Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఎన్నికలు సజావుగా జరిగేందుకు పార్టీ ప్రతినిధులు సహకరించాలి:కలెక్టర్

$
0
0

ఒంగోలు, జూలై 5: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసిందన్నారు. జిల్లాలో ఎన్నికలప్రవర్తన నియమావళి అమలులో ఉందన్నారు. జిల్లాలో ఈనెల 9న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. 9నుంచి జిల్లాలోని అన్ని పంచాయతీల్లో నామినేషన్ ప్రక్రియప్రారంభవౌతుందన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పకడ్బంధీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అర్హత కలిగిన వారి నామినేషన్లు తిరస్కరణకు గురికాకుండా అభ్యర్థులకు అవగాహన కల్పించాలని రాజకీయపార్టీల ప్రతినిధులను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో 21గుర్తింపుకార్డుల్లో ఏదోఒకదానితో ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవచ్చునని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు 10వేలకు పైబడి జనాభాకు 80వేలు, పదివేలకంటే తక్కువజనాభా ఉంటే 40వేలు, అదేవార్డు మెంబర్లకు పదివేలకు పైబడిన జనాభా ఉంటే పదివేల రూపాయలు, పదివేలు జనాభా తక్కువుగాఉంటే ఆరువేల రూపాయలు ఎన్నికల వ్యయం చేయాలన్నారు. నామినేషన్‌ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుండి అభ్యర్థుల ఎన్నికల వ్యయం లెక్కించటం జరుగుతుందన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం సంబంధిత సబ్‌డివిజన్ పోలీసు అధికారుల వద్ద అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో వాహనాలు వినియోగించేందుకు కూడా పోలీసు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
ఈసమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి, జిల్లా పరిషత్ సిఇఒ ఎం గంగాధర్‌గౌడ్, డిఆర్‌డిఎ పిడి ఎ పద్మజ, రాజకీయపార్టీలప్రతినిధులు సిరిగిరి రంగారావు, యర్రాకుల శ్రీనివాసరావు, జివి కొండారెడ్డి, ఒంగోలు చిట్టిబాబు, వి ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా
english title: 
free and fair elections

ఆన్‌లైన్ విధానాలతో అక్రమాలకు చెక్

$
0
0

దర్శి, జూలై 5 : రెవిన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల దస్తాలు ఆన్‌లైన్ కావడం వలన అక్రమాలకు చెక్ పెట్టినట్లు అవుతుందని జిల్లా రిజిస్ట్రార్ జిఎస్ గోపాల్ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పూర్వీకుల ఆస్తులను రిజిస్ట్రర్ కావడానికి వారసుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు అయి ఉండాలన్నారు. లేని చో రిజిస్ట్రేషన్లు జరపడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కొనుగోలు దారులు సంబంధిత ఆస్తి తాలూకు
పూర్తి వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారించుకున్న తరువాతనే చలానాలు తీయాలని ఆయన కోరారు. రిజిస్ట్రార్ కార్యాలయాలు నూతన విధానాల వలన జిల్లా పరిధిలోని ఏ కార్యాలయంలోనైనా తమ ఆస్థులను రిజిస్ట్రర్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విధానం ఈ నెల 8 నుండి పూర్తిగా అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని గమనించి కొనుగోలు అమ్మకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సబ్ రిజిస్ట్రార్ యస్‌యండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

ఐరన్ మాత్రలు వికటించి బాలికలకు అస్వస్థత
కందుకూరు, జూలై 5: స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఐరన్ మాత్రలు వికటించి 27మంది బాలికలు అస్వస్థతకు గురైన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. ప్రధానోపాధ్యాయురాలు, వైద్యులు, బాధిత బాలికలు తెలిపిన వివరాల ప్రకారం గురువారం పాఠశాల ఆవరణలో జరిగిన స్కూల్‌హెల్త్ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారులు ఐరన్ మాత్రలను బాలికలకు పంపిణీ చేశారు. భోజనం చేసిన వెంటనే ఐరన్ మాత్రలు వేసుకోవాలని బాలికలకు సూచించారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సమస్య వలన 50మంది బాలికలు ఐరన్ మాత్రలను గురువారం వేసుకోలేదు. శుక్రవారం పాఠశాలకు వచ్చిన తదుపరి మధ్యాహ్నం 11.30గంటల సమయంలో ఐరన్ మాత్రలను వేసుకున్నారు. వేసుకున్న వెంటనే మాత్రలు వికటించి బాలికలు వాంతులు చేసుకుని స్పృహ కోల్పోయారు. వెనువెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ, ఎంఇఓ బండి గోవిందయ్య 108 సహాయంతో బాలికలను పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న బాలికల తల్లిదండ్రులు వైద్యశాలకు చేరుకుని తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. సమాచారం అందుకున్న వైద్యశాఖ క్లస్టర్ ఎస్‌పిహెచ్‌ఓ డాక్టర్ రాజకుమారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు నాగమణి చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించి వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. సిపిఐ పట్టణ కార్యదర్శి వి రాఘవులు వైద్యశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. చికిత్స పొందుతున్న వారిలో వి భవాణి, ఆర్ సుప్రియ, ఎస్‌కె నజియా, టి సుకన్య, జి శిరీష, పి దేవిప్రియ, జి శ్రీదేవి, బి జానకి, జె వెంకటలక్ష్మి, బి సుమలత, బి కీర్తి తదితరులు ఉన్నారు.
దర్శిలో.
దర్శి: స్థానిక కస్తూర్బాపాఠశాలలో గురువారం రాత్రి ఆ పాఠశాల బాలికలకు ప్రభుత్వం అందచేసిన ఐరన్‌మాత్రలు వికటించి 40మంది బాలికలు అస్వస్థతకు గురైనారు. వీరిని శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామల చేర్పించారు. వైద్యులు సరైన సమయంలో స్పందించటంతో బాలికలు ప్రమాదంనుండి బయటపడ్డారు. భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఇచ్చిన ఈ ఐరన్ మాత్రల వలన కొద్దిమందికి ఇటువంటి చిన్నపాటి అస్వస్ధతలు కలుగుతాయని జిల్లావైద్య శాఖాధికారి పి సుధాకర్‌బాబు పేర్కొన్నారు. సంఘటన జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కస్తూరిబా పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని బాలికలను అడిగి పూర్తివివరాలను తెలుసుకున్నారు. జిల్లాలో కొన్నిప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. బాలికలను ఆయన పరీక్షించి తగిన వైద్యాన్ని అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. ఆస్వస్ధతకు గురైన బాలికలకు ప్రభుత్వ వైద్యులు ఆనంద్‌బాబు, చేగిరెడ్డి మనోహర్ రెడ్డి, రాధాకృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు.

- జిల్లా రిజిస్ట్రార్ -
english title: 
online

‘పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించాలి’

$
0
0

అద్దంకి, జూలై 5: మండలంలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయభేరి మోగించాలని అద్దంకి మాజీ శాసనసభ్యులు జాగర్లమూడి రాఘవరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఇరిగేషన్ బంగ్లాలో గ్రామాల వారీగా నాయకులతో పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. గ్రామ నాయకుల అభిప్రాయాలను తెలుసుకొని అభ్యర్థులను కూడా ఎంపిక చేశారు. వార్డు మెంబర్లను మాత్రం మీరే ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలే కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని భరోసా ఇచ్చారు. రాఘవరావు వెంట పరిటాల నాగేశ్వరరావు, చినరాముడు, ఎర్రిబోయిన వెంకటేశ్వర్లు, తోకల వెంకటేశ్వర్లు, వీరాంజనేయులు, బోసు, ఎర్రిబోయిన ప్రసాదు తదితరులున్నారు.

అక్రమ బాణసంచా పట్టివేత
చీరాల, జూలై 5: నివాస ప్రాంతంలో బాణసంచాను అక్రమంగా నిల్వచేసి ఉందన్న సమాచారం అందుకున్న ఒన్ టౌన్ పోలీసులు శుక్రవారం వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా దాచి ఉంచటం చట్టరీత్యా నేరమని సిఐ భీమా నాయక్ అన్నారు. జాండ్రపేట సెంటర్‌లో ఊటుకూరి హరిబాబు నిబంధనలకు వ్యతిరేకంగా రెండు లక్షల రూపాయల విలువైన బాణసంచాను నిల్వ చేశారన్నారు. స్వాధీనం చేసుకున్నట్లు సిఐ విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ మేరకు హరిబాబును అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో సోదాలు చేస్తుండగా అక్రమ బాణ సంచాబైటపడినట్లు ఆయన వెల్లడించారు. అగ్నిమాపక అధికారి అనుమతిలేకుండా కనీసం ఎటువంటి లైసెన్స్‌లు లేకుండా అక్రమంగా నిల్వ చేయటం దారుణమని అన్నారు. ఈ దాడిలో ఎస్ ఐ వెంకటేశ్వర్లు, పుల్లయ్య నాయడు, నాగరాజు, దయానంద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

మండలంలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు
english title: 
panchayat elections

పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

$
0
0

ఒంగోలు, జూలై 5: జిల్లా నూతన ఎస్‌పిగా పి ప్రమోద్‌కుమార్ శుక్రవారం ఉదయం 9.50గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించించినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టిబందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఆయన తెలిపారు. రౌడీషీటర్లపై బైండోవర్ కేసులు నమోదుచేస్తామన్నారు.
జిల్లాలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్లు ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. దొంగతనాలకు సంబంధించిన రికవరీని కూడా త్వరతగతిన చేస్తామన్నారు. జాతీయరహదారులపై ప్రమాదాల నివారణకు దృష్టిపెడతానన్నారు. జాతీయ రహదారిపై మద్యంసేవించి వాహనాలు నడిపేవారిపై నిఘాపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయరహదారిపై వెళ్లే వాహనాలు పరిమితికి మించి లోడుతో వెళితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఒంగోలునగరంలో ట్రాఫిక్ వ్యవస్ధను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కృషిచేస్తానని ఆయన తెలిపారు. నగరంలో సిగ్నల్స్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు మెరుగైన న్యాయసహాయం అందించేందుకు కృషిచేస్తానని జిల్లాఎస్‌పి ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. నూతన ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్‌కుమార్‌ను పలువురు పోలీసు అధికారులు, రాజకీయనాయకులు అభినందనలు తెలిపారు.

బరితెగించిన నీటి చోరులు ప్రధాన కాల్వ కట్టలకే గండ్లు
కురిచేడు, జూలై 5: సాగర్ జలాలు విడుదల చేయటంమే ఆలస్యం, నీటి మళ్లింపుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుంటారు చేపల గుత్తేదారుడు. వారికి తామేమి తీసిపోమన్నట్టుగా ఏకంగా ప్రధాన కాల్వకట్టలకే గండ్లు పెడుతున్నారని అనధికార సాగుబడి రైతులు. తరచూ కాల్వ మేజర్లకు గండ్లు పెడుతున్నా అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఒకరైతు ఏకంగా దర్శి బ్రాంచి కాల్వకు శుక్రవారం గండిపెట్టి అక్రమ తూము ఏర్పాటుకు ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నాన్ని పసికట్టిన పడమర వీరాయపాలెం మేజర్ లస్కర్ ఆశీర్వాదం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే సిబ్బందిని అప్రత్తం చేసి, అక్రమతూము ఏర్పాటును అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దర్శి బ్రాంచి కాల్వ కుడివైపు కట్ట 3వ కిలోమీటరు వద్ద ఒక రైతు అక్రమ తూముకు ప్రయత్నించాడు. అద్దంకి ప్రాంతం నుండి వలస వచ్చిన ఆరైతు ఇక్కడ పొలం కొనుగోలు చేశాడు. సాగర్‌కాల్వ ఊటనీటితో పొలం సాగు చేయసాగాడు. ఊట నీటి కన్నా ఏకంగా కాల్వలో ప్రవహించే నీటినే తమ పంట పొలానికి మళ్లించుకోవాలనే దురాశ అతనిలో కలిగింది. అతని దురాశకు ఒక చోటా రాజకీయనాయకుడి భరోసా దొరికింది. దీంతో ప్రొక్లయినర్‌తో కాల్వకట్టను తొలిచాడు. అక్కడ తూము ఏర్పాటు చేసి పైపుల ద్వారా నేరుగా తన పొలంలోకి నీటిని మళ్లించుకోవాలని ఏర్పాట్లు చేసుకోసాగాడు. కాల్వలపై పర్యవేక్షిస్తున్న లస్కర్ ఆశీర్వాదం గమనించి దర్శి జెఇ అంకమరావు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల విధి నిర్వహణలోవున్న ఆయన సిబ్బంది వర్కఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, లస్కర్లు చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనులను సంఘటనా స్థలానికి పంపి రైతు ప్రయత్నాలకు చెక్ పెట్టించారు. అక్రమ తూము ఏర్పాటుకు ప్రయత్నించిన రైతుపై కాని, ప్రొక్లయినర్ యాజమాన్యంపై కాని ఎలాంటి చర్యలు తీసుకోకుండానే సిబ్బంది వారిని వదిలివేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం ఆధునీకరణ పేరుతో కాల్వలకు ఒకవైపు మరమ్మతులు చేస్తుంటే మరో వైపు నీటిచోరులు, అక్రమ సాగుబడి దారులు ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాలుపడుతున్నా పోలీసు కేసులు బనాయించకుండా ఉపేక్షించటంపై ఆయకట్టుదారులు విమర్శిస్తున్నారు.

‘హిమ్ బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తాం’
మార్కాపురం, జూలై 5: మాయ మాటలతో హిమ్ సంస్థ ద్వారా నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని పోరాట కమిటీ అధ్యక్షులు ప్రేమానందం తెలిపారు. శుక్రవారం స్థానిక ఎన్‌జిఓ హోంలో జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నెల్లూరులో సిఐడి డివైఎస్పీ దిలీప్‌కుమార్‌ను కలిసి తమ బాధను విన్నవించుకోవడం జరిగిందని, ప్రతిఒక్కరికి న్యాయం జరిగేవరకు తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈసమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షులు సిపిఎం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా ప్రతి ప్రాంతంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారే తీవ్రంగా నష్టపోయారన్నారు. త్వరలో బాధితుల తరుపున ప్రధాన న్యాయస్థానంలో రిట్ వేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గౌరవ సలహాదారుడు బలుసుపాటి గాలెయ్య కమిటీ కార్యదర్శి మందా పోలయ్య పాల్గొన్నారు.

అంగన్‌వాడి సమస్యలు పరిష్కరించాలి
చీరాలరూరల్, జూలై 5: అంగన్‌వాడి కార్యకర్తలు పదవీవిరమణ చేసినప్పుడు అన్ని రకాలప్రయోజనాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని కోరుతూ చీరాల తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడి కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రైవేటుపరం చేస్తే సహించేదిలేదని అన్నారు. కార్యక్రమంలో డి నాగేశ్వరరావు, అంగన్‌వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు ప్రదానం
యద్దనపూడి, జూలై 5: విద్యాపక్షోత్సవాలలో భాగంగా మండలంలోని పూనూరు గ్రామంలోని ఎల్ ఇ ప్రాథమిక పాఠశాల వద్ద శుక్రవారం ఆరోగ్యం-పారిశుద్ధ్యం అనే అంశంపై విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. క్విజ్ పోటీలలో టి కార్తీక్ గ్రూప్‌కు ప్రథమ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి ప్రసాద్, ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్‌వాడి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

వీధిలైట్లు వెలిగించాలి
యద్దనపూడి, జూలై 5: మండలంలోని పలు గ్రామాలలో వీధిలైట్లు వెలగకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని అనంతవరం, పూనూరు, యద్దనపూడి, యనమదల, వింజనంపాడు గ్రామాలలో రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలగకపోవటంతో గ్రామస్ధులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. అసలే విద్యుత్ కోతలతో సతమతమవుతుంటే దీనికితోడు ఉన్న కొద్దిపాటి సమయంలోనైనా వీధిలైట్లును వెలగకపోవటం ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరమ్మత్తులు చేయించి వెంటనే వీధి లైట్లు వెలిగేవిధంగా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

‘ఎన్నికల నియమావళి పాటించాలి’
వేటపాలెం, జూలై 5: రాజకీయ నాయకులు ఎన్నికల నియమావళిని పాటించాలని మండలాభివృద్ధి అధికారి పి ఝాన్సీరాణి తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆమె ప్రసంగించారు. సామాన్యుడు ఓటుహక్కును వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. ఎస్‌ఐవి అంకబాబు మాట్లాడుతూ సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించదలచుకున్న రాజకీయపార్టీల వారు ముందస్తుగా డివైఎస్‌పి అనుమతి తీసుకోవాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని తెలిపారు. ఎన్నికలలో ఘర్షణలకు పాల్పడితే రౌడీషీట్‌లు ఓపెన్ చేస్తామని తెలిపారు. అఖిలపక్ష నాయకులు కోనంకి నాగేశ్వరరావు, కర్ణ శ్రీనివాసరావు, అక్కల రాజశేఖరరెడ్డి, పి మనోహరలోహియా, దంతం వెంకటసుబ్బారావు, బొడ్డు సుబ్బారావు, పల్లపోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

దాతల సహకారం మరువలేనిది
వేటపాలెం, జూలై 5: జూనియర్ కళాశాల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో ఉపయోగపడుతుందని బండ్లబాపయ్య విద్యాసంస్థల కమిటి కార్యదర్శి బండ్ల శరత్‌బాబు తెలిపారు. శుక్రవారం బండ్లబాపయ్య హిందూ జూనియర్ కాలేజిలో పూర్వ విద్యార్థి బట్ట శంకరరావు జ్ఞాపకార్ధం ఆయన సతీమణి సుగుణ, కుమారులు బట్ట తులసీ శ్రీనివాసరావు, నాగరాజుల ఆర్థిక సహాయంతో 6వ తరగతి విద్యార్థులు 100మందికి నోటుపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శరత్‌బాబు మాట్లాడుతూ పేద విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన నోటుపుస్తకాలు, పెన్నులు అందిస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సహాయకార్యదర్శి కొసనం నాగమాంబ, ప్రిన్సిపాల్ పి బాలసుబ్రహ్మణ్యం, హైస్కూల్ ఇన్‌చార్జి ఎన్ ఏసుదాసు, ఉపాధ్యాయులు బట్ట మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. కాగా వేటపాలెం రైల్వేస్టేషన్ రోడ్డులోగల అనాధ సంక్షేమ సంస్ధ ఆధ్వర్యంలో వేటపాలెం పంచాయతీలోని పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సంస్థ అధ్యక్షులు జెల్లి యల్లమందయ్య నోటుపుస్తకాలు, జామెంట్రీ బాక్సులు, పెన్సిల్స్ ఇవ్వగా వాటిని ఎస్ ఐ ఇ అంకబాబు విద్యార్థులకు అందజేశారు.

పెన్షన్ సౌకర్యం కల్పించాలి
వేటపాలెం, జూలై 5: అంగన్‌వాడి కార్యకర్తలు పదవీవిరమణ చేసినప్పుడు లక్ష రూపాయల గ్రాడ్యూయిటీ, సహాయకులకు రూ. 50వేలు ఇవ్వాలని కోరుతూ అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వేటపాలెం మండల కాంప్లెక్స్ ఎదుట అంగన్‌వాడిలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎన్ బాబూరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవవేతనం అందజేయాలని కోరారు. చివరి జీతంలో సగం పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి 55ఏళ్లు వయోపరిమితి ఉండేలావిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విఆర్‌వో సంఘ నాయకుడు ఎం సత్యనారాయణ వారికి మద్దతు పలికారు. కార్యక్రమంలో నాయకులు సరళ, గౌరీకుమారి, విజయకుమారి, ఎస్ భ్రమరాంభ, భానుమతి, బుల్లెమ్మాయి తదితరులు పాల్గొన్నారు.

బ్యూటిపార్లర్‌పై ఉచిత శిక్షణ
వేటపాలెం, జూలై 5: స్థానిక మండల కాంప్లెక్స్‌లో గల గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణాసంస్థ ఈ నెల 25నుండి 30రోజులపాటు నిరుద్యోగ మహిళలకు బ్యూటిపార్లర్ మేనేజ్‌మెంటులో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ డైరెక్టర్ టి తిరుపతిరెడ్డి శుక్రవారం తెలిపారు. మహిళలు జిల్లాకు చెందినవారై ఉండి 18నుండి 45 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారై ఉండాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. ఆసక్తికలిగిన మహిళలు తమ బయోడేటాను ఈ నెల 23వ తేదీలోగా డైరెక్టర్ రూడ్‌సెట్, వేటపాలెం, ప్రకాశం జిల్లాకు పంపాలన్నారు.

జిల్లా నూతన ఎస్‌పిగా పి ప్రమోద్‌కుమార్
english title: 
panchayat elections

మోపిదేవిని బలిపశువును చేశారు

$
0
0

హైదరాబాద్, జూలై 5: తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు మోపిదేవి వెంకటరమణను బలిపశువును చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదో కుట్ర అని ఆమె దుయ్యబట్టారు. మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాథ్ శుక్రవారం విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగిస్తూ మోపిదేవిని అరెస్టు చేసే ముందు వారం రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. 26 జివోల కేసు రాజీకీయ ప్రేరేపితమైందని ఆమె దుయ్యబట్టారు. 26 జివోల కేసుల్లో ఒక్కొక్కరికీ ఒక్క న్యాయమా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిందని ఆమె పునరుద్ఘాటించారు. అందుకు ప్రతిఫలంగా వైఎస్‌ను అప్రతిష్ట చేసేందుకు ఎఫ్‌ఐఆర్‌లో పేరు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టిడిపి కలిసి చేస్తున్న కుట్రలను ప్రజలు గమినిస్తున్నారని ఆమె అన్నారు. ప్రతి పంచాయతీలో పార్టీ విజయం సాధించాలని, పార్టీ జెండా రెపరెపలాడాలని ఆమె తెలిపారు.

విజయమ్మ సమక్షంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి మోపిదేవి సోదరుడు హరినాథ్

విజయమ్మ విమర్శ
english title: 
m

పాఠశాలపై తీవ్రవాదుల దాడి: 42 మంది దుర్మరణం

$
0
0

కానో (నైజీరియా), జూలై 6: నైజీరియాలో బోకో హరామ్ గ్రూపునకు చెందిన ఇస్లామిక్ తిరుగుబాటుదారులుగా అనుమానిస్తున్న కొందరు సాయుధ దుండగులు యోబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలపై దాడిచేసి 42 మందిని హత్య చేశారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని స్థానికులు శనివారం తెలిపారు. మముడోలోని సెకండరీ పాఠశాలపై శుక్రవారం రాత్రి సాయుధ దుండగులు దాడి జరిపారని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 42 మంది విద్యార్థులు, పాఠశాల సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని స్థానికులు, ఆరోగ్య కార్యకర్తలు తెలిపారు. మృతుల్లో చాలా మందికి కాలిన గాయాలు, మరికొంత మందికి బుల్లెట్ గాయలు ఉన్నాయని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అధికారి ఒకరు వివరించారు.

నైజీరియాలో బోకో హరామ్ గ్రూపునకు చెందిన ఇస్లామిక్ తిరుగుబాటుదారులుగా
english title: 
42 killed

అంబేద్కర్ వర్శిటీలో కొత్త కోర్సులు

$
0
0

హైదరాబాద్, జూలై 6: ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో రెండు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్టు వర్శిటీ అధికారులు తెలిపారు. బిటెక్, బిఎస్సీ, ఐటిఐ చేసిన వారు కూడా వీటిలో చేరవచ్చని వారు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ టెస్టు సంస్థతో కుదిరిన అవగాహనా ఒప్పందం మేరకు అడ్వాన్స్‌డ్ సర్ట్ఫికేట్ ప్రోగ్రాం ఇన్ పీఎల్సీస్ స్కాడా సిస్టం, సర్ట్ఫికేట్ కోర్సు ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్ కనెక్షన్ టెక్నిక్స్ అనే ఈ రెండు కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 15వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
జెఎన్‌టియుహెచ్ 3/2 ఫలితాలు విడుదల
జెఎన్‌టియుహెచ్ బిటెక్ కోర్సు మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (3/2) ఫలితాలను విడుదల చేసినట్టు ఇవాల్యూయేషన్ డైరెక్టర్ కె. ఈశ్వర్ ప్రసాద్ తెలిపారు. పరీక్షలకు 86107 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో 81,964 మంది హాజరయ్యారని, 44198 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. రీ వాల్యూయేషన్‌కు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు.

ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ
english title: 
ambedkar open varsity

సమైక్యాంధ్ర కాదు సీమాంధ్ర అనండి

$
0
0

హైదరాబాద్, జూలై 6: సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సభ నిర్వహించుకుంటే తమకు అభ్యంతరం లేదు కానీ వారు సమైక్యాంధ్ర సభ అనవద్దని తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా ఆ సభకు హాజరైతే సమైక్యాంధ్ర సభ అనాలే తప్ప, సీమాంధ్రకు చెందిన వారు సభ నిర్వహించినప్పుడు సమైక్యాంధ్ర సభ అని ఎలా అంటారని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ మరింత పటిష్టం కావాలంటే వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ చేపట్టాలని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా జాప్యం జరిగిందని ఆయన అన్నారు. పెళ్ళిలో ఆడపిల్ల వారు అణిగిమణిగి ఉన్నట్లు తాము సంయమనంతో ఉంటున్నామని ఆయన తెలిపారు. ఎంపి రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగాలని తాము కోరుతుంటే సీమాంధ్రకు చెందిన వారు బలవంతంగా కాపురం చేస్తామని అంటున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు పార్టీ అధిష్ఠానాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.

టి.కాంగ్రెస్ ఎంపి పొన్నం హితవు
english title: 
ponnam

వరద సహాయంలానే రుణమాఫీ చేసి చూపిస్తాం

$
0
0

హైదరాబాద్, జూలై 6: చార్‌ధామ్‌లో వరద బాధితులకు రాష్ట్రంలో రైతుల రుణాలకు సంబంధం ఉందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. చార్‌ధామ్ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్షంగా చేసి చూపించాం, రైతులకు రుణ మాఫీని సైతం ఇదే విధంగా చేసి చూపిస్తామని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రాంతీయ సదస్సు శనివారం కొంపల్లిలో జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు - కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పంచాయితీ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అంశాల్లో చార్‌ధామ్‌లో టిడిపి అందించిన వరద సహాయం గురించి ప్రధానంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగానే రుణ మాఫీ పైనే తొలి సంతకం చేయనున్నట్టు ప్రకటించిన చంద్రబాబు అది ఎలా సాధ్యం అవుతుందనే సందేహాలకు చార్‌ధామ్ వరద సహాయమే దానికి ఉదాహరణ అని వివరించారు. రైతులకు రుణ మాఫీ సైతం అదే విధంగా చేసి చూపిస్తామని అన్నారు.

పంచాయతీ అజెండాలో ‘చార్‌ధామ్’ * చంద్రబాబు వ్యూహం
english title: 
babu

బాబు ప్రధాని అవుతారు: ఎర్రబెల్లి

$
0
0

హైదరాబాద్, జూలై 6: తెలంగాణ ఏర్పడితే టిడిపి జాతీయ పార్టీ అవుతుందని, రెండు రాష్ట్రాల్లోనూ బలంగా ఉంటుందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. శనివారం కొంపల్లిలో నిర్వహించిన టిడిపి ప్రాంతీయ సదస్సులో దయాకర్‌రావు మాట్లాడారు. చంద్రబాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో దయాకర్‌రావు బాబు సమక్షంలోనే ఆయన ప్రధాని అవుతారని అన్నారు. తెలంగాణ ఏర్పడితే టిడిపి రెండు ప్రాంతాల్లోనూ అధికారంలోకి వస్తుందని అన్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలం కాదని, కట్టుబడి లేదని ఎవరైనా అంటే వారిని ఉరికించి కొట్టాలని దయాకర్‌రావు అన్నారు. టిజెఎసి నాయకులు కాంగ్రెస్‌కు కెసిఆర్‌కు సేవకుల్లా పని చేస్తున్నారని మండిపడ్డారు. వి హనుమంతరావు ఇంటి వద్ద విందు కోసం కోదండరామ్ పడిగాపులు కాశాడని ఎద్దెవా చేశారు. తెలంగాణపై చిత్తశుద్ధితో ఉన్నది టిడిపి మాత్రమేనని, కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని అన్నారు. కాంగ్రెస్ నాయకులను గ్రామాలకు రానివ్వవద్దని పిలుపు ఇచ్చిన టిజెఎసి ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల చుట్టు ఎందుకు తిరుగుతున్నారని దయాకర్‌రావు ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పడితే టిడిపి జాతీయ పార్టీ అవుతుందని
english title: 
yerrabelli

ఇక్కడ అధికారం.. కేంద్రంలో కీలకం

$
0
0

హైదరాబాద్, జూలై 6: నవంబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపి సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో టిడిపి గెలవడం, కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పడం ఖాయం అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణలోని ఐదు జిల్లాల పార్టీ శ్రేణులకు శనివారం కొంపల్లిలో టిడిపి ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణకు టిడిపి వ్యతిరేకం కాదని, మహానాడులో తీర్మానం చేశామని, ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నానని అన్నారు. రాష్ట్రంలో రాబోయేది టిడిపి ప్రభుత్వమేనని, గతంలో మాదిరిగానే కేంద్రంలో చక్రం తిప్పుతామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రంలో నాలుగు సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడితే మూడు ప్రభుత్వాల ఏర్పాటులో టిడిపినే కీలక పాత్ర పోషించినట్టు చంద్రబాబు తెలిపారు. టిడిపి ఆధ్వర్యంలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందని, కేంద్రంలో టిడిపి మళ్లీ చక్రం తిప్పుతుందని అన్నారు. రాబోయేది టిడిపి ప్రభుత్వమే దీన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని, బెల్ట్‌షాపులను ఎత్తివేస్తూ రెండవ సంతకం చేస్తానని తెలిపారు. తాను నిప్పులా బతికానని భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటానని అన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడే స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించలేదని, తప్పని పరిస్థితిలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇది ఎన్నికల సంవత్సరం ప్రతి కార్యకర్త తిరిగి టిడిపిని అధికారంలోకి తీసుకు రావాలనే ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత ఎంపిటిసి, జడ్‌పిటిసి, జిల్లా పరిషత్తు ఎన్నికలు జరుగుతాయని, ఆ తరువాత పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ప్రతి క్షణం టిడిపిని అధికారంలోకి తీసుకు రావాలనే ఆలోచనతో కృషిచేయాలని అన్నారు. ప్రజలు మనకు ఓటు వేసేంత వరకు చెవిలో జోరీగలా వారికి పదే పదే చెప్పాలని అన్నారు. అమెరికాలో ఒబామా పోటీ చేసినప్పుడు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తే, తలుపు తీయకపోయినా అక్కడే నిలబడి తెరిచేంత వరకు ఉండి, తమ నాయకుడి గురించి వివరించారని, అదే విధంగా మీరు అందరికీ టిడిపి గురించి చెప్పాలని కోరారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్‌లో కలిసిపోతాయని అన్నారు. గతంలో చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ఎన్‌జి రంగా వంటి ఎందరో రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి తిరిగి కాంగ్రెస్‌లో కలిసిపోయారని, ఒక్క టిడిపి మాత్రమే కాంగ్రెస్ వ్యతిరేకతతో పోరాడుతోందని అన్నారు. కాంగ్రెస్ బలహీనపడింది, బిజెపి ఎదగడం లేదు, కేంద్రంలో థర్డ్ ఫ్రంట్‌కే అవకాశాలు ఉన్నాయని, దీనిలో టిడిపి కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు తెలిపారు.
జగన్ లక్ష కోట్లు సంపాదించాడని, టిఆర్‌ఎస్ దందాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అవినీతి అసమర్ధ, పనికి మాలిన పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జైలులో ఉండే పార్టీ, టిఆర్‌ఎస్ దందాలు చేసే పార్టీ అని మండిపడ్డారు. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ఆలోచించే ఏకైక పార్టీ టిడిపి మాత్రమేనని చంద్రబాబు తెలిపారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం కల్పించింది, తెలంగాణ సమస్యలను పరిష్కరించడానికి ఉద్యమించింది టిడిపి మాత్రమేనని అన్నారు.
సిఎంగా, ప్రతిపక్ష నాయకునిగా నాదే రికార్డ్
తాను చూడని అధికారం లేదని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు తనదేనని, అదే విధంగా అత్యధిక కాలం ప్రతిపక్ష నాయకునిగా పని చేసిన రికార్డ్ సైతం తనదేనని అన్నారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక ప్రతిపక్షంగా సభకు వచ్చేవారు కాదని అలా సభకు వచ్చిన తొలి నాయకుడు ఎన్టీరామారావు కాగా, ఆ తరువాత తానే సభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నానని అన్నారు. తన రికార్డును ఎవరూ బ్రేక్ చేసే అవకాశం లేదని చంద్రబాబు తెలిపారు. విఠలాచార్య సినిమాల్లో మాయలు చేసినట్టుగా జగన్ అక్రమంగా మాయలు చేశారని విమర్శించారు.
టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబు తెలిపారు. టిడిపి అధికారంలోకి రాగానే ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేస్తామని తెలిపారు. అమర వీరుల కుటుంబ సభ్యులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా బ్రష్టుపట్టించారని, తిరిగి గాడిలో పడాలంటే టిడిపి అధికారంలోకి రావాలని అన్నారు. సమావేశంలో నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన టిడిపి శ్రేణులు సదస్సులో పాల్గొన్నారు. (చిత్రం) తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతున్న టిడిపి అధినేత చంద్రబాబు

టిడిపి ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు ధీమా * నవంబర్‌లో ఎన్నికలు వచ్చినా సిద్ధమే * తెలంగాణకు వ్యతిరేకం కాదు
english title: 
chandra babu

సోనియా, దిగ్విజయ్‌లతో రామచంద్రయ్య భేటీ

$
0
0

న్యూఢిల్లీ, జూలై 6: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో విడివిడిగా సమావేశమయ్యారు. కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన రామచంద్రయ్యపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలన్న పట్టుదలతో ఉన్నారు. కరెంటు చార్జీల పెంపు పార్టీ ప్రయోజనాలకు మంచిది కాదని వాదించటంతోపాటు తన నాయకుడైన చిరంజీవికి ముఖ్యమంత్రి కావటానికి అవసరమైన అన్ని అర్హతలూ ఉన్నాయని రామచంద్రయ్య చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలను ముఖ్యమంత్రి తీవ్రంగా తీసుకున్న విషయం తెలిసిందే. కడపకు చెందిన డిఎల్ రవీంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పుడు కూడా రామచంద్రయ్యకు ఉద్వాసన చెప్పటానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాలకు చిరంజీవి బ్రేకు వేశారు. ముఖ్యమంత్రికి, తనకు మధ్య తీవ్రస్థాయిలో పోరాటం జరిగినప్పుడు రామచంద్రయ్య అధినాయకత్వాన్ని కలిసే ప్రయత్నం చేయలేదు. అయితే శనివారం ఆయన హఠాత్తుగా ఢిల్లీ వచ్చి పార్టీ అధినేత్రిని కలవడం ప్రత్యేకతను సంతరించుకుంది. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సోనియాకు వివరించటంతోపాటు ప్రజా రాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైనప్పుడు ఇచ్చిన హామీల అమలుపై చర్చించినట్లు తెలిసింది. తెలంగాణను ఏర్పాటు చేసిన పక్షంలో రాయలసీమలో తలెత్తే పరిణామాపై ఆయన వాస్తవమైన నివేదికను అందచేశారని తెలిసింది. సాయంత్రం ఆయన దిగ్విజయ్‌తో సమావేశమయ్యారు.
సాయిప్రతాప్ డిమాండ్
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినపక్షంలో రాయలసీమను కూడాప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి సాయి ప్రతాప్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ జరిగితే మూడు రాష్ట్రాలు ఏర్పడి తీరాలని ఆయన స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ
english title: 
ramachandraiah

సీమ ఆత్మగౌరవం పట్టదా?

$
0
0

హైదరాబాద్, జూలై 6: కేంద్ర ప్రభుత్వానికి, సోనియా గాంధీకి రాయలసీమ ప్రజల ఆత్మగౌరవం పట్టదా అని వారిని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సీమ ప్రజలకు అన్నం కన్నా ఆత్మగౌరవమే ముందని, ఆ ఆత్మగౌరవంతోనే ఎన్ని కరవు కాటకాలు ఎదురైనా ఆత్మస్థైర్యంతోనే బతుకుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాయలసీమ సాధనకు ఆయన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన 52 గంటల నిరాహార దీక్ష శనివారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ సింహ గర్జన పేరుతో చేపట్టిన ఈ దీక్షతో సీమ నేతల వెన్నులో వణుకు పుట్టిందని ఇది తమ దీక్ష విజయన్నారు. అలాగే ఈ దీక్షకు తెలంగాణ ప్రాంత నేతలు సైతం సంఘీభావం ప్రకటించడం తమ తొలి విజయంగా ఆయన అభివర్ణించారు. రాయలసీమ నేతల వల్లే సీమలోని ఫ్యాక్టరీలు మూతపడి ప్రజలు వలసలు దౌర్భాగ్యం దాపరించిందని మండిపడ్డారు. సమైక్యాంధ్రలో అర్ధాకలితో బతికామని ఇకా మాకా దుస్థితి వద్దని మా రాష్ట్రం మాకు ప్రకటించండని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ సీమ వెనక్కి తప్ప ముందుకు సాగలేదన్నారు. ఆత్మగౌరవమే సీమ ప్రజల ఆస్తి అని రాయల తెలంగాణ పేరుతో దాన్ని విభజించాలని చూస్తే సీమ ప్రజలు రాజకీయ భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. సీమ ప్రజలు మేల్కొనాలని లేకపోతే కేంద్రం రాయలసీమను రాష్ట్ర పటంతలో లేకుండా చేస్తుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బైరెడ్డి, రాయలసీమ జెఎసి కార్యనిర్వాహక సభ్యుడు వేణుగోపాల్ రెడ్డిల దీక్షను రాయలసీమ నుంచి పట్టణానికి వలస వచ్చిన ఒక వలస కూలీ చేత నిమ్మరసం తాగించి విరమింపజేశారు. అంతకు ముందు దీక్ష శిబిరాన్ని సినీ నటుడు నరేష్, గద్దర్, తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. రాయలసీమను విభజించే హక్కు కేంద్రానికి లేదని, తెలంగాణపై కాంగ్రెస్ రోడ్డు మ్యాప్ సాధారణ, పంచాయతీ ఎన్నికల రోడ్డు మ్యాప్ అని విమర్శించారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌కు తెలంగాణ ప్రజలు మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని ఆయన ప్రకటించారు. సినీ నటుడు నరేష్ మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయల కోసం మూడు ప్రాంతాల ప్రజలతో కేంద్రం ఆడుకుంటోందని, రాష్ట్రాన్ని విభజించడానికి మీరెవరని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. దీక్ష శిబిరం వద్ద తన ఆటాపాటలతో అలరించారు. (చిత్రం) రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేపట్టిన 52 గంటల దీక్షను విరమింపజేస్తున్న రాయలసీమ వలస కూలీ

కేంద్రానికి బైరెడ్డి సూటిప్రశ్న దీక్షకు సంఘీభావం తెలిపిన సినీ నటుడు నరేష్, గద్దర్ ముగిసిన 52 గంటల బైరెడ్డి నిరాహార దీక్ష
english title: 
seema

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

$
0
0

హైదరాబాద్, జూలై 6: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. గత వారం రోజులుగా వివిధ విద్యార్థి సంఘాలు దశల వారిగా ఆందోళన చేస్తున్నాయి. శనివారం బంజారాహిల్స్‌లో విద్యార్థి సంఘాల నేతలతో పాటు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, టాస్మోట్సిస్ చార్జీలను పెంచాలని, ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిధులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని వారు సూచించారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల నివాస ప్రాంతాల్లోకి విద్యార్థులు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మంత్రుల నివాస ప్రాంగణ ముట్టడికి ప్రయత్నించగా విద్యార్థులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే బంద్‌లు, రాస్తారోకోలకు పిలుపు ఇస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. (చిత్రం) బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణాన్ని ముట్టడించేందుకు యత్నిస్తున్న విద్యార్థి సంఘాల నేతలు

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని
english title: 
ministers

ఎన్నికల ఖర్చుపై ముండేకు నోటీసు తగదు

$
0
0

హైదరాబాద్, జూలై 6: తన ఎన్నికల ఖర్చుకు కోట్లాది రూపాయలు ఖర్చయిందని ప్రకటన చేసిన మహారాష్ట్ర బిజెపి సీనియర్ నేత గోపీనాథ్ ముండేకు కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదు ఇవ్వడాన్ని లోక్‌సత్తా ఎమ్మెల్యే, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ తప్పుపట్టారు. ఈ తరహా నోటీసులు ఇవ్వడం కేంద్ర ఎన్నికల సంఘం బ్యూరోక్రటిక్ చర్య, పనికిమాలిన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. శనివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎన్నికల సంస్కరణలపై చర్చ జరుగుతున్న సమయంలో ముండే వాస్తవాన్ని చెప్పడాన్ని స్వాగతించాలన్నారు. ఈ మేరకు తాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి విఎస్ సంపత్‌కు లేఖ రాశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ సీటుకు రూ. ఐదు కోట్లు, ఎంపీ సీటుకు 15 నుంచి 30 సీట్లు ఖర్చవుతోందన్నారు. చట్టసభకు పోటీ చేసే సభ్యులు ప్రతి ఒక్కరు రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు అబద్ధాలు పేర్కొంటారన్నారు. ప్రజల్లో ఉన్న విషయాన్ని ముండే బహిరంగంగా చెప్పారన్నారు. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అధ్యయనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పార్టీలు 60 శాతం ఓటర్లకు డబ్బును ఆఫర్ చేస్తున్నాయని పేర్కొన్నట్లు జెపి తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పెద్ద మొత్తంలో సొమ్మును ఖర్చుపెట్టడం ఎంట్రీ ఫీజుగా తయారైందన్నారు. సంస్కరణలను తెచ్చే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదని, కాని రాజకీయ పార్టీలు ఈ దిశగా చర్చించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కటారి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్ధానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ 300 వరకు పంచాయతీల్లో పోటీ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం రవి, ఉపాధ్యక్షులు డివివిఎస్ వర్మ పాల్గొన్నారు.

లోక్‌సత్తా నేత జెపి విమర్శ
english title: 
munde

విద్యుత్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు

$
0
0

హైదరాబాద్, జూలై 7: ఈ ఏడాది రాష్ట్రంలో పది శాతం మేరకు విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థ (ట్రాన్స్‌కో) చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ చందా తెలిపారు. ఉత్పత్తికి సిద్ధమవుతున్న నూతన విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుంచి పూర్తి స్ధాయిలో విద్యుత్‌ను ఉపయోగించేందుకు సరఫరా, పంపిణీ ప్రాజెక్టులన్నింటినీ నాణ్యతా నియంత్రణ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. థర్ట్ పార్టీ తనిఖీల ద్వారా సంపూర్ణ నాణ్యతా యాజమాన్యం అమలుకు విద్యుత్ సంస్ధలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్ధితిపై సోమవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమీక్షించనున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం ఆయన విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. టెండర్ల ఒప్పందాల్లోని నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ ఏ విధమైన ఉల్లంఘనలు, అవకతవకలకు చోటివ్వకుండా నిర్మాణ పనులన్నింటీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర విద్యుత్ అధ్యయన సంస్ధ, విద్యుత్ అధ్యయన అభివృద్ధి వంటి ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్ధల ద్వారా నిపుణులైన నాణ్యతా నియంత్రణ బృందాల ఏర్పాటు, థర్ట్ పార్టీ తనిఖీలను చేపట్టడం ద్వారా సంపూర్ణ నాణ్యతాయాజమాన్యం అమలు సాధ్యపడుతుందన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తిలేదన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన కాంట్రాక్టర్లను వదిలేది లేదని, జరిమానాలు విధిస్తామన్నారు. నాసిరకం పనుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్ధ, సబ్‌స్టేషన్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆరు అంశాలపై విద్యుత్ పరిస్ధితిని సమీక్షిస్తారు. ఈ అంశాలపై ఏపిట్రాన్స్‌కో, డిస్కాంలు ఒక సమగ్ర నివేదికను అందిస్తాయి. ప్రస్తుతం విద్యుత్ సరఫరా పరిస్ధితులు, కొనసాగుతున్న ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, భవిష్యత్తులో పెరగనున్న డిమాండ్, పెరగనున్న విద్యుత్ స్ధాపిత శక్తి, అదనపు విద్యుత్ కొనుగోళ్లు, సౌర విద్యుత్, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర విద్యుత్ వనరుల అభివృద్ధి, వినియోగదారుల సంక్షేమ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఖరీఫ్ పంటకు ఏడు గంటల విద్యుత్ సరఫరా జరిగే విధంగా ప్రణాళిక ఖరారు చేసినట్లు సిఎండి సురేష్ చందా తెలిపారు.

కెసిఆర్ వౌనం వెనుక

పదునైన వ్యూహం

ఢిల్లీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న టిఆర్‌ఎస్
తొందరపాటు ప్రకటనలు చేయరాదని పార్టీ నేతలకు ఆదేశాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 7: టిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు వౌనం వెనుక పదునైన వ్యూహం ఉందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. గత వారం రోజులుగా ఇక్కడ, ఢిల్లీలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం చేపట్టిన కసరత్తు, తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో హడావుడిని కెసిఆర్ తన సన్నిహితులతో కలిసి నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఏర్పడే పక్షంలో టిఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం తథ్యమనే భరోసా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాజకీయ జాక్ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ బృందం ఢిల్లీకి వెళ్లి హల్‌చల్ సృష్టించింది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్ సింగ్‌తో కోదండరామ్ కలిసి చర్చించడం, మరో కాంగ్రెస్ నేత ఇచ్చిన విందుకు హాజరు కావడం లాంటి అంశాలను టిఆర్‌ఎస్ సీనియర్ నేతలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి తెలంగాణ అంశంపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు, లేదా ఒక నిర్ణయం తీసుకునే ముందు తమను సంప్రదించే వరకు ఎటువంటి ప్రకటన చేయరాదనే నిశ్చయంతో కెసిఆర్ ఉన్నట్లు సమాచారం. ఇటీవల పార్టీలో చేరిన కడియం, కేశవరావుకు పార్టీ రోజూవారీ వ్యవహారాలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ఎంపిక చేయడం, కార్యకర్తలకు శిక్షణ, పార్టీ వ్యవహారాల సమీక్ష కార్యక్రమాలను కెసిఆర్ అప్పగించినట్లు సమాచారం. అందుకే కడియం శ్రీహరి, కెకె ఇరువురే పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి కెసిఆర్‌కు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి చేపట్టిన కసరత్తులోని అంశాలను వివరించలేదని తెలిసింది. ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయాన్ని తాము తీసుకుని, ప్రకటించి ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవాలనే తాపత్రయంలో కాంగ్రెస్ అధిష్ఠానం, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
తెలంగాణ గురించి ఢిల్లీలో హడావుడి జరగడం ఇది తొలిసారి కాదు. అందుకే బంతి కాంగ్రెస్ కోర్టులో ఉంది. ఏ నిర్ణయం వెలువడుతుందో చూస్తాం. తెలంగాణ సాధన మా లక్ష్యం. అది నెరవేరితే ఆ క్రెడిట్ ప్రజలకు దక్కుతుంది అని టిఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు కావడమే తమ లక్ష్యమని, రాయల తెలంగాణ గురించి తెలియదని టిఆర్‌ఎస్ నేతలంటున్నారు. ఈ అంశంపై ఢిల్లీనుంచి ఎటువంటి సంకేతాలు తమ అధినేతకు అందలేదంటున్నారు. ఎత్తుకు పైఎత్తు వేయడంలో, సమయానుకూలంగా వ్యవహరించడంలో కెసిఆర్ అపర చాణక్యుడనే పేరుంది. అందుకే ఢిల్లీలో, హైదరాబాద్‌లో రోడ్ మ్యాప్‌పై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు హడావుడి పడుతున్నా కెసిఆర్ ఎటువంటి ప్రకటన చేయకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా సంయమనంతో ఉండాలని కెసిఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తామనుకున్నట్లు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రాని పక్షంలో, ఇంకా జాప్యం జరిగేటట్లుంటే మాత్రం కెసిఆర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడే అవకాశాలు కనపడుతున్నాయి.

దిగ్విజయ్‌తో నేడు ఒయు, టిఎస్ జెఎసి నేతల భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 7: కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సోమవారం ఉస్మానియా విద్యార్థి ఐకాస (ఒయు జెఎసి), తెలంగాణ విద్యార్థి ఐకాస (టిఎస్‌జెఎసి) నేతలు భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం ఒయు జెఎసి, టిఎస్‌జెఎసి నేతలు పిడమర్తి రవి, మర్రి అనిల్‌కుమార్, దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్, వీరప్రసాద్ యాదవ్, శుభప్రదేవ్ పటేల్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం 11 గంటలకు దిగ్విజయ్‌సింగ్ తమతో భేటీకి సమయం ఇచ్చినట్టు ఒయు జెఎసి అధికార ప్రతినిధి బాల్‌రాజ్ యాదవ్ తెలిపారు. ఢిల్లీకి బయలుదేరే ముందు ఒయు జెఎసి, టిఎస్‌జెఎస్ ప్రతినిధులు హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 12న కాంగ్రెసు కోర్ కమిటీతో భేటీ కానున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ వినతి పత్రం సమర్పించినట్టు బాల్‌రాజ్ తెలిపారు.
తెలంగాణ అంశంపై సమర్పించే రోడ్‌మ్యాప్‌లో చేర్చాల్సిన అంశాలను ఉప ముఖ్యమంత్రికి వివరించినట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణలోని పది జిల్లాలతో కలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తప్ప, మరే ప్రతిపాదనకు అంగీకరించవద్దనీ ఉప ముఖ్యమంత్రికి సూచించినట్టు ఆయన తెలిపారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించాలని కోరినట్టు బాల్‌రాజ్ తెలిపారు. నీటి వనరులు, ఉపాధి, ఉద్యోగ, విద్యావకాశాలు, తెలంగాణ భూముల ఆక్రమణ తదితర రంగాలలో జరిగిన అన్యాయాన్ని రోడ్ మ్యాప్‌పై సమర్పించే నివేదికలో పేర్కొనాలనీ ఉప ముఖ్యమంత్రిని కోరినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు పార్లమెంట్ ఉభయ సభలో ప్రకటించిన అనంతరం ఈ ప్రాంతంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను సోమవారం తమతో జరిగే భేటీలో దిగ్విజయ్‌సింగ్‌కు వివరిస్తామని బాల్‌రాజ్ యాదవ్ తెలిపారు.

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు/నెల్లూరు, జూలై 7: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి విస్తారంగా వర్షాలు కురిశాయి. గత కొంతకాలంగా జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, మరోపక్క విద్యుత్ కోతలతో ప్రజలు, రైతులు తల్లడిల్లి పోయారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో ప్రజలు కొంతమేర ఉపశమనం పొందారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, చినగంజాం తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ఉప్పు సాగు ఆగిపోయింది. ప్రకాశం జిల్లాలోని కందుకూరు మండలంలో అత్యధికంగా 94.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నెల్లూరు జిల్లాలోకూడా పలు మండలాల్లో వర్షం కురిసినట్టు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది.

భవిష్యత్తు విద్యుత్ అవసరాలే లక్ష్యం నేడు ముఖ్యమంత్రికి నివేదిక
english title: 
v

ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండగలరా?

$
0
0

హైదరాబాద్, జూలై 7: తెలంగాణ ఉద్యమంపై తన చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండగలరా అని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ నాయకురాలు రమ్య సవాల్ విసిరారు. తెలంగాణ మాదిగ దండోర ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ‘వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు’ కార్యక్రమాన్ని రమ్య ప్రారంభించారు. అంతకుముందు ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి ఇందిరా పార్కుకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో రమ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కెసిఆర్, ఇనేళ్లలో ఏ జిల్లాకైనా దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ సంపద, వనరులను సీమాంధ్రులు తరలించుకుపోతున్నారని కెసిఆర్ ఆరోపిస్తుంటారనీ, మరి ఆందులో ఆయన వాటా ఎంత అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కెసిఆర్ కుటుంబం చేస్తోన్న దోపిడీని ప్రశ్నిస్తే తనపై దాడులు చేయించారని రమ్య ఆరోపించారు. మహిళలు అంటే కెసిఆర్‌కు చిన్న చూపనీ, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని బజారు కీడుస్తానని గతంలో అవమానపర్చారని ఆమె దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంపై కెసిఆర్‌కు ఏమాత్రం గౌరవం లేదనీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను చప్రాసీతో పోల్చారని రమ్య గుర్తు చేసారు. టిఆర్‌ఎస్ నేతల అవినీతి బండారంపై వచ్చిన ఆరోపణలకు ఆ పార్టీ నేతలు ఎందుకు సమాధానం చెప్పడం లేదనీ ఆమె ప్రశ్నించారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం వల్లనే వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఆమె తెలిపారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న కెసిఆర్, చిన్న చిన్నవాటికే అసహనానికి గురైతే, తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నిర్వహించగలరనీ ఆమె ప్రశ్నించారు. విమర్శలకు సమాధానం చెప్పకుండా దాడులు చేయించడం ఏం సంస్కృతి అని తెలంగాణ మాదిగ దండోర నేత చింతాస్వామి ప్రశ్నించారు. కెసిఆర్ వల్ల దళితులకే కాకుండా దళితులకు అండగా నిలిచినవారిపై దాడులు చేయిస్తున్నారనీ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి కెసిఆర్, ఆయన కుటుంబాన్ని తరిమికొట్టే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చింతాస్వామి హెచ్చరించారు.

ఆదివారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ‘వెయ్యి డప్పులు -
లక్ష చెప్పులు’ కార్యక్రమంలో పాల్గొన్న కెసిఆర్ అన్న కూతురు రమ్య

కెసిఆర్ కుటుంబానికి అన్న కూతురు రమ్య సవాల్
english title: 
y

బుద్ధగయ పేలుళ్లు కేంద్ర వైఫల్యమే

$
0
0

హైదరాబాద్, జూలై 7: యుపిఏ ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్ల దేశంలో ఉగ్రవాదులు తెగబడుతున్నారని, భద్రత విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ఉప్పల్ నియోజకవర్గంలో బిజెపి ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్రం వైఫల్యంవల్లనే బుద్ధగయలో ఉగ్రవాదులు దాడులు చేశారన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను, మత మార్పిడులను రద్దు చేస్తూ చట్టం తెస్తుందన్నారు. దేశమంతా బిజెపి వైపు చూస్తోందన్నారు. బీహార్ పేలుళ్లకు కాంగ్రెస్ అసమర్ధ విధానాలే కారణమన్నారు. యుపిఏ ప్రభుత్వం స్కాంలలో కూరుకుపోయిందన్నారు. ఉగ్రవాదులను అణచివేయడంలో మెతకవైఖరిని అవలంభిస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో యుపిఏ కూటమి ఘోరపరాజయం పాలవుతుందని ఆయన అన్నారు. సిబిఐ అండదండలతో కాంగ్రెస్ సర్కార్ కేంద్రంలో నడుస్తోందన్నారు. రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా విడిపోదామన్నారు. దేశంలో ఆహార భద్రత చట్టాలను మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ ప్రభుత్వాలు ముందు తెచ్చాయన్నారు. అక్కడ అసెంబ్లీలలో ఈ చట్టం గురించి కూలంకషంగా చర్చ జరిగిందన్నారు. కాని యుపిఐ కూటమి తెచ్చిన ఆహార భద్రత చట్టం కాంగ్రెస్ భద్రత చట్టంగా మారిందన్నారు. బంగారు తల్లి పథకాన్ని కర్నాటక ప్రభుత్వం గతంలోనే ప్రవేశపెట్టిందన్నారు. మజ్లిస్ పార్టీ మతతత్వ రాజకీయాలను పెంచిపోషిస్తోందని, ఈ పార్టీకి కాంగ్రెస్ అండదండలున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో బిజెపికి గణనీయంగా సీట్లు వస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవినీతిలో కూరుకునిపోయాయన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పన్నుల కుమార్‌గా మారారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేదని, అధికారుల ఇష్టారాజ్యంగా పాలన తయారైందన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ కాళ్ల ముందు పెట్టారన్నారు. ఆగస్టు రెండోవారంలో నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తారని, ఆయన నాయకత్వం కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత దత్తాత్రేయ, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన బిజెపి ప్రజా చైతన్య సదస్సులో ప్రసంగిస్తున్న ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు. సదస్సుకు హాజరైన ప్రజలు

అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు, మత మార్పిడులను రద్దు చేస్తాం ప్రజా చైతన్య సదస్సులో వెంకయ్యనాయుడు
english title: 
b

నల్లమల పులులకు వైరస్ భయం

$
0
0

కర్నూలు, జూలై 7: నల్లమల అడవుల్లోని పులులకు కొత్త వైరస్ భయం పట్టుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇండోనేషియాలోని రాయల్ బెంగాల్ టైగర్లను పట్టి పీడిస్తున్న ఈ వైరస్ నల్లమల పులులకు సోకకుండా తక్షణం వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ) నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం అధికారులను ఆదేశించింది. దీనితో ప్రస్తుతం నల్లమల అరణ్యం, సమీప ప్రాంతాల్లోని నీటి నమూనాలను సేకరించి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పులుల అభయారణ్యం అధికారులు చెబుతున్నారు. ‘కెనైన్ డిస్టెంపర్ వైరస్’ (సిడిఎ) అనే వ్యాధి సోకి బంగ్లాదేశ్, ఇండోనేషియాలోని పులులు తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని అటవీ అధికారులకు సమాచారం అందింది. నల్లమల అరణ్యంలోనే కాకుండా ఆదిలాబాద్ జిల్లా కవ్వల్ పులుల అభయారణ్యంలో ఉన్న పులులు కూడా రాయల్ బెంగాల్ జాతికి చెందినవే కావడంతో వీటికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమయింది. వ్యాధి సోకిన పులులు పిచ్చి పట్టినట్లుగా వ్యవహరించి మనషులను సైతం చంపేస్తాయని, వ్యాధి ముదిరి మరణిస్తాయి. వ్యాధి సోకిన తరువాత నివారించడం సాధ్యం కాదని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వైరస్ ప్రధానంగా కుక్కలు, ఆవులు, గేదెలకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీటిని వేటాడి మాంసాన్ని తినడం ద్వారా పులులకు వైరస్ వ్యాపిస్తుందని ఆ ఆదేశాలు గుర్తించాయి. నీటి ద్వారా కూడా పులులకు వైరస్ సోకుతుందని వర్షాకాలంలో శరవేగంగా విస్తరిస్తుందని పరీక్షల్లో వెల్లడయింది. దాంతో నల్లమల, కవ్వల్ పులుల అభయారణ్యం చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని కుక్కలు, ఆవులు, గేదెలకు తక్షణం వైరస్ నివారణ కోసం టీకాలు వేయాలని ఆదేశించారు. అడవుల్లోనే కాకుండా అడవి చుట్టు పక్కల ఉండే చెరువులు, నీటి గుంటల్లో నీటిని సేకరించి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని జాతీయ స్థాయి అధికారులు రాష్ట్ర అటవీ అధికారులకు సూచించారు. అయితే నీటి పరీక్షల్లో వైరస్ లేదని పరీక్షల్లో నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా అడవి చుట్టుపక్కల ఉండే గ్రామాల్లోని కుక్కలు, గేదెలు, ఆవులకు పశు సంవర్ధక శాఖ సహకారంతో టీకాలు వేయిస్తున్నారు. అడవుల్లో సాధారణంగా చదరపు కిలోమీటరుకు ఎనిమిది అంతకు మించి జంతు సాంద్రత ఉంటే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. నల్లమల అరణ్యంలో జంతు సాంద్రత 2.50 మాత్రమే ఉన్నందు వైరస్ వేగం తగ్గుతుందని జాతీయ అధికారులు అభిప్రాయపడినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించడంతో అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

వైకాపా ఎమ్మెల్యేల రాజీనామాలు కుట్రే
కెటిఆర్, స్వామిగౌడ్ ఆరోపణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 7: తెలంగాణ అంశంపై నిర్ణయం వెల్లడయ్యే తరుణంలో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. అన్నదమ్ములు, భార్యభర్తలు కలిసి ఉండలేని ఈ రోజుల్లో కలిసి ఉందామని సీమాంధ్ర నేతలు చెప్పడం హాస్యాస్పదమని టిఆర్‌ఎస్ విమర్శించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఖాజాగూడలో ఆదివారం సాయంత్రం జరిగిన ధూంధాం కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె తారక రామారావు, ఆ పార్టీ ఎమ్మెల్సీ కె స్వామిగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, ప్రజా ఉద్యమానికి ఎంతటి వారైనా లొంగక తప్పదనీ, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏర్పాటు కాకపోతే, వచ్చే సాధారణ ఎన్నికల తర్వాతైనా ఏర్పడక తప్పదన్నారు. తెలంగాణవాదం జంట నగరాలలో కూడా ఎంత బలంగా ఉందో వచ్చే ఎన్నికల్లో నిరూపించి తెలంగాణ వ్యతిరేకుల, సీమాంధ్ర నేతల కళ్లు తెరిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో సభ పెట్టించిందీ, సీమాంధ్రలో సభ పెట్టుకోమని కాంగ్రెసు అధిష్ఠానమే చెప్పడంతోనే, ఆ పార్టీకి తెలంగాణపై ఎంత చిత్తశుద్ధి ఉందో బహిర్గతం అయిందని విమర్శించారు. తెలంగాణపై రోడ్ మ్యాప్ తీసుకురావాలని దిగ్విజయ్ సింగ్ చెప్పడం పట్ల స్వామిగౌడ్ మండిపడ్డారు. రోడ్ మ్యాప్ గురించి ఇంతకాలంగా కాంగ్రెసు నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏదో ఒక సాకుతో తెలంగాణ అంశాన్ని సాగదీసేందుకే రోడ్ మ్యాప్‌ను తెరపైకి తెస్తున్నారని ఆయన విమర్శించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
డోన్, జూలై 7: కర్నూలు జిల్లా డోన్ మండల పరిధిలోని ఓబుళాపురం మిట్ట సమీపంలోని రిలయన్స్ దాబా వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఇనుపగుళ్ల లోడుతో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ రిలయన్స్ దాబా వద్ద టైర్ పంక్చరై నిలిచిపోయింది. అదే సమయంలోనే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుండి శ్రీశైలం వెళ్తున్న కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపులేని వేగంతో ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీనితో బస్సు ఎడమ భాగమంతా నుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్న అనంతపురానికి చెందిన వ్యవసాయాధికారి బాల అశోక్‌కుమార్ (33) తపాలశాఖ ఉద్యోగి శివ శంకర్ (28), కర్నూలు శ్రీనివాసనగర్‌కు చెందిన బాలకృష్ణ (30) అనంతపురం జిల్లా నార్పలకు చెందిన దేవి బాయి (33) అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలు బస్సు సీట్ల మధ్య ఇరుక్కుపోయాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులందరినీ మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.

అప్రమత్తం చేసిన జాతీయ అధికారులు
english title: 
n

జాలర్లకు చిక్కిన భారీ చేప

$
0
0

వైరా, జూలై 7: ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో 17 కేజీల వాలిగి చేప జాలరులకు ఆదివారం చిక్కింది. రిజర్వాయర్‌లో గత నెల 25 నుండి జాలరులు చేపల వేట చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రిజర్వాయర్‌లో చేపలు, రొయ్యలు లభ్యమవుతాయని ప్రతీతి. అయితే మత్స్యకారులు ఆదివారం సాగించిన వేటలో భారీ చేప దొరకడంతో వారి పంట పండింది. షేక్ బి.బి.సాహెబ్ రోజూలాగే శనివారం రాత్రి కూడా వలలు వేశాడు. ఆదివారం ఉదయానికి వల పూర్తిగా కనిపించకుండా చాలాదూరం పోయింది. చాలాసేపు గాలించిన తరువాత కనిపించకుండా పోయిన వలను కనుగొని అతికష్టం మీద దాన్ని ఒడ్డుకు చేర్చారు. దాదాపు ప్రతి ఆదివారం చేపలు కొనుగోలు చేయడానికి జనాలు రిజర్వాయరు వద్దకు అధికంగా వస్తుంటారు. రిజర్వాయరులో భారీ చేప లభ్యమైందన్న వార్త ఆ నోట ఈ నోట విన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ‘ఔరా’ అనుకోవడం కనిపించింది.

వైరా రిజర్వాయర్‌లో దొరికిన భారీ వాలిగి చేప

ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్‌లో 17 కేజీల
english title: 
j
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>