Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

మళ్లీ ఈ లింకులేమిటీ?

$
0
0

రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానంపై జనం కలవరం
నెల్లూరు, జూలై 10: ఆధార్ కార్డు రగడ మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల ముందు వరకు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఆధార్ కార్డు తప్పనిసరనే నిబంధనలు విధించడంతో ఆధార్ కార్డు లేనివారంతా అధిక ధర వెచ్చించి సిలిండర్లు కొనుగోలుచేసి అవస్థపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ సాధారణ ధరలకే సిలిండర్ సరఫరా చేయాలని ఆదేశించడంతో ఆ వివాదం అంతటితో సద్దుమణిగింది. అయితే ఈసారి రేషన్ కార్డుకూ ఆధార్ కార్డును లింకు పెట్టి రేషన్‌కార్డుల లబ్ధిదారుల ప్రయోజనాలకు గండి కొట్టే విధంగా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
రేషన్ కార్డుకు ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానం చేయాలని లేకుంటే ఆ కార్డు చెల్లదని పౌర సరఫరా శాఖాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక ఆధార కార్డు పొందలేక పోయిన తెలుపురంగు రేషన్ కార్డుదారులు తమకు సరుకులు అందుతాయో, అందవో అని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో 8లక్షల 65వేల రేషన్ కార్డులు మంజూరయ్యాయి. 2009- 10లో చేసిన సర్వేలో దాదాపు లక్షకు పైగా కార్డులను రద్దు చేశారు. అయినా మళ్లీ కేటాయింపుల్లో లక్షా యాభై వేల కార్డులు మంజూరు చేశారు. ఇటీవల తెల్లకార్డులున్న వారందరికీ కూపన్లు అందచేశారు. గత నెలతో వీటి గడువు కూడా ముగిసిపోయింది. కొత్తగా ఏర్పాటైన టిడిపి ప్రభుత్వం మళ్లీ కూపన్లు మంజూరు చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థకు ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకంగా పేరు మార్చి కూపన్లు మంజూరు చేసింది. వాటి ద్వారా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదలకు రాయితీపై ప్రతినెలా నిత్యావసర సరుకులు సరఫరా చేస్తుంది. అయితే ప్రస్తుతం రేషన్ కార్డులకు ఆధార్ కార్డులు ఫ్యామిలీ ఫొటోలను అనుసంధానం చేయాలని లేకుంటే ఆ కార్డు చెల్లదని సరుకులు కూడా అందవని ప్రభుత్వం మెలిక పెట్టడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఆధార్ కార్డుతోపాటు ఫ్యామిలీ ఫొటోను ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డుకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించాలని సూచించింది. ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటోలు అనుసంధానం చేయని రేషన్ కార్డులను బ్లాక్ లిస్టులో పెట్టి చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఆధార్ కార్డులకోసం వివరాలు నమోదు చేసుకుని ఇంకా కార్డులు అందనివారు, నేటికీ వివరాలు కూడా నమోదు చేసుకోనివారు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాకు చెందిన అనేమంది ఆధార్ కార్డుకోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్నప్పటికీ కార్డులు అందలేదు. ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానం పై ఆగస్టు నుంచే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్టు అధికారులు చెపుతుండడంతో తెల్ల రేషన్ కార్డుదారులు కంగారుపడుతున్నారు.

రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానంపై జనం కలవరం
english title: 
aadhar

భారత్ ఆలౌట్ 457

$
0
0

ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టు
నాటింగ్‌హామ్, జూలై 10: ఇంగ్లాండ్‌తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 457 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీ (146), కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (82), భువనేశ్వర్ కుమార్ (58), మహమ్మద్ షమీ (51) అర్ధ సెంచరీలు భారత్‌కు మెరుగైన స్కోరును అందించాయి. భువీ, షమీ 229 బంతులు ఎదుర్కొని, చివరి వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడం విశేషం. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 259 పరుగులు చేసిన భారత్ ఈ ఓవర్ నైట్ స్కోరుతో గురువారం ఉదయం ఆటను కొనసాగించి 304 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. విజయ్ 361 బంతులు ఎదుర్కొని 146 పరుగులు చేసి జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా 25 పరుగులకే పెవిలియన్ చేరగా, ధోనీ 152 బంతుల్లో 82 పరుగులు చేసి దురదృష్ట వశాత్తు రనౌటయ్యాడు. స్టువర్ట్ బిన్నీ (1), ఇశాంత్ శర్మ (1) వికెట్లు త్వరత్వరగా కూలగా, చివరిలో భువీ, షమీ అడ్డుగోడగా నిలిచారు. వీరి భాగస్వామ్యాన్ని ఛేదించడానికి ఇంగ్లాండ్ బౌలర్లు 38.1 ఓవర్లు కష్టపడాల్సి వచ్చింది. మోయిన్ అలీ బౌలింగ్‌లో జో రూట్ క్యాచ్ అందుకోగా భువీ అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 2011లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ అత్యధికంగా 96.3 ఓవర్లు ఆడింది. ఈ ఇన్నింగ్స్‌లో 161 ఓవర్లు నిలబడడం భారత బ్యాటింగ్ మెరుగుపడిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది.
భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 9 పరుగులకే మొదటి వికెట్‌ను కెప్టెన్ అలిస్టార్ కుక్ రూపంలో చేజార్చుకుంది. అనంతరం శామ్ రాబ్సన్ (20), గారీ బ్యాలెన్స్ (15) మరో వికెట్ పడకుండా జాగ్ర త్తగా ఆడుతూ, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇం గ్లాండ్ స్కోరును 43 పరుగులకు చేర్చారు.
భారత్‌కే పిచ్ అనుకూలం: ఆండర్సన్
నాటింగ్‌హామ్, జూలై 10: తమ కంటే భారత్‌కే ట్రెంట్ బ్రిడ్జి పిచ్ అనుకూలంగా ఉందని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వ్యాఖ్యానించాడు. ‘మేము చాలా గొప్పగా ఆతిథ్యమిస్తాం’ అంటూ పిచ్ క్యూరేటర్, అధికారులను పరోక్షంగా విమర్శించాడు. ఇంగ్లాండ్‌తో భారత్ మొదటి టెస్టు బుధవారం ఆరంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మురళీ విజయ్ 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ ఇంగ్లాండ్ బౌలర్లను తీవ్రంగా వేధించింది. క్రీజ్‌లో నిలదొక్కుకున్న విజయ్‌ని అవుట్ చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. ఈ విషయాన్ని అతను ప్రస్తావిస్తూ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నదని అన్నాడు.
కల నెరవేరింది: విజయ్
విదేశాల్లో టెస్టు సెంచరీ సాధించాలన్న తన కల నెరవేరిందని భారత ఓపెనర్, సెంచరీ హీరో మురళీ విజయ్ అన్నాడు. నెట్స్‌లో బాగా కష్టపడ్డానని, అందుకు ఫలితం దక్కిందని చెప్పాడు. చాలాకాలంగా విదేశాల్లో శతకం కోసం ఎదురుచూస్తున్నానని, ఇన్నాళ్లకు తన కల ఫలించిందని అన్నాడు.
పిచ్ తీరు మారుతుంది: గ్రౌండ్స్‌మన్ బిర్క్స్
పిచ్ స్వభావం మారుతుందని ట్రెంట్ బ్రిడ్జి గ్రౌండ్స్‌మన్ స్టీవ్ బిర్క్స్ స్పష్టం చేశాడు. మొదటి రోజు ఆటలో బ్యాట్స్‌మెన్‌దే పైచేయి కావడంతో పిచ్ స్వభావంపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో అతను వివరణ ఇచ్చాడు. పిచ్ తీరులో మార్పు వస్తుందని అన్నాడు.
(చిత్రం) అర్ధ సెంచరీలు.. భువీ, షమీ

ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టు
english title: 
team india

ప్లే ఆఫ్ మ్యాచ్‌కి నేమార్ రెడీ!

$
0
0

బ్రెసిల్లా, జూలై 10: వరల్డ్ కప్‌లో మూడో స్థానం కోసం శనివారం నెదర్లాండ్స్‌లో జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సూపర్ స్టార్ నేమార్ ఆడతాడని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (బిఎఫ్‌ఎఫ్) ప్రతినిధి రోడ్రిగో పైవా ప్రకటించాడు. కొలంబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ ఆడుతున్నప్పుడు నేమార్ గాయపడిన విషయం తెలిసిందే. కొలంబియా డిఫెండర్ జువాన్ జునిగా కాలు అడ్డం పెట్టడంతో నేమార్ కింద పడ్డాడు. అతని వెన్నుముక పక్కన ఉండే ఎముక చిట్లిందని వైద్యులు తెలిపారు. టెరెసొపొలిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేమార్ మిగతా మ్యాచ్‌ల్లో పాల్గొనే అవకాశం లేదని బిఎఫ్‌ఎఫ్ ఇంతకు ముందు ప్రకటించింది. అయితే, జర్మనీతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్ 1-7 తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడంతో అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు కనిపించింది. బ్రెజిల్ వందేళ్ల సాకర్ చరిత్రలో అంత భారీ తేడాతో ఓడడం అదే మొదటిసారి. వరల్డ్ కప్‌లోనే ఏ సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా ఇంత ఏక పక్షంగా జరగలేదు. ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేకపోతున్న బ్రెజిల్ కనీసం మూడో స్థానాన్నయినా దక్కించుకోవాలని ఆశిస్తున్నది. నేమార్‌తోపాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న రెగ్యులర్ కెప్టెన్ థియాగో సిల్వ కూడా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. మూడో స్థానానికి నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో వీరిద్దరూ పాల్గొంటారని పైవా ప్రకటించాడు. అయితే, బిఎఫ్‌ఎఫ్ ఇంకా అధికారికంగా ఈ వార్తను ధ్రువీకరించలేదు.
కేరళ వైద్యం!
తిరువనంతపురం: నేమార్‌కు కేరళ వైద్యం అందించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ కేరళ ఆయుర్వేద వైద్యుల బృందం నేమార్ కేసును క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అతనికి అందించాల్సిన చికిత్సా విధానాన్ని ఖరారు చేసింది. ఈ వివరాలను ముఖ్య మంత్రి ఊమెన్ చాందీకి అందచేసింది. బిఎఫ్‌ఎఫ్ అధికారులను సంప్రదించి, నేమార్‌ను కేరళకు రప్పించేందుకు ప్రయత్నించాలని కోరింది. కేరళ ఆయుర్వేద వైద్యం పట్ల నేమార్ సానుకూలంగా ఉన్నట్టు ఇది వరకే వార్తలు వచ్చాయి.
(చిత్రం) ఆసుపత్రిలో నేమార్

వరల్డ్ కప్‌లో మూడో స్థానం కోసం శనివారం
english title: 
neymar

ఓ ఇంటివాడైన జొకొవిచ్

$
0
0

స్వెటి స్ట్ఫోన్ (మాంటెనీగ్రో), జూలై 10: ఇటీవలే వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌తోపాటు మళ్లీ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కూడా సొంతం చేసుకున్న నొవాక్ జొకొవిచ్ తన చిరకాల స్నేహితురాలు జెలెనా రిస్టిక్‌తో ఇక్కడి ఓ ఐదు నక్షత్రాల రిసార్ట్‌లో జరిగింది. గత నెల 14వ తేదీన వీరి వివాహం జరగాల్సి ఉండగా, వింబుల్డన్ టోర్నీని దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసుకున్నారు. ఆండీ ముర్రే, సారా ఫెర్గూసన్, రిచర్డ్ బ్రాస్నన్, మరియా షరపోవా, సెర్బియాకే చెందిన జన్కొ తిప్సారెవిచ్, అతని జీవిత భాగస్వామి బిల్జానా వంటి అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జొకొవిచ్, జెలెనా వివాహం జరిగింది.

ఓ ఇంటివాడైన జొకొవిచ్
english title: 
married

పిసిబి చైర్మన్ సేథీపై వేటు

$
0
0

ఇస్లామాబాద్, జూలై 10: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)లో మళ్లీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పిసిబి అధ్యక్షుడిగా ఉన్న నజామ్ సేథీపై పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వేటు వేశాడు. అతని స్థానంలో తాత్కాలి అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తి జంషద్ అలీ షాను నియమించాడు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ సల్మాన్ అస్లామ్ బట్ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపాడు. కొత్త నిబంధనావళిని అనుసరించి మరో నెల రోజుల్లో పిసిబి కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయనీ, అప్పటి వరకూ అలీ షా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతాడని వివరించాడు. పిసిబికి చీఫ్ ప్యాట్రన్ హోదాలో ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ చర్య తీసుకున్నట్టు తెలిపాడు. ఎన్నికలు సజావుగా సాగడానికి త్వరలోనే మధ్యంతర కమిటీని ఏర్పాటు చేస్తామన్నాడు. ప్రభుత్వ ఆదేశాలను తాను కోర్టు దృష్టికి తెస్తున్నట్టు చెప్పాడు. ఇలావుంటే, సేథీ ఇటీవల కాలంలో పిసిబి అధ్యక్ష పదవిని అలంకరించడం, ఉద్వాసనకు గురికావడం ఆనవాయితీగా మారింది. సేథీ, జకా అష్రాఫ్ మధ్య పిసిబి అధ్యక్ష పదవి మ్యూజికల్ చైర్‌గా మారింది. కాగా ఈ మార్పులు పిసిబి కార్యకలాపాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఎవరు ఎప్పుడు అధ్యక్ష స్థానాన్ని అలంకరిస్తారో? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పలేని పరిస్థితుల్లో పిసిబి అధికారులు, సిబ్బంది దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా తెరపైకి అలీ షా వచ్చాడు. అతని వ్యవహార శైలి ఎలా ఉంటుందోనన్న అనుమానం అందరినీ వేధిస్తున్నది. అంతేగాక, అతను చాలా కొద్దికాలమే పదవిలో ఉంటే, కీలక నిర్ణయాలు ఎలా తీసుకుంటాడన్న ప్రశ్న వ్యక్తమవుతోంది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)లో మళ్లీ గందరగోళ పరిస్థితులు
english title: 
pcb

‘చిట్టీ’ల సాయం!

$
0
0

సావో పౌలో, జూలై 10: విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టడానికి చిట్టీలను రాసుకుంటారు. మరచిపోతామన్న భయంతో పలు అంశాలను కాగితంపై లేదా చేతిపై రాసుకోవడం చాలా మందికి అలవాటు. వరల్డ్ కప్ సాకర్ సెమీ ఫైనల్‌లో నెదర్లాండ్స్‌పై విజయం సాధించి అర్జెంటీనా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన సెర్గియో రొమెరో కూడా చిట్టీల సాయంతోనే తన పాత్రను సమర్థంగా పోషించాడన్న వాస్తవం మ్యాచ్‌ని కవర్ చేసిన కెమెరాల ద్వారా వెలుగు చూసింది. నెదర్లాండ్స్ ఆటగాళ్ల బలాబలాలు, వారు బంతిని కొట్టే విధానాలపై రొమెరో ముందుగానే సంక్షిప్త సమాచారాన్ని సేకరించాడు. పెనాల్టీ షూటౌట్ అనివార్యమైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చిన్న కాగితంపై ఆ సమాచారాన్ని రాసుకున్నాడు. షూటౌట్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన ఒక్కో ఆటగాడు పెనాల్టీ కిక్ కొట్టడానికి వచ్చిన వెంటనే అతని గురించి రాసుకున్న వివరాలను జాగ్రత్త చదువుకొని, బంతిని ఆపడానికి రొమెరో సిద్ధమయ్యాడు. తన ప్రయత్నాల్లో రెండు విఫలమైనా, మరో రెండు పెనాల్టీల్లో అతను ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకోగలిగాడు. రోన్ వ్లార్, వెస్లీ స్నెడ్జర్ కిక్‌లను సేవ్ చేసి జర్మనీని గెట్టెక్కించాడు. గోల్‌కీపర్లు ఇలా నోట్స్ రాసుకొని, అవసరమైన సమయాల్లో వాటిని చూసుకొని వ్యూహరచన చేయడం వరల్డ్ కప్‌లో కొత్తేమీ కాదు. 2006 వరల్డ్ కప్‌లో జర్మనీ గోల్‌కీపర్ జెన్స్ లేమాన్ కూడా ఇదే విధంగా నోట్స్‌పై ఆధారపడ్డాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో పెనాల్టీ షూటౌట్ అవసరంకాగా, అర్జెంటీనా ఆటగాళ్లు నలుగురు చేసిన ప్రయత్నాల్లో రెంటిని అడ్డుకొని అతను జర్మనీని విజయపథంలో నడిపించాడు. ఆతర్వాత ఆ చిట్టీలను వేలానికి పెట్టి, తద్వారా వచ్చిన 1.3 మిలియన్ డాలర్లను ఒక ధార్మిక సంస్థకు విరాళంగా ఇచ్చాడు.
ఇద్దరు ఆటగాళ్లు ససేమిరా
అర్జెంటీనాతో జరిగిన సెమీ ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్‌లో మొదట కిక్‌ను కొట్టడానికి ఇద్దరు ఆటగాళ్లు నిరాకరించినట్టు నెదర్లాండ్స్ మేనేజర్ లూయిస్ వాన్ గాల్ చెప్పాడు. డిఫెండర్ రొన్ వ్లాన్ మొదటి కిక్‌ను కొట్టేందుకు రావడం స్టేడియంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వ్లాన్ తన ప్రయత్నంలో విఫలమైన వెంటనే, అతనికి మొదటి అవకాశం ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నించారు. ఈ పరిణామంపై గాల్ వివరణనిచ్చాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లు పెనాల్టీ షూటౌట్‌లో మొదటి కిక్‌ను కొట్టేందుకు నిరాకరించారని వివరించాడు. ఇలావుంటే, కోస్టారికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అద్భుతమైన సేవ్‌తో జట్టును ఆదుకున్న సబ్‌స్టిట్యూట్ గోల్ కీపర్ టిమ్ క్లర్‌ను బరిలోకి దించే అవకాశం గాల్‌కు లేకపోయింది. నిబంధనల ప్రకారం అతను ముగ్గురు సబ్‌స్టిట్యూట్స్‌ను మాత్రమే ఆడించాలి. ఈ మూడు అవకాశాలను వాడుకున్న కారణంగా కర్ల్ సేవలు అతనికి లభించలేదు. అలకమార్ జట్టుకు తాను మేనేజర్‌గా వ్యవహరించినప్పుడు అదే జట్టు సభ్యుడైన సెర్గియో రొమెరో నెదర్లాండ్స్ ప్రయత్నాలు అడ్డుకొని అర్జెంటీనాను గెలిపించడం గాల్‌ను మరింత అసహనానికి గురి చేసింది. ఫైనల్ చేరలేకపోయనా, మూడో స్థానానికి శనివారం బ్రెజిల్‌తో జరిగే మ్యాచ్‌ని గెల్చుకొని పరువు నిలబెట్టు కుంటామని అతను ధీమా వ్యక్తం చేస్తున్నాడు. వ్యూహ రచనలో ఎలాంటి పోరపాట్లు వేవని అతను స్పష్టం చేశాడు.

విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టడానికి చిట్టీలను
english title: 
chitties

అర్జెంటీనాను వరల్డ్ కప్ ఫైనల్ చేర్చిన హీరో రొమెరో

$
0
0

షూటౌట్‌లో నెదర్లాండ్స్ పరాజయం
================
సావో పౌలో, జూలై 10: వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించగా, ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా అర్జెంటీనా ఫైనల్ చేరింది. పెనాల్టీ షూటౌట్ అనివార్యమైన ఈ మ్యాచ్‌లో రాన్ వ్లార్, వెస్లీ స్నెడ్జర్ ప్రయత్నాలను అర్జెంటీనా గోల్‌కీపర్ సెర్గియో రొమెరో సమర్థంగా అడ్డుకున్నాడు. రియల్ హీరోగా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. మొదటి సెమీ ఫైనల్‌లో ఆతిథ్య దేశం బ్రెజిల్‌ను 7-1 తేడాతో జర్మనీ చిత్తుచేసిన నేపథ్యంలో, అర్జెంటీనా, డచ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ తీవ్ర ఉత్కంఠను రేపుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, మ్యాచ్ అందుకు భిన్నంగా సాగింది. ఇరు జట్లు బంతిని ఎక్కువ సమయం తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రాధాన్యమిచ్చాయే తప్ప తీవ్ర స్థాయిలో దాడులకు ఉపక్రమించలేదు. గోల్ పోస్టులపై జరిగిన కొన్ని దాడులను ఇరు జట్ల గోల్‌కీపర్లు అడ్డుకున్నారు. గొంజాలొ హిగున్ కొట్టిన బంతి గోల్ పోస్టును తగులుతూ దూరంగా దూసుకెళ్లింది. మొత్తం మీద మ్యాచ్ నిర్ణీత సమయంతోపాటు, ఇంజురీ టైమ్ ముగిసే వరకూ ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. దీనితో 30 నిమిషాల ఎక్‌స్ట్రాటైమ్‌ను అనుమతించారు. కానీ, మ్యాచ్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. గోల్స్ కోసం అడపాదడపా ప్రయత్నాలు, ఎక్కువ శాతం ఆక్రమించిన రక్షణాత్మక విధానాలు అభిమానులను నిరాశ పరిచాయి. సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ అద్భుతాలు సృష్టిస్తాడని, అర్జెంటీనాకు గోల్స్ వరద తప్పదని ఊహించిన వారి అంచనాలు తారుమారయ్యాయి. కెప్టెన్ మెస్సీ సహా అర్జెంటీనా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ ప్రతిభను కనబరచలేదు. నెదర్లాండ్స్ ఆటగాళ్లు దాడులు చేయడంలో కొంత వెనుకబడినా, అర్జెంటీనా దూకుడుకు బాగానే కళ్లెం వేశారు. ఎక్‌స్ట్రా టైమ్‌లోనూ ఫలితం తేలకపోవడంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. నెదర్లాండ్స్ ఆటగాడు రాన్ వ్లార్ ఫస్ట్ కిక్‌ను వృథా చేయగా, అర్జెంటీనాకు మెస్సీ గోల్‌ను అందించాడు. అర్జెన్ రొబెన్ సమర్థంగా గోల్‌ను సాధించడంతో డచ్‌కు ఈక్వెలైజర్ లభించింది. ఆ వెంటనే అర్జెంటీనాకు ఎజెకెల్ గరే 2-1 ఆధిక్యాన్ని సంపాదించి పెట్టాడు. నెదర్లాండ్స్ తరఫున వెస్నీ స్నెడ్జర్ చేసిన ప్రయత్నాన్ని అర్జెంటీనా గోల్‌కీపర్ రొమెరో అడ్డుకోవడంతో మ్యాచ్ ఫలితం దాదాపుగా స్పష్టమైంది. సెర్గియో అగెరో కూడా గోల్ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం 3-1కి పెరిగింది. డచ్‌కి డిర్క్ కుయట్ గోల్‌ను అందించగా, అర్జెంటీనాకు మాక్సీ రోడ్రిగెజ్ గోల్ సాధించి పెట్టాడు. 4-2 తేడాతో గెలిచిన అర్జెంటీనా, 24 సంవత్సరాల తర్వాత మళ్లీ వరల్డ్ కప్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. మొత్తం మీద అర్జెంటీనా తరఫున షూటౌట్ కిక్ కొట్టిన నలుగురూ సఫలంకాగా, నెదర్లాండ్స్ ఆగాళ్లలో ఇద్దరు మాత్రమే గోల్స్ చేయగలిగారు. మరో ఇద్దరు విఫలం కావడంతో డచ్ ఇంటిదారి పట్టింది. అర్జెంటీనా ఈనెల 13న (్భరత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 1.30 నుంచి మొదలు) జరిగే ఫైనల్‌లో జర్మనీని ఢీ కొంటుంది.
స్ట్ఫోనోకు నివాళి
గుండె పోటుతో మృతి చెందిన రియల్ మాడ్రిడ్ ‘లెజెండ్’ ఆల్ఫ్రెడో డి స్ట్ఫోనోకు అర్జెంటీనా ఆటగాళ్లు నివాళులర్పించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు వౌనం పాటించారు. చేతులకు నల్ల పట్టీలు కట్టుకొని, అతని పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. (చిత్రం) అర్జెంటీనాను గెలిపించిన గోల్‌కీపర్ రొమెరో

షూటౌట్‌లో నెదర్లాండ్స్ పరాజయం
english title: 
hero romero

నెదర్లాండ్స్ దిగ్భ్రాంతి

$
0
0

ఆమ్‌స్టర్‌డామ్, జూలై 10: వరల్డ్ కప్ సాకర్‌లో నెదర్లాండ్స్ తప్పక ఫైనల్ చేరుతుందన్న ధీమాతో ఉన్న అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అర్జెంటీనాతో జరిగిన సెమీ ఫైనల్‌లో అర్జెన్ రొబెన్ లాంటి కీలక ఆటగాడు కూడా దూకుడుగా ఆడకుండా మ్యాచ్‌ని పెనాల్టీ షూటౌట్ వరకూ తీసుకురావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. షూటౌట్‌లో డిఫెండర్ రొన్ వ్లార్‌కు మొదటి కిక్ కొట్టే అవకాశం ఇవ్వడం, అతను ఆ ప్రయత్నంలో విఫలం కావడం విమర్శలకు కారణమైంది. వ్లార్ గోల్ చేయలేకపోవడంతో మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిందన్న వాదన వినిపిస్తున్నది. కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌లో కర్ల్ అద్భుతంగా సేవ్ చేస్తే సెమీ ఫైనల్‌లో గోల్‌కీపర్ జాస్పెర్ సిలెసెన్ చేతులెత్తేయడం దారుణమన్న అభిప్రాయం దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. మొత్తం మీద ఈ ఫలితం నెదర్లాండ్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్‌ని సావో పౌలోలో ప్రత్యక్షంగా, నెదర్లాండ్స్ వ్యాప్తంగా టీవీల్లో చూసిన అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ జట్టు పోరాడకుండానే ఓడిందని వాపోతున్నారు. ఇక మూడో స్థానానికి బ్రెజిల్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని కోరుతున్నారు.

వరల్డ్ కప్ సాకర్‌లో నెదర్లాండ్స్ తప్పక ఫైనల్ చేరుతుందన్న ధీమాతో
english title: 
dutch

సొమ్మును ఖర్చు చేసేదెలా?

$
0
0

బడ్జెట్ కేటాయంపులపై జాతీయ క్రీడా సమాఖ్యల ప్రశ్న

న్యూఢిల్లీ, జూలై 10: బడ్జెట్‌లో కేటాయించిన 100 కోట్ల రూపాయలను ఏ విధంగా ఖర్చు చేయాలంటూ జాతీయ క్రీడా సమాఖ్యలు ప్రశ్నిస్తున్నాయి. కామనె్వల్త్ గేమ్స్‌లోగా ఈ మొత్తాన్ని వెచ్చించడం ఏ విధంగా సాధ్యమవుతుందని నిలదీస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జాతీయ క్రీడా సమాఖ్యలకు 185 కోట్ల రూపాయలు కేటాయించారు. అదనంగా మరో 100 కోట్లను కామనె్వల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు భారత బృందం సిద్ధమయ్యేందుకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఈనెల 23 నుంచి కామనె్వల్త్ గేమ్స్ ఆరంభం కానుండగా, పది రోజుల్లో వంద కోట్ల రూపాయలను ఏ విధంగా ఖర్చు చేస్తాం? అథ్లెట్లకు ఎలాంటి శిక్షణనిస్తాం? అని జాతీయ సమాఖ్యలు ప్రశ్నిస్తున్నాయి. ఇది చాలా ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమని అభిప్రాయపడుతున్నాయి. గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో మొత్తం 17 క్రీడా విభాగాల్లో పోటీలు జరగనుండగా, భారత్ 13 విభాగాల్లో తలపడుతుంది. అదే విధంగా ఇచెయాన్ (దక్షిణ కొరియా)లో జరిగే ఆసియా క్రీడల్లో 36 విభాగాలకుగాను 30 విభాగాల్లో పోటీ పడుతుంది. అథ్లెట్లకు ఏడాది పాటు శిక్షణ ఇప్పించడానికి ఒక్కో జాతీయ సమాఖ్యకు సమారు మూడు లేదా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అయితే, కామనె్వల్త్ గేమ్స్ ఈనెలలోనే మొదలుకానుండగా, ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు జరుగుతాయి. ఈ రెండు ఈవెంట్స్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యే అథ్లెట్లకు శిక్షణ కోసం ఇప్పుడు వంద కోట్ల రూపాయలు కేటాయించి ప్రయోజనం ఏముంటుందని వివిధ జాతీయ క్రీడా సమాఖ్యల అధికారులు వాపోతున్నారు. ఇలావుంటే, ఆర్థికంగా ఆదుకోకపోతే కామనె్వల్త్ గేమ్స్ నుంచి వైదొలగక తప్పదని హాకీ ఇండియా (హెచ్‌ఐ) చేసిన హెచ్చరికలపై జైట్లీ స్పందించారు. ప్రస్తుత బడ్జెట్‌లో హెచ్‌ఐకి 25 కోట్ల రూపాయలు దక్కనున్నాయి. మొత్తం మీద కేంద్ర క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖకు 1,769 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ ద్వారా లభిస్తాయి. క్రీడాభివృద్ధికి ఇతోథిక ప్రాధాన్యం ఇస్తా మని జైట్లీ ప్రకటించగా, కేటాయంపులను వివిధ ఈవెంట్స్ కు ముందుగానే జరపాలని క్రీడా సమాఖ్యలు అంటున్నా య. హెచ్‌ఐ సహా పలు సమాఖ్యలు ఇప్పటికే ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోతున్నదంటూ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నాయ. ఈ తరుణంలో జైట్లీ ప్రవేశపె ట్టిన బడ్జెట్ క్రీడా రంగానికి కొంత ఆశాజనకంగా ఉన్నప్పటి కీ సమస్యలన్నీ తీరేలా కనిపించడం లేదు.

బడ్జెట్ కేటాయంపులపై జాతీయ క్రీడా సమాఖ్యల ప్రశ్న
english title: 
how to spend

ఎమ్మెల్సీ ఎన్నికలపై మల్లగుల్లాలు

$
0
0

* రెండు ‘స్థానిక సంస్థల’ పదవులు
* టిక్కెట్ల కోసం బాబుపై వత్తిడి పెంచుతున్న నేతలు
* వుడా చైర్మన్ రేసులో వెలగపూడి?
విశాఖపట్నం, జూలై 11: జిల్లాలో ఇటీవల ఖాళీ అయిన, త్వరలోనే ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు టిడిపి కసరత్తు ప్రారంభించింది. జిల్లాలోని స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి దాడి వీరభద్రరావు, సూర్యనారాయణ రాజు ఎంపికయ్యారు. దాడి వీరభద్రరావు పదవీ కాలం కొద్ది నెలల కిందటే ముగిసింది. తిరిగి ఆ పదవి తెలుగుదేశం పార్టీ ఆయనకు ఇవ్వకపోవడంతో, పార్టీని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక సూర్యనారాయణ రాజు పదవీ కాలం కూడా కొద్ది రోజుల్లో ముగియనుంది. ఇలాగే రాష్ట్రంలో మరి కొన్ని నియోజకవర్గాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి త్వరలోనే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే జిల్లాలో ఈ రెండు పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో జివిఎంసి కూడా విలీనమై ఉంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినప్పుడు జివిఎంసికి ఎన్నికలు జరగలేదు. జివిఎంసిలో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలను విలీనం చేశారు. ఈ విలీనాన్ని కొనసాగించాలా? లేకుంటే, మున్సిపాలిటీలను యథావిధిగా ఉంచాలా? అన్న అంశంపై ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఒకవేళ విలీనం లేకుంటే, సెప్టెంబరు, లేదా డిసెంబర్‌లో జివిఎంసిలోని 72 వార్డులకు ఎన్నికలు జరపాలని భావిస్తున్నారు. వీలీనం కొనసాగితే, మళ్లీ వార్డుల విభజన జరిపి, ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే, స్థానిక సంస్థల నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో జివిఎంసి కార్పొరేటర్లు ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జివిఎంసిని మినహాయించి రెండు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తారా? కార్పొరేటర్ల ఓట్లు తప్పనిసరి అనుకుంటే ఒక నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఈ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడిన పలువురు నేతలు, తొలినుంచి పార్టీలో ఉన్న పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. వారి జాబితా చూస్తే చాలా పెద్దగానే ఉంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు మదిలో ఏముందో అంతుబట్టటం లేదు. కాగా, ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కని వారికి జివిఎంసి ఎన్నికల్లో కీలక పదవులు కట్టబెట్టాలని టిడిపి అథిష్ఠానం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా వుడా చైర్మన్ పదవి సుమారు మూడు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. వుడా చైర్మన్‌గా రవి పదవీ విరమణ చేసిన తరువాత ఆ స్థానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఆయన చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా వుడాకు బోర్డు లేదు. ఇప్పుడు వుడా కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వుడా బోర్డును నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చైర్మన్ పదవి కోసం వెలగపూడి రామకృష్ణబాబు ప్రయత్నిస్తున్నట్టు భోగట్టా. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

పట్టపగలు వృద్ధురాలి హత్య
* రెండు తులాల బంగారం కోసమే ఈ దారుణం
* ఇంటి అడ్రాస్ అడిగినట్టు నటించి వృద్ధురాలిని కడతేర్చిన గుర్తు తెలియని యువకుడు
విశాఖపట్నం(క్రైం), జూలై 11: ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిని హత్య చేసి గుర్తు తెలియని యువకుడు ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకు పోయాడు. పట్టపగలు ఆరిలోవలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఆరిలోవ కాలనీలోని ఓ పూరి పాకలో ఎదురుపాకల ఎరకమ్మ(70) అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసముంటుంది. చాకలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని యువకుడు మోటారుబైక్‌పై ఆమె ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఎరకమ్మ ఇంట్లోకి వెళ్లి ఇంటి అడ్రాస్ కావాలని అడుగుతున్నట్టు నటించి, వృద్ధురాలు ఒంటరిగా ఉన్నట్టు గుర్తించి వెంటనే ఆమెను మంచంపైకి తోసి పీక నులిమి హతమార్చి బంగారు ముక్కుపుడక, చెవిదిద్దులను తీసుకుని అక్కడ నుండి ఉడాయించాడు. కొంత సమయం తర్వాత వృద్ధురాలి ఇంటి పక్కన ఉన్నవారు గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. క్రైం ఎడిసిపి వరదరాజులు, ఎసిపి రంగరాజు, సిఐ ధనుంజయనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ సిబ్బంది హంతకునికి సంబంధించిన ప్రాధమిక ఆధారాలను సేకరించగా, పోలీసు జాగిలం సంఘటన స్థలం నుండి కాలనీ పక్కన గల ఓ ఇంటి వద్ద ఆగిపోయినట్టు పోలీసులు గుర్తించారు. వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి స్థానికంగా తెలిసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కెజిహెచ్ మార్చురీకి తరలించారు. సిఐ థనుంజయనాయుడు నేతృత్వంలో ఆరిలోవ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

గీతం బిఆర్క్ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు
* జెఇఇ మెయిన్ ర్యాంకర్లకు నేరుగా ప్రవేశం
విశాలాక్షినగర్, జూలై 11: గీతం విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ద్వారా నిర్వహిస్తున్న ఐదేళ్ళ బిఆర్క్ కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు జరుపుతున్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ సాయి తెలిపారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లోని బిఆర్క్ కోర్సు అడ్మిషన్లు జాతీయస్థాయి ప్రవేశపరీక్ష నాటాలో ర్యాంకు ఆధారంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జెఇఇ-మెయిన్ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు బిఆర్క్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌ను నాటా పరీక్ష కేంద్రంగా సిఓఎ గుర్తించిందని అన్నారు. నాటా ప్రవేశపరీక్షకు హాజరు కాని విద్యార్థులు గీతంలో ఆన్‌లైన్ ప్రవేశఫరీక్ష రాయవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు యూనివర్శిటీ వైబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపారు.
22న ఐదేళ్ళ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ప్రవేశపరీక్ష
ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన విద్యార్థులకు గీతం విశ్వవిద్యలయంలో ఐదేళ్ళ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సును ఉచితంగా చదివించడానికి ప్రతినెలా 50 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లన అందించడానికి ఔషధరంగంలో పేరొందిన లారెస్ ల్యాబ్స్ ముందుకు వచ్చింది. యూనివర్శిటీ-ఇండస్ట్రీ పరస్పర సహకారంలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు తక్షణం తమ సంస్థల్లో ఉద్యోగ అవకాశాన్ని సైతం లారెస్‌ల్యాబ్స్ కల్పించనుంది. ఇంటర్మీడియేట్ ఎంపిసి, బైపిసి గ్రూపులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.లక్ష్మణదాస్ తెలిపారు.

బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ప్రదర్శన
* కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
విశాలాక్షినగర్, జూలై 11:ప్రజావ్యతిక బిజెపి ప్రభుత్వ సాధారణ బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఉదయం జగదాంబ జంక్షన్‌లో సిపిఎం పార్టీ ఆద్వర్యంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. బడ్జెట్ సాధారణ ప్రజలకు గొడ్డలివేటు అంటూ ప్రదర్శన చేశారు. అనంతరం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగా సిపిఎం కార్యాలయం నుంచి జగదాంబ జంక్షన్ వరకూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జగదాంబ జోన్ కార్యదర్శి జిఎస్.రాజేశ్వరరావు మాట్లాడుతూ నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేటర్లకు మోదాన్ని, సామాన్యులకు ఖేదాన్ని మిగిల్చిందని అన్నారు. సంపన్నులకు 22 వేల కోట్ల రాయితీలు ప్రకటించిన బిజెపి, సామాన్యులపై 7 వేల కోట్లు భారం వేసిందని విమర్శించారు. సబ్సిడీలను కుదించి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక పథకాలకు కేటాయింపులు తగ్గించిందని అన్నారు. ప్రభుత్వరంగంలో వాటాలను అమ్మడం, రక్షణ నుండి గృహనిర్మాణాల వరకు ఎఫ్‌డిఐలను అనుమతించిందని అన్నారు. బీమారంగంలో ఎఫ్‌డిఐ వాటా 49 శాతానికి పెంచడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జగదాంబ జోన్ నాయకులు ఎం.సుబ్బారావు, వై.రాజు, డివైఎఫ్‌ఐ నాయకులు వివి.శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు కె.అప్పలరాజు, జి.నాయనబాబు, కె.నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ-విశాఖ మధ్య రెండు విమానాలు
* 25వ తేదీ నుంచి అందుబాటులోకి
* మరొకటి త్వరలో
* ఇండిగో, ఏయిరిండియా ఎయిర్స్‌లైన్స్ నిర్వహణ
విశాఖపట్నం, జూలై 11: ఢిల్లీ-విశాఖపట్నం మధ్య మరో రెండు కొత్త విమానాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఈ నెల 26వ తేదీ నుంచి ప్రవేశపెడతున్నట్టు ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ (ఇండియా) అధ్యక్షుడు డి.వరదారెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇండిగో, ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌లు వీటిని నిర్వహిస్తాయన్నారు. ఇండిగో ఎయిర్స్‌లైన్స్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఏ320 విమాన సర్వీసును ఢిల్లీలో మధ్యాహ్నాం బయలుదేరి హైదరాబాద్ మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందన్నారు. ఇది ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అలాగే ఎయిరిండియా ఢిల్లీ-విశాఖ మధ్య మరో విమాన సర్వీసును ప్రవేశపెడుతుందన్నారు. చెన్నై-విశాఖ-్ఢల్లీల మధ్య నడిచే ఇది విశాఖ నుంచి సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరుతుందన్నారు. అయితే ఈ విమాన సర్వీసు త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. ఈ విధంగా ఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలకు విమాన సర్వీసులు పెరుగుతున్నాయని, వీటిని ప్రయాణికులు ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

చర్చలు విఫలం కొనసాగుతున్న సమ్మె
* వర్షంలోను ట్రామాకేర్ ఉద్యోగుల నిరసన
విశాఖపట్నం, జూలై 11: ట్రామాకేర్ ఉద్యోగుల సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. భారీ వర్షంలోను దీనిని కొనసాగిస్తున్నారు. సమ్మె విరమింపజేసేందుకు కెజిహెచ్ వైద్యాధికారులు చేసిన ప్రయత్నాలు సైతం ఏమాత్రం ఫలించలేదు. ట్రామాకేర్ కో-ఆర్డినేటర్ వరప్రసాద్ సమక్ష్యంలో శుక్రవారం మధ్యాహ్నాం కొద్దిసేపు సమ్మెలోకి దిగిన ఉద్యోగులతో చర్చలు జరిపారు. ఈ నెలాఖరికి ఖచ్చితంగా తొమ్మిది మాసాల జీతాల బకాయిలను చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీని ఉద్యోగులు విశ్వసించలేదు. హామీలా కాకుండా దీనిని రాతపూర్వకంగా మార్పుచేయాలని, అపుడే తామంతా నమ్ముతామని లేదంటే సమ్మెను కొనసాగిస్తామంటూ ట్రామాకేర్ సెంటర్ కాంట్రాక్ట్ ఎంప్లారుూస్ యూనియన్ (కెజిహెచ్) ప్రతినిధులు వై.త్రినాథ్, టి.నాగరాజు, ఏ.సుధాకరరావులు పేర్కొన్నారు. అయితే దీనిపై ఆయన ఆలోచనలో పడ్డారు. రాతపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో ఉద్యోగులు యధావిధిగా సమ్నెను కొనసాగిస్తున్నారు. దీంతో ట్రామాకేర్ నిర్వహణ ఇపుడు సమస్యగా మారింది. ప్రత్యామ్నాయం లేక పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. రాష్టవ్య్రాప్త సమ్మెలో భాగంగా కెజిహెచ్ ట్రామాకేర్ సెంటర్‌లోను 73 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో వైద్యులు, నర్సులే అధికం. వీరంతా 45 మంది ఉండగా, మిగిలిన దాదాపు 30 మంది ఉద్యోగులో ల్యాబ్ టెక్నిషీయన్, డ్రైవర్లు, తదితర సిబ్బంది సేవలందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వారికి అత్యవసర సేవలందించే ఈ సెంటర్‌లో ఇపుడు వైద్య సేవలు నిలిచిపోయాయి. కాగా శుక్రవారం కురిసిన వర్షంలోను సమ్మె కొనసాగుతోంది.

రెండు లక్షలకు పైగా పగిలిన టెంకాయిలు
సింహాచలం, జూలై 11: సింహగిరి ప్రదక్షిణకు ఈ ఏడాది అనూహ్యంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి తొలిపావంచా వద్ద భారీ సంఖ్యలో టెంకాయలు కొట్టారు. రెండు లక్షలకు పైగా కొబ్బరికాయలు భక్తులు కొట్టినట్టు ఒక అంచనా. భక్తులకు కొట్టిన టెంకాయి ముక్కలతో స్వామివారి తొలి పావంచా ప్రాంగణం అంతా నిండిపోయింది. నాలుగు అడుగుల ఎత్తులో పెద్దకుప్పలు దర్శనమిచ్చాయి. భక్తులంతా ఆశ్చర్యంగా టెంకాయ కుప్పలను చూసుకుంటూనే మళ్ళీ టెంకాయలు పగులగొట్టుకుంటూ గిరి ప్రదక్షిణకు ఉపక్రమించారు. భక్తులంతా ప్రదక్షిణలు పూర్తిచేసుకుని మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి సింహాలేశుని దర్శనానికి సింహగిరికి వెళ్ళనున్నారు.

గిరిజన విద్యార్థి అదృశ్యం
అరకులోయ, జూలై 11: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి పి.నవీన్‌కుమార్ (14) అదృశ్యమైనట్టు పోలీసులకు శుక్రవారం పిర్యాదు అందింది. పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థి తండ్రి లక్ష్మణరావు మందలించాడన్న కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు పిర్యాదులో పేర్కొన్నారు. వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయిన కుమారుడూ ఎంతకీ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కుమారుడి కోసం గాలించినప్పటికీ అతడి జాడ తెలియరాలేదు. దీంత తన కుమారుడి ఆచూకీ తెలిసినవారు సమాచారం అందించి నవీక్‌కుమార్‌ను అప్పగిస్తే తగిన పారితోషకం చెల్లిస్తామని తండ్రి లక్ష్మణ్‌రావు తెలిపారు. అరకులోయ పట్టణంలో నివసిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు కుమారుడి ఆచూకీ తెలుసుకునేందుకు రేయింబవళ్ళు కళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో వారు కంటతడి పెడుతున్నారు.

రెండు వేలు తీసుకుంటూ ఎ.సి.బి.కి చిక్కిన ఎ.ఎస్.ఐ
మాడుగుల, జూలై 11: రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ మాడుగుల ఎ.ఎస్.ఐ. శుక్రవారం ఎ.సి.బి. అధికారులకు చిక్కారు. మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామంలో గత నెల 18వ తేదీ మోదకొండమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఈ ఘటనలో చోరీకి పాల్పడినట్టుగా అనుమానించి చీడికాడ మండలానికి చెందిన లాలం కాశీ, కల్లేపల్లి అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు కండిషన్ బెయిల్ సంతకం కోసం మాడుగుల ఎ.ఎస్.ఐ.ను సంప్రదించగా ఆయన మూడు వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో వారు రెండు రూపాయలు ఇస్తామని ఎ.ఎస్.ఐ.తో ఒప్పందం కుదుర్చుకుని అదే విషయాన్ని ఎ.సి.బి. అధికారులకు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఎ.సి.బి అధికారులు బెయిల్ కోసం ధరఖాస్తు చేసిన వారికి రెండు వేల రూపాయలను ఇచ్చి పంపారు. ఆ డబ్బులను ఎ.ఎస్.ఐ.కు ఇస్తుండగా ఎ.సి.బి. డి.ఎస్.పి. నరసింహాం పట్టుకున్నారు. ఎ.ఎస్.ఐ.పై కేసు నమోదు చేసి ఎ.సి.బి. కోర్టుకు తరలించనున్నట్టు డి.ఎస్.పి. నరసింహం తెలిపారు. ఈ దాడుల్లో ఎ.సి.బి. ఎస్.ఐ.లు గణేష్, రాము, రమణమూర్తి, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

* రెండు ‘స్థానిక సంస్థల’ పదవులు * టిక్కెట్ల కోసం బాబుపై వత్తిడి పెంచుతున్న నేతలు * వుడా చైర్మన్ రేసులో వెలగపూడి?
english title: 
mlc

తరలివచ్చిన భక్తజన సందోహం

$
0
0

* రథప్రదక్షిణను ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాస్
సింహాచలం, జూలై 11: చినుకులు తడిపేస్తున్నా, రహదారులు బురదమయమైనా, కాళ్లకు చెప్పులు, తలపై గొలుగు లేకుండా గిరి ప్రదక్షిణే పరమార్థంగా అచంచెలమైన భక్తితో సింహగిరి ప్రదక్షిణకు భక్తజనం పోటెత్తారు. దేవస్థానం చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు సింహగిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. సింహగిరి పరివాహక ప్రాంతమంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. ఏచోట కన్నా భక్తుల సందోహమే దర్శనమిచ్చింది. ఆషాఢ శుద్ధ చతుర్ధశి పర్వదినం సందర్భంగా శుక్రవారం సంప్రదాయంగా ప్రదక్షిణ మొదలైంది. రాష్ట్ర మానవ వనరులు, విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు జెండా ఊపి పుష్పరథ ప్రదక్షిణను ప్రారంభించారు.
నాదస్వర, వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, పులివేషాలు, తప్పెటగుళ్లు, కోలాటాలు, భజన సంకీర్తనల నడుమ సింహాచలేశుని పూలరథం ముందుకు సాగింది. ఉదయం సామాన్యంగా ఉన్న రద్దీ పది గంటల తరువాత ఒక్కసారిగా ఊపందుకుంది. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు సింహాచలేశుని తొలి పావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి మనసులోని కోర్కెలను నివేదించి బృందాలుగా భక్తులు ప్రదక్షిణకు వెళుతూనే ఉన్నారు. రథం ప్రారంభమైన సమయానికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తొలి పావంచా నుండి పాత అడివివరం ప్రధాన కూడలి వరకు ఇసుక వేస్తే రాలనంతగా జనం కనుచూపుమేరంతా నిండిపోయి కనిపించారు. సింహగిరి ప్రదక్షిణ చేసిన వారిలో అత్యధికంగా మహిళలే ఉండడం విశేషం. గతంతో పోలిస్తే ప్రదక్షిణచేసే ముసలి వారి సంఖ్య బాగా తగ్గింది. యువతీయువకులు, నడి వయస్కులే అధికంగా ఉన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ
సింహగిరి ప్రదక్షిణకు అనూహ్యంగా భక్తులు తరలిరావడంతో సింహాచలం ప్రధాన రహదారిలో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో మేల్కొన్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఇటు గోశాల అటు పాత అడివివరం ప్రధాన కూడళ్ల వరకే కొన్ని వాహనాలను అనుమతించి ట్రాఫిక్‌ని నియంత్రించారు. సింహాచలం మీదుగా కొత్తవలస వెళ్లే 68 నెంబర్ బస్సు రూట్ మార్చి పెందుర్తి మీదుగా పంపించారు. దీంతో కొంతమంది భక్తులకు ఇబ్బంది ఎదురైనప్పటికీ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మాత్రం అనుమతించలేదు.
తొలిపావంచా వద్ద తోపులాట
కొంతదిగువ తొలి మెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టడానికి భక్తులు పోటీ పడ్డారు. తండోపతండాలుగా వచ్చిన భక్తుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న సింహాచలేశుని నమూనా విగ్రహం వద్ద పరిస్థితిని అధికారులు అదుపు చేయగలిగారు. ప్రత్యేకించి బారికేడ్లు ఏర్పాటుచేయడంతో టెంకాయలు కొట్టేందుకు వచ్చే భక్తులను నియంత్రించడం సాధ్యమైంది.
భక్తులసేవలో సేవాసంస్థలు
గిరి ప్రదక్షిణకు తరలివచ్చే భక్తులకు సేవలందించేందుకు అనేక స్వచ్చంద సేవా సంస్థలు ముందుకు వచ్చాయి. దేవస్థానం ఏర్పాటుచేసిన స్టాల్స్‌తో పాటు కొంతమంది సొంతంగా కూడా స్టాల్స్ ఏర్పాటుచేసుకుని భక్తులకు తాగునీరు,. పులిహోర, పొంగలి, చక్కెర పొంగలితో ఆపటు ఉప్మా వంటి అల్పాహారాలను కూడా అందించారు.
నిరంతర నిఘా
గిరి ప్రదక్షిణ సమయంలో ఏక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ నిఘా ఏర్పాటుచేసింది. ఎసిపి మురళీనాయుడు నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎక్కడికక్కడ నేర పరిశోధనా విభాగానికి చెందిన పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారు. ట్రాఫిక్ సిఐ మళ్ల మహేష్ తన బృందంతో ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్, ఇఇ శ్రీనివాసరాజు, పర్యవేక్షణలో దేవస్థానం సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ సహకారంతో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. శుక్రవారం సింహగిరి ప్రదక్షిణకు బయలుదేరినవారు సుమారుగా మూడు లక్షల మంది ఉంటారని అంచనా. వీరిలో ఎంతమంది శనివారం దర్శనానికి రానున్నారన్న దానిపై అధికారుల్లో అలజడి మొదలైంది. సాధారణంగా చందనయాత్రకు లక్ష నుండి లక్షా ఏభై వేల మంది దర్శనానికి వస్తేనే నానా అవస్థలు పడే అధికారులు శనివారం అనూహ్యంగా భక్తులు తరలివస్తే పరిస్థితి ఎలా గట్టెక్కిసారో వేచి చూడాలి.

* రథప్రదక్షిణను ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాస్
english title: 
g

నగరం తడిసింది...

$
0
0

* నిలకడగా వర్షం...చల్లబడిన వాతావరణం
విశాఖపట్నం, జూలై 11: వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం పూర్తిగా చల్లబడింది. 24 గంటలుగా అదేపనిగా కురుస్తోన్న వర్షంతో విశాఖ నగరం పూర్తిగా తడిచింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ మురుగునీరు చేరింది. చెత్తా, చెదారం పేరుకుపోయి వీధుల్లోరోడ్లు, ప్రధాన రహదారులు సైతం చిత్తడిగా మారాయి. విశాఖపట్నం రైల్వేస్టేషన్ వర్షపు నీటితో నిండింది. స్టేషన్ బస్‌స్టాప్ వద్ద పూర్తిగా నిండిన నీటితో ప్రయాణికులు శుక్రవారం తీవ్ర అవస్థలకు గురికావాల్సి వచ్చింది. రామ్మూర్తిపంతులపేట, రైల్వేన్యూకాలనీ, కొబ్బరితోట, వన్‌టౌను ఏరియా, పూర్ణామార్కెట్, అచ్చియ్యమ్మపేట, జ్ఞానాపురం, మర్రిపాలెం తదితర పల్లపు ప్రాంతాలన్నీ జలయమయ్యాయి. చాలా కాలం తరువాత కైలాసపురం మీదుగా జ్ఞానాపురానికి వెళ్ళే ఎర్రిగెడ్డ వర్షపునీటితో పొంగిపొర్లింది. వాయువ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి పుణ్యమా అంటూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం వేకువజాము నుంచి కురుస్తోన్న వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. కాగా విశాఖ నగరంలో శుక్రవారం 2.3సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. గత ఏడాది గురుపౌర్ణమి సందర్భంగా సాయంత్రం నుంచి వర్షం కురవగా, ఈసారి ఇందుకు భిన్నంగా శుక్రవారం రోజంతా కురిసిన వర్షం రాత్రి ఎనిమిది గంటల తరువాత తగ్గుముఖం పట్టింది. మండుటెండల నుంచి ఇపుడిపుడే సేద తీరుతున్న విశాఖవాసులకు ఈ వర్షం మరింత ఊరటనిస్తోంది. అదీ ఉరుములు,మెరుపుల్లేకుండా నిలకడగా కురుస్తోన్న వర్షంతో విద్యుత్ వినియోగం కాస్తంత తగ్గింది. దీంతో విద్యుత్ సంస్థ అధికారులు ఊపీరిపీల్చుకుంటున్నారు. నాలుగు మాసాల తరువాత ఎడతెరపి లేకుండా వర్షం కురియడం ఇదే తొలిసారి కావడం విశేషం.
* తగ్గిన విద్యుత్ వినియోగం
విద్యుత్ వినియోగం కాస్తంత తగ్గింది. ఇంతవరకు ప్రతిరోజు 15 నుంచి 17 మిలియన్ యూనిట్ల వరకు వాడకం ఉండేది. అటువంటిది ఇపుడు 15 నుంచి 16 మిలియన్ యూనిట్ల మేర ఉండగా, వర్షం కారణం వాడకం తగ్గినట్టు స్పష్టమవుతోంది. గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గిపోయాయి. ఇలాగే మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే విద్యుత్ సమస్యలు పూర్తిగా తగ్గుతాయని సంస్థ వర్గాలు భావిస్తున్నాయి. ఈదురుగాలులు లేకపోవడం, నిలకడతో కూడిన వర్షంతో సంస్థకు నష్టాలు తగ్గుతున్నాయి.

* నిలకడగా వర్షం...చల్లబడిన వాతావరణం
english title: 
city

ఊరట

$
0
0

విజయనగరం, జూలై 11: రెండు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు నారుమడులు వేసేందుకు అనుకూలమని వ్యవసాయశాఖ జెడి ప్రమీల చెప్పారు. ఎద పంటలకు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 178.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావల్సి ఉండగా 64.8 మిల్లీమీటర్ల నమోదైంది. జిల్లాలో మొత్తం 6074.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 2202.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సరాసరి వర్షపాతం పరిశీలిస్తే.. 178.7 మిల్లీమీటర్లకుగాను ఇంకను 64 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. శుక్రవారం నాటికి జిల్లాలో వివిధ మండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. కొమరాడ 6.4 మిల్లీమీటర్లు, గుమ్మలక్ష్మిపురం 12.6, కురుపాం 5.6, జియ్యమ్మవలస 10.4, గరుగుబిల్లి 17.2, పార్వతీపురం 10.4, మక్కువ 20.6, సీతానగరం 29, బలిజపేట 17, బొబ్బిలి 40.4, సాలూరు 65.2, పాచిపెంట 10.4, రామభద్రాపురం 16.4, బాడంగి 33.4, తెర్లాం 12.8, మెరకముడిదాం 16.4, దత్తిరాజేరు 32.8, మెంటాడ 23.4, గజపతినగరం 20.4, బొండపల్లి 28.4, గుర్ల 48.6, గరివిడి 19.2, చీపురుపల్లి 26.8, నెల్లిమర్ల 8.4, పూసపాటిరేగ 42.2, బోగాపురం 22.4, డెంకాడ 30.4, విజయనగరం 41, గంట్యాడ 38.6, ఎస్.కోట 17.8, వేపాడ 19.4, ఎల్.కోట 18.6, జామి 20, కొత్తవలస 36 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. ఆయా మండలాల్లో రైతులు నారు మడులు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రెండు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
english title: 
voorata

ప్రక్షాళన

$
0
0

విజయనగరం, జూలై 11: జిల్లాలో ఆదర్శ రైతుల స్థానంలో ఎంపిఇఒల నియామకానికి సర్కార్ సన్నద్ధమవుతోంది. ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 29 వేల ఆదర్శ రైతులను తొలగించిన విషయం విధితమే. వాటి స్థానంలో అగ్రికల్చర్ బిఎస్సీ పట్ట్భద్రులతో ఎంపిఇఒల నియామకం చేపట్టడానికి మంత్రి వర్గం నిర్ణయించింది. దీంతో జిల్లాలో 400 మంది వ్యవసాయ పట్ట్భద్రులకు ఉద్యోగాలు లభించనున్నాయి. గతంలో 2002 అక్టోబర్‌లో ఎంపిఇఒల వ్యవస్థను తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంపిఇఒలకు నెలకు రూ.5వేలు గౌరవ వేతనంపై నియమించారు. గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల కొరత ఉండటంతో ఎంపిఈఒలను నియమించారు. అయతే ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వీరి కాంట్రాక్ట్ పూర్తికావడంతో వీరిని కొనసాగించకుండా ఆదర్శ రైతు వ్యవస్థను తీసుకువచ్చింది. తాజాగా మంత్రివర్గం ఎంపిఇఒల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి వెయ్యి హెక్టార్లకు ఒక ఎంపిఇఒలను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, ఉద్యానవన పట్ట్భద్రులను ఈ స్థానాల్లో నియమించాలని నిర్ణయించారు. దీనిపై త్వరలో ఆదేశాలు రానున్నాయి. జిల్లాలో 2.25 లక్షల హెక్టార్లలో వరి, ఇతర పంటలు పండిస్తున్నారు. ఇవిగాకుండా మరో లక్ష హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. కాగా, వెయ్యి హెక్టార్లకు ఒకరు చొప్పున జిల్లాకు 300 మంది ఎంపిఇఒలను నియమించనున్నారు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ జెడి ప్రమీల వద్ద ప్రస్తావించగా గతంలో వెయ్యి హెక్టార్లకు ఒక ఎంపిఇఒ ఉండేవారని, నేడు అదే విధానాన్ని ప్రభుత్వం కొనసాగించనుందని వెల్లడించారు.

జిల్లాలో ఆదర్శ రైతుల స్థానంలో ఎంపిఇఒల నియామకానికి సర్కార్
english title: 
prakshalana

‘సిఆర్‌టిల నియామకానికి చర్యలు’

$
0
0

విజయనగరం, జూలై 11: రాష్ట్రంలో సిఆర్‌టిలు కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్స్, పిఇటిల (్ఫజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్) నియామకానికి చర్యలు తీసుకోవాలని ఎపికెజిబివి జాయింట్ సెక్రటరీ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన రాజీవ్ విద్యా మిషన్ పిఒలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెజిబివిలలో సిఆర్‌టిలు, పిఇటిలు ఖాళీలు ఉంటే వెంటనే వాటిని భర్తీ చేయాలన్నారు. ఏయే జిల్లాల్లో ఎనె్నన్ని ఖాళీలు ఉన్నదీ అడిగి తెలుసుకున్నారు. ఈ జిల్లాలో సిఆర్‌టిలు ఆరు ఖాళీలు ఉన్నాయని, పిఇటి ఉద్యోగాలు ఖాళీ లేవని ఆర్‌విఎం పిఒ శారద చెప్పారు. సిఆర్‌టిల నియామకానికి పాత జాబితాలోని మెరిట్ జాబితా ప్రకారం ఎంపిక చేయాలని ఆర్‌విఎం ప్రాజెక్టు అధికారి శారదను ఆదేశించారు. అలాగే కెజిబివిలలో విద్యార్థులకు ఎలాంటి ఆహారం అందిస్తున్నారు? మెను పాటిస్తున్నారా? తనిఖీలు జరుపుతున్నారా? అని ఆరా తీశారు. విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిసిపిఒ వి.శ్రీరామ్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో సిఆర్‌టిలు కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్స్, పిఇటిల
english title: 
crt

పరిమిత కుటుంబాల వల్ల ఎన్నో ప్రయోజనాలు

$
0
0

విజయనగరం, జూలై 11: దేశంలో జనాభా పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ పద్మజ అన్నారు. అందువల్లనే పరిమిత కుటుంబాల ఆవశ్యకతను గుర్తించాలన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధిక జనాభా దేశ ప్రగతికి అవరోదమన్నారు. జనాభా నియంత్రణకు ప్రజలు పూర్తిగా సహకరించాలన్నారు. 2014 నాటికి ప్రపంచ జనాభా 128 కోట్లకు, రాష్ట్ర జనాభా 4.5 కోట్లకు చేరిన నేపథ్యంలో ఈ ఏడాది 3పరిమిత కుటుంబం.. అపరిమిత ఆనందం2 అనే నినాదంతో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్టు తెలిపారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే అబ్బాయికి 25 సంవత్సరాలు, అమ్మాయికి 22 సంవత్సరాలు నిండిత తరువాత వివాహం చేయాలన్నారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే బిడ్డకు బిడ్డకు మధ్య దూరం ఉండాలన్నారు. కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్దతులపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. చిన్న కుటుంబం ప్రతి ఒక్కరి ధ్యేయంగా ఉండాలన్నారు. ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణ చేయించుకున్న జమడలకు చెందిన మున్నూరు లక్ష్మి, ఒక పిల్లవానితో కుటుంబ నియంత్రణ చేయించుకున్న నాతవలసకు చెందిన సక్క లక్ష్మి, వాసెక్టమీ చేయించుకున్న కొండ వెలగాడకు చెందిన చందక మురళీలకు బహమతిగా రూ.10వేలు అందజేశారన్నారు. అనంతరం బెస్ట్ పిహెచ్‌సి సెంటర్లుగా మొండెంఖల్లు, కెఆర్‌బి పురం, వియ్యంపేటకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు లభించాలన్నారు. మంచి సేవలందించిన వైద్యులు, నర్సులకు, ఎంపిహెచ్‌ఎలకు, ఆశా వర్కర్లకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సమావేశంలో పౌర సంబంధాల శాఖ ఎ.డి జాన్సన్ ప్రసాద్, డిఎల్‌ఒ సుధాకర్ పట్నాయిక్, డిటిసిఒ డాక్టర్ బి.రామారావులతోపాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ ర్యాలీని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ పద్మజ ప్రారంభించారు. ఈ ర్యాలీ కాంప్లెక్స్ నుంచి ఎత్తుబ్రిడ్జి, ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్ మీదుగా జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకుంది. ఈ ర్యాలీలో సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు జాన్సన్ ప్రసాద్, డిఎల్‌ఒ సుధాకర్ పట్నాయిక్, డిడిపిఒ డాక్టర్ టి.రామారావు, గజపతినగరం, బోగాపురం, నెల్లిమర్ల ఎస్‌పిహెచ్‌ఒలు, మాస్ మీడియా అధికారులు డాక్టర్ వెంకటేశ్వరరావు, పైడి వెంకటరమణ, ఎ.జయప్రసాద్, చంద్రశేఖరరాజు, నాయుడు, ప్రసాద్, వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు.

దేశంలో జనాభా పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని
english title: 
population

‘పరిశుభ్రతపై విద్యార్థ్ధులకు అవగాహన పెంచాలి’

$
0
0

విజయనగరం , జూలై 11: పాఠశాల విద్యార్ధులకు పరిశుభ్రతపై అవగాహన పెంచాలని జాయింట్ కలెక్టర్ బి.రామారావు సూచించారు. జిల్లా స్థాయి స్కూల్ శానిటేషన్‌టాస్క్ఫోర్స్ కమిటి సమావేశాన్ని శుక్రవారం తన ఛాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలల్లో టాయిలెట్లు మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పైపులైన్లుకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేపట్టాలన్నారు. తాగునీరు, టాయిలెట్, పారిశుద్ధ్యం వంటి సదుపాయలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు వేసిన కమిటి జిల్లాకు త్వరలో వస్తుందని చెప్పారు. సమావేశంలో జెడ్పీసిఇఓ ఎన్ మోహన్‌రావు, రాజీవ్ విద్యామిషన్ పిఓ శారద, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ మోహర్‌ప్రసాద్, డిప్యూటి డిఇఓ నాగమణి, నాలుగు మున్సిపాలటి ఇంజనీర్లు పాల్గొన్నారు.

పాఠశాల విద్యార్ధులకు పరిశుభ్రతపై అవగాహన పెంచాలని జాయింట్
english title: 
cleanliness

నత్తనడకన జంఝావతి ఆక్విడెక్ట్ పనులు

$
0
0

గరుగుబిల్లి, జూలై 11: తోటపల్లి కుడి ప్రధాన కాలువపై నిర్మాణం చేపడుతున్న జంఝావతి ఆక్విడెక్ట్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మండలపరిధిలోని ఉల్లిభద్ర, దళాయివలస, తులసిరామినాయుడువలస, గొల్లవానివలస, గొట్టివలస, గరుగుబిల్లి, పెద్దూరు తదితర గ్రామాలకు చెందిన భూములకు జంఝావతి ప్రాజెక్ట్ ద్వారా సాగు నీరు అందించేందుకు గడిచిన ఆరు, ఏడు సంవత్సరాల క్రితం ఇరిగేషన్ అధికారులు కాలువ నిర్మాణం చేపట్టారు. అయితే ఉల్లిభద్ర సమీపంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువపై ఆక్విడెక్ట్ నిర్మించకపోవడంతో భూములకు తాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఆక్విడెక్ట్ నిర్మాణం చేపట్టాలని పలు మార్లు సంబంధిత అధికారులకు తెలియజేయడంతో దాదాపు 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు ప్రారంభమై రెండు సంవత్సరాలు పైబడుతున్నప్పటికీ నేటికి పనులు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు అంటున్నారు. ఆక్విడెక్ట్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రస్తుత ఖరీఫ్‌సీజన్‌కు సంబంధించి సాగునీరు అందని పరిస్థితి ఉందని పలు గ్రామాలకు చెందిన రైతులు అంటున్నారు.

‘క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి..’
విజయనగరం , జూలై 11: క్రమశిక్షణతో విద్యార్ధులు చదివితే ఉన్నతస్థాయికి చేరుకోగలరని విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. విజయనగరం మండల పరిధిలో రాకోడు ప్రాధమికోన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన ఎనిమిదివ తరగతిని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గీతా మాట్లాడుతూ రాకోడుకు ఉన్నతపాఠశాల మంజూరు కావడం సంతోస దాయకం అన్నారు. 9,10 తరగతలు ప్రారంభించడానికి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సహకరించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే గీతను పాఠశాల ఉపాధ్యాయలు ఘనంగా సన్మానించారు. ఇదే మండలం కోరుగొండపాలెం గ్రామంలో ఏరువాక నగదు బదిలి క్రింద 130 మంది మహిళా రైతులకు విశాఖ డైరీ మంజూరు చేసిన 2,42,566 రూపాయలను ఎమ్మెల్యే చేతులు మీదగా పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డైరీ అభివృద్ధికి మహిళా రైతులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపిపి కె. దనలక్ష్మి, జెడ్పీటిసి పి. రమణ వైస్ ఎంపిపి వి. శ్రీనివాసరావు, ఎంపిటిసి సిహెచ్ సత్యం, సర్పంచ్ రామారావు, విశాఖ డైరీ కె కాటమయ్య, మేనేజర్ వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

‘తొలగించిన కార్మికులను విధుల్లో చేర్చుకోవాలి’
విజయనగరం, జూలై 11: గత ఏడాది ఎస్‌ఎంఎస్ కంపెనీ నుంచి తొలగించిన ఐదుగురు కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని సిటూ నాయకులు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జోరుగా వర్షం కురుస్తున్న గొడుగులతో అక్కడ ఉండి సాయంత్రం వరకు ధర్నాను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఎంఎస్ కంపెనీ కార్మికులను నిర్థాక్షిణ్యంగా తొలగించిందని ఆరోపించారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఎస్‌ఎంఎస్ కంపెనీ నెలకోల్పి ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. అయితే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. అంతేగాకుండా అక్కడ కార్మిక యూనియన్ నెలకోల్పితే ఆ కార్మికులను విధుల్లో నుంచి తొలగించిందని ఆయన విమర్శించారు. అప్పటి నుంచి పలుమార్లు కలెక్టరేట్, డిసిఎల్ కార్యాలయాల ఎదుట ధర్నా చేసినప్పటికీ ఫలితం లభించలేదన్నారు. ఇప్పటికైనా కార్మికశాఖాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేనిచో దీనిపై ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

‘ఇక రాత్రి పూట పారిశుద్ధ్య పనులు’
విజయనగరం , జూలై 11: పట్టణంలో పారిశుద్ధ్యపనులు రాత్రి పూట చేపట్టేందుకు మున్సిపల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని ప్రధానమైన రహదారుల్లో రాత్రిపూట పనులను ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ విషయమై మున్సిపల్ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ య.అప్పలరాజుతో మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ చర్చించారు. పారిశుద్ధ్యం మెరుగుదలలో భాగంగా జన సంచారం ఎక్కువగా ఉండే కొన్ని ప్రధానమైన రోడ్లుల్లో పారిశుద్ధ్యపనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గణేష్‌కోవెల వరకు, గంటస్తంభం జంక్షన్ నుంచి కన్యకాపరమేశ్వరి కోవెల వరకు, అక్కడ నుంచి నాయుడు ఫంక్షన్ వరకు, అక్కడ నుంచి మయూరి జంక్షన్‌వరకు, అక్కడ నుంచి బాలాజీ జంక్షన్ వరకు, మూడు లాంతర్ల జంక్షన్ నుంచి అంబటిసత్రం జంక్షన్‌వరకు, గంటస్తంభం జంక్షన్ నుంచి మూడులాంతర్ల జంక్షన్ వరకు, అక్కడ నుంచి కోట జంక్షన్ వరకు, అక్కడ నుంచి లయున్స్‌కమ్యూనిటీ హాలుమీదుగా బాలాజీ జంక్షన్ వరకు రాత్రిపూట పారిశుద్ధ్యపనులు చేపట్టాలని ప్రతిపాదించారు.

తోటపల్లి కుడి ప్రధాన కాలువపై నిర్మాణం చేపడుతున్న జంఝావతి ఆక్విడెక్ట్ నిర్మాణం పనులు
english title: 
aquiduct

‘పకడ్బందీగా పంట కోత ప్రయోగాలు’

$
0
0

విజయనగరం, జూలై 11: ఖరీఫ్‌లో పంట కోతల ప్రయోగాలు జరిపినపుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జెడి ప్రమీల సూచించారు. శుక్రవారం వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పంట కోత ప్రయోగాలు వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ సందర్భంగా సిపిఒ మోహనరావు మాట్లాడుతూ పంట కోత ప్రయోగాల ఆవశ్యకతను వివరించారు. దేశంలో వివిధ పంటల దిగుబడులను అంచనా వేసేందుకు, స్థూల జాతీయోత్పత్తి గణనకు ఇది దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించేటపుడు కూడా దీనిని పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. పంట కోత ప్రయోగాలు నిర్వహించాల్సిన గ్రామాల్లో నిర్దేశించిన పంట లేనపుడు ఎఎస్‌ఒను సంప్రదించి ప్రత్యమ్నాయ గ్రామం ఎంచుకోవాలన్నారు. ఒక గ్రామంలో ఎఎస్‌ఒ లేదా ఎఇఒ ఒక్కరు మాత్రమే పంట కోత ప్రయోగం చేయాలన్నారు. పంట కోత ప్రయోగం చేయాల్సిన గ్రామాల్లో రెండుప్లాట్లు ఎంపిక చేసేందుకు రెండు వేర్వేరు సర్వే నంబర్లను తీసుకోవాలన్నారు. గ్రామం సందర్శించిన తేదీని తప్పనిసరిగా వేయాలన్నారు. ఎంపికైన సబ్ డివిజన్‌లో ఉన్న మడుల సంఖ్యను తప్పనిసరిగా వేయాలన్నారు. ప్లాట్ ఎంపికకు ర్యాండమ్ నంబర్లు వేయడానికి సంబంధిత మండలానికి కేటాయించిన కాలం నుంచి మొదలు పెట్టి ఆ కాలం పూర్తయిన తరువాత పక్క కాలమ్‌నకు వెళ్లాలన్నారు. పంట నాటిన తేదీకి, పంట కోత నిర్ణయించిన తేదీకి మధ్య వ్యత్యాసం సంబంధిత పంటలకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసుకొని ఎక్కువ తేడా లేకుండా వేయాలన్నారు. ప్రయోగ పంట యొక్క దిగుబడి పంట పరిస్థితిని అంచనా వేసేందుకు దోహదపడుతుందన్నారు. వ్యవసాయశాఖ డిడి లీలావతి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రెండు ప్రయోగాలు చేపట్టాలన్నారు. కంది, పత్తి, ఆముదం, నువ్వులు పంటలకు 10 బై 10 మీటర్లలో పంట కోత ప్రయోగం చేయాలన్నారు. అలాగే ఇతర పంటలకు 5 బై 5 మీటర్లలో పంట కోత ప్రయోగం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

‘పకడ్బందీగా పంట కోత ప్రయోగాలు’
english title: 
crop

నేవీ క్యాంటీన్‌లో అగ్నిప్రమాదం

$
0
0

విశాఖపట్నం , జూలై 12: విశాఖలోని నేవీ క్యాంటీన్‌లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేనప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. నేవీ, రక్షణ శాఖ సిబ్బందితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల మాజీ సైనికులకు కిరాణా సరుకులతో పాటు విలువైన వస్తువులు, మద్యం సీసాలు విక్రయించే క్యాంటీన్‌లో ఇంతటి అగ్ని ప్రమాదం సంభవించడం ఇదే మొదటి సారి. ఈ ప్రమాదంలో సుమారు 3కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియటం లేదు. అయితే విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణం కావచ్చని చెబుతున్నారు. మధ్యాహ్నం సుమారు 2గంటల సమయంలో క్యాంటీన్ రద్దీగా ఉన్న సమయంలో ఈ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న వారందరూ భయంతో పరుగులు తీశారు. నేవీకి చెందిన అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించి సాయంత్రం 6 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చాయి. (చిత్రం) విశాఖలోని నేవీ క్యాంటీన్ నుండి వెలువడుతున్న దట్టమైన పొగ

రూ. 3 కోట్ల ఆస్తినష్టం
english title: 
navy canteen
Viewing all 69482 articles
Browse latest View live