Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

కొత్త మలుపు

$
0
0
అఫ్గానిస్తాన్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. గత పనె్నండేళ్లుగా సాగుతున్న తాలిబన్ వివాదం ఆసక్తికర పరిణామాలనే ఆవిష్కరిస్తోంది. అమెరికా జంట సౌధాలను కూల్చిన 9/11 అనంతరం అల్‌ఖైదా, తాలిబన్లను తరిమికొట్టాలన్న లక్ష్యంతో అమెరికా మొదలెట్టిన యుద్ధం ఇప్పటి వరకూ ఓ కొలిక్కి రాలేదు. అల్‌ఖైదా అధినేత లాడెన్ హతుడైనప్పటికీ ఆ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇంకా అనేక దేశాల్లో బీభత్సాన్ని సృష్టిస్తూనే ఉంది. ముఖ్యంగా అల్‌ఖైదాకు అండదండలందించిన ఒకప్పటి తాలిబన్లు నెమ్మదిగా అఫ్గాన్‌లోనే పుంజుకుంటున్నారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన జరగాలంటే తాలిబన్లతోనే చర్చలు జరపాలన్న వాదన నేపథ్యంలో అమెరికా ఇందుకు సిద్ధ పడటం అనేక కోణాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నదే. గత పనె్నండేళ్ల అఫ్గాన్ యుద్ధంలో తాము తాలిబన్లతో చర్చలు జరపడం అన్నది కొత్త మలుపేనంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించడం..అసలు అగ్రరాజ్య వ్యూహమేమిటన్న దానిపై అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇంత కాలం పోరాడిన తాలిబన్లతోనే అమెరికా చర్చలకు దిగడం ఆన్నది కర్జాయ్ సర్కార్‌కు మింగుడు పడటం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చర్చలు జరగడానికి వీల్లేదన్న తీవ్రత ఆయన మాటల్లోనూ, తీసుకున్న నిర్ణయంలోనూ కనిపిస్తోంది. ఎప్పుడైతే తాలిబన్లతో చర్చల యోచన తెరపైకి వచ్చిందో అమెరికాతో భద్రతా చర్చల్ని కొనసాగించేది లేదంటూ కర్జాయ్ తెగేసి చెప్పేశారు. అంతే కాదు, ఖతర్‌లో నిర్మించ తలపెట్టిన తాలిబన్ కార్యాలయం పట్ల కూడా ఆయ న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం..అఫ్గాన్-అమెరికాల మధ్య సయోధ్య స్థానే వివాదం చోటుచేసుకుంటోందని చెప్పడానికి నిదర్శనం. వచ్చే ఏడాది అఫ్గాన్ నుంచి నాటో దళాలు నిష్క్రమించాల్సి ఉంది. ఆ తర్వాత కూడా దేశ శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అమెరికా తన దళాలను కొనసాగించాలంటే..అఫ్గాన్‌తో జరుపుతున్న చర్చలు ఫలప్రదం కావాల్సిందే. అయితే.. మధ్యలో తలెత్తిన తాలిబన్ వ్యవహారం ఈ ప్రక్రియను ఏ మలుపుతిప్పుతుందో అంతుబట్టడం లేదు. అసలు తాలిబన్లతో చర్చల సాఫల్యతకు ఆస్కారం ఉందా లేదా అన్న విషయాన్ని నిర్థారించుకోకుండానే అమెరికా ఆ ప్రతిపాదన చేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాలిబన్లతో చర్చలకు అమెరికా ఎంత ఉత్సాహాన్ని చూపించిందో వారి నుంచి అంతే స్థాయిలో విఘాతక చర్యలు మొదలయ్యాయి. తాలిబన్లు జరిపిన దాడిలో నలుగురు అమెరికా సైనికులు మరణించిన నేపథ్యంలో అనంతర పరిణామాలు ఎలా ఉంటాయన్నదానిపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. అమెరికాతో శాంతి, భద్రతా చర్చల్ని నిలిపివేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కర్జాయ్ ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. తమతో ఓ పక్క శాంతి చర్చలు జరుపుతూనే తాలిబన్లతో మంతనాలు సాగిస్తామన్న సంకేతాలను ఒబామా ప్రభుత్వం వ్యక్తం చేయడం గందరగోళాన్ని సృష్టిస్తోందన్న కర్జాయ్ వాదన సరైనదే. ముఖ్యంగా అమెరికా మాటలకు, చేతలకు పొంతన లేదని చెప్పడం ద్వారా భవిష్యత్‌లో ఇరు దేశాల సంబంధాలపైనే అనుమానాలు రేకెత్తించింది. ముఖ్యంగా ఎమిరేట్స్‌లో ఏర్పాటు చేసిన తాలిబన్ కార్యాలయానికి ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్’అని పేరు పెట్టడాన్ని కర్జాయ్ ప్రభుత్వం తీవ్రంగానే నిరసిస్తోంది. 1996 నుంచి అఫ్గాన్‌ను పాలించిన తాలిబన్ ప్రభుత్వం ఇదే పేరుతో విదేశాల్లోని కార్యాలయాలను కొనసాగించింది. అయితే, 2001లో అమెరికా దాడి అనంతరం పతనమైన నేపథ్యంలో తాలిబన్ ఉద్యమ పీఠమే కదిలిపోయింది. అసలు తాలిబన్ ప్రభుత్వమే లేనప్పుడు కతర్‌లోని దాని కార్యాలయానికి ఇలాంటి పేరు పెట్టడమేమిటన్న అఫ్గాన్ వాదన ఎంతైనా సమంజసం. ఈ విషయంలో కర్జాయ్ అభిప్రాయం ఏమిటో అమెరికాకు తెలిసినప్పుడు అలాంటి పేరుతో తాలిబన్ల కార్యాలయం ఏర్పాటును అనుమతించడం ఏమిటన్న ప్రశ్న సహజంగా తలెత్తేదే! దీనితో పాటు గతంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా అమెరికా-అఫ్గాన్ సంబంధాల్లో అపశ్రుతులకు కారణమయ్యాయి. తాలిబన్లతో నేరుగా అమెరికా చర్చించడమంటే అఫ్గాన్‌లో తమ ప్రభుత్వ ఉనికిని విస్మరించడమేనన్నది కర్జాయ్ వాదన. మరో పక్క ఈ వారంలోనే తాలిబన్లతో చర్చలకు తాము సిద్ధమవుతున్నామని అమెరికా గట్టిగా చెప్పడం పరిస్థితిని మరింత సంక్షుభితంగా మార్చింది. అఫ్గాన్ శాంతికి సంబంధించి ఎలాంటి చర్చలు జరిపినా అవి దేశ రాజధాని కాబూల్ కేంద్రంగానే జరగాలి తప్ప కతర్ నుంచి మొదలు కాకూడదన్న కర్జాయ్ వాదన దేశ భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిందే. తన సొంత ఉనికి కోసం కర్జాయ్ ఎంతగా తాపత్రయ పడుతున్నా..అమెరికా దళాల మద్దతు లేనిదే ఒక్క రోజు కూడా మనుగడ సాగించలేరన్నది ఎంతైనా నిజం. తాజాగా బలాన్ని సంతరించుకున్న తాలిబన్లు ఇప్పటికే రోజువారీ దాడులతో ప్రభుత్వ ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. మరో పక్క అమెరికాతో చర్చలకు మార్గాన్ని సుగమం చేసుకుంటూనే..కర్జాయ్ ప్రభుత్వంతో కూడా తాము శాంతి చర్చలకు సిద్ధమని తాలిబన్లు ప్రకటించడం కొత్త మలుపు. ఇదే లక్ష్యంతో తాము కతర్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పడం కర్జాయ్ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే. తాలిబన్లతో అమెరికా చర్చలు జరిపినా, కర్జాయ్‌తో ఈ మాజీ పాలకులు మంతనాలకు దిగినా వాటి అంతిమ లక్ష్యం ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. ముఖ్యంగా అఫ్గాన్ కొత్త రాజ్యాంగానికి నిబద్ధమై పని చేయడానికి తాలిబన్లు సిద్ధంగా ఉన్నారా అన్నది అంతుబట్టడం లేదు. ఒక వేళ అఫ్గాన్‌లో మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారే అవకాశం లభిస్తే దాన్ని తాలిబన్లు ఎంతగా సద్వినియోగం చేసుకుంటారన్నదానిపైనే తదుపరి ఫలితాలు, పరిణామాలు ఆధారపడి ఉంటాయి. అఫ్గాన్‌ను కేంద్రంగా చేసుకుని ఇతర దేశాల భద్రతకు ముప్పు కలిగించే రీతిలో వ్యవహరించేది లేదంటూ తాలిబన్లు అమెరికాకు ఇచ్చిన హామీయే వారితో చర్చలకు ఆస్కారం ఇచ్చిందని భావించవచ్చు. అంతే కాదు, ఇంతకాలం అల్‌ఖైదాతో సన్నిహితంగా మెసిలిన తాలిబన్లు ఇక నుంచి ఆ ఉగ్రవాద సంస్థను పక్కన పెట్టేందుకూ వెనుకాడరన్న సంకేతాలను తాజా పరిణామాలు అందిస్తున్నాయి. ఇందుకు తాలిబన్లు తగిన నమ్మకాన్ని కలిగించే పక్షంలో ఇప్పటి వరకూ నిర్బంధించిన తాలిబన్ ఖైదీలను గ్వాటనామో నుంచి విడుదల చేయడానికీ అమెరికా వెనుకాడక పోవచ్చు. 2011లో మొదలైన శాంతి ప్రక్రియకు ఖైదీల విడుదల డిమాండే గండికొట్టింది. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నవాజ్ షరీఫ్ ప్రభుత్వ పాత్ర అత్యంత కీలకం కాబోతోంది. చర్చల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే కొద్దీ పాకిస్తాన్ పాత్ర ప్రాధాన్యత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే..అఫ్గాన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా వాటి ప్రభావం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భారత్‌పై అనివార్యంగానే ఉంటుంది. మొత్తం మీద తాలిబన్లతో అమెరికా చర్చల యోచన ఆ దేశ భవితవ్యాన్ని ఎలాంటి మలుపుతిప్పుతుందన్నది అందరి దృష్టిని ఆకర్షించే పరిణామం.
సంపాదకీయం
english title: 
kotha malupu

ప్రజల హక్కులకు అమెరికా ముప్పు!

$
0
0
అమెరికా సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఉద్యోగి ఎడ్‌వర్డ్ స్నోడెన్ ఈమధ్య ఒక సంచలానత్మక రహస్యాన్ని బయటపెట్టాడు. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అతిపెద్ద నిఘా సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఎ)...పౌర స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా కార్యకాలాపాలు నిర్వహించే విధానం నిజంగా భయం గొల్పుతున్నదని.. నిజంగా ఇది రాజ్యం పౌర స్వేచ్ఛను అడ్డుకోవడమేనన్నది ఆయన వెల్లడించిన విషయంలోని సారాంశం! అన్ని రంగాల్లోకి తన నిఘానేత్రాలను విస్తరింపజేసిన ఎన్‌ఎస్‌ఎ, వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను, టెక్స్ట్‌మెసేజ్‌లు, సెర్చ్ ఇంజెన్‌ల నిర్మాణ క్రమాన్ని, బ్యాంక్ రికార్డులు, ఈ-మెయిల్స్, ఇంటర్నెట్‌లో విదేశీయులు, అమెరికన్లు మాట్లాడుకునే మాటలను ట్యాప్ చేస్తున్నది. నిజంగా ఇది ప్రఖ్యాత రచయిత ఓర్‌విల్లన్ తన రచనల్లో భయంకలిగించే రీతిలో వివరించిన రీతిని తలపుకు తెస్తున్నదంటే అతిశయోక్తి కాదు. నెప్టానా కటారియా అనే మొక్క నుంచి వెలువడే ఒకరకమైన వాసన పిల్లులను ఆకర్షించినట్టుగా, ఎన్‌ఎస్‌ఎ కబంద హస్తాల గురించి స్నోడెన్ వెల్లడించిన అంశాలు, ప్రస్తుత అధికార వ్యవస్థను వ్యతిరేకించే సిద్ధాంతాలను అనుసరించే వారిని ఆకర్షించాయి. అమెరికాలో పనిచేస్తున్న వామ -పక్షాల కార్యకర్తలు, రైట్-వింగ్ సంప్రదాయవాదులు, సామాజిక-ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం కలుగజేసుకోకూడదని వాదించే లిబరిటేరియన్ల చేతికి స్నోడెన్ ఒక ఆయుధాన్నిచ్చినట్టయింది. ‘దేశీయ సమాజం, అంతర్జాతీయ సమాజం’పై అమెరికా ప్రభుత్వం చూపుతున్న ఆధిపత్యంపై స్నోడెన్ చూపిన దృష్టాంతం..ఎలక్ట్రానిక్ రంగంలో తాను సాధించిన ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకొని ప్రపంచ దేశాల్లోకి మరింత విస్తారంగా చొచ్చుకొని వెళ్ళే హక్కు అగ్రరాజ్యానికి ఎవరిచ్చారన్న ప్రశ్నను రేకెత్తిస్తున్నది. అంతే కాదు అమెరికా విపరీత చొరవ కారణంగా, వివిధ దేశాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి కూడా! తన డిజిటల్ నిఘా వ్యవస్థ ద్వారా, పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించిన దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉన్నదంటూ, ఎన్‌ఎస్‌ఎ బహిర్గతం చేయడంతో మన దేశం ఒక్కసారిగా నివ్వెరపోయింది. స్నోడెన్ తన హెచ్చరిక ద్వారా..ప్రజాస్వామ్య దేశాల్లో అత్యంత ప్రభావశీలంగా ఉన్న విలువలు- పత్రికా స్వాతంత్య్రం నుంచి ప్రైవేటు లావాదేవీలను రహస్యంగా నిర్వహించుకునే హక్కు వరకు- ఒక్కసారిగా ప్రమాదంలో పడిపోయాయన్న సత్యాన్ని ఆవిష్కరించాడు. అయితే సాధార ప్రజలను నియంత్రించడానికి ఉపయోగపడే ‘‘ఈ సమాచార సామ్రాజ్యంలో’’ అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థల పాత్ర ఏమిటనేది ఇంతవరకు అర్థంకాని విషయం. స్నోడెన్ బట్టబయలు చేసిన ఎన్‌ఎస్‌ఎ ‘పట్టకం’ ద్వారా కొనసాగుతున్న కార్యకలాపాల నిర్వహణలో.. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, దేశంలోని అగ్రగామి ఐటి సంస్థలైన మైక్రోసాఫ్ట్, యాహూ, గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్, స్కైప్ వంటి వాటి సహకారం తప్పనిసరిగా ఉంటుందనేది అక్షర సత్యం. వీటి సహాయం లేకుండా ఎన్‌ఎస్‌ఎ ఎట్టి పరిస్థితుల్లో ఇంతటి విస్తృతమైన కార్యానికి పూనుకోవడం దుస్సాధ్యం! ఈ సాంకేతిక సంస్థలు కావాలనే అమెరికా ప్రభుత్వంతో కుమ్మక్కై, తమ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ సమాచార వ్యవస్థలను, ప్రభుత్వానికి అందించడమే కాకుండా, ఎప్పటికప్పుడు అవసరమైన సేవలు కూడా అందిస్తున్నాయి. అంతేకాదు వాటి సర్వర్లను ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాయి కూడ! మరి ‘పెద్దన్న’ మన ఇళ్ళలో మాట్లాడుకునే ప్రతి పదాన్ని తెలుసుకొని దాన్ని పరిశీలించేంతటి స్థాయి డేటాను కలిగివుండాలన్న ఉత్సాహాన్ని చూపుతున్నట్లయితే, అప్పుడు ఈ కుట్రలో సహ భాగస్వామిగా నిలిచేది అమెరికాలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే! ఐటి సేవలందిస్తున్న కార్పొరేషన్లకు ఇప్పటి వరకు ‘పట్టకం’ అనే పదాన్ని వినివుండవు. కానీ స్నోడెన్ వెల్లడించిన ప్రకారం, అమెరికాలోని ప్రైవేటు రంగం, ఈ అపరిమిత సమాచారాన్ని అందించడంలో మాత్రం ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నదనేది సుస్పష్టం. ఈ దొంగచాటుగా సమాచారాన్ని సేకరించే ఈ పథకంలో, రెండోస్థాయి ప్రైవేటు కార్పొరేట్ రంగం కూడా ఉన్నది. నిజం చెప్పాలంటే స్నోడెన్ ‘బూజ్ అల్లెన్ హామిల్టన్’ అనే అటువంటి సంస్థలో పనిచేస్తున్నారు. అత్యంత సంక్లిష్టమైన అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించి ఈ సంస్థ అతిపెద్ద కాంట్రాక్టరు. అమెరికా ఇంటెలిజెన్స్ బడ్జెట్‌లో 70శాతం వరకు..రాజకీయంగా సన్నిహిత సంబంధాలున్న ప్రైవేటు కాంట్రాక్టు కంపెనీలైన..బూజ్, పలంటీర్ టెక్నాలజీస్ ఇన్‌కార్పొరేషన్, సైన్స్ అప్లికేషన్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ వంటి వాటి యజమానుల జేబుల్లోకే వెళుతుంది. స్నోడెన్‌కు అత్యంత గుప్తమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉన్నదంటే...దీని భావమేంటి? ఆయన పనిచేసే కంపెనీ వంటి సంస్థలకు ప్రధాన వినియోగదారుడు, అమెరికా ప్రభుత్వం! అందువల్ల ఈ కంపెనీలు సాధారణ అమెరికన్లు లేదా విదేశీయుల జీవితాలకు చెరుపు చేసే అవకాశాలే ఎక్కువ! అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సేకరించే సమాచారం వల్ల.. ఏవిధమైన నేర చరిత లేనివారిని, ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేని అమాయకులను తీవ్రమైన వేధింపులకు గురిచేయడం లేదా బెదిరించడం లేదా ఉగ్రవాదులుగా ముద్రవేయడం వంటివి జరిగే అవకాశాలే ఎక్కువ. ప్రజలను అణచివేసేందుకోసం దుష్ట రికార్డులు నిర్వహిస్తూ వస్తున్నదన్న అపప్రధ ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వంపైనే ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయి నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటైన హైబ్రిడ్ వ్యవస్థ నేడు అమెరికాలో కొనసాగుతుండటం సరికొత్త పరిణామం. అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఈవిధంగా ఏకమొత్తంగా ప్రైవేటీకరణ దిశగా పయనింపజేయడానికి అంతటి అత్యుత్సాహమెందుకో అర్థం కాదు. పరిశోధనాత్మక జర్నలిస్టు టిమ్ షోరోక్ తాను రాసిన ‘‘స్పైస్ ఫర్ హైర్ : ది సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఔట్ సోర్సింగ్’’ అనే పుస్తకంలో ఈవిధంగా తన వాదనను వినిపించారు, ‘‘ ప్రస్తుతం ఉగ్రవాద వ్యతిరేక పోరుకు అర్థవివరణ ఇచ్చే అతిముఖ్యమైన పదబంధం ..‘ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం’. ఇక్కడ భాగస్వామ్యం అనే సానుకూల పదాన్ని బహుళజాతి సంస్థలు ప్రయోగించడంలో ప్రయోజనాలు అనే అంతరార్ధం ఇమిడి ఉంది!’’ ప్రొఫెసర్ ఛాల్మర్స్ ఈవిధంగా వివరించారు..‘‘నిఘా సమాచారాన్ని సేకరించి విశే్లషించడాన్ని ప్రైవేటీకరించడం అనే అంశంపై అమెరికాలో కనిపిస్తున్న తడబాటు వల్ల, విదేశీ గూఢచారులు అమెరికా రహస్యాలను సేకరించే అవకాశాలను మరింతగా పెంచుతున్నాయి.’’ స్నోడెన్ ప్రస్తుతం చైనాలో తలదాచుకుంటున్నాడు. దీనిపై చైనా ప్రభుత్వ ఆధీనంలోని ‘గ్లోబల్ టైమ్స్’ వ్యాఖ్యానిస్తూ, అమెరికా కంప్యూటర్ల హ్యాకింగ్, సైబర్ వార్‌ఫేర్‌కు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని స్నోడెన్ నుంచి రాబట్టవచ్చునని పేర్కొంది. అయితే ‘ప్రతి నిఘా’ వ్యూహాన్ని ఇప్పటికే చైనా అనుసరిస్తున్నదన్నది బహిరంగ రహస్యం. ముఖ్యంగా యుఎస్ ప్రైవేటు భద్రతా సంస్థల్లో ‘మోల్స్’ను నెలకొల్పడం ద్వారా చైనా దీన్ని అమలు పరస్తుండవచ్చు. అమెరికా జాతీయ భద్రతా కార్యకలాపాలన్నింటిని ఏకమొత్తంగా ప్రైవేటీకరించడంలో ఉత్పన్నమయ్యే మరో సమస్య ఏమంటే.. ఏవిధమైన భాగస్వామ్యం లేని వారికి లేదా అమెరికా ప్రజలకు ప్రైవేటు సంస్థలు జవాబుదారీగా ఉండవు. ఇదే సమయంలో ప్రపంచ ప్రజల మధ్య కొనసాగే సమాచార లావాదేవీలన్నీ, రహస్యంగా వినడం వల్ల..వారు తీవ్రంగా మోసపోవడం జరుగుతుంది. నయా-సరళీకృత అమెరికాలో, నేడు ప్రభుత్వం చేస్తున్న అతిని, కార్పొరేట్ సంస్థల నేరాలను వేలెత్తి చూపేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఒబామా.. ‘ఈ-మెయిల్ తనిఖీల’పై సంప్రదాయ వాదులు తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రజల ఈ-మెయిల్స్‌ను తనిఖీ చేసే అమెరికా ఇన్‌కార్పొరేషన్ అపరిమిత అధికార పరిధిని ప్రశ్నించే సాహసం చేయకండి..అంటూ వ్యంగ్యాత్మక విమర్శలు చేస్తున్నారు. ఇక అమెరికాలోని ప్రైవేటు సెక్యూరిటీ కాంట్రాక్టర్లకు యుఎస్ కాంగ్రెస్‌లోని రెండు పార్టీల వారి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అంతేకాదు తమతో అత్యంత స్నేహంగా ఉండే స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రయోజనం కల్పించే స్థానిక ప్రాజెక్టులకోసం ప్రభుత్వం నిధులు సమకూర్చేలా చేయగలుగుతున్నాయి. ఒక పిశాచం మాదిరిగా ప్రభుత్వం పౌరుల రోజువారీ జీవితాల్లోకి అక్రమంగా ప్రవేశించడం ఇంకా ఎంతోకాలం కొనసాగకపోవచ్చు. ఎందుకంటే గత మూడు దశాబ్దాలుగా అధికారాన్ని క్రమంగా ప్రైవేటీకరిస్తూ వస్తున్న ప్రభుత్వం అందుకు జవాబుదారీగా ఉండటం లేదు. వీకీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ‘‘సైఫర్‌పంక్స్ : ఫ్రీడమ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్’’ అనే పుస్తకంలో.. ‘‘ఈ సరికొత్త డిజిటల్ నియంతృత్వం అంటే..కేవలం రాజ్యం నిఘా వ్యవస్థ, లాభాలే ఊపిరిగా పనిచేసే కార్పొరేట్ సంస్థలు వీలీనమైపోవడం మాత్రమే,’’ అని వ్యాఖ్యానించారు. అసాంజే..స్నోడెన్‌ను ఒక హీరోగా గొప్పగా పొగడటమే కాదు ఇంటర్నెట్ పుణ్యమాని ‘మన పక్క కిందనే సైనికుడు నిఘావేసి మనం మాట్లాడుకునే మాటలను వినే పరిస్థితి దాపురించింది,’ అంటూ విమర్శించారు. అయితే ఇక్కడ గూఢచారిగా వ్యవహరించే వారు సిఐఎకు చెందిన సివిల్ సర్వెంటు లేదా ఎంఐ6 కూడ కాదు..కానీ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేసే ఐటి వృత్తి నిపుణడు మాత్రమే. చైనాకు చెంది సైబర్ సైన్యంలో ఇప్పటికీ పురాతన ప్రభుత్వ బ్యూరోక్రసీకి చెందినవారు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ మన ప్రైవసీలోకి చొరబడే పాశ్చాత్య చొరబాటు దార్లు మాత్రం కార్పొరేట్ పోరాట యోధులు! ‘బలహీనులకు ప్రైవసీ, బలవంతులకు పారదర్శకత’ అనే సిద్ధాంతాన్ని అసాంజే చెబుతుంటారు. కానీ ఈవిధంగా ప్రభుత్వ- ప్రైవేటు సమిశ్రీత నిఘా వ్యవస్థ కొనసాగినంతకాలం దాన్ని సాధించడం సాధ్యంకాదు!
ఫీచర్
english title: 
feature
author: 
- శ్రీరాం చౌలియా

అంతరిస్తున్న ఒక వ్యవస్థ

$
0
0
‘‘ టెలిగ్రాం- బయటినుంచి ఆ కేక వినగానే ఆరోజుల్లో మొదట గుండెలు దడదడలాడేవి, ఏ దుర్వార్త అందుకోవలసి వస్తుందోనని.. శుభాశుభాలు రెండింటికీ ‘టెలిగ్రాం’ఇవ్వడం వున్నా, ఎందుకో ఎక్కువగా ‘టెలిగ్రాం’ కీడునే శంకించేది. ‘మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ’లాంటి వర్తమానాలు టెలిగ్రాం చేరవేసేది. అలాగే పరీక్ష పాసయినా, పిల్లలు పుట్టినా వెంటనే టెలిగ్రాం పంపేవారు. సెలవు పొడిగించాల్సి వస్తే ఉద్యోగి దూరప్రాంతం వెళ్లినప్పుడు తన ఆఫీసుకి టెలిగ్రాం ఇచ్చేవాడు. అలాగే దూరాభారంవల్ల ఆత్మీయుల పెళ్లికి వెళ్లలేకపోతే- వివాహ శుభాకాంక్షలు టెలిగ్రాం ద్వారానే పంపేవారు వధూవరులకు శుభాకాంక్షలు తెలుపమనేవారు. అదే విధంగా సానుభూతి సందేశాలు కూడా ‘టెలిగ్రాం’చేరవేసేది. ‘టెలి గ్రాం’ జనజీవన మమేకమై ఒకనాడు కథలు, నాటికలు, సినిమాల్లోకూడా ప్రధాన భూమిక పోషించేది. అలాంటి ‘టెలిగ్రాం’వ్యవస్థ జూలై ’15నుంచి సమూలంగా ‘రద్దు’ అవుతోందిట’’అన్నాడు రాంబాబు పేపర్ మడిచి టేబుల్‌మీద పెడుతూ. ‘‘నిజమే! అభివృద్ధిచెందిన సాంకేతికత టెలిగ్రాఫిక్ వ్యవస్థ అస్తిత్వాన్ని పూర్తిగాదెబ్బతీసింది. ఇవాళ సెల్‌ఫోన్లు, ఈమెయిల్స్ వచ్చాక ఉత్తరాలు, టెలిగ్రాంలు కనుమరుగయ్యాయి. ఆర్డినరీ టెలిగ్రాం, ఎక్స్‌ప్రెస్ టెలిగ్రాం, స్పీడ్‌పోస్ట్ వీటన్నింటి అవసరమూ మొబైల్స్, ఇంటర్నెట్ వచ్చాక తీరిపోయింది. క్షణాల్లో వర్తమానం చేరవేయడం, వెనువెంటనే ఏ విషయాన్నయినా కావలసిన వారితో మాట్లాడగలగడం ఆధునిక సాంకేతికాభివృద్ధి అందుబాటులోకి వచ్చాక, ‘టెలిగ్రాం’ పాతబడిపోవడంలో వింతేముంది! గత శుక్రవారం మా అత్తగారు పోయిన వార్త దూరంగా వున్న నాకు మా ఫణి ఫోన్‌చేసి చెప్పిన అయిదు నిమిషాల్లోగానే- నా మొబైల్‌కు ఇతరుల సంతాప సందేశాలు ఎస్సెమ్మెస్‌ల ద్వారానూ, నేరుగా సంభాషించడం ద్వారానూ అందాయంటే, ఒకప్పటి రోజులకీ ఇప్పటికీ ఎంత తేడాయో తెలియడం లేదూ! ‘టెలిగ్రాం’ద్వారా- చివరి చూపులకు రావలసిన వారికి వర్తమానం పంపడం, ఆ తరువాత మిగతావారికి ‘‘గం.్భ.స మా అత్తగారు లక్ష్మీబాయి 14వ తేదీ స్వర్గస్తులైనారని తెలియచేస్తున్నాను’’ అంటూ దశదినకర్మ వివరాలతో లేఖలు రాయడం, ఈ కాలంలో అవసరం లేదుకదా! అందరికీ ఎస్సెమ్మెస్‌లు ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ఫేస్‌బుక్‌లో అప్‌డేటింగ్ ద్వారా విషయం సెకండ్లలో పరివ్యాప్తం చేయచ్చు. ‘టెలిగ్రాం’ నిజంగానే అంతరించింది. కానీ ఆ వ్యవస్థ సమూలంగా అంతరించిపోతోందంటే ఏమిటోలానే వుంది. ఒక కోడ్ సంఖ్యద్వారా వంద రకాల వర్తమానాలు ‘టెలిగ్రాం’గా వెళ్ళే ఆరోజులు ఇక ముగిసిపోయినట్లేగా!’’ అన్నాను నేను. ‘‘ఏటా మూడువందలనుండి నాలుగువందల కోట్ల రూపాయల నష్టంతో టెలిగ్రాఫిక్ శాఖ నడుస్తోందిట. అంచేత భారత సంచార్ నిగమ్స్ లిమిటెడ్- ‘బి.ఎస్.ఎన్. ఎల్’, టెలిగ్రాం వ్యవస్థ రద్దుచేయడానికి నిర్ణయించింది. టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ ఆమోదం ఒక్కటే తరువాయి. అయితే టెలిగ్రాఫ్ ఉద్యోగస్తుల ఉద్యోగాలు తీసివేయమనీ, వారిని టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీచేస్తామనీ- హామీఇచ్చిందట. నిజానికి గత పదేళ్లుగా జనజీవనం నుంచి ‘టెలిగ్రాం’ పంపడం అనేది ఎప్పుడో తప్పుకుంది. 182కు పైగా టెలిగ్రాఫిక్ ఆఫీసులు పనిలేక గోళ్లుగిల్లుకుంటునే వున్నాయి. ‘టెలిగ్రాం’ పంపడం అంటే టెలిగ్రాం ఫారమ్‌లో పెన్నుతో రాయడం, ఆ పదాలనుబట్టి పదానికి ఇంత చొప్పున రుసుము లెక్కకట్టి, టెలిగ్రాం ఛార్జీలు వసూలుచేయడం వుండేది. మొదట్లో అందుకునే టెలిగ్రాంలు కూడా రాతలోనే వుండేవి. ఆ తరువాత టైప్ చేసిన స్లిప్పులతో వచ్చేవి. వెబ్ ఆధారిత టెలిగ్రాం సిస్టమ్‌గా 2010లో సాంకేతికంగా టెలిగ్రాంను అభివృద్ధిపరిచినా ప్రయోజనం కలగలేదుట. నిజానికి ఆరు దశాబ్దాల తరువాత 2011 మేలో టెలిగ్రాం ఛార్జీలు మార్పుచెందాయి. ఆదాయం పెంపుకై వారుచేసిన ప్రయత్నాలు ఏవీకూడా ఫలించలేదు. జనం ‘టెలిగ్రాం’అన్నదానిని మరిచిపోయినట్లే అయింది. మరి ఇక విధిలేని పరిస్థితుల్లో ఆ వ్యవస్థను వచ్చేనెల జూలై 15నుంచి పూర్తిగా రద్దుచేయడం జరుగుతోంది’’ అన్నాడు రాంబాబు. ‘‘విద్యుత్ సంకేతాల ద్వారా మొట్టమొదటగా టెలిగ్రాం అనేది కలకత్తానుండి డైమండ్ హార్బర్‌కు యాభై కిలోమీటర్ల దూరానికి తొలి ప్రత్యక్ష వేగవంతమైన వర్తమానంగా మన దేశంలో 1850 నవంబర్ అయిదున బట్వాడా అయింది. టెలిగ్రాం సర్వీస్ అనేది సాధారణ ప్రజానీకానికి కూడా 1855 ఫిబ్రవరి నుండి అందుబాటులోకి వచ్చింది. అప్పటినుంచి ‘టెలిగ్రాం’ అన్న పిలుపు పోస్ట్‌మ్యాన్ ద్వారా వాకిలిముందు వినిపిస్తే ఎన్ని గుండెలు దగదడలాడేయో! టెలిగ్రాం చింపి చదువుకుని విషాదంతో కృంగిపోయినవారు, ఆనందంతో పొంగిపోయినవారు, పరుగులు తీసినవారు ఎందరెందరో! ఆ తరం దాటి ‘ఈ’తరంలోకి వచ్చేసాం. ఉత్తరాలు రాసుకోవడం, టెలిగ్రాంలు పంపుకోవడం ఈ తరానికి అవసరమే లేదు. అయితే ఇప్పటికీ రక్షణ దళాలు, ఇంటలిజెన్స్ కమ్యూనిటీ టెలిగ్రాం వ్యవస్థపై ప్రత్యేక ప్రయోజనాలతో ఆధారపడే వ్యవహరిస్తున్నారు. మరీ మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు ‘టెలిగ్రాం’ కొంతమేరకు అస్తిత్వంలో వుంది. కానీ ‘టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ ఆమోదిస్తే బి.ఎస్.ఎన్.ఎల్. జూలై ’15నుంచి ‘టెలిగ్రాం’కు గుంటపెట్టి గంటవాయించేస్తుంది. ‘టెలిగ్రాం’ అన్నది ఇక గత చరిత్రగా మాత్రమే మిగిలిపోతుంది’’అంటూ చెమర్చిన కన్నులు తుడుచుకున్నాడు సుందరయ్య.
సంసారాలు
english title: 
samsaaralu

నైతిక ప్రమాణాల పతనం

$
0
0
జగన్ అక్రమ ఆస్తుల కేసు ఎ2 ముద్దాయి విజయసాయిరెడ్డికి తిరుమలలో అనవసర మర్యాదలు దక్కడంపై వ్రాయవలసి వచ్చినప్పుడు ముందుగా చైర్మన్ రాజుగారు మరియు కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం గారలవైపు చూపుడు వేలు పోతుంది. పూర్వజన్మ సుకృతం కారణంగా వారికి స్వామి సేవాభాగ్యం కల్గిందని భావించాలి మొదట. అపచారం జరుగుతున్నపుడు నివారించే ప్రయ త్నం చేయడం, కుదరనపుడు తప్పుకోవడం వంటివి స్వామి ధ్యానంలో ఈపాటికి వచ్చిన వుండాలి వారికి. తితిదే విషయంలో శ్రీ ఎన్టీఆర్ నెలకొల్పిన సత్ప్రమాణామాలు అనితర సాధ్యం. వైఎస్‌ఆర్ కాలంలో తితిదేలో ప్రారంభమైన ప్రమాణాల పతనం ఆయన కాలంచేసినా అట్లాగే ఉండడం దురదృష్టకరం. చివరగా- మీడియాకు చేసే ప్రార్థన ప్రముఖుల రాకపోకలు వ్రాయకుడీ! చూపకుడీ! సామాన్యులం తట్టుకోలేకున్నాం. - వి.ఆర్.ఆర్.ఎ.రాజు, వరంగల్ భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి హిందూ మతం నేడు విదేశీ కబంధ హస్తాలలో ఉంది. భారతదేశంలో పేదరికం, నిరుద్యోగం చేతగాని తనంలా తీసుకుని కొన్ని మిషనరీ సంస్థలు మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నాయి. ఇదో పెద్ద కమిషన్ వ్యాపారంగా తయారైంది. హిందూ దేవాలయాల దగ్గర, ప్రధాన కూడళ్ళలో మత మార్పిడి గాళ్ళు నిల్చుని వచ్చీపోయే వారిని నసపెడుతూ ప్రలోభాలకి గురిచేస్తూ మతం మార్చుకోమని సలహాలిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. భారతీయ సంస్కృతి అంతా హిందూ మతంపై ఆధారపడి ఉంది. హిందూ మతం చాలా విస్తారమైనది. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు వేదాంగములతో విస్తరించి ఉన్నది. అలాంటి మతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ హిందువు ప్రధాన కర్తవ్యం. ప్రలోభాలకి, డబ్బుకి అమ్ముడుపోకుండా భారతీయ సంస్కృతిని కాపాడాలి. మత మార్పిడులను పూర్తిగా నిషేధించాలి. మత మార్పిడి గాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. - ఆర్.శంకరరావు, దొండపర్తి ధరాభారంతో జనం సతమతం రాష్ట్ర చరిత్రలో స్వాతంత్య్రం సిద్ధించిన నాటినుండి నిత్యావసర సరుకుల ధరలు ఇంత ఎక్కువగా పెరిగి సామాన్య ప్రజానీకం బ్రతుకులు ఛిన్నాభిన్నం అయిన సంఘటనలు లేవేమో? బియ్యం, నూనె, పప్పులు, కూరగాయలు.. ఇలా నిత్యావసర సరుకుల ధరలు రాకెట్ స్పీడుతో పెరిగిపోతుంటే వాటిని నియంత్రించడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. రైతుల నుండి తక్కువ ధరలో కొనుగోలుచేసి, అక్రమ నిల్వలకు పాల్పడుతూ రేట్లు పెంచుకుంటూ దళారులు, వ్యాపారస్తులు కోట్లు గడిస్తుంటే, చట్టాలను అమలుచేసి ధరలకు కళ్లెం వేయాల్సిన అధికారులు, పాలకులు చోద్యం చూస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజానీకం పాలిట వరప్రసాదిని ప్రజాపంపిణీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసారు. ప్రజలకు, రైతులకు ఏ లోటూ రాకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం దులిపేసుకోవడం దారుణం. ప్రజల ఓట్లతో అధికార పీఠం అధిష్టించి, ప్రజల పన్నులతో సకల సౌకర్యాలు అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. - సి.సాయిమనస్విత, విజయవాడ అవగాహన అవసరం! ప్రజాస్వామ్య విధానంపై ఓటరు విజ్ఞత ధర్మరక్షణ ఆధారపడి వుంటుంది. తాను అడ్డదారిన నడిస్తే జాతి పురోగతి పతనం అవుతుంది. ఈ సమాజంలో ప్రతి ఓటరు నీతి మార్గాన నడుస్తుంటే ఏ దుష్టశక్తులు ఏమీ చేయలేవు. సమాజ సమగ్రతకు మనం దృఢ సంకల్పంతో మంచిగా కర్తవ్యం పాటించాలి. పౌర జీవనంలో సమాజ సమస్యల ప్రస్తావన ప్రజాస్వామ్యంలో లేకపోవడం దురదృష్టం! ఎన్నికలు కేవలం రాజకీయ వ్యవహారంగా తలంచే ఉపకరణం కాదు! ఓటరు అత్యంత బుద్ధివికాసంలో దేశశ్రేయస్సుకొరకు ఓటు వినియోగించాలి. రాజకీయాల నైతిక విలువలు ప్రతి పౌరుడు అర్ధంచేసుకోవాలి! అప్పుడే మార్పు వస్తుంది! ఓటరు మహశయులారా ప్రాథమిక హక్కుల విలువ గుర్తుయెరిగి విషపూరితమైన మార్గాలు అవలభించకుండా సక్రమైన పద్ధతియందు ఎన్నిక కార్యాచరణ యందు అందరు మమేకం కావాలి! - కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు లొసుగుల చట్టం కసబ్‌కు కోర్టు ఉరిశిక్ష వేసింది. రాష్టప్రతి వ్యతిరేకించిన క్షమాభిక్షపై రివ్యూ పిటిషన్ వేయడానికి కసబ్‌కు అవకాశం యివ్వక ప్రభుత్వం తప్పుచేసిందని ఓ లా ప్రొఫెసర్ ఓ ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసం రాసారు. చట్టంలో యిలాంటి లొసుగులు అనేకం ఉండబట్టే నేరస్తులు తప్పించుకు తిరుగుతున్నారు. న్యాయమూర్తులు నిస్సహాయులవుతున్నారు. ‘‘ద జడ్జ్ జడ్జస్ ఎకార్డింగ్ టు లా, బట్ హి కెనాట్ జడ్జి ద లా’’. - ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఉత్తరాయణం
english title: 
letters to the editor

నిత్య స్మరణీయుడు శివాజీ

$
0
0
సరీగ్గా 338 సంవత్సరాల క్రితం.. అంటే 1675లో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశినాడు సహ్యాద్రి పర్వతశ్రేణులలో ఉన్న రాయగఢ్‌లో ఛత్రపతిగా పట్ట్భాషిక్తుడైనాడు శివాజీ మహారాజు. సువిశాల భారతదేశంలోని సమస్త నదీనదాల నుండి తెచ్చిన పవిత్ర జలాలతో హైందవీ స్వరాజ్య పరిపాలకుని అభిషిక్తుడ్ని చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పరిపాలన చేస్తున్న రాజులు, సుల్తానులు కానుకలు సమర్పించుకున్నారు. మామూలుగా ఎవరో ఒక రాజు పట్ట్భాషిక్తుడైతే అందులో అట్టహాసం ఉండవచ్చును గాని విశేషమేముంటుంది? కాని శివాజీ పట్ట్భాషేకంలో అన్నీ విశేషాలే. శివాజీ పుట్టుకతో రాజవంశంలో పుట్టినవాడు కాదు. రాజ్యం వారసత్వంగా సంక్రమించిందీ కాదు. ఈ దేశం పరాయి పరిపాలకుల పద ఘట్టనలో నలిగిపోతుంటే, స్వధర్మం, విగ్రహాలు, విధ్వంసకుల వికృత చర్యలకు రూపుమాసిపోతూ ఉంటే, నడి వీధుల్లో గోమాతలు నిత్యం హత్య చేయబడుతుంటే, ఈ దారుణ కృత్యాలకు అడ్డుకట్టవేయడానికి ప్రతినబూనిన సామాన్య మానవుడు శివాజీ. ఆయన తండ్రి బహమనీ సుల్తానులవద్ద కొలువున్న చిన్న సర్దారు. కాబట్టి చిన్ననాడే ఆయుధ విద్యలను అభ్యసించాడే గాని, అక్షరాలను నేర్వలేదు. అయినా తల్లి జీజీబాయి చెప్పిన రామాయణ, భారత ఇతిహాసాల కథల ద్వారా శివాజీకి లభించింది కాలక్షేపం కాదు, కార్యాచరణకు ముందుకు దూకించే ప్రేరణ. అందుకే తోటి బాలురతో సైన్యాన్ని సమకూర్చుకొని తోరణ దుర్గ విజయంతో హైందవ స్వరాజ్య స్థాపనకు విజయ తోరణాన్ని కట్టాడు శివాజీ. తురుష్కుల దండయాత్రకు పూర్వం ఎంతో వైభవోపేతంగా వున్న భారతదేశం కపట యుద్ధాన్ని ఎరుగదు. సమాన స్థాయి వారితోనే యుద్ధం. పగటిపూట మాత్రమే యుద్ధం. గ్రామాలలోని సామాన్య ప్రజానీకం మీద యుద్ధంయొక్క దుష్ప్రభావం పడేది కాదు. తురుష్కుల దండయాత్రపై నియమాలకు విరుద్ధంగా నడిచింది. శత్రువు ఏమరపాటుగా ఉన్నపుడు దొంగదెబ్బ తీయటంలోనే వారి నేర్పు గోచరవౌతుంది. ఓడిపోయినప్పుడల్లా కాళ్ళావేళ్ళాపడి శరణు పొంది, ఒక చిన్న అవకాశం దొరికితే చాలు ఇక్కడి రాజులను క్రూరంగా చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం, అంతటితో ఆగకుండా గ్రామాలపైబడి దోచుకోవటం, దేవాలయాలను ధ్వంసంచేయటం, స్ర్తి బాల వృద్ధులచే విచక్షణ కూడా లేకుండా మారణ హోమం సాగించటం తురుష్కుల దండయాత్రలలో సర్వసామాన్య విషయాలు. శివాజీకి ముందు దేశరక్షణకై పూనుకొన్నవారు దేశరక్షణలో తమ ప్రాణాలను బలిదానం చేయటంలోనే ధన్యత ఉందని భావిస్తూ శత్రువుకు వెన్నుచూపకుండ వీరోచితంగా ధర్మయుద్ధం చేస్తూ మరణిస్తూ ఉండగా- జన్మధన్యత చాలదు, సాఫల్యం కూడా కావాలి. అంటే విజయాలు సాధించాలి. అందుకై ముల్లునుముల్లుతో తీయాలి అని భావించి గెరిల్లా యుద్ధంలో మొగలాయిలకు, బహమనీ సుల్తానులకు వారి భాషలోనే సమాధానం చెప్పిన రాజనీతి చతురుడు శివాజీ. అయితే అలాంటి సమయంలో కూడా స్ర్తిల పట్ల, బాలల పట్ల, ప్రార్థనా స్థలాల పట్ల, పవిత్ర గ్రంథాల పట్ల కించిత్తుగూడ అన్యాయం గాని, అక్రమం గాని జరుగకుండా శ్రద్ధవహించి హైందవీయుల ధర్మపరిపాలనకు నిదర్శనంగా నిలిచినవాడు శివాజీ. మరి అటువంటి వ్యక్తిని, ఆయన పట్ట్భాషిక్తుడైన స్ఫూర్తిప్రద ఘట్టాన్ని స్మరించుకొని ఆ వెలుగులో మన కర్తవ్యాన్ని రూపొందించుకోవటం మన కర్తవ్యం.
సబ్ ఫీచర్
english title: 
sub feature
author: 
- గౌరుగారి గంగాధరరెడ్డి

రాశిఫలం 22-06-2013

$
0
0
Date: 
Saturday, June 22, 2013 (All day)
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి
వృశ్చికం: 
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
మేషం: 
మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ధననష్టంపట్ల జాగ్రత్త వహించాలి. నూతన కార్యాలు వాయిదా పడతాయ. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
వృషభం: 
బంధు, మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని అనుభవిస్తారు.
మిథునం: 
స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు.
కర్కాటకం: 
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చగుటచే ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.
సింహం: 
అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు.
కన్య: 
అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు.
తుల: 
స్థిరాస్తుల విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండాలి. దైవ ప్రార్థన చేస్తారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినచో అనారోగ్య బాధలుండవు.
ధనుస్సు: 
ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
కుంభం: 
తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి.
మీనం: 
గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తి మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగి వుంటారు. బంధు మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు.
దుర్ముహూర్తం: 
ఉ.06.00 నుండి 07.36 వరకు
రాహు కాలం: 
..
వర్జ్యం: 
ఉ.11.02 నుండి 12.32 వరకు
నక్షత్రం: 
అనూరాధ ఉ.05.43 తదుపరి జ్యేష్ఠ రా.04.08
తిథి: 
శుద్ధ చతుర్దశి రా. 07.40
మకరం: 
ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు.వ్యతిరేక ఫలితాలు కలుగకుండా చూసుకోవాలి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది.

22-06-2013

$
0
0
crossimage: 
Date: 
Saturday, June 22, 2013

పరిచయం..

$
0
0
సమాజ పరిణామంలో వర్గం పాత్ర, ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే రచనల సంకలనం ఇది. సమాజంలో వ్యక్తులకు, సమూహాలకు లింగ, వర్ణ, జాతి, మతం, ప్రాంతం తదితర పలు రకాల గుర్తింపులుంటాయి. ఇవేవీ ఉన్నప్పటికీ అన్నింటిలోకి కీలకమైనది వర్గమే. ఎందువల్లనంటే ఏ సమాజ వౌలిక స్వభావం అయినా అది ఏ ఉత్పత్తి విధానం మీద ఆధారపడింది అన్న విషయంపైనే నిర్ధారింపబడుతుంది. ఒక వ్యక్తి ఆ సమాజంలోని ఉత్పత్తి శక్తులతో ఎలాంటి సంబంధం ఉంది అన్న అంశంపై ఆ వ్యక్తి ఏ వర్గానికి చెందాడన్నది తెలుస్తుంది. సమాజం సమూలంగా మార్పు చెందడంలో వౌలిక పాత్ర వహించేది వర్గాలు, వర్గ పోరాటమే. రకరకాల అస్తిత్వ వాదాలు ప్రాచుర్యంలోకి వచ్చి, విచ్ఛిన్న వేర్పాటువాద ఉద్యమాలకు సైతం ఊతమిస్తున్న నేటి తరుణంలో వర్గ విశే్లషణ ప్రాధాన్యత ఎంతైనా ఉంది. దానికి ఈ పుస్తకం సముచితమైన రీతిలో ఉపయోగపడుతుంది. దీనికి ఉపయోగపడే అంశాలను ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు పుస్తకాల నుండి సేకరించి పొందుపరిచారు. దీనిలో మొదటిగా 1980 నాటి సోవియట్ ప్రచురణ ‘వర్గాలు, వర్గ పోరాటం అంటే ఏమిటి?’ అనే దాని నుండి ప్రధానమైన కొన్ని అధ్యాయాలను తీసుకున్నారు. * వర్గాలు-వర్గ పోరాటం సంకలనం -కారల్ మార్క్స్ -పి.సుందరయ్య ప్రజాశక్తి బుక్ హవుస్ ఎంహెచ్‌భ వన్, ప్లాట్ నెం.21/1, అజామాబాద్, ఆర్‌టిసి కళ్యాణ మండపం దగ్గర, హైదరాబాద్ - 20 040-27660013
సమాజ పరిణామంలో వర్గం పాత్ర, ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి
english title: 
parichayam

పద్య ప్రియులకు హృద్యమైన ప్రబంధం

$
0
0
చెంచులక్ష్మీ కల్యాణము కవి: శ్రీరామడుగు వెంకటేశ్వరశర్మ, వెల: 100/-, ప్రతులకు: విశాలాంధ్ర ఇంకా మేనేజింగ్ ఎడిటర్, నది- అగ్రిగోల్డ్ మల్టిమీడియా, 26-20-44, సాంబమూర్తిరోడ్, గాంధీనగర్, విజయవాడ-3. ఇదొక పద్య ప్రబంధము. కవి బ్రహ్మశ్రీ డాక్టర్ రామడుగు వెంకటేశ్వరశర్మ. ఇతివృత్తం సుప్రసిద్ధం- రెండుసార్లు తెలుగులో చలనచిత్రంగా కూడా వచ్చింది. ఈ మూలకథకు పౌరాణికాధారము మృగ్యము. స్థల పురాణమో కవిప్రోక్తమో జానపద భావనయో ఆధారము. ప్రహ్లాద సంరక్షణకై నృసింహుడు ఉగ్రరూపంలో అవతరించాడు. రాక్షస సంహారం జరిగినా అవతార శాంతి జరుగలేదు. అందువల్ల శ్రీ మహాలక్ష్మియే బింబ ప్రతిబింబ భావముతో చెంచులక్ష్మిగా అవతరించి నరసింహుణ్ణి మురిపించి మరపించిన ఐతిహ్యము. ఇది జానపద గాథ కావటంవల్ల వనచర వృత్తాంతము వారి జీవనశైలి బహుభార్యాత్వము వంటివి కన్పడుతాయి. నేటికీ శ్రీశైలం అడవులలోని చెంచులు మల్లన్నను తమ అల్లునిగా భ్రమరాంబను తమ కూతురుగా భావించి కల్యాణోత్సవ సందర్భంలో తలంబ్రాలు పంపే ఆచారం ఉంది. అంటే వనచరులను ప్రధాన భారతీయ జీవన స్రవంతిలో అంతర్భాగం చేయడానికి కవి పుంగవులు కల్పించిన రచనలుగా భావనలుగా కల్పనలుగా వీటిని భావింపవలసి ఉంటుంది. ఈ గ్రంథ రచయిత ఆధునికుడు. కాని కృతి ప్రాబంధికము. పేరు చెప్పకపోతే ఏ పదహారవ శతాబ్దపు కవియో రచించాడని మనము భ్రమింపవలసి ఉంటుంది. ఈ గ్రంథము ఒక స్పర్థలో బహూకృతినందింది కూడా. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి చెప్పినట్లు ‘‘్ధరాళమైన శైలిని నిర్దుష్టమైన ధార లలిత సుందరమైన భావన ఈ గ్రంథమునకు అలంకారములై’’ విరాజిల్లుతున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో నృసింహ క్షేత్రముల సంఖ్య నృసింహోపాసకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇది ఐదు అశ్వాసముల సంప్రదాయ ప్రబంధము కవికథా సందర్భ ఔచిత్యాన్నిబట్టి స్వాగతము, ఉత్సాహము వంటి వృత్తములను ప్రయోగించారు. ఇందులో (99వ పుట) చెంచులక్ష్మి, ఆదిలక్ష్ముల మధ్య జరిగిన సవతి పోరు హాస్య రస స్ఫోరకంగా ఉంది. ఒకరు కొంగ అయితే మరొకరు హంస, ఒకరు సింహమయితే మరొకరు గజము. ఇలా సంవాదము సాగింది. ‘‘చెట్టు లెక్కగలవా? నరహరి పుట్టలెక్కగలవా?’’ అనే జానపద గేయము తెలుగువారికి సుప్రసిద్ధమే కదా? తెరతీయన్ విలసిల్లెనంత నదిగో దేదీప్యమానంబుగా కరమాశ్చర్య స సంభ్రమ భ్రమల వేడ్కనముంచు నమ్మాయ యన్ తెరనే తీయగలట్టి యాహరి యె తత్ దృశ్యంబునేకైతవాతెఱకున్ శక్యమె విప్ప నూరెఱుగ మత్త్భేంబునెక్కించెదన్ (79వ పుట. చతుర్థాశ్వసము, వివాహ వర్ణన) ఈ పద్యము మత్త్భే వృత్తములో ఉండటం కవియొక్క ప్రౌఢత్వాన్ని సూచిస్తున్నది. సంస్కృత కావ్యాలల్లో స్ర్తి పాత్రలకు ప్రాకృతం వాడటం సంప్రదాయం. ఇందులో చెంచులక్ష్మికి తన చర వ్యావహారికం వాడారు. ‘‘ఏను ఎవ్వురైతేను నీకేల- పోర- బుంగమీసాల నామాల పోరగాడు! ఏదయిన సూస్తె కొంపకొల్లేరె ఇంక సేరకుర- నన్ను కోరల సిన్నవాడ’’ (45వ పుట) ఇక్కడ ‘కొంపకొల్లేరు’ అనేది ఒక తెలుగు సామెత- వెంకటేశ్వరశర్మ నృసింహానుగ్రహం కలవారు. కాబట్టే ఈ యుగంలో ఇలాంటి రచన చేయగలిగారు. పద్యము హృద్యమని నిరవద్యమని అజరామరనీ మళ్లీ ఆ కాలంలో నిరూపించారు. మద్యప్రియులు టుమ్రీలను ఆదరించినట్లే పద్యప్రియులు హృద్యంగా ఈ కృతిని సుకృతిని బహూకృతిగా ఆదరిస్తారు. దీనిపేరే కల్యాణము. కాబట్టి ఇది కల్యాణకారకము.
ఇదొక పద్య ప్రబంధము.
english title: 
padya priyulu
author: 
-ముదిగొండ శివప్రసాద్

భౌతికవాద దృక్పథంపై సమగ్ర విశ్లేషణ

$
0
0
‘‘మన తాత్త్విక వారసత్వం’’ (వ్యాసాలు) ఎం.వి.ఎస్.శర్మ, ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, హైదరాబాద్. వెల: రూ.100 భారతదేశ తాత్త్విక సంప్రదాయం ఆధ్యాత్మికమేనన్న భావన స ర్వత్రా వ్యాపించిపోయింది. ఇక్కడ అంతా పరలోకం గురించి ఆలోచించేవారే తప్ప ఇహలోకం గురించి, భౌతిక విషయాల గురించి పట్టించుకోరన్న భావన అధికంగా వుంది. భౌతికవాదం అంటే అదేదో పాశ్చాత్య సిద్ధాంతం అని చిన్నచూపు చూసే ప్రచారం కూడా జరుగుతున్నది. నిజానికి మన దేశపు తాత్త్విక వారసత్వం ఆధ్యాత్మికవాదం కాదు. అది మన ప్రాచీన తాత్త్విక సంపదలో చిన్న భాగం మాత్రమే. మన తాత్త్విక సిద్ధాంతాల్లో ప్రధానమైన ధోరణి భౌతికవాదమే. ఉత్తర మీమాంస తప్ప తక్కిన షడ్దర్శనాలు భౌతికవాద దర్శనాలే. ఇవిగాక లోకాయతం, బౌద్ధం, జైనం కూడా భౌతికవాద దర్శనాలే. పశ్చిమ దేశాల్లో తాత్త్విక భావాలింకా రూపుదిద్దుకోని కాలంలోనే మన దేశంలో సుసంపన్నమైన భౌతికవాదం రూపొందిందన్న వాస్తవాన్ని విస్మరించడం సరియైనది కాదు. హేతువాదం, తార్కికత ప్రధానంగా కొనసాగే భౌతికవాద ధోరణులు ప్రబలితే ప్రజలు తెలివిమీరిపోతారన్న భయంతో పాలకులు వాటిని అణచివేసి భావవాద లేదా ఆధ్యాత్మికత ధోరణులను ప్రోత్సహిస్తూ వచ్చారు. దేవుడు, వేద ప్రామాణ్యం పేరిట భావ వాదాన్ని పెంచి పోషించగా, వాటిని వ్యతిరేకించిన భౌతికవాద ధోరణులను నాస్తిక మతంగా ప్రచారం చేసి అణచివేయడానికి ప్రయత్నించారు. భారతదేశ తాత్త్విక సంప్రదాయంలో బలమైన భౌతికవాద ధోరణులున్నాయనీ, ఈ ధోరణులు ఆధ్యాత్మికత లేదా భావవాద ధోరణులతో తీవ్రంగా పోరాటం చేశాయని డిడి కోశాంబీ, దేవీప్రసాద్ ఛటోపాధ్యాయ లాంటి ప్రగతిశీల చరిత్రకారులు, తత్త్వవేత్తలు తమ రచనల ద్వారా నిరూపించారు. తెలుగులో ఏటుకూరి బలరామమూర్తి లాంటివారు కొంత చేసినప్పటికీ భారత తాత్త్విక సిద్ధాంతాల గురించిన రచనలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకతను ఎం.వి.ఎస్.శర్మగారు గుర్తించారు. అది మానవ దశనుండి మానవుడిలో పొడసూపిన భౌతికవాద ధోరణులతో ప్రారంభించి క్రమంగా వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, స్మృతులు, షద్దర్శనాలు, ఇతర భారతీయ మతాలలో చోటుచేసుకున్న భౌతికవాద దృక్పథాన్ని వివరించారు. 19వ శతాబ్దంలోని కొంతమంది తాత్త్వికుల కృషిని కూడా చివరన తెలియజేశారు. క్లిష్టమైన తత్త్వశాస్త్ర విషయాలను వ్యాసాలుగా విభజించుకొని సులభశైలిలో ఆసక్తికరంగా తెలియజేసిన విధానం బాగుంది. భారత తాత్త్విక సంప్రదాయం గురించి ఒక సమగ్రమైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
భారతదేశ తాత్త్విక సంప్రదాయం ఆధ్యాత్మికమేనన్న
english title: 
vishleshana
author: 
-కె.పి.

ఇతివృత్తం అస్తవ్యస్తం..

$
0
0
పవిత్ర - సాంఘిక నవల రచన: బి.సులోచన ప్రథమ ముద్రణ: 2013 వెల: రూ.60/- ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్,ఇతర పుస్తక కేంద్రాలు. ఇదొక విచిత్రమైన నవల. మామూలుగా మనం చూసే అంతంతమాత్రపు తెలుగు సినిమాలలో మాదిరిగానే ఇందులో కథ నడుస్తుంది. కథానాయకురాలు పవిత్ర అందాల రాశి. పైగా బుద్ధిమంతురాలు. కాలేజీలో ఈ అప్సరసను చూడగానే హీరో కళ్యాణ్ ప్రేమలో పడతాడు. మర్నాడు ఆ సంగతి తెలుసుకొని పవిత్ర తను కూడా ప్రేమలో పడుతుంది. హీరోయిన్‌ది మధ్యతరగతి కుటుంబం. హీరో కోటీశ్వరుల కుమారుడు. ఈయన తల్లి మహిళామండలి అధ్యక్షురాలిగా కాలక్షేపం చేస్తుంటుంది. తండ్రి పెద్ద వ్యాపారస్తుడు. భార్య ఉండగా ఆయన మరో మహిళతో సంబంధం పెట్టుకుంటాడు. ఫలితంగా కొడుకులతో తిట్లు తింటుంటాడు. వ్యక్తిత్వం అనేది ఎక్కడా కనపడని రకరకాల పాత్రలు పుస్తకంలో దర్శనమిస్తాయి. ఫైటింగు సీన్లు కూడా ఉంటాయి. కాబోయే అత్తగారికోసం- అంటే హీరో తల్లికోసం హీరోయిన్ చేసే మహత్తరమైన త్యాగం పుస్తకం చివరలో కనిపిస్తుంది. ఈ పుస్తకంలో పాత్రలైతే అనేకం ఉన్నాయి గాని, ఎవరికీ సరైన వ్యక్తిత్వం కనపడదు. పుస్తకం చదివి నేర్చుకోవాల్సిన అంశాలేవీ లేవు. రచయిత్రికి కల్పనాచాతుర్యం ఉంది. శైలికూడా బాగుంది. సన్నివేశాల రూపకల్పన సరిగాలేదు. పైగా సంభాషణలలో స్పష్టత లోపించింది. ఏ నవలకైనా ఇతివృత్తం ముఖ్యం. ఈ పుస్తకంలో అదే సరిగ్గాలేదు.
ఇదొక విచిత్రమైన నవల.
english title: 
pavithra
author: 
- ఎం.వెంకటేశ్వరశాస్ర్తీ

విద్యార్థుల చెంతకు ‘అంతరిక్షం’

$
0
0
అంతరిక్షంలో అద్భుతాలు- ఐదు విజ్ఞానశాస్త్ర రూపకాలు- డా.వి.వి.వెంకటరమణ, పుటలు: 94; వెల: రూ.100/-, ప్రతులకు: కె.వెంకటలక్ష్మి, 201, ఆర్.కె.యునైటెడ్ రెసిడెన్సీ, సలీంనగర్ కాలనీ, న్యూమలక్‌పేట, హైదరాబాదు- 500036, ఫోను: 24540574. విషయాలు తెలుసుకోడానికి ఎంత శ్రమపడాలో, తెలుసుకున్న విషయాలు ఇతరులకు తెలియచేయడానికి అనేక రెట్లు శ్రమపడాలి. సామాన్య విషయాలను గురించి రాయడం ఒక ఎత్తు అయితే, క్లిష్టమయిన సాంకేతిక అంశాలు, వైజ్ఞానిక వివరాలు గురించి రాయడానికి విషయ పరిజ్ఞానమొకటే చాలదు. సామాన్యులకి అర్థమయ్యే సులభమైన పద్ధతిలో చెప్పగలిగిన నేర్పు, ఓర్పు ఉండి తీరాలి. ఈ రెండూ ఉన్న డా.వి.వి. వెంకటరమణ రాసిన అంతరిక్షంలో అద్భుతాలు (ఐదు విజ్ఞానశాస్త్ర రూపకాలు) పుస్తకం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రూపకాలన్నీ కూడా ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. పిల్లల మాసపత్రిక ‘చెకుముకి’లో కూడా ప్రచురింపబడ్డాయి. ఈ పుస్తకంలో అయిదు రూపకాలున్నాయి. ‘ఈతరం విజేత- సైన్సు’ రూపకంలో మానవ జీవితంతో పెనవేసుకుపోయిన విజ్ఞానశాస్త్ర అంశాలను వివరిస్తుంది. చంద్రుడి గురించిన వివరాలు, ఆ గ్రహంమీద మానవుడు పాదం మోపడానికి తోడైన పరిశోధనల వివరాలున్నాయి. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, యూరీగగారిన్, అపోలో 1 ప్రమాదం, కమాండ్ మాడ్యూల్ లూనార్ మాడ్యూల్, చంద్రుడి మీద షికారుచేసిన లూనార్ రోవర్-1 తదితర వివరాలున్నాయి. రెండవ రూపకం ‘నవతరానికి కమ్యూనికేషన్స్’లో ఆధునిక సమాచార సాంకేతిక విప్లవం తీరుతెన్నుల గురించిన ప్రస్తావనలున్నాయి. రష్యా ప్రయోగించిన స్పుత్నిక్ 1, జియోసెంట్రిక్ కక్ష్య, జియోసింక్రనస్ కక్ష్య, ఆర్యభట ఉపగ్రహం, ఇన్‌సాట్ ప్రాజెక్ట్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, జగదీశ్ చంద్రబోసు పరిశోధనలు తదితర వివరాలున్నాయి. 1906లో జరిగిన తొలి రేడియో ప్రసారం అందించిన రెనాల్డ్ ఫెస్సిండస్, లీడె ఫారెస్ట్‌ల ప్రస్తావన కూడా ఉంది. జి.పి.ఎస్. ఇంటర్నెట్, విడియో చాట్, శాటిలైట్ నెట్‌వర్క్, లోకల్ ఏరియా నెట్‌వర్క్, వైడ్ ఏరియా నెట్‌వర్క్, బ్రాడ్‌బ్యాండ్‌ల పరిచయం కూడా ఉంది. తదుపరి రూపకం ‘అంతరిక్షంలో అద్భుతాలు’లో అమెరికాలోని కేప్‌కెనె్నడీ అంతరిక్ష కేంద్రం వివరాలు చోటుచేసుకున్నాయి. స్పేస్‌షటిల్ ప్రయోగించడం చూడడంకోసం టిక్కెట్లు కొనుక్కోవచ్చునన్న వివరణ ఆసక్తికరంగా ఉంది. సోవియట్ రష్యా స్థాపించిన శాల్యూట్, మిర్ అంతరిక్ష కేంద్రాలని గురించి కూడా తెలుసుకోవచ్చు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యూరోప్, రష్యా, జపాన్, కెనడా, అమెరికా దేశాల భాగస్వామ్యంతో ఏర్పడడం నిజమైన ‘అంతరిక్షంలో అద్భుతం’ అనడం అతిశయోక్తికానేరదు. నాలుగవ రూపకం ‘ఈతరం విజేత సైన్స్’ రూపకం, అనేక రంగాలలో సాధించిన విజయాలను భావితరాలకు పరిచయం చేసింది. ప్లాస్టిక్‌నుంచి మూల కణాలదాకా, డి.ఎన్.ఏ నించి ఓపెన్‌హార్ట్ సర్జరీదాకా, కాన్సర్ నించి నానోటెక్నాలజీ, జీవోత్పత్తి విషయాలు సరళమైన భాషలో చెప్పడం జరిగింది. ఆఖరిదైన ‘విజ్ఞానశాస్త్రంలో భారతదేశ ప్రగతి’ రూపకం, విజ్ఞానశాస్త్రంలో పరిశోధనలు చేసి ప్రగతిని సాధించాలంటే, విదేశాలకు వెడితేనే సాధ్యమనే దురభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేసింది. రేడియో తరంగాల గురించి అన్ని దేశాలకన్నాముందు భారతదేశంలో విజయవంతమైన ప్రయోగాలు జరిగాయి. మూలకణాల ద్వారా అవయవాలను రూపొందించడం, మిస్సైల్ రంగంలో స్వయం సమృద్ధి, సాగర గర్భ పరిశోధనలు, డి.ఎన్.ఏ. పరిశోధనలు ఔషధీయ మొక్కలు, శాటిలైట్లు, సూపర్ కంప్యూటర్ తదితర రంగాలలో సాధించిన ప్రగతి చదువరులకు అవగతమవుతుంది. విజ్ఞానశాస్త్రంలో రోజూ అనేక కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. రచయిత ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని తాజా అంశాల్ని కూడా వివరించడం ముదావహం. ఏం చెప్పామన్న దానికన్నా, ఎలా చెప్పామన్నది ముఖ్యం. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు, భారతదేశంలో పరిశోధన చేయాలని వచ్చిన విదేశీ విద్యార్థి, అతని గురువు, ఇతర విద్యార్థుల మధ్య జరిగిన సంభాషణ, రైలుప్రయాణంలో సహ ప్రయాణికుడైన ప్రొఫెసర్‌తో సంభాషణ, స్వదేశీ విదేశీ గురువులు వారి శిష్యుల సంభాషణల ద్వారా అవగాహన పెంచే ప్రయత్నం జరిగింది. ఆకాశవాణి శ్రోతలకోసం రాసిన రూపకాలు చదవడం అంతే సాఫీగా సాగనప్పటికీ, పోటీ పరీక్షలకి సిద్ధపడుతున్న విద్యార్థులకి ఈ పుస్తకం కరదీపికగా ఉపయోగపడుతుంది.
విషయాలు తెలుసుకోడానికి ఎంత శ్రమపడాలో
english title: 
wonders of space
author: 
-పాలంకి సత్యనారాయణ

నిరసన రాగాలు.. విమర్శల బాణాలు..

$
0
0
‘‘బాపూ రమణా’’ (ద్విశతి) అక్కిరాజు సుందరకృష్ణ, పేజీలు: 48+52, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలలో ప్రజలకు నీతి బోధ చేసే శతకములు తెలుగునాట విస్తృత ప్రచారంలో వున్నాయి. నీతి బోధనే కాకుండా భక్తి, శృంగార, వైరాగ్యాలను తెలిపేందుకు శతక ప్రక్రియను చేపట్టినవారు ఎందరో వున్నారు. అధిక్షేపానికి శతక ప్రక్రియ అనుకూలంగా వుండటంచే ఎందరో కవులు తమ ఆగ్రహాన్ని, నిరసనను వ్యంగ్యంగా తెలియజేయడానికి రకరకాల మకుటాలతో శతకాలను రాయడం మొదలుపెట్టారు. కేవలం హాస్యానికని ఉద్దేశించి వ్యంగ్య రీతిలో అధిక్షేప శతకాలు రాయడం ఇప్పుడు మామూలైపోయింది. ఆ కోవలో వచ్చిన మరో శతక సంపుటియే ‘‘బాపూ రమణా.’’ బాపూ రమణల పట్ల అత్యంత గౌరవాభిమానాలు కలిగివున్న అక్కిరాజు సుందర రామకృష్ణ వారిని సంభోదిస్తూ ‘బాపూ రమణా’ మ కుటంతో రాసిన కంద పద్యాల సం పుటి ఇది. బాపూ రమణలు స్నేహానికి మారుపేర్లు. కామా, డాష్‌లతో వారి పేర్లను విడదీయడం కూడా పాపమని భావించే కవి ‘‘ఇద్దరిని కలిపి మిమ్ముల/ నొద్దిక నొకరే యడన్న యూహన్ తమితో/ ముద్దుగా వ్రాసితి నిలి-మీ/ మీరలు/ గనుకను సినిమాలగూర్చి కాస్సేపు కబు/ర్లను వినిపించెద..’’నని సినిమా రంగం గురించి, వాటి పోకడల గురించి, వర్తమాన కాలంలోని సినిమాల పతనావస్థను గురించి వివరించారు. అవార్డులు ఆశించని ఆ జంటను ‘‘గొట్టంగాళ్ళిచ్చెడి, అ/ పట్టాలును బిరుదులున్న పత్రాల్ (సి) గిత్రాల్/ కట్టా వ్యర్ధములు- ఎ/ప్పట్టున చూచినను మీకు’’అని ఓదారుస్తారు. అవార్డులకోసం- బిరుదులకోసం పాకులాడు వారిని, అనర్హులు అవార్డులను కొట్టేయడం పట్ల కవి తన ఆగ్రహాన్ని వెలిబుచ్చుతారు. సమాజంలో వస్తున్న మార్పులు, ప్రజలలో పెరుగుతున్న సుఖ లాలసత ధోరణులను తీవ్రంగా నిరసిస్తారు. నచ్చిన కవులను ప్రశంసల్లో ముంచెత్తారు. సాహిత్య సమావేశాలను, కుకవులను ముఖ్యంగా ‘నానీ’ల్లాంటి సాహిత్య ప్రక్రియలను ‘‘జానాబెత్తెడు’’ గాళ్ళును/ ‘నానీ’లను పేరుబెట్టి నానా లొల్లిన్/ పూనిక సలుపుచు మరి మా/ ప్రాణాల్ తెగ తోడుచుండ్రి’’అంటూ తీవ్రంగా విమర్శించడం వీరికే చెల్లింది. ఆంధ్రదేశమిపుడు ‘అవినీతికి అగ్రగామి’యనీ, ‘‘పద్యప్రియులైన ఆంధ్రులు మద్యప్రియులైరి నేడు’’ ‘‘తలకొక రాష్టమ్రు వలయును, తెలుగుల దౌర్భాగ్యమేమొ తెలియక పోయెన్’’ అని బాధపడతారు. తిరుపతి వెంకటేశ్వరస్వామిని కూడా అధిక్షేపించిన రచయిత తన వృద్ధాప్య సమస్యల పట్ల వాపోవడాన్ని కూడా పద్య రూపంలో తెలియజేసిన విధానం బాగుంది. ‘సరదాగ ప్రాస కోసము/ మరి మరి యత్నించి యిట్లు మక్కువ మీరన్/ ఇరికించితి నిటు పదముల/ బరువును తెగ మోపి నేను’’అంటూ తన ప్రయత్నం గురించి చెప్పి, ‘తప్పైన నను క్షమించుడి’అని వేడుకుంటున్నారు. ‘బాపూ రమణా’ మకుటంతో ప్రారంభించిన ఈ శతకాన్ని వారికి, వారి కృషికి మాత్రమే పరిమితమైతే బాగుండేది. అలా కాకుండా ఇతరేతర విషయాలకు కూడా అదే మకుటంతో రాయడం ఎబ్బెట్టుగా వుంది. సర్వాంతర్యామియైన భగవంతునికి అన్ని విషయాలను నివేదించుకోవడంలో వున్న సౌలభ్యం వ్యక్తులమీద ఉండదు కదా! ఈ పుస్తకంలో సగ భాగాన్ని శతకానికే కేటాయించగా, మిగతా సగ భాగం ‘కవి ప్రశంస’లాంటి ముందుమాటలకు కేటాయించడం ఆశ్చర్యం. ‘బాపూ రమణా’ అంటూ రాసిన ఈ శతకానికి బాపూ వేసిన బొమ్మ చాలా బాగుంది. ఇంకా నయం, వారితో ముందుమాట రాయించలేదు.
ప్రజలకు నీతి బోధ చేసే శతకములు తెలుగునాట
english title: 
nirasana
author: 
-అశోక్

అందాయి...

$
0
0
మైల శుద్ధాత్మక నవల -వరకుమార్ గుండెపంగు వెల: రూ.100/- ప్రతులకు: వరకుమార్ గుండెపంగు సన్నాఫ్ భిక్షం, ఇం.నెం.5-94, అంబేద్కర్ విగ్రహం దగ్గర, బేతవోలు గ్రామం చిలుకూరు మండలం నల్లగొండ జిల్లా. 99485 41711 సుందరయ్య స్మారకోపన్యాసాలు -సుందరయ్య విజ్ఞాన కేంద్రం సంకలనం సి.సాంబిరెడ్డి, గుడిపూడి విజయరావు వెల: రూ.120 ప్రతులకు ప్రజాశక్తి బుక్ హవుస్, 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. మరియు ఇతర బ్రాంచీలు 040 - 27608107 ప్రత్యూష పవనాలు రెక్కలు శ్రీమతి గూడూరి విజయలక్ష్మి వెల: రూ.60/- ప్రతులకు: గూడూరి విజయలక్ష్మి 8-4-368/బి, మోతీనగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్ - 18. 9703774636 9849021672
మైల శుద్ధాత్మక నవల
english title: 
andaayi..

నానీల్లో ప్రతిఫలించిన ‘పల్లె వైభవం’

$
0
0
ఏ శుభవేళ ఆచార్య ఎన్. గోపి ‘నానీ’ల ప్రక్రియ ప్రారంభించారో గానీ - ఈ కవితారూపం దినదినాభివృద్ధి చెందుతోంది. వందలాది కవులు వెలుగులోకి వచ్చారు. వస్తువైవిధ్యమూ విశేషమే. అటువంటి నానీ కవులలో పనసకర్ల ప్రకాశ్ ఒకరు. నగరీకరణ నలుదిక్కులా వ్యాపిస్తున్న రోజుల్లో ఈ కవి పల్లెవైపు కలాన్ని పయనింపజేశాడు. ‘‘పెళ్ళికొచ్చినవారు/ చెప్పారు పిల్లకంటే/ పల్లె బాగుందని’’ అనటంలో పల్లె ప్రాభవం వెల్లడి అవుతుంది. నేటి రాజకీయాలపై మంచి చురక ఇది- ‘‘ఇంకా ఎన్నాళ్ళీ/ చిల్లర దొంగతనాలు? ఇప్పుడైనా చేరండి/ రాజకీయాల్లో’’ ప్రకాశ్ లోక పరిశీలన ఉన్న కవి. ఆర్ద్ర హృదయం గల కవి కలంనుంచి వెలువడిన మరొక మంచి నానీ..... నూతి చుట్టూ/ ఎప్పుడూ చెమ్మే అమ్మకంటి పొరని/ అచ్చుగుద్దినట్టు’’ ఇటువంటి అనుభూతిని పంచే నానీలు చాలా ఉన్నాయి. అయితే ఈ కవి వీటితోనే సంతృప్తి చెందకుండా వచన కవితలు, దీర్ఘకవితలూ రాసి సత్తా నిరూపించుకోవాలి- ఆ స్థాయిగల కవికాబట్టి!
ఏ శుభవేళ ఆచార్య ఎన్. గోపి
english title: 
andaayi..
author: 
-డి.ఎన్.

మనలో మనం - ఎడిటర్‌తో ముఖాముఖి

$
0
0
ఎల్.జ్యోతి, సికిందరాబాద్ ఉన్నవాడూ ఉన్నవాడికే పెట్టడం, లేనివాడూ ఉన్నవాడికే పెట్టడంలా ఉంది, నేటి పాతుకుపోయిన సాంస్కృతిక సంస్థలకు లభించే ఆర్థిక సహకారాలు. కొత్తవారికి ప్రోత్సాహం కరువు. కారణం? ‘పట్టు’ పరిశ్రమ శ్రీనివాసరెడ్డి, శ్రీకాళహస్తి ఒక వార్తాపత్రికను కొని పదిమంది చదివే దౌర్భాగ్యపు అలవాటు ఈ దేశంలోనేనా ఇతర దేశాలలో కూడా ఉన్నదా? అనేక తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను భరిస్తూ కూడా విశేష విజ్ఞానాన్ని అందించే వార్తాపత్రికను రోజుకు రెండు రూపాయలు పెట్టి కొనడానికి చేతులు రావు. అదే ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసే పాన్‌పరాగ్, గుట్కా మరియు సిగరెట్లకు రోజుకు వంద రూపాయల దాకా తగలేస్తారు. డబ్బు ఉన్నవారు కూడా 2.00 పెట్టి వార్తాపత్రికను కొనాలంటే సంశయిస్తారు. ఈ పరిస్థితి మారేదెప్పుడు? ప్రతివారూ కొనక్కర్లేదు. పత్రికల విలువ తెలిసినవాళ్లు - కొనే స్తోమత ఉండీ వాటిని రోజూ ముష్టి ఎత్తటం మానేస్తే చాలు. కోస్న ప్రభాకర్‌రెడ్డి, కోస్నపల్లె, ధర్మపురి ప్రస్తుత తరుణంలో యువత రాజకీయాల్లోకి రావాలా? వద్దా? వచ్చి తీరాలి. జి.జాహ్నవి, విశాఖపట్టణం నాయకుడిగా ప్రజలను పరిపాలించే వ్యక్తికి ఓర్పు సహనం చాలా ఉండాలి. కానీ ఈ మధ్య జరిగిన ఓ సంఘటన చూస్తే ప్రజా ప్రతినిధా లేక రౌడీనా అనిపించింది. ఓ టోల్‌గేట్ దగ్గర ఎమ్మెల్యే కార్లకు డబ్బులు కట్టమని సిబ్బంది అడిగినందుకు ఎమ్మెల్యే బయటకు వచ్చి సిబ్బందిని కొట్టాడు. దీనిని అన్ని టీవీ ఛానెల్స్‌లో చూపించారు. ఇలాంటి వాణ్ని ఏమనాలి? ‘అసెంబ్లీ రౌడీ’ ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్ తాము పదవుల కోసం పార్టీలు మార్చటం లేదంటున్నారు. దశాబ్దాల తరబడి ఓ పార్టీలో అన్నీ అనుభవించి. మరెందుకు మారుతున్నారో? కాస్త గాలి మార్పుకు. ప్రజల్లో మార్పు రావాలని మీరు పదేపదే చెబుతున్నారు. ఎన్‌డిఏ, యుపిఏ, ఇంకేదో మూడో ఫ్రంటు అంటూ వివిధ పార్టీలకు పదవులు కట్టబెట్టారు ప్రజలు. ఇంకా ఏమి మార్పు రావాలో చెప్పండి. పార్టీలు పెట్టిన ఫ్రంట్లను నెత్తికెత్తుకోవటం కాదు. మొత్తం పార్టీలకు భయం ఉండేలా రాజకీయ వ్యవస్థను హద్దుల్లో ఉంచేలా ప్రజా చైతన్యం ఎదగాలి. పైల సంతోష్ కుమార్, పలాస మన మాజీ ముఖ్యమంత్రి తనయుడు జగన్మోహనరెడ్డిగారి అవినీతిని ఆధారాలతో సహా సిబిఐ నిరూపిస్తున్నా, వారి ఆస్తులను ఇడి అటాచ్‌మెంట్ చేస్తుంటే జగన్‌గారి సొంత పత్రిక ‘సాక్షి’ అవన్నీ కుట్రపూరిత చర్యలని, కుమ్మక్కులని ప్రజలకు చెప్పడం ఎంతవరకు సబబు. ఇది పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం కాదా? చార్జిషీట్లలో పేర్కొన్నంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు. ఎవరి పత్రికలో వారు తమ వాదాన్ని వినిపించటంలో తప్పు లేదు. మంచి చెడ్డలు నిర్ణయించాల్సింది విజ్ఞులైన ప్రజలు. శాండీ, కాకినాడ గత కొద్దికాలంగా ఉత్తరాలలో నాతో సహా తరచుగా కనిపించేవారు మాయమై కొత్తవారు కనిపిస్తున్నారు. మంచిదే. కొత్తవారిని ప్రోత్సహించవలసిందే. అందుకని పాతవారిపై శీతకన్ను వేయాలా? ‘మా పత్రిక కొని చదవండి. కాని మీ అభిప్రాయాలు మాకొద్దు’ అని పాతవారితో చెప్పడం సబబేనా? ఇవి కొన్ని, అవి కొన్ని ప్రచురిస్తే అందరికీ సంతృప్తి కాదా? మాటామంతీలో కూడా కోటాలంటే ఎలా? రమాదేవి, వినుకొండ చాలా ఉత్తరాలు చెత్తబుట్టలో వేశారు. మా ప్రశ్నలకు మీ నుంచి జవాబు ఎండమావేనా? కాంగ్రెస్ ఎం.పిలు తె.రా.స.లో చేరిక తెలంగాణ తెచ్చేలా ఉంది. హైకమాండ్‌లో కదలిక వచ్చినట్లుంది....? అది కూడా ఎండమావే! రాపర్తి ఆదినారాయణ, పిఠాపురం పాపభీతి కొరవడినది. దేవుళ్ల సొమ్ము దోచుకు తింటున్నారు. అక్రమాలు, లంచాలు ధన దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్లు, దేవుని సొమ్ము అక్రమంగా తినకూడదను పాపభీతి గాని భక్తిగాని భయంగాని లేదు. మనిషి పుట్టుకతోనే దురాశాపరుడా? కాదు. అవకాశాన్ని బట్టి. మద్యాన్ని ఎం.ఆర్.పి.కి అమ్మాలని ఆందోళన చేసేవారే గాని మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని, తయారీని నిలిపివేయాలని మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన చేసేవారు కనిపించరేమండి? మందుతల్లి మహిమ. వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం, ప.గో.జిల్లా స్పాట్ ఫిక్సింగ్ (క్రికెట్) వ్యవహారంలో అల్లుడి పాత్రపై రాజీనామా చేయాలని బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ని డిమాండ్ చేస్తున్న యుపిఎ నేతలు, మరి లక్షల కోట్ల బొగ్గు స్కాం జరిగిన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజీనామాకు డిమాండ్ చేయరేమి? వారి స్థానంలో మీరుంటే చేస్తారా? ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశం జిల్లా మనది సెక్యులర్ రాజ్యం అంటూనే మన నాయకులు ఓట్ల కోసం మతాలను అడ్డు పెట్టుకుంటున్నారు. ఇది న్యాయమా? కాదు. అది మత చెత్త రాజకీయం. మహమ్మద్ యూసుఫ్, కాజీపేట, వరంగల్ జిల్లా సీఎం గద్దె కోసం మ్యూజికల్ చెయిర్ పోటీ పెడితే, చిరంజీవి, చంద్రబాబు, కేసీఆర్, కిరణ్‌కుమార్, జగన్‌లలో కుర్చీ ఎవరికి దక్కుతుంది? కుర్చీ విరుగుతుంది. ఎస్.ఆర్.దేవి, హ్యూస్టన్, అమెరికా దయ్యాలున్నాయా? ఉన్నారు. సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్లగొండ కార్పొరేట్ కాలేజీలలో పని చేస్తున్న పాపానికి పరీక్షలు పూర్తవగానే మమ్మల్ని విద్యార్థులను వెదికి పట్టుకొని మన కాలేజీలలో చేర్పించండి అంటూ టార్గెట్లు విధించి, కరపత్రాలను చేతికి అందించి ఎండలలో మమ్మల్ని తరుముతూ ఉపాధ్యాయులను బ్రోకర్లుగా మార్చేస్తున్నాయి కాలేజీలు. ఇదేమిటంటే నెల జీతం చేతికిచ్చి యుకెన్ గో అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారు. టీచర్లను బ్రోకర్ల కంటే హీనంగా దిగజార్చేస్తున్న మన విద్యా విధానం బాగుపడేది ఎప్పుడు సార్? చై-నా సంస్కృతి పోయినప్పుడు. విద్యకు కార్పొరేట్ పీడ తొలిగినప్పుడు. * ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్- 500003 e.mail : mvrsastry@gm ail.com
ఎల్.జ్యోతి, సికిందరాబాద్
english title: 
manalo manam

మూస పాత్రలే.. ప్చ్!

$
0
0
అచ్చమైన తెలుగమ్మాయి కథానాయికగా నటిస్తే చూడాలని ఎదురుచూస్తున్న అనేక మందికి నచ్చిన అమ్మాయి మధుశాలిని. అనేక చిత్రాలలో నటించినా బాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లకు వచ్చినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం గోళ్లుగిల్లుకుంటూ కూర్చున్న ఈ అమ్మడిని కదిలిస్తే అనేక అవకాశాలు వస్తున్నా మూసపాత్రల్లో నటించలేక ఆయా సినిమాలు వదులుకుంటున్నానని డాబులు కొడుతోంది. ఆమె నటించిన ‘ కితకితలు’ సినిమా గుర్తొస్తోంది, అని ఆమె మాటలు విన్న వారికి తెలుగులో అవకాశాలు ఒక్కటి కూడా లేకపోయినా వర్మ చిత్రంలో నటించిన క్రెడిట్ మాత్రమే ప్రస్తుతం ఆమెను రక్షిస్తోంది. తెరంగేట్రం చేసిన తొలి నాళ్లలోనే తనవద్ద ఉన్న అందాలన్నీ రెచ్చిపోయి చూపించడంతో, మరింక చూపించడానికి ఏమీ లేవని నిర్మాతలు ఆమెపై సీతకన్ను వేశారేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి. దానికితోడు నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసువద్ద బోల్తాకొట్టడంతో అమ్మడికి అది కూడా కలిసిరాలేదు. తక్కువ సినిమాల్లోనే నటించిన తెలుగమ్మాయిగా మిగిలిపోయారెందుకు అని అంటే నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అన్నీ ఒకే తరహా పాత్రలు కావడంతో అవన్నీ రిజెక్ట్ చేశానని అడిగిన వాళ్ల చెవుల్లో పూలుపెట్టే ప్రయత్నం చేస్తోంది. అయినా కానీ ఇప్పుడు నటిస్తున్న హీరోయిన్లందరూ మూసపాత్రలే చేస్తున్నారు కదా! తాను మాత్రం అందుకు వ్యతిరేకం అంటూ ముక్తాయింపు ఇచ్చింది. మొత్తానికి మూస పాత్రల కారణం పాలిట రక్షణ కవచాల్లా మారాయి మరి! హిట్ లెస్ బ్యూటీ! చెయ్యని పాత్రలేదు. ఐటెమ్ సాంగ్ కూడా ఓకె. బికినీ వేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయినాకానీ ఒక్క హిట్ కూడా ఆమె దగ్గరికి చేరుకోవడానికి అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. చేసిన సినిమాలన్నీ ఢమాల్.. ఢమాల్ అనడంతో ఈ అమ్మడి వైపు అవకాశాలు కనె్నత్తి చూడడంలేదు. ఇంతకూ ఎవరీ హిట్ లెస్ బ్యూటీ అని అంటే, పూరీ జగన్నాథ్ తీసిన ‘బుజ్జిగాడు’ చిత్రంతో త్రిష చెల్లెలిగా సెకెండ్ హీరోయిన్ లెవెల్లో పరిచయమైన సెక్సీ అందాల సంజన! ఇప్పటికే ఫ్లాప్ బ్యూటీ అని పేరుపడ్డ ఈ అమ్మడికి ఆ మాటంటే అమాంతమైన కోపం విరుచుకుపడుతోందట. తనను బ్యూటీ అంటే ఒప్పుకుంటాను కానీ, ఫ్లాప్ బ్యూటీ అంటే మాత్రం అస్సలు ఊరుకోనని మారం చేస్తోంది. తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ టాప్ హీరోయిన్‌గా ఎదగాలన్న కలలు నెరవేరలేదు. అందుకే తన సినిమాలను తానే తీసుకుని ప్రమోట్ చేసుకోవాలనుకుంటోందట. అయితే తన సినిమాలతోపాటు మరో ఐదు సినిమాలు తన డైరీలో సిద్ధంగా ఉన్నాయని, ఇన్ని వుండగా తనను ఫ్లాప్ బ్యూటీ అని ఎందుకంటారని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం సంజన కన్నడంలో మూడు, తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. ఫ్లాప్ హీరోయిన్ అంటే ఒప్పుకోని ఈ భామ ఒక్క హిట్ కూడా కొట్టలేక నానా మాటలు మాట్లాడుతోంది. అంతేమరి.. విలువలేని దానికి శబ్దాలెక్కువని పెద్దలు ఊరికే చెప్పారా? ‘కిక్కే కిక్కు’ సల్మాన్ ఖాన్ ‘కిక్’ కోసం అభిమానులు తెగ ఎదురు చూసేస్తున్నారు. భాయ్ ‘సిక్స్ ప్యాక్’ కోసం కాదట. జీరోసైజ్ భామ కోసం. సల్మాన్ సరసన ఇప్పటికే ప్రియాంకా చోప్రా.. దీపికా పదుకొనె పేర్లు వినిపించాయి. కానీ - వారి స్థానే ఆ పోస్ట్‌ని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొట్టేసింది. హాట్‌హాట్‌గా ‘టబ్’ బాత్ నుంచీ అప్పుడే వచ్చినట్టుండే జాక్వెలిన్ జనానికి సరైన ‘కిక్’ ఇవ్వనుంది. శిరీష్ కుందర్ దర్శకత్వంలో సాజిద్ నాడియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. నటీనటుల ఎంపికలో భాగంగా హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు తెర పడినట్టే. ‘హౌస్‌ఫుల్’ చిత్రంతో హౌస్‌ఫుల్ కలెక్షన్లు తెచ్చిపెట్టిన జాక్వెలిన్ ఈ చిత్రంలో ఎంతమందికి ‘కిక్’ ఇవ్వనుందో?
హరివిల్లు
english title: 
harivillu
author: 
సమీర్

ఒంటరి నేస్తం

$
0
0
రోజుల తరబడి దుమ్ము దుప్పట్లు కప్పుకుని విక్రమార్కుడు మోసే శవంలా గదిలో ఓ మూల మేకుకు వేలాడే ఉత్తరాల తీగ నా మానవ సంబంధాల పిచ్చుక గూడు... ఇంటికొచ్చిన తోకలేని పిట్టల్ని విజ్ఞానంగా నిక్షిప్తం చేసుకున్నాక తీగపై వాలిన పెంపుడు పక్షుల్లా మలచడం బలపం పలకను తొలి ముద్దడినప్పటి అలవాటు... బక్కచిక్కిన అనాధకి పౌష్టికాహార నిధి దొరికినట్టు... రోజురోజుకీ రాజకీయ నాయకుని అనైతిక సంపాదనలా ఇంతింతై వటుడింతై మురిపించేది... ఆ ఉత్తరాల దొంతరలలో ఎనె్నన్ని లక్షల అక్షరాలు? వాటి విలువ ఎనె్నన్ని అక్షర లక్షలు.. అనుభవ తూణీరాలు నింపుకున్న అనుభూతుల అమ్ముల పొది నా ఉత్తరాల తీగ. ఉద్యోగ బాధ్యతల సాలిగూడులో దిక్కుతోచక దోగాడుతున్నప్పుడు అందుకున్న లేఖా సందేశాలు మనసును శాంతి శాలువలతో సత్కరించి ఉపశమింప చేసేవి... బాల్యం నుండి ఈ క్షణం వరకు నా జీవన రూపాంతరతకు సమకాలిక మార్గదర్శి సమకాలీన కార్యదర్శి... నా ఉత్తరాల తీగ.. ఈ బహు దూరపు బాటసారికి కడదాకా మిగిలిన ఒంటరి నేస్తం!! కన్నకొడుకు -మోకా రత్నరాజు ఏ నదీమ తల్లి రొమ్ము పాలు తాగిన పుణ్యఫలమో కాని గింజను మింగి కంకిని ప్రసవించే - ఈ పురిటిగెడ్డ బిడ్డనైన ధన్యుడినైతిని. సాగరమదనంలో అమృతం పుట్టిందో లేదో నాకు తెలీదు కాని నిస్సత్తువ దప్పిక గొంతులోకి సత్తువనిచ్చి దప్పిక తీర్చే జీవ జలనిధి మా గోదారి గంగా బొండామంటే- కచ్చితంగా అమృత భాండమే అంటానే్నను! ఏటి నీటి స్నాన పానాలతోపాటు శ్రమ రెక్కల చెమట ఉగ్గుల్ని పట్టించి కళ్లల్లో పెట్టుకు పెంచుకున్న కొబ్బరిమొక్కా- పేగు తెంచుకు పుట్టిన కన్నబిడ్డా- కళ్లెదుట మసలుతున్న కవల పిల్లల్లా కన్పించేవారు! మాట తప్పిన కన్నకొడుకు అవసాన దశలో పట్టించుకోకపోయినా- తనూ; నేనూ బతకుండాలే కాని చచ్చేదాకా రుణం తీర్చుకుంటూ- నెలనెలా జీతభత్యాలు చెల్లించే ఖజానాలా నిలబడ్డ కొబ్బరి చెట్టే - నా కన్నకొడుకు! * పట్నంలో శాలిబండ -ఆశారాజు దసరా వస్తుంది దీపావళి వస్తుంది పక్కపక్కనే పరిమళంతో నా జ్ఞాపకం నడుస్తుంది జులూస్‌లో తిరిగే హైదరాబాద్ ముసిముసిగా నవ్వుకుంటుంది రాఖీ పున్నమి వస్తుంది జగ్‌నేకీ రాత్ వస్తుంది కలల చెకీల మీద వెనె్నల జల్లు కురుస్తుంది కొత్తబట్టలు కొనుక్కొని చార్మినార్ తల్లిలా వస్తుంది బోనాల పండుగ వస్తుంది హోలీ సందడి వస్తుంది జాతరలో రంగుల రాట్నం మీద లాల్‌దర్వాజా మురుస్తుంది వౌనంగా వున్న మనసులాగ- శాలిబండ ఒక గోలకొండ పీసల్‌బండ మరొకటి మేకలబండ ఇవన్నీ రాళ్లూ రప్పలు కావు ఉరుసులకూ, ఉజ్జయిని వేడుకలకూ తరలివచ్చే ‘దట్టీలూ’ - ‘తొట్టెళ్లూ’ హార్మోనియం మెట్లలాగ- హరీబౌలి రేతిబౌలి పుత్లీబౌలి ఇంజన్‌బౌలి గచ్చుబౌలి ఇది బెదిరించే దండకం కాదు భూమి చెమ్మగిల్లిన కమ్మదనం నేను పెరిగిన గల్లీలు తిరిగిన బజార్లు నేర్చుకున్న గజళ్లు దర్శించిన సౌందర్యాలు నన్ను ప్రేమికుణ్ణి చేశాయి వినయంగా బతుకుతూ పొగరుగా షాయరీ చెప్పడం నేర్పాయి గుచ్చుకున్న గాజుపెంకుల్ని పారేయలేదు ఫకీరు పాడిన పాటలు మరిచిపోలేదు మూసీలో విసిరేసిన చారాణా సిక్కా ఇప్పటికీ కళ్లల్లో శబ్దం చేస్తుంది ఇక్కడిది చేమంతుల ఉదయం మరుమల్లెల సాయంత్రం మర్మంలేని మనుషులతో అలలుపు సొలుపు లేని ప్రయాణం
రోజుల తరబడి దుమ్ము దుప్పట్లు కప్పుకుని
english title: 
kavitha
author: 
-కొత్తపల్లి ఉదయబాబు

ACB దాడులు

కార్టూన్ కార్నర్

$
0
0
కార్టూన్ కార్నర్
కార్టూన్ కార్నర్
english title: 
cartoon corner
author: 
వెంకటేష్
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>