Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

రేపటి నుంచి ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన

$
0
0
రాజమండ్రి, జూన్ 24: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీ ఎస్సీ, ఎస్టీ ఓటర్లను లెక్కించే కార్యక్రమానికి పురపాలక శాఖ బుధవారం నుండి శ్రీకారం చుట్టనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల రిజర్వేషన్లకు అవసరమైన గణాంకాలు లేకపోవటం వల్ల తాజాగా ఎస్సీ, ఎస్టీ ఓటర్లను లెక్కించాలని పురపాల శాఖ నిర్ణయించింది. స్థానిక సంస్థల్లో ఇప్పటి వరకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు జరుగుతూ వచ్చాయి. కానీ 2011 జనాభా లెక్కల్లో మున్సిపాలిటీల్లోని వార్డుల వారీ జనాభా లెక్కలు అందుబాటులో లేకుండా పోయాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా మాత్రమే జనాభా లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కల ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏ కేటగిరీకి ఎనె్నన్ని వార్డులు రిజర్వవుతాయో కేటగిరీల వారీ సంఖ్య మాత్రమే తేలుతుంది. కానీ ఏ వార్డును ఎవరికి రిజర్వు చేయాలో తేల్చాలంటే మాత్రం వార్డుల వారీ జనాభా లెక్క దొరకదు. వార్డుల వారీ బిసి జనాభా లెక్కలు లేకపోవటం వల్ల ప్రస్తుతం బిసి రిజర్వేషన్ల కోసం రాష్ట్రప్రభుత్వం బిసి ఓటర్ల గణనను చేపట్టిన సంగతి విదితమే. ఇపుడు ఎస్సీ, ఎస్టీ జనాభా కూడా వార్డుల వారీ అందుబాటులో లేదన్న విషయం తేలటంతో, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారుచేయటానికి కూడా ఆయా కేటగిరీల ఓటర్లను లెక్కించాలని రాష్ట్రప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఇలా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఆయా కేటగిరీల ఓటర్లను గుర్తించటం ఇదే తొలిసారి. ఎక్కువ సంఖ్యలో ఎస్సీ ఓటర్లున్న 10వార్డులను గుర్తించి, ఆ పది వార్డులను ఎస్సీలకు రిజర్వు చేస్తారు. ఇప్పటికే బిసి ఓటర్ల గణనను పూర్తిచేసిన మున్సిపల్ అధికారులు, బుధవారం నుండి మళ్లీ ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణనను చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఇంటింటికి వెళ్లి లెక్కించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు నియమించిన బృందాలు ఇంటికి వచ్చినపుడు, ఒకవేళ ఆ ఇంటిలోని వారు లేకపోతే, వారు ఎస్సీలో కాదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఏరులై పారుతున్న మద్యం సర్కారుపై షర్మిల నిప్పులు నర్సీపట్నం, జూన్ 24: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన కొత్త ఎక్సైజ్ విధానంతో గ్రామాల్లో మంచినీరు దొరకకపోయినా, మద్యానికి మాత్రం కరవుండదని వైకాపా అధ్యక్షుడు జగన్‌సోదరి షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకున్న షర్మిల సోమవారం సాయంత్రం విశాఖ జిల్లాలో అడుగుపెట్టారు. నర్సీపట్నం మండలం గన్నవరం మెట్ట వద్ద షర్మిలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. షర్మిల మాట్లాడుతూ కిరణ్‌ప్రభుత్వాన్ని దుర్మార్గపు ప్రభుత్వంగా ఆమె అభివర్ణించారు. కొత్త పాలసీతో మద్యం గ్రామాల్లో ఏరులై ప్రవహిస్తుందన్నారు. మద్యంపై వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపే దుస్థితి నెలకొందని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని చంద్రబాబు చెప్పడాన్ని ఆమె ఎద్దేవా చేసారు. బెల్ట్ షాపులు ఎత్తివేసినంత మాత్రాన మద్యం విక్రయాలు తగ్గవన్నారు. ఐదేళ్ళ కాలంలో రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారన్నారు. బాబు పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామస్థాయిలో పార్టీ నాయకులు సన్నద్ధమై వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగనన్నకు ఆదరణ చూసి ఓర్వలేక కుట్ర పన్ని అక్రమంగా కేసులు నమోదు చేసి జైలు పాలు చేసాయని ఆమె ఆరోపించారు. ఐదుగురు బుకీల అరెస్టు కడప, జూన్ 24: కడప జిల్లాలో ఇంగ్లాండ్, భారత్‌ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలకు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు క్రికెట్ బుకీలను సోమవారం ప్రొద్దుటూరు, చాపాడు పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి దాదాపు ఐదు లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చాపాడు మండలంలోని వెంగన్నగారిపల్లె గ్రామానికి చెందిన రాజారెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందనే సమాచారంతో దాడి చేసి నలుగురు క్రికెట్‌బుకీలను అరెస్టు చేసిన సోమవారం కోర్టులో హాజరుపరిచారు. 2 లక్షల 40 వేల రూపాయలు నగదు, వివిధ రకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. వెంగన్నగారిపల్లె గ్రామానికి చెందిన రాజారెడ్డితో పాటు వేణుగోపాల్, శివశంకర్‌రెడ్డి మరొకరు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఈ ప్రాంతంలోని పలువురితో సంబంధాలు ఏర్పరచుకొని కార్యకలాపాలను సాగిస్తున్నారని పోలీసులు చెప్పారు. ప్రొద్దుటూరులో గత కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ హైదరాబాద్‌లో స్థిరపడి అక్కడి నుంచి వ్యవహారం నడుపుతున్న మార్తల సుబ్బారెడ్డిని సోమవారం వన్‌టౌన్ సిఐ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అతనిని నుండి 2 లక్షల 65వేల 500 రూపాయలు నగదు, 6 సెల్‌ఫోన్లు, క్రికెట్‌బెట్టింగ్ స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని మోడంపల్లెకు చెందిన పెద్దపుల్లారెడ్డి కుమారుడు మార్తల సుబ్బారెడ్డి హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉంటున్నాడు.ప్రొద్దుటూరుకు వచ్చిన సుబ్బారెడ్డిని ఇండియా, ఇంగ్లాడ్ మధ్య జరిగిన చాంఫియన్ కప్పుకు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ‘రాయపాటిని సాగనంపండి’ ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 24: గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తెరలేపి, పార్టీని భ్రష్టు పట్టిస్తున్న ఎంపీరాయపాటి సాంబశివరావును పార్టీ నుంచి సాగనంపాలని పార్టీ మీడియా సెల్, ఒబిసి విభాగం వైస్-చైర్మన్ ఇవిఎన్ చారి అధిష్ఠానాన్ని కోరారు. టిటిడి చైర్మన్ పదవి దక్కలేదన్న అక్కసుతో రాయపాటి సొంత పార్టీని విమ ర్శిస్తున్నారని అన్నారు. తనకు గిట్టని వారిపై ఏదో రకంగా బురద చల్లుతున్నారని, కులాల వారీగా చిచ్చుపెడుతున్నారని ఆయన విమర్శించారు. దీంతో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని, సేవలందిస్తున్న నాయకులు నీరుగారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన రాయపాటి ఇప్పుడు తాను కూర్చున్న కొమ్మనే నరికి వేయాలనుకోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి వర్ష సూచన ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 24 : ఉత్తర తెలంగాణా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాతో పాటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) సోమవారం ప్రకటించింది. ఒడిషా కోస్తా నుండి పశ్చిమ బెంగాల్ వరకు ఉత్తర బంగాళాఖాతంపై ఉపరితల అల్పపీడన ద్రోణి ఏర్పడి ఉంది. వచ్చే రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. గత ఇరవైనాలుగు గంటల్లో ఇచ్ఛాపురంలో ఐదు సెంటీమీటర్లు, సోంపేట, మెట్‌పల్లి, మహబూబ్ నగర్‌లలో నాలుగు సెంటీమీటర్లు, తాడిపత్రిలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాఖండ్ బాధితులకు చర్లపల్లి ఖైదీల విరాళం ఆంధ్రభూమి బ్యూరో హైదరాబాద్, జూన్ 24: చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల మనసులను ఉత్తరాఖండ్ జల దృశ్యాలు కదిలించి వేశాయి. వారిలో మానవత్వం ఉట్టిపడింది. జైలులో లభించే రోజూ వారి వేతనంలో నుంచి ఒక రోజు వేతనాన్ని ఉత్తరాఖండ్ ఖైదీలకు అందజేయాలని నిర్ణయించారు. సుమారు వంద మంది ఖైదీలు చర్లపల్లి ఒపెన్ ఏయిర్ జైలు సూపరింటెండెంట్ కొలను వెంకటేశ్వర రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. అందుకు ఆయన సంతోషించి వారి నుంచి ఒక రోజు వేతనాన్ని సేకరించి, ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తానని చెప్పారు. అంతేకాదు చర్లపల్లి ఓపెన్ ఏయిర్ జైలులో పని చేస్తున్న సుమారు 40 మంది ఉద్యోగులు కూడా తమ ఒక రోజు వేతనాన్ని ఉత్తరాఖండ్ బాధితులకు ఇవ్వాలని నిర్ణయించారు. జైలులో శిక్ష అనుభవించే ఖైదీలను ఖాళీగా కూర్చోబెట్టకుండా వివిధ వృత్తి పనులు చేయిస్తుంటారు. దానికి వారికి రోజుకూ వేతనం చెల్లిస్తారు. ఓపెన్ ఏయిర్ జైలు ఖైదీలకు 70 రూపాయలు, మిగతా జైలులో ఉండే ఖైదీలకు 50 రూపాయల చొప్పున వేతనాన్ని జైలు అధికారులు చెల్లిస్తారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో ఇదే తొలిసారి
english title: 
r

పేద విద్యార్థుల కోసం 700 ఆదర్శ పాఠశాలలు

$
0
0
విశాఖపట్నం, జూన్ 24: రాష్ట్రంలో సుమారు 700 మోడల్ స్కూళ్లను నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలియచేశారు. తొలిదశలో 300, రెండో దశలో 400 స్కూళ్ళను ప్రారంభించనున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో తొలి ఎపి మోడల్ స్కూల్‌ను విశాఖ జిల్లా కశింకోట మండలం తేగడ గ్రామంలో ఆయన సోమవారం ప్రారంభించారు. జిల్లాలో చీడికాడ, రావికమతం, మునగపాక, నర్సీపట్నంలలో కూడా ఇటువంటి మోడల్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా తేగడ మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో మన విద్యార్థులు పోటీ తత్వాన్ని తట్టుకునేందుకు వీలుగా, ఈ మోడల్ స్కూళ్ళలో విద్యాబోధన ఉంటుందని అన్నారు. పేద విద్యార్థులకు ఆంగ్ల విద్య అందుబాటులో లేకుండా పోతోందనే తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్ళను ప్రారంభిస్తోందని చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని అన్నారు. గత నెలలో 3,200 మంది టీచర్లను, హెడ్మాస్టర్లను నియమించామని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని యోధులతో పోటీ పడే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ఈ బడి నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. మోడల్ స్కూళ్లు రాబోయే రోజుల్లో దేశానికే తలమానికంగా నిలుస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ అందించాలన్న ధ్యేయంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్పొరేట్ స్కూళ్ళకే పరిమితమైన ఆంగ్ల విద్యను ఇప్పుడు పేద పిల్లలకు అందించాలన్న లక్ష్యంతో ఈ మోడల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని ఆయన తెలియచేశారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ లక్ష్యాన్ని గుర్తెరిగి పనిచేయాలని ఆయన సూచించారు. ఈ స్కూల్‌లో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులతోపాటు, ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. ఒక్కో స్కూల్‌ను 50 లక్షల రూపాయలతో నిర్మించారు. మంత్రులు రఘువీరారెడ్డి, బాలరాజు, గంటా శ్రీనివాసరావు, కోండ్రు మురళి, ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య, ముత్యాలపాప, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసుల నాయుడు, సూర్యనారాయణరాజు, డిసిసి అధ్యక్షుడు ధర్మశ్రీ, కలెక్టర్ శేషాద్రి పాల్గొన్నారు. విశాఖ జిల్లా కశింకోట మండలం తేగడలో మోడల్ స్కూల్‌ను ప్రారంభిస్తున్న సిఎంకిరణ్ భారీగా చేరుతున్న వరద నీరు చర్ల, జూన్ 24: ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు తాలిపేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మండలంతోపాటు ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో తాలిపేరు, పక్కనే ఉన్న జెర్రిపోతుల వాగు, లోటింత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు రెండు అదనపు గేట్ల నిర్మాణ పనులు జరుగుతుండటంతో భారీగా వస్తున్న వరద నీటి వల్ల ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గేట్ల నిర్మాణం కోసం వేసిన రింగ్‌బండ్‌ను దృష్టిలో ఉంచుకొని వరద నీటిని ఎప్పటికప్పుడు కిందికి వదిలేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 10వేలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదిలేస్తుంటే ఖరీఫ్‌కు సాగునీరు ఎలా విడుదల చేస్తారంటూ మరోవైపు సమీప రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో సుమారు 700 మోడల్ స్కూళ్లను నిర్మించనున్నట్టు
english title: 
p

ఆ పార్టీలకు ఓట్లెందుకేయాలి?

$
0
0
గుంటూరు, జూన్ 24: రాష్ట్రంలో ప్రజలు నానాకష్టాలు పడుతుంటే పట్టించుకోని అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి, ప్రజాసమస్యలపై పోరాడని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం జరిగిన గుంటూరు, ప్రకాశం జిల్లాల పార్టీ ప్రాంతీయ సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సిద్ధంగా లేరని, పరిపాలనపై పట్టులేని ఆయన ఎన్నికలు ఏవిధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్‌ఆర్‌సిపి ఎక్కడ ఘన విజయం సాధిస్తుందోనన్న భయంతో వెనకడుగు వేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సిపి రెండేళ్లు పూర్తిచేసుకుని ప్రత్యర్థి పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తోందని ఆమె అన్నారు. పార్టీ నాయకుల మధ్య సమన్వయం కొరవడిందని, దీన్ని గుర్తెరిగి పార్టీ శ్రేణులు ప్రతి పంచాయతీలో గెలుపు సాధించాలని పిలుపునిచ్చారు. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉచిత విద్యుత్‌కు తూట్లు పొడుస్తున్నారని, ఆరోగ్యశ్రీ పథకంలో 90 ఆసుపత్రులను తీసివేశారని, ఇందిరమ్మ గృహాలకు నిధులు మంజూరు చేయడం లేదని, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేస్తున్నారని విజయమ్మ ఆరోపించారు. పదవిని కాపాడుకోడానికి మాత్రమే సిఎం కిరణ్ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని, ఇక ఆయన రైతులను ఏం పట్టించుకుంటారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి, మామ ఎన్‌టిఆర్‌పై పోటీకి సిద్ధమని చెప్పి టిడిపి అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరి మామనే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి, పార్టీ జెండాను లాక్కున్న చంద్రబాబు రాజకీయ నీచచరిత్ర కుట్రలు, కుతంత్రాలతో ముడిపడి ఉందని విజయమ్మ తీవ్రంగా ఆరోపించారు. రైతులను జైలులో పెట్టించిన చంద్రబాబు నేడు రుణమాఫీ అంటూ కపట ప్రేమను ఒలకబోస్తున్నారన్నారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసిన చంద్రబాబు నేడు అధికారంలోకి వస్తే బెల్టుషాపులను తీసివేస్తామని అనడం కేవలం ప్రజలను మోసగించేందుకేనన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేశారని, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను మూసివేసి నూజివీడు సీడ్స్‌కు కాంట్రాక్టులు ధారదత్తం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తే, చంద్రబాబు టిడిపిని రిటైల్‌గా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. సిబిఐ ద్వారా కేసులను బనాయించి మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, ములాయంసింగ్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కేంద్ర ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. నీతిగా వ్యాపారం చేసుకునే జగన్‌ను జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలు పనే్న కాంగ్రెస్, టిడిపిలకు ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ఆలోచించాలని విజయమ్మ కోరారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ
కాంగ్రెస్, టిడిపిలపై విజయమ్మ ధ్వజం
english title: 
a

కళ్లెదుటే జల సమాధి

$
0
0
విజయవాడ, జూన్ 24: ఐదేళ్లుగా ఉజ్జయినీ, బదరీనాథ్ వంటి ద్వాదశ జ్యోతిర్లింగాల పుణ్యక్షేత్రాల్లో యాగాలు చేయిస్తున్న తాను జూలై 10నుంచి వారం రోజులపాటు కేదార్‌నాథ్‌లో పవిత్ర యాగ నిర్వహణ కోసం స్థానిక పురోహితుడు వంశీకృష్ణతో కలిసి వెళ్లానని, వరదల బీభత్సంలో తామిద్దరమూ బతికి తిరిగిరావటం పునర్జన్మగా భావిస్తున్నామని నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి సతీష్ అగర్వాల్ అన్నారు. ఆకలి దప్పులతో నిద్రహారాలు లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అష్టకష్టాలతో తాము నగరానికి చేరగలిగామని చెప్పారు. వ్యయప్రయాసలతో ఢిల్లీకి చేరి అక్కడి నుంచి విమానంలో నగరానికి చేరుకున్న అగర్వాల్ సోమవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మీడియా ప్రతినిధులతో కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడారు. ఈ నెల 15న రాత్రికి తాము కేదార్‌నాథ్ వెళ్లామన్నారు. ఆ సమయంలో తమవెంట 110 మంది యాత్రికులు ఉంటే వారిలో 20మందికి పైగా కళ్లెదుటే జలపాతాల్లో కొట్టుకుపోయారని ఆయన విలపించారు. రుద్రప్రయాగ, గౌరీఖండ్, కేదార్‌నాథ్ అనే గ్రామాల్లో వ్యాపారస్తులు సహా 10వేల మంది పైనే ఉన్నారని, 16న ఉదయం దిగువకు చేరుకుందామని బయలుదేరితే కుంభవృష్టితో రహదారులు కొట్టుకుపోయాయని తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో నడవటానికి దారి కూడా లేకుండాపోయిందన్నారు. అంత ఎత్తులో వృక్షాలు లేక ఆక్సిజన్ అందక వృద్ధులు ఇబ్బందులు పడ్డారన్నారు. కేదార్‌నాథ్‌కు 14 కి.మీల దూరంలో మూడు షెల్టర్లలో భయంకరమైన శబ్దాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నాలుగు రాత్రులు గడిపామన్నారు. బైటపడదామని దారితప్పి ఓ ప్రాంతానికి చేరితే దుకాణాలు కనిపించాయని, అక్కడ బిస్కెట్లు, తాగునీరు, కూల్‌డ్రింక్‌లు లభించాయన్నారు. 19వరకు ఎలాంటి హెచ్చరికలు లేవని, 19న మాత్రం రెండు హెలికాప్టర్‌లు దర్శనమిచ్చాయని చెప్పారు. అప్పటికి మార్గంమధ్యలో వందలాది మంది కన్పించడంతో నేవీ అధికారులు నడకమార్గం చూపించి తమను దారితప్పించి మరో రెండు రోజులు వేధించారని ఆయన విమర్శించారు. 20న 20మంది సైనికులు సహాయక చర్యలు చేపట్టారని, హెలికాప్టర్‌ల నుంచి ఆహార పొట్లాలు విసురుతున్నా అవి కొండచరియల్లోనే పడిపోయాయని వివరించారు. హరిద్వార్ సమీపంలో కేవలం గుజరాతీయులకే సహాయం, పునరావాసం లభించాయని ఆయన చెప్పారు. మైక్‌ల ద్వారా ఎక్కడెక్కడ వసతిగృహాలు, భోజన సదుపాయాలున్నాయో వారికి చెబుతూవచ్చారే తప్ప తమను పట్టించుకోలేదన్నారు. నరకయాతన అనుభవించాం ఎమ్మిగనూరు: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తాము నరకయాతన అనుభవించామని బాధితులు వాపోయారు. కేధార్‌నాథ్, బద్రీనాథ్ దర్శనానికి ఎమ్మిగనూరు ఉప్పరిపేట వాసులు పూల వీరేష్, అతని భార్య పూల శారద, పిల్లలు పవన్, సిద్దార్థ, అక్షయ కెకె ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లారు. వరదల్లో చిక్కుక్కున్న వీరు అష్టకష్టాలు పడి కట్టుబట్టలతో సోమవారం ఎమ్మిగనూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరేష్ విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 4న కుటుంబ సభ్యులతో కేధార్‌నాథ్ దైవదర్శనార్థం కెకె ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లామన్నారు. 16వ తేదీ గౌరీఖండ్ చేరుకుని దేవుని దర్శనం చేసుకున్నామన్నారు. అనంతరం అక్కడే నాలుగు అంతస్తుల లాడ్జిలో దిగామన్నారు. కొద్దిసేపటికే వరదలు ముంచెత్తడంతో అక్కడి వంతెన కొట్టుకుపోయిందన్నారు. దీంతో తామంతా భయంతో లాడ్జి వెనుకభాగం గుండా కొండప్రాంతంలోకి పరుగులు తీశామన్నారు. తమ కళ్లెదుటే గౌరీకుండ్‌లో గుడివాడకు చెందిన 10 మంది, విజయవాడకు చెందిన 44 మంది, హైదరాబాద్ వారు నలుగురు వరదలో కొట్టుకుపోయారన్నారు. కొండల్లోనే నిద్రహారాలు లేక రెండు రోజులు గడిపామన్నారు. చలికి తట్టుకోలేక పిల్లలు గజగజవణికిపోతుంటే గుర్రాలకు కప్పే దుప్పట్లతో వారిని కాపాడుకున్నామన్నారు. అక్కడి నుండి నాలుగు కిలోమీటర్లు కొండల్లో నడిచామన్నారు. కూతురు అక్షయకు కడుపునొప్పి వచ్చినా అలాగే ముందుకు నడిచామన్నారు. అనంతరం హెలిక్యాప్టర్‌లో ఢిల్లీ చేరుకున్నామన్నారు. కెకె ఎక్స్‌ప్రెస్‌లో ఎమ్మిగనూరు చేరుకున్నామన్నారు. ఆకలితో అలమటించాం గుంతకలు: వరదల్లో చిక్కుకుని వారం రోజులపాటు ఆకలి దప్పులతో అలమటిస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బితుకుబితుకు మంటూ గడిపిన తమపట్ల సహాయక బృందాలు వివక్ష చూపాయని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వృద్ధులు ఉత్తరాఖండ్ సంఘటనను తలుచుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమవారం ఉదయం కెకె ఎక్స్‌ప్రెస్ రైలు దిగిన నంద్యాలకు చెందిన తిరుపాలయ్య, అతని భార్య జయమ్మ విలేఖరులతో తమగోడు వెల్లబోసుకున్నారు. ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన తాము చార్‌ధాం వద్ద వరదల్లో చిక్కుకున్నామన్నారు. భయానక వాతావరణంలో నీళ్లలో తేలియాడుతున్న శవాల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామన్నారు. హెలిక్యాప్టర్‌లో వచ్చిన సహాయక బృందాలు తెలుగువారి పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించాయని జయమ్మ పేర్కొన్నారు. సహాయక బృందాలను చూడగానే ప్రాణాలు లేచి వచ్చినట్లయ్యిందన్నారు. బృందాలు బాధితులకు బిస్కెట్లు, తాగునీరు అందిస్తుంటే వరుసలో నిలుచున్నామన్నారు. అయితే అందరికీ బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసిన సహాయక బృందాలు తెలుగువారికి మాత్రం రెండంటే రెండు బిస్కెట్లు, తీర్థం పోసినట్టుగా తాగునీరు అందించారన్నారు. మా వాళ్లను త్వరగా పంపే ఏర్పాట్లు చేయండి - ఉత్తరాఖండ్ సిఎంకు కిరణ్ ఫోన్ - ఆంధ్రభూమి బ్యూరో విశాఖపట్నం, జూన్ 24: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు పంపించేలా ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఆదివారం రాత్రి విశాఖ సర్క్యూట్ హౌస్‌లో బస చేసిన ఆయన సోమవారం ఉదయం ఫోన్‌లో ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు వారి గురించి ఆరా తీశారు. ఆ తరువాత ఢిల్లీ ఎపి భవన్‌లో వరద బాధితులకు అందుతున్న సహాయ సహకారాల గురించి మంత్రులు శ్రీ్ధర్‌బాబు, దానం నాగేంద్రను అడిగి తెలుసుకున్నారు. 3 రోజులూ చెట్టుపై ఉన్నాం విజయవాడ, జూన్ 24: బావాజీపేట నుంచి 10మంది యాత్రికులు యాత్రకు వెళ్లగా ఐదుగురి ఆచూకీ లభించింది. వీరిలో ఒకరైన అన్నపూర్ణ నగరానికి చేరుకుని మృత్యువు కోరల నుంచి తాను ఎలా బైటపడిందీ వివరించారు. వరద ధాటికి తట్టుకోలేక మరో ఆశ్రయం లేక మూడురోజులపాటు చెట్టుపై వుండి ప్రాణాలు కాపాడుకోగలిగానని అన్నపూర్ణ కన్నీటి పర్యంతవౌతూ చెప్పారు. కేదార్‌నాథ్‌కు డోలీలో వెళుతుంటే ఒక్కసారిగా రెండంతస్తుల మేర వరద ఉద్ధృతి పెరగటంతో డోలీ మోసేవారు తనను వదిలి వెళ్లిపోయారని చెప్పారు. దీంతో దిక్కుతోచక సమీపంలోని చెట్టెక్కానని, తర్వాత హెలికాప్టర్ సిబ్బంది సాయంతో బైటపడ్డానన్నారు. కేదార్‌నాథ్ వెళ్లేముందు హరిద్వార్ హోటళ్లలో తాము భద్రపరచిన విలువైన పరికరాలు, లాప్‌ట్యాప్, ఇతర ఆభరణాలు చోరీకి గురయ్యాయని, క్షేమంగా తిరిగివచ్చిన బాధితులు పలువురు వివరించారు.
ప్రాణాలు అరచేత పట్టుకుని రోజులు గడిపాం* ఉత్తరాఖండ్ బాధితుల రోదన
english title: 
k

మృతులు ఎనిమిది మందే

$
0
0
విశాఖపట్నం, జూన్ 24: ఉత్తరాఖండ్ వరదల్లో రాష్ట్రానికి చెందిన వారు ఎనిమిది మంది మాత్రమే మరణించారని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విశాఖ ఎయిర్‌పోర్టులో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 2,624 మంది యాత్రికులు చార్‌ధామ్ యాత్రకు వెళ్లారని చెప్పారు. అక్కడ సంభవించిన వరదల్లో మరణించింది ఎనిమది మంది కాగా, 35 మంది జాడ ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఇప్పటి వరకూ 1500 మందిని సురక్షితంగా ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీలోని ఎపి భవన్‌కు చేర్చామని, అక్కడి నుంచి వారిని వారి స్వస్థలాలకు పంపించామని చెప్పారు. ఇంకా ఎపి భవన్‌లో 140 మంది ఉన్నారని, 19 మంది అస్వస్థతకు గురవడంతో వారికి ఢిల్లీలోనే చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ఉత్పాతం బాధాకరమైనదన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు చేపట్టిందని అన్నారు. ఎపి భవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు అక్కడి తెలుగువారి సమాచారాన్ని తెలుసుకుంటున్నామని అన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రోజూ మాట్లాడుతున్నారన్నారు. అలాగే మన చీఫ్ సెక్రటరీ కూడా ఉత్తరాఖండ్ సిఎస్, ఇతర కలెక్టర్లతో మాట్లాడుతున్నారని రఘువీరారెడ్డి తెలియచేశారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నందున విఐపిలను అక్కడికి రావద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ అధికారులు చెప్పినందువలన మన ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి వెళ్లలేదని రఘువీరా రెడ్డి చెప్పారు. విఐపిలు వెళ్లడం వలన అక్కడ సహాయక చర్యలకు తీవ్ర అవరోధం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వెళ్లలేదన్నారు. రాజకీయాకలకు అతీతంగా అక్కడ సహాయక చర్యలు జరుగుతుంటే, చంద్రబాబు నాయుడు అక్కడివెళ్లి ఆ పరిస్థితిని కలుషితం చేశారని రఘువీరా అన్నారు. అసెంబ్లీలో బంగారుతల్లి పథకానికి చట్టబద్ధత కల్పించేందుకు జరిగిన చర్చలో చంద్రబాబు పాల్గొనకుండా, అమెరికా వెళ్లిపోయి, ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉత్తరాఖండ్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న ప్రతి తెలుగు వారిని సురక్షితంగా మన రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
విఐపిలను రావద్దన్నారని సిఎం వెళ్లలేదు: రఘువీరా
english title: 
m

మానసిక ఆరోగ్యంతో నైపుణ్యానికి రాణింపు

$
0
0
సమాజంలో చాలామంది నైపుణ్యాలుండీ రాణించలేరు. అద్వితీయ మేధస్సు ఉన్నా మహనీయులు కాలేరు. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందలేరు. ఉన్నత చదువులు అలంకరించినా ప్రజారంజకులుగా కీర్తి గడించలేరు. కోట్లు సంపాదించినా గౌరవ మర్యాదలు అందుకోలేరు. ఇలాంటి వారిని పరిశీలిస్తే మానసిక లోపమే అందుకు మూలమని తెలుస్తుంది. వ్యక్తిత్వ వైఫల్యం, ప్రవర్తనాలోపం మానసిక రుగ్మతలు, ఇతర పలు అంశాలు వారి సామర్థ్యాలకు అడ్డంకులుగా పరిణమిస్తాయి. అందుకే ఆధునిక సమాజంలో వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతాంశాలు అయ్యా యి. శక్తి సామర్థ్యాలకంటే గుణగణాలకు విలువనిస్తున్నారు. తెలివితేటలకంటే దృక్పథం ముఖ్యమని భావిస్తున్నారు. కార్పొరేటు సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు విద్యార్హతలు, నైపుణ్యాలతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించి ఉద్యోగాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇప్పుడిప్పుడే వ్యక్తిత్వానికి విలువ ఇచ్చే స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. విద్యార్హతలు, నైపుణ్యాలతోపాటు మానసిక ఆరోగ్య నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వాలి. అందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని స్వంతం చేసుకోవాలి. ఆరోగ్యం మానసిక రుగ్మతలపట్ల అవగాహన పెంచుకోవాలి. సామర్థ్యమే ఆరోగ్యం వ్యక్తిగత శక్తి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుంటూ, ఒత్తిళ్ళను తట్టుకుంటూ, దినచర్యలను సక్రమంగా నిర్వహించడాన్ని మానసిక ఆరోగ్యంగా చెప్పవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం మానసిక, శారీరక, సామాజిక సమతుల్యతే ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం కూడా సాధారణ ఆరోగ్య సూత్రాలకు అనుగుణంగానే ఉంటుంది. అయితే శారీరక లోపాలు, సామాజిక పరిస్థితులను సానుకూలంగా చూడగల సామర్థ్యమే మానసిక ఆరోగ్యం. ఒక మనిషి జీవనశైలి, వ్యవహారం, ప్రవర్తనా తీరును పరిశీలించి మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. సాధారణంగా మానసిక ఆరోగ్యవంతులు తమ వ్యక్తిగత జీవితాన్ని సజావుగా గడుపుతారు. ఇతరులతో సఖ్యతగా ఉంటూ, అవసరాలు తీర్చుకుంటూ, ఉమ్మడి లక్ష్యాలను సాధిస్తుంటారు. తమ పట్ల తమకు పరిపూర్ణ అవగాహన ఉంటుంది. నిత్యం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుంటారు. వాస్తవికంగా ఆలోచిస్తుంటారు. స్వీయ గౌరవం కలిగి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సామాజిక స్పృహ కలిగి సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తారు. మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. తమ శక్తి సామర్థ్యాలపట్ల స్పష్టత కలిగి ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుంటారు. బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఒత్తిళ్ళను, సమస్యలను సవాళ్లుగా స్వీకరిస్తారు. మానవీయత, నైతిక విలువలు పాటిస్తారు. ప్రలోభాలు, ప్రతీకారాలకు దూరంగా ఉంటారు. సమూహం లేదా బృందంలో సభ్యులుగా ఉండేందుకు ఇష్టపడతారు. ఉత్సాహం, కుతూహలం కలుపుగోలుతనం వారి స్వభావంలో భాగమై ఉంటుంది. అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటారు. సామర్థ్యాలకు సానపట్టుకుంటారు. సమస్యలకు పరిష్కారాలు వెదుకుతారు. ఆత్మవిశ్వాసం, స్థిరచిత్తం కలిగి ఉత్పాదక శక్తులుగా ఎదుగుతారు. సుఖ సంతోషాలను స్వంతం చేసుకుంటారు. త్యాగనిరతి, కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఇంటా, బయటా అందరు హర్షించేలా ప్రవర్తించే వారిని మానసిక ఆరోగ్యవంతులుగా పేర్కొనవచ్చు. అంటే ప్రతివారికి ప్రీతిపాత్రులవుతారని కాదు. సామాజిక ధర్మాలు, ఆచారాలు, విలువలు పాటిస్తే చాలు. తమని వ్యతిరేకించేవారు, తమతో విభేదించేవారితో సైతం సానుకూలంగా వ్యవహరించగలగాలి. వ్యక్తిత్వాలు, అభిప్రాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు వేరైనా స్నేహ సంబంధాలు కొనసాగించగలగాలి. *
సమాజంలో చాలామంది నైపుణ్యాలుండీ రాణించలేరు
english title: 
expertise
author: 
డాక్టర్ ఎన్.బి.సుధాకర్ రెడ్డి Psychologist nbsreddi@gmail.com

వర్షాకాల వ్యాధులతో జాగ్రత్త!

$
0
0
వర్షం పడగానే గుంటలో నీరు నిలువ ఉండి, మురికి నీరుగా మారిన తరువాత ఆ నీటిలో దోమలు నివాసాలు ఏర్పరచుకుని విపరీతంగా వృద్ధి చెందుతాయి. దోమకాటువల్ల వచ్చే వ్యాధుల్లో తీవ్రమైనవి డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, మలేరియా. ఈ వ్యాధులను సకాలంలో నయం చేయకపోతే మరణాలు కూడా సంభవిస్తాయి. అలాగే వర్షాలు పడిన చోట నీరు కలుషితం కావటంతో అతిసార వ్యాధి సంభవిస్తుంది. ఇటువంటి వ్యాధులకు హోమియో బాగా ఉపయోగపడుతుంది. డెంగ్యూ.. లక్షణాలు: జ్వరం, ఎముకల నొప్పులు, కళ్లల్లోనుంచి నీరు కారడం, కళ్లు కదలించడం కష్టంగా మారడం ఆకలి తగ్గి, వాంతి అయ్యేట్లు ఉండటం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు రావడం, ముక్కులోనుంచి రక్తం పడటం, రక్త విరేచనాలు, తలనొప్పి విపరీతంగా ఉండటం. కారణం: డెంగ్యూ వైరస్, ఏడిస్ ఈజిప్ట్ దోమలు. డెంగ్యూ సోకిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి చేర్చాలి. రోగికి తరచూ ద్రవ పదార్థాలు ఇవ్వాలి. అవసరమైతే రక్తమార్పిడి చేయాలి. జాగ్రత్తలు: దోమలు నిలువ ఉండే ఆవాసాలైన నీళ్ల తొట్టిలు, టైర్లు, పాడేపోయిన కూలర్లలోని నీళ్లు నిలువ ఉండకుండా వాటిని తీసివేయాలి. మందులు: డెంగ్యూ వ్యాధి నివారణకు జల్సీమియం అనే మందునును వ్యాధి రాకముందు ఒక రోజు మూడు మోతాదులు తీసుకుంటే వ్యాధి సోకకుండా ఉంటుంది. వ్యాధి సోకితే యుఫటోరియం పర్ఫోటం అనే మందును వాడటంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాధి నివారణ కూడా త్వరగా జరుగుతుంది. చికున్ గున్యా: చికున్ గున్యా ప్రాణాంతక వ్యాధి కానప్పటికీ మనిషిని కదలలేని స్థితికి చేర్చి, శారీరకంగా, మానసికంగా కృంగిపోయేట్లు చేస్తుంది. లక్షణాలు: వైరస్ సోకిన వెంటనే అధిక జ్వరం, తీవ్రమైన కీళ్లనొప్పులు ఉండి మనిషి కదలలేని స్థితి ఏర్పడుతుంది. తలనొప్పి, నిద్రలేమి బాధిస్తాయి. వ్యాధి తీవ్రత 5 నుంచి 7 రోజులు వరకూ ఉంటుంది. జాగ్రత్తలు: శరీరంలోని ద్రవాలు, లవణాలు అన్నీ తగ్గిపోతాయి. కనుక ఆహార పానీయాలు సక్రమంగా ఉండే విధంగా చూడాలి. లేకపోతే ప్రాణాపాయానికి దారితీస్తుంది. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలి. నివారణ: వ్యాధి సోకకముందు యుఫటోరియం పర్ఫోరేటం అనే మందును వారానికి ఒక రోజు మూడు పూటలు తీసుకోవాలి. ఇలా వ్యాధి ప్రబలి ఉన్నంతకాలం తీసుకోవాలి. వ్యాధి సోకిన తరువాత ఆయా లక్షణాలను బట్టి రస్టాక్స్, బ్రయోనియా అనే మందులను రోజుకు మూడుసార్లు మూడు రోజులు వాడితే వ్యాధి తీవ్రత తగ్గుతుంది. మలేరియా.. మలేరియా జ్వరం ప్రతి యేటా ఎక్కువగా వర్షాలు పడిన తరువాత దోమలవల్ల వ్యాధి వ్యాప్తిచెందుతుంది. కారణాలు: మలేరియా ప్రొటోజోవా జీవి అయి ప్లాస్మోడియం ద్వారా సోకుతుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు: జ్వరం తీవ్రంగా ఉండటంతోపాటు చలి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు: దోమలను నివారించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. దోమతెరలు వాడాలి. నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి. నివారణ: చైనా, చినూనమ్ ఆర్స్, మలేరియా అఫిసినాలిస్, సల్ఫర్ అనే మందులు మలేరియా నివారణకు పనిచేస్తాయి.
వర్షం పడగానే గుంటలో నీరు నిలువ ఉండి, మురికి నీరుగా మారిన తరువాత
english title: 
seasonal diseases
author: 
డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ సెల్‌నెం. 9440229646 E-mail: drpsreedhar@ymail.com

ఖరీఫ్‌కు నీరు ఇవ్వండి

$
0
0
విజయవాడ, జూన్ 25: గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరదనీరు చేరుతుండటంతో సోమవారం అర్థరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఐదు గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తి సుమారు మూడు వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలారు. గేట్ల పైనుండి నీరు ప్రవహిస్తే గేట్లు దెబ్బతింటాయనే ఉద్దేశంతోటే గేట్లను కొద్దిగా ఎత్తాల్సి వచ్చిందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కేంద్ర మంత్రులతో ఏరువాక నిర్వహిస్తున్నందున ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం చుక్క నీరుని కూడా వృధాగా సముద్రంలోకి వదలకుండా వచ్చిన నీటిని వచ్చినట్లే కాలువలకు సరఫరా చేయాలంటూ తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు నాయకత్వంలో ఆ పార్టీ నేతలు కొందరు మంగళవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ గేట్ల దిగువన కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. అనంతరం నేరుగా నీటిపారుదల శాఖ ఎస్‌ఇ కార్యాలయానికి చేరుకుని ఎస్‌ఇని కలిసారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ కెఎల్ నరసింహమూర్తి మాట్లాడుతూ ఎంతోకాలం తర్వాత దశల వారీగా డెల్టా ఆధునికీకరణ పనులు నిర్వహిస్తున్నామని, వేసవిలో రూ. 200 కోట్లతో చేపట్టిన పనులు జూలై ఒకటో తేదీ నాటికి కానీ పూర్తికావని, అప్పటి వరకు నీటి విడుదల అసాధ్యమన్నారు. అయినా వేసవిలో తాగునీటి అవసరాల కోసం కొద్దిరోజులు పనులు నిలిపి వేసి తాగునీటి చెరువులన్నింటికీ నీటిని సరఫరా చేసిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఇక నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి మట్టాలను దృష్టిలో ఉంచుకుని డెల్టా ఆయకట్టుకు నీరు సరఫరా విషయమై ప్రభుత్వమే ఓ తేదీ ఖరారు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక మధ్యాహ్న సమయంలో డెల్టా కాలువలకు సాగునీటిని విడుదల చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు ప్రకాశం బ్యారేజీ వద్ద కొద్ది సేపు ధర్నా నిర్వహించారు.
* ప్రకాశం బ్యారేజీ వద్ద టిడిపి ధర్నా
english title: 
kharif

గ్రేటర్ విశాఖలో అనకాపల్లి, భీమిలి

$
0
0
విశాఖపట్నం, జూన్ 25: గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు, మరో పది పంచాయతీలను విలీనం చేస్తూ పొందుపరచిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వెలువడనున్నాయి. విశాఖను మెట్రో సిటీగా తీర్చిదిద్దేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రతిపాదనకు, ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం జివిఎంసి జనాభా 18.5 లక్షలు. మెట్రో సిటీగా రూపాంతరం చెందాలంటే కనీసం 20 లక్షల జనాభా ఉండాలి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, విశాఖ జిల్లా మంత్రి కొణతాల రామకృష్ణ ఈ విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో అనేక అభ్యంతరాలు రావడంతో విలీనాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన విలీన ప్రక్రియను ముమ్మరం చేశారు.
* దస్త్రాలపై సిఎం సంతకం
english title: 
maha visakha

ఉప్పొంగిన పెన్‌గంగ

$
0
0
ఆదిలాబాద్, జూన్ 25: ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు ఉధృతంగా పోటెత్తి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల నుండి జిల్లాలో ప్రవహించే పెన్‌గంగా, ప్రాణహిత పరవళ్ళు తొక్కుతుండగా, బెజ్జూర్, కౌటాల, వేమనపల్లి, చెన్నూర్, సిర్పూర్-టి పరీవాహక మండలాల్లోని 18 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సాయంత్రం వరణుడు శాంతించడంతో వరద ముప్పు నుండి ఆయా గ్రామాల ప్రజలు తేరుకుంటున్నారు. ఇదిలావుంటే బెజ్జూర్ మండలంలోని రేచిని, కృష్ణపల్లి, కుకుడ వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రేచిని, సోమిని, ఇందర్‌గాం, సుశ్మీర్, పిప్పల్‌గూడ, కృష్ణపల్లి, మొగవెల్లి, జరిగూడ, సోయాపల్లి, నాగపల్లి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆదిలాబాద్ మండలంలోని బంగారుగూడ వాగు, జైనథ్ మండలంలోని నీరాల వాగు ఉధృతంగా ప్రవహించడంతో మహారాష్టక్రు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా వుంటే మత్తడివాగు ప్రాజెక్టు నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో రెండు గేట్లను, సాత్నాల ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేసి వరద నీటిని వదిలి పెట్టారు. సల్గుపల్లి వద్ద సంగం ఒర్రె ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. వేమనపల్లి మండలం గొర్రపల్లి వాగు వరదలతో ఉప్పొంగడంతో 9 గ్రామాలకు రాకపోకలు స్తంభించగా, అత్యవసర పనుల నిమిత్తం ఆయా గ్రామాల ప్రజలు నాటుపడవలతో ప్రయాణం సాగిస్తున్నారు. ------------ కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి విశాఖపట్నం, జూన్ 25: ఒడిశా తీరాన్ని అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఆవరించింది. దీనితోపాటు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా కోస్తాంధ్రలో రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకావం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు మంగళవారం తెలిపారు. ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లోను, దక్షిణ కోస్తాలో ఒకటిరెండు చోట్ల చెదురుమదులు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా
english title: 
pen ganga

అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోండి

$
0
0
జోగిపేట, జూన్ 25: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే దీటైన వ్యూహంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ జిల్లా జోగిపేట పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి స్థానిక సంస్థల ఎన్నికల ప్రాంతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. గతంలో జరిగిన సహకార ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడిందని ఆమె ఆరోపించారు. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు వైకాపా సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. త్వరలో జరగనున్న అన్ని ఎన్నికల్లో పార్టీ పోటీచేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. తమ కుటుంబంపై ప్రజలకు అభిమానం ఉన్నందున ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు అదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తాము అధికారం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం మరో 6 నెలల పాటే అధికారంలో ఉంటుదన్నారు. తెలంగాణ వాదాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు గౌరవించారని విజయమ్మ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేతులోనే ఉంటుందన్నారు. రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్న సమయంలో 7 జిల్లాలను అభివృద్ధి చేయడానికి ప్రణహిత చేవేళ్ల ప్రాజెక్టు పనులను ప్రారంభించిన నేటి వరకు పూర్తి చేయలేదన్నారు. 108, 104 వంటి సేవలు నేడు ప్రజలకు ఉపయోగకరంగా లేవన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సిబిఐ పథకం ప్రకారమే జగన్‌కు బెయిల్ రాకుండా చేయడం జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షుడు బట్టి జగపతి మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట పట్టణంలో వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయన పేరుమీదే గెలిచి నేడు ఇలాంటి కార్యక్రమం పునుకోవడం సరికాదన్నారు. గోనే ప్రకాశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో తెరాసకు ప్రజల నుంచి మద్దతు ఉండదన్నారు. కేసిఆర్ కుటుంబ పార్టీగా తెరాస మారిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా శాసన సభ్యులు కూన శ్రీశైలంగౌడ్, గోవర్ధన్, అందోల్ ఇన్‌చార్జి నల్లా సూర్యప్రకాశ్, సంగారెడ్డి ఇంచార్జి శ్రీ్ధర్‌రెడ్డి, పటాన్‌చెరువు ఇన్‌చార్జి మహిపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ ఇన్‌చార్జి హనుమంతు, నాయకులు ఉజ్వల్‌రెడ్డి, బాలకిష్టారెడ్డి, నరేందర్‌రెడ్డి, రాఘవరెడ్డి, మహేందర్‌గౌడ్, రవిందర్‌గౌడ్, నర్సింలు పాల్గొన్నారు.
వైకాపా శ్రేణులకు విజయమ్మ పిలుపు
english title: 
vijayamma

రాజన్న ఆలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సోదాలు

$
0
0
వేములవాడ,జూన్ 25: సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం మెరుపుదాడులు నిర్వహించారు.సుమారుగా ఒకలక్షా రెండువందల రూపాయాల విలువ గల లడ్డూ రీసెల్ నిర్వహిస్తున్న టికెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో ప్రధానంగా ఐదుశాఖలపై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ మర్తాండ,సిఐలు రఘుచందర్,సుబ్బారావు,శశిధర్‌రెడ్డి, ఎంపిడివో శ్రీనివాస్, అసిసెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆనంద్‌లతోపాటు 17మంది సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి లడ్డూ ప్రసాదాలయ తమారి విభాగం,గోదాం,్ధర్మశాలలు, ఇంజనీరింగ్ టెండర్ నిర్వహణ విభాగం,లీజియస్,విభాగాలలలో తనిఖీ నిర్వహించారు. ఉదయం 9గంటలకు ఆలయానికి వచ్చిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ముందుగా లడ్డూ అమ్మకాల కౌంటర్‌కు వెళ్లి లడ్డూ విక్రయాలపై టికెట్లను పరిశీలించగా ఒక వెయ్యి రెండు లడ్డూ టికెట్లు రిసేల్ చేస్తున్న స్వయంగా పరిశీలించి పట్టుకొని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పదిరూపాయాలకోకటి చోప్పున విక్రయించే లడ్డూల టికెట్లను అక్రమంగా అమ్ముతున్నట్లు గుర్తించారు. సుమారు ఒకలక్షరూపాయాలమేర ఆలయ ఆదాయానికి గండికోట్టారన్న విషయాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి నివ్వెరపోయారు. మిగితా విభాగాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
సుప్రసిద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో విజిలెన్స్
english title: 
enforcement

నిజామాబాద్‌లో మెడికల్ కళాశాలకు ఎంసిఐ ఓకే

$
0
0
నిజామాబాద్, జూన్ 25: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎంసిఐ నుండి ఎట్టకేలకు అనుమతి లభించింది. దీంతో ప్రస్తుత 2013-14 విద్యాసంవత్సరంలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ద్వారా కౌనె్సలింగ్ ప్రక్రియను చేపట్టి ఈ ఏడాది 100 సీట్లను భర్తీ చేయనుండగా, ఆగస్టులో తరగతులు ప్రారంభం కానున్నాయి. స్థానిక వైద్య కళాశాలకు అనుమతి మంజూరు చేస్తూ ఎంసిఐ పాలక మండలి ఈ నెల 18, 19వ తేదీలలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం తాలూకా ప్రతులను మంగళవారం ఇంటర్నెట్‌లో ఎంసిఐ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల శాఖా మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి సైతం మంగళవారం సాయంత్రం ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మెడికల్ కళాశాలకు ఎంసిఐ అనుమతి లభించిన విషయాన్ని నిర్ధారించారు. 2009వ సంవత్సరంలో నిజామాబాద్‌కు మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి మైదానంలో సుమారు 200 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ భవన సముదాయాలను నిర్మించారు. కళాశాల నిర్వహణకు అవసరమైన అన్ని సదుపాయాలను సమకూరుస్తూ, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టారు. ఎంసిఐ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, గత నెల 16, 17వ తేదీలలో ముగ్గురు సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందం హాజరై స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి వెళ్లింది. తాజాగా, ఈ నెల 18, 19 తేదీలలో ఎంసిఐ పాలక మండలి సమావేశంలో చర్చించిన మీదట నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అనుమతి మంజూరు చేశారు. ఎంసిఐ నుండి అనుమతి లభించడం పట్ల మంత్రి సుదర్శన్‌రెడ్డి, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎంసిఐ
english title: 
mci

గడ్డిపోచల్లా కొట్టుకుపోయారు

$
0
0
తోట్లవల్లూరు, జూన్ 25: జీవితంలో ఇంతటి ఉపద్రవాన్ని మరోసారి చూడబోమని, కలసివెళ్ళిన వాళ్ళం చెల్లాచెదురవటం, చేయి పట్టుకొని వున్న మనిషి జారిపోవటం, కళ్ళముందే వందలాది మంది గడ్డిపోచల్లా వరద నీటిలో కొట్టుకుపోవటం, వందలాది గుర్రాలు, కార్లు వరదలో తేలియాడుతూ కొట్టుకుపోవటం, పెద్దపెద్ద భవంతులు, ఆలయాలు కూలిపోవటం ఇలా ఉత్తరాఖండ్ వరదల్లో తమ కళ్లముందు సాక్షాత్కరించిన భయానక దృశ్యాలని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని దేవరపల్లి వాసులు వివరించారు. ఢిల్లీలో చంద్రబాబు ఏర్పాటు చేసిన విమానంలో సోమవారం సాయంత్రం బయలుదేరిన మరీదు కృష్ణవేణి (దేవరపల్లి), మర్రెడ్డి వనజ, మర్రెడ్డి విజయలక్ష్మి, జొన్నల శ్రీదేవి (చాగంటిపాడు), భీమవరపు మురహరరెడ్డి, భీమవరపు రాణి (ఇబ్రహీంపట్నం), బొమ్మారెడ్డి సామ్రాజ్యం (విజయవాడ), కొల్లి సీతారావమ్మ (హైదరబాద్) రాత్రికి హైదరాబాద్ వచ్చి ఉదయం 9 గంటలకు స్వస్థలాలకు చేరుకున్నారు. మొత్తం ఎనిమిది మంది వారి సొంతిళ్ళకు చేరటంతో బంధువులు ఆనందంలో మునిగిపోయారు. దేవరపల్లి, చాగంటిపాడు వెళ్ళిన విలేఖరులకు కృష్ణవేణి, విజయలక్ష్మి తమకు ఎదురైన అనుభవాలను ఏకరువు పెట్టారు. 16న కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన సమయంలోనే వర్షాలు వస్తున్నాయని, ఓ పోలీసు వచ్చి వరదలు వస్తున్నాయి, దూరంగా వెళ్ళిపొమ్మని ఆదేశించాడని చెప్పారు. దీంతో తమ 19మంది బృందం వడివడిగా కొండ ఎగువకు వెళుతుండగానే కేదార్‌నాథ్ ఆలయానికి వరద వచ్చి తాము చూస్తుండగానే భక్తులు కొట్టుకుపోయారని విజయలక్ష్మి తెలిపారు. తాము కొండపైకి ఎక్కుతుండగా వరద ఎదురవటంతో గౌరీ టెంపుల్‌లోకి వెళ్ళామని, అక్కడ అందరం ఉండగానే వరదలు రావటంతో ఇసుప మెష్‌ను కొందరం పట్టుకున్నామని, మెష్‌ను పట్టుకోలేనివారు వరద నీటిలో కొట్టుకుపోయారని చెప్పారు. తమకు నడుంలోతు ఒండ్రుమట్టి పేరుకుపోయిందని, ఓ వ్యక్తి సాయంతో గౌరీ టెంపుల్ నుంచి బయటకు వచ్చామని, తమ బృందంలోని 19 మందిలో ఏడుగురు ఇనుప మెష్‌ను పట్టుకోలేకపోవటంతో తమ కళ్లెదుటే కొట్టుకుపోయారని తెలిపింది. అక్కడ నుంచి కొండ ఎక్కుతుండగానే వరద ఉద్ధృతి పెరగటంతో గౌరీ టెంపుల్ పూర్తిగా కొట్టుకుపోయిందని కృష్ణవేణి, విజయలక్ష్మి వివరించారు. అక్కడ నుంచి 11 వేల అడుగుల ఎత్తులో కొండపైకి వెళ్ళగా అన్నపూర్ణ లాడ్జి కనిపించిందని, దాని యజమాని తమను చేరదీసి నాలుగు రోజులు భోజనం పెట్టాడని, అక్కడ భోజనం చేస్తూనే హెలిపాడ్‌ల వద్దకు వస్తుంటే తెలుగువారిని ఎక్కించుకోలేదని, మళ్ళీ అన్నపూర్ణ లాడ్జికి వెళ్ళి తలదాచుకుని నాలుగు రోజులైనా హెలికాప్టర్ ఎక్కలేకపోవటంతో కొండపై నుంచి 15 కిలోమీటర్లు కిందకి దిగామన్నారు. అప్పటికే గుజరాత్, కర్నాటక, మద్రాస్ పోలీసులు బస్సుల వద్ద ఉండి వారి రాష్ట్రాల ప్రజలను బస్సుల్లోకి ఎక్కిస్తున్నారని, తాము తెలుగువారం కావటంతో పట్టించుకోలేదన్నారు. ఈ నడకలోనే ఆరేపల్లి సరస్వతి, భీమవరపు నాగరత్నం చనిపోయారని చెప్పారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రజల కోసం సొంత పోలీసులను పంపగా మన రాష్ట్రం నుంచి మాత్రం ఎవ్వరూ రాలేదని వాపోయారు. కిందికి నడుస్తూ వస్తుండగా బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి కారులో ఎక్కించుకుని ఓ హోటల్లో భోజనం పెట్టించారని, అక్కడ ఓ తెలుగు వ్యక్తి పరిచయమై తలా 2 వేల రూపాయలు ఇచ్చారని అన్నారు. ఆ డబ్బులతో ఓ కారును రూ.10వేల కిరాయికి మాట్లాడుకుని రుషికేష్ చేరామని వివరించారు. అక్కడ ఓ తెలుగు టివి చానల్ వారు తమతో మాట్లాడి తరువాత వదిలి వెళ్ళిపోయారని చెప్పారు. దేవరపల్లి నుంచి రుషికేష్ వెళ్ళిన కొల్లి సాంబిరెడ్డి తమను ఓ ఆశ్రమానికి, తరువాత ఢిల్లీకి చేర్చాడని చెప్పారు. ఢిల్లీ ఎపి భవన్‌లో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. కొందరు మంత్రులు వచ్చి పలకరించి వెళ్ళటంతప్ప ఒరిగిందేమీ లేదన్నారు. బాబు సాయంతోనే ఇంటికి చేరాం కేదారనాథ్ యాత్రకు వెళ్లి వరద భీభత్సంలో చిక్కుకుని దుర్భర పరిస్థితిలో ఉన్న తాము టిడిపి అధినేత చంద్రబాబు ప్రత్యేక చొరవ వల్ల క్షేమంగా ఇంటికి చేరామని గుంటూరు జిల్లా అమరావతికి చెందిన సబ్బిశెట్టి పుల్లారావు, భార్య భారతి చెప్పారు. 26వ తేదీన చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన తాము కేదారనాథ్ పర్వత శ్రేణి నుండి శనివారం ఉదయం 10 గంటలకు కిందకు వచ్చి అద్దె గదుల్లో ఉన్నామని సాయంత్రం 7 గంటల తర్వాత సంభవించిన భారీ వర్షం, ఉప్పెనలాగా వర్షపునీరు రావడంతో తాము ఉన్న భవనంలోనే రెండు అడుగుల ఎత్తున బురదలో కూరుకుపోయామని, ఆ సమయంలో భవనం అటూ ఇటూ ఊగడంతో భయబ్రాంతులకు గురై పక్కనే ఉన్న దిబ్బపైకి చేరుకున్నామని తెలిపారు. తాము ఒడ్డుకు చేరిన గంటలోపే తాము బస చేసిన భవనం కుప్పకూలి నీళ్లలో కొట్టుకుపోయిందన్నారు. సురక్షితంగా స్వస్థలానికి.. విజయనగరం: ఉత్తర భారతదేశ యాత్రలకు జిల్లా నుంచి 150 మంది వరకు వెళ్లినట్టు సమాచారం. వారిలో మంగళవారం నాటికి 30 మంది యాత్రికులు జిల్లాకు చేరుకున్నారు. కొత్తవలస, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన వారు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ గంగోత్రి యాత్ర నరకయాతనని పేర్కొన్నారు. తాము ఒక గంట ముందు బయల్దేరకపోతే తాము బయటపడే మార్గం ఉండేది కాదని బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి ఆర్‌కెఎఎన్ రాజు, బిజె ప్రసాదరావులు తెలిపారు. తమ బంధువు డెహ్రడూన్ కలెక్టర్‌గా పనిచేయడం వల్ల ముందస్తుగా సమాచారం తెలుసుకోగలిగామన్నారు. తాము మాతలి నుంచి శ్రీనగర్ మీదుగా కేదార్‌నాథ్ వెళ్లడానికి బయల్దేరామన్నారు. ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లేసరికి రోడ్డు మూసుకు పోవటంతో ముందుకు ప్రయాణించడానికి అవకాశం లేక వెనుదిరిగామన్నారు. తాము మూడు రోజులపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. తాము తిరుగు ప్రయాణంలో రోడ్డు మార్గం గుండా ప్రయాణించామని అక్కడ పరిస్థితులు చెప్పడానికి అలవికాని విధంగా ఉన్నాయన్నారు. దరసు దగ్గర రోడ్డు కోత పడటంతో కొండను తొలిచి రోడ్డును కలిపారని వారు పేర్కొన్నారు. తాము చూస్తుండగానే కొండలు మట్టి ముద్దల్లా కొట్టుకుపోయాయన్నారు. తాము బస చేయడానికి రిజర్వు చేసుకున్న లాడ్జి కూడా వరదల్లో కొట్టుకుపోయిందని వారు కన్నీటిపర్యంతమయ్యారు. తాము దేవుని దయవల్ల తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోగలిగామని వారు తెలిపారు. గుట్టలుగా శవాలు ఉరవకొండ: దేవుడి దయవల్ల పునర్జన్మ లభించిందని అనంతపురం జిల్లా ఉరవకొండకు చేరుకున్న ఉత్తరాఖండ్ వరద బాధితులు పేర్కొన్నారు. ఉరవకొండకు చెందిన చెన్న బసమ్మ, కురుబ రాజు, వడ్డే పరశురాం మంగళవారం ఇంటికి చేరుకున్నారు. 16న కేదార్‌నాథ్ నుండి గౌరీఖండ్‌కు వెళ్తుండగా భారీ వర్షాలు కురియడంతో తిండితిప్పలు లేక రెండు రోజుల పాటు 21 కిలోమీటర్లు నడికి ఉత్తరకాశీకి చేరుకున్నామన్నారు. గుట్టలుగా పడిఉన్న శవాల మధ్య నరకాన్ని చూశామన్నారు. అష్టకష్టాలు పడి ఢిల్లీ ఎపి భవన్ చేరుకున్నామ.న్నారు. నంద్యాల సైనికాధికారి సాయం ఎమ్మిగనూరు: నంద్యాలకు చెందిన సైనికాధికారి రాము సాయంతో తామంతా క్షేమంగా ఇంటికి చేరుకోగలిగామని ఎమ్మిగనూరుకు చెందిన ఉత్తరాఖండ్ బాధితులు తెలిపారు. ఎమ్మిగనూరు సోమప్పనగర్ వాసులు పూజారి లక్ష్మన్న, సావిత్రమ్మ, రాములమ్మ విలేఖరులతో మాట్లాడుతూ బద్రీనాథ్‌లో ఆంధ్రులు కట్టించిన ఆశ్రమంలో తమతోపాటు, మరో 120 మంది తలదాచుకున్నారన్నారు. నంద్యాలకు చెందిన ఆర్మీ అధికారి తమను తమను హెలికాప్టర్‌లో ఎక్కించడంతో ఢిల్లీ చేరుకున్నామన్నారు. ===================== మాకిది పునర్జన్మ విజయవాడ: కేదారనాథ్ ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే నిమిత్తం విజయవాడ భావాజీపేటకు చెందినవారు ఇద్దరు తిరిగి వచ్చారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రాగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని నాని శ్రీనివాస్ (నాని) తమ బస్సుల్లో దగ్గరుండి 41 మంది యాత్రికులను మంగళవారం తెల్లవారుజామున విజయవాడకు తీసుకువచ్చి జిల్లాలోని వారివారి ప్రాంతాలకు పంపించారు. భావాజీపేటకు చెందిన చిన్నకేశవులు, సంధ్యా లక్ష్మి, వెంకట సుశీల (53), ఆవుల రంగారెడ్డి (67) భార్య వెంకటలక్ష్మి (58) ఆచూకీ తెలియరావటంలేదు. తిరిగి వచ్చిన డివి సతీష్‌కుమార్ మాట్లాడుతూ తన కళ్ల ఎదుటే 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ నెల 4వ తేదీ బయలుదేరి 15వ తేదీ కేదారనాథ్‌లో స్వామి దర్శనం చేసుకున్నామని, ఇక తిరుగు ప్రయాణంలో సంభవించిన భారీ వర్షాలకు నరకయాతన అనుభవించామన్నారు. ఇంతటి ఘోర విపత్తు కనీవినీ ఎరుగలేదన్నారు. ఆహార పానీయాలే కాదు బట్టలకు కూడా ఇబ్బంది పడ్డామన్నారు. హెలికాప్టర్ ద్వారా డెహాడ్రూన్ నుండి ఢిల్లీకి చేరుకోగల్గామన్నారు. ఇరుకైన ఘాట్ రోడ్డులో వందలాది వాహనాలు చిక్కుకున్నాయని తమతో వచ్చిన వారిలో ఐదుగురు గల్లంతయ్యారంటూ లక్ష్మి విలపించారు.
కళ్ళ ముందే ప్రళయం..ఉత్తరాఖండ్ బాధితుల్లో వీడని భయం * బతికి వస్తామనుకోలేదు..!
english title: 
pralayam

కర్నూలు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ప్రారంభం

$
0
0
కర్నూలు, జూన్ 25: సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య సెప్టెంబర్ నాటికి డబుల్ డెక్కర్ రైలు ప్రవేశపెడతామని రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. కర్నూలు రైల్వేస్టేషనులో మంగళవారం కర్నూలు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ, కర్నూలు-నంద్యాల డెమో ప్యాసింజర్ రైళ్లను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ గతంలో రైల్వేపరంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చుకునేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నామన్నారు. రైల్వేబడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దపీట వేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన రైళ్లు ఒక్కొక్కటీ పట్టాలెక్కుతున్నాయన్నారు. అవిగాక సికింద్రాబాద్ నుంచి బెంగుళూరుకు, బెంగుళూరు నుంచి సికింద్రాబాద్‌కు డబుల్ డెక్కర్ రైళ్లు, సికింద్రాబాద్ నుంచి విజయవాడ, సికింద్రాబాద్ నుంచి తిరుపతి మార్గాల్లో సెప్టెంబర్ నాటికి కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ రైళ్లన్నీ కర్నూలు మీదుగా వెళ్తాయన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు డివిజన్ పనితీరు బాగా ఉందని పేర్కొన్న మంత్రి కోట్ల డివిజన్‌కు ప్రోత్సాహకంగా రూ.రెండు లక్షల నగదు బహుమతి ప్రకటించారు. కర్నూలు నుంచి సికింద్రాబాద్‌కు కొత్తగా ఇంటర్‌సిటీ రైలు, కర్నూలు నుంచి నంద్యాలకు ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తక్కువ ఖర్చుతో హైదరాబాద్, నంద్యాలకు వెళ్లే సౌకర్యం కలిగిందన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన రైల్వేబోగీల మరమ్మతు కర్మాగారానికి సెప్టెంబర్ నెలలో యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ శంఖుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. మూడేళ్లలో పనులు పూర్తిచేసి కర్మాగారాన్ని ప్రారంభిస్తామన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వారే ప్రజా నాయకులన్న విషయం గుర్తుంచుకుని పనిచేస్తూ ప్రజల ఆశీర్వాదం కోరుతామని అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఆ మేరకు అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైల్వే స్టేషనుకు వచ్చిన ప్రయాణికుడు అసంతృప్తి చెందకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ వెంకటేష్, ఎంపి ఎస్పీవైరెడ్డి, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) ఇంటర్‌సిటీ రైలుకు కర్నూలు సిటీ రైల్వేస్టేషన్‌లో పచ్చజెండా ఊపుతున్న మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య సెప్టెంబర్ నాటికి
english title: 
double decker train

రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

$
0
0
సిద్దిపేట , జూన్ 27: తెలంగాణ ప్రాంత రైతుల ఆత్మ హత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. గురువారం చిన్నకోడూరులోని ఎంపిడిఓ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్తు ఆచరణలో మాత్రం రైతులకు ఒరగపెట్టిందేమిలేదన్నారు. తెలంగాణ రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తు ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఇన్సురెన్స్ పంపిణిలో తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తు సీమాంధ్ర ప్రాంత రైతాంగానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తుందన్నారు. సీమాంధ్ర పాలకులు అనాదిగా తెలంగాణపై వివక్ష కొనసాగిస్తునే ఉన్నారన్నారు. తెలంగాణలో భూగర్భజలాలు అడుగంటి రైతులు కరువుతో అలమటిస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. టిడిపి, కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీ ఐన టిఆర్‌ఎస్‌లో చేరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రాష్ట్రం సాధించేందుకు సహకరించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు 50 వేల వరకే అప్పులు చెల్లించి మిగతా లక్ష రూపాయలు ఉత్పత్తి రంగాల్లో ఖర్చుపెట్టి ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. మండలంలో 18మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 5గురికే నిధులు మంజూరీ కావడం వివక్ష కాదా అన్నారు. త్వరలోనే మరో 13మందికి రైతు ప్యాకేజీ కింద నిధులు మంజూరీ చేసి ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ వసంతలక్ష్మి, ఎంపిడిఓ భిక్షపతి, ప్రత్యేకాధికారి అంజనేయులు, టిఆర్‌ఎస్ నేతలు రాంచంద్రం, వెంకట్‌రెడ్డి, తిరుపతి, రాధాకిషన్‌శర్మ, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మండలంలోని సలేంద్రికి చెందిన 16మంది రైతులకు లావణి పట్టాలను ఎమ్మెల్యే అందించారు. టిఆర్‌ఎస్‌లో చేరిన టిడిపి నేతలు చిన్నకోడూరు మండలం మాటిండ్లకు చెందిన టిడిపి నేత పొన్నాల సత్తయ్య ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యే హరీష్‌రావు సమక్షంలో గురువారం చిన్నకోడూరులో టిఆర్‌ఎస్‌లో చేరారు. చిన్నకోడూరు మండల టిఆర్‌ఎస్ యూత్ అధ్యక్షునిగా సురేందర్‌రెడ్డిని నియమిస్తు ఎమ్మెల్యే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణకు అనాదిగాద్రోహం చేస్తున్న టిడిపికి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, టిడిపి ద్వంద వైఖరితో ఎంతో మంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పిల్లలకు కాల్షియం డ్రాప్స్ వేస్తున్న హెల్త్‌కేర్ సెంటర్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 12, డోస్ ఒక్కింటికి రూ. 20 : పలువురికి అస్వస్థత, ఆసుపత్రులలో చేరిక మెదక్, జూన్ 27: జిల్లాలో హెల్త్‌కేర్ సెంటర్ సిబ్బంది కాల్షియం డ్రాప్స్ శిబిరాలను ఏర్పాటు చేయడానికి జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందిని కలువకుండానే గ్రామాల వారిగా సర్వే చేస్తు వందల సంఖ్యలో చిన్నారులకు కాల్షియం డ్రాప్స్ వేస్తున్నారు. డ్రాప్స్ వేసుకున్న చిన్నారులకు దద్దులు రావడం, వాంతులు, విరోచనాలు, జ్వరంతో పిల్లల ఆసుపత్రిలలో అడ్మిట్ అవుతున్నారు. దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో హెల్త్‌కేర్ సెంటర్ ఎపి ఇన్‌చార్జి నరేశ్ అనే వ్యక్తి నడిపిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుండి ఇటీవల జిల్లాకు హెల్త్‌కేర్ సెంటర్ ఆధ్వర్యంలో కాల్షియం డ్రాప్స్ ద్వారా నిర్వహించు కార్యక్రమ శిబిరాలను నిర్వహిస్తున్నారు. మెదక్ మండలంలో ప్రతి గ్రామంలో ఒక నెల నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలను హెల్త్‌కేర్ సెంటర్ వారు సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తి ఆయిన తరువాత రిజిస్ట్రేషన్ ఫీజు 12 రూపాయలు, ప్రతి డోస్‌కు 20 రూపాయల వంతున కాల్షియం డ్రాప్స్‌కు వసూలు చేస్తున్నారు. ఈ నెల 22న మెదక్ మండలం అవుసులపల్లిలో 200 మంది చిన్నారులకు కాల్షియం డ్రాప్స్ వేశారు. ఈ 200 మందిలో చాలా మంది అస్వస్తతకు గురయ్యారు. కాల్షియం డ్రాప్స్ వేసిన చిన్నారులకు దద్దులు రావడం, జర్వం, వాంతులు, విరోచనాలు కావడం జరిగింది. ముందుగా హెల్త్ కేర్ సెంటర్ కాల్షియం డ్రాప్స్ కార్డులను చిన్నారులకు 12 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు క్రింద వసూలు చేసి అందజేశారు. కాల్షియం డ్రాప్స్ డోస్‌కు 20 రూపాయలు వసూలు చేశారు. మొదటి డోస్ 22న వేయగా 29న 2వ డోస్, జూలై 6న మూడవ డోస్ తేదీలను ఖరారు చేసి హెల్త్‌కేర్ సెంటర్ కార్డులను పంపిణీ చేశారు. మెదక్‌లో కాల్షియం డ్రాప్స్ హెల్త్‌కేర్ సెంటర్ మెదక్ బస్టాండ్ ఆవరణలో ప్రారంభించారు. ఇక్కడ ఇన్‌చార్జిగా శేశు ఉన్నారు. రెండు టీములు కాల్షియం డ్రాప్స్ వేసేందుకు గాను ఒకటి నుండి 15 సంవత్సరాల లోపు చిన్నారులను గుర్తించి వారి నుండి 12 రుపాయలు వసూలు చేస్తు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బూర్గుపల్లి గ్రామంలో 250 మంది చిన్నారులకు కాల్షియం డ్రాప్స్ వేశారు. గురువారం నాడు పాతూర్‌లో సర్వే నిర్వహిస్తున్నట్లు శేషు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు రెండు టీములు పనిచేస్తున్నట్లు తెలిపారు. మొదటి టీంలో గోపాల్, రెండవ టీంలో శంకర్ టీం లీడర్సుగా పనిచేస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేవని ల్యాబ్ సర్టిఫికెట్ ఇచ్చింది హెల్త్‌కేర్ సెంటర్ ఎపి ఇన్‌చార్జి నరేశ్ కాల్షియం డ్రాప్స్ వేయడం వల్ల పిల్లలకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని హెల్త్‌కేర్ సెంటర్ ఎపి ఇన్‌చార్జి నరేశ్‌ను వివరణ కోరగా, కాల్షియం డ్రాప్స్ వరుణ్ ల్యాబ్‌కు టెస్టుకు పంపడం జరిగిందని అందులో ఎలాంటి సైడ్ ఇన్‌ఫెక్షన్ రావని వరుణ్ ల్యాబ్ సర్ట్ఫికెట్ ఇచ్చినట్లు నరేశ్ తెలిపారు. ఇంకా ఆయుస్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ సంస్థ చైర్మన్ తీగల ఆగిరెడ్డి సెల్‌ఫోన్ నంబర్లు ఇస్తాను వారితో మాట్లాడండని, వారి నంబర్లు ఇవ్వలేదు. కాల్షియం డ్రాప్స్ అనేవి ఉండవు * జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రంగారెడ్డి కాల్షియం డ్రాప్స్ అనేవి ఉండవని కాల్షియం సిరఫ్, కాల్షియం ట్యాబ్‌లెట్లు మాత్రమే ఉంటాయని మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రంగారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలో కాల్షియం డ్రాప్స్ శిబిరాల నిర్వహణ సంగతి తన దృష్టికి రాలేదని ఆయన తెలిపారు. ముగ్గురు చిన్నారులను నిలాఫర్ ఆసుపత్రికి తరలించా * చిన్నారుల వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ కాల్షియం డ్రాప్స్ వేసిన ముగ్గురు చిన్నారులు తన వద్దకు వచ్చారని వారు జ్వరంతో వాంతులు, విరోచనాలు, దద్దుర్లతో తన ఆసుపత్రికి వచ్చారని చిల్ట్రన్స్ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ చిన్నారులకు ప్రథమ చికిత్స నిర్వహించి హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. * అవుసులపల్లిలో 15 మందికి అస్వస్తత * మాజీ సర్పంచ్ దశరథం తన మనవరాలు 5 నెలల అక్షయ్‌కు ఈ నెల 22న కాల్షియం డ్రాప్స్ వేయించడం జరిగిందని అవుసులపల్లి మాజీ సర్పంచ్ దశరథం తెలిపారు. ఆ డ్రాప్స్ వేసినప్పటి నుండి తన మనవరాలికి దద్దులు, జ్వరం, విరోచనాలు కావడంతో చిల్ట్రన్స్ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్‌కు చూపించడం జరిగిందన్నారు. కేవలం డాక్టర్ రాసిన మందులకే 500 రుపాయలు ఖర్చు అయినప్పటికినీ విరోచనాలు, దద్దుర్లు తగ్గడం లేదని తెలిపారు. అదే విధంగా టంటం నర్సింలు ముగ్గురు పిల్లలకు కాల్షియం డ్రాప్స్ వేయించగా, క్రాంతికుమార్ నిద్రలో కేకలు పెట్టడం మొదలైందని తండ్రి నర్సింలు తెలిపారు. అలాగే కుమార్తె జగదీశ్వరి, మహేశ్వరి జ్వరంతో బాధపడుతున్నారన్నారు. ఈ విధంగా చాలా మంది చిన్నారులు అస్వస్తతకు గురయ్యారు. ప్రతిష్టాత్మకంగా రైతు ముంగిట్లో రెవెన్యూ సేవలు - జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్ గజ్వేల్, జూన్ 27: రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా జిల్లాలో రైతు ముంగిట్లో సేవలు కార్యక్రమాన్ని చేపట్టి ప్రతిష్టాత్మకంగా ఆమలు చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. గురువారం గజ్వేల్‌లో నియోజకవర్గ స్థాయి రైతు సదస్సు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితోకలసి సంపూర్ణ హక్కులతోకూడిన డాక్యుమెంట్లు అందజేసిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా 33380 వినతులు రాగా, పూర్తి స్థాయిలో పరిష్కరించి పరిష్కార పత్రాలు రైతు ఇంటి వద్దనే అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా 1955 నుండి 12వేల ఎకరాలలో ఇనాం భూములను సాగు చేసుకుంటూ పేదలు కుటుంబాలను పోషించుకుంటుండగా, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టు కొని టైటిల్ డీడ్స్, పహాణి, ప్రొసిడింగ్ తదితర పత్రాలను అందజేసి ముందు ముందు ఇబ్బందులు లేకుండా రికార్డులకెక్కిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఆ కుటుంబాల ఆర్థికాభివృద్ధి సాధ్యపడడంతోపాటు పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, ప్రతి గ్రామంలో రెవెన్యూ సేవల కోసం విఆర్వో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాగా పేద ప్రజల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ, ఎస్టీలకు సంబందించిన 2లక్షల 53వేల సమస్యలు పరిష్కరించగా, ఇతరులకు చెందిన 3లక్షల 85వేల దరఖాస్తులకు మోక్షం లభించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, వైస్ చైర్మన్ గుంటుకు మల్లేశం, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్‌నర్సింహారెడ్డి, సాక్షర భారత్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, తహశీల్దార్‌లు సంతోష్‌లాల్, శ్రీనివాస్‌రెడ్డి, రాములు, శకుంతల, నేతలు నర్సింహాచారి, విజయభాస్కర్‌రెడ్డి, జాఫరుల్లా, రామరాజు, సుల్తాన్, లక్ష్మారెడ్డి, మధుసూదన్, గుంటుకు రాజు, గంట శంకరయ్య, జహీర్ పాల్గొన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి మెదక్, జూన్ 27: హైదరాబాద్‌తో కూడిన ప్రత్యేక తెలంగాణ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పట్లోళ్ల శశిధర్‌రెడ్డి తెలిపారు. గురువారం మెదక్ రాజీవ్‌భవన్‌లో తెలంగాణ అమరవీరులకు జోహారులు తెలుపుతూ తెలంగాణ సాధన కోసం హైదరాబాద్ నిజాం కళాశాలలో ఈ నెల 30న మధ్యాహ్నం రెండు గంటలకు తలపెట్టిన చలో నిజాం కళాశాల గోడపత్రికను ఆయన ప్రారంభించారు. యూపిఎ భాగస్వాములను ఒప్పించి ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని కోరారు. ప్యాకేజీలతో సంబంధం లేకుండా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఇవ్వాలని శశిధర్‌రెడ్డి కోరారు. డిసెంబర్ 9న ప్రకటించిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దన్న పాత్ర ప్రత్యేక తెలంగాణ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అమరుల బలిదానం వృదా కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక తెలంగాణను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎయంసి చైర్మన్ మధుసూదన్‌రావు, మెదక్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడూరి ఆంజనేయులుగౌడ్, సిడిసి డైరెక్టర్ మామిళ్ల ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి సిద్దయ్య, అజ్గర్ ఆలీ, రిలయన్స్ సలీమ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోండ శ్రీనివాస్‌గుప్త, డిసిసి ప్రధాన కార్యదర్శి తోట ఆశోక్, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, ఎస్.అర్జున్ పాల్గొన్నారు. యూరియా, ఎరువుల విషయంలో ఆందోళన వద్దు మెదక్ ఎడి మనోహార మెదక్, జూన్ 27: రైతులకు ఎరువుల ఇబ్బంది లేకుండా ఎప్పకప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు మెదక్ ఎడి మనోహార గురువారం ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు. మెదక్ సబ్ డివిజన్ పరిధిలో మెదక్, కొల్చారం, పాపన్నపేట, మండలాలు, విస్తరించి ఉన్నాయని ఆమె తెలిపారు. మెదక్ సబ్ డివిజన్‌లో 9950 హెక్టార్ల సాధారణ విస్తీర్ణ భూమి ఉందన్నారు. ఇందులో వరి 6500 హెక్టార్లు, మొక్కజొన్న 1550 హెక్టార్లు, చెరుకు 1650 హెక్టార్లు, పప్పు ధాన్యాలు 200 హెక్టార్లు, కురగాయలు 60 హెక్టార్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ మొత్తానికి 2 వేల 850 మెట్రిక్ టన్నులు యూరియా అక్టోబర్ వరకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 944 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ నెల 28న వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియ చేరుతుందని ఆమె తెలిపారు. పాపన్నపేట మండలంలో సాధరాణ విస్తీర్ణ భూమి 12413 హెక్టార్లు ఉన్నట్లు ఆమె తెలిపారు. అందులో 9550 వరి పంట, మొక్కజొన్న 1600 హెక్టార్లు, చెరుకు 800 హెక్టార్లు, పప్పు ధాన్యాలు 414 హెక్టార్లు, కురగాయలు 60 హెక్టార్లు ఉందని ఆమె తెలిపారు. కాగా పాపన్నపేట మండలానికి 3790 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని ఆమె తెలిపారు. కొల్చారం మండలంలో 6680 హెక్టార్ల సాధరణ విస్తీర్ణ భూమి ఉందని, అందులో వరి 501 హెక్టార్లు మొక్కజొన్న 1100 హెక్టార్లు, పప్పు దినుసులు 480 హెక్టార్లు, చెరువు 712 హెక్టార్లు, ఇతర పంటలు 50 హెక్టార్లు కాగా కొల్చారం మండలానికి 2 వేల 410 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ఆమె తెలిపారు. ఈ నెల 28 నాటికి మెదక్ సబ్ డివిజన్‌కు డీలర్లకు, సొసైటీలకు యూరియా 50 మెట్రిక్ టన్నులు వస్తుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి దశరథం ఉన్నారు. కలెక్టరేట్ ముందు ఏవన్ పరిశ్రమ కార్మికుల ధర్నా సంగారెడ్డిరూరల్,జూన్ 27: గత ఆరు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏవన్ ఆర్గానిక్స్ లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు గురువారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఇండస్ట్రీయల్ కమిటీ జిల్లా అధ్యక్షుడు బి.మల్లేశం మాట్లాడుతూ గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏవన్ పరిశ్రమ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ లాభాల్లో ఉన్న కార్మికుల వేతనాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. వేతనాలు లేక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పరిశ్రమ హెడ్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి.రాజు, శంకర్, మహేష్, రఘునాథ్‌రెడ్డి, నహీం, శ్రీనివాస్, గోవర్ధన్‌రెడ్డి, రాజు, ప్రదీప్, ప్రభాకర్, కార్మికులు గోరేమియా,శంకర్రావు, విజయ్, వెంకట్‌రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ధర్నా సంగారెడ్డిరూరల్,జూన్ 27: ట్రాన్స్‌కోలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు, యుఇఇయుల ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి ట్రాన్స్‌కో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎస్‌ఈ రాములుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె.రాజయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రాన్స్‌కో కాంట్రాక్టు కార్మికుల పట్ట ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఆరు నెలలైనా ఎరియర్స్ చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నెల నెల వేతనాలు చెల్లిండం లేదని, 8 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నారం, రంగంపేట, వెంకట్రారావ్‌పేటలో తొలగించిన కార్మికుల వెంటనే తీసుకోవాలని, కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుఇఇయు నాయకులు మధు, దేవరాజ్, రవి, రాములు, కేలాసం, నర్సింలు, స్వామి, భానుప్రతాప్, శేఖర్, ప్రవీన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. కూలిన ట్యాంకు పైకప్పు * విద్యార్థులకు తప్పిన ముప్పు గజ్వేల్, జూన్ 27: వర్గల్ మండల పరిధిలోని నర్సంపల్లిలో గురువారం తెల్లవారుజామున వాటర్ ట్యాంకు పైకప్పు కూలగా, విద్యార్థులకు ముప్పు తప్పింది. పాఠశాల ఆవరణలో వాటర్ ట్యాంకు ఉండగా, అక్కడి నుండే గ్రామానికి త్రాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే పాఠశాల నిర్వాహణ సమయంలో కూలి ఉంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. కాగా తాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ పంపింగ్ సిస్టమ్ ద్వారా త్రాగునీటిని అందిస్తున్నారు. పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు సంగారెడ్డి,జూన్ 27: గ్రామపంచాయతీ సర్పంచ్‌ల ఎన్నికల సంబంధించి రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు గురువారం మధ్యాహ్నం సంగారెడ్డి కలెక్టరేట్‌లో విడుదల చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి డివిజన్ పంచాయతీల వారిగా రిజర్వేషన్ల వివరాలు ఇవే....కాశీపూర్ బిసి (మహిళ), ఉత్తర్‌పల్లి జనరల్ (మహిళ), చిద్రుప్ప (బిసి), మక్తఅల్లుర్ జనరల్ (మహిళ),బ్యాతోల్ (బిసి), కులబ్‌గూర్ (ఎస్టీ), ఇరిగిపల్లి జనరల్ (మహిళ), చర్లగూడెం జనరల్ (మహిళ), చెర్యాల్ బిసి (మహిళ), మామిడిపల్లి జనరల్, కొత్లాపూర్ బిసి (మహిళ), జూల్‌కల్ బిసి, కలబ్‌గూర్ ఎస్సీ (మహిళ), ఫసల్‌వాది ఎస్సీ (మహిళ), పోతిరెడ్డిపల్లి బిసి, ఆరుట్ల జనరల్ (మహిళ), ఇస్మాయిల్‌ఖాన్‌పేట్ ఎస్సీ, ఎర్ధనూర్ ఎస్సీ (మహిళ), తాడ్లపల్లి జనరల్, తోపుగోండ బిసి, ఇంద్రకరణ్ (జనరల్), నాగపూర్ జనరల్, కంది బిసి (మహిళ), కలివేముల బిసి (మహిళ), కౌలంపేట ఎస్సీ, ఎద్దుమైలారం ఎస్సీ, చింతల్‌పల్లి ఎస్టీ (మహిళ), పటాన్‌చెరు మండలం : ఐనోల్ జనరల్, చిన్న కంజిరాల ఎస్సీ, నందిగామ ఎస్సీ, పోచారం బిసి, సుల్తాన్‌పూర్ బిసి (మహిళ), కర్దనపూర్ జనరల్, పాటి జనరల్, ఇంద్రేశం జనరల్, లక్డారం బిసి, కిష్టరెడ్డిపేట్ జనరల్ (మహిళ), పెద్ద కంజర్ల బిసి (మహిళ), చిట్కూల్ ఎస్సీ, ఘనపూర్ జనరల్, రద్రారం బిసి (మహిళ), బానూర్ ఎస్సీ, ముత్తంగి ఎస్సీ (మహిళ), వడక్‌పల్లి ఎస్సీ (మహిళ), అమీన్‌పూర్ బిసి, క్యాసారం జనరల్ (మహిళ), ఇస్నాపూర్ జనరల్ (మహిళ), పాశమైలారం బిసి, ఐలాపూర్ ఎస్టీ, రాంచంద్రపురం మండలం: ఉస్మాన్‌నగర్ బిసి (మహిళ), తెల్లాపూర్ జనరల్, ఇదులనాగులపల్లి ఎస్సీ (మహిళ), కొల్లుర్ ఎస్టీ, బండల్‌గూడ బిసి, వెల్‌మల ఎస్సీ, సదాశివపేట మండలం: నందికంది జనరల్, వెల్‌టూర్ జనరల్, రెజింతల్ జనరల్ (మహిళ), బబిల్‌గన్ జనరల్, ఆత్మకూర్ ఎస్సీ, పొట్టిపల్లి జనరల్ (మహిళ), కొల్కుర్ బిసి (మహిళ), వెంకటాపూర్ ఎస్సీ (మహిళ), సిద్దాపూర్ బిసి (మహిళ), మద్దికుంట బిసి, నిజాంపూర్ ఎస్సీ (మహిళ), మబారక్‌పూర్ బిసి(మహిళ), ఎటిగడ్డసంగం జనరల్, ఆరూర్ బిసి (మహిళ), కంబల్‌పల్లి జనరల్ (మహిళ), మిల్‌గిర్‌పేట్ ఎస్సీ, కోనపూర్ బిసి (మహిళ), చందాపూర్ బిసి, తంగడ్‌పల్లి బిసి, సురారం జనరల్ (మహిళ),నాగులపల్లి జనరల్, ఎల్లారం బిసి (మహిళ), మచ్చిరెడ్డిపల్లి బిసి, పెద్దాపూర్ జనరల్, ఎంకేపల్లి జనరల్, అంకన్‌పల్లి జనరల్ (మహిళ), కొండాపూర్ మండలం: అలీయబాద్ జనరల్, గరకుర్తి ఎస్సీ(మహిళ), తెర్‌పోల్ ఎస్సీ (మహిళ), గుంటపల్లి బిసి, అనంతసాగర్ ఎస్టీ (మహిళ), గొల్లపల్లి బిసి (మహిళ), తోగర్‌పల్లి బిసి (మహిళ),చీ కోనపూర్ జనరల్, మల్కాపూర్ జనరల్, మారేపల్లి జనరల్ (మహిళ), మల్లేపల్లి బిసి, సిద్దాపూర్ బిసి, గిర్మాపూర్ ఎస్సీ, గంగారం బిసి (మహిళ), మాచేపల్లి జనరల్ (మహిళ), మన్‌సాన్‌పల్లి జనరల్ (మహిళ), కొండాపూర్ బిసి, మునిదేవునిపల్లి జనరల్ (మహిళ), గోపులారం కుర్దు బిసి, మహ్మదపూర్ జనరల్, దుబ్బకుంట జనరల్, హరిదాస్‌పూర్ ఎస్సీ, మునిపల్లి మండలం: బుదేరా జనరల్, మునిపల్లి బిసి (మహిళ), కంకోల్ ఎస్సీ, మల్లికార్జునపల్లి ఎస్సీ (మహిళ), కమ్మంపల్లి బిసి (మహిళ), పెద్దచెల్మడ కలాన్ జనరల్ (మహిళ), తాటిపల్లి జనరల్, పెద్దగోపులారం బిసి, బుస్సరెడ్డిపల్లి బిసి (మహిళ), పెద్దలోనికలాన్ జనరల్ (మహిళ), అంతారం జనరల్, లింగంపల్లి బిసి (మహిళ), మేలాసంగం జనరల్ (మహిళ), చీలపల్లి బిసి (మహిళ), గార్లపల్లి బిసి, మక్తాక్యాసారం బిసి, చిన్నచెల్మెడ కుర్దు ఎస్సీ, చిన్నలోని కుర్దు బిసి, పోల్కంపల్లి బిసి, మగ్దుంపల్లి జనరల్ (మహిళ), బోడపల్లి జనరల్ ,బోడిశేట్‌పల్లి జనరల్ (మహిళ),తక్కడ్‌పల్లి జనరల్, మన్‌సాన్‌పల్లి బిసి, కల్లాపల్లిబెలూర్ జనరల్, కోహిర్ మండలం : మాచిరెడ్డిపల్లి బిసి (మహిళ), పిచ్చర్‌గడి జనరల్ (మహిళ), రాజనెల్లి ఎస్సీ (మహిళ), కోహిర్ బిసి (మహిళ), గుర్జువాడ జనరల్ (మహిళ), చింతల్‌గాట్ జనరల్ (మహిళ), పర్సపల్లి జనరల్, ఖాణపూర్ ఎస్సీ (మహిళ), బిలాల్‌పూర్ బిసి, గోడ్డిగార్‌పల్లి జనరల్, పైడిగుమాల్ ఎస్సీ (మహిళ), మనియార్‌పల్లి బిసి, సజ్జపూర్ జనరల్, వెంకటాపూర్ జనరల్, పోతిరెడ్డిపల్లి ఎస్సీ (మహిళ), కావేలి ఎస్సీ, దిగ్వాల్ ఎస్సీ, మద్రి ఎస్సీ, బదాంపేట ఎస్సీ, నాగిరెడ్డిపల్లి జనరల్, జహీరాబాద్ మండలం: రాయిపల్లి పట్టి దనశ్రీ ఎస్టీ (మహిళ), అల్‌గోల్ జనరల్, గోడ్‌గార్‌పల్లి బిసి (మహిళ), డిడ్‌గి జనరల్, గోపన్నపల్లి బిసి (మహిళ), మనాపూర్ ఎస్సీ (మహిళ), హుగ్గెళ్లి ఎస్సీ, కొత్తూర్ (బి) జనరల్, హోతి(కె) ఎస్సీ (మహిళ), బుచ్‌నెల్లి జనరల్ (మహిళ) దనశ్రీ జనరల్ (మహిళ),కాశీంపూర్ బిసి, చీరాగ్‌పల్లి బిసి, రాయిపల్లి తాండ ఎస్సీ (మహిళ), రంజోల్ జనరల్ (మహిళ), అల్లిపూర్ ఎస్సీ (మహిళ), సత్‌వార్ జనరల్ (మహిళ), అనిగుంట ఎస్సీ (మహిళ), హైదరాబాద్ బిసి (మహిళ), గుడ్‌పల్లి ఏస్టీ, హోతి(బి) జనరల్, గోవింద్‌పూర్ బిసి, మగ్దంపల్లి ఎస్టీ, మల్కాపూర్ (జాడి) ఎస్సీ (మహిళ), గౌసబాద్ బిసి, ఇప్పేపల్లి జనరల్, బుర్దిపహడ్ జనరల్, మడ్గి ఎస్సీ, సాయికపూర్ ఎస్టీ, విట్టునిక తాండ, పస్తాపూర్ జనరల్, మల్‌చెల్మా ఎస్టీ, అసద్‌గున్జి బిసి, ఝరాసంగం మండలం: సిద్దాపూర్ బిసి (మహిళ), గున్టమ్‌రాపల్లి ఎస్సీ (మహిళ), చీలికేపల్లి బిసి (మహిళ), దేవరాంపల్లి జనరల్ (మహిళ), వనంపల్లి ఎస్సీ (మహిళ), బీడకనే్న జనరల్ (మహిళ), మచునూర్ జనరల్ (మహిళ), జీర్లపల్లి ఎస్సీ, బర్ధీపూర్ జనరల్ (మహిళ), జనేగోన్ జనరల్, కుప్పానగర్ జనరల్, కక్కర్‌వాడ జనరల్, ఏలోగి ఎస్టీ, ఝరాసంగం బిసి, తుమ్మనపల్లి జనరల్ (మహిళ), కృష్ణపూర్ బిసి (మహిళ), చీలమమిడ్డి జనరల్, జిన్నియర్‌పల్లి ఎస్సీ, పొట్‌పల్లి జనరల్ (మహిళ), కొల్లురు బిసి (మహిళ), ఇదులపల్లి జనరల్ (మహిళ), బోరిగాన్ బిసి, నర్సాపూర్ జనరల్, మెడ్‌పల్లి ఎస్సీ, చీలపల్లి బిసి, కమలపల్లి జనరల్, ఏడాకులపల్లి బిసి, బోమ్మనపల్లి జనరల్, రాయికోడ్ మండలం: శంశోద్దీన్‌పూర్ జనరల్ (మహిళ), సంగాపూర్ బిసి (మహిళ), నల్లంబల్లి జనరల్,యూసుఫ్‌పూర్ జనరల్ (మహిళ), దర్మపూర్ జనరల్ (మహిళ), నగ్‌వార్ జనరల్ (మహిళ), ఇందూర్ బిసి (మహిళ), రాయిపల్లి పికె ఎస్సీ (మహిళ), మహ్మదపూర్ జనరల్, హస్నబాద్ ఎస్సీ, ఇటికేపల్లి బిసి (మహిళ), సింగీతం జనరల్ (మహిళ), పిపడ్‌పల్లి బిసి (మహిళ), సిరూర్ జనరల్, పాంపడ్ బిసి, కోడూర్ జనరల్, హల్‌గేరా జనరల్ (మహిళ), ఔరంగనగర్ జనరల్, కర్చల్ బిసి, కుసునూర్ బిసి, మోర్థగా బిసి, జంబీగి కే బిసి, నాగన్‌పల్లి ఎస్సీ, మామిడిపల్లి జనరల్, రాయికోడ్ బిసి, న్యాల్‌కల్ మండలం: అమెరాబాద్ బిసి (మహిళ), న్యామత్‌బాద్ ఎస్సీ (మహిళ), మామిడిగి జనరల్, ఇబ్రహీంపూర్ జనరల్ (మహిళ), హద్‌నూర్ ఎస్సీ (మహిళ), కల్‌బేంలా ఎస్సీ (మహిళ), గాంగ్‌వర్ ఎస్సీ, చెంగన్‌పల్లి జనరల్, న్యాల్‌కల్ బిసి (మహిళ), మెటల్‌కుంట జనరల్ (మహిళ), గున్జోట్టి జనరల్, బసంత్‌పూర్ జనరల్, టేకూర్ జనరల్ (మహిళ), మంగి జనరల్ (మహిళ), చేకుర్తి జనరల్ (మహిళ), చల్కి ఎస్సీ, వాడి బిసి (మహిళ), రఘవపూర్ బిసి (మహిళ), రాజోళ ఎస్సీ, రేజింతల్ జనరల్ (మహిళ), హుస్సేన్‌నగర్ జనరల్ (మహిళ), హుసేళ్లి జనరల్, కక్జిన్‌వాడ జనరల్, అత్‌నూర్ జనరల్, కలీల్‌పూర్ బిసి, రత్నాపూర్ బిసి, మాల్గి జనరల్, మరియంపూర్ బిసి, మిర్జాపూర్ ఎన్ జనరల్, మిర్జాపూర్ బి బిసి, దపూర్ జనరల్, నారాయణ్‌ఖేడ్ మండలం: అత్‌వార్ జనరల్, హన్మంతరావుపేట్ ఎస్సీ,జూల్‌కల్ ఎస్టీ(మహిళ), పంచాంగం ఎస్సీ (మహిళ), నిజాంపేట్ జనరల్, లింగాపూర్ బిసి (మహిళ), పైడిపల్లి జనరల్(మహిళ), ర్యాకల్ ఎస్సీ, నర్సాపూర్ జనరల్ (మహిళ), అబేండ ఎస్సీ (మహిళ), సంజీవన్‌రావుపేట బిసి (మహిళ), హంగిర్గా బి ఎస్టీ, అనంతసాగర్ జనరల్ (మహిళ), మద్‌వార్ ఎస్టీ, గంగాపూర్ బిసి, నారాయణఖేడ్ బిసి, రాయల్‌మడుగు బిసి (మహిళ), చప్టా-కే బిసి, సత్యాగ్మ బిసి, కోండాపూర్ బిసి, తురుకపల్లి జనరల్, రుద్రారం జనరల్ (మహిళ), నాంలిమెట్ ఎస్టీ, హంగిర్గాకె జనరల్, వెంకటాపూర్ జనరల్ (మహిళ), జనన్నాథ్‌పూర్ బిసి (మహిళ), కమ్జిపూర్ ఎస్టీ (మహిళ), కంగ్టిమండలం: రాసోల్ ఎస్సీ(మహిళ), సుకల్‌తీర్థ బిసి (మహిళ), జంబీగి-బి జనరల్, తడ్‌కల్ బిసి (మహిళ), నాగుర్ కె బిసి, జంబీగి-కే జనరల్ (మహిళ), గారేడ్‌గాన్ జనరల్, తురుకవాడగాన్ ఎస్సీ(మహిళ), చప్టా కె జనరల్ (మహిళ), నాగుర్ బి ఎస్సీ, బోర్గి జనరల్ (మహిళ), ఎంకేమోరి జనరల్ (మహిళ), పొట్‌పల్లి జనరల్, చీమలపాడ్ ఎస్సీ, గాజులపాడ్ బిసి (మహిళ), దమార్‌గడ్డ బిసి (మహిళ), వంగ్‌డాల్ జనరల్, దెగుల్‌వాడి ఎస్టీ, చౌకన్‌పల్లి బిసి, వాసేర్ బిసి, సిద్దాన్‌గిర్గా జనరల్, కంగ్టి ఎస్టీ, సంగం ఎస్టీ (మహిళ), కల్హేర్ మండలం: రాపర్తి ఎస్టీ (మహిళ), మారిడి ఎస్టీ, కల్హేర్ ఎస్టీ, కిష్ణపూర్ బిసి (మహిళ), మహదేవ్‌పల్లి జనరల్ (మహిళ), మసాన్‌పల్లి బిసి, బాచేపల్లి బిసి (మహిళ), పోచాపూర్ బిసి, నగ్దార్ జనరల్ (మహిళ), కడ్‌పాల్ జనరల్ (మహిళ), బీబిపేట ఎస్సీ (మహిళ), సింగాపూర్ జనరల్, రాంరెడ్డిపేట్ జనరల్, అంతర్‌గావ్ ఎస్సీ, మంగపల్లి జనరల్, బోక్కాస్‌గావ్ ఎస్సీ, ముభారక్‌పూర్ బిసి (మహిళ), సుల్తానాబాద్ బిసి (మహిళ). మనూర్ మండలం: పుల్‌కుర్తి బిసి (మహిళ), ఎస్గి ఎస్టీ (మహిళ), అతిమల్ జనరల్ (మహిళ), ఉసిరికేపల్లి బిసి (మహిళ), మోర్గి ఎస్సీ (మహిళ), తోర్నాల్ జనరల్ (మహిళ), తిమ్మపూర్ బిసి (మహిళ), నాగల్‌గడ్డ ఎస్సీ(మహిళ), దన్‌వార్ జనరల్, తమ్‌నుర్ జనరల్, బాదల్‌గాన్ జనరల్ (మహిళ), గోండగాన్ జనరల్ (మహిళ), దుద్దగోండ జనరల్ (మహిళ), కర్స్‌గుట్టి బిసి, గుడూర్ బిసి, బోరంచ ఎస్సీ, కరమ్‌ముంగి జనరల్ (మహిళ), ఏనే్కపల్లి జనరల్ (మహిళ), సెల్‌గేరా బిసి, సారి దమర్‌గిడ్డ జనరల్ (మహిళ), దావుర్ జనరల్, ఏరికేపల్లి జనరల్, ఔదత్‌పూర్ జనరల్, మైకోడ్ ఎస్టీ, ఏలోగి జనరల్, మవినెల్లి బిసి, ముక్తాపూర్ ఎస్సీ, రాయిపల్లి జనరల్, బల్లాపూర్ జనరల్, మనూర్ ఎస్టీ, వల్లుర్ బిసి, రంగాపూర్ ఎస్సీ.
ఎమ్మెల్యే హరీష్‌రావు
english title: 
mla

పంచాయతీ రిజర్వేషన్ల గెజిట్‌లో జాప్యం

$
0
0
నల్లగొండ, జూన్ 27: జిల్లాలోని పంచాయతీ సర్పంచ్‌లు, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో అధికార యంత్రాంగం తీవ్ర మల్లగుల్లలు పడుతు గెజిట్ విడుదలలో జాప్యం చేస్తున్న తీరుపై రాజకీయ పక్షాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల అధికారిక గెజిట్ ప్రకటన జారీపై రేపు మాపు అంటు జిల్లా పంచాయతీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదంటు, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్ల నేపధ్యంతోనే జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారులు రిజర్వేషన్ల సమాచారంపై పారదర్శకంగా వ్యవహరించకుండా గోప్యత పాటిస్తున్నారంటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బిసి రిజర్వేషన్లను జిల్లా యూనిట్‌గా తీసుకుని ఖరారు చేయడం..ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు రాష్ట్ర యూనిట్‌గా పరిగణించడం వంటి నిబంధనల నేపధ్యంలో అధికారులు జీవో నెంబర్ 293నిబంధనల మేరకు వివాదరహితంగా రిజర్వేషన్ స్థానాలను వస్తారన్నారు. డిఆర్‌డిఎ పిడి రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రుణాలు తిరిగి చెల్లించేందుకు సిబ్బంది అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్ని మండలాలలో రుణం తీసుకున్న సంఘాల వారిని కలిసి రుణం తిరిగి చెల్లించేలా కృషి చేస్తుందన్నారు. వసూళ్లు తక్కువ ఉన్న మండలాలపై దృష్టిని కేంద్రీకరించి రుణాల చెల్లింపునకు కృషి చేస్తున్నారన్నారు. రుణాలు మంజూరైన మండలాలకు సిబ్బంది వెళ్లి సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి వాయిదాలు చెల్లించినట్లయితే వడ్డీ ఉండదని తెలుపుతున్నామని బ్యాంకర్లు ఇందుకు సహకరించాలని బ్యాంకర్లను కోరారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ బ్యాంకర్లు, ఐకెపి సిబ్బందిల సమస్యలపై వివరించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంఘాలకు అందించే రుణాల గురించ తెలియజేశారు. ఈ సమావేశంలో నాబార్డు ఎజి ఎం వీరశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ జేమ్స్, వివిధ బ్యాంకుల అధికారులు, ఐకెపి, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. సమభావన సంఘాలకు వడ్డీలేని రుణాలందించాలి జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు నల్లగొండ , జూన్ 27: సమభావన సంఘాలకు మంజూరైన వడ్డీలేని రుణాలందించడంలో బ్యాంకర్లు చొరువ చూపాలని జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు కోరారు. గురువారం టిటిడిసి సమావేశ మందిరంలో బ్యాంకర్లు, ఐకెపి, వెలుగు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకర్లు లబ్ధిదారులను ప్రొత్సహించి వారికి సకాలంలో రుణాలందించేందుకు ముందుకు రావాలన్నారు. అదేవిధంగా రుణాలు తిరిగి చెల్లించేలా వారిని చైతన్య పరిచినట్లయితే రుణాలు త్వరితగతిన వసూళ్లవుతాయని తద్వారా ప్రభుత్వం లక్ష్యం నేరవేరుతుందని బ్యాంకర్లు, అధికారులను కోరార. లబ్ధిదారునికి బ్యాంకర్లు వివిధ పథకాల కింద రుణాలందించి ప్రభుత్వ పథకాలు విజయవంతమయ్యేలా సహకరించాలని దీని ద్వారా లబ్దిదారులు తీసుకున్న రుణం తిరిగి చెల్లించేందుకు ముందుకు గుర్తించ లేకపోయారన్న గుసగుసలు, విమర్శలు ప్రభుత్వ యంత్రాంగంలోనే వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల ఖరారు చేయడంలో జనాభాతో పాటు ఒక పంచాయతీ 1995, 2001, 2006లలో ఏ వర్గానికి రిజర్వ్ చేయడమైందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సివుండగా ఈ అంశాన్ని విస్మరించినట్లుగా తెలుస్తుందని, అధికార పార్టీ ఒత్తిళ్లతో కొన్ని చోట్ల రిజర్వ్ స్థానాలు ఇష్టారాజ్యంగా ఎంపిక చేశారని విపక్షాల నుండి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భువనగిరి, నల్లగొండ డివిజన్ మండలాల్లో పంచాయతీ రిజర్వేషన్ల ఖరారులో అధికారులు పొరపాట్లు చేశారని అందుకే మళ్లీ వాటిని సరి చేసి చూసుకుంటున్న క్రమంలో రిజర్వేషన్ల గెజిట్ విడుదలలో జాప్యానికి కారణమవుతుందన్న ప్రచారం జరుగుతుంది. అనేక మంది ఎంపిడివోలకు ఈ దఫా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపై లోతైన అవగాహాన లేకపోవడం సమస్యగా మారగా ఈ విషయంలో నిపుణులైన కొంత మంది ఎంపిడివోలతో మిగతా మండలాల రిజర్వేషన్లను ఫైనల్ చేసినట్లుగా సమాచారం. కొన్ని చోట్ల ఎస్సీ, ఎస్టీల జనాభా పరిమితంగా ఉన్న రిజర్వ్ చేయాల్సిరావడం కూడా గందరగోళానికి దారితీసింది. అయితే ఇప్పటికే మండలాల్లో స్థానిక అధికారుల ద్వారా రిజర్వేషన్లపై దాదాపుగా స్పష్టత వచ్చినప్పటికి గెజిట్ విడుదల జరిగితే కదా అన్నట్లుగా పరిస్థితి ఉండటంతో రిజర్వేషన్ల ఖరారు వ్యవహారంలో ఇంకా ఉత్కంఠత కొనసాగుతుంది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ జూలై 2,3తేదిలలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఎన్నికల నిర్వాహణ తప్పదన్న భావనతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతుండగా పల్లెల్లో పంచాయతీ పోరు క్రమంగా ఊపందుకుంటుంది. మున్సిపాలిటీని ముట్టడించిన కార్మికులు సూర్యాపేట, జూన్ 27: మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ సిఐటియు అనుబంధం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్ధానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ ఉద్యోగులను లోనికి వెళ్లకుండా కొంతసేపు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చినపాక లక్ష్మినారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి కనీసవేతనాలు చెల్లించకుండా వారి శ్రమను ప్రభుత్వం దోచుకుంటుందని ధ్వజమెత్తారు. వారికి రూ.12,500లచొప్పున వేతనాలు చెల్లించాలని డిమాండ్‌చేశారు. అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగుల పిఎఫ్ కటింగ్‌లకు సంబంధించిన స్లిప్‌లను అందించాలని కోరారు. అర్హులైన కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని కాంట్రాక్టు వర్కర్లకు పబ్లిక్ హెల్త్ పర్మినెంట్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, పర్మినెంట్ ఉద్యోగులకు జిపిపి ఎకౌంట్ ప్రారంభించాలని డిమాండ్‌చేశారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, సిఐటియు డివిజన్ కార్యదర్శి వెంపటి గురూజీలు మాట్లాడుతూ పని సమయంలో ప్రమాదాలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించి కాంట్రాక్టు కార్మికులకు రూ. 50000 ఇన్సూరెన్స్ కల్పించాలని మొత్తం ప్రీమియం మున్సిపాలిటీ వారే భరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు మరణం సంభవిస్తే ఖర్చులకు రూ. 10000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కాంట్రాక్టు కార్మికులందరికి ఇళ్లు, ఇండ్ల స్ధలాల నిర్మాణం చేపట్టాలని కోరారు 2011 మార్చి, ఏప్రిల్‌లో పెరిగిన వేతనాలు వెంటనే ఇప్పించాలని వారంతరపు సెలవులు, పండుగ సెలవులు, ఇఎస్‌ఐ స్మార్ట్‌కార్డులు వ్యక్తిగత ఎకౌంట్‌లు అమలు కల్పించాలని కోరారు. పర్మినెంట్ కార్మికులకు ఇస్తున్నట్లుగానే యూనిఫామ్, సబ్బులు, నూనె, చెప్పులు, మాస్కులు నైట్‌డ్యూటీలో పనిచేసేవారికి రేడియం జాకెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిచో రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలను ఉదృతంచేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సమ్మి, నాయకులు పెంటయ్య, వీరాస్వామి, దండు లక్ష్మయ్య, కృష్ణ, యాకమ్మ, భిక్షం, రమణ, సైదులు, మారయ్య, సైదమ్మ, బండారు నాగమ్మ, దేవదానం, బక్కమ్మ, సతీష్, తలారి వెంకన్న, కాసర్ల లింగయ్య, నాగరాజు, వేణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ వివరాలు విధిగా సమర్పించాలి భువనగిరి సబ్‌కలెక్టర్ దివ్య చౌటుప్పల్, జూన్ 27: ఆధార్ వివరాలను విధిగా సమర్పించాలని భువనగిరి సబ్‌కలెక్టర్ దివ్య కోరారు. చౌటుప్పల్ మండల తహశీల్దార్ కార్యాలయంలో గురువారం ఆహార సలహా సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ జూలై ఫస్ట్ నుంచి నగదు బదిలీ పథకం ప్రారంభమవుతున్న దృష్ట్యా లబ్ధిదారులు విధిగా ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, సెల్ నెంబర్లను సమర్పించాలని కోరారు. ఆధార్, బ్యాంకు ఖాతాలను రేషన్ డీలర్లకు ఇవ్వాలన్నారు. అదేవిధంగా గ్యాస్ ఏజెన్లీ వద్దకూడా సమర్పించాలని సూచించారు. అమ్మహస్తం పథకం కింద సరఫరా చేస్తున్న తొమ్మిది రకాల సరుకులను తీసుకోవాలన్న నిబంధనలు లేవన్నారు. ఇష్టమైన సరుకులను మాత్రమే తీసుకోవచ్చన్నారు. ముందుగా లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించి డిడిలు చెల్లించాలని సూచించారు. అమ్మహస్తం సరుకుల సరఫరాలో కొంత జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనన్నారు. అమ్మహస్తం పథకం ద్వారా అందిస్తున్న సరుకుల ధరలు, స్టాక్ వివరాలను అందుబాటులో పెట్టాలన్నారు. గ్రామ ఆహార సలహా సంఘం సమావేశం నిర్వహించాలని సూచించారు. జాతీయ రహదారి వెంట ఉన్న దాబాలలో ఆహార పదార్ధాలు నాణ్యంగా లేవని ఫిర్యాదులు చేయడంతో సంబంధిత అధికారులతో తనిఖీలు జరిపిస్తానని హామీ ఇచ్చారు. గ్యాస్ డీలర్లు గ్యాస్ రీఫిల్లింగ్ కోసం ఫోన్ చేస్తే సరైన సమాధానం రాకుంటే తమకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల తహశీల్దార్ కొప్పుల వెంకట్‌రెడ్డి, ఎఎస్‌ఓ అనురాధ, సివిల్ సఫ్లై డిటి ఎల్లేష్, ఆర్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, పాశం సంజయ్‌బాబు, రిక్కల సుధాకర్‌రెడ్డి, జొన్నగంటి లింగస్వామి, భీమిడి ముత్యంరెడ్డి, ముస్కు నరసింహా, ఆకుల ధర్మయ్య, తాళ్ల యాదగిరి, సామిడి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకే రిజర్వేషన్‌లు గ్రామపంచాయతీ రిజర్వేషన్‌లను ప్రభుత్వ నిబంధనల మేరకే కేటాయించామని భువనగిరి సబ్‌కలెక్టర్ దివ్య తెలిపారు. గురువారం ఆమె మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామపంచాయతీ రిజర్వేషన్‌లను అన్ని కోణాల నుంచి పరిశీలించిన తర్వాతే జిల్లా కలెక్టర్‌కు అందజేశామన్నారు. ఎలాంటి అనుమానాలున్నా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసుకోని పూర్తి సమాచారం తీసుకోవచ్చని చెప్పారు. ఇంకా అనుమానాలు ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చన్నారు. రైతులకు విత్తనాలు అందించాలని ధర్నా గుండాల, జూన్ 27: రైతులకు విత్తనాలు, ఎరువులు అందించాలంటూ గురువారం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద మండల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పత్తిరైతుల సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అవసరమయ్యే కల్తీలేని విత్తనాలు, ఎరువులను అందించాలని, మండల కేంద్రాన్ని కరవు మండలంగా ప్రకటించి 10కోట్ల రూపాయలతో సాగునీరు, తాగునీరు, పశుగ్రాసం అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు వడ్డీలేని రుణాలందించి 60సంవత్సరాల పైబడిన రైతులకు 3వేల పించన్లు చెల్లించాలని, రైతులకు జాబ్‌కార్డులతో సంబంధం లేకుండా ఉపాధి పనిని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలన్నారు. అనంతరం వినతి పత్రాన్ని డిప్యూటి తహశీల్దార్ అంజయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కె.హరిశ్చంద్ర, మల్లేష్, కృష్ణమూర్తి, నర్సిరెడ్డి, రాములు, మల్లయ్య, కృష్ణయ్య, యాదయ్య, బుచ్చిరాములు, రాములు, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 నుండి బిఇడి రెగ్యులర్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాలు నల్లగొండ రూరల్, జూన్ 27: మహాత్మాగాంధీ యూనివర్సిటీ బి ఇడి రెగ్యూలర్ పరీక్షలను జులై 5నుండి నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కట్ట నర్సింహ్మరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలకుగాను జిల్లా వ్యాప్తంగా 13పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లగొండ పట్టణంలో నాలుగు కేంద్రాలు సూర్యాపేటలో 3, భువనగిరిలో 2, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడలో ఒక్కో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2గంటల నుండి 5గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 5,200మంది అభ్యర్థులు హజరవుతున్నట్లు తెలిపారు. జులై 5న పౌండేషన్ ఆఫ్ ఎడ్యూకేషన్, 8న తరగతి నిర్వాహణ, 10న స్కూల్ మేనేజ్‌మెంట్, సిస్టమ్ ఆఫ్ ఎడ్యూకేషన్, 12న ఎడ్యూకేషన్ ఎవల్యూషన్ 15న మెత్తడ్స్ ఆఫ్ టీచింగ్ 1, 17న ఫిజికల్ సైన్స్ 19న ఇంగ్లీష్, 22న లాంగ్వేజ్‌పరీక్షలు నిర్వహించనున్నారు.
జిల్లాలోని పంచాయతీ సర్పంచ్‌లు, వార్డుల రిజర్వేషన్ల ఖరారులో అధికార యంత్రాంగం
english title: 
g

మేధో సంపత్తి మాతృదేశాభివృద్ధికి పాటుపడాలి

$
0
0
నెల్లూరు, జూన్ 27: మేధో సంపత్తి మాతృదేశాభివృద్ధికి బాటలు వేయాలని బిజెపి జాతీయ నాయకులు ముప్పవరపువెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. జిల్లాకు చెందిన గండ్రా సతీష్‌రెడ్డి భారత రక్షణ రంగ సంస్థ సంచాలకునిగా నియమితులు కావడం పట్ల వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా అభినందించారు. గురువారం నెల్లూరు పురమందిరంలో నిర్వహించిన గండ్రా సతీష్‌రెడ్డి సత్కారసభకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిధుల్లో ఒకరిగా హాజరై ప్రసంగించారు. విదేశాల్లో వివిధ రంగాల్లో పేరొందిన నిపుణుల్లో పదింట ఐదుగురు భారతీయులుగా ఉండటం తనను కలచివేస్తోందన్నారు. అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్‌వాసులు కావడాన్ని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాకాకుండా గండ్రా సతీష్ తన అసాధారణ ప్రజ్ఞాపాఠశాల్ని స్వదేశానికి అంకితం చేయడం అందరూ ప్రశంసించాల్సిన అంశమన్నారు. అనాది నుంచి విశ్వగురువుగా భారత్ ప్రపంచ దేశాల్లో గుర్తింపుపొందిందన్నారు. మనదేశంలో ఉన్న నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే పేరొందాయన్నారు. ఇప్పుడు రక్షణ రంగంలో పేరొందిన అగ్ని, ఫృద్వి వంటి యుద్ధక్షిపణులు పురాణ ఇతిహాసాల్లో చెప్పుకునే వివిధ అస్త్రాలతో సరిపోలుస్తూ వెంకయ్య ఉపన్యసించారు. అగ్ని, వరుణ, పాశుపత, బ్రహ్మాస్త్రాలు వినియోగించినట్లుగా భారతీయ చరిత్ర చెపుతుందన్నారు. ఎందరో అపరిమిత నిష్ణాతులు భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి ఉండటం విశేషమన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనదేశం అన్నింటా వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు. రక్షణ రంగానికి, పరిశోధనలకు కేటాయిస్తున్న నిధులు తగ్గుముఖం పడుతున్నాయని వాపోయారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయించినది కేవలం 1.79శాతం మాత్రమేనన్నారు. ఇంత తక్కువశాతం ముందెన్నడూ లేదన్నారు. భారత్‌కు పొరుగునే ప్రమాదకారిగా ఉన్న చైనా బడ్జెట్‌లో ఇరవైశాతం నిధులు కేటాయిస్తోందని వివరించారు. పరిశోధనా రంగానికి 4.6శాతం (8లక్షల కోట్లు) మాత్రమే మన బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటున్నాయన్నారు. అదే అమెరికా 15శాతం కేటాయిస్తుండగా చిన్నదేశమైన సౌదీ అరేబియా సైతం 8శాతం కేటాయింపులు ఉండటం గుర్తెరగాలన్నారు. డాలర్ విలువ 65 రూపాయలుగా మారిందంటే భారత్ తిరోగమన దిశగా పయనిస్తోందనే సంగతి అర్ధమవుతుందన్నారు. భారత్ చుట్టూ ఉన్న చిరు దేశాలు కూడా బెదిరింపులకు పాల్పడటం శోచనీయమన్నారు. పాకిస్తాన్ ప్రచ్ఛన్న యుద్ధాలతో నలభైవేల మంది భారతీయుల్ని పొట్టనపెట్టుకుందన్నారు. లక్షా 30వేల మంది తమిళుల ఊచకోత వెనుక చిన్నపాటి దేశమైన శ్రీలంక ఉందన్నారు. ఏదేమైనా ప్రతిభను, తెలివిని అభినందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇలాంటి సన్మాన, సత్కారాలు ఎందరికో ఉత్ప్రేరకంగా ఉంటాయని కార్యక్రమ నిర్వాహకులైన బెజవాడ గోపాలరెడ్డి అవార్డు కమిటీ, విఆర్ కళాశాల పూర్వవిద్యార్థులనుద్దేశించి కొనియాడారు. గండ్రా సింహపురి ఆణిముత్యం: కేంద్ర మంత్రి పనబాక భారత రక్షణ రంగ సంస్థ(డిఆర్‌డిఓ) సంచాలకులుగా నియమితులైన గండ్రా సతీష్‌రెడ్డి సింహపురి ఆణిముత్యం అంటూ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అభివర్ణించారు. డిఆర్‌డిఓకు చెందిన 54 మంది సంచాలకుల్లో నెల్లూరీయుడైన గండ్రాకు అవకాశం కలగడం ఎంతో సంతోషకరమైన పరిణామమన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సినిమాపరంగా అన్నింటా అభివృద్ధి చెందిన నెల్లూరువాసికి రక్షణరంగంలోనూ కీలక స్థానానికి ఎదగడం స్థానికులకు గర్వకారణమన్నారు. మాజీ రాష్టప్రతి అబ్ధుల్ కలామ్ అజాద్‌కు ప్రియశిష్యుడు కావడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సదరు సతీష్ కోరుకుంటే కోట్లాది రూపాయలు అర్జించే అవకాశాలున్నా భారతదేశం కోసం పాటుపడుతుండటం ముదాహమన్నారు. ఎందరో భారత మేధావులు ఇక్కడ ఉన్నత విద్యాభ్యాసం పొంది ఇతర దేశాలకు వలస పోతుండటం ఆవేదనకు గురిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా సతీష్‌ను ప్రశంసిస్తూ పనబాక సభకు ఓ చిరుకవితను చదివి వినిపించారు. చిన్న వయస్సులోనే పెద్ద పదవికి ఎన్నిక కావడం ఎంతో అభినందనీయమన్నారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడుతూ గండ్రా భారతదేశ శాస్ర్తియ సలహాదారు కావాలని ఆకాంక్షించారు. దేశం అన్ని రంగాల్లో ముందుంటున్నా రాజకీయంగానే దశ, దిశ లేకుండా వెనుకబడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌ను తలచుకుంటే ఆందోళనాకరంగా ఉంటుందని విచారం చెందారు. గతంలో పనిచేసిన ఎందరో ప్రధానులు దేశ అభివృద్ధి ధ్యేయంగా అంకితభావంతో వ్యవహరించారన్నారు. మనదేశంలో రాకెట్ల వినియోగానికి నాందీప్రస్తావన పలికిన ఘనత టిప్పుసుల్తాన్ హయాంలోనే సాగినట్లు చారిత్రక ఆధారాలున్నాయని గుర్తు చేశారు. ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో సంభవించిన వరద ఉప్పెనలో రక్షణ రంగానికి చెందిన సైన్యం అందించిన సేవలు అపారమన్నారు. కార్యక్రమంలో ఇంకా నెల్లూరు నగర, కావలి ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, బీద మస్తాన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. దాతల సహకారం సద్వినియోగం చేసుకోండి వెంకటగిరి, జూన్ 27: దాతల సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రణాళికా బోర్డు మాజీ సభ్యులు నక్కా వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ చిట్టెటి హరికృష్ణ సూచించారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ పాఠశాలలోని 120 విద్యార్థులకు కాలనీకి చెందిన బండారు జయరామయ్య నోటుపుస్తకాలు , పలుకులు పంపిణి చేశారు. ప్రతి సంవత్సరం పాఠశాలలోని విద్యార్థులు నోటు పుస్తకాలు , పలకలు పంపిణి చేయడం అనవాయితీ. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ పంపణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నక్కా వెంకటేశ్వర్లు, హరికృష్ణ, గిరిరెడ్డి తదితరులు పాల్గొన్ని విద్యార్థులకు పుస్తకాలు పంపణీ చేశారు. విద్యార్థు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకొని పదిమంది సాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం రమణయ్య, సిబ్బంది ఈశ్వరయ్య, ఆదిలక్ష్మి, సంపూర్ణమ్మ పాల్గొన్నారు. హస్టల్, సూళ్లలో టాస్క్‌పోర్స్ తనిఖీలు వెంకటగిరి, జూన్ 27: పట్టణంలోని పలు హస్టల్స్‌ను, పాఠశాలలను టాస్క్ఫోర్స్ అధికారి ఎం ఎల్ నరసింహం గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని క్రాస్‌రోడ్డు వద్ద నున్న పలు హస్టల్స్ తనిఖీ చేపట్టారు. హస్టల్ విద్యార్థులు ఎంత మంది ఉన్నారు. హజరు ఎంత మందికి వేశారు. హస్టల్‌లో వసతులు ఎలా ఉన్నాయి, ఇంకేమైన కావాలన్ని అన్న విషయాలపై తనిఖీ చేశారు. అనంతరం ఎన్టీ ఆర్ కాలనీలో ప్రాథమిక పాఠశాలను కూడా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం మెనూ ప్రకారం ఉందా లేదా అని అడిగి తెలుకున్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తలు వచ్చాయా, యూనిపామ్ ఇచ్చారా అని హెచ్ రమయ్యను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధులకు సక్రమంగా వస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. ఆయన వెంట ఎఎస్ డబ్ల్యువో వెంకటరమణ్య, వార్డన్‌లు కృష్ణయ్య, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. మున్సిపల్ కార్యాలయం ముట్టడి వెంకటగిరి, జూన్ 27: మున్సిపాలిటిలొని కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న రిలేనిరాహార దీక్షలు గురువారానికి ఐదవరోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కార్మికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్ కార్యాలయ గేటు తాళం చేసి సిబ్బందిని విధులకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. దీంతో స్పందించిన మున్సిపల్ కమీషనర్ ప్రమీల దీక్షా శిబిరం వద్దకు చేరుకొని సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రిలేనిరాహార దీక్షలు విరమించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం పట్ట్భద్రుల ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి ఆరోపణ నాయుడుపేట, జూన్ 27: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని పట్ట్భద్రలు ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని జనరల్ పాఠశాలలో మండలంలో 2013 పదవ తరగతి ఫలితాలలో అగ్రస్థానంలో నిలిచిన వారిని సన్మానించే కార్యక్రమానికి ముఖ్యఅథిగా విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో చాలామంది అధికారులు డిప్యుటేషన్ పద్ధతిపై పనిచేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు సరైన వసతులు కల్పిచకపోయినప్పటికీ కార్పొరేట్ పాఠశాలలతో పోటీగా 85శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. ఆర్టీసీ నష్టాలను చూపి గ్రామీణ ప్రాంతాలలో బస్సులను నిలిపివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. విద్యా శాఖలో అన్ని స్థాయిలలో సుమారు 10వేల ఉద్యోగాలు భర్తీచేయవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. మండల విద్యాశాఖ అధికారుల అదనపు బాధ్యతలు అప్పగిస్తున్న ప్రభుత్వం వీరికి అదనంగా పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా పక్షోత్సవాలకు 5వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఆ నిధులను అధికారులు ఏ ఏ పనులకు వినియోగించారో చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ రాష్ట్ర నాయకులు బాబురెడ్డి, చంద్రశేఖర్, గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏబివిపి కళాశాలల బంద్ విజయవంతం నాయుడుపేట, జూన్ 27: పట్టణంలో గురువారం అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ చేపట్టిన కళాశాలల బంద్ విజయవంతం అయింది. కళాశాలలలో ఉన్న అధిక ఫీజులు, సౌకర్యాల లేమి తదితర సమస్యల సాధనకు రాష్టవ్య్రాప్తంగా ఎబివిపి చేపట్టిన బంద్‌లో భాగంగా బంద్ చేపట్టినట్లు నాయుడుపేట బాగ్ అధ్యక్షుడు చెంచురత్నం తెలిపారు. పట్టణంలో కళాశాలలను అన్నింటిని యాజమాన్యాలతో మాట్లాడి మూయించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, నవీన్, చెంగయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కనీసవేతనాలు చెల్లించాలి నాయుడుపేట, జూన్, 27: నాయుడుపేట నగర పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సిఐటియు మండల కార్యదర్శి శివకవి ముకుంద డిమాండ్ చేశారు. గురువారం సిఐటియు ఆధ్యర్యంలో నగరపంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. 25 సంవత్సరాలగా పనిచేస్తున్న తమకు కనీసవేతనాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. నగర పంచాయతీలో 104 మంది ఉద్యోగులు ఉన్నారని వారికి వారికి ఉద్యోగ భద్రత లేక అభద్రతాభావంతో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. సిఐటియు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఉద్యోగులతో ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నగర పంచాయతీ మేనేజర్ ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం అందిచారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే జగన్ ఆశయం సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్ సిపి సమన్వయ కర్త కిలివేటి స్పష్టం నాయుడుపేట, జూన్ 27: రాష్ట్ర ప్రజల సమగ్ర సంక్షేమానికి కట్టుబడి ఉన్న వ్యక్తి జగన్ అని, అదే ఆయన జీవితాశయమని సూళ్లూరుపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య స్పష్టంచేశారు. గురువారం ఆయన మండల పరిధిలోని పూడేరు గిరిజన కాలనీ, గ్రామంలో చేపట్టిన గడప గడపకు వైఎస్సార్‌సిపి కార్యక్రమానికి స్థానిక గిరిజనులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు నేటి కిరణ్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని తెలిపారు. ఆనాడు గ్రామాలలో నిరుపేద గ్రామీణ ప్రజలకు అత్యవసర సమయాలలో మైళ్ల కొద్దీ దూరంవెళ్లడానికి వీలుగా 108ని ప్రారంభించారని గుర్తుచేశారు. కాని ఈనాడు ఆ 108 సంజీవని నిధుల లేమితో కొట్టుమిట్టాడుతొందని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికలలో వై ఎస్సార్ సిపిని ఆదరించి దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓడూరు సుందరరామిరెడ్డి, గిరిధర్ రెడ్డి, డి.అంకయ్య, సరోజనమ్మ, కరుణాకర్ రెడ్డి, దయారర్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాసులు, శీనయ్య, తిరుపాల్, మస్తాన్, రమణయ్య, సనీత, చెల్లయ్య, పాల మహేశ్వర్, శేఖర్‌బాబు, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నేరుగా మందులు జాయింట్ డైరెక్టర్ ప్రసాద్‌రావు వెల్లడి నెల్లూరుసిటీ, జూన్ 27: ఇక నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నేరుగా మందులను పంపిణీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్‌రావు వెల్లడించారు. బుధవారం డిఎంఅండ్‌హెచ్‌ఓ ఛాంబర్‌లో ఎస్‌పిహెచ్‌ఓలతో సమిక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్లను విధిగా తనిఖీ చేయాలని సూచించారు. జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న 17 క్లస్టర్ విభాగాలకు చెందిన వైద్యాధికారులు వారి పరిధిలో గల సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వారి అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్య సేవలను అందించాలన్నారు. ప్రజలకు అందుబాటలో వైద్యాధికారులు ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియా కేసులు నమోదు అయితే వాటి పూర్తి సమాచారాన్ని వైద్యశాఖ ఉన్నతాధికారులకు అందచేయాలన్నారు. పిసిపిఎన్‌డిటి చట్టాన్ని పూర్తి పటిష్టంగా అమలు చేయాలన్నారు. గ్రామస్థాయిలో ఉన్న స్కానింగ్ సెంటర్లు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అదే విధంగా స్కానింగ్ సెంటర్‌లో నమోదు అయిన వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తప్పక చూపించాలన్నారు. అదే విధంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శానిటేషన్ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యకు పెద్దపీట ఎమ్మెల్యేలు ఆనం, ముంగమూరు వెల్లడి నెల్లూరుసిటీ, జూన్ 27: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని నెల్లూరురూరల్,సిటీ ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి వెల్లడించారు. విద్యాపక్షోత్సవాల్లో భాగంగా బుధవారం పిఎన్‌ఎం హైస్కూల్లో విద్యార్థులకు సైకిళ్లు , యూనిఫారాలు, నోట్‌బుక్స్ అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పాఠశాలలో అదనపు తరగతులను కొన్ని కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి నిర్మించామన్నారు. పాఠశాలలో అవసరమైన వౌలిక సదుపాయాలను రాజీవ్ విద్యామిషన్ ద్వారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్స్‌ను వేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విడుదల చేశారన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా మైనార్టీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి స్కాలర్‌షిప్‌లను మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాకీర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఆసుప్రతి తనిఖీ నెల్లూరుసిటీ, జూన్ 27: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాద్‌రావు తెలిపారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న విభాగాలను పరిశీలించారు. హెల్త్ డైరెక్టర్ పూనం మాలకొండయ్య సూచన మేరకు సిఎఫ్‌డబ్యు వివరాలను సేకరించి అందచేస్తునట్లు తెలిపారు. అనంతరం ఆర్‌ఎంఓ, సూపరింటెండెంట్ అధికారులను కలిసి సిబ్బంది వివరాలు, ల్యాబ్‌లు తదితర విషయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు నెల్లూరు, జూన్ 27: ఏపిజెయూ (ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్) జిల్లా శాఖ తరఫున ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వనున్నట్టు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇంటూరు కృష్ణ, నాయకులు వాసుదేవనాయుడు సంయుక్తంగా వెల్లడించారు. 2012 సంవత్సరంలో పత్రికల్లో ప్రచురితమైన వార్తలను, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన క్లిప్పింగ్స్‌ను తమకు అందజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండేసి ఎంట్రీలను పంపేందుకు అవకాశం ఉందన్నారు. తమ సంఘం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారు తమ సంఘానికి చెందినవారు కాదన్నారు. విలేఖర్ల సమావేశంలో ఇంకా ఏపిజెయూ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కన్వీనర్ నరేష్ కూడా పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటా నెల్లూరు, జూన్ 27: సేవా కార్యక్రమాల్లో తనవంతుగా ముందుంటానని విశ్రాంత ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ వి అరుణాచలం పేర్కొన్నారు. గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నెల్లూరు ఏసి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆవిర్భావంలో విశేష కృషి చేసినట్లు తెలిపారు. వివేకానందుడు జాతికి చేసిన నీతిబోధల పుస్తకాలను ఆసక్తిగల వారికి అందజేయడంలోనూ తనవంతు పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. మానవుడు సంఘజీవి అనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వైఎస్‌ఆర్‌సిలో చేరుతా: అబూబాకర్ నెల్లూరు, జూన్ 27: కాంగ్రెస్‌పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సిలో చేరుతున్నట్లు బారా షాహెద్ దర్గా కమిటీ మాజీ చైర్మన్ సయ్యద్ అబూబాకర్ (బాబా) వెల్లడించారు. గురువారం ఉదయం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న పేద ప్రజల కోసం మహానేత వైఎస్‌ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అందులో ప్రధానంగా ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పించడం అమోఘమన్నారు. నాలుగుశాతం రిజర్వేషన్ కారణంగా తమ మతానికి చెందిన ఎందరో పేద కుటుంబాల సంతతి ఉన్నత విద్యాభ్యాసాలు పొందుతున్నారన్నారు. అంతేగాక మంచి ఉద్యోగాలు సైతం పొందుతున్నారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అపర సంజీవనిలా పేదలకు అక్కరకు వస్తుందన్నారు. ఇంతటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత తనయుడు యువనేత జగన్‌ను అక్రమంగా జైలువాసంలో బంధించిన నేటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూనే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వైఎస్ బతికి ఉండగా ఎన్నో ప్రయోజనాలు పొందిన ఆనం సోదరులు నేడు ఆయన కుటుంబాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అందువలనే తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు వెల్లడించారు. పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సిలో చేరుతున్నట్లు వివరించారు. విలేఖర్ల సమావేశంలో వైఎస్‌ఆర్‌సి నాయకులు మునీర్‌బాషా, ప్రశాంత్, ఎండి ముక్తియార్, ఇంతియాజ్, మున్వర్‌బాషా, షబ్బీర్, జిలానీ, జాఫర్ మొహిద్దీన్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌సిలో చేరిన ముదిరాజ్ నేత నెల్లూరు, జూన్ 27: ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. గురువారం నగరంలోని బాలాజీనగర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సి జిల్లా ముఖ్యనేతల సమక్షంలో వైఎస్‌ఆర్‌సిలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కాకాణి గోవర్దనరెడ్డి, నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కాకాణి గోవర్ధనరెడ్డి, నాయకులు సుభాన్, ముప్పసాని శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పుస్తక వితరణ నెల్లూరు, జూన్ 27: పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ప్రారంభించారు. గురువారం బుజబుజ నెల్లూరులోని శివాజీకాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని తొలుత చేపట్టారు. పేద విద్యార్థులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయపార్టీలు ఆందోళనలకే పరిమితం కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాల్ని కూడా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పటికే ఉచిత వైద్య శిబిరాలు, విపత్తుల ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయం, రక్తదాన శిబిరాలను తమ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన సంగతి గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో చురుకుగా వ్యవహరిస్తున్న ఎన్‌ఎండి చారిటబుల్ టస్ట్ అధినేత నిజాముద్దీన్‌ను కోటంరెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా నిజాముద్దీన్ మాట్లాడుతూ తాను ఎంతో మంది రాజకీయ నాయకుల్ని చూసినా కోటంరెడ్డి వంటి సేవాభావం, పోరాట పటిమ వ్యక్తిత్వం మరెవ్వరిలోనూ కానరాలేదన్నారు. నిరంతరం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ అందరినీ ముందుకు నడిపించే సమర్ధ నాయకుడని కొనియాడారు. ఎన్నికలెప్పుడొచ్చినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నెల్లూరు రూరల్ మండల కన్వీనర్ పిగిలాం నరేష్‌యాదవ్, పార్టీ నాయకులు ప్రశాంత్ కిరణ్, నజీర్‌బాషా, నగళ్ల రామకృష్ణయాదవ్, చలమయ్య, వరదయ్య, తదితరులు పాల్గొన్నారు. 30 అంబేద్కర్ ఐఎఎస్ స్టడీ సర్కిల్ సమావేశం కోవూరు, జూన్ 27: నెల్లూరు నగరంలోని కొండాయపాళెం గేటువద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఈనెల 30న అంబేద్కర్ ఐఎఎస్ స్టడీ సర్కిల్ సమావేశం జరుగుతుందని స్టడీ సర్కిల్ చైర్మన్, కన్వీనర్లు ఎ పూర్ణ ప్రకాష్, జె ప్రేమ్‌సన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, ఎంబిసి, మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. వేర్వేరు కేసులలో ముగ్గురు నిందితులు అరెస్ట్ ఇందుకూరుపేట, జూన్ 27: రెండు గ్రామాలలో జరిగిన వేర్వేరు కేసులలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ కృష్ణానందం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని గంగపట్నం మజరా పల్లెపాలెంకు చెందిన వెయ్యాల వెంకయ్య, సింగోతు రామసుబ్బయ్య అనే వ్యక్తులు ఈనెల 20న చాముండేశ్వరి బ్రహ్మోత్సవాలలో పాత మనస్పర్ధలతో అదే గ్రామానికి చెందిన ఉన్నవాడ హరిబాబుపై దాడి చేసి గాయపర్చారు. ఈకేసులో నిందితులు ఇద్దరిని, జగదేవిపేట గ్రామంలో ఈనెల 20న కుందుర్తి దేవదానం అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దాడి చేసి గాయపర్చగా, వారిలో ఇద్దరిని అప్పట్లో అరెస్టు చేయగా పరారీలో ఉన్న కుందుర్తి ఆమోష్‌ను గురువారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చినట్టు ఆయన పేర్కొన్నారు. అన్ని దానాల కన్నా విద్యాదానమే మిన్న వరికుంటపాడు, జూన్ 27: అన్ని దానాలకన్నా విద్యాదానం మిన్న అని స్థానిక మండల విద్యాధికారి వి జయంతిబాబు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని కాకొల్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో సందిరెడ్డి మాలకొండయ్య మెమోరియల్ ట్రస్ట్ పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీషుమీడియం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో పాఠశాలల్ని అభివృద్ధిపరచి వాటిని మూతపడకుండా చూడాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఉచిత పుస్తకాలను అందజేస్తూ మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సదావకాశంగా ఉందన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో మొట్టమొదటిసారిగా ఎల్‌కెజి నుంచి ఐదవ తరగతి వరకు ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టడం పట్ల గ్రామస్తులకు అభినందనలు చెపుతూ డిఇఓతో సంప్రదించి అనుమతి వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. మండల అభివృద్ధి అధికారి కె శివారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతి రోజూ క్రమం తప్పక పాఠశాలకు పంపించాలని సూచించారు. ప్రధానంగా బాలికలను పనులకు పంపకుండా పాఠశాలల్లో చేర్పించాలన్నారు. చదువులో బాలికలు బాలుర కన్నా మెరుగ్గా రాణిస్తున్నట్లు కితాబిచ్చారు. ఇంట్లో మహిళ చదివితే కుటుంబం అంతా విద్యాభ్యాసం పొందినట్లేనన్నారు. స్థానిక ఎస్సై శ్రీనివాసరావుమాట్లాడుతూ క్రమశిక్షణతో చదివిన ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. బాగా చదివిన వారు సమాజంలో ప్రత్యేకంగా గుర్తింపులభించడంతో సహా గౌరవించడం జరుగుతుందన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ సొంత ఖర్చులతో ఇంగ్లీషుమీడియం బోధించే ముగ్గురు విద్యార్థులను పాఠశాలలో నియమించారు. సందిరెడ్డి మాలకొండయ్య చారిటబుల్ ట్రస్ట్ దాతృత్వంతో పాఠశాల విద్యార్థులందరికీ సుమారు 30వేల రూపాయల విలువ చేసే పలకలు, నోట్ పుస్తకాలు, జామెట్రీ బాక్స్‌లు, పెన్నులు, పెన్సిళ్లు, తదితరాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత, ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి కాంతారావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆక్రమణల తొలగింపుపట్ల హర్షం ఆత్మకూరు, జూన్ 27: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణ ప్రక్రియలో భాగంగా ప్రజల కోరిక మేరకు విస్తరించి అడ్డంకులను తొలగించడం పట్ల ఆర్యవైశ్య సంఘ నెల్లూరుజిల్లా రూరల్ విభాగం అధ్యక్షులు కొల్లా నాగరాజారావుఓ ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు. ఈ పరిణామం ఎంతో సంతోషదాయకమన్నారు. ఆనం కుటుంబానికి ప్రజలంతా రుణ పడి ఉంటారన్నారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా కొల్లా నాగరాజారావుతోపాటు లయన్స్‌క్లబ్ మాజీ అధ్యక్షులు పెళ్లకూరు రమణారెడ్డి, ఆర్యవైశ్య సంఘ నేతలు పొన్నూరు హజరత్తయ్య, దోర్నాదుల సురేష్‌బాబు, తదితరులు ఈ ప్రకటన చేసిన వారిలో ఉన్నారు. ఇష్టపడి చదవాలి ఆత్మకూరు, జూన్ 27: ఆత్మకూరు పట్టణంలోని లక్ష్మణరావుపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకలు, పెన్సిళ్లు అభయాంజనేయస్వామి ఆలయ నిర్వాహకుడు ఏటూరు సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి జయకుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా ఎస్సై ఆంజనేయరెడ్డి హాజరయ్యారు. కష్టమైనా ఇష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. చదువును ఆసక్తిగా కొనసాగించేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలన్నారు. నిరంతరం శ్రమించి విద్యార్థుల్ని ఉత్తమ ఫలితాలతో ఉత్తీర్ణులయ్యేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు రొట్టె వెంకటేశ్వర్లు, హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, సిహెచ్ అంకిరెడ్డి, సహోపాధ్యాయులు విజయలక్ష్మి, పెంచలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విద్యాపక్షోత్సవ ర్యాలీ ఆత్మకూరు, జూన్ 27: విద్యాపక్షోత్సవాల్ని పురస్కరించుకుని మురగళ్లలో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం మురగళ్ల ఎస్సీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీతారామశాస్ర్తీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, తదితరులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలో బిజెపి పాగా ఖాయం బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 27: కేంద్రంలో బిజెపి పాగా వేయనున్నట్టు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కాకు విజయలక్ష్మి పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో గురువారం జరిగిన బిజెపి మండల కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఆధ్వర్యంలో 2014 జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పాగా వేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన వరద బీభత్సంలో 15 వేల మంది యాత్రికులను సొంత ఖర్చుతో విమానాలను ఏర్పాటు చేసి సురక్షితంగా స్వగృహాలకు నరేంద్రమోడి చేర్చారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిడతల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు కిలో బియ్యాన్ని రూపాయికి ఇచ్చి నిత్యావసర వస్తువులు 185 రూపాయలకు ఇస్తున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో ఆహారభద్రత లేకుండా పోయిందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నం శ్రీనివాసులు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని విన్నవించారు. జులై 14న నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సదస్సుకు వెయ్యి మంది కార్యకర్తలు హాజరుకావాలని ఆమె కోరారు. ఈకార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ కన్వీనర్ రామిరెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం మండల బిజెపి అధ్యక్షులు ఎం శ్రీనివాసులు, జి నరసింహులు, బాలయ్య, ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకు ప్లేట్లు వితరణ వింజమూరు, జూన్ 27: మండలంలోని నల్లగొండ్ల గ్రామంలో సాక్షర భారత్ ఆధ్వర్యంలో వికలాంగులకు ప్లేట్లు వితరణ చేశారు. గురువారం గ్రామంలో గుర్తించబడిన 20 మంది వికలాంగులకు గ్రామ సాక్షర భారత్ కోఆర్డినేటర్లు ఎల్ లక్ష్మి, నాగజ్యోతి ప్లేట్లు వితరణ చేశారు. వికలాంగులకు తమ వంతు సహాయం చేయటానికి అన్ని వేళలలా ముందుంటామన్నారు. ఈకార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి డేవిడ్‌రాజు, గ్రామస్థులు హాజరయ్యారు. వికలాంగులకు వౌలిక వసతులు కల్పించాలి వింజమూరు, జూన్ 27: వికలాంగులకు వౌలిక వసతులు కల్పించాలని వికలాంగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల నాగేంద్ర తెలిపారు. గురువారం వికలాంగ పోరుయాత్రలో భాగంగా వింజమూరు వచ్చారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వికలాంగుల సంక్షేమ పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. వికలాంగులకు అవసరమైన వౌలిక వసతులు, పెన్షన్ పెంపుదల, చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, వికలాంగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈపోరుయాత్ర ముగిసేలోగా తమ సమస్యలను పరిష్కరించకుంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈకార్యక్రమంలో ఆయనతోపాటు వికలాంగ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరమణయ్య, ప్రధాన కార్యదర్శి చిట్టి సుకుమార్, నగర అధ్యక్షులు మందా సుకుమార్, స్థానిక ఎంఆర్‌పిఎస్ నాయకులు అంబేద్కర్ మాదిగ, ప్రేమదాసుమాదిగ, ఆర్ కొండయ్య, శామ్యూల్, ఆర్ పేతూరుమాదిగలు ఉన్నారు.
గండ్రా సత్కార సభలో బిజెపి జాతీయ నేత వెంకయ్యనాయుడు ఆకాంక్ష
english title: 
venkaiah

ఆదర్శ పాఠశాలల్లో పేద విద్యార్థులకు.. నాణ్యమైన విద్య

$
0
0
నిజాంసాగర్, జూన్ 26: నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్ధెశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయం పక్కన నూతనంగా 3కోట్ల 2లక్షల రూపాయలతో అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న మోడల్ స్కూల్ భవనాన్ని బుధవారం రాత్రి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. అలాగే అక్కడే ఉన్న సాంఘీక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహం భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం పేద విద్యార్థులను ఆదుకుంటుందని, అందుకే హస్టల్ భవనానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో భవనాలు నిర్మించి, నాణ్యమైన విద్యను అందించడం తమ సర్కార్ లక్ష్యం అని అన్నారు. ఏ ప్రభుత్వాలు చేయని సాహాసం తమ ప్రభుత్వం చేస్తుందన్నారు. మోడల్ స్కూల్‌లో ఎంతో మంది విద్యార్థులు చేరేందుకు పోటి పడ్తున్నారని అన్నారు. ఆదర్శ పాఠశాలల్లో ప్రైవేట్‌కు ధీటుగా ఆంగ్ల బోధన జరుగుతోందని అన్నారు. ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాధం మొదలైంది. ఎమ్మెల్సీ అరికేల నర్సారెడ్డి పేరు శిలాపలకంపై వేయక పోవడం పట్ల జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్‌రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరుణతార, అదనపు జెసి శ్రీరాంరెడ్డి, బోధన్ ఆర్డీఓ మోహన్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి నాగేశ్వర్‌రావు, నాయకులు వినాయ్‌కుమార్, దుర్గారెడ్డి, రాజు, మల్లిఖర్జున్, రాంకిష్టయ్య, తదితరులు ఉన్నారు. బోధన్‌కు చేరుకున్న రాజరాజేశ్వర స్వామి రథం బోధన్ జూన్ 27:వేముల వాడ పుణ్యక్షేత్రం నుండి బయలు దేరిన రాజరాజేశ్వర స్వామి రథం గురువారం బోధన్ పట్టణానికి చేరుకుంది. కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, రైల్వేగేట్ మీదుగా ఈ రథం వెళ్లడంతో స్థానిక ప్రజలు భక్తి శ్రద్దలతో అందులోని దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు సమర్పించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేములవాడ దేవస్థానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ స్వామి వారి అనుగ్రహంను అన్ని ప్రాంతాల ప్రజలకు అందించేందుకై ఈ రథయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగిందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఈ రథం పర్యటిస్తుందని వివరించారు. ఇందూరుపై ఇన్‌చార్జ్ మంత్రికి.. విముఖత ఎందుకో? నిజామాబాద్, జూన్ 27: జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన గురుతర బాధ్యత కలిగిఉన్నప్పటికీ, ఇంచార్జ్ మంత్రి ముఖేష్‌గౌడ్ జాడ కానరాకుండాపోయింది. నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా బాధ్యతలు దక్కిన నాటి నుండి దాదాపు 10మాసాల కాలంలో ఆయన ఒక్కసారి కూడా జిల్లాకు హాజరుకాలేకపోయారు. గత ఏడాది డిసెంబర్ మూడవ వారంలో డిఆర్‌సి సమావేశం నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చి, చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. వారం పది రోజుల్లోనే తిరిగి డిఆర్‌సి సమావేశం ఏర్పాటు చేస్తామంటూ ముఖేష్‌గౌడ్ ఇచ్చిన హామీ ఆరు మాసాలు గడిచిపోయినా అమలుకు నోచుకోలేకపోతోంది. చివరకు జిల్లాలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలోనూ మంత్రి ముఖేష్‌గౌడ్ ముఖం చాటేస్తున్నారు. మూడు రోజుల క్రితం భిక్కనూరులో కొత్తగా ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ కార్యాలయానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి సైతం సానుకూలత కనబర్చడంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు, కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఎనలేని హడావుడి చేశారు. చివరి నిమిషంలో మంత్రి ముఖేష్‌గౌడ్ తన జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ జిల్లా ఇంచార్జ్ మంత్రి పేరును శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాల మీద అందంగా చెక్కినప్పటికీ, అమాత్యుల వారి జాడ కనిపించకుండాపోయింది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల విషయం పక్కనబెడితే జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వేదికగా నిలుస్తూ, మినీ అసెంబ్లీగా పరిగణించే జిల్లా సమీక్షా మండలి సమావేశాల పట్ల కూడా తీవ్ర విముఖత ప్రదర్శించడాన్ని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలం నుండి డిఆర్‌సి సమావేశం నిర్వహించకుండా అటకెక్కించడం వారిలో అసంతృప్తిని రాజేస్తోంది. డిఆర్‌సి నిర్వహించని కారణంగాకీలక అంశాలు ప్రస్తావనకు నోచుకోకుండా, అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రతీ మూడు మాసాలకోసారి డిఆర్‌సి సమావేశాలు నిర్వహించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, జిల్లా ఇంచార్జ్ మంత్రుల నిస్తేజ వైఖరి వల్ల ఈ భేటీలు జరగడం లేదు. ఇదివరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు డిఆర్‌సి కోసం ఒత్తిడి తేవడంతో జిల్లా యంత్రాంగం ఇంచార్జ్ మంత్రి ముఖేష్‌గౌడ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, గతేడాది నవంబర్ 20వ తేదీన డిఆర్‌సి భేటీ జరపాలని తేదీని ఖరారు చేశారు. ఈ తరుణంలోనే సమావేశానికి ఒకరోజు ముందు ఇంచార్జ్ మంత్రి ముఖేష్‌గౌడ్ కార్యాలయం నుండి లేఖ అందింది. సాంకేతికపరమైన కారణాల వల్ల నవంబర్ 20వ తేదీ నాటి డిఆర్‌సి భేటీకి రాలేకపోతున్నందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. తిరిగి సమావేశాన్ని డిసెంబర్ మాసం మొదటి వారంలో నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు సమావేశం ఏర్పాటు చేయకపోగా, కనీసం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన ముఖేష్‌గౌడ్ ఒక్కసారి కూడా జిల్లాకు హాజరుకాలేదు. ఇంచార్జ్ మంత్రి వైఖరిని బట్టి చూస్తే సమీప భవిష్యత్తులోనూ డిఆర్‌సి సమావేశం నిర్వహించే దాఖలాలు కనిపించడం లేదు. త్వరలోనే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న క్రమంలో, కోడ్ అమల్లోకి వస్తే డిఆర్‌సి సమావేశాన్ని పూర్తిగా అటకెక్కించనున్నారు. ఇదివరకు జిల్లా ఇంచార్జ్ మంత్రులుగా కొనసాగిన గీతారెడ్డి, శ్రీ్ధర్‌బాబు, సబితా ఇంద్రారెడ్డిలు కొంత ఆలస్యమైనా అడపాదడపా జిల్లాకు చేరుకుని డిఆర్‌సి సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అందుకు భిన్నంగా ప్రస్తుత జిల్లా ఇంచార్జ్ మంత్రి ముఖేష్‌గౌడ్ బాధ్యతలు చేపట్టిన నుండి ఒక్కసారి కూడా జిల్లా వైపు కనె్నత్తి చూడకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల కోసమే కాంగ్రెస్.. తెలంగాణ నాటకం ఎమ్మెల్యే కెటిఆర్ ధ్వజం కామారెడ్డి, జూన్ 27: రానున్న సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ నాటాకాన్ని తెరపైకి తేస్తోందని సిరిసిల్లా ఎమ్మెల్యే తారాకరామారావు(కెటిఆర్) ఆరోపించారు. గురువారం ఆయన కామారెడ్డి పట్టణంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ, తల తోక లేని మాటలను కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర పెట్టుబడి దారులకు అమ్ముడు పోయారని ఆరోపించారు. ఇక త్వరలోనే కాంగ్రెస్ పార్టీ బంగాళఖాతం చూసుకోవాల్సిందేనని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పెందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్ని ఎత్తులు వేసిన ఇక కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో రావడం అనేది జరగదని జోస్యం చెప్పారు. 10జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని, ప్యాకేజీలు, రాయలతెలంగాణ డ్రామాకు తెరదించాలని అన్నారు. పాత తెలంగాణ ఉందో అదె తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకుని చరిత్ర సృష్టించడంతో పాటు తెలంగాణ సాధించుకుంటామని అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే గంపగోవర్ధన్, ఐడిసిఎమ్‌ఎస్ చైర్మెర్ ముజిబొద్దిన్, కవి దేశపతి శ్రీనివాస్, టిఆర్‌ఎస్ నాయకుడు పిప్పిరి ఆంజనేయులు, మంద వెంకటేశ్వర్‌రెడ్డి, గోపిగౌడ్, ఎంజి.వేణుగోపాల్, మినుకురి రాంరెడ్డి, మల్లేశ్‌యాదవ్, మామిండ్ల రమేశ్ ఉన్నారు. ప్రజలు, కూలీలు లేక.. వెలవెలబోయన ప్రజావేదిక బాన్సువాడ, జూన్ 27: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోదిస్తూ ఉపాధి కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకుంటున్న అక్రమాలు వెలికి తీసుసేందుకు చేపట్టిన సామాజిక తనిఖీలో భాగంగా గురువారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 6వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఇజిఎస్ సిబ్బంది, అధికారులు తప్ప ప్రజలు కరవయ్యారు. అయితే సామాజిక తనిఖీ ప్రజావేదికకు ప్రజలను, కూలీలను తరలించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన కరవైందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. కూలీలు, ప్రజల సమక్షంలో మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావేదికలో గ్రామాల్లోని జరిగిన అవినీతి, అక్రమాలు బహిర్గతం చేయాల్సి ఉండగా, కూలీలు పాల్గొనకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. బాన్సువాడ మండలంలో ఈ పథకం ప్రారంభంమైనప్పటి నుండి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల పనులు చేపడుతుండగా, సిబ్బంది అక్రమాలకు పాల్పడి లక్షలాది రూపాయలకు కాజేసిన విషయం ఈ తనిఖీలో వెల్లడైన విషయం తెలిసిందే. 2012-13ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మండలంలోని 14 గ్రామాల్లో 59లక్షల రూపాయలతో పలు పనులు చేపట్టారు. మండలంలోని 11వేల మంది జాబ్‌కార్డులు కలిగిన కూలీలకు పని కల్పించాల్సి ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 6వేల మందికే పని కల్పించారు. ఈ నెల 15నుండి 26వరకు సామాజిక తనిఖీ బృందాలు గ్రామాలను సందర్శించి, జరిగిన పనులపై విచారణ చేపట్టారు. ప్రస్తుత సంవత్సరం 59లక్షలతో చేపట్టిన పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలను గురువారం నిర్వహించిన ప్రజావేదికలో తనిఖీ బృందం సభ్యులు బహిర్గతం చేశారు. ఎపిడి కుమారస్వామి, విజిలెన్స్ ఆఫీసర్ గురువయ్యలు, ఎస్సార్పీ, డిఆర్పీల నుండి వివరాలు సేకరించారు. ఉపాధి హామీలో అవినీతి, అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు సాయిరెడ్డి, కృపాకర్, ఎఇ పిఆర్ కిషన్, ఎపిఎం శిరీష, ఎస్సార్పీ రాఘవులు, ఎపిఓ మల్లేష్, ఐకెపి సిబ్బంది, ఇజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ విజయంలో మహిళలే కీలకం జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అరుణతార నిజామాబాద్ టౌన్, జూన్ 27: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో మహిళలు ముందుండాలని ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అరుణాతార పిలుపునిచ్చారు. అరుణాతార అధ్యక్షతన గురువారం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ జిల్లా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహిళా ప్రతినిధులు తమవంతు కృషి చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. మహిళలకు స్థానిక సంస్థలలో 50శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీకే దక్కిందన్నారు. బంగారుతల్లి పథకం పుట్టిన బిడ్డలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, నిరుపేదలు ఆడబిడ్డ పుట్టితే వదిలించుకునే సాహసం చేస్తున్నారని, కానీ ఈ పథకం ద్వారా ఆ బెంగ తీరనుందన్నారు. ఇదిలా ఉండగా, మాక్లూర్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల కవిత జిల్లా నాయకులపై అసహనాన్ని వెళ్లగక్కారు. తమకు పార్టీ పదవులు ఇచ్చినా, ఎక్కడ గుర్తింపునివ్వడం లేదని, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే పదవులు అన్న తీరుగా తయారైందని వేదికలపైకి పిలువడం లేదని అభ్యంతరం వెలిబుచ్చారు. రాబోయే ఎన్నికల్లో.. వైకాపాదే అధికారం వైకాపా కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి నిజామాబాద్ టౌన్, జూన్ 27: 2014లో జరుగనున్న ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులనుద్ధేశించి ప్రసంగించారు. జూలై రెండవ తేదీన జిల్లాలో జరుగనున్న వైఎస్సార్ సిపి ప్రాంతీయ సదస్సుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరవుతున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు పార్టీ శ్రేణులు సమయత్తం కావాలని ఆయన సూచించారు. వైకాపా ఏర్పడి రెండు ఏళ్లు గడుస్తుందని అనతికాలంలోనే ప్రజాధరణ పొందిన పార్టీగా సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెసు, టిడిపిలను వణుకు పుట్టిస్తోందన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను కుట్రపూరితంగానే జైలులో పెట్టించారని ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని బాజిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయంలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వైకాపా బలమైన పార్టీగా ఆవిర్భచిందని, ప్రధాన రాజకీయ పార్టీలకు ఇది మింగుడుపడటం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా తమసత్తా చాటుకోవాలని, గ్రామీణస్థాయి నుండి పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆయన సూచించారు. అనంతరం వైకాపా జిల్లా కన్వీనర్‌గా నియమితులైన డాక్టర్ మధుశేఖర్ పూర్తిస్థాయి బాధ్యతలను స్వీకరించారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన చేత ప్రమాణాస్వీకరం చేయించారు. అంతకుముందు ఉత్తరాఖండ్ ఘటనలో మరణించిన మృతులకు సంతాపం తెలియజేసి రెండు నిమిషాలు వౌనం పాటించారు.ఈ సమావేశంలో వైఎస్సార్‌సిపి నాయకులు ఇంద్రకరణ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, కేశ్‌పల్లి గంగారెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, ప్రకాశ్‌నాయుడు, సిద్ధార్థ రెడ్డి, గంపసిద్ధాలక్ష్మి, విజయలక్ష్మి కార్యకర్తలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రకటించాలి సిపిఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేష్ డిమాండ్ ఆర్మూర్, జూన్ 27: కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని సిపిఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని యాల్ల రాములు మెమోరియల్ హాలులో గురువారం సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని, ప్యాకేజీలు, రాయల తెలంగాణ అంటూ పుకార్లు రేపుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలతో ఆడుకుంటోందని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నెలలో నాలుగైదు సార్లు ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ చెప్పిన విధంగా నడుచుకుంటున్నాడని, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిపిఐ ముందుభాగాన ఉండి పోరాడుతుందని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల్లో కూరుకుపోయిందన్నారు. దేశ సంపదను కొల్లగొట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నారని అన్నారు. ప్రధానమంత్రిపై అనేక కుంభకోణాల ఆరోపణలు వచ్చాయని, సిగ్గులేకుండా పదవిని అంటిపెట్టుకున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, నాయకులు తెడ్డు పోశెట్టి, రాములు, బండి అభిలాష్, ఆరేపల్లి సాయిలు, టఫ్ జిల్లా కో కన్వీనర్ సుధాకర్, తెలంగాణ యూనివర్సిటీ జెఎసి నేత మహిపాల్, సిపిఐ నాయకులు బి.రవీందర్, కె.రాజన్న, ఎం.రాజు, డి.గంగాధర్, గోవర్ధన్, షాహిద్, ముత్యాలు, చిరంజీవి, శ్రీనివాస్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి చెందిన సంపంగి రాములు, ఇబ్రహీం, లతీఫ్‌లు సిపిఐ పార్టీలో చేరగా ఎమ్మెల్యే గుండా మల్లేష్ కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి సుదర్శన్‌రెడ్డి
english title: 
model schools

కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు ఆర్ధిక పరిపుష్టికి కృషి

$
0
0
ఒంగోలు, జూన్ 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమకూర్చి రాష్ట్రంలోని కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేలా తన వంతు కృషి చేస్తునట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి ఆధ్యక్షత అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని అన్ని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు చాలావరకు దినదినాభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. ఇటీవల పెరిగిన జనాభాకు అనుగుణంగా కొత్తగా మూడు కార్పోరేషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఒంగోలు, చిత్తూరు, ఖమ్మం కార్పోరేషన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తించి కార్పోరేషన్‌కు మంచి పేరుప్రతిష్టలు తీసుకొని రావాలని, లేనిపక్షంలో అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. తొలుత ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మంత్రి మాట్లాడుతూ చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారికి సేవ చేయాలని మంత్రి వారికి సూచించారు. వివిధ రకాల పనులు చేసే విషయంలో ఇంజనీరింగ్ అధికారులు ఆలసత్వం వ్యవహరిస్తున్నారని, ఇకనుండి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెండర్లు తీసుకొని పనులు సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను అవసరమైతే బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆయన సూచించారు. పనులు నిర్థేశించిన సమయంలో పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులన్నింటిని జూలై నెలాఖరు నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీని ఏర్పాటుచేసి సుందరంగా తీర్చిదిద్దేలన్నారు. ఒంగోలులో పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడు నెలలలోపు అన్ని పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడుతూ అనుమతులు తీసుకోకుండా అక్రమంగా భవన నిర్మాణాలు చేస్తే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీజనల్ డైరెక్టర్‌ను పిలిచి అవసరమైతే కొన్ని ప్రాంతాలను తనిఖీ చేసి అవసరమైన సలహాలు, సూచనలు ఆయన నుండి తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. రెవెన్యూ అధికారులతో మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 30వ తేదిలోగా పన్నులు ప్రజలు చెల్లిస్తే అలాంటి వారికి ఇంటిపన్నులో వడ్డీ రాయితీ ఇవ్వాలని సూచించారు. ఆస్తి, కుళాయిలు, ఇతర పన్నులు వసూలుచేయడంలో ఒంగోలు కార్పోరేషన్ కొంత వెనుకబడి ఉందని, నూటికి నూరు శాతం పన్నులను వసూలు చేసి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలవాలని సూచించారు. తాను ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నానని, అయితే అధికారులు బాధ్యతారహితంగా పనిచేస్తే అలాంటి వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇదిలాఉండగా ఇటీవల పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో మంచి మార్కులు సాధించిన మున్సిపల్ పాఠశాలలు, కాలేజీ విద్యార్థులను మంత్రి మహీధర్‌రెడ్డి అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికలే తెలుగుదేశం ఇన్‌చార్జ్‌లకు గీటురాయి ఒంగోలు, జూన్ 27: స్థానిక సంస్థల ఎన్నికలే జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు గీటురాయి కానున్నాయి. పంచాయతీ, జడ్‌పిటిసి, ఎంపిటిసిలకు జరిగే ఎన్నికల్లో ఎవరు ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జికి అసెంబ్లీ సీటు ఇస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో జిల్లాలోని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టారు. కాగా జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా సంతనూతలపాడు, చీరాల నియోజకవర్గాలకు మాత్రం ఇన్‌చార్జ్‌లను నియమించలేదు. మిగిలిన పది నియోజకవర్గాల్లో మాత్రం ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అగ్నిపరీక్షగా మారాయి. ఎక్కడ నియోజకవర్గంలో సీట్లు రాకపోతే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుండి తప్పించి కొత్తవారికి చోటు కల్పించే అవకాశాలు ఉండటంతో ప్రస్తుత ఇన్‌చార్జ్‌లు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకంటే మెరుగ్గానే తొలి విడత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఫలితాలు రావటంతో ఆ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలను జరిపే పరిస్థితి ఉంది. అందులో భాగంగా తొలుత పంచాయతీ ఎన్నికల్లో తమసత్తా చాటితే ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికల్లో కూడా ఆ బలం కొనసాగుతుందన్న ఆలోచనలో టిడిపి ఇన్‌చార్జులు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. అదేవిధంగా స్థానిక సంస్ధల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వారిని ఓటర్లగా చేర్పించాలని కూడా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు ఆదేశాలు జారీచేశారు. ఈనేపధ్యంలో ఓటర్లను చేర్చే విషయంలో నేతలు ప్రత్యేక దృష్టిసారించారు. ఇదిలాఉండగా ముఖ్యనేతల్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ముఖ్యనేతలు ఏకతాటిపై నిలిచి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పార్టీకార్యకర్తలు కోరుతున్నారు. ఈపాటికే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తిలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తులు ప్రారంభించారు. కాగా స్ధానిక సంస్థల ఎన్నికలు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు అగ్నిపరీక్షగా మారింది. ఇదిలాఉండగా తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. పార్టీల నేతలు ఎన్నికల వ్యూహంలో మునిగి తేలుతుండగా జిల్లాయంత్రాంగం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసిన వెంటనే ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి గుడ్లూరు, జూన్ 27: ఐదో నెంబర్ జాతీయ రహదారిపై మోచర్ల సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు వైపు నుంచి వస్తున్న లారీని కావలి వైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్‌ను దాటి ఢీకొట్టాడు. ఈ లారీలో ఉన్న కామరాజు (46), చెండ్రి (45) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చిత్తూరు ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉలవపాడు ఎస్సై జి చంద్రశేఖర్, సిఐ అక్కేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు స్తంభించిన ట్రాఫిక్ నాయకుల అరెస్టు ఒంగోలు అర్బన్, జూన్ 27: ఒంగోలు నగరపాలక సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. నగరంలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్‌కు వెళ్ళే రహదారి పూర్తిగా స్తంభించి పోయింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాంట్రాక్టు కార్మికులను, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులను అరెస్టు చేశారు. కనీస వేతనం 12 వేల 500 రూపాయలు ఇవ్వాలని గత మూడు రోజుల నుండి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కార్పొరేషన్ కార్యాలయానికి గేట్లు వేసి బైఠాయించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు అనేక పోరాటాలు చేసి కనీస వేతనాలు సాధించుకున్న చరిత్ర ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారని వంద కోట్లు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల వద్ద నుండి వేల కోట్ల రూపాయలు పిఎఫ్ డబ్బు తీసుకుంటున్నారని, కాని వారి ఖాతాల్లో ఆ డబ్బును జమ చేయకుండా కాంట్రాక్టర్లు, అధికారులు దోచుకుంటున్నారని విమర్శించారు. నగర కార్యదర్శి కె శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న శాంతియుత ఉద్యమాన్ని పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సిఐటియు నాయకులు సునీల్ మాట్లాడుతూ నగరాన్ని శుభ్రం చేసే కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వెంటనే కలెక్టర్, జిల్లా మంత్రి, అధికారులు పట్టించుకొని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె సామ్రాజ్యం, వై రవికుమార్, పి కోటేశ్వరరావు, అన్నపూర్ణ, వెంకటరత్నం, వెంకటేశ్వర్లు, వెంకాయమ్మ, ఎ శ్రీనివాసరావు, రాములు, సైదులు, వెంకటేశ్వర్లు, నరసింహం, సింగయ్య, ప్రతాప్‌లతో పాటు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ కలెక్టర్ విజయకుమార్ స్పష్టం మర్రిపూడి, జూన్ 27: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌కు కందుకూరు ఆర్‌డిఒ బాపిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలంటికి వీలైనంత త్వరలో పరిష్కారమార్గం చూపుతామని మండల ప్రజలకు హామీ ఇచ్చారు. మండలం నుండి వచ్చిన అన్నిగ్రామాల ప్రజలు తమ సమస్యలను అర్జీరూపంలో తెలుపుకోవాలని ఆయన కోరారు. సుమారు 12వందలకు పైగా వచ్చిన అర్జీలన్నింటిని స్వయంగా కలెక్టర్ ముఖాముఖీగా వీలైనంతవరకు ప్రజాదర్బారులోనే పరిష్కారమార్గం చూపారు. ఉదయం 11 నుండి సాయంత్రం మూడుగంటల వరకు అర్జీలను స్వీకరించారు. ముఖ్యంగా వికలాంగులకు ట్రైసైకిళ్ళు ఇప్పించేందుకు సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు జారీచేశారు. కొంతమంది రైతులకు స్టేజీమిదే పట్టాదారు పుస్తకాలను తహశీల్దార్ చంద్రావతి ద్వారా అందచేయించారు. ఎన్‌ఆర్‌జిఎస్ కూలీలు కొంతమందికి మెడికల్ క్లైయిమ్‌లు ఇప్పించేందుకు ఆదేశాలు జారీచేశారు. ఇదిలాఉంటే ప్రజల సమస్యలు స్టేజీమీదే పరిష్కార మార్గం చూపటంతో మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కొంతమంది మహిళా రైతులకు పట్టాదారు పుస్తకాలు కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె యాకూబ్‌నాయక్, జిల్లా పరిషత్ సిఇఒ గంగాధర్, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి రాజు, స్ట్ఫె సిఇఒ బి రవి, బిసి వెల్ఫేర్ ఇడి మయూరి, డ్వామా పిడి ఎం పోలప్ప, హౌసింగ్ పిడి ధనుంజయ్, ఉద్యానవన శాఖ ఎడి మర్రిపూడి మండల ప్రత్యేకాధికారి జెన్నమ్మ, డిప్యూటీ డిఇఒ కాశీంబేగ్, దర్శి ఎడిఏ మాలకొండారెడ్డి, ఎంపిడిఒ శ్రీనివాసరావు, పొదిలి సిఐ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ చంద్రావతి, ఎస్‌ఐ బాబాఖాదర్‌వలీ, ఎపిడి విజయకుమారి, ఎంఇఒ రాంసింగ్, ఐసిడిఎస్ సిడిపిఒ రేచల్‌సరళ, ఎఒ మధుబాబు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు సైరాబి, జరీనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వెటర్నరీ సీట్లు ఇప్పిస్తామని మోసం ఇద్దరిపై కేసు నమోదు కొమరోలు, జూన్ 27: తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెటర్నరీ సీట్లు ఇప్పిస్తామని నమ్మపలికి 6లక్షల రూపాయలు తీసుకుని మోసగించిన కడపజిల్లా పోరుమామిళ్ళకు చెందిన ఇద్దరు వ్యక్తులపై కొమరోలుకు చెందిన ఎన్‌వి నారాయణ అనే ఉపాధ్యాయుడు గురువారం తమకు ఫిర్యాదు చేశాడని ఎస్సై ఎం రామానాయక్ తెలిపారు. కొమరోలుకు చెందిన ఎన్‌వి నారాయణ, కె వెంకటేశ్వర్లు కుమారులకు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 2012-13 సంవత్సరానికి ఎన్‌ఆర్‌ఐ కోటా కింద వెటర్నరీ సీట్లు ఇప్పిస్తామని వైఎస్‌ఆర్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన కల్లూరి విష్ణువర్ధన్‌రెడ్డి, తండ్రి భాస్కర్‌రెడ్డి గతఏడాది నమ్మబలికి నారాయణ వద్ద నుంచి 2లక్షల రూపాయలు, వెంకటేశ్వర్లు వద్ద నుంచి 4లక్షల రూపాయలు తీసుకున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు సీట్లు లభించలేదు. దీనితో జరిగిన మోసాన్ని గుర్తించిన నారాయణ, వెంకటేశ్వర్లు పోరుమామిళ్ళకు వెళ్ళి వారిని నిలదీశారు. దీనితో తాము తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పి రెండు లక్షలకు 3 చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులను బ్యాంక్‌లో వేయగా ఖాతాలో నగదులేదని బ్యాంక్ అధికారులు చెప్పారని బాధితులు వాపోయారు. దీంతో నారాయణ గురువారం తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామనాయక్ తెలిపారు. రోడ్డుపై విద్యార్థులకు పాఠాలు కాంట్రాక్టు లెక్చరర్ల వినూత్న నిరసన ఒంగోలు అర్బన్, జూన్ 27: జిల్లాలోని కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదురుగా కాంట్రాక్టు లెక్చరర్లు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నడిరోడ్డుపై విద్యార్థులకు కాంట్రాక్టు అధ్యాపకులు పాఠాలు బోధించారు. పాఠాలు బోధించే సమయంలో విద్యార్థులు సమ్మెను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈదీక్షను సిపిఎం నగర కమిటీ కార్యదర్శి జివి కొండారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. 13 సంవత్సరాల నుండి పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించక పోవడం దారుణమన్నారు. సిపిఐ (ఎంఎల్) న్యూడెమెక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నెల నెలా జీతాలు చెల్లించకుండా వెట్టిచాకిరి చేయిస్తూ రెగ్యులర్ చేయక పోవడం దారుణమన్నారు. పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ సంఘీభావం ప్రకటించారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను పరిష్కరించి నిర్ణయం తీసుకోకపోతే విద్యార్థి సంఘాలతో అధ్యాపకులకు మద్దతుగా తాము కూడా సమ్మెకు దిగుతామన్నారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాలకోటయ్య మాట్లాడుతూ కార్పోరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యను బోధిస్తూ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడంలో వారి పాత్ర ఎనలేనిదన్నారు. తరగతి నాలుగు గోడల మధ్య విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన అధ్యాపకులు వీధినపడడం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ నాలుగు రోజుల నుండి సమ్మె చేస్తున్నా విద్యాశాఖ మంత్రి అధ్యాపకుల సమస్యలను పట్టించుకోకుండా ఆబార్క విధానం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలోని 250 మంది కాంట్రాక్టు అధ్యాపకులు 30 జూనియర్ కళాశాలల నుండి హాజరైనారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు ఆపేది లేదని వారు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు కె సురేష్, ఆర్‌సిహెచ్ రంగయ్య , సిహెచ్ బాబూరావు, ఎస్‌కె రసూల్, పి సుబ్బారెడ్డి, కాశీరత్నం, విజయలక్ష్మి, కల్యాణి తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతిపైనే కాంగ్రెస్ దాడి టిడిపి నేతల ధ్వజం ఒంగోలు అర్బన్, జూన్ 27: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తెలుగుదేశం పార్టీపై కాకుండా తెలుగుజాతి పైనే దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలైన కేదార్‌నాధ్, చార్‌ధామ్, బద్రీనాధ్ యాత్రలకు వెళ్ళి అనుకోకుండా విపత్తు సంభవించడంతో వరదల్లో చిక్కుకున్నారని అన్నారు. వీరిలో వందలాది మంది తెలుగువారు ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనిపై స్పందించిన తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీశ్రేణులను అప్రమత్తం చేసి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని తెలుగు వారిని స్వస్థలాలకు పంపించేందుకు తీవ్రంగా కృషి చేశారన్నారు. ఈసందర్భంగా డెహ్రాడూన్ విమానాశ్రయంలో తమ పార్టీ పార్లమెంట్ సభ్యులైన రమేష్ రాధోడ్, కె నారాయణపై హనుమంతరావు దాడి చేయడం దారుణమన్నారు. ఈ దాడి తెలుగుదేశం ఎంపిలపైనే కాకుండా యావత్తు తెలుగు జాతిపై దాడిగా వారు పేర్కొన్నారు. వేలాది మంది తెలుగు ప్రజలు వరదల్లో చిక్కుకొని అల్లాడిపోతుంటే రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని వారు ప్రశ్నించారు. రాష్ట్రం నుండి 13 మంది కేంద్రంలో మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తూ తమ బాధ్యతలు మరిచిపోయి బాధ్యతారహితంగా వ్యవహరించారన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక విమానంలో తెలుగు వారిని రాష్ట్రానికి పంపిస్తుంటే హర్షించాల్సింది పోయి సహాయం చేసే వారిపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. బాధితులకు వైద్యసేవలు చేయడం కోసం ఎపి భవన్‌లో తెలుగుదేశం పార్టీ వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేస్తే కనీసం మానవత్వం లేకుండా వైద్యశిబిరాన్ని తొలగించడం దారుణమన్నారు. వరదల్లో చిక్కుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్న తెలుగు వారిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. తక్షణమే హనుమంతరావు తమ పార్టీ ఎంపిలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేఖర్ల సమావేశంలో జిల్లా పార్టీ ప్రధానకార్యదర్శి యర్రాకుల శ్రీనివాసరావు, జిల్లా ఎస్సీ సెల్ అద్యక్షులు కొమ్మూరి రవిచంద్ర, కార్యనిర్వాహక కార్యదర్శులు బొల్లినేని వాసుకృష్ణ, పోగుల సుందరం, కమ్మ వెంకటేశ్వర్లు, పఠాన్ హనీఫ్‌ఖాన్, బాలిశెట్టి నాగేశ్వరరావు, పొనుగుపాటి వెంకటేశ్వర్లు, మల్లెల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మహీధర్‌రెడ్డి వెల్లడి
english title: 
mahi
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>