672 పంచాయతీలకు ఎన్నికలు
‘కోడ్’ కూసింది!
పదవులుంటేనే పట్టించుకుంటారా?
మొక్కుబడిగా కౌన్సిల్!
మద్యం దుకాణం యజమానిపై కాల్పులు
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
కడప, జూలై 4:గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాజంపేట డివిజన్ రిటర్నింగ్ అధికారులకు, వైఎస్సార్ నగర పాలక ఆడిటోరియంలో జమ్మలమడుగు డివిజన్ రిటర్నింగ్ అధికారులకు రాజంపేట సబ్ కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా, కడప ఆర్డీవో వీరబ్రహ్మం, జమ్మలమడుగు ఆర్డీవో రఘునాథరెడ్డిల ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి కోన శశిధర్ జడ్పీ సమావేశం మందిరంలో రిటర్నింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఏ రాజకీయ పార్టీకి లేదా గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించ కూడదని స్పష్టం చేశారు. ఎంపిడిఓలు, తహశీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల కరదీపికలు క్షుణ్ణంగా చదువుకొని అందులోని సూచనలను తప్పకుండా అనుసరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వక్తులుగాని, నాయకులు గాని ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేసినా దాన్ని నివృత్తి చేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికలను ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలన్నారు. సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. సర్పంచ్‌లు నామినేషన్ దాఖలు చేస్తున్న అభ్యర్థి నామినేషన్ ఫారంలో సంతకాలు చేశారా లేదా అనే విషయాన్ని తప్పకుండా గమనించాలన్నారు. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న వ్యక్తి ఆ గ్రామానికి సంబంధించి ఏ వార్డులోనైనా ఓటరుగా ఉంటే చాలన్నారు. అలాగే వార్డు సభ్యులు పోటీ చేస్తున్న వ్యక్తి ఆ గ్రామ పంచాయితీలో ఏదో ఒక వార్డులో ఓటరుగా ఉండాలన్నారు. అతన్ని ప్రతిపాదించే వ్యక్తి అదే వార్డుకు చెందిన ఓటరుగా ఉండాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు నిర్ణీత ధరావత్తు చెల్లించారో లేదో గమనించాలన్నారు. నేర చరిత్ర ఉంటే నామినేషన్‌ను తిరస్కరించాలన్నారు. బలహీన వర్గాల వారికి ఓటు హక్కు ఉన్నప్పటికీ ఆధిపత్యం చెలాయించి వినియోగించుకోకుండా అడ్డుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించాలన్నారు. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా అధికారులకు ఎవరికి అత్యవసర పరిస్థితులు అనివార్యకారణాలు మినహా సెలవులు మంజూరు చేసేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే సబ్ కలెక్టర్, ఆర్డీవో జడ్పీసిఇఓ పరిధిలోని అధికారులకు, సిబ్బంది కూడా సెలవులు మంజూరు చేయరాదని సూచించారు. దాదాపు 7 సంవత్సరాల తరువాత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలో జిల్లాకు ముగ్గురు సీనియర్ అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వస్తారన్నారు. ఎన్నికల విధులు చాలా ముఖ్యమని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒక్కొక్క నియోజక వర్గానికి ఒక సంచార బృందాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణపై నిఘా ఉంచుతామన్నారు. ఈనెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారి, జాయింట్ కలెక్టర్ కలసి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశానికి తహశీల్దార్లు, ఎంపిడిఓలు, మండల ప్రత్యేక అధికారులు, పోలీసు అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. అలాగే సబ్‌కలెక్టర్ ప్రీతి మీనా మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన రాజంపేట డివిజన్‌కు సంబంధించిన 258 గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవులకు, 2574 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో కడప డివిజన్ మండలాల రిటర్నింగ్ అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, ఎ ఆర్ ఓలకు సంబంధించి గ్రామ పంచాయితీ ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనలను అధికారులు సమగ్రంగా తెలుసుకోవాలన్నారు. 7782 వార్డులు, 790 పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 10, 11 వేల నుండి అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉందన్నారు. వరుసగా ఎన్నికలు వస్తున్నందున మండల స్థాయి అధికారులు ఎన్నికల నిర్వహణపై ఆత్మ విశ్వాసంతో పని చేయాలన్నారు. ప్రతి మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు బాధ్యత, స్పెషల్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఎంపిడి ఓలదేనన్నారు. జిల్లా ఎన్నికల అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు ఎన్నికలలో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు. వార్డులు, సర్పంచ్‌ల రిజర్వేషన్లకు సంబంధించి క్షుణ్ణంగా చేయడం వల్ల ఎవరి నుండి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు.
వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన జమ్మలమడుగు డివిజన్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కొత్త పథకాలు చేపట్టరాదని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సిపి రోడ్డు, భవనాలు, కొత్త పథకాల పనులు చేపట్టరాదన్నారు. అత్యవసర పనులు, తాగునీటి సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. గ్రామ పంచాయితీ రిజర్వేషన్లు పక్కాగా చేయడంపై ఎన్నికల కమిషన్‌ను నుండి అభినందనలు లభించాయన్నారు. శిక్షణా తరగతులకు గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. 20 చెక్ పోస్టులు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మండల ప్రత్యేక అధికారులు బాధ్యతతో నిధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల సమయంలో కింది స్థాయి సిబ్బంది పంచాయితీ సెక్రటరీ, వి ఆర్వోలు, గ్రామ నౌకర్లు, ఆఫీసు సిబ్బంది, రాజకీయ పార్టీల వారితో కలసి ప్రచారంలో చెల్లరాదని, వారితో సంబంధాలున్నట్లు ఆర్వోల దృష్టికి వస్తే తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. మైదుకూరు, పులివెందుల, ఎంపిపివోలు, అమరనాధ్‌రెడ్డి, డాక్టర్ సి వెంకటేష్‌లు శిక్షణలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె నిర్మల, డిఆర్వో ఈశ్వరయ్య, జడ్పీ సిఇవో మాల్యాద్రి, శిక్షణ సహాయ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, డిపివో అపూర్వ సుందరి, జమ్మలమడుగు డివిజనల్ పంచాయితీ అధికారి లక్ష్మి, ఆర్వోలు, ఎఆర్వోలు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడివోలు పాల్గొన్నారు.
మూడు విడతలుగా పోలింగ్
* 23న కడప, 27న రాజంపేట, 31న జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్
కడప, జూలై 4: ఎన్నికల నగారా మోగడంతో జిల్లా లోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 791 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో ఆరు గ్రామ పంచాయతీలు పట్టణాల్లో విలీనమయ్యేందుకు రంగం సిద్ధం కావడంతో మిగిలిన వాటిలో ఎన్నికల ప్రక్రియ మొదలయింది. ఈనెల 23న మొదటి విడతలో కడప రెవెన్యూ డివిజన్‌లోనూ, రెండవ విడతలో 27న రాజంపేట రెవెన్యూ డివిజన్‌లోనూ, మూడవ విడతలో 31న జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళికి కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గురువారం ఎన్నికలు జరిగే అన్ని మండలాలకు చెందిన సంబంధిత అధికారులతో ప్రత్యేకించి సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ను ఏ ఒక్క పార్టీ నేత విస్మరించినా వారిపై తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆయన అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే అభ్యర్థులపై చర్యలు తప్పవని ఆయన అధికారులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈనెల 9న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. 13న నామినేషన్ దాఖలు చివరి తేదీగా ప్రకటించారు. 17న నామినేషన్ ఉప సంహరణ, అభ్యర్థుల గుర్తులను ప్రకటిస్తారు. మూడు విడతల ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించి ఉప సర్పంచ్‌ను కూడా ఎన్నిక కూడా జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక జరగని ప్రాంతాల్లో మూడవ రోజు తప్పని సరిగా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అక్రమ మార్గాలు, వేలం పాటల ద్వారా సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నికలకు బేరసారాలు సాగించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా దృష్టిసారించారు.
సమరానికి సిద్ధం కావాలి
* వైకాపాకు ప్రజల్లో తగ్గిన సానుభూతి
* తిరుపతి సభకు భారీగా తరలిరావాలి
* రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్
కడప, జూలై 4 : పంచాయతీ ఎన్నికల అనంతరం వైకాపా కనుమరుగు కావడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పేర్కొన్నారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీలో విలీనవుతుందని జోస్యం చెప్పారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కలసి కట్టుగా కృషి చేసి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను, జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డితో కలిసి కడపలోనే ఉంటామన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ నుండి ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను రప్పించి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యాలయం నుండి తాము పంచాయతీ ఎన్నికలను పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరిగినా, ఇతర పార్టీల నాయకులు ఏదైనా ఆటంకాలు సృష్టించినా తమ దృష్టికి తేవాలన్నారు. సమస్యలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామన్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు గీటురాళ్లుగా నిలుస్తాయన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏ నాయకులు కూడా నిర్లక్ష్యం చేయరాదన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 2017కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించడంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతమయిందన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో బాధితులను అదుకోవడంలో చంద్రబాబు చూపిన చొరవను రాష్ట్ర ప్రజలందరూ అభినందించారన్నారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకుని పోయిన యాత్రికులకు చంద్రబాబు ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి తరలించడం జరిగిందన్నారు. ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులైనట్లు తేలిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కడప జిల్లాలో వైకాపాపై ప్రజల్లో సానుభూతి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ కుటుంబం మొత్తం రోడ్డెక్కి తిరుగుతున్నారని విమర్శించారు. వైఎస్ మరణంతో ప్రజలు సానుభూతితో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేశారన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి తగ్గిందన్నారు. ప్రస్తుతం చంద్రబాబు లాంటి పాలనా దక్షత కలిగిన ముఖ్యమంత్రి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడతారన్నారు. పార్టీ శ్రేణులు ఇప్పటి నుండే పంచాయతీ ఎన్నికలకు కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అన్ని నియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. వారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గెలిచే వారికే టికెట్లు
* బద్వేలు, రాయచోటిపై దృష్టి సారించండి
* తమ్ముళ్లతో టెలీకాన్ఫరెన్స్‌లో బాబు
కడప, జూలై 4 : గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ తరపున ప్రతి పంచాయితీలోనూ గెలిచే అభ్యర్థినే రంగంలో దింపాలని గురువారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడారు. బాబు జిల్లాలోని ముఖ్యనేలతోపాటు అన్ని నియోజకవర్గాలకు చెందిన నేతలతోనూ మాట్లాడారు. ముఖ్యంగా జిల్లాలోని రాయచోటి, బద్వేలు నియోజక వర్గాలపై శ్రద్ధ చూపాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మతో జిల్లా నేతలు సంప్రదించి ఆమె పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇక రాయచోటిలో జడ్పీ మాజీ చైర్మన్ ఎస్ సుబ్రమణ్యం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనేది తనకు బాగా తెలుసని వారి విషయంలో తానే జోక్యం చేసుకొని సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. జిల్లా నేతలతోనూ, రాయచోటి నియోజక వర్గపార్టీ నేతలతో ఇప్పటికే తాను మాట్లాడానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో సానుభూతి బాగా ఉందని, కాంగ్రెస్, వైకాపా విధానాల్లో లోపాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2014 సాధారణ ఎన్నికలకు నాంది అని నేతలు, కార్యకర్తలు అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి కలసి పని చేయాలని ఆయన సూచించారు. పంచాయతీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు చేయూతనివ్వడానికి పార్టీ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. ఈ నెల రోజులు పార్టీ శ్రేణులు కష్టపడి దేశం మద్దతు దారులను ఎన్నికల్లో దింపి గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదు
* అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు
* పిసిసి సభ్యుడు రాంప్రసాద్‌రెడ్డి
రాయచోటి, జూలై 4 : కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, పత్రికల్లో వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని పిసిసి సభ్యుడు, రాయచోటి కాంగ్రెస్ నేత మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తాను పార్టీని వీడిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కార్యకర్తలు నమ్మవద్దన్నారు. లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రమేష్‌రెడ్డికి రాయచోటి కాంగ్రెస్ ఇన్‌చార్జి పదవి కట్టపెట్టారని, ఈ నేపథ్యంలో తాను అలిగి పార్టీని వీడనున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. గత 20 ఏళ్ల కాలంగా తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతోందని, అలాంటి పార్టీని తాను వీడే ప్రసక్తి లేదన్నారు. రమేష్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించినట్లు తనకు ఏ మాత్రం తెలియదన్నారు. అయితే ఈరోజు ఉదయానే్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాకం అశోక్‌కుమార్‌తో మాట్లాడినా ధ్రువీకరించలేదని వివరించారు. పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించడం వల్లే పార్టీ హైకమాండ్ గత ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఇకపోతే టిడిపిలో కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కాంగ్రెస్‌లోకి వస్తే తనకు ఏ రకమైన అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షునితో చెప్పినట్లు తెలిపారు. అలాగే రాయుడు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుందన్న రాష్ట్ర హైకమాండ్ సూచనను తాను కూడా సమర్థించినట్లు పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో తాను ఓటమి పాలు కావడంతో కొంత మంది కార్యకర్తలు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారన్నారు. ఉప ఎన్నికల్లో కూడా సొంత పార్టీలోని కొందరు నాయకుల కుట్రల వల్లే ఓటమి చెందానన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే ఏం తీసిపోరన్నారు. కిరణ్ హయాంలో రాష్ట్భ్రావృద్ధి కోసం నిరుపేదలు, బడుగులు, బలహీన వర్గాల కోసం ఎన్నో వినూత్నమైన పథకాలు చేపడుతున్నారన్నారు. ఇక స్ధానిక పోరును ప్రత్యర్థులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి మండలంలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకుంటారన్నారు. అభ్యర్థులను త్వరలో ప్రకటించడంతో పాటు వారి విజయం కోసం అంకిత భావంతో కృషి చేస్తామన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుండే అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. అందుకోసం కార్యకర్తలు, నాయకులు కష్టించి పని చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, లయన్ నాగేశ్వరావు, కొండారెడ్డి, మోహన్ పాల్గొన్నారు.
రూ. 5 కోట్ల ఎర్రచందనం పట్టివేత
* 100 మందిపై కేసులు నమోదు
* టాస్క్ఫోర్స్ అధికారుల వెల్లడి
రైల్వేకోడూరు, జూలై 4: రాయలసీమ ప్రాంతంలో ఇటీవల కాలంలో విస్తృతంగా దాడులు జరిపి రూ. 5 కోట్ల విలువచేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నామని టాస్క్ఫోర్స్ అధికారులు మధుబాబు, విశే్వశ్వరరావు తెలిపారు. గురువారం వారు రైల్వేకోడూరు ప్రాంతంలో ఎర్రచందనం అక్రమరవాణా నిర్మూలన కోసం విసృత్తంగా దాడులు నిర్వహించారు. అనంతరం స్థానిక అటవీశాఖ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి, తిరుపతి, మైదుకూరు, ఖాజీపేట తదితర ప్రాంతాల్లో అటవీ అధికారుల సహకారంతో టాస్క్ఫోర్స్ అధికారులు ప్రత్యేక పోలీస్ బలగాలతో ఎర్రచందనం అక్రమ రవాణా నిర్మూలనకోసం పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణా నిర్మూలన కోసం ప్రత్యేక పోలీస్ బలగాలతో గాలింపుచర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేసుల్లో పట్టుబడే స్మగ్లర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతామన్నారు. డబ్బును సులభతరంగా సంపాదించాలన్న అత్యాశతో కొందరు యువకులు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.
బాబు సిఎం అయితే రుణమాఫీపైనే తొలి సంతకం
* టిడిపి నేతలు పుట్టా, రెడ్యం
బ్రహ్మంగారిమఠం, జూలై 4 : 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అత్యధిక శాసనసభ స్థానాలను కైవసం చేసుకొని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపైనే పెట్టనున్నట్లు మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్, రాష్ట్ర తేదేపా ప్రధాన కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం బిమఠం మండలంలోని ఎర్రంపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బాబు ముఖ్యమంత్రి అయ్యాక రెండవ సంతకం బెల్ట్ షాపులు తీసివేయడం పైన రెండవ సంతకం ఉంటుందన్నారు. చంద్రబాబు ప్రజలకు గతంలో చేసిన అభివృద్ది పనులు కానీ, గతంలో ఎన్ని కరువుకాటకాలువచ్చినా రైతులకు గానీ, ఇళ్ళకుగానీ 9గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించారని, అలాగే రైతులకు అన్ని రకాల వస్తువులను అందించారని, అందువల్లె అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు, టిడిపిలో చేరుతున్నారన్నారు. అందులో భాగంగానే ఎర్రంపల్లె, కొత్తపల్లె గ్రామాలకు సంబంధించిన మాజీ ఎంపిటిసి వీరయ్య, మోపురు సిద్దయ్య, మేకల గుర్రయ్య, కృష్ణయ్య , శ్రీనివాసులు, బాల సుబ్బారెడ్డి, నరశింహారెడ్డి, దుగ్గుల కామాక్షిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో 40 కుటుంబాలు కాంగ్రెస్ , వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందినవారు తమ పార్టీలోకి కండువాలు వేసి స్వాగతించామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ధరలు నియంత్రించడంలో కానీ, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రైతులకు నాణ్యతగా అందించడంలో కానీ, ధరలు తగ్గించడంలోకానీ ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, గిట్టుబాటు ధరలు అందించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. అలాగే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని టిడిపివైపు మొగ్గుచూపుతున్నారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి అక్రమాలుచేసి జైలుకు పోయాడని, జైలుకెళ్ళి 14 నెలలు గడుస్తున్నా ఆయనకు సంబంధించి విజయమ్మ, షర్మిల, భారతి చెప్పెమాటలు బూటకాలని, వారు ఏ తప్పు చేయకపోతే ఇన్నిరోజులు జైల్లో ఎందుకు ఉన్నారన్నారు. వారు సంపాధించిన వేల కోట్ల రూపాయలు ప్రజలదేనని, ప్రజలు తెలుసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి అసమర్ధుడని తన పదవిని నిలుపుకునేందుకు కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబు ఆద్వర్యంలో టిడిపి బలోపేతం అవుతుందని స్తానిక ఎన్నికలు సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి, తదితర ఎన్నికలలో మైదుకూరు నియోజకవర్గంలో అన్ని స్థానాలను గెలుచుకొని టిడిపి సత్తా ఏమిటో నిరూపిస్తామని వారు సవాల్ విసిరారు. ఈకార్యక్రమంలో వెంకటసుబ్బయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో
80 శాతం సీట్లు వైకాపావే
* ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి
సుండుపల్లె, జూలై 4: స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం సీట్లు వైకాపా మద్దతుదారులు కైవసం చేసుకుంటారని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని రెడ్డివారిపల్లె వైకాపా మండల కన్వీనర్ వై. ఆనంద్‌రెడ్డి స్వగృహంలో పంచాయతీ వారీగా నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో వైకాపా మద్దతుతో పోటీ చేసేందుకు అన్ని పంచాయతీల నుంచి అభ్యర్థులు చాలామంది ముందుకొస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే నాయకుల సమక్షంలోనే అభ్యర్థులను ఖరారు చేసుకునేందుకు సుండుపల్లెకు వచ్చానన్నారు. ప్రతి పంచాయతీలో నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి కలిసి కట్టుగా పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా కన్వీనర్ వై. ఆనంద్‌రెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, ఆరంరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, జయరామనాయుడు, హకీం, ఇర్ఫాన్, చంద్రానాయక్ పాల్గొన్నారు.
విభజిస్తే అగ్నిగుండమే
* కలెక్టరేట్ ముట్టడిలో జెఎసి నాయకుల హెచ్చరిక
కడప (రూరల్), జూలై 4 : కొంతమంది నేతల స్వార్థం కోసం చరిత్ర కలిగిన రాయలసీమ జిల్లాలను విడకొట్టాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని జెఎసి నేతలు మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డిలు హెచ్చరించారు. జెఎసి ఆధ్వర్యంలో గురువారం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందన్నారు. అలాంటి సీమను స్వార్థ రాజకీయాల కోసం విడగొట్టాలనుకోవడం క్షమించరాని విషయమన్నారు. ఇప్పటికైనా రాయలసీమ జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రతిపాదనలను అడ్డుకోవాలని కోరారు. ఇందుకు పార్టీలకు అతీతంగా మేథావులు, రచయితలు, విద్యా వంతులు, యువత, రైతులు, కార్మికులు ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. వైకాపా నేతలు అంజాద్ బాషా, అఫ్జల్‌ఖాన్‌లు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు గీత దాటి ఉద్యమాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. టిడిపి నాయకులు బాలకృష్ణయాదవ్ మాట్లాడుతూ రాయలసీమ కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి తనయుడు అషఫ్,్ర శ్రీనివాసరావులతో పాటు వందలాదిగా విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
నేడు తిరుపతికి బాబు రాక
తిరుపతి, జూలై 4: స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ శుక్రవారం తిరుపతిలో కూడా ప్రాంతీయ సదస్సును నిర్వహించనున్నది. రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుండి తెలుగుదేశం పార్టీ నేతలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, మాజీ ప్రతినిధులు సుమారు 20 వేల మంది రానున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో 6 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుండి హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్‌కు వెళ్లి అక్కడ బస చేయనున్నారు. అటు తరువాత 8 గంటలకు పూతలపట్టుకు బయలుదేరి ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీరజవాన్ వినాయకం ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు అక్కడ నుండి బయలుదేరి 10 గంటలకు తిరుపతి రూరల్ తనపల్లి క్రాస్ వద్ద ఉన్న రామానాయుడు కల్యాణ మండపంలో నిర్వహించే ప్రాంతీయ సదస్సులో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సదస్సు జరుగుతుంది. అటు తరువాత సాయంత్రం 6 గంటలకు వివిధ జిల్లాల వారిగా ముఖ్యనేతలతో బాబు సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశాలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సమీక్షా, సమావేశాలు నిర్వహించారు. భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు సమాయత్తం అవుతున్నారు. చంద్రబాబు దృష్టిలో పడేందుకు నేతలు పోటీపడుతున్నారు. సభావేదిక పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, బ్యానర్లను, తోరణ ద్వారాలను కట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టాల్సి వుంటుందని రెవెన్యూ అధికారులు హెచ్చరించడంతో టిడిపి నేతలు మీమాంశలో పడుతున్నారు. సదస్సు జరిగే ప్రాంతం మినహాయించి బయట బ్యానర్లను కడితే చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరికలతో టిడిపి నేతల అత్యుత్సాహానికి బ్రేకులు వేసినట్లు అయింది. కాగా సభా ఏర్పాట్లను టిడిపి సీనియర్ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, చదలవాడ కృష్ణమూర్తి, నరసింహయాదవ్, శ్రీధర్‌వర్మ, గౌనిగారి శ్రీనివాసులు, మాల్యాద్రి, నగర పార్టీ అధ్యక్షుడు దంపూరి భాస్కర్, బిజి కృష్ణయాదవ్, మస్తాన్‌నాయుడు, ఆర్‌సిమునికృష్ణ, మందాలపు మోహన్‌రావు, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి తదితరులు ఏర్పాట్లలో బిజీగా వున్నారు. మందాలపు మోహన్‌రావు ఆధ్వర్యంలో 20 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నరసింహయాదవ్ ఆధ్వర్యంలో వివిధ హంగుల్లో, రకరాల మోడల్స్‌లో స్వాగత కటౌట్లను ఏర్పాటు చేశారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ఆధ్యక్షుడు రవినాయుడు ఆధ్వర్యంలో నారాచంద్రబాబు నాయుడు సైనికుడి డ్రస్‌లో వస్తున్నట్లు ఏర్పాటు చేసిన కటౌట్ అందర్నీ ఆకట్టుకుంది.
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లు అరెస్టు
బిఎన్ కండ్రిగ పోలీసులను అభినందించిన అర్బన్ ఎస్‌పి
తిరుపతి, శ్రీకాళహస్తి, జూలై 4: బుచ్చినాయుడు కండ్రిగ మండలం ఆళ్లత్తూరు వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి వన్‌టౌన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరుణ్, టూటౌన్‌లో పనిచేస్తున్న చిరంజీవి, మహేష్‌లను అర్బన్ ఎస్‌పి రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు గురువారం శ్రీకాళహస్తి డిఎస్‌పి అభిషేకం ఆధ్వర్యంలో వన్‌టౌన్ సిఐ నాగరాజు, బిఎన్ కండ్రిగ ఎస్‌ఐలు తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన కానిస్టేబుళ్లను జడ్జి ముందు హాజరు పరిచి సబ్‌జైలుకు తరలించారు. ఆళత్తూరు వద్ద బుధవారం అర్ధరాత్రి 6 లక్షల రూపాయలు విలువ చేసే 31 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈ స్మగ్లింగ్‌లో ప్రధాన సూత్రదారులుగా ముగ్గురు కానిస్టేబుళ్లు ఎర్రచందనం స్మగ్లర్లు గురవయ్య, మల్లికార్జున, నరేష్‌లతో సంబంధం పెట్టుకున్నారు. 3వతేది సాయంత్రం ఏపి 26 ఎహెచ్ 6276 ట్రైలర్, ఏపి ఏపి 26ఎహెచ్ 6277 నెంబర్‌గల వాహనాల్లో ఎర్రచందనాన్ని తరలిస్తుండగా అలత్తూరు - రెడ్డిగుంట బడవ రోడ్డులో బిఎన్ కండ్రిగ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎర్రచందనం లారీలు వెళ్లేందుకు వీలుగా ముందు ఎపి 03 ఎఆర్ 5373 సిబిజెడ్ ద్విచక్ర వాహనంలో పైలట్స్‌గా కానిస్టేబుళ్లు మహేష్, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ చిరంజీవిలను అరెస్టు చేశారు. ఈ విషయం బట్టబయలు కావడంతో ఆ కానిస్టేబుళ్లు పరారయ్యారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. ఈ స్మగ్లింగ్ వెనుక పోలీసు ఉన్నతాధికారి ఒకరు అండగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులను అరెస్టు చేసి, పై స్థాయి అధికారులను వదిలేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఇంటి దొంగలైన పోలీసులను అరెస్టు చేసిన బిఎన్ కండ్రిగ ఎస్‌ఐ వెంకటరమణ, అతని సిబ్బందిని అర్బన్ ఎస్‌పి రాజశేఖర్‌బాబు అభినందించారు. ఈ కేసులో పరారైన స్మగ్లర్లు గురవయ్య, మల్లికార్జున, నరేష్‌లను త్వరలో అరెస్టు చేస్తామని అర్బన్ ఎస్‌పి తెలిపారు.
అధికారంలోకి వచ్చేంది టిడిపినే : ముద్దు
తిరుపతి, జూలై 4: రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనేనని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. గురువారం రామానాయుడు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ప్రాంతీయ సదస్సుకు విచ్చేయనున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఆగడాలు చేసినా అత్యధిక స్థానాలను గెలుచుకుంటామన్నారు. అవినీతి కాంగ్రెస్‌లో నుండి పుట్టిన కొమ్మ వైఎస్‌ఆర్‌సి అని అన్నారు. ఎప్పటికైనా వైఎస్‌ఆర్‌సిపి కాంగ్రెస్‌లో కలిసిపోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, చదలవాడ కృష్ణమూర్తి, నరసింహయాదవ్, డాక్టర్ కొడూరు బాలసుబ్రమణ్యం, బుల్లెట్ రమణ, శ్రీధర్‌వర్మ, దంపూరి బాస్కర్, ఆర్‌సి మునికృష్ణ, మందాలపు మోహన్‌రావు, ఉప్పలవాటి శ్రీనివాసులు , రవినాయుడు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
హజ్‌యాత్రకు రాష్ట్రం నుంచి 7525 మందికి అర్హత కల్పిస్తాం
* రాష్ట్ర హజ్‌యాత్ర కమిటీ చైర్మన్ స్పష్టం
మదనపల్లె, జూలై 4: జిల్లా నుంచి హజ్ యాత్రకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వెళ్ళే యాత్రికులకు గురువారం మదనపల్లె పట్టణం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ కమాల్ ఉద్దీన్ అహ్మద్ హజ్ యాత్రికులను ఉద్దేశించి మాట్లాడుతూ మదనపల్లె డివిజన్ పరిధి నుంచి బయలుదేరే హజ్ యాత్రికులకు మూడురోజుల శిక్షణ ఇవ్వాలన్నారు. దేశవ్యాప్తంగా 1.25లక్షల మంది, రాష్టవ్య్రాప్తంగా 7525, చిత్తూరు జిల్లా నుంచి 460మందికి అవకాశం ఉంటుందని తెలిపారు. వారిలో శిక్షణ పొందిన యాత్రికులకు హెల్త్ అండ్ ట్రైనింగ్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్డు ఉన్నవారికి మాత్రమే యాత్రలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన వారిలో అర్హులను ఎంపిక చేస్తామన్నారు. అనంతపురం, చిత్తూరుజిల్లా యాత్రికులకు బెంగళూరు నుంచి హజ్‌యాత్ర ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లా మైనార్టీ సంక్షేమ, వక్ఫ్‌బోర్డు కమిటీ ఇఓ అబ్దుల్‌హమీద్, సభ్యులు మహ్మద్‌ఖాన్, ఇమ్రాన్‌ఖాన్, మహ్మద్ ఇబ్రహీమ్, కలీల్ ఉద్దీన్, మతగురువులు, ముస్లింలు హాజరయ్యారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
యాదమరి, జూలై 4: రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై ఉమామహేశ్వరరావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పాచిగుంట గ్రామానికి చెందిన ఉదయకుమార్, ఉత్తరకుమార్ చిత్తూరు నుంచి మోటార్‌సైకిల్‌పై స్వగ్రామమైన పాచిగుంటకు వెళ్తుండగా భూమిరెడ్డిపల్లె క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న మరో మోటార్‌సైకిల్ ఢీకొనడంతో అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఉదయకుమార్(20) సంఘటనా స్థలంలో మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన ఉత్తరకుమార్(22)ను 108 అంబులెన్సు ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. మరో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న జాఫర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మెరుగైన చికిత్సల కోసం వేలూరు సిఎంసికి తరలించారు. ఈమేరకు యాదమరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
‘మేధావుల్లారా... సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కండి’
ఆంధ్రభూమిబ్యూరో
తిరుపతి, జూలై 4: సమైక్యాంధ్ర కోసం మేధావులు ఉద్యమంలో భాగస్వాములు కావాలని, రాష్ట్ర ఐక్యతను సాధించి భవిష్యత్ తరాల వారికి భవిష్యత్ కల్పిద్దామని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం ఎటిఎన్ డిగ్రీ కళాశాలలో సమైక్యాంధ్ర విద్యార్థుల చైతన్య సదస్సు శాప్స్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ నరేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాల విభజన డిమాండ్ దాదాపు 16 రాష్ట్రాల్లో ఉందని, ఒక్క ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తే తేనెతుట్టెను కదలించినట్లేనన్నారు. రాష్ట్రాల విభజనకు సంబంధించి రెండవ ఎస్‌ఆర్‌సిని వేసి చర్చించాలన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చితే కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందని దిగ్విజయ్‌సింగ్ చెప్పడం విడ్డూరమన్నారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై లోతైన చర్చ జరగాలన్నారు. ప్రత్యేక తెలంగాణపై రాష్ట్రఅసెంబ్లీలో చర్చించి చేసిన తీర్మానాన్ని అంగీకరించాలన్నారు. ఎస్వీయూనివర్శిటీ ప్రొఫెసర్ బాలాజీ ప్రసంగిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కొరకు రాష్టవ్య్రాప్తంగా విద్యార్థులు, యువకులు ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, మేధావులు వౌనంగా ఉంటే సమాజం చెడిపోతుందన్నారు. శాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో ఉన్న ప్రజాప్రతినిధులు గతంలో మాదిరిగా రాష్ట్ర ఐక్యతకోసం ఉద్యమాల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల ఓట్లకోసం చేస్తున్న ప్రకటనలను నమ్మవద్దని, కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు సైతం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు కెవి ప్రసాద్, తేజ్‌ప్రకాష్, నిజాముద్దీన్, భారతి, యశోధ, మోహన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
డయల్ 100కు మంచి స్పందన : ఎస్పీ
చిత్తూరు, జూలై 4: డయల్ యువర్ 100కు చిత్తూరు జిల్లాకు సంబంధించి 1,738 మంది ఫిర్యాదు చేసినట్లు జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రమాదాలకు సంబంధించి 879, దొంగతనాలు, హత్యలు తదితర నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. డయల్ 100 విభాగానికి ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది ఫిర్యాదు చేసిన వ్యక్తుల వద్దకు పట్టణ ప్రాంతాల్లో 20 నిమిషాల లోపు, గ్రామీణ ప్రాంతాలకు 45 నిమిషాలలోపు చేరుకొని సంబంధిత ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటారన్నారు. జూన్ నెలకు సంబంధించి 174 కేసులు నమోదయ్యాయన్నారు. ఇటీవల బి.కొత్తకోట పోలీస్టేషన్ పరిధిలోని వేమిలికోట గ్రామ సమీపంలో ఒక మహిళపై దాడిచేసి నగలు దోచుకున్న సంఘటన గురించి డయల్ 100కు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి సకాలంలో చేరుకొని తగు చర్యలు తీసుకున్నారన్నారు. అదేవిధంగా పుంగనూరు పట్టణంలోని మారెమ్మ గుడి వద్ద జరిగిన ఒక హత్య కేసులో కూడా డయల్ 100కు సమాచారం రాగా, పోలీసులు సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకొని నిందితుల్ని అరెస్టు చేశారన్నారు. కావున జిల్లా ప్రజలు డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కాంతిరాణాటాటా కోరారు.
ప్రభుత్వ సామగ్రిని తరలించుకెళ్లిన ప్రైవేటు సంస్థ
* లాసావాసా కంపెనీ నిర్వాకం
* పట్టించుకోని తెలుగుగంగ అధికారులు
శ్రీకాళహస్తి, జూలై 4: ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 7 ఏళ్ల కాలపరిమితి ముగిసిన తరువాత మొత్తం సామగ్రిని తెలుగుగంగ అధికారులకు స్వాధీనం చేయాల్సిన లాసా వాసా సంస్థ కొంత సామగ్రిని బహిరంగంగా తరలించుకుని వెళ్లినా అధికారులు పట్టించుకోలేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారితో ఒప్పందం వివరాలు తమకు తెలియదంటూ తెలుగుగంగ అధికారులు దాట వేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడానికి 2005లో రాష్ట్ర ప్రభుత్వం లీ అసోసియేట్ సౌత్ ఆసియా ప్రైవేటు లిమిటెడ్ జాయింట్ వెంచర్ విత్ వాస్ కన్‌స్టలెన్సీ (లాసావాసా) కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. కాలపరిమితి ముగిసిన తరువాత మొత్తం సామగ్రిని తెలుగుగంగ ప్రాజెక్టుకు స్వాధీనం చేయాలనే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని తెలుగుగంగ కాలనీలోని లాసావాసా సంస్థ కార్యాలయాలకు, ల్యాబ్‌లకు భవనాలను కేటాయించారు. ఇందులో కంప్యూటర్లు దగ్గర నుండి ఫర్నీచర్ వరకూ అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది. ఈ ఒప్పందం గత నెల 30వతేదికి ముగిసింది. ఒప్పందం కుదుర్చుకున్న అధికారులు ప్రస్తుతం లేకపోవడంతో లాసావాసా కంపెనీ ప్రతినిధులు కార్యాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతరత్రా సామగ్రిని గురువారం తరలించుకెళ్లారు. కళ్ల ముందే సామగ్రి తరలిపోతున్నా తెలుగుగంగ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. విలువైన వస్తువులన్నీ తరలించినట్లు సమాచారం. ఈ విషయంపై తెలుగుగంగ ఇఇ ప్రసాద్‌ను వివరణ అడుగగా ఒప్పందం వివరాలు తమకు తెలియదని, లాబొరేటరీలో పరికరాలు మాత్రమే ఉన్నాయని, ఇతరత్రా సామగ్రిని మొత్తం వారు తీసుకువెళ్లిన మాట వాస్తవమేనన్నారు.
సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీల రిలే దీక్షలు
చిత్తూరు, జూలై 4: అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు గురువారం రెండోరోజుకు చేరుకున్నాయి. అంగన్‌వాడీ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వేతనంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచాలని, అంగన్‌వాడీ కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని, అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ రోడ్డులోని సిడిపిఓ కార్యాలయం వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమానికి అంగన్‌వాడీ వర్కర్లు, అండ్ హెల్పర్స్ జిల్లా ఉపాధ్యక్షురాలు సుజని, గుడిపాల మండల నాయకులు ఉష, బుజ్జి, శశికళ, సిఐటియు డివిజన్ కార్గదర్శి గంగాధరగణపతి, సురేంద్రతోపాటు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
* తప్పిన పెనుప్రమాదం
* రూ. కోటి 81లక్షల ఆస్తి నష్టం
పూతలపట్టు, జూలై 4: మండలంలోని రంగంపేట క్రాస్ సమీపంలో ఉన్న గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీకి అనుబంధంగా మామిడి జ్యూస్ నిమిత్తం నిల్వ ఉంచిన మామిడి పండ్ల షెడ్లలో నాలుగు షెడ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో కోటి 81లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు ఫ్యాక్టరీ మేనేజ్‌మెంట్ తెలిపింది. సకాలంలో గల్లా ఫుడ్స్ సిబ్బంది స్పందించి పాకాల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. ఈప్రమాదంలో నాలుగు షెడ్లలో నిల్వ ఉంచిన వివిధ రకాలైన మామిడి పండ్లు పూర్తిగా కాలిపోయాయి. గల్లా ఫుడ్స్ ప్యాక్టరీ మేనేజర్ జగన్మోహన్ మాట్లాడుతూ ప్రమాదం తెలిసిన వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. అమరరాజా సిబ్బంది కూడా మంటలను అదుపుచేయడంలో సాయపడ్డారు. అగ్నిమాపక జిల్లా అధికారి శ్రీనివాసులు, హార్టికల్చర్ అధికారులు, విద్యుత్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాద సంఘటనపై పూతలపట్టు పోలీసులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
పాకాలలో ఎసిబి కలకలం
* మారువేషంలో తచ్చాడిన అధికారులు
పాకాల,జూలై 4: అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం పాకాలలో మఫ్టీలో తిరగడం ప్రభుత్వ అధికారులను వణికించింది. ఎసిబి సిఐ స్థాయి అధికారులు ఇద్దరు లుంగీలతో తహసీల్ధార్, ఎంపిడిఓ, వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయాల వద్ద తిరుగుతూ కనిపించారు. ఎవరికి అనుమానం రాకుండా రైతులవలే వీరు వేషధారణతో రావడం, నిఘా పెట్టడంతో ఏ కార్యాలయంలో ఏ అధికారికి మూడిందోనంటూ తెలిసిన వారు కొంత మంది చర్చించుకోవడం కనిపించింది. ఇటీవల రెవెన్యూశాఖపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఎసిబి అధికారులు పాకాలలో తిష్టవేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎసిబి అధికారులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉండటాన్ని తెలుసుకున్న ఆయా శాఖల అధికారులు వణికిపోతున్నారు. అవినీతి అధికారుల గుట్టురట్టు చేయడంలో భాగంగా రైతుల వలే మారువేషంలో వచ్చారా? లేక ఏ అధికారిపైనైనా నిఘా పెట్టేందుకు వచ్చారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
వికలాంగ విద్యార్థులకు చేయూతనివ్వాలి
* డిఇఓ ప్రతాప్‌రెడ్డి పిలుపు
గంగాధర నెల్లూరు, జూలై 4: వికలాంగ విద్యార్థులకు చేయూతనందిస్తే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంఆర్‌సిలో జరిగిన విద్యాపక్షోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చుచేస్తున్నాయని, శారీరక, బుద్ధిమాంద్యత వల్ల కొంతమంది బాలబాలికలు విద్యలో వెనుకబడుతున్నారని, ఇలాంటి వారికి చేయూతను అందించి సహాయం చేస్తే అందరికంటే వారు మిన్నగా తయారవుతారన్నారు. ఈసందర్భంగా చిన్నారి శ్రవణం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చిన్న వయస్సులో వినికిడి లోపంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి ప్రాథమిక దశలో చికిత్స అందించడంతోపాటు వినికిడి యంత్రాలను పంపిణీచేస్తే అందరితోపాటు వారు మంచి విద్యను నేర్చుకుంటారన్నారు. దీంతోపాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సైతం వికలాంగ విద్యార్థులకు కొద్దిపాటి సలహాలు, సూచనలు అందచేసి వారిలో నూతన ఉత్తేజాన్ని కల్పిస్తే వారు నూతన ఉత్తేజతులై అందరికన్నా మెరుగ్గా రాణించే అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది వికలాంగులు శాస్తజ్ఞ్రులతోపాటు బహుళ కంపెనీల్లో పలు పదవులను పొందిన సంగతి ఆయన గుర్తు చేశారు. ఈకార్యక్రమాలు ఆర్‌విఎం పథకం కింద అమలవుతున్నాయని, మరింత అభివృద్ధి చెందడం కోసం అందరి కృషి అవసరమన్నారు. ఈకార్యక్రమంలో మండల ఇన్‌చార్జి విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్, ఆర్‌విఎం పిఓ లక్ష్మిదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ డిఇ స్టాలిన్, వైద్యాధికారులు జానకిరావు, గీతతోపాటు వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం మండలాలకు చెందిన అనేక మంది వికలాంగ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పదవులకు వేలం నిర్వహిస్తే ఓటు హక్కు తొలగిస్తాం
గుంటూరు, జూలై 4: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ డి మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రెవెన్యూ కల్యాణ మండపంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియమావళి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి మొత్తం అమలులో ఉందన్నారు. పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఈనెల 5వ తేదీ సాయంత్రానికి తొలగించేలా ఆయా పార్టీల ప్రతినిధులతో చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించిన క్షణం నుండీ నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. పార్టీలు బ్యానర్లు, హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగించని పక్షంలో అధికారులే తమ సిబ్బందితో వాటిని తొలగించి నాశనం చేయాలని స్పష్టం చేశారు. నూటికి నూరుశాతం నియమావళిని అమలు చేయగలిగితే ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవ్వవని పేర్కొన్నారు. నియమావళిని అమలు చేసే విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, ఎటువంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నియమావళి అమలులో ఉంటుందన్నారు. ఈ సమయంలో మంత్రులు, ఇతర నాయకులు, ప్రభుత్వ కార్యక్రమాలపై సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రభుత్వ అధికారులు హాజరు కావాల్సిన అవసరం లేదని, అటువంటి సమావేశాలను పార్టీ సమావేశాలుగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రచారాల్లో ప్రభుత్వ అధికారులు గానీ, సిబ్బంది పాల్గొన కూడదని తెలిపారు. ప్రతి ఒక్కరి వద్ద ప్రస్తుతం సెల్‌ఫోన్లు ఉన్నందున వాటి ద్వారా ఫొటోలు, వీడియో తీసే అవకాశం ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నియమావళిని పకడ్బందీగా అమలు చేసే క్రమంలో జిల్లాలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ కమిటీలో పట్టణ, గ్రామీణ పోలీసు అధికారులతో పాటు, వివిధ శాఖల అధికారులు కూడా ఉంటారని తెలిపారు. డివిజన్, మండల స్థాయిలలో కూడా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి కేటాయించిన విధులకు, శిక్షణా తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. మినహాయింపులు, సెలవలు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా గాని, ప్రజలు ఎన్నుకున్న వారై ఉండాలని, వేలం ద్వారా జరిగే ఎంపిక చెల్లదని అన్నారు. ఈ విషయంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారికి భవిష్యత్తులో ఓటు హక్కులేకుండా చేస్తామని స్పష్టం చేశారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కొత్తగా మంజూరైన వివిధ అభివృద్ధి పనులను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ప్రారంభించకూడదని ఇన్‌చార్జి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసమావేశంలో గుంటూరు ఆర్‌డిఒ బి రామమూర్తి, డివిజనల్ పంచాయతీ అధికారి వీరయ్య, డివిజన్‌లోని తహశీల్దార్లు, ఎండిఒలు తదితరులు పాల్గొన్నారు.
అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి
గుంటూరు, జూలై 4: ప్రత్యేక ఆంధ్రా ద్వారా అధికార వికేంద్రీకరణ జరుగుతుందని, దీంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని బిజెపి రాష్టన్రేత యడ్లపాటి రఘునాథబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక అరండల్‌పేటలోని వైన్‌డీలర్స్ కల్యాణ మండపంలో బిజెపి ఆధ్వర్యంలో సీమాంధ్ర ఉద్యమ కమిటీ నేతృత్వంలో సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల పరిరక్షణపై చర్చావేదిక నిర్వహించారు. చర్చావేదికకు ముఖ్య అతిథిగా హాజరైన రఘునాధబాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర జెఎసి నుండి కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తప్పుకోవడంతో సమైక్యాంధ్ర జెఎసి తన అస్తిత్వాన్ని కోల్పోయిందని తెలిపారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమం తరువాత అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. మోసం చేయడం, మాయమాటలు చెప్పడం కాంగ్రెస్ సహజ లక్షణమని విమర్శించారు. వెంటనే ఈ ప్రాంత నాయకులు సీమాంధ్ర జెఎసిని ఏర్పాటు చేసి నదీజలాలు, ప్రాజెక్టులను జాతీయ చేసేలా, హైదరాబాద్, తెలంగాణ జిల్లాల్లో నివాసముంటున్న ఆంధ్రుల ఆస్తులు, ప్రాణ రక్షణకు పోరాడాలని కోరారు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు మాట్లాడుతూ సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని, వెనుకబడి జిల్లాలు, ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పోట్లూరి పూర్ణచంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లెపు కృపారావు, సిహెచ్ విజయభాస్కరరెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు రాజా రామ్మోహనరావు, ఆర్ లక్ష్మీపతి, వై స్వరూపరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి దొప్పలపూడి గోపాలరావు, నగర నాయకులు కాయితి సైదారెడ్డి, ఆలూరి కోటేశ్వరరావు, జగన్మోహన్, కెవి సుబ్బారావు, వనమా పూర్ణచంద్రరావు, చంద్రశేఖర్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్యంపై అవగాహనకు విద్యార్థుల ర్యాలీ
పొన్నూరు, జూలై 4: పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో భాగంగా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు గ్రామంలో ప్రజలకు అవగాహన కల్గించేందుకు విద్యార్థులు ర్యాలీ జరిపారు. పారిశుద్ధ్య పరిరక్షణకై చేపట్టాల్సిన చర్యల విషయమై ప్రజల్లో ప్రచారం చేయడంతో పాటు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసి అంజయ్యతో పాటు, రిసోర్స్‌పర్సన్ డి దాసు, ఎఎన్‌ఎం వి లియమ్‌కుమారి, అంగన్‌వాడీ సిబ్బం ది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
7న జిల్లా స్థాయి
చదరంగం పోటీలు
గుంటూరు (స్పోర్ట్స్), జూలై 4: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బిఆర్ స్టేడియంలో ఈనెల 7వ తేదీన అండర్-15 బాల బాలికలకు చదరంగం పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి ఎం సాంబశివరావు తెలిపారు. పోటీలలో మొదటి నాలుగు స్థానాలు సాధించిన బాల బాలికలను శ్రీకాకుళంలో ఈనెల 12 నుండి 14 వరకు జరగనున్న రాష్టస్థ్రాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల బాల బాలికలు 7వ తేదీన ఉదయం 8 గంటలకు నిర్వాహకుల ను సంప్రదించి, తమ పేర్లను నమో దు చేయించుకోవాలని కోరారు.
వైఎస్సార్ సీపీ ఎన్నికల
పరిశీలకునిగా ఉప్పుటూరి
తాడికొండ, జూలై 4: వైఎస్‌ఆర్ సిపి తాడికొండ మండల ఎన్నికల పరిశీలకుడిగా విద్యార్థి విభాగం నుండి ఉప్పుటూరి నర్సిరెడ్డి నియామకం జరిగినట్లు నియోజకవర్గ కన్వీనర్ మందపాటి శేషగిరిరావు తెలిపారు. గురువారం తాడికొండ సాయిబాబా కల్యాణ మండపంలో విలేఖర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో, వార్డుల్లో వైఎస్‌ఆర్ సిపి అభ్యర్థులు ఏ పార్టీతో పొత్తులు లేకుండా బరిలో ఉంటారని స్పష్టం చేశారు. గ్రామ కోఆర్డినేటర్లు, అభిమానులు వైఎస్‌ఆర్ సిపి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు అనూఫ్, రవికుమార్, వెంకటరెడ్డి, టి శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌టిసి కార్మికుల ధర్నా
మంగళగిరి, జూలై 4: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బస్‌స్టేషన్ ప్రాంగణంలో ఆర్‌టిసి కార్మికులు ధర్నా నిర్వహించారు. శుక్రవారం నుంచి జరుప తలపెట్టిన నిరవధిక బంద్‌ను జయప్రదం చేయాలని, ఇయు అధ్యక్షుడు డి నాగేంద్రం కోరారు. ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు కెపి శేఖర్, వి శ్రీనివాసరావు, పిఎస్‌ఎస్‌కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జయరామిరెడ్డికి ‘అవగాహన’ అభినందన
గుంటూరు (పట్నంబజారు), జూలై 4: ఎన్‌జి వ్యవసాయ విశ్వవిద్యాలయం పిజి స్టడీస్ డీన్‌గా పదోన్నతి పొందిన పి జయరామిరెడ్డిని గురువారం అవగాహన సంస్థ పక్షాన రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచలి శివాజీ, స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య అభినందించారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ యలమంచలి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సీనియర్ శాస్తవ్రేత్తగా ప్రభుత్వ వ్యవసాయరంగంలో పనిచేస్తూ నిబద్ధత గల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న జయరామిరెడ్డి పదోన్నతి పొందడం ఆనందదాయకమన్నారు. సమరయోధుడు పావులూరి మాట్లాడుతూ తన గురువైన ఆచార్య ఎన్‌జి రంగా పేరున ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయానికి మంచిపేరు తేవడానికి జయరామిరెడ్డి వంటి శాస్తవ్రేత్తల కృషి అవసరమన్నారు. అనంతరం జయరామిరెడ్డిని యలమంచలి, పావులూరి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సంస్థ ఉపాధ్యక్షులు పిఎస్ మూర్తి, సహాయ కార్యదర్శి అచ్యుత ఇందుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వినుకొండలో 66 గుడిసెలు దగ్ధం
వినుకొండ, జూలై 4: వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమీపంలో బాబు జగ్జీవన్‌రాం కాలనీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 66 గుడిసెలు అగ్నికి ఆహుతై సుమారు రూ. 7లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. నిద్ర సమయంలో వున్న గుడిసె వాసులు ఈ అగ్నిప్రమాదాన్ని గమనించి హాహాకారాలతో పిల్లాపాపతో, కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి జైపాల్ తమ సిబ్బందితో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ సమయంలో నూజండ్ల వైపు నుండి తిరిగివస్తున్న వైఎస్సార్ సిపి కన్వీనర్ డా నన్నపనేని సుధ, డాక్టర్ లతీష్ రెడ్డి సంఘటనా సమయంలో అక్కడే ఉండి బాధితులకు సహాయ సహకారాలు అందించారు. గురువారం ఉదయం తహశీల్దార్ సిహెచ్ కృష్ణమూర్తి కాలనీకి చేరుకుని కాలనీని సందర్శించి బాధితులను పరామర్శించారు. అగ్నిప్రమాద విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు అగ్నిబాధితులను పరామర్శించి ప్రభుత్వపరంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు శివశక్తి నీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు మంచినీళ్ళు ట్యాంకు సరఫరా చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.
రాష్ట్ర ప్రజల ధైర్య, పౌరుష, ప్రతాపాలకు ప్రతీక అల్లూరి
గుంటూరు (కల్చరల్), జూలై 4: అచంచలమైన దేశభక్తి, నిస్వార్థమైన త్యాగనిరతి, వీటన్నింటికీ తోడు నిరుపమాన పోరాట పటిమతో బ్రిటీష్ వారి గుండెల్లో నిద్రపోయిన మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు రాష్ట్ర ప్రజల ధైర్య, పౌరుష, ప్రతాపాలకు ప్రతీక అని అరసం రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ శ్లాఘించారు. గురువారం రాత్రి నగరంలోని అరండల్‌పేట అవగాహన కార్యాలయంలో భారతజాతి గర్వించదగ్గ వీరుడు అల్లూరి సీతారామరాజు 116వ జయంతి సభను సీతారామరాజు విగ్రహ కమిటీ, అవగాహన సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షుడు ఎంవి రమణరావు అధ్యక్షత వహించారు. ప్రధానవక్తగా విచ్చేసిన లక్ష్మీనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సీతారామరాజు పౌరుషం, ఆయన పోరాట పటిమ వేలాది మంది యువతీ, యువకుల్లో చైతన్యాన్ని కల్గించిందన్నారు. అధ్యక్షత వహించిన రమణరావు మాట్లాడుతూ యువకుడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మన్యం ప్రాంత జనావళిని స్వాతంత్య్ర పథంవైపు నడిపించి వారందరికీ అండదండగా నిలిచి బ్రిటీషు పాలకులను తిప్పికొట్టిన ధీశాలి అన్నారు. పాఠ్యాంశాల్లో అల్లూరి పోరాట దృక్పథాన్ని, స్వాతంత్య్రోద్యమంలో ఆయన పాత్రను పొందుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరో వక్త, జర్నలిస్ట్ బండారు సురేష్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల పాటు బ్రిటీష్ యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన యోధుడు అల్లూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపన కమిటి కార్యదర్శి ఎం సుబ్రహ్మణ్యం, అవగాహన సంస్థ ఉపాధ్యక్షుడు పిఎస్‌ఆర్ మూర్తి, కె రోశయ్య, స్వాగతోపన్యాసం చేసిన పాశం రవీంద్రయాదవ్, అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తదితరులు అల్లూరి పోరాటాలను స్మరించుకుంటూ మనఃపూర్వక నివాళులర్పించారు. సభా ప్రారంభానికి ముందు సీతారామరాజు చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
గంటి ప్రసాదంపై దాడి గర్హనీయం
గుంటూరు (పట్నంబజారు), జూలై 4: అమరుల బంధుమిత్రుల సంఘ రాష్ట్ర నాయకులు గంటి ప్రసాదంపై దాడి గర్హనీయమని, దీన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం స్థానిక లాడ్జిసెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి పిడిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విరసం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాలో జరిగిన అమరుల సంస్మరణ సభలో పాల్గొని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్న మిత్రుడ్ని పరామర్శించేందుకు వెళ్లిన ప్రసాదంపై కొందరు దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను అణచి వేసే కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. పికెఎస్ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కోమర్తి గ్రామానికి చెందిన ప్రసాదం నాలుగు దశాబ్దాలకు పైగా పలు ప్రజా సంఘాల్లో పనిచేశారన్నారు. అంతేకాక అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకునిగా ఉండి పలు ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నృసింహుని సన్నిధిలో రైల్వే ఎజిఎం
మంగళగిరి, జూలై 4: దక్షిణమధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం) ఎకె పాండే గురువారం సతీసమేతంగా మంగళగిరి విచ్చేసి పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. కొండపై పానకాలస్వామిని, దిగువ సన్నిధిలోని లక్ష్మీ నరసింహ స్వామిని, రాజ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఉపప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభాచార్యులు పాండే దంపతులను ఆశీర్వదించారు. తొలుత ఆలయ ముఖద్వారం వద్ద వీరికి ఆలయ ఇఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి సంప్రదాయ బద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఎన్నికల నిబంధనావళికి బద్ధులై మసలుకోవాలి
తెనాలి, జూలై 4: ఎన్నికల నియమావళికి బద్ధులై విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని బూత్ లెవల్ సిబ్బందితో జెసి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక జెఎమ్‌జె కళాశాలలో పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జెసి, మురళీధర్‌రెడ్డి పాల్గొని ఎన్నికల నియమావళిపై పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన క్రమంలో జిల్లాలో తొలి విడత పోలింగ్ ఈ నెల 23న తెనాలి డివిజన్ నిర్వహించనున్నందున పోలింగ్ స్టేషన్లలో విధి విధానాలు వివరించారు. మొదటి ఫేజ్ ఎన్నికల్లో డివిజన్‌లో 18 మండలాలకుగాను 349 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న క్రమంలో కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల కోడ్ కేవలం గ్రామాలకే అనుకోవద్దని, రాష్ట్రం మొత్తం ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉందన్నారు. నిబంధనావళికి లోబడి పట్టణాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలింగ్ సమయంలో సమస్యాత్మక గ్రామాల విషయంలోను పూర్తి స్థాయి ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆర్డీఓ ఎస్.శ్రీనివాసమూర్తి అధ్యక్షత వహించిన సదస్సులో డిఎల్‌పిఒ సుబ్రహ్మణ్యం, మండల స్థాయి అధికారులు, బూత్‌లెవల్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం విలేఖర్లతో జెసి మాట్లాడుతూ ఎన్నికల నిబంధనావళిని పటిష్టమైన విధి విధానాలతో అమలుచేస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న నాయకుల విగ్రహాలు, ఫోటోప్రేమ్‌లపై కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ముసుగులు వేయాలని సూచించామన్నారు. పోలింగ్ సమయంలో సమస్యాత్మక గ్రా మాలుగా గుర్తించిన చోట్ల, పోలీస్ నిఘాతోపాటు, తమ వంతు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటామన్నారు. అన్ని రాజకీయ పార్టీల వారు ఎన్నికల నియమావళిని గౌరవించి తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు.
నిధుల వినియోగంలో జిల్లాకు ప్రాధాన్యమివ్వాలి
గుంటూరు (పట్నంబజారు), జూలై 4: ఉడా చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వణుకూరి శ్రీనివాసరెడ్డి గురువారం ఎంపి రాయపాటి సాంబశివరావును స్థానిక లక్ష్మీపురంలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి రాయపాటి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉన్న విజిటిఎం ఉడా విస్తీర్ణంలో అధికభాగం గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ నిధుల వ్యయం పరిశీలిస్తే సరైన న్యాయం జరగడం లేదన్నారు. జిల్లాలో ఉడా ప్రచారా ఆర్భాటాలుగా మిగిలిపోయిన అమరావతి టౌన్‌షిప్‌లో ఎటువంటి అభివృద్ధి లేదని, అదేవిధంగా సీతానగరం వద్ద శిలాఫలకంగా మిగిలిపోయిన బోధిశ్రీ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. ఉడా ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న గుంటూరు ఇన్నర్ రింగురోడ్డు మూడవ దశ పనులు కూడా త్వరగా ప్రారంభించేలా చూడాలని కోరారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలలో ఉడాకు ఎంపి ల్యాడ్స్ నుండి తాను 30 శాతం నిధులిస్తానని దానికి 70 శాతం ఉడా నిధులు జత చేసి రోడ్లు తదితర వౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. వణుకూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉడా చేపట్టిన డ్రీమ్ ప్రాజెక్టు నిధుల వ్యయంపై తాను అవగాహనకు వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మాజీ జడ్పీటిసి సభ్యులు మొగిలి భరత్‌కుమార్, మోహన్‌రెడ్డి, సూర్యదేవర రవి తదితరులు పాల్గొని వణుకూరిని అభినందించారు.
చెత్తను వేరు చేయడం అన్ని విధాల లాభదాయకం
గుంటూరు, జూలై 4: గృహాలలో పోగయ్యే చెత్తను తడి, పొడి చెత్తలుగా వేరు చేయడం వల్ల ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా, సామాజికంగా, ఆర్థికంగా చూస్తే అన్ని విధాల లాభదాయకమేనని ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి పేర్కొన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్య అమలులో భాగంగా నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఊరంటే గుంటూరే కార్యక్రమం రెండోరోజైన గురువారం స్థానిక అరండల్‌పేటలోని సాయిభాస్కర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అరండల్‌పేటలో ప్రారంభమైన ర్యాలి పిచ్చుకలగుంట, భారత్‌పేట, మల్లిఖార్జునపేట, శారదా కాలనీల మీదుగా తిరిగి ఆసుపత్రి వరకు జరిగింది. ర్యాలీలో ఆసుపత్రి సిబ్బంది తడి, పొడి చెత్తలను వేరు చేయడం, దీని వల్ల కలిగే లాభాలతో ఆసుపత్రి రూపొందించిన కరపత్రాలను ఆయా ప్రాంత వాసులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ గృహ పరిసరాలను పరిశుభ్రంగా తయారు చేసుకోవడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిఇ, నోడల్ అధికారి నగేష్‌బాబు, స్పెషల్ టీమ్ సభ్యులు సురేష్ భండారి, బషీర్, సాయిభాస్కర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ టివి రావు, డాక్టర్ యరగూటి సాంబశివారెడ్డి, డాక్టర్ లీలాకాంత్, మేనేజర్ చంద్రశేఖర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నాలుగున్నర దశాబ్దాల పాటు సర్పంచ్‌గా పనిచేసిన జమిందార్
నరసరావుపేట, జూలై 4: రాష్ట్రంలో నాలుగున్నర దశాబ్దాల పాటు గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన ఏకైక వ్యక్తి పెట్లూరివారిపాలెం జమిందార్ కటికినేని వెంకటరమణ సుబ్బారావు అని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ యన్నం వెంకటనర్సిరెడ్డి కొనియాడారు. గురువారం స్థానిక షాలేంనగర్‌లో కటికినేని వెంకటరమణ సుబ్బారావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. జమిందార్ వెంకటరమణ మాజీ ముఖ్యమంత్రి దివంగత కాసు బ్రహ్మనందరెడ్డి, కాసు వెంగళరెడ్డితో సహచర్యం చేశారని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం, గ్రామాభ్యుదయం కోసం పాటుపడిన వ్యక్తి అన్నారు.
రెండో రోజుకు ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు
వినుకొండ, జూలై 4: వృద్ధులు, వితంతువుల పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డిబోయిన ప్రసన్నకుమార్ మాదిగ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 200 రూపాయల పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్యంపట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలి
భట్టిప్రోలు, జూలై 4: తమ చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలని రాజీవ్ విద్యా మిషన్ జిల్లా సిఎంఓ రాజకుమారి అన్నారు. విద్యా పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం ఆరోగ్య, పారిశుద్ధ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లటూరు జెడ్పీ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆరోగ్య సూత్రాలు తెలియజేస్తూ నినాదాలు చేశారు. అద్దేపల్లిలోని హెచ్‌సి, ఉర్దూ, యుపి పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యుపి పాఠశాలలో జరిగిన సభకు ఎంఇఓ జాన్సన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి సిఎంఓ రాజకుమారి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉంటేనే చదువుల్లో రాణిస్తారన్నారు. పిహెచ్‌సి వైద్యులు రవిబాబు, శివకామేశ్వరావు ఆరోగ్య సూత్రాలు వివరించారు. అనంతరం చిన్నారులకు బహుమతులు, దుస్తులు పంపిణీ చేశారు. ఆర్‌విఎం అందించిన వినికిడి యంత్రాన్ని లక్ష్మీనరసింహారావు అనే మూగ విద్యార్థికి సిఎంఓ అందజేశారు.
జాతీయ అథ్లెటిక్స్‌లో సీతారామమూర్తికి నాల్గవ స్థానం
తెనాలి రూరల్, జూలై 4: విశ్రాంత ఉపాధ్యాయుడు, జాతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు దీవి సీతారామమూర్తి జూన్ 27 నుండి జూలై 1వ తేదీ వరకు బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన 34వ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున లాంగ్‌జంప్‌లో పాల్గొని 4వ స్థానం కైవశం చేసుకున్నారు. తెనాలిలోని గంగానమ్మపేటకు చెందిన ఈయన గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పతకం సాధించిన తను ఎపి కార్యదర్శి దేవదర్శన్ ద్వారా జ్ఞాపిక, ప్రసంశాపత్రం అందుకున్నట్లు చెప్పారు.
రైతు శ్రేయస్సే ధ్యేయంగా పని చేయాలి
* ఎంపి రాయపాటి
గుంటూరు (కార్పొరేషన్), జూలై 4: పొన్నూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్‌గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన బొనిగల వేణుప్రసాద్ గురువారం స్థానిక లక్ష్మీపురంలోని ఎంపి రాయపాటి సాంబశివరావును ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి రాయపాటి మాట్లాడుతూ మార్కెట్‌యార్డు రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించి రైతు శ్రేయస్సే ధ్యేయంగా పని చేయాలన్నారు.
దొంగ పెళ్ళిళ్ళ ముఠాపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట, జూలై 4: ప్రతి గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ స్పెషలాఫీసర్ కార్యక్రమానికి పట్టణ ప్రజల నుంచి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎవివి భద్రరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలి ఫిర్యాదుగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తూ పట్టణంలో దొంగ పెళ్ళిళ్లు చేసే ముఠా ఉందని, ఆ ముఠా నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో దొంగ పెళ్ళిళ్లు నిర్వహిస్తున్నారని అన్నారు. వీరిలో కొందరు పాత్రికేయులతోపాటు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు, మరి కొంతమంది వ్యక్తులు ఉన్నారని, వారి పేర్లతో సహా వెల్లడించారు. ఈ ఫిర్యాదుపై మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ తాము ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని, మీరు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సమాధానం ఇచ్చారు. అంతేకాక, పట్టణంలోని అన్ని పోలీస్టేషన్లలో వీరే దందాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ స్థానిక పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. చంద్రబాబుకాలనీకి చెందిన సీతారామ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తూ తమ కాలనీలో పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, వాటిని నిర్మూలించే చర్యలు చేపట్టాలని కోరారు. చిలకలూరిపేట రోడ్డులోని జయపాల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తూ డాక్టర్ అనె్న రామమోహనరావు ఆసుపత్రి పక్క బజారులో డ్రైనేజి వ్యవస్థ సరిగాలేకపోవడంతో మురుగు అక్కడే నిలిచి తీవ్ర అసౌర్యానికి గురవుతున్నామని అన్నారు. బాపనయ్యనగర్‌కు చెందిన ఎస్‌కె ఫరీద్ ఫిర్యాదు చేస్తూ 60 అడుగుల రోడ్డు వద్ద నాలుగు రోడ్లు ఉన్న చోట నుండి ఒకే డ్రేనేజిలోకి మురుగు ప్రవహిస్తుందని, ఆ డ్రైనేజీలో చెత్త చెదారం అడ్డుపడి మురుగు ప్రవహించడం లేదని, వెంటనే చెత్త చెదారాన్ని తొలగించాలని కోరారు. మాలమహానాడు అధ్యక్షుడు అన్నవరపుకిషోర్ ఫిర్యాదు చేస్తూ మున్సిపల్ పన్నులు చెల్లించేందుకు వెళ్తే ఈసేవాలో సమయం వృధా అవుతుందని, అందుకోసం మున్సిపల్ కార్యాలయంలోనే కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
‘పంచాయతీ’ గోదాలో బస్తీమే సవాల్
తెనాలి రూరల్, జూలై 4: పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల నుండి నామినేషన్లు ఈ నెల 9 నుంచి స్వీకరించనున్న నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఎంపికలో వివిధ రాజకీయ పార్టీల నేతలు తలమునకలౌతున్నారు. తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. మండలంలో మేజర్ పంచాయతీలైన నందివెలుగు, కొలకలూరు, అంగలకుదురు, సంగంజాగర్లమూడి, పెదరావూరు, కఠెవరం గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. అధిక సంఖ్యలో ఓటర్లు, వార్డు ఉన్నందున అన్ని పార్టీల దృష్టి ఆయా గ్రామాలపై పడింది. నందివెలుగులో 2443 మంది పురుషులు, 2526 మంది మహిళలు ఉన్నారు. కొలకలూరులో 5310 మంది పురుషులు, 5520 మహిళలు, అంగలకుదురులో 3100 మంది పురుషులు, 3247 మంది మహిళలు, సంగం జాగర్లమూడిలో 1971 మంది పురుషులు, 2080 మంది మహిళలు, పెదరావూరులో 2622 మంది పురుషులు, 2758 మంది మహిళలు, కఠెవరంలో 2367 మంది పురుషులు, 2513 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలం మొత్తంమీద 18 గ్రామ పంచాయతీలకుగాను 55563 మంది ఓటర్లు ఉండగా అందులో 27296 మంది పురుషులు, 28267 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలంలోనే అతిపెద్ద పంచాయతీ కొలకలూరులో అత్యధికంగా 10830 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంపై అన్ని పార్టీల దృష్టి మళ్లింది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో మండలంలోని ఆరు సొసైటీలకుగాను నాలుగింటిని తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకోగా కాంగ్రెస్ రెండింటితో సరిపెట్టుకుంది. వైఎస్‌ఆర్ సిపికి ఒక్క సొసైటీకి దక్కలేదు.
ఈ క్రమంలో అన్ని పార్టీల అధ్యక్షులు పంచాయతీ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకోవటంతో స్థానిక నాయకులు గ్రామాల్లో తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే 2006 పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు ఖర్చు చేయనిదే విజయం కష్టమన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీల నాయకులు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో కాంగ్రెస్ నాయకులు, వైఎస్‌ఆర్ సిపి నాయకులు గుదిబండి వెంకటరెడ్డి, చినవెంకటరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికలు జరుగుతున్నారు. ఎవరు విజయం సాధించాలన్నా మహిళా ఓటర్లే కీలకం కానున్నాయి. ఇది గ్రహించిన నేతలు వారివైపు దృష్టి సారించారు. ‘పంచాయతీ’ గోదాలో బస్తీమే సవాల్
తెనాలి రూరల్, జూలై 4: పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల నుండి నామినేషన్లు ఈ నెల 9 నుంచి స్వీకరించనున్న నేపథ్యంలో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు అభ్యర్థుల ఎంపికలో వివిధ రాజకీయ పార్టీల నేతలు తలమునకలౌతున్నారు. తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. మండలంలో మేజర్ పంచాయతీలైన నందివెలుగు, కొలకలూరు, అంగలకుదురు, సంగంజాగర్లమూడి, పెదరావూరు, కఠెవరం గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. అధిక సంఖ్యలో ఓటర్లు, వార్డు ఉన్నందున అన్ని పార్టీల దృష్టి ఆయా గ్రామాలపై పడింది. నందివెలుగులో 2443 మంది పురుషులు, 2526 మంది మహిళలు ఉన్నారు. కొలకలూరులో 5310 మంది పురుషులు, 5520 మహిళలు, అంగలకుదురులో 3100 మంది పురుషులు, 3247 మంది మహిళలు, సంగం జాగర్లమూడిలో 1971 మంది పురుషులు, 2080 మంది మహిళలు, పెదరావూరులో 2622 మంది పురుషులు, 2758 మంది మహిళలు, కఠెవరంలో 2367 మంది పురుషులు, 2513 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలం మొత్తంమీద 18 గ్రామ పంచాయతీలకుగాను 55563 మంది ఓటర్లు ఉండగా అందులో 27296 మంది పురుషులు, 28267 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలంలోనే అతిపెద్ద పంచాయతీ కొలకలూరులో అత్యధికంగా 10830 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంపై అన్ని పార్టీల దృష్టి మళ్లింది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో మండలంలోని ఆరు సొసైటీలకుగాను నాలుగింటిని తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకోగా కాంగ్రెస్ రెండింటితో సరిపెట్టుకుంది. వైఎస్‌ఆర్ సిపికి ఒక్క సొసైటీకి దక్కలేదు.
ఈ క్రమంలో అన్ని పార్టీల అధ్యక్షులు పంచాయతీ ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకోవటంతో స్థానిక నాయకులు గ్రామాల్లో తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే 2006 పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి ఎక్కువ మొత్తంలో అభ్యర్థులు ఖర్చు చేయనిదే విజయం కష్టమన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీల నాయకులు గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే, శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో కాంగ్రెస్ నాయకులు, వైఎస్‌ఆర్ సిపి నాయకులు గుదిబండి వెంకటరెడ్డి, చినవెంకటరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికలు జరుగుతున్నారు. ఎవరు విజయం సాధించాలన్నా మహిళా ఓటర్లే కీలకం కానున్నాయి. ఇది గ్రహించిన నేతలు వారివైపు దృష్టి సారించారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
కర్నూలు, జూలై 4: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ కె.రాఘురామిరెడ్డి తెలిపారు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నుంచి గురువారం జిల్లా కొత్త ఎస్పీగా కె.రఘురామిరెడ్డి ఎస్పీ ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జిల్లాను అవగాహన చేసుకుని దశల వారీగా అసాంఘిక కార్యకలాపాలపై గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో దృష్టి సారించి ఓటర్లు ప్రశాంతంగా ఓట హక్కు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటామర్కొన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచి సమూలంగా నివారించాలని ఆదేశించారు. ప్రధానంగా ఫ్యాక్షన్, భూ తగాదాలు, పరుపు హత్యలను నివారించాలన్నారు. జిల్లాలోని పేకాట, మట్కా తదితర కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి సహకరించాలని కోరారు. విధుల్లో తప్పు చేసిన సిబ్బందిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమస్యలతో పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. పెండింగ్ కేసులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయ న కర్నూలు రేంజ్ డిఐజి టి.మురళీకృష్ణను మర్యాద పూర్వకంగా కలశారు. అలాగే జిల్లా పోలీసు అధికారుల సంఘం నాయకులు ఎస్పీ రఘురామిరెడ్డికి స్వాగతం పలికి పూలబొకే అందజేశారు. అనంతరం కర్నూలు సబ్‌డివిజన్‌లో ఉన్న పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో నేర సమీక్షపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ఎన్నికల ముందే రౌడీ షీటర్లకు కౌనె్సలింగ్ చేసి బైండోవర్ చేయాలని ఎస్పీ ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని కొత్త ఎస్పీ హెచ్చరించారు.
పిఎసి చైర్మన్‌గా కెఇ కృష్ణమూర్తి
* టిడిపి శ్రేణుల్లో ఆనందం
డోన్, జూలై 4: శాసనసభ ప్రజా పద్దుల సంఘం (పిఎసి) చైర్మన్‌గా టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, కెయి కృష్ణమూర్తి ఎన్నిక కావడం పట్ల టిడిపి నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేబినేట్ హోదా కలిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా కెఇ కృష్ణమూర్తిని ఎన్నిక చేసి చంద్రబాబు టిడిపికి బిసిల పట్ల వున్న మక్కువను కనబరిచారని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన కెఇ కృష్ణమూర్తి తొలిసారి డోన్ అసెంబ్లీ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1983, 1985, 1989, 2009లో డోన్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. డోన్ నియోజక వర్గం నుంచి ఐదుసార్లు గెలిచి ఓటమి ఎరుగని నేతగా మిగిలారు. ఐదుసార్లు డోన్ నుంచి ప్రాతినిథ్యం వహించిన కెఇ ఎన్నో కీలక మంత్రి పదవులు చేపట్టారు. మర్రి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో పార్లమెంట్ కార్యదర్శిగా, అంజయ్య మంత్రి వర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, లఘ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేగాక కర్నూలు జడ్పీ చైర్మన్‌గా పనిచేసి జిల్లా ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మంత్రి వర్గంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసి రాష్ట్రంలో కెఇ ప్రత్యేక గుర్తింపు పొందారు. 1999లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డిపై విజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా పని చేశారు. టిడిపిలో కీలక నేతగా ఎదిగి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వున్నారు. ఎంతో రాజకీయానుభవం కలిగి బిసి నేతగా వున్న కెఇకి పిఎసి చైర్మన్ పదవి దక్కడం పట్ల ఆ పార్టీ నేతలు టిఇ శేషఫణిగౌడ్, వై.నాగేశ్వరయాదవ్, పట్టణ టిడిపి అధ్యక్షులు కొట్రికె ఫణిరాజ్, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణాచారి, తెలుగు యువత నాయకులు టిఇ నాగరాజు గౌడ్, ఎల్లాగౌడు, కన్నపుకుంట గోవిందరెడ్డి, దొరపల్లె నాగరాజు పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కెఇని ఎన్నిక చేయడం పట్ల నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
అటవీశాఖ అధికారులకు
జింక పిల్ల అప్పగింత
మంత్రాలయం, జూలై 4 : మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలో గురువారం జింక పిల్ల లభ్యమైంది. అబ్రహంకు చెందిన పొలంలో జింక పిల్లను కుక్కలు వెంట పడి వేటాడుతుండగా అబ్రహం జింక పిల్లను కాపాడి మంత్రాలయం పోలీసులకు అప్పగించారు. అటవీశాఖ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారి జాన్ వచ్చి జింక పిల్లను తీసుకుపోయారు.
సమర్థవంతంగా
సాగు, తాగునీటి పంపిణీ
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
కర్నూలురూరల్, జూలై 4: రానున్న ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని వ్యవసాయానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు సమర్థవంతంగా పంపిణీ చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వ శాఖల మధ్య చక్కటి సమన్వయంతో అధికారులు వారి సిబ్బంది కలిసి పని చేయాలని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి నీటి పారుదల వివిధ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో నీటి పారుదల శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ అధికారులు ఎల్‌ఎల్‌సి, కెసి కెనాల్ వెంట కర్నాటక రైతుల జలచౌర్యం జరగకుం డా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. సంబంధిత ఆర్‌డిఓ, తహశీల్దార్లు బాధ్యులపై కేసులు పెట్టాలని సూచించారు. ఎగువన వున్న టిబి డ్యాంలో ప్రస్తుతం 25 టిఎంసిల నీరు నిల్వ వుందని ఆ నీటిని రైతులకు సంపూర్ణంగా పంటలకు అందించవచ్చన్నా రు. అనంతరం నీటి పారుదల శాఖ ఎస్‌ఇ మట్లాడుతూ గత యేడాది నీరు తక్కువగా వున్నప్పటికీ ఎకరాకు 42 బస్తాలు సగటున రైతులు అధిక దిగుబడి సాధించారని ఈ యేడాది నీరు పుష్కలంగా వున్నాయని మంచి దిగుబడి సాధించాలన్నారు. అభివృద్ధి చెం దిన వివిధ ఆయకట్టులలో నీటి పన్ను రూ. 86 లక్షలు వసూలు చేశామని ఇం కా కొన్ని గ్రామాల్లో తగినంత పన్ను లు రావడంలేదని తెలిపారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్‌డిఓ పాల్గొన్నారు.
ఓబులంపల్లె సహకార సంఘం
వైకాపాదే..
ఆళ్లగడ్డ, జూలై 4: మండల పరిధిలోని ఓబులంపల్లె సహకార సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. సంఘం పరిధిలో 13 వార్డులు వుండగా నామినేషన్‌ల పరిశీలనలో 1, 8 వార్డుల నుంచి పెండేకంటి జ్ఞానమ్మ, గోపిరెడ్డి వెంకటశివారెడ్డి, 3వ వార్డులో నబీసాహెబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 10 వార్డులకు గురువారం ఎన్నికలు నిర్వహించగా అందులో వైకాపా 5 స్థానాలు, కాంగ్రెస్ 3, టిడిపి 2 స్థానాల్లో విజయం సాధించింది. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి లక్ష్మీకాంతరెడ్డి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐలు రమేష్‌బాబు, విజయలక్ష్మీ బందోబస్తు నిర్వహించారు. ఎన్నికైన గోపిరెడ్డిశివారెడ్డిని అధ్యక్షుడిగా నిర్ణయించారు. ఉపాధ్యక్షుడిగా నాసారి నరసింహప్రసాద్‌ను ఖరారు చేశారు. శుక్రవారం అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్నికల అధికారి తెలిపారు.
13 డైరెక్టర్ల స్థానాలు వైకాపా కైవసం
రుద్రవరం : మండల పరిధిలోని పెద్దకంబలూరు గ్రామ సహకార సొసైటీకి జరిగిన ఎన్నికల్లో 13 డైరెక్టర్ల స్థానాలు వైకాపా కైవసం చేసుకుంది. నాలుగు డైరెక్టర్లు ఏకగ్రీవంగా వైకాపాకి రాగా గురువారం జరిగిన ఎన్నికల్లో 9 డైరెక్టర్లు వైకాపాకే దక్కాయి. శుక్రవారం రుద్రవరం, పెద్దకంబలూరు సహకార సొసైటీలకు అధ్యక్షలను ఎన్నుకోవాల్సి ఉంది. రుద్రవరం సొసైటీకి పత్తి సత్యనారాయణ, పెద్దకంబలూరు సొసైటీకి ఎర్ర మనోహార్‌రెడ్డిలను ఎన్నుకుంటారు.
సాగునీటి సమీక్షకు
ఎన్నికల కోడ్ ఆటంకం
* జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జూలై 4: జిల్లా సాగునీటి సమీక్షా సమావేశానికి పంచాయతీ ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం విడుదల కావడంతో ఈ సమావేశంలో ప్రధాన భూమిక పోషించే ప్రజాప్రతినిధులు, నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు ఎన్నికల నియమావళి కారణంగా సమావేశానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సలహా మండలి సమావేశాన్ని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి రద్దు చేసి సమావేశానికి హాజరైన నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులతో సాగునీటి సమస్యలపై చర్చించాలని నిర్ణయించుకున్నారు.
ఎన్నికల్లో టిడిపి జెండాలు ఎగురవేస్తాం
* టిడిపి ఇన్‌చార్జి జయనాగేశ్వర్‌రెడ్డి
ఎమ్మిగనూరు, జూలై 4:స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలలో టిడిపి జెండాలు ఎగురవేయాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి డాక్టర్ జయనాగేశ్వర్‌రెడ్డి గురువారం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండలల టిడిపి నాయకుల విస్త్రృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకొని టిడిపి నాయకులు ఎన్నికల్లో గెలవాలని పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్ర టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తిరుపతిలో శుక్రవారం జరుగు ప్రాంతీయ సదస్సుకు 30 వాహనాల్లో బయలు దేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు ప్రసంగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
వ్యవసాయంలో మెళకువలపై రైతులకు
అవగాహన కల్పించండి
* వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించిన కలెక్టర్
కర్నూలుఓల్డ్‌సిటీ, జూలై 4: తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించేలా రైతులకు వ్యవసాయంలో మెళకువలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ సమావేశ మం దిరంలో వివిధ పంటల్లో పొలంబడి నిర్వహణపై గురువారం కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ 20 13-14 సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఏడాది వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ కర్నాటక, మహారాష్టల్ల్రో కురిసిన వర్షాల వల్ల తుంగభద్ర దిగువ కాల్వ, కెసి కెనాల్‌కు నీరు వదలడం వల్లనే పంట దిగుబడి వచ్చిందన్నారు. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా త్వరలోనే తుంగభద్ర కెసి కెనాల్‌కు నీటిని వదులుతామన్నారు. గత సంవత్సరం రూ. 1400 కోట్ల పంట రుణాల లక్ష్యం కాగా రూ. 1900 కోట్లు రైతులకు మంజూరు చేశామని, ఈ ఏడాది కూడా రూ. 2,500 కోట్ల పంట రుణా లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకూ రూ. 800 కోట్ల పంట రుణాలు రైతులకు మంజూరు చేశామన్నారు. పంట నష్టపరిహారం మొత్తాన్ని రైతులకు బ్యాంకుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి ఠాగూర్‌నాయక్, డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, టిడిపి కుట్రలను తిప్పికొట్టండి
* వైఎస్ ఆశయ సాధనే వైకాపా లక్ష్యం:మాజీ ఎంపి భూమా
నంద్యాల రూరల్, జూలై 4:కొందరి దుష్టశక్తుల ఆటకట్టించేందుకే నంద్యా ల వైకాపా అభ్యర్థిగా బరిలోకి వచ్చానని కాంగ్రెస్, టిడిపి కుట్రలను ఎదుర్కొనేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వైకాపా జెండాను ఎగురవేయాలని వైకాపా కేంద్ర పాలకమండలి సభ్యులు మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నంద్యాల మండలంలోని అన్ని గ్రామాల వైకాపా నాయకులు, కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ గురునాథరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు వైకాపాని జగన్ స్థాపించారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా జెండా ఎగురవేసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలన్నదే ప్రతి ఒక్కరి ధ్యేయమన్నారు. నంద్యాల వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాజకీయ చరిత్ర కలిగిన నంద్యాల నాకు తల్లిలాంటిదన్నారు. రాజకీయ లబ్ధికోసమే వస్తున్నానని పుకార్లను నమ్మవద్దని కార్యకర్తలను కోరారు. గతంలో ఎంపిగా ఉన్నప్పుడు తాను ప్రారంభించిన శిలాఫలకాలే తనకు స్వాగతం పలుకుతున్నాయన్నారు. గ్రామాలలో అభివృద్ధి ఎక్కడా లేదని శాశ్వతంగా ఒక్క పని కూడా కాంగ్రెస్ నాయకులు చేయలేదన్నారు. ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టి మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ స్థలాలను అమ్ముకోకుండా కాపాడిన వ్యక్తి అందరికీ తెలుసన్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఎనలేని కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం వైకాపాలోకి రావాలని కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌లో తంటాలు పడుతున్నారన్నారు. 9 సంవత్సరాలు కష్టం అనుభవించానని గ్రూపులకు అండగా ఉంటూ వర్గాలను కాపాడుకుంటానన్నారు. నంద్యాల ఎమ్మెల్యేకు అధికార బలం ఉంటే తనకు ప్రజాబలం ఉంద ని భూమా అన్నారు. రాబోయే రోజు ల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే రాజ్యమన్నారు. జగన్మోహన్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే టిడిపి పెద్దలు, ముఖ్యమంత్రి కుట్రపన్నుతున్నారన్నారు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో సొసైటీ ఎన్నికల్లో నీచ రాజకీయాలు పాల్పడ్డారని ఆరోపించారు. నాయకు లు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి స్థాని క సంస్థల ఎన్నికల్లో వైకాపా జెండాను ఎగురవేసి కాంగ్రెస్ అధిష్టానానికి దిమ్మ తిరిగేలా ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. సమావేశంలో వైకాపా నాయకులు ఎవి సుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎవిఆర్ ప్రసాద్, మిట్నాల రమణారెడ్డి, నాగసుబ్బారెడ్డి, సూర్యచంద్రారెడ్డి, గుంతనాల ఆనంద్, నాగేశ్వరరావు, గురివి రెడ్డి, పుల్లయ్య, తదితర గ్రామా ల నాయకులు పాల్గొన్నారు.
తప్పుల తడకగా ఓటరు జాబితా!
* కోడుమూరు జాబితాలో కోట్ల హర్ష పేరు
కోడుమూరు, జూలై 4: ఈ నెల 23వ తేదీ కోడుమూరు పంచాయతీకి ఎన్నికలు జరుగుతుండడంతో బరిలో ఉన్న పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు ఓటర్ల జాబితాలు తెప్పించుకుని ఓటర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే గురువారం కోడుమూరు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి ఇంటిలో వారి అనుచరులంతా ఓటర్ల జాబితాను గుర్తించే పనిలో ఉండగా వీటిలో 15వ వార్డుకు సంబంధించిన జాబితాలో ఒక ఓటరుకు రెండు ఓట్లు ఉన్నట్లు బయటపడ్డాయి. అలాగే ఇదే వార్డులోని మాజీ సర్పంచ్ సిబి లత, ఆమె కుమారుడు సిద్దార్థ పేర్లు మీద రెండేసి ఓట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనికితోడు మరో రాజకీయ నాయకుడు మాజీ సర్పంచ్ కెయి రాంబాబు కుమారుడు కెఇ హర్షవర్ధన్‌గౌడ్, రాఘవేంద్రగౌడ్ పేర్లు ఉండటం గమనార్హం. ఇది ఇలా ఉండగా మరో విచిత్రం ఏమిటంటే రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు కోట్లహర్షవర్ధన్‌రెడ్డి పేరు మీద ఓటరుగా నమోదు అయిన విషయం ఇక్కడ చర్చనీయాంశమైంది. అంతే గాక ఆ నేత స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని 18-141 నెంబర్ గల ఒక క్వార్టర్‌లో నివాసం ఉంటున్నట్లు జాబితాలో కనపడటం విశేషం. లద్దగిరిలో ఓటరుగా ఉన్న కోట్ల హర్షవర్ధన్‌రెడ్డిని కోడుమూరులో ఓటరుగా ఎలా నమోదు చేశారన్న విషయమై పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఈ తప్పిదం తెలిసే జరిగిందా, లేదా పొరపాటుగా నమోదైందా అనే విషయాన్ని స్థానిక ఎన్నికల అధికారులు తేల్చాల్సి ఉందని ఆయా పార్టీల నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అలాగే ఇదే క్వార్టర్‌లోని 18-139 నెంబర్‌లో గత పదేళ్ల కిందట వ్యవసాయ కార్యాలయంలో విస్తరణాధికారిగా పని చేస్తున్న జి.నారాయణ ఉండేవాడు. ప్రస్తుతం ఆ ఉద్యోగి కర్నూలులో నివాసం ఏర్పరుచుకున్నప్పటికీ ఆయన పేరు ఇంకా ఓటరు జాబితాలో ఉండటం విశేషం. ఇలా పట్టణంలో ఉన్న 20 వార్డుల్లోనూ ఓటర్ల జాబితాలో తప్పులు కనపడటం శోచనీయం. ఈ తప్పిదాలను అధికారులు పోలింగ్ సమయానికైనా సరి చేస్తారా లేదా అని రాజకీయ పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని ఆయా వార్డుల్లోని ఓటర్ల జాబితాలో జరిగిన తప్పుల తడకలపై కోడుమూరు అదనపు ఎన్నికల అధికారి ఆంటోని సరైన సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం. అలాగే లద్దగిరికి చెందిన కాంగ్రెస్ నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి కోడుమూరులో ఉంటున్నట్లు ఓటరు జాబితాలో నమోదయ్యారన్న విషయంపై కూడా ఆ అధికారి పెదవివిప్పక పోవడం శోచనీయం.
ఆ అధికారులపై చర్యలు తీసుకోండి
* నివాసాల కూల్చివేతపై ఎమ్మెల్సీ గేయానంద్ ఆగ్రహం
కల్లూరు, జూలై 4: నగరంలో పేదలు నివసిస్తున్న అమీర్ హైదర్ కాలనీలో నివాసాల కూల్చివేతకు కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ గేయానంద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మీడియా పాయింట్‌లో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మట్లాడుతూ పేదలకు అందాల్సిన రాజ్యాంగ హక్కులను వారికి దక్కకుండా కాలరాస్తున్న ప్రజాప్రతినిధులు, పోలీసు యంత్రాంగంపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు జీవించే హక్కు లేదా అని ప్రశ్నించారు. నదీ పరివాహక ప్రాంతంలో కొన్ని వేల మంది నివసిస్తున్నారని, అయితే అధికారులు కేవలం పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. రాజకీయ నాయకులు తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజలను అక్కడి నుంచి గెంటి వేయడం దారుణమన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయ విచారణ జరిపించి అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో
అధిక స్థానాలు టిడిపివే..
* జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి
ఆళ్లగడ్డ, జూలై 4: త్వరలో జరగను న్న పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో అధిక స్థానాలను టిడిపి మద్దతుదారు లు కైవసం చేసుకుంటారని, 2014 ఎన్నికల్లో కూడా టిడిపి అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయఢంకా మోగిస్తారని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో గురువా రం ఆయన విలేఖరులతో మాట్లాడు తూ గతంలో ఉప ఎన్నిక సందర్భంగా నాయకులు ప్రజలకు పలు హామీలు ఇచ్చారని, అయితే ఇప్పటి వరకూ వా టిని నెరవేర్చలేదన్నారు. కావున పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చే ఆయా పార్టీల నాయకులను ప్ర జలు నిలదీయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో టిడిపి మద్దతుదారులు పోటీ చేసి గెలవడం ఖా యమన్నారు. నమ్మించి ఓట్లు వేయించుకుని, మోసం చేసిన వారికి బుద్ధి చెప్పే సువర్ణావకాశం ఇప్పుడు ఓటర్ల చేతిలో వుందన్నారు. కులం పేరుతో దూషించే వారికి ప్రజలు పట్టం కట్టరన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చేసిన పాదయాత్ర ప్రజల్లో టిడిపి ఇమేజిని పెంచిందన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయినా కాంగ్రెస్‌పార్టీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీంతో చంద్రబాబు వారి కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారన్నారు. ఆళ్లగడ్డ టిడిపి ఇన్‌చార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 97 గ్రామ పంచాయతీలు వున్నాయని, అన్ని స్థానాల్లో టిడిపి మద్దతుదారులు పోటీ చేసి, గెలవడం ఖాయమన్నారు. రైతు రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అది టిడిపితోనే సాధ్యమన్నారు. ఏరువాక ప్రారంభమైనా ఇంత వరకూ ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలతో ప్రజల్లో టిడిపిపై నమ్మకం పెరిగిందని, తద్వారా రానున్న కాలంలో టిడిపితోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు.
పవరిస్తే పోర్టు కడతా!
కంకిపాడు, జూలై 4: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చరమగీతం పాడి తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు సీతారామా గార్డెన్స్‌లో గురువారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ నాయకుల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మైలవరం నియోజకవర్గం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని, 2014 శాసనసభ ఎన్నికల్లో విజయానికి, పార్టీ పటిష్టతకు సమిష్టి కృషి అవసరమని అన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక సంస్థల పటిష్టతకు కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని, నీటి సంఘాలు, రైతు సంఘాలు, డ్వాక్రా గ్రూపులు, విద్యా కమిటీలు, ఐసిడిఎస్ వంటి వాటిని ఏర్పర్చి అభివృద్ధికి దోహదపడింది తెలుగుదేశం పార్టీ అని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. గ్రామాలు మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఆదర్శ గ్రామాలుగా మారతాయని అన్నారు. కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీలకు చరమగీతం పాడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలవల్ల రాష్ట్రం అధోగతి పాలైందని అన్నారు. వేల కోట్ల రూపాయల మేర కుంభకోణాలు జరుగుతుంటే అభివృద్ధి ఏం జరుగుతుందని విమర్శించారు. 2012 నీలం తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందిస్తే రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంకు అధికారం ఇస్తే విజయవాడ- గుంటూరును మెగా సిటీగా తీర్చిదిద్దుతానని, నెల రోజుల్లో దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, బందరు పోర్టు నిర్మాణం, విజయవాడ- గుంటూరు- రేపల్లె పట్టణాలకు అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మించి అభివృద్ధి చేస్తామని వరాల జల్లు కురిపించారు. జిల్లా పార్టీ నాయకులు వర్ల రామయ్య, కాగిత వెంకట్రావ్, వైవిబి రాజేంద్రప్రసాద్, కొనకళ్ల నారాయణ, దాసరి బాలవర్థనరావు, తంగిరాల ప్రభాకరరావు, బచ్చుల అర్జునుడు, ఈడుపుగల్లు గ్రామ పార్టీ అధ్యక్షుడు అనుమోలు పద్మనాభ చౌదరి, మాగంటి బాబు, తదితరులు హాజరయ్యారు.
పంచాయతీ ఎన్నికల్లో
సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్
* జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్
విజయవాడ , జూలై 4: గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు, సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని పరిశీలించేందుకు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై నగరంలోని కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో రెవెన్యూ డివిజన్ అధికారులకు, పంచాయితీ అధికారులు, డివిజనల్ పంచాయితీ అధికారుల, బిఎస్‌ఎన్‌ఎల్, ఎపి ట్రాన్స్‌కో, రవాణా శాఖ, అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల లో జరిగే ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ద, చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు జరుగకుండా వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని, అలాగే వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుకు అవకాశం లేని గ్రామాల్లో వీడియో షూటింగ్ చేసి మైక్రో అబ్జర్వర్లను నియమించాలని సూచించారు. ఈప్రక్రియను పరిశీలించేందుకు గానుబిఎస్‌ఎన్‌ఎల్, విద్యుత్ శాఖ, రవాణా శాఖల నుంచి ప్రతి డివిజన్‌కు ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. వీరందరూ రెవెన్యూ అధికారుల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అలాగే సమస్యాత్మక గ్రామాలంటినీలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం ఎన్నికల షెడ్యూల్డ్‌ను ప్రకటించడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని, అధికారులు ఈ ప్రవర్తనా నియమావళి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నికల ప్రవర్తనా నియమాలళి అమలుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారని, ఎన్నికల కోడ్, పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్, లను జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులను డివిజనల్ స్థాయిలో మైక్రో అబ్జర్వర్లుగా నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత డిఎస్‌పిలు సంయుక్తంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులను నిర్వర్తించే సంబంధిత అధికారులు అలక్ష్యం లేకుండా మరింత జాగ్రత్తలు పాటించాలని ఆర్‌డిఓ లకు సూచించారు. గిరిజన, మత్స్యకార నివాసిత ప్రాంతాల్లో చిప్ లిక్కర్ పంపిణీని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నూతన ఓటర్ల నమోదు చేయటం జరగదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి, సబ్ కలెక్టర్ డి హరిచందన, అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్ రమేష్‌కుమార్, డిపిఓ ఆనంద్, ట్రాన్స్‌కో ఎస్‌ఇ మొహనకృష్ణ, బిఎస్‌ఎన్‌ఎల్ అధికారి శ్రీనివాస్, డిటిసి శివలింగయ్య, నూజివీడు, గుడివాడ, బందర్ రెవెన్యూ డివిజనల్ అధికారులు బి సుబ్బారావు, వెంకట సుబ్బయ్య, సాయిబాబు పాల్గొన్నారు.
ఓటుహక్కు నిర్భయంగా వినియోగించుకోండి
* ఎస్పీ ప్రభాకరరావు
కూచిపూడి, జూలై 4: రాజ్యాంగం ప్రతి పౌరునికి కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ ప్రభాకరరావు అన్నారు. పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని గురువారం రాత్రి మొవ్వ మండలం కోసూరు, కాజ గ్రామాల్లో పోలీసు గ్రామసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అవనిగడ్డ డిఎస్పీ హరిరాజేంద్ర బాబు అధ్యక్షత వహించారు. ప్రతి గ్రామంలో నిర్భయంగా ఓటుహక్కును వినియోగించుకునేందుకు సహకరించి సమస్యాత్మక గ్రామాల పేరును చెరిపి వేసుకునేందుకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చల్లపల్లి సిఐ దుర్గారావు, కూచిపూడి ఎఎస్‌ఐ సత్యనారాయణ, విఆర్‌ఓలు నాగమల్లేశ్వరరావు, సంధ్యారాణి, ఇఓలు పిచ్చయ్య, ఉమామహేశ్వరరావు, గ్రామ ప్రముఖులు గోగినేని పెరుమాళ్ళు, నాగవర్ధనరాజు, దగాని సుబ్బారావు, యార్లగడ్డ శ్రీనివాసరావు, తాతా రామ్మోహనరావు పాల్గొన్నారు.
రిక్షా తొక్కి కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన
మచిలీపట్నం (కల్చరల్), జూలై 4: ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు అధ్యాపకులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 11వ రోజుకు చేరుకున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులు రిక్షా తొక్కి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిపిఎం నాయకులు కొడాలి శర్మ, బహుజన సమాజ్ పార్టీ నాయకులు జి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. 11 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం శోచనీయమన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు కెవి నాగేశ్వరరావు మాట్లాడుతూ 6న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకులు వరప్రసాద్, సురేష్, రాంబాబు దీక్షలో పాల్గొన్నారు. యండి మున్వర్, నాగరాజు, జాషువ, సతీష్‌కుమార్, వాసు, రమేష్ దీక్షా శిబిరాన్ని పర్యవేక్షించారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
కృత్తివెన్ను, జూలై 4: మండల పరిధిలోని పోడు గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిడమర్రు గ్రామానికి చెందిన కూలీలు పశ్చిమ గోదావరి జిల్లా వెళుతుండగా ద్విచక్ర వాహనం అడ్డురావటంతో ఆటో పల్టీకొట్టింది. క్షతగాత్రులను భీమవరం ఆసుపత్రికి తరలించారు.
ఆర్టీసీ కార్మికుల ధర్నా
అవనిగడ్డ, జూలై 4: ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు 240 రోజులు పనిదినాలు పూర్తిచేసిన వారిని పర్మినెంట్ చేయాలని, గత ఏప్రిల్ 1నాటికి వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు గురువారం ధర్నా జరిపారు. యూనియన్ నాయకులు రాంప్రసాద్, పూర్ణచంద్రరావు నాయకత్వం వహించారు.
అల్లూరికి ఘన నివాళి
మచిలీపట్నం టౌన్, జూలై 4: పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత అని వక్తలు అన్నారు. స్థానిక చల్లరస్తా సెంటరులో సామాజిక కార్యకర్త మైనంపూడి సాయిబాబు ఆధ్వర్యంలో గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, షేక్ అరీఫ్ పాషా, వనె్నంరెడ్డి నాగరాజు, ఆకుల సతీష్, చిరువోలు రామ్మోహన్, ఉడత్తు శ్రీనివాసరావు, డా. చిలంకుర్తి పాండురంగారావు పాల్గొన్నారు.
పింగళికి భారతరత్న ఇవ్వాలి
మచిలీపట్నం టౌన్, జూలై 4: జాతీయ పతాకానికి రూపకల్పన చేసి దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పింగళి వెంకయ్య 51వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. విజయకృష్ణా కోస్తా జాతీయ రహదారి జనజాగృతి సంస్థ, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు చిలకలపూడి పోలీసు స్టేషన్ పక్కనున్న పింగళి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సికినం కాళిదాసు, నిడుమోలు వెంకటేశ్వర ప్రసాద్, చిలంకుర్తి పాండు రంగారావు, ఆకుల సతీష్, చిన్నం నానిబాబు, కొడమంచలి చంద్రశేఖర్, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, గంపల రాజగోపాల్, రామిశెట్టి ప్రసాద్, చిరువోలు రామ్మోహన్, ఆరీఫ్ పాషా, బి సత్యనారాయణ సింగ్, మైనంపూడి సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.
భట్లపెనుమర్రులో నివాళి
కూచిపూడి : ఎన్నికల కోడ్ పుణ్యమా అని జాతీయ నాయకుడైన పింగళి వెంకయ్య వర్ధంతిని గురువారం మొవ్వ మండలంలో సాదాసీదాగా నిర్వహించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 51వ వర్ధంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులను ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచాలని మండల అధికారులు పేర్కొనటంతో పింగళి స్వగ్రామమైన భట్లపెనుమర్రులో ఆయన వర్ధంతిని నామ్‌కే వాస్తే అన్నచందంగా నిర్వహించారు. గ్రామంలోని పింగళి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పింగళి విద్యనభ్యసించిన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు పింగళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రముఖులు చలసాని బెనర్జి, యలమంచలి నారాయణదాస్, తంగిశెట్టి సాంబశివరావు, శేషగిరిరావు, కంఠంనేని రామ్మోహనరావు, మేకా నాగేశ్వరరావు, చలసాని మోహనదాస్, గాంధి, గొట్టిపాటి శ్రీనివాసరావు, మేకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
8 మంది రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు
మచిలీపట్నం టౌన్, జూలై 4: గ్రామ పంచాయతీల ఎన్నికల దృష్ట్యా ఇనగుదురు స్టేషన్ పరిధిలో ఆరుగురు రౌడీషీటర్లపై గురువారం బైండోవర్ కేసులు నమోదు చేశారు. జలాల్‌పేటకు చెందిన గంజాల తులసీరామ్, చింతగుంటపాలేనికి చెందిన కొల్లు చరణ్, ఈడేపల్లికి చెందిన బలుసుపాటి సాంబశివరావు, అమృతపురానికి చెందిన మేకల బాజీలపై బైండోవర్ కేసులు పెట్టినట్లు ఎస్‌ఐ వెంకటనారాయణ తెలిపారు. అలాగే మచిలీపట్నం టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో బలరామునిపేటకు చెందిన బండారు శేఖరబాబు, రుస్తుంబాదకు చెందిన జయవరపు వెంకట సుందరరావు, తోటావారితుళ్ళు సెంటరుకు చెందిన రామిశెట్టి మాధవరావుపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భాస్కరరావు తెలిపారు.
25లోపు డిఎడ్ పరీక్ష రుసుము చెల్లించాలి
మచిలీపట్నం (కల్చరల్), జూలై 4: నవంబర్‌లో నిర్వహించే డిఎడ్ పరీక్షకు మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, తప్పిన విద్యార్థులు ఈ నెల 25లోపు అపరాధ రుసుము లేకుండా పరీక్ష రుసుము చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి డి దేవానందరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డైట్ ప్రిన్సిపాల్ 26న పరీక్ష రుసుమును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలన్నారు. రూ.50లు అపరాధ రుసుముతో ఆగస్టు ఒకటి లోపు విద్యార్థులు చెల్లించిన పరీక్ష రుసుమును 2న చెల్లించి 5న సిడిలు, హార్డ్ కాపీ, నామినల్ రోల్స్, చలానాలు, దరఖాస్తులు, రికగ్నిషన్ ఉత్తర్వులు, డిఎస్సీ ఆర్డర్స్‌ను డిఇఓ కార్యాలయంలో అందించాలన్నారు. 4, 5 సబ్జెక్టులు ఉంటే రూ.150లు, మూడు సబ్జెక్టులకు రూ.140లు, రెండు సబ్జెక్టులకు రూ.120లు, ఒక సబ్జెక్టుకు రూ.100లు పరీక్ష రుసుముగా నిర్ణయించినట్లు దేవానందరెడ్డి వివరించారు.
చేతివృత్తులను రక్షించాలని ధర్నా
మచిలీపట్నం టౌన్, జూలై 4: చేత్తివృత్తిదారులకు జనాభా ప్రాతిపదికన 25శాతం నిధులతో సబ్‌ప్లాన్ అమలు చేయాలని, వృత్తి కులాల ఫెడరేషన్‌లకు ఇచ్చిన నిధులను వెంటనే సొసైటీలకు మంజూరు చేసి లబ్ధిదారులకు రుణాలు అందించాలని, బిసి మార్జిన్ మనీ, రాజీవ్ అభ్యుదయ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చేతివృత్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వృత్తిదారుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎపి వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు లెల్లెల బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు వృత్తిదారుల సంఘాల ప్రతినిధులు కాటూరి నాగభూషణం, పివి ఆంజనేయులు, చల్లారి సుబ్బారావు, వనమాడి సుబ్బారావు, ఆలేటి విఠల్, పంచల నరసింహరావు పాల్గొన్నారు. సిపిఎం నాయకులు కొడాలి శర్మ, బూర సుబ్రహ్మణ్యం, గుంటూరు విద్యాసాగర్, తదితరులు సంఘీభావం తెలిపారు.
మహిళ హత్య కేసులో నిందితుని అరెస్టు
చల్లపల్లి, జూలై 4: సంచలనం సృష్టించిన వక్కలగడ్డ మహిళ దారుణ హత్య కేసులో చల్లపల్లి పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డిఎస్పీ హరిరాజేంద్ర బాబు నిందితుడు చందోలు రాజశేఖర్‌ను మీడియాకు చూపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 8న అర్ధరాత్రి వక్కలగడ్డలో కొమ్ము శకుంతల(55) దారుణ హత్యకు గురైందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. పాత నేరస్థుల కార్యకలాపాలపై నిఘా పెట్టి దర్యాప్తు చేయగా శకుంతల హత్యోదంతం బయట పడిందన్నారు. అత్త వరుసయ్యే శకుంతలతో సన్నిహితంగా ఉంటున్న నిందితుడు రాజశేఖర్ ఆమె నివాసగృహం వెనుక ఉన్న తాడిచెట్టు దగ్గర కొంత సమయం గడిపి డబ్బులు ఇవ్వాలని అడగ్గా అందుకు శకుంతల నిరాకరించింది. దీంతో చెంప మీద కొట్టడంతో శకుంతల పక్కనే ఉన్న తాడిచెట్టుకు గుద్దుకుని గాయపడిందన్నారు. గాయపడిన శకుంతల తలను బలంగా అదే తాడిచెట్టుకు కొట్టి హత్య చేశాడని తెలిపారు. మృతురాలి చెవిదిద్దులు, సెల్‌ఫోన్ తీసుకుని మృతదేహాన్ని ఇంట్లో పడేసి పరారయ్యాడన్నారు. రాజశేఖర్‌పై చల్లపల్లి, చెరుకుపల్లి పోలీసు స్టేషన్‌లలో కేసులు ఉండగా పెదకాకాని స్టేషన్‌లో మరో హత్య కేసు ఉందన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం మేడూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ కుటుంబం గత పదేళ్ల క్రితం చల్లపల్లిలో స్థిరపడిందన్నారు. రాజశేఖర్ భార్య, పిల్లలు మేడూరులో ఉంటుండగా గత రెండేళ్ల నుండి మరో మహిళను వివాహం చేసుకుని స్థానిక నారాయణరావు నగర్‌లో ఉంటున్నాడని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సిఐ దుర్గారావు, ఎస్‌ఐ గౌస్‌పాషా పాల్గొన్నారు.
పంచాయతీ పోరుకు పకడ్బందీ ఏర్పాట్లు
అజిత్‌సింగ్‌నగర్, జూలై 4: గ్రామ పంచాయితీ ఎన్నికలను సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు, సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని పరిశీలించేందుకు వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి పేర్కొన్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై నగరంలోని కలెక్టర్ క్యాంపుకార్యాలయంలో రెవెన్యూ డివిజన్ అధికారులకు, పంచాయితీ అధికారులు, డివిజనల్ పంచాయితీ అధికారుల, బిఎస్‌ఎన్‌ఎల్, ఎపి ట్రాన్స్‌కో, రవాణా శాఖ, అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల లో జరిగే ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ద, చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు జరుగకుండా వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని, అలాగే వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుకు అవకాశం లేని గ్రామాల్లో వీడియో షూటింగ్ చేసి మైక్రో అబ్జర్వర్లను నియమించాలని సూచించారు. ఈప్రక్రియను పరిశీలించేందుకు గానుబిఎస్‌ఎన్‌ఎల్, విద్యుత్ శాఖ, రవాణా శాఖల నుంచి ప్రతి డివిజన్‌కు ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. వీరందరూ రెవెన్యూ అధికారుల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అలాగే సమస్యాత్మక గ్రామాలంటినీలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం ఎన్నికల షెడ్యూల్డ్‌ను ప్రకటించడంతో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని, అధికారులు ఈ ప్రవర్తనా నియమావళి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నికల ప్రవర్తనా నియమాలళి అమలుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారని, ఎన్నికల కోడ్, పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్, లను జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ అధికారులను డివిజనల్ స్థాయిలో మైక్రో అబ్జర్వర్లుగా నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత డిఎస్‌పిలు సంయుక్తంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులను నిర్వర్తించే సంబంధిత అధికారులు ఎటువంటి అలక్ష్యం లేకుండా మరింత జాగ్రత్తలు పాటించాలని ఆర్‌డిఓ లకు సూచించారు. మూడు విడతలుగా నిర్వహించే పంచాయితీ ఎన్నికలలో ఈనెల 23వ తేదీన నూజివీడు, 27వ తేదీన విజయవాడ, 31వ తేదీన బందర్, గుడివాడ డివిజన్లలో జరుగుతాయన్నారు. నూజివీడు డివిజన్‌లలో 14మండలాలను, 279 గ్రామ పంచాయితీలు, విజయవాడ డివిజనలలో 14 మండలాలకు గాను 238 గ్రామ పంచాయితీలు, బందర్ డివిజన్‌లలో 12 మండలాలకు గాను 233 గ్రామ పంచాయితీలు, గుడివాడ డివిజన్లలో 9 మండలాలకు గాను 219 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సకల చర్యలు తీసుకొంటున్నామన్నారు. గిరిజన, మత్స్యకార నివాసిత ప్రాంతాల్లో చిప్ లిక్కర్ పంపిణీని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నిలక విధులు నిర్వర్తించే అధికారులందరూ మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డివిజన్ వారీగా ఇప్పటికే స్టేజ్ -1, స్టేజ్ -2 అధికారులకు శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేసామని, ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేస్తున్నట్లు ఆర్‌డిఓలో కలెక్టర్‌కు వివరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నూతన ఓటర్ల నమోదు చేయటం జరగదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి ఉషాకుమారి, సబ్ కలెక్టర్ డి హరిచందన, అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్ రమేష్‌కుమార్, డిపిఓ ఆనంద్, ట్రాన్స్‌కో ఎస్‌ఇ మొహనకృష్ణ, బిఎస్‌ఎన్‌ఎల్ అధికారి శ్రీనివాస్, డిటిసి శివలింగయ్య, నూజివీడు, గుడివాడ, బందర్ రెవెన్యూ డివిజనల్ అధికారులు బి సుబ్బారావు, వెంకట సుబ్బయ్య, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు చట్టం కమిషనర్ రాక
విజయవాడ (క్రైం), జూలై 4: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ఎం విజయనిర్మల ఈనెల 5న శుక్రవారం జిల్లాకు రానున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకుంటారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ శాఖల జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహంలో సమావేశమైన జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై సమీక్షిస్తారు. రాత్రి బస అనంతరం 6వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 10:30 గంటలకు ఏలూరు వెళతారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుని రాత్రి బస చేస్తారు. 7వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి హైదరాబాద్ వెళతారు.
‘అవినీతి రాజకీయాలకు జగన్ జైలుజీవితం గుణపాఠం’
కంకిపాడు, జూలై 4: ప్రతీ అవినీతి రాజకీయ నాయకుడికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి జైలుజీవితం గుణపాఠం కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సూచించారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని శ్రీ సీతారామ గార్డెన్స్‌లో గురువారం జరిగిన నాలుగు రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలపై ఘాటుగా విమర్శల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిపి చంచల్‌గూడ జైలులో గడుపుతూ జైలు నుండే రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. అవినీతి మంత్రులు కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు. అయ్యన్నపాత్రుడి తనయుడు విజయకుమార్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో వేలకోట్లు దండుకున్నారని, ప్రజా ధనాన్ని దుర్వినియోగపర్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని సూచించారు. గద్దే రామ్మోహన్ తనయుడు గద్దే రాజేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పటిష్టతకు, పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నా, ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. అవినీతి అంతమై సుపరిపాలన రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అందుకు కాంగ్రెస్ అవినీతి పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ బాధితులకు సహాయమందించడంలో ప్రభుత్వం విఫలమైన తీరును చెప్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై ఉద్వేగంతో విమర్శలు చేస్తుంటే చంద్రబాబు అసహనం వ్యక్తంచేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడుకున్న విమర్శలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞత కల్పించే విధంగా మనం స్పందించడం చాలా అవసరమని పుంచుమర్తికి సూచించారు. అనంతరం సభలో మాట్లాడినవారిలో పార్టీ నాయకులు వర్ల రామయ్య, కోడెల శివప్రసాదరావు, నన్నపనేని రాజకుమారి, బచ్చుల అర్జునుడు, కొనకళ్ల నారాయణ తదితరులున్నారు.
విభేదాలు వదిలేసి విజయమే లక్ష్యంగా పనిచేయాలి
విజయవాడ, జూలై 4: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి నావంతుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను.. నెలల తరబడి పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరినీ పలుకరించాను... పార్టీ పట్ల స్పందన బాగానే ఉంది... అందుకే సాధ్యమైనంత మేర అన్ని గ్రామ పంచాయతీల్లోనూ పాగా వేయటానికి ఇప్పటి నుంచి నిద్రాహారాలు లేకుండా పని చేయండి అంటూ గురువారం రాత్రి ఓ స్టార్ హోటల్‌లో జరిగిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ముఖ్యుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. కాస్తంత కటువుగా... కాస్తంత సున్నితంగా మధ్యమధ్యలో నవ్వుతూ మొత్తంపై నాయకులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సింది. ఇన్‌చార్జులు తమతమ నియోజకవర్గాల్లో పని చేయండి... వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇతర సామాజిక వర్గాలపై దృష్టి సారించవద్దని గట్టిగా చెప్పారు. అంతర్గత విభేదాలు విస్మరించి మమైకమై పని చేయండి. కులం వర్గం అంటూ లేకుండా గెలుపొందే వారిని పోటీకి నిలుపండన్నారు. అత్యుత్సాహంతో గత సొసైటీ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయాన్ని పదేపదే గుర్తించుకోవాలన్నారు. నేతల పనితీరు గమనిస్తుంటా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే వారందరికీ ప్రభుత్వంలో సముచిత స్థానం పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని పదేపదే చెప్పారు. సమావేశం అనంతరం రోడ్డు మార్గాన గుంటూరు వెళ్లి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయలుదేరి వెళ్లారు.
సిఐ మెడకు చుట్టుకున్న ఆటోడ్రైవర్ ఆత్మహత్య కేసు
విజయవాడ , జూలై 4: కంకిపాడుకు చెందిన ఆటోడ్రైవర్ ఆత్మహత్య కేసులో ప్రస్తుతం ఇబ్రహీంపట్నం సిఐగా పని చేస్తున్న అప్పటి కంకిపాడు ఎస్‌ఐ పి కనకారావుతోపాటు మరోవ్యక్తిపై కేసు నమోదైంది. మృతుని బాబాయి దాఖలు చేసిన ప్రైవేటు కేసును స్వీకరించిన మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈనెల 30న కేసు విచారణకు నిందితులు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కంకిపాడు పోలీస్టేషన్ పరిథిలోని తెనే్నరు గ్రామ భూస్వామి అయిన మొగులూరు భాస్కరరావు మేనకోడలు 2011 మే 21న ఇంటికి వెళ్ళేందుకు ఆటో ఎక్కింది. ఆటోడ్రైవర్ రాధాకృష్ణ (22)తోపాటు ఆటో వెనుక మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అయితే సదరు ముగ్గురూ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయం తెలిసిన భూస్వామి భాస్కరరావు ఆటోస్టాండు వద్దకు వచ్చి ఆటోడ్రైవర్ రాధాకృష్ణను కొట్టి పోలీస్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు రెండురోజుల పాటు రాధాకృష్ణను స్టేషన్‌లో ఉంచి తమదైన శైలిలో విచారించారు. ఆతర్వాత రాధాకృష్ణ 2011 మే 23వ తేదీ రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను చనిపోతూ తన మరణానికి కంకిపాడు సిఐ పి కనకారావు, భాస్కరరావుల వేధింపులే కారణమని సూసైడ్‌నోటు రాశాడు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆత్మహత్యపై కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై మృతుని బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా దిగారు. కాగా ఈకేసు దర్యాప్తు నగర పోలీసులు కాకుండా సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. విచారణ పూర్తి చేసిన సిఐడి ఆటోడ్రైవర్ రాధాకృష్ణ మరణానికి పోలీసు అధికారి కనకరావు ప్రమేయం లేదని 2012 జూలై 9న అనుకూలంగా నివేదిక సమర్పించింది. దీంతో మృతుని బాబాయి చిమట సాంబశివరావు కనకారావు, భాస్కరరావులకు వ్యతిరేకంగా ఆయన తరుఫు పౌరహక్కుల న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ ద్వారా మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో 2012 ఆగస్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశాడు. మృతుని సూసైడ్‌నోటు, చేతిరాత, ఫోరెన్సిక్ రిపోర్టు, ఇతర సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆటోడ్రైవర్ రాధాకృష్ణ ఆత్మహత్యకు కారణం సిఐ కనకారావు, భాస్కరరావులేనని ప్రాధమిక ఆధారాలున్నట్లు అభిప్రాయపడి నిందితులపై ఐపిసి 306 రెడ్‌విత్ 34 సెక్షన్ కింద కేసు విచారణకు స్వీకరించి 30న హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. ఇదిలావుండగా యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు వ్యక్తుల గూర్చి సమాచారం తెలియచేయాలని ఆటోడ్రైవర్ రాధాకృష్ణను పోలీసులు వేధింపులకు గురి చేసినట్లు వినిపిస్తున్న ఆరోపణల వెనుక మరో కథనం దాగి ఉన్నట్లు ఫిర్యాది తాలూకూ పౌర హక్కుల న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ ఘటనకు ముందు ఒక సందర్భంలో రాధాకృష్ణ ఆటో ప్రమాదానికి గురైనప్పుడు కంకిపాడు పోలీసులు ఆటోను అదుపులోకి తీసుకుని 70 రోజుల పాటు తిరిగి ఇవ్వకుండా నిర్బంధించారు. తన ఆటో ఇవ్వాలని కోరిన రాధాకృష్ణను ఎస్‌ఐ కనకారావు ఐదువేల రూపాయలు లంచం డిమాండు చేయగా రెండువేలు ముట్టచెప్పి ఆటో తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసిన రాధాకృష్ణ బంధువు ఒకరు ఎస్‌ఐని నిలదీయగా అది మనసులో పెట్టుకుని అవకాశం రాగానే తీవ్ర వేధింపులకు గురి చేయడం ద్వారా రాధాకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు సదరు న్యాయవాది చెబుతున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం కార్యాలయం ప్రారంభం
విజయవాడ, జూలై 4: 2014 సాధారణ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతున్నది. దీనిలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో ఇన్‌చార్జీలను నియమించడమే గాక ఎన్నికల కార్యాలయాలను హైటెక్ సౌకర్యాలతో దశల వారీగా సమకూర్చుకుంటున్నది. శాసనసభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీల నియామకం, కార్యాలయాలు ప్రారంభం ఇప్పటికే జరిగాయి. దీనిలో భాగంగా సమీపంలో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని) సొంత ఖర్చుతో పాత బస్‌స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయం (కేశినేని భవన్)ను గురువారం సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు హంగూ ఆర్భాటంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబును పూలబాటలో నడిపించారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలు మార్మోగాయి. కార్యాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినందులకుగాను కేశినేని నానిని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నగర అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, నాగుల్ మీరా, అసెంబ్లీ నియోకవర్గాల ఇన్‌చార్జీలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, శాసనసభ్యులు తంగిరాల ప్రభాకర్, శ్రీరాం తాతయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
ఉరేసుకుని రిక్షా కార్మికుడి ఆత్మహత్య
పాతబస్తీ, జూలై 4: కంటిచూపు మందగించిందని ఇద్దరు ఆడపిల్లలను భార్యను బతికించలేననే మనోవేదనకు గురైన ఓ రిక్షా కార్మికుడు తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి... కెఎల్‌రావు నగర్ అంబేద్కర్ నగర్‌కి చెందిన పమ్మిడి కృష్ణ (35) గత కొంతకాలంగా కంటిచూపు మందగించి బాధపడుతున్నాడు. ప్లాట్‌ఫాం రిక్షా కార్మికునిగా జీవనం సాగిస్తున్న కృష్ణా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య సేవలు పొందినప్పటికీ కంటిచూపు మెరుగుపడలేదు. దాంతో జీవితంపై విరక్తి కలిగిన కృష్ణ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకున్నాడు. సమాచారం అందిన కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య దుర్గా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
చేనేత రుణాలు రద్దు చేయాలి
పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఒంగోలు, జూలై 4: గ్రామపంచాయితీ ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్‌హాలులో రెవిన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్లతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. అధికారులు ఏవిధమైన పొరపాట్లుకు తావులేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషిచేయాలని ఆదేశించారు. ఓటర్లు సేచ్చగా వారికి నచ్చిన అభ్యర్థులను ఎన్నుకునే వాతావరణం కల్పించాలన్నారు. అధికారులు తప్పు చేయనప్పుడు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా వారికి రక్షణ కల్పిస్తామని, తప్పుచేసినట్లు తెలితే మాత్రం అదే స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సబ్‌డివిజన్ స్థాయిలో ఆర్‌డివోలు, మండల స్థాయిలో ఎంపిడిఒలు కీలక బాధ్యతలు నిర్వహించాలన్నారు. ఆర్‌డిఒలు డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులుగా విధులు నిర్వహిస్తూ వారి పరిధిలోని సిబ్బందికి పనివిభజన స్పష్టంగా చేయాలన్నారు. అధికారులు నిర్ణీత సమయానికి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఎక్కడైనా సందేహాలుంటే సీనియర్ అధికారులను సంప్రదించాలని తెలిపారు, జాయింట్ కలెక్టర్ అదనపు జిల్లా ఎన్నికల అదికారి హోదాలో గ్రామపంచాయితీల ఎన్నికల పక్రియను పర్యవేక్షిస్తారని, వివిధ స్థాయిలో పనిచేస్తున్న అధికారులందరూ జాయింట్ కలెక్టర్‌ను ఎప్పటికప్పుడు సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల సామాగ్రికి సంబంధించి బ్యాలెట్‌పత్రాలు, ఓటర్ల జాబితాల ముద్రణ బాధ్యతలు జిల్లా పంచాయతీ అధికారి నిర్వహించాలని, బ్యాలెట్ బ్యాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రికి సంబంధించిన బాధ్యతలు ఎపిఎంపిఐపి ప్రాజెక్టు డైరక్టర్ నిర్వహించాలని ఆదేశించారు.
పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారుల నిమాయకం, పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా పరిషత్ సిఇఒ నిర్వహిస్తారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు బాధ్యతలను జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. గ్రామపంచాయితీ ఎన్నికలు ముగిసే వరకు జిల్లా పంచాయతీ అధికారి, వారి కార్యాలయ సిబ్బంది మొత్తం కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం ఆధ్వర్యంలో పనిచేయాలని, జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో ఎవరికి కేటాయించిన బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలకు తావులేకుండా రాజ్యాంగ బద్దంగా ఎన్నికల కమిషన్ నియమావళికి అనుగుణంగా పనిచేయాలన్నారు. అధికారులు సమయస్పూర్తి, బుద్ది కుశలతో పనిచేసి ఏవిధమైన ఆరోపణలు, అభియోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలపై నివేదికలను కంభం స్పెషల్ డిప్యూటి కలెక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాల్సిన బాధ్యత జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఎపిడి, కోనేరు రంగారావు సిఫారసుల కమిటీ డిప్యూటి కలెక్టర్ నిర్వహిస్తారన్నారు. ఈసమావేశంలో జిల్లాజాయింట్ కలెక్టర్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీలలో ఆధిపత్యానికి మూడు పార్టీల ఎత్తుగడలు
కందుకూరు, జూలై 4: డివిజన్ పరిధిలో 475పంచాయతీలలో ఈనెల 27న జరగనున్న ఎన్నికలకు టిడిపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపిలు పార్టీల నాయకులు ఇప్పటి నుండే ఎత్తుగతలు వేస్తూ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డివిజన్ పరిధిలో కందుకూరు, కనిగిరి, కొండపి, దర్శి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజక వర్గాల పరిస్థితిని విశే్లషిస్తే త్రిముఖ పోటీ తప్పనిసరి అనే విధంగా పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ విశే్లషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అపర రాజకీయ చాణక్యుడిగా పేరు గడించిన మహీధర్‌రెడ్డి పంచాయతీలలో పట్టు సాధించి తన హవా తగ్గలేదని తద్వారా రానున్న శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు సాధ్యం అని నిరూపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక గత రెండు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీకి గట్టిపోటీ ఇచ్చి ప్రతిపక్షంగా ఉన్న టిడిపిని మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పర్యవేక్షిస్తున్నారు. గతంలో జరిగిన నెల్లూరు పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారంలో వెనకబడినా టిడిపి ఎన్నికల వ్యయంలో వెనకడుగువేసినా సుమారు 34వేల ఓట్లు ఆపార్టీకి లభించి, గ్రామీణ ప్రాంతాలలో చెక్కుచెదరని కేడర్ ఉందని నిరూపించింది. అయితే ఆపార్టీలో శివరాం మినహాయించి మరే ద్వితీయశ్రేణి నాయకుడు లేనందున పార్టీకి కొంత వెలితి కనిపిస్తుందని విశే్లషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక జగన్ ఊపుతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానంతో పుట్టుకొచ్చిన వైఎస్‌ఆర్‌సిపి నియోజకవర్గంలో సంచలనాలు నెలకొల్పింది. నెల్లూరు పార్లమెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా పార్టీకి సుమారు 30వేలు మెజార్టీ నియోజకవర్గంలో రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే తదుపరి జరిగిన సహకార సంఘ ఎన్నికలలో నియోజకవర్గంలో ఆపార్టీ నామమాత్రంగానే పోటీ ఇచ్చింది. ప్రస్తుతం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్‌ఆర్‌సిపికి కన్వీనర్లు, నియోజకవర్గస్థాయిలో ముగ్గురు కన్వీనర్లు ఉన్నా గ్రామస్థాయిలో పటిష్టమైన కేడర్‌లేని ఆపార్టీని వెంటాడుతుందని అభిప్రాయాలు రాజకీయపార్టీ నాయకుల నుండి వస్తున్నాయి. ఇప్పటి నుండే మూడు పార్టీల నాయకులు గ్రామాలవారీగా తమ అనుచరగణంతో ముమ్మరంగా చర్చలు సాగిస్తూ అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా కందుకూరు మండలంలో టిడిపికి, లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో మూడుపార్టీల మధ్య నువ్వా నేనా అన్న విధంగా, గుడ్లూరు మండలంలో వైఎస్‌ఆర్‌సిపి వైపు మొగ్గు చూపే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలో మూడుపార్టీల మధ్య పోటాపోటీగా పోటీ జరగనున్నట్లు తెలుస్తోంది. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తన అనుచరులతో ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తూ మెజార్టీస్థానాలు సాధించే దిశంగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌సిపి మెజార్టీకై ఆపార్టీ నాయకులు ముక్కు కాశిరెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇక టిడిపికి కదిరి బాబూరావు ఆధ్వర్యంలో మండలాల వారీగా పార్టీ నాయకులు గ్రామాలలోని పార్టీ కేడర్‌తో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కనిగిరి నియోజకవర్గంలో మూడుపార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా దర్శి, కొండపి నియోజకవర్గాలలో కూడా మూడు పార్టీల మధ్య పోరు తప్పనిసరి అని సమాచారం.
గ్రామాలలో మొదలైన ఎన్నికల సందడి
వెలిగండ్ల, జూలై 4: మండలంలోని గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు వెలువడడంతో ఆయా గ్రామాలలోని వివిధపార్టీల నాయకులు సర్పంచ్‌ల అభ్యర్థులకోసం వేటప్రారంభించారు. 21పంచాయతీలలోని కాంగ్రెస్, వైఎస్‌ఆర్ సిపి, టిడిపిలు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్నాయి. అయితే మొదటిసారిగా వైఎస్‌ఆర్ సిపి అన్ని పంచాయతీలను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉండే, కాంగ్రెస్ మాత్రం అధికారంలో తామే ఉన్నాము కనుక తమకే ఎక్కువ పంచాయతీలు వస్తాయని భివిస్తుంది. ఇక తెలుగుదేశంపార్టీ ప్రభుత్వ వ్యతిరేకత, కోట్లు దిగమింగిన జగన్ జైల్లో ఉండడం, ఆపార్టీపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లుతుందని వాటివల్ల అత్యధిక స్థానాలు గెలుస్తామని పేర్కొంటోంది. ఏది ఏమైనా మండలంలోని వెదుల్లచెరువు గ్రామంలో జిల్లా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకున్నాడు. మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి స్వగ్రామమైన ఇమ్మడిచెరువు ఎన్నికలు ప్రతిష్టంగా తీసుకున్నారు. జిల్లా బిసిసెల్ టిడిపి అధ్యక్షులు గవదగట్ల పెదమాలకొండయ్య ఇమ్మడి చెరువు పంచాయతీని ఎలాగైనా గెలిపించుకోవాలని కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి ఎరీక్షన్‌బాబు మొగుళ్లూరు గ్రామాన్ని తెలుగుదేశం కైవసం చేసుకునేందుకు ప్రతిష్టంగా తీసుకున్నారు. ఏది ఏమైనా మండలంలో అత్యధిక స్థానాలు అధికారపార్టీ, వైఎస్‌ఆర్ సిపి, టిడిపిలు గెలుస్తామని ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
బాధ్యతలనుంచి తప్పించండి బాబూ
ఒంగోలు, జూలై 4: జిల్లాలో పార్టీపనితీరు, వాస్తవ పరిస్థితులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి తనను నియోజకవర్గ బాధ్యతలనుండి తప్పించాల్సిందిగా సంతనూతలపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ మన్నం శ్రీ్ధర్ తెలుగుదేశంపార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడుకు గురువారం లేఖ పంపించారు. ఆ లేఖలోని సారాంశాన్ని పత్రికలకు విడుదల చేశారు. రాష్ట్రం, పార్టీకోసం, పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని చంద్రబాబును ఆ లేఖలో కొనియాడారు. కాని కిందిస్ధాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. తనను బాధ్యతల నుండి తప్పించినప్పటికీ పార్టీకోసం కృషిచేస్తానని ఆయన వివరించారు. జిల్లాతెలుగుయువత, సంతనూతలపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా తనను నియమించినందుకు చంద్రబాబుకు శ్రీ్ధర్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతికార్యక్రమాన్ని నిర్వహించానని ఆయన పేర్కొన్నారు. జిల్లానేతలు కరణం బలరామకృష్ణమూర్తి, శిద్దా రాఘవరావు, దివి శివరాం, కందుల నారాయణరెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జులు తనకు సలహాలు,సూచనలను అందించారని ఆయన వివరించారు. రాబోయే ఎన్నికల సమయంలో రెండుపదవులకు న్యాయం చేయలేననే ఉద్దేశంతో ఒక పదవీకి వేరేవారిని ఎంపిక చేస్తే బాగుంటుందని నాలుగునెలల క్రితం జిల్లా పార్టీ ముఖ్యనాయకులను కలిసికోరానన్నారు. దీంతో సంతనూతలపాడు నియోజకవర్గం రిజర్వుడు సీటు కాబట్టి జిల్లా తెలుగుయువత అధ్యక్షునిగా కొనసాగటం మంచిదని పెద్దలు సలహా ఇచ్చారని ఆయన వివరించారు. దీంతో మూడునెలల క్రితం జరిగిన జిల్లా ఇన్‌చార్జుల సమావేశంలో తనను తెలుగుయువత అధ్యక్షునిగా కొనసాగించాలని జిల్లాపార్టీ నేతలకు వివరించానన్నారు. కాని జిల్లాలో పార్టీ ముఖ్యనాయకులను కాని, ఇన్‌చార్జులను కాని ఎవరిని సంప్రదించకుండా బుధవారం అనుబంధ సంఘాల అధ్యక్షులను ప్రకటించడం బాధకలిగించిందన్నారు. జిల్లా అనుబంధ సంఘాలు ఎనిమిది ప్రకటిస్తే అందులో ఆరుగురు అధ్యక్షులను ఒకే నియోజకవర్గంనుండి ప్రకటించారన్నారు. మిగిలిన నియోజకవర్గాలను పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు. జిల్లా పార్టీ ముఖ్యనిర్ణయాలు తీసుకునేటప్పుడుకూడా జిల్లా ముఖ్యనాయకులను సంప్రదించి సమష్టినిర్ణయం తీసుకునే పరిస్ధితి లేదని, కష్టపడే కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని మన్నం శ్రీ్ధర్ చంద్రబాబుకు పంపించిన లేఖలో వివరించారు.
అంగన్‌వాడీ వర్కర్స్ సమ్మెను జయప్రదం చేయాలి
గిద్దలూరు, జూలై 4: రాష్టవ్య్రాప్తంగా అంగన్‌వాడీ వర్కర్ల సమ్మె ఈనెల 8,9,10 తేదీల్లో నిర్వహించనున్నామని, ఈసమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ మజుందార్ పిలుపునిచ్చారు. గురువారం సిఐటియు కార్యాలయంలో యూనియన్ సమావేశం అధ్యక్షురాలు స్వర్ణ ఆధ్వర్యంలో జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి మజుందార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జీతంతో సమంగా రాష్ట్రప్రభుత్వం వేతనాలు పెంచాలని, రిటైర్‌మెంటు బెనిఫిట్ అందచేయాలని అన్నారు. సూపర్‌వైజర్ పరీక్షకు వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు ఆవులయ్య, అంగన్‌వాడీ వర్కర్లు లక్ష్మీదేవి, ధనలక్ష్మీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పిఇటి పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
యర్రగొండపాలెంరూరల్, జూలై 4: స్థానిక కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న పిఇటి పోస్టులకు అర్హులైన పిఇటి కోర్సు చేసిన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రత్యేక అధికారి కె విజయభాస్కర్‌రెడ్డి కోరారు. ఈనెల 8లోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని, ఎస్టీ మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
పేద విద్యార్థినికి అన్నా ఆర్థిక సాయం
తర్లుపాడు, జూలై 4: చదువుల నిమిత్తం పేద విద్యార్థినికి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు 10వేల రూపాయలను గురువారం అందచేవారు. తర్లుపాడు గ్రామానికి చెందిన సత్తెనపల్లి దానం కృష్ణతార సివిల్ శిక్షణ కొనసాగిస్తుంది. కృష్ణతార తండ్రి ఆటో నడుపుకుంటూ గుండెజబ్బుతో కుటుంబ భారాన్ని మోయలేని పరిస్థితుల్లో ఎలాగైనా కూతురు చదవాలనే కోరికతో శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఆర్థికంగా అన్నా రాంబాబు ఆదుకోవడంతో ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏకరూప దుస్తులు పంపిణీ
యర్రగొండపాలెంరూరల్, జూలై 4: స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు గురువారం ఎంఇఓ మస్తాన్‌నాయక్ ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ శ్రీను, వైస్‌చైర్మన్ నూర్జాహాన్, ఉపాధ్యాయులు కె సుకుమారి, ఎం భాస్కర్, రాజామణి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అనుమతి లేకుండా నిర్వహిస్తున్న
కార్పొరేట్ జూనియర్ కాలేజీకి తాళాలు
దర్శి, జూలై 4:ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న నారాయణ జూనియర్ కాలేజీకి గురువారం ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ తనిఖీ అధికారి పి మాణిక్యరావు తాళాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గతంలో ఈ కళాశాలకు అనుమతులు లేవని హెచ్చరికలు జారీ చేసినా యాజమాన్యం ఖాతర్ చేయలేదన్నారు. ఆకస్మికంగా తనిఖీచేసి కళాశాలలు నిర్వహిస్తున్నట్లు కనుగొన్నామన్నారు. తాము వస్తున్నట్లు ముందుగా పసిగట్టిన యాజమాన్యం విద్యార్థులను కాలేజీ నుండి పంపివేశారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను కళాశాలల్లో చేర్పించేటప్పుడు ఆయా కాలేజీలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అని గమనించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాలేజీ యాజమాన్యం ఇతర కాలేజీలలో విద్యార్థులను చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ అనుమతి లేని కాలేజీలు నిర్వహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆయనవెంట దర్శి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎ సువర్ణరావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి వైఎస్‌ఆర్ సిపిలో 100 కుటుంబాలు చేరిక
తర్లుపాడు, జూలై 4: కాంగ్రెస్‌పార్టీ నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి 100 కుటుంబాలు గురువారం చేరినట్లు వైఎస్‌ఆర్ సిపి మండల అధ్యక్షులు రావి బాషాపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా మార్కాపురం వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను కోరారు. కలుజువ్వలపాడు, ఓబాయపల్లి, కొండారెడ్డిపల్లి, లక్ష్మక్కపల్లి గ్రామాల కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి వైఎస్‌ఆర్‌సిపిలో చేరారు. ఈకార్యక్రమంలో రమేష్‌రెడ్డి, మండల వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు తిప్పిరెడ్డి వెలుగొండారెడ్డి, మాజీ అధ్యక్షులు వెన్నా తిరుపతిరెడ్డి, మాజీఎంపిపి ఆర్ వెంకటరెడ్డి, యక్కంటి వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలుజువ్వలపాడు బస్టాండ్ సెంటర్‌లో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
పాతికేళ్ల అనంతరం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న చెరుకూరు
పొన్నలూరు, జూలై 4: మండలంలోని చెరుకూరు గ్రామం పాతికేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం పంచాయతీ పోరుకు సిద్ధమవుతోంది. ఈగ్రామంలో ఏ పంచాయతీ ఎన్నికలు జరిగి ఇప్పటికి పాతికేళ్ళ పూర్తియ్యాయి. 1985వ సంవత్సరం తర్వాత ఇప్పటికి చెరుకూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగలేదు. గ్రామస్థులందరూ పార్టీల కతీతంగా సహృద్భావ వాతావరణంలో చర్చలు నిర్వహించుకుని రాజీ ఫార్ములా పాటిస్తుండడంతో ఎన్నికలు జరపకుండా ఐదేళ్ళకోసారి ఐదు లక్షల రూపాయల చొప్పున గ్రామ అభివృద్ధి నిధులు గ్రామానికి చేకూరాయి. అయితే గతంలో గ్రామ పంచాయతీని ఎక్కువగా వెనుకబడిన వర్గాలకు, దళిత కులాలకు కేటాయిస్తుండడంతో గ్రామస్థులు ఎన్నికలకు వెళ్ళడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. అయితే ఈసారి జనరల్ మహిళలకు రిజర్వు కావడంతో ప్రస్తుతం గ్రామంలో పంచాయతీ ఎన్నికల కళ కనిపిస్తోంది. గడచిన పదేళ్ల కాలంలో ప్రజలు సమర్థులు, విద్యావంతులైన నాయకత్వం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి సర్పంచ్ నేలపాటి సుబ్బారావు అనేక వ్యయ ప్రయాసలకోర్చి నిజాయతీతో వ్యవహరించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. నాటి నుండి నేటి వరకు జనరల్ అభ్యర్థులకు కేటాయించకపోవడంతో గ్రామంలో రాజకీయంపై నిరాసక్తత నెలకొంది. ఇనే్నళ్ళ తర్వాత పంచాయతీని జనరల్ మహిళకు కేటాయించడంతో గ్రామంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. గ్రామంలో మొత్తం 1500 పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రధానపోటీ టిడిపి,, వైఎస్‌ఆర్‌సిపి మధ్యనే
ఇటీవల సహకార ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన వైఎస్‌ఆర్‌సిపి రెట్టించిన ఉత్సాహంతో కదన రంగంలో కాలు దువ్వుతుండగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. వైఎస్‌ఆర్‌సిపి తరపున ఇప్పటికే పోటీచేసే అభ్యర్థిని ప్రకటించి కొంతమేర ప్రచారం పూర్తిచేయగా, అధికార కాంగ్రెస్ గ్రామంలో కనుమరుగైపోయింది. కారణం అధికారపార్టీకి గతంలో నాయకత్వం వహించిన నేత ప్రస్తుతం చిత్తూరు జిల్లా తిరుపతిలో వ్యాపార నిర్వహణలో ఉన్నారు. దీంతో అధికార పక్షానికి దిశా నిర్దేశం చేసే రథ సారధి కరువైపోయారు. దీంతో కాంగ్రెస్‌లో ఉన్న వారంతా వైఎస్‌ఆర్ సిపిలోకి వెళ్లారు. చాలా రోజులుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశంపార్టీ గతంతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు మధ్యవర్తులు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలిసింది. ఒకవేళ రాజీ ప్రయత్నాలు సఫలం అయితే పాతికేళ్లపాటు పంచాయతీ ఎన్నికలు లేని గ్రామంగా చెరుకూరు గ్రామం రికార్డుల కెక్కనుంది.
‘ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలి’
అద్దంకి, జూలై 4: ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం ద్వారా పర్యావరణంతో పాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునని ఎండిఓ విజయకుమార్ అన్నారు. ఆరోగ్య, పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా గురువారం విద్యార్థులతో పట్టణంలో ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఎండిఓ మాట్లాడుతూ మలమూత్ర విసర్జనకు ఇంటింటా మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆరోగ్య పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. వర్షాకాలంలో మలేరియా, జ్వరాలు వచ్చే అవకాశాలున్నందున, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఈప్రదర్శనలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధరశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రోశయ్య జన్మదిన వేడుకలు
దర్శి, జూలై 4 : తమిళనాడు గవర్నర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 81వ జన్మదిన వేడుకలను దర్శి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కస్తూరిబా పాఠశాల విద్యార్థినుల మధ్య ఈ వేడులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలేజీ విద్యార్థినులకు ఎస్‌డిఆర్ ఫౌండేషన్ అధినేత సోము దుర్గారెడ్డి నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కాలేజీలో తల్లిదండ్రులు లేని విద్యార్థినికి దుస్తులు పంపిణీ చేశారు. కాలేజీకి అవసరమైన వాటర్ ట్యాంకును కొల్లా భాస్కర్‌రావు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బొగ్గవరపు సుబ్బారావు, కార్యదర్శి అచ్యుత సత్యనారాయణ, కోశాధికారి దేవకి రాము, అచ్యుత కొండలు , వెంకట రమణ, సి ప్రసాద్, దేవకి సత్యనారాయణ, పి సుబ్రమణ్యం, పులిపాటి శ్రీను, బొగ్గవరపు వెంకటేశ్వరరావు, రామచంద్రారావు, కొల్లా భాస్కర్, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల గుర్తులు ఖరారు
శ్రీకాకుళం, జూలై 4: పంచాయతీ ఎన్నికల గుర్తులను ఎట్టకేలకు ఖరారు చేశారు. జిల్లాలో బ్యాలెట్ విధానం ద్వారా ఈదఫా ఎన్నికలను నిర్వహించనున్నారు. సర్పంచ్‌లకు, వార్డు మెంబర్లకు కేటాయించిన గుర్తుల ముద్రణల సైతం జిల్లాలోనే ముద్రించినట్లు జిల్లా పంచాయతీ శాఖాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సర్పంచు స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులకు 20 గుర్తులను, వార్డు మెంబర్లకు పోటీచేసే అభ్యర్థులకు 15 గుర్తుల వరకు కేటాయించారు. జిల్లాలో 1091 పంచాయతీల్లో సర్పంచ్లు, 10,490 స్థానాల్లో వార్డుల అభ్యర్థులు బరిలో దిగి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ముద్రించిన బ్యాలెట్ ముద్రణలను ఆయా మండలాలకు పంపించినట్లు తెలిసింది. సర్పంచు స్థానాలకు గాను బుట్ట, ఉంగరం, కత్తెర, కుట్టుమిషన్, బ్యాట్, పలక, బ్యాటరీలైట్, బ్రష్, క్యారెట్, టేబుల్‌బల్ల, దూరదర్శిని, చేతికర్ర, షటిల్, మొక్కజొన్న, నగారా, దువ్వెన, మంచం, కప్పు, సాసర్, కొవ్వొత్తి గుర్తులను ముద్రించి సిద్ధం చేశారు. అదేవిధంగా వార్డుమెంబర్లకు సంబంధించి స్తంభం కవాతు, గ్యాస్‌పొయ్యి, హార్మోనియం, టోపీ, ఇస్ర్తిపెట్టె, పోస్టుడబ్బా, ఫోర్క్, చెంచా, జగ్గు, గౌను, స్టూల్, బీరువా, ప్రషర్‌కుక్కర్, ఐస్‌క్రీమ్, కెటిల్ గుర్తులను ముద్రించారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంబంధిత మండలాధికారులకు సైతం వీటికి సంబంధించిన బ్యాలెట్ ముద్రణలను పంపించి అక్కడ నిర్ధేశించిన కేంద్రాల్లో సిద్ధం చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి 4,408 వరకు బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధం చేసి మండలాలకు చేరవేశారు. వీటితోపాటు బ్యాలెట్ కొరత లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికలకమీషన్ ఆదేశాల మేరకు మరో వెయ్యి బ్యాలెట్ బాక్సులను కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి జిల్లాకు తెప్పించుకున్నారు. అంతేకాకుండా పూర్తిస్థాయి స్టేషనరీ సామాగ్రి సైతం ఆయా మండలాలకు పంపించినట్లు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యయం రూ.3కోట్లు?
శ్రీకాకుళం, జూలై 4: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడు కోట్లరూపాయల వరకు బడ్జెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు జిల్లా యంత్రాంగం ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో మూడు విడతల్లో రెవెన్యూ డివిజన్ల వారీగా జరిపే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశాల మేరకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది పూర్తి జాబితాను సిద్ధంచేసిన పంచాయతీ అధికారులు దానిని నేడో, రేపో జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నారు. సుమారు ఏడేళ్ల తరువాత నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఇప్పటికే సంబంధిత జిల్లా కలెక్టర్‌కు, పంచాయతీ అధికారులతో పాటు ఎన్నికల్లో పాల్గొంటున్న వారికి రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది. 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 2.46 కోట్లరూపాయల నిధులను ఎన్నికల నిర్వహణకు వెచ్చించగా, ఈ సారి ఈ వ్యయాన్ని మూడుకోట్లరూపాయలకు పైగా కేటాయించినట్ల్లు తెలిసింది.
* అధికారులు, సిబ్బంది నియామకం
జిల్లాలో మూడు విడతల్లో జరగనున్న ఎన్నికల్లో స్టేజ్-1, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారుల నియమాకం ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. ఈనెల 23వ తేదీన శ్రీకాకుళం డివిజన్‌కు సంబంధించి జరగనున్న ఎన్నికలకు స్టేజ్-1లో రిటర్నింగ్ అధికారులు 151 మందిని, స్టేజ్-2లో 389 మందిని నియమించింది. అదేవిధంగా 3,448 మంది ప్రిసైడింగ్ అధికారులు, 5,245 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. అలాగే ఈనెల 27వ తేదీన జరగనున్న పాలకొండ డివిజన్ ఎన్నికలకు గాను స్టేజ్-1లో119, స్టేజ్-2లో 408మందిని నియమించగా, 3,522మంది ప్రిసైడింగ్ అధికారులను, 4,805 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసారు.అదేవిధంగా 31వ తేదీన జరగనున్న టెక్కలి డివిజన్ ఎన్నికకు గాను స్టేజ్-1కు 117 మందిని, స్టేజ్-2కు గాను 368 మందిని నియమించారు. 3,520 మంది ప్రిసైడింగ్ అధికారులను, 4,050 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరితో పాటు ఇతర శాఖల సహాయం కూడా తీసుకున్నారు.
* ఎన్నికల విధులకు గౌరవవేతనం
స్థానిక సంస్థ ఎన్నికల విధుల్లో పాల్గోనే అధికారుల గౌరవవేతనాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రిసైడింగ్ అధికారి/ కౌంటింగ్ సూపర్‌వైజర్‌కు-250 రూపాయలు, పోలింగ్ అధికారి/ కౌంటింగ్ అసిస్టెంట్‌కు-175 రూపాయలు, జోనల్, రూట్, సెక్టోరియల్ అధికారులకు ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం ఇచ్చే గౌరవవేతనం-800 రూపాయలు, క్లాస్‌ఫోర్ ఉద్యోగులకు-100 రూపాయలు, పోలింగ్ /కౌంటింగ్ జరిగే రోజుల్లో భోజనానికి-100 రూపాయల వరకు గౌరవవేతనం ఇవ్వనున్నారు.
భక్తులతో కిటకిటలాడిన కూర్మనాథుని ఆలయం
గార, జూలై 4: మండలం శ్రీకూర్మంలో వెలసిన కూర్మనాథుని జయంతి వేడుకలు గురువారం కన్నుల పండుగగా జరిగాయి. ఆలయ కార్యనిర్వహణాధికారిణి శ్యామలాదేవి, పాలక మండలి సభ్యులు పొన్నాడ రుషీశ్వరరావు, దివిలి అప్పారావుల పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకుడు చామర్ల సీతారామ నృసింహాచార్యులు నేతృత్వంలో అర్చక స్వాములు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి సుప్రభాత సేవ, ప్రాతఃకాల పంచామృత అభిషేక సేవ అనంతరం ఉత్సవ మూర్తులను ఏకాంతంగా స్వామివారి జయంతోత్సవ మండపంలో వేంచేపు చేశారు. అదేవిధంగా స్వామి వారి ఆస్థాన మండపంలో 108 కలశాలతో ఆరాధన గావించి అనంతరం వివిధ రకాలైన ఔషధాలతో నదీజలాలను శాస్ర్తియంగా స్నపన అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా అభిమంత్రన చేసిన తీర్ధంతో స్వామికి అభిషేకం చేసారు. అనంతరం స్వామి ఉత్సవ మూర్తులను ఆస్థాన మండపంలో ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి నూతన వస్తధ్రారణ అనంతరం పుష్పాలతో అలంకరణ గావించి స్వామి అవతార ఘట్టాన్ని అర్చకులు వినిపించారు. అనంతరం భక్తుల సందర్శనార్ధం అనుమతించారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు అర్చక స్వాములకు పండిత సత్కారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరినామ సంకీర్తనలు, హరికథా కాలక్షేపం భక్తులను ఆకట్టుకొంది. అభిమంత్రన చేసిన జలం కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ ఉత్సవ నిర్వహణ కోసం ముందుకు వచ్చిన దాతలు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఆనందగజపతిరాజు గోత్రనామాలతో కూడా విశేషార్చనలు గావించారు.
నరసన్నపేట నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జిగా రమణమూర్తి
నరసన్నపేట/జలుమూరు, జూలై 4: నరసన్నపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బగ్గు రమణమూర్తిని నియమిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇన్‌చార్జిగా కొనసాగిన బగ్గు లక్ష్మణరావు ఇటీవలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక్కడ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే నియోజకవర్గంలో ఇన్‌చార్జి నియామకానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యకర్తలతో సమీక్షలు జరిపి, చివరకు బగ్గు రమణమూర్తికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకంతో నియోజకవర్గంలో నాలుగు మండలాల స్థానిక ఎన్నికలలో పార్టీపరంగా కార్యకర్తలకు నాయకత్వ కొరత తీరనుంది.
పార్టీ పటిష్టతే లక్ష్యం
టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎన్నికైన బగ్గు రమణమూర్తిని గురువారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ అధినేత తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు. తాను పార్టీ ఆవిర్భావం నుండి కీలకబాధ్యతలను చేపట్టానన్నారు. 1985-87లో నియోజకవర్గ పార్టీ అధ్యక్షునిగా, అలాగే 1987-89లో జిల్లా పార్టీ అధ్యక్షునిగా కూడా పనిచేశానని వివరించారు. 1991 వరకు పార్టీలో జనరల్ సెక్రటరీగా సేవలను అందించానని చెప్పారు. జలుమూరు, నరసన్నపేట జడ్పీటిసి ఎన్నికై 1995 నుండి 2001 వరకు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షునిగా కూడా కొనసాగానన్నారు. అలాగే 2001 నుండి 2005 వరకు జలుమూరు జెడ్పీటిసిగా పదవీబాధ్యతలు చేపట్టానని వెల్లడించారు. అయితే దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు నేతృత్వంలో పార్టీలో సేవలందించానని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని వెల్లడించారు.
ఆ పంచాయతీలకూ ఎన్నికలు
* హైకోర్టు తీర్పుతో గ్రామాల్లో ఎన్నికల వేడి
ఎచ్చెర్ల, జూలై 4: శ్రీకాకుళం మున్సిపాలిటీలో పరిసరంగా ఉన్న ఏడు పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేస్తూ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆరు పంచాయతీలకు చెందిన నాయకులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తూ కుశాలపురం, తోటపాలెం, పాతృనివలస, ఖాజీపేట ఎన్నికలను తదుపరి కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్వహించాలని వాయిదా వేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు పైడి అనసూయమ్మ, కళ్లేపల్లి రమణకమారి, అప్పలనాయుడు, ఎం.మురళీలు న్యాయమూర్తి వేణుగోపాలరావు ద్వారా ఎన్నికలు జరిపించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ప్రజావ్యాజ్యం స్వీకరించిన హైకోర్టు యధావిధిగా కుశాలపురం, తోటపాలెం, పాతృనివలస, ఖాజీపేట గ్రామాలకు ఎన్నికలు జరిపించాలని గురువారం తీర్పునిచ్చింది. దీనిపై ఆ గ్రామాల్లో కూడా ఎన్నికల సమరం జరుగనుంది.
వివేకానందుడి స్ఫూర్తితో సాగండి
* సిటిజన్‌ఫోరం అధ్యక్షుడు కామేశ్వరరావు
శ్రీకాకుళం, జూలై 4: స్వామి వివేకానందుని స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలని సిటిజన్‌ఫోరం జిల్లా అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు అన్నారు. ఫోరం కార్యాలయంలో గురువారం వివేకానందుని 111వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. భారతీయులకు గౌరవం తీసుకువచ్చిన ఘనత వివేకానందుడదని కొనియాడారు. దేశ యువతకు సందేశాన్ని ఇచ్చి సమాజాన్ని మంచి లక్ష్యంతో అభివృద్ధి సాధించాలని బోధించిన వ్యక్తి అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ఉదయ్‌భాస్కర్, పత్తి సుమతిలు మాట్లాడుతూ వివేకానందుని అడుగుజాడల్లో యువత నడవాలని పిలుపునిచ్చారు. తొలుత వివేకానందుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోరాడ రమేష్, ఎ.వి.టి.అప్పారావు, శ్యామ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూర్మనాథుని దర్శించుకున్న విజిలెన్స్ డిప్యూటి డైరెక్టర్
గార, జూలై 4: మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథాలయాన్ని విజిలెన్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఎం. సురేష్‌బాబు కుటుంబీకులతో గురువారం సందర్శించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్ర సందర్శనానంతరం కూర్మనాథాలయానికి చేరుకున్న సురేష్‌బాబును ఆలయాధికారులు, అర్చకులు, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ముందుగా స్వామిని దర్శించుకున్న ఈయన లక్ష్మీ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలోని గోడలపై ఒడిషా ఆకుపసర్లుతో వేసిన నాటి చారిత్రక చిత్రాల చరిత్రను, విశిష్టతను ఆలయ పాలక మండలి సభ్యుడు దివిలి అప్పారావు వివరించారు. స్వామి ఆస్తాన మండపంలో జరుగుతున్న కూర్మ జయంతి ఉత్సవంలో కొద్ది సేపు పాల్గోన్న సురేష్‌బాబు కుటుంబీకులకు తీర్థ ప్రసాదాలు అందజేసారు.
సమర్ధవంత నేతను సర్పంచ్‌గా ఎన్నుకోండి
సారవకోట, జూలై 4: గ్రామాల్లో నిరంతరం ప్రజలకు సేవ చేసే సమర్ధవంతమైన నాయకున్ని సర్పంచుగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. కోదడ్డపనస గ్రామంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. నేటి కాంగ్రెస్ పార్టీ మునిగే పోయే పరిస్థితిలో ఉందని, రాష్ట్రానికి జగన్ నాయకత్వమే సమర్ధవంతమైన పరిపాలన ఇవ్వగలదన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా నమ్మిన అవసరాలు తీర్చే విధంగా పరిపాలన కొనసాగాలని అభిప్రాయపడ్డారు. కోదడ్డపనస గ్రామస్థులు ఏకత్రాటిపై నిలిచి ఒకే అభ్యర్థిని సర్పంచు ఎన్నికల బరిలో దించేందుకు నిర్ణయించడం హర్షణీయమన్నారు. ఇదే స్పూర్తితో కాంగ్రెస్ ఆగడాలను ఎదుర్కొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి గ్రామ పంచాయతీపై వైఎస్సార్ సీపీ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు బగ్గు లక్ష్మణరావు మాట్లాడుతూ అర్హులందరికీ ఒకే పర్యాయం పథకాల ఫలితాలు అందించిన ఘనత దివంగత సి.ఎం వైఎస్సార్‌కే దక్కిందన్నారు. పేదలకు విద్యా, వైద్యసదుపాయాలు కల్పించిన వైఎస్ పేరు ప్రజల్లో సజీవంగా ఉందన్నారు. అంతకుముందు పార్టీలో చేరిన గ్రామస్థులకు కృష్ణదాస్, లక్ష్మణరావులు కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటిసిలు చిన్నాల రామసత్యనారాయణ, నామగిరి జగన్నాధదాసు, పార్టీ నాయకులు, గ్రామస్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కనె్నధారపై రీసర్వే ప్రారంభం
సీతంపేట,జూలై 4:సీతంపేట ఏజెన్సీలోని కనె్నధార కొండ పై సర్వే నెం.289లో ఉన్న బౌండరీ సరిహద్దులను సర్వే బృందాలు గురువారం కొలతలు చేపట్టాయి. జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి బి రామారావు ఆదేశాల మేరకు పది బృందాలు పులిపుట్టి, కర్లెమ్మ రెవెన్యూ సరిహద్దు పరిధిలో ఉన్న కంఠమానుగూడ,మాసంగిగూడ గ్రామాల్లో జిపిఎస్ సిస్టం ద్వారా సర్వే జరిపారు. అక్కడి నుండి బౌండరీల పరిధిలో ఉన్న భూముల హద్దులు, పంటలు, శ్మశానాలు, ఉమ్మడి ఆస్తుల వివరాలను మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. మాసంగిగూడ,కంఠమానుగూడ గ్రామాల గిరిజనులకు సర్వే నెం.289లో ఇచ్చిన పట్టాలు,పాస్‌పుస్తకాలు,గిరిజన రైతులు ఆ భూముల్లో సాగుచేస్తున్న పంటలను పరిశీలించారు. సర్వే మొత్తం జిపిఎస్ సిస్టం ద్వారా సాగుతుందని డిఐఓ పోలారావు చెప్పారు. అధికారులు రెండు గ్రూపులుగా విడిపోయి సర్వే జరిపారు.
సర్వే పారదర్శకంగా చేయండి:
తమ జీవనాధారమైన కనె్నధార కొండ పై లోకాయుక్త ఆదేశాల మేరకు చేపడుతున్న రీసర్వే పారదర్శకంగా చేయాలని కనె్నధార పోరాటకమిటీ నాయకులు సవరతోట మొఖలింగం కోరారు. గతంలో మాదిరిగా సర్వే చేపట్టి తప్పుడు నివేదికలు అందజేస్తే సహించేది లేదని అన్నారు.సర్వే బృందాలకు తాము పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామన్నారు. కాగా, రీసర్వే సమాచారం తెలుసుకున్న గిరిజనులు పట్టాలు,పాస్‌పుస్తకాలతో కనె్నధార కొండకు చేరుకున్నారు. ఈ రీసర్వేలో సంజ్ఞారాణి,సర్వేయర్‌లతో పాటు కనె్నధార పోరాటకమిటీ నాయకులు వెలుగు సంజీవరావు,మిత్యారావు, గిరిజనులు పాల్గొన్నారు.
పట్టుబడిన అంతర్ రాష్ట్ర దొంగలు
పాలకొండ,జూలై 4: ఏమార్చి బంగారం దుకాణాల్లో వ్యాపారుల నుండి బంగారాన్ని అతి చాకచక్యంగా దొంగిలించే అంతర్రాష్ట దొంగల ముఠాను పాలకొండ పోలీసులు పట్టుకున్నారు. అనతికాలంలోనే ఈ నేరస్తులను ఎస్ ఐ వినోద్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకుని దొంగతనం చేసిన బంగారాన్ని స్వాధీన పరుచుకున్నారు. నేరస్తులను స్థానిక డి ఎస్‌పి దేవానంద్ శాంతౌ గురువారం విలేఖర్ల ముందుంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పోస్ట్ఫాసు రహదారిలో ఈ నెల 1న సాయంద్రం ఏడున్నర గంటల ప్రాంతంలో బంగారుదుఖాణంలో చోరీకి పాల్పడిన వారిని పార్వతీపురం రామకళామందిర్ థియేటర్‌లో మాటువేసి పట్టుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుండి ఏడున్నర తులాల బంగారం వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పార్వతీపురంలో ఈ బంగారాన్ని విక్రయించేందుకు వీరు వస్తారనే అనుమానంతో ఆప్రాంతంలో నిఘా పెంచామన్నారు. అలాగే మండలంలోని ఎన్‌కె రాజపురం గ్రామంలో మే 5న గిరి త్రినాధరావు ఇచ్చిన పిర్యాదు మేరకు దొంగను పట్టుకున్నామని స్థానిక బుట్టిమఠం ప్రాంతానికి చెందిన గొలుసు శ్రీను అలియాస్ కుక్కల శ్రీను అలియాస్ పోలయ్యను స్థానిక మార్కెట్‌లో గురువారం అరెస్టు చేశామన్నారు. ఈ దొంగతనంలో నాలుగు తులాల బంగారంతో పాటు సెల్‌ఫోన్, వెండి పట్టీలు స్వాధీన పరుచుకున్నామని తెలిపారు.
ఒడిశాలో దొంగల నివాసం
పట్టుబడిన వారు ఒడిశాలోని రాయఘడకు చెందినవారు సయద్ గులాం ఆలీ, సఫీ ఆలీ, సయద్ మహమ్మద్ ఆలీలుగా గుర్తించామని వీరంతా బంధవులేనని అదే రాష్ట్రానికి చెందిన ఖరియర్‌కు చెందినవారన్నారు. రాయఘడలో ఉంటూ వీరు పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. దొంగల్లో రకరకాలవారు ఉంటారని, వీరు వ్యాపారులను ఏమార్చి దొంగతనాలు చేసేవారిగా గుర్తించి ఆదిశలో దర్యాప్తు చేపట్టి పట్టుకున్నామని తెలిపారు.
జిల్లా ఎస్‌పి అభినందన
పాలకొండ పట్టణంలో బంగారం దుఖాణంలో జరిగిన చోరీకి సంబంధించి నింధితులను అనతికాలంలో పట్టుకున్న పాలకొండ ఎస్ ఐ వినోద్ బాబు, సిబ్బంది ఎల్ రాంబాబు, పి శ్రీనివాసరావు, వై గవరయ్య, బి రమేష్‌లను జిల్లా ఎస్‌పి గోపాలరావు అభినందించారు. ఈసందర్భంగా వారికి రివార్డును కూడా ప్రకటించినట్లు డి ఎస్‌పి తెలిపారు.
విద్యాసంస్థల బంద్‌పై ఎస్‌ఎఫ్‌ఐ ప్రచారం
శ్రీకాకుళం, జూలై 4: ప్రభుత్వం విద్యాసంస్థల్లో కనీస వౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపుమేరకు ఈనెల 6న విద్యాసంస్థల బంద్ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ చేసిన ప్రచారానికి విశేష స్పందన లబించింది. విద్యాసంస్థలు, యాజమాన్యం హాస్టల్ విద్యార్థులను కలిసారు. ఈ సందర్బంగా విద్యార్థులు, యాజమాన్యం, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించినట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వై చలపతిరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమో పాఠశాల ప్రారంభం నాటికి ఇవ్వాలని ఖచ్చితమైన అంచనాలు ఉన్నప్పటికీ ప్రింటింగ్ చేయకుండా, టెండర్లు పిలవకుండా జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలకు కనీస వౌళిక సదుపాయాలు కల్పించాల్సిన బాద్యతను విస్మరిస్తున్నారన్నారు.
ఇంటర్మీడియట్, వృత్తి విద్యాకోర్సులు చదువుకొనేందుకు కళాశాలల్లో కొన్ని గ్రూపులు ఎత్తివేసి విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ఆర్ మోహన్‌రావు, ఎస్ హరీష్, డీవైఎఫ్‌వై పట్టణ కన్వీనర్ మనోహరి పట్నాయిక్, జగదీష్, బాబూరావు, జానకిరావు తదితరులు పాల్గొన్నారు.
మూడు పార్టీలకు ముచ్చెమటలు!
విశాఖపట్నం, జూలై 4: పంచాయతీ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు నాంది అని చంద్రబాబు ఇప్పటికే డిక్లర్ చేశారు. తొమ్మిదేళ్ళపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీకి ఇవి ప్రతిష్ఠాత్మక ఎన్నికలు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బే తగిలింది. కనీసం ఈ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలను సాధించుకోపోతే, తొమ్మిదేళ్ళ పాలనకు అర్థం లేకుండా పోతుంది. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం కాకపోవడంతో ఈ ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలో తెలియని పరిస్థితుల్లో ఉంది.
ఏ ఎన్నికలకైనా పంచాయతీ ఎన్నికలే నాందీ ప్రస్తావన అవుతాయి. పార్టీ పరంగా ఈ ఎన్నికలు జరగకపోయినా, గ్రామాల్లో ఆయా పార్టీలకున్న బలమేంటో తేలిపోతుంది. ఆ తరువాత జరగనున్న జిల్లాపరిషత్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎన్నికల ప్రభావమే కనిపిస్తుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించాయి.
ముందుకురాని అభ్యర్థులు
పంచాయతీ సర్పంచ్‌లుగా పోటీ చేయడానికి అనేక ప్రాంతాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వస్తే, ఎన్నికల్లో ఎంత ఖర్చు చేస్తావని ప్రశ్నించడంతో, వారు ముందుకు రావడం లేదు. చాలా చోట్ల ప్రధాన రాజకీయ పార్టీలకు అభ్యర్థులు లేకపోవడం గమనార్హం. అన్ని రాజకీయ పార్టీలూ అభ్యర్థుల అనే్వషనలో నిమగ్నమై ఉన్నాయి. జిల్లాలో 920 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 50 శాతం పంచాయతీలను మహిళలకు కేటాయించారు. అంటే 460 పంచాయతీల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైనా ఉంది. అంతమంది మహిళా అభ్యర్థులు ఏ పార్టీకీ దొరకడం లేదు.
ఏకగ్రీవం అనుమానమే!
గత పంచాయతీ ఎన్నికల్లో 71 పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. ఈ ఏడాది పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికలు ఏకగ్రీవమైనా, వేలం పాటలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఈ సంవత్సరం ఏకగ్రీవం అయ్యే పంచాయితీలు ఉండకపోవచ్చు.
ఇక పార్టీల పరంగా చూస్తే..జిల్లాలో మూడు పార్టీలు వివిధ సమస్యలతో సతమతమవుతున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కాలేదు. జిల్లాలో కొణతాల, దాడి, సబ్బం గ్రూపులు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో క్యాడర్ ఎవరి మాట వినాలి? అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతోంది. దీని ప్రభావం ఆయా గ్రామాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ గ్రూపులను సరిచేసుకోలేకపోయారు. ఈ తరుణంలో పార్టీని సరిచేసుకునే అవకాశాలు లేవు. కొణతాల రామకృష్ణ ఇంకా అలక వీడలేదు. కాగా, నిన్న మొన్నటి వరకూ సబ్బం హరి పక్కన ఉన్న వర్గం అంతా ఇప్పుడు దాడి వీరభద్రరావు గూటిలోకి చేరుతోంది. దీనిపై సబ్బం హరి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఇన్ని గ్రూపులు, ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న వైకాపాకు జన బలం ఉన్నా, తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, ఇక్కడ ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోయింది. నాయకులంతా కలిసి ఉన్నట్టే, కనిపిస్తున్నా, ఎన్నికల్లో పార్టీకి తూట్లు పొడిచేందుకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో ఈ తీరు కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలుగుదేశం పార్టీ వారు అమ్ముడైపోయారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. డిసిసిబి చైర్మన్ ఎన్నిక సమయంలో అప్పటి రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ సొసైటీ అధ్యక్షులను సమావేశానికి పిలిచినా, ఎవ్వరూ హాజరు కాకపోవడాన్ని బట్టి పార్టీ తీరు అర్థమవుతోంది. ఇక టిడిపి నుంచి వైకాపాలో చేరిన దాడి వీరభద్రరావు ఆ పార్టీలో పట్టు నిలుపుకొనేందుకు ఈ ఎన్నికలను ఒక వేదికగా చేసుకోవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో పట్టు ఉన్న దాడి, వైకాపా బలాన్ని జోడించి ప్రధానంగా తెలుగుదేశాన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేసినా చేయచ్చు. వీటిని బేరీజు వేసుకుని, టిడిపి నాయకులు పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహ రచన చేసే పరిస్థితులు చాలా మృగ్యంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆధిపత్య పోరు కొనసాగితే, పార్టీలో సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో గడ్డు రోజులు తప్పవన్నది వాస్తవం.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లా మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. గత తొమ్మిదేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను గ్రామీణ ప్రజలకు అందించింది. వీటిపై మమకారంతో ఓట్లు కాంగ్రెస్ వేస్తారా? అదే మాదిరి గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు వగైరా అంశాలతో కాంగ్రెస్‌ను ఈ సారి దూరంగా ఉంచుతారా? అన్నది వేచి చూడాలి. ఒక విధంగా కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన తీరు ఈ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందనడంలో సందేహం లేదు.
పది రోజుల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం
* సీనియర్లను ఆదేశించిన చంద్రబాబు
విశాఖపట్నం, జూలై 4: ఇప్పటి వరకూ జిల్లాలో నిర్లిప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు నింపేందుకు చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశం చేశారు. గురువార తెల్లవారుజాము రెండు గంటల వరకూ నాలుగు జిల్లాల నాయకులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, ఉదయం 5.30 గంటలకు ఇక్కడి నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడుతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. చంద్రబాబు జిల్లా నుంచి వెళుతూ పాయకరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్‌గా అనితను నియమించారు. ఇంకా గాజువాక, పాడేరు, అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను వెంటనే నియమించాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే యలమంచిలి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల విషయంలో కూడా చంద్రబాబు పునరాలోచన చేస్తున్నట్టు భోగట్టా.
ఇక చంద్రబాబు నాయుడు ఉదయం 5.30 గంటలకు విజయవాడ బయల్దేరి వెళ్లినప్పుడు స్థానిక నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు.
వుడా బోర్డు సమావేశం రద్దు
విశాఖపట్నం, జూలై 4: విశాఖ నగరాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశం రద్దయింది. ఈ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే వుడాకు ఇన్‌చార్జ్ చైర్మన్‌గా మున్సిపల్, పరిపాల పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించిన శ్యాంబాబు ఆ శాఖ ఈ సమావేశానికి హాజరు కావల్సి ఉంది. ఇటీవల ఆయన ఆ శాఖ నుంచి బదిలీ కావడంతో ఈ బోర్డు సమావేశాన్ని రద్దు చేసినట్టు వుడా విసి యువరాజ్ ప్రకటించారు. దీన్ని ఎప్పుడు నిర్వహించేదీ తరువాత తెలియచేస్తామని ఆయన చెప్పారు.
వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి
* కెజిహెచ్‌లో కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా
విశాఖపట్నం, జూలై 4: బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతూ కెజిహెచ్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు గురువారం కెజిహెచ్ సూపరింటెడెంట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో కాంట్రాక్ట్ కార్మికులను జెండాలను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పటల్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జెడి నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు వెన్నుముకగా ఉన్న కింగ్‌జార్జి ఆసుపత్రిలో 130 మంది ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు ఓ కార్పొరేట్ సంస్థ ఆదీనంలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తస్తున్నారన్నా. వీరంతా దళిత బలహీనవర్గాలకు చెందినవారు, వీరంతా రోగులు విడిచిన వ్యర్ధాలను తీసి ఆసుపత్రిని శుభ్రం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారన్నా. వీరికి గత రెండు మాసాలుగా సంబంధిత కాంట్రాక్టర్, ఆసుపత్రి యాజమాన్యం జీతాలు చెల్లించడంలేదన్నా. జీతాలు లేక కార్మికులంతా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారన్నా. ఈ వృత్తిమీద వచ్చే జీతమే వీరికి ఆదారంగా పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. యూనియన్ ప్రతినిధి జి.వామనమూర్తి మాట్లాడుతూ ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు కట్టుకోలేక తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారన్నా. కొన్ని సందర్భాల్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కార్మికులంతా చాలీచాలని జీతాలతో బతుకుతున్నారని, పెరిగిన ధరలకనుగుణంగా జీతాలు చెల్లించడంలేదన్నారు. 68 జివో (సఫాయి కర్మచారి)ల ప్రకారం ధరలకనుగుణంగా జీతాలు చెల్లించడంలేదన్నారు. జివోలు ఇచ్చి 15 మాసాలు గడుస్తున్నా అమలకు నోచుకోలేదన్నారు. కార్మికులపట్ల కాంట్రాక్టర్, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వలన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జీతాల కోసం ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యమన్నారు. అందువలనే ఆందోళనకు దిగామని, రెండు మాసాల జీతాలను చెల్లించాలని, పెరిగిన జీతాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీటిని పరిష్కరించకపోతే కార్మికులంతా కలసి వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
విశాఖలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
* నేటికి 200 రోజులు..100 నియోజకవర్గాలు పూర్తి
విశాఖపట్నం, జూలై 4: మరో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్సార్‌సిపి నాయకురాలు షర్మిల ప్రారంభించిన పాదయాత్ర విశాఖ నగరంలో కొనసాగుతోంది. గత నెల 24వ తేదీన షర్మిల పాదయాత్ర విశాఖ జిల్లాకు చేరుకుంది. విశాఖ రూరల్ జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకుని, రెండు రోజుల కిందట విశాఖ నగరంలో అడుగుపెట్టింది షర్మిల. విశాఖ రూరల్ జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుల సహాయ సహకారాలు ఆమెకు అందలేదు. జగన్ ముఖ్య అనుచరునిగా చెప్పుకుంటున్న సబ్బం హరి అస్సలు పాదయాత్రలో ఎక్కడా కనిపించలేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కొణతాల రామకృష్ణ వ్యక్తిగత కారణాల వలన పాదయాత్రకు దూరంగా ఉండిపోయారు. దాడి వీరభద్రరావు పాత్ర కూడా పాదయాత్రలో అంతంతమాత్రంగానే ఉంది. శుక్రవారం ఉదయం గాజువాక నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఎన్‌ఎడి జంక్షన్ మీదుగా కంచరపాలెం మెట్టకు చేరుకుంది. రాత్రికి ఇక్కడే బస చేయనున్నారు.
ఇదిలా ఉండగా శుక్రవారం నాటికి షర్మిల పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంటుంది. గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన షర్మిల తన పాదయాత్రను ప్రారంభించారు. అలాగే ఇప్పటి వరకూ 100 నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర కొనసాగింది. దీన్ని పురస్కరించుకుని స్థానిక ఆర్‌కె బీచ్‌లో భారీ బహిరంగ సభకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. అయితే స్థానిక నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా అది ఏమేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బహిరంగ సభ సమాచారాన్ని పార్టీ క్యాడర్‌కు తెలియచేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖలోనే ముగింపా?
షర్మిల శనివారం వరకూ విశాఖలోనే పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తొమ్మిదో తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఈ సమయంలో పాదయాత్ర నిర్వహించడం సరికాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకూ పాదయాత్రను నిలిపివేయాలా? లేక విశాఖలోనే ముగింపు ఇవ్వాలా? అన్న ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర 208 రోజులు కొనసాగింది. విశాఖతోనే షర్మిల తన పాదయాత్రను ముగిస్తే, 201 లేదా 202 రోజులు పూర్తవుతాయి. అయితే చంద్రబాబు కన్నా ఎక్కువ కిలో మీటర్లు నడిచినట్టు పార్టీ వర్గాలు తెలియచేస్తున్నాయి.
గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలి
విశాఖపట్నం, జూలై 4: విశాఖ ఏజేన్సీ మండలాల్లో గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని కోరుతూ గిరిజన హక్కుల పరిరక్షణ ఐక్యకార్యాచరణ కమిటీ (విశాఖ జిల్లా) ఆధ్వర్యంలో గురువారం గిరిజనులు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన చట్టాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. గత నెల 17వ తేదీన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి పసుపులేటి బాలరాజు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖామంత్రి సారయ్య కొయ్యూరు మండలంలో గిరిజనేతరులకు పట్టాలు ఇచ్చినట్టుగా వచ్చిన సమాచారం గిరిజనులను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధి కె.సత్యనారాయణ మాట్లాడుతూ గిరిజన చట్టాలకు, హక్కులకు భంగం కలిగించే ఈ చర్యను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యనే తమ సంఘాలు జరిపిన సర్వేలో అరకువేలీలో సుమరు వంద దుకాణాలకుగాను కేవలం ఒక్క దుకాణం కూడా గిరిజనుడికి చెందినది లేదన్నారు. ఒక పేద గిరిజనుడు పెట్టుకున్న చిన్న టీ దుకాణం లేకపోగా, పక్కనే వెలసిన గిరిజనేతురుని హోటల్ పోటీకి తట్టుకలేక మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గిరిజన ఉద్యోగులు హౌసింగ్ సొసైటీగా ఏర్పడి ఇళ్ళు కట్టుకొందామని ప్రయత్నం చేయగా అరుకువేలీ చుట్టుపక్కల సుమారు కిలోమీటర్ల పరిధిలో భూములన్నీ గిరిజనేతరుల చేతిలో బినామీ పేర్లతో ఉన్నాయన్నారు. ఏజేన్సీలో అన్ని మండల కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. గిరిజన ఐక్యవేదిక ప్రతినిధి ఏ.సింహాచలం మాట్లాడుతూ 1/70 చట్టాన్ని ఇతర గిరిజన అనుకూల చట్టాలను నీరుగార్చే ప్రభుత్వం ఏ ప్రయత్నం చేసినా అది లక్షలాది మంది గిరిజనుల మనోభావాలను దెబ్బతిసేవిగా భావిస్తున్నామన్నారు. కనుక గత నెల 17వ తేదీన కొయ్యూరు మండలంలో గిరిజనేతరులకు ఇచ్చిన పట్టాలను వెంటనే రద్దు చేయాలని, పీసా చట్టం, అటవి హక్కుల చట్టం, ఇతర గిరిజన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే కాలంలో గిరిజనులు తమ హక్కుల కోసం జరిపే పోరాటాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గిరిజనులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లాకు అల్లూరి పేరుపెట్టాలి
అనకాపల్లి, జూలై 4: జిల్లాకు అల్లూరి పేరుపెట్టాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అల్లూరి సీతారామరాజు జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గూడ్సుషెడ్డు వద్దనున్న సీతాతారామరాజు విగ్రహానికి సిపిఐ కార్యదర్శి వైఎన్ భద్రం, ఆడారి అప్పారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటీష్ పాలకులను గడగడలాడించి గిరిజనుల్లో చైతన్యం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అల్లూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి శీరందాసు అబ్బులు, మాజీ కౌన్సిలర్ తాకాశి వెంకటేశ్వరరావు, కర్రి సూర్యనారాయణ, వియ్యపురాజు, కోరిబిల్లి శంకకరావు, ఎఐటియుసి కార్యదర్శి కోన లక్ష్మణ, వేగి బంగారునాయుడు పాల్గొన్నారు. ఎఐటియుసి భవనంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఎఐటియుసి కార్యదర్శి కోన లక్ష్మణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెంటకోట సత్యనారాయణ, నాయుడు మల్లికార్జునరావు, కోడూరు వీరాచారి, బుద్ధ వీరభద్రరావు, కెవి రమణ, వియ్యపురాజు పాల్గొన్నారు. భారతీయ జనతాపార్టీ యువమోర్చ ఆధ్వర్యంలో తుమ్మపాల ఆర్‌ఇసిఎస్ కార్యాలయం వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మాజీ సైనికులు వైఎస్‌రావు, బిజెపి రాష్ట్ర నాయకులు గంగుపాం నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌రావు సమాజంలో నేటి యువత అల్లూరి ఆశయాలను ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు కొణతాల శివకుమార్, న్యాయవాది ఐవిఎస్ ప్రసాదరావు, బిజెవైఎం నాయకులు పీలా మురళీ, బొడ్డేడ అశోక్, వుడా రమేష్, పొలమరశెట్టి నాగేశ్వరరావు, ఎం.రామచంద్రరావు పాల్గొన్నారు. హిందూ జనవేదిక ఆధ్వర్యంలో జరిగిన అల్లూరి జయంతిలో జనవేదిక పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అడపా రామకృష్ణ, బోనగిరి శ్రీనివాసరావు, నాగులాపల్లి ఈశ్వరరావు, శివసత్యనారాయణ చౌదరి పాల్గొన్నారు.
టిడిపి పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా అనిత?
పాయకరావుపేట, జూలై 4: టిడిపి పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా వి.అనితను నియమించినట్టు పార్టీ నాయకులు తెలిపారు. ప్రస్తుతం విద్యాశాఖలో ఓపెన్‌స్కూల్స్ జిల్లా కో-ఆర్డినేటర్‌గా అనిత పనిచేస్తున్నారు. చెంగల వెంకట్రావు టిడిపిని వీడి వైఎస్సార్ సిపిలోకి వెళ్లడంతో ఇక్కడ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి సీటు ఖాళీ అయింది. ఈ సీటు కోసం సుమారు 15 మంది వరకు రాష్ట్ర పార్టీకి బయోడేటాలు సమర్పించారు. బుధవారం విశాఖ వచ్చిన చంద్రబాబు పాయకరావుపేట ఇన్‌చార్జి నియమించే విషయమై చర్చించారు. నేతలు అయ్యన్నపాత్రుడు, గవిరెడ్డి రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, పప్పల చలపతిరావు, కెఎస్‌ఎన్‌రాజు అందరూ అనితకు ఇన్‌చార్జి పదవి ఇస్తే పార్టీ అభివృద్ధి చెందుతుందని సూచించారు. దీంతో అనితను ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్టు ఇక్కడి నాయకులను సమాచారం అందింది. అనితను టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించినట్టు సమాచారం అందడంతో పార్టీ నాయకులు ఆనందోత్సవాలు నెలకొన్నాయి.
‘అల్లూరిని ప్రభుత్వం విస్మరించడం తగదు’
కె.డి.పేట,జూలై 4: స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం తెలుగు వారికే సిగ్గుచేటని అల్లూరి రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు, అల్లూరి సోదరుని కుమారుడు సత్యనారాయణరాజు అన్నారు. కృష్ణాదేవిపేటలో గురువారం అల్లూరి 116వ జయంతి వేడుకలు స్థానిక పార్కులో నిర్వహించారు. ఇక్కడ సెంటర్‌లో ఉన్న అల్లూరి విగ్రహం నుండి పాఠశాలల విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, యువకులు ప్రధాన రోడ్లలో కాగడా పట్టిన అల్లూరి చిత్రపటాన్ని ఊరేగించారు. అల్లూరి కొల్లగొట్టిన పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ జరిపారు. అనంతరం పార్కులో ఏర్పాటుచేసిన అల్లూరి జయంతి సభలో సత్యనారాయణరాజు మాట్లాడుతూ అల్లూరిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. మన్యం ప్రజల జీవన గమనంపై పోరాడి స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన అల్లూరిని ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు అల్లూరి స్ఫూర్తితో పోరాడాలంటూ పిలుపునిచ్చే ప్రజాప్రతినిధులు, ఎన్నికైన అనంతరం అల్లూరిని విస్మరించడం జాతికే అవమానమన్నారు. అల్లూరి రాష్ట్ర కమిటీ సహా ఉపాధ్యక్షుడు వబ్బలరెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ 3.60 కోట్ల రూపాయలతో ఇక్కడ పార్క్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో ఎందరో మంత్రులు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. పర్యాటక శాఖలో విలీనం చేస్తేనే అభివృద్ధి సాధ్యమని, ఇందుకు జిల్లా మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాసరావు కృషి చేయాలని కోరారు. మన్యం వీరునిగా గిరిజనుల గుండెల్లో దేవుడిగా నిలిచిన అల్లూరిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఆయన సంచరించిన ప్రాంతాలు, స్మారక మందిరాలను, పార్కును అభివృద్ధి చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తెలుగుదేశంపార్టీ ఎస్టీసెల్ కార్యదర్శి దుచ్చరి చిట్టిబాబు డిమాండ్ చేశారు. ఈ సభలో స్థానిక నాయకులు చిటికెల మురళీమోహనరావు, పైల రాంబాబు, న్యాయవాది చింతల ప్రకాష్‌తోపాటు అల్లూరి కుటుంబ సభ్యులు శివాజీ పాణిగ్రహి, శ్రీరామరాజు, సత్యవతి, సుబ్బిరాజు పాల్గొన్నారు.
తేనెటీగల దాడిలో
20 మంది విద్యార్థులకు గాయాలు
కోటవురట్ల,జూలై 4: తేనెటీగల దాడిలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ప్రిన్సిపాల్ దివాకర్ తీసుకువచ్చి చికిత్స చే యించారు. తేనెటీగలు విజృంబించడంతో కళాశాల ప్రిన్సిపాల్ గురువారం సెలవు ప్రకటించారు. స్థానిక జూనియర్ కళాశాల వద్ద ఎండిపోయిన చెట్టుకు తేనెపట్టు పట్టింది. ఎవరో ఆకతాయి తేనెపట్టు మీదకు రాయి విసరడంతో తేనెటీగలు ఒక్కసారిగా విజృంభించాయి. కళాశాల తరగతి గదుల్లోకి వెళ్ళి విద్యార్థులపై దాడిచేశాయి. దీంతో వి ద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కళాశాల నుండి బయటకు పరుగులు తీశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిలో నాగేంద్ర, సాయిబాబు, కనకదుర్గ, గణపతి, దుర్గాప్రసాద్,దాలినాయుడు, శ్రీను, వర్మ, భాస్కరరావు ఉన్నారు.
‘అల్లూరి స్ఫూర్తితో బాక్సైట్‌పై పోరాటం సాగిద్దాం’
డుంబ్రిగుడ, జూలై 4: మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని బాక్సైట్‌పై గిరిజనులు పోరాటం సాగించాలని సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి కె.లోకనాధ్ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 116వ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో అల్లూరి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు అడవిపై పూర్తి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం అటవీ హక్కు చట్టాన్ని అమలు చేసిందన్నారు. పోడు పట్టాలు పంపిణీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని తెలిపారు. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని, పీసా చట్టాన్ని తిరస్కరించి బాక్సైట్ తవ్వకాలకు కుటిల ప్రయత్నాలు సాగిస్తుందన్నారు. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, వారపుసంతల్లో దళారుల చేతిలో గిరిజన రైతులు మోసపోయి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు. గిరిజనాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐ.టి.డి.ఎ. కార్యాలయం ప్రస్తుతం దళారి వ్యవస్థగా మారిందని విమర్శించారు. స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని తరిమికొట్టినట్టు బాక్సైట్ జోలికి వచ్చే వారిని సైతం తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం. జిల్లా కార్యవర్గ సభ్యులు కోటేశ్వరావు, కె.సురేంద్ర, వి.ఉమామహేశ్వరరావు, కె.్ధయానిధి, గుర్మిసింగ్, దేశం నాయకులు సుబ్బారావు, భాస్కరరావు, అల్లూరి యూత్ అధ్యక్షుడు ఎం.అర్జున్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వేతనం పెంచాలి
* అంగన్‌వాడీ వర్కర్ల ఆందోళన
* కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
విశాఖపట్నం, జూలై 4: కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ప్రభుత్వం వేతనాలు పెంచాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పదవీ విరమణ చేసిన తరువాత లక్ష రూపాలయు, హెల్ఫర్‌కు రూ.50వేలు గ్రాట్యూటీనివ్వాలని, చివరి జీతంతో సగం పెన్షన్ ఇవ్వాలనేవి ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. వీటితోపాటు సూపర్‌వైజర్ పరీక్షకు వయో పరిమితి 55ఏళ్ళకు పెంచాలని, ఐసిడిఎస్‌ను సంస్థాగతం చేయాలని, అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను స్వచ్చంధ, ప్రైవేటు మరే ఇతర సంస్థలకు అప్పగించరాదంటూ అంగన్‌వాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ పెరిగిన పని గంటల ఆధారంగా ఉపాధ్యాయులకు, ఆయాలకు వేతనాలు పెంచాలని కోరుతూ ఆందోళనకు దిగామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే దీనిని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రమాదకర విధానాలతో ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. పిల్లలకు, గర్భిణీ స్ర్తిలకు, బాలింతలకు, కిశోర బాలికలకు అనుబంధ పోషకాహారాన్ని అందిస్తూ, ఫ్రీ స్కూలు పిల్లలకు ఆటలు, పాటలతో విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎంతో దోహదం చేస్తున్న అంగన్‌వాడీ వ్యవస్థను ప్రభుత్వాలు తమ విధానాలతో నాశనం చేస్తున్నాయన్నారు. 2001లోనే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు దేశంలో అన్ని గ్రామాల్లో, నివాస ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నెలకొల్పాలని ఆదేశించిందన్నారు. మరోపక్క ప్రభుత్వం ఇందిరమ్మ అమృతహస్తం పేరుతో ‘్ఫల్‌మీల్స్’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, దీనిలో ఐకెపి ఇతర స్వచ్చంధ సంస్థలను కూడా ఈ పథకంలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం గందరగోళం చేస్తుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిఐటియు ప్రధాన కార్యదర్శి రమేష్ హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ రోజు అంగన్ వర్కర్లు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేదన్నారు.
జింక్ ప్లాంట్ స్థలానికి రక్షణ కల్పించాలి
* కార్మికుల సంక్షేమంపై చర్యలు కేంద్రం చొరవ తీసుకోవాలి
* కేంద్ర సహాయమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి
విశాఖపట్నం, జూలై 4: అనేక కారణాలతో మూతపడిన హిందుస్థాన్ జింక్ ప్లాంట్‌లో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని తగిన న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర సహాయమంత్రి, విశాఖ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి తెలిపారు. ఈ మేరకు కేంద్ర గనులశాఖామంత్రి దిన్షా జె.పటేల్‌కు ఆమె లేఖ రాసారు. గతంలో అనేకసార్లు చేసిన విజ్ఞప్తులను పరిశీలించి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా కొన్ని మాసాలుగా మూతపడిన హిందుస్థాన్ జింక్‌ప్లాంట్ స్థలాన్ని రియల్ ఎస్టేట్‌గా మార్పు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందన్నారు. దీనివల్ల మరో సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. ఇప్పటికే మూతపడిన జింక్ ప్లాంట్‌ను తెరిచే క్రమంలో చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇది మూతపడినందు ఇందులో పనిచేసే కార్మికుల కుటుంబాల సంక్షేమాన్ని పట్టించుకునే నాధులే కరవయ్యారని, థర్డ్ పార్టీ అధ్యయనం ద్వారానే న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడంలేదన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి జింక్ ప్లాంట్ స్థలానికి తగిన రక్షణ కల్పించి, ఇందులో కార్మికుల సంక్షేమంపై దృష్టిపెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
స్టేషన్‌కు బాంబు బూచి?
* పరుగులు తీసిన పోలీసులు
* అధికారుల హైరానా
విశాఖపట్నం, జూలై 4: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి బాంబు ఉందనే వార్తలతో కలకలం రేగింది. చివరికి ఎలాంటి బాంబూ లేదని తేలటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందనే సమాచారంతో రైల్వేస్టేషన్‌లో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అజ్ఞాత వ్యక్తి ఒకరు రైల్వే పోలీసులకు ఫోన్ చేసి స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కొందరు బాంబును పెట్టినట్టుగా ఫిర్యాదు చేయడంతో డిస్పీ భీమారావుతోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమయ్యారు. అయితే దీనిపై బాంబు స్వ్కాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆర్ఫీఎఫ్, జిఆర్‌పి సంయుక్తంగా స్టేషన్‌లో పలుచోట్ల విస్తృత తనిఖీలు చేశారు. రైల్వే అధికారులు హైరానా పడటం, ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళనతో పరుగులు తీయడం ప్రత్యేకమైంది. బాంబు ఉందని కొందరు, ఏకంగా బాంబు పేలిదంటూ మరికొంతమంది నోట వినిపించిన నేపధ్యంలో అంతటా అప్రమత్తమయ్యారు. విశాఖ రైల్వేస్టేషన్ అన్ని ప్లాట్‌ఫారాలు, జ్ఞానాపురం వైపు స్టేషన్, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, వాటర్ పైపులైన్లు, స్టేషన్‌ళో పలు విభాగాల్లో నిశితంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి బాంబు లేదని తేలటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఎరువు మరీ బరువు
* భారీగా పెరిగిన ఎరువుల ధరలు
విశాఖపట్నం (జగదాంబ), జూలై 4: వరుస కష్టాలతో అల్లాడుతున్న రైతన్నకు ఎరువుల ధర పెంపుతో ప్రభుత్వం మరింత భారం మోపుతోంది. గత మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టిల కారణంగా జిల్లా రైతాంగం నష్టాలబారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోకపోగా వారిని మరింత కుంగదీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కిరణ్ సర్కార్ గద్దెనెక్కిన తరువాత ఇప్పటికే ఐదుసార్లు ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డివిరిచారు. అది చాలదన్నట్లు సర్కారు మరోసారి ఎరువుల ధరలను పెంచింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో లక్షవేల హెక్టార్లకు పైగా వరిపంట సాగవుతోందని అధికారులు అంచనావేసారు. దీనికోసం డిఎపి, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు కలిపి సుమారు వంద టన్నులకు పైగా అవసరమని వ్యవసాయ అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం డిఎపి ధర రూ.1190 ఉంది. దీనిని ప్రభుత్వం తాజాగా రూ.1350కి పెంచగా, పొటాష్ ధర ప్రస్తుతం 840 ఉండగా దీనిని 990కు పెంచారు. కాంప్లెక్స్ ఎరువు ధర రూ.1150 ఉండగా రూ.1475కు పెంచారు. యూరియా ధర మాత్రం రూ.290లోనే ఉంది. ఈ ఏడాది దీని ధరను పెంచలేదు. యూరియా ధర అందుబాటులో ఉన్నప్పటికీ పంట ఎదుగుదలకు యూరియావల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనేది రైతుల నమ్మకం. డిఎపి, కాంప్లెక్స్, పొటాష్ ఎరువుల వల్ల పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని భావిస్తున్న జిల్లా రైతాంగం వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. కౌలు రైతు మొదలుకొని ప్రతి రైతు డిఎపి, పొటాష్ ఎరువులను వేస్తారు. పంట పొట్టదశలో గింజల నాణ్యత కోసం పొటాష్ ఎరువును వేస్తారు. అయితే ప్రస్తుతం ఎరువుల ధరలను చూసి రైతులు బెంబేలెత్తుతున్నారు. గతంలో సుమారు వెయ్యి రూపాయలు కేటాయిస్తే రెండు ఎరువుల బస్తాలు వచ్చేవి. కాని నేడు ఒక బస్తా కూడా రాని పరిస్థితి. గతంలో ఎకరానికి రెండు పర్యాయాలు ఎరువులు వేయడానికి రూ.1200 ఖర్చు అయ్యేది. కాని ఇప్పుడు సుమారు 3 వేలకు పైగా అవుతోంది. దీంతో రైతులు ఎరువులకే సగం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఎరువుల ధర పెంచడం వల్ల ఈ ఏడాది జిల్లా రైతాంగంపై రూ.2.50 కోట్ల వరకూ అదనపు భారం పడనుంది. ఈ పరిస్థితుల్లో అతివృష్టి, అనావృష్టి సంభవిస్తే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. గత మూడేళ్లుగా పెట్టుబడికి చేసిన అప్పులే రైతన్న ఇంకా తీర్చలేదు. ఈ నేపథ్యంలో ఎరువుల ధరలు పెరగడం రైతన్నకు ఇబ్బందిగా మారింది. రైతు సంక్షేమానికి పాటు పడుతున్నామని గొప్పలు చెబుతున్నా ప్రభుత్వం ఎరువుల ధఱలు పెంచి తమపై భారం మోపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ మద్దతుదారులకే అధిక పంచాయతీలు
* మంత్రి ముఖేష్‌గౌడ్ ధీమా
సింహాచలం, జూలై 4: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అధిక పంచాయతీలు కైవసం చేసుకుంటారని రాష్ట్ర మార్కెటింగ్ గిడ్డంగుల శాఖ మంత్రి ముఖేష్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో మంత్రి కాసేపు మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కానప్పటికీ పార్టీల మధ్య తప్పక ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గ్రామీణస్థాయిలో అందరికీ చేరునున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో గెలుపొందుతారనే ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులంతా ఏకతాటిపై నడిచి సర్పంచ్‌ల విజయాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసేవలోవ ఉన్నవారికి పదవులు వాటంతట అవే వర్తిస్తాయని పదవులొచ్చాక సేవలు కొనసాగించే వాడే ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతారని మంత్రి చెప్పారు. అంతకు ముందు మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలేశుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని స్వామివారిని ప్రార్థించుకున్నారు. కాగా ఎపిడిసిఎల్ సిఎండి కార్తికేయమిశ్రా కూడా సింహాచలేశుని దర్శించుకొని విశేష పూజలు చేయించుకున్నారు. దేవస్థానం అధికారులు ఈయనకు ఆలయ మర్యాదలు చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
విశాఖపట్నం, జూలై 4: ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి శారీరక అవసరాలు తీసుకుని, మరో యువతిని వివాహమాడిన వ్యక్తి బాగోతం గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మహిళ చేతన నాయకురాలు కె.పద్మను ఆశ్రయించి, ఆమె సహాయంతో ఎమ్.వి.పి.జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేట, ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన యువతి అక్కడ ఉన్న కంకి రిలేషన్‌షిప్ మార్కెటింగ్ ప్రైవెట్ లిమిటెడ్‌లో పని చేస్తుండేది. అదే కంపెనీలో పని చేయడానికి నగరంలోని కె.ఆర్.ఎమ్.కాలనీకి చెందిన బొల్లవరపు సుధాకర్ 2006లో చేరాడు. ఈ తరుణంలో వీరిద్దరికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకుంటానని సుధాకర్ నమ్మించి 2010లో విశాఖకు తీసుకుని వచ్చి ఎమ్‌విపికాలనీలోని పెయింగ్ గెస్ట్ రూమ్‌లో కొద్ది రోజులు ఉంచి తర్వాత ఆమెను హైదరాబాద్‌కు పంపి వేశాడు. మరల విశాఖకు తీసుకుని వచ్చి అప్పుఘర్‌లోని ఎపి టూరిజం హొటల్‌లోని గదిలో ఉంచి సుధాకర్ శారీరకంగా లొంగదీసుకోవడంతో 2011లో ఆమె గర్భవతి అయ్యింది. వివాహం చేసుకోమని ఒత్తిడి తీసుకుని రావటంతో మాత్రలు ఇచ్చి ఆదర్శనగర్‌లోని ఓ క్లినిక్‌లో ఆమెకు సుధాకర్ అబార్షన్ చేయించాడు. తర్వాత వివాహం చేసుకోమని పట్టుబడడంతో 2012 మే నెలలో ఆమెను సుధాకర్ తన ఇంటికి తీసుకుని వెళ్లి తల్లి శంకుతలకు పరిచయం చేశాడు. కొత్తగా సుధాకర్ పేరుతో కనస్ట్రక్షన్స్ బిజినెస్ పెట్టానని తర్వాత వివాహం చేసుకుంటానని తల్లి ఎదుట మాట ఇవ్వడంతో ఆమె నమ్మింది. అప్పటి నుండి ఎప్పటికప్పుడు వివాహ విషయం వాయిదా వేయడం సుధాకర్ ప్రారంభించాడు. తర్వాత ఇసుకతోటలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఆమెను ఉంచాడు. ఈ ఏడాది మే నెలలో దుబాయ్ వెళ్తున్నానని, రాగానే వివాహం చేసుకుంటానని చెప్పి హైదరాబాద్‌కు పంపించి వేసి, విజయనగరం జిల్లాకు చెందిన సత్య అనే యువతిని మే 29న సుధాకర్ వివాహం చేసుకున్నాడు.
సుధాకర్ వివాహం చేసుకున్నట్టు అతని కంపెనీ సూపర్‌వైజర్ ద్వారా తెలుసుకున్న ఆమె షాక్‌కు గురై వెంటనే విశాఖకు చేరుకుని, అతనికి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను నిలదీసింది. సుధాకర్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని, ఆచూకీ దొరికితే వెంటనే పెళ్లి చేస్తామని వారు నమ్మించారు. ఈ విధంగా రెండు సార్లు ఇంటి చుట్టూ ఆమె తిరగగా, సుధాకర్‌కు పెళ్లి చేసేశామని ఇంకోసారి ఇంటికి వస్తే బాగుండదని మూడో సారి ఆమె ఇంటికి వెళ్తే అతని తల్లిదండ్రులు ఓ ముస్లిం యువకునితో కలిసి బెదిరించారు. దీంతో చేసేది లేక ఆమె మహిళ చేతన నాయకురాలు పద్మను ఆశ్రయించడంతో ఆమె సహాయంతో మోసగాడు సుధాకర్, తల్లిదండ్రులు శంకుతల, వీరభద్రచారిపై గురువారం ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్.వి.పి.జోన్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామాల్లో ఊపందుకున్న ఎన్నికల సందడి
విజయనగరం, జూలై 4: పంచాయతీ ఎన్నికల ప్రకటనతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. గ్రామాల్లో ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామాల్లో తమ సామాజిక వర్గం బలం ఎక్కువ ఉందని, తనకే మద్దతు పలకాలని ఆశావహులు ప్రధాన పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయని ప్రధాన పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తమకు గల అన్ని అవకాశాలను ఒడ్డి పంచాయతీ ఎన్నికల్లో తమ ప్రాబల్యం కొనసాగించేందుకు అన్ని శక్తులను ఉపయోగిస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా పంచాయతీ ఎన్నికలను కీలకంగా భావిస్తొంది. ఈ ఎన్నికల్లో పట్టు సాధిస్తేనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు సులభమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం గెలుపు అవకాశాలు ఉన్న వారినే బరిలో నిలబెట్టాలని యోచిస్తున్నారు. అంతేగాకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ఆకర్షించుకోవాలని ప్రయత్నాలు సాగిస్తొంది. అంతేగాకుండా కాంగ్రెస్‌లో వర్గాలు ఉన్న చోట తమ బలం పెంచుకోవాలని వ్యూహాం పన్నుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే తమకు శ్రీరామరక్ష అని తెలుగుదేశం మద్దతుతో బరిలోకి దిగుతున్న ఆశావహులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఈ దఫా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి నిలబెట్టే యోచనలో ఉండటంతో త్రిముఖ పోటీ ఖాయమని తెలుస్తొంది. నిన్న, మొన్నటి వరకు ప్రధాన పార్టీలలో ఎవరికో ఒకరికి సర్పంచ్ పదవులు దక్కేవి. ఈ దఫా త్రిముఖ పోటీతో ఓటర్లలో చీలిక ప్రారంభం కానుంది. మూడు పార్టీలలో నేతలు మహిళల్లో గెలుపు అవకాశాలు, మాటకారితనం ఉన్న వారిని గ్రామాల్లో నిలబెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సర్పంచ్ పదవులను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. గ్రామాల్లో సర్పంచులకు పలుకుబడి, హోదా ఉండటంతో ఆ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు అన్ని వర్గాల వారిని కలుసుకుంటున్నారు. తాము గతంలో చేసిన సేవలకు గుర్తుగా ఈ దఫా తమను గెలిపించాలని అభ్యర్థులు ప్రాధేయపడుతున్నారు. రిజర్వేషన్ ప్రక్రియలో కొంత మందికి పోటీ చేసే అవకాశం దక్కనప్పటికీ వారి మిత్రులు, తమ మాట మీద నిలబడే వ్యక్తులను ఎన్నికల్లో దింపి తాము అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా గ్రామాల్లో ఎక్కడ చూసిన ఎన్నికల వేడి కన్పిస్తొంది.
గంటి ప్రసాదంపై కాల్పులను
ఖండించిన కళాసీ సంఘం
విజయనగరం, జూలై 4: విరసం సభ్యునిగా జీవితాన్ని ప్రారంభించి విప్లవబాటలో నడిచిన మావో అమరవీరుల బంధుమిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటి ప్రసాదరావు గురువారం నెల్లూరులోని గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దాడికి గురై అక్కడ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈయన స్వస్థలం సీతానగరం మండలం అజ్జాడ. తల్లిపేరు వాసమ్మ. ఈయనకు ఆరుగురు అన్నదమ్ములు. ఈయన బీఎస్సీ వరకు బొబ్బిలిలో విద్యాభ్యాసం చేశారు. ఉద్యోగం వేటలో తిరిగి ఉద్యోగం దొరక్కపోవడంతో పిడబ్ల్యుజి విధానాలపట్ల ఆకర్షితులయ్యారు. 1998 ఆగస్టులో జిల్లాలోని గుమ్మలక్ష్మిపురం మండలం కొప్పడంగి ఎన్‌కౌంటర్‌లో తన సోదరుడు గంటి రమేష్ మృతి చెందాడు. ఆ తరువాత గంటి ప్రసాదరావు ఆ దళంలో చేరాడు. దళంలో చేరక ముందు రెండేళ్ల నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. 12 ఏళ్లపాటు అజ్ఞాత జీవితం గడిపాడు. ఆ తరువాత బీహార్‌లో కొనే్నళ్లు గడిపాడు. ఉత్తరాంధ్రలో విప్లవ కార్మిక సంఘాలకు పునాది వేశాడు. రైతు పేదల కమిటీ, ప్రగతి శీల కార్మిక సంఘంలకు నాయకత్వం వహించాడు. 2007 మార్చి 10న బొబ్బిలిలో ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో అతనిపై కర్ణాటక కేసు, నిజామాబాద్ కేసులతోపాటు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి, నరసన్నపేటలో జరిగిన దాడుల కేసులు ఉన్నాయి. ఆ తరువాత ఏడాది జైలు జీవితం గడిపాడు. గంటి ప్రసాదరావుపై కాల్పులు జరపడాన్ని కళాసీల సంఘం అధ్యక్షుడు బాగారు అప్పలస్వామి, కార్యదర్శి తవిటినాయుడులు తీవ్రంగా ఖండించారు. ఆయన గన్ను పట్టే వ్యక్తి కాదని, పెన్ను పట్టే వ్యక్తిఅని వారు పేర్కొన్నారు. పోలీసులు బూటకపు కాల్పులు జరిపారని మండిపడ్డారు.
ఆకాశాన్నంటిన
కూరగాయల ధరలు
భోగాపురం, జూలై 4 : కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మధ్య తరగతి నిరుపేదలకు కూరగాయలు కొనుక్కోని తినాలంటే చుక్కలు లెక్కపెట్టవలసిన పరిస్థితి వుంది. టమాటా కేజీ ధర వారం క్రితం 16 రూపాయలు ఉండగా ప్రస్తుతం కేజీ 60 రూపాయల వరకు ధర పెరగడంతో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఏవైనా శుభకార్యాలయకు అంత రేట్లతో కాయగూరలు విక్రయించ లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వంద రూపాయలు వున్న అరటిగెలలు ప్రస్తుతం 280 రూపాయల వరకు అధిక ధరలు పలుకు తున్నాయి. అలాగే బెండకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు, క్యాబేజీ, వంకాయలు తదితర కూరగాయలకు కేజీకి అదనంగా 20 రూపాయలు వరకు ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులు కూరగాయలు తినాలంటే వ్యయ ప్రయాసలు కోర్చి విక్రయించాల్సిన పరిస్థితి వుంది తక్షణమే ప్రభుత్వం నిత్యావసర సరుకులు ధరలను అదపులోకి తీసుకు రావాలని పలువురు కోరాతున్నారు.
యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద
విజయనగరం , జూలై 4: యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ చైర్మన్ మామిడి అప్పలనాయుడు అన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి గురువారం ఇక్కడ పంచాయతీరాజ్ చాంబర్ కార్యాలయంలో జరిగింది. వివేకానంద చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ స్వామి వివేకానంద మనదేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శనీయమన్నారు. . ప్రపంచం ఉన్నంతవరకూ స్వామి వివేకానంద ఆశయాలు, ఆదర్శాలు సజీవంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రవూఫ్, జె.వి.రాకేష్ పట్నాయక్, శ్రీనివాసరావు, పెంటయ్య, నారాయణరావుతదితరులు పాల్గొన్నారు.
‘ఆగస్టు 18న ఉత్తరాంధ్ర శైవ మహాసభలు’
విశాఖపట్నం, జూలై 4: శ్రీ శైవ మహాపీఠం విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 18న ఉత్తరాంధ్ర శైవ మహాసభలు నిర్వహిస్తున్నట్టు ఆ పీఠం అధ్యక్షుడు అండలూరి శ్రీనివాసశర్మ గురువారం ప్రకటనలో తెలిపారు. సద్గురు శివానందమూర్తి ఆశీర్వచనాలతో జరిగే ఈ కార్యక్రమంలో సావనీర్‌ను ఆవిష్కరిస్తారన్నా. ఆరాధ్యుల్లో 70 ఏళ్ళు పైబడిన వారికి ఆత్మీయ సత్కారాలు ఉంటాయన్నారు. ఆరాధ్య బంధువులత్లో ప్రతిభ పాటవాలు కనబర్చిన పిల్లలకు ప్రోత్సహించి జ్ఞాపికలను అందజేయనున్నట్టు చెప్పారు. అరాధ్య బంధువులంతా శ్రీ శైవమహాపీఠంను సంప్రదించి, వారి వివారలను, సావనీర్‌లో ప్రచురించాల్సిన అంశాలను పీఠానికి అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ పీఠం ప్రతినెల మాస శివరాత్రి రోజున లేదంటే మొదటి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఏకవార రుద్రాభిషేకం,స్ర్తి, పురుష సూక్తం, మంత్రపుష్పాలు వంటి కార్యక్రమాలను నిర్వహస్తున్నామన్నారు.
‘రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర’
బొంపడల్లి, జూలై 4 : ఠాష్ట్ర విభజన చేసేందుకు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం తెలియని నేతల నివేదిక అవసరమా? అని అనకాపల్లి ఎంపి, వైకాపా రాష్ట్ర నేత సబ్బంహరి ప్రశ్నించారు. మండలంలోని దేవుపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను చిన్నాభిన్నం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేసి రాష్ట్ర సాంప్రదాయాన్ని కాపాడిన వైఎస్సార్ తనయుడు జగన్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌పై అవగాహన లేని దిగ్విజయ్, ఆజాద్ నివేదికలపై కాంగ్రెస్ ఆధార్ పడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక నేత రాయల తెలంగాణా అని, మరో నేత తెలంగాణా అని మరికొంత మంది సమైక్యాంధ్ర అని పొట్లాట పెట్టి రాష్ట్ర ముక్కలుగా విభజించేందుకు నివేదిక అందజేయడం సరికాదన్నారు . వైకాపా జిల్లా కన్వీనర్ పి.సాంబశివరాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయకేతనం ఎగుర వేసేందుకు ప్రజలు కృషి చేయాలన్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బేబినాయిన, ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు , నాయకులు పాల వలస రాజశేఖర్, శీరంరెడిడ పెద్దినాయుడు, మండల కన్వీనర్ ఈదుబిల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు రాపాక అచ్చింనాయుడు, రాజశేఖర్, అప్పారావు, వైకాపాలో చేరారు.
పాఠశాల సమస్యలపై విద్యార్థుల ఆందోళన
విజయనగరం , జూలై 4: పట్టణంలో కస్పా పురపాలక ఉన్నత పాఠశాల సమస్యలను పరిష్కరించాలని ఆ పాఠశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో గురువారం పురపాలక సంఘ కార్యాలయాన్ని దిగ్భందించారు. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి ఎం.గణేష్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో సమస్యలపై అధికారులు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. ఎందరో విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలలో నెలకొన్న సమస్యలు కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి కుళాయిలు పనిచేయడం లేదని, మరుగుదొడ్లు ఉన్న ప్రయోజనం లేదని, ప్రహారీ గేటు మరమ్మతులు గురైందని, మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని, వంట గదిని నిర్మించాలని, ప్రయోగశాలలకి, గ్రంథాలయాల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామి విద్యార్థులతో పాఠశాల సమస్యలపై చర్చించారు.
పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అధ్వాన్నంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ సమస్యలపై స్పందించిన కమిషనర్ మధ్యాహ్న భోజన నిర్వాహకులతో సెల్‌ఫోన్‌లో చర్చించారు.
విద్యార్థులకు సక్రమంగా భోజనాన్ని అందజేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వినోద్ తదితరులు పాల్గొన్నారు.
‘సురక్షిత నీటిని ప్రజలకు అందించండి’
పార్వతీపురం, జూలై 4: గ్రామాల్లో మంచినీటి సరఫరాపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సురక్షిత నీటిని అందించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు సంబంధించిన ఓవర్‌హెడ్‌టాంకుల్లో తప్పని సరిగాక్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన మంచినీటినే ప్రజలకు సరఫరా చేయాలన్నారు. రక్షిత పథకాలు లేని గ్రామాల్లోని గొట్టపుబావులు, నేలబావుల్లో నీటిని తాగే ప్రజలకు క్లోరినేషన్ బిల్లలు సరఫరా చేయాలని ఆదేశించారు. సురక్షితమైన మంచినీటిని అందించడం వల్ల 90శాతం వరకు సీజనల్ వ్యాధులు అదుపుచేయడానికి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ క్లోరినేషన్ కార్యక్రమానికి సంబంధించిన ఆర్ డబ్ల్యు ఎస్, పంచాయతీరాజ్, ఎడీవోలు సంయుక్తంగా బాధ్యత వహించాలన్నారు. ప్రజల్లో క్లోరినేషన్ నీటి పట్ల అవగాహన ఏర్పడే విధంగా చూడాలన్నారు. మండలాల్లోనిర్వహించే విద్యాపక్షోత్సవాల వివరాలు అడిగితెలుసుకున్నారు. శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా చూడాలని అధికారులకు కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. అవసరమైతే ఇలాంటి గ్రామాలపై నిఘా పెట్టి ఘర్ణలకు పాల్పడే వారిపై ముందుగా బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు.
ఆర్డీవో జె.వెంకటరావుతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి యు.స్వరాజ్యలక్ష్మి, ఆర్ డబ్ల్యు ఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మెహర్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పని చేయాలి
బొబ్బిలి, జూలై 4: అధికారులంతా సమన్వయంతో పనిచేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కోరారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సక్రమంగా విధులు నిర్వహించని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇప్పటి నుంచే వైద్యశాఖ అప్రమత్తంగా ఉండి తగు చర్యలు చేపట్టాలని జిల్లా డిఎంహెచ్‌ఒ స్వరాజ్యలక్ష్మిని ఆదేశించారు. గ్రామాల్లో అపారిశుద్ధ్యం నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మరమ్మతులకు గురైన బోర్లును తక్షణమే బాగుచేయాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు. చిన్న పిల్లలకు చక్కని పౌష్టికాహారాన్ని అందించాలని ఐ.సి.డి.ఎస్. అధికారులకు ఆదేశించారు. గ్రామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల పరిషత్ అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ చంద్రిక, ఎం.డి.ఒ. అరుంధతీదేవి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘మొలకెత్తని విత్తనాలకు నష్టపరిహారం’
పార్వతీపురం, జూలై 4: మొలకెత్తని 1001 వరి విత్తనాలకు రైతాంగానికి మళ్లీ వరి విత్తనాలతో అందించడంతో పాటు ఎపి సీడ్స్ సరఫరా చేసిన మొలకెత్తని విత్తనాలకు కూడా నష్టపరిహారంగా డబ్బులు ఇప్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. డివిజన్‌లోని వివిధ మండలాల్లో పర్యటించిన వచ్చిన అనంతరం కలెక్టర్ గురువారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు హౌస్‌లో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ మొలకెత్తని విత్తనాల విషయంలో వ్యవసాయశాఖ తగు చర్యలుతీసుకుంటుందని పేర్కొన్నారు. జిల్లాలో హౌసింగ్‌శాఖ ప్రతి మండలంలోను నెలకు 100నుండి 125వరకు ఇళ్లను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించామన్నారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు హాస్టళ్లు, పాఠశాలలతో పాటు ఐసిడి ఎస్ కేంద్రాలను కూడా సందర్శించి వారికి తగిన వైద్య సహకారం అందించాలని సూచించామన్నారు. నిర్మల్ భారత్ కింద మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా తాను పర్యిటించిన మండలాల్లో శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించినట్టు తెలిపారు. తాగునీటి సరఫరాను వీలైనంతవరకు 2014నాటికి 90శాతం వరకు రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరాచేసేందుకు గాను చర్యలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులకు సూచించామన్నారు. రక్షిత మంచినీరు లభించని ప్రాంతాల్లో నీటి కాచి చల్లార్చాలని కలెక్టర్ కోరారు. క్లోరినేషన్ వాటర్ అందించే చర్యలు తీసుకోవాలని ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులకు, ఇతర అధికారులకు ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు.
సోనా మసూరి విత్తనాలు లేవు!
గజపతినగరం, జూలై 4 : ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన సోనామసూరి, 1001 వరి రకం విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేయకపోవడంతో రైతులు ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. 1001 రకం వరి విత్తనాలు వ్యవసాయ శాఖ అధికారులు 6 వేల క్వింటాళ్ల వరకు సరఫరా చేసినప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో అందలేదు. సబ్ డివిజన్‌కు కేటాయించిన విత్తనాల కేటాయిపులుకు మించి ఇవ్వడంతో జిల్లా విత్తనాభివృద్ది సంస్థ అధికారులు విత్తనాలు సరఫరా చేయడానికి సుముఖంగా లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు పంపలేదు. ఇక సోనా మసూరి రకం విత్తనాలు గత రెండేళ్లుగా పంపిణీ చేయడం లేదు. 1001 రకం విత్తనాలు 670 రూపాయలకు, సోనా మసూరి విత్తనాలు 860 రూపాయలకు ప్రైవేటు డీలర్లు విక్రయిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు 1001 రకం 525 రూపాయలు, సోనామసూరి 560 రూపాయలకు విక్రయించే వారు. ప్రస్తుతం విత్తనాలను అధిక ధరలకు ప్రైవేటు డీలర్ల వద్దకొనుగోలు చేసుకుంటున్నారు.
‘11 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ తోటల పెంపకం’
బొబ్బిలి, జూలై 4: రాష్ట్రంలో ఉద్యానవనాలశాఖ ద్వారా 11లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని చేపట్టామని రాష్ట్ర ఉద్యానవనాల శాఖ జాయింట్ డైరెక్టర్ జె.డి. శ్రీవెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఉద్యానవన క్షేత్రంలో మామిడి అంట్లను గురువారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 1.37 లక్షల హెక్టార్లు, మైక్రో ఇరిగేషన్ ద్వారా 9.75 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నామన్నారు. వీటి ద్వారా 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. హెక్టార్‌కు 20వేల రూపాయల సబ్సీడి ఎరువులను రైతులకు అందిస్తున్నామన్నారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు శతశాతం, మిగిలిన వారికి 90శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది లక్ష హెక్టార్లలో ఆయిల్‌పామ్‌తోపాటు వివిధ రకాలైన పంటలను సాగు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఎ.పి. మైక్రో ఇరిగేషన్ రాష్ట్ర హార్టీకల్చర్, ఆయిల్‌పామ్, స్టేట్ ప్లాన్ ప్రాజెక్టు, తదితర పథకాల కింద అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గత ఏడాది మామిడి అంట్లుకట్టేందుకు వెయ్యి కోట్ల రూపాయలు వ్యయం చేశామని, ఈ ఏడాది 1270 కోట్లు వ్యయం చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా మామిడి, ఇతర పంటలకు 15వేల రూపాయలు రాయితీ అందిస్తున్నామన్నారు. నీలం తుఫాన్ కారణంగా రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు 33వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ మొత్తాలను ఆయా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమచేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పంటలు 25.98 లక్షల హెక్టార్లలో ఉన్నట్లు తెలిపారు. విజయనగరం, బొబ్బిలి ఉద్యానవన శాఖాధికారులు రహీమ్, రాజశేఖర్ పాల్గొన్నారు.
ఎసిబికి చిక్కిన వీఆర్వో
వేపాడ, జూలై 4 : వేపాడ విఆర్వోగా పని చేస్తున్న గేదెల ఈశ్వరరావు 15వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువారం ఉదయం ఎల్.కోట మండలం సంతపేట దాబా వద్ద విఆర్వోకు లంచం ఇస్తుండగా ఎసిబి డిఎస్పీ రఘువీర్ తమ సిబ్బందితో వలపన్ని పట్టుకున్నారు. అనంతరం అతన్ని వల్లంపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈశ్వరరావును చినగుడిపాల ఇన్‌చార్జ్ విఆర్వోగా నియమించారు. అక్కడ విశాఖపట్నానికి చెందిన శీరం లక్ష్మణరావు 11 ఎకరాల 8 సెంట్లు భూమిని కొనుగోలు చేసుకొని పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వాలని గత ఆగస్టులో తహశీల్ధార్‌కు ధరఖాస్తు చేసుకున్నారు. దీనికి తహశీల్ధార్ విఆర్వోను పరిశీలించాలని ఆదేశించారు. దీంతో పట్టాదారు పాసుపుస్తకం కావాలంటే రూ. 15 వేల లంచం ఇస్తేనే ఇస్తానని చెప్పగా లక్ష్మణరావు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు లంచం తీసుకుంటుండగా వీఆర్వో లక్ష్మణరావును ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
వచ్చే శుక్రవారం తుది నిర్ణయం!
న్యూఢిల్లీ, జూలై 5: వచ్చే శుక్రవారం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వివాదంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల నుండి దాదాపు గంటంబావుపాటు జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై ప్రాథమిక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఉదయం తనకు అందజేసిన వివరాలను హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముందు పెట్టారని సమాచారం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం లేదా రాష్ట్ర విభజన చేపట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ తయారు చేసే రోడ్ మ్యాప్‌లపై వచ్చేవారం చర్చ జరగవచ్చునని తెలిసింది. కాగా, వచ్చేవారం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్‌తోపాటు కిరణ్‌కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, బొత్స సత్యనారాయణలను ఆహ్వానిస్తారు.
బోగోలు స్టేట్‌బ్యాంక్ ఎటిఎంలో దొంగ నోటు
బిట్రగుంట, జూలై 5: మండల కేంద్రమైన బోగోలు పంచాయతీలోని స్టేట్‌బ్యాంక్ ఎటిఎంలో దొంగనోట్లు వస్తున్నట్లు ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఉపాధ్యాయుడు తన జీతం ఇటీవల ఎటిఎం నుండి డ్రాచేసి ప్రకాశం జిల్లా ఉలవపాళ్ల స్టేట్‌బ్యాంక్‌లో నగదు చెల్లించేందుకు వెళ్లగా ఆ నగదులో 1000 రూపాయల నోటు నకిలీదిగా గుర్తించి నోటుపై ఫేక్ రాసరాని వాపోయాడు. బ్యాంకులు ఏర్పాటుచేసిన ఎటిఎంల నుండి దొంగ నోట్లు వస్తుంటే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయం తెలిసిన పలువురు జిల్లా బ్యాంకు అధికారులు గుర్తించి దొంగ నోట్లు రాకుండా చూడాలని ఖాతాదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రోగుల వివరాలు ప్రతి రోజు తెలపాలి
* ఇన్‌చార్జ్ డిఎంహెచ్‌ఓ సుధాకర్ స్పష్టం
నెల్లూరుసిటీ, జూలై 5: జిల్లాలో గల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంతమంది రోగులకు వైద్య చేస్తున్నారో అందుకు సంబంధించిన వివరాలను ప్రతి రోజు సాయంత్రం 4 గంటలలోపల తనకు తెలిపాలని జిల్లా ఇన్‌చార్జ్ డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ సుధాకర్ తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని ఆశ నోడల్ వర్కర్స్‌కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యం అందచేసిన రోగులను వివరాలను ఎప్పటికప్పుడు తెలిపాలన్నారు. అదే విధంగా 24 గంటల హాస్పిటల్లో వైద్య సేవలను అందించేందుకు డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. టాస్క్ఫోర్సు అధికారులు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తారని, వారు సూచించిన విధంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేదీన జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన ముగ్గురు డాక్టర్లకు 10 వేల రూపాయల చొప్పున బహుమతులను అందచేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా డాక్టర్లకు తగిన అవార్డులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఓడిటి డాక్టర్ విద్యాసాగర్, ఎన్‌సిడి ప్రాజెక్టు అధికారి డాక్టర్ సుధాకర్, డిఐఓ డాక్టర్ జయసింహ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
మన గ్యాస్ మనకే!
హైదరాబాద్, జూలై 5: కృష్ణా గోదావరి బేసిన్ నుంచి రాష్ట్రానికి న్యాయంగా చెందాల్సిన సహజవాయువు వాటాను ప్రాధాన్యత ప్రకారంగా వచ్చే విధంగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఏపి ట్రాన్స్‌కో సిఎండిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఎఎస్ అధికారి సురేష్ చందా అన్నారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రుల బృందం ఈ అంశంపై సమావేశం కానుంది. సహజవాయువు, విద్యుత్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి ఈ నెల 8వ తేదీన ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. సహజవాయువుకేటాయింపులపై సమగ్రమైన వివరాలు రూపొందించాలని, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఒత్తిడి తెచ్చి గ్యాస్ సరఫరా అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా నివేదిక ఇవ్వాలని ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల గురించి నివేదిక ఇవ్వాలన్నారు. శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు, సహజవాయువు కొరత ఉందన్నారు. ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులను నిర్ణీత కాలపరిమితిలో సమర్ధ ప్రాజెక్టు యాజమాన్య విధానం ద్వారా పూర్తి చేయాలన్నారు.
ఇంకా సత్వరమే విద్యుత్ అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. విద్యుత్ గ్రిడ్ సమతుల్యత పరిరక్షణకు క్రమశిక్షణ పాటించాలని, విద్యుత్ పంపిణీ నష్టాలను 17.4 శాతం కంటే దిగువకు తగ్గించాలని, ఐటి ద్వారా ఉత్తమసేవలు అందించాలని, ఆర్ధిక వనరులను సమర్ధంగా వినియోగించడం విధానాలను అమలు చేయాలన్నారు.
1985వ బ్యాచికి చెందిన ఐఎఎస్ అధికారి సురేష్ చందా ఈ సర్వీసులో చేరకముందు ఎన్టీపిసిలో ఇంజనీర్‌గా పనిచేశారు. తనను రాష్ట్రప్రభుత్వం ట్రాన్స్‌కో సిఎండిగా నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. డిస్కాంలు, ట్రాన్స్‌కో ఉద్యోగులు, ఇంజనీర్లు సమిష్టిగా విద్యుత్ రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సురేష్ చందా గుంటూరు, ఖమ్మం జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా, చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశానని, సైన్స్, టెక్నాలజీ శాఖ డైరెక్టర్‌గా, సాగునీటి శాఖ కార్యదర్శిగా, మాధ్యమిక విద్యాశాఖ కార్యదర్శి, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్, ఇ సేవ, ఐటి శాఖ కమిషనర్‌గా పనిచేసి అందరి మన్ననలు పొందారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ట్రాన్స్‌కో జాయింట్ ఎండిలు పి రమేష్, వై నాగిరెడ్డి, డిస్కాం సిఎండిలు సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, కార్తికేయ మిశ్రా, కెవిఎస్ రెడ్డి, డైరెక్టర్లు జి రామకృష్ణా రెడ్డి, ఎస్ సుబ్రహ్మణ్యం, మహమ్మద్ అన్వరుద్దీన్ తదితరులు హాజరయ్యారు.
మూడు విడతలకు
మూడు నోటిఫికేషన్లు ఇవ్వండి
పంచాయతీ ఎన్నికలపై బాబు లేఖ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: మూడు విడతలుగా జరిగే పంచాయితీ ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ప్రచారం చేసుకునే సమయంలో అభ్యర్థుల మధ్య వివక్ష చూపినట్టు అవుతుందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. మూడు విడతలుగా జరిగే ఎన్నికలకు విడివిడిగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. టిడిపి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, పి. రాములు, ప్రకాశ్‌గౌడ్‌లు ఎన్నికల కమిషన్ రమాకాంత్‌రెడ్డిని కలిసి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తొలి విడత ఎన్నికలకు పరిమితం చేసి, రెండవ, మూడవ విడత పోలింగ్ జరిగే ప్రాంతాల కోసం విడిగా సవరించిన నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. 2006లో ఇదే విధంగా ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు.
జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించండి: సిపిఐ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: జైళ్లలో జీవితఖైదీ శిక్షను అనుభవించడం వల్ల వారి కుటుంబాలు ఛిద్రమవుతున్నాయని, క్షమాభిక్ష ప్రసాదించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. వివిధ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న జీవితఖైదీల కుటుంబ సభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జైళ్లలో ఏళ్లతరబడి మగ్గి పశ్చాత్తాపంతో సత్ప్రవర్తనను అలవరచుకుని నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని, శిక్షలు పడటంతో వారి కుటుంబ సభ్యులు సామాజికంగా, ఆర్ధికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని , కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు తరచూ వస్తున్నాయని, ఖైదీల తరఫున కె. సంపూర్ణ, కె. ఎస్తేరమ్మ, పోచయ్య, కె. పురుషోత్తం, భిక్యా, తిరుపతయ్య తదితరులు నారాయణను కోరారు. 2004 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షమాబిక్ష జీవో -196 ఇచ్చిందని, దానివల్ల చాలా మంది విడుదలయ్యారని, కనీసం ఏడేళ్ళ శిక్ష వాస్తవ శిక్ష రెమిషన్, 10 ఏళ్లు జీవిత ఖైదీలను విడుదల చేయాలని వారు కోరారు.
పిజి తొలి దశ కౌనె్సలింగ్ పూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: ఉస్మానియా యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీ, మహాత్మాగాంధీ యూనివర్శిటీ, పాలమూరు వర్శిటీల్లో పిజి అడ్మిషన్ల తొలి దశ పూర్తయినట్టు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు తెలిపారు. ఇంగ్లీషు, ఎకనామిక్స్, ఉర్దూ, థియేటర్ ఆర్ట్సు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, లింగ్విస్టిక్స్, మరాఠీ, పర్షియన్, కన్నడ భాషల్లో కౌనె్సలింగ్ పూర్తయిందన్నారు. కౌనె్సలింగ్‌లో ప్రభుత్వ నిబంధనలను పాటించామని, లోపాలకు తావులేకుండా చర్యలు చేపట్టామని వర్శిటీ అధికారులు పేర్కొన్నారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డి ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల పరిశీలకులతో ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంతరెడ్డి శుక్రవారం ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై వ్యవహరించాల్సిన తీరు, మార్గదర్శకాలను వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా ఎటువంటి వివాదాలు, గొడవలు తలెత్తకుండా కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. కాగా రాష్ట్ర డిజిపి వి దినేష్ రెడ్డి ఎన్నికల కమిషనర్ రమాకాంతరెడ్డిని కలిసి పంచాయతీ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తీసుకున్న చర్యలను వివరించారు. ఒక లక్ష మంది పోలీసులను పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగించనున్నట్లు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన బలగాలను మోహరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
పోలీసులకు శంకర్‌రావు ఝలక్
అసలు దస్తావేజులు వారే ఎత్తుకెళ్ళారు
పిటిషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి
వీల్‌చైర్‌లో కోర్టుకు హాజరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: వివిధ కేసులపై నాన్ బెయిలబుల్ వారంట్‌తో ఎమ్మెల్యే శంకర్‌రావును ఏ క్షణమైనా అరెస్టు చేయాలని యోచిస్తున్న పోలీసులకు శంకర్‌రావు ఝలక్ ఇచ్చారు. గురువారం కేర్ ఆసుపత్రి నుంచి శంకర్‌రావు డిశ్చార్జి అయ్యారు. గత రెండు రోజులుగా ఇరువైపులా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుసుకున్న శంకర్‌రావు నేరుగా కోర్టులో పోలీసులపై పిటిషన్ దాఖలు చేసి ఆశ్చర్యపర్చారు. వివిధ అంశాలకు చెందిన కేసుల దస్తావేజులను భద్రంగా దాచిపెట్టానని అయితే వాటిని పోలీసులే ఎత్తుకెళ్ళారని చెప్పారు. శుక్రవారం నాంపల్లి కోర్టులో పోలీసుల తీరును ప్రశ్నిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. వీల్‌చైర్‌లో శంకర్‌రావు కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ తాను వివిధ అంశాలపై దర్యాప్తు చేయాలని ఎసిబితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పలుమార్లు విన్నవించుకున్నానని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం, పోలీసులపైనా తాను ఉద్యమం చేస్తున్నానని చెప్పారు. అయితే అందుకు ప్రభుత్వం, పోలీసులు సహకరించలేదని, అందుచేత కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. కోర్టులో న్యాయం జరుగుతుందని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే నెలలు గడచినప్పటికీ దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదన్నారు. తన వద్ద ఉన్న అసలు దస్తావేజులను పోలీసులు ఎత్తుకెళ్ళారని ఆయన ఆరోపించారు. దస్తావేజులను తిరిగి ఇవ్వాలని తాను నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. అయితే పోలీసుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదన్నారు. సమాధానం రాకపోగా తనపై కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. డిజిపిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నాయన్నారు. అయితే ప్రస్తుతం దస్తావేజులు పోలీసుల వద్ద ఉన్నందున తనకు నిరూపించడానికి అవకాశం లేదన్నారు. కనీసం దస్తావేజుల జిరాక్స్ కాపీలు ఇవ్వాలని కోరినప్పటికీ స్పందనలేదన్నారు. రెడ్ల కులస్తులకు చెందిన భూములు డిజిపి బినామీ ఆస్తులని తాను ఎన్నడూ చెప్పలేదన్నారు. తాను కేవలం డిజిపి కుటుంబానికి చెందిన ఆస్తులు బయటపెట్టాలని డిమాండ్ చేశానన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరులు అక్రమంగా కలప, ఎర్రచందనం అమ్ముకుంటున్నారని తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తనకు అక్రమాస్తులు ఉన్నట్లు నిరూపించాలని డిజిపి దినేష్‌రెడ్డి చాలెంజ్ చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోగా అందుకు సమాధానం దాటవేశారు. అన్ని విషయాలపై కోర్టులో సమాధానం చెబుతానని ఆయన చెప్పారు.
నేడు విద్యాసంస్థల రాష్ట్ర బంద్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: పాఠశాలల్లోనూ, జూనియర్ కాలేజీల్లో సౌకర్యాలను పెంచాలని, ప్రభుత్వం ప్రకటించిన పథకాలను పటిష్టంగా అమలుచేయాలని, ప్రధానంగా విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలను, దుస్తులను వెంటనే ఇవ్వాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ సహా ఐదు విద్యార్ధి, యువజన సంఘాలు శనివారం నాడు రాష్టవ్య్రాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐడిఎస్‌ఓ, ఎఐఎఫ్‌డిఎస్, ఎఐపిఎస్‌యు సంఘాలు ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తీసుకురావాలని కోరుతున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నూర్ మహ్మద్ చెప్పారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష టీచర్ పోస్టులను, 930 ఎంఇఓ, 113 డిప్యూటీ డిఇఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మోడల్ స్కూళ్లు వెంటనే ప్రారంభించాలని, విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని, సంక్షేమ హాస్టళ్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, ప్రతి ప్రభుత్వ జూనియర్ కాలేజీ అభివృద్ధికి కోటి రూపాయలు చొప్పున కేటాయించాలని అన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలను కట్టడి చేయాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బంద్ నిర్వహిస్తున్నామని, దానిని జయప్రదం చేయాలని ఆయన కోరారు. పాఠశాలలు ప్రారంభించి 26 రోజులు గడచినా, ఇంత వరకూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, 30 శాతం మాత్రమే పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించారని అన్నారు. మిగిలినవి ఆగస్టుకు కూడా అందించలేమని నిస్సిగ్గుగా చెబుతున్నారని మహమ్మద్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయని, ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసేందుకు కుట్ర జరుగుతోందని, దానికి అనుగుణంగానే 39, 40 జీవోలు జారీ అయ్యాయని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారని, లక్షలాది రూపాయలు డొనేషన్ల పేరుతో వసూలుచేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదని, వారి వ్యాపారానికి ప్రభుత్వమే పరోక్షంగా ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తమిళనాడులో ఉన్న మాదిరి పటిష్టమైన చట్టం చేయాలని ఆయన కోరారు. కొన్ని పాఠశాలల్లో భవనాల పరిస్థితి దారుణంగా ఉందని, అవి ఎప్పుడు కూలుతాయో తెలియడం లేదని అన్నారు. మరో పక్క విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ విధానాలను నిరసిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే బంద్ పాటిస్తున్నట్టు పేర్కొన్నారు.
కలిసి పనిచేయడం కష్టమే
అయినా కలిసి రావాలన్న బి. వి. రాఘవులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: ప్రస్తుత సంక్షుభిత సమయంలో వామపక్ష పార్టీలు కలిసి పనిచేయడం కష్టంగానే ఉందని, అయినా ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని కలిసి రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి. వి. రాఘవులు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పరస్పర పోటీలను విడనాడి ఉమ్మడిగా చర్చించుకుని వామపక్ష బలాన్ని చూపాల్సి ఉందని అన్నారు. ఎంసిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి జగ్జీత్‌సింగ్ లాయల్‌పురి సంతాపసభను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంసిపిఐ యు పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.డి గౌస్ అధ్యక్షత వహించగా, సిపిఐ జాతీయ సమితి సభ్యుడు చాడా వెంకటరెడ్డి, ఎంసిపిఐ పోలిట్‌బ్యూరో సభ్యుడు మర్రెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయకుమార్, న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.వి. కృష్ణ, లిబరేషన్ కమిటీ సభ్యుడు కె. రణధీర్, ఎస్‌యుసిఐ సభ్యుడు సిహెచ్ మురహరి, ఎంఎల్ కమిటీ సభ్యుడు జి. జానకిరాములు, ఫార్వర్డుబ్లాక్ సభ్యుడు కె. దయానంద్, వామపక్ష వేదిక కన్వీనర్ వి. రాంప్రసాద్, కాటం నాగభూషణం తదితరులు పాల్గొని లాయక్‌పురి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కట్టుబడి ఉన్నవారే నిఖార్సైన కమ్యూనిస్టులు అవుతారని, మనసులో ఒకటి ఉంచుకుని మరొకటి మాట్లాడేవారిని కమ్యూనిస్టులుగా చూడలేమని రాఘవులు పేర్కొన్నారు. లాయక్‌పురి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని, పుస్తకాలకు ప్రచారానికే పరిమితం కాకుండా, కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడని చెప్పారు. వామపక్షాలు వివిధ విషయాలపై ఉమ్మడిగా పనిచేయలేకపోతున్నాయని, సరైన ప్రాతిపదిక ఏర్పడటం లేదని, వౌలిక కార్యక్రమాలపై విభేదాలు ఉన్నప్పుడు కార్యక్రమాల్లో ఏది మంచిదో చూసుకోవల్సి ఉందని అన్నారు.
గంటి హత్య కిరాతకం
గంటి ప్రసాదం హత్య కిరాతకమని సిపిఎం రాష్టక్రార్యదర్శి బి. వి. రాఘవులు అన్నారు. నెల్లూరులో పట్టపగలు ఉద్యమ కార్యకర్తను హత్య చేయడం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని తెలుపుతోందని అన్నారు.
ఉపాధి హామీ వివరాలను పొందుపర్చకపోతే పెనాల్టీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం శ్రమ శక్తి సంఘాలను పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లు పనుల జాబితాను, పనులు చేసే వారి జాబితా వివరాలను నిర్దేశించిన విధంగా వారం లోపల పొందుపర్చకపోతే నెలవారీ వేతనంలో 25శాతం కోత విధించే విధంగా పెనాల్టీ విధిస్తారు. ఈ వివరాలు పొందుపర్చని పక్షంలో ఐటి సిస్టమ్ ద్వారా అసిస్టెంట్ ప్రొగ్రాం ఆఫీసర్ ఆటోమాటిక్‌గా రికవరీ చేస్తారు. కాగా సరైన కారణాలు చూపితే ఏపివో పెనాల్టీని విధించకుండా ఈ వివరాలను ప్రాజెక్టు డైరెక్టర్‌కు నివేదించాల్సి ఉంటుంది. కాగా ప్రాజెక్టు డైరెక్టర్ ఆమోదం లేని పక్షంలో మరుసటి నెలలో ఫీల్ట్ అసిస్టెంట్స్ వేతనం నుంచి 25 శాతం సొమ్మును పెనాల్టీ రూపంలో మినహాయిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
టిఆర్‌ఎస్ కార్యవర్గ భేటీ వాయిదా
ఢిల్లీ పరిణామాల్లో స్పష్టత వచ్చాకే సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం వాయిదా పడింది. ఈ నెల 7వ తేదీన సమావేశం కానున్న రాష్ట్ర కార్యవర్గాన్ని వాయిదా వేసినట్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల వ్యూహంపై శుక్ర, శనివారం జిల్లాల వారీగా సమీక్షలు జరిపి, ఆ మరుసటి రోజు ఆదివారం రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టిఆర్‌ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే ఢిల్లీస్థాయిలో తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన తర్వాతనే భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని తాజాగా టిఆర్‌ఎస్ యోచిస్తోన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ కారణంగానే రాష్ట్ర కార్యవర్గాన్ని వాయిదా వేశారని తెలిసింది.
ఓటర్లను ప్రలోభపరిచే హామీలపై
‘సుప్రీం’ ఆదేశాలను స్వాగతించిన లోక్‌సత్తా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపరిచే విధంగా వాగ్దానాలు చేసే రాజకీయ పార్టీల విధానాలపై నిఘావేయాలని, ఈ తరహా చర్యలను నిలుపుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు లోక్‌సత్తా ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, అధ్యక్షులు కటారి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో ఊదరగొట్టే హామీల వల్ల దారిద్య్రం తొలగదన్నారు. రైతులకు సబ్సిడీపై విద్యుత్, పేదలకు సబ్సిడీపై బియ్యం, ఇంకా ఇళ్లు లేని వారి ఇళ్లు కట్టిస్తామని రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వవచ్చన్నారు. కాని ఉచితంగా టీవీలు, గ్రైండర్లు, బంగారు హారాలు ఇస్తామంటూ కొన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వడం అనైతికమన్నారు. రాజకీయ పార్టీలు అర్ధంపర్ధంలేని హామీలను ఇస్తుంటే ఇక రానున్న రోజుల్లో ప్రతి ఓటరుకు ఉచితంగా మద్యం బాటిళ్లను సరఫరా చేస్తామని కూడా హామీ ఇచ్చేందుకు ప్రస్తుత రాజకీయ పార్టీలనేతలు వెనకాడరన్నారు. ఓటర్లను ప్రలోభపరిచే విధంగా ఉన్న హామీలకు అడ్డుకట్టవేసేందుకు అవసరమైతే చట్టాన్ని కూడా తీసుకురావాలని సుప్రీం కోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనైతిక విధానాలకు అద్దంపట్టే ఎన్నికల హామీలు చేసే రాజకీయ పార్టీలకు కళ్లెం వేసేందుకు ఎన్నికల సంఘానికి రాజ్యాంగంలోని 324వ అధికరణ విశేషాధికారాలు కల్పిస్తోందని వారు చెప్పారు.
తెలంగాణవాదాన్ని చాటండి
పంచాయతీ ఎన్నికల వ్యూహంపై పార్టీ జిల్లా ఇన్‌చార్జీలకు టిఆర్‌ఎస్ పిలుపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని బలంగా చాటాలని పార్టీ జిల్లా బాధ్యులకు టిఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తెలంగాణవాదం ఎంత బలంగా ఉందో చాటడంతో పాటు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు కనువిప్పు కలిగేవిధంగా ఫలితాలు సాధించాలని సూచించింది. పంచాయతీ ఎన్నికల వ్యూహంపై శుక్రవారం తెలంగాణ భవన్‌లో రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇంచార్జీలు, జిల్లా కన్వీనర్లతో పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం ఇన్‌చార్జి కడియం శ్రీహరి, పార్టీ జాతీయ వ్యవహారాల కమిటి సెక్రటరీ జనరల్ కె కేశవరావు పార్టీ జిల్లా బాధ్యులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెసు నేతలు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందనీ, దాని నుంచి బయట పడేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసపూరితంగా నమ్మించేందుకు ప్రయత్నిస్తోందని కడియం శ్రీహరి ఆరోపించారు. తెలంగాణవాదం గతంలో మాదిరిగా బలంగా లేదని తెలంగాణ వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారనీ, వీరి వాదనను తప్పని నిరూపించేందుకు పంచాయతీ ఎన్నికలను అస్త్రంగా ఉపయోగించుకోవాలని కడియం శ్రీహరి సూచించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి అవిర్భవించిందనీ, యుపిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే స్వాగతిస్తామని కడియం శ్రీహరి స్పష్టం చేసారు. అలా కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా ఇంకా నానే్చందుకు ప్రయత్నిస్తే కాంగ్రెసు పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు పంచాయతీ ఎన్నికలను ఆయుధంగా ఎంచుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌కు మద్దతు ఇచ్చే పార్టీలు, భావ సారూప్యం కలిగిన సంస్థలను తమ పార్టీ మిత్రులుగానే భావిస్తుందని కడియం తెలిపారు. సంక్షేమ పథకాలను కొనసాగించాలని కానీ, వాటిని కేవలం పార్టీ ప్రచారం కోసమే వినియోగించుకోవడం తప్పని కడియం శ్రీహరి అన్నారు. ఇందిరమ్మ అమృత హస్తం, బంగారు తల్లి పథకాలకు ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫోటోలను ఉపయోగించుకోవడం తీవ్ర అభ్యంతరకరమని కడియం తప్పుపట్టారు. సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయకుండా, కాంగ్రెసు కేవలం తమ పార్టీ నేతల వ్యక్తిగత ప్రచారం కోసం ఉపయోగించుకోవడం తప్పనీ కడియం విమర్శించారు.
ఈ వ్యవహరంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు కడియం శ్రీహరి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తామని చెప్పి, నోటిఫికేషన్లను మాత్రం ఒకేసారి విడుదల చేయడం తప్పని ఆయన అన్నారు. విడతల వారీగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేయాలని టిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుందని ఆయన తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పార్టీ తరఫున ఫిర్యాదు చేయనున్నట్టు కడియం శ్రీహరి తెలిపారు. పంచాయతీ ఎన్నికల వ్యూహంపై జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షలో మొదటి రోజు పార్టీ బలాబలాలను అంచనా వేశామనీ, దానికి అనుగుణంగా పార్టీ వ్యూహాన్ని రూపొందిస్తామని ఆయన తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా కమిటీలతో శనివారం సమావేశం కానున్నట్టు ఆయన తెలిపారు.
అది చీకటి ఒప్పందం
ఎన్‌ఎంయు ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 5: ఆర్టీసి యాజమాన్యంతో ఎంప్లారుూస్ యూనియన్, టిఎంయు కుదుర్చుకున్న ఒప్పందాలు చీకటి ఒప్పందాలని, కార్మికులను దగా చేశారని ఆర్టీసి నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం నాగేశ్వరరావు విమర్శించారు. ఒప్పంద ప్రతిలో కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, వేతన సవరణ తదితర అంశాలపైన స్పష్టత లేదన్నారు. తాము కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గుర్తింపు సంఘాలు డిమాండ్ల సాధనకు ఇచ్చిన సమ్మె పిలుపుకు మద్దతు ఇచ్చామన్నారు. కాగా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆర్టీసి గుర్తింపు సంఘాలు ఎంప్లారుూస్ యూనియన్, టిఎంయు, ఆర్టీసి యాజమాన్యానికి ఒప్పందం కుదిరింది. దీంతో ఆర్టీసికి సమ్మె గండం తప్పింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న మొత్తం 17,287 మంది డ్రైవర్లు, కండెక్టర్ల సర్వీసులను దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు, ఒప్పందంపై సంతకాలు పెట్టినట్లు కార్మిక సంఘాల నేతలు పద్మాకర్, చంద్రశేఖర రెడ్డి, జిడి ప్రసాదరెడ్డి రాజేంద్రప్రసాద్, టిఎంయు నేతలు థామస్ రెడ్డి తదితరులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 8644 మందిని, నవంబర్‌లో 875 మందిని, వచ్చే ఏడాది మే నెలలో 3447 మందిని, వచ్చే ఏడాది సెప్టెంబర్ లో 4322 మంది కాంట్రాక్టు సిబ్బంది సేవలను క్రమబద్ధీకరిస్తామని యాజమాన్యం పేర్కొన్నట్లు వారు చెప్పారు. రెగ్యులర్ కార్మికులకు అమలు చేసే స్ట్ఫా రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీంను కూడా కాంట్రాక్టు సిబ్బందికి వర్తింప చేస్తామిన హామీ ఇచ్చారు. కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వర్తింప చేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వేతన సవరణను అమలుచేయడానికి ఒప్పందం కుదిరినట్లు వారు చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేస్తామని యాజమాన్యం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని వారు చెప్పారు.
అన్నదమ్ముల ఘర్షణ సంఘటనలో కేసులు నమోదు
ఇందుకూరుపేట, జూలై 5: అన్నదమ్ముల ఘర్షణ సంఘటనలో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్టు ఇందుకూరుపేట ఎస్‌ఐ శేఖరబాబుబాబు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని పల్లెపాడు గ్రామానికి చెందిన నెల్లూరు సుధాకర్‌పై ఈనెల 3న నెల్లూరు గోపాలయ్య, అతని భార్య రాజేశ్వరమ్మ దాడి చేసి గాయపర్చారు. అదే విధంగా నెల్లూరు గోపాలయ్యపై సుధాకర్, నాగేశ్వరరావులు దాడి చేసి గాయపర్చారు. వీరువురికి మామిడితోటలోని కాయలు కోసే విషయంలో వివాదం జరిగింది. కౌంటర్ కేసుగా నమోదు చేసి నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.
తన భర్తని ప్రభుత్వమే హత్య చేసింది
నెల్లూరు, జూలై 5: మాజీ మావోయిస్టు నేత, అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంటి ప్రసాదంను ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా హత్య చేయించిందని హతుడు భార్య కామేశ్వరమ్మ తీవ్రస్థాయిలో ఆరోపించారు. నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రసాదం గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ సందర్భంగా ఆసుపత్రికి ఆయన భార్య, కుమారుడు, పలువురు విరసం నేతలు వచ్చారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమంలో ఉన్న వారిని జన స్రవంతిలోకి రావాల్సిందిగా ప్రభుత్వాలు కోరడం, వారి మాటలు నమ్మి ఉద్యమకారులు ప్రజల్లోకి రావడం, వారిని అదును చూసి ప్రభుత్వాలే మట్టుపెట్టడం పరిపాటిగా మారిపోయాయన్నారు. అందులోభాగంగానే తన భర్తను ప్రభుత్వం పథకం ప్రకారం హత్య చేయించిందని ఆరోపించారు. తన భర్తకి ఎవరితోను శత్రుత్వం లేదని, కేవలం ప్రభుత్వం మాత్రమే తమకు శత్రువు అని, వారి పన్నాగమే ఈ హత్యకు కారణమన్నారు. ప్రభుత్వం చేస్తున్న దమన నీతికి ప్రజలు తగు రీతిలో బుద్ధిచెప్తారని హెచ్చరించారు. అన్యాయం చేసే వారి పట్ల ఎదురుతిరిగి నిలబడటమే తన భర్త చేసిన తప్పు అని, అందుకే ప్రభుత్వం కిరాయి మూకలతో ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహంపై పలువురు విరసం నేతలు, అభిమానులు వచ్చి ఎర్రజెండా కప్పి లాల్‌సలాం చేశారు. మృతదేహాన్ని చూసిన పలువురు విరసం నేతలు, అభిమానులు కంటితడి పెట్టారు. మద్రాసులో సాఫ్ట్‌వేర్ ) ఉద్యోగం చేస్తున్న కుమారుడు సుధీర్ కూడా తన తండ్రికి లాల్‌సలాం ద్వారా జోహార్లు అర్పించారు. అనంతరం మృతదేహాన్ని తమ స్వగ్రామమైన బొబ్బిలికి అంబులెన్స్‌లో తరలించారు. ఈ కార్యక్రమం మొత్తం పోలీసుల కనుసన్నల్లో జరిగింది. ప్రసాదం మృతదేహాన్ని సందర్శించుకోవడానికి, చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కర్ని పోలీసులు వీడియో కెమెరాతో బంధించారు. నెల్లూరునగర, రూరల్ డిఎస్పీలు వెంకటనాధ్‌రెడ్డి, బాల వెంకటేశ్వరరావు, సిఐ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, రామారావు, కెవి రత్నం, సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు బాబురావు, మల్లికార్జున, వెంకట్రావులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అర్ధరాత్రి ప్రసాదం చనిపోయిన తర్వాత ఆ వార్తను బయటకు వెల్లడించడానికి నారాయణ వైద్యులు కూడా కొంత భయపడ్డారని సమాచారం.
ంచి వరంగల్‌కు మృతిచెందిన మాజీ మావోయిస్ట్ ప్రసాద్ మృతదేహాన్ని తరలిస్తున్న విరసం నాయకులు
అక్రమంగా తరలిస్తున్న 247 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
మనుబోలు,జూలై 5 : అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యం లారీబోల్తా పడడంతో విషయం బయట పడింది. వివరాల మేరకు గురువారం రాత్రి పొదలూకూరు నుండి పోర్టుకు రేషను బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీ మండల పరిధిలో వడ్లపూడి గ్రామం మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న బియ్యం పొదల్లో పడ్డాయి. ఈ విషయాన్ని వడ్లపూడి విఅర్‌వో రామచంద్రయ్యకు గ్రామస్థులు తెలియజేయడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే లారీకి సంబంధించినవారు క్రేన్ సహయంతో లారీని బయటకు లాగి తప్పించుకోవడానికి ప్రయత్నించగా లారీ బ్యాటరీ పాడయిపోయి, డీజల్ ట్యాంకు పగిలి డీజల్ పూర్తిగా పోవడంతో లారీని వదిలి పారిపోయారు. బోల్తాపడిన బియ్యాన్ని కొద్ది మంది ఇళ్లకు తరలించడానికి ప్రయత్నించగా విఅర్‌వో రామచంద్రయ్య అడ్డుకుని విషయాన్ని తహశీల్దారు వెంకటనారాయణమ్మకు తెలియజేశారు. తహశీల్దార్ సంఘటనా స్థలాన్ని పరీశిలించి పౌరసరఫరా అధికారులకు తెలియజేయడంతో జిల్లా పౌరసరఫరా అధికారి ఉమామహేశ్వర రావు తన సిబ్బందితో వచ్చి 247 బస్తాల బియ్యాన్ని సీజ్‌చేసి, పొదలూకూరుకు తరలించి లారీని మనుబోలు పోలీసులకు స్వాధీనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎఎస్‌ఓ శంకరన్ తదితరులు పాల్గొన్నారు.
జగనే మగధీరుడు
నెల్లూరు, జూలై 5: తమ పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి మాత్రమే రాజకీయాల్లో సిసలైన మగధీరుడంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర నేత, నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలో రానున్న పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు వైఎస్‌ఆర్‌సి జిల్లా విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ శ్రేణులనుద్దేశించి పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ అంశాలపై విశదీకరించారు. క్రమశిక్షణతో, శ్రద్ధగా వ్యవహరిస్తూ సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం ద్వారా విజయానికి పరిస్థితులు అనుకూలపరచుకోవాలంటూ కార్యకర్తలకు ఉద్బోధిందించారు. ఇదిలాఉంటే ఉత్తరాఖాండ్ వరదల్లో చిక్కుకున్న చార్‌థామ్ యాత్రికుల్ని రక్షించడంలో చంద్రబాబునాయుడు మగధీరుడిగా వ్యవహరించారంటూ తెలుగుదేశం పార్టీ ప్రచారం సాగించడం, ఫ్లెక్స్‌బోర్డులు ఏర్పాటు చేసుకోవడాన్ని మేకపాటి ఎద్దేవ చేశారు. ఉత్తరాఖాండ్ వరదల్లో చిక్కుకున్న ప్రయాణికుల్ని రక్షించడంలో దేశ సైన్యం మాత్రమే అమోఘమైన పాత్ర పోషించిందన్నారు. దేశం అంతా సైన్యం చేసిన అపార కృషికి కృతజ్ఞతులై ఉండాలన్నారు. అయితే చార్‌ధామ్ ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న తరువాత వారిని నాలుగు విమానాల్లో తరలించినంత మాత్రాన చంద్రబాబు మగధీరుడై పోతారా అంటూ మేకపాటి ప్రశ్నించారు. ఆయనకు ఆర్థికంగా వెసులుబాటు ఉండటం వలనే విమానం ఏర్పాటు చేశాడంటూ కూడా మేకపాటి పేర్కొన్నారు. ఏదేమైనా నలభై ఏళ్ల వయస్సులోనే జన రంజకమైన పార్టీ ఏర్పాటు చేసి అందరి అభిమానాన్ని చూరగొంటున్న జగన్మోహనరెడ్డి మాత్రమే రాష్ట్ర రాజకీయ రంగంలో మగధీరుడంటూ మేకపాటి ఉద్ఘాటించారు. వైఎస్‌ఆర్‌సి కేడర్‌లో ఏమైనా చిన్నపాటి కలహాలున్నా వాటిని పక్కన పెట్టి త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో అందరూ సమిష్టిగా పాటుపడాలన్నారు. పంచాయతీ ఎన్నికలు జగన్ భవిష్యత్‌కు ఎంతో కీలకం కానున్నాయని మేకపాటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పొరపాటున ఈ పంచాయతీ పోరులో వైఎస్‌ఆర్‌సి మద్దతుదారులు ఓటమి పాలైతే ఇదే అవకాశంగా భావించి వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి పార్టీపై దుష్ప్రచారం ఉద్ధృతం చేసే శక్తులు బలపడతాయని కార్యకర్తలనుద్దేశించి హెచ్చరించారు.
అంతకుముందు నెల్లూరు ఎంపిగా తాను చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేకపోయినా జగన్‌పై ఉన్న జనాభిమానమే రెండో పర్యాయం ఘన విజయానికి బాటలు వేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు కుమ్మక్కై రాజకీయ విన్యాసాలు చేస్తున్నాయన్నారు. రెండున్నర ఏళ్ల క్రితం నిర్వహించిన ఎంఎల్‌సి ఎన్నికల నుంచి ఇటీవల చేపట్టిన సహకార పోరు వరకు ఆ పార్టీల మధ్య కొనసాగిన అనైతిక సర్దుబాటు తేటతెల్లమవుతుందన్నారు. కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం అన్నింటా విఫలైమందన్నారు. యూపిఏ-1 పరిపాలనలో చోటుచేసుకున్న అక్రమాలు, కుంభకోణాలన్నీ ఇప్పుడిప్పుడు వరుసగా బహిర్గతమవుతున్నాయని విమర్శించారు.
మళ్లీ విద్యుత్ కోతలు
ఒంగోలు, జూలై 5: జిల్లాలో మళ్ళీ విద్యుత్‌కోతలు ప్రారంభం కావటంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలోను తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీనికితోడు విద్యుత్ ఉత్పత్తి ఘనణీయంగా తగ్గిపోవటంతోనే ఈపరిస్థితులు ఏర్పడ్డాయని ట్రాన్స్‌కో అధికారులు సెలవిస్తున్నారు. జిల్లాకు నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం రోజుకు 310 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుండటంతో భారీగా విద్యుత్‌కోతలను విధిస్తున్నారు. ప్రధానంగా రామగుండం, కొత్తగూడెం థర్మల్‌పవర్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో కూడా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో మూడుగంటలపాటు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటలు, గ్రామాల్లో 12గంటల పాటు కోతలను అధికారికంగా విధిస్తున్నారు. ఆ ఇచ్చే సరఫరా కూడా మూడు నుండి నాలుగు సార్లు ఇస్తుండటంతో రైతులు పొలాల్లోనే జాగరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కోస్తాతీరంలో వందలాది ఎకరాల్లో వేరుశనగపంటను సాగుచేశారు. వారందరూ రాత్రివేళల్లో పొలాల్లోనే జాగరణచేస్తూ పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. అధికార కోతలు ఈవిధంగా ఉంటే అనధికార కోతలను కూడా భారీగావిధిస్తున్నారు. ఎమర్జెన్సీలోడ్ రిలీఫ్‌పేరుతో విద్యుత్‌కోతలను విధిస్తూ జిల్లాప్రజలను అంధకారంలోకి నెడుతున్నారు. ప్రధానంగా గ్రామాల్లో
ఎప్పుడు విద్యుత్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
విద్యుత్‌కోతల కారణంగా ఆక్వా, పరిశ్రమల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వారంగానికి కూడా సక్రమంగా విద్యుత్ సరఫరాకాకపోవటంతో ఆయిల్ ఇంజన్లపై ఆధారపడి సాగుచేయాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. గ్రానైట్, ఇతర పరిశ్రమల యజమానులు కూడా ఈ విద్యుత్‌కోతలతో తీవ్రంగా నష్టపోతున్నారు. మొత్తంమీద రాష్ట్రప్రభుత్వం విధించే విద్యుత్‌కోతలతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.