Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 2015 | 2016 | (Page 2017) | 2018 | 2019 | .... | 2067 | newer

  0 0

  కానీ నా కొడుకు బతికే ఉన్నాడు. నేను చేసిన వడ్డీ వ్యాపారమే వాడూ చేస్తాడు. నా ఆస్తి దోచేస్తే తరిగేది కాదు. నా భూమి నాకే వుంది.
  నువ్వు నమ్ముకొన్న జనం నీ వెంట రారు. నావైపు ప్రభుత్వం ఉంది. సిఆర్‌పి వుంది. నువ్వు ననే్నం చెయ్యలేవు’’ అంటుంది.
  ఈ ఉద్యమంలోకి వచ్చేటపుడు జ్యోతి, సత్యం కృష్ణానదిపై పడవ దాటుతుంటారు. కృష్ణకు బాగా వరద వచ్చినపుడు సత్యం ‘‘నీకు ఈత వచ్చా!’’ అని జ్యోతిని అడుగుతాడు. అపుడు పడవ నడిపేవాడు ‘‘అదేంటి బాబూ! ఆ ప్రశ్న ఇప్పుడడుగుతారు. పడవెక్కక ముందే అడగాల్సింది’’ అంటాడు. ఈ ప్రశ్నలో ఉద్యమం కూడా స్ఫురిస్తుంది. ఉద్యమంలోకి రాకముందే అన్నీ ఆలోచించుకోవాలని.
  ఇంకొకచోట విప్లవ యోధుడు సత్యం దాహంతో బాధపడుతుంటాడు. కొండల్లో ఎక్కడా మంచి నీళ్లు కనిపించవు. అక్కడ ‘‘దూరం దూరంగా కొండసానువుల్లో పెద్ద పెద్ద జలాశయాలు, ఆశలు వురకలు వేశాయి. ముందుకు పరుగులు తీసింది. మరీచికలు ఆమెను ఆహ్వానిస్తూ ముందుకు అంతవేగంగానూ పరుగులు తీశాయి. ఎండమావులు కొండెక్కాయి. ప్రతిభ ఆగిపోయింది. మృగతృష్ణ తన ఆర్తిని తీర్చలేదు’’ అని గ్రహిస్తుంది.
  ఉద్యమంపట్ల నవలా రచయిత్రి ఉద్దేశం కూడా అదే. సాయుధ పోరాటాలు, రక్తపాతం ఈ సమస్యకు పరిష్కారం కాదని స్పష్టంగా, వ్యంగ్యంగా చెప్తుంది.
  ఈ విప్లవోద్యమంలో మధ్యతరగతివారే పాల్గొంటున్నారు. అసలు బాధితులు దూరంగానే ఉంటారు. వారు సంఘటితం కానంతవరకు, చైతన్యవంతులు కానంతవరకు ఈ ఉద్యమం ఫలించదు. సామ్యవాద సమాజం రాదు అనే సత్యాన్ని స్పష్టంగా చెప్తుంది. మరీచిక పేరు సార్థకం చేస్తుంది.
  ఈ నవలలోని స్ర్తి పాత్రలు సజీవ పాత్రలు. తాము కోరుకున్న జీవితం కోసం, తాము నమ్మిన సిద్ధాంతం కోసం తిరుగుబాటు బావుటా ఎగురవేసినవారు, సంఘం చక్రాలలో ఇమడలేనివారు, సంఘం కొలబద్దల్ని తిరస్కరించినవారు, కృత్రిమ మర్యాదా తీరాలను లక్ష్మణరేఖల్ని అధిగమించినవారు.
  పితృస్వామ్య వ్యవస్థను, దానిలోని లోటుపాట్లను సమర్థంగా చిత్రీకరించింది ఈ నవల. కాలేజీ నుంచి ఆలస్యంగా వచ్చిన జ్యోతిని కాబోయే భర్త ‘‘కాలేజీకి వెళ్లకుండా ఎక్కడికెళ్లావ్’’ అని అధికారం చెలాయిస్తాడు. కూతుర్ని అర్థం చేసికొన్న తండ్రి కూడా కూతుర్ని అడగకుండా కూతురి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాడు.
  ఈ నవలలోని శబరి, జ్యోతి పెళ్లి నిర్ణయించినాకే పెళ్లిని తిరస్కరించి ఇంటి బయటకు వచ్చేస్తారు. శబరి తల్లి, తండ్రి కూడా శబరికి ఇష్టం లేకపోయినా ఆదిత్యను చేసుకోమని బలవంతపెడతారు. వాళ్లిద్దరు కూడా ఇష్టం లేకపోయినా ఒకే ఇంట్లో మార్జాల దంపతుల్లా జీవించడం వివాహ వ్యవస్థలోని డొల్లతనాన్ని వెల్లడిస్తుంది.మరీచిక చదివాక జ్యోతి కోరిన సమ సమాజం రావడానికి ఇంకా దూరం తరగనందుకు విచారిస్తాం. ఇరవై ఏళ్ల క్రింద పరిస్థితి ఇంకా ఇలాగే వున్నందుకు బాధపడతాం. ఇన్ని ఉద్యమాలు, పోరాటాలు దాడిచేసినా ఎరమింగిన కొండచిలువలా మత్తుగా పడివున్న సంఘం కళ్లెదుట కనబడుతూ పరిహసిస్తున్నపుడు, శాంతి, స్వేచ్ఛగా పరిమళించే నవ సమాజం, సమసమాజం ఎప్పుడొస్తుంది అనే ప్రశ్నల గాయాలు మన గుండెల్ని సలుపుతూనే వుంటాయి. -సమాప్తం


  0 0

  సీ నీలమేఘశ్యామ! నీవె తండ్రివి మాకు
  కమలవాసిని మమ్ము-కన్నతల్లి
  నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్
  నీ కటాక్షము మా కనేక ధనము
  నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు
  నీ సహాయము మాకు నిత్యసుఖము
  నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య
  నీ పదధ్యానంబు నిత్యజపము
  తే తోయజాతాక్ష! నీ పాద తులసిదళము
  భోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత!
  భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
  దుష్టసంహార! నరసింహా! దురితదూర!

  భావం:నరసింహస్వామి! మాకు తండ్రివి నీవే. లక్ష్మీదేవియే మా కన్నతల్లి. నీ భక్తులే మా బంధువులు. నీ దయయే మా సొమ్ము. నీ పాటలే మా లోకం. నీ నామజపమే మా విద్య. నీ పాద ధ్యానమే నిత్య జపం. నీ పాదాలమీద పూజ చేసిన తులసిదళం రోగాలన్నింటిని రూపుమాపే మందు. బ్రహ్మరుద్రులచే పొగడబడుచున్న ఓ స్వామీ! నీవే మాకు అన్నియూ.


  0 0
 • 01/04/19--06:37: maatata
 • Cross Image: 
  Date: 
  Saturday, January 5, 2019

  0 0

  చౌటుప్పల్, జనవరి 4: మండలంలోని పంతంగి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దిండు భాస్కర్ ఆధ్వర్యంలో కస్తూరి ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్‌లను శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులకు బ్యాగులు, నోటుపుస్తకాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి సహకారం అందించడం అభినందనీయమన్నారు. సంపద అందరికీ ఉన్నా దానం చేసే గుణం కొందరికే ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సహకారం అందిస్తున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్‌ను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజు, అరుణ, బాతరాజు అండాలు, సాగర్ల లింగయ్య, అంతటి రాజేష్, బర్రె శేఖర్, జెమ్మి సురేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
  అటవీ భూముల అభివృద్ధికి కృషి
  * కొత్తగూడెం సీపీఎఫ్ రాజారావు

  నడిగూడెం, జనవరి 4: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అటవీ భూముల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కొత్తగూడెం సీపీఎఫ్ రాజారావు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని రామాపురం అటవీ భూముల్లో నిర్మిస్తున్న ఫెన్సింగ్, గేట్లు పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. అటవీ భూములు అణ్యక్రాంతం కాకుండా కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నడిగూడెం మండలంలోని రామాపురం అటవీ భూముల్లో సుమారు 8 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అవసమైన దగ్గర గేట్లు నిర్మిస్తున్నుట్ల తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి ముకుందారెడ్డి, కోదాడ ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మిపతిరావు బీట్ ఆఫీసర్ మాచర్ల అచ్చయ్య పాల్గొన్నారు.
  ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి
  * హాజరైన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
  నల్లగొండ రూరల్, జనవరి 4: అంధుల కోసం లిపిని కనుగొన్న లూయిస్ బ్రెమిలీ 210జయంతిని శుక్రవారం పట్టణంలోని దివ్యాంగుల బాలుర కళాశాల వసతి గృహంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ జ్యోతి ప్రజ్వలన గావించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ అంధులు తేలికగా చదువగలిగే, రాయగలిగే బ్రెయిలీ లిపిని కనిపెట్టి అద్భుతాన్ని ఆవిష్కరించారన్నారు. ఈ లిపి ద్వారా ఎంతోమంది చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారనీ, సంబంధిత శాఖ ద్వారా కూడా అనేక సంక్షమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ. శైలజ, సూపరింటెండెంట్ నర్సింగరావు, డ్వాబ్ కార్యదర్శి చొక్కారావు, వసతిగృహ నిర్వాహకులు వెంకట్ రెడ్డి, అస్మా, పెంటయ్య తదితరులున్నారు.

  యాదాద్రిలో ఘనంగా నిత్యారాధనలు
  * అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
  యాదగిరిగుట్ట, జనవరి 4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి నిత్యారాధనలు, ఆర్జిత సేవలు శుక్రవారం శాస్తయ్రుక్తంగా సాగాయి. సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేసి బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా ప్రతిష్ఠామూర్తులను ఆరాధించిన పూజారులు పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి సుగంధ పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కవచమూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవాలు నిర్వహించారు. బాల ఆలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
  సాయంత్రం అండాళ్ అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం పురస్కరించుకుని ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. మహిళలు ఊంజల్ సేవోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, కీర్తనలతో అమ్మవారిని కొలిచారు. పూజారులు హారతి నివేధన చేశారు. స్వామివారిని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో సీఎండీలు రఘుమారెడ్డి దర్శించుకున్నారు. వారి వెంట డైరక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ వెంకన్న, డీఈ కృష్ణగౌడ్, ఏడీ శ్రీనివాస్, ఏఈ సుధాకర్‌రెడ్డి ప్రభృతులు ఉన్నారు.

  నిస్వార్థ నాయకులను ఎన్నుకోండి
  ప్రజా స్వామ్యాన్ని కాపాడండి
  * సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి పిలుపు
  4
  చిట్యాల, జనవరి 4: స్థానిక సంస్థల ఎన్నికల్లో నిస్వార్ధంగా పని చేసే నాయకులను ఎన్నుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పిలుపు నిచ్చారు. గ్రామ పంచాయతీ, వార్డు స్థానాల్లో సీపీఎం బలపర్చిన అభ్యర్థులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించనట్లయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జర్గిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచి ధనిక వర్గాల వారు అధికారం చేజిక్కించుకునే పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు ఇలాంటి వాటికి లొంగ కుండా గ్రామంలో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేసే నాయకుడినే ఎన్నుకోవాలని కోరారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు జిట్ట నగేశ్, అవిశెట్టి శంకరయ్య, నారబోయిన శ్రీనివాసులు, శీలా రాజన్న, పానుగుళ్ళ అచ్చాలు, ఐతరాజు నర్సింహ, రుద్రారపు పెద్దులు, రాచకొండ శ్యాంసుందర్, తిరుగుడు సన్యాసిరావు, గోపగోని వెంకన్న, గుడిసె లక్ష్మినారాయణ, జోగు లక్ష్మయ్య, జన్నపాల జానయ్య, మందుగుల యాదయ్య, బూర్గు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

  సిద్ధం కానున్న రైతు వేదికలు..
  ఒక్కో వేదిక నిర్మాణానికి 12లక్షలు..
  142 క్లస్టర్లకు గాను 124 క్లస్టర్లకు భూసేకరణ పూర్తి
  నల్లగొండ రూరల్, జనవరి 4: రైతు సంక్షేమం దృష్ట్యా వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి వచ్చే సమాచారాన్ని తెలియపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితి (రైసస)ని ఏర్పాటు చేసి సభ్యులను నియమించింది. ఇప్పటికే అనేక సబ్సిడీ పథకాలతో పాటు రైతుబంధు, రైతు బీమాలాంటి ప్రతిష్టాత్మక పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతులకు మెరుగైన సమాచారాన్ని అందించేందుకు సమన్వయ సమితి సభ్యుల సేవలను మరింతగా వినియోగించుకోనుంది. వీటిని భవిష్యత్‌లో కొసాగిస్తూ వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనిలో భాగంగానే రైతులకు ప్రత్యేక కేంద్రాలు ఉండడంతో పాటు రైతు సమన్వయ సమితి సభ్యులను సమన్వయకర్తలుగా వినియోగించుకుంటూ రైతు వేదికల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రైతు సమన్వయ సమితి సమితులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇద్దరు లేదా నలుగురు సభ్యులను ఒక చోట చేర్చి అధికారులను అనుసంధానం చేసి రైతు వేదికను నిర్మించనుంది. ఒక్కో వేదిక నిర్మాణానికి రూ.12 లక్షలు ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 142 వ్వవసాయ క్లస్టర్లు ఉండగా, ఇప్పటికే 124 క్లస్టర్లలో భూసేకరణ పూర్తయింది. ప్రభుత్వానికి నివేదించిన తర్వాత నిధుల కేటాయింపు అనంతరం పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల ద్వారా భవనాలు నిర్మించాలని నిర్ణయంచింది. ఇప్పటికే డిజైన్స్ పూర్తయ్యాయని ఆయా భవనాల్లో ఎప్పటికప్పుడు రైసస సభ్యులు రైతులకు సంధానకర్తలుగా ఉండి చర్యలు తీసుకుంటారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ రైసస సభ్యుల నుండి జిల్లా రైసస వరకు మొత్తం 9 వేల 230 మంది సభ్యులు ప్రభుత్వానికి, రైతులకు సంధానకర్తలుగా నియమితులయ్యారు. వీరి సేవలను ఉపయోగించుకోని వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో 562 రెవెన్యూ గ్రామాల్లో 14 మంది చొప్పున సభ్యులు ఉండగా ఒకరు కన్వీనర్‌గా ఉన్నారు. మొత్తం ఆయా గ్రామాల్లో 8 వేల 430 మంది ఉన్నారు. మరో 31 మండలాల్లో 24 మంది చొప్పున సభ్యులు, ఒక కన్వీనర్ ఉన్నారు. మొత్తం 775 మంది మండల సమితి సభ్యులుగా ఉన్నారు. జిల్లాస్థాయిలో 24 మంది సభ్యులతో పాటు మరొకరు కన్వీనర్‌గా ఉన్నారు. ఇలా మొత్తంగా 9 వేల 230 మంది రైససల నుండి ప్రాతినిధ్యం వహిస్తుండగా వీరిని సమన్వయ పరుచుకుని రైతులకు చేరువ కావాలని ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచించింది. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వస్తే రైసస సభ్యులకు గౌరవ వేతనం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో రైతులకు సేవలందించేందుకుగాను గ్రామీణ రైతు సమన్వయ సమితి సభ్యుల నుండి రాష్ట్ర సమితి సభ్యుడు వరకు కొంత గౌరవ వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. గ్రామీణ సమన్వయ సమితి సభ్యులకు నెలకు వెయ్యి, కన్వీనర్‌కు 15 వందలు, మండల రైసస సభ్యులకు 15 వందలు, కన్వీనర్‌కు 2వేలు, జిల్లా రైసస సభ్యులకు 2వేలు, కన్వీనర్‌కు 5వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంఋన్నట్లు సమాచారం.

  మిషన్ కాకతీయకు ఆగిన నిధులు..!
  పెండింగ్‌లో రూ.251 కోట్ల బిల్లులు
  బిల్లుల విడుదలైతేనే పనులు ముందుకు..!

  నల్లగొండ, జనవరి 4: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం పనులు నిధుల కరవుతో ఆగిపోయాయి. వానలు పడితేనే చెరువులు నిండు.. నిధులందితేనే చెరువుల పనులన్నట్లుగా కాంట్రాక్టర్లు ఇప్పటికే చేసిన పనుల కోసం రావాల్సిన బిల్లులు విడుదలైతేనే కొత్తగా పనులు చేస్తామంటు పనులు ఆపివేశారు. ఇప్పటిదాకా జరిగిన పనులకు సంబంధించి 251కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టులు చెరువుల పునరుద్ధరణ పనుల కొనసాగింపులో చేతులెత్తేశారు. జిల్లాలో 4200 చెరువులుండగా 3,135 చెరువుల పరిధిలోని 2లక్షల 7,075 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా నాలుగు విడతల్లో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. తొలి విడత మిషన్ కాకతీయ కింద 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.169 కోట్లతో 807 చెరువుల పునరుద్ధరణ పనులు జరిపించారు. 804 చెరువులకు రూ.164కోట్లు చెల్లించారు. 2015-16 రెండో విడతలో రూ.248 కోట్లతో 1058 చెరువుల పునరుద్ధరణ పనులను ప్రారంభించి 1029 చెరువుల పనులకు రూ.189 కోట్లు చెల్లించారు. మూడో విడతలో 2016-17లో రూ.155 కోట్లతో 840 చెరువుల పునరుద్ధరణ చేపట్టి 435 చెరువుల పనులు పూర్తిచేసి రూ.56 కోట్లు చెల్లించారు. 2017-18లో నాల్గో విడత మిషన్ కాకతీయ కింద 429 చెరువుల పునరుద్ధరణ పనులను రూ.72 కోట్లతో చేపట్టి 69 చెరువుల పనులు పూర్తి చేయగా 3 కోట్ల 30లక్షల రూపాయలు చెల్లించారు. చివరి మూడు విడతల్లో కలిపి రూ.251 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
  ఒక్కటి పూర్తికాని మినీ ట్యాంకుబండ్‌లు
  ఉమ్మడి జిల్లాల పరిధిలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హుజూర్‌నగర్ మినహా మిగతా 11 నియోజకవర్గాల్లో మినీ ట్యాంకుబండ్ చెరువుల పనులనుల రూ.4023 కోట్లతో చేపట్టారు. 2018 డిసెంబర్ నెలాఖరుకల్లా మినీ ట్యాంకుబండ్ చెరువుల పనులు పూర్తికావాల్సివుండగా రూ. 198.92 కోట్లు ఖర్చయినప్పటికి నేటికి ఎక్కడా ఒక్క మినీ ట్యాంకుబండ్ పనులు పూర్తి కాలేదు. ఆలేరు కొలనుపాక, భువనగిరి పెద్దచెరువు పనులు 85 శాతం పూర్తికాగా, సూర్యాపేట చౌదరి చెరువు, నల్లగొండ బతుకమ్మ చెరువు, దేవరకొండ భీమనపల్లి చెరువుల పనులు 80 శాతం, నకిరేకల్ నల్లచెరువు, మునుగోడు ఊర చెరువు పనులు 75 శాతం పూర్తయ్యాయి. తుంగతుర్తిలో మోత్కూర్ పెద్దచెరువు పనులు 72 శాతం, మిర్యాలగూడ యాద్గారపల్లి చెరువు పనులు 70 శాతం, కోదాడ పెద్దచెరువు పనులు 65 శాతం పూర్తయ్యాయి. మినీ ట్యాంకుబండ్ నిర్మాణ కాంట్రాక్టర్లకు కూడా బిల్లుల బకాయిలు ఉండటంతో పనులు నిలిపివేసి బిల్లుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
  రాష్ట్రంలో మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందునా మిషన్ కాకతీయకు మరోసారి దండిగా నిధులొస్తాయని, పెండింగ్ బిల్లుల చెల్లింపు జరుగుతుందని ఇరిగేషన్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఆశిస్తుండగా ఈ దిశగా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సివుంది.

  పంచాయతీ ఎన్నికల్లో
  మొదటిసారిగా ‘నోటా’
  * పల్లెల్లో నిరక్షరాస్యులకు ఇబ్బంది
  వలిగొండ, జనవరి 4: గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఎన్నికల సంఘం ‘నోటా’ను ప్రవేశపెట్టింది. బ్యాలెట్ పేపర్‌లో చివరగా నోటా గుర్తును ముద్రించడం జరిగింది. శాసనసభ ఎన్నికల్లో 2014 నుండి నోటాను అమలులోకి తీసుకురాగా నోటాకు కూడా ఎంతో స్పందన లభించింది. దీనితో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒక్కొక్క ఓటే కీలకం కావడంతో నోటాపై ఆసక్తి నెలకొంది. గ్రామాల్లో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు ఉండే అవకాశం ఉండడంతో ఓట్లు వేసే క్రమంలో గుర్తులు సరిగా తెలియక తికమక పడే ప్రమాదం ఉందని ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు పోటీ చేసే అభ్యర్థులు తెలియజేస్తున్నారు. ఓటర్లకు అభ్యర్థులు నచ్చకపోయిన ఓటర్లు నోటాకు ఓటువేసి తమ వ్యతిరేకతను వెల్లండించే అవకాశం వచ్చిందని పలువురు ఓటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనితో నోటాకు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఓట్లు నమోదయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని చెప్పవచ్చు.

  నాణ్యమైన విద్యుత్‌లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్
  24 గంటల విద్యుత్‌ను అందించిన ఘనత విద్యుత్ సిబ్బందిదే..
  జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్ డి ప్రభాకర్‌రావు

  యాదగిరిగుట్ట రూరల్, జనవరి 4:ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో గృహావసరాలకే కాకుండా వ్యవసాయం,కంపెనీలకు 24 గంటల కరెంటును అందించడంలో ప్రతి ఒక్క విద్యుత్ అధికారుల,సిబ్బంది కృషి ఉందని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించ గలిగామని రాష్ట్ర జెన్‌కో,ట్రాన్స్‌కో చైర్మన్ డి ప్రభాకర్ అన్నారు.శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో తెలంగాణ పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్యర్యంలో భవన నిర్మాణానికి (గెస్ట్‌హౌస్)నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజున విద్యుత్ అందకారమే అంటున్న సందర్బంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు సూచనలతోఖర్చుకు వెనకాడకుండా నాణ్యమైన ట్రాన్స్‌ఫార్మర్‌లను కొనుగోలు చేసి అధికారుల కృషితోనే నిరంతర విద్యుత్ సాధ్యమైందని అన్నారు.విద్యుత్ వినియోగంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. గతంలో కరెంటు లేక పోతే వార్త ఉండేదని నేడు కరెంటు పోతేనే వార్త అవుతుందని అన్నారు.ప్రతి నెల 2700 కోట్ల ఖర్చు ఉందని 1935 కోట్ల రెవెన్యు ఉందని 800 కోట్ల నష్టంతో ఉన్నా కరెంటు కష్టాలు ప్రజలకు తెలువకుండా చేస్తున్నామని అన్నారు.రఘరామ్‌రెడ్డ మాట్లాడుతూ గ్రామాలలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి ఎలక్షన్‌లలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్‌కే ప్రథమ స్థానం ఇచ్చారని స్విచ్ ఏస్తే కరెంటు,ప్రతి గ్రామంలో నిరంతర విద్యుత్‌ను అందించగలుగుతున్నామని అన్నారు.వ్యవసాయదారులకు 24 గంటల కరెంటు ఇవ్వడంమే విద్యుత్ ఉద్యోగుల కృషికి నిదర్శనమని అన్నారు.గోపాల్ మాట్లాడుతూ విద్యుత్‌ను అందించడంలో ఎలాంటి రిమార్కు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రం నులమూల అందించగలుగుతున్నామని ప్రజలు విద్యుత్ ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉంటున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ బేసీరెడ్ది,డైరీ డైరెక్టర్ నరేష్‌కుమార్,రాష్ట్ర అధ్యక్షులు మధుసూధన్‌రెడ్డి,గోవర్థన్‌రెడ్డి,వర్కింగ్ ప్రసిడెంట్ చెలపతిరావు,రాష్ట్ర సెక్రటరీ జనరల్ నర్సింహ్మలు,డైరెక్టర్లు,ఏఈలు,ఏడీలు పాల్గొన్నారు.


  0 0

  మహబూబాబాద్,జనవరి 4: పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు గతంలో లాగా తూతూ మంత్రంగా వివరాలు వెల్లడిస్తే మొదటికే మోసం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పంచాయితీ ఎన్నికల సంఘం కఠిన నిబందనలను ఈసారి విదించింది. సర్పంచ్, వార్డు సుభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు విధిగా అఫిడవిట్ సమర్పించాల్సిన పరిస్థితి ఉంది. తప్పుడు సమాచారంతో నామినేషన్ దాఖలు చేస్తే అప్పుడే తిరస్కరించడంతోపాటు ఒకవేళ గెలిచిన సర్పంచ్ తప్పుడు వివరాలు ఇచ్చాడని తెలిస్తే అనర్హుడుగా ప్రకటించే అవకాశం నామినేషన్ సందర్భంలో సమర్పించే అఫిడవిట్‌తో ఏర్పడనుంది. దీంతో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీచేయాలనే భావించే అభ్యర్థులు నిబందనలపైన అవగాహన పెంచుకునే పనిలో పడ్డారు. నూతన పంచాయితీరాజ్ చట్టం 2018 ప్రకారం అనేక కొత్త అంశాలను పొందుపర్చడం జరిగింది. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధి తన ఆస్తులతోపాటు ఉమ్మడి కుటుంబ ఆస్తులను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. పోలీస్ కేసులు, కోర్టు కేసులు, శిక్షలు ఇలా ప్రతి అంశాన్ని ఏదీ రహస్యంగా దాచుకోకుండా వివరించాల్సిన పరిస్థితి కొత్త చట్టంలో ఎర్పడింది. దాఖలు చేసే పత్రాలపై అభ్యర్ధి సంతకంతో పాటు మరో ఇద్దరు సాక్షులతో సంతకం చేయించి డిక్లరేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందించాలి. దీంతో ప్రస్తుతం పల్లెల్లో ఎన్నికల నిబందనలపై చర్చ ముమ్మరంగా సాగుతుంది. ఇక ఆస్తుల వివరాలకు వస్తే జీవిత భాగస్వామితోపాటు పిల్లల ఆస్తులను కూడా సమర్పించాలి. కుటుంబ సభ్యుల పాన్‌కార్డు, అకౌంట్‌నెంబర్, ఆదాయపన్నుశాఖ ఇచ్చిన రిటర్న్స్, ఉమ్మడి కుటుంబం అయితే అక్కడ వచ్చే ఆస్తుల వాటా కూడా తెలుపాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చేతిలో ఉన్న నగదు నుండి బ్యాంకులో ఉన్న డబ్బుదాకా ప్రతి అంశం అఫిడవిట్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. అంతేగాకుండా అభ్యర్ధి విద్యార్హతను కూడా ఈసారి తప్పనిసరిగా తెలుపాల్సి ఉంది. చదువుకున్న చదువు వివరాలతోపాటు అందుకు సంబందించిన దృవీకరణ పత్రాలు సమర్పించాలి. అభ్యర్ధి సమర్పించిన అఫిడవిట్‌ను ఎన్నికల అధికారి కార్యాలయంలో నోటిస్ బోర్డుకు అతికిస్తారు. ఆ పత్రాల్లో ఎమైన తప్పులు ఉంటే అప్పటికప్పుడే అభ్యర్ధి పైన పిర్యాదు చేసే అవకాశం ఉంది. తనపై వచ్చిన పిర్యాదులను నిజం కాదని రుజువు చేసుకోనట్లైతే నామినేషన్‌ను తిరస్కరించే అంత కఠినంగా ఎన్నికల చట్టాలను రూపోందించారు. పల్లెపోరును పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో నిబందనలను అత్యంత కఠినతరం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పోటీలో దిగే ఆశావాహులు ప్రస్తుతం నిబందనలపై అవగాహన పెంచుకునే పనిలో న్యాయవాదుల చుట్టూ తిరుగుతున్నారు.

  కన్నుల పండువగా లక్ష లక్ష్మీ కుంకుమార్చన

  మహబూబాబాద్,జనవరి 4: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని గార్ల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం గోదాదేవి అమ్మవారికి మహిళలు లక్ష లక్ష్మీ కుంకుమార్చనను కన్నుల పండువగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో ఒక శుక్రవారం కుంకుమార్చన నిర్వహించటం ఆనవాయితీ. అలంకృతులైన గోదాదేవి అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పూలతో అలంకరింపజేసి మంగళవాయిద్యాల మధ్య అలయ మండపంలో ప్రతిష్టింపజేసి గోదా అష్టోత్తర లక్ష లక్ష్మీ కుంకుమార్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా అలయ వంశపారంపర్య అర్చకులు కాండూరి లక్ష్మీనారాయణ చార్యులు వేద మంత్రాలు వల్లించారు. ఈ కార్యక్రమంలో మాటేటి పద్మ, పుల్లఖండం కవిత, వేంశెట్టి కవిత, గంగావత్ శారద, ఎద్దు కరుణ, పుల్లఖండం పార్వతి, కొణతం సుభద్ర, కానాల మంగమ్మ, వడ్లమూడి లక్ష్మీ, మాలోతు మాణిక్యమ్మ, మూడు భారతి, పబ్బిశెట్టి తరంగిణీ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  తిథి: 
  బహుళ అమావాస్య రా.తె.5.41
  నక్షత్రం: 
  మూల మ.2.57
  వర్జ్యం: 
  మ.1.14 నుండి 2.57 వరకు, తిరిగి రా.1.20 నుండి 3.03 వరకు విశేషాలు: అమావాస్యోపవాసం
  దుర్ముహూర్తం: 
  ఉ.06.00 నుండి 07.36 వరకు
  రాహు కాలం: 
  ఉ.9.00 నుండి 10.30 వరకు
  మేషం: 
  (అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
  వృషభం: 
  (కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
  మిథునం: 
  (మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
  కర్కాటకం: 
  (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ఈ రోజు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
  సింహం: 
  (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలనమేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి
  కన్య: 
  (ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి
  తుల: 
  (చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
  వృశ్చికం: 
  (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంత సౌఖ్యంగా వుంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
  ధనుస్సు: 
  (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఋణప్రయత్నం ఫలిస్తాయ. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
  మకరం: 
  (ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
  కుంభం: 
  (్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
  మీనం: 
  (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
  Date: 
  Saturday, January 5, 2019
  author: 
  - గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి

  0 0

  ఉట్నూరు, జనవరి 4: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఉట్నూరు మండలంలో 35 గ్రామపంచాయతీలు ఉండగా కొత్తగా ఏర్పాటైనా కామాయిపేట పంచాయతీ సర్పంచ్‌గా ఆత్రం అయ్యూబాయిని గిరిజనులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం కామాయిపేటలో పంచాయతీ పరిధిలోని అల్లీగూడ, కామాయిపేట, పాటగూడ, మత్తడిగూడ, బొప్పరికుంట, బొగ్గుగుట్ట, ఒంటిమామిడి గ్రామాలకు చెందిన గిరిజనులు సమావేశమయ్యారు. చాకటి రాజు పటేల్ అధ్వర్యంలో సమావేశం నిర్వహించగా కొత్తపంచాయతీ మహిళలకు రిజర్వ్ అయినందునా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తీర్మానం చేశారు. ఈమేరకు కామాయిపేటకు చెందిన ఆత్రం అయ్యూబాయిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని తిర్మానించగా వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం మడావి భీంరావును ఉప సర్పంచ్‌గా ఎన్నుకోవాలని తీర్మానించారు. సమావేశంలో గిరిజన పెద్దలు మడావి జలపతిరావ్, కుర్సంగెదేవు, ఆత్రం సోనెరావు, భూమారావు, భీంరావు, మహిళా సంఘాల ప్రతినిధులు సోనిబాయి, సోంబాయి, చిన్నుబాయి తదితరులు పాల్గొన్నారు.

  స్వర్ణ పతక విజేతకు ఘన స్వాగతం
  కాగజ్‌నగర్, జనవరి 4: ఇండో నేపాల్ అథ్లెటిక్స్ ఛాంఫియన్ షిప్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారిణి ఉమా సర్కార్‌కు శుక్రవారం కాగజ్‌నగర్‌లో బీజేపీ నాయకురాలు కొత్తపల్లి వెంకటలక్ష్మి, చంద్రయ్య , స్వచ్చంద సేవ సమితి అధ్యక్షురాలు కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం పలికారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలానికి చెందిన ఉమా సర్కార్ ఇండో నేపాల్ ఛాంఫియన్ షిప్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం, అదే విధంగా షార్ట్ ఫుట్‌లో సైతం స్వర్ణ పతకం గెలుచుకొని శుక్రవారం కాగజ్‌నగర్ కు చేరుకుంది. ఈ సందర్బంగా క్రీడాకారిణి మాట్లాడుతూ తాను అంతదూరం పోటీలో పాల్గొనడానికి వెళ్లేందుకు సహాకరించిన కొత్తపల్లి వెంకటలక్ష్మి, చంద్రయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షురాలు అనీత గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ అనీత క్రీడాకారిణి కి శాలువా కప్పి అభినందించారు. క్రీడాకారులు ఎవరైనా సహాకారం కావాలంటే తాము అందిస్తామని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు.

  కుల వృత్తులతో యువతకు ఉపాధి
  * జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజేశ్వర్
  ఆసిఫాబాద్ టౌన్, జనవరి 4: కులవృత్తులలో నైపుణ్యం సాధించిన యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజేశ్వర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాగజ్‌నగర్ పద్మశాలి భవనంలో కుమ్మరి కులస్తులకు నైపుణ్యం పెంచేందుకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులను జనవరి 7 నుండి 9 వరకు నిర్వహించడం జరగుతుందన్నారు. ఈ శిక్షణ సందర్భంగా ఇండ్లలో వాడే అలంకరణ సామాగ్రి, వాటర్ బాటిళ్లు, గ్లాసులు, జగ్గులు, టీ కప్స్ తయారీ పై శిక్షణ ఇవ్వడం జరగుతుందని ఆయన తెలిపారు. కుమ్రంభీం జిల్లాలోని కుమ్మరి కులస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి ముగ్గురు చొప్పున 30మందికి మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వడం జరగుతుందని రాజేశ్వర్ తెలిపారు. ఆసక్తి గల వారు తమ ఫోటో, ఆధార్ కార్డు, కుల సర్ట్ఫికేట్లతో హాజరుకావాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిన తరగతులు అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే దిశగా కృషి చేయడం జరగుతోందన్నారు. వీటిని కులవృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కుమ్మరులు కేవలం కుండల తయారీకే పరిమితం కాకుండా అనేక మట్టి వస్తువుల తయారీలో శిక్షణ ఇచ్చి మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న వస్తువుల తయారు చేయడం ద్వారా ఆర్థిక పుష్టి సాధించే దిశగా వారిని సమాయత్తం చేస్తున్నామన్నారు.

  రాష్ట్ర పథకాలకు అంతర్జాతీయ గుర్తింపు
  * సీఎం కేసీఆర్ నిర్ణయాలు చారిత్రాత్మకం
  * ఎన్నికల తర్వాత పంచాయతీల రూపురేఖలు మారుస్తాం
  * జనాభా నిష్పత్తి ప్రకారం నిధుల కేటాయింపు
  * ఏకగ్రీవ పంచాయతీలకు పెద్దపీఠ
  * నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి
  నిర్మల్, జనవరి 4: తొలి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం ఈ రాష్ట్ర ప్రజల విజయమని నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించిన సంగతి అందరికి తెలిసిందేనన్నారు. ఈ పథకాల అమలుకోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారని, దేశ ప్రధాని సైతం రైతుబంధు అమలుకు కార్యాచరణ రూపొందిస్తుండడం పట్ల ఈ ఘనత మన ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. శుక్రవారం నిర్మల్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీ ఆర్ పేద ప్రజలు, రైతుల సంక్షేమం కోసం అమలుచేసిన పథకాలు చారిత్రాత్మకంగా నిలిచిపోతాయన్నారు. ఇలా ఉంటే త్వరలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయని, అనంతరం గ్రామాల రూపురేఖలే మారిపోనున్నాయన్నారు. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీ ఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం పెద్ద ఎత్తున నిధులను మంజూరుచేసి గ్రామాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 134 పంచాయతీల్లో కనీసం 30 శాతం అయినా ఏకగ్రీవం చేసేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.10 లక్షల నిధులు విడుదలవుతాయని, అలాగే ఎన్ ఆర్ ఈజీయస్ ద్వారా మరో 10 లక్షలు ఇప్పిస్తానని ఆయన హామీనిచ్చారు. కొత్తగా ఏర్పడ్డ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే రూ.20 లక్షల నిధులతో గ్రామాన్ని అభివృద్ది చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు.
  పార్టీ పునర్ నిర్మాణం కోసం....
  టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించడంతో ఆయన ఆదేశం ప్రకారం పార్టీని కిందిస్థాయి నుండి పునర్‌నిర్మాణం చేసేందుకు కార్యాచరణ రూపొందింస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాకో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించినందున నిర్మల్ జిల్లాలో దాదాపు ఎకరం స్థలంలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించబోతున్నామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశాలకు అనువుగా ఉండేవిధంగా ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో దేవరకోట ఆలయ చైర్మెన్ ఆమెడ కిషన్, పార్టీ నాయకులు గండ్రత్ ఈశ్వర్, ధర్మాజి రాజేంధర్, కోటగిరి అశోక్, పాకాల రాంచందర్, ముత్యంరెడ్డి, ద్యాయత్ సోమేశ్వర్, మేడారం ప్రదీప్, గండ్రత్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

  శిర్షా పంచాయతీ
  ఏకగ్రీవానికి తీర్మాణం
  * సర్పంచ్, ఉప సర్పంచ్‌ల పేర్లు ఖరారు
  * జిల్లాలోనే తొలి ఏకగ్రీవం
  కౌటాల, జనవరి 4: పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియకు ముందే సర్పంచ్, ఉప సర్పంచ్‌ను ఖరారు చేసి తీర్మాణం చేసి మండలంలోని శిర్షా గ్రామానికి చెందిన ప్రజలు తమ ఐక్యతను చాటారు. దీనికి సంబంధించి వివరాలలోకివెళ్లితే పంచాయతీల పునర్విభజనకు ముందు మండలంలోని ముత్యంపేట పంచాయతీలో శిర్షా గ్రామం ఉండేది. ఈ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేయడంతో తొలిసారిగా ఎన్నికలు జరుగుతుందటంతో సర్పంచ్, ఉప సర్పంచ్‌లతో సహా ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సాధారణ పంచాయతీ ఎన్నికలలో ఎన్నిక జరగాల్సి ఉండగా అటు అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్న దరిమిలా గ్రామస్థులంతా ఏకమై గురువారం రాత్రి సమావేశమై సర్పంచ్, ఉప సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఖరారు చేసి తీర్మాణాన్ని కూడా రాసుకున్నారు. అసలే రాజకీయాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో గ్రామ పంచాయతీల పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పరిస్థితులు నెలకొనగా కొత్తగా ఏర్పడిన శిర్షా గ్రామస్తులు అభివృద్ధిని ఆకాంక్షిస్తు ఏకగ్రీవంగా తమ గ్రామ ప్రథమ పౌరురాలును ఎన్నుకోవడం విశేషం. సర్పంచ్ పదవిని బీసీ(మహిళ)గా రిజర్వు చేయడంతో 658 ఓటర్లున్న గ్రామంలో 100శాతం బీసీ ఓటర్లే ఉండగా, వీరిలో కుర్మ కులస్తులు 90 శాతం వరకు ఉండటం విశేషం. సర్పంచ్‌గా కడారి కనుకక్కను మొట్టమొదటి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. ఈ మేరకు గ్రామస్థులు ఆమె పేరును ఖరారు చేస్తూ ఏకగ్రీవ తీర్మాణాన్ని రాసుకున్నారు. గ్రామంలో ఎటువంటి విభేదాలు ఉండకూడదనే వారు ఐక్యతను చాటేందుకు ఏకగ్రీవం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటే ఉప సర్పంచ్‌గా దివ్యాంగురాలైన ఎగ్గే తిరుపతమ్మను ఖరారు చేశారు. 8 వార్డులకు గాను వార్డు సభ్యలను కూడా త్వరలోనే ఏకగ్రీవంగా ప్రకటిస్తామని గ్రామస్థులు పేర్కొన్నారు.
  ఫోటోరైటప్
  4 ఎం ఎన్‌సిపి 13: శిర్షా పంచాయతీ సర్పంచ్‌గా తీర్మాణించిన కనుకక్క
  4 ఎం ఎన్‌సిపి 14: కౌటాల మండలంలోని శిర్షా గ్రామం

  ట్రాయి నిబంధనలతో సామాన్యడిపై పెనుభారం
  బ్రైట్‌వే ఎండి ఎఫ్‌టీఏ అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి
  శ్రీరాంపూర్ రూరల్ జనవరి 4: ట్రాయి నిబంధనలతో సామాన్యుడుకి వినోదం దూరమయ్యే ప్రమాదం ఉందని ట్రాయి నిభందనలను పునఃరాలోచించాలని బ్రైట్‌వే ఎండి ఎఫ్‌టీఏ అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలోని సింగరేణి సేవ భవన్‌లో ఉమ్మడి అదిలాబాద్ కేబుల్ ఆపరేటర్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ టీ ఎం అధ్యక్షులు సుభాష్‌రెడ్డి, విక్రమ్ డిజిటల్ కేబుల్ నెట్‌వర్క్ అధినేత అధ్యక్షులు బ్రింజ్‌మోహన్ శర్మ, బ్రైట్‌వే డైరెక్టర్, హైటెక్ కమ్యూనికేషన్ అధినేత మహ్మద్ వౌలానాలతోకలసి మాట్లాడారు.కేబుల్ టీవీ బిజినెస్‌కు ఎలాంటి ఇబ్పంది లేదని, మొబైల్ టెక్నాలజీని ఉపమోగించుకొని కొత్త చానళ్లను ఎప్పటికప్పుడు వినయోగదారునికి అందుబాటులో ఉంచాలని తెలిపారు. వద్దనకున్న వినియోగదారునికి వెంటనే క్యాన్సిల్ చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా కోటి కేబుల్ కనెక్షన్లు ఉన్నాయని, ఒక్క పే చానల్‌కు రుపాయి చెల్లించిన కోటి రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. ట్రాయి నింబంధనల ప్రకారం ఒక చానల్‌కు పది పైసలు నుండి 19రూపాయల లోపు వసూల్ చేసే అవకాశం కల్పించారని తెలిపారు.దీనికి ప్రతి చానల్‌కు రూ 19 చోప్పున వాసుల్ చేయడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కేబుల్ రంగంపై విధించిన జీఎస్‌టీ 18శాతం నుంచి 5శాతానికి తగ్గించాలనీ కోరామన్నారు.కేబుల్ ఆపరేటర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు.నామాన్యుడి పై భారం పడే విధంగా ఉన్న ట్రాయ్‌నిబందలను తొలగించాలని రూ. 130 ఏయిర్ టూ ఫ్రీ చానల్స్ బిల్లును కేబుల్ ఆపరేటర్లకు వర్తించేలా చేయాలని అన్నారు. కేబుల్ ఆపరేటర్లు ఐక్య మత్యంతో పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోఉమ్మడి అదిలాబాద్ ఎంఎస్‌వోలు మందమర్రి సధానందం, చెట్ల రమేష్ లక్షేట్ పేట్, అజయ్ బెల్లంపల్లి, మురళి బెల్లంపల్లి రూరల్, సతీష్ రామకృష్ణపూర్ జాకీర్ రామకృష్ణాపూర్, శ్రీనివాస్,మ్యదరిపేట పాలకుర్తి శ్రీనివాస్,కడెం, మధు జన్నారం,మదాసు మధుచెన్నూర్,ఆపరేటర్ల సంఘం ఉపాధ్యక్షులు బొద్దున సత్తయ్య,కార్యదర్శిరాజేశం,సిటి డిజిటల్ డైరెక్టర్ పంబాల తిరుపతిలతో పాటు వివిధ ఏరియాల ఆపరేటర్స్ తదితరు లు పాల్గొన్నారు.


  0 0

  శ్రీకాకుళం, జనవరి 4: రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు చేసిన తప్పును కేంద్రం పై నెట్టేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ మహిళామోర్ఛా జాతీయ ఇంఛార్జ్, ఉత్తరాంధ్ర పార్లమెంట్ క్లస్టర్ కో ఆర్డినేటర్ దగ్గుబాటి పురంధేశ్వరి
  పేర్కొన్నారు. బీజేపి జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలు 80 నుండి 90 శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటున్నారని, పోలవరం ప్రాజెక్ట్ పనులకు ప్రతీ పైసా కూడా కేంద్రం నిధులేనని స్పష్టం చేశారు. ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపని చరిత్ర కాంగ్రెస్‌పార్టీది అని అన్నారు. ఎన్డీ ఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలపడం జరిగిందని అన్నారు. ఈ ఏడు మండలాలు ఏపీలో కలపనట్లయితే పోలవరం ప్రాజెక్ట్ పనులే ప్రారంభం కావని పేర్కొన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే నిర్మాణం పనులు జరిగేనా అని ప్రశ్నించారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి 10 నుండి 12వేలు రూపాయలు కేంద్రం నిధులేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లను అభివృద్ధిచేసేందుకు రూ.75వేల కోట్లను మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులుకు సంబంధించి యుటిలైజేషన్ సర్ట్ఫికెట్ సకాలంలో ఇవ్వకపోతే నిధులు జాప్యం జరుగుతాయని తెలియజేశారు. అమరావతి అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు చూడవచ్చని, దీనిపై శే్వత పత్రం ద్వారా వివరించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. రాజధాని పర్మినెంట్ నిర్మాణానికి రూ.1500 కోట్లు కేంద్రం నిధులు ఇచ్చినట్లు తెలియజేశారు. అవినీతీ రహిత పాలన ప్రధాని మోదీ అందిస్తున్నారన్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలనేది ప్రజల ఆకాంక్ష అని అన్నారు. అనైతిక కలయిక రాష్ట్రంలో ఉందని, రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం వారు చేసిన తప్పులను కేంద్రంపై నెట్టేస్తున్నారన్నారు. వెనుకబడిన జిల్లాలైన ఏడు జిల్లాలకు ప్రతీ ఏడాది రూ.350 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి వుందన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ముఖ్యమంతి ఆమోదం తోనే తీసుకురావడం జరిగిందన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ ఎంపి కణితివిశ్వనాధం, జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయణరావు, పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు, ఎంబిజి నాయుడు, చల్లా వెంకటేశ్వరరావు, శవ్వాన వెంకటేశ్వరరావు, రెడ్డినారాయణరావు, అట్టాడ రవి బాబ్జి, ఎస్‌వి రమణమూర్తి, కోరాడ నారాయణరావు, సురేష్‌సింగ్, పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ బవిరెడ్డి శివప్రసాదరెడ్డి, బత్తుల పవన్‌సాయి తదితరులున్నారు.

  పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు ఏర్పాట్లుపూర్తి
  * ఎస్పీ డాక్టర్ సి ఎం త్రివిక్రమవర్మ
  ఆంధ్రభూమి బ్యూరో
  శ్రీకాకుళం, జనవరి 4: ఈనెల 6న పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నిర్వహించనున్న రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎస్పీ డాక్టర్ సి ఎం త్రివిక్రమవర్మ పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయ సమవేశమందిరంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సివిల్, ఏ ఆర్, ఫైరింగ్, జైల్ వార్డెన్ తదితర పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి 19,643మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరికి శ్రీకాకుళం కేంద్రంగా డాక్టర్ అంబేద్కర్ యూనివర్శిటీ ప్రిన్సిపాల్ గుంట తులసీరావు కో ఆర్డినేటర్‌గా 23 కేంద్రాలలో రాతపరీక్షలు నిర్వహించనున్నామని, వీటికి 10,531 మంది హాజరుకానున్నారన్నారు. అదే విధంగా టెక్కలి కేంద్రంగా 28 కేంద్రాలలో ఐతమ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.మదుసాహు కో ఆర్డినేటర్‌గా నిర్వహించే రాత పరీక్షలో 9,112 మంది పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాకినాడ జవహార్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ నేతృత్వంలో ఈ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 6వ తేదీ ఉదయం 10గంటల నుండి 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నామని, పరీక్షకు హాజరు కాగోరు అభ్యర్థులు 9గంటల నుండి పరీక్ష హాల్ వద్ద హాజరుకావాలన్నారు. పరీక్ష సమయంలో అభ్యర్థులకు బయోమెట్రిక్ ద్వారా వారి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి ప్రతీ కాలేజీలో బయోమెట్రిక్‌లో ట్రైనింగ్ అయిన 51 మంది ఐటీ ట్రైనీస్‌ను వినియోగించడం జరుగుతుందన్నారు. పరీక్ష సమయంలో అభ్యర్థులు కేవలం బ్లాక్, బ్లూ బాల్‌పెన్‌లను మాత్రమే వినియోగించాలని, వారితో పాటు హాల్‌టికెట్, ఒక ఐడి కార్డ్ మాత్రమే పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. సెల్‌ఫోన్‌లు, ఇతర గార్జెట్స్‌ను పరీక్ష హాల్‌లోకి అనుమతించరని వారి బేగ్ అండ్ బ్యాగేజీ విషయంలో కూడా యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడంలో ఏవైనా అవాంతరాలు ఏర్పడినప్పటికి వాటిని ఎక్స్‌పర్ట్‌ల సహాయంతో సరిచేయడం జరుగుతుందన్నారు.
  ఆర్‌పి ఎఫ్ ఎగ్జామ్ రాసేవారికి 7న పోలీస్ పరీక్షలు:
  పోలీస్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్షలు నిర్వహించిన రోజునే ఆర్‌పి ఎఫ్ పరీక్షలు కూడా నిర్వహించనున్న నేపథ్యంలో, పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారికి ఈనెల 7వ తారీఖున జే ఎన్‌టియు కాకినాడలో వారి అభ్యర్థన మేరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ పరీక్షల తేదీలో ఎటువంటి మార్పులు,చేర్పులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష హాల్‌లో కేవలం జే ఎన్‌టియు అపాయింట్ చేసిన ఇన్విజిలేటర్స్ మాత్రమే ఉంటారని పోలీస్ అధికారులు హాల్ బయట ఉంటారన్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను శ్రీకాకుళంకు సంబందించి ఏ ఆర్ హెడ్‌క్వాటర్స్‌లోను, టెక్కలి సంబంధించి టెక్కలి హెడ్‌క్వార్టర్స్‌లోను భద్రపర్చడమైనదని ఆయన తెలిపారు. ఈసందర్భంగా శ్రీకాకుళం కో ఆర్డినేటర్ డాక్టర్ బి ఆర్ ఏ యు ప్రిన్సిపాల్ జి.తులసీరావు మాట్లాడుతూ పరీక్షకు వచ్చే అభ్యర్థులను 10గంటల తర్వాత అనుమతించబోమన్నారు. అదేవిధంగా ప్రతీ అభ్యర్థి తమతో పాటు బాల్‌పెన్‌లు, హాల్‌టికెట్, ఏదైనా ఫోటోగుర్తింపు కార్డులన మాత్రమే తనతో కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు ఓ ఎమ్ ఆర్ షీట్‌మీద తప్పనిసరిగా సంతకం చేయాలని ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని పూర్తిగా చదివిన అనంతరం మాత్రమే పరీక్షరాయాలని ఆయన సూచించారు. ఈ పరీక్షలకు ప్రీప్రింటెడ్ ఓ ఎమ్ ఆర్ షీట్‌లను ఇవ్వడం జరుగుతుందని, దానిలో అభ్యర్థి వ్యక్తిగత డేటా అంతా ఉంటుందన్నారు. వాటిలో ఏమైనా పొరపాట్లు దొర్లినట్లయిన వాటిని పరీక్ష ప్రారంభం ముందుగానే చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విలిజిలేటర్ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆన్సర్‌షీట్స్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే పరీక్ష రాయాలని, ఏమైనా ప్రింట్ కాకపోతే ముందుగానే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఐతమ్ కళాశాల ప్రిన్సిపాల్ మధుసాహూ మాట్లాడుతూ పలాస, టెక్కలి, నరసన్నపేట, కోటబొమ్మాళి, ఐతమ్ కళాశాలలో ఈ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ముందుగా ఇన్‌స్ట్రక్షన్స్ చదివితే వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఏ ఎస్పీ గంగరాజు, డి ఎస్పీ వి.్భమారావుతదితరులు పాల్గొన్నారు.

  టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం
  * ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
  శ్రీకాకుళం (టౌన్), జనవరి 4: రాష్ట్ర అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమని స్థానిక శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి అన్నారు. జన్మభూమి-మా ఊరు 6వ విడత కార్యక్రమంలో భాగంగా నగరంలోని పుణ్యపువీధిలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి కోట్లాదిరూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. జాతిమత విభేదాలు లేకుండా అన్ని జాతుల వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు దక్కాలన్నదే చంద్రబాబు ఆశయమన్నారు. రాష్ట్ర విభజనతో నష్టాల ఊబిలోకి కూరుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారన్నారు. ఈ జన్మభూమి ద్వారా మీ వార్డుల్లోని పల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, రానున్న రోజుల్లో కూడా ఈ అభివృద్ధి ఫలాలు సాధించాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. దీనికి మీరంతా సహకరించి జిల్లాలో అన్ని సీట్లలో తెలుగుదేశం విజయం సాధించే దిశగా కృషి చేయాలని ఆమె ఆశించారు. మా తెలుగుతల్లి మల్లెపూదండ ప్రార్థనాగీతంతో ప్రారంభమైన ఈ జన్మభూమి కార్యక్రమంలో జన్మభూమి ప్రతిజ్ఞ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శే్వతపత్రాలను నగరపాలక సిబ్బంది చదివి వినిపించారు. ఈ సభలో ప్రత్యేకాధికారి పాటూరి లక్ష్మీనృసింహం కూడా పాల్గొని కార్యక్రమ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చంద్రన్న సంక్రాంతి కానుకలును అందజేశారు. ఇదే విధంగా 12వ వార్డుకు సంబంధించి ఎమ్‌సి ఈ స్కూల్, 13వ వార్డుకు సంబంధించి రెల్లివీధి, 15వ వార్డుకు సంబంధించి ఇప్పిలివీధి ముత్యాలమ్మ టెంపుల్ వద్ద, 15వ వార్డుకు సంబంధించి ముత్యాలమ్మ టెంపుల్ వద్ద, 18వ వార్డుకు సంబంధించి పాండ్రంకి వీధి వేపచెట్టు జంక్షన్ వద్ద నిర్వహించిన గ్రామసభలలో అసిస్టెంట్ కమీషనర్ హైమవతి, ఏసిపి దేవకుమార్, డి ఈ, ఏ ఈలు, నగర టీడీపీ నాయకులు మాదారపు వెంకటేశ్, కెల్ల కొండలరావు, ఇప్పిలితిరుమలరావు, ఎస్‌విరమణమాదిగ, కరగాన రాము, చిట్టి నాగభూషణరావు, వార్డు కన్వీనర్‌లు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి చేతుల మీదుగా ఆదరణ పనిముట్లు అందజేశారు. వార్డు ప్రజల నుండి వినతులు స్వీకరించారు.

  నకిలీ పోలీస్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  * నగరంలో వినూత్న పంథాలో దొంగతనాలు
  * ఎస్పీ త్రివిక్రమవర్మ
  శ్రీకాకుళం (టౌన్), జనవరి 4: నగరంలో ఒక దొంగల ముఠా మోటార్ సైకిల్‌పై ప్రయాణం చేస్తూ వినూత్న తరహాలో దొంగతనాలకు పాల్పడుతుందని ఎస్పీ తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నగరంలో దీపా మహల్ వద్ద 60 ఏళ్ల వయసు గలిగిన మల్లిఖార్జున అనే వ్యక్తిని మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు నగరంలో దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయని, మీ దగ్గర ఉన్న బంగారు నగలను మాకు అప్పజెప్పి మీరు వెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్‌లో వాటిని కలెక్ట్ చేసుకొని వెళ్లవచ్చని చెప్పారు. ఇదే సందర్భంలో వేరే మోటార్ సైకిల్‌పై వచ్చిన మరో ఇద్దరు తమ దగ్గరనున్న బంగారు ఆభరణాలను కర్చ్ఫీలో చుట్టి వీరికి అందజేసి వెళ్లిపోయారు. దీనితో మల్లిఖార్జున్ తన దగ్గరనున్న బంగారు ఆభరణాలను వారికి అందజేయగా వాటితో వారు పరారయ్యారు. ఇటువంటి దొంగతనాలు నగరంలో పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజానీకం అప్రమత్తంగా వ్యవహారించాలని ఎస్పీ సూచించారు.
  సభ విజయవంతం పైనే పార్టీ భవితవ్యం
  * వైసీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని
  శ్రీకాకుళం (టౌన్), జనవరి 4: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 9వ తేదీన ఇచ్ఛాపురంలో నిర్వహించనున్న సభ విజయవంతం పై పార్టీ భవితవ్యం ఎంతగానో ఆధారపడి ఉంటుందని వైసీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం వైసీపీ కార్యాలయంలో జగన్మోహనరెడ్డి పాదయాత్ర ముగింపు బహిరంగ సభ ఏర్పాట్లుపై విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఈ ముగింపు సభ నిర్ణయిస్తుందన్నారు. ఈ ముగింపు సభకు రాష్ట్రం మొత్తం నుండి వేలాది మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు జిల్లాకు తరలిరానున్న నేపథ్యంలో ఈ సభ విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై వుందన్నారు. ఇచ్ఛాపురంలో నిర్మించిన పైలాన్‌ను ఈఫిల్ టవర్ మాదిరిగా రూపొందించడం జరిగిందని దీనిని చూసేందుకు దేశం నలుమూలల నుండి ఎంతో మంది రావడం జరుగుతుందన్నారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ భారతదేశ రాజకీయ చరితలో నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గం నుండి రెండు వేల మందిని ఈ సభకు తీసుకురానున్నట్లు తెలిపారు. జిల్లాలో మీ అందరి కృషితోనే జగన్ పాదయాత్ర విజయవంతం అయిందని కార్యకర్తలను ప్రసంశించారు. జిల్లా ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందనేది ఈ పాదయాత్ర స్పష్టం చేసిందని రానున్న ఎన్నికల్లో పదికి పది నియోజకవర్గాలను గెలిచే అవకాశం వున్నట్లు వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి పేర్కొన్నారన్నారు. సభకు జనసమీకరణ ఎంతో ముఖ్యమని ఆదిశగా ప్రతీ నియోజకవర్గ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో వైసీపీ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పార్లమెంటరీ కో ఆర్డినేటర్ దువ్వాడ శ్రీను, పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్‌కుమార్, పది నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, సాధు వైకుంఠరావు, అందవరపుసూరిబాబు,మామిడి శ్రీకాంత్, చల్లరవికుమార్, వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  అర్హులందరికి సంక్షేమఫలాలు
  సోంపేట, జనవరి 4: రాజకీయాలకు అతీతంగా అర్హులందరికి ప్రభుత్వ సంక్షేమఫలాలు అందించడం జన్మభూమి, గ్రామసభల ధ్యేయమని సోంపేట ఎంపీపీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కొర్లాం ఎంపీటీసీ ఆర్‌వి రమణ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. సీ ఎం చంద్రబాబునాయుడు అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఏ ఒక్కరూ సంక్షేమ ఫలాలకు ఏ ఒక్కరూ దూరం కాకుండా ఉండేందుకు గ్రామసభలను నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులన్నీ 90 శాతం సమకూర్చినట్లు గణాంకాలు ద్వారా తెలుస్తుందన్నారు. ఇది చంద్రబాబు పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పీటీసీ చంద్రమోహన్, మండల ప్రత్యేకాధికారి కరుణాకరరావు, ఎంపీడీవో ఈశ్వరమ్మ, తహసీల్థార్ గోపాలరత్నం పాల్గొన్నారు.

  నౌపడ ఉన్నత పాఠశాలకు అప్పలరాజు నగదు వితరణ
  సంతబొమ్మాళి, జనవరి 4: మండలం, నౌపడ ఉన్నతపాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయంగా స్కూల్ ఆసిస్టెంట్ అప్పలరాజు నగదును శుక్రవారం పాఠశాలకు అందజేసారు. లక్కివలస గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు అప్పలరాజు నౌపడ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ తాను స్వయంగా అభివృద్ధికి దోహదపడాలనే దృక్పథంతో 3 వేల రూపాయల నగదును సంబంధిత హెచ్ ఎంకు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దండుగోపాలపురం ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ పదవివిరమణ చేసిన అయ్యబాబుకు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎల్ ఎల్ నాయుడు, ఎంపీటీసీలు కె. ఇందిర, అసిరినాయుడు, ఎం ఇవో చిన్నవాడు, హెచ్ ఎం ఢిల్లేశ్వరరావు, మాజీ సర్పంచ్ అప్పలరాజు, వసంతరావు, అప్పలస్వామిలు శుక్రవారం ఘనంగా సన్మానించారు.

  పోర్టు నిర్మాణానికి పి ఎసి ఎస్ అధ్యక్షుడు భూమి అప్పగింత
  సంతబొమ్మాళి, జనవరి 4: భావనపాడు పోర్టు నిర్మాణ భాగంలో ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ మండల పీ ఎసి ఎస్ అధ్యక్షుడు అట్టాడ రాంప్రసాదరావు తన భూమిని ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తన స్వగ్రామం మర్రిపాడు గ్రామంలో తన పంట పొలానికి తానే స్వయంగా వెళ్లి ఆర్ ఐ శేషగిరి, మండల సర్వేయర్ బాలరెడ్డిలకు తన పంట భూముల వివరాలను తెలియజేసారు. పోర్టు అభివృద్ధిలో భాగంగా సర్వే జరుపుతున్న సమయంలో అట్టాడ రాంప్రసాదరావు తన పొలం వద్దకు తీసుకువెళ్లి విస్తీర్ణం, సర్వే నెంబర్లును తెలియజేయగా, అధికారులు సర్వే చేసారు. ఈయనతోపాటు రైతులున్నారు.

  జగన్ పాదయాత్ర రాష్ట్ర స్వర్ణయుగానికి పునాది
  ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 4: రాష్ట్రంలో వై ఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర రాబోయే రోజుల్లో రాష్ట్ర స్వర్ణయుగానికి పునాది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రఘురామ్ తెలియజేసారు. శుక్రవారం లొద్దపుటి వద్ద నిర్మిస్తున్న పైలాన్ వద్ద విలేఖరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసారని, ఈ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కావాల్సిన సౌకర్యాలు గూర్చి తెలుసుకున్నారన్నారు. అధికారపక్షం ఎన్ని అడ్డంకులు కలిగించిన నిబద్దతతో పాదయాత్ర చేసారన్నారు.హత్యకు సైతం కుట్ర చేసారని, మండుటెండ, చలి, వానలను ఎదుర్కొంటూ ప్రజలకు కలవాలనే లక్ష్యంతో ఈ యాత్ర సాగిందన్నారు. దేశంలో మరువలేని సంఘటనగా ఈ యాత్ర నిలుస్తుందన్నారు. రైతులు, స్ర్తిలు కలిసి వారికి కావాల్సినవాటిని వారే జగన్‌ను అడిగారన్నారు. 344 రోజులు సాగిన ఈ యాత్రలో ముగింపు ఇచ్ఛాపురంలో జరుగుతుందని, రాష్ట్ర స్థాయిలో ఈ సభ ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నరేష్‌కుమార్, వెంకటరెడ్డి, పిరియా విజయ పాల్గొన్నారు.
  గ్రామాల అభివృద్ధి సీ ఎం లక్ష్యం
  ఇచ్ఛాపురం(రూరల్), జనవరి 4: మారుమూల గ్రామాల అభివృద్ధి చేయడమే సీ ఎం లక్ష్యమని ఎంపీపీ ఢిల్లీరావు పేర్కొన్నారు. జన్మభూమిలో భాగంగా తులసీగాం,్ధర్మపుంర గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తులసీగాంలో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, 44 లక్షల రూపాయలతో ఎన్‌టి ఆర్ సుజల పథకం, 21 లక్షల రూపాయలతో మూడు అంగన్‌వాడీ భవనాలు, కాజ్‌వే నిర్మాణాలు టీడీపీ హాయంలోనే జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, వాటి ఉపయోగాలు గూర్చి వివరించారు. జడ్‌పీటీసీ లింగరాజు. ప్రత్యేకాధికారి పాపారావు, ఎం ఇవో అప్పారావు, దక్కత కామేషు, సాహేదేవ్, వివిధ అధికారులు పాల్గొన్నారు.
  జన్మభూమితో సమస్యలకు పరిష్కారం
  ఇచ్ఛాపురం, జనవరి 4 : జన్మభూమి - మావూరు కార్యక్రమంతో ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి అన్నారు. పట్టణంలోని 6, 7 వార్డులలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి సభల్లో ఆమె మాట్లాడారు. రేషన్, పింఛన్, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి లైట్లు, రోడ్లు, కాలువలకు సంబంధించిన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తొలుత వివిధ శాఖల అధికారులు సంక్షేమ పథకాల గురించి వివరించారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. బాల సంజీవని కిట్లను పంపిణీ చేశారు. కౌన్సిలర్లు పి.మంజులత, జి.అనసూయ, టీడీపీ నేతలు చాట్ల తులసీదాస్, బి.నిర్మలారెడ్డి, నందిక జానీ, నాగరాజు పాత్రో, కొర్రాయి ధర్మరాజు, బి.కృష్ణయ్య, వజీద్ జిలానీ, గుడ్ల రవి, ఎస్.ఎన్.పండా, డి.విశ్వనాథ్, జి.కృష్ణ పాల్గొన్నారు.
  తిత్లీ తుపాన్ బాధితులకు న్యాయం చేయండి
  పలాస, జనవరి 4: తిత్లీ తుపాన్‌కు సంబంధించి సుమారు 3 నెలలు గడుస్తున్న ఇప్పటికి బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బాధితులకు న్యాయం చేయాలని పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డికి విజ్ఞప్తి చేసారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను వైసీపీ నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ తిత్లీ తుపాన్ బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించినప్పటికి ఇప్పటికి బాధితులకు నష్టపరిహారం అందకపోవడం ప్రభుత్వ ఆలసత్వానికి నిదర్శనమన్నారు. పండుగ నాటికి బాధితులకు పరిహారం అందకపోతే వౌనదీక్ష చేస్తామని హెచ్చరించారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం తమ వంతు ప్రయత్నాలు చేస్తుందని, బాధితులందరి పేర్లును నెట్‌లో అప్రూవల్ చేసామని, నిధులు వచ్చిన వెంటనే పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వరిశ హరిప్రసాద్, బడగల బల్లయ్య, భవానీ, జుత్తు నీలకంఠం, గురయ్యనాయుడు, గిరిబాబు, పైల చిట్టి, మధుకేశ్వరరావు, ఎం ఎన్‌మూర్తి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

  బాబుది జవాబుదారీపాలన
  మందస, జనవరి 4: రాష్ట్రంలోని 119 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాజకీయాలకు అతీతంగాప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు జవాబుదారీతనం పాలన సీ ఎం చంద్రబాబునాయుడు అందజేస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీషా అన్నారు. శుక్రవారం పిడిమందస, కుంటికోట, వీరగున్నమ్మపురం, నర్శింగపురంల్లో జన్మభూమి గ్రామసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ప్రణాళికలు సిద్దం చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమానికి బాబు పెద్దపీట వేసి, కోట్లాది రూపాయలు వ్యయంతో గ్రామాలను అభివృద్ధి పథం వైపు నడిపించారని, రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నప్పటికి అన్ని రంగాల్లోను ప్రగతి పథం వైపు నడిపిస్తున్నామన్నారు. పింఛన్లు, చంద్రన్నకానుకలను లబ్దిదారులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డి.జయలక్ష్మి, జడ్‌పీటీసీ సవర కుమారిలఖియా, ఎంపీడీవో రాజేశ్వరరావు, తహసీల్థార్ శ్యాంసుందరరావు, ఎపిడి అప్పలసూరి, పివో రంగలక్ష్మి, ఏ ఇలు సూర్యారావు, శ్రీనివాస్, రాజేష్, టీడీపీ నాయకులు తాతారావు, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.

  సమాజసేవతోనే విద్యార్థులకు బంగారుభవిష్యత్తు
  మందస, జనవరి 4: విద్యార్థులు గ్రామాల్లోని ప్రజలకు అక్షరాస్యత, మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత, విద్య, వైద్యం వంటి అంశాలపై ప్రజలను చైతన్యం చేయాలని ఆంధ్రా యూనివర్శిటీ ఎన్ ఎస్ ఎస్ సభ్యులు చింతాడ శరత్‌బాబు, ఎంపీటీసీ ఆర్.కృపారావు అన్నారు. శుక్రవారం మందస కాపువీధిలో బాలిగాం ఆదిత్య డిగ్రీ,జూనియర్‌కాలేజిల ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సేవాభావం అలవరుచుకొని, సమాజ సేవకులుగా తయారుకావాలన్నారు. జాతీయసేవాభావాన్ని, ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు ప్రసాద్, ప్రవీణ్, ఎన్ ఎస్ ఎస్ పివోలు రవికుమార్, ఆనంద్, సోమేశు పాల్గొన్నారు.
  6న మోడల్ డీ ఎస్సీ పరీక్షలు
  పాలకొండ, జనవరి 4: యూటీ ఎఫ్ శ్రీకాకుళం జిల్లాశాఖ ఆధ్వర్యంలో డీ ఎస్సీ పరీక్షకు సిద్దపడుతున్న ఎస్‌జీటీ అభ్యర్థుల కోసం ఆఫ్‌లైన్ పద్దతిలో ఈ నెల 6న మోడల్ డీ ఎస్సీ పరీక్ష జిల్లా వ్యాప్తంగా పది కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్టు యూటీ ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి టి. ఎన్.శివాజీ, గౌరవాధ్యక్షులు కె.షన్ముఖరావు, అధ్యక్షులు పి.కాంతారావులు తెలిపారు. ఇందులో భాగంగా పాలకొండలోని సీతంపేట రోడ్డులో ఉన్న నవోదయ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డీ ఎస్సీ పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష రాయడానికి సిద్దమయ్యే అభ్యర్థులు రూ.20 నామమాత్రపు ప్రవేశరుసుం చెల్లించి ఐదో తేదీలోగా అప్లికేషన్ ద్వారా వారి పేర్లును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. అప్లికేషన్లు పాలకొండ మెయిన్‌రోడ్డులో ఉన్న నాయుడు, కోణార్క్ జిరాక్స్‌ల వద్ద లభిస్తాయని, ప్రవేశరుసుంతో పాటు అప్లికేషన్‌ను యూటీ ఎఫ్ మండల బాధ్యులకు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఈ మంచి అవకాశాన్ని డీ ఎస్సీ అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.
  ప్రభుత్వ పథకాలతో జీవన ప్రమాణాలు మెరుగు
  రాజాం, జనవరి 4: రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగు అయ్యాయని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని ఆగూరు, గడిముడిదాం గ్రామాల్లో నిర్వహించిన జన్మభూమి సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జడ్డు విష్ణుమూర్తి, గురవాన నారాయణరావు, వంగా వెంకటరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద సహాయమందిందని, ప్రజలు ఈ విషయాలను గుర్తించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవాలని కోరారు. ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ప్రత్యేకాధికారి ఆర్.స్వరూపరాణి, తహశీల్దార్ సత్యనారాయణ తదితరులు కూడా ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ రెండు గ్రామాల్లో జన్మభూమికి విశేష స్పందన లభించింది. పింఛనుదారులతో పాటు ప్రజలు అనేక వినతిపత్రాలను కూడా అందజేశారు. అలాగే నగర పంచాయతీ పరిధిలోని బాబానగర్, సారధి రోడ్డు ప్రాంతాల్లో జన్మభూమి గ్రామసభలు నిర్వహించారు.

  కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్దం
  రాజాం, జనవరి 4: కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీ ఐ కార్యవర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడు సారధ్యంలో శుక్రవారం బస్టాండ్ కూడలిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలోని ప్రధాన అంశాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రత్యేక హోదా, ప్యాకేజీ, రైల్వేజోన్ వంటి అంశాలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఆయనతో పాటు పెంకి కృష్ణ, కనకరాజు, దుర్గారావు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.

  జన్మభూమితో సమస్యలు పరిష్కారం
  సరుబుజ్జిలి, జనవరి 4: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండల ప్రత్యేకాధికారి దామోదరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని పురుషోత్తపురం గ్రామ పంచాయతీలో తహశీల్దార్ ప్రభాకర్‌జేమ్స్, షలంత్రి గ్రామ పంచాయతీలో ఎంపీడీవో పావని జన్మభూమి గ్రామసభలు నిర్వహించారు. ముందుగా షలంత్రి గ్రామ పంచాయతీలో మండల జన్మభూమి కమిటీ కన్వీనర్ శివ్వాల సూర్యనారాయణతో కలిసి అధికారులు వీధుల్లో పర్యటించగా పురుషోత్తపురం గ్రామ పంచాయతీలో ఎంపీపీ సత్యనారాయణతో కలిసి అధికారుల బృందం గ్రామంలో పర్యటించి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పాఠశాలల వద్ద నిర్వహించిన గ్రామసభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంతో అన్ని శాఖల అధికారులు ప్రజల వద్దకే వచ్చి అర్జీలు స్వీకరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి నివేదికలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పీ ఆర్‌డీ విజయభాస్కర్, స్వచ్ఛ్భారత్ డీ ఈ మురళీ, ఏవో శ్రీనివాసబాబు, పీ ఆర్ జే ఈ గుప్త, ఎం ఈవో బాలరాజు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
  సమస్యలపై ప్రజలు నిలదీత
  దబ్బపాడు గ్రామసభ రసాభసా
  పోలీసులు రంగ ప్రవేశం
  ఎల్ ఎన్‌పేట, జనవరి 4: ప్రభుత్వ పథకాల్లో మంజూరులో వివక్షత, సమస్యలు పరిష్కరించకపోవడంపై ప్రజలు జన్మభూమిలో నిలదీసిన సంఘటనలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. మండలంలోని దబ్బపాడు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభ రసాభసాగా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అదుపు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం దబ్బపాడు గ్రామంలో తహశీల్దార్ వెంకటరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. మాజీ సర్పంచ్ సీతారాం, ఎం.లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ పింఛన్లు మంజూరులో వివక్ష చూపారని ఆరోపించారు. గ్రామానికి చెందిన జి.చిట్టెమ్మ భర్త చనిపోయి మూడేళ్లు అయినా రాజకీయ కారణాలు వల్ల పింఛను మంజూరు కాలేదన్నారు. తిత్లీ తుపాను నష్టపరిహారాల్లో వివక్ష చూపారన్నారు. ఈ సమస్యలపై వేదికపైకి దూసుకొచ్చి నిలదీయడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. పరిస్థితి సద్దుమణగపోవడంతో అధికారులు సభను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. అలాగే కృష్ణాపురంలో నిర్వహించిన గ్రామసభలో సమస్యలపై అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్‌ప్రసాద్, జెడ్పీటీసీ వెలమల సుగుణ, హిరమండలం ఏ ఎంసీ చైర్మన్ మన్మధరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
  * హిరమండలంలో...
  మండలంలోని చొర్లంగి, గొట్ట గ్రామాల్లో జన్మభూమి మా ఊరు గ్రామసభలు నిర్వహించారు. చొర్లంగి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తిత్లీ పరిహారం అందకపోవడంతో పాటు ఇళ్లు బిల్లులు, తదితర సమస్యలపై అధికారులను ప్రజలు నిలదీశారు. నిర్మాణాలు చేపట్టినప్పటికీ బిల్లులు మంజూరు కాలేదన్నారు. అలాగే తిత్లీ పరిహారాలు ఇప్పటివరకు అందించలేదని అన్నారు. పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. అలాగే గొట్ట గ్రామంలో పలు సమస్యలపై అధికారులను ప్రజలు నిలదీశారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు జన్మభూమి సభల్లో పాల్గొన్నారు.

  అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌పై ప్రత్యేకాధికారి ఆగ్రహం
  హిరమండలం, జనవరి 4: అంగన్‌వాడీ కేంద్రం సూపర్‌వైజర్ వరహాలమ్మపై మండల ప్రత్యేకాధికారి కె. ఎస్. ఎన్.రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని గొట్ట అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల హాజరును నమోదు చేయకపోవడంపై సూపర్‌వైజర్‌ను ప్రశ్నించారు. వీటిపై ప్రత్యేకాధికారి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రం పరిరక్షణ చేపట్టడం లేదన్నారు. పౌష్టికాహారం రికార్డుల్లో నమోదు చేస్తున్నారా అని ప్రశ్నించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. హాజరు పట్టీలో ఉన్న పిల్లల సంఖ్య కూడా లేకపోవడంతో తక్కువ కావడంతో ప్రశ్నించారు. సూపర్‌వైజర్ సమాధానం చెప్పక తడబడ్డారు. పౌష్టికాహారంపై ఆరా తీశారు. సక్రమంగా విధులు నిర్వహించాలని తెలిపారు. దీంతో పాటు ఎంపీడీవో కాశీవిశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.
  విభజన హామీలు అమలు చేయాలి
  పాలకొండ (టౌన్), జనవరి 4: రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని సీపీ ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులను కలిసి జే ఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు. నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం అన్యాయం చేస్తుందన్నారు. జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న వారిపై కేంద్రం నిర్ధాక్షిణ్యంగా లాఠీచార్జీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుపతిలో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపించారు. లక్షలాది కుటుంబాలు ఆ సంస్థ మూసివేసిన కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు రేజేటి శేఖర్, సవర నరేంద్ర, బెహరా, బంగారి, ఎం.స్వామి, శేఖర్, ఒమ్మి దుర్గారావు, శిర్లి గురునాధస్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


  0 0

  విజయనగరం, జనవరి 4: విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బూత్ కమిటీలను పటిష్టం చేయాలని బీజేపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ పురంధీశ్వరి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఓ హొటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో టీడీపీకి గెలుపు అన్నదీ సులువు కాదని, వైసీపీ పరిస్ధితి కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. అందువల్ల బీజేపీ నేతలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. బీజేపీ గెలుపు సులభం కానప్పటికీ పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మీడియా కన్వీనర్లను, సోషల్ మీడియా కన్వీనర్లను, లీగల్ సెల్ కన్వీనర్ల జాబితాను పది రోజుల్లో పూర్తి చేయాలన్నరు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, జిల్లా అధ్యక్షులు పెద్దింటి జగన్మోహన్, జిల్లా ఇన్‌ఛార్జి రామకృష్ణారెడ్డి, సుబ్బరామిరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్లు సత్తి అచ్చిరెడ్డి, పతివాడ రమణ, శంకర్‌లాల్ శర్మ, దేవర ఈశ్వరరావు, పెద్దింటి రామస్వామినాయుడు, పురిపండ శ్రీనివాసరావు, సువ్వారి వెంకట సన్యాసిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  అర్హులందరికీ సంక్షేమ పథకాలు
  దత్తిరాజేరు, జనవరి 4: గ్రామాలలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తుందని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ అన్నారు. శుక్రవారం జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా కోరపుకృష్ణాపురం గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు పింఛన్లు, పక్కా గృహాలు, సంక్షేమ పథకం రుణాలతోపాటు పలు పథకాలు నిరుపేదలకు మంజూరు చేయడం జరుగుతుందని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే విద్యార్థులకు భృతికి కోట్లాది రూపాయలు వ్యయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అన్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల సంక్షేమం కోసం విద్యార్థులు స్కూల్‌కు వెళ్ళేందుకు సైకిళ్ళ పంపిణీతోపా ఉపకారవేతనాలు మంజూరు చేస్తున్నదని తెలిపారు. రేషన్‌కార్డులు కావాల్సిన వారు ధరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిశీలించి మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. కోమటిపల్లి గ్రామంలో జరిగిన జన్మభూమి గ్రామసభలో నియోజకవర్గ వర్గ ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తూ కోట్లాది రూపాయాలు వ్యయం చేస్తున్నదని అన్నారు. గ్రామాలలో ప్రజలకు కావాల్సిన వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని చెప్పారు. చంద్రన్న బాట ద్వారా ప్రతి గ్రామంలో సిసి రహదారులు, కాలువలు నిర్మించామని అన్నారు. ఉపాధి హామీ నిధులు ద్వారా చెత్త సంపద కేంద్రాలు, నాడెప్‌లు, ఇంకుడుగుంతలు, శ్మశానవాటికలు అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ఆదరణ పథకం ద్వారా పలు రకాల వృత్తిదారులకు పనిముట్లు పంపిణీ చేశారని అన్నారు. ప్రజా క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని, అర్హులు ఎవరైనా ఉంటే కావాల్సిన పథకాలకు ధరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిశీలించి మంజూరు చేస్తామని అన్నారు. అనంతరం ప్రజలు పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కల్పవల్లి, ఎంపీడీవొ జి.బాబూరావు, మండల విద్యాశాఖాధికారి ఎం. వెంకటరావు,ఆర్‌డబ్ల్యుఎస్ జెఇ చంద్రకళ, పిఆర్‌జెఇ చంద్రశేఖర్, హౌసింగ్ ఏఇ ఉమామహేశ్వరరావు, పంచాయతీ అధికారి రాంబాబు, డిటి కోటీశ్వరరావు, విద్యుత్ అధికారి, ఐసిడి ఎస్ సూపరువైజర్ శ్యామలతతోపాటు ఎంపీపీ బి.రాజేశ్వరి, గజపతినగరం నియోజకవర్గం నాయకులు పి.వి.వి.గోపాలరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు బోడసింగి సత్తిబాబు, కోరపుకృష్ణాపురం, కోమటి పల్లి, చౌదంతివలస, తాడేంద్రివలస మాజీ సర్పంచ్‌లు శ్రీదేవి, తిరుపతిరావు, సన్యాసిరావు, వెంకన్నలతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

  బాల సంజీవనితో పోషణ స్థితి మెరుగు
  గజపతినగరం, జనవరి 4: బాల సంజీవనితో పోషణస్ధితి మెరుగు పడుతుందని మండల ప్రత్యేకాధికారి మోహనరావు అన్నారు. శుక్రవారం మండలంలోని సాలిపేట గ్రామంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. అందులో బాగంగా పలువురు గర్భిణీలకు బాల సంజీవని ద్వారా అదనపు పోషకాహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైరిస్కు గర్భిణులు, రక్తహీనత గల బాలింతలు, పిల్లలకు అదనపు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలు వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో తహాశీల్ధార్ బి.శేషగిరిరావు, సిడిపివొ కె.రమణమ్మ, ఎం ఇవొ విమలమ్మ, మండల వ్యవసాయ అధికారి టి.సంగీత తదితరులు పాల్గొన్నారు.
  నాయకులపై లాఠీచార్జి దుర్మార్గం
  * నిరసనలో అపశృతి సిపిఎంనేత రాములకు గాయాలు
  గజపతినగరం, జనవరి 4: ప్రత్యేకహోదాపై పోరాడిన నాయకులపై అక్రమ లాఠీచార్జీ ప్రధాని మోదీ చేయించడం దుర్మార్గమని సిపి ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వి.లక్ష్మి అన్నారు. లాఠీచార్జీకి నిరసనగా గజపతినగరంలోని నాలుగురోడ్లు జంక్షన్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న సమయంలో బొమ్మపై పెట్రోల్ పోసే సమయంలో సిపి ఎం నేత రాకోటి రాములు ప్రమాదానికి గురయ్యాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేకహోదా విభజన హామీలు అమలు కోసం డిల్లీలో సిపి ఐ, సిపి ఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శులు జంతర్ మంతర్ వద్ద చేసిన ధర్నా కార్యక్రమంపై పోలీసులు విరుచుకుపడి లాఠీచార్జీ చేయడం తీవ్రంగా ఖండించారు. సమస్యలు, హామీలపై నిలదీస్తే లాఠీచార్జీలు చేయించడం మోదీ పరిపాలన ఉక్కుపాదాన్ని తలపిస్తున్నది తెలిపారు. ప్రజాస్వామ్య విలువలకు పాతర వేయడం అలవాటుగా పరిపాలనలో భాగమైపోయిందని విమర్శించారు. కార్యక్రమంలో సిపి ఎం జిల్లా కమిటీ సభ్యులు రాకోటి రాములు, పురం అప్పారావు, సిపి ఐ నాయకులు శ్రీను, ఏరియా కార్యదర్శి గేదెల రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

  నిన్ను నమ్మం బాబోయ్
  దత్తిరాజేరు, జనవరి 4: గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు వందలాది వాగ్ధానాలు చేసి వాటిని ఏ ఒక్కటి అములు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి తప్పుడు వాగ్ధానాలు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని నమ్మే పరిస్థితిలో లేరని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. శుక్రవారం నిన్ను నమ్మం బాబోయ్ కార్యక్రమంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు మండలంలోని షికారుగంజి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ నాలుగున్నరేళ్ళల్లో చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. ఇంటికొక ఉద్యోగం అనే వాగ్ధాన్ని నెరవేర్చకపోయినా తనకుమారిడికి మాత్రం ఉద్యోగం ఇచ్చాడని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయంలో తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుకు 80కోట్లు మంజూరు చేసి 90శాతం పనులు పూర్తి చేయగా టీడీపీ పాలనలో కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. ప్రజలకు చేసిన వాగ్ధానాలు విస్మరించడంతో మరల అధికారం చేపడదామనే ఏవతో కాంగ్రెస్‌తో చేతులు కలిపి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నవరత్నాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ముందుగా జరిగిన ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో అప్పలనర్సయ్య మాట్లాడుతూ నాలుగేళ్ళగా టీడీపీ చేస్తున్న అవినీతిని ప్రతి ఒక్క బూత్ కమిటీ సభ్యుడు ప్రజలకు వివరించాలని కోరారు. మండల వైసీపీ అధ్యక్షులు కడుబండి రమేష్‌నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మంత్రి అప్పలనాయుడు, పోరలి కో- ఆపరేటీవ్ అధ్యక్షులు గేదెల సింహాద్రి అప్పలనాయుడు, జిల్లా గొర్రెల పెంపకం సంఘం అధ్యక్షులు బమ్మిడి అప్పలనాయుడు, బూత్ కమిటీల అధ్యక్షులు మహదేవ్ ఫణీంద్ర, షికారుగంజి వైసీపీ నాయకులు సోమురాజు వెంకటరావు, సుంకరి వెంకటరావు, దన్నాన త్రినాథ్‌రావు, అప్పికొండ సాంబమూర్తిలతోపాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

  పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
  * ఎమ్మెల్యే డాక్టర్ నాయుడు

  బొండపల్లి, జనవరి 4: పేదల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందని గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని కొండకిండాం, ఓంపల్లి గ్రామాలలో ఎంపిడివొ ఎం.ప్రకాశరావు బృందం, కిండాం అగ్రహారం, రాచకిండాం గ్రామాలలో తహశీల్ధార్ శేఖర్ ఆధ్వర్యంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరిగింది. కొండకిండాం సభలో ఎమ్మెల్యే నాయుడు పాల్గొని మాట్లాడుతూ పాడిరైతులను ప్రోత్సహించేందుకు పశువుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం గోకులం షెడ్లు మంజూరు చేస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయనబాటలో పయనించి గ్రామాలలో అభివృద్ధి చేశానని అందరూ గుర్తించి అండగా నిలిచి ఆదరించాలని కోరారు. సమస్యలు ఉంటే నేరుగా తనదృష్టికి తీసుకురావాలని అన్నారు. అంతకు ముందు గ్రామంలోని వీధులలో పర్యటించి ప్రజా సమస్యలు క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. అనంతరం 21 లక్షలతో నిర్మించిన సామూహిక గోకులం షెడ్‌ను, బోరుబావులను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బండారు బాలాజీ, ఎ ఎంసి చైర్మన్ చంటిరాజు, మండల ప్రత్యేకాధికారి వెంకటరావు, మండల పశువైద్యాధికారి లక్ష్మిదీపిక, టీడీపీ నాయకులు పి.వి.వి.గోపాలరాజు, మాజీ సర్పంచ్ ముంజేటి పార్వతి, గంట్యాడ జెడ్పీటీసీ కె.రమేష్, ఇవొపి ఆర్‌డి రవికుమార్ వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

  రాజమ్మతల్లి సనిధిలో తొమిది గంటలు లలిత సహస్ర పారాయణం
  బొండపల్లి, జనవరి 4: మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరిదేవి ఆలయంలో శుక్రవారం మార్గశిరమాసం పురష్కరించుకొని విజయనగరం దండుమారెమ్మ కాలనీకి చెందిన మహిళలు తొమ్మిది గంటలు నిర్విరామ లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శర్మ మాట్లాడుతూ
  భక్తులపై అమ్మవారి కరుణ కలగటానికై నామపారాయణం సులభతరము, శక్తివంతమైన మార్గమని అందులోనూ లలితా సహస్రనామము సాక్షాత్తు హయగ్రీవ భగవానులు అగస్త్యులవారికి ఉపదేశించిన మహాశక్తిపూరితమయిన మంత్రరాజమని తెలిపారు. కార్యక్రమంలో భాస్కర రామం, మాజీ కౌన్సిలర్ మంచాల శివాని ఆధ్వర్యంలో 30మంది మహిళలచే నిర్వహించారు.

  ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పధకాల ప్రచారం
  కొత్తవలస, జనవరి 4: మండలంలోని దేవాడ గ్రామంలో కోస్టల్ ఇంజనీరింగ్ విద్యార్ధులు ప్రభుత్వ పధకాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. శుక్రవారం దేవాడ గ్రామంలో ప్రతీ వీధిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వం అందజేస్తున్న పధకాలు గురించి వివరించారు. విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన పలు రకాల శే్వత పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకు అత్యంత చేరుగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలు, మానవ వనరులు నిర్వహణ, సామాజిక సాధికారిత తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. ఎన్. ఎస్ ఎస్ పివొ కె.రవితోపాటు ప్రిన్సిపల్ నరిసింహరాజు పాల్గొన్నారు.

  అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
  విజయనగరం (్ఫర్టు), జనవరి 4: పట్టణంలో అర్హులందరికీ జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ద్వారా ప్రభుత్వపథకాలను అందిస్తున్నామని మున్సిపల్‌చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. పట్టణంలో 10, 3,19,27,35 వార్డుల్లో శుక్రవారం జరిగిన జన్మభూమి-మా ఊరు వార్డుసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రజాసమస్యల పరిష్కారానికి జన్మభూమి కార్యక్రమం చక్కని వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈ సభల్లో ప్రజలు ఇచ్చిన వినతులను దశలవారీగా పరిష్కరిస్తామని అన్నారు. అందువల్ల వార్డుసభలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు మద్ధతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్‌కమిషనర్ టి.వేణుగోపాల్, అసిస్టెంట్‌కమిషనర్ కనకమహాలక్ష్మి, అసిస్టెంట్ సిటీప్లానర్లు శోభన్‌బాబు, హరిదాసు, మున్సిపల్ ఇంజనీర్ మత్స్యరాజు, జన్మభూమి లైజన్ ఆఫీసర్ డాక్టర్ ఎన్‌విఎస్ సూర్యనారాయణ, పట్టణ జన్మభూమి కమిటీసభ్యులు డాక్టర్ విఎస్ ప్రసాద్, కరణం విజయకుమారి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ బొద్దుల నరసింగరావు, వ్యవసాయమార్కెట్‌కమిటీ చైర్మన్ సైలాడ త్రినాధరావు, పలువురు మున్సిపల్‌కౌన్సిలర్లు పాల్గొన్నారు.
  సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
  విజయనగరం (్ఫర్టు), జనవరి 4: ఎల్‌ఐసి ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విజయనగరం బ్రాంచ్ అధ్యక్షుడు మీసాల వెంకటరమణ అన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఇక్కడ ఎల్‌ఐసి బ్రాంచ్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వెంకరమణ మాట్లాడుతూ ఏజెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎల్‌ఐసి యాజమాన్యం మొండివైఖరి అవలంభిస్తుందని ఆరోపించారు. అలాగే పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడంలో విఫలమవుతుందని అన్నారు. పాలసీదారులకు బోనస్ పెంచడంలో మీనవేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. పాలసీదారుల పట్టాలపై ఇచ్చే రుణాలపై వడ్డీ తగ్గించాలన్నారు. పాలసీదారులు చెల్లించే ప్రీమియంపై జిఎస్‌టి విధించడం దారుణమని చెప్పారు. జిఎస్‌టిని విధించడం పాలసీదారులకు పెనుభారంగా మారిందన్నారు. పాలసీదారులకు తక్షణమే బోనస్ పెంచడంతోపాటు ప్రీమియం చెల్లింపుపై విధించిన జిఎస్‌టిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెంట్లు సంఘం కార్యదర్శి కంటుభుక్త శంకరరావుమాట్లాడుతూ క్యాష్ కౌంటర్ల వద్ద స్వైఫింగ్‌మిషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖ డివిజన్ ఉపాధ్యక్షుడు బివి రమణ మాట్లాడుతూ ఏజెంట్లందరికీ ఇఎస్‌ఐ సదుపాయం కల్పించాలని, మెడీక్లయిమ్ వర్తింపజేయాలని, ఏజెంట్ల గ్రాట్యూటీ, గ్రూప్ ఇన్స్యూరేన్స్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రేగాన రాజారావు, రెసిడెన్షియల్ కార్యదర్శి పంచాది శ్రీనివాసరావు, యూనియన్ నాయకులు సబ్బవరపుసూరినాయుడు, పనస మైనరుబాబు, తదితరులు పాల్గొన్నారు.
  సమస్యల పరిష్కారానికి జన్మభూమి
  * ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు
  నెల్లిమర్ల, జనవరి 4: గ్రామాలలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు అన్నారు. పూసపాటిరేగ మండలంలోని గోవిందపురం గ్రామంలో జరిగిన జన్మభూమి గ్రామసభకు ఆయన శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు కావాల్సిన వౌలిక సదుపాయాలు, అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని ఆయన అన్నారు. అంతకుముందు గ్రామసభ ద్వారా వచ్చిన సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవొ త్రివిక్రమరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  అక్రమ వసూళ్ళు చేస్తే చర్యలు తీసుకోవాలి
  పూసపాటిరేగ, జనవరి 4: చంద్రన్న సంక్రాంతి కానుకల్లో లబ్దిదారుల వద్ద అక్రమ వసూళ్ళు తీసుకుంటున్నారని ఆరోపణలు రుజువైతే ఆ డీలర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీపీ కర్రోతు బంగారురాజు ఆదేశించారు. బోగాపురం మండలంలోని గూడెపువలసలో జన్మభూమి గ్రామసభ శుక్రవారం జరిగింది. గ్రామసభలో సంక్రాంతి కానుకల్లో ఒక్కో బ్యాగ్ వద్ద 20రూపాయలు వసూలు చేస్తున్నారంటూ కొందరు లబ్దిదారులు ఎంపీపీ దృష్టికి తీసుకువెళ్ళడంతో తక్షణమే విచారణ చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఆదేశించారు. అనంతరం గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. జన్మభూమి కార్యక్రమంలో భోగాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన క్రీడాపోటీలను ఎంపీపీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పడాల రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

  అక్రమ అరెస్టులు ఖండిస్తూ నిరసన
  పూసపాటిరేగ, జనవరి 4: ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని ఢిల్లీ పార్లమెంటు వద్ద వామపక్షాలు, జనసేన కలసి నిరసన చేస్తున్న నాయకులను అరెస్టుచేయడాన్ని ఖండిస్తూ అందుకు సంఘీభావంగా పూసపాటిరేగ జాతీయ రహదారిపై సిపిఎం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం నాయకుడు సూర్యనారాయణ నేతృత్వంలో జనసేన కమిటీ నాయకులతో కలసి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా పార్లమెంటు ముందు ధర్నా చేస్తున్న నాయకులను అరెస్టుచేయడం అన్యాయమంటూ నినాదాలు చేశారు. అరెస్టుచేసిన నాయకులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలువురు సిపిఎం కార్యకర్తలతోపాటు జనసేన నాయకులు శంకరరావు కూడా పాల్గొన్నారు.

  దక్షిణ భారతదేశ సైన్స్ ప్రదర్శనకు ప్రవల్లిక ఎంపిక
  పూసపాటిరేగ, జనవరి 4: దక్షిణ భారత దేశ సైన్స్ ప్రాజెక్టు ప్రదర్శనకు ప్రవల్లిక ఎంపికైందని మండలంలోని కోనాడ జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. పదవ తరగతి చదువుతున్న ప్రవల్లిక భౌతిక శాస్త్ర ఉపాద్యాయుడు రామసతీష్ సహకారంతో విజయనగరంలో నిర్వహించిన నెహ్రూ నేషనల్ సైన్స్ ఎన్వరాల్‌మెంట్ ఎగ్జిబిషన్ ఫర్ చిల్డ్రన్స్ ప్రదర్శను ప్రవల్లిక జిల్లా స్థాయిలో ఎంపికైంది. విశాఖపట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో విద్యార్థిని తయారుచేసిన భూ వ్యాసార్థాన్ని కనుగొనే సాధారణ పరికరం ఉత్తమ ప్రాజెక్టుగా ఎంనికైంది. దీంతో ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దక్షిణ భారత దేశ సైన్స్ ప్రదర్శన బెంగుళూరులో నిర్వహించి ఉండడంతో ఆ ప్రదర్శనకు కూడా ప్రవల్లిక ప్రాజెక్టు రూపకల్పనకు సన్నద్ధమవుతుందని హెచ్ ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ ప్రాజెక్టులో కూడా ప్రవల్లిక విజేతగా నిలవాలని ఉపాద్యాయ బృందం ఆకాంక్షించారు.

  ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
  నెల్లిమర్ల, జనవరి 4: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు అన్నారు. శుక్రవారం మండలంలో సీతారామునిపేట, సారిపల్లి గ్రామాలలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. అర్హులందరికీ పక్కా గృహాలు, పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నదని వెల్లడించారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా సంక్షేమ పథకాలకి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని అన్నారు. పార్టీలకు అతీతంగా లబ్దిదారులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నదని చెప్పారు.
  ఆర్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలి
  సారిపల్లి గ్రామానికి పునరావాస ప్యాకేజీ కల్పించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడును కోరారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాయి విభీషణరావు, వైసీపీ నాయకులు సారిపల్లి గురునాథరావు, నడిపేన ఆనంద్ తదితరులు మాట్లాడుతూ తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు వలన సారిపల్లి గ్రామం పూర్తిగా నీటిలో మునిగిపోతున్నదని చెప్పారు. ప్రాజెక్టు వలన సర్వస్వం కోల్పోయిన వారికి పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సువ్వాడ వనజాక్షి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్, మండల శాఖ అధ్యక్షుడు గేదెల రాజారావు, నాయకులు బి. ఆదినారాయణ మాస్టారు తదితరులు పాల్గొన్నారు.

  రాష్ట్రాన్ని మోసం చేసిన మోడీ గద్దె దిగాలి: వామపక్షాలు
  నెల్లిమర్ల, జనవరి 4: అధికారం చేపట్టగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ మాట తప్పారని, తక్షణమే ఆయన గద్దె దిగాలని వామపక్ష నాయకులు కిల్లంపల్లి రామారావు, మొయిద పాపారావులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలోని జంత్రమంత్ర వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి వామపక్ష నాయకులపై లాఠీ ఛార్జీని నిరసిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు రామారావు, పాపారావులు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకల్పించాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు జంతరమంతర వద్ద ఆందోళన చేస్తుంటే నాయకులపై లాఠీఛార్జ్ చేయడం దారుణమని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని అన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాకల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కుంటుసాకులు చూపించి ప్రత్యేక హోదాను కల్పించకపోవడం దారుణమని అన్నారు. మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చిన మోడీ పాలించే హక్కులేదని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కనకల రాము తదితరులు పాల్గొన్నారు.
  ఉచిత గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి
  నెల్లిమర్ల, జనవరి 4: ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పొందడానికి రేషన్‌కార్డు కోసం ధరఖాస్తు చేసుకోవాలని సిఎస్‌డిటి వి.వి. ఆర్. జగన్నాథరావు కోరారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రేషన్‌కార్డుల జారీ విషయంలో ప్రజల అవగాహన రాహిత్యంతో పడుతున్న బాధలను తొలగించడానికి ప్రభుత్వం రేషన్‌కార్డుల ధరఖాస్తువిధానాన్ని సులభతరం చేసిందని అన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్ 1100కు కాల్ చేసి రేషన్‌కార్డుకు ధరఖాస్తు నమోదు చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ పద్దతిలో ధరఖాస్తు చేసుకున్నవారు తప్పకుండా ప్రజాసాధికార సర్వే చేయించుకోవాలని తెలిపారు. అలాగే ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం సమీపంలో ఉన్న గ్యాస్ డీలర్‌ను సంప్రదించాలని కోరారు. లబ్దిదారులకు తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు సమర్పించాలని చెప్పారు.

  మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి
  బొండపల్లి, జనవరి 4: రాష్ట్భ్రావృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మాజీ మంత్రి పడాల అరుణ కోరారు. శుక్రవారం మండలంలోని ఒంపల్లి గ్రామంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో అరుణ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు, మహిళలకు రుణమాఫీ, ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి పరికరాల పంపిణీ, పాడి రైతులకు గోకులాలు, పాడిపశువుల కొనుగోలు ఇలా అన్ని రంగాలలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజనకు కారకులైన వారు రంగులు మార్చుకుని ఊసరవిల్లిలా గ్రామగ్రామాన తిరిగి చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజలు చైతన్యవంతులై రాష్ట్భ్రావృద్ధి కోసం మళ్ళీ చంద్రబాబును సిఎం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నుంచి వినతులను అధికారులు స్వీకరించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శేఖర్, ఇవొ పి ఆర్డీ రవికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
  ప్రజా సమస్యలు పరిష్కారానికే జన్మభూమి- మాఊరు
  మెరకముడిదాం, జనవరి 4: ప్రజా సమస్యలు పరిష్కారానికే జన్మభూమి- మాఊరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక మండల అధ్యక్షుల తాడ్డి సన్నాసినాయుడు అన్నారు. శుక్రవారం మండలంలో గల గర్భాం, బిళ్లలవలసలలో జన్మభూమి- మాఊరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గర్భాంలో నిర్వహించిన గ్రామ సభలో ఎంపిపి మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ది కోసమే జన్మభూమి- మాఊరు కార్యక్రమం నిర్వహించడం జరగుతుందన్నారు. సంక్షేమ ఫథకాలు అమలులో ఎటువంటి అవకతవకలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అర్హత ఉన్న ప్రతి వారికి పించను పథకం అందించడం జరుగుతుందన్నారు. అలాగే ఇటీవల ఆధరణ పథకం ద్వారా అనేక మంది కుల వృత్తుల వారికి పలు రకాల పనిముట్లు ఇవ్వడం జరిగిందన్నారు. లబ్దిదారులు ఈ పనిముట్లును సద్వినియోగం పర్చుకొని అభివృద్ది చెందాలన్నారు. అనంతరం తహశీల్దారు ఎంవి రమణమూర్తి మాట్లాడుతూ ఇప్మటి వరకు జరిగిన 5 విడతల జన్మభూమి కార్యక్రమాల్లో అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆరవ విడత జన్మభూమి కార్యక్రమంలో అపరిష్కృత సమస్యలను సైతం పరిష్కరించడం జరుగుతుందన్నారు. అనంతరం స్ర్తి శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన గర్భిణి ఆహ్వానం కార్యక్రమంలో పలువురు గర్భిణిలకు సీమంతం కార్యక్రమం నిర్వహించి పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఒ ఎస్తేరు రాణి, ఇఒపిఆర్‌డి సుధాకర్, ఎంపిడిఒ ఎస్తేరురాణి, ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు కృష్ణవేణి, పలు శాఖల అథికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
  అంగన్‌వాడీ బవనం ప్రారంభించిన ఎంపిపి
  మెరకముడిదాం, జనవరి-4: మండలలో గల గర్భాం మదుర గ్రామం అయినటువంటి నరసయ్యపేటలో శుక్రవారం ఎంపిపి తాడ్టి సన్యాసినాయుడు చేతులు మీదుగా అంగన్‌వాడీ బవనాన్ని ప్రాంభించారు. 7.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ బవనం అందుబాటులోకి రావడంతో చిన్నారులు కష్టాలు కడతేరనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపిపి మాట్లాడుతూ మండలంలో సుమారు 70 శాతం అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం పూరె్తైయిందని మిగిలిన 30 శాతం బవనాలు నిర్మాణానికి స్థల సేకరణలో ఉన్నాయన్నారు. వీటికి స్థల సమీకరణ పూరె్తైన వెంటనే బవన నిర్మాణం ప్రారంభించనున్నామన్నారు. మండలంలో శత శాతం అంగన్‌వాడీ బవనాలు నిర్మాణం జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఎంవి రమణమూర్తి, ఐసిడిఎస్ సిడిపిఒ ఎస్తేరురాణి, పర్యవేక్షకురాలు కృష్ణవేణి, పలు శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

  శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
  పార్వతీపురం, జనవరి 4: ఉద్యోగులు, సిబ్బందికి వివిధ అంశాలపై ఇస్తున్న శిక్షణ ద్వారా తమ విధినిర్వహణలో మరింత నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని పార్వతీపురం సబ్ కలెక్టర్ టి ఎస్ చేతన్ ఉద్యోగులకు ఉద్భోధించారు. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులకు పరిపాలనా పరమైన వివిధ అంశాలపై (రిఫ్రష్‌మెంట్) శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా కార్యాలయంలో విధులు నిర్వర్తించేందుకు ఈశిక్షణ ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా శిక్షణా సంస్థ మేనేజర్ శ్రీనివాసరావు శిక్షణలో సిబ్బందికి పరిపాలనా పరమైన ఫైళ్లు,రికార్డుల నిర్వహణ పట్ల శిక్షణలో అవగాహన కల్పించడంతో పాటు ఉద్యోగులు, సిబ్బందికి తలెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. అదేవిధంగా సాయంత్రం ఇదే కార్యాలయంలోని ఉద్యోగులకు ఎన్ ఐ సి ఉద్యోగులు జి ఎ పోలినాయుడు, బి.బాలకృష్ణలు కాగిత రహితపాలనపై శిక్షణ ఇచ్చారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అప్పలరాజు, పార్వతీపురం ఇ ఆఫీస్ డివిజనల్ మేనేజర్ ఎ ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

  పోలమాంబ జాతర నిర్వహణ ఏర్పాట్లపై రేపు శంబరలో సమావేశం
  పార్వతీపురం, జనవరి 4: పార్వతీపురం డివిజన్‌లోని శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై ఈనెల 6వ తేదీ ఆదివారం ఉదయం 10గంటలకు శంబరలోని పోలమాంబ ఆలయం ఆవరణలో వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని టి ఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసమావేశానికి జాతర నిర్వహణ ఏర్పాట్లపై ఇంతవరకు చేపట్టిన పనుల ప్రగతి నివేదికలతో హాజరుకావాలని సబ్ కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా క్యూలైన్ల ఏర్పాట్లు, సిరిమాను ఉత్సవ ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య ఆరోగ్యం, విద్యుత్, రహదార్లు అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల ఏర్పాట్లు,బస్సుల సౌకర్యం తదితర ఏర్పాట్లపై సంబంధిత శాఖాధికారులు తమ నివేదికలతో ఆరోజు సమావేశానికి సిద్ధం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకాలని ఆయన సూచించారు. హాజరు కాని అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ హెచ్చరించారు.
  జన్మభూమి గ్రామసభలను వినియోగించుకోవాలి: జెసి-2
  రామభద్రపురం, జనవరి 4: సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని జెసీ-2 సీతారామారావు కోరారు. శుక్రవారం మండల పరిధిలోని దుప్పలపూడి గ్రామసభలో పాల్గొని మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమపథకాలను అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. అంతేకాకుండా అర్హులను గుర్తించి అందరికీ ప్రభుత్వపథకాలు అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు కూడా అలసత్వం వహించకుండా జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే కోటశిర్లాం గ్రామంలో బొంతు రత్నకుమార్ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యతాపరంగా పరిష్కరిస్తామన్నారు. ముందుగా గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. అలాగే జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించి శే్వతపత్రాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బప్పడాల చిన్నంనాయుడు, వివిదశాఖల అధికారులు పాల్గొన్నారు.

  ప్రతిభ గల విద్యార్థులకు స్టడీమెటీరియల్స్ పంపిణీ
  సీతానగరం, జనవరి 4:మండలంలోని జోగింపేట బాలయోగీ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ ఆశీర్వాదం చేపట్టారు. ఈమేరకు ఇటీవల గురుకులంలో నిర్వహించిన 10వ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలలో పదికి పదిపాయింట్లు సాధించిన విద్యార్థులకు గురుకులాల ఇంట పదుల పంట కార్యక్రమం ద్వారా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్టడీమెటీరియల్స్‌ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను పరీక్షలకు అన్నివిధాలా సిద్ధంచేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విద్యార్థులంతా పోటాపోటీగా పరీక్షల


  0 0

  విశాఖపట్నం, జనవరి 4: విశాఖలో చోటుచేసుకుంటున్న సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ నివేదికలు కంచికి చేరుతున్నాయి. గడచిన రెండేళ్లలో విశాఖ కేంద్రంగా మూడు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. విశాఖ భూ కుంభకోణంతో పాటు ఏజెన్సీలో గతేడాది సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు హత్య చేశారు. దీనిపై అప్పటి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అప్పటి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ప్రస్తుతం సిట్ దర్యాప్తు అధికారిగా నియమించారు. అనంతరం గతేడాది అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌పై శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సిట్‌ను ఏర్పాటు చేసింది. విశాఖ భూ కుంభకోణంపై తొలి సారిగా నియమించిన సిట్ ఆరు నెలలకు పైగా విచారణ జరిపి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికను మరో ఆరు నెల్ల పాటు ప్రభుత్వం తనవద్దే ఉంచుకుని ఎట్టకేలకు గతేడాది చివర్లో కేబినెట్ ముందుకు తెచ్చి ఆమోదించింది. భూ కుంభకోణంపై నివేదికను ఆమోదించడమైతే జరిగింది కానీ, విచారణ అంశాలను, దోషులను ఇప్పటికీ వెల్లడించలేదు. ఇక తరువాత జరిగిన రెండు సంఘటనల్లో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యకు సంబంధించి సిట్ దర్యాప్తు జరుగుతుండగానే కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఇప్పటికే ఎన్‌ఐఏ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యోదంతంపై విచారణ జరుపుతోంది. ఇదిలా ఉండగా జగన్‌పై హత్యాయత్నాకి సంబంధించి సిట్ దర్యాప్తు జరుపుతోంది. అయితే తమకు రాష్ట్రప్రభుత్వ దర్యాప్తుపై నమ్మకం లేదని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని అశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఎన్‌ఐఏ దర్యాప్తునకు ఆదేశించింది. జగన్‌పై హత్యాయత్నం కేసును జనవరి 1 నుంచి ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉండగా సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదంటూ వైసీపీ ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, తీర్పు వెలువడుతున్న తరుణంలో విశాఖ నగర పోలీసు కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా రెండు రోజుల కిందట విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి సిట్ విచారణ అంశాలను వెల్లడించారు. అప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ గతేడాది డిసెంబర్ 31నే కేసు నమోదు చేయడం గమనార్హం.

  కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో గీతం ఎంఓయూ
  * లాగిస్టిక్స్‌లో డిగ్రీ కోర్సు నిర్వహణ
  ఆంధ్రభూమి బ్యూరో
  విశాఖపట్నం, జనవరి 4:్భరత ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న లాగిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌సీ) సహకారంతో గీతం డీమ్డ్ యూనివర్శిటీలో బీబీఏ లాగిస్టిక్స్ కోర్సును నిర్వహించేందుకు ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. గీతం ఇన్‌ఛార్జి వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ, ఎల్‌ఎస్‌సీ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ కెప్టెన్ టీఎస్ రామానుజం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రామానుజం మాట్లాడుతూ దేశంలోని వివిధ రంగాలకు భవిష్యత్‌లో 28 మిలియన్ల మంది లాగిస్టిక్స్ నిపుణులు అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం విద్యాలయంతో అనుసంధానమవుతున్నామన్నారు. స్టయిఫండ్‌తో కూడిన అప్రంటిస్ శిక్షణ, డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించడం బాధ్యతగా తీసుకుంటామన్నారు. పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు తమ గవర్నింగ్ బాడీ సభ్యులుగా ఉండటం వల్ల విద్యార్థులకు తక్షణ అవకాశాలు లభిస్తాయన్నారు. గీతం ఇన్‌ఛార్జి వీసీ కే శివరామకృష్ణ మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగిస్టిక్ పార్కుల ఏర్పాటు ద్వారా ఈ రంగంలో అవకాశాలపై దృష్టి సారించిందన్నారు. గీతం అంతర్జాతీయ విద్యా విభాగం ద్వారా ఇప్పటికే ఎంబీఏ కోర్సులో లాగిస్టిక్స్‌ను బోధిస్తున్నామన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా లాగిస్టిక్స్ సెక్కార్ స్కిల్ కౌన్సిల్ అందించే శిక్షణ విద్యార్థులకు, అధ్యాపకులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ షీలా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
  రక్షణ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం
  * డీఆర్‌డీఓ శాస్తవ్రేత్త వెల్లడి
  ఆంధ్రభూమి బ్యూరో
  విశాఖపట్నం, జనవరి 4:సరిహద్దులో దేశ రక్షణ దళాలకు సహాయపడేందుకు దేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తోందని సంస్థకు చెందిన శాస్తవ్రేత్త ప్రమోద్‌కుమార్ ఝా వెల్లడించారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ విద్యార్థి విభాగం నిర్వహిస్తున్న ఫూజన్-2కె సాంకేతిక యువజనోత్సవాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. దేశంలో త్రివిధ దళాలకు ఉపయోగపడే విధంగా మానవ రహిత వాహన నౌకలు, యుద్ధ విమానాలు, ట్యాంకులను రూపొందిస్తున్నట్టు తెలిపారు. త్రీడీ ప్రింటింగ్ పరిజ్ఞానం, ధర్మో ఎలక్ట్రిక్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సాంకేతిక అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెరగాలని సూచించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డీ ఎలిజిబెత్ రాణి, ఈసీఈ విభాగం అధిపతి ప్రొఫెసర్ పీవీ విజయశ్రీ, ఫ్యాకల్టీ సలహాదారు డీ సందీప్ వర శంకర్, కేఎం చిట్టి, డాక్టర్ డీ గౌరి, ఐఈఈఈ విద్యార్థి విభాగం అధ్యక్షుడు జీ సాహిత్ తదితరులు పాల్గొన్నారు.
  సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి
  * మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి విమల
  విశాఖపట్నం,జనవరి 4: కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ.విమల తెలిపారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలోని శుక్రవారం జీవీ ఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయ్యప్పస్వామి దర్శనానికి వెళుతున్న మహిళా భక్తులను అడ్డుకోవడం తగదని,మహిళలు అన్ని రంగాల్లో సముచిత స్ధానం ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గుండాలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. మతవాదాన్ని అడ్డుపెట్టికుని బీజేపీ చేస్తున్న రాజకీయాల్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. కేరళలో ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను నియంత్రించకుండా నేటికి వారిని ప్రోత్సహించడం పట్ల ప్రధాన మంత్రి నిర్లక్షత్వానికి ఇది నిదర్శనమన్నారు.హిందుత్వ ముసుగులో అల్లర్లు సృష్టిస్తూ వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చేయాలని తప్ప భక్తి ఏమాత్రం కాదున్నారు. సమాఖ్య గౌరవధ్యక్షురాలు పరమేశ్వరి మాట్లాడుతూ దేశంలో 50శాతం మహిళలు,హింస,దాడులు, హత్యాచారాలకు బలిఅవుతున్నారంటే కేవలం బీజెపీ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. మహారాష్టల్రోని శని దేవాలయంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించినప్పుడు శబరిమల తీర్పులో ఎందుకు అల్లర్లు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలు మహిళా సంఘం నాయకులు జయ, దేవుడమ్మ,నూకాలమ్మ,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
  స్వచ్ఛ సర్వేక్షన్ 2019 కార్యక్రమాలకు సిద్దంగా ఉండండి
  * స్వచ్చతాయాప్‌తో పరిసరాల పరిశుభ్రతకు తక్షణ పరిష్కారం
  * హెచ్‌పీసీ ఎల్ ఆధ్వర్యంలో ప్రచారరధాలు ప్రారంభం
  విశాఖపట్నం,జనవరి 4: స్వచ్ఛ సర్వేక్షన్ 2019 క్షేత్రస్థాయి పరిశీలన బృందాలు ఈ నెల 31వ తేదిలోపు నగరంలో పర్యటించనున్నందున ప్రజలంతా సిద్దంగా ఉండాలని జీవీ ఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఏ.హేమంత్ కుమార్ తెలిపారు. జీవీ ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌కు హెచ్‌పీసీ ఎల్ అందించిన ప్రచార రధాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చతయాప్-పురసేవ యాప్‌ల ద్వారా పరిసరాల పరిశుభ్రతకు తక్షణ పరిష్కారం పొందవచ్చునన్నారు. అదే విధంగా పరిశుభ్రతకు తక్షణ పరిష్కారం కోసం పాల్గొనాలని కోరారు. 1969 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేసి అభిప్రాయం తెలపాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ బృందం అడిగిన ఏడు ప్రశ్నలకు సరైన సమాధానమివ్వాలని కోరారు. హెచ్‌పీసీ ఎల్ పౌరసంబధాల అధికారి శర్మ మాట్లాడుతూ విశాఖ నగరం, స్వచ్చ నగరం రూపొందడానికి జీవీ ఎంసీ కమిషనర్ హరినారాయణన్, పబ్లిక్ హెల్త్ అధికారులు, పారిశుధ్య కార్మికులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. స్వచ్ఛసర్వేక్షన్‌లో హెచ్‌పీసీ ఎల్ తొలి నుంచి భాగస్వామ్యం కావడం హర్షణీయమన్నారు. విశాఖ నగరాన్ని స్వచ్చ సర్వేక్షణ్ పోటీల్లో తొలిస్థానంలో ఉంచేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఎస్ ఈ రాయలబాబు, కళాబృందాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
  శివరాత్రిలోగా మత్స్యగుండం రహదారి
  పాడేరు, జనవరి 4: ప్రముఖ శైవక్షేత్రమైన మత్స్యగుండం ప్రాంతానికి శివరాత్రిలోగా రహదారిని నిర్మిస్తామని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి హామీ ఇచ్చారు. మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిని నిర్మించాలని కోరుతూ మఠం గ్రామస్తులు శుక్రవారం మత్స్యగుండం ముఖద్వారం వద్ద ధర్నా నిర్వహించి జన్మభూమి గ్రామ సభను అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రాజెక్టు అధికారి మఠం గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ప్రతి మహాశివరాత్రికి మత్స్యగుండంలో భారీ ఎత్తున జాతర నిర్వహిస్తున్నామని, అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారని ఆందోళనకారులు ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మత్స్యగుండానికి ప్రతి సంవత్సరం తూతు మంత్రంగా నాశిరకం రహదారిని నిర్మిస్తున్నారని, ఈ రహదారి నిర్మించిన కొద్ది రోజులకే శిథిల స్థితికి చేరుకుంటుందని వారు చెప్పారు. దీనివలన మత్స్యగుండం ప్రాంతానికి వెళ్లే రహదారి నరకప్రాయంగా మారి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్న భక్తులు, పర్యాటకులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నట్టు వారు వివరించారు. దీంతో స్పందించిన ప్రాజెక్టు అధికారి మహాశివరాత్రిలోగా మత్స్యగుండం ప్రాంతానికి నాణ్యమైన రహదారిని నిర్మించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. మత్స్యగుండం రహదారి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పనులను వేగంగా చేపట్టి రహదారి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు అధికారి హామీ, ఆదేశాలతో సంతృప్తి చెందిన ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, హుకుంపేట ఎం.పి.డి.ఒ. రామచంద్రరరావు, ఎం.ఇ.ఒ. రామచంద్రరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

  నిషేధిత సంస్థతో ఒప్పందంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
  పాడేరు, జనవరి 4: గిరిజనులు పండించే కాఫీని మార్కెటింగ్ చేసేందుకు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఐ.సి.ఎస్.డి. సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న గిరిజన సంక్షేమ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్ చేసారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాఫీ మార్కెటింగ్‌కు ఒప్పందం కుదుర్చుకున్న ఐ.సి.ఎస్.డి. సంస్థను యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యు.ఎన్.డి.పి.) బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తూ జారీచేసిన ఉత్తర్వులను బహిర్గతం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ప్రయివేట్ సంస్థతో కాఫీ మార్కెటింగ్‌కు గిరిజన సంక్షేమ అధికారులు ఏవిధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. ఐ.సి.ఎస్.డి.ని 2026 వరకు నిషేధిత సంస్థగా యు.న్.డి.పి. గుర్తించి బ్లాక్ లిస్ట్‌లో పొందుపరిచినప్పటికీ, అధికార పార్టీ నేతల అండదండలతో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. కాఫీ మార్కెటింగ్ చేసేందుకు ఈ సంస్థతో అక్రమంగా ఒప్పందం కుదుర్చుకుని మూడు సంవత్సరాలలో 15 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఆయన ఆరోపించారు. ఐ.సి.ఎస్.డి. సంస్థతో కాఫీ మార్కెటింగ్‌కు కుదుర్చుకున్న అక్రమ ఒప్పందాలలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్ సంతకాలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పాడేరు ఐ.టి.డి.ఎ. అధికారులు ఈ సంస్థకు ప్రచారకర్తలుగా మారి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. నిషేధిత సంస్థతో అక్రమంగా ఒప్పందం కుదుర్చుకున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని అప్పలనర్స డిమాండ్ చేసారు.

  సమస్యల పరిష్కారమే జన్మభూమి లక్ష్యం
  అరకులోయ, జనవరి 4: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే జన్మభూమి లక్ష్యమని స్థానిక ఎం.పి.పి. కె.అరుణకుమారి అన్నారు. మండలంలోని పద్మాపురం పంచాయతీ యండపల్లివలసలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో ఆమె మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సభల ద్వారా దరఖాస్తుల రూపంలో సమస్యలు తెలిపి పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని ఆమె అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, తమ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ప్రజల వద్దకే నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుందని ఆమె పేర్కొన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలలో కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడం చంద్రబాబుకే సాధ్యమని అరుణకుమారి అన్నారు. అంతకుముందు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతాలు చేసి బాలామృతం పంపిణీ చేసారు. ఇదిలాఉండగా పంచాయతీ పరిధిలో అసంపూర్తిగా ఉన్న 150 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసి బిల్లులు చెల్లించాలని, యండపల్లివలస నుంచి గురుకుల కళాశాల మీదుగా దుమ్మగుడ వరకు నిలిచిపోయిన రహదారిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ పీసా కమిటీ సభ్యులు గ్రామ సభలో నిరసన వ్యక్తం చేసారు. అనంతరం కస్తూరిభా గాంధీ పాఠశాల బాలికలు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి.ఒ. విజయకుమార్, సి.డి.పి.ఒ. ఉమ, ఎం.ఇ.ఒ.పి.్భరతిరత్నం, వ్యవసాయ అధికారి సింహాచలం, పలువురు అధికారులు, సిబ్బంది, దేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  లాఠీచార్జికి నిరసనగా ఆందోళన
  అరకులోయ, జనవరి 4: ఢిల్లీలో ప్రత్యేక హోదాపై శాంతియుతంగా ఆందోళన చేపట్టిన సి.పి.ఎం. నాయకులపై లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ అరకులోయ పట్టణంలో సి.పి.ఎం. నాయకులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద గంటకు పైగా రాస్తారోకో చేపట్టడంతో వారపు సంత రోజు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను పాదరక్షలతో కొట్టి దగ్ధం చేసి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. నాయకులు పొద్దు బాలదేవ్, కె.రామారావు, పి.రామన్న, గాసి, రాజు, టి.హరి, పాల్గొన్నారు.

  బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రచారం
  అరకులోయ, జనవరి 4: ఈ నెల 7వ తేదిన అరకులోయ ప్రధాన రహదారి వద్ద నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ సి.పి.ఎం. నాయకులు శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. రాజకీయ ప్రత్యామ్నాయం, గిరిజన సమగ్రాభివృద్ధి అనే అంశంపై నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని అరకు వారపు సంత, యండతపల్లివలస తదితర చోట్ల మైకుల ద్వారా ప్రచారం చేసారు. బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. నాయకులు బాలదేవ్, సురేష్‌కుమార్, రామారావు, గుర్మిసింగ్, పోతురాజు, జోషి, సత్యనారాయణ పాల్గొన్నారు.

  అరకులోయలో సిసి కెమెరాల ఏర్పాటు
  అరకులోయ, జనవరి 4: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ పట్టణంలో శుక్రవారం సిసి కెమెరాలను ఏర్పాటు చేసారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సి.సి. కెమెరాలను పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద నెలకొల్పారు. సి.సి.కెమెరాల ఏర్పాటుతో సంఘ విద్రోహక శక్తుల కార్యకలాపాలను, నేరస్తుల అగడాలను గుర్తించేందుకు అవకాశం ఏర్పడినట్టు పలువురు భావిస్తున్నారు.

  జన్మభూమిలో సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండి
  కోటవురట్ల, జనవరి 4: జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని నియోజకవర్గం ప్రత్యేకాధికారి పుష్పమణి సూచించారు. శనివారం మండలంలో రాజుపేట, చౌడువాడ, టి.జగ్గంపేట , రామచంద్రపురం గ్రామాల్లో జన్మభూమి గ్రామసభలు నిర్వహించారు. రాజుపేట, చౌడువాడ గ్రామాల్లో పాల్గొన్న పుష్పమణి , మండల ప్రత్యేకాధికారి ఉన్నతి పథకం కింద ఎస్సీ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసారు. ఈసందర్భంగా ఆమెమాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. చౌడువాడ గ్రామసభలో గృహాలు మంజూరుకు సంబందించి వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. పక్కా గృహాలకు ఇసుక మంజూరు చేయాలని గ్రామస్తులు మండల ప్రత్యేకాధికారి విజ్ఞప్తి చేసారు. ఈకార్యక్రమంలో ఎడీవో కళ్యాణి, తహశీల్దార్ లక్ష్మి, ఇ ఓ ఆర్‌డీ ప్రభాకర్‌రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
  తక్షణం వేతనాలు పెంచాలి
  కోటవురట్ల, జనవరి 4: గ్రామీణ తాగునీటి సరఫరా ఆపరేటర్లకు వెంటనే వేతనాలు చెల్లించకపోతే నీటి సరఫరాను నిలిపివేస్తామని ఆపరేటర్లు హెచ్చరించారు. శుక్రవారం కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల పరిధిలో పని చేస్తున్న ఆపరేటర్లతో సీ ఐటీయు నక్కపల్లి డివిజన్ కార్యదర్శి ఎం. అప్పలరాజు మండలంలో రామచంద్రపురం ఫైలెట్ ప్రాజెక్టు వద్ద సమస్యలపై సమావేశం నిర్వహించారు. గత జూలై నెల నుంచి గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఆపరేటర్లకు వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై అప్పలరాజు మాట్లాడుతూ వీరికి కనీస వేతనంగా 18 వేలు చేసి తక్షణం చెల్లించాలని డిమాండ్ చేసారు. వీరికి ప్రస్తుతం అమలు చేస్తున్న ఏడువేల రూపాయలు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ఈకార్యక్రమంలో ఆపరేటర్లు ఎస్ .త్రినాధరావు, ఎస్. అప్పలరాజు, ఎవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
  ప్రశ్నించిన యువకుడిపై చేయి చేసుకున్న వీ ఆర్ ఓ
  * రసాబాసాగా మారిన బకులూరు జన్మభూమి
  కొయ్యూరు, జనవరి 4: మండలంలోని బకులూరులో శుక్రవారం జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాబాసాగా మారింది. గ్రామంలో సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్తులు పెయ్యల రమేష్‌పై వీ ఆర్ ఓ శ్రీనివాస్ చేయి చేసుకోవడంతో వివాదం చోటు చేసుకుంది. బకులూరు, బాలారం పంచాయతీల్లో తహశీల్దార్ నైటింగల్ నేతృత్వంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. 12 గంటలు కావస్తున్నా తహశీల్దార్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో జెడ్పీటీసీ శ్రీరామ్మూర్తి అసహనం వ్యక్తం చేసారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నిర్వహణలో తహశీల్దార్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం తహశీల్దార్ వచ్చాక పలు సమస్యలపై స్థానికులు ప్రశ్నిస్తుండగా అధికారులు వారిని వారించి అభివృద్ది, ప్రగతిని వివరించారు. అనంతరం నిర్మాణాలు పూర్తయిన మరుగుదొడ్లుకు చెల్లింపులు జరగడం లేదని ఉపాధి పనులకు వెళ్ళని వ్యక్తులకు డబ్బులకు వస్తున్నాయి కాని పనులు చేసిన వారికి రావడం లేదంటూ స్థానికులు అధికారుల ముందు వాపోయారు. అలాగే ధృవీకరణ పత్రాలు మంజూరులో వీ ఆర్ ఓ శ్రీనివాస్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని, అనర్హులకు మాత్రం వెనువెంటనే ఇస్తున్నారని , ప్రతీదానికి లంచం ఆశిస్తున్నారంటూ ఆరోపణ చేసారు. ఈ ఆరోపణలను జన్మభూమి కమిటీ సభ్యులు తోసిపుచ్చారు. రమేష్ ఆరోపణపై ఆగ్రహించిన వీ ఆర్ ఓ అతన్ని కొట్టడంతో రమేష్ వర్గీయులు వీ ఆర్ ఓపై ప్రతిదాడికి దిగారు. ఘర్షణ పెరుగుతుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను వారించి వివాదం సర్దుమణిగించారు. ఈమేరకు కొయ్యూరు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రమేష్ తెలిపాడు. అలాగే తహశీల్దార్ ప్రతీ రోజూ ఆలస్యంగా రావడంపై జెడ్పీటీసీ ఫిర్యాదు మేర జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు మండల ప్రత్యేకాధికారి పార్వతమ్మ తెలిపారు.

  ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయం
  కొయ్యూరు, జనవరి 4: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని మాజీ మంత్రి ఎం. మణికుమారి పేర్కొన్నారు. మండలంలోని కినపర్తిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గిరిజన ప్రాంతంలోని ఎన్టీ ఆర్ వైద్యం, తాగునీరు, రహదారులకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. పాడేరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకుని రానున్న ఎన్నికల్లో తిరిగి టీడీపీకే పట్టం కట్టాలని కోరారు. చంద్రన్న సంక్రాంతి కానుకలు అందించారు. ఈకార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి పార్వతమ్మ, ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీడీ ఓ రెహమాన్ సహా , పలు శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

  ఢిల్లీలో హోదా అరెస్ట్‌లు దారుణం
  పాయకరావుపేట, జనవరి 4: ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు అమలు చేయాలని సీపీ ఐ, సీపీ ఎం ప్రత్యేక హోదా సాధన సమితి విద్యార్థి, యువజన సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని సీపీ ఐ మండల కార్యదర్శి వి. అర్జునరావు విమర్శించారు. శుక్రవారం వామపక్షాల పిలుపు మేరకు పాయకరావుపేటలో సీపీ ఐ, సీపీ ఎం. పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈసందర్భంగా సీపీ ఐ మండల కార్యదర్శి టి. అర్జునరావు, సీపీ ఎం మండల కన్వీనర్ ఎ.దాసు, కాంగ్రెస్ నాయకులు జగతా శ్రీనులు మాట్లాడుతూ విభజన చట్టంలో హామీలు, ప్రత్యేక హోదా, కడపకు ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం పలు హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించే వారిపై ఉక్కుపాదం మోపడం దారుణమన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలన్నారు. లేకుంటే తగిన మ్యూలం చెల్లించుకోక తప్పదన్నారు . ఈకార్యక్రమంలో వి.శివ ప్రకాష్ , టి. సుబ్బలక్ష్మి,వై.రాజాబాబు, ఆర్.రామచంద్ర, జి.రమణమ్మ, వై.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

  నూకాంబిక అమ్మవారికి లక్ష గాజులతో ప్రత్యేక ఆలంకరణ
  అనకాపల్లి టౌన్, జనవరి 4: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన శ్రీ నూకాంబిక అమ్మవారికి మార్గశిర మాసం శుక్రవారం సందర్బంగా లక్ష గాజులతోప్రత్యేకంగా ఆలంకరించారు. బెంగుళూరుకు చెందిన దాత ఎస్‌వి బాబు దంపతులు సహయంతోఈకార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ ఈవో ఎన్ సుజాత ఆలయ అభివృద్ది కమీటీ సభ్యులు మళ్ళ సురేంద్ర, కొణతాల వెంకట్రావులు తెలిపారు. ఈ ఆలంకరణతో అమ్మవారు ఈనెల 6 వరకు భక్తులకు దర్శినం ఇవ్వనున్నట్లు తెలిపారు. దాతలు ఎస్‌వి బాబు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతీ ఏడాది అమ్మవారికి లక్షగాజులతోఅంకరణతోపాటు భవానీ భక్తుల సమయంలో వెయ్యిమందికి అన్నసమారాధనకు విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే గతంలో అమ్మవారికి బంగారం ముక్కుపుడకతోపాటు అనేక రకాల వస్తువులు అందజేసినట్లు తెలిపారు.ఎస్‌వి బాబు కర్ణాటక, బెంగళూరులో సినిమా ప్రోడ్యూసర్‌గా పనిచేస్తున్నట్లుతెలిపారు.ఈసందర్బంగా బాబు కుటుంబ సభ్యులుతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు.

  ప్రాథమిక దశ నుండే నైపుణ్యాన్ని ఆలవర్చుకోవాలి
  అనకాపల్లిటౌన్, జనవరి 4: ప్రతీ విద్యార్ధి ప్రాథమిక దశ నుండే విద్యాతోపాటు నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని చైతన్య పబ్లిక్ స్కూల్ (ఉక్కునగరం) అన్నపూర్ణ ఛారిటబుల్ సోసైటీ డైరెక్టర్ పి సుశీలారాణి అన్నారు.స్థానిక విజయారెసిడెన్సీలోశుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో చాలామంది యువత పేరున్న విద్యాన్న సంస్థనుండి విద్యనభ్యసించి పెద్దపెద్ద డిగ్రీలను పొంది ఉద్యోగాలు ఉన్నత పదవులు లేక సరైనా అవకాశాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు.ఈ సమస్యకు ప్రధాన కారణం ఈనాటి విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యాలకు నైపుణ్యతపై అంతగా అవగాహన లేకపోవడం లేకపోవడమన్నారు.ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేట్ పరిశ్రమలల్లోకూడా ప్రతి ఉద్యోగి కమ్యూనికేషన్, బాధ్యతాయుతంగా ఉండటం, ఇతర ఉద్యోగులతో కలిసిమలిసి పనిచేయడం, ఉద్యోగంలోచేరే సమయంలో సరైనా నిర్ణయాలు తీసుకోవడం, సాహసోపేతంగా మెలగడం, చేసే పని మీద పూర్తిశ్రద్ధ వంటి ఎన్నో నైపుణ్యాలు కలిగి ప్రతీ యువతాఉండాలని తమ ఆకాంక్షని అన్నారు. నైపుణ్యాలపై కళాశాల ప్రాయంలో విద్యానభ్యసించినప్పుడు పెట్టే వర్క్‌షాపులు, సెమినార్‌ల ద్వారా ఇప్పటికిప్పుడే విద్యార్ధులకు ఆర్ధం కాదన్నారు. చిన్నప్పటి నుండి ప్రాథమిక విధ్యనభ్యసించే స్థాయి నుండే పాఠశాలల్లో దీనిని ఒక విద్యాభ్యాస ప్రణాళికలో అనుసంధానించి నేర్పించితే వారు తమ విద్యాభ్యాసం పూర్తిచేసే సమయానికి వివిధ నైపుణ్యాలు పూర్తిస్థాయిలోఆవగాహన వస్తుందని ఆమె అన్నారు.్ఛరిటిబుల్ సోసైటీ ఎడ్యుక్యుటివ్ డైరెక్టర్ డాక్టర్ మేఘన కంభం(సిఇవో)మాట్లాడుతూ నైపుణాలుపై అవగాన పెంపొందించేలన్న ఉద్దేశంలో ఇజ్రయిల్ దేశ ప్రభుత్వంచే ఆమోదించబడిన సక్సెస్ టుమారోకార్యక్రమాన్ని ఇప్పటికే ప్రపంచచ వ్యాప్తంగా 40 దేశాలలోఅమలులో ఉందన్నారు. మన దేశంలో అలాగే మన రాష్ట్రంలో ప్రప్రధంగా ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సోసైటీ వారి సౌజన్యంతో చైతన్య స్కూల్‌ల్లో ఈ ఎంట్రప్రెన్యూరల్ స్కిల్స్‌ను పెంపొందించడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈనెల 6న ఉక్కునగరం చైతన్య పబ్లిక్ స్కూల్ అన్నపూర్ణ ఛారిటిబుల్ సోసైటీ గ్రౌండ్ ఆవరణలో 24వ వార్షికోత్సవం సందర్బంగా సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్, స్కూల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో భాగంగా స్కూల్ కాన్‌క్లేవ్ జరుగుతుందన్నారు.ఈకార్యక్రమానికి మానవవనరుల శాఖామాత్యులు గంటాశ్రీనివాసరావుముఖ్య అతిధిగా విచ్చేసి గ్రేటర్ ఆంధ్ర స్కూల్ హెల్త్ ఇవ్నోవేషన్ , ఎంట్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్ టుకె 19ను ఆవిష్కరిస్తారని వివరించారు. అలాగే జిల్లాలోఉన్న విశాఖ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు, విద్యావేత్తలు ప్రత్యేక ఆహ్వానితులుగా హజరవుతున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో చైతన్యస్కూల్ ప్రిన్సిపల్ ఈ చంద్రిక తదితరులు పాల్గొన్నారు.

  ఎమ్మెల్యేని నిలదీసిన భూ బాధితులు
  * జన్మభూమి సభలో గంధరగోలం
  సింహాచలం, జనవరి 4: పెందుర్తి శాసన సభ్యుడు బండారు సత్యనారాయణమూర్తిని పంచగ్రామాల భూ బాధితులు నిలదీసారు.పెందుర్తి, భీమిలి నియోజకవర్గం 72వ వార్డు పరిధిలో గోవులశాల కూడలి వద్ద శుక్రవారం జరిగిన జన్మభూమి-మావూరు కార్యక్రమంలో భాగంగా సంఘటనతో చోటుచేసుకోవడంతో సభలో గంధగోల పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ప్రసంగించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సీఐటీయూ, సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్లెకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేసారు. మంత్రి, ఎమ్మెల్యే ప్రజలను మోసం చేసారని అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కారిస్తామని చెప్పి తప్పించుకు తిరుగుతున్నారని రైతు సంక్షేమ సంఘం నేతలు కృష్ణంరాజు, రమణి ఆరోపించారు. ప్రభుత్వం పై, ప్రజా ప్రతినిధుల పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సభా వేదిక పైకి దుసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి నేతలు అదుపులోకి తీసుకున్నారు. నినాదాలతో సభా ప్రాంగణంలో హోరెత్తుతున్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యే బండారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కమ్యూనిస్టుల పై ఎదురుదాడికి దిగారు. కమ్యూనిస్టు ఎమ్మెల్యే ఉన్న కాలంలోనే భూ సమస్య వచ్చిందని ఆయన అన్నారు. విశాఖ శారదా పీఠధిపతి భూ సమస్యను రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. భూ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తోందని న్యాయస్థానంలో జరుగుతున్న జాప్యం కారణంగానే సమస్య తేలడం లేదని ఎమ్మెల్యే అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే పలుసార్లు సమావేశం పై భూ సమస్యకు పరిష్కారం చూపాలని అనేక విదాలుగా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. దేవస్థానానికి ప్రత్యమ్నాయ భూమి ఇవ్వడంతో పాటు సుమారు 650 కోట్ల రూపాయలను పరిహారంగా ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. అన్ని కోణాల నుండి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కమ్యూనిస్టులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి ఆరోపించారు. పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారించాకే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సత్యనారాయణ, జన్మభూమి కమిటీ ప్రతినిధులు పిసిని వరహా నరసింహం, తెలుగుదేశం నాయకులు పాశర్ల ప్రసాద్, అడివివరం సహకార పరపతి సంఘం అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, వేపగుంట మాజీ సర్పంచ్ గంట్ల పెంటారావు ప్రజలు పాల్గొన్నారు.
  వంద ఎకరాల్లో 25 వేల గృహాలు
  * రూ.17 కోట్లతో 72 వార్డు అభివృద్ధి పనులు
  * జన్మభూమి సభలో ఎమ్మెల్యే వెల్లడి
  సింహాచలం, జనవరి 4: పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని ఎస్సార్ పురం ప్రాంతంలో వంద ఎకరాల స్థలంలో 25 వేల గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. శుక్రవారం జీవీఎంసీ 72వ వార్డు పరిధిలో గోవులశాల కూడలి వద్ద జరిగిన జన్మభూమి- మావూరు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజలనుద్దేశించి మాట్లాడారు.ఏపీ టిడ్‌కో సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఒక్కొక్కరు లక్ష రూపాయలు ముందుగా చెల్లించిన వారికి తొమ్మిది లక్షల రూపాయల విలువైన గృహాన్ని అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అనుమాలు ఉన్నవారు పెందుర్తిలో ఇప్పటికే నిర్మాణాలు జరుగుత్నున గృహాలు ఉన్నాయని వాటిని పరిశీలించిన తరువాతనే సొమ్ములు చెల్లించుకో వచ్చునని ఆయన సూచించారు. పెందుర్తి, భీమిలి నియోజక వర్గాలలో అంతర్లీనంగా ఉన్న 72వ వార్డు అభివృద్ధికి సుమారు 17 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, మరో నాలుగు కోట్లతో పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయని ఎమ్మెల్యే ప్రకటించారు. సభలో 168 స్వయం సహాయక బృందాలకు సంబంధించి 4 కోట్ల 80 లక్షల 50 వేల రూపాయల బ్యాంకు లింక్ చెక్కును ఎమ్మెల్యే అందజేసారు.


  0 0

  తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఎన్నికలకు నగారా మోగింది. అనాదిగా వర్గ రాజకీయాలతో ముడిపడినందున ఒక్కసారిగా పల్లెల్లో రాజకీయ పరిస్థితి మారిపోతోంది. ఎన్నికలకు తెర లేవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా వేడి పుట్టించే వాతావరణం ఏర్పడిందని పేర్కొనవచ్చు. బడా రాజకీయ నేతలకు వ్యూహ,ప్రతి వ్యూహాలు రూపొందించుకోవడానికి, బలమైన అనుచరవర్గం తయారుచేసుకోవడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలను ఆయుధంలా వాడుకొనే అవకాశం వుంటుంది.
  ఒకప్పుడు గ్రామ సర్పంచులుగా ఎన్నిక కావడం అంటే- ఎంతో హోదా కింద, గౌరవ మర్యాదల కింద భావించేవారు. మొదట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తరువాత అంచలంచెలుగా ఎదగాలని ఎందరో నిర్ణయించుకునేవారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థ వుండేది. సర్పంచ్‌లుగా గెలిచిన వారిలో ఒకరు సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యేవారు. అప్పట్లో సమితి ప్రెసిడెంట్ హోదా ఎమ్మెల్యే హోదాకు సమానంగా వుండేది. దాదాపు ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లతో సమానంగా పంచాయతీ సమితి వుండేది. సమితి ప్రెసిడెంట్లుగా ఎంపికైన వారిలో ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నుకునేవారు. ఏపీలో ఎన్టీ రామారావు అధికారం చేపట్టాక మండల వ్యవస్థ ప్రారంభమైంది. ఇప్పుడు ఒక సమితి స్థానంలో నాలుగైదు మండల ప్రజాపరిషత్తులు ఏర్పడ్డాయి. సర్పంచ్‌లుగా గెలిచిన వారిలో కొందరు రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగి మంత్రుల స్థాయికి ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులైన జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కర రెడ్డి లాంటి ప్రముఖులు మొదట సమితి ప్రెసిడెంట్లుగా ఎన్నికైనవారే.
  ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1985లో ‘నూతన పంచాయతీరాజ్ చట్టం’ అమలులోకి తీసుకురావడంతో సమితులు రద్దయ్యాయి. చివరిగా సమితి అధ్యక్షుల ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో 1980లో జరిగాయి. ఎన్.టి.రామారావు తీసుకొచ్చిన కొత్త పంచాయతీ చట్టంలో కూడా మూడంచెల పంచాయతీ వ్యవస్థ (సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు) వున్నప్పటికీ నేరుగా ప్రత్యక్ష ఎన్నికలు ఏర్పాటు చేశారు. వార్డు మెంబర్‌ను, సర్పంచ్‌ను, మండల అధ్యక్షుడిని, జిల్లా పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ప్రజలు ఎన్నుకునే విధంగా చట్టంలో మార్పులు చేశారు. ఈ విధంగా 1986లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అప్పట్లో దేవేందర్ గౌడ్ లాంటి నేతలు జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎంపికయ్యారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలోనే ఐదంచెల పంచాయితీ వ్యవస్థ 1995లో అమలులోకి వచ్చింది. సర్పంచ్‌లతో పాటు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లాపరిషత్ చైర్మన్‌లు అంటూ ఐదు విభాగాల వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఎంపీటీసీల నుంచి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిని, జడ్పీటీసీల నుంచి జిల్లాపరిషత్ చైర్మన్‌ను ఎన్నుకుంటున్నారు. జడ్పీటీసీలు మండల స్థాయిలో ఓటర్ల ద్వారా ఎన్నికవుతున్నారు. చిన్న పంచాయతీ అయితే ఒకరు, పెద్ద పంచాయతీ అయితే ఇద్దరు, ముగ్గురు చొప్పున ఎంపీటీసీలు (2000 నుంచి 3000 మంది ఓటర్లతో) ఎన్నికవుతున్నారు.
  గతంలో పంచాయతీలకు ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఆరేడు సంవత్సరాలకు ఇంకా పైబడి ఎన్నికలు జరిగేవి. ఇలా 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత 1980లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 1987లో ఏడు సంవత్సరాల విరామం అనంతరం ఎన్నికలు జరిగాయి. ఇలా అస్తవ్యస్తంగా ఉన్న పంచాయతీ వ్యవస్థకు రాజ్యాంగ పరిధిలో చట్ట్భద్రత వుండాలని 1989లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నూతన పంచాయితీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చారు. గ్రామ పంచాయతీలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎమ్మెల్యే, ఎం.పీ. ఎన్నికల తరహాలో క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగే విధంగానూ, సర్పంచ్‌లకే నేరుగా చెక్‌పవర్ వుండాలని, కేంద్రం నుంచి వారి ఖాతాలోకి నేరుగా నిధులు వెళ్లాలని ఆయన భావించారు. ఆ కేటాయింపులకు ‘పంచాయతీరాజ్ రోజ్‌గార్ నిధులు’ అని పేరుపెట్టారు. రాజీవ్‌గాంధీ ఈ చట్టానికి నాంది పలికి మొదట ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 1992లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా వున్నప్పుడు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రత ఏర్పడింది.
  మొదట్లో సర్పంచ్ పదవిని హోదా కింద భావించినవారు రానురానూ రాజకీయ, వ్యాపార, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే విధంగా మారారు. ప్రపంచీకరణ ఫలితంగా పల్లెలకు ఆనుకుని జాతీయ రహదారుల వద్ద భూమి విలువ పెరగడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధిచెందడం, కొత్తకొత్త పరిశ్రమలు, కార్పొరేట్ కళాశాలలు రావడం వంటి మార్పులు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, పరిశ్రమల యజమానులకు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అనుమతి అవసరం కావడంతో తద్వారా సర్పంచ్‌లకు, ఇతర పాలకవర్గ సభ్యులకు భారీఎత్తున కమీషన్ల రూపంలో ఆదాయం వస్తున్నది. ఇలాగే కొన్ని మేజర్ పంచాయతీల పరిధిలో ఈత, తాటి, చింత వనాలు వుండడం, చేపలు, రొయ్యలు పెంపకానికి కృత్రిమంగా చెరువులు ఏర్పడడం, వాటికి వేలం పాటలు నిర్వహించడంతో పంచాయతీలకు ఆదాయం బాగా పెరిగింది.
  గ్రామాల్లో రోడ్లు, వాటర్ ట్యాంకులు, ఇతర సౌకర్యాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిధులు, వరల్డ్ బ్యాంక్ నిధులు వస్తుండడంతో వీటి కాంట్రాక్ట్ పనుల ద్వారా సర్పంచులకు, వార్డ్ మెంబర్లకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. అందుకే కొన్ని మేజర్ పంచాయతీల్లో ఎన్నికల సందర్భంగా గెలుపుకోసం లక్షలు కోట్లు ఖర్చుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో జరిగాయి. 2007లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తిరుపతి సమీపంలోని తిరుచానూరు, రేణిగుంట, హైదరాబాద్ శివారులోని శంషాబాద్, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య వున్న కొన్ని పంచాయతీల్లో, విశాఖ నగరం పరిసరాల్లోని గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం నేతలు పోటాపోటీగా డబ్బు ఖర్చు చేశారు.
  ఇపుడు తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ పోరులో ప్రధాన రాజకీయ పార్టీలు తమ పట్టును నిరూపించుకునేందుకు తపన పడుతున్నాయి. కీలక పంచాయతీల్లో సర్పంచ్ పీఠాలను కైవసం చేసుకునేందుకు ఎంత డబ్బయినా ఖర్చు చేసేందుకు నేతలు వెనుకాడడం లేదు. భవిష్యత్ రాజకీయాలకు పంచాయతీ పదవులు పునాది వంటివని భావిస్తూ గ్రామస్థాయి నాయకులు బరిలోకి దిగుతున్నారు. పంచాయతీల్లో ఎన్నికల కోలాహలం చూస్తుంటే.... జాతిపిత మహాత్మా గాంధీ ఆశించిన ‘గ్రామ స్వరాజ్యం’ సంగతేమే కానీ, రాజకీయాలు మాత్రం రసకందాయంలో పడ్డాయి.


  0 0

  రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత మన దేశానికి ప్రధాని ఎవరు? నరేంద్ర మోదీ కాకుంటే- ఆ పీఠాన్ని ఎక్కేదెవరని యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మన దేశంలో ఇప్పటికీ రెండే రెండు ప్రధాన పార్టీలు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి నుంచి రాహుల్ గాంధీ, భాజపా నాయకత్వంలోని ఎన్డీఏ శిబిరం నుంచి నరేంద్ర మోదీ ప్రధాని పదవి కోసం ప్రస్తుతం పోటీలో ఉన్నట్టు అంతా భావిస్తున్నారు. ప్రస్తుత ప్రధాని మోదీ మళ్లీ పగ్గాలు చేపట్టడం ఖాయమని భాజపా ధీమాగా ఉంది. ఇటీవల ఎన్డీఏ కూటమి నుండి నిష్క్రమించిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడం అనూహ్య రాజకీయ పరిణామాలకు నాంది పలికింది. గత నెలలో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమి రాబోయే లోక్‌సభ ఎన్నికల వరకూ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ ఇపుడు ఊపందుకొంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు.
  ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన తెరాస అధినేత కేసీఆర్ సైతం జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో తాము కీలకపాత్ర పోషించడం ఖాయమని ఆయన అంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి కొత్తఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ సంకల్పం. కాంగ్రెస్సేతర, భాజపాయేతర పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసి కేంద్రంలో అధికారం దక్కించుకోవాలన్నది ఆయన వ్యూ హంగా కనిపిస్తోంది. తెలంగాణలో గత నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలపై ఇతర రా ష్ట్రాలు సైతం ఆసక్తిని చూపుతున్నాయి. రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని కేసీఆర్ చెబుతుండడంతో తెరాస పాలనను మిగతా రాష్ట్రాలు సైతం గమనిస్తున్నాయి. కాంగ్రెస్, తెదేపా, భాజపా, వామపక్షాలను ఓడించి భారీ మెజారిటీతో కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడంతో జాతీయ రాజకీయాల్లో ఇక తెరాస కీలకపాత్ర వహించగలదన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. తెరాస పార్టీ పగ్గాలను తన కుమారుడు కేటీఆర్‌కు అప్పగించి, జాతీయ రాజకీయాలపై దృష్టి సారించేందుకు కేసీఆర్ సమాయత్తం కావడం గమనార్హం. ఇప్పటికే ఆయన వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు ప్రారంభించారు.
  దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత ఉత్తర భారతదేశానికి చెం దిన నాయకులే ఎక్కువగా ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. దక్షిణ భారతం నుంచి అందునా తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు మాత్రమే అనుకోని రీతిలో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రాభవం క్రమేణా తగ్గడంతో తెలుగు ప్రజలు ప్రాంతీయ పార్టీలకే పట్టం గడుతున్నారు. సినీనటుడు ఎన్టీ రామారావు అలనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి కొన్ని నెలల వ్యవధిలోనే అధికారం చేపట్టారు. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన చక్రం తిప్పారు. ఎన్టీఆర్ తర్వాత 1996లో చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పార్టీలను కూడగట్టడంలో విజయం సాధించారు. రాజకీయంగా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటూ చంద్రబాబు ముందుకు వెళతారు. రాజకీయంగా ఒడిదుడుకులు లేకుంటే గతంలో ఎన్టీఆర్ ప్రధాని అయ్యేవారని విశే్లషకులు చెబుతుంటారు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే గనుక చంద్రబాబుకు భవిష్యత్‌లో ఉన్నత పదవులు దక్కే అవకాశాలున్నాయి. ఇక, రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా విశేష జనాదరణ ఉన్న నేత. అకాల మరణం పొందక ఉంటే ఆయన కూడా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి ఉండేవారు. ప్రస్తుత రాజకీయాలను గమనిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి కేసీఆర్, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు ఇపుడు వ్యూహరచన చేస్తున్నారు. భిన్నధృవాలుగా ఉన్న ఈ ఇద్దరు నేతలూ ఒక్కటైతే తెలుగు ప్రజలు జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి రావడం ఖాయం. దక్షిణ భారతానికి మరోసారి ప్రధాని పీఠం దక్కాలంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఐక్యంగా పనిచేయడం అవసరం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని జారవిడుచుకొంటే ప్రధాని పదవి దక్షిణ భారతానికి దక్కడం ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పొచ్చు.


  0 0

  సీసపు విష రసాయన ధాతువులు కలసిన ‘మ్యాగీ’ సేమ్యాలను చిన్నపిల్లలు ఎందుకు తినాలన్నది సర్వోన్నత న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ గురువారం సంధించిన ప్రశ్న.. తినరాదన్నది న్యాయమూర్తి ప్రశ్నలో నిహితమై ఉన్న సమాధానం. కానీ ‘మోనో సోడియం గ్లటుమేట్’- ఎమ్‌ఎస్‌జి- అన్న కృత్రిమ రసాయన ‘సీసం’-లెడ్-తో సంకరమైన ‘మ్యాగీ’ సేమ్యాలను దశాబ్దుల తరబడి పిల్లలు తింటూనే ఉండడం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ కొనసాగిస్తున్న ఆర్థిక బీభత్సకాండకు ఒక ఉదాహరణ మాత్రమే.. ఈ వాణిజ్య బీభత్సకాండకు ఉదాహరణలు కోకొల్లలు. ‘నెజల్’-నెస్‌లే-అన్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థ ఉత్పత్తిచేసి మన నోళ్లకెత్తుతున్న అనేకానేక అనవసర కృత్రిమ ఆహార పదార్థాలలో ఈ ‘మ్యాగీ’ ఒకటి మాత్రమే. ‘ఎమ్‌ఎస్‌జి’ విష రసాయనం రుచిని పెంచడమేకాక ఈ ‘మ్యాగీ’ సేమ్యాలు- నూడుల్స్- అతి త్వరగా ‘ఉడికి’పోయి ఆవురావురమని ‘ఆబ’గా ఆరగించడానికి వీలైన ఆహారంగా రూపొందడానికి దోహదం చేస్తోందట. అందువల్ల ‘మ్యాగీ’ సేమ్యాలను చూసి పిల్లల కంటె ముందు పెద్దలకు ‘ముక్కులు ఊరడం’ ఆరంభమైంది. కృత్రిమ రుచుల సౌరభాలను నాలుక కంటె ముందు ‘ముక్కు’ ఆఘ్రాణిస్తుందట! అందువల్ల అనారోగ్యాన్ని పెంచే ఆహారాలను ‘ఆబ’గా తినడంలో నోటికంటె ముందు ‘ముక్కు’ పనిచేస్తుందని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 1959లో వ్రాసిన తన ‘దమయంతీ స్వయంవరం’ అన్న నవలలో వివరించి ఉన్నారు. ఆ వివరణకు వాస్తవ రూపమైన దృశ్యాలు చిత్ర విచిత్రంగా ఆవిష్కరణవౌతుండడానికి ‘మ్యాగీ’ సేమ్యాల వంటి ‘అమిత రుచికరమైన’ కృత్రిమ రసాయన విషాలు దోహదం చేస్తున్నాయి. ‘కల్తీకి రుచి ఎక్కువ..’ అన్నది ఆధునిక నాగరిక జీవన వాస్తవం! దాదాపు నాలుగేళ్ల క్రితం ఈ ‘నెజల్’కంపెనీ వారి సీసపుగుట్టు రట్టయినప్పుడు ‘మ్యాగీ’ సేమ్యాలు ‘అమిత రుచి’ని కుక్కలు సైతం అసహ్యించుకున్నాయి. కుక్కలు సైతం తినడానికి నిరాకరించిన ‘మ్యాగీ’ సేమ్యాల ‘గుట్టలు’ మురికి కాలువల పక్కన దర్శనమిచ్చాయి. ‘్భరత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ’- ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’- ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ- ఫ్యాయ్- వారు 2015 జూన్‌లో ఈ ‘మ్యాగీ’ సేమ్యాల అమ్మకాలను నిషేధించారు. కొన్ని వారాలపాటు మూతపడిన మ్యాగీ సేమ్యాల విక్రయాలు ఆ తరువాత 2015 నవంబర్ నుంచి యథావిధిగా పుంజుకున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నత్తనడకతో పోటీపడుతున్న న్యాయప్రక్రియ ఇలా పుంజుకొనడానికి కారణం.. వీటికంటె అతి ప్రధానమైన కారణం మన దేశంలోని వినియోగదారుల ‘ముక్కులు ఊరడం..’
  ఈ ‘సేమ్యా’లను మాత్రమే గాక విష రసాయనాలతో కల్తీ అయిన అన్నిరకాల ‘డబ్బాల’ ‘సీసాల’ ‘పొట్లాల’ నిలువ ఉన్న ఆహారాలను మనం, ప్రధానంగా మధ్య తరగతి జనం విపరీతంగా కొనుగోలు చేస్తుండడం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’- చొరబాటు విస్తరించడానికి కారణం. ‘నెస్లే’ వంటి సంస్థలు తయారు చేస్తున్న ‘ఐస్‌క్రీమ్’లు ‘చాక్లెట్లు’, కేకులు, పిజ్జాలు, బర్గర్‌లు, శీతల పానీయాలు ‘‘మానవులు తినకూడని, తాగకూడని, చప్పరించకూడని’’ రకరకాల కృత్రిమ రసాయన పదార్థాలతో కలుషితమై ఉండడం ప్రపంచమంతటా ప్రచారం అవుతున్న వాస్తవం! ఈ వాస్తవం దేశ విదేశాలలోను న్యాయస్థానాలలోను న్యాయస్థానాల బయట అనేకసార్లు ధ్రువపడింది. అయినప్పటికీ మన దేశంలోని ‘పెద్దలు’ ఈ అనారోగ్యకరమైన తిండి పదార్థాలను కొంటూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. దాదాపు ఐదు దశాబ్దుల క్రితం వరకు వేయించిన సెనగపప్పు, బఠాణీలు, మరమరాలు- బొరుగులు-, బెల్లం, కారం పట్టించిన రకరకాల పప్పులు, పల్లీలు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, గోడంచి- జీడిపప్పు-, అటుకులు, పేలాలు, వంటి ‘చిరు తిండి’ని పిల్లలకు పెద్దలు తినిపించేవారు, కొనిపించేవారు. కొబ్బరి నీళ్లు, రకరకాల పండ్లు, చెఱకు రసం, పానకం వంటి పానీయాలను సేవించారు. కానీ ఆధునికత పేరుతో పాశ్చాత్య నాగరికత పెరిగిన తరువాత ఇవన్నీ మూలపడినాయి. ఐస్‌క్రీమ్‌లు, బర్గర్‌లు, వేఫర్‌లు, సాండ్‌విచ్‌లు, కట్‌లెట్‌లు, జామ్‌లు ‘కోకో’, ‘పెప్సీ’ పానీయాలు పిల్లల కడుపులలో వారిని కొవ్వెక్కిస్తున్నాయి, లావెక్కిస్తున్నాయి! ఇళ్లలో సైతం ఆరోగ్యకరమైన సంప్రదాయపు వంటలు, పిండి వంటలు మూలపడినాయి. కృత్రిమ రసాయన విషాలు కలసిన రకరకాల రంగులు వేసిన వంటలు, పిండి వంటలు తయారవుతున్నాయి. ప్రజలు ప్రధానంగా మధ్యతరగతి వారు తమ పిల్లలకు మొదట ఈ కృత్రిమ పానీయాలను, తినుబండారాలను మప్పుతున్నారు, ఆ తరువాత పిల్లలు నిపుణులుగామారి నిరంతరం ‘అంగడి పదార్థాలు’ డబ్బాల ఆహారాలు తెగ మెక్కుతున్నారు.. నెస్లే వంటి సంస్థల విస్తరణకు ఇదీ నేపథ్యం..
  శుద్ధిచేసి నిలువచేసే ప్రక్రియ పేరుతోనూ, ‘‘కరకర’’లాడించడం పేరుతోను, ఘుమ ఘుమ లాడించడం పేరుతోను ప్రతి తిండి పదార్థంలోను కొంత శాతం మేర కృత్రిమ రసాయనాలను కలపడానికి ప్రభుత్వం అనుమతిస్తుండడం వౌలికమైన వైపరీత్యం. ప్రపంచీకరణ వ్యవస్థీకృతమై ఇలా ‘తిండి’లో రసాయనాలను కలపడం మరింతగా వ్యవస్థీకృతమైంది. ఇలా ప్రభుత్వం, ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాధికార సంస్థలు అనుమతించిన పరిమాణం కంటె ఎక్కువ పరిమాణంలో ఆహార శుద్ధి ప్రక్రియ- ఫుడ్ ప్రాసెసింగ్- పరిశ్రమల వారు - రసాయనాలను ఆహారంలో కలపడం చట్టవిరుద్ధం. కానీ దాదాపు ప్రతి ‘డబ్బా తిండి’- పాకేజ్డ్ ఫుడ్-లోను అనుమతించిన పాళ్లలోకంటె ఎక్కువ పాళ్లలో ఈ రసాయనాలను కలిపి వేస్తున్నారు. పట్టుబడిన నేరస్థులైన సంస్థల వారి పదార్థాలను కొన్ని రోజులపాటు నిషేధిస్తున్నారు. మళ్లీ యథాప్రకారంగా ఈ పదార్థాల ఉత్పత్తి, వినిమయం జరిగిపోతూనే ఉంది. ఘుమ ఘుమలాడే నెయ్యికి అది సహజ పరిమళం కాదు, రసాయనాలతో కల్పించిన కృత్రిమ సుగంధం అది. ఈ రసాయనాలు మన కడుపులలో చేరి క్రమంగా శరీరాలను విష పూరితం చేస్తున్నాయి. ‘నెజల్’ సంస్థవారు ఇలా ప్రభుత్వం అనుమతించిన ‘శాతం’కంటె ఎక్కువ శాతం ‘సీసాన్ని’ మ్యాగీ సేమ్యాలలో కలిపినట్టు 2016లో బయటపడింది. ఇలా కొంత శాతం మేర రసాయనాలతో ఆహారాన్ని ‘కల్తీ’ చేయడానికి ప్రభుత్వం అనుమతించడం ఏమిటి? ఎలాంటి రసాయన విషాలను కలుపకుండా ఆహారాన్ని శుద్ధిచేసి నిలువ ఉంచలేమా?? అన్న ప్రశ్న అనేక ఏళ్లుగా వినబడుతోంది. సర్వోన్నత న్యాయమూర్తులు డి.వై.చంద్రచూడ్, హేమంత గుప్తా ఈ ప్రశ్నను మరోసారి సంధించారు.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి!
  ఆర్భాటం లేకుండా ‘శుద్ధిప్రక్రియ’ మన ఇళ్లలోను, కుటీర, గ్రామీణ పరిశ్రమలలోను వేల ఏళ్లుగా కొనసాగడం చరిత్ర. ఇలా ఆహారాన్ని సంప్రదాయ పద్ధతిలో శుద్ధిచేసి నిలువ ఉంచడానికి భారతీయులు ఎలాంటి కృత్రిమ రసాయనాలను వాడలేదు. కొన్ని సందర్భాలలో ప్రకృతి సిద్ధమైన అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే ఆహారాన్ని శుద్ధిచేసి నిలువ ఉంచడానికి ఉపయోగించారు. అప్పడాలు, వడియాలు, ఒరుగులు, ఉప్పేరి, పచ్చళ్లు, పిండి వంటలు, తాండ్ర, బెల్లం పాకం, ఔషధాలు... ఇలా వందల రకాలను సంప్రదాయ పద్ధతిలో- ఎలాంటి కృత్రిమ రసాయనాలు లేకుండా- శుద్ధిచేసి నిలువ చేయడం భారతీయ చరిత్రలో భాగం..


  0 0

  భారతీయ జనతాపార్టీ పాలనలో ఉన్న మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభు త్వాలను ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో ఒక విధమైన నూతన ఆత్మ విశ్వాసం కని పిస్తున్నది. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాలలో కేవలం ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే కాంగ్రెస్ చెప్పుకోదగిన విజయం సాధించింది. అక్కడ మాత్రమే భాజపా తీవ్ర పరాభవానికి గురైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగిన పూర్తి ఆధిక్యతను భాజపా పొం దలేక పోయింది. ఇక తెలంగాణలో ఎన్నో ఆశలు పెంచుకున్నా, తెలుగు దేశంతో చేతులు కలిపినా కాంగ్రెస్‌కు ప్రయోజనం లేకపోయింది. 2014లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో కన్నా ఇప్పుడు సీట్లు తక్కువగా వచ్చాయి. మిజోరంలో పదేళ్ల కాంగ్రెస్ పాలనకు తెరపడింది. అయినప్పటికీ, కాంగ్రెస్ వ్యవ హారాలపై రాహుల్ పర్యవేక్షణ ప్రారంభమైన తర్వాత- ఒకేసారి మూడు రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం చెప్పుకోదగిన పరిణామమే.
  రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాదాపు ఒంటరిగా పోటీ చేసింది. ప్రజా కూటమి పేరుతో బద్ధ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలకు పేరొందిన తెలుగుదేశంతో చేతులు కలిపినా తెలంగాణలో ఫలితం దక్కలేదు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలలో తాను కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లింపవలసి వస్తుందంటూ ఒక వంక బీఎస్పీ అధినేత్రి మాయావతి బెదిరిస్తూ వచ్చారు. అటువంటి సమయంలో ఒంటరిగా ప్రభుత్వాలను ఏర్పా టు చేయగలగడం రాహుల్ నాయకత్వం స్థిరపడినదని చెప్పడానికి సంకేతం అని భావించాలి.
  ఇదివరలో ఎక్కడ కాంగ్రెస్‌కు ఓటమి ఎదురైనా రాహుల్ నాయకత్వానికి పనికిరారని, ప్రియాంకా గాంధీ క్రియాశీల రాజకీయాలలోకి రావాలని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట కొంతమంది యువకులు ప్రద ర్శనలు చేస్తూ ఉండేవారు. కొందరు సీనియర్ నేతలు సహితం అందుకు వంత పాడుతూ ఉండేవారు. కానీ, ఈ పర్యాయం ఎవ్వరూ అటువంటి మాటలు అనకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రియాంకా గాంధీ గతంలో కన్నా ఇప్పుడు కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల అభ్యర్థులను నిర్ణయించడంలో తల్లి సోనియా గాంధీతో కలసి ఆమె నిర్ణయాత్మక పాత్ర వహించారు. రెండు, మూడు రోజులపాటు వారిని ప్రతిఘటించి, చివరకు వారి మాటలకు రాహుల్ తల వంచవలసి వచ్చింది. గతంలో వలే ఏకపక్షంగా యువనేతలను పార్టీపై రుద్దే ప్రయత్నం రాహుల్ చేయ కుండా పార్టీలో ఒక విధంగా ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
  అయదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల తర్వాత రాహుల్ స్వరంలో కూడా మార్పు వస్తున్నది. రాఫెల్ ఒప్పందంపై గతంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీపై దాడి చేసిన రాహుల్, గతంలో కన్నా ఇప్పుడు మరింత దృఢంగా లోక్‌సభలో దాడి చేయడం గమనార్హం. భాజపా వ్యతిరేక పార్టీలతో పొత్తులు ఏర్పాటు చేసుకొనే విషయంలోనూ సమర్ధవంతంగా వ్యవహ రిస్తున్నారు. బీజేపీ వ్యతిరేకతను ఓట్లుగా మార్చు కోవాలంటే ఆ పార్టీని ఎవరు ఓడిస్తారన్నది ప్రధానంగా ప్రజలు చూస్తారనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తున్నది. ఇందుకు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలే ఉదాహరణ. అక్కడ మాజీ సీఎం అజిత్ జోగితో మాయావతి చేతులు కలిపిన తర్వాత వారిద్దరూ కాంగ్రెస్ ఓట్లకు గండి కొడతారని, దాంతో భాజపా ఆ రాష్ట్రంలో సునాయానంగా గెలుస్తుందని అందరూ అంచనాలు వేశారు. అయితే ఆశ్చర్యకరంగా వారిద్దరూ కాంగ్రెస్ ఓట్లను కాకుండా భాజపా ఓట్లను చీల్చారు. భాజపాను ఓడించాలని చూసేవారిని సహితం ఆ పార్టీతో సమానంగా ప్రజలు జతకట్టే ప్రమాదం నున్నట్లు వెల్లడైనది. అందుకనే ఇప్పుడు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, జమ్మూ కశ్మీర్ వంటి కొన్ని రాష్ట్రాలలో మినహా దేశం అంతా దాదాపుగా ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేస్తుందనే సంకేతాన్ని రాహుల్ ఇస్తున్నారు.
  మొదటగా పశ్చిమ బెంగాల్ విషయంలో నెలకొన్న అస్పష్టతకు తెరతీశారు. అక్కడ మమతా బెనర్జీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు సిపిఎంతో పొత్తుకు సిద్ధపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎంతో సీట్లను సర్దుబాటు చేసుకొని అతిపెద్ద ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలబ డగలిగింది. అయితే కాంగ్రెస్‌కు ఒక్క లోక్ సభ సీటు ఇవ్వడానికి కూడా మమత ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోకుండా చేయాలని ఒక వంక మమతా బెనర్జీ, మరోవంక మాయావతి పట్టుదలగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ఎట్లాగూ బిజెపి పూర్తి మెజారిటీ సీట్లు పొందలేదని, కాంగ్రెస్ కూడా కోలుకోలేని పక్షంలో బిజెపి, కాంగ్రెస్‌లలో ఎవరో ఒకరు బయట నుండి మద్దతు ఇస్తే తాము ప్రధాన మంత్రి పదవి చేపట్టవచ్చని మమత, మాయావతి కలలు కంటున్నారు. అందుకనే వారిద్దరి పట్ల బతిమాలే ధోరణి అవసరంలేదని నిర్ణయానికి రాహుల్ వచ్చిన్నట్లు కనిపిస్తున్నది.
  జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీని ఢీకొనగల నేతగా గుర్తింపు పొంద గలిగితే పలు రాష్ట్రాలలో మద్దతు పొందటం సులభం కాగలదన్న ఆలోచనలో రాహుల్ ఉన్నారు. దాంతో పశ్చిమ బెంగాల్ లో ఒంటరిగా అన్ని సీట్లకు పోటీ చేయడానికి సిద్దపడమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు సూచించారు. అక్కడ సిపిఎం బాగా బలహీన పడిందని, ఆ పార్టీతో పొత్తు వల్లన ప్రయోజనం లేదనే అభిప్రాయానికి కూడా వచ్చారు. మరోవంక వామపక్షాలు కూడా కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా తమ ఉనికిని కోల్పోతున్నామని భావిస్తున్నారు. సొంతంగానే ఎక్కువ సీట్లు గెలుపొందగలమనే విశ్వాసం ఇప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో వెల్లడి అవుతున్నది.
  ఉత్తర ప్రదేశ్‌లో కూడా అటువంటి పరిస్థితులే నెల కొన్నాయి. రాహుల్ గాంధీ పట్ల అఖిలేశ్ యాదవ్ కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, మాయావతి మాత్రం మాట్లాడకుండా అతనిని కట్టడి చేస్తున్నారు. దాంతో ప్రస్తుతం సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియోజకవర్గాలను మాత్రమే వదిలివేసి, మిగిలిన చోట్ల తామే పోటీ చేయాలని మాయావతి భావిస్తున్నారు. ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్ సింగ్‌తో పొత్తుకు సిద్ధమై మూడు సీట్లు వదలడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలలో నిర్ణయాత్మక పాత్ర వహించగల ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కు స్థానం లేకుండా చేయడం ద్వారా ప్రధాన మంత్రి పదవి పోటీలో రాహుల్‌కు అవకాశం లేకుండా చేయాలని మాయావతి భావి స్తున్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే బిజెపికి అండగా ఉంటున్న బ్రాహ్మణులు, మరికొందరు అగ్రవర్ణాల వారు కాంగ్రెస్ వైపు మారతారని, తద్వారా భాజపాను నిలువరించగలమని ఛత్తీస్‌గఢ్ లో వలే ఆలోచనలు చేస్తున్నారు. కానీ రాజకీయాలలో సాధారణ గణాంకాలు పనిచేయబోవని గ్రహించలేక పోతున్నారు. అందుకనే వౌనంగా మాయావతి, మమతలను దెబ్బకొట్టే విషయమై రాహుల్ ఆలోచనలు చేస్తున్నారు. ముందుగా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం పట్ల ఆయన దృష్టి సా రిస్తున్నారు. వీటితోపాటు పంజాబ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయవలసిందే. అన్నింటికన్నా ఆశ్చర్యకరం తెలుగుదేశంతో కొత్తగా కుదిరిన స్నేహం ముందుకు వెళ్లే అవకాశం కనబడటం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సైతం ఒంటరిగా పోటీ చేయడం పట్లనే కాంగ్రెస్ దృష్టి సారిస్తున్నది.
  మహారాష్టల్రో కాంగ్రెస్‌తో పొత్తు పట్ల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎక్కువ పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే 40 సీట్లకు సంబంధించి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. మిగిలిన 8 సీట్లను చిన్న చిన్న పార్టీల కోసం ఎదురు చూస్తూ ఆపారు. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ లోని అసమ్మతిని ఆసరాగా చేసుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి వేయడం కోసం బీజేపీ, ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని ఆదుర్దాలో ఉన్న బిఎస్ యడ్యూరప్ప చేయని ప్రయత్నం లేనే లేదు. అయినా అక్కడ భాజపా ఎత్తుగడలు సాగడం లేదు. ప్రభుత్వ సుస్థిరతకు భంగం ఏర్పడటం లేదు.
  రాహుల్ గాంధీ రాఫెల్ విమానాల ఒప్పందంపై మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్ప వలసిన ప్రధాన మంత్రి మోదీ, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ బదులు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆ బాధ్యత అప్పచెప్పడం ద్వారా పరోక్షంగా రాహుల్ గాంధీలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు దోహదపడ్డారని చెప్పవలసి ఉంది. రాఫెల్ ఒప్పందంపై రాహుల్ గాంధీ నిర్దిష్టంగా కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా సమాధానం చెప్పకుండా జైట్లీ ఎదురు దాడి చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలను ఏకరువు పెట్టారు.
  కాంగ్రెస్ పాలనకు తిరస్కార పూర్వకంగానే ప్రజలు మోదీకి పట్టం గట్టారు. ఇప్పుడు తిరిగి మోదీ వ్యతిరేకతతో నాయకుడిగా ఎదిగే అవకాశాన్ని రాహుల్ గాంధీ పొందుతున్నారు. ప్రధాన మంత్రి మోదీ తొలిసారిగా ఈనెల 1వ తేదీన సవివరంగా పలు క్లిష్టమైన అంశాలపై ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆయా అంశాలపై ఆయన పార్లమెంట్‌లో గాని, చివరికి బిజెపి వేదికలపైన గాని, కనీసం మంత్రి వర్గ సమావేశంలో గాని చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ కార్యకర్తలు అమాయకంగా అడిగే ప్రశ్నలకు సహితం భయపడే పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నది ? మొత్తం బిజెపి నాయకత్వం ఆలోచించుకో వలసిన అంశం ఇది.
  రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రధాని కాలేక పోవచ్చు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన తప్పిదాలను ఆయన తన తలపై మోస్తూ దేశంలో మరే నేత ఎదుర్కొనని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే- తన బలహీనతలు, తన పార్టీ పొరపాట్లను గ్రహించి, నిజాయతీతో మార్పు కోసం ప్రయత్నం ఆయన చేస్తున్నారని చెప్పవచ్చు.


  0 0

  సిడ్నీ, జనవరి 4: ఓవైపు చతేశ్వర్ పుజారా.. మరోవైపు రిషబ్ పంత్.. ఇంకోవైపు రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా బౌలర్లను ఆటాడుకున్నారు. సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. ఓవర్ నైట్ స్కోరు నాలుగు వికెట్లకు 303తో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే హనుమ విహారి (42) వికెట్ కోల్పోయంది. 101వ ఓవర్‌లో నాథన్ లియాన్ వేసిన చివరి బంతికి లాబుస్చాన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విహారి వెనుదిరిగాడు. భారత్ రివ్యూ కోరినా రిప్లైలో అవుట్ అని తేలడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, పుజారాతో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ క్రమంలో పుజారా ఫోర్ కొట్టి 150 పరుగులు పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి ఆస్ట్రేలియా బౌలర్లకు సవాల్ విసిరారు. ఓవైపు పరుగులు రాబడుతూనే అచితూచి ఆడారు. 129.5 ఓవర్‌లో లియాన్ అద్భుతమైన బంతికి పుజారా అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే డబుల్ సెంచరీకి 7 పరుగుల దూరంలో ఉన్నాడు. 22 ఫోర్లతో 373 బంతుల్లో పుజారా 193 పరుగులు సాధించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి పంత్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 141 బంతుల్లో రెండో టెస్టు సెంచరీ చేశాడు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా దూకుడుగా ఆడి 10వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మూడో సారి బంతి మార్చినా వీరిని ఆపడం ఆస్ట్రేలియా బౌలర్లకు సాధ్యపడలేదు. 166.3 ఓవర్‌లో రిషబ్ పంత్ 150 పరుగుల మైలురాయని దాటాడు. చివరికి రవీంద్ర జడేజా తన వ్యక్తిగత స్కోరు 81 వద్ద లియాన్ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా బౌల్డ్ అయ్యాడు. సమయం దగ్గరపడుతుండడంతో కెప్టెన్ కోహ్లీ డిక్లేర్డ్ చేశాడు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.

  ఆస్ట్రేలియా గడ్డపై రెండో భారీ స్కోరు..

  ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా గడ్డపై భారత్ రెండో భారీ స్కోరు నమోదు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ సెంచరీలకు తోడు మయాంక్ అగ ర్వాల్, రవీంద్ర జడేజా అర్ధ సంచరీలు తోడవడంతో 622/7 భారీ స్కోరును నమోదు చేసింది. దీనికి ముందు 2004లో సిడ్నీ మైదనంలోనే 705/7తో భారీ స్కోరు సాధించింది.
  పుజారా అత్యధిక పరుగుల రికార్డు..
  ఆస్ట్రేలియాలో ఆసియా ఉపఖండం జట్లలో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డులో చతేశ్వర్ పుజారా (193) చోటు సంపాదించుకున్నాడు. పుజారాకు ముందు సచిన్ తెండూల్కర్ (241 నాటౌట్), రాహుల్ ద్రవిడ్ (233), రవిశాస్ర్తీ (206), అజార్ అలీ (పాక్, 205), వీరేంద్ర సెహ్వాగ్ (195) ఉన్నారు.
  రిషబ్ ఖాతాలో రికార్డులు..
  భారత వికెట్ కీపర్ ఖాతాలో మరో రికార్డు చేరింది. విదేశీ గడ్డపై భారీ స్కోరు సాధించిన ఏసియాన్ వికెట్ కీపర్లలో రిషబ్ బంగ్లా కీపర్ ముఫ్తికర్ రహీంతో పాటు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రహీం 2017 వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌పై ఈ ఘనతను సాధించాడు. మరోవైపు భారత్-ఆస్ట్రేలియా జట్లలో అతి పిన్న వయసులోనే (21ఏళ్ల 92 రోజులు) సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఈ జాబితాలో (18ఏళ్ల 256 రోజులు) మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ ముందువరుసలో నిలిచాడు. 1992 సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ (148 నాటౌట్) ఈ ఘనతను అందుకున్నాడు.
  లియాన్ 15సార్లు!
  భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు రికార్డులకు వేదికైంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ రెండో రోజూ మంచి ఫాంలో ఉన్న చతేశ్వర్ పుజారా (193)ను తన బౌలింగ్‌లో తానే క్యాచ్ అందుకొని రికార్డు సృష్టించాడు. ఒక బ్యాట్స్‌మన్‌ను ఇలా అవుట్ చేయడం లియాన్‌కు 15వ సారి. ఓవరాల్ ఈ జాబితాలో శ్రీలంక వెటరన్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 35 సార్లు, ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ 21 సార్లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, లియాన్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

  స్కోర్‌బోర్డు..

  భారత్ తొలి ఇన్నింగ్స్:

  మాయాంక్ అగర్వాల్ (సీ) మిచెల్ స్టార్క్ (బీ) నాథన్ లియాన్ 77; లోకేష్ రాహుల్ (సీ) షాన్ మార్ష్ (బీ) జొస్ హాజెల్‌వుడ్ 9; చతేశ్వర్ పుజారా (సీ), (బీ) నాథన్ లియాన్ 193; విరాట్ కోహ్లీ (సీ) టిమ్ పైన్ (బీ) జొస్ హాజెల్‌వుడ్ 23; అజింక్య రహానే (సీ) టిమ్ పైన్ (బి) మిచెల్ స్టార్క్ 18; హనుమ విహారి (సీ) లాబుస్చాన్ (బీ) నాథన్ లియాన్ 42; రిషబ్ పంత్ 159 (బ్యాటింగ్); రవీంద్ర జడేజా (బీ) నాథన్ లియాన్ 81.

  ఎక్‌స్ట్రాలు: 20, మొత్తం (167.2 ఓవర్లలో 7 వికెట్లకు) 622.

  వికెట్ల పతనం: 1-10, 2-126, 3-180, 4-228, 5-329, 6-418, 7-622

  బౌలింగ్: మిచెల్ స్టార్క్ 26-0-123-1, జొస్ హాజెల్‌వుడ్ 35-11-105-2, పాట్ కమిన్స్ 28-5-101-0, నాథన్ లియాన్ 57.2-8-178-4, మామస్ లాబుస్చాన్ 16-0-76-0.

  ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మార్కస్ హారిస్ 19 (బ్యాటింగ్), ఉస్మాన్ ఖాజా 5 (బ్యాటింగ్)

  ఎక్‌స్ట్రాలు: 0; మొత్తం: (10 ఓవర్లలో) 24.

  బౌలింగ్ : మహమ్మద్ షమీ 3-0-9-0, జస్ప్రీత్ బూమ్రా 3-0-12-0, రవీంద్ర జడేజా 2-1-1-0, కుల్దీప్ యాదవ్ 2-1-2-0.


  0 0

  అమరావతి, జనవరి 4: బ్రాహ్మణులలో పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. బ్రాహ్మణ యువత స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా రవాణా రంగంలో సుమారు రూ. 60 లక్షల సబ్సిడీపై 30 మందికి మారుతీ డిజైర్ టూర్ వాహనాలను లబ్ధిదారులకు శుక్రవారం ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. గతంలో ఎంతో వైభవం కలిగిన బ్రాహ్మణులలో పేదలను గుర్తించి వారి అభ్యున్నతికి దేశంలో ఎక్కడాలేని విధంగా యువ డ్రైవర్లను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చాణక్య స్వయం ఉపాధి పథకం కింద కార్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంలో బ్రాహ్మణులు సంపన్నులని, విజ్ఞాన సముపార్జనలో ముందుండేవారని గుర్తుచేశారు. అయితే కాలక్రమంలో ఎక్కువ మంది పౌరోహిత్యంపై ఆధారపడటం, దానిపై సరైన ఆదాయం లేక ఆర్థికంగా వెనుకపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకోసమే బ్రాహ్మణులలో పేదలను గుర్తించి వారి అభ్యున్నతికి బ్రాహ్మణ సంక్షేమ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్య, నైపుణ్య శిక్షణ, పారిశ్రామిక శిక్షణ, విదేశీ విద్య, సాంస్కృతిక పరంగా అనేక పథకాలు వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 50వేల మంది పేద బ్రాహ్మణులకు రూ. 202 కోట్లతో వివిధ పథకాల ద్వారా లబ్ది చేకూరుతోందన్నారు. విద్యారంగ అభివృద్ధికి రూ. 137.2 కోట్లు ఖర్చు చేయటంతో పాటు 211 మంది విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఆర్థిక సహకారం అందించామని తెలిపారు. మరో 1453 మందికి రూ. 21.12 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించామన్నారు. రూ. 41.34 కోట్లతో 47వేల 665 మందికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ సొసైటీ చట్టం 1964 ద్వారా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటుచేసి రూ. 23 కోట్లతో పదివేల మంది బ్రాహ్మణులకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. వేద బ్రాహ్మణులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగపరచుకుని ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి మన్మోహన్‌సింగ్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ ఎం పద్మ, చైర్మన్ వేమూరి ఆనందసూర్య, సీఎంఒ అదనపు కార్యదర్శి గిరిజా శంకర్, ఎమ్మెల్సీ టీడీ జనార్థన్, ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్, బ్రాహ్మణ సంక్షేమ సంస్థ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


  0 0

  తిరుపతి, జనవరి 4: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఏప్రిల్‌నెల కోటాలో మొత్తం 63,311 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ల్లో విడుదల చేసినట్లు టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 10,061 సేవా టికెట్లు విడుదల చేశామన్నారు. ఇందులో సుప్రభాతం 7,836, తోమాల 130, అర్చన 130, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 1,725 టికెట్లు ఉన్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో జనరల్ కేటగిరిలో 53,250 సేవాటికెట్లు ఉండగా వీటిలో విశేషపూజ 2,500, కల్యాణం 11,875, ఊంజల్ సేవ 3,750, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,875, వసంతోత్సవం 12,650, సహస్రదీపాలంకార సేవ 15,600 టికెట్లు ఉన్నాయని వివరించారు.


  0 0

  తిరుపతి, జనవరి 4: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ముందుగా గదులను ఆన్‌లైన్లోనే బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తిరుచానూరులో భక్తుల కోసం తోళప్పగార్డెన్‌లో మొత్తం 30 గదుల్లో ఏసీ 19, నాన్ ఏసీ 11 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ఆన్‌లైన్లో భక్తులు బుక్‌చేసుకునేందుకు వీలుగా 14 ఏసీ, 6 నాన్ ఏసీ గదులు అందుబాటులో ఉంచామని వీటిని 100 శాతం భక్తులు వినియోగించుకుంటున్నారని అన్నారు. కన్యాకుమారిలో రూ.22.50 కోట్లుతో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 27వ తేదీన విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం జరుగుతుందని చెప్పారు. మార్చి 13న హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ జరుగుతుందని వివరించారు. ఈనెల 8, 22 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 9, 23వ తేదీల్లో ఐదేళ్లలోపు చంటి పిల్లల తల్లితండ్రులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాన్ని రూ. 100 కోట్లతో అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఇందులో ఇప్పటి వరకు రూ. 60.65 కోట్లుతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఈఓ వివరించారు. ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా గోపురాల పునరుద్ధరణ. ఫ్లోరింగ్, లైటింగ్ ఏర్పాటు పనుల కోసం పురావస్తు శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్ లక్కీడిప్‌లో పెంచడం సాధ్యం కాదని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించాలని బెంగళూరుకుచెందిన సురేష్ కోరగా ఆగమ పండితుల సూచనల ప్రకారం దీనిపై నడుచుకుంటామని ఈఓ స్పష్టం చేశారు. విజయవాడకు చెందిన కెవిఎన్ శర్మ మాట్లాడుతూ విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో టీటీడీ పుస్తక ప్రదర్శనశాల పెట్టలేదని, టీటీడీ ప్రచురణలకు రాయితీలు ఇవ్వాలని కోరారు. దీనీపై ఈఓ స్పందిస్తూ ప్రస్తుతం టీటీడీ డైరీలు, క్యాలెండర్లు సీజన్ కావడంతో సిబ్బంది ఆపనిలో ఉన్నారని తెలిపారు. పుస్తకమహోత్సవంలో తప్పకుండా టీటీడీ పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న తరువాత శ్రీవారిని దర్శించుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని బెంగళూరుకి చెందిన ముకుంద కోరగా, అది సాధ్యం కాదని ఈఓ స్పష్టం చేశారు. భక్తులు వరాహస్వామిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలోకి ప్రవేశిస్తున్న విషయాన్ని తెలియజేశారు. అయితే క్యూలైన్లు మార్చడం సాధ్యం కాదని వివరించారు. కంపార్ట్‌మెంట్‌ల నుంచి వెలుపలికి వచ్చే భక్తులు మూడు వరుసల్లో మహాద్వారం వరకు వెళ్లేందుకు త్వరలో క్యూలైన్లు ఏర్పాటు చేస్తామని ఈఓ తెలియజేశారు.
  8న ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా విడుదల
  ఇదిలావుండగా భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ నెల రూ. 300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల కోటాను ఈనెల 8వ తేదీ టీటీడీ విడుదల చేయనుంది. ఐటీ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్ట్ఫాసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు.


  0 0

  హైదరాబాద్, జనవరి 4: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటనపై విచారణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు హైకోర్టు అప్పగించినందున, అసలైన కుట్రదారులు బయట పడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. కత్తితో దాడి చేసిన కేసును కేంద్రం ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని హైకోర్టు థృవీకరించిందని మిథున్ రెడ్డి శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతం ఎన్‌ఐఏ పరిథిలోకి వస్తుంది కాబట్టి కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని హైకోర్టు ఇదివరకే కేంద్రానికి సూచించిందని ఆయన చెప్పారు. ఎన్‌ఐఏ విచారణతో నిజాలు వెలుగులోకి వస్తాయని తాము విశ్వసిస్తున్నామని ఆయన చెప్పారు. విశాఖ విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్ 25న శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేస్తే అరగంటలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే దాడి చేశారని, జనంలో సానుభూతి కోసం డ్రామా చేశారని, అరగంటకే టీడీపీ నాయకులు విమర్శించారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటన పట్ల విచారం వ్యక్తం చేయకుండా ఎగతాళి చేశారని ఆయన విమర్శించారు. పైగా అది కోడి కత్తే కదా? అని వ్యాఖ్యానించారని, ‘కోడి కత్తి కాదది నారా కత్తి’ అని ఆయన విమర్శించారు. ఆ రోజు విశాఖ విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో మధ్యాహ్నం ఘటన జరిగితే, సాయంత్రం వరకూ కేసు నమోదు చేయలేదని ఆయన చెప్పారు. శ్రీనివాస్‌నే నిందితునిగా చూపించారని, అసలైన వారు ఎవరో బయట పెట్టలేదన్నారు. అంతేకాకుండా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. తమకు ఉన్న సమాచారం మేరకు శ్రీనివాస్ టీడీపీ నాయకుడు హర్షవర్థన్ వద్ద పని చేస్తున్నాడని ఆయన చెప్పారు. ప్రభుత్వం, పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేకే కోర్టును ఆశ్రయించామని మిథున్ రెడ్డి తెలిపారు.


  0 0

  హైదరాబాద్, జనవరి 4: తాము అధికారంలోకి రాగానే అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. అగ్రి గోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల చొప్పున ఇవ్వాలని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే ఆదుకుంటామని ప్రకటించడంతోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని భావిస్తున్నదన్నారు. అగ్రి గోల్డ్ భూములు కాజేయాలన్న ప్రయత్మమూ జరుగుతున్నదని ఆయన విమర్శించారు. అగ్రి గోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అగ్రి గోల్డ్ బాధితులను ఆదుకునేంత వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కోసం, కుటుంబం కోసం, తాబేదార్ల కోసం పని చేయకుండా ప్రజల కోసం పని చేయాలని అన్నారు. హైటెక్ సిటీ శంకుస్థాపన లోగడ రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్థన్ రెడ్డికి చేసిన సూచన మేరకే జరిగిందని ఇటీవల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చెప్పారని ఆయన గుర్తు చేశారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో నేదురుమల్లి సీఎంగా లేరని చెప్పడాన్ని బట్టి చూస్తే వారికి జ్ఞాపకశక్తి ఎంత ఉందో అర్థమవుతున్నదని బొత్స అన్నారు. అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల ఉసురు మీకే తగులుతుందని ఆయన అన్నారు.


older | 1 | .... | 2015 | 2016 | (Page 2017) | 2018 | 2019 | .... | 2067 | newer