Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


older | 1 | .... | 2032 | 2033 | (Page 2034) | 2035 | 2036 | .... | 2067 | newer

  0 0

  సూర్య హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కప్పాన్’ చిత్రం ఇటీవలే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు అనూహ్యమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు జోరందుకున్నాయి. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన ప్రధాని మోదీగా కనిపిస్తారని సమాచారం. ఆయన సెక్యూరిటీ అధికారిగా సూర్య నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్‌లో విడుదల చేయనున్నారు. సూర్య సరసన సయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేస్తారట.


  0 0

  అలనాటి మహానటి సావిత్రి పాత్రలో తనదైన నటనతో మెప్పించి అందరితో శభాష్ అనిపించుకున్న హీరోయిన్ కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణలో ప్రారంభమైంది. నరేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నందమూరి కల్యాణ్‌రామ్ క్లాప్ కొట్టగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ ఎస్ హరీష్‌శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో కీర్తిసురేష్ మాట్లాడుతూ ‘తెలుగులో మహానటి తర్వాత చేస్తోన్న సినిమా అని, మహిళా ప్రధానమైన చిత్రంలో నటించడం హ్యాపీగా ఉందన్నారు. ప్రతి అమ్మాయికి కనెక్టయ్యే సినిమా, ఎక్కువ భాగం సినిమా యుఎస్‌లో చిత్రీకరణ జరుపుకోనుందని వివరించారు. డైరెక్టర్ నరేంద్ర మంచి కథను సిద్ధం చేశారని, తప్పకుండా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాననే నమ్మకం ఉందన్నారు. దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ 2016నుండి ఈ కథపై వర్క్ చేస్తున్నాను. తరుణ్ నాకు స్క్రిప్ట్‌లో హెల్ప్ చేశాడు. అన్నీ ఎమోషన్స్ కలగలిపిన కథ ఇది. ఈ కథకు కీర్తిసురేష్‌తప్ప మరేవరూ సూట్ కారు. 25 శాతం ఇండియాలో... 75 శాతం యు.ఎస్‌లో చిత్రీకరణ జరగనుంది. ఏప్రిల్‌లో యుఎస్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. కుటుంబ కథా ప్రేక్షకులు సహా అందరికీ కనెక్టయ్యే సినిమా ఇది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ మహానటితో కీర్తిసురేష్ తెలుగువారి హృదయాల్లో ఎంతటి స్థానం సంపాదించుకుందో తెలిసిందే. మహిళా ప్రధానమైన చిత్రంలో ఇప్పుడు చేస్తుందని, ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సిచ్యువేషన్‌ను ఎదుర్కొనే ఉంటుందన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ కోడూరి మాట్లాడుతూ మహేష్ కోనేరు నిర్మాతగా చేస్తోన్న మూడో సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే సంగీతం అందిస్తాను. కీర్తిసురేష్‌తో వర్క్‌చేయడం హ్యాపీగా ఉందన్నారు.


  0 0

  సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 25వ చిత్రం ‘మహర్షి’ చేస్తున్నాడు. దీని తరువాత మహేష్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో ప్రాజెక్టు చేయనున్నాడన్నది తెలిసిందే. ప్రస్తుతం సుక్కు స్క్రిప్ట్ పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రకు ప్రముఖ యాంకర్ అనసూయను తీసుకోవాలనుకుంటున్నాడట. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రలో మెప్పించి బ్లాక్‌బ్లాస్టర్ సక్సెస్‌లో భాగస్వామి అయ్యంది. దాంతో సుకుమార్, మహేష్ సినిమాకీ అదే సెంటిమెంట్ కొనసాగించాలని అనుకుంటున్నాడట. జూన్‌లో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.


  0 0
 • 01/10/19--06:40: ..విజయాభవ
 • కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’. విజయేంద్రప్రసాద్ అందించిన కథకు క్రిష్, కంగనా డైరెక్టర్లు. ఈమధ్యనే విడుదలైన టైటిల్ సాంగ్‌లో కంగన అద్భుత పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. జనవరి 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్న సందర్భంగా చిత్రంలోని ‘విజరుూభవ...’ పాటనూ విడుదల చేశారు. సైన్యానికి ధైర్యం ఊపిరిపోస్తూ యుద్ధానికి సిద్ధమవుతున్న ఝాన్సీ ఎంపిసోడ్‌ను ప్రధానంగా చిత్రీకరించినట్టు కనిపిస్తోంది. రీల్ ఝాన్సీ హావభావాలు, ధైర్య సాహసాలు చూస్తుంటే, రియల్ లైఫ్‌లో ఝాన్సీని చూసినంత భావన కలిగేలా కంగన అద్భుత నటనను అపదర్శించింది. మణికర్ణిక చిత్రానికి ప్రసూన్‌జోషి సాహిత్యం అందిస్తే, శంకర్-ఇషాన్-లాయ్ త్రయం సంగీతం సమకూర్చడం తెలిసిందే. విజయాభవ అంటూ శంకర్ మహదేవన్ గొంతులో వినిపిస్తోన్న పాట ఆద్యంతం మార్దవంతో సాగడం గమనార్హం. యూట్యూబ్‌లో లైక్స్ మీద లైక్స్ సంపాదిస్తున్న ఈ పాట చిత్రానికి హైలెట్‌గా నిలవనుందన్న విషయం అర్థమవుతుంది. షూటింగ్ సమయంలో దర్శకుడు క్రిష్‌తో తలెత్తిన విభేదాలు, అదే సమయంలో ప్రతి పాత్ర నుంచి సోనూ సూద్ తప్పుకోవడంతో ప్రాజెక్టు బాద్యతను భుజానవేసుకుని కంగన పూర్తి చేయడం తెలిసిందే.


  0 0

  సినిమా అంటేనే పండగ.. అందుకే అన్ని ఎమోషన్స్ అందులో ఉండాలి. అందులో యాక్షన్ దమ్ము ఉండాల్సిందే. దమ్ములేని కథలను చేయనంటున్నాడు బోయపాటి శ్రీను. బోయపాటి డైరెక్షన్ అంటేనే థియేటర్స్‌లో యాక్షన్ మోత. హైవోల్టేజ్ యాక్షన్ చిత్రాల మేకర్‌గా ఇమేజ్ తెచ్చుకున్న బోయపాటి ఈసారి రామ్‌చరణ్‌తో యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించాడు. అదే వినయ విధేయ రామ. కైరా అద్వానీ హీరోయిన్‌గా డివివి దానయ్య నిర్మించిన
  చిత్రం సంక్రాంతి కానుగా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటితో చిట్‌చాట్.

  కథ చెప్పేటపుడు మరీ ఎమోషన్ ఫీలవుతారట?
  సినిమా అంటేనే పండుగ. పండుగని అభిమానుల వరకు చేర్చాలంటే ముఖ్యంగా నటీనటులు నన్ను నమ్మాలి. వాళ్ళు నన్ను నమ్మాలంటే వాళ్ళకన్నా ముందు నేను పదింతలు ఎక్స్‌ర్‌సైజు చేసి, వాళ్ళను ఇన్‌స్పైర్ చేయగలగాలి. ఈ ప్రాసెస్‌లో ఆర్టిస్టులకన్నా కథలో నేనే ఎక్కువగా ఇన్‌వాల్వ్ అవుతాను. కథ చెప్పేటపుడే ఎఫెక్ట్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అపుడే వాళ్ళు సరిగ్గా కనెక్ట్ అవుతారు.

  ఎవరికి వినయ విధేయ రాముడు?
  -వినయం విధేయత ఉంది కాబట్టే రాముడయ్యాడు. ఈ రాముడు ఫ్యామిలీ పట్ల విధేయుడు. నమ్మిన వాళ్ళకోసం ఎంతవరకైనా వెళ్ళే యాక్షన్ రాముడు. ఆ విధేయత ఏ స్థాయిలో వుంటుందనేది సినిమాలో చూస్తారు.
  చరణ్‌ని రాంబోగా చూపించడానికి కారణం?
  -ఈ సినిమాలో హీరో అలా హీమాన్‌లా కనిపించాలి. దానికోసం రామ్‌చరణ్ నాలుగేళ్ల టైం తీసుకున్నాడు. నిజానికి చరణ్‌కు ఈ కథను నాలుగేళ్ల క్రితం చెప్పా. కథ వినగానే ఆయన చాలా బాగుంది, తప్పకుండా చేద్దామన్నాడు. అయితే బాడీలో ఇలాంటి మార్పులు అడిగా. దానికి ఓకె అని అలా న్యూలుక్‌లో కనిపించాడు. ఆ బాడీలో ఈ రోజు వున్న మెచ్యూరిటీ నాలుగేళ్ల క్రితం లేదు. అందుకే పర్‌ఫెక్షన్ కోసం టైమ్ తీసుకోవాల్సి వచ్చింది.
  అంత యాక్షన్ మోతాదు ఎందుకు?
  -నేను చేసిన సినిమాలు భద్ర నుండి ఇప్పటి వినయ విధేయ రామ వరకు ఫ్యామిలీ ఎమోషన్స్‌కే నా మొదటి ప్రాధాన్యత.. అయితే సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండాలి. అలాంటి ఎమోషన్ యాక్షన్‌నుంచే వస్తుంది. ప్రతి సినిమాలో ఫ్యామిలీ, సొసైటీ గురించి కథ చెప్పడానికి ప్రయత్నిస్తా.
  అజర్ బైజాన్ ఎపిసోడ్స్ గురించి?
  -అజర్ బైజాన్ సీక్వెన్స్ ప్రిపేర్ చేసుకుని రామ్‌చరణ్‌కి చెప్పినపుడు, అప్పటికే రెండు నెలల కన్నా ఎక్కువ టైమ్ లేదు. ఇప్పట్లో కష్టం అని నాకు తెలిసినా, మీరు చేసేస్తారు అని ఒక మాట అనేసి వెళ్లిపోయా. ఆయన కూడా ఆ మాటని అలాగే తీసుకుని, నన్ను నమ్మాడు కాబట్టే అంతలా కష్టపడ్డాడు. నిజంగా రామ్‌చరణ్ సపోర్టు లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. ఈ సినిమాకు ఆయన మా అందరికి ఓ బ్రిడ్జిలా నిలబడ్డాడు. నిజంగా రామ్‌చరణ్‌తో పనిచేయడం మరిచిపోలేని అనుభూతి.
  మీ మార్క్ కాకుండా ఆకట్టుకునే పాయింట్?
  -మాస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తోపాటు సినిమాలో ఒక కొత్త పాయింట్‌ని ‘వినయ విధేయ రామ’లో రైజ్ చేశాం. అదేమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. తప్పకుండా ఆడియెన్స్‌కు రీచ్ అవుతుంది.
  ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లాంటి వారి గురించి?
  -సినిమాలోని పాత్ర కోసం అందుబాటులో వున్నవారిని తీసుకోను. నాకు ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది.. ఏ సినిమా కొత్తగా ఉండాలి.. కొత్తదనాన్ని ప్రేక్షకులు ఇష్టపడతారు.. అందుకే కొత్త కొత్తవాళ్ళతో చేయాలనీ ప్లాన్ చేస్తుంటా. ఇందులో ఒక ఐఎఎస్ ఆఫీసర్, హీరోకి పెద్దన్నయ్య అన్నపుడు.. ఎవరిని తీసుకున్నా ఈ క్యారెక్టర్‌లో పర్‌ఫెక్ట్‌గా సింక్ అవ్వాలి. అందుకే ప్రశాంత్‌ని ఎంపిక చేసా. అలా వరసగా ఏజ్ దగ్గరినుండి పెర్ఫామెన్స్ లెవెల్స్ వరకు ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆర్యన్ రాజేష్, స్నేహ, ఇలా చాలామంది పాత్రలను బట్టే ఎంపిక చేశాం.
  విలన్‌గా వివేక్ గురించి?
  -వివేక్‌ని కలిసినపుడు ఆయన అన్న మొదటి మాట- నేను ‘రక్తచరిత్ర’ సినిమా చేశాను. మళ్లీ అదే స్థాయి సినిమా అయితే తప్ప నేను చేయను అని చెప్పాడు. సరే సర్, మీరు చేయకండి కానీ ఒకసారి క్యారెక్టర్ వినండి అని చెప్పాను. ఆయనకు గంటసేపు కథ చెప్పా. అంతే, విన్నాడో లేదో డేట్స్ ఇచ్చేశాడు. అదే కమిట్‌మెంట్‌తో చేసేశాడు.
  కాంబినేషన్.. ఇంటీరియర్ భారీగా, కారణం?
  -నా దృష్టిలో సినిమా అంటే కలర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకే ఎక్కువగా అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో కథల్ని ఎంచుకుంటాను. అందుకే ప్రతి సినిమాలో రిచ్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ అన్పిస్తుందేమో.. ఒకవేళ విలేజ్ బ్యాక్‌డ్రాప్ చేస్తే తప్పకుండా పెంకుటిల్లు కావలసిందే.
  నిర్మాత గురించి?
  -ఏ సినిమాకైనా ప్రధమ క్రెడిట్ నిర్మాతదే. జ్యూస్ నాదైనా మంచి గ్లాస్ ఉండాలి. అందుకే రామ్‌చరణ్, నాకు డి.వి.వి. గారైతేనే బెటర్ అని చెప్పడం జరిగింది. సినిమా ఈ రోజు ఇంత అద్భుతంగా వచ్చిందంటే అది ఆయనవల్లే పాజిబుల్ అయింది. నిజంగా మంచి కమిట్‌మెంట్ ఉన్న నిర్మాత.
  మీరు ఇలాంటి జోనర్‌లోనే సినిమాలు చేస్తారా.. కొత్త జోనర్‌లో ట్రై చేయరా?
  -నా నుండి ఆడియెన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది 100 శాతం ఇవ్వాలి అనే నేననుకుంటా. అవతల ఎక్స్‌పెక్టేషన్స్ ఒకలా ఉండి, మన ప్రొడక్ట్ ఇంకోలా వుంటే మ్యాచ్ అవ్వదు. అందుకే నేను చిన్న సినిమాలు చేయను. ఒకవేళ నేను బయోపిక్ చేసినా, అందులో కూడా దమ్ము కంపల్సరీగా ఉంటుంది. దమ్ములేని సినిమాలు నేను చేయలేను.
  తదుపరి చిత్రాలు?
  -నెక్స్ట్ సినిమా విషయంలో కమిట్‌మెంట్ ఉంది. దాని గురించి తరువాత తెలియజేస్తా. నాకు అందరి హీరోలతో సినిమాలు చేయాలనీ ఉంది.


  0 0

  ఆర్‌ఎక్స్ 100 గ్రాండ్ సక్సెస్ పాయల్ జాతకమే మార్చేసింది. ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు అటు కోలీవుడ్‌లోనూ పాయల్ దూసుకుపోతోంది. అక్కడ ఉదయనిధి స్టాలిన్ లాంటి యంగ్ హీరో సరన అవకాశం అందుకుంది. ప్రస్తుతం ఉదయనిధితో కలిసి ఆన్ లొకేషన్ ఈ బ్యూటీ చేస్తున్న సందడి మామూలుగా లేదు. తమిళ చిత్రం ఏంజెల్ షూటింగ్‌తో బిజీ అంటూ పాయల్ తాజాగా ఓ వీడియోని ఇన్‌స్టాగ్రమ్లో అప్‌లోడ్ చేసింది. హాయ్ ఉదయ్.. షూటింగ్ ఫర్ ఏంజెల్! అంటూ ఛీర్స్ చేసింది. మొత్తానికి పాయల్ జోరు చూస్తుంటే ఇప్పట్లో
  ఎక్కడా తగ్గేట్టే కనిపించడం లేదు. ఎన్టీఆర్- కథానాయకుడు చిత్రంలో జయసుధ పాత్రలో పాయల్ నటిస్తోంది.
  దీంతోపాటు భానుశంకర్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్
  చిత్రంలో నటించనుంది.
  ఇరువార్ ఉల్లమ్ అనే తమిళ
  చిత్రంలో ఇష్కా అనే పంజాబీ
  చిత్రంలోనూ పాయల్
  నటిస్తోంది. ఇకపై
  అగ్ర హీరోల చిత్రాల్లోనూ
  నటించేందుకు
  ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.


  0 0

  దక్షిణాది నటి క్యాథరిన్ ధెరిస్సా లక్క్ఛీన్స్‌కొట్టేసింది.. తమిళంలో బిజీగా ఉన్న ఈ నటికి టాలీవుడ్‌లో మాత్రం అవకాశాలు రావడంలేదు. సరైనోడు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ హీరోయిన్ రేస్‌లో బాగా వెనుకబడిపోయింది. ఈ దశలో ఆమెకు క్రేజీ హీరో విజయ్‌దేవరకొండ సరసన నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వినవస్తున్నాయి. విజయ్ ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఓనమాలు, మళ్లీమళ్లీ రాని రోజు మూవీల ఫేమ్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడు. కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ మూవీలో క్యాథరిన్‌ను తీసుకున్నారు.


  0 0

  సీతంపేట, జనవరి 10: పర్యాటక అభివృద్ధి పేరుతో అమాయక గిరిజనులకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని ఆదివాసీ సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షులు ఆరిక కృష్ణారావు, బీజేపీ మోర్చ అధికార ప్రతినిధి పెంటయ్యలు ప్రశ్నించారు. గురువారం చంద్రమ్మ గుడి వద్ద ఆదివాసీ సంఘాల నాయకులు, పెదరామ పంచాయతీలోని గిరిజనుల అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ సీతంపేట మన్యంలో పర్యాటకం పేరుతో నిర్మిస్తున్న జగతిపల్లి రిసార్ట్స్, చంద్రమ్మ వ్యూ వ్యాలీ రిసార్ట్‌లు, రెస్టారెంట్ల నిర్మాణాలను ఆదివాసీ గిరిజనులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఆదివాసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా అధికారులు అడ్డు తగలడంతో ఆవేదన చెందారు. ఐదో షెడ్యూల్‌లో ఆదివాసీ సంస్కృతి, జీవన విధానానికి నష్టం కలిగించే ఈ రిసార్ట్స్ పనులు మానుకోవాలన్నారు. ఇప్పటికే అనేకసార్లు చంద్రమ్మ తల్లి గుడి వద్ద పర్యాటక పనులు ఆపమని వేడుకున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఆవేదన కలిగిస్తుందన్నారు. పెదరామ పంచాయతీ పరిధిలోని కాగమానుగూడ గ్రామస్తులను ఐటీడీ ఏ అధికారులు భయపెడుతూ దుర్బాషలాడడం సరైనది కాదన్నారు. పీసా చట్టానికి తూట్లు పొడుస్తున్న చంద్రమ్మ రిసార్ట్స్ పనులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
  మంత్రి దృష్టికి మీ సేవా నిర్వాహకుల సమస్యలు
  కొత్తూరు, జనవరి 10: జిల్లాకు చెందిన రాష్ట్ర బిసి సంక్షేమశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి మీసేవా నిర్వాహకుల సమస్యలను తెలిపారు. కొత్తూరుకు చెందిన మీ సేవా నిర్వాహకుల ఆధ్వర్యంలో గురువారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో అచ్చెన్నాయుడును కలిసి వినతిపత్రం ఇచ్చారు. మీ సేవా నిర్వాహకులకు ప్రభుత్వం ఇస్తున్న కమిషన్ పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఒక పంచాయతీకి మీ సేవా కేంద్రం ఉండాలన్న సమస్యలపై మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం.సంతోష్, రామకృష్ణ, రవి, సంతు తదితరులున్నారు.

  ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల రంగవల్లుల పోటీలు
  కొత్తూరు, జనవరి 10: మండలంలోని వసప, వసప కాలనీల్లో నిర్వహిస్తున్న ఎన్ ఎస్ ఎస్ సేవా శిబిరం ముగింపు కార్యక్రమంలో గురువారం విద్యార్థులు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని పురవీధులను శుభ్రం చేసి ముగ్గులను వేసి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గులు చూపర్లకు ఆకట్టుకున్నాయి.
  మండల పరిషత్ కార్యాలయం పనులు పరిశీలన
  కొత్తూరు, జనవరి 10: నూతనంగా నిర్మిస్తున్న మండల పరిషత్ కార్యాలయం పనులు పంచాయతీరాజ్‌శాఖ ఈ ఈ వరప్రసాదరావు గురువారం పరిశీలించారు. రూ.1.25 కోట్లతో నిర్మిస్తున్న ఈ పనులను స్థానిక గుత్తేదారు పొగిరి అర్జునరావుకు పనులు నాణ్యతగా చేయాలని సూచించారు.
  అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
  వంగర, జనవరి 10: అర్హులందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు మండల ప్రత్యేకాధికారి ఎస్.మన్మధరావు పేర్కొన్నారు. గురువారం మండలంలోని శివ్వాం, కొట్టిశ గ్రామాల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. గ్రామసభల్లో అర్హులైన వారు రేషన్‌కార్డులు, పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజులు, తహశీల్దార్ మంగు, ఏవో బాబ్జీ, ఎం ఈవో దుర్గారావు, పశువైద్యాధికారి రాము, వైద్యాధికారి అనీల్‌కుమార్, ఏ ఈలు కార్తీక్‌నాయుడు, మణికుమార్, శివమనోజ్‌కుమార్, ఏపీవో సంగంనాయుడు, ఏపీ ఎం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.


  0 0

  కొత్తూరు, జనవరి 10: మహిళా సంఘాలను బలోపేతం చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే మండల మహిళా సమాఖ్య నిధులు దారి మళ్లాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు నెలల క్రితం మండల మహిళా సమాఖ్యకు కొత్త పాలకవర్గం ఎంపికైనప్పటికీ రికార్డులు బ్యాంకు ఖాతాలను జరగాల్సి ఉన్నా ఆ చర్యలు ఇప్పటివరకు జరగకపోవడం విమర్శలకు తావిస్తుంది. కొత్త పాలకవర్గం బ్యాంకు ఖాతాలను తెరవాల్సిన అధికారులు గత ఎం ఎం ఎస్ పాలకవర్గంలో జరిగిన అక్రమాలు వెలుగు చూడడంతో మండల మహిళా సమాఖ్య నిధులు దారి మళ్లాయని ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లాయి. ఈ నేపధ్యంలో కొత్తూరు మండల మహిళా సమాఖ్య ఆదాయ వ్యయాలకు సంబంధించిన రికార్డులను వెలుగు ఏపీడీ ఆధ్వర్యంలో సీజ్ చేసినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే కొత్తూరు మండల మహిళా సమాఖ్యకు సంబంధించి గత పాలకవర్గం హయాంలో సుమారు 20 నుంచి 30 చెక్కుల్లో లక్షలాది రూపాయలు బ్యాంకుల నుంచి డ్రా చేసి స్వాహాకు పాల్పడ్డారని సెర్ప్ అధికారులకు సమాచారం అందడంతో ఆర్థిక లావాదేవీల వ్యహారాలపై సమగ్ర విచారణను సెర్ప్ అధికారులు కొనసాగిస్తున్నారు. అటు పాలకవర్గం హయంలో మండల మహిళా సమాఖ్య సమావేశాలు, కార్యక్రమాల పేరుతో అత్యధికంగా చెక్కులు విత్‌డ్రా కావడంతో ఇందుకు సంబంధించిన రికార్డులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి కొత్తూరు ఎం ఎస్ ఎస్‌లో విధులు నిర్వహిస్తున్న అకౌంటెంట్ సుమ కూడా ఏపీడీ డైసీ తొలగించారు. అకౌంటెంట్ చంద్రన్న పెళ్ళికానుక పేరుతో అనర్హుల పేర్లును నమోదుచేసి వేలాది రూపాయలను విత్‌డ్రా చేసినట్టు కూడా సెర్ప్ అధికారుల విచారణ తేలడంతో ఆమెను తొలగించినట్టు స్థానిక వెలుగు శాఖ అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి స్థాయిలో ఈ అక్రమాలపై విచారణ సాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త పాలకవర్గం పేరుతో బ్యాంకు ఖాతాలు తెరవకపోవడం, రికార్డులు ఉన్నతాధికారుల ఆధీనంలో ఉండడంతో వెలుగు శాఖకు సంబంధించిన కార్యక్రమాలు స్తంభించాయని ఆ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
  * ఏపీ ఎం వివరణ...
  ఈ విషయమై స్థానిక వెలుగు ఏపీ ఎం రామ్మూర్తి వద్ద ప్రస్తావించగా గత పాలకవర్గం హయాంలో ఆర్థిక లావాదేవీలపై అక్రమాలు జరగడం వాస్తవమేనని, అయితే ఈ విషయంపై సెర్ప్ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారని తెలిపారు. బాధ్యులెవరైనా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు చర్యలు తప్పవన్నారు.
  ప్రజాసంకల్పయాత్ర ఒక చారిత్రిత్మాక ఘట్టం
  పలాస, జనవరి 10: ప్రపంచ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఓ చారిత్రిత్మాక ఘట్టంగా పలాస వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు అభివర్ణించారు. గురువారం ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావడం పట్ల కార్యకర్తలకు మహిళలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో మరో 100 రోజులు కష్టపడితే వైసీపీ విజయం తథ్యమని, తద్వారా నవరత్నాల పథకాలు ద్వారా ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించడమే వై ఎస్ జగన్ లక్ష్యమని, ఇందుకు కార్యకర్తలు, అభిమానులు ఆయన అండగా ఉండి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేసారు. పలాసలో జరిగిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒకటిగా నిలిచిందని, దీని పట్ల వై ఎస్ జగన్ సంతృప్తి వ్యక్తం చేసారని, ఇదే స్పూర్తితో విజయస్థూపం కార్యక్రమం బాధ్యతలు మనకు అప్పగించడం తన కార్యకర్తల క్రమశిక్షణ, నిబద్దతకు నిదర్శనమన్నారు. కార్యకర్తలంతా గ్రామాల్లోకి, ప్రజల్లోకి నవరత్నాల పథకాలను తీసుకువెళ్లాలని, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు నిరాశ చెందకుండా రెట్టింపు ఉత్సాహంతో వైసీపీ విజయానికి బాటలు వేయాలని సూచించారు.
  భారీ వస్తద్రానానికి చురుగ్గా ఏర్పాట్లు
  రాజాం, జనవరి 10: గత 20 ఏళ్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లిఖార్జునరావు సారధ్యంలో నిర్వహించే వస్త్ర, అన్నదాన కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు జీ ఎం ఆర్ వరలక్ష్మీ చారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. దేశం నలుమూలల నుంచి సుమారుగా 25 వేల మంది వరకు పండగ పూట ఈ కార్యక్రమానికి హాజరవుతారని, వచ్చిన వారికి జీ ఎం ఆర్‌టీ కళాశాల ప్రాంగణంలో వస్త్రాలు, అన్నసమారాధన చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దీనికి సంబంధించి రెడ్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారం, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామన్నారు.
  కొత్తవలసలో జన్మభూమి
  రాజాం, జనవరి 10: రాజాం నగర పంచాయతీ కొత్తవలస గ్రామంలో బుధవారం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒంటరి మహిళలకు, ఇతర లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు నమోదు చేస్తున్నామని, భవిష్యత్తులో అర్హులైన వారికి సహకారం అందుతుందన్నారు. ఆయనతో పాటు మున్సిపల్ యంత్రాంగం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  కొత్త అంతకాపల్లికి రోడ్డు మంజూరు
  రాజాం, జనవరి 10: రాజాం నగర పంచాయతీ సరిహద్దు నుంచి కొత్త అంతకాపల్లి వరకు ఉన్న ఒకటిన్నర కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారి ఏర్పాటుకు రూ.కోటిన్నర నిధులు మంజూరైనట్టు మాజీ సర్పంచ్ ప్రతినిధి వి.చిన్నారావు తెలిపారు. త్వరలో ఈ నిధులతో రహదారి ఏర్పాటు చేయడమవుతుందన్నారు.


  0 0

  పలాస, జనవరి 10: అర్హులైన తిత్లీ తుపాన్ బాధితులకు న్యాయబద్దంగా అందాల్సిన పరిహారం అందకపోతే ఈ నెల 17వ తేదిన వౌనదీక్ష తప్పదని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ జిల్లాకలెక్టర్ ధనుంజయరెడ్డికి తెలిపారు. గురువారం మెగాజాబ్‌మేళాలో పాల్గొనేందుకు విచ్చేసిన కలెక్టర్‌ను ఎమ్మెల్యే శివాజీ మర్వాదపూర్వకంగా కలిసి తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. తన వౌనదీక్ష కలెక్టర్ మీద గాని, ప్రభుత్వ యంత్రాంగం మీద గాని కాదని కేవలం మీడియా సాక్షిగా సీ ఎం దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ వౌనదీక్ష అని అన్నారు. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో పరిహారం అందలేదని గోల పెడుతున్నారని, అటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి వివరాలతో తనకు అందించాలని లేకుంటే వౌనదీక్ష తప్పదని, దీనిపై కలెక్టర్ సమాధానం ఇస్తూ తిత్లీ తుపాన్ రెండవ విడత నష్టపరిహారం అందించడానికి సిద్దంగా ఉందని, ఇప్పటికే 3 లక్షల 45 వేల మంది మొదటి విడత దరఖాస్తు చేసుకోగా, వారికి 380 కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందని, రెండవ విడత 36 వేల దరఖాస్తులు రాగా, 48 కోట్ల రూపాయలు సిద్దంగా ఉందని, వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మంచినీళ్లుపేట తీరంలో మునిగిన బోట్లును పైకి తీసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో కిడ్నీ సమస్యలను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారానికి 510 కోట్ల రూపాయలు మంజూరు చేసారని, వీటితో ఇంటింటికి కుళాయిలు ద్వారా శుద్దజలాలను అందిస్తామన్నారు. వారితోపాటు టీడీపీ నాయకులు వజ్జ బాబురావు, గాలి కృష్ణారావు, లోడగల కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
  యువత అందివచ్చిన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్
  పలాస, జనవరి 10: ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగవకాశాలు సమాజంలో బాగా పెరిగాయని, నిరుద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకొని అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి అన్నారు. స్థానిక సూర్యతేజ కాలేజి ఆవరణలో గురువారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సూర్యతేజ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు నిరుద్యోగ యువకులు పొటెత్తారు. ఈ మెగా జాబ్‌మేళాలో పేరొందిన 17 సంస్థలు ఉద్యోగవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడంతో భారీ స్థాయిలో నిరుద్యోగ యువకులు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతీయువకులకు శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. నిరుద్యోగులు తమ కుటుంబాలపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగేందుకు ఇటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. జిల్లాలో సుమారు 28 వేల మందికి యువనేస్తం పథకం ద్వారా లబ్ది పొందుతున్నారని, ఇటీవల ఉద్దాన ప్రాంతంలోని 200 మందికి శ్రీసీటీలో ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. జిల్లాలో విద్యార్హతలు ఉన్నప్పటికి వారికి అవసరమైన స్కిల్ డెవలప్‌మెంట్, బాడీలాంగ్వేజ్, వౌలిక పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కారించడం తెలియక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని గుర్తించి వాటిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎస్ సిడిపి ఎన్.గోవిందరావు, కాలేజి ప్రిన్సిపాల్ ఎం.మోహనరావు, కరస్పాండెంట్ పద్మజకామేశ్వరరావు, వజ్జ బాబురావు, మల్లా శ్రీనివాసరావు, గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

  అధికారులు అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేస్తా
  *రాష్టప్రరిశీలకులు లక్ష్మీనృసింహం
  సరుబుజ్జిలి, జనవరి 10: మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్టు నిరూపిస్తే తక్షణమే సస్పెండ్ చేస్తానని జిల్లా జన్మభూమి మా ఊరు ప్రత్యేకాధికారి రాష్ట్ర పరిశీలకులు పి.లక్ష్మీనృసింహం అన్నారు. గురువారం మండలంలోని సింధువాడ గ్రామ పంచాయతీలో ఎంపీడీవో ఎం.పావని ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా జన్మభూమి గ్రామసభ సందర్భంగా ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరం, వైద్య శిబిరం, అంగన్‌వాడీ పౌష్టికాహార ప్రదర్శన తదితర స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక పాఠశాల వద్ద నిర్వహించిన గ్రామసభలో శాఖల వారీగా గ్రామ సభ నిర్వహిస్తుండగా సింధువాడ మాజీ సర్పంచ్ గోవింద వెంకట శివానందమూర్తి, పలు శాఖలపై ఫిర్యాదు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. సింధువాడ గ్రామ పంచాయతీలో అర్హులను విడనాడి అనర్హులకు పింఛన్లు పంపిణీ చేశారని, తిత్లీ తుపాను పంట నష్టపరిహారంలో భూములు లేని వ్యక్తులకు నష్టపరిహారం అందజేయడం ఎంతవరకు సమంజసమని కొంతమంది దళారులు ప్రజలకు ఆశచూపి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, వయస్సు మార్పిడిలకు పాల్పడుతూ వేల రూపాయలు గుంజుతున్నట్టు మాజీ సర్పంచ్ పేర్కొన్నారు. దీనిపై లక్ష్మీనృసింహం ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామసభలో బాధ్యత ఉన్న మాజీ సర్పంచ్ ఆరోపించిన ప్రతి అంశంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తక్షణమే విచారణ జరిపి సంబంధిత అధికారులను ఇక్కడే సస్పెండ్ చేస్తానంటూ ఆయన తెలపడంతో గ్రామసభలో ఉన్న అధికారులు ఆందోళనకు గురయ్యారు. అలాగే సింధువాడ పెద్ద చెరువు సుమారు 35 ఎకరాలు ఉండగా ఆక్రమణకు గురై రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది రైతులు తెలపగా దీనిపై వారం రోజుల్లో సింధువాడ గ్రామంలో ప్రత్యేకమైన రెవెన్యూ కోర్టు ఏర్పాటు చేసి విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని గ్రామసభలో ఉన్న శ్రీకాకుళం ఆర్డీవో ఎం.వి.రమణను డాక్టర్ లక్ష్మీనృసింహం ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారి దామోదరరావు, ఈవో ఆర్‌డీ విజయభాస్కర్, ఎం ఈవో బాలరాజు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.


  0 0

  ఆమదాలవలస, జనవరి 10: గడిచిన నాలుగన్నరేళ్ల పాలనలో సుమారు రూ.226 కోట్లు ఖర్చుచేసి పట్టణాన్ని అభివృద్ధి చేశానని స్థానిక మున్సిపాల్టీ చైర్‌పర్సన్ తమ్మినేని గీత తెలిపారు. గురువారం పట్టణంలో గల వెంగళరావు కాలనీలో నిర్వహించిన జన్మభూమి- మా ఊరు గ్రామ సభలో మాట్లాడుతూ ఈ కాలనీలో పేద ప్రజల ఇళ్లు నిర్మాణాల నిమిత్తం ప్రభుత్వం రూ.2.35లక్షల రూపాలయను ఉచితంగా అందించిందని ఆమె తెలిపారు. డ్వాక్రా మహిళలకు రూ. 27లక్షలు, 93 గ్యాస్ కనెక్షన్‌లు, 147 తాగునీటి కుళాయి కనెక్షన్‌లు, 276 మందికి పెన్షన్‌లు మంజూరు చేశానని చైర్‌పర్సన్ గీత వివరించారు. రానున్న ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వానికి, ఆయా పార్టీ నాయకులను ప్రజలు విధిగా గెలిపించాలని చైర్‌పర్సన్ గీత కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బాలాజీ ప్రసాద్, వార్డ్ కౌన్సిలర్ రెడ్డి గౌరి, దేశం నాయకులు విద్యాసాగర్, బోర గోవిందరావు, రెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

  ప్రగతి, ప్రజాసేవే ఆశయం
  మందస, జనవరి 10: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు పాలిస్తుంటే ప్రగతి, ప్రజాసేవయే ఆశయంగా తాను పనిచేస్తున్నానని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ అన్నారు. గురువారం 6వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో జిల్లుండలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సీ ఎం చంద్రబాబునాయుడు 119 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదరణ, చంద్రన్న పథకాలు నిరుద్యోగభృతి వంటివి కల్పించి ప్రజలకు ఆర్థికభరోసా కల్పించారన్నారు. ప్రతి పేదవాడికి ఆదుకునే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పలాస నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేసామని, ప్రజల ఆదరాభిమానానికి అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటామన్నారు. పింఛన్లు,చంద్రన్నకానుకలను పంపిణీ చేసారు. ప్రజలు నుంచి అర్జీలను స్వీకరించారు. సొండిపూడి, భిన్నల, కొత్తపల్లిల్లో జన్మభూమి సభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయలక్ష్మి, జడ్‌పీటీసీ సవర కుమారి, ఎంపీడీవో రాజేశ్వరరావు, తహసీల్థార్ శ్యామసుందరావు, ఏ ఇలు శ్రీనివాస్, రాజేష్, పివో రంగలక్ష్మి, టీడీపీ నాయకులు తాతారావు, దుర్యోదన, లింగరాజు, దుర్వాసులు పాల్గొన్నారు.

  సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  మందస, జనవరి 10: సైబర్ నేరాలు పట్ల ప్రజలకు అప్రమత్తం చేసే విధంగా విద్యార్థులు అవగాహన కల్పించాలని, సోషల్‌మీడియా జ్ఞాన సముపార్జన కోసం వినియోగించుకోవాలని మందస ఎస్ ఐ నాగరాజు అన్నారు. మందసలో గురువారం బాలిగాం ఆదిత్య డిగ్రీ కాలేజిల ఎన్ ఎస్ ఎస్ యూనిట్‌ల ఆధ్వర్యంలో జరిగిన సేవా శిబిరంలో మొక్కలు నాటడం, పర్యావరణం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా హెల్మట్‌లు వాడుకోవాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే జీవితం నాశనమవుతుందన్నారు. ప్రిన్సిపాల్ ప్రసాద్, ప్రవీణ్, పివోలు రవికుమార్, సోమేశ్వరరావు, టివి ఆర్ పాలిటెక్నికల్ కాలేజి ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

  తిత్లీ పరిహారంపై అపోహాలు వద్దు: కలెక్టర్
  సోంపేట, జనవరి 10: తిత్లీ పరిహారంపై అపోహాలు నమ్మవద్దు అని జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పటికే పరిహారం అందించడం జరిగిందని, ఇంకా 88 వేల మందికి ఇవ్వాల్సి ఉందని, పండుగలోపు సాధ్యమైనంతవరకు అందరికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాలవలసలో ఎంపీటీసీ జానకమ్మ అధ్యక్షతన జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన మాట్లాడారు. బాధితులు నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించామని, ఇప్పటిదాకా 3 లక్షల 81 వేల దరఖాస్తులు అందగా, వాటిలో 80 శాతం వరకు పరిహారం అందించడం జరిగిందని, మిగిలినవారికి పరిహారం అందిస్తామని, ఈ విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇంటింటికి నీటి కనెక్షన్‌లు ఇచ్చేందుకు పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలో 510 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఈ కార్యక్రమం ఈ ఏడాదిలోపు పూర్తవుతుందన్నారు. గతంలో కన్నా 6వ విడత గ్రామసభల్లో ప్రజలు నుంచి వచ్చే దరఖాస్తులు తగ్గాయన్నారు. 16300 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని, 14 లక్షల చెత్తసేకరణ డబ్బాలు అన్ని గ్రామాల్లోని ప్రజలకు అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లును నిర్మించుకోవాలని కోరారు. రైతులు కోసం మినీగోకులాలు జిల్లాలో 4500 మందికి మంజూరు చేసామన్నారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. రేషన్‌కార్డులు, చంద్రన్నకానుకలు, పింఛన్లును అందించారు. ఎంపీపీ శ్రీనివాసరావు, ప్రత్యేకాధికారి కరుణాకరరావు, ఎంపీడీవో ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

  పాఠశాలకు వాటర్‌ప్లాంట్ వితరణ
  సోంపేట, జనవరి 10: మండలంలోని కర్తలపాలెం ఉన్నత పాఠశాలకు 20 వేల రూపాయలు విలువైన ఆర్‌వో వాటర్‌ప్లాంట్‌ను కొర్లాం ఎంపీటీసీ వెంకటరమణ ఆర్థికసహాయంతో ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది ఆయనను అభినందించారు.
  దుస్తులు పంపిణీ
  సోంపేట, జనవరి 10: జిల్లాలో క్రీడలకు 23 పాఠశాలలను ఎంపిక చేయగా, సోంపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు ఖోఖో క్రీడకు ఎంపికైనారు. వారికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మంజూరుచేసిన 12 జతల క్రీడా దుస్తులను హెచ్ ఎం మల్లేశ్వరరావు, పి ఇటి తవిటయ్యల ఆధ్వర్యంలో అందజేసారు.


  0 0

  జలుమూరు,జనవరి 10: రాష్ట్రంలో ఉన్న బీదల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మండలం బసివాడ, టెక్కలిపాడు గ్రామాల్లో గురువారం జరిగిన 6వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం బీదల కోసం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని టీడీపీ పాలనలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆర్థికంగా రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉన్నప్పటికి అభివృద్ధిని విడనాడకుండా అభివృద్ధే ధ్యేయంగా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు వేలాది కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో భారీ స్థాయిలో రోడ్లు నిర్మాణాలు జరిగాయని ఆయన వివరించారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండదండలుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఎంసి చైర్మన్ వెలమల చంద్రభూషన్, మండల జన్మభూమి కన్వీనర్ బగ్గు గోవిందరావు, మండల టీడీపీ అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, తహశీల్దార్ కె.ప్రవళ్లిక ప్రియ, ఎం ఈవో మాధవరావు, పలు శాఖాధికారులు, పాలకులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా మండలం గుగ్గిలి, కరవంజ గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో పడాల వాసుదేవరావు ప్రజా సంక్షేమం,జన్మభూమి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు, హౌసింగ్ ఏ ఈ బలివాడ గౌరీ శంకర్, వైద్యాధికారులు విక్రమ్‌దేవ్, ఉమాగౌరి, మాతల ఆనందరావు, విద్యుత్‌శాఖ ఏ ఈ శ్రీనివాసరావు, వెలుగు సిసి ప్రభావతిలు పాల్గొన్నారు.

  పల్లెలో సంక్రాంతి సందడి
  జలుమూరు, జనవరి 10: పల్లెలు సంక్రాంతి కలలను సంతరించుకుంటున్నాయి. హిందువులకు ఏడాదికొకసారి వచ్చే బోగి, సంక్రాంతి పర్వదినాలు ఘనంగా జరుపుకునేందుకు పనులు జరుగుతున్నాయి. గతంలో మరణించిన ఇంటి పెద్దలకు సంక్రాంతి పండుగను పురష్కరించుకొని వారికి నూతన వస్త్రాలు, పిండి వంటలు చేసి పొత్తరులతో పెద్దలకు చెల్లించి వాటిని పురోహితులు, జంగమదేవరులుకు అందజేసి దీవనలు అందుకోవడం చేస్తారు. ఇదిలా వుండగా పల్లెల్లో ప్రతీ ఇంటిలో వస్తువులు, ఇళ్లు రంగురంగులుగా కనిపిస్తున్నాయి. హరిదాసులు హరినామస్మరణతో వీదులు సందడిగా కన్పిస్తుండగా సింహాద్రి అప్పన్న, డూడూ బసవన్న సన్నాయిలు వాయిధ్యంలతో గంగిరెద్దు ఇంటింటా సందడితోపల్లెలు కళకళలాడుతున్నాయి. మరో రెండు రోజుల్లో వలసలు వెళ్లేవారు రావడంతో మరింత ఉత్సాహంతో పల్లెలు ఉంటాయని భావిస్తున్నారు.

  తమ్మయ్యపేటలో స్వచ్ఛ్భారత్
  జలుమూరు, జనవరి 10: మండలం హుస్సేన్‌పురం పంచాయతీ తమ్మయ్యపేట గ్రామంలో గురువారం మండలం చల్లవానిపేట మండలం వంశధార డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆధ్వర్యంలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ్భారత్ విలువలు, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
  గ్రామసభలో రేషన్‌కార్డుల కోసం రభస
  ఆమదాలవలస, జనవరి 10: రేషన్ కార్డుల కోసం గత నాలుగేళ్లుగా అనేకసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసినప్పటికి నేటికి కార్డులు మంజూరు కాలేదని పలువురు దరఖాస్తుదారులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోగల తోటాడ గ్రామంలో గురువారం స్పెషలాఫీసర్ పంచాది రాధ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో పలువురు లబ్ధిదారులు వివిధ పథకాలపై అధికారులను నిలదీశారు. తమ పంచాయతీలో అనేక కుటుంబాలు సంఖ్య పెరిగాయని, రేషన్‌కార్డుల కోసం సుమారు 76 కుటుంబాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసినప్పటికి కేవలం పంచాయతీకి మూడు కార్డులు మాత్రమే మంజూరయ్యావని, అధికారుల విధానాలు, తీరుపై గ్రామస్థులు ఉద్రిక్తవాతావరణం సృష్టించారు. తమ రేషన్‌కార్డుల సమస్యపై 1100 ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసినా అతీగతి లేదని మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు చెల్లించాల్సి బకాయిలు నేటికి చెల్లించలేదని, కనీసం సంక్రాంతి నాటికైనా కూలి డబ్బులు ఇవ్వాలని పలువురు కూలీలు అధికారుల వద్ద మొరపెట్టుకొన్నారు. సమస్యలపై ఆందోళన చేస్తున్న వ్యక్తులను స్పెషలాఫీసర్ పంచాది రాధ ఓదార్చి పోలీసుల సహకారంతో అదుపులో తీసుకొని ఉధ్రిక్తపరిస్థితులను సద్దుమణిగించారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ కూన అమ్మాజీ, ఎంపీటీసీ బెండు రమణ, దేశం నాయకులు బెండు రాము, హనుమంతు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


  0 0

  శ్రీకాకుళం: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది..సగానికిపైగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లేవ్..అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రూ. 14 కోట్లు బిల్లులు నిలిచిపోయాయ్..సి.ఎఫ్.ఎం.ఎస్. పరంగా సాంకేతిక అనుమతులు లేవంటూ అడ్వాన్సులు, అలెవెన్సులకు తాత్కలికంగా నిలుపుదల చేసేసిన ఖజానాశాఖ!! వీటన్నింటికీ ఒకటే మాట - సర్వర్ డౌన్ అయిపోయింది. అంటూ ఏరోజుకు ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం వద్ద సొమ్ములేవ్! అన్న విషయాన్ని తెలియనివ్వకుండా ఆర్బీఐ నుంచి అకౌంట్లుకు రావాలని, దాని విషయమై తమకు ఎటువంటి వివరాలు తెలియవంటూ జిల్లా ఖజానాశాఖాధికారులు చేతులేత్తేసే వైనం. ఉద్యోగులు గగ్గోలు పెడుతుంటే - కోట్లాది రూపాయలు పెట్టుబడులకు, రాజకీయ, అధికారిక పర్సంటేజీలు ముందస్తుగా అప్పులు చేసి చెల్లించేవారంతా వడ్డీలు కట్టుకోలేక అల్లాడుతున్నారు. దీనంతటికీ ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఓవర్‌డ్రాఫ్ట్ ఇవ్వకపోవడమే బహిరంగ రహస్యం! కానీ, ఖజానాశాఖ మాత్రం సాంకేతికపరమైన అవరోధాలు చూపిస్తూ గత వారం రోజులుగా మేనేజ్ చేస్తుందంటూ ఆ శాఖ అధికారులే కొంతమంది బహిర్గతం చేయడం గమనార్హం. నాలుగున్నర ఏళ్ళు పాలన పూర్తి చేసి, మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్న అధికార పార్టీ తెలుగుదేశం..ఇప్పటికీ ముఖ్యమంత్రి నుంచి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ అంటూ అన్నీ వేదికల్లోనూ ఉదరగొడుతునే ఉన్నారు. కానీ, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు వంటివని వాటి కోసం రూ. లక్షల కోట్లు చెల్లింపులు చెస్తున్నామంటూ చెప్పుకొస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మాత్రం ఖజానాశాఖలో కుప్పలుతెప్పలుగా పెరిగిపోతున్నాయి. ఖజానాలో కాసులు కొరతగా ఉన్నాయన్న అసలు విషయాన్ని దాచిపెట్టి సర్వర్ డౌన్ అన్న సాంకేతికలోపాన్ని అడ్డంపెట్టుకుని కాలం నెట్టుకొస్తున్నారు. మూడు మాసాలుగా సుమారు రూ. 14 కోట్లు వరకూ బిల్లులకు చెల్లింపులు లేకుండా ఉన్నట్టు అధికారికంగా తెలిసింది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా బ్యాంకు క్లీయరెన్స్‌లురాక బిల్లుల చెల్లింపులు నిలిచిపోతున్నాయి. వేల సంఖ్యలో లావాదేవీలు నిలిచిపోయాయి. గతంలో ఖజానా చెల్లింపులకు ఎటువంటి అవరోధాలు ఉండేవి కావు. బిల్లులుపెట్టడమే ఆలస్యం అదే రోజు బ్యాంకు క్లీయరెన్స్ జాబితా తయారై చెల్లింపునకు అనుమతి వచ్చేది. మరుసటి రోజు బ్యాంకు క్లియరెన్స్ జాబితా తయారై చెల్లింపునకు అనుమతి వచ్చేది. మరుసటి రోజే ఆ ఖాతాదారుడు బిల్లు మొత్తాలను పొందేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. బిల్లులను నగదుగా మార్చుకోవాలంటే ప్రతిరోజూ ఖజానా ఉద్యోగులు ఆర్థికశాఖకు పంపే జాబితాను అనుమతించాలి. అప్పుడే ఆ జాబితాకు బ్యాంకు క్లియరెన్స్ వస్తుంది. రాష్ట్ర కార్యాలయంలో అనుమతి లేకపోవడంతో బ్యాంకు జాబితాలు తయారుకాక చెల్లింపులు అర్థంతంగా నిలిచిపోతున్నాయి. జిల్లాలో ప్రధాన ఖజానా కార్యాలయంతోపాటు 13 ఉప కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో నిత్యం 300 నుంచి 450 వరకూ వివిధ బిల్లులు వస్తుంటాయి. బిల్లు మేరకు రోజు సుమారు మూడు కోట్ల రూపాయల వరకూ చెల్లింపులు జరుగుతుంటాయి. 010 పద్దు కింద ప్రభుత్వం ఉద్యోగులకు నెలకు సుమారు 150 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం కిందస్థాయికి ఎలాంటి ఆదేశాలు పంపకుండానే సంచాలకుని కార్యాలయం నుంచే బిల్లుల లావాదేవీలను పర్యవేక్షిస్తోంది. జిల్లాలో సుమారు 14 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయినట్టు సమాచారం. ప్రభుత్వ ఖజానాలో చెల్లింపులకు అందుబాటులో ఉన్న మొత్తాలను సరిచూసుకుని ఎంతమేరకు ఆర్థికశాఖ అధికారులు, అనుమతిస్తారో అంతవరకే బిల్లు చెల్లింపులను అనుమతిస్తున్నారు. నిత్యం వందలు, వేల సంఖ్యలో బిల్లులు వస్తే అనుమతించే పరిస్థితి ఇప్పుడు లేదు. ముగింపుబిల్లు వరుస క్రమం నుంచి నాలుగు రోజుల నుంచి గరిష్టంగా వారం రోజులు బిల్లులకు ఒక్కసారిగా బ్యాంకు క్లిరెన్స్‌లు ఇస్తున్నారు. ఈలోగా ఖజానాకు బిల్లు సమర్పించి టోకెన్ తీసుకున్నవారి వరుస క్రమం పెరిగిపోతున్నా ప్రాధాన్యతాక్రమంలో తీసుకోవడం లేదు. బిల్లుల చెల్లింపుల ప్రక్రియ కాకపోవడంతో ఖజానా కార్యాలయాలలో పర్సంటేజీల గోల కూడా వినిపిస్తోంది. వివిధ శాఖల ఉద్యోగులు బిల్లులు, పింఛనుదారుల బిల్లులు, పంచాయితీ పరిధిలోని సాధారణ నిధులు, జెడ్పీ, మండల పరిషత్, మార్కెట్ యార్డుల బిల్లులు ఇలా పలురకాల చెల్లింపులపై అనధికారక ఆంక్షలు తంటా తెచ్చిపెతుడున్నాయి. ఖజానా కార్యాలయాల్లో బిల్లులు సాపైన బ్యాంకు జాబితాలకు రూపం రావడం లేదు. అనధికారికంగా ఖజానాపై వచ్చిన అంక్షలపై ఆ శాఖాధికారులకు ఎటువంటి సమాచారం లేదు. నిత్యం బిల్లులను తీసుకుని వారికి టోకెన్లు మాత్రం ఇవ్వాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. టోకెన్ జారీ చేసి తదుపరి లావాదేవీకి ఉపక్రమించే సరికి అంతర్జాలం అనుమతించడం లేదు. ఈ పరిస్థితి మార్చి నెల వరకూ కొనసాగుతుందని తెలుస్తోంది. శాఖలవారీగా ఖర్చులు క్రమబద్దీకరణ, అభివృద్ధి పనుల బిల్లులు, ఎల్.వో.సి.లకు ప్రాధాన్యతక్రమంలో ఆమోదం దొరుకుంది. అంతర్జాలంలోని పర్సనల్ అకౌంట్ పోర్టల్ ద్వారా బిల్లులు చెల్లింపులకు ఎల్.వో.సి.ల ఆమోదం జరుగుతోంది. 010 ద్వారా నెలవారీ జీవితాకు డిసెంబర్ నెలకు జాప్యం ఏర్పడింది. అంతర్జాలంలో ఎదురయ్యే సాంకేతిక లోపాలతో కొంత సమయం వృధా అవుతోంది. కానీ, అభివృద్ధి బిల్లులకు మాత్రం అడ్డంకులు తొలగడం లేదు. వీటిపై అనధికార ఆజ్ఞలు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి రోజు వరకూ కొనసాగినా ఆశ్చర్చపడాల్సిందేమీ లేదంటూ ఖజానాశాఖ అధికారులే సుస్పష్టం చేయడం గమనార్హం!


  0 0

  తాడికొండ, జనవరి 10: దేశ ప్రధాన మంత్రి నరేద్రమోదీకి, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనబడటం లేదా, కన్నా వస్తే నా కారులో తీసుకువెళ్లి అభివృద్ధిని చూపిస్తానని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. మండల పరిధిలోని పొనె్నకల్లు పంచాయితీ కార్యాలయంలో గురువారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ నాలుగు రోజుల క్రింతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ బూత్ కమీటీల వీడియో కాన్ఫరెన్స్‌లో సభ్యత, సంస్కారం, గౌరవ మార్యాదలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కించపరిచే విధంగా మాట్లాడటాన్ని ఎమ్మెల్యే ఖండించారు. విశాఖపట్నంకు రైల్వే జోన్ ఇవ్వకుండా రాజకీయాలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకుడు ప్రధాని వద్ద గొంతువిప్పి మాట్లాడిన దాఖాలు లేవని, తన పైన ఉన్న కేసుల నుండి బయటపడటం కోసమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భాజపాతో కలసి పోయారని విమర్శించారు. ఏపీ ప్రజలు తెలివైనవారని, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఉన్నాయని జగన్ భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎంపిపి షేక్ రిజ్వానా జిలానీ, తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గుంటుపల్లి మధుసూదనరావు, టీడీపీ సీనియర్ నాయకుడు కంచర్ల శివరామయ్య, మాజీ సర్పంచ్ జి శివలీల పాల్గొన్నారు.

  నకిలీ పొటాష్ అమ్మితే చర్యలు తప్పవ్
  క్రోసూరు, జనవరి 10: పురుగుమందుల షాపుల యజమానులు రైతులకు నకిలీ పొటాష్ విక్రయిస్తే చర్యలు తప్పవని ఎడిఎ అమలాకుమారి హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేశారు. షాపుల్లోని రిజిస్ట్రర్‌లు, పురుగుమందుల శ్యాంపిల్స్ సేకరించి గోడౌన్‌ల వద్ద ఉన్న పొటాష్‌లను పరిశీలించారు. పొటాష్ ద్రావణాన్ని నీటిలో వేసి చేతిని ముంచితే స్పర్శ లేనట్లయితే అది నకిలీగా నిర్ధారణ అవుతుందని, రైతులు గమనించాలన్నారు. అనుమానం వస్తే అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎఒ పి సురేష్, ఎఇఇ ప్రవల్లిక పాల్గొన్నారు.


  0 0

  నాగార్జున యూనివర్సిటీ, జనవరి 11: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎల్‌ఐసి చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన ముగ్గురు విద్యార్థులకు వర్సిటీ వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ గురువారం త్రిచక్ర వాహనాలు అందచేశారు. వర్సిటీలోని సెంటర్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆధ్వర్యంలో జరిగిన త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ వర్సిటీలోని విభాగాలు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా సామాజిక మార్పునకు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందని అన్నారు. వర్సిటీలోని సోషల్ రెస్పాన్సిబిలిటీ సెంటర్ మరిన్ని సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ మరింత ఖ్యాతిని ఆర్జించాలని కోరారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కె జాన్‌పాల్. రిజిస్ట్రార్ ఆచార్య కె రోశయ్య, వర్సిటీ స్టాటిస్టిక్స్ విభాగాధిపతి ఆచార్య జివి ఆర్ ఎస్ ఆంజనేయులు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

  పేదల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి
  మంగళగిరి, జనవరి 10: పేద, బడుగు వర్గాల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. ఆరో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని 29, 30, 31 వార్డుల్లోను, మండల పరిధిలోని ఎర్రబాలెంలోను జన్మభూమి సభలు జరిగాయి. ఆయా సభల్లో పాల్గొన్న చైర్మన్ చిరంజీవి మాట్లాడుతూ సొంత ఇల్లులేని పేదలకు ప్రభుత్వం నిర్మిస్తున్న గృహాల కేటాయింపు జరుగుతుందని చిరంజీవి పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు, మార్కెట్‌యార్డు చైర్మన్ వల్లభనేని సాయిప్రసాద్, వైస్‌చైర్మన్ గుత్తికొండ ధనంజయరావు, కౌన్సిలర్ వింజమూరి ఆషాబాల, చంద్రశేఖర్, తిరువీధుల బాపనయ్య తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామంలో జరిగిన జన్మభూమి సభలో చిరంజీవితో పాటు మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు, జడ్‌పీటీసీ సభ్యురాలు ఆకుల జయసత్య పాల్గొని ప్రసంగించారు. గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు జన్మభూమి సభావేదిక ఎదుట బైఠాయించారు. లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులు, పెన్షన్లను అందజేశారు. ఎంపీడీఓ జీ వీరాంజనేయులు, ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


  0 0

  కర్నూలు సిటీ, జనవరి 10:ప్రతిపక్ష పార్టీ నేత జగన్ చేసింది పాదయాత్ర కాదు.. విహారయాత్ర అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. జగన్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి ప్రజలకు తెలిపి వారిని చైతన్యపరిచి వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిపించి సీఎం చంద్రబాబుకు జిల్లాను కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం సోమిశెట్టి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. జగన్ ఏడాది పాటు అలుపు లేకుండా పాదయాత్ర చేశారని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదని, అలాంటి యాత్ర 90 ఏళ్ల ముసలివాళ్లు, చిన్న పిల్లలు కూడా చేస్తారన్నారు. పాదయాత్రలో ఒక రోజు సెలవు తీసుకుంటే మరొక రోజు కోర్టుకు హాజరుకావడానికి కొద్ది రోజుల పాటు కోడి కత్తి డ్రామా ఆడారే తప్ప పాదయాత్ర ఎక్కడ చేశారని ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో ఏ ఒక్క కార్యకర్తకు చిన్న సహాయం చేయని జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోతారని భయపడి అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారన్నారు. ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి పరిష్కరించడానికి కృషి చేస్తారని భావించి ఓట్లు వేసి గెలిపిస్తే రోడ్ల వెంట తిరిగారన్నారు. జగన్ రాజకీయాలకు అనర్హుడని, ఒకవేళ ప్రజలు ఆయనకు ఓట్లు వేస్తే దండగే అన్నారు. జగన్ రాష్ట్భ్రావృద్ధి గురించి ఏ ఒక్క రోజు కూడా సీఎం చంద్రబాబుతో చర్చించలేదని, అతడి ధ్యాసంతా సీఎం కుర్చీ వైపే తిరుగుతుందన్నారు. రాష్ట్భ్రావృద్ధి సహకరించకుండా ప్రతి పనిని అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకుడిగా మారాడన్నారు. ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నా జగన్ నోరుమెదపడం లేదని, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వారిని ప్రజలు కూడా నమ్మేస్థితిలో లేరన్నారు.


  0 0

  డోన్, జనవరి 10:రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని, ప్రత్యేక హోదా కాంగ్రెస్‌పార్టీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ స్పష్టం చేశారు. ‘ఇంటింటికీ కాంగ్రెస్’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె డోన్ పట్టణంలోని 13వ వార్డులో పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అలాగే కూరగాయల మార్కెట్‌లో కలియ తిరిగి చిరు వ్యాపారుల బాగోగుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వ్యాపారులు ఇంటి స్థలాలు, పక్కా గృహాల కోసం విన్నవించారు. వీటిపై స్పందించిన ఆమె తాము అధికారంలోకి రాగానే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే ఏ ప్రభుత్వమైనా ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి సాధించిందన్నారు. పట్టణానికి జీడీపీ ద్వారా శాశ్వత తాగునీటి ప్రాజెక్టు తీసుకొచ్చిన ఘనత తమదే అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి తనను గెలిపించాలని సుజాతమ్మ కోరారు.


  0 0

  కృష్ణగిరి, జనవరి 10:నవ్యాంధ్రప్రదేశ్ పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వాటిని పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం శోచనీయమని, అలాంటి వారిని మరొకసారి గెలిపించవద్దని ప్రజలను కోరారు. మండల పరిధిలోని టి.గోకులపాడు గ్రామంలో గురువారం జన్మభూమి-మా ఊరు గ్రామసభ నిర్వహించగా డిప్యూటీ సీఎం కేఈ పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ విభజన వల్ల అభివృద్ధిలో వెనుకబడ్డ ఏపీని ఆదుకుంటామని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పిన మోదీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని ప్రధాని మోదీతో సహా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కలిసి అనేక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు చెబుతున్న నవరత్నాలు నకిలీ రత్నాలని ఎద్దేవా చేశారు. ఆరు పదుల వయస్సులో కూడా సీఎం చంద్రబాబు ఏకధాటిగా చేసిన పాదయాత్రకు వారానికి ఒకసారి బ్రేక్ తీసుకుని వైఎస్ జగన్ చేసిన పాదయాత్రకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. వైఎస్ హయాంలో పని చేసిన ఎంతోమంది అధికారులు జైలుపాలైన విషయాన్ని ప్రజలు, అధికారులు మర్చిపోలేదన్నారు. ఇక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, తన భార్య బ్రహ్మణి, తల్లి భువనేశ్వరికి చెందిన ఆస్తులను ప్రతి ఏటా ప్రకటిస్తారని మరి వైఎస్ జగన్ ఏనాడూ తన ఆస్తుల వివరాలను వెల్లడించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ప్యాకేజీ కానీ ఇచ్చి ఉంటే సీఎం చంద్రబాబు నవ్యాంధ్రను మరింత అభివృద్ధి చేసే వారన్నారు. నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2 కిలో బియ్యం పథకం నేడు దేశ వ్యాప్తంగా అమలవుతోందన్నారు. 2014 ఎన్నికల సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒకొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. అందులో భాగంగా ఓర్వకల్లు వద్ద రూ. 88.5 కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించి సీఎం చంద్రబాబు ఇటీవల జాతికి అంకితం చేశారని వెల్లడించారు. హంద్రీనీవా నుంచి ప్రతి చెరువుకు నీటిని మళ్లించే కార్యక్రమం కూడా మొదలు పెట్టామన్నారు. చుక్కల భూములపై విచారించి సుమోటోగా చర్యలు తీసుకుని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా వైద్యాధికారి డా. ప్రసాద్ మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా కాన్పులు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. హంద్రీనీవా నీటితో మండలంలో భూగర్భ జలాలు పెరిగాయని, ఏడాదికి రైతులు 4 పంటలు పండించుకుంటున్నారని మాజీ జడ్పీటీసీ సభ్యులు కేఈ జయన్న అన్నారు. జన్మభూమి గ్రామసభలో గ్రామస్థులు ఇంకా పలు సమస్యలను కేఈ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో 19 గ్రూపులకు రూ. 1.9 లక్షల చెక్కును అందజేశారు.
  సంక్రాంతి కానుక పంపిణీలో జాప్యం
  * రాష్ట్ర ఫుడ్‌కార్పొరేషన్ చైర్మన్ చల్లా ఆగ్రహం * వీఆర్‌ఓ, డీలర్లపై జేసీకి ఫిర్యాదు
  ఆదోనిటౌన్, జనవరి 10: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేద, నిరుపేదల సైతం పండుగులు జరుపుకోవాలని ఉచితంగా అందిస్తున్న సంక్రాంతి కానుకల పంపిణీలో ఆలస్యం చేయడం పట్ల రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇస్వీలో జరిగిన జన్మభూమి సభలో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీపై సభలో విచారించారు. అయితే ప్రజలు తమకు ఇంతవరకు ఏ కానుకలు ఇవ్వలేదనడంతో అక్కడే ఉన్న వీఆర్‌ఓ, డీలర్లను విచారించారు. పండుగ కోసం ఇస్తున్న కానుకలను పండుగ అయిపోని తరువాత ఇస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకు ఇవ్వలేదని చెప్పాలని వీఆర్‌ఓ కాశీం, డీలర్ గోవిందు, నరహారీరెడ్డిలను విచారించారు. మిషన్లు పని చేయలేదనడంతో ఫోన్లో జాయింట్ కలెక్టర్ రవి సుభాస్‌కు ఫిర్యాదు చేశారు. ఇస్వీలో ఇంతవరకు చంద్రన్న కానుకలు ఇవ్వలేదని, వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే డీలర్లపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రెండు రోజుల్లో కానుకలు పంపిణీ చేస్తామని నియోజకవర్గ అధికారి వెంకటసుబ్బయ్య, నోడల్ అధికారి ధనుంజయ హామీ ఇచ్చారు. ఇస్వీ గ్రామాన్ని తాను దత్తతీసుకొని అభివృద్ధి చేస్తానని చల్లా తెలిపారు. ఆదోని అభివృద్ధి ఎంతో కష్టపడి పని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు అండగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

  మైనార్టీ బడ్జెట్‌లో రూ. 1102 కోట్ల కేటాయింపు
  * ఎంపీ బుట్టా రేణుక
  ఆదోనిటౌన్, జనవరి 10: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న 34 లక్షల మైనార్టీల సంక్షేమం అబివృద్ధి కోసం సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018-19 బడ్జెట్‌లో రూ. 1102 కోట్లు కేటాయించారని ఎంపీ బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి షేక్‌మస్తాన్‌వలీ తెలిపారు. గురువారం పట్టణంలోని మహ్మద్ ఆలీ పార్కులో రూ.2.20కోట్లతో నిర్మించిన తలపెట్టిన షాదీఖానా నిర్మాణం కోసం మీనాక్షినాయుడు ఆధ్వర్యంలో ఎంపీ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఆదోని ముస్లిం మైనార్టీలకు ఎంతోకాలంగా ఉన్న షాదీఖానా కల నేడు నెరవేరుతుండడం హర్షించ దగ్గ విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీలకు కేవలం రూ.323కోట్లు బడ్జెట్ ఉండగా నేడు సీఎం చంద్రబాబు కేవలం 13 జిల్లాలకే రూ.1102 కోట్లు కేటాయించడం, దుల్హన్ పథకం కింద పెళ్లిల కోసం 45వేల మందికి రూ.202కోట్లు ఆర్థిక సహాయం ఉచితంగా అందించారని, అందులో జిల్లాలో 9వేల మందికి రూ.45కోట్లు ఇచ్చారన్నారు. ఆదోని నియోజకవర్గంలో రూ.18కోట్లతో మైనార్టీలకు రెసిడెన్షియల్ కళాశాల, రూ.390 కోట్లతో ఐటీఐ కళాశాల, రూ.1.90కోట్లతో ఉర్దూజూనియర్ కాలేజీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రధాని మోదీని ఢీకున్న ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబునాయుడు అని, అలాంటి చంద్రబాబుకు మైనార్టీలు అన్ని విధాలుగా అండగా ఉండాలని, తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ఆశీర్వాదించాలని కోరారు. 9 నెలల్లో షాదీఖానా నిర్మాణం పూర్తి చేస్తామని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బుట్టారేణుకను, ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే ప్రారంభోత్సవానికి వస్తామని మీనాక్షినాయుడు స్పష్టం చేశారు. షాదీఖానా నిర్మాణాన్ని అడుగడుగున అడ్డుకుంటున్నారని, నిన్న కూడా తనకు అజ్ఞాత వ్యక్తులు లేక రాశారాని, అయినా తాను షాదీఖానా నిర్మాణానికి సిద్ధమయ్యాయని, దీనిని మైనార్టీలు గుర్తించాలని కోరారు.


  0 0

  సత్తుపల్లి, జనవరి 10: ఖమ్మం జిల్లాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి కేవలం ఒక సీటు దక్కడం బాధాకరమని ఓటమికి అనేక కారణాలు దోహదమయ్యాయని బహిరంగ వేదికలపై పరస్పర విమర్శలు చేసుకోవడం తగదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం సత్తుపల్లి ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ పార్టీ ఓటమికి పోడు భూములు ఒక కారణంగా ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన హరితహారం పథకం కింద పోడు చేసిన భూముల్లో మొక్కలు నాటడం వలన తమకు భూమి దక్కదేమోనని గిరిజనులు అపోహ పడ్డారని ఈ విషయంలో కూటమి అసత్య ప్రచారం ఓటమికి కారణంగా చెప్పారు. అదే విధంగా ఖమ్మం జిల్లా భౌగోళికంగా ఆంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలతో మిళితమై ఉన్న కారణంగా మహాకూటమి విజయానికి జిల్లా ఒక కారణమన్నారు. అదే విధంగా ఒక పక్క ముఖ్యమంత్రి కెసిఆర్ ఖమ్మం జిల్లాను అనేక రకాలుగా అభివృద్ధి పరిచేందుకు విశేష కృషి చేస్తున్నారని అయినప్పటికి జిల్లా ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీని ఓటమి పాలు చేశారని తెలిపారు ఓటమిపాలైనప్పటికి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు 13వేల కోట్ల రూపాయలతో సీతారామ ప్రాజెక్టు ద్వారా కృష్ణా, గోదావరి పరివాహక ఫ్రాంతంలో గోదావరి జలాలు అందించేందుకు నిర్మాణ దశలో ఉందని రానున్న రెండున్నర సంవత్సరాల కాలంలో గోదావరి జలాలు జిల్లాకు రానున్నాయని ఆయన చెప్పారు. ఓటమి విషయం కెసిఆర్ క్షుణ్ణంగా విశే్లషిస్తున్నారని త్వరలో కెసిఆర్‌కు జిల్లా ఓటమి విషయంపై స్పష్టత వస్తుందన్నారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికి బహిరంగ వేదికలపై విమర్శలు చేయడం సరైన పద్దతి కాదని తమవైపు నుంచి తప్పు ఉంటే సరిదిద్దుకుంటామని ఈ విషయాన్ని కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్ళామని తెలిపారు. ఓటమి పాలైనప్పటికి ముఖ్యమంత్రి కన్నతండ్రిలా జిల్లాను ఓ కొడుకులా చూసుకుంటూ అనేక రంగాల్లో అభివృద్ది పరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్ మట్టా దయానంద్, చెక్కిలాల మోహన్‌రావు, తోట గణేష్, సుధాకర్ తదితరులున్నారు.


  0 0

  కొత్తగూడెం, జనవరి 10: పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకోవాలని ఎస్పీ సునీల్‌దత్ ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్లాన్నారు. గురువారం ఒఎస్డీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలను కాపాడే సమయంలో విధి నిర్వహణలో ఎలాంటి రజీలేకుండా పనిచేయాలన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహించే వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతోపాటు మట్కా, గుట్కా విక్రయించేవారిపై నిఘా పెట్టి వారిపై కేసులు పెట్టాలని ఆదేశించారు. వివిధ సమస్యలపై పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రజల్లో స్నేహపూర్వకంగా వ్యహరించి వారి సమస్యల పరిష్కారానికి పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్‌ల పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను సులభంగా అదుపుచేయొచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు చేపట్టాలి అన్నారు. పెండింగ్‌లోవున్న కేసులను పరిష్కరించేందుకు న్యాయశాఖ అధికారులతో సమన్వయంతో విధులు నిర్వహించి నేరస్తులకు శిక్షలుపడెలా కృషి చేయాలన్నారు. 2019 సంవత్సరంలో యూనిఫామ్ సర్వీస్ డెలివరీ లక్ష్యంతో పనిచేయాలన్నారు. పోలీసు స్టేషన్లలో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా శ్రమించిన పోలీసులు అదే స్ఫూర్తితో పంచాయితీ ఎన్నికలుసైతం జరిగేలా కృషి చేయాలన్నారు. ఫారెస్టు జిల్లా అధికారి రాంబాబు మాట్లాడుతూ కలప అక్రమ రవాణ జరగకుండా పోలీసులు, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రధానంగా అటవీ భూముల ఆక్రమణను అడ్డుకోవడంలో పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని పోలీసు, అటవీ అధికారులు సేకరించి అక్రమ దారులపై కేసులు నమోదు చేయడంలో ఇరుశాఖల అధికారులు సహకరించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి, భద్రాచలం ఎ ఎస్పీ సంగ్రామ్ సింఘ్‌పాటీల్, కొత్తగూడెం డిస్పీ ఎస్ ఎం ఆలీ, ఇల్లందు డి స్పీ ప్రకాష్‌రావు, పాల్వంచ డి ఎస్పీ మధుసుదన్‌రావు, మణుగూరు డిస్పీ సాయిబాబా, సిఐలు కుమారస్వామి, ఆదినారాయణ, కరుణాకర్, రాయల వెంకటేశ్వర్లు, వేణుచంధర్, సత్యనారాయణ రెడ్డి, వివిధ పోలీసు స్టేషన్లకు చెందిన సిఐలు, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.


older | 1 | .... | 2032 | 2033 | (Page 2034) | 2035 | 2036 | .... | 2067 | newer