగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని, నేటికి అందని వారికి కూడ పథకాలు అందించాలని ధ్యేయంతో జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్తే తక్షణమే పరిష్కారించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకం అర్హులకు అందిన నాడు ప్రభుత్వ లక్ష్యం నేరవేరవుతుందని, రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహాలు కోసం అర్హులు దరఖాస్తులు చేసుకోవచ్చునని, అర్హులైతే వారికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి పథకాలు అందించేందుకు సేవామిత్రలను ఏర్పాటు చేసి, పథకాలు అందిస్తున్నామన్నారు. అనంతరం జన్మభూమి కార్యక్రమంలో చంద్రన్న కానుకలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పలాస మున్సిపల్ కమిషనర్ రమేష్‌నాయుడు, ఎంపీడీవో సూర్యనారాయణ, తహసీల్థార్ కల్యాణచక్రవర్తి, పట్టణ టీడీపీ అధ్యక్షులు లోడగల కామేశ్వరరావు, వజ్జ బాబురావు, బి.సూర్యనారాయణ, రవిశంకర్‌గుప్తా, బడ్డ నాగరాజు, పుట్టా లోకనాధం తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బాలకృష్ణను గెలిపించుకుందాం
పలాస, జనవరి 3: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆపస్ అధికార అభ్యర్థి జి.బాలకృష్ణను గెలిపించుకుందామని ఆపస్ జిల్లా అధ్యక్షుడు చందనరావు పిలుపునిచ్చారు. గురువారం పలాస మండలంలో బాలకృష్ణ పర్యటనలో భాగంగా మండలంలోని ఉపాధ్యాయులను, స్థానిక ప్రభుత్వ జూనియర్‌కాలేజిలో అధ్యాపకులు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, ఎస్‌జీటీలుగా ఉపాధ్యాయ జీవితం ప్రారంభించిన బాలకృష్ణ ప్రధానోపాధ్యాయుడుగా, ఎం ఇవోగా పనిచేసిన అనుభవంతో ఉపాధ్యాయుల సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని, ఎమ్మెల్సీగా విజయం సాధిస్తే శాసనమండలిలో తనకున్న అనుభవంతో సమస్యలపై తన గళం వినిపించి పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో చక్రపాణిప్రధాన్, మాధవరావు, ఎస్.రామారావు, కె.షణ్ముఖరావు, త్రిలోచనరావు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

ఎబివిపి రాష్ట్ర కార్యవర్గసభ్యుడుగా సందీప్‌రెడ్డి
పలాస, జనవరి 3: అఖిల భారత విద్యార్థిపరిషత్ 64వ జాతీయమహాసభల్లో గుజరాత్ రాష్ట్రం, అహ్మద్‌బాద్‌లో నిర్వహించారు. ఈ మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గసభ్యుడుగా పలాసకు చెందిన అక్షర డిగ్రీకాలేజిలో చదువుతున్న జి.సందీప్‌రెడ్డిను ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గసభ్యుడుగా ఎన్నికపై హర్షం వ్యక్తం చేయడంతోపాటు జిల్లాకు కీర్తి తెచ్చిన సందీప్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమస్యలపై పోరాడి విద్యార్థులకు న్యాయం జరిగే పోరాడుదామని, విద్యార్థులు దేశభక్తి వైపు మళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నో ఏళ్లుగా విద్యార్థుల సమస్యల పరిష్కారంకాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏబివిపి ద్వారా రాజీలేని పోరాటం చేసి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు శ్రమిస్తున్నామని భరోసా ఇచ్చారు.
కానరాని ఫారంగేట్ పాలసీ
పాలకొండ, జనవరి 3: దళారుల బెడద లేకుండా రైతుల చెంతకే అధికారులు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నూతనంగా ఫారంగేట్ పాలసీ ప్రవేశపెడతామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఈ పద్దతి ద్వారా ధాన్యం కొనుగోలు జరపలేదని అభ్యుదయ రైతు కె.ప్రసాదరావు తెలిపారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జనవరి మొదటి వారం ప్రవేశించినా ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదన్నారు. ఇప్పటికే మండలంలో 40 శాతానికి పైగా రైతులు దళారుల ద్వారా ఇతర జిల్లాలకు ధాన్యం తరలించారని, మద్దతు ధర ప్రకారం 80 కిలోల బస్తా రూ.1400 కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ రైతులకు ఆ ధర చెల్లించడం లేదన్నారు. దీంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే రైతుకు బస్తా ఒక్కంటికి రూ.45 రవాణా ఖర్చు చెల్లించాల్సి ఉన్నప్పటికీ అక్కడ ఉన్న మిల్లర్లు తమ ఉందనే నెపంతో మద్దతు ధరలో కోత విధిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందే విధంగా కొనుగోలు కేంద్రాలు ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జన్మభూమి గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక
సరుబుజ్జిలి, జనవరి 3: మండలంలో నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు గ్రామసభల ద్వారా వివిధ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న అర్హుల ఎంపిక జరుగుతుందని ఎంపీడీవో పావని, తహశీల్దార్ ప్రభాకర్ జేమ్స్ అన్నారు. గురువారం మండలంలోని చిన్నకాగితాపల్లి గ్రామ పంచాయతీలో ఎంపీడీవో పావని మూల సవలాపురం గ్రామ పంచాయతీలో తహశీల్దార్ ప్రభాకర్ జేమ్స్ జన్మభూమి గ్రామసభలు నిర్వహించారు. మూలసవలాపురం గ్రామ పంచాయతీలో ఈవోపీ ఆర్‌డీ విజయభాస్కర్ మాట్లాడుతూ గ్రామసభల్లో గ్రామ పంచాయతీ ప్రణాళికలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించాలన్నారు. అలాగే మండలంలోని 21గ్రామ పంచాయతీల్లో ఉన్న వివిధ రకాల పింఛన్లకు దరఖాస్తుదారుల ఎంపికలో అర్హులను గుర్తించారు. వైద్యాధికారి భార్గవప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. చిన్నకాగితాపల్లి గ్రామ పంచాయతీలో మండల ప్రత్యేకాధికారి దామోదరరావు మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు కుంటుపడుతున్న పశుసంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు కుటుంబంపై ఉందన్నారు. పశుసంవర్ధకశాఖ ద్వారా పశువులు పెంచే వ్యక్తులకు రాయితీలపై పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ రెండు గ్రామసభల్లో రేషన్‌కార్డుదారులకు చంద్రన్న సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసబాబు, ఏపీ ఎం కమలకుమారి, జే ఈ పూర్ణమ్మ, ఎం ఈవో బాలరాజు, టీడీపీ నాయకులు సురేంద్ర, రమేష్ పాల్గొన్నారు.
మోడీ విధానం ఫెడరల్ వ్యవస్థకే విఘాతం
*రాష్ట్ర విద్యుత్‌శాఖామంత్రి కళా వెంకటరావు
రాజాం, జనవరి 3: దేశ ప్రధాని నరేంద్రమోడీ విధానాలు ఫెడరల్ వ్యవస్థకే విఘాతం కలిగేలా ఉన్నాయని రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రి కిమిడి కళావెంకటరావు విమర్శించారు. గురువారం విలేఖర్లతో మట్లాడారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పాలైన తర్వాత ప్రధానిలో నిరాశ, నిస్పృహ ఆవహించాయని, దీంతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంపై కక్షతో మాట్లాడుతున్నారని విమర్శించారు. భారతదేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు అందరిలో మోడీ విధానాలు దిగజారిన స్థాయిలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో తోలుబొమ్మలకు మాటలు, ఆటలు ఆడిస్తున్నారని విమర్శించారు. పబ్లిసిటీ కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ అధికార ప్రతినిధి నోటికొచ్చిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆడిపోసుకుంటున్నారని, ఇప్పటికైనా దిగజారుడు విమర్శలు మానుకోవాలని సూచించారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించినప్పుడు కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలందరూ విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని కోరాయని, దానిని మోడీ ప్రభుత్వం మరిచిపోయి రాష్ట్రాన్ని అన్ని విధాలా ప్రగతి చూపుతున్న చంద్రబాబును విమర్శించడం తగదన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని చెప్పిన కేంద్రం రూ.1200 కోట్ల బకాయిలను ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. రూ.50 వేల కోట్ల విలువైన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం అందించినప్పటికీ విద్యా సంస్థలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని, విశాఖ రైల్వేజోన్ ఊసే లేదని, వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు ప్రకటించిన కేంద్రం ఇంతవరకు విడుదల చేయలేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎన్నికల ప్రయోజనం కోసం వేలాది కోట్లు నిధులు మిగిలిన రాష్ట్రాలకు విడుదల చేశారని పేర్కొన్నారు. విభజన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పేదవాడి సొంతింటి కల నేరవేర్చలేని ప్రభుత్వం

$
0
0

పలాస, జనవరి 3: పేదవాడి సొంతింటి ల నేరవేర్చలేని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని పలాస పట్టణ బీజేపీ అధ్యక్షులు పాలవలస వైకుంఠరావు ధ్వజమెత్తారు. గురువారం కాశీబుగ్గలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంతింటి కల నేరవేర్చాలనే ధ్యేయంతో నిధులు కేటాయించినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో జాప్యం వహించిందని, దీనితో ఇళ్లు మంజూరు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని, అధికారులు నిర్లక్ష్యం వహించడానికి గల కారణాలు ఏమిటి అని, నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. పేదవారు పూరిపాకలు తొలగించి, పునాదులు వేసుకొని శ్లాబులు వేసి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బిల్లులకు కేంద్రం నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదన్నారు. పేదలకు అన్యాయం జరిగితే పేదల కన్నీరులో ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకొని నిరుపేదలకు అందించకుండా పచ్చచొక్కాలకు, జన్మభూమి కమిటీలకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఎహెచ్‌పీ ఇళ్లు పేరుతో కొంతమంది నేతలు డబ్బులు దండుకున్నారని, డబ్బు వున్నవారికి ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. ఇళ్లు కేటాయింపులపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. ఈయనతోపాటు బీజేపీ మండల అధ్యక్షుడు కె.్భస్కరరావు, హరికృష్ణ తదితరులున్నారు.
ఎటువంటి విచారణకైనా సిద్దం
పలాస, జనవరి 3: పలాస పీ ఎసీ ఎస్‌లో అవకతవకలు జరిగినట్లు ఇటీవల మాజీ పీ ఎసీ ఎస్ అధ్యక్షుడు సిర్ల రవిచంద్రతోపాటు మరికొంతమంది టీడీపీ నాయకులు ఆరోపించడం తగదని, ఎటువంటి విచారణకు సిద్దంగా ఉన్నామని పలాస పీ ఎసీ ఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీ్ధర్(బాబా) స్పష్టం చేసారు. గురువారం తన స్వగృహంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి రికార్డులను బహిర్గతం చేసారు. పీ ఎసీ ఎస్‌లో 10 నుంచి 15 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగినట్లు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని, తాను ఫిబ్రవరి 6,2013లో బాధ్యతలు తీసుకున్నానని, అప్పటికి పలాస పీ ఎసీ ఎస్ ఔట్‌స్టాండింగ్ 4 కోట్ల 70 లక్షల 75680 రూపాయలు, నేటి ఔట్‌స్టాండింగ్ 8 కోట్ల 80 లక్షల 60628 రూపాయలు, అలాంటింది 10 నుంచి 15 కోట్ల రూపాయలు కుంభకోణం ఏలా జరుగుతుందో వారే చెప్పాలన్నారు. 2013 నాటికి సిర్ల రవిచంద్ర పీ ఎసీ ఎస్ అధ్యక్షుడుగా ఉండేవారు అని, 2010-11 బీమా సొమ్ము కోటి 80 లక్షల 88 వేల రూపాయలు దుర్వినియోగమైందని ఆరోపించారని, ఆ సొమ్ము ఆయన హాయంలో పంచినట్లు ఆయన సంతకంతో రికార్డుల్లో పొందుపరిచారని చెప్పారు. అర్హత ఉంటే రుణాలు ఇవ్వాలని పీ ఎసీ ఎస్ లక్ష్యం కాబట్టి, తాను ఇచ్చే పెద్ద మొత్తం రుణాలన్నీంటికి పీ ఎసి ఎస్ లీగల్ అడ్వజైర్ అనుమతి మేరకు ఇవ్వడం జరిగిందని, పార్టీలకు రహితంగా అందించామన్నారు. తాను ఏ రైతు వద్దనైనా ఒక రూపాయి తీసుకున్నట్లు రుజువు చేస్తే ఎటువంటి శిక్షకైనా సిద్దమేనన్నారు. 51 ఎక్వైరీ తాను వేయగలనని, తనకు అధికారం ఉందన్నారు. 2010-11 బీమాసొమ్ముపై విచారణ జరిపించాలని తాను పట్టుబడి ఉంటే ఆయన చేసిన నిర్వాహకానికి కొంతమంది ఉద్యోగులతోపాటు డైరెక్టర్లు కూడ జైలు పాలై ఉండేవారన్నారు. తన హాయంలో ఆన్‌లైన్ విధానం ద్వారా జరిగిందని, రైతుల అకౌంట్స్‌లో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు.
అర్హులందరికి సంక్షేమ పథకాలు
మందస, జనవరి 3: రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ అన్నారు. హోన్నాళిలో 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుందన్నారు. సీ ఎం చంద్రబాబునాయుడు 119 పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పెద్దన్నగా నిలిచారని, రాష్ట్ర విభజనలో 16 కోట్ల రూపాయలు అప్పుల్లో వున్నప్పటికి రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చి దిద్దానని, బెల్లుపటియాలోని జన్మభూమి గ్రామసభలో జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షురాలు శిరీషా మాట్లాడుతూ బెల్లుపటియా, దోనీ చెత్తసంపద కేంద్రానికి నిధులను మంజూరు చేయడం జరిగిందని, ప్రజల భాగస్వామ్యంతో వౌలిక వసతులు కల్పించుకోవాలని కోరారు. పొత్తంగి, సిరిపురంల్లో గ్రామసభలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వరరావు, తహసీల్థార్ శ్యామసుందరరావు, పివో రంగలక్ష్మి, ఎంపీపీ జయలక్ష్మి, జడ్‌పీటీసీ సవర కుమారిలఖియా, ఎ ఇలు సూర్యారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చంద్రన్నబీమా పేదలకు వరం
మందస, జనవరి 3: చంద్రన్నబీమా పథకం పేదలకు వరమని టీడీపీ పార్టీ విప్ ఎల్.రుద్రయ్య, ఎంపీటీసీ ఎన్.బాలకృష్ణ, ఎంపీటీసీ ఆర్.కృష్ణారావులు అన్నారు. గురువారం కిల్లోయిలోని సూర్యారావు మరణించడంతో భార్య సునీతకు 5 వేల రూపాయలు నగదును, మందసలోని ఇటీవల అనారోగ్యంతో తాతాలు మరణించడంతో భార్య అడవమ్మలకు 5 వేల రూపాయలను అందజేసారు. ఈ కార్యక్రమంలో బీమామిత్ర విజయ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

నవరత్న పథకాలతో ప్రజా సంక్షేమం
ఇచ్ఛాపురం, జనవరి 3 : వైసీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే నవరత్న పథకాలతో ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్‌పర్సన్ పి.రాజ్యలక్ష్మి చెప్పారు. 9వ వార్డు ముడియా వీధిలో గురువారం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగుస్తుందని, ముగింపు సభకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించటం, జగన్ సీఎం కావటం తథ్యమని అన్నారు. నవరత్న పథకాలపై అవగాహన కల్పించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లాబాల స్వర్ణమణి పాల్గొన్నారు.

కేజీబీవీలో రాష్ట్ర అధికారి పరిశీలన
ఇచ్ఛాపురం, జనవరి 3 : పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయను తాగునీరు-పారిశుధ్యం (వాష్) ప్రాజెక్టు రాష్ట్ర కోఆర్డినేటర్ నన్నోరయ్య గురువారం పరిశీలించారు. పాఠశాలలోని నీటి సరఫరా వ్యవస్థను, పారిశుద్ధ్య నిర్వహణను తనిఖీ చేశారు. భోజనం చేయటానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలని విద్యార్థినులకు చెప్పారు. స్వచ్ఛ విద్యాలయ అవార్డు పొందటం అభినందనీయమని, పాఠశాలను నిత్యం అదే స్థాయిలో ఉంచాలని సూచించారు. సీఎంఓ శ్రీనివాసరావు, కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆర్.వాసంతి పాల్గొన్నారు.

జనం కోసం జన్మభూమి

$
0
0

జలుమూరు, జనవరి 3: గ్రామీణ ప్రాంత జనుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని మండల ప్రత్యేకాధికారి జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ అన్నారు. మండలం శ్రీముఖలింగం గ్రామంలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో నియమించబడ్డ ప్రతీ శాఖాధికారి ప్రజల ముందుకు వచ్చి మీరు చెప్పిన సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని, ఇటువంటి కార్యక్రమాలకు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథాకాలు వివరించారు. పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు. అదే విధంగా అంధవరం, పర్లాం, మాకివలస గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాలు జరిగాయి. పై జన్మభూమి కార్యక్రమంలో తహశీల్దార్ కె.ప్రవళ్లిక ప్రియ, ఎంపీడీవో పడాల వాసుదేవరావు, పంచాయతీ విస్తరణాధికారి అప్పలనాయుడు, హౌసింగ్ ఏఈ గౌరీ శంకర్, పలు శాఖల అధికారులు, ఆయా పంచాయతీల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు.
తహశీల్దార్ మా మొర వినండి:
మండలం కరకవలస గ్రామంలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సమస్యలు తెలియజేద్దామని, వచ్చినా మా మొర వినకుండా వెళ్లిపోవడం భావ్యం కాదని పలువురు రైతులు ఆవేదన వ్యక్త పరిచారు. ఇటీవల జరిగిన తిత్లీ తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించడంలో అధికారులు వివక్షత చూపారని కరకవలస గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆందోళన చెందారు. కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని చివరికి జన్మభూమి ద్వారా మా మొర వింటారని ఆశించినా ఫలితం లేకపోవడంతో బాధితులు విచారం వ్యక్తపరిచారు. జరిగిన అన్యాయాన్ని గురించి కనీసం పట్టించుకొని అధికార తీరుపై గ్రామస్థులు నివ్వెరపోయారు.

దాన్యం కొనుగోలుకు మల్లగుల్లాలు
సారవకోట, జనవరి 3: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదరాబాదరాగా ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు మిల్లర్లపై ఆధారపడి కొనసాగుతున్నాయి. ఇదివరకే మిల్లర్లు సేకరించిన ధాన్యాన్ని తాజాగా కొనుగోలు చేసినట్లు రికార్డులు తయారుచేయవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రైతు నేరుగా కొనుగోలు కేంద్రాలకు హాజరు కావడం లేదు. మిల్లులు యజమానులు సమర్పించిన రైతుల జాబితాల ప్రకారం చెల్లింపులకు కొనుగోలు కేంద్రాల అధికారులు అంతర్జాలంలో పొందుపరుస్తున్నారు. ఇటీవల తిత్లీ తుఫాన్‌లో నష్ట పరిహారం చెల్లించిన సర్వే నెంబర్ల భూములకు చెందిన రైతుల వద్ద తక్కువగా ధాన్యం కొనుగోలు చేసినట్లు తాజాగా రికార్డ్‌ల్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ కొనసాగించడానికి కొనుగోలు కేంద్రాల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొంతమంది కిరాణా వ్యాపారులు, కాఫీ హొటళ్ల యజమానులు, భూమిలేని వృత్తి కార్మికుల పేర్లతో కూడా ఇప్పటికే దాన్యం కొనుగోలు చేసినట్లు వారి వారి బ్యాంక్ ఖాతాలకు నగదు జమచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కన్పించడం లేదు. ఇదీ కొనుగోల కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితులు.

జన్మభూమి వేదికలను సద్వినియోగ పర్చుకొండి
సారవకోట, జనవరి 3: ఆరవ విడతగా మండలంలో నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాలను సద్వినియోగ పర్చుకోవాలని మండల ప్రత్యేకాధికారి కోటీశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని బైదులాపురం, బద్రి గ్రామాల్లో గురువారం జరిగిన జన్మభూమి వేదికలపై ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తామని, అదే విధంగా రాబోవు కాలంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు, వౌళిక సదుపాయాలు కల్పించడానికి జన్మభూమి వేదికగా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. బద్రి ప్రాథమికోన్నతపాఠశాలను తనిఖీలు చేసి విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు వీలుగా ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. తహశీల్దార్ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో అవలంగి, లక్ష్మీపురం గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీడీవో జగదీశ్వరరావు, పంచాయతీ విస్తరణాధికారి ఈశ్వరరావు, పలువురు మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆదర్శమహిళా సావిత్రి భాయి ఫూలే
సారవకోట, జనవరి 3: మహిళలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేందుకు పునాదిరాళ్లను వేసిన సావిత్రిభాయి ఫూలే ప్రపంచంలో ఆదర్శమహిళగా నిలిచారని కినె్నరవాడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, జేబిటీ పాఠశాల అధిపతి మోహనగాంధి ప్రసంశించారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా పలువురు ఉపాధ్యాయినులను గురువారం సన్మానించారు. ఈసందర్భంగా వీరు మాట్లాడుతూ 1848లో పూలే మహారాష్ట్ర, పూణే పట్టణంలో మహిళల కోసం పాఠశాలలను ప్రారంభించి ఈ పాఠశాలల్లో స్వయంగా ఆమె ఉపాధ్యాయునిగా పనిచేశారని వివరించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని నేడు మహిళలు అధికంగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి బాలికల విద్యను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కినె్నరవాడ పాఠశాలలో ఉపాధ్యాయుని సునీతను సన్మానించగా జేబిటీ పాఠశాలలో బుడితి ఉన్నతపాఠశాల ప్రథానోపాధ్యాయిని ఎండి ప్రమీలను పాఠశాల అధిపతి, ఉపాధ్యాయులు సన్మానించారు.
బాధిత కుటుంబాలకు చంద్రన్నబీమా అందజేత
లావేరు, జనవరి 3: మండలంలో కేశవరాయునిపాలెం, బుడుమూరు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం కింద ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. కేశవరాయునిపాలెం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కుప్పిలి నాగేశ్వరరావు భార్య రమణమ్మకు రూ.5వేలు నగదును అందించారు. జన్మభూమి కమిటీ సభ్యులు నాయిని లక్ష్మణరావు, బీమా మిత్ర రాధ, సి ఎఫ్ డి.నీలవేణి, గ్రామ పెద్దలు ఆర్.లక్ష్మణరావు, సింహాద్రి, యతిరాజులు చేతుల మీదుగా వీటిని అందించారు. మరో రూ.25వేలు సాయం బ్యాంక్ ఖాతాలో జమ కానున్నట్లు వెల్లడించారు. బుడుమూరులో పొలిసి చిన్న కుటుంబానికి మాజీ సర్పంచ్ పెదనాయుని శ్రీరాములునాయుడు చేతుల మీదుగా రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.

చంద్రన్న పాలనలోనే సాగునీరు అందిస్తాం

$
0
0

పొందూరు, జనవరి 3: పొందూరు మండలం రైతాంగంతో పాటు ఇక్కడ ప్రజలు ఎంతో కాలంగా ఆశించిన సాగునీరుపై ఆశలు చిగిరించి ప్రజల చిరకాలవాంఛ చంద్రన్న పాలనలో తీరనుందని ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూనరవికుమార్ వెల్లడించారు. ఆరవ విడత జన్మభూమి - మా ఊరు సందర్భంగా గురువారం మండలంలోని పిల్లలవలస, బురిడి కంచరాం గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు నీటి వనరుల కల్పనకై టీడీపీ ప్రభుత్వం పోలవరం జలాలతో సస్యశ్మామలం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం జలాలతో కరువుకాటకాలు పూర్తిగా తొలగించాలనే ముఖ్యోద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శరవేగంగా పనులు ముమ్మరంగా చేపడుతున్నారన్నారు. రైతే రాజు కావాలన్న చంద్రన్న ఆశయంతో పోలవారం ప్రాజెక్ట్ పనులు 65శాతం పూర్తిచేశామన్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకే అందించే అవినీతి లేని ప్రభుతాన్ని నడుపుతున్నామన్నారు. అందరికి అభివృద్ధి, అందరికి సంక్షేమం అనే లక్ష్యంతో 5,800 ఇళ్లులు కట్టాలనే టార్గెట్ పెట్టుకొని అందరికి ఎన్టీ ఆర్ గృహ నిర్మాణానికి 1.50లక్షలతో ఉచితంగా కట్టే అవకాశం కల్పిస్తున్నాం. ఎస్సీలకు రూ.2లక్షలతో ఉచిత గృహనిర్మాణం, ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు. అప్పులు బాధలేక కష్టాల్లో ఉన్న రైతులకు 25,500 కోట్లతో రుణమాఫీ గత పదేళ్ల క్రితం నాలుగు గంటలు కరెంట్ ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటే నేడు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. కులవృత్తులందరికి ఆదరణ పథకం ద్వారా నైపుణ్యం వస్తువులు అందిస్తున్నామని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రతీ పంచాయతీకి మీసేవ కేంద్రాలను ఏర్పాటుచేశాం. త్వరలో 5వేల లక్షల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పేదవారిని మోసగించే ప్రభుత్వాలు మట్టికొట్టుకుపోతాయన్నారు. గతంలో వృద్ధ, వికలాంగ, విడో పెన్షన్‌లు చనిపోయిన వారి వేలిముద్రలు వేసి 2,28,000 పెన్షన్‌లు దోచుకుతిన్నారు. గృహ నిర్మాణంలో భాగంగా ఒక ఇంటిని చూపి ఐదు బిల్లులు చేసేవారు. అటువంటి అవినీతి జరగకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకొని పేదవాడికి అండగా ఉండే విధంగా సర్కార్ పనిచేస్తుందన్నారు. సేవచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వధించాలని కోరారు. ప్రజల కోరిక మేరకు పిల్లల వలస శ్మశాన వాటిక బోర్‌ను మంజూరు చేశారు. 14ఫైనాన్స్ నిధులతో శ్మశానవాటిక నిర్మాణం పనులు చేయాలని జే ఈలకు ఆదేశించారు. చంద్రన్న కానుకలు విప్ చేతుల మీదుగా అందించారు. అలాగే బానాం, ధర్మపురం గ్రామాల్లో అధికారుల మద్య జన్మభూమి కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దిలీప్ చక్రవర్తి, ఎంపిడీవో లక్ష్మీభాయి, మండల పార్టీ అధ్యక్షులు రామ్మోహనరావు, ఏ ఎంసి చైర్మన్ అనె్నపు రాము, వండాన సత్యం, సువ్వారి శ్రీనివాసరావు, గుడ్ల మోహనరావు, అనకాపల్లి రంగారావు, సీపాన శ్రీరంగనాయకులు, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు,మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

తోటపల్లి కాలువ ద్వారా రైతులకు సాగునీరు

$
0
0

జి.సిగడాం, జనవరి 3: రైతు సంక్షేమమే ధ్యేయంగా తోటపల్లి కాలువద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 69వేల కోట్లు ఖర్చుచేసి రైతులకు సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు, ఇంధన శాఖామంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు. గురువారం మండలం బాతువ గ్రామంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమం పాల్గొని మాట్లాడారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి 14,600 ఇళ్లు మంజూరు కాబడినట్లు వీటిని పార్టీల కతీతంగా అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లు రూ. 2వేలుకు పెంచేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. అర్హులైన వారందరికి ప్రభుత్వపథకాలు అందుతాయన్నారు. నిరంతర విద్యుత్‌లో భాగంగా బాతువ గ్రామానికి రూ.1.45కోట్ల వ్యయంతో ఉప విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ ఉప కేంద్రం వలన 14 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రహదారులకు నియోజకవర్గంలో రూ.12కోట్లతో బిటి రోడ్లు నిర్మాణం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం అయితే పురిటి ఖర్ఛులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఎన్టీ ఆర్ వైద్యసేవలకు రూ.5 లక్షలు పెంచినట్లు, డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమకు రూ. 10వేలు అందించినట్లు ఆయన అన్నారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. మాజీ శాసనసభ్యులు మీసాల నీలకంఠం నాయుడు మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్దకొడుకుగా పనిచేస్తున్నారని, మండలంలో బాతువ గ్రామం పెద్దదని, విద్యార్థులు, ప్రజలు రాకపోకలకు బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి కళాను కోరారు. చంద్రబాబు పరిపాలనా దక్షుడని, కాంగ్రెస్‌పార్టీ బలహీన మైందని, దాన్యలక్ష్మి ధనలక్ష్మిమారిందని,రానున్న ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రం ప్రపంచానికే తలమానికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాజకీయ అనుభవం లేని వారికి గెలిపిస్తే అభివృద్ధి అంధకారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చక్రధరబాబు, జిల్లా ప్రత్యేకాధికారి లక్ష్మీనర్శింహులు, ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రత్యేకాధికారి ధర్మారావు, ఎంపిపి డొంక సూరీడమ్మ, మండల ప్రత్యేకాధికారి రత్నకుమార్, వ్యవసాయశాఖ ఏవో బి. ఇందుమతి, విద్యుత్ శాఖ ఏ ఈ కుమార్, అల్లు జోగినాయుడు, తనుబుద్ది దాలినాయుడు, గొలివి శ్రీను, కొమరాపు రవికుమార్, తహశీల్దార్ బి.సత్యం, ఎంపిడీవో బిహెచ్ శంకరరావు, ఉప తహశీల్దార్ సి.హెచ్ ఎస్‌వి కె ప్రసాదరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు.


ఫ్యాక్షన్ గ్రామాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

$
0
0

అనంతపురం అర్బన్, జనవరి 3: ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల పట్ల నిరంతరం అప్రమత్తంగా వుండాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదేశాలు జారీ చేసారు. గురువారం సంబంధిత విభాగం అధికారులతో ఎస్పీ సమీక్షించి గణాంకాలను విడుదల చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో చిన్న సమస్యలను ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఫ్యాక్షన్ దాని పర్యవసనాలు పట్ల గ్రామీణ ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఎలాంటి సమస్యనైనా మొగ్గ దశలోనే తుడిచి పెట్టాలన్నారు. గత పక్షంలో రోజుల్లో 30 కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, 116 పల్లె నిద్రలు, 168 ప్రాంతాల్లో వాహన తనిఖీలు తదితర కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపిన జి.సో.అ.సం
అనంతపురం అర్బన్, జనవరి 3: స్థానిక జిల్లా ఫోలీసు కార్యాలయంలో గురువారం కానిస్టేబుళ్ల నుండి హెడ్ కానిస్టేబుళ్లగా, హెడ్ కానిస్టేబుళ్లు నుండి ఎ.ఎస్.ఐలుగా పదోన్నతి కల్పించడంపై ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌కు జిల్లా పోలీసు అధికారుల సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏ.ఎస్.ఐలు 44మంది, 138మంది హెడ్ కానిస్టేబుళ్లుతోపాటు జిల్లా పోలీసు అధికారులు సంఘం అధ్యక్షులు ఎస్ త్రిలోక్‌నాథ్, సుధాకర్‌రెడ్డి, మసూద్‌వలీ, హరినాథ్‌లు పుష్పగుచ్ఛం అందజేసి ఎస్పీకి, అదనపు ఎస్పీలకు కృతజ్ఞతలు తెలిపారు.
బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో ప్రత్యక్ష ప్రసారం
అనంతపురం సిటీ, జనవరి 3: లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బూత్‌స్థాయి కార్యకర్తలతో వీడియో ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ ప్రధాని నరేంద్రమోదీ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బంగారు మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీ ఆదివారం నగరంలోని సూరజ్ గ్రాండ్ సమావేశ మందిరం 4వ అంతస్తునందు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు నిర్వహించనున్నారని తెలిపారు. సమావేశానికి పర్యవేక్షకులుగా ఏపీ వ్యవహారాల బాధ్యులు, రాజ్యసభ సభ్యులు మురళీధరన్ వ్యవహరిస్తారని తెలిపారు. ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు.

తండాలు, చిన్న పంచాయతీల్లో ఏకగ్రీవాలపై టీఆర్‌ఎస్ దృష్టి

$
0
0

నల్లగొండ, జనవరి 3: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తు అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించే పది లక్షలతో పాటు ఎంపీ నిధులు, ఎమ్మెల్యే కోటా నిధుల నుండి మరో పది లక్షలు ఇస్తామంటు రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్‌లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గురువారం వారు టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించి రాజకీయంగా సంఛలనం రేపారు. దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ రెవెన్యూ డివిజన్లలో పెద్ద సంఖ్యలో ఉన్న తండాలు, ఎస్టీ రిజర్వేషన్ల పంచాయతీలతో పాటు చిన్న పంచాయతీలను గంపగుత్తాగా టీఆర్‌ఎస్ కైవసం చేసుకునే దిశగా ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ల ఆఫర్ ఉందని భావిస్తున్నారు. తండాలు, చిన్న పంచాయతీలను ఏకగ్రీవం గొడుగు కింద టీఆర్‌ఎస్ సాధించిన పక్షంలో మిగతా పంచాయతీల్లో జరిగే పోలింగ్‌పై దృష్టి పెట్టి మరింత మెరుగైన రీతిలో సర్పంచ్ స్థానాలను గెలుచుకునేందుకు వీలుంటుందని టీఆర్‌ఎస్ వ్యూహాంగా కనిపిస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1720పంచాయతీల్లో తండాలు, చిన్న పంచాయతీలు 500మేరకు ఉన్నాయి. వీటిలో సింహభాగం ఏకగ్రీవం దిశగా అడుగులేస్తాయని భావిస్తున్నారు. మొత్తం మీద నల్లగొండ ఎంపీ గుత్తా, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు ప్రతిపాదించిన 20లక్షల ఏకగ్రీవ నజరాన తండాల్లో వౌలిక వసతుల కల్పనకు నిధుల పరంగా, సర్పంచ్ అభ్యర్థులకు కూడా ఆర్ధికంగా ఉపయుక్తంగా ఉంటుందని దీంతో పెద్ద ఎత్తున ఏకగ్రీవానికి ముందుకు వచ్చే అవకాశముందని అంఛనా వేస్తున్నారు. కాగా, సీఎం కేసీఆర్ ఒకవైపు ఎమ్మెల్యే కోటా నిధులు రద్ధు చేసి, సీఎం ఎస్‌డీఎఫ్ మాదిరిగా మంత్రులకు ఫండ్ కేటాయింపు చేయాలని యోఛిస్తున్నట్లుగా ప్రచారం సాగుతుండటం ఈ సందర్భంగా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే కోటా నిధులు లేని పక్షంలో అప్పుడు ఏకగ్రీవ సర్పంచ్‌లకు ఎమ్మెల్యేలు నిధులు ఎలా సమకూరుస్తారన్నది సందేహాకరంగా కనిపిస్తుంది. అదే సమయంలో సర్పంచ్ ఒక పార్టీకి, ఎంపీ, ఎమ్మెల్యేలు మరోపార్టీ వారైన పక్షంలో కూడా ఎంపీ, ఎమ్మెల్యే కోటా నుండి పది లక్షల నిధులు ఏకగ్రీవ సర్పంచ్‌లకు అందడం అనుమానమేనన్న వాదన సైతం వినిపిస్తుండటం గమనార్హం.

పోచంపల్లి వస్త్రాలు అద్భుతం

$
0
0

భూదాన్‌పోచంపల్లి, జనవరి 3: సాంప్రదాయ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే. జోషి సతీమణి అనురాధ జోషి అన్నారు. గురువారం భూదాన్‌పోచంపల్లిని ఆమె సందర్శించారు. గ్రామీణ పర్యాటక కేంద్రంలో భూదానోద్యామానికి సంబంధించిన చిత్రాలను పరిశీలించారు. మగ్గాలపై తయారు చేస్తున్న పట్టు చీరలను ఆమె తిలకించారు. నేత కళాకారులు కళాత్మకంగా తయారు చేస్తున్న పట్టు చీరలను చూసి అబ్బుర పడ్డారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు దేశవిదేశాల్లో మంచి ఆదరణ లభిస్తుందని, నేత కళాకారుల నైపుణ్యాన్ని ఆమె ప్రశంశించారు. ఆమె వెంట తహశీల్దార్ దశరథ నాయక్ పాల్గొన్నారు.
చిత్రం..పట్టుదారాన్ని పరిశీలిస్తున్న అనురాధ జోషి

లారీ ఢీకొని టోల్‌ప్లాజా సెక్యూరిటీ గార్డు మృతి

$
0
0

సంగారెడ్డి, జనవరి 3: యాజమాన్యం నిర్లక్ష్యం, లారీ డ్రైవర్ అతివేగం, అజాగ్రతల కారణంగా యువకుడి విలువైన ప్రాణం గాల్లో కలిసిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులోని 65వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ఫ్లాజా వద్ద గురువారం తెల్లవారు జామున 4 గంటలకు చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే జహీరాబాద్ మండలం రాయిపల్లి (డీ) గ్రామానికి చెందిన నగేష్ (19) గత కొంత కాలంగా కంకోల్ టోల్‌ఫ్లాజాలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా బుధవారం డ్యూటీకి రాగా 6వ నంబర్ లేన్ వద్ద వాహనాలను దారి మళ్లించాలంటూ అక్కడి అధికారి ఆదేశించాడు. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో 6 లేన్ వద్ద ఒక డీసీఎం వ్యాను రుసుం చెల్లించడానికి నిలిచివుంది. జహీరాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న లారీని 6వ నంబరు లేన్‌కు మళ్లించే క్రమంలో లారీ అతివేగంగా వచ్చి నగేష్‌ను ఢీ కొట్టింది. లారీ, డీసీఎంల మధ్య ఇరుక్కుపోయిన నగేష్‌ను గమనించి అక్కడి సిబ్బంది అప్రమత్తమై లారీని వెనక్కు తీయించి చూడగా విగతజీవుడుగా మారాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఇదిలావుండగా యుక్త వయస్కుడైన నగేష్ కుటుంబానికి టోల్‌ఫ్లాజా యాజమాన్యం ప్రత్యేకంగా పరిహారం చెల్లించి ఆదుకోవాలని మృతుడి బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అక్కడి అధికారులు, యాజమాన్యంలో ఏ మాత్రం స్పందన లభించలేదు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఫరీదోద్దీన్, జహీరాబాద్, అందోల్ ఎమ్మెల్యేలు మానిక్‌రావు, చంటి క్రాంతి కిరణ్‌లు సంఘటన స్థలానికి చేరుకుని యాజమాన్యం పక్షాన అధికారులతో చర్చలు నిర్వహించారు. పీఎఫ్, ఇతర లాభాలను మాత్రమే కల్పిస్తామని, ప్రత్యేకంగా పరిహారం అంటూ చెల్లించేది లేదని యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. గంటల తరబడి ఆందోళన చేపట్టడంతో ఇరువైపుల వాహనాలు కిలోమీటర్ల మేరకు స్తంభించిపోయాయి. సంగారెడ్డి డీఎస్పీ శ్రీ్ధర్‌రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, ప్రత్యేక పోలీసు బలగాలతో కంకోల్ టోల్‌ఫ్లాజాకు చేరుకుని ఏలాంటి ఆస్తినష్టం కలుగకుండా ఆందోళనకారులను కట్టడి చేసారు. తమ మాటలను సైతం బేఖాతర్ చేసిన టోల్‌ఫ్లాజా యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పాలంటే పని చేస్తున్న సిబ్బంది విధులను బహిష్కరించాలని ప్రజాప్రతినిధులు, అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సూచించారు. దీంతో టోల్‌ఫ్లాజాలో పని చేస్తున్న సిబ్బంది మొత్తం విధులను బహిష్కరించారు. నాలుగైదు రోజుల వరకు ఇక్కడికి సిబ్బంది వచ్చి పని చేసే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతానికి వాహనాలు ఏలాంటి రుసుం చెల్లింపులు లేకుండా నేరుగా వెళ్లిపోతున్నాయి. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఫ్లాజా వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై మునిపల్లి మండలం బుధేరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

చిత్రం..మృతుడి బంధువులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

మినీ మేడారం నాటికి ములుగు జిల్లా

$
0
0

వరంగల్, జవవరి 3: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇచ్చిన హామీ నేరవేరబోతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్న ములుగు ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ తమ అభ్యర్థి చందూలాల్‌ను గెలిపిస్తే ములుగు జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీ కార్యరూపం దాల్చబోతుండటం విశేషం. రాష్ట్రంలో మరో రెండు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరనుంది. ములుగు జిల్లా ఏర్పాటుకు వేగంగా పావులు కదులుతున్నాయి. ఇప్పటికే జిల్లా ఏర్పాటుపై గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు విధించారు. దీంతో ములుగు ప్రజల పోరాటానికి తెర పడబోతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమయ్యే మినీ మేడారం నుంచే సమక్కసారలమ్మములుగు జిల్లాగా ఏర్పాటు కాబోతోంది. తొమ్మిది మండలాలను కలుపుకొని ఈ జిల్లా ఏర్పాటు కాబోతుంది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ డివిజన్‌లోని తొమ్మిది మండలాలు కొత్తగా ఏర్పాటు కానున్న ములుగు జిల్లా పరిధిలోకి వస్తాయి. ములుగు వెంకటాపూర్, గోవిందారావుపేట, తాడ్వాయి, ఏటురునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, నూగూరువెంకటాపూర్‌తో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న మల్లంపల్లి మండలంతో ములుగు జిల్లా రూపుదిద్దుకోనుంది. భౌగోళికంగా 30,31 చదరపు విస్తీర్ణం కలిగిన ములుగు డివిజన్‌లో మొత్తం 3.01లక్షల జనాభా ఉంది. ములుగు జిల్లాకు కలపనున్న మండలాలు అన్ని కూడా ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే ములుగు కొత్త జిల్లాను సమక్క సారలమ్మ పేరున ములుగు జిల్లాగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే మినీ మేడారం జాతర రోజునే జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు జనగామ జిల్లా పరిధిలో ఉన్న ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న చేర్యాల, మద్దూర్ మండలాలను జనగామ జిల్లాలో కలపాలనే డిమాండ్ వస్తుంది. అంతే కాకుండా జనగామ జిల్లా పరిధిలో ఉన్న జఫర్‌గడ్ మండలాన్ని వరంగల్ అర్బన్ జిల్లాలో కలపాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో ఉన్న పరకాలను పరకాల జిల్లా కేంద్రంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉండాలనే డిమాండ్ బలంగా వినవస్తోంది.
చిత్రం..జిల్లా కేంద్రం కానున్న ములుగు పట్టణం

Viewing all 69482 articles
Browse latest View live