Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పెనుబల్లిలో ఉద్రిక్తత

$
0
0

బుచ్చిరెడ్డిపాళెం, జూలై 14 : బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో పొలీసులు ఆదివారం పికెట్ ఏర్పాటుచేశారు. కమ్యూనిస్టేతరులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేక వైఎస్‌ఆర్ సిపి, బిజెపి మద్దతుతో నామినేషన్ వేయబోయిన ముగ్గురు వార్డుసభ్యుల అభ్యర్థులపై శనివారం కమ్యూనిస్టు నేతలు దాడిచేసి వారిని కిడ్నాప్ చేశారు. అలాగే వారికి అండగా నిలిచిన వైఎస్‌ఆర్ సిపి, బిజెపికి చెందిన ఇద్దరు నేతలపై దాడిచేశారు. దీంతో పెనుబల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా పోలీసు పికెట్ ఏర్పాటుచేశారు. దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పరారీలో ఉన్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు. ఇదిలా ఉండగా కిడ్నాప్ కాబడ్డారని చెబుతున్న వారి కుటుంబ సభ్యులు తమకు ఎన్నికలు వద్దని, కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి వస్తే చాలని కోరుకుంటున్నారు.
ఇద్దరు అరెస్ట్
వైఎస్‌ఆర్ సిపి, బిజెపి నేతలపై దాడికి పాల్పడ్డ సిపిఎంకు చెందిన సుబ్రమణ్యం, శివశంకర్ అనే ఇద్దరు వ్యక్తులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన నిందితునిగా చెబుతున్న గురునాధం పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

అడ్డగుండాల గ్రామస్థుల ఆందోళన

తడ, జూలై 14: మండల పరిధిలోని అండగుండాల గ్రామానికి చెందిన ఇద్దరు గ్రామ పెద్దలను తడ పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవడంతో అండగుండాల గ్రామస్థులు ఆదివారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అండగుండాల గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం విషయమై కారికాటి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో ఆ విషయంపై తడ పోలీసులు ఆ గ్రామ పెద్దలిద్దరినీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు తడ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని అన్యాయంగా గ్రామ పెద్దలను అరెస్ట్ చేశారంటూ ఆందోళన నిర్వహించారు. గ్రామంలో చిచ్చు రేగడానికి కారణం ఓ కాంగ్రెస్ నాయకుడని, అతనిపై చర్యలు తీసుకునే ధైర్యం లేక గ్రామ పెద్దలను అరెస్ట్ చేయడం అన్యాయమని తడ ఎస్సై నాగేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందచేశారు. దీంతో ఎస్సై విచారణకు తీసుకొచ్చిన ఇద్దరినీ విడిచిపెట్టడంతో గ్రామస్థులు శాంతించారు.

మూఢనమ్మకాలతో క్షుద్ర పూజలు
వింజమూరు, జూలై 14: మూఢనమ్మకాలతో క్షుద్రపూజలు చేసిన సంఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి 1.5 కేజీల ఇత్తడి అమ్మవారి విగ్రహం స్వాధీనం చేసుకున్న సంఘటన వింజమూరు మండలంలో ఆదివారం జరిగింది. కలిగిరి సిఐ ఎవి రమణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శంఖవరం పంచాయతీ వెంకటాద్రిపాలెంకు చెందిన లేటి శోభన్‌బాబు తండ్రి రమణయ్యకు ఆరోగ్యం సరిగా లేదని పలు ఆస్పత్రులలో చికిత్సలు చేయించినా ఆరోగ్య పరిస్థితి బాగుకాని స్థితిలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని శ్రీనివాసపురానికి చెందిన కుప్పం బాలయ్య, అతని అసిస్టెంట్ నెల్లూరు జిల్లా సంగంకు చెందిన వేముల ఏడుకొండలును సంప్రదించాడు. మీ తండ్రి ఆరోగ్యం నయం కావాలంటే పొలంలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంటిలో నిత్యపూజలు చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మబలికారు. అందుకు 30 వేలు ఖర్చవుతాయనటంతో శోభన్‌బాబు సరేనన్నాడు. అనంతరం బాలయ్య చెన్నై నగరంలోని శ్రీస్వామినాధన్ స్టోర్స్ నుండి ఐదు వేల రూపాయల విలువ చేసే అమ్మవారి ఇత్తడి విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. ఈక్రమంలో శనివారం రాత్రి శోభన్‌బాబు కుటుంబీకులు వారి పొలంలో క్షద్రపూజలు చేసి, జంతువులను బలిచ్చారు. విగ్రహం తీసేందుకు గుంట తవ్వారు. మరికొద్ది సేపట్లో అమ్మవారి విగ్రహం వస్తుందని, మీరు దాన్ని చూడకూడదని శోభన్‌బాబు కుటుంబీకులను దూరంగా వెళ్లమన్నాడు. అప్పటికే బాలయ్య తన వెంట తెచ్చిన విగ్రహాన్ని సంచిలో నుండి గుంటలో ఉంచి వారికి చూపించాడు. వారు నిజమని నమ్మి దాన్నితెచ్చి ఇంటికి తెచ్చే సమయంలో విషయం పోలీసులకు తెలిసింది. డిఎస్పీ డి వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని బాలయ్య అతని అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న అమ్మవారి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇకనైనా ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించక అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

చోరీ నగలు కుదవ అంగడిలో తాకట్టు
ఆత్మకూరురూరల్, జూలై 14 : ఆత్మకూరు పట్టణంలోని హరిప్రియ హోటల్ యజమాని ఇంటిలో చోరీ చేసిన నిందితుడు మెజిస్ట్రేట్ ముందు చోరీ చేసినట్టు అంగీకరించాడు. నిందితుడు మెజిస్ట్రేట్ ముందు తాను చోరి చేసిన బంగారు ఆభరణాలలో ఆత్మకూరు పట్టణంలో ఓ బంగారు అంగడిలో 2 గాజులు పెట్టి రూ.20 వేలు నగదు తీసుకున్నానని వెల్లడించాడు. ఈ విషయం తెలియగానే పట్టణ పరిధిలోని బంగారు షాపుల యాజమానులు ఉలిక్కిపడ్డారు. వ్యాపార పరంగా ఎవరు బంగారు నగలు తీసుకొచ్చినా కుదువ పెట్టుకోవడం ఆనవాయితీ. హోటల్ యజమాని ఇంటిలో చోరికి గురైన 11 సవర్ల బంగారంలో కేవలం 2 గాజులు మాత్రమే ఆత్మకూరులో తాకట్టు పెట్టినట్లు నిందితుడు వెల్లడించారు. మిగిలిన కొంత బంగారాన్ని నెల్లూరులో, మరికొంత చెన్నైలో పూర్తిగా గోవాలో విక్రయాలు సాగించినట్లు నిందితుడు వెల్లడిస్తున్నాడు. పోలీసులకు సవాల్‌గా మారిన ఈ కేసుకు సంబంధించి సిఐ నిందితున్ని విచారణ కొరకు తమకు అప్పగించాలని మెజిస్ట్రేట్ వద్ద దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు స్వాధీనపరుచుకుంటే హోటల్ యజమానికి సంబంధించిన బంగారం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. పట్టణ పరిధిలో రెండు గాజులు కుదువ పెట్టుకున్న వ్యాపారిపై పోలీసులుచర్యలు తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఏదేమైనా ఆత్మకూరు బంగారు షాపుల యాజమానుల మధ్య విషయం చర్చనీయాంశం అయింది.

వృత్తి విద్యాకోర్సులపై
ప్రభుత్వం దృష్టి సారించాలి
- బిజెపి నేత వెంకయ్యనాయుడు పిలుపు -
వెంకటాచలం, జూలై 14: వృత్తి విద్యాకోర్సులపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని బిజెపి సీనియర్ నాయకుడు ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. వెంకటాచలం మండలం స్వర్ణ్భారత్ ట్రస్టులోని థైరెడ్‌లో వృత్తి విద్యలపై శిక్షణ పొందిన విద్యార్థులకు సర్ట్ఫికెట్లను ఆయన ఆదివారం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి విద్యార్థులలో నైపుణ్యతను గుర్తించి, వాటిపై ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. వృత్తి విద్యలపై ప్రతి మండలంలో ఉపాథి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. కుల వృత్తులలో యువత నైపుణ్యతను సాధించేందుకు ప్రభుత్వాలతోపాటు స్వచ్చంద సంస్థలు నడుం బిగించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా థెరెడ్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్ట్ఫికెట్లు అందజేసారు. ఈకార్యక్రమంలో సిఇఓ శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ చర్యలు:జెసి
మనుబోలు, జూలై 14: ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టరు లక్ష్మీకాంతం హెచ్చరించారు. ఆదివారం ఎన్నికల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పరిశీలించి తిరిగి వెళ్తున్న సమయంలో స్థానిక రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో ఏర్పాటుచేసిన బోర్డును ఆయన పరీశిలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటుచేయాలని, బోర్డులను తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక తహశీల్దారు వెంకటనారాయణమ్మను ఆదేశించారు. కోండూరుసత్రం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించారని విలేఖరులు ఆయన దృష్టికి తీసురావడంతో స్పందించి భూమిని పరిశీలించి నివేదికను పంపాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ట్రైనీ కలెక్టరు వర్షిణి, స్థానిక ఎంపిడివో హేమలత తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల బరిలో ఎమ్మెస్సీ విద్యార్థి
ఆత్మకూరు రూరల్, జూలై 14 : మండలంలోని చెర్లోయడవల్లి గ్రామ పంచాయతీ బరిలో సిద్ధం సుష్మ అనే ఎమ్మెస్సీ అభ్యర్ధి బరిలో ఉన్నారు. గ్రామంలోని ప్రజలంతా ఈమెను బరిలో నిలపడానికి నిర్ణయించుకున్నారు. ఈ పంచాయతీ పరిధిలో 8 వార్డు మెంబరుగా ఎమ్మెస్సీ చదువుతున్న సిద్ధం సుష్మ పోటీకిదిగారు. ఈ పంచాయతీ పరిధిలో ఎమ్మెస్సీ చదువుకున్న ఈమెకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోయేసరికి కుటుంబ సభ్యులు రాజకీయ రంగ ప్రవేశం చేయించినట్టు తెలుస్తోంది. దళిత కుటుంబానికి ఈ చెందిన ఈమె ఉన్నత చదువులు చదివినా ప్రభుత్వ ఉద్యోగం రాకపోయేసరికి రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కాక ప్రజలకు సేవ చేయడం మాహాభాగ్యమని సుష్మ వెల్లడించారు. ప్రస్తుతం గ్రూప్-1కు సిద్ధమవుతున్నానని ఆమె వెల్లడించారు. ఈ లోపు గ్రామస్తుల సహకారంతో పోటికి దిగినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఆర్థిక స్థోమత లేకున్ననూ ఆమె చదువుకు తగినంత సహకారం అందిస్తామని గ్రామస్థులు వెల్లడించారు.

ప్రత్యేక రాష్ట్రం
వచ్చే ప్రసక్తే లేదు

నెల్లూరుసిటీ, జూలై 14: కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీలో కూడా ప్రత్యేక తెలంగాణ మీద చర్చించలేదని, సిడబ్ల్యుసి సమావేశంలో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించి చర్చకు రాదని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. ఆదివారం పద్మావతి ఫంక్షన్‌హాల్లో సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే కెసిఆర్‌కు సిఎం కూర్చీ, ఆయన కుమారుడుకి డిప్యూటీ సిఎం, కూతురుకి ఢిల్లీలో పదవి, అల్లుడికి కీలక మంత్రి పదవులు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య ధ్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని విడదీసే దానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులో మద్దతు ఇవ్వదన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని పార్టీలు ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఓట్లను దండుకొనేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. ఆ పార్టీ అడ్రస్సు లేని పార్టీ అని తెలిపారు. చిన్న రాష్టల్ర వల్ల నక్సలిజం పెరిగిపోవడం తప్ప అభివృద్ధి ఉండదన్నారు. నెల్లూరుసిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా వచ్చి ఆంధ్రరాష్టన్న్రి విడగొడితే ఎట్టి పరిస్థితులో సహించేది లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీలు ఒక తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ఆనం వివేకానందరెడ్డి తండ్రి ఆనం వెంకటరెడ్డి కూడా సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని విభజించాలని చూస్తే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, యర్రంరెడ్డి గోవర్దన్‌రెడ్డి, ననే్నసాహెబ్, వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి కన్వీనర్ డివి కృష్ణయాదవ్ తదతరులు పాల్గొన్నారు.

నామినేషన్ల పరిశీలన పూర్తి
సర్పంచ్ నామినేషన్లు - 74
వార్డు మెంబర్లు- 520 తిరస్కరణ
నెల్లూరుసిటీ, జూలై 14: జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు మెంబర్లకు నామినేషన్ల పరిశీలన ఆదివారం జరిగింది. మొత్తం 931 పంచాయతీలకు గాను 927 పంచాయతీలకు అభ్యర్థులు నామిషన్లు దాఖలు చేశారు. 4 పంచాయతీలకు వివిధ కారణల వల్ల ఎవరు కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు. సర్పంచ్ అభ్యర్థులుగా 4670 మంది అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. 8834 వార్డులకు గాను 22776 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం రాత్రి వరకు నామిషనేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది. అందులో వివిధ కారణాలతో సర్పంచ్ నామినేషన్లు 74 నామినేషన్లను తిరస్కరించారు. వార్డులకు దాఖలైన 22776 మంది నామినేషన్లు పరిశీలించి వాటిలో 520 తిరస్కరించారు.
డివిజన్ల వారిగా వివరాలిలావున్నాయ.
కావలి డివిజన్‌లో సర్పంచ్ అభ్యర్థులుగా నలుగురు, వార్డు మెంబర్లు -62
ఆత్మకూరు డివిజన్‌లో సర్పంచ్‌కు 13- వార్డుమెంబర్లు-93, నెల్లూరు డివిజన్‌లో సర్పంచ్‌కు 27, వార్డు మెంబర్లకు 171, గూడూరు డివిజన్‌లో సర్పంచ్ 14, వార్డు మెంబర్లకు 123, నాయుడుపేట డివిజన్‌లో సర్పంచ్‌కు 16, వార్డు మెంబర్లు -70 నామినేషన్లు తిరస్కరించారు.

బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి గ్రామంలో ఇంకా ఉద్రిక్త
english title: 
tension

పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటండి

$
0
0

ఒంగోలు , జూలై 14: పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన సర్పంచ్, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో అత్యధిక స్థానాల్లో గెలుపొందే విధంగా పార్టీశ్రేణులు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు యానం చినయోగయ్య యాదవ్ అధ్యక్షతన ఆదివారం నగరంలోని 5వ డివిజన్, 26వ డివిజన్‌లలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ డివిజన్‌కు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. డివిజన్ అధ్యక్షుడిగా గాలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కొణికి రోశయ్యలను ఎంపిక చేశారు. అదేవిధంగా 26వ డివిజన్ అధ్యక్షుడిగా పొత్తూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పులివర్తి అజయ్‌బాబులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దామచర్ల మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను పార్టీశ్రేణులు ఛాలెంజ్‌గా తీసుకొని టిడిపి బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలు ఇప్పటినుండే సన్నద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని దామచర్ల ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు ఏలాంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ బిసిలకు రానున్న ఎన్నికల్లో వంద అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని వాగ్దానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిసిలు ముందుండి పార్టీని నడిపించాలని కోరారు. కేంద్ర, రాష్ట్రాల్లో అసమర్థ ప్రభుత్వాలు పాలిస్తున్నాయని దీనివల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి లాంటి ఆర్థిక నేరగాళ్ళకు కళ్ళెం వేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదని, చట్ట సభలకు అలాంటి వారు అనర్హులని తీర్పు చెప్పడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా నగర పార్టీ అధ్యక్షుడు యానం చిన యోగయ్య యాదవ్ మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు ఆకాశానంటుతున్న నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా, తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అసమర్థ ప్రభుత్వాల పరిపాలన వలన ప్రజలు విసుగు చెందారని, ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ ప్రధానకార్యదర్శి కపిల్ బాషా, రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు యక్కల తులసీరావు, బొల్లినేని వాసుకృష్ణ, టివి శ్రీరామ్మూర్తి, కమ్మ వెంకటేశ్వర్లు, కొమ్మూరి రవిచంద్ర, బొల్లినేని మురళీకృష్ణ, టి అనంతమ్మ, కుట్టు బోయిన వెంకట్రావు, కె సురేష్, జి శ్రీనివాసరావు, పొనుబాటి వెంకటేశ్వర్లు , బొల్లినేని బుజ్జి, మద్దినేని సుబ్బారావు, నూనె వెంకటేశ్వర్లు, పులివర్తి సాయిబాబు, షేక్ అన్వర్ బాషా, మద్దసాని రాము, ఎంపి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్ఠాత్మకంగా పంచాయతీ రాజకీయం!
తాయిలాలు ప్రకటిస్తున్న నేతలు
ఒంగోలు, జూలై 14: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయండి.. అనంతరం లక్షలాది రూపాయల విలువైన వర్క్‌లను తీసుకెళ్లండని అధికార పార్టీకి చెందిన కొంతమంది శాసనసభ్యులు హుకుం జారీ చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీచేసే కొంతమంది అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు కూడా అధికారపార్టీకి చెందిన నేతలు ముందుకువస్తున్నారు. కాని కొన్ని నియోజకవర్గాల్లో అలాంటి తాయిలాలు ప్రకటిస్తున్నప్పటికీ పోటీ చేసేందుకు గ్రామాల్లోని నేతలు ముందుకురాని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థికి 20 లక్షల రూపాయలకు పైగానే వర్క్‌లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలకే ఈ ఎన్నికలు పెద్దతలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. ఎన్నికల్లో ఫలితాలు తారుమారు అయితే హైకమాండ్ వద్ద తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుందన్న భావనలో అధికారపార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, మరికొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలో ఉన్నారు. గ్రామాల్లో నెలకొన్న రాజకీయ వాతావరణం దృష్ట్యా అక్కడి నేతలు పొత్తులు పెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా జిల్లాలోని ఒసి జనరల్ కేటగిరి కింద ఉన్న పంచాయతీల్లో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కొక్క పంచాయతీలో 20 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు చేసేందుకు అభ్యర్థులు వెనుకాడడం లేదని తెలుస్తోంది. కొంతమంది అభ్యర్థులు ఈపాటికే తమ భూములను అమ్ముకుని ఆ నగదును ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇదిలాఉండగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తిలు కూడా పంచాయతీ ఎన్నికలపై దృష్టిసారించారు. ఇటీవల జరిగిన డిసిసిబి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెరుగైన ఫలితాలే వచ్చాయి. దీంతో నూతనోత్సాహంతో నేతలు గ్రామాల్లో అభ్యర్థులను రంగంలోకి దించారు. కొంతమంది అభ్యర్థులకు ఆర్థికబలం తగ్గినప్పటికి నేతలు ఆ లోటు పూడ్చేందుకు ముందుకు వస్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రధానంగా ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులకు పెద్ద తలనొప్పిగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో తమసత్తా చాటకపోతే అధినేత చంద్రబాబు వద్ద మార్కులు తగ్గుతాయన్న మీమాంసలో నేతలు ఉన్నారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు జిల్లాలో జరిగిన సభలో పార్టీనేతలకు హితోపదేశం చేశారు. ఎట్టి పరిస్ధితుల్లోను పంచాయతీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుని పార్టీకి వైభవం తీసుకురావాలని సూచించారు. కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో బలం ఉన్నప్పటికి నేతల మధ్య మాత్రం అంతర్గత కుమ్ములాటలు జోరందుకుంటున్నాయి. దీంతో నేతల మధ్య ఉన్న అనైఖ్యత పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద మూడు ప్రధాన రాజకీయపక్షాలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగానే మారాయి. కాగా పంచాయతీ ఎన్నికల పుణ్యామా అని మద్యం ఏరులై పారుతోంది. మద్యంషాపుల్లో రిటైల్‌గా మద్యం అమ్మకాలు తగ్గగా, హోల్‌సేల్‌గా మాత్రం విక్రయాలు భారీగా పెరిగిపోయాయి.

ముగిసిన నామినేషన్ల పరిశీలన
పలుకూరులో స్వల్ప ఉద్రిక్తత
రెండు టిడిపి, రెండు కాంగ్రెస్, ఒకటి వైఎస్‌ఆర్‌సిపి
ఏకగ్రీవం
కందుకూరు, జూలై 14: ఈనెల 27న జరగనున్న పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు మెంబర్లుగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్ల స్క్రూట్ని కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. కందుకూరు మండలం మాచవరం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన మెడబలిమి అంకయ్య నామినేషన్‌ను ఉప సంహరణ చేసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా మండలంలోని నరిశెట్టివారిపాలెం, కమ్మవారిపాలెం పంచాయతీలలో ఒక్కొక్క నామినేషన్ రావడంతో రెండు పంచాయతీలు టిడిపి ఖాతాలో జమ కానున్నాయి. మిగిలిన 19పంచాయతీలలో 89నామినేషన్లు స్క్రూట్నిలో నిలిచాయి. అందరూ ఆసక్తితో ఎదురు చూసిన మాచవరం పంచాయతీలో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దాసరి పోతులూరయ్య నామినేషన్ స్క్రూట్నిలో నిలిచింది. ఇక నామినేషన్ల ఉప సంహరణ పూర్తిఅయ్యే సమయానికి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి బరిలో నిలిస్తే మొట్టమొదటిసారిగా మాచవరం పంచాయతీలో బ్యాలెట్ వినియోగం అమలు జరగనుంది. నామినేషన్ల స్క్రూట్ని సందర్భంగా పలుకూరు పంచాయతీలో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి తన్నీరు జయమ్మ అఫిడవిట్‌లో వివరాలు పొందు పరచలేదు. స్క్రూట్ని సమయంలో టిడిపి అభ్యర్థి జయమ్మ నామినేషన్లపై అభ్యంతరం తెలిపారు. ఈనేపథ్యంలో పలుకూరు గ్రామంలో చిన్నపాటి వివాదం నెలకొంది. అధికారుల జోక్యంతో వివాదం సమసిపోయింది. పలుకూరు పంచాయతీ 2వ వార్డు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి నామినేషన్ స్క్రూట్నిలో తొలగించడం జరిగింది. అదేవిధంగా మాచవరంలో 4వ వార్డు అభ్యర్థిగా 7వ వార్డు అభ్యర్థి ప్రతిపాదించడంతో ఆనామినేషన్ కూడా తొలగించడం జరిగింది. ఇక మండలంలో పంచాయతీల వారీగా పలుకూరులో టిడిపి అభ్యర్థి చెంబేటి లక్ష్మి, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి జయమ్మ, జి మేకపాడులో టిడిపి అభ్యర్థి సుబ్బారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరెడ్డి, జిల్లెలమూడిలో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవాచారి, టిడిపి అభ్యర్థి మస్తానయ్య, కోవూరు టిడిపి అభ్యర్థి నల్లపు మధు, విక్కిరాలపేటలో కాంగ్రెస్ అభ్యర్థి మాధవి, టిడిపి అభ్యర్థి భూదేవి, పాలూరులో కాంగ్రెస్ అభ్యర్థి జి వెంకారెడ్డి, టిడిపి అభ్యర్థి జి వెంకటేశ్వరరెడ్డి, శ్రీరంగరాజపురంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ శ్రీనివాసులు, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి కె శ్రీరాములు, అనంతసాగరం కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన రాములు, కంచరగుంట కాంగ్రెస్ అభ్యర్థి మొరార్జీ, టిడిపి అభ్యర్థిల మధ్యన, మోపాడులో కాంగ్రెస్ అభ్యర్థి పాలేటి శ్యామల, టిడిపి అభ్యర్థి పాలేటి మాధవి, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి మద్దాల రాధ, కొండముడుసుపాలెంలో కాంగ్రెస్ అభ్యర్థి కలవకూరి లక్ష్మి, టిడిపి అభ్యర్థి కలవకూరి నీరజ, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి తుమ్మా చెన్నమ్మ, కొండికందుకూరులో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి కోనంకి కుమారి, కాంగ్రెస్ అభ్యర్థి గుమ్మా సుశీల, ఓగూరులో టిడిపి అభ్యర్థి ఎ ఆదినారాయణమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి జి చంద్రకళ పోటీలలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అదేవిధంగా వలేటివారిపాలెం మండలంలో స్క్రూట్ని ముగిసిన అనంతరం 21పంచాయతీలలో సర్పంచ్ పదవికి 120మంది నామినేషన్లు దాఖలు చేశారు. 398వార్డులకు వచ్చిన దరఖాస్తులలో మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 395మంది 194వార్డులలో బరిలో నిలిచారు. మండలంలోని కొండారెడ్డిపాలెం పంచాయతీకి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఆపంచాయతీ వైఎస్‌ఆర్‌సిపి ఖాతాలోకి జమ కానుంది. లింగసముద్రం మండలంలో 16పంచాయతీలలో సర్పంచ్ పదవులకు స్క్రూట్ని అనంతరం 103మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదేవిధంగా వార్డు మెంబర్లకు 103నామినేషన్లు స్క్రూట్నిలో నిలిచాయి. మండల పరిధిలోని మొగిలిచెర్ల, ఆర్‌ఆర్‌పాలెం పంచాయతీలకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో రెండు పంచాయతీలో కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఈనెల 17తేది అనంతరం ఉపసంహరణలో పై పేర్కొన్నవారిలో కొంతమంది నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి.

వర్షాలతో ఊపందుకోనున్న ఖరీఫ్ సాగు

ఒంగోలు, జూలై 14: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగు ఊపందుకోనుంది. గత కొన్ని రోజులుగా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో అటు రైతాంగంతోపాటు ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో రెండు లక్షల 34 వేల 791 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకావల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 25వేల హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలను సాగుచేశారు. ప్రధానంగా జిల్లాలో సజ్జ, నువ్వు, పత్తి పంటలను సాగుచేయగా శనగ, మిర్చి, కంది, మినుము, పెసర పంటలను విస్తారంగా సాగుచేయనున్నారు. కూరగాయల పంటలను కూడా సాగుచేసేందుకు రైతులు సమాయత్తవౌతున్నారు. ఈపాటికే కొన్ని వేల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశారు. ప్రస్తుతం సాగుచేసిన రైతులకు ఈ వర్షాలు ఎంతగానో మేలుచేకూర్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే ఏడు గంటల ఉచిత విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా కాక రైతులు ఆందోళన చెందుతున్న దశలో ఈ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం కోస్తా తీరప్రాంతంలో సాగుచేసిన వేరుశనగ పంట ఏపుగా పెరిగింది. అధిక దిగుబడులు వస్తాయని వేరుశనగ రైతులు ఆశాజనకంగా ఉన్నారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు సరాసరిన 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా బేస్తవారిపేట మండలంలో 36.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా వర్షాపాతం వివరాలు మిల్లీమీటర్లలో ఈవిధంగా ఉన్నాయి. చీరాల మండలంలో 22.2 మిల్లీమీటర్లు, కంభం మండలంలో 19.6, కారంచేడు మండలంలో 19.2, కొండెపి మండలంలో 18.2, హనుమంతునిపాడు మండలంలో 15.4, మర్రిపూడి మండలంలో 13.6, గిద్దలూరు మండలంలో 13.2, రాచర్ల మండలంలో 10.4, కనిగిరి మండలంలో 10.2, కొనకనమిట్ల మండలంలో 9.8, మద్దిపాడు మండలంలో 9, చీమకుర్తి మండలంలో 9, పిసిపల్లి మండలంలో 8.6, పొన్నలూరు మండలంలో 8.2 మిమీ వర్షపాతం నమోదైంది. కందుకూరు మండలంలో 6.4, అర్ధవీడు మండలంలో 4.8, పెద్దారవీడు మండలంలో 4.2, పొదిలి మండలంలో 3.2, ఇంకొల్లు మండలంలో 2.6, వెలిగండ్ల మండలంలో 2.4, తర్లుపాడు మండలంలో 2.4, నాగులుప్పలపాడు మండలంలో రెండు, జె పంగులూరు మండలంలో 1.8, చినగంజాం మండలంలో 1.6, వలేటివారిపాలెం మండలంలో ఒక మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. మొత్తంమీద వర్షాల ప్రభావంతో జిల్లాలో ఖరీఫ్ సాగు ఊపందుకోనుంది.

అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం
* మంత్రి కన్నా స్పష్టం
మద్దిపాడు, జూలై 14: గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు నుండి తిరుపతి వెళుతూ ఆదివారం ఆయన మద్దిపాడులోని వీరభద్రా హోటల్ యజమాని పప్పు శ్రీనివాసరావు ఇంటి వద్ద కొద్దిసేపు ఆగిన ఆగారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, సన్న, చిన్నకారు రైతులకు పంటల సాగు విషయంలో అన్నివిధాలుగా తోడ్పాటు అందిస్తున్నామన్నారు. పంట పొలాలకు ఆరుతడుల కింద గుండ్లకమ్మ నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించే విధంగా అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, బాలికలకు నగదు ప్రోత్సాహక పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మంత్రి వెంట గుంటూరు జిల్లా మార్కెట్ యార్డు చైర్మన్ పర్చూరి వెంకటేశ్వరు, గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు, గుంటూరు డిసిసి వైస్ ప్రెసిడెంట్ పక్కాల సూరిబాబు, స్థానిక కాంగ్రెస్ నాయకులు యు నాగేశ్వరరావు, రఘు, షేక్ రహమాన్, వహబ్, మద్దా అంజయ్య, దండే శ్రీరాములు, వెంకయ్య, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

వాహనం బోల్తా పడి 16 మందికి గాయాలు
కురిచేడు, జూలై 14: త్వరగా ఇంటికి చేరాలనే తపనతో టాటాఎస్ వాహనంలో ప్రయాణించి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు కల్లూరు గ్రామ కూలీలు. కురిచేడు మండలం కల్లూరు గ్రామానికి చెందిన 40 మంది కూలీలు ఆదివారం సాగర్ కాల్వ కాంక్రీట్ పనులకు వెళ్ళారు. పనులు ముగించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో టాటాఎస్ వాహనం ఎక్కారు. వాహనంలో పరిమితికి మించి కూలీలు ఎక్కారు. దీనికితోడు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో వాహనం బయలుదేరిన కొద్దిసేపటికే బోల్తా పడింది. కూలీలందరూ ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాట జరిగింది. దీనితో గాయపడిన వారి సంఖ్య పెరిగింది. నిత్యం తాము రాకపోలకు ఉపయోగిస్తున్న వాహనం రావటం ఆలస్యం కావటంతో తొందరగా ఇల్లు చేరాలనే తపనతో కూలీలు టాటాఎస్‌లో కిక్కిరి ఎక్కారు. గాయపడిన 16 మందిని దర్శి, కురిచేడుకు చెందిన 108 వాహనాలలో సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి కురిచేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గాయపడిన వారిలో నక్కా బాలగురవయ్య, వల్లెం పెద్దయ్య, దండూరి యోగయ్య, పాలుబోయిన నాసరమ్మ, పాలుబోయిన శీను, పాలుబోయిన లక్ష్మయ్య, నక్కా ప్రవల్లిక, ఎల్లమ్మ, చిన్న గాలెమ్మ, గుర్రమ్మ, మల్లవరపు గోపి, వెంకట్రావు తదితరులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్య, గుర్రమ్మ, రామాంజనేయులు, తలుపూరి కోటమ్మ, కొండు సుందరమ్మలను మెరుగైన చికిత్స కోసం 108లో నరసరావుపేట తరలించారు. క్షతగాత్రులకు కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు సురేష్, సునీత సిబ్బంది చికిత్స చేసారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ప్రమాద స్థలం నుండి అదృశ్యమయ్యాడు. అయితే ఈప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. కూలీలలో కొందరు వాహనం వెనక టైరు పగలటంతో ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చి వాహనం బోల్తాపడిందని పేర్కొన్నారు.

నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
ఒంగోలు , జూలై 14: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముస్లింల పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గుజరాత్‌లోని గోద్రా మారణకాండలో చనిపోయిన ముస్లింలను కుక్కపిల్లలతో పోల్చడం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం నగర అధ్యక్షులు ఎస్‌కె అన్వర్ బాషా ఆధ్వర్యంలో నరేంద్ర మోడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు మాట్లాడుతూ నరేంద్రమోడి హిందుత్వ వాదాన్ని రెచ్చగొడుతూ భారత ప్రధాని కావాలని కలలు కంటున్నారన్నారు. ఇది లౌకికవాద భారత దేశమని, ఈ దేశంలో ఎప్పటికీ ఇలా జరుగదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి గోద్రా అల్లర్లకు కారణమైన నరేంద్రమోడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోడిని అరెస్టు చేసేంతవరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం మైనార్టీ విభాగం ప్రధానకార్యదర్శి షేక్ జబ్బార్, ఉపాధ్యక్షులు ఎస్‌కె రియాజ్, షేక్ కపిల్‌బాషా, ఎస్‌కె కాలేషాబాబు, షేక్ హబీబ్, బుజ్జి, నాసర్‌వలి, షౌకత్, వౌలాలి, ఎండి బాషా, షేక్ కరిముల్లా, ఎస్‌కె బాషా, ఎస్‌కె అబ్థుల్లా తదితరులు పాల్గొని నరేంద్రమోడికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

‘బ్యాడ్మింటన్‌కు పెరుగుతున్న ఆదరణ’
చీరాల, జూలై 14: ప్రపంచంలో క్రికెట్ తరువాత బ్యాడ్మింటన్ క్రీడకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని, అందుకు నిదర్శనం గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి చూపటమేనని భారత్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కెసిహెచ్ పున్నయ్య చౌదరి తెలిపారు. గత రెండు రోజులుగా చీరాలలోని డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 42వ ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆదివారం చివరిరోజు క్రీడాకారుల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ క్రీడాకారులు గ్రామీణ, మండల, జిల్లా, రాష్టస్ధ్రాయిలో రాణించి జాతీయస్థాయిలో ఆడాలని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, ప్రకాశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ రఘుకిరణ్, సిహెచ్ నాగేశ్వరరావు, ఎ విజయకుమార్, కరణం వెంకన్నబాబు, పి రవిచంద్రారెడ్డి, డి రమేష్‌బాబు, చిరంజీవి, షేక్ హుమాయూన్ కబీర్ తదితరులు పాల్గొన్నారు.

టిడిపి శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు దామచర్ల పిలుపు
english title: 
panchayat elections

కోడ్ దాటిన కమిషనర్

$
0
0

శ్రీకాకుళం, జూలై 14: మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్‌కు ఎన్నికల కోడ్ పట్టనట్టుంది. మున్సిపాల్టీకి కమిషనర్ వచ్చిన నాటి నుండి ఆయనకు ఏ విషయంపైనా నిబంధనలు తెలియనట్లుంది. ఇటీవల బార్ లైసెన్సులు మంజూరులో మున్సిపాల్టీ ఇవ్వాల్సిన ఎన్‌వోసీ ధృవీకరణ పత్రాల్లో సైతం నిబంధనలేవీ తనకు తెలియవని పేర్కొనడం పలు విమర్శలకు తావివ్వగా, నేడు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రకటనలు చేయడం వివాదస్పదమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల నిబంధనల మేరకు కోడ్ అమలులో ఉండగా ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటి ప్రకటనలు చేయరాదన్నది ముఖ్య నిబంధన. అందులోనూ ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో పూర్తి నిబద్ధతతో ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఆదివారం వనిత టీవీలో ప్రతి పది ఐదు నిముషాలకు ఒక పర్యాయం శ్రీకాకుళం పట్టణ పురప్రజలకు విజ్ఞప్తి పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణ పరిధిలోని స్లమ్ ప్రాంతాల్లో నివశిస్తున్న నిరుపేద తెల్లరేషన్ కార్డుదారులకు 3లాస్ట్ మైల్ కనెక్టివిటీ2 కింద రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రెండు వందల రూపాయలకే మంచినీటి కుళాయి కనెక్షను ఇస్తామని, ఈ కుళాయి ఏర్పాటుకు అయ్యే రెండు వేల రూపాయల సామాగ్రి కూలి ఖర్చు మున్సిపాల్టీయే భరిస్తుందని అందులో వెల్లడించారు. శ్రీకాకుళం మున్సిపాల్టీలో శివారు కాలనీలైన కాజీపేట, చాపురం, పాతృనివలస, కిల్లిపాలెం, కుశాలపురం, తోటపాలెం, పెద్దపాడు వంటి పంచాయతీలు పట్టణ పరిసరాలకు ఆనుకునే ఉన్నాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునే నేపథ్యంలో ఇటువంటి ప్రభుత్వ ప్రకటనలు చేయడంతో అక్కడ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉంది. ఇటువంటి ప్రకటనలు ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనే అంటూ జిల్లా ఎన్నికల అధికారులు సుస్పష్టం చేస్తున్నారు. ఈ తరుణంలో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు విపక్షాలు 3ఆంధ్రభూమి2కి తెలిపాయి.
కోడ్‌పై కమిషనర్‌కు సూచనలు అందిస్తాం
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్
ఇప్పటికే ఆచరణలో ఉన్న ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో కోడ్ ఉల్లంఘన చేసినట్లు కానప్పటికీ, జిల్లా అంతటా ఎన్నికల కోడ్ వర్తించడంతో ప్రభుత్వ పథకాలు ప్రచారం ఎన్నికల షెడ్యూల్ వరకూ నిలుపుదల చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ చెప్పారు. మున్సిపల్ కమిషనర్‌కు ఈ అంశంపై తగిన సూచనలు ఇస్తామని 3ఆంధ్రభూమి2కి వివరించారు.
* ఎన్నికల కోడ్ జిల్లా వ్యాప్తంగా ఉంది - డిపివో
రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిననాటి నుండి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎటువంటి ప్రభావిత ప్రచారం చేయరాదని, మున్సిపాల్టీ ప్రచారంపై ఉన్నతాధికారులను అడిగి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కోడ్ ఉల్లంఘన కాదు
పట్టణ ప్రజలకు అత్యవసరమైన వౌలిక వసతులపై సమాచారం అందించడం కోడ్ ఉల్లంఘన కాదని మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్ చెప్పారు. కొత్తగా ప్రభుత్వం రూపొందించిన పథకం కాదని, ఆచరణలో ఉన్న ప్రభుత్వ పథకాలను అర్హులకు తెలియజేసే ప్రకటనలు కోడ్‌కు విరుద్ధంగా చేసేవి కాదంటూ ఆయన పేర్కొన్నారు.

లక్ష్మిపేటపై నిఘా!
శ్రీకాకుళం, జూలై 14: జిల్లాలో 546 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. కాని - ఏడేళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గుర్తించిన 943 గ్రామాలు కంటే ఇప్పుడు మరిన్ని సమస్యాత్మకమైన గ్రామాలుగా మారాయి. అలా మారిన సమస్యాత్మకమైన గ్రామాల్లో 3‘లక్ష్మిపేట’ ఒకటి. జిల్లాలో వంగర మండలంలో మడ్డువలస రిజర్వాయర్ దిగువభూభాగంలో గల లక్ష్మీపేట పంచాయతీలో బిసీలు, ఎస్సీల మధ్య రేగిన రగడ ఐదుగురు ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పంచాయతీ పోరు వచ్చింది. అసలే సామాజిక పోరుతో అతలాకుతలమైన లక్ష్మిపేట గ్రామంపై మరల రాజకీయ రగడ ఏ పరిణామాలకు దారితీస్తోందోనన్న భయం అక్కడ గ్రామస్థుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఈ సామాజివర్గాల మధ్య ప్రస్తుతం పగలు, ప్రతీకారాలు లోలోపలే అణచివేసుకుంటున్నా....రాజకీయంగా బలం సాధించాలన్న తపన మాత్రం రెండు వర్గాల మధ్య ఉంది. దీంతో లక్ష్మిపేటలో మరోసారి అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉండవచ్చునంటూ జిల్లా పోలీసు యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. అలాగే, రెండో విడతలో ఈ నెల 27న లక్ష్మీపేటలో నిర్వహించాల్సిన పోలింగ్ బూత్‌ను కొట్టిస గ్రామానికి మార్చేందుకు అనుమతులు ఇవ్వాలంటూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సౌరభ్‌గౌర్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. లక్ష్మీపేట గ్రామంలో 578 ఓటర్లు ఉండగా, అందులో బిసీలు 411 మంది ఓటర్లు కాగా, ఎస్సీ ఓటర్లు 155 మంది. మహిళా జనరల్ కేటగిరీలో రిజర్వ్ అయిన ఈ పంచాయతీలో ఇప్పటికే బిసి వర్గం బలపరిచిన మద్దతుదారులు, అలాగే ఎస్సీ వర్గాలు మద్దతు ఇచ్చిన మద్దతుదారుల మధ్య పోటీ నెలకొంది. ఎన్నికలు నేపథ్యంలో బీసీ, ఎస్సీల మధ్య రాజకీయ వైరం జరిగే ప్రమాదంఉందంటూ ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్పకనేచెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే లక్ష్మీపేటపై పోలీసు నిఘా పెంచింది. రౌండ్ ది క్లాక్‌లో పికెటింగ్ నిర్వహిస్తున్న జిల్లా పోలీసుశాఖ సరికొత్త విధానంతో వెబ్‌కెమోరాలు కూడా ఆ పంచాయతీలో అమర్చారు. పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా చిత్రీకరించే పద్దతిని 2009 సార్వత్రిక ఎన్నికల నుంచి ఎన్నికల కమిషన్ తీసుకువచ్చింది. ఆ విధానానే్న తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో కూడా అమలు చేసేందుకు జిల్లా అంతటా నాలుగు వందల మంది ఇంజనీరింగ్ విద్యార్ధులతో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై నిఘా పెంచేలా వెబ్‌కళ్లు అమలు చేస్తున్నారు. అంతకుముందే లక్ష్మీపేట గ్రామంలో ఇటువంటి వెబ్ నిఘాను గత కొద్దిరోజులుగా పోలీసుశాఖ అమర్చింది. దీంతో గ్రామంపై కెమెరా కన్ను రాత్రింబవళ్లు పనిచేస్తోంది!!

నామినేషన్ల పరిశీలనలో జాప్యం
శ్రీకాకుళం, జూలై 14: జిల్లాలో పంచాయతీ ఎన్నికల బరిలో దిగిన సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు నామినేషన్ ఘట్టం ముగిసింది. కాగా, ఆయా మండలాల వారీగా వచ్చిన నామినేషన్ దరఖాస్తులు పరిశీలించిన అనంతరం సంబంధిత సమాచారాన్ని జిల్లా కేంద్రానికి అందించడంలో ఆయా ఇన్‌చార్జిలు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా జిల్లాలో మొత్తం ఏకగ్రీవ పంచాయతీలు ఖరారులో సైతం అధికారులు అర్ధరాత్రైనా సమాచారంలో స్పష్టత లేకపోవడం గమనార్హం. ఆదివారం అర్ధరాత్రి వరకు అందిన సమాచారాన్ని ఆంధ్రభూమి2కి జిల్లా పంచాయతీ అధికారులు వివరించారు.
నామినేషన్ల గడువు ముగిసేసరికి జిల్లాలో సర్పంచ్ పదవులకు గాను 5,458 ల , వార్డుమెంబర్లకు గాను 22,947 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఆదివారం జరిగిన నామినేషన్ల పరిశీలన అనంతరం 27,356 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో సర్పంచ్ పదవులకు 5,198, వార్డు మెంబర్లకు 22,158 నామి నేషన్లు సరిగా ఉన్నట్లు గుర్తించారు. టెక్కలి డివిజన్‌కు సంబంధించి పలాస మండంలోని కొన్ని పంచాయతీలో అక్కడ నెలకొన్న వివాదాలుకారణంగా నామినేషన్ల పరిశీలన అధికారులు నేటికి వాయిదా వేశారు. ఇది మినహా అదే డివిజన్‌లోని పది మండలాలు, శ్రీకాకుళం డివిజన్‌కు సంబంధించి తొమ్మిది మండలాలు, అలాగే పాలకొండ డివిజన్‌లో తొమ్మిది మండలాల సర్పంచ్‌లు, వార్డుమెంబర్ల నామినేషన్లను అధికారులు పూర్తి చేశారు. శ్రీకాకుళం డివిజన్‌లో 1263 సర్పంచ్ నామినేషన్లు, వార్డుమెంబర్లకు 5,939 నామినేషన్లను అధికారులు పరిశీలించి ఖరారు చేశారు. అదేవిధంగా పాలకొండ డివిజన్‌కు సంబంధించి సర్పంచ్ పదవులకు 1,194, వార్డుమెంబర్లకు 5,448 నామినేషన్లు ఖరారయ్యాయి. టెక్కలి డివిజన్‌కు సంబంధించి సర్పంచ్‌లకు 1523, వార్డుమెంబర్లకు 5,429 నామినేషన్లను అధికారులు పరిశీలన జరిపి ఎంపికచేసారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలకు సైతం అధికారులు అర్ధరాత్రైనా స్పష్టతకు రాలేదు. సోమవారం నాటికి సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటామని డిపివో వెంకటేశ్వరరావు తెలిపారు.

ఆగని గజరాజుల విధ్వంసం
సీతంపేట,జూలై 14:సీతంపేట ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. గడచిన నెల రోజులుగా పులిపుట్టి పంచాయతీ పరిధిలో ఉన్న సుందరయ్యగూడ,పులిపుట్టి గ్రామాల సమీపంలోగిరిజనులకు చెందిన పంటలను నాశనం చేసిన ఏనుగులు, ఆదివారం వేకువజాము ప్రాంతంలో సుందరయ్యగూడ గ్రామ సమీపంలో సంచరించి ఓ గిరిజనుడి ఇంటిని నేలమట్టం చేసాయి. గ్రామానికి చెందిన ఊయక భాస్కరరావు తన పంట పొలం సమీపంలో ఓ ఇంటిని నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే శనివారం కొత్తూరు వెళ్లిన భాస్కరరావు రాత్రి కావడంతో ఏనుగుల భయానికి అక్కడే ఉండిపోయాడు. ఆదివారం ఉదయం తాను నివాసముంటున్న పూరిగుడెసె నేలమట్టమై కనిపించింది. ఇంటిలో భాస్కరరావు కుటుంబసభ్యులకు చెందిన దుస్తులు, కుర్చీలు, మంచం, తదితర సామాగ్రిని ఏనుగులు నాశనం చేసాయి.అలాగే ఇంటి ప్రక్కనే ఉన్న కొబ్బరి,పనస,జీడి చెట్లను విరిచి బీభత్సం సృష్టించాయి. ఏనుగులు ఇంత వరకు తమ గ్రామం చుట్టు తిరుగుతున్నాయని తెలిసినప్పటికి భయంతో బిక్కు బిక్కుమంటూ పంటలకు రక్షణగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఇల్లు, పంట నాశనంతో నిరాశ్రయులయ్యామని భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేసాడు.
ఆగని పంటల ధ్వంసం: ఏనుగులు ప్రతీ రోజు పంటల ధ్వంసం చేస్తున్నాయి.శుక్రవారం తుమ్మనకోలని గ్రామంలో సవరసురేష్‌కు చెందిన ఎకరా వరిపంటను నాశనం చేసాయి.అలాగే ఇటీవల కాలంలో చెరుకు, పనస, అరటి తోటలను నాశనం చేశాయి. ఏనుగుల నుండి తమకు ప్రాణ,పంటల నష్టం ఉందని,ప్రభుత్వం స్పందించి వీటిని ఈ ప్రాంతం నుండి తరలించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
గిరిజనులను వెంటాడుతున్న భయం
చీకటి పడితే చాలు సుందరయ్యగూడ,పులిపుట్టి గ్రామాలకు చెందిన గిరిజనులు ఏనుగుల భయంతో వణికిపోతున్నారు. పగలంతా టేకుప్లాంటేషన్‌లో సేదతీరుతున్న ఏనుగుల గుంపు చీకటి పడగానే గ్రామ సమీపంలో తిరుగాడుతుండడంతో గిరిజనులు రాత్రి సమయాల్లో ఇంటి నుండి బయటికి కదలలేని పరిస్థితి నెలకొంది. ఏనుగుల సంచారంతో రాత్రులు కంటిమీద కునుకు లేదని సుందరయ్యగూడ గ్రామానికి చెందిన లలిత, ప్రసాద్,్ధర్మారావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు పంచాయతీలు, 98 వార్డులు ఏకగ్రీవం
నరసన్నపేట, జూలై 14: జరుగనున్న స్థానిక ఎన్నికల్లో భాగంగా 13వ తేదీతో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ముగిసిందని మండల ఎన్నికల అధికారి ఎం.పోలినాయుడు అన్నారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ మండలంలో మూడు పంచాయతీలకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే వచ్చిందని, అలాగే 312 వార్డులకు గాను 98 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైందన్నారు. ఈ దిశగా వీటిని ఏకగ్రీవంగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మండలంలో పది నామినేషన్ కేంద్రాలలో నామినేషన్ పరిశీలనను పూర్తిచేశామన్నారు. ఎటువంటి నామినేషన్లు తిరస్కరణకు గురికాలేదని స్పష్టంచేశారు. 17వ తేదీ సాయంత్రంలోగా నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. మండలంలో 337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
కొండ చిలువ హతం
వీరఘట్టం, జూలై 14: మండలం చిదిమి పంచాయతీ పరిధి యు. వెంకమ్మపేట గ్రామానికి చెందిన బొత్స అప్పలనాయుడుకు చెరకు పొలంలో కూలీలకు ఎదురైన కొండ చిలువను ఆదివారం ఉదయం హతమార్చారు. ఉదయం 11 గంటల సమయంలో పొలంలోని చెరకుకు జెడలు కడుతుండగా గట్టుపై నుండి వస్తున్న కొండ చిలువ పామును ప్రమాదం పొంచి ఉండడంతో దానిని చంపివేశారు. ఈ కొండ చిలువ సుమారు పది అడుగుల పొడవు ఉంటుందని కూలీలు అంచనావేశారు.
భారీ వర్షం..రైతుల్లో హర్షం
జలుమూరు, జూలై 14: మండలం పలు గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా అకాల వర్షం కురియడంతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఆకుమళ్లకు, వరి ఎదలకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. గత వారంరోజులుగా ఉక్కపోతతో ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా వర్షం పడడంతో ప్రజలకు ఊరటనిచ్చింది. ఎండిన చెరువుల్లో మూగజీవాల దాహార్తి కోసం నీరు చేరింది.
సర్పంచ్‌గా అంగన్‌వాడీ కార్యకర్త
వీరఘట్టం, జూలై 14: మండలంలోని కుమ్మరిగుంట గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న గుడివాడ నర్సమ్మను ఆ పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకొన్నారు. ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయడంతో ఆమెకు ప్రజలంతా బాసటగా నిలిచి ఐకమత్యంగా ఎ న్నుకొన్నారు. అదేవిధంగా వార్డు సభ్యులుగా బొద్దూరు పాపమ్మ, హనుమంతు రామినాయుడు, కనకల సూరమ్మ, అప్పలనాయుడు, బుగత చిన్నయ్య, ధర్మాన ఆదిలక్ష్మి, ఎచ్చెర్ల లక్ష్మి, ఓని గౌరీశ్వరిలను వార్డు సభ్యులుగా ఎన్నుకొన్నారు. అయితే వీరంతా ఒక్కొక్క నామినేషనే దాఖలు చేయడంతో ఏకగ్రీవమయ్యింది. అయితే అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఎన్నికల నిబంధనలను పాటించాలి
రణస్థలం, జూలై 14: ఎన్నికల నియమనిబంధనలను ప్రతీ ఒక్కరూ తూ.చ తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మహ్మద్ అబ్దుల్ అన్నారు. ఆదివారం రణస్థలం హైస్కూల్‌లో నామినేషన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. నామినేషన్ దాఖలు ఎలా చేశారు, సర్పంచ్, వార్డుమెంబర్లకు నామినేషన్ లెక్కింపును ఏవిధంగా చేస్తున్నారు తదితర అంశాలపై అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఈయనతోపాటు మండల ఎన్నికల అధికారి వాసుదేవరావు ఉన్నారు.

సుప్రీం తీర్పుపై స్పష్టత అవసరం
* సిటిజన్ ఫోరం చర్చాగోష్ఠిలో వక్తలు
శ్రీకాకుళం, జూలై 14: వివిధ కారణాలతో జైల్లో ఉన్న పౌరునికి ఓటుహక్కు లేని నేపథ్యంలో చట్టసభలకు జరిగే ఎన్నికలకు పోటీల్లో నిలిచే అర్హత లేదంటూ సుప్రీంకోర్టు ఇటీవలి వెలిబుచ్చిన తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు బరాటం కామేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం అత్యున్నత న్యాయస్థానం వ్యక్తపరిచిన తీర్పును వక్తలు స్వాగతించారు. తీర్పు-నేరచరితులు, రాజకీయం, స్వపరిపాలన ప్రధానాంశంగా చర్చలో వినియోగదారుల ఫోరం చైర్మన్ పప్పల జగన్నాథం మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు పటిష్ఠతకు మరింతగా ఊతమిస్తుందన్నారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, గుండ అప్పలసూర్యనారాయణలు మాట్లాడుతూ దేశ భవితకు నష్టం వాటిల్లే రౌడీయిజం, కుట్రపూరిత రాజకీయాలకు అడ్డుకట్ట వేసే ధర్మశాసనం తీర్పు హర్షణీయమన్నారు. అయితే వెలువడిన తీర్పు స్పష్టతగా ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. లోక్‌సత్తా జిల్లా అధ్యక్షులు కె.పోలినాయుడు స్పందిస్తూ సి.బి.ఐ వంటి అవినీతి నిరోధక సంస్థలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలంటూ ధర్మాసనం సూచన దేశప్రగతికి ఉపకరిస్తుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, గొలివి నర్సునాయుడులు మాట్లాడుతూ కోర్టు తీర్పు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఓటు వినియోగించుకోవడంలో ఓటర్లకు గ్రామాలలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి డి.విష్ణుమూర్తి వాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేదికలో శ్రీనివాసానందస్వామి, బిజెపి నాయకులు పైడి సత్యం, దేశం పార్టీ నాయకులు ఎస్.వి.రమణమాదిగ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

పట్టణాల్లో పచ్చదనానికి కృషి
* జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్
శ్రీకాకుళం , జూలై 14: పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సౌరబ్‌గౌర్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేర పచ్చదనం కనిపిస్తున్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం కానరావడం లేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో కాలనీలు, రహదారులు వంటి ప్రదేశాల్లో మొక్కలను విస్తృతంగా నాటి చక్కటి ఆహ్లాదకర వాతావరణం కల్పించడానికి దోహద పడాలని సూచించారు. అదేవిదంగా బహిరంగ మలవిసర్జన నిరోధించుటకు తోడ్పడాలని అన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమానికి సహకరిస్తామని తెలిపారు. బి. ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి లజపతిరాయ్ మాట్లాడుతూ వాకర్స్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వాకర్స్ పాత్‌ను నిర్మించాలనే ఆలోచన ఉందని, తద్వారా ఆ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన సమస్య నిరోధించే అవకాశం కలుగుతుందని అన్నారు. ముందుగా తాను చదివిన కళాశాల కావడంతో పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణ కలియతిరిగారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ కోశాధికారి కె.వి.రమణమూర్తి, సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర, కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

అరసవల్లికి భక్తుల తాకిడి
శ్రీకాకుళం, జూలై 14: ఆరోగ్యప్రదాత, ప్రత్యక్షదైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. గత వారం అమావాస్య కారణంగా కాస్తంత తగ్గినా ఈ వారం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కేశఖండనల శాలల వద్ద తలనీలాలు అర్పించి ఇంద్రపుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. కొందరు మహిళలు దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న గోశాలలో గోమాతలకు, త్రిమూర్తి స్వరూపమైన రావిచెట్టు చుట్టూ ప్రదక్షణలు చేసి దీపారాధన చేసారు. అనంతరం క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆలయ విధానాలనుసరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యన్నదాన ప్రసాదం 450 మంది భక్తులు స్వీకరించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

సోంపేట ఉద్యమం దేశానికి దిక్సూచి
సోంపేట, జూలై 14: థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకిస్తూ సోంపేటలో ప్రజలు చేస్తున్న ఉద్యమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తాయని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ఎస్.కృష్ణ అన్నారు. జూలై 14వ తేదిన జరిగిన సంఘటనను నిరసిస్తూ ఆదివారం సోంపేటలో పర్యావరణ పరిరక్షణ సంఘం, తీరప్రాంత మత్స్యకార వేదికల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. డాక్టర్ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో మానవహక్కుల వేదిక ప్రతినిధి కృష్ణ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడంలో ఈ ప్రాంతీయులు చేస్తున్న ఉద్యమాలు గొప్పవని కొనియాడారు. సోంపేట ఉద్యమాన్ని నేడు దేశంలో అన్ని ప్రాంతాలు స్పూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేస్తున్నారని, ఆ ఘనత సోంపేట ప్రజలకే దక్కుతుందన్నారు. అంతకుముందు థర్మల్ శిబిరం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లిన ఉద్యమకారులు బీలలో నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లిన వీరు గొల్లగండిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలను పోలీసులు అడ్డుతగిలేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. ఎటువంటి అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహించకూడదని బారువ ఎస్ ఐ గోవిందరావు ఆధ్వర్యంలో తన సిబ్బందితో బీల వద్దకు వెళ్లారు. పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అప్పటికే వందలాది సంఖ్యలో హాజరైన మహిళలు, ఉద్యమకారులను ఎన్నికల కోడ్ అడ్డుగా ఉండడం వల్ల సమావేశాలు జరుపుకోవచ్చునని పోలీసులు సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానవహక్కుల జిల్లా ప్రతినిధి జగన్నాధరావు, సి పి ఎం ( ఎం ఎల్) ప్రసాదరావు, ఐక్యవేదిక ప్రతినిధులు కృష్ణారావు, రాజారావు, చంద్రమోహన్‌లు, పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. అనంతరం సోంపేట పట్టణం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈశ్వరరావు, ఆనందరావు, చిత్రాడ శ్రీను, శేఖర్‌ల ఆధ్వర్యంలో 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమరులస్థూపం వద్దకు ఘనంగా నివాళులర్పించారు.

మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్‌కు ఎన్నికల కోడ్ పట్టనట్టుంది
english title: 
code violation

కలహండికి తరలిపోయిన కోచ్ ఫ్యాక్టరీ

$
0
0

విశాఖపట్నం, జూలై 14: ప్రతిసారి ఒడిషా పెత్తనమే. ప్రతి దానిలోను ఆదిపత్యపోరే. ఏ విషయంలోను ఒడిషా వెనక్కి తగ్గడంలేదు. ఇక్కడి ప్రజాప్రతినిధులు ఒక్క అడుగు ముందుకు వేయడంలేదు. ఇదే ఒడిషాకు కొండంత బలం. తాజాగా మరో భారీ ప్రాజెక్టును ఎత్తుకుపోయి ఒడిషా అక్కడి నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించుకోబోతోంది. విశాఖపట్నం దువ్వాడ సమీపాన దాదాపు 150 ఎకరాల స్థలంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్టు విస్తృత ప్రచారం జరిగింది. ఇది నిజమే అనుకున్న ఉత్తరాంధ్రవాసులకు రైల్వేబడ్జెట్ తరువాత దీనిని ఒడిషాకు తరలించారనే విషయం తెలిసింది. దీంతో అయోమయంలో పడాల్సి వచ్చింది. రూ. 200 కోట్ల విలువైన కోచ్ ఫ్యాక్టరీని కూడా ఒడిషా తన్నుకుపోయిందంటే, అదీ విశాఖకు వచ్చే అన్నింటితోపాటు దీనిని సాధించుకోగలిగిరంటే ఇదంతా అక్కడి ప్రజాప్రతినిధుల ఘనతే. అయినా ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఎలాగూ రోడ్డెక్కడంలేదు. ఆందోళనలు, నిరసనల జోలికి అసలుపోరు. కనీసం ఇటువంటి వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చినా తామంటే ఉంటామంటూ స్వచ్చంధ సంస్థలు, ప్రజా సంఘాలు కొనే్నళ్ళుగా గగ్గోలు చేస్తున్నాయి. అయినా ఫలితంలేకపోతోంది. ఒక దాని వెంట మరోకటిగా కోట్ల విలువైన ప్రాజెక్టులు తరలిపోతుండగా ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటంపట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అయిదేళ్ళ కిందట ఇక్కడ ఉండే చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం భువనేశ్శర్‌కు వెళ్ళిపోయింది. దీనికి కారణాలేమీ లేవు. ఎటువంటి వౌలిక వసతులు లేకపోయినా, అనువైన ప్రదేశం సమకూర్చకపోయినా వెళ్ళిపోయిన ఈ కార్యాలయం వలన వాల్తేరు డివిజన్ కోట్లాది రూపాయల విలువైన భారీ ప్రాజెక్టులను తెచ్చుకోలేకపోతోంది.
ప్రధానమైన రైళ్ళు
ఇప్పటికే ప్రధానమైన ప్రశాంతి, విశాఖ ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీలు భువనేశ్వర్‌కు వెళ్ళిపోయాయి. వీటి వలన ఇక్కడి ప్రయాణికులు రిజర్వేషన్ ఫలాలు కోల్పోవల్సి వస్తోంది. రైళ్ళ శుభ్రత కొరవడింది. విశాఖ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను అయిదేళ్ళ కింటద భువనేశ్వర్‌కు పొడిగించుకున్నారు. అంతకంటే ముందుగా విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను ఎత్తుకుపోయారు. ఇది విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు నడిచేటపుడు పరిశుభ్రంగా ఉండేది. సామాన్య ప్రయాణికులకు సైతం రిజర్వేషన్లు లభించేవి. ఇపుడు స్లిపర్ క్లాస్‌లతోపాటు ఏసి బెర్తులకు అతీగతీ ఉండటంలేదు. ఏమాత్రం ఆదాయం రాని భువనేశ్వర్ నుంచి నిర్వహిస్తున్న వీటి వలన అనేక మంది ప్రయాణికులు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు.
మళ్ళింపు రైళ్ళు అంతే
చివరకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ మీదుగా నడపాల్సిన వీక్లీ సూపర్‌పాస్ట్ రైళ్ళు కాస్త దువ్వాడ స్టేషన్ మీదుగా భువనేశ్వర్‌కు వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల రోజూ దేశ నలుమూలలకు వెళ్ళాల్సిన వందలాది మంది ప్రయాణికులు 20 కిలోమీటర్ల దూరానున్న దువ్వాడకు వ్యయప్రయాసలపడి వెళ్ళాల్సి వస్తోంది. కేవలం ఆరేళ్ళ కిందట రెండింటితో మొదలైన మళ్ళింపు రైళ్ళు 13కు చేరుకున్నాయి. ఇవన్నీ దువ్వాడ మీదుగానే నడుస్తుండగా ప్రజాసంఘాల ఉద్యమాలతో స్పందించిన రైల్వే ఎట్టకేలకు ఇక్కడకు ఆరింటిని నడుపుతోంది. ఇదే స్ఫూర్తితో ఆందోళనలు నిర్వహిస్తే కొంత ఫలితం ఉండేదని ప్రయాణికులు అంటున్నారు.

ఏడాదికో కొత్త వైద్య కళాశాల ఏర్పాటు
బుచ్చెయ్యపేట, జూలై 14: వైద్య విద్యకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏడాదికో జిల్లాలో కొత్తగా మెడికల్ కాలేజీని ఏర్పాటుచేయాలని నిర్ణయించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కొండ్రు మురళి అన్నారు. బుచ్చెయ్యపేటలో ఆదివారం దళిత సంఘాల అధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడా ది నెల్లూరు, కరీంనగర్ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రజలకు మ రింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మనరాష్ట్రంలో మరో 130 ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. గత ఏడాది దీర్ఘకాలిక రోగాల నివారణకు 1400 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయిస్తే, ఈ ఏడాది 1600 కోట్లకు పెంచామన్నారు. ప్రజారోగ్యంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని మంత్రి కొండ్రు మురళి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డయేరియా, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు.
సమైక్యంగా ఉంచడమే రాష్ట్రానికి శ్రేయస్కరం
సమైక్యంగా ఉంచటమే రాష్ట్రానికి శ్రేయస్కరమని మంత్రి కొండ్రు మురళి అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని విధాలా నష్టపోతామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విభజన వలన ఎన్నో నష్టాలుఉన్నాయని, భాషా ప్రాతిపదికన ఏర్పడిన మనరాష్ట్రాన్ని అదే విధంగా కొనసాగించడం వలన రాష్ట్రంలోని అన్ని ప్రాం తాల ప్రజలకు మేలు చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రా న్ని విభజిస్తే మాత్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక అలమటిస్తాయన్నా రు. అయితే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక పాకేజీలు ప్రకటించాలని మంత్రి మురళీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మావోయిస్టుల కోసం జల్లెడ
కొయ్యూరు, జూలై 14: విశాఖ మన్యం కొయ్యూరు మండల పరిధి కిండంగి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన మహిళా మావోయిస్టును పోలీసులు గుర్తించారు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన రామభక్త అలియాస్ లక్ష్మిగా నిర్ధారించారు. ఈమె గతంలో బలిమెల బ్లాక్ కమిటీ అసిస్టెంట్ కమాండర్‌గా పనిచేసి ఇటీవలనే గాలికొండ ప్రాంతానికి బదిలీ అయినట్లు తెలుస్తోంది. రామభక్త మృతి చెందిన విషయాన్ని పోలీసు అధికారులు నిర్ధారించారు. బూదరాళ్ళ శివారు మారుమూల కిండంగి గ్రామ సమీప వణుకుల కొండ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ అక్కడి పరిస్థితులను బట్టి వాస్తవమేనని అర్ధమవుతుంది. ఈ ఘటనలో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందిన సంగతి తెలిసిందే. మూకుడుపల్లి నుండి కిండంగి అటవీ ప్రాంతం మీదుగా వస్తున్న కూంబింగ్ పోలీసులకు మావోయిస్టులు తారస పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం 3 గంటల సమయంలో వణుకుల కొండ అటవీ ప్రాంతం నుండి సుమారు అరగం ట పాటు తుపాకీ పేలుడు శబ్ధాలు వినిపించినట్లు పరిసర ప్రాంత వాసులు చెబుతున్నారు. మృతి చెందిన మహిళా మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆదివారం ఉదయం గూడెం మండలం నేరెళ్ళబందకు తీసుకువచ్చారు. అనంతరం చింతపల్లికి తరలించారు.
భారీ బందోబస్తుతో మృతదేహం తరలింపు
పోలీసులకు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన మహిళ మావోయిస్టు మృతదేహాన్ని భారీ బలగాల నడుమ చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్ధలం నుండి మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రత్యేక పోలీసు బలగాలు ఆదివారం ఉదయం అటవీ ప్రాంతం మీదుగా నేరేళ్ళబందకు తరలించారు. కాల్పుల శబ్ధం తప్పితే ఏం జరిగిందో తెలియదని సమీప వాసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరిన్ని అదనపు బలగాలు మావోయిస్టుల ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశాయి. మృతదేహాన్ని మోసుకొస్తున్న పోలీసు పార్టీకి మరిన్ని బలగాలు ఆ ప్రాంతంలో రక్షణ కల్పిస్తూ మాటువేశాయి. మావోయిస్టులు ఆత్మరక్షణతో ఎదురుకాల్పులు జరుపుతూ చల్లాచెదురైనట్లు భావిస్తున్న పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఉద్ధృతం చేశాయి. దీంతో మన్యంలో మళ్ళీ భయాందోళనలు నెలకొన్నాయి.

ఎన్నికల అధికారి తీరుపై
అడ్డూరు ప్రజల ఆగ్రహం
చోడవరం, జూలై 14: నామినేషన్ పత్రాలతోపాటు అఫిడవిట్‌ను నామినేషన్ల పరిశీలన రోజున స్వీకరించడంతో ఘర్షణలు, వాదోపవాదాలతో నర్సాపు రం పంచాయతీ కార్యాలయం దద్దరిల్లింది. ప్రధానంగా నర్సాపురం నామినేషన్‌ల స్వీకరణ కేంద్రంలో పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేశవరావు వ్యవహారం పట్ల అడ్డూరు గ్రామస్థులు అభ్యంతరం తెలియజేస్తూ నామినేషన్ల పరిశీలనను అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు నామినేషన్ల పరిశీలనకు అంతరాయం కలిగింది. ఎట్టకేలకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శనివారం అడ్డూరుకి చెందిన దేశం పార్టీ మద్దతు అభ్యర్థి దాసరి అప్పలనాయుడు నామినేషన్ దరఖాస్తుతోపాటు ఆస్తుల వివరాలతో అఫిడవిట్‌లు దాఖలు చేయలేదు. ఆదివారం నామినేషన్‌ల పరిశీలన రోజున అఫిడవిట్, ఆస్తుల వివరాల పత్రాలను అందజేసిన సందర్భంగా అదే గ్రామానికి చెందిన స్వతంత్య్ర అభ్యర్థి నాగిరెడ్డి కృష్ణ అభిమానులు, మద్దతుదారులు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి నామినేషన్ల పరిశీలన రోజున అఫిడవిట్‌లు స్వీకరించడం తగదని వారు ఆందోళన చేపట్టారు. దీనిపై ఎన్నికల అధికారి కేశవరావు స్పందిస్తూ తా ను ఎటువంటి పత్రాలు తీసుకోలేదని చెప్పినప్పటికీ గ్రామానికి చెందిన నాగిరెడ్డి సత్యనారాయణ, సిమ్మునాయుడుతోపాటు మరికొందరు తమకు తగిన వివరాలను చెప్పకుంటే విధులను నిర్వహించనివ్వబోమంటూ అడ్డుకున్నారు. ఈ సందర్భంలో ఎన్నికల అధికారులకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో నర్సాపురం పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల పరిశీలన మధ్యాహ్నం రెండున్నర గంటలైనప్పటికీ ప్రారంభించలేదు. దీంతో నర్సాపురం, అడ్డూరు ఇతర గ్రామాల అభ్యర్థులు ఎన్నికల అధికారిని నామినేషన్ల పరిశీలన చేపట్టాలని, లేనిపక్షంలో ఉన్నతాధికారులకు పరిస్థితిని తెలియజేయాల్సి వస్తుందని చెప్పారు. దీంతో ఎస్‌ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల అధికారుల విధులకు అడ్డుతగలడం చట్టరీత్యా నేరమని, తక్షణం ఆందోళన విరమించాలని చె ప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

గిరిజనులకు మావోల బహిరంగ లేఖ
జి.మాడుగుల, జూలై 14: ప్రజాప్రతినిధులారా మీ క్షేమం కోరుతూ మేము సైతం క్షేమం అంటూ మావోలు ఎన్నికల బహిష్కరణపై సి.పి.ఐ.మావోయిస్ట్ పార్టీ, కోరుకొండ ఏరియా కమిటీ పేరున ఆదివారం లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఈనెల పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నట్టు మీకందరికీ తెలుసునని అనుకుంటున్నామని పేర్కొన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలకు నామినేషన్లు కట్టేందుకు మీరు సిద్ధపడుతున్నట్టు మేము భావిస్తున్నాము. నామినేషన్లు కట్టే గిరిజన నాయకులు ముందుగా మీరు బాక్సైట్‌కు, అవినీతికి వ్యతిరేకంగా నిలుస్తారా? అనుకూలంగా ఉంటారా? అని ప్రశ్నించారు. మీరు ప్రజల పక్షమే అయితే మీమీ పార్టీ సభ్యత్వాలతోసహా రాజీనామా చేసి ప్రజా పోరాటాల వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. మీరు ఎన్నికల్లో పాల్గొంటే అవినీతికి, బాక్సైట్‌కు అనుకూలమనే భావన మాకు కలుగుతుంది. అదే జరిగితే మావోయిస్ట్ పార్టీ నుండి తీవ్రమైన చర్యలు తీసుకోవల్సి వస్తుందని వారు హెచ్చరించారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజన నాయకులు పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పిలుపు ఇస్తున్నట్టు వారు పేర్కొన్నారు.

ఐదు పంచాయతీలు ఏకగ్రీవం
చీడికాడ, జూలై 14: మండలంలో ఐదు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. జైతవరం, మంచాల, బి.సింగవరం, చీడికాడ, విబిపేట పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డుమెంబర్లకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవమయ్యాయి. జైతవరం సర్పంచ్‌గా కోడూరు బంగారమ్మ, మంచాల సర్పంచ్‌గా కసిరెడ్డి కొండమ్మ, బి.సింగవరం సర్పంచ్‌గా శరగడం సుబ్బలక్ష్మి, చీడికాడ సర్పంచ్‌గా కె. పంపులు, విబి పేట సర్పంచ్‌గా సబ్బవరపు రామునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీల్లో వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో 23 పంచాయతీలకు 79 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని ఎంపిడిఒ డి.గుణలక్ష్మి తెలిపారు. వీరి ఎన్నిక ను అధికారికంగా ప్రకటించాల్సి ఉందని గుణలక్ష్మి తెలిపారు.

కొత్తూరు సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం
పాయకరావుపేట, జూలై 14: మండంలంలోని కొత్తూరు పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ పదవికి ఎస్సీ మహిళ రిజర్వ్ అయింది. గ్రామంలో ఎస్సీ కుటుంబం ఒకటే ఉండడం, అందులోనూ ఎస్సీ మహిళ ఒక్కరే ఉండడంతో తుమ్మి నాగాయమ్మ సర్పంచ్ అభ్యర్థ్ధిగా నామినేషను దాఖలు చేశారు. గ్రామంలో ఉన్న 8 వార్డులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. వార్డు సభ్యులకు నామినేషన్ వేసిన వారిలో కాండ్రేకుల నాగేశ్వరరావు, వల్లూరు సునీత, మేడిశెట్టి వరలక్ష్మి, బుద్దాడ మంగ, బీరం రాజు, గోళ్ల జోగారావు, దాడి నాగలక్ష్మి, కొంకిపూడి యార్తలు నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. పోటీ లో నిలబడే వ్యక్తులు లేకపోవడంతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైం ది. వీరి ఏకగ్రీవంపై 17వతేదీన అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు.

ఎన్నికలు బహిష్కరిస్తే
బాక్సైట్ తవ్వకాలు నిలిచిపోతాయా?
మావోలతో వాగ్వివాదానికి దిగిన గిరిజనులు
జి.మాడుగుల, జూలై 14: ఎన్నికలు బహిష్కరిస్తే బాక్సైట్ తవ్వకాలు నిలిచిపోతాయా అంటూ మద్దిగరువు గ్రామంలోని పోటీ దారులతో పాటు 100 మంది గిరిజనులు మావోలతో వాగ్వివాదానికి దిగినట్టు సమాచారం. స్థానికుల సమాచారం ప్రకారం ఆదివారం ఉదయం బొయితిలి, నుర్మతి పాఠశాలల నుండి నామినేషన్ పత్రాలను తీసుకువెళుతున్న మావోలను మద్దిగరువులో గిరిజనులు అడ్డుకుని వాగ్వివాదానికి దిగినట్టు తెలిసింది. గిరిజన ప్రాంతంలో అత్యంత మారుమూల ప్రదేశంలో స్థానిక సంస్ధల ఎన్నికలు బహిష్కరించినంత మా త్రాన బాక్సైట్ తవ్వకాలు నిలిచిపోతాయా? అంటూ గిరిజనులు మావోలను నిలదీసినట్టు తెలిసింది. అంతే కాకుండా తమ ప్రాంతంలో జరిగే గొడవలు, మావోయిస్టుల సమస్యలు, ఇతర సమస్యలతో పాటు ప్రభుత్వం కల్పించే కొద్ది పాటి అవకాశాలను స్థానిక నాయకత్వం లేకుండా ఎలా సాధ్యపడుతుందో తెలపాలని సూటిగా ప్రశ్నించినట్టు సమాచారం. తమ ప్రాంతానికి సంబంధించిన పనులను చేసుకునేందుకు స్థానిక నాయకులే తమకు ఆధారమని వారు ప్రాధేయపడినట్టు తెలిసింది. తాము స్థానిక సంస్ధల ఎన్నికలను బహిష్కరించలేమని, తమ అభ్యర్థనను మన్నించాల్సిందిగా మావోలతో చెప్పినట్టు తెలుస్తోంది. ఆదివారం చోటు చేసుకున్న సంఘటనపై తమ ప్రాంత ప్రజలపై పోలీసులు విరుచుకుపడి తమను సమాచారం నిమిత్తం వేధిస్తే తమవైపు నుండి మాట్లాడే నాయకుడే లేకుండా చేయడం అన్యాయమని వారు అన్నట్టు తెలుస్తోంది. గిరిజన ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను, గెలుపొందిన నాయకులను నిర్ధాక్షిణ్యంగా చంపుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించినట్టు సమాచారం. అంతే కాకుండా గిరిజన నాయకులను చంపడం వల్ల గిరిజనుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా గిరిజనులు మావోలను ప్రశ్నించడంతో మావోలు సమాధానాలు దాటవేసినట్టు తెలిసింది. మావోలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు బూటకమని, ఎన్నికలు బహిష్కరించాల్సిందేనని తెలిపినట్టు సమాచారం. అంతే కాకుండ గిరిజన ప్రాంతంలోని కొద్ది మంది నాయకులు స్వార్ధపరుల పంచన చేరి వారికి తొత్తులుగా మారి స్వార్ధంతో పని చేస్తున్నారని, అటువంటి నాయకులను, గిరిజనులను ఎన్నిసార్లు హెచ్చరించినా తమ ప్రవర్తనను మార్చుకోక పోవడంతోనే వారిని హతమార్చినట్టు మావోలు తమ చర్యలను సమర్ధించుకున్నట్టు సమాచారం.

ఆటోల స్పీడుకు అడ్డుకట్ట వేయరూ!
పెదగంట్యాడ, జూలై 14: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతుండడం పట్ల ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాక పట్టణంలో ప్రయాణికులతో రహదారులు రద్దీగా మారాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ఈ ప్రాంతంలో గల వివిధ పరిశ్రమలకు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడంతో భారీ వాహనాలు వేగంగా ప్రయాణిస్తూ ప్రమాదాలు జరగడానికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. గాజువాక, పెదగంట్యాడ, దయాళ్‌నగర్, కూర్మన్నపాలెం, బిహెచ్‌పివి, ఆటోనగర్ తదితర కూడళ్లలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు మచ్చుకైనా కానరాకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న రహదారి ప్రమాదాల్లో ఆటోలు, భారీ వాహనాల వలన చోటుచేసు కుంటున్నవేనని పలువురు పేర్కొంటున్నారు. డ్రైవింగ్‌లో అనుభవం లేక పోవడం, మద్యం సేవించడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడడం, స్పీడ్‌బేకర్లు, జీబ్రాక్రాసింగ్‌ను పట్టించుకోక పోవడం, మితిమీరిన వేగం, పరమితికి మించి ప్రయాణికులతో వాహనాలను నడపడం తదితర కారణాల వలన ప్రమాదాలు చోటుచేసుకుని పలువురి ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలను నడపడం కూడా ప్రమాదాలు జరగడానికి కారణమేనని పేర్కొంటున్నారు. వీటితో పాటు ఈ ప్రాంతంలో గల వివిధ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు కాలం చెల్లిన వాహనాలను వినియోగిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. వాహనాల స్పీడుకు, కాలం చెల్లిన వాహనాలకు అడ్డుకట్టవేయడంలో ఆర్‌టిఎ అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే కనీస వయసు, డ్రైవింగ్‌లో అనుభవం, లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసి వుందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మన్యంలో ఉత్కంఠ

విశాఖపట్నం: మన్యంలో ఏక్షణం ఏం జరుగుతుందోనన్న భయం గిరిజనులను వెంటాడుతోంది. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్‌లు.. ఎన్నికలను ఏవిధంగానైనా జరిపించాలని పోలీసు అధికారులు పట్టుపట్టడంతో మన్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అధికారులకు సవాలుగా నిలిచింది. ఏజెన్సీలోని 244 పంచాయితీలకు 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో కనీసం 20 పంచాయతీలకు నామినేషనే్ల దాఖలు కాలేదు. చింతపల్లి మండలం బలపం, కుడుముసుర, వంచుల, జికె వీధి మండలం జెర్రెల, మొండిగెడ్డ, జికె వీధి మండలం ఇంజరితో పాటు మరికొన్ని పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మొత్తంమీద ఏజెన్సీలో 20 పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదని తెలుస్తోంది. నామినేషన్ల పరిశీలన ఆదివారం పూర్తయింది. సోమవారం నుంచి నామినేషన్ల విత్‌డ్రా. ఈ నేపథ్యంలో మావోయిస్ట్‌లు జి మాడుగుల మండలంలో నామినేషన్ల పత్రాలను ఎత్తుకెళ్లి, సంచలనం సృష్టించారు. దీంతో ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు వాటిని వెనక్కు ఇమ్మనమని అధికారులను కోరుతున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం అది సాధ్యం కాదు కాబట్టి, నామినేషన్ల విత్‌డ్రా సమయంలో వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ వారు మావోయిస్ట్‌ల హెచ్చరికలను ఖాతరు చేయకుండా, ఎన్నికల బరిలోనే కొనసాగితే పరిణామాలు ఎలా ఉంటాయోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఎన్నికల ప్రక్రియ పూర్తయి, అభ్యర్థులు విజయం సాధించినా, వారికి ప్రాణ హాని ఉండదన్న నమ్మకం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ఏజెన్సీలోని జికె వీధి, జి మాడుగుల చింతపల్లి, కొయ్యూరు, పెదబయలు, ముంచింగిపుట్ మండలాలు మావోయిస్ట్‌లకు మంచి పట్టు ఉన్న ప్రాంతాలు. ఈ మండలాల్లో ఎన్ని పంచాయితీల్లో అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

మన్యానికి అదనపు బలగాలు : ఎస్పీ దుగ్గల్
విశాఖపట్నం, జులై 14: మన్యంలో పంచాయతీ ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ దుగ్గల్ తెలియచేశారు. ఆదివారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఏజెన్సీలో మావోయిస్ట్‌లను ఎదుర్కొనేందుకు అదనపు పోలీసు బలగాలను కోరామని చెప్పారు. నామినేషన్లను అపహరించుకువెళ్ళడం, ఎన్నికలను అడ్డుకోవడం వంటి చర్యలను తాము తీవ్రంగా పరిగణినిస్తున్నామని ఆయన అన్నారు. ఏజెన్సీలో పోలీస్ స్టేషన్లను పటిష్ఠం చేశామని అన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు నిర్భయంగా పాల్గొనవచ్చని ఆయన అన్నారు.

విశాఖ వచ్చిన విజయమ్మ
విశాఖపట్నం, జూలై 14: వైఎస్‌ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆదివారం విశాఖ చేరుకున్నారు. షర్మిల కుమార్తెలు, బ్రదర్ అనిల్ కుమార్‌తో సహా విజయమ్మ రైలులో నగరానికి చేరుకున్నారు. విజయనగరం జిల్లా పాదయాత్రలో ఉన్న షర్మిలను వీరు కలుసుకున్నారు. తిరిగి సాయంత్రం విమానంలో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు.

మళ్ళీ పెట్రో వడ్డన
విశాఖపట్నం, జూలై 14: పెట్రోల్ ధర మళ్ళీ పెరిగింది. పక్షం రోజుల్లో ఇది రెండసారి. ఈసారి లీటర్ పెట్రోల్‌కు రూ.1.55 పెరిగింది. పెరిగిన పెట్రోల్ ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. పెరిగిన ధరల ప్రకారం ఇక నుంచి లీటర్ పెట్రోల్ దాదాపు రూ.76లకు చేరుకుంది. విశాఖ జిల్లాలో వందకు పైగా పెట్రోల్ బంక్‌లుండగా, ఇందులో ఒక్క నగరంలోనే 69 పెట్రోల్ బంక్‌లున్నాయి. వీటి ద్వారా రోజుకీ దాదాపు రెండు లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి. ఈ విధంగా పెంచిన పెట్రో ధరల ప్రకారం వినియోగదారులపై దాదాపు ఆరు లక్షల మేర భారం పడనుంది. పక్షం రోజులు కిందట పెరిగిన రెండు రూపాయల ధరలతో నాలుగు లక్షల మేర భారం మోయగా, ఇపుడు దాదాపుగా మరో రెండు లక్షల వరకు భారం పడింది. ఈ ఏడాది వరుసగా నాలుగుసార్లు పెట్రో ధరలను పెంచగా గడచిన పక్షం రోజుల్లో ఇది వరుసగా రెండవసారి పెంచి వినియోగదారులపై పెనుభారాన్ని మోపింది. పెంచిన ప్రతిసారి కనీసం రెండు రూపాయల వరకు భారం ఉంటుండటంతో సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
రవాణా, నిత్యావసర సరకులపై తీవ్ర ప్రభావం
పెరిగిన పెట్రో ధరల ప్రభావం రవాణాచార్జీలు, నిత్యావసర సరకులపై తీవ్రంగా పడనుంది. పెట్రోలు ధరలు పెరుగుతున్న ప్రతిసారి బస్సులు, ఆటోలు, జీపుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే పరిస్థితిని మరోసారి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలే నిత్యావసర సరుకులు ఈమధ్యకాలంలో ఆకాశన్నింటుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా కిలో ఉల్లి రూ.30లకు చేరుకుంది. కిలో బియ్యం రూ.50లు పలుకుతోంది. పప్పులు, నూనెల ధరల సంగతి చెప్పనక్కర్లేదు. రోజురోజుకీ వీటిధరల్లో మార్పులు వస్తున్నాయి. కూరల ధరలు మండిపోతున్నాయి. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలతో ఇవన్నీంటి ధరలు మరింత పెరుగుతాయని సామాన్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వం సామాన్యులనే లక్ష్యంగా చేసుకుందని అంటున్నారు.
* నేడు ఆశీలమెట్ట వద్ద నిరసన
రెండు రూపాయలు పెంచిన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పెంచి సామాన్యులపై పెనుభారం మోపింది. ఈ ఏడాదిలో ఇది నాల్గవసారి కావడంతో వీటిని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటియుసి జిల్లా ఉపాద్యక్షుడు, ఆటో వర్కర్స్ యూనియన్ ప్రతినిధి జి.వామనమూర్తి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పెంచిన ధరలకు నిరసనగా సోమవారం ఉదయం 11 గంటలకు ఆశీలమెట్ట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. పెట్రోల్‌పై నియంత్రణ ఎత్తివేయడం వలనే ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. విపరీతంగా పెంచిన పెట్రో ధరల తగ్గింపు కోసం ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ప్రతిసారి ఒడిషా పెత్తనమే. ప్రతి దానిలోను ఆదిపత్యపోరే
english title: 
coach factory

పదునెక్కిన రాజకీయ పార్టీల వ్యూహం

$
0
0

విజయనగరం, జూలై 14: పంచాయతీ ఎన్నికల ఘట్టంలోని నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారానికి పదునెక్కించాయి. ముఖ్యంగా పార్వతీపురం, విజయనగరం డివిజన్లలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. కాగా, పార్టీరహితంగా జరిగే ఈ ఎన్నికలకు ఇప్పటి వరకు ప్రధాన పార్టీలకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం వారే సర్పంచ్‌లుగా గెలుపొందుతున్నారు. ఈ దఫా వైకాపా కూడా బరిలోకి దిగుతుండటంతో కొన్ని చోట్ల త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా, పార్వతీపురం పంచాయతీ ఎన్నికలకు కేవలం 8 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ డివిజన్‌లోని పార్వతీపురం, కురపాం, బొబ్బిలి, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ హవా ఉంది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలంటే పల్లెల బలం అవసరం. దీంతో నేతల కన్ను పంచాయతీ ఎన్నికలపై పడింది. పల్లెలో తమ సత్తాను చాటేందుకు తెలుగుదేశం వ్యూహం పన్నుతొంది. పంచాయతీ ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకోవడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపు సులభమవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నేతలు సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి.
జిల్లాలో 4726 మంది సర్పంచ్ పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ దఫా పంచాయతీ ఎన్నికలకు ఏకగ్రీవాలకు కొన్నిచోట్ల ప్రయత్నాలు జరుగుతుండగా, మరికొన్ని చోట్ల బహుముఖ పోటీ నెలకొంది. ప్రధాన పార్టీలకు చెందిన అనుచరులు ఒకే పంచాయతీకి పోటీ పడటంతో బహుముఖ పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవులకు ప్రధాన పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు బరిలో దిగారు. ఇరు పార్టీలకు రెబెల్ బెడద తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఒకరికి మద్దతునిస్తే, దానిని కాదని రెబెల్‌గా మరికొందరు బరిలో దిగారు. చీపురుపల్లిలో బెల్లాన శ్రీదేవి నామినేషన్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపగా, అదే పంచాయతీలో మీసాల వరహాలనాయుడు సతీమణి సరోజిని బరిలో దిగారు. అలాగే ఎస్.కోటలో కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిచారు. దీంతో వారిని బుజ్జగించేందుకు నేతలు యత్నాలు చేస్తున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో టిడిపి పట్టు ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో దానిని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్తుంది. గజపతినగరంలో నిన్న మొన్నటి వరకు వైకాపావైపు పరుగులు తీసిన నాయకులు నేడు కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతున్నారు. ఏది ఏమైనా పార్టీరహితంగా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రధాన పార్టీల మద్దతును ఆయా అభ్యర్థులు కోరుతున్న విషయం విదితమే. ఈ పరిస్థితుల్లో మేజర్ పంచాయతీలకు ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేయడంతో నాయకులకు బుజ్జగింపులు చేయడం తలనొప్పిగా పరిణమించింది.
ఇదిలా ఉండగా ఈ దఫా సగానికిపైగా స్థానాల్లో మహిళలు రంగంలోకి దిగుతున్నారు. దీంతో ఎస్‌హెచ్‌జి సంఘాల మద్దతు కోసం వారంతా సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో పగలు ప్రచారాలు, రాత్రులు చర్చలు చేస్తున్నారు.

పంచాయతీ పోలింగ్‌పై వెబ్ కన్ను!
విజయనగరం, జూలై 14: రాష్ట్రంలో మొదటిసారిగా పంచాయతీ ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మారుమూల పంచాయతీల్లో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు వెబ్‌కాస్టింగ్ పద్దతిని ఉపయోగించనున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహణవల్ల ఎంతో సౌలభ్యం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 25 ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ పద్దతిని అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక గ్రామాలు 61 ఉన్నట్టు గుర్తించారు. వాటిలో విజయనగరం డివిజన్‌లో 40 గ్రామాలు, పార్వతీపురం డివిజన్‌లో 21 అత్యంత సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. అలాగే సమస్యాత్మక గ్రామాలు విజయనగరం డివిజన్‌లో 101, పార్వతీపురం డివిజన్‌లో 58 ఉన్నాయి. ఈ విధానంతో ఎన్నికలు జరిగే ప్రాంతాన్ని జిల్లా కేంద్రంలోను, రాజధానిలో ఉండి తిలకించే వీలుంది. ఎన్నిక జరిగే కేంద్రంలో ఏర్పాటు చేసిన వెబ్ కెమెరా ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోలింగ్ కేంద్రంలోని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. ఇందుకోసం పోలింగ్ కేంద్రంలో ల్యాప్‌టాప్, వెబ్ కెమెరా, ఇంటర్నెట్ ఏర్పాటుచేస్తున్నారు. ప్రత్యేక కోడ్ ద్వారా ఎన్నికల సంఘం అధికారులు, కలెక్టర్, పరిశీలకులు తాము కూర్చొన్న చోటు నుంచే ఎక్కడి పోలింగ్ కేంద్రాన్నైనా ప్రత్యక్షంగా చూడవచ్చు. ముఖ్యంగా ఎన్నికల్లో రిగ్గింగ్, అల్లర్లు జరిగితే వెంటనే ఎన్నికల సంఘానికి, జిల్లా అధికారులకు వెంటనే తెలిసిపోతుంది. దీని వల్ల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
గరివిడి, జూలై 14 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్ర ఆదివారం గరివిడి సాయంత్రం గరివిడి చేరుకోగానే ప్రజలు స్వాగతం పలికారు. పాత గరివిడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర చీపురుపల్లి వరకూ సాగింది. ఈ సందర్భంగా గరివిడిలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఆమె పూల మాల వేసిన నివాళులర్పించారు. షర్మిలను చూసేందుకు ప్రజలు రావడంతో పలు ట్రాఫిక్ సమస్య ఎదురైంది. ఈ పాదయాత్ర కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కన్వీనర్ సుజయకృష్ణ రంగారావు, జిల్లా కన్వీనర్ సాంబశివరాజు, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, వైకాపా నియోజకవర్గ కన్వీనర్లు కోట్ల సూర్యనారాయణ, స్థానిక పార్టీ ప్రతినిధులు సత్యన్నారాయణరెడ్డి, వాకాడ శ్రీను, వాకాడ అన్నపూర్ణ, మాజీ జెడ్‌పిటిసి కోట్ల విజయ, తదితరులు పాల్గొన్నారు.

గౌహతి రైలులో మంటలు.. ఆరుగురికి గాయాలు
విజయనగరం, జూలై 14: ఒడిషావైపు వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఇంజన్ వెనుకవైపున ఉన్న బోగి నుంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. చీపురుపల్లి స్టేషన్‌కు కూతవేటు దూరంలో రైలుబండి నుంచి మంటలు చెలరేగాయి. దీంతో రైలుబండి ప్లాట్‌ఫారం వద్దకు చేరుకునేసరికి ఆందోళన చెందిన ప్రయాణికులు కొందరు రైలు నుంచి బయటకు గెంతేశారు. వీరిలో ఆరుగురికి గాయాలైనట్టు సమాచారం. కాగా, రైల్వే వర్గాలు మాత్రం గౌహతి ఎక్స్‌ప్రెస్ నుంచి మంటలు రావడం నిజమేనని, ఎవరికి గాయాలు కాలేదని పేర్కొన్నారు. బ్రేక్ బైండింగ్ వల్ల కొన్ని సార్లు ఇలా మంటలు వస్తాయని తెలిపారు. దీంతో వెంటనే రైలును నిలుపుదల చేసి ఎయిర్ బ్రేక్ సరిచేసిన తరువాత అక్కడ నుంచి రైలు బయలుదేరింది.
విజయానికి విభిన్న రీతుల్లో ప్రచారం
గంట్యాడ, జూలై 14 : పల్లెల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల పోరు ప్రధాన రాజకీయ పార్టీలుకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి చిన్నారులు, రైతులు, వృద్ధులతో ప్రచారం నిర్వహిస్తున్నారు.ఆయా పార్టీల మద్దతుతో సర్పంచ్, వార్డు పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్ధుల విజయం కోసం విభిన్న ప్రచారంతో వ్యూహ్మాత్మకంగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రీతిలో ప్రచారాన్ని నిర్వసిస్తున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం, ర్యాలీలతో అభ్యర్ధుల విజయం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్ సిపి నాయకులు గట్టి ప్రయ్నాలు చేస్తున్నారు. పార్టీ జెండాలు టోపీలు, కండువాలు ధరించి ఆయా పార్టీల అభిమానులు అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది.

విద్యుదాఘాతానికి రైతు మృతి
గజపతినగరం, జూలై 14 : వివాహమై నెల రోజులు కాక ముందే కాళ్లపారాణి ఇంకా తడి ఆరక ముందే నిండు నూరేళ్లు నిండి విద్యుత్ ఘాతానికి రైతులు మృతి చెందిన సంఘటన ఆదివారం గజపతినగరంలో చోటు చేసుకుంది. గజపతినగరంలోని గంగరాజు ధియేటర్ పక్కన నివాసం ఉంటున్న బండారు చిట్టిబాబు (35) విద్యుత్ మోటారు పంప్ సెట్ వేయడానికి స్విచ్ వేయగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రావులపాలెంలోని రావి గ్రామం నుంచి గజపతినగరం వచ్చి మూడు ఎకరాల భూమిని రాయకర చెరువు క్రింద కొంత భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిట్టిబాబు గత ఏడాది వరకు సింగపూర్‌లో ఓడల పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేద్దామన్న ఉద్దేశ్యంతో గజపతినగరంలో ఉన్న అన్నదగ్గరకు చేరుకున్నాడు. చిట్టిబాబుకు మేనమామ కూతురితో ఈ ఏడాది మే 24న వివాహం జరిగింది. ఆషాడం రావడంతో భార్య కన్నవారింటికి వెళ్లిపోయింది. చిట్టిబాబు ఉదయం పది గంట సమయంలో పొలంలో ఉన్న విద్యుత్ మోటారు వేద్దామని స్విచ్ వేయగా షాక్‌కు బలయ్యాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. విఆర్వో ఫిర్యాదు మేరకు ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.

‘యువతకు దిశా నిర్దేశం కొరవడింది’
సాలూరు, జూలై 14: భారత్ సంక్షేమమే విశ్వకళ్యాణమని ఆర్.ఎస్.ఎస్. విభాగ్ సహసంఘ చాలక్, రిటైర్డ్ డిప్యూటీ డి.ఇ.ఒ. నర్సింహం అన్నారు. ఆదివారం గురుపూజోత్సవాలలో భాగంగా స్థానిక ఆరిశెట్టి వారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు అతి ప్రాచీనమైనవి, చాలా గొప్పవని కొనియాడారు. ప్రస్తుతం యువతకు దిశా నిర్దేశం కొరవడిందన్నారు. యువతకు గృహాలలోను, పాఠశాలలో, సమాజంలో స్ఫూర్తికొరవడిందన్నారు. యువతకు సంస్కారవంతులుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శాఖల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం సభాధ్యక్షుడు ఎన్.వై. తాతలు మాట్లాడుతూ ఆర్. ఎస్. ఎస్. శాఖల్లో కాషాయ ధ్వజాన్ని గురువుగా భావిస్తు పూజలు నిర్వహిస్తారన్నారు. కాషాయం త్యాగనిరతిని సూచిస్తుందన్నారు. ప్రతీ వ్యక్తి సంస్కార వంతంగా జీవించి త్యాగ నిరతిని అలవర్చుకోవాలన్నారు. ప్రపంచానికి పనికొచ్చే శక్తిగా యువత మారాలని పిలుపునిచ్చారు. విభాగ్ భౌతిక్ ప్రముఖ్ కిలపర్తి తిరుపతిరావు, జిల్లా సహా కార్య వాహ వి.రాము, జిల్లా ప్రముఖ్ కొండబాబు, జి. లక్ష్మణరావు, వంగపండు రాజేంద్రప్రసాద్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

సంతపేటలో అనివార్యం కానున్న పోలింగ్
లక్కవరపుకోట, జూలై 14 : వరుసగా నాలుగు ఎన్నికల్లో ఏకగ్రీవమైన సంతపేట పంచాయతీలో ఈసారి పోటీ అనివార్యమవుతుంది. లక్కవరపుకోట మండలం సంతపేట గ్రామ పంచాయతీ 1995లో రంగారాయపురం పంచాయతీ నుండి విడిపోయింది. 1995 నుంచి ఇప్పటి వరకూ అన్ని ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంది. అందులో ఓటర్లు 170 గృహాలుండగా, గ్రామం మొత్తం జనాభా 720 మంది అందులో ఓటర్లు 527 మంది ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ రామకోవెలలో సమావేశమయ్యి. ఒక ఏకాభి ప్రాయానికి వచ్చి. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందింది. మేజర్ పంచాయతీల్లో లేని సౌకర్యాలన్నీ ఈ పంచాయతీల్లో గ్రామస్తులు సమకూర్చుకున్నారు. గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాతే రామమందిరాన్ని గ్రామస్తులందరూ కలిసి కుట్టుగా నిర్మించుకున్నారు. గ్రామంలో అందరూ కలిసి పరిశుభ్ర తను పాటించి నిర్మల పురస్కార్ అవార్డును పూణేలో రాష్టప్రతి చేతుల మీదుగా అప్పటి గ్రామ సర్పంచ్ గురు సన్యాసమ్మ అందుకున్న గ్రామమిది. నిర్మల్ పురస్కార్ అవార్డుతోపాటు, శుభ్ర అవార్డు కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా అప్పటి సర్పంచ్ గురు సన్యాసమ్మ హైదరాబాద్‌లో అందుకున్నారు. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ సిద్దపడుతున్నారు.

మూడు పూరిళ్లు దగ్ధం... రూ. 4 లక్షల ఆస్తి నష్టం
డెంకాడ, జూలై 14 : మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని బంగార్రాజుపేట గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. బంగార్రాజుపేట గ్రామానికి చెందిన వెంపడాపు అప్పలరెడ్డి ఇంటి వద్ద తెల్లవారు జామున నీరు పొయ్యిపై నీరు మరిగిస్తుండగా మంటలు చెలరేగి ఈ దారుణం చోటు చేసుకుంది. దీంతో బాధితులవి పూరిళ్లు కావడంతో కట్టు బట్టలతో మిగిలి నిరాశ్రయులయ్యారు. తగరపువలస నుంచి అగ్నిమాపక వాహనంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే సరికి జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. అప్పలరెడ్డి పెళ్లి కోసం తెచ్చుకున్న లక్షా 50 వేల రూపాయలు కాలి బూడిదైనట్లు స్థానికులులంటున్నారు. అలాగే తరిగి అప్పలనర్సమ్మ ఇళ్లు నిర్మాణం కోసం 75 వేల నగదు తెచ్చుకుని ఇంట్లో వుంచింది.
ఇది కూడా అగ్నికి ఆహుతయ్యిందని బాధితులు వాపోతున్నారు. సంఘటనా స్థలానికి ఆర్‌ఐ చిరంజీవి, విఆర్‌ఓ సూరిబంగారి చెరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. 4 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు. బాధితులను ఆదుకుని తగిన సహాయం చేయాలని అధికారులను బాదితులు కోరుతున్నారు. కట్టుబట్టలతో మిగిలిన తమకను ఆదుకుని తమకు సాయం అందించాలని అక్కడి వారు కోరుతున్నారు.

పంచాయతీ ఎన్నికల ఘట్టంలోని నామినేషన్ల పర్వం ముగియడంతో
english title: 
sharpen

పేట కాంగ్రెస్‌కు పెద్దదిక్కేదీ?

$
0
0

సిద్దిపేట, జూలై 15 : సిద్దిపేట నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు కరువైంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషిచేయాల్సిన పెద్ద నాయకులు పట్టించుకోకపోవటంతో గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు పోలీంగ్‌కు కేవలం వారు రోజులు గడువు వుండటంతో ఇంతవరకు నియోజక వర్గం ముఖ్య నేతలు ప్రచారంలో పాలుపంచుకోకపోవటంపై గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యం అలముకొంది. కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడ తమను పట్టించుకోరా.. ? గ్రామాల్లో నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 1985 నుండి సిద్దిపేట నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 1985 నుండి 2004 వరకు సిద్దిపేట నియోజక వర్గంలో కెసిఆర్ ఎమ్మెల్యేగా మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగారు. సిద్దిపేట నియోజక వర్గాన్ని కెసిఆర్ తన కంచుకోటగా మార్చుకున్నారు. 2004లో కెసిఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందే మంత్రిగా బాధ్యతలు స్వీకరించి..అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తన కంచుకోటగా మలుచుకన్నారు. 1985 నుండి ఇప్పటి వరకు 27 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రాతినిథ్యం కరువైంది. 2004 నుండి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో,కేంద్రంలోఅధికారంలో వున్నప్పటికి నియోజక వర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలో ఏలాంటి మార్పురాలేదు. నియోజక వర్గంలోని మేజార్టీ క్యాడర్ ఇతర పార్టీలకు వలసలు పోగా.. పార్టీపై అభిమానం వున్న నేతలు, కార్యకర్తలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎంపిగా పోటీ చేసిన చాగండ్ల నరేంద్రనాథ్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో అధిక్యతలో వున్నప్పటికి ఒక్క సిద్దిపేట నియోజక వర్గంలో 60 వేల ఓట్లు వెనుకబడిపోవటంతో 6 వేల ఓట్లతో ఓటమిచెందారు. సిద్దిపేట నియోజక వర్గంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధిష్టానం చెపుతున్నప్పటికీ ఇంతవరకు ఏలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. 2011లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఫారూక్‌హుస్సేన్‌ను నామినేట్ చేశారు. ఫారూక్‌హుస్సేన్ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన నియోజక వర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. నియోజక వర్గంలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌తో పాటు మార్కెట్ కమిటి చైర్మన్ గూడూరి శ్రీనివాస్‌లు రెండు గ్రూపులు చలమణీ అవుతున్నారు. ఇటివల కాంగ్రెస్ పార్టీ పదవుల్లో గ్రూపు విభేదాలు మరోసారి స్పష్టమైనాయి. దీంతో పంచాయతీ ఎన్నికల ముందు ఇటివల సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు నియోజక వర్గంలో గ్రూపువిభేదాలను పరిష్కరించేందుకు నియోజక వర్గం సమన్వయ కర్తగా, స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జీగా చాగండ్ల నరేంద్రనాథ్‌ను నియమించారు. కాని ఇంతవరకు చాగండ్ల నరేంద్రనాధ్ నియోజక వర్గం కోఆర్టీనేటర్‌గా నియామకమైన తర్వాత సిద్దిపేటలో అడుగుపెట్టలేదు. నరేంద్ర నాథ్ తన సంత పనులకు విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తన కుటుంబ పనుల నిమిత్తం సతీసమేతంగా లండన్ వెళ్లారు. మరో నెలరోజుల వరకు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు పర్వం ముగిసినప్పటికి కనీసం ఏ గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారో పట్టించుకునే వారు కరువైనారు. అందుబాటులో వున్న మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ నామినేషన్ల తర్వాత ఉప సంహరణ తర్వాత పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. సిద్దిపేట నియోజక వర్గం తొలివిడత ఈనెల 23న జరిగే పోలీంగ్ జరుగుతుండటంతో గ్రామాల్లో రంగంలో వున్న అభ్యర్థులు తీవ్ర కలవర చెందుతున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీచేస్తున్నప్పటికి తమకు కనీసం చేయుత నిచ్చెవారు కరువైనారని వాపోతున్నారు. పంచాయతీ ఎన్నికలకు కేవలం వారం రోజుల గడువు వుండటంతో అభ్యర్థులు తమను పట్టించుకోక పోవటంపై గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు నియోజక వర్గం నేతలపై గుర్రుగా వున్నారు. నియోజ వర్గం నాయకులపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఎన్నికల పోలీంగ్‌కు మిగిలిన ఆరురోజులైన నియోజక వర్గ స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొని రంగంలో వున్న అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని కాంగ్రెస్ అభిమానులు కోరుతున్నారు. నియోజక వర్గంలో నాయకుల్లో మార్పు రానంతవరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారదని రాజకీయ విశే్లకులు భావిస్తున్నారు.

సరికొత్త సాంకేతిక విజ్ఞానంపై
పోలీసులకు శిక్షణ
సంగారెడ్డి,జూలై 15: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు కాబోతున్న సిసిటి ఎన్‌ఎస్ (క్రైమ్‌అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్)లో భాగంగా టిసిఎస్ (టాటా కంప్యూటర్ కన్సల్‌టెన్సీ) ఆధ్వర్యంలో జిల్లా పోలీసులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. ఈకార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జి భూపాల్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ఛేంజ్ మెనెజ్‌మెంట్‌పై శిక్షణ కూడా ఇచ్చారు. సదస్సులో టిసిఎస్ కు చెందిన కరుణాకర్ కుంభవాత్ పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం పోలీసులు కూడా పట్ట సాధిస్తూ పోలీసు విచారణంలో వేగంగా పురోగతిని సాధించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డిఎస్పీ వెంకటేశ్, రామచంద్రాపురం డిఎస్పీ మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

అక్రమ మద్యంపై అప్రమత్తం
సంగారెడ్డి,జూలై 15: ఈ నెలలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కల్తీకల్లుతో పాటు అక్రమ మద్యాన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. దినకర్‌బాబు సంబంధిత అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అధికారులు సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. కల్తీకల్లు, అక్రమ మద్యం అరికట్టేందుకుగాను జిల్లాలో విస్తృతంగా దాడులను నిర్వహించాలని ఆయన సమావేశంలో పాల్గొన్న ఏక్సైజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో అనాధికారికంగా కొనసాగుతున్న బెల్ట్‌షాపులను నిరోధానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 23వ తేదీన మొదటి దఫా ఎన్నికలు సిద్దిపేట డివిజన్‌లో ఉన్న నేపథ్యంలో 44 గంటల ముందు మద్యం దుకాణాలను మూసివేసే విధంగా ముందస్తు చర్యలను తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎక్కవ మొత్తంలో మద్యం సేవించడం ద్వారా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఇందుకు ఆబ్కారీ శాఖ సిబ్బందిని బాధ్యులుగా భావించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.సిద్దిపేట డివిజన్‌లో మొదటి దఫా ఎన్నికల సందర్భంగా పోలింగ్ సమాగ్రిని తరలించేందుకుగాను 60 రూట్లకు పోలింగ్ అధికారులతో పాటు జోనల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. 162 బస్సుల ద్వారా 82 జీపుల ద్వారా ఈసామాగ్రిని చేరవేయడం జరుగుతుందన్నారు.మెదక్ డివిజన్‌లో రెండవ విడుతకు సంబంధించి కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న డిపివో అరుణను ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్, డిఆర్‌వో, ఏజెసి మూర్తి, డిఆర్‌వో ప్రకాష్ , ఎక్సైజ్ అధికారులు జీవన్‌సింగ్, హరికిషన్ , ఆర్టీ ఏ అధికారులు, మధుసూధన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు తిరుగులేదు
నర్సాపూర్, జూలై 15: నర్సాపూర్ నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు ఏకమైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాలు గెలుపొందుతారని రాష్ట్ర స్ర్తిశిశుసంక్షేమశాఖ మంత్రి వాకిటి సునీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారంనాడు నర్సాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక అన్ని పార్టీలు ఉమ్మడిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలుస్తున్నాయని అన్నారు. అయినప్పటికి కాంగ్రెస్ పార్టీ శక్తి ముందు నిలబడలేకపోతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వల్ల ప్రజలు తమ వెంట ఉన్నారని స్పష్టం చేశారు. గత 14 సంవత్సరాల కిందట నియోజకవర్గం పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ ఏదో ఒక పార్టీ బలపరిచిన అభ్యర్థులే సర్పంచ్‌లుగా గెలుపొందుతున్నారని అన్నారు. నర్సాపూర్, శివ్వంపేట, హత్నూర మండలాల్లోని పలు గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ తరపున ఇద్దరేసి అభ్యర్థులు నిమినేషన్లు వేశారని వారు ఉపసంహరణ గడువులోగా విత్‌డ్రా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. సమావేశంలో మండల పార్డీ అధ్యక్షుడు కృష్ణారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్, మాజీ ఎంపిపి లలిత పాల్గొన్నారు.

జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలి
* కలెక్టర్ దినకర్‌బాబు సమీక్ష
సంగారెడ్డి,జూలై 15: జిల్లా అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా రాష్ట్రంలో అన్ని కార్యక్రమాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ ఏ దినకర్‌బాబు కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని మినిసమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రీయ సూచన విజ్ఞాన కేంద్రం ద్వారా జాతీయ పశువ్యాధి సమాచార సేకరణ కేంద్ర వ్యవస్థ ద్వారా అత్యధిక కేసులను జిల్లా నమోదు చేయడం పట్ల ఆయన సంబంధిత పశసంవర్థక శాఖను అభినందించారు. అధికారులు అంకిత భావంతో పని చేస్తే ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదే రీతిలో 20 సూత్రల అమలు పథకం, 15 సూత్రాల అమలు పథకాన్ని జిల్లా అధికారులు అమలు చేయాలని ఆయన కోరారు. జిల్లాలో పాల ఉత్పత్తి మరియు సంబంధిత శాఖ ద్వారా జరిగే కార్యక్రమాలను జిల్లాలో భారీ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఉద్యానవన శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో 46 మండలాల నుండి 12500 పశువ్యాధి కేసులను గుర్తించి ఆన్‌లైన్ ఆప్‌లోడ్ చేయడంలో దేశంలో మొదటి స్థానంలో జిల్లా నిలవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్, ఏ జెసి మూర్తి, డి ఆర్ వో ప్రకాష్‌కుమార్ , పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి , ఎన్‌ఐసి అధికారి శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమానికి కట్టుబడిన కాంగ్రెస్
తూప్రాన్, జూలై 15: పేదల సంక్షేమానికి కట్టుబడిన కాంగ్రెస్ వివిధ పథకాలకు రూపకల్పన చేసి ఆమలు చేస్తున్నట్లు కాంగ్రెస్ పరిశీలకులు ఎన్‌సి రాజవౌళిగుప్త పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని సర్పంచ్ అభ్యర్థులు, పార్టీ శ్రేణులకు తూప్రాన్‌లోని లింగారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని, అయితే ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిపై ప్రజలను చైతన్యం చేయాల్సిన భాద్యత పార్టీ శ్రేణులపై ఉందని స్పష్టం చేశారు. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించగా, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ ద్వారా వివిధ పథకాలకు ప్రత్యేక నిధులు కెటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలే గీటురాయి కాగా, మెజార్టీ స్థానాలను దక్కించుకునే దిశగా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు విజయభాస్కర్‌రెడ్డి, నాచగిరి ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యుడు లింగారెడ్డి, నేతలు వెంకటస్వామి పాల్గొన్నారు.

28మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానం
సంగారెడ్డిరూరల్,జూలై 15: జిల్లా గెజిట్‌లో నోటిఫై చేసిన 28 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ జీవన్‌సింగ్ తెలిపారు. ఈ నెల 15నుంచి 21వ తేదీ వరకు సంగారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఈ నెల 22న ఉదయం 11గంటలకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేయబడుతుందని తెలిపారు.

తూప్రాన్‌లో చోరీ
తూప్రాన్, జూలై 15: తూప్రాన్ పెట్రోల్‌బంక్ సమీపంలోని నాగార్జున కాలనీలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దొంగలు తాళం పగల గొట్టి చోరీకి పాల్పడ్డారు. కాలనీలో ఉంటున్న సత్తయ్య పనిపై ఆదివారం వేరే గ్రామానికి వెల్లగా, ఇదే అదనుగా భావించిన దొంగలు తాళం పగలగొట్టి లోన ప్రవేశించారు. అనంతరం బీరువాలో దాచుకున్న 2తులాల బంగారు వస్తువులు, 20తులాల వెండి, రూ,40వేల నగదును దోచుకెల్లారు. అయితే దొంగలు ఎలాంటి అనవాళ్లు చిక్కకుండా ఇంటిని శుభ్రం చేసి వెల్లడం గమనార్హం కాగా, ఉదయం ఇంటికి వచ్చిన యజమాని సత్తయ్య చోరీ జరిగినట్లుగా గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పట్టణ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ముందు ధర్నా
సంగారెడ్డి,జూలై 15: సంగారెడ్డి పట్టణంలోని మగ్దుంనగర్, రిక్ష కాలనీల మురికి కాలువల సమస్యను పరిష్కరించాలని కోరుతూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఎ.శరత్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజు మాట్లాడుతూ మగ్దుంనగర్,రిక్ష కాలనీల్లో మురికి కాలువల నిర్మాణాలు లేక వర్షాలు కురిస్తే ఆ మురికి నీరంత ఇండ్లలోకి చేరుతుందని, దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ఇటివల కురిసిన వర్షాలకు కూలీపోయిన రెండు ఇండ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ మురికి కాలువలకు శాస్వత పరిష్కారం చూపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు దుర్గేష్, దత్తు, బాబామియా, సతీష్, తాజోద్దీన్, రాజక్ తదితరులు పాల్గొన్నారు.

* మొదటి విడత ఎన్నికలైనా అభ్యర్థులకు చేయూత కరువు * విదేశాల్లో ఎమ్మెల్సీ ఫారూక్, నరేంద్రనాథ్ * ప్రచారంలో కానరాని ముఖ్య నేతలు * అభ్యర్థుల్లో కలవరం
english title: 
peta congress

‘పంచాయతీ’పై ఖాకీ నిఘా

$
0
0

నల్లగొండ, జూలై 15: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ అధికార యంత్రాంగానికి కత్తిమీద సాముల మారింది. గతంలో కంటే ఎక్కువ పార్టీలు..ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉండటం..గత ఎన్నికల కంటే ఖర్చులు సైతం భారీగా జరుగుతుండటంతో పల్లెల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల పోరు కాస్తా పార్టీలు..ప్రజల మధ్య పంచాయతీలకు దారితీసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 1196 గ్రామ పంచాయతీలు..11686 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా తరుముకొస్తున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్నాయి. ఇందుకు తాజాగా దాఖలైన నామినేషన్ల వ్యవహారమే నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో పంచాయతీ ఎన్నికలలో సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. జిల్లాలో కలెక్టర్-ఎన్నికల అధికారి వైపు నుండి 306 పంచాయతీలు అతిసున్నితమైన, 147 సున్నితమైన సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 178 గ్రామాల్లో వీడియో చిత్రీకరణ..87పంచాయతీల్లో వెబ్‌కెమెరాల వినియోగం..సూక్ష్మ పరిశీలకులను వినియోగిస్తు ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీస్ శాఖ వైపు నుండి జిల్లాలో 760పంచాయతీలను సమస్యాత్మక పంచాయతీలుగా గుర్తించగా అక్కడ ఎన్నికల నిర్వహణపై ముందస్తు నిఘాను..బందోబస్తు చర్యలను చేపట్టారు. ముఖ్యంగా రాజకీయ కక్షలు..్ఫ్యక్షన్ గొడవలు..తీవ్రవాద ప్రాబల్యం ఉన్న సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కొనసాగుతున్న ‘గ్రామపోలీస్’తో గ్రామాల్లో శాంతిభద్రతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలకు అదనంగా నలుగురు పోలీసులను నియమించారు. వారి సమాచారం ఆధారంగా అవసరమైతే ప్రత్యేక టాస్క్ఫోర్సు..ట్రబుల్ షూటింగ్ పోలీస్ బృందాలు ఉద్రిక్తతలు చోటుచేసుకునే గ్రామాలకు నిమిషాల్లో చేరేలా రూట్‌ప్లాన్..యాక్షన్ ప్లాన్‌లను రూపొందించారు.
కట్టడికి బైండోవర్లు..దాడులు
పంచాయతీ ఎన్నికల బందోబస్తు భాగంగా గత ఎన్నికల సందర్భంగా దాడులకు, నేరాలకు పాల్పడిన వారిని, రౌడీషీటర్లను గుర్తించి బైండోవర్ చేస్తున్నారు. 800 మందికి పైగా నేరగాళ్ల కదలికలపై దృష్టి సారించి వారిని స్టేషన్‌కు రప్పిస్తున్నారు. లైసెన్స్‌డ్ ఆయుధాల సరెండర్‌కు ఆదేశాలిచ్చారు. 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు. అటు మావోయిస్టు మాజీలు..సానుభూతిపరులపై సైతం ఓకనే్నసి ఉంచారు. ఎన్నికల్లో వివాదాలకు కారణమయ్యే మద్యాన్ని, నాటుసారా అక్రమ విక్రయాలను అదుపు చేసేందుకు ఇప్పటికే సివిల్, ఎక్సైజ్ పోలీసు బృందాలు జిల్లా వ్యాప్తంగా ముమ్మర దాడులను సాగిస్తున్నాయి. బెల్ట్‌షాపుల నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసి పోలింగ్‌కు నాలుగైదు రోజుల ముందుకల్లా వాటిని బంద్ చేయించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంతేగాక మద్యం అమ్మకాలు పెరిగిపోకుండా అమ్మకాలపై జాయింట్ కలెక్టర్ రోజువారి నివేదికలు సేకరిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో చెలరేగే సమస్యలపై 9490619446కు, 08682-24462కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. జిల్లా పంచాయతీ ఎన్నికల బందోబస్తులో ఒక ఎస్పీ, ఎఎస్పీ, ఆరుగురు డిఎస్పీలు, 31మంది సిఐలు, 96మంది ఎస్‌ఐలు, 1129ఎఎస్‌ఐలు, 389జమిందార్లు, 1383మంది కానిస్టేబుల్స్, 500మంది హోంగార్డులు, 14 సెక్షన్ల ఎపిఎస్పీ సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. వారికి అదనంగా ట్రైనీ ఎస్‌ఐలు 41 మంది జిల్లాకు చేరుకోగా ర్యాపిడ్ యాక్షన్, సిఆర్‌పిఎఫ్‌లతో కూడిన నాలుగు కంపెనీల అదనపు బలగాలు జిల్లాకు రానున్నాయి. అయితే జిల్లాలోని ఐదు డివిజన్‌లలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో బందోబస్తు కోసం సిబ్బంది కొరత సమస్య ఉండబోదని ఈ నేపధ్యంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పెద్దగా సమస్యలు ఉండబోవని పోలీస్ శాఖ ధీమాతో ఉండటం విశేషం.

పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే ధ్యేయం
నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి
భువనగిరి, జూలై 15: రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే నార్మాక్స్ ధ్యేయమని ఆ సంస్థ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పాలశీతలీకరణ కేంద్రంలో జరిగిన పాల ఉత్పత్తిదారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మదర్‌డైరి(నార్మాక్స్)కు పాలు సరఫరా చేస్తున్న రైతులకు సబ్సిడీపై పశువుల దానా అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రైతుల సంక్షేమాన్ని దృష్టియందుంచుకొని అన్ని విధాలుగా నార్మాక్స్ వారిని ఆదుకుంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన పాలను ఉత్పత్తి చేసే రైతులకు గిట్టుబాటు ధర అందించడంలో నారాక్స్ ముందంజలో ఉందన్నారు. అదేవిధంగా పాల ఉత్పత్తిదారుల సంక్షేమంలో భాగంగా ఆయా కుటుంబాలలో ఉన్నత విద్యనభ్యసించే వారి పిల్లలకు ఉపకారవేతనాలతో పాటూ ప్రత్యేక ప్రోత్సాహక నగదు బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నార్మాక్స్ పరిధిలోని పాల ఉత్పత్తిదారుల కుటుంబ సభ్యుల పిల్లలకు మంజూరైన ఉపకార వేతనాలను ఆయన పంపిణీ చేశారు. అదేవిధంగా పదవ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన పాల ఉత్పత్తిదారుల పిల్లలకు ఒక్కొక్కరికి 5వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.

వ్యయపరిమితి దాటితే అనర్హత వేటు
* ఎన్నికల జిల్లా వ్యయపరిశీలకుడు చంద్రమోహన్‌రెడ్డి
నల్లగొండ టౌన్, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్, సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమీషన్ విధించిన వ్యయపరిమితికి మించి ఖర్చు చేసినట్లయితే ఎన్నికల్లో గెలిచినగాని అనర్హులుగా ప్రకటించబడతారని ఎన్నికల వ్యయపరిశీలకులు చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఉదయాధిత్య భవనంలో డిజిగ్నేటేడ్ అధికారులతో ఎన్నికల ఖర్చు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నామినేషన్ వేసిన నాటి నుండి పోలింగ్ కౌంటింగ్ వరకు అభ్యర్థులు చేసిన ఖర్చులకు సంబంధించి రోజు వారి వివరాలు రిజిస్ట్రర్‌లోనమోదు చేసి మండల స్థాయి అధికారులచే ఆమోదం పొందాల్సి ఉంటుందని అభ్యర్థులకు సూచించారు. 10వేల జనాభా గల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీచేయు అభ్యర్థులు 80వేల రూపాయలు, 10వేల జనాభాకంటే తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు 40వేల రూపాయలకు మించకుండా ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల కమీషన్ నిర్దేశించిన నియమనిబంధనల ప్రకారం డిగ్జినేటెడ్ అధికారులు రోజువారి అభ్యర్థుల ఖర్చు లెక్కలు పరిశీలించాలని నిర్దేశించిన నమూనా పట్టిక 1,2లో చూపిన అంశాల వారిగా రిజిష్టర్లు పరిశీలించాలని, ప్రతి రెండు రోజులకు ఒకసారి అభ్యర్థుల ఖర్చు వివరాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల పరిశీలకురాలు ప్రియదర్శిని మాట్లాడుతూ పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి తమ ఖర్చుకు సంబంధించిన అవసరమైన ఆధారాలు చేపించాల్సి ఉంటుందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముక్తేశ్వర్‌రావు మాట్లాడుతూ ఓటర్లను ప్రలోబాలకు గురిచేయకుండా ధనాన్ని విచ్చల విడిగా ఖర్చు చేయకుండా నియంత్రించేందుకు ఎన్నికల కమీషన్ పరిమితిని నియమించిందని అభ్యర్థుల ఖర్చు పరిమితి మించకుండా చూడాల్సిన బాధ్యత మండల స్థాయి డిజిగ్నేటేడ్‌లపై ఉందని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డి ఆర్‌వో ఆర్.అంజయ్య, డిపివో కృష్ణమూర్తి, జిల్లా ఆడిట్ అధికారి సిహెచ్.వేణుగోపాల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
నాలుగు మోటార్‌సైకిళ్ళు, నాలుగు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం
దేవరకొండ, జూలై 15: దుకాణాల ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలను చాకచక్యంగా దొంగిలించే దేవరకొండకి చెందిన రాపాల నర్సింగ్ అనే దొంగను సోమవారం దేవరకొండలో అరెస్ట్ చేసి అతని నుండి నాలుగు మోటార్‌సైకిళ్ళు, నాలుగు ల్యాప్‌టాప్ కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు దేవరకొండ ఎస్‌హెచ్‌వో నాగేశ్వర్‌రావు చెప్పారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చేసిన దొంగను మీడియా ఎదుట చూపించి అతడు చేసిన దొంగతనం వివరాలను వెల్లడించారు. నిందితుడు నర్సింగ్ దేవరకొండలో కారుడ్రైవర్‌గా పని చేస్తూ దొంగతనాలకు అలవాటుపడ్డాడని చెప్పారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఎనిమిది నెలల క్రితం ఒక వైన్స్‌షాప్ ఎదుట నిలిపి ఉంచిన మోటార్‌సైకిల్‌ను నిందితుడు దొంగిలించాడని, పది రోజుల తర్వాత అదే వైన్స్‌షాప్ ఎదుట నిలిపి ఉంచిన మరో మోటార్‌సైకిల్‌ను దొంగిలించాడని చెప్పారు. రెండు దొంగతనాలు చేసిన అనంతరం తుక్కుగూడలో మరో వైన్‌షాప్ ఎదుట నిలిచి ఉంచిన మోటార్‌సైకిల్‌ను నిందితుడు దొంగిలించాడని చెప్పారు. ఈ నెల 8 వ తేదీన హైద్రాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఒక ఇంటి ఎదుట నిలిపి ఉంచిన మోటార్‌సైకిల్‌ను నిందితుడు దొంగిలించాడని తెలిపారు. ఈ నెల 10వ తేదీన దేవరకొండలోని గురుకుల పాఠశాల సమీపంలో ఇంజనీరింగ్ విద్యార్ధులు నివాసం ఉండే రూం తాళం పగులగొట్టి మూడు ల్యాప్‌ట్యాప్‌లను, గాంధీనగర్‌లో మరో ఇంజనీరింగ్ స్టూడెంట్‌కు చెందిన ఒక ల్యాప్‌టాప్‌ను నిందితుడు నర్సింగ్ దొంగిలించాడని చెప్పారు. దొంగిలించిన ల్యాప్‌టాప్‌లను అమ్మేందుకు సోమవారం పట్టణంలోని ముత్యాలమ్మ వీధిలో తిరుగుతుండగా అరెస్ట్ చేసి నిందితుడి నుండి దొంగిలించిన వాహనాలను, కంప్యూటర్లను రికవరీ చేసినట్లుచెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో క్రైం ఎస్ ఐ కలీల్‌ఖాన్, ఐడి పార్టీ సిబ్బంది విజయశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, హోంగార్డు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.

వైకాపాపై కాంగ్రెస్, టిడిపి కుట్ర
మిర్యాలగూడ, జూలై 15: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు పోటీ చేయకుండా అధికారకాంగ్రెస్, ప్రధానప్రతిపక్షం టిడిపి కుట్రలుపన్నుతున్నాయని వైకాపా జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నర్సింహ్మారావు, వైకాపా సిఇసి సభ్యురాలు పాదూరి కరుణ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని పాదూరి కరుణ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉండకుండా కాంగ్రెస్,టిడిపి ఎత్తుగడలు వేస్తున్నాయని విమర్శించారు. కార్యకర్తలు మనోధైర్యంతో అధికారకాంగ్రెస్, టిడిపి ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆత్మస్థైర్యంతో కార్యకర్తలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అధికారకాంగ్రెస్‌పార్టీ, ప్రధానప్రతిపక్షమైన టిడిపికి సమానంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు గెలుపొందుతారని వారన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైకాపా అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని వారన్నారు. కాంగ్రెస్, టిడిపి కుట్రలను తిప్పికొడుతూ జిల్లాలో మెజార్టీ పంచాయతీలను గెలుచుకునేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. సమావేశంలో మారేపల్లి అమృతారెడ్డి, రాము పాల్గొన్నారు.

ఒకే పంచాయతీలో తండాల మధ్య పోరు
దామరచర్ల, జూలై 15: పంచాయతీ ఎన్నికల్లో ఈసారి చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. మండలంలోని వాచ్యతండా గ్రామపంచాయతీ పరిధిలో బెట్టెతండా, గంగ్యాతండా, బొల్లిగుట్టతండాలు ఉన్నాయి. ఏ గ్రామపంచాయతీలోనైనా అభ్యర్థులు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. కాగా ఈ గ్రామపంచాయతీలో వాచ్యతండాకు మిగిలిన తండాలైన బెట్టెతండా, గంగ్యాతండా, బొల్లిగుట్టతండాల ఓటర్ల మధ్య పోటీ నెలకొంది. వాచ్యతండా గ్రామపంచాయతీ రిజర్వేషన్ బిసి మహిళకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ రావడమే తండాల మధ్య పోరుకు ఆజ్యం పోసింది. బిసి సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఈ పంచాయతీ పరిధిలో రెండే ఉన్నాయి. ఒక కుటుంబం వారు వాచ్యతండాలో నివసిస్తుండగా మరొక కుటుంబం వారు బెట్టెతండాలో నివసిస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 1469 ఓటర్లున్నారు. గత నాలుగు పర్యాయాలుగా వాచ్యతండాకు చెందినవారే సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఈసారి శివారుతండాల అభ్యర్థులకు సర్పంచ్ అవకాశం ఇవ్వాలని బెట్టెతండా, బొల్లిగుంటతండా, గాంగ్యతండా ఓటర్లు గ్రామపెద్దల సమావేశంలో తెగేసి చెప్పారు. అందుకు వాచ్యతండా పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వాచ్యతండా నుండి కాతోజు అనసూర్య బెట్టెతండా నుండి కనె్నగంటి శశికళ సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. వాచ్యతండాకు 500 పైచిలుకు ఓటర్లు ఉండగా శివారుతండాకు 800పై చిలుకు ఓటర్లు ఉన్నారు. దీంతో ఎవరికి వారు తాము బలపర్చిన అభ్యర్థిని గెలిపించుకోవాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు ఎవరిపక్షాన నిలుస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
సూర్యాపేట, జూలై 15: పట్టణంలో అన్ని ఎన్నికలకు వార్డులవారీగా పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ సిహెచ్.నాగేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎండి.షఫిఉల్లా మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కేంద్రాలను ఒకవార్డు కేంద్రాలను మరోవార్డులో దూరంగా ఏర్పాటు చేయడం వల్ల శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌శాతం తక్కువగా నమోదవుతుందన్నారు. అదే మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వార్డులవారీగా పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటుచేయడం వల్ల ఓటర్లకు సులువుగా ఉండటంవల్ల 80శాతం వరకు పోలింగ్ నమోదవుతుందన్నారు. అందువల్ల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కేంద్రాలను మున్సిపల్‌వార్డుల వారీగా ఏర్పాటుచేసి ప్రజలు ఓటుహక్కును సులువుగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షుడు కొండేటి ఏడుకొండలు, వైకాపా నాయకుడు తండు శ్రీనివాస్‌గౌడ్, పట్టణ టిడిపి ప్రధానకార్యదర్శి బూర బాలసైదులు, సిపిఐ ప్రాంతీయ సహయకార్యదర్శి దోరేపల్లి శంకర్ పాల్గొన్నారు.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
కనగల్, జూలై 15: తండ్రికి తలకొరివి పెట్టి కూతురురుణం తీర్చుకున్న ఘటన మండలంలోని బుడమర్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంతంగి లక్ష్మయ్య(45) అనారోగ్యంతో గత కొంత కాలంగా బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో మృతునికి ఒకే ఒక కూతురు ఉండడంతో మగపిల్లలు లేని లోటును తీర్చి తండ్రికి తలకొరివి పెట్టింది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చింతపల్లి, జూలై 15: మండలంలోని వింజమూరు గ్రామసమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరోనలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు. హైద్రాబాద్‌లోని జీడిమెట్లలో నివాసం ఉండే షాద్‌నగర్‌కు చెందిన క్షీరోద్(30) తన మిత్రులైన కృష్ణ, నాగమణి, వారి కుమార్తెలు మహేశ్వరి, జానకిలను తన కారులో ఎక్కించుకుని నాగార్జున సాగర్ నుండి హైద్రాబాద్‌కు వెళ్తుండగా హైద్రాబాద్ నుండి మల్లెపల్లి వైపు వెళ్తున్న డిసిఎం వింజమూరు సమీపంలో కారును ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది. తీవ్రగాయాలైన ఐదుగురిని అదే రోడ్డులో చింతపల్లి వైపు వస్తున్న తహశీల్దార్ పర్హిన్‌షేక్ దగ్గర ఉండి వారిని హైద్రాబాద్‌కు తరలించారు. తీవ్రగాయాలైన క్షీరోజ్ మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆందోళనకరంగా ఉన్న నలుగురుని హైద్రాబాద్‌లోని ఆరెంజ్ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
కనగల్, జూలై 15: నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎన్నికల అధికారి ఎన్.చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఎంపిడివో కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు ఎన్నికల నియమావళీని ఉల్లంఘించి అధిక నిధులతో ప్రచారాలు నిర్వహించరాదన్నారు. సర్పంచ్, వార్డు స్థానాల్లో పోటీ చేయు అభ్యర్థులు ప్రతి రోజు ఖర్చులు నమోదు చేయాలని, ఎన్నికలకు సంబంధించిన వివరాలను అధికారులకు అందజేయాలని సూచించారు. సర్పంచ్ 40 వేలు, వార్డు సభ్యులు 6వేల రూపాయలకు మించి ఎన్నికలకు ఖర్చు చేయరాదన్నారు. కార్యక్రమంలో ఎంపిడివో సీతాకుమారి, తహశీల్దార్ సైదులుగౌడ్, వేణుకుమార్, లక్ష్మారెడ్డి, చందుచారి పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
రామన్నపేట, జూలై 15: ఎన్నికల సందర్భంగా గ్రామాలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తప్పవని రామన్నపేట ఎస్‌ఐ ఎండి. మాసియొద్దిన్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఈనెల 23న జరిగే గ్రామపంచాయతి ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం గ్రామాలలో తన సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వివిధపార్టీల నాయకులతో మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేటట్లు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించి ఎన్నికల అధికారులకు సహకరించాలని సూచించారు. గ్రామాలలో అలజడులు సృష్టించేవారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సవాల్‌గా మారిన సమస్యాత్మక పల్లెలు * శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు
english title: 
nigha

తప్పులతడకగా ఓటర్ల జాబితా

$
0
0

నెల్లూరు, జూలై 15: నగరపాలక సంస్థ పరిధిలో ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని, తక్షణం అధికారులు సవరించకుంటే టిడిపి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను దిగ్భందం చేసి ఆందోళన చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర హెచ్చరించారు. సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రవిచంద్ర మాట్లాడుతూ నగరంలోని ఏ డివిజన్‌లో కూడా ఓటర్లు వరుస సంఖ్యలో లేరని, జాబితా గందగోళంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు, అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక డివిజన్‌లో 15వేల ఓట్లు, మరో డివిజన్‌లో 5వేల ఓట్ల చొప్పున ఉన్నాయని, కాంగ్రెస్‌కు అనుకూలమైన డివిజన్లలో 5వేల ఓట్లు మాత్రమే పెట్టారని విమర్శించారు. డి లిమిటేషన్ ప్రకారం ఉన్న ఓటర్ల జాబితాను గందగోళం చేశారన్నారు. 2010వ సంవత్సరం నుంచి ఓటర్ల జాబితా సక్రమంగా లేదన్నారు. ఓటర్ల జాబితాలు గందరగోళంగా ఉన్నాయని గత మూడు సంవత్సరాల నుంచి తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నా అధికారులకు మాత్రం పట్టడం లేదన్నారు. అక్రమాలపై ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి అప్పటి కలెక్టర్‌ను తీవ్రంగా మందలించడంతోపాటు చర్యలు తీసుకున్నారన్నారు. అయినా నిస్సిగ్గుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోకపోతే తగినమూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ శ్రీకాంత్ గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసి ఉన్నారని, నగరంలో జరిగే అక్రమాలపై దృష్టిసారించాలన్నారు. 2005లో నెల్లూరు ఆర్‌డివో కార్యాలయంలో దొంగ ఓట్లు వేస్తుంటే తమ కార్యకర్తలు రెడ్‌హ్యాండెట్‌గా పట్టించారని గుర్తుచేశారు. ప్రజలు తమవైపు ఉన్నారని, ఎన్నికల్లో అసమర్థ కాంగ్రెస్, అవినీతి పిల్ల కాంగ్రెస్‌ను తరిమికొడతారని రవిచంద్ర తెలిపారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూరల్ కన్వీనర్ కిలారి వెంకటస్వామినాయుడు, తెలుగుయువత జిల్లా అధ్యక్షులు పమిడి రవికుమార్‌చౌదరి, నాయకులు అన్నం దయాకర్‌గౌడ్, నూనె మల్లికార్జున, ధర్మవరపు సుబ్బారావు, మండవ రామయ్య, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, పాముల రమణయ్య, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

పట్టపగలు బుజబుజనెల్లూరులో దోపిడీ
* రూ.2.50 లక్షల సొత్తు గల్లంతు
* బెంబేలెత్తుతున్న ప్రజలు
నెల్లూరు, జూలై 15: పట్టపగలు దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న వృద్ధురాల్ని బెదిరించి రూ.2.50 లక్షల సొత్తును దోచుకెళ్లిన సంఘటన సోమవారం నగర పరిధిలోని బుజబుజనెల్లూరులో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఉచ్చూరు అరుణమ్మ అనే వృద్ధురాలు భర్త ప్రభాకర్‌రెడ్డి మృతి చెందడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉంటోందని గ్రహించిన దొంగలు ఇనుపరాడ్‌తో ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే బాత్‌రూమ్‌లో ఉన్న అరుణమ్మ తలుపులు తెరవడాన్ని గమనించి బయటకు వచ్చింది. దొంగ రాడ్డు చూపించి అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఒంటిపై ఉన్న 10 సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రూ.10వేల నగదును దోచుకొని పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత బాధితురాలు చుట్టుపక్కల వారికి తెలియజేయడంతో స్థానికులు ఐదవ నగర పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, క్లూస్ టీం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మహిళ నుండి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇంట్లో ఒంటరిగా ఉందని బాగా గమనించిన వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చనని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
బెంబేలెత్తుతున్న ప్రజలు
నిత్యం ఏదోఒక ప్రాంతంలో పట్టపగలు దొంగలు మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడి బంగారు నగలు, నగదు దోచుకెళ్లడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దొంగలపై నిఘా ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులు క్రైం సమావేశాల్లో సూచనలు ఇస్తున్నా సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదని, గస్తీలు నామమాత్రంగా చేపడుతున్నారని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దొంగలపై పటిష్టమైన నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అవినీతిని అంతమొందించేందుకు
యువత ముందుకు రావాలి
* టిడిపి నేత సోమిరెడ్డి పిలుపు
నెల్లూరు, జూలై 15: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు యువత ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నగరంలోని 28,29 డివిజన్లకు సంబంధించిన యువకులు పార్టీలో చేరిన సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ సిద్ధాంతాలు లేని పార్టీల కోసం యువత పోరాడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా రాజకీయ ప్రవేశం చేయాలంటే దేవతలను పూజిస్తారని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరాలంటే జైలుకు పోవాల్సిందేనన్నారు. రాష్ట్రాన్ని పాలించగల ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడు మాత్రమేనన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి పరిపాలన, సమర్థ నాయకత్వం కావాలని ప్రజలు ఆలోచిస్తున్నారని, అది చంద్రబాబుకే సాధ్యమన్నారు. సిద్ధాంతం లేని రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడంపై ప్రజలు ఆలోచనలో పడ్డారన్నారు. జిల్లాలో రానున్న రోజుల్లో టిడిపిలోకి భారీగా వలసలు ఉంటాయన్నారు. 28,29 డివిజన్లకు సంబంధించి 20 మంది యువకులు కొల్లూరు నారాయణనాయుడు ఆధ్వర్యంలో అనుచరులతో సోమిరెడ్డి, బీద రవిచంద్ర సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాయకులు కిలారి వెంకటస్వామినాయుడు, పడవల కృష్ణమూర్తి, అన్నం దయాకర్‌గౌడ్, బద్దెపూడి రవీంద్ర, జలదంకి సుధాకర్, నూనె మల్లికార్జున, భాలకృష్ణచౌదరి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా చైతన్య సదస్సును విజయవంతం చేయండి
బిజెపి నాయకుల పిలుపు
నెల్లూరుసిటీ, జూలై 15: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన జరిగే జిల్లా ప్రజాచైతన్య సదస్సును విజయవంతం చేయాలని జిల్లా భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు సురేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బిజెపి కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలు, అవినీతి, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై ప్రజా చైతన్య సదస్సులో చర్చిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 11వ తేదీన హైదరాబాదులో జరిగే నవభారత యువ సమ్మేళనానికి జిల్లా నుంచి యువకులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో భావి భారత ప్రధాని ప్రస్తుత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఎన్నడు లేని విధంగా యువకులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, డాక్టర్ వరదయ్య, కె సుధాకర్, అన్న శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మా నామినేషన్లు సక్రమమే
ఎన్నికల అధికారికి అభ్యర్థుల అప్పీలు
నెల్లూరుసిటీ, జూలై 15: జిల్లాలోని 931 పంచాయతీల్లో 303 క్లస్టర్ కేంద్రాల్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ పరిశీలన పర్వం ఆదివారం పూర్తయిన విషయం తెలిసిందే. సర్పంచ్ పదవులకు సంబంధించి 74 నామినేషన్లు తిరస్కరించగా, వార్డులకు సంబంధించి 520 నామినేషన్లు తిరస్కరణకు గురయినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వార్డులు, సర్పంచ్ స్థానాలకు గాను 26,521 నామినేషన్లు తేలాయి. వీటిలో సర్పంచ్ పదవులకు 4382 నామినేషన్లు, వార్డులకు 22,139 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్లను తిరస్కరించిన కొంతమంది అభ్యర్థులు సోమవారం ఎన్నికల అధికారి వద్ద అప్పీలు చేసుకున్నారు. అందులో మొత్తం 24 మంది సర్పంచ్ అభ్యర్థులు, 138 మంది వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న వారు తమ నామినేషన్లు సక్రమైనవేని ఎన్నికల అధికారికి అప్పీలు చేసుకున్నారు. అప్పీలు చేసుకున్న వారి భవిష్యత్తు మంగళవారం తేలనుంది. డివిజన్లవారిగా వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు డివిజన్‌లో 10మంది సర్పంచ్‌లు, వార్డులకు పోటీ చేసే అభ్యర్థులు 40 మంది, గూడూరు డివిజన్ నుండి సర్పంచ్ 6, వార్డులు 38మంది, కావలి సర్పంచ్ 1, వార్డులు 10, నాయుడుపేట సర్పంచ్ 1, వార్డులు 25, ఆత్మకూరు సర్పంచ్ 6, వార్డులకు పోటీ చేసే 25 మంది అభ్యర్థులు ఎన్నికల అధికారికి అప్పీలు చేసుకున్నారు.

బెల్ట్‌షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు
మద్యం స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు
రాపూరు, జూలై 15: రాపూరు ఎక్సైజ్, ప్రొహిబిషన్ పరిథిలోని పలు ప్రాంతాలలో సోమవారం మద్యం బెల్ట్‌షాపులపై దాడులు చేసారు. పొదలకూరు మండలం చాట్లగుట్ట గ్రామసమీపంలో అక్రమంగా మద్యం నిల్వవున్న ఎం గోపాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 10 మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకోవటం జరిగిందని ఎక్సైజ్ సిఐ ప్రసాద్ తెలిపారు. అలాగే మరుపూరు గ్రామంలో దాడులు చేసి వెంకటరమణయ్య అనే వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ వున్న 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిధిలోని రాపూరు, పొదలకూరు, చేజర్ల మండలాలలో ఎక్కడన్నా అక్రమ మద్యం నిల్వ ఉన్నా, బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

సాయిబాబాకు వైభవంగా పల్లకీ సేవ
కోవూరు, జూలై 15: గురుపూర్ణిమ మహోత్సవాలలో భాగంగా సోమవారం సాయిబాబాకు వైభవంగా పల్లకీసేవ చేపట్టారు. మండలంలోని మసీదువీధి, పడుగుపాడులలో ఉన్న శ్రీషిరిడీ సాయిబాబా మందిరంలో ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసారు. రాత్రి హారతి, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాను రంగురంగు విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

15 మంది రౌడీషీటర్లు బైండోవర్
ఇందుకూరుపేట, జూలై 15: మండలంలోని 20 పంచాయతీలలో ఈనెల 27న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ముదివర్తిపాలెం, మైపాడు, కొరుటూరు తదితర గ్రామాలలోని 15 మంది రౌడీషీటర్లను తహశీల్దార్ అనుమతితో సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక ఎస్‌ఐ కె శేఖర్‌బాబు తెలిపారు. ఈ 15 మంది గతంలో పలువివాదాల్లో ఉండగా, వీరి రౌడీషీటర్లుగా పేర్కొన్నామన్నారు.

పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
అధికారులకు ఎన్నికల పరిశీలకులు రవిచంద్ర ఆదేశం
గూడూరు, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎం రవిచంద్ర ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి విమర్శలకు తావులేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. సోమవారం ఆయన గూడూరు ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని అన్ని మండలాల ఎన్నికల అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ల దాఖలు, పరిశీలన కార్యక్రమం ముగిసిందన్నారు. ఇక ఉపసంహరణకు ఈనెల 17వ తేదీ వరకు గడువు ఉన్నందున ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి వచ్చిన అప్పీళ్లను ఏవిధంగా పరిష్కరిస్తున్నారన్న దానిపై ఆయన ఆర్డీవోను ప్రశ్నించారు. ఎన్నికల చివరి రోజున పలువురు నామినేషన్లు ఒక్కసారిగా వేసేందుకు రావడంతో కొంత గందరగోళం ఏర్పడిందని ఆర్డీవో వివరించారు. అయినా అధికారులు నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి నామినేషన్ కేంద్రానికి వచ్చిన వారి దగ్గర నుండి నామినేషన్లు స్వీకరించారని తెలిపారు. అలాగే పరిశీలనలో వెంకటగిరి, వాకాడు మండలాలకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వచ్చినట్లు, వాటిని పరిశీలిస్తున్నట్లు ఆర్డీవో ఎన్నికల పరిశీలకులకు వివరించారు. వెంకటగిరి మండలం సోమసానిగుంట పంచాయతీ సర్పంచ్ పదవికి సంబంధించి నామినేషన్ వేసే సమయంలో కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఎన్నికల అధికారి చెప్పి, పరిశీలన రోజున కుల ధ్రువీకరణ పత్రం లేదని నామినేషన్ తిరస్కరించారని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఎల్లసిరి గోపాలరెడ్డి, పాశం సునీల్‌కుమార్‌లు ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. వాకాడు మండలం ముట్టెంబాక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్‌లో ఓటర్ల క్రమసంఖ్య తప్పుగా వేయడం, బలపరిచిన అభ్యర్థి క్రమసంఖ్య తప్పుగా వేసినందున నామినేషన్‌లను తిరస్కరించడంపై కూడా వైకాపా నాయకులు ఆర్డీవోకు అప్పీలు చేశారు. వాటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం అభ్యంతరాలను పరిష్కరించనున్నట్లు వారికి ఆర్డీవో తెలియచేశారు. ఈ సందర్భంగా సోమవారం అప్పీళ్లను ఆర్డీవో స్వీకరించనుండటంతో అధికమంది తమ అప్పీళ్లను దాఖలు చేయడానికి గూడూరు ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు.

* సవరించకుంటే ఆందోళన * టిడిపి జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర హెచ్చరిక
english title: 
tappula tadaka

ఓటేయడానికి గుర్తింపు కార్డు తప్పనిసరి

$
0
0

నిజామాబాద్ , జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు తప్పనిసరిగా తమ వెంట గుర్తింపు కార్డు తేవాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ కె.హర్షవర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఓటరు గుర్తింపు కార్డులను 22రకాలుగా ఎన్నికల సంఘం గుర్తించిదన్నారు. ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆదాయపు పన్ను గుర్తింపు కార్డు, సర్వీస్ గుర్తింపు కార్డు (సంబంధిత శాఖాధికారులతో జారీ చేయబడినది), బ్యాంకులు, పోస్ట్ఫాసుల ద్వారా ఫొటోలతో జారీ చేయబడిన పాస్‌బుక్‌లు, రైతుల గుర్తింపు కార్డులు, పాస్ పుస్తకాలను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తామన్నారు. ఆస్తి, పట్టా దస్తావేజులు, రిజిస్ట్రార్ డీడ్స్, రేషన్‌కార్డు, ఎస్సీ, ఎస్టీ, బిసి ధ్రువీకరణ పత్రాలు, పెన్షన్ డాక్యుమెంట్లు, స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డులు, ఆయుధాల లైసెన్సులు, అంగవైకల్య ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలతో కూడిన ఎటిఎం కార్డులు, బార్ కౌన్సిల్ ద్వారా సభ్యులుగా గుర్తించిన కార్డులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా సచివాలయం ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులు, ఉపాధి హామీ జాబ్‌కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల కార్డులు, స్మార్ట్‌కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు కూడా ఓటరు గుర్తింపు కార్డుగా పరిగణిస్తామన్నారు. పైన పేర్కొన్న 22 రకాల కార్డులలో ఏదైనా ఒక కార్డును ఓటర్లు తప్పనిసరిగా తమవెంట తీసుకుని రావాల్సి ఉంటుందని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ కోరారు.

జిల్లా అదనపు జెసిగా బాధ్యతలు స్వీకరించిన శేషాద్రి
నిజామాబాద్ టౌన్, జూలై 15: జిల్లా అదనపు జెసిగా నియమితులైన డాక్టర్ శేషాద్రి సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి ఎజెసి జయరామయ్య నుండి ఆయన చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎజెసిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎజెసి మాట్లాడుతూ, అందరి సహాయ సహకారాలతో జిల్లాను అభివృద్ధిపథంలో నడుపుతానని స్పష్టం చేశారు. తనకు గతంలో బోధన్ ఆర్డీఓగా పనిచేసిన అనుభవం ఉందని, జిల్లాలోని పరిస్థితులు తెలుసని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికి అందేలా చర్యలు తీసుకుంటానని ఆ దిశగా తనవంతు కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇప్పటివరకు ఎజెసిగా పనిచేసిన శ్రీరాంరెడ్డి గత నెలాఖరులో పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వరంగల్ డిఆర్వోగా పనిచేస్తూ పదోన్నతి పొందిన శేషాద్రి నిజామాబాద్ ఎజెసిగా నియమితులయ్యారు. సోమవారం ఆయన చాంబర్‌లో బాధ్యతలు తీసుకోగా, నిజామాబాద్ ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, తహశీల్దార్ రాజేందర్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్, ఆర్‌ఐ విజయ్‌కాంత్, సంక్షేమ శాఖాధికారులు, సిబ్బంది తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.

పండుగలు, ఎన్నికలు ఖాకీలకు సవాల్!
నిజామాబాద్ , జూలై 15: పోలీసులకు నెల రోజుల పాటు అగ్ని పరీక్షగా మారింది. ఓ వైపు పండుగలు, మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతోపాటు గ్రామాలలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. దీంతో సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన పోలీసులు పక్కా నిఘా వేశారు. రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు గురువారం నుండి ప్రారంభం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలను వేగవంతం చేశారు. అసాంఘిక శక్తుల కార్యకలాపాలు గతంలో జిల్లాలో వెలుగుచూశాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తీసుకుని బందోబస్తును పటిష్టం చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి నిఘాను పెంచారు. అదేవిధంగా బోనాల పండుగ ఇదే నెలలో జరుగనుండటంతో పోలీసులు సవాల్‌గా స్వీకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ కెవి.మోహన్‌రావు జిల్లా వ్యాప్తంగా పోలీసులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలను నిర్దేశించారు. అత్యంత పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించాలని, గొడవలకు తావు లేకుండా చూసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ జిల్లా అధికారులతో పాటు పోలీసు శాఖకు సూచించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొదటి విడతగా పోలింగ్ జరిగే గ్రామాలపై దృష్టిసారించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా భారీగా పోలీసు బలగాలను ఆయా గ్రామాలలో మోహరించారు. ఎన్నికల నిర్వహణతోపాటుగా పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని ఎస్పీ మోహన్‌రావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మంగళవారం నగర శివారులోని ఫంక్షన్ హాల్‌లో శాంతి కమిటీ సమావేశంను నిర్వహించగా, ఎస్పీ పాల్గొని సూచనలు చేశారు. ఇప్పటికే ఎన్నికల బందోబస్తుతో బిజీగా ఉన్న పోలీసులు పండుగలను సైతం ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా జరిగేలా కార్యాచరణ రూపొందించారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తేనే జిల్లా పోలీసు శాఖకు ఎన్నికల సంఘం నుండి ప్రశంసలు అందుతాయి. జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన మోహన్‌రావు సైతం జిల్లాలోని సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాన్ని రూపొందించారు. రాజకీయ ఒత్తిళ్లను తిప్పికొట్టి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు. వేలం పాట నిర్వహించే గ్రామాలపై డేగ కన్ను వేసి చర్యలు తీసుకునే విధంగా పోలీసులను అప్రమత్తం చేశారు. ఏదేమైనా జూలై మాసం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారనుంది. ఇదిలాఉండగా, గత రెండు నెలలుగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ రేంజ్ డిఐజి పోస్టును ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేసింది. సిబిసిఐడి విభాగంలో డిఐజిగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ను నిజామాబాద్ రేంజ్ డిఐజిగా నియమించింది. ఆయన రెండు రోజులు క్రితమే జిల్లాకు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో శాంతిభద్రతలపై పోలీసు అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఇదిలాఉండగా, ధర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో మావోయిస్టుల పేరిట వాల్‌పోస్టర్‌లు వెలువడం పోలీసులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఓ వైపు భారీగా బలగాలను మోహరించిన పోలీసు శాఖకు డివిజన్ కార్యదర్శి జగన్ పేరిట వాల్‌పోస్టర్‌లు వెలుగుచూడడంతో ఆయా ప్రాంతాలపై నిఘాను పటిష్టం చేశారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని చెప్పుకొచ్చిన పోలీసు అధికారులు, వాల్‌పోస్టర్‌లు నకిలీల పనేనని కొట్టిపారేస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులను మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోస్టర్‌లు అతికించడం వెనుక ఎవరి హస్తం ఉందనేదానిపై సీరియస్‌గా దృష్టిసారించి ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. మాజీలపై నిఘాను ఏర్పాటు చేశారు. వారి కదలికలను ఏప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవచ్చనే అనుమానాల మేరకు ఇప్పటికే పలువురు పాత నేరస్థులను బైండోవర్ చేశారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రితో మహేష్‌కుమార్ భేటీ
నిజామాబాద్ , జూలై 15: రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహేష్‌కుమార్‌గౌడ్ సోమవారం హైదరాబాద్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి మహేష్‌గౌడ్‌ను ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు ప్రకటించారు. తనకు కీలకమైన గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించేందుకు సహకరించిన తరహాలో, బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు కూడా తగినవిధంగా సహకారం అందించాలని కోరారు.

శిథిల భవనాలను వారంలోగా కూల్చివేయాలి
బల్దియా అధికారులను ఆదేశించిన ఇన్‌చార్జి కలెక్టర్
నిజామాబాద్, జూలై 15: నిజామాబాద్ నగరంలో పురాతన కాలానికి చెంది ఉండి, శిథిలావస్థకు చేరిన భవనాల యజమానులకు తక్షణమే నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లోపు కూల్చివేత చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పించే అధికారులను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, దురదృష్టవశాత్తు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సోమవారం నగరంలోని మాలపల్లి కాలనీలో ఆయన పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పురాతన కాలం నాటి భవనాలు శిథిలావస్థకు చేరడాన్ని గమనించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి, గడువులోపు కూల్చివేత చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు నగరంలో శిథిలావస్థకు చేరిన కేవలం 37 ప్రభుత్వ, ప్రైవేటు భవనాలకు సంబంధించి మాత్రమే నోటీసులు జారీ చేశారని, పురాతనమైనవి ఇంకా అనేకం ఉన్నాయని అన్నారు. ప్రతిచోట బల్దియా అధికారులు శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, తక్షణమే నోటీసులు అందించాలని, ఎవరైనా స్పందించని పక్షంలో గడువు అనంతరం బల్దియా అధికారులే కూల్చివేతలు చేపట్టి భవన యజమానులకు అపరాధ రుసుము విధించాలన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తిస్తూ అధికారులు ప్రత్యేక చొరవ ప్రదర్శించాలని హితవు పలికారు. కాగా, మాలపల్లి కాలనీలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉండడాన్ని గమనించి ఇన్‌చార్జి కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లపైనే మోకాలి లోతు వరకు గుంతలు ఏర్పడి, అందులో వర్షపు నీరు నిండి ఉండడం, రోడ్లపై బురద, మురికినీరు ప్రవహిస్తుండడం వంటి పరిస్థితులను గమనించి అధికారులపై అసహనం వెళ్లగక్కారు. సి.సి రోడ్లు చెడిపోవడం, ఇప్పటికీ పలుచోట్ల మట్టి రోడ్డే ఉండడం గమనించారు. ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే వాటర్‌ట్యాంకు ప్రాంతంలో లీకేజీని చూసి మండిపడ్డారు. లీకేజీ వల్ల కలుషిత నీరు కుళాయిల ద్వారా సరఫరా అవుతుందని, తద్వారా ప్రజలు అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే లీకేజీలకు మరమ్మతులు జరిపించాలని, ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. మంచినీటి ట్యాంకు చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఉన్నపళంగా తొలగింపజేయాలని ఆదేశించారు. మట్టి రోడ్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సి.సి రోడ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. ఉర్దూమీడియం బాలికల జూనియర్ కళాశాల ఎదురుగా మురికి కాల్వతో పాటు సి.సి రోడ్ల నిర్మాణం పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. కాలనీలో నివాస ప్రాంతాల నడుమ చెత్తను పారవేసేందుకు వీలుగా డబ్బాలు ఏర్పాటు చేయాలని, పశువులను రోడ్లపై కట్టివేయకుండా యజమానులకు నోటీసులు అందించాలన్నారు. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షిస్తూ, మెరుగైన వసతులు కల్పించేందుకు బల్దియాలోని ప్రతి ఉద్యోగి పాటుపడాలని, ఏమరుపాటు ఎంతమాత్రం తగదని అన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ వెంట మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ మంగతాయారు, తహశీల్దార్ రాజేందర్, బల్దియా అధికారులు సిరాజుద్దీన్, రషీద్ తదితరులు ఉన్నారు.

సమస్యలు పరిష్కరించాలని
కలెక్టరేట్‌కు తరలివచ్చిన బాధితులు
నిజామాబాద్ , జూలై 15: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, పలువురు కల్టెరేట్‌కు తరలివచ్చారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించారు. దీంతో కలెక్టర్ కార్యాలయం బాధితుల తాకిడితో సందడిగా మారింది. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హర్షవర్ధన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎపి సివిల్ సప్లయిస్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో హమాలీలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. జిల్లాలో వెంటనే సివిల్ సప్లయిస్ గోదాంలు నిర్మించి హమాలీలకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఇన్‌చార్జి కలెక్టర్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఓమయ్య మాట్లాడుతూ, గత ఆరేళ్లుగా సివిల్ సప్లయిస్‌కు సొంత గోదాంలు నిర్మించాలంటూ హమాలీలు ఆందోళనలు చేస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో సొంత గోదాంలు నిర్మించేందుకు నిధులు మంజూరైనా అధికారులు పట్టించుకోకపోవడంతో నిధులు వెనక్కి మళ్లిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఇరవై ఏళ్లుగా సివిల్ సప్లయిస్ గోదాంలో పనిచేస్తున్న హమాలీలు, కూలీ పనులు లేక పూట గడవడమే గగనంగా తయారైందన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సివిల్ సప్లయిస్‌కు సొంత గోదాంలను నిర్మించి హమాలీలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి బోజన్న, వెంకటేశం గుప్తా, మహబూబ్‌తో పాటు హమాలీలు పాల్గొన్నారు. అదేవిధంగా ఎస్‌టి హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా బంజారా విద్యార్థి సేవా సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు చేరుకుని వినతి పత్రం అందచేశారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని జిజి కళాశాల ప్రాంగణంలో ఉన్న ఎస్‌టి బాలికల వసతి గృహంలో దాదాపు 150 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని సంఘం ప్రతినిధులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్‌టి వసతి గృహాలలో అరకొర వసతులతో విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. జిజి కళాశాలలోని హాస్టల్‌లో మరుగుదొడ్లు, బాత్‌రూంలు లేక విద్యార్థినులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించినప్పుడే చదువులో రాణించేందుకు దోహదపడుతుందని సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ పెరుమాల్ నాయక్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని, వసతి గృహాలలో వసతులను మెరుగుపర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించిన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిని ఇన్‌చార్జి కలెక్టర్‌కు అందజేశారు. జీవో 075 ప్రకారం తమకు వివిధ పోస్టులలో అవకాశం కల్పించాలని వారు కోరారు.

‘పెట్రో’ వడ్డనపై సర్వత్రా నిరసనలు
అందోళనలకు సిద్ధమైన ప్రతిపక్షాలు
నిజామాబాద్ , జూలై 15: నెలన్నర రోజుల వ్యవధిలోనే నాలుగు పర్యాయాలు పెట్రోలు ధరలు పెంచడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లీటరుకు రూపాయిన్నర చొప్పున అదనపు వడ్డింపులు విధించడం వల్ల జిల్లాలో వాహన వినియోగదారులు ప్రతిరోజు దాదాపు 10 లక్షల రూపాయల అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది. ముడి చమురు దిగుమతుల వ్యయం పెరగడాన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థలు పెట్రోల్ ధరలను చీటికిమాటికి పెంచుతుండడం సామాన్య కుటుంబాలను కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అనేక పర్యాయాలు పెట్రో ధరలను పెంచడం వల్ల పేద, మధ్య తరగతికి చెందిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పలుమార్లు వంటగ్యాస్, కిరోసిన్, డీజిల్ ధరల పెంపు వల్ల నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందనంత ఎత్తుకు వెళ్లాయి. దీంతో పాటు సంక్షేమ పథకాలు సైతం అమలుకు నోచుకోకపోవడం వల్ల పేద ప్రజలు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూపాయికి కిలో బియ్యం పథకం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేయకపోగా, విమర్శలు గుప్పిస్తున్నారు. మంచినూనె, పప్పులు, కూరగాయల ధరలు తగ్గించలేని ప్రభుత్వం, కేవలం రూపాయికి కిలో బియ్యం అందించి, వివిధ రకాల పన్నులను పెంచడం ద్వారా ఆర్థిక దోపిడీని కొనసాగిస్తోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర సరుకులపై అది మరింత ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వంద వరకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. జిల్లాలో ప్రతిరోజు సగటున 5 లక్షల లీటర్ల డీజిల్, లక్షన్నర లీటర్ల పెట్రోల్ వినియోగం అవుతోంది. జిల్లాలో లక్షా 40 వేల వరకు ద్విచక్రవాహనాలు ఉండగా, ఆటోరిక్షాలు, కార్లు, బస్సులు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు మరో 40 వేల వరకు ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఎడాపెడా పెంచివేసి, తీవ్ర భారం మోపడంతో వాహనచోదకులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటిన తరుణంలో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం బడ్జెట్ సర్దుబాటు కాక అపసోపాలు పడాల్సివస్తోంది. ప్రత్యక్షంగా వాహనదారులకు ఈ అదనపు పోటుకు తోడు బడుగు జీవులు సైతం చీటికిమాటికి పెరుగుతున్న పెట్రో ధరల కారణంగా చార్జీల రూపంలో వాతలను చవిచూడాల్సి వస్తోంది. చమురు ధరలు పెరగడాన్ని సాకుగా చూపిస్తూ ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఛార్జీలను పెంచే అవకాశాలుండడం మధ్యతరగతి, సామాన్య, బడుగు జీవులపై ప్రభావం చూపనుంది. ప్రైవేట్ వాహన ఆపరేటర్లు కూడా ఇదే అదనుగా భావించి ఆర్టీసీ కంటే ఎక్కువ స్థాయిలో ధరలు పెంచడం జరుగుతుంది. ఈ పెట్రో మంటలను ఎలా తట్టుకోవాలన్న దానిపై బడ్జెట్ బాబులు తర్జనభర్జనలు పడుతున్నారు. పెట్రో ధరల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఈ పరిణామం పంచాయతీ ఎన్నికలపై ఎంతోకొంత ప్రభావం చూపుతుందనే ఆందోళన కాంగ్రెస్ అనుకూల ముద్ర వేసుకున్న అభ్యర్థులను వెంటాడుతోంది. పెరిగిన పెట్రో ధరల ప్రభావం వల్ల ఓటర్లు తమ పట్ల ఎక్కడ వ్యతిరేకత కనబరుస్తారోనని కాంగ్రెస్ మద్దతుదారులుగా బరిలోకి దిగిన అభ్యర్థులు హైరానాకు లోనవుతున్నారు.

సుంకెట దోషులను పట్టుకుంటాం
ఆర్మూర్ డిఎస్పీ రాంరెడ్డి
మోర్తాడ్, జూలై 15: మండలంలోని సుంకెటలో సర్పంచ్ అభ్యర్థులకు బెదిరింపు లేఖలు రాసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆర్మూర్ డిఎస్పీ ఆకుల రాంరెడ్డి తెలిపారు. మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కావాలనే కొందరు వ్యక్తులు ఆడిన నాటకం వల్లే సుంకెటలో ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాలు, ప్రార్థనా స్థలాల వద్ద ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం నిర్వహించరాదని ఆయన సూచించారు. ప్రజలకు రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు సంక్రమించిందని, అది దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. చాలా గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు సమాచారం అందుతోందని, ఎవరైనా సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే అలాంటి అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏకగ్రీవాల కోసం వేలం పాటలు నిర్వహించవద్దని, ఇప్పటికే సబ్ డివిజన్ పరిధిలోని పడిగెల్‌లో కేసు నమోదు చేసామని చెప్పారు. వేలం పాటలు నిర్వహించే గ్రామ కమిటీలు చట్టపరంగా చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సుంకెటలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీస్ పికెట్‌లను ఏర్పాటు చేశామని, ఎన్నికలు ముగిసే వరకు ఈ పికెట్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మోర్తాడ్‌లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. డిఎస్పీ వెంట భీమ్‌గల్ సిఐ వహీదుద్దీన్, స్థానిక ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తదితరులు ఉన్నారు.

‘రూరల్’ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చాటుకునేదెవరో..?
డిఎస్, మండవలకు ప్రతిష్టాత్మకం
నిజామాబాద్, జూలై 15: ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్, టిడిపి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిన నేపథ్యంలో, పంచాయతీ సమరంలో ఎవరిది పై చేయిగా నిలుస్తుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్లుగా రూరల్ నియోజకవర్గం నుండి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మండవ వెంకటేశ్వరరావుకు, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. 2009 సార్వత్రిక ఎన్నికలు, అనంతరం 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ నుండి పోటీ చేసి వరుసగా ఓటమి పాలైన డిఎస్, రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతారనే ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. ఈ విషయాన్ని డిఎస్ సైతం కొట్టిపారేయకుండా, తాను జిల్లాలోని తొమ్మిది సెగ్మెంట్లలో ఎక్కడి నుండైనా పోటీ చేస్తానంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ రూరల్ నియోజకవర్గంపై తన ఆపేక్షను ప్రదర్శించుకుంటున్నారు. ఈ పరిణామం కాస్తా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మండవ వెంకటేశ్వరరావుకు ఏమాత్రం రుచించడం లేదు. గత కొన్ని రోజుల క్రితమే రూరల్ సెగ్మెంట్‌లో డిఎస్ ప్రత్యేక చొరవ చూపుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సైతం అక్కడే నిర్వహించడంతో ఎమ్మెల్యే మండవ తన అనుచరులతో కలిసి వచ్చి తీవ్ర అభ్యంతరం తెలుపడం, ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకుని రభస నెలకొంది. ఈ సంఘటన అనంతరం మండవ వెంకటేశ్వరరావు డిఎస్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అర్బన్ సెగ్మెంట్‌లో ప్రజల తిరస్కారానికి గురై, రూరల్‌లో పోటీ చేసేందుకు డిఎస్ సిద్ధపడుతున్నారంటూ పత్రికాముఖంగా ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలను వేదికగా మల్చుకుని రూరల్ సెగ్మెంట్‌పై డిఎస్ పాగా వేయకుండా మండవ తన అనుచరుల ద్వారా పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గం పరిధిలోని డిచ్‌పల్లి, దర్పల్లి, నిజామాబాద్ మండలంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఇప్పటికే టిడిపి తరఫున అనుకూల అభ్యర్థులను బరిలో నిలుపుతూ, వారి గెలుపు కోసం మండవతో పాటు టిడిపి ఎమ్మెల్సీలు అర్కల నర్సారెడ్డి, విజి.గౌడ్, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు దినేష్‌కుమార్ తదితరులంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పంచాయతీ సమరంలో కాంగ్రెస్ మద్దతుదారులు ఓటమిపాలైతే రూరల్ సెగ్మెంట్‌లో పోటీ చేయడం అంత సునాయసం కాదనే సంకేతాలు డిఎస్‌కు అందించినట్లవుతుందని భావిస్తున్నారు. దీంతో నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ వంటి ప్రక్రియలను తెదెపా నేతలు ఎంతో నిశితంగా గమనిస్తున్నారు. నిజామాబాద్ మండలం ముల్లంగి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు కాంగ్రెస్ అనుకూల వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించిన సందర్భంగా టిడిపి, కాంగ్రెస్ వర్గాల మధ్య స్వల్పస్థాయిలో ఘర్షణ సైతం జరిగింది. ఇలా ప్రతీ విషయంలోనూ మండవ, డిఎస్‌లకు చెందిన వర్గీయులు ఈ నియోజకవర్గంలో పంచాయతీ పోరును సవాల్‌గా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ సైతం రూరల్‌లో మంచి పట్టు కలిగి ఉన్న తన ప్రధాన అనుచరుడైన నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్‌రెడ్డి ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం రూరల్ సెగ్మెంట్ పరిధిలోని స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అనుకూల అభ్యర్థులు గెలుపొందితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అది తన గెలుపునకు దోహదపడుతుందనే భావనతో డిఎస్ సైతం పకడ్బందీగానే పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. మొత్తమీద ఇద్దరు నేతలకు ఈ నియోజకవర్గంలో తొలివిడతలోనే జరుగుతున్న పంచాయతీ పోరులో పై చేయిని చాటుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది.

జిల్లా ఎన్నికల అధికారి హర్షవర్ధన్
english title: 
id must

అక్రమంగా జిల్లాకు మద్యం రాకుండా ఆరు చెక్‌పోస్టులు

$
0
0

ఒంగోలు, జూలై 15: జిల్లాలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా అక్రమమద్యం జిల్లాకు ప్రవేశకుండా ఆరుచెక్‌పోస్టులు, 14మొబైల్ టీంలను ఏర్పాటుచేసినట్లు ఒంగోలు డివిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం భాస్కరరావువెల్లడించారు. సోమవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా టంగుటూరులోని టోల్‌గేట్, చీరాల మండలంలోని ఈపూరుపాలెం, అద్దంకి మండలంలోని పుట్టావారిపాలెం, మార్కాపురం ప్రాంతంలోని దిగువమెట్ట, దోర్నాలలో, పామూరు దగ్గర ఒక చెక్‌పోస్టును ఏర్పాటుచేశామన్నారు. అదేవిధంగా జిల్లాలోని 14 ఎక్సైజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో 14 మొబైల్ పార్టీలను ఏర్పాటుచేశామని ఆ పార్టీలు ఈనెల 10న నాకాబందీని నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఇతర జిల్లాల నుండి అక్రమ మద్యం జిల్లాలోకి రాకుండా ఉండేందుకు సోమవారం ఇంటర్ జిల్లాల అధికారులు ముమ్మర దాడులు చేపట్టినట్లు ఆయన వివరించారు. జిల్లాకు సరిహద్దుప్రాంతమైన స్టువర్టుపురం ప్రాంతంలో దాడులు చేయగా నాలుగు కేసులు నమోదుచేసి 30లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ఆరువందల లీటర్ల ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఇద్దరిని అరెస్టుచేసినట్లు ఆయన వివరించారు.
జిల్లాలో ఎక్కడైనా బెల్టుషాపులు ఉంటే వాటిపై విజిలెన్స్‌దాడులు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా గత సంవత్సరం మద్యం షాపునకు ఎంత అయితే మద్యం బాటిళ్ళు సరఫరా చేస్తామో అదే సరఫరా జరుగుతుంది తప్ప ఎక్కువమోతాదులో మద్యం బాటిళ్ళను విడుదల చేయమని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికల సందర్భంగా అనధికార బెల్టుషాపుల నిర్వాహకులపై 225కేసులు నమోదుచేసినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా 63మందిపై బైండోవర్‌కేసులు పెట్టామన్నారు. 1761 మద్యంబాటిళ్ళను అనధికార మద్యంబెల్టుషాపుల వద్ద సీజ్‌చేసినట్లు భాస్కరరావు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా మిగిలి ఉన్న 47 మద్యంషాపులకు టెండర్లు పిలిచేందుకు సోమవారం నోటిఫికేషన్ జారీచేసినట్లు ఆయన వివరించారు. ఈనెల 21వతేదీన దరఖాస్తులు తీసుకునేందుకు తుదిగడవని, 22వతేదీన లాటరీపద్దతిన టెండర్లను తీస్తామని ఆయన తెలిపారు.
ఒంగోలు సర్కిల్ పరిధిలో తొమ్మిది, చీమకుర్తి సర్కిల్ పరిధిలో మూడు, పొదిలి సర్కిల్‌పరిధిలో నాలుగు, దర్శి సర్కిల్ పరిధిలో రెండు, కనిగిరి సర్కిల్ పరిధిలో ఏడు, చీరాల సర్కిల్ పరిధిలో తొమ్మిది, పర్చూరు సర్కిల్ పరిధిలో ఒకటి, అద్దంకి సర్కిల్‌పరిధిలో రెండు, కందుకూరు సర్కిల్ పరిధిలో మూడు, శింగరాయకొండ సర్కిల్ పరిధిలో నాలుగు, గిద్దలూరు సర్కిల్ పరిధిలో మూడు మద్యంషాపులకు టెండర్లను పిలుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం నిరోధానికి పకడ్బంధీ ఏర్పాటుచేసినట్లు ఒంగోలు డివిజన్ ఇఎస్ భాస్కరరావు తెలిపారు.

ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తా
ప్రకాశం ఆర్‌ఎంగా నాగశివుడు బాధ్యతల స్వీకరణ
ఒంగోలు, జూలై 15:ప్రకాశం ఆర్‌టిసి రీజనల్ మేనేజన్‌గా వనరుల నాగశివుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడారు. జిల్లాలోని ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతికి చర్యలు తీసుకుంటానని ఆయన వెల్లడించారు. బస్సులు వేళకు వచ్చేలా చర్యలు తీసుకుని ప్రయాణికుల్లో ఆర్‌టిసి పట్ల నమ్మకాన్ని కలిగిస్తానని చెప్పారు. ప్రధానంగా రీజియన్‌లోని కార్మికులు, సిబ్బంది సహకారంతో లాభాల బాటలో పెట్టేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆదాయం వచ్చే మార్గాల్లో సర్వీసులు పెంచుతానని ఆయన తెలిపారు. ప్రయాణికులు లేకుండా వృథాగా తిరిగే సర్వీసులపై ప్రత్యేక దృష్టిపెట్టి ఆ సర్వీసులను రద్దు చేస్తానని ఆయన వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలు, జీపులపై పోలీసు శాఖ సహకారంతో చర్యలు తీసుకుంటానని నాగశివుడు తెలిపారు. కందుకూరు డిపో మేనేజరుగా 1987 నుండి 90వ సంవత్సరం వరకు నాగశివుడు జిల్లాలో పని చేశారు. గతంలో పనిచేసిన అనుభవంతో ఆయన సంస్థను లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఒంగోలు డిపో మేనేజరుగా 1990 నుండి 93వ సంవత్సరం వరకు, 1993 నుండి 95 వరకు తిరుపతి డిపో మేనేజర్ గాను, 95 నుండి 98 వరకు తిరుమల డిఎంగాను, 98 నుండి 2001 వరకు కడప సిటిఎంగాను, అనంతరం 2003వ సంవత్సరం వరకు తిరుపతి సిటిఎంగాను నాగశివుడు పనిచేశారు. 2003 నుండి 2004 సంవత్సరం వరకు నెల్లూరులో కంట్రోలు ఆఫ్ స్టోర్స్‌గాను, 2006 నుండి 2008 వరకు తిరుపతిలో వర్క్స్ మేనేజర్ గాను, 2009వ సంవత్సరంలో విజయనగరం ఆర్‌ఎంగాను, 2010వ సంవత్సరంలో కడప జిల్లా ఆర్‌ఎంగాను, 2011 నుండి తిరుపతి ఆర్‌ఎంగా పనిచేస్తూ బదిలీపై జిల్లాకు వచ్చినట్లు ఆర్‌ఎం నాగశివుడు వెల్లడించారు.

రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి
* నెల్లూరు ఎంపి మేకపాటి స్పష్టం
కనిగిరి రూరల్, జూలై 15: రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుందని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకే వైఎస్‌ఆర్‌సిపి నడుచుకుంటుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మాజీ జడ్‌పిటిసి వైఎం ప్రసాద్‌రెడ్డి (బన్ని) నివాస గృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం విషయంలో వైఎస్‌ఆర్‌సిపి అభిప్రాయాన్ని గతంలోనే వ్యక్తం చేశామని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు సైగలతో సయ్యాటలాడుతూ ప్రజాసంక్షేమాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని ఆయన ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సిపిని ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి చెల్లలేవని, జరగనున్న పంచాయతీ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సిపి అత్యధిక స్థానాలలో గెలుపొందడం ఖాయం అని, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలను అధికారపార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని అన్నారు. రాష్ట్రంలో ఏసమయంలోనైనా సాధారణ ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్‌ఆర్‌సిపికి పట్టం కట్టేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీలు, డీజిల్, పెట్రోల్ గణనీయంగా పెంచి సామాన్య ప్రజానీకం నడ్డి విరిసిందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, గుడిపాటి ఖాదర్, పులి శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, పాలూరి రమణారెడ్డి, నలందా రవి, కె గురవయ్య, కె రమణారెడ్డి, టి రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1020 పంచాయతీల్లో 5,955 సర్పంచ్ అభ్యర్థులు
10302 వార్డుల్లో
25993 వార్డు సభ్యులు
మొదలైన ప్రచారం
ఒంగోలు, జూలై 15: జిల్లాలోని 1020పంచాయతీల్లో స్క్రూట్నీ తరువాత సర్పంచ్ అభ్యర్థులుగా 5,955మంది, వార్డుమెంబర్లుగా 25,993మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఒంగోలు డివిజన్‌లోని 346పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులుగా 1833మంది, 3600వార్డులకు 9,631మంది అభ్యర్థులు, కందుకూరు డివిజన పరిధిలో 475పంచాయతీలు ఉండగా 2,786మంది సర్పంచ్ అభ్యర్థులు, 4,634 వార్డులకు11,607మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా మార్కాపురం డివిజన్ పరిధిలో 199పంచాయతీలు ఉండగా 13,36మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,068వార్డులకుగాను 4,755మంది వార్డుమెంబర్లు ఎన్నికల బరిలో ఉన్నారు.పోటీలో ఉన్న అభ్యర్థులకు ఈనెల 17వతేదీన గుర్తులు రానున్నాయి. గుర్తులు రాకపోయినప్పటికి పోటీలో ఉన్న అభ్యర్థులు ముమ్మరప్రచారంలో మునిగితెలుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులతోపాటు వారి బంధుగణం కూడా ప్రచారహోరెత్తిస్తున్నారు. ప్రధానంగా రాత్రి ఏడుగంటలు దాటితే చాలు ఓటర్ల ఇంటిముందు పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యక్షవౌతున్నారు. తాము పోటీలో ఉన్నాము తమకు ఓటు వేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. కొంతమంది పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను బెదిరించే కార్యక్రమంలో కూడా నిమగ్నవౌతున్నారు. కోస్తాతీరప్రాంతంలో రొయ్యల చెరువులు ఉన్నాయి. ఆప్రాంతంలోని రొయ్యల చెరువుల యజమానుల వద్దనుండి బలవంతంగా నగదువసూలుచేయటమే కాకుండా ఓట్లుతమకు వేయకుంటే రొయ్యల చెరువుల అంతు చూస్తామంటూ కూడా బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. పోటీలో ఉన్న అభ్యర్థులకు రొయ్యల చెరువులు యజమానులు సహకరించకపోతే రొయ్యలు కౌంట్‌లో ఉన్న దశలో విషగుళికలు వేస్తారన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పంచాయతీ ఎన్నికలు రొయ్యల చెరువుల యజమానులు ప్రాణసంకటంగా మారిందనే చెప్పవచ్చు.

‘తెలుగుభాషకు వెలుగుదివ్వె ఘంటసాల’
ఒంగోలు , జూలై 15 : తెలుగుభాషకు వెలుగు దివ్వె అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని పలువురు వక్తలు కొనియాడారు. ఘంటసాల నేషనల్ ఆర్డ్స్ అకాడమీ 108రోజుల పాటు నిర్వహిస్తున్న ఘంటసాల ఆరాధనోత్సవాల కార్యక్రమం రాష్ట్ర సంగీత సాహిత్య చరిత్రలో నూతన అధ్యాయనానికి నాంది పలుకుతుందని అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కుర్రా ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సివియన్ రీడింగ్ రూము ఆవరణలో నిర్వహిస్తున్న నిర్విరామ ఘంటసాల గాన సంగీత విభావరికి ముందుగా జిల్లాకు చెందిన సినీ హీరో బూచేపల్లి కమలాకర్ ఆకస్మిక మరణానికి సభ 2 నిమిషాల పాటు వౌనం పాటించి నివాళులు అర్పించింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో అభినవ ఘంటసాల బాలయోగి గానామృతం శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడించింది. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించిన కుర్రా ప్రసాద్‌బాబు మాట్లాడుతూ తెలుగు భాషా వికాసానికి వెలుగు దివ్వెల ఘంటసాల మన మధ్య నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఎంతో సాహసోపేతమైన ఈ నిర్విరామ ఘంటసాల సంగీత విభావరి కార్యక్రమాన్ని చేపట్టి అద్వితీయంగా నిర్వహిస్తున్న ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీకి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సోమవారంతో సంగీత విభావరి కార్యక్రమం 65 రోజులు పూర్తి చేసుకున్నట్లు ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు తాటికొండ విజయ్‌కాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ మేనేజర్ కళ్ళగుంట కృష్ణ, జిల్లా సాహిత్య సాంస్కృతిక సంస్థల ఐక్య వేదిక గౌరవాధ్యక్షులు ఎం మల్లికార్జున్‌రావు, ఇళయరాజ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, చదరంగ సమాఖ్య అధ్యక్షుడు పివి కృష్ణ, యన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గాయనీ గాయకులు తాటికొండ బాలయోగి, లక్ష్మీ తులసీ, అప్పికట్ల రత్తయ్య, కీ బోర్డు రవి, తబలా బాలాజీలు తమ ప్రతిభా పాఠవాలతో శ్రోతల అభిమానాన్ని చూరగొన్నారు.

కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి
ఒంగోలు, జూలై 15: కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలని, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఒంగోలులో ర్యాలీ నిర్వహించి స్థానిక చర్చి సెంటర్‌లో మానవహారం చేపట్టారు. 30 కళాశాలల నుండి కాంట్రాక్టు అధ్యాపకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక చర్చి సెంటర్ నుండి నెల్లూరు బస్టాండ్ వరకు ప్లేకార్డులు ప్రదర్శించి ర్యాలీ చేపట్టారు. తమకు ఉద్యోగభద్రత కల్పించేంత వరకు సమ్మె ఆపేది లేదని అసోసియేషన్ అధ్యక్షులు కె సురేష్ తేల్చి చెప్పారు. కలెక్టరేట్ ఎదురుగా అధ్యాపకులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 22వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షా శిబిరాన్ని ఫోరంఫర్ గుడ్‌గవర్నెన్స్ జిల్లా కార్యదర్శి ఎస్‌కె షంషేర్ అహ్మద్ ప్రారంభించి మాట్లాడారు. చాలీ చాలని వేతనాలతో 13 సంవత్సరాల నుండి ఊడిగం చేయించుకొని క్రమబద్దీకరణ చేయక పోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఆర్‌సిహెచ్ రంగయ్య, పి మాధవరావు, సుబ్బారెడ్డి, నర్సారెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఈశ్వరుడు, కాశీ రత్నం, బాబూరావు, సంయుక్త, హేమలత, పద్మజ, నాయక్, ఆంజనేయులు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఒంగోలు అర్బన్, జూలై 15: పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఒంగోలు నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నగర ముఠా కార్మిక సంఘం కార్యాలయం నుండి సిపిఐ కార్యకర్తలు ప్రదర్శనగా వెళ్ళి అద్దంకి బస్టాండ్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజలపై భారాలు మోపుతూ గత ఆరువారాల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెంచడం వలన సామాన్య మానవులపై అధిక భారం పడిందన్నారు. దీని ప్రభావం వలన నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అవినీతి పరులను ప్రోత్సహిస్తూ రూపాయి మారకపు విలువ పడిపోయిందనే సాకుతో విచ్చల విడిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర సిపిఐ నాయకులు కె సుభాన్ నాయుడు, ఎస్‌డి సర్థార్, చినిగే సుబ్బారావు, చంధ్రశేఖర్, వెంకటేశ్వర్లు, మురళి, కుమారి, మస్తాన్ , గాంధీ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు బ్యాంకర్లు ఆర్థిక సహాయం అందించాలి
జిల్లాకలెక్టర్ విజయకుమార్
ఒంగోలు, జూలై 15: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధిమార్గాలపై శిక్షణ ఇచ్చి ఆర్థిక సహాయం అందించేందుకు బ్యాంకర్లు కృషిచేయాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి మార్గాలపై రూడ్‌సెట్ ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలపై బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతకు సంక్షేమశాఖల ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు సమగ్ర ప్రణాళికను తయారుచేయటం జరుగుతుందన్నారు. జిల్లాలో సంక్షేమ శాఖల ద్వారా గ్రామాల్లో వివిధ పథకాల క్రింద నిరుద్యోగులకు రుణాలు అందించేందుకు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలో ఉత్సాహంగా ఉన్న లబ్ధిదారులు వారు కోరుకున్న పరిశ్రమ స్థాపించేందుకు అవసరమైన శిక్షణ రూడ్‌సెట్ ద్వారా ఇప్పించనున్నట్లు చెప్పారు. జిల్లాలో గత సంవత్సరం నాలుగువందల కోట్లరూపాయలు స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.నిరుద్యోగుల ఉపాధి అవకాశాలపై శిక్షణ ఇవ్వటం, వారు కోరుకున్న యూనిట్లపై ఎంత సంపాదించవచ్చు, ఎంత బ్యాంకులకు చెల్లించవచ్చు అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటారన్నారు. ఈసమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ పద్మజ, లీడ్ డిస్ట్రిక్ మేనేజరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

* 14 మొబైల్ టీంలు ఏర్పాటు * 47 మద్యంషాపులకు నోటిఫికేషన్ విడుదల * ఎక్సైజ్ ఇఎస్ భాస్కరరావు వెల్లడి
english title: 
check posts

ఊగిసలాట!

$
0
0

శ్రీకాకుళం, జూలై 15: గ్రేటర్ మున్సిపాలిటీ విలీన సమస్య పెండింగ్‌లో ఉన్న ఖాజీపేట, పాతృనివలస, తోటపాలెం, కుశాలపురం పంచాయతీల్లో ఎన్నికల సందడిపై ఊగిసలాట నెలకొంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్న ఈ పంచాయతీల్లో ఆదివారం సాయంత్రం ఆందోళన చెలరేగింది. తొలుత ఈ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవద్దని ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. దీనిపై ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, నామినేషన్ స్వీకరణ కూడా పూరె్తైంది. సర్పంచ్ పదవులపై ఆశలు పెంచుకున్న అభ్యర్థులు మందీమార్భలంతో రంగంలో దిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. అంతేకాకుండా తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని కూడా పూర్తిచేసి అక్కడ ఓటర్లకు తాయిళాలు అందించే పనిలో బరిలో ఉన్న అభ్యర్థులుండగా ప్రభుత్వం ఈ పంచాయతీలపై మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటీషన్ వేయడంపై కలకలం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఆశావహులు హైకోర్టుకు పరుగులు తీసి నామినేషన్‌పత్రాలను కూడా న్యాయస్థానం ముందుంచి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగేలా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం సవాల్ చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించి తీర్పు వెలువరిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ పదవుల కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా ఓటర్లు కూడా ఎన్నికలు జరుగుతాయని ఆశలు పెంచుకున్నారు. ఇంతలో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న పుకార్లు షికార్లు చేయడంతో ఇటు ఆశావహులు, అటు ఓటర్లు ఒకింత ఉత్కంఠకు లోనవుతున్నారు. మధ్యంతర ఉత్తర్వులపై మంగళవారం తీర్పు వెలువడుతుందని రాజధాని వర్గాలు ఇచ్చిన సమాచారంపై ఈ నాలుగు పంచాయతీల్లో వాడివేడి చర్చ సాగుతోంది. తాత్కాలికంగా ప్రచారాలకు తెరదింపి కోర్టు ఉత్తర్వుల కోసం ఆశావహులు నిరీక్షించడంతో నిశ్శబ్ధ వాతావరణం చోటుచేసుకుంది. ఎన్నికల సందడి ఎక్కడ తప్పిపోతుందోనన్న భయం ఓటర్లను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ ఊగిసలాటకు ఎలా తెరపడుతుందో వేచిచూడాలి మరి.

‘ ఉపాధి’ పీకేస్తాం!
శ్రీకాకుళం, జూలై 15: రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు ప్రధాన ఆయుధంలా అధికార పార్టీ నేతలు వినియోగిస్తున్నారు. పంచాయతీ ఓటర్లలో 30 శాతం మంది ఓటర్లు ఉపాధి హామీ పథకంలో జామ్ కార్డు దారులే! సుమా రు ఐదు లక్షల మంది ఓటర్లు తాము సూచించిన అభ్యర్ధులకే ఓటు వేస్తారన్న ప్రగాఢ విశ్వాసంతో ఆ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వారంతా పంచాయతీ ఎన్నికల వేళ ప్రచార సారథుల్లా పనిచేయడం ఆరంభించారు. జిల్లా అంతటా ఇదే తీరు ఉన్నప్పటికీ, శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ పంచాయతీ ఓటర్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు సోమవారం ఫీల్డు అసిస్టెంట్‌పై ఫిర్యాదు చేసారు. ఓటర్లను బెదిరించి జాబ్ కార్డులు పీకేస్తామని, ‘ఉపాధి’ లేకుండా చేస్తామని హెచ్చరికలు చేస్తున్న వైనాన్ని సానివాడ ఓటర్లు వెలుగులోకి తీసుకువచ్చారు. ఓటర్లను హెచ్చరిస్తూ అధికార పార్టీ అభ్యర్ధులకే ఓట్లు వేయాలంటూ కొంతమంది ఫీల్డు అసిస్టెంట్లు హెచ్చరికలు జారీ చేస్తున్న కథనాలు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ ముందుకు రావడంతో పంచాయతీల్లో ‘అథికార’ దుర్వినియోగం బట్టబయలు అయ్యింది. పంచాయతీ ఎన్నికలలో తాము సూచించిన అభ్యర్థికి ఓటు వేయని పక్షంలో ఉపాధి హామీ పనులు చేయు కూలీలకున్న జాబ్ కార్డులు రద్దు చేస్తామని శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ పంచాయతీకి చెందిన ఓటర్లు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కొంతసేపు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసారు. ఓ ఫీల్డ్ అసిస్టెంటు నేరుగా ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, జాబ్ కార్డులు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని వారంతా ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్పందిస్తూ విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటానంటూ ఫిర్యాదుదారులైన లక్ష్మీ, అప్పలనర్సమ్మలకు భరోసా ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు జిల్లాలో అన్నీ పంచాయతీల్లో ఉన్నాయి. కాని - సానివాడ ఓటర్లు స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకురావడం గమనార్హం. ఇటీవల టెక్కలి డివిజన్‌లో కూడా ఇటువంటి హెచ్చరికలు వినిపించాయి. కేంద్ర ప్రభుత్వంచే అమలు చేస్తున్న మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండోవిడతగా 2007, మే 3న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపథం కార్యక్రమంలో ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో శ్రీకాకుళం జిల్లా ఈ పథకాన్ని అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చేతులమీదుగా ఇటీవలే జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అచీవ్‌మెంటు అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల కోసం ఆ శాఖకు చెందిన ఫీల్డు అధికారులే ఓటర్లకు జాబ్‌కార్డులు తొలగిస్తామంటూ బెదిరించడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి ఫీల్డ్ ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని విచారణ నిర్వహించాలంటూ ఆదేశించారు. జిల్లాలో 38 మండలాల్లో 1104 పంచాయతీల్లో 4369 ఆవాసాలకు 5,06,004 జాబ్‌కార్డులు మంజూరు చేసారు. అయితే, 38 మండలాలకు 1099 పంచాయతీల్లో 15,63,838 ఓటర్లు ఉన్నారు. ఇందులో 30 శాతం వరకూ ఉపాధి హామీ కూలీలు ఉండడంతో వారి ఓటుబ్యాంకు అధికార పార్టీ అభ్యర్ధులు దక్కించుకునేందుకు ఫీల్డు అసిస్టెంటులను ప్రచార సారథులుగా వినియోగించుకుంటున్నారు. ఏడేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినంతమాత్రన పంచాయతీల తలరాత అమాంతం మారిపోతుందని విశ్వసించగల వీల్లేదు. అట్టడుగు స్థాయి చట్టసభగా పౌరజీవనం మెరుగుదలకు ఊరంతా ఒక్కమాటపై సమిష్టి కృషి సాగించాల్సిన పంచాయతీలకు అసలు ఈ చౌకబారు రాజకీయాలతో పనేముంది? గ్రామపంచాయతీ ఎన్నికలను ఆసాంతం రాజకీయాల్లో ముంచి తేలుస్తున్న పార్టీలే ప్రలోభస్వామ్యానికి, విలువల ఖూనీకి పోటాపోటీగా పాల్పడుతున్నాయి. గ్రామస్వరాజ్యాన్ని ఎండమావిగా స్థీరీకరిస్తున్నాయి! అందుకు తార్కణమే జిల్లాలో ఉపాధిహామీ పథకం పటిష్టంగా అమలు చేయాల్సిన ఫీల్డు ఆఫీసర్లు కొందరు పంచాయతీ ఎన్నికల ప్రచార సారధులుగా మారి జాబ్ కార్డులు పీకేస్తాం...ఉపాధి లేకుండా చేసేస్తాం...తాము సూచించిన అభ్యర్ధులకు ఓట్లు వేయకపోతే రోజూ కూలీలు కట్! అంటూ చేసే బెదిరింపులు పంచాయతీ బ్యాలెట్‌పై ధనం, మద్యం ప్రభావం లేకుండా అవసరమైన చర్యలన్నీ చేపడతామంటున్న ఎన్నికల అధికారి ప్రకటన ఏ మేరకు అమలవుతుందన్నదే అంతిమంగా ఎన్నికల వాసిని నిగ్గుతేల్చే కీలకాంశం!

ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చర్యలు
శ్రీకాకుళం, జూలై 15: ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం సాయంత్రం మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల విధులకు నియమించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి విధిగా పాటించాలని పేర్కొన్నారు. ప్రతి మండలానికి ఒక బృందాన్ని నియమించామని, ఆ బృందం అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డులు ఒక పంచాయతీలో ఉంటే అటువంటి చోట్ల పోలింగ్ కేంద్రాలు తగ్గించే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఆరువందల మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిందని పేర్కొన్నారు. మండలాల్లో రూట్లు, జోన్ల వివరాలను పూర్తిస్థాయిలో అందించాలని ఆదేశించారు. ఈ నెల 18వ తేదీన స్టేజి-2 అధికారుల శిక్షణా కార్యక్రమ్నా ఏర్పాటు చేయాలన్నారు. స్టేజ్-2 అధికారులుగా 452 మందిని నియమించామని చెప్పారు. పోలింగ్ అధికారి మెటీరియల్, కౌంటింగ్ మెటీరియల్ ఈ నెల 18వ తేదీ నాటికి అందించుటకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఎన్నికలసామాగ్రి పంపిణీ కేంద్రాలను చక్కగా ఏర్పాటుచేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది అందరూ సాధ్యమైనంత వరకు సమయపాలన పాటించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్ విధానం మండల స్థాయిలో ఏర్పాటు చేసిన తరువాత మండలాలతో జిల్లాకలెక్టర్ మొదటిసారిగా నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషాఖాసీం, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీఒ గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముంతు ఆర్టీసి అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఒక మండలం నుండి మరో మండలానికి ఎన్నికల విధులకు హాజరు కావడానికి అవసమరగు బస్సులను సకాలంలో నడిపేందుకు చర్యలు చేపట్టాలని ఆర్టీసి ప్రాంతీయ మేనేజర్ అప్పన్న, డిప్యూటీ సిటిఎం సత్యనారాయణలను ఆదేశించారు.

కారులో తరలిస్తున్న రూ. 29 లక్షలు స్వాధీనం
ఇచ్ఛాపురం, జూలై 15: ఆంధ్రా నుండి ఒడిస్సాకు కారులో తరలిస్తున్న 29 లక్షల రూపాయలు పట్టుకున్నట్లు సిఐ రవికుమార్ తెలిపారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో పురుషోత్తపురం వద్ద ఎక్సైజ్ పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ కేంద్రం వద్ద సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిస్సాలో బెంకనాల్ సమీపంలో వున్న తాల్చేరుకు చెందిన బాబులాల్‌తుళ్, అతని కుమారుడు కిషాన్‌లాల్‌తుళ్‌లు ఆంధ్రా వైపు ఇండికా కారులో వస్తుండగా తనిఖీ చేసారు. కారులో రెండు సంచుల్లో 29 లక్షల రూపాయలు ఉండడాన్ని పోలీసులు గమనించారు. దీనిని ఎక్కడకు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా తమకు తాల్చేరులో బంగారం షాపు ఉందని, వైజాగ్‌లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నామని పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. తమకు వైజాగ్ దగ్గర అరకులో కూడ ఒక ఫ్యాన్సీదుకాణం ఉందని వారు తెలిపారన్నారు. దీనితో పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని దానికి సంబంధించిన పత్రాలను తీసుకురావాలని వారిని ఆదేశించినప్పటికి సాయంత్రం 7 గంటల వరకు వారు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో ఈ నగదును తహశీల్దార్ ముందు హాజరుపరిచారు. నగదును ట్రజరీలో జమచేయడంతోపాటు ఈ వివరాలను ఆదాయపుపన్ను శాఖాధికారులకు తెలియజేయడం జరుగుతుందని సి ఐ రవికుమార్ తెలిపారు.
మధనాపురంలో రెండు లక్షలు స్వాధీనం
బూర్జ : గ్రామ పంచాయతీల ఎన్నికల దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో మధనాపురం కూడలి వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం వాహనాలను తనిఖీచేసే సమయంలో పాలకొండ నుండి బూర్జవైపు వెళుతున్న కంఠ నరసింహమూర్తి అనే వ్యక్తివద్ద రెండు లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించామన్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

ఐ.టి ప్రవేశాలు వాయిదా
* ఎన్నికల కోడ్ అడ్డంకి
ఎచ్చెర్ల, జూలై 15: ఈ విద్యాసంవత్సరంలో ఐ.టి.ఐ కోర్సుల్లో అడ్మిషన్లు చేరగోరు అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి నిర్వహించాల్సిన కౌనె్సలింగ్ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. జిల్లాలో 19 ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐల్లో అడ్మిషన్ పొందేందుకు వీలుగా 44,091 దరఖాస్తులను విక్రయించారు. అయితే 2447 మంది ఆసక్తి కనబరిచి ఐటిఐ కోర్సుల్లో చేరేందుకు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరిచి కౌనె్సలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. ఇంతలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వీటిని వాయిదా వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నెల 18 నుంచి 24వ తేదీవరకు కౌనె్సలింగ్ ప్రక్రియ పూర్తిచేసేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేసి కాల్‌లెటర్‌ను కూడా అభ్యర్థులకు బట్వాడా చేశారు. 3,150 సీట్లకు గాను 2,447 మంది దరఖాస్తు చేసుకోవడంతో ఐ.టి.ఐ అడ్మిషన్లపై ఆసక్తి తగ్గిందని అధికారులు చెప్పకనే చెబుతున్నారు. ప్రభుత్వ ఐ.టి.ఐ.లైన ఎచ్చెర్ల, డిఎల్‌టిసి,రాజాం, పలాస, సీతంపేటలలో 840 సీట్లు ఉండగా మిగిలిన 14 ఐటిఐలలో 2,310 సీట్లు ఉన్నాయి. దరఖాస్తులు తక్కువ కావడంతో సీట్ల భర్తీ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదంలేకపోలేదు.
అడ్మిషన్ల కౌనె్సలింగ్ వాయిదా
ఐటిఐ సీట్ల భర్తీకి ఈ నెల 18 నుంచి 24వ తేదీవరకు నిర్వహించాల్సిన కౌనె్సలింగ్ వాయిదా పడినట్లు ప్రభుత్వ బాలికల ఐ.టి.ఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ రాడ కైలాసరావు స్పష్టంచేశారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరిగి తేదీలు ఖరారు చేసిన అనంతరం సమాచారం అందిస్తామన్నారు.

ఎపి టెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి
* డిఈవో అరుణకుమారి
శ్రీకాకుళం, జూలై 15: రాష్టవ్య్రాప్తంగా ఎపి టెట్-2013 విడుదలైందని, అర్హత కలిగిన అభ్యర్ధులు షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎపి ఆన్‌లైన్, మీసేవా, ఈ సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు అందజేయడానికి ఈ నెల 16వ తేదీ నుండి ఆగష్టు ఒకటవ తేదీ వరకు ఉందన్నారు. హాల్‌టిక్కెట్లను ఆగష్టు 25వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం పేపర్ వన్, మద్యాహ్నం పేపర్ టూ పరీక్ష ఉంటుందన్నారు. ఫలితాలు సెప్టెంబర్ 20వ తేదీన వెలువడతాయన్నారు.

‘ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి’
పాతశ్రీకాకుళం, జూలై 15 : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఉద్యోగులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు ఉద్యోగులు పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు పలు మండలాల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌పై కలెక్టర్ పై విధంగా స్పందించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మోడల్ స్కూల్‌లో సీటును ఇప్పించాలని జలుమూరు మండలంకు చెందిన ఎస్.యర్రయ్య కోరారు. స్కూల్‌కు అదనపు తరగతుల భవనాన్ని మంజూరు చేయాలని పొందూరు మండలానికి చెందిన పలువురు కోరారు. తమ గ్రామానికి వౌళిక సదుపాయాలు కల్పించాలని పాలకొండకు చెందిన నాని కోరారు. తమకు పావలా వడ్డీ కింద బుణాలు మంజూరు చేయాలని పలాసా నుంచి మణి కోరారు. మంశదార కుడికాలువ 17 ఎల్ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని సరుబుజ్జలికి చెందిన వరాహనర్శింహం కోరారు. జెడ్పీ ఉన్నత పాఠశాలకు తెలుగుపండిట్‌ను నియమించాలని మందస మండలం హరిపురం నుంచి కె వెంకట్రావు కోరారు. డయల్ యువర్ కార్యక్రమంలోడుమా పీడీ కళ్యాణ్ చక్రవర్తి, డి ఎం హెచ్ ఓ గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది
శ్రీకాకుళం, జూలై 15: రాజ్యాంగ స్పూర్తితో అధ్యయనం చేస్తే రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, విభజన సాధ్యం కాదని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు, 368 ప్రకారం మూడు అంశాలు పరిగణనలోకి వస్తాయన్నారు. సాధారణ మెజార్టీ, ప్రత్యేక మెజార్టీ, మెజార్టీ రాష్ట్రాల అనుమతి అవసరమన్నారు. అయితే ప్రస్తుతం కె.కె పేర్కొంటున్నట్లు సాధారణ మెజార్టీ సరిపోదన్నారు. తప్పనిసరిగా రెండు, మూడు అంశాలను అనుసరించాల్సిందే అన్నారు. దీనికి కారణం రాష్ట్రంలో ఆరు పాయింట్ల ఫార్ములా ఉండటం వలన, విభజన చేయాల్సి వస్తే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ మార్చాల్సి ఉందని వివరించారు. ఏడవ షెడ్యూల్ మార్చాలంటే రాజ్యాంగం నిర్దేశించిన 2,3 పద్ధతులు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉందన్నారు. అందుకే వీటన్నటినీ అధ్యయనం చేయడం ద్వారా రాష్ట్ర విభజన సాధ్యం కాదని తెలిపారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణరావు, రోణంకి మల్లేశ్వరరావు, గుత్తు చిన్నారావు, గొర్లె కృష్ణారావు, డి.పార్థసారధి, బి.రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వామనావతారంలో
జగన్నాథుడు
శ్రీకాకుళం(కల్చరల్), జూలై 15: జగన్నాథ రథోత్సవాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఇలిసిపురం గుడించా మందిరంలో జగన్నాథ స్వామి సోమవారం దర్శనమిచ్చారు. రోజుకో దర్శన భాగ్యం కలగడం ద్వారా జీవితం ధన్యమవుతోందని భక్తుల నమ్మకం. సాయం త్రం అయితే సరి ఆలయం వద్ద భక్తులు క్యూలైన్‌లో వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు. పూరీకి చెం దిన రఘువీర్‌దాస్, బ్రహ్మాజీ, బావాజీల నిర్వహణలో ఒడిశా విధానాన్ని అనుసరించి ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా గుజరాతిపేటలో తెలుగువారి సంప్రదాయాన్ని అనుసరించి పెంటా వంశీయులు స్వామిని నృసింహావతారంలో అలంకరించా రు. ఈ సందర్భంగా స్వామి వారి పేరున ప్రత్యేక పూజలు జరిపారు. అరసవల్లి సూర్యనారాయణదేవాలయం, మొండేటివీధి లక్ష్మీగణపతి ఆలయంలో జగన్నాథస్వామికి ప్రత్యేక పూజలుచేశారు.
జలుమూరులో...
జలుమూరు : మండల కేంద్రం జలుమూరులో వెలసియున్న జగన్నాథుడు సోమవారం వామనావతారంలో దర్శనమిచ్చారు. యధావిథిగా ఉదయం అర్చకులు వైద్యభూషణ భానూజీరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసారు.
స్వామి తీర్ధప్రసాదాలను పలువురు భక్తులు స్వీకరించారు. ముఖ్యంగా ఐదవరోజు ఎరాపంచమ్ కావడం, కొన్ని ప్రాంతాల నుం డి సాయంత్రం స్వామివారిని దర్శిం చి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జలుమూరుతోపాటు రామచంద్రాపురం, వెంకటాపురం, తమ్మయ్యపేట గ్రామాల నుండి భక్తు లు వచ్చి ఉత్సవంలో పాల్గొన్నారు.

పట్టుబడ్డ దొంగ ‘పోలీస్’

* నాలుగు బైక్‌లు స్వాధీనం
శ్రీకాకుళం , జూలై 15: దొంగలను పట్టుకొని ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసే దొంగగా మారి నాలుగు బైక్‌లు దొంగతనం చేసి పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌లకు చిక్కాడు. పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలకు వెళ్తే...జిల్లాలోని జలుమూరు మండలానికి చెందిన జొన్న రవికుమార్ 2000 లో ఎపిఎస్‌పి కానిస్టేబుల్‌గా సెలక్టు అయి విజయనగరం ఎపిఎస్‌పి బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మొదటి నుండి మద్యానికి బానిసైన ఆయన జల్సాలకు అలవాటు పడటం వలన పోలీస్‌బుర్రను దొంగతనానికి ఉపయోగించాడు. 2012లో ఓ పర్యాయం సస్పెండు కూడా అయ్యాడు. సస్పెండ్ కాలంలో జల్సాలకు అలవాటు పడిన ఆయన చేతిలో చిల్లిగవ్వలేని కారణంగా అధిక మొత్తం సంపాదనలో భాగంగా బైక్‌ల దొంగతనం సాగించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఈ నెల వంజంగి గ్రామానికి చెందిన రొక్కం నర్శింహమూర్తికి చెందిన బైక్ దొంగతనంనకు గురికాగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం దర్యాప్తు చేస్తున్న పోలీసులకు స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద దొంగతనంనకు గురైన బైక్‌తో రవికుమార్ కనిపించాడు. వాహనాన్ని పోలీసులు ఆపినా ఆపకుండా వేగంగా దూసుకుపోవడంతో వెంబడించిన పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయనను పట్టుకొని బండికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మొత్తం బండారం బైటపడింది. ఈ వాహనమే కాకుండా మరో మూడు వాహనాలు తాను దొంగతనం చేసినట్లు నిందితుడు అంగీకరించడంతో నిందితుని నుండి ఎపి 30 ఎఫ్ 1993, ఎపి 30 ఎఫ్ 4890, ఎపి 30 డి 3852 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలను నిందితుడు చాకచక్యంగా దొంగిలించేవాడని వన్‌టౌన్ ఎస్‌ఐ కె.్భస్కరరావు విలేఖర్లకు తెలిపారు. కేసును ఛేదించిన వారిలో ఎఎస్‌ఐ కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ సుధ, కానిస్టేబుళ్లు రమణ తదితరులున్నారు.

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
జి.సిగడాం, జూలై 15: ఈ నెల 23న జరుగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. సోమవారం ఎంపిడిఒ కార్యాలయంలో అదనపు ఎన్నికల అధికారి బి.హెచ్.శంకర్రావు ఆధ్వర్యంలో 67 మంది ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా తహశీల్దార్ నర్సయ్య మాట్లాడుతూ పోలింగ్ చేయు విధానం, ముందుగానే బ్యాలెట్ బాక్సులు సరిచూసుకుని షీల్‌లు వేసే విధానాలపై అవగాహన కలిగించారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు వాడకూడదన్నారు. ఏజెంట్లు బ్లైండ్ ఓట్లు వేసేందుకు అనుమతించరాదని సూచించారు. అలాగే పోలింగ్ అయిన తరువాత కౌంటింగ్‌లో పాటించాల్సిన విషయాలను జిల్లా కలెక్టర్ పంపించిన నిబంధనలు వివరించారు. 67 మందికి శిక్షణ ఇవ్వగా వీరిలో 65 మంది రణస్థలంలో జరుగనున్న ఎన్నికల్లో పాల్గొంటారని, లావేరు మండలంలో ప్రిసైడింగ్ అధికారులుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఇ.ఒ.పి.ఆర్.డి ఎం.శ్రీనివాసరావు, ఎక్సైజ్ సి.ఐ జి.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాకవి గరిమెళ్లకు నివాళి
పోలాకి, జూలై 15: తన కళానికి గళాన్ని జోడించి స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ప్రజలను మేల్కొలిపిన ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ 120వ జయంతిని పురస్కరించుకుని మండలంలో ప్రియాగ్రహారం గ్రామంలో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న గరిమెళ్ల విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ గరిమెళ్ల సాహిత్యం గూర్చి, స్వాతంత్య్రం పోరాటంలో ఆయన పంథాను గూర్చి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎ.ఎన్.్భక్తా, మాజీ ఎం.పి.పి కె.ఎల్.ఎన్.్భక్తా, ఉపాధ్యాయ సంఘ నాయకులు భానుమూర్తి, సాహితీ వేత్త నాగరాజు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నతపాఠశాలలో గత విద్యాసంవత్సరంలో పదోతరగతిలో ఉత్తములుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు.
ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
లావేరు, జూలై 15: మండలంలో జరుగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 80 మంది ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం మండలకేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఎన్నికల్లో వీరి విధులకు సంబంధించిన అంశాలపై మండల ఎన్నికల అధికారి ఎం.కిరణ్‌కుమార్, సహాయ ఎన్నికల అధికారి చంటిబాబులు సూచనలిచ్చారు. మంగళవారం మరో 80 మందికి శిక్షణ ఇస్తామన్నారు.
ఎన్నికల సందర్భంగా పలువురిపై బైండోవర్ కేసులు
శ్రీకాకుళం, జూలై 15: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అతి సమస్యాత్మకంగా ఉన్న గ్రామాల్లో పలువురిపై బైండోవర్‌కేసులు నమోదు చేసినట్లు తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్ తెలిపారు. శిలగాం సింగువలస పంచాయతీకి సంబంధించి దేశం పార్టీ వర్గీయులు 11 మంది, కాంగ్రెస్ పార్టీ వర్గీయులు 11 మంది, వైఎస్సార్‌సీపీ వర్గీయులు 11 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. అలాగే కిష్టప్పపేటలో ఎ-గ్రూపులో 28 మంది, బి-గ్రూపులో 28 మందిపై, కనుగులవానిపేటలో ఎ-గ్రూపులో 37 మంది, బి-గ్రూపులో 37 మందిపై, బైరిలో ముగ్గురిపై బైండోవర్ కేసు నమోదు చేసి సొంత పూచీకత్తులపై విడుదల చేశామన్నారు. మండలంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు బృందాన్ని ఏర్పాటుచేశారని, బృంద సభ్యులలో తహశీల్దార్‌తోపాటు అగ్రికల్చర్ ఎ.డి రవికిరణ్, ఎస్సై అవతారం, ఎక్సైజ్ ఎస్.ఐ బి.నర్సింహమూర్తిలు ఉన్నారన్నారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
అదనపు మద్యం సరఫరా చేయలేం
* ఎక్సైజ్ సి.ఐ స్పష్టీకరణ
సారవకోట, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా లైసెన్స్‌పొందిన దుకాణదారుడు కోరిన విధంగా అదనపు మద్యాన్ని సరఫరా చేయలేమని కోటబొమ్మాళి ఎక్సైజ్ సి.ఐ ఎన్.శ్రీనివాసరావు స్పష్టంచేశారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గడిచిన ఏడాది ఇదే నెలలో ఆయా షాపులకు తమ శాఖ సరఫరా చేసిన మేరకు మాత్రమే ఈ నెలలో సరఫరా చేస్తామన్నారు. బెల్టుషాపులను ఇప్పటికే నివారించామని, ఎక్కడైనా విడివిడిగా విక్రయాలు జరిపితే అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు స్థానిక పోలీసులు, రెవెన్యూ యంత్రాంగంతో కలిసి కృషిచేస్తున్నామన్నారు.

గ్రేటర్ మున్సిపాలిటీ విలీన సమస్య పెండింగ్‌లో ఉన్న
english title: 
oscillation

బయోమెట్రిక్ మస్తర్ లేకుంటే జీతాలు కట్

$
0
0

విశాఖపట్నం, జూలై 15: ఇష్టానుసారం విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, వారి పేరిట స్వాహాకు పాల్పడుతున్న పారిశుద్ధ్య కాంట్రాక్టర్లకు జివిఎంసి చెక్ పెట్టనుంది. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల విషయంలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై అనేక ఫిర్యాదులున్నాయి. జివిఎంసి పరిధిలో 3993 మంది పారిశుద్ధ్య కార్మికులు ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరితో పాటు నైట్ శానిటేషన్‌లో మరో 800 మంది వరకూ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరు విధులకు హాజరైనా కాకున్నా మస్తర్ మాత్రం పడుతోంది. కొంతమంది శానిటరీ ఇనస్పెక్టర్లు లోపాయికారీ వ్యవహారంతో పనిచేయని సిబ్బందికి సైతం జీతాలు మంజూరవుతున్నాయి. దీనిపై జివిఎంసి కమిషనర్‌కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఆకస్మిక తనిఖీల్లో సైతం మస్తర్ రిజిస్టర్‌లో ఉన్న సంఖ్యకు హాజరైన పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యకు పొంతన లేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికుల తీరుపై కమిషనర్ ఎంవి సత్యనారాయణ దృష్టి సారించారు. పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కమిషనర్ నిర్ణయించారు. జివిఎంసి పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ మస్తర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. బయోమెట్రిక్ మస్తర్ విధానంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా 5వ తేదీన జీతాలు చెల్లిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. బయోమెట్రిక్ విధానంలేని కార్మికుల జీతాలు నిలిపివేయాలని జోనల్ కమిషనర్లను కమిషనర్ ఆదేశించారు. వీరికి థర్డ్‌పార్టీ విచారణ జరిపిన తర్వాతే జీతాలు చేల్లించాలని స్పష్టం చేశారు. కొంతమంది పారిశుద్ధ్య కాంట్రాక్టర్లు, కార్మికులు బయోమెట్రిక్ విధానాన్ని వ్యతిరేకిసుతన్నట్టు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఎవరు అంగీకరించకున్నా బయోమెట్రిక్ విధానం అమలు జరుపుతామని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య విధానాన్ని మెరుగుపరిచేందుకు ఈవిధానం దోహదం చేయడమే కాకుండా జీతాలు సకాలంలో చెల్లించేందుకు వీలు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. థర్డ్‌పార్టీ విచారణ కారణంగా జీతాలు చెల్లింపులో జాప్యం చోటుచేసుకుంటుదని ఆయన పేర్కొన్నారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసే విషయంలో కాంట్రాక్టర్లు, కార్మికులు, అధికారులు సహకరించాలని కమిషనర్ కోరారు.

కాలం చెల్లిన భవనాలను కూల్చేస్తాం
* కమిషనర్ సత్యనారాయణ
విశాఖపట్నం, జూలై 15: కాలం చెల్లిన శిధిల భవనాలను తొలగించే విషయంలో రాజీకి తావులేదని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ స్పష్టం చేశారు. నగర పరిధిలో శిధిల భవనాల గుర్తింపు, తొలగింపు అంశాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. నగర పరిధిలో 70 ఏళ్లు నిండిన ప్రైవేటు భవనాలను తొలగించనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే నగర పరిధిలో 375 కాలం చెల్లిన భవనాలను గుర్తించామని, వీటి యజమానులకు నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. నగర పరిధిలోని అన్ని జోన్లలో శిధిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, స్ట్రక్చరల్ ఇంజనీర్లు వాటిని పరిశీలించి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. శిధిల భవనాలన్నింటినీ తొలగించడం జరుగుతుందన్నారు. మూడవ జోన్ 28వ వార్డు పరిధిలోని వెంకటేశ్వర మెట్టలో 70 ఏళ్ల కిందట నిర్మించిన మూడంతస్తుల ప్రైవేటు భవనాన్ని సోమవారం కూల్చివేశారు. ఈ భవనంలోని తొమ్మిది పోర్షన్లున్నాయని, వీటిలో నివసిస్తున్న వారిని హెచ్చరించి ఖాళీ చేయించినట్టు తెలిపారు. భవనం కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోందని, పక్కనున్న భవనాలకు, వాటిలో నివాసం ఉండే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ఉన్న ఇళ్లు 1200
దరఖాస్తులు అక్షరాలా 2,30,000
* ఇంకా కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
* ఇళ్ళ లేవని స్పష్టం చేయని అధికారులు
* ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పేదలు
ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నం
పేదల కోసం ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుంది. అవి పేదలకు చేరేదేమాత్రమో అందరికీ తెలిసిందే. అయినా పేదలు ఆయా పథకాల కోసం వెంపర్లాడ్డం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఇల్లు, రేషన్ కార్డు, పించను. వీటిలో ఏ ఒక్కటి వచ్చినా సంబరపడిపోతారు పేదలు. వీరి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా గృహాలను, పించన్లను, రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకురాలేకపోయింది ప్రభుత్వం. రేషన్ కార్డులను ఏదో రకంగా జనాలు సంపాదించుకున్నా, గృహాలు, పించన్ల విషయంలో మాత్రం లక్షలాది మంది ఇంకా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణం చేస్తునే ఉన్నారు. గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ఇళ్ళ కోసం పేదలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇవ్వడానికి ఇళ్ళు లేవని అధికారులు చెప్పరు. ఇది తెలియని మహిళలు మండుటెండలో చంటి పిల్లలతో కలెక్టరేట్ వచ్చేస్తున్నారు. అసలు విషయం తెలిస్తే.. దరఖాస్తుదారులు గొల్లుమనక తప్పదు.
నగరంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే వారిలో కొంతమంది కలెక్టరేట్‌కు, మరికొంతమంది జివిఎంసి కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు ఇస్తున్నారు. వీరిలో కొంతమంది రెండు చోట్లా దరఖాస్తులు ఇచ్చారు. ఇలా కలెక్టర్ కార్యాలయంలో లక్షకు పైగా దరఖాస్తులు పేరుకుపోయాయి. జివిఎంసి కార్యాలయంలో అచ్చంగా ఇళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులు అక్షరాలా 1,60,000. వీటిలో 1,30,000 దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వెరసి ఈ రెండు కార్యాలయాల్లో 2,30,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్న మాట. అయితే నగరంలో ఉన్న ఇళ్ళు కేవలం 1200 మాత్రమే. అంటే ఒక్కో ఇంటికి రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నమాట. ఈ దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉన్న ఇళ్ళను మంజూరు చేయడానికి కూడా ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ సమావేశమై లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. గతంలో జివిఎంసి అధికారులు నగరంలోని ఇల్లు లేని నిరు పేదలు ఎంతమంది ఉన్నారన్న విషయమై సర్వే నిర్వహించింది. ఇందులో గుడెసలలో ఉన్న వారు 30 వేలమంది. సెమీ పక్కా భవనాల్లో ఉన్న వారు 20 వేల మంది. అద్దె ఇళ్ళలో నివాసం ఉంటున్న వారు 60 వేల మందికిపైగా ఉన్నారు. గతంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ళు నిర్మించే సమయంలో వీరిలో ఐదు వేల మందికి ఆ గృహాలను కేటాయించారు. ఆ తరువాత అందులో రెండు వేల మంది అనర్హులని తేలింది. ఆ తరువాత ఆయా ఇళ్ళను పేదలకు మంజూరు చేయగా, మిగిలినవి 1200 ఇళ్ళు మాత్రమే. వీటిని ఎంతమంది ఏ ప్రాతిపదికన ఇవ్వగలరు. కేవలం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రమే వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ప్రభుత్వం ఇప్పట్లో కొత్త ఇళ్ళను నిర్మించే అవకాశం లేదు. ఇటీవల జిల్లా అధికారులు ఓ కొత్త ఆలోచన చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి, అందులో కొంత భాగం ఆ వ్యక్తి వెంచర్ వేసుకునేందుకు, మరో కొంత భాగంలో పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చే విధంగా పిపిపి పద్ధతిన కార్యక్రమం మొదలుపెట్టాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో సమీప భవిష్యత్‌లో నగరంలో కొత్త ఇళ్ళ నిర్మాణం సాధ్యం కాదన్నది సుస్పష్టం.
కానీ కలెక్టరేట్‌లో సోమవారం చూస్తే, ఒక జాతరను తలపించే విధంగా జనం వచ్చారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దరఖాస్తులు అధికారులకు అందచేయడానికి నానా యాతనా పడ్డారు. గ్రీవెన్స్ సెల్‌లో దరఖాస్తులు ఇచ్చేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి, ఒక్కో దరఖాస్తుకు ఒక నెంబర్ ఇస్తున్నారు. వాటిని గ్రీవెన్స్ సెల్ దగ్గర బోర్డులో పొందుపరుస్తున్నారు. అందులో సంబంధిత అధికారులు మీమీ ఇళ్ళకు వచ్చి, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తారని పేర్కొంటున్నారు. కానీ అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లడం లేదు. మర్నాడు దరఖాస్తుదారులు వచ్చి తమ పేరు బోర్డు మీద ఉండడాన్ని చూసి, తమకు ఇళ్ళు మంజూరైపోయినట్టు భావిస్తున్నారు. వీరు వెళ్లి తమతమ ప్రాంతాల్లోని వారికి చెపుతున్నారు. వారంతా తరలివచ్చి దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇచ్చేస్తున్నారు. సాక్షాత్తూ కలెక్టర్ కార్యాలయంలో ఇంత తంతు నడుస్తున్నా అధికారులు స్పందించడం లేదు. ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి జాబితాను తయారు చేయడం ఒక పని. ఆ ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు, కొత్త ఇళ్ళ నిర్మాణానికి కనీసం సన్నాహాలు ప్రారంభించే వరకైనా కొత్త దరఖాస్తులు స్వీకరించడాన్నైనా నిలిపివేయాలి. ఇళ్ళు, పింఛన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవద్దని స్పష్టంగా అధికారులు బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తొలి లోక్‌సభ సభ్యులు
తిలక్, మోహన్‌రావులకు టిఎస్సార్ సత్కారం
విశాఖపట్నం , జూలై 15: నిస్వార్థ ప్రజాసేవకుడు,తొలి లోక్‌సభ సభ్యుడు ప్రథమ పార్లమెంట్ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్యం తిలక్‌ను ఆదర్శంగా తీసుకొని సేవలందించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి యువతకు పిలుపునిచ్చారు. తెలుగుశక్తి ఆధ్వర్యంలో సోమవారం ఓ హోటల్‌లో తిలక్ 93వ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేట్ కట్ చేశారు. అనంతరం టిఎస్సార్ మాట్లాడుతూ పార్లమెంటు ప్రారంభ సమయంలో తొలి ఎంపీలుగా కెఎస్ తిలక్, కెఎస్ మోహనరావులు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. వారి సేవలకు గుర్తింపుగా తెలుగుశక్తి సంస్థ సత్కరించడం ఆనందదాయక మన్నారు. మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి మాట్లాడుతూ పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, చేసిన సేవలే శాశ్వతమన్నారు. ప్రతిఒక్కరికీ సేవలందిస్తేనే నిజమైన నేతలుగా అందరి మన్ననలు పొందుతారన్నారు. భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పరమేశ్వర రావు, ఉప్యాక్షులు శ్రీనివాసరావు తిలక్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర రావు, కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ కె.తాతారావు, ఇంటక్ నేతలు కెఎస్ మోహన్ కుమార్, మంత్రి రాజశేఖర్, తెలుగుశక్తి అధ్యక్షుడు బివిరామ్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా హెచ్‌పిసిఎల్ వ్యవస్థాపక దినోత్సవం
విశాఖపట్నం, జూలై 15: హెచ్‌పిసిఎల్ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిఎం (టెక్నికల్) జిఎస్ ప్రసాద శర్మ మాట్లాడుతూ సంస్థ సాధించిన లక్ష్యాలను వివరించారు. అలాగే భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు పునరంకిత ప్రతిజ్ఞ చేశారు. సంస్థలను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తామని వారు ప్రతినపూనారు. సంస్థ చైర్మన్ కం మేనేజింగ్ డైరక్టర్ సందేశాన్ని ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నరసింహం చదివి వినిపించారు. సంస్థ ఇంత అభివృద్ధి చెందడానికి గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగుల శ్రమేనని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత సిబ్బంది కూడా సంస్థను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని అన్నారు. గతంలో దేశంలోని అభివృద్ధి చెందిన కర్మాగారాల్లో హెచ్‌పిసిఎల్ 500 స్థానంలో ఉండేదని, ఇప్పుడు అది 260కి చేరుకుందని అన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన సిబ్బంది సత్కరించారు.

ఆగస్టులో ఫ్లైఓవర్ ప్రారంభం
* పేరు ప్రతిపాదన ప్రభుత్వానిదే
విశాఖపట్నం, జూలై 15: ఆశీల్‌మెట్ట వద్ద జివిఎంసి నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభిస్తామని కమిషనర్ ఎంవి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఫ్లైఓవర్ ట్రయల్ రన్ సోమవారం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను సత్వరమే పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రిడ్జిపై నిర్మిస్తున్న బిటి రోడ్డును, విద్యుదీకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిఆర్‌ఎం కార్యాలయం వద్ద ప్రహారీ నిర్మాణంతో పాటు తరలించిన సబ్‌స్టేషన్ భవనాన్ని తొలగించాలని అధికారులకు సూచించారు. సర్వీసు రహదారి నిర్మాణంలో అడ్డంకిగా ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ భవనం, రైల్వే డివిజనల్ ఇంజనీర్ భవనాలను తక్షణమే తొలగించి సర్వీసు రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నేవల్ ఇంజనీర్ విభాగానికి చెందిన ప్రహారీని కూల్చి కొత్తగా నిర్మించేందుకు సంబంధిత అధికారులతో సంప్రదించనున్నట్టు తెలిపారు. రోడ్ల పక్క డ్రైన్ల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు.
ఫ్లైఓవర్‌కు ఎవరి పేరు పెట్టాలన్న అంశం తన పరిధిలో లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది ప్రభుత్వ పరిధిలోని అంశమని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజీవ్‌గాంధీ, తెనే్నటి విశ్వనాథం, ద్రోణంరాజు సత్యనారాయణ తదితరుల పేర్లు పెట్టాల్సిందిగా విజ్ఞాపనలు అందాయని తెలిపారు. ఈ అంశంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదేనన్నారు. జివిఎంసిలో భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు 10 పంచాయతీల విలీనంపై రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత వార్డుల పునర్విభజన, తదితర ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు.

వామనావతారంలో దర్శనమిచ్చిన జగన్నాధుడు
విశాఖపట్నం, జూలై 15: జగన్నాధస్వామి దశావతారాల్లో భాగంగా స్వామివారు సోమవారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. టర్నరుచౌల్ట్రీ ఆవరణలో వామనావతారంలో ఉన్న స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈసందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం తరపున ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, కార్యనిర్వాహణాధికారి డి భ్రమరాంబ తదితరులు శ్రీసుభద్ర, బలభద్రసమేతుడైన స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరించారు. ఈసంద్భంగా విప్ ద్రోణంరాజు మాట్లాడుతూ టర్నరుచౌల్ట్రీ ఆధునీకరణకు కోటి రూపాయల నిధులు మంజూరైనట్టు తెలిపారు. చారిత్రాత్మక పురాతన కట్టడాలకు ఎటువంటి ముప్పువాటిల్లకుండా వాటిని ఆధునీకరించనున్నట్టు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తదితరులు జగన్నాధస్వామిని దర్శించుకున్నారు.

దేశ ఆర్థికాభివృద్ధికి సూచి స్థూల జాతీయోత్పత్తి
విశాఖపట్నం, జూలై 15: ఒకదేశం, రాష్ట్రం ఆర్థికాభివృద్ధిని తెలుసుకునేందుకు స్థూలజాతీయోత్పత్తి ముఖ్యప్రామాణికమని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మృణాల్ బౌమిక్ అన్నారు. ఎయు ప్లాటినం జూబ్లీ హాల్‌లో సోమవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల రీజనల్ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని తెలుసుకునేందుకు స్థూల జాతీయోత్పత్తి ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర గణాంక సంస్థ దేశానికి సంబంధించిన స్థూలజాతీయోత్పత్తిని తయారు చేస్తుందని తెలిపారు. అలాగే అర్ధ గణాంకశాఖ రాష్ట్రానికి సంబంధించి స్దూలు జాతీయోత్పత్తిని, తలసరి ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుందన్నారు. వ్యవసాయానికి సంబంధించిన లెక్కలు, ధరలు, స్థానిక సంస్థలు, పబ్లిక్ అండర్ టేకింగ్ గణాంకాలు, సాంఘిక, ఆర్థిక గణనకు సంబంధించిన సమాచారం తదితరాల ద్వారా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం రూపొందించిన ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి మధింపు విధానానికి ప్రాముఖ్యత లభించిందన్నారు. కేంద్రం విడుదల చేస్తున్న త్రైమాసిక స్థూల జాతీయోత్పత్తి అంచనాలతో సమానంగా రాష్ట్రం కూడా వీటిని రూపొందిస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర స్థూలజాతీయోత్పత్తి 7,45,782 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం 78,177 రూపాయలుగా నమోదైందన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.04శాతం పెరుగుదలగా గుర్తించినట్టు తెలిపారు. ఈవర్క్‌షాప్‌లో కేంద్ర గణాంక డైరెక్టర్ రీనాసింగ్, రాష్ట్ర గణాంక అధికారి డి దక్షిణామూర్తి, సిపిఓ సుధాకర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మైదాన ప్రాంతాలకు తరలిన మన్యం ప్రజాప్రతినిధులు
* మంత్రి బాలరాజు పర్యటనకు చెక్
* నర్సీపట్నం ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసు

నర్సీపట్నం,జూలై 15: మావోయిస్టుల వరుస సంఘటనలతో మన్యం ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజన్సీ, మైదాన ప్రాంత ప్రజాప్రతినిధులకు పోలీసు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు , ఇతర ప్రజాప్రతినిధులు ఏజన్సీలో పర్యటించవద్దని ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా మైదాన ప్రాంత ప్రజాప్రతినిధులను సైతం అప్రమత్తం చేయడం విశేషం. విశాఖ మన్యంలో గత 10 రోజులుగా మావోయిస్టులు వరుస ఘటనలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వారి ఇళ్ళను సైతం లూఠీ చేస్తున్నారు. చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ వంతల సుబ్బారావును మట్టుపెట్టేందుకు ప్రయత్నించగా మావోల చేతిలో నుండి తృటిలో తప్పించుకున్నారు. అలాగే మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు కూడా దేహశుద్ధి చేసారు. పంచాయతీ ఎన్నికలను పురష్కరించుకుని ఏజన్సీలో ఘాతులకు పాల్పడాలనేది మావోయిస్టుల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఏజన్సీ ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు తరలిపోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేసారు. పలువురు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే మైదానానికి తరలిపోయారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు తరుచూ మన్యంలో పర్యటించడం పోలీసులకు మింగుడుపడడం లేద. ఒక వైపు మావోయిస్టులు ఆలజడులు సృష్టిస్తుండగా, మరో వైపు మంత్రి యద్దేశ్చగా మన్యంలో పర్యటించడం పోలీసు అధికారులకు కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. దీంతో మంత్రి ఏజన్సీ గ్రామాల్లో పర్యటించడం మానుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు కొంత కఠినంగానే హెచ్చరించినట్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో మంత్రి బాలరాజు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఇదే అదునుగా మావోల నుండి ప్రమాదం పొంచి ఉండవచ్చని ముందు జాగ్రత్తతో ఏజన్సీలో పర్యటించవద్దని బాలరాజు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి నర్సీపట్నం, పాడేరులకే పరిమితమై సమావేశాలు నిర్వహిస్తూ నాయకులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా పోలీసు అధికారులు మైదాన ప్రాంత ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు పంపించారు. మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాపకు పోలీసుల నుండి నోటీసు అందింది. ఎన్నికల పర్యటనకు వెళ్ళే ముందు తమకు సమాచారం ఇవ్వాలని, ఒంటరిగా పర్యటించవద్దని నోటీసుల్లో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇలా మావోయిస్టులకు అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ పోలీసులు అప్రమత్తం చేసారు. ఎన్నికల పోలింగ్ ముగిసేలోగా మావోలు ఎలాంటి ఘాతుకాలకైనా పాల్పడే అవకాశం ఉండడంతో ముందస్తుగా పోలీసులు అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

సీలేరులో మావోల యాక్షన్ టీమ్

సీలేరు,జూలై 15: జి.కె.వీధి మండలం సీలేరులో మావోయిస్టు యాక్షన్ టీమ్ సంచరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీసులకు కూడా యాక్షన్ టీమ్ రెక్కీ నిర్వహించినట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శనివారం జి.కె.వీధి మండలంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒడిషాకు చెందిన మహిళా మావోయిస్టు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈసంఘటనపై మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆంధ్రా - ఒడిషా సరిహద్దుకు చెందిన మావోయిస్టు యాక్షన్ టీమ్ సీలేరులో యాక్షన్ టీమ్ రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిలో భాగంగా ఆదివారం వారపు సంతలో మావోయిస్టులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలీసుల కోసం రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. సంతలో పోలీసులు వస్తే అదును చూసి దాడి చేసేందుకు యాక్షన్ టీమ విఫలయత్నం చేసినట్లు సమాచారం. యాక్షన్ టీమ్ బృందం ప్రయత్నాలు విఫలం చెందడంతో యాక్షన్ టీమ్ సభ్యులు వెనక్కి పోయినట్లు సమాచారం. ఈసంఘటనపై పోలీసులు యాక్షన్ టీమ్ సంచారంపై ఆరా తీస్తున్నారు.

మద్యం మత్తులో గ్రామాలు
పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
అనకాపల్లి, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల తరపున దాదాపు అన్ని గ్రామాల్లోను అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. దీంతో ప్రచార హోరు క్రమేపీ ఊపందుకుంటుంది. మరోవైపు ఓటర్లను ముందుగానే ప్రలోభాలకు గురిచేయడం ద్వారా ప్రత్యర్థి అభ్యర్థులు గూటిలోకి వెళ్లకుండా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. ఇటువంటి తరుణంలో మందుబాబులను మచ్చిక చేసుకుంటే తప్ప ఎన్నికల ప్రచారానికి ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చినా ఊపుండే పరిస్థితి లేదు. ఇంటింటి ప్రచారంలోనైనా ప్రాంతాల వారీగా సమావేశాలు దిగ్విజయం చేయాలన్న మందుబాబుల హడావుడిపైనే ఎక్కువగా అధారపడి ఉంటుంది. సర్పంచ్‌ల ఎన్నికల నగారా మోగించిందే తడవుగా అనకాపల్లి, మునగపాక, అచ్యుతాపురం తదితర మండలాల్లో మద్యం పంపిణీ గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో కేవలం కొంతమందికే పరిమితమయ్యే మద్యం పంపిణీ మరింత ఎక్కువయింది. అత్యంత గోప్యంగా తమకు సన్నిహితులు, విధేయులైనవారి కమతాల్లోను, నివాసాల వద్ద మద్యాన్ని చేర్చి తమ మద్దతుదారులైన వార్డుమెంబర్లకు, విధేయత కలిగిన వార్డుమెంబర్లకు కూపన్లు ఇచ్చి మద్యం పంపిణీని అత్యంత గోప్యంగా చేస్తున్నారు. ప్రతీ ఎన్నికల మాదిరీగానే ఈ ఎన్నికల్లో కూడా ఎన్నికల ఖర్చులో సింహభాగం మద్యానికి కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల గ్రామంలో మద్యం దుకాణం యజమానితో ఒప్పందం కుదుర్చుకుని చీటిలు ఇచ్చి ఏరోజుకారోజు అవసరమయ్యే మద్యాన్ని తీసుకునే వెసులుబాటును కల్పించుకున్నారు. మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటంతో గ్రామాల్లోని మద్యం దుకాణాల్లో సైతం అమ్మకాలు పడిపోయాయని యజమానులు లబోదిబోమంటున్నారు. ఇదిలావుంటే అన్నివర్గాల వారికి మద్యం బాగా అందుబాటులో ఉండటంతో శాంతిభద్రతల సమస్య పెరిగిపోతుంది. మండలంలోని పిసినికాడ, సీతానగరం, కూండ్రం, కుంచంగి, కశింకోట మండలం అచ్చెర్ల, తీడ, చెరకాం తదితర గ్రామాల్లో మితీమీరి మద్యం సేవించిన మందుబాబులు తాము మద్దతు పలుకుతున్న అభ్యర్థులకు అనుగుణంగా ప్రత్యర్థులతో ఘర్షణలకు దిగుతున్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్‌లు సైతం నామమాత్రంగానే మిగులుతున్నాయి. మితీమీరి మద్యం సేవించిన మందుబాబులు ఇంట్లో భార్యాపిల్లలపై కూడా ఘర్షణకు దిగుతున్నారు. దీంతో కుటుంబ తగాదాలు కూడా పెరిగిపోతున్నాయి. మితిమీరి మద్యం సేవించిన మందుబాబులు రోడ్డుప్రమాదాల్లో మృత్యువాతకు గురయ్యే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సర్పంచ్‌ల ఎన్నికల ఘట్టం సమీపించే నాటికి మద్యం గ్రామాల్లో ఏరులై పారి అన్నివర్గాల వారికి విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. దీంతో ఇంతవరకు మందు అలవాటు లేని యువకులు, పిల్లలు పలుచోట్ల మహిళలు సైతం ఉచితంగా వచ్చే మద్యాన్ని తీసుకుని మందుకు బానిసలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు కలవరం చెందుతున్నారు. సహజంగా ప్రతీ ఎన్నికల్లోను ముఖాముఖి పోటీ ఉండేది. అయితే ఈ పర్యాయం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష దేశంతోపాటు వైఎస్‌ఆర్ సిపి అభ్యర్థులు కూడా ప్రతీ పంచాయతీలోను ఎన్నికల బరిలో నిలవడంతో త్రిముఖ పోటీ జరుగుతుంది. దీంతో ప్రజలకు మద్యంతోపాటు ఇతరత్రా తాయిలాలు అందజేయడంలో సహజంగానే పోటీ పెరిగింది.

నామినేషన్ల తిరస్కృతి పట్ల అభ్యర్థుల ఆందోళన
చోడవరం, జూలై 15: పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండలంలో నిర్వహించిన పరిశీలనలో నామినేషన్లను తిరస్కరించిన పలువురు సర్పంచ్, వార్డుసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లు తిరస్కరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. నామినేషన్లు తిరస్కరించిన వాటిలో ఆదివారం అడ్డూరు సర్పంచ్ అభ్యర్థి దాసరి అప్పలనాయుడుతోపాటు తాజాగా గౌరీపట్నానికి చెందిన సర్పంచ్ అభ్యర్థులు పల్లెల వరహాలుబాబు, పల్లెల భవానీ, కురచాల తాతయ్యలతోపాటు అదే గ్రామానికి మరో ఇద్దరు వార్డుమెంబర్లను కూడా నామినేషన్‌ల తిరస్కరించారు. దీనిపై వీరు రెవెన్యూ డివిజన్ అధికారికి అప్పీల్ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. సోమవారం స్థానిక గాంధీగ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గౌరీపట్నం గ్రామపంచాయతీకి చెందిన తిరస్క్రత అభ్యర్థులు పల్లెల వరహాలుబాబు, పల్లెల భవానీ, కె. తాతయ్యలు రిటర్నింగ్ అధికారి బి. జయలక్ష్మిని కలిసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గౌరీపట్నం గ్రామపెద్దలు న్యాయవాది వెంకట్రావు, కోన చంద్రరావులు వారి రాకపట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. అఫిడవిట్‌లు నిబంధనలకు విరుద్దంగా ఈరోజు అందజేస్తే తీసుకోరాదని ఎన్నికల అధికారి ముందు ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్యాలయం వద్ద గుమిగూడిన జనాన్ని పంపించివేసారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి జయలక్ష్మి మాట్లాడుతూ తాము నామినేషన్ల పరిశీలన తరువాత ఎవరి వద్దనుండి ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని, కేవలం ఉపసంహరణకు మాత్రమే పరిశీలిస్తున్నామన్నారు. అలాగే నామినేషన్‌లు తిరస్కరించబడ్డ పల్లెల వరహాలబాబు, భవానీ, తాతయ్యలు తాము రెవెన్యూ డివిజన్‌కు అప్పీల్ చేసుకుంటున్నామని తెలియజేసారు. దీంతో అక్కడి పరిస్థితులు సద్దుమణిగాయి.

సేవలు మరింత విస్తృతం: టిఎస్సార్
విశాఖపట్నం, జూలై 15: ఫోరమ్‌ల సబ్ కమిటీల ద్వారా సేవలు విస్తృతం చేస్తున్నట్టు రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయా వేదికల ప్రతినిధులతో సోమవారం ఆయన నివాసంలో వేర్వేరుగా చర్చించారు. ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఫోరం, ఫిషర్‌మెన్ వెల్ఫేర్ ఫోరం, బిసి వెల్ఫేర్, ఎస్సీఎస్టీ,క్రిస్టియన్, మహిళా, యూత్ తదితర ఫోరమ్‌ల నాయకులతో సమావేశమై సమస్యలపై మాట్లాడారు. ఫోరమ్‌ల కమిటీలకు అనుబంధంగా సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని టిఎస్సార్ సూచించారు. ప్రతి వార్డులో ఐదుగురు పెద్దలు, ఐదుగురు మహిళలు, మరో ఐదుగురు యువతతో సబ్ కమిటీలను ఏర్పాటు చేసి, తద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. ఫోరంల ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు వీలుగా వీటి కార్యాలయాలను ప్రారంభించాలన్నారు. కార్యాలయాల్లో ఇన్‌చార్జిలు సమస్యలను నమోదు చేసుకుంటారన్నారు. ప్రభుత్వపరంగా అందించే సహాయం అందే విధంగా కృషి చేయడంతోపాటు, సొంత నిధులతో పేదలకు స్వాంతన చేకూర్చే చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. చదువుకున్న యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. స్వయం ఉపాధి పొందేందుకుగాను ఆటోరిక్షాలు, బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా చూస్తామన్నారు. పేద మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. సులాభ్‌కాంప్లెక్స్‌ల కోసం స్థలాన్ని కేటాయించినట్టు అయితే నిర్మాణానికి సహకరిస్తామన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల మరమ్మత్తుల కోసం మెటీరియల్ అందజేయనున్నట్టు తెలిపారు. ఇలా పలు విధాలుగా పేదల సంక్షేమం కోసం చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై టిఎస్సార్ చర్చించారు. వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు, పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఏ రెహ్మాన్, ఫిషర్‌మెన్ వెల్ఫేర్ ఫోరం గౌరవ అధ్యక్షులు, పిసిసి ప్రధాన కార్యదర్శి పులుసు జనార్దనరావు, మాజీ కార్పొరేటర్ నీలకంఠం, మహిళా వెల్ఫేర్ ఫోరం గౌరవ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, ఎస్సీ,ఎస్టీ,క్రిస్టియన్ వెల్ఫేర్ ఫోరం గౌరవ అధ్యక్షులు కొప్పుల వెంకట్రావు, అధ్యక్షులు కొల్లాబత్తుల వెంగళరావు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పెద్దాడ రమణ, బిసి వెల్ఫేర్ ఫోరం గౌరవాధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బెహరా భాస్కరరావు, బిసి వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు పొన్నాడ మోహనరావు, యూత్ వెల్ఫేర్ ఫోరం గౌరవ చైర్మన్ కొంతం అరుణ్‌కుమార్, చైర్మన్ సేనాపతి వెంకటేష్, అధ్యక్షులు లక్కరాజు రామారావు, యాదవ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులుగా గొంపా గోవింద్‌యాదవ్, పల్లా యుగంధర్‌యాదవ్ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాల్సిందే
* కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
విశాఖపట్నం, జూలై 15: విశాఖపట్నం, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు మంజూరు చేయాలని కోరుతూ ఉపాధ్యాయుల సంఘాల ఐక్య కార్యచరణ సమితి (జెఏసి) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ పట్టణాల్లో ప్రభుత్వం నాలుగు విడతలుగా గ్రాంట్-ఇన్-ఎయిడ్ 310-311 పద్దు కింద ప్రస్తుతం జీతాలు చెల్లిస్తున్నారన్నారు. కాని రాష్ట్రంలో అన్ని మునిసిపల్, మునిసిపల్ కార్పొరేటర్లను ప్రభుత్వ పాఠశాలలు, మండల పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలల్లో 010 పద్దు కిందే జీతాలు చెల్లిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎపిటిఎఫ్ కన్వీనర్ సింగంపల్లి వెంకటరమణ మాట్లాడుతూ విశాఖ,విజయవాడ మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వమే గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద జీతాలు చెల్లిస్తున్నారన్నారు. గ్రాంట్ సకాలంలో రాకపోవడం వలన వీటిల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు, ఏరియర్స్ అందక ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్ధి ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. అందువల్ల 010 పద్దు కింద జీతాలు చెల్లించాలన్నారు. వీరికి జీతాలు చెల్లించనందున జిల్లాపరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులు, ఇతర సౌకర్యాలు, ఈ మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పొందలేక పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

ఆషాడ పౌర్ణమి ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు
సింహాచలం, జూలై 15: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో జరిగే సంవత్సరోత్సవాల్లో ఆషాఢ పౌర్ణమి ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. చందనోత్సవం తర్వాత వేలాదిగా భక్తులు సింహగిరికి తరలివచ్చి సింహాచలేశుని దర్శించుకునే ఉత్సవం ఆషాఢ పౌర్ణమి. ఈ వేడుకనే గిరి పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా కీర్తిస్తారు. ఆషాఢ శుద్ధ చతుర్ధశి రోజున సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేసి పౌర్ణమినాటి ఉదయం సింహాద్రినాధున్ని దర్శించుకోవడం ఇక్కడ శతాబ్ధాల కాలంగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే ఆషాఢ పౌర్ణమి ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు కార్యనిర్వహ ణాధికారి కె.రామచంద్ర మోహన్ సారధ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

* థర్డ్‌పార్టీ పరిశీలన తర్వాతే చెల్లింపు
english title: 
muster

డయల్ యువర్ డిఎంకు విశేష స్పందన

$
0
0

విజయనగరం , జూలై 15: ప్రయాణికుల నుంచి వచ్చే పిర్యాదులను వారంరోజుల్లో పరిష్కరిస్తామని ఆర్టీసీ విజయనగరం డిపోమేనేజర్ కె.పద్మావతి తెలిపారు. సోమవారం డిపోమేనేజర్ పద్మావతి డయల్ యువర్ డి.ఎం. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. పలు సమస్యలకు సంబంధించి 10 వినతులు వచ్చాయి. విజయనగరం నుంచి భోగాపురం గ్రామానికి, విజయనగరం నుంచి పినవేమలి, పెదవేమలి మీదుగా సిరిపురం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని పలు గ్రామాలకు చెందిన ప్రజలు కోరారు. శృంగవరపుకోట, గజపతినగరం రూట్లలో అద్దెబస్సుల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా బస్సులను నడుపుతున్నారని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అతివేగంగా బస్సులను నడపడం వల్ల ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారని వారు తెలిపారు. అలాగే బస్సులు కూడా పరిశుభ్రంగా ఉండటం లేదన్నారు. కొన్నిచోట్ల బస్సులను ఆపడం లేదని, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు. ఈ సమస్యలపై స్పందించిన డిపోమేనేజర్ పద్మావతి మాట్లాడుతూ ప్రయాణికుల సమస్యలను వారంరోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ట్రాఫిక్‌సూపర్‌వైజర్ బూర్లి ఆదినారాయణ, డిపోక్లర్క్ మెట్ల దుర్యోధన తదితరులు పాల్గొన్నారు.

నేడు సమైక్యాంధ్ర రక్తదాన శిబిరం
విజయనగరం , జూలై 15: సమైక్యాంధ్రకు మద్ధతుగా మంగళవారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో ఉచిత రక్తదానం నిర్వహించనున్నట్లు సమైక్యాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు తెలిపారు. సమైకాంధ్రకు మద్ధతుగా, తెలంగాణవాదులకు వ్యతిరేకంగా పట్టణంలో సోమవారం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను కొంతమంది తెలంగాణ వేర్పాటువాదులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విభజించేందుకు కుట్రపనున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటడటం కలికే ప్రయోజనా, విడిపోతే ఏర్పడే అనర్థాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తెలుగుప్రజలకు భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రేనన్నారు. విడిపోవడం వల్ల అనేకరకాలుగా రాష్ట్రం నష్టపోతుందన్నారు. సమైక్యాంధ్ర జెఎసి ప్రతినిధులు అబ్దుల్వ్రూఫ్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రయింద్రాం పంచాయతీ ఏకగ్రీవం
బొండపల్లి, జూలై 15 : మండలంలోని రయింద్రాం గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్ పదవికి పల్లి రామదేవుడమ్మ, ఆమె భర్త పల్లి వెంకటరమణలు సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులుగా నామినేషన్లు దాఖలు చేయగా సోమవారం భర్తపల్లి వెంకటరమణ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో సర్పంచ్‌గా రామదేవుడమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పది వార్డు మెంబర్లు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కారు ఢీకొని విద్యార్థి మృతి
బొండపల్లి, జూలై 15 : రోడ్డు దాటుతున్న విద్యార్ధిని సోమవారం మధ్యాహ్నం కారు ఢీ కొనడంతో మృతి చెందాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొట్లాం గ్రామానికి చెందిన మహంతి అశోక్ (10) సైకిల్‌పై ఇంటికి వెళ్లెందుకు రోడ్డు దాటుతుండగా గజపతినగం నుంచి విజయనగరంపైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈమేరకు గాయపడి అశోక్‌ను వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. స్థానిక హెచ్‌సి కేసు శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమస్యల పరిష్కారానికి
ఉపాధ్యాయుల ధర్నా
మెంటాడ, జూలై 15 : స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం యుటిఎఫ్ సంఘ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు అయిదు వేల పుస్తకాలు ఇవ్వవలసి వుందని, యూనిఫారాలు పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదని డిమాండ్ చేసారు. మండలంలో 35 పాఠశాలలకు ప్రహరీల నిర్మాణ చేయాలని, తదితర సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇన్‌చార్జ్ ఎంపిడిఓ గంటా వెంకటరావుకు అందజేశారు.

‘ఆధార్ కార్డులు ఉచితంగానే ఇవ్వాలి’
విజయనగరం, జూలై 15 : ఆధార్ కార్డులను మీసేవా కేంద్రాల్లో కాకుండా ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలన్న తదితర డిమండ్లతో సిపిఐ(ఎంఎల్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు, సోమవారం కలక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నగదు బదిలీ పధకాని, సంక్షేమ పధకాలకు ఆధార్ కార్డులు తప్పని సరి అంటూ ప్రకటించిన ప్రభుత్వ వాటి పంపిణీ విషయంలో శ్రద్ధ కనబర్చడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డులు లేని వారికి గ్యాస్, రేషన్, ఫించన్లు నిలుపుదల చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ప్రజానీకం ఆందోళన చెందుతున్నారన్నారు. ఉప్పటికీ ఆధార్‌కార్డులకు సంబంధించి పేర్లు నమోదు చేసిన వారికి ఉచితంగా అందజేయాలని, ఇప్పటి వరకు పేర్లు నమోదు చేయని వారికి షెడ్యుల్ ప్రకటించి ఆధార్ కార్డులు అందజేయాలని, నగదు బదిలీ కోసం బ్యాంకులో జీరో నగదుతో ఖాతాలను ప్రారంభించడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయమైన అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని, అలాగే అప్రకటిత విద్యుత్ కోతలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ పేరుతో ప్రతి సోమవారం కలక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్ డే రద్దు చేయడాన్ని నిరసిస్తున్నామని దానిని కొనసాగించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో నాయుకులు బి.శంకరరావు, రెడ్డినారాయణరావు, బి.పాండురంగారావు, జి.సత్యారావు, పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
విజయనగరం , జూలై 15: వి.టి అగ్రహారం బి.సి కాలనీకి చెందిన వెంపాడ ఉమా మహేశ్వరీ (38) అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఉమా మహేశ్వరిని భర్త, ఇతర కుటుంబ సభ్యులే పొట్టన పెట్టుకున్నారని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, భర్త కేశవ రెడ్డి, అత్త ఈశ్వరమ్మ ఇతర కుటుంబ సభ్యులు మాత్రం అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. పోలీసుల సమాచారం మేరకు విశాఖపట్నం కంచరపాలేనికి చెందిన ఉమామహేశ్వరికి, వి.టి అగ్రహారం బిసి కాలనీకి చెందిన వెంపాడ కేశవ రెడ్డితో వివాహం జరిగింది. వృత్తి రీత్యా కేశవ రెడ్డి ఆటోడ్రైవర్. ఉమామహేశ్వరినీ భర్త కేశవ రెడ్డి, అత్త ఈశ్వరమ్మలతోపాటు స్థానికంగా ఉండే ముగ్గురు ఆడపడుచులు తరచూ వేధించేవారని మృతిరాలి తల్లి చంద్రకళ, అన్న చంద్రశేఖర్‌లు ఆరోపించారు. ఆదివారం కేశవ రెడ్డి ఫోన్ చేసి ఉమా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆడపడుచు ఫోన్‌చేసి ఫిట్స్ వచ్చి సొమ్మసిల్లి కిందపడిందని చెప్పినట్లు చెప్పారని తెలిపారు. ఆడపడుచులు త్రివేణి, ఎం.జయ, శాంతి మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం ఫైనాన్స్ చెల్లించలేదని ఆటోను తీసుకుని పోయారని, అప్పట్నుంచి ఉమామహేశ్వరీ మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్పష్టం చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

‘ఎన్నికల నిబంధనలు పట్టించుకోలేని అధికారులు’
విజయనగరం , జూలై 15: జిల్లాలో అధికారులు ఎన్నికల నిబంధనల గురించి పట్టించుకోవడంలేదని జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ఆరోపించారు. సోమవారం ఇక్కడ అశోక్ బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను అమలు చేయడంలో విఫలమవుతున్నారన్నారు. జిల్లాలో కొంతమంది అధికారులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిష్పక్షపాతంగా వ్యవహిరించాల్సిన అధికారులు పక్షపాతంగా వ్యవహరించడం తగదన్నారు. జిల్లాలో కాంగ్రెస్, వైస్సార్ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తూ తెలుగుదేశంపార్టీపై బుదరజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెడున్నాయని ఆరోపించారు. వైస్సార్ పార్టీ నాయకురాలు షర్మిల జిల్లాలో సాగిస్తున్న పాదయాత్ర విఫలమైందని, ప్రజల నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదన్నారు. జిల్లా తెలుగుదేశంపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు మాట్లాడుతూ వార్డుల విభజనలో మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహంచారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కనకల మురళీమోహన్, సైలాడ త్రినాధరావు, సువ్వాడ రవిశేఖర్, ఆల్తి వెంకటరమణ, ఎస్‌కెఎం భాషా తదితరులు పాల్గొన్నారు.

ఉప్పొంగిన వట్టిగెడ్డ.. 200 క్యూసెక్కుల విడుదల

జియ్యమ్మవలస, జూలై 15: మండలంలోని రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్‌లోకి వరదనీరు అధికంగా చేరడంతో సోమవారం 200 క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరదనీరు రిజర్వాయర్‌లోకి చేరింది. 397 అడుగులకు మించి నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా 200 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టినట్లు ఆశాఖ ఏ. ఇ. బి.వి.రఘు తెలిపారు. 399 అడుగులకు నీరు చేరిందంటే ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తిస్తామని, అందుకే ముందుగా నీరు దిగువ ప్రాంతాలకువిడిచిపెట్టామన్నారు. అధిక స్థాయిలో ఇప్పటికే రిజర్వాయర్‌లోకి నీరు చేరుతున్నదని తెలిపారు.
రాకపోకలకు అంతరాయం
వట్టిగెడ్డ నీటిని దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టడంతో రావాడ- టి.కె.జమ్ము ప్రధాన ఆర్.అండ్.బి. రహదారిపై గుండానీరు ప్రవహిస్తుండటంతో గిరిజనుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొండపై గల 20 గ్రామాల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

తలకిందులుగా నిలబడి కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన
విజయనగరం , జూలై 15: ఒప్పంద కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సోమవారం తలకిందులు జపంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒప్పంద కార్మికులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం గత 22 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోఛనీయమని ఆవేధన వ్యక్తం చేశారు. మా సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో విద్యార్థులుభవిష్యత్తు కూడా తలకిందులయ్యే ప్రమాదం ఉందన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు ఎందుకు చేపట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.

సమస్యల పరిష్కారానికి ‘ గ్రీవెన్స్’: ఎస్పీ
విజయనగరం , జూలై 15: ఎస్పీ గ్రీవెన్స్, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాల ద్వారా బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు ఎస్పీ కార్తికేయ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ కార్తికేయ నిర్వహించిన గ్రీవెన్స్‌కు ఆరు ఫిర్యాదులు, డయల్ యువర్ ఎస్పీకి మూడు ఫిర్యాదులు అందాయి. సాలూరుపట్టణానికి చెందిన ఎం.సత్యన్నారాయణమ్మకు చెందిన కొంత వ్యవసాయ భూమి బాడంగి మండలంలో ఉందని, ఆభూమిని ఒకరు అక్రమంగా సాగు చేసుకుంటుంన్నారని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. కొత్తవలస మండలం గంగపూడి గ్రామానికి చెందిన మహిళ తన భర్త, అత్తమామలపై పెట్టిన వరకట్న కేసుపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణంలోని గాజులరేగకి చెందిన డి.చంద్రకళ కొడుకు కొద్ది రోజుల క్రితం మృతి చెందినందున వృత్తిరీత్యా వచ్చే నగదు, ఇతర సదుపాయాలన్ని తన కోడలికే చెందాయని, తనకు బతికేందు ఆధారం లేకుండా పోయినందున న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

ప్రయాణికుల నుంచి వచ్చే పిర్యాదులను వారంరోజుల్లో
english title: 
dm

మోడిలో ఎన్నికల బహిష్కరణ

$
0
0

మొగల్తూరు, జూలై 15: అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించటానికి ఆ గ్రామస్థులు సమిష్టిగా నిర్ణయించుకున్నారు. మండలంలోని మోడి గ్రామంలో ప్రజలకు కావలసిన వియర్ ఛానల్ పనులు ముందుకు సాగకపోవటం, మోడి - మొగల్తూరు గ్రామాలను కలుపుతూ వెస్ట్ కుక్కులేరుపై వంతెన పనులు మధ్యలో ఆగిపోవటం వంటి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించటంలో అటు పాలకులు ఇటు ప్రభుత్వం విఫలమయ్యిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసహనానికి గురైన గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. మోడి గ్రామ పంచాయతీ 1977లో ఏర్పడింది. ఇక్కడ వంతెన నిర్మాణానికి అనేకమార్లు శంకుస్థాపనలు చేశారు. పనులూ ప్రారంభించారు. అయితే ఆ పనులు కాస్తా మధ్యలో ఆగిపోవటంతో గ్రామస్థులంతా ఎన్నికలు బహిష్కరించటంతో ఇప్పుడందరి దృష్టి మోడి గ్రామంపై పడింది. గ్రామ సమస్యల పట్ల ఐక్యంగా వుండి ప్రజలు ఎన్నికలు వద్దంటూ నినదించటం మిగిలిన గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచిందనే చెప్పాలి. తమ గ్రామంలో నిలిచిపోయిన వియర్ ఛానల్, మోడి వంతెన పనులను వెంటనే పూర్తిచేస్తే అప్పుడు ఎన్నికల గురించి ఆలోచిస్తామని ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌లు దాసరి ప్రసాదరావు, కడలి ధర్మారావు, దాసరి మాణిక్యాలరావు (చిట్టిబాబు), బి లక్ష్మణరావు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ మద్దతిచ్చిన వారే గెలుస్తారు
-మంత్రి పితాని ధీమా
మొగల్తూరు, జూలై 15: రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన అభ్యర్థులే గ్రామ పంచాయతీ ఎన్నికలలో అత్యధికంగా గెలుపొందటం ఖాయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి పితాని సత్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. మొగల్తూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సమరంలో ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ పార్టీల మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునివ్వటంతో తాము కూడా కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు సాధించుకుంటామన్నారు. పంచాయతీల ఎన్నికల సమరంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి పథకాలే తమ పార్టీ బలపర్చే అభ్యర్థులకు శ్రీరామరక్షని అన్నారు. పంచాయతీ ఎన్నికల ద్వారా గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందని మంత్రి పితాని చెప్పారు. డిసిసి అధ్యక్షుడు, నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సమరంలో 70శాతం కాంగ్రెస్ మద్దతిచ్చిన సర్పంచ్‌లు గెలుపొందటం ఖాయమని జోస్యం చెప్పారు. నరసాపురం, మొగ ల్తూరు మండలాల్లో ఎక్కవ శాతం తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు నెగ్గనున్నారని సుబ్బారాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మొగల్తూరు పంచాయతీకి కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన దూది శారదాంబ, కాంగ్రెస్ నేతలు అనంతపల్లి రాధాకృష్ణ, కలవకొలను నాగతులసీరావు, డిసిసిబి డైరెక్టరు ఎం రాంభాస్కరరావు, దూదిబాబు, ఎవిఎంఎల్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు పి రాంబాబు, బ్లాక్ టూ కాంగ్రెస్ అధ్యక్షుడు కె కనక సుబ్బారావు, గురుజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

స్వల్పంగా తగ్గిన నామినేషన్లు
ఏలూరు, జూలై 15 : జిల్లాలో పరిశీలన అనంతరం పంచాయతీ నామినేషన్ల సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తరువాత పరిశీలన అనంతరం మొత్తంగా నామినేషన్లు తగ్గుముఖం పట్టాయి. ఇంతకుముందు సర్పంచ్ పదవులకు 5,182 నామినేషన్లు, వార్డులకు 27,968 నామినేషన్లు దాఖలు కాగా వాటిని పరిశీలించిన అనంతరం అధికారులు కొన్ని నామినేషన్లను తిరస్కరించారు. అనంతరం ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి, సర్పంచ్ పదవులకు 4,883 నామినేషన్లు, వార్డు సభ్యులకు 27,149 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని తేల్చారు. ఇదే సమయంలో తమ నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో కొంతమంది అభ్యర్ధులు వాటిపై అప్పీళ్లకు వెళ్లారు. జిల్లాలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసి తిరస్కరణకు గురైన 17 మంది, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసి తిరస్కరణకు గురైన 103 మంది సోమవారం అయా ఆర్డీవోల వద్ద అప్పీలు చేసుకున్నారు. తమ నామినేషన్లను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పాలని వారు కోరారు. ఈ విధంగా నర్సాపురం డివిజన్ పరిధిలో వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసి తిరస్కరణకు గురైన 19 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసి తిరస్కరణకు గురైన అయిదుగురు, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు వేసి తిరస్కరణకు గురైన 26 మంది, కొవ్వూరు డివిజన్ పరిధిలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు తిరస్కరణకు గురైన ముగ్గురు, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు తిరస్కరణకు గురైన 22 మంది, ఏలూరు డివిజన్ పరిధిలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు తిరస్కరణకు గురైన తొమ్మిది మంది, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు తిరస్కరణకు గురైన 36 మంది అప్పీళ్లకు వెళ్లారు. ఇక పరిశీలన అనంతరం జిల్లాలో నామినేషన్ల ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే సర్పంచ్ పదవులకు 4883, వార్డు సభ్యుల పదవులకు 27149 నామినేషన్లు సక్రమంగా వున్నట్లు తేల్చారు. దీనిలో ఏలూరు డివిజన్ పరిధిలో సర్పంచ్ పదవులకు 1826, వార్డు సభ్యుల పదవులకు 10840 నామినేషన్లు, కొవ్వూరు డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 1191, వార్డు సభ్యుల పదవులకు 6614, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 582, వార్డు సభ్యుల పదవులకు 3088, నర్సాపురం డివిజన్ పరిధిలో సర్పంచ్ పదవులకు 1284, వార్డు సభ్యుల పదవులకు 6607 నామినేషన్లు సక్రమంగా వున్నట్లు అధికారులు ధృవీకరించారు. వీటిలో ఏలూరు డివిజన్ పరిధిలో ఎన్నికలు ఈ నెల 23న జరగనున్న విషయం తెలిసిందే. మరో వైపు పరిశీలన పూర్తికావడంతో ఉపసంహరణ గడువుపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైవుంది. పంచాయితీల పరిధిలో పోటీని తగ్గించుకునేందుకు రంగంలో వున్న అభ్యర్ధులు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకుంటూ కొంతమందిని నామినేషన్లు ఉపసంహరణకు అంగీకరింపచేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నెల 17తో ఈ గడువు ముగుస్తుండటంతో దానికి మరో 48 గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఈ సంప్రదింపుల పర్వం ఊపందుకుంది.

పరిమితి దాటితే ఖర్చు రాసేస్తాం
ఏలూరు, జూలై 15: ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఎన్నికల పరిమిత వ్యయాన్ని మించి ఖర్చు చేస్తే అనర్హత వేటు తప్పదని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె దేవానంద్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మండల స్థాయి ఎన్నికల వ్యయ పరిశీలనా ఆడిటర్ల సమావేశంలో అభ్యర్ధుల ఎన్నికల వ్యయ నివేదికలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా దేవానంద్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల దొంగ లెక్కలకు కాలం చెల్లిందని ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని, దానికి అనుగుణంగా అభ్యర్ధులు నడుచుకోకపోతే విజయం సాధించిన తర్వాత కూడా పదవి నుండి తొలగించే పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవ ఎన్నికల వ్యయాన్ని నిర్ధారించడానికి నిరంతర నిఘా ఏర్పాటు చేసిందని, రోజువారీ ఎన్నికల వ్యయం అదే రోజు రికార్డులలో నమోదు చేయాలని ఆ లెక్కలు సక్రమంగా ఉన్నాయా? లేదా అని పరిశీలించడానికి ప్రత్యేక వ్యవస్థను కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిందన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధులు ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా తమ ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించాలన్నారు. నిర్ధేశించిన మొత్తాలకు మించి ఖర్చు చేసినట్లు రుజువైతే ఎంన్నిక రద్దవుతుందన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధి ప్రచారం నిమిత్తం వాహనాలకు చెల్లించే అద్దె, కరపత్రాలు, పోస్టరు, బహిరంగ సభలు, సభ నిర్వహణకు ఉపయోగించే (మిగతా 6వ పేజీలో)
టెంట్లు, మైక్, అనుచరుల భోజన ఖర్చులు వంటి వన్నీ వ్యయ ఖాతాలకు వెళతాయన్నారు. జిల్లా కలెక్టర్ సిద్దార్ధ్‌జైన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ధన, మద్య ప్రవాహాల ప్రభావంతో స్వేచ్ఛాయుత ఎన్నికలకు విఘాతం కలుగకుండా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలలో ధన, మద్య ప్రవాహాలను అరికట్టడానికి అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలలో అభ్యర్ధుల వ్యయాలను నియంత్రించేందుకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల వ్యయ పరిమితి, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ముద్రించిన ప్రతులను ఎన్నికలలో పోటీ చేసే ప్రతీ అభ్యర్ధికి అందిస్తున్నామని, ఈ విషయాలపై ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీకంఠనాథరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల వ్యయ వివరాలను పరిశీలించేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందని, ఈ బృందాలు వారి పరిధిలో అభ్యర్ధులు చేసే ప్రచార, ఇతర వ్యయాలను పరిశీలించి నివేదికలు రూపొందిస్తారన్నారు.

వినూత్నం కాదు విపరీతం
ఏలూరు, జూలై 15: కొద్దిరోజులుగా చెత్త ఎత్తే సంఘాలు సమ్మెలో వున్నాయి. సహజంగానే దీనివల్ల నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. అయినప్పటికీ వాటిని భరిస్తూ వచ్చిన ప్రజానీకానికి సోమవారం మాత్రం షాక్ తగిలినట్లైంది. ఉదయం లేచి బయటకు వచ్చే సరికి ఊరంతా చెత్త వెదజల్లి ఉంది. ఇళ్లల్లోనుంచి చెత్తను తీసుకువెళ్లి మరీ ప్రధాన కూడళ్లలోనూ చల్లారు. ఫైర్‌స్టేషన్ సెంటర్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో దాదాపు గుమ్మరించారనే చెప్పుకోవాలి. మరికొన్ని చోట్ల చెత్తకు తీసుకువెళ్లే ట్రాక్టర్ల టైర్లలో గాలి తొలగించి రోడ్డుకు అడ్డంగా వదిలేశారు. ఇదంతా ఏమిటని ప్రశ్నించే నాధుడు లేకపోవడంతో ఈ పరిస్థితి శృతిమించి రాగాన పడినట్లు భావిస్తున్నారు. అయితే మరోవైపు ఈ పరిణామాన్ని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారని చెప్పుకొస్తుండటం మరింత విచిత్రం. ఈ విధంగా వినూత్నం పేరుతో విపరీత పోకడలకు దారితీస్తే దాన్ని గమనించి పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మరింత విమర్శలకు కారణమైంది. సోమవారం నాటి పరిస్థితి పట్ల నగర ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని సంఘాలు ఈ పరిస్థితిపై విమర్శలు సందిస్తూ వినూత్న రీతిలో ఉద్యమం చేయాలనుకుని ఈ విధంగా చేస్తే అది ఎంత మాత్రం సమంజసం కాదని, అవసరమైతే బాధ్యులైన అధికారుల ఇళ్ల వద్ద ఈ విధంగా చేస్తే అసలు విషయం ఏమిటో తేలిపోతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతూ కొద్దిరోజులుగా అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు పడుతున్న తరుణంలో ఈ విధంగా చెత్తను వెదజల్లే వినూత్న నిరసన ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్న ఆందోళన కూడా వారు వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఇదే విధమైన నిరసన బారిన నగర ప్రజలు పడటం గుర్తుండే వుంటుంది. అప్పుడు కూడా ఇంతకుమించిన విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ మళ్లీ అదే పరిస్థితిని తీసుకువచ్చారు. గత కొద్దిరోజులుగా తమకు మూడు నెలల వేతన బకాయిలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన నిర్వహిస్తూ వచ్చారు. కార్మికులు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా, బైఠాయింపు, సమ్మె, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేయడం తదితర రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేసి జీతం బకాయిలు తక్షణం చెల్లించాలని కోరుతూ వచ్చారు. అయితే కార్పొరేషన్ అధికారులు ఈ విషయంపై స్పందించలేదు. సుమారు 270 మంది డ్వాక్వా, సిఎంఇవై కార్మికుల సమస్యల పట్ల పర్మినెంటు కార్మికులు కూడా స్పందించి సోమవారం తమ విధులను బహిష్కరించారు. ఇందులో భాగంగా వారు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు కొంతమంది కార్మికులు నగరంలో పలు ప్రాంతాల్లో చెత్తను తీసుకువెళ్లకుండా సేకరించిన దానిని రోడ్లపై వెదజల్లారని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. ప్రజల సానుభూతిని కోల్పోతే ఉద్యమాలు విజయం సాధించవన్న విషయాన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు మరచిపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు కూడా ఈ రకంగా వ్యవహరించే సిబ్బంది పట్ల ఉదాసీన వైఖరి అనుసరిస్తుండటాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

ఎన్నికల సమాచారానికి మీడియా కేంద్రాలు
ఏలూరు, జూలై 15: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమాచారాన్ని అందించడానికి మీడియా కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టరు సిద్ధార్ధ జైన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం పంచాయితీ ఎన్నికల మీడియా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమాచారాన్ని గ్రామస్థాయిలో ఎప్పటికప్పుడు సేకరించి జిల్లాస్థాయికి సత్వరమే అందించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి మీడియా సెంటర్‌ను ఏలూరు డిపివో కార్యాలయంలో, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం డివిజన్ స్థాయి మీడియా సెంటర్లను ఆయా ఆర్‌డివో కార్యాలయాల్లో ఏర్పాటుచేసి అవసరమైన ఎన్నికల సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని పౌర సంబంధాల అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన సమాచారం వస్తుందని, ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన వారి సమాచారాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను అమలు చేస్తున్న దృష్ట్యా దీనిపై పోటీ చేసే అభ్యర్ధులకే కాకుండా ప్రజల్లో కూడా అవగాహన కలిగించడానికి విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని సిద్ధార్ధ్‌జైన్ చెప్పారు. ధన బలంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలను వమ్ము చేయడానికి ప్రతీ గ్రామంలోనూ ప్రత్యేక నిబంధనల కమిటీ ఏర్పాటు చేసామని అవసరమైతే వీడియో నిఘా కూడా పెంచుతామన్నారు. జిల్లా పంచాయతీ సాధారణ ఎన్నికల పరిశీలకులు కె దేవానంద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులను చేపట్టిందని వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగుల బాధ్యతన్నారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలను సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా మీడియా కేంద్రాలు కీలకపాత్ర పోషించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిపిఒ అల్లూరి నాగరాజు వర్మ, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆర్‌వి ఎస్ రామచంద్రరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి కె రామ్మోహనరావు, ఎం భాస్కరనారాయణ, సహాయ పౌర సంబంధాధికారులు సిహెచ్‌కె దుర్గాప్రసాద్, టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంతానం సమాచారం దాచిపెడితే చర్యలు
ఏలూరు, జూలై 15 : జిల్లాలో పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులలో ఇద్దరు కన్నా ఎక్కువ మంది సంతానం ఉండి నామినేషన్‌లలో వాస్తవాలను దాచిపెట్టిన అభ్యర్ధులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ తెలిపారు. 1995 సంవత్సరం తదుపరి ఇద్దరు కన్నా ఎక్కువ సంతానం కలిగిన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులన్నారు. అయితే నామినేషన్ ఫారంలో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నారనే వాస్తవాలను దాచిపెట్టి, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు తదనంతరం పదవిని కోల్పోతారన్నారు. అంతేకాక, వారిని చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇటువంటి విషయాలపై జిల్లాలో పలు ఆరోపణలు వస్తున్నాయన్నారు. కావున వాస్తవాలను దాచిపెట్టిన అభ్యర్ధులు తక్షణమే తమ నామినేషన్‌లు ఉపసంహరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

నేడు డిజిపి దినేష్‌రెడ్డి రాక
-ఏలూరులో పోలీసు సబ్సిడరీ క్యాంటిన్ ప్రారంభం
ఏలూరు, జూలై 15 : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి దినేష్‌రెడ్డి మంగళవారం జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి విచ్చేయనున్నట్లు జిల్లా ఎస్‌పి ఎం రమేష్ తెలిపారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో కొత్తగా నిర్మించిన సబ్సిడరీ పోలీస్ క్యాంటీన్‌ను డిజిపి ప్రారంభిస్తారని ఎస్‌పి తెలిపారు. అనంతరం ఏలూరు రేంజ్ పోలీసు అధికారులతో ఎన్నికల బందోబస్తు నిర్వహణ సమీక్షా సమావేశం జరిపిన అనంతరం మంగళవారం రాత్రి డిజిపి ఏలూరులోనే బస చేస్తారని ఆయన తెలిపారు. డిజిపితోపాటు కోస్తా ఆంధ్రా ఐజి సిహెచ్ ద్వారకాతిరుమలరావు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎస్‌పి తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు బిల్లులు రద్దు!
-మీటరు రీడింగు ముసుగులో ఓటర్లను ప్రలోభపెడుతున్న వ్యక్తి-
దేవరపల్లి, జూలై 15: దేవరపల్లి మండలం చిన్నాయగూడెం ఎస్సీ ఏరియాలో ఒక వ్యక్తి కరెంటు రీడింగు తీస్తూ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు బిల్లులు రద్దు చేస్తారని ప్రచారం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన స్థానిక నాయకులు ఎంపిడిఒ జె రేణుకమ్మకు ఫిర్యాదు చేయగా ఆమె సోమవారం ఆ వ్యక్తిని వివరణ కోరారు. తనకు ఏమీ తెలియదని, స్థానిక నాయకుడు ఒకరు ఈ విధంగా చేయాలని చెప్పడంతో చేశానని, క్షమించి తనను వదిలేయాలని వేడుకున్నాడు. ఎంపిడిఒ రేణుకమ్మ అతని వద్ద నుండి లిఖితపూర్వకంగా హామీ పత్రం తీసుకుని, దానిని కానిస్టేబుల్‌కు అప్పగించారు.
మహిళా సమాజం పేరుతో చందాలు
దేవరపల్లి, జూలై 15: నకిలీ రశీదు పుస్తకాలు సృష్టించి చందాలు వసూలు చేస్తున్న వ్యక్తికి సోమవారం దేవరపల్లి గ్రామస్థులు దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఏలూరుకు చెందిన బండారు శ్రీరామ్ అనే వ్యక్తి నిడదవోలుకు చెందిన శ్రీ కస్తూరిబాయి మహిళా సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చర్ల సుశీల వృద్ధాశ్రమం బిల్లు పుస్తకాలు తయారుచేసి జిల్లాలో వివిధ గ్రామాల నుండి చందాలు వసూలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ విషయం తెలిసిన ఆశ్రమ వ్యవస్థాపకురాలు చర్ల విధాలకుమారి వివిధ దినపత్రికల్లో, టివిల్లో తమ పేరు చెప్పి దొంగ రశీదులు సృష్టించి చందాలు వసూలు చేస్తున్నారని ప్రకటనలు చేశారు. అయినా బండారు శ్రీరామ్ సోమవారం ప్రముఖ వ్యాపారవేత్త శ్రీకాకొళపు కాళీకృష్ణ ఇంటికి వచ్చి చందా అడిగాడు. రశీదు రెండో స్లిప్పుపై ఏ విధమైన చిరునామా లేకపోవడంతో అనుమానం వచ్చి నిడదవోలులో చర్ల సుశీల వృద్ధాశ్రమం నిర్వాహకులకు ఫోన్ చేశారు. ఆమె వచ్చి రశీదులు నకిలీవిగా చెప్పడంతో శ్రీరామ్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

డమీ అభ్యర్థులపై నిఘా:జెసి
ఏలూరు, జూలై 15 : జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తి అయిన తర్వాత రంగంలో మిగిలిన డమీ అభ్యర్ధులపై ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఎన్నికల ఖర్చు తనిఖీ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని ప్రాంతాలలో ఎన్నికల ఖర్చును తప్పించుకోవడానికి కొంత మంది డమీ అభ్యర్ధులను పెట్టుకుని తమతోపాటే ప్రచారానికి తిప్పుకుంటూ ఖర్చును డమీ అభ్యర్ధుల ఖాతాలో చూపించడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయని సమాచారం అందుతోందని ఎవరైనా అభ్యర్ధి తన తరఫున ప్రచారం చేసుకోకుండా ఇతర అభ్యర్ధికోసం ప్రచారం చేపడితే అటువంటి వారిపై నిఘా పెంచుతామని ఈ డమీ అభ్యర్ధి ఖర్చు కూడా వాస్తవంగా ఎవరి తరఫున ప్రచారం చేస్తున్నాడో ఆ అభ్యర్ధి ఖర్చుగా లెక్కించడం జరుగుతుందని కావున ఇటువంటి డమీ అభ్యర్ధులపై ప్రత్యేక నిఘా ఉంచాలని వ్యయ తనిఖీ అధికారులను జెసి ఆదేశించారు. ఎన్నికల వ్యయాన్ని పూర్తిగా తగ్గించి నిబంధనలు మేరకే అభ్యర్ధి ఖర్చు చేసేందుకు ఈ నిఘా ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు. డమీ అభ్యర్ధుల కార్లు కూడా దుర్వినియోగం కాకుండా చూడాలని స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి రాష్ట్రానికే పశ్చిమగోదావరి ఆదర్శంగా ఉండేలా ఎన్నికల సిబ్బంది నిరంతరం ఒక సైనికుడిలా పనిచేయాలని అప్పుడే ఎన్నికల సంఘం ఆశించిన విధానం నెరవేరుతుందని జెసి చెప్పారు.

జంబ్లింగ్ విధానంలో పోలింగ్ సిబ్బంది నియామకం
ఏలూరు, జూలై 15 : జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి జంబ్లింగ్ పద్దతిలో పోలింగ్ సిబ్బందిని నియమిస్తున్నట్లు జిల్లా పంచాయితీ ఎన్నికల పరిశీలకులు కె దేవానంద్ చెప్పారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో సోమవారం కంప్యూటరు ద్వారా పోలింగ్ సిబ్బందిని జంబ్లింగ్ విధానంలో నియమించే పద్దతిని ఆయన పరిశీలించారు. తొలి దశగా ఏలూరు డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పోలింగ్ అధికారులను జంబ్లింగ్ పద్దతిలో నియామకాన్ని ఆయన అభినందించారు. ఈ పద్దతి వల్ల ఎక్కడా కూడా పక్షపాతానికి అవకాశం ఉండదని, ఇటువంటి విధానాన్ని అమలు చేస్తున్నందున పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగంపై దేవానంద్ ప్రశంసల జల్లు కురిపించారు. పారదర్శకంగా పోలింగ్ అధికారులను నియమించే పద్దతి ఇతరులకు ఆదర్శంగా నిలస్తుందని ఆయన చెప్పారు. నివాసము, ఉద్యోగం, స్వంత ఊరు కాకుండా వేరే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిని జంబ్లింగ్ పద్దతిలో విధులు కేటాయించడం వల్ల పోలింగ్ సిబ్బంది ఎక్కడా కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించడానికి వీలు ఉండదని ఆయన చెప్పారు. మద్యం విక్రయాలపై కూడా నిఘా పెంచాలని పోలింగ్‌కు ముందు మద్యం షాపులు మూసివేసే నాటికి ఉన్న స్టాకు వివరాలను నమోదు చేసుకుని ఆ తర్వాత స్టాకును కూడా పరిశీలించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు మాట్లాడుతూ రిజర్వ్‌లో ఉంచిన పోలింగ్ ఆఫీసర్లను కూడా ఖాళీగా ఉంచకుండా సమీప పోలింగ్ కేంద్రాలలో నియమిస్తామని దీనివల్ల ఆయా ప్రాంతాలలో సత్వరమే పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడగలుగుతారన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే చర్యలు
ఏలూరు, జూలై 15 : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలలో పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి హెచ్చరించారు. స్థానిక డిటిసి కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆమె రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్లతో మాట్లాడుతూ జిల్లాలో బుధవారంనుండి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా సరుకులు చేరవేసే వాహనాలలో జంతువులను తరలిస్తుంటే వాటిని పట్టుకుని ప్రత్యేక కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జంతువులను చేరవేసే వాహనాలు విధిగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, మేకలు, గొర్రెలు, పందులు, తదితర చిన్న చిన్న వాటికి ఒక్కొక్క జంతువుకు 60 సెంటీమీటర్లు వెడల్పు, 100 సెంటీమీటర్లు పొడవు ఉండాలని, పెద్ద జంతువులైతే 200 సెంటీమీటర్లు ఇన్‌టు 100 సెంటీమీటర్లు ప్రదేశం విధిగా ఉండాలని చెప్పారు. పశువులను తరలించే వాహనాలలో విధిగా గడ్డి పరిచి ఉంచాలని జంతువులను తాళ్లతో కట్టి ఉంచాలని ఆహారం, నీరు విధిగా వాహనంలో పశువులకు అందుబాటులో ఉంచాలని, గాలి, వెలుతురు ఉండే విధంగా చూడాలని ఆమె చెప్పారు. జంతువులును తరలించే వాహనం గంటకు 40 కిలోమీటర్ల వేగం మించి వెళ్లరాదని వాహనంలో మేకులు గానీ, ఇనుప రేకులు గానీ బయటకు వచ్చి జంతువుల భద్రతకు విఘాతం కలిగే విధంగా ఉంటే అటువంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సమయాలలో జంతువుల ప్రథమ చికిత్సకు కావాల్సిన మందులను ఆ వాహనంలో అందుబాటులో ఉంచాలని జంతువులను ఇంజను వైపు ముఖం వచ్చేలా నిలిపి ఉంచాలని ఈ నిబంధనలను పాటించకపోతే జరిమానా విధించాలని ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ పశువువులను వాహనంలో తరలిస్తుంటే అటువంటి వాహనాలను స్వాధీనం చేసుకుని పశువులను గోశాలకు గానీ, పశుసంవర్ధక శాఖాధికారులకు గానీ అప్పగించాలని ఆయా వాహన యజమానుల నుండి అపరాధ రుసుం కూడా వసూలు చేయాలని ఆమె ఆదేశించారు.

అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆ గ్రామంలో పంచాయతీ
english title: 
boycott

పారదర్శకంగా ‘పంచాయతీ’

$
0
0

వరంగల్, జూలై 15: గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించవలసిన బాధ్యత సూక్ష్మ పరిశీలకులదేనని రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల పరిశీలకుడు హరిప్రీత్‌సింగ్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహించే సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల విధానం, సూక్ష్మ పరిశీలకుల విధులు, బాధ్యతలపై సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు హరిప్రీత్‌సింగ్, జిల్లా ఎన్నికల అధికారి జి.కిషన్, జిల్లా అదనపు ఎన్నికల అధికారి ప్రద్యుమ్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సాధారణ పరిశీలకులు హరిప్రీత్‌సింగ్ మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల ప్రక్రియకు చెవులు, కళ్ల వంటి వారని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది పరిశీలించాలని అన్నారు. అవసరమైన సూచనలు చేయడంతోపాటు ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు తమకు తెలియచేయాలని, కానీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. మొదటిసారి గ్రామపంచాయతీ ఎన్నికలలో సూక్ష్మ పరిశీలకుల నియామకం జరిగిందని, సాధారణ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్‌తోపాటు కౌంటింగ్, ఉపసర్పంచ్ ఎన్నిక వరకు మొత్తం ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు పాల్గొని సమాచారాన్ని చెక్ మెమోలో పొందుపరచి తమకు అందజేయాలని తెలిపారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని సూక్ష్మ పరిశీలకులకు సూచించారు. గ్రామస్థాయిలో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్నందున పోలింగ్ కేంద్రాలలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులను సూక్ష్మ పరిశీలకులుగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమించామని చెప్పారు. పోలింగ్ అధికారులు నిర్వహిస్తున్న ప్రక్రియను పరిశీలించి లోటుపాట్లను అధికారులకు వివరించాలని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రతి ఓటు కీలకమేనని, ఎటువంటి సంఘటనలు జరిగినా తమకు సమాచారం అందించాలని, పరిస్థితులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. పరిశీలకులకు వీడియోగ్రాఫర్‌ను కేటాయిస్తామని, ఇబ్బందికర సంఘటనలను వీడియోగ్రఫీ చేయాలని తెలిపారు. సూక్ష్మ పరిశీలకుల విధులపై స్పష్టంగా శిక్షణ ద్వారా తెలియచేస్తామని, అందుకు అనుగుణంగా వ్యవహరించి ఎన్నికలను సాఫీగా జరిగేలా సూక్ష్మ పరిశీలకులు చూడాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. పోలింగ్ ప్రక్రియలోని ముఖ్య ఘట్టాలను నిర్థేశించిన నిర్ణీత నమూనాలో పొందుపరచాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతున్నదా అనే అంశంతోపాటు ఎన్నికల నిబంధనలను పాటిస్తున్నది గమనించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధు, డిఆర్‌డిఎ ఎపిడి రాము తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రమాతగా భద్రకాళి
వరంగల్, జూలై 15: శాకంభరీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవరోజు సోమవారం భద్రకాళి అమ్మవారిని ఉగ్రమాతగా (ప్రత్యంగిర) అలంకరించి పూజారాధనలు జరిపారు. కాళిక అమ్మవారు తన భక్తులపై ప్రతీపశక్తులు ఈర్ష్యాద్వేషములతో ప్రయోగాది రూపేణ బాధలు పెట్టేవారిని ధ్వంసం చేస్తుంది. భద్రకాళి ఉగ్రస్వరూపమే ప్రత్యంగిర. అమ్మవారు సింహం మొహం కలిగి చేతియందు సర్పం, ఢమరుకం, త్రిశూలం, కపాలం ఇత్యాది భయంకరమైన ఆయుధాలు కలిగి దుష్టశక్తుల సంహారం చేసి భద్రకాళి అమ్మవారు భక్తులకు ఎల్లవేళలా కాపాడుతుందని వేదపండితులు చెబుతారు. సోమవారం హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత సలక్షణ ఘనపాఠి మహాగ్నిచిత్‌వూఢ్య పౌండరీకయాజీ అమ్మవారిని దర్శించి వేదమంత్రాలతో స్తుతించారు. అమ్మవారి భక్తులు ఆలయం వద్ద కోలాటాలతో అమ్మవారిని కీర్తించారు.

కాంగ్రెస్‌తోనే తెలంగాణ
* మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు
పరకాల టౌన్, జూలై 15: కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమని మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు అన్నారు. సోమవారం పరకాల ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకపోతే తెలంగాణ అంశాన్ని కోర్ కమిటీలో పెట్టడం జరగదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలనే కోర్ కమిటీలో చర్చించి సిడబ్ల్యూసిలో చేర్చారని చెప్పారు. సిడబ్ల్యూసి నివేదిక ఇచ్చిన తరువాత తెలంగాణను ప్రకటిస్తారని చెప్పారు. డిసెంబర్ 9న ప్రకటన చేసింది వాస్తవమేనని అయితే, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాత్రికి రాత్రి చేసిన రాజీనామా డ్రామాల వల్ల కమిటీ వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణపై స్పష్టత ఉందని అందుకే సిడబ్ల్యూసిలో చేర్చడం జరిగిందన్నారు. కొందరు ఎన్నికల కోసమే అంటూ ప్రచారం చేస్తున్నారని ఎన్నికలు తెలంగాణ, సీమాంధ్రలో జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమయిందని ఆయన ప్రజలకు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం ముగిసిందని, స్థానిక పరిస్థితులను బట్టి అక్కడక్కడ కొంత సర్దుబాటు చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని, మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో పరకాల మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, బండి సారంగపాణి, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మడికొండ సంపత్, బొచ్చు క్రిష్ణారావు, బొద్దుల వీరన్న, రమేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
రూరల్ ఎస్పీ పాలరాజు
కేసముద్రం, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని వరంగల్ రూరల్ ఎస్పీ పాలరాజు సూచించారు. పోలీసులు అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన మండలంలోని ఇనుగుర్తిని సోమవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా హైస్కూల్ ఆవరణలో వివిధ పార్టీల నాయకులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వ్యిక్తిగత ఆరోపణలకు దిగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం చేసుకోవాలని, అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. ప్రలోభాలకు గురిచేసే విధంగా వ్యవహరించకూడదని, మద్యం, డబ్బు పంపిణీ చేయకూదడని సూచించారు. గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్న ఇనుగుర్తి వాసులు ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించి గ్రామానికున్న మంచిపేరును తిరిగి నిలబెట్టేందుకు కృషి చేయాలన్నారు. కాగా గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులు, గుడుంబా తయారిని తక్షణం మానుకోవాలని, తమకు దొరికితే కఠిణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ డిఎస్పీ రమాదేవి, రూరల్ సిఐ సతీష్‌వాసాల, ఎస్సైలు కరుణాకర్, అమృత్ తదితరులు పాల్గొన్నారు.

‘గీత’ దాటొద్దు
నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీల హెచ్చరిక
నెక్కొండ/రాయపర్తి, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను వరంగల్ అర్బన్, రూరల్ ఎస్పీలు ఆదేశించారు. నెక్కొండ మండలంలో ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ అలాంటి వ్యక్తులపై రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు. నెక్కొండ మండలం చిన్నకొర్పోలు గ్రామాన్ని సోమవారం సందర్శించి రెండురోజుల క్రితం గ్రామంలో నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణలపై అడిగితెలుసుకున్నారు. డిఎస్పీ సరిత, సిఐ రాజశేఖర రాజు, ఎస్సై అమృతరెడ్డి, తహశీల్దార్ ప్రకాష్‌రావు, ఎంపిడిఓ కృష్ణప్రసాద్‌లతో పరిస్థితిని సమీక్షించి పలు సూచనలు చేశారు. గ్రామంలో పోలింగ్ స్టేషన్‌కు 200 గజాల దూరంలో బారికేడ్లను ఎర్పాటు చేయాలన్నారు. గతంలో జరిగిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు.
రాయపర్తి మండలంలో అర్బన్ ఎస్పీ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించాలని చూస్తే వారిపై కఠినచర్యలు తప్పవని వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మండలంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. మండలకేంద్రంతోపాటు తిరుమలాయపల్లి, కొండూరు, కాట్రపల్లి, మైలారం గ్రామాలలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. అర్బన్ జిల్లా పరిధిలో జరిగే ఎన్నికలపై శాఖాపరంగా ముందస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎటువంటి సభలు, సమావేశాలకు అనుమతులు లేవని తెలిపారు. ఎవరైనా సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే తప్పనిసరిగా ఎన్నికల అధికారులు, పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. ఎన్నికలలో మద్యం, డబ్బులను అక్రమంగా తరలించినా, ఓటర్లను ప్రభావితం చేసిన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లేనని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా కావలసిన హింసకు దిగితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం పంచాయతీరాజ్ చట్టం 221(బి) కింద చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్పీ వెంట మామునూరు డిఎస్పీ సురేష్, వర్థన్నపేట సిఐ మల్లయ్య, రాయపర్తి ఎస్సై రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలు
రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ కిషన్
పరకాల టౌన్, జూలై 15: పంచాయతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎటువంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ జి. కిషన్ అన్నారు. సోమవారం పరకాల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. గొడవలు పడవద్దని అవసరమైతే ఎంపిడిఓ, తహశీల్దార్ దృష్టికి తీసుకరావాలన్నారు. అభ్యర్థి తరుపున ఒకే ఏజెంట్ ఉండేలా చూడాలని, ఎలక్షన్ ఏజెంట్ సంతకం ప్రారంభం, ముగింపు తప్పని సరి అని చెప్పారు. అధికారులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. 24వేల పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించే అవకాశం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాలలోకి పోలీసు అధికారులను రానివ్వవద్దని, విఆర్‌ఓ, విఆర్‌ఏలను లోపల ఉండనీయవద్దన్నారు. బ్యాలెట్ పత్రాలు ఎన్ని అవసరం ఉంటే అన్నింటికే సంతకాలు చేయాలని సూచించారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
విధులకు డుమ్మా కొడితే కఠినచర్యలు * డిఎంహెచ్‌ఓ సాంబశివరావు
ఏటూరునాగారం, జూలై 15: ఏజెన్సీ గ్రామాలలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు రోగాల బారినపడకుండా చూస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. సోమవారం మండలంలోని దొడ్ల, మల్యాల, కొండాయి, చిన్నబోయినపల్లి గ్రామాలను డాక్టర్ సాంబశివరావు సందర్శించి జ్వరాల బారినపడిన రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటిడిఎ కార్యాలయంలోని డిప్యూటీ డిఎంహెచ్‌ఓ గదిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో వాగులు, వంకలు దాటి వెళ్లని గ్రామాలలో మందులను నిలువ చేసుకోవాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఐటిడి ఎ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో దోమల నివారణ మందు, క్లోరినేషన్, బ్లీచింగ్ చల్లించాలని డిప్యూటీ డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. పిహెచ్‌సిలోని వైద్యులు వారికి కేటాయించిన గ్రామాలలోనే నివాసం ఉండాలని, పట్టణాలకు పరిమితమైతే కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. పారిశుద్ధ్యం నెలకొన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సహాయచర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎఎన్‌ఎంలు అందుబాటులో ఉంటూ జ్వరాల బారినపడిన రోగులకు మందులను పంపిణీ చేయడమేకాకుండా వారి ఆరోగ్యపరిస్థితిని ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని అన్నారు. అధికంగా జ్వరాలు ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రోగుల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. మురికిగుంటలు, కాలువలు, చెత్తాచెదారం పేరుకుపోయిన చోట బ్లీచింగ్, దోమల మందును తరచు పిచికారి చేయాలని అన్నారు. దోమలు వృద్దిచెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఎఎన్‌ఎం, గ్రామపంచాయతీ కార్యదర్శిలు సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్యాన్ని తొలగించాలని అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో కానిస్టేబుళ్ల పాత్ర కీలకం: డిఐజి
వరంగల్, జూలై 15: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని వరంగల్ రేంజ్ డిఐజి డాక్టర్ ఎం.కాంతారావు అన్నారు. వరంగల్ నగరశివారు మడికొండలోని వరంగల్ పోలీసు శిక్షణా కేంద్రాన్ని సోమవారం డిఐజి సందర్శించారు. శిక్షణా కేంద్రానికి చేరుకున్న డిఐజికి డిటిసి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ కె.శ్రీకాంత్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డిఐజి శిక్షణా కేంద్రంలోని బ్యారెక్స్, పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు. కానిస్టేబుళ్లకు వివిధ విభాగాలలో ఇస్తున్న శిక్షణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రైనీ కానిస్టేబుళ్ల తరగతి గదులకు వెళ్లి కానిస్టేబుళ్ల వ్యక్తిగత వివరాలను తెలుసుకోవడంతోపాటు ఉన్నత విద్య అభ్యసించిన ట్రైనీ కానిస్టేబుళ్లకు భవిష్యత్తులో శాఖాపరంగా రాణించడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి డిఐజి మాట్లాడుతూ పోలీసులు పేద, బలహీన వర్గాల పక్షాన నిలవాలని సూచించారు. పోలీసులు తమ శ్రేయోభిలాషులని ప్రజలు గుర్తించే విధంగా నేటితరం పోలీసులు కృషి చేయాలని కోరారు. చట్టాలను అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించడం పోలీసుల బాధ్యతగా గుర్తించాలని అన్నారు.

ఎన్నికల బాధ్యత సూక్ష్మ పరిశీలకులదే: హరిప్రీత్‌సింగ్
english title: 
transperancy

పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా నేడు ఖరారు

$
0
0

ఒంగోలు, జూలై 16: పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుదిజాబిను బుధవారం సాయంత్రం మూడు గంటల తరువాత ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు బుధవారం సాయంత్రం మూడు గంటలకు ముందుగా ఉపసంహరించుకునే వీలుంది. కాగా ఒక్కొక్క పంచాయతీలో వివిధ పార్టీలకు చెందిన సానుభూతిపరులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేశారు. వారందరినీ బుజ్జగించి ఉపసంహరింప చేసి వారు అనుకున్న అభ్యర్థిని రంగంలోకి దించేందుకు నేతలు కసరత్తులు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం కొన్ని గంటల పాటు మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు గ్రామాల్లోనే తిష్టవేసి పరిస్థితులను గమనిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులను బుజ్జగించేందుకు వారికి తాయిలాలు కూడా ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలలైతే పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత కాంట్రాక్టు పనులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలైతే నగదు ముట్టచెప్పేలా చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు రంగంలో ఉండాల్సి ఉండగా ఒక్కొక్క పంచాయతీకి పదుల సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో మండల, జిల్లాస్థాయి నేతలకు తలనొప్పిగా మారింది. ఇక పోటీలో ఉన్న అభ్యర్థులు 20 లక్షల నుండి కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేసేందుకు వెనకంజవేయని పరిస్థితి నెలకొంది. కాగా పోటీలో ఉన్న వారు నియోజకవర్గ నేతలు, మండల స్థాయి నేతల వద్దకు రాయబారాలు పంపుతూ తమకు 20 లక్షల రూపాయల వరకు పార్టీపరంగా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులకంటే నియోజకవర్గ నేతలు, మండల స్థాయి నేతలకే ఆర్థికభారం పెరిగినట్లైంది. ఇదిలాఉండగా ఓసి జనరల్ కేటగిరీ కింద ఉన్న పంచాయతీల్లో ఓటుకు వెయ్యి నుండి 25వేల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు నేతలు వెనకాడని పరిస్థితులు ఏర్పడ్డాయి. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఒక కుటుంబానికి లక్ష రూపాయలు కూడా పోటీలో ఉన్న అభ్యర్థ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే పంచాయతీ ఎన్నికల్లో నగదును అభ్యర్థులు లెక్కలేకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని బిందెలు, చీరలు, జాకెట్లు, కుంకుమ బరిణెలు, ముక్కుపుడకలకు కూడా డిమాండ్ పెరగనుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
టిడిపి నేత కరణం పిలుపు
ముండ్లమూరు, జూలై 16:స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ముండ్లమూరులోని తన అతిధిగృహంలో వివిధ గ్రామాల కార్యకర్తలతో స్థానిక ఎన్నికలపై చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల గురించి ఆయన కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలంతా ఐకమత్యంతో పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వేముల మాజీ సర్పంచ్ భూమా వెంకటేశ్వరరెడ్డి, మానం నాగేశ్వరరావు, మేదరమెట్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించిన ఎఐఎస్‌ఎఫ్ నేతలు
ఒంగోలు అర్బన్, జూలై 16: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను ఎఐఎస్‌ఎఫ్ నేతలు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అనేక సమస్యలు వారి దృష్టికి వచ్చాయి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు సంక్షేమ వసతిగృహాలను సందర్శించినట్లు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పరచూరి కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతిగృహాలు తెరిచి నెలా పదిహేను రోజులు కావస్తున్నప్పటికీ నేటికీ పలు హాస్టళ్ళల్లో మెను సక్రమంగా అమలుకావడం లేదన్నారు. వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు సమస్యలతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలతో ఎంతకాలం సహవాసం చేయాలని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను అధికారులు పరిశీలించిన పాపాన పోలేదన్నారు. పేద విద్యార్థులంటే అధికారులకు చులకనగా మారిందని మండిపడ్డారు. వసతిగృహాల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యారన్నారు. అసలే ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయని, అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ వసతిగృహాలు నీటిమయంగా మారుతున్నాయన్నారు. తాగేందుకు సక్రమంగా నీరులేదని, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. సంక్షేమ వసతిగృహాల సమస్యలపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కలిసి విద్యార్థుల సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు కె రజని, లక్ష్మి, నారాయణ, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

‘జగన్ జైలులో ఉన్నా.. ప్రజాదరణ తగ్గలేదు’
మార్కాపురం, జూలై 16: వైఎస్‌ఆర్‌సిపి నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్నా ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గలేదని మార్కాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ రంగారెడ్డి అన్నారు. మంగళవారం మాజీఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి స్వగృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ లబ్ధికోసం కొన్ని పార్టీలు కలిసి జగన్‌ను ప్రజల నుంచి దూరం చేసేందుకు అక్రమంగా జైలుకు పంపినప్పటికీ ప్రజల్లో మాత్రం ఆయనపై ఆదరణ తగ్గలేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో పేదప్రజల కోసం, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయని, ఆ అభిమానంతోనే ప్రజలు జగన్‌ను ఆదరిస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేదప్రజల కోసమని ఎంతో ఆర్భాటంగా చేపట్టిన అభయహస్తం అబాసుపాలైందని అన్నారు. జగన్‌ను దెబ్బతీసేందుకు రాయల్ తెలంగాణ అంటూ కాంగ్రెస్ అధిష్థానం కుటిల యత్నాలు చేసినా రెండు రాష్ట్రాలుగా విభజించిన వైఎస్‌ఆర్‌సిపి రెండు ప్రాంతాల్లో అధికారం చేపట్టడం ఖాయమని రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అత్యధికశాతం స్థానాలు వైఎస్‌ఆర్‌సిపి కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈసమావేశంలో మాజీఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, గిద్దలూరు మండల వైఎస్‌ఆర్ సిపి కన్వీనర్ హిమశేఖర్‌రెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, పి వెంకటరెడ్డి, ఎం మహేశ్వరరెడ్డి, జె నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు రాజధాని ఏర్పాటుపై
షికార్లు చేస్తున్న పుకార్లు
పరుగులు తీస్తున్న రియల్టర్లు
ఒంగోలు, జూలై 16: తెలంగాణా అంశం తెరపైకి రావటం, ఒంగోలును రాజధాని చేస్తారనే ముమ్మర ప్రచారం జిల్లాలో సాగుతోంది. చివరగా సిడబ్ల్యుసిలో తెలంగాణ అంశం తేలనుందని, అందువలన తెలంగాణా ఇవ్వటం ఖాయమని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీంతో జిల్లాలో స్తబ్ధతగా ఉన్న భూముల రేట్లు పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుండి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. తెలంగాణ అంశం తెరపైకి రావటంతో భూములను కొనుగోలు చేసేందుకు రియల్టర్లు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కోస్తాప్రాంతానికి చెందిన బడా వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయనేతలు కొంతమంది హైదరాబాదులోని భూములను అమ్ముకుని ఒంగోలులో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణా ఇస్తే ఒంగోలు రాజధాని అవుతుందని అందువలన ఇప్పటినుండే భూములను కొనుగోలు చేస్తే లాభపడవచ్చుననే భావనలో రియల్టర్లు ఒంగోలువైపునకు పరుగులు తీస్తున్నట్లు సమాచారం. ఒంగోలు రాజధాని ప్రస్తావనను కొంతమంది రాజకీయనేతలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. భౌగోళికపరంగా చూసినా రైల్వేలైన్లు, సముద్ర తీర ప్రాంతం, జాతీయ రహదారి ఉన్నాయి. కాగా రాజధానికి ఏర్పాటుకు కావాల్సిన ప్రభుత్వ భూములు కోస్తాతీరంలోను, కందుకూరు, మార్కాపురం డివిజన్‌ల్లో ఎక్కువుగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు అనువుగా ఈభూములు ఉండే అవకాశాలున్నాయి. నీటిపరంగా చూసినప్పటికీ వెలుగొండప్రాజెక్టు, గుండ్లకమ్మ రిజర్వాయరు, రామతీర్ధం రిజర్వాయర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో రాజధాని నిర్మాణం జరిగితే నీటి అవసరాలు తీరతాయని భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు కూడా కోస్తాతీర ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. కొత్తపట్నం మండలం బీరంగుంట వద్ద ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడా జరిగాయి. కాని ఆప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. చీమకుర్తిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు కూడా ఉన్నాయి. దీంతో అంతర్జాతీయపరంగా కూడా వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. గతంలో గుంటూరు జిల్లా నిజాంపట్నంనుండి కొత్తపట్నం వరకు వేల ఎకరాల్లో వాన్‌పిక్‌ను విస్తారించాలని భూములను కూడా కొనుగోలు జరిగింది. కాని వాన్‌పిక్ అధినేత నిమ్మగడ్డప్రసాద్ జైల్లో ఉండటంతో ఆ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించటం లేదు. కోస్తాతీర ప్రాంతంలో పోర్టులను నిర్మించి జలరవాణాను కూడా మెరుగుపరిచే అవకాశాలున్నాయి. వాన్‌పిక్ వస్తుందన్న ఆలోచనలతో కొంతమంది రిటైర్డు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతోపాటు, కొంతమంది రాజకీయనేతలు కూడా చీరాల, వేటపాలెం, చినగంజాం తదితరప్రాంతాల్లో కోట్లరూపాయలు వెచ్చించి భూములను కొనుగోలు చేశారు. కాని వాన్‌పిక్‌రాకపోవటంతో వారంతా ఆర్ధికంగా పతనమయ్యారు. ప్రస్తుతం ఒంగోలు రాజధాని అంశం తెరపైకి రావటంతో వారందరూ ఊపిరీపీల్చుకుంటున్నట్లు సమాచారం. మొత్తంమీద ఒంగోలులో రాజధాని ఏర్పాటు వ్యవహరం జిల్లాలో చర్చనీయాంశమైంది.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు
సూక్ష్మ పరిశీలకులు సహకరించాలి
కలెక్టర్ విజయ్‌కుమార్ ఆదేశం
ఒంగోలు, జూలై 16: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సూక్ష్మ పరిశీలకులు సహకరించాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై సూక్ష్మ పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు, తీవ్ర సమస్యాత్మక గ్రామాలు, అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన పద్ధతిలో అన్నీ సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం నుండి కౌంటింగ్ పూర్తయి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు జరిగే అన్ని సంఘటనలను సూక్ష్మ పరిశీలకులు తమ డైరీలో నమోదు చేయాలన్నారు. ఎన్నికల్లో ఓటర్ పోలింగ్ స్టేషన్‌కు వచ్చి స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటింగ్ రహస్యంగా జరగాలని, ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నది ఓటువేసే వ్యక్తికి తప్ప మరెవరికి తెలియకూడదన్నారు. బహిరంగ ఓటింగ్ జరిగితే పోలింగ్ రద్దు చేసి రీ పోలింగ్‌కు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఓటరు గుర్తింపుకార్డు తీసుకుని పోలింగ్ స్టేషన్‌కు రావాలని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయంగా ఎన్నికల కమిషన్ ఆమోదించిన 21 ఇతర రకాల కార్డుల్లో ఏదోఒకటి చూపించి ఓటు వేయాలన్నారు. నిజమైన ఓటరు అయినప్పటికీ 22 రకాల కార్డుల్లో ఏదోఒకటి చూపించినట్లైతే ఓటు వేసేందుకు అనుమతించకూడదన్నారు. పోలింగ్ సందర్భంగా అభ్యర్థులు, వారి ఏజెంట్ల నుండి ఫిర్యాదులు వచ్చినపుడు అవి సరిదిద్దటానికి అవకాశం ఉంటే సరిదిద్దాలన్నారు. లేనిపక్షంలో సూక్ష్మ పరిశీలకులు వారితో అనవసరమైన వాగ్వావాదానికి దిగకుండా తాము గమనించిన విషయాలు డైరీలో నమోదు చేయాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చేవారు క్యూలో వచ్చేలా ఏర్పాటుచేయాలన్నారు. గుంపుగా వచ్చేందుకు అనుమతించకూడదని, ఎలాంటి ఆందోళనలు, ఒత్తిళ్లకు తావులేకుండా ధైర్యంగా, పారదర్శకంగా పని చేయాలని సూచించారు.

జిల్లాలో విస్తారంగా వర్షాలు
ఒంగోలు, జూలై 16: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ పంటను సాగు చేసేందుకు సమాయత్తవౌతున్నారు. జిల్లావ్యాప్తంగా సరాసరిన 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా తాళ్ళూరు మండలంలో 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో ఈవిధంగా ఉన్నాయి. పుల్లలచెరువు మండలంలో 27.6 మిల్లీమీటర్లు, మార్టూరు మండలంలో 25.8, యద్దనపూడి మండలంలో 23.6, కారంచేడు మండలంలో 22.2, పర్చూరు మండలంలో 21.2, జె పంగులూరు మండలంలో 19.2, చినగంజాం మండలంలో 18.4, చీరాల మండలంలో 17.4, బల్లికురవ మండలంలో 16.4, సంతమాగులూరు మండలంలో 15.2, కొరిశపాడు మండలంలో 13.2, కంభం మండలంలో 12.8 మిమీ వర్షపాతం నమోదైంది. వేటపాలెం మండలంలో 11.2, నాగులుప్పలపాడు మండలంలో 10.4, హనుమంతునిపాడు మండలంలో 10.2, అర్ధవీడు 9.4, బేస్తవారిపేట మండలంలో 8.4, ఇంకొల్లు మండలంలో 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మద్దిపాడు మండలంలో 6.2, అద్దంకి మండలంలో 5.4, దర్శి మండలంలో నాలుగు, టంగుటూరు మండలంలో 3.2, జరుగుమల్లి మండలంలో 3.2, కందుకూరు మండలంలో 3.2, శింగరాయకొండ మండలంలో మూడు, కొత్తపట్నం మండలంలో మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మర్రిపూడి మండలంలో 2.4, కొమరోలు మండలంలో 2.4, సంతనూతలపాడు మండలంలో 2.2, కనిగిరి మండలంలో 1.6, పొదిలి మండలంలో 1.2, గిద్దలూరు మండలంలో 0.80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంమీద అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల
english title: 
final list

మనీ.. మద్యం

$
0
0

శ్రీకాకుళం, జూలై 16: నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు గ్రామాల్లో మనీ... మద్యం ఫార్ములాతో ఓటుబ్యాంకు కొట్టేయడానికి శక్తియుక్తులా పోరాడుతున్నారు. రహస్యంగా గ్రామాలకు మద్యంను తరలించి ఓటర్లను కిక్కుతో తమవైపు తిప్పుకోవాలన్న అత్యాశతో పావులు కదుపుతున్నారు. ఎటువంటి అనుమతుల్లేకుండా లక్షలాది రూపాయలు మద్యాన్ని గ్రామాలకు యధేచ్చగా తరలించే పనిలో నేతలంతా బిజీగా ఉన్నారు. ప్రధాన రహదారుల్లో పోలీసు తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న దొడ్డిదారిల్లో మద్యాన్ని అనుబంధ గ్రామాలకు సైతం చేరవేస్తున్నారు. మద్యం షాపులకు షీలింగ్ అంటూ సంబంధిత అధికారులు సరుకుల్లో కోత విధించినప్పటికీ ఈ నెల పదవ తేదీ నుంచి నేటివరకు 10 కోట్ల రూపాయలు అమ్మకాలు సాగినట్లు ఐ.ఎం.ఎల్. డిపో గణాంకాలు సుస్పష్టంచేస్తున్నాయి. పదిరోజుల పాటు 3.5 కోట్ల రూపాయలు అమ్మకాలు సాగించడం పంచాయతీ ఎన్నికలకు ఎంత కిక్కు ఎక్కిస్తున్నారన్నది ఇట్టే అర్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆదివారం, సోమవారాల్లో పలు ప్రాంతాల్లో భారీగా మద్యం పోలీసులకు పట్టుబడింది. జిల్లాలో ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసుశాఖ దొడ్డిదారులపై కూడా నిఘా పెంచింది. దీంతో జిల్లా అంతటా రెండురోజులుగా 1500 మద్యం కేసులు పోలీసులకు చిక్కింది. ఎచ్చెర్ల మండలంలో కుప్పిలి గ్రామానికి తరలిస్తున్న 15 కేసులు మద్యం సుమారు 43,200 రూపాయల విలువ చేసేదిగా పోలీసులు గుర్తించారు. సాక్షాత్తు మండల తెలుగుదేశం నేత వాహనం కూడా ఇందులో పట్టుబడటం గమనార్హం. కొత్తూరు మండలం సోమరాజుపురంలో అక్రమంగా మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అలాగే జిల్లాకేంద్రంలోని రాజీవ్ స్వగృహ సమీపంలో రూరల్ మండలం కునుకుపేటకు చెందిన ఓ వ్యక్తి వద్ద 20 వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని టాటా ఎసి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతపట్నంలో ముప్పై కేసుల మద్యం , పోలాకి మండలంలో 16 కేసుల మద్యం పట్టుబడింది. ఈ ఘటనల వెనుక పంచాయతీ ఎన్నికలేనన్నది నగ్న సత్యం.
ఇదిలా ఉండగా ఓటరుకు కరెన్సీ ఎరవేయడానికి అభ్యర్థులు డబ్బుకట్టలను రంగంలో దింపుతున్నారు. ప్రతీ ఓటరుకు
500 నుంచి రెండువేల రూపాయల వరకు చెల్లించి పంచాయతీల్లో పట్టునిరూపించుకోవాలన్న సంకల్పంతో నేతలు ముందుకు సాగుతున్నారు. రియల్ ఎస్టేట్ పంచాయతీల్లో ఒక అడుగు ముందుకు వేసి ఓటర్లకు గృహోపకరణ వస్తువులు అందించాలన్న పనిలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గ్రామాల్లో ఉన్న యువతకు క్రికెట్ కిట్లు, మహిళలకు చీరలు, స్టీల్‌బిందెలు పంపిణీ చేసి ఓట్ల ఎరవేస్తున్నారు. ఇందులో భాగంగానే గత రెండు రోజులుగా జిల్లాలో 42 లక్షల రూపాయలు పోలీసులు వివిధ చెక్‌పోస్టుల వద్ద అకౌంటులేని నగదుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 29 లక్షల రూపాయలు నగదు పోలీసుల తనిఖీల్లో సోమవారం పట్టుబడింది. అలాగే బూర్జ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రెండున్నర లక్షల రూపాయలు, కంచిలి మండలంలో నాలుగున్నర లక్షల రూపాయలు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేని ఈ నగదు వెనుక పంచాయతీ స్టంట్ ఉందని అధికారులు చెప్పకనే చెబుతున్నారు. జిల్లాలో మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మద్యం..మనీయే ప్రధాన భూమిక పోషిస్తుందని అభ్యర్థులు ఆ దిశగా పంపకాల్లో బిజిబిజీగా ఉన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని అభ్యుదయ వాదులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.
15 లక్షల మంది ఓటర్లు పాల్గొనే ఇవి పేరుకే పార్టీ రహిత ఎన్నికలు. అడుగడుగునా పార్టీ జెండాల రెపరెపలు రాజకీయపక్షాల స్వీయాధిక్య కాంక్షను చాటడం ఇప్పటికే ఊపందుకుంది. ఏడేళ్లక్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల ముసుగులో కొన్నిచోట్ల వేలంపాటలు జోరేత్తడం తెలిసిందే. అదే రివాజు ఈసారి కూడా మొదలైంది. ఐదు నుంచి 20 లక్షల రూపాయల వరకే వేలం జరిగే పంచాయతీ కుర్చీలకు ఇప్పుడు అరకోటి వరకూ గుమ్మరించడానికైనా వెనుదీయని పంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో మనీ! మద్యం!! ప్రభావం లేకుండా అవసరమైన చర్యలన్నీ చేపడతామని చెప్పే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన ఏ మేరకు అమలవుతుందన్నది గత మూడురోజులుగా నమోదైన మనీ, మద్యం కేసులే సాక్ష్యం!?

కనె్నధార కొండ రీసర్వేపై కలెక్టర్ ఆరా
సీతంపేట,జూలై 16:సీతంపేట ఏజెన్సీలో వివాదస్పదమైన కనె్నధార కొండ వ్యవహారంలో గడచిన కొన్ని రోజులుగా జరుగుతున్న రీసర్వే పై జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆరా తీశారు.మంగళవారం టిడబ్ల్యూ కమిషనర్ పర్యటనలో భాగంగా సీతంపేట విచ్చేసిన కలెక్టర్ స్థానిక పిఎంఆర్‌సి కేంద్రం వద్ద కనె్నధార పోరాటకమిటీ నాయకులతో మాట్లాడారు. కనె్నధార కొండపై జరుగుతున్న రీసర్వే ఎంత వరకు వచ్చింది.. గిరిజన రైతులకు ఇచ్చిన పట్టాలు అవి గుర్తిస్తున్నారా ? లేదా ?అని కనె్నధార కొండ పోరాటకమిటీ నాయకులు సవరతోట మొఖలింగం, పత్తికకుమార్, సంజీవరావులను ప్రశ్నించారు.దీని పై వారు సమాధానమిస్తూ 350సబ్‌డివిజన్‌ల పరిధిలోని 650ఎకరాల వరకు రీసర్వే పూర్తి అయ్యిందని కలెక్టర్‌కు చెప్పారు.అలాగే ఏనుగుల వలన ధ్వంసం అయిన పంటలకు నష్టపరిహారం ఎంత వరకు చెల్లిస్తున్నారని తహశీల్దార్ మంగును ప్రశ్నించారు.ఏనుగుల వలన జరిగిన పంటనష్టాలు అంచనా వేసేందుకు ఇటీవలే హార్టికల్చర్ అధికారులు వచ్చారని, వారు నివేదిక అందిస్తారని తహశీల్దార్ మంగు వివరించారు.పంట నష్టపరిహారానికి సంబంధించి తమకు కూడా నివేదిక పంపాలని కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్‌తో పాటు పీవో కె సునీల్‌రాజ్‌కుమార్ ఉన్నారు.

గుణాత్మక విద్య అందించండి
సీతంపేట,జూలై 16:గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాలు, కెజిబివిలు వంటి పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల భవిష్యత్త్ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఎ సోమేష్‌కుమార్ అన్నారు.ఏజెన్సీ పర్యటనలో భాగంగా మంగళవారం సీతంపేట విచ్చేసిన ఆయన స్థానిక గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వెస్ట్(క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్‌టి స్టూడెంట్స్)పై ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు ఇచ్చే శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడుతూ క్వెస్ట్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు,విద్యార్థుల కోసం రూపొందించి దీపిక, అభ్యాసిక అనే పుస్తకాల గూర్చి ముందుగా తెలుసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమం లేదని,గిరిజన విద్యార్థుల విద్యాప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు పునాది,క్వెస్ట్ వంటి కార్యక్రమాలు రూపొందించామన్నారు. వివిధ సబ్జెక్ట్‌లకు చెందిన 250మంది గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులతో ఈ దీపిక,అభ్యాశిక అనే పుస్తకాలు తయారు చేశామన్నారు. గిరిజన
సంక్షేమ ఆశ్రమపాఠశాల చదివే విద్యార్థులకు విద్య రాదనే భావన గతంలో ఉండేదని,అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10ఐటిడిఎల్లో 2వేల మంది ఉపాధ్యాయులు ఈ క్వెస్ట్ కార్యక్రమం పై శిక్షణ పొందుతున్నారన్నారు. గిరిజన విద్యార్థులకు పాఠాలు బోదించాలంటే వాళ్ల మనసులకు దగ్గరగా ఉంటే కథలు చెబుతు పాఠ్యాంశాలు బోధించాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ గిరిజన విద్యాభివృద్ధికి తామంతా ప్రోత్సహిస్తామన్నారు.ఉపాధ్యాయులు ఏవిధంగా విద్యార్థులకు బోధించాలో తెలిపే దీపిక,గిరిజన విద్యార్థుల కోసం తయారుచేసిన అభ్యాశిక వంటి పుస్తకాలు వలన ఎంతో లాభం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిసిసి ఎండి రమేష్‌కుమార్,ఐటిడిఎ పీవో కె సునీల్‌రాజ్‌కుమార్,డిప్యూటి డిఇఓ సుబ్బారావు,ఏఎంఓ ఆదినారాయణ,ఏటిడబ్ల్యుఓలు బల్ల అప్పారావు,వరలక్ష్మి,కమల,రీసోర్స్ పెర్సన్‌లు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఏకగ్రీవ పంచాయతీల్లో నేడు ఉపసర్పంచ్ ఎన్నిక
శ్రీకాకుళం, జూలై 16: ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ పదవికి ఈ నెల 17వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్‌తోపాటు వార్డుసభ్యులకు పోటీదారులు ఎవరూ లేని పంచాయతీల్లో 17వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు ప్రకటించిన తక్షణం ఉపసర్పంచ్ ఎన్నిక జరుపవచ్చన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలు జారీ చేసిందని పేర్కొన్నారు. 17వ తేదీన కోరమ్ తక్కువగా ఉన్నప్పుడు 18వ తేదీ ఉదయం పదకొండు గంటలకు సంబంధిత రిటర్నింగ్ అధికారి ద్వారా నిర్వహిస్తామన్నారు. 17, 18వ తేదీల్లో ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించినప్పుడు మరలా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. ఏదేని వార్డులకు నామినేషన్లు దాఖలు కానప్పుడు ఉపసర్పంచ్ ఎన్నిక పోలింగ్ పూర్తి అయిన తరువాత మాత్రమే నిర్వహించాలన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 650 మంది ఓటర్లు ఉండేవిధంగా చర్యలు చేపట్టవచ్చని కమిషన్ సూచనలు జారీ చేసిందన్నారు.

రాజుకున్న పాతకక్షలు
* కాంగ్రెస్ నాయకునిపై వైకాపా వర్గీయుల దాడి
నరసన్నపేట, జూలై 16: పట్టణంలో కలివరపుపేటలో పాతకక్షలు రాజుకున్న నేపధ్యంలో ఒకరిపై దాడి జరిగిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోరాడ వేణుగోపాలస్వామి గుప్తపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన వ్యాపారం ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చిన సమయంలో సుమారు 50 మంది చంద్రభూషణగుప్త తన అనుచరులతో తనపై దాడి చేశారంటూ గుప్త విలేఖరులకు తెలిపారు. ఈ దాడిలో వేణుగోపాలస్వామి గుప్త ఎడమకాలు విరిగిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే తనపై అక్కసుతోనే గుప్త అనుచరులు దాడి చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎన్నికల నియమాలు అతిక్రమిస్తే చర్యలు
*జాయింట్ కలెక్టర్ భాస్కర్
హిరమండలం,జూలై 16: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని జెసి కె భాస్కర్ హెచ్చరించారు. మంగళవారం వంశధార అతిధి గృహంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో 1094 పంచాయతీలు, 10496 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, మరో నాలుగు పంచాయతీల్లో సమస్యల కారణంగా ఎన్నికలు జరగడంలేదన్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 23న జరిగే ఎన్నికల్లో 5,68,871మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా పాలకొండ డివిజన్‌లో 4,83,803మంది ఓటుహక్కు వినియోగించుకుంటారన్నారు. టెక్కలి డివిజన్‌లో 5,32,669మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి 24,715మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 10,543 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 4,176 ఎన్నికల బాక్సులు అందజేస్తున్నామని, 142గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా 253 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు.

ఏనుగుల సమస్యను పరిష్కరించండి
*గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు మొర
సీతంపేట,జూలై 16:సీతంపేట ఏజెన్సీలో అలజడి సృష్టిస్తున్న ఏనుగులను ఈ ప్రాంతం నుండి తరలించి తమకు న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు పత్తికకుమార్,సవరతోట మొఖలింగం,సంజీవరావులు కోరారు.మంగళవారం సీతంపేట విచ్చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సోమేష్‌కుమార్‌ను స్థానిక పిఎంఆర్‌సి కేంద్రం వద్ద కలిసి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతిపత్రం అందజేసారు. ఏనుగుల వలన పంటలు నాశనం అవుతున్నాయని, రాత్రుళ్లు గ్రామం విడిచి బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నామని కమిషనర్‌కు వివరించారు.అలాగే మండలంలో ఎనిమిది పంచాయతీలు నాన్‌షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయని వాటిని షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని కోరారు. దీని పై పరిశీలిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
నీటిలో నీలకంఠుడు!
పాతపట్నం, జూలై 16: మహేంద్ర తనయకు ఆవలివైపున స్వయంభూగా వెలసిన నీలకంఠుడు ఏడాదిలో ఆరునెలలు నీటిలోనే భక్తులకు దర్శనమిస్తాడు. గజపతిరాజుల కాలంనాటి నుండి ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ నీలకంఠేశ్వర ఆలయం ఈ ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచింది. ఏటా జూలైలో స్వామి పూర్తిస్థాయిలో నీటిలోనే భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంటాడు. నీటిలో ఉన్న స్వామి మూలవిరాట్‌ను దర్శించుకుని భక్తులు తన్మయం చెందుతున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శిస్తుంటారు. క్రీ.శ 16వ శతాబ్ధంలో పర్లాఖిమిడి గజపతిరాజులు స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. విగ్రహమంతా భూమిలోనే ఉంటుందని పూర్వీకుల విశ్వాసం. స్వామిని అభిషేకించేందుకు గంగమ్మ తల్లి ఆరునెలల పాటు ఇక్కడే కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. పర్లాఖిమిడి గజపతిరాజులకు స్వప్నంలో స్వామి కనిపించి మహేంద్ర ఒడ్డున వెలిశాను, అక్కడ ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించినట్లు ప్రచారం ఉంది.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం
* మరొ యువతి పరిస్థితి విషమం
హిరమండలం, జూలై 16: మండలంలోని పెద్దసంకిలి గ్రామ పంచాయతీ పరిధిలోని బర్రిపేట గ్రామ సమీపంలో ఎబి రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని దుర్మరణం చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే కొత్తూరులోని రెల్లివీధికి చెందిన ముదిల రాజు, కోల క్రిష్ణవేణి(16), కోల ప్రియాంక అనే ముగ్గురు ద్విచక్రవాహనంపై హిరమండలం మండలం తులగాం గ్రామానికి వస్తున్నారు. హిరమండలం నుండి కొత్తూరు వైపు వెళుతున్న టిప్పర్‌ను తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న నీటిగుంటలో పడిపోయారు. ఈ సమయంలో జారిపడిన కోల క్రిష్ణవేణి టిప్పర్ ముందుభాగంలోని చక్రాల కింద పడి దుర్మరణం చెందింది. తీవ్రంగా గాయపడిన ప్రియాంకను హిరమండలం పిహెచ్‌సికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అలాగే స్వల్ప గాయాలైన రాజుకు స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై హిరమండలం ఎస్ ఐ ఎం.శ్రీను కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం
*టిడిపి నేత రామ్మోహన్‌నాయుడు
పొందూరు, జూలై 16: కాంగ్రెస్ పాలనతో విసిగి పోయిన ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మంగళవారం ఆయన లోలుగు పంచాయతీ సర్పంచ్‌గా బరిలో ఉన్న అభ్యర్థి లోలుగు నారాయణమ్మకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వారు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మనీ..మద్యంలను విపరీంతగా వినియోగించుకోవడంతో పాటు హింసాత్మక చర్యలకు పాల్పడి ఓటర్లను భయభ్రాంతులను చేసే అవకాశం జిల్లాలో ఎక్కువగా కనబడుతోందన్నారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అవసరమైన పూర్తి భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ,ఎస్పీలతో పాటు ఎన్నికల కమిషన్ కూడా కోరామన్నారు. ఈ ఎన్నికల్లో దేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైనట్లు వస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత నాయకులు లోలుగు శ్రీరాములనాయుడు తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాముడిగా జగన్నాథుడు
శ్రీకాకుళం, జూలై 16: పట్టణంలో వివిధ వైష్ణాలయాల్లో జగన్నాథుని రథోత్సవ పూజలు జరుగుతున్నాయి. ఇలిసిపురంలో గుడించా మందిరంలో రఘువీర్‌దాస్ బావాజీ నిర్వహణలో జరుగుతున్న రథయాత్రలో బుధవారం జగన్నాథుని శ్రీరామ అవతారంలో అలంకరించి భక్తుల దర్శనార్ధం ఉంచారు. కార్యక్రమంలో బాలకృష్ణ పాణిగ్రహి ఒడిశాకు చెందిన పురోహితులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే గుజరాతిపేట ఇంద్రద్యుమ్నంలో నిర్వహిస్తున్న జగన్నాథ ఉత్సవంలో స్వామి సత్యనారాయణ స్వామి రూపంలో అలంకరించి పూజలు జరిపారు.

‘ప్రభుత్వ పథకాలకు వర్సిటీ అనుసంధానంతో అభివృద్ధి’
ఎచ్చెర్ల, జూలై 16: ప్రభుత్వ శాఖలతో అంబేద్కర్ యూనివర్సిటీ విభాగాలను అనుసంధానం చేయడం వల్ల జిల్లాలో శరవేగంగా అభివృద్ధి ఫలాలు అర్హులకు అందించగలుగుతామని రాష్ట్ర ముఖ్య ప్రణాళిక గణాంక శాఖ డైరెక్టర్ డి.దక్షిణామూర్తి స్పష్టంచేశారు. మంగళవారం వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్‌ను కలిసి 20 సూత్రాలకు విశ్వవిద్యాలయం విభాగాల అనుసంధానంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ విశ్వవిద్యాలయం ఇటువంటి ప్రక్రియ ఆరంభించలేదని కొనియాడారు. సమాజమే సిలబస్‌గా అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడంతోపాటు పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి ఈ ప్రక్రియ మరింత దోహదపడుతుందన్నారు. అనుసంధానంపై పలువిషయాలను వీసీ ఆయనకు వివరించారు. ఈయనతోపాటు సిడిసి డీన్ జి.తులసీరావు తదితరులున్నారు.

రూ.500 కోట్ల ఉపాధి పనులు లక్ష్యం
* జిల్లా ఫైనాన్స్ మేనేజర్ రాజారావు
నరసన్నపేట, జూలై 16: జిల్లాలో ఉపాధి పనులు వేగవంతం చేస్తున్నామని ఆ శాఖ జిల్లా ఫైనాన్స్ మేనేజర్ వి.రాజారావు తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 500 కోట్లరూపాయల లక్ష్యంగా ఉపాధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే 56,449 పనులను గుర్తించగా సుమారు 23,129 పనులు పూర్తయ్యాయని స్పష్టంచేశారు. అలాగే పచ్చతోరణానికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.ఒ జె.సత్యమూర్తి, సాంకేతిక సహాయకులు నాయుడు, నాగమణి, నర్సయ్య, నాగమణి, అప్పలరాజు పాల్గొన్నారు.

ఆర్టీసీతోనే సురక్షిత ప్రయాణం
శ్రీకాకుళం, జూలై 16: సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే మేలని జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్.సెంథిల్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ రెండో డిపో ఆవరణలో నిర్వహించిన ప్రమాద రహిత వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి మానసిక ఆందోళన నుండి బయటపడే మార్గాల ద్వారా మరింత మెరుగైన సేవలందించే వీలుందన్నారు. ప్రస్తుతం నెక్ రీజియన్‌లో అతి తక్కువ ప్రమాదాలు నమోదైనందున ప్రమాద నివారణలో బెస్ట్‌గానే ఉందన్నారు. సంస్థ నష్టాలకు కారణాలుగా పేర్కొంటున్న ప్రైవేట్ వాహనాలను నివారించడంలో ఆర్టీసీ సిబ్బందికి పోలీస్ సేవలు అందుబాటులో ఉంటాయని భరోసానిచ్చారు. రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు ఇస్తున్న ప్రోత్సాహక బహుమతి సరిపోదని, వారిని పదోన్నతి వంటివాటితో సత్కరించాల్సి ఉందన్నారు. కార్యక్రమానికి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పన్న అధ్యక్షత వహించగా, డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యన్నారాయణ, స్టేషన్ మేనేజర్ బి.యల్.పి.రావు, యూనియన్ నాయకులు యంవి రాజు, కుమార్, కె.శంకరరావు, కె.నానాజీ పాల్గొన్నారు.

థర్మల్ స్థూపానికి పాలాభిషేకం
సోంపేట, జూలై 16: ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు చేస్తున్న ఉద్యమాలను పట్టించుకోకుండా రాజకీయ దురద్దేశ్యంతో సోంపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అమరస్థూపానికి నివాళులర్పించడాన్ని నిరసిస్తూ సోంపేట పర్యావరణ పరిరక్షణ సంఘం, తీరప్రాంత మత్స్యకార ఐక్యవేదికల ఆధ్వర్యంలో మంగళవారం థర్మల్ స్థూపానికి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు డాక్టర్ కృష్ణమూర్తి, తమ్మినేని రామారావు, బీన ఢిల్లీ, ఎం.రాజారావు, మెట్ట గోపాల్ తదితరులు మాట్లాడుతూ సోంపేట పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే దురద్దేశ్యంతో అమరుల స్థూపానికి నివాళులర్పించారని విమర్శించారు. ఇప్పటికైనా దిగజారుడురాజకీయాలు మాని ఉద్యమానికి మద్దతు పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.్ధర్మారావు, కె.నారాయణ, వెంకన్న, చంద్రమోహన్ పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో వివాదం
ఎచ్చెర్ల, జూలై 16: సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న కొత్తకోట పూర్ణచంద్రరావుతోపాటు మరికొంతమంది ఉపాధిహామీ పనుల వద్ద మంగళవారం ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న మరో అభ్యర్థి పైడి లక్ష్మునాయుడు అనుచరులు అక్కడకు చేరుకుని ఉపాధి హామీ పనుల వద్ద ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరరం లక్ష్మునాయుడుతోపాటు మాజీ వైస్ ఎంపిపి కోటిపాత్రుని విశ్వనాధం, పైడి ధనుంజయ్, రామస్వామి, పిఎసిఎస్ ఉపాధ్యక్షులు పైడి వైకుంఠరావులు కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఎంపిడిఒకు ఫిర్యాదు చేశారు.
బొడ్డేపల్లి శైలజ, ఎస్సై పి.వి.ఎస్.ఉదయ్‌కుమార్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎంపిడిఒను వివరణ కోరగా ఉపాధి పనుల వద్ద ప్రచారం చేయడం కోడ్ ఉల్లంఘన కాదని స్పష్టంచేశారు.

నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు
english title: 
money, liquor

ఏజెన్సీలో భారీగా నామినేషన్ల ఉప‘సంహరణ’

$
0
0

విశాఖపట్నం, జూలై 16: పంచాయతీ ఎన్నికల్లోని నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం బుధవారం జరగనుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో భారీ ఎత్తున నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి నామినేషన్ల ఉపసంహరణ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. జి మాడుగుల మండలంలో నాలుగు పంచాయితీలకు చెందిన నామినేషన్లను ఇప్పటికే మావోయిస్ట్‌లు అపహరించుకుపోయారు. కొన్ని పంచాయతీలకు కనీసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నందున నామినేషన్లను ఉపసంహరించుకోవాలని మావోయిస్ట్‌లు ఇప్పటికే హెచ్చరించారు. కాదని బరిలో కొనసాగితే, ప్రాణ హాని తప్పదని హెచ్చరించారు. దీంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ముంచింగిపుట్, పెదబయలు, జికెవీధి, జి మాడుగుల మండలాల్లో అభ్యర్థులు తమతమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు సిద్ధ పడుతున్నారు. కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమించినందున సిపిఐ, సిపిఎం పార్టీలకు ఈ హెచ్చరికల నుంచి మినహాయింపు ఉంటుందని కొంతమంది భావిస్తున్నా, వారు కూడా తప్పుకోవలసిందేనని అంటున్నారు మరికొంతమంది. దీంతో ఏజెన్సీ నుంచి భారీ సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
చొరబడిన మావోయిస్ట్‌లు
చత్తీస్‌గడ్, ఒడిశా ప్రాంతాల్లో జరిగే విధ్వంసాల్లో ఈ ప్రాంతానికి చెందిన మావోయిస్ట్‌ల పాత్ర ఉంటుంది. విశాఖ ఏజెన్సీలో ఉనికి కోల్పోయారనుకుంటున్న మావోయిస్ట్‌లు ఇప్పుడు చత్తీస్‌గడ్, ఒడిశా ప్రాంత మావోయిస్ట్‌ల సహకారంతో తిరిగి పట్టు సాధించాలని భావిస్తున్నారు. పోలీసులు అప్రమత్తమయ్యేలోగా, చత్తీస్‌గడ్, ఒడిశా ప్రాంతానికి చెందిన మావోయిస్ట్‌లు విశాఖ ఏజెన్సీలో చొరబడ్డారన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. నక్సల్స్ ఎప్పుడు ఏ విధ్వంసానికి పాల్పడతారో, ఎప్పుడు ఎవరిని హతమార్చుతారోనన్న భయంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నక్సల్స్ ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం కన్నా, ఆ తరువాత మొత్తం పోలీసు బలగాలను దించి, ఎన్నికలను జరిపితే బాగుటుందని అధికారులు బావిస్తున్నారు.
ఇదిలా ఉండగా మైదాన ప్రాంతాల్లో పరిస్థితి మరొక విధంగా ఉంది. కొన్ని పంచాయతీల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య ఒడంబడిక కుదుర్చుకున్నారు. సర్పంచ్ పదవిని ఒక పార్టీకి ఇస్తే, వార్డు సభ్యుల పదవులను పొత్తుపెట్టుకున్న వారికి ఇవ్వాలన్నది ఒప్పందంలో భాగం. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న పార్టీల్లో ఒకరు ఎన్నికల బరి నుంచి తప్పుకోనున్నారు. వందల సంఖ్యలోని పంచాయతీల్లో ఇలాంటి ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా నామినేషన్ల ఉపసంహరణ భారీగానే ఉంటుందని తెలుస్తోంది.

ఏజెన్సీలో ఎక్సైజ్ దాడులు
విశాఖపట్నం, జూలై 16: తొలి విడత ఎన్నికలు జరిగే విశాఖ ఏజెన్సీలో మద్యాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 38 మందిపై 89 సారాయి కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ అధికారులు తెలియచేశారు. అలాగే 940 లీటర్ల సారాను సీజ్ చేశారు. 10,900 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఏజెన్సీలో బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న 71 మందిపై 65 మందిపై కేసులు నమోదు చేశారు. 390 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 322 కిలోల గంజాయిని, 130 బాటిల్స్ బీరును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఐదుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మద్యం జిల్లాలోకి చొరబడకుండా ఉండేందుకు అరకు దగ్గర గోరాపూర్ వద్ద, ముంచింగిపుట్ వద్ద చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. అలాగే తగరపువలసద్ద, తాండవ బ్రిడ్జివద్ద, పెందుర్తి సమీపంలోని జంగాలపాలెం వద్ద చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

ఆదాయం పెరిగే మార్గమెక్కడ
ఖర్చుల నియంత్రణకు దారేది
* సర్వశక్తులు ఒడ్డుతున్న జివిఎంసి
విశాఖపట్నం, జూన్ 16: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్న మహా విశాఖ నగరపాలక సంస్థ ముందున్నది ఒకేఒక లక్ష్యం. ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని రెండింతలు చేసుకోవాలి. ఇదే సందర్భంలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న దుబారాను అరికట్టాలి. దుబారా ఖర్చుల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలి. ఆస్తిపన్ను, మంచినీటి పన్నుల ద్వారా ఇప్పటికే లభిస్తున్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. పన్నులు పెంచి ప్రజల ఆగ్రహాన్ని చవిచూసేకంటే ఉన్న వనరులనే మదింపు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే జివిఎంసి లక్ష్యం. జివిఎంసి పరిధిలోని 2.2 లక్షల అసెస్‌మెంట్ల ద్వారా సుమారు 100 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. దీనిలో వాణిజ్య సముదాయాల నుంచి లభించే ఆదాయం అధికం. వాణిజ్యేతర భవనాలు కూడా ఇటీవల కాలంలో వాణిజ్య అవసరాల మేరకు రూపాంతమైపోయాయి. అలాగే వాణిజ్య సముదాయాలు సైతం పరిధిని విస్తృతం చేసుకున్నాయి. దీనిపై దృష్టి సారించిన జివిఎంసి తొలుత వాణిజ్య సముదాయాల పునర్ మదింపు ప్రక్రియను చేపట్టింది. దీంతో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూశాయి. దాదాపు 10 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం సమకూరింది. నగర పరిధిలో దాదాపు 40 వేల వాణిజ్య భవనాలను ఇదే తరహాలో మధింపు చేయాలని నిర్ణయించారు. దీనికోసం మినీ కంప్యూటర్లలో ఆసెస్‌మెంట్ల పూర్తి సమాచారాన్ని ఉంచి, వాస్తవ పరిస్థితులతో దీన్ని క్రోఢీకరిస్తున్నారు. దీంతో భవన యజనానుల బండారం బయటపడుతోంది.
ఇక మంచినీటి పన్ను పెంపు అంశంపై కూడా జివిఎంసి దృష్టి సారిస్తోంది. బల్క్, సెమీ బల్క్ నీటి వినియోగదార్లపై భారాన్ని మోపే విధంగా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. నీటి పన్ను రూపంలో జివిఎంసికి 50 కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తుండగా, 50 శాతం పెంపు లక్ష్యంగా కన్పిస్తోంది. ఇక నగర పరిధిలో ఖాళీ స్థలాల పన్ను వసూళ్లను జివిఎంసి కఠిన తరం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఖాళీ స్థలాల పన్ను రూపంలో కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలవుతుండగా, దీన్ని 50 కోట్ల రూపాయలకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జూలై 31లోగా ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చి విఎల్‌టి చెల్లించాల్సిందిగా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నోటీసులకు యజమానులు స్పందిచకపోతే స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తున్నారు. ఇదే తరహాలో ప్రకటనల ద్వారా వచ్చే పన్ను, ఇతర ఆదాయ మార్గాలను వదలకుండా అదనపు రాబడే పరమావధిగా ముందుకెళ్తున్నారు.
ఇదిలా ఉండగా, కేవలం ఆదాయాన్ని పెంచుకుంటేనే సరిపోదన్న వాస్తవాన్ని ఇప్పటికి గానీ యంత్రాంగం గుర్తించలేదు. ముఖ్యంగా దురాబాఖర్చులను నియంత్రించుకుంటే ఆదాయాన్ని పెంచినంతగా భావించారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బంది విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. పారిశుద్ధ్య విభాగంలో దాదాపు 4800కు పైగా ఉన్న కార్మికులతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న, మిగిలిన వారి విధుల విషయంలో నివేదికను రూపొందిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడమే కాదు ఖర్చులు నియంత్రించుకుంటేనే జివిఎంసికి ఆర్ధిక పరిపుష్టి చేకూరేది.

నేటి నుంచి ఇళ్ల నుంచి చెత్త సేకరణ ప్రారంభం
విశాఖపట్నం, జూలై 16: జివిఎంసి పరిధి జోన్ 4లో ఇళ్ల నుంచి చెత్త సేకరణ కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. జోన్ పరిధిలోని 31 నుంచి 49 వార్డుల పరిధిలో ఈకార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వి శేషాద్రి బుధవారం ప్రారంభించనున్నారు. ఘన వ్యర్థాల నిర్వాహణకు అనువుగా ఇళ్ల నుంచి తడి,పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తారు. తొలి దశలో వారం రోజుల పాటు చెత్త సేకరణపై స్థానికులకు అవగాహన కల్పించి ఈనెల 24 నుంచి పూర్తి స్థాయిలో చెత్త సేకరణ ప్రారంభించనున్నట్టు కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. జోన్ పరిధిలోని 19 వార్డుల్లో 285 పుష్‌కార్డు రూట్‌లను గుర్తించామని, మొత్తం 855 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారని తెలిపారు. జోన్ పరిధిలో ఇప్పటికే 2,192 డస్ట్‌బిన్‌లను, 548 టబ్బులను పంపిణీకి సిద్ధంగా ఉంచామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు టోపీలు, విజిల్స్ పంపిణీకి సిద్దంగా ఉంచినట్టు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జోన్ పరిధిలో 49 మంది నోడల్ అధికారులను నియమించామన్నారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి తడిపొడి చెత్తను సేకరించి వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తారని తెలిపారు.

కులం, బంధుత్వాలు సమస్యలు పరిష్కరించలేవు
* గిరిజన మంత్రి బాలరాజు
పాడేరు, జూలై 16: స్ధానిక సంస్ధల ఎన్నికలలో కులం, బంధుత్వాల పేరు చెప్పి ఓట్లను దండుకునే నాయకుల వల్ల గ్రామాల్లో సమస్యలు తీరవని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. మండలంలోని వంట్లమామిడి పంచాయతీ కొత్తపొలం, మోదాపల్లి పంచాయతీ కేంద్రాలలో మంగళవారం ఆయన పర్యటించి పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులతో మాట్లాడుతూ అధికారం కోసం గ్రామాలలో పర్యటనలు సాగిస్తున్న పలు పార్టీల నాయకులు తమ బంధుత్వాలు, కులాలను ఆయుధాలుగా మలుచుకుని ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి కుటిల రాజకీయ ఎత్తుగడలకు గిరిజనులు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. మన్యంలో ప్రగతికి దోహదపడే అభ్యర్ధులకే ప్రాధాన్యత ఇవ్వాలని, కులాలకు, బంధుత్వాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రగతిని సాధించే అవకాశం లేదని ఆయన సూచించారు. కొంత మంది స్వార్ధపర రాజకీయ నాయకులు ఆదిపత్యం చెలాయించేందుకు గిరిజనుల మధ్య కులాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దశాబ్ధాల కాలంగా అభివృద్ధికి దూరంగా జీవనం సాగిస్తున్న గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందచేస్తూ ప్రజలలో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కొందరు జిత్తులమారి వేషాలతో ఇటువంటి ప్రచారాలను సాగించడం అత్యంత హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న గిరిజనుల మధ్య ఇటువంటి కులాల కుమ్ములాటలను ప్రోత్సహిస్తున్న కపట నాయకులకు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారం కోసం వివిధ పార్టీల నాయకులు సాగిస్తున్న కులాల వైషమ్యాలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గిరిజనులలో రాగద్వేషాలు రగిలి ప్రశాంత మన్యంలో అశాంతికి బీజం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపొలం గ్రామ గిరిజనులు జీవితకాల వాంఛ అయిన బి.టి.రోడ్డు నిర్మాణంలో తలెత్తిన అటవీ సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా తమ తాత ముత్తాతల నుండి తమ ప్రాంత వాసులకు కాలిబాట తప్ప వేరే గత్యంతరం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ ప్రాంతానికి రహదారి సౌకర్యంతో పలు సౌకర్యాల కల్పనకు కృషి చేయడం తమ అదృష్టంగా పేర్కొన్నారు. గ్రామంలోని మంచినీరు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అదనపు ఉపాధ్యాయుని నియామకంతో పాటు వంట్ల మామిడి గ్రామానికి రహదారి నిర్మాణం వంటి పలు సమస్యలను గిరిజనులు మంత్రి దృష్టికి తీసుకు రావడంతో వాటిని తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మోదాపల్లి పంచాయతీ కేంద్రంలో గిరిజనులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాడేరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామం దశాబ్ధాల కాలంగా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడడానికి ఇంతవరకు ఎన్నుకున్న నాయకుల అసమర్థతే కారణమని ఆయన అన్నారు. ఇంతవరకు అధికారం చలాయించిన నాయకులు మీ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు. గిరిజనుల అభివృద్ధికి పీట వేసి ప్రగతికి నిధులు కేటాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధులను పంచాయతీ ఎన్నికలలో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన కొందరు నాయకులు అధికార దాహంతో పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేయడం శోచనీయమని అన్నారు. గిరిజనులకు సేవచేయడంతో పాటు వారి యోగక్షేమాలను నిరంతరం తెలుసుకుంటూ వారి అవసరాలను తీర్చే నాయకుడే నిజమైన నాయకుడని అన్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ పలు గ్రామాలు సమస్యలతో సతమతవౌతుండడం తనను ఎంతగానో బాధిస్తుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తద్వారా గిరిజన గ్రామాలు అభివృద్ధితో పాటు వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరిసేందుకు అలుపెరగని పోరాటం చేస్తానని మంత్రి బాలరాజు హామీ ఇచ్చారు.

బిచాణా ఎత్తేసిన మరో సంస్థ
* రూ.ఐదు కోట్లతో పరారైన సంస్థ నిర్వాహకుడు
* చీటీలు, ఫైనాన్స్, అధిక వడ్డీ పేరుతో టోకరా
విశాఖపట్నం, జూలై 16: మ్యాజిక్, రాగ, సిమ్స్, శ్రీచక్రగోల్డ్, తదితర సంస్థల జాబితాలో మరో ఫైనాన్స్ సంస్థ చేరించి. సుమారు రూ.ఐదు కోట్లకు పైగా ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టి ఈ సంస్థ నిర్వాహకుడు కుటుంబంతో కలిసి పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలివి.
స్థానిక వన్‌టౌన్ ఏరియాలోని కంచరవీధిలో దార్ల బ్రహ్మాజి, కుటుంబంతో గత ముప్పై ఏళ్లుగా నివాసముంటున్నాడు. సమీపంలోని చిన్న చిన్న దుకాణాలకు రోజు వారి ఫైనాన్స్ ఇవ్వడంతో పాటు ఇంటి దగ్గర చీటీలు వేయడం ప్రారంభించాడు. ఫైనాన్స్ వ్యాపారం బాగ సాగుతుండడంతో శ్రీవెంకటేశ్వర కనక గ్రూప్ చిట్స్ అండ్ ఫైనాన్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. చీటీల సొమ్మును సక్రమంగా ఇవ్వడం ప్రారంభించడంతో ఖాతాదారులు బ్రహ్మాజిని నమ్మారు. ఈ తరుణంలో తమ సంస్థలో నగదు డిపాజిట్ చేస్తే పది శాతం వడ్డీ ఇస్తామని ప్రచారం చేయడంతో అనేకమంది ఇందులో ఖాతాదారులుగా చేరారు. దీంతో సుమారు రూ.5కోట్లకు పైగ డిపాజిట్లను బ్రహ్మాజి సేకరించినట్టు పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న బంగారం వ్యాపారస్తులు ఇతని వద్ద పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేశారు. కొద్ది రోజులుగా ఖాతాదారులకు వడ్డీని సరిగా బ్రహ్మాజి చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం కొంతమంది ఖాతాదారులు అతని ఇంటికి వెళ్లి నిలదీశారు. కొద్ది రోజుల్లో అందరీ ఖాతాలను క్లీయర్ చేస్తానని చెప్పిన బ్రహ్మాజీ సోమవారం రాత్రి కుటుంబంతో సహా పలాయనం చిత్తగించడంతో లబోదిబోమంటూ బాధితులు మంగళవారం ఉదయం స్థానిక పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. బ్రహ్మాజి వద్ద డిపాజిట్ చేసిన వారిలో బంగారం వ్యాపారులతో పాటు, పేద, మధ్య తరగతి వారున్నారు. పది శాతం వడ్డీ వస్తుందని, రెండు, మూడు రూపాయలకు ఇతరుల వద్ద ఐదు లక్షలు, పది లక్షల రూపాయల మేరకు అప్పు చేసి బ్రహ్మాజి వద్ద డిపాజిట్ చేసిన వారు ఇప్పుడు బోరు మంటున్నారు. బాధితులంతా టౌన్‌హాలు వద్ద సమావేశమై అనంతరం ర్యాలీగా పోలీసు స్టేషన్‌కు తరలి వెళ్లారు. నిందితుడు బ్రహ్మాజిని పట్టుకోవడం కోసం ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. సిఐ ఇలియాస్ ఆహ్మద్ నేతృత్వంలో ఒకటో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడి
* జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి

విశాఖపట్నం , జూలై 16: పంచాయతీ ఎన్నికలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా నిర్వహించే విధంగా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి మండల అధికారులకు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలివిడత గ్రామ పంచాయతీ ఎనిన్కలు పాడేరు డివిజన్‌నందు ఈ నెల 23వ తేదీన జరుగనున్న సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మండలాధికార్ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఏమైనా అసంఘటిత చర్యలు జరిగితే వెంటనే తెలియజేయాలని అన్నారు. ఏ రోజు కారోజు నివేదికలను పంపించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ తహశ్లీదర్, ఎంపిడిఓ, పోలీసుల బృందం ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. నియమావళిని అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు జరిగినప్పుడు వీడియో తీసి రోజువారీ రిపోర్టును పంపాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, పోలింగ్ కేంద్రాలలో వీడియోఅగపీ ఏర్పాట్లు గురించి తెలుసుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన రూట్‌మ్యాప్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు సరిపడా ఉన్నవీ లేనిది చూసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో వెంటనే తీసుకుని వెళ్ళాలని అన్నారు. పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇప్పించాలని అన్నారు. మారుమూల గ్రామాలలో వాహనాలు వెళ్లేందుకు రహదారి సౌకర్యం ఉన్నదీ లేనిది ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లను చేసుకోవాలని అన్నారు. 17వ తేదీ సాయంత్రానికల్లా అన్యర్థుల ఉపసంహరణ వివరాలను తెలియజేస్తూ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల లిస్టును పంపించాలని అన్నారు. 18వ తేదీ ఉదయానికల్లా బ్యాలెట్ పేపర్లు ఎంత కావాలన్నది తెలియజేయాలని అన్నారు. 23వ తేదీ లోపల బిఎల్‌ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్లందరికీ స్వయంగా స్లిప్‌లను పంపిణీ చేయాలని అన్నారు. 21 రకాల గుర్తింపు కార్డుల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వారికి తెలియజేయాలని అన్నారు. ఓటరు జాబితాలో ఎవరైనా మరణించినా, వలసవెళ్ళినా, వివాహం చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళినా వారి జాబితాను తయారు చేసి పంపాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డిఆర్‌ఓ వెంకటేశ్వరరావు, జడ్పీసిఇఓ డివి.రెడ్డి, డిపిఓ కె.సుధాకర్, ఆర్డీఓలు రంగయ్య, గణపతిరావు, సుబ్బరాజు, వసంతరాముడు అన్ని మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ఐదుగురు నకిలీ మావోల అరెస్ట్
చింతపల్లి, జూలై 16: మావోయిస్టులమని చెప్పుకుంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఒక మహిళతోసహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చింతపల్లి డిఎస్పీ ఇ.జి. అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆ యన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ మువ్వల సీత, పాంగి అప్పారా వు, వడ్డాది శ్రీను, పాంగి నరేష్, వం తల పాండు అనే ఐదుగురు మావోయిస్టులమంటూ మండలంలో అలజడి సృష్టిస్తున్నారన్నారు. మండలంలో లంబసింగి, లోతుగెడ్డ జంక్షన్ గ్రామాల్లో మావోయిస్టులమంటూ సుమారు 25 వేల నగదు, ఒక సెల్‌ఫోన్ బెదిరించి తీసుకున్నట్లు తెలిపారు. తమకు అంది న ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో పాం గి నరేష్ పరారయ్యాడని తెలిపారు. నిందితుల నుండి 303 రైఫిల్, నాలుగు తూటాలు, వాడిన తూటా, హీరోహోండా మోటార్ బైక్ స్వాధీనం పర్చుకున్నట్లు డిఎస్పీ తెలిపారు.

మావోల యాక్షన్ టీమ్ సమాచారంతో పోలీసులు అప్రమత్తం
సీలేరు, జూలై 16: మావోయిస్టుల యాక్షన్ టీమ్ సీలేరులో సంచరిస్తున్నట్లు సమాచారం పోలీసులకు అందడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఈనేపధ్యంలోనే పోలీసులు సి.ఆర్.పి. ఎఫ్.బలగాలతో మంగళవారం ఉదయం నుంచి సాయం త్రం వరకు సీలేరు పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు ముమ్మరం చేపట్టారు. సీలేరులో ఫ్రధాన కూడళ్ళ వద్ద సి.ఆర్.పి.ఎఫ్. బలగాలను మోహరించి విస్తృతంగా వాహన తనిఖీలు , రికార్డులు పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించి వదిలిపెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తుండడంతో రాజకీయ నాయకుల భద్రత పట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల నుండి ఎటువంటి ముప్పువాటిల్లకుండా ముందుస్తుగా తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల కొయ్యూరు మండలంలో మావోయిస్టులు ఫ్లీనరీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో మావోయిస్టులను చుట్టముట్టి ఎదురుకాల్పులు జరపడంతో మహిళా మావోయిస్టు మృతి చెందిన విషయం తెలిసింది. సీలేరు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, సీలేరు పోలీస్ స్టేషన్ మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉండడంతో పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు మరింత అప్రమత్తం చేశారు. ఈనేపధ్యంలో ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహిస్తూనే మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచారు.
అడవుల్లో పోలీసులు..
గ్రామాల్లో మావోయిస్టులు
సమావేశాలు పెట్టి హెచ్చరికలు
గూడెంకొత్తవీధి, జూలై 16: ప్రస్తుతం విశాఖ మన్యంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒక ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిస్తుంటే, మరోపక్క మావోలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అడవుల్లో సంచరించే మావోయిస్టులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తుంటే, పోలీసులు వారికోసం అడవుల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత పదిరోజులుగా మన్యం అడవుల్లో నెలకొంటున్న సంఘటనలు. గత సోమవారం జంపర్లోవ గ్రామంలో ప్రజలతో సమావేశమైన మావోయిస్టులు గాలికొండ పంచాయతీకి నామినేషన్ దాఖలు చేసిన గెమ్మిలి సింహాద్రిని హెచ్చరించారు. నామినేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిచో తీవ్ర పరిణామాలు ఉంటాయని స్వయంగా మావోయిస్టు నేతలు రవి, ఆజాద్,శరత్ హెచ్చరించారు. గత నాలుగు రోజులుగా నేలజర్త, జెర్రెల, కన్నవరం, అన్నవరం గ్రామాల్లో మావోయిస్టులు సమావేశాలు ఏర్పాటుచేసి ఎన్నికలు బహిష్కరించాలని, నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఉపసంహరించుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. వంచుల, జెర్రెల, మొండిగెడ్డ పంచాయతీల్లో ఎవరూ నామినేషన్లు వేయకుండా మావోయిస్టులు అడ్డుకున్నారు.
వందలాది మంది మిలీషియా సానుభూతిపరులతో కలిసి చీకటి పడకముందే దాడులకు పాల్పడి సంచలనం సృష్టిస్తున్నారు. ఇదిలాగుంటే పైచర్యలను అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రయత్నించడం సహజం. పోలీసులు మావోయిస్టుల కోసం అడవుల్లో వేట సాగిస్తున్నారు. పథకం ప్రకారం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేస్తున్న మావోయిస్టుల ఎత్తుగడలను పూర్తిగా పసిగట్టలేని గ్రేహౌండ్స్ బలగాలు అడవుల్లో వాతావరణం అనుకూలించక పోయినా విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనిని అదునుగా చూసుకున్న మావోయిస్టులు స్వేచ్చగా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడి తప్పించుకున్న మావోయిస్టుల కోసం పదుల సంఖ్యలో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకే ప్రాంతంలో ఈ బలగాలు సంచరిస్తుండడంతో ఒకరికొకరు సమాచారం లోపం వలన ఏ సంఘటన జరగకుండా అడవుల్లో వైర్‌లెస్ సెట్లను పోలీసులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గాలింపు చర్యలకు ఆటంకం కలుగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అయితే మావోయిస్టులు స్వేచ్ఛగా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేసుకుని సాధ్యమైనంత వరకు ప్రజలు ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, మావోల యాక్షన్ టీమ్‌లు సంచరిస్తుండడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టుల కోసం అడవుల బాట పడుతుంటే, ఎన్నికలు బహిష్కరించాలని గ్రామాల్లో మావోయిస్టులు సమావేశాలు పెట్టి హెచ్చరికలు జారీ చేస్తుండడం విశేషం.

గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందే
కాంట్రాక్టర్లకు వుడా విసి ఆదేశం
విశాఖపట్నం, జూలై 16: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) చేపడుతున్న పలు ప్రాజెక్టుల పనులు నిర్ధేశిత సకాలంలో పూర్తి చేయాలని వైస్ చైర్మన్ ఎన్ యువరాజ్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులు పూర్తి చేయడంలో అధికారులకు, కాంట్రాక్టర్లకు సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం అప్పగించిన పనులను పూర్తి చేయని వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వుడా ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పలు ప్రాజెక్టులను మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా అంచనావ్యయం విపరీతంగా పెరిగిపోతోందని, దీనివల్ల అదనపు భారం తప్పట్లేదని అభిప్రాయపడ్డారు. పనుల విషయంలో సాచివేత ధోరణి పనికిరాదన్నారు. బిల్లుల చెల్లింపులు, ఇతర విషయాల్లో అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు తన దృష్టికి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. దీనిపై స్పందించిన కాంట్రాక్టర్లు డిజైన్లు తమకు సకాలంలో అందని కారణంగానే జాప్యం చోటుచేసుకుంటోందిన కాంట్రాక్టర్లు విసి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎస్‌ఎస్‌ఆర్ రేట్లను మార్చట్లేదని చెప్పగా బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే పైపులైను, విద్యుత్ లైన్లుమార్పిడి వంటి అంశాల్లో స్థానికులకు నష్టపరిహారం అందకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదన్నారు. అనంతరం ఆయన హరిత ప్రాజెక్టును సందర్శించారు. హరిత ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చిందని ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కాంట్రాక్టు కింద పనులు విభజించి ఒకే సారి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మూడు పనులకు టెండర్లు ఖరారుకాగా, మరో ఏడు పనులకు రెండో విడత టెండర్లను ఖరారు చేసినట్టు తెలిపారు. ఈప్రాజెక్టు విషయంలో వుడా కొంతమేర చెడ్డపేరును మూటగట్టుకుందని, దీన్ని తొలగించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఇయు చీకటి ఒప్పందంతో కార్మికులకు అన్యాయం
* ఎన్‌ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు
విశాఖపట్నం, జూలై 16: ఆర్టీసీ యాజమాన్యంతో చేసుకున్న చీకటి ఒప్పందంతో కార్మికులను ఎంప్లారుూస్ యూనియన్ (ఇయు), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయు)లు మోసం చేసాయని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయు) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు ఆరోపించారు. మద్దిలపాలెం కాంప్లెక్స్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్మికుల బహిరంగసభలో ఆయన ముఖ్యప్రసంగం చేశారు. యాజమాన్యంతో ఒప్పందం రాయించుకుని అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినా ఎటువంటి ఫలితం లేకపోయిందన్నారు. రాష్ట్ర రవాణాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ సమ్మె జరగదనే ధీమాను వ్యక్తంచేస్తూనే ఉన్నారంటే ఎంప్లారుూస్ యూనియన్ పరిస్థితి అర్ధమవుతూనే ఉందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 1.3లక్షల మంది ఆర్టీసీ కార్మికులు అజేయమైన శక్తని అందించినా ఎంప్లారుూస్ యూనియన్ దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. కార్మికుల ఇంక్రిమెంట్‌లు పెరగలేదని, భత్యంతర భృతి రాలేదని, బేసిక్ పెరగలేదన్నారు. ఒక్క రూపాయి ప్రయోజకరం లేకుండా ఎంప్లారుూస్ యూనియన్ ఒప్పందం చేసిందన్నారు. గత ఏడాది జూన్‌లో ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చిన సమ్మె నోటీసులో ఎన్‌ఎంయు 36 డిమాండ్లను పెట్టగా, ఇందులో 32 డిమాండ్లు పరిష్కారమయ్యాయన్నారు. ఆర్టీసీలో ఇటీవల జరగాల్సిన సమ్మెను విచ్ఛిన్నం చేసి మోసపూరిత ఎగ్రిమెంటులో కార్మికులకు తీవ్ర ద్రోహం ఇయు, టిఎంయులు చీకటి ఒప్పందం చేసి కార్మికులకు అన్యాయం చేశాయన్నారు. గతంలో చేసిన ఎగ్రిమెంట్లనే అంకెల గారిడీతో కార్మికులను మభ్యపెట్టెరీతిలో యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులు జీవితాలను నట్టేట ముంచాయన్నారు. ఎంఎన్‌యు గతంలో చేసిన ఎగ్రిమెంట్లను అమలు చేయడం చేతకాక, యాజమాన్యంతో కార్మికులు రెగ్యులైజేషన్‌కు అగ్రిమెంట్ చేసామని చెప్పుకుంటే మరోపక్క రాష్టవ్య్రాప్తంగా సమ్మె విరమించిన తరువాత దాదాపు రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను స్లాకు సీజను పేరి డిసెంగేజ్ చేసారన్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఆర్టీసీలో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయించిన ఘనత ఎన్‌ఎంయుదేనన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి గత ఏడాది జూలైన ఎన్‌ఎంయు ఇచ్చిన సమ్మె నోటీసుపై అపుడు ఇయు, టిఎంయు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా సమ్మెను విచ్చిన్నం చేసాతమని పత్రికల ద్వారా బహిరంగ ప్రకటనలు చేసినప్పటికీ ఎన్‌ఎంయు 32 డిమాండ్లతో ఆర్టీసీలో మిగిలిపోయిన కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లను అందర్ని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేసి యాజమాన్యంతో గత ఏడాది జూలైన రాతపూర్వకంగా మిగలి ఉన్న వారందర్ని రెగ్యులర్ చేయడానికి తమ యూనియన్ అంగీకరింపజేసిందన్నారు. దానికనుగుణంగా గత ఏడాది జూలై 31న ప్రభుత్వ అనుమతికి ఎండి లేఖ రాయడం జరిగిందని అంగీకారానికి జరిగిన జాప్యానికి నిరసిస్తూ గత ఏడాది నవంబర్ 15న వేలాదిమంది ఎన్‌ఎంయు కార్మికులతో ఛలో సెక్రటేరియట్ నిర్వహించి ఒక్క చెమట బిందువు కూడా చిందకుం ముఖ్యమంత్రిలో సమావేశమై కాంట్రాక్ట్ కార్మికులందర్ని గత నెలలోపు దశలవారీగా రెగ్యులర్ చేయడమే కాకుండా అప్పటి వరకు ఉన్న కారుణ్య నియామకాలను జరిపి అందరికీ ఉద్యోగకాలు ఇస్తామని హామీ తీసుకోవడం జరిగిందన్నారు. వాటిని అమలు చేయడంలో ఇయు, టిఎంయు తీవ్ర వైఫల్యం చెందామన్నారు. అనంతరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది జనవరిన 188 డిమాండ్లతో యాజమాన్యానికి ఇయు, టిఎంయు వినతులను ఇచ్చి వాటి గురించి నేటికి కూడా కనీసం చర్చించకపోగా, జనవరిలో సంక్రాంతి కానుకగా అందర్ని రెగ్యులర్ చేస్తామని మేనిపెస్టోలో పొందుపరిచి చేతకాక తదుపరి ఎసిఎల్‌కు వేస్తామని సంతకాల సేకరణ చేసి కార్మికులను మభ్యపెట్టాయన్నారు. ఫ్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతాలని కార్మికులను మార్పు పేరుతో వంచించి మొన్న సమ్మెను విరమింపజేటపుడు కనీసం పెరిగిన ధరలకనుగుణంగా జీతాలు పెంచమని అడగకుండా పే కమిటీని వేగవంతం చేయాలని కోరడం ఆ విధంగా ఎగ్రిమెంటు చేసి కార్మికులకు అన్యాయం ఇయు, టిఎంయు చేసాయన్నారు. ఈ నెల 5న సమ్మె చేస్తామని ఆ రెండు యూనియన్లు రెండు డిమాండ్లతోనే యాజమాన్యానికి నోటీసు ఇస్తే దానికి మద్ధతుగా మెజారిటీ యూనియన్‌గా ఎన్‌ఎంయు సమ్మె చేయడానికి పూర్తి మద్ధతు పలికితే పెట్టిన రెండింటిపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే సమ్మె తప్పదని చేసిన వాటి హెచ్చరికలు గాలిలో కలిసిపోయాయన్నారు. ఈ సభలో రాష్ట్ర కార్యదర్శులు కె.నందగోపాల్, విజి విలియమ్స్, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్‌వి రావు, అర్బన్ కార్యదర్శి ఏకె శివాజీ, రూరల్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పిఎన్ రావు, ఎంవిఆర్ మూర్తి, జోనల్ కార్యదర్శి పివివి మోహన్, అన్ని డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, గ్యారేజి సిబ్బంది, మహిళా కండక్టర్లు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రయాణికుల భద్రతలో డ్రైవర్ పాత్ర కీలకం
* విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ దుగ్గల్
విశాఖపట్నం, జూలై 16: ప్రయాణికుల భద్రతలో డ్రైవర్ పాత్ర అత్యంత కీలకమైందని విక్రమిజిత్ దుగ్గల్ అన్నారు. ఏపీఆర్టీసీ విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలు-2013లు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన సభనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో మిగలిన జిల్లాల కంటే ప్రమాదాల స్థాయిలో విశాఖ రీజియన్ చాలా తక్కువుగా ఉందన్నారు. విశాఖ ఏజేన్సీలో గిరిజనులకు అందుబాటులో ఉండేందుకు ఆర్టీసీ మరింత కృషి చేయాలన్నారు. మిగిలిన అన్నిచోట్ల ప్రమాదాల శాతం పెరుగుతుండటం, విశాఖలో మాత్రం తగ్గుతున్న పరిణామాలపట్ల ఆయన సంస్థ సిబ్బందిని అభినందించారు. విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో మాదిరి విశాఖ జిల్లాలో కూడా త్వరలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగే సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.

పంచాయతీ ఎన్నికల్లోని నామినేషన్ల ఉప సంహరణ
english title: 
w

బుజ్జగింపులు ఫలించేనా?

$
0
0

విజయనగరం, జూలై 16: విడువమంటే పాముకు కోపం... కరవమంటే కప్పకు కోపం చందంగా రాజకీయ నేతల పరిస్థితి మారింది. పంచాయతీ ఎన్నికల్లో ఒకే పంచాయతీకి ఒకే పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య పెరగడంతో ఎవరిని బుజ్జగించాలో అర్థంగాక అయోమయంలో పడ్డారు. ఒకవేళ ఒకరికి మద్దతునిచ్చి వేరొకరిని కాదంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఎడమొహం.. పెడమొహం పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ దఫా పంచాయతీ ఎన్నికలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకే పంచాయతీకి కొన్ని చోట్ల ఒకే పార్టీకి చెందిన వారే నలుగురు, ఐదుగురు చొప్పున బరిలో దిగారు. ఇదే విధంగా కాంగ్రెస్, టిడిపి, వైకాపాలో పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరిని ఓదార్చాలో తెలియని అయోమయం నెలకొందని వివిధ రాజకీయ పార్టీల నేతలు వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 921 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, వాటిలో దాదాపు 150 పంచాయతీల వరకు ప్రధాన పార్టీల అనుచరులు ఉన్నారు. మేజర్ పంచాయతీలతోపాటు కొన్ని కీలకమైన పంచాయతీలకు పోటీపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 61 పంచాయతీలకు ఒకొక్క నామినేషన్ దాఖలు కావడంతో అవి ఏకగ్రీవం కింద ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ దఫా కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ పదవికి మద్దతునిస్తే, రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో తాము మద్దతునిస్తామని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అనుచరులు ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. దత్తిరాజేరుతోపాటు కొన్ని మండలాల్లో ఈ రకమైన అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. గంట్యాడ మండలంలో కొత్తవెలగాడలో వైకాపా, కాంగ్రెస్ పొత్తులు కుదుర్చుకున్నట్టు సమాచారం. అలాగే ఎస్.కోట, కొత్తవలస తదితర మండలాల్లో కూడా పొత్తులకు ప్రయత్నాలు సాగుతున్నాయి.పార్వతీపురం డివిజన్‌లోని రామభద్రాపురం, సాలూరు, కొమరాడ మండలాల్లో కూడా పొత్తులకు నేతలు యత్నాలు సాగిస్తున్నారు. ఏది ఏమైనా బుజ్జగింపులు ఏ మేరకు ఫలిస్తాయన్నదీ మరో 24 గంటల్లో తేలనుంది.

‘ఉత్తమ సేవలు అందించండి’
విజయనగరం, జూలై 16: జిల్లాలో ఉత్తమ సేవలు అందించి జిల్లాకు మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ఇటీవల ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందజేసిన అవార్డును మంగళవారం కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ స్వరాజ్యలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012-13లో మొత్తం 21 అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు జిల్లా ఉత్తమ జిల్లాగా ఎంపికైందన్నారు. రానున్న కాలంలో ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. ముఖ్యంగా మార్పు కార్యక్రమంలో భాగంగా గర్బిణీల నమోదు 96.3 శాతం సాధించినందుకు, అదే విధంగా గర్బిణీ స్ర్తిల టి.టి.టీకామందు 96.3 శాతం సాధించడంలో ఉత్తమంగా నిలిచింది. గర్బిణీలలో రక్తహీనత అరికట్టడానికి గర్బిణీలందరికీ ఐఎఫ్‌ఎ మాత్రలు వినియోగించునట్టు చేయడంలో శతశాతం సాధించగా, ఇంటి వద్ద కాన్పులను గణనీయంగా తగ్గించడంలోను, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలోను జిల్లా ముందంజలో ఉంది. ఆసుపత్రి ప్రసవాలు 95.2 శాతం, సంవత్సరంలోపు చిన్నారులకు శతశాతం వ్యాధి నిరోధక టీకాలు చేయడంలోను, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు 92.3 శాతం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషను నిధుల వినియోగంలో 83 శాతం సాధించడంలో ప్రధమంగా నిలిచిందన్నారు. అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు పూర్తిగా అదుపులో ఉంచడంలో ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించి వారిని చైతన్యవంతులను చేయడంలోను, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నివేదికలను, ముందస్తు ప్రణాళికలు సకాలంలో రాష్ట్ర స్థాయి అధికారులకు పంపడంలో ఈ అవార్డు సాధించగలిగామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి స్వరాజ్యలక్ష్మి చెప్పారు. వీటితోపాటు ఇతర శాఖలైన రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, స్ర్తి శిశు సంక్షేమ శాఖల విభాగాల మధ్య మంచి సమన్వయం ఏర్పాటు చేసి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలుపరచినందుకుగాను ఈ అవార్డు జిల్లాకు లభించిందని ఆమె తెలిపారు.

2819.2 కిలోమీటర్లకు చేరిన షర్మిల పాదయాత్ర
విజయనగరం, జూలై 16: రాష్ట్రంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన మీ కోసం..వస్తున్నా పాదయాత్ర రికార్డును వైకాపా నేత షర్మిలా అధిగమించి రికార్డు బ్రేక్ చేశారు. మంగళవారం ఆమె జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో దత్తిరాజేరులో పర్యటించారు. ఈ రోజు నాటికి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 2819.2 కిలోమీటర్లకు చేరింది. దీంతో ఆమె చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర రికార్డును అధిగమించినట్టు వైకాపా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, జిల్లాలో ఆమె ఈ నెల 8 నుంచి ఇప్పటి వరకు ఎస్.కోట, గజపతినగరం, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. బుధవారం నుంచి ఆమె బొబ్బిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె బహిరంగ సభల్లో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంపుదల చేయడంతోపాటు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు పెంపుదల చేస్తామని భరోసా ఇస్తొన్నారు. టిడిపి, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వైఎస్ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రానున్న ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ఆమె తన ప్రసంగాల్లో కోరుతున్నారు.

‘సురక్షిత ప్రయాణమే ఆర్టీసీ లక్ష్యం’
విజయనగరం , జూలై 16: సురక్షత ప్రయాణమే ఆర్టీసీ లక్ష్యమని, దీనికోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని ప్రాంతీయ రవాణాశాఖాధికారి అబ్దుల్వ్రూఫ్ కోరారు. ప్రమాద రహిత వారోత్సవాలను మంగళవారం ఇక్కడ డిపోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎవరి పొరపాటు వల్ల జరిగినా కూడా ప్రమాదం ప్రమాదమేనన్నారు. ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోవడమేకాకుండా, జరిగిన దురదృష్టకర సంఘటనలో వారి కుటుంబాలకు కలిగే లోటు తీర్చలేనిదన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ లక్ష్మణరావు, డిపోమేనేజర్ కె.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

‘రాజకీయాల్లో యువత ప్రముఖ పాత్ర వహించాలి’
విజయనగరం , జూలై 16: రాజకీయాల్లో యువత ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పట్టణంలో 15వ వార్డుకు సంబంధించి యువజన కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ. విభాగాలకు కమిటీలను ఏర్పాటు చేశారు. యువజన కాంగ్రెస్ వార్డు అధ్యక్షుడిగా కిలారి ప్రసాద్, ఎన్‌ఎస్‌యుఐ విభాగం అధ్యక్షుడిగా మంత్రిప్రగడ విద్యాస్వరూప్‌ను నియమించారు. మంగళవారం కోలగట్ల నివాసంలో అధ్యక్ష, కార్యదర్శి, ఇతర సభ్యులకు పార్టీ కండువాలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ రాజకీయాల్లో యువత కీలకపాత్ర పోషించాలన్నారు. ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మేకా కాశీవిశే్వశ్వరుడు, విజయనగరం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, అసెంబ్లీ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బోడసింగి ఈశ్వరరావు, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ
జామి, జూలై 16 : ఇక్కడి ఎండిఒ కార్యాలయ సమావేశ భవనంలో పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో ఆర్‌ఒలు, పిఒలు, పిపిలు నిర్వహించాల్సిన విధులు గురించి జెడ్‌పి సిఇఒ మోహనరావు వివరించారు. గతంలో పోలింగ్‌కు వెళ్లిన సిబ్బంది అనుభవాలను, ఎన్నికల సమయంలో ఎదురైన ఇబ్బందులను శిక్షణా తరగతుల్లో తెలియజేయాలని సిబ్బందిని కోరారు. పాటించాల్సిన పద్దతులను వివరించారు. సమయ స్పూర్తితో వ్యవహరించి సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలకు ఏజెంట్లుగా వచ్చిన వారి గుర్తింపు కార్డులను పరిశీలించి సెల్ ఫోన్‌లు వాడకుండా చూడాలని తెలిపారు. సమస్యలు ఎదురైనపుడు స్థానిక ఎంపిడిఓకుగాని, తహశీల్దార్‌కు గాని, ఎస్సైకి గాని వెంటనే తెలిపరచాలని ఎంపిడిఓ ఎన్‌ఆర్‌కె సూర్యం తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఈఓపిఆర్‌డి సిబ్బంది పాల్గొన్నారు.

క్షయ నియంత్రణ చర్యలకు గుర్తింపుగా డాక్టర్ ప్రసాద్‌కు అవార్డు
విజయనగరం , జూలై 16: జిల్లాలో క్షయవ్యాధి నివారణ పట్ల ప్రజల్లో చైతన్యం, వైద్యుల్లో అవగాహన కల్పించినందుకు ఆర్‌ఎన్‌టిసిపి ఉత్తమ జిల్లా కో-ఆర్డినేటర్‌గా ఐఎంఎ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ రాష్టస్థ్రాయి అవార్డును అందుకున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన రాష్ట్ర ఐఎంఎ సదస్సులో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ విజయకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయచంద్రరెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. జిల్లాలో క్షయవ్యాధి నివారణకు డాక్టర్ ప్రసాద్ విశేషంగా కృషి చేశారు. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, వైద్యుల్లో అవగాహన కల్పించారు. ఈ నేపధ్యంలో ఐఎంఎ-ఆర్‌ఎన్‌టిసిపి జిల్లా కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ప్రసాద్‌కు రాష్టస్ధ్రాయి అవార్డు రావడం పట్ల ఐఎంఎ విజయనగరం బ్రాంచ్ మంగళవారం ఐఎంఎ హాలులో అభినందించింది. ఈ సందర్భంగా జిల్లా క్షయనివారణ అధికారి డాక్టర్ పి.రామారావుమాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో డాట్ విధానం ద్వారా మందులను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా క్షయవ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు పౌష్టికాహారం అందించేందుకు ఒక ప్రణాళిక తయారు చేయాలని జిల్లాకల్టెర్ ఆదేశించారన్నారు. ఐఎంఎ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ క్షయవ్యాధి సమాజానికి ఆర్ధికభారంగా మారిందన్నారు. దీని నివారణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎ నాయకులు డాక్టర్ కూరెళ్ల శ్రీనివాస్, డాక్టర్ మురళీమోహన్, డాక్టర్ మల్లేశ్వరరావు, డాక్టర్ సత్యశ్రీనివాస్, డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సిబ్బందికి శిక్షణ
డెంకాడ, జూలై 16 : పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి మంగళవారం ఎంపిడిఓ నిర్మలాదేవి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎంపిడిఓ కార్యాలయంలో ఎన్నికల ఆర్‌ఓలు, ఎఆర్‌ఓలకు,పిపిలకు శిక్షణ నిర్వహించారు. ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరని అనుమతించాలి అనే విషయమై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అనే విషయమై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కృష్ణారావు, ఎన్నికల పరిశీలకులు శేషగిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

‘విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’
చీపురుపల్లి, జూలై 16 : విధి నిర్వహణలో ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మంగళవారం అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలవో మంగళవారం జరిగిన పిఓ, ఎపిఓలు శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిబంధనలు అమలు జరిగేలా చూడాలన్నారు. పోలింగ్ సమయంలో తమకు అప్పగించిన విధులను సిబ్బంది నిర్వహించాలన్నారు. తహశీల్దార్ టి.రామకృష్ణ, ఎంపిడిఓ కె.రాజ్‌కుమార్, ప్రత్యేక అధికారి పి.బాంధవరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన
విజయనగరం , జూలై 16: సమస్యల పరిష్కారం కోసం ఒప్పంద అధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 23 రోజులకు చేరుకుంది. ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలంటూ దీక్షా శిబిరంలో పడుకుని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు రౌతు గోపి మాట్లాడుతూ తమ స్థానాల్లో విశ్రాంత అధ్యాపక, ఉపాధ్యాయులను నియమించడాన్ని తీవ్రంగా ఖండించారు. పొట్టకూటి కోసం పోరాటాలు చేస్తుంటే వీరిని నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విశ్రాంత ఉపాధ్యాయ, అధ్యాపకులు తమ పోరాటానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. కోశాధికారి పి.లలితేంద్రరావు, అధ్యాపకులు ఎ.రవికాంత్, డి.సూర్యనారాయణ, ఎం.ఎన్.ఎల్ నారాయణమ్మ, పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిఎస్పీ
జామి, జూలై 16 : మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను డిఎస్పీ కృష్ణ ప్రసన్న మంగళవారం పరిశీలించారు. జెడివలస, జామి, అలమండ, గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మంచినీరు వంటి వౌళిక సదుపాయాలపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జెడివలస పోలింగ్ కేంద్రం వద్ద విశాల ప్రదేశం లేదని పోలీసు సిబ్బంది నియామకంపై శృంగవరపుకోట సిఐ రఘవీర్‌విష్ణుతో చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లు, ఎజెంట్లు, సెల్‌ఫోన్‌లను తీసుకువెళ్లకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జామి ఎస్సై లూదర్‌బాబు, హెచ్‌సి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

త్యాగాలకు సిద్ధం: సమైక్యాంధ్ర జెఎసి
విజయనగరం , జూలై 16: ఎందరో మహానీయులైన త్యాగఫలంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని సమైకాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు అన్నారు. తెలంగాణ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోరుతూ మంగళవారం ఇక్కడ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాతే తెలుగువారికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక గుర్తింపు, గౌరవం లభించిందన్నారు. కొంతమంది తెలంగాణవేర్పాటువాదులు తెలంగాణ ఉద్యమం పేరుతో అశాంతిని నెలకొల్పుతూ, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను తెలంగాణ ఉద్యమం పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తూ ప్రజాస్వామానికి ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర జెఎసి సభ్యులు అబ్దుల్వ్రూఫ్, మద్దిల సొంబాబు తదితరులు పాల్గొన్నారు.

‘మద్యం నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు’
పార్వతీపురం, జూలై 16: పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్రమసారా, మద్యం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని పార్వతీపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ వి రమణ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ మధ్య నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో 74కేసులు నమోదు చేసి 49మందిని అరెస్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి 20,800 లీటర్ల నాటుసారా తయారికీ పనికివచ్చే బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. ఎం ఆర్ పి కంటే అధిక ధరలకు విక్రయించిన రెండు మద్యం షాపులకు లక్షరూపాయల వంతున జరిమానా విధించామన్నారు. ఎన్నికల దృష్ట్యా 25బెల్టుషాపులపై కేసులు నమెదు చేసి 339 నిబ్బులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో 21వ తేదీ సాయంత్రం 5గంటల నుండి 23తేదీ వరకు మద్యం షాపులు మూసివేయిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో మద్యం అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో దాడులు
ఒడిశానుండి అక్రమంగా నాటుసారా, మద్యం దిగుమతి కాకుండా గట్టి నిఘా పెట్టామని సూపరింటెండెంట్ ఎన్‌వి రమణ తెలిపారు. ఒడిశాలోని జయకోట , బాత్రుపల్లి తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్టు తెలిపారు. చినమేరంగిలోనిర్వహించిన దాడుల్లో పదివేల లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశామన్నారు. ఇంకా పలుగిరిజన గ్రామ సరిహద్దుల్లో దాడులు పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా పార్వతీపురం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రాహుల్‌దేవ్ శర్మ ఆధ్వర్యంలో ఎక్సైజ్, పోలీసుశాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.

విడువమంటే పాముకు కోపం... కరవమంటే కప్పకు కోపం చందంగా
english title: 
bujjagimpu

ఎన్నికల ప్రలోభాలపై నిఘా నేత్రం

$
0
0

ఏలూరు, జూలై 16: ‘పంచాయతీ ఎన్నికల్లో మోడల్ కోడ్ విషయంలో ఎక్కడా రాజీ ఉండదు... అభ్యర్ధుల ప్రచార ఖర్చుల నుంచి అన్నివిధాలా వ్యయాలు, ఇతరత్రా అంశాలపై పూర్తిస్ధాయిలో నిఘా కన్ను వేసి ఉంచాం’22అని జిల్లా కలెక్టరు సిద్ధార్ధ జైన్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పంచాయితీ పోరుకు జిల్లా యంత్రాంగం అన్నివిధాలా సంసిద్ధమైందని, ఎక్కడైనా లెక్క తేడా వస్తే ఆ అభ్యర్ధులకు ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. మద్యం నిల్వల నుంచి మనీ పంపిణిల వరకు అన్నింటిపై నిఘా ఏర్పాటుచేశామన్నారు. త్వరలోనే మద్యం నిల్వలపై తమకు అందిన స్పష్టమైన సమాచారం మేరకు ఎక్సైజ్ విభాగం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే నగదు పంపిణీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, బ్యాంకు ఖాతాల నుంచి భారీగా నగదు తరలిపోయినా, ఏ ప్రాంతంలోనైనా పెద్దఎత్తున నగదును తరలిస్తున్నా, అభరణాల నుంచి జాకెట్టు ముక్కల వరకు ఎటువంటి గిఫ్ట్‌లు సిద్ధం చేసినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈసారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చిందని కలెక్టరు చెప్పారు. నిబంధనల మేరకు వ్యయ పరిమితికి మించి ఖర్చు పెట్టిన అభ్యర్ధుల విషయంలో కఠినంగా వ్యవహరించటం జరుగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు. దానికనుగుణంగా జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ప్రచార ఖర్చు విషయంలో నిఘా నేత్రాలు ఏర్పాటుచేశామన్నారు. ప్రతి మండలానికి ప్రత్యేకంగా ఆడిటర్లను నియమించామని, ప్రతి రెండురోజులకు అభ్యర్ధులు తమ ఖర్చుల వివరాలను వారికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్ధులు చేస్తున్న ప్రచారానికి, వారు చూపుతున్న ఖర్చుకు పోలిక ఉందా అన్న విషయాన్ని క్రోడీకరించుకుని ఆడిటర్లు నివేదికలు తయారుచేస్తారన్నారు. అలాగే ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45రోజుల్లోగా అభ్యర్ధులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈవిషయంలో ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే భవిష్యత్‌లో వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందన్నారు. ప్రచారానికి సంబంధించి అభ్యర్ధులపైనే పూర్తి బాధ్యత ఉంటుందని, పార్టీ తరపున ప్రచారానికి ఖర్చు పెట్టినా ఆ మొత్తం కూడా సదరు అభ్యర్ధి ఖాతాలో పడిపోతుందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రధానంగా మద్యం, డబ్బు పంపిణిపై ప్రత్యేక నిఘా నిరంతరం కొనసాగుతుందని, 21 చెక్‌పోస్టులను జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసినట్లు కలెక్టరు సిద్ధార్ధజైన్ తెలిపారు. మంగళవారం ఎక్సైజ్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించానని, జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం నిల్వలు ఉన్నట్లు తనకు స్పష్టమైన సమాచారం అందిందన్నారు. త్వరలోనే వీటిపై దాడులు నిర్వహిస్తామని, అక్రమంగా మద్యం నిల్వలు గుర్తిస్తే సంబంధితులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ ప్రాంతంలోనైనా మద్యం నిల్వలకు సంబంధించి స్ధానికంగా ఉన్న తహసిల్దార్, ఎస్సైలకు ప్రజలు సమాచారం ఇవ్వవచ్చునన్నారు. మద్యం షాపువారీగా రోజువారీ అమ్మకాల వివరాలు సేకరిస్తున్నానని, దీన్నిబట్టి ఏ ప్రాంతంలో మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారో తెలుసుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాలో బెల్టుషాపులను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు 169 షాపులను మూసివేశామన్నారు. ఇంకా ఎక్కడైనా బెల్టుషాపులుంటే వారి వివరాలను తెలియజేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. నల్లబెల్లం తయారీపై కూడా నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డబ్బు పంపిణికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఎవరైనా 50వేల రూపాయల వరకు తమతో తీసుకువెళితే అభ్యంతరం ఉండదని, అంతకుమించి సొమ్ము తీసుకువెళ్తున్న సమయంలో మాత్రం స్పష్టమైన పత్రాలు ఉండితీరాల్సిందేనని, అలాకానిపక్షంలో సదరు మొత్తాన్ని ఎన్నికల సొమ్ముగా పరిగణిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 27 జాయింట్ చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని, డబ్బు భారీగా తరలిస్తూ ఆధారాలు లేకుండా ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. బ్యాంకు ఖాతాల నుంచి ఎక్కైడైనా భారీగా నగదును తీసుకుంటుంటే అటువంటి సందర్భాలపై నిఘాను ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కేబుల్ టివి, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా చేసే ప్రచార ఖర్చులతోపాటు పత్రికల్లో వచ్చే ప్రకటనల విషయంలో కూడా అభ్యర్ధులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడైనా ఎన్నికల సందర్భంగా ప్రజలకు బహుమానాలు, నజరానాలు అందిస్తున్నట్లు తెలిస్తే తనకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే పోలింగ్ రోజున ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయటం వంటివి చేస్తే సదరు వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఇక జిల్లాలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ మొత్తం వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించటం జరుగుతుందని, దీనికోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విద్యార్ధులను వినియోగిస్తున్నామని, అంతేకాకుండా 300 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్చగా, ప్రశాంతంగా వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నామని, ఎక్కడైనా వీటికి భంగం వాటిల్లితే తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తనతోపాటు జిల్లా ఎస్పీ ఎం రమేష్, డిపిఓ నాగరాజువర్మ, సిఇఓ నాగార్జునసాగర్, ఆర్డీవోలు సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు సిద్ధార్ధజైన్ తెలిపారు.

ఆకివీడులో 13.5 లక్షల నగదు స్వాధీనం
ంచేపల రైతుల సొమ్ము అని సందేహం
ఆకివీడు, జూలై 16: కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద పోలీసులు ఏర్పాటుచేసిన చెక్ పోస్టు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి నుండి రూ.13.5లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు చెక్ పోస్టును ఏర్పాటుచేసి, విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మచిలీపట్నం ప్రాంతం నుండి ఓ కారులో చెరుకువాడ తీసుకువెళుతున్న నడింపల్లి అప్పలరాజు నుండి రూ.13.5లక్షల నగదును ఆకివీడు ఎస్‌ఐ యార్లగడ్డ రవికుమార్ స్వాధీనం చేసుకున్నారు. చెరుకువాడ గ్రామానికి చెందిన అప్పలరాజు తాను చేపల రైతుల నుండి ఈ సొమ్మును తీసుకువస్తున్నట్లు పోలీసులకు వివరించారు. అయితే దీనికి సంబంధించి బిల్లులు లేకపోవడంతో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలను తహసీల్దార్‌కు వివరించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎపి పోలీసు బెస్ట్
ఏలూరులో సబ్సిడరీ పోలీసు క్యాంటిన్ ప్రారంభించిన డిజిపి - జిల్లా ఎస్పీకి ప్రశంసలు
ఏలూరు, జూలై 16: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనితీరులో అత్యుత్తమమైన వారని, ఈవిషయంలో ఎవరూ వారికి పోటీ రాలేరని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. ఏ రాష్ట్రంలో చూసినా ఎపి పోలీసు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు కన్పించవని, అందువల్లే సంక్షేమానికి పెద్దపీట వేయటం ద్వారా వారిలో నిబద్ధతను మరింతగా పెంచుతున్నామని దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసందర్భంగా పశ్చిమ పోలీసుపై అభినందనలు వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ ఎం రమేష్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఏలూరులోని పోలీసుక్వార్టర్స్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన సబ్సిడరీ పోలీసు క్యాంటిన్‌ను మంగళవారం సాయంత్రం దినేష్‌రెడ్డి, ఆయన సతీమణి కమల దినేష్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో దినేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా అతిపెద్ద పోలీసు క్యాంటిన్‌ను అతితక్కువ సమయంలో నిర్మించినందుకు జిల్లా ఎస్పీ రమేష్‌ను అభినందించారు. సమర్ధతకు నిదర్శనం పశ్చిమ పోలీసు యంత్రాంగం అంటూ ప్రశంసించారు. రాష్ట్ర పోలీసులు పడే కష్టాలు మరే రాష్ట్రంలోనూ కన్పించవని, ఇదే సమయంలో మన రాష్ట్ర పోలీసులకు ఉన్న ఇమేజ్ ఏ పోలీసులకు లేదన్నారు. సబ్సిడరీ పోలీసు క్యాంటిన్‌లో పోలీసు సిబ్బంది, రిటైర్డు పోలీసు సిబ్బందికి 25 శాతం సబ్సిడీపై నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామన్నారు. త్వరలోనే వ్యాట్ మినహాయింపు కూడా లభిస్తుందని, అప్పుడు మరో పదిశాతం అదనంగా రాయితీ లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అపన్నహస్తం అందిస్తున్నారని, పోలీసు క్వార్టర్స్ మరమ్మతులకు విరివిరిగా నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి పోలీసు యూనిట్ ఆఫీసుకు ఒక డాక్టరు చొప్పున నియమించటం జరుగుతోందన్నారు. దీనివల్ల పోలీసు కుటుంబాలకు అత్యవసరంగా వైద్యసేవలు అందించడానికి వీలుకలుగుతుందన్నారు. పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటే పోలీసులు ఇష్టపడి కష్టపడి పనిచేస్తారని, అప్పుడు సమాజానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని లక్షా 46వేల మంది పోలీసు సిబ్బంది సంక్షేమానికి గతంలో లేనివిధంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల పోలీసుల పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడిందన్నారు. మెడికల్ రీఎంబర్స్‌మెంట్ అమలుచేయటం, పోలీసుల సంక్షేమానికి సంవత్సరానికి కోటి రూపాయల గ్రాంటు, క్వార్టర్ల మరమ్మత్తులకు ప్రతి యేటా 20కోట్ల రూపాయల ఖర్చు, పోలీసులకు కార్పోరేట్ వైద్యం అందించటం, పోలీసు కుటుంబాలకు ఉచితంగా వైద్యసౌకర్యం, విదేశాలకు వెళ్లి చదువుకునే పిల్లలకు పలు రాయితీలు అందిస్తున్నట్లు డిజిపి దినేష్‌రెడ్డి చెప్పారు. జిల్లా ఎస్పీ ఎం రమేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు కేంద్ర పారా పోలీసులకు మాత్రమే పరిమితమైన సబ్సిడరీ పోలీసు క్యాంటిన్ సౌకర్యాన్ని రాష్ట్ర పోలీసులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత డిజిపి దినేష్‌రెడ్డికే దక్కుతుందన్నారు. 40నుంచి 50శాతం సబ్సిడీపై పోలీసు కుటుంబాలకు ఈ క్యాంటిన్‌లో అన్నిరకాల వస్తువులను సరఫరా చేస్తామన్నారు. కేంద్ర పోలీసు క్యాంటిన్‌కు అనుసంధానంగా ఇది పనిచేస్తుందని, సుమారు 400 నుంచి 500 మంది ఉత్పత్తిదారులతో సరుకులు సరఫరా చేయడానికి అంగీకారం కుదిరిందని చెప్పారు. విశాఖలోని సిఐఎస్‌ఎఫ్ నుంచి అవసరమైన సరుకులను కొనుగోలుచేసి పోలీసు కుటుంబాలకు పంపిణి చేస్తామన్నారు. రిటైర్డు పోలీసు సిబ్బంది, ఉద్యోగం చేస్తూ వీరమరణం పొందిన వారి కుటుంబాలకు కూడా ఈ క్యాంటిన్‌లో సరుకులు కొనుగోలుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. జిల్లాలోని దాదాపు రెండువేల మంది సిబ్బందికిగాను ప్రస్తుతానికి వెయ్యిమంది వరకు ఈ క్యాంటిన్‌లో సభ్యత్వం పొందారన్నారు. 500 రూపాయలు మెంబర్‌షిప్ చెల్లించి సభ్యత్వం పొందాల్సి ఉంటుందన్నారు. మొదటినెలలోనే సుమారు 30లక్షల రూపాయల టర్నోవర్ సాధించేదిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో పోలీసుశాఖ తీసుకున్న చర్యల కారణంగా గతంలో పాస్‌పోర్టు పొందాలంటే 62 రోజులు పట్టేదని, అయితే ప్రస్తుతం కేవలం మూడురోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతోందని, ఇది దేశంలోనే రికార్డు అని ఎస్పీ రమేష్ పేర్కొన్నారు. అనంతరం డిజిపి దినేష్‌రెడ్డి 31మంది పోలీసు సిబ్బందికి 31లక్షల రూపాయల రుణాలను అందజేశారు. అదేవిధంగా సబ్సిడరీ పోలీసు క్యాంటిన్ బ్రోచర్‌ను కూడా దినేష్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, సుధాకరరావులు డిజిపి దంపతులను సత్కరించారు. అలాగే జిల్లా పోలీసుశాఖ తరపున డిజిపి దంపతులను భారీ గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో కోస్తా జిల్లాల ఐజి సిహెచ్ ద్వారకాతిరుమలరావు, ఏలూరు రేంజ్ డిఐజి విక్రమ్‌సింగ్‌మాన్, డిఐజి సతీమణి నందిని, జిల్లా ఎస్పీ ఎం రమేష్, ఆయన సతీమణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివి కృష్ణారెడ్డి, పలువురు డిఎస్పీలు, సిఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎస్సీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయనందుకు
నల్లజర్ల తహసీల్దార్‌పై వేటు
-ఆర్‌ఐ, దూబచర్ల విఆర్వోపైనా చర్యలు
నల్లజర్ల, జూలై 16: పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయదలచిన భార్యాభర్తలకు కుల ధ్రువీకరణ పత్రం మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నల్లజర్ల తహసీల్దార్‌పై వేటు పడింది. ఆయనతో పాటే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, దూబచర్ల విఆర్వోలను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ కలెక్టర్ సిద్ధార్ధ జైన్ ఆదేశాలు జారీచేశారు. వివరాలిలావున్నాయి.. నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామానికి చెందిన మానూరి వెంకన్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థినిగాను, అతని భార్య దుర్గ 1వ వార్డు అభ్యర్థిగాను పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. వీరు కుల ధ్రువీకరణ పత్రంకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో వారి నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీనిపై బాధితులు ఆర్డీవో కోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఏలూరు ఆర్డీవో కె నాగేశ్వరరావు విచారణలో తహసీల్దార్ సుబ్బారావు, ఆర్‌ఐ పోతురాజు, విఆర్వో సుబ్బారావు కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయకపోవడం తప్పుగా పరిగణించి కలెక్టర్‌కు నివేదించారు. దీనితో ఎన్నికలయ్యే వరకు వారు ముగ్గురూ కలెక్టరేట్‌లో విధులు నిర్వహించాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్ ఆర్ వెంకట్రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

మీడియాలో ప్రకటనలూ ఎన్నికల వ్యయమే:కలెక్టర్
ఏలూరు, జూలై 16 : జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వివిధ పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలను ఆయా అభ్యర్ధుల ఎన్నికల వ్యయంలో పరిగణిస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ తెలిపారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలలో అభ్యర్థుల తరపున వారి శ్రేయోభిలాషులు, బంధువులు ఎవరైనా ఎటువంటి ప్రచార ప్రకటన ఇచ్చినా, పెయిడ్ ఆర్టికల్స్ వచ్చినా వాటిని కూడా ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయం కింద భావించి లెక్కిస్తామని ఆయన చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 10 వేల లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయితీలో వార్డు మెంబరు పదవికి పోటీ చేసే వారు ఆరు వేల రూపాయలలోపు, పది వేలకు పైబడిన గ్రామ పంచాయతీలో వార్డుమెంబరుగా పోటీ చేసే అభ్యర్థి పది వేల రూపాయల వరకూ, అదే విధంగా 10 వేల జనాభా కలిగిన గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తే 40 వేల రూపాయలు, 10 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీలలో 80 వేల రూపాయలలోపు ఎన్నికల వ్యయం చేయవలసి వుంటుందని కలెక్టర్ చెప్పారు.

ఎడతెరిపి లేని వర్షం
ఏలూరు, జూలై 16 : అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీగా వర్షాలు కురిసాయి. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పల్లపు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ఏలూరు నగరంలోనూ పరిస్థితి అదే విధంగా కొనసాగుతోంది. రెండురోజుల క్రితమే అల్పపీడనం కారణంగా ఏకధారగా వర్షాలు జిల్లాను కుదిపేశాయి. దాని నుంచి పూర్తిగా తేరుకోకుండానే సోమవారం రాత్రి నుంచి మళ్లీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. మరో వైపు రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
భీమవరంలో...
భీమవరం: తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షం కారణంగా పట్టణవాసులు పలు ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా స్కూళ్ళకు, కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు అవస్థల పాలయ్యారు. అలాగే చిరువ్యాపారులు బేరాలు లేక అల్లాడారు. హౌసింగ్ బోర్డు కాలనీ, గునుపూడి, చినరంగనిపాలెం, డిఎన్నార్ కళాశాల రోడ్డు, బంట్రోతువారి వీధి, శ్రీనివాసా థియేటర్, నర్సయ్య అగ్రహారం వర్షం కారణంగా నీటమునిగాయి.
నీట మునిగిన కూరగాయల తోటలు
ఆచంట: తుపాను ప్రభావంతో మండలంలో విస్తారంగా వర్షాలుపడ్డాయి. సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. వివిధ గ్రామాలలో పారిశుద్ధ్యం క్షీణించింది. మురుగు కాలువలు పూడుకుపోవటంతో వర్షపునీరు రహదారులపై పొంగి పొర్లుతోంది. ఈ సంవత్సరం దాళ్వా సీజన్‌కు ఆకుమడి దశ నుండే నష్టాలు ప్రారంభమయ్యాయి. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఆకుమళ్లు ముమ్మరంగా వేశారు. భారీ వర్షంతో ఆకుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. కాగా మరోపక్క వశిష్ఠ గోదావరిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని గ్రామస్థులు బెంబేలెత్తుతున్నారు. కరుగోరుమిల్లి ఇసుక ర్యాంప్ సమీపంలో గట్టు కుంగిపోయింది. కరుగోరుమిల్లి, అయోధ్యలంక, భీమలాపురం గ్రామాల పరిధిలోని లంక భూముల్లో అధిక శాతం సాగుచేస్తున్న కూరగాయల పంటలు నీట మునిగాయి. పెదమల్లం, అయోధ్యలంక గ్రామాల్లో మంచి దిగుబడిని ఇస్తున్న బెండ, బీర, వంగ వంటి కూరగాయ పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పశువులకు సైతం గడ్డి కొరత ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు. కాగా మండలంలోని పంచాయతీ ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులకు వర్షం కారణంగా వారి ప్రచారానికి ఆటంకమేర్పడింది.

జంగారెడ్డిగూడెంలో భారీ చోరీ
అపార్ట్‌మెంటులో 60 కాసుల బంగారు ఆభరణాలతో పరారైన ఆగంతకుడు
జంగారెడ్డిగూడెం, జూలై 16: స్థానిక అశ్వారావుపేట రోడ్డులోని జి.టి.పి టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అపార్ట్‌మెంట్ సెకండ్ ఫ్లోర్‌లో 201వ నెంబర్ ఫ్లాట్‌లో కొల్లి సత్యశ్రీకి చెందిన సుమారు 12 లక్షల రూపాయల విలువైన 60 కాసుల బంగారు ఆభరణాలు ఒక ఘరానా నేరగాడు చోరీచేశాడు. ఎస్సై బి.ఎన్.నాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏలూరు నుండి వచ్చిన క్లూస్ టీమ్ నేర స్థలంలో నేరగాడి వేలిముద్రలు సేకరించారు. ఇటీవల పట్టణంలో అనేక చోట్ల నేరాలకు పాల్పడిన వ్యక్తే ఇక్కడ కూడా నేరం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అట్లూరి సురేష్ సోదరి అయిన కొల్లి సత్యశ్రీ ఒక్కరే ఈ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఫ్లాట్‌కు తాళం వేసి హైదరాబాద్ కుమార్తె వద్దకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో బస్సు ఎక్కి మంగళవారం తెల్లవారు జామున జంగారెడ్డిగూడెంలో అపార్ట్‌మెంట్ వద్ద బస్సు దిగారు. సెకండ్ ఫ్లోర్‌లోని తన ఫ్లాట్‌కు వెళ్ళేసరికి తలుపులు తీసి ఉండటంతో అనుమానం వచ్చి లోనికి తొంగి చూసారు. పడకగదిలో ఒక వ్యక్తి ఛార్జింగ్ లైట్‌లో బీరువా వెదకడం గమనించి తలుపు వేసి పక్క ఫ్లాట్‌లో నివసిస్తున్నవారిని లేపడానికి సత్యశ్రీ ప్రయత్నించారు. వారు ఎంతకూ లేవక పోయేసరికి థర్డ్ ఫ్లోర్‌లో నివాసం ఉండేవారిని పిలిచేందుకు వెళ్ళారు. అప్పటికే ఫ్లాట్ యజమాని వచ్చిన వైనం గమనించిన నేరగాడు బలంగా తలుపులు తోసుకుని బయట పడిపోయాడు. వేగంగా మెట్లు దిగి వెళ్ళిపోతున్న నేరగాడిని గమనించి అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ దుర్గరావు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అతని చేయి అందిపుచ్చుకునే సరికి విదిలించుకుని పరారయినట్టు దుర్గారావు చెప్పాడు. నేరగాడు ముఖానికి ముసుగు వేసుకుని ఉన్నాడని, బలంగా ఉన్నాడని, అతని వెంటపడినా ఫలితం కనిపించలేదని చెప్పారు. ఇంటిలో ఎవరూ లేని సమయం కనిపెట్టి, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ నేరానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఫ్లాట్ ప్రధాన ద్వారం తలుపుల మడత బందులు తొలగించి లోనికి ప్రవేశించిన నేరగాడు సత్యశ్రీ లోపలదాచి పెట్టిన రోకలి బండతో మోది బోల్డులు, స్క్రూమేకులతో సహా మిగిలిన తలుపులు, బీరువా తెరిచాడు. కాగా, సత్యశ్రీ ఇంటిలో 30 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు ఎస్సై చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చేపట్టామని, త్వరలో పట్టుకుంటామని చెప్పారు.

గృహాల్లో మద్యం నిల్వలపై మెరుపు దాడులు
ఎక్సైజ్ అధికార్లకు కలెక్టర్ సిద్ధార్ధ జైన్ ఆదేశం
ఏలూరు, జూలై 16 : జిల్లాలో పలు ప్రాంతాల్లోని ఇళ్లల్లో మద్యం అక్రమ నిల్వలు ఉన్నట్లు సమాచారం అందిందని త్వరలోనే మెరుపుదాడులు నిర్వహించి అక్రమ నిల్వలను బయట పెట్టాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం ఎక్సైజ్ అధికారులతో మద్యం నిల్వల వివరాలను ఆయన సమీక్షించారు. పంచాయతీ ఎన్నికల్లో మద్యం, మనీ ప్రభావాన్ని నిరోధించడానికి జిల్లాలో మెరుపుదాడులు నిర్వహిస్తామని ముఖ్యంగా మద్యాన్ని అక్రమంగా ఇళ్లల్లో దాచి ఉంచారనే సమాచారాన్ని తెలుసుకున్నామని చెప్పారు. జిల్లాలో మూడు ప్రాంతాల్లోని ఇళ్లల్లో అక్రమ మద్యం నిల్వలు ఉన్నట్లు పక్కా సమాచారం ఉందని దాని ప్రకారం ఆయా ఇళ్లపై దాడులు నిర్వహించి అక్రమ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకోవాలని చట్ట ప్రకారం ఆయా ఇళ్ల యజమానులపై కూడా కేసులు పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో అక్రమ సారా తయారీని పూర్తిగా నిరోధించాలని గత 15 రోజులుగా 1503 లీటర్ల అక్రమ సారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారని అయితే మారుమూల ప్రాంతాల్లో కూడా దాడులు ముమ్మరం చేసి అక్రమ సారాయి తయారీదారులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో జూలై 3వ తేదీ నుండి ఇంత వరకూ 82360 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనపర్చుకున్నామన్నారు. రోజూ వారీ మద్యం విక్రయాలపై నివేదిక అందజేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డుమెంబరు అభ్యర్ధులు ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు ఖర్చు చేయాలని ఓటర్లను ఆకర్షించడానికి నగదు, మద్యం పంపిణీకి పాల్పడితే అనర్హత వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో గ్రామస్థాయిలో కూడా మోడల్ కోడ్ బృందాలు క్షుణ్ణంగా నిఘా నిర్వహిస్తున్నాయని ఈ స్థితిలో అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు. గతేడాది జూలై మాసంలో జిల్లాలో ఐఎంఎల్ 1,44,771 కేసులు, 45990 కేసుల బీరు సరఫరా జరగ్గా ప్రస్తుత జూలై మాసంలో ఇప్పటి వరకూ ఐ ఎం ఎల్ 1,25,260 కేసులు, 38125 కేసులు బీరు సరఫరా అయ్యిందని చెప్పారు.
అభ్యర్థుల బ్యాంకు ఖాతాలపై నిఘా
జిల్లాలో పంచాయితీ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల బ్యాంకు ఖాతా లావాదేవీలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచామని, ఎక్కువ మొత్తాలలో డబ్బు డ్రా చేసి ఆ సొమ్మును ఎలా ఖర్చు చేస్తున్నారో కూడా నిఘాను పెంచామని కలెక్టర్ చెప్పారు. అభ్యర్థుల తరఫున ఎవరైనా 10 రూపాయలు లోపు మాత్రమే ఖర్చు చేయాలని అంతకుమించి సొమ్ము ఖర్చు చేస్తే ఆ ఖర్చును అభ్యర్ధి ఎన్నికల ఖర్చుగా పరిగణనలోనికి తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 21 జాయింట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసామని డబ్బు ఎక్కువ మొత్తంలో తీసుకువెళుతున్న సందర్భంలో రెండు చోట్ల సీజ్ చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 50 వేల రూపాయలకు మించి సొమ్ము తీసుకువెళ్లేవారు సంబంధిత ఆధారాలతో ఉండాలని వ్యాపార లావాదేవీలు సాగించుకునే వారెవరూ ఇబ్బంది పడకుండా ఉండాలంటే రికార్డు తప్పనిసరి అని కలెక్టర్ చెప్పారు.
ఎస్‌ఎంఎస్‌లపై ప్రత్యేక నిఘా
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొంత మంది అభ్యర్ధులు వారి శ్రేయోభిలాషులు ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్న అంశంపై కూడా దృష్టి కేంద్రీకరించామని అటువంటి అభ్యర్ధనలను పరిగణనలోనికి తీసుకుని ఎన్నికల వ్యయ పరిధిలోనికి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆయా సెల్ ఏజెన్సీల నుండి సమాచారం రాబట్టేందుకు వారికి లేఖలు రాయడం జరిగిందన్నారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వరరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కె మధుసూదనరావు, దాసరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

పనుల నాణ్యతలో రాజీపడవద్దు
పిఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికార్లతో కలెక్టర్
ఏలూరు, జూలై 16 : ప్రజోపయోగకర పనులు సకాలంలో పూర్తి చేయడంతోపాటు నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడవద్దని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్ జైన్ పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2012-13 సంవత్సరంలో ఇంజనీరింగ్ శాఖలు చేపట్టిన పనుల ప్రగతిని మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనుల ప్రగతిలో పురోగతి ఉండాలని, అదే సమయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. పనుల నాణ్యతలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే పనులు వేగవంతం చేసి నిర్ధేశించిన సమయానికి పూర్తి చేయాలన్నారు. అదే సమయంలో పూర్తి అయిన పనులకు త్వరితగతిన చెల్లింపులు జరిగేలా జిల్లా పరిషత్తు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాను కొన్ని పనులను ఆకస్మిక తనిఖీలు చేసి పరిశీలిస్తానని సంబంధిత ఎస్టిమేట్లు, ప్లాన్‌లు, నాణ్యతా ప్రమాణాలు ఆ సమయంలో తనిఖీ చేస్తామన్నారు. చేపట్టిన పనుల్లో జాప్యానికి కారణాలుంటే వాటిని సంబంధిత డి ఇ, ఇ ఇ, ఎస్ ఇల దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. త్వరలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి పనులు కూడా పరిశీలిస్తానన్నారు. 2012-13లో 9.82 కోట్ల రూపాయలతో చేపట్టిన 293 పనుల్లో ఇప్పటి వరకూ 7.98 కోట్ల రూపాయల విలువైన 239 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 1.23 కోట్ల రూపాయలతో ప్రగతిలో ఉన్న 39 పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

మొక్కలు పెంచడం సామాజిక బాధ్యత:డిజిపి
ఏలూరు, జూలై 16 : మొక్కలు పెంచడం ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్‌పోర్టు విధానాన్ని కంప్యూటర్ ద్వారా సులభతరం చేయడంతో పశ్చిమగోదావరి జిల్లాలోనే లక్షా 68 వేల తెల్లకాగితాలను ఆదా చేయగలిగారని, ఇదే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసి, కోట్లాది కాగితాల వాడకాన్ని నిషేధిస్తామన్నారు. పాస్‌పోర్టు జారీలో దేశంలోనే పశ్చిమగోదావరి అగ్రస్థానంలో ఉందని జిల్లా ఎస్‌పి ఎం రమేష్‌ను ఆయన అభినందించారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ జైన్ డిజిపిని కలుసుకుని ముచ్చటించారు. డిజిపితో కలిసి మొక్కలు నాటారు.

దుద్దుకూరులో భారీ కొండచిలువ హతం
దేవరపల్లి, జూలై 16: దేవరపల్లి మండలం దుద్దుకూరులో మాజీ సర్పంచ్ కాకర్ల శ్రీనివాసరావుకు చెందిన చెరకు తోటలో 15 అడుగుల పొడవు గల పింజరగున్న పాము కూలీలకు కనబడడంతో ఆ పామును హతమార్చారు. మంగళవారం చెరకుతోటలో జడ వేసేందుకు వెళ్లిన కూలీలకు మధ్యాహ్నం ఈ పాము కనబడడంతో కూలీలు, చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పాముకు రెండు సంవత్సరాల వయస్సు వుంటుందని రైతులు పేర్కొన్నారు.

కుంగిన చెరువు గట్టు
గండి పడితే ఖరీఫ్ కష్టమే - మరమ్మతులకు నడుంబిగించిన రైతులు
పోలవరం, జూలై 16: పోలవరం మండలంలోని అతి పెద్దదైన కొత్తూరి చెరువుగట్టు కుంగిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలవరం మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఏజన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లడంతో కొత్తూరి చెరువు పూర్తిగా నిండి ప్రమాదస్థాయికి చేరింది. ముఖ్యంగా చెరువు వద్ద ఒకటో నెంబరు తూము వద్ద గట్టు ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ గట్టుకు గండి పడితే ఈ ఏడాది ఖరీఫ్ సాగు కష్టమని రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు రెండువేల ఎకరాలకు సాగునీరందించే ఈ చెరువుపై రైతులు ఆధారపడ్డారు. గట్టులో వున్న కాంక్రీటు తూము ముక్కలైందని, ఈ కారణంగా గట్టు కుంగిపోయిందని రైతులు అనిశెట్టి రాథాకృష్ణ, కాండ్రు ప్రభాకరరావు, అల్లిమిల్లి నారాయణ, వెంకట్రావు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలవరం తహసీల్దార్ ఐ నాగేశ్వరరావు చెరువు గట్టును పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే మంగళవారం ఇరిగేషన్ అధికారులెవరూ రాకపోవడంతో ఆయకట్టు రైతులంతా స్వచ్ఛందంగా మూడు ట్రాక్టర్లలో గ్రావెల్ తీసుకెళ్లి గట్టును పటిష్ఠ పరిచే కార్యక్రమం ప్రారంభించారు. అయితే ఉదయం నుండి కురుస్తున్న వర్షం కారణంగా కొత్తూరు చెరువుకు వెళ్లే మార్గం సరిగా లేకపోవడంతో ఒక ట్రాక్టర్ తిరగబడింది. ఈ సంఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.

‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో కలెక్టర్ సిద్ధార్ధ జైన్ *డబ్బు, మద్యంపై ప్రత్యేక దృష్టి *జిల్లాలో 21 చెక్ పోస్టులు *లెక్క తేడా వస్తే అభ్యర్థులకు ఇబ్బందే *కోడ్ అమలులో రాజీ ఉండదు
english title: 
collector
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>