Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

సమైక్యాంధ్ర ఉద్యమ హోరు

$
0
0

విశాఖపట్నం/శ్రీకాకుళం, జూలై 9: సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖ నగరంలో మంగళవారం నిరసనలు హోరెత్తాయి. కేంద్ర సహాయమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి సమైక్యాంధ్రపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని లేని పక్షంలో ఇళ్ళ వద్ద సత్యాగ్రహం నిర్వహిస్తామని సమైక్యాంధ్ర ప్రజాపోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు జిఏ నారాయణరావు హెచ్చరించారు. నిరసన తెలియచేస్తూ పురంధ్రీశ్వరికి చీర, సారె.. సుబ్బరామిరెడ్డికి కమండలం, విభూథి పార్శిల్ చేశారు. ప్రత్యేక తెలంగాణపై ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలో అక్కడే ఉంటున్న పురంధ్రీశ్వరి, టిఎస్సార్‌లు సమైక్యాంధ్ర గురించి పట్టించుకోవడం లేదన్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద మంగళవారం సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి (14 యూనివర్శిటీల సంఘం) ఆధ్వర్యంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థి జేఏసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు నోరెత్తటం లేదన్నారు. స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే ఈ నెల 12న సామూహిక నిరాహారదీక్ష చేస్తామన్నారు. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రిని తెలంగాణపై రోడ్‌మ్యాప్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కోరటం తగదన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. అలాగే సమైక్యాంధ్రపై విధాన ప్రకటన చేయాలని కోరుతూ ఈ రెల 20న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో దీక్ష చేపట్టనున్నట్టు సమైక్యాంధ్ర యువజన జెఏసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్ చెప్పారు. 14, 15 తేదీల్లో విశాఖలో భారీ బహిరంగసభ ఉంటుందన్నారు. 12న కుల సంఘాలతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదంటూ శ్రీకాకుళంలోని అంబేద్కర్ వర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం తరగతులు బహిష్కరించి, జాతీయ రహదారిపైకి చేరుకుని కెసిఆర్ డౌన్..డౌన్.., సమైక్యాంధ్రయే ముద్దు..తెలంగాణ వద్దంటూ నినాదాలతో ధర్నా సాగించారు. సమైక్యాంధ్ర ఫోరం అధ్యక్షులు బలగప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమబాటలో ఉద్యోగ జెఎసి
నాగార్జున యూనివర్సిటీ: ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం కాకుండా కాపాడటం కోసం అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనలకు సైతం పూనుకుంటామని సమైక్యాంధ్ర ఉద్యోగ జెఎసి కన్వీనర్ బి రాజశేఖర్ తెలిపారు. మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ధర్నా నిర్వహించారు. రాజశేఖర్ మాట్లాడుతూ తమ భవిష్యత్తును పణంగా పెట్టి రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి, వారిని అరెస్టు చేయటం ద్వారా ప్రభుత్వం విద్యార్థులను వేధిస్తోందని అన్నారు. విద్యార్థులను వేధించటం వంటి నీచరాజకీయాలను స్వస్తి పలికి రాష్ట్ర సమైక్యతకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇప్పటివరకు ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతున్న విద్యార్థి జెఎసికి మద్దత్తుగా సమైక్యాంధ్ర ఉద్యోగ జెఎసి ప్రత్యక్ష ఆందోళనలకు పూనుకుంటుందని హెచ్చరించారు.
అనంతలో నిరాహార దీక్షలు
అనంతపురం: అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటోంది. సమైక్యాంధ్ర కోసం వివిధ ప్రజా సంఘాలు, సమైక్యాంధ్ర నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు సైతం పెద్ద ఎత్తున ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితితో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు సమైక్యాంధ్ర కోసం వినూత్న రీతిలోకార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. విద్యాసంస్థల బంద్, ర్యాలీలు, మేధావుల సదస్సులు, రచయితలు, కవుల సమావేశాలు, తీర్మానాలు, రాస్తారోకోలు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు, రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు.
....................
కేంద్రమంత్రి పురంధ్రీశ్వరికి చీర, సారె..ఎంపీ సుబ్బరామిరెడ్డికి కమండలం విభూథి పంపిస్తున్న దృశ్యం. అనంతపురంలో జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు
.................
నామినేషన్లలో సెంటిమెంట్!
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు/ఒంగోలు/చిత్తూరు, జూలై 9: రెండేళ్ల ఆలస్యంగా ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తొలిరోజు స్పందన చాలా తక్కువగా కనిపించింది. అసలే ఆషాఢమాసం, శుద్ధ పాడ్యమి, ఆపై మంగళవారం కావడంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు అమంగళమని భావించారు. అభ్యర్థులు ముహూర్తం చూసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాల్లో 931 పంచాయతీలకుగాను కేవలం 31 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. తొలిరోజున సర్పంచుల్లో నాలుగుశాతం కూడా దాఖలు కాలేదని ఓరకంగా విశే్లషించాలి. పంచాయతీ వార్డులు జిల్లావ్యాప్తంగా 8834కు ఉండగా కేవలం 32 నామినేషన్లు మాత్రమే తొలి రోజు దాఖలయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఒక్కశాతానికి కూడా వార్డు సభ్యులకు సంబంధించి నామినేషన్లు దాఖలు కాలేదని చెప్పాలి. ముత్తుకూరు మండలంలో పొట్టేంపాడు పంచాయతీకి ఓ వికలాంగ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లాల్లో తొలిరోజు నామినేషన్ల దాఖలు ప్రక్రియ మందకొడిగా సాగింది. ఒంగోలు డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 29, వార్డు మెంబర్లకు 34 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. చిత్తూరు జిల్లాలో తొలివితడగా తిరుపతి డివిజన్‌లోని 14మండలాల్లోని 399 పంచాయతీల్లో సర్పంచ్‌కు 48 నామినేషన్లు దాఖలయ్యాయి. 3,586 వార్డులకు 67 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఖమ్మం, గుంటూరు జిల్లాల్లో
ఖమ్మం/గుంటూరు/కృష్ణా: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం మంగళవారం ప్రారంభమైంది. ఖమ్మం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సర్పంచ్ పదవులకు 129 నామినేషన్లు, వార్డు మెంబర్లకు 246 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం జిల్లాలో సర్పంచ్ పదవులకు పది, వార్డు మెంబర్ల పదవులకు 23 మంది నామినేషన్లు వేశారు. గుంటూరు జిల్లాలో సర్పంచ్ పదవులకు 58, వార్డు మెంబర్ల పదవులకు 108 మంది నామినేషన్లు వేశారు. కృష్ణా జిల్లాలో సర్పంచ్ పదవులకు 61, వార్డు మెంబర్ల పదవులకు 115 మంది తమతమ నామినేషన్లు దాఖలు చేశారు.
గోదావరి జిల్లాల్లో ..
కాకినాడ/ఏలూరు: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉభయగోదావరి జిల్లాలో తొలి రోజైన మంగళవారం సర్పంచ్ పదవులకు 225 నామినేషన్లు దాఖలయ్యాయి. తూర్పు గోదావరిలో సర్పంచ్ స్థానాలకు మొత్తం 134 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డు సభ్యులకు సంబంధించి 383 నామినేషన్లు దాఖలయ్యాయి. కాకినాడ డివిజన్‌లో 22 సర్పంచ్ నామినేషన్లు, 40 వార్డు సభ్యుల నామినేషన్లు, పెద్దాపురం డివిజన్‌లో 37 సర్పంచ్, 126 వార్డు సభ్యుల నామినేషన్లు, రంపచోడవరం డివిజన్‌లో 9 సర్పంచ్‌లు, 23 వార్డు సభ్యుల నామినేషన్లు, అమలాపురం డివిజన్‌లో 22 సర్పంచ్‌లు, 55 వార్డు సభ్యుల, రాజమండ్రి డివిజన్‌లో 44 సర్పంచ్‌లు, 139 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో తొలి రోజు సర్పంచ్ పదవులకు 91 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యత్వ పదవులకు 206 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో మొత్తం నాలుగు డివిజన్లలోని 884 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
వైకాపా అభ్యర్థి కిడ్నాప్?
బొబ్బిలి (రూరల్), జూలై 9: విశాఖ జిల్లా బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామంలో వైఎస్సార్‌సిపి మద్దతు అభ్యర్థిగా పంచాయతీ బరిలోకి దిగాలనుకుంటున్న ఎ రామసూర్య ప్రతాపనాయుడు మంగళవారం కిడ్నాప్‌కు గురైనట్టు సమాచారం. ఈయన ఆదర్శ రైతుగా పనిచేస్తున్నాడు. విజయనగరంలోని వ్యవసాయశాఖ జెడి ఇంటికి వెళ్తుండగా, కారులో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. అయితే ఆ తరువాత రంగరాయపురం గ్రామానికే చెందిన మరో ఆదర్శ రైతు వి సత్యారావుతో ప్రతాపనాయుడు ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం. 13న సాయంత్రం తనను విడిచి పెడతానన్నారని, రంగరాయపురంలో ఎవరైనా నామినేషన్ వేసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనను చంపేస్తామని కిడ్నాపర్లు హెచ్చరించినట్టు ప్రతాపనాయుడు తెలిపారు.

పారిశ్రామికవేత్త ప్రసాద్ అదృశ్యం
యానాం, జూలై 9: ప్రముఖ పారిశ్రామికవేత్త, కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని ఆనంద్ రీజెన్సీ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకరప్రసాద్ (54) అదృశ్యమయ్యారు. యానాంలోని హోటల్ పర్యవేక్షణకు వచ్చిన ఆయన సోమవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లి, తిరిగి రాలేదు. ఈ మేరకు రవిశంకరప్రసాద్‌కు వ్యాపార భాగస్వామి, సోదరుడి వరసైన పి కిరణ్ సోమవారం సాయంత్రం యానాం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని యానాం సిఐ కపిలగురు తెలిపారు. చెన్నైలో జెమిని గ్రూపు సంస్థల మేనేజింగ్ డైరెక్టరైన రవిశంకరప్రసాద్ వారి వ్యాపార సంస్ధలలో ఒకటైన రీజెన్సీ హొటల్‌ను పరిశీలించేందుకు ఆదివారం యానాం వచ్చారు. సోమవారం తెల్లవారుజామున 3గంటలకు హోటల్ నుండి మార్నింగ్ వాకింగ్‌కని వెళ్లిన ఆయన 3.22 నిమిషాలకు యానాం టోల్‌గేటు దాటినట్లు సిసి టివిల పుటేజ్ ద్వారా గుర్తించారు. ఆయన ఎక్కడికి వెళ్లారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని సిఐ కపిలగురు తెలిపారు. ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తుచేస్తున్నామన్నారు. యానాం గోదావరి తీరంలో బోట్లపై గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుండి రవిశంకర్ బంధువులు యానాం ఆనంద్ రీజెన్సీకి చేరుకున్నారని ఆయనకు ఎవరైనా శత్రువులున్నారా అనే కోణంలో బంధువుల నుండి సమాచారం సేకరిస్తున్నామని సిఐ తెలిపారు..

మోడీ ప్రధాని కావాలి

బిజెపి నేత వెంకయ్యనాయుడు

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 9: దేశంలో సుస్థిర పాలన, సమర్థవంతమైన నాయకత్వం కోసం రానున్న సాధారణ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉంటే సమస్యలు పరిష్కరించగలరని ఆయన అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తామని, కామన్ సివిల్‌కోడ్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. నదులు అనుసంధానం చేస్తామని, స్విస్ బ్యాంకు నుంచి నల్లదనం రాబడతామని స్పష్టం చేశారు. మంగళవారం విజయనగరంలో జరిగిన ఆ పార్టీ ప్రజా చైతన్య సదస్సు, ఆత్మీయ సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ధరలు అదుపు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 33సార్లు పెట్రోలు ధరలు, 14 సార్లు ఎరువుల ధరలు పెంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ధరలు ఆకాశంలోను, ప్రజలు పాతాళంలోకి నెట్టబడ్డారని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా కుంభకోణాలే కన్పిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానికి పదవి ఉన్నా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సరిహద్దు దేశాలతో దౌత్య సంబంధాలుగానీ, అంతర్గత సమస్యలనుగానీ పరిష్కరించలేని స్థితిలో ప్రధాని ఉన్నారని ఆరోపించారు. దేశంలో ద్రవ్యలోటు, రాబడి లోటు, తాజా కరెంట్ లోటు, వాణిజ్యలోటు, పరిపాలన లోటు ఇలా.. అన్నింటా లోటు ఏర్పడిందన్నారు. ఎన్డీఏ హయాంలో డాలర్ విలువ 42 రూపాయలు కాగా, కాంగ్రెస్ గద్దెనెక్కిన తరువాత 61 రూపాయలకు పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం విద్యుత్ కోతలతో రాష్ట్రం అల్లాడుతోందన్నారు. స్విస్ బ్యాంకులో ఉన్న 60 లక్షల కోట్ల రూపాయల నల్లదనాన్ని రాబట్టడంలో కేంద్రం విఫలమైందన్నారు. నక్సల్స్ దమన కాండ పెరిగిపోయిందన్నారు. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటిని పరిష్కరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి తెలంగాణ విభజనకు కట్టుబడి ఉందన్నారు.

* సీమాంధ్ర ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మ దగ్ధం * 20న ఇందిరాపార్కు వద్ద దీక్షకు సమాయత్తం
english title: 
s

మసీదుల వద్ద వౌలిక సదుపాయాలు

$
0
0

విజయవాడ, జూలై 9: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదుల వద్ద ప్రార్థనలను నిర్వహించుకునే ముస్లింలకు అవసరమైన వౌలిక వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ డా బుద్ధప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ఏర్పాటు చేయవలసిన వౌలిక వసతులపై మంగళవారం సాయంత్రం కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంజాన్ ముస్లింలకు ఎంతో పవిత్రమైనదన్నారు. నెల రోజుల పాటు ఉదయం నెలవంకను చూసిన అనంతరం తిరిగి సాయంత్రం నెలవంకను చూసే వరకు కఠోరమైన ఉపవాస దీక్షను ఆచరిస్తారన్నారు. మసీదుల వద్ద వందలాది మంది ముస్లింలు సామూహిక ప్రార్థనలను నిర్వహించుకుంటారన్నారు. ప్రార్థనల సమయంలో మసీదుల వద్ద నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాయంత్రం ఉపవాప దీక్షను విరమించి సమాజ్ అనంతరం ముస్లింలు ఆహార పానీయాలను సేవించడం జరుగుతుందన్నారు. ఇందుకు అనుగుణంగా ముస్లింలకు మసీదుల వద్ద అవసరమైన ఆహార పదార్థాల అమ్మకాలను నిర్వహించేలా ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేయాలని కార్మిక శాఖాధికారులను ఆదేశించారు. మసీదు పరిసర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ఏర్పాట్లను ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, పారిశుద్ధ్య పనులను పంచాయతీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ కమిషన్లు పర్యవేక్షించాలన్నారు. వర్షాకాలం సందర్భంగా మసీదులు, పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వర్షపు నీరు నిలువ వుండకుండా పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాలని పంచాయతీ శాఖాధికారులను ఆదేశించారు. మసీదుల మరమ్మతులకు, నిర్వహణకు అవసరమైన నిధులను వక్ఫ్‌బోర్డు అధికారులు సమకూర్చాలన్నారు. పౌర సరఫరాల అధికారులు ముస్లింలకు పంచదార, గోధుమ వంటి సరుకులు చౌక ధరల దుకాణాలు, బహిరంగ మార్కెట్‌లలో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. నమాజ్ నిర్వహించుకోవడంలో మసీదుల వద్ద ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముస్లింలు వారి సమస్యలను 0866 2570206 నందు తెలియజేస్తే తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్ రమేష్‌కుమార్, డిసిపి ఖాన్, మైనార్టీ కార్పొరేషన్ ఇడి సాంబశివరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఇ బి మోహనకృష్ణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సత్యపాల్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వి చిట్టిబాబు, మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు, తిరువూరు మున్సిపల్ కమిషనర్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మసీదుల వద్ద
english title: 
ramzan

కుప్పలు తెప్పలుగా కూరగాయలు

$
0
0

పాతబస్తీ, జూలై 9: నైరుతీ రుతు పవనాలు రైతుల పాలిట ఏరువాకగా మారగా అదే రుతుపవనాలు కూరగాయల తోటలు చీడ పీడలను తట్టుకొని దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. గతనెల మొదటివారంలో కిలో రూ.30 అమ్మిన వంకాయలు నేడు కిలో కేవలం రూ.8లకే లభిస్తున్నాయి. మంగళవారం విజయవాడ నగరంలోని అన్ని రైతుబజారుల్లో కూరగాయలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి. నగర వీధుల్లో తోపుడు బండ్ల నిండా బీరకాయలు, వంకాయలు, దొండ, బెండకాయలే కల్పిస్తున్నాయి. గులాబి వంకాయలు కిలో రూ.8, కాంతులు వంకాయలు కిలో రూ.6లకే లభిస్తున్నాయి. రూ.13కి అమ్మిన బెండకాయలు నేడు రూ.8లకే అమ్ముతున్నారు. పచ్చిమిర్చికి కిలో రూ.28 గతనెల్లో అమ్మగా నేడు కిలో రూ.11లకే అమ్ముతున్నారు. బీర రూ.20 నుండి 11లకు, దొండ కిలో రూ.12 నుండి నేడు రూ.6లకు అమ్ముతున్నారు. రూ.26 అమ్మిన కాకర నేడు కిలో రూ.10లకే లభిస్తున్నాయి. చామదుంప కిలో రూ.32 నుండి ధర తగ్గి రూ.24కి చేరింది. కిలో రూ.16 నుండి 20 అమ్మిన దోసకాయలు నేడు కిలో రూ.10లకు, గోరుచిక్కుడు కిలో రూ.28 నుండి రూ.18కి తగ్గింది. బీన్స్ కిలో రూ.84 నుండి ధరలు తగ్గి రూ.38కి లభిస్తున్నాయి. బంగాళ దుంపలు మాత్రం ధర నిలకడగా రూ.16 మీద ఉంది. టమాటా, క్యారెట్స్ మాత్రం ధరలు ఇంకా అందని ద్రాక్షాగానే మిగిలాయి. టమాటా కిలో రూ.34, క్యారెట్ రూ.46లుగా నిలకడగా ఉంది. సామాన్యులను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అల్లం మాత్రం ఘాటు తగ్గి కిలో రూ.184 నుండి దిగివచ్చి నేడు కిలో రూ.152లకే అమ్ముతున్నారు. వంటనూనె నేడు ధరతగ్గి లీటరు రూ.93లకి దిగింది. టమాటా, క్యారెట్ మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుండి దిగుబడి చేసుకోవడంలో వాటి ధరలు తగ్గడం లేదని వ్యాపారులు తెలిపారు. ఈ నెలాఖరుకి కృష్ణానది ఆయకట్టు ప్రాంతాలు కృష్ణా, గుంటూరు జిల్లాలోని పంట అందుబాటులోకి వస్తుందని అప్పటి వరకూ వాటి ధరలు తగ్గవంటున్నారు.

నైరుతీ రుతు పవనాలు రైతుల పాలిట ఏరువాకగా మారగా అదే రుతుపవనాలు
english title: 
vegitables

నిబంధనలతో సాగితేనే వ్యాపారాభివృద్ధి

$
0
0

విజయవాడ, , జూలై 9: రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారస్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని నిబంధనలతో సాగితేనే వ్యాపారాభివృద్ధి జరుగుతుందని అప్పుడే మన సమస్యలపై ప్రభుత్వంతో పోరాడగలమని జయభేరిగ్రూప్ అధినేత, సినీనటుడు మురళీమోహన్ అన్నారు. ఎపి ఛాంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధమ వార్షికోత్సవం మంగళవారం సాయంత్రం తుమ్మలపల్లి వారిక్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు అనధికారిక లేఅవుట్లతో ఇబ్బందులు ఎదురవుతాయని, లేఅవుట్ చేస్తేనే వ్యాపారానికి, వినియోగదారునికీ కూడా శ్రేయస్సు అని అన్నారు. సంబంధిత అన్ని కాగితాలు సమర్పించగలిగితే 15 రోజుల్లో లేఅవుట్ చేయటానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చిత్తశుద్ధితో వ్యాపారం చేసేవారికి ప్రనుత్వం ఎప్పుడూ అండగా వుంటుందని అన్నారు. వేదికపై అతిథులుగా మాజీ ఎమ్మెల్యే నాసర్‌వలి, కోగంటి సత్యనారాయణ, బొండా ఉమామహేశ్వరరావు, కేశినేని నాని, గౌతంరెడ్డి, సిహెచ్ బాబూరావు తదితరులు మాట్లాడుతూ కలసికట్టుగా కృషి చేస్తే ఈ రంగానికి మహర్దశ కలుగుతుందని అన్నారు. సభాధ్యక్షులుగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సారేపల్లి శ్రీనివాసరావు వ్యవహరించగా వేదికపై నిర్వహణ ఇఎస్‌ఎస్‌వి ప్రసాదరావు, కార్యదర్శి వజ్జే మహేష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్రా నారాయణరావు, కైలాసపతి, సంయుక్త కార్యదర్శి కాజ మురళీమోహన్ తదితర సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి అసోసియేషన్ల సభ్యులు హాజరయ్యారు. ప్రారంభంలో సినీసంగీత విభావరి, సిల్వస్టర్ మిమిక్రి అందరినీ అలరించింది.

రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారస్థులు ఎన్నో సమస్యలను
english title: 
business development

ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై గౌతమ్‌రెడ్డిపై కేసు

$
0
0

సబ్‌కలెక్టరేట్, జూలై 9: ఎన్నికల కోడ్ ఉల్లఘించి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ గౌతంరెడ్డిని సత్యనారాయణపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 64వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం గౌతంరెడ్డి సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులో కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన తర్వాత బైక్‌ర్యాలీ నిర్వహిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల వైఎస్‌ఆర్ జయంతి నిర్వహించారు. ఇది ఎన్నికల కోడ్‌కి విరుద్ధమని సత్యనారాయణపురం స్టేషన్ సిఐ సత్యనారాయణ మంగళవారం ఉదయం గౌతంరెడ్డి ఇంటికి వచ్చారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న గౌతంరెడ్డి అనుచరులు, పార్టీ నాయకులు అక్కడకు చేరుకోవడంతో కార్యకర్తల నినాదాల మధ్యనే గౌతంరెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అక్రమ అరెస్ట్‌లకు ఏమాత్రం లొంగమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రాంతీయ సదస్సుల పేరుతో సభలు నిర్వహిస్తున్నాడని చెప్పారు. మంత్రి పితాని సత్యనారాయణ పలుచోట్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా పలు ప్రాంతాల్లో ప్రారంభాలు చేస్తున్నారని తెలియజేశారు. వీరిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేయకుండా దివంగత ముఖ్యమంత్రికి నివాళులు అర్పించటాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకూడా కోడ్ ఉల్లంఘించారని గౌతంరెడ్డి ఆరోపించారు. పోలీసులు కావాలనే ఈ విధంగా కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. గౌతమ్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు యాదల శ్రీనివాసరావు, కె.రత్నకుమార్, ఎం.రాజా, వి.చైతన్య, రుహుల్లాపై కేసు నమోదు చేసి సత్యనారాయణపురం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. వెంటనే ఇదే కేసుపై పాయకపురం పోలీసులు నాయకులను మళ్ళి అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. సత్యనారాయణపురం స్టేషన్‌లో 147, 148, 296 సెక్షన్లలపై మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు.

సవరించిన చట్టాల ప్రకారం పన్ను వసూలు
అజిత్‌సింగ్‌నగర్, జూలై 9: నగర పాలక సంస్థకు దీర్ఘకాలంగా ఉన్న ఆస్తిపన్ను బకాయిలను చెల్లించకుండా కోర్టుకు వెళ్ళిన పన్నుదారులపై కూడా సవరించిన చట్టాల ప్రకారం వెంటనే పన్ను వసూలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ జిఎస్ పండాదాస్ ఆదేశించారు. అలాగే పన్ను వసూళ్ళలో సిబ్బంది, అధికారులు ఎటువంటి అలక్ష్యం చేయకుండా సక్రమంగా విధులను నిర్వహించాలని, అలసత్వం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. నగర పరిధిలోని మూడవ సర్కిల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ పండాదాస్ మాట్లాడుతూ 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉన్న పన్ను బకాయిలను తక్షణమే వసూలు చేయాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సర్కిల్ పరిధిలోని సిఎంఏ కేసుల వివరాలు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేసులకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పన్ను చెల్లింపులో ఉత్పన్నమైన వివాదాలపై కోర్టుకు వెళ్ళిన కమర్షియల్ కాంప్లెక్స్‌ల అద్దెదారులకు ఆక్యుపెన్సీ నోటీసు ఇచ్చి పన్ను చెల్లించకపోతే సదరుషాపులను సీజ్ చేయుటకు గల అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. అదేవిధంగా కోర్టు కేసులో ఉన్న పన్నుదారులు తమ పాత పన్నుబకాయిలకు సంబంధించి డిడిలు, చెక్కుల ద్వారా చెల్లించిన యజమానులు తప్పని సరిగా ఆయా వార్డు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందజేయాలని సూచించారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా పన్ను చెల్లించకుండా ఉన్న బకాయిదారుల గృహాలకు చెందిన వౌళిక వసతులను కల్పించకుండా నిలిపివేయాలని అధికార్లను ఆదేశించారు. నగర పాలక సంస్థకు అనుకూలంగా వచ్చిన సిఎంఎ కేసులపై వెంటనే అవసరమైన చర్యలు చేపట్టి ఆస్తిపన్ను బకాయిలను తక్షణమే చల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పన్ను దారులు ఇచ్చిన చెక్కులు ఏవైనా బౌన్స్ అయిన వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి సంబంధిత యజమానులపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సర్కిల్ వారిగా ఆక్యుపెన్సీ సర్ట్ఫికేట్‌లో చూపిన కొలతలు ప్రకారం డివేషన్ లేకుండా ఉన్న వాటికి నెల లోపు అసెస్‌మెంట్ వేయాలన్నారు. ఆక్యుపెన్సీ సర్ట్ఫికేట్‌లో ఏవైనా డివియేషన్ ఉంటే వెంటనే రిపోర్టు రీ సర్వే చేసిన అసెస్‌మెంట్ వివరాలను వార్డు వారిగా ప్రోపర్టీ టాక్స్ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఎవరైనా వారి స్థలానికి కాని ఆస్తికి గానీ పన్ను వేయాలని అర్జీలు ధాఖలు చేసినప్పుడు సదరు ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలను నిశితంగా పరిశీలించి పన్ను వేయాలని తెలిపారు. కార్పొరేషన్‌కు చెందిన స్థలాలకు చుట్టూ ఫెన్సింగ్ వేసి కార్పొరేషన్ బోర్డులను ఏర్పాటుచేయాలన్నారు. ఈ సమావేశంలో సిఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం సత్యనారాయణరాజు, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) వెంకటలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ బి సాంబశివరావు పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్ ఉల్లఘించి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం
english title: 
gautham reddy

నామినేషన్లకు గడువు పూర్తి

$
0
0

నెల్లూరుసిటీ, జూలై 13: జిల్లా వ్యాప్తంగా శనివారం సర్పంచ్, వార్డు మెంబర్లుకు భారీగా నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ప్రధానంగా పంచాయితీల ఏకగ్రీవాలపై ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి.జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 9వ తేదీ నుండి జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. జిల్లాలోని 46 మండలాలలోని 931 పంచాయతీల సర్పంచ్ పదవులకు 4670 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు సభ్యులకు 22776 నామినేషన్లు దాఖలైనట్టు అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి తెలిపారు. ఆయన తన చాంబర్‌లో శనివారం విలేఖర్లతో మాట్లాడుతూ ఆదివారం స్క్రూట్నీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పొత్తుతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇదిలావుండగా కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్, తెలుగుదేశ పార్టీలు వార్డు మెంబర్లను సమానంగా పంచుకునేందుకు దృష్టి సారిస్తున్నారు. ఎలాగైనా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటూ ఒక్కరు కూడా వార్డు మెంబర్లు గెలవకుండా ఈ రెండు పార్టీలు సకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మండలాలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. అధికార పార్టీ కావడంతో మండల నాయకులు అంతా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే ప్రభావం కన్పిస్తుందన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ పాలన వలన పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, నిత్యావస వస్తువుల ధరలను ప్రజల్లోకి తీసుకుని పోయి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నాని చూస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి ఈ ఎన్నికలు అవసరమని గుర్తించిన అన్ని పార్టీలు గెలుపు గుర్రాలను పంచాయతీ ప్రెసిడెంట్‌లుగా ఎన్నికల బరిలో నిలబెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు మెంబగా ---మంది అభ్యర్థులు తమ నామిషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా జిల్లాలోని ఆయా పంచాయతీల్లో నామినేషన్ల పర్వం కోలాహలంగా జరిగింది. ఇదిలావుండగా జిల్లాలోని మండలాల వారిగా సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల నామినేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 931 పంచాతీయలకు అభ్యర్థులు భారీగానే నామిషన్లు దాఖలు చేశారు. జిల్లాలోని సైదాపురం, చిల్లకూరు మండలాల్లో మాత్రమే అధికంగా 31 పంచాయతీల్లో, ఆ తరువాత స్థానంలో ఉన్న పొదలకూరు మండలంలో 30 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మిగిలిన అన్ని మండలాల్లోను ఆ తరువాత సంఖ్య బహుళ్యంలో ఉన్న పంచాయతీలే. గతంలో జిల్లాలోనే అత్యధికంగా 32 పంచాయతీలతో ఉన్న నెల్లూరు రూరల్ మండలం ఆ స్థానం నుండి వెనుకబడింది. రూరల్ మండలంలోని 15 గ్రామ పంచాయతీలను నగరపాలక సంస్థలో విలీనం కావడంతో దీంతో కేవలం 17 పంచాయతీలతో మాత్రమే నెల్లూరు రూరల్ మండలం పరిమితమైంది. ఇదిలావుంటే మరో ఆరేడు నెలల్లో రానున్న సాధారణ ఎన్నికల్ని పురస్కరించుకుని బరిలో నిలిచే ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఇప్పటి స్థానిక పోరులో కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని గ్రామాలలో ఒకే పార్టీ నుండి ఇద్దరేసి, ముగ్గురేసి అభ్యర్థులు కూడా ఆయా రాజకీయ పక్షాల నుంచి మద్దతుదారులుగా పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా శనివారం సర్పంచ్,
english title: 
n

రాపూరులో ఎన్నికల కోలాహలం

$
0
0

రాపూరు, జూలై 13: జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారం పూర్తయింది. గత మూడు రోజులుగా మండలంలోని 21 గ్రామపంచాయతీలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల దరఖాస్తులు శనివారం సాయంత్రం పూర్తయింది. ఇందులో జోరేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా వెంకటరావమ్మ నామినేషన్ ఒక్కటే దాఖలు కావటంతో దాదాపుగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికానుంది. అలాగే రాపూరు గ్రామపంచాయతీకి టిడిపి, కాంగ్రెస్, వైకాపాలు బలపర్చే అభ్యర్థులతోపాటు మరికొందరు నామినేషన్లు దాఖలు చేసారు. ఇందులో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి బత్తిన శ్రీప్రియకు మద్దతుగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పెద్ద ఎత్తున అనుచరులు, అభిమానులతో ఊరేగింపుగా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి నలవడ్డ సునందన మద్దతుగా పిసిసి సభ్యులు, రాపూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు చెన్ను బాలకృష్ణారెడ్డి అనుచరులతో పెద్దఎత్తున ఊరేగింపుగా హాజరై నామినేషన్ దాఖలు చేయించారు. పిట్టబోయిన సుదర్శనమ్మ, తుమ్మలపల్లి శ్రీదేవి, బత్తిన లక్ష్మి, వెలుగోటి ప్రమీల, పి లక్ష్మిలు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసారు. మండలంలోని మొత్తం గ్రామపంచాయతీలకు 107 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 550 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసినట్టు మండల ఎన్నికల అధికారి, రాపూరు ఎంపిడిఓ గోపి తెలిపారు. కాగా చివరి రోజైన శనివారం వివిధ రాజకీయ పార్టీలు ర్యాలీలు, నినాదాలతో రాపూరు పట్టణం కోలాహలంగా మారింది.

ఎర్రచందన దొంగలు అరెస్ట్
సూళ్లూరుపేట,జూలై 13: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు వద్ద ఇటీవల ఎర్రచందన వాహనాన్ని వదిలి పరారైన ఇద్దరు దొంగలను శనివారం సూళ్లూరుపేట పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ అంకమరావు సమాచారం మేరకు చిత్తూరు జిల్లా తిరుచానూరు ప్రాంతానికి చెందిన దొంతి మణి, చంద్రవౌళిరెడ్డి, చేవూరి మధు అనే ముగ్గరు ఈ నెల 1న స్కార్పియో వాహనంలో చిత్తూరు జిల్లా నుండి 21 ఎర్ర చందన దుంగలను వేసుకొని కోటపోలూరుకు చేరుకొని, అక్కడ ఆలయ సమీపంలో వాహనాన్ని పొదలచాటు దాచిపెట్టి వెళ్లారు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ తన సిబ్బందితో అక్కడకెళ్లి వాహనాన్ని పరిశీలించగా అందులో ఎర్రచందన దుంగలున్నట్లు కనుగొన్నారు. దీంతో వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్మగ్లర్లకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శనివారం నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. ఈ మేరకు వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.

జగన్నాథ రథయాత్ర ప్రారంభం
గూడూరు, జూలై 13: గూడూరు పట్టణంలో కనీవినీ ఎరుగని రీతిలో శనివారం నెల్లూరు ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో దాతల ఔదార్యంతో గూడూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభం కాగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సొసైటీలోని దువ్వూరు నారాయణరెడ్డి పురమందిరం నుండి ఈ రథయాత్ర ప్రారంభించారు. ప్రారంభోపన్యాసంలో వక్తలు మాట్లాడుతూ జగన్నాథ రథయాత్రలో జగన్నాథుని దివ్య స్వరూపాన్ని దర్శించుకొని సేవించుకునే అవకాశం లభిస్తుందన్నారు. జగన్నాథ రథయాత్ర లక్షల సంవత్సరాల వైదిక సంప్రదాయంలో జరుగుతున్న దివ్య ఉత్సవమని పేర్కొన్నారు. ప్రస్తుత సమయంలో దీని ప్రాముఖ్యాన్ని గుర్తించి అన్ని పట్టణ ప్రాంతాల్లో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గూడూరులో మొట్టమొదటిసారిగా భక్తుల సహాయ సహకారాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రథం హైడ్రాలిక్ సిస్టంతో తయారుచేయడం వలన చిన్న చిన్న వీధుల్లో సైతం సునాయాసంగా నిర్వహించారు. ఈ యాత్ర డిఎన్‌ఆర్ టౌను హాలు నుండి ప్రారంభమై మార్కెట్ సెంటర్ మీదుగా సంగం థియేటర్, గాంధీబొమ్మ, బనిగీసాహెబ్ పేట, సుందరమహల్, టవర్ క్లాక్, రాజావీధి, కుమ్మర వీధి మీదుగా తిరిగి రాత్రికి టౌన్ హాలుకు చేరుకుంది. ఈ సందర్భంగా రథం ముందుగా వివిధ రకాల వాయిద్యాలు, కోలాటాలు, భజనలు, హరేరామ, హరేకృష్ణ నామ సంకీర్తన, భజంత్రీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తంజావూరు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా 108 వంటకాలు తయారుచేసి స్వామివార్లకు నైవేద్యంగా సమర్పించారు. రాత్రి చ్చప్పన్ భోగ్, హారతి, ముఖ్య దాతలు, సేవకులకు సన్మానం, దీప హారతులు, భక్తులకు తీర్థప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 5వేల మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుని రథాన్ని లాగారు.

కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం
పెళ్లకూరు, జూలై 13: మండల పరిధిలోని చిల్లకూరు నామినేషన్ కేంద్రం వద్ద శనివారం కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైకాపా మద్దతుదారులు నామినేషన్ వేసేందుకు వీలు లేదంటూ నామినేషన్ పత్రాలను దౌర్జన్యంగా లాక్కెళ్లి చించేశారు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చిల్లకూరు గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పాపాడి రాజగోపాలరెడ్డి తన సతీమణి కౌసల్యమ్మ చేత సర్పంచ్ స్థానానికి అభ్యర్థినిగా నామినేషన్ వేసేందుకు వెళ్లారు. ఎన్నికల అధికారికి తన నామినేషన్‌ను కౌసల్యమ్మ ఇవ్వబోతుండగా వెనుకే ఉన్న కాంగ్రెస్ మద్దతుదారులు కొందరు నామినేషన్ పత్రాలను బలంవంతంగా లాక్కొని బయటకు వెళ్లి చించేశారు.
కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడికి వ్యతిరేకంగా ఎవ్వరూ నామినేషన్ దాఖలు చేయడానికి కుదరదంటూ వీరంగం సృష్టించారు. దీంతో మనస్థాపం చెందిన రాజగోపాలరెడ్డి, కౌసల్యమ్మ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అక్కడ నుండి కొంచెం సేపు తరువాత నామినేషన్ దాఖలు చేయకనే వెళ్లిపోయారు. అనంతరం పాలుచూరు గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు అదే కేంద్రం వద్దకు రాగా వారిపైన కూడా చిల్లకూరు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గందరగోళం సృష్టించారు. ద్విచక్ర వాహనాలపై వైకాపా జెండాలను తొలగించాలని దౌర్జన్యం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా నాయుడుపేట సిఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు జోక్యం చేసుకొని వివాదం సద్దుమణిగిలే చేశారు. విషయం తెలుసుకొన్న గూడూరు డిఎస్పీ చౌడేశ్వరి చిల్లకూరు ఎన్నికల కేంద్రం వద్దకు చేరుకొని సంఘటన వివరాలను సిఐని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ నామినేషన్లు దాఖలు చేసే సమయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిర్భయంగా ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్లు దాఖలుచేసుకోవచ్చన్నారు. ఇందుకోసం తాము స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామన్నారు. ఎన్నికలను నిస్పక్షపాతంగా నిర్వహిస్తామని, ప్రజలు సమన్వయం పాటించి వివాదాలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం డిఎస్పీ నెలబల్లి కేంద్రాన్ని సందర్శించి సమస్యాత్మక గ్రామాల పరిస్థితులపై వాకాబు చేశారు.

ఏకగ్రీవం చేయలేదని మనస్థాపం చెంది ఆత్మహత్యా యత్నం
తడ, జూలై 13: తడ మండలం అండగుండాల గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఈసారి ఓసి మహిళకు కేటాయించారు. అక్కడ చిన్న పంచాయతీ కాబట్టి గ్రామ పెద్దలు కూర్చుని అభ్యర్థిని ఎంపిక చేశారు. తన భార్యను ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి ప్రయత్నించిన కారికాటి సుబ్రహ్మణ్యం, అలియాస్ శివయ్య ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు తెలిసింది. ఒక దశలో తన భార్యను నామినేషన్ వేయమని కోరినా ఆమె గ్రామ పెద్దల మాటలు మన్నించడంతో సుబ్రహ్మణ్యం మనస్థాపం చెంది శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతన్ని చెన్నైకి తరలించారు.

జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి
english title: 
r

నల్లమలలో కొనసాగుతున్న కూంబింగ్

$
0
0

మార్కాపురం, జూలై 13: నల్లమల అటవీప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేశామని మార్కాపురం ఓఎస్‌డి సమయ్‌జాన్‌రావు శనివారం భూమికి తెలిపారు. ప్రస్తుతం యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల పరిధిలోని అటవీప్రాంతంలో మూడుస్పెషల్ పార్టీలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని, మరో రెండు మూడురోజుల్లో పెద్దదోర్నాల, అర్ధవీడు, గిద్దలూరు ప్రాంతాల్లో మరో మూడుపార్టీలను పంపి కూంబింగ్ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. 68ప్రాంతాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. అలాగే గతంలో దళాల్లో పనిచేసి లొంగిపోయిన వారి దినచర్యలపై దృష్టి సారించామని తెలిపారు. అలాగే గతంలో అరెస్టు అయిన వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తెలిపారు. నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం లేదని, అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుచర్యగా నిత్యం నల్లమల అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు. ఎవరైనా విఐపిలు నల్లమల అటవీప్రాంతంలో ఎన్నికల సందర్భంగా పర్యటిస్తుంటే వారికి ప్రత్యేక భద్రత ఇవ్వడం జరుగుతుందని, ముందస్తు సమాచారం లేకుండా నేతలు ఎవరూ అటవీప్రాంతంలో పర్యటించరాదని, ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగిందని సమయ్‌జాన్‌రావు తెలిపారు. ఎమ్మెల్యే స్థాయిలో పర్యటన జరుపుతుంటే స్థానిక సిఐతోపాటు స్పెషల్‌పార్టీ ఆధ్వర్యంలో రక్షణ కల్పించడం జరుగుతుందని, మంత్రిస్థాయిలో పర్యటన ఉంటే డివైఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీల ఆధ్వర్యంలో రక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. ముందుగా బాంబ్‌డిస్పోజబుల్‌స్వ్కాడ్, డాగ్‌స్వ్కాడ్‌లతో మంత్రులు పర్యటించే రహదారులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. ఏదిఏమైనా నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేదని, ఉన్నప్పటికీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సమయ్‌జాన్‌రావు తెలిపారు.
ముందస్తు ఎన్నికలు తథ్యం:వెంకయ్య
కందుకూరు, జూలై 13: లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు రానున్నాయని, ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమిపాలు కావడం తథ్యం అని బిజెపి జాతీయ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం స్థానిక ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో విలేఖరులతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వ పాలన వలన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పతనం వలన రూపాయి విలువ రోజురోజుకి దిగజారి పతన స్థితికి చేరుకుందని ఆయన అన్నారు. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగి మధ్యతరగతి, సామాన్య ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పడరానిపాట్లు పడుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వలన సమస్యలు ఎదుర్కొన్న ప్రజానీకం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా అన్ని రాజకీయపార్టీలతో చర్చలు జరిపినా ఇంకా సమయం కావాలని అనడం విడ్డూరం అని ఆయన అన్నారు. సమావేశంలో కళాశాల కరస్పాండెంట్ కంచర్ల రామయ్య పాల్గొన్నారు.

కిట్స్‌లో మొబైల్ కంప్యూటర్ సెంటర్ ప్రారంభం
పెద్దారవీడు, జూలై 13: కృష్ణచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మొబైల్ కంప్యూటర్ కేంద్రాన్ని శనివారం జెఎన్‌టియు కాకినాడ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ తులసీరాందాసు ప్రారంభించారు. ఈసందర్భంగా వైస్‌చాన్స్‌లర్ మాట్లాడుతూ ఈ టెక్నాలజీ ప్రపంచ అత్యున్నత మూడు టెక్నాలజీల్లో ఒకటని, మొట్టమొదటిసారిగా విద్యార్థులచే అభివృద్ధి చేయిస్తామన్నారు. 2015నాటికి ఈ పరిజ్ఞానంపై 1.1కోట్ల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేశారన్నారు. ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ గ్రామీణప్రాంతంలో ఏర్పాటు చేసిన కిట్స్ కళాశాలలో ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. నూతన టెక్నాలజీతో విద్యార్థులు మేథాశక్తిని వ్యక్తిగత, వృత్తివిద్యను అందించడంలో ముందుండాలని తెలిపారు. కళాశాల చైర్మన్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యత పెంచడం కోసం ప్రపంచంలోనే గొప్పసవాల్‌ను ఎదుర్కోవడం కోసం ఈ మొబైల్ టెక్నాలజీని కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు. పలు సంస్థలు తమ విద్యాసంస్థలోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయని కళాశాల కార్యదర్శి అన్నా కృష్ణచైతన్య తెలిపారు. ఈకార్యక్రమంలో ఎఓ ప్రభాకర్, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి, అన్నా రంగనాయకులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన జెఎన్‌టియు విసి
కిట్స్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన గ్లోబరీనా ఎంప్లాయి బిలిటీ టెస్టు (గేట్)ను టెక్నాలజీ లిమిటెడ్ హైదరాబాద్ వారు 3,4 సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాన్ని జెఎన్‌టియు కాకినాడ వైస్‌చాన్స్‌లర్ జి తులసీరాందాసు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.

* పంచాయతీ ఎన్నికలకు మావోల ప్రభావం ఉండదు * మాజీలపై నిఘా పెంచాం : ఓఎస్‌డి
english title: 
n

నామినేషన్ దాఖలు గడువు పూర్తి

$
0
0

మర్రిపూడి, జూలై 13: మర్రిపూడి మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు 92 మంది సర్పంచ్ అభ్యర్థులకు, వార్డు మెంబర్లకు 377 మంది అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, ఎంపిడివో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం దాఖలైన నామినేషన్ల వివరాలు గుండ్లసముద్రం సర్పంచ్ అభ్యర్థికి 3, వార్డు మెంబర్లు 8, కెల్లంపల్లి సర్పంచ్‌కు 1, వార్డుకు 9, పొన్నూరు సర్పంచ్‌కు 2, కాకర్ల వార్డులకు 8, చిలంకూరు సర్పంచ్ 2, వార్డులకు 24, చీమట వార్డులకు 1, రేగలగడ్డ సర్పంచ్ 2, వార్డులకు 8, మర్రిపూడి సర్పంచ్ 6, వార్డులకు 28, అంకేపల్లి సర్పంచ్ 4, వార్డుకు 15, వల్లాయిపాలెం సర్పంచ్‌కు 3, వార్డుకు 9, గార్లపేట సర్పంచ్‌కు 3, వార్డులకు 29, కూచిపూడి సర్పంచ్ 1, వార్డులకు 4, వేమవరం సర్పంచ్ 4, వార్డులకు 28, జువ్విగుంట సర్పంచ్ 3, వార్డులకు 5, రావెళ్ళ వారిపాలెం సర్పంచ్ 1, వార్డు 10, తంగెళ్ళ సర్పంచ్ 6, వార్డులకు 18, నర్సరాజుపాలెం సర్పంచ్ 3, వార్డు 16, అయ్యపరాజుపాలెం సర్పంచ్ 6, వార్డులకు 14 మొత్తం మండలంలో చివరి రోజు శనివారం నాటికి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా 92 మంది, వార్డు మెంబర్ల అభ్యర్థులుగా 377 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎంపిడివో శ్రీనివాసరావు తెలిపారు.
దర్శిలో..
దర్శి: పంచాయతీ నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. మండలంలోని మొత్తం సర్పంచ్ పదవికి 125 మంది, వార్డు మెంబర్ పదవులకు 527 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దర్శి పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థికి 10 మంది, 20 వార్డులకు 111 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలో త్రిపుర సుందరీపురం పంచాయతీకి కావూరి లక్ష్మమ్మ ఒక్కతే పంచాయతీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలో మరో వ్యక్తి లేకపోవడంతో ఈమె ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బొట్లపాలెం సర్పంచ్‌కు 4, వార్డులకు 45 మంది, పొతకమూరు సర్పంచ్ 7, వార్డులకు 16 మంది, పాపిరెడ్డిపాలెం సర్పంచ్‌కు 5, వార్డులకు 16 మంది, తూర్పు వీరాయిపాలెం సర్పంచ్‌కు 5, వార్డులకు 18, పోతవరం సర్పంచ్‌కు 9, వార్డులకు 11, దేవవరం సర్పంచ్‌కు 5, వార్డులకు 11, తానం చింతల సర్పంచ్‌కు 5, వార్డులకు 12, వెంకటాచలంపల్లి సర్పంచ్‌కు 5, వార్డులకు 12 , మారెడ్డిపల్లి సర్పంచ్‌కు 2, వార్డులకు 8, చందలూరు సర్పంచ్‌కు 3, వార్డులకు 10, తుమ్మెదలపాడు సర్పంచ్‌కు 5, వార్డులకు 9, బసిరెడ్డిపాలెం సర్పంచులకు 2, వార్డులకు 8, బండి వెలిగండ్ల సర్పంచ్‌కు 7, వార్డుకు 16, ఎర్ర ఓబన పల్లి సర్పంచ్‌కు 2, వార్డులకు 10, రామచంద్రాపురం సర్పంచులకు 4, వార్డులకు 11, రాజంపల్లి సర్పంచులకు 8, వార్డులకు 48, జముకుల దినె్న సర్పంచులకు 6, వార్డులకు 13, కొత్తపల్లిసర్పంచులకు 5, వార్డులకు 11, కొర్లమడుగు సర్పంచులకు 5, వార్డులకు 10, పెద ఉయ్యాలవాడ సర్పంచులు 3, వార్డులకు 10, లంకోజనపల్లి సర్పంచులకు 6, వార్డులకు 29, తూర్పు వెంకటాపురం సర్పంచులకు 4, వార్డులకు 16, తూర్పు చవటపాలెం సర్పంచులకు 2, వార్డులకు 30, శామంతపూడి సర్పంచులకు 5, వార్డులకు 25 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్లు ఉప సంహరణ తరువాత ఎంత మంది బరిలో నిలుస్తారో తేలనుంది.
సంతనూతలపాడులో..
సంతనూతలపాడు : మండలంలో ఈ నెల 23న జరుగనున్న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఈ నామినేషన్లు చివరి రోజు కావడంతోప్రధాన రాజకీయ పార్టీలు సర్పంచ్ అభ్యర్థులను వేయించారు. మండలంలో 17 పంచాయతీ సర్పంచ్ పదవులకు గానూ 95 నామినేషన్లు దాఖలు అయ్యాయి. పి గుడిపాడు 4, కొనగానివారిపాలెం 4, చిలకపాడు 4, పి తక్కెళ్ళపాడు 4, ఎం వేములపాడు 4, మద్దులూరు 5, కామేపల్లి వారిపాలెం 3, సంతనూతలపాడు 5, గురువారెడ్డిపాలెం 9, లక్ష్మీ పురం 6, రుద్రవరం 5,మైనంపాడు 6, ఎండ్లూరు 5, గుమ్మనంపాడు 5, ఎనికపాడు 5, చండ్రపాలెం 4, బొడ్డువానిపాలెం 8 చొప్పున పంచాయతీ సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.
యర్రగొండపాలెంరూరల్‌లో..
యర్రగొండపాలెంరూరల్: చివరి రోజైన శనివారం పలుపార్టీల అభ్యర్థులు భారీఎత్తున జనసమీకరణతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైపాలెంలో మురారిపల్లి, గోళ్ళవిడిపి, యర్రగొండపాలెం గ్రామపంచాయతీలకు సంబంధించిన సర్పంచ్, వార్డులకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరుపున వైపాలెం మాజీఎంపిపి ఎంసిహెచ్ మంత్రునాయక్ సతీమణి శాంతాభాయి తన నామినేషన్‌ను వివిధ నాయకుల ఆధ్వర్యంలో దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్, మాజీఎంపిపి ఎంసిహెచ్ మంత్రునాయక్, మాజీసర్పంచ్‌లు ఒంగోలు మూర్తిరెడ్డి, షేక్ సయ్యద్‌కాశీం, సీనియర్ నాయకులు ఇమ్మడిశెట్టి సుబ్బారావు, సూరె రమేష్, వివిధ సామాజకవర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా టిడిపి తరుపున సొరకాయల మంగమ్మ తన నామినేషన్‌ను మండలంలోని టిడిపికి చెందిన వివిధ నాయకుల ఆధ్వర్యంలో దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి త్రిసభ్య కమిటీ సభ్యులు చేకూరి ఆంజనేయులు, జిల్లా టిడిపి మైనార్టీసెల్ నాయకులు షేక్ జిలానీ, గోళ్ళ సుబ్బారావు, సూరె శ్రీనివాస్, తోట మహేష్, అడుసుమల్లి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. గోళ్ళవిడికి చెందిన పాశం ఆవులయ్య సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మిల్లంపల్లి పంచాయతీకి సర్పంచ్ పదవికి మురారిపల్లి గ్రామానికి చెందిన గురవయ్య నామినేషన్ దాఖలు చేశారు. వైపాలెం సెంటర్‌లో మురారిపల్లి, గోళ్ళవిడిపి, వైపాలెం పంచాయతీలకు చెందిన వార్డులకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
జోరుగా చేరికలు
జరుగుమల్లి, జూలై 13: మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధిలో పీరాపురం గ్రామంలోని 100కుటుంబాలు కాంగ్రెస్‌పార్టీ నుంచి వైఎస్‌ఆర్ సిపిలో మండల కన్వీనర్ గాలి శ్రీను ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు సమక్షంలో చేరారు. ఈసందర్భంగా జూపూడి ప్రభాకరరావు పార్టీలో చేరిన వారికి కుండువాతో ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో స్వర్ణ రవీంద్రబాబు, కొండపి మండల వైఎస్‌ఆర్ సిపి కన్వీనర్ ఉపేంద్ర, ఎ పోలయ్య, మాల్యాద్రి, గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉలవపాడులో...
ఉలవపాడు : శనివారం ఉలవపాడులో పలువురు టిడిపి నుండి వైఎస్‌ఆర్ సిపి తీర్థం పుచ్చుకున్నారు. 6వ వార్డు మాజీ సభ్యుడితోపాటు జాలరి సంఘం నాయకులు పసుపులేటి వేణు, యాదవ సంఘం నాయకుడు బుర్రా శ్రీనివాస్‌యాదవ్ తదితరుల ఆధ్వర్యంలో 50మంది వైఎస్‌ఆర్ సిపి తీర్థం పుచ్చుకున్నారు. మండల వైఎస్‌ఆర్ సిపి నాయకుడు రామల సింగారెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్‌ఆర్ సిపిలో చేరినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ దార్ల కోటేశ్వరరావు, నాయకులు జిలానీబాషా, ఎస్‌కె ముజీబ్ తదితరులు పాల్గొన్నారు
34మందిపై బైండోవర్ కేసులు నమోదు
సిఎస్‌పురం, జూలై 13: మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 34మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్‌కె లాల్‌అహ్మద్ తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సిపిలకు చెందిన ఎ కొత్తపల్లిలో 11మంది, ఆనికాళ్లపల్లిలో 11మంది, నల్లమడుగులలో 12మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు.

కె ఉప్పలపాడులో చెక్‌పోస్టు ఏర్పాటు
కొండపి, జూలై 13: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అనథరైజ్డ్‌గా మండలంలోకి మద్యం, ధనం ట్రాన్స్‌ఫోర్టు కాకుండా నిరోధించేందుకు కె ఉప్పలపాడు గ్రామంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసినట్లు శింగరాయకొండ సిఐ అశోకవర్ధన్ తెలిపారు. శనివారం ఆయన కొండపి మండలంలోని సమస్యాత్మక గ్రామాలను సందర్శించారు. ఈసందర్భంగా గ్రామాలలో మద్యం, ధనం పంపిణీ చేయడం జరుగుతున్నట్లు తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈసందర్భంగా కె ఉప్పలపాడు, పెట్లూరు తదితర గ్రామాలను సందర్శించారు. సిఐతోపాటు కొండపి ఎస్సై జి సోమశేఖర్ తదితరులు ఉన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
కనిగిరి రూరల్, జూలై 13: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నగర పంచాయతీ కనిషనర్ లక్ష్మిరాజ్యం అన్నారు. శనివారం స్థానిక ఎంఆర్‌సి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా కాలుష్యాన్ని నివారించుకోవచ్చునని ఆమె అన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి కాలుష్య నివారణకు సహకరించాలని ఆమె కోరారు. ఈకార్యక్రమంలో ఎంఇఓ జి సుబ్బత్తమ్మ, నగర పంచాయతీ సిబ్బంది ఖాజామొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

హైడ్రామా ఉద్రిక్తల నడుమ వైఎస్‌ఆర్‌సిపి నామినేషన్
కందుకూరు: మండల పరిధిలోని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి స్వగ్రామమైన మాచవరంలో ఉద్రిక్తల నడుమ వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి తరపున వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ, నియోజకవర్గ సమన్వయకర్తలు ఉన్నం వీరాస్వామి, తుమాటి మాధవరావు, మండల కన్వీనర్ పువ్వాడి రమణయ్య, నాయకులు గంగిరెడ్డి, చిరంజీవిరెడ్డి ఆధ్వర్యంలో దాసరి పోతులూరయ్య నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి శనివారం అందజేశారు. ఈసందర్భంగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత పదిరోజులుగా గ్రామంలో పోటీ లేకుండా ఏకగ్రీవం చేసేందుకు మంత్రి మహీధర్‌రెడ్డి గ్రామంలోని అన్ని సమాజిక వర్గాల పెద్దలతో చర్చించి ఏకగ్రీవం ఆమోదానికి ఒప్పించినట్లు సమాచారం. గ్రామంలోని ఒప్పందాన్ని తెలుసుకున్న వైఎస్‌ఆర్ సిపి సర్పంచ్ అభ్యర్థి పోతులూరయ్య రెండు రోజులుగా అదృశ్యమయ్యాడు. పోటీ లేదని భావిస్తున్న తరుణంలో వైఎస్‌ఆర్‌సిపి జిల్లా నాయకులు కలుగజేసుకుని అభ్యర్థి తరపున ప్రతిపాదించిన వ్యక్తులతో నామినేషన్ దాఖలు చేయించడం నియోజకవర్గంలో ఆసక్తికర అంశంగా మారింది. రిటర్నింగ్ అధికారి ఆదివారం ఉదయం 11గంటలకు తనముందు హాజరు పరచాలని నాయకులకు సూచించారు. ఏది ఏమైనా నామినేషన్ల ఉపసంహరణకు గడువు మరో నాలుగు రోజులు ఉండడంతో గ్రామస్థులను కాదని అభ్యర్థి నిలబడతాడా అనే చర్చలు జరుగుతున్నాయి. వైఎస్‌ఆర్ సిపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో కాంగ్రెస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా మంత్రి సూచన మేరకు పాలేటి బాలయ్య నామినేషన్ దాఖలు చేయడంతో నాలుగు దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న సర్పంచ్ పదవికి ఈసారి రసవత్తర పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినీహీరో కమలాకర్ మృతికి పలువురు సంతాపం

చీమకుర్తి, జూలై 13: చీమకుర్తికి చెందిన వర్తమాన సినీనటుడు బూచేపల్లి కమలాకర్‌రెడ్డి అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. కమలాకర్ దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పెద్ద కుమారుడు. ఈ వార్త తెలియగానే ప్రకాశం జిల్లా అన్నీ పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలివచ్చారు. వైఎస్ ఆర్ సిపి గౌరవాధ్యక్షులు విజయమ్మ, వైవి సుబ్బారెడ్డి మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. మృత దేహాన్ని చైనె్న నుండి శనివారం ఉదయం 11 గంటలకుచీమకుర్తి స్వగృహానికి తీసుకొని వచ్చారు. చీమకుర్తి మండల ప్రజలు, దర్శి నియోజక వర్గ ప్రజలు వేలాదిగా తరలి వచ్చి మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కమలాకర్‌రెడ్డి అభి, హాసిని, సంచలనం, బ్యాండ్‌బాలు చిత్రాల్లో హీరోగా నటించారు. కమలాకర్‌రెడ్డి మృతి చెందడంతో యూనిట్ సభ్యులందరూ చీమకుర్తికి వచ్చి బోరున విలపించారు. కమలాకర్‌రెడ్డి చిన్న వయస్సులోనే మృతి చెందడాన్ని తల్లిదండ్రులు బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే , కమలాకర్‌రెడ్డి సోదరుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి దంపతులు ఆవేదన వర్ణనాతీతం. సోదరి ధనలక్ష్మి, బావ రూపేష్‌లు అన్నయ్య ఇక లేడంటూ బోరున విలపించడంతో చూపరులను కలిచి వేసింది. ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులరెడ్డి , తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్థన్, పలు గ్రానైట్ గెలాక్సీ క్వారీల యజమానులు, మేనేజర్లు , సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్‌కుమార్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కరణం బలరామకృష్ణమూర్తి, జిల్లా డైయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, మాజీ జడ్పి చైర్మన్ కాటం అరుణమ్మ, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, వ్యాపార వేత్తలు శిద్దా హనుమంతరావు, శిద్దా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కెపి కొండారెడ్డి, స్థానిక తహసీల్ధార్ పేరయ్య, డాక్టర్ అమృతపాణి, ఎ ఎంసి చైర్మన్ మారం వెంకారెడ్డి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తదుపరి కమలాకర్‌రెడ్డి మృత దేహాన్ని ఊరేగింపుగా స్మశానికి తీసుకొని వెళ్లి భారీ ఎత్తున అంత్యక్రియలు నిర్వహించారు.
దర్శిలో..
దర్శి: సినీహీరో, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి సోదరుడు కమలాకర్ రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ప్రముఖ పారిశ్రామికవేత్త మునగా నరసింహారావు, బిజెపి మండల నాయకులు పిల్లి నారాయణరెడ్డి, మాజీ ఎంపిపి ఇత్తడి దేవదానం, మాజీ సర్పంచ్ చంద్రగిరి గురువారెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి మండల కన్వీనర్ వెన్నపూస వెంకట రెడ్డి, ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ సోము దుర్గారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె అంజిరెడ్డి, ఆ పార్టీ నాయకులు వెన్నపూస బాపిరెడ్డి, కొడవటి జాన్ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయి :అన్నా
కొమరోలు, జూలై 13: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ బలపరచిన అభ్యర్థుల విజయానికి దోహదపడుతాయని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేర్కొన్నారు. శనివారం కొమరోలు గ్రామపంచాయతీ పదవికి కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి గుర్రం అల్లూరయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ, నామినేషన్ల దాఖలు కార్యక్రమాలకు అన్నా రాంబాబు హాజరయ్యారు. గజ్జలకొండ సుబ్బయ్య రైస్‌మిల్లు నుంచి బయలుదేరిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సర్పంచ్, వార్డుపదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో స్టేజీ-1 ఎన్నికల అధికారి ఎం లక్ష్మీనాయక్ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అల్లూయ్య నామినేషన్ దాఖలు చేయగా కొమరోలు పంచాయతీలోని 16వార్డులకు కాంగ్రెస్‌పార్టీ బలపరచిన అభ్యర్థులు నామినేషన్లు అందచేశారు. ఎమ్మెల్యే రాంబాబు విలేఖరులతో మాట్లాడుతూ 2009కి ముందు జరిగిన అభివృద్ధి తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కొమరోలు మండలంలో జరిగిన అభివృద్ధిని ఓటర్లు గుర్తుచేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు ఎన్ సుబ్బరాయుడు, మాజీజడ్పిటిసి సభ్యులు ఎస్ వెంకటనాయుడు, నేతలు ఎన్ వెంగయ్యచౌదరి, ఎ సుబ్రహ్మణ్యం, ఎస్ జనార్ధన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు

చీకటి రాజకీయాలు చేసేవారికి
ఓటు అడిగే హక్కులేదు
మార్కాపురం, జూలై 13: చీకటి ఒప్పందాలతో రాజకీయాలు చేసేవారికి ప్రజలను ఓటుఅడిగే హక్కులేదని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. శనివారం ఆయనను కలిసిన భూమితో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌కు ఓటు వేయాలని అనుకునే కాంగ్రెస్ నాయకులు అధికార కాంగ్రెస్‌పార్టీని అడ్డం పెట్టుకొని సంపాదించిన సొమ్మును అనాధశరణాలయానికి అప్పగించి వైఎస్‌ఆర్‌సిపికి ఓటు వేయాలని కందుల హితవు చెప్పారు. నిన్నమొన్నటి వరకు వైఎస్‌ఆర్‌సిపి తమకు బద్దవైరమని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు నేడు పదవుల కోసం ఒకటిగా మారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వీరి కుట్రలను సామాన్యప్రజలు గుర్తించి బుద్ధి చెబుతారని అన్నారు. రెండు పార్టీలు వేరువేరుగా పోటీచేస్తే టిడిపిని ఎదుర్కోలేమనే భయంతో కలిసి పోటీచేసి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని కందుల ఆరోపించారు. మార్కాపురం నియోజకవర్గంలో అధికశాతం కాంగ్రెస్‌పొత్తుతో వైఎస్‌ఆర్ సిపి అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ రెండుపార్టీల రాజకీయకుట్రను ప్రజలు గ్రహించారని, అసహించుకునే సమయం ఆసన్నమైందని కందుల అన్నారు. కాలంగడుపుకునే రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే రాజకీయాలు ఉండాలని హితవు పలికారు. ఎవరెన్ని కుటిల రాజకీయాలు చేసినా విజయం టిడిపిదేనని కందుల ధీమా వ్యక్తం చేశారు.

అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్య ఎస్‌ఎస్‌ఎన్‌కే సాధ్యం

సంతనూతలపాడు, జూలై 13: విలువైన విద్యకు, నాణ్యమైన బోధనకు విద్యార్థుల నమ్మకమే ఎస్‌ఎస్‌ఎన్ విద్యా సంస్థలు అని, ఆ విద్యా సంస్థల చైర్మన్ యల్లటూరి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పాలిటెక్నిక్ విద్యార్థులు లెటరన్ ఎంట్రీ ద్వారా ఎస్‌ఎస్‌ఎన్ ఇంజనీరింగ్ కాలేజీని ఆప్షన్స్ ద్వారా ఎంచుకున్నారని ఆయన తెలిపారు. ఈ విద్యా సంస్థను పాలిటెక్నిక్ విద్యార్థులు అత్యధికంగా 96మంది ఇంజనీరింగ్ ఆయా బ్రాంచ్‌లకు చెందిన ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు మక్కువ చూపడంతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఎస్‌ఎస్‌ఎన్ ను నిలబెట్టారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎస్‌ఎస్‌ఎన్ విద్యా సంస్థల పట్ల ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింత చూరగొనే విధంగా వారికి విలువైన, నాణ్యమైన సాంకేతిక విద్యను అందించేందుకు ఎస్‌ఎస్‌ఎన్ విద్యా సంస్థలు కృతనిశ్చయంతో ముందుకు వెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విద్యా సంస్థల అభివృద్దికి సహకరిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఎస్‌ఎస్‌ఎన్ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య కోసం మైక్రోసాఫ్ట్‌తో ఈ సంవత్సరం నుండి ఒప్పందం చేసుకున్నామని, గతంలో కూడా హెచ్‌జి, ఐబియం, జోకాంపస్‌తో కూడా ఒప్పందం చేసుకొని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించేందుకు ఎస్‌ఎస్‌ఎన్ విద్యా సంస్థలు ఎప్పుడూ ముందు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

మర్రిపూడి మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు
english title: 
n

మామా అల్లుళ్ల ఎత్తులు పై ఎత్తులు

$
0
0

శ్రీకాకుళం, జూలై 13: దశాబ్ధాల చరిత్ర కలిగిన రాజకీయ నేపథ్యం ఉన్న తమ్మినేని కుటుంబం ఇంటిపోరు రచ్చకెక్కింది.!. అల్లుడు, మామలు అంతర్యుద్ధం బంధుత్వాలను బలాదూర్ చేసి పంచాయతీ రాజకీయాల సాక్షిగా మరోమారు రచ్చకెక్కడంతో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి తమ్మినేని స్వగ్రామమైన తొగరాంలో సర్పంచ్ పదవి కోసం తోటి కోడలు బరిలో దిగడం వెనుక తమ్మినేని, కూన ప్రత్యన్నయుద్ధం సుస్పష్టమైంది. అలాగే కూన రవికుమార్ ఇలాకా అయిన పెనుబర్తిపై పట్టు సాధించాలన్న లక్ష్యంతో మాజీ మంత్రి తమ్మినేని, రవికుమార్ మద్దతుదారున్ని ఓడించాలన్న సంకల్పంతో వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఉప్పు- నిప్పులా ప్రత్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేయడం రాజకీయ విజ్ఞులు తప్పుబడుతున్నారు.
రాష్ట్రంలోనే అత్యంత వివాదస్పద రాజకీయ ఆధిపత్య నియోజకవర్గంగా నిలిచిన ఆమదాలవలసలో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరాటం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికే మింగుడుపడడం లేదు. టిడిపిలో ఒకే కుటుంబీకులైన మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఆయన మేనల్లుడు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కూన రవికుమార్‌ల మధ్య వర్గపోరాటం తారాస్థాయికి చేరింది. దివంగత కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం తరువాత పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు మామ, అల్లుళ్ల మధ్య విభేదాలను దూరం చేసి సయోధ్యతో ముందుకు సాగుతారన్న నియోజకవర్గ పార్టీ కేడర్ ఆశలు వీరు అనుసరిస్తున్న వైఖరితో అడియాసలయ్యాయి. వారి ఆధిపత్యానికి గ్రామ పంచాయతీ ఎన్నికలే వేదికలుగా మారాయి. ప్రత్యర్ధి అభ్యర్థులను ఈ పంచాయతీ ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా ఇరువురు పెట్టుకున్నారు. మండలంలో రవికుమార్ సొంత పంచాయతీ అయిన పెనుబర్తిలో ఆయన బలపరిచిన అభ్యర్థిని ఓడించేందుకు తమ్మినేని రంగం సిద్ధం చేస్తున్నారు. రవికుమార్ బలపరిచిన ఆయన సోదరుడు కూన సత్యనారాయణ సతీమణి సుధపై పోటీగా నిలిచిన కూన గోపికి మద్దతుగా తమ్మినేని సీతారాం తడాఖా చూపాలని పావులు కదుపుతున్నారు. మాజీ మంత్రి తమ్మినేని ఇలాకా అయిన తొగరాం పంచాయతీలో ఆయన బలపరిచిన సోదరుడు దివంగత విజయవర్థనరావు భార్య శారదపై దివంగత దేశం నేత తమ్మినేని శ్యామలరావు భార్య భారతమ్మను నిలిపి గెలిపించి రవికుమార్, సీతారాంకు ఝలక్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఆదివారం నుండి పంచాయతీ ఎన్నికల పోలింగ్ వరకు మాజీ మంత్రి సీతారాం పెనుబర్తిలో మకాం వేయగా ఆయనకు ధీటుగా తొగరాంలో రవికుమార్ తిష్టవేసి తన పట్టుదలను నిజం చేసేందుకు ఇప్పటికే నిర్ణయించుకోవడం పార్టీ కేడర్‌కు మింగుడు పడడం లేదు. జరుగనున్న ఎన్నికల్లో ఎవరి అభ్యర్థులు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

ముగిసిన నామినేషన్ల పర్వం
ఇక యుద్ధం ఆరంభం

శ్రీకాకుళం, జూలై 13: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు శనివారం ఐదు గంటలతో ముగియడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ పది మంది కలిసినా పంచాయతీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఎత్తులు...పై ఎత్తులు, పొత్తులు..బుజ్జగింపుల్లో బిజిగా నాయకులు ఉన్నారు. స్థానికంలో పట్టుసాధించేందుకు ప్రధాన పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. గతంలో వచ్చిన స్థానాలకంటే అధికంగా గెలుచుకోవడానికి వ్యూహంతో ప్రధాన రాజకీయ పక్షాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే అనేక మంది తెరవెనుక ఒప్పందాలతో ఏకగ్రీవం బాటలో పయనించగా మరికొంతమంది మనం..మనం బరంపురం అన్న సామెత మాదిరిగా సామాజిక అస్త్రాలతో చీకటి ఒప్పందాలకు తెరలేపుతున్నారు. బంధుత్వాలు, బంధాలను పక్కనపెట్టి రక్తసంబంధాలను బలాదూర్ చేసే మాదిరిగా అన్నదమ్ములు, తోటికోడళ్లు, అల్లుడు-మామలు బరిలో దిగిన సందర్భాలు జిల్లాలో అనేక చోట్ల కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వగ్రామమైన మబగాం ఏకగ్రీవం బాటలో కొనసాగడం ధర్మాన కుటుంబీకులు ఐక్యతారాగం ఆలపించినట్లయింది. శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో రూరల్ మండలంలో పది గ్రామ పంచాయతీలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కరువవ్వడం మాజీ మంత్రి గుండ ఉనికిని ప్రశ్నించినట్లయింది. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఇలాకా అయిన తొగరాంలో తోటికోడలు యుద్ధం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. కొత్తూరు మండలంలో పొన్నుటూరు పంచాయతీని ఎస్టీ మహిళకు కేటాయించినప్పటికీ ఆ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు గ్రామంలో లేకపోవడం వల్ల ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం విశేషం. థర్మల్‌యుద్ధ భూమిగా మారిన బీల పరిసర పంచాయతీల్లో పర్యావరణ ప్రేమికులే సర్పంచ్ కిరీటాలను అందిపుచ్చుకుని ప్రధాన పార్టీల ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చడం గమనార్హం. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పోటాపోటీగా నామినేషన్ ఘట్టంలో కదం తొక్కినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకబడి ఉందనే చెప్పాలి. ఈ మూడు పార్టీలను రెబల్స్ బెడద కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఉపసంహరణలు నాటికి తిరుగుబాటు అభ్యర్థులు ఎటువైపు బావుటా ఎగురవేసి పార్టీ నాయకత్వాలను సంక్లిష్ట పరిస్థితుల్లో నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో నామినేషన్ ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి 13వ తేదీవరకు పోలైన నామినేషన్లు 29,293గా సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరుగనున్న శ్రీకాకుళం డివిజన్‌కు సంబంధించి 349 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు గాను 1962 మంది అభ్యర్థులు, 3,428 వార్డులకు గాను 8,869 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరుగనున్న పాలకొండ డివిజన్‌కు సంబంధించి 378 పంచాయతీల్లో 1,774 మంది సర్పంచ్లు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా 3,522 వార్డుమెంబర్ స్థానాలకు 8,149 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 31న ఎన్నికలు జరుగనున్న టెక్కలి డివిజన్‌కు సంబంధించి 364 పంచాయతీలకు 1,994 మంది నామినేషన్లను దాఖలు చేయగా 3,500 వార్డులకు 6,548 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీన నామినేషన్ల పరిశీలన, తుది పరిశీలన ఉంటుందని, జిల్లా పంచాయతీ శాఖాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఈ దఫా కూడా సుమారు 250 పైబడి ఏకగ్రీవాలు జరిగినట్లు అధికారులు చెబుతుండగా పూర్తిస్థాయి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

* పెనుబర్తిలో తమ్మినేని * తొగరాంలో కూన * టిడిపిలో గందరగోళం
english title: 
mm

ప్రశాంత ఎన్నికలకు చర్యలు: కలెక్టర్

$
0
0

శ్రీకాకుళం, జూలై 13: జిల్లాలో ఈ నెల 23, 27, 31వ తేదీల్లో జరుగబోవు పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్పష్టం చేశారు. శనివారం జరుగబోవు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా రాష్ట్ర ఎన్నికల పరిశీలకులకు ఎన్.ఐ.సి. కేంద్రంలో వివరించారు. మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, అందులో 23న శ్రీకాకుళం డివిజన్‌లోను, 27న పాలకొండ డివిజన్‌లోను, 31 టెక్కలి డివిజన్‌లోను పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 553 పంచాయతీలుండగా 5,43,801 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. పాలకొండ డివిజన్‌లో 378 పంచాయతీల్లో 4,73,098 మంది ఓటర్లున్నారని, టెక్కలి డివిజన్‌లో 364 పంచాయతీలకు గాను 5,37,843 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ అధికారులుగా 10,496 మందిని, సహాయ పోలింగ్ అధికారులుగా 12,008 మందిని నియమించామన్నారు. రిజర్వు సిబ్బందిగా 24,786 మందిని ఉంచామని తెలిపారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఈ ప్రజంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు బి.బాలామాయాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషాఖాసీం, డిపిఒ వెంకటేశ్వర్లు ఉన్నారు.

‘గిరిపుత్రులను మోసగించడం తగదు’
శ్రీకాకుళం, జూలై 13: రామగిరి క్షేత్రం, ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న కనె్నధార కొండ లీజ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గిరిపుత్రులను తప్పుతోవపట్టించి వారి కడుపుకొడుతున్నారని ఉత్తరాంధ్ర సాదుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానందస్వామి ఆరోపించారు. గిరిజనుల గ్రామదేవతలతోపాటు సీతా రామలక్ష్మణుల విగ్రహాలకు పూజలు చేస్తున్న గిరిజనులకు మభ్యమాటలతో కనె్నధార కొండను కొల్లగొట్టాలని చూస్తున్నారన్నారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ స్థానిక అధికారుల నివేదికను పక్కనపెట్టి, జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా నివేదికను సమర్పించడం ద్వారా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు స్థానికులకు న్యాయం చేకూరుతుందని అభిలషించారు. భగవంతుని పట్ల నీతి తప్పిన నాయకులు ఎవరైనా శిక్ష అనుభవించకతప్పదని సిటిజన్‌ఫోరం అధ్యక్షులు బరాటం కామేశ్వరరావు అన్నారు. అఖిలపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శిమ్మ వెంకట్రావు, ధనుంజయ్‌రావు, దున్న దీన, గొలివి నర్సునాయుడు, దేశం పార్టీ, బిజెపి నాయకులు ఎస్.వి.రమణమాదిగ, ఎస్.ఉమామహేశ్వరి, సూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వరాహనృసింహస్వామిగా జగన్నాథుడు
శ్రీకాకుళం, జూలై 13: జగన్నాథుడు శనివారం భక్తులకు వరహానృసింహస్వామిగా దర్శనమిచ్చాడు. శ్రీమన్నారాయణుని దర్శనం రోజుకో విధంగా కలగడంతో భక్తులు పరవశించిపోతున్నారు. స్థానిక ఇలిసిపురం గుడించా మందిరంలో బలభద్ర, సుభద్ర సమేత స్వామివారిని దర్శించడానికి భక్తులు బారులు తీరారు. పూరీకి చెందిన పలహరి మహంతి రఘువీర్‌దాస్ బావాజీ నిర్వహణలో ఒడిశా విధానాలనుసరించి జరిగిన పూజల్లో బాలకృష్ణపాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రియమైన శనివారం సెలవు దినం కావడంతో కుటుంబాలతో స్వామి దర్శించుకోవడం కనిపించింది. భక్తుల రద్దీని నియంత్రించడానికి పోలీసులు అవస్థలు పడ్డారు. అదేవిధంగా అరసవల్లి సూర్యనారాయణస్వామి, మొండేటివీధి లక్ష్మీగణపతి ఆలయాలతోపాటు పట్టణంలో వివిధ రామమందిరాల్లో జగన్నాథస్వామి పేరున స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు.

ఫైళ్ల గల్లంతుపై చర్యలు హర్షణీయం
-- మాజీ మంత్రి గుండ --
శ్రీకాకుళం , జూలై 13: జిల్లాలో ముఖ్యమైన విభాగాలకు చెందిన ఫైళ్లు గల్లంతుపై జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష చర్యలకు ఆదేశించడం ముదావహమని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఇదివరకే జిల్లాలో ఫైళ్లు, పత్రాలు గళ్లంతవుతున్నాయని తెలుగుదేశం పార్టీ తరపున అనేక పర్యాయాలు తెలియపర్చామన్నారు. దీనిపై అధికారులు పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ పట్టించుకోలేదని ఆరోపించారు. నేడు ఉద్యోగుల సమావేశంలో జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు హనుమంతు సాయిరాం కలెక్టర్ దృష్టికి బి.సి సంక్షేమ శాఖలో ఫైళ్ల గల్లంతుపై ప్రశ్నించగా కలెక్టర్ చర్యలకు ఆదేశించడం హర్షించదగ్గదిగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, రోణంకి మల్లేశ్వరరావు, గొర్లె కృష్ణారావు, గుత్తు చిన్నారావుతదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఈ నెల 23, 27, 31వ తేదీల్లో జరుగబోవు పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా
english title: 
p

ముగిసిన నామినేషన్ల ఘట్టం

$
0
0

విశాఖపట్నం, జూలై 13: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో మూడు విడతలుగా జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 9 నుంచి నామినేషన్ల స్వీకరణను ప్రారంభించారు. జిల్లాలోని 39 మండలాల్లో శనివారం రాత్రి 10 గంటల సమయానికి అందిన వివరాల ప్రకారం సర్పంచ్ పదవులకు 4961 నామినేషన్లు దాఖలుకాగా, వార్డు సభ్యులుగా 21,605 మంది అభ్యర్థులు నామినేషన్ల వేశారు. జిల్లాలో జిల్లాలో 920 పంచాయతీలు, 9,214 వార్డు పదవులున్నాయి. విశాఖపట్నం డివిజన్‌కు సంబంధించి ఆరు మండలాల్లో పంచాయతీ సర్పంచ్ పదవులకు 1064 నామినేషన్లు, వార్డు సభ్యులుగా 2741 నామినేషన్లు దాఖలయ్యాయి. అనకాపల్లి డివిజన్‌కు సంబంధించి 12 మండలాల్లో సర్పంచ్ పదవులకు 1703, వార్డు సభ్యులుగా 8296 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే నర్సీపట్నం డివిజన్ పరిధిలో 10మండలాలకు సంబంధించి సర్పంచ్‌లుగా 1150, వార్డు సభ్యులుగా 6595 మంది నామినేషన్లు వేశారు. అలాగే పాడేరు మండలంలో 1488 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవులకు, 3973 మంది అభ్యర్థులు వార్డు మెంబర్లుగాను నామినేషన్లు దాఖలుచేశారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. సక్రమంగా లేని నామినేషన్లను అదేరోజున తిరస్కరిస్తారు. అభ్యంతరాలను 16వతేదీన పరిష్కరించుకోవచ్చు. 17వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. పాడేరు డివిజన్‌లో నెల 23న, విశాఖపట్నం, నర్సీపట్నం డివిజన్లలో ఈనెల 27న, అనకాపల్లి డివిజన్‌లో ఈనెల 31న పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ జరిగిన రోజునే ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలను ప్రకటిస్తారు.

పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టండి
* తెదేపా శ్రేణులకు యనమల ఆదేశం
విశాఖపట్నం, జూలై 13: పంచాయతీ ఎన్నికల విజయం సాధించడం తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా భవిష్యత్‌లో తెలుగుదేశం పార్టీకి ఎదురుండదని నిరూపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. పాతబస్తీలోని శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారిని శనివారం దర్శించుకున్న యనమల కొద్దిసేపు పార్టీ ప్రతినిధులతో ముచ్చటించారు. స్థానిక ఎన్నికల్లో ఫలితాలు రానున్న సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని, ఇప్పటి నుంచే పార్టీ విజయానికి కేడర్ పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని, తద్వారా ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించవచ్చన్నారు. మెజార్టీ స్థానాలను సాధించడం ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల మంచిభావన ఉందనే సందేశాన్ని తీసుకురావాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు దృష్టి సారించాలని సూచించారు. అధికార పార్టీ ఓటర్లను, కార్యకర్తలను ప్రలోభాలకు గురిచేస్తుందని, గెలిచేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని తెలుగుదేశం వర్గాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదే సందర్భంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గణబాబు పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను వివరించారు. మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధిస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు. అంతకు ముందు యనమల రామకృష్ణుడు కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు ఉమామహేశ్వరరావు, ఒమ్మి సన్యాసిరావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భరణికాన రామారావు, పార్టీ ప్రతినిధులు అల్సి అప్పలనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

విలీనంపై రేపు ఉత్తర్వులు?
విశాఖపట్నం, జూలై 13: మహావిశాఖ నగరపాలక సంస్థలో భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు 10 పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిఓ రెండు రోజుల్లో వెలువడనుంది. ఇప్పటికే విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, సాధ్యమైనంత త్వరలోనే మున్సిపాలిటీలకు సైతం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విలీనం ప్రక్రియ పూర్తయినప్పటికీ వార్డుల పునర్విభజన, ఎస్సీ,ఎస్టీ,బీసి,మహిళా ఓటర్ల గుర్తింపు అంశాలను పూర్తి చేయాల్సి ఉంది. శాస్ర్తియ పద్ధతిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను చేపట్టేందుకు కొంతమేర సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ సాధ్యమైనం త్వరలోనే ఈతంతును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నాటికి ఈప్రక్రియ సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆఘమేఘాల మీద విలీనం అంశాన్ని పూర్తి చేయాలనుకుంటోంది. దీనిలో భాగంగానే రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే దిశగా కసరత్తు జరుగుతోందని సమాచారం. దీనిపై జివిఎంసి వర్గాలు మాత్రం గుంభనంగానే ఉన్నాయి. విలీనం అంశం పూర్తయిందని, ఇక జిఓ విడుదల కావడం ఒక్కటే మిగిలి ఉందని పేర్కొంటున్నాయి.
కాలం చెల్లిన భవనాల తొలగింపు తూతూమంత్రమేనా
విశాఖపట్నం, జూలై 13: కాలం చెల్లిన భవనాల తొలగింపు విషయంలో జివిఎంసి ఆరంభ శూరత్వంపై అనుమానానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. హైదరాబాద్‌లో శిధిలభవనం కూలిన ఘటనలో 16 మంది మృత్యువాత పడటంతో ఆఘమేఘాలమీద కాలం చెల్లిన కట్టడాలపై జివిఎంసి స్పందించింది. నగరంలో దాదాపు 375 భవనాలు కాలం చెల్లి, శిధిలావస్థకు చేరుకున్నట్టు జివిఎంసి గుర్తించింది. తొలిరోజు మూడు భవనాలను జివిఎంసి అధికారులు కూల్చేశారు. జోన్ 3లో అత్యధికంగా 241 కాలం చెల్లిన భవనాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో తొలిరోజు ఒక భవనాన్ని కూల్చివేసినట్టు అధికారులు ప్రకటించారు. రెండో రోజు కూల్చివేత ప్రక్రియకు అధికారులు విరామం ఇచ్చారు. అయితే కాలం చెల్లిన భవనాలను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశామని, యాజమాన్యాలు స్పందించని పక్షంలో మాత్రమే తాము రంగంలోకి దిగుతామని జివిఎంసి అధికారులు వివరణ ఇస్తున్నారు. ఈవిషయంలో కొన్ని అంశాలు తమకు ప్రతిబంధకంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కాలం చెల్లినట్టు భావిస్తున్న భవనాలకు సంబంధించి జివిఎంసితో పాటు థర్డ్‌పార్టీ ధృవీకరించాల్సి ఉంది. ఈవిషయంలో భవనాల యజమానులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలను కొట్టిపారేయలేమని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా నగర పరిధిలో జివిఎంసి గుర్తించిన కాలం చెల్లిన భవనాల్లో అత్యధికశాతం ప్రభుత్వ శాఖలకు చెందినవే ఉండటం గమనార్హం. ఎయు లేడీస్ హాస్టల్ కూలేందుకు సిద్ధంగా ఉందని నిర్థారించినప్పటికీ కొనే్నళ్లుగా అదే భవనంలో దాన్ని కొనసాగిస్తున్నారు. ఇక పంచాయతీరాజ్, జెడ్పీ, జివిఎంసి పరిధిలోని పలు భవనాల పరిస్థితి కూడా అంతే. నగరం నడిబొడ్డున జివిఎంసికి చెందిన టిఎస్సార్ కాంప్లెక్స్ శిధిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉంది. వీటిపై వస్తున్న అద్దెలతో పాటు అందులో ఉన్న వ్యాపారస్తుల అభ్యర్ధన మేరకు తొలగింపు విషయాన్ని జివిఎంసి పక్కనపెట్టింది. యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాల్సిన కూల్చివేతపై నాన్చుడు ధోరణి అవలంభిస్తే భవిష్యత్‌లో జరిగే ప్రాణ, ఆస్తి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నది శేష ప్రశ్న.

శ్రీ కృష్ణకమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలి
విశాఖపట్నం, జూలై 13: శ్రీ కృష్ణ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చూడాలని విద్యార్థి యువజన జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో శనివారం ఆర్‌జెడి నేత శరద్‌పవార్‌ను యువజన జెఏసి ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్‌కుమార్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతు తెలియజేయాల్సిందిగా శరద్‌పవార్‌ను కోరారు. భారతదేశంలో ఉత్తరాంచల్, ఛత్తీస్‌గడ్, జార్ఘండ్ రాష్ట్రాల విభజనతోనే అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం వలనే ప్రగతి సాధ్యపడుతుందని, సమస్యలు పరిష్కరించబడతాయని, విడిపోతే ఎటువంటి ప్రయోజనాలు ఉండవన్నారు.

* సర్పంచ్‌లకు 4961 * వార్డు మెంబర్లకు 21,605 నామినేషన్లు
english title: 
m

విజ్ఞానాన్ని పంచే సైన్స్ ఎక్స్‌ప్రెస్ రాక

$
0
0

విశాఖపట్నం, జూలై 13: ప్రపంచ విజ్ఞానాన్ని, శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ‘సైన్స్ ఎక్స్‌ప్రెస్’ ఈనెల 15వ తేదీన ఇక్కడకు వస్తుంది. దీనిని విశాఖ రైల్వేస్టేషన్ ఎనిమిదవ నెంబర్ ప్లాట్‌ఫారంపై ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రారంభిస్తారు. రాయగడ నుంచి బయలుదేరి ఆ రోజు ఉదయం 10 గంటలకు ఇక్కడకు చేరుకునే సైన్స్ ఎక్స్‌ప్రెస్‌లో కనీసం 8కోచ్‌లుంటాయి. ఒక్కో కోచ్‌లో ఒక్కో ప్రత్యేకతను తెలియజేసే అంశాలతో డిస్‌ప్లే ఉంటుంది. వరుసగా మూడు రోజులపాటు దీనిని సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శించవచ్చు. ప్రతి ఏడాది ఇదే సీజన్‌లో వచ్చే సైన్స్ ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి నేరుగా బయలుదేరి కాకినాడకు వెళ్తుంది. అక్కడ నుంచి రాజమండ్రి, విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు వెళ్తుంది.

పాస్‌పోర్టు సేవాకేంద్రంపై సిబి‘ఐ’
విశాఖపట్నం, జూలై 13: విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళే అభ్యర్థులు, కుటుంబసభ్యుల వద్దకు వెళ్ళాల్సిన బందువులు, శస్తచ్రికిత్స కోసం వెళ్తున్న రోగులకు అవసరమైన పాస్‌పోర్టును సకాలంలో జారీ చేస్తూ విశేషంగా సేవలందిస్తున్న పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయం చుట్టూ ఇపుడు సమస్యలు అలుముకుంటున్నాయి. ఇటీవల సిబిఐ అధికారులు నిర్వహించిన దాడులే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మరో నాలుగు రోజుల్లో మళ్ళీ ఈ అధికారులు బిర్లాజంక్షన్ వద్దనున్న పాస్‌పోర్టు సేవా కేంద్రంలో (పిఎస్‌సి) ఆకస్మీక దాడులు నిర్వహిస్తారని తెలిసింది. ఇక్కడ పనిచేసి బయటకు వెళ్ళిన తరువాత దుకాణం నిర్వహించుకునే ఒకరిద్దరు చేసిన తప్పిదాలకు నిత్యం దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పాస్‌పోర్టు సమస్యలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి. అభ్యర్థులు ఇక్కడకు వచ్చిన నుంచి తిరిగి వెళ్ళినంత వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వస్తోంది. అనేక రకాలుగా సేవలందిస్తున్న పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయం, పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో అధికారులు, ఉద్యోగులు ఇపుడు బయపడుతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి అధికారులు వస్తారోనన్న ఆందోళన వీరి నుంచి వ్యక్తమవుతోంది. ఇందులో ఓ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ అభ్యర్థులకు అవసరమైన స్లాట్ బుకింగ్‌లను ఇబ్బడిముబ్బడిగా జారీ చేస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల సిబిఐ దాడులు జరిపి ఏజేన్సీకి చెందిన కొందర్ని అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత మళ్ళీ దాడులు జరిపి ఇందులో ఓ అధికారి జోక్యం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. ఈ విధంగా స్లాట్ బుకింగ్‌లు కాస్త వివాదస్పదంగా మారడంతో ఈమధ్య వీటిని ఏకంగా నిలిపివేయడం మరో తీవ్రతరమైన సమస్యగా మారింది. రోజు స్లాట్ బుకింగ్ ద్వారా కనీసం 400 మంది వరకు అభ్యర్థులు ఇక్కడకు వస్తుంటారు. ఎవరో చేసిన తప్పిదానికి రోజు వచ్చే అభ్యర్థులు ఇబ్బందుల పడుతున్నారు. అయితే వృద్ధులు, పిల్లలు, విదేశాలకు శస్తచ్రికిత్సలు చేయించుకునేందుకు మెడికల్ సర్ట్ఫికేట్ ఇస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళే రోగులకు అభ్యంతరాలు ఉండవు. అలాగే ఎన్‌ఓసి తెచ్చుకునే వృద్ధులు, పిల్లలకు ఎటువంటి సమస్యలుండటంలేదు. ఈ తరహా వారందరికీ పాస్‌పోర్టు జారీ అవుతుంది. కాగా పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరిగి సక్రమ పద్ధతిలో సేవలు అందుతున్న వరకు సిబిఐ పాస్‌పోర్టు సేవాకేంద్రం ప్రత్యేక దృష్టి ఉంచుతున్నట్టు తెలుస్తోంది.

మావోల అడ్డాలో పంచాయతీ సమరానికి బ్రేక్!
నర్సీపట్నం/గూడెం కొత్త వీధి, జూలై 13: పంచాయతీ ఎన్నికల్లో సి.పి.ఐ. మావోయిస్టుల వ్యూహం ఫలించింది. ఎన్నికలను బహిష్కరించండంటూ మావోయిస్టులిచ్చిన పిలుపునకు సానుకూల స్పందన లభించింది. విశాఖ మన్యంలో మావోయిస్టు ప్రభావిత మండలాలైన జి.కె.వీధి, చింతపల్లిల్లోని ఆరు పంచాయతీల్లో గిరిజనులు ఎన్నికలను బహిష్కరించారు.
జి.కె.వీధి మండలం జర్రెల, వంచుల, మొండిగెడ్డ, చింతపల్లి మండలం బలపం, కుడుమసారి, తమ్మింగుల పంచాయతీల్లో నామినేషన్లు ముగిసే సమయానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కానట్టు సమాచారం. మావోయిస్టు ప్రభావిత పంచాయతీలైన పై గ్రామాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మావోయిస్టులు విశాఖమన్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తవ్వకాలకు వ్యతిరేకంగా పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మావోయిస్టులు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో కరపత్రాలు, వాల్ పోస్టర్లు వెదజల్లారు. అలాగే చింతపల్లి మండలంలో అధికార కాంగ్రెస్ ఫార్టీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ వంతల సుబ్బారావు, జి.కె.వీధి మండలం దేవరాపల్లి, మంగిలిపాలెంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మత్స్యల మత్స్యరాజు, గడుతూరి బాబూరావు ఇళ్ళపై దాడులు చేసి ఆస్తులను లూఠీ చేశారు. సుబ్బారావు త్రుటిలో నుండి తప్పించుకుని ప్రాణాలతో బయట పడ్డారు.
ఈ సంఘటనల నేపథ్యంలో ఏజన్సీలోని ప్రజాప్రతినిధులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకంజ వేశారు. వంచుల, జర్రెల, మొండిగెడ్డ, బలపం, కుడుమసారె, తమ్మింగుల పంచాయతీల్లో ఎన్నికలను బహిష్కరించగా, మరికొన్ని పంచాయతీల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు కాకుండా వేరే వారిచే నామినేషన్లు కేంద్రానికి నామినేషన్లు పంపించి దాఖలు చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో జరిగిన పంచాయతీ, మండల పరిషత్‌ల ఎన్నికల్లో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చినప్పటికీ రాజకీయ పార్టీల నాయకులు అంతగా పట్టించుకునేవారు కాదు. మావోయిస్టులు పిలుపునిచ్చినా స్థానిక నాయకులు మాత్రం నామినేషన్లు వేసి పోటీల్లో నిల్చునేవారు. ఈ దఫా మావోయిస్టులు సైతం బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఎన్నికల బహిష్కరణ పిలుపును సీరియస్‌గానే తీసుకున్నారు. ప్రధానంగా బాక్సైట్ తవ్వకాలు జరిపే బలపం, జర్రెల పంచాయతీల ఎన్నికలను స్థానిక గిరిజనులే వ్యతిరేకిస్తూ నామినేషన్లకు దూరంగా ఉన్నారు. విశాఖమన్యంలో అన్ని పంచాయతీల్లోనూ ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారులు చేసిన ప్రకటనలు నామమాత్రమయ్యాయి.
ఉప సంహరణ నాటికి మరికొన్ని...
చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో పలు పంచాయతీల్లో ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు దారులు నామినేషన్లు వేసినప్పటికీ వీరంతా ఉప సంహరించుకోవాలని మావోలు వత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా కొయ్యూరు మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన బూదరాళ్ళ, మఠంభీమవరం, యు.చీడిపాలెం పంచాయతీలపై మావోయిస్టులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గతంలో పై పంచాయతీల్లో ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు పలు సంఘటనలకు పాల్పడిన దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈమూడు పంచాయతీల్లో అధిక శాతం నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. మావోయిస్టులకు పట్టున్న ఈ పంచాయతీల్లో ఎన్నికలు జరగకుండా నామినేషన్లు ఉప సంహరించుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. మావోయిస్టుల నుంచి వస్తున్న ఒత్తిడితో వారి ప్రాబల్యం అధికంగా ఉన్న మారుమూల ప్రాంత పంచాయతీలలో పోటీ చేసేందుకు గిరిజనులు వెనుకడుగు వేసి నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు రానట్టు భావిస్తున్నారు. దీంతో నామినేషన్లు దాఖలు కాని పంచాయతీలో ఈ నెల 23వ తేదీన పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి పంచాయతీలలో మరోసారి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి రాంప్రసాద్ శనివారం రాత్రి ఆంధ్రభూమితో చెప్పారు.
మన్యంలో ఉద్రిక్తత: పంచాయతీ ఎన్నికల వేళ మన్యంలో ఎదురు కాల్పులు, మావోయిస్టు దాడుల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణంను తలపిస్తోంది. కొయ్యూరు మండలం కిండంగి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఒక రోజు ముందు గూడెంకొత్తవీధి మండలం మంగిలిపాలెం, దేవరాపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల ఇళ్ళపై దాడులకు మావోయిస్టులు పాల్పడ్డారు. ఇక్కడ పాల్గొని కొయ్యూరు వైపు తరలివెళ్తున్న మావోయిస్టులకు పోలీసులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడుతుండడంతో ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. నామినేషన్లు వచ్చే అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వెనుతిరిగారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్ళపై మావోయిస్టులు గురిపెడుతుండడంతో ఆపార్టీ నాయకుల్లో కలవరం మొదలవుతుంది. ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల బూటు చప్పుళ్ళతో మన్యం అడవులు దద్దరిల్లుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు తిరుగుతుండడంతో గ్రామాల్లో భయాందోళన నెలకొంటోంది.

అడవి దున్న హతం
* నలుగురు అరెస్ట్

నర్సీపట్నం,జూలై 13: అడవిదున్నను వేటగాళ్ళు హతం చేశారు. మొండెం, తలను వేర్వేరుగా చేశారు. మొండెంను సంఘటనా స్థలంలో వదిలివేసిన వేటగాళ్ళు తలను మాత్రం పట్టుకుపోయారు. అడవి దున్న తలకు లక్ష రూపాయలకు పైగా రేటు పలికే అవకాశం ఉండడంతో ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈసంఘటనకు సంబంధించి నలుగురు వేటగాళ్ళను అరెస్ట్ చేశారు. నర్సీపట్నం అటవీ రేంజర్ ఎస్.కె.మస్తాన్‌వల్లీ అందించిన వివరాలిలా ఉన్నాయి. జీడితోట నరికేందుకు కూలీకి వెళ్తుండగా రోలుగుంట మండలం చటర్జీపురం సమీపంలో అడవిదున్న దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ అడవిదున్న సంగతి తెలుసుకున్న చటర్జీపురం గ్రామానికి చెందిన నీలాపురమణ, కేదారి చిన అప్పలనాయుడు, నీలాపులోవరాజు, కొల్లేటి శ్రీనులు నాటు తుపాకులతో దాడి చేసి అడవి దున్నను పట్టుకున్నారు. చటర్జీపురంలోని సమీపంలోని గెడ్డ వద్ద అడవిదున్నను నరికి మొండెం, తలను వేర్వేరు చేశారు. మొండెంను అక్కడే వదిలివేసి తలను మాత్రం కొంతదూరంలో గొయ్యితీసి దాచిపెట్టారు. మొండెం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించగా రేంజర్ ఎస్.కె.మస్తాన్‌వల్లీ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. అడవి జంతువుల వేటకు వెళ్ళే వారే ఈపని చేసి ఉంటారని అనుమానించిన రేంజర్ చటర్జీపురంలోని వేటగాళ్ళను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా అడవిదున్న తలను స్వాధీనం చేసుకున్నారు. మొండెం, తలకు పంచనామా శనివారం పంచనామా నిర్వహించి పూడ్చిపెట్టారు. ఈసంఘటనలో పై నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు రేంజర్ మస్తాన్‌వల్లీ తెలిపారు.

సమర్థులను ఎన్నుకోండి: మంత్రి బాలరాజు
పాడేరు, జూలై 13: పంచాయతీ ఎన్నికలలో సమర్థులైన వారిని ఎన్నుకుని గిరిజన ప్రాంత ప్రగతికి సహకరించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు కోరారు. తన నివాసంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని, ఇటువంటి వాటికి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు సమర్థులై ఉండాలని అన్నారు. తమ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయగల వారు పంచాయతీ సర్పంచ్‌లుగా ఎన్నికైతేనే అందరికీ ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గిరిజన ప్రాంత ప్రజానీకం గమనించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి బృహత్తర కార్యక్రమాలను అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తాను మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్ళ కాలంలో కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించి విశాఖ మన్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు ఆయన చెప్పారు. మన్యంలో రహదారుల నిర్మాణం, మంచినీటి సదుపాయాల కల్పన, విద్యాభివృద్ధి, మహిళా సంక్షేమం, నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పన వంటి పలు కార్యక్రమాలను అమలు చేసినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉందని, తమ ప్రగతికి పాటుపడుతున్న కాంగ్రెస్‌ను స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉందని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలన్న, తమ ప్రాంతంలో అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ అభ్యర్థులే సర్పంచ్‌లుగా ఎన్నిక కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గిరిజన ప్రాంత ప్రజలు పంచాయతీ ఎన్నికలలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రానున్న కాలంలో పంచాయతీలకు అధిక మొత్తంలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పారు. పంచాయతీలకు కేటాయించే నిధులను సక్రమంగా వినియోగించి ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టగలిగే వారిని ఎన్నుకోవాలని ఆయన అన్నారు. ఏజెన్సీలోని 244 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధికంగా విజయం సాధించ గలరనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే స్థానిక ఎన్నికలలో తమ పార్టీ విజయానికి సోపానాలని బాలరాజు పేర్కొన్నారు.
పంచాయతీ పోరుపై నేతల హైరానా
పట్టనట్లు వ్యవహరిస్తున్న నియోజకవర్గ నేతలు
వైకాపాలో సమన్వయ లేమి
కాంగ్రెస్ నేతల్లో కానరాని ఉత్సాహం
అభ్యర్థుల కొరతతో టిడిపి
అనకాపల్లి, జూలై 13: గ్రామపంచాయతీల నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లాలో మూడు దశలుగా పంచాయతీ పోరుకు సన్నద్ధమయ్యారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. మరో ఏడాదిలోగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్ సిపి అగ్రనేత జగన్‌మోహన రెడ్డి, దేశం అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ రాజకీయ భవిష్యత్‌కే పెద్ద సవాలుగా భావిస్తున్నారు. అయితే పంచాయతీ ఎన్నికలపై అగ్రనేతలకున్న ఆసక్తి జిల్లా, నియోజకవర్గ నేతల్లో కానరావడం లేదు. అటు దేశం, ఇటు వైఎస్‌ఆర్ సిపి నేతల్లో పంచాయతీ ఎన్నికల పట్ల కాస్తంత ఉత్సాహం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఆ సందడి కానరావడం లేదు. పంచాయతీ ఎన్నికలకు నియోజకవర్గ ఇన్‌చార్జిలే పూర్తిబాధ్యత వహించాలని, సానుకూల ఫలితాలు రాకపోతే టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఇన్‌చార్జిలను పక్కనపెట్టేందుకు సైతం వెనుకాడేది లేదని దేశం అధినేత చంద్రబాబు, వైసీపి నేత విజయమ్మ సైతం ఖరాఖండిగా స్పష్టం చేసారు. అయినప్పటికీ జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు పంచాయతీ ఎన్నికలను అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు. అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకుంటే వారు విజయం సాధించేందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును సైతం అందించాల్సివస్తుందేమోనని తప్పించుకు తిరుగుతున్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులు సైతం పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు కానరావడం లేదు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార కాంగ్రెస్‌లో ఆ కాస్తంతైనా హడావుడి కనిపిస్తుంది. దేశం పార్టీలో మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మరో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సర్పంచ్ అభ్యర్థులను బరిలోకి దింపడంపై దృష్టి కేంద్రీకరించారు. అభ్యర్థులు లేక పోటీకి దింపలేని పరిస్థితి యలమంచిలి నియోజకవర్గంలోని దాదాపు 30గ్రామాల్లో నెలకొన్న విషయం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లింది. గెలుపోటములతో సంబంధం లేదు. ఎన్నికల బరిలో దేశం మద్ధతుదారులను విధిగా బరిలో దింపాల్సిందేనని చంద్రబాబు ఆల్టిమేట్టం ఇవ్వడంతో మాజీ ఎంపి పప్పల చలపతిరావు, యలమంచిలి దేశం ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్న సుందరపువిజయ్‌కుమార్ తదితరులు శనివారం హడావుడిగా మునగపాక, అచ్యుతాపురం, యలమంచిలి తదితర మండలాల్లో పర్యటించి ప్రతీ గ్రామంలోను విధిగా దేశం అభ్యర్థులు బరిలోకి దిగేలా చర్యలు తీసుకున్నారు. పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందిస్తామని నేతలు భరోసా ఇవ్వడంతో పోటీకి దిగేందుకు సుముఖత వ్యక్తం చేసారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో నియోజకవర్గ వైఎస్‌ఆర్ సిపి నేత పెదబాబు దాదాపు అన్ని గ్రామాల్లో కూడా వైసీపి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సర్వశక్తులు ఒడ్డి కృషిచేస్తున్నారు. కాంగ్రెస్, వైసీపి పార్టీలకు ధీటుగా అన్ని పంచాయతీల్లో కూడా విధిగా దేశం అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అనకాపల్లి అసెంబ్లీ దేశం సమన్వయకమిటీ సభ్యులు అష్టకష్టాలు పడ్డారు. మాజీమంత్రి కొణతాల రామకృష్ణ వౌనం వహించడం వలన వైసీపిలో కొంత స్తబ్ధత నెలకొన్నప్పటికీ యలమంచిలిలో వైసీపీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్‌లు తమ ప్రాంతాల్లో వైసీపి అభ్యర్థులను బరిలోకి దింపడంతోపాటు వారి గెలుపు బాధ్యతను సైతం వీరి భుజస్కందాలపై వేసుకున్నారు. తమ మద్ధతుదారులను మెజార్టీ స్థానాల్లో గెలిపించుకుంటే తప్ప యలమంచిలి అసెంబ్లీ వైసీపి టిక్కెట్‌ను అడిగే హక్కును పొందలేమనే భావంతో ఈ ఇరువురు నేతలు సర్పంచ్ ఎన్నికల్లో విజయంపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లా దేశం అధ్యక్షులు గవిరెడ్డి తన సొంత మాడుగుల అసెంబ్లీకే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం తదితర అసెంబ్లీల్లో వైఎస్‌ఆర్ సిపిలో రెండు వర్గాలుగా ఎవరికి వారే సర్పంచ్ పదవులకు తమ మద్దతుదారులను బరిలోకి దింపారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో వైసీపికి రెబల్స్ బెడద లేకుండా చూసేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికల వైసిపీ పరిశీలకులు దాడి వీరభద్రరావుతెలిపారు. డిసిసి అధ్యక్షులు కరణం ధర్మశ్రీ మాడుగుల, చోడవరం అసెంబ్లీల పరిధిలో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరించారు. అయితే పలుచోట్ల అధికార కాంగ్రెస్ పార్టీలో గంటా వర్గీయులు సర్పంచ్ పదవులకు నామినేషన్ దాఖలు చేయడంతో ఆ ప్రాంతంలో రెబల్స్ బెడద తప్పేటట్టు లేదు.

* రేపటి నుంచి మూడు రోజులు
english title: 
v

అట్టహాసంగా సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

$
0
0

గజపతినగరం, జూలై 13 : నామినేషన్లు దాఖలు చేయడానికి శనివారం చివరి రోజు కావడంతో ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం అభ్యర్థులతో సందడిగా కనిపించింది. అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. మేజర్ గ్రామపంచాయతీ గజపతినగరం సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీకి తలపడుతున్న సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త నరవ వీరాస్వామి సతీమణి కొండమ్మ నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవికి అందజేశారు. ఎమ్మెల్యే అప్పలనర్సయ్య నాయకత్వంలో ఆమె కేంద్రానికి చేరుకున్నారు. అభ్యర్ధి కొండమ్మకు మాజీ గ్రామ సర్పంచ్ కందుల వెంకట చిన్నయ్యస్వామి ప్రతిపాదించారు. కార్యక్రమంలో సీతారామస్వామి దేవస్థానం అధ్యక్షుడు కొల్లా వెంకట సాంబమూర్తి మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు గార తవుడు, పార్టీ నాయకులు ఉత్తరావల్లి అప్పలనాయుడు, కర్రి రమేష్, రుంకాన భాస్కరరావు, పాల్గొన్నారు. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమఅనుచరులతో ప్రదర్శనగా వచ్చి నామినేన్ పత్రాలు దాఖలు చేశారు. నగర ప్రసన్నకుమారి తమ మద్దతుదారులతో ప్రదర్శనగా వచ్చి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ప్రసన్న కుమారి అభ్యర్ధిత్వాన్ని దాసరి వెంకటరమణ ప్రతిపాదించారు. కృష్ణవేణి కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
బొండపల్లి: మండలం పరిధిలోని ముద్దూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కల్యాణపు సుమతి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. బిళ్ళలవలస గ్రామంలో గల నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్దకు వందలాది మంది గ్రామస్తులతో చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సుమతి అభ్యర్ధిత్వాన్ని బాలి రామ్మూర్తినాయుడు బలపర్చారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో వివిధ పార్టీలకు చెందిన ఆల్తి అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ సుంకరి నర్సింహులు, బాలి రామ్మూర్తినాయుడు, బాలి పెంటంనాయుడు, బాలి తాతినాయుడు, కల్యాణపు సత్యం, తాతినాయుడు, తదితరులు పాల్గొన్నారు. బొండపల్లి పంచాయితీ సర్పంచ్ పదవికి లచ్చిరెడ్డి సుజాత నామినేషన్‌ను దాఖలు చేశారు. మాజీ ఎంపిపి బండారు బంగారం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిరిపురపు ఆదినారాయణ, పాల్గొన్నారు.

వియ్యంపేటకు నామినేషన్ నిల్
విజయనగరం, జూలై 13: జిల్లాలోని కొత్తవలస మండలం వియ్యంపేట పంచాయతీని ఎస్టీలకు కేటాయించడంతో అక్కడ ఏ ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయడానికి వీలులేకుండా పోయింది. ఆ పంచాయతీలో ఒక ఎస్టీ మహిళ నివసిస్తున్నప్పటికీ ఆమెకు ముగ్గురు పిల్లలు ఉండటంతో సర్పంచ్ పదవికి పోటీ చేసే అర్హతను ఆమె కోల్పోయింది. దీంతో ఆ పంచాయతీకి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

చినమేరంగి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం
జియ్యమ్మవలస, జూలై 13: మండలంలో చినమేరంగి గ్రామ సర్పంచ్‌గా శతృచర్ల పరిషత్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నామినేషన్లు వేయడానికి చివరి రోజు కావడంతో సర్పంచ్‌గా పరిషత్‌రాజు ఒక్కరే నామినేషన్ వేశారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కురుపాం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శతృచర్ల చంద్రశేఖరరాజు తనయుడు శతృచర్లకు పార్టీలతో ప్రమేయం లేకుండా పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గ్రామస్థులు కోరారు. కొంతమంది పెద్దలు పరిషత్‌రాజును ఇండిపెండెంట్‌గా పోటీలోకి దింపారు. చినమేరంగి శతృచర్ల కోట నుంచి ఊరేగింపుగా కురుపాం ఎమ్మెల్యే విటి జనార్దన థాట్రాజ్, నాగూరు మాజీ ఎమ్మెల్యే శతృచర్ల చంద్రశేఖరరాజు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి పరిషత్ రాజు నామినేషన్ వేశారు.

టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన?
బొబ్బిలి, జూలై 13: బొబ్బిలి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలలో గెలుపుసాధించేందుకు కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు ఒకవైపు, వైఎస్సార్‌సీపీ వేరొకవైపు ఎత్తులు- పై ఎత్తులతో పావులు కదుపుతున్నారు. పంచాయతీ పోరులో ప్రతాపం చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా అభ్యర్థులను ఓడించేందుకు పలు పంచాయతీలలో దేశం, కాంగ్రెస్ నేతలు ఒకటి కావడం విశేషం. పంచాయతీ ఎన్నికలలో పార్టీలతో సంబంధం లేకపోయినప్పటికీ గ్రామ స్థాయిలో కీలకమైన ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు సర్పంచ్ పదవులపై దృష్టిసారించారు. ఈమేరకు బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో ఉన్న పలు పంచాయతీలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అవగాహనకు వచ్చి వైకాపా అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బొబ్బిలి మండలంలో అలజంగి, పారాది, కోమటిపల్లి, కలువరాయి, చింతాడ తదితర పంచాయతీలలో కాంగ్రెస్, దేశం నేతలు ఒకరికొకరు సహకరించుకుంటూ వెకాపాను ఎదిరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అలాగే రామభద్రపురం మండలంలో కొత్తరేగ, దుప్పలపూడి, నర్సాపురం, కోటశిర్లాం, కొండరేజేరు, నాయుడువలస, తదితర పంచాయతీలలో ఇరుపార్టీల నాయకులు వైకాపా అభ్యర్థులపై పోరుకు సిద్ధమవుతున్నారు.
అలాగే బాడంగి మండలంలో గొల్లాది, కోడూరు, బొత్సవానివలస, వాడాడ, తదితర పంచాయతీలలో నాయకులు ఒక్కటైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో బొబ్బిలి రాజుల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు దేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ప్రణాళికలు ప్రకారం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. వీటిని ఎలాగైన చిత్తుచేస్తామని బొబ్బిలి రాజులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారిందనవచ్చు.

పారిశుద్ధ్యం, మంచినీరే ప్రధాన సమస్య
కురుపాం, జూలై 13: కురుపాం మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యం లోపం, మంచినీటి అవసరాలు ప్రధాన సమస్యలుగా కనిపిస్తాయి. పంచాయతీలోని అన్నివీధుల్లోని కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. పోలీస్ స్టేషన్ వద్ద కాలువ చెత్తతో నిండిపోవడంతో వర్షం పడితే రోడ్డుపైకే మురుగునీరు వస్తుంది. రావాడ రోడ్డు, జి.సి.సి. ప్రాంతాల్లో ఉన్న కల్వర్టుల వద్ద చెత్త నిలిచి పోవడంతో మురునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు కనబడుతున్నాయి. పారిశుద్ధ్యం నిర్వహణ కోసం నిధులు చాలడం లేదు. ఒక్క ట్రాక్టరే ఉండటంతో రెండు రోజులకొకసారి చెత్తను తీయిస్తుంటారు. గత రెండేళ్లుగా కాలువల్లో పూడిక తొలగించడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా మెరుగుపరిస్తే సమస్యలు తీరినట్లే. వీధి దీపాల ఏర్పాటు కోసం నిధులున్నప్పటికీ నిర్వహించడం లేదు. ఈ మూడు సమస్యలే సర్పంచ్‌కు ప్రధానమైనవి.

నిన్న శతృవులు.. నేడు మిత్రులు!
సీతానగరం, జూలై 13: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు- శాశ్వత శతృవులు ఉండరు అనడానికి పెదబోగిలి పంచాయతీ నిదర్శనం. పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న టిడిపి మద్దతు అభ్యర్థి బుడితి కృష్ణవేణికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ కేంద్రానికి ఎమ్మెల్యే జయమణి, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చి టిడిపి అభ్యర్థికి మద్దతు తెలిపారు. అనంతరం పంచాయతీ పరిధిలోని పలు వీధులలో టిడిపి, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారు. రాజకీయాలలో నిన్నటి వరకు శతృవులుగా ఉన్న టిడిపి, కాంగ్రెస్ ఈ ఎన్నికలలో కలిసి పోటీ చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మేజర్ పంచాయతీలో టిడిపి, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోరు ఉండేది. వైకాపా రాకతో ఈ రెండు పార్టీలు కలిసి అభ్యర్థిని పోటీకి నిలవడం విశేషం.

నామినేషన్లు దాఖలు చేయడానికి శనివారం
english title: 
a

మద్యం వ్యాపారం నేరమా?

$
0
0

విజయనగరం, జూలై 13: జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ మద్యం వ్యాపారం చేస్తున్నారని వైకాపా నేత షర్మిల పేర్కొనడాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మద్యం వ్యాపారంలో మంత్రి బొత్సకు ఒక్క రూపాయి పెట్టుబడి ఉందని బహిరంగంగా నిరూపించినా దేనికైనా సిద్ధమేనన్నారు. వైకాపా పార్టీ నిరూపించగలదా అని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాను అన్ని రంగాల్లో మంత్రి బొత్స ముందుకు తీసుకెళ్లారని జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న అన్నారు.

ముగిసిన నామినేషన్ల ఘట్టం
* సర్పంచ్ ఎన్నికకు 4726, వార్డు సభ్యులకు 23194 నామినేషన్లు
విజయనగరం, జూలై 13: జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం డివిజన్లకు సంబంధించి 921 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా వాటిలో సర్పంచ్ ఎన్నికకు మొత్తం 4726 మంది, వార్డు సభ్యులకు 23194 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సీతానగరం మండలం జోగంపేట, కొత్తవలస మండలం వియ్యంపేట ఎస్టీ పంచాయతీలకు కేటాయించగా వాటికి ఏ ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయలేదు ఇక వార్డు సభ్యులకు సంబంధించి కురపాంలోని పెదపొత్తిలి పంచాయతీలో 3, 4, 7, 10 వార్డులకు, తిత్తిరిలోని 6, 10 వార్డులకు, పాచిపెంట మండలం పెద్దవలసలోని 5వ వార్డుకు ఏ ఒక్కరు నామినేషన్ దాఖలు చేయలేదు.

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు
విజయనగరం, జూలై 13: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. శనివారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, కోడ్ ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం, డబ్బు అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం జిల్లాలో ఏడు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన సాలూరు, పార్వతీపురం మండలాల్లో రెండు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు విజయనగరం డివిజన్‌లో 101, పార్వతీపురం డివిజన్‌లో 40 అనధికార బెల్టుషాపులు మూసివేసినట్టు తెలిపారు. కాగా, ఎన్నికల నిర్వహించే తేదీ నాటికి 48 గంటల ముందుగా మద్యం షాపులు మూసివేయాలన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎంవి శేషగిరిబాబు మాట్లాడుతూ కదలికలపై అనుమానం వున్న వ్యక్తులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు.
సెల్‌ఫోన్లు నిషేధం
పోలింగ్ జరిగే ప్రాంతానికి వంద మీటర్ల దూరం నుంచి సెల్‌ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని ఎన్నికల పరిశీలకులు ఆదేశించారు. ఓటర్లు కూడా వంద మీటర్లలోపే సెల్‌ఫోన్లను వదిలిపెట్టాలన్నారు.
పోలింగ్ ఏజంట్ ఒక్కసారే మారాలి
పోలింగ్ కేంద్రంలో నియమించబడిన పోలింగ్ ఏజంట్ పదే పదే బయటకు విడిచిపెట్టరాదని, ఒక్కసారి పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఒక్కసారి మాత్రమే బయటకు విడిచిపెట్టాలన్నారు. అయితే బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకూడదని, ప్రత్యామ్నాయంగా వచ్చిన వ్యక్తే చివరి వరకు కొనసాగాలని ఎన్నికల పరిశీలకులు సూచించారు. ఏజంట్‌ను రెండోసారి లోపలికి అనుమతించరాదన్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు ఎంవి శేషగిరిబాబు, పి.లక్ష్మినరసింహం, లోహితాస్యులు, ఎస్పీ కార్తికేయ, జెసి శోభ, ఎజెసి నాగేశ్వరరావు, డిఆర్వో వెంకటరావు, జెడ్పీ సిఇఒ మోహనరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీదర్, ఆర్డీవోలు రాజకుమారి, జె.వెంకటరావు, డిఎస్పీలు కృష్ణప్రసన్న, ఒఎస్‌డి డివి శ్రీనివాసరావు , డిపిఒ సత్యసాయి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వైకాపా నేతల మధ్య వర్గపోరు..
కార్యకర్తల్లో అందోళన
విజయనగరం, జూలై 13: జిల్లాలో వైఎస్సార్ సిపి నాయకురాలు షర్మిల పాదయాత్ర ఐదోరోజు కొనసాగుతొంది. ఆమె పాదయాత్ర విజయవంతమవుతున్నప్పటికీ ఆ పార్టీ నేతల్లో సమన్వయం లేదన్నదీ కొన్ని సందర్భాల్లో తేటతెల్లమవుతోంది. వైఎస్సార్‌సిపి రానున్న ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధిస్తుందని నమ్ముకొని ఆ పార్టీలోకి వెళ్లిన కొందరి నేతల్లో ఆశలు సన్నగిల్లి తిరిగి వెనక్కి మరలే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ జిల్లా నాయకత్వం పెద్ద లోపంగా చెప్పుకొవచ్చు. మరికొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికలు జరగనుండటం, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం కొనసాగుతున్న గ్రామ స్థాయిలో ఆ పార్టీకి స్పందన లేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడం ఆ పార్టీ పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది. జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం మినహా మరెక్కడా పంచాయతీ ఎన్నికలకు అభ్యర్థులను పూర్తి స్ధాయిలో పెట్టే పరిస్థితి కన్పించడం లేదు. జిల్లా కేంద్రంలో వైకాపా సమన్వయకర్తలు అవనాపు విజయ్‌తోపాటు గురాన అయ్యలు విజయనగరం నియోజకవర్గంలో గ్రూపులుగా విడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా, పూల్‌బాగ్‌లోని షర్మిలా బస చేసిన ప్రాంతంలోనే వీరు కొట్లాడుకున్నట్టు సమాచారం. ఎస్.కోట నియోజకవర్గంలో డాక్టర్ జి.తిరుపతి, వేచలపు చినరామునాయుడు, బోకం శ్రీనివాసరావు, జయప్రకాష్‌బాబు వంటి నేతలు ఎవరికి వారే తమ వర్గాలను తయారు చేసుకొని గ్రూపులు నడుపుకుంటున్నారు. గజపతినగరం నియోజకవర్గంలో కడుబండి శ్రీనివాసరావు, డాక్టర్ పెద్దినాయుడుతోపాటు మక్కువ శ్రీదర్‌లు ఇదే పరిస్థితిలో ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో జిల్లా సమన్వయకర్త పి.సాంబశివరాజుతోపాటు అతని తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజుతోపాటు బోగాపురంనకు చెందిన కె.శ్రీనివాసరాజులు పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో గద్దె బాబూరావుతోపాటు కోట్ల సూర్యనారాయణ గ్రూపుల మధ్య విభేదాలు ఏర్పడి గద్దె బాబూరావు సమన్వయకర్తకు రాజీనామా చేసే పరిస్థితికి వెళ్లింది. ఇలా జిల్లాలో ఆ పార్టీ నేతల మధ్య వర్గపోరు కొనసాగుతొంది. పార్టీ నుంచి శాసనసభ టిక్కెట్లకు ఆశించి పార్టీ నాయకులు పోటీపడుతున్నారే తప్ప జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి మాత్రం ఎవ్వరూ అంకితభావంతో పనిచేసిన దాఖలాలు లేవు. ఇటీవల జిల్లాకు వచ్చిన వైఎస్ విజయమ్మ కార్యక్రమం కూడా ప్రణాళిక లేకుండానే నిర్వహించడం ఆమె కార్యక్రమం విజయవంతం కాలేదన్న పరిస్థితిని ఆ పార్టీలో కార్యకర్తలకు అయోమయం కలిగించింది. షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రకు జనం వస్తున్నప్పటికీ పార్టీ నేతలు మాత్రం పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేయాలన్న తలంపు లేకపోవడం ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో విజయావకాశాలు ఉండవని కూడా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పంచాయతి ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితిలో జిల్లాలో ఆ పార్టీ బలాన్ని చెప్పకనే చెబుతొంది. పి.సాంబశివరాజు, సుజయ్‌కృష్ణ రంగారావుల మధ్య సమన్వయం లేదన్న ప్రచార ఆ పార్టీలో ఉండటం ఆ పార్టీకి మరింత నష్టాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి ప్రజలకు, ప్రభుత్వం పట్ల అధికార పార్టీ నేతల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని అనుకూలంగా మార్చుకునే పరిస్థితి వైకాపా నేతల్లో కానరావడం లేదు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానానికి తెలిసినా దీనిపై చర్యలు కూడా లేవని ఆ పార్టీ నేతలు కొందరు అనుకోవడం కొసమెరుపు.

‘కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయింది’
నెల్లిమర్ల, జూలై 13 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయిందంని వైఎస్సార్ సిపి నాయకురాలు షర్మిల అన్నారు. శనివారం ప్రజా పాదయాత్రలో భాగంగా నియోజకవర్గ కేంద్రం స్థానిక మొయిద జంక్షన్‌లో బహిరంగ సభ జరిగింది. పాదయాత్రలో భాగంగా రామతీర్ధం జంక్షన్ నుంచి ర్యాలీగా వచ్చి మొయిద జంక్షన్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను కాంగ్రెస్ అటకెక్కించిందన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో విద్యుత్ బకాయిలు, రుణ మాఫీ జరిగిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విద్యుత్ ఛార్జీలు, పన్నుల భారం పెంచిపేద ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు. అలాగే జిల్లాకు ప్రాతినిద్యం వహిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులను గెలిపించకుని లిక్కర్ డాన్‌గా ఎదిగి ప్రజాసమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అలాగే ప్రజాలు తెలుగుదేశం అధికార నేత చంద్రబాబు అధికార పార్టీతో కుమ్మక్కయ్యి. ప్రభుత్వాన్ని కాపాడడం వల్లే ప్రజలపై భారాలు పడుతున్నాయన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి జగన్ మీద కేసులు బనాయించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి నాయకులు సుజయకృష్ణ రంగారావు, వాసిరెడ్డి పద్మ, పి.సాంబశివరాజు, కాకర్ల పూడి శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.

‘150 అనధికార మద్యం షాపులు మూసివేత’
గజపతినగరం, జూలై 13 : జిల్లాలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న 150 దుకాణాలను మూసి వేసినట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. శనివారం సాయంత్రం గజపతినగరంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల సహకారంతో జిల్లా వ్యాప్తంగా మద్యం మని నియంత్రం కోసం ఏడు నిరంతర నిఘా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దు రాష్టల్ల్రో గల గ్రామ పంచాయతీలపై రెండు నిఘా ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అభ్యర్దులు ఎన్నికల ఖర్చుకు సంబంధించి పర్యవేక్షించేందుకు జిల్లా, మండల, పంచాయతీ స్థాయిలో ప్రత్యేక నిఘామోనటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలను పి.లక్ష్మినర్సింహం, శేషగిరిబాబు, లోగిబాబు, పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఏకగ్రీవం వేలం పంచాయతీలపై తమ దృష్టికి తీసుకు వస్తే ఆఎన్నికను రద్దు చేయడమే కాకుండా చటపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహశీల్ధార్ కోరాడ శ్రీనివాసరావు, ఎంపిడిఓ ఎం.శ్రీరంగ, తదితరులు పాల్గొన్నారు.

- డిసిసి అధ్యక్షుడు కోలగట్ల
english title: 
dcc

పంచాయతీ ఎన్నికల్లో స్థానిక వ్యూహాలు

$
0
0

కడప, జూలై 14 : సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జరుగుతున్న పంచాయతీ పోరుకు సంబంధించి ప్రధాన పార్టీల అగ్రనేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో తలదూర్చి స్థానిక నేతల మనోభావాలను దెబ్బతిస్తే సాధారణ ఎన్నికల్లో వారివల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉండదని భావిస్తున్న నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల బాధ్యతలను స్థానిక నేతలకే వదిలేస్తున్నారు. అయితే తమ తమ సొంత గ్రామాలను, అధిపత్యంలో ఉన్న గ్రామాలను చేయిదాటిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, మాజీలు దాదాపు అంతా తమ గ్రామాల విషయంలో అనుకున్నది సాధించుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 785 పంచాయతీలు ఉండగా ఇందులో దాదాపు 40 చోట్ల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అగ్రనేతలకు సంబంధించిన పంచాయతీలే ఎక్కువ ఉన్నాయి. దీనికి సహకరించడంలో చోటామోటా నేతల వ్యూహాలు కూడా ఉన్నాయి. అగ్రనేతలకు అనుకూలంగా వ్యవహరించి మెప్పు పొందితే సాధారణ ఎన్నికలు వచ్చే లోగా ప్రభుత్వంలో
తమ పనులన్నీ సునాయాసంగా చేయించుకోవడానికి ఈ మచ్చిక దోహపడుతుందని స్థానిక నేతలు సహకరిస్తున్నారు. తమ గ్రామ పంచాయతీల విషయంలో జాగ్రత్తలు తీసుకున్న అగ్రనేతలు మిగిలిన వాటిని స్థానిక నేతలకు వదిలేశారు. దీనితో స్థానిక రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు వ్యూహాలు రూపొందించుకుని అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా అవసరమైన చోట్ల పార్టీలతో సంబంధం లేకుండా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వీలైనంతలో ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీలుకాని పక్షంలో రాజీకి ప్రయత్నిస్తున్నారు. తమకు పట్టున్న గ్రామాలను ఎవరికి వారు దక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కువ చోట్ల టిడిపి, అధికార కాంగ్రెస్ పార్టీల నేతలు కుమ్మక్కయినట్లు తెలుస్తోంది. వైకాపాతో కూడా అక్కడక్కడ కాంగ్రెస్ నేతలు కలిసి పని చేసుకుంటున్నారు. వైకాపా రెబల్స్ కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయిపోయారు. దీనితో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పరస్పర అవగాహనతో పంచాయతీలను పంచుకుంటున్నారు. అయితే పాచికలు పారని పంచాయతీల్లో మాత్రం నేతలు అడ్డదారులు వెతుక్కున్నారు. సాంకేతికపరమైన అంశాల విషయంలో తమకు అనుకూలంగా ఉన్న అధికారులతో ప్రత్యర్థులకు సమస్యలు సృష్టించి ప్రత్యర్థులు, చోటామోటా అభ్యర్థులను బరిలో నుండి తప్పించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా సాగిపోతుండడంతో అధికారులు కూడా జోక్యం చేసుకోవడం లేదు.

వేర్పాటు ఉద్యమాలు కాంగ్రెస్ సృష్టే
* సమైక్యాంధ్ర నినాదం చెప్పిన ఏకైక పార్టీ సిపిఎం
* కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్
కడప (అర్బన్),జూలై 14 : వేర్పాటు వాద ఉద్యమాలతో సమస్యలు సృష్టిస్తోందని కాంగ్రెస్ పార్టీనే అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ విమర్శించారు. ఆదివారం నగరంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వేర్పాటు వాద ఉద్యమాలు సృష్టించింది కాం గ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. రాష్ట్ర ంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి ‘సమైక్యా ంధ్రే మా నినాదం’ అని చెప్పగలిగిన ఏకైక దమ్మున్న పార్టీ సిపియం అని అన్నారు. కేంద్రంలో యూపిఎ ప్రభు త్వం అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిందవన్నారు. పేదలకు సబ్సిడీలు కుదించి, పారిశ్రామిక వేత్తలను అందలం ఎక్కించే విధంగా పాలకవర్గాలు పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపన్నుల పల్లకీలు మోసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పేదలపై భారాలు వేస్తున్నాయన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన నగదు బదిలీ పథకం, ఆహార బదిలీలు కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతిని దేవర దున్నపోతుల్లా కాంగ్రెస్ సర్కార్ పెంచి పోషిస్తోందన్నారు. అసమర్థత ప్రభుత్వం వల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లక్షా, 50 వేల కోట్ల బడ్జెట్‌లో వెనుకబడిన ప్రాంతా ల్లో 50 వేల కోట్లు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

గెలవలేమనే విమర్శలు
* ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు
రైల్వేకోడూరు, జూలై 14 : త్వరలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై గెలవలేమనే దురుద్ధేశ్యంతోనే కొందరు నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు ఖండించారు. ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో జరిగిన అభివృద్ధి కారణంగా ప్రజల్లో పార్టీపై మంచి విశ్వాసం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మొదలుకుని నేటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ హాయాంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల మేరకు అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత తమదేనన్నారు. జరుగుతున్న ఈ ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తం మీద ఇతర పార్టీల కన్నా అత్యధిక సర్పంచ్ పదవులను తామే గెలుచుకుంటామని ఎమ్మెల్సీ తెలిపారు. ఏయే పార్టీల నేతలు ప్రజలకు ఏమి అభివృద్ధి చేశారో ఓటర్లకు బాగా తెలుసన్నారు. ఇతర పార్టీలను ఇబ్బందులు పెట్టి గెలవాలనే తమ పార్టీకి లేదని, తాము కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు బత్యాల పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు హేమరాజ్, నవీన్, సుధాకర్, శివయ్య పాల్గొన్నారు.

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రాజంపేట/ సిద్దవటం, జూలై 14 : సిద్దవటం రేంజ్‌లోని మద్దూరు బీటులో అటవీ అధికారులు అదివారం 50 ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగులు గుర్తు తెలియని స్మగ్లర్లు మద్దూరు బీటులోని బాలాయికుంట అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు హుటాహుటిన వెళ్లి బాలాయికుంట ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి 50 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దుంగలను సిద్దవటం అటవీ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.
రాజంపేటలో...
రాజంపేట మండలం ఆంజనేయపురం ఎస్టీకాలనీ సమీపంలో ఎర్రచందనం దుంగలు లోడు చేస్తున్న లారీపై ఆదివారం తెల్లవారుజామున పోలీస్, అటవీశాఖ అధికారులు దాడి చేశారు. దీంతో 70 మంది తమిళనాడుకు చెందిన కూలీలు లారీని, దుంగలను వదలి పరారయ్యారు. ఈ సందర్భంగా 72 ఎర్రచందనం దుంగలను, కెఎ 02 8822 అనే నెంబర్ లారీని స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ రేంజర్ కె.విజయకుమార్ తెలిపారు. దుంగల విలువ సుమారు లక్ష రూపాయల మేరకు ఉంటుందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారం అందడంతో అటవీశాఖ, పోలీస్‌శాఖ అధికారులు, సిబ్బందితో సంయుక్తంగా ఈ దాడి చేశామన్నారు. నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టామన్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నవారు ఎంతటి వారైనను పట్టుకుంటామన్నారు. ఈ దాడిలో రాజంపేట రూరల్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మధుసూదన్‌రెడ్డి, ఎఫ్‌బిఓ ఎస్.నాగేశ్వరరావు, ఎబిఓ కెవి సుబ్బారెడ్డి, పోలీస్ సిబ్బంది, బేస్‌క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టాలి
* మాజీ ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రెడ్డి
నందలూరు, జూలై 14 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను ప్రలోభ పెట్టే ధనంతో పాటు ఇతరత్రా వాటిని ఎన్నికల అధికారులు అరికట్టే దిశగా కఠినచర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నందలూరులో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాళ్లపాక గ్రామంలో టిడిపి ప్రముఖ నాయకులు కృష్ణయ్య మృతి చెందడంతో ఆయనకు ఘన నివాళి అర్పించి, ఆ కుటుంబ సభ్యులకు ఏ అవసరం మెచ్చినా తాను అండగా నిలుస్తానన్నారు. టంగుటూరు పంచాయతీ పరిధిలోని పాచికాల్వ, చింతకాయలపల్లె, శేషయ్యగారిపల్లె, మదనమోహనపురం గ్రామాల్లో పర్యటించానన్నారు. కుందానెల్లూరులో ఏకగ్రీవంగా ఎన్నికైన తన వర్గంలోని గోపిరెడ్డి సతీమణి కళావతమ్మను అభినందించానన్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా పంచాయతీల్లో పోటీలో ఉన్న తన వర్గం వారి గెలుపుకోసం తాను తన వర్గీయులు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చింతకాయలపల్లెకు చెందిన లేబాక నరసింహులు టంగుటూరు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నేడు ఎన్నికల్లో ధనం, మందు ప్రభావం ఎక్కువగా ఉందని, ఎన్నికల కేంద్ర, రాష్ట్ర అధికారులు సరియైన రీతిలో చర్యలు చేపట్టడం లేదన్నారు. ఎన్నికల్లో ధనప్రభావం ఎక్కువగా ఉందని, ధనం ఉన్నవారే ఎన్నికల్లో అధికంగా పోటీలో ఉన్నారని వారు గెలిస్తే ధనార్జన ధ్యేయంగా ఉంటారన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందన్నారు. అవినీతికి పాల్పడం, రౌడీయిజం, దందాలు చేసే నాయకులు ప్రజలకు చేరువ కాలేరన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజంపేటలో ఎలక్ట్ఫ్రికేషన్ వందశాతం పనులు చేసి రాష్టస్థ్రాయిలో మంచి గుర్తింపు తెచ్చామన్నారు. తాగునీటి కోసం బోర్లు వేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని తన వర్గీయులంతా ఆయా పంచాయితీల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్‌ఖాన్, యెద్దల వెంకటేశ్వర్లు, మట్టిబాబు, తాటి సుబ్బరాయుడు, వౌలా, ఆల్విన్ రాజు, దుర్గయ్య, కృష్ణారెడ్డి, సంటెయ్య, ఓబయ్య, మగ్భుల్, మహబూబ్‌భాషా, మల్లికార్జునశెట్టి, వెంకటమస్తాన్, మల్లికార్జునరాజు, వేణు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

వెంటాడుతున్న వర్షాభావం..!
* ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలి
* రైతుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి
రాజంపేట, జూలై 14 : రాజంపేట డివిజన్‌లో రెండేళ్లూగా వరుస కరవును దృష్టిలో ఉంచుకొని వర్షాభావ పరిస్థితులపై ఇప్పటి నుండే సమీక్షలు జరిపి తగు విధంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఈ ఏడాది ఎంతైనా అవసరమని పలు గ్రామాల రైతాంగం నుండి విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కరవుతో బతుకుభయంతో ఉన్న ఇక్కడి రైతాంగాన్ని ఆదుకునేందుకు వర్షాభావ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుకు, సబ్సిడీతో విత్తనాలను అందించేందుకు వీలుగా ప్రణాళికలు చేపట్టడం వల్ల వలసలను ఆరికట్టేందుకు వీలవుతుందన్న అభిప్రాయం వ్యవసాయ శాఖలో కూడా వినిపిస్తుంది. గతంలో ఇలాంటి ప్రణాళికలు సిద్ధం చేసినా అమలులో సరైన విధానం అవలంభించని కారణంగా రైతాంగాన్ని ఆదుకోవడంలో సత్ఫలితాలు సాధించలేదన్న విమర్శలు వ్యవసాయశాఖపై ఉన్నాయి. ఈ ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించి చిరుజల్లులు వరకే పరిమితమవ్వడంతో ఖరీఫ్‌లో అనుకున్నంతగా వర్షాలు పడే పరిస్థితులు కానరానందున ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను కార్యోన్ముఖులను ఇప్పటి నుండే చేయడం ఇందుకోసం సబ్సిడీతో అవసరమైన విత్తనాలను సిద్ధం చేయడం ఎంతైనా అవసరమన్న డిమాండ్‌ను కొట్టిపారేసేందుకు వీలులేదు. ఈ విషయంలో జిల్లా వ్యవసాయశాఖనే కాకుండా, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ముందుచూపుతో ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వరుస కరవుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లాలో కొంతవరకు ఆదుకుంటున్నట్టు కనిపిస్తున్నా అది పూర్తిస్థాయిలో సత్ఫలితాల దిశగా పయనించడం లేదన్నది మాత్రం వాస్తవం. కనుక తిరిగి ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఇక్కడి రైతులను వ్యవసాయ కూలీలను వలసలు వెళ్ళకుండా ఆపడం చాలా కష్టమైన పనని కూడా పలు వర్గాలు భావిస్తున్నాయి. కనుక ఇప్పటినుండే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా వర్షాలు పడినా పడకపోయినా కొంతవరకు రైతులను ఆదుకునేందుకు వీలవుతుందన్నది వాస్తవం. రెండేళ్లుగా వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కరవు రావడం జరిగితే పరిస్థితులపై ప్రత్యేక నివేదికలు రూపోందించుకోవడం వల్ల వర్షాలను బట్టి అధికారులు పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించి తగు విధంగా చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకునేందుకు సులభంగా ఉంటుందన్నది వాస్తవమే. అయినా ఈ విషయంలో ఉన్నతాధికారుల స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకం. వర్షాలు వస్తే దానికి తగ్గట్టుగా రైతు పంట వేసుకునే అవకాశం కల్పించేందుకు సూచనలు ఇవ్వడం పెద్ద కష్టమైన పని కాదు. కనుక ముందుజాగ్రత్త చర్యలు ఎంతైనా అవసరమన్నది అనుభవజ్ఞులైన రైతులు అంటున్నారు. అలాగే ఇప్పటివరకు రైతులకు అందజేసిన సబ్సిడీ విత్తనాలు అధునాతన పరికరాల వివరాలకై కూడా నివేదికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందంటున్నారు. ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం ఈ పరిస్థితుల్లో రైతులు వరిసాగు చేసుకోలేరని నివేదికలు పంపించడం అప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను సబ్సిడీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతూ వస్తుంది. ఇందువల్ల రైతులకు మేలు కన్నా కీడే ఎక్కువవుతుంది.
గత రెండేళ్ల చరిత్రను పక్కనుంచితే పదిహేను సంవత్సరాలుగా వర్షాల పరిస్థితిని డివిజన్‌లో అంచనా కట్టినా ముడూ నాలుగేళ్లు మినహాయించి వర్షాలు పడిన జాడ కనిపించదు. కనుక ముందుజాగ్రత్త చర్యలు రైతును ఆదుకునేందుకు తీసుకోవడం ఎంతైనా అవసరమన్నది ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. రైతుల సంక్షేమంపై ఎన్నో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి వీలుగా ముందుజాగ్రత్త చర్యలపై దృష్టి కేంద్రీకరించడం ఎంతైనా అవసరం.

బాంబు స్వాధీనం
ముద్దనూరు, జూలై 14: స్థానిక ముద్దనూరు -జమ్మలమడుగు రహదారి ప్రక్కన ఉన్న శ్మశానంలో ఆదివారం ఓ సమాధిపై బాంబు ఉండడంతో సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ బాలమద్దిలేటి హుటా హుటిన సంబంధిత స్థలానికి వెళ్ళి బాంబును స్వాదీనం చేసుకున్నారు. అలాగే చుట్టు ప్రక్కల నివాసం ఉంటున్న ప్రజలను విచారించగా ఈ ప్రాంతంలోని సమాధి పైన గత మూడురోజులుగా బాంబు ఉన్నదని అది సంబంధిత బంధువులు పూజా నిమిత్తం ప్రసాదం పెట్టి ఉంటారని భావించామని స్థానికులు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలి
* జెవివి రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య
కడప , జూలై 14 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య కోరారు. ఆదివారం స్థానిక సిపి బ్రౌన్ లైబ్రరీ అవరణంలో పాఠశాల విద్య-పర్యవేక్షణపై నిర్వహించిన జిల్లా వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3వేల పాఠశాలలు ప్రైవేట్ విద్య ఆకర్షణ కారణంగా వచ్చే విద్యా సంవత్సరంలో మూతపడే అవకాశం ఉన్నా, 7వేల పాఠశాలలను కాపాడేందుకు ఉపాధ్యాయలోకం, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, అధికార యంత్రాంగం ఉమ్మడి పట్టుపట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో జెవివి భాగస్వామ్యం అవుతుందన్నారు. ఉపాధ్యాయులు పూనుకుంటే, తల్లిదండ్రులులకు నమ్మకం కలిగిస్తే ఉత్సాహభరితమై నేర్చుకునే వాతావరణం కల్గిస్తే ప్రస్తుతం ఇంగ్లీష్ చదువుల కొర్కెలను తీర్చగలిగితే సంవత్సరం జిల్లాలో ప్రమాదంలో ఉన్న 406 పాఠశాల అభివృద్ధిచేసుకోవచ్చన్నారు. ఇందులో 12 మండలాలలోని 16 ప్రభుత్వ పాఠశాలల ప్రాథమిక పాఠశాలల బాధ్యత తీసుకోవాలని వర్క్‌షాపులో నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఎంఇవో అసోషియేన్ జిల్లా అధ్యక్షులు వి నాగమునిరెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు వౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుంటోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయ అవసరమైన విద్యార్హతలు, శిక్షణ, అనుభవం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లను చదివించాల్సిన అవసరం లేదన్నారు.
10వ తరగతి పరీక్షల్లో జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు స్థాపించిన విజయాలు గమనార్హం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జెయుపి నగర సలహాదారుడు రామస్వామి, యుటిఎఫ్ జిల్లా నాయకులు చంద్రశేఖర్, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి గుణశేఖర్, వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ బాధ్యులు రజనీకాంత్‌రెడ్డి, వయోజన విద్య మానిటర్ జిల్లా అధికారి ఇ సోమశేఖర్‌రెడ్డి, మున్సిపల్ ఉర్దూ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కెవి సుబ్బారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులుకట్టా నరసింహులు, రాఘవరెడ్డి, వైద్యులు డాక్టర్ పుత్తాబాలిరెడ్డి, జెవివి విద్యా విభాగం కో కన్వీనర్ ఎడి దేవదత్తం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ రఘునాధ్‌రెడ్డి, జెవివి జిల్లా సభ్యులు అవధానం శ్రీనివాస్, ఇన్నయ్య షామీర్‌బాషా, రామగోపాల్, వెంకటేశ్వర్లు, అనికుమార్, క్రిష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్రామరాజు, మహావీర్, నాయుడు, గోవిందు, రవూఫ్, వెంకట్రామణ, బాబురావు, మస్తానయ్య, దాదాపీర్, కుశకుమార్, వెంకటసుబ్బయ్య, రామచంద్ర పాల్గొన్నారు.

దోషులను అరెస్టు చేయాలని రాస్తారోకో
పోరుమామిళ్ల, జూలై 14: దోషులను అరెస్టు చేయాలంటూ దళిత నేతలు ఆదివారం సాయంత్రం రాస్తారోకో చేపట్టారు. స్థానిక గిరినగర్‌కు చెందిన మనోహర్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ భవనం ఎదుట దళితనేతల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. బి కోడూరు మండలం రాజుపాళెం దళితవాడకు చెందిన మనోహర్ గిరినగర్‌లో కాపురం ఉంటున్నాడని శనివారం తెల్లవారుజామున అతనిని బయటికి పిలుచుకొని వచ్చి అంబేద్కర్ భవనం వద్ద తీవ్రంగా గాయపరిచి అక్కడే పడవేసి వెళ్లిపోయారని దానిపై శనివారం మనోహర్ ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఓబులేసు, నరసింహులు మరొకరిపై కేసు నమోదు చేశారు. వారందరిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ ముత్యాల ప్రసాద్, దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడురాజు, సిపియం వీరయ్య, శేఖర్ తదితరులు డిమాండ్ చేశారు. సిఐ మురళినాయక్ తమ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తామన్నారు.

విష జీవులతో నిండుతున్న డ్రైనేజీలు
సుండుపల్లె, జూలై 14 : మండలంలోని యర్రమనేనిపాళెం కుప్పగుట్ట ప్రాంతంలో కాలువ లేనందు వల్ల ఇంటి పరిసర ప్రాంతాల నుంచి మురిగి నీరు గ్రామం చివరి బాగానా నిలయంగా ఉండడంతో విష జీవులకు చాలా నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మురిగి నీరు నిల్వ ఉండడంతో గతంలో ఆ గ్రామంలో మలేరియా, టైపాయిడ్, చికెన్‌గున్యా వ్యాధులతో చిన్నారులతో సహా రోగిగస్తులపై బాధపడ్డ సాగారు. ఆ గ్రామంలో డ్రైనేజి నీరు ఎక్కువగా నిల్వ ఉండడంతో దోమల శాతం అధికంగా పెరుగుతుంది. అయితే సంబంధిత అధికారులు మాత్రం డ్రైనేజిని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. కాని ఇంత వరకు బ్లీచింగ్ కూడా చల్లని పరిస్థితి దాపురించింది. గతంలో జిల్లా అధికారులు డ్రైనేజి కాలువలు కావాలని అనేక మార్లు విన్నవించినా పట్టించుకొన్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపించారు.

* పట్టించుకోని పెద్దలు * చోటా నేతలదే హవా
english title: 
strategy

ముగిసిన నామినేషన్ల పరిశీలన

$
0
0

చిత్తూరు, జూలై 14: జిల్లాలోని మొత్తం 1,356పంచాయతీలు, 13,088వార్డులకు నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. 9వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియను జిల్లా అధికారులు ప్రారంభించారు. ఇందులో చివరిరోజైన శనివారంనాటికి పంచాయతీ స్థానాలకు 8,447 వార్డు మెంబర్లకు 24,445 అత్యధిక నామినేషన్లు వచ్చాయి. అయితే ఆదివారం సాయంత్రానికి నామినేషన్ల పరిశీలన అనంతరం పంచాయతీలకు సంబంధించి 379నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. బరిలో 8,068మంది అభ్యర్థులు ఉన్నట్లు జిల్లాపంచాయతీ ఎన్నికల అధికారి వి.ఆర్.చంద్రవౌళి తెలిపారు. వార్డు మెంబర్ల స్థానాలకు 346నామినేషన్లు తిరస్కరించగా 24,099మంది బరిలో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు, డివిజన్‌లోని చిత్తూరు మండలం పంచాయతీ 99, వార్డు మెంబర్లకు 266, గుడిపాల 147-376, యాదమరి 123-332, జి.డి.నెల్లూరు 190-492, పూతలపట్టు 77-253, పెనుమూరు 128-400, బంగారుపాళ్యం 173-512, తవణంపల్లె 161-492, ఐరాల 139-331, ఎస్.ఆర్.పురం 140-250, వెదురుకుప్పం 144-375, ఆర్.సి.పురం 155-345, వడమాలపేట 117-278, పాలసముద్రం 57-189, పుత్తూరు 83-224, కార్వేటినగర్ 121-340, నారాయణవనం 76-276, నగరి 127-404, నిండ్ర 117-305, విజయపురం 121-343 చిత్తూరుడివిజన్‌లోని మొత్తం 20మండలాలకు వెరసి సర్పంచ్ పదవులకు 2,491, వార్డు మెంబర్లకు 6,895మంది బరిలో ఉన్నారు.
తిరుపతి డివిజన్‌లోని మండలాలు:- తిరుపతి సర్పంచ్‌లు 175, వార్డుమెంబర్లు 944, చంద్రగిరి 168-499, పాకాల 137-341, పులిచెర్ల 122-338, రేణిగుంట 115-477, శ్రీకాళహస్తి 220-566, ఏర్పేడు 207-574, తొట్టంబేడు 166-443, బి.ఎన్.కండ్రిగ 128-367, కె.వి.బి.పురం 163-431, సత్యవేడు 140-435, వరదయ్యపాళ్యం 124-374, నాగలాపురం 76-226, పిచ్చాటూరు 116-365 వెరసి 14మండలాలకు గాను సర్పంచ్ పదవులకు 2,057, వార్డు మెంబర్లకు 6,420నామినేషన్లు వచ్చాయి.
మదనపల్లె డివిజన్:- మదనపల్లె సర్పంచ్ 149, వార్డుమెంబర్లకు 641, నిమ్మనపల్లె 84-171, కురబలకోట 61-210, బి.కొత్తకోట 65-266, పెద్దమండ్యం 70-253, తంబళ్ళపల్లె 132-263, పి.టి.యం 131-298, మొలకలచెరువు 108-216, వాల్మీకిపురం 120-352, గుర్రంకొండ 110-377, కలకడ 97-392, కలికిరి 85-266, పీలేరు 125-500, ఎర్రావారిపాళ్యం 123-388, రొంపిచెర్ల 48-253, చిన్నగొట్టిగల్లు 131-225, కె.వి.పల్లె 106-387, పుంగనూరు 155-307, చౌడేపల్లి 135-287, రామసముద్రం 96-211, సదుం 90-332, సోమల 84-337, పెద్దపంజాణి 168-374, పలమనేరు 75-224, గంగవరం 110-354, బైరెడ్డిపల్లె 101-395, వి.కోట 136-564, రామకుప్పం 108-359, గుడుపల్లి 110-290, శాంతీపురం 176-450, కుప్పం 231-842 వెరసి 31 మండలాలకు గాను సర్పంచ్‌లకు 3,520, వార్డు మెంబర్లకు 10,784నామినేషన్లు వచ్చినట్లు జిల్లాపంచాయతీ అధికారి తెలిపారు. ఈనెల 17వ తేదీన తుదిజాబితా వెలువడనుంది.

దేశంలో ప్రజల నిష్పత్తి ప్రకారం కోర్టులు లేవు
హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా వెల్లడి
పీలేరు, జూలై 14: దేశంలో ప్రజల నిష్పత్తి ప్రకారం కోర్టులు లేవని హైకోర్టు చీఫ్ జస్టీస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా అన్నారు. ఆదివారం పీలేరులో 11వ ఏడిజె కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని అన్నికోర్టుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం 9గంటలకు 11వ ఎడిజె కోర్టును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ దేశంలో 10లక్షల మందికి ఒక కోర్టు వుండాలని నిబంధనలువున్నా కోటి మంది జనాభా వున్నా ఒక కోర్టు కూడ లేదని దీనితో ప్రజలకు సత్వర న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుందన్నారు. ప్రతి కోర్టులోను ప్రజల సౌకర్యార్థం వౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం వుందన్నారు. పీలేరులో 11వ ఏడిజె కోర్టు ప్రారంభించడంవలన ఈప్రాంతపు కక్షదారులు జిల్లాకోర్టుకు వెళ్లాల్సిన అవసరంలేదని తెలిపారు. న్యాయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోవుండి చేరువకావాలని జుడీషియల్ అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. ప్రజల పక్షాన న్యాయవ్యవస్థ నుండి నమ్మకం కల్గించాలని కేసుల పరిష్కారానికి ప్రజలు సహకరించాలని ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు న్యాయ వ్యవస్థపై పరిపూర్ణమైన అవగాహనతో మెలగాలనిసూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జీలు జివి రమణ, ఎల్ రమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

దేశంలో విభజన ఉద్యమాలకు చరమగీతం పాడండి
* సిడబ్ల్యుసిలో సమైక్యాంధ్రకు సానుకూల నిర్ణయం తీసుకోకుంటే కాంగ్రెస్ భూ స్థాపితమే
* శాప్స్ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి హెచ్చరిక
తిరుపతి, జూలై 14: విభజన ఉద్యమాలతో భారతదేశంలో అభివృద్ధి కుంటుపడటంతో పాటు దేశ సమగ్రత, సమైఖ్యత తీవ్రంగా దెబ్బతింటున్నదని, ఇటువంటి ఉద్యమాలకు ఇకనైనా చరమగీతం పాడాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి యాదవకాలనీలో మధురవాణి ఇంగ్లీషు మీడియం హైస్కూల్లో శాప్స్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు డి మహమ్మద్ రఫీ అధ్యక్షతన శాప్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో 20కిపైగా విభజన ఉద్యమాలు నడుస్తున్నాయన్నారు. ఇటువంటి విభజన ఉద్యమాలకు కారణం ప్రాంతాల మధ్య అభివృద్ధిలో తేడా వుండటమేనన్నారు. తెలంగాణ వంటి విభజన ఉద్యమాల వెనుక టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్, అతని కుటుంబ సభ్యుల స్వార్థం వుందన్నారు. తమ స్వార్థంను ప్రజలపై రుద్ది పదే పదే రెచ్చగొట్టిన కారణంగా వందలాది మంది అమాయకపుజనం, విద్యార్థులు బలి అవుతున్నారన్నారు. నిజంగా తెలంగాణకోసమే జీవితాలను త్యాగం చేస్తున్న కుటుంబం కేసిఆర్‌ది అయితే వారి ఇంటిలో ఎవ్వరు తెలంగాణకోసం ఆత్మహత్య చేసుకోలేదన్నారు. అంతేకాదు ఏరాజకీయ నాయకుడి ఇంటిలో కూడా ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. కేవలం పదవులకోసం తెలంగాణ వాదాన్ని రెచ్చకొట్టి ఆ ప్రాంత ప్రజల జీవితాలతో నేతలు చెలగాటమాడుతున్నారన్నారు. తెలంగాణ వెనుకబాటు వుంటే ఆ ప్రాంతంలో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రులుగా వున్నారని, ప్రధాన మంత్రిగా సైతం వున్నారన్నారు. అటువంటి వారి నిర్లక్ష్యంపై తిరగబడ్డాలన్నారు. ఇప్పుడు చేస్తున్న ఏర్పాటువాద ఉద్యమాలు నేతల నిర్లక్ష్యంపై తిరుగుబాటు ఉద్యమంగా చెయ్యాలన్నారు. రాయలసీమలో వెనుకబాటు కూడా ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రుగా అయిన వారి పాపమేనన్నారు. సమైక్యరాష్ట్రంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపించిన నేతలు ఇతర ప్రాంతాల అభివృద్ధిని విస్మరించారన్నారు. అభివృద్ధిలో అసమానతలు లేకుండా చూడాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై వుందన్నారు. అనంతరం ఎస్వీయూ ప్రొఫెసర్ బావాజి మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన సిడబ్ల్యుసిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశానికే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం వుందన్నారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ బర్త్‌డే సందర్భంగా తీసుకున్న తెలంగాణ ప్రకటన నిర్ణయం దేశ ప్రయోజనాలను, దేశ సమైఖ్యతను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. మరో 50 ఏళ్ల అభివృద్ధి వెనక్కు వెళ్లిందన్నారు. పదవులకోసం ప్రాకులాడే ఉద్యమకారులు విశాల దృక్పథంతో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమ ప్రభావంతో ఎంత నష్టపోతున్నామో తెలియదా? అని ప్రశ్నించారు. ఇకనైనా అభివృద్ధి నిరోధకులుగా, దేశద్రోహులుగా వేర్పాటువాదులను అభివర్ణించాల్సిన అవసరం వుందన్నారు. కోర్టులు సైతం జోక్యం చేసుకుని దేశాభివృద్ధికి విఘాతం కల్గిస్తున్న విభజన ఉద్యమాలను నిరోధించేందుకు పటిష్టమైన చట్టం తీసుకురావాలని కోరారు. దేశంలో 16 రాష్ట్రాల్లో విభజన ఉద్యమాలున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజిలు ప్రకటించాల్సిన అవసరం వుందన్నారు. సిడబ్ల్యుసి సమావేశంలో నిర్ణయంలో ఏమాత్రం పొరపాటు చేసినా దేశం తీవ్రంగా నష్టపోతున్నదన్నారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ తయారు చేసి ప్రతి కాలేజిలో విద్యార్థులతో చైతన్య సదస్సులను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో శాప్స్ నేతలు కెవి ప్రసాద్, టిఎస్‌ఎన్వీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి, సమైక్యాంధ్ర ప్రదేశ్ స్కూల్ అధినేత అధ్యక్షులు జె రాజేంద్ర ప్రసాద్, ఎస్వీ ప్రసాద్, శాప్స్ చంద్రశేఖర్, లక్ష్మిపతినాయుడు, విద్యార్థి జేఏసి నేతలు కె ధనంజయులునాయుడు, తేజ్‌ప్రకాష్, ఎస్‌కె నిజాముద్దీన్, భారతి, యశోద, కుమారి, సరోజమ్మ, మదు, సుధాకర్, శ్రీధర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శాప్స్ అధికార ప్రతినిధిగా ఉప్పలపాటి
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి, కార్మిక విభాగం కన్వినర్‌గా లక్ష్మిపతినాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో వీరు మొదటినుండి కృషి చేస్తున్న నేపధ్యంలో ఈ నియామకం చేసినట్లు తెలిపారు.

21 మండలాల్లో 54 పంచాయతీలు ఏకగ్రీవం
* ఐదు పంచాయతీలకు నామినేషన్లు నిల్
చిత్తూరు, జూలై 14: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 1,356 పంచాయతీలు ఉండగా వివిధ కారణాలతో ఐదు పంచాయతీలకు నామినేషన్లు పడలేదు. మిగిలిన పంచాయతీల విషయంలో 21 మండలాల్లోని 54 పంచాయతీ సర్పంచ్ పదవులకు సింగిల్ నామినేషన్ వచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి వి.ఆర్.చంద్రవౌళి తెలిపారు. సింగిల్‌నామినేషన్లు పడిన పంచాయతీల వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి. గుడిపాల-క్రిష్ణజిమ్మాపురం పంచాయతీ, గంగాధర నెల్లూరు-అగరమంగళం, పూతలపట్టు-తలపులపల్లె, తలుపునేనివారిపల్లె, పోలవరం, గాండ్లపల్లె, పోటుకనుమ, చిటిపిరాళ్ళ పంచాయతీలు, పెనుమూరు మండలం -చింతపెంట, గానుగపల్లె పంచాయతీలు, బంగారుపాళ్యం మండలం-మహాసముద్రం, ఈచినేరిపల్లె, పాలేరు, నలగాంపల్లె, గుంతూరు పంచాయతీలు, తవణంపల్లె మండలం-అరగొండ గొల్లపల్లె, తొడతర, తవణంపల్లెపుత్తూరు పంచాయతీలు, ఎస్.ఆర్.పురంమండలం-పుల్తూరు, వేణుగోపాలపురంపంచాయతీలు, వెదుకురుకుప్పం మండలం -పెరుమాళ్ళపల్లెపంచాయతీ, వడమాలపేట మండలం-కల్లూరుపంచాయతీ, కార్వేటినగరం-సి.డి.కండ్రిగ, గాజంకి పంచాయతీలు, నారాయణవనంమండలం-నయనారుకండ్రిగ, నారాయణవణం, తిరువత్యం పంచాయతీలు, నిండ్రమండలం-నెట్టేరి, మెళంబాకం, ఓరూరుపేట, కైపాకంపంచాయతీలు, విజయపురం మండలం-మల్‌రెడ్డికండ్రిగ పంచాయతీ, తిరుపతిమండలం-కొత్తూరు, రామానుజపల్లె పంచాయతీలు, చంద్రగిరి మండలం-రెడ్డివారిపల్లె, పిచ్చినాయుడుపల్లి, యం.కొత్తపల్లె, ఎ.జి.పల్లె, మామండూరుపంచాయతీలు, శ్రీకాళహస్తి మండలం-అరవకొత్తూరు, ఎర్రగుడిపాడు, ఐనాగరాలు, సురావారిపల్లె పంచాయతీలు, కె.వి.బి.పురం మండలం-తిమ్మసముద్రం పంచాయతీ, సత్యవేడు మండలం-రెప్పలవాడ, పోతాంబరికుప్పం, పొల్లాదం పంచాయతీలు, నాగలాపురం మండలం-అచ్చమనాయుడు కండ్రిగ, క్రిష్ణపురం, సుబ్బానాయుడు కండ్రిగ పంచాయతీలు, పెద్దమాండ్యం-గుర్రంవాడ్లపల్లె, కొత్తకడపల్లె, నాతియోబంగారుపల్లె, కలిచెర్ల పంచాయతీలు, బైరెడ్డిపల్లె మండలం-వెంగంవారిపల్లె పంచాయతీ సర్పంచ్ పదవులకు సింగిల్ నామినేషన్లు వచ్చినట్లు జిల్లా పంచాయతీ అధికారి వి.ఆర్.చంద్రవౌళి తెలిపారు. ఇదిలా ఉండగా చిత్తూరు మండలంలోని పెద్దిశెట్టిపల్లె పంచాయతీ, బంగారుపాళ్యం మండలంలోని చీకూరిపల్లె పంచాయతీ, నారాయణవనం మండలంలోని సముదాయం పంచాయతీ, సత్యవేడు మండలంలోని ఎన్.ఆర్.అగ్రహారం, పుదుకుప్పం పంచాయతీలకు నామినేషన్లు దాఖలుకాలేదని డిపిఓ తెలిపారు.

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు
చిత్తూరు, జూలై 14: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవమైన పంచాయతీలకు కేంద్రప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తు జిల్లా పంచాయతీ అధికారికి ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయతీలకు సంబందించి 15వేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలో అభివృద్ధి పనులకు రూ.20లక్షలు, 15వేల కన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఏడు లక్షల రూపాయలు కేంద్రప్రభుత్వం అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ‘టెలిగ్రామ్’ సేవలకు మంగళం
* ఏటా రూ. 150 కోట్ల నష్టం
* మంచు మనోజ్ టెలిగ్రామ్‌తో ముగిసిన శకం
తిరుపతి, జూలై 14: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ టెలికం సర్వీసులో (తంతి తపాల) టెలిగ్రామ్ సర్వీసులకు మంగళం పాడారు. 1853వ సంవత్సరం కలకత్తా నగరంలో తొలిసారిగా ప్రారంభమై 160 ఏళ్లుగా సుదీర్ఘ సేవలు అందించిన టెలిగ్రామ్ (తంతి తపాల) సేవ శకం ఆదివారం నాటితో ముగిసింది. ఈ నేపధ్యంలో తిరుపతి బిఎస్‌ఎన్‌ఎల్ ప్రాంతీయ కార్యాలయంలో ఈ సేవకు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రముఖ సినీనటుడు మంచుమనోజ్ కుమార్ హైదరాబాద్‌లో ఉన్న తన తండ్రి మోహన్‌బాబు, సోదరి లక్ష్మిప్రసన్న, మంచు విష్ణువర్ధన్ తదితరులకు 8 టెలిగ్రామ్‌లు ఆదివారం చివరిగా పంపారు. దీంతో ఈ సేవను నిలిపివేస్తున్నట్లు టెలికం అదికారులు అధికారికంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కల్గిన ఈ సేవ నేడు వచ్చిన టెలికం విప్లవంలో కనుమరుగైంది. దేశంలో ఏటా 150 కోట్ల రూపాయలు టెలికం సంస్ధకు ఈ సేవ ద్వారా నష్టం జరుగుతోంది. టెలికం కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి 30 నుండి 50 వేల రూపాయలు వేతనాలు వస్తుండటం ఈ టెలిగ్రామ్‌ల ద్వారా నెలకు 10 నుండి 20 వేల రూపాయలు మాత్రమే ఆధాయం లభిస్తుండటం గమనార్హం. తిరుపతి బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో నెలకు ఈ సేవ ద్వారా కేవలం 15 వేల రూపాయలు ఆదాయం లభిస్తుంది. అయితే ఈ సేవకు వినియోగించబడుతున్న ఉద్యోగుల జీతాలు లక్ష రూపాయలు దాటుతున్నది. ఇటువంటి పరిస్ధితుల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా ఈసేవను తొలగిస్తున్నట్లు ఆ సంస్ధ యాజమాన్యం ప్రకటించింది. చివరి రోజు తిరుపతి బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ద్వారా 60 టెలిగ్రామ్ సేవలు అందాయి. టెలికం శకం ముగిసిన నేపధ్యంలో అనేక మంది ఉద్యోగులు, వినియోగదారులు మనోభారాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్ కమర్షియల్ ఎజిఎం వెంకోరావు, ఏఓ ఒవిఆర్ శర్మ, జిఎం పిఏ సుబ్రమణ్యం, మోహన్‌రావు, ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించండి
* పంచాయతీ ఎన్నికల్లో పకడ్బందీ భద్రత ఇవ్వండి
* బెల్టుషాపులుఏరివేయండి
* క్రైమ్ మీటింగ్‌లో అర్బన్ ఎస్‌పి ఆదేశం
తిరుపతి, జూలై 14: పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత పోలీసు అధికారులను అర్బన్ ఎస్‌పి రాజశేఖర్‌బాబు ఆదేశించారు. ఆదివారం తిరుపతి అర్బన్ ఎస్‌పి కార్యాలయంలో వివిధ సబ్ డివిజన్ల పోలీసు అదికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో బైండోవర్ కేసులను పూర్తి చెయ్యాలని సూచించారు. మద్యం షాపులు ఎన్ని వున్నాయి, వాటికి గతంలో అందుతున్న మద్యం ఎంత, తాజాగా ఎంత మద్యం అందుతున్నదో లెక్కలు కట్టాలన్నారు. ఎక్సైజ్ అధికారుల సహకారంతో గ్రామాల్లో బెల్టుషాపులను పూర్తిగా ఏరివేయ్యాలని సూచించారు. రాత్రి వేళల్లో కాని, పగటి పూట కాని గుంపులుగా వుండటం, ఎన్నికల తాయితాలు పంచడం వంటి సంఘటనలకు అవకాశం లేకుండా, ఘర్షణలకు తావులేకుండా తగు చర్యలు తీసుకోవాలని వివిధ సబ్ డివిజన్ల పోలీసు అధికారులను ఎస్‌పి ఆదేశించారు. తిరుమలకు వెళ్లే వాహనాలు ఎన్ని, అధికారులు వాహనాలు ఎన్ని తదితర అంశాలను పరిశీలించేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చెయ్యాలని, టిటిడి సహకారంతో తిరుమలలో గదుల్లో చోరీలు జరుగకుండా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. చిన్నపిల్లల మిస్సింగ్ కాకుండా, కిడ్నాప్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌పి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎఎస్‌పిలు ఉమామహేశ్వర్‌శర్మ, సుబ్బరామిరెడ్డి, డిఎస్‌పిలు విమలకుమారి, శంకర్, స్వామి, నరసింహారెడ్డి, ఎస్‌కెబాబు, శ్రీనివాసులు, అభిషేకం, వెంకటేశ్వరనాయక్ తదితరులు పాల్గొన్నారు.

సాధనతో అసాధ్యాలు సైతం సుసాధ్యం
* డిస్కం సిఎండి విద్యాసాగర్‌రెడ్డి వెల్లడి
* ఘనంగా ముగిసిన ఎపిఎస్‌పిడిసిఎల్ క్రీడా సాంస్కృతికోత్సవాలు
* ఓవరాల్ ఛాంపియన్ నెల్లూరు సర్కిల్
* రన్నర్‌గా గుంటూరు సర్కిల్
* క్రికెట్ విజేత తిరుపతి సర్కిల్
తిరుపతి, జూలై 14: సాధన చేయడం ద్వారా అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయవచ్చునని ఏకలవ్యుడి కఠోర శ్రమ ఫలితం ద్వారా మనకు అవగతం అవుతుందని ఎపిఎస్‌పిడిసిఎల్ సిఎండి కె విద్యాసాగర్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండురోజులుగా తిరుపతిలో జరుగుతున్న ఎపిఎస్‌పిడిసిఎల్ క్రీడా సాంస్కృతికోత్సవాలు ఆదివారం నాటితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్ధానిక ఎయిర్‌బైపాస్‌రోడ్డులోని పిఎల్‌ఆర్ కనె్వన్షన్‌హాల్లో బహుమతి ప్రదానోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎండి విద్యాసాగర్‌రెడ్డి మాట్లాడుతూ నిరంతర సాధన ద్వారా ఆటల్లో విజయం సాధించవచ్చునన్నారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక దృఢత్వం ఏర్పడుతుందన్నారు. గెలుపు ఓటములను క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలని, తద్వారా ఉద్యోగంలో కూడా చిన్నచిన్నలోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేజతలకు సిఎండి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. స్ర్తిలు, పురుషుల విభాగం రెండింటిలోనూ నెల్లూరు సర్కిల్ ఓవర్‌లాల్ చాంపియన్‌గా నిలిచింది. షటిల్, టేబుల్, వాలీబాల్, క్యారమ్స్, హాకీ, లాస్ టెన్నిస్‌లలో గెలుపొందారు. గుంటూరు సర్కిల్ రెండవ స్థానంలో నిలిచింది. క్రికెట్ విజేతగా తిరుపతి సర్కిల్ నిలిచింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎస్ విశ్వనాథం, సయ్యద్‌బిలాల్‌బాషా, చీఫ్ ఇంజనీర్ రామ్‌సింగ్, రాజబాపయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు డి ఏసుదాసు, టి హనుమత్ ప్రసాద్, కె పాల్, ఎ వేణుగోపాల్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో నాటు తుపాకులు కలకలం
* 7 నాటు తుపాకులు,
ఆరు జింక కొమ్ములు స్వాధీనం
బి.కొత్తకోట, జూలై 14: మండలంలోని గట్టుపంచాయతీ గట్లమీదపల్లిలో నాటుతుపాకులు రాజ్యమేలుతున్నాయి. ఆదివారం గట్లమీదపల్లిలో ఏడు నాటుతుపాకులు, ఆరు జింక కొమ్ములులను ఎస్సై సుకుమార్ తన సిబ్బందితో కలిసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గట్లమీదపల్లి నుంచి రసహ్యసమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది స్థానికుల నుంచి అందిన సమాచారంమేరకు ముళ్లపొదల్లో దొరికాయని పోలీసులు చెబుతున్నారు. అసలే గ్రామాల్లో ఎన్నికలవేడితో రాజుకుంటున్న సమయంలో ఇలా నాటుతుపాకులు కలకలంరేపాయి. ఎస్సై కథనంమేరకు గట్లమీద నుంచి అందిన సమాచారంతో అక్కడికి చేరుకుని కూంబింగ్ నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నాటుతుపాకులు, జింకకొమ్ములు ఎవరుపెట్టారో, ఎందుకు పెట్టారో అని వాటివివరాలు త్వరలో సేకరించి నిందితులను గుర్తిస్తామని ఆయన అన్నారు. నాటుతుపాకులతోపాటు నిందితులను పోలీసులు గుర్తించారని కానీ వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని రాజకీయ వత్తిడితో వారిని వదిలేసినట్లు ఆ గ్రామస్థులు అంటున్నారు.
ఐదు నాటు తుపాకులు స్వాధీనం
వి.కోట: మండల పరిధిలోని నాయకనేరి అటవీ చెక్‌పోస్టు సమీపంలో ఆదివారం ఐదు నాటుకుపాకులు స్వాదీనం చేసుకున్నట్లు ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. వారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల దృష్ట్యా మండలంలో తనిఖీలు నిర్వహిస్తుండగా నాయకనేరి చెక్‌పోస్టు సమీపంలో అనుమానితులు ఐదు నాటుతుపాకులను పొదల్లో వేసి పరారైయ్యారు. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రశాంతంగా మండలంలో ఎన్నికలు నిర్వహించేందుకు 38మందిపై బైండోవర్ కేసు నమోదుచేసినట్లు తెలిపారు. మండలంలో జిల్లా అధికారుల సూచన మేరకు ఆగస్టు 2వరకు 144సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతులు లేకుండా ప్రదర్శనలు, సభలు నిర్వహించరాదన్నారు. బెల్టుషాపులను స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. ఎటువంటి సమాచారమైన అందించాలంటే 100కు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు.

* సర్పంచ్ స్థానాలకు 8,068 * వార్డుమెంబర్లకు 24,099 మంది ఖరారు
english title: 
n

రసవత్తరంగా ‘పంచాయతీ’ రాజకీయాలు

$
0
0

గుంటూరు, జూలై 14: పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతున్నప్పటికీ జిల్లాలో ప్రధాన రాజకీయ పక్షాలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించడంతో సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బేరసారాలు ఊపందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23, 27, 31 తేదీల్లో వరుసగా తెనాలి, గుంటూరు, నరసరావుపేట డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి, పంచాయతీ ఎన్నికలు కొత్త కానప్పటికీ తొలిసారిగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కోనుంది. రానున్న రోజుల్లో జరగబోయే మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు పునాది కావడంతో అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తాము బలపర్చిన అభ్యర్థులే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యేలా ప్రధాన పార్టీల నేతలు చక్రం తిప్పుతున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో ఉప సంహరణలోగా తమ ప్రత్యర్థులను సామ దాన బేధ దండోపాయాలు ఉనుపయోగించి ఎలాగైనా బరి నుండి వైదొలిగించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం లక్షల రూపాయలు చేతులు మారనున్నాయి. జిల్లావ్యాప్తంగా 1010 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 5,949 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే 10,654 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందుకు సంబంధించి 28 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. నరసరావుపేట డివిజన్‌లో అత్యధికంగా 357 పంచాయతీలు ఉండగా, తెనాలి డివిజన్‌లో 348, గుంటూరు డివిజన్‌లో 307 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 39 పంచాయతీల సర్పంచ్ పదవులకు ఒకే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 11 నియోజకవర్గాల పరిధిలోని ఈ 39 పంచాయతీలలో ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఏకగ్రీవం కానున్నారు. అమరావతి మండలం ముత్తాయపాలెంలో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో అక్కడ ఎన్నిక జరగడంపై సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఇలా ఉండగా తెనాలి డివిజన్‌లో 498 వార్డులకు, గుంటూరు డివిజన్‌లో 120 వార్డులకు ఒకే నామినేషన్ దాఖలు కావడంతో అక్కడ కూడా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెనాలి డివిజన్‌లో రేపల్లె మండలం చెన్నుపల్లివారిపాలెంలో 7 వార్డులకు, కామరాజుగడ్డ ఉత్తరం పంచాయతీలో 4 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఆయా వార్డులకు ఎన్నిక నిర్వహించడంపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తం మీద పార్టీలకతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకున్నాయి.

వడ్డీ వ్యాపారి దారుణ హత్య
చేబ్రోలు, జూలై 14: చేబ్రోలుకి చెందిన వడ్డీ వ్యాపారి అనుమానాస్పద స్థితిలో దారుణ హత్యకు గురయ్యాడు. మునుపెన్నడూ లేని విధంగా చేబ్రోలులో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపడంతో కలకలం రేగింది. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.... చేబ్రోలులోని ఉప్పరపాలెంకు చెందిన వేల్పూరి శివయ్య (46) ఆదివారం ఉదయం అప్పాపురం ఛానల్ సమీపంలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శనివారం రాత్రే హత్యకు గురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తలపై సుమారు 11 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు చేబ్రోలు సిఐ జె పూర్ణచంద్రరావు, ఎస్‌ఐ వినోద్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మన్నవలో అలజడి
పొన్నూరు, జూలై 14: నామినేషన్ల పరిశీలన దరిమిలా మండల పరిధిలోని ఆలూరు, ఆరెమండ, దండముడి, జడవల్లి, మన్నవ గ్రామాలలో ఏడుగురు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. ఆలూరు, ఆరెమండ, దండముడి, గాయంవారిపాలెం, జూపూడి, నండూరు, పిటిపర్రు, పెదపాలెం గ్రామాల్లో 20 మంది వార్డుమెంబర్ల దరఖాస్తులను కూడా చెల్లకుండా పోయాయి.
కాగా మన్నవ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా రంగంలో నిలిచిన ప్రధాన అభ్యర్థి బొనిగల నాగమల్లేశ్వరరావు నామినేషన్ తిరస్కరించడంతో కాంగ్రెస్ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ తిరస్కరించినట్లు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ వర్గీయకులు పోలింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టారు. సిఐ నిమ్మగడ్డ రామారావు నేతృత్వంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి గుంపును చెదరగొట్టడంతో హుటాహుటిన వారు పొన్నూరు ఎండిఒ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. మహిళలు కార్యాలయం ఎదుట బైఠాయించారు.
ఐకెపి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
గుంటూరు (పట్నంబజారు), జూలై 14: ఐకెపి ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిఐటియు జిల్లా కార్యదర్శి నేతాజీ పేర్కొన్నారు. స్థానిక బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో ఐకెపి ఉద్యోగులకు రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో నేతాజీ మాట్లాడుతూ ఐకెపి, విఎఒ(యానిమేటర్ల)కు, ఎన్‌పిఎం ఉద్యోగులకు సమ్మె అనంతరం వేతనాల పెంపుదలకు సెర్ఫ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. గత జూన్ నుండి పెంపుదల అమలుకావాల్సి ఉండగా అందుకు సంబంధించిన బడ్జెట్‌ను మాత్రం అధికారులు విడుదల చేయలేదన్నారు. మండల సమాఖ్య అకౌంటెంట్లకు హౌస్‌రెంట్ పాలసీ కల్పించేందుకు సెర్ఫ్ అంగీకరిస్తూ అర్హులైన వారి జాబితాలను జూలై 15వ తేదీలోగా జిల్లా అధికారులు సెర్ఫ్‌కు పంపించాలని ఉత్తర్వులు అందాయన్నారు. వెంటనే మండల సమాఖ్య అకౌంటెంట్ల జాబితాను సెర్ఫ్‌కు పంపాలని డిమాండ్ చేశారు. సెర్ఫ్‌లోని దిగువస్థాయి ఉద్యోగులు ఎల్1, ఎల్ 2లకు, మండల సమాఖ్య సిసిలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని కోరారు. ఈ శిక్షణ తరగతులకు విఎఒల సంఘ అధ్యక్షురాలు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు.
పంచాయతీ ఎన్నికల్లో నిబంధనలు పాటించకుంటే చర్యలు
మంగళగిరి, జూలై 14: ఈ నెల 27వ తేదీ జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలను పోటీలో ఉన్న అభ్యర్థులు, వారిని బలపరిచే రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పనిరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నార్త్‌జోన్ డిఎస్పీ ఎం మధుసూధనరావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో సిఐలు సురేష్‌బాబు, మురళీకృష్ణ, ఎస్సైలు రవిబాబు, నాగకుమారి, సత్యనారాయణ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం నిషేధమని, అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని, మైకులకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీ చేయరాదని, ఇతరత్రా ఎటువంటి ప్రలోభాలు చేసినా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్‌కి కార్యకర్తలే వెనె్నముక
* మంత్రి మాణిక్య వరప్రసాద్
గుంటూరు (పట్నంబజారు), జూలై 14: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెనె్నముక అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లా మైనార్టీ వైస్ చైర్మన్‌గా నియమితులైన తలకాయల రవీంద్ర ఆదివారం స్థానిక లక్ష్మీపురంలోని మంత్రి మాణిక్య వరప్రసాద్ క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు బడ్జెట్‌లో అధికంగా నిధులను కేటాయించిందన్నారు.

ఏ రంగంలోనైనా కష్టపడితేనే ఫలితం
గుంటూరు , జూలై 14: కష్టపడితే ఏ రంగంలోనైనా విజయం తథ్యమని ఉత్తరాఖాండ్ చంపావత్ జిల్లా కలెక్టర్ అద్దంకి శ్రీ్ధర్‌బాబు పేర్కొన్నారు. స్థానిక వెంకటాద్రిపేటలోని పోతురాజు రాజ్యలక్ష్మి వీధి బాలల అనాథ ఆశ్రమంలో రాష్ట్ర కాపునాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో చిన్నారులకు నోట్ పుస్తకాలు, యూనిఫారం, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ్ధర్‌బాబు మాట్లాడుతూ మనిషి మేథస్సును పెంచేది విజ్ఞానమేనన్నారు. విజ్ఞానాన్ని సముపార్జించాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. విద్యార్థులు కష్టపడి కాక ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలను చక్కగా మననం చేసుకోవాలన్నారు. కొత్తపేట సిఐ ఆకుల అశోక్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఆశ్రమ నిర్వాహకురాలు పోతురాజు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తమ ఆశ్రమంలో 50 మంది వీధి బాలలు ఉన్నారన్నారు. అనంతరం శ్రీ్ధర్‌బాబు 50 మంది పిల్లలకు నోట్ పుస్తకాలు, యూనిఫారం, దుప్పట్లు పంపిణీ చేశారు.

టిడిపి, వైఎస్సార్ సీపీ నాయకుల ఘర్షణ
దుర్గి, జూలై 14: మండల కేంద్రమైన దుర్గి గ్రామ పంచాయతీ కార్యాలయంవద్ద ఆదివారం తెలుగుదేశంపార్టీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. టిడిపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులుగా దుర్గి గ్రామానికి చెందిన వెలిబోయిన రమణమ్మను బి జానమ్మ ప్రతిపాదించింది. అయితే జానమ్మ కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు.
నామినేషన్ల అభ్యంతరాల స్వీకరణ సమయంలో వీరిద్దరి నామినేషన్లు అధికారుల పరిశీలనకు రావడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన వెలిదండి ఉమాగోపాల్ ఇరువురి అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించాలని ఎన్నికల అధికారిణిని కోరారు. దీంతో రమణమ్మ నామినేషన్‌ను ఖరారుచేసి, జానమ్మ నామినేషన్‌ను తొలిగించాలని తెలుగుదేశంపార్టీ నాయకులు శెట్టిపల్లి యల్లమంద కోరారు.
ఇరువురు అభ్యర్థులైన రమణమ్మ, జానమ్మ నామినేషన్లను తొలిగించాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నాయకులు ఉమాగోపాల్ ఎన్నికల అధికారిణి అనితాశ్రీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టిడిపి, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరుపార్టీలకు చెందిన నాయకులు దాడులకు ప్రయత్నిస్తున్న సమయంలో సమాచారం అందుకున్న దుర్గి ఎస్‌ఐ పి కృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘర్షణకు పాల్పడిన ఇరువర్గాలకు చెందిన నాయకులతోపాటు, మరో 18మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మాచర్ల సిఐ ఎ శ్రీనివాసరావు సంఘటనాప్రదేశానికి చేరుకుని ఘర్షణ జరిగిన తీరును ఎస్‌ఐ కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం, వైఎస్సార్ సీపీలకు చెందిన నాయకులపై బైండోవర్ కేసులను నమోదు చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేసిన రమణమ్మ, జానమ్మల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగు నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల అధికారిణి అనితాశ్రీ తెలిపారు.

మంచికల్లులో పోలీసుల కవాతు
రెంటచింతల, జూలై 14: మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో గొడవలు, అల్లర్లకు పాల్పడే వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామని గురజాల డిఎస్పీ ఇంజారపు పూజ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని సమస్యాత్మక గ్రామమైన మంచికల్లు గ్రామంలో డిఎస్పీ పూజ ఆధ్వర్యంలో 97మంది పోలీసులచే ప్రధాన వీధుల్లో పోలీసులు కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ పూజ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరెడ్డి, రూరల్ సిఐ మల్లెల రాజేష్, రెంటచింతల ఎస్‌ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
విజయపురిసౌత్ మండలంలో...
ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని గురజాల డిఎస్పీ ఇంజారపు పూజ అన్నారు. ఆదివారం విజయపురిసౌత్ పరిధిలోని అత్యంత సమస్మాత్యక గ్రామమైన లచ్చంబావి తండాలో గ్రామసభ నిర్వహించారు. డిఎస్పీ పూజ మాట్లాడుతూ ఈనెల 31న పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు. గ్రామస్థులు తమను ఓటువేయనివ్వకుండా కండ్లకుంట, అచ్చమ్మకుంట గ్రామస్థులు అడ్డుకుంటారని డిఎస్పీ పూజ దృష్టికి తీసుకురాగా, పోలింగ్ జరిగే రోజు ఏ గ్రామంలోని వారు ఆ గ్రామంలోనే ఉండాలని, వేరే గ్రామాలకు వెళితే రౌడీషీట్‌ను తెరిచి చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల రోజున స్పెషల్ టీమ్‌చే భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో అభ్యర్థులు సభలు, సమావేశాలు నిర్వహించినా, ప్రచారం చేసినా ఓటర్లకు నగదు, మద్యం వంటివాటికి ప్రలోభానికి గురిచేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారానికి వినియోగించే వాహనాలకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలన్నారు.

రాష్ట్ర విభజన అభివృద్ధికి ఆటంకం
రేపల్లె, జూలై 14: రాష్ట్ర విభజనతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి దెబ్బతినటమే కాకుండా కృష్ణా డెల్టాకు సాగునీటి సమస్య మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉందని రాష్ట్ర రైతు నాయకులు కేసన శంకరరావు అన్నారు. ఆదివారం స్థానిక విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కర్ణాటక నుండి రావాల్సిన నిఖర జలాలు కూడా సకాలంలో రావటంలేదని, ఈ తరుణంలో రాష్ట్ర విభజన వల్ల డెల్టా ప్రాంతం ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్ధకాలంగా ఐక్యంతో అన్యోన్యంగా ఉన్న రాష్ట్రంలో తెలంగాణ అనే విషవృక్షాన్ని నాటిన కేసిఆర్ వంటి ఉన్మాదిని అడ్డుకోకుండా జాప్యంచేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్నారు. ఇప్పటికే దేశంలో విడిపోయిన చిన్నరాష్ట్రాలు విచ్ఛిన్నకర శక్తులకు నిలయాలుగా మారి అభివృద్ధికి నోచుకోక ఆర్థిక ఇబ్బందులతో ప్రజల జీవన విధానాలే సమస్యాత్మకంగా మారినా పాలకుల్లో మార్పు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేథావులు, ఆర్థిక నిపుణులు, ఢిల్లీ పెద్దలు రెండు ప్రాంతల వారిని సమన్వయపరిచి రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా అభివృద్ధి పథంలో నడిపించాలని ఇదే రాష్ట్ర ప్రజల మనోభీష్టమని శంకరరావు ప్రభుత్వాలకు సూచించారు. ఈ సమావేశంలో రైతు సమాఖ్య నాయకులు టి బుచ్చిరామకృష్ణ, కె శివప్రసాద్, పరుచూరి కుటుంబరావు, వెంకటరావు, సాంబయ్య, టి నరసింహారావు, వెంకట సుబ్బారావు, కుటుంబరావు, భూషయ్య తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ల పరిశీలనలో టిడిపి, వైకాపా ఘర్షణ
* పోలీసుల రంగప్రవేశంతో సద్దుమనిగిన వివాదం
మాచర్ల, జూలై 14: పంచాయతీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ ఆ దిశగానే ఎన్నికల ఘట్టానికి సమాయత్తమవుతున్నాయి. శనివారం నామినేషన్ల పర్వం ముగియటంతో ఆదివారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు ప్రారంభించారు. దుర్గి పంచాయతీ సర్పంచ్ పదవి బిసి మహిళకు రిజర్వేషన్ అయింది. మాచర్ల నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం బలంగా ఉన్న దుర్గిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటినుండే వాతావరణం వేడిక్కింది. ఆదివారం నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో తెలుగుదేశంపార్టీ బలపరచిన అభ్యర్థి బొబ్బా జ్ఞానమ్మ తొలుత ఎల్లబోయిన రమణమ్మకు ప్రపోజల్‌గా ఉంది. తరువాత బొబ్బా జ్ఞానమ్మ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని గమనించిన వైయస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎలిదండి గోపాల్ అభ్యంతరం తెలిపారు. దీనికి తీవ్రంగా స్పందించిన తెలుగుదేశంపార్టీ నాయకులు శెట్టిపల్లి యలమంద వాగ్వాదానికి దిగారు. వీరిద్దరి మధ్య చెలరేగిన వాగ్వాదం చిలికిచిలికి ఒకరినొకరు చొక్కాలు పట్టుకునేంతవరకు వెళ్లింది. విషయాన్ని తెలుసుకున్న దుర్గి ఎస్‌ఐ కిష్టయ్య సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. తెలుగుదేశం, వైయస్సార్ సీపీకి చెందిని 20 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు ఇరువర్గాలకు తమదైన శైలిలో కౌనె్సలింగ్ నిర్వహించి పంపారు. నామినేషన్‌కు సంబంధించిన వివాదం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల అధికారి సుభాషిణి తెలిపారు.

ఘనంగా పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నరసరావుపేట, జూలై 14: స్థానిక ప్రకాష్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌కు చెందిన 1994-95బ్యాచ్ పదోతరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారంరాత్రి ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆనాటి గురువులైన లిబిము, వర్థిని, నాగార్జున, సత్యం, శేషవల్లి, భారతి, రోజ్‌మేరీ, పద్మావతిలను పూర్వవిద్యార్థులు ఘనంగా సత్కరించారు. 18సంవత్సరాల అనంతరం పూర్వవిద్యార్థులు తమ మధుర జ్ఞాపకాలు, యోగక్షేమాలను తమగురువులతో కలిసి పంచుకున్నారు. ఈకార్యక్రమంలో డి రవి, ఎం మల్లిఖార్జునరావు, బివికె చౌదరి, రవీంద్రారెడ్డి, గోవర్థన్, కాశి, భాను, సాహిత్య, లావణ్య, సుష్మిత, కిరణ్మయి పాల్గొన్నారు.

టిడిపి విజయానికి కాపులు కృషిచేయాలి
నరసరావుపేట, జూలై 14: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కాపుసోదరులు బాగా కృషిచేయాలని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జమిందార్ పంక్షన్‌హాల్లో కాపు సంఘీయుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా కోడెల మాట్లాడారు. సమావేశానికి మాజీ పట్టణ పార్టీ అధ్యక్షుడు కోవూరి నర్సింహారావు అధ్యక్షతవహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేవారికి తెలుగుదేశంపార్టీ తప్పక అవకాశం ఇస్తుందన్నారు. తెలుగుదేశంపార్టీ కాపులను గౌరవిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బలంగా ఉన్న కాపు వర్గీయులను ముందుంచుతుందన్నారు. పదేళ్ళ కాలంలో ఎంత నష్టపోయామో దానిని పూడ్చుకుని, ముందుకు సాగాలన్నారు. తాను రాజకీయ ప్రవేశం చేసిన రోజుల్లో కాపువర్గీయులు ఎంతో అండగా నిలిచారని, వారిని మరవకూడదన్నారు. తనకు ఆత్మీయమైన వ్యక్తులు కాపుసోదరులేనని తెలిపారు. ప్రస్తుతం కాపుల్లో యువకులు బాగా కనిపిస్తున్నారని, రాబోయే కాలం, పెత్తనం వారిదేనని డాక్టర్ కోడెల స్పష్టం చేశారు. 2004, 2009లో ఓడిపోయామని, తాను ప్రజల నిర్ణయానికి తలవంచానన్నారు. తొమ్మిదేళ్ళలో రాష్ట్రం ఎలాంటి పరిస్థితికి దిగజారిందో మీరందరికీ తెలుసన్నారు. ఇప్పటికైనా కాపు సంఘీయులు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో వనమా సుబ్బారావు, కోవూరి బాబు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, మోదుగుల మల్లీశ్వరి, రామతులసి, మేకల సత్యవతి, అల్లంశెట్టి మోహన్‌రావు, కల్యాణం రాంబాబు, రామిశెట్టి చలపతిరావు, కోసూరి లక్ష్మీనారాయణ, కొండలు, కొత్తూరి గోవిందరావు, యర్రంశెట్టి రాము, జల్లిపల్లి శేషమ్మ, తెల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు కాపుసంఘీయులు, కాపుయువత గజమాలలతో ఘనంగా సన్మానించారు.

పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతున్నప్పటికీ
english title: 
guntur

కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

$
0
0

కర్నూలు, జూలై 14: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కె.రఘురామిరెడ్డి ఆదేశించారు. ఎన్నికల్లో చిన్నపాటి సంఘటన జరిగినా ఎస్‌ఐ, సిఐలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ముం దస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కెఎస్ వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ గ్రామ పంచాయతీ ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల్లో మంచిగా పని చేసిన వారికి ప్రోత్సాహం, తప్పు చేస్తే చర్యలు తప్పవని సూచించారు. ట్రబుల్ మాంగర్స్‌ను గుర్తించి వారిపై నిఘా తీవ్రతరం చేయడంతో పాటు అలాంటి వారిని ఎన్నికలు పూర్తయ్యే వరకూ గ్రామ బహిష్కరణకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 30 పోలీసు యాక్టు, సెక్షన్ 144 అమలులో ఉంద ని, ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో ఉండే సిబ్బంది మర్యాద పూర్వకంగా మసలు కోవాలని, కొన్ని చిన్న చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చేయాలన్నారు. పోలింగ్ రోజు ఓటింగ్‌కు అంతరాయం కలిగించే వారిపై నిఘా తీవ్రతం చేయాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలకతీతంగా ట్రబుల్ మాంగర్స్‌ను, ఓటింగ్ రోజు సమస్యలు సృప్టించే ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులను గుర్తించి వారిపై షాడో పార్టీలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఎవరైనా నాయకులకు సెక్యూరిటీ తగ్గించినట్లైతే అలాంటి వారికి ఏమైనా ప్రమాదం ఉందేమో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మద్యం, డబ్బు, బాంబులు, మారుణాయుధాలు తదితర అసాంఘిక శక్తుల ఆటలు కట్టించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను సమర్థవంతంగా పని చేసేవిధంగా సిబ్బందికి సిఐలు, ఎస్‌ఐలు సూచనలు చేయాలన్నారు. గ్రామాల్లో ఫ్యాక్షనిస్టులు, అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లను తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అవుకు మండలం రామాపురం గ్రామంలో జరిగిన సంఘటనలో కానిస్టేబుల్ గాయాల పాలవ్వడం, కొత్తపల్లి పోలీసు స్టేషన్‌పై ఎం.లింగాపురం గ్రామస్థుల దాడి వంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎఎస్పీ వెంకటరత్నం మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకయ్యే బడ్జట్, ఎన్నికల నియమావళి గురించి వివరించారు. ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల సందర్భంగా తీసుకునే చర్యల గురించి వివరించారు. సమావేశంలో డోన్, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, ఆదోని డీఎస్పీలు తిరుమలేశ్వరరెడ్డి, అమరనాథనాయుడు, రామంజినేయులురెడ్డి, బిఆర్ శ్రీనివాసులు, డీఎస్పీ శివరామిరెడ్డి, ఎఆర్ డీఎస్పీ రుషికేశ్వరరెడ్డి, జిల్లాలోని సిఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
కొత్తపల్లి పోలీసుస్టేషన్‌పై దాడి
* కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం..
* మద్యం విక్రేత అరెస్టే కారణం..
ఆత్మకూరురూరల్, జూలై 13: మం డల పరిధిలోని కొత్తపల్లె పోలీసు స్టేషన్‌పై ఎం.లింగాపురం గ్రామానికి చెంది న కొందరు వ్యక్తులు ఆదివారం రాత్రి దాడి చేయడంతో ఎన్నికల సంఘం, పోలీసు శాఖ ఉలిక్కిపడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం పోలీసుల సహాయ సహకారాలతో గ్రామా ల్లో బెల్టు షాపులు, సారా దుకాణాలపై ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే కొత్తపల్లె మండల పరిధిలోని ఎం.లింగాపురం గ్రామానికి చెందిన రమేష్ మద్యం, నాటుసారా విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో షాపు యజమానికి, పోలీసులకు కొద్దిపాటి ఘర్షణ చోటుచేసుకుంది. అయితే పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని కొత్తపల్లె పోలీసు స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న రమేష్ బంధువులు 50 మందిని వెంటబెట్టుకుని ఆటోల్లో వచ్చి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి స్టేషన్‌లో ఉన్న ద్విచక్ర వాహనం, కిటికీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రబాబు పోలీసు క్వార్టర్స్‌లో ఉన్న ఇంటిలో నుంచి బయటకు వచ్చి సర్ది చెబుతుండగా ఆయనపై కూడా దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. చివరకు నిందితుడు రమేష్‌ను విడిపించుకుపోయారు. ఈ విషయం గ్రామంలో దావానలంలా వ్యాపించడంతో క్షణక్షణం ఏమి జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. దాడి చేసిన వ్యక్తులు గ్రామాన్ని విడిచి వెళ్లినట్లు తెలిసింది. దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.2

నల్లమల ఘాట్ రోడ్డులో
బస్సు, కారు ఢీ.. ఇద్దరి మృతి
* మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
శ్రీశైలం, జూలై 14 : సున్నిపెంటకు 2 కిలోమీటర్ల దూరంలో విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు చెందిన కారును ఢీ కొనడంతో నల్లమల ఘాట్ రోడ్డు నెత్తురోడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ జయరావు (45) అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు సునీల్ (29) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఉదయం 9-50 నిముషాలకు డిఫెన్స్ కాలనీకి చెందిన హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీశైలం మల్లన్నను దర్శించుకొని కారులో తిరుగు ప్రయాణం అవుతుండగా సున్నిపెంట నుండి విజయవాడకు వెళ్తున్న బస్సు వేగంగా వచ్చి కారును ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న జయరావు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన క్షతగాత్రును 108 సిబ్బంది సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు. మరో ఇద్దరు విజయలక్ష్మి, చైతన్యల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం శ్రీశైలం దేవస్థానం ఇఓ చంద్రశేఖర్‌ఆజాద్ చొరవతో దేవస్థానం అంబులెన్సులో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. సిఐ వేణుగోపాల్‌రెడ్డి, నాగేశ్వరరావు, ఎస్ గిరిబాబు, సిబ్బంది, దేవస్థానం అధికారులు సంఘటనా స్థలానికి చేరి సహాయ చర్యలు చేపట్టారు. డాక్టర్లు అఖిలేష్, స్వప్నలు ప్రథమ చికిత్స నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇఓ చొరవ చూపి స్థానిక ప్రజలు సహకారంతో సహాయక చర్యలు వేగవంతం చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో
కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
* న్యాయశాఖ మంత్రి ఏరాసు
మహానంది, జూలై 14: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కార్యకర్తలందరు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థుల విజయానికి దోహదపడాలని న్యాయశాఖమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఆదివారం ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురిసి శ్రీశైలం డ్యాంలో పుష్కలంగా నీరుచేరి రైతుల పంటలు బాగాపండి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని మూడు ముక్కులు చేసేందుక యోచిస్తున్న అలోచన సరైంది కాదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. ఒకవేళ తెలంగాణ ఇవ్వాల్సివస్తే రాష్ట్రాన్ని మూడుముక్కలు చేయాల్సిందే అన్నారు. కేంద్రం తెలంగాణ, ఆంధ్ర ప్రాంత నాయకుల మాటలు వింటున్నారని రాయసీమ నాయకుల మాటలు వినడం లేదని అవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ రాయలసీమ సాధించుకునేందుకు పూర్తిస్థాయిలో పోరాడుతాం అన్నారు.
మహానందిలో పూజలు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో రాష్ట్ర న్యాయశాఖమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆదివారం పూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ ఎఇఓ శివయ్య, ఇన్‌స్పెక్టర్ నీలకంఠం రాజులు స్వాగతం పలకగా అనంతరం వారు శ్రీకామేశ్వరీ సహిత మహానందీశ్వరస్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వంహించారు. అనంతరం వారిని వేదపండితులు అశీర్వదించగా అధికారులు శేషవస్త్రాలతో సత్కరించారు. అలాగే గుంటూరు రైల్వే ఎస్పీ పూజలు నిర్వహించారు. వీరి వెంట కాకనూరు శివనాగిరెడ్డి, మాజీ పిపి కృష్ణయ్య, మహానంది మాజీ సర్పంచ్ తిమ్మారెడ్డి, చిలకల వెంకటేశ్వర్‌రెడ్డి, జయసింహారెడ్డి, రాజారెడ్డి, బోయ ఉశేని తదితరులు పాల్గొన్నారు.
పీపుల్స్‌వార్ వారోత్సవాలతో
అప్రమత్తమైన పోలీసులు
* నల్లమల సమీప గ్రామాలపై నిఘా
నంద్యాల, జూలై 14: మావోయిస్టులు ఈనెల 15 నుంచి 21వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ దినాలను పురస్కరించుకొని వారోత్సవాలు ఈనెల 15 నుంచి 21వ తేదీ వరకు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈనెల 21వ తేదీ రాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నంద్యాల, ఆత్మకూరు, ఆళ్లగడ్డ పోలీసుసబ్ డివిజనల్ పరిధిలోని నల్లమల అటవీ సమీప పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. కొత్తపల్లె, పాములపాడు, పగిడ్యాల, ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి తదితర అటవీ సమీప పోలీసు స్టేషన్లకు భద్రత పెంచారు. ప్రత్యేక పోలీసు బృందాలతో గస్తీ ముమ్మరం చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మావోయిస్టులు వారోత్సవాలు జరుపుకోవడంతో వారి సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లపై కూడా నిఘా ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి కొత్తపల్లె పోలీసు స్టేషన్‌పైనే ఎం.లింగాపురం గ్రామానికి చెందిన సుమారు 100 మంది దాడి చేసి పోలీసులను కొట్టి, ఎస్‌ఐ క్వాటర్స్‌పై కూడా దాడి చేసి రాళ్లు వేసి పలువులు కానిస్టేబుళ్లను గాయపరచి, పోలీసు స్టేషన్‌ను, పోలీసుల క్వాటర్స్‌లో ఫర్నీచర్ ద్వంసం చేసి, భయాందోళనలు సృష్టించి పోలీసుల అదుపులో ఉన్న బెల్టుషాపు నిర్వాహకుడిని విడిపించుకొనిపోయిన సంఘటన జిల్లా పోలీసు ఉన్నతాధికారులను నివ్వేరపోయేలా చేసింది. దీంతో ఆదివారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కొత్తపల్లె ఎస్‌ఐ చంద్రబాబును జిల్లా కేంద్రానికి పిలిపించి జరిగిన సంఘటపై ఆరా తీస్తున్నారు. కొత్తపల్లె పోలీసు స్టేషన్‌పైనే దాడికి పాల్పడ్డ విద్రోహులను కట్టడి చేసేందుకు సుమారు 40మందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఒక వైపు గ్రామాల్లో సర్పంచు ఎన్నికలు, మరో వైపు మావోయిస్టుల వారోత్సవాలతో నల్లమల అటవీ సమీప పోలీసు స్టేషన్లలో భద్రతపై పోలీసుల్లో టెక్షన్ మొదలైంది. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో అప్రమత్తంగా ఉండాలని ఆదివారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
దేవనకొండ, జూలై 14 : పగడ్బందీ గా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు విష్ణు తెలిపారు. ఆదివారం ఆయన మండల కేంద్రమైన దేవనకొండలోని ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించారు. పొలింగ్ అధికారులను నామినేషన్ల పరిశీలన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల గుర్తులను ఎలా కేటాయిస్తారని, సర్పంచ్, వార్డు సభ్యుల కౌటింగ్ వంటివి జాగ్రతగా చూడాలన్నారు. సమస్యాత్మకమైన గ్రామాలు ఎవైన ఉంటే వాటిపై నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసులకు సూ చించారు. ఎన్నికల ప్రశాతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విష్ణు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీఓ రాంసుందర్‌రెడ్డి, ఎంపిడిఓ మధుసుధన్‌రెడ్డి, తహశీల్దార్ జయప్రభా, తదితరులు పాల్గొన్నారు.
నాటుసారా, మద్యం పట్టివేత
కోవెలకుంట్ల, జూలై 14: కోవెలకుంట్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు సంఘటనల్లో 30 లీటర్ల నాటుసారా, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు కోవెలకుంట్ల ఎక్సైజ్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు. స్థానిక ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్‌లో ఆదివారం ఎక్సైజ్ సిఐ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ఎన్నికల దృష్ట్యా రూట్‌వాచ్‌లు నిర్వహస్తుండగా శనివారం రాత్రి కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట జంక్షన్ వద్ద ప్యాషన్ ప్లస్ ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి 30 లీటర్ల నాటుసారా తరలిస్తూ తమను గమనించి ద్విచక్ర వాహనం, నాటుసారా ప్యాకెట్లను వదిలి పారిపోయాడని, దీంతో ద్విచక్ర వాహనం, 30 లీటర్ల నాటుసారా సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కోవెలకుంట్ల సర్కిల్ పరిధిలోని ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామంలోని ఒక ఇంట్లో బెల్టు షాపు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో గ్రామ విఆర్వో, తలారీలతో కలిసి ఆ ఇంటి వద్దకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉండడంతో వారి సమక్షంలో తాళం పగులగొట్టి ఇంటిలో సోదా నిర్వహించగా 47 క్వార్టర్లు, 2 ఫుల్ బాటిళ్ల మద్యం లభించిందని, ఇంటి యజమాని చిన్న నాగన్న గ్రామంలో లేనట్లు తెలిసిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తనిఖీల్లో ఎక్సైజ్ సిబ్బంది అశ్వర్థరెడ్డి, మద్దయ్య, కెవి రమణ, అన్సర్‌బాషా పాల్గొన్నారు.
పాలకులకు బుద్ధి చెప్పండి
* సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామకృష్ణ
కల్లూరు, జూలై 14: ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసే పార్టీలకు, ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సిపిఐ కార్యదర్శివర్గ సభ్యు డు రామకృష్ణ సూచించారు. స్థానిక బంగారుపేటలోని 45వ వార్డులో ఉన్న సిపిఐ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రా న్ని రావణకాష్టంలా మార్చడానికి కాం గ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం పేరుతో తెలంగాణ ప్రజలతో చెలగాటం ఆడుతుందన్నా రు. ఇన్ని సంవత్సరాలు గడిచినా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదంటే ఆ పార్టీ ఎంతటి మోసకారిదో అర్థమవుతుందన్నారు. సంక్షేమ పథకాల పేర ప్రజలను మోసం చేసి, ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసిందేమీ లేదన్నారు. జిల్లా కార్యదర్శి రామాంజినేయులు మాట్లాడుతూ సిపిఐ ప్రజా సమస్యలపై ప్రభుత్వాలతో నిత్యం పోరాడుతుందన్నారు. నగర కార్యదర్శి రసూల్ మా ట్లాడుతూ పేద ప్రజలకు అందాల్సిన వితుంతు, వికలాంగుల పింఛన్లను, అదేవిధంగా మురికివాడల్లో అపరిష్కృతంగా వున్న పట్టాల సమస్యలను అధికారులతో పోరాడి సాధించామన్నారు. ప్రజాప్రతినిధులకు కొమ్ముకాస్తున్న అధికారులు పేదలకు అన్యాయం చేస్తే సహించమన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, మనోహర్‌మాణిక్యం, మాజీ కార్పొరేటర్ గిడ్డమ్మ, మునెప్ప, మహేంద్ర పాల్గొన్నారు.

వెలుగోడు మండలంలో
2 నామినేషన్ల తిరస్కరణ
వెలుగోడు, జూలై 14: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలో దాఖలైన నామినేషన్లలో పరిశీలన అనంతరం 419 నామినేషన్లు పక్కాగా ఉన్నట్లు ఎంపిడిఓ సాల్మన్ తెలిపారు. మొత్తం 421 నామినేషన్లు దాఖలు కాగా ఆదివారం పరిశీలించి 2 నామినేషన్లను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన కె.గోవిందు తహశీల్దార్ ఇవ్వాల్సిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వలేదని తిరస్కరించారు. గుంతకందాల గ్రామంలో 10వ వార్డు ఎస్సీకి రిజర్వు కాగా ఎస్టీకి చెందిన వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేయడంతో తిరస్కరించినట్లు తెలిపారు. మండల పరిధిలోని వేల్పనూరు గ్రామపంచాయతీ ఎస్సీకి రిజర్వు కాగా బట్టు ఏసయ్య ఒక్కడే నామినేషన్ వేశాడు దాంతో అతడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. అలాగే గ్రామంలోని 14 వార్డులకు సైతం ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో వారందరి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీకి ఒక్క దానికే 20 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ వుంటుందని ఆయన తెలిపారు.
అప్పీల్‌కు వెళ్తాం..
వెలుగోడు మేజర్ గ్రామ పంచాయతీలో నామినేషన్ తిరస్కృతి అభ్యర్థి కె.గోవిందు అప్పీల్‌కు వెళ్తాం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న తనను బరిలో నుంచి తొలగించేందుకు ప్రత్యర్థి పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను 1996లో వార్డుమెంబర్‌గా బిసి రిజర్వేషన్ కేటగిరీలోనే గెలిచానని అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఏంటో అర్థం కావడం లేదన్నారు. నామినేషన్ పత్రంలో కుల ధ్రువీకరణ కాలంలో తాను గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి ఇచ్చానని, అయినా రిటర్నింగ్ అధికారి తన నామినేషన్‌ను తిరస్కరించారని, దీనిపై అప్పీల్‌కు వెళ్తానని, అప్పటికీ న్యాయం జరగకపోతే హైకోర్టుకు కూడా వెళ్తానని తెలిపారు.
ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద వైద్యం
* మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి
నంద్యాల, జూలై 14: భారతీయ వైద్యం ప్రపంచ ఖ్యాతి గాంచిన ప్రకృ తి సహజ సిద్ధమైంది ఆయుర్వేద వైద్యమని నంద్యాల మాజీ ఎంపి, వైకాపానేత భూమా నాగిరెడ్డి అన్నారు. ఆదివా రం నంద్యాల పట్టణంలోని బాలాజీకాంప్లెక్స్ కేశవరెడ్డి పాఠశాల ఆవరణంలో 40 మంది ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో, వెంకప్ప ఆయుర్వేదిక్, నంద్యాల కేబుల్‌టివి సంయుక్త సౌజన్యంతో ఉచిత మెగా ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించారు. ఆయుర్వేద ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించిన భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యం పేదలకు అందించిన వారే నిజమైన వైద్యులని, రోగికి వైద్యుడిపై, ఆయన వైద్యంపై నమ్మకం కలిగేలా వైద్యసేవలు ఉండాలని కోరారు. ఆయుర్వేదం అమృతం కన్నా శ్రేష్టమైందని, విదేశా ల్లో కూడా ఆయుర్వేద వైద్యం కోసం, మందుల కోసం విదేశీయులు క్యూల్లో నిలిచి కొనుగోలు చేస్తుండడం భారతీయ ఆయుర్వేద వైద్యానికి ఉన్న గొప్పతనాన్ని తెలియజేస్తుందని భూ మా వివరించారు. కొన్ని అపోహల కారణంగా, ప్రచార లోపం వల్ల ఆయుర్వేద వైద్యం అలోపతి, హోమియోపతి కన్నా వెనుకబడిందని, పురాతన, శాస్ర్తియమైన భారతీయ పూర్వీకుల వైద్యం ఆయుర్వేదం అన్నది మరువవద్దన్నారు. నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో 40 మంది ఆయుర్వేద వైద్యులు తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేయడం, పట్టణంలోని వెంక ప్ప ఆయుర్వేదిక్ సహకారంతో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించి సేవలు అందిస్తున్న ఆయుర్వేద వైద్యులను మాజీ ఎంపి భూమానాగిరెడ్డి అభినందించారు. వెంకప్ప శిరిగిరి ఆయుర్వేదిక్ దుకాణం కర్నూలు జిల్లాతో పాటు కడప, అనంతపు రం, ప్రకాశం జిల్లాల ఆయుర్వేద వైద్యులకు అన్నిరకాల ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచడం వారి అంకితభావానికి నిదర్శనం అన్నా రు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లేని సహజ సిద్ధమైన వనమూలికలతో తయారయ్యే దేశీయ వైద్యవిధానమైన ఆయుర్వేద వైద్యం అందరికి అందుబాటులోకి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గెలివి సహాదేవుడు, కేబుల్‌టివి ఎండి జయచంద్రారెడ్డి, వెంకప్ప కుటుంబ సభ్యులు, నం ద్యాల ప్రాంత ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు. ఉచిత ఆయుర్వేద మెగా వైద్యశిబిరానికి నంద్యాలతో పాటు సమీప ప్రాంతాల నుండి వందలాది మంది రోగులు తరలిరావడంతో 40 మంది వైద్యులు క్యూల్లో నిల్చున్న రోగులను పరీక్షించి అవసరమైన రూ. 3 లక్షల విలువ చేసే ఆయుర్వేద మందులను భూమా రోగులకు పంపిణీ చేశారు.

* ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించాలి * ఘర్షణలు జరిగితే ఎస్‌ఐ, సిఐలదే బాధ్యత:ఎస్పీ కె.రఘురామిరెడ్డి
english title: 
code

జిల్లాలో ఊపందుకున్న బుజ్జగింపుల పర్వం!

$
0
0

మచిలీపట్నం, జూలై 14: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్నవారిని తప్పించేందుకు బుజ్జగింపుల పర్వం ముమ్మరమైంది. కొన్నిచోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరు, ముగ్గురు బరిలో ఉండటం ఆయా పార్టీల నాయకులకు తలనొప్పిగా మారింది. బహు అభ్యర్థిత్వం బెడద నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 13వ తేదీతో నామినేషన్‌ల ఘట్టం ముగిసింది. నామినేషన్‌లు దాఖలు చేసిన వారిలో దీటైన అభ్యర్థిని రంగంలో ఉంచి మిగతావారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బహు అభ్యర్థిత్వం బెడద కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలను చుట్టుముట్టింది. రాజకీయంగా అంతంతమాత్రంగా ఉన్న పార్టీలకు గ్రామాల్లో ఎక్కువమంది పోటీకి దిగటంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు ఆయా పార్టీల నాయకత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో ఉపసంహరణల నాటికి ఒకే అభ్యర్థి బరిలో మిగిలేలా అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే నామినేషన్ల స్క్రూట్నీలోనే తప్పించాలన్న ప్రయత్నం లోపాయికారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ముగిసింది. జిల్లాలో ఎంతమంది అనర్హులయ్యారనేది వివరించడంలో అధికారులు విఫలమయ్యారు. సోమవారం సాయంత్రానికి స్క్రూట్నీలో ఎన్ని నామినేషన్‌లు తిరస్కరణకు గురయ్యాయనేది చెబుతామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కాకుండా కొన్ని గ్రామాల్లో పెద్దలు ఏకగ్రీవం చేసేందుకు కృషి చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులను రాజకీయాలకు అతీతంగా గ్రామపెద్దలు సమావేశపర్చి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులు విరమించుకునేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదని సమాచారం. రాజకీయ కక్షలు పెరగకుండా ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవం చేయాలన్న రాజకీయ పార్టీల నాయకులు, ఆయా గ్రామపెద్దల ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచిచూడాల్సిందే. నామినేషన్ల పరిశీలనలో తిరస్కరణకు గురైతే చిక్కుండదు. ఈ దశలోనే చక్రం తిప్పాలన్న వ్యూహరచనలో కొందరు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. నామినేషన్ సజావుగా ఉంటే ఉపసంహరణ గడువు నాటికి పోటీ నుండి తప్పించాలన్న వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే.

స్కీం పేరిట లక్షల్లో టోకరా!
ఉయ్యూరు, జూలై 14: స్థానిక సుందరమ్మపేటలో స్కీం పేరుతో లక్షలు వసూలు చేసి పరారైన వ్యక్తి ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం సుందరమ్మపేటలో సేవింగ్స్, ఫైనాన్స్ పేరుతో గత కొనే్నళ్ళుగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న భీమవరానికి చెందిన వ్యక్తి గత కొన్ని రోజులుగా పరారీలో ఉండటంతో బాధితులు మూకుమ్మడిగా ఆదివారం సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయ తలుపులు పగలగొట్టి అందిన వస్తువును అందినట్లు దోచుకెళ్ళారు. నెలకు వంద చొప్పున చెల్లించి వాయిదాల పద్ధతిలో కావలసిన వస్తువును పొందే అవకాశం కల్పించడంతో వేలాది మంది ఈ స్కీంలో సభ్యులుగా చేరారు. ప్రతినెల డ్రాతీసి అందులో గెలుపొందిన వ్యక్తి చెల్లించిన రుసుముకు కావలసిన వస్తువును అందించడం ఈ స్కీం ఉద్దేశ్యం. డ్రాలో రాని ఖాతాదారులకు వారి నిర్ణీత సమయం పూర్తిచేసిన అనంతరం వారు చెల్లించిన సొమ్ముకు వడ్డీతో సహా చెల్లించడం, లేదా కావలసిన వస్తువును ఇవ్వడం చేస్తారు. అయితే కాలంచెల్లిన తరువాత కూడా సంస్థ వారి సొమ్మును తిరిగి ఇవ్వకపోవడం, నిర్వాహకుడు కన్పించకపోవడంతో ఖాతాదారులకు అనుమానాలు తలెత్తాయి. వారంతా మూకుమ్మడిగా ఆదివారం కార్యాలయానికి వచ్చి అందిన వస్తువును అందినట్లు పట్టుకుపోయారు. కాగా ఈ సంస్థ నిర్వాహ కుడు ఇదే తరహాలో జిల్లాలో పలు ప్రాంతాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. ఈ స్కీం కింద సుమా రు రూ.50 లక్షల వరకు ప్రజలు మోసపోయినట్లుగా తెలుస్తోంది. పట్టణ పోలీసులు ఈవిషయమై ఆరా తీస్తున్నారు.

గూడపాడు సర్పంచ్ ఏకగ్రీవం
* సర్పంచ్ ఒకటి, 2 వార్డు పదవుల నామినేషన్ల తిరస్కరణ
కూచిపూడి, జూలై 14: నామినేషన్ల పరిశీలన అనంతరం మొవ్వ మండలం గూడపాడు సర్పంచ్ అభ్యర్థిగా బొప్పన స్వర్ణలతాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎండివో వై పిచ్చిరెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని ఏడు క్లష్టర్లలో 21 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు దాఖలైన 104 నామినేషన్‌లలో అవిరిపూడి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన మేడిశెట్టి వన రామారావు కుమారుడైన రత్నమోహన్‌కు ముగ్గురు పిల్లల కారణంగా తిరస్కరించినట్లు తెలిపారు. అలాగే 214 వార్డులకు దాఖలైన 542 నామినేషన్‌లలో అయ్యంకి, భట్లపెనుమర్రు గ్రామాల్లో ఒక్కొక్క వార్డులకు దాఖలైన నామినేషన్‌లు ముగ్గురు సంతానం కారణంగా తిరస్కరించినట్లు పిచ్చిరెడ్డి తెలిపారు. కాగా మండలంలో 26 వార్డులలో ఒక్క నామినేషన్ చొప్పున దాఖలు కావటంతో ఆ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది.

బందరు మండలంలో నామినేషన్ల పరిశీలన ప్రశాంతం
మచిలీపట్నం టౌన్, జూలై 14: బందరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాఖలైన నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. 12 క్లష్టర్ కార్యాలయాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు దాఖలైన నామినేషన్లను స్టేజ్-1 అధికారులు పరిశీలించారు. సర్పంచ్ పదవులకు 210 నామినేషన్లు దాఖలు కాగా ఏడు నామినేషన్లను తిరస్కరించారు. అలాగే 324 వార్డు పదవులకు 753 నామినేషన్‌లు దాఖలుకాగా వీటిలో 37 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. పరిశీలన అనంతరం సర్పంచ్ పదవులకు మొత్తం 207, వార్డు పదవులకు 716 నామినేషన్లను స్టేజ్-1 అధికారులు ఆమోదించారు. 101 వార్డుల్లో ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావటంతో ఆ వార్డుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదిలావుండగా గరాలదిబ్బ గ్రామ పంచాయతీ 6వ వార్డుకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం విశేషం. పోతిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థులుగా వేముల ఏడుకొండలు, వేముల నాగభవాని దాఖలు చేసిన నామినేషన్‌లపై మరో అభ్యర్థి కొండేటి శివ అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు దాఖలు చేసిన నామినేషన్ ఫారాల్లో సాక్షులు సంతకాలు పెట్టలేదని, కేవలం పేరు, చిరునామా రాసారన్నారు. ఇవికూడా సంబంధిత సాక్షులు కాకుండా వేరే వ్యక్తులు వారి పేరు, చిరునామా రాశారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ బందరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొల్లు రవీంద్ర పోతిరెడ్డిపాలెం స్టేజ్-1 అధికారిని కలిసి ఆ నామినేషన్లను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్డీవోని కలిసి అప్పీలు చేసుకోవాలని స్టేజ్-1 అధికారి సూచించారు.

సమస్యలు తీర్చకుంటే సమ్మె తప్పదు
* ఆర్టీసీ ఎంప్లాయిస్ హెచ్చరిక
అవనిగడ్డ, జూలై 14: ఆర్టీసీ యాజమాన్యం చట్ట విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నందున తాము రీజియన్ స్థాయిలో సమ్మె నోటీసు ఇస్తామని ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ ఉపాధ్యక్షులు ప్రభాకరరావు, రీజినల్ కార్యదర్శి ప్రసాద్ హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా 12గంటలు కార్మికులతో పనులు చేయిస్తూ ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్య నిర్ణయాలు ప్రయాణికులు, కార్మికులకు హానికరంగా ఉంటున్నాయన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందని విమర్శించారు. కార్మికులపై పనిభారం వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రిలే దీక్షలో 9మంది కార్మికులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో
* ఒకరికి తీవ్ర గాయాలు
కూచిపూడి, జూలై 14: మద్యం తాగిన మైకంలో ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రయాణికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మొవ్వ మండలం అయ్యంకిలో జరిగింది. ఎఎస్‌ఐ సత్యనారాయణ సమాచారం ప్రకారం అవనిగడ్డ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు విజయవాడకు ప్రయాణిస్తుండగా అయ్యంకి ఆర్ అండ్ బి రహదారిలో పామర్రుకు చెందిన ఆటోడ్రైవర్ మద్యం మత్తులో అడ్డదిడ్డంగా ఆటోను నడిపి బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో దెబ్బతినటంతో పాటు అందులో ప్రయాణిస్తున్నవారు గాయాల పాలయ్యారు. వీరిలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావటంతో 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం తరలించారు.

సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం కిటకిట
మోపిదేవి, జూలై 14: శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్‌లలో నిలబడ్డారు. కొందరు భక్తులు తమ చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. మరికొందరు పుట్టెంటుకలు తీయించి, చెవిపోగులు కుట్టించి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జూనియర్ సివిల్ జడ్జి ఆర్ కిషోర్‌బాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

ఒక సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
బంటుమిల్లి, జూలై 14: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాఖలైన నామినేషన్లను ఆదివారం పరిశీలించారు. 21 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు 117 మంది నామినేషన్లు దాఖలు చేయగా ములపర్రు సర్పంచ్ అభ్యర్థి యలవర్తి పాండురంగారావు నామినేషన్‌ను తిరస్కరించారు. సాతులూరు గ్రామ పంచాయతీలో 10 వార్డులకు గాను 7 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
కొర్లపాడులో 10 వార్డులకు గాను మూడు వార్డులు, రామవరపుమోడిలో మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ముంజులూరులో మూడు వార్డులకు సంబంధించిన మూడు నామినేషన్‌లను తిరస్కరించారు. అర్తమూరులో కూడా మూడు మల్లంపూడిలో 5వ వార్డు నామినేషన్‌లను తిరస్కరించారు.
అవనిగడ్డలో...
అవనిగడ్డ : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అవనిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి 14 మంది నామినేషన్‌లు దాఖలు చేయగా అందరినీ పోటీకి అర్హులుగా ప్రకటించారు. పులిగడ్డలో కూడా నలుగురు సర్పంచ్ అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు.
ముదినేపల్లిలో...
ముదినేపల్లి : మండలంలోని 32 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు 159, వార్డు పదవులకు 664 నామినేషన్లు దాఖలు కాగా ఆదివారం నిర్వహించిన పరిశీలనలో 11 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. సర్పంచ్ పదవులకు సంబంధించి 5, వార్డు పదవులకు సంబంధించి 6 నామినేషన్లను తిరస్కరించినట్లు ఎండివో విద్యాసాగర్ తెలిపారు.

ప్రజాసేవకు పదవులు ఆసరా
మచిలీపట్నం , జూలై 14: ప్రజలకు సేవచేసే అవకాశాలను పదవులు అందిస్తాయని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి చక్రధరరావు అన్నారు. పట్టణ రోటరీ క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం రోటరీ క్లబ్ హాలులో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చక్రధరరావు మాట్లాడుతూ అవసరాలను గుర్తించి కష్టాలను సేవల ద్వారా తీర్చే సంస్థ రోటరీ అన్నారు. మంచి పనులు చేసే వ్యక్తులు ఉన్న సంస్థలు రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ అని ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ సహకారాలు అందించడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, విద్యాభివృద్ధికి కృషి చేయడం, మంచినీటి సరఫరా మొదలైన కార్యక్రమాలను నిర్వహించడంలో రోటరీ అగ్రగామి అన్నారు. 3020 రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ సిహెచ్‌వి వెంకటేశ్వరరావు క్లబ్ అధ్యక్షురాలు జి రాజేశ్వరి, కార్యదర్శి ఎ జ్యోతి, డైరెక్టర్‌లు, కమిటీ చైర్మన్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో తక్షణ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు పి బాబు, యండివికె కిషోర్, డా. బి ధన్వంతరి ఆచార్య, పి మెహర్ కుమార్, ఎంవి సీతాపతిరావు, కొల్లు రవీంద్ర, గఫార్, కరెడ్ల సుశీల, తదితరులు పాల్గొన్నారు.

ధ్వంసమైన రోడ్లు.. నగరవాసుల అగచాట్లు!
విజయవాడ, జూలై 14: కేంద్ర ప్రభుత్వ పథకం జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కింద కొనే్నళ్ళుగా నగరంలో వౌలిక సదుపాయాల కోసం దాదాపు అదీ నగర చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా రూ.1600 కోట్ల రూపాయల నిధులు తెచ్చి వెచ్చించామని అధికారపక్ష నేతలు పదేపదే చెబుతున్నారు. కొన్నివేలమంది నిర్భాగ్యుల కోసం నగర శివార్లలో 1+3లో నీడ కల్పించవచ్చు కానీ ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే మారుమూల ప్రాంతాల్లో కాదు బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో సైతం నడకసాగని రీతిలో వర్షపు నీరు, మురుగు నీరు మమేకమై కొన్ని గంటలపాటు ప్రవహించింది. ఇక మొగల్రాజపురంలో పాలీక్లీనిక్ రోడ్డు నుంచి నిర్మలా కానె్వంట్ వరకు ఏడాది పొడవునా సైడ్ కాల్వల్లో మురుగు నీరు అణుమాత్రం కదలకుండా కన్పిస్తుంటుంది. ఏదిఏమైనా నగరం మొత్తంపై దాదాపు 85కి.మీ మేర అంతర్గత రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ రహదారులలో ప్రయాణం నరకయాతన... పైగా లక్షలాది రూపాయల విలువైన వాహనాలు ధ్వంసమవుతున్నాయి. రెండేళ్ళ క్రితం సంభవించిన నీలం తుపాను సహాయాన్ని బాధితులకు అందించకుండా ఆర్ అండ్ బి శాఖ ద్వారా ఒన్‌టౌన్‌లో టనె్నల్ రోడ్డు, ఇతర ప్రాంతాల్లో రహదారులను వేయించారు. వందల కోట్లు ఖర్చు చేసి నగరంలో ప్రతి చోటా అంతర్గత భూగర్భ డ్రైన్‌ల నిర్మాణాలు వాటికి అనుసంధానంగా ఔట్‌ఫాల్ డ్రెయిన్‌లు నిర్మించారు బాగుంది. అయితే కొండప్రాంతం, అలాగే ఎగువ ప్రాంతాల నుంచి సాధారణంగా ప్రవహించే నీరు... వర్షాకాలం ప్రవహించే వర్షపు నీటి కోసం కొన్ని దశాబ్దాల క్రితం ప్రతివీధిలోనూ రెండు వైపుల అదీ ఎన్నో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించారు. అయితేనేమి వేసవికాలంలో వాటిల్లో పూడిక తీసే నాథుడే లేడు. ఇంకేముంది వర్షాకాలంలోఇలాంటి డ్రెయిన్లు పొంగి రహదారులపై ప్రవహిస్తున్నాయి. ఈ కారణం వల్ల కూడా ఎక్కడికక్కడ రహదారులు దారుణంగా ధ్వంసమవుతున్నాయి. గత కొనే్నళ్ళ క్రితం రోజూ కేవలం రెండు సెంమీ వర్షం కురవటంతోనే ఒన్ టౌన్‌లో వించిపేట, గణపతిరావు రోడ్డు, ఇస్లాంపేట, నైజాం గేట్, పాత చేపల మార్కెట్ ప్రాంతం దాదాపు 48గంటలపాటు నీట మునిగాయి. అదీ నగర భూగర్భ డ్రైనేజీ పనితీరు. ఇందుకు ఎన్ని వందలు... వేల కోట్లు ఖర్చు చేస్తేనేమి.. ఏ ఒక్కరిపైన అయినా చర్య ఉంటే కదా!

010 జీతాల కోసం నేడు మున్సిపల్ టీచర్ల మహాధర్నా
* నేటికి మూడు నెలల జీతం బకాయి
అజిత్‌సింగ్‌నగర్, జూలై 14: విజయవాడ నగర పాలకసంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 జీవోద్వారా నేరుగా ట్రెజరీ ద్వారా జీతాలను పంపిణీ చేయడంతోపాటు తక్షణమే వేతన బకాయిలతోపాటు ఎరియర్స్‌ను మంజూరు చేయాలన్న డిమాండ్‌తో కార్పొరేషన్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు సోమవారం చేపట్టనున్న మహాధర్నాకు సర్వ సిద్దం చేసారు. గత కొంత కాలంగా అపరిష్కృతంగా ఉన్న 010 జీతాల కోసం ఉపాధ్యాయులు ఇప్పటికే ఆందోళన బాట పట్టిన విషయం విధితమే. కాగా గత సంవత్సరం మార్చి నెలలో ఈ జీతాల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వైనంతో నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు టీచర్లతో ఆందోళనను విరమింపచేసేందుకు గాను ప్రకటించిన హామీలు నేటికీ కార్యరూపం దాల్చకపోవడం, అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఎటువంటి స్పందన లేకపోవడంతో పాలకులు హామీలకు విసిగి వేసారి ఇక ఉద్యమమే శరణ్యమని భావించిన ఉపాధాయులు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సన్నాహాలు చేసారు. ఇందులో భాగంగా నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహా ధర్నాకు శ్రీకారం చుట్టారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఏకధాటిగా నిరసన ధర్నా జరుపనున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు కార్పొరేషన్ ఉపాధ్యాయులందరూ సోమవారం సెలవు కోసం తమ ప్రధానోపాధ్యాయులకు ధరఖాస్తు చేసుకున్నారు. కాగా వీరందరికీ సెలవు మంజూరు విషయమై కార్పొరేషన్ విద్యాధికారులు మీమాంసలో పడ్డారు. ఊకమ్మడి సెలవు మంజూరులో ఉన్న నియమ నిబంధనలను పరిశీలించి తదుపరి చర్యలపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా జీతాల కోసం తాడోపేడో తేల్చుకునేందుకు ఉపాధ్యాయులందరూ ఐక్య పోరాటానికి సిద్దం కావడం విశేషం. ఉపాధ్యాయ సంఘాల నాయకులందరితో కలిసి 010 జెఎసి ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర మంతా ఉపాధ్యాయులకు 010 జీవో ద్వారా నేరుగా జీతాలు పొందుతుంటే తమకు కనీసం నెల నెలా జీతాలను ఇచ్చే నాధుడు లేకపోవడంపై ఉపాధ్యాయ లోకంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సక్రమంగా రాని జీతాల కారణంగా అనేక అర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, చేసేది ప్రభుత్వ ఉద్యోగమైనా కుటుంబ పోషణకు సైతం వెతుకులాట చేసుకోవాల్సి వస్తున్న వైనం పై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నారు. ఇదిలావుండగా 010 జీతాల మంజూరు కు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ ఏర్పాటును సైతం ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారు. దీనితో తాము లబ్ధిపొందాల్సిన అనేక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు లబ్దిపొందలేమని వారు పేర్కొంటున్న వైనం ఉద్యమం బలోపేతానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మాటలు విని గత సంవత్సరం తీవ్రంగా నష్టపోయామని, వీరి హామీలను నమ్మి ఆందోళన విరమించకుండా ఉంటే ఈపాటికల్లా తమకు 010 జీతాలు మంజూరు అయ్యేవన్న ఆలోచనలలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ప్రస్తుతం చేపట్టిన దశల వారీ ఆందోళనలను అంతిమ లక్ష్యం సాధించే వరకూ విరమించేది లేదని, మహాధర్నాతో ప్రారంభమైన తమ ఉద్యమానికి ప్రభుత్వం స్పందించకుంటే ఎటువంటి త్యాగాలకైనా సిద్దమేనని 010 జెఎసి నాయకులు ప్రకటిస్తున్నారు. ఇదిలావుండగా నగర పాలక సంస్థ లో వాటర్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలివ్వకపోవడం కార్మికు సంఘాలు గుర్రు మంటున్నాయి. వారు కూడా తమ జీతాల సాధన కోసం ఆందోళన బాట పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నగర కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికుల జీతాల కోసం ఉద్యమించేందుకు రంగం సిద్దం చేస్తున్న వైనం గమనార్హం. ఒకపక్క ఉపాధ్యాయులు, మరోపక్క కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఆందోళన బాట పడితే కార్పొరేషన్ అందించే పౌర సేవలకు విఘాతం కలుగకమానదు.

కౌలురైతులకు10 వేల కోట్ల పంట రుణాలివ్వాలి
విజయవాడ, జూలై 14: రాష్ట్రంలో కౌలు రైతులందరికీ రూ.10వేల కోట్ల పంట రుణాలివ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబోయిన రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుందరయ్య భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులు ఏళ్ల తరబడి చేసిన అనేక పోరాటాల ఫలితంగా దిగొచ్చిన ప్రభుత్వం 2011లో లైసెన్స్ సాగుదారుల చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ప్రతి కౌలుదారునికీ గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉందన్నారు. గుర్తింపుపొందిన ప్రతి కౌలుదారునికీ పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం, బీమా సౌకర్యం కల్పించాల్సి ఉందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేయకపోగా కౌలుదారుల చట్టాలను ప్రభుత్వం ఆమలు చేయటంలేదన్నారు. భూ యజమానులు, అధికారులతో కలిసి ప్రభుత్వం కౌలు రైతులకు అనేక అవరోధాలు సృష్టిస్తోందన్నారు. ఈ సమావేశంలో కిసాన్ సభ ఆలిండియా ఉపాధ్యక్షులు ఎస్ మల్లారెడ్డి పాల్గొన్నారు.
నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె శ్రీనివాస్, ఎన్ రంగారావు
ముందుగా జరిగిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె శ్రీనివాస్, ఎన్ రంగారావులను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వంగల సుబ్బారావు, పిన్నమనేని మురళీకృష్ణ, జుత్తిగ నరసింహమూర్తి, తాతా భాస్కరరావు, సహాయ కార్యదర్శులుగా పి జమలయ్య, గంగపట్నం రమణయ్య, కె అజయ్, టివి లక్ష్మణస్వామి, మరో 25 మంది సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ఆల్మట్టి డ్యాం ఇంకా ఎత్తు పెంచుతారా!?
విజయవాడ, జూలై 14: ఆల్మట్టి డ్యాం ఎత్తు 519.06 నుండి 524.25 అడుగులకు పెంపుదల చేస్తున్నట్లు దీనికోసం నిధులు కేటాయించినట్లు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించటం ఆందోళన కల్గిస్తున్నదని తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 అడుగులు పెంచటం వలన కృష్ణాడెల్టా నారుమళ్ళు సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో వేయవల్సిన పరిస్థితి వస్తుందని, దీని వలన నాగార్జున సాగర్ క్రింద ఆయకట్టు 22 లక్షలు దెబ్బతినే అవకాశముందన్నారు. త్వరలో జడ్జిమెంట్ వస్తుందని అప్పటివరకు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా ముఖ్యమంత్రి ఎంపిలతో కలిసి ప్రధాన మంత్రిపై ఒత్తిడి తేవాలని, చంద్రబాబు హయాంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు 524 అడుగులు ఎత్తడానికి ప్రయత్నం చేస్తే న్యాయపోరాటం ద్వారా దీనిని ఆపివేయటం జరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ఆగస్టు నెలలో రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన కార్యక్రమం చేపడుతుందన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో సెంట్రల్ ఇన్‌చార్జి బొండా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బొడ్డు వేణుగోపాలరావు, నూజివీడు మండల పార్టీ అధ్యక్షులు కాపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే ఆత్మతృప్తి
అజిత్‌సింగ్‌నగర్, జూలై 14: ఆపదలో ఉన్న వారిని ఆదుకుని వారికి అవసరమైన సేవ చేయడంలో ఉన్న ఆత్మతృప్తి మరిదేనిలో కలగదని ప్రముఖ పారిశ్రామిక వేత్త, సంఘ సేవకులు గోకరాజు గంగరాజు పేర్కొన్నారు. గోకరాజు గంగరాజు 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక వివేకానంద సెంటినరీ హైస్కూల్ విద్యార్థులకు అనంత లక్ష్మీదేవి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలు ఎంతో మంది ఉన్నారని, ముఖ్యంగా విద్యార్థులు ఎంతో మంది తమ విద్యాభ్యాస అవసరాల కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వైనం గమనార్హమన్నారు. సామాజిక అభ్యున్నతి కావాలంటే నిరుపేదలు విద్యాభున్నతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపేదలైన విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, ఇతర అవసరాలను తీర్చగలిగితే వారి అభ్యున్నతికి దోహదపడినవారిమవుతామన్నారు. గత యాభై సంవత్సరాలుగా పేద వర్గాలకు విద్యాబోధన చేస్తున్న వివేకానంద సెంటినరీ హైస్కూల్‌లో నిర్మించనున్న సిల్వర్ జూబ్లీ తరగతి గదుల భవన నిర్మాణానికి గాను నిర్మాణ వ్యయంలో యాభై శాతమైన సుమారు 25 లక్షల రూపాయలను విరాళంగా అందజేస్తున్నట్లు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అనంతలక్ష్మీదేవి సేవా సంఘం అధ్యక్షుడు పెనె్మత్స అప్పలరాజు మాట్లాడుతూ నగరంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థులు నోటు పుస్తకాల కోసం ఇబ్బందులు పడరాదన్న ఉద్దేశ్యంతో వేలాది పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే పాఠశాల తరగతి గదుల నిర్మాణం కోసం సుమారు పాతిక లక్షల రూపాయలను విరాళంగా అందజేయడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దుర్గాప్రసాద్, ప్రధానోపాధ్యాయులు ఎ రామ్‌ప్రసాద్, ఉపాధాయులు నాగరాజు, నగర ప్రముఖులు యువి నరసరాజు, దాట్ల సత్యనారాయణరాజు, హనుమంతరావు, మహిళా పారిశ్రామిక వేత్త రాధారాణి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గోకరాజు గంగరాజు పాఠశాల ఉపాధాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. తొలుత పాఠశాల ఆవరణలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మానసిక ఆరోగ్యానికి కావలసింది శారీరక ఆరోగ్యం
విజయవాడ, జూలై 14: మానసికారోగ్యానికి ముఖ్యంగా కావల్సింది శారీరక ఆరోగ్యం, భావోద్రేక సమతౌల్యత, ఆత్మవిశ్వాసం, ఆశావాదం అని డాక్టర్ సి.రవికుమార్ అన్నారు. పోషకాహార విలువల వారోత్సవాలు ప్రారంభం సందర్భంగా నలంద విద్యానికేతన్‌లో ‘కౌమారదశలో కలిగే మార్పులు’ అంశంపై ఆదివారం జరిగిన అవగాహన శిబిరంలో ఆయన ప్రసంగించారు. 13నుంచి 17ఏళ్ళ మధ్యకాలంలో శరీర భాగాలతోపాటు వ్యక్తి నడకలో మార్పు వస్తుందని ఇతర వ్యక్తులు చేసే ప్రతి పనిని విమర్శిస్తుంటారని తల్లితండ్రులపై తీవ్ర నిరసన భావంతో ఉంటారని, పగటికలలు కంటూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తారని తెలిపారు. శరీరంలో వచ్చే మార్పుల వల్ల బాహ్య పరిస్థితుల పట్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారని అన్నారు. అందుకే తల్లిదండ్రులు ఈ దిశలో తమ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారో గమనిస్తుండాలన్నారు. ఉపాధ్యాయులు పెరిగే వాతావరణం ఈ మూడు అంశాలు విద్యార్థులను ప్రభావితం చేస్తుంటాయి. విద్యార్థులకు అన్ని విషయాల్లోనూ కౌనె్సలింగ్ ఎంతో అవసరమని డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులను ఉదాహరణగా తీసుకుని వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎలా ఎదిగారు అనే విషయంపై చర్చించారు. డాక్టర్ పి.కిషోర్ ప్రసంగిస్తూ పిల్లల్లో ఉత్తర కౌమారదశ 17 నుంచి ప్రారంభమై 21వ సంవత్సరం వరకు ఉంటుందన్నారు. ఈ దశలో సాంఘిక పరివర్తనలో ఎక్కువ మార్పులు జరుగుతుంటాయని, విందులు, వినోదాల పట్ల ఆసక్తి, భిన్నలింగ వ్యక్తులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుశాంత్ దాస్ తదితరులు ప్రసంగించారు.

నగ్నమునికి తనికెళ్ళ భరణి సాహితీ పురస్కార ప్రదానం
విజయవాడ , జూలై 14: దిగంబర కవిత ప్రారంభకులు, విరసం వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, ప్రజాస్వామ్య కవిత ప్రారంభకులు నగ్నమునికి తనికెళ్ళ భరణి సాహితీ పురస్కారం -2013ను అందించారు. ఆదివారం సాయంత్రం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సాహితీ వేత్తలు, కవులు, పండితులు, రచయితల కరతాళ ధ్వనుల మధ్య ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వేదికపై అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, సినీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి, గోళ్ళ నారాయణరావు, శ్రీశ్రీ విశే్వశ్వరరావు, కె.పట్టానిరామ్, డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి, కె.వెంకటేశ్వరరావు, కొప్పర్తి వెంకట రమణమూర్తి తదితరులు పాల్గొని మానవ జీవన వాస్తవికతలను తన కలాన్ని కత్తిగా చేసి రచనలు చేసిన నగ్నమునికి ఈ పురస్కారాన్ని అందించటం ఎంతో ముదావహమన్నారు. ప్రారంభంలో బులుసు అపర్ణచే మహిళా అష్టావధానం జరిగింది. పృచ్ఛకులుగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, పింగళి వెంకట కృష్ణారావు, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, మంజులూరి కృష్ణకుమారి, మల్లాప్రగడ శ్రీవల్లి, పుల్లాభట్ల నాగశాంతి స్వరూప, ఎంఎస్ సూర్యనారాయణలు పాల్గొని చేసిన అవధాన కార్యక్రమం భాషా వైభవాన్ని చాటింది.

భక్తి, భాషల సమాహారం.. నాట్య సంకీర్తనోత్సవం
విజయవాడ , జూలై 14: శ్రీధర్మ పరిషత్ మహా సంస్థానం వారి సౌజన్యంతో అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు అయోధ్యనగరంలోని శ్రీ శివగాయత్రి ప్రాంగణంలో జరుగుతున్న అన్నమయ్య 605వ జయంతి నాట్య సంకీర్తనోత్సవం భక్తితత్వాన్ని, భాషా వైభవాన్ని చాటుతూ సాగింది. 3వ రోజైన ఆదివారం సాయంత్రం నాటి నాట్య ప్రదర్శనలు నయన మనోహరంగా ప్రదర్శనలనిచ్చిన నాట్యాభ్యాసకుల కృషిని, నాట్యంపైవారికి గల శ్రద్ధను గోచరింపచేశాయి. ప్రత్యేక ప్రదర్శనగా చిన్నారి సాయి మంజూష చేసిన నాట్య ప్రదర్శన రాజీవ నేత్రాల రఘువాయనమః అంశాలతో రమణీయంగా సాగి ఆహూతుల హర్షధ్వానాలందుకుంది. వరుసగా బలిజేపల్లి శివానంద్, జెఎస్‌ఆర్ మూర్తి, నిర్మలా రమేశ్, జోశ్యుల పద్మశ్రీ, పాత్రుని శిరీష, నాగమణి బుద్ధదేవ్, శ్రీకాంత్, భాగవతుల శ్రీనివాస శర్మ, మహంకాళి సూర్యనారాయణ శర్మ, శైలశ్రీ, అద్దేపల్లి అశ్వనీకుమార్, హేమసుందర్, లోకేష్ కృష్ణవేణి నాట్యాచార్యుల శిష్య బృందాలు అంతయు నీవే హరి పుండరీకాక్ష, ఒక పరి నొకపరి, జగడపు చనవుల, ఫాలనేత్రాన, పిలవరే కృష్ణుని, పిడికిట తలంబ్రాలు, తందనానా ఆహి, వేడుకుందామా, గోవిందాశ్రీత, భావములోన బాహ్యము తదితర సంకీర్తనలకు నాట్యాభినయం అందరి కరతాళ ధ్వనులందుకున్నాయి. మూడు రోజులు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి దాదాపు 40మంది నాట్యాచార్యుల శిష్య బృందాలు 700మంది చిన్నారులు ప్రదర్శనలో వారి వారి నాట్య కళాప్రతిభను చాటుకున్నారు. అందరికి ఎహెచ్‌ఎస్ వరప్రసాద్ (రాజా) రాజగోపాల జ్ఞాపికలు అందించి ఆశీర్వదించారు. నిర్వహణ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి చేయగా, ప్రదర్శనకు పర్యవేక్షణ పసుమర్తి కేశవప్రసాద్ చేశారు.

వాన భయం పోయింది... దోమకాటు వెంటాడు
పాతబస్తీ, జూలై 14: విజయవాడ నగరవాసుల వెన్నులో వణుకు పుట్టించిన వాన భయం నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. కానీ దోమకాటు భయం మాత్రం నిరంతరం వెంటాడుతోంది. ముఖ్యంగా పాతబస్తీ మూడేళ్లనాడు తవ్విన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ గోతులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. నాటి గోతులు పూడ్చడానికి పశ్చిమ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నిధుల నుండి సుమారు రూ.18కోట్లు మంజూరు చేయించుకున్నారు. పనులను వెలంపల్లి శ్రీనివాసరావు నిత్యం పర్యవేక్షిస్తునే ఉన్నారు. అయినాగాని రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం కావడంలేదు. దాంతో కొండప్రాంతవాసులు తమ నివాసాలకు చేరుకోడానికి నరకయాతనకు గురవుతుండగా కొండ దిగువ ప్రాంతవాసులు మురుగు ముంపునకుగురై కలుషిత వాతావరణంలో మగ్గాల్సి వస్తుంది. పైగా కొండప్రాంతవాసులు చాలామంది మరుగుదొడ్లు ట్యాంకులు నిర్మించకుండా మరుగుదొడ్ల వాడకాన్ని మురుగుకాలువలకు వదిలేస్తున్నారు. దానివల్ల వాడిన నీటితోపాటు మరుగుదొడ్లు నీరుకూడా దిగువ ప్రాంతాలకు కొట్టుకొస్తుంది. అలాంటి మురుగు దోమలార్వా అభివృద్ధి కర్మాగారంలా మారుతుంది. కొండ దిగువ ప్రాంతాల్లో మురుగుకాలువలు నిత్యం పూడికకు గురవుతున్నాయి. అనధికార అంచనా ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన డ్రెయిన్‌లో నిత్యం 50 టన్నుల సిల్ట్ పేరుకుపోతుంది. జనాభా లెక్కల ప్రకారం ఉండాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది కరవయ్యారు. మురుగు కాలువల్లో సిల్ట్ ఎంత తొలగించినా మరికొంత పేరుకుపోతూనే ఉంది. దాంతో చెత్తాచెదారంతో మురుగు కాలువలు నిండిపోతున్నాయి. ప్రధాన మురుగు రోడ్లు మీద ఏరులై పారుతుంది. ఇలాంటి దశలో మూడేళ్లనాడు తవ్విన గోతులు మురుగుతో నిండిపోతున్నాయి. పూర్తిగా మురుగునీరు పారుతున్న దారులు మురుగు కంపు కొడుతున్నాయి. నిత్యం తడారకుండా నీరు నిలువ ఉండడంతో దోమలార్వా వృద్ధి చెందుతోంది. దాంతో వాన భయం వదిలినా పాతబస్తీవాసుల్లో దోమకాటు భయం పట్టుకుంది. లార్వా నియంత్రణకు మున్సిపల్ ప్రజాఆరోగ్యశాఖ కసరత్తు చేస్తున్నాగాని పూర్తిస్థాయిలో నివారణ కావడంలేదు.

గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్నవారిని తప్పించేందుకు
english title: 
bujjagimpu
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>