Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

ఎసిబి వలలో ఎంజిఎం ‘పెద్ద’!

$
0
0

వరంగల్, జూలై 16: బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.రామకృష్ణను అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం ఎంజిఎం ఆసుపత్రికి ఆక్సిజన్ సిలండర్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ మనోహర్‌రెడ్డికి 10లక్షల రూపాయల బిల్లులు చెల్లించేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ 1.50లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఇంత మొత్తం డబ్బు ఇవ్వలేనని కాంట్రాక్టర్ చెప్పినా సూపరిండెంటెండ్ బిల్లుల చెల్లింపుకు ససేమిరా అని మొండికేశారు. దాంతో కాంట్రాక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారులు ఇచ్చిన డబ్బు తీసుకుని కాంట్రాక్టర్ మంగళవారం ఉదయం హన్మకొండ రెడ్డికాలనీలోని డాక్టర్ రామకృష్ణ ఇంటికి వెళ్లి ఆ డబ్బును అందజేశాడు. కాంట్రాక్టర్ నుంచి రామకృష్ణ డబ్బు తీసుకున్న వెంటనే ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామకృష్ణ ఇంటితోపాటు ఎంజిఎంలోని ఆయన కార్యాలయంలో ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. రామకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎసిబి డిఎస్పీ సాయిబాబా తెలిపారు. ఈ కేసులో ఫార్మసి విభాగం సూపర్‌వైజర్ స్వామి ఫరారీలో ఉన్నట్లు చెప్పారు. సర్జరీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ 70రోజుల క్రితమే ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టి ఇలా పట్టుబడటం డాక్టర్లలో చర్చనీయాంశంగా మారింది.

కోడ్ మీరితే కఠిన చర్యలు
ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ
జనగామ, జూలై 16: పోటీలోవున్న అభ్యర్ధులు ఎన్నికల నియామవళిని ఉలంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎన్నికల పరిశీలకులు కె.వి సత్యనారాయణ, ఎన్నికల ఖర్చుల నిఘా అధికారి బి.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వారు జనగామలో పర్యటించారు. ఈసందర్భంగా ఎన్నికల తీరు, అభ్యర్ధుల స్క్రూటినీ, చెక్‌పోస్టులు, ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అభ్యర్ధులు ఎన్నికల నియమావళి కంటే అధికంగా ఖర్చు చేసిన చర్యలు ఉంటాయని అన్నారు. అన్నికల నిబందన ప్రకారం అభ్యర్ధలు ప్రచారం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా ఉండాలన్నారు. అధికారుల వెంట ఆర్డీవో వెంకట్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.

ఉగ్ర ప్రభగా భద్రకాళి
వరంగల్, జూలై 16: చల్లనితల్లిగా సమస్త భక్తజనావళి పూజలందుకొంటున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం అమ్మవారిని ‘ఉగ్రప్రభ’ క్రమంలో అలంకరించి పూజారాధనలు జరిపారు. ఉగ్రప్రభ అమ్మవారికి జ్వాలామాలిని అని కూడా పిలుస్తారు. అమ్మవారు ప్రళయకాలమునందలి అగ్నితో సమానమైన శరీరకాంతులతో చిరునవ్వులు కురిపిస్తూ ఆరుముఖాలతో 12చేతులతో ఉంటుంది. కుడివైపు కింది నుండి పైకి అభయముద్ర, అంకుశం, దర్భల, ఖడ్గం, శక్తిని, వింటిని, అదేవిధంగా ఎడమవైపు వరదముద్ర, పాశం, శూలం, ఖేటం, పద్మం, బాణం ధరించి మణులతో, విభూషణాలతో ప్రకాశిస్తుంది. ప్రకృతిని, ప్రాణికోటిని బాధించే శక్తులను తన ఉగ్రప్రభల నుండి ప్రజ్వరిల్లే ప్రళయకాలాగ్ని జ్వాలలతో సంహరిస్తుంది. పాడిపంటలకు కీడు తలపెట్టు అసురీశక్తులను నశింపజేస్తుంది. అతివృష్టి, అనావృష్టులకు కారణమగు అసురీశక్తులతో ఉదాహరణకు అంతరిక్షంలో ఎల్నినో వంటి ప్రతీపశక్తులను నిరోధిస్తుంది. కాళిక భక్తులకు వరాలు, సకల విధాల అభయాన్ని ప్రసాదించి భక్తుల కోరికలను తీరుస్తుందని వేదపండితులు చెబుతారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఐజి ఉమాపతి సతీమణి కమల భద్రకాళి దేవాలయంలో ముత్తయిదువులతో అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిపించారు. కాజీపేటకు చెందిన డాక్టర్ వొడితెల సులోచన విశ్వనాథరావు అమ్మవారికి విశేషసేవలను నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఎల్లంపట్ల సురేష్, చెప్పెల సదాశివశర్మ హవన కార్యక్రమం నిర్వహించారు.

లొంగిపోయిన నక్సలైట్‌కు ఆర్థిక సహాయం
వరంగల్, జూలై 16: నక్సల్స్ అడవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలని వరంగల్ రూరల్ ఎస్పీ జి.పాలరాజు పిలుపునిచ్చారు. గతంలో పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయిన న్యూడెమోక్రసీ పుల్లన్న దళ సభ్యుడు ఈక రవి అలియాస్ ఆర్‌కెకు తాత్కాలిక ఆర్థిక సహాయం కింద ఐదువేల రూపాయల చెక్కును రూరల్ జిల్లా ఎస్పీ మంగళవారం అందజేశారు. గత మార్చి నెలలో నర్సంపేట డిఎస్పీ సరిత ఎదుట లొంగిపోయిన కొత్తగూడ మండలం బోటిలింగాల గ్రామానికి చెందిన ఈక రవి న్యూడెమోక్రసీ పార్టీలో సభ్యుడిగా పనిచేస్తూ అనారోగ్య కారణాలతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆర్థిక సహాయం అందజేసిన సందర్భంగా రూరల్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో కలసిపోవాలనుకునే అజ్ఞాత నక్సల్స్ ఇకపై డయల్ 100కు ఫోన్ చేసి లొంగిపోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ డాక్టర్ వై.సాయిశేఖర్, రూరల్ ఎస్‌బి-2 సిఐ విద్యాసాగర్ పాల్గొన్నారు.

ఎన్నికలు సజావుగా జరగాలి
* అధికారులకు కలెక్టర్ కిషన్ ఆదేశం
మహబూబాబాద్, జూలై 16: పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.కిషన్ ఆదేశించారు. మహబూబాబాద్ ఆర్డీఒ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన డివిజన్‌లోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్డీఒ బిక్షానాయక్, డిఎస్పీ ఎ.రమాదేవి, డివిజనల్ పంచాయతీ అధికారి జానిమియా, అన్ని మండలాల ఎడీఒలు,ప్రత్యేక అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల మేరకు నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని కోరారు. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ ఘట్టం ముగియడంతో అభ్యంతరాలను తీసుకున్న అధికారులు ఏ విధంగా వాటిని క్లియర్ చేసిందీ అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అన్ని వివరాలను సమగ్రంగా జిల్లా యంత్రాంగానికి, ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. అధికారుల సందేహాలను నివృత్తి చేశారు.

పంచాయతీ ఎన్నికలు అందరికీ ప్రతిష్టాత్మకమే!
* నక్సల్ చర్యలపై ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
* ఫ్యాక్షన్ పోరుపై అధికారుల్లో కలవరం
* పల్లెల్లో పాగా కోసం పార్టీల పట్టుదల
వరంగల్, జూలై 16: పంచాయతీ ఎన్నికల నిర్వహణ వరంగల్ జిల్లాలో అధికారులకు కత్తిమీద సాములా మారింది. చాపకింద నీరులా విస్తరిస్తున్న నక్సల్ కార్యకలాపాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తంకాగా.. గ్రామాల్లో పార్టీల ఆధిపత్యపోరు ఎలాంటి ఇబ్బందులు తెస్తుందోనని ఎన్నికల్లో తలమునకలైన అధికారులు కలవరపడుతున్నారు. ఇంకోవైపు సాధారణ ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికల పర్వంను పార్టీలు ప్రతిష్టగా భావిస్తున్నాయి. తెలంగాణకు కేంద్రమైన వరంగల్‌లో ఈ పర్యాయం పంచాయతీ పోరులో ఉద్యమ ప్రభావం కూడా తీవ్రంగానే ఉండొచ్చని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఘట్టంలో ఎన్నికల కమిషన్ నిర్వహణ తేదీలు ప్రకటించినపుడు అందరిలోను పెద్దచలనం కనిపించలేదు. ఇక ఎన్నికల నిర్వహణ సమయం దగ్గరపడుతున్న కొద్దీ గ్రామాల్లో సందడి తీవ్రమైంది. మూడువిడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో తొలివిడత ఈనెల 23న, రెండోదశ 27న, తుదివిడత పోలింగ్ 31న జరగనుంది. మొదటివిడత ఎన్నికలకు మరోవారం రోజులే గడువు ఉండడంతో అధికార యంత్రాంగం తీరికలేకుండా ఉంది. ఎన్నికల నిర్వహణలో ప్రధానంగా పోలీసుయంత్రాంగం రెప్పవాల్చని నిఘాతో అలర్టు అయింది. జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది. ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం తదితర ప్రాంతాలతో పాటు ఇటు నర్సంపేట, భూపాలపల్లిలోను అన్నల కదలికలు ఎక్కువే. అయితే ఒకప్పటి పరిస్థితికి ఇప్పుడు భిన్నమైన పరిస్థితి ఉందని పోలీసువర్గాలు వాదిస్తున్నాయి. లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్ ఘటనలతో అన్నలు బలహీనమయ్యారని అంటున్నా..పంచాయతీ ఎన్నికలను కేంద్రంగా చేసుకొని ఏవైనా సంఘటనలకు పాల్పడే అవకాశం లేకపోలేదని ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తూ హెచ్చరికలు జారీచేశాయి. ఈ కారణంగా పల్లెలు, ఏజెన్సీ ఏరియాను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇటు పోలీసులతోపాటు అటు గ్రామాల్లో ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న ఆయాపార్టీల నేతలతోపాటు మాజీల్లోను కలవరం కనిపిస్తోంది. ఏ క్షణాన ఏ సంఘటన జరుగుతుందోననే భయం అందరిలోను లీలగా మెదులుతూనే ఉంది. ఈ క్రమంలో భారీ బలగాలను రంగంలోకి దించుతున్నారు. అనుమానితులపై నిఘా ముమ్మరం చేశారు. ఇటు నక్సల్ సమస్యకు తోడుగా గ్రామాల్లో అల్లర్లు సృష్టించే వారిపైనా పోలీసు స్టేషన్లవారీగా దృష్టి సారించి బైండోవర్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా రాజకీయ గొడవలు తీవ్రంగా జరిగే సమస్యాత్మక గ్రామాలను కూడ అధికారులు ముందుగానే గుర్తించారు. భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, నర్సంపేట, ములుగు వంటి అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పరకాల నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ సిపి నాయకుడు కొండామురళి ఆధిపత్యానికి చెక్ పెట్టేవిధంగా అన్నిపార్టీలు ఏకమవుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఏవైనా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అని పోలీసులు దృష్టి సారించారు. సాధారణ ఎన్నికలకు కూడా సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు దక్కించుకోవాలంటే ముందుగా గ్రామాల్లో పట్టు సాధించాలి. పార్టీ రహిత ఎన్నికలైనా తాము మద్దతుపలికి మెజార్టీ సర్పంచు, వార్డు స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు మరోవైపు అన్ని పార్టీలు కసరత్తు చేస్తూ తదనుగుణంగా వ్యూహాలను అమలుచేస్తున్నాయి. ఇంకోవైపుతెలంగాణ అంశం అన్నిపార్టీలోను గుబులు రేపుతోంది. ఈ విషయంలో తమ అధినాయకత్వం నాన్పుడువైఖరి ఎన్నికల్లో ఏ నష్టాన్ని కలిగిస్తుందోనని కాంగ్రెస్ నాయకుల్లో కలవరం కనిపిస్తుండగా, తెలంగాణపై తమ వైఖరి ముప్పుతెచ్చేనా అని టిడిపి, వైకాప నేతలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ పోరు పర్వం అందరికీ ప్రతిష్టగామారుతోంది.

లక్షన్నర రూపాయలు లంచం తీసుకొంటూ బుక్కయన సూపరింటెండెంట్
english title: 
mgm

నేర్చుకుందాం

$
0
0

సంపదలు గల్గు తఱి మహాజనుల హృదయ
మభినవోత్పల కోమలం బగుచు వెలయు
నాపదలు వొందునపుడు మహా మహీధ
రాశ్మ సంఘాత కర్కశం బై తనర్చు
భావం: సంపదలుకలిగినపుడు మహాత్ముల మనస్సులు కలువలవలె మృదువుగా ఉంటాయి. ఆపదలు వచ్చినపుడు మాత్రంపెద్ద కొండలరాలవలె కఠినంగా ఉంటాయి. అంటే సంపదలు వచ్చినపుడు గర్వించి కఠినంగా ప్రవర్తించరనీ, ఆపదలు వచ్చినపుడు వెలవెలబోరని భావం. పెద్దలందరూ సంపదలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే సంపదలు వచ్చి గర్వం కలిగి భగవంతుడిని మరిచిపోతావేమోనని అసలు సంపదలను దరికి చేరనివ్వరు. ఎపుడూ కష్టాలు ఉంటే భగవంతుడిని అనుక్షణమూ తలుచుకుంటూ ఉంటామనే వారూ ఈ లోకంలో ఉన్నారు. ఆపదలకు వెరిచి వాటినుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక పనిని చేయకుండా ఆపదలు కలిగినపుడు, కాలం తమదై నడిచినపుడూ ఒకేలా వ్యవహరించేవారే మహాత్ములు.

భర్తృహరి శతకములోని పద్యమిది

సంపదలు గల్గు తఱి మహాజనుల హృదయ
english title: 
nerchukundam
author: 
నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్

కిరణ్మయి కల - 12

$
0
0

మాటా మంతీ లేకుండా కలిసి భోంచేస్తున్న ఈ జంటవైపే కొన్ని జతల కళ్లు చూస్తున్నాయని తేలిపోయింది. స్టేర్ చేసేవాళ్లంటే కిరణ్మయికి చిరాకు.
‘‘హంపీ రావటం ఇదేనా?’’
కిరణ్మయి ప్రశ్నాస్త్రం సూటిగా తనమీద సంధిస్తుందనుకోలేదు ప్రత్యగాత్మ. తన దృష్టి మళ్లించటానికే అలా అంటోంది. చుట్టూ చూడగానే తనకీ విషయం అర్థమైపోయింది.
‘‘ఎప్పుడో చిన్నతనంలో మా అమ్మా నాన్నలు తీసుకువచ్చారు. కాని, ఈసారి అడుగుపెట్టగా ఒళ్లంతా పులకరించిందనుకోండి. రాగానే ఓ పుస్తకం కొని చదివాను. రాత్రంతా నిద్రపట్టలేదు. ఈ హంపీ నా స్వంతం అన్న ఫీలింగ్ నన్ను బాగా కుదిపేసింది. కాళిదాసులా ఆసు కవిత్వం తన్నుకువచ్చేసింది.
‘‘ఈ పంపా తీరం
ఇదివరకే పరిచయం
ఎప్పుడూ? ఎలా? చెప్పలేను
ఈ పచ్చిక బయళ్లూ
పరిమళపు గుభాళింపులు
రెల్లు భామల నిట్టూర్పులు
తీరం చాటు దీపం వెలుతురూ
ఏ గతానికి స్వాగతమో!’’
కిరణ్మయి ఈసారి గట్టిగానే నవ్వేసింది. ఇప్పుడు తమని ఎవరూ పట్టించుకోవటంలేదు. ఇంటినుంచి పారిపోయిన జంటలా చూట్టంలేదు.
‘‘ఎందుకు నవ్వుతున్నారు? నా కవిత్వం అంత చండాలంగా వుందా?’’
‘‘ఉత్తి బడిపంతులేననుకున్నాను, కవి పండితులన్నమాట’’
‘‘దెబ్బతిన్నారు. నేను పంతుల్ని కాదు. ఆ కవిత్వం నాది కాదు’’
‘‘ఎవరిది?’’
‘‘ఎవరిదైనా అనుభూతి మాత్రం ఇద్దరిదీ.
ఖాళీ బల్ల కోసం దేవులాడుతున్న ఓ జంట కనిపించగానే ఇద్దరూ లేచారు.
‘‘ఈ రోజు ఖాళీయేనా?’’
మొగమాటం లేకుండా అడిగేసింది కిరణ్మయి. సంబంధం సాప్తపదీనం.
‘‘ఎక్కడికి వెళ్లాలి?’’
‘‘పదండి చెబుతా’’
అరగంటలో మళ్లీ కిరణ్మయి కీలుగుర్రం ఎక్కటం మేనేజర్ కంట పడింది. టూరిస్టు హోమ్ సరిహద్దు దాటగానే ప్రత్యగాత్మ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
‘‘మేడమ్‌గారూ! ఇప్పడు చెప్పండి. ఎటు వెళ్లమంటారు?’
‘‘మీ ఇష్టం’’ అన్నది లైటు వెలిగినందుకు మురిపెంగా. ఇప్పుడు తను చెప్పినట్టు అతను వినాలి. వింటున్నాడు కూడా.
‘‘ఉదయం క్వీన్స్ బాత్ చూచారా. హంపీ వచ్చాక పంపా సరోవరం చూడాల్సిందే. చరిత్రకు అన్యాయం జరగకూడదు.’’
అలాగేనన్నది కిరణ్మయి. తుంగభద్ర గట్లు ఒరుసుకుని ప్రవహిస్తున్నది. గడ్డమీద స్కూటర్ ఆగింది. క్రింద ఉద్ధృతంగా పారుతున్న పంపానది చూడగానే కిరణ్మయి బిత్తరపోయింది.
‘‘అయ్యబాబోయ్ ఏరు దాడటం నావల్ల కాదు’’ కాని అక్కడి దృశ్యాలు వెంటనే ఆకట్టుకొన్నాయి. బుట్టలో కూచుని గిరగిర తిరుగుతూ నదికి ఏటవాలుగా పల్లీయులు చిన్నా పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా ఆవలిగట్టు చేరుకుంటున్నారు.
‘‘పదండి’’
ప్రత్యగాత్మ దిగి కిరణ్మయికి చెయ్యి అందిచ్చాడు. మెల్లగా దిగింది. ఇసుకలో గట్టుదాకా నడవటం తనకి కాస్త ఇబ్బందిగానే వుంది. తన పేరు ఎలా తెలుసుకున్నాడో ఏంటో అడగాలనిపించింది కిరణ్మయికి. అడగ్గానే గట్టిగా నవ్వాడు ప్రత్యగాత్మ.
‘‘చెప్పమంటే నవ్వుతారేం?’’
‘‘వెరీ సింపుల్. నా పేరు ఆత్మారామ్. ఆత్మ అంటే సూర్యుడు. తెల్లవారగానే కిరణాలతో ప్రపంచాన్ని ముంచెత్తటం సూర్యుడి అలవాటు. మీ పేరు అయితే సూర్యకుమారి కాకపోతే కిరణ్మయి అయి వుండాలి. నాకు నచ్చిన పేరుతో పిలుస్తాను. పేలుతుంది అనే నమ్మకం’’.
తనని ఫూల్ చేస్తున్నాడు ఈ ఆత్మారాముడు.
‘‘పేరు అడిగితే ఇంత తిరకాసు పెట్టారు. అంచేత మీకై మీరు చెబితే వింటాను. యామై రైట్ ఆర్ రాంగ్’’
ఆర్‌టిసి బస్సు కండక్టర్‌లా రైట్ అనేసి ఈల వెయ్యాలనిపించింది కిరణ్మయికి. రేవు అంచును నిలబడ్డ ఈ జంట కనిపించగానే, ఓ కుర్రాడు గబగబా తెడ్డు వేసి పుట్టిని ఇటుకేసి పరుగెత్తించాడు. ఓ అంచు ఒడ్డు తాకుతున్నా పుట్టి ప్రవాహానికి అటూ ఇటూ ఊగిసలాడుతూనే వున్నది. ప్రత్యగాత్మ ఒక అంగలో పుట్టిలో దిగాడు. కిరణ్మయి తటపటాయించటం చూచి పుట్టి అబ్బాయి పళ్లికిలించాడు. రోషంతో ప్రత్యగాత్మ చెయ్యి పట్టుకోకుండా పుట్టిలో అడుగు వేసింది. ఓ పెద్ద అల తాకిడికి తట్టుకోలేక పుట్టి ఓ అంగుళం వెనక్కి జారింది. కిరణ్మయి కాలు జారి నీళ్లళ్లో పడిపోయింది. ప్రత్యగాత్మ గబుక్కున దిగి పైకి లేపాడు.
‘‘అయ్యో! చీర తడిచిపోయింది. వెనక్కి పోదాం’’ అన్నాడు కంగారుగా. కిరణ్మయి వినిపించుకోలేదు.
****
‘‘ఏంటమ్మగోరూ! దబ్బున పడిపోయారు’’
పుట్టబ్బాయి నవ్వుతూంటే కిరణ్మయికి ఒళ్లు మండుతున్నది.
తిరిగి వెళ్లటానికి ఒప్పుకోలేదు అందుకే.
‘‘నువ్వు దిగి పుట్టిని గట్టుకు ఒత్తిపట్టుకోవోయ్’’- ప్రత్యగాత్మ కోప్పడగానే కుర్రాడు దిగి పట్టుకున్నాడు. కిరణ్మయి కాలు మోపి క్షేపంగా పుట్టిలో కూచున్నది.
‘‘మెల్లగాపోనీ’’ వార్నింగ్ ఇచ్చేశాడు పుట్టి అబ్బాయికి తనూ ఎక్కి కూచుని. పుట్టి కదిలింది. సూర్య కిరణాలు తళతళామంటూ తరంగాలతో ఆడుకుంటున్నాయి. తడిసిన కుచ్చెళ్ళలో తనువు జలదరించింది కిరణ్మయికి.
- ఇంకాఉంది

మాటా మంతీ లేకుండా కలిసి భోంచేస్తున్న
english title: 
daily serial
author: 
ఉప్పు రాఘవేంద్రరావు

రంగనాథ రామాయణం

$
0
0

ఈ సుగ్రీవుణ్ణి మా అన్న రావణుడు కని సంతోషిస్తాడు అని తలపోస్తూ లంకలోపలికి కొనిపోయినాడు. అది కాలాగ్ని కాలమేఘాన్ని కూల్చి గుహకు కొంపోయినట్లు తోచింది. దేవతలు అందరూ ఆజిలో సుగ్రీవుడు ఈ విధంగా మూర్ఛపోయినాడే అని విచారించారు. ఆ కుంభకర్ణుడి లావు, చలము, లాఘవములను రాక్షసులు అందరూ సన్నుతించారు. సుగ్రీవుణ్ణి విడిపించలేక వానరులు హాహాకారాలు చేశారు.
శరభుడు, ఋషభుడు, ధూమ్రుడు, జాంబవంతుడు, కేసరి, పృథరోముడు, హరిరోముడు, పావకాక్షుడు ద్వివిదుడు, మైందుడు, గవయుడు, శతబలి, గవాక్షుడు, గజుడు, కుముదుడు, జ్యోతిర్ముఖుడు, సుషేణుడు, దధిముఖుడు, ధూమ్రుడు, గంధమాదనుడు, తారుడు, ఆదిగాగల వీరవానరులు, ఉదగ్ర విక్రములు, దారుణకారులై తరువులు, శైలములు కైకొని ఆకసానికి ఎగసి, అట్టహాసాలు, సింహనాదాలతో దశదిశలు అట్టిట్టుగా బ్రహ్మాండము పగుల, ఏ రీతిగా నయినా సుగ్రీవుని విడిపింతము అని తలపోసి కుంభకర్ణుడిని చుట్టముట్ట తలచినపుడు హనుమంతుడు చేయెత్తి వద్దని వానరుల్ని వారించి ‘‘సుగ్రీవుడు ఉద్భట శూరుడు. మూర్ఛపోయి వున్నాడు అంతే. తెలివి వచ్చిన వెంటనే ఆ వీరాధివీరుడు తిరిగి వస్తాడు. అందువల్ల మనం అసుర నుంచి విడిపించినట్లయితే జీవితాంతమూ విచారిస్తాడు. ఇది మనకు కర్తవ్యం కాదు. కొలది సమయం వేచి చూడండి. ఈ లోపల వానరేశ్వరుడు రాకున్న కుటిలురయిన రావణ కుంభకర్ణులను, చటుల విక్రములైన రాక్షస సేనలను తీవ్ర ముష్టిఘాతాలతో సంహరించి, బంగారు కాంతులు విలసిల్లే ఏడు కోట్లను, లంకను సర్వనాశనం చేసి సుగ్రీవుణ్ణి విడిపించుకొని రావచ్చును’’ అని వాకొన్నాడు.
అప్పుడు వానరులు హనుమంతుడి వాక్యాలు ఆకర్ణించి, మనముల సంతసించి, కుంభకర్ణుడి వెనుక పోవ, కుంభకర్ణుడు గణింపక సుగ్రీవుడితో కడువడిగా లంకలో ప్రవేశించాడు. కుంభకర్ణుడు ఆ రీతిగా వెడలుతుండగా రాజమార్గాలతో గోపురాలనుంచి సౌధాల మీద నుంచి పురకాంతలు పుష్పవృష్టి కురిపించారు.

సుగ్రీవుడు- కుంభకర్ణుడిని విరూపుని చేయుట
ఆ పూలవాన సౌరభాలకు సుగ్రీవుడికి మెల్లగా మెలకువ వచ్చింది. కన్నులు తెరచి చూశాడు. లంకానగరం రాజవీధి అని గుర్తించాడు. తెలతెల్లపోయాడు. ఈ రీతిగా ఈ రాక్షసుడికి పట్టువడి మూర్ఛపోయాను అని తలచాడు తన కరాలతో ఆ రాక్షసవీరుడి చెవులు పెనవైచి తమ్మెలతో కలిపి పెరికివేశాడు. ముక్కుపుటాలతో బోసిపోయే విధంగా కరచి, కుంభకర్ణుడు మీదికి ఎగిరాడు. కుంభకర్ణుడు సుగ్రీవుడి కాళ్లు పట్టి నేలపై విసరబోయాడు. సుగ్రీవుడు ఆకాశంలోకి ఎగిరి రామవిభుడి వద్దకి వచ్చాడు. దేవతలు సుగ్రీవుడు రావడం కాంచి ఆశ్చర్యపోయారు. వానరులందరూ తమ ఏలికను కాంచి నమస్కరించారు. సుగ్రీవుడు వానరులతో రామవిభుడికి ప్రణమిల్లాడు. రామవిభుడు సుగ్రీవుణ్ణి ఆనందంతో ఆలింగనం చేసుకొన్నాడు.
అంత కుంభకర్ణుడు ఆ విధంగా ముక్కులు, చెవులు పోగొట్టుకొని ఇంతకు పూర్వం తన చెల్లెలు శూర్పణఖకు కలిగిన భంగపాటే తనకూ కల్గినందుకు సిగ్గుపడి, ఈ వికృత రూపంతో రాక్షసేశ్వరుడి కడకు ఏమని, ఎట్లని వెతాను’’ అని తలచి యుద్ధం చేయపోవడం బాగు బాగు అని భావించాడు. పురమునుండి వెనుదిరిగాడు. రక్త ప్రవాహాలు దేహం అంతా నిండి ఉద్దండ వర్తనుడు కుంభకర్ణుడు ఘనతమ రోషంతో జేగురు చాయల సేలయేరులు ప్రవహించే నల్లని కాటుక కొండ కైవడి కనవస్తూ ఇతడు యుగాంతం నాటి తీవ్రాగ్ని జ్వాలయా అన రణస్థలికి ఏతెంచాడు. ఆ విధంగా ఏతెంచుతూనే ఉగ్రరూపం ధరించి వానర సైన్యం మీద విరచుకొని పడ్డాడు. భీషణంగా వానరుల కడ కాళ్లు పట్టుకొని వేగంగా తిప్పి తిప్పి అవనిపై పడవేసినాడు. కొందరను వెలికి ప్రేగులు రాలిపడ పిడికిళ్లతో పొడిచాడు. అత్యుదడ్రై మరికొందరి గుండెలు పగిలి వెలికివచ్చిపడే రీతిని పాదాలతో త్రొక్కివేశాడు.
- ఇంకాఉంది

ఈ సుగ్రీవుణ్ణి మా అన్న రావణుడు కని
english title: 
ranganatha
author: 
- శ్రీపాద కృష్ణమూర్తి

తొలి ఏకాదశి

$
0
0

శాంతాకారం భజగశయనం, పద్మనాభం... అంటూమహావిష్ణువును పూజించే ఈ ఏకాదశే తొలిఏకాదశి. ఎందుకంటే సంవత్సరం పొడవునా వచ్చే ఏకాదశులన్నింటిలోకి ఆషాడమాసాన, ధనుర్మాసాన వచ్చే ఏకాదశులకు ప్రత్యేకత ఉంది కనుక. ఈ రోజు క్షీరాబ్దిలో మహావిష్ణువు శయనిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని, కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశిని అనీ, హరి దగ్గరే వాసం చేస్తారు కనుక హరివాసరం అని ఈ ఏకాదశికి వివిధ పేర్లు పరిగణన లోకి వచ్చాయ పైగా ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు నేటినుంచి దక్షిణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. దానివల్లకూడా ప్రత్యక్షనారాయణునిగా తలిచే సూర్యుడు నేటినుంచి పడుకున్నట్లుగా భావించి శయనైకాదశిగాభావిస్తారు.
ఈ ఏకాదశి ఉపవాసం గురించి భవిషోత్తర పురాణం ఉద్ఘాటిస్తోంది. ఏకాదశీవ్రత ప్రాధాన్యాన్ని బ్రహ్మవైవర్తన పురాణం చెప్తుంది. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు. రుక్మాంగద మహారాజు, అంబరీషుడు ఈ వ్రతాచరణంతో విశేషఖ్యాతి పొందారు. ఏకాదశి తెల్లవారు ఝాముననే అభ్యంగన స్నానపానాదులను చేసి బ్రహ్మచర్య దీక్ష వహించి సదా శ్రీహరినే ధ్యానించాలి. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు.
విష్ణ్భుగవానుడు అలంకారప్రియుడు కనుక పూలతో సుగంధ ద్రవ్యాలతో,పరమ భక్తితో ఆ మహావిష్ణువును ఈరోజు అమిత శోభాయమానంగా అలంకరిస్తారు. పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. ఈ రోజంతా ఉపవాసం చేసి హరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. శ్రీమన్నానారాయణ మంత్రోచ్చారణ చేస్తూ భక్తవత్సలుడైన శ్రీహరిని కొలవడమే ఈ వ్రతవిశేషం. అందుకే ఈ వత్రాన్ని నియమనిష్ఠలతో ఆచరించిన వారికి మహావిష్ణువు సమస్త బాధలనుంచి ఉపశమనం కలిగించి వారికి ముక్తిని ప్రసాదిస్తాడని హరిభక్తుల విశ్వాసం. ఈ దినాన వైష్ణవాలయాల్లో జాజిపూలతో స్వామికి పవళింపుసేవోత్సవం జరుపుతారు.
ఇక వర్షాకాలం ఆరంభం కనుక వ్యవసాయదారులు నేటినుంచి వ్యవసాయ పనులను శ్రీకారం చుడ్తారు. గోదావరి జిల్లాలో పాలెళ్ల పండుగలా ఈ తొలికాదశిని నిర్వహింపచేస్తారు. కొత్త పాలేర్లను పనిలోకి తీసుకోవడం , వారికి పంచభక్షపరమాన్నలతో విందుచేయడం, కొత్తబట్టలను ఇచ్చి గౌరవించడం లాంటి ఆచారాలు అక్కడ ఉన్నాయ. నెల్లూరు ప్రాంతంలోనూ వ్యవసాయపు పనులను మొదలుపెడ్తారు. తెలుగు వారి పండుగలన్నీ కూడా ఇపుడే ఆరంభమవుతాయ కనుక ఏకాశి ఎత్తుకొస్తుంది ఉగాది ఊడ్చుకువెళ్తుంది అన్న సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది.
మనకు గోవు పరమపవిత్రం. గోముఖభాగమందు వేదాలు, కొమ్మలందు హరిహరులు, నేత్రాలలో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగములో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి, అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు సర్వతీర్థాలు ఉన్నట్లుగా మనం భావిస్తాం. గోవుగురించి అధర్వణవేదంలోనూ, బ్రహ్మాండ , పద్మపురాణాలలోనూ, మహాభారతంలోనూ ఏన్నో గాథలున్నాయి. గోవిశిష్టతను పురస్కరించుకుని తొలేకాదశినాడు గోపద్మవ్రతం ఆచరిస్తారు. గోశాలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులుతీర్చి మధ్యలో ముప్పైమూడు పద్మాలముగ్గులువేసి శ్రీమహాలక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఆ పద్మాలపై పెట్టి విధివిధానానుసరించి పూజచేస్తారు. పద్మానికొకఅప్పడం చొప్పున వాయనాలు దక్షిణతాంబూలతో ఇస్తారు. ఇంకా తులసికోట వద్ద పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి జామ, ఖర్జూర, చెరుకు, సీతాఫలాలను నివేదిస్తారు. సేవాభావం, పరులను గౌరవించడం లాంటి నియమాలను పాటించడం ఈ వత్రాచరణలో ముఖ్యం. నేటినుంచి కామక్రోధాదులకు తలొగ్గకుండా శాంతంతో కూరిమి చేయాలని శాస్త్ర వచనం.

మంచిమాట
english title: 
toli ekadasi
author: 
- చివుకుల

కదిలించే బయోగ్రఫీ!

$
0
0

** భాగ్ మిల్కా భాగ్ (ఫర్వాలేదు)

తారాగణం:
ఫర్హాన్ అఖ్తర్, సోనమ్ కపూర్
రెబెకా బ్రీడ్స్, దలీప్ తాహిల్
ప్రకాష్‌రాజ్, పవన్ మల్హోత్రా
దివ్యాదత్తా తదితరులు
కథ: రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా
సినిమాటోగ్రఫీ: బినోద్ ప్రధాన్
సంగీతం: శంకర్ మహదేవన్
స్క్రీన్‌ప్లే: ప్రసూన్ జోషి
నిర్మాత, దర్శకత్వం:
రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా

చరిత్రని తెరకెక్కించటం మాటలు కాదు. ఒక జీవితకాలాన్ని కొద్ది గంటలకు కుదించటం అంటే ఆ జీవితంలోకి తొంగిచూసి తరచి తరచి శోధించి అనే్వషించి.. కొన్ని పేజీల్లోకి మార్చటం. ఏ అంశాన్ని ఉంచాలి? ఏ సంఘటనల్ని స్క్రిప్ట్‌లో రాయకూడదు? అన్నది ఆ వ్యక్తి జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే సాధ్యపడుతుంది. అయినప్పటికీ బేరీజు వేసుకొని.. యథాతథంగా సెల్యులాయిడ్‌పై చూపిస్తే.. అది డాక్యుమెంటరీ కావొచ్చు. విసుగు పుట్టించవచ్చు. కాబట్టి మెలోడ్రామా తప్పనిసరి. అన్ని జీవితాల్లోనూ అటువంటి నాటకీయత ఉండదు. కానీ మిల్కాసింగ్ లైఫ్ అందుకు మినహాయింపు. స్వతహాగా ‘మిల్కాసింగ్’ అథ్లెట్ అని మాత్రమే చాలామందికి తెలుసు. ఎక్కడ పుట్టాడో? ఎలాంటి జీవిత వేదనని అనుభవించాడో? క్లిష్ట పరిస్థితులకు ఎదురీది అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎలా ఎదిగాడో? చాలామందికి తెలీదు. ఆయా సంఘటనల్ని సన్నివేశాల రూపే ణా రాసుకొని.. మిల్కాసింగ్ తెర వెనుక జీవితాన్నీ.. ట్రాక్‌పై అతడి వేగాన్ని పట్టేశాడు దర్శకుడు రాకేష్.
కథ- ఒక పల్లెటూళ్లో పంజాబీ కుటుంబానికి చెందిన మిల్కా జీవితం ఆడుతూ పాడుతూ గడిచిపోతూంటుంది. ఇంత లో దేశ విభజన జరుగుతుంది. ముష్కరుల దాడిలో తన కుటుంబాన్ని కోల్పోతాడు మిల్కా. తనని ప్రాణంగా ప్రేమించే అక్క దూరమవుతుంది. శరణార్థ శిబిరంలో రొట్టె కోసం తగవు. కొద్దిరోజులకు అక్క, బావ ఆ శిబిరానికి చేరుకుంటారు. కానీ బావకి మిల్కా అంటే పడదు. అతడొక భారంగా భావిస్తాడు. విభజన గొడవలన్నీ సద్దుమణగటం.. మిల్కా ఆవారా గాళ్ల సావాసం చేయ టం ఒకేసారి జరుగుతాయి. రైల్లో బొగ్గు దొంగతనం చేస్తాడు. పేకాట ఆడతాడు. బొగ్గు దందాతోనే పెరిగి పెద్దవాడవుతాడు. అక్కడ ‘బిరో’ (సోనమ్ కపూర్) పరిచయమవుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఏనాటికైనా- దేశం గర్వించేట్టు బతుకుతానంటాడు. బొగ్గు దొంగిలించటం మానేస్తాడు. జీవనం కోసం ఆర్మీలో చేరతాడు. దాంతో అతడి జీవితమే మారిపోతుంది. పరుగు. అదే లక్ష్యం. అదే ట్రాక్. అదనంగా ఇచ్చే పాల కోసం పరుగు. మరో గుడ్డు కోసం తాపత్రయం. అతడిలోని కోరికని ‘ట్రాక్’పై పెట్టాలనుకుంటాడు సీనియర్ మిలిటరీ ఆఫీసర్. మిల్కాని ఢిల్లీ బెటాలియన్‌కి తీసుకెళతాడు. అక్కడ మిల్కా ‘ఇండియా’ ఎంబ్లమ్ ఉన్న కోటు వేసుకొన్న వ్యక్తికి గౌరవం ఇవ్వటం చూస్తాడు. ఎలాగైనా ఆ కోటు వేసుకోవాలి? దాని కోసం ఎన్నో అవమానాలు పొందుతాడు. ఆఖరికి ఆ పోటీలో క్వాలిఫై అయి.. జాతీయ రికార్డుని బద్దలు కొడతాడు. విజయంతోపాటే పతనమూ ఉన్నట్టే. ఒలింపిక్స్ కోసం రోమ్ వెళ్లిన అతణ్ణి పరాజయం వెక్కిరిస్తుంది. బీర్ తాగటం.. అమ్మాయితో నైట్ గడపటంతో తన లక్ష్యాన్ని మర్చిపోతాడు. దాంతో - మెడల్ చేజారిపోతుంది. కోచ్ కోప్పడతాడు. చివరికి వెనుదిరిగి వస్తూండగా.. ఇప్పటి వరకూ 400 మీటర్ల పరుగు పందెంలో రికార్డు ఏదని అడుగుతాడు మిల్కా తన కోచ్‌ని. 45.9 అని రాసిస్తాడు కోచ్. తను ఏం పోగొట్టుకున్నాడో? దేన్నయతే సాధించాలని జీవిత లక్ష్యంగా పెట్టుకొన్నాడో మరోసారి గుర్తు చేసుకొని.. దానికి తగ్గట్టు పరుగు ప్రాక్టీస్ చేస్తాడు. వరల్డ్ రికార్డు సాధిస్తాడు.
కథలో ఎనె్నన్నో అంశాల్ని స్పృశించాడు దర్శకుడు. మిల్కాసింగ్ బాల్యాన్నీ.. దేశ విభజన కారణంగా మిల్కా కుటుంబం ఎలా ఛిన్నాభిన్నమైందో? జీవితంలో ‘ప్రేమ’ జారిపోవటం.. ట్రాక్‌పై పరుగు - ఒక్కోటి ఎంతో స్పష్టంగా సెల్యులాయిడ్‌పై చూపాడు. మిల్కా శారీరక మానసిక పరిస్థితులను కళ్లకి కట్టాడు. ట్రైన్‌లో దొంగతనం చేయటం.. రెండు కేన్ల నెయ్యిని పోలీస్ నుంచీ తప్పించటం కోసం - ఆ నెయ్యి తాగి.. బస్కీలు తీయటం.. మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో ఒక ఆస్ట్రేలియన్ అమ్మాయి ‘ఆర్ యూ రిలాక్సింగ్’ అని ప్రశ్నిస్తే.. ‘నహీ జీ ఐయామ్ మిల్కా సింగ్’ అనటం వెనుక అతడికి ఇంగ్లీష్ రాదన్న నిజాన్ని తెలియజేయటం.. 400 మీటర్ల పరుగు పందెంలో ఒక అమ్మాయిపై మోజు కారణంగా వదలుకోవటం.. అదే రికార్డుని మళ్లీ సాధించటం.. జవహర్‌లాల్ నెహ్రూ నుంచీ ప్రశంసలందుకోవటమే కాదు - పాకిస్తాన్ ఆటల పోటీల్లో ప్రత్యేక ప్రతినిధిగా నియమితుడు కావటం - ఇలా అనేకానేక మిల్కా సింగ్ జీవిత మలుపుల్ని చక్కగా పట్టేశాడు. ఏ ఒక్క కీలకమైన అంశాన్నీ మిస్ చేయలేదు. ఇక నటనాపరంగా - ఫర్హాన్ అఖ్తర్ ప్రతి ఫ్రేమ్‌లోనూ పరుగు పెట్టించాడు. తన చిరకాల కోరిక అయిన ‘ఇండియా’ ఎంబ్లమ్ కోటుని కుట్టించుకుంటున్నప్పుడు అతడి మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అదే కోటుతో అక్క దగ్గరకు వెళ్లినప్పుడు ఆమె మొహంలో సంతోషం - ఇలా భావోద్వేగ పూరితమైన సన్నివేశాలెన్నో మనసుని కదిలిస్తాయి. వొళ్లు గగుర్పొడుస్తుంది.
ప్రకాష్ రాజ్ పాత్ర పరిధి తక్కువ. కోచ్ జావేద్‌గా నవాబ్ షా, మిల్కా అక్కగా దివ్యాదత్తా - ఇలా ఎవరి పాత్ర మేరకు వారు ప్రతి సన్నివేశాన్నీ పండించారు. నేపథ్య సంగీతం, పాటలు బావున్నాయి. ఫర్హాన్ అఖ్తర్ దర్శకుడిగానే కాదు.. నటుడిగానూ తనేమిటో నిరూపించాడు. చక్కటి స్క్రీన్‌ప్లేతో.. దర్శకత్వ ప్రతిభతో సెల్యులాయిడ్‌పై అలరించిన ఈ బయోగ్రఫీ చిత్రం అటు అథ్లెట్ అభిమానులకే కాదు.. మిల్కా చరిత్ర తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.
రివ్యూతో సంబంధం లేకపోయినా - చిత్ర ప్రేరణకు స్ఫూర్తిని కలిగించిన రియల్ లైఫ్ హీరో - ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ తెర వెనుక జీవితం గురించి కొన్ని మాటలు చెప్పుకోవటం భావ్యం అనిపించింది. మారుమూల పల్లెటూరి వాడూ.. అస్సలు ‘ట్రాక్’ అంటే ఏమిటో? ఒలింపిక్స్‌కి అర్థం సైతం తెలీనివాడూ.. ఒక చెరిగిపోని శిలాక్షరాల్ని రాసాడంటే అతడి అకుంఠిత దీక్ష- ఆ కృషి వెనుక పట్టుదల మాటల్లో చెప్పేది కాదు. ఎంతగా ఎదిగాడో అంతగా వొదిగి ఉన్నాడనటానికి అతడి జీవితమే ఉదాహరణ. తను రాసిన ఆటోబయోగ్రఫీ ‘ది రేస్ ఆఫ్ మై లైఫ్’ (రచనలో కూతురు సోనియా సాన్‌వాల్కా సహకారం కూడా ఉంది.) ఆధారితంగా ‘్భగ్ మిల్కా భాగ్’ చిత్రాన్ని తీశారు. అందుకుగాను మిల్కా తీసుకున్న రెమ్యునరేషన్ ఒక్క రూపాయి. ఒకవేళ లాభాలు కనుక వస్తే.. తన వాటాగా వచ్చే సొమ్ముని ‘మిల్కాసింగ్ ఛారిటబుల్ ట్రస్ట్’కి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. 2003లో ప్రారంభించిన ఈ ట్రస్ట్ ద్వారా నిరుపేదలను ఆదుకోవటం.. ఆటల్లో నైపుణ్యం చూపేవారికి ఆర్థిక సహాయాన్ని అందించటం. ప్రస్తుతం ఛండీఘర్‌లో మిల్కా నివాసం.

చరిత్రని తెరకెక్కించటం మాటలు కాదు
english title: 
biography
author: 
-బి.ఎన్

గ్రాఫిక్స్‌తో ‘సాహసం’

$
0
0

** సాహసం (ఫర్వాలేదు)
తారాగణం:
గోపీచంద్, తాప్సీ, సుమన్
శక్తికపూర్, అలీ, నారాయణరావు
వాసు తదితరులు.

కెమెరా: శ్యామ్‌దత్
సంగీతం: శ్రీ
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
చంద్రశేఖర్ ఏలేటి

చందమామ కథలంటే పిల్లలకు పెద్దలకు కూడా ఇష్టమే. అందులో కాస్త సాహసాలు దట్టించిన కథలంటే మరీనూ. అందుకే ఆధునిక కాలంలో కూడా అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో సాహసగాధలు తెరకెక్కుతుంటాయి. ఇలాంటి సాహసాలకు నిధి వేట లాంటి ఆకర్షణ తోడయితే, మరీ ఆసక్తికరంగా వుంటుంది. అయితే ఈ తరహా సినిమాలకు కాస్త వ్యయ ప్రయాసలు ఎక్కువ. అందుకే భారీ వ్యయానికి, వసూళ్లకు అవకాశం వున్న హాలీవుడ్‌లోనే ఈ తరహా సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. మన దగ్గర అడపాదడపా కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి చేసిన అలాంటి ప్రయత్నమే ‘సాహసం’. ఇటీవల బాగా పాపులర్ అయిన గ్రాఫిక్ విన్యాసాలను జోడించి, నిధి వేటను సాగించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఆ వేట వెనకు విషయం ఏమిటంటే..
గౌతమ్ (గోపీచంద్) తాత (సుమన్)దేశ విభజన కాలంలో పెషావర్‌లో వజ్రాల వర్తకుడు. విభజన సమయంలో చెలరేగిన హింసకు భయపడి, తన సొత్తుతో పారిపోతూ, ఓ ఆలయంలో తలదాచుకుంటాడు. నిజానికి ఆ ఆలయం కింద కనిష్కుల కాలం నాటి నిధి వుంటుంది. అనుకోకుండా నిధి ద్వారం తెరుచుకుని, ఇతగాడి సొత్తు అందులో కలిసిపోతుంది. ఆ మాట వీలునామా రాసి, అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను డైరీగా రూపొందించి, ఓ లాకెట్‌తో కలిపి, రహస్యంగా దాచి చనిపోతాడు. ఆ తరువాత అతగాడి కొడుకు పేదరికంలోనే వుంటూ వస్తాడు. ఇది గతం.
ఇక వర్తమానానికి వస్తే, మనవడు గౌతమ్ (గోపీచంద్) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడు. డబ్బుల కోసం తహతహలాడుతుంటాడు. అలాంటి సమయంలో ఇంటి పైకప్పుకు కన్నపడి, ఈ నిధి సంగతి తెలుస్తుంది. కానీ ఆ ఆలయం పాకిస్తాన్‌లో పెషావర్ సమీపంలో వుండడంతో, శ్రీనిధి(తాప్సీ) సాయంతో అక్కడకు బయల్దేరతాడు. అక్కడ అదే నిధి కోసం వేటాడుతున్న సుల్తాన్ (శక్తికపూర్) బృందంతో ఢీకొంటాడు. చివరకు తన తాత సొత్తు ఎలా సంపాదించాడన్నది మిగిలిన కథ.
నిధి వేట సినిమా అంటే లొకేషన్లు, ఆపై సవాలుపై సవాలుగా ఎదురయ్యే సమస్యలతో కూడిన స్క్రిప్ట్ కీలకంగా వుంటాయి. ‘మోసగాళ్లకు మోసగాడు’లో ఎడారి ప్రాంతం, ‘టక్కరిదొంగ’లో విదేశీ లొకేషన్లు కనువిందు చేస్తాయి. ‘సాహసం’ సినిమా కోసం పాకిస్తాన్ పెషావర్ ప్రాంతాన్ని తలపించే లఢక్ తదితర ప్రదేశాలను షూటింగ్ లొకేషన్లుగా ఎంచుకోవడం వరకు బాగానే వుంది. కానీ ఆపై నిధి వేట మొత్తాన్ని గ్రాఫిక్స్‌కు వదిలేసారు. అవి అత్యంత సహజంగానే వున్నా, సవాళ్లు సమస్యల చిక్కుముళ్లు ఇట్టే విడిపోతూ, సినిమా అలా అలా దిగుడుబాటలో బండిలా సాగిపోతుంది తప్ప, ఉత్కంఠకు గురిచేయదు. ఈ విషయంలో స్క్రిప్ట్ మరికాస్త బిగుతుగా వుంటే మరింత బాగుండేది. ఇక దర్శకుడు సినిమాను హాలీవుడ్ స్థాయిలో సీరియస్‌గా రన్ చేయాలని చూసాడు. తెలుగుసినిమా రొటీన్ వ్యవహారాలైన రొమాన్స్, డ్యూయట్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. అలీ, విలన్ క్యారెక్టర్ చేసిన శక్తి కపూర్‌ల ద్వారానే కాస్త ఫన్ పండించడానికి చూసారు. అది ఫలితం ఇచ్చింది కూడా. సాధారణంగా సినిమాకు సెకండాఫ్ ఆయువు పట్టుగా నిలుస్తుంది. ద్వితీయార్థం బాగుంటే, ప్రథమార్థంలో వ్యవహారాలు ప్రేక్షకులు ఇట్టే మర్చిపోతారు. ఈ సినిమాకు కూడా అదే జరిగింది. ఆ మర్చిపోవడం అన్నది సినిమాకు సంబంధించిన లాజిక్‌ల విషయంలో కూడా జరిగింది. అదే సెకండాఫ్ రంజుకా లేకుంటే, జనాలకు లాజిక్‌లు మిస్సయిన సంగతి గుర్తుకొచ్చేది. ప్రథమార్థంలో దర్శకుడి చాదస్తం కొంత ఇబ్బందికి గురిచేసినా, ద్వితీయార్థంలో కథ, నిధివేట, గ్రాఫిక్స్ ఆకట్టుకుని, సినిమాను గట్టెక్కించాయి.
గోపీచంద్ సినిమాకు అనుగుణంగా తన నటనను మార్చుకుని, చేసిన తీరు బాగుంది. తాప్సీకి పెద్దగా పాత్రమీ లేదు. ఉన్నంతలో ఓకె. విలన్‌గా శక్తికపూర్ బాగాచేసాడు, డబ్బింగ్ కూడా బాగుంది. అలీ కనిపించిన కాస్సేపు బాగానే నవ్వించాడు. మిగిలిన వారందరికీ చిన్న చిన్న పాత్రలే.
సినిమాకు నటీనటుల కన్నా సాంకేతిక నిపుణులే కీలకం. అందునా ఫొటోగ్రఫీ. శ్యామ్‌దత్ ఆ బాధ్యతను బాగా నిర్వహించాడు. కొత్త లొకేషన్లు, అక్కడి పోరాటాలు, చేజింగ్‌లు బాగా తెరపైకి తెచ్చాడు. ఇక చాన్నాళ్ల తరువాత శ్రీ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పాటలకు పెద్దగా అవకాశం లేదు. రెండు పాటల్లో ఒకటి తన స్టయిల్‌లో చేసాడు. అది అతని స్టయిల్ నచ్చేవారికి ఓకె. రెగ్యులర్ పాటలే నచ్చేవారికి అంతగా నప్పదు.
మొత్తం మీద పాతిక కోట్ల ఖర్చుకు సాహసించిన నిర్మాత దర్శకులకు మంచి ఫలితమే ఇచ్చింది సాహసం.

చందమామ కథలంటే పిల్లలకు పెద్దలకు కూడా ఇష్టమే
english title: 
sahasam
author: 
-విఎస్‌ఎన్

రణబీర్‌తో ఎవరు? -- ముంబై టాక్

$
0
0

రణబీర్ కపూర్ సరసన నటించేందుకు నటీమణులు ఉవ్విళ్లూరుతూంటారు. ఎందుకంటే? కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుంది కాబట్టి. మొన్నటి కత్రినా కైఫ్ నుంచీ నిన్నటి దీపికా పదుకొనె వరకూ రణబీర్‌తో ‘హిట్స్’ అందించినవారే. అనురాగ్ కాశ్యప్ ‘బాంబే వెల్వెట్’ చిత్రీకరణ పూర్తి చేసుకుంటూన్న తరుణంలో రణబీర్‌తో కరణ్ జోహర్ ఒక భారీ ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేస్తున్నాట్ట. స్క్రీన్ టెస్ట్ జరుగుతోంది కథానాయిక ఎవరా? అని. రణబీర్‌తో ‘వేకప్ సిద్’ ‘ఏ జవానీ హై దీవానీ’ చిత్రాలు నిర్మించిన కరణ్ ఈ ప్రాజెక్ట్‌ని భారీగా తీయాలని అనుకుంటున్నాట్ట. మరి రణబీర్ సరసన ఎవరైతే బాగుంటుంది? అప్‌కమింగ్ హీరోయిన్ల కంటే కాస్తంత నటనలో పరిణితి కలిగిన అమ్మాయిని సెలెక్ట్ చేస్తే - ఈ ఆలోచనల్లో దొరికింది పరిణితి చోప్రా. దీంతో స్క్రీన్‌పై ఫస్ట్ టైం కనిపిస్తారు పరిణితి - రణబీర్. అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి మరి.

బాలీవుడ్‌లోకి టీవీ భామ!
విరబూసిన నగుమోముతో - చూట్టానికి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకూ ప్రతీకగా కనిపించే అంకిత లొఖండే త్వరలోనే బాలీవుడ్ తెరపై కనిపించనుందా? ఇన్నాళ్లూ ఛానెళ్ల జగత్తుని ఏలుతోన్న ఈ మహారాణి తాజాగా షారూఖ్ ఖాన్ సరసన నటించనుందన్న వార్త ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. షారూఖ్ తదుపరి ప్రాజెక్ట్ ‘హ్యాపీ న్యూ ఇయర్’ గురించి ఇప్పటికే రూమర్లు ఏరులై పారేస్తున్నాయి. అసలు అంకితని షారూఖ్ ఎక్కడ చూశాడు? అదో పెద్ద కథ. ఛానెళ్లలో సీరియల్స్ అడపాదడపా చూసే షారూఖ్‌కి ఆ అమ్మాయిని ‘మకావూ’లో చూసేంతవరకు గుర్తు పట్టలేక పోయాడు. ఆఖరికి పరిచయాలు కావటం. వెంటవెంటనే చిత్రానికి సంబంధించిన మాటలు రావటం జరిగింది. దీంతో మకావూ నుంచీ వచ్చింత్తర్వాత స్పెషల్ థాంక్స్‌ని పోస్ట్ చేసిందిట అంకిత. ఆ మాత్రం అంకిత భావం లేకుంటే ఇండస్ట్రీలో నెగ్గుకు రావటం కష్టం. ఇకనేం? ఖాన్‌తో గేమ్‌కి రెడీ. ఫర్హాఖాన్‌ని కలుసుకొని అగ్రిమెంట్ చేసేసింది. దాంతో అటు షారూఖ్ ఖుష్. ఇటు అంకిత వెరీ ఖుష్. మరి వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో?

ఎట్టకేలకు హీరోయిన్?
ఇన్నాళ్లూ సైడ్ కేరెక్టర్లతో సరిపెట్టుకున్న కల్కి కొచిలిన్ ఎట్టకేలకు సైఫ్ అలీఖాన్ ప్రాజెక్ట్‌లో కథానాయికగా చేయనుంది. ‘ఏ జవానీ హై దివానీ’ ‘షాంఘై’ చిత్రాల్లో తన సత్తా చూపించిన కల్కి ‘సైఫ్’ చిత్రంలో విజృంభించనుంది. కాస్ట్యూమ్స్ పట్ల అంతగా పట్టింపు లేకపోవటంవల్ల.. ఆ మాటకొస్తే ఏ హీరోయిన్‌కీ లేదనుకోండి.. ఈ చిత్రంలో ముప్పాతిక నగ్నత్వాన్ని ప్రదర్శించనుందని వినికిడి. సైఫ్ అలీఖఆన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ అండ్ డికె (గో గోవా గాన్ ఫేమ్) దర్శకత్వం వహించనున్నారు. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్ లాస్ ఏంజిల్స్‌లో ప్రారంభమైంది. ‘కల్కి’ ఈ చిత్రానికి ఎస్సెట్ అవుతుందన్న నమ్మకం ఉందంటున్నాడు సైఫ్ అలీఖాన్. మరి ఈ బక్కపిల్ల - గండు చీమలు కుట్టిన పెదాల్తో ఏం చేస్తుందో ఏమో?

ముంబై టాక్
english title: 
mumbai talk
author: 
బి ఎన్

అంజలి అదుర్స్...!

$
0
0

అచ్చతెలుగు అమ్మాయి అయినా తొలిసారిగా తమిళంలో గుర్తింపు పొంది, ఆ తర్వాత పుట్టింటికి వచ్చిన అంజలి వరుస చిత్రాలతో టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ విజయం తర్వాత వరుస అవకాశాలతో బిజీ అయి, ఆమధ్య పినతల్లి గొడవతో ఒక్కసారిగా అంజలి పేరు లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం రవితేజకు జోడీగా నటించిన ‘బలుపు’ చిత్రం హిట్ బాటలో దూసుకుపోవడంతో రెండవ హీరోయిన్‌గా చేసినా సంతోషిస్తోంది. అందుకు తగినట్లు తన పారితోషికం కూడా ఒక్కసారిగా పెంచేసిందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ‘బలుపు’లో ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించే ఓ పాత్రలో కనిపించినా, ఆమె పాత్ర చిత్రానికి కీలకమవడంతో అంజలికి బాగా గుర్తింపు లభిస్తోంది. అందులో సెకండ్ హీరోయిన్‌గా నటించినా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావడంలేదట. ‘సీతమ్మవాకిట్లో...’ సినిమాలో సమంత అంజలిని డామినేట్ చేస్తే, ‘బలుపు’లో శృతిహాసన్‌ను డామినేట్ చేసి టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది. తెలుగు చిత్రాల్లో తెలుగు హీరోయిన్ పరిస్థితి రెండవ కథానాయికగా మిగిలిపోతుందనే బాధవున్నా, సక్సెస్ అందుతుండటంతో సంతోషంగా వుంది అంజలి. ఏదేమైనా తన ఖాతాలో మరో విజయం చేరినందుకు ప్రస్తుతం తన రేట్‌ను కూడా అదిరిపోయేలా పెంచిన అంజలిని అందరూ దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సూత్రం పాటిస్తోందని మెచ్చుకుంటున్నారు. దటీజ్...అంజలి!

అచ్చతెలుగు అమ్మాయి అయినా తొలిసారిగా
english title: 
anjali
author: 
-సమీర్

‘విలన్ ఆఫ్ ది మిలీనియం’

$
0
0

‘ప్రాణ్‌గా నా జీవితం ఎంతో సంతృప్తికరంగా సాగింది. జీవితంలోని వొడిదుడుకుల్నీ.. కష్టసుఖాల్నీ.. అన్నింటినీ అనుభవించాను. రూపాయి కోసం వెతికిన సందర్భాలున్నాయి. లక్షల కొద్దీ రెమ్యునరేషన్ అందుకున్న రోజులూ ఉన్నాయి. వచ్చే జన్మలోకూడా ‘ప్రాణ్’గానే పుట్టాలనుకుంటా. నటుడిగా జీవించాలనుకుంటా’ అంటాడు. అదీ నటన పట్ల ప్రాణ్‌కున్న సిన్సియారిటీ.
=====================

చూపుల్లో కర్కశత్వం.. మాటల్లో కరకుదనం.. స్నేహం కోసం ప్రాణాన్ని ధారపోసే సున్నితత్వం.. వెరసి అతడే ‘ప్రాణ్’. చూట్టానికి విలనీ పోకడలు బోలెడన్ని స్పష్టాస్పష్టంగా కనిపించినప్పటికీ.. మనసు తేటగీతి. చిత్రపరిశ్రమలో ఎవర్ని అడిగినా పొల్లు పోకుండా ఇవే మాటలు చెబుతారు. ఇదే పాట పాడతారు -ప్రాణ్ గురించి. ఇక నటన గురించి చెప్పనక్కర్లేదు. ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’ చిత్రం షూటింగ్ జరుగుతున్న రోజులు. కథానుగుణంగా విలన్ కేరెక్టర్ లెంగ్త్ మరీ చాంతాడంత అయి.. ప్రతి ఫ్రేమ్‌లోనూ విలన్ కనిపిస్తూ కథానాయకుణ్ణి పక్కకి నెట్టేశాడు. ఇంకెవరైనా ఐతే పరిస్థితి ఏ విధంగా ఉండేదో? కానీ.. రాజ్‌కపూర్ మాత్రం ప్రాణ్ ‘విలనిజాన్ని’ ప్రశంసించాడు. అతడి అసమాన నటనా ప్రతిభ ముందు ఆ ఫ్రేమ్‌లో నేను కనిపించక పోతేనేం? అంటూ తన సహృదయతను చాటుకోవటమే కాదు.. విలన్ అంటే రేపటి తరానిక్కూడా అర్థమయ్యేట్టు ఆ బందిపోటు పాత్రకి మరిన్ని మెరుగులు అద్దాడు. అదీ ప్రాణ్‌లోని నటనకు గీటురాయి. ఇదొక మచ్చుతునక మాత్రమే. 1940 నుంచీ ప్రాణ్ జీవితంలో అటువంటి మైలురాళ్లు మజిలీలు ఎనె్నన్నో. లెక్కకు మించి.
పాత ఢిల్లీలోని కోట్‌ఘర్ ప్రాంతంలో ఒక సంపన్న పంజాబీ కుటుంబంలో 1920, ఫిబ్రవరి 12న ప్రాణ్ ప్రాణం పోసుకున్నాడు. తండ్రి కేవల్ కృష్ణ సికంద్ సివిల్ ఇంజనీర్. అంతేకాదు - గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టర్ కూడా. ఉద్యోగరీత్యా తరచూ ట్రాన్స్‌ఫర్లు కావటంతో.. ప్రాణ్ చదువు సంధ్యలు మీరట్, కపుర్తలా, ఉనావ్, డెహ్రాడూన్, రాంపూర్‌ల మీదుగా సిమ్లా చేరాయి. చిన్నప్పట్నుంచీ కుక్కలంటే ప్రాణం పెట్టే ప్రాణ్‌కి ఆ హాబీతోపాటు ఫొటోగ్రఫీ కూడా అలవడింది. ఎ.దాస్ అండ్ కో లో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా చేరాడు. ఫొటోగ్రఫీతోపాటు నటన అంటే ఏ మూలనో ఉన్న ఆసక్తి సిమ్లా థియేటర్ వైపు నడిచేట్టు చేసింది. ‘రామ్‌లీలా’ నాటకం. ఆ నాటకంలో సీత పాత్ర. పాత్ర ఏదైతేనేం.. నటించటం ముఖ్యం. అంతే! స్టేజ్‌పై ప్రాణ్ తన నటనకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఆ నాటకంలో రాముడికి మదన్‌పురి నటించటం కొసమెరుపు. స్వతహాగా పంజాబీ కావటంతో ‘యమ్లా జత్’ అనే పంజాబీ చిత్రంలో విలన్‌గా చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. 1940-44 ప్రాంతంలో విలన్‌గా పంజాబీ చిత్రాల్లో ప్రాణ్ ఒక వెలుగు వెలిగాడు. 1942లో ‘ఖాన్‌దాన్’ అనే హిందీ చిత్రంతో తన కెరీర్‌ని హీరోగా మొదలుపెట్టాడు. ఆ చిత్రంలో పాకిస్తానీ గాయని నూర్జహాన్ హీరోయిన్. 1942 - 1946 మధ్య 21 పంజాబీ చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన ప్రాణ్‌కి దేశ విభజన అవరోధంగా నిలిచింది. దాంతో పంజాబీ చిత్రాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయాడు.
నటుడిగా స్థిరపడటానికి ముంబై చేరాడు. ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్నాడు. మొదటిగా తాజ్‌మహల్ హోటల్‌లో బస చేసిన ప్రాణ్ - ఇటు పని అటు మనీ రెండూ లేకపోవటంతో ఆఖరికి చిన్న హోటల్‌కి మారాడు. అక్కడ్నుంచీ తెలిసిన వాళ్ల గెస్ట్ హౌస్‌లో. 1954లో సెంట్రల్ ముంబైలోని పాలీ హిల్స్ అపార్ట్‌మెంట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లోకి మారాడు. హిందీ చిత్రాల్లో అవకాశాలు అంత తేలిగ్గా దొరకలేదు. ఫొటోగ్రాఫర్‌గా నెలసరి 200 రూపాయల ఆదాయం కాస్తా పోయి.. పదుల సంఖ్య రాబడిలో పడ్డాడు. ఐనా తనదైన నటనను వదులుకో దల్చుకోలేదు. అదే అతణ్ణి చివరి వరకూ నిలిపింది. ఒక ఇంటర్వ్యూలో ‘వచ్చే జన్మలో ఏం కావాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నిస్తే - ‘ప్రాణ్‌గా నా జీవితం ఎంతో సంతృప్తికరంగా సాగింది. జీవితంలోని వొడిదుడుకుల్నీ.. కష్టసుఖాల్నీ.. అన్నింటినీ అనుభవించాను. రూపాయి కోసం వెతికిన సందర్భాలున్నాయి. లక్షల కొద్దీ రెమ్యునరేషన్ అందుకున్న రోజులూ ఉన్నాయి. వచ్చే జన్మలో కూడా ‘ప్రాణ్’గానే పుట్టాలనుకుంటా. నటుడిగా జీవించాలనుకుంటా’ అంటాడు. అదీ నటన పట్ల ప్రాణ్‌కున్న సిన్సియారిటీ.
1948లో ‘జిద్దీ’ చిత్రంతో ప్రాణ్ విలన్‌గా అవతరించాడు. విలన్‌గా, కేరెక్టర్ యాక్టర్‌గా, హాస్య నటుడిగా 350 పైగా చిత్రాల్లో నటించి విలన్‌గా ఎదురులేని మనిషి అనిపించుకున్నాడు. నిన్నటి తరానికి ప్రాణ్ గురించి చెప్పనక్కర్లేదుగానీ.. ‘షేర్‌ఖాన్’ అంటే రేపటి యువతకి కూడా గుర్తుండిపోయే నటనను అందించి - బాలీవుడ్ సినీ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 1968- 1992 మధ్యకాలంలో 13 సినిమాల్లో విలన్‌గా నటించినప్పటికీ.. ఆ తర్వాత్తర్వాత పాజిటివ్ రోల్స్ వేస్తూ వచ్చాడు. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగానూ అతడ్ని ఎవరూ ఇంతవరకూ అధిగమించలేదు. 1969 ప్రాంతంలో రాజేష్‌ఖన్నా పారితోషికాన్ని భరించటానికి నిర్మాతలు కొద్దిగా మొహమాట పడేవారు. అయితే - ప్రాణ్ విషయానికి వస్తే.. లక్షల కొద్దీ కుమ్మరించటానికి సంసిద్ధతను వ్యక్తం చేసేవారంటే అతడిలోని నటనకు ఇంతకంటే ఆనవాళ్లు ఏం కావాలి.
2000లో ‘విలన్ ఆఫ్ ది మిలీనియం’ అంటూ స్టార్‌డస్ట్ ప్రకటించటం.. ఆ తర్వాత పద్మభూషణ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఇలాంటి పురస్కారాలెన్నో ప్రాణ్‌ని వరించాయి. సిఎన్‌ఎన్ టాప్ 25 ఏషియన్ యాక్టర్స్‌లో అతడొకడు. ‘ఖాన్‌దాన్’ ‘పిల్‌పిలి సాహెబ్’ ‘హలకు’ ‘మధుమతి’ ‘ఉప్‌కార్’ ‘షాహీద్’ ‘ఆంసూ బన్ గయే ఫూల్’ ‘జానీ మేరా నామ్’ ‘విక్టోరియా నెం.203’ ‘బే-ఇనామ్’ ‘జంజీర్’ ‘డాన్’ ‘దునియా’ ఇలా చెప్పుకున్న కొద్దీ అతడి హిట్‌లిస్ట్ ఎంతో.
చదువు మెట్రిక్యులేషన్‌తో ఆగిపోయింది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా అతడి కెరీర్ అర్థంతరంగా ముగిసింది. ప్రాణ్‌ని నటుడిగా చూట్టం తండ్రికి ఇష్టం లేదు. ఆయనకు మల్లే ఇంజనీర్‌గానో.. పైస్థాయి అధికారిగానో చూడాలనుకున్నారు. కానీ ఇవేవీ ప్రాణ్‌కి వొంటబట్టలేదు. ఆఖరికి నటుడిగా ఎదుగుతున్న రోజుల్లో - మొదటి ఇంటర్వ్యూ వార్తాపత్రికల్లో రావటం తండ్రి ఎక్కడ చూస్తాడోనని.. పత్రికల్ని దాచేయమని అక్కలకు పురమాయించాట్ట. ఆ తర్వాత్తర్వాత తండ్రి అర్థం చేసుకోవటంతో పరిస్థితి కాస్తంత సద్దుమణిగింది. ఒక్కోసారి అనుకోని సంఘటనలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ప్రాణ్ జీవితంలోనూ అలాంటి ఘట్టం ఒకటి. ఓ రోజు లాహోర్‌లోని హీరా మండీ అనే షాప్‌కి వెళ్లాడు. అక్కడ ఏదో కొంటూండగా.. రచయిత వలీ మహమ్మద్ వలీ అతణ్ణి చూట్టం.. అప్పటికే వలీ దల్‌సుఖ్ ఎం.పంచోలీ చిత్రానికి పని చేస్తూండటంతో - అతడికి కావలసిన నటుడు దొరికినట్టయింది. ‘ఏం బాబూ లడ్డూ కావాలా?’ అన్నట్టు.. ప్రాణ్‌ని వలీ అడిగాడు. అదే ‘యమ్లా జత్7 చిత్రం. మోతీ బి.గిద్వాన్ దర్శకత్వంలో నిర్మితమైన ఆ చిత్రంలో నూర్జహాన్, దుర్గాఖోటే లాంటి ప్రముఖులు నటించారు. నూర్జహాన్‌కీ.. ప్రాణ్‌కీ మధ్య పదిహేనేళ్ల వయసు తేడా ఉండటంతో ‘ఖాన్‌దాన్’ చిత్రంలో కొన్ని క్లోజప్ షాట్స్ తీయటానికి నూర్జహాన్‌ని ఎతె్తైన ఇటుకల మీద నిలబెట్టార్ట. ఇలాంటి సంఘటనలతో అతడు ఎదుగుతూ వచ్చాడు. ఎనె్నన్నో మజిలీలు దాటుకొని మరిన్ని పురస్కారాలను అందుకున్నాడు.
‘షేర్‌ఖాన్’ అంటే ‘ప్రాణ్’ ‘ప్రాణ్’ అంటే షేర్‌ఖాన్ అన్నట్టు అంతగా ఆ పాత్రలో లీనమై నటించి.. ఎవరికీ తెలీని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ జ్ఞాపకాలను మదిలో తొలుస్తూండగానే.
*

చూపుల్లో కర్కశత్వం.. మాటల్లో కరకుదనం..
english title: 
pan

బలి తీసుకున్న బడిభోజనం!

$
0
0

క్రూరమైన నిర్లక్ష్యం కోరలు కరకరమని నమిలి మింగిన దారుణ మారణ ధ్వనులు మానవత్వం మచ్చుకైనా మిగిలిన ప్రతిహృదయాన్ని కలచివేస్తున్నాయి! ఇరవై ఇద్దరు చంటిపిల్లలు ఈ క్రూరమైన నిర్లక్ష్యానికి బలైపోయారు. మొగ్గలుగానే రాలిపోయారు. నిజాలను నిగ్గు తేల్చడానికి నడుములను బిగించిన అధికార రాజకీయ నాయకుల గుండెలలో మానవత్వం మచ్చుకైనా మిగిలి లేదన్నది విషంగా మారిన బడి భోజనం ఆవిష్కరించిన వికృత విషాద వాస్తవం. బీహార్‌లోని శరణ్ జిల్లా చప్రా గ్రామంలోని ధర్మసతి గందావన్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం ఈ విషాన్ని తినవలసి వచ్చిన విద్యార్థులను హత్య చేసింది ఘోరమైన నిర్లక్ష్యం మాత్రమే. ఈ నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వ మానవశక్తి వనరుల మంత్రిత్వ కార్యాలయం నుండి దేశంలోని అన్ని బడుల ప్రాంగణాల వరకు రాష్ట్ర ప్రభుత్వాల సచివాలయాల నుండి బడుల వంట స్థలాల వరకు దశాబ్దులుగా వ్యాపించిపోయింది. సోయాబీన్స్ కూర ‘‘బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్ర’’- ఇరవై ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొన్న బడి భోజనం విషపూరితం కావడానికి ఏది కారణం కావచ్చునన్న చర్చ మొదలైపోయింది. రెండూ కారణాలు కావచ్చు. అంటే బీహార్‌లోని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ఐక్య జనతాదళ్ పార్టీని అప్రతిష్ఠపాలు చేయదలచిన వారు నిర్దాక్షిణ్యంగా ఈ హత్యలు చేయించి ఉండవచ్చునట. లేదా కాలుష్య జీవరసాయనాలతో విషపూరితమైన సోయా చిక్కుడు గింజలను సరఫరా చేసిన వారు బడిపిల్లల బతుకులను నిర్లక్ష్యంగా చంపి ఉండవచ్చు. బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయగలవారెవరు? కూల్చడానికో, అప్రతిష్ఠను ఆపాదించడానికో యత్నిస్తున్న వీరు ఇలా బడి భోజనంలో, రాజకీయాలతోకాని, లౌకిక దౌష్ట్యంతోకాని సంబం ధం లేని పసికందులు తినే మధ్యాహ్న భోజనంలో విషం కలిపే రాక్షసత్వానికి పూనుకున్నారా? పూనుకున్నారని బీహార్ విద్యామంత్రి పీకే సాహీ ఆరోపించడం ఈ విషాద సంఘటనకు సంబంధించిన అతిఘోరమైన నిర్లక్ష్యం. దశాబ్దుల పాటు దేశంలోని అన్ని పాఠశాలలోని వంటశాలల్లో సభలు తీరిన నిర్లక్ష్యం ఫలితం ఈ పసిపాపలు, బాలలు బలైపోవడం... కానీ నిర్లక్ష్యానికి సైతం రాజకీయ రంగు పులిమి సానుభూతి సంపాదించగలుగుతున్న వారు కుట్ర జరిగిందని చెబుతున్న సిద్ధాంతవాదులు నిర్లక్ష్యానికి నిజమైన రూపాలు. పిల్లలను కోల్పోయి తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులను ఓదార్చడం మాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకులు ప్రతిపక్షాల వారు పరస్పరం నిందించుకుంటూ ఉండటం మానవత్వాన్ని అపహాస్యం పాలు చేస్తున్న మాలిన్యం.
ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయదలచినవారు ఇలా ఒక బడిలో పిల్లలు తినే తిండిలో విషం కలపరు. ఎందుకంటె అలాంటి రాక్షస చర్యవల్ల పిల్లలు అకాల మృత్యుగ్రస్తులవుతారు తప్ప ప్రభుత్వానికి కొత్తగా వచ్చే చెడ్డపేరు ఉండదు. అందువల్ల కుట్ర జరినట్టు ముందు వెనకల ఆలోచించకుండా ఆరోపించడం నైతిక నిర్లక్ష్యం. ఒకవేళ రాజకీయ లాభాలకోసం ముక్కుపచ్చలారని ముద్దుపాపలను చంపడానికి సైతం వెనుదీయని మానవరూప పిశాచాలు ఉన్నట్టయితే వాటిని నాయయస్థానం ముందు నిలబెట్టి ఉరికంబమెక్కించాలి. కానీ ఎలాంటి ఆధారలు లేకుండానే బీహార్ మంత్రి కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. నిజాన్ని దర్యాప్తు సంస్థల వారు పరిశోధించి కనిపెడతారని మళ్ళీ ఆయనే చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు కనిపెట్టే వరకూ ఎందుకని ఆగలేదు? మధ్యాహ్నం పనె్నండున్నర గంటలకు కలుషితాహారం తిన్న వెంటనే పిల్లలు తీవ్రంగా అస్వస్థులయ్యారు. వారికి చికిత్స కోసం తరలించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు కాని మంది కాని లేకపోవడం వల్ల ఎక్కువ మంది చిన్నారులు అసువులు బాసారు. మిగిలిన వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వైద్య శకటాలు లేవు. అందువల్ల బస్సుల్లో పిల్లలను కుక్కి జిల్లా కేంద్రానికి తీసుకుపోయారు. మధ్యలో ఈ బస్సుకు సాంకేతిక లోపం ఏర్పడి కూలబడిందట. ఆ తరువాత జిల్లా వైద్యాలయంలో కూడ సరైన చికిత్సా సదుపాయాలు లేని కారణంగా అస్వస్థ అర్భకులను పాట్నాకు తరలించవలసి వచ్చిందట. మధ్యాహ్న భోజనం కాలుష్యగ్రస్తం కావడానికి అవకాశం ఉన్నట్టు దేశమంతటా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటె ఈ పథకం ‘అధ్వాన్న భోజనం’గా మారిపోయి చాలా ఏళ్ళయింది. కానీ ప్రాణాపాయం ఏర్పడే సమయంలో కాపాడే వైద్య వ్యవస్థ సుదూర ప్రాంతంలో కానీ లేదు. ఇదంతా ఒకనాటి నిర్లక్ష్యం కాదు. విషం తిన్న బుడుతలకు సాయంత్రం ఆరున్నర గంటలకు కాని వైద్య చికిత్స జరగలేదు... నిర్లక్ష్య వాటికలో నిజం నడుం విరిగి పడివుంది.
బడి పంతుళ్ళకు, పంతులమ్మలకు వంట వారికి వడ్డించే వారికి కూడ మధ్యాహ్న భోజన గ్రస్తులంటే సహజంగానే మంట. ఈ మంటకు కారణం ఈ పథకం పట్ల తమకు అదనంగా లభించే ఆర్థిక ప్రయోజనం లేకపోవడం. వంట చేసి వడ్డించే వారికి కూడ జీతాలు చాలవు. అందువల్ల మధ్యాహ్న భోజన సామగ్రిలో కొంత తస్కరించడం మామూలైంది. హెడ్‌మాస్టర్లు సైతం తమ ఇళ్ళలో అందరికీ సరిపడా భోజనాన్ని క్యారియర్లలో పెట్టి తీసుకెళ్ళిన, వెడుతున్న ఉదంతాలు వెలుగు చూశాయి. జరుగుతున్న ఆర్భాటానికి దీటుగా పౌష్టిక భోజనం పెట్టడానికి నిధులు చాలవు. రోజూ బియ్యానికి రూపా యి, మిగిలిన తతంగానికి- కూరలు, కుంపట్ల సహా- రెండు రూపాయల చొప్పు న ప్రతి విద్యార్థికీ మంజూరయినప్పుడు శుచిగా పుష్టిగా భోజనం ఎలా తయారవుతుంది? అందులోనే అవినీతిపరులు కొంత కాజేస్తున్నారు. ఈ సంగతులు తెలిసిన ప్రభువులు నిధులను పెంచకపోవడం కొనసాగుతున్న నిర్లక్ష్యం. ఇప్పుడు బీహార్‌లో జరిగిన ఘటన మొదటిది కాదు. దేశమంతటా వందలాది పాఠశాలల్లో ఇలా భోజన కాలుష్యం ఏర్పడిపోవడం దశాబ్దుల కథ. మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోను, అనంతపురం జిల్లాలోను, గత నెలలో ఈ నెలలో మధ్యాహ్న భోజనం కలుషితమైన ఉదంతాలు బయటపడ్డాయి. ఇప్పుడు ధర్మశతి పాఠశాలలో విషాహారం ఘటన జరిగిన మరునాడే బీహార్‌లోని మధువని జిల్లాలో మరో యాబయిమంది పిల్లలకు ‘మధ్యాహ్న’ కాలుష్యం సోకిందట. ఘటనలు జరిగిన తరువాత మాత్రమే మేలుకుంటున్న రాజకీయవేత్తలకు అధికారుల నిర్లక్ష్యానికి ఇంతకంటె నిదర్శనం ఎందుకు?
ధర్మశతి పాఠశాలలో భోజనం వడ్డించగానే రుచి చూసిన పిల్లలు ఒక్కొక్కరుగా విచిత్రమైన వికారమైన వాసన గురించి, రుచి గురించి ఫిర్యాదు చేశారట. కానీ ‘‘మీరంతే...మీకు రుచించదు...ఉత్తిగా వస్తోంది కాబట్టి ఈ తిండి అలుసైపోయింది’’-ఇలాంటి దీవెనలతో పెద్దపంతులమ్మ పిల్లలను తిట్టిపోసిందట. అందువల్ల ఆ పిల్లలు ఆ తిండిని కుక్కుకున్నారట. కొందరు పిల్లలు పడిపోయిన తరువాత ఆనుమానించిన వంటలక్క సోయా చిక్కుడు కూర రుచి చూసిందట. అమె కూడా అస్వస్థురాలై పడిపోయిందట. ఈ పదార్ధపరంపరను సరఫరా చేసే కిరాణకొట్టువాడు పెద్ద పంతులమ్మ మీనాదేవి మొగుడట. ఆయన అమ్మిన సోయాచిక్కుడు విత్తనాలు ఎక్కడివి? దిగుమతి అయినవా? లేక అక్కడనే పండినవా? దిగుమతి అవుతున్న చిక్కుడు గింజలలో బిటి రసాయన విషం ఉందని ఏళ్ళ క్రితమే బయటపడింది!

సంపాదకీయం
english title: 
editorial

‘సుప్రీం’ తీర్పు పార్టీలను కదిలిస్తుందా?

$
0
0

మన న్యాయవ్యవస్థ రెండు ప్రతిస్పందనల్లో ఒకదాన్ని ఉపాయంగా రాబడుతుంటుంది. ఇది సాధారణంగా జరిగే విషయం. వీటిల్లో మొదటిది మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడేది కాగా, రెండవది సరీగ్గా దీనికి వ్యతిరేకం. సుప్రీంకోర్టు ఇటువంటి వ్యవహారశైలిపై అన్ని రాజకీయ పార్టీలదీ ఒకే బాణి. సుప్రీంకోర్టు తన ఆదేశాల పరిధిని అతిక్రమిస్తున్నదని, కార్యనిర్వాహక వ్యవస్థలోకి తరచుగా చొరబడుతున్నదని అవి ఆరోపిస్తుంటాయి. అధికార, విపక్ష పార్టీలనే భేదం లేకుండా సుప్రీంకోర్టును విమర్శించడంలో ఏకతాటిపై నిలుస్తాయి. అయితే ప్రభుత్వం ఆవిధంగా వ్యాఖ్యానించినప్పటికీ, తరచుగా విశే్లషకులు, వ్యాఖ్యాతలు కోర్టులు తమ పరిధిని అతిక్రమించి, కార్యనిర్వాక వ్యవస్థలోకి చొరబడటాన్ని తప్పు పడుతుండడం వర్తమాన చరిత్ర.
ఎన్నికైన ప్రజాప్రతినిధిపై నేరం రుజువైననాటినుంచే తన పదవిని కోల్పోవలసి ఉంటుందంటూ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై, ఈసారి అంత వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం విశేషమే. బహుశా మనమందరం ఇదే కోర్టు తీర్పుకోసం ఎదురుచూడటం...ఆ తీర్పే మన దేశంలో చట్టంగా రూపొందాలని బహుశా కోరుకొని ఉండటమే అందుకు కారణం కావచ్చు. అయతే అనుకున్నట్టు రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపో వడం విశేషమే. ఇక దేశ ప్రజల మనస్థితిని గుర్తించిన రాజకీయ పార్టీలు తక్షణమే బహిరంగంగా కోర్టు తీర్పును స్వాగతించాయి! కానీ అంతర్గతంగా అవి తీవ్ర క్షోభను ఎదుర్కొంటున్నాయి. అయితే రాజకీయ పార్టీల వారికి ఊరట కలిగించే అంశమేమంటే.. ఈ తీర్పును గతానికి వర్తింపజేయకుండా, ఇకముందు కాలానికి వర్తింపజేయడమే! నిజంగా దీన్ని గతానికి కూడా అనువర్తింపజేసినట్లయితే, పార్లమెంటులో చాలామంది సభ్యులు తమ పదవులకు నీళ్ళొదులుకోవాల్సి వచ్చేది. అందువల్ల హంతకులు, అత్యాచారానికి పాల్పడ్డవారు, కిడ్నాపర్లు, వివిధ స్కాముల్లో పీకల్లోతు కూరుకుపోయి ఇంకా పార్లమెంటులో, వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఎన్నికై ప్రస్తుతం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారికి ఈ తీర్పు తాత్కాలిక ఊరట కలిగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈ తీర్పు గతంలో తాము చేసిన తప్పులకు వర్తించకపోవడమే కారణం.
మరి ఈ తీర్పు చెప్పిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం, దీన్ని ఎందుకని గతానికి కూడా వర్తింపజేయలేదనే ప్రశ్న ఉదయించడం సహజం, సముచితం కూడా! అందువల్ల కోర్టువారు తమకు తామే ఒక వివరణ ఇచ్చినట్టయితే బాగుండేది. అయితే ఇక్కడ సహజ న్యాయసూత్రాలు ఏం చెబుతున్నాయో ఒక్కసారి పరిశీలించాలి. ఇవ్వాళ ఒక ప్రత్యేక మార్గం లో, నేడు అమల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా వ్యవహరించినప్పుడు...ఆవిధంగా వ్యవహరించడం తప్పని రేపు తీర్పు వెలువడితే, దాన్ని నేటికి వర్తింపజేయడం సముచితం కాదని సహజ న్యాయసూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది న్యాయమే అయినప్పటికీ, నేడు ఎవరినుద్దేశించి ఈ తీర్పును వాంఛించామో, ఆ వ్యక్తులు ప్రస్తు తం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం కూడా దారుణమైన నేరాలకు పాల్పడినవారే. అందువల్ల ప్రస్తుత తీర్పు గతానికి వర్తింపజేసినా, ఈ నేరగాళ్ళు, సహజ న్యాయ సూత్రాలను అణగదొక్కారని వాదించడానికి ఎట్టిపరిస్థితుల్లో వీలుండదు. అందువల్ల కోర్టు ఈ తీర్పును గతానికి వర్తింపజేసే విధంగా వెలువరించినట్లయితే, తక్షణమే అమల్లోకి వచ్చేది. అంతేకాదు ఇప్పటికే నేరస్థులుగా కోర్టులు నిర్ధారించినవారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాల్సివచ్చేది. అంతేకాదు తమపై కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని చెబుతూ, ప్రస్తుత చట్టంలోని లొసుగులను అవకాశంగా తీసుకొని తమ పదవుల్లో కొనసాగడానికి ఏమాత్రం సాధ్యమయ్యేది కాదు.
ఈ నేపథ్యంలో తెలిసో తెలియకో మన న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న విపరీతమైన జాప్యం.. ఇటువంటి నేరగాళ్ళని ప్రోత్సహించినట్లవుతోంది. అందువల్ల న్యాయవ్యవస్థ తనకు తెలియకుండానే, రాజకీయ వ్యస్థను నేరపూరితంగా మార్చడంలో సహాయపడుతున్నట్టవుతోంది. అందువల్ల న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న దురదృష్టకరమైన జాప్యాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడంలో భాగంగానే సుప్రీంకోర్టు చాలా వేగంగా ఈ కేసును పరిష్కరించి తీర్పు చెప్పిందని భావించినా, దీన్ని నైతిక విజయమంటూ దండోరా వేయడానికి మనం ఏమాత్రం ఇష్టపడం.
ఎందుకంటే వాస్తవిక పరిస్థితులు న్యాయమూర్తులపై ప్రభావాన్ని చూపి ఉండవచ్చు. ఈ గణాంకాలను పరిశీలిస్తే వాస్తవిక పరిస్థితి పూర్తి అవగాహనకు వస్తుంది. లోక్ సభలో 30శాతం (మొత్తం 543 మంది ఎంపీలలో 162 మంది) మందికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీటిల్లో 14శాతం కేసులు అత్యంత తీవ్రమైనవి. అంటే హత్య, రేప్, దోపిడీ వంటి నేరాలు! ఇక రాష్ట్రాల అసెంబ్లీలను పరిశీలిస్తే..పరిస్థితి పెద్ద మెరుగ్గా ఏమీ లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం అసెంబ్లీల్లో 1258 మంది ఎమ్మెల్యేలు నేరచరితులు. అంటే మొత్తం ఎమ్మెల్యేల్లో వీరు 31శాతం వరకు ఉన్నారు. లోక్‌సభ సభ్యుల్లో మాదిరిగానే 14 శాతం కేసులు చాలా తీవ్రమైనవి.
పార్లమెంటు, శాసనసభల్లో నేరస్థుల విషయంలో మనకు కనిపిస్తున్న ఈ సారూప్యత కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు వివిధ వర్గాల వారికి రిజర్వేషన్లు అమలు జరుపుతున్నాయి. అదేవిధంగా నేర చరితులకు కూడా కొంత శాతం రిజర్వేషన్లు కల్పించాయా అనే అనుమానం తప్పక కలిగితీరుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గతానికి కూడా వర్తింపజేసినట్టయితే పరిస్థితి ఎట్లా ఉండేదన్న అంశంపై తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే చట్టసభల్లో నేరచరితులుగా ఉన్నవారిలో దాదాపు మెజారిటీ సభ్యులపై దిగువ కోర్టులు నేరాన్ని నిర్ధారించాయి. ఈ కేసులన్నీ ప్రస్తుతం పైకోర్టుల్లో అప్పీలు చేయడం వల్ల, విచారణలో కొనసాగుతున్నాయి. అందువల్ల ప్రసుత తీర్పు వర్తింపజేస్తే, చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులను కోల్పోవడం ఖాయం. అప్పుడు ముప్పయిశాతం సీట్లు ఖాళీ అవుతాయి. తర్వాత దేశం ఎదుర్కొనేది ఉప ఎన్నికలు కాదు..మినీ సాధారణ ఎన్నికలు! దేశంలోని పెద్ద పార్టీలనుంచి చిన్నా చితకా పార్టీల వరకు.. నేరచరితులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారనేది నిష్టుర సత్యం. రాజకీయాల్లో నైతికత్వం గురించి అతిపెద్దగా గొంతు చించుకొని మరీ ఆర్భాటించేది భారతీయ జనతాపార్టీ. మరి నేర చరితుల విషయంలో కాంగ్రెస్‌ను మించిపోయింది మరి! ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో 38శాతం మంది నేరచరితులే! అదే కాంగ్రెస్‌లో మాత్రం 21శాతం! ఈ గణాంకాలు పరిశీలించినప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులు ఆనందంతో నృత్యం చేయాలి మరి! కానీ భాజపాతో పోలిస్తే తక్కువ సంఖ్యలో నేరచరితులున్నప్పటికీ, 21శాతం మంది క్రిమినల్స్ పార్టీలో ఉన్నారంటే వారి సంఖ్య చాలా ఎక్కువేనని చెప్పాలి.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అనే సంస్థ వారు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను ఇచ్చారు. శివసేన, రాజ్‌థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, శిబూ సొరేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, తెలంగాణ రాష్టస్రమితి వంటి ప్రాంతీయ పార్టీల్లో నేర చరితుల సంఖ్య అధికంగా ఉన్నటు తెలుస్తోంది. వీరిలో కూడా శివసేన 77శాతం, జెఎంఎం 80శాతం మంది క్రిమినల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక అఖిలభారత అన్నా డిఎంకె పార్టీలో 44శాతం మంది కళంకితులైన ఎమ్మెల్యేలున్నారు. ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే కళంకితుల గణాంకాలు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. రాష్ట్రాల్లో కర్ణాటకదే ఆగ్రతాంబూలం. ఇక్కడ 74శాతం మంది కళంకితులున్నారు. మరి వెనుకబడ్డ రాష్ట్రం బీహార్‌లో 58శాతం మంది నేర చరితులు. ఉత్తరప్రదేశ్‌లో 47శాతం ఉండగా, అత్యం త అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని చెప్పుకుంటున్న నరేంద్రమోడి నేతృత్వలోని గుజరాత్‌లో 57శాతం మంది ఎంపిలు, 31 శాతం మంది ఎమ్మెల్యేల చరిత్ర నేరపూరితమే. ఇది జాతీయ సగటుతో సమానం!
తీర్పు విస్తృతిలో కొన్ని సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా అది అతిముఖ్యమైంది కూడా! దిగువ కోర్టు ఒక రాజకీవేత్తను నేరస్థుడిగా నిర్ధారించిన తర్వాత.. ఆయన పైకోర్టుకు అప్పీలు చేసుకుంటే, నిర్దోషిగా విముక్తుడవుతాడా? ఒకవేళ ఆవిధంగా విముక్తుడైతే పరిస్థితేంటి? దిగువకోర్టు తీర్పు ప్రకారం రాజీనామా చేయడం, పైకోర్టు క్లీన్‌చీట్ ఇచ్చింది కనుక, అప్పటికే ఆయనను తొలగించిన స్థానంలోనే ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చా? దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు ఇటువంటి సమస్యలకు తక్షణమే పరిష్కారాలు కనుగొనాలి. నేటి రాజకీయాల్లో, సీటు గెలవడమే ముఖ్యం. అందువల్ల క్రిమినల్స్‌కు కూడా టికెట్లు లభిస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ తమ ప్రత్యర్థి పార్టీని ఉదాహరణగా చూపుతూ పోటీ పడి గెలుపు గుర్రాల పేరుతో నేరచరితులకు టిక్కెట్లు ఇస్తున్నాయి. ఎదుటివారు చేసే తప్పును నేను కూడా చేస్తే తప్పేంటన్న దృక్పథం అన్ని పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ తాము కూడా అదేమార్గాన్ని అనుసరించకపోతే అధికారం దక్కదన్న భయం వెన్నా డటమే అందుకు కారణం.
ప్రస్తుత సుప్రీంకోర్టు తీర్పు, అటువంటి రాజకీయ పార్టీలన్నింటికి ఒక అవకాశాన్ని కల్పించింది. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, ప్రస్తుతం ఉన్న ప్రతిష్ఠంభనను తొలగించడానికి వారికి ఇది చక్కటి అవకాశం. రాజకీయ పార్టీలు ఈ తీర్పును జాగ్రత్తగా గ్రహించకపోతే అంతకు మించిన నేరం మరోటుండబోదు. మరి ఈ తీర్పు ప్రభావం రాజకీయ పార్టీలపై ఏవిధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.

ఫీచర్
english title: 
supreme court
author: 
-అనీల్ ధర్కర్

అనాయాస ఆర్థిక అవినీతి

$
0
0

జీవితాంతం శ్రమిస్తూ, నీతిగా నిక్కచ్చిగా సంపాదిస్తే ‘‘అవ్వ వడికిన నూలు తాత మొలతాడుకు సరిపోయిందనే’’ సామెత సామాన్య మధ్యతరగతి, కార్మికులు, వ్యవసాయ కూలీలు, కాయకష్టం చేసే శ్రమజీవులకు వర్తిస్తుంది. డబ్బు సంపాదన జీవిత గమనానికి అవసరమే. అవసరానికంటే ఎక్కువ ఆర్జించి ప్రోదిచేసుకోవడం ఆర్థిక వ్యభిచారమని... గాంధీజీ ఒకచోట వ్యాఖ్యానించారు. సులభార్జన పట్ల మక్కువ జోరెత్తుతుండటంతో విద్యార్థులు, యువతరమే ప్రధాన లక్ష్యంగా క్రికెట్ బెట్టింగ్‌లు, జూదం గ్యాంబ్లింగ్ నిర్వహణలతో, అనూహ్య లబ్దిని ఆశచూపి టోకున టోపీ పెట్టే మోసకారి సంస్థల దగాకు ప్రజలు నిలువెత్తునా మునిగిపోతున్నారు.
రాష్ట్ర రాజధానిలో బెట్టింగ్ దందా నెరపుతున్న అంతరాష్ట్ర ముఠా ఒకటి ఇటీవల పోలీసుల వలలో చిక్కడం బెట్టింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉందనే ఋజువు లభించింది. అయిదేళ్ళ క్రితం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జైపూర్‌లో ఐపీఎల్ పోటీ ఆరంభం కావడానికి ముందు కోల్‌కత్తాలో అంతరాష్ట్ర బెట్టింగ్ ముఠా పట్టుబడడం గగ్గోలు పుట్టించింది. అప్పట్లో వారివద్ద నుంచి మొబైల్ ఫోన్లు, స్కోర్ షీట్లు, వివిధ ప్రాంతాల వ్యక్తులతో ఫోన్ సంభాషణల్ని నమోదుచేసే యంత్ర పరికరాలు దొరకడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం భాగ్యనగరానికి అలాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవస్థ వ్యాపించిందని గచ్చిబౌలీ ముఠా ఉదంతం నిరూపిస్తోంది. రాష్ట్ర రాజధానిలోనే కాకుండా గుడివాడ, రేపల్లె, హిందూపురం, తాడిపత్రి, ధర్మవరం, చిత్తూరు, వాటికి అనుబంధాలైన మున్సిపాలిటీలు, చిన్న పట్టణాలలో సైతం బెట్టింగ్ భూతం ఆవహించి బెట్టింగ్ భూతాలా నర్తనలు మిన్నుముట్టాయి. అందినకాడికి అడపా దడపా, పోలీసులకు అడ్డగా చిక్కిపోయారు. అంతేకాకుండా ప్రధాన నగర శివార్లలోని రిసార్టులు, డాబాలు, మద్యశాలలు భారీ తెరపై క్రికెట్ వీక్షణాల మాటున లక్షలకు లక్షలు చేతులు మారుతున్నాయి.
ముంబై, దుబాయ్‌లకు చెందిన బడా ముఠాల కనుసన్నల్లో పనిచేసే బుకీలు, వారి మనుషులు జిల్లాల వారిగా తమ వ్యాపారాన్ని చాపకింద నీరులా విస్తరించుకుపోతున్నట్లు కథనాలు, విశే్లషణలు చాటుతున్నాయి. కోట్ల రూపాయల స్థాయికి ఎగబాకిన బెట్టింగ్‌లో క్రీడాకారులకు ప్రమేయం ఉండబోదన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేమంటూ జస్టిస్ చంద్రచూడ్ కమిటీ పేర్కొన్న విషయాల్ని కొట్టిపారేయలేనివే. కృష్ణా జిల్లాలో పోలీసు యంత్రాంగానికి లక్షల రూపాయల నెలవారి ముడుపుల్ని ముట్టజెప్పి యదేచ్ఛగా సాగించిన సింగిల్ నెంబరు లాటరీ భాగోతం సమాజంలో జూదప్రక్రియకు అద్దం పట్టేదే. అంతేకాకుండా వివిధ జిల్లాలలో లాటరీ టికెట్లు నేరుగా అందజేయకుండా నెంబర్లను మాత్రం లాటరీ జూదరులకు అందజేసే వినూత్న ప్రక్రియ కార్మిక, మధ్యతరగతి, బీదల కుటుంబాల్ని నట్టేట ముంచుతోంది. ఈ ప్రక్రియతో లాటరీలు నిర్వహిస్తున్నారని ఆయా పట్టణాలలోని స్థానిక పోలీసులకు తెలిసినా ముడు పులు స్వీకరించడం వల్ల నోరు మెదపడంలేదు.
నగరాలు, పట్టణాలలో గంజాయి, హెరాయిన్ విచ్చలవిడిగా లభ్యమవుతూ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నాయి. చైనా, థాయ్‌లాండ్ లాంటి దేశాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు మరణశిక్షలు అమలు జరుపుతుంటే మన దేశంలో నిక్షేపంగా అక్రమ రవాణా, విక్రయాలు పెద్దఎత్తున సాగిస్తూ లాభార్జన బాటలో నిక్షేపంగా మనగలుగుతున్నారు. దేశంలో ఎటువంటి ఆర్థిక నేరాలు, కుంభకోణాలు పునరావృత్తం కాకుండా ఉండటానికి వెనువెంటనే బాధ్యుల్ని గుర్తించి శిక్షించాలని, వ్యవస్థాపరమైన లోటుపాట్లను తక్షణం పరిహరించాలని డాక్టర్ రంగరాజన్ కమిటీ ఏనాడో సిఫార్సుచేసింది. వ్యసనాలను ఆర్థిక వనరులుగా మలచుకోవాలన్న అత్యాశ, మానసిక దౌర్భల్యం మనుషులను పెడదారి పట్టించి అవినీతి ఊబిలోకి లాగుతున్న వైనాన్ని ప్రభుత్వాలు వెంటనే గుర్తించి, అడ్డుకట్టవేయకపోతే సామాజిక పరిణామాలు పెడదారి పట్టి దేశ ప్రగతికి గొడ్డలి పెట్టులా మారుతుంది.

సబ్ ఫీచర్
english title: 
corruption
author: 
- దాసరి కృష్ణారెడ్డి

మంచిదే నడుస్తుంది

$
0
0

‘‘ ‘అంతా మనమంచికే’ అనేది కొందరి ఫిలాసఫీ! జరిగేవన్నీ మంచికని అనుకోవడమే వారి పని ఎందుకయిందంటే- అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ కనుకనే! అసలు అనుకోవడం ఎందుకు? అయ్యేది ఎలాగూ అవుతుందని వదిలేయచ్చు కదా! అంటే కుదరదు మరి. అనుకోకుండా వుండడం కంటే, అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే ప్రయత్నం చేస్తూ, అనుకోనిది జరిగినా-అప్పుడు ‘అంతా మన మంచికే’ అనే ఫిలాసఫీని జీర్ణించుకోవడం, మనిషిని క్రుంగిపోకుండా, దిగమింగుకునేలా చేస్తుంది. ఒకవేళ అదృష్టం బాగుండి- అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందే అనుకో!!- అది ఎలాగూ అనుకున్న మంచికే ఆనంద సంధానమవుతుంది.’’ అన్నాడు రాంబాబు.
‘‘దీనే్న తిరకాసు భాష అంటారు! విషయాన్ని కణుగూమిణుగూ చెప్పకుండా, కర్ర విరగకుండా, పాము చావకుండా ‘సేఫ్‌జోన్’లో వుండడం అంటే ఇది! ఎఫ్ 14 నిబంధనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ తీసుకుని రద్దుచేసారట! 1988నుంచి అటూఇటూ తేలకుండా వున్న ఆ నిబంధనని రద్దుచేయడంతో, హైద్రాబాద్ ఆరవ జోన్‌లోకి రావడమూ, పోలీసు ఉద్యోగాల విషయంలో- స్థానికులే 70 శాతం లాభపడే అవకాశమూ లభించిందిట! ఇది అనుకున్నదే అని కొందరు అనుకోగా, అనుకోనిది అయ్యిందని కొందరనుకున్నారట! నిజంగా ఇది మంచికేనా? అంటే మాత్రం ఎలా ఎవరు నిర్ధారించి చెబుతారు? ఇవాళ ‘హైదరాబాద్’ అన్నది ‘రాష్ట్ర విభజన అంశం’ దగ్గర-కీలకమైన సమస్యగా వుం(టుం)ది. హైదరాబాద్ లేని తెలంగాణ అంటే ‘తల లేని మొండెం’ అని కొందరంటూంటే-, ‘హైదరాబాద్’ నేడు ఒకరి సొత్తుకాదు.
అది అందరిదీ. దాని ఈనాటి అభివృద్ధిలో ఎందరి భాగస్వామ్యమో వుంది. అంచేత అప్పనంగా దానిని ఒక ప్రాంతం వారికి కట్టబెడితే చూస్తూ ఊరుకోలేము’’ అనే వారున్నారు. అలాగే హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనచేస్తున్న వారూ వున్నారు. కొన్నాళ్లపాటు హైదరాబాద్‌ని ఫ్రీజోన్‌గా వదిలేసి, సీమాంధ్రులు ఇతరత్రా తమ ప్రాంతాలను అభివృద్ధిచేసుకున్నాక- హైదరాబాద్‌ని తెలంగాణకు ముఖ్య భాగంగా వుంచేయాలని అంటున్నవారూ వున్నారు! భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు అయిన హైదరాబాదు ఇప్పుడు ‘రోడ్డు మ్యాప్’లో- ఎక్కడ వుండబోతుందన్నది కూడా ఉత్కంఠే’’ అన్నాడు ప్రసాదు.
‘‘ ‘సెంటిమెంట్’తో కూడిన వ్యవహారాలు అనుకుంటున్నప్పుడు, ఇంకో కొత్త ‘సెంటిమెంట్’లో ‘సెంట్’లా పూస్తారొకరు. ముఖ్యమంత్రే స్వయంగా కోర్ కమిటీ ముందు- రాష్ట్ర విభజనకు ఇందిరాగాంధీ వ్యతిరేకం అనీ, ఇందిరమ్మ బాటలో నడుస్తున్నామని పలుకుతున్న అధిష్ఠానం ఆవిడ ఆశయాలు, అభిప్రాయాలు తుంగలోతొక్కి, కొత్తగా నిర్ణయం తీసుకోవడం ఏమేరకు సబబనీ అన్నారట! 1972 డిసెంబర్ 21న ఇందిరాగాంధీ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాన్నీ, నాడు వెల్లడించిన ఆమె సమైక్యతాభావ శంఖాన్నీ ‘కిరణ్’ తాజాగా పూరించారు. ‘అమ్మమాట జవదాటరాదు కదా!’ అని అమ్మ ‘సెంటిమెంట్’ను ముందుకు తెచ్చారు’’. అన్నాడు శంకరం.
‘‘ఈ ‘అమ్మ’లూ ‘బొమ్మ’లూ జాన్తానై! ‘తెలుగుతల్లే’ మా తల్లి కాదు పొమ్మని, ‘తెలంగాణ తల్లి’ అంటూ అమ్మనూ, కొత్త బొమ్మనూ రూపొందించుకున్నాక- ‘అమ్మ’ సెంటిమెంట్ అడ్డుపడుతుందని ఎలా అనుకుంటాం? అఫ్‌కోర్స్! మూలపుటమ్మ చాల పెద్దమ్మ- ‘రాజకీయపు అమ్మ’యేగానీ- ఆ అమ్మ ‘సోనియమ్మే’కదా! సోనియమ్మ ఇందిరమ్మ బాటలో నడవాలని ఆశించినా, ఆవిడ అంతకన్నా త్యాగమూర్తిగా ప్రధాని పదవినే కాదనుకుని, పార్టీ అధ్యక్షురాలిగానే కొనసాగుతూ, కాంగ్రెస్ పూర్వ వైభవానికీ, దేశప్రతిష్ఠతకూ ఓ కంకణం కట్టేసుకున్నట్లు వ్యవహరిస్తోంది కదా! కోర్ కమిటీలూ, ‘బోర్ కమిటీ’లూ ఎన్ని నడిచినా- చివరి తీర్పు సోనియాగారిదే కదా! అత్తలేని కోడలు సోనియా ఉత్తమురాలుగా- అత్తమీది కోపాన్ని కాక, ఇష్టానే్న తెలంగాణ ‘దుత్త’మీద చూపుతుందని భావిస్తున్న వారున్నారు. సి.ఎం.గారు ‘ఇందిరమ్మపై ఆన’ అన్నా- ఆనక ‘అధిష్ఠానం’ ఏ నిర్ణయం తీసుకున్నా, శిరోధార్యమనక తప్పదు! ‘తెలంగాణ విభజన’అన్న విషయంపైనే సమైక్యవాదం వినబడాలి ఇప్పుడు. కుడికి ఒకడూ, ఎడమకు ఒకడూ, ఎగువకు ఒకడూ, దిగువకు ఒకడూ లాగుతూంటే- ‘దిగ్విజయ్’గా ఏకాభిప్రాయ సూత్రతకు కట్టడం ఈజీ కాదు.’’ అన్నాడు ప్రసాదు.
‘‘ఏ కాలానికయినా అత్యుత్తమమైనది కావాలి. ‘మంచిదే నడుస్తుంది’. మంచికానిది నడచినట్లు కనబడుతున్నా, ఎక్కడో కుంటుపడుతుంది. ‘నడవడం’అంటే- నడవడమే! అది చేతి కర్రతో, స్టాండ్‌తో నడుస్తూంటేనూ, వీల్‌ఛైర్‌లో గమనిస్తూంటేనూ, ఆ గమనాన్ని ‘నడక’అనలేం! ఏదో విధంగా ‘నడక’కాదు. సహజమైన ‘నడక’కావాలి. ‘నడక’ మంచిది. అది పరుగుగా మారనక్కరలేదు. ఎటొచ్చీ ‘తప్ప’టడుగులతోనూ, ‘తప్పు’టడుగులతోనూ కారాదంతే! ఇప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ప్రభుత్వాలు నడుస్తున్నాయా అంటే- వాటిని ‘నడక’లుగా విశ్వసించలేని స్థితి వచ్చేసింది! ‘చతికిల’బడే తీరులూ,‘చచ్చుబడే’ తీరులూ కూడా పొడచూపుతున్నాయంటున్నవారున్నారు. ‘నీ అడుగు లోన అడుగువేసి నడువనీ, నన్ను నడువనీ’అన్నట్లుగా- ఈ నడకలోనే భాగస్వామ్యం వహిస్తున్నవీ, వహించాలని తపన పడుతున్నవీ పార్టీలున్నాయి. ‘‘ఇది నడకే కాదు. ఇలా నడిస్తే కాళ్ళిరగ్గొడతాం’ అని బెదిరిస్తున్నవీ వున్నాయి! ‘జరిగేవన్నీ మంచికనే’ ఫిలాసఫీయే ‘మంచిదే నడుస్తుంది’అనే భావి విశ్వాసాన్ని కలిగిస్తుంది. అంచేత- జంకుకొంకు లేక... ‘ఒకడవె పదవోయ్!’..అన్న గీతమే వినిపిస్తూంది.’’ అంటూ లేచాడు రాంబాబు.

సంసారాలు
english title: 
samsaralu

పతనావస్థలో పాఠశాల విద్య

$
0
0

పాలకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆధీనంలోని విద్యారంగంలో ప్రమాణాలు అంతకంతకూ పతనమవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నా చట్టాలమీద చట్టాలు తెస్తున్నా లక్ష్యానికి చేరువకాలేకపోతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి అందరికీ విద్యనందించాలనే ఆశయంతో విద్యా హక్కు చట్టాన్ని అమలుచేస్తున్నామని చెప్పుకుంటున్నా ఆశించిన ఫలితాలు కనబడటంలేదు. ఎన్ని చేసినా విద్య అందని అంగడి సరుకుగా మారిపోయింది. ఉన్న వారికి నాణ్యమైన విద్య, లేని వారికి నాసి రకం విద్య అన్నట్లుగా తయారైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. చాలీచాలని వసతులు కూర్చునేందుకు బల్లలు లేని పరిస్థితి. మరుగుదొడ్లు అందుబాటు లేని మంచినీరు. వస్తారో రారో తెలియని గురువులు. వీటన్నింటిని మించి గట్టిగా వానొచ్చినా కూర్చునేందుకు అనువుగా లేని భవనాలతో ప్రాథమిక విద్య కొట్టుమిట్టాడుతున్నది. మమీ, డాడీ చదువులు వచ్చిన తర్వాత ప్రైవేట్ విద్యకు, ప్రభుత్వ విద్యకు వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. సర్కారు బడిలో చదువు చదవటం నామోషీ పడే రోజులు దాపురించాయి. విద్యారంగంపై దృష్టి సారించాల్సిన అవసరం వుంది.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు

పూర్వవైభవం సాధ్యమేనా?
తెలుగుదేశం అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో తమ ‘వస్తున్నా మీకోసం’ ముగింపు సభలో ప్రస్తుత కాంగ్రెస్ అవినీతి, అసమర్ధ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారని, సామాన్య జనం కష్టాలు చూసి తాను మనస్తాపం చెందినట్లు, ప్రజలు ఈసారి తె.దే.పాని గెలిపిస్తే తాను ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చి అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్లి పేదవారు లేకుండా చేసేదాకా నిద్రపోనని, అన్ని వర్గాల వారికి ప్రయోజనాలు పొందేట్టు అవినీతి రహిత పాలన అందిస్తానని వరాల జల్లు కురిపించడమేగాక, అందమైన స్వప్నలోకానికి తీసుకెళ్లారు. 9 ఏళ్ల పాలన చేసిన ముఖ్యమంత్రిగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యక్తి బాధలు, సమస్యలు లేకుండా చేయడం అసాధ్యమని ఆయనకు తెలుసు. ‘ఒక్కడే’ ఈ సమాజాన్ని సినిమాలో మార్చగలడేమోకాని వాస్తవంగా అసాధ్యం.
- జి.వి.రత్నాకరరావు, వరంగల్

మందు తాగండి..ప్రభుత్వాన్ని నిలపండి
ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి తనదైన శైలిలో మద్యం వ్యాపారుల పట్ల విశాల హృదయాన్ని ప్రదర్శించింది. విశాల హృదయాన్ని ప్రదర్శించడమే కాకుండా తమ పర్మిట్ రూంలను కూడ విశాలం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. రిటైల్ వైన్ షాపులో కూడ కూర్చొని తాగడానికి కుర్చీలు వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ‘‘ఫ్రెండ్లీ పాలసీ’’ అని కొత్తగా నామకరణం చేసి బెల్టు షాపులకు అ(న)్ధకారికంగా అనుమతి ఇచ్చినట్లయింది. ప్రభుత్వ పాలసీ ద్వారా ప్రజలకు (మగవారికి) చెప్పేదేమిటంటే‘చేతిలో మద్యం సీసాపట్టు’, ప్రభుత్వాన్ని చక్కబెట్టు’ అనే చందంగా తయారైంది. మీరు బాగా తాగి ప్రభుత్వాన్ని, నాయకులను చక్కపెడితే మీ కుటుంబాలు బాగుపడటానికి మహిళలకు వడ్డీలేని రుణం ఇస్తాం అన్న చందంగా తయారైంది. ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ రకరకాల పేర్లతో అమలుకు సాధ్యంకాని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అక్రమ మార్గాల ద్వారా ప్రజల సంపాదనను దోచుకుంటూ ‘‘కుక్కకు బొక్క వేసే’’ చందంగా తయారైంది ప్రజలు ఓటుకు నోటు, నోరుకు బీరు ఆశపడకుండా మంచి ప్రభుత్వాలను ఎన్నుకుంటే మనకు మనం మేలుచేసుకున్న వాళ్ళమవుతాం.
- మూర్తి ఆనంద్‌కుమార్, రామాయంపేట

బంద్‌ల వల్ల తీరని నష్టం
గత కొన్ని నెలలుగా మన రాష్ట్రంలో బందులు, సమ్మెలు ఎక్కువగా జరగడంవలన ఎన్నో విలువైన పని గంటలు, విద్యార్థులకు పాఠశాలలో తగ్గింపు బోధనా సమయం ఇంకా ఎన్నో ఇతర విలువైన సమయం నష్టం జరిగింది. ప్రజాస్వామ్యంలో సమ్మె అనేది చాలా అరుదుగా, ఒక సమస్యకు పరిష్కార దిశగా మారాలి తప్ప ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, ఇంకా కొంతమందికి రోజూ పనికి ఆటంకం కారాదు. మన రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి, ఇప్పుడే మొదలైన విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలి. పాఠశాలలు, కాలేజీలు మరియు విశ్వవిద్యాలయాలు సమ్మెకు గురికావడం ఆందోళనకరమైన విషయం. తల్లిదండ్రులు ఎంతో శ్రమ తో వారి పిల్లలను, పాఠశాలలకు ఎంతో డబ్బు చెల్లించిన తరువాత సమ్మెలవలన పాఠశాలలు మూసివేస్తే వారి దుఃఖానికి కొలమానం ఏది. రాజకీయ నేతలు, విద్యాధికులు, ఇంకా ఎంతోమంది ఈ సమస్యను పరిష్కరించాలి,
- మేడవరం జితామిత్ర, హైదరాబాద్

ఉత్తరాయణం
english title: 
school education

స్వల్పంగా పెరిగిన సెనె్సక్స్

$
0
0

ముంబయి, జూలై 19: ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెనె్సక్స్ శుక్రవారం 21 పాయింట్లు వృద్ధి చెంది దాదాపు నిలకడగా సాగింది. అయితే ఇన్ఫోసిస్‌లా టిసిఎస్ కూడా తొలి త్రైమాసిక ఫలితాల్లో చక్కటి లాభాలను ఆర్జించడంతో దాని ప్రభావం వల్ల వరుసగా మూడవ రోజూ లాభపడి ఆరు వారాల గరిష్ఠ స్థాయికి ముగిసింది. కాగా బిహెచ్‌ఇఎల్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టపోడంతో సెనె్సక్స్ పెద్దగా లాభపడకపోయినా ఐటి, ఆటో రంగ స్టాక్స్ లాభపడడంతో మార్కెట్ అనుకూల ధోరణిలోనే సాగింది. త్రైమాసిక ఫలితాలను త్వరలో ప్రకటించనున్న ఆర్‌ఐఎల్ షేరు 0.7 శాతం లాభపడింది. గత రెండు సెషన్స్‌లో 277 పాయింట్లు లాభపడిన సెనె్సక్స్ మూడవ రోజైన శుక్రవారం కూడా 21.44 పాయింట్లు వృద్ధి చెంది 0.11 శాతం పెరిగి 20,149.85 వద్ద ముగిసి రెండు నెలల గరిష్ఠ స్థాయి అయిన 20,256.60 దరిదాపులకు చేరింది. మదుపరులు కొన్ని స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు పాల్పడడంతో లాభాలు తగ్గాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ తరహాలోనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తొలి త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచిందని బ్రోకర్లు తెలిపారు. ఈ త్రైమాసికంలో టిసిఎస్ మొత్తం ఆదాయం 14,869 కోట్ల రూపాయల నుంచి 21 శాతం వృద్ధి చెంది 17,987 కోట్లకు చేరింది. దాంతో శుక్రవారం ఆ కంపెనీ షేరు 4.92 శాతం లాభపడి 1740.10 రూపాయల నుంచి పెరిగి 1755 రూపాయలకు చేరింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి ఇండెక్స్ నిఫ్టీ స్వల్పంగా 8.55 పాయింట్లు వృద్ధి చెంది 0.15 శాతం పెరిగి 6,029.20 వద్ద ముగిసింది. ఒక దశలో నిఫ్టీ 6,066.85 గరిష్ఠ స్థాయికి చేరింది. సెనె్సక్స్‌లో 16 కంపెనీల స్టాక్స్ లాభపడగా 14 నష్టాలతో ముగిసాయి. బాగా లాభపడిన స్టాక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీల్యాబ్స్, హీరో మోటార్ కార్పొరేషన్, ఒఎన్‌జిసి కంపెనీలున్నాయి. ఇంకో వైపు ఉన్న ఆర్డర్లు రద్దయ్యి, మాంద్యం వల్ల కొత్త ఆర్డర్లు లభించకపోవడంతో బిహెచ్‌ఇఎల్ షేరు 8 శాతం నష్టపోయింది. హెచ్‌డిఎఫ్‌సి తొలి త్రైమాసికంలో 34 శాతం నికరలాభాన్ని ఆర్జించినప్పటికీ, అంచనాలకు తగ్గట్లు ఫలితాలు రాకపోవడంతో దాని షేరు 2.35 శాతం క్షీణించింది. సెక్టార్‌పరంగా ఐటి 2.81 శాతం, టెక్ ఇండెక్స్ 2.20 శాతం, ఆటో ఇండెక్స్ 1.66 శాతం, చమురు, గ్యాస్ ఇండెక్స్ 0.67 శాతం లాభపడింది.

బలపడిన రూపాయి
ముంబయి, జూలై 19: రెండు రోజుల నష్టం నుంచి రూపాయి శుక్రవారం కోలుకుని 32 పైసలు బలపడి డాలర్ విలువతో 59.35పైసల వద్ద స్థిరపడింది. ఎగుమతిదారులు, కొంత మంది బ్యాంకర్లు తాజాగా డాలర్లను అమ్మడంతో డాలర్ క్షీణించి రూపాయి బలపడింది. అంతేకాక స్టాక్ మార్కెట్‌లోకి 250 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి చేరింది. ఫారెక్స్ మార్కెట్ ప్రారంభంలో రూపాయి 59.30 గరిష్ఠానికి చేరగా బ్యాంకర్లు, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడంతో 0.54 శాతం పెరిగి 59.35 వద్ద రూపాయి స్థిర పడింది.
వడ్డీరేట్లు తగ్గించిన పంజాబ్, సింధ్ బ్యాంక్
న్యూఢిల్లీ, జూలై 19: రుణాలపై కనీస వడ్డీరేటును 0.26 శాతం తగ్గిస్తున్నట్లు పంజాబ్, సింధ్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. దీని వల్ల వినియోగదారుల ఇఎంఐ ఇతర వడ్డీరేట్లు తగ్గుతాయి. గతంలో ఉన్న కనీస వడ్డీరేటు 10.25 శాతం నుంచి 9.99 శాతానికి చేరుతుంది. ఆగస్టు 1 నుంచి ఈ రేటు అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలియచేసింది.

వొడాఫోన్ ఆదాయంలో 13 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జూలై 19: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికమైన ఏప్రిల్-జూన్ నెలల్లో భారతదేశంలో తమ కార్యకలాపాల వల్ల వచ్చే ఆదాయం 13 శాతం పెరిగి 9,933.42 కోట్ల రూపాయలు(జిబిపి 1,091 మిలియన్లు) సాధించినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న టెలికాం కంపెనీ వొడాఫోన్ శుక్రవారం తెలియచేసింది.
మనదేశంలో 11,217 కోట్ల రూపాయల పన్ను వివాదంలో కంపెనీ చిక్కుకుంది. ‘స్థిరమైన ధరల వాతావరణం భారత్‌లో నెలకొనడం, కస్టమర్ల వెరిఫికేషన్ విధానం మెరుగవడం, డేటా రాబడి పెరగడం వల్ల ఆదాయం పెరిగింది’ అని వొడాఫోన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ త్రైమాసికంలో మొబైల్ ఇంటర్‌నెట్ వినియోగం కూడా 29 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది.

* తీవ్ర నష్టం నుంచి ఆదుకున్న ఐటి, ఆటోరంగ స్టాక్స్
english title: 
s

హెచ్‌డిఎఫ్‌సి లాభం రూ.1,707 కోట్లు

$
0
0

ముంబయి, జూలై 19: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 34 శాతం పెరిగి 1,707.10 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి శుక్రవారం ప్రకటించింది. గత సంవత్సరం ఏప్రిల్-జూన్ నెలల్లో 1,275.86 కోట్ల రూపాయల మేర ఏకీకృత నికర లాభాన్ని సాధించినట్లు కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం 7,388.51 కోట్ల(కిందటేడు ఇదే త్రైమాసికంలో) నుంచి పెరిగి 8,482.85 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. ఏకీకృత నికర లాభంలో అనుబంధ సంస్థలైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, హెచ్‌డిఎఫ్‌సి వెంచర్ క్యాపిటల్, గృహ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి. కాగా మాతృసంస్థ అయిన హెచ్‌డిఎఫ్‌సి సంస్థ ఒకటి గత సంవత్సరం ఈ త్రైమాసికంలో 1,001.91 కోట్ల రూపాయల నికర లాభాన్ని గడించగా ఈ త్రైమాసికంలో 17 శాతం వృద్ధి సాధించి 1,173.10 కోట్ల రూపాయలు ఆర్జించింది. మొత్తం ఆదాయం 4,934.95 కోట్ల నుంచి 5,556.94 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇది మార్కెట్ వర్గాల అంచనాలకు తగినట్లే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

* 34 శాతం పెరిగిన ఏకీకృత లాభం
english title: 
hdfc

బెంగళూరు విప్రోలో బాంబు కలకలం

$
0
0

బెంగళూరు, జూలై 19: ‘19 బాంబులతో విప్రో కార్యాలయంలోని ట్రైనింగ్ బ్లాక్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు, శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పేల్చివేస్తాం’ అని ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీకి శుక్రవారం సర్జాపూర్ పోలీసు స్టేషన్‌కు అందిన ఆకాశ రామన్న లేఖ కలకలం రేపింది. ‘ఈ లేఖ అందినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ హుటాహుటిన విప్రో ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. తనిఖీలు ముమ్మరంగా చేసి ఎటువంటి బాంబులు లేవని తేల్చిన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భద్రతా చర్యల్లో భాగంగా సర్జాపూర్ విప్రో ఆవరణలో తనిఖీలు నిర్వహించినట్లు విప్రో కంపెనీ కూడా తెలియచేసింది.

ఆర్‌ఐఎల్ నికర లాభం రూ.5,352 కోట్లు

న్యూఢిల్లీ, జూలై 19: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ నెలల్లో నికర లాభం 19 శాతం పెరిగి 5,352 కోట్ల రూపాయలు సాధించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ప్రకటించింది. రిఫైనింగ్ మార్జిన్లు పెరగడం వల్ల గత సంవత్సరం కంటె నికర లాభం పెరిగిందని, గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 4,503 కోట్ల రూపాయల నికర లాభం ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే కృష్ణా,గోదావరి (కెజి-డి6) చమురు క్షేత్రంలో గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోడంతో ఆదాయం 4.6 శాతం తగ్గి 90,589 కోట్ల రూపాయలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
కెజి డి-6లో ఉత్పత్తి 53 శాతం క్షీణించి ఈ త్రైమాసికంలో 49.2 బిలియన్ క్యుబెక్ అడుగులు మాత్రమే లభించింది.

హిందుస్తాన్ జింక్ నికర లాభం 5% వృద్ధి

న్యూఢిల్లీ, జూలై 19: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో నికర లాభం 5 శాతం పెరిగి 1660.45 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్ జింక్ తెలిపింది. అమ్మకాలు పెరిగి, ఉత్పత్తి వృద్ధి చెందినా మెటల్ ధరలు తక్కువగా ఉండడం వల్ల ఈ త్రైమాసికంలో నికర లాభం అంచనాలకు తగినట్లు లేదని కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1,581.34 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. గత సంవ్సరం ఈ త్రైమాసికంలో అమ్మకాల వల్ల 2,712.67 కోట్ల రూపాయలు ఆర్జించగా ఈ ఏడాది నికర అమ్మకాలు 8.36 శాతం పెరిగి 2,939.41 కోట్లు సాధించినట్లు జింక్ పేర్కొంది. జింక్ ఉత్పత్తి 10 శాతం పెరిగి 1,73,000 టన్నులు సాధించగా లండన్ మెటల్ ఎక్స్చేంజిలో (ఎల్‌ఎంఇ) ధర ఈ త్రైమాసికంలో 5 శాతం తగ్గిందని కంపెనీ వెల్లడించింది.

‘19 బాంబులతో విప్రో కార్యాలయంలోని ట్రైనింగ్ బ్లాక్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలకు, శనివారం
english title: 
b

సంగ్వాన్.. ఎవరి మాటా వినడు!

$
0
0

న్యూఢిల్లీ, జూలై 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ రంజీ క్రికెటర్ ప్రదీప్ సంగ్వాన్ ఎవరి మాటా వినడట. మూర్ఖంగా ప్రవర్తించడంలో అతనిని మించిన వారు లేరట. డోప్ పరీక్షలో పట్టుబడిన సంగ్వాన్ గురించి ఈ వ్యాఖ్యలు చేసింది ఆషామాషీ వ్యక్తికాదు. ఒకప్పుడు భారత క్రికెట్‌కు అల్‌రౌండర్‌గా అసాధారణ సేవలు అందించిన మనోజ్ ప్రభాకర్ చెప్పిన వాస్తవాలు. ఉత్ప్రేరకాలను వాడినట్టు డోప్ పరీక్షలో సంగ్వాన్ పట్టుబడడంపై ఢిల్లీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన మనోజ్ తీవ్రంగా స్పందించాడు. అతనికి మంచి చెడులను చెప్పేందుకు ఎవరూ లేరని, దీనితో ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడని మనోజ్ అన్నాడు. శారీరంలో పైభాగాన్ని బలోపేతం చేసుకోవడానికి విపరీతంగా కష్టపడవద్దని, దీని వల్ల అసాధారణ బౌలర్‌గా ఎదిగే అవకాశాలు దెబ్బతింటాయని తాను సంగ్వాన్‌కు పలుమార్లు సూచించినట్టు తెలిపాడు. అయితే, తన సూచనలను అతను పట్టించుకోలేదని అన్నాడు. ‘సిక్స్ ప్యాక్ బాడీ’ అన్నది బాడీ బిల్డర్లకో, సినీ నటులకో బాగుంటుందిగానీ క్రికెటర్లకు కాదని మనోజ్ స్పష్టం చేశాడు. ఫ్యాషన్ వేరు.. క్రికెట్ వేరు అన్న వౌలిక అంశాన్ని సంగ్వాన్ గుర్తించలేదని చెప్పాడు. బౌలింగ్ కంటే నైట్ పార్టీలకే అతను ప్రాధాన్యం ఇచ్చేవాడని అన్నాడు. చాలాసార్లు తాను ఈ విషయంపై అతనిని నిలదీశానని మనోజ్ పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చీర్ గరల్స్‌ను ప్రవేశపెట్టడం, అర్ధరాత్రి వరకూ ఆటగాళ్లకు పార్టీలను ఏర్పాటు చేయడం వల్లే ఇలాంటి ఉపద్రం ముంచుకొచ్చిందని విమర్శించాడు. క్రికెటర్లను ఫ్యాషన్ మోడల్స్‌గా తయారు చేస్తున్నదని ఐపిఎల్‌పై ధ్వజమెత్తాడు. సంగ్వాన్ వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు కెరీర్‌ను చేతులారా దెబ్బతీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకానొక దశలో ఇశాంత్ శర్మ కంటే ముందుగానే సంగ్వాన్ జాతీయ జట్టు లో స్థానం సంపాదిస్తాడని తాను ఊహించినట్టు మనోజ్ చెప్పాడు.

డోపింగ్ క్షమార్హం కాదు: కోహ్లీ
న్యూఢిల్లీ, జూలై 19: డోపింగ్ క్షమార్హం కాదని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని భారత యువ బ్యాట్స్ మన్, జింబాబ్వే పర్యటనకు వెళ్లే టీమిండియాకు నాయకత్వం వహించనున్న విరాట్ కోహ్లీ స్పష్టం చేశా డు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ క్రికెట్‌లోనూ డోపింగ్ సమస్య తలెత్తడం దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. ఇలాంటి పనులకు ఎవరు పాల్పడినా క్షమించరాదని చెప్పాడు. జిం బాబ్వేకు వెళ్లే జట్టు పటిష్టంగా ఉందని కోహ్లీ అన్నాడు. అక్కడ విజయాలను సాధించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీ, విండీస్‌లో జరిగిన ట్రై సిరీస్‌లలో విజయాలను సాధించామని, జింబాబ్వేలోనూ గెలుస్తామని అతను ధీమా వ్యక్తం చేశాడు.

హాకీ వీడియో అనలిస్టుగా
మహాధిక్ నియామకం
న్యూఢిల్లీ, జూలై 19: భారత పురుషుల హాకీ జట్టుకు వీడియో అనలిస్టుగా ధనంజయ్ మహాధిక్‌ను హాకీ ఇండియా (హెచ్‌ఐ) నియమించింది. తొలి హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నమెంట్‌లో పాల్గొన్న ఢిల్లీ వేవ్‌రైడర్స్‌కు అతను వీడియో అనలిస్టుగా పని చేశాడు. మాజీ క్రీడాకారుడైన మహాధిక్ కెరీర్‌లో 64 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత హాకీ రంగానికి వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నాడు. ఆధునిక హాకీలో, ప్రత్యర్థి జట్ల బలాబలాలను నిర్ధారించుకొని, వ్యూహ రచన చేసుకోవడానికి వీడియో అనాలిసిస్ కీలక భూమిక పోషిస్తున్నది. విదేశీ జట్లు ప్రత్యేకంగా వీడియో అనలిస్టులను నియమించుకొని, వారి సలహాలు, సూచనలతో జట్టు వ్యూహాలను ఖరారు చేస్తున్నాయి. హెచ్‌ఐ కూడా ఇదే పంథాను అనుసరించాలని నిర్ణయించి, మహాధిక్‌ను వీడియో అనలిస్టుగా నియమించింది.
23 నుంచి ఫెడరేషన్ కప్ హాకీ
న్యూఢిల్లీ, జూలై 19: భారత హాకీ సమాఖ్య (ఐహెచ్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి ఫెడరేషన్ కప్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈనెల 28 వరకూ ఈ టోర్నమెంట్‌లో ఢిల్లీలోని శివాజీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు ఐహెచ్‌ఎఫ్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ హాకీ సంఘం, హర్యానా హాకీ సంఘం సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహణ బాధ్యతలను స్వీకరించాయని పేర్కొంది.

స్వదేశానికి బుకానన్
వెల్లింగ్టన్, జూలై 19: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సి)లో క్రికెట్ డైరెక్టర్‌గా రెండేళ్లు సేవలు అందించిన ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్ స్వదేశానికి వెళ్లనున్నాడు. క్రికెట్ డైరెక్టర్‌గా అతను సంతృప్తికరమైన సేవలు అందించాడని ఎన్‌జెడ్‌సి ఒక ప్రకటనలో తెలిపింది. అతను స్వదేశమైన ఆస్ట్రేలియాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం దురదృష్టకరమని పేర్కొంది. వ్యక్తిగత కారణాల వల్ల తాను వెళ్లాల్సి వస్తున్నదని బుకానన్ తెలిపినట్టు ఆ ప్రకటనలో వివరించింది. అయితే, ఎన్‌జెడ్‌సిలోని కొంత మంది సభ్యులతో బుకానన్ విభేదిస్తున్నాడని, అందుకే అతనికి ఉద్వాసన పలికారని సమాచారం.

ఎన్‌సిఎలో శిక్షణకు
అమీర్‌ను అనుమతించండి
ఐసిసిని కోరిన పాక్ క్రికెట్ బోర్డు
కరాచీ, జూలై 19: స్పాట్ ఫిక్సింగ్‌లో దోషిగా రుజువుకావడంతో లండన్ జైల్లో శిక్ష అనుభవించి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న యువ పేసర్ మహమ్మద్ అమీర్‌ను జాతీయ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సిఎ)లో శిక్షణకు అనుమతించాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) కోరింది. అమీర్‌ను ఎన్‌సిఎ శిక్షణకు ఐసిసి అనుమతించిందని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలను ఐసిసి ఖండించింది. అమీర్‌కు అలాంటి అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమీర్ తరఫున పిసిబి వకాల్తా పుచ్చుకుంది. తమ కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ పొందేందుకు అతనిని అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. అమీర్‌పై ఐసిసి ఐదేళ్ల నిషేధం విధించింది. దీనిని తర్వాత నాలుగుళ్లకు కుదించింది. వచ్చే ఏడాదికి అతని సస్పెన్షన్ కాలం పూర్తవుతుంది. ఈలోగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అమీర్ ఆశిస్తున్నాడని ఐసిసికి రాసిన లేఖలో పిసిబి పేర్కొంది. ఇలావుంటే, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పిన్నర్ దనీష్ కనేరియా విషయంలో పిసిబి ఎలాంటి వినతి చేయకపోవడం గమనార్హం. ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్‌లో హిందువులకు జరుగుతున్న అన్యాయానికి ఇదో నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు.

మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ ధ్వజం
english title: 
s

స్వాన్ స్పిన్ మాయాజాలం

$
0
0

లండన్, జూలై 19: ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ చెలరేగిపోతున్నది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా ఆస్ట్రేలియా ఎదు రుదాడికి దిగింది. దీనితో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులు సాధించిన ఈ జట్టు ఆతర్వాత ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూల్చింది. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ 44 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా పతనం అనివార్యమైంది. లార్డ్స్ మైదానంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించడం స్వాన్‌కు ఇది రెండోసారి. మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, ఫాలో ఆన్ ఇవ్వకుండా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 31 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది కుక్ (8), జొనథాన్ ట్రాట్ (0), కెవిన్ పీటర్స న్ (5) పెవిలియన్‌కు చేరగా, జో రూట్ (18), నైట్‌వాచ్‌మన్ టిమ్ బ్రెస్నన్ (0) క్రీజ్‌లో ఉన్నారు.
మ్యాచ్ మొదటిరోజైన గురువారం ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ సెంచరీతో రాణించాడు. అతను 109 పరుగులు చేయగా, జొనథాన్ ట్రాట్ 58, జేమ్స్ బెయిర్‌స్టో 67 పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్ ర్యాన్ హారిస్ 72 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించినా, మిగతా బౌలర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు. కాగా, శుక్రవారం ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ 289 పరుగుల వద్ద బ్రెస్నన్ (7) వికెట్‌ను కోల్పోయింది. జేమ్స్ ఆండర్సన్ 12 పరుగులు చేసి హారిస్ బౌలింగ్‌లో బ్రాడ్ హాడిన్‌కు చిక్కాడు. చివరిలో స్టువర్ట్ బ్రాడ్ (33), స్వాన్ (నాటౌట్ 28) కొంత సేపు ఆసీస్ బౌలింగ్‌ను ప్రతిఘటించడంతో తొలి ఇన్నింగ్స్‌లో అలిస్టర్ కుక్ సేన సాధించిన 361 పరుగులకు సమాధానంగా తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, రోజర్స్ చక్కని ఆరంభాన్నిచ్చేందుకు ప్రయత్నించారు. కానీ స్వాన్ బౌలింగ్‌లో రోజర్స్ (15) క్లీన్ బౌల్డ్ కావడంతో మొదలైన ఆస్ట్రేలియా పతనం చివరి వరకూ కొనసాగింది. వాట్సన్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యాలను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జట్టు 53.3 ఓవర్లలో 128 పరుగులకే ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

128 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా శఉత్కంఠగా సాగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టు
english title: 
s
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>