Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ ఒంటరిగానే పోటీ

$
0
0

ఒడిశా: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేడీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బిజూ జనతాదళ్ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలిపారు. బీజేడీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలోగానీ, బీజేపీ నేతృత్వంలోని ఏన్డీఏలోగానీ చేరే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు. రైతుల సమస్యలను ఎన్డీఏ కూటమి పట్టించుకోవటం లేదని అన్నారు.


ఈబీసీ బిల్లుపై రాజ్యసభలో చర్చ

$
0
0

న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన కులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై రాజ్యసభలో విస్తత్రంగా చర్చ జరిగింది. ఉద్యోగావకాశాలే లేనపుడు ఈ బిల్లు వల్ల ప్రయోజనం ఏముందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ అన్నారు. ఔట్ సోర్సింగ్ నియామకాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝూ మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల మోదీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఈ బిల్లుకు అసెంబ్లీల ఆమోదం అవసరం లేదని అన్నారు.

రంగవల్లి

$
0
0

19 చుక్కలు, 10 వరకు మధ్య చుక్కలు

కె.ఎస్.వి. సుప్రజ విజయవాడ
=================================================

రంగవల్లి

$
0
0

16 చుక్కలు, 2 వరుసలు, 2 వరకు సరిచుక్కలు
పి.వి.ఎల్. సుజాత సైనిక్‌పురి, సికింద్రాబాద్
=============================================

జంక్ ఫుడ్‌తో జంకే..

$
0
0

మన దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వాటిలో జంక్‌ఫుడ్ మార్కెట్‌దే మొదటిస్థానం. ఏటా 20 శాతం చొప్పున అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ బిజినెస్‌లో లక్ష కోట్లు జరుగుతోంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ బిజినెస్ మరింత విస్తరిస్తూ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా.. ఫాస్ట్ఫుడ్ మార్కెట్‌ను చేజిక్కించుకునేందుకు మల్టీనేషనల్ కంపెనీలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. జంక్‌ఫుడ్ కంపెనీలు కొన్ని పది నుంచి ఇరవై సంవత్సరాల వయస్సు గ్రూపులను టార్గెట్ చేసుకుంటూ బిజినెస్ వ్యూహాలు రూపొందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా జంక్‌ఫుడ్స్ వ్యాపారంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రముఖ పానీయ కంపెనీ 500 కోట్ల డాలర్లు అంటే 30 నుంచి 35 వేల కోట్ల రూపాయల దాకా గుమ్మరించేందుకు సిద్ధమైంది.
జంక్‌ఫుడ్ మార్కెట్ విస్తరించడం శుభపరిణామం కాదు. అది రాబోయే అనారోగ్య సమాజానికి హెచ్చరిక. జంక్‌ఫుడ్ ఆరోగ్యానికి హానికరం. మత్తు, మాదకద్రవ్యాలు, సిగరెట్లు ఆరోగ్యాన్ని కుళ్లబొడిచినట్లే జంక్‌ఫుడ్ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మధుమేహం, గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు కూడా ఈ జంక్‌ఫుడ్ కారణమవుతోంది. దీని కారణంగా తలెత్తే ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయించుకోవడానికి భారతదేశం జాతీయాదాయంలో ఏటా దాదాపు రెండు వేల కోట్లకు పైగా నష్టపోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. రోజురోజుకీ విస్తరిస్తున్న జంక్‌ఫుడ్ కల్చర్ ఆరోగ్యానే్న కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తోంది.
ఫాస్ట్ఫుడ్ కంపెనీల ప్రచారానికి ప్రధానంగా స్కూల్, కాలేజీ పిల్లలే.. వీటికి అలవాటుపడ్డ పిల్లల్లో ఊబకాయం, బీపీ, షుగర్, మతిమరుపువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లల ఆరోగ్యంపై వీటి ష్ప్రభావాన్ని గుర్తించిన కొన్ని దేశాలు స్కూళ్లలో వీటి అమ్మకాలను, టీవీలలో అడ్వర్టయిజ్‌మెంట్లను నిషేధించాయి. చిప్స్, కుకీస్, క్యాండీ, కార్బోనేటెడ్సోడాలను స్కూల్స్‌లో విక్రయించకూడదని కోస్టారికా ఆంక్షలు విధించింది. స్కూల్ పిల్లలకు షుగరీ సోడాలు, ప్రాసెస్డ్ స్నాక్స్ మొదలైనవి విక్రయించకూడదని మెక్సికో ఆదేశించింది. టాకోస్, బర్కిటోస్, సలాడ్స్ వంటి వాటిల్లో కొవ్వు తక్కువగా ఉండాలని నిబంధనలు విధించింది. పాఠశాల దగ్గర ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను మాత్రమే విక్రయించాలని పెరూ చట్టం చేసింది.
మనదేశంలోనూ స్కూళ్ల కేంటీన్లలో జంక్‌ఫుడ్స్ అమ్మకూడదన్న నిబంధలున్నప్పటికీ అవి అమలుకావడం లేదు. కొన్ని స్కూల్స్ నిర్వహించే కార్యక్రమాలకు బడా సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తూ తమ అమ్మకాలు పెంచుకుంటున్నాయి. మనదేశంలో ఫాస్ట్ఫుడ్ ఉత్పత్తి, అమ్మకాలు, ప్రచారాన్ని నియంత్రించే చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం జంక్‌ఫుడ్స్ వాడకాన్ని తగ్గించే ఉద్దేశ్యంతో ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టడం సంతోషకర పరిణామం. జంక్‌ఫుడ్స్‌పై ఫ్యాట్ పన్ను విధించడం వల్ల కేరళ ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకపోయినప్పటికీ కనీసం అల్పాదాయ వర్గాలవారైనా జంక్‌ఫుడ్ జోలికి వెళ్లరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫాస్ట్ఫుడ్స్ వాడకం నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మూడు రకాల సిఫార్సులు చేసింది. పండ్లు, కూరగాయల ధరలు తగ్గేలా, ఫాస్ట్ఫుడ్ ధరలు పెరిగే పన్నులుండాలన్నది వీటిలో ఒకటి. పండ్లు, కూరగాయల సాగుకు సబ్సిడీలిచ్చి వాటిని ప్రోత్సహించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల్లో మొదటిది. ఫాస్ట్ఫుడ్ కూల్‌డ్రింక్స్ ప్రచారాన్ని కట్టుదిట్టంగా కట్టడి చేయాలన్నది రెండో అతి ముఖ్య సూచన. ఆహార ఉత్పత్తుల పాకెట్లు, డబ్బాలపై మరింత స్పష్టమైన, సమగ్రమైన సమాచారంతో కూడిన లేబుల్స్ ఉండాలన్నది మూడో సూచన. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే స్లోగన్ సిగరెట్ పాకెట్లపై ముద్రించినట్లే, ఫాస్ట్ఫుడ్ పాకెట్స్‌పై కూడా ఇలాంటి హెచ్చరిక ముద్రించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విశ్వాసమా? రాజ్యాంగమా??

$
0
0

మత విశ్వాసాలు చాలా బలీయమైనవి. మత విశ్వాసాలను నమ్మేవారు హక్కులను వదులుకొని బానిసలుగా బతకడానికి సిద్ధపడతారు. ‘మతం మత్తుమందు’ అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ అన్నారు. ‘మతం ఒక భ్రమ, అశాస్ర్తియమైనది’ అని ఏంగెల్స్ అన్నారు. వారు అధ్యయనం చేసింది క్రైస్తవ, ఇస్లాం, యూదు మతాలనైనప్పటికీ మత వివ్వాసాలన్నీ అశాస్ర్తియమైనవే. ప్రపంచంలో ఏ మతం మనుషులను మనుషులుగా చూడలేదు. మతాల పెద్దలు ప్రజాస్వామ్య, సామ్యవాద ఉద్యమాలను తొక్కేశారు. విజ్ఞాన పరిశోధనలను వెలుగులోనికి రానివ్వలేదు. కొన్ని మతాలు మనుషులను జాతులుగా విడగొట్టి హీనంగా చూస్తే, హిందూ మతం కులాల పేరుతో అంటరానితనం పాటించి అత్యంత దారుణంగా హింసించింది. ఇక్కడ చాలా కాలం మనువాద సిద్ధాంతం రాజ్యమేలింది. ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలు మహిళలను తక్కువగా చూశాయి, చూస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత శాస్తవ్రేత్తలు కోపర్నికస్, గెలీలో, జాన్ కెప్లర్, బ్రూనో వంటివారు క్రైస్తవులైనప్పటికీ ఆ మత పెద్దలే వారిని చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశారు. వారి పరిశోధనా పాత్రలు, గ్రంథాలపై నిషేధం విధించారు. వాటిని తగులబెట్టారు. మత విశ్వాసాలు ప్రపంచ అభివృద్ధిని వందల ఏళ్లు వెనక్కు నెట్టేశాయి. మన దేశం ఇప్పుడు రెండు మతాలకు సంబంధించి రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోంది. ఆ సమస్యలు రెండూ మహిళల సమానత్వానికి సంబంధించినవే. 21వ శతాబ్దంలో భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడం అత్యంత దారుణం. ఈ మత విశ్వాసాలు రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి ఎదగడం బాధాకరం. దేశంలో న్యాయంపై మతం, రాజకీయాలు పైచేయి సాధించడానికి ప్రయత్నించడం దురదృష్టకరం.
కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018 సెప్టెంబరు 28న ఐదుగురు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పును చదివారు. ‘‘చట్టాలు, సమాజం అందరినీ గౌరవించాలి. దైవత్వం లింగ విభేదాలు చూపించదు. అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లవచ్చు. భారతదేశంలో మహిళలను దేవతలతో కొలుస్తారు. అలాంటప్పుడు లింగ భేదం చూపలేం. మహిళను తక్కువగా చేసి చూడలేం. మతం అనేది ప్రాథమిక జీవన విధానంలో భాగం. మతం విషయంలో మహిళలకు సమాన హక్కులు ఉండాల్సిందే. శారీరకమైన మార్పులను సాకుగా చూపి మహిళలపై వివక్ష చూపించడం సరికాదు. మహిళలను శబరిమల ఆలయంలోకి ప్రవేశించడాన్ని నిరాకరించడం అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25లను ఉల్లంఘించినట్టే’’ అని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు ఈ తీర్పుతో అంగీకరించగా, ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందూ మల్హోత్రా భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం. సతీసహగమనం లాంటి సామాజిక రుగ్మతలు మినహా మతపరమైన విధానాలను తొలగించే దానిపై నిర్ణయం తీసుకునే అంశం కోర్టుకు సంబంధించినది కాదన్నారు. దేశంలో లౌకిక వాతావరణాన్ని కల్పించేందుకు బలంగా నాటుకుపోయిన మతపరమైన ఆచారాల్లో మార్పు చేయవద్దన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని దేవస్థానం బోర్డు స్వాగతించింది. తీర్పుపై బోర్డు రివ్యూ పిటిషన్ కూడా వేయదలచుకోలేదు.
అయితే అయ్యప్ప భక్తులు ఈ తీర్పుని వ్యతిరేకించారు. కేరళ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేశారు. మహిళల చేత కూడా చేయించారు. ఆందోళనలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించిన మహిళలను అడ్డుకున్నారు. వారిపై దాడులు కూడా చేశారు. దాంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎవరి హక్కులనైతే కాపాడటానికి అత్యున్నత న్యాయస్థానం ప్రయత్నిస్తుందో వారు కూడా ఆ హక్కులు వద్దనడం మత వ్ఢ్యౌనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో స్ర్తి పురుష సమానత్వం, సామాజిక సంస్కరణలపై ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘వనితా మతిల్’ పేరుతో భారీ మానవహారాన్ని ఏర్పాటుచేశారు. 2019 జనవరి 1వ తేదీ సాయంత్రం సముద్ర తీరం వెంబడి రహదారులపై ఉత్తరాన కాసర్‌గాడ్ నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకు 620 కిలోమీట్ల పొడవున దాదాపు 40లక్షలమందికి పైగా మహిళలు భారీ మానవహారంలో పాల్గొన్నారు. మహిళా శక్తి ప్రదర్శనలో కేరళ ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయం. చివరకు జనవరి 2వతేదీ తెల్లవారు జామున 3.45 గంటలకు కొందరి రక్షణతో 50ళ్ళ లోపు వయసున్న ఇద్దరు మహిళలు బిందు అమ్మిని (40), కనకదుర్గ (39) తొలిసారిగా ఆలయంలోపలకు ప్రవేశించారు. దీంతో రెచ్చిపోయిన హిందూ మత సంస్థలు, అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఈ నెల 3వతేదీ కేరళ బంద్‌కు పిలుపుఇచ్చారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థిలు నెలకొన్నాయి. ఈ సంఘటనలకు రాజకీయ రంగు పులుముకున్నది.
ఇక రెండవది ముస్లింలకు చెందిన ట్రిపుల్ తలాక్ అంశం. ఇది కూడా స్ర్తి పురుష సమానత్వానికి చెందినదే. ముస్లింలలో భర్తలు భార్యలకు విడాకులు ఇవ్వడం అత్యంత సులభమైన పని, ఏకపక్షమైనది. న్యాయస్థానంతో సంబంధం లేకుండా ఎలాంటి కారణం చెప్పకుండా ఏకపక్షంగా భర్త మూడుసార్లు తలాక్ చెప్పి ఇచ్చే విడాకులను తలాక్ అంటారు. మరో మూడురకాలుగా కూడా భార్యాభర్తలు విడిపోతారు. అయితే ఈ తలాక్ పద్ధతే అత్యంత దారుణమైనది. భార్యను నిరాశ్రయురాలిని చేస్తుంది. భర్తకు భార్య తలాక్ పద్ధతిలో విడాకులు ఇచ్చే అవకాశం లేదు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీం కోర్టు 2017లో రా జ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అయినా ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. ఈ తీర్పు వెలువడిన తరువాత కూడా దేశ వ్యాప్తంగా దాదాపు 45 మంది భర్తలు తమ భార్యలకు తలాక్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వారికి అండగా నిలవలేకపోయింది. తలాక్ చెప్పిన భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడు. సరైన చట్టాల రూపకల్పన ద్వారా స్ర్తి పురుషులిద్దరికీ సమాన న్యాయం అందించవలసిన బాధ్యత పార్లమెంటుపై వుంది. ముస్లిం పర్సనల్ లా తప్ప అన్ని వర్గాల పర్సనల్ లాలను పార్లమెంటు సంస్కరించింది. ముస్లిం పర్సనల్ లా సంస్కరణకోసం ముస్లిం మహిళలే దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేశారు. వారు సంఘటితమై సమాన న్యాయం కోసం ఖురాన్ బోధనలు, రాజ్యాంగ నిబంధనలపై అవగాహనను పెంచేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా అందజేశారు. సంప్రదాయ ముస్లిం మత పెద్దలు ముస్లిం మహిళల డిమాండ్లను అసలు పట్టించుకోలేదు. హిందూ, క్రైస్తవ, జైన్ మహిళలతో సమానంగా ముస్లిం మహిళలకు కూడా న్యాయం అందించాలన్న అంశంపై దేశంలోని రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో ముస్లిం మహిళలకు న్యాయం చేసే తలాక్ బిల్లు (ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు) 2018 డిసెంబర్ 27న లోక్‌సభలో 245 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే పలు విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ బిల్లును డిసెంబర్ 31న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే విపక్ష పార్టీల సభ్యులు బిల్లును అడ్డుకున్నారు. దీనిపై సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను జనవరి 2కు వాయిదా వేశారు. రాజ్యసభలో ఈ బిల్లు భవితవ్యం అనిశ్చితిలో పడింది. ఈ బిల్లుకు యథాతథంగా మద్దతు ఇవ్వం అని కాంగ్రెస్ ప్రకటించింది. బిల్లును జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తోంది. వివిధ కారణాల రీత్య విపక్షాలు ఈ బిల్లుకు మద్దతు తెలుపడంలేదు. పూర్తిగా వ్యతిరేకించడంలేదు. బిల్లులో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కొందరు ముస్లిం మహిళలు కూడా దీనిని వ్యితిరేకించి నిరసన ప్రదర్శనలు చేయడం శోచనీయం.
ఈ బిల్లుపై తలెత్తిన వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఆ కారణంగా ముస్లిం బాధిత మహిళలు నష్టపోతారు. మత విశ్వాసాలు ఎంత బలీయంగా ఉంటాయో, ప్రభుత్వాలను కూడా ఎలా ఇరుకున పెడతాయో, రాజకీయాలను కూడా ఎలా శాసిస్తాయో ఈ సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది.

మతం వద్దంటే మరణమా?

$
0
0

ఇస్లాం మతాన్ని, స్వదేశాన్ని, అయినవాళ్లను విడిచి దూరంగా వెళుతూ.. బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన 18 ఏళ్ల సౌదీ యువతి రహాఫ్ మొహమ్మద్ అల్ కునన్ ఎట్టకేలకు ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ ఆశ్రయాన్ని పొందింది. వివరాల్లోకి వెళితే..
రహాఫ్ మొహమ్మద్ అల్ కునన్ సౌదీ యువతి. సౌదీ అరేబియా చట్టం ప్రకారం మహిళలు పురుషుల సంరక్షణలో ఉండాలి. మహిళ ఉద్యోగం చేయాలన్నా, ప్రయాణించాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, చివరికి బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా కుటుంబానికి చెందిన పురుషుల అనుమతి కావాల్సిందే.. అయితే రహాఫ్‌కు చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని కోరిక.. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. వెంటనే రహానా సోషల్ మీడియా ద్వారా 3నాకు స్వేచ్ఛ కావాలి. నేను నా దేశంలో నాకిష్టం వచ్చిన చదువు చదువుకోలేను. ఉద్యోగం చేయలేను. అందుకే నేను దేశం విడిచి వెళ్లాలనుకున్నాను. మా నాన్న నాపై కోపంతో ఉన్నారు. అందుకే నేను నా విషయాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నాను2 అని తెలిపింది. తన పరిస్థితి గురించి రహాఫ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టుల ద్వారా వెల్లడిస్తుండడంతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షించింది. సౌదీలో మతమార్పిడికి అవకాశం లేదు. అది నేరంతో సమానం. ఆ నేరానికి మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. రహాఫ్ ఒకసారి జుట్టు కత్తిరించుకుంది. అందుకుని ఆమె కుటుంబం రహాఫ్‌ను ఇంట్లోనే ఆరునెలలపాటు బంధించింది. అందుకే రహాఫ్ తనకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ ఆమె ప్రపంచంలోని అనేక దేశాలకు విజ్ఞప్తి చేసింది. చివరకు రహానా ఆస్ట్రేలియాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లయిట్ కోసం థాయ్‌ల్యాండ్ ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు తనతో పాటు విమానంలో వస్తున్న సౌదీ దౌత్యవేత్త తన పాస్‌పోర్టును లాక్కున్నాడని రహాఫ్ ఆరోపించింది. థాయ్‌ల్యాండ్ ఇమిగ్రేషన్ అధికారులు రహాఫ్ దగ్గర సరైన పత్రాలు లేవని కారణాలు చెప్పి.. మరోవైపు సౌదీ అరేబియాలోని ఆమె కుటుంబం చెంతకు తిప్పి పంపేందుకు ప్రయత్నించారు. రహాఫ్ మాత్రం తనకు సౌదీకి తిరిగివెళ్లే ఉద్దేశ్యం లేదని చెప్పింది. అయినా వినకుండా ఆమెను జనవరి 7వ తేదీన సౌదీకి వెళ్లేందుకు టికెట్లు తీశారు. కానీ సౌదీ విమానం ఎక్కడానికి నిరాకరించిన రహాఫ్ తనను తాను ఎయిర్‌పోర్టులోని హోటల్ రూంలో బంధించుకుంది. 3నేను ఇస్లాం మతాన్ని వదిలేశాను. కాబట్టి నా కుటుంబానికి నేనంటే పగ. వారు నన్ను చంపేయడానికి చూస్తున్నారు. కాబట్టి నా జీవితం ప్రమాదంలో ఉంది2 అంటూ ఆందోళన వ్యక్తం చేసింది రహాఫ్. థాయ్‌ల్యాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను థాయ్‌లోనే ఉండమన్నారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థతో పాటు, మానవ హక్కుల సంస్థలు రహాఫ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం రహాఫ్ పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ సంఘటనలతో దిగొచ్చిన థాయ్ ఇమిగ్రేషన్ అధికారులు రహాఫ్‌ను థాయ్‌ల్యాండ్‌లోనే ఉండేందుకు అనుమతించారు. కానీ ఆమె ఐక్యరాజ్యసమితి ఆశ్రయం లభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. థాయ్‌ల్యాండ్ ఐక్యరాజ్యసమితి శరణార్థి ఒప్పందంలో భాగస్వామి కాదు. శరణార్థులకు ఆ దేశం న్యాయపరమైన రక్షణ కల్పించదు. అంతకుముందు థాయ్ న్యాయవాదులు కొందరు ఆమెను స్వదేశానికి పంపే ప్రయత్నాలను ఆపాలని కోర్టును ఆశ్రయించినా, కోర్టు దాన్ని తోసిపుచ్చింది. కానీ రహాఫ్ ఎట్టకేలకు ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ ఆశ్రయం పొందింది. సౌదీ నుంచి పారిపోవాలనుకున్న మహిళల్లో రహాఫ్ మొదటి మహిళ కాదు. గతంలో కూడా ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. 24 ఏళ్ల దినా అలీ లస్లూమ్ కూడా సౌదీ నుండి ఆస్ట్రేలియా వెళుతుండగా ఆమెను మనీలా ఎయిర్‌పోర్ట్ నుంచి వెనక్కి తీసుకెళ్లారు. అంతకు మునుపే ఆమె తన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేసింది. సౌదీ అరేబియాకు తిరిగి వెళ్లిన లస్లూమ్ పరిస్థితి ఏమిటో.. ఆమె ఎలా ఉందో? ఇప్పటివరకుతెలియలేదు.

మహాభారతంలో ఉపాఖ్యానాలు -96

$
0
0

పూర్వ సముద్ర తీరంలో ఒక ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు అతని రాజ్యంలో గొప్ప సంపదకలిగిన ఒక వైశయుడు ఉండేవాడు అతను చాలా ఉదారుడు. ఓర్పు కలవాడు ధర్మాచరణ చేసేవాడు. అతనికి చాలా మంది పుత్రులు కలరు. ఆ గృహంలో ఒక కాకి కూడా ఉండేది. అది ఆ పిల్లలు పారవేసిన ఎంగిలి మెతుకులు తింటూ అక్కడే ఉండేది. ఆ తిండితో అది పొగరెక్కి తనతో సమానమైనది, తన కంటే గొప్పది ఇంకో పక్షి లేదని అనుకుంటూ అహంకరించి ఇతర గొప్ప పక్షులనూ కూడా అవమానించేది.
ఒకనాడు ఆ సముద్ర తీరానికి గరుడునితో సమానంగా ఎగురుతూ కొన్ని హంసలు మానస సరోవరంలో నివసించేవి వచ్చాయి. ఆ హంసలను చూసి ఆ వైశ్య పిల్లలు కాకితో ఇలా అన్నారు.-‘‘ఓ పక్షీ ! అన్ని పక్షులలో నీవే శ్రేష్ఠమైన దానివి. ఈ హంసలు కూడా ఆకాశంలో చాలా దూరం ఎగురుతున్నాయి. నీకు కూడా అంత ఎత్తు ఎగిరే శక్తి ఉన్నా ఇంత వరకూ ఎక్కడికీ ఎగురలేదు’’. పిల్లలు చెప్పిన మాటలు విన్న మూర్ఖకాకి ఆమాటలు నిజమేనని నమ్మి, ఈ హంసల గొప్పదనం పరిక్షించాలని నిశ్చయించుకొంది. ఎంగిలి మెతుకులు తినే ఆ దుర్బుద్ధి గల కాకి ఆహంసలను ‘‘ఎగురుదాం రండి’’ అని పోటీకి పిలిచింది. బలిష్టంగా ఉండి ఎక్కువ దూరం ఎగుర గల హంసలు ఆ కాకి ప్రేలాపన విని పగలబడి నవ్వాయి.
ఆ హంసలు అప్పుడు కాకితో ఇలా అన్నాయి. ‘‘ఓ వాయసమా! పక్షులలో చాలా దూరం ఎగరటానికి మేము ప్రసిద్ధి చెందాము. మా నివాసమే అత్యంత పవిత్రమైన మానస సరోవరం, ఆ సరస్సు కైలాసం దగ్గర ఉంటుంది. అంటే మేము శివునికి సమీపంలో ఉండేవారం. అప్పుడప్పుడు ఈ భూమీద విహరిస్తూ ఉంటాము మా అవయావాల మీద చక్రచిహ్నాలు ఉంటాయి. అలాంటి మాతో పోటీకి రావాలని ఎలా తలుస్తున్నావు. నీవు కాకివి. నీకు మాతో పోటీ ఏమిటి’’ కాని వాటి మాటలను మూర్ఖ వాయసం వినకుండా పదే పదే తన గొప్పలు చెప్పుకుంటూ హంసలను నిందిస్తూ వాటిని చులకన చేసి మాట్లాడుతూ ఇలా సమాధానం చెప్పింది -
‘‘ఓ హంసా! నేను నూటొక్క రకాలుగా ఎగురుతాను. వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానితో యోజనం దూరం ఎగురలేను. వాటిలో కొన్ని - క్రిందికి పైకి ఎగరటము నాలుగు వైపులా ఎగరటం, వెనక వైపులా ఎగరటం అడ్డంగా ఎగరటం, అన్ని వైపులా ఎగరటం గిర గిరా తిరిగి క్రిందకిరావటం ఇలాగ నూటొక్క రకాల విధాల నేను ఎగురగలను. ఇప్పుడు మీరంతా చూస్తూ ఉండగా అన్ని రకాలుగా ఎగిరి మీకు చూపెట్టగలను. అప్పుడు నా గమనం, బలం మీకు అర్థమవుతాయి. ఏ గతిలో ఎగురాలో చెప్పండి’’ అని డాంబికంగా పలికింది.
అప్పుడు ఒక హంస ఇలా జవాబు చెప్పింది. ‘‘ఓ కాకీ నీవు నూటొక్క రకాలుగా ఎగరగలవు కాని నేను అన్ని పక్షులకూ తెలిసిన ఒకే ఒక గమనంతో ఎగురుతాను, నాకు ఇంకొక రకమైన గమనం తెలియదు నీకు ఏది నచ్చితే ఆ గమనం ఎగురు’’.
అప్పుడు అక్కడ చేరిన కాకులు పరిహాసంగా ఇలా అన్నాయి ‘‘ఈ హంస ఒకే ఒక గమనంతో నూరు రకాల గమనాన్ని ఎలా జయిస్తుంది? పైగా ఈ కాకి చాలా బలిష్ఠంగా ఉంది. వేగంగా ఎగరగలదు’’.
తర్వాత హంసలు కాకులు పోటీపడి ఎగిరాయి. ఒకే గమనంతో హంస, నూరు గమనాలతో కాకులు ఎగరటం మొదలు పెట్టాయి. ఇటు నుంచి చక్రాంగం హంస ఎగిరింది. అటునుంచి కాకి ఎగిరింది. వాని విచిత్ర గమనాలతో చూచేవారిని ఆశ్చర్యపరుచ దలచి కొత్త కొత్త విన్యాసాలను చేసి తనను తాను పొగడుకుంటున్నది. అవి చూసి తక్కిన కాకులు గట్టిగా కావుకావు మని అరిచాయి. అవి హంసలను చూసి హేళన చేశాయి. హంస మాత్రం ఏమీ పట్టించు కోకుండా ఒకే విధమైన గమనంతో సాగిపోతున్నది. రెండు గడియలలో కాకి ఓడిపోతున్నట్లనిపించింది. అయినా కాకులు హంసను హేళన చేస్తునే ఉన్నాయి. ‘‘ఆ ఎగురుతున్న హంస కాకి కంటే వెనకబడి ఉన్నది’’ అని అరిచాయి. వాటి మాటలు విన్ని హంస సముద్రం మీద పైపైకి పశ్చిమ దిక్కున ఎగుర సాగింది. అప్పుడు కాకి ఆయాసపడసాగింది. దానికి వాలటానికి ఆ సముద్ర మధ్యంలో ఎక్కడా ఒక చెట్టు కూడా కన్పించలేదు. దానికి భయం కలిగింది. అప్పుడు కాకి ఇలా అనుకున్నది బాగా అలసటగా ఉంది ఇప్పుడు నేను ఎక్కడ వాలాలి? ఈ సముద్రం ఎన్నో భయంకరమైన జలజంతువులతో నిండి ఉంది. కనుక ఇంత దూరం సముద్రం మీద ఎగిరి ఆవలి ఒడ్డుకు ఎలా చేరగలను?’’
హంస రెండు గడియలు ఎగిరి కాకి కోసం చూస్తూ ముందరికి వెళ్ళ లేదు. చక్రాంగం కాకిని దాటి ముందుకు వెళ్ళింది. ‘‘కాకి కూడా ఎగురుతూ నా దగ్గరకు రావాలి’’ అని ఎదురు చూసింది. ఇంతలో హంస కాకితో ఇలా అంది ‘‘కాకీ! ఇప్పుడు నీవు ఏగతిలో ఎగురుతున్నావు? బాగా అలసిపోయావు’’ అని హంస దగ్గరకు వచ్చింది. దాని శరీరం శిథిలమై పోయింది. ఎంత ఎగిరినా ఆ నీటికి అంతు లేదు. అది క్రిందపడిపోతున్నది. అప్పుడు కాకి హంసతో ఇలా అన్నది ‘‘సోదరా హంసా! మేము కాకులం ఊరికే కాకా అని అరుస్తూ ఉంటాము. నేను నిన్ను శరణు వేడుతున్నాను. ఈ నీటినించి ఒడ్డుకు చేర్చు’’
ఇలా ప్రార్థిస్తూ కాకి ఆ మహాసముద్రంలోని నీటిని రెక్కలతో, ముక్కుతో తగులుతూ బాగా అలసిపోయి ఆ నీటిలో పడిపోయింది. దానికి చాలా బాధకలిగింది. అతి దీనంగా అది సముద్రంలో పడి మరణించబోతున్న కాకిని చూసి హంస ఇలా అన్నది -
‘‘కాకీ నీవు గర్వంతో నూటొక్క గతులతో ఎగురుతాను అని ఆత్మస్తుతి చేసుకుంటూ మమ్మల్ని హేళన చేస్తూ వచ్చావు. మరి అంత గొప్పగా ఎగర గలిగితే ఇలా సముద్రంలో పడిపోయావు ఎందుకు?’’
అప్పుడు సముద్రపు నీళ్ళలో పడి కొట్టుకుంటున్న కాకి దీనంగా ఇలా అంది.- ‘‘హంసా! వైశ్య బాలకులు పడవేసిన ఎంగిలి మెతుకులు తిని మదించిన నేను గరుత్మంతునితో సమానమని తలచి అహంకరించాను. నిన్ను ప్రాణాల కోసం శరణువేడుతున్నాను. నన్ను దయచేసి ఒడ్డుకు చేర్చు. ఇక ముందు ఎవ్వరినీ హేళన చేసి అవమానించను. ఈ ఆపద నుంచి నన్ను రక్షించు’’. అప్పుడు హంస దయతో వేగంగా వచ్చి కాళ్ళతో కాకిని లేవదీసి తన వీపుమీద ఎక్కించుకొని పూర్వం తాము పోటీ మొదలు పెట్టిన చోటికి తీసుకొని వెళ్ళింది. కాకిని అక్కడ దించి హంస వేగంగా తన ఇష్టంవచ్చిన చోటికి వెళ్ళింది. హంస చేతిలో అలా ఓడిపోయి కాకి బల పరక్రమాలు వదిలి శాంతంగా జీవించింది.
ఇంకావుంది...


స్వాధ్యాయ సందోహం-191

$
0
0

మనిషి తానుచేసే పనికి ఏ విఘ్నాలు సంభవించకుంటే తన నిశ్చితాభిప్రాయాలను సవరించుకోవడంగాని విరమించడంగాని చేయడు. అట్టివాడు ఎవడూ ఎవరి సహాయమూ అర్థించడు. కాని లోకంలో యుద్ధముంది. ఒకరికి మరొకరిమీద విరోధముంది. ఒకడు మరొకణ్ణి హీనంగా చూస్తాడు. దీని పేరే యుద్ధం.
లోక సమష్టిలో ఉన్న ఈ యుద్ధం వ్యక్తి వైయక్తిక జీవితంలోకూడ ఉంది. ఇంద్రియాలు, దేహమూ ఆత్మను తమ వశం చేసుకొనేందుకు నిమగ్నమైయుంటాయి. కాని ఆత్మ దేహేంద్రియాలు తన వశంలో ఉండాలని భావిస్తుంది. దైవీభావాలు అసురభావాలను తమ అధీనంలోనే తెచ్చుకోవాలని భావిస్తాయి. అసురీశక్తులు దైవీశక్తులను అణచివేయాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ దేవాసుర యుద్ధవిషయమటుంచండి. మనిషి తన జీవితాన్ని సుఖమయం చేసుకొనేందుకు ప్రకృతితో ఎంత సమరస యుద్ధంచేయవలసి యుంటుంది?
ఏ యుద్ధానికైనా విధిగా సహాయకులు కావలసియుంటుంది. అందుచేత ‘స్మిన్నరో విహ్వయంతే సమీకే’ ‘‘నాయకులంతా జీవన సంగ్రామంలో సహాయకునిగా ఆ దైవానే్న ఆహ్వానిస్తారు’’ నాయకులే కాదు-
ఇంద్రం పరే- వరే మధ్యమాస ఇంద్రం యాంతో- వసితాస ఇంద్రమ్‌
ఇంద్రం క్షియంత ఉత యుధ్యమానా ఇంద్రం నరో వాజయంతో హవంతే॥ ఋ.4-25-8.
ఉత్తమ, మధ్యమ, అధములైనవారు సహితం ఇంద్రునే (్భగవంతునే) సహాయకునిగా ఆహ్వానిస్తారు. యుద్ధంచేసేవారు, దాని నెదుర్కొనేవారు ఇంద్రుణ్ణే పిలుస్తారు. నిరాశావహులు హతాశులు కూడ ఆయనే్న స్వాగతిస్తారు. వీరేగాక జీవితంలో జ్ఞానం, ధనం, బలం, సంతానం మొదలయినవి కోరుకొనేవారు సహితం ఆ దైవానే్న(ఇంద్రునే) అర్థిస్తారు. ఆశావాదులు, నిరాశావాదులు, జ్ఞాన ప్రవణులు, ధ్యాన తత్పరులు, సజ్జనులు, దుర్జనులు, మధ్యేవర్తులు అందరూ ఆ భగవంతునే సహాయమర్థిస్తుంటారు. ఈ విధంగా అర్థించే స్థితిలో అందరూ సమానులే. భగవద్ద్వారంవద్ద ఒక విధంగా అందరూ యాచకులే. భగవద్ద్వారం వద్దనున్న వారందరూ ‘రిరిక్త్వాం సస్తన్వఃఅగ్మన్’ ‘‘రిక్త శరీరులై మాత్రమే చేరుకొంటారు’’ అట్టివారే భగవంతుని వద్దనుండి ఏదైనా పొంది తెచ్చుకోగలరు. దేహంమీద ఏదో బరువైన వస్తువులు మోసుకొనిపోయి నిలిచినవారు ఆయననుంచి ఇక అధికంగా తెచ్చుకోగలిగే దేముంటుంది.
యోధులు ఆత్మసంరక్షణార్థం కవచాదులను ధరించి యుద్ధంలోనికి వెళతారు. కాని జీవన సమరంలోఉన్న యోధుడు దైవద్వారానికి ముందు నిలిచేందుకు ముందుగా శరీరంమీద ఉండే రక్షణ కవచాదులను తొలగించుకొని నిలబడాలి. ఎందుకంటే ‘తన్వః కృణ్వత త్రామ్’ ఆ దైవమే ఆ యోధుడికి శరీర సంరక్షణచేసే కవచమైపోతాడు. ఇంకో విశేషమేమంటే ఆ దైవద్వారం వద్ద నిలిచేందుకు వెళ్లేవాడు ఆయనకు కానుకగా త్యాగమనే మహాఫలాన్ని తీసుకొనిపోవాలి. ‘మిథో యత్ త్యగముభయాసో అగ్మన్.’
***
పరమార్థ ప్రాపక క్రమం
యత్సానోః సానుమారుహద్ భూర్వస్పష్ట కర్త్వమ్‌
తదింద్రో అర్థం చేతతి యూథేన వృష్ణిరేజతి॥ ఋ.1-10-2॥
భావం:- ఒక శిఖర మధిరోహించిన తరువాత మరల అధిరోహించదగిన శిఖరం కనబడిన విధంగా ఒక పురుషార్థాన్ని సాధించిన తరువాత సాధించదగిన మరో పురుషార్థాన్ని ఆత్మ గుర్తిస్తుంది. అలాగే ప్రాణాయామాది అష్టాంగ యోగాభ్యాసం ద్వారా సాధించదగిన నిర్వికల్ప సమాధాని ఆత్మసాధించి మోక్ష పురుషార్థాన్ని పొందగలుగుతుంది.
వివరణ:- పర్వతారోహణం చేసే వారికి ఈ మంత్రంలో చెప్పబడిన అనుభవం సాధారణంగా కలుగుతుంది. ఎదురుగా ఉన్న పర్వత శిఖరాన్ని ఎక్కగానే తృప్తి కలుగకముందే ఆ పైన కనబడే మరో పర్వత శిఖరాన్ని కూడ ఎక్కాలనే కోరిక కలుగుతుంది. ఆ ఎతె్తైన శిఖరాన్ని అధిరోహించడమొక్కటే సాధించవలసిన విజయంగా ఒక తీవ్రవాంఛ జనిస్తుంది. అది వాంఛ మాత్రంగానే కాదు. ‘్భర్య స్పష్ట కర్త్వమ్’ ‘‘ప్రధాన కర్తవ్యంగా తోస్తుంది.’’ వెనుక సాధించిన పర్వత శిఖరారోహణ విజయం మరుపునకు వస్తుంది.
ఇంకావుంది...

శ్రీ పరమహంస బోధామృతము

$
0
0

కామ కాంచన మోహాగ్ని చల్లారిననే కాని భగవద్దర్శనము కానేరదు.
87.తీవ్ర వైరాగ్యము పూని యొక్కసారి భగవద్దర్శనము పొందినంతనే అత్యంత బలీయమగు మోహపాశములు విచ్ఛిన్నమైపోవును. అట్టివానికిక భార్యవలననైనను ఇటు నటు అసమమైన రెండు సూదంటు రాళ్లున్నయెడల వానిలో ఏది దానిని విశేష బలముతో నాకర్షించును? వానిలో పెద్దదియే కదా? భగవంతుడే ఈ పెద్ద సూదంటురాయి. అపుడు చిన్నసూదంటు రాయి వంటి స్ర్తి అందులకు వ్యతిరిక్తముగా ఏమి చేయగలదు?
88. పాములు విషజంతువులు గదా? నీవు వానిని పట్టుకొనబోయినయెడల తప్పక నిన్ను కరచును. కాని, మన్ను మంత్రించి వానిపై జల్లి వానిని వశమొనర్చుకొన నేర్చినవానికి పాములను బట్టుకొనుట అంత కష్టమైన పని కానేరదు. ఏడెనిమిది పాములను సైతము అతడు చేతులకును మెడకును జుట్టుకొని వానితో పాములను సైతము అతడు చేతులకును మెడకును జుట్టుకొని వానితో ఆటలాడగల్గును. (అదేవిధముగా బ్రహ్మ సాక్షాత్కారము నొందినవాడు సంసార భయమునుండి విముక్తుడగును.)
89.ఒక మార్వాడీ పెద్దమనుష్యుడొకనాడు శ్రీరామ కృష్ణుని సందర్శించి కొన్ని వేల రూపాయలను సమర్పింప దనకు అనుజ్ఞనీయుడని వేడుకొనెను. అతడెట్టి సదుద్దేశము కలిగియున్నను శ్రీగురుదేవుడు ఖండితముగా వలదని చెప్పి దానిని స్వీకరింపడయ్యెను. ‘‘నాకు డబ్బుతో నెట్టి సంబంధము నుండరాదు. దానిని స్వీకరించితినా, నా మనస్సు ఇక సదా దానిమీదనే నిలిచియుండును’’ అనెను. అంత నా పెద్దమనుష్యుడు, సొమ్ము శ్రీరామకృష్ణుని సేవకు వినియోగపడుటకై అతని బందుగులలో నొకరి పేర నుంచెదననెను. శ్రీరామకృష్ణుడిట్లు బదులు చెప్పెను. ‘‘వలదు, అది కపటమైన పని. ఇంతేకాక దానిచే ఒకరి దగ్గర నా సొమ్ము, ఉన్నదను భావము సదా నా మనస్సులో గలుగుచుండును’’.
అప్పుడును ఆ మార్వాడీ ఊరకుండక, ‘‘మనస్సు తైలము వంటిదై యున్నయెడల కామినీ కాంచనములను సాగరముపై తేలయాడగలదు’’’ అను శ్రీరామకృష్ణుని వచనములనే యుదాహరించి తన కానుక నంగీకరింపుడని పట్టుపడెను.
అంత శ్రీరామకృష్ణుడిట్లు సమాధానమొసగెను: ‘‘ఆ మాట నిజము. కాని ఆ చమురే చాలా కాలము నీటిపైని తేలిచుండినయెడల మురుగెత్తునుకదా! అటులనే కామినీ కాంచనములను సాగరముపైని ఊరక తేలుచున్నను గూడ దానితో చిరకాలము నిరంతరమైన సంసర్గము కలిగెనా, మనస్సు క్రుళ్లి కంపుకొట్టును’’.
కాంచన మోహమును జయించుటెట్లు?
90.కాంచన మోహము, లేక ధనరాగము సాధకుని ధర్మ మార్గమునుండి పెడత్రోవ త్రొక్కించునని తెలుపుచు శ్రీగురుదేవుడు యువకుడగు నొక శిష్యుని జూచి యొకప్పుడిట్లు పలికెను: ‘‘ లౌకికునివలె- పామరునివలె- నీవు డబ్బు పుచ్చుకొని ఉద్యోగము చేయనారంభించినావు. కాని నీ తల్లి నిమిత్తము నీవు పాటుపడుచున్నావు. లేనియెడల, చీ చీ! చీచీ యని యుందును’’. పదే పదే యిట్లని తుదకు, ‘‘్భగవంతుని దప్ప మరెవ్వరిని సేవింపకుము’’ అనియెను.
91.డబ్బుకోసం ఉద్యోగము చేయుట యెట్టి పతనహేతువో తెలుపుచూ శ్రీ గురుదేవుడొకప్పుడొక శిష్యునకిట్లనియెను: ‘‘వానిమొగ మెట్లు కళావిహీనమైన యున్నదో కనుడు. నల్లని పొర వాని మొగము నావరించినట్లున్నది. ఇది యంతయు ‘ఉద్యోగ మహాత్మ్యము’. జమా ఖర్చు లెక్కలు, మరి యిట్టి వేయి విషయములలో అతడు మునిగితేలుచుండును’’.
92.్ధనము మనుష్యుని స్వభావమునే మార్చివేయునట్టి ఉపాధి. దాని ప్రభావము యిట్టిదని చెప్ప నలవికాదు; ఎవ్వడైనను ధనవంతుడైనంతనే వాని నైజము పూర్తిగా మారిపోవును. ఎంతయో వినయ విధేయతలుగల బ్రాహ్మణుడొకడు ఇచటికి (దక్షిణేశ్వరమునకు) తరచుగా వచ్చుచుండెడివాడు. కొంతకాలమునకు అతడిచటికివచ్చుట మానివేసెను.వాని సంగతి సందర్భములేవియు మాకు దెలియలేదు. ఒకనాడు మేము కొన్నగరమునకు పడవనెక్కి వెడలితిమి. మేము పడవ దిగుచు, గంగానది యొడ్డున గూర్చుండిన యా బ్రాహ్మణుని జూచితిమి.
ఇంకావుంది...

శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి

సుందరకాండ

$
0
0

ఇదంతా మదస్నేహమట. అందుకనే తెలివి రాగానే ఈ ఏకత భిన్నమవుతుంది.
నతత్రకాచిప్రమదా ప్రసహ్య వీర్యోపపనే్నన గుణేనలబ్ధా
నచాన్య కామాపి నచా న్యపూర్వా వినా
వరార్హం జనకాత్మజాం తాం
ఈ స్ర్తిలలో ఎవరూ-
రావణ వీర్యంచేత బలాత్కారంగా తీసికొని రాబడినవారు కాదు. మరి!
అతని గుణాన్ని వలచి వచ్చిన వారే కాని. రావడానికి ముందు-
మరొకని వలచిన వారూకారట- ఇన్నిటికీ- విరుద్ధంగా జనక మహారాజు కూతురొక్కతే అక్కడ ఉందట.
నచాకులీనా నచహీనరూపా నా‚ దక్షిణా నా‚ నుపచారయుక్తా
భార్యా‚్భవత్తస్య నహీన సత్త్వా న చాపి కాంతస్య నకామనీయా
వారిలో ఎవరూ రూపానికి తక్కువ వారు కారు
కులానికీ తక్కువవారుకారు
రావణుని యందనురాగాన్ని పంచనిది లేదు.
ఆయన యందు కామము లేనిది లేదు.
ఒక్క సీత తప్ప అతణ్ణి కాదన్న స్ర్తియే లేదు.
ఇటువంటి స్ర్తి సమూహాన్ని వారి సుఖాన్ని వారి భోగాల్ని చూస్తూన్న స్వామి-
బభూప బుద్ధిస్తు హరీశ్వరస్య
యదీదృశీ రాఘవ ధర్మపత్నీ
ఇమాయథా రాక్షసరాజ భార్యాః
సుజాత మస్యేతి హి సాధు బుద్ధేః- అని అనుకొన్నాడు.
ఈ రాక్షస రాజ భార్యలెలా ఉన్నారో శ్రీరామ ధర్మపత్ని కూడా అలాగే ఉన్నట్లయితే ఈతని జన్మ శోభావహమైయుండెడిది కదాః అని సాధు బుద్ధి అయిన హనుమ మనసులో అనుకొన్నాడట ఎంత మాట!
సాధుబుద్ధేమిటి! ఇలా అనుకొనడమేమిటి! అంటే-
ఆ సాధుత్వము- సీతా దుఃఖ అసహిష్ణుత్వమునందు. స్వామి సీతాకష్టము నూహించుకొని సహింపలేక పోయినాడు. అతి స్నేహఃఖలు పాపశంకీ అని కదా! సూక్తి. అతి స్నేహం ఔచిత్యాన్ని పాటింపనీయదు.
అట్టి తీరులోనిదీ మాట. అందుకే స్వామి వెంటనే పశ్చాత్తప్తుడై
పునశ్చ సో‚ చింతయదార్త రూపో
ధ్రువం విశిష్టా గుణతోహి సీతా
అధా‚యమస్యాం కృతవాన్ మహాత్మా
లంకేశ్వర: కష్టమనార్య కర్మ- అని చెంపలువేసికొన్నాడు.
పశ్చాత్తాపం సామాన్య స్థితిలో లేదు. ఆర్తుడైపోయేడు. తన ఉపాస్యదేవతకు తనే కళంకాన్ని ఆపాదించే క్షుద్ర భక్తునిగా తనను తలంచుకొని వాపోయేడు. సీత వీరందరికంటె గుణ విశిష్టురాలనే సత్యాన్ని స్మరించుకొన్నాడు.
లంక ఒక ఇంద్రజాలం
అందులో తగుల్కొంటే కాని దానిని చూసి ఔనని సంతోషిస్తాడు అయిన దానిని చూసి కాదని దుఃఖిస్తాడు. ఇందులోనుండి బయటపడడం ప్రాజ్ఞునికి మాత్రమే తెలుస్తుంది. తెల్లవారితే ఈ ఇంద్రజాలం దగ్దమవుతుంది. ఇటువంటి స్ర్తిసమూహ మధ్యనుండి స్వామి ముందుకు నడుస్తున్నాడు.
తత్రదివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్న భూషితం
అవేక్షమాణో హనుమన్ దదర్శ శయనాసనమ్
దంతకాంచన చిత్రాంగై ర్వైడూర్వైశ్చ వరాసనై:
మహార్హస్తరణో పేతైరుపపన్నం మహాధనై:
స్ఫుటికతో చేయబడిన మంచం. దానికి రత్నాల్ని పొదిగించిన అలంకరణ.
దాని క్రింద కాలానుకొనడానికి ముక్కాలిపీట
దాన్ని దంతంతో చేసేరట. దాని చుట్టూ బంగారపు అంచు
ఆ అంచుపై వైడూర్యాలు పొదిగేరు.
ఆ మంచానికి తలదిక్కున పూర్ణచంద్రునిలా మెరసిపోతూన్న శే్వతచ్ఛత్రం.
ఇదీ రావణ శయనాసన సౌందర్యం.
ఆ మందిరం సుగంధాలతో పుష్ప సౌరభాలతో గత భోగాల్ని స్ఫరణకు తెస్తోంది.
ఇంకావుంది...

సౌందర్యారాధనం

$
0
0

సౌందర్యాధనం చాలామంది చేస్తుంటారు. అందం అంటే ఇష్టం లేనివారు ఎవరూ ఉండరు. అందులోను శారీరిక సౌందర్యం కాదు ఆత్మసౌందర్యం అంటే ప్రీతి చెందని వారు ఎవరూ ఉండరు. ఆ ఆత్మ సౌందర్యానికన్నా మించిన సౌందర్యం కృష్ణపరమాత్మది. ఆ దేవదేవుని సౌందర్యాన్ని చూడడానికి రెండు కనులూ చాలవంటారు కృష్ణ్భక్తులు. ఇపుడు అసలే మార్గశీర్షమాసం. గోదాదేవి ఆమె చెలికత్తెలందరూ పొద్దుపొద్దునే లేచి ఆ గోపాలబాలుని నందుగోపుని చూడరమ్మని ఒకరినొకరు పిలుచుకుని వెళ్తుంటారు.
అలా వెళ్లడానికి కారణం వారు ఆ పరమాత్మను మనసున నిలుపుకొనడం. ఆ పరమాత్ముని సేవించడానికి పూర్వజన్మ పుణ్యంకావాలి. యశోదాదేవికి గారాలతనయుడైన ఆ కృష్ణపరమాత్మ తమకూ తనయుడు కావాలని కొందరు కోరుకుంటే మరికొందరు రుక్మిణీ సత్యభామలకు ప్రియాతి ప్రియుడైన ఆ కృష్ణపరమాత్మ తమకు కూడానాథుడు కావాలని కోరుకుంటారు.
అందరూ మాత్రం చిన్ననాడు చిద్విలాసమూర్తియై చేసిన ఎనె్నన్నో దుష్టసంహారాలను, చూపిన లీలావిలాసాలను స్మరించి ఆనందిస్తుంటారు. అట్లాంటి ఆనందాల్లో కృష్ణపరమాత్ముని అంగాంగ సౌందర్యాన్ని వర్ణించుకుంటూ ఆ చిన్నివాడు గర్గముని దగ్గర నేర్చుకున్న పాఠాలు, తోడి గోపబాలురతో గోవులను కాయడానికి వెళ్లిచూపిన మహాత్మ్యాలు ఎనె్నన్నో ఉన్నాయి.
అట్లాంటివాటిల్లో పెరియాళ్వారు ఒకసారి కుంభకోణంలోని రాముల వారి కోవెలకు వెళ్లారట. అక్కడ కోదండపాణియైన రాముడు, ఆయన ప్రక్కన విల్లంబులు ధరించి లక్ష్మణమూర్తి కనిపించారట. అంతే ఆ స్వామిని వారి చేతిలోని కోదండాన్ని చూసి న పెరియాళ్వారుకు కృష్ణయ్య గుర్తుకువచ్చాడట.
ఆహా! ఇదేమి చోద్యం అలనాడు యశోదమ్మ ఒడిలో కూర్చుని పాలుకుడుపుతూ ఉంటే ఆ తల్లి కన్నయ్య ముఖారవిందంపై పరుచుకుంటున్న ముంగురులను సరిచేస్తూన్నపుడు కనీ కనబడుకుంటా కనబడిన కనుగొమ్మలు కదా ఇవి అనుకొన్నాడట. చూశారా! ఇది ఆళ్వారుల హృదయం. పైగా చిన్ని కృష్ణయ్య యశోద కస్తూరీ తిలకాన్ని, కాటుకను దిద్దుతున్నపుడు ఆ కన్నయ్య కనుగొమ్మలను చేతితో ముట్టుకుంటూ చక్కగా సరిచేస్తున్నట్టు భావన చేస్తున్నపుడు పెరియాళ్వారుకు ఎనలేని సౌందర్యం స్వామి ముఖారవిందంలో కనిపించిందట. ఆ స్వామి కనుగొమ్మలు ఎంత శక్తివంతమైనవో కదా అనిపించిందట.
ఆ స్వామిని పెంచడానికి ఈ యశోదా నందులు ఎంత పుణ్యం చేసుకొన్నారో కదా. దేవకీదేవులకన్నా వీరి పుణ్యం ఎంచగా వీలులేనిది లెక్కపెట్టగలేనన్ని పుణ్యరాశులను చేసుకొన్నారు కనుకనే ఈ కన్నయ్యను కడుపార కన్నట్టు, ఆతడే తమను పాలించే పాలకుడని అనుకుంటూ పెంచుతున్నారు. నిజమే వీరినేనా ఆయన పాలించేది అఖిల భువనాలను తన చిరు బొజ్జలో దాచుకున్న చిరుదరహాసమూర్తి కదా. వారినొక్కరినే కాదు కదా చరాచర జగత్తునంతా స్వామి కరుణార్ర దదృక్కులతో పాలిస్తున్నాడుకదా. అనుకొంటూ ఎంతో పొంగిపోయారట పెరియాళ్వారు.
ఆళ్వారులు స్వామిని ఎంతగా సేవించారో. లోకంలోని ప్రతీదీ వారికి స్వామి లాగే కనబడుతుంది. ఆ పెరియాళ్వారు ఆ కనుగొమ్మలను చూసి మన్మథుడు యువతీయువకులు ఒకరినొకరు ప్రేమించుటకై నల్లని బాణాలను వదిలాడు. ఈ రాముడు అజ్ఞాన అహంకారాలు కలిగిన ఈరావణాసురుని నిర్జించడానికి బాణా లు వదిలాడు. కానీ నా కన్నయ్య మాత్రం అందరూ తనను చూసి ప్రీతిచెంది హృదయానందాన్ని పొంది ఆ ఆనందంతో అడుగులు వేస్తూ వేస్తూ నా దగ్గరకు వచ్చి అచంచలమైన ప్రేమానందాబ్ధిలో మునిగి స్వధర్మాచరణను చేస్తూ అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ ననే్న నమ్ముకునేట్లుగా చేసి వారి వారి పాపపంకిలాన్ని కడిగివేసి వారిని తనతోపాటుగా దివ్యపదానికి తీసుకెళ్లుదామని స్థిర నిశ్చయంతో రెండు నల్లని వంగిన కనుగొమ్మలను తన ముఖంపై పెట్టుకున్నారు కదా.
ఆహా కృష్ణయ్యా! నీకెంత వాత్సల్యమూ, కరుణ ఉన్నాయో కదా. స్వామి నీవే నాకు పరమపదానివి. నాకు నీవు తప్ప ఎవరునూ అక్కర్లేదు. సదా నీ నామస్మరణ చేసుకొంటూ నీ రూపాన్ని కనులారా చూస్తూ నీ తత్వాన్ని ఆకళింపుచేసుకొనే శక్తి నిమ్ము అని కోరుకుంటున్నారట పెరియాళ్వారు.
మరి ఇదే మంచికాలంకదా. మార్గళివ్రతాన్ని ఆచరించే మనమందరమూ ఆ అందాల యశోదాబాలుని సౌందర్యారాధనం చేస్తూ సేవించుదాం తరలిరండి తరణులారా!

అనంతం-32

$
0
0

‘‘రగిలిపోతారని ఎలా చెప్పగలరు’’
‘‘ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం’’
‘‘మీ తదుపరి కార్యక్రమం?’’
‘‘పిచ్చుకల ప్రాజెక్టు’’
‘‘వ్వాట్’’
‘‘సెల్ టవర్లవల్ల పిచ్చుక జాతి అంతరించిపోతోంది’’
‘‘ఐతే.?’’
‘‘అడవుల్లో రక్షిత ప్రాంతాలు నెలకొల్పాలి’’
‘‘అన్నిరకాల పిచ్చుకలకూనా?’’
‘‘ఊరపిచ్చుకలకు మాత్రమే’’
‘‘ఎందుకని’’
‘‘దేశభక్తి’’
‘‘ఊర పిచ్చుకలకీ దేశభక్తికీ ఏమిటి సంబంధం.’’
‘‘ఊరపిచ్చుక లేహ్యం ధాతుపుష్టికి దివ్యమైన ఔషధం.’’
‘‘్ధతు పుష్టికి దేశభక్తికీ ఏమిటి సంబంధం.’’
‘‘చీపులిక్కరు గుట్కాలు మాదకద్రవ్యాలు- కలుషితమైన గాలి నీరూ... జాతిని నిర్వీర్యం చేస్తున్నాయి! వాళ్ళకి ఊరపిచ్చుక లేహ్యం అందించి పుష్టి సంపన్నులను చెయ్యటమే దేశభక్తి.’’
‘‘ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిస్తారా.’’
‘‘అందులో ఒక చిక్కుంది.’’
‘‘ఏమిటో...?’’
‘‘అమెరికా వాళ్ళతో కలసి లేహ్యం చెయ్యాలంటారు.’’
‘‘నిధులకు దిగులుండదు కదా.’’
‘‘ఇండియా ఊర పిచ్చుకల మీద అమెరికా పెత్తనం చేస్తుంది.’’
‘‘చేస్తే ఏం?’’
‘‘మన ఊర పిచ్చుక లేహ్యం అమెరికాలోనే అమ్మాలంటారు.’’
‘‘లాభమే కదా.’’
‘‘లేహ్యం మనది. ధాతుపుష్టి వాళ్ళకా? అన్యాయం.’’
అందరూ భళ్ళున నవ్వారు.
మళ్ళీ గ్లాసుల నిండా మందు నిండింది.
‘‘ప్రొడక్షన్ మొదలైతే నాకూ ఊరపిచ్చుక లేహ్యం పంపించండి’’ అన్నాడొక పోలీసు అధికారి నవ్వుతూ.
‘‘పరిస్థితి చెయ్యి దాటిపోయిందా.’’ గరుడాచలం అడిగాడు.
‘‘టెన్స్! బట్ అండర్ కంట్రోల్’’ అన్నాడతను.
మళ్ళీ అక్కడ నవ్వులు విరిసాయి...
విందు పూర్తయ్యింది.
అందరూ వెళ్ళిపోయాక గరుడాచలం, రాగ్యా మిగిలారు.
‘‘సారూ’’అని నెమ్మదిగా పిల్చాడు రాగ్యా.
‘‘ఏమిటి? చాంద్‌నీ విషయమేనా?’’ అడిగాడు గరుడాచలం.
అతని జ్ఞాపకశక్తికి రాగ్యాకి ఆశ్చర్యమనిపించింది!
అంత నిషాలోకూడా తన విషయం అతనికి గుర్తున్నదంటే ఎంత అభిమానం తన పట్ల!
‘‘దేవర జాతరొత్తుండాది’’అని గుర్తుచేశాడు రాగ్యా.
అప్పటికప్పుడు కారుమబ్బులు క్రమ్ముకున్న ఆకాశంలా అతని మొహం నల్లగా మాడిపోయింది రాగ్యా గమనించలేదు!
‘‘అనుకున్నట్టే అంతా జరుగుతుంది. ఎమ్మెల్లేగారు కూడా పట్టుదలతో ఉన్నారు. కాయా? పండా? అన్నది త్వరలోనే తేల్చేస్తారు’’అని రాగ్యాకి ధైర్యం చెప్పాడు గరుడాచలం.
కొంత సమయం గడిచింది.
కీ.శే.పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్లే పెంటారెడ్డి ఎక్కడికో వెళ్ళి, వ్యవహారాలన్నీ చక్కదిద్దుకొని వొచ్చాడు.
గరుడాచలం అతనికి ఎదురువెళ్ళి స్వాగతం పలికాడు!
ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
‘‘రాగ్యా నీతోనే ఉన్నాడా?’’ గుడారంలోకి వెళ్ళకుండా బైటే నిలబడి అడిగాడు ఎమ్మెల్లే.
‘‘ఏమంటాడూ! చాందినీ కావాలిట. తొందరపడుతున్నాడు’’
‘‘నీకుమాత్రం తొందరగా లేదూ’’అని, క్రీగంట గరుడాచలాన్ని చూస్తూ అదోలా నవ్వాడు ఎమ్మెల్లే.
గరుడాచలం వౌనంగా నవ్వూరుకున్నాడు.
‘‘అంతా నాకు తెలుసు! ప్రతీకారం తీర్చుకోవటంకన్నా, నీకు చాంద్‌నీని అనుభవించాలన్న ఆసక్తే ఎక్కువగా వుంది.’’
‘‘నా కళారాధన అలాంటిది’’అన్నాడు గరుడాచలం.
‘‘కీపిట్టప్! శృంగారం కూడా ఓ కళే! పైగా, అన్ని కళల్లోనూ అదే గొప్పది! రసికులెవ్వరూ దాన్ని కాదనరు.’’
‘‘నేను మాత్రం అన్నానా.’’
‘‘రాగ్యాకేమీ అనుమానం రాలేదా?’’
‘‘ఇప్పటివరకు రాలేదు.’’
‘‘జాగ్రత్తగా డీల్ చెయ్యాలి వాడ్ని.’’
‘‘అవస్యం’’అన్నాడు గరుడాచలం.
‘‘రాగ్యా ఎక్కడున్నాడు’’ క్షణం తర్వాత ఎమ్మెల్లే అడిగాడు.
‘‘నా గుడారంలో..’’
‘‘ఒంటరిగా నువ్వొకసారి రావాలి. గుడారంలోనే వుంటాను’’అని చెప్పాడు ఎమ్మెల్లే, తన గుడారంలోకి దారితీస్తూ.
గరుడాచలం రాగ్యా దగ్గరికి వెళ్ళాడు.
ఏవో ఊహల్లో తేలిపోతూ బాహ్యప్రపంచానే్న పూర్తిగా మరచిపోయి, ఓ మూల కూర్చొని ఉన్నాడు రాగ్యా.
‘‘రాగ్యా’’అని పిలుస్తూ గరుడాచలం వచ్చి, భుజంమీద చేత్తో తట్టేదాకా రాగ్యా రుూ ప్రపంచంలోకి రాలేదు.
‘‘ఏమిటలా ఉన్నావు?’’ గరుడాచలం అడిగాడు.
‘‘శాందినీ గురుతొస్తుంది’’అన్నాడు రాగ్యా దీనంగా.
మఫ్టీ కానిస్టేబులు కనకయ్య వొచ్చాడు. గరుడాచలానికి అభివాదం చేసాడు.
‘‘ఎమ్మెల్లేగారు త్వరగా రమ్మంటున్నారు’’అని చెప్పాడు.
(ఇంకా ఉంది)

కచ్చితత్వం లేని కొలమానం!

$
0
0

పరిపూర్ణం
ఒక వైద్యుడే కావచ్చు గాక!
రోగుల పట్ల అతడి హృదయస్పందనలు
మంచివేనా అంటే
ఎలా చెప్పగలం?

ఒక ఉపాధ్యాయుడే
కావచ్చుగాక!
పిల్లల భవితల్ని కాంక్షించే
నిత్యస్వాప్నికుడు
అతనిలో ఉన్నాడా అంటే
ఎలా చెప్పగలం?

ఒక కొలువుచేసే
అధికారే కావచ్చుగాక!
ఆ కొలువులోని నీతి
అతనిలో కొలువై
ఉందా అంటే
ఎలా చెప్పగలం ?

ఒక రాజకీయవేత్తే కావచ్చు
అతడి రాజనీతిలో
ప్రజాహితం ఉందా అంటే
ఎలా చెప్పగలం?

నిజాయితీ అనేది
మనసును బట్టి ఉంటుంది
మనసును బట్టి
మంచే కాదు చెడూ ఉంటుంది

అది ఎన్నడూ
తన పరిపూర్ణప్రాతినిధ్యాన్ని
ఏ ఒక్కదానికో
పరిమితం చేయలేదు

మంచిచెడుల మధ్య
కొట్టుమిట్టాడే మనిషి
పరిపూర్ణుడు ఎన్నటికీ కాలేడు!
ఇది ముమ్మాటికీ నిజమే!

వ్యవస్థీకృతమైన ధర్మాలను
పంచభూతాలు
సుస్థిరం చేసుకొన్నాయి

పంచభూతాత్మకమైన
మనిషి మాత్రం
స్వధర్మాన్ని విడిచి
మానవతకు దూరంగా
మిగిలిపోతున్నాడు

సుస్థిరమైన మానవత్వానికి
ప్రతీకగా
నిలువలేక పోతున్నాడు

అందుకే మనిషి
అర్థం గోచరించని ఒక పదం
స్పష్టత లేని ఒక వాక్యం

సంశయాత్మకమైన ఓ స్వాభావికం
కచ్చితత్వం లేని ఓ కొలమానం!

పల్లెకు పోదాం!

అక్కడ
ఆత్మీయతకు ఆవాసం
అనుబంధాలకు ఆలవాలం
మనస్సుల్లో మమకారం
మాటల్లో మాధుర్యం
చేతల్లో సహకారం
నిలకడైన జీవనానికి
నిండైన భాష్యం
నెమ్మదైన జీవితానికి
మెండైన అర్థం

అక్కడిగాలిలోని స్వచ్ఛత
మనసుకు పాకుతుంది
మట్టిలోని మమకారం
మానవత్వాన్ని నేర్పిస్తుంది
నీటిలోని మాధుర్యం
మాటలో ప్రతిఫలిస్తుంది
అందుకే పద పోదాం పల్లెకు
శాంతికి నెలవుగా
మమతకు కొలువుగా
అలరారే పల్లెకు పోదాం!

శ్రీ

$
0
0

చం॥ సరియగు బాటలోన మనసారగ సాగగఁ బూని భూమిలో
మురియుచు సేవఁ జేయగను మోదమునందుచు నీకుమ్రొక్కరే?
యరయగ మారుదేవునిగ హారతులందెదవే ఘనంబుగా
విరియును నీదు కీర్తి పదివేలకుఁ బైబడి వత్సరమ్ములన్ !

ఉ. మానవసేవయున్నరయ మాధవ సేవయునాటి మాట కుం
బ్రాణముఁ బోయనెంచియును రమ్యపు బాటన సాగిపోవలెన్
కానకనాగఁబోవు కలికాలపురుగ్మతలారిప వేయగాఁ
బూనియు మార్గదర్శివయి పూర్ణపు సేవకుఁ జుట్టు మోయిశ్రీ!


ప్రజల మనిషి -వట్టికోట ఆళ్వారుస్వామి

$
0
0

ఆ విషయాన్ని ఆళ్వారుస్వామి గారు చాలా వాస్తవికత ప్రాతిపదికగా చిత్రించటానికి ప్రయత్నించారు. మనకు సాధారణంగా ఇలాంటి నవల లొచ్చినపుడు వాటిలో ఎక్కువ కాల్పనికమైనటువంటి అంశం చాలా వుంటుంది.
ముఖ్యంగా ఆళ్వారుస్వామిగారి ఈ ప్రజల మనిషి, దీని అనంతరం వచ్చినటువంటి గంగు వీటిని తీసుకుంటూ తెలంగాణలో ఆ రోజు వున్నటువంటి దుస్థితే కాకుండా, ఆ దుస్థితినుంచి బయటపడటానికి, అలాగే తమ శక్తిని గుర్తించటానికి, ప్రజలలో వివిధ వర్గాలకు ఏ విధంగా ఆ పరిస్థితి ఉపయోగపడిందీ మనకర్థమవుతుంది. అందుకనే మహాకవి దాశరధి చెప్పినట్టు ఒక్క తెలంగాణా ఉద్యమంలోనే కాకుండా అన్నిచోట్లా కూడా ప్రజల తరఫున వున్నటువంటి నాయకులు తయారుకావటానికి కొంతకాలం పడుతుంది. వారికి కూడా వున్నటువంటి పరిమితులు పోవటానికి ఇంకా అనుభవం తోడ్పడుతుంది.
అప్పటివరకు దోపిడీ వ్యవస్థలో చితికి, చివికిపోయి తాము నిస్సహాయంగా వున్నామనుకున్న సామాన్య ప్రజ శక్తిమంతులవటానికి, సాహసోపేతమైన కార్యాలు చేయటానికి తగిన భూమిక ఈ నవలలో చిత్రించబడింది. ఇక్కడ వట్టికోట ఆళ్వారుస్వామిగారు ఒక వాస్తవిక రూపంగల రచయితగా తప్ప తానుగా కాల్పనికమైనటువంటి అంశం ఏదీ చొప్పించలేదు. ముఖ్యంగా ఇతర నవలలలు తెలంగాణకు సంబందించి వచ్చిన వాటిలో ఈ కాల్పనికఅంశం ఎక్కువగా కనపడుతుంది.
అక్కడివాడు, అక్కడి ఉద్యమంలో తాను పాల్గొన్నవాడు, ఆద్యమం ఎలా క్రమంగా రూపుదిద్దుకున్నదీ పరిశీలించినటువంటివాడు కనుక ఆళ్వారుస్వామి దానిని తాను తిరిగినటువంటి ప్రదేశాలను, తాను కలిసినటువంటి మనుషుల యొక్క అనుభవాలని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఒక చారిత్రక నవలగా తీర్చిదిద్దినటువంటి అంశం మనకు స్పష్టమవుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జైల్లో ఆయన జైలరుతో చేసినటువంటి వాదనలో రాజ్యాంగం, జైళ్లు, పరిపాలన వాటికి సంబందించిన అనేక అంశాలపై ప్రాథమిక స్థాయిలో చర్చలు కనపడతాయి. అందులోను ప్రతి పాత్ర కూడా తాను మూసపోసినట్లుగా కాకుండా వైవిధ్యంతో కూడినట్లు ఉండటం -చిత్రించటంలో ఆళ్వారుస్వామిగారు కృతకృత్యులయ్యారు. అందుకే వాస్తవానికి ఆళ్వార్లు పన్నిద్దరే అయినా మా వట్టికోట పదమూడో ఆళ్వారని దాశరధి అగ్నిధారను ఈయనకంకితమిస్తూ చెప్పింది అక్షర లక్షలలు చేసేటటువంటి సత్యమని మనం భావించాల్సి వుంటుంది.
సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీనరసింహ శతకము

$
0
0

సీ. నీమీద కీర్తనల్ నిత్యగానము సేసె
రమ్యమొందింప నారదుఁడఁగాను
సావధానముగ నీ చరణ పంకజ సేవ
సలిపి మెప్పింపంగ శబరిఁగాను
బాల్యమప్పటి నుండి భక్తి నీయందున
గలుగఁగ ప్రహ్లాద ఘనుఁడఁగాను
ఘనముగా నీమీఁద గ్రంథముల్ గల్పించి
వినుతి సేయును వ్యాసమునిని గాను
తే॥ సాధుఁడను, మూర్‌కమతి మనుష్యాధముఁడను
హీనుఁడను సుమ్మి నీవు ననే్నలు కొనుము
భూషణ వికాస ! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం:
ఓ స్వామీ ! నీపై పాటలు పాడి మెప్పించుదామంటే నేను నారదుణ్ణికాను. భక్తి నీ పాదపద్మాల నర్చిం మెప్పు సంపాదించటానికి నేన శబరికాను, చిన్ననాటి నుంచి భక్త్భివం కల్గి ఉండడానికి నేను ప్రహ్లాదుడిని కాను. నీపై కృతులు వ్రాయటానికి వ్యాసుణ్ణి అసలే కాను. మానవుల్లోకనిష్టుణ్ణి సుమా! నన్ను కాపాడు

maatata

$
0
0
Cross Image: 
Date: 
Thursday, January 10, 2019

నాట్య ప్రణవం

$
0
0

చరిత అండ్ గౌతమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఈరోజుల్లో- శ్రీమంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ప్రధాన పాత్రల్లో కుమార్ జి. దర్శకత్వంలో తను.ఎస్ నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రణవం’. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు కుమార్ జి చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చండీఘర్‌కు చెందిన మోడల్ అవంతిక హరి నల్వా హీరోయిన్‌గా నటిస్తుండగా, గాయత్రి అయ్యర్ మరో ముఖ్య భూమికలో నటిస్తోంది. భరతనాట్యం నేపథ్యంలో లవ్, సస్పెన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నాం. అలాగే మా సినిమాకు మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆర్.పి.పట్నాయక్‌గారు, ఉషగారు కలిసి ఒక డ్యూయట్ మా సినిమాలో ఆలపించారు. త్వరలో ఆడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఫ్రెష్ కానె్సప్ట్‌తో యంగ్ టీమ్ అంతాకలిసి చేస్తోన్న మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’ అన్నారు.

బైలంపుడి పాట విడుదల

$
0
0

తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హరీష్ వినయ్, తనిష్క తివారి జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా అనిల్ పిజిరాజ్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం లిరికల్ సాంగ్ బుధవారం హైదరాబాద్‌లో ఫిలిం ఛాంబర్‌లో బాలీవుడ్ హీరోయిన్ మైరా అమిథి చేతులమీదుగా లాంచ్ చేశారు. అనంతరం మైరా అమిథి మాట్లాడుతూ.. ‘పిల్లల దేవుడు’పల్లవితో సాగే సాంగ్ చాలా బావుంది. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు అన్నారు. నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమామీద ఆసక్తితో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. అందరూ కొత్తవారైనప్పటికీ ఎంతో సహజసిద్ధంగా నటించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైటెక్నికల్ వాల్యూస్‌తో సినిమాని తెరకెక్కించాము. ‘ఇక్కడ యుద్ధంచేయాలి.. గెలవడానికి కాదు, బతకడానికి’అనేది మా సినిమా క్యాప్షన్. ‘పిల్లల దేవుడు’అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశాం. అందరికీ పాట నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’అన్నారు. సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘ఇందులో రెండు పాటలున్నాయి. ఈరోజు పిల్లల దేవుడు అనే పాట లాంచ్ చేశాం. పాట అందరికీ నచ్చుతుంద’న్నారు. హీరో హరీష్ వినయ్ మాట్లాడుతూ.. ‘సుభాష్‌గారు అద్భుతమైన సాంగ్ ఇచ్చారు. దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమా తీసారు’ అన్నారు. దర్శకుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ.. ‘కెమెరామేన్‌గా నా కెరీర్ స్టార్ట్‌చేశాను. చాలా చిత్రాలకు వర్క్‌చేశాను. దర్శకుడుగా ఇది తొలి సినిమా. ‘బైలంపుడి’అనే గ్రామంలో జరిగే లవ్ అండ్ పొలిటికల్ చిత్రమిది. ప్రతి పాత్ర ఎంతో సహజసిద్ధంగా ఉంటుంది. ఒక విలేజ్‌లో ఏమైతే అంశాలు ఉంటాయో.. మా సినిమాలోకూడా అన్ని అంశాలుంటాయి. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రస్తుతం కొత్త కథలను ఆదరిస్తున్నారు. ఆ తరహాలో వచ్చే మా సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.

Viewing all 69482 articles
Browse latest View live