Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఎవరు గొప్ప ? -కథ -- సిసింద్రి

$
0
0
అది విక్రమపురి. ఆ దేశపు రాజుకి తమ రాజ్యానికి వచ్చే సాధువులను విచారించి, వారి పూర్వాపరాలు తెలుసుకోవటంలో ఆసక్తి ఎక్కువ. అంతేకాదు. వారిలో ఎవరు ఉన్నతమైన వారోనని పరిశీలించేవారు. ప్రపంచంలో సాధువులు గొప్పవారా? అని ఆయనకు తెలుసుకోవాలనిపించింది. దీనిపై మేధావులను ఆయన ప్రశ్నించాడు. ఎవరికి వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు సాధువులే గొప్పవారని, మరి కొందరు బాధ్యతలు నెరవేరుస్తూ గృహస్థు జీవితం గడుపుతున్న వారే గొప్పవారని చెప్పుకొచ్చారు. అయితే తమతమ వాదనలను నిరూపించుకోవలసిందిగా రాజు ఆదేశించాడు. సాధువులను గృహస్థు జీవితం గడుపుతున్న వారిని ఆయన తన సభకు ఆహ్వానించాడు. అందరూ తమ వాదనలు చెప్పసాగారు. చివరగా ఒక సాధువు లేచి నిల్చోగానే రాజు అందరినీ అడిగినట్లే ఆయనను ప్రశ్నించసాగాడు. సాధువు వాటికి ఇలా జవాబు చెప్పాడు. ‘రాజా! ఎవరైనా సరే వారివారి స్థితిగతులలో గొప్పవారే. సమమే’ అన్నాడు. ‘అయితే మీ వాదనను నిరూపించుకోండి’ అని రాజు అడిగాడు. ‘నిరూపిస్తాను. కానీ మీరు నాతో వచ్చి నాలాగా కొంతకాలం జీవించాలి. అప్పుడే నిరూపించగలను’ అని సాధువు అన్నాడు. అందుకు అంగీకరించిన రాజు సాధువుతో బయలుదేరాడు. ఇద్దరూ మరో ప్రాంతానికి వెళ్లారు. ఆ దేశపు రాజధానిలో భారీ ఉత్సవం జరుగుతోంది. దేశమంతా సందడిగా ఉంది. ఈ సందడిలో ఆ దేశ రాజు ఒక ప్రకటన చేయించాడు. స్వయంవరం జరగబోతోందన్నదే ఆ ప్రకటన. రాజు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశారన్న ప్రకటన రాజు, సాధువు చెవిన పడింది. స్వయంవరానికి వచ్చేవారిలో మంచి అందగాడినో, తెలివైన వాడినో, యువరాణి ఎన్నుకుంటుంది. ఆమె ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. స్వయంవరానికి వచ్చిన వారి వివరాలు తెలుసుకుంటూ తనకు ఇష్టం లేని వారిని ఆమె వద్దంటుంది. వెనక్కి వెళ్లిపోమంటుంది. అయితే ఆ దేశపు యువరాణి మహా సుందరాంగి. అందగత్తె. ఆ సభకు ఎందరో వచ్చారు. వారిలో ఒక సాధువు కూడా ఉన్నారు. నింగినున్న సూర్యుడు భూమికి వచ్చాడా అనిపించేలా వున్న ఆ సాధువు మెడలో యువరాణి పూలమాల వేసింది. ఆయననే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. అయితే సాధువుకు కోపం వచ్చింది. ‘ఇది అసందర్భం. తానేమీ పెళ్లి చేసుకోవడానికి రాలేదం’టూ పూలమాలను మెడలోంచి తీసి విసిరేశాడు. అక్కడి నుండి వెళ్లిపోయాడు. యువరాణి పెళ్లంటూ చేసుకుంటే ఆయనే్న చేసుకుంటాననీ, లేకుంటే ప్రాణత్యాగం చేస్తానంటూ ఆ సాధువు వెంట పడింది. ఆమె వెంట విక్రమపురి రాజు, సాధువు వెళ్లారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన సాధువు గుర్తు పట్టలేని ఒక గుహలోకి వెళ్లిపోయాడు. దాంతో యువరాణి వెనుదిరిగి ఒక చెట్టు కింద ఏడుస్తూ కూర్చుంది. విక్రమపురి రాజు, సాధువు ఆమెను ఓదార్చి తిరిగి వెళ్లిపోదామనుకున్నారు. అయితే అప్పటికే చీకటి కావడంతో మరుసటిరోజు ఉదయం వెనక్కు వెళ్లిపోయే విధంగా ఒప్పించారు. ఆ రోజు ముగ్గురూ అక్కడే వున్నారు. ఆ చెట్టుపైన ఒక పక్షి జంట, వాటి పిల్లలు మూడు ఉన్నాయి. చెట్టు కింద వున్న ముగ్గురిని చూసిన పక్షి జంటలో ఆడపక్షితో మగపక్షి, బాగా చలి వేస్తోంది. ఆ ముగ్గురూ చలికాచుకోవటానికి మంట ఏదైనా తయారుచేస్తే బాగుంటుంది అని చెప్పింది. వెంటనే ఆడపక్షి ఆ ఏర్పాటు చేసింది. అలాగే వారి ఆకలి తీర్చడానికి తమ వద్ద ఏమీ లేనందువల్ల ఆ మంటల్లో తానే పడి వారికి ఆహారమవుతానని మగపక్షి పడిపోయింది. ఆ వెంటనే ఆడపక్షి, మూడు పిల్లలు కూడా మంటల్లో పడిపోయాయి. అది చూసిన విక్రమపురి రాజు, సాధువు, యువరాణి విస్తుపోయారు. తెల్లవారింది. యువరాణిని విక్రమపురి రాజు, సాధువు ఆమె తండ్రికి అప్పగించారు. అప్పుడు సాధువు విక్రమపురి రాజుతో, ‘రాజా! నీకో విషయం చెప్పదలిచాను. ఎవరైనా సరే వారున్నచోట ఎవరికి వారు గొప్పవారే. గృహస్థు జీవితం గడపాలనుకుంటే మాటల్లో పడి ఆత్మత్యాగం చేసిన పక్షుల్లాగా ఇతరులకు సాయపడే విధంగా జీవించు. లేదంటావా అందాల సుందరిని సైతం పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి గుహలోకి వెళ్లిపోయిన సాధువులాగా జీవించు. ఈ వాస్తవాన్ని తెలుసుకుని జీవనం సాగించాలి’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. * చేసి చూద్దాం తలమీద మంట అనుభవం, నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఈ ప్రయోగం చేసి ప్రేక్షకులను ఆశ్చర్యం లో ముంచెత్తవచ్చు. ఒక వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి అతని నడినెత్తిన మంట వెలిగించి దాని మీద కాఫీ కాచి, వేడివేడి కాఫీ ఇతరులకు ఇవ్వవచ్చు. దీనిని బహిరంగ వేదికలపై అనేక పర్యాయాలు నిర్వహించటం జరిగింది. ముందుగా కుర్చీలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టాలి. అతని కళ్లకు గంతలు కట్టాలి. ఒక చిన్న సంచీలో తడి దూదిని ఏకరీతిగా సర్ది చిన్న తలగడగా తయారుచేయాలి. దీనిని కుర్చీలో ఉన్న వ్యక్తి నడినెత్తిన పెట్టాలి. ఇది అథమ ఉష్ణవాహకంగా ఉపయోగపడుతుంది. అంటే తన గుండా ఉష్ణాన్ని ప్రసరింపనీయదు. నూలుగుడ్డలతో వృత్తాకారంగా ఒక చుట్ట కుదురు తయారుచేయాలి. దీనిని ఈథైల్ ఆల్కహాలుతో తడపాలి. ఈ చుట్ట కుదురును వ్యక్తి నడినెత్తిన ఉంచిన చిన్న తలగడపై పెట్టి అగ్గిపుల్లతో దానిని వెలిగించాలి. ఆ వ్యక్తి నడినెత్తిన మంట పైకి లేస్తుంది. ఆ మంట మీద గినె్న నుంచి అందులో పాలు, కాఫీ పొడి వేయాలి. కొద్ది నిమిషాలలో కాఫీ తయారవుతుంది. మంటపై అకస్మాత్తుగా పెద్ద గుడ్డను కప్పడంతో దానికి ఆక్సిజన్ అందక మంట ఆరిపోతుంది. మంట పైకి వెడుతుంది. అందువల్ల మనిషి నెత్తికి గాని ఇతర అవయవాలకు గాని మంట వేడి సోకదు. తల మీద అధమ ఉష్ణవాహకం ఉంచడం వలన మంట వేడి తలకు వెళ్లదు. కళ్లకు గంతలు ఎందుకంటే పొరపాటున మంట గాలికి పక్కకు వాలితే కంటికి నేరుగా ఆ వేడి తగలకుండా ఉండేందుకు. బాల బాలికలు మాత్రం ఈ ప్రయోగాన్ని స్వతంత్రంగా ఎవరి పర్యవేక్షణ లేకుండా చేయకూడదు. -సి.వి.సర్వేశ్వరశర్మ గోల్డెన్ రూల్ -- స్ఫూర్తి ఖ్యాతి ప్రవర్తనని ఆమె తల్లిదండ్రులు కొన్ని నెలలుగా గమనిస్తున్నారు. తన అక్కతో, తమ్ముడితో తరచూ గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. సాధారణంగా తప్పు ఖ్యాతిదే అవడం వాళ్లు గమనించారు. ప్రతీసారి ఖ్యాతిని కోప్పడుతున్నారు. కాని ఆ పాప మారలేదు. ఖ్యాతి పుట్టినరోజు వచ్చింది. ఆ సాయంత్రం వాళ్లు దాన్ని ఓ హోటల్‌లో సెలబ్రేట్ చేశారు. బంధు మిత్రులు, ఖ్యాతి క్లాస్‌మేట్స్, వారి తల్లిదండ్రులు.. దాదాపు నూట యాభై మంది దాకా దానికి హాజరయ్యారు. ఒకరిద్దరు పూల బొకేలని తెచ్చారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థని నియమించటంతో పిల్లలందరికీ గంటన్నరసేపు కాలక్షేపం అయింది. ‘ఎస్‌తో స్టార్టయ్యే పేరుగల వాళ్లు వెంటనే వచ్చి నన్ను తాకండి. మొదటగా వచ్చిన వాళ్లకి బహుమతి’ ఈవెంట్ మేనేజర్ మైక్‌లో ప్రకటించగానే నలుగురైదుగురు వెళ్లి అతన్ని తాకారు. ముందుగా వెళ్లిన సుశీల, సుధాకర్, సోఫియాలకి అతను చాక్లెట్లు బహుమతిగా ఇచ్చాడు. ఖ్యాతిని పిలిచి అడిగాడు. ‘నీ ఫేవరేట్ రంగు ఏమిటి?’ ‘నీలం రంగు’ చెప్పింది. ‘గుడ్ నీలంరంగు డ్రస్ వేసుకున్న వారికి బహుమతి ఇద్దాం. ఒంటి మీద ఒక్క నీలం రంగు దుస్తులున్నా సరే. చూసి నువ్వే వెళ్లి ఇవ్వు’ ఖ్యాతి చాక్లెట్లు తీసుకుని హాలంతా వెదికి ఆ రంగు డ్రెస్సుల్లో ఉన్న వారికి వాటిని ఇచ్చింది. ‘ఎవరు తమ తల్లిదండ్రులని పట్టుకుని ముందుగా ఈ సర్కిల్‌లోకి తీసుకువస్తారో వారికి ఏభై రూపాయల బహుమతి’ ఈవెంట్ మేనేజర్ ప్రకటించి కింద కార్పెట్ మీద ఓ ప్లాస్టిక్ రింగ్‌ని పెట్టాడు. సుబ్బారావు దంపతులని వారి కూతురు సుబ్బలక్ష్మి ముందుగా తీసుకువచ్చింది. ఇలా రకరకాల ఆటలతో కార్యక్రమం గంటన్నర సేపు చక్కగా సాగాక బఫే డిన్నర్ చేశారు. రెస్టారెంట్ వాళ్లకి లెక్క చూసుకుని ఖ్యాతి తండ్రి డబ్బు చెల్లించాక అంతా ఇంటికి బయలుదేరారు. ఖ్యాతి పూల గుత్తులు రెండిటినీ తీసుకోబోయింది. ‘నేనొకటి తెస్తాను’ ఖ్యాతి తమ్ముడు చెప్పాడు. ‘వద్దు. నా పుట్టినరోజుకి నాకు వచ్చాయి ఇవి. నేనే తెస్తాను’ వాడిని పక్కకి తోయడంతో కింద పడ్డాడు. ‘ఈ గులాబీ గుత్తి ఎంత బావుందో కదా?’ తల్లికి చెప్తూ ఖ్యాతి గులాబీ బొకేని చేతిలోకి తీసుకుంది. ఓ ముల్లు ఖ్యాతి వేలికి గుచ్చుకోగానే బాధగా అరిచింది. వేలి నించి రక్తం బొట్లు కారాయి. ‘గులాబీలు అందంగా వున్నా, ముళ్లు వాడిగా ఉన్నాయి’ తల్లితో చెప్పింది ఖ్యాతి. టిష్యూ పేపర్‌ని రక్తం కారకుండా వేలికి చుట్టుకొంది. ‘అవును అచ్చం నీలానే.’ తల్లి నవ్వుతూ చెప్పింది. ‘అదేమిటి?’ ‘గులాబీలా నువ్వు కూడా చక్కగా వున్నావు. కానీ నువ్వు నీ తమ్ముడితో అక్కతో మాట్లాడే మాటలు ముళ్లల్లా వాడిగా ఉన్నాయి. నాన్న నీకు ఎప్పుడూ చెప్పే గోల్డెన్ రూల్ గుర్తుందా?’ తల్లి అడిగింది. ‘గుర్తుంది. నిన్ను ఇతరులు ఎలా ట్రీట్ చేయాలనుకుంటారో నువ్వూ ఇతరులని అలాగే ట్రీట్ చెయ్’ ‘కరెక్ట్. గులాబీలకి ముళ్లు లేకపోతే, అంతా ఎలా సంతోషిస్తారో నువ్వు కూడా మృదువుగా మాట్లాడటం నేర్చుకుంటే అప్పుడంతా నిన్ను మెచ్చుకుంటారు’ కారులో ఇంటికి వెళ్తూ ఖ్యాతి తల్లి చెప్పిన విషయమే ఆలోచించింది. ఆ పుట్టిన రోజు అనుభవంవల్ల ఖ్యాతికి గోల్డెన్ రూల్ గురించి బాగా అర్థమైంది. మర్నాటి నించి ఆ పాప ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. -మల్లాది
సిసింద్రి
english title: 
sisindri
author: 
వి. బాలకేశవులు

ఓన్లీ ఇన్ ఇండియా - మినీ మేగ్

$
0
0
ఓన్లీ ఇన్ ఇండియా వెస్ట్ బెంగాల్‌కి చెందిన ప్రైవేట్ ఆర్థిక వ్యాపార సంస్థ శారదా గ్రూప్ దివాలా తీసింది. దాని అధినేత సుదీప్తా సేన్‌ని అరెస్టు చేశారు. ‘ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బు తిరిగి ఇవ్వడానికి తమ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి, సిగరెట్లు తాగేవాళ్లు ఎక్కువ సిగరెట్లని తాగితే పన్నుల రూపంలో లభించే ఆదాయాన్ని వాళ్లకి ఇస్తామ’ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చింది! ఇందుకు ఆమె పార్టీ వారే ఆమెని విమర్శించారు. ఇండియా మొత్తానికి వెస్ట్‌బెంగాల్‌లోనే పొగాకు వినియోగం అధికం. 2003 కేంద్ర చట్టం ప్రకారం ఏ కారణంగానైనా పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించడం నేరం. స్ఫూర్తి 2005లో ఫ్లోరిడాని హరికేన్ చార్లీ తాకింది. జాక్‌బానర్ అనే చిన్న పిల్లవాడు వాటర్ బాటిల్స్‌ని సేకరించి అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చాడు. ఇలా మొత్తం 27 లారీల నిండా వాటర్ బాటిల్స్‌ని జాక్ సేకరించాడు. ఇలా అన్నారు... రాజకీయవేత్తలు ఎక్కడైనా ఒక్కటే. నది లేని చోట వంతెనని నిర్మిస్తామని మాట ఇస్తారు. -నికితా కృశే్చవ్ ఈషార్ట్ ఫిల్మ్ చూశారా? ‘మిస్ అండర్‌స్టాండింగ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో మనుషులు ఎంత తేలిగ్గా ఒకర్నొకరు తప్పుగా అంచనా వేస్తారో హాస్యంగా చెప్పారు. దీన్ని చూడడానికి యూట్యూబ్ డాట్‌కామ్‌లోకి వెళ్లి misunderstanding అని టైఫ్‌చేసి సెర్చ్ చేయండి. నిడివి 3 నిమిషాల 2 క్షణాలు. హాలీవుడ్ కబుర్లు ‘మనీ ట్రైన్’ అనే సినిమా 1995లో విడుదలైంది. ఈ కామెడీ థ్రిల్లర్‌లో న్యూయార్క్ సిటీ ట్రాన్సిట్ మనీ ట్రైన్‌లోంచి ప్రతీ స్టేషన్‌లో టిక్కెట్ల అమ్మకాల ద్వారా వసూలైన డబ్బుని దొంగిలించడం ఇతివృత్తం. దీని ప్రభావంతో హేరీ కాఫ్‌మేన్ ఆ ప్రయత్నం చేశాడు. ఆశ్చర్యంగా మాజీ అధ్యక్ష అభ్యర్థి బాబ్‌డేవ్‌కి కూడా ఈ నేరంలో భాగం ఉందని పోలీసులు భావించారు. హేరీ పట్టుబడ్డాక, నిజం తెలిసింది. లింగు-లిటుకు లింగు: మేధావులు మంచి భర్తలవుతారా? లిటుకు: మేధావులు అసలు భర్తలే కారు. వింత లోకం టోక్యో యూని వర్సిటీకి చెందిన ఓ టీమ్ ‘స్లిమ్మింగ్ గాగుల్స్’ ని కనిపెట్టింది. ఆ కళ్లజోడుని ధరిస్తే ప్లేట్‌లోని ఆహారం ఏభై శాతం పెద్దగా కని పిస్తుంది. ఎక్కువ తింటున్నామనే భావన కలిగి ఇక తినడం ఆపేస్తారు. ప్రొఫెసర్ మిచిటాకా హిరోజ్‌కి వచ్చిన ఆలోచన ఇది. ఈ గాగుల్స్ ధరించిన వారు 10% తక్కువ ఆహారం తీసుకుంటారని, తద్వారా బరువు సమస్య ఆ మేరకు తగ్గుతుందని చెప్తున్నారు. త్వరలో ఈ కళ్లజోళ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. దురదృష్టపు దొంగ వియార్క్‌లోని గ్రాంటన్ అనే ఊళ్లోని లాండ్‌బర్గ్ (18) అనే దొంగ గుళ్లులేని 22 కాలిబర్ హేండ్‌గన్‌ని ఆగి వున్న కారులో డ్రైవింగ్ సీటులో కూర్చుని ఉన్న జెస్సికా (19) అనే ఆమెకు చూపించి హ్యాండ్‌బాగ్ ఇవ్వమని కోరాడు. ఆమె ఇచ్చాక తెరిచి చూస్తే అందులో డబ్బు లేదు. క్రెడిట్ కార్డులు, చెక్కుబుక్కులు కనిపించాయి. తన పేర చెక్ రాయమని కోరాడా దొంగ. ఆమె రాసిస్తే మర్నాడు బ్యాంక్‌కి దాన్ని క్యాష్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు, లాండ్‌బర్గ్ వస్తాడని ఎదురు చూడకపోయినా అక్కడ కాపున్న పోలీసులకి అతను చిక్కాడు. ఈ అమాయకపు దొంగ మొదటి దొంగతనం ప్రయత్నం ఇది. గతంలో కనీసం లైబ్రరీ పుస్తకం కూడా దొంగిలించని అతణ్ణి చూసి కోర్టులో అంతా నవ్వుతుంటే, సిగ్గుతో తలవంచుకున్నాడు. జడ్జి కూడా నవ్వుతూ అతనికి తక్కువ శిక్ష విధించాడు. డైవర్స్ నైజీరియాకి చెందిన టీచర్ బొనానే్ల అలోమోగే పదకొండేళ్ల వైవాహిక జీవితానంతరం తన భర్త నించి విడాకులు తీసుకుంది. కారణం అతను తమ పిల్లల స్కూల్ ఫీజులని కట్టడం గానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ చేయడు. మరో ఊళ్లో ఉద్యోగం చేస్తూ, రెండేళ్లకోసారి వచ్చి పోతుంటాడు. భర్తగా ఏ బాధ్యతని నిర్వహించని అతను తనకి వద్దని ఆమె విడాకులు తీసుకుంది. హెల్త్ టిప్ అన్నం తిన్నాక స్నానం చేయకండి. అందువల్ల కాళ్లు, చేతుల్లోకి రక్తం అధికంగా ప్రవహిస్తుంది. దాంతో పొట్ట చుట్టూ ఉండే రక్తం తగ్గిపోతుంది. దీనివల్ల జీర్ణక్రియ బలహీనపడుతుంది.
వెస్ట్ బెంగాల్‌కి చెందిన ప్రైవేట్ ఆర్థిక వ్యాపార
english title: 
mini mag
author: 
-- ఆశ్లేష

ఆండ్రాయడ్ ట్రిక్స్-టిప్స్ -- కంప్యూటర్ కబుర్లు

$
0
0
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అనేది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం. అందరి మన్ననలనూ ఇట్టే పొందింది. కొత్త స్మార్ట్ ఫోన్లలో మెజారిటీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసేవే. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వాడకంలో లాంగ్ ప్రెస్, స్పేస్ బార్, రిజెక్యింగ్ కాల్, బ్రౌజింగ్ - ఇలా పలు అంశాలలో టిప్స్, ట్రిక్స్ చాలానే ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్‌లో తెరపై సమయం మాత్రమే కనిపిస్తుంది. దాంతోపాటు తేదీనీ చూడాలంటే, సింపుల్, నోటిఫికేషన్ ట్రేని కిందకి లాగి వదిలితే సరి. తేదీ కూడా కనిపిస్తుంది. అలాగే, మన ఫోన్ రింగైతే, వినపడకుండా సైలెంట్ మోడ్‌లో ఉంచాలనుకోండి. ఫోన్ పవర్ బటన్, వాల్యూమ్ బటన్‌లను వాడి సైలెంట్ మోడ్‌లో ఉంచవచ్చు. అందుకోకూడదనుకున్న కాల్స్‌ను నేరుగా వాయిస్ మెయిల్ బాక్స్‌లోకి పంపవచ్చు. దీనికి కాంటాక్ట్ ఎడిట్‌లోకి వెళ్లి అడిషనల్ ఇన్ ఫోలో సెండ్ డైరెక్ట్లీ టు వాయిస్ మెయిల్ అనే ఆప్షన్ సెట్ చేస్తే సరిపోతుంది. ఇక బ్రౌజింగ్ చేసేటపుడు ఫాంట్ పెద్దదిగా కనిపించాలంటే, మెనూలో మోర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి టెస్ట్ సైజును లార్జ్‌కు సెట్‌చేస్తే చాలు. మీ ఫోన్‌లో ఎక్కువ ఐకాన్లుంటే, ఒకే తరహా అప్లికేషన్స్‌తో పలు ఫోల్డర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. అన్నట్టు, హోం స్క్రీన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌పై నొక్కి పట్టి ఉంచితే చాలు. ప్రత్యేక ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలోని షార్ట్‌కట్‌లతో కావల్సిన అప్లికేషన్లను తెరపై ఉంచుకోవచ్చు. హోం కీని నొక్కి ఉంచితే, అపుడే వాడిన 8 అప్లికేషన్లను మనం చూడొచ్చు. (రీసెంట్లీ యూస్డ్ ఆప్స్). బాక్ కీని నొక్కి పెడితే, బుక్ మార్క్‌లు, ఎక్కువగా విజిట్ చేసిన సైట్ల చిరునామాలూ కనిపిస్తాయి. ఇతర భాషల్లో కీబోర్డులు కావాలంటే ఆప్స్ స్టోర్ నించి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అలాగే, గూగుల్ మాప్స్‌ను ఫ్రీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కొన్నిట్లో అది ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా వస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో సెల్ఫ్ పోట్రేట్ మోడ్ వాడి మీ ఫొటో మీరే తీసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే అడ్రస్ బుక్‌లో కేవలం పేర్లు కాకుండా, ఫొటోలను నొక్కితే వచ్చే మెనూల నుంచి ఫోన్ చేయడం, మెసేజ్ పంపడం, ఇ-మెయిల్ పంపడం కూడా చేయవచ్చు. ఆండ్రాయిడ్ వాయిస్ కమాండ్స్‌తో మనం 10 కమాండ్‌లను రికార్డు చేసి ఉంచుకోవచ్చు. వీటితో సౌలభ్యం ఉంది. ఉదాహరణకు, కాల్ రామారావ్ అని ఒక కమాండ్ రికార్డు చేసి ఉంచామనుకోండి. దాన్ని ఎంచుకొంటే, రామారావ్ అనే మిత్రునికి కాల్ వెళ్తుందన్నమాట. బ్రౌజింగ్ చేసేటపుడు ఒక పదాన్ని వెదకాలనుకోండి. అపుడు మెనూ కీలో మోర్ పై క్లిక్ చేస్తే, ఫైండ్ ఆన్ పేజ్ ద్వారా సెర్చ్ బాక్స్, కీబోర్డ్ ప్రత్యక్షవౌతాయి. ఫేస్‌బుక్‌లో దేన్నన్నా షేర్ చేయాలంటే, సింపుల్. మెనూలో మోర్ ఎంచుకొని అందులో షేర్ పేజ్‌లోకి వెళ్లాలి. అందులో ఫేస్‌బుక్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎటొచ్చీ, ఇంటర్నెట్ కనెక్టయి ఉండాలంతే. ఆండ్రాయిడ్ ఫోన్‌ను సమర్థవంతంగా వాడటానికి ఇలా ఎన్నో చిట్కాలున్నాయి. అన్నట్టు, ఆండ్రాయిడ్‌లో ఆడుకోవడానికి బోలెడు గేమ్స్ ఉన్నాయి. వీటి గురించి వేరేగా చెప్పనక్కర్లేదనుకుంటా. షార్ట్ కట్స్ (్ఫటోషాప్ 7.0 టూల్స్) M మార్కీ టూల్ N నోట్స్ టూల్ O డాడ్జ్ బర్న్ స్పాంజ్ టూల్ P పెన్ టూల్ తెలుసుకోవాల్సిన సంగతి.. లాప్‌టాప్ కొంటున్నారా? లాప్‌టాప్ కంప్యూటర్లలో 99 శాతం పేరున్న బ్రాండ్లే ఉన్నాయి. లాప్‌టాప్ కొనేట్లయితే, ప్రాసెసర్ కొత్త తరానిదా కాదా చూసుకోవాలి. మెయిన్ మెమరీ కనీసం 4 జిబి ఉండాలి. వీడియో గ్రాఫిక్స్‌తో పని చేసేట్లయితే కావలసినంత వీడియో రామ్ ఉండేలా చూసుకోవాలి. మానిటర్ స్క్రీన్ 12 నించి 17 అంగుళాల దాకా ఉండేలా వివిధ మోడల్స్ ఉన్నాయి. మీ అవసరాన్నిబట్టి దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. హార్డ్ డిస్క్ కనీసం 300 జిబి ఉండాలి. నిజానికి ఇపుడొచ్చే లాప్‌టాప్‌లలో 500 జిబి కనీసం ఉంటోంది. కానీ, మీరు గ్రాఫిక్స్ ఎక్కువగా వాడేట్లయితే, హార్డ్ డిస్క్ 1 టిబి ఉండేలా చూసుకోవడం మంచిది. వైఫీ, బ్లూటూత్ మామూలే. అలాగే డివిడి డ్రైవ్ ఉండేలా చూసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం బ్యాటరీ లైఫ్. విద్యుత్ సరఫరా లేకుండా కేవలం బ్యాటరీ మీదే ఎంతసేపు పని చేయగలదనేది చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా 3 గంటలు కనిష్టంగా 7, 8 గంటలు గరిష్టంగా బ్యాటరీ మీద పనిచేసేలా లాప్‌టాప్‌లు లభిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం మీ బడ్జెట్. తానుండేందుకు స్థలం లేదు కానీ, మెడకో డెస్క్‌టాప్ తగిలించుకున్నట్టు. నెట్ న్యూస్ ఇంటెల్ నాలుగో తరం కోర్ సిరీస్ ప్రాసెసర్లు ఇంటెల్ తన నాలుగో తరం కోర్ సిరీస్ ప్రాసెసర్లను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాసెసర్ల రూపకల్పనలో పనితనంకన్నా అది వాడే విద్యుత్ ప్రధానాంశంగా ఇంటెల్ ఎంచుకుంది. ఈ ప్రాసెసర్ల కోడ్ నేమ్ హాస్వెల్. ఈ ప్రాసెసర్లు 15 వాట్లకన్నా తక్కువే విద్యుత్‌ను ఖర్చు చేస్తాయిట. లో అండ్ కోర్ ఐ 5 4430 ప్రాసెసర్ 197 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.12 వేలు) ఉంటే, కోర్ ఐ7 4470 మోడల్ ప్రాసెసర్ 368 డాలర్ల దాకా (దాదాపు రూ.22 వేలు) ఉండవచ్చు. ఇవి ముఖ్యంగా లాప్‌టాప్‌లలో బాటరీ సేవ్ చేయగలవంటున్నారు. ఈ నెలాఖరులోకి లేదా జూలై నెలలోకెల్లా ఈ ప్రాసెసర్లు 4 మోడల్స్‌లో మార్కెట్లోకి వస్తాయంటున్నారు. ఆ ప్రాసెసర్‌ను వాడుకోవాలంటే మదర్ బోర్డూ మార్చాల్సిందే నంటున్నారు విశే్లషకులు. పద పారిజాతం Wi-Fi వైఫీ అంటే వయర్లెస్ యాక్సెస్ నిచ్చే నెట్‌వర్క్ సౌకర్యం WAN వైడ్ ఏరియా నెట్‌వర్క్. అంటే విశాల వైశాల్య (్భగోళికంగా) నెట్‌వర్క్. నిక్‌నెట్, ఏపీస్వాన్ ఉదాహరణలు.
కంప్యూటర్ కబుర్లు
english title: 
computer kaburlu
author: 
వి.వి.వి.రమణ

భావోద్వేగాలు - భక్తిప్రపత్తులు

$
0
0
మన ప్రపంచమే ఒక పోరాట క్షేత్రం.. పోరుబాటలో జీవితం పరిగెడుతూనే ఉంటుంది. భావోద్వేగాలు ఉద్రేక స్వభావంతో ఉరుకుతుంటాయి.. సారధ్యం వహిస్తున్న అంతరంగం వాటికి గంతలు కట్టి దౌడు తీయమంటుంది. పోరాడవలసిన దేహం విస్తుపోయి చైతన్యరహితమైనట్లుగా చేష్టలుడిగినదవుతుంది. ఒకపక్క భావోద్వేగాలకు సారధ్యం వహిస్తూన్న ఆంతర్యం నిశ్శబ్దంగా బ్రతుకు పోరాటం నేర్పుతుంటుంది. అంతర్వీక్షణా ఫలితంగా బహిరంగ రూపానికి మాటలు మిగలవు.. అంతర్వీక్షణతో ఉద్వేగ తత్వాన్ని గణిస్తూ, దౌడు తీస్తున్న తీరును గుణిస్తూ, మనసును హృదయానికి చేర్చి ఆత్మిక జీవనం సాగించవలసి ఉంటుంది. ఈ గమనంలో మానవ పుటక సైతం సంభవామి యుగేయుగే అనుకుంటే తప్ప ప్రపంచీకరణలో నెగ్గుకు రావటం సాధ్యపడదు. నిజానికి ‘నెగ్గాలి’ అన్న సంకల్పంలో ఎంతో కొంత ‘అహంకారం’ ఉంటుంది. ‘నెగ్గుకు రావాలి’ అన్న లక్ష్యంలో కొంత మేరనైనా భావోద్వేగం మిళితమై ఉంటుంది. ఇలా చూసినపుడు ఇగో, ఎమోషన్ వేరువేరు కాదనిపిస్తుంది. అహంకారం అహంభావాల వల్ల మనకు మనం బందీలమై పోతుంటాం. అంటే మనం గీసుకున్న గీతను దాట ప్రయత్నించం. అయితే భావోద్వేగాలతో మనం మారుతుంటాం. మనం ఊపిరి తీసుకుంటున్న సమాజం కానీ, మనం శ్వాసిస్తున్న కుటుంబ వ్యవస్థ కానీ, మన హృదయ స్పందనలుగా మారిన భక్తిప్రపత్తులు కానీ మనల్ని ఉద్వేగభరితుల్ని చేస్తూనే ఉంటాయి. ఈ జీవన యానంలో తెలివితేటలు, భావోద్వేగాలు సమాంతర వ్యక్తిత్వాలుగా అనిపిస్తున్నప్పటికీ భావోద్వేగ తీవ్రత ముందు తెలివిది కాస్త వెనకడుగే అవుతోంది. భావోద్వేగాలే జీవితాన్ని దౌడీ తీయిస్తున్నా మనుకున్నపుడు ఈ ఉద్వేగాలను మానవ జీవన ఉద్వేగాలు గాను, దివ్య జీవన ఉద్వేగాలుగాను వింగడించుకోవచ్చు. మానవ పర ఉద్వేగాలన్నీ సమ్మిశ్రీతాలు, కలుషితాలు. దివ్య జీవన ఉద్వేగ పవిత్రాలు, పారదర్శకాలు. కలుషిత ఉద్వేగాల వల్ల ప్రేమకంపితులం అవుతుంటాం.. పారదర్శక ఉద్రేకాల వల్ల ప్రేమ పాత్రల మవుతాం. మానవ ఉద్వేగాలు బందీలను చేస్తుంటే దివ్య ఉద్వేగం స్వతంత్రుల్ని చేస్తుంటుంది. హ్యూమన్ ఎమోషన్స్ భౌతిక మనుగడకు వత్తాసు పలుకుతుంటే డివైన్ ఎమోషన్ అధిభౌతిక జీవనానికి మార్గం సుగమం చేస్తుంటుంది. అయినా బ్రతుకు పోరులో భయస్థులమూ మనమే! ధైర్యస్థులం మనమే! నిజానికి భయకంపితులమై దివ్యత్వానికి చేరువ కాగలుగుతున్నట్లే ధైర్యంతో స్వంత పంథాలోను దివ్యత్వాన్ని అందుకోగలం. అయితే మనం చేస్తున్న పొరపాటుల తప్పులు చేస్తూ, భయపడుతూ భగవంతుడి ముందు మోకరిల్లి క్షమాపణ కోరుకోవటం.. చేసిన తప్పును మరలా చేయకుండా ఉండే ప్రయత్నం చేయకపోవడం. ఈ మానవ తప్పిదం నుండి బయటపడనంత కాలం భయపడుతూనే ఉండి.. భగవంతుడు క్షమించక శిక్షిస్తాడనే భయంతోనే బ్రతుకును వెళ్లదీస్తుంటాం. ఇలా భయం మనల్ని భక్తి వాకిట కూర్చుండబెడుతోంటే తప్ప ధైర్యంగా ఆత్మను జాగృతం చేయటం లేదు. ఇంతకీ భయానికి భక్తిరంగు పులిమి చేస్తున్న పూజల్ని నివేదిస్తున్న ప్రసాదాల్ని అందుకుంటున్న భగవంతుడు ఎవరు? ఆ భగవంతుడూ మనలా మరో సృష్టికారకుడే కదా! మనం సృష్టిలోకి వచ్చినట్లుగా మరొకరినీ సృష్టిలోకి తెస్తున్నాం కదా. కాబట్టి ఆ భగవంతుడూ మన స్నేహితుడే! సన్నిహితుడితో స్నేహం చేయాలే తప్ప సిగ్గిలితే ఎలా? మన మనసు వణుకుతున్నంత కాలం స్నేహం పురి విప్పదు.. మనం భయపడుతున్నంత కాలం ఎంతటి ప్రాణ స్నేహితుడైనా మనలోని తప్పొప్పులను చూపించే ప్రయత్నం చేయడు. ఇద్దరం వేరువేరు కాదు అనుకునే తత్వంలోనే, ఆ ‘ఒన్‌నెస్’లోనే డివైన్ ఎమోషన్ ప్యూర్ ఎమోషన్ అవుతుంది. మనం ప్రతిరోజూ సంధ్యా సమయాలలో చేసే పూజలు భక్తి ప్రపత్తులతో చేస్తున్నవే! అయితే ఈ భక్తి కూడా భావోద్వేగ జనితమేనా? మన ఎమోషన్‌ను ఇలా ‘డివోషన్’గా మలుస్తున్నామా? మానవ సంబంధాల నడుమ మన భావోద్వేగం ప్రాపంచిక మానవ బంధం అవుతోంది. భగవంతుని పరంగా మన భావోద్వేగం దివ్య బంధం అవుతోంది. ప్రాపంచిక మనుగడలో మన ఎమోషన్స్ ఒక్కొక్కరితో ఒక్కో విధంగా ఉంటున్నాయి. అలాగే అవతలి వారు ఒక్కొక్కలా మన భావోద్వేగాలను అర్థం చేసుకుంటున్నారు. అంటే మానవ సంబంధాలలో మన భావోద్వేగాలు వ్యక్తులను బట్టి, సందర్భాలను బట్టి వేరువేరు తీరుల వ్యక్తమవుతున్నాయన్నమాట. అందుకే అంటుంటారు We offer our emotion according to our capacity and others receive our emotion according to their receptivity అని. మొత్తానికి భావోద్వేగాలను పంచుకోనిదే బంధాలు పెరగటాలు, తరగటాలు జరగటం లేదు. మనం ఉంటున్నది ఒకే వ్యవస్థనే అయినప్పటికీ భావోద్వేగాల పరంగా వ్యవస్థ వైయక్తిక మయిపోతోంది. చివరికి వ్యక్తిపరంగానే భావోద్వేగానికి అస్తిత్వం సిద్ధిస్తోంది. వ్యవస్థ ఇలా విడిపోతుండటం వల్లనే దైవం, దివ్యత్వం అనే భావనలు మనలో భావోద్వేగాలుగా పరిణమించి మతం నీడన అస్తిత్వాన్ని వెతుక్కుంటున్నాయి. ఫలితంగా దివ్యత్వం ఒక అసామాన్య, సంపూర్ణ వ్యవస్థగా చిత్రితమై పోయింది. అందుకే దైవంతో బంధం ‘త్వమేవాహం’ అవుతోంది. ఇక్కడ పొటమరించే భావోద్వేగమూ ‘ఒక్క’టే.. అదే డివైన్ ఎమోషన్... పవిత్ర భావోద్వేగం.. అంటే కలుషితం కానటువంటిది. మన బాహ్య జీవనం ఆడంబర జీవనం అని మనందరకూ తెలిసిందే. ఒక విధంగా ఇది కలుషితం అవుతూనే ఉంటోంది. అయితే అంతరంగ జీవనంపై ఈ నీడలు పడటం లేదు. అది నిష్కళంకంగాను, పారదర్శకంగాను, పవిత్రంగాను ఉంటోంది. ఇలా డివైన్ ఎమోషన్ అంతరంగానికి చెందినదవుతోంది. దీనికి హృదయ స్పందనలు ముఖ్యమే తప్ప మానసిక ప్రకంపనలు ప్రధానం కాదు. సర్వసాధారణంగా మనం భక్తి పారవశ్యంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాం. ప్రార్థనతో మనం సంకల్పిస్తున్నాం అనుకుంటూనే కోరికల చిట్టా విప్పుతుంటాం. ప్రార్థించటం అంటే కోరుకుంటున్నాం అనుకుంటున్నామే తప్ప ప్రాధేయ పడుతున్నాం అని అనుకోవటం లేదు. దివ్యత్వం అనేది శక్తి ప్రవాహం. ఈ శక్తిని దేహంలోకి వొంపుకోవాలే తప్ప ప్రార్థించినంత మాత్రాన అది మనలోకి ప్రవహించదు. విల్ పవర్‌తో డివైన్ పవర్ అంది వచ్చేది. కాబట్టి ప్రేయర్‌కు కావలసింది విల్ పవర్. దివ్యత్వానిది రాజప్రాసాదమయితే మానవత్వానిది రాచరికమే కదా! రాజ్యం మనదే కాబట్టి అందులో ఎలా విహరించాలన్నది మనం నిర్ణయించుకోవాలి... మన ఎంపికను బట్టే దివ్యానందం లభిస్తుంది. భావోద్వేగానికున్న శక్తిని మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఎమోషన్‌ను పాజిటివ్ అనుకున్నా, నెగెటివ్ అనుకున్నా దాని శక్తి అపారమే. అది చాలా పవర్‌ఫుల్! సామాన్యంగా నచ్చిన వాటిని పాజిటివ్ అంటుంటాం. నచ్చని వాటిని నెగెటివ్ అంటుంటాం. పాజిటివ్ ఎమోషన్స్ వల్ల మంచి జరుగుతుంటుంది. నెగెటివ్ ఎమోషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక పోయినా, వాటి నుండి బయట పడలేకపోయి బలహీనపడతాం. అంతే తేడా! మనల్ని మనం ఎంత పాజిటివ్‌గా అంచనా వేసుకుంటుంటామో అలాగే మనలో నుండి పుట్టుకొచ్చే ఎమోషన్స్‌ను - ఎటువంటివైనా - పాజిటివ్ గానే డీల్ చేయగలగాలి. ఐహికానందాన్నిచ్చే హ్యూమన్ ఎమోషన్స్‌ను ఎంత సులభంగా ఆదరించ గలుగుతున్నామో అంతే సరళంగా ఆయుష్మికానందాన్నిచ్చే డివైన్ ఎమోషన్‌తోను అనుసంధానం కాగలగాలి. మానవ జీవితం సంపూర్ణం కావటానికి అన్ని భావోద్వేగాలను సమంగా స్వీకరించ గలుగుతున్నట్లే డివైన్ ఎమోషన్ పరంగానూ స్వయం సమృద్ధం కావలసిందే. మొత్తానికి హ్యూమన్ ఎమోషన్స్‌ను డివైన్ ఎమోషన్‌తో లింక్ చేయగలిగితే జీవితం ధన్యమైనట్లే! కారణం ఈ అనుసంధానం మన బాహ్యాన్ని అంతరంగాన్ని ముడిపెట్ట గలుగుతుంది కాబట్టి, ఇంకొక విధంగా చెప్పాలంటే మన భావోద్వేగాలను దైవదత్తం చేయగలిగితే అంటే మన కోపతాపాలు, ప్రేమ ఆప్యాయతలు మొదలైన ఉద్వేగాలను భగవంతుడి పరంగాను చూపగలిగితే మన లోలోతుల మార్పు సాధ్యమవుతుంది. ఈ డివినైజేషన్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల భావోద్వేగాల విషయంలో పాజిటివ్, నెగెటివ్ అన్న వింగడింపు లేకుండా పోతుంది. విరుద్ధతలు లేని అద్వితీయ భావోద్వేగం మాత్రమే మిగులుతుంది. ఈ అద్వైత భావనే జీవితాన్ని సంపన్నం చేస్తుండాలి. ఈ దృష్టితో బ్రతుకును అర్థవంతం చేసుకుంటూ పోవాలి. కొన్ని గుణగణాలతో, ఉద్వేగ ఉద్రేకాలతో మనం వ్యక్తిత్వ సంపన్న మవుతున్నాం... ఈ దేహమూ పురుష లక్షణ సమన్వితమే అవుతోంది. అయితే ఈ కనిపించే దేహంలో కనిపించని ఆత్మ ఒకటుంది. ఆ ఆత్మకు ఉండేవన్నీ మహా పురుష లక్షణాలే. అంటే భౌతిక జీవనానికి మించింది ఆత్మిక జీవనం.
విను నా మాట
english title: 
vinu naa maata
author: 
-డా.వాసిలి వసంతకుమార్ 939393 3946 - drvaasili@yahoo.co.in

'బెల్ట్'షాపుల స్థానంలో పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన

$
0
0

మోడీ చేసిన తప్పేంటి?

$
0
0
పాట్నా, జూన్ 23: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై జెడి(యు) నాయకత్వం విరుచుకుపడటాన్ని బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోడీని నియంత అని, చీలికలు తెచ్చే నాయకుడు అంటూ జెడి(యు) వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన ఆయన అసలు నరేంద్ర మోడీ చేసిన తప్పేమిటంటూ ఆ పార్టీ నాయకత్వాన్ని నిలదీశారు. పదిహేడు సంవత్సరాల పాటు బిజెపి సారధ్యంలోని ఎన్‌డిఎ కూటమిగా వున్న భాగస్వామ్య పక్షంగా ఉన్న జెడియు బయటకు వెళ్లిన వెంటనే నరేంద్ర మోడీపై ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం అర్థరహితమని ఆయన ఖండించారు. ఆదివారం పాట్నాలో జరిగిన బిజెపి కార్యకర్తల సదస్సులో మాట్లాడిన రాజ్‌నాథ్‌సింగ్ ‘దశాబ్దానికి పైగా మాతో కలిసివున్న జెడియు అభిప్రాయం ఆకస్మికంగా మారడానికి కారణమేమిటి? 2002 నుంచి 2013 వరకు అదే నరేంద్ర మోడీపై కలిసి పనిచేసిన జెడియు నేతలకు ఆయన ధోరణి ఏమిటో స్పష్టం కాలేదా? ఇప్పుడు బయటకు వచ్చిన వెంటనే ఆయన అంత వ్యతిరేకిగా మారిపోయారా?’ అని నిలదీశారు. నరేంద్ర మోడీని బిజెపి జాతీయ ప్రచార సారధిగా నియమించిన నేపథ్యంలో ఎన్‌డిఎ కూటమి నుంచి జెడియు తప్పుకున్న విషయం తెలిసిందే. మరో పార్టీ ఆంతరంగిక వ్యవహారాలను సాకుగా చూపించి ఎన్డీఏ నుంచి జెడియు వైదొలగడం ఎంతమాత్రం సమంజసం కాదని, ప్రతి పార్టీకి అంతర్గతంగా అవసరమైన నిర్ణయాలను తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ అంతర్గత స్వేచ్ఛలో భాగంగానే నరేంద్రమోడీని పార్టీని ప్రచార సారధిగా నియమించామని, అందుకు కారణం దేశవ్యాప్తంగా ఆయనకున్న ఆదరణ, జనాకర్షణ శక్తేనని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. కొంతకాలంగా కాంగ్రెస్‌కు సన్నిహితమవుతున్నారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పైనా రాజ్‌నాథ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు చేరువ కావడం వల్ల ఇప్పటివరకు నితీష్‌కున్న కీర్తిప్రతిష్ఠలన్నీ కూడా దానితోపాటే మిగిలిపోతాయని హెచ్చరించారు. బీహార్ మంత్రివర్గం నుంచి బిజెపి మంత్రులకు ఉద్వాసన పలకడాన్ని కూడా రాజ్‌నాథ్ తప్పుబట్టారు. ఇది ఏకపక్ష నిర్ణయమని, సంకీర్ణ ప్రభుత్వాలు పనిచేసే పద్ధతే కాదని తెలిపారు. కాంగ్రెస్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రాజ్‌నాథ్‌సింగ్ ఆ పార్టీని మహాభారత కథలోని ధృతరాష్ట్రుడితో పోల్చారు. కళ్లు కనిపించకపోయినా చివరివరకు ధృతరాష్ట్రుడు అధికారాన్ని పట్టుకుని వేళ్ళాడాడని, చివరికి భీముడ్ని కూడా కౌగలించుకుని హతమార్చేందుకు ప్రయత్నించాడని రాజ్‌నాథ్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో జెడియుకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. యుపిఎ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజమెత్తారు. ఆదివారం పాట్నాలో జరిగిన బిజెపి కార్యకర్తల సదస్సులో స్థానిక నేతలతో రాజ్‌నాథ్‌సింగ్
జెడియును నిలదీసిన రాజ్‌నాథ్
english title: 
m

1864మంది యాత్రికుల రాక

$
0
0
హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు ఎట్టకేలకు తమ ఇళ్లకు తిరిగొస్తున్నారు. ప్రత్యేక రైళ్లలో ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు 1,864 మంది చేరుకున్నారు. అయతే వరద బీభత్సంతో మృత్యువు అంచుదాకా వెళ్లి వచ్చిన తమవారిని చూసిన బంధువులు ఒక్కసారిగా రైలు వద్దకు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్లాట్‌ఫామ్ మీద ఇతర రైళ్ల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు కూడా ఉండటంతో ఒకరినొకరు తోసుకొని కిందపడ్డారు. మరోవైపు ప్రకృతి విలయాన్ని ప్రత్యక్షంగా చూసిన యాత్రికులు పడ్డ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తమ ఇబ్బందుల గురించి బంధువులకు చెబుతూ కన్నీరు పెట్టారు. అడుగడుగునా బాధితులు, బంధువుల ఆర్తనాదాలే. అందరివీ విషన్న వదనాలే. తిరిగి స్వస్థలాలకు చేరుకుంటామని ఊహించలేకపోయామని బరువెక్కిన హృదయాలతో యాత్రికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.మృత్యువు నుంచి బయటపడడం తమ అదృష్టంగా భావిస్తున్నామని బోరున విలపించారు. తిరిగి రావడం అదృష్టంగా భావిస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన రాములమ్మ చెప్పగా, యాత్రలో తానుపడిన కష్టాలు, ఘోర దృశ్యాలను జీవితాంతం మర్చిపోలేనని నిజామాబాద్‌కు చెందిన యాదగిరి కన్నీటి పర్యంతమయ్యాడు. కళ్ళెదుటే తమతోపాటు వచ్చిన యాత్రికులు వరదల్లో కొట్టుకుపోతుండటం కన్పించిందని మెదక్‌కు చెందిన ఈశ్వరయ్య అనగా,ఏదిఏమైనా తమ వారికి ఇది పునర్జనే్మనంటూ బంధువులు చెబుతున్నారు. ఇదిలావుంటే ఢిల్లీ చేరుకున్న యాత్రికులు ప్రత్యేక రైళ్లలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలకు వస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ఆర్‌టిసీ బస్సులు ఏర్పాటు చేసి స్వస్థలాలకు వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, యాత్రికుల ఖర్చుల కోసం ప్రతి ఒక్కరికి 2వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. యాత్రికులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. నేటికీ అక్కడి వరదల్లో, కొండ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాత్రికులను తరలించడానికి హెలికాప్టర్‌ను సిద్ధం చేశామని, కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు చెప్పారు. అయతే నేడోరేపో ఉత్తరాఖండ్‌కు హెలికాప్టర్ బయలుదేరి వెళుతుందని విపత్తుల అధికారి కె రాధ తెలిపారు. ఉత్తరాఖండ్, ఢిల్లీలో ఉన్న తెలుగువారి కోసం సహాయ చర్యలను చేపడుతూనే స్వస్థలాలకు వెళుతున్న వారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. కాగా, వైద్య, ఆహార సదుపాయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నామని, ఇప్పటి వరకు 3వేల మంది రాష్ట్ర వాసులను గుర్తించామని, అందులో 1,500 మందిని ఢిల్లీ ఎపి భవన్‌కు తీసుకువచ్చామని అధికారులు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున చార్‌ధామ్ యాత్రికుల బంధువులతో కిటకిటలాడుతున్న సికిందరాబాద్ రైల్వేస్టేషన్. వరద బీభత్సంనుండి ప్రాణాలతో బయటపడి తిరిగొచ్చిన ఆప్తులకు మిఠాయ తినిపించి ఆనందంతో స్వాగతం పలుకుతున్న ఓ కుటుంబం.
కిటకిటలాడిన సికిందరాబాద్ రైల్వేస్టేషన్ భారీసంఖ్యలో బంధువుల రాక... తొక్కిసలాట యాత్రికుల బాధలు వర్ణనాతీతం సహాయ కార్యక్రమాలను చేపడుతున్నామన్న ప్రభుత్వం
english title: 
y

అడుగడుగునా అవమానాలే

$
0
0
న్యూఢిల్లీ, జూన్ 23: రాష్ట్రానికి చెందిన ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవటంలో ఆంధ్రాభవన్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా నుంచి ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన సాయంత్రం ఏడు గంటలకు ఆంధ్రాభవన్ చేరుకుని బాధితులను పలకరించి వారు పడిన బాధలను తెలుసుకున్నారు. నానా గడ్డి కరిచి ఢిల్లీకి చేరుకున్న తమకు ఆంధ్రాభవన్‌లో అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని బాధితులు బాబుకు ఫిర్యాదు చేశారు. చలికి తగిలిన గాయాలకు చికిత్స చేయవలసిందిగా కోరితె వాజ్‌లైన్ తెచ్చుకుని రాసుకోవలసిందిగా అధికారులు సలహా ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదురోజుల పాటు తిండితిప్పలకు నోచుకోని తమకు ఆంధ్రాభవన్ అధికారులు ఉడకని అన్నం, సాంబరు పెట్టి చేతులు దులుపుకున్నారని బాబుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్నానానికి గదులివ్వరాదనీ, ఒకవేళ గది కావాలంటే 6వేల రూపాయలు కట్టండంటూ అధికారులు అన్నారని బాబు దృష్టికి ఈ సందర్భంగా పలువురు బాధితులు తీసుకొచ్చారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షిత ప్రాంతాలకు తరలించటంలోనేగాక చివరకు హెలికాప్టర్ ఎక్కించటంలో అధికారులు విపరీతమైన వివక్ష చూపించినట్లే భవన్ అధికారులు అంతకంటే హేయమైన తీరులో వ్యవహరించినట్లు వీరు తెలియచేశారు. అన్నం పెట్టే విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుకు మనస్థాపం చెందిన తాము ఢిల్లీలో అడుక్కోక తప్పలేదని ఓ మహిళా యాత్రికురాలు బాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి వెళ్లేందుకు ఇంతకుముందు కొన్న టిక్కెట్‌ను రద్దు చేసుకుని కొత్త టిక్కెట్ కొనుక్కుంటేనే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పారన్నారు. మా దగ్గర చిల్లిగవ్వ లేదని చెప్పినా ఫలితం లేకపోయిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో వచ్చిన తమకు కనీసం ఒక టవల్ కూడా ఇవ్వటానికి అధికారులు ముందుకు రాలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంతవరకూ ఢిల్లీకి వచ్చి పరామర్శించక పోవటాన్ని బాధితులు తీవ్రంగా విమర్శించారు. సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించటానికి నియమితులైన ఇద్దరు మంత్రులు ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో తెలియదని ఆరోపించారు. అమ్మ పెట్టాపెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నతీరులో ఆంధ్రాభవన్ అధికారులు వ్యవహరిస్తున్నారు. తమకు తెలిసిన తెనాలి వాస్తవ్యులు అష్టకష్టాలు పడి ఆంధ్రాభవన్‌కు చేరుకున్నారని తెలిసి ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది బాధితులకు రొట్టెలు, ఆపిల్స్ ఇవ్వటానికి రాగా ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందాలని అధికారులు మెలిక పెట్టారు. దీంతో వారు వెంటనే ఈ విషయాన్ని రెసిడెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పర్యాటక మంత్రి కేవలం సానుభూతి చూపించటం తప్పించి తమని ఆదుకోవటానికి ఎట్టి చర్యలు తీసుకోలేదని బాధితులు అగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాభవన్‌లో వరద బాధితులకు నగదు పంపిణీ చేస్తున్న చంద్రబాబు
ఆంధ్రాభవన్‌లో పట్టించుకునే దిక్కులేదు దుర్భర పరిస్థితిలో ఉన్నాం చంద్రబాబుకు వరద బాధితుల గోడు
english title: 
a

రాజకీయ పునరేకీకరణలు తథ్యం

$
0
0
హైదరాబాద్, జూన్ 23: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఆ తర్వాత రాజకీయ పునరేకీకరణలు తథ్యమని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత ఎం వెంకయ్యనాయుడు అన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 60వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇక్కడ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని బిజెపి యువమోర్చా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సర్దార్ పటేల్ లాంటి వ్యక్తులు మొదటి ప్రధాని అయి ఉంటే కాశ్మీర్ లాంటి సమస్య ఉండేది కాదన్నారు. దేశంలో 630 పథకాలకు ఒకే కుటుంబం వ్యక్తులు పేర్లు పెట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ కుటిల నీతులను ఎండగట్టిన తొలి వ్యక్తి, బలమైన నేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అన్నారు. ఎన్డీఏ హయాంలో అభివృద్ధి చెందితే, యుపిఏ కాలంలో మాత్రం రూపాయి విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, తప్పుడువిధానాల వల్లనే అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రంలో మాత్రమే అభివృద్ధి కొనసాగుతోందన్నారు. నరేంద్రమోడీ, మనోహర్ పారికర్, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్ నేతృత్వంలో ఆయా రాష్ట్రప్రభుత్వాలు అభివృద్థి పథంలో అగ్రగామిగా ఉన్నాయన్నారు. మోడీ అంటే త్రీడీ అన్న విషయం ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవడంలో మోడీ స్పందనే నిదర్శనమన్నారు. బీహార్‌లో జెడియూ విడిపోయిన తర్వాత సర్వేలే బిజెపికి, నరేంద్రమోడీ సామర్ధ్యానికి ప్రతీక అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తమ పార్టీ జయకేతనం ఎగుర వేయడం ఖాయమన్నారు. దేశాన్ని ఏకం చేసే విధంగా జాతీయ సమైక్యత, సమగ్రతా సిద్ధాంతాన్ని బలపరిచే పార్టీ కేవలం బిజెపి మాత్రమే అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో జాతీయ భావన, దేశభక్తితో ముందుకు అడుగులు వేయాలన్నారు. అవినీతి, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దేశ యువతీ, యువకులు ముందుకు వచ్చి పోరాడుతున్నారన్నారు. మజ్లిస్ నేతలు హిందువులపై, జాతిపై చేసిన దేశ ద్రోహ వ్యాఖ్యలకు సంబంధించిన కేసు ఎందుకు నీరుకారిందన్నారు. ఇది దేశ సమైక్యత, సమగ్రతకు సంబంధించిన విషయం అని ఆయన అన్నారు. ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలను ఎదిరించడంలో బిజెపి ముందుంటుందన్నారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు లాంటి ఘటనలకు నెహ్రూ కాంగ్రెస్ విధానాలే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు దత్తాత్రేయ, జాతీయ కార్యదర్శి జి. సతీష్, శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి, బిజెపి నేతలు కె హరిబాబు, బద్దం బాల్‌రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సభలో మాట్లాడుతున్న బిజెపి జాతీయ నేత వెంకయ్యనాయుడు
బిజెపి నేత వెంకయ్యనాయుడు
english title: 
r

పోలీస్ స్టేషన్ల కంప్యూటరీకరణ

$
0
0
హైదరాబాద్, జూన్ 23: పోలీస్ స్టేషన్లలో కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేయడానికి దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేయడానికి పోలీస్ శాఖ వేగవంతం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2200 పోలీస్ స్టేషన్లు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో నేటికి పోలీస్ స్టేషన్లలోకంప్యూటర్లు లేని పరిస్థితి నెలకొంది. మారుమూల ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల పాలనా పనితీరు ఇప్పటికీ అస్తవ్యస్థంగా ఉందని సంబంధిత అధికారులు చెప్పడం ఆశ్చర్యం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ స్టేష్టన్లలో ఆధునిక కమ్యూనికేషన్ విధానాన్ని తీసుకురావడానికి పోలీస్ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా చేపడుతున్న కంప్యూటర్ల వినియోగంతో క్షణాల్లో సమాచారం తెలుసుకోవచ్చునని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇక నేరుగా రాష్ట్రంలో ఎక్కడైనా పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న సంఘటన జరిగినా అందుకు సంబంధించిన సమాచారం డేటా నెట్‌వర్కతో తెలుసుకోవచ్చును. శ్రీకాకులం జిల్లా చింతపల్లి, కరీంనగర్ బీమదేవరపల్లి, అనంతపురం జిల్లా రొద్దం వంటి పోలీస్ స్టేషన్‌లో పని చేసే విధానం గురించి కంప్యూటలో చూడవచ్చునని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లలో పోలీస్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు. బాధితుల ఫిర్యాదులు పోలీసులు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే నెలలు, ఏళ్ళు గడిచినా కేసుల అంశం తేల్చకుండా నాన్చుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. పోలీసుల పనితీరు, ప్రజలకు సంబంధించిన శాంతి భద్రతల విషయాలతో పాటు పోలీసులపై వస్తున్న ఫిర్యాదులపై కంప్యూటర్ల విధానంతో నూతన సంస్కరణలు చేపట్టవచ్చునని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 48 శాతం పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్ విధానం పూర్తి చేశామని, మరో ఆరునెలల్లో అన్ని పోలీస్ స్టేష్టన్లలో కంప్యూటర్ల డేటాతో అనుసంధానం చేసే ప్రక్రియ విధానాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి తెలిపారు. మాజీ సైనికోద్యోగులకు రైల్వేలో ప్రత్యేక నియామకాలు ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 23: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక నియామకాన్ని చేపడుతోంది. గ్రూప్ డి పోస్టుల్లో మూడు కేటగిరిలు ట్రాక్‌మెన్, హెల్పర్, పాయింట్‌మెన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం తెలిపింది. ఈ మూడు కేటగిరిల్లో 311 పోస్టులను రైల్వే భర్తీ చేయనుంది. కనీసం 15 ఏళ్లపాటు మిలటరీలో పని చేసి ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు వయోపరిమితి తదితర అంశాల్లో నిబంధనలు వర్తిస్తాయి. జూలై 15లోగా ద.మ.రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌లో వివరాలు తెలుసుకోవచ్చని సైనిక సంక్షేమ కార్యాలయం తెలిపింది. ప్రమాదంలో అగ్నిమాపక శాఖ గాలికి పోయిన ఉప సంఘం సిఫార్సులు కానరాని స్థాయా సంఘం నిర్దేశాలు 89 నియోజకవర్గాల్లో ఫైర్‌స్టేషనే్ల లేవు ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 23: అరకొర బడ్జెట్, తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా విపత్తులు, అగ్నిప్రమాదాల సమయంలో ఆదుకోవాల్సిన అగ్నిమాపక శాఖ ప్రమాదపుటంచుల్లో ఉంది. అవసరమైనప్పుడు ఆపద నుంచి ప్రజల్ని, ప్రజాఆస్తులను కాపాడాల్సిన ఈ శాఖ క్రమేణా నిస్తేజంగా మారుతోంది. 2007 నుంచి 2012 వరకు ఇప్పుడు ఉన్న ఫైర్ స్టేషన్లకు అదనంగా ఒక్క ఫైర్‌స్టేషన్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఈ శాఖపై ప్రభుత్వం ఏ స్థాయిలో స్పందిస్తుందో స్పష్టమవుతోంది. భారీ అగ్నిప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పుడు వేగంగా స్పందించడం మినహా ముందస్తుగా యంత్రాంగం ఏర్పాట్లు లేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో ప్రమాదంలో చిక్కుకున్న ప్రజల ఆస్తులు బుగ్గిపాలవుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో చిన్న పెద్ద నగరాలు, పట్టణాలు, జనావాసాలు రోజు రోజుకీ విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న జనాభా, నగర, పట్టణ జనాభాలకు అనుగుణంగా అగ్నిమాపక శాఖ తన పరిధిని విస్తరించడం లేదు. ఈ శాఖ పనితీరు మెరుగుపర్చేందుకు గతంలో నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను 2012 నవంబర్ వరకు అమలు చేయలేదు. ఈ శాఖకు బడ్జెట్ కేటాయింపులూ అరకొరగానే ఉంటున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా విపత్తుల ఉపశమన నిధి నుంచి విడుదల కావాల్సిన నిధులు అందని కారణంగా ఈ శాఖ ఆధునీకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. మరో వైపు ఈ శాఖ వౌలిక వసతులను మెరుగు పర్చేందుకు ఉద్దేశించిన అగ్నిమాపక సలహా స్థాయి సంఘం నిర్దేశించిన ప్రమాణాలను పక్కన పడేసింది. ఈ శాఖపై సమగ్రంగా పరిశీలించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 89 అసెంబ్లీ నియోకవర్గాల్లో ఒక్క ఫైర్ స్టేషన్ కూడా లేదంటే ఈ శాఖ ఏరకంగా అత్యవసర సమయంలో ప్రజలకు సేవలందిస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. కొత్త ఫైర్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని గతంలో ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. వౌళిక వసతులను కల్పించేందుకు తీసుకున్న చర్యలు శూన్యం. కొన్ని ఫైర్ స్టేషన్లలో అగ్నిమాపక వాహనాలను నిలిపేందుకు వసతి లేదు. 85 ఫైర్ స్టేషన్లను తనిఖీ చేస్తే వాటిలో ఆరు ఫైర్ స్టేషన్లలో వాహనాలను నిలిపేందుకు స్థలం లేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అగ్నిమాపక వాహనాలు, రక్షణ వాహనాలు (రెస్క్యూవ్యాన్స్) వంటివి ఉన్నా అవి అవసరానికి సరిపడా లేవు. ఇప్పటికే కొనుగోలు చేసిన అత్యధిక పౌనఃపున్యంగల రేడియోసెట్లను అగ్నిమాపక శాఖ సక్రమంగా వినియోగించడం లేదని తెలుస్తోంది. అన్నింటికీ మించి కీలకమైన కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో పనితీరు కుంటుపడుతోంది. వాహనాలు ఉంటే, సిబ్బంది ఉండరు, సిబ్బంది ఉంటే వాహనాలు లేని పరిస్థితి నెలకొంది. ఉన్న వారికి రోజు రోజుకీ వచ్చే మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ఆ శాఖ ఉన్నతాధికారులు కాలక్షేపం చేస్తున్నారు. 2007 నుంచి 2012 మధ్య కాలంలో ఎలాంటి శిక్షణ ప్రణాళిక అమలు చేయలేదని స్పష్టమైంది. ఈ కాలంలో డెప్యూటేషన్‌పై తీసుకున్న 811 మంది హోంగార్డుల్లో ఏ ఒక్కరికీ శిక్షణ ఇవ్వలేదు. ఫైర్‌మెన్, డ్రైవర్, ఆపరేటర్ వంటి కీలకపోస్టుల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. 2012-13లో రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ ద్వారా ఫైర్‌మెన్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. పట్టణాలు, నగరాల్లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు సమీపంలో ఉన్న వాహనాలు కాస్త అటో ఇటో ప్రమాద స్థలానికి చేరుకున్నా గ్రామీణప్రాంతాల్లో మాత్రం చాలా ఆలస్యంగా చేరుకుంటున్న సంఘటనలు ఉన్నాయి. పట్టణాలు, నగరాల్లో అయితే కాల్ వచ్చిన 30 నిమిషాల్లోనే ప్రమాదాన్ని అరికట్టడానికి హాజరైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫైర్ స్టేషన్ అవసరమని మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సూచన మేరకు ఏర్పాటైతే కనీసం త్వరగా క్షేత్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. చార్‌ధామ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలి దత్తాత్రేయ డిమాండ్ ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 23: ఉత్తరాఖండ్‌లో ప్రకృతి వైపరీత్యాలకు మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. చార్‌ధామ్‌లోని బదరీనాథ్, కేదారినాథ్ దేవాలయల వద్ద నివాస సముదాయానికి కనివినీ ఎరుగని నష్టం వాటిల్లిందని, వందలాది మంది మరణించారని, భారతీయులకు పవిత్ర పుణ్య స్ధలాలైన ఈ రెండు క్షేత్రాల్లో దేవాలయాలు పునరుద్ధరించేందుకు మూడేళ్లు పడుతుందన్నారు. కాని ప్రకృతి వైపరీత్యాల తర్వాత పునరావాస చర్యలను చేపట్టడంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం భక్తులకు కనీసం తాగునీటి సదుపాయాన్ని కల్పించడంలో కూడా విఫలమైందన్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పని చేయడం లేదన్నారు. జాతీయ విపత్తు నివారణ కేంద్రాలు కూడా విఫలమయ్యాయన్నారు. ఈ తరహా విషాదాలను తట్టుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాలేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ బహుగుణ పేర్కొనడం దారుణమన్నారు. హిమాలయాల్లో ఈ తరహా విషాదం చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోలేదన్నారు. 38 వేల చదరపు కి.మీ విస్తీర్ణంలోని ప్రాంతంలో కూడా పునరావాస చర్యలు తీసుకోవడంలో కేంద్రం ఘోర వైఫల్యం చెందిందన్నారు. జాతీయ విపత్తు నివారణ అథారిటీకి తగిన సిబ్బంది లేరన్నారు. కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. కేంద్రం ఈ అథారిటీకి ఎటువంటి నిధులు కేటాయించడం లేదన్నారు. రాష్ట్రానికి చెందిన వేలాదిమంది యాత్రికులు హిమాలయాల్లో చిక్కుకున్నారని, వీరిని సురక్షితంగా స్వరాష్ట్రానికి చేర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏనుగుల సంఖ్య పెరిగింది: కాగ్ ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 23: రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య పెరిగింది. జింకలు, సాంబార్‌లు, నల్ల దుప్పులు, అడవి పందులు, ఎలుగు బంట్లు, నక్కలు, తోడేళ్లు, పక్షుల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అధికారులు సమర్పించిన నివేదికలో వెల్లడైంది. 2010 నుంచి 2012 వరకు ఐదు వన్యప్రాణి డివిజన్లు, ఒక పులుల సంరక్షణ ప్రాంతంలో నిర్వహించిన వన్యప్రాణి గణన రికార్డులను పరిశీలించినప్పుడు ఈ వివరాలు బహిర్గతమయ్యాయి. చిత్తూరు (పశ్చిమ) డివిజన్ కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ డివిజన్‌లో ఏనుగుల రక్షణ ప్రాంతంలో నిర్వహించిన గణనలో 2007లో 9 ఏనుగులు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 17కు పెరిగింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్-1 ప్రకారం అంతరించిపోయే ప్రమాదం ఉన్న ఒక జీవి బట్టమేక పిట్ట. ఇవి గతంలో ఆత్మకూరు వన్యప్రాణి నిర్వహణ డివిజన్ కింద వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉండేవి. కాని ప్రస్తుతం దాదాపు కనుమరుగయ్యాయి. 2001లో వీటి సంఖ్య 98 ఉండగా, 2010లో కేవలం ఐదుకు పడిపోయాయి. భారతదేశంలో అతి పెద్ద నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల రక్షిత కేంద్రంలో గడచిన 5 సంవత్సరాల్లో చెప్పుకోదగిన మార్పు లేదు. ఈదు సంవత్సరాల్లో 2007లో 76, 2008లో 85, 2009లో 80, 2010లో 85, 2011లో 79 పెద్దపులులు ఉన్నాయి. అయితే చిరుత పులుల సంఖ్య 2007లో 56 ఉండగా, వీటి సంఖ్య 2011కు 88కు పెరిగింది. వరంగల్ వన్యప్రాణి సంరక్షణలో డివిజన్‌లో పులుల సంఖ్య 2007లో రెండు ఉండగా, 2012లో సున్నాకి పడిపోయింది. చిరుతపులుల సంఖ్య 2007లో పది ఉండగా, 2012కు ఐదుకు పడిపోయిందని 2012లో సేకరించిన వన్యప్రాణి గణన తెలియచేసింది. జన్నారనం వన్యప్రాణి నిర్వహణ డివిజన్‌లో కవ్వల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పులుల సంఖ్య 2009 నుంచి స్ధిరంగా నాలుగు ఉంది. చిరుత పులుల సంఖ్య 2009లో 23 ఉండగా, 2011లో 21కు తగ్గింది. సిఎం పదవి కాదు.. ప్రత్యేక రాష్ట్రం కావాలి పాల్వాయి డిమాండ్ ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు, ప్రత్యేక రాష్ట్రం కావడమే ప్రధానమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇటీవల తాను ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిసి తెలంగాణ రాష్ట్ర విభజన తప్ప ఎటువంటి ప్యాకేజీలు అవసరం లేదని చెప్పినట్లు ఆయన ఆదివారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ రాష్రం ఏర్పాటు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుందని చెప్పానని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆంధ్ర ప్రాంతంలో పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, అటువంటి పరిస్థితి తెలంగాణకు రానీయకూడదని కోరానని అన్నారు. తెలంగాణ ప్రాంత సీనియర్ నాయకులు అందరూ సమావేశమయ్యారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవాల్సిందిగా దిగ్విజయ్‌సింగ్‌కు వివరించానని ఆయన చెప్పారు. తెలంగాణ నిర్ణయం ప్రకటించడానికి హైదరాబాద్‌కు రావాల్సిందిగా దిగ్విజయ్‌ను కోరినట్లు పాల్వాయి తెలిపారు. డిఎస్‌తో జానా భేటీ ఇలాఉండగా పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి సమావేశమై మంతనాలు జరిపారు. ఇటీవల డిఎస్ ఢిల్లీకి వెళ్ళి ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పరిస్థితులను సోనియా గాంధీకి వివరించిన విషయాల గురించి డిఎస్ ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఈ నెల 30న నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్వహించబోయే సమావేశం గురించి కూడా వారు చర్చించారు. సౌర విద్యుత్ ప్యానెల్స్ అమర్చండి ప్రాణహిత-చేవెళ్లపై స్థారుూ సంఘం సిఫార్సు ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 23: ప్రతిష్టాకరమైన డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి సాగు నీటి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని నిర్వహించేందుకు సౌరశక్తి విద్యుత్‌ను ఉపయోగించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని విద్యుత్ రంగంపై ఏర్పాటైన శాసనసభ స్థారుూ సంఘం సిఫార్సు చేసింది. ఈ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంతో ముడిపడి ఉంది. దాదాపు రెండు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఈ ప్రాజెక్టు కాల్వలపైన ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి ఉత్పత్తి చేయవచ్చు. స్ధారుూ సంఘం చైర్మన్ సి. నర్సారెడ్డి ఆధ్వర్యంలోని సభ్యులు ఈ నివేదికను సమర్పించారు. దీని వల్ల ప్రాజెక్టు కింద ఉన్న భూములకు ఎత్తిపోతల ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ లభిస్తుంది. నీటి ఆవిరిని అరికట్టవచ్చును. కాల్వలను సక్రమంగా ఉపయోగించుకోవచ్చును. ఎత్తిపోతలకు అవసరమైన విద్యుత్ లభిస్తుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. ఈ పథకాల నిర్వహణకు దాదాపు 7600 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. మొత్తం పైన సాలీనా 14500 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభ్యత ఉంటే తప్ప ఈ ఎత్తిపోతల పథకాలను నిర్వహణ కష్టమవుతుందని స్థారుూ సంఘం అభిప్రాయపడింది. దాదాపు విద్యుత్‌కే ఎనిమిదివేల కోట్ల రూపాయల ఖర్చవుతుంది. లేదా ఎకరానికిక 20 వేల రూపాయల చొప్పున వ్యయమవుతుంది. దీనికి అదనంగా అనేక ఖర్చులుంటాయి. రాష్ట్రంలో అన్ని వెనకబడిన ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు సమగ్రమైన ప్రణాళిక అవసరమని ఈ సంఘం అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఇంధన సంరక్షణ సంఘం విసృతంగా విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ప్రచారం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కనీసం 50 లక్షల రూపాయల నిధులను కేటాయించాలని స్థారుూ సంఘం సిఫార్సు చేసింది. వినియోగదారులు సిఎల్‌ఎఫ్, ఎల్‌ఇడి , సోలార్ బల్బులు ఉపయోగించేందుకు ప్రోత్సహించాలి. సంప్రదాయేతర ఇంధన వనరులను ఉపదయోగించడన్ని ప్రోత్సహించాలి. ఇంధన పొదుపు కార్యక్రమాల్లో ఏపి ట్రాన్స్‌కో, డిస్కాంలు, జెన్కోకు భాగస్వామ్యం కల్పించాలని సిఫార్సు చేసింది.
రాష్ట్రంలో 2200 పోలీస్ స్టేషన్లు రూ. 100 కోట్ల ఖర్చు
english title: 
p

దేవుడున్నాడు.. పరమశివుడే రక్షించాడు

$
0
0
నెల్లూరు, జూన్ 23: సాక్షాత్తు పరమశివుడు కళ్లెదుటే సాక్షాత్కరించినంతటి పనైందని చార్‌ధామ్ యాత్ర నుంచి తిరిగి వచ్చిన 53 మంది బాధితులు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఆదివారం మధ్యాహ్నం నెల్లూరు ఛేరుకున్న వీరికి స్థానిక రైల్వే స్టేషన్‌లో బంధువులు, శ్రేయోభిలాషులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాత్రీకులు మాట్లాడుతూ, దేవుడున్నాడని.. అందువల్లే తాము ప్రాణాలతో సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగామని భావోద్వేగంతో అన్నారు. ట్రావెల్ ఏజెంట్ నిర్వాకం వల్ల సొంత ఊరు చేరుకుంటామన్న భరోసా కూడా ఒకానొక దశలో కరవైందన్నారు. గంగానది అకస్మాత్తుగా పొంగి ప్రవహించడంతో ఎక్కడికక్కడ దారి తెన్నూ తెలియని పరిస్థితుల్లో చిక్కుకున్నామన్నారు. అన్నపానీయాలు లభించక ఇక్కట్లు పాలైనట్లు తెలిపారు. చేతిలో డబ్బున్నా కొనుక్కుని తినడానికి అక్కడ ఏమీ లభించక నరకయాతన అనుభవించామని, తమ క్షేమ సమాచారం బంధువులకు అందజేయలేక తీవ్ర ఉద్వేగానికి లోనయ్యామన్నారు. యాత్రికులను ఆదుకోవడంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పటికీ సైనిక జవాన్ల సహాయ చర్యల వల్ల క్షేమంగా ఇంటికి చేరుకోగలిగామన్నారు.
సాక్షాత్తు పరమశివుడు కళ్లెదుటే సాక్షాత్కరించినంతటి
english title: 
d

పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతా

$
0
0
బాపట్ల, జూన్ 23: దేశంలో పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేసి జాతి గర్వించదగిన స్థాయికి తీసుకెళ్తానని కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గుంటూరు జిల్లా సూర్యలంక సముద్రతీరంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ వేదికపై చిరంజీవి పంచెకట్టుతో కనిపించి ప్రేక్షకులను, పర్యాటకులను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని, జి-20 దేశాల సదస్సులో కూడా ఈ రంగం విశిష్టతను చర్చించడం జరిగిందన్నారు. పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి అభివృద్ధి చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ తనపై ఎంతో నమ్మకముంచి ఈ శాఖను అప్పగించారని, ఈ శాఖ ద్వారా దేశ ఆదాయాన్ని, ప్రతిష్ఠను పెంచడానికి నిర్విరామంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి పర్యాటకశాఖ నుండి వీలైనన్ని అధిక నిధులను మంజూరు చేస్తున్నట్లు, గడచిన ఆరు నెలల్లో రూ.221 కోట్ల నిధులతో వివిధ కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. వైజాగ్ బీచ్ వద్ద బీచ్ కారిడార్‌ను, కోనసీమ- భద్రాచలం, అరకులోయ, కొండపల్లి -ఇబ్రహీంపట్నం ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానన్నారు. రానున్న ఆరు నెలల్లో రాష్ట్రంలో రూ.500 కోట్ల మేరకు పర్యాటక శాఖ నుండి నిధులను విడుదల చేస్తానన్నారు. కాంగ్రెస్‌లోనే సామాజిక న్యాయం ఏ సామాజిక న్యాయం కోసం తను పరితపించానో అది కాంగ్రెస్ పార్టీలో ఉందని, ఈ విశ్వాసం నిజమైందనడానికి జెడి శీలం కేంద్ర మంత్రిగా నియమితులు కావడం పెద్ద ఉదాహరణ అని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. బీచ్ ఫెస్టివల్స్‌ను భారీస్థాయిలో నిర్వహించడానికి కృషి చేసిన కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి వట్టి వసంత్‌కుమార్, బాపట్ల ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డిని అభినందించారు. నక్సల్స్ పేరుతో దోపిడీ గొల్లప్రోలు, జూన్ 23: నక్సలైట్ల పేరుతో బెదిరించి రైస్ మిల్లు యజమాని నుంచి 6.3 లక్షల రూపాయలు దోచుకుపోయన ఉదంతం తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లప్రోలు పట్టణ శివారు చెందుర్తి సెంటర్ సమీపంలోని శ్రీ మహేశ్వరీ మోడరన్ రైస్ మిల్లు వద్దకు ఆదివారం ఉదయం నలుగురు ఆగంతకులు కారులో వచ్చారు. మిల్లు యజమాని గుండుబిల్లి పోలీసు (చిన్న)ను మాట్లాడే పనివుందని మిల్లు ఆఫీసు గదిలోకి తీసుకెళ్లారు. గది బయట ఇద్దరు కాపలా ఉండగా, మరో ఇద్దరు లోపలికి వెళ్లారు. తాము గణపతి దళానికి చెందిన నక్సలైట్లమని, ఆయుధాల కొనుగోలుకు రూ.లక్ష విరాళం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ వ్యాపారం అంతంతమాత్రమేనని, అంత సొమ్ము తన వద్ద లేదని చిన్న తెలిపాడు. దీనితో ఆగ్రహించిన ఆగంతకులు తుపాకులు బయటకుతీశారు. చిన్నను నిర్భందించి బీరువాలో వెతికారు. అనంతరం అతనివద్ద ఉన్న బ్యాగ్ వెతకగా, అంతకు ముందు రోజు బ్యాంకు నుండి డ్రాచేసి తెచ్చిన రూ.6.3 లక్షల నగదు కనిపించింది. అరిస్తే కాల్చేస్తామంటూ బెదిరించి, నగదు తీసుకుని, కార్యాలయం గది బయట గడియ పెట్టి కారులో పరారయ్యారు. కొంత సేపటికే చిన్న కేకలు వేయడంతో విషయం బయటపడింది. పిఠాపురం సిఐ రాంబాబు ఆధ్వర్యంలో పిఠాపురం రూరల్ పోలీసులు సూర్యభాస్కరరావు, గొల్లప్రోలు ఎఎస్సై క్రిస్టియన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తిరుమలలో పున్నమి గరుడ సేవ తిరుపతి, జూన్ 23: ప్రతి నెలా పౌర్ణమిరోజున తిరుమలలో స్వామివారికి నిర్వహించే గరుడ సేవ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామి సర్వాలంకార భూషితుడైన తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను దర్శనమిచ్చారు. దేదీప్యమానమైన విద్యుత్ వెలుగుల మధ్య స్వర్ణాలంకార భూషితుడై శ్రీస్వామివారి ఊరేగింపు భక్తులకు కనువిందు చేసింది. కాగా తిరుమలలో ఆదివారం రద్దీ విపరీతంగా ఉండడంతో ఆలయంలో స్వామి దర్శనం లభించనివారు తిరువీధుల్లో ఊరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకున్నారు. పది మంది కృష్ణా వాసుల గల్లంతు ఆంధ్రభూమి బ్యూరో విజయవాడ, జూన్ 23: ప్రముఖ యాత్ర స్థలాల సందర్శన నిమిత్తం కృష్ణా జిల్లా నుండి ఉత్తరాఖండ్‌కు వెళ్లిన వారిలో నేటికీ పది మంది యాత్రికుల ఆచూకీ తెలియక వారివారి కుటుంబ సభ్యులు నిద్రాహారాలు లేకుండా ఎదురుతెన్నులు చూస్తున్నారు. విజయవాడ నుంచి వెళ్లిన వారిలో తొలుత 10 మంది ఆచూకీ తెలియకపోగా క్రమేణ ఐదుగురి సమాచారం అందించింది. వీరిలో పొట్టిపోతుల అన్నపూర్ణ క్షేమంగా ఆదివారం భావాజీపేటలోని నివాస గృహానికి చేరింది. ఇక ఆవుల రంగారెడ్డి (66), భార్య వెంకటలక్ష్మి (55), బి వెంకట సుశీల (53), బి సంధ్యాలక్ష్మి (40), జి అనసూయ (45) ఆచూకీ తెలియాల్సి ఉంది. వీరిలో సంధ్యాలక్ష్మి భర్త చెన్నకేశవులు, అనసూయ భర్త జివి గుప్తా క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఆచూకీ తెలియనివారిలో ఇద్దరు నీటిలో కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తోట్లవల్లూరు మండలం పాములపాటివారి పాలెం, దేవరపల్లి, చాగంటిపాడు గ్రామాల నుంచి మొత్తం 19 మంది బయలుదేరి వెళ్లగా వీరిలో దేవరపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు భీమవరపు నాగరత్తమ్మ, ఆరేపల్లి సరస్వతి మరణించినట్లు సమాచారం. మిగిలిన వారిలో ఐదుగురి ఆచూకీ తెలియరావటంలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వారిలో పెద్దు సరోజిని (70), కరిపినేని రాజేంద్రప్రసాద్ (50), కరిపినేని నాగలక్ష్మి (45), ఎస్ సుశీల (52), కరిపినేని లక్ష్మి (40) ఉన్నారు. నూజివీడు డివిజన్ చాట్రాయి గ్రామం నుంచి వెళ్లిన వారిలో కూరగాయల వ్యాపారి సదటి సత్యనారాయణ (60) ఢిల్లీ సమీపంలో గుండెపోటుతో మరణించాడు. జిల్లా మొత్తంపై ఆచూకీ తెలియని పది మంది కోసం అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించి అనే్వషిస్తున్నారు.
కేంద్ర మంత్రి చిరంజీవి భరోసా
english title: 
p

గరుడ వాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి

$
0
0
కర్నూలు, జూన్ 23: కర్నూలు జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఈ రైలును మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీనితోపాటు బడ్జెట్‌లో ప్రకటించిన కర్నూలు, నంద్యాల మధ్య కొత్త ప్యాసింజరు రైలు కూడా ప్రారంభం కానున్నది. కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్‌గా ఉన్న పేరును కర్నూలు సిటీ రైల్వే స్టేషనుగా మారుస్తూ జారీ అయిన ఆదేశాలు కర్నూలు రైల్వే అధికారులకు చేరడంతో ఆ మేరకు స్థానిక రైల్వే స్టేషనులో బోర్డులను మారుస్తున్నారు. సిటీస్టేషన్‌గా మారడంతోనే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశ పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు అడ్డంకులు ఉన్నందున కర్నూలు, సికింద్రాబాదు మధ్య కొత్తగా ఒక ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశ పెడుతున్నట్లు రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు. ఆ రైలును ఇంటర్‌సిటీగా మార్చుకునేందుకు కేంద్రమంత్రి కోట్ల తనవంతు ప్రయత్నం చేసి ఫైలును శరవేగంగా కదిలించి సిటీ రైల్వే స్టేషనుగా మార్చుకోగలిగారు. దాంతో కొత్తగా మంజూరయిన ఎక్స్‌ప్రెస్ రైలునే ఇంటర్‌సిటీగా ప్రవేశ పెడుతున్నారు. కాస్త ఆలస్యమే అయినా మంగళవారం నుంచి ప్రతిరోజు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం కర్నూలు నుంచి, సాయంత్రం సికింద్రాబాదు నుంచి రాకపోకలను ప్రారంభిస్తుంది. ప్రారంభ రోజున ఉదయం 9గంటలకు రైలుకు పచ్చజెండా ఊపిన అనంతరం కొత్త రైలు వేళలను ప్రకటించనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించిన కర్నూలు, నంద్యాల ప్యాసింజరు రైలు కూడా మంగళవారం ప్రారంభం కానుంది. ఆ రైలు వేళలను, టికెట్ ధరలను అదే రోజున ప్రకటించనున్నారు. షార్‌కు చేరిన జి శాట్ రెండు ప్రయోగాలకు ఇస్రో సన్నద్ధం సూళ్లూరుపేట, జూన్ 23: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 1న పిఎస్‌ఎల్‌వి, ఆగస్టు తొలి వారంలో జిఎస్‌ఎల్‌వి రాకెట్ ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. జూలై ఒకటిన అర్ధరాత్రి 11.47 గంటలకు పిఎస్‌ఎల్‌వి సి-22 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. దీనిద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులన్నీ పూర్తయ్యాయి. జూన్ 12న ప్రయోగించాల్సిన ఈ రాకెట్ రెండో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో శాస్తవ్రేత్తలు లోపాన్ని సవరించి జూలై 1న ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఆగస్టులో జిఎస్‌ఎల్‌వి ప్రయోగం ఆగస్టు తొలివారంలో జిఎస్‌ఎల్‌వి రాకెట్‌ను ప్రయోగించేందుకు శాస్తవ్రేత్తలు సిద్ధం చేశారు. ఈ రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టే జిశాట్ ఉపగ్రహం ఆదివారం భారీ భద్రత నడుమ షార్‌కు చేరింది. సోమవారం నుంచి రాకెట్‌లో ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియలో శాస్తవ్రేత్తలున్నారు. కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. సుదీర్ఘ విరామం తరువాత రెండు ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం చుట్టింది. ఎస్సీ వర్గీకరణ చేయకుంటే కాంగ్రెస్‌కు నష్టమే కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెనాలి, జూన్ 23: జనరల్ సీటు ద్వారా ఎంపిగా గెలిచిన తనకు వర్గీకరణ ద్వారా వచ్చే రిజర్వేషన్ ఫలాలు అవసరం లేదని, తన జాతికి ఉన్నతంగా రాణించేందుకు వర్గీకరణ అవసరమని, అదే జరగకుంటే కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే కోటి మంది మాదిగల్లో తాను ఒకడినని కేంద్ర జాతీయ రహదారుల సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి జెఎమ్‌జె కళాశాలలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎంఆర్‌పిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత మాదిగల్లో తొలి కేంద్ర మంత్రిని తానేనని, ఆ అవకాశం సోనియా ద్వారానే లభించిందని అన్నారు. కృష్ణమాదిగ నాయకత్వంలో ఉప్పెనలా వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మాదిగ జాతి అన్ని రంగాల్లో రాణించాలనే ఆకాంక్ష తనకు ఉందన్నారు. అమ్మను ఒప్పిస్తా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో పెట్టించే ప్రయత్నం చేస్తానని మాదిగ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తుంగభద్రకు పెరిగిన వరద బళ్ళారి, జూన్ 23: శివమొగ్గ, తీర్థహళ్ళి, హాగుంబే తదితర ప్రాంతాలలోకురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో రోజు రోజుకూ పెరుగుతోంది. ఆదివారం డ్యాంలోకి 13, 585 క్యూసెక్‌లు నీరు చేరింది. వర్షాలు ఇలాగే కొనసాగితే ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1,589.48 అడుగులు ఉండగా, 8.490 టీఎంసీల నీరు నిల్వ ఉందని తుంగభద్ర బోర్డు అధికారులుతెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటి మట్టం 1580.35అడుగులు 4.302 క్యూసెక్కులుగా ఉండేదని తెలిపారు.
రేపటి నుంచి ‘ఇంటర్‌సిటీ’ పరుగు నంద్యాల ప్యాసింజర్‌కూ గ్రీన్‌సిగ్నల్
english title: 
g

‘తృటిలో బయటపడ్డాం.. చచ్చి బతికాం’

$
0
0
రాజమండ్రి, జూన్ 23: ‘మా పరిస్థితి చచ్చి బతికినట్లు ఉందని’ చార్‌ధామ్‌యాత్ర నుంచి తిరిగి వచ్చిన యాత్రికులు వ్యాఖ్యానించారు. చార్‌ధామ్‌యాత్రకు వెళ్లి ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యాత్రికులు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలులో ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తమవారికి స్వాగతం పలకడానికి యాత్రికుల బంధువులు పెద్ద సంఖ్యలో రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో స్టేషన్‌లో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు తమవారి చెంతకు చేరిన యాత్రికుల కళ్లల్లో ఒకలాంటి మెరుపుకనిపించింది. వారి కళ్లల్లో చార్‌ధామ్‌యాత్ర తాలూకు అనుభవాలు, భయాందోళనలు స్పష్టంగా కనిపించాయి. అయితే ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న జిల్లా యాత్రికులు ఒక విధంగా అదృష్టవంతులనే చెప్పాలి. వీరి వెనుక బయలుదేరిన వేలాది మంది ఇప్పటికీ వరదల్లో చిక్కుకుపోవడం గమనార్హం. నాలుగు రోజుల పాటు నరకయాతన అనుభవించామని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తూ, కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలు చూశామన్నారు. దీంతో నాలుగు రోజుల పాటు బస్సు దిగే అవకాశం కూడా లేకపోయిందన్నారు. కనీసం తినేందుకు తిండి, తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకలేదన్నారు. కొన్నిసార్లు వర్షపునీటితోనే దాహం తీర్చుకోవాల్సి వచ్చిందన్నారు. తమ పక్కనే ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయని, తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నామని పలువురు యాత్రికులు చెప్పారు. తమ వెనుక వచ్చిన యాత్రికుల్లో చాలామంది గల్లంతయ్యారన్నారు. ఉత్తరాఖండ్‌లో తమ గోడును పట్టించుకునే నాధుడు కనిపించలేదన్నారు. ఏలూరు చేరుకున్న 50 మంది ఏలూరు: చార్‌ధామ్ పెను ఉత్పాతం నుండి బయటపడిన 50 మంది యాత్రికులు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా నరకయాతన అనుభవించిన చార్‌ధామ్ యాత్రీకుల కళ్లల్లో ఒకింత అనందం కన్పడింది. దేవుని దయవల్ల అతి పెద్ద ఉపద్రవాన్ని తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డామని, ఇది తమకు పునర్జన్మ వంటిదని యాత్రికులు పేర్కొన్నారు. ఈనెల 5వ తేదీన తామంతా ఉత్తరకాశీ యాత్రకు బయలుదేరామని, 15వ తేదీన ఉత్తరకాశీకి వెళ్లేందుకు సిద్దమవుతుండగా చిన్నగా వర్షం ప్రారంభమైందన్నారు. ఇక అక్కడ నుండి ప్రయాణం కుదరదని చెప్పటంతో అక్కడే బస్టాండ్‌లో దాదాపు 40మంది వరకు ఉండిపోయామన్నారు. ఇక అక్కడ నుంచి నరకం ప్రారంభమైందని, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు తీసుకోకపోవటం వల్ల యాత్రికులంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కళ్లముందే ఎంతోమంది తెలుగువారు కొట్టుకుపోతున్నా ఏమి చేయలేని పరిస్దితిలో చూడాల్సి వచ్చిందన్నారు. అయితే ఢిల్లీలో కేంద్ర మంత్రులు చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి తమకు ఎంతో ధైర్యం చెప్పటంతోపాటు భోజనం, అల్పాహారం ఏర్పాట్లు చేశారన్నారు. చార్‌ధామ్ యాత్రికులను రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో పరామర్శిస్తున్న సినీ నటుడు, టిడిపి నేత మురళీమోహన్ ‘నరకాన్ని అనుభవించాం’ వినుకొండ, జూన్ 23: గుంటూరు జిల్లా వినుకొండ నుండి ఈ నెల మూడున చార్‌ధామ్ యాత్రకు వెళ్ళిన పట్టణానికి చెందిన పది మంది బాధితులు ఆదివారం మధ్యాహ్నం క్షేమంగా వినుకొండ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. చార్‌ధామ్ నుండి వినుకొండకు రైలులో తిరిగి వచ్చిన భక్తుల సమాచారం అందుకున్న బంధువులు, మిత్రులు రైల్వేస్టేషన్‌లో వారికి ఘనస్వాగతం పలికారు. తమ బంధువులను చూడగానే వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు విలేఖరులతో మాట్లాడుతూ, తాము వారం రోజులపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామన్నారు. చూస్తుండగానే కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయని, నాలుగు రోజులపాటు బస్సులోనే ఉండి అన్నపానీయాలు లేక అలమటించామన్నారు. క్షేమంగా తిరిగివచ్చిన వారిలో గోనుగుంట్ల రాఘవమ్మ, పర్చూరి హేమమాలిని, పర్చూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కందకట్ల పుల్లారావు ఉన్నారు. బాధితులను ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, వైఎస్సార్ సిపి కన్వీనర్ డాక్టర్ సుధ తదితరులు పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ‘ప్రాణాలతో వస్తామనుకోలేదు’ ఆంధ్రభూమి బ్యూరో విశాఖపట్నం, జూన్ 23: ప్రాణాలతో తిరిగొస్తామనుకోలేదు. కనీసం మావార్ని చూస్తామనిగానీ, కలుసుకుంటామని గానీ అనుకోలేదు. భగవంతుని అనుగ్రహం వల్లే తామీరోజు మీముందుకు వచ్చాం. లేదంటే అంతటి విధ్వంసం నుంచి తాము క్షేమంగా ఇళ్ళకు తిరిగిరావడాన్ని తలచుకుంటేనే భయం వేస్తోందంటూ కేదార్‌నాథ్ యాత్రీకులు కన్నీళ్ళపర్యంతమయ్యారు. విశాఖపట్నం నుంచి 18 మంది సభ్యుల బృందం రామకృష్ణ అనే అర్గనైజర్ నేతృత్వంలో బయలుదేరారు. ప్రకృతి కనె్నర్ర చేయడంతో కేదార్‌నాథ్ యాత్రను మధ్యలోనే ముగించుకుని ప్రత్యేక రైల్లో ఆదివారం విశాఖపట్నం చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లో ఎదురు చూస్తున్న బంధువులను కలుసుకున్న యాత్రికుల్లో ఒక్కసారి దుఃఖం కట్టలు తెంచుకుంది. నిజంగా భగవంతుడు తమను కాపాడాడని పేర్కొన్నారు. ఈనెల నాలుగో తేదీన విశాఖపట్నం నుంచి రైలులో బయలుదేరిన వీరంతా ఆరోతేదీన హరిద్వార్ చేరుకుని బోళానంద ఆశ్రమంలో బస చేశారు. ఏడోతేదీన ఉదయం బయలుదేరి రుషికేష్ తదితర పుణ్యక్షేత్రాలు సందర్శించారు. 14న గంగోత్రి యాత్రను పూర్తి చేసుకున్నారు. అక్కడ్నుంచి బయలుదేరి యమునోత్రికి చేరుకోవాలి. అంతే చిన్నగా మొదలైన వర్షం తీవ్రరూపం దాల్చింది. మూడు రోజుల పాటు అక్కడే బస్సుల్లోనే ఉండి సైన్యం సాయంతో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ్నుంచి ప్రత్యేక రైల్లో విశాఖ చేరుకున్నారు. ఆర్గనైజర్ రామకృష్ణ మొత్తం 110 మంది వరకూ యాత్రికులను వెంట తీసుకెళ్ళాడని, మధ్యలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకున్న తమను కాపాడే క్రమంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిపారు. విశాఖ చేరుకున్న యాత్రికులు
నాలుగు రోజులు నరకయాతన.. వాననీరే దిక్కు : చార్‌ధామ్ బాధితుల ఆవేదన
english title: 
t

ఒలింపిక్ డే రన్‌లో తోపులాట

$
0
0
ఆంధ్రభూమి బ్యూరో విశాఖపట్నం, జూన్ 23: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు విశాఖ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చేసిన ప్రయత్నం ఉద్రిక్తంగా మారింది. నిర్వహణ లోపం వలన చిన్నారులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. లక్షా 20 వేల మందితో ఐదు కిలోమీటర్లు ఒలింపిక్ డే రన్ నిర్వహించాలన్న లక్ష్యంతో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రయత్నించింది. ఈ కార్యక్రమానికి క్రీడాకారులకు పెద్దగా స్థానం కల్పించకపోగా, స్కూల్ పిల్లలతో ప్రయోగం చేసింది. ఇది కాస్తా బెడిసికొట్టింది. రన్ ప్రారంభమయ్యే చోటకు వేల సంఖ్యలో జనం వచ్చారు. అక్కడ ఏర్పడిన పరిస్థితులను తట్టుకోలేక సగంమంది వెనుదిరిగారు. వివిధ స్కూళ్ళ నుంచి వచ్చిన విద్యార్థులు తప్పిపోయారు. చివరకు 5కె పరుగులో గమ్యస్థానం చేరుకున్నది చాలా తక్కువమందే. 1989లో వాషింగ్టన్ డిసిలో సుమారు 85,956 మందితో రన్ నిర్వహించి గిన్నీస్ రికార్డు సృష్టించారు. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ విశాఖలో ఆదివారం 5కె రన్ నిర్వహించింది. ఈ రన్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు ఈ రన్ ప్రారంభమైంది. ఈ రన్‌లో పాల్గొన్న వారికి ప్రత్యేక టిక్కెట్‌లు అసోసియేషన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఒక్కో టిక్కెట్ 10 రూపాయల చొప్పున విక్రయించింది. లక్షన్నరకు పైగా టిక్కెట్‌లు విక్రయించినట్టు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ రన్‌పై స్కూళ్ళలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో వివిధ స్కూళ్ళ నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు రన్ ప్రారంభమయ్యే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. వీరందరికీ మంచినీరు అందచేస్తామని అసోసియేషన్ ముందుగానే ప్రకటించింది. కానీ ఉదయం 8 గంటల తర్వాత కూడా వీరికి మంచినీరు లభించలేదు. వేల సంఖ్యలో వచ్చిన చిన్నారుల మధ్య తొక్కిసలాట జరిగింది. చాలా మంది నీరసించిపోయారు. మరికొంతమంది రన్ ప్రారంభం కాకమునుపే వెనుదిరిగారు. మరికొంతమంది బయటకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోవలసి వచ్చింది. వీరికి ఏమైనా ప్రమాదం సంభవిస్తే, ఆదుకునేందుకు తగిన అంబులెన్స్‌లు కూడా లేకపోవడం గమనార్హం. గ్రౌండ్స్ వద్దకు వచ్చే అంబులెన్స్‌లకు పర్మిషన్ లేదంటూ పోలీసులు వాటిని వెనక్కు పంపేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చే ముందు సినీ హీరో రామ్‌చరణ్ తేజ వచ్చాడంటూ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో పిల్లలు కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఒక దశలో పిల్లలు ఏమవుతారోనన్న భయం కలిగింది. రామ్‌చరణ్ వచ్చిన తరువాత ఈ పరిస్థితి మరింత భయానకంగా మారింది. మరి కాసేపటికి ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు. ఆయన రెండు నిముషాలు మాట్లాడి జెండా ఊపి రన్ ప్రారంభించి వెళ్ళిపోయారు. ఇక వేలాది మంది చిన్న ద్వారం నుంచి బయటకు వెళ్ళేందుకు నిర్వహకులు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. చిన్నారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. అప్పటికే సుమారు 20 మంది పిల్లలు తప్పిపోయారు. వారి కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అల్లాడారు. అప్పటికీ పిల్లలకు మంచినీరు అందలేదు. దీంతో గ్రౌండ్‌లో ఉన్న సగం మంది వెనుదిరిగిపోయారు. 5కె రన్ చివరి వరకూ పాల్గొన్నది కేలం కొద్ది మంది మాత్రమే. హెలికాప్టర్‌లో చిత్రీకరణ ఈ రన్‌ను భారత నౌకాదళం హెలికాప్టర్ ద్వారా చిత్రీకరించింది. సుమారు నాలుగు గంటల పాటు హెలికాప్టర్ ద్వారా చిత్రీకరణ సాగింది. రన్ ప్రారంభం నుంచి చివరి వరకూ ఎంతమంది ప్రయాణిస్తే అంతమందినే లెక్కిస్తారని ఒలింపిక్ అసోసియేషన్ తెలియచేసింది. ఆ విధంగా అయితే చివరి వరకూ వెళ్ళింది లక్షమంది ఉండరన్నది కచ్చితంగా చెప్పచ్చు. మరి రికార్డు ఏవిధంగా సాధిస్తారో వేచి చూడల్సిందే. తొక్కిసలాటను అదుపు చేస్తున్న పోలీసులు, సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో వెలవెలబోయిన ఫినిషింగ్ పాయింట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : కేంద్ర మంత్రి సర్వే ఆంధ్రభూమి బ్యూరో విజయవాడ, జూన్ 23: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం నేటికీ కట్టుబడి ఉందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. గుంటూరు వెళ్లేముందు తనను కలిసిన విలేఖరులతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. తెలంగాణ విషయమై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కూడా వెనుకబడిన గ్రామాలు ఉన్నాయని దీనికి పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమన్నారు. నగర ప్రజలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లోపు దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్‌ను నిర్మించి తీరుతామన్నారు.
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు
english title: 
o

ప్రత్యామ్నాయ కూటమికి 1న ఢిల్లీలో సదస్సు

$
0
0
హైదరాబాద్, జూన్ 24: దేశ రాజకీయాల్లో విఫలమైన యుపిఎ, ఎన్‌డిఎ కూటమిలకు ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు జూలై 1న ఢిల్లీలో సదస్సును నిర్వహిస్తున్నట్టు సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వెల్లడించారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో రెండు రోజుల పాటు నిర్వహించే సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలను సోమవారం ప్రారంభించారు. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ, జాతీయ పరిణామాలను సుధాకర్‌రెడ్డి వివరించగా, రాష్ట్ర రాజకీయాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ చెప్పారు. సుధాకర్‌రెడ్డి ప్రసంగిస్తూ పాలనాపరంగా అన్ని రంగాల్లో విఫలమై, అవినీతి కంపుకొడుతున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ, మతోన్మాద కార్డుతో అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపి నేతృత్వంలోని ఎన్‌ఎడిలకు వ్యతిరేకంగా విధాన ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా జెడియు, బిజెడి, ఎస్‌పి తదితర పార్టీలతో వామపక్షనాయకులు సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. ఈ పూర్వరంగంలో భాగంగానే ఢిల్లీలోని వౌలాంకర్ ఆడిటోరియంలో సిపిఏఐ, సిపిఎం, ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డుబ్లాక్‌ల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. యుపిఎ, అంతకు ముందు ఎన్‌డిఎ అవలంభించిన ప్రజావ్యతిరేక ఆర్ధిక విధానాలను ఎండగట్టి ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలను ప్రజల ముందుంచనున్నట్టు తెలిపారు. యుపిఎ నుండి గత ఎడాది కాలంలో 48 మంది ఎంపిలున్న తృణముల్, డిఎంకెలు వెలుపలికి వచ్చాయని, వాజపేయి నేతృత్వంలోని యుపిఎ కూటమిలో 24 పార్టీలు ఉండగా, ఇపుడు కేవలం 3 పార్టీలే మిగిలాయని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలను కూడగట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఆ ఫ్రంట్‌కు విధానాల విషయంలో స్పష్టత లేదని చెప్పారు. ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలు లేకుండా ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ ప్రమాదకరమైనదని హెచ్చరించారు. గుజరాత్ ముఖ్యమంత్రి 3డి నేతగా వెంకయ్యనాయుడు పోల్చడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 3డి అంటే భ్రమకల్పించేదని, అలాగే మోడీ కూడా భ్రమలు కల్పిస్తున్నారని అన్నారు. రిలయన్స్ సంస్థ ఉత్పత్తి చేస్తూన్న గ్యాస్ ధరను మూడు రెట్లు పెంచేందుకు, గతంలో ఆ సంస్థకు విధించిన వంద కోట్ల రూపాయిల జరిమానా రద్దుకు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇప్పటికే బ్రిటిష్ మెట్రిక్ యూనిట్‌కు 2.4 డాలర్లు నుండి 4.2 డాలర్లకు పెంచారని చెప్పారు. మరోసారి ధర పెంచితే ప్రజలపై వేల కోట్ల భారం పడుతుందని అన్నారు. అందుకే ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సిపిఐ ఆందోళనను కొనసాగిస్తుందని అన్నారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకురావల్సిన అవసరం లేదని అన్నారు. ‘స్థానికం’గా పట్టు సాధిస్తాం రాజకీయ శక్తిగా తెరాస జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీల భేటీలో కడియం ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఉద్యమ పార్టీగానే కాకుండా రాజకీయంగా కూడా బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని ఆ పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలనాటికి పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంచార్జీలతో సోమవారం కడియం శ్రీహరి, పార్టీ అధినేత కెసిఆర్ భేటీ అయి పార్టీ నిర్మాణంపై చర్చించారు. సమావేశం అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 26 నుంచి 30 వరకు మండల స్థాయిలో విస్తృతస్థాయి సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. 30న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావిస్తున్నామనీ, ఆ దిశగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై దృష్టి సారించినట్టు కడియం తెలిపారు. మండల స్థాయి విస్తృతస్థాయి సమావేశాలు ముగిసిన తర్వాత నియోజక వర్గాల స్థాయిలో కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తామన్నారు. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జీలతో జూలై 3న మరోమారు సమావేశమై పార్టీ నిర్మాణంపై తగిన సూచనలు, సలహాలు ఇస్తామని ఆయన తెలిపారు. ఉద్యమపరంగానే కాకుండా పార్టీని రాజకీయంగా బలోపేతం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంపై పార్టీ శ్రేణులను, నేతలను సమాయత్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగానే పార్టీ నిర్మాణంపై దృష్టి సారించినట్టు కడియం వివరించారు. పార్టీ నిర్మాణం పర్యవేక్షణకు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను రెండేసి జిల్లాలుగా విభజించి కమిటీలను వేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కాకుండా ప్యాకేజి ఇస్తామని తమకు ఎవరు చెప్పలేదని టిఆర్‌ఎస్ జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్ కె కేశవరావు తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణకు ప్యాకేజి ఇస్తారనే ప్రచారం మాత్రమేనని తెలిపారు. తెలంగాణ ప్రజలు కోరుకునేది ప్రత్యేక రాష్ట్రానే్న తప్ప, ప్యాకేజిని కాదని ఆయన స్పష్టం చేసారు. ప్రజా జీవితంలోకి వచ్చాక ఏదంటే అది మాట్లాడటం తగదని, తనపై విమర్శలు చేసేవారు బలిపశువులు ఎవరయ్యారో మున్ముందు వారే గ్రహిస్తారనీ ఆయన పరోక్షంగా కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేయడమే కాకుండా ఇద్దరు దళిత ఎంపీలను కేశవరావు బలిపశువులను చేసారని కేంద్ర మంత్రి సర్వే చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. తప్పుడు రాతలు, ప్రసారంతో సమాజాన్ని మీడియా తప్పుదోవ పట్టించవద్దనీ, సంచలనాల కోసం మీడియా విలువలను మరిచిపోవద్దని ఆయన హితవు పలికారు. టిఆర్‌ఎస్‌లో చేరిన మక్తల్ కాంగ్రెస్ నేతలు మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్‌లో కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ జెడిపిటిసి అధ్యక్షుడు లింగమ్మ, మాజీ ఎంపిపిలు మల్లన్నగౌడ్, నాగన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు రవికుమార్ టిఆర్‌ఎస్‌లో చేరినట్టు మక్తల్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ దేవర మల్లప్ప ప్రకటించారు.
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
english title: 
p

రాజకీయం కోసం ఇంత రాద్ధాంతమా?

$
0
0
హైదరాబాద్, జూన్ 24: పది రోజుల పాటు అమెరికాలో విలాసంగా గడిపి ఇప్పుడు ఉత్తరాఖండ్ యాత్రికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం పిసిసి అధ్యక్షుడు బొత్స అధ్వర్యంలో పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వెంటనే తగు ఏర్పాట్లు చేశారని చెప్పారు. రాష్ట్రం నుంచి ఇద్దరు మంత్రులను, ఒక కేంద్ర మంత్రిని, వైద్య బృందాలను, హెలికాప్టర్‌ను పంపించారని, ఎప్పటికప్పుడు ఉత్తరాఖండ్ సిఎంతో చర్చిస్తూనే ఉన్నారని వివరించారు. అయితే ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు పది రోజుల పాటు అమెరికాలో గడిపి వచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎపి భవన్‌లో చేసిన హంగామా, మాట్లాడిన తీరు, అనుచితమైన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. గతంలో గోకుల్‌ఛాట్‌పై దాడి జరిగినప్పుడు కూడా చంద్రబాబు తన ఇంట్లో విందులో ఉన్నారని ఆయన విమర్శించారు. తమకు మానవత్వం ఉన్నదని, ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపట్టిందని, పార్టీ తరఫున కూడా సహాయక చర్యలు చేపడుతున్నామని, ఈ మేరకు పార్టీ తరఫున సహాయ నిధిని ఏర్పాటు చేసి, ఉత్తరాఖండ్‌కు పంపనున్నామని ఆయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల నివారణ కమిటీ సభ్యుడు వైస్-చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఆయన చెప్పారు. తాను కూడా డెహ్రాడూన్ కలెక్టర్‌తో మాట్లాడానని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలకు రెండు వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని వివరించారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు తమ పార్టీ జిల్లా కమిటీల సమావేశాలు నిర్వహించనున్నట్లు బొత్స తెలిపారు. నేడు కర్నూలుకు రెండు కొత్త రైళ్లు ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 24: రైల్వే మంత్రిత్వ శాఖ 2013-14 బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రకటించిన కొత్త రైళ్ల కార్యాచరణ మొదలైంది. సికింద్రాబాద్-కర్నూలు సిటీ-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, కర్నూలు సిటీ-నంద్యాల-కర్నూలుసిటీ డెమొ ప్యాసింజర్ రైళ్లు మంగళవారం ప్రారంభమవుతున్నాయి. రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి చేతుల మీదుగా ఈ రైళ్లను కర్నూలు సిటీ స్టేషన్‌లో ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం నాడిక్కడ ప్రకటించింది. ప్రతి రోజు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నెం.17223 సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి కాచిగూడ, ఫలక్‌నుమా, ఉమ్ధానగర్, తిమ్మాపూర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, శ్రీరామ్‌నగర్, గద్వాల్ మీదుగా వెళ్లి అదే రోజు రాత్రి 9.35 గంటలకు కర్నూల్‌సిటీ స్టేషన్‌కు చేరుకుంటుందని ద.మ.రైల్వే వెల్లడించింది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ నుంచి ప్రతి రోజు ఉదయం 6.05 గంటలకు నెం.17224 ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరి ఉదయం 10.45 గంటలకు అదే రూట్లో సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి కర్నూలు సిటీ స్టేషన్ వరకు ఉన్న 244 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 40 నిమిషాల్లో చేరుకుంటుందని, చాలాకాలంగా కర్నూలు నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ఉదయం వేళ నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు కావాలనే డిమాండ్ ఉంది. అనేక విజ్ఞప్తుల అనంతరం రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల చొరవతో ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందని రైల్వే వెల్లడించింది. డెమొ ప్యాసింజర్ రైలు నె.77696 కర్నూలు సిటీ నుంచి ఆది, సోమ, గురు, శుక్ర, శనివారాల్లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి వెల్దుర్తి, ధోన్, బేతమ్‌చర్ల మీదుగా అదే రోజు రాత్రి 10.10 గంటలకు నంద్యాల చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నంద్యాల నుంచి కర్నూలు సిటీకి ఆది, సోమ, గురు, శుక్ర, శనివారాల్లో నెం.77695 డెము రైలు ఉదయం 6.05 గంటలకు బయలుదేరి కర్నూలు సిటీకి అదే రోజు ఉదయం 10.20 గంటలకు చేరుకుంటుందని రైల్వే వెల్లడించింది. ఇప్పటివరకు కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్‌గా ఉన్న పేరును కర్నూలు సిటీగా మారుస్తున్నట్లు కూడా తెలిపింది. మంగళవారం నుంచి ఈ మార్పు వర్తిస్తుందని తెలిపింది. నేడు ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 24: ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు మాధ్యమిక విద్యా మంత్రి పార్ధసారధి విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి రామ శంకర్ నాయక్ తెలిపారు. ఫలితాలను ఇంటర్‌నెట్‌లోనూ, ఐవిఆర్‌ఎస్ ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అభ్యర్ధులకు తెలియజేస్తామని అన్నారు. నెట్ ద్వారా ఎగ్జామ్ రిజల్ట్సు డాట్ ఎసి డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌తో పాటు రిజల్ట్సు డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్, ఎపిఐటి డాట్ ఎపి డాట్ జిఓవి డాట్ ఇన్, ఇండియారిజల్ట్సు డాట్ కామ్ తదితర వెబ్‌సైట్లలో ఉంచుతున్నట్టు చెప్పారు. అలాగే పరిష్కిరం కాల్ సెంటర్లకు వెళ్లి లేదా 1100 నెంబర్‌కు, 18004251110 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని, ఐవిఆర్‌ఎస్ ద్వారా 1255225కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని ఆయన చెప్పారు.
10 రోజులు అమెరికాలో గడిపి ఇప్పుడు విమర్శలా.. చంద్రబాబుపై మండిపడ్డ బొత్స
english title: 
r

ఉప్పొంగుతున్న వరద రాజకీయం

$
0
0
హైదరాబాద్, జూన్ 24: రాష్ట్రంలో అధికారం ఆశిస్తున్న పార్టీల సంఖ్య పెరిగిపోవడంతో ప్రతిదీ రాజకీయమే అవుతోంది. చివరకు ఉత్తరాఖండ్‌లోని వరద బీభత్సం ప్రకంపనలు సైతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. టిడిపి అధినాయకుడు చంద్రబాబు ఢిల్లీలో ధర్నాకు దిగి, బాధితులను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించగా, కాంగ్రెస్ నాయకులు బాబు రాజకీయంపై తమ రాజకీయం చూపిస్తున్నారు. టిడిపి తరఫున ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ నాయకులు సైతం ప్రభుత్వం తరఫున విమానాన్ని ఏర్పాటు చేసి, బాధితులను తరలించాలని నిర్ణయించినట్టు మంత్రి దానం నాగేందర్ తెలిపారు. ఇక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు తాము అందరికన్నా ముందే అక్కడికి సహాయ బృందాన్ని పంపించామని, వారు సహాయ కార్యక్రమాలు చేపట్టారని ప్రకటించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడకుండానే చేయాల్సింది చేస్తే, తెలుగు నాయకులు మాత్రం రాజకీయంతో హడావుడి చేస్తున్నారు. తెలుగు నాయకులు మాత్రం సహాయాన్ని మించి రాజకీయం చేస్తూ రాష్ట్రంలో వరద రాజకీయాలకు తెర లేపారు. చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకోగానే ఆయన చార్‌ధామ్ బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదని విమర్శిస్తూ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వెంటనే ఢిల్లీ వెళ్లి ఎపి భవన్‌లో ఉన్న బాధితులను పరామర్శించి అక్కడే ధర్నా చేశారు. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని ఉత్తరాఖండ్ పంపించిది. మంత్రి శ్రీ్ధర్ బాబు అక్కడే ఉన్నారు. మోడీ స్పీడ్‌ను చూసి బాబు రెండు రోజుల తరువాత ఢిల్లీలో వాలిపోగా, కాంగ్రెస్ నాయకులు సైతం జూలు విదిలించారు. సహాయ కార్యక్రమాల ప్రచారంపై అప్పటివరకు దృష్టి సారించని కాంగ్రెస్ నాయకులు బాబు రంగ ప్రవేశం చేయడంతో తమ వంతు రాజకీయానికి శ్రీకారం చుట్టారు. అయితే ఎపి భవన్‌లో బాధితులకు వైద్య సహాయం అందుతుండగా, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వెళ్లిన డాక్టర్లు వైద్య సహాయం అందిస్తామంటే అధికారులు అభ్యంతరం చెప్పారు. దీనిని టిడిపి తీవ్రంగా విమర్శించింది. అయితే మోడీని మించి పోవాలని భావించిన చంద్రబాబు టిడిపి డబ్బుతో విమానంలో ఢిల్లీ నుంచి బాధితులను హైదరాబాద్ తరలించారు. ఇక సోమవారం ఉదయం నుంచి టిడిపి నాయకులు చార్‌ధామ్ వరదలపై ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టారు. చార్‌ధామ్ బాధితులను ఆదుకోవడానికి పడవలు పంపించలేరా? అంటూ శాసన సభలో టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు నిలదీశారు. దీంతో ‘వరద బీభత్సంపై మనకున్న అవగాహన ఇదీ.. అంతా కొండ ప్రాంతం.. కొండలపైకి పడవలు పంపాలా?’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి టిడిపిని ఎండ గట్టారు. వ్యవహారం అక్కడితోనే ఆగిపోతుందని కాంగ్రెస్ నాయకులు భావించారు. చంద్రబాబు ప్రధానమంత్రికి, హోంమంత్రికి లేఖలు రాశారు. హుటాహుటిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమానం ఏర్పాటు చేశారు. చంద్రబాబుతోపాటు టిడిపి నాయకులంతా వరదలపై విమర్శల జోరు పెంచారు. బాబుతో పాటు పార్టీ సీనియర్లు అంతా స్పందించారు. లోకేశ్ సైతం సంఘటనపై స్పందించారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం వరద బాధితుల మృతికి సంతాప సమావేశం కూడా నిర్వహించారు. మరోవైపు విఐపిలు రావద్దని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హెచ్చరించడం వల్ల వెళ్లలేదని, అక్కడికి వెళ్లి రాజకీయం చేయడం వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం అవుతుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రళయాన్ని చూసి ముఖ్యమంత్రికి ఎలా నిద్ర పడుతోందని చంద్రబాబు నిలదీయగా, ప్రతిపక్ష నాయకుడు ఉత్తరాఖండ్ వెళ్లారు కానీ ముఖ్యమంత్రి వెళ్లలేక పోయారని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. ఢిల్లీ నుంచి టిడిపి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన చార్‌ధామ్ బాధితులకు నారా లోకేశ్‌తో పాటు టిడిపి సీనియర్లు స్వాగతం పలికారు. 190 మంది యాత్రికులను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకు వచ్చినట్టు పార్టీ నాయకులు తెలిపారు. ఏ క్షణమైనా ఎన్నికలు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇసి సమీక్ష ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 24: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలు ఏక్షణమైనా జరిగే అవకాశం ఉందని, అందువల్ల జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి రమాకాంతరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించేందుకు సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లు (ఎస్‌పిలు), పోలీస్ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, ఇతర జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల జాబితాలు రాగానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నోటిఫికేషన్ జారీ కాకముందే ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. ప్రశాంత పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల ఎన్నికల తర్వాత మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అంశాలపైనా కమిషనర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే పోలీసు బందోబస్తు గురించి సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. స్థానిక ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల గుర్తింపు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలను సిద్ధంగా ఉంచాలన్నారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సుల గురించి చర్చించారు. బాక్సులను అవసరమైన మేరకు ఏర్పాటు చేసుకోవాలని, పాత బాక్సులు సరిపోని పక్షంలో కొత్తవాటికి ఆర్డర్ ఇచ్చి తెప్పించాలని సూచించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సబంధించి మూడు నాలుగేసి జిల్లాలకు ఒక ప్రాంతీయ సమావేశాన్ని నెలరోజుల క్రితమే రమాకాంతరెడ్డి ఏర్పాటు చేసి సమీక్షించారు. ప్రాంతీయ సమావేశాల నిర్ణయాలపై తీసుకున్న చర్యల గురించి సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వం ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం మరోమూడు, నాలుగు రోజుల్లోగా రిజర్వేషన్ల జాబితాలు ఎన్నికల కమిషన్‌కు అందుతాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల జాబితా రాక గురించి ఎన్నికల కమిషన్ ఎదురు చూస్తోంది. ఈ జాబితాలు అందిన 24 గంటల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ వ్యవహారాలు చూసేందుకు కమిషనర్‌కు సహాయంగా ఉండేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ను కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. పంచాయతీల విలీనం కొనసాగింపు? రాష్ట్రంలోని 21,590 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ప్రభుత్వం కొన్ని గ్రామ పంచాయతీల హోదాను పెంచాలని, కొన్ని గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయాలని భావిస్తోంది. గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, హోదాపెంపు, విలీనాలను కొనసాగించేందుకు వీలుగా రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ఒక జీఓ (జీఓ నెంబర్ 298, తేదీ 22-06-2013) జారీ చేసింది. అంటే గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, హోదాపెంపు, విలీనాలకు అవకాశం కల్పించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. ఈ అంశాలేవీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాకపోవడం మూలంగా వీటిపై సమీక్షా సమావేశంలో చర్చించలేదు. చార్‌ధామ్ బాధితులకు తక్షణ సాయం రూ.5వేలు మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ‘ఉత్తరాఖండ్’పై సిఎం సమీక్ష ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 24: చార్‌ధామ్ ఘటనలో బాధితులకు ఇప్పుడు ఇస్తున్న రెండు రూపాయలకు బదులుగా ఐదు వేలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే బాధితుల ఆర్ధిక సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భావిస్తున్నారు. ఉత్తరాఖండ్ ఘటనపై ఆయన సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక విమానాన్ని పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. ఘటనలో మరణించిన వారి వివరాలు ఖరారైన తరువాత వారి కుటుంబాలకు కూడా నష్ట పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఉత్తరాఖండ్ ఘటన నేపథ్యంలో అక్కడి వెళ్లి వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసిన కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ హైదరాబాద్‌కు తిరిగివచ్చి ముఖ్యమంత్రికి అక్కడి పరిస్థితులు, బాధితులకు అందిస్తున్న సహాయ పునారావాసాలపై వివరించారు. ఆర్మీ, ఇతర అధికారుల సహాయంతో మంచు కొండల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని, మన రాష్ట్రానికి చెందిన వారిని ఢిల్లీకి, అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే త్వరగా బాధితులను రాష్ట్రానికి రప్పించేందుకు ఒక విమానాన్ని కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విమానాన్ని డెహ్రాడూన్ నుంచి హైదరాబాద్‌కు బాధితులను తరలించేందుకు ఉపయోగించాలని సూచించారు. ఇతర మార్గాల ద్వారా వచ్చే యాత్రికులకు భోజన, రవాణా, వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని ఆదేశించారు. అదేవిధంగా యాత్రికుల మృతదేహాలను కూడా ప్రభుత్వ ఖర్చుతో రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలా ఉండగా, వాస్తవంగా రాష్ట్రం నుంచి ఎంతమంది ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లారు.. వారిలో ఎంతమంది తిరిగి వచ్చారు అన్న అంశాలపై పూర్తి వివరాలను కలెక్టర్ల నుంచి తెప్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్న అధికారులకు తోడుగా మరికొంతమందిని పంపించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి వైద్య బృందాలను పంపించామని, వారు అవసరమైన వైద్య సహాయం బాధితులకు అందిస్తున్నారని, మన రాష్ట్రం నుంచి ఇప్పటికే రెండు హెలికాప్టర్లను పంపించామని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగునాట చార్‌ధామ్ ప్రకంపనలు పోటాపోటీ విమానాలు
english title: 
u

సైనిక బంధం మరింత ముందుకు

$
0
0
న్యూఢిల్లీ, జూన్ 24: భారత సాయుధ బలగాలు గత కొద్ది సంవత్సరాల కాలంలో అమెరికా నుంచి దాదాపు 40 వేల కోట్ల రూపాయల విలువైన సైనిక సామగ్రిని కొనుగోలు చేశాయి. దీంతో సైనిక సామగ్రికి సంబంధించి ఉభయ దేశాల మధ్య సాగుతున్న క్రయ-విక్రయ సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాలని భారత్, అమెరికా సోమవారం అంగీకారానికి వచ్చాయి. ఇటీవలి కాలంలో ఉభయ దేశాల మధ్య రక్షణ వాణిజ్యం ఎంతో విస్తరిస్తోందని, భారీ రవాణా విమానాలైన సి-17, సి-130జె సూపర్ హెర్క్యులస్‌లను వాయుసేనలోనూ, జలాంతర్గామి విధ్వంసక విమానం పి-81ను నావికాదళంలోనూ ప్రవేశపెట్టడంతో ఉభయ దేశాల మధ్య రక్షణ వాణిజ్యం కొత్త పుంతలు తొక్కిందని భారత్, అమెరికా పేర్కొన్నాయి. పరస్పరం ప్రయోజనం చేకూర్చే విధంగా రక్షణ వాణిజ్య, పారిశ్రామిక సహకార రంగాల విస్తృతికి గల అవకాశాలను అందిపుచ్చుకుని సైనిక సామగ్రి క్రయ-విక్రయ సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉభయ దేశాలు వివిధ మార్గాల్లో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నాయని రక్షణ రంగానికి సంబంధించిన వాస్తవ పత్రం (్ఫ్యక్ట్ షీట్)లో భారత్, అమెరికా పేర్కొన్నాయి. భారత్, అమెరికా 2005 నుంచి దాదాపు 40 వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే హై-టెక్ ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయడంపై అమెరికాలో కఠినమైన చట్టాలు రావడం, అలాగే రక్షణ సామగ్రి కొనుగోలుదారుగా కొనసాగేందుకు భారత్ కూడా విముఖంగా ఉండటంతో ఇటీవలి కాలంలో ఉభయ దేశాల మధ్య రక్షణ వాణిజ్యం కాస్త మందగించింది. సోమవారం ఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో అమెరికా, భారత్ విదేశాంగ శాఖ మంత్రులు జాన్ కెర్రీ, సల్మాన్ ఖుర్షీద్ వరద సహాయ కార్యక్రమాలను సోనియాకు వివరించిన మర్రి ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి న్యూఢిల్లీ, జూన్ 24: జాతీయ విపత్తు నివారణ కమిటీ ఉపాధ్యక్షుడు, శాసన సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకుని ఉత్తరాఖండ్‌లో తమ కమిటీ చేపట్టిన విపత్తు నివారణ కార్యక్రమాల గురించి వివరించారు. శశిధర్ రెడ్డి హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేతోపాటు ఉత్తరాఖండ్‌లోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ జాతీయ విపత్తు నివారణ కమిటీ అధికారులు, కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాలను కూడా పర్యవేక్షించారు. అనంతరం సోమవారం సోనియా గాంధీకి ఈ కార్యక్రమాలు కొనసాగుతున్న తీరు తెన్నుల గురించి లోతుగా వివరించారని తెలిసింది. సహాయ, పునరావాస కార్యక్రమాల్లో కొంత సమన్వయం లోపించిందని సుశీల్‌కుమార్ షిండే చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో శశిధర్ రెడ్డి సమావేశం కావటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇలావుండగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్ సోనియా గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్య తదితర అంశాలు చర్చకు వచ్చాయని అంటున్నారు. కాగా, ఈ సందర్భంగా ఖాన్ తన కుమారుడి పెళ్లి పత్రికను పార్టీ అధ్యక్షురాలికి ఇచ్చి ఆహ్వానించారు. ఎన్డీఎలో మలుపు తిరిగిన లుకలుకలు మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై శివసేన అభ్యంతరాలు ఆంధ్రభూమి బ్యూరో న్యూఢిల్లీ, జూన్ 24: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి కీలక బాధ్యతలను అప్పగించటంతో పార్టీలోనేగాక కూటమిలో మొదలైన లుకలుకలు మరోమలుపు తిరిగాయి. ఎన్డీయేలో మిగిలి ఉన్న ఇద్దరు భాగస్వాములలో ఒకటైన శివసేన ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీని ప్రకటించిన పక్షంలో ఇక్కట్లు తప్పకపోగా భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గిపోయే అవకాశాలున్నాయని బిజెపి నాయకత్వానికి స్పష్టం చేసింది. బాల్‌థాక్రె కుమారుడు ఉద్ధవ్‌థాక్రే పార్టీ అధికార పత్రికలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు బిజెపిని కంగుతినిపిస్తున్నాయి. మోడీకి ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించటంతో ప్రధాన భాగస్వామ్య పక్షమైన జెడియు బయటకు వెళ్లిపోయింది. మోడీకున్న హిందుత్వ ముద్ర వల్ల లౌకిక పార్టీలు కూటమికి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ‘కొత్త బాగస్వాములను సమకూర్చుకోవటానికి బిజెపి చేస్తున్న కసరత్తేమిటి? భాగస్వామ్య పక్షాలు చెట్లకు పుట్టవు. అదేవిధంగా భాగస్వామ్య పక్షాలతో పరస్పర నమ్మకం విశ్వాసంతో వ్యవహరించాలే తప్పించి వాతావరణ పరిస్థితులపై ఆధారపడ్డ పంటల మాదిరి చూడరాదు’ అని సామ్నా సంపాదకీయం బిజెపికి సలహా ఇచ్చింది. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థిగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ వైపు శివసేన మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే. బ్రతికి ఉన్నప్పుడు బాల్‌థాక్రే సుష్మానే సమర్థించారు. శివసేన అధికార పత్రికలో వచ్చిన ఈ తాజా సంపాదకీయంపై వ్యాఖ్యానించటానికి బిజెపి నాయకులు నిరాకరించారు. ఎన్నికలకు చాలా వ్యవధి ఉన్నందున ఎన్నో పరిణామాలు జరిగే అవకాశాలున్నాయని మాత్రం చెబుతున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం బిజెపి నాయకత్వం శివసేనతోనేగాక ఏంఎన్‌ఎస్ అధినేత రాజ్‌థాక్రేతో కూడా పొత్తు కుదుర్చుకోవాలని ఆలోచిస్తొంది. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీకి రాజ్‌థాక్రేకి సన్నిహిత సంబంధాలున్నందున శివసేనకు టాటా చేప్పే అవకాశాలుంటాయని చెబుతున్నారు.
భారత్, అమెరికా అంగీకారం
english title: 
s

ఆంధ్రాభవన్ వైఖరిలో మార్పు

$
0
0
న్యూఢిల్లీ, జూన్ 24: ఉత్తరాఖండ్ నుంచి అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఆంధ్రాభవన్ చేరుకున్న తెలుగువారికి ఎదురవుతున్న నిరాదరణపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన దాడికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో సోమవారం పరిస్థితి కొంత మారింది. ఆంధ్రాభవన్‌కు చేరుకున్న ప్రతి ఒక్క బాధితుడికి 2వేల రూపాయల చొప్పున నగదు సాయం అందించారు. ఇలా సుమారు 2లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లు అధికారులు తెలియచేశారు. అయితే కాలకృత్యాలు తీర్చుకోవటానికే తప్పించి విశ్రాంతి తీసుకోవటానికి గదులను ఇవ్వకపోవటంతో బాధితులు నేలపైనే పడుకుంటున్నారు. కాగా, సాయంత్రానికి సుమారు 125 మందికి టిక్కెట్లు తెప్పించి స్వస్థలాలకు పంపారు. చంద్రబాబు ఒక ప్రత్యేక విమానంలో 120 మందిని హైదరాబాద్ మీదుగా విశాఖకు పంపించారు. ఆయన పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కె నారాయణరావు, రమేష్ రాథోడ్‌తో కలసి డెహ్రాడూన్ వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. నారాయణరావు, రమేష్ రాథోడ్‌లను పరిస్థితి మెరుగుపడేంత వరకూ డెహ్రాడూన్‌లో ఉండి తెలుగువారికి సహాయపడవలసిందిగా ఆదేశించారు. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మరికొంత మంది మంగళవారం ఢిల్లీ చేరుకుంటారని అధికారులు చెప్పారు. వీరిని తీసుకురావటానికి కొన్ని బస్సులను పంపారు. వీహెచ్ సాయం వరద బాధితులను పరామర్శించటానికి ఆంధ్రాభవన్‌కు వచ్చిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు వారి దయనీయ స్థితిని చూసి చలించిపోయారు. సాయంత్రానికి ఆయన వంద మందికిపైగా మహిళలకు చీరలను, సమారు అరవై మంది పురుషులకు వెయ్యి రూపాయల వంతున నగదు అందచేశారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో తన శక్తి మేరకు బాధితులకు సాయం చేశానని చెప్పారు. పార్టీ అధ్యక్షురాలి ఆదేశం మేరకు నెల జీతంతోపాటు పదిలక్షల రూపాయలను ఎంపీలాడ్స్ నుంచి అందజేశానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బాధితులను, పరామర్శించాలని ఆయన కోరారు. ఆంధ్రాభవన్‌లో ఎన్టీఆర్ ట్రస్టు పేరిట వైద్య శిబిరం ఏర్పాటు చేయటానికి రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ అనుమతి ఇవ్వటానికి నిరాకరించటంతో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. తమకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరేందుకు వెళ్లిన తనకు ఒక ఎంపీనన్న కనీస మర్యాద కూడా ఇవ్వకుండా కమిషనర్ తలబిరుసుగా వ్యవహరించారని టిడిపి రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఆరోపించారు. అధికారం తన చేతులలో ఉందనీ వైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని కమిషనర్ కరాఖండిగా మాట్లాడారని ఆమె చెప్పారు. అయితే ఈ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా తెలుగుదేశం పార్టీ వైద్య శిబిరం నిర్వహించింది. కమిషనర్‌పై చర్య తీసుకోవలసిందిగా తాను ముఖ్యమంత్రిని కోరటంతోపాటు సభా హక్కుల తీర్మానాన్ని ప్రతిపాదిస్తానని ఆమె తెలియచేశారు. ఎలాంటి లోపాలు లేవు వరద బాధితులను ఆదుకోవటంలో ఎట్టి లోపాలు లేవని ఆంధ్రాభవన్ రెసిడెంట్ కమిషనర్ తనకు తెలియచేశారని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విలేఖరులకు చెప్పారు. బాధితులకు మంచి అల్పాహారం, భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రాభవన్‌లో ఉత్తరాఖండ్ వరద బాధిత మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న విహెచ్
వరద బాధితులకు మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వ ఆదేశాలతో అల్పాహారం, భోజనం
english title: 
a
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>