Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

110వ రేస్ కాదు..

$
0
0
* 1903లో ప్రారంభమైన టూర్ డి ఫ్రాన్స్ 110 ఏళ్లు పూర్తి చేసుకుంది. కానీ, ఇప్పుడు జరుగుతున్నది 111వ రేస్ కాదు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల కారణంగా మొత్తం 11 పర్యాయాలు ఈ రేస్‌ను నిర్వహించలేదు. ఆ రకంగా చూసుకుంటే, ఇది 100వ రేస్. 2007లో ఫ్లాయిడ్ లాండిస్ (2006 విజేత) టైటిల్‌ను రద్దు చేశారు. అతను విచారణలో బయటపెట్టిన సమాచారం ప్రకారమే ఆర్మ్‌స్ట్రాంగ్‌పై విచారణ కొనసాగింది. ఏడు పర్యాయాలు టైటిల్ సాధించిన ఆర్మ్‌స్ట్రాంగ్‌పై సస్పెన్షన్ వేటు పడేందుకు కారణమైంది. కాగా, అతను టైటిళ్లు సాధించిన 1999-2005 కాలానికి ద్వితీయ స్థానంలో ఉన్న రైడర్లను విజేతలుగా ప్రకటించడానికి యుసిఐ నిరాకరించింది. ఆ సంవత్సరాల్లో టైటిల్ ఎవరికీ దక్కదని స్పష్టం చేసింది. * ఇప్పటి వరకూ టూర్ డి ఫ్రాన్స్ రేస్‌లో పాల్గొన్న వారిలో పొడవైన రైడర్‌గా జొహా వాన్ సమ్మెరెన్ రికార్డు సృష్టించాడు. అతని పొడవు 6 అడుగులా, ఐదున్నర అంగుళాలు. ఇక పొట్టివాడిగా సామ్యూల్ డువౌలిన్ పేరు చరిత్ర పుటల్లో నిలిచింది. అతని ఎత్తు 5 అడుగులా రెండు అంగుళాలు. ఇక అతి బరులైన రైడర్ మాగ్నసన్ బాక్‌స్టెడ్. అతని బరువు అక్షరాలా 95 కిలోలు. లియోనార్డో పీపొలి 57 కిలోల బరువుతూ, టూర్ డి ఫ్రాన్స్‌లో పాల్గొన్న బక్కపల్చని రైడర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకూ నలుగురు రేస్ మధ్యలో మృతి చెందారు.
1903లో ప్రారంభమైన టూర్ డి ఫ్రాన్స్ 110 ఏళ్లు
english title: 
110the year

కొండకోనల్లో.. సాహస యాత్ర

$
0
0
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు సంపాదించిన టూర్ డి ఫ్రాన్స్‌కు అమెరికా రైడర్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ వల్ల ఎంతటి పేరు ప్రతిష్ఠలు లభించాయో అంతకంటే ఎక్కువ నష్టం వాటిల్లింది. డ్రగ్స్‌ను వినియోగించి తాను ఏడు టైటిళ్లను గెల్చుకున్నానని అతను అంగీకరించడం యావత్ క్రీడా రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన ఆర్మ్‌స్ట్రాంగ్ టైటిళ్లతోపాటు అంతర్జాతీయంగా తనకు ఉన్న పేరుప్రఖ్యాతుల్ని కూడా పోగొట్టుకున్నా డు. ఈసారి టూర్ డి ఫ్రాన్స్‌ను డోపింగ్ రహిత ఈవెంట్‌గా నిర్వహిస్తా మని అధికారులు హామీలు గుప్పిస్తున్నప్పటికీ, ఈ పోటీలపై అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. ఆర్మ్‌స్ట్రాంగ్ వ్యవహారమే ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణం. ============== పచ్చిక మైదానాలు... ఎత్తయిన కొండలు... పర్వతాలు... ఒక్కో ‘స్టేజీ’ని అధిగమిస్తూ వెళ్లే రైడర్లు... ఇవీ టూర్ డి ఫ్రాన్స్ సైకిల్ రేస్ ప్రత్యేకతలు. గంటల తరబడి అవిశ్రాంతంగా సైకిల్ తొక్కడం అనుకున్నంత సులభం కాదు. ఘాట్ రోడ్లపై సైకిళ్లను ముందుకు దూకించడానికి అపారమైన శక్తిసామర్థ్యాలేకాదు, అనంతమైన ఆత్మవిశ్వాసం కూడా కావాలి. అందుకే, ఠీవిగా నిలబడే పర్వతాలు కూడా వారి దృఢ సంకల్పం ముందు తల వంచుతాయ. 110 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 111వ వసంతంలోకి అడుగుపెట్టిన టూర్ డి ఫ్రాన్స్, మరోసారి అభిమానులకు కనువిందు చేయనుంది. శనివారం ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక రేసును గెల్చుకొని, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని మిగుల్చుకోవడానికి 198 మంది రైడర్లు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నిరుటి విజేత బ్రాడ్లీ విగిన్స్ టైటిల్ నిలబెట్టుకోవడం ఈసారి కష్టంగానే కనిపిస్తోంది. విగిన్స్‌తో చివరి వరకూ పోటీపడి, రెండో స్థానంలో నిలిచిన క్రిస్ ఫ్రూమ్ ఫేవరిట్‌గా బరిలో దిగుతున్నాడు. ఇటీవల ఒమాన్‌లో జరిగిన రేస్‌ను గెల్చుకొని సత్తా చాటిన 28 ఏళ్ల ఫ్రూమ్, ఆతర్వాత క్రిటెరియమ్ ఇంటర్నేషనల్, టూర్ ఆఫ్ రొమాండీ, ది క్రిటెరియమ్ డు డౌఫిన్ రేసులనూ తన ఖాతాలో చేర్చుకున్నాడు. టీ స్కై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతనికి మాజీ చాంపియన్ అల్బెర్టో కాంటడార్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. 2007, 2009 సంవత్సరాల్లో విజేతగా నిలిచిన కాంటడార్‌తోపాటు జోక్విమ్ రొడ్రిగెజ్, కాడెల్ ఇవాన్స్ కూడా టైటిల్‌పై కనే్నశారు. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించి పట్టుబడిన లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత టూర్ డి ఫ్రాన్స్ జరగడం ఇదే మొదటిసారి. ఏడు పర్యాయాలు విజేతగా నిలిచిన అతను డోపింగ్ కారణంగా టైటిళ్లను కోల్పోయాడు. రికార్డులు కూడా రద్దయ్యాయి. ఆర్మ్‌స్ట్రాంగ్‌పై వేటు పడిన తర్వాత మరెవరూ డోపింగ్‌కు పాల్పడరని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. 1997లో టైటిల్ సాధించి, మూడు పర్యాయాలు రెండో స్థానాన్ని ఆక్రమించిన జర్మనీ రైడర్ జన్ ఉల్రిచ్ తాను నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించానని వారం క్రితం చేసిన ప్రకటన వల్ల టూర్ డి ఫ్రాన్స్‌పై అనుమానం మేఘాలు కమ్ముకుంటున్నాయి. రక్తానికి ఉత్ప్రేరకంగా పని చేసే ఎరిథ్రోపొటిన్ (ఇపివో)ను వినియోగించిన ఫ్రెంచ్ స్టార్ లారెంట్ జలబెర్ట్ ఇప్పుడు టీవీ, రేడియో కామెంటేటర్‌గా అవతారం ఎత్తాడు. అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్ (యుసిఐ), టూర్ డి ఫ్రాన్స్ అధికారులను అతను నానా రకాల ప్రశ్నలతో వేధించడం ఖాయం. అతను చేసే వ్యాఖ్యలు అభిమానులపై తీవ్ర ప్రభావం చూపుతాయని టూర్ డి ఫ్రాన్స్ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ ఉదంతం తర్వాత రాజీనామా చేయాలంటూ యుసిఐ అధ్యక్షుడు పాట్ మెక్ కయిద్‌పై ఒత్తిడి పెరుగుతోంది. టూర్ డి ఫ్రాన్స్ రేస్‌ను ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తే, మరోసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలని కయిద్ ఆశిస్తున్నాడు. అతనికి కూడా ఈ రేస్ అత్యంత కీలకంగా మారింది. తొలి చాంపియన్ గారిన్ ప్రతిష్ఠాత్మక టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్ రేస్‌లో తొలి విజేత వౌరిస్ గారిన్. 1903లో జరిగిన మొదటి రేస్‌ను అతను గెల్చుకున్నాడు. 1871 మార్చి 3న ఇటలీలో జన్మించిన గారిన్ 1957 ఫిబ్రవరి 19న మృతి చెందాడు. 1885లో ఒక ఫ్యాక్టరీలో చినీ స్వీపర్‌గా పని చేసిన అతను 1889లో సైకిల్ కొన్నాడు. సైక్లింగ్ అంటే ఎంతో మక్కువ ఉండడంతో, చిన్నచిన్న రేసుల్లో పాల్గొనేవాడు. 1893లో అతను ఫ్రాన్స్‌కు వెళ్లి, అక్కడ స్థిరపడ్డాడు. అదే ఏడాది 701 కిలో మీటర్ల దూరాన్ని అతను 20 గంటల్లో పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. 1896లో పారిస్-రొబాక్స్ రేస్ గెల్చుకున్నాడు. 1898లో మరోసారి ఇదే రేస్‌లో విజేతగా నిలిచాడు. 1901లో పారిస్-బ్రెస్ట్-పారిస్ రేస్‌ను కైవసం చేసుకున్నాడు. 1903 టూర్ డి ఫ్రాన్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, తొలి టైటిల్‌ను అందుకున్న సైక్లిస్టుగా రికార్డు సృష్టించాడు. రికార్డులు.. విశేషాలు.. కెరీర్ మొత్తంలో అత్యధిక స్టేజీల్లో గెలుపొందిన రైడర్‌గా ఎడ్డీ మెక్‌కెక్స్ రికార్డు సృష్టించాడు. అతను 1969లో ఆరు, 1970లో ఎనిమిది, 1971లో నాలుగు, 1972లో ఆరు, 1974లో ఎనిమిది స్టేజీల్లో విజేతగా నిలిచాడు. కెరీర్‌లో అతను స్టేజ్ విజయాల సంఖ్య 34. ఒక టూర్‌లో అత్యధిక స్టేజ్ విజయాలు ఎనిమిది. 1930లో చార్లెస్ పెలిసియర్, 1970, 1974 సంవత్సరాల్లో ఎడ్డీ మెక్‌కెక్స్, 1976లో ఫ్రెడ్డీ మార్టెన్స్ ఈ రికార్డును నమోదు చేశారు. స్టేజ్ విజేతకు ఇచ్చే ఎల్లో జెర్సీని ఎక్కువ రోజులు ధరించిన రైడర్ ఎడ్డీ మెక్‌కెక్స్. అతు కెరీర్‌లో మొత్తం 96 రోజులు ఎల్లో జెర్సీ ధరించాడు. 1952లో స్టాన్ ఒకెర్స్‌పై ఫాస్టొ కొపీ 28 నిమిషాల 27 సెకన్ల తేడాతో విజయం సాధించాడు. టూర్ డి ఫ్రాన్స్ చరిత్రలోనే ఎక్కువ తేడాతో గెలుపొందిన రైడర్‌గా కొపీ రికార్డు సృష్టించాడు. కాగా, 1989లో లారెంట్ ఫిగ్నాన్‌పై గ్రెగ్ లెమాండ్ కేవలం 8 సెకన్ల తేడాతో గెలిచాడు. హోరాహోరీగా సాగిన రేస్ ఇదే. ఆ రేస్‌లోనే లెమాండ్ 24.5 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 54.930 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేశాడు. టూర్ డి ఫ్రాన్స్‌లో అత్యంత వేగంగా సైకిల్ తొక్కిన రైడర్‌గా అతను మరో రికార్డును సృష్టించాడు. ఫిర్మిన్ లాంబట్ 1922లో రేస్‌ను గెల్చుకునే సమయానికి అతని వయసు 36 సంవత్సరాలు. ఎక్కువ వయసులో విజేతగా నిలిచిన రైడర్‌గా అతని రికార్డును ఇప్పటి వరకూ ఎవరూ ఛేదించలేదు. హెన్రీ కార్నెట్ 1904లో టూర్ డి ఫ్రాన్స్ టైటిల్ అందుకునే సమయానికి అతని వయసు కేవలం 20 ఏళ్లు. అత్యధిక పర్యాయాలు ఈ రేస్‌లో పాల్గొన్న రైడర్ జూప్ జొడెమెల్క్. 1970-1986 మధ్యకాలంలో అతను 16 పర్యాయాలు టూర్ డి ఫ్రాన్స్‌లో పాల్గొన్నాడు. ప్రతిసారీ అతను రేస్‌ను పూర్తి చేయడం మరో విశేషం. రేస్‌లో పాల్గొనే ఒక్కో రైడర్ రోజుకు సుమారు 5,900 నుంచి 9,000 వరకూ కాలరీస్ శక్తిని ఉపయోగించుకుంటాడు. ఇప్పటి వరకూ జరిగిన పోటీల్లో 1919లో అత్యల్పంగా కేవలం 10 మంది మాత్రమే రేస్‌ను పూర్తి చేశారు. 69 మంది రేస్‌ను మొదలుపెడితే, వారిలో 59 మంది మధ్యలోనే వైదొలిగారు. జాక్వెస్ ఆంక్వెటిల్ (ఫ్రాన్స్) 1957 నుంచి 1961 వరకు, తిరిగి 1964లో టూర్ డి ఫ్రాన్స్ టైటిల్ సాధించాడు. ఆరు పర్యాయాలు విజేతగా నిలిచిన అతని పేరే రికార్డు పుస్తకాల్లో ఉంది. వాస్తవానికి లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ అత్యధికంగా ఏడు పర్యాయాలు ఈ టైటిల్ సాధించాడు. అయితే, తాను డోపింగ్‌కు పాల్పడినట్టు అంగీకరించడంతో అతని టైటిళ్లతోపాటు రికార్డులను కూడా రద్దు చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ పేరు మాయం కావడంతో, ఎక్కువ టైటిళ్లు సాధించిన రైడర్‌గా ఆంక్వెటిల్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఎడ్డీ మెక్‌కెక్స్, బెర్నార్డ్ హినాల్ట్, మిగెల్ ఇండురైన్ తలా ఐదేసి పర్యాయాలు విజేతలుగా నిలిచారు. మిగెల్ ఇండురైన్ 1991 నుంచి 1995 వరకూ వరుసగా ఐదు పర్యాయాలు టైటిల్ సాధించాడు. వరుస టైటిళ్ల రికార్డు ఇది. ఆర్మ్‌స్ట్రాంగ్ 1999 నుంచి 2005 వరకూ ఏడుసార్లు టూర్ డి ఫ్రాన్స్‌ను గెల్చుకున్నాడు. కానీ, అతని రికార్డును రద్దు చేశారు. అమెరికా తరఫున గ్రెగ్ లెమాండ్ (1986, 1989, 1990), లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1999, 2000, 2001, 2002, 2003, 2004, 2005) టైటిళ్లు రద్దయ్యాయి. మూడు వారాల్లో ఒక్కో రైడర్ తన సైకిల్ పెడల్‌ను 3,24,000 నుంచి 4,86,000 పర్యాయాలు తొక్కుతాడు. ఒక్కో సైకిల్‌కు సగటున మూడు చైన్లను మార్చాల్సి వస్తుంది. ఈ ఏడాది పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏ స్టేజీని ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఉత్కంఠ భరితంగా సాగే రేసును గెలిచే అవ కాశాలు ఎవరికి ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. విజయం ఎవరిదైనా ఈ రేస్ ఉత్కంఠ భరితంగా జరుగుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌గా పేరు
english title: 
konda konallo
author: 
- కౌస్తుభ్

‘గురి’తప్పిన ఆర్చరీ!

$
0
0
భారత ఆర్చరీ సంఘం (ఎఎఐ) వ్యవహారం కొత్త సమస్యలకు దారితీస్తున్నది. దేశంలోని అన్ని జాతీయ క్రీడా సంఘాలకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎన్నికలు జరిగాయంటూ ఎఎఐ గుర్తింపును కేంద్రం రద్దు చేసింది. అయితే, అంతర్జాతీయ ఆర్చరీ సమాఖ్య (్ఫటా) గుర్తింపు కొనసాగుతున్నది కాబట్టి ప్రభుత్వ నిర్ణయంతో తమకు సంబంధం లేదని ఎఎఐ స్పష్టం చేస్తున్నది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నది. సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ మల్హోత్రా మొండి వైఖరే ప్రస్తుత వివాదానికి ప్రధాన కారణం. కేంద్రం సూచిస్తున్న కొత్త మార్గదర్శకాలను అనుసరించి 70 సంవత్సరాలు పైబడిన వారెవరూ క్రీడా సమాఖ్యలకు పోటీ చేయడానికి లేదా పదవులు నిర్వహించడానికి అనర్హులు. దీని ప్రకారం 81 ఏళ్ల మల్హోత్రా ఎఎఐ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేదు. అయితే, పదవి నుంచి వైదొలగేందుకు అతను ససేమిరా అంటున్నాడు. ఎన్నికల తంతును ముగించాడు. భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) తాత్కాలిక అధ్యక్షుడిగా తనను గుర్తించిన ప్రభుత్వం, ఎఎఐ విషయంలో ఎందుకు కాదంటున్నదని అతని వాదన. ఆర్చరీ సంఘానికి వర్తించే వయసు నిబంధనను ఐఒఎకు వర్తించదా అని ప్రశ్నిస్తున్నాడు. కానీ మల్హోత్రా వాదనలో పస లేదన్నది వాస్తవం. ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నదన్న ఆరోపణపై ఐఒఎ గుర్తింపును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) రద్దు చేసే సమయానికి మల్హోత్రా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. నిజానికి ఐఒఎ అప్పటి అధ్యక్షుడు సురేష్ కల్మాడీపై అవినీతి ఆరోపణలు వచ్చే సమయానికి కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. ఐఒసి సస్పెండ్ చేసినప్పటికీ వెనక్కు తగ్గని ఐఒఎ ఎన్నికలను నిర్వహించింది. అభయ్ సింగ్ చౌతాలా అధ్యక్షుడిగా కొత్త కమిటీ ఎన్నికైంది. అయితే, ఈ కొత్త కమిటీని గుర్తించడం లేదని ఐఒసి తేల్చిచెప్పింది. తాము సస్పెన్షన్ నిర్ణయం తీసుకునే సమయానికి మల్హోత్రా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించిన కమిటీతోనే ఏవైనా సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేసింది. ఒలింపిక్స్ మొదలుకొని అన్ని అంతర్జాతీయ ఈవెంట్స్‌లో భారత్ పాల్గొనాలంటే, ఐఒసి గుర్తింపు ఉండితీరాలి. లేకపోతే, జాతీయ పతాకాన్ని ధరించకుండా, ఐఒసి పతాకం కింద పోటీపడాలి. సస్పెన్షన్‌ను పునఃసమీక్షించే విషయంపై లాసనే్నలో జరిగిన సమావేశానికి భారత ప్రభుత్వ ప్రతినిధులతోపాటు, మల్హోత్రా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించిన కిమటీని ఐఒసి ఆహ్వానించింది. కానీ, ఐఒసి సభ్యుడు రణ్‌ధీర్ సింగ్‌తోపాటు మల్హోత్రా కూడా ఆ సమావేశానికి హాజరుకాలేదు. మిగతా ఐఒఎ ప్రతినిధులు హాజరుకావడంతో సమావేశం సంతృప్తికరంగా సాగింది. కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా లాసనే్న వెళ్లి, ఐఒసి అధికారులతో చర్చించడంతో ఐఒఎపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఐఒసి ఆదేశాలకు అనుగుణంగానే కేంద్రం వ్యవహరించింది. దీనిని అడ్డం పెట్టుకొని, ఎఎఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొనేది లేదంటూ మల్హోత్రా భీష్మించుకోవడం విచిత్రం. ప్రతి దేశంలోనూ జాతీయ క్రీడా సమాఖ్యలన్నీ ఒకే విధానాన్ని అనుసరిస్తాయి. మన దేశంలో మాత్రం ఎవరి దారి వారిది. దేశ వ్యాప్తంగా ఒకే క్రీడా విధానం ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ క్రీడా బిల్లును ప్రవేశపెట్టేందుకు అప్పటి క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ శక్తివంచన లేకుండా కృషి చేశాడు. అయితే, ఎక్కువ శాతం జాతీయ క్రీడా సమాఖ్యల్లో రాజకీయ నాయకులే కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. క్రీడా బిల్లును ఆమోదిస్తే వారిలో ముప్పాతిక శాతం తమ పదవులను వదులుకోవాల్సి వస్తుంది. ఈ కారణంతోనే కేబినెట్‌లోనే కొంత మంది క్రీడా బిల్లును వ్యతిరేకించారు. కారణాలు ఎలావున్నా, క్రీడా బిల్లుకు ఇంకా ఆమోద ముద్ర పడలేదు. ఈలోగా మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేసినప్పటికీ, ఎఎఐ వంటి సమాఖ్యలు వీటిని అమలు చేయడానికి సిద్ధంగా లేవు. స్వార్థ ప్రయోజనాల కోసం యావత్ క్రీడా రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సంఘాలు, సమాఖ్యల్లో ఆర్చరీది అగ్రస్థానం. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో మెరికల్లాంటి ఆర్చర్లను పంపాల్సిన బాధ్యతను విస్మరించిన ఎఎఐ మిగతా సమాఖ్యలు కూడా ప్రభుత్వాన్ని ధిక్కరించేలా ప్రవర్తిస్తున్నది. మన దేశంలో క్రికెట్‌ను మినహాయిస్తే, మిగతా ఏ ఒక్క ఆట కూడా కేంద్ర ఆర్థిక సాయం లేనిదే మనుగడ సాగించే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి డబ్బు కావాలిగానీ ప్రభుత్వ మార్గదర్శకాలను మాత్రం పాటించమంటూ ఎఎఐ పట్టుబట్టడం హాస్యాస్పదం. ఇందులో మల్హోత్రా స్వార్థమే తప్ప ఆర్చరీకి ఒరిగే మేలు ఏమీ లేదు. దేశంలో ఆర్చరీ సంఘం గురి తప్పింది. చక్కదిద్దే చర్యలు చేపట్టకపోతే అంతర్జాతీయ వేదికపై భారత క్రీడా రంగం నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంది. ఎనిమిది పదుల వయసు నిండిన మల్హోత్రా తన పదవి నుంచి గౌరవంగా తప్పుకొని, ఉన్నత విలువలను నెలకొల్సిన అవసరం ఉంది. లేకపోతే, మిగతా క్రీడల మాదిరిగానే ఆర్చ రీ కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయే ప్రమా దం ఉంది. ఆర్చరీలో పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన వారికి సంఘంలో తగిన గుర్తింపునిచ్చి, వారి సేవ లను వినియోగించుకునేలా ప్రభుత్వం మార్గదర్శ కాలను విడుదల చేయాలి. నిబంధనలను అమలు చేయాలి.
భారత ఆర్చరీ సంఘం (ఎఎఐ) వ్యవహారం
english title: 
archery

నిబంధనలకు నీళ్లు!

$
0
0
ఏడు పర్యాయాలు వింబుల్డన్ టైటిళ్లు సాధించిన మాజీ ప్రపంచ నంబర్‌వన్ రోజర్ ఫెదరర్‌కు నిబంధనల గురించి తెలియవని అనుకోవడానికి వీలులేదు. కానీ, తాజా వింబుల్డన్‌లో అతను ఉద్దేశపూర్వకంగానే నిబంధనలకు నీళ్లొదిలాడు. గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పోటీల్లో క్రీడాకారులంతా ఖచ్చితంగా తెల్లదుస్తులనే వేసుకోవాలి. బూట్లు, రిస్ట్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ కూడా తెల్ల రంగులోనే ఉండాలి. ఫెదరర్ తెల్ల బూట్లు వేసుకున్నప్పటికీ వాటి అడుగుభాగం నారింజ రంగులో ఉండడాన్ని నిర్వాహకులు తప్పుపట్టారు. వెంటనే వాటిని మార్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వింబుల్డన్‌లో స్టార్లు నిబంధనలను లక్షపెట్టకపోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది మహిళల సింగిల్స్ చాంపియన్ సెరెనా విలియమ్స్ రంగురంగుల షార్ట్స్ చేసుకోవడం వివాదానికి కారణమైంది. 2007లో ఫ్రాన్స్ క్రీడాకారిణి తతియానా గొలొవిన్ కూడా ఇలాంటి లోదుస్తులతోనే కనిపించింది. అమెరికాకు చెందిన బెథానీ మాటెక్ సాండ్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో గూగుల్ గ్లాస్ ధరించడం కూడా వివాదం రేపింది. నల్ల కళ్లద్దాలను పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధమా? కాదా? అన్న విషయాన్ని వింబుల్డన్ అధికారులు ఇంకా నిర్ణయించలేదు. కొంత మంది క్రీడాకారిణులు రకరకాల హెయిర్ బ్యాండ్స్‌తో దర్శనమిస్తున్నారు. సంప్రదాయానికి పెద్దపీట వేసే ఇలాంటి టోర్నీల్లో నిబంధనలను పట్టించుకోవకపోవడాన్ని అంతా తప్పుపడుతున్నారు.
ఏడు పర్యాయాలు వింబుల్డన్ టైటిళ్లు సాధించిన మాజీ
english title: 
rules

సమ న్యాయం..

$
0
0
సమ న్యాయం.. నెదర్లాండ్స్‌కు చెందిన మైకెల్ లాడ్రప్ తన కెరీర్‌లో బార్సిలోనా, రియల్ మాడ్రిడ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఒకసారి బార్సిలోనా తరఫున అతను ఆడినప్పుడు ఆ జట్టు రియల్ మాడ్రిడ్‌ను 5-0 తేడాతో చిత్తుచేసింది. మరో మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ తరఫున లాడ్రప్ ఆడాడు. అందులో మాడ్రిడ్ 5-0 తేడాతో బార్సిలోనాపై విజయం సాధించింది. మొత్తం మీద రెండు మ్యాచ్‌ల్లో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లు ఒకే ఆధిక్యంతో విజయాలు సాధించాయ. ఈ విధంగా అతను ఎవరినీ నొప్పించకుండా ఇరు జట్లకూ సమన్యాయం చేశాడు. వరుస విజయాలు ఇటలీ దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నమెంట్స్‌లో ఎసి మిలన్ జట్టు వరుసగా 58 విజయాలను నమోదు చేసుకొని రికార్డు నెలకొల్పింది. యూరోపియన్ కప్‌ను వరుసగా ఐదుసార్లు గెల్చుకున్న ఏకైక జట్టు రియల్ మాడ్రిడ్. అన్నదమ్ముల సవాల్ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ వా ఒక దశలో వరుసగా 87 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆతర్వాత అతనిని జట్టు నుంచి తొలగించారు. ఆ స్థానాన్ని స్టీవ్ వా సోదరుడు మార్క్ వా భర్తీ చేయడం విచిత్రం. 1992లో మార్క్ వా ఐదు వనే్డల్లో నాలుగుసార్లు రనౌట్ అయ్యాడు. మెరుపు వేగం.. ర్యాకెట్‌తో ఆడే ఆటల్లో అత్యంత వేగవంతమైనది బాడ్మింటన్. ఈ ఆటలో షటిల్ కాక్ చాలా వేగంగా ప్రయాణిస్తుంది. అంతర్జాతీయ బాడ్మింటన్ సమాఖ్య (ఐబిఎఫ్) 1934లో తొమ్మిది సభ్యదేశాలతో ఆరంభమైంది. ఈ సమాఖ్య ప్రకటించిన గణాంకాల ప్రకారం చైనాకు చెందిన డబుల్స్ స్పెషలిస్టు ఫు హైఫెంగ్ అత్యంత బలంగా స్మాష్ చేశాడు. అతను కొట్టిన షటిల్ కాక్ గంటకు 332 కిలోమీటర్లు (206 మైళ్లు) వేగంతో వెళ్లింది. కాగా, ఐబిఎఫ్‌లో 150 సభ్యదేశాలు ఉన్నాయి. వీటిలో అధికశాతం ఆసియా, ఐరోపా ఖండాలకు చెందినవే. ఒలింపిక్స్‌తో సహా మొత్తం తొమ్మిది మేజర్ ఈవెంట్స్‌ను ఐబిఎఫ్ గుర్తించింది. 1992లో ఈ క్రీడ ఒలింపిక్స్‌లో రంగ ప్రవేశం చేసింది.
పాప్ కార్న్
english title: 
pop corn
author: 
- మైత్రేయి

శివపార్వతి మృతదేహం అప్పగింత

$
0
0
చీమకుర్తి, జూన్ 30:మండలంలోని కెవి పాలెంలో శివ పార్వతి హత్యకు గురైన సంగతి పాఠకులకు విధితమే. శనివారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం ఉదయం రూరల్ సిఐ భూషణం ఆధ్వర్యంలో శవపంచనామా నిర్వహించారు. తదుపరి ఒంగోలు రిమ్స్‌కు చెందిన ప్రొఫెసర్, ఫోరెన్సిక్ నిపుణులు జివి రాజ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శ్రీరాములు ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి తహశీల్దార్ సమక్షంలో శివపార్వతి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఒంగోలు డిఎస్‌పి జాషువా ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేశారు. మొదటి నిందితుడు బ్రహ్మంను ఆదివారం సాయంత్రం కోర్టుకు హాజరుపరిచారు. వెంకయ్య, వాసు, రాజాలను కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులకు సహకరించారంటూ మండల వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షులు పమిడి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపిటిసి పుట్టా బ్రహ్మయ్యను, కొల్లూరి శింగయ్యను ముగ్గురిని 5,6, 7వ నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. వీరిని సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు డిఎస్‌పి తెలిపారు. కేసును త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసిన సిఐ భూషణం, ఎస్‌ఐలు భక్తవత్సల్‌రెడ్డి, ఆరోగ్యరాజ్, సిబ్బందికి రివార్డుల కోసం సిఫార్సు చేయనున్నట్లు డిఎస్‌పి తెలిపారు.
నిందితుల అరెస్టు
english title: 
shiva parvathi

ఎన్నికల నిర్వహణపై పోలీసుల కసరత్తు షురూ

$
0
0
మార్కాపురం, జూన్ 30: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించారు. మార్కాపురం డివైఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో డివిజన్‌లోని పలు మండలాల్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. గతంలో జరిగిన ఎన్నికల ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని ఆ గ్రామాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అప్పట్లో కేసుల్లో ఉన్న వారిని ముందస్తు బైండోవర్లు చేసుకుని స్థానిక తహశీల్దార్ వద్ద హాజరుపరచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవల ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో పోలీసులు, రెవెన్యూ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దీనితో జిల్లాఎస్పీ జిల్లాపరిధిలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనితో పోలీసులు గత చరిత్రను సేకరించి కేసుల్లో ఉన్న వారిపై బైండోవర్లు పెట్టడంతోపాటు సమస్యాత్మక గ్రామాల్లో అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో భారీఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. మార్కాపురం డివైఎస్పీ జి రామాంజనేయులు భూమితో మాట్లాడుతూ ఇప్పటికే రెవెన్యూ, మండలపరిషత్, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించడం జరిగిందని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని, రిజర్వేషన్ల కోటాలో వచ్చిన పంచాయతీలలో పెద్దగా ఇబ్బందులు ఉండవని, ఓసి రిజర్వేషన్ వచ్చిన పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
* సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల గుర్తింపు * ఘర్షణలు జరిగిన గ్రామాల్లో బైండోవర్లకు ప్రయత్నాలు * చర్యలు ప్రారంభించాం-డివైఎస్పీ రామాంజనేయులు
english title: 
police

మళ్ళీ పగిలిన సాగర్‌నీటి పైపులు

$
0
0
మార్కాపురం , జూన్ 30: కాంట్రాక్టర్ వైఫల్యమో..? అధికారుల నిర్లక్ష్యమో..? తెలియదు కానీ ప్రజలకు మాత్రం కష్టాలు తీరడం లేదు. మార్కాపురం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 58కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఎస్‌ఎస్ ట్యాంక్‌కు సాగర్ నీరు సరఫరా చేసే పైపులు మూడురోజులకో పర్యాయం పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోతుంది. వర్షాభావ పరిస్థితుల్లో తీవ్ర నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే వారి దాహార్తి తీర్చాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రభుత్వంపై పోరాటం సాగించి సాగర్‌నీటిని విడుదల చేయిస్తే ఆ నీరు పట్టణానికి చేరడానికి పలు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీనితో ప్రజల గొంతు తడిసే పరిస్థితులు కరువవుతున్నాయి. సాగర్‌జలాలు పట్టణానికి విడుదల చేసి మూడేళ్ల కాలంలో సుమారు 34 పర్యాయలు పైపులైన్లు పగిలి వారాల పర్యంతం నీటి సరఫరా నిలిచిపోయింది. గత వారంరోజుల కిందట కేశినేనిపల్లి సమీపంలోనిం పెద్దదోర్నాల కోల్డ్‌స్టోరేజ్ వద్ద పైపులు పగిలి నీటి సరఫరా నిలిచిపోగా అధికారులు మరమ్మతులు చేశారు. కాగా ఆదివారం అదే ప్రాంతానికి కొద్దిదూరంలో మరో పర్యాయం పైపులైన్లు పగిలిపోవడంతో మరో నాలుగురోజుల పాటు పట్టణానికి నీరు వచ్చే అవకాశం లేకుండా పోయింది. గత 40రోజులుగా పట్టణంలో నీటి సరఫరా జరుగక ట్యాంకర్ల ద్వారా అరకొరగా సరఫరా చేస్తున్నారు. సాగర్‌జలాలు విడుదల చేసి ఆదివారం నుంచి నీటి సరఫరా జరుగుతుందని పట్టణ ప్రజలు ఆనందపడుతున్న సమయంలో ఆదివారం సాయంత్రం అధికారులు పిడుగులాంటి వార్తను ప్రకటించారు. దీనితో పట్టణ ప్రజలు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపులైన్లు మరమ్మత్తులకు గురికాకుండా సక్రమంగా తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పట్టుకోసం ఒకరు.. పంతంకోంస మరొకరు.. పరువుకోసం ఇంకొకరు మార్కాపురం, జూన్ 30: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతుండటంతో ఒకపార్టీ పట్టుకోసం, మరోపార్టీ పంతం కోసం, ఇంకోపార్టీ పరువుకోసం కొట్టుమిట్టాడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తాము బలపరచిన అభ్యర్థులను గెలిపించుకొని పట్టు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని ఏర్పాటు చేసి ప్రజల్లో బలం ఉందని చెప్పుకునే నేతలు ఎలాగైనా విజయం సాధించి తమ పంతం నెగ్గుకోవాలని తాపత్రయ పడుతున్నారు. కాగా తొమ్మిదేళ్ళపాటు అధికారంలో ఉండి మరో తొమ్మిదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేపట్టిన తెలుగుదేశంపార్టీ పరువు నిలుపుకునేందుకు కుస్తీ పడుతున్నారు. ఇప్పట్లో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే అవకాశం లేదని భావించిన అన్ని రాజకీయపార్టీలు సాధారణ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించిన సమయంలో ఒక్కసారిగా పంచాయతీ ఎన్నికలు తెరపైకి రావడంతో ఇప్పుడెందుకు వచ్చాయిరా మాయదారి ఎన్నికలు అంటూ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఆ ఎన్నికలకు క్షేత్రస్థాయి మూలం స్థానిక సంస్థలు కావడంతో ఎలాగైనా తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని మూడుపార్టీలు ఎత్తులకుపైఎత్తులు వేస్తున్నారు. దీనితో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా పల్లెప్రాంతాల్లో మకాంలు వేసి అభ్యర్థుల ఖరారులో తలమునకలవుతున్నారు. ప్రధానంగా గెలుపుబాటలో ముందు ఉండేందుకు కాంగ్రెస్‌పార్టీకి చెందిన నేతలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక రెండవస్థానంలో తెలుగుదేశంపార్టీ చోటామోటా నాయకులందరిని సమీకరించుకొని తనదైన శైలిలో పోరుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఇటీవల ఏర్పాటైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో తమకు బలం ఉందని ఎలాగైనా స్థానిక సంస్థల్లో అధిక పంచాయతీలు గెలిపించుకొని సత్తా చాటుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. అధికార కాంగ్రెస్‌పార్టీలో మాత్రం శాసనసభ్యుల వద్ద మెప్పుపొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కాగా గ్రామీణ ప్రాంతానికి చెందిన ప్రజలు వివిధ పనులపై పగటిపూట పట్టణాల్లో సంచరిస్తుండగా రాజకీయ నేతలు రాత్రి సమయాల్లో గ్రామాల్లో మకాంవేసి గెలుపుకోసం చర్చలు జరుపుతున్నారు. ఏదిఏమైనా గత ఎన్నికల్లో రెండుపార్టీలు కావడంతో అనేక పంచాయతీలు ఏకగ్రీవం కాగా ప్రస్తుతం మూడు రాజకీయ పార్టీలు రంగంలో ఉండటంతో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య భారీగా తగ్గి మూడు ముక్కలాటగా మారే పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టు అధ్యాపకులను అర్ధనగ్న ప్రదర్శన ఒంగోలు, జూన్ 30: ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గౌర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆద్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద అధ్యాపకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరుతూ అసోసియేషన్ ఆద్వర్యంలో అధ్యాపకులు స్థానిక కలెక్టరేట్ వద్ధ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 7వ రోజుకు చేరాయి . ఈ సందర్భంగా ప్రభుత్వ మొండివైఖరి నశించాలని, ఎపిపిఎస్‌సి ద్వారా జెఎల్ నోటిఫికేషన్ ఆపాలని. అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేతబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. తొలుత అధ్యాపకులు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యానం చిన యోగయ్య యాదవ్ సందర్శించి అధ్యాపకులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యానం చిన యోగయ్య యాదవ్ మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోసం గత 7 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేయటం వల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు తరగతులు జరగడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం కలుగచేసుకొని అధ్యాపకుల సమస్యలను పరిష్కరించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కె సురేష్, ఆర్‌సి రంగయ్య, పి మాధవరావు, పి కరీమ్ ఖాన్, రసూలు, కాశీరత్నం, సుబ్బారెడ్డి, బాబూరావు, నరసారెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
* పట్టణంలో నిలిచిన తాగునీటి సరఫరా
english title: 
water pipes

ఎ.ఒ.బి.లో పోలీసుల తనిఖీలు

$
0
0
సీలేరు, జూన్ 30: ఆంధ్రా - ఒడిషా సరిహద్దుల్లో బి. ఎస్. ఎఫ్. పోలీస్ బలగాలు , గ్రేహౌండ్స్ పోలీస్ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ఫ్రభావిత ప్రాంతమైన సరిహద్దులో అణువణువుగా గాలింపులు చేపడుతున్నారు. ఆంధ్రాలో స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపధ్యంలో సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఎటువంటివి జరుగకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటి నుంచే పటిష్టమైన చర్యలు పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ బలగాలు చేపడుతున్నాయి. ఈనేపధ్యంలోనే సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండ,ఝాన్‌బాయ్, బలిమెల ప్రాంతాల్లో పోలీస్ బలగాలను మోహరించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. బి. ఎస్. ఎప్. అవుట్ పోస్టుల వద్ద అదనంగా బలగాలు సమకూర్చి మావోయిస్టుల నుంచి ఏ క్షణంలో దాడి జరిగినా సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు నిమగ్నమయ్యారు. ఎ. ఓ.బి.లో పోలీసులు పాగా కొనసాగుతూనే ఉంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సరిహద్దు ప్రాంతం అంతా పోలీసుల మయంగా మారింది.
ఆంధ్రా - ఒడిషా సరిహద్దుల్లో బి. ఎస్. ఎఫ్. పోలీస్
english title: 
aob

మళ్ళీ సమైక్య గళం!

$
0
0
విశాఖపట్నం, జూన్ 30: సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలా? లేక విడగొట్టాలా? అన్న అంశంపై సత్వర నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తోంది. ఇటువంటప్పుడే తెలంగాణ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. అయితే సమైక్యాంధ్ర ఉద్యమానికి ఇన్నాళ్ళూ నాయకత్వం వహించిన కావూరి ఇప్పుడు వౌనం వహిస్తున్నారు. గతంలో డిసెంబర్ తొమ్మిది ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమం పెద్దఎత్తున లేచింది ఉత్తరాంధ్ర నుంచే. పార్టీలకు అతీతంగా సమైక్య రాష్ట్రం కోసం అంతా ఉద్యమించారు. సమైక్యవాదానికి మద్దతు తెలిపిన అప్పటి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి కూడా ఉత్తరాంధ్రలో పర్యటించి, తమ వాదనను వినిపించారు. మళ్లీ ఇప్పుడు తెలంగాణ సెగ కాంగ్రెస్ అథిష్ఠానాన్ని తాకుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకుంటే, ఆ ప్రభావం సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులపై కచ్చితంగా పడుతుంది. దీన్ని తట్టుకోవాలంటే, సీమాంధ్ర నాయకులు సమైక్య రాష్ట్రం గురించి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా విశాఖ చేరుకున్న దిగ్విజయ్ సింగ్‌ను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి సమైక్యాంధ్రపై వినతులు అందచేశారు. అలాగే సమైక్యాంధ్ర జెఎసి నాయకులు కూడా దిగ్విజయ్‌ను కలిసి రాష్ట్రాన్ని విభజించవద్దంటూ వినతులు అందచేశారు. అయితే ఆయన నాయకులు ఆశించినంతగా స్పందించలేదు. అన్నింటికి ఓకె...లెట్ అజ్ సీ అంటూ సమాధానం చెప్పారు. దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం ఇవ్వడం వలన ప్రయోజనం ఉండదని భావించిన మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. అయితే ఆయన స్పందన అంతంతమాత్రంగా ఉండడంతో నిరాశకు గురయ్యారు. మరోపక్క తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అథిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, దానికి తామెలా ప్రతి స్పందించాలో గాదె వెంకటరెడ్డి, గంటా, శైలజానాథ్ ఆదివారం ఉదయం విశాఖలో సమావేశమై చర్చించారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణను వీరు ఏవిధంగా రూపొందిస్తారన్నది వేచి చూడాలి. సమైక్యవాదులతో హైదరాబాద్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటికీ మించి క్షేత్ర స్థాయిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ, ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది.
సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది
english title: 
general elections

విజయానికి బాసట సంక్షేమ పథకాలే

$
0
0
జి.మాడుగుల, జూన్ 30: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం ద్వారానే స్ధానిక సంస్ధల ఎన్నికలలో విజయం సిద్ధిస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. ఆదివారం ఆయన పాడేరు, జి.మాడుగుల మండలాల్లో విసృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు గావించారు. ఇందులో భాగంగా జి.మాడుగుల మండలం బందవీది గ్రామంలో 18 లక్షల రూపాయలతో నిర్మించనున్న పశువైద్య శాలకు శంకు స్ధాపన గావించిన అనంతరం జి.మాడుగుల మండల కేంద్రంలోని 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎ.టి.డబ్ల్యు.ఒ.కార్యాలయం, ప్రాధమిక అరోగ్య కేంద్రంలో 16 లక్షల 54 వేల రూపాయలతో నిర్మించనున్న జనరల్ వార్డ్‌లకు శంకు స్ధాపనలు గావించారు. అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం ద్వారానే పార్టీకి విజయం వరిస్తుందని అన్నారు. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రజలు చూపుతున్న ఉత్సాహమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో గల ఆదరణ తెలియజేస్తుందని అన్నారు. అయితే ప్రతీ పంచాయతీలో కాంగ్రెస్ నాయకులు తారతమ్యాలు విడనాడి సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలే తప్ప పార్టీకి వెన్నుపోటు పొడిచే విదంగా వ్యవహరించి ఇతర పార్టీలు అవకాశాన్ని చేజిక్కించుకునే విదంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ శ్రమించి పనిచేసిన నాడే విజయం సిద్ధిస్తుంది తప్ప ఒకరిపై ఒకరు ఆదిపత్యం కోసం తపిస్తే ఓడిపోవడమే కాకుండా చేసిన కృషికి ఫలితం లేకుండా పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఎట్టి పరిస్ధితులలోనూ మాట పట్టింపులకు పోకుండా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు విజయానికి బాటలు వేశాయని, అయితే వాటిని ప్రజలకు చేరవేసే గురుతర బాధ్యత కార్యకర్తలపైనే ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే కష్టించి పనిచేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు ఓట్లు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారం వెలగబెట్టిన మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వంజంగి కాంతమ్మ అధికార దాహంతో పార్టీ ఫిరాయించడంతో పాటు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీపై విమర్శలు గుప్పించడం అధికార తాపత్రయం తప్ప వేరేమి కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక పదవులు అలంకరించిన ప్రస్తుత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం అధికార దాహంతోనే పాదయాత్రలు చేపడుతున్నారని షర్మిల పాదయాత్రపై విమర్శించారు. ఇటువంటి అధికార వాంచతో విమర్శలు గుప్పిస్తున్న నాయకులు విమర్శలను తిప్పికొట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీ అనే అంశాన్ని ప్రజలకు చేరవేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ద్వారా చెప్పింది చేస్తాం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాల్సిన భాద్యత కార్యకర్తల భుజస్కంధాలపైనే ఉందని బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్శయ్య, కుడుముల సత్యనారాయణ, చిన్నాచారి, సార మన్మధరావు, చిన మత్య్సకొండబాబు, ఎస్.ప్రసాద్, సోమలింగం, చిన్నబ్బాయిచారి, రెడ్డిబాబు, రమణ, ఈశ్వరరావు, చిన్నుల దొర, అప్పారావు, బత్తిరి రవిప్రసాద్, సీదరి మంగ్లన్న దొర, బోద నారాయణ, గంపరాయి సూరయ్య, రొబ్బా ఉషారాణి, కిష్టవేణి, కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు
english title: 
welfare schemes

చెరకుకు గిట్టుబాటు ధర ఇప్పించండి

$
0
0
చోడవరం, జూన్ 30: వ్యవసాయ పెట్టుబడులు పెరిగి అప్పుల పాలవుతున్నామని చెరకు రైతులు మరోప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌సోదరి షర్మిల ముందు వాపోయారు. ఆదివారం చోడవరం బస నుండి తొమ్మిది గంటలకు షర్మిల తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. యాత్ర విజ్జపుసోమేశ్వరరావు బంగ్లా, గజపతినగరం, గోవాడ, అంభేరుపురం, వెంకన్నపాలెం, నర్సాపురం వరకు సాగింది. అనంతరం విశ్రాంతికి ఉపక్రమించారు. ఈ పాదయాత్రలో స్థానిక పెద్దమదుం వద్ద పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు చెరకు గడలను తెచ్చి ఆమెకు చూపుతూ గిట్టుబాటు ధరలు లేక చెరకు రైతులు చితికిపోయామంటూ చూపించారు. దీంతో మీకు టన్ను చెరకుకు ఎంత ఇస్తే గిట్టుబాటు అవుతుందని షర్మిల రైతులను అడిగారు. టన్నుకు 2500 ఇస్తే గిట్టుబాటు కాదా అని రైతులను ప్రశ్నించారు. అదీలేదు టన్ను చెరకును పెంచుతామని చెప్పడమే తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని రైతులు వాపోయారు. మన ప్రభుత్వం వస్తుంది కష్టాలు తీరుతాయంటూ ఆమె చెరకు రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం గోవాడ సుగర్స్ మెయిన్ గేటు వద్ద ఫ్యాక్టరీ కోజనరేషన్ విస్తరణ కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి విస్తరణ కోసం ప్రారంభించిన శిలాఫలకాన్ని నియోజకవర్గ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావుషర్మిలమ్మకు చూపుతూ కిరణ్‌కుమార్ రెడ్డి ఈ అభివృద్ధి పనులకోసం పట్టించుకోవడం లేదని తెలిపారు. దీంతో త్వరలో తప్పక మనందరికీ మంచిరోజులొస్తాయని, ఆగిపోయిన అభివృద్ధి పనులు జరుగుతాయని ఆమె బలిరెడ్డికి తెలిపారు. అంతకుముందు చోడవరం శివారు బసవద్ద నుండి ప్రారంభించిన పాదయాత్రలో గజపతినగరం, అంభేరుపురం, వెంకన్నపాలెం, నర్సాపురం, ఆర్‌ఆర్ పేట, సీమునాపల్లి తదితర గ్రామాల్లో వైఎస్‌ఆర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఆదివారం సాయంత్రం విశ్రమం అనంతరం సీమునాపల్లి, రాయపురాజుపేట మీదుగా కోటపాడుకు పాదయాత్ర సాగింది. ఈకార్యక్రమంలో ఆమె వెంట ఆ పార్టీనాయకులు బలిరెడ్డి సత్యారావు, అన్నంరెడ్డి అదీప్‌రాజు, అప్పికొండ లింగబాబు, మళ్ల శ్రీనివాసరావు, అల్లం రామఅప్పారావు, బివిఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ‘కాంగ్రెస్‌లోనే యాదవులకు సముచిత స్థానం’ కశింకోట, జూన్ 30: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే యాదవులకు సుముచిత స్థానం కలుగుతుందని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక కోదండసీతారామ కళ్యాణ మండపంలో ఆదివారం మండల యాదవసంఘం అధ్యక్షులు పంచదార్ల సూరిబాబు కాంగ్రెస్‌పార్టీలో చేరిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదవులకు కాంగ్రెస్ ప్రభు త్వం అన్నివిధాలుగా సముచిత స్థానం కల్పిస్తుందని, విద్యాశాఖా మంత్రి పార్ధసారధి, రెవెన్యూశాఖా మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రవర్తి వంటివారుకి కాంగ్రెస్‌పార్టీ సరైన గుర్తింపు ఇచ్చిందన్నారు. పార్టీలో చేరిన పంచదార్ల సూరిబాబు మాట్లాడుతూ జిల్లా మంత్రి గంటా మండలం చేస్తున్న అభివృద్ధి పనులు అలాగే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెడుతున్న ఆకర్షణీయమైన పథకాలను చూసి పార్టీలో కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేసారు. అయితే యాదవులకు ఏ పార్టీ న్యాయం చేయలేదని, కాంగ్రెస్‌పార్టీయే న్యాయం చేయగలదనే నమ్మకంతో తామంతా పార్టీలో చేరుతున్నట్లు సూరిబాబు తెలిపారు. తమకు ఇళ్లస్థలాలులేవని, హౌసింగ్ స్కీంలు, ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని మంత్రి గంటా ఎదుట ఆవేదన వ్యక్తం చేసారు. హౌసింగ్ స్కీంలు, నిరుపేదలైన వార్కి ఇళ్లస్థలాలు మంజూరు చేస్తామని మంత్రి ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. యాదవసంఘం నాయకులు పంచదార్లసూరిబాబుకు మంత్రి పూలమాల, పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మహిళాయాదవ్ మంత్రి గంటాకు మేక పిల్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షులు కాయల మురళీధర్, తిరుశోళ్లరామకృష్ణ, బుదిరెడ్డి చిన్నా, డిసిసిబి డైరక్టర్ శిదిరెడ్డి శ్రీనివాసరావు, గొంతిన అప్పలనాయుడు, శిష్టి అప్పారావు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు. వౌలిక సదుపాయాలు, విద్యకు ప్రాధాన్యం పాడేరు, జూన్ 30: గిరిజన గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. ఆదివారం పాడేరు, జి.మాడుగుల మండలాలలో పర్యటించిన ఆయన ముందుగా పాడేరు మండలంలోని కోట్లగరువు గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామస్థుల మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలో పాఠశాల, సి.సి.రోడ్లు, గ్రావిటీ పథకం, మినీ అంగన్ వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే విదంగా ఆర్.డబ్ల్యు. ఎస్.అధికారులకు గ్రావిటీ పథకం నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అదేశించారు. గ్రామంలో ఫించనుకు అర్హులైన వారికి ఫించన్లు అందించే ఏర్పాట్లు చేయాలని అదేశాలు జారీ చేశారు. అనంతరం స్ధానిక తలారీ సింగ్ వద్ద 15 లక్షల రూపాయలతో సబ్ ప్లాన్ నిధులతో నిర్మించిన సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయానికి శంకుస్ధాపన గావించిన అయన మద్దుల బంద గ్రామంలో తొమ్మిది లక్షల రూపాయల జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులతో నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రానికి, బొక్కెళ్లు గ్రామంలో 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న తాగునీటి పథకానికి శంకుస్ధాపనలు గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యతను ఇస్తున్నట్టు తెలిపారు. అదే విదంగా గిరిజన గ్రామాల్లో వౌళిక వసతులు కల్పనతో పాటు గ్రామాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా సమాన ప్రాధాన్యతతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారుల కార్యాలయాలు అన్ని సౌకర్యాలతో నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. సహాయ గిరిజన సంక్షేమ శాఖ అధికారుల కార్యాలయం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా పాడేరులో నిర్మిస్తున్నట్టు బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్ బోదనారాయణ, సతీష్ వర్మ, ఆర్.డి.ఒ. ఎం.గణపతిరావు, ఐ.టి.డి.ఎ.సహాయ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్.నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు బి.మల్లిఖార్జున రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ శాఖల కార్య నిర్వాహక ఇంజనీర్లు ఎం.ఆర్.జి. నాయుడు, బి.అప్పలనాయుడు, గిరిజన సంక్షేమ శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ డి.వి.ఆర్. ఎం.రాజు, తహశీల్ధార్ రామలింగ స్వామి, జి.సి.సి. డివిజనల్ మేనేజర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్షత్రియులు ఐక్యం కావాలి విశాఖపట్నం, జూన్ 30: క్షత్రియులు దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ అన్నా రు. స్థానిక సీతమ్మధారలో క్షత్రి సం క్షేమ సమితి కొత్తగా నిర్మించిన భవనా న్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ క్షత్రియుల కో సం ఇటువంటి భవనాన్ని నిర్మించడం ముదావహమని అన్నారు. 2008లో విశాఖలో జరిగిన క్షత్రియ సమ్మేళనానికి వచ్చానని, ఆ తరువాత మళ్లీ ఇప్పు డు వచ్చానని అన్నారు. కేంద్ర ప్రభు త్వం అన్ని వర్గాల వారికీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నా రు. అలాగే క్షత్రియుల్లో పేదలకు కేం ద్రం సహాయం అందించాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి, ఎంపి సుబ్బరామిరెడ్డి, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షుడు వెంకటపతిరాజు, కార్యదర్శి రాఘవరాజు, భవన నిర్మాణానికి ఆర్థిక సహా యం అందించిన అల్లూరి సీతారామరాజు, ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ పెట్టుబడులు పెరిగి అప్పుల పాలవుతున్నామని చెరకు
english title: 
remunerative prices

మన్యంలో ప్రశాంత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

$
0
0
నర్సీపట్నం,జూన్ 30: విశాఖ ఏజన్సీలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పకడ్భందీ చర్యలు చేపడుతున్నామని జిల్లా అదనపు ఎస్పీ దామోదర్ (ఆపరేషన్స్) తెలిపారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలను తరలిస్తామన్నారు. ఏజన్సీలో ఎన్నికల నిర్వహణకు ఏ మేరకు పోలీసు బృందాలు అవసరమో ఇప్పటికే రూరల్ ఎస్పీ సమావేశం ఏర్పాటు చేసి వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ మన్యంలో గిరిజనులు స్వేచ్ఛగా ఓట్లు వేసుకునే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. ఎన్నికల పోలింగ్‌కు మావోయిస్టులు ఎటువంటి అవాంతరాలు కల్పించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇతర ప్రాంతాల నుండి అదనపు బలగాలను మన్యానికి తరలిస్తామన్నారు. గిరిజనులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు అవసరమైతే హెలికాప్టర్లను వినియోగిస్తామన్నారు. ఇప్పటికే మన్యంలో అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామలను గుర్తించామన్నారు. రాజకీయ ఘర్షణలు, మావోయిస్టుల కదలికలున్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. చింతపల్లి, పాడేరు ఘాట్‌రోడ్లులో ప్రత్యేక పోలీస్ బృందాల ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలతో తనిఖీలు చేస్తున్నామన్నారు. మందుపాతర్లను గుర్తించేందుకు వీలుగా పోలీసు డాగ్స్ పార్టీలు తిరుగుతున్నాయన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం ఈ తనిఖీలు చేపడుతున్నట్లు దామోదర్ వివరించారు. * మావోలకు విరాళాలిస్తే కఠిన చర్యలు మైదాన ప్రాంతాల్లో ఉంటూ గిరిజన ప్రాంతంలో వ్యాపారాలు సాగిస్తున్న వ్యాపారులు మావోయిస్టులకు విరాళాలు, ఇతర సరుకులు అందజేస్తే అటువంటివారిపై కేసులు నమోదు చేస్తామని అదనపు ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు నిధుల కోసం కొంత మంది వ్యక్తులను డిమాండ్ చేస్తుండగా, మావోయిస్టుల పేరుతో మరి కొంత మంది నకిలీ మావోయిస్టులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని, వ్యక్తుల ద్వారా డబ్బు పంపించాలని పలు రూపాల్లో నిధుల కోసం మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇటువంటి సందర్భాల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మావోయిస్టులకు నిధులు సమకూర్చే వారి వివరాలు ప్రస్తుతానికి తెలియనప్పటికీ, ఎన్‌కౌంటర్, లొంగుబాట్లు సమయాల్లో బయటపడుతుందన్నారు. ఏజన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నంలో కొత్త వ్యక్తులు, యువకులకు ఇళ్ళు అద్దెకు ఇస్తే వారి వివరాలు ముందుగా తెలుసుకోవాలన్నారు. మావోయిస్టులు, వారి సానుభూతి పరులు పట్టణాల్లో ఇళ్ళు అద్దెకు తీసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి వారికి ఇళ్ళు అద్దెకు ఇస్తే ఇంటి యజమానులపై మావోయిస్టులపై పెట్టే కేసులనే నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేసారు. రేపు మాడుగులలో మంత్రుల పర్యటన చోడవరం, జూన్ 30: మాడుగుల నియోజవకవర్గంలో గిరిజన సంక్షేమ శాఖామంత్రి పి. బాలరాజు, ఓడరేవుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావులు జూలై 2వ తేదీన మాడుగుల నియోజకవర్గంలో పర్యటించనున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేసారు. 2వ తేదీన 11 గంటలకు మాడుగుల నియోజకవర్గంలో కింతలి పిహెచ్‌సిని సందర్శించి, 12.30గంటలకు మండల సమాఖ్య భవనం ప్రారంభంతోపాటు మూడు గంటలకు చీడికాడ మండలంలోని మోడల్ స్కూల్‌ను ప్రారంభిస్తారని ఆయన తెలియజేసారు. అలాగే సాయంత్రం నాలుగు గంటలకు ఐదుకోట్ల 30లక్షలతో నిర్మించిన శిరిజాం వంతెనను ప్రారంభిస్తారన్నారు. వరహాపురంలో పార్టీవర్గ సమావేశంలో పాల్గొంటారన్నారు. ఆరుగంటలకు వరహాపురంలోని మెర్క్యురీ లైట్లను ప్రారంభిస్తారని కార్యాలయ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేసారు. 3న విశాఖ వస్తున్న చంద్రబాబు * పంచాయతీ ఎన్నికలపై సదస్సు విశాఖపట్నం, జూన్ 30: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జులై మూడో తేదీన విశాఖ వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో ఆయన ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన విశాఖలో జరిగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల పార్టీ కార్యకర్తలు, నాయుకులతో సమావేశమవుతారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఆయన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆహుతులను అలరించిన చిన్నారుల సుందర కాండ బృంద గానం సబ్బవరం, జూన్ 30: మండలంలోని గొల్లలపాలెం వద్ద శ్రీనగర్ కాలనీ సప్తరుషీ వేద పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన సంగీత జనకులం స్టీల్ ప్లాంట్ విద్యార్ధుల సుందర కాండ సంగీత విభావరి ఆహూతులను ఆధ్యంతం అలరించింది. ఈసందర్భంగా వారు పలు భక్తిగీతాలను రసవత్తరంగా ఆలాపన చేశారు. సంగీత అభిమానులను అమితంగా ఆకర్షించిన ఈకార్యక్రమం ఇక్కడి సప్తరుషీ వేద పాఠశాల 4వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినట్లు వ్యవస్ధాపక అధ్యక్షులు మాధవ శర్మ తెలిపారు. అనంతరం స్టీల్ ప్లాంట్ సంగీత జనకులం సంగీత పాఠశాల గురువులు పి.దుర్గారావును ఘనంగా సన్మానించారు.
విశాఖ ఏజన్సీలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో
english title: 
manyam

మాదిగల అభివృద్ధికి వర్గీకరణే పరిష్కారం

$
0
0
విశాఖపట్నం, జూన్ 30: మాదిగల అభివృద్ధికి వర్గీకరణ ఒక్కటే పరిష్కార మార్గమని జాతీయ రహదారుల కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అసెంబ్లీ హాలులో ఆదివారం నిర్వహించిన మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాదిగ బిడ్డగా, కేంద్రంలో మంత్రిగా ఉన్న తాను ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అండగా నిలుస్తానన్నారు. ఈ వర్గీకరణకు యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అనుకూలమేనని, అందువలనే ఉషా మెహరా కమిషన్‌ను వేసారన్నారు. 2012లో సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్‌లో సైతం ఎన్నికల మ్యానిఫెస్టోలో వర్గీకరణను పెట్టారన్నారు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమన్నారు. మాదిగ జాతి భవిష్యత్, కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే రెండు అంశాల కోసం తాను పాటుపడతానన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిందిగా మాదిగలు నిర్వహిస్తున్న ఉద్యమం న్యాయమైనదిగా పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ మాట్లాడుతూ మాదిగల తరఫున ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వే సత్యనారాయణకు తామంతా విలువనిస్తున్నామన్నారు. దీనిని గౌరవించి కేంద్రంలో యుపిఎ సర్కార్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రంలో కోటి మంది మాదిగల ఆగ్రహాన్ని కాంగ్రెస్ చవిచూడాల్సి వస్తుందన్నారు. అలాగే రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు తరువాత గడువు ఇచ్చే అవకాశం లేదన్నారు. ఎందుకంటే శీతాకాల సమావేశాలు జరుగుతాయనే విశ్వాసం లేదని, బిల్లు వచ్చే నమ్మకం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌పార్టీకి మాదిగలు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. 2004వ సంవత్సరం నుంచి కేంద్రంలోను, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిస్తుందని, యుపిఏ రెండు విడుతల్లో బిల్లు పెట్టకపోతే మూడవసారి అధికారంలోకి వచ్చే నమ్మకం లేదన్నారు. ఒకవేళ అధికారంలోకి వచ్చినా చేస్తారని విశ్వసించలేకపోతున్నామన్నారు. అలాంటి పరిస్థితిల్లో మాదిగలు తమదారి తాము చూసుకోవాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే భవిష్యత్ లేదనేది రూడీ అవుతందని, మాదిగలు ఉపకులాలు ఒకే కులంగా మెజారిటీ కులంగా ఉన్నారన్నారు. మాదిగ ఉపకులాల జనాభా పది శాతం ఉండగా, ఇందులో మాదిగలు కోటి వరకు ఉన్నారన్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ చేయూతనిస్తే చేయి అందుకుంటూ అండగా నిలుస్తామని, మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటామన్నారు. రాజకీయ నిర్ణయం ముందు ఉద్యమపరంగా వత్తిడి తీసుకువచ్చేందుకు ఆగస్టు,సెప్టెంబర్ మాసాల్లో అనేక రాపాల్లో ఉద్యమ కార్యక్రమాలను రూపొందించామన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నేత కృష్ణమాదిగ నాయకత్వంలో వర్గీకరణ కోసం చేసిన ఉద్యమానికి 19 ఏళ్ళు పూర్తయ్యిందన్నారు. అయిన పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించలేదన్నారు. 19 ఏళ్ళ ఉద్యమాల్లో ఎంతోమంది అమాయక మాదిగలు అశువులు బాసారని ఆందోళన వ్యక్తంచేశారు. రెల్లి ఉపకులాల ప్రతినిధి డాక్టర్ ఆడమ్స్ మాట్లాడుతూ మాదిగలకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆకలితో ఉన్నవారు ఐక్యమత్యం ఎలా సాధించగలరని ప్రశ్నించారు. మహిళా నాయకురాలు అనిత సకుర మాట్లాడుతూ మాదిగల సమస్యల పరిష్కారానికి వెంట ఉంటానని, తన వంతు సహాయ, సహకారాలుంటాయని హామీనిచ్చారు. ఏయు ఎస్సీఎస్టీ, బిసి సి నాన్ టీచింగ్ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మల్లిపూడి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటరు కొట్ర కన్నారావు, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, పెద్దాడ ప్రకాశరావు మాదిగ, మున్నంగి నాగరాజు మాదిగ, విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం తీర్మానాలు చేశారు.
మాదిగల అభివృద్ధికి వర్గీకరణ ఒక్కటే పరిష్కార మార్గమని జాతీయ
english title: 
sarvey

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలా?

$
0
0

తెలంగాణ రాదు..ఏమైనా జరగొచ్చు!

$
0
0
హైదరాబాద్, జూలై 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశం లేదని టిడిపి సీమాంధ్ర నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుందని వారు చెబుతున్నారు. ఏదో జరిగిపోతున్నట్టు కాంగ్రెస్ హడావుడి చేస్తోందే తప్ప తెలంగాణ ఏర్పాటు చేసే ఉద్దేశం ఆ పార్టీకి లేదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేసేట్టుగా ఉంటే ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ వచ్చే వారు కాదని, రాష్ట్రానికి చెందిన నాయకులే ఢిల్లీలో ఉండేవారని, సచివాలయం ఢిల్లీకి మారి ఉండేదని వర్ల వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే తప్ప సమస్య పరిష్కరించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు. మరోవైపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని టిడిపి అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. చార్‌ధామ్ యాత్రీకుల పరిస్థితిపై రోజుకు రెండుసార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న చంద్రబాబు మాత్రం తెలంగాణ అంశంపై మాత్రం వీరితో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. అయితే ఢిల్లీ పరిణామాలను బాబు జాగ్రత్తగా గమనిస్తున్నారని, ఎలాంటి నిర్ణయం వెలువడినా ధైర్యంగా ఎదుర్కోవాలనే ధృడ నిర్ణయంతో ఆయన ఉన్నారని టిడిపి నాయకులు చెబుతున్నారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ప్రాంతాల్లోనూ గణనీయమైన స్థాయిలో విజయం సాధించడం ద్వారా టిడిపి బలం పెరిగిందనే నమ్మకం కలిగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
‘దేశం’ నేతల్లో భిన్నాభిప్రాయాలు
english title: 
telangana raadu

త్వరలో బెజవాడలో సమైక్యాంధ్ర సభ

$
0
0
విజయవాడ, జూలై 1: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ వాదానికి తలొగ్గకుండా రాష్ట్రం సమైక్యంగా ఉంటుందంటూ తక్షణం ప్రకటన చేయాలని సోమవారం నాడిక్కడ జరిగిన సమైక్యాంధ్ర సంరక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. సమితి రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి అధ్యక్షత జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని జెఏసిలతో కలిపి త్వరలోనే విజయవాడలో సమైక్యాంధ్ర సాధన సభ భారీగా నిర్వహించాలని తీర్మానించారు. ఈలోగా రాజకీయ పక్షాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరి సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకుని ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే ప్రకటన చేయాలని సమావేశంలో నాయకులు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని ఓ తీర్మానంలో కోరారు. ఈ సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి కొణిజేటి రమేష్, కృష్ణా జిల్లా కార్యదర్శి కొల్లూరు వెంకటేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొన్నారు. తీరు మారకుంటే భౌతికదాడులే విశాఖపట్నం: సీమాంధ్ర ప్రజాప్రతినిధుల తీరు మారకపోతే వారిపై భౌతికదాడులు తప్పవని సమైక్యాంధ్ర పొలిటికల్ జెఎసి రాష్ట్ర కన్వీనర్ జెటి రామారావు హెచ్చరించారు. చెప్పుల దండలు వేయడంతో పాటు, ఇళ్ళ ఎదుట నల్ల జెండాలతో ఆందోళనలు చేపడతామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విశాఖలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిసేందుకు వెళుతున్న జెఏసి ప్రతినిధులను పోలీసులు సోమవారం తెల్లవారుజామున ముందుగానే అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో ఆందోళనకారులు తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జెఏసి రాష్ట్ర కన్వీనర్ జెటి రామారావు మాట్లాడుతూ దిగ్విజయ్‌సింగ్ తాను బస చేసే ప్రాంతానికి రమ్మని చెబితే ఉదయం ఆరు గంటలకు తాము సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు అంది వచ్చిన అవకాశాన్ని నేలపాలు చేశారన్నారు. కీలక సమయంలో కనీసం ఉద్యమకారులకు దిగ్విజయ్‌ని కలిసి వివరంగా మాట్లాడే అవకాశం కల్పించలేకపోయారన్నారు. దిగ్విజయ్‌సింగ్‌కు మిలియన్‌మార్చ్, సాగరహారం, చలో అసెంబ్లీ ఉద్యమాల్లో జరిగిన విగ్రహాల విధ్వంసం, మీడియా వాహనాల దగ్ధం తదితర సంఘటనల చిత్రాలకు సంబంధించిన ఫొటోలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి వివరించాలనేది తమ ఉద్దేశంగా చెప్పారు. టి నాయకుల విద్వేష ప్రకటనలు, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, కెసిఆర్ అండ్ కో అవినీతి, అక్రమాలు, బెదిరింపు తదితర అంశాలతో పూర్తిస్థాయిలో వివరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రజల తరపున నాయకులుగా ఉండాల్సన వారంతా దళారులుగా మారారన్నారు. పది లక్షల సంతకాల సేకరణ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో సోమవారం విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమైక్యాంధ్ర విద్యార్థి యువజన జెఎసి చైర్మన్ ఆరేటి మహేష్, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవిందరావు సంయక్త ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణపై బిజెపి, సిపిఐ వైఖరి మార్చుకోకపోతే పార్టీ ఆఫీసులు ముట్టడిస్తామని హెచ్చరించారు. కిషన్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం సమైక్యాంధ్ర 14 యూనివర్శిటీల కమిటీ ప్రతినిధి కాంతారావు ఆధ్వర్యంలో ఏయు బయట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. నెల్లూరులో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ప్రతినిధులపై బిజెపి నేతల దాడికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అదే విధంగా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్లనే రాష్ట్రంలో విభేదాలు తలెత్తుతున్నాయని, రాష్ట్ర అగ్నిగుండంగా మారే పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన జరగదంటూ ప్రకటించాలని డిమాండ్ చేశారు. (చిత్రం) సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో సంతకాలు సేకరిస్తున్న దృశ్యం
సంరక్షణ సమితి సమావేశంలో నిర్ణయం * రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానం
english title: 
unity

దిగ్విజయ్ నివేదిక అందాకే తెలంగాణపై నిర్ణయం

$
0
0
రాజమండ్రి, జూలై 1: అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తెలంగాణ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, వీటి తరువాత ఆయన అధిష్ఠానానికి ఒక నివేదికను సమర్పించే అవకాశం ఉందన్నారు. ఈ నివేదిక తరువాత కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులే ఉన్నాయని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ అంశంపై సభలు నిర్వహిస్తున్నాయన్న అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినపుడు, అందరికీ వాక్ స్వాతంత్య్రం ఉందని, ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకోవచ్చన్నారు. తన ఢిల్లీ పర్యటనకు ప్రత్యేకత ఏమీ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రిని, కేంద్ర హోం మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని కలిశానన్నారు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. ఉత్తరాఖండ్ ప్రకృతి విలయతాండవంలో బాధితులను ఆదుకోవడానికి సైన్యం, జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందాలు, పోలీసులతో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది విశేష సేవలందిస్తున్నారని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న మన రాష్ట్ర ప్రజలను ఆదుకోవటంలో మన రాష్ట్ర ప్రభుత్వం, ఇతరులు విశేషంగా కృషిచేశారని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గోదావరిలో అత్తగారి అస్తికలు నిమజ్జనం ఇటీవల కన్నుమూసిన గవర్నర్ నరసింహన్ అత్తగారి అస్తికలు సోమవారం గోదావరిలో నిమజ్జనం చేశారు. రాజమండ్రిలోని పుష్కర్‌ఘాట్‌లో పూజలు నిర్వహించిన అనంతరం గవర్నర్ నరసింహన్ దంపతులు అస్తికలు నిమజ్జనం చేశారు. హైదరాబాద్ నుండి విమానంలో రాజమండ్రి చేరుకున్న గవర్నర్ దంపతులు అస్తికల నిమజ్జనం అనంతరం మళ్లీ విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
* గవర్నర్ నరసింహన్ స్పష్టీకరణ
english title: 
governor

సిబిఐపై ఎవరూ ఒత్తిడి తేలేరు

$
0
0
విశాఖపట్నం, జూలై 1: సిబిఐపై ఎవరూ ఒత్తిడి తేలేరని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం బిజెపికి అలవాటుగా మారిందన్నారు. సోమవారం ఉదయం విశాఖలో తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ అసత్య ప్రచారాలతో పబ్బం గడుపుకునేందుకు బిజెపి యత్నిస్తోందన్నారు. బిజెపి నక్కజిత్తుల పార్టీ అని ఆయన విమర్శించారు. ఆ పార్టీకి చెందిన గోపినాధ్ ముండే ఎన్నికల వ్యయంపై వ్యాఖ్యానించి తన గొయ్యి తానే తవ్వుకున్నారన్నారు. సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఇన్వ్‌స్టిగేషన్ అనే బిజెపి ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాస్తవానికి సిబిఐ స్వయం ప్రతిపత్తిగల సంస్థ అని, దానిపై ఎవరు ఒత్తిడి తేలేరని ద్విగిజయ్ సింగ్ అన్నారు. కాగా దిగ్విజయ్ సింగ్ సోమవారం ఉదయం 8.30కు విశాఖ నుండి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఆయన ఎక్కిన విమానం టేక్ ఆఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు తీవ్ర ఆస్వస్థకు గురికావడంతో చికిత్స నిమిత్తం అతనిని కిందకు దించారు. విమానం అరగంట ఆలస్యంగా బయలు దేరింది. రైల్ రోకో కేసులో టిడిపి ఎమ్మెల్యేలకు వారెంట్లు హైదరాబాద్, జూలై 1: తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా రైల్ రోకో చేసినందుకు 11 మంది తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలకు సోమవారం రైల్వే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో తెలంగాణ జెఎసి రైల్ రోకోకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు సికింద్రాబాద్ స్టేషన్‌లో రైళ్లను నిలిపి వేశారు. అయితే రైల్వే కోర్టు విచారణకు ఎమ్మెల్యేలు హాజరుకాక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. విచారణకు హాజరు కావాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. నాగం జనార్దన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన రైల్ రోకోలో దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, దయాకర్ రెడ్డి, వేణుగోపాలా చారి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. వీరందరికీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. 80 మంది వరద బాధితులను తీసుకొచ్చిన టిడిపి ఉత్తరాఖండ్ చార్‌ధామ్ వరదల్లో చిక్కుకున్న 80 మంది యాత్రికులను టిడిపి ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకు వచ్చింది. యాత్రికులతోపాటు టిడిపి ఎంపిల బృందం టిడిపిపి నాయకులు నామా నాగేశ్వరరావు నాయకత్వంలో హైదరాబాద్ చేరుకుంది. యాత్రికులంతా తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఎంపిలను ఆదేశించారు. గన్‌మెన్లను ఇవ్వండి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు గతంలో ఇచ్చిన విధంగా ఇద్దరు గన్‌మెన్లను భద్రత కోసం ఇవ్వాలని కోరుతూ టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఇంటిలిజెన్స్ అదనపు డిజిపి మహేందర్‌రెడ్డికి లేఖ రాశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి వర్లకు ముప్పు ఉందని, టిడిపిలో ఆయన ముఖ్యమైన నాయకుడని లేఖలో బాబు పేర్కొన్నారు. వర్లకు సెక్యురిటీ అవసరం లేదని విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ చేసిన సూచన మేరకు గన్‌మెన్లను తొలగించారన్న బాబు.. పార్టీ కోసం వర్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారని, దీనిని దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీ కొనసాగించాలని కోరారు. మాట తప్పింది టిడిపినే * అనర్హత వేటుపై ఎమ్మెల్యేల వాదన హైదరాబాద్, జూలై 1: తెలంగాణ అంశంపై మాట తప్పిన టిడిపికి తనపై అనర్హత వేటు వేయాలని కోరే హక్కు లేదని టిడిపికి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన గంగుల కమలాకర్ వాదించారు. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ సోమవారం పిటిషనర్, కౌంటర్ పిటిషనర్‌ల వాదనలు విన్నారు. గంగులపై అనర్హత వేటు వేయాలని పిటిషనర్ టిడిపి ఎమ్మెల్యే డి నరేంద్ర స్పీకర్‌ను కోరారు. అయితే 2009 ఎన్నికల్లో టిడిపి తెలంగాణకు హామీ ఇచ్చిందని, తరువాత మాట తప్పిందని, తాము ఆ మాటకే కట్టుబడి ఉన్నామని గంగుల తెలిపారు. మాట తప్పిన టిడిపికి తనపై అనర్హత వేటు వేయాలని కోరే అధికారం లేదన్నారు. కాగా, ఎమ్మెల్యేలు కె హరీశ్వర్ రెడ్డి, చిన్నం రామకోటయ్య, వేణుగోపాలా చారి సోమవారం విచారణకు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను దిక్కరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వీరిపై వేటు వేయాలని టిడిపి ఫిర్యాదు చేసింది. దీంతో టిడిపి వాదనల వివరాలు తమకు అందజేయాలని, అవి అందిన తరువాత మరోసారి తమ వాదనలు వినిపిస్తామని తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు.
* దిగ్విజయ్‌సింగ్
english title: 
digvijay singh

యాదయ్య త్యాగాన్ని జాతి మరువదు

$
0
0
మహబూబ్‌నగర్, జూలై 1: దేశ రక్షణలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ యాదయ్య ప్రాణత్యాగాన్ని జాతి ఎప్పటికీ మరువలేరని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గత నెల 24వ తేదీన శ్రీనగర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అసువులుబాసిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులను సోమవారం చంద్రబాబుపరామర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో యాదయ్య భార్య సుమతమ్మను, ఆయన పిల్లలను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ జవాన్ యాదయ్య ప్రాణత్యాగాన్ని దేశ ప్రజలు మరువలేరని తెలిపారు. 11 ఏళ్లు దేశం కోసం పని చేసి ఉగ్రవాదుల దాడిలో మృతి చెందడం బాధాకరమని అన్నారు. మరో ఐదు సంవత్సరాలలో పదవీ విరమణ పొందాల్సిన యాదయ్య లేకపోవడం ఆ కుటుంబానికి తీరని నష్టం జరిగిందని అన్నారు. చిన్నారులు సుశ్మిత(4), నశ్మిత(1)లకు యాదయ్య దూరం కావడం తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. యాదయ్య ప్రాణత్యాగాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా దేశ భక్తిని పెంపొందించుకోవాలని కోరారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను ప్రతిఒక్కరు ఆదుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని, సమాజం వారికి అండగా నిలిచినప్పుడే నిజమైన నివాళి అవుతుందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన యాదయ్య విగ్రహాన్ని కొండారెడ్డిపల్లిలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. విగ్రహ ఏర్పాటుకు తమ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, రాములు చొరవ తీసుకోనున్నారని తెలిపారు. యాదయ్య కుటుంబానికి కేంద్రం నుండి రావల్సిన సహాయం కోసం తాను ప్రత్యేకంగా లేఖ రాస్తానని, ఇప్పటికే కుటుంబానికి సహాయం పూర్తి స్థాయిలో అందాల్సి ఉండేదని, ఆలస్యం కావడం విచారకరమని అన్నారు. యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగంతో పాటు అందాల్సిన సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. టిడిపి తరఫున రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, యాదయ్య కూతుళ్ల పేరిట డిపాజిట్ చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. యాదయ్య పిల్లలు దిక్కులేని వారిగా ఉండటానికి వీలులేదని, అందరికంటే మిన్నంగా ఉండేందుకు సమాజం మొత్తం ఆ కుటుంబానికి అండగా నిలవాలని అన్నారు. అప్పుడే ప్రజల్లో దేశ భక్తి ఉన్నట్లు అని బాబు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో యాదయ్య పేరిట గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశ ప్రజలందరు సురక్షితంగా ఉన్నారంటే యాదయ్య లాంటి జవాన్లు ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, వారందరి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు. చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు రాములు, జైపాల్‌యాదవ్, రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎర్రశేఖర్ తదితరులు ఉన్నారు. (చిత్రం) కొండారెడ్డిపల్లి గ్రామంలో యాదయ్య భార్య సుమతమ్మకు 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న చంద్రబాబు
దేశ రక్షణలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ యాదయ్య
english title: 
yadaiah
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>