Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

సేవే లక్ష్యం

$
0
0

హైదరాబాద్, జూన్ 5: అహోరాత్రులు పట్టుదల, దీక్షతో లక్ష్యాన్ని గురిపెట్టి అనుకున్నది సాధించిన ఎమ్సెట్ టాపర్ల మనోభావం సమాజ సేవ, పేదరిక నిర్మూలన, ఉన్నత స్థాయి పదవులను అధిష్టించి సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావలనే తపన పడుతున్నట్టు టాపర్లు వ్యాఖ్యానించారు. మెడిసిన్ విభాగంలో టాపర్‌గా నిలిచిన వివి వినీత్ తాను మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకుని పేదవారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలన్నదే లక్ష్యంగా చెప్పగా, ఇంజనీరింగ్‌లో టాపర్‌గా నిలిచిన పి సాయి సందీప్ రెడ్డి మాత్రం మంచి యూనివర్శిటీలో ఇంజనీరింగ్ కోర్సులో చేరి ఐఎఎస్‌కు హాజరై కలెక్టర్ కావాలనే లక్ష్యాన్ని వ్యక్తం చేశాడు. విజయవాడకు చెందిన రోహిత్‌కుమార్ వెనుకోటి మెడిసిన్‌లో రెండో ర్యాంకు సాధించగా, ఎం. జగదీష్ రెడ్డి మూడో ర్యాంకు సాధించాడు. ఇద్దరూ చైతన్య నారాయణ మెడికల్ అకాడమిలో చదివిన వారే. విశాఖపట్టణానికి చెందిన ఎస్ ఎస్ కె వెంకటేష్ నాలుగో ర్యాంకు, వరంగల్ ఖాజీపేటకు చెందిన చెకూరి రిత్విక్ ఐదో ర్యాంకు సాధించాడు. కర్నూలు సిరివెల్లం మండలానికి చెందిన అవుతు ప్రవీణా ఆరో ర్యాంకు సాధించగా, వరంగల్ హనుమకొండకు చెందిన నోముల గౌతం రెడ్డి ఏడో ర్యాంకు సాధించాడు. విజయవాడ శ్రీ చైతన్య నారాయణ మెడికల్ అకాడమికి చెందిన సాయినాధం చిరంజీవి 8 వ ర్యాంకు సాధించగా, హైదరాబాద్ పంజాగుట్టకు చెందిన సూరపనేని ప్రజ్ఞ 9వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన కలవపూడి సుకుమార్ 10వ ర్యాంకు సాధించాడు.
ఇక ఇంజనీరింగ్ విభాగంలో ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన పి సాయి సందీప్‌రెడ్డి తొలి ర్యాంకు సాధించగా, రెండో ర్యాంకును విశాఖ చైతన్య విద్యాసంస్థకు చెందిన గ్రంథి సృజన్‌రాజ్, మూడో ర్యాంకు విజయవాడ చైతన్య నారాయణ అకాడమికి చెందిన కోరగంజి గోకుల్, గుంటూరు బ్రాడిపేటకు చెందిన కాటూరి సాయి కిరణ్ నాలుగో ర్యాంకు సాధించాడు. విశాఖపట్టణం ఆసీల్‌మెట్టకు చెందిన వై జ్యోత్స్న ఐదో ర్యాంకు సాధించగా, హైదరాబాద్ రామాంతపూర్‌కు చెందిన వి వంశీకృష్ణ ఆరో ర్యాంకు సాధించాడు. మిర్యాలగూడ బంగారుగడ్డకు చెందిన వేగుళ్ల క్రాంతి ఏడో ర్యాంకు, ఖమ్మం రాజేశ్వరపురానికి చెందిన కందుల దినేష్ 8వ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌కు చెందిన ఎ రవిచంద్ర 9వ ర్యాంకు సాధించగా, తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన బి. గౌరీశంకర్‌కు 10వ ర్యాంకు వచ్చింది.

టాపర్లు వీరే

మెడిసిన్

ర్యాంకు పేరు మార్కులు వెయిటేజీ
1 వి వెంకట వినీత్ 158 99.06
2 రోహిత్‌కుమార్ ఎనుకోటి 157 98.55
3 ఎం.జగదీష్‌రెడ్డి 157 98.51
4 ఎస్‌ఎస్‌కె వెంకటేష్ 156 98.13
5 చేకూరి రిత్విక్ 156 98.00
6 అవుతుప్రవీణ్ 155 97.66
7 ఎన్ గౌతమ్‌రెడ్డి 155 97.61
8 సాయినాధం చిరంజీవి 155 97.57
9 ఎస్ ప్రజ్ఞ 155 97.53
10 సుకుమార్ కలవపూడి 155 97.45

ఇంజనీరింగ్
ర్యాంకు పేరు మార్కులు వెయిటేజీ
1 పి.సాయి సందీప్ 154 97.06
2 గ్రంథి సృజన్‌రాజు 152 96.25
3 కె గోకుల్ 152 96.17
4 కాటూరి సాయి కిరణ్ 151 95.78
5 వై జ్యోత్స్న 151 95.78
6 వి వంశీకృష్ణ 152 95.75
7 వి క్రాంతి 151 95.74
8 కె.దినేష్ 151 95.70
9 ఎ.రవిచంద్ర 151 95.66
10 బి.గౌరీశంకర్ 151 95.61

రేపు ఓయు
డిగ్రీ ఫలితాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 5: ఉస్మానియా యూనివర్శిటీ ఆధీనంలోని డిగ్రీ ఫలితాలను 7వ తేదీ ఉదయం 11.30 గంటలకు విడుదల చేస్తున్నట్టు పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ టి భిక్షమయ్య తెలిపారు. ఫలితాలను వర్శిటీ విసి ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ విడుదల చేస్తారని ఆయన పేర్కొన్నారు.

‘కిలాడి’ సంధ్యపై కేసు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 5: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలను ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలతో భీమవరంకు చెందిన కిలాడీ సంధ్యపై హైదరాబాద్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనరేట్‌లో తనకు పలుకుబడి ఉందని చెప్పి డబ్బులు వసూళ్లు చేస్తోందని బుధవారం మీడియాలో రావడంతో సంబంధిత ఉన్నతాదికారులు వెంటనే స్పందించారు. దీంతో ఎపిపిఎస్‌సికు చెందిన అధికారులు హైదరాబాద్ సిసిఎస్ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ఉండగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించినట్లు వచ్చిన వార్తలను ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. కాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చెందిన సభ్యుడు సీతారామరాజుతో పాటు సంధ్యను పట్టుకోవడానికి సిసిఎస్ పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

7న మంత్రివర్గ భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 5: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 7న సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మహంతి ఒక నోట్ జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించిన తర్వాత జరుగుతున్న మొదటి మంత్రివర్గ సమావేశం ఇది. డిఎల్‌ను తొలగిస్తూ, సిఎం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. డిఎల్ తొలగింపుపై మంతివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి రాజనర్సింహ ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

ఎమ్సెట్ టాపర్ల మనోభావాలు
english title: 
s

రామచంద్రయ్య కోసం కాదు

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 5: రాష్ట్ర మంత్రివర్గం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డిని తొలగించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. డిఎల్‌పై పడినట్లు మరి కొంతమందిపై వేటు పడే అవకాశాలున్నాయా? ఈ ప్రహసనం అగిపోయిందని భావించవచ్చా? అన్న ప్రశ్నలకు ఆయన జవాబు ఇవ్వలేదు. తనకు అత్యంత సన్నిహితుడైన దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య పదవిని కాపాడేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేంద్ర మంత్రి హోదాలో చిరంజీవి పార్టీ అధ్యక్షురాలితో సమావేశమయ్యారని ఆయన నమ్మబలికారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి రాష్ట్రంలో నెలకొని ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించినట్లు బొత్స చెప్పారు. పార్టీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా సోనియాగాంధీని రాష్ట్రంలో పర్యటించవలసిందిగా కోరానని ఆయన చెప్పారు. తమ ఆహ్వానానికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలియజేశారు. హైదరాబాద్‌లోనే కాక రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో సోనియా, రాహుల్ గాంధీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని బొత్స ప్రకటించారు. పిసిసి కొత్త కార్యవర్గం ఏర్పాటు గురించి ఆయన కచ్చితమైన సమాథానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. ‘ఇప్పుడు కార్యవర్గం లేదా?’ అని ఎదురుప్రశ్న వేశారు. మీ టీమ్ ఎప్పుడు వస్తుందని అడిగినప్పుడు స్వల్ప మార్పులు, చేర్పులతో త్వరలో వెలువడుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయిన ఎంపీలు మందా జగన్నాధం, జి వివేక్‌లు సభ్యత్వానికి రాజీనామా చేయాలా? వద్దా? అన్న విషయమై ఆత్మపరిశీలన చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అత్యంత సున్నితమైన తెలంగాణ అంశానికి అతి త్వరలోనే సామరస్యపూర్వక పరిష్కారం లభించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

సోనియాతో చిరు భేటీపై బొత్స వివరణ త్వరలో రాష్ట్రంలో సోనియా పర్యటన
english title: 
r

కిరణ్ నిర్ణయాలతో కాంగ్రెస్ భూస్థాపితం

$
0
0

కడప, జూన్ 5: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని మాజీమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు. తానెపుడూ పార్టీకి విధేయుడేనని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తన తడాఖా చూపిస్తానని స్పష్టం చేశారు. మంత్రి పదవి నుండి డిస్మిస్ అయిన తరువాత తొలిసారిగా బుధవారం తన సొంత జిల్లా కడప వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మైదుకూరు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఆయనకు నియోజకవర్గంలోని వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు జిల్లా శివారులోని కర్నూలు జిల్లా చాగలమర్రికి తరలి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. వందలాది వాహనాల కాన్వాయిలో టాప్‌లేని జీపుపై డిఎల్ తన పర్యటనకు శ్రీకారం చుట్టారు. దువ్వూరు, కానగూడూరు, మైదుకూరు, ఖాజీపేట ప్రాంతాల్లో కార్యకర్తలు ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశాల్లో ప్రసంగించారు. కిరణ్‌కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ ఆశయాలను కూడా తుంగలో తొక్కుతున్నారని డిఎల్ ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి చేపడుతున్న చర్యలు, సంక్షేమ పథకాలు అమల్లో ఆచరణ సాధ్యం కానివన్నారు. పదవుల కోసం తాను ప్రాకులాడడం లేదన్నారు. పని చేసే వారికి, ప్రతిభ కలిగిన వారికి పదవులు ఎప్పుడైనా వస్తాయని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కుట్ర కుతుంత్రాల వల్ల పార్టీకి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. తాను మొదటిసారిగా మంత్రి అయినప్పుడు కేవలం ఒక పర్యాయమే ఎమ్మెల్యేగా ఎన్నికైన సిఎం తన వద్దకు వచ్చి పనుల చేయించుకున్నారన్నారు. తన సేవలను మరచిపోయారన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పలుసార్లు మంత్రిగా పార్టీ కోసం అంకిత భావంతో పని చేస్తున్న తనకు మాటమాత్రమైనా చెప్పకుండా బర్త్ఫ్ చేయడం బాధ కలిగించిందన్నారు. కాంగ్రెస్‌కు చెందిన పెద్ద నాయకులెవరితో ఫోన్ చేయంచినా తృణప్రాయంగా మంత్రి పదవికి రాజీనామా చేసేవాడినన్నారు. బర్త్ఫ్ చేయడానికి తానేమైనా కళంకిత మంత్రినా అని నిలదీశారు. తొలగించిన తీరు తనను బాధించిందన్నారు. అయనా కాంగ్రెస్ పార్టీని విడనాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో సిఎం కుట్రలను, కుతంత్రాలను తిప్పి కొడతానని, అసెంబ్లీ సమావేశాల్లో తన తడాఖా చూపుతానని అన్నారు. సిద్ధాంతాలతో పనిచేసే ఏ ముఖ్యమంత్రికైనా తన ఇష్టప్రకారమే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అధికారం ఉంటుందని, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం నియంతలా వ్యవహరిస్తూ తన అడుగులకు మడుగులొత్తే వారినే మంత్రివర్గంలో కొనసాగించాలని భావిస్తున్నారని ఆరోపించారు.

‘కాంగ్రెస్ కోసం మిత్రుడి కొడుకుపైనే పోటీచేశా’
ఖాజీపేట, జూన్ 5: కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు తన ప్రాణ స్నేహితుడు వైఎస్ కుమారుడిపై పోటీ చేయడానికి కూడా వెనుకాడలేదని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలోని తన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన తనకు మంచి బహుమానం దక్కిందన్నారు. ముఖానికి రంగులు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చే వారికే కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రాధాన్యత ఉందన్నారు.
పార్టీని నాశనం చేసేందుకు సిఎం కిరణ్ కంకణం కట్టుకున్నారన్నారు. తనలాంటి నిజాయితీపరుడికి ఇలాంటి దుస్థితి కలిగితే పార్టీ అట్టడుగుకు దిగజారుతుందన్నారు. తాను కళాంకిత మంత్రి కాదన్నారు. లంచగొండిని అసలు కాదని అన్నారు. కొంతమంది కుక్కలు తనపై అసత్య ప్రచారం చేస్తూ మెప్పుపొందేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. ఇక ముందు కార్యకర్తల అభీష్టం మేరకు కార్యచరణ రూపొందించి నడుచుకుంటానన్నారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కడప జిల్లాలోని ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మరి కొంతమంది ముఖ్యమంత్రికి చెంచాగిరీ చేస్తున్నారన్నారు. గతాన్ని నెమరువేసుకుంటే వారి స్థాయి ఏమిటో వారికే అర్థమవుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం తన నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించి కార్యకర్తల అభీష్టం మేరకు రాజకీయ భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను ప్రకటిస్తానన్నారు. కార్యకర్తలంతా పార్టీ కోసం పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిఎల్ పర్యటనలో దారి పొడవునా భారీ ఎత్తున జనం తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.

దువ్వూరులో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తున్న డి.ఎల్.రవీంద్రారెడ్డి

వైకాపాలోకి సినీ నటుడు నరేష్?
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, జూన్ 5: అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సినీనటుడు నరేష్ త్వరలో వైకాపా తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం జైలులో ఉన్న జగన్‌తో ములాఖత్ అయినట్లు తెలిసింది. అనంతరం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కూడా కలసి పార్టీలో చేరేందుకు హామీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో తాను ప్రాంతీయ పార్టీలో చేరనున్నట్లు నరేష్ బుధవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అయతే ఏ పార్టీలో చేరేదీ ఇప్పుడే స్పష్టం చేయలేనన్నారు. త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం వాస్తవమన్నారు.

రాజకీయాల్లోకి రాను
‘ప్రిన్స్’ మహేష్‌బాబు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 5: రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రసక్తేలేదని, అసలు మొదటి నుంచి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రిన్స్ మహేష్‌బాబు అన్నారు. రెయిన్‌బో తల్లీపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బుధవారం విజయవాడ విచ్చేసిన మహేష్‌బాబు కొద్ది సేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మరో పదేళ్ల వరకు హిందీ చిత్రాల జోలికి వెళ్లబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘నేనొక్కడినే’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, తన కుమారుడు గౌతంకృష్ణతో నటింప చేయాలని సుకుమార్ ఆలోచిస్తున్నారని ఈ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

‘నేనొక్కడినే’ చిత్రం టైటిల్‌తో తనకు సంబంధంలేదని, కథను బట్టి అలా నిర్ణయించి ఉండవచ్చన్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో త్వరలో మరో చిత్రంలో షూటింగ్ ప్రారంభం కాబోతున్నదన్నారు. తాను నటించిన ఏ చిత్రం వల్ల కూడా యువత పెడదోవ పట్టలేదని మహేష్‌బాబు నవ్వుతూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుత యువ సినీ హీరోలందరూ తనకు పోటీయేనని అన్నారు. ఎయిడ్స్, పోలియో ఇతరత్రా ప్రమాదకర వ్యాధులు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో పుట్టే పిల్లలకు వైద్య సహాయం అందించేందుకు రెయిన్‌బో ఆసుపత్రి సహాయంలో ఓ ట్రస్ట్ నెలకొల్పే ఆలోచన ఉందని మహేష్‌బాబు వివరించారు.

శ్రీశైలం జలాశయానికి వరదనీరు

శ్రీశైలం, జూన్ 5: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చిచేరుతోంది. సుంకేసుల జలాశయం, తుంగభద్ర నది నుంచి రోజా గేజింగ్ పాయింట్ ద్వారా జలాశయానికి 8,088 క్యూసెక్యుల వరద నీరు జలాశయానికి చేరుతోంది. జలాశయంలో బుధవారం 814 అడుగుల నీటిమట్టం ఉంది. 36.98 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో జలాశయానికి ఊహించినదాకికన్నా ఎక్కువగా నీరు వచ్చి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆశించిన మేరకు వరద నీరు జలాశయానికి చేరితే విద్యుత్ ఉత్పత్తి, రైతులకు సాగునీటి అవసరాలు తీరుతాయని అధికారులు అంటున్నారు.

చురుకుగా కదులుతున్న రుతుపవనాలు
ఉత్తర కోస్తాలో భారీ వర్షం.. కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 5: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రుతుపవనాలు బుధవారం ఉత్తర కోస్తాకు కూడా విస్తరించాయి. తాడేపల్లిగూడెంలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెరువూరులో 3 సెంటీ మీటర్లు, రాజమండ్రి, విజయవాడల్లో 2 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. రుతుపవనాలు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల వలన వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాష్ట్రంలో రుతుపవనాలు మరింత బలపడాలంటే, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అరేబియా మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడడం వలన పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలావుండగా, ఛత్తీస్‌గడ్ నుంచి ఆంధ్రా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి యథాతథంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వలన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాఉం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో
ఆధిపత్య పోరు

షర్మిల యాత్రలో గ్రూపు రాజకీయాలు బట్టబయలు

ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జూన్ 5: మరో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్ర ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరుకు వేదికగా మారుతోంది. పార్టీలోని గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పాదయాత్రను విజయవంతం చేయటంలో తామే బాగా కష్టపడ్డామన్న అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలియచేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని గ్రూపుల నాయకులు బలప్రదర్శనకు దిగుతున్నారు. బలప్రదర్శనకు ఎవరికి వారు తమ సొంత ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నంలో అసలు పార్టీ బలపడాలనే లక్ష్యం గాలికి కొట్టుకుపోతోంది. నాయకుల మధ్య ఏర్పడిన ఈ పోటీ మాత్రం కార్యక్రమానికి హాజరయ్యే బలహీనవర్గాల ప్రజలకు కలసివస్తోంది. పాదయాత్రకు జన సమీకరణకు రాజమండ్రి నగరంలోని వార్డుల్లోకి నాయకుల అనుచరులు వెళ్లి బలహీనవర్గాలకు చెందిన జనాన్ని ప్రసన్నం చేసుకునేందుకు చాలాతిప్పలు పడ్డారు. ఎక్కడికక్కడ అన్ని వార్డుల్లో జన సమీకరణకు నాయకులు తమ అనుచరులకు బాధ్యతలు అప్పగించటంతో, చోటా మోటా నాయకులు పోటీపడ్డారు. ఈ పోటీని గుర్తించిన జనం, కాస్త తెలివిగా నాయకుల మధ్య తమదైన శైలిలో పోటీపెట్టారు. తాము ఎక్కువ దూరం రాలేమని, ఏదో ఒక సెంటరు నుండి మరో సెంటరు వరకు మాత్రమే వస్తామని, అక్కడి వరకు తీసుకెళ్లి, తరువాత ఇంటికి చేరవేసే బాధ్యత కూడా మీదేనని, అయినా చెప్పిన మేర మొత్తం ఇచ్చేయాల్సిందేనని జనం చెప్పటంతో నాయకుల అనుచరులకు మతిపోయింది. పాదయాత్రకు ముందు జరిగిన సన్నాహక సమావేశాల్లో తాను 10వేల మందిని తీసుకొస్తామంటే, తాను 15వేల మందిని తీసుకొస్తానంటూ హామీలిచ్చిన నాయకులు ఎలాగైనా హామీని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో తమ అనుచరులను వార్డుల్లోకి పంపటంతో, మంగళ, బుధవారాల్లో రెండు రోజులూ బలహీనవర్గాలకు చెందిన మహిళలకు కాస్తంత ఉపాధి లభించింది. అయితే గ్రూపు రాజకీయాల తలనొప్పి భవిష్యత్తులో పార్టీకి ఎలా ఉంటుందో తెలియదుగానీ, ప్రస్తుతానికి మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో షర్మిల పాదయాత్ర విజయవంతంగా సాగేందుకు గ్రూపుల నాయకుల మధ్య నెలకొన్న పోటీ బాగా ఉపయోగపడుతోంది.

ఇక వచ్చేవన్నీ
సంకీర్ణ ప్రభుత్వాలే

తెరాస అధినేత కెసిఆర్

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జూన్ 5: వచ్చే ఎన్నికల అనంతరం కేంద్ర-రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడుతాయని, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితిని అవకాశంగా మలుచుకుని తెలం గాణ రాష్ట్ర సాధనకు టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం బుధవారం ఆయన టిఆర్‌ఎస్ రాజకీయ శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ, జాతీయ పార్టీలతోనే తెలంగాణ వస్తుందన్న వాదనను తిప్పికొట్టారు. టిఆర్‌ఎస్ పుట్టకపోతే కాంగ్రెస్, బిజెపి, టిడిపి తెలంగాణ ఊసెత్తేవి కావన్నారు. జెఎంఎంతో జార్ఖండ్ రాష్ట్ర సాధన జరిగిందన్నారు. రాష్ట్రంలో సీమాంధ్రలో కాంగ్రెస్, టిడిపి, వైకాపాల మధ్య మూడుముక్కలాట సాగుతోందని, తెలంగాణలో సాధించే మెజార్టీ సీట్లతో టిఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అన్నారు. 100అసెంబ్లీ, 16ఎంపి స్థానాల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే సంకీర్ణ రాజకీయాల్లో తెలంగాణ లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆంధ్ర పక్షపాతిగానే వ్యవహరిస్తోం దని, తెలంగాణ ప్రజల పక్షాన ఏనాడు లేదన్నారు. సోనియా గాంధీ చేతిలో ప్రధానమంత్రి మన్మోహన్ కీలుబొమ్మలా మారారని కెసిఆర్ విమర్శించారు.
తెలంగాణ సాధన కోసం ఈ నెల 14న జెఎసి నిర్వహించే చలో అసెంబ్లీకి లక్షలాదిగా తెలంగాణ వాదులు తరలివచ్చి ఉద్యమసత్తా చాటాలని, మధ్యలో అడ్డుకుంటే ప్రతి పోలీస్ స్టేషన్‌ను అసెంబ్లీగా మార్చి మాక్ అసెంబ్లీ నిర్వహించాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని, సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు మోసాలతో నీళ్లను, నిధులను, ఉద్యోగాలను దోచుకెళ్లిన సంగతిని ప్రజల్లో చర్చకు పెట్టి తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ప్రతి కార్యకర్త కథానాయకుడు కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే జురాల-పాకల ప్రాజెక్టును చేపట్టి నల్లగొండకు సాగు, తాగునీరు అందిస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల చొప్పున పింఛన్లు అందజేస్తామని, బలహీన వర్గాలకు 120 గజాల స్థలంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని, లక్ష రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని కెసిఆర్ హామీలు గుప్పించారు.

అసెంబ్లీ సమావేశాల్లోనే తేల్చుకుంటా : మాజీ మంత్రి డిఎల్
english title: 
d

భాగస్వామ్యం కోసం బయోకాన్ వేట

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 5: సోరియాసిస్ నివారణకు తయారు చేసిన ‘అల్జుమాబ్’ బయోలాజికల్ మందు అభివృద్ధి, మార్కెటింగ్ భాగస్వామి కోసం వెదుకుతున్నట్లు బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ బుధవారం తెలియచేసింది. ఇంతవరకూ లేని వైవిధ్య భరితమైన ఈ మందు సోరియాసిస్ నివారణకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడుతుందని ఆ కంపెనీ చైర్మన్, ఎండి కిరణ్ మజుందార్ షా తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ఈ మందు‘ఇథోలిజుమాబ్’(బ్రాండ్ నేమ్ అల్జుమాబ్) అమ్మకానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఈ మందును మనదేశం విడుదలకు సిద్ధమవుతున్నామని, భాగస్వామి లభించిన తర్వాత ప్రపంచ దేశాలలో విడుదల చేస్తామన్నారు. 2016 నాటికి 8 బిలియన్ డాలర్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు.

సోరియాసిస్ నివారణకు తయారు చేసిన
english title: 
b

బంగారం, ప్లాటినం దిగుమతులపై 8 శాతం సుంకం పెంపు

$
0
0

న్యూడిల్లీ, జూన్ 5: బంగారం దిగుమతుల వల్ల కరెంటు ఖాతా లోటు పెరిగిపోతుండడంతో ప్రభుత్వం బంగారం, ప్లాటినం దిగుమతులపై సుంకాన్ని బుధవారం అర్ధ రాత్రి నుంచి పెంచింది.
బంగారంపై ప్రస్తుతం ఉన్న థిగుమతి సుంకం 6 శాతం నుంచి 8 శాతానికి పెరుగుతుంది. ఈ విషయాన్ని రెవెన్యూ కార్యదర్శి సుమిత్ బోస్ చెప్పారు. అదే విధంగా ప్లాటినంపై ఉన్న 6 శాతం దిగుమతి సుంకాన్ని 8 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. ఆరు నెలల కాలంలో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడం ఇది రెండవ సారి. ఇది వెంటనే అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

బంగారం దిగుమతుల వల్ల కరెంటు
english title: 
b

విద్యతోనే పేదల అభివృద్ధి

$
0
0

బుక్కరాయసముద్రం, జూన్ 6: పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖా మంత్రి డా.సాకే శైలజానాథ్ అన్నారు. గురువారం బుక్కరాయసముద్రం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మండలంలోని జంతులూరు గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభం అనంతరం గ్రామవాసులు పాఠశాల ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేయడంతో వెంటనే వారిపైన స్పందిస్తూ ఇక నుంచి ఇటువంటి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు ఉంటాయని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అంతేకాకుండా పిల్లల పట్ల ఉపాధ్యాయులకన్నా తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ వహించాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. నీలంపల్లిలో కమ్యూనిటీ హాలు, చెదుల్ల, వెంకటాపురం గ్రామాలలో రోడ్లను ప్రారంభించారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సహకార సంఘం ఆవరణంలో ప్రహరి గోడకు భూమిపూజ చేశారు. అనంతరం ఇందిరాస్ర్తి శక్తి మహిళా సమాఖ్య భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల చైతన్యమే జాతికి శ్రీరామరక్ష అన్నారు. బుక్కరాయసముద్రం మహిళా సంఘ సమాఖ్య భవనం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇరవై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ప్రతి ఒక్కరికి స్వంత ఇంటి అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. మండలంలో 90 శాతం ఇందిరమ్మ ఇళ్లు, పి.కొత్తపల్లి రోడ్డు మినహా మండలంలోని సిసి రోడ్లు, తారు రోడ్లు పూర్తయ్యాయన్నారు. సకాలంలో వితంతు వికలాంగ, వృద్ధులకు ప్రతి నెలా పెన్షన్ ఇచ్చే ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం పీడిస్తున్న తాగునీటి సమస్యను తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డితో చర్చించి యంపిఆర్ డ్యాం నుంచి పైపులైన్ల ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో బడి ఈడు పిల్లలందరినీ తప్పక పాఠశాలలకు పంపించాలని, ఇక నుంచి పాఠశాలలో వేయబోయే కమిటీలలో పిల్లల తల్లులను కమిటీ మెంబర్లుగా నియమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి ఢిల్లీరావు, ఆర్డిఓ డి.హుస్సేన్‌సాబ్, మండల తహశీల్దార్ నాగరాజు, మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, పి.లింగమయ్య, భాస్కరరెడ్డి, నాగభూషణం(బూసి), శ్రీకాంత్, మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ యస్.రామకృష్ణ, సింగిల్‌విండో అధ్యక్షుడు కె.నాగలింగారెడ్డి, చంద్రమోహన్, పెద్దకొండయ్య, ముసలన్న, పూల నారాయణస్వామి, శ్రీనివాసులు, సత్తి, ఆదినారాయణ, మారుతి, కొండమ్మ పలువురు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

న్యాయమే గెలిచింది
అనంతపురం కల్చరల్, జూన్ 6: మిస్సమ్మ స్థలం విషయంలో న్యాయమే గెలిచిందని, ఇది మిత్రపక్షాలు సాధించిన విజయమని ఆ పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి మహలక్ష్మి శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇండ్ల ప్రభాకర్‌రెడ్డిలు గురువారం మిస్సమ్మ స్థలంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఒకప్పుడు మిస్సమ్మకు పట్టా ఇచ్చారని, దీనిపై బిఎన్‌ఆర్ సోదరులు బోగస్ రిజిస్ట్రేషన్ పత్రాలతో ఆక్రమించుకున్నారన్నారు. 2ఎ నమూనా ప్రకారం ఎక్కడా బిఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ గురించి కనబరచలేదన్నారు. రూ.150 కోట్ల విలువ చేసే స్థలాన్ని కోటి రూపాయలకే తాము పొందినట్లు చెప్పుకువచ్చారని, స్థలాన్నిప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణ కోసం ఉపయోగించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటికైనా బిఎన్‌ఆర్ సోదరులు తక్షణమే మిస్సమ్మ స్థలం నుండి వైదొలగాలన్నారు. వెంటనే తమ బోర్డులను తామే తొలగించుకోవాలన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులపై, అక్కడ నివాసమున్న పేదలపై బిఎన్‌ఆర్ సోదరులు దౌర్జన్యం చేశారని ఇకపై ఇటువంటి దౌర్జన్యాలను మానుకోవాలన్నారు. ఇన్ని రోజులు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు బిఎన్‌ఆర్ సోదరుల అక్రమాలను చూస్తూ, వారు దౌర్జన్యాలకు పాల్పడినా ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, నివాసమున్న వారికి సర్వహక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు కలసికట్టుగా పోరాటం సాగస్తామన్నారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేషయ్య, టిడిపి కృష్ణకుమార్, సరిపూటి రమణ, స్వామిదాస్, సిపిఐ మల్లికార్జున, సిపిఎం రామ్మోహన్, వీరనారప్ప పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో
అక్రమాలపై విజిలెన్స్!
హిందూపురం, జూన్ 6: హిందూపురం మహిళా, శిశు ప్రాజెక్టు పరిధిలో ఇటీవల జరిగిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై 3ఆంధ్రభూమి2లో ప్రధానంగా శీర్షిక వెలువడిన విషయం విదితమే. దీనికితోడు పోస్టుల భర్తీలో చోటు చేసుకున్న అక్రమాలపై ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కలెక్టరేట్ ఎదుటధర్నా నిర్వహించి అప్పటి పెనుకొండ ఆర్డీఓ ఈశ్వర్ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలుచేశారు. ఈ నేపథ్యంలో గురువారం విజిలెన్స్ అధికారులు అంగన్‌వాడీ పోస్టుల భర్తీపై విచారణ నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం చేరుకున్న అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. అదే విధంగా అప్పట్లో హిందూపురం సిడిపిఓగా విధులు నిర్వహించిన ఇందిరాదేవిని వివిధ అంశాలపై విచారణ సాగించారు. ఏఏ పోస్టులను భర్తీ చేశారు, ఆయా పోస్టులకు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, దేని ప్రతిపాదికన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అన్న అంశాలపై సిడిపిఓ ఇందిరాదేవిని దాదాపు రెండు గంటల పాటు ఎస్పీ విచారించారు. అదే విధంగా ఇందుకు సంబంధించి ఐసిడిఎస్ కార్యాలయంలో నమోదైన వివరాలను ఫైళ్లు, వివరాల సిడిలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, హిందూపురం ప్రాజెక్టు పరిధిలో ఇటీవల భర్తీచేసిన అంగన్‌వాడీ పోస్టులపై పెక్కు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై విచారణ సాగించేందుకు ప్రస్తుతం వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఈ వివరాలతో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలనను జరపడం జరుగుతుందన్నారు. విచారణ పూర్తిఅయిన తర్వాత సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఎస్పీ బ్రహ్మారెడ్డి తెలిపారు. కాగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో కొందరు అధికారులు ముందుగా అభ్యర్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని అనర్హులు, స్థానికేతరులకు పోస్టులు కట్టబెట్టారని పెద్దఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుండి రూ.లక్ష దాకా అభ్యర్థులను వసూలు చేసుకొన్నట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. స్థానికులకు మాత్రమే ప్రాధాన్యత కల్పించాల్సిన పోస్టుల్లో కొన్నింటిని లోపాయికారి ఒప్పందాలతో స్థానికేతరులకు కట్టబెట్టినట్లు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై పలువురు అర్హత కలిగి ఉద్యోగాలు రాని అభ్యర్థులు ఉన్నతాధికారులకు నేరుగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు కూడా చేశారు. ఇదిలా ఉండగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై అప్పటి ఆర్డీఓ ఈశ్వర్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం కాగా ఆయన ఇటీవలే ఇతర ప్రాంతానికి బదిలీ అయ్యారు. విచారణ పూర్తి అయిన తర్వాత అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొంటారా లేక కాగితాలకే విచారణ పరిమితమవుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

చౌక ధాన్యపు డిపో తనిఖీ
మున్సిపల్ పరిధిలోని రహమత్‌పురంలో నిర్వహిస్తున్న తొమ్మిదో నెంబర్ చౌక ధాన్యపు దుకాణాన్ని విజిలెన్స్ ఎస్పీ బ్రహ్మారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న స్టాక్, రికార్డులను పరిశీలించారు. అదే విధంగా డిపో పరిధిలో ఎన్ని రేషన్‌కార్డు ఉన్నాయన్న విషయమై ఆరా తీయగా దాదాపు 1750 దాకా ఉన్నట్లు డీలర్ షఫీవుల్లా పేర్కొన్నారు. అయితే తనకు 500 కార్డులు మాత్రమే చాలని సంబంధిత డీలర్‌తో విజిలెన్స్ అధికారులు లిఖిత పూర్వకంగా తీసుకొన్నట్లు సమాచారం.

కీలక పోస్టులన్నీ ఖాళీ
భర్తీకి నోచని మేనేజర్ పోస్టు
అనంతపురం టౌన్, జూన్ 6: కార్పొరేషన్‌లో పాలనాపరంగా కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో పరిపాలనాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఆదాయం ఉండే పోస్టులపైనే పలువురు ఉద్యోగులు మక్కువ చూపుతున్నారు. పదోన్నతులలో భాగంగా సీనియారిటీ జాబితా ప్రకారం సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పించారు. మే 31వ తేదీన మేనేజర్ శకుంతలమ్మ పదవీవిరమణ చేయటంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. అకౌంటెంట్ సతీష్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు లోను కావటంతో లాంగ్ లీవ్‌లో వెళ్ళిపోయారు. ఆయన యుబిఎస్‌పి సెక్షన్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనితో ఇంజనీరింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ విజయకుమార్‌ను అకౌంటెంట్‌గా నియమించారు. దీనితో ఇంజనీరింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ పోస్ట్ ఖాళీగా ఉండిపోయింది. అలాగే యుబిఎస్‌పి సెక్షన్ సూపరింటెండెంట్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. ఆదాయం ఉండే పోస్టుల వైపు మొగ్గు చూపుతున్న సిబ్బంది మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించటానికి విముఖత చూపుతున్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం మేనేజర్ పోస్ట్ నియమించాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. మేనేజర్ పోస్ట్ అడ్మినిస్ట్రేషన్‌పరంగా ఎంతో కీలకమైంది కావటం విశేషం. మేనేజర్‌గా అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ ఆర్.డి, మున్సిపల్ పరిపాలనా శాఖలు కోరే నివేదికలను తయారుచేసి పంపాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. పాలనాపరంగా మేనేజర్ పోస్ట్ కీలకమేకాని గంపెడు పని భారంతో సతమతం కావాల్సి ఉంటుందని వాపోతున్నారు. ఎంత పనిచేసినా సరైన గుర్తింపులేకపోగా అందరితోను మాటలు పడాల్సి వస్తుందన్నారు. అయితే పదోన్నతులలో సీనియర్లమంటూ పోటీపడ్డవారిని కీలకమైన మేనేజర్ పోస్టులో నియమిస్తే బాగుంటుందని వ్యంగ్యంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా పదోన్నతులు కల్పించిన తర్వాత కూడా పలువురు ఉద్యోగులు వారికి కేటాయించిన సూపరింటెండెంట్ పోస్టుల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ విధులు నిర్వహించటానికి విముఖత చూపుతున్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో కీలకమైన అకౌంటెంట్, మేనేజర్, రెవెన్యూ, ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, టౌన్ ప్లానింగ్, యుబిఎస్‌పి సెక్షన్ సూపరింటెండెంట్ పోస్టులను నియమిస్తే ఉద్యోగుల అసంతృప్తిని నివారించటంతోపాటు పాలనాపరంగా నెలకొన్న వివిధ సెక్షన్లలో స్తబ్ధతను తొలగించవచ్చునంటున్నారు. అయితే గతంలో సీనియారిటీ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న శకుంతలమ్మకు ప్రాధాన్యతా క్రమంలో అకౌంటెంట్ పోస్టును కేటాయించకుండా మేనేజర్‌గానే కొనసాగించారు. దీనితో సీనియారిటీ జాబితాను పక్కనపెట్టి జూనియర్లకు ప్రాధాన్యతా పోస్టులలో ప్రాధాన్యతను కల్పించినట్లైంది. దీనితో ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. సీనియారిటీ జాబితాను తోసి సూపరింటెండెంట్ పోస్టుల భర్తీలో అప్పటి ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు సిబ్బందిలో తిరుగుబాటు ధోరణికి దారితీసింది. ఇప్పటికైనా సీనియారిటీ జాబితా ప్రకారం వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్ల పోస్టుల భర్తీని చేపడితేకాని నగరపాలక సంస్థ 3గాడి2లో పెట్టేందుకు వీలుకాదంటున్నారు. లేదంటే పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తి మరింత అస్తవ్యస్తంగా మారుతుందనటంలో సందేహం లేదు.
ఫిర్యాదు చేస్తే కేసు నమోదు
అనంతపురం, జూన్ 6 : ఎవరైనా పోలీసుస్టేషన్‌లకు వచ్చి ఫిర్యాదులు ఇస్తే కేసులు నమోదు చేస్తామని అనంతపురం రేంజ్ డిఐజి బాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం పోలీసు సమావేశ మందిరంలో విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా గురించిన సమాచారం, జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఏఏ ప్రాంతాల్లో ఏఏ సమస్యలు నెలకొని ఉన్నాయి లాంటి వాటి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆయా పోలీసుస్టేషన్‌ల్లో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ మహిళా, పురుష హోంగార్డులను ఉంచి ఫిర్యాదుదారుల పట్ల మంచి నడవడిక కలిగి ఉండేలా వారిని తీర్చిదిద్దుతామన్నారు. ఎవరైనా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితిని తొలగిస్తామన్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యల గురించి తెలుసుకుని వ్యవస్థను గాడిలో పెడతానన్నారు. అంతకు ముందుగా అతను తన స్వగతాన్ని వివరించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో డిఐజిగా పనిచేస్తూ అనంతపురము రేంజ్‌కు బదిలీ అయ్యానన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఆయన మొదట్లో ఆంధ్రయూనివర్శిటీలో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ లెక్చరర్‌గా పనిచేశానని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి కడప జిల్లా రాజంపేట, ఖమ్మం, తిరుపతి, నెల్లూరు, ప్రొద్దుటూరులలో డిఎస్‌పి పనిచేశానన్నారు. అనంతరం కడప, రంగారెడ్డి జిల్లాల ఎయస్‌పిగా పనిచేశానన్నారు. హైదరాబాదు నగరంలోని ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్, విశాఖపట్నంలో డిసిపిగా పనిచేశానన్నారు. కొంతకాలం పాటు ట్రాఫిక్ విభాగంలోకూడా విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. రెండున్నర సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలోని విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో బాధ్యతలు నిర్వర్తించినట్లు పేర్కొన్నారు.

మున్సిపల్ రిజర్వు స్థలం అన్యాక్రాంతమైతే సహించం
అనంతపురం టౌన్, జూన్ 6: నగరంలోని ఆర్.టి.సి బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ రిజర్వ్ స్థలం 5.20 ఎకరాల స్థలాన్ని గురువారం ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ, కమిషనర్ రంగయ్యలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణకిశోర్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణకిశోర్, చైన్‌మెన్లు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్‌లో గుర్తించిన రిజర్వ్ స్థలం 5.20 ఎకరాల స్థలంలో 72 సెంట్లు గల్లంతు కావటం గుర్తించారు. గల్లంతైన స్థలం వివరాలపై ఆరా తీసిన ఇన్‌చార్జి కలెక్టర్‌కు సంతృప్తికరమైన సమాధానం టౌన్ ప్లానింగ్ సిబ్బంది నుంచి లభించలేదు. దీనితో ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్పొరేషన్ మున్సిపల్ స్థలాలపై విషయ పరిజ్ఞానం పెంచుకోకపోతే ఎలాగని సిబ్బందిని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలివ్వకుండా అవసరం లేని విషయాలను ప్రస్తావించటం మానుకోవాలని సూచించారు. రిజర్వ్ స్థలంపై ఎసిపి కృష్ణకిశోర్ సంతృప్తికర సమాధానం ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో చైన్‌మెన్ కుళ్ళాయప్ప సమాధానమిస్తూ మున్సిపాలిటీ ఏర్పాటు సమయంలో సెంట్రల్ పార్క్ ఏర్పాటుకై రిజర్వు స్థలం కేటాయించారన్నారు. గతంలో రహదార్ల ఏర్పాటులో స్థలం కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఇందులో స్థలం కేటాయింపులు చేశారన్నారు. అలా కేటాయింపులు జరగగా మిగిలినదే 5.20 ఎకరాల రిజర్వ్ స్థలమని తెలిపారు. సరైన సమాచారం ఇచ్చిన చైన్‌మెన్ కుళ్ళాయప్పను ఇన్‌చార్జి కలెక్టర్ అభినందించారు. రిజర్వ్ స్థలం 5.20 ఎకరాలలో గల్లంతైన 72 సెంట్ల స్థలం ఏమైందన్న విషయం నిగ్గుతేల్చాలన్నారు. తహశీల్దార్, సర్వేయర్లు రిజర్వ్ స్థలాన్ని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. ఎల్లుండిలోగా గల్లంతైన 72 సెంట్ల స్థలం సంగతి తేల్చాలని సూచించారు. ఎలాంటి పరిస్థితిలోను మున్సిపల్ కార్పొరేషన్ స్థలం అన్యాక్రాంతం కానివ్వరాదని హెచ్చరించారు. తప్పులు దొర్లినట్లైతే చర్యలు తప్పవని అన్నారు.
నకిలీ వే బిల్లుల ముఠా అరెస్టు
తాడిపత్రి, జూన్ 6 : పట్టణంలో నకిలీ వే బిల్లులు, నకిలీ రాయల్టీ బిల్లులతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ముఠాను అరెస్టు చేశామని పట్టణ సిఐ లక్ష్మినారాయణ తెలిపారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ తాడిపత్రి నుండి హైదరాబాద్‌కు బండల లోడుతో వెళ్తున్న లారీని కర్నూలు వద్ద విజిలెన్స్‌వారు తనిఖీలు చేయగా వే బిల్లుపై ఏసిటివో-2 పేరు మీద ఉన్న సీలును చూసి అనుమానంతో లారీని సీజ్ చేసి, తాడిపత్రిలోని కమల్ రోడ్‌లైన్స్‌పై విజిలెన్స్ వారు దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో కొన్ని నకిలీ వే బిల్లులు, రబ్బరు స్టాంపులు దొరకగా, వాటిని విజిలెన్స్‌వారు సీటీఓకు అందజేశారని, వారు నకిలీవని ధృవీకరించి దర్యాప్తు చేయాల్సిందిగా తెలుపడంతో కమల్ రోడ్‌లైన్స్ నిర్వహిస్తున్న రామయ్య, వేణుగోపాల్‌ను విచారించగా, నందలపాడుకు చెందిన కుమార్ తమకు నకిలీ బిల్లులు అందజేస్తున్నాడని తెలుపడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నకిలీ బిల్లులు, రబ్బరుస్టాంపులను స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు. కుమార్ కర్నూలు జిల్లాలో అధికారులు స్టాంపు వేయని వే బిల్లులను తెచ్చి వాటిపై గల రబ్బరు స్టాంపులు, అధికారుల సంతకాలను ఇంకు రిమూవర్‌తో తొలగించి ఆ బిల్లులను విక్రయిస్తున్నాడని, ఇతనిపై కర్నూలు జిల్లాలో పలు కేసులున్నాయని తెలిపారు. అరెస్టు చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని తెలిపారు.
కార్మికుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం, జూన్ 6 : స్థానిక రెవెన్యూ భవన్‌లో గురువారం జిల్లాలోని కార్మికుల సమస్యలను పరిష్కరించుటకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరు తరపున కార్మికశాఖ ఉప కమిషనరు కె. సుబ్బారావు ఫిర్యాదులను స్వీకరించారు. అసిస్టెంట్ కమిషనర్లు రంగరాజు అయ్యంగార్, సూర్యనారాయణ, మురళీధర్, సీనియర్ సహాయకులు సుజాత తదితరులు పాల్గొన్నారు. కార్మికుల కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌లోవచ్చిన వినతుల వివరాలిలా ఉన్నాయి .. అనంతపురము మెడికల్ కళాశాల, సర్వజన వైద్యశాలలోపనిచేస్తున్న 213 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఆరు నెలల వేతనాలు ప్రభుత్వం ద్వారా బకాయిపడి ఉండడంవల్ల జీతభత్యాలు లేక ఉద్యోగుల కుటుంబాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే 2013 ఏప్రిల్ నుంచి ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగింపు కొరకు చర్యలు చేపట్టాలని అనంతపురము మెడికల్ కళాశాల, ఆసుపత్రి ఉద్యోగుల సంఘం నాయకులు వినతిని సమర్పించారు. కళ్యాణదుర్గం మండలంలోని వడ్డేకాలనీలో సుమారు నాలుగు వేల మంది నివసిస్తున్నారని, ఈ ప్రాంతపు ప్రజలకు తాగునీరు సరఫరా కావడం లేదని అందుచేత తాగునీటి ఎద్దడి తీర్చుటకు వాటర్ ప్లాంట్ మంజూరు చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. కళ్యాణదుర్గం మండలంలోని కురుబరహళ్లి గ్రామంలోని బిసి కాలనీ నివాసి వడ్డే భాగ్యమ్మ సాధారణంగా మృతి చెందినదని ఈమె పేరు మీద భవన నిర్మాణ సంక్షేమం బోర్డు ద్వారా రూ.30 వేలు మంజూరై భర్త హనుమంతరాయుడుకు చెందవలసి ఉండగా ఇటీవల కాలంలో ఇతను కూడా మరణించారు. అందుచేత ప్రస్తుతం మరణించిన దంపతుల కుమారుడైన వడ్డే వన్నూరుస్వామికి మంజూరు అయిన ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వ అధికారులు తగుచర్య తీసుకుని నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి నారాయణరెడ్డి, ఎడిఓ సేవానాయక్, జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి ఇబ్రహీమ్, ఎపిఓ సువర్ణలత, ఇయస్‌ఐ బ్రాంచి హిందూపురం మేనేజరు పద్మావతమ్మ, డిప్యూటీ కమిర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు ప్రసాదు, పిఎఫ్‌ఓ సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల నిరసన దీక్షలు జయప్రదం చేయండి
అనంతపురం సిటీ, జూన్ 6: ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపుతున్న సాచివేత ధోరణికి నిరసనగా ఈ నెల 11వ తేదీన హైదరాబాదులో జరుగు దీక్షలను జయప్రదం చేయాలని జిల్లా జాక్టో పిలుపునిచ్చింది. గురువారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో జాక్టో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాక్టో నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర జాక్టో ఈ నెల 11వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లాలో జాక్టో నాయకులు, ఉపాధ్యాయులు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాక్టో రాష్ట్ర నాయకులు కె.ఓబుళపతి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై జరుగు నిరసన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌టిఎఫ్ ఉపాధ్యాయులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో జాక్టో జిల్లా నాయకులు బసవరాజు, వెంకటేశులు, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, రామన్న, గోవిందు, జయరామ్ నాయక్, వెంకటసుబ్బయ్య, శ్రీనివాసప్రసాద్, రాజశేఖర్, నారాయణస్వామి, వెంకటరత్నం, విష్ణువర్థన్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, తులసిరెడ్డి, ఎర్రిస్వామి, అశోక్‌కుమార్‌రెడ్డి, రామలింగప్ప, ఎం.రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుడి మృతి
ధర్మవరం టౌన్, జూన్ 6: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని (55) సంవత్సరాలు వృద్ధుడు మృతి చెందాడు. వివరాలిలా వున్నాయి. కనగానపల్లి హైస్కూల్ వద్ద అపస్మారక స్థితిలో పడి వున్న వృద్ధుడిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు విషయం చేరవేయడంతో బుధవారం సాయంత్రం 108 సాయంతో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతి చెందిన వృద్ధుడు తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు ధరించాడని, ముఖంపై పెద్ద పులిపిరి వుందని డాక్టర్లు తెలిపారు. వృద్ధుడిని అంత్యక్రియల నిమిత్తం మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు.పోలీసులు కేసు నమోదు చేసారు.
వివాహిత ఆత్మహత్య
గోరంట్ల, జూన్ 6: వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని 1వ వార్డుకు చెందిన చింతకాయల లక్ష్మీదేవి (36) అనే మహిళ దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధ పడుతోందని, ఆ బాధ భరించలేక గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
రెండు దేవాలయాల్లో చోరీ
ఉరవకొండ, జూన్ 6: మండలంలోని రేణుమాకుల పల్లి గ్రామంలోని సుంకులమ్మ, మారెమ్మ దేవాలయంలో గురువారం తెల్లవారుజామున దుండుగులు చోరీ చేసినట్లు ఆలయ పూజారి లింగప్పలు తెలిపారు. తలుపుల బద్దలు కొట్టి సుంకులమ్మ ఆలయంలో బిరువాను రాళ్లతో ధ్వంసం చేసి అమ్మవారి కిరిటాలు, ముఖం, మీసాలతో పాటు బంగారు తాళిబొట్లను, హుండీలోని నగదును చోరీ చేసినట్లు పూజారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతానికి యువ రైతు మృతి
వజ్రాకరూరు, జూన్ 6: మండల పరిధిలోని చిన్నహోతూరు గ్రామానికి చెందిన గోవిందు.33 కు విద్యుత్‌షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు. బంధువుల వివరాలు మేరకు...రోజుమాదిరిగా పొలానికి నీరు కట్టెందుకు వెళ్లడన్నారు. గురువారం తెల్లవారజూమున యథాప్రకారం తమ 3ఎకరాల కొత్తిమిర తోటకు నీళ్లు కట్టెందుకు వెళ్లాడన్నారు. విద్యుత్ మోటరు ప్రారంభిస్తుండగా ఈ సంఘటన చేసుకుందన్నారు. ఉదయం పొలానికి వెళ్లిన వ్యక్తులు చూసి గోవిందు మృతి చెందినట్లు గుర్తించారన్నారు. మృతునికి భార్య తులసమ్మ ఇద్దరు పిల్లలు వున్నట్లు తెలియజేశారు. ఈ సంఘటనపై వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
కదిరిటౌన్, జూన్ 6: పట్టణ శివార్లలోని పిల్ల కాలనీకి చెందిన భాస్కర్ అనే బీటెక్ విద్యార్థి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని మర్తహళ్లి వద్ద బుధవారం రోడ్డు దాటుతుండగా వాటర్‌ట్యాంక్ వాహనం ఢీకొని మృతి చెందినట్లు కాలనీవాసులు పేర్కొన్నారు. భాస్కర్ తండ్రి క్షౌరవృత్తి చేస్తూ తమ కుమారున్ని చదవించేందుకు రూ. 5లక్షల దాకా అప్పుచేయడం జరిగిందన్నారు. భాస్కర్ మృతి చెందడం వల్ల అతని కుటుంబం దయనీయ స్థితిలో వుందని, ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని కాలనీవాసులు కోరారు.
విద్యుదాఘాతంతో నేతన్న మృతి
ధర్మవరం, జూన్ 6: మగ్గం నుండి తయారైన చీరను తీసుకొని బయటకు వస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో శివానగర్‌కు చెందిన పోతులయ్య (27) అనే నేత కార్మికుడు మృతి చెందాడు. షాక్ తగిలిన వెంటనే అతనిని 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ రామచంద్రారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
చెనే్నకొత్తపల్లి, జూన్ 6: పెళ్లి ఊరేగింపులో గాయపడి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన గురువారం దామాజిపల్లిలో జరిగింది. గత నెల 24న గ్రామంలో జరుగుతున్న పెళ్లి ఉరేగింపులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చికిత్స పొందుతూ వడ్డే ముత్యాలమ్మ (45) అనంతపురం ఆసుపత్రిలో మృతి చెందింది.
మహిళ ఆత్మహత్యాయత్నం
ధర్మవరం, జూన్ 6: స్థానిక మార్కెట్ వీధికి చెందిన చిన్నసుంకమ్మ కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి గురువారం పాల్పడింది. వివరాలు ఇలా వున్నాయి. నారాయణ స్వామి, భార్య సుంకమ్మ ఇరువురు కలసి గాజుల వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు. ఇరువురి మధ్య కుంటుంబ కలహాలు రావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుంకమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
జూదరుల అరెస్టు
నంబులపూలకుంట, జూన్ 6: మండల పరిధిలోని బి. కొత్తపల్లి గ్రామంలో గురువారం జూదం ఆడుతున్న ఆరుమంది జూదరులను అదులోకి తీసుకున్నట్లు ఎస్సై లక్ష్మి పేర్కొన్నారు. గ్రామంలోని పీర్లచావడి సమీపంలో జూదరులు పేకాట ఆడుతున్న సమయంలో ఆరుమందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 2200ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. జూదరులను నేడు రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
ఓబుళదేవరచెరువులో...
ఓబుళదేవరచెరువు: మండల పరిధిలోని పెద్దగుట్లపల్లి గ్రామశివార్లలో పేకాట ఆడుతున్న ఆరుమందిని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్ణాటక, ఆంధ్రా సరిహద్దుల ప్రాంతాలలో భారీగా పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో మెరుపుదాడులు చేసి వీరిని పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుండి రూ.14 వేలను స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరుపరస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
హిందూపురంలో..
హిందూపురం రూరల్, జూన్ 6: హిందూపురం రూరల్ మండల పరిధిలోని నక్కలపల్లి వద్ద గురువారం సాయంత్రం 14 మందిని అరెస్టు చేసి వారి నుండి రూ.25,100 నగదు స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్సై చాంద్‌బాషా తెలిపారు. గ్రామంలో పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించి జూదరులను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకొన్నట్లు చెప్పారు. ఈ మేరకు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్సై చెప్పారు.

పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని
english title: 
poor

కిరణ్‌పైనే గురి

$
0
0

కడప, జూన్ 6 : ఇటు డిఎల్ రవీంద్రారెడ్డి అటు ఆయన వ్యతిరేకులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని లక్ష్యం చేసుకుని మాటల యుద్ధానికి దిగారు. తనను భర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వదిలిపెట్టనని మాజీ మంత్రి డిఎల్ విమర్శలు ఎక్కు పెడుతుండగా ఆయన వ్యతిరేకులు సిఎంకు అనుకూలంగా మాట్లాడుతూ డిఎల్‌పై ఆరోపణలు సంధిస్తున్నారు. సిఎం కిరణ్‌పై మరోసారి అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని డిఎల్ గురువారం ప్రకటించారు. సీనియర్లను నిర్లక్ష్యం చేస్తున్న సిఎం పార్టీ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆయన వల్ల పార్టీ నష్టపోతుందన్నారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి విధానాల వల్లే ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తోందని డిఎల్ వ్యతిరేకులు ప్రచారం చేస్తూనే ఆయనపై ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. ఎమ్మెల్యే వీరశివారెడ్డి మిగిలిన నేతలను ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వి వరదరాజులురెడ్డి తదితరులతో కలిసి డిఎల్‌పై విరుచుకుపడుతున్నారు. ఒకడుగు ముందుకేసి డిఎల్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆయనను చేర్చుకుంటే తేలుతో సావాసం చేసినట్లేనని ధ్వజమెత్తారు. అక్రమంగా సంపాదించుకున్నారని కూడా అన్నారు. డిఎల్ అటు సిఎం పనితీరును విమర్శిస్తూనే ఇటు వీరశివాపై బృందంపై కూడా వ్యాఖ్యలు చేశారు. వారంతా సిఎంకు చెంచాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. తనపై చౌకబారు విమర్శలు చేస్తున్నవారంతా వారి గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదిలావుండగా మంత్రి పదవికి దూరమై డిఎల్ రవీంద్రారెడ్డి, మంత్రి పదవిని ఆశిస్తూ వీరశివారెడ్డి సృష్టిస్తున్న గందరగోళం పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ వ్యవహారం పార్టీ అధిష్ఠానానికి కూడా తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు మిగిలిన నేతలను పార్టీ కార్యకర్తలకు విస్మయం కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధిష్ఠానం కల్పించుకుంటే తప్ప వేడి చల్లారే పరిస్థితి కనిపించడం లేదు.

సమస్యలు పరిష్కరిస్తాం
* ఆర్టీపీపీ కార్మికులకు జెన్‌కో డైరెక్టర్ హామీ
ఎర్రగుంట్ల, జూన్ 6 : రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో కార్మికులు ఎదుర్కొంటున్న క్యాటగిరైజేషన్‌తోపాటు వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జెన్‌కో డైరెక్టర్ రాధాకృష్ణ హామీ ఇచ్చారు. గురువారం ఆర్టీపీపీలో 7 యూనియన్లకు చెందిన కార్మికుల నాయకులతో పాటు వందలాది మంది కార్మికులు విఐపి గెస్ట్‌హౌస్ వద్ద డైరెక్టర్‌ను కలసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ వీలైనంత త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సిల్క్, సెమీసిల్క్, సూపర్ సిల్క్ విషయంలో జెన్‌కో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. అలాగే ఒకే కార్మికుని ఒకే ఇపి ఎఫ్ నెంబరు ఉండేలా, మహిళలకు 26 రోజులు పని దినాలు కల్పించేందుకు, ప్రస్తుతం ఉన్న గేట్ పాసుల స్థానంలో మరింత నాణ్యమైన పాసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుబ్బిరెడ్డి, పుల్లారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్టీపీపీలో పలువురు అధికారుల తీరుపై సిఐ కుమార్‌బాబుతో పాటు కార్మిక నాయకులు పలువురు డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన డైరెక్టర్ రాధాకృష్ణ ప్రాజెక్టు సవ్యంగా నడవాలంటే పట్టువిడుపులు ఉండాలని, నియంతలా వ్యవహరించ కూడదని హితవు పలికారు. ఈ సందర్భంగా డికెటి పట్టా రైతులు నష్టపరిహారాన్ని మంజూరు చేయాలని భూములు కోల్పోయిన బాధితులు డైరెక్టర్‌కు వినతిపత్రాలు సమర్మించారు.
నిర్మాణం పనులు పరిశీలన
6వ యూనిట్ నిర్మాణం పనులను డైరెక్టర్ రాధాకృష్ణ, కృష్ణమూర్తి, స్థానిక అధికారులు కుమార్‌బాబుతో పాటు సంబంధిత ఎస్‌ఇలు పరిశీలించారు. ఈ సందర్భంగా నత్తనడకన నడుస్తున్న పనుల పట్ల డైరెక్టర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న మేరకు సివిల్ పనులు జరగడం లేదని ఇలా అయితే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయలేమన్నారు. కొన్ని కంపెనీల అధికారులు డైరెక్టర్ వచ్చినా అందుబాటులో లేకపోవడం పట్ల అగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన 6వ యూనిట్ పనులను పూర్తి చేయాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిచారు. ఆయన వెంట డైరెక్టర్ క్రిష్ణమూర్తితో పాటు జెన్‌కో సిఇ రత్నబాబు, స్థానిక సిఇ కుమార్‌బాబు, ఎస్‌ఇలు రమణారెడ్డి, శేషారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
* భారీగా నగదు, వాహనాలు స్వాధీనం
నందలూరు, జూన్ 6 : మండల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసే స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుండి దాదాపు 30 లక్షలు విలువ చేసే 4 వాహనాలను, రూ. 1 లక్షా 5 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరసింహరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 23వ తేదీన ఆడపూరు సమీపంలోని చెట్ల పొదల్లో అనుమానాస్పదంగా పడి ఉన్న ఎపి02 ఆర్ 456 స్కార్పియో, ఈ నెల 3వ తేదీ ఒక సఫారీ, మారుతి, ఇండికా వాహనాలు కూడా నందలూరు పరిసర ప్రాంతాలలో లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పటి నుండే ఈ స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఉంచడంతో గురువారం మధ్యాహ్నం ఈదరపల్లె క్రాస్ రోడ్ వద్ద స్మగ్లర్ల ఉన్న సమాచారం తెలిసి తిరుపతికి చెందిన వెంకటరమణ, కడప రామాంజనేయపురంకు చెందిన పెరుగు లక్ష్మీనరసయ్య, నందలూరుకు చెందిన ఎస్ ఖాదర్‌వలిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్దనున్న నగదు లక్షా ఐదు వేలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరితో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు నందలూరుకు చెందిన ఖాదర్‌బీ, రఫీ, భాషా, భాస్కర్ కలసి బాలపల్లెకు చెందిన బాబుతో వ్యాపార లావాదేవీలు జరిపేవారని విచారణలో తేలిందన్నారు. స్మగ్లర్లు బాబు వద్ద ఎర్రచందనం కిలో రూ. 300కు కొనుగోలు చేసి, బెంగుళూరు పాలెంలో కిలో రూ. 600లకు అమ్మేవారన్నారు. హైవేలోనే అక్రమ రవాణా నిర్వహించేవారన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను, నగదును కోర్టులో పెడతామని ఎస్సై తెలిపారు.

ఉన్మాదిని పట్టుకుంటాం
* ఐపిఎస్ అధికారి విజయకుమార్
ఒబులవారిపల్లె, జూన్ 6 : మండలంలోని జివి పురంలో ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న నిందితుడు తోట రమణను అతి త్వరలో పట్టుకుంటామని ఐపిఎస్ అధికారి విజయకుమార్ అన్నారు. గురువారం ఆయన గ్రామంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జివి పురంలో గత రెండేళ్లగా కనబడకుండా తిరుగుతున్న ఉన్మాది రమణను త్వరలో పట్టుకుంటామని, నిందితుడు ఎక్కడ ఉండేది తెలిసి ఉంటే చెప్పాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని, అదనపు బలగాలతో గాలింపు చర్యలు చేపడతామన్నారు. నిందితుని అచూకీ తెలిసిన వారు గ్రామంలోని పోలీసులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ అన్యోన్య, సిఐ రమాకాంత్, ఎస్సై సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

వీరారెడ్డిగారిపల్లెలో ఈతకెళ్లి
ఇద్దరి మృతి
రాయచోటి, జూన్ 6 : ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన గురువారం లక్కిరెడ్డిపలె మండలం దప్పేపల్లె పంచాయతీలోని వీరారెడ్డిగారిపల్లెలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం వీరారెడ్డిగారిపల్లెలో గ్రామానికి చెందిన వెంకటుసబ్బయ్య కుమారుడు, రెడ్డిశేఖర్(8), చంద్ర కుమారుడు రెడ్డిశేఖర్(8), జనే్మజయుడు(8) కలిసి మధ్యాహ్నం గ్రామం సమీపంలోని చెరువుకు ఈతకెళ్లారు. అయితే ఈతఆడుతూ లోతులోకి పోవడంతో మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ వీరన్న కేసు నమోదు చేసి, శవాలను పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అటవీ సంరక్షణ అందరి బాధ్యత
* అటవీశాఖ రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ హెచ్‌సి మిశ్రా
రైల్వేకోడూరు, జూన్ 6 : అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ హెచ్‌సి మిశ్రా అన్నారు. గురువారం స్థానిక అటవీశాఖ పార్క్ ఆవరణలో రాజంపేట డివిజన్ స్థాయి వన సంరక్షణ సమితి అధ్యక్షులు, సభ్యులతో అటవీ సంరక్షణపై సమావేశం జరిగింది. స్థానిక డిఎఫ్‌ఓ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాజంపేట, కోడూరు, చిట్వేలి, సానిపాయి, బాలపల్లె అటవీశాఖల అధికారులు, సిబ్బంది, విఎస్‌ఎస్ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌సి మిశ్రా మాట్లాడుతూ అడవులను సంరక్షణ చేయడం కేవలం అటవీ శాఖ అధికారుల బాధ్యత కాదని, పోలీసులు, ప్రజలు, విఎస్‌ఎస్ సభ్యులు తమ వంతు కృషి చేయాలని అన్నారు. అడవులు అంతరించిపోతే వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చి మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడే సూచనలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడవులను కాపాడుకుంటే వాతావరణ బాగుంటుందని, తద్వార సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. చెన్నైలో ఎర్రచందనం విలువ విపరీతంగా ఉండడంతో అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసేందుకు స్మగ్లర్లు వస్తున్నారని, వారిని ఎదుర్కొనాలంటే అటవీ శాఖ అధికారులకు ప్రజలు, విఎస్‌ఎస్ సభ్యులు సహకరించాలన్నారు. ఇప్పటికే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తిరుపతి, కోడూరు అటవీ ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే అత్యంత విలువైన ఎర్రచందనం చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలోనే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కాకుండా ప్రతి ఒక్కరు అటవీశాఖ అధికారులకు సహకరించాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో వెళుతుంటే వారి సమాచారాన్ని స్థానికులు అటవీ అధికారులకు చెప్పాలన్నారు. స్మగ్లర్లు ఇచ్చే డబ్బులకు ఎవరు కూడా ప్రలోభాలకు గురికాకుండా ఉండాలన్నారు. అడవితల్లిని పది కాలాల పాటు సంరక్షణ చేసుకుంటే భావి తరాలకు ఏలాంటి ప్రమాదం ఉండదన్నారు. అక్రమ రవాణా సమాచారాన్ని సకాలంలో తెలిపేవారికి అటవీ శాఖ తరపున పారితోషకాన్ని అందిస్తామన్నారు. తమిళనాడు, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల నుండి వందలాది మంది స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనాన్ని నరికివేయడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యత గుర్తెరిగి వారిని ఎదుర్కొనాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. అడవులు దెబ్బతింటే తద్వారా అటవీ ప్రాంతంలోని జంతువులన్నీ గ్రామాలపైకి వస్తాయని, దీంతో ప్రజలకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం త్వరలో సిబ్బంది కొరతను భర్తీ చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి వాల్‌పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పీలేరు, తిరుపతి డిఎఫ్‌ఓలు నాగార్జునరెడ్డి, పవన్‌కుమార్, సబ్ డిఎఫ్‌ఓ శ్రీనివాసులు, అటవీ అధికారులు వెంకటసుబ్బయ్య, హేమచందర్, ఖాదర్‌బాషా, శివరామప్రసాద్, టివైఎన్ గౌడ్, సాయిబాబా తదితరులు పాల్గొని, ప్రసంగించారు.

డిఎల్‌కు మతిభ్రమించింది
* ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రసాద్‌రెడ్డి
ప్రొద్దుటూరు, జూన్ 6 : మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డికి మంత్రి పదవి పోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు చైర్మన్ శంకరాపురం ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులోని తన చాంబర్‌లో గురువారం విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కించపరచే విధంగా, తరచూ పథకాలను, ముఖ్యమంత్రి విధానాలను విమర్శించడం డిఎల్‌కు ఎంత వరకు సబబు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దొడ్డిదారిన సూట్‌కేసులను మోసి పదవులు తెచ్చుకున్నాడని విమర్శించడం సోనియాగాంధీని విమర్శించినట్లు కాదా అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సోనియాగాంధీ ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టారన్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీని ఆరోపించడం వల్లే మంత్రిగా డిఎల్‌ను బర్తరఫ్ చేశారన్నారు. రాజీనామాను అడిగి వుంటే ఎడమచేతితో వదిలేసేవాడినని డిఎల్ చెప్పడం విడ్డూరంగా వుందని ముఖ్యమంత్రి తీరు నచ్చనప్పుడు రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సోనియాగాంధీ మీద ఏ మాత్రం గౌరవం వుందో డిఎల్ విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. బుధవారం ఆయన మైదుకూరు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభల్లో తాజాగా వైఎస్ తన ప్రాణమిత్రుడని చెప్పుకుంటున్న డిఎల్ వైఎస్ హయాంలో పథకాలను ఎన్నిసార్లు విమర్శించారో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రాణమిత్రుని కొడుకు వైఎస్ జగన్‌మోహన్ దేశాన్ని అమ్మేస్తాడని తన ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన సంగతి మరవడం చాలా హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పార్టీలో వుంటూ అనేక సార్లు ఒడిదుడుకుల మధ్య ఎన్నికల్లో గెలుపొందుతూ కేవలం ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి 2009 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయన మాజీ ఎమ్మెల్యే వరదపై చెంచాలు, గరిటలంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఏ పార్టీలో వున్నా ఆయనకు అప్పజెప్పిన బాధ్యతలను పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారన్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి మంత్రిగా వున్నప్పుడు తన శాఖలో వున్న ఉద్యోగాల విషయంలో స్పీపర్ స్థాయి నుంచి డాక్టర్ల స్థాయి నియామకాల్లో ప్రత్యేక గ్యాంగ్‌లను తయారు చేసుకొని డబ్బులు వసూలు చేయడం వాస్తవం కాదా అని విమర్శించారు. ప్రొద్దుటూరు ప్రజలకు ప్రధాన అవసరమైన మంచినీటి కోసం కుందూపెన్నా వరదకాల్వను ఏర్పాటు కోసం మాజీ ఎమ్మెల్యే వరద పాటుపడుతుంటే ఆయన చేసే పనిని అడ్డుకోవడం జరుగుతుందన్నారు. ప్రొద్దుటూరులో ఆయనతో మంచి సంబంధాలు కలిగిన నేతలు, లోపాయికారి గ్యాంగ్‌లు ప్రజలకు నీళ్ళు రాకుండా అడ్డుకుంటే ఈ పట్టణం నుండి బహిష్కరించాల్సిందిపోయి అందరూ కలిసి ఒకటవడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు బేపారి బషీర్‌అహమ్మద్, కాంగ్రెస్ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, షబ్బీర్, పెద్దశెట్టిపల్లె వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ ప్రభుత్వంలో రూ.500 కోట్లపై
శే్వత పత్రం విడుదల చేయాలి
* టిడిపి నేతలు అమీర్, గోవర్ధన్‌రెడ్డి
కడప (అర్బన్), జూన్ 6 : దివంగత ముఖ్యమంత్రి ప్రభుత్వ హయాంలో 2006లో కడప నగరాభివృద్ధికి మం జూరు చేసిన రూ.500 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ద్వారా శే్వతపత్రం విడుదల చేయాలని టిడిపి రాష్ట్ర నాయకులు విఎస్ అమీర్‌బాబు, ఎస్. గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో వారు మా ట్లాడుతూ వైఎస్ హయాంలో కడప నగరాభివృద్ధి పేరుతో ప్రభుత్వం నుంచి మంజూరైన కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న ప్రస్తుత వైకాపా నేతలు నేడు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నగరాన్ని మరో సింగపూర్‌ను చేస్తామన్న అప్పటి మేయర్ పి రవీంద్రనాథ్‌రెడ్డి సింగపూర్ కాదు కదా కడపను కడపలా ఉంచి ఉంటే ప్రజలు సంతోషించేవారన్నారు. అండ ర్ డ్రైనేజీ పనులను సంపూర్ణంగా చేయకపోవడంతో ఏ రోడ్డులో చూసి నా మ్యాన్‌హోల్స్ హెచ్చు తగ్గులతో నగర ప్రజలకు అనునిత్యం కష్టాలకు గురవుతున్నారన్నారు. కొన్ని ప్రాంతా ల్లో వర్షం నీరు కూడా బయటకు మళ్లించలేని స్థితిలో ఉన్నాయన్నారు. ఒక్కొక్క వార్డుకు రూ.5 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో శే్వతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు పీరయ్య, రవిశంకర్‌రెడ్డి, మీనాక్షి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

రైతులకు త్వరగా విత్తనాలివ్వాలి
* ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి, జూన్ 6 : రైతులకు త్వరగా విత్తనాలను అందివ్వాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం కురిసినందున రైతులు వేరుశెనగ విత్తనాలు విత్తేందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు త్వరగా అందిస్తే అదునులో విత్తనం పడుతుందన్నారు. నియోజకవర్గంలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మండలాలకు 2వేల క్వింటాళ్లు సరఫరా చేస్తే రైతులకు సరిపోతాయన్నారు. ప్రస్తుతం వెయ్యి క్వింటాళ్లు వస్యాయని, వ్యవసాయాధికారులు చెబుతున్నారని, అవి ఏ మూలకూ సరిపోవన్నారు. ఇక రుణాలు రెన్యూవల్ సమయంలో బ్యాంకు అధికారులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరి కాదన్నారు. మీ సేవా ద్వారా 1బి, అడంగల్ తీసుకొస్తేనే రుణాలు రెన్యువల్ చేస్తామని చెబుతారని, అయితే కొందరి రైతుల పాసుపుస్తకాలు కంప్యూటర్‌లో ఎక్కించకపోకవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కనుక తహశీల్దార్ కార్యాలయంలో 1బి, అడంగల్ అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఎ రాధాదేవి, వ్యవసాయాధికారి దివాకర్‌బాబు, ఎఇఓ నవంత్‌కుమార్, మాజీ కౌన్సిలర్ దశరథరామిరెడ్డి, జాఫర్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం
మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి గురువారం అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు మంచి పౌష్ఠికాహారం అందించాలన్నారు. అప్పుడే కేంద్రాలపై పిల్లలకు మక్కువ ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ భారతి, ఎంఇఓ చిన్న రెడ్డెన్న, సూపవైజర్లు తదితరులు పాల్గొన్నారు.

‘సినిమా నేను తీస్తా’ లఘు చిత్రం
ఆడియో ఆవిష్కరణ
కడప ,జూన్ 6 : ‘సినిమా నేను తీస్తా’ లఘు చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం నగర మాసాపేట నిర్మల్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవానికి బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఆర్‌ఐ సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు టింబర్ డిపో సుధీర్, న్యాయవాది అజయ్ కుమార్ వీణా, బ్లడ్ 2 లివ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు పి పవన్‌కుమార్, నిర్మల్ హైస్కూల్ ప్రధానో ఉపాధ్యాయురాలు మేరి క్యాతీరీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కళాకారుల కొదవ లేదన్నారు. ఇంత చిన్నవయస్సులోనే ఆర్ట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ లఘు చిత్రానికి కడప వాసి దీపక్ దర్శకత్వం వహించడం చాలా అభినందిందచ దగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు, రమణస్వామి, ప్రసాద్, లక్ష్మి, ఆదిల్, సందీప్, సందు, శివ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

* మంత్రి పదవికి దూరమై డిఎల్.. ఆశిస్తూ వీరశివా * ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం
english title: 
target kiran

7కోట్లకు ఐపి... ఉపాధ్యాయురాలు అరెస్టు

$
0
0

మదనపల్లె, జూన్ 6: మదనపల్లె పట్టణం కమ్మగడ్డవీధిలో నివాసముంటూ వాల్మీకిపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న నిర్మలాదేవి, ఆమె భర్త భాస్కరయ్య అలియాస్ భాస్కర్‌నాయుడులను గురువారం రాత్రి మదనపల్లె రెండవ పట్టణ పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. వివరాలు ఇలావున్నాయి.. మదనపల్లె పట్టణంలో ఉంటూ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూ సహచర ఉపాధ్యాయులతో పరిచయాలు ఏర్పరుచుకుని చిన్నచిన్న చిట్స్ నడుపుతూ అంచలంచెలుగా లక్షల్లో వ్యాపారం చేస్తూ నమ్మకం కుదుర్చుకుంది. ఈమెకు కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. కుమార్తె వివాహం చేయడంతో ఆమె అమెరికాలో స్థిరపడింది. కుమారుడు బెంగుళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత ఆరుమాసాల క్రితం కుమారుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించింది. చీటీల వ్యాపారంతో పట్టణంలో మూడు భవనాలు కొనుగోలు చేసింది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు సైతం ఆమెవద్ద లక్షలాది రూపాయాల చిట్‌లు వేశారు. గత కొంతకాలంగా ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తోంది. దీంతో కొందరి వద్ద సొమ్ములు తీసుకుని మరలా ఇచ్చేస్తుండేది. ఇలా నమ్మకంతో అన్నిశాఖల ఉద్యోగులు, వ్యాపారులు సైతం లక్షల రూపాయలు ఆమెకు అప్పగించారు. ఆమెవద్ద నెలనెలా వడ్డీలు తీసుకునే వారు. ఇలా అప్పులు పెరిగిపోయాయి. 120మంది నుంచి రూ.7కోట్లు అప్పులు చేసింది. ఈ నేపధ్యంలో రుణదాతల ఒత్తిడిలు పెరిగిపోయాయి. గత కొంతకాలంగా తన ఉపాధ్యాయవృత్తిని వదిలేసి చేసిన అప్పులపై కోర్టులో ఐపి దాఖలాలు చేసి అమెరికా, బెంగళూరులో ఉంటోంది. విషయం తెలుసుకున్న అప్పులు ఇచ్చిన వారంతా స్థానిక పోలీసులను, ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఎట్టకేలకు నిర్మలాదేవి ఐపి దాఖలు చేసింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండవ పట్టణ పోలీసులు గురువారం బెంగళూరులో ఉంటున్న నిర్మలాదేవి, ఆమె భర్త భాస్కర్‌నాయుడులను అరెస్టుచేసి రిమాండుకు తరలించారు.

రాష్ట్రంలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల ఏర్పాటులో...
ప్రభుత్వానిదే తుది నిర్ణయం

మదనపల్లె, జూన్ 6: రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాల ఏర్పాటులో ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. 60శాతంకు పైగా పాలకమండలి లేని మార్కెట్‌లు ఉన్నాయి... వీటిపై సిఎం నిర్ణయంపై ఆధారపడి ఉందని రాష్ట్ర వ్యవసాయ మార్కెట్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. తన కుటుంబసభ్యులతో కలిసి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఇదివరకే 1992-95వరకు ఆర్డీఓగా విధులు నిర్వర్తించిన మదనపల్లె సబ్‌కలెక్టర్ బంగ్లాను సందర్శించారు. జిల్లాలో మూడురోజుల పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి హార్సిలీహిల్స్‌కు వచ్చారు. గురువారం మదనపల్లె సబ్‌కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయనకు పరిపాలన అధికారి మునిరాజ, కలికిరి డిటి శేషాద్రిలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి విలేఖరులతో మాట్లాడారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న 670 చెక్‌పోస్టుల ద్వారా ఏటా రూ. 664.37కోట్లు ఆదాయం వస్తోందని, గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి అత్యధిక ఆదాయం ప్రభుత్వానికి వస్తోందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మార్కెట్ అధికారుల పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి నివేదించామని, మరో రెండుమాసాలలో పోస్టులు పూర్తిగా భర్తీచేయనున్నట్లు ప్రకటించారు. మార్కెట్‌యార్డులకు అనుసంధానంగా ఉంటూ సమీపప్రాంతాలలో ఏలాంటి మార్కెట్‌యార్డులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు కేటాయిస్తే.. స్వంతమార్కెట్ యార్డులు నిర్మాణానికి నిధుల కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో రైతుబజార్లు కొన్నింటివి నిరుపయోగంగా ఉంటున్నాయన్న పశ్నకు స్పందించిన కమిషనర్ రైతుబజార్ సిఇఓ ఆధ్యర్యంలో కమిటీలు వేసి స్థితిగతులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, వాటిని పునఃవ్యవస్థీకరించడానికి కృషిచేస్తామన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కాంగ్రెస్ ఘనత
* మంత్రి గల్లా స్పష్టం
తిరుపతి, జూన్ 6: మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించిన ఘనత కిరణ్ సర్కారేదని మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. గురువారం ఆమె పాకాల, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలకు సంబంధించి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను మంత్రి పంపిణీ చేశారు. ఈసందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన సభలో తిరుపతి గ్రామీణ ప్రాంతానికి సంబంధించి 2453 గ్యాస్ కనె్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళల్లో ఆర్థిక భద్రత కల్పించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. మహిళలకు, రైతులకు ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలను వర్తింపజేస్తున్నారన్నారు. డి లిమిటేషన్‌లో తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గంలో కలవడంతోఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అదృష్టం కలిగిందన్నారు. తిరుపతి రూరల్ మండలాన్ని 66 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామన్నారు. ఇందుకు ఒటేరు గ్రామమే నిదర్శనమన్నారు. చిత్తూరు ఎంపి డాక్టర్ ఎన్ శివప్రసాద్, ఎంపిడిఓ సుశీలాదేవి, రూరల్ తహశీల్దార్ వెంకటరమణ, మార్కెట్ యార్డు చైర్మన్ దామోదరరెడ్డి, ప్రజాప్రతినిదులు, మహిళలు పాల్గొన్నారు.
డ్రస్ కోడ్‌పై గవర్నర్‌కు
వివరణ ఇచ్చిన జెఇఒ
తిరుపతి, జూన్ 6: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి అమలు చేయాలని నిర్ణయించిన డ్రస్‌కోడ్ విధానాన్ని గురువారం తిరుమలకు వచ్చిన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు జేఇఓ శ్రీనివాసరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటి వరకూ ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే డ్రస్ కోడ్ విధానాన్ని టిటిడి అమలు చేస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై సామాన్య భక్తులకు సైతం టిటిడి డ్రస్‌కోడ్ విధించాలని నిర్ణయించిన విషయం విదితమే. అయితే ఇటీవల తిరుమలకు వచ్చిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సామాన్య భక్తులకు డ్రస్‌కోడ్ అమలు చేయడం సరికాదన్నారు. ఈనేపథ్యంలో తిరుమలకు గవర్నర్ చేరుకున్న వెంటనే పద్మావతి అతిథి భవనంలో గురువారం టిటిడి ఎలాంటి దుస్తులను భక్తులు ధరించాలో తయారు చేసిన డిజైన్లను ఆయనకు చూపించారు. ఇందుకు గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్ దంపతులకు జెఇఒ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు, అడిషినల్ సివిఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ ఇఓ రిసెప్షన్ వెంకటయ్య, ఓఎస్‌డి దామోదరం తదితర అధికారులున్నారు.

ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించవద్దు
* ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి హితవు
వి.కోట, జూన్ 6: జిల్లా పడమటి ప్రాంత ప్రజలు రాజకీయాలకు అతీతంగా పనిచేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని వారిని రెచ్చగొట్టి ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించవద్దని తెలుగుదేశం నేతలకు ఎమ్మెల్యే అమరనాధ్‌రెడ్డి హితవు పలికారు. గడపగడపకు వైఎస్సార్‌సిపి కార్యక్రమంలో భాగంగా గురువారం మండల పరిధిలోని బైరుపల్లె, పాముగానిపల్లె పంచాయతీ గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ కాంగ్రెస్‌తో మిలాఖత్ అయిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
టిడిపిలో నిజమైన కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన వారు ఈ విషయాన్ని ఖండించాల్సిన విషయం ఉందన్నారు. ప్రజల్లో మొదట నమ్మకాన్ని కల్పించుకోవాలని టిడిపి నేతలకు సూచించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని మూసుకోవాల్సిన పరిస్థితి తీసుకురావద్దని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో తెలుగుదేశంపార్టీని నడిపిస్తున్న రథసారధులు ఎన్ని పార్టీలు మారారో గుర్తించుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆదేశం మేరకు తాను తెలుగుదేశంపార్టీ వీడిన విషయం అందరికి తెలిసిందే అన్నారు. అమాయక కార్యకర్తలను రెచ్చగొట్టి వైఎస్సార్‌సిపిని గ్రామాల్లో చులకన చేయాలని చూడడం వారి అవివేకమన్నారు. నేరుగా ప్రజల్లోకి వస్తే ఎవరిది తప్పో తేలిపోతుందని సవాల్ విసిరారు. విధానాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరిని పార్టీ నుంచి బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా బంగ్లావూరులో కొంతమంది తెలుగుదేశం, వైఎస్సార్‌సిపి కార్యకర్తలకు స్వల్ప తోపులాటలు చోటు చేసుకోవడంతో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. చివరకు నేతలు సర్ది చెప్పడంతో సమస్య పరిష్కారమైంది.
గ్రామాల్లో ప్రజలు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. తాగునీరు, పారిశుద్ధ్యం పట్ల శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సిపి నేతలు పాల్గొన్నారు.
135 గ్రామాల్లో మలేరియాపై ప్రత్యేక కార్యక్రమం
* డిఎంహెచ్‌ఓ దశరథరామయ్య స్పష్టం
చిత్తూరు, జూన్ 6: చిత్తూరు జిల్లాలోని 18క్లస్టర్ల పరిధిలోగల 135గ్రామాల్లో మలేరియా వ్యాప్తిచెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎన్.దశరధరామయ్య ఆదేశించారు. గురువారం సాయంత్రం డిఎంహెచ్‌ఓ చాంబర్‌లో ప్రతినెలా 6వ తేదీన జరిగే సబ్-యూనిట్ ఆఫీసర్ల సమావేశం డిఎంహెచ్‌ఓ, జిల్లా మలేరియా అధికారి దోసారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా డిఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రభుత్వం జూన్ నెలను మలేరియా మాసంగా ప్రకటిచిందన్నారు. జిల్లాలో మలేరియా వ్యాప్తించెందకుండా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గూర్చి వివరించారు. జిల్లాలోని 18క్లస్టర్ల పరిధిలో 135గ్రామాల్లో ప్రతి ఏటా మలేరియా పాజిటివ్ వస్తుందని, ఆ గ్రామాల్లో ఈనెల 1వ తేదీ నుండే మొలాథిన్ స్ప్రేయింగ్ ప్రారంభించామన్నారు. జిల్లాకు 25మెట్రిక్ టన్నుల మొలాథిన్ వచ్చిందని, ఆ మందును సంబంధిత క్లస్టర్లకు పంపించామన్నారు. ఇప్పటి వరకు 16గ్రామాల్లో స్ప్రే చేసినట్లు నివేదికలు అందించారన్నారు. జూన్, జూలై మాసం ఆఖరుకల్లా మిగిలిన గ్రామాల్లో కూడా మొలాథిన్ స్ప్రేచేయాలని ఆదేశించారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈనెల 14వ తేదీన యాంటీ మలేరియా, డయారీయా దినోత్సవంపై ప్రతి గ్రామపంచాయతీలో ర్యాలీ నిర్వహించాలన్నారు. ఇందుకు సాక్షరభారత్ కో-ఆర్డినేటర్లు, ఆయా గ్రామపంచాయతీల్లో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, అంగన్‌వాడీలను ఉపయోగించుకోవాలని సూచించారు. తిరిగి పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఈనెల 21వ తేదీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించాలని అన్నారు. జిల్లాలో మలేరియా రాకుండా చూసే బాద్యత వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిపైనే ఉందన్నారు. మలేరియా వ్యాధి సోకకుండా దోమల లార్వాను నాశనం చేయాలని, దోమతెరలు వాడాలని, ఇంటిలోపల, బయట నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలని, నీటి తొట్టెలను వారానికి ఒక సారి ఖాళీచేసి శుక్రవారం రోజున డ్రైడే పాటించాలన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పించాలన్నారు.
ఇంటిపై వాటర్ ట్యాంకులకు మూతలు బిగించాలని, సెప్టిక్ ట్యాంకు గాలి గొట్టాలకు ఇనుప జాలిని బిగించాలని, దోమలను చంపే స్ప్రేలు వాడటం, ఇండ్లలో మందులు చల్లటం తదితరాలను గూర్చి ప్రజలకు వివరించాలన్నారు. ఇందుకు సంబందించి ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందించాలని, పోస్టర్లను ప్రతిగ్రామంలో గోడలపై అంటించాలని డిఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్.దశరధరామయ్య ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్‌యూనిట్ ఆఫీసర్లకు జిల్లా మలేరియా అధికారి దోసారెడ్డి మరికొన్ని సూచనలు ఇచ్చారు. పిఓడిటి డాక్టర్ మునిరత్నంతోపాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఆకస్మికంగా కానిస్టేబుల్ మృతి
మదనపల్లె, జూన్ 6: ముదివేడు కానిస్టేబుల్ ఎం.క్రిష్ణమూర్తినాయక్ (43) గురువారం ఉదయం మదనపల్లెలో ఆకస్మికంగా మృతిచెందాడు. ఇతను కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. గురువారం స్వగ్రామం కలకడ మండలం ఎనుగొండపాళెం తాండలో పోలీస్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నతాధికారులు రెండుమార్లు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పించినా.. అనారోగ్య కారణంగా వెళ్లలేకపోయారు. ఈ అంత్యక్రియలకు మదనపల్లె డిఎస్‌పి రాఘవరెడ్డి, మదనపల్లె, వాల్మీకిపురం, పీలేరు, ములకలచేరువు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
* మరొకరికి గాయాలు * 108 సిబ్బందిని చితకబాదిన పోలీసులు
మదనపల్లె, జూన్ 6: గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి చేరుకుని రక్తపుమడుగులో పడివున్నాడు. అటుగా వెళ్తున్న 108 ప్రమాదాన్ని గమనించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వెళ్లిపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను రక్షక్ వాహనంలో తరలించేందుకు యత్నిస్తుండగా క్షతగాత్రుల్లో ఒకరు మృతిచెందాడు. అరగంట సమయం తరువాత అక్కడి వచ్చిన 108 ఆపకుండా వెళ్లిపోయిందని స్థానికులు పోలీసులకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు 108సిబ్బందిని చితకబాదారు. అపస్మారకస్థితిలో పడివున్న మరో క్షతగాత్రున్ని పోలీస్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మదనపల్లె వన్‌టౌన్ సిఐ నారాయణస్వామిరెడ్డి కథనం వివరాలు ఇలా ఉన్నాయి... పెద్దమండ్యం మండలం బండ్రేవుకు చెందిన గుట్టమీద వెంకటరమణ కుమారుడు క్రిష్ణ (24) బెంగళూరు పట్టణంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను స్వగ్రామంలో పెళ్లికోసం మూడురోజుల క్రితం ఇంటికి వచ్చాడు. అనంతరం బుధవారం సాయంత్రం తన స్నేహితుడు అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు (22)ను వెంటతీసుకుని ద్విచక్రవాహనంపై మదనపల్లెకు చేరుకున్నారు. పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో కాండ్లమడుగు క్రాస్ వద్ద తన స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు ఇద్దరు ద్విచక్రవాహనంలో అర్ధరాత్రి సమయంలో బయలుదేరారు. మార్గమధ్యంలో మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె శివారుప్రాంతం హనుమాన్‌జంక్షన్‌లో అంగళ్లు నుంచి మదనపల్లె వైపు వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే దుర్మణం చెందగా, స్నేహితుడు శ్రీనివాసులు తీవ్రగాయాలతో పోలీసులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య రూప, కుమార్తె ఉంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ నారాయణస్వామిరెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల దాడిపై ఎస్పీకి ఫిర్యాదు
108 వాహనంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను ములకలచెరువు నుంచి మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా బుధవారం అర్ధరాత్రి సమయంలో మదనపల్లె శివారుప్రాంతం హనుమాన్‌జంక్షన్‌లో జరిగిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించలేదని పోలీసులు, స్థానికులు తమపై దాడికి పాల్పడ్డారంటూ గురువారం 108 జిల్లా అధికారులు, స్థానిక 108 సిబ్బంది జిల్లాఎస్పీ, జిల్లా కలెక్టర్, మదనపల్లె సబ్‌కలెక్టర్‌లకు ఫిర్యాదు చేశారు. పబ్లిక్ 108సిబ్బందిపై దాడికి పాల్పడుతుంటే.. వారి నుంచి 108 సిబ్బంది రక్షించడానికి వాహనం ధ్వంసం కాకుండా అడ్డుకోవడానికి తాము చేయిచేసుకోవాల్సి వచ్చిందని సిఐ నారాయణస్వామి రెడ్డి గురువారం విలేఖరుల సమావేశంలో వివరణ ఇచ్చారు.

చత్తీస్‌గడ్ సిఎంకు
బిజెపి నేతల స్వాగతం
రేణిగుంట, జూన్ 6: చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణసింగ్ శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జల్లి మధుసూదన్, జిల్లా బిజెపి అధ్యక్షుడు చంద్రారెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు రాటకొండ విశ్వనాథ్, చంద్ర తదితరులు స్వాగతం పలికారు.
తిరుమలకు చేరుకున్న చత్తీస్‌గడ్ సిఎం
శ్రీవారి దర్శనార్థం చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణసింగ్ గురువారం రాత్రి 8.15 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జేఇఓ శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఆయన స్వామిని దర్శించుకుంటారు.
5 లక్షలకు ఓ వ్యాపారి ఐపి
మదనపల్లె, జూన్ 6: మదనపల్లె పట్టణం రామారావుకాలనీలో స్వీట్ దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యాపారి నష్టాలకు గురై రూ.5లక్షల వరకు అప్పులు చేశాడు. రుణదాతల వత్తిడి తాళలేక మదనపల్లె సబ్‌కోర్టులో గురువారం రూ. 5లక్షలకు 12మంది బాధితులకు ఐపి దాఖలు చేశారు. అతని వద్ద కట్టుబట్టలు మినహా ఏమిలేవని, రుణదాతలు తనను వేధించవద్దని ఐపిలో పేర్కొన్నాడు.

మదనపల్లె పట్టణం కమ్మగడ్డవీధిలో నివాసముంటూ
english title: 
ip for 7 crore

అలంకారప్రాయంగా ఆదర్శ కాలనీలు!

$
0
0

కర్నూలు, జూన్ 6: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం చేపట్టిన ఆదర్శ కాలనీలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. కర్నూలు నగరం చుట్టూ నిర్మించిన అనేక కాలనీల్లో గృహ నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. వేలాది గృహాలు మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. అంతో ఇంతో పూర్తయిన గృహాల్లో ఎవరూ నివాసం ఉండకపోవడంతో అసాంఘిక శక్తులకు నిలయంగా మారుతున్నాయి. నగరంలోని నిరుపేదల కోసం వేల కోట్ల రూపాయల ఖర్చు చేసిన ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేసుకున్నా ఇంటిలో నివాసం ఉండటానికి వీలు కాకపోవడంతో వారి సొమ్ము కూడా మట్టిలో కలిసినట్లయింది. నగరంలోని నిరుపేదల కోసం నగరం చుట్టూ ఉన్న జగన్నాథగట్టు, పెద్దపాడు, వెంకాయపల్లె, పందిపాడు వంటి ప్రాంతాల్లో 2007 నుంచి 2012వ సంవత్సరం వరకూ సుమారు 32 వేల ఇంటి స్థలాలు, పక్కా గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా కాలనీల్లో మంజూరైన గృహాల్లో కేవలం 4,625 గృహాలు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇక రుణాలు మంజూరు చేసిన గృహాలు సుమారు 16 వేలు ఉండగా మరో 7 వేల ఇళ్ల నిర్మాణం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గృహ నిర్మాణం కోసం అవసరమైన రుణం కావాలంటూ దరఖాస్తు చేసుకున్న వారు సుమారు 4,500 మంది ఉండగా వారికి ఇంత వరకూ ఏ విషయం చెప్పకపోవడం గమనార్హం. స్థలం మంజూరు చేసినా అవెక్కడున్నాయో చూపకపోవడం, ఆ స్థలాలకు రుణం కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య సుమారు 10 వేలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఇంత వరకూ ఖర్చు పెట్టిన సొమ్ము, లబ్ధిదారులు సొంత నిధులతో నిర్మించుకున్న ఇంటిలో నివాసం ఉండటానికి అనేక మంది సిద్ధపడినా ఆయా కాలనీల్లో వౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రహదారులు, మురుగు నీటిపారుదల, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తే తక్షణం అక్కడికి వెళ్లి నివాసం ఉంటామని నిరుపేదలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆదర్శ కాలనీల్లో రాష్ట్రంలోనే అతి పెద్ద కాలనీగా పేరుగాంచిన జగన్నాథ గట్టుపై సుమారు 8 వేల ఇళ్ల నిర్మాణం చేపడితే అందులో 4వేలకు పైగా గృహాలను లబ్ధిబ్దిదారులు నిర్మించుకున్నారు. వారికి ప్రభుత్వం రాయితీ, రుణం రూపేణా ఇచ్చే సొమ్ము కూడా చెల్లించింది. ఆయా గృహాల్లో నివాసం ఉండటానికి లబ్ధిదారులు ఆసక్తిగా ఉన్నా వౌలిక సదుపాయాల లేమి కారణంగా ముందుకు రావవడం లేదు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించ తలపెట్టిన పక్కా గృహాలు ఇపుడు ఎందుకూ పనికి రానివిగా తయారయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆదర్శ కాలనీలపై దృష్టి సారించి వౌలిక సదుపాయాలను కల్పించి ఇతర సమస్యలను పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

మంత్రులకు భద్రత పెంపు
* ఛత్తీస్‌గడ్ ఘటన నేపథ్యం..
కర్నూలు, జూన్ 6: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల మెరుపుదాడి ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో జిల్లా కు చెందిన ఇద్దరు మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేష్‌లకు ప్రభు త్వం భద్రత పెంచింది. అలాగే వారు పర్యటించే ప్రాంతంలో ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీపై మావోయిస్టులు విరుచుకుపడిన విషయం విదితమే. ఆ సంఘటన తరువాత కేంద్రం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రముఖులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాకుండా నగరాల్లో కూడా నక్సలైట్లు దాడులు చేసే అవకాశం ఉందని సూచించింది. దాంతో రాష్ట్రంలో పోలీసు అధికారులు చర్య లు తీసుకున్నారు. అయిదేళ్ల క్రితం మావోయిస్టులకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరాసు ప్రతాపరెడ్డికి భద్రతను రెట్టింపు చేశారు. నియోజకవర్గంలో పర్యటించే ముందు ఆయన పోలీసులకు తగిన వివరాలు తెలపాలని కూ డా కోరారు. ఆయన పర్యటించే ప్రాం తాల్లో ముందస్తు తనిఖీలతో పాటు ఆయనను కలవడానికి వచ్చే వారిని కూడా సోదా చేస్తున్నారు. అలాగే కర్నూలు నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టిజి వెంకటేష్ విషయంలో కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని గతంలో కంటే భద్రతను పెంచారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో కూడా పోలీసులు సోదా లు నిర్వహించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రైతులు సకాలంలో విత్తనం వేసుకోవాలి
* మంత్రి ఏరాసు
వెలుగోడు, జూన్ 6: రైతులు సకాలంలో విత్తనం వేసుకోవాలని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సూచించారు. తెలుగుగంగ కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించడానికి విశేష కృషి చేసిన మంత్రి ఏరాసును గురువారం మండల పరిధిలోని గుంతకందాల గ్రామంలో గ్రామకమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులందరూ ఏకాభిప్రాయంతో సకాలంలో పంటలు వేసుకుంటనే రబీ సీజన్‌లో సాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. రైతులు నిజంగా అల్ప సంతోషులన్నారు. విదేశాల్లో రైతుల ఉత్పత్తి ధర కంటే వాటి అమ్మకం ధర అధికంగా వుండి రైతులకు లాభదాయకంగా వుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతులకు అలాంటి గిట్టుబాటు అయ్యే వ్యవసాయ విధానం కోసం ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు ప్రభుత్వ ఉద్యోగికే పిల్లనిస్తున్నారని, పదెకరాలు రైతుకు పిల్లనివ్వమని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో ఈ ఏడాది రూ. 18 వేల కోట్ల పథకాలను అమలు చేయాలని సిఎం కిరణ్ దృఢ నిశ్చయంతో వున్నారన్నారు. బిసిలకు రూ. 1500 కోట్లతో వృత్తులకు సంబంధించిన పరికరాలు, వాటి అవసరం లేని వారికి రూ. 5 వేల సబ్సిడీతో రుణాలు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామస్థులు మంత్రిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో తహశీల్దార్ విజయశ్రీ, ఎంపిడిఓ సాల్మన్, సిపిఎం నాయకులు యాదాటి నాగేంద్రుడు, మాజీసర్పంచ్ గాండ్ల శివన్న, నాయకుడు అంబాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

బడ్జెట్‌లో ఆర్‌యుకు మొండిచెయ్యి
* రూ. 5 కోట్లు మంజూరు
* విసి కృష్ణానాయక్
కర్నూలు స్పోర్ట్స్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ యూనివర్శిటీకి బడ్జెట్ కేటాయింపులో మొండిచెయ్యి చూపిందని, రూ. 16 కోట్ల ప్రతిపాదనలకు గానూ కేవలం రూ. 5 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని విసి కృష్ణానాయక్ తెలిపారు. స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాలలో గురువారం విసి విలేఖరులతో మాట్లాడుతూ వర్శిటీతో పాటు ఏర్పడిన యూనివర్శిటీలకు ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులు కేటాయించందన్నారు. ఆర్‌యుకు నిధుల కేటాయింపులో చిన్నచూపు చూస్తున్నారని మంత్రుల క్యాబినెట్ సబ్ కమిటీ ఈ అన్యాయాన్ని ప్రస్తావించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయిందన్నారు. ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులు వర్శిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, డైలీ వేజ్, రెగ్యులర్ ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతాయన్నారు. వర్శిటీని అభివృద్ధి చేసేందుకు 12 (బి), ప్లానింగ్ అండ్ మానిటరింగ్ బోర్డు కమిటీలు ఇప్పటికే సందర్శించారని, వారి నుంచి సానుకలంగా నివేదిక వస్తుందని విసి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి మహబుబ్‌నగర్ జిల్లా పర్యటనలో పాలమూరు వర్శిటీ అభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు బహిరంగంగా అక్కడి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల వల్ల ప్రకటించారని, కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఆర్‌యు అభివృద్ధికి కావాల్సిన నిధుల మంజూరుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పాలమూరు వర్శిటీకి సంబంధించి స్థానిక ఎంపి కెసిఆర్ ఎంపి ల్యాడ్స్ కింద రూ. 50 లక్షలుమంజూరు చేశారని, కావున ఆర్‌యు అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. వర్శిటీ అభివృద్ధికి నిధుల కేటాయింపు కోసం జిల్లా ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం వర్శిటీలో ఖాళీగా వున్న ప్రొఫెసర్, ఇతర పోస్టుల భర్తీకి గత మార్చి నెల 19వ తేదీ రోస్టర్‌ను ప్రక్రియను పూర్తి చేసిందని, ఏడాది చివరికి భర్తీ చేస్తామన్నారు. అలాగే పిజి సెట్ కౌనె్సలింగ్‌ను ఈ నెల 3వ వారంలో ప్రారంభించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్శిటీని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అందరి సహకారం తీసుకుంటామని విసి తెలిపారు.
అబ్దుల్లాపురం రిజర్వాయర్ నిర్మాణం జరిగే ప్రసక్తేలేదు:మంత్రి ఏరాసు
వెలుగోడు, జూన్ 6: మండల పరిధిలోని అబ్దుల్లాపురం వద్ద రిజర్వాయర్ నిర్మాణం జరిగే ప్రసక్తే లేదని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తెలిపారు. గురువారం గుంతకందాలలో జరిగిన అభినందన సభలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అబ్దుల్లాపురం రిజర్వాయర్ వస్తే రెండు కార్లు పండే వేలాది ఎకరాలు నీటిలో మునిగిపోతాయని ఆందోళన చెందుతున్న రైతుల్లో మంత్రి ఏరాసు చేసిన ప్రకటన హర్షం నింపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ నిర్మా ణం గురించి గతంలో ప్రభుత్వం ఆలోచించిన మాట వాస్తవమేనని, అయితే బాగా పంటలు పండే వేలాది ఎకరాల భూములను, కొన్ని గ్రామాలను కోల్పోయి రిజర్వాయర్ నిర్మించడం వల్ల జరిగే నష్టమే ఎక్కువగా వుంటుందన్నారు. ఈ రిజర్వాయర్ వల్ల ప్రయోజనం పొందే ప్రాంతాలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రిజర్వాయర్ వస్తుందని ఆందోళన చెందుతున్న అబ్దుల్లాపురం, గుంతకందాల, మద్దూరు, కృష్ణానగర్, వేంపెం ట, పెంచికలపల్లె గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోదని మంత్రి స్పష్టం చేశారు.

రూ. 99 కే 9 రకాల కూరగాయలు
* నేడు లాంఛనంగా ప్రారంభించనున్న కలెక్టర్
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూన్ 6: పెరిగిన కూరగాయల ధరలను అదుపు చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిల్లా యంత్రంగా కేవలం రూ. 99 కే 9 రకాల కూరగాయలను ఈ నెల 7వ తేదీ నుండి స్థానిక సి.క్యాంపు రైతు బజారులో విక్రయించనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటిలో టమోటా కిలో, ఉల్లిగడ్డలు కిలో, ఆళ్లగడ్డలు 1/2 కిలో, వంకాయలు 1/2 కిలో, బెండకాయలు 1/2 కిలో, దొండకాయలు 1/2 కిలో, పచ్చి మిరపకాయలు 1/4 కిలో, మునక్కాడలు-4, ఆకుకూరలు - 5 కట్టలు కలిపి కేవలం రూ. 99కే విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి విక్రయాలను లాంఛనంగా ప్రారంభిస్తారని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
వందకోట్లతో ఎస్‌ఎస్
ట్యాంకు నిర్మాణం
* మున్సిపల్ కమిషనర్ కృష్ణ
ఎమ్మిగనూరు, జూన్ 6 : పట్టణ ప్రజల దాహర్తిని తీర్చేందుకు వంద కోట్లతో ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పినట్ల మున్సిపాల్ కమిషనర్ కృష్ణ గురువారం విలేఖరులకు తెలిపారు. స్థానిక గూడికల్ రోడ్డు లో 120 ఎకరాల్లో ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణ కార్యక్రమం చేపడుతామని ఈ ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణం అయితే 6 నెలల వరకు నీటిని ట్యాంకులో నిలువ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మున్సిపాల్ జనరల్ ఫండ్ నుండి కోటి 8లక్షలతో మైనార్టీ శివన్ననగర్ కాలనీలలో రోడ్ల పనులు ప్రారంభమయ్యాయని మైనార్టీ కాలనీ నాలుగు రోడ్లు, మున్సిపాల్ జనరల్ ఫండ్ కింద మైనార్టీ కాలనీలో రూ. 6 లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని ఏఎస్‌ఏ స్కీం కింద రూ. 23 లక్షలు మంజూరు చేశారని వాటితో ఎస్‌ఎస్ ట్యాంకు వద్ద 6 బోర్లను మరమ్మతు చేయిస్తామని కమిషనర్ తెలిపారు.
అధికారులు సమన్వయంతో
పనిచేయాలి
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
నంద్యాల రూరల్, జూన్ 6: ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం చే యకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నియోజక వర్గం అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి సూచించారు. నంద్యాల ప్రథమనంది దేవస్థాన కల్యాణ మంటపంలో గురువారం వివిధ శాఖ ల అధికారులతో కలెక్టర్ ఇందిరమ్మ పచ్చతోరణం, ఇందిరమ్మ కలలు, హౌ సింగ్, కౌలురైతుల రుణాలు, ఉపాధి హామీ, సివిల్ సప్లై, రెవెన్యూ సదస్సు లు, విద్యా సంబరాలు తదితర వాటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెన్షన్, తాగునీరు, పారిశుద్ధ్యం అప్రమత్తంగా లేని పక్షంలో పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యాసంబరాలులో భాగంగా బడిఈడు పిల్లల ను బడిలో చేర్పించడం, తెలుగు భాష ప్రాముఖ్యత, నియోజకవర్గంలో ఆర్‌విఎం పాఠశాలలు ఎన్ని పూర్తయ్యాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే వాటి వివరాలు, పాఠశాల నేమ్ బోర్డులను తెలుగులో రాయాలని ఆదేశిం చారు. పాఠశాలలకు తాగునీటి వసతి కల్పించాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 13లోగా అన్ని పాఠశాలలకు యూనిఫాం పంపి ణీ చేయాలన్నారు. మండలంలో భూ సార పరీక్షలు చేయించి భూచేతన కార్యక్రమం ద్వారా 350 మంది రైతులకు శిక్షణ ఇస్తున్నామని నంద్యాల ఇన్‌చార్జీ ఎడి ఎకె చెన్నయ్య కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. నంద్యాల మండలం చాపిరేవుల పిహెచ్‌సిలో ఎన్ని కాన్పులు చేశారని, జననీ సురక్ష పథకం వివరాలు అడిగి తెలుసుకున్నా రు. 104 సర్వీసు గ్రామాల నివేదికను ఎంపిడిఓలు తనిఖీ చేయాలన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం నివేదికను ఈ నెల 10వ తేదీలోగా ఇవ్వాలన్నారు. 739 గ్రామైక్య సంఘాలకు రూ. 19.5 కోట్లు రుణాలు ఇచ్చినట్లు ఐకెపి అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సిఎస్‌పిలు గ్రామాల్లో ఇంటి వద్దకు వెళ్లి పెన్ష న్ ఇవ్వాలని, లేనిచో చర్యలు తప్ప వన్నారు. జూలై 1 నుంచి నగదు బదిలీ పథకాన్ని వర్తింపచేస్తున్నామని, ఎన్‌పిఆర్, ఆధార్ నంబర్లను త్వరగా సేకరించాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్ల వార్డెన్లు ముందుగా హాస్టల్‌కు వెళ్లి తాగునీరు తదితర సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఇం దిరమ్మ కలల నివేదికను జిల్లా కార్యాలయానికి అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ పథకం కింద పక్కా గృహాలు నిర్మించేందుకు ఎస్సీలకు రూ. లక్ష, ఎస్టీలకు రూ. 1.5 లక్షలు ఇచ్చామన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. మోడల్‌స్కూల్‌కు విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించా లని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సిఇఓ సూర్యప్రకాష్, డిఆర్‌డిఎ పిడి నజీర్, సోషల్‌వెల్పేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి, నంద్యాల ఆర్డీఓ శంకర్, డ్వామా పిడి హరినాథ్‌రెడ్డి, హౌసింగ్ ఇఇ సుధాకర్‌రెడ్డి, పిఆర్ ఇఇ సుబ్బారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ హరిరామనాయక్, హౌసింగ్‌పిడి రామసుబ్బు, డిప్యూటీ డిఇఓ తాహేరాసుల్తానా, ఎపిఓ సాంబశివరావు, సిడిపిఓ లీలావతి, తహశీల్దార్ శివరామిరెడ్డి, ఎంపిడిఓ ప్రజ్యోత్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిఎం కిరణ్ గురించి
డిఎల్ చెప్పింది వాస్తవమే..
* టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కెఇ
కల్లూరు, జూన్ 6: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పేదంతా వాస్తవమేనని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సిఎం కిరణ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే వివిధ పథకాలతో ప్రజల ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం సిఎం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా వుందని ఇక సంక్షేమ పథకాల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడం తథ్యమన్నారు. మంత్రులకు తెలియకుండా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే ఏకైక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే అన్నారు. పేదలకు అందిస్తున్న అమ్మహస్తం పథకం ఏవిధంగా మారిందో ప్రజలు ఇప్పటికే గుర్తించారన్నారు. 9 రకాల వస్తువులకు బదులుగా నాసిరకం వస్తువులను ప్రజలకు తగలగడుతున్నారని, పేద ప్రజల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగులుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రవేశ పెట్టేటప్పుడు డిప్యూటీ సిఎం లేకుండా పథకాన్ని ప్రవేశపెట్టారంటే దళితులపై ఏమాత్రం ప్రేమ వుందో అర్థమవుతుందన్నారు. రైతుల రుణాలకు వడ్డీ చెల్లించవద్దని చెబుతున్న సిఎం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు సుబ్బరాయుడు, ఆకెపోగు ప్రభాకర్, శ్రీనివాసులు, పర్వేజ్, హనుమంతరాయచౌదరి, చక్రపాణి, రవి పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను
సద్వినియోగం చేసుకోండి
* ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కర్నూలుటౌన్, జూన్ 6: గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సూచించారు. కల్లూరు మండల పరిధిలోని చిన్నటేకూరు గ్రామంలో గురువారం ఎపిఓ రాజారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే కాటసాని ముఖ్య అతిథిగా హాజరై ఉపాధి మేట్‌లకు గుడారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ నిరుపేదలు వలస వెళ్లకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే కూలీలకు పనిముట్లు, వైద్యం, బీమా తదితర సౌకర్యాలు ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పనికి తగ్గట్లు వేతనం రాకున్నా, పనుల్లో అవినీతికి పాల్పడినా వెంటనే అధికారులకు తెలియజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తారన్నారు. రెండు వారాల క్రితం వడదెబ్బతో మృతిచెందిన ఉపాధి కూలీ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానన్ని, వారి పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించేందకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఎపిడి లక్ష్మన్న మాట్లాడుతూ పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అనేక పోరాటాలు చేయడంతోనే ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి పనులు కల్పిస్తున్నారన్నారు. మండలంలో మెట్టమొదటిసారి గుడారాలను పంపిణీ చేస్తున్నామని, వీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివరాయుడు, ఎంపిడిఓ అన్వర్‌బేగం, నాయకులు కె.్ధనుంజయ్య, రేవంత్, నాగిరెడ్డి, వెంకటేశ్వర్లు, అధికారులు ప్రసాద్, లక్ష్మీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్‌లు, ప్రజలు పాల్గొన్నారు.
చెన్నైకి వెళ్లిన పీఠాధిపతి మహాదేశికన్
ఆళ్లగడ్డ, జూన్ 6: అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిజీ గురువారం స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను ఆశీర్వదించి మధ్యాహ్నం చెన్నైకి బయల్దేరారు. పట్ట్భాషిక్తుడైన జియ్యర్ స్వామి మొట్టమొదటిసారిగా అహోబిలం వచ్చి రెండు రోజుల పాటు లక్ష్మీనరసింహస్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అలాగే ఎగువ అహోబిలం గిరులపై కొలువైన శ్రీ మాలోలా, వరాహ నరసింహ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. మార్గమధ్యలో వున్న అత్తా కోడళ్ల మండపాన్ని పరిశీలించి, కారంజ నరసింహ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ బివి నరసయ్య, ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, అర్చకులు, ఆళ్లగడ్డ జూనియర్ సివిల్ జడ్జి శేషాద్రి, ఆలయ సిబ్బంది జియ్యర్‌స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం జియ్యర్ స్వామి చెన్నైకి బయల్దేరి వెళ్లారు.

* సగానికి పైగా ఆగిన ఇందిరమ్మ ఇళ్లు.. * వౌలిక వసతులు కరవు.. * ఇళ్లలో చేరేందుకు ముందుకురాని లబ్ధిదారులు
english title: 
model colonies

ప్రైవేటు పాఠశాలల మాయాజాలం!

$
0
0

ఒంగోలు, జూన్ 6: బడిగంట మోగే సమయం దగ్గర పడుతుండటంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల హడావుడి జిల్లాలో పెరిగిపోయింది. తమ పాఠశాలల్లో చేరితే ఉత్తమ ఫలితాలు వస్తాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఊదరగొట్టే పనిలో యాజమాన్యాలు నిమగ్నమయ్యాయి. గత నెల రోజుల నుండి జిల్లావ్యాప్తంగా ఇదే తంతు సాగుతోంది. ప్రధానంగా టెక్నో స్కూళ్ల పేరుతో విద్యార్థులను యాజమాన్యాలు ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. తీరా చేరిన తరువాత విద్యార్థులకు కనీస వసతులు కూడా ఉండని పరిస్థితులు జిల్లాలో నెలకొంటున్నాయి. డిగ్రీ చదివే విద్యార్థి కంటే ఎల్‌కెజి చదివే విద్యార్థులకే ఫీజులను అధికంగా వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లా పీల్చుకుతింటున్నారు. ప్రస్తుతం జిల్లాలో విద్య, వైద్యం వ్యాపారంగా మారిపోయాయి. ప్రతి తల్లితండ్రి తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో లక్షల రూపాయలను విద్యకు వెచ్చిస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు తాము చెప్పిన ఫీజులనే కట్టాలంటూ షరతులను విధిస్తున్నాయి. జిల్లాలోని ఒక్కో ప్రైవేటు పాఠశాల వివిధ రకాలుగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. కాని ఫీజులను నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా 207 గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఆ మేరకు సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో కూడా పెట్టారు. ప్రతి ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకోవాలని ఆదేశాలు జారీచేయటం తూతూమంత్రంగానే జరుగుతోంది. తీరా విద్యాసంవత్సరం ప్రారంభమైన తరువాత వాటి గురించి జిల్లా విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవటం పరిపాటిగానే మిగులుతోంది. జిల్లావ్యాప్తంగా ఎక్కువగా ఒంగోలు నగరంలో 28, దర్శిలో 17, చీరాల, పామూరుల్లో 12, మార్కాపురం, వేటపాలెం మండలాల్లో పది చొప్పున, చీమకుర్తిలో 7, కొత్తపట్నంలో 9, శింగరాయకొండలో నాలుగు, అద్దంకిలో మూడు ప్రైవేటు పాఠశాలలు ఉన్నట్లు విద్యాశాఖాధికారులే ప్రకటించారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా ప్రభుత్వపరంగా 3067 ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలు, 508 అప్పర్‌ప్రైమరీ పాఠశాలలు, 612 హైస్కూళ్లు ఉన్నాయి. ప్రైమరీ పాఠశాల్లో 2.26 లక్షల మంది, అప్పర్‌ప్రైమరీ పాఠశాలల్లో 86 వేల మంది, హైస్కూళ్లల్లో లక్షా 95 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాని ప్రభుత్వపరంగా నాణ్యమైన విద్యనందించడం లేదన్న ఆరోపణలతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు పరుగులు తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ పేద, మధ్యతరగతి ప్రజలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఇష్టపడని పరిస్థితులు జిల్లాలో నెలకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఆకర్షించేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ ఆ పథకాలు బూడిదలో పోసిన పన్నీరులాగానే మిగిలిపోతున్నాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుచెప్పే గురువులు గ్రామాల్లోనే నివాసం ఉంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు. ఆనాడు గురువులు విద్యార్థులతో కలసిపోయారన్న నానుడి ఉండేది. రానురాను ఆ సంబంధాలు తెరమరుగయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మూడు వంతుల మంది ఉపాధ్యాయులు పట్టణాలకే పరిమితవౌతూ బడి చివరిగంట మోగగానే ఆర్‌టిసి బస్సును వెతుక్కునే పనిలో నిమగ్నవౌతున్నారు. దీంతో కూడా విద్యాప్రమాణాలు తగ్గుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా వ్యాపిస్తున్నప్పటికీ జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం వౌనముద్రలో ఉండటం గమనార్హం.

ఖరీఫ్‌పై కోటి ఆశలు
నాణ్యమైన విత్తనాలు, ఎరువుల కోసం రైతన్న ఎదురుచూపు
కందుకూరు, జూన్ 6: నైరుతి రుతుపవనాలు ఊరిస్తున్నాయి. ఈఏడాది తొలకరి ముందే పలకరిస్తుందన్న వాతావరణ ప్రకటన రైతన్నలో కొత్త ఉత్సాహం నింపుతుంది. పొలాలన్ని దున్ని విత్తనం వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు ఖరీఫ్‌పై కొంత ఆశ పెట్టుకున్నారు. నాణ్యమైన విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు, పెట్టుబడుల కోసం పంట రుణాలు కావాల్సిన ఆదరువులు వీటన్నింటిపైన నిర్ధిష్ట కార్యాచరణలు ముందుడగు వేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా తయారు చేసుకోలేక రైతుల వద్ద నిల్వ ఉన్న విత్తనాన్ని సకాలంలో సేకరించక ఏటా వ్యవసాయశాఖ ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థలు ఖరీఫ్ అవసరాలను తీర్చలేకపోతున్నాయి. రబీ పంటకాలం పూర్తి అయిన వెంటనే విత్తనసేకరణ జరిపి తొలకరిలో సాగుకు రైతులకు అందజేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది లెక్కలనే తిరగరాస్తూ అదే అంచనాలను తెరమీదికి తీసుకొస్తున్నారు. రైతు చైతన్యయాత్రలలో అన్ని చెప్పామని, అన్నదాతలకు అవగాహన కల్పించామంటూ వ్యవసాయ అధికారులు చెప్పుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడం లేదు. వర్షం వచ్చాక గొడుగు కొందామన్న చందంగా విత్తనాభివృద్ధిసంస్థ వ్యవహరిస్తుంది. తీరాసాగు ముమ్మరంగా మొదలైన తరువాత విత్తనాల సేకరణ జరిపి పంపిణీ చేయడం వలన సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఖరీఫ్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వర్షం కురిస్తే రైతులు తొలకరి పంటలకు అన్నిరకాల విత్తనాలను సిద్ధం చేసి ఉంచామని ప్రకటనలు మాత్రం గుప్పిస్తున్నారు. గత ఏడాది రైతులకు పలు చేదు అనుభవాలు ఎదురైనా ఈసారైనా అధికారులలో ముందస్తు వ్యూహంతో పనిచేస్తున్నారో లేదో అర్థంకాని పరిస్థితి నెలకొంది. రబీలో గిద్దలూరు ప్రాంతంలో సరఫరా చేసిన శనగ విత్తనాలు పుచ్చులు రావడంతో తిరిగి వెనక్కు పంపారు. ఇంకొల్లు ప్రాంతంలో పంపిణీ చేసిన మినుము విత్తనాలు, తాళ్లూరు ప్రాంతంలో పంపిణీ చేసిన వరి విత్తనాలు నాణ్యత లోపం కారణంగా రైతులు నష్టపోయారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రైతుకు సంబంధిత కంపెనీల నుంచి నష్టపరిహారం కూడా అందడం లేదు. జిల్లాలో ఖరీఫ్ కాలం మొదలైంది. అయితే వర్షాలు సక్రమంగా కురవకపోతే జూలై నుంచి ఖరీఫ్ పంటలు సాగవుతాయి. వర్షం కురిస్తే రైతులు తొలకరిపంటగా నువ్వు, సజ్జ సాగు చేస్తారు. పశ్చిమ ప్రాంతంలో సజ్జ ఎక్కువగా సాగవుతుంది. కంది, పత్తి, జీలుగు, పిల్లిపెసర, ఆముదం విత్తనాలు అవసరం. జిల్లాలో 13,708హెక్టార్ల విస్తీర్ణంలో నువ్వు సాగవుతుంది. రైతులకు అవసరమైన విత్తనం ఇంకా మండల కేంద్రాలకు చేరలేదు. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి జిల్లాలో స్వయంగా రైతులచేత పంటలు సాగు చేయించి, వారి పర్యవేక్షణలో నాణ్యతగల విత్తనాలను తయారుచేసి పంపిణీ చేయాలి. కాగా జిల్లాలో ఈపథకం ఆశించిన స్థాయిలో జరగడంలేదు. విత్తనాభివృద్ధి సంస్థ 525క్వింటాళ్ళు కాగ్-4రకం వేరుశనగ విత్తనాలను ఇప్పటి వరకు సేకరించింది. ఇవి కాక ఈఏడాది 60వేల హెక్టార్లలో కంది సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. 3,350క్వింటాళ్ళు ఎల్‌ఆర్‌జి-41రకం విత్తనాలు సిద్ధ చేసినట్లు తెలిసింది. పత్తి జిల్లాలో 4.51లక్షల ప్యాకెట్లు అవసరం కాగా, ఇప్పటి వరకు 1,36,551ప్యాకెట్లు వచ్చాయి. అలాగే సజ్జ, ఆముదం సంబంధించి కూడా జిల్లాకు 420క్వింటాళ్ళు అవసరం అయితే ఆముదం విత్తనాలు 300క్వింటాళ్ళు అవసరం అని ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. అయితే ఇంకా రాలేదు. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 3,30,774హెక్టార్లలో సాగవుతుంది. దీనికోసం 18,310క్వింటాళ్ళ విత్తనం అవసరం అని అంచనా వేశారు. ఖరీఫ్‌లో అవసరమైన విత్తనాలను సిద్ధం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధిసంస్థ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌కు సరిపడ ఎరువులను కూడా తెప్పిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. జీలుగు, పిల్లిపెసర విత్తనాలను 2వేల క్వింటాళ్ళు సిద్ధం చేశామని అంటున్నారు. ఏది ఏమైనా ఖరీఫ్ పంటలకు సరిపడ విత్తనాలు, ఎరువులు వస్తాయో లేదోనని ఆందోళనలో రైతాంగం ఉంది.

వ్యక్తిగత మరుగుదొడ్లకు చెల్లింపులు
యుద్ధప్రాతిపదికన జరగాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఒంగోలు, జూన్ 6: జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి నగదు చెల్లింపులు యుద్ధప్రాతిపదికన జరగాలని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేషన్ అధికారుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 36 కోట్ల రూపాయల మేర ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. లబ్ధిదారులకు నగదు చెల్లింపులు ఆలస్యం కాకుండా ఫినో కంపెనీ అధికారులతో సమీక్షించుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు నగదు చెల్లింపులు జాప్యం కారణంగా ఇతరులు ముందుకురావటం లేదని, పనులు పురోగతిలోకి రావటం లేదని గుర్తించామన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో మొదటి దశ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు అంచనాలు తప్పుగా తయారుచేసేందుకు ఇందిరాక్రాంతి పథం ఎపిఒ, డ్వామా ఎపిడిలు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు బాధ్యులను చేయాల్సిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏదోఒక కారణం చెప్పి పనయిపోయిందనే పద్ధతులను విడిచిపెట్టాలన్నారు. పనులు చేసి చూపించాలన్నారు. ఐదు రోజుల్లో పూర్తిచేసే పనులు ఐదు సంవత్సరాల ప్రాజెక్టుల్లా కాలయాపన చేస్తున్నారన్నారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు మొదటిదశలో 80 శాతం గ్రౌండింగ్ పూర్తయిందన్నారు. కాని నగదు చెల్లింపులు కంప్యూటర్‌లో 80 శాతం జనరేట్ కాలేదన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెల్లింపులు కంప్యూటర్ విధానానికి దేశంలో గొప్పపేరు ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పనులు జరిగే విధానాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. కిందిస్థాయి అధికారులు చెప్పే మాటలు మాకు చెప్పే కొరియర్ సర్వీసు ఉద్యోగాలు చేయవద్దని అధికారులను హెచ్చరించారు. జిల్లాలో తాగునీటి సమస్యలపై అధికారులపై తక్షణమే స్పందించాలన్నారు. మరమ్మతులకు గురైన తాగునీటి ఆర్‌ఒ ప్లాంట్ల మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. తాగునీటి వనరులు అందుబాటులో లేనిచోట ట్యాంకర్ల ద్వారా తాగునీరు ప్రజలకు సరఫరా చేయాలన్నారు. తాగునీటి ట్యాంకర్ల రవాణాపై ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థలో తాగునీటి సరఫరా సక్రమంగా అందించటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఏవేవో చెబితే తాగునీటి సమస్యలు గురించి అధికారులు తెలుసుకునే విధానం మంచి పద్ధతి కాదని కమిషనర్, మునిసిపల్ ఇంజనీర్లపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా పేర్నమిట్ట చెరువును సమ్మర్ సోరేజీ ట్యాంకుగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలురోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. విద్యుత్ స్తంభాల నిర్మాణ పనులు వేగంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈసమావేశంలో సిపిఒ కెటి వెంకయ్య, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎం రాజు, డ్వామా పిడి పోలప్ప తదితరులు పాల్గొన్నారు.

గడప గడపకు వైఎస్‌ఆర్, ఇంటింటికి దారా
ఒంగోలు , జూన్ 6 : గడప గడపకు వైఎస్‌ఆర్, ఇంటింటికి దారా సాంబయ్య కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీన నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం నుండి ప్రారంభిస్తున్నట్లు సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎస్‌ఎన్ పాడు ఇన్‌చార్జి దారా సాంబయ్య తెలిపారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఈనెల 10వ తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలోని రైతులకు కనీస మద్దతు ధరలు, పెన్షన్లు, అమ్మఒడి , బెల్టుషాపుల రద్దు, రైతు నిధి తదితర పథకాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్ఫలితాలపై నాటికలు, కళాజాతాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. గుడిసెలు మేల్కొన్నాయ్ అనే నాటికను ప్రత్యేకంగా అన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం గత 10 సంవత్సరాల నుండి తన పోరాట ఫలితంగానే వచ్చిందన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కెవిపి రామచంద్రరావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉప ప్రణాళికపై చర్చించి ఎస్సీ, ఎస్టీలకు ఆ నిధులు ఖర్చు పెట్టాలని ఎన్నోసార్లు విన్నవిస్తే స్పందించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనను ప్రత్యేకంగా మహారాష్టక్రు పంపారన్నారు. మహారాష్టల్రో ఉప ప్రణాళిక అమలు జరుగుతున్న తీరుతెన్నులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. ఆ తరువాత ఎన్నికలు, వైఎస్ మరణం తరువాత ఉప ప్రణాళిక మూలనపడిందన్నారు. అప్పటి నుండి కేంద్రంలో 4 లక్షల కోట్లు, రాష్ట్రంలో 22 వేల 500 కోట్ల రూపాయలు సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్ళాయన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మద్యపానాన్ని నిషేధిస్తే చంద్రబాబు నాయుడు తలుపులు తెరిచారన్నారు. వ్యక్తిగతంగా ఆరు సీసాలు ఇంట్లో ఉండవచ్చని జీవో కూడా ఉందన్నారు. ముందుగా వాటిని నిషేధించగలిగితే బెల్టుషాపులు కూడా పూర్తిగా రద్దు అవుతాయన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇటీవల తమ పార్టీ ఇద్దరిని సమన్వయకర్తలుగా నియమించిందన్నారు. ప్రస్తుతం వాటిని రద్దు చేశారని, తాను నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్న గడపగడపకు వైఎస్‌ఆర్, ఇంటింటికి దారా సాంబయ్య అనే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

త్వరలో ఒంగోలులో ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాలు
ఒంగోలు అర్బన్, జూన్ 6:త్వరలో ఒంగోలులో ప్రథమాంధ మహాసభ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వక్తలు పేర్కొన్నారు. ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది రాష్ట్ర ప్రచార వేదిక, పద్మశ్రీ ఘంటసాల సాంస్కృతిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రచార కరపత్రాలను గురువారం స్థానిక ఎకెవికె జూనియర్ కళాశాలలో ఆవిష్కరించి ప్రదర్శన చేపట్టారు. ప్రధమాంథ్ర మహాసభ నుండి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వరకు నూరేళ్ల ప్రస్థానం (1913-2013 ) అనే అంశంపై జిల్లాలోని వివిధ అధ్యాపక సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశానికి ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కెపి రంగనాయకులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రచార కార్యదర్శి కోటా వెంకటేశ్వరెడ్డి మాట్లాడుతూ నేటితరం విద్యార్థులకు 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ గురించి ఆంధ్ర మహాసభలు, ఆంధ్రోద్యమం గురించి తెలియదన్నారు. కళాశాలల్లో ఆంధ్ర చరిత్ర ఒక సబ్జెక్టుగా బోధించడం లేదన్నారు. తెలుగు వారి చారిత్రక విజ్ఞానం, తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతులు, చారిత్రక ఔన్నత్యాల గురించి అంతగా తెలిసే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అధ్యాపక సంఘాలు, మేధావులు, విద్యావేత్తల సహకారంతో సమాజంలో చైతన్యం కోసం ప్రధమాంధ్ర మహాసభ నుండి నూరేళ్ల ప్రస్థానం అనే అంశంపై విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు అనేక కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు. గత నెల 24, 25, 26 తేదీల్లో బాపట్లలో శతాబ్ది ఉత్సవాలు జరిగాయన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మహాసభలు జరిపే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిడెడ్ జూనియర్ కళాశాలల సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షులు విఎల్‌పి రాజు, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కె సురేష్ , ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, పి లక్ష్మిప్రసాద్, ఎ సూర్య నారాయణ, సిహెచ్ బాబూరావు, ఎస్‌కె కరీముల్లా, జె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

‘బిసి సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలి’
చీరాల, జూన్ 6: బిసి సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని తదితర డిమాండ్‌లతో యాదవ చైతన్య యాత్ర నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ చీరాల నియోజకవర్గం ఆధ్వర్యంలో గురువారం మండలంలోని దేవినూతల గ్రామం నుంచి బయలుదేరిన చైతన్యయాత్ర గవినివారిపాలెం, పుల్లాయపాలెం, బోయినవారిపాలెం, ఈపూరుపాలెం, బుర్లవారిపాలెంతో ముగిసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చట్టసభలలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, బిసి ఉద్యోగాలలో రిజర్వేషన్‌లు వర్తింపు, బిసిల అభివృద్ధికి ప్రత్యేక పారిశ్రామిక విధానం, జిల్లాలో దామాషాప్రకారం 25వేల పైన ఉన్న యాదవ జనాభా కలిగిన అన్ని నియోజకవర్గాలలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకే అసెంబ్లీ టిక్కెట్‌లు కేటాయించాలని, బిసి అభ్యర్ధిని ముఖ్యమంత్రిగా చేయాలని పలు డిమాండ్‌లు చేశారు. కార్యక్రమంలో పెరుగు భాస్కర్, ఆంజనేయ మూర్తి, తాడిబోయిన లక్ష్మీప్రసాద్, బుర్ల రాము, రమణయ్య, పిట్టు నాగభూషణం, కర్నేటి నాగమల్లేశ్వరరావు, హరికృష్ణ, బుర్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

50 బస్తాల బియ్యం పట్టివేత
వేటపాలెం, జూన్ 6: మండలంలోని చల్లారెడ్డిపాలెం గ్రామంలో గురువారం తెల్లవారుఝామున ప్రజాపంపిణీకి చెందిన 50 బస్తాల బియ్యం గ్రామ శివారు ప్రాంతంలో స్ధానికులు గమనించి ఎస్‌ఐ అంకబాబుకు సమాచారాన్ని అందజేశారు. పోలీసులు వచ్చి ఎడారి ప్రాంతంలో ఉన్న 50 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్‌తో పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇదేవిధంగా మే నెలలో మార్కెట్ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉన్న 25 బస్తాల బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో అక్రమంగా బియ్యం, కిరోసిన్ తరలిపోతున్నా స్థానిక అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టుకున్న వారిపై 6ఎ కేసు నమోదుచేసి తమ పని అయిపోయినట్లు చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. చల్లారెడ్డిపాలెంలో దొరికిన బియ్యం ఎక్కడనుంచి వచ్చాయనే కోణంలో రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ గ్రామంలోని డిపోలను తనిఖీలు చేయగా సంబంధిత స్టాకు రిజిస్టర్‌లు సక్రమంగానే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ బియ్యం ఎక్కడనుంచి ఇక్కడకు తరలించారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

రామాయపట్నం పోర్టు ఏర్పాటులో
మంత్రికి సహకరిస్తాం : దివి
కందుకూరు, జూన్ 6: రామాయపట్నం పోర్టు మంజూరు ప్రక్రియలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం పేర్కొన్నారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో శివరాం మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రాజకీయ పార్టీ నాయకుల పైరవీలతో పోర్టు నెల్లూరు జిల్లా దుగరాజపట్నానికి తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి నియోజకవర్గం, జిల్లా పరిధిలోని అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి పోర్టు మంజూరుకు కృషి చేయాలని ఆయన కోరారు.
నియోజకవర్గాన్ని వెంటాడుతున్న తాగునీటి సమస్య
నియోజకవర్గంలో అన్ని మండలాల పరిధిలో తాగునీటి సమస్య ప్రజలను వెంటాడుతోందని శివరాం అన్నారు. ఒక్క కందుకూరు పట్టణం మినహాయించి అన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారని ఆయన అన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలు ఎందుకు నిర్వీర్యం అవుతున్నాయో అంతుచిక్కడం లేదన్నారు. గుడ్లూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నాయకుల అభీష్టం మేరకే నీటి సరఫరా జరుగుతోందని ఆప్రాంత వాసులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణంలో ఉన్న వంద పడకల వైద్యశాలకు పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బంది లేక ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
అమెరికాలో ఆంధ్ర అవినీతి అసమర్థ పాలనపై చర్చ
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అవినీతి, అసమర్థ పాలనపై చర్చ జరుగుతున్నట్లు శివరాం వెల్లడించారు. నెలరోజుల పాటు తాను అమెరికాలో ప్రవాసాంధ్రుల సభలలో, తానా సభలలో పాల్గొన్నానని తెలిపారు. ఈక్రమంలో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రవాసాంధ్రులు మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అసమర్థ పాలనపై చర్చించుకోవడం విశేషం అన్నారు. మరలా చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతుందనే అభిప్రాయాన్ని ప్రవాసాంధ్రులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈసమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు తలపనేని వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వంశీ, ఉపాధ్యక్షుడు గోరంట్ల బ్రహ్మయ్య, టిడిపి నాయకులు మాధవ, రవి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

29న బిసి ఓటర్ల తుది జాబితా ప్రచురణ
మున్సిపల్ కమిషనర్ స్పష్టం
కందుకూరు, జూన్ 6: మున్సిపాలిటీ పరిధిలోని బిసి ఓటర్ల తుది జాబితా ఈనెల 29వ తేదీన ప్రచురించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఫల్గుణకుమార్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పరిధిలో ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయపార్టీల పట్టణ అధ్యక్షులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశానుసారం పట్టణంలో ఈనెల 1నుంచి బిసి ఓటర్ల గుర్తింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. 11న ముసాయిదా బిసి ఓటర్ల జాబితా ప్రచురించనున్నామని, 12నుంచి 15వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించనున్నామని తెలిపారు. ఫిర్యాదులు, అభ్యంతరాలు ఏ వ్యక్తి చేస్తున్నారో ఆవ్యక్తిమాత్రమే దరఖాస్తు ఇవ్వాలని, గుత్తగా వస్తే దరఖాస్తులు స్వీకరించబడవని అన్నారు. 22వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలపై విచారణ జరుగుతుందని, 29న తుది జాబితా ప్రచురించబడుతుందని ఆయన తెలిపారు. రాజకీయపార్టీ నాయకులు సర్వే బృందాలు ఆయా వార్డులకు వచ్చిన సందర్భాలలో తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలు కమిషనర్‌కు వివరించారు. ఈసమావేశానికి టిడిపి పట్టణ అధ్యక్షుడు తలపనేని వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎస్‌కె ఖాదర్‌బాషా, బిజెపి పట్టణ అధ్యక్షుడు జె రాఘవులు, సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్‌కె గౌస్‌బాషా, సిపిఐ నాయకులు బి సురేష్‌బాబు పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల బియ్యం పట్టివేత
శింగరాయకొండ, జూన్ 6: అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల బియ్యాన్ని గురువారం ఉదయం జాతీయ రహదారిపై శింగరాయకొండ పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒంగోలు నుండి కావలి వైపు వెళ్తున్న లారీలో 200 బస్తాల బియ్యం తరలిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు జాతీయ రహదారిపై జివిఆర్ ఫ్యాక్టరీ సమపంలో లారీని స్వాధీన పరుచుకున్నారు. స్వాధీన పరుచుకున్న లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి ఎన్‌ఫోర్స్ డిటి సుబ్బారావుకు స్వాధీన పరచనున్నట్లు ఎఎస్సై బాషా తెలిపారు. ఈ బియ్యం ప్రజాపంపిణీ బియ్యంగా అనుమానం రావడంతో పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ అధికారులకు పంపనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిటి సుబ్బారావు తెలిపారు.

పొంగిన దొంగల వాగు
నిల్చిపోయిన వాహనాలు
పెద్దదోర్నాల, జూన్ 6: మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద వెలుగొండ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న దొంగలవాగు బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పొంగి ప్రవహించటంతో కర్నూలు, గుంటూరు వెళ్ళే వాహనాలు గురువారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు నిల్చిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నల్లమల అటవీప్రాంతంలో కురిసిన వర్షానికి గంటవానిపల్లె గ్రామం వద్దవున్న చప్టాపై నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయి గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. గంటవానిపల్లె గ్రామానికి చెందిన ఒక గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుండటంతో గ్రామంలోని కొందరు యువకులు చెట్టుకు తాళ్లు కట్టి తాళ్ల సహాయంతో ఆమెను చప్టాను దాటించి దోర్నాల ఆస్పత్రికి తరలించారు. చప్టాపై నీరు ఎక్కువగా ప్రవహించటంతో వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగం పనులకు వెళ్ళే కార్మికులు నిల్చిపోయారు. దీంతో మొదటి సొరంగం పనులు చేస్తున్న ఎన్‌ఎస్‌ఇ ప్రతినిధి రామ్మోహనరావు జెసిబితో సంఘటనా స్థలానికి చేరుకొని చప్టాపై అడ్డంగా ఉన్న కొమ్మలను తొలగించటంతో కొంతమేరకు అంతరాయం తొలగింది. సుమారు రెండు గంటల పాటు బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గంటవానిపల్లి వద్ద ఉన్న చప్టా ప్రదేశంలో బ్రిడ్జి నిర్మించాలని, అదే విధంగా కొత్తూరు సమీపంలో ఉన్న దొంగలవాగు సమీపంలో ఉన్న చప్టాపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.

టెక్నో స్కూళ్ల పేరుతో ప్రచారం అనుమతి లేకుండా 207 ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యాప్రమాణాలు
english title: 
private schools

బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంపై ఎసిబి దాడి

$
0
0

చిలకలూరిపేట, జూన్ 6: పట్టణంలోని పండరీపురంలో గల బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. కార్యాలయంలో మామూళ్లు ఇస్తేనే లైసెన్స్‌లు, వెహికల్ నెంబర్లను ఇస్తున్నారని బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఎసిబి డిఎస్‌పి నరసింహారావు తెలిపారు. కార్యాలయంలో ఉన్న ఏజెంట్ల నుండి 40 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రికార్డులను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారుల సమాచారాన్ని అందిస్తే దాడులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
హత్యకేసు ముద్దాయలకు
జీవిత ఖైదు, జరిమానా
నరసరావుపేట, జూన్ 6: మండలంలోని ఇక్కుర్రు గ్రామానికి చెందిన గుంటి కోటేశ్వరరావును హతమార్చిన కేసులో యర్రగుంట్ల ఇజ్రాయేలు, యర్రగుంట్ల గాబ్రియేలుకు జీవిత ఖైదు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి బి శ్యాంసుందర్ గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం మండలంలోని ఇక్కుర్రుగ్రామానికి చెందిన గుంటి కోటేశ్వరరావు పెంచుకున్న కుమార్తెను యర్రగుంట్ల ఇజ్రాయేలు మాయమాటలతో మోసంచేసి, ఆమెను నిర్మల పట్టణానికి తీసుకువెళ్ళాడు. ఇందుకు గాబ్రియేలు వారికి సహకరించాడు. దీంతో గ్రామంలోని పెద్దలు ఇజ్రాయేలు, గాబ్రియేలును పిలిచి పెద్ద సమక్షంలో రాజీ కుదిర్చారు. అయితే ఇజ్రాయేలు కోటేశ్వరరావు కుమార్తెను తీసుకువెళ్ళడంతో మనస్థాపానికి గురై కోటేశ్వరరావు పెద్దల సమక్షంలో వారిని దోషులుగా నిలబెట్టడంతో ఇజ్రాయేలు, గాబ్రియేలు తీవ్ర మనస్థాపం చెంది 2008 మే ఏడో తేదీన కోటేశ్వరరావును గొడ్డళ్ళతో నరికి, రాళ్ళతో కొట్టి హతమార్చారు. ఈ మేరకు అప్పటి రూరల్ సిఐ ఎంవి సుబ్బారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసుకు జిల్లా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేశిరెడ్డి మల్లారెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. ఈ కేసులో వారిద్దరికి జీవిత ఖై దు, వెయ్యి రూపాయల జరిమానా న్యాయమూర్తి విధించారు. ఇజ్రాయేలు కు సహకరించిన గాబ్రియేలుకు మరో మూడు నెలల జైలు శిక్ష విధించారు.
వ్యవసాయ, పాడి రంగాల
అభివృద్ధితోనే దేశం సుభిక్షం

* కలెక్టర్ సురేష్‌కుమార్

చేబ్రోలు, జూన్ 6: దేశం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ అన్నారు. గురువారం చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో ఆవరణలో ఏర్పాటు చేసిన నేషనల్ డెయిరీ ప్లాన్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ వ్యవసాయం, పాడి పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కువ శాతం మంది రైతులు ఈ రెండు రంగాలపైనే ఆధారపడి ఉన్నారన్నారు. పాడి పరిశ్రమాభివృద్ధిలో జాతీయ పాడిపరిశ్రమల అభివృద్ధి సంస్థ పాత్ర చాలా ముఖ్యమైందన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నేషనల్ డెయిరీ ప్లాన్‌ను సంగం డెయిరీలో ప్రారంభించుకోవడం హర్షదాయకమన్నారు. డెయిరీ ఉన్నత స్థాయికి చేరడానికి అందుకు పాడి రైతులే కారణమని పేర్కొన్నారు. ప్రస్తుత పాడి పరిశ్రమ రంగంలో నెలకొంటున్న పోటీతత్వాన్ని అధిగమించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. 35 సంవత్సరాల చరిత్ర కల్గిన సంగం డెయిరీని మరింత ఉన్నత స్థాయికి చేర్చేలా రైతులు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. సభకు అధ్యక్షత వహించి డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ సంగం డెయిరీకి నేషనల్ డెయిరీ ప్లాన్ అమలుకు అవకాశం కల్పించిన జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్లాన్ మొదటి దశలో మూడు పథకాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. సమతుల్య పోషకాహార పథకాన్ని డెయిరీ పరిధిలో గుర్తించిన 200 గ్రామాల్లో అమలు చేయనున్నామని, ఇందుకు 1,91,93, 000 రూపాయల నిధులు గ్రాంటుగా మంజూరైందన్నారు. 2వ పథకమైన పశుగ్రాస ఉత్పత్తి పథకం కింద పోషక విలువలు తగ్గకుండా అవసరమైన సమయాల్లో పశువులకు మేపే గ్రాసాన్ని తయారు చేయడం ముఖ్య ఉద్దేశమని, ఇందుకు 68 లక్షలు మంజూరైందన్నారు. చివరిదైన గ్రామ ఆధారిత పాల సేకరణ పద్ధతుల పటిష్టీకరణ పథకం కింద పాల నాణ్యత పెంచడం ముఖ్య ఉద్దేశమని ఇందుకోసం 289.60 లక్షల రూపాయలు గ్రాంటు మంజూరు కాగా 159.90 లక్షల నిధులను డెయిరీ అందజేస్తుందన్నారు. పాల ఉత్పత్తి దారుల సంక్షేమానికే డెయిరీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తొలుత కలెక్టర్ డెయిరీలో తయారవుతున్న పాల ఉత్పత్తుల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. డెయిరీ ఆవరణలో ఇగ్నో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిప్లోమా ఇన్ డెయిరీ టెక్నాలజీ కోర్సు చేస్తున్న 12 మంది విద్యార్థులకు స్ట్ఫైండ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు ఇక్కుర్తి సాంబశివరావు, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ వి వేణుగోపాలరెడ్డి, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ డిప్యూటీ మేనేజర్ లత, డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ గోపీనాధ్, పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలన్నింటికీ
‘ఆధార్’ తప్పనిసరి

* 400 గ్యాస్ కనెక్షన్ల పంపిణీ * 1.7 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్ మనోహర్
కొల్లిపర, జూన్ 6: సంక్షేమ పథకాలకు ఆధార్‌కార్డు తప్పనిసరని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కొల్లపరలోని పాలకేంద్రం కళ్యాణ మండపంలో దీపం పథకం కింద 400 మంది లబ్ధిదారులకు గురువారం గ్యాస్ కనెక్షన్లను మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేందుకు ఆధార్ తోడ్పడుతుందన్నారు. త్వరలో ప్రారంభించే నగదు బదిలీ పథకంకు ఆధార్ తప్పనిసరి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించటమే లక్ష్యం అన్నారు. ముందుగా పిడపర్తిపాలెంలో 6.50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిమెంటు రోడ్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఇందిర జీవిత బీమా పథకం కింద విద్దెల అంజలికి 75 వేల రూపాయల చెక్కు అందజేశారు. అనంతరం కోటి రూపాయలతో నిర్మించిన అత్తోట - నేలపాడు రోడ్ ఆయన ప్రారంభించారు.

మల్లాది గ్రామ దత్తతకు ’ప్రపంచ బ్యాంకు‘ కార్యాచరణ ప్రణాళిక
అమరావతి, జూన్ 6: నాగార్జున సాగర్ ఆయకట్టు అభివృద్ధి పథకంలో భాగంగా ప్రపంచ బ్యాంకు తరఫున గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు వ్యవసాయ శాఖ ప్రతినిధి డాక్టర్ పాల్‌సింగ్ సిద్దు తెలిపారు. గురువారం మండల పరిధిలోని మల్లాది గ్రామాన్ని ప్రపంచ బ్యాంకు అధికారుల బృందం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల బృందం గ్రామంలో విస్తృతంగా పర్యటించి రైతులతో పంటల పెంపకం, దిగుబడి, మార్కెటింగ్ వివిధ అంశాలపై మమేకమై చర్చించారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ రైతులు పండించిన ఉత్పత్తులను వారే అమ్ముకునేందుకు వీలుగా గ్రామీణ గోడౌన్లను నిర్మించి నిల్వ ఉంచుకునే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దళారీ వ్యవస్థను నిర్మూలించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రపంచ బ్యాంకు తరఫున అమరావతి మండలంలో ఈ ఏడాది మల్లాది, దిడుగు గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పారు. గత ఏడాది ఆత్మ ప్రాజెక్టు తరఫున చేపట్టిన శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర ప్రదర్శనలు వాటి ఉపయోగాల గురించి చర్చించారు. ఈ ఏడాది కూడా ఆత్మ ప్రాజెక్టు ద్వారా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై సమగ్రంగా చర్చించారు. ఈ బృందంలో వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎంఎన్ రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ అధికారి మూర్తి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ కె వేణుకృష్ణ, ఆత్మ ప్రాజెక్టు పిడి మాధవీ శ్రీలత, డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ మోహనరావు, సీనియర్ ఇక్స్‌టెన్షన్ కోఆర్డినేటర్ నారాయణచౌదరి, జిల్లా నీటి అభివృద్ధి విభాగం అధికారి నీలకంఠేశ్వరరావు, మంగళగిరి ఎడిఎ సిహెచ్ తిరుమలాదేవి, ఆత్మా ప్రాజెక్టు ఎస్‌ఎంఎస్ సాయిబాబు, అమరావతి ఎఒ నరేంద్రబాబు, బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శ్రీనివాసరావు, ఎఇఒలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు బృందానికి మాజీ ఎంపిపి వెంపా జ్వాలా లక్ష్మీనరసింహారావు స్వాగతం పలికారు. అనంతరం ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి అమరేశ్వరాలయంలో అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోరీ
నూజెండ్ల, జూన్ 6: నూజెండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి లక్ష రూపాయల విలువ చేసే వస్తువులు చోరీ అయ్యాయి. పాఠశాలలో ఉన్న ఎల్‌సిడి టీవి, ప్రొజెక్టర్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయానే్న పాఠశాలకు వచ్చిన అటెండర్ హెచ్‌ఎం రూమ్‌ని శుభ్రపరిచేందుకు వెళ్లాడు. అప్పటికే బీరువా తాళాలు తెరిచి రికార్డులు చిందరవందరుగా పడి ఉండటాన్ని గుర్తించి ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందజేశాడు. ప్రధానోపాధ్యాయుని పక్కగదిలో ఉన్న ఎల్‌సిడి ప్రొజెక్టర్ కూడా చోరీ అయింది. వెంటనే జరిగిన విషయాన్ని పాఠశాల హెచ్‌ఎం హరిప్రసాద్ ఐనవోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ పి భాస్కర్ ఆదేశాల మేరకు పోలీసులు పాఠశాలకు చేరుకుని దొంగతనం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోరాటయోధుడు చండ్ర
మంగళగిరి, జూన్ 6: పీడిత, తాడి త జనావళి కోసం జీవితాంతం అవిశ్రాంతంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు అని పట్టణ సిపిఐ కార్యదర్శి కూరపాటి మురళీరాజు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత దివంగత చండ్ర రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం పట్టణంలోని గాలిగోపురం ఎదుట గల ఆయన విగ్రహానికి సిపిఐ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా మురళీరాజు మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడిన రాజేశ్వరరావు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. తాడేపల్లి మండల సిపిఐ కార్యదర్శి కంచర్ల కాశయ్య మాట్లాడుతూ తెలంగాణాలో నిజాం పాలన దోపిడీకి వ్యతిరేకంగా చండ్ర ఉద్యమించారని అన్నారు. అవినీతి, దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే చండ్రకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నా రు. పార్టీ నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ముసునూరు సుహాస్, పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఎస్‌కె సుభాని, చిన్ని తిరుపయ్య, అన్నవరపు ప్రభాకర్, మద్దిరాల రమేష్, షేక్ దస్తగిరి, నూతలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత సిపిఐ కార్యాలయం నుంచి చండ్ర విగ్రహం వరకు పార్టీ పతాకాలు చేతబూని ప్రదర్శన నిర్వహించారు.
వ్యవసాయాధారిత పరిశ్రమలకు సత్వర రుణాలు
గుంటూరు, జూన్ 6: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు బ్యాంకర్లు సత్వరమే రుణాలు అందజేయాలని వ్యవసాయ సంయుక్త సంచాలకుడు శ్రీ్ధర్ పేర్కొన్నారు. గురువారం కృషీ భవన్‌లో వెంచర్ క్యాపిటల్ స్కీంపై ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఏజన్సీ, అగ్రికల్చరల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ జిల్లాను వ్యవసాయపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. భారత ప్రభుత్వం వ్యవసాయశాఖ, సహకార శాఖ నేతృత్వంలో అమలు చేయనున్న వెంచర్ క్యాపిటల్ స్కీం ఫర్ అగ్రి బిజినెస్ డెవలప్‌మెంట్‌పై రైతులకు అవగాహన కల్గించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు. ఈ స్కీం ప్రాజెక్టు ఆఫీసర్ ప్రకాష్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కింద వ్యక్తులు, రైతులు, ఉత్పత్తిదారులు, స్వయం సహాయక గ్రూపుల్లోని వారికి వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నారు. ఒక ప్రాజెక్టు తయారు చేయడానికి రూ. 50 వేలు కన్సార్డియమ్ ఇస్తుందని చెప్పారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం నాగసుందరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పలు రాయితీలను కల్పిస్తోందన్నారు. నాబార్డు ఎజిఎం భవానీశంకర్ మాట్లాడుతూ వెంచర్ క్యాపిటల్ స్కీం అమలుకు అందరూ సహకరించాలన్నారు.

భూసమస్య పరిష్కరించాలి
నూజెండ్ల, జూన్ 6: భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ములకలూరు ఎస్సీ కాలనీవాసులు మూడో రోజైన గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళకు దిగారు. పట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చి వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విఆర్‌వో జానీబాషాను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. వాగుపోరంబోకు, గుండ్లకమ్మ పోరంబోకు అంటూ కాలక్షేపం చేస్తున్న విఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్థులు పలువురు హెచ్చరించారు. 30 ఏళ్లుగా భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, భూమికి సంబంధించిన అడంగల్ కాపీ, ఆన్‌లైన్లలో పేర్లు నమోదు చేయకుండా డ్రామాలు అడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారు ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న నరసరావుపేట ఆర్డీవో శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించారు. ఆర్‌ఎస్‌ఆర్ రికార్డుల ప్రకారం వాగు పోరంబోకుగా ఉన్నందున ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు కుదరదని, ఉన్నతాధికారులకు సమస్యను తెలియజేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు.

తెనాలి మండలంలో నేడు స్పీకర్ పర్యటన
తెనాలి రూరల్, జూన్ 6: రాష్ట్ర శాససభాపతి, స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ శుక్రవారం తెనాలి మండలంలో పర్యటించనున్నట్లు ఎంపిడిఓ బొర్రా శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 2081 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న, పనుల ప్రారంభించన్ను అభివృద్ధి కార్యక్రమాలు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు ఎంపిడిఓ వివరించారు. ముందుగా మండలంలోని జాకీర్ హుస్సేన్‌నగర్‌లో 8 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను స్పీకర్ మనోహర్ ప్రారంభిస్తారు. అనంతరం హాఫ్‌పేటలో జనసందర్శనం, ఖాజీపేట గ్రామంలో 23 లక్షల రూపాయల నిధులతో బిటి రోడ్ ప్రారంభం, కొల్లిపరలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న అప్రోచ్ రోడ్‌ను స్పీకర్ ప్రారంభిస్తారు. 5 లక్షల రూపాయలతో శ్మశానవాటికకు కాంపౌండ్ నిర్మాణం కోసం భూమిపూజ చేస్తారు. అనంతరం 25 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తయిన కొలకలూరు - అనుమర్లపూడి గ్రామాల లింక్‌రోడ్‌ను మనోహర్ ప్రారంభిస్తారు. చివరిగా కొలకలూరు ఎస్సీ కాలనీలో కోటి రూపాయలతో ఆర్‌అంబి నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న సిమెంటు రోడ్లను ప్రారంభిస్తారు. మండలంలోని కఠెవరంలో కోటి రూపాయలతో చిన్న, పెద్ద కాలనీల్లో నిర్మించిన సిమెంటు రోడ్లను ప్రారంభించనున్నట్లు ఎంపిడిఓ వివరించారు.
పెన్షనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణ దాతలు అభినందనీయులు
తెనాలి, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యుల పట్టుదలకు దాతల సహకారం తోడై అసోసియేషన్ నూతన భవన నిర్మాణం అనే లక్ష్యం సాకారమైందని దాతల సేవలు ముదావహమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక ట్రావెలర్స్ బంగళా పక్కనే పెన్షనర్స్ అసోసియేషన్ కోసం ప్రభుత్వపరమైన స్థలాన్ని కేటాయించగా, నూతనంగా నిర్మితమైన భవనాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా గురువారం ప్రారంభించారు. పెన్షనర్స్ అసోసియేషన్ లక్ష్య సాధనలో సహకరించిన దాతలు అభినందనీయులని నాదెండ్ల దాతలను సత్కరించి అభినందనలు తెలిపారు.

ఉర్దూ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం
నరసరావుపేట, జూన్ 6: స్థానిక ప్రకాష్‌నగర్‌లోని లిమ్రా హ్యాండ్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఆర్డీవో ఎం శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాధ్యమైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలని సూచించారు. హ్యాండ్ రైటింగ్ ద్వారా విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరడానికి వీలవుతుందన్నారు. ఎన్‌సిపియుఎల్ విద్యార్థులకు ఈ సందర్భంగా మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ షేక్ కరిముల్లా, డ్రాయింగ్ టీచర్ చక్రవర్తి, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

డివైఎస్‌వోకు 2 ఫిర్యాదులు
మాచర్ల, జూన్ 6: పాత పోలీసు క్వార్టర్స్ సమీపంలోని బోరింగ్ మరమ్మతులకు గురైందని, ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువుగా ఉందని 29వ వార్డుకు చెందిన సుబ్బారావు గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ స్పెషల్ ఆఫీసర్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 7వ వార్డులోని రోప్‌లైన్ వద్ద గల రెడ్డి బడ్డీకొట్టు సమీపంలో కల్వర్టు పూడిపోయిందని వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని గోవిందరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ గిరికుమార్ తెలిపారు.

‘ఇందిరమ్మ పచ్చతోరణం’ పక్కాగా అమలుచేయాలి
తెనాలి రూరల్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల భూములను అభివృద్ధిపరిచే ప్రక్రియలో భాగంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ పచ్చతోరణం’ కార్యక్రమాన్ని తెనాలి మండలంలో పక్కాగా అమలుచేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధిసంస్థ ఎపిడిఓ ప్రసాద్ పేర్కొన్నారు.
మండల పరిషత్ కార్యాలయం సమావేవం మందిరంలో గురువారం మండల సమాఖ్య సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎపిడి మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అభివృద్ధికి నోచుకోని భూములను గుర్తించి వాటిని క్రమంగా అభివృద్ధి చేసి కనీసం ఎకరాకు 200 చెట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని పెదరావూరు, కొలకలూరు, ఎరుకలపూడి, చావావారిపాలెం, సోమసుందరపాలెం గ్రామాలను సంపూర్ణ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మింపజేసే గ్రామాలుగా ఎంపిక చేసుకోవటం జరిగిందని, మార్చి 2013నాటికి నూరు శాతం మరుగుదొడ్లు పూర్తి చేయించవలసి ఉండగా పూర్తికాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ నెలాఖరునాటికైనా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రూపుల్లోని ప్రతి సభ్యురాలు తప్పక ఇన్సూరెన్స్ పథకాల గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ‘స్ర్తి నిధి’ బ్యాంకుల ద్వారా గ్రూపుల్లోని ఆరుగురు సభ్యులకు 15 నుండి 20 వేల రూపాయల మేరకు రుణాలు అందేలా, తిరిగి వారు సకాలంలో సక్రమంగా చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు.

మన్యసూక్త హోమాలకు మహాపూర్ణాహుతి
గుంటూరు , జూన్ 6: పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తుల సమక్షంలో హనుమన్మండల దీక్షలను దీక్షాధారులైన స్వాములు విరమించారు. శ్రీరామ, ఆంజనేయస్వామి భక్తులను అమితంగా పులకింపజేసిన ఈ విశేషమైన కార్యక్రమాన్ని గురువారం నగరంలోని మారుతీ నగర్‌లో కొలువుతీరిన శ్రీ కంచికామ కోటిపీఠ మారుతీ దేవాలయంలో ఆ దేవాలయ పాలకమండలి శ్రద్ధాశక్తులతో నిర్వహించింది. కంచికామ కోటి పీఠాధిపతుల ఆశీస్సులతో హనుమన్మండల దీక్షలను నిర్వహిస్తున్నారు. దీక్షల ముగింపు సందర్భంగా గురువారం ప్రభాత వేళ సుందర అభయాంజనేయ స్వామికి పంచామృత స్నపన, తిరుమంజనం, అనంతరం నాగవల్లీ దళార్చనలను అర్చక స్వాములు చేశారు. దీక్షా విరమణలో భాగంగా మండలం పాటు ప్రధాన యజ్ఞస్థలిలో జరుపుతున్న నవగ్రహ, రుద్ర, మన్యసూక్త హోమాలకు 25 మందికి పైగా వేద పండితులు, రుత్విక్కులు పూర్ణాహుతి చేశారు. ముఖ్యంగా దీక్షలను ఆచరిస్తున్న స్వాములు సామూహికంగా అంజనీసుతుని సేవించుకున్నారు. పూర్ణాహుతి కార్యక్రమానికి ముందు ఇరుముడులు ధరించిన స్వాములు దేవస్థానంలో 11 పర్యాయాలు ప్రదక్షిణలు చేసి, మాల విరమణ చేశారు. ఇదే ఆలయంలో వేంచేసియున్న శ్రీ గంగా గౌరీశంకర స్వామికి మాస శివరాత్రిని పురస్కరించుకుని కల్యాణ మహోత్సవాన్ని కూడా కనులపండువగా నిర్వహించారు. మారుతీ దేవాలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు, యజ్ఞ పూర్ణాహుతి తదితర కార్యక్రమాల్లో పాల్గొని రుత్విక్కులను సత్కరించారు.

సిసి రోడ్ల ప్రారంభం
బాపట్ల, జూన్ 6: బాపట్ల మండలంలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ముత్తాయపాలెంలో కోటి 32 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆదర్శనగర్, కప్పలవారిపాలెం, ఈతేరు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అక్కడ జరిగిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా బాపట్ల నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ప్రతిగ్రామానికి అవసరమైన వౌళిక సదుపాయాలను కల్పించడంలో రాజీలేకుండా శ్రమిస్తున్నట్లు వివరించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లం గోపికృష్ణ, గాదె మధుసూధనరెడ్డి, మాజీ ఎంపిపి దాసరి యోహాను, బొడ్డు సుబ్బారెడ్డి, జిట్టా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత కళాకారులదే
వినుకొండ, జూన్ 6: సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత కళాకారులపై ఉందని చైతన్య స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక చైతన్య స్రవంతి కార్యాలయంలో జరిగిన కళాకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి సంస్థ కార్యదర్శి బి రవికుమార్ అధ్యక్షత వహించారు. సామాజిక రుగ్మతలపై కళాకారులు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. తొలుత తెలుగు వెలుగుల చిత్రపటానికి గుమ్మడి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సమాజంలో పతనమవుతున్న విలువలను కాపాడటంలోను, మానవ సంబంధాలను పెంపొందించేందుకు ప్రతి కళాకారుడు కృషి చేయాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు కళాకారులందరూ సంఘటితం కావాలన్నారు. ఈ నెల 16వ తేదీ ఆదివారం చైతన్య స్రవంతి కార్యాలయంలో జరగనున్న నియోజకవర్గ కళాకారుల సదస్సును జయప్రదం చేయాలని కోరారు.

బడిమానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి
విజయపురిసౌత్, జూన్ 6: ఐదేళ్ళ చిన్నారులను, బడిమానేసిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చింతల తండా ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లిఖార్జునరావు కోరారు. విద్యా సంబరాల్లో భాగంగా గురువారం విజయపురిసౌత్ పరిధిలోని చింతలతండాలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి పిల్లలను పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మల్లిఖార్జునరావు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల మోజులో పడి మోసవద్దని పిల్లల తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాల గురించి వివరించారు.

మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రోత్సహించండి
అమృతలూరు, జూన్ 6: మొదటి విడతగా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకున్న మండల పరిధిలోని ఐదు గ్రామాల్లో ఉన్నవారు వ్యక్తిగత మరుగుదొడ్డి లేనివారందరూ మరుగుదొడ్డి నిర్మించుకునేలా సభ్యులకు అవగాహన కల్పించాలని ఎసి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. గురువారం మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మండల పరిధిలోని 29 గ్రామ సమాఖ్యల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విషయాలపై మండల సమా ఖ్య ఇసి సభ్యులకు అవగాహన కల్పించారు.

* ఏజెంట్ల నుండి 40 వేలు స్వాధీనం
english title: 
acb raid

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు

$
0
0

ఖమ్మం, జూన్ 6: పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 758పంచాయతీలకు గాను సుమారు 4కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రకటించిన నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియతో పాటు బ్యా లెట్ బాక్స్‌లను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లుండగా భద్రాచలం డివిజన్ పూర్తిగా షెడ్యుల్డ్ ఏరియాలో ఉంది. ఇక్కడ మొత్తం 117గ్రామ పంచాయతీలున్నాయి. కొత్తగూడెం డివిజన్‌లో 147గ్రామ పంచాయతీలుండగా కొత్తగూడెం మండలంలో 2, సింగరేణి మండలంలో ఒకటి మాత్రమే నాన్ షెడ్యుల్డ్ ఏరియాలో ఉన్నాయి. మిగిలినవన్ని షెడ్యుల్డ్ ప్రాంతంలో ఉండటం గమనార్హం. పాల్వంచ డివిజన్‌లో 117పంచాయతీలకు గాను 103 షెడ్యుల్డ్ ఏరియాలోనూ, 14 నాన్‌షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయి. ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో 377గ్రామపంచాయతీలకుగాను 369నాన్‌షెడ్యుల్డ్ ఏరియాలో ఉండగా, కేవలం 8మాత్రమే షెడ్యుల్డ్ ఏరియాలో ఉన్నాయి. అవి కూడా పెనుబల్లిలో 6, సత్తుపల్లిలో రెండు పంచాయతీలున్నాయి. జిల్లా మొత్తం 758పంచాయతీలకు గాను 372 షెడ్యుల్డ్ ఏరియాలోనూ, 386నాన్ షెడ్యుల్డ్ ఏరియాలో ఉన్నాయి. కాగా షెడ్యుల్డ్ ఏరియాలో ఖచ్ఛితంగా గిరిజనులు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల ప్రక్రియ రెవెన్యూ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
కాగా మరో నాలుగైదు రోజుల్లో సర్పంచ్‌లతో పాటు వార్డు మెంబర్ల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని జిల్లా పంచాయతీ అధికారి పి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 4కోట్ల మేరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కాగా పోలింగ్ సిబ్బంది వ్యయానికి 60లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలో సర్పంచ్‌ల రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీవోల ఆధ్వర్యంలోజరగ్గా, వార్డు మెంబర్ల ప్రక్రియ మాత్రమే ఎంపిడివోల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యను చదివిన విద్యార్థులను ఉపయోగిస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 14.25లక్షల మంది వరకు ఓటర్లుండగా వీరందరికి బ్యాలెట్ పేపర్లు కూడా తయారు చేయాల్సి ఉంటుంది. సర్పంచ్ ఎన్నికకు పింక్ బ్యాలెట్ పేపర్‌ను, వార్డుమెంబర్‌కు తెలుపు బ్యాలెట్ పేపర్లు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయని డిపివో తెలిపారు.

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
* మంత్రులు బలరాం నాయక్, రాంరెడ్డి, ఎమ్మెల్యే రేగా
పినపాక, జూన్ 6: రాష్ట్రంలో అభివృద్ధి సాధించడం అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అది కూడా సీఎం హయాంలోనే జరుగుతుందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు అన్నారు. గురువారం మండలంలో వారు విస్తృతంగా పర్యటించి మారుమూల జానంపేట గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించనున్న 33/11కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏడూళ్ళబయ్యారం క్రాస్ రోడ్డులో ఉన్న కో ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో ఐటిడిఏ నుంచి మంజూరైన రూ.8 లక్షలు విలువ చేసే ట్రాక్టర్‌ను మహిళా సమాఖ్యకు అందజేశారు. ఈ సందర్భంగా జానంపేటలో జరిగిన సభలో మంత్రి రాంరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణంతో సమీప గ్రామాలకు 24 గంటలూ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లాలో రూ.800 కోట్లతో 721 గ్రామాలకు మంచినీటి సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. 2004 నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో అమలౌతున్న పథకాలను కిరణ్ సర్కార్ అమలు చేస్తున్నారన్నారు. రైతాంగానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో ఇటీవల కొంత లోపం జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. అయినా ప్రభుత్వం కోట్లు వెచ్చించి విద్యుత్‌ను కొనుగోలు చేసి అందిస్తుందన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలను సైతం అందిస్తుందని, అన్ని పథకాలను కొనసాగిస్తుందని చెప్పారు. మండలంలో పోడు భూముల వ్యవహారం తలనొప్పిగా మారిందని, పోడు చేసుకునే గిరిజన, నిరుపేదల భూములను సర్వే చేయించి వెంటనే పట్టాలిచ్చేందుకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా 30 సంవత్సరాలుగా మండలంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న చందా లింగయ్య కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి మరో పార్టీలోకి జారుకోవడం తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దినట్లేనని విమర్శించారు. అటువంటి వారి మాటలు పట్టించుకోవద్దన్నారు. అనంతరం కేంద్రమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలలో నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. సోనియా, మన్మోహన్‌ల ఆధ్వర్యంలో గతంలో వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, రాష్ట్రంలో ఆ పథకాలను కిరణ్ సర్కార్ ఎక్కడ కుంటుపడకుండా అమలు చేస్తున్నారని అన్నారు. ఒక్క పినపాక నియోజకవర్గంలోనే పులుసుబొంత వాగు ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల రోడ్డు మార్గాలను విస్తరించడం జరిగిందన్నారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ మండలంలో ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్లల్లో విశేషమైన అభివృద్ధిని సాధించడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాల్లో ప్రతి ఒక్క దానిని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పినపాక మండలంలో జరిగిన అభివృద్ధిని, గతంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు భేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు. జానంపేటలో సబ్ స్టేషన్‌పై అవహేళన చేసిన ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకుంటున్నాయని విమర్శించారు. ఇదే జానంపేటలో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసి ఆ హామీని నిలబెట్టుకుంటానని మరో మారు హామీ ఇచ్చారు. ఉత్తుత్తి మాటలు చెబుతూ కాంగ్రెస్‌పై లేనిపోని అపనిందలు వేసే నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 30 ఏళ్ల చందా లింగయ్య అనుభవం తన మూడేళ్ల అనుభవంతో సమానమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక తహశీల్దారు పూనెం నాగేశ్వరరావు చేస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని సభా ముఖంగా జిల్లా కలెక్టర్‌ను కోరారు. గిరిజన తహశీల్దారు అయి ఉండి గిరిజనులకే తీవ్ర ద్రోహం చేయడం చాలా అన్యాయమన్నారు. మండలంలో ఎల్టీఆర్ కేసులు, పట్టాదారు పాసుపుస్తకాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు పూనెం నాగేశ్వరరావు, ఎండీఓ గడ్డం రమేష్, విద్యుత్ శాఖ ఏఇ రమేష్, ఎస్‌ఇ తిరుమలరావు, పాల్వంచ ఆర్డీఓ శ్యాం ప్రసాద్, డియస్పి తిరుపతి, సిఐలు సాంబరాజు, వేణుచందర్, ఎస్‌ఐలు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా కిశోర్, నాయకులు పూజారి వెంకన్న, ముక్కు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సోషలిస్టు వ్యవస్థ కోసం పోరాడిన యోధుడు చండ్ర
ఖమ్మం , జూన్ 6: భారతదేశంలో సోషలిస్టు వ్యవస్థ కోసం తుదిశ్వాస వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. చండ్ర రాజేశ్వరరావు శతజయంతి సభ గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది. జమ్ముల జితేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పువ్వాడ మాట్లాడుతూ సంపన్న రైతు కుటుంబంలో జన్నించిన చండ్ర రాజేశ్వరరావు నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పరితపించారని కొనియాడారు. తెలంగాణ విముక్తి పోరాటంలో సాయుధ దళాలకు సారథ్యం వహించారని, భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలోతనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమ చీలిక అనంతరం దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి సిపిఐ కార్యదర్శిగా ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. 1972లో కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల చట్టం తీసుకు రావడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి చండ్ర అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా పలు భూపోరాటాలకు నాయకత్వం వహించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంతో చండ్రకు విడదీయరాని బంధం ఉందన్నారు. ప్రపంచీకరణ పాలకవర్గాల్లో పెరిగిన అవినీతి నేపద్యంలో కమ్యూనిస్టు శ్రేణులు బహుముఖ పోరాటాలకు సిద్దం కావాలని పువ్వాడ పిలుపునిచ్చారు. ఈ శతజయంతి సభలో రాష్ట్ర నాయకులు టివి చౌదరి, పాకాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, మేకల సంగయ్య, పోటు కళావతి తదితరలు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమాన్ని విస్మరించి
సోనియా చుట్టూ ప్రదక్షిణలు
* కాంగ్రెస్ నేతల తీరుపై సిపిఎం నేత పోతినేని ఎద్దేవా
ఖమ్మం , జూన్ 6: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కుర్చీలు కాపాడుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా మరికొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో సోనియాగాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు ఎద్దేవా చేశారు. గురువారం మండలంలోని సత్యనారాయణపురంలో తోట పెద్ద వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సిపిఎం గ్రామశాఖ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడమే సిపిఎం ధ్యేయమన్నారు. ఎర్రజెండాను నమ్ముకొని సిపిఎం పార్టీలో చేరిన వారికి పార్టీ అండగా నిలస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో, జిల్లాలో అనేకచోట్ల భూపోరాటాలు చేసిన ఘనత సిపిఎంకు ఉందన్నారు. అంతేగాక ఇతర ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసి అనేక సమస్యలు కూడా పరిష్కరించుకోగలిగామని పోతినేని స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఇళ్ళస్థలాలు, పెన్షన్లు సాధించుకోగలిగామన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు తదితర సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తున్నామన్నారు. రాష్ట్ర ఉద్యానవన శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఏనాడూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించిన పాపానపోలేదని, ఎక్కడ ఒంగోలు గిత్తలు ఉన్నాయి, ఎక్కడ ఎడ్ల పందేలు జరుగుతున్నాయో అనే విషయాలపైనే దృష్టి సారిస్తారని విమర్శించారు. తమ్మినేని వీరభద్రం ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఈసందర్భంగా 30 కుటుంబాలకు చెందిన ప్రజలు పోతినేని సమక్షంలో సిపిఎం లో చేరారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, నాయకులు నున్నా నాగేశ్వరరావు, బత్తుల లెనిన్, ఎజె రమేష్, కాసాని ఐలయ్య, కనకయ్య, సిఐటియు కార్యదర్శి పి మోహన్‌రావు, మామిండ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనం పల్టీ: వ్యక్తి మృతి
కొణిజర్ల, జూన్ 6: ద్విచక్ర వాహనం అదుపు తప్పి పల్టీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటన తుమ్మలపల్లి గ్రామ సమీపంలో గురువారం ఆర్‌అండ్‌బి రోడ్డుపై జరిగింది. స్థానికులు, మృతుని కు టుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అన్నవరం గ్రామానికి చెందిన చెన్నోజు వాసుదేవాచారి(40) ద్విచక్ర వాహనంపై తనికెళ్ళ నుంచి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలో మూలమలుపువద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతోఅక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శంకర్ సంఘటనా స్థలాకి చేరుకొని పంచనామ నిర్వహించి పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేసున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
పాఠ్యపుస్తకాలు పంపిణీ
ఖమ్మం రూరల్, జూన్ 6: మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు గురువారం మండల విద్యాశాఖాధికారి వి సత్యనారాయణ 33,240 పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 57,635 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా, ప్రస్తుతం 33,240 పాఠ్యపుస్తకాలు మాత్రమే వచ్చినట్టు ఆయన తెలిపారు. ఇంకా తెలుగు మీడియంకు చెందిన 7వ తరగతి హిందీ, సైన్స్, 8వ తరగతి గణితం, 9వ తరగతి ఇంగ్లీష్, గణితం, 10వ తరగతి తెలుగు, భౌతికశాస్త్రం పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకు చెందిన 7వ తరగతి హిందీ, సైన్స్, 10వ తరగతి ఇంగ్లీష్, హిందీ, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం పాఠ్యపుస్తకాలు సైతం రావాల్సి ఉన్నట్టు ఎంఇఓ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో
11 మందికి గాయాలు
* ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
తిరుమలాయపాలెం, జూన్ 6: మండల పరిధిలోని కాకరవాయి గ్రామ సమీపాన గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 11 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాకరవాయి గ్రామశివారుకు చెందిన 11 మంది జిల్లా కోర్టుకు ఒక కేసు విషయమై హాజరై తిరిగి తమ గ్రామానికి టాటా ఏసిలో వెళ్తున్నారు. జూపెడ గ్రామానికి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో సుద్దవాగుతండాకు చెందిన బాణోతు సోమన్న, బాణోతు జాను, బాణోతు మల్సూరు, బాణోతు వీరన్న, బాణోతు చిన్న, బాణోతు లకుపతి, బాణోతు పంత్రి, బాణోతు భాషా, బాణోతు తావ్రి, బాణోతు మోహన్ అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ ఎల్ రఘురాంరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రారంభమైన
వ్యవసాయ మార్కెట్
ఖమ్మం (గాంధీచౌక్), జూన్ 6: గత నెల 15 నుండి ఈ నెల 5 వరకు మార్కెట్‌కు సెలవులు ఇవ్వటంతో మూతపడ్డ మార్కెట్ గురువారం యథాతథంగా ప్రారంభమైందని మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ అన్నారు. ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్నామని, మార్కెట్‌కు సెలవులు ప్రకటించాలని మార్కెట్ కూలీలు కోరడంతో మార్కెట్‌కు సెలవులు ఇచ్చామని ఆయన అన్నారు. ఇకపై రైతులు వారు పండించిన పంటలను మార్కెట్‌కు తరలించుకోవచ్చని, మార్కెట్‌లో అమ్మకాలు జరుగుతాయని ఆయన అన్నారు.

చండ్రుగొండ మండలంలో భారీ వర్షం
చండ్రుగొండ, జూన్ 6: మండలంలో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో పిడుగులు సైతం పడడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. వర్షానికి తోడు గాలి తోడవడంతో చండ్రుగొండ, రావికంపాడు, బాలికుంట, బెండాలపాడు గ్రామాల్లో పెద్దపెద్ద వృక్షాలతో పాటు విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో గురువారం ఉదయం వరకు మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఘనంగా సామూహిక అక్షరాభ్యాసాలు
ఎర్రుపాలెం, జూన్ 6: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసకార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి తల్లిదండ్రులు వివిధ గ్రామాల నుంచి ఆలయానికి వచ్చి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, తదుపరి సరస్వతి పూజ కార్యక్రమాలను ఆలయ వేద పండితులు కొత్తూరి కోటేశ్వరశాస్ర్తీ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మలు నిర్వహించి, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. చిన్నారులకు దేవాలయం తరుపున పలక, బలపం, ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమంలో ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఈవో వెచ్చానర్సింహారావు, స్థానిక ధర్మకర్త వేమిరెడ్డి అంకిరెడ్డి, ధర్మకర్తలు, సిబ్బంది, పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు
english title: 
panchayat elections

చేరని పాఠ్యపుస్తకాలు

$
0
0

విజయవాడ, జూన్ 6: నూతన విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా మరో ఆరు రోజుల్లో ఈనెల 12 తేదీ వేసవి సెలవులనంతరం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. అయితేనేమి కీలకమైన పాఠ్య పుస్తకాలు మాత్రం నేటికీ పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరలేదు. అసలు ప్రతి ఏటా కూడా పాఠ్య పుస్తకాల పంపిణీ ఒక ప్రహసనంలా సాగుతున్నది. ఒక్కోసారి త్రైమాసిక పరీక్షలమయం వరకూ కూడా పాఠ్యపుస్తకాలు అందని స్థితి ఏర్పడుతున్నది. మరోవైపు బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకై ప్రతి పాఠశాల స్థాయిలో పెద్దఎత్తున విద్యా సంబరాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఈనెల 13 తేదీ నాటికల్లా పాఠ్య పుస్తకాలన్నీ చేరాల్సి ఉన్నాయి. జిల్లాలో 1 నుంచి పదో తరగతి వరకు దాదాపు 3 లక్షల 25వే మంది పిల్లలకు 24 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా గత ఏడాది గోదాంలలో మిగిలిపోయిన రెండున్నర లక్షల పుస్తకాలతో కలుపుకుని ఇప్పటికి మొత్తం 10 లక్షల పుస్తకాలు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రోజుకు కనీసం 50వేల పుస్తకాలు డిపోలకు చేరుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా పాఠశాలల పునఃప్రారంభం నాటికి అత్యధిక పుస్తకాలు అందించగలమంటున్నారు. గత ఏడాది 3,6,7 తరగతుల పుస్తకాలు మారగా ఈ ఏడాది 4,5,8,9 తరగతుల పుస్తకాలు మారాయి. అయితే కొత్త పుస్తకాలు సకాలంలో అందేలా కన్పించడం లేదు. జిల్లాలో మొత్తం 3వేల 469 పాఠశాలలు ఉండగా వీటిల్లో ప్రాథమిక పాఠశాలలు 2వేల 484, యుపి స్కూల్స్ 527, హైస్కూల్స్ 48 ఉన్నాయి. ఇప్పటివరకు 3 తరగతి లెక్కలు, సైన్స్, 4 తరగతి లెక్కలు, ఐదో తరగతి తెలుగు, ఆరేడు తరగతులకు సంబంధించి హిందీ, ఇంగ్లీషు మినహా ఇతర పుస్తకాలన్నీ చేరాయి. 8,9 తరగతులకు సంబంధించి హిందీ, లెక్కలు, ఎన్‌ఎస్, సోషల్ పుస్తకాలు పదో తరగతికి మాత్రం ఒక్క హిందీ మినహా ఇతర పుస్తకాలన్నీ చేరాయి. కష్టపడి బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించినా పుస్తకాలు లేకుండా మేం ఏం చేయగలమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఉత్తీర్ణతా శాతం తగ్గితే అధికారులు తమను బలి పశువులను చేస్తున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వేసవి సెలవులకు ముందుగానే పాఠ్య పుస్తకాలు తెప్పించుకుని అప్పుడే సిలబస్ కూడా ప్రారంభించారు. దీనివల్ల అర్ధ సంవత్సరం పరీక్షల నాటికే సిలబస్ పూర్తిచేసి రెండోసారి ప్రారంభించడం లేదా ఆపై వచ్చే సంవత్సరం సిలబస్ ప్రారంభించడమో చేస్తున్నారు. ముఖ్యంగా తొమ్మిదో తరగతిలో, అర్ధ సంవత్సర పరీక్షలు ముగిసిన వెంటనే పదో తరగతి సిలబస్ ప్రారంభం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే అత్యధిక మార్కులు సంపాదించుకోగల్గుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లోనే బిఇడి, ఎంఇడి పూర్తిచేసిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటున్నారు. అయితే పాఠశాలలో సరైన వౌళిక సదుపాయాలు లేకపోవటం, సకాలంలో పాఠ్య పుస్తకాలు అందకపోవటం వంటి కారణాలతో త్వరితగతిన సిలబస్ పూర్తిచేయలేకపోతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల కోసం నకిలీ పాఠ్య పుస్తకాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ పుస్తకాలను స్కానింగ్ చేసి యధాతధంగా ముద్రించి అధిక రేట్లకు విక్రయం చేస్తున్నారు. దీనికి తగ్గట్లే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వీటిని ఆదరిస్తున్నారు.

సిసి కెమెరాలతో నేరాలు తగ్గుముఖం
హనుమాన్ జంక్షన్, జూన్ 6: పోలీసు శాఖ ఏర్పాటు చేస్తున్న సిసి కెమెరాలు వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమాజంలో నేరాలు తగ్గుముఖం పడుతున్నాయని కోస్తా రీజియన్ ఐజి ద్వారక తిరుమలరావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఐజి, డిఐజి విక్రమ్‌మాన్ సింగ్‌లు హనుమాన్ జంక్షన్‌లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా స్థానిక ట్రాఫిక్ ఆవుట్‌పోస్టులోని సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ సమాజంలో దోపిడి, దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయని, పెరుగుతున్న వైట్‌కాలర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. వైట్‌కాలర్ నేరాలపై పోలీసులకు సాంకేతికపరమైన శిక్షణ లేకపోవడంతో వాటిని నిరోధించడం సాధ్యం కావడంలేదని ఆంగీకరించారు. వైట్‌కాలర్ నేరాల నిరోధానికి పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లో నేరాల నిరోధానికి పరిధితో సంబంధం లేకుండా సిబ్బంది పనిచేయాలని సూచించారు. అవసరమైతే రెండు జిల్లాల అధికారులు కలిసి కమిటీగా ఏర్పడాలని అదేశించారు. విజయవాడ మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉందని వస్తున్న ప్రచారాన్ని తిరుమలరావు ఖండించారు. విశాఖపట్నం, ఖమ్మం ప్రాంతాల్లో నక్సలైట్ల కదిలికలు గుర్తించడంతో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, విజయవాడలో ఏటువంటి కదలికలు లేవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జె ప్రభాకర్, నూజివీడు డిఎస్‌పి ఎ శంకర్ రెడ్డి, నూజివీడు సిసిఎస్ సిఐ వి విజయరావు, జంక్షన్ సిఐ వైవి రమణ, ఎస్‌ఐ అబ్దుల్ సలాం తదితరులు ఉన్నారు.

జంక్షన్‌కు త్వరలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్
హనుమాన్ జంక్షన్ ట్రాఫిక్ నియంత్రణకు త్వరలో తగిన సిబ్బందితో కూడిన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని కోస్తా రీజియన్ ఐజి ద్వారకా తిరుమలరావుప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కూడలిలో కొద్దిసేపు వాహనాల రాకపోకలను పరిశీలించారు. జంక్షన్ సిఐ వైవి రమణ ప్రతిరోజు సిబ్బంది కొరతతో ఎదుర్కొంటున్న సమస్యలను ఐజికి వివరించారు. ప్రతినిత్యం వేలాది వాహనాలతో రద్దీగా వుండే హనుమాన్ జంక్షన్ కూడలిలో సరైన సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారుతోందని తెలిపారు. శాంతి భద్రతల కోసం కేటాయించిన సిబ్బంది సైతం ట్రాఫిక్ నియంత్రణ కోసం కేటాయిస్తున్నామని, అయినా ట్రాఫిక్ సమస్య పరిష్కరం కావడంలేదని అధికారులు తెలిపారు. రెండు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న హనుమాన్ జంక్షన్‌కు త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని ఐజి ప్రకటించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతోనైనా జంక్షన్ ట్రాఫిక్ కష్టాలు తిరుతాయా అని స్థానికులు అసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డిఎస్‌పి కార్యాలయం వద్ద
రైతుల ధర్నా
నందిగామ, జూన్ 6: వందలాది మంది రైతుల వద్ద నుండి మిర్చి కొనుగోలు చేసి సుమారు 2కోట్లకు పైగా టోకరా వేసి పరారైన మిర్చి వ్యాపారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత రైతులు గురువారం స్థానిక డిఎస్‌పి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనకు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నేతలు సయ్యద్ ఖాసిం, చుండూరు సుబ్బారావు తదితరులు మద్దతు తెలియజేశారు. బాధిత రైతులు కామేశ్వరరావు, ఏడుకొండలు, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు వ్యాపారి తమను ఏవిధంగా మోసం చేసిందీ వివరించారు. గతంలో ఒక విత్తనాల కంపెనీకి ప్రతినిధిగా పని చేసిన మండలంలోని చెరువుకొమ్ముపాలెంకు చెందిన ఇందూరి నాగిరెడ్డి నందిగామ పట్టణంలోని చేపల మార్కెట్ సమీపంలో ఐఎన్‌ఎన్‌ఆర్ మిర్చి బ్రాండ్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రైతులకు చైనా కంపెనీ విత్తనాలను విక్రయించడమే కాక 2వేల రూపాయలు డిపాజిట్ చేసుకొని రైతులకు బాండులు ఇచ్చాడు. అంతే కాకుండా మార్కెట్‌లో ఉన్న మిర్చి ధర కన్నా వెయ్యి రూపాయలు అధిక ధరతో రైతుల వద్ద నుండి మిర్చి కొనుగోలు చేసి కొంత నగదు ఇచ్చి మిగిలిన సొమ్ముకు చెక్కులు ఇచ్చాడు. రైతులకు సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా బాకీదారులకు ఇందూరి నాగిరెడ్డి అందుబాటులోకి రాకపోవడంతో బుధవారం రాత్రి నందిగామలోని కార్యాలయాన్ని ముట్టడించారు. పలువురు రైతులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పలువురు గురువారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు ధర్నా నిర్వహించి డిఎస్‌పి చిన హుస్సేన్‌ను కోరగా మొత్తం రైతులు అందరూ ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేవి వివరంగా పేర్కొంటూ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేయాలని, కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేస్తామని తెలియజేశారు. ఈ ధర్నాలో నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు తదితర మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

ఎంసెట్ ర్యాంకర్ నిఖిలేశ్వర్‌కు అభినందనలు
అవనిగడ్డ, జూన్ 6: అవనిగడ్డకు చెందిన కొండవీటి నిఖిలేశ్వర్ ఎంసెట్‌లో 113వ ర్యాంక్ సాధించి మెడిసిన్‌లో కార్డియాలజిస్ట్‌గా ప్రత్యేక కోర్సు తీసుకోనున్నట్లు తెలిపాడు. గురువారం ఆయన స్వగృహంలో నిఖిలేశ్వర్‌ని విలేఖర్లు కలవగా శిక్షణ పొందిన కారణంగానే తాను 113వ ర్యాంక్ సాధించగలిగానన్నారు. నిఖిలేశ్వర్ తల్లిదండ్రులు సాయిబాబు, భానురేఖ తమ కుమారుడిని అభినందిస్తూ మిఠాయిలు తినిపించారు.

యామిని ప్రియకు ‘మండలి’ అభినందనలు
అవనిగడ్డ, జూన్ 6: ఇటీవల అమెరికాలోని నాసా కేంద్రంలో అంతరిక్షానికి సంబంధించిన పత్రాల సమర్పణకు వెళ్ళిన మత్తి యామిని ప్రియను రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అభినందించారు. నూజివీడు ట్రిపుల్ ఐటిలో చదువుతున్న యామిని నాసాలో పరిశోధనల కోసం పత్రాలు తయారు చేసి సమర్పించారు.

పోలీసుల ఆదుపులో నకిలీ నక్సలైట్?
హనుమాన్ జంక్షన్, జూన్ 6: నక్సలైట్ల పేరుచెప్పి స్థానిక రైస్‌మిల్లర్ నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని హనుమాన్ జంక్షన్ పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. జంక్షన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. హనుమాన్ జంక్షన్‌కు చెందిన కొనకళ్ల వెంకటేశ్వరరావుకు పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం ఏపూరు గ్రామ పరిధిలో రైస్ మిల్లు వుంది. కొద్దిరోజుల క్రితం కొందరు వ్యక్తులువచ్చి వేంకటేశ్వరరావును తుపాకులతో బెదిరించడంతోపాటు, తాము నక్సలైట్లమని రెండు లక్షలు నగదు ఇవ్వకపోతే చంపేస్తామని చేప్పారు. దీంతో భయపడిన వేంకటేశ్వరరావు తన దగ్గర అంత డబ్బు లేదని 80వేలు ఇచ్చి మిగిలిన నగదు త్వరలో ఇస్తానని చెప్పడంతో వచ్చిన వ్యక్తులు వెళ్ళిపోయారు. రెండు రోజుల నుంచి మళ్ళి నగదు కావాలని ఫోన్లు చేయడంతో వేంకటేశ్వరరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆప్రమత్తమైన పోలీసులు గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా వుండగా గురువారం ఫోన్‌చేసిన గుర్తుతెలియని వ్యక్తులు డబ్బుతో స్థానిక నూజివీడు రోడ్‌లోని వైయస్‌ఆర్ కల్యాణ మండపం వద్దకు రావాలని సూచించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందజేసిన వేంకటేశ్వరరావు తన మిత్రులతో కలసి ఆ ప్రదేశానికి వెళ్ళారు. డబ్బు తీసుకొనేందుకు వచ్చిన వ్యక్తిని వేంకటేశ్వరరావు ఆయన మిత్రులు కలిసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో జంక్షన్ ఎస్‌ఐ అబ్దుల్ సలాం స్టేషనులో ఆ వ్యక్తిని విచారించారు. దీంతో ఆ వ్యక్తి వివరాలు వెల్లడించాడు. అతని పేరు మద్దలిమోహన్ అని విజయవాడలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని వివరించారు. గురువారం ఉదయం కొందరు వచ్చి హనుమాన్ జంక్షన్‌లో ఇంటి కడిగేందుకు తనను కారులో తీసుకువచ్చి వదలివెళ్ళినట్లు చెప్పాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి, బాధితుడు నుంచి వాంగ్మూలం రికార్టు చేసిన జంక్షన్ పోలీసులు సంఘటన స్థలం పెదపాడు పోలీసుస్టేషను పరిధిలో ఉండడంతో పెదపాడు పోలీసులకు అప్పగించారు.

పోలంపల్లి డ్యామ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
వత్సవాయి, జూన్ 6: పోలంపల్లి డ్యామ్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. మండలంలోని పోలంపల్లి ఆనకట్ట వద్ద గురువారం రాష్ట్ర, జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా కృష్ణా డెల్టా సిఇ సాంబయ్య, గోదావరి బేసిన్ కమిషనర్ ఇన్ మెకానికల్ విజయప్రకాష్‌లతో కలిసి డ్యామ్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యామ్‌కు ఇరువైపులా ఎర్పడిన గుంటలను, అసంపూర్తిగా ఉన్న కరకట్టను, పూర్తిస్థాయిలో ఇంత వరకూ నిర్మాణం చేయని డ్యామ్ పనులను పరిశీలించారు. అనంతరం వత్సవాయి, పెనుగంచిప్రోలు మండల రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఈ డ్యామ్‌ను గత తొమ్మిదేళ్లుగా నిర్మాణం చేస్తున్నారని, నేటి వరకూ నిర్మాణ పనులు పూర్తి కాలేదని, దీనికితోడు ఆయకట్టు రైతులకు నీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బ్రిటీష్ కాలం నాడు నిర్మించిన ఆనకట్టను పరిగణలోకి తీసుకొని నీటి సరఫరా చేయడం అత్యంత దౌర్భాగ్యమని రైతులు ఆరోపించారు. సిఇ సాంబయ్య మాట్లాడుతూ 2014 నాటికి గేట్ల నిర్మాణం పూర్తవుతుందని, 2015నాటికి పూర్తి స్థాయిలో డ్యామ్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కాంట్రాక్టర్ ఇబ్బందుల వల్ల పనులు వేగవంతం కాలేదని అన్నారు. ఈ లోపల పాత ఆనకట్ట పరిధిలో మేట తొలగించి నీటిని దిగువకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టకపోతే ఉద్యమం చేపడతామని అన్నారు. రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఎస్‌ఇ శారద, విజయవాడ సివిల్ ఎస్‌ఇ నరసింహమూర్తి, ఇఇ స్పెషల్ డివిజన్ యాదవ్, డిసి మెకానికల్ శ్రీ్ధర్ దేశ్‌పాండే, డిఇ సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటిబండ్ల వెంకట్రావు, మాజీ నీటి సంఘ అధ్యక్షుడు పాల్గొన్నారు.

డెల్టా ఆధునికీకరణ పనులపై ఎమ్మెల్యే దాస్ అసంతృప్తి
కూచిపూడి, జూన్ 6: మొవ్వ మండలం పెదపూడి శివారు భీమనది డ్రైన్‌పై రూ.80లక్షల డెల్టా ఆధునికీకరణ నిధులతో నిర్మించిన వంతెన బూడిదలో పోసినట్లైందని పామర్రు శాసనసభ్యులు డివై దాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం వంతెన నిర్మాణాన్ని డ్రైనేజీ ఎఇ విజయకుమార్‌తో కలిసి పరిశీలించిన ఆయన పలు లోపాలను గుర్తించి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో 214ఎ జాతీయ రహదారి కానున్న పామర్రు-అవనిగడ్డ ఆర్‌అండ్‌బి రహదారిలో గత ఏడాది ఏప్రిల్ 2వతేదీన శంకుస్థాపన చేసిన వంతెన నిర్మాణ సమయంలో వెడల్పును 10 మీటర్లుగా నిర్మించాలని, ఫిల్లర్లు ఏటవాలుగా నిర్మించాలని మొదటి నుండి హెచ్చరిస్తున్నా తన సూచనలను కాంట్రాక్టర్, వారి ఇంజనీరింగ్ బేఖాతరు చేసి తమ ఇష్టారాజ్యంగా నిర్మించటాన్ని ఆయన తప్పుపట్టారు. ఫలితంగా ఐనంపూడి నుండి దాదాపు ఎనిమిది గ్రామాల్లోని వరదనీరు వంతెన వద్ద నిలిచిపోయి ఎగువ భూములు ముంపుకు గురవుతాయన్నారు. వంతెన వెడల్పు 7.5మీటర్లకే పరిమితం చేయటంతో రహదారి విస్తరణలో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని, వర్షపు నీటి నిల్వ కారణంగా వంతెన కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. వంతెన నిర్మాణంలో ఏర్పడిన లోపాలు సరి చేయకపోతే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి బిల్లు చెల్లింపును నిలిపి వేయిస్తానని హెచ్చరించారు. అనంతరం కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో రూ.1.80లక్షలతో నిర్మిస్తున్న పక్కా డ్రైన్ నిర్మాణంలో వెలువడిన అవకతవకలను గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే డ్రైన్ నిర్మాణానికి ఆటంకం కలిగించే అడ్డంకులను ఎంతటివారైనా ఖాతరు చేయవద్దని ఆర్‌డబ్ల్యుయస్ అధికారులకు సూచించారు. పెదపూడి రైతులకు సాగునీరు సరఫరాకు ఆటంకం కలిగించే సైఫన్, పంట బోదె తవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మొవ్వ ఎఎంసి చైర్మన్ మండవ రత్నగిరిరావు, మాజీ చైర్మన్ చీకటిమర్ల శివరామప్రసాద్, ఆర్‌డబ్ల్యుయస్ డిఇ రామదాసు, ఎఇ సిహెచ్ సుబ్బారావు, పిఐడియు ప్రసాదరావు, డ్రైనేజీ ఎఇ విజయకుమార్, ఎండివో వై పిచ్చిరెడ్డి, కెడిసిసి డైరెక్టర్ కాకర్ల శివ కుమార్, మాజీ సర్పంచ్ వైకెడి ప్రసాదరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజులపాటి తారక బ్రహ్మానంద మస్తాన్, కూరపాటి కోటేశ్వరరావు, పిట్టు శ్రీనివాసరావు, హైదర్ అబ్బాస్ అలీ తదితరులు ఉన్నారు.

శాస్త్రోక్తంగా మన్యుసూక్త హోమం
మచిలీపట్నం , జూన్ 6: స్థానిక పరాసుపేట సువర్చలాసమేత ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం మన్యుసూక్త హోమం, మహాలక్ష్మి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్తేవి వెంకట సత్యనారాయణాచార్యులు బ్రహ్మత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముత్తేవి శేషభట్టార్, అర్చకులు అగ్నిహోత్రం వాసుదేవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కార్య నిర్వహణాధికారి ఎంవివి సత్యనారాయణ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా - 15మందికి గాయాలు
జగ్గయ్యపేట , జూన్ 6: జాతీయ రహదారిపై మండలంలోని గౌరవరం గ్రామ శివారులో గురువారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 15మంది ప్రయాణీకులు గాయపడ్డారు. హైదరాబాదు నుండి నర్సాపురం వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు గౌరవరం గ్రామం దాటిన తరువాత రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. డ్రైవర్ అలసత్వమే ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు ఆరోపించారు. బస్సులో మొత్తం 40మంది ప్రయాణీకులు ఉండగా నర్సాపురానికి చెందిన ధనలక్ష్మి, దుక్కిపట్ల గ్రామానికి చెందిన కె సూర్యనారాయణ, గుడివాడకు చెందిన జాస్తి అచ్చయ్య చౌదరికి తీవ్రగాయాలు అయ్యాయి. అలాగే సాకా సంపంగి, రామలక్ష్మితో పాటు మరో పది మంది స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను రెండు 108 అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిల్లకల్లు ఎస్‌ఐ ఇస్మాయిల్ ప్రమాద సంఘటనను సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దు
కలిదిండి, జూన్ 6: బడి ఒడిలో బడి ఈడు పిల్లలను చేర్పించడం నా ఉద్యోగ బాధ్యత అని ఎంఇఓ నరసయ్య అన్నారు. మండల పరిధిలోని అప్పారావుపేటలోని తనూజా పాఠశాల, కలిదిండిలో టెక్నో స్కూలుకు ప్రభుత్వ గుర్తింపు లేదని, గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించవద్దని కోరారు. విద్యా హక్కు చట్టం ద్వారా గుర్తింపు తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే 7వ తరగతి వరకు గుర్తింపు ఉన్న పాఠశాలల్లో 8, 9, 10 తరగతి విద్యార్థులను చేర్పించుకోవద్దన్నారు. విద్యా సంబరాల్లో భాగంగా గురువారం ఎస్‌ఆర్‌పి అగ్రహారం, పడమటిపాలెం, పరసావానిపాలెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల్లో ఆయా ప్రాంత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నిజాయతీతో పోలీసుశాఖకు మంచిపేరు తీసుకురావాలి
మచిలీపట్నం, జూన్ 6: నీతి, నిజాయతీలతో పనిచేసి పోలీసుశాఖకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని నార్త్ కోస్టల్ జోనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సిహెచ్ ద్వారకా తిరుమలరావు పోలీసు అధికారులకు సూచించారు. నార్త్ కోస్టల్ ఐజిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసిఆర్‌బి, స్పెషల్ బ్రాంచ్, క్లూస్, డిటిఆర్‌ఎస్, ఎఫ్‌పిబి తదితర విభాగాల పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిసిటిఎన్‌ఎస్ ప్రొగ్రామ్ ద్వారా అన్ని పోలీసు స్టేషన్‌లకు అనుసంధానించి ఇకమీదట పోలీసు సేవలు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా నైసర్గిక స్వరూపాన్ని సరిహద్దు జిల్లాలతో పంచుకుంటున్న సరిహద్దుల వద్ద తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డిఐజి విక్రమ్ సింగ్ మాన్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు, అడిషనల్ ఎస్‌పి బాజ్‌పాయ్, డియస్‌పిలు, సిఐలు పాల్గొన్నారు.

భూ పోరాటాలకు శ్రీకారం చుట్టిన చండ్ర
విజయవాడ, జూన్ 6: భూస్వామ్య, జమిందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా భూపోరాటాలకు శ్రీకారం చుట్టి లక్షలాది ఎకరాలను భూమిలేని నిరుపేద రైతులకు పంచిన చండ్ర రాజేశ్వరరావు చిరస్మరణీయులని నగర ప్రథమ మేయర్ టి. వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ సూర్యదేవర నాగేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ కొనియాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ప్రారంభ సందర్భంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం స్థానిక కంట్రోల్ రూం వద్దనున్న సిఆర్ విగ్రహం వద్ద సభ జరిగింది. తొలుత చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి సూర్యదేవర నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టి. వెంకటేశ్వరరావు, ఇండియన్ మెడికల్ రాష్ట్ర నాయకులు డా. రాంప్రసాద్, సిఆర్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా విశ్వశాంతి వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ నాయకులు శాంతి కపోతాలను ఎగురవేశారు. అనంతరం ప్రారంభమైన సభలో టి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత కుటుంబంలో జన్మించిన సిఆర్ అభ్యుదయ భావజాలంతో జీవిత చరమాంకం పీడిత తాడిత ప్రజలకు అండగా ఉద్యమించారన్నారు. జమిందారీ,
జగిర్ధారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిన సిఆర్ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన వీర తెలంగాణా సాయుధ పోరాటానికి నేతృత్వం వహించి 4వేల మందికి పైగా పోరాటయోధులను బలిదానమిచ్చారని కొనియాడారు. సూర్యదేవర నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాతగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన సిఆర్ సోవియట్ రష్యా ప్రభుత్వంచే ఆర్డర్ ఆఫ్ లెనిన్, జర్మన్ ప్రభుత్వంచే జార్జి డిమిట్రావ్ వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించబడ్డారని కొనియాడారు. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా దీర్ఘకాలం పాటు కొనసాగిన సిఆర్ ప్రజలకు అండగా అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించారని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన దోనేపూడి శంకర్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో జన్మించిన చండ్ర రాజేశ్వరరావు విజయవాడ నగరాన్ని కేంద్రంగా చేసుకుని నగరంలోని రౌడీ మూకలను అణిచివేశారన్నారు. నగరంలో కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక శైలితో ప్రజా ఉద్యమాలను చేపడుతూ ప్రజలతో మమేకమై పనిచేస్తుందని చెప్పారు. సిపిఐ నగర సమితి సభ్యులు వజ్జే మహేష్ వందన సమర్పణ చేసిన కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు జి. కోటేశ్వరరావు, పి. దుర్గ్భావాని, నగర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లా సూర్యారావు, వియ్యపు నాగేశ్వరరావు, నగర కార్యవర్గ సభ్యులు నవనీతం సాంబశివరావు, నూతక్కి సీతారామయ్య, డివి రమణబాబు, నగర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, మహిళా నాయకులు దుర్గాసి రవణమ్మ, జి. రాహేలమ్మ, తమ్మిన దుర్గ, సిరా లక్ష్మి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న అభయగోల్డ్ నిందితుల విచారణ
విజయవాడ , జూన్ 6: అభయగోల్డ్ వ్యవహారానికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో మరింత సమాచారం వెలుగుచూస్తోంది. బోర్డు తిప్పేసిన సంస్థ నిర్వహకులు అరెస్టుకు ముందే జాగ్రత్త పడి నగదు, బంగారం వంటివి సర్దేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టయి రిమాండులో ఉన్న ప్రధాన నిందితుడు మేనేజింగ్ డైరెక్టర్ కోకట్ల శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు బోర్డు డైరెక్టర్లు విజయరాజు, మహేష్‌లను కోర్టు ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీసులు తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రెండురోజులు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చినా మరో రోజు పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రస్తుతం నిందితులు పోలీసు కస్టడీలోనే కొనసాగుతున్నారు. ఏలూరు రోడ్డులోని అభయ గోల్డ్ గ్రూపు సంస్థలు కొద్దిరోజుల క్రితం ఖాతాదారులకు డబ్బు ఎగవేసి బోర్డు తిప్పేసిన సంగతి విదితమే. దీనిపై కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు ఎండి శ్రీనివాసరావు, అతని భార్య అంబిక, డైరెక్టర్లు మహేష్, విజయరాజులతోపాటు మరో 14మందితో కలిపి మొత్తం 16మందిని నిందితులుగా గుర్తించారు. అయితే వీరిలో ఇప్పటి వరకు శ్రీనివాసరావు, అంబిక, మహేష్, విజయరాజులను మాత్రమే అరెస్టు చేయడం జరిగింది. మిగిలిన నిందితుల జాబితా పోలీసుల వద్ద ఉన్నప్పటికీ ఆ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే జరిగితే కనుక పరారీలో ఉన్న నిందితులు పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తపడటంతోపాటు దొడ్డిదారిలో కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే వెస్ట్ ఏసిపి హరికృష్ణ నేతృత్వంలో కేసు ప్రాధమిక దర్యాప్తులో సుమారు 62వేల మంది సంస్థ ఖాతాదారులకు దాదాపు 37కోట్ల మేర తిరిగి చెల్లించాల్సి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా మూడు కోట్ల రూపాయలు విలువ చేసే భవనం, రాష్ట్రంలో పలు జిల్లాల్లో వివిధ చోట్ల వెయ్యికి పైగా ఎకరాల భూమిని గుర్తించి అందుకు సంబంధించి అసలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే రిమాండులో ఉన్న నిందితులను కస్టడీకి ఇస్తే మరింత సమాచారం సేకరిస్తామని కోర్టును కోరిన మీదట న్యాయస్థానం అనుమతి మేరకు రెండురోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు నిందితులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. గురువారంతో నిందితుల కస్టడీ ముగిసినందున తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే తమ విచారణ పూర్తి కాలేదని, కస్టడీ పొడిగించాలని పోలీసులు కోర్టును కోరగా మరోరోజు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. దీంతో గురువారం రాత్రి వరకూ విచారిస్తున్న పోలీసులు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇంట్లోనే అతని సమక్షంలో తిష్ట వేసి పలు పత్రాలు పరిశీలించడంతోపాటు వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇల్లు, పొలాల అదనపు డాక్యుమెంట్లుతోపాటు ఐదు కేజీల వెండి, రెండు లక్షలు నగదు గుర్తించారు. భారీ ఎత్తున బంగారం, నగదు మాత్రం వెలుగుచూడలేదని అధికారులు చెబుతున్నా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆది నుంచీ అభయగోల్డ్ దర్యాప్తులో రహస్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు పలు ఆరోపణలూ ఎదుర్కోవడం గమనార్హం. కాగా తాజాగా సంస్థలో ఏజెంటుగా పని చేసిన దుర్గాపురానికి చెందిన కణజం కనకలింగేశ్వరరావు అనే సైకిల్ మెకానిక్ ఫిర్యాదుపై సూర్యారావుపేట పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సంస్థ ఎండి మరో 11మందిపై ఈ కేసు నమోదైంది. తాను 11మంది నుంచి రెండు లక్షల వరకు కట్టించినట్లు లింగేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలావుండగా కస్టడీలో ఉన్న నిందితులను విచారిస్తున్న పోలీసులు శుక్రవారం సాయంత్రంలోగా తిరిగి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

భూములు ఇచ్చే ప్రసక్తే లేదు
విజయవాడ, జూన్ 6: పోలవరం కాలువల నిర్మాణం.. ఆ తర్వాత బైపాస్ రోడ్డు నిర్మాణం వంటి అభివృద్ధి పనుల పేరిట ఎంతో విలువైన భూములు కోల్పోయాం. తిరిగి హైటెన్షన్ వైర్ల టవర్ల కోసం భూములను ఇవ్వమంటే ఇచ్చేది లేదని నున్న, ఇబ్రహీంపట్నం, భవానీపురం రైతులు ఖరాఖండిగా చెప్పారు. నున్న నుంచి నెల్లూరు కృష్ణపట్నం వరకు హైటెన్షన్ లైన్ల నిర్మాణంకు అవసరమైన టవర్లను నెలకొల్పేందుకై జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ దాసరి హరిచందన గురువారం తుది విడతగా రైతులతో చర్చలు జరిపారు. భూసేకరణ చట్టాల ద్వారా బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఊరుకోబోమని కూడా తెగేసి చెప్పారు. స్థానిక మార్కెట్ ధరను బట్టి నష్టపరిహారం అందచేయాలని పలువురు రైతులు కోరారు.

పాలప్యాకెట్లకు వెళ్లిన మహిళ మెడలో బంగారం చోరీ
విజయవాడ (క్రైం), జూన్ 6: తెల్లవారుజామున పాలప్యాకెట్ కోసం వెళ్లిన మహిళ మెడలోని బంగారు నగలు గుర్తు తెలీని వ్యక్తులు దోచుకుని పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... సత్యనారాయణపురం జ్ఞానఓలు వారి వీధికి చెందిన వలివేటి ఝాన్సీలక్ష్మీ (42) అనే మహిళ గురువారం ఉదయం పాలప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయలుదేరి పాలప్యాకెట్ తీసుకుని తిరిగి ఇంటికి వస్తున్నారు. నాగంవారివీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న సమయంలో వెనుక నుంచి ఇద్దరు గుర్తు తెలీని వ్యక్తులు బైక్‌పై ఆమెను దాటుకుని ముందుకు వెళ్ళారు. మరలా తిరిగి ఎదురుగా వచ్చి ఆమెను సమీపించి మెడలోని ఏడు కాసుల బంగాను నానుతాడు, నల్లపూసల గొలుసు లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుల మతాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
పాయకాపురం, జూన్ 6: కుల,మత, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామంత్రి కొలుసు పార్ధసారధి కోరారు. పెనమలూరు మండలం పోరంకి గ్రామ పరిధిలోని నారాయణపురం కాలనీ నుండి ఎనికేపాడు ఎన్‌హెచ్ 5 వరకు 48లక్షల్తో నిర్మించనున్న తారురోడ్డు పనులకు గురువారం ఉదయం మంత్రి సారధి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే మంజూరు చేసిన నిధలతో చేపట్టే పనులు నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉంటాయన్నారు. విద్య, వాణిజ్యపరంగా విజయవాడ నగరం అభివృద్ధి చెందటంతో ఒకప్పుడు గ్రామ ప్రాంతమైన పెనమలూరు మండలం నేడు పట్టణ వాతావరణాన్ని తలపిస్తుందన్నారు. పాశ్చాత్యపోకడల వల్ల పట్టణ ప్రాంత ప్రజలలో ఐకమత్యం కొరవడి కుల, మత, వర్గ, రాజకీయాలకు నిలయమవుతున్నాయన్నారు. తద్వారా అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత ప్రజల మాదిరిగా పట్టణ ప్రాంత ప్రజలు ఐకమత్యంతో మెలిగి వారికి అవసరమైన వౌళిక వసతులు ఏర్పాటు చేసుకునేందుకు రాజకీయాలకు అతీతంగా సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకున్నప్పుడే ఆ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. నారాయణపురం కాలనీలో కమ్యూనిటీహాలు నిర్మాణానికి శాసన సభ్యుల నిధుల నుండి 15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కాలని ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను తీర్చేందుకు లైన్ల మరమ్మతు నిమిత్తం అవసరమైన 15 లక్షలను మంజూరు చేస్తున్నాననీ, వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. నారాయణపురం కాలని - నిడమానూరు రోడ్డు పక్కన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కాలనీవాసుల కోరిక మేరకు పార్క్ నిర్మాణానికి విజిటియం ఉడా నుండి అవసరమైన నిధులను మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. ప్రజల సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయడంలో వెనుకాడేది లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో నారాయణపురం కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తుమ్మల గోపాలకృష్ణ, కార్యదర్శి యం. ఆంధోనిరాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దామోదర్, స్థానిక పెద్దలు అల్లూరి సత్యనారాయణ, ఆచంట వెంకటరమణ, తహసిల్దార్ విజయ్‌కుమార్, అభివృద్ధి అధికారి జె.సునీత, పంచాయతీ రాజ్ డిఇ ఏడుకొండలు పాల్గొన్నారు.

నూతన విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా మరో ఆరు రోజుల్లో
english title: 
text books

వుడాకు నిస్సత్తువ!

$
0
0

విశాఖపట్నం, జూన్ 6: విశాఖ నగరాభివృద్ధి సంస్థకు నిస్సత్తువ ఆవహించింది. ఒకప్పుడు చాలా బిజీగా ఉండే అధికారులు ఇప్పుడు నిర్లిప్తంగా కనిపిస్తున్నారు. నాలుగైదేళ్ల కిందట కొత్త లే-అవుట్‌లు, భూముల వేలం వంటి వివిధ రకాల కార్యకలాపాలతో బిజీగా ఉండే ఇక్కడి ఐఎఎస్ అధికారులు, ఇప్పుడు ప్రతి విషయంలో ఆచితూచి అడుగేయాల్సి వస్తోంది. గతంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం నుంచి వీరికి సహాయ సహకారాలు అందడంతో పనులు వేగవంతం చేసేవారు. కానీ వుడాలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. వుడా సొంత ప్రాజెక్ట్‌లనే పూర్తి చేయలేని దుస్థితికి చేరుకుంది. గత ఏడాది వుడా చిల్డ్రన్ ఎరీనా, వైఎస్‌ఆర్ పార్క్ పనులు జరుగుతున్నాయి. అంతకు ముందు చేపట్టిన హరిత ప్రాజెక్ట్ ఇంకా బాలారిష్టాల్లోనే కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన జాప్యం వలన వుడాకు, లేదా లబ్దిదారులకు చేతి చమురు వదిలే పరిస్థితి కనిపిస్తోంది. సుమారు ఆరేళ్ళ కిందట ప్రారంభించిన రో హౌసింగ్‌లో కొన్ని గృహాలను వేలం వేస్తే, కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లోని కొన్ని గృహాల నిర్మాణం పూర్తి కాకపోవడం, అది ఇప్పటి వరకూ కొనసాగడంతో వీటికి అప్పట్లో పలికినంత ధర ఇప్పుడు పలికే అవకాశం లేకుండాపోయింది. వీటిని త్వరలోనే వేలం వేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.
ఇక వుడా వద్ద సుమారు 200 స్థలాలు ఉన్నాయి. వీటిని లే-అవుట్‌లుగా చేసి విక్రయించాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఈ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, లాటరీ పద్ధతిలో స్థలాలను కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు.
కుంభకోణమే పతనానికి కారణం!
ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన వుడా ఇప్పుడు ఇంత నిరాశాజనకంగా పనిచేయడానికి వుడాలో జరిగిన కుంభకోణమే కారణమని స్పష్టమవుతోంది. వుడాలో సుమారు 500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని గత వైస్ చైర్మన్ కోన శశిథర్ నివేదిక ప్రభుత్వానికి పంపించారు. దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. వుడా స్థలాలకు అంటే బ్రాండ్ నేమ్ ఉండేది. ఈ కుంభకోణంతో ఆ పేరు మసకబారింది. వుడా భూములు కొనుగోలు చేయడానికి కూడా కొంతమంది వెనకాడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో ప్రస్తుత విసి వుడా కార్యాలయాన్ని ప్రక్షాళన చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు తప్ప, కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టిపెట్టలేకపోతున్నారు. వుడాలో పనిచేస్తున్న సిబ్బంది సీట్లనైతే మార్చారు.. ఇందులో జరిగే అవినీతిని ఏమేరకు తగ్గించగలుగుతారో వేచి చూడాలి.
రాజకీయ వత్తిడులు
ఇదిలా ఉండగా వుడా అధికారులపై రాజకీయ వత్తిడులు తీవ్రంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వుడా పరిధి మూడు జిల్లాల వరకూ విస్తరించింది. ఈ మూడు జిల్లాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా, అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు మోకాలు అడ్డుపెడుతున్నట్టు తెలుస్తోంది. వారి మధ్య ఆధిపత్యపోరుతో వుడా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేకపోతున్నారని తెలుస్తోంది.
హాస్టళ్లపై అధికారుల దృష్టి
* మళ్లీ తెరుచుకోనున్న గ్రంథాలయాలు
* ప్రతి హాస్టల్‌కు ట్యూటర్లు
విశాఖపట్నం, జూన్ 6: సంక్షేమ హాస్టళ్ళంటే చిన్న చూపే అందరికీ. వీటిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అవి అక్కరకు రావడం లేదు. కానీ జిల్లా కలెక్టర్ శేషాద్రి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటి డైరక్టర్ శ్రీనివాసన్ తీసుకుంటున్న చర్యల వలన హాస్టళ్ళ రూపురేఖలు మారనున్నాయి. అంతేకాదు, ఇందులో చదువుతున్న విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దనున్నారు. జిల్లా కలెక్టర్ వంద రోజుల ప్రణాళికలో భాగంగా హాస్టళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న 79 హాస్టళ్ళను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు.
గత ఏడాది 1.2 కోట్ల రూపాయలతో హాస్టళ్ల మరమ్మతులు చేపట్టారు. మిగిలిన హాస్టళ్ళకు ఈ ఏడాది మరమ్మతులు కొనసాగించనున్నారు. హాస్టళ్ళలోని విద్యార్థులకు చాలా కాలం కిందట గ్రంథాల సదుపాయం ఉండేది. కానీ ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రంథాలయాల నిర్వహణ చేయలేక చేతులెత్తేశారు. గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలే కొనుగోలు చేయడం లేదు. గతంలో ఎప్పుడో కొనుగోలు చేసిన పుస్తకాలు కాస్తా చెదలు పట్టాయి. అలాగే విద్యార్థులకు అంతగా ఉపయోగం లేని పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి హాస్టళ్ళలోని గ్రంథాలయాలను పునరుద్ధరించనున్నారు. ఇందులో విద్యార్థుల ఆసక్తిగా చదివే కథల పుస్తకాలను ఉంచనున్నారు. అలాగే క్రీడా వస్తువులు కూడా కొనుగోలు చేయడానికి ఒక్కో హాస్టల్‌కు వెయ్యి రూపాయలు కేటాయిస్తున్నారు.
ఇక హాస్టళ్ళలో విద్యార్థుల విషయానికి వస్తే, పదవ తరగతికి వచ్చిన తరువాతే ఆయా హాస్టళ్ళలో వార్డెన్లు వారిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచడానికి హాస్టల్ వార్డెన్లపై వత్తిడి ఉండడం వలన మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి నివారించేందుకు మూడవ తరగతి నుంచే హాస్టల్ విద్యార్థులకు ట్యూటర్లను నియమిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో ఉత్తీర్ణతా శాతం తగ్గిపోవడం వలన చాలా మంది ప్రైవేటు స్కూళ్ళకు వెళ్లిపోతున్నారు. దీంతో కొన్ని చోట్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు హాస్టల్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. విద్యార్థులు చదివే స్కూళ్ళలో ఇచ్చిన హోంవర్క్‌లు సక్రమంగా పూర్తి చేస్తున్నారా? లేదా? సిలబస్ ఏవిధంగా జరుగుతోంది? అన్న విషయాలపై అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు. విద్యార్థులకు ముందుగా గైడ్స్ ఇస్తారు. పాఠ్య పుస్తకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటారు. 8,9,10వ తరగతి విద్యార్థులు ఉన్న హాస్టళ్ళకు నలుగురు చొప్పున ట్యూటర్లను నియమించనున్నారు. మిగిలిన హాస్టళ్ళకు ఇద్దరు చొప్పున ట్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

రైతు బజారులో కూరగాయలు కరవు
ఉదయం 11 గంటలకే స్టాల్స్ ఖాళీ
వినియోగదారులకు తప్పని అవస్థలు
గోపాలపట్నం, జూన్ 6 : రైతు బజార్లలో కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. ఉత్పత్తి తగ్గిపోవడంతో సరఫరా చాలా వరకూ నిలిచిపోయింది. గత నెల రోజుల క్రితం గోపాలపట్నం రైతు బజారుకు కాయగూరలు 650 క్వింటాళ్ల మేరకు సరఫరా కాగా గత రెండు రోజులుగా కేవలం 450 క్వింటాళ్ళు మాత్రమే సరఫరా కావడంతో రైతు బజారు 11 గంటలకే ఖాళీ అయిపోతుంది. ఈ రైతు బజారుకు పెందుర్తి, సబ్బవరం పాయకరావుపేట, అరకు, శొంఠ్యాం, పాడేరు, దుంబ్రిగుడ తదితర ప్రాంతాల నుండి కూరగాయలను రైతులు తీసుకొస్తారు.
నెలరోజుల్లో తేడా ఇలా
నెలరోజుల కింద క్యాబేజీ 50 క్వింటాళ్ళు సరఫరా జరిగితే ఇప్పుడు కేవలం 5 క్వింటాళ్ళు మాత్రమే సరఫరా జరుగుతోంది. టమాటా 50 క్వింటాళ్ళు సరఫరా అయ్యేది ఇప్పుడు కేవలం 25 క్వింటాళ్ళు మాత్రమే సరఫరా జరుగుతోంది. ఇక ఉల్లిపాయలు 50 క్వింటాళ్ల నుంచి 40 క్వింటాళ్ళకు తగ్గింది. బీన్స్ 11 క్వింటాళ్ళు సరఫరా జరిగితే ఇప్పుడు కేవలం ఒక క్వింటాకు మాత్రమే సరఫఱా జరుగుతోంది. మిర్చి 16 నుంచి 20 క్వింటాళ్ళు ఉండేది ఇప్పుడు 10 క్వింటాళ్ళు మాత్రమే జరుగుతోంది. అదే విధంగా బెండ, బంగాళ, ఇతర కూరగాయలు సరఫరా బాగా తగ్గిపోతుంది. ఆకుకూరలు అన్ని రకాల కల్సి 38 నుంచి 40 క్వింటాళ్ళు సరఫరా జరిగితే ఇప్పుడు కేవలం 15 క్వింటాళ్ళు మాత్రమే వస్తున్నాయి.
ప్రస్తుతం ధరలు
ఒక వైపు కూరగాయల సరఫరా తగ్గిపోవడంతో ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. రైతు బజారులో బీన్స్ కిలో 50 రూపాయలు కాగా. టమాటా 40 రూపాయలు, మిర్చి 40 రూపాయలు, క్యాబేజీ ఇరవై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. ఇక అల్లం కిలో రూ. 150 దాటింది. దొండ, బెండ, బీర, చిక్కుడు కాకర తదితర కూరగాయలు రైతు బజారుకు తెచ్చిన గంట, అరగంటలోనే అయిపోతున్నాయి. ఆకు కూరల విషయానికొస్తే కొత్తిమీర ధరని చూస్తే అర్ధమవుతోంది. కొత్త మీర కట్ట గతంలో రూపాయికి, రెండు రూపాయలకు దొరికేది. ఇప్పుడు ఏకంగా పది నుంచి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. పది రూపాయలకు తోటకూర కట్టలు 5, గోంగూర కట్టలు 4, పుదీన రెండు కట్టలు, మెంతికూర 3 కట్టలు చొప్పున విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా వర్షాలు పడి కూరగాయ పంటలు పండినంత వరకు ధరలు ఇలా బెంబేలెత్తిస్తాయని రైతులు అంటున్నారు. కాగా రైతు బజారులోనే పరిస్థితి ఇలా ఉంటే బహిరంగ మార్కెట్ ధరలు మరింత భయపెడ్తున్నాయని వినియోగదారులంటున్నారు.

టిక్కెట్ల ధరలు పెంపుపై దేవాదాయ వర్గాలతో చర్చిస్తా?
మంత్రి గంటా శ్రీనివాసరావు
సింహాచలం, జూన్ 6 : రాష్ట్రంలోని పలు దేవాలయాలలో పూజా టిక్కెట్ల ధరలు పెంపుపై దేవాదాయశాఖ మంత్రి అధికారులతో చర్చిస్తానని రాష్ట్ర ఓడరేవులు, వౌలిక వసతుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. గురువారం ఆయన సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టెక్కట్ల ధరలు పెంపుపై రాష్ట్రంలోని పలువురు స్వామీజీలు సింహగిరిపై చేసిన ధర్నా వ్యవహారంపై ఆరా తీశారు. ఈనేపథ్యంలో విలేఖరులడిగిన ప్రశ్నపై మంత్రి పై విధంగా స్పందించారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల ప్రణాళికను దేవస్థానం ఈవో రామచంద్రమోహన్, ఈ ఈ శ్రీనివాసరాజులు మంత్రికి వివరించారు. సుమారు 7 కోట్ల రూపాయల ఖర్చుతో కొండపై భక్తుల కోసం సత్రం నిర్మాణం చేయాలని ప్రతిపాదించినట్లు అధికారులు మంత్రికి చెప్పారు. 84 లక్షల రూపాలయలతో గజపతివర్మ పునర్నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు ఈవో తెలిపారు. సింహగిరి అంతా కాంక్రీట్ జంగిల్ చేసేయవద్దని పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. భక్తులకు వసతులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని మంత్రి సూచన చేశారు. భక్తుల కోసం తక్షణమే క్యాంటిన్ నిర్మాణం చేపట్టాలని భీమిలి ఎమ్మెల్యే ముత్తెంశెట్టి శ్రీనివాసరావు అధికారులకు చెప్పారు. గోసంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. అంతకు ముందు మం6తి సింహాచలేశుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈవో రామచం6దమోహన్ మంత్రికి అర్చక పరివారంతో కలిసి సంప్రదాయంగా స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. మంత్రితో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరా, 72 వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంట్ల కిరణ్‌బాబు, కర్రి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

పెరిగిన ఆర్టీసీ స్డూడెంట్ బస్ పాస్‌చార్జీలు
* అధికారుల నోట రోజుకో మాట
విశాఖపట్నం, జూన్ 6: స్టూడెంట్ బస్‌పాస్ చార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీలు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిపై ఆర్టీసీ ఇన్‌చార్జ్ రీజనల్ మేనేజర్ చౌదరి అధ్యక్షతన గురువారం రాత్రి అధికారులతో సమీక్ష జరిగింది. స్టూడెంట్ బస్‌పాస్ చార్జీలను ఒకేసారి కాకుండా స్వల్పంగానే పెంచినట్టు ప్రకటించారు. పెంచిన చార్జీలను రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
* భారీగా పెరిగిన చార్జీల్లో మళ్ళీ మార్పులు తీసుకువచ్చిన యాజమాన్యం పాత చార్జీలకు స్వల్పంగా భారాన్ని వేసింది. మూడు మాసాల బస్‌పాస్ చార్జీలు ఇంతవరకు నాలుగు కిలోమీటర్ల పరిధిలో రూ.85లున్న చార్జీలుండగా దీనిని రూ.130కి పెంచింది. దీనిని రూ.315లకు పెంచుతూ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే అనుమతించకపోవడంతో ఉపసంహరించుకున్న ఆర్టీసీ యాజమాన్యం తాజాగా రూ.130ని నిర్ణయించింది. అలాగే ఎనిమిది కిలోమీటర్లకు సంబంధించి మూడు మాసాలకు రూ.105లుండగా దీనిని స్వల్పంగా పెంచినట్టు సంబంధితాధికారి తెలిపా. 12 కిలోమీటర్ల పరిధిలో రూ.130లు, 18కిలోమీటర్ల పరిధిలో రూ.150లు, 22 కిలోమీటర్ల వరకు రూ.175లు ఉన్న మూడు మాసాల బస్‌పాస్ చార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్టు తెలిపింది. అలాగే విశాఖ నగరంలో జనరల్ స్టూడెంట్ బస్‌పాస్ (మూడు మాసాలు) రూ.240లుండగా దీనిని రూ.390లకు పెంచాలని సంస్థ నిర్ణయించింది.
* గ్రామీణ ప్రాంతాల్లో
జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ స్టూడెంట్ బస్‌పాస్ చార్జీలను స్వల్పంగా పెంచింది. అయిదు కిలోమీటర్ల మేర రూ.55, అదే పది కిలోమీటర్లకు రూ.75లు, 15కిలోమీటర్లకుగాను రూ.90, 20కిలోమీటర్ల వరకు రూ.120లు, 25కిలోమీటర్ల పరిధిలో రూ.150లు, 30కిలోమీటర్ల వరకు రూ.165లు, 35కిలోమీటర్ల మేర 180వరకు బస్‌పాస్ చార్జీలు కొనసాగుతున్నాయి. అయితే వీటిని భారీగా పెంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన సంస్థకు స్వల్పంగానే పెంచాలనే ఆదేశాలొచ్చాయి. దీంతో పెంచిన చార్జీలను ఉపసంహరించుకుని స్వల్పంగా పెంచుతున్న చార్జీలనే అమలు చేయాలని నిర్ణయించింది. వీటిని కూడా ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
1997 తర్వాత ఇదే పెరుగుదల
1997వ సంవత్సరం దాటిన నుంచి ఇంతవరకు స్టూడెంట్ బస్‌పాస్‌ల చార్జీలు పెరగలేదు. ఇపుడు కూడా స్వల్పంగానే పెంచినట్టు సంస్థ తెలిపింది. ఎటువంటి భారం మోపకూడదని, మధ్యతరగతి, పేద విద్యార్థులను ఇబ్బంది పెట్టుకూడదనే ఉద్దేశ్యంతో యాజమాన్యం స్వల్పచార్జీలనే అమలు చేయాలని నిర్ణయించినట్టు అధికారి ఒకరు తెలిపారు.

విద్యుత్ పొదుపుతోనే సామర్ధ్యం పెంపు
* సౌరశక్తిపైనే ప్రత్యేక దృష్టి
విశాఖపట్నం, జూన్ 6: రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ అవసరాల కోసం సోలార్ ప్రాజెక్ట్ తప్పనిసరి కానుంది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ప్రభుత్వరంగ సంస్థలన్నీ ఈ రోజు సోలార్ ప్రాజెక్ట్‌ల వైపే దృష్టిసారిస్తోంది. ఈ ప్రాజెక్టును నెలకొల్పినపుడే తప్ప అక్కడ నుంచి మరెపుడూ పెట్టుబడి పెట్టే అవసరం ఉండకపోగా, అవసరమైన విద్యుత్‌ను నిరంతం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందువలనే దీనిని ఎలాగైనా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిలోభాగంగా ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలో సోలార్ పవర్‌ను అందుబాటులో తీసుకురావడం, అంతవరకు విద్యుత్ సామార్ధ్యాన్ని పెంచుకోవడం, పొదుపు అంశాలను పాటించడం వంటి అంశాలను పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఎస్‌ఇసిఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మెంబర్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. దీంతో ఆయన గురువారం విశాఖ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం విద్యుత్ పొదుపు, భవిష్యత్‌లో పెరిగే డిమాండ్, సంస్థ వాడకం తదితర కీలక అంశాలపై ఆయన చర్చించారు. సహజ వాయువు, బొగ్గును రక్షించుకుంటూనే విద్యుత్ అవసరాలకనుగుణంగా దీని సామర్ధ్యాన్ని పెంచుకోవాలన్నది ప్రధాన లక్ష్యంగా ఆయన పేర్కొన్నా. దీని కోసం కార్యాచరణ రూపొందించాలని కూడా సూచించారు. విద్యుత్ వృధాను తగ్గించడం, ఇందుకోసం విద్యుత్ సామర్థ్యం, విద్యుత్ పొదుపు (ఇఇ అండ్ ఇసి) ప్రమాణాలను పాటించడం, ఇందులో కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలు మునిపాలిటీ, వుడా, వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్‌శాఖ, పరిశ్రమలు భాగస్వామ్యం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల దాదాపు 15వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు చేయవచ్చని ఎనర్జీ కన్జర్వేషన్ కమిటీ అంచనా వేస్తుంది. అలాగే ఆయా ప్రభుత్వ సంస్థలకు వీటిపై బోదించి, తద్వారా మార్పు తీసుకురావలనే లక్ష్యంతో కార్యచరణ రూపొందించనుంది. దీనిలోభాగంగా జిల్లా ఎనర్జీ కనె్వర్వేషన్ కమిటీ, జిల్లా కలెక్టర్‌తో సమావేశమై శుక్రవారం ఆయన తగిన సూచనలు చేయనున్నారు. ఆ తరువాత కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. తొలిదశలో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, రాజమండ్రి, తిరుపతి, కడప, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లకు వాడే విద్యుత్‌పై దృష్టిపెట్టనున్నారు. దీనిపై నాల్గవ ఉన్నత స్థాయి ఎస్‌ఇసిఎం సమావేశం ఈనెల 15వ తేదీన మధ్యాహ్నాం 2.30 గంటలకు సెక్రటేరియట్‌లో జరుగుతుంది. దీనిలో వేర్వేరు విద్యుత్ పొదుపు కార్యక్రమాలపైన, సోలార్ పవర్‌పై చర్చిస్తారు. ========

దేవస్థానంలో ఒక ఉద్యోగి సస్పెన్సన్
* మరో ఉద్యోగికి చార్జి మెమో
సింహాచలం, జూన్ 6: విధి నిర్వహణలోనున్న అర్చకులపై అనుచిత వ్యాఖ్యాలు చేసిన నాల్గవ తరగతి ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఇవో రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ఏఇఓపై అనుచితంగా ప్రవర్తించిన మరో ఉద్యోగికి చార్జ్ మెమో ఇచ్చారు. ఉద్యోగులు క్రమశిక్షణగా విధులు నిర్వహించకపోతే చర్యలు తప్పవని ఇవో హెచ్చరించారు.

శంకర్ ఫౌండేషన్‌ను సందర్శించిన శివస్వామి
విశాఖపట్నం, జూన్ 6: విశాఖపట్నం వేపగుంట సమీపాన ప్రత్యేకంగా నెలకొల్పిన శంకర్ ఫౌండేషన్‌ను శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్ర పీఠాధిపతి, విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బ్రహ్మచారి శివస్వామి గురువారం సందర్శించారు. ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆత్మకూరి శంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిలావళలర్పించారు. అనంతరం శంకర్ ఫౌండేషన్‌లో గల వివిధ విభాగాలను పరిశీలించారు. శంకర్ ఫౌండేషన్ పనిచేస్తున్న తీరును నిరుపేదలకు, గ్రామీణ ప్రాంతవాసులకు ఉచితంగా చేపడుతున్న కంటి శస్తచ్రికిత్సల సేవా కార్యక్రమాలను సంస్థ హెచ్‌పిసి వి.రమేష్‌కుమార్ స్వామిజీకి వివరించారు. అనంతరం శివస్వామి ప్రసంగిస్తూ నిస్వార్ధంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు నిదర్శనంగా శంకర్ ఫౌండేషన్ రూపుదిద్దుకోవడం ప్రశంసనీయమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఆదర్శంగా శంకర్ ఫౌండేషన్ నిలుస్తుందన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్లు,సిబ్బందికి ఆశీస్సులు అందజేశారు. శంకర్ ఫౌండేషన్‌ను సందర్శించిన వారిలో క్షేత్రం ప్రతినిధి చంద్రశేఖర కవి, ఆథ్యాత్మికవేత్త ఎమ్‌వి రాజశేఖర్, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వివిధ ఆశ్రమాల ప్రతినిధులు, శంకర్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహాకులు సిఇఓ ఆనంద్‌సుదన్, కె.రామారావు తదితరులు పాల్గొన్నారు. స్వామిజీ శివస్వామికి పూలమాలతో స్వాగతం పలికి ఫౌండేషన్‌ను సందర్శించినందుకు సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఆపండి
* ఆర్డీవోను ఆదేశించిన జెసి ప్రవీణ్‌కుమార్

సబ్బవరం, జూన్ 6: సబ్బవరం,ఇరువాడ పంచాయతీల్లోని విలువైన ప్రభుత్వ బంజరుభూముల అన్యాక్రాంతంపై జిల్లాకలెక్టర్ వి.శేషాద్రి కొరడా ఝళిపించారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాలతో జిల్లాజాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ గురువారం దర్యాప్తుప్రారంభించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు విశాఖ ఆర్డీవో రంగయ్య,ఎడి సర్వేకుమార్, ఎల్‌పి ఎస్‌పిడి ఎస్.వెంకటేశ్వరరావు,ట్రైనీ కలెక్టర్ మురళీతో కలిసి ఆయన ముందుగా ఇక్కడి తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.ఇరువాడ గ్రామ పంచాయతీ పరిధిలోని 142/2లోని ప్రభుత్వ బంజరుభూమికి సంబంధించిన వివరాలు,సబ్బవరం సర్వేనెంబర్ 271లోని 5 సబ్‌డివిజిన్లలోని రికార్డు దాఖలా వివరాలను క్షణ్ణంగా పరిశీలించారు. గతంలో పనిచేసిన తహశీల్దార్లు,ఎంఆర్‌వోలు ప్రభుత్వ బంజరు భూములను దారాదత్తం చేసిన వివరాలను సైతం తెలుసుకన్నారు. అప్పటికే సాయంత్రం 6.30 గంటలు సమయం కావటంతో విలేఖర్లకు సైతం ఇంటర్యూ నిరాకరించిన జాయింట్ కలెక్టర్ మసక మసక చీకట్లోనే సబ్బవరంలో ఆక్రమణలకు గురయిన సర్వే నెంబర్ 271లోని అక్రమ కట్టడాలను అసకపల్లి సర్వేనెంబర్-1లోని కొండ గుట్టపై ఆక్రమణలను పరిశీలించారు.అయితే ఈమొత్తం బంజరుభూమిలో 5ఎకరాలు సామాజిక అడవులకు చెందిన మదర్ నర్సరీకి కేటాయించినట్లు ఆర్డీవో రంగయ్య తెలిపారు. మిగిలిన భూమి ఐదు సబ్‌డివిజన్లలో విస్తరించి ఉందని తెలిపారు.అందులోకొంత మందికి ఎస్సీ,బిసి కాలనీలు మంజూరు చేసినట్లు రికార్డుల ప్రాప్తికి వివరించారు. అయితే 271లోని భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం వాగు ఫోరంబోకగా పేర్గొని ఉన్నట్లు ఆర్డీవోతెలిపారు. దీంతో కోర్టుకేసుల్లో కౌంటర్‌ను మార్చిగెడ్డ్ఫోరంబోకగానే చూపించాలని జెసి ఆదేశించారు. అంతేకాకుండా సబ్బవరం సర్వేనెంబర్‌లోని మొత్తం 88.02 ఎకరాల విస్తీర్ణం మొత్తాన్ని సమగ్రమైన సర్వే చేసి విలువైన భూమి చుట్టూకంచె నిర్మించాలన్నారు.సర్వెనెంబర్ 271/2లో దెడ్డం ప్రసాద్ ఆక్రమించాడని అధికారులు తెలిపారు. దీంతో అధికారుల బోర్డులు సైతం తొలగిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఆక్రమణలు తొలగించే సమయంలో అధికారులను అడ్డుకున్న వారిని ఉపేక్షించేది లేదని వారికి రక్షణగా ప్రత్యేక పోలీసు బలగాలతోపాటు ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ను తమకు కేటాయించాలని జిల్లాఎస్‌పి శ్రీనివాస్‌ను జాయింట్ కలెక్టర్ కోరారు. సబ్బవరం విఆర్‌వో కృష్ణకుమార్ పర్యవేక్షణ సరిగాలేదని గుర్తించిన జెసి ఇక్కడ పర్మినెంట్ విఆర్‌వోను నియమించాలని ఆదేశిస్తూ ఆ విఆర్‌వోప్రత్యేకించి సర్వేనెంబర్ 271 భూమికి పర్యవేక్షణాధికారిగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రమైన సర్వేపూర్తయ్యేవరకు ఆర్డీవో ప్రతీ రోజూ పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో కొందరు ఆక్రమణ దారులు తమ వద్ద పట్టాలున్నాయంటూ జెసికి చూపించటంతో వాటిని రికార్డుల్లో ఇన్‌కార్పోరేట్ అయ్యాయో లేదో చూడాలని తహశీల్దార్ నాగభూషణాన్ని ఆదేశించారు. దీంతో ఆర్డీవో రంగయ్య కల్పించుకుని వారి వద్ద 2001లోజారీచేసినట్లు చెబుతున్న ఎల్‌పిసిలున్నాయని అప్పటికి ఇందిరమ్మపధకం లేదన్నారు. ఇంటి పట్టాపొందిన లబ్ధిదారుడు 6నెలల లోపు గృహం నిర్మించకుంటే అది చెల్లుబాటు కాదన్నారు. ఈనేపధ్యంలో ఇక్కడి ఆక్రమణలకు ముఖ్యకారణం విద్యుత్ శాఖ అధికారులు మీటర్లు మంజూరు చేయటం పంచాయతీ కార్యదర్శులు పన్నులు వేయటం లాంటి తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయంటూ కొందరు జెసి దృష్టికి తీసుకురావటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ బంజరుభూములకు వారి అజమాయిషీ ఏమిటని ప్రశ్నిస్తూవారికికూడ నోటీసులు జారీచేయాలని ఆర్డీవోను కోరారు. ఈపర్యటనలోజెసితోపాటు ఆర్డీవోరంగయ్య,ఎడి సర్వేకుమార్,ట్రైనీ కలెక్టర్ మురళీ,ఎల్‌పి ఎస్‌డిసి వెంకటేశ్వరరావు,తహశీల్దార్ నాగభూషణరావు,ఆర్‌ఐ రమేష్ పాల్గొన్నారు.

‘లైఫ్‌లో లవ్’ సినిమా షూటింగ్ సందడి
చోడవరం, జూన్ 6: మాతా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న లైఫ్‌లో లవ్ అనే చిత్రం షూటింగ్ రెండవ షెడ్యూల్ చోడవరం సంతోష్ షాపింగ్ మాల్‌లో గురువారం జరిగింది. హీరోహీరోయిన్లు కలసి వస్తద్రుకాణంలో షాపింగ్ చేసేందుకు వచ్చిన దృశ్యాన్ని చిత్రీకరించారు. డైరెక్టర్ ప్రేమ్‌తేజ్ దర్శకత్వంలో కెమెరామేన్ బండి చక్రపాణి ఆయా సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో హీరో విశాఖకు చెందిన సాయిసంతోష్ కాగా, హీరోయిన్ స్థానికురాలే కావడం వలన పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో యువకులు తరలివచ్చి షూటింగ్‌ను తిలకించారు. స్థానిక సుధా బ్యూటీక్లీనిక్‌కు చెందిన యజమాని కె.సుదీర్, సుధ దంపతుల రెండవ కుమార్తె హనీ(మేఘనాగుప్తా) సినిమాలో పేరు సుమశ్రీ నటిస్తున్నారు. ఈ చిత్రంలో కమెడియన్లుగా కళ్లుచిదంబరం, కొండవలస లక్ష్మణరావు, ప్రసన్నకుమార్, అంబికా శ్రీను నటిస్తున్నారు.
ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో డైరెక్టర్ ప్రేమ్‌తేజ్ మాట్లాడుతూ గ్రామీణ నేపధ్యంలో అందమైన ప్రేమకథా చిత్రంగా యువతకు మంచి సందేశాన్నిచ్చే చిత్రాన్ని అందిస్తున్నామన్నారు. చిత్రం రెండవ షెడ్యూల్ కొద్దిరోజుల్లో పూర్తిచేసుకుని నెలరోజుల్లోగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సిఉండగా కొందరు ప్రముఖ నటులకు కాల్షీట్లు అధికంగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమైందని అన్నారు.
సబ్ ప్లాన్ నిధులలో గిరిజన విద్యకు పెద్దపీట
గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు
పాడేరు, జూన్ 6: గిరిజన ప్రాంతాలలో విద్యాభివృద్ధికి ఎస్.టి. సబ్ ప్లాన్ నిధుల నుంచి 78 శాతం వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. విశాఖ మన్యంలో విద్యా ప్రమాణాల పెంపుకు చేపడుతున్న చర్యలపై స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులు, పాఠశాలలు, కళాశాలల ప్రదానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌తో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధి గతంలో కంటే మెరుగుపడినప్పటికీ ఇంకా ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. గిరిజన విద్యకు ఇంతవరకు అత్యధిక శాతం నిధులను వెచ్చించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీలో పనిచేస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు అంకితబావంతో విధులను నిర్వర్తించకపోవడం వలనే సర్కారు లక్ష్యం దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారంతా గిరిజనులే అయినప్పటికీ గిరిజన విద్యాభివృద్ధికి అంకితబావం కనబరచకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో అక్షరాస్యత శాతం అతి తక్కువగా ఉందని, దీనిని అధిగమిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పాఠశాలల నుంచి మధ్యలో బడిమానివేసిన విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని ఆయన చెప్పారు. ప్రతి పాఠశాలలో 3 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న బాలికలను ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన ఆదేశించారు. గత నాలుగు సంవత్సరాలలో గురుకుల, ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుతో పాటు విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ కొరకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించినట్టు ఆయన తెలిపారు. ఏజెన్సీలోని ప్రతి మండల కేంద్రంలో 15 లక్షల రూపాయల వ్యయంతో సహాయ గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయ భవనాలను నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. పాడేరు ఐ.టి.డి.ఎ.లో అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా కాంప్లెక్స్‌ను నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా ముద్రించిన విద్యా సంబరాల వాల్‌పోస్టర్లను ఈ సందర్భంగా బాలరాజు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వై.నరసింహరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.గణపతిరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.మల్లిఖార్జునరెడ్డి, ఏజెన్సీలోని అన్ని మండలాల గిరిజన సంక్షేమ సహాయ అధికారులు, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రదానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు మోకాలడ్డితే ఉపేక్షించేది లేదు
*మంత్రి బాలరాజు హెచ్చరిక
పాడేరు, జూన్ 6: ప్రభుత్వం విడుదల చేస్తున్న అభివృద్ధి పనుల నిధులు సకాలంలో వినియోగించక ప్రభుత్వానికి చెడ్డపేరు తమ నిర్లక్ష్యం కారణంగానే వస్తుందని మండల ప్రత్యేక అధికారులపై గిరిజన సంక్షేమ శాఖమంత్రి పసుపులేటి బాలరాజు మండిపడ్డారు. స్ధానిక ఐ.టి.డి.ఎ.సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక అధికారుల సమావేశంలో ఆయన ప్రత్యేక అధికారుల తీరుపై తీవ్రంగా స్పందించారు. గిరిజన ప్రాంతంలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరించకపోగా అభివృద్ధికి మోకాలడ్డుతూ సకాలంలో పనులు జరగకుండా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో సాగుతున్న అభివృద్ధి పనులపై పూర్తి స్ధాయిలో దృష్టి సారించి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంతో పాటు అనేక అభివృద్ధి పనులకు ప్రత్యేక అధికారులు చెల్లింపులు జరపాల్సి ఉండగా గ్రామస్ధాయిలో నియమించబడే వ్యక్తికి చెల్లింపులపై అనేక ఆంక్షలు విధించడంతో పాటు బ్యాంక్‌ల నందు అందించాల్సిన సమాచారం అందించకపోవడంతో పాటు తమ గుర్తింపు కార్డులు అందించకపోవడం వంటి పలు సమస్యలు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని వెంటనే వాటిని సరిదిద్దుకోవాలని ఆయన చెప్పారు. ప్రత్యేక అధికారులు అభివృద్ధికి సహకరించే విధంగా వ్యవహరించక తమదే అధికారం అన్న చందంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న వారికి ఇబ్బందులు కలుగజేయకుండా వారికి సహకరించాల్సిందిగా ఆయన కోరారు. బిల్లుల చెల్లింపులు ఇతర అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడానికి ప్రత్యేక అధికారులు కారణం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయని, పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం గిరిజన ప్రాంతానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తూ గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు చేపడుతుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విదంగా వ్యవహరిస్తున్న ప్రత్యేక అధికారులు తమ తీరు మార్చుకోవాలని హితవుపలికారు. ఇకపై ప్రత్యేక అధికారుల కారణంగా ప్రగతికి అవరోదం ఏర్పడుతున్నట్టు తనకు ఫిర్యాదులు అందితే శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించనున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. అదే విదంగా రానున్న కాలంలో గిరిజనులకు విత్తనాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుని ముందస్తుగా విత్తనాలను సమకూర్చుకోవడంతో పాటు గిరిజనులకు సరఫరా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మండల స్ధాయిలో జరుగుతున్న సానిటేషన్ , కరెంట్, తాగునీటి సమస్యలు పరిష్కారం, వైద్య సేవలు, ఐ.కె.పి., జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనుల్లో దృష్టి సారించాలని మంత్రి బాలరాజు కోరారు. ఈ కార్యక్రమంలో పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.గణపతిరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.మల్లిఖార్జునరెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్లు బి.అప్పలనాయుడు, ఎం.ఆర్.జి.నాయుడు పాల్గొన్నారు.

వై ఎస్ ఆర్ వుడా సెంట్రల్ పార్కులో ప్లానిటోరియం
మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, జూన్ 6 : మహా విశాఖ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించనున్న డాక్టర్ వై ఎస్ ఆర్ వుడా సెంట్రల్ పార్కులో మిని ప్లానిటోరియంను ఏర్పాటు చేసే ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పెట్టుబడులు, వౌలిక సదుపాయాల శాఖ మాత్యులు గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. గురువారం ఉదయం పార్కు పరిధిలో అభివృద్ధి చేసిన వెలుపలి నడక దారి ( ఎక్స్‌టర్నల్ జాగింగ్ ట్రాక్)ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై ఎస్ ఆర్ పార్కును ఆహ్లాదకర కేంద్రంగానే కాకుండా విజ్ఞానదాయక సందర్శన స్థలంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పార్కు ఆవరణలో ప్లానిటోరియం ఏర్పాటు ప్రతిపాదిస్తున్నామన్నారు. నక్షత్రశాల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక అధ్యయనాన్ని వుడా చేపడుతుందన్నారు. వై ఎస్ ఆర్ వుడా సెంట్రల్ పార్కును బహుళ ప్రయోజన కేంద్రంగా నగరవాసులకు అంకిత చేసేందుకు వుడా ప్రణాళికల ఉ చేపట్టిందని పేర్కొంటూ పార్కు పరిధిలో ఒక్కొక్కటిగా సౌకర్యాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. సుమారు 35 కిలోమీటర్ల పొడవున్న ఎక్స్‌టర్నల్ జాగింగ్ ట్రాక్ పొడవునా 720 చెట్ల పెంపకంతో పాటు పార్కు అంతటా 2వేలకు పైగా మొక్కల్ని నాటేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ రూ. 35 కోట్ల వ్యయంతో చేపట్టిన పార్కులో ఇప్పటికే 10 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని తెలిపారు. కైలాసగిరి కొండ దిగువన వుడా అభివృద్ధి చేసిన హెల్త్ ఎరినాను కూడా నెలరోజుల్లోగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ఈనెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నగర పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున వుడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా ఆరోజు నిర్వహించేందుకు సమాలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ వుడా విసి డాక్టర్ మనోజ్, చిఫ్ ఇంజనీర్ ఐ.విశ్వనాథరావు, కార్యదర్శి డాక్టర్ జెసి కిషోర్‌కుమార్, డి ఎఫ్ ఒ డాక్టర్ ఎస్.రెహ్మాన్, ఎస్టేట్ అధికారి బి.భవానీదాస్, ఫారెస్టు రేంజ్ అధికారి రమేస్, ప్రజాస్పందన అధ్యక్షులు సి. ఎస్.రావు, పేడాడ రమణకుమారి, విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి.రాజపాత్రుడు, కార్యదర్శి ఆర్.రామారావు తదితరులు పాల్గొన్నారు.

* కొత్త ప్రాజెక్ట్‌లపై నిరాసక్తత * రాజకీయ వత్తిడులే కారణమా?
english title: 
vuda

రాజకీయ సందడి!

$
0
0

విజయనగరం, జూన్ 6: త్వరలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. ఓ పక్క అధికారులు పంచాయతి ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తుంటే మరోపక్క రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ దఫా ఎన్నికలను 2011 జనాభా ప్రాతిపథికన ఎన్నికలు నిర్వహించడంతో జిల్లాలో కేవలం 14 వార్డులు మాత్రమే పెరిగాయి. అయితే ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ కేటాయించాలనే దానిపై తర్జనభర్జన జరుగుతుంది. ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు మొత్తం ఎన్ని కేటాయించాలనే దానిపై గ్రీన్ సిగ్నల్ లభించగానే మిగిలిన తంతు ముగిసే విధంగా జాబితాలను సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ అయినా ఏ కేటగిరీకి ఎన్ని పంచాయతీలు కేటాయించాలన్న దానిపై మరింత స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. .2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయతీల్లో 18,76,676 మంది జనాభా కాగా, 2011 నాటికి 19,17,089గా ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వలసలు పెరగడం, ఇతర కారణాల వల్ల కొన్ని పంచాయతీల్లో వార్డుల సంఖ్య తగ్గాయి. మరికొన్ని చోట్ల వార్డుల సంఖ్య పెరిగింది. కాగా, గత పదేళ్ల వ్యవధిలో కేవలం 14 కొత్త వార్డులు ఏర్పాటు కావడం గమనార్హం. ఇటీవల నగర పంచాయతీగా ఏర్పడిన నెల్లిమర్లలో జర్జాపుపేట, గతంలో విజయనగరం మున్సిపాలిటీలో అయ్యన్నపేట, కనపాక, ధర్మపురి, గాజులరేగ పంచాయతీలు విలీనమయ్యాయి. పార్వతీపురం మున్సిపాలిటీలో ఇటీవల నవిరి పంచాయతీ చేరడంతో వార్డులు కేవలం 14 మాత్రమే పెరిగాయి. 2001 నాటికి వార్డుల సంఖ్య 8750 వార్డులు ఉండగా, 2011 నాటికి 8764 వార్డులకు పెరిగాయి. కాగా, ఎన్నికల కోసం ప్రస్తుతం బ్యాలెట్ పత్రాల ముద్రణ చురుగ్గా సాగుతోంది. మరోపక్క మండలాల వారీగా, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు ఎంతెంత రిజర్వేషన్ కేటాయించారో తేలనుంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను ఎదుర్కొనేందుకు కసరత్తు మొదలు పెట్టారు. దీంతో అన్ని పార్టీల్లోను రాజకీయ సందడి మొదలైంది.

ఆర్టీసీ ఆర్.ఎం బాధ్యతల స్వీకరణ
విజయనగరం, జూన్ 6: ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆర్టీసీ విజయనగరం నార్త్‌ఈస్ట్‌కోస్టల్ రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న తెలిపారు. ఆర్టీసీ ఆర్.ఎం.గా గురువారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా బస్సులు నడుపూతూ మెరుగైన సేవలు అందించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజల వద్దకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తామని, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరమనే విషయాలపై అవగాహన కల్పిస్తామన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లే వాహనాలు, మోటారు వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలపై దాడులు నిర్వహిస్తామని అప్పన్న తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రయాణికుల రద్దీగా ఎక్కువ ప్రాంతాల్లో ప్రత్యేకంగా బస్సులు నడుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్లు కొటాన శ్రీనివాసరావు, గండి సత్యనారాయణ, విజయనగరం డిపోమేనేజర్ పిబిఎంకె రాజు, డిపో అసిస్టెంట్‌మేనేజర్ ముత్తిరెడ్డి సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.

ఆండ్ర బ్రిడ్జికి శంకుస్థాపన
మెంటాడ, జూన్ 6 : మండలంలోని చంపావతి నదిపై ఆండ్ర గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, బొత్స అప్పలనర్సయ్యలు గురువారం భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎస్‌డిఎఫ్, ఐఎపి నిధుల నుంచి 1.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజన్నదొర మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఆండ్ర గ్రామంతోపాటు కల నేటికి నెరవేర బోతుందన్నారు. ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలను గుర్తించుకుని నిధులు మంజూరు చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. ఉపాధి పనులు కల్పించలేదని అడగడానికి వెళుతున్న కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కూలీలు సభా ప్రాంగణానికి సమీపంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆర్ రవిశంకర్, జిల్లా టెలికాం కమిటీ మెంబర్ రెడ్డి రాజప్పలనాయుడు, ఆండ్ర బ్రిడ్జి ఇఇ ఎవి సబ్బారావు, పార్వతీపురం డిఇ ఎస్ శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఎడి కె.్ఫణి, ఎంపిడిఓ జి.వెంకటరావు, మండల తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు, మాజీ ఎఎంసి చైర్మన్ పి.అప్పలనాయుడు, మాజీ జెడ్‌పిటిసి సభ్యురాలు దేశరి భానుమతి, మాజీ సర్పంచ్‌లు కుంచు తిరుపతినాయుడు, చింతగడ శంకరరావు, యవర్న అప్పారావు, ఆండ్ర ఎస్సై బాబురావుతోపాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
‘వడ్డీ చెల్లింపులకు నిధుల విడుదల’
విజయనగరం (్ఫర్ట్టు), జూన్ 6: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఇంతవరకు 52,176 మందిరైతులకు శూన్యవడ్డీ వర్తించిందని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వంగపండు శివశంకర ప్రసాద్ తెలిపారు. సహకార సంఘాల్లో రుణబకాయిల వసూళ్లు, శూన్యవడ్డీ, డిపాజిట్ల సేకరణ తదితర అంశాలపై గురువారం డిజిఎం కె.వెంకటేశ్వరావుతో సమీక్షించారు. ఈ సందర్భంగా శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ రెండు కోట్ల 89 లక్షల 95 వేల రూపాయల శూన్యవడ్డీని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆయా సహకార సంఘాల్లో ఈ వడ్డీని జమ చేస్తామన్నారు. 2012-2013 రబీసీజన్‌కు సంబంధించి రుణాలు తీసుకున్న రైతులు ఈనెలాఖరులోగా చెల్లిస్తే శూన్యవడ్డీ వర్తింపు జరుగుతుందన్నారు. ఈనెలాఖరునాటికి 90శాతం రుణబకాయిలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇంతవరకు 72శాతం వసూలు చేశామన్నారు. మిగతా 18శాతం రుణబకాయిలను ఈనెలాఖరులోగా వసూలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఖరీఫ్‌సీజన్‌లో ఇంతవరకు రెండుకోట్ల రూపాయల పంటరుణాలను అందించామన్నారు.
హోంగార్డుల నియామకాలకు
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం, జూన్ 6: జిల్లా పోలీస్ శాఖలో వివిభ విభాగాల్లో ఖాళీగా ఉన్న 21 హోంగార్డు పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను కోరుతున్నట్లు ఎస్పీ కార్తికేయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల గల అభ్యర్థులు ఈ 12 నుంచి 27 తేది వరకు జిల్లా పోలీస్‌పెరేడ్ గ్రౌండ్‌లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. పోలీస్‌వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, హాల్‌టికెట్లను పొందవచ్చని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ధరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ ధరఖాస్తుకు, హాల్‌టికెట్ (ఇన్‌డూప్లికేట్), అర్హతలు చెప్పే గజిటెడ్ సంతకంతో కూడిన జెరాక్స్ పత్రాలు, నాలుగు కలర్ పాస్‌ఫోర్టుసైజు ఫొటోలతోపాటు ఎస్టీ అభ్యర్థుల మినహా మిగిలిన అభ్యర్థులంతా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, విజయనగరం 25 రూపాయల డిడితో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 12 నుంచి 27 తేదిలోగా అన్ని పనిదినాల్లోను ఉదయం మధ్యాహ్నం 1 గంట వరకు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. కేటగిరిలో-ఎలో మహిళా హోంగార్డు ఉద్యోగాలకు అభ్యర్థులు, టెన్త్ ఉత్తీర్ణత సాధించి, మైదానా ప్రాంతానికి చెందిన వారు కనీసం 250 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలన్నారు. ఎస్టీ అభ్యర్థులకు 5 సె.మీ వెసులు బాటు కల్పించినట్లు చెప్పారు.

‘అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి’
విజయనగరం, జూన్ 6: వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మలేరియా లక్షణాలను వివరించి మలేరియా రాకుండా ఉండేందుకు వారిలో అవగాహన కల్పించాలన్నారు. మురుగు కాలువల్లో దోమలు పెరగకుండా పిచికారి చేయాలన్నారు. సాక్షర భారత్ సహకారంతో ఆయా గ్రామాల్లో ప్రేరక్‌లు ఉన్నందున మలేరియా గ్రామాల్లో విజృంభించకుండా అధికారుల దృష్టికి తీసుకురావడం, ప్రజల్లో అవగాహన కల్పించడం చేయాలన్నారు. ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా వ్యాధి విజృంభించే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మలేరియా నిర్మూలనకు చేపడుతున్న చర్యల గురించి డిఎంహెచ్‌ఒ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి వివరించారు.

‘10లోగా ఆధార్ కార్డులు అందజేయండి’
విజయనగరం, జూన్ 6: నగదు బదిలీ పథకానికి (డిబిటి) సంబంధించి బీసీ వసతిగృహ లబ్ధిదారులకు ఆధార్ కార్డులను అందజేయాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.సంజీవరావు వసతిగృహ సంక్షేమాధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ ఈ నెల పదో తేదీలోగా పూర్తి చేయాలన్నారు. గురువారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నగదు బదిలీ పథకానికి ఎంపికైన బీసీ విద్యార్థులలో ఆధార్ కార్డులు లేని విద్యార్థులను గుర్తించి వారికి ఆధార్ అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని మండల కేంద్రాల్లో ఆధార్ మంజూరు చేసేందుకు బయోమెట్రిక్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది నగదు బదిలీ పథకం ద్వారా ఉపకార వేతనాలను పంపిణీ చేయాల్సి ఉన్నందున ఆధార్ లేకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఉపకార వేతనాలను పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సహాయ బీసీ సంక్షేమాధికారి వి.హరిబాబు, సహాయ బీసీ సంక్షేమాధికారి కె.సూరిబాబు పాల్గొన్నారు.

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైళ్లు
విజయనగరం, జూన్ 6: కొత్తవలస మండలంలోని నిమ్మలపాలెం గ్రామ సమీపంలో డీజిల్ తీసుకెళ్తున్న గూడ్స్ రైలు నిలిచిపోవడంతో సుమారు గంట సేపు మిగిలిన రైళ్లు నిలిపివేశారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇంజన్ సామర్థ్యం చాలకపోవడంతో గూడ్స్ రైలు నిలిచిపోయిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ గూడ్స్ రైలు నిలిచిపోవడంతో కొత్తవలస-విజయనగరం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తవలస రైల్వే స్టేషన్‌లో పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్, పలాస వెళ్ళాల్సిన ఇఎంయు రైలుతోపాటు మిగిలిన రైళ్లను నిలిపివేశారు. గంట తరువాత రైళ్లు రాకపోకలు మొదలయ్యాయి.

‘ఆధార్ ప్రక్రియను వేగవంతం చేయండి’
విజయనగరం, జూన్ 6: జిల్లాలో ఆధార్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శోభ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన లబ్ధిని నగదు బదిలీ పధకం కింద అందజేసేందుకు ఆధార్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆమె ఎంపిడిఒలు, వసతిగృహ సంక్షేమాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా ఆధార్ నంబర్లు లేని వారికి బయోమెట్రిక్ చేయించి ఇఐడి నంబరును కేటాయించి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయడంలో బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో నగదు బదిలీ పథకం కింద ప్రి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, జననీ సురక్ష యోజన పథకం కింద గర్బిణీ స్ర్తిలకు చెల్లించే ప్రసూతి వేతనం మొదలైనవి ఆధార్ కార్డులతో అనుసంధానం చేసి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. కాగా, ఆధార్ మ్యాచింగ్ అయిన వాటిని, మ్యాచింగ్ కాని జాబితాలను తయారు చేసి మ్యాచ్ కాని లబ్ధిదారుల వివరాలను డంప్ జాబితాలో సరి చూడాలన్నారు. వసతి గృహ సంక్షేమాధికారులు ప్రత్యేక శ్రద్ధతీసుకొని లబ్థిదారుల యుఐడి, ఇఐడి నంబర్లను సంబంధిత ఖాతాలకు అనుసంధానించడానికి కృషి చేయాలన్నారు. జూన్ పదో తేదీలోగా ఇఐడి జాబితాను సమర్పిస్తే వాటిని ఆధార్‌తో అనుసంధానం చేయిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు, జెడ్పీ సిఇఒ మోహనరావు, బీసీ సంక్షేమాధికారి సంజీవరావు, ఎంపిడిఒలు, వసతిగృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

‘్భ చేతన’ విజయవంతానికి పిలుపు
విజయనగరం, జూన్ 6: భూ చేతన కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని వ్యవసాయశాఖ ఇన్‌ఛార్జి జెడి లక్ష్మణరావు కోరారు. గురువారం రైతు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూచేతనతో భూసార పరిరక్షణ అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సరళి, సేంద్రియ ఎరువులు తగ్గడం, రసాయన ఎరువులు విచక్షణ రహితంగా వాడటంతో భూసారంలో అసమతౌల్యం ఏర్పడుతుందన్నారు. పశువుల పెంపకం తగ్గడం వల్ల రసాయన ఎరువులకు డిమాండ్ పెరిగిందన్నారు. అందువల్ల సాగు ఖర్చు కూడా పెరిగిపోతుందని పేర్కొన్నారు. ‘డాట్’ హెడ్ గురుమూర్తి మాట్లాడుతూ రైతులు అధిక మోతాదులో ఎరువులు వాడటం వల్ల పంటలపై విపరీతంగా ఖర్చు పెరుగుతుందన్నారు. దీనివల్ల భూసారం దెబ్బతింటుందన్నారు. దీనిని అధిగమించడానికి అవసరానికి అనుగుణంగా శాస్ర్తియ పద్దతిలో ఎరువులను ఉపయోగించాలన్నారు. ముఖ్యంగా భాస్వరం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు విజయనగరం ఏరువాక కేంద్రంలో భూచేతన పథకంలో భాగంగా ముఖ్యమైన పంటలకు ప్రధమశ్రేణి క్షేత్రాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. రైతు శిక్షణ కేంద్రం డిడి ఆషాదేవి మాట్లాడుతూ రైతులు పంట దిగుబడులు తగ్గకుండా సాగు ఖర్చు తగ్గించుకునేందుకు భూసార పరీక్షలు జరుపుకోవాలన్నారు. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా లభ్యమయ్యే పోషకాలు అధిక మోతాదులో ఉండటం వల్ల పైరుకు సిఫార్సు చేసిన మోతాదులో 30 శాతం తగ్గించాలన్నారు. లబ్య పోషకాలు తక్కువ మోతాదు ఉంటే సిఫార్సు చేసిన పోషకాలు 30 శాతం అధికంగా వాడాలన్నారు. భూసార పరీక్షతో సూక్ష్మ లోపాలను గుర్తించి వాటిని అధిగమించే వీలు ఉంటుందని వివరించారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆత్మా పిడి రాజబాబూరావుతోపాటు పలువురు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ఎసిబికి పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్
విజయనగరం, జూన్ 6: పట్టణంలోని దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న స్థలంలో ఓ మహిళ తోపుడు బండిపై టిఫిన్ అమ్ముకునేందుకు అనుమతి కోరగా జూనియర్ అసిస్టెంట్ తనకు రూ.3వేలు లంచం ఇస్తే తప్ప తోపుడు బండి పెట్టుకోడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఆమె ఎసిబి అధికారులను ఆశ్రయించింది. ఎసిబి డిఎస్పీ కెసిఎస్ రఘువీర్ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గూడాచారి వీధిలో నివాసం ఉంటున్న రేణుకాబాయి తోపుడు బండి పెట్టుకునేందుకు దేవాదాయశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లంకా సన్యాసినాయుడు రూ.3వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె ఇంటి వద్దకు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ సన్యాసినాయుడు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఎసిబి ఇన్‌స్పెక్టర్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.

బకాయిలు చెల్లించాలంటూ చెరకు రైతుల ఆగ్రహం
సీతానగరం, జూన్ 6: లచ్చయ్యపేట ఎన్.సి. ఎస్. సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు బిల్లులు సకాలంలో చెల్లించనందున గురువారం ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ, సి.పి.ఎం., తదితర వామపక్షాల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఎదుట శాంతియుతంగా రైతులంతా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. యాజమాన్యం రైతులను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు బొబ్బిలి, సీతానగరం ప్రధాన జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రైతులతో చర్చలు జరపడానికి వచ్చిన సి.ఇ.ఒ. ఆంజనేయులకు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాక్టరీ సీజన్ ముగిసి దాదాపు నాలుగు నెలలు కావస్తున్న బకాయిలు పూర్తిచేయకపోవడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు సహనం కోల్పోయి సి.ఇ.ఓ., మరికొంతమంది అధికారులను ఫ్యాక్టరీలో పరుగులెత్తించారు. అనంతరం పోలీసులు రక్షణ మధ్య సి.ఇ.ఓ.ను కార్యాలయంలోనికి తరలించారు. అప్పటికీ శాంతించని రైతులు ఫ్యాక్టరీ అద్దాలను పగులుగొట్టారు. మరికొంతమంది ఫ్యాక్టరీపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటన ఫ్యాక్టరీ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసింది. రహదారి మధ్యలో టెంటు వేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం విషయం తెలుసుకున్న పార్వతీపురం ఆర్డీ ఓ జె.వెంకటరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఫ్యాక్టరీ రికార్డులను పరిశీలించగా 27కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు గుర్తించామని, ఈ మొత్తాన్ని ఈనెల 15వ తేదీలోగా అందించాలని లేనిపక్షంలో తదుపరి జరిగే పరిణామాలకు ఎన్.సి. ఎస్. యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బి.చిరంజీవులు, మండల అధ్యక్షులు కె.తిరుపతిరావు, రైతు సంఘం నాయకులు ఆర్.శ్రీరామ్మూర్తి, ఆర్.వేణు, సి.పి. ఎం. జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు, రెడ్డి లక్ష్మునాయుడు, ఈశ్వరరావు, జి.సత్యనారాయణ, తదితరులతోపాటు సుమారు 150మంది రైతులు పాల్గొన్నారు.

త్వరలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న
english title: 
political activitiy

హరోం... హరహర

$
0
0

బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 7: హరోం... హరహర అనే భక్తుల జయజయ ధ్వానాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, మేళతాళాలతో కన్నుల పండువగా శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయిల రథోత్సవం కొనసాగింది. మండలంలోని జొన్నవాడ గ్రామంలోగల శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం రథంపై స్వామి, అమ్మవార్లు కొలువుదీరి ఆగ్రామ పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అలంకార మండపంలోవుంచి గణపతిపూజ, పుణ్యవచనం, దేవతాఆహ్వానంతో వేదపండితులు స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చక బృందం మంత్రోచ్చరణలు, మేళతాళాలతో స్వామి అమ్మవార్లను రథంపైకి చేర్చారు. భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులు హరోం... హర హర అంటూ రథాన్ని పురవీధులలో లాగారు. ఈ సందర్భంగా భక్తులు రథచక్రాల కింద గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు ఉంచి భక్తిని చాటుకున్నారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అమ్మవారి భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసి మజ్జిగ, రస్న, మంచినీరు, పులిహోర, మంచినీరు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి బెంగళూరుకు చెందిన బేతిరెడ్డి త్రినాధరెడ్డి, సుజాతమ్మ దంపతులు, కాళయకాదల్లుకు చెందిన జక్కా కోదండరామిరెడ్డి, జక్కా వెంకట్రామిరెడ్డి ఉభయకర్తలుగా వ్యవహరించారు. రథోత్సవం సందర్భంగా దగదర్తి మాజీ జడ్పీటిసి, జిల్లా ప్రణాళికా సంఘ కమిటీ సభ్యులు గోగుల వెంకయ్య చేయించిన ప్రత్యేక పుష్పాలంకరణ కన్నుల విందు చేసింది. జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు పందిళ్లపల్లి అరుణమ్మ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. రాత్రికి అమ్మవారి పుట్టినిల్లుగా భావించే పెనుబల్లి గ్రామానికి స్వామి, అమ్మవార్లు గజ సింహా వాహనంపై బయలుదేరి వెళ్ళారు. ఈకార్యక్రమానికి బేతిరెడ్డి త్రినాధరెడ్డి, సుజాతమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
నేడు కల్యాణోత్సవం
బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే కార్యక్రమమైన కల్యాణోత్సవం శనివారం ఉదయం జరగనున్నట్టు ఆలయ సహాయ కమిషనర్ శివకుమార్ తెలిపారు. భారీ సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. సాయంత్రం తెప్పోత్సవం జరగనున్నట్టు ఆయన తెలిపారు.

ప్రజాభిమానాన్ని ఎవరూ కొనలేరు
కోవూరు, జూన్ 7: ప్రజాభిమానాన్ని ఎవరూ కొనలేరని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి కోవూరు మండలంలోని పలుగ్రామాలలోని నాలుగు సీసీ రోడ్లు, నాలుగు కమ్యూనిటీ హాళ్లకు ప్రారంభోత్సవాలు, ఒక సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని వైఎస్‌ఆర్‌సిపి మండల కన్వీనర్ ములుముడి వినోద్‌రెడ్డి నివాసంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక సాకు చూపి బెయిల్ సమయాన్ని పొడిగిస్తూ ప్రజలకు జగన్‌ను దూరం చేయాలని చూస్తోందన్నారు. ఎన్నికలు ఏ సమయంలో నిర్వహించినా వైఎస్‌ఆర్‌సిపిని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లా పరిషత్, జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, ఆత్మకూరు, కావలి మున్సిపాల్టీలతోపాటు జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, ఎంపిటిసిలు, జడ్పీటిసిలను కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే వైకాపా పోటీ చేసిన అన్ని స్థానాలను గెల్చుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసారు. కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపి సహకారంతో మండలంలోని పలు గ్రామాలలో 23 లక్షలతో నాలుగు సిసి రోడ్లు, రెండు కమ్యూనిటీ హాల్స్‌కు ప్రారంభోత్సవాలు, మరో సిసిరోడ్డుకు శంకుస్థాపన చేసినట్టు ఆయన తెలిపారు. అలాగే కోవూరు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులకు మరో 70 లక్షల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చామని, ఆ ప్రతిపాదనలను పరిశీలించి నిధులు మంజూరు చేస్తామని ఎంపి హామీ ఇచ్చారని తెలిపారు. గత ఉపఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఎంపిని 53 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని, రాబోయే ఎన్నికల్లో ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కోవూరు, ఇందుకూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం మండలాల వైఎస్‌ఆర్‌సిపి కన్వీనర్‌లు వినోద్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జునరెడ్డి, గూడూరు వైకాపా సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసులురెడ్డి, వైకాపా నాయకులు రాధాకృష్ణారెడ్డి, హరిప్రసాద్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, నరసింహులురెడ్డి, రవీంద్రరెడ్డి, జనార్దన్‌రెడ్డి, వినీత్‌రెడ్డి, శైలేంర్రెడ్డి, శేషయ్య, వెంకటేశ్వరరావు, అన్ను తదితరులు పాల్గొన్నారు.

785కోట్లతో సాగునీరు, తాగునీరు పథకం
నెల్లూరు, జూన్ 7: ఆత్మకూరు, ఉదయగిరి ప్రజల దాహార్తిని తీర్చేందుకు 785 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు నెల్లూరురూర్‌ల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వెల్లడించారు. శుక్రవారం మైపాడు గేటు ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమశిల హైలెవల్ కెనల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆత్మకూరు, ఉదయగిరి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఆనం సంజీవరెడ్డి లిఫ్ట్ కెనల్‌గా నామకరణం చేసినట్లు తెలిపారు.ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 60వేల 615 ఎకరాలకు సాగునీరు, ఉదయగిరిలో 26వేల 385 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం వల్ల 4గ్రామలను ముంపునకు గురవుతాయన్నారు. మొత్తం 560 కుటుంబాలకు నష్ట వాటిల్లుతుందన్నారు. నష్టపోయిన వారికి 26కోట్ల రూపాయలతో పునరావసం, ఇళ్లు నిర్మించిఇస్తామన్నారు. 9వేల 280ఎకరాల భూమిని సేకరించేందుకు 133 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. అందులో 1000 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమిని చెప్పారు. ఈ పథకం ద్వారా కరవు ప్రాంతాలు పచ్చని పల్లెలుగా మారుతాయన్నారు. ఆనం సంజీవరెడ్డి ఎత్తి పోతుల పథకంగా నామకరణం చేసేందుకు ప్రభుత్వం కూడా జిఓను విడుదల చేసినట్లు తెలిపారు. సమావేశంలో నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పి శ్రీనివాసులు, సాయిలలితా, యలమూరి రంగయ్యనాయుడు, కినె్నర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రూ.75లక్షలతో జాఫర్‌సాహెబ్ కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణ
మైపాడు రోడ్డు గల జాఫర్‌సాహెబ్ కెనాల్‌పై 75లక్షల రూపాయలతో బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు నెల్లూరురూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. శుక్రవారం జాఫర్‌సాహెబ్ కెనాల్‌పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికుల కోరిక మేరకు ఈ ప్రాంతంలో కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2వ డివిజన్‌లో డ్రైయిన్లను నిర్మించేందుకు 1కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు దోబిఘాట్‌ను నిర్మించుకునేందుకు నిధులను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏసి సుబ్బారెడ్డి, యలమూరి రంగయ్యనాయుడు, కినె్నర ప్రసాద్, సాయిలలితా మహిపాల్, గురవయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

నగరంలో కుండపోత
* చెరువులను తలపించిన రోడ్లు
* ఇబ్బందులు పడ్డ వాహనదారులు
నెల్లూరు, జూన్ 7: ఒక్కసారిగా నగరంలో శుక్రవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. వాతావరణం చల్లబడినా ప్రజలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. నగరంలోని ప్రధాన కూడలిలలో నిర్మించి ఐల్యాండ్‌లు, కేబుల్స్ కోసం ఇష్టారాజ్యంగా గుంటలు తవ్వి పూడ్చకపోవడంతో వర్షపు నీరు చేరి రోడ్లన్నీ చెరువుల్లా కన్పించాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది మోటార్‌సైకిలిస్ట్‌లు అయితే ఏకంగా గుంతల్లో పడి గాయాలపాలయ్యారు. గాంధీబొమ్మ, విఆర్‌సిసెంటర్, రామలింగాపురం అండర్‌బ్రిడ్జి, విజయమహాల్‌సెంటర్, వేదాయపాళెం, అయ్యప్పగుడి జాతీయ రహదారి వద్ద, పెద్దబజార్, చిన్నబజార్, ఏసి కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో రోడ్లపై వర్షపునీరుతోపాటు డ్రైనేజి నీరు ప్రవహించడంతో అవస్థలు పడ్డారు. కరెంట్ ఆఫీస్ నుండి నిప్పో, వేదాయపాళెం వరకు ఎత్తుగా సిమెంట్‌రోడ్డు వేసి సైడ్ కాల్వలు నిర్మించకపోవడంతో వర్షపునీరంతా సమీపంలోని ఇళ్లల్లోకి చేరాయి. గంటపాటు కురిసిన కుండపోత వర్షంతో ఆర్టీసీ నుండి ఆత్మకూరు బస్టాండ్ వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి నగరంలో కాలువలు ఏర్పాటుచేసి వాననీరు రోడ్లపై నిలవకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

నేరాల నియంత్రరణకు చర్యలు తీసుకోండి
నెల్లూరు, జూన్ 7: నేరాలను నియంత్రించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని నగర డిఎస్పీ పి వెంకటనాథ్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం సిఐలతో డిఎస్పీ క్రైం సమావేశం నిర్వహించి పలు కేసుల స్థితిగతులపై సమీక్షించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాలను అదుపు చేసేందుకు రాత్రి, పగలు ప్రత్యేక సిబ్బందితో గస్తీలను ముమ్మరం చేయాలన్నారు. దొంగతనాలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చైతన్యపరచాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కోర్టు వారెంట్ కేసులల్లో నిందితులను అరెస్ట్ చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లపై నిఘా ఉంచి నిర్వాహకులను అరెస్ట్ చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిసిఎస్, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, మహిళా పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు పి వీరాంజనేయరెడ్డి, మద్ది శ్రీనివాసరావు, కోటారెడ్డి, కెవి రత్నం, రామారావు, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, జి మంగారావు, నాగేశ్వరమ్మ, ఎస్సైలు పాల్గొన్నారు.

అంగనవాడీల్లో పిల్లల్ని చేర్పించాలి
ఓజిలి, జూన్ 7: మండల కేంద్రమైన ఓజిలి బిసి కాలనీలో శుక్రవారం అంగన్‌వాడీ ఆధ్వర్యంలో చిన్నారులతో ర్యాలీ నిర్వహించారు. చిన్నారులను అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, కానె్వంటు వద్దు- అంగనవాడీ ముద్దు అంటూ చిన్నారులచే నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ మునికుమారి, కార్యకర్తలు బంగారమ్మ, శ్యామల, విజయ తదితరులున్నారు.

శివాలయంలో చోరీ
ఓజిలి, జూన్ 7: మండల కేంద్రమైన ఓజిలిలో ఉన్న శివాలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి తాళాలు పగుల గొట్టి హుండీలో ఉన్న 500 రూపాయల నగదును అపహరించుకొని వెళ్లారు. అలాగే సైకిల్ షాపుకు వేసిన తాళాలను పగుల గొట్టి, సైకిల్, 16వందల నగదును అపహరించుకొని వెళ్లినట్టు బాధితుడు రమణయ్య వాపోయాడు.

చట్టాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి
గూడూరు డిఎస్పీ చౌడేశ్వరి వెల్లడి
గూడూరు, జూన్ 7: ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి, తద్వారా బాల్య వివాహాలు, ఇతరత్రా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జరిగే పరిణామాల గురించి తెలియ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గూడూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కందుల చౌడేశ్వరి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో చైల్డ్ వెల్ఫేర్ సంరక్షణ సమావేశం నిర్వహించారు. సిడబ్ల్యుసి చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిఎస్పీ పాల్గొని ప్రసంగిస్తూ చట్టాలతో పేరుతో సామాన్యులకు ఇబ్బందులకు కలగకుండా వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. బాల్యవివాహం జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ ఇవ్వబోతే పెళ్లికి ఎంతో ఖర్చుచేశాం. పెళ్లిఆగిపోతే మా పరువు పోతుందని వారు చెప్పినప్పుడు అధికారులు విచక్షణతో మసలుకోవాలని హితవుపలికారు. నిబంధనలను అమలు చేయాల్సిన బాద్యత ప్రభుత్వ అధికారులపై ఉన్నా వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకొని తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పలువురు నిరుపేదలు తమ కుటుంబ పోషణ కోసం తమ పిల్లలను చదివించకుండా పనికి పంపిస్తూ వారి సంపాదనలో కొంత తీసుకోవడం కొన్ని కుటుంబాల్లో జరుగుతోందన్నారు. సిడబ్ల్యుసి చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో బాల కార్మికులు అనేక చోట్ల పనులు చేస్తున్నారని, దీనిని అడ్డుకొనే క్రమంలో పలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఇందుకు సంబంధించి అందరు సమన్వయంతో పనిచేసి బాల కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలిగించినపుడే దీని నిర్మూలనకు సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిపివో దేవరాజ్, శశిధర్ రెడ్డి, డిసిఆర్‌బి సిఐ శ్రీనివాసరావు, గూడూరు లేబర్ ఆఫీసర్ ఎం కోటేశ్వరరావు, ఐసిడిఎస్ అర్భన్, రూరల్ సిడిపివోలు ఉమామహేశ్వరీ, ప్రమీలారాణి, సిఐలు ఉప్పాల సత్యనారాయణ, కే వేమారెడ్డి, ఎస్సైలు షరీఫ్, మారుతీకృష్ణ, దశరధరామారావులు పాల్గొన్నారు.

డిఎం వైఖరిని నిరసిస్తూ జెఎసి ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు
గూడూరు, జూన్ 7: గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెఎసిగా ఏర్పడి నిరవధిక నిరాహార దీక్షలను ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సంస్థ నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకున్నా గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కార్మికులకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటున్నారని ఆరోపించారు. గూడూరు డిపో నుండి తిరుమలకు నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ లేకుండా కేవలం డ్రైవర్ ద్వారా ప్రయాణికులకు టికెట్‌లు ఇవ్వడం వలన సమయం వృథా అవుతోందని, దూర ప్రాంత బస్సు సర్వీసులకు తప్పనిసరిగా కండక్టర్ ఉండాలన్న నిబంధన ఉన్నా, ఇక్కడి డిపో మేనేజర్ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారంటూ ఎస్‌డబ్ల్యుఎఫ్, ఎన్‌ఎంయు, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిఎం వైఖరిని వ్యతిరేకించారు. డిఎం ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. డిపో మేనేజర్ సంస్థ ఆదాయాన్ని పెంచుకొనేందుకు అని చెప్పి డిపో ఆదాయానికి కృషి చేస్తున్న కండక్టర్లు లేకుండా కేవలం డ్రైవర్లతో తిరుమల బస్సులను నడపాలని ఆదేశించడం వలన డ్రైవర్‌పై పనివత్తిడి అధికమవుతుందని, ఈ విధానాన్ని విడనాడాలన్నారు. ఆర్టీసీకి అధిక ఆదాయం సమకూర్చి పెడుతున్న కండక్టర్లను లేకుండా డ్రైవర్లతో తిరుమలకు బస్సులు నడపడం వలన డ్రైవర్లకు పని వత్తిడి అధికమై ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానం చేర్చడానికి వీలుండదని అన్నారు. ఈ విషయంలో డిఎం వైఖరిని వారు తప్పు బట్టారు. ఘాట్ సెక్షన్‌లో తప్పనిసరిగా కండక్టర్ ఉండాలని, లేకుంటే ఇద్దరు డ్రైవర్లు ఉండాలని, ఒకే డ్రైవర్‌తో టిమ్స్ విధానం అమలు చేయడం వలన సకాలంలో ప్రయాణికులను గమ్యస్థానం చేరవేయడం కష్టతరమవుతుందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి కన్వీనర్ విఎస్ రెడ్డి, నాయకులు బి దశరథ, ఎస్‌కె జిలానీ, ఎంఎస్ రెడ్డి, ఎస్‌కెఎం అహ్మద్‌లు పాల్గొనగా దీక్షల్లో కండకర్లు కె మునెయ్య, బి చెంగయ్య, సిఆర్ పెంచలయ్యలు పాల్గొన్నారు.

కడనూతలలో విద్యాసంబరాలు
బిట్రగుంట, జూన్ 7: బోగోలు మండల అల్లిమడుగు పంచాయతీలోని కడనూతలలో శుక్రవారం విద్యాసంబరాలు జరిగాయి. స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల జయకుమార్ అధ్వర్యంలో విద్యాసంబరాలు జరగగా మండల విద్యశాఖాధికారి శైలజ హజరైనారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతు ప్రతి ఉపాధ్యాయుడు, అంగన్ వాడి వర్కర్ల బడి ఈడు పిల్లలని గుర్తించి బడిలో చేర్పించాలని చెప్పారు. విద్య పై అవగహన లేని తల్లి దండ్రలకు అవగహన కల్పించి పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేయలని సూచించారు. అనంతరం గ్రామంలోని విద్య పై అవగాహన కల్పిస్తు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు షంగర్, మాధవి,సిఆర్‌పి రవి, అంగన్ వాడి సూపర్ వైజర్ సూభాషిణి, కార్యకర్తలు నిర్మల కుమారి, బాలత్రిపురసుందరి, తదితరులు పాల్గొన్నారు.
7బిటిటి ఆర్ 1గ్రామంలో విద్యపై అవగాహన కల్పిస్తు ర్యాలీ నిర్వహిస్తున్నదృశ్యం.

కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి
ఎన్‌ఎస్‌యుఐ డిమాండ్
నెల్లూరుసిటీ, జూన్ 7: కార్పొరేట్ విద్యాసంస్థలో జరుగుతున్న అవినీతిపై అధికారులు చర్యలు తీసుకోకపోతే జిల్లా ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని జిల్లా ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు ముజీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరాభవన్‌లో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు పేద విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌లను తప్పుడు పత్రాలను సృష్టించి దోచుకున్నాయన్నారు. ఏ విద్యార్థి కూడా స్కాలర్‌షిప్‌లను ఇవ్వకుండా ఆ విద్యాసంస్థలు తమ సొంత ఖతాల్లోకి జమ చేసుకున్నాయన్నారు. విద్యాసంస్థలకు ఉండేది 10బ్రాంచ్‌లు అయితే స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ల కోసం ఇన్ని బ్రాంచ్‌లు ఎలా పుట్టుకొచ్చాయో తెలపాలని కోరారు. అదనపు భవనాల పేరుతో కొత్తకొత్త పేర్లు పెట్టుకుని పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను దోచుకున్నారు. నారాయణ మెడికల్ కాలేజిలో జరుగుతున్న అకృత్యాలను రెండు రోజుల్లో వివరిస్తానని చెప్పారు.

రోగులు లేకపోతే వార్డును శుభ్రం చేయరా
వైద్యవిధాన పరిషత్ సిబ్బందిపై ఇన్‌చార్జి డిఎంఅండ్‌హెచ్‌ఓ అసహనం
నెల్లూరుసిటీ, జూన్ 7: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అసంక్రమణ వ్యాధుల బారిన పడిన వారికి వైద్య సేవలను అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వార్డును చూసి సి జిల్లా ఇన్‌చార్జ్ డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ వైద్య విధాన పరిషత్ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అసంక్రమణ వ్యాధుల చికిత్స వార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ వార్డులో అపరిశుభ్రంగా ఉన్న తీరుపై పారిశుద్ధ్య సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. ఆకస్మికంగా వైద్య విధానపరిషత్ ఆసుపత్రిని తనిఖీకి వచ్చే సమయానికి ఆసుపత్రి డిసిహెచ్, సూపరింటెండెంట్ లేకపోవడంతో వారి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. దానికి మందుల గోడౌన్‌కు తాళం వేసి ఉండటం చూసి సంబంధిత అధికారులపై మండిపడ్డారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు బాధ్యతలోపనిచేసి ప్రజలకు మెరుగైన సేవలను అందించినప్పుడు మంచి గుర్తింపు వస్తుందన్నారు. తీసుకుంటున్న జీతాలకు తగిన న్యాయం చేయాలని హితవు పలికారు. ఇక నుండి ఈ వార్డులో డాక్టర్ ప్రజలకు అందుబాటలో లేకపోతే తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎన్‌సిడి ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ ఈదూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలి
ఎమ్మెల్యేలు ఆనం, ముంగమూరు ఆదేశం
నెల్లూరుసిటీ, జూన్ 7:నగరంలోని జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని నెల్లూరురూరల్, సిటీ ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలంలోని కాన్ఫరెన్స్‌హాల్లో ఆర్‌అండ్‌బి, విద్యుత్‌శాఖ, కార్పొరేషన్ అధికారులతోసమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డువిస్తరణ పనుల్లో ఆర్‌అండ్‌బి అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, మినిబైపాస్ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా తాగునీటి పైపులైన్లు, విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మినిబైపాస్ రోడ్డు విస్తరణ పనుల్లో ఆర్‌అండ్‌బి ఎఇ నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక నుంచి అలాంటి ఫిర్యాదులు అందింతే సహించేది లేదని ఎఇని హెచ్చరించారు. మూడు శాఖల సమన్వయంతో రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ డి జాన్‌శ్యాంసన్, డిప్యూటీ కమిషనర్ కె భాగ్యలక్ష్మీ, విద్యుత్‌శాఖ డిఇ, ఆర్‌అండ్‌బి డిఇ దామోదర్‌రెడ్డితదితరులు పాల్గొన్నారు.
దివంగత న్యాయవాదులకు సంతాపం
నెల్లూరు లీగల్, జూన్ 7: ఇటీవలకాలంలో మరణించిన న్యాయవాదులకు నెల్లూరు బార్ అసోసియేషన్ సంతాపం వెలిబుచ్చింది. శుక్రవారం ఉదయం ఇటీవల మృతి చెందిన సీనియర్ న్యాయవాదులు పి శేషాచలం (80), ఏ శేషారెడ్డి (83)లకు బార్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జడ్జి ఎల్ శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో న్యాయవాదులంతా రెండు నిమిషాలపాటు వౌనం పాటించారు. నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యదర్శి కె రాజగోపాల్‌రెడ్డి దివంగత న్యాయవాదుల సేవలను తన ఉపన్యాసంలో భాగంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా అర్ధగంటసేపుకోర్టు కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.

ఎంపి, ఎమ్మెల్యేలచే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
కోవూరు, జూన్ 7: మండల పరిధిలో 23 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం నెల్లూరు ఎంపి రాజమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మండలంలో పలు గ్రామాలలో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసారు

హరోం... హరహర అనే భక్తుల జయజయ
english title: 
harom .. hara.. hara

గుజరాత్ వైపు పెట్టుబడిదారుల చూపు

$
0
0

నెల్లూరు, జూన్ 7: గుజరాత్‌లో కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయడం వలనే ఆ రాష్ట్రం వైపుపారిశ్రామిక వేత్తలంతా పెట్టుబడులు మళ్లించేలా దృష్టిసారిస్తున్నారని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఎంపి కపల్‌సేన్ పేర్కొన్నారు. కార్మిక చట్టాల్ని కాలరాస్తూ పెట్టుబడిదార్లను ఆహ్వానిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన రాష్ట్రం వెలిగిపోతోందని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అంబానీ వంటి పెట్టుబడిదారులు కార్మికశక్తిని దోచుకోవడంలో ముందుంటారన్నారు. అందుకే వారంతా గుజరాత్ వైపుఆకర్షితులవుతున్నారన్నారు. ఇలాంటి దుశ్చర్యలను సిపిఎం అనుబంధ కార్మిక సంఘమైన సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సిఐటియుకు అనుబంధంగా పనిచేసే ఏపిఎస్‌ఆర్‌టిసి ఎస్‌డబ్ల్యూఫ్ తొమ్మిదవ రాష్టమ్రహాసభలు నెల్లూరులో నిర్వహిస్తున్నారు. రెండోరోజైన శుక్రవారం కపల్‌సేన్ హాజరై పతాకావిష్కరణతో సహా ప్రారంభోపన్యాసం చేశారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ బలమైన యూనియన్‌గా ఆర్టీసీలో ఎదిగేందుకు సూచనలు, సలహాలు తెలిపారు. ఎనిమిది గంటల పనిదినాలు కూడా కాలరాసేక్రమం అధికంగా ఉండటాన్ని ఉద్దేశించి పాలకుల తీరును దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సిబ్బంది కొరత వల్ల ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు పనిఒత్తిడితో అల్లాడిపోతున్నారన్నారు. కార్మికుల వెతలు వర్ణనాతీతంగా ఉంటున్నాయన్నారు. కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగట్టేందుకు సిపిఎం అనుబంధ సిఐటియూ విస్తృతంగా పోరాటం చేస్తుందన్నారు. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్‌లో రవాణాశాఖ అధికార యంత్రాంగం అవినీతి, చేతివాటానికి స్వస్తిపలికితే ఆర్టీసీకి ఊపిరినిస్తుందని అభిప్రాయపడ్డారు. కార్మిక వ్యతిరేక చర్యల్ని ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యకర్తలంతా మూకుమ్మడిగా తిప్పిగొట్టాలన్నారు. ఏపిఎస్ ఆర్టీసీకి విక్రయిస్తున్న డీజిల్‌పై ప్రభుత్వ పన్ను మినహాయింపు ఉండాలన్నారు. ప్రైవేటీకరణ, అసంఘటిత రంగానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ప్రభుత్వాల పెట్టుబడిదారి విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగించాలన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ నేతలు ఆర్టీసీలో కార్మిక వర్గానికి నమ్మకం కలిగించాలన్నారు. ఏపిఎస్ ఆర్టీసీలో ఎస్‌డబ్ల్యూఎఫ్ చిన్నదే అయినా భవిష్యత్‌లో పెద్దదిగా తయారవ్వాలన్నారు. ఇటీవల పదవీ విరమణ పొందిన పలువురు ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యకర్తలైన ఆర్టీసీ కార్మికులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఇంకా సిఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఎంఎల్‌సిలు యండ్లపల్లి శ్రీనివాసులురెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

గుజరాత్‌లో కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయడం
english title: 
gujarath

దిగుబడి దిగాలు.. ధర బేజారు

$
0
0

కందుకూరు, జూన్ 7: అసలే పంట దిగుబడి తీవ్రంగా తగ్గడంతో విలవిల్లాడిపోతున్న మామిడి రైతులను రోజురోజుకు దిగజారుతున్న ధరలు మరింత కృంగదీస్తున్నాయి. ఏప్రిల్ నెలలో రైతులను ఊరించి, ఆశల పల్లకిలో ఊరేగించిన మార్కెట్ ధరలు ప్రస్తుతం దిగజారుతుండడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 17వేలకుపైగా మామిడి తోటలు ఉన్నాయి. అందులో మూడొంతుల విస్తీర్ణం ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే ఉన్నాయి. జనవరిలో మంచు, చీడపీడలు తదితర కాణాల వల్ల ఈసారి మామిడి దిగుబడి దారుణంగా పడిపోయింది. సాధారణ పంట దిగుబడి ఎకరాకు 4టన్నులు కాగా, ఈసారి ఒకటిన్నర నుంచి రెండు టన్నులకు మించలేదు. ప్రకాశం జిల్లాలోనేకాక రాష్టమ్రంతటా దిగుబడి ఇలాగే తగ్గడంతో ఈసారి మామిడికి మంచి ధర పలుకుతుందని రైతులు ఆశించారు. పంట దిగుబడి తగ్గడం వలన వచ్చిన నష్టాన్ని మంచి ధర పలికితే కొంత అయినా పూడ్చుకోవచ్చునని భావించారు. కాయలు కొద్దిమొత్తంలో కోతకు వచ్చిన ఏప్రిల్, మే నెలల్లో రైతు అంచనాలకు అనుగుణంగానే ధరలు పలికాయి. బంగినపల్లి టన్ను ధర 25వేల నుంచి 30వేల వరకు పలికింది. అయితే మే నెల చివరి నాటికి ధరలు తగ్గిపోయాయి. ప్రస్తుతం బంగినపల్లి మామిడి ధర 20వేల నుంచి 25వేల రూపాయల మధ్య ఉంది. ధరలు తగ్గడంతోపాటు కొనుగోళ్లు కూడా మందగించాయి. ఇటీవల ఈదురు గాలుల వలన గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో మామిడి కాయలు నేలరాలాయి. దాంతో కూడా చాలావరకు నష్టం సంభవించింది. ఈప్రాంతాల నుంచి బంగినపల్లి మామిడి ప్రతి ఏటా ముంబయి, చెన్నై వంటి నగరాలకు ఎగుమతి అయ్యేవి. ముంబయి ఎగుమతి వ్యాపారులు రైతుల నుంచి పోటీలు పడి బంగినపల్లి మామిడి కొనుగోలు చేసేవారు. ఈఏడాది ముంబయి ఎగుమతిదారులు ఒకరిద్దరు మినహా రాలేదు. ఉలవపాడు, గుడ్లూరుకు చెందిన దళారుల ద్వారా నెల్లూరు జిల్లాలో సరుకును కొనుగోలు చేస్తున్నారు. ఈప్రాంతంలో టర్బో లారీకి సరిపడా బంగినపల్లి ఒకే ఒక్క తోటలో దొరక్కపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఐదారు తోటలలో ఏరితే టర్బో లారీకి సరిపడ బంగినపల్లి మామిడి దొరకడం లేదు. నెల్లూరు జిల్లాలో పంట దిగుబడి తక్కువగానే ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఉన్న వింజమూరు, ఉదయగిరి ప్రాంతాల్లో 20నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో పెద్దమామిడి తోటలు ఉన్నాయి. అలాంటి తోటలలో ఒక్కొక్క తోటలోనే ఒక కనీసం టర్బోలారీ సరుకు లభిస్తుంది. అందువలనే మన ప్రాంతంలో సరుకు కొనుగోలు ప్రారంభించిన ముంబయి ఎగుమతి వ్యాపారులు ఒకరిద్దరు ఎక్కువ నెల్లూరు జిల్లా తోటలపైనే మక్కువ చూపుతున్నారు.

బెంగళూరు మామిడికి ధర తక్కువే
జిల్లాలో బంగినపల్లి మామిడి తరువాత ఎక్కువగా పండే బెంగళూరు మామిడి ధర టన్ను 7వేల రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఈ మామిడిని అధికంగా కొనుగోలు చేసే జ్యూస్ ఫ్యాక్టరీలు ఎక్కువగా కొనుగోలుకు రావడం లేదు. బెంగళూరు మామిడి పచ్చళ్లు, అవసరాల కోసం కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కొద్దిమొత్తంలో ఎగుమతి చేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి పోటీ లేకపోవడంతో ధర తక్కువగా ఉంది. గత సీజన్‌లో టన్ను 35వేల రూపాయలు పలికిన పెద్ద రసాలు కూడా ఈసారి 18వేల రూపాయలకు మించలేదు. బెంగళూరు మామిడి దాదాపు సమానంగా పలికే చెరకు రసం మాత్రం రైతులను పెద్దగా నిరాశ పరచలేదు. గత నెలలో టన్ను 16వేల రూపాయలు పలికిన చెరకు రసం మామిడి ధర ఇప్పటికీ అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగినపల్లితో పోల్చితే ఏటా దండిగా పంట దిగుబడి వచ్చే చెరకురసం మామిడికి ఈమాత్రం ధర లభించడం పట్ల కొంతవరకు రైతులు సంతృప్తి చెందుతున్నారు.

చిరు వ్యాపారుల కూటమి
బడా వ్యాపారులు రంగంలో లేకపోవడంతో ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, చిలకలూరిపేట, తేనాలి ప్రాంతాలకు చెందిన చిన్న వ్యాపారులు ఇక్కడ మామిడి కొనుగోళ్లకు కూడపలుక్కొని వ్యవహరిస్తున్నారు. ఈ చిరు వ్యాపారులు మూడు నుంచి ఐదు టన్నుల వరకు బంగినపల్లి మామిడి కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి సరుకును కూడా ప్రతిరోజు కొనుగోలు చేయరు. ఒకరోజు మూడు టన్నులు కొనుగోలు చేసి వాటిని తీసుకువెళ్లి ఆప్రాంతంలో చిరు వ్యాపారులకు విక్రయించి మళ్లీ కొనుగోలుకు వచ్చేసరికి మూడు రోజులు సమయం పడుతుంది. ఇలాంటి చిరు వ్యాపారులకు పెద్దగా సరుకు అవసరం లేకపోవడంతోపాటు అందరూ కూడబలుక్కొని బంగినపల్లి ధర ఇప్పటికే 19వేల రూపాయలకు మించకుండా చేశారు. సాధ్యమైతే ఇంకా ధర తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదిఏమైనా ఈఏడాది మామిడి రైతులకు ఒక పక్క చీడపీడలు, మరోపక్క ధరలు, మరోవైపు వడగాల్పుల వల్ల తోటలలో చెట్లమీదనే కాయలు పండి నేల రాలడంతో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది.

* తగ్గుతున్న మామిడి ధరలు * ఆందోళనలో రైతులు
english title: 
ryots

అద్దంకిలో డాక్టర్ ఇంట్లో భారీ చోరీ

$
0
0

అద్దంకి, జూన్ 7: నిత్యం రద్దీగా ఉండే స్టేట్‌బ్యాంకు రోడ్డులో...శుక్రవారం తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో ప్రముఖ వైద్యుడు కోగంటి రంగారావు ఇంటిలో భారీ చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న అద్దంకి పోలీసులు వెంటనే దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా కేంద్రం ఒంగోలు నుండి పోలీస్‌డాగ్, క్లూస్‌టీంను రప్పించారు. అద్దంకిలో భారీ చోరీ జరగడంతో నిందితులను పట్టుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించి వెంటనే ఇనె్వస్టిగేషన్ ప్రారంభించింది. దర్శి డిఎస్‌పి వెంకటలక్ష్మి, దర్శి సిఐ శ్రీరాం (అద్దంకి ఇన్‌చార్జి), ఇన్‌చార్జి ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులనడిగి వివరాలు సేకరించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో ఐదుగురు దుండగులు రంగారావు ఇంటి ముందు ఉన్న ఇనుపమెస్ గేట్ తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్ళారు. ఇంటికి ప్రధాన ద్వారాన్ని గడ్డపలుగుతో పగలగొట్టి డాక్టర్ దంపతులు నిద్రిస్తున్న బెడ్‌రూంలోకి వెళ్ళారు. తలుపులు పగిలిన శబ్దానికి నిద్రలేచిన దంపతులను ఐదుగురు దుండగులు గడ్డపలుగులు, కత్తులు చూపించి బెదిరించారు. దుండగులందరూ ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌస్‌లు వేసుకొని ఉన్నారు. డాక్టరుగా మీరు మాకు తెలుసని, గొడవ చేయకుండా కూర్చోవాలని బెదించారు. అనంతరం ఐదుగురిలో ఇరువురు దంపతులకు కాపలగా ఉండగా, మరో ముగ్గురు ఇంటిలోని బీరువాల్లో ఉన్న 7లక్షల రూపాయల నగదు, 80 సవర్ల బంగారం, ఇంకా వెండి వస్తువులు దోచుకున్నారు. మొత్తం కలిపి సుమారు 25లక్షల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దోపిడి అనంతరం బాధిత దంపతులు బయటకు వచ్చి ఇంటి చుట్టుపక్కల వారికి దోపిడీ విషయం తెలియచేశారు. దొంగల ఆచూకీ కోసం స్థానికులు వెతికినప్పటికి ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. పోలీసులు రంగంలోకి దిగి కేసును ఛేదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దుండగుల్లో డాక్టరుకు తెలిసిన వారెవరైనా ఉండి ఉండవచ్చునని, మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రొఫెషనల్ దొంగలై ఉంటారని భావిస్తున్నారు.

7 లక్షల నగదు, 80 సవర్ల బంగారం, వెండి ఆభరణాలు అపహరణ
english title: 
robbery

పంచాయతీ ఎన్నికలకు అధికారుల సమాయత్తం!

$
0
0

ఒంగోలు, జూన్ 7 : రాష్ట్రప్రభుత్వం ఏక్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాయంత్రాంగం సర్వం సిద్ధమైంది. అందులో భాగంగా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను జిల్లా పంచాయతీ అధికారులు సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 1028 పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియలో రాష్ట్రప్రభుత్వం మునిగితెలుతోంది. ఈనెల 15,16తేదీల్లో రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు అయ్యే అవకాశాలున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. రిజర్వేషన్ల జాబితావిడుదలైన తరువాత జిల్లాలో ఎన్నికల వేడి ప్రారంభంకానుంది. ఈపాటికే జిల్లాలో సహకార సంఘ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తన ఉనికిని కాపాడుకుంది. కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ఈదరమోహన్ విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో తన సత్తాచాటేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ, తెలుగుదేశంపార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల రెండవ విడత జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి తన సత్తాచాటినప్పటికీ నేతల్లో మాత్రం అంతర్గత కుమ్ములాటలు జోరందుకుంటున్నాయి. ఈ ప్రభావం పంచాయతీ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గాల్లోని వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఎవరికివారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో ఏమేరకు విజయం సాధిస్తారో వేచిచూడాల్సి ఉంది. పంచాయతీ, ఎంపిటిసి, జిల్లాపరిషత్ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం కావడంతో ఆయా రాజకీయపక్షాల నేతలు గ్రామాల్లోని ముఖ్యనేతలతో సమావేశం అవుతున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగితే ఏ నాయకుడు ఏ పార్టీకి చెందినవారో స్పష్టంగా అర్ధమవుతుందన్న ఆలోచనలో నేతలు ఉన్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలు జరిగితే గ్రామాల్లోని నేతలు రెండు నుండి మూడు గ్రూపులుగా విడిపోవటం, వారు ఆయా రాజకీయపార్టీలకు అండగా ఉండటం జరుగుతుంది. దీంతో రాజకీయపార్టీల బలబలాలు గ్రామాల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందో ఆ మెజార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో తమకు బలం ఉందని వైఎస్‌ఆర్‌సిపి నేతలు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వారి బలం ఎంతో తెలిసిపోనుంది.
అన్ని పార్టీలకు పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మాకంగా మారటంతో నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మొత్తంమీద వచ్చేనెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు అధికారవర్గాల సమాచారం.
పంచాయతీ ఎన్నికలు జరిగిన వెంటనే ఎంపిటిసి, జడ్‌పిటిసిలు ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మునిసిపల్ ఎన్నికలు జరగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది పొడువునా ఎన్నికలు జరిగే అవకాశాలుండటంతో ఆయారాజకీయపక్షాలకు చెందిన నేతలు, జిల్లా అధికారులు బిజిబిజిగా ఉండనున్నారు. మొత్తంమీద త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలపైనే నేతలు దృష్టిసారించారు.

* 15వతేదీ తరువాత రిజర్వేషన్ల జాబితా విడుదల
english title: 
panchayat elections
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>