Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

వేద పారాయణం అద్భుతం

$
0
0

తిరుపతి, జూలై 7: తిరుమల ధర్మగిరిలో టిటిడి నిర్వహిస్తున్న వేద పాఠశాలను ఇఓ ముక్కామల గిరిధర్ గోపాల్ ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతోనూ, పాఠశాల అధ్యాపకులతో ఆయన ముచ్చటించారు. రుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యుజుర్వేదం, తైత్తరీయ శాఖల్లోనూ సామవేదం, అధర్వరణ వేదం, శైవాగమం, వైష్ణవ ఆగమం, పాంచరాత్ర ఆగమం తదితర శాఖల్లోని మంత్ర పుష్పాలను వేద విద్యార్థులు పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో స్పష్టంగా అద్భుతంగా వేదపారాయణం చేస్తున్నారని ప్రశంసించారు. సనాతన ధర్మపరిరక్షణకు వేద విజ్ఞానం ఎంతో అవసరమని ఆయన అన్నారు. వేద వాప్తికి మరింత కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.
పెరిగిన రద్దీ
ఇదిలావుండగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సాధారణ భక్తులు స్వామిని దర్శించుకోడానికి 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 7 గంటలు పడుతోంది. ఈ నేపధ్యంలో టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు క్యూలైన్‌లో తనిఖీలు చేసి భక్తులకు అవసరమైన పాలు, మజ్జిగ, ఆహారం అందేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా విఐపిలకు ఇచ్చే పాస్‌ల సంఖ్యను కుదించి సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇచ్చారు.

క్యూలైన్లలో భక్తులకు ఆహారం
అందుతోందో లేదో తనిఖీ చేస్తున్న జెఇఓ

టిటిడి వేద పాఠశాలను సందర్శించిన కొత్త ఇఓ
english title: 
v

చార్‌ధామ్ బాధితులను ఆదుకోవాలి

$
0
0

సింహాచలం, జూలై 7: ఉత్తరాఖండ్ చార్‌ధామ్ వరదల్లో మృతి చెందిన యాత్రికుల ఆత్మశాంతి కోసం శాంతి గీతాయజ్ఞ పరిషత్ ఆధ్వర్యంలో శాంతి గీతాయజ్ఞం ఆదివారం సింహాచలం దేవస్థానం పుష్కరిణీ సత్రం ప్రాంగణంలో జరిగింది. యజ్ఞ పరిషత్ ప్రతినిధులు, వేదపండితులు గీతా పారాయణల హోమాలు నిర్వహించి పూర్ణాహుతి ద్వారా యజ్ఞ్ఫలాన్ని మృతుల ఆత్మశాంతిని కాంక్షిస్తూ ధార పోశారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామితో పాటు సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్ ఆలయ ప్రధాన అర్చక పురోహితుడు మోర్త సీతారామాచార్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. పవిత్రమైన పుణ్యభూమిలో ఇంతటి విపత్తు సంభవించడం దురదృష్టకరమని స్వామి అన్నారు. ఈ సంఘటనను జాతీయ విపత్తుగా పరగణించి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాలన్నీ బాధితులను ఆదుకోవాలని స్వామీజీ విజ్ఞప్తి చేశారు. దుర్ఘటనలో వేలాది మంది మృత్యువాత పడ్డారని, మరెంతోమంది విగతజీవులుగా మారారని వీరందర్ని ఆదుకునేందుకు భారీగా నిధులు సేకరించి ప్రభుత్వం సాయం అందించాలని స్వామీ సూచించారు. అక్కడ అనేక గిరిజన గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయని వాటిని పునర్నిమించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్వామీజీ కోరారు. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ప్రకృతి విపత్తులో చార్‌ధామ్‌లో ఉంటున్న ఎందరో మహనీయులు కూడా గల్లంతయ్యారని భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలని ఆభగవంతుడిని అందరూ ప్రార్థించాలని స్వామీజీ పిలుపు నిచ్చారు. మృతుల ఆత్మశాంతి కోసం గీతాయజ్ఞ పరిషత్ నిర్వహించిన శాంతి యజ్ఞాన్ని స్వామీజీ అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం పరిషత్ ప్రతినిధులు గోశాల నుండి సింహాచలేశుని తొలిపావంచా వరకు వౌన ప్రదర్శన నిర్వహించారు. పరిషత్ ప్రతినిధులు ప్రసాదరావు పీతల అప్పలరాజు కార్యక్రమానికి సారధ్యం వహించారు.
.......................
పూర్ణాహుతి నిర్వహిస్తున్న వైదికులు,
హాజరైన స్వామీజీ, ఈవో, ప్రధాన అర్చకుడు

స్వరూపానందేంద్ర విజ్ఞప్తి
english title: 
ca

సమైక్య రాష్ట్రం కోసం..

$
0
0

సింహాచలం, జూలై 7: రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటూ కృతయుగ దైవం శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామివారికి పూజలు చేయించామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఓడరేవులు వౌలిక వసతుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఇద్దరు మంత్రులు, గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి సింహాచలేశుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో మంత్రి ఏరాసు మాట్లాడారు. రాష్ట్రాన్ని విడదీయడం అంత సులువు కాదని ఒక కుటుంబ విడిపోతేనే అనేక సమస్యలు, అంశాలు పరిగణంలోకి తీసుకొన్నాకే నిర్ణయం ప్రకటిస్తారని అటువంటి రాష్ట్రాన్ని విడదీయాలంటే కేకు కత్తిరించినంత సులువు కాదని ఏరాసు అన్నారు. ఒక ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఊపందుకుంటుందని, సమైక్యవాదులు కూడా పోరాటాలకు సన్నద్ధమవుతున్నారని మంత్రి చెప్పారు. వర్షాలు సక్రమంగా కురవాలని, రైతాంగం ప్రజల సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ముందుగా దేవాలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రులు సింహాచలేశున్ని ప్రార్థించారు.

కప్ప స్తంభం వద్ద స్వామిని ప్రార్థిస్తున్న మంత్రులు

సింహాచలేశునికి మంత్రులు ఏరాసు, గంటా పూజలు
english title: 
s

ఆ ముగ్గురిదీ అవినీతి దారే

$
0
0

వరంగల్, జూలై 7: ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబీకులెన్నడైనా సచివాలయానికి వచ్చారా? నా తొమ్మిదేళ్ల పాలనలోనూ మా వాళ్లు ఎక్కడైనా కనిపించారా? రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజాక్షేమమే ధ్యేయం కావాలి.. ఆ ముగ్గురి మాదిరిగా అవినీతే లక్ష్యం కాకూడదు’ అని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెరాస అధినేత కెసిఆర్, వైకాపా నేత జగన్మోహన్‌రెడ్డి దృష్టి మొత్తం అక్రమ సంపాదనలపైనే ఉందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తపరిచడంలో భాగంగా వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన ఉత్తర తెలంగాణ టిడిపి ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలనుండి తరలివచ్చిన పార్టీశ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ‘స్థానిక’ ఎన్నికల కార్యాచరణ వేదికనుండే సాధారణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రెండు దఫాలుగా దాదాపుగంటన్నరకు పైగా ఆవేశంతో ప్రసంగించిన బాబు, మళ్లీ తాను అధికారంలోకి వస్తేనే భ్రష్టుపట్టిన రాష్ట్రం గాడిన పడుతుందని చెప్పుకొచ్చారు. అటు కాంగ్రెస్, తెరాస, ఇటు వైకాప నేతలకు ప్రజాక్షేమంకంటే స్వార్ధం, అక్రమార్జనలే పరమావధిగా ఉన్నాయని ధ్వజమెత్తారు.
ఆ పథకాలన్నీ మావే..
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడపిల్లల సంక్షేమం కోసం ప్రారంభించిన మహాలక్ష్మి పథకాన్ని కాపీకొట్టిన సిఎం బంగారుతల్లి అని కొత్త ప్రచారం చేస్తున్నారని అన్నారు. ‘ఈ-సేవను ప్రారంభించింది నేను, ఆనాడు అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ రాష్ట్రానికి వస్తే అరగంటలో ఆయనకు డ్రైవింగ్ లైసెన్సు మంజూరు చేయించాం. దాని పేరునే ఇప్పుడు ‘మీ-సేవ’గా మార్చారు. పేర్లు మార్చడంలో కిరణ్ దిట్ట, ఆయనకు రాజకీయాల్లో ఓనమాలే తెలియవు. పరిపాలన అసలే తెలియదు, అందుకే మా కార్యక్రమాల్నే పేర్లు మార్చి తమవిగా చెప్పుకుంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. అత్యున్నతమైన ఎపిపిఎస్సీని సైతం భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. ‘నాడు వైఎస్ తన అనుచరున్ని ఎపిపిఎస్సీ సభ్యునిగా నియమిస్తే ఇటీవలే ఆయన అరెస్టయి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. అలాగే సిఎం కిరణ్ ఓ కాంగ్రెస్ కార్యకర్తకు ఎపిపిఎస్సీ పదవి ఇస్తే ఒక మహిళ ఇంట్లో పేకాడుతూ చిక్కాడు. డిప్యుటి తహశీల్థార్ స్థాయి సభ్యుడొకరు డిప్యుటి కలెక్టర్ పోస్టు అభ్యర్ధులను ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?’ అని ప్రశ్నించారు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఏ పోస్టయినా డబ్బు పెట్టి తెచ్చుకున్నామని ఇప్పుడెవరైనా నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని సవాల్ చేశారు.
ఆస్తులు పెంచుకోవడమే కెసిఆర్ ధ్యేయం..
తెరాస అధినేత కెసిఆర్ ఉద్యమం ముసుగులో తన కుటుంబ ఆస్తులు పెంచుకుంటున్నారని తూర్పారబట్టారు. ‘వారి బండారమమంతా బయటపడుతూనే ఉంది. ఉప ఎన్నికల్లో ప్రజలకు మాయ మాటలు చెప్పి గెలవడం తప్ప సాధారణ ఎన్నికల్లో గెలిచే సత్తా కెసిఆర్‌కు లేదు’ అని ఎద్దేవాచేశారు. వైకాపా అధినేత జగన్ లక్షకోట్ల అక్రమార్జనతో పత్రిక, ఛానల్ పెట్టడం చూస్తే సిగ్గేస్తోందన్నారు. ఈ ముగ్గురికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని, 2014 సాధారణ ఎన్నికల్లో తమదే గెలుపని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘కేంద్రంలో కాంగ్రెస్ గెలవదు, బిజెపికి ఓట్లు పెరగవు. మూడో ప్రత్యామ్నాయం వస్తోంది. రాష్ట్రం మాదిరిగానే కేంద్రంలోనూ నేనే చక్రం తిప్పుతా’ అని చంద్రబాబు చెప్పారు. ఇందుకు ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతున్న చంద్రబాబు. హాజరైన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల టిడిపి శ్రేణులు

కిరణ్, కెసిఆర్, జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
english title: 
a

ఏకగ్రీవం పేరిట సర్పంచ్ పదవుల వేలం ....

$
0
0

సిటీలైట్ చౌరస్తాలో ఆర్తనాదాలు, హాహాకారాలు

$
0
0

బేగంపేట, జూలై 8: పద్నాలుగు మంది ప్రాణాలను మింగేసిన సికింద్రాబాద్ రాష్టప్రతి రోడ్డులోని సిటీలైట్ హోటల్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు వెల్లడించారు. సోమవారం ఉదయం సిటీలైట్ భవనం కుప్పకూలిన తర్వాత వివిధ విభాగాలు చేపట్టిన సహాయక చర్యలు అనుక్షణం ఉత్కంఠగా సాగాయి. ఏ క్షణం ఎవరి మృతదేహం బయటకు వస్తుందోనని సంఘటన స్థలంలో మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు రోదిస్తూ ఆందోళనకు గురయ్యారు. కానీ పోలీసులు మాత్రం వారిని ముందుకు రానివ్వకుండా అడ్డుకోవటమేగాక, వారిని బలవంతంగా అక్కడినుంచి పంపించి వేశారు. ఎల్లయ్య అనే స్థానికుడు టీ తాగేందుకు వచ్చాడని, ఆయన ఏమైపోయాడోనంటూ ఆయన భార్య, కూతురు సంఘటన స్థలంలో రోదిస్తున్నా, పోలీసులు విచక్షణారహితంగా వారిని అక్కడినుంచి తరిమేశారు. మృతులు, బాధితుల కుటుంబాలకు చేయూతనివ్వాల్సిన పోలీసులు సంఘటన స్థలానికి వచ్చిన రాజకీయ నేతలకు దాసోహం అన్నారు. ఒక్కో నేత వెంట పదులు సంఖ్యలో వారి అనుచరులు, కార్యకర్తలు వస్తూ, సహాయక చర్యలకు ఆటంకం కల్గిస్తున్నా, ప్రశ్నించని పోలీసులు అమాయకులపై తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. సంఘటన ఉదయం జరిగినందున మృతుల సంఖ్య తక్కువగానే ఉండవచ్చునని అధికారులు భావించినా, శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడ్డాయి. సంఘటన జరిగిన అరగంటలో ముగ్గురి మృతదేహాలను వెలికితీసిన అధికారులు సోమవారం సాయంత్రానికల్లా 13 మంది మృతి చెందినట్లు, మరో 17 మంది తీవ్ర గాయాలపాలైనట్లు నిర్థారించారు.
ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే తెరిచే సిటీలైట్ హోటల్‌కు వందల మంది టీ, టిఫిన్ కోసం వస్తుంటారు. అయితే సోమవారం అమావాస్య కావటం, మార్కెట్ బంద్ ఉండటంతో ఉదయం ఆరున్నర గంటల సమయంలో సుమారు నలభై నుంచి యాభై మంది ఉన్నపుడు ఒక్కసారిగా హోటల్ జి ప్లస్ టు భవనం కుప్పకూలింది.
ఒక రకంగా మామూలు రోజుకన్నా సోమవారం అమావాస్యరోజు తక్కువమంది హోటల్‌లో ఉన్నపుడు కూలటంతో ప్రాణనష్టం బాగా తగ్గిందని స్థానికులంటున్నారు. కానీ పలువురు ప్రత్యక్ష సాక్షులు మాత్రం భవన శిథిలాల కింద ఇంకా కనీసం 30 నుంచి నలభై మందికి వరకు ఉండి ఉండవచ్చునని తెలిపారు. త్వరలో రంజాన్ పండుగ ప్రారంభం కానున్నందున హలీం తయారు చేయడానికి హోటల్ యజమాని ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన 25 మందిలో యజమాని కొడుకు సయ్యద్ ముస్త్ఫాతో పాటు మొత్తం పదకొండు మంది, మరో ఇద్దరు కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మృతులు, క్షతగాత్రుల వివరాలు
సిటీలైట్ భవనం కూలిన ఘటనలో నిజామాబాద్ కాన్‌పూర్ మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన యు.రమేష్(28), ఒరిస్సాకు చెందిన సంతోష్(28), రాజు(28), మురళీ(27), నన్ను అలియాస్ మనోజ్(28), సికింద్రాబాద్ పాన్‌బజార్‌కు చెందిన ఎం. రమేష్(35), సయ్యద్ ముస్త్ఫా(33), సికింద్రాబాద్ భోలక్‌పూర్‌కు చెందిన బల్దియా ఉద్యోగి ఎం. బాలకృష్ణ(50)తో పాటు మరో మూడు మృతదేహాలను పోలీసులు గుర్తించాల్సి ఉంది. గాయపడినవారిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రదీప్‌దాస్(20), బేకరిలో క్యాషియర్‌గా పనిచేస్తున్న మెదక్‌కు చెందిన నరేంద్ర(23), ముషీరాబాద్‌కు చెందిన బి. సాయిలు(60), రామంతాపూర్‌కు చెందిన బి.నర్సింహ(45), హోటల్‌లోనే నివాసముండే జి. ప్రభాకర్(62), ఎన్. చిరంజీవి(23), ఇందిరానగర్‌కాలనీకి చెందిన ఎన్. సురేష్, సప్లయిర్‌గా పనిచేస్తున్న ముఖేష్(23), సప్లయిర్ రమేష్(60), లేబర్‌గా పనిచేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బి.రమేష్‌కుమార్, రాహుల్‌సింగ్(26), నల్గొండ మిర్యాలగూడకు చెందిన రామాంజనేయులు రెడ్డి(38), రాజేంద్రనగర్‌కు చెందిన వర్కర్ సుధాకర్(30), బోయిన్‌పల్లికి చెందిన ఎం.డి. బాషా(24), మెదక్ సిద్దిపేటకు చెందిన వై.ఎలయ్య(40), టి.మల్లేష్(23), మెదక్ అందోల్ సమీపంలోని డాకూర్ గ్రామానికి చెందిన సిహెచ్. నాగేష్(32), వైసీపురాకు చెందిన మహ్మద్ హమీద్(23), సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటకు చెందిన లారీ డ్రైవర్ పులి ఎల్లమ్(40)లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

పద్నాలుగు మంది ప్రాణాలను మింగేసిన సికింద్రాబాద్ రాష్టప్రతి రోడ్డులోని
english title: 
city light hotel

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

$
0
0

శంకర్‌పల్లి, జూలై 8: ఎన్నికల ప్రచారంలో వాహనాలకు అనుమతి లేకున్నా, లెక్కకు మించి డబ్బులు ఖర్చుచేస్తే కేసులు, శిక్షలు తప్పవని స్థానిక తహశీల్దార్, ఎంపిడిఓ భిక్షం, చేవెళ్ల సిఐ గంగారాం హెచ్చరించారు. సోమవారం పరిషత్‌లో నేతల సమావేశంలో వారు మాట్లాడుతూ, గ్రామాల్లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రజలు సహకరించాలని, పదివేలకంటే ఎక్కువ జనాభా వున్న గ్రామంలో సర్పంచ్ అభ్యర్ధి రూ.80 వేలు, వార్డు సభ్యులు ఆరువేలు ఖర్చు చేసి లెక్కలు చూపాలన్నారు. జనరల్ సర్పంచ్ రూ.2వేలు, ఎస్సీ ఎస్సీ, బిసి సర్పంచులు రూ.1000 డిపాజిట్ చేయాలన్నారు. వార్డు సభ్యులు జనరల్- రూ.500, ఎస్‌సి, ఎస్టీ, బిసిలు రూ.250 డిపాజిట్ చేయాలన్నారు. ఈనెల 9 నుంచి 13వరకు నామినేషన్లు ఉ.10.30 నుంచి సాయంత్రం వరకు, 14న పరిశీలన, 15న అభ్యంతరాలు, 16న ఆర్‌డిఓకు అప్పీలు చేసుకోవాలన్నారు. ఈనెల 27న ఎన్నికలు జరుగుతాయని, అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక వుంటుందని, తదుపరి నిర్ణయాలు ఎన్నికల అధికారిదేనని అన్నారు. సమావేశంలో నాయకులు, ఓటర్లు, అభ్యర్ధులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో వాహనాలకు అనుమతి లేకున్నా, లెక్కకు మించి
english title: 
code

ప్రజల సంక్షేమమే వైఎస్ ధ్యాస

$
0
0

వికారాబాద్, జూలై 8: అనుక్షణం ప్రజల సంక్షేమమే శ్వాసగా, ధ్యాసగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జీవించారని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రెడ్డి కొనియాడారు. సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జనహృదయ నేత రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. నిరంతరం ప్రజల కోసం శ్రమించిన మహామనిషి వైఎస్‌ఆర్ అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ప్రజాప్రయోజనకర పథకాలను స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.అనంత్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జి.చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాజశేఖరరెడ్డి, మర్పల్లి మాజీ ఎంపిపి నర్సింలు, బిసి విభాగం నాయకుడు నర్సింలు యాదవ్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు రహీం, కార్యదర్శి ఖాలీద్, కొత్తగడి పిఎసిఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్, నాయకుడు దోమ శ్రీ్ధర్ పాల్గొన్నారు.

-- పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి --
english title: 
ys

రంగారెడ్డిలో 649 పంచాయతీలకే ఎన్నికలు!

$
0
0

హైదరాబాద్, జూలై 8: రంగారెడ్డి జిల్లాలోని 705 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 15 గ్రామ పంచాయతీలు నగర పంచాయతీలుగా ప్రకటించగా, మరో 36 గ్రామ పంచాయతీలు జిహెచ్‌ఎంసిలో విలీనం చేసేందుకు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కోర్టు కేసులు, కాలం తీరని పంచాయతీలు మినహా మిగిలిన 649 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించేందుకు మంగళవారం నోటిఫికేషన్ జారీచేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 672 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీల జాబితాను ప్రకటించిన ప్రభుత్వం పురపాలక శాఖ చేసిన అభ్యర్థన మేరకు మరో 22 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్
కీసర సర్పంచ్ అభ్యర్థి జంగయ్య
కీసర, జూలై 8: వైఎస్‌ఆర్‌సిపి కీసర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కరెంటు జంగయ్యను మండల కన్వీనర్ టి. ఉమాపతి శర్మ ప్రకటించారు. కీసరగుట్టలో వైఎస్‌ఆర్‌సిపి సమావేశంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసారు. టిడిపి పార్టీలు ఉన్న జంగయ్య పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పిలుపురాకపోవడంతో చివరకు యాభై మంది కార్యకర్తలతో కలిసి వైసిపిలో చేరారు. కీసర గ్రామ సర్పంచ్‌గా గెలిచితీరుతానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు జె.సత్తిరెడ్డి, ముత్యంరెడ్డి, యాదగిరి, వీరేశ్, నరహరి, లాలియాదవ్, టి.లక్ష్మణ్, ప్రభాకర్‌చారి, ఎం.వెంకటేశ్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్, వైకాపా, బిజెపిలకు సర్పంచ్ అభ్యర్థులు కరువు
హయత్‌నగర్, జూలై 8: గ్రామపంచాయితీ ఎన్నికలకు మొదటి విడతగా నేడు నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. హయత్‌నగర్ మండలంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఒక్కో గ్రామం నుంచి ఇద్దరు ముగ్గురు చొప్పున సర్పంచ్ పోటీ కోసం పోటీపడుతున్నారు. టిఆర్‌ఎస్, వైకాపా, బిజెపిలకు పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారు. మండలంలోని 23గ్రామాలకు గాను కొన్ని గ్రామాలలో తప్పా ఆ పార్టీల బలం ఎక్కడ కనిపించడం లేదు. సోమవారం నామినేషన్‌ల ప్రక్రియ మొదలవుతున్న ఆ పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారని కార్యకర్తలే చెపుతున్నారు. ప్రధాన పార్టీలలో పోటీపడుతున్న నాయకులను ఆ పార్టీల ఇన్‌చార్జ్‌లు బుజ్జగిస్తూ కేవలం గెలుపు గుర్రాల కోసం వెతుకుతున్నారు. దీంతో ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్‌ల పోటీ జోరందుకుంది. రిజర్వేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గెలుపు గుర్రాలను ఎంచుకొని రాత్రివేళ మద్యం సరఫరాతో ప్రచారాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఎంత ఖర్చు పెట్టైన తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే లక్ష్యంతో పోటీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. తెరాస, వైకాపా, బిజెపిలు మాత్రం పోటీ చేసేందుకు సర్పంచ్ అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం.

రంగారెడ్డి జిల్లాలోని 705 గ్రామ పంచాయతీల్లో
english title: 
rangareddy

కెసిఆర్‌కు సొంత ప్రయోజనాలే ముఖ్యం

$
0
0

ఖైరతాబాద్, జూలై 8: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర ఏర్పాటు కంటే తన సొంత ప్రయోజనాలే ముఖ్యమని, తన స్వప్రయోజనాలకు ఎక్కడ గండి పడుతుందోనన్న కుట్రతో ఆయన రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని చూస్తున్నారని తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి విమర్శించింది. సోమవారం లక్డీకపూల్‌ల్లోని ఓ హోటల్‌ల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జెఎసి చైర్మన్ గజ్జల కాంతం, ప్రొఫెసర్లు అన్సారి, చందునాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య అడ్డంకి కెసిఆర్, అతని కుటుంబ సభ్యులేనని, రాష్ట్ర ఏర్పాటు కోసం 60 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువకులు విద్యార్ధులే మృతి చెందారని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రజల మనోగతాన్ని అర్ధం చేసుకొని తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధపడితే.. తమను సంప్రదించకుండా తెలంగాణ ఎలా ఇస్తారని కెసిఆర్ కుమారుడు కెటిఆర్ ప్రశ్నించడం వెనుక అంతర్యం ఇదేనని అన్నారు. తెలంగాణ విషయమై జరుగుతున్న సంప్రదింపుల్లో భాగంగా ప్రజా సంఘాలమైన తమకూ కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చిందని, ఈ నెల 10న ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, 11న హోంమంత్రి షిండే, ఆజాద్‌లను, 12న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎవరి వెంటాలేరని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ వెంటే తెలంగాణ ప్రజలు ఉంటారని వారికి వివరిస్తామని తెలిపారు. తెలంగాణపై ముందడుగు వేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బ్రహ్మరధం పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు వెంకటేశం గౌడ్, చందు నాయక్, సంజీవ నాయక్, అరవింద్, ఆకుల విజయ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర ఏర్పాటు
english title: 
kcr

నామినేషన్ దాఖలు చేసేవారు నిబంధనలు పాటించాలి

$
0
0

వికారాబాద్, జూలై 8: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే వారు తప్పకుండా నిబంధనలు పాటించాలని వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. సోమవారం స్థానిక రవీంద్రమండపంలో డివిజన్‌లోని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేసే వారికోసం ఒక్క రోజులో కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. రిజర్వేషన్‌ల కేటాయింపు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే జరిగాయని, వాటి విషయం ముగిసిందన్నారు. రేషన్‌డీలర్లు, సహకార సంఘ కార్యాలయం ఆఫీస్ బేరర్లు ఎన్నికల్లో పోటీచేయవచ్చన్నారు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని, కాంట్రాక్ట్ పద్దతిన పనిచేసే వారు పోటీ చేయవచ్చన్నారు. వికారాబాద్ డిఎస్పీ నర్సింలు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్, డిఎస్పీ, ఇతర పార్టీల పోలీసులను మోహరిస్తామన్నారు. వికారాబాద్ ఎంపిడివో వినయ్‌కుమార్ మాట్లాడుతూ మంగళవారం నుండి నామినేషన్లు స్వీకరించేందుకు క్లస్టర్‌లలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సిద్దంగా ఉంటారన్నారు. 9న ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియ 13తో ముగుస్తుందని తెలిపారు. 14న నామినేషన్ల పరిశీలన, 15న అప్పీలు, 16న జాబితా విడుదల, 17న ఉపసంహరణలు, 19న తుదిజాబితా, గుర్తు కేటాయింపు జరుగుతుందన్నారు. సమావేశంలో తాండూర్ మార్కెట్ కమిటి చైర్మన్ రమేష్, బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి కె.శివరాజ్, వికారాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు జాఫర్, టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి విజయ్‌కుమార్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు బస్వలింగం, పట్టణ పార్టీ అధ్యక్షుడు రాములు, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్వర్‌షరీఫ్, డిఎల్‌పివో శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి గ్రామ పంచాయతీ ఎన్నికల సమావేశానికి డివిజనల్ పంచాయతీ అధికారి అరగంట ఆలస్యంగా రావడం గమనార్హం. డివిజన్ స్థాయి సమావేశానికి కేవలం వికారాబాద్ సబ్‌డివిజన్ పోలీసులు మాత్రమే హాజరయ్యాయి. తాండూరు సబ్‌డివిజన్ పోలీసులు హాజరుకాకపోవడం విచిత్రం.

వైఎస్ ఆశయ సాధనకు పాటుపడాలి
మేడ్చల్, జూలై 8: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మేడ్చల్ నియోజకవర్గ వైకాపా సమన్వయ కర్త హరివర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జన్మదిన వేడుకలను మండలంలోని డబీల్‌పూర్, గౌడవెళ్లి, గిర్మాపూర్ తదితర గ్రామాలలో వైకాపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాంరెడ్డి, అశోక్, జగన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్‌కేసర్: పేదల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం కృషి చేసి అన్ని వర్గాల లబ్ధి చేకూర్చిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్ అన్నారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను సోమవారం జరిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు నల్లగారి భానుప్రకాష్, నందం గణేష్‌బాబు, రహమాన్, నరేందర్, ఎల్లస్వామి, శ్రీనివాస్, ప్రభాకర్‌గౌడ్, మాజీ సర్పంచ్‌లు సంజయ్‌కుమార్, డక్కి రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్‌లో..
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దివంగత నేత, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 64వ జయంతి వేడుకలను వైఎస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. సర్కిల్ పరిధిలోని షాపూర్‌నగర్‌లో కూన కృష్ణగౌడ్, మహాలక్ష్మి ట్రస్టు చైర్మన్ కూన శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘణంగా నివాళులర్పించారు. మండల పరిధిలోని గండిమైసమ్మ చౌరస్తా సమీపంలోని పల్లవి వృద్ధుల, వితంతువుల, మెంటల్లీ రిటార్డెడ్ ఆశ్రమంలో జయంతి సందర్భంగా అనాథలకు కూన శ్రీశైలంగౌడ్ దుప్పట్లు, బియ్యంతో పాచు వంట సామాగ్రిని అందజేశారు. గాగిల్లాపూర్ లో వైఎస్సార్ జయంతి పురస్కరించుకొని జన్మదిన కేక్‌ను కట్‌చేసి పంచారు. విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఉప్పల్‌లో..
ఉప్పల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు సోమవారం ఉప్పల్, చిల్కానగర్, రామంతాపూర్, హబ్సిగూడలో ఘనంగా జరిగాయి. వైఎస్సార్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు పోగుల గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నేతలు ధన్‌పాల్‌రెడ్డి, జంపన ప్రతాప్, హరివర్ధన్‌రెడ్డి, అరుణ్, సత్తయ్య, రజనీకాంత్‌రెడ్డి పాల్గొని వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అకస్మాత్తుగా మృతి చెందిన రాఘవరెడ్డి కుటుంబానికి రూ.10వేలు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.
పేద ప్రజల గుండె చప్పుడు
సరూర్‌నగర్: పేద ప్రజల గుండె చప్పుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని ఆర్‌కెపురం డివిజన్ కార్పొరేటర్ దేప సురేఖా భాస్కర్‌రెడ్డి అన్నారు. రాజశేఖర్‌రెడ్డి 64వ జయంతి సందర్భంగా డివిజన్‌లోని చిత్రాలేవుట్ కాలనీలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి సోమవారం ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు డక్కియార్ నాయక్, చిలుకా ఉపేందర్‌రెడ్డి, గట్ల రవీందర్, పగడాల ఎల్లయ్య పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే వారు
english title: 
nomination

‘సంఘీ’నగర్‌లో 3470 మంది ఓటర్లా?

$
0
0

హైదరాబాద్, జూలై 8: రాష్ట్ర ఎన్నికల కమీషన్ స్పష్టమైన ఆదేశాలు నిర్దేశించిన నియమాలను సూచించినప్పటికి అధికారుల అలసత్వం, వారి తప్పిదాల కారణంగా ఉమర్‌ఖాన్ దాయిరా(సంఘీనగర్)లో లేని ఓటర్ల సంఖ్య కనిపిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పంచాయతీలో సుమారు వేయ్య మంది ఓటర్లకంటే ఎక్కువ ఉండరని స్థానికలు పేర్కొంటున్నా పక్క గ్రామ పంచాయతీల పరిధిలోని సర్వే నెంబర్లలో నిర్మించుకున్న ఇండ్లలో నివసించే సుమారు 2,053 మంది ఓటర్లను ఉమర్‌ఖాన్ దాయిరా పంచాయతీలో లెక్క చూపిస్తున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేసినా స్థానిక మండల ఎన్నికల అధికారి స్పందించకపోవడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి పంచాయతీ పరిధిలో నివసించే జనాభా, దానికి ఆధారంగా పరిధిలోని ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏకంగా ఉమర్‌ఖాన్ దాయిరా (సంఘీనగర్)కు ఆనుకుని ఉన్న కోహెడ, అనాజ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లను తమ పంచాయతీ పరిధిలో లెక్కగట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఉమర్‌ఖాన్ దాయిరా (సంఘీనగర్) గ్రామ పంచాయతీ ఏర్పాటు సమయంలో నిర్దిష్టమైన హద్దులు ఏర్పాటుచేసి రెండువేల జనాభా 50.59 హెక్టార్ల పరిధిని ఖరారు చేస్తూ జీవో ఎంఎస్ నెం.323, తేది: 21.06.1991న జారీచేసింది. దానికి భిన్నంగా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సమయంలో స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఎన్నికల అధికారులు తమ గోడును వినకుండా అనాజ్‌పూర్, కోహెడ గ్రామాల పరిధిలోని సుమారు 1106 ఇళ్లలో నివశించే 2,053 మంది ఓటర్లను ఉమర్‌ఖాన్ దాయిరా (సంఘీనగర్) గ్రామ పంచాయతీ పరిధిలో నివశిస్తున్నట్టుగా ధృవీకరిస్తూ తుది ఓటర్ల జాబితా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తంచేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోహెడ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన ఉమర్‌ఖాన్ దాయిరా (సంఘీనగర్) గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 10 నుండి 42 వరకు ఉన్న విస్తీర్ణాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా నిర్దేశించినా అందుకు భిన్నంగా సర్వే నెంబరు 442, అనాజ్‌పూర్‌లోని 184 ఇండ్లలో నివశించే 419 మంది ఓటర్లు, కోహెడ గ్రామ రెవెన్యూ పరిధిలోని 542 సర్వే నెంబర్‌లోని 697 ఇళ్లలో నివశించే 1163 మంది ఓటర్లను ఉమర్‌ఖాన్ దాయిరా ఓటర్ల జాబితాలో ప్రకటించడంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం జారీచేసిన గెజిట్ ఆధారంగా పరిధిని నిర్దేశించి నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు అందుకు భిన్నంగా నిన్నటివరకు ఇంటి అనుమతులు, ప్రక్క గ్రామం నుండి పొందినా సదరు ఇళ్లల్లో నివశించే ఓటర్లు మాత్రం ఉమర్‌ఖాన్ దాయిరా జాబితాలో ప్రకటించడం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. ఇదే పంచాయతీలో ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు ఉండడం, సంఘీనగర్‌లో మూతపడ్డ పరిశ్రమలో అప్పుడు పనిచేసే కార్మికులకు సంబంధించిన సుమారు 400 మంది పేర్లను ఓటర్ల జాబితాలోనుండి తొలగించక పోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయలోని అధికారులతో పాటు, మండల స్థాయ అధికా రులు ఏ ఒక్కరోజుకూడా ఓటర్ల జాబితాను పరిశీలించ లేదని, గ్రామంలో పర్యటించి వివరాలు తెలుసుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ఉదాహరణకు ఓటర్ల జాబితాలోని ఓటర్ క్రమ సంఖ్యల 1937, 1938, 1941, 1942కు సంబంధించిన ఓట్లు యూసుఫ్ పోమపాలలీ అనే వ్యక్తి పేరు మీద వయస్సు తేడా ఉందే తప్ప ఫొటో ఒక్కరిదేనని స్థానికులు ఓటర్ల జాబితాను చూపించారు. ఈ జాబితాలో ఇలాంటి ఓట్ల సంఖ్య సుమారు 200 వరకు ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ గ్రామ పంచాయతీలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు ఉన్న మాజీ పార్లమెంటు సభ్యులు గిరీష్ సంఘీ నివాసంలో నలుగురు ఓటర్లు ఉన్నా 17 మంది ఉన్నట్లుగా ఓటర్ల జాబితాలో పేర్లు ప్రకటించారని, వారిలో నలుగురు మినహా మిగిలిన వారంతా పదేళ్ల క్రితమే నగరానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారని గ్రామస్థులు వివరించారు. ఈ గ్రామ పంచాయతీలో అసలు ఉన్న ఓటర్లు ఎంతమంది? బయటవారు ఎంతమంది? ఈ జాబితాను గత పదేళ్లుగా పరిశీలించకుండానే తుది జాబితాను ప్రకటించడంపై అధికారుల నిర్లక్ష్యం ఎంతమేరకు ఉందో అర్థమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఓటర్ల జాబితాను పరిశీలించి సవరించాలని, తప్పును గుర్తించి దానికి కారణమై అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ను స్థానికులు అభ్యర్థిస్తున్నారు.

* ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు * జాబితాలో పత్తాలేని వారి పేర్లు * పన్నులు చెల్లించేది ఒక పంచాయతీలో.. ఓట్లు వేసేది మరో పంచాయతీలో?
english title: 
sanghi nagar

డబ్బు, మద్యం పంపిణీపై నిఘా: కలెక్టర్ శ్రీధర్

$
0
0

హైదరాబాద్, జూలై 8: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావు నిర్వహించుటకు అన్ని రాజకీయ పార్టీలు తోడ్పాటునందించాలని, అలాగే డబ్బు, మద్యం పంపిణీ జరుగకుండా నిఘా ఏర్పాటుచేస్తున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీని అరికట్టేందుకు ప్రైవేటు వీడియోగ్రఫీని ఏర్పాటుచేస్తున్నామని, దీని వ్యతిరేకంగా వ్యవహరించిన అభ్యర్థిపై తన అభ్యర్థిత్వం కోల్పోవడంతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతందని అన్నారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, మూడవ విడత జరిగే గ్రామాలకు ప్రచారానికి ఎక్కువ సమయం ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన అభ్యర్థి ఖర్చు కంటే ఎక్కువ ఖర్చుచేసినట్లయితే వారిపై తీసుకుంటామని తెలిపారు. బిజెపి ప్రతినిధి మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జి.నర్సింలు, సిపిఐ (ఎం) పార్టీ ప్రతినిధి డి.జి.నర్సింగ్‌రావు, టిడిపి ప్రతినిధి సుభాష్ యాదవ్, సిపిఐ ప్రతినిధి బాలమల్లేష్ అడిగిన సందేహాలను సమావేశంలో కలెక్టరు నివృత్తి చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎం.వి.రెడ్డి, డిఆర్‌ఓ రవీందర్‌రెడ్డి, డిపిఓ మునావర్ పాల్గొన్నారు.

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావు నిర్వహించుటకు అన్ని
english title: 
collector

గాంధీలో మిన్నంటిన రోదనలు

$
0
0

తార్నాక, జూలై 8: క్షతగాత్రులు ఆర్తనాదాలు మృతుల బంధువుల రోదనలు నాయకుల పరామర్శలతో సోమవారం గాంధీ ఆసుపత్రి దద్దరిల్లిపోయింది. సిటిలైట్ హోటల్ సికింద్రాబాద్‌లో ఇంతకాలం ల్యాండ్‌మార్క్‌గా నిలిచినప్పటికీ తాజాగా ప్రధానంగా వార్తల్లో నిలిచింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని పైగా ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ పెద్దలు అధికారుల స్పందన సహాయ కార్యక్రమాలు సరిగ్గాలేవని బాధితుల బంధువులు సిఎం రాకను తెలుసుకుని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులను కట్టడి చేయడం తలకు మించిన భారంగా మారిపోయింది. ముఖ్యమంత్రి నేరుగా వచ్చి కొద్ది నిముషాల వ్యవధిలోనే వెళ్లిపోవడంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి. దుర్ఘటన జరిగిన సోమవారం ఉదయం సంఘటన స్థలంలోనే 12మంది మృత్యువాత పడగా మరొక వ్యక్తి చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడు. తీవ్రమైన గాయాలతో 19 మంది ఆసుపత్రిలో చేరగా అందులో నలుగురు మాత్రం చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.
చచ్చుపడిన పాలన... అనుభవం లేని సిఎం: బాబు
ముఖ్యమంత్రి అనుభవారాహిత్యంతో రాష్ట్రంలో పాలన చచ్చుబడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. సోమవారం సికింద్రాబాద్‌లోని సిటిలైట్ ఘటనాస్థలానికి చేరుకున్న చంద్రబాబు అటు నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి వచ్చారు. మృతుల కుటుంబాలను క్షతగాత్రుల బంధువులను పరామర్శించారు. దాదాపు గంటన్నరకు పైగా ఆసుపత్రిలోనే గడిపి అనుచరవర్గాన్ని సహాయక చర్యలకు పురమాయించారు. ఆసుపత్రి అంతా కలియదిరుగుతూ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు వేగవంతం చేశారు. మార్చురీలోనికి కూడా వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిస్సహాయత పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. వైపరీత్యాల సంగతి ప్రక్కనపెడితే ఇప్పటి పాలకులే ప్రజలకు పెద్ద వైపరీత్యంగా మారిపోయారని వ్యాఖ్యానించారు. భవనం కూలి అక్కడికక్కడే 12 మంది ప్రాణాలు కోల్పోయి మరో 20 మంది ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి, అనుచర మంత్రులకు సమావేశాలే ముఖ్యమయ్యాయని, ఇది పాలకుల సిగ్గుమాలిన చర్యకు నిదర్శనంగా పేర్కొన్నారు. బాధితులను పరామర్శించి వారిని ఆదుకొనే చర్యలను పర్యవేక్షించాల్సిన సిఎం చుట్టపుచూపుగా వచ్చి వెళ్లడం, మంత్రులు, అధికారులు ఒక్కరు కూడా ఆసుపత్రిలో లేకపోవడం విచారకరమని అన్నారు. 80 సంవత్సరాలకుపైగా ఉన్న భవంతిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో జిహెచ్‌ఎంసి అధికారులు విఫలమయ్యారని, ఈ ప్రమాదానికి పూర్తికారణం ప్రభుత్వానిదేనని అన్నారు. ఒక ఏడాదిలో ఐదు సంఘటనలు జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

* సిటీలైట్ వద్ద పోలీసుల అత్యుత్సాహం * తండోపతండాలుగా తరలివచ్చిన జనం * ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులు బేజార్ * గాంధీ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చంద్రబాబు పరామర్శ
english title: 
gandhi

కన్నీటి పర్యంతం

$
0
0

హైదరాబాద్, బేగంపేట, చార్మినార్, జూలై 8: సిటీలైట్ హోటల్ ఘటనతో సహాయక చర్యల పేరిట హడావుడి చేసిన పోలీసులు ధ్వంధవైఖరితో అవలంభించారని అక్కడకు చేరుకున్న మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినా, కేవలం గంట వ్యవధిలో ప్రారంభమైన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసే అంశంపై కనబర్చాల్సిన శ్రద్ధను పోలీసులు ముందుగా ట్రాఫిక్ ఆంక్షల అమలుపైనే ప్రదర్శించారన్న విమర్శ విన్పించింది. సహాయక చర్యల నిమిత్తమే ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నానమి చెప్పుకొస్తున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చిన రాజకీయ నేతలు, అమాత్యులు, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల బందోబస్తుకే పరిమితమయ్యారు. ఒక మాజీ మంత్రి వెంట దాదాపు యాభై మంది ఆయన అనుచరులు, గల్లీలీడర్లు సైతం గుంపులు గుంపులుగా వచ్చి సహాయక చర్యలకు ఆటంకాలు కల్గించినా, పట్టించుకోని పోలీసులు తమవారేమై పోయారోనన్న ఆందోళనతో రోధిస్తూ అక్కడకు వచ్చిన మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను ఏ మాత్రం జాలి, దయ లేకుండా తరమివేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వచ్చినపుడు ఆయా పార్టీలకు చెందిన నేతలకు దండాలు కొట్టి మరీ పోలీసులు ఘటనస్థలానికి అనుమతించటం పలువురితో వాగ్వాదానికి దారి తీసింది. పగలంతా బైబిల్ హౌజ్ వరకు ట్రాఫిక్‌ను అనుమతించిన అధికారులు సాయంత్రం కవాడిగూడ నుంచి సిటీలైట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బన్సీలాల్‌పేట నుంచి దారి మళ్లించారు. సోమవారం అమవాస్య, ఆపై ట్రాఫిక్‌ను దారి మళ్లించటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమై, దుకాణాలు మూతపడ్డాయి. ఫలితంగా వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులకు, ఘటన స్థలాన్ని సందర్శించేందుకు వచ్చిన నేతలకు కనీసం తాగునీరు కూడా లభించక ఇబ్బందులెదుర్కొన్నారు.
ఎలా కూలింది?
సికింద్రాబాద్‌లో అతి పురాతనమైన, పేరుగాంచిన సుమారు 87 ఏళ్ల చరిత్ర కల్గిన సిటీ హోటల్ ఇక కనుమరుగైంది. బతుకుదెరువు కోసం ఇక్కడ మోండామార్కెట్, బంగారు నగలను విక్రయించే పాట్ మార్కెట్, యంత్రాల విడి భాగాల కోసం రాణిగంజ్‌కు, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హమాలీగా పనిచేసే వారెక్కువ మందికి సిటీలైట్ హోటల్ ఓ చక్కటి ల్యాండ్‌మార్క్. పై అంతస్తుల్లో అధిక మొత్తంలో హలీం తయారీ కోసం అయిదారు బట్టీలు నిర్మించటం వల్లే హోటల్ కుప్పకూలిందని మున్సిపల్ కమిషనర్ ఎం.టి.కృష్ణబాబు నిర్థారించారు. భవనానికి పిల్లర్లు లేకపోవటం, గోడలపైనే స్లాబ్‌ను నిర్మించటం భవనం కూలేందుకు ప్రధాన కారణాలని వ్యాఖ్యానించారు.
మర్రి శశిధర్‌రెడ్డి సందర్శన
సికిందరాబాద్‌లోని సిటీలైట్ హోటల్ కుప్పకూలడంతో పలువురు మృతి చెందిన సంఘటన స్థలాన్ని స్థానిక సనత్‌నగర్ ఎమ్మెల్యే, జాతీయ విపత్తుల నివారణ కమిటీ వైస్‌చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి సందర్శించారు. తన నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఈ సంఘటన తెలిసిన వెంటనే ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరిపినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్లు దేవేనంద్, కిరణ్‌మయి, మహేశ్వరి, స్థానిక నేతలు శ్రీహరి, కిషోర్‌కుమార్,దయానంద్, సుదర్శన్, పూర్ణానందం, బాలకృష్ణ ఉన్నారు.

సిటీలైట్ హోటల్ ఘటనతో సహాయక చర్యల పేరిట హడావుడి చేసిన
english title: 
kanniiti paryantham

బుజ్జగింపుల పర్వం!

$
0
0

మచిలీపట్నం, జూలై 9: గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల నాయకులకు తలనొప్పిగా మారాయి. ఒకే పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులు పోటీకి కాలుదువ్వుతుండటంతో నాయకుల పరిస్థితి కరవమంటే కప్పకు.. వదలమంటే పాముకు కోపం.. అన్న చందంగా తయారైంది. గ్రామస్థాయిలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు పోటీలోకి దిగటం వల్ల పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆయా పార్టీల నాయకులు బెంబేలెత్తుతున్నారు. సాధ్యమైనంత వరకు రాజీ చేసేందుకు రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ప్రయత్నాలు ఒక కొలిక్కిరావటం లేదు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమై 13వ తేదీతో ముగియనుంది. ఒక్కో గ్రామంలో ఒక్కో అభ్యర్థినే బరిలోకి దింపేందుకు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకులు గ్రామాల్లో తిష్టవేసి పరిస్థితిని సానుకూలంగా మలుచుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీకి చెందినవారు పెద్దమొత్తంలో పోటీకి దిగుతున్నారు. ఈ క్రమంలో పార్టీపరంగా ఎవరిని సమర్ధించాలనే ప్రశ్న ఎదురవుతోంది. అన్ని రాజకీయ పార్టీలను ఈ సమస్య వెంటాడుతోంది. అందుకుతగ్గట్టు గ్రూపు రాజకీయాలు కూడా బలంగా పని చేస్తున్నాయి. పైస్థాయి నాయకులు తమ అనుచరులను బరిలోకి దించేందుకు ఊతమిస్తున్నారు. తెరవెనుక రాజకీయాల వల్ల గ్రామాల్లో పట్టుకోల్పోయే ప్రమాదం ఏర్పడుతోందన్న భావన ఆయా పార్టీల జిల్లా స్థాయి నాయకుల్లో వ్యక్తమవుతోంది. కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీకి చెందిన వారు ఇద్దరు నుంచి ఐదుగురు వరకు పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిని బుజ్జగింజలేక తలప్రాణం తోకకు వస్తోందని నాయకులు చెబుతున్నారు. ఏకతాటిపైకి తీసుకురాకపోతే దీని ప్రభావం సాధారణ ఎన్నికలపై గణనీయంగా పడే అవకాశం ఉంది. ఈ వైషమ్యాల వల్ల ఓట్లు చెల్లాచెదురై నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదు. ఈనేపథ్యంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థులను బుజ్జగించి ఒక్కరు మాత్రమే బరిలో ఉండేవిధంగా రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల నాయకులకు
english title: 
bujjagimpulu

సర్పంచ్ పదవులకు 61 దాఖలు

$
0
0

మచిలీపట్నం, జూలై 9: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలిరోజు మంగళవారం జిల్లాలో స్వల్పంగా నామినేషన్లు దాఖలయ్యాయి. 9న ప్రారంభమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ 13వరకు జరగనుంది. తొలిరోజు జిల్లాలో 61 సర్పంచ్ పదవులకు, 115 వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. మచిలీపట్నం డివిజన్‌లో 17 సర్పంచ్ పదవులకు, వార్డు పదవులకు 51 మంది నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 11 మంది, వార్డు సభ్యుల పదవులకు 15 మంది, నూజివీడు డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 18 మంది, వార్డు సభ్యుల పదవులకు 33 మంది, గుడివాడ డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 15 మంది, వార్డు సభ్యుల పదవులకు 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ దశలో స్వల్పంగా నామినేషన్లు దాఖలు కాగా రానురాను ఈ సంఖ్య పెరగనుంది. అమావాస్య ఘడియలు మంగళవారం కూడా ఉండటంతో నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. అలాగే పలు గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు మంతనాలు సాగుతున్నాయి. పోటీ ఎక్కువగా ఉండటంతో రాజీ బేరాలు సాగుతున్నాయి. ఒకే అభ్యర్థిని రంగంలోకి దించేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకుల బుజ్జగింపులు మరోపక్క కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో తొలిరోజు నామినేషన్‌లు స్వల్ప మొత్తంలో దాఖలయ్యాయి.

* వార్డు సభ్యులకు 115..
english title: 
sarpanch posts

క్షతగాత్రుల్లో ఒకరి కిడ్నీ తొలగింపు

$
0
0

జి.కొండూరు, జూలై 9: జి.కొం డూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం సిఐ బంగారురాజు జరిపిన కాల్పుల్లో గాయపడ్డ బాధితుల్లో మైలవరానికి చెందిన పజ్జూరు నరసింహారావు (24) కిడ్నీని తొలగించారు. కిడ్నీని తొలగించని పక్షంలో నరసింహారావు ప్రాణాలకే ముప్పు ఏర్పడనున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కిడ్నీని తొలగించాల్సి వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రే నరసింహారావు కిడ్నీని తొలగించినట్లు తెలిసింది. కిడ్నీ తొలగించిన తర్వాత నరసింహారావు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసింది. మైలవరానికి చెందిన సేదం కృష్ణారావు(42) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఎస్‌పిహెచ్‌ఓ రవికుమార్ వెల్లడించారు. గుంటూరు నుంచి వైద్య నిపుణులు శస్తచ్రికిత్స చేసినా రక్తస్రావం ఆగటం లేదని వివరించారు. ఐసియులో ఉంచి వెంటిలేటర్‌పై కృష్ణారావుకు వైద్యం అందిస్తున్నారు. గుడిపూడి వెంకటరామయ్య(24), సింహాద్రి సూర్యనారయణ(45) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

ప్రాథమిక నివేదిక అందజేశాం: ఎఎస్పీ
జి.కొండూరు, జూలై 9: జి.కొం డూరు పోలీస్‌స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన కాల్పుల ఘటనపై ప్రాథమిక నివేదికను ఎస్‌పికి అందచేసినట్లు ఎఎస్‌పి షిమోషి బాజ్‌పేయి వెల్లడించారు. ఆమె మంగళవారం సాయం త్రం స్థానిక పోలీస్టేషన్‌లో విచారణ కొనసాగించారు. పోలీస్టేషన్‌పై జరిగిన దాడి, కాల్పుల ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. విచారణ పూర్తయిన తర్వాత దర్యాప్తు వివరాలను తెలియచేస్తామని విలేఖరులకు తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించామన్నారు. నూజివీడులో బెజవాడ రాజేశ్వరి వాంగ్మూలాన్ని, జి.కొండూరులో రామకృష్ణ తల్లిదండ్రులు, బంధువుల వాంగ్మూలాలను, గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడ్డ వారి వాంగ్మూలాలను నమోదు చేశామని స్పష్టం చేశారు. రామకృష్ణ మృతిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్తు వివరించారు. నూజివీడు డిఎస్‌పి ఎ శంకరరెడ్డి, నందిగామ డిఎస్‌పి డి సిహెచ్ హుస్సేన్, మైలవరం ఎస్‌ఐ సిహెచ్ నాగప్రసాద్ తదితరులు విచారణకు సహకరిస్తున్నారు. ఎన్నికల విధులను, పోలీస్టేషన్‌లో రోజు వారి కార్యకలాపాలను డిఎస్‌పి శంకరరెడ్డి ఆధ్వర్యంలో మైలవరం ఎస్‌ఐ నాగప్రసాద్ నిర్వర్తిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీస్ స్టేషన్ వద్ద మోహరించిన అదనపు బలగాల సంఖ్యను తగ్గించారు. మరోపక్క విజయవాడ సబ్ కలెక్టర్ విచారణలో భాగంగా స్థానిక తహశీల్దార్ డి గిధ్యోన్ కోడూరులో మృతుడు రామకృష్ణ తల్లిదండ్రులు, బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు.

* మరొకరి పరిస్థితి విషమం
english title: 
kidney removed

సర్పంచ్ అభ్యర్థులు ఖరారుకాక కాంగ్రెస్ అవస్థలు!

$
0
0

తోట్లవల్లూరు, జూలై 9: మండలంలో పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థులను పోటీకి నిలబెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. పార్టీ రహిత ఎన్నికలైనా పార్టీలు బలపర్చిన అభ్యర్థులే సర్పంచ్ పదవికి పోటీ చేయటం ఆనవాయితీగా వస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలు ఒక పునాదిగా ఉంటాయని తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థులను రంగంలోకి దింపుతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకబడి ఉంది. నామినేషన్ల పర్వం మంగళవారం మొదలవ్వగా చాలా గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల ఎంపికి ఒక కొలిక్కి రాలేదు. అధికార పార్టీ తరపున ఎమ్మెల్యే డివై దాస్ ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో వెనుకబడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కొండంత అండగా ఉన్న నాయకులు వైఎస్‌ఆర్‌సిపిలోకి వెళ్లటం కాంగ్రెస్‌కు లోటుగా మారింది. ముఖ్యంగా మండల కేంద్రం తోట్లవల్లూరులో నాలుగు రోజుల నుంచి నాయకులు సమావేశవౌతూ నువ్వు పోటీచేయి అంటే నువ్వు పోటీ చేయి అంటూ ఎవరికి వారు వెనుకంజ వేస్తున్నారు. రొయ్యూరులో కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి కలసి ఉమ్మడిగా సర్పంచ్ అభ్యర్థిని రంగంలోకి దింపుతున్నాయి. ఇక్కడ ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. పాములలంకను ఎమ్మెల్యే దాస్ ఎంతో అభివృద్ధి చేసినా అక్కడ కూడా పోటీకి కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు రావటంలేదు. చినపులిపాకలో సర్పంచ్ అభ్యర్థి ఎంపిక జరగలేదు. బొడ్డపాడులో పంచాయతీ మాజీ సభ్యుడు మూడే శివశంకర్ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ గ్రామంలో కాంగ్రెస్ కాస్త బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. వల్లూరుపాలెంలో కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయటం లేదని తెలుస్తోంది. భద్రిరాజుపాలెం, చాగంటిపాడు, దేవరపల్లి, గుర్విందపల్లి, పెనమకూరు, కనకవల్లి, గరికపర్రు గ్రామాల్లో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా తయారయింది. ఆయా గ్రామాల్లో నాయకులున్నా కార్యకర్తల బలం లేని విషయం స్పష్టమవుతోంది. ఐలూరులో కాంగ్రెస్ పార్టీ గట్టెక్కే పరిస్థితి ఉందని చెపుతున్నారు. ఇక్కడ సుంకర రాఘవరావు బ్రదర్స్, కాపులు, దళితుల మద్దతు కాంగ్రెస్‌కు బలంగా ఉంది. ఏదిఏమైనా పంచాయతీ ఎన్నికలకు టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి దూకుడుగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నత్తనడకన నడుస్తోంది. వైఎస్‌ఆర్‌సిపిలోకి కాంగ్రెస్ ముఖ్య నాయకులు వెళ్ళగా ఆ లోటును భర్తీ చేయలేకపోవటంతో ఇపుడు ఈ పరిస్థితి ఎదురవుతోందని కొందరు కార్యకర్తలు వాపోతున్నారు.

మండలంలో పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థులను పోటీకి నిలబెట్టేందుకు
english title: 
congress

ఎన్నిక నియమావళిని గౌరవించండి

$
0
0

విజయవాడ, జూలై 9: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పంచాయతీ ఎన్నికలను నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు సహకరించాలని సబ్ కలెక్టర్ డి హరిచందన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి మార్గదర్శక సూత్రాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ డి హరిచందన ఆమె కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ నెల 27న పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఈ నెల 3 నుండి అమలులోవున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈ నెల 31 వరకు అమలులో వుంటుందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చిలు, దేవాలయాల వంటి ప్రదేశాలను వేదికలుగా ఉపయోగించరాదన్నారు. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి మాత్రమే ప్రచార సమయంలో వాహనం వినియోగించుకునేందుకు అనుమతించడం జరుగుతుందని, వాహనం తిరిగే సమయంలో అభ్యర్థి తప్పక వాహనంలో ఉండాలని, లేని పక్షంలో వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు వాహనాలను వినియోగించుకునేందుకు అనుమతిలేదని, వాహనాన్ని వినియోగించినట్లైతే వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. చౌకధరల దుకాణాల్లో కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ఉంచిన అమ్మహస్తం సంచుల పంపిణీని తక్షణమే నిలిపివేసి సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకోవాలన్నారు. చౌకధరల దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏసిపిలు టి హరికృష్ణ, ఎస్‌కె షకీలాభాను, డివి నాగేశ్వరరావు, అర్బన్ తహశీల్దార్ ఆర్ శివరావు, జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఎకె అన్సారి, నరహరశెట్టి శ్రీహరి, టిడిపి ప్రతినిధులు గోగుల రమణరావు, కె హనుమంతరావు, వి రాజేష్, వైఎస్సార్ సిపి ప్రతినిధులు తాడి శకుంతల, బిజెపి ప్రతినిధులు కె సుబ్రహ్మణ్య ఆర్ముగం, బండి కాళేశ్వరరావు,సిపిఐ ప్రతినిధి ఎం కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పంచాయతీ ఎన్నికలను
english title: 
code
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>