Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

పునర్జన్మ ఎత్తినట్టుంది

$
0
0

న్యూఢిల్లీ, జూలై 19: ఫరాన్ అక్తర్ నటించిన ‘్భగ్ మిల్కా భాగ్’ చిత్రాన్ని చూసినప్పుడు పునర్జన్మ ఎత్తినట్టు అనిపించిందని భారత మాజీ అథ్లెట్, ‘్ఫ్లయింగ్ శిఖ్’ మిల్కా సింగ్ వ్యాఖ్యానించాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ యవ్వనంలో తను ఎలా ఉండేవాడినో అచ్చుగుద్దినట్టు అదే విధంగా కనిపించేందుకు ఫరాన్ అక్తర్ విశేషంగా కృషి చేశాడని అన్నాడు. మిల్కా సింగ్ జీవితం ఆధారంగా, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తున్నది. చిత్రం గురించి మిల్కా సింగ్ మాట్లాడుతూ తాను స్టేడియంలో పడిన కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రశంసించాడు. తాను పడిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు లభిస్తున్నదని వ్యాఖ్యానించాడు. ఎంతో మంది తనను ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారని అన్నాడు. చిన్నపిల్లలు సైతం తనను గుర్తుపడుతున్నారని చెప్పాడు. అథ్లెట్‌గా ఎదగడానికి తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని మిల్కా సింగ్ అన్నాడు. చాలాసార్లు తాను ప్రాక్టీస్ చేస్తూ స్పృహతప్పి కింద పడేవాడినని, తోటి అథ్లెట్లు తనను స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లే వారని తెలిపాడు. ఊపిరి ఆడక అల్లాడుతున్నప్పుడు ఎన్నోసార్లు తనకు కృత్రిమ శ్వాస కూడా అందించారని పేర్కొన్నాడు. రోజుకు ఐదారు గంటలు ప్రాక్టీస్ చేసేవాడినని, అప్పటి రోజులను ఈ చిత్రం మళ్లీ కళ్ల ముందు ఆవిష్కరించిందని కొనియాడాడు. తన జీవితగాధ ఆధారంగా తయారైన ఈ చిత్రం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిస్తే తన జన్మ ధన్యమవుతుందని వ్యాఖ్యానించాడు.

ఫరాన్ అక్తర్ చిత్రంపై మిల్కా సింగ్
english title: 
p

టెక్నిక్‌ను మార్చుకోవడం అవసరం

$
0
0

న్యూఢిల్లీ, జూలై 19: వయసు మీద పడుతున్న విషయాన్ని గమనించి బ్యాటింగ్‌లో టెక్నిక్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ తెండూల్కర్‌కు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ హితవు పలికాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ సాధారణంగా బ్యాట్స్‌మెన్ ఒకవైపు తిరిగి బ్యాటింగ్ చేస్తారని అన్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సమయంలో, వేగంగా దూసుకొచ్చే బంతుల దిశను క్షణాల్లో అర్థం చేసుకున్నప్పుడే ఈ విధంగా ఆడవచ్చని పేర్కొన్నాడు. అయితే, వయసు ప్రభావం కారణంగా సచిన్ క్రీజ్‌లో వేగంగా కదలడం సాధ్యం కాదని అన్నాడు. అందుకే, బౌలర్‌కు పూర్తిగా ఎదురునిలబడి బ్యాటింగ్ చేయడం శ్రేయస్కరమని తెలిపాడు. అప్పుడు బంతిని ఆడేందుకు బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ సమయం లభిస్తుందని అన్నాడు. సచిన్ వంటి గొప్ప ఆటగాడు టెక్నిక్‌ను మార్చుకోవడం చాలా సులభమని అన్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు టీమిండియా వెళుతున్న నేపథ్యంలో, అక్కడి పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పాడు. యువ ఓపెన్ శిఖర్ ధావన్ మంచి ఓపెనర్ అని అజర్ కితాబునిచ్చాడు. అయితే, దక్షిణాఫ్రికాలో రాణిస్తేనే అతని సత్తా తెలుస్తుందని అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ రాణించిన తీరు అద్భుతమని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా వంటి యువ ఆటగాళ్లతో భారత జట్టు పటిష్టంగా ఉందన్నాడు. దక్షిణాఫ్రికాలో వీరంతా మరోసారి అద్భుత విజయాలను నమోదు చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు.

సచిన్‌కు అజర్ హితవు
english title: 
t

జట్టులో స్థానమే లక్ష్యం

$
0
0

కరాచీ, జూలై 19: పాకిస్తాన్ జాతీయ జట్టులో మళ్లీ స్థానం సంపాదించడమే తన లక్ష్యమని వికెట్‌కీపర్ కమ్రాన్ అక్మల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన తమ్ముడు ఉమర్ అక్మల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పచెప్పడాన్ని అతను వ్యతిరేకించాడు. ఉమర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అనీ, కీపర్‌గానూ అతనినే కొనసాగిస్తే ఆతర్వాత ఎదురయ్యే పరిణామాలకు క్రికెట్ పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నాడు. స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను కీపర్‌గా మార్చే ప్రయత్నం తగదని చెప్పాడు. 31 ఏళ్ల వయసు ఉన్న తనలో మరికొంతకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగడానికి సిద్ధమని ప్రకటించాడు. రంజాన్ టి-20 టోర్నమెంట్‌లో తాను జాతీయ బ్యాంక్ తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నానని చెప్పాడు. సెలక్టర్లు తనకు ఆ బాధ్యతను అప్పచెప్తే సంతోషంగా స్వీకరిస్తానని అన్నాడు. వికెట్‌కీపర్లు బ్యాట్స్‌మెన్‌గానూ రాణించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని, కానీ, ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పచెప్తే, ఈ అదనపు భారంతో అతను రాణించిన సంఘటనలు లేవని చెప్పాడు.

పాక్ వికెట్‌కీపర్ కమ్రాన్ అక్మల్
english title: 
j

వనే్డ సిరీస్‌కు దక్షిణాఫ్రికా, లంక సిద్ధం

$
0
0

కొలంబో, జూలై 19: ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో అల్లాడుతున్న దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాయి. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో బలాబలాలు తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఎనిమిది దేశాలు పాల్గొన్న చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లూ సెమీస్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాణించలేకపోవడం, ప్రత్యేకించి సెమీస్, ఫైనల్స్ ఒత్తిడిని భరించలేక దారుణంగా విఫలం కావడం దక్షిణాఫ్రికాకు ఆనవాయితీగా మారింది. ఈ ముద్ర నుంచి బయట పడేందుకు లంకతో జరిగే సిరీస్‌ను ఉపయోగించుకోవాలని ఈ జట్టు భావిస్తున్నది. ఎబి డివిలియర్స్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టులో హషీం ఆమ్లా, అల్విరో పెటెర్సన్, ఫఫ్ డు ప్లెసిస్, జెపి డుమినీ వంటి మేటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. మోర్న్ మోర్కెల్, లొన్వాబొ సొత్సోబ్ బౌలింగ్ విభాగాన్ని శాసించనున్నారు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా ఒత్తిడిని అధిగమిస్తే లంకను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే, లంకను తక్కువ అంచనా వేయడం కష్టాలను కొని తెచ్చుకోవడమేనని పలు సందర్భాల్లో స్పష్టమైంది. స్వదేశంలో లంకను ఓడించడం అనుకున్నంత సులభం కాదు. కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన దినేష్ చండీమల్ ఎంత వరకు తన బాధ్యతలను సమర్థంగా పోషిస్తాడో చూడాలి. తిలకరత్నే దిల్షాన్, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే ఆటగాళ్లతో లంక బౌలింగ్ పటిష్టంగా ఉంది. లసిత్ మలింగ, అజంతా మెండిస్, షామిందా ఎరాంగ, రంగన హెరాత్ తదితరులు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి సర్వశక్తులు ఒడ్డడం ఖాయం. మొత్తం మీద సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య జరిగే సంకుల సమరం క్రికెట్ అభిమానులను అలరించనుంది.

వనే్డ ట్రోఫీతో శ్రీలంక, దక్షిణాఫ్రికా కెప్టెన్లు చండీమల్, డివిలియర్స్

ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో అల్లాడుతున్న
english title: 
o

సచిన్‌కు నిరాశే

$
0
0

న్యూఢిల్లీ, జూలై 19: క్రీడాకారులకు కూడా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘్భరత రత్న’ అవార్డును ప్రకటించవచ్చంటూ కేంద్రం నిబంధనలను మార్చిన మరుక్షణం నుంచి వినిపించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ పేరు మరుగున పడింది. ‘్భరత రత్న’ను స్వీకరించే తొలి క్రీడాకారుడిగా అతను రికార్డు పుటల్లో శాశ్వత స్థానం సంపాదిస్తాడన్న అంచనాల తల్లకిందులయ్యాయి. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం సచిన్‌కు నిరాశనే మిగిల్చింది. అంతర్జాతీయ హాకీలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి, భారత్‌కు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సాధించి పెట్టిన ధ్యాన్ చంద్ పేరును ‘్భరత రత్న’కు ప్రతిపాదిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాయడంతో, అతనికే అవార్డు దక్కడం దాదాపు ఖాయమైంది. ఎంతోకాలంగా సచిన్‌కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఎంతోమంది క్రికెటర్లతోపాటు వివిధ క్రీడలకు చెందిన వారు, చివరికి రాజకీయ నాయకులు కూడా సచిన్‌కు అనుకూలంగా ప్రకటనలు గుప్పించారు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అతని పేరును ప్రతిపాదించలేదు. క్రికెట్ సహా ఇతర క్రీడా సంఘాలు, సంస్థలు, సమాఖ్యల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాకపోవడంతో, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ధ్యాన్ చంద్ పేరును ఖరారు చేసింది. ఈ ప్రతిపాదనను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంపింది. ఆయన అంగీకారం తెలిపితే, రాష్టప్రతి ఆమోద ముద్ర పడడం, ధ్యాన్ చంద్‌కు భారత రత్న అవార్డు లభించడం ఖాయం. మొత్తానికి క్రీడా రంగంలో ఈ అవార్డుకు ఎవరు అర్హులని ఎంతోకాలంగా సాగుతున్న చర్చకు క్రీడా శాఖ తెరదించింది. సచిన్ కంటే ధ్యాన్ చంద్ ఈ అవారుడకు అర్హుడని చెప్పకనే చెప్పింది.

ధ్యాన్ చంద్‌కు ‘్భరత రత్న’ అవకాశం
english title: 
s

భగవంతుడు అల్పసంతోషి

$
0
0

మంత్రి వద్దకు వెళ్లిన వానికి, నీతిమంతుడైన ఆ మంత్రి పూజాగృహంలో అతణ్ణి ప్రశ్నించడం, అతడు రావడానికి నిరాకరిస్తే చంపడం వంటి ఘాతుకాలను చేయడం ఇష్టంలేక, ఎనిమిది గంటల వరకూ ఆగి, అప్పుడు మంత్రిగారిని దర్శించుకొని, రాజుగారు తనని అప్పటికప్పుడు పిలుచుకు రమ్మన్నారని, వెంటనే బయలుదేరి రాని పక్షంలో తల తెగవేసి తీసుకురమ్మన్నారనీ చెప్పాడు. తాను ఈ పనులేవీ చేయలేక, పూజను ఆటంకపరచలేక, పూజా కార్యక్రమం అయ్యేంతవరకూ ఆగి వున్నాననీ చెప్పుకున్నాడు.
మంత్రి అతడి మాటలన్నీ విని, ఖజానా తాళపు చెవితో, రాజ సేవకుణ్ణి వెంటబెట్టుకొని రాజు వద్దకు వచ్చాడు.
‘మీరు మళ్లీ ఇంత త్వరగా ఎందుకు వచ్చారు? తీరికగా, తర్వాత ఎప్పుడో రమ్మని ఇంతకు మునుపే కదా మీకు చెప్పింది? ఇందాక వచ్చి, ఖజానా తెరచి, అక్కడ వున్న నగలన్నిటి వివరాలు నాకు చెప్తిరి. మళ్లీ ఖజానా తాళం పెట్టుకుంటిరి. ‘మీరు వెళ్లిరండి’ అని సెలవు ఇచ్చి పంపిస్తిని. మళ్లీ ఇంత హడావిడిగా ఎందుకు తిరిగి వచ్చినట్టు?’ అని ఆశ్చర్యంతో అడిగాడు రాజు.
మంత్రికి విషయమంతా అర్థమైంది. ఏదో ఆశకు లోనై రాజు, తన వ్రతాన్ని భంగపరచడానికి సిద్ధపడ్డాడు కానీ, తనని పిలవడానికి వచ్చిన రాజసేవకుడు, మర్యాద పాటించి, రాజాజ్ఞను కూడా ధిక్కరించి, పూజ అయేంతవరకూ ఆగిపోయాడు.
కానీ రాజు అసహనం పెరగకముందే, మంత్రిపైనా, రాజ సేవకునిపైనా ఆగ్రహం మిన్నుముట్టక ముందే, భగవంతుడే స్వయంగా మంత్రి వేషం ధరించి, మాయ తాళపు చెవితో ఖజానా తీసి రాజుగారికి కావలసిన సమాచారం అందించాడు.
రోజుకు ఇరవై మూడు గంటలు రాజసేవలో వున్నా, క్షణికోద్రేకంలో రాజు, అన్నీ మరచి, మర్యాదలూ ఉల్లంఘించి, తన తల తీయించేటంతటి ఆగ్రహోదగ్రుడయ్యాడు.
రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట మాత్రమే భగవంతుడి పూజకు కేటాయించినప్పటికీ, ఆ కాస్తకే సంతోషించి, తనకు ఎట్టి ఇక్కట్లు రాకుండా, తన వేషాన్ని భగవంతుడు ధరించి, రాజ ఉత్తర్వులు పాటించాడు. ఎవర్ని సేవిస్తే నిజమైన ఫలితం దక్కుతుందో మంత్రికి పూర్తిగా అర్థమయింది. మరుక్షణం, మంత్రి మహారాజుతో ‘మీకూ నాకూ ఆ జగద్రక్షకుడే రక్ష. భగవంతుణ్ణి రోజూ నిర్విరామంగా సేవించుకోడానికి, నాకు అవకాశం ఇప్పించండి. నన్నీ మంత్రి పదవి నుండి విడిపించండి’ అంటూ వెళ్లిపోయాడు.
మిత్రశ్రీ ‘కథను’, తాను చెప్పి, ఉత్కళరావు తన ఇంగ్లీష్ పాండిత్యాన్ని ప్రదర్శించాడు. ‘్హ్యతీ ని ఇఖఆ ఒళ్పూళజూ ద్యిజూ తీజఆ్ద ఘఒ ౄఖష్ద చీళ్ఘ ఘఒ ని ఒళ్పూళజూ ౄక జశ. హళ త్యీఖజూ శ్యఆ ద్ఘ్పళ ళఛిఆ ౄళ జశ ళక ద్ఘజూఒ’ అన్నాఢు, ఇంగ్లండ్‌లోని చర్చి పూజారి టామస్ వుల్సీ. ఎనిమిదవ హెన్రీ మహారాజు, తన ఆజ్ఞ పాటించలేదని పుల్సీకి మరణశిక్ష విధించాడు.
వుల్సీ, మాట వరసకిలా అలా అన్నాడే కానీ, నిజంగా భగవంతుడు దిగి వచ్చి, భక్తుణ్ణి రక్షిస్తాడా అనుకుంటుండేవాణ్ణి. మిత్రశ్రీ ఈ పురాతన కథను పునరుద్ధరించి, ఆ అనుమానం తొలగించేశాడు’ అన్నాడు ఉత్కళరావు.
*

నీలంరాజు నోట్‌బుక్
english title: 
neelamraju notebook
author: 
నీలంరాజు లక్ష్మీప్రసాద్

పజిల్ - 432

$
0
0

ఆధారాలు

అడ్డం
1.దేవేంద్రుడు (5)
4.అందము (4)
6.కూత (3)
8.పోటు బంటు (4)
10.దీని వేగం కారుకన్నా ఎక్కువ (3)
11.నవగ్రహాల్లో విద్వాంసుడు (3)
12.ఆంగ్లంలో తాళానికీ, గొళ్లానికీ
అనుసంధానమైనది. ఇంతకీ ఇదే! (1)
13.వేశ్యకిచ్చే డబ్బు. ‘మరోలా’ వెదికి
సాధించు (1)
14.కేసరం (3)
15.తి,ల (3)
17.ఈ కొండ ‘సెక్యులర్’ కాదేమో! (4)
21.మోసగాడు (3)
23.తిరగబడిన ‘నిమ్మ’ (4)
24.కర్మసాక్షి, సూర్యుడు (5)

నిలువు

1.జాతాశౌచము (3)
2.అతిగా కష్టపడితే, ఒళ్లు ఇలా
అవుతుంది (2)
3.అర్జునుడూ మనిషే! సందర్భాన్నిబట్టి వెనుదిరుగుతూంటాడు గూడా! (3)
4.చంద్రుడు (3)
5.ఇందులో ప్రతిదీ ఇదే! (2)
7.‘ఇంతగా దాపరికమా?’ అంటూ
గొడవ పెట్టుకున్నాడు (3)
9.కష్టాలు (4)
10.గగుర్పాటు (4)
16.తలలేని వంట మనిషి (3)
17.వర్షాకాలంలో పూసే కొండమల్లె. అందుకే కోయిల ఇక్కడికి పోదని పోతనగారి
ఉవాచ (3)
18.ఒకనాటి హాస్యనటి. సినిమాల్లో
రేలంగికి విడదీయరాని జంట (3)
19.శ్రేయము (3)
20.అవధానులకు ధారణతోపాటు
ఇదీ కావాలి (2)
22.ఉన్నతమైన (2)
*

ఆధారాలు అడ్డం
english title: 
puzzle
author: 
నిశాపతి

వింతే! కానీ నిజం!!

$
0
0

2013 జూలైలో గంగానదికి వరదలు వచ్చి కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రిలలో వేల మంది కొట్టుకుపోయి మరణించారు. కానీ సుమారు రెండు వందల ఏళ్ల క్రితం లండన్ నగరంలో వచ్చిన ఓ వరదలో తొమ్మిది మంది మరణించారు. అది నీటి వరద కాదు, బీర్ వరద!
లండన్‌లోని సెయింట్ గైల్స్ అనే చోట టోటెన్ హేమ్ కోర్ట్ రోడ్‌లో ‘మ్యూక్స్ అండ్ కంపెనీ బ్రూవరీ’ ఉండేది. అందులో బ్రిటీష్ రాజు, రాణిల వినియోగం కోసం మూడు లక్షల ఇరవై మూడు వేల గేలన్ల (14 లక్షల 70 వేల లీటర్లు) బీర్ నిల్వ ఉంది. ఆ బ్రూవరీ బీదవారి నివాస గృహ సముదాయంలో వుండేది. సెంట్రల్ లండన్‌లోని ఆ బ్రూవరీలో ఇరవై అడుగుల ఎత్తుగల బీర్ పీపాలు వందల కొద్దీ ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నాయి. ప్రతీ పీపాలో 3555 బేరల్స్ ఏల్ (ఒక రకం బీర్) నిల్వ ఉండేది. వాటన్నిటినీ కలిపి ఇరవై తొమ్మిది లోహపు చైన్లతో కట్టారు.
అక్టోబర్ 17, 1814న ఓ పీపాకి కట్టిన చైన్ తెగింది. తర్వాత మరొకటి. ఆ రెండు పీపాలు పగిలిన శబ్దం ఐదు మైళ్ల దూరం దాకా వినిపించింది. ఆ తాకిడికి మిగిలిన పీపాలన్నీ కూడా పేలిపోయి వాటిలో నిలవ వున్న మొత్తం బీర్ ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల ఇటుక గోడ మీంచి రద్దీగా ఉండే సెయింట్ గైల్స్‌లోని ఇళ్ల మీదికి పారింది. అక్కడ చాలా బీద కుటుంబాలు ఒకే గదిలో నివసించేవి. బీర్‌ని చూసి చాలామంది అటకలు ఎక్కి తమ ప్రాణాలు రక్షించుకున్నారు. కానీ బేస్‌మెంట్‌లో ఉన్నవారు ఆ బీర్‌లో మునిగి ఊపిరాడక మరణించారు. కొందరు అదృష్టవంతులు పైకి పరిగెత్తి ఇళ్ల కప్పుల మీదికి ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. బ్రూవరీలోని ఓ ఉద్యోగి తన సోదరుణ్ణి బీర్‌లో పడి కొట్టుకుపోకుండా రక్షించాడు. ఐతే మరో ఉద్యోగిని మాత్రం మరణించింది. ఆ బీర్ ప్రవాహ వేగానికి ఇళ్లన్నీ నాశనమయ్యాయి. క్రమేపీ బీర్ లండన్ నగర రోడ్ల మీదకి వెళ్లి డ్రైనేజీలో కలిసిపోయింది.
ఐతే చాలామంది నడుం దాకా బీర్ వచ్చేదాకా ఆగి, దాన్లోకి దిగి మగ్గుల్లో, బక్కెట్లలో ఆ బీర్‌ని నింపి తాగారు. అది రాజవంశం కోసం చేసి, ప్రత్యేకంగా రెండేళ్ల పాటు ఓక్ పీపాల్లో నిల్వ ఉంచింది కాబట్టి సాధారణ ప్రజలు అంతదాకా రుచి చూడని అద్భుతమైన బీర్ అది కాబట్టి ఎగబడి తాగారు.
మొత్తం ఆరు వందల టన్నుల బరువుగల ఆ బీర్ పదిహేను అడుగుల ఎత్తులో ప్రవహించింది. ఆ ఇళ్లల్లోని ఆరుగురు ముసలి వాళ్లు, పిల్లలు మరణించారు. మరణించిన బ్రేవరీలోని ఓ ఉద్యోగిని వయసు పధ్నాలుగే. సమీపంలోని టాలిస్టాక్ ఆమ్స్ పబ్ అనే బార్ కూడా ఆ బీర్ తాకిడికి నాశనమైంది.
మరణించిన ఎనిమిదో వ్యక్తి మర్నాడు ఆల్కహాల్ పాయిజన్‌తో మృతి చెందాడు. బీర్‌ని అధికంగా తాగి స్పృహ తప్పిన అతన్ని హాస్పిటల్‌లో చేర్పించిన కొద్ది గంటలకే అతడు మరణించాడు. అతన్నించి వచ్చిన బీర్ వాసనకి హాస్పిటల్‌లోని ఇతర రోగులు హాస్పిటల్‌లో బీర్ పార్టీ జరుగుతోందని భావించారు. నర్సులు కాదని చెప్పినా మర్నాడు దినపత్రికల్లో చదివితే కానీ వారు నమ్మలేదు. బీర్ వరదల్లో మరణించిన తమ బంధువులని కొందరు బీద ప్రజలు కొంత రుసుము వసూలు చేసి చూపించారు. లండన్ ప్రజలు క్యూలో నిలబడి మరీ వారి మృతదేహాలను ఆసక్తిగా చూశారు. ఇది తెలిసిన పోలీసులు వచ్చి ఆ ప్రదర్శనని నిలిపివేశారు. ఈ ప్రమాదం సాయంత్రం పూట జరిగింది. అంతా అది బీర్ తాగే సమయం కాబట్టి బీర్ వాసన వస్తూంటే బీర్ వరద వస్తోందని గ్రహించక పక్కగదిలో బీర్ ఒలికిందని భావించారు. చాలా వారాలపాటు వారు తమ ఇళ్లల్లోని బీర్‌ని ఎత్తి బయట పోస్తూనే ఉన్నారు. కొన్ని నెలల దాకా ఆ ప్రాంతంలోని బీర్ వాసన పోలేదు.
బ్రేవరీ మీద కొందరు నష్టపరిహారం కోసం కోర్టుకెక్కారు. జడ్జి, జ్యూరీ సభ్యులు దాన్ని ‘ఏక్ట్ ఆఫ్ గాడ్’గా భావిస్తూ ఎవర్నీ బాధ్యులను చేయలేదు. ఆ బ్రేవరీకి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లడంతో, అప్పటికే నష్టపోయిన బీర్ మీద చెల్లించిన డ్యూటీని పార్లమెంట్ తిరిగి వారికి ఇచ్చేయడమేగాక, వారి వ్యాపార లైసెన్స్‌ని రద్దు చేయలేదు. ఆ బ్రేవరీని తిరిగి నిర్మించారు. 1922 దాకా ఇది నడిచింది. ఆ తర్వాత లండన్ నగర నియమాల ప్రకారం వెస్ట్‌లండన్‌లోని కొత్త ప్రదేశానికి దీన్ని తరలించారు. 1956లో మ్యూక్స్ బ్రేవరీ ఫ్రియారీ బ్రీవరీతో కలిసిపోయి ‘ఫ్రియారీ మ్యూక్ బ్రేవరీ’గా మారింది.
బీర్ వరద వచ్చిన ఆ ప్రదేశంలో ప్రస్తుతం డొమినియం థియేటర్ అనే నాటక శాల నడుస్తోంది. 800 పౌన్ల బరువుగల ఇనుప గొలుసుని పీపాలలోని బీర్ ఎలా తెంచేసిందా అన్నది నేటికీ అంతుపట్టడం లేదే. కొందరు శాస్తజ్ఞ్రులు దీని మీద అనేక ఊహాగానాలు చేశారు. ఈ సంఘటన మీద అనేక కథలు, నవలలు కూడా వెలువడ్డాయి. మరణించిన వారిలో అతి తక్కువ వయసుగల వ్యక్తి మూడేళ్ల థామస్ ముల్వే. అతి ఎక్కువ వయసుగల వ్యక్తి అరవై మూడేళ్ల కేథరిన్ బట్లర్. పధ్నాలుగేళ్ల బ్రేవరీ ఉద్యోగిని పేరు ఎలినార్ కూపర్.
నేటికీ సందర్శకులని పూర్వం బీర్ వరద వచ్చిన ఈ ప్రాంతానికి తీసుకువెళ్లే టూర్ నిర్వహింపబడుతోంది. లండన్ చరిత్ర పుటల్లో అనేక బీభత్సాలు జరిగాయి. లండన్ ప్లేగువ్యాధి, లండన్ నగరం అంటుకుని మండిపోవడం, లండన్ బీర్ వరద మొదలైనవి లండన్ వాసులకే కాక ప్రపంచానికి కూడా గుర్తుండిపోయిన దుర్ఘటనలు. (చిత్రం) లండన్‌లో బీరు వరద
*

నమ్మండి ! ఇదినిజం!
english title: 
nammandi idi nijam
author: 
-పద్మజ

బ్లూ టూత్ అంటే... - టెక్ - టాక్ !

$
0
0

ఈ కాలంలో మనం ఎన్నో

ఎలక్ట్రానిక్ ఉపకరణాలను

చూస్తున్నాం.

వాడుతున్నాం. ఈ

ఎలక్ట్రానిక్ ఉపకరణాలు

పరికరాలు ఎక్కువగా

వైర్లతో, కేబుల్స్‌తో

కలిపితేనే పనే్జస్తాయి!

ఐతే వైర్లతో, కేబుల్స్‌తో

అన్ని వేళలా

ఉపయోగించడం కష్టమైన

పని. ఉదాహరణకు,

రెండు మొబైల్ ఫోన్లను

కలపడం లేదా మొబైల్

ఫోన్‌ను పీసీకి కలపడం,

డ్రైవింగ్‌లో ఫోన్‌ను

వాడకుండా మాట్లాడటం -

వగైరా. మరి అలాటపుడు

ఉపకరణాలను వాడటం

ఎలా (అవి లేని కాలంలో

పరిస్థితి వేరేగా ఉండేది)

దీని కోసం వైర్లెస్

పరిజ్ఞానం అవసరమైంది.

అందుకే, బ్లూ టూత్ అనే

వైర్‌లెస్ టెక్నాలజీని

రూపొందించారు. ఈ

బ్లూటూత్ అనే పదాన్ని

చాలా కంప్యూటర్స్,

సెల్‌ఫోన్ ప్రకటనలలో

వింటూన్నాం.
బ్లూ టూత్‌ను మొదట

ఎరిక్సన్ సంస్థ

రూపొందించింది. ఆ

తరువాత ఐబిఎం,

ఇన్‌టెల్, నోకియా,

తోషిబా సంస్థలు మరింత

అభివృద్ధి చేశాయి. ఈ బ్లూ

టూత్ అనే పేరు 10వ

శతాబ్దానికి చెందిన డానిష్

రాజు హెరాల్డ్ బ్లూ టూత్

పేరు నుంచి వచ్చింది.

జాగ్రత్తగా పరిశీలిస్తే దీని

లోగోలో ‘హెచ్’ ‘బి’

అక్షరాలు కనిపిస్తాయి.
బ్లూ టూత్ అంటే

ఎలక్ట్రానిక్ ఉపకరణాలను

ఒకదానితో ఒకటి కలిపి

ఉంచే తక్కువ పరిధిలో

(30 అడుగుల

దూరంలోపే) పనిచేసే

వైర్లెస్ రేడియో టెక్నాలజీ,

వైర్లు, కేబుల్స్‌ను వాడి

ఎలాగైతే మనం

కంప్యూటర్‌తో కీబోర్డు,

వౌస్‌లను, యంపి3

ప్లేయర్‌తో హెడ్ ఫోన్లను

కలుపుతున్నామో అదే

విధంగా మనం బ్లూ టూత్

వైర్లెస్ టెక్నాలజీని

ఉపయోగించి

కలుపుతున్నాం.
బ్లూ టూత్ ఎలా పని

చేస్తుందీ అంటే...
* ఒక రేడియో చిప్‌ను

ఉపకరణాల్లో వాడటం

ద్వారా మనం ఈ బ్లూ

టూత్ టెక్నాలజీని

వాడగల్గుతున్నాం.
* రెండు ఉపకరణాల

మధ్య ఏక కాలంలో

ఒక్కొక్క బిట్ (0 లేదా

1) లేదా కొన్ని బిట్స్

సమూహంగా గాలి

తరంగాల ద్వారా డేటా

బట్వాడా జరుగుతుంది.
* గాలి తరంగాల ద్వారా

బిట్స్ రూపంలో వచ్చిన

మెసేజ్‌ను ఎలా

తీసుకోవాలి, ఎలా

చదవాలి, మెసేజ్ తనకు

అందేలోగా ఎవరన్నా

మార్పులు చేశారా?

ఇలాంటి అన్ని ప్రశ్నలను

బ్లూటూత్ సంబంధించిన

ప్రామాణికమైన ప్రోటోకాల్

చూసుకుంటుంది.
బ్లూటూత్ టెక్నాలజీ

తక్కువ ఖర్చుతో

కూడుకుంది. అంతేకాదు.

బ్లూ టూత్‌ను

ఉపయోగించి మనం

డేటాను లేదా శబ్దాన్ని

లేదా విడియో,

ఫొటోలనూ కూడా

పంపొచ్చు. సాధారణంగా

బ్లూ టూత్ ప్రామాణికమైన

ప్రోటోకాల్‌నే వాడుతుంది.

కాబట్టి దీనిని అందరూ

వాడొచ్చు. బ్లూ టూత్

తక్కువ శక్తిగల వైర్లెస్

తరంగాలను వాడటం వల్ల

ఆట్టే సమస్యలుండవ్.

ఐతే, ఆధునిక

టెక్నాలజీలో ఏదీ పూర్తి

భరోసా ఇవ్వదు. దేని

నష్టాలు దానికున్నాయి.

సరిగ్గా తెలీకుండా దేన్నీ

వాడకూడదు. అదే

రీతిలో, బ్లూ టూత్‌ను

కూడా వాడుకుంటే ఆట్టే

సమస్యలుండవ్.

షార్ట్ కట్స్ (్ఫటోషాప్

7.0 టూల్స్)

shift + I

సైకిల్

ఐడ్రాపర్ లేదా శాంప్లర్

లేదా మెషర్ వాడటానికి
shift + J

హీలింగ్ బ్రష్, పాచ్ టూల్

టాగిల్ చేయడానికి
shift + K స్లైస్

లేదా స్లైస్ టూల్స్ మధ్య

టాగిల్ చేయడానికి
shift + L సైకిల్

లాసో టూల్ వాడటానికి

నెట్ న్యూస్
కింద పడ్డా పైచేయి

మాదే...

అదేదో సామెత చెప్పినట్టు,

కింద పడ్డా పైచేయి మాదే

అని ప్రింట్ మీడియా

కాలర్

ఎగరేయచ్చంటున్నారు.

విషయం ఏమిటంటే, ఈ

ఆధునిక బ్లాగ్, నెట్

యుగంలో వార్త

కాంతికన్నా వేగంగా

వ్యాపిస్తోంది. సోషల్ నెట్

వర్క్‌లేమిటి, ట్విటర్లో

ట్వీట్ లేమిటి, వార్తా

పత్రికల న్యూస్

ఏజెన్సీలకన్నా వేగంగా

వార్తలను

అందించేస్తున్నాయి.

ముఖ్యంగా ట్విటర్. ఐతే,

ట్విటర్‌కన్నా న్యూస్

ఏజెన్సీలే మిన్న అని

యుకేకి చెందిన ఎడిన్‌బర్గ్

యూనివర్సిటీ

సైంటిస్టులంటున్నారు.

వాళ్లు 11 వారాలలో

ప్రధాన వార్తలకు

సంబంధించిన దాదాపు

51 మిలియన్ల ట్వీట్‌లను

స్టడీ చేశారట (దీనికి

2011 సమ్మర్

కాలాన్ని ఎంచుకున్నారు)

దానికీ, వార్తలందించే

ఏజెన్సీల నుంచి వచ్చే

వార్తలనూ కంపేర్ చేసి

చూస్తే ఏజెన్సీలే వేగంగా

వార్తలందిస్తున్నాయని

తెలిసింది(ట).

అదన్నమాట విషయం.

తెలుసుకోవాల్సిన

సంగతి..
వర్జిన్..ఎప్పటికీ వర్జినే...

వర్జిన్ అనేది బాగా

పాపులరయిన టెలికామ్

సంస్థ పేరు. ఈ సంస్థ

రికార్డింగ్, విమానయానం

వంటి రంగాల్లోనూ

వ్యాపారం చేస్తోంది. దీని

వ్యవస్థాపకులు రిచర్డ్

బ్రాసన్. రిచర్డ్ మొదట్లో

రికార్డింగ్ కంపెనీ

ఆరంభించాడు. అది బాగా

లాభాలను

తెచ్చిపెట్టడంతో, ఒక

బ్రాండ్ నేమ్ కావాలని

ఆలోచించాడు. అతని

బిజినెస్‌లో ఒక

భాగస్వామి (పేరు తెలీదు)

మనం మచ్చలేని

వ్యాపారం చేస్తున్నాం

కదా, వర్జిన్ అని పేరు

పెడితే ఎలా ఉంటుందీ

అన్నాడు. అంతే, తన

సంస్థకు వర్జిన్ అని

పేరెట్టాడు. వర్జిన్

యాహూ అంటే

మచ్చలేనిది అనీ, కన్య

అనీ అర్థం. అందరూ

భాగస్వాములూ వర్జినా

ఐతే ఓకే అనేశారు. అదీ

సంగతి. అన్నట్టు, ఈ

విషయాన్ని రిచర్డ్ తన

ఆత్మకథలో

రాసుకున్నాడు. ఇంతకీ

ఆ ఆత్మకథకు రిచర్డ్

పెట్టిన పేరేంటో తెల్సా..

లూజింగ్ మై వర్జినిటీ..

బావుంది కదూ.
*

పద పారిజాతం

Bleg

సమాఛారాన్ని

అడుక్కోడానికి పెట్టే బ్లాగ్
Audiocast/Pop

cast శబ్దంతో

కూడిన బ్లాగ్. ఆడియో

క్లిపింగ్ ద్వారా తమ

పోస్ట్‌ని ఉంచడం
Blogroll ఒక భ్లాగ్‌లో

వేరే ఇతర బ్లాగ్‌లను లింక్

చేయడం
Vblog విఢియో

బ్లాగ్ అనడానికి క్లుప్త

రూపం.

సామెత

వైరస్సెరిగి వాత పెట్టాలి..

టెక్ - టాక్ !
english title: 
tech talk
author: 
వి.వి.వి.రమణ

ఎలావుందీవారం ? జూలై 21 నుండి 27

$
0
0

సందర్భానుసారంగా ప్రవర్తించి అందరినీ ఆకట్టుకుంటారు. సన్నిహితుల అభిప్రాయాలు సేకరించి మీ దినచర్యలో, లక్ష్య సాధనలో కావలసిన మార్పులు చేసుకుంటారు. స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని కార్యోన్ముఖులవుతారు. ప్రయాణాలు, ప్రజాహిత కార్యక్రమాలు మీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. రాతపనులు, రచనా వ్యాసంగాలు మీ ప్రాధాన్యతను ఇనుమడింపజేసేవిగా ఉంటాయి. ధన లోపం ఉండదు.

వృషభం (ఏప్రిల్ 21 - మే 21)
మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. కార్యవర్గం చురుకుగా పని చేస్తూండటంతో వ్యవహారాలు వేగం పుంజుకుంటాయి. నిలిచిపోయిన పనులు కొన్ని గాడిలో పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయనవచ్చు. ప్రత్యర్థులు, భాగస్వాములు మీ ప్రత్యేకతను, గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు. కుటుంబావసరాలు సకాలంలో తీర్చగలుగుతారు.

మిథునం (మే 22 - జూన్ 21)

మొండితనం, పట్టుదల వీడి కొన్ని విషయాలలో ఇతరుల అభిప్రాయాలు మన్నించడం అవసరం. 23, 24 తేదీల్లో ఆందోళన, అసహనం పెరిగినా మిగతా రోజులు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కుటుంబ వ్యక్తులు, భాగస్వాములు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. తెగువ చూపించి కొన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. బహుముఖ ప్రజ్ఞావంతులయిన వారితో చర్చించి మీ సమస్యలకు మార్గాంతరాలు తెలుసుకుంటారు. మిత్రులను సందర్శిస్తారు.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23)
ఇన్సూరెన్స్, రవాణా, ఆర్థిక రంగాల్లో నూతన పరిణామాలు ఏర్పడి మీకు ఆలోచనలను కలిగిస్తాయి. లక్ష్యసాధనలో ఏకాగ్రత చూపి అందరికంటే ముందుంటారు. క్షణం తీరిక లేకుండా పనిచేసి, సగంలో ఆగిన పనులను ఓ కొలిక్కి తీసుకువస్తారు. మీ వల్ల అభివృద్ధి, లాభం పొందినవారు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. వాయిదాలు, బాకీలు చెల్లించి సంతృప్తి పొందుతారు. ప్రయాణాలు వాయిదా పడవచ్చు.

సింహం (జూలై 24 - ఆగస్టు 23)
మీరూహించిన విధంగా పనులు సాగుతున్నా తెలియని ఆందోళన, మనస్తాపం కలుగవచ్చు. సోదర వర్గంతో సంబంధాలు మెరుగవుతాయి. పోగొట్టుకున్న పరువు, ప్రతిష్ఠ తిరిగి సాధించే సూచనలున్నాయి. తలవని తలంపుగా వృత్తి, వాణిజ్యాలలో వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి. పరోక్ష సహకారం అందించి కుటుంబ వ్యక్తుల అభివృద్ధికి కారకులవుతారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబర్ 23)
భారీ అంచనాలతో వ్యవహారాలను ప్రారంభించినా ఏ విషయంలోనూ ఏమరుపాటు పనికిరాదు. డబ్బు విరివిగా ఖర్చు చేసి కావలసిన వనరులు సమకూర్చుకో గలుగుతారు. మనోభీతిని వీడి, ప్రశాంతచిత్తంతో ఆలోచించడం శుభకరం. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు మెరుగవుతాయి. సంతానం, విద్యకి సంబంధించిన ప్రయత్నాలు ప్రోత్సాహకరంగానే ఉంటాయి. చర్చలు, సమావేశాల ద్వారా మీ అనుమానాలు కొన్ని నివృత్తి చేసుకోగలుగుతారు.

తుల (సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23)
ముఖ్యావసరాలపై దృష్టి నిలిపి వారాంతానికి ఫలితాలు అందుకుంటారు. మీ మీద అలిగిన వారు తిరిగి మీ వద్దకు చేరుతారు. పరిస్థితులను వివరించి సహచరులకు మార్గాంతరాలు తెలియజేస్తారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దే బాధ్యతను మీద వేసుకుంటారు. నూతన ప్రవర్తనా నియమావళికి రూపకల్పన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యాసం మీ మానసిక శక్తిని ద్విగుణీకృతం చేస్తాయి. ఆదాయం పెరుగుతుంది.

వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 23)
ప్రత్యర్థుల అసంబద్ధ చర్యలకు చింతించాల్సిన పనిలేదు. ఇతరులపై ఆధారపడక మీకున్న అవకాశాలను సక్రమంగా వినియోగించుకోండి. రావలసిన ధనం ముందు వెనుకలుగా మీ చేతికందుతుంది. ఒప్పందాలు, రాతపనులు పునః పరిశీలన చేసి ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఆస్తి లావాదేవీలు వాయిదా వేయడం ఉత్తమం. చింతలు వదిలి చిత్తాన్ని కేంద్రీకరించడం శ్రేయస్కరం.

ధనుస్సు (నవంబర్ 24 - డిసెంబర్ 22)
ఇతరులు మీ మీద సవారీ చేస్తున్నట్లనిపించినా చింతించకండి. సమయమిస్తే వారి తప్పును వాళ్లే సరిదిద్దుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, దినచర్యలు సక్రమంగానే సాగుతాయనవచ్చు. విందులు, వివాహాలకు కావలసిన వనరులను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. 25, 26 తేదీల్లో వ్యవహారాల్లో విజయం, సమాలోచనల ద్వారా నిర్ణయాలు ఉల్లాసాన్నిస్తాయి.

మకరం (డిసెంబర్ 23 - జనవరి 22)
సూక్ష్మదృష్టితో పరిశీలించి వ్యవహారాలను సక్రమ మార్గంలో నడిచేట్లు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చోటు చేసుకున్నా నిలదొక్కుకొని లక్ష్యాలను చేరుకుంటారు. శుక్ర శనివారాలు కుటుంబ విషయాల్లో, క్రీడా సాంస్కృతిక రంగాల్లో మెరుగైన ఫలితాల నిస్తాయనవచ్చు. ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. మాటలు పొదుపుగా వాడితే కొన్ని వివాదాలు తలెత్తకుండా ఉంటాయి.

కుంభం (జనవరి 23 - ఫిబ్రవరి 20)
వివిధ రంగాల్లో మీకున్న పరిజ్ఞానం ఈ వారంలో ఉపయోగపడుతుంది. శ్రద్ధాసక్తులు ప్రదర్శించి నూతన విషయాలు ఆకళింపు చేసుకుంటారు. శారీరక శ్రమ తగ్గి, ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ వ్యక్తుల అభివృద్ధికై మీరు చేసే కృషి సంతృప్తికర ఫలితాల నిస్తుంది. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆత్మస్థైర్యాన్ని పెంపు చేసుకోగలుగుతారు. ఆదాయం బ్యాంకు నిల్వలు పెంపుచేసేదిగా ఉంటుంది.

మీనం ( ఫిబ్రవరి 21 - మార్చి 20)
పరిమిత వనరులున్నా సక్రమంగా వినియోగించి అందరినీ సంతృప్తిపరుస్తారు. సరళ రీతిలో ఆలోచించి, రాబోయే ఇబ్బందులకు తగిన తరుణోపాయాలు వెతుకుతారు. వృత్తిపరంగా మీ కృషికి తగిన గౌరవాదరాలు పొందుతారనడంలో సందేహం లేదు. తాత్కాలిక శ్రమ, వత్తిడి ఉన్నా శాశ్వత ప్రయోజనాల నాశించి అన్నింటినీ భరిస్తారు. రాజకీయ, సామాజిక రంగాల్లో మీ కృషి వివిధ వర్గాలలో నూతన ఆలోచనలు రేకెత్తిస్తాయి. వందిమాగధులను అదుపు చేయండి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20)
english title: 
yela vundii vaaram
author: 
ఎస్.రవిప్రకాశ్

నేర్పరితనమా? నేర్వనితనమా?

$
0
0

‘ఏవండీ.. వింటున్నారా?’ అని అమ్మలు అంటుంటే - ‘ఆ.. వింటున్నానే’ అంటూ జవాబును పెదాలకు అప్పజెప్పి తన ఆలోచనల్లో మునిగిపోతున్న నాన్నలను మనమందరం చూస్తూనే ఉన్నాం. ఇది మన ముందరి తరం తీరు.
ఈ తరంలో అయితే- పేరు పెట్టి పిలిచి ‘లిజన్’ అని బెటర్ హాఫ్ అంటుంటే ఆ లిజన్‌ని ఆర్డర్‌గా పరిగణించి పక్కనే చేరి వినటానికి రెడీ అయిపోవటం అదర్ హాఫ్ విజన్ అయిపోతోంది.
విన్నా వినకపోయినా ఆ తరంలో ఎడబాటు ఉండేది కాదు. పొరపాట్లు ఉన్నా వాటిని తడబాట్లుగానే కొట్టిపారేసేవారు. ఏదీ యూనివర్సల్ ప్రాబ్లమ్ అనిపించేది కాదు.
ఇప్పుడు కూడా ఎడబాట్లు లేవు.. తడబాట్లు లేవు. పొరపాట్లు లేవు.. అన్నట్టుగానే ఉంటోంది. ఏ క్షణాన చూసినా అన్యోన్య దాంపత్యమే అనిపిస్తోంది.. కనిపిస్తోంది. అయినా ఆలుమగల మధ్య లేని దూరం ఆ మనసులలో పెరిగిపోతోంది. చిరు విముఖతా శాశ్వత సమస్య అయిపోతోంది. మూడు ముళ్ల బంధంలో మూడడుగులు వేసిన పురాణ పురుషుడు దర్శనమిస్తున్నాడు.
‘వినదగు నెవ్వరు చెప్పిన’ అని అనిపిస్తున్నా ‘వినదగు నెవర్ చెప్పిన’ అన్న భావం బలమై కూర్చుంటోంది.
అసలు మనం ‘ఎవర్’ అనీ ‘నెవర్’ అనీ విరుద్ధ ఆలోచనలను పెంచుకుంటున్నామా? లేక పంచుకుంటున్నామా అన్నది ప్రశ్న.
* * *
ఈ మధ్య - ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన స్నేహితురాల్ని కలవటానికి వెళ్లి మాట్లాడుకుంటూ అన్ని వార్డులను కలియ తిరుగుతుండగా మూడు పదుల డాక్టర్ స్టెతస్కోప్‌తో తలవంచుకుని వడివడిగా ఔట్ పేషెంట్ వార్డు వైపు వెళ్తుంటే-
‘బాబూ! ఒక్క మాట’ అంటూ ఆపి ఆ డాక్టర్‌ని పరిచయం చేసింది మిత్రురాలు. ఇంతకీ ఆ డాక్టర్ ఆ స్నేహితురాలి పుత్రరత్నమే. పరిచయాలయిన తర్వాత ‘అయినా, తెలీక అడుగుతాను.. ఈ డాక్టర్లు అంతమంది పేషెంట్లు ఎదురుచూస్తూ, కళ్లప్పగించి చూస్తుంటే అలా తలవంచుకు వెళ్లిపోతారేమిటి?’ అన్నాను.
‘తలవంచుకోకపోతే - అందరూ తెలిసిన పేషెంట్లే అయి ఉంటారు - ఎందరినని విష్ చేయాలి? ఎందరికని ప్రిఫరెన్స్ ఇవ్వాలి?’ అంది.
డాక్టర్లు చూసీచూడనట్టు - ప్రొఫెషనలిజమ్‌లో ఎవరూ నా వారు కాదన్నట్టు - రయ్‌మని దూసుకుపోవటంలోని సైకాలజీ ఇదన్నమాట!
ఈ ఆలోచనతో కృష్ణుడు, అర్జునుడు, గీతోపదేశ ఘట్టం కళ్ల ముందు మెదిలింది. దాదాపుగా అర్జునుడి పరిస్థితీ ఈ డాక్టర్ వంటిదే అనిపించింది.
* * *
బాణాన్ని ఎక్కుపెట్టటమే తరువాయి అనుకుని మురిసిపోతున్న కృష్ణుల వారు ఇంకా అర్జునుడు బాణాన్ని సంధించక పోతుండటంతో సందేహిస్తూ వెనుతిరిగి చూస్తే బిక్కమొహంతో పార్థుడు-
అదిలించాల్సింది రథాశ్వాలను కాదు - కదిలించాల్సింది అర్జునుడి భావోద్వేగాలను అని ఇట్టే తెలిసిపోయింది ఆ పురుషోత్తముడికి. ‘వినదగు ఎవ్వరు చెప్పిన’ అన్న రీతిలో చెబితే ఫల్గుణుడు ‘నెవర్’ అంటాడేమోనన్న శంకతో ‘నీ’ ‘నా’ తత్వసారాన్ని వీనుల విందయ్యేటట్లు, మనసును వశీకరణం చేసుకునేటట్లు చెప్పాడు. ఆ బోధతో విజయుడికి విశ్వదర్శనమైంది. ఆ ఉపదేశమే ‘శ్రీ మద్భగవద్గీత’గా నిత్యం పఠనీయమైంది తరతరాలకు.
మొత్తానికి సకల ధర్మాల సారంగా గీత మిగిలిపోయింది. అయినా తలకెక్కించుకుని మన గీతల్ని మనం చెరిపేసుకోలేక పోతున్నాం. గీతలో ఒక ఫిలాసఫీ ఉంది.. ఒక సైకాలజీ ఉంది.. ఒక ఆంత్రపాలజీ ఉంది. మన తత్వాలను, వ్యక్తిత్వాలను, మనస్తత్వాలను, మానవ పరిణామాన్ని, చరిత్ర గతిని మార్చగల రహస్యాలున్నాయి.. జీవ సూత్రాలున్నాయి.. జీవన ధర్మాలున్నాయి.
* * *
అంతెందుకు మన వేమనా ఇటువంటి పనే చేశాడు - ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్న రీతిలోనే - ‘విశ్వదాభిరామ వినుర వేమా’ అంటూ - భక్తి, రక్తి, ముక్తి, యుక్తులుగా సాగే జీవన చట్రాన్ని మన ముందుంచాడు. ‘ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు’ అంటూ అలతి అలతి పదాలతో సోషియాలజీని, సైకాలజీని కలగలిపాడు. రక్తి- అనురక్తులలో, భవ-్ధన బంధాలలో ఫిలాసఫీని, థియోసఫీని రంగరించాడు. అందుకే వేమన ఒక సామాజిక శాస్తజ్ఞ్రునిలా, ఒక మనో విశే్లషకుడిలా, ఒక కౌన్సిలర్లా అనిపిస్తాడు. పైగా ధర్మాన్ని అల్లంత దూరాన ఉంచక మానవ తత్వానికి ఆభరణం చేశాడు.
* * *
There is a flavor in blood and a sweetness in tears అని ఖలీల్ జిబ్రాన్ అంటాడు. ‘ఫ్లేవర్ ఇన్ బ్లడ్’ అన్న పదం విన్నపుడల్లా చదువు సంధ్యల మధ్య మరుగున పడిపోయిన ‘సీజన్ ఆఫ్ బ్లడ్’ అన్న పదబంధం మనసు పొరల నుండి పలకరిస్తూనే ఉంది. జీవితం రక్తరుతువుతో జీవకళను సంతరించుకుంటున్నట్లనిపిస్తుంటుంది. మనకు తెలిసిన ఆరు రుతువులకు ఈ రక్త రుతువును కలుపుకుంటే ఏడు రుతువులయి జీవితం ఇంద్రచాపమే అవుతుంది.
ఇంతకీ అశ్రువులలో అమృత తత్వాన్ని, అరుణిమలో పసిమిని చూడగల నేర్పరితనం ఈ జీవితానికి ఉందా? నేర్వనితనం జీవితానిదయితే బ్లడ్‌లోని ఫ్లేవర్‌ను, టియర్స్‌లోని స్వీట్‌నెస్‌ను తెలుసుకోవటం ఈ జన్మకు సాధ్యం కాదు కాక కాదు. జీవితాన్ని బంగారు పళ్లెంలో అందిస్తున్నా స్వీకరించగల సత్తా మనకుండాలి కదా! అతిథిలా ఈ పుడమిపైకి వచ్చినప్పటికీ నేల తల్లి ఆతిథ్యాన్ని అందుకోగల సంసిద్ధత మనకుండాలి కదా!
ఉప్పూ కర్పూరమూ ఒక్కలానే ఉంటాయి అన్నట్టుగా దుఃఖాశ్రువులయినా, ఆనందాశ్రువులయినా ఒక్కలానే ఉంటాయి. రెండూ కన్నీళ్లే! కాని అవి కనుకొలకుల నిలవటానికి కారణాలైన భావోద్వేగాలు వేరువేరు.. జలజలమని రాలిన తర్వాత మనిషికి మిగిల్చే స్థితి వేరువేరు. జీవితాన్ని దొర్లించేస్తూంటే ఉప్పగానే ఉంటుంది. జీవితాన్ని కదిలించగలిగితే కర్పూరమే అవుతుంది. ఉప్పులేని కూర రుచికరం కాదు - అందుకే వంటలో ఉప్పు కరుగుతుంది. కర్పూరం మంటలా ఎగస్తుంది - జీవితమూ కర్పూరంలా రగలాలి.
కేవలం మనిషిగా బ్రతికి తనువును చాలిస్తే సరిపోదు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగి వ్యక్తిత్వాన్ని వ్యక్తిమత్వం చేసుకుంటేనే మన అస్తిత్వం ఆదర్శం అయ్యేది.
ఇంతకీ తెల్లగా కనిపించిన కర్పూర కళిక ఎర్రని మంటలా కావటంలో ఫ్లేవర్ ఇన్ బ్లడ్ కనిపించటం లేదూ..! స్వీట్‌నెస్ ఇన్ టియర్స్ తెలియటం లేదూ! కరిగిపోయే జీవితంలో కరగని తత్వం ఒకటుంది - దానిది వ్యక్తిత్వం మనస్తత్వం కలగలిసిన నేపథ్యం. *

వినదగు
english title: 
vinadagu
author: 
-డా.వాసిలి వసంతకుమార్ 9393933946

పానీపూరీ

భోషాణం - కథ

$
0
0

అప్పుడే తెల్లారింది. ఇంకా పూర్తిగా మెలకువ రాలేదు. ఇంతలో ఫోన్ మోగింది. అలా పడుకునే సెల్ అందుకుని ‘హలో’ అన్నాడు సత్యం.
‘ఒరే, సత్యం, పొద్దునే్న నిద్ర లేపి ఒక విషాద వార్త చెప్పాల్సి వచ్చింది. ఈ రోజు ఉదయానే్న మీ బామ్మ పోయిందిరా. నిన్న రాత్రి వరకు బాగానే ఉంది. రాత్రి ఫలహారం చేసి పడుకున్నాక, ‘ఒరే, రాముడూ! కొంచెం ఆయాసంగా ఉందిరా’ అంది. ఎసిడిటీ అయ్యుంటుందని వెంటనే రెండు చెంచాలు ఏంటేసిడ్ పట్టాను. మళ్లా పడుకుంది. తెల్లారే నాలుగో గంటకి లేచిపోయి తన పనులు చేసుకుంటుంది. అలాంటిది ఇంకా లేవలేదేమిటి చెప్మా అని వెళ్లి చూస్తే ఊపిరాడ్డం లేదు. కదిపి చూశాను. ఉలుకూ పలుకూ లేదు. ఎందుకైనా మంచిదని పక్కింట్లో డాక్టరు చదువుతున్న అబ్బాయుంటే పిలిచి చూపించేను. ప్రాణం పోయి చాలాసేపయ్యిందని చెప్పేడు. నిద్దట్లోనే సునాయాసంగా చనిపోయింది పుణ్యాత్మురాలు. మనకే కష్టం మిగిల్చింది’ బామ్మ చావుని వివరించి చెప్పేడు రామం చిన్నాన్న. నిద్ర బద్ధకమంతా వదిలిపోయింది. స్థాణువులా కూర్చుండిపోయాడు.
‘హలో, హలో వింటున్నావా?’ అన్నాడు చిన్నాన్న.
‘ఆ..ఆ’ అన్నాను. అంతకు మించి మరే మాటా నోటి వెంట రాలేదు.
‘రాత్రి చాలాసార్లు నినే్న తలచుకుంది. తల్లీ దండ్రిలేని పిల్లాడు. ఒక్కడే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఎన్ని కష్టాలు పడుతున్నాడో పాపం. చూసి చాలా రోజులయ్యింది. ఒక్కసారి రమ్మని చెప్పరా రామం అని కంటతడి పెట్టుకుంది’ తరువాత ఏవేవో చెప్పేడు చిన్నాన్న. అన్నిటికీ ఊ.. ఆ అంటున్నాడే తప్ప ఏవీ బుర్రలోకి ఎక్కడం లేదు. బామ్మ ఆలోచనలతోనే మనస్సంతా నిండిపోయింది.
* * *
అదొక పల్లెటూరు. బ్రాహ్మణ వీధిలో సత్యం తండ్రి సుబ్బారావు, చిన్నాన్న రామారావు కలిసి ఒక పెద్ద పెంకుటింట్లో ఉండేవారు.
సుబ్బారావుకి ఒక్కడే కొడుకు సత్యం. సత్యం హైస్కూల్‌లో చదువుతూండగానే తల్లి తండ్రి అంటువ్యాధి సోకి చనిపోయారు. అప్పట్నించీ చిన్నాన్న దగ్గరే పెరిగాడు. వాళ్లకి ఒక్కత్తె కూతురు. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తారింటికి పంపేశారు. సత్యంకి బామ్మ దగ్గర చనువెక్కువ. బామ్మకి కూడా సత్యం అంటే ప్రాణం. ఎంత అల్లరి చేసినా భరించేది. పెద్దవాళ్లెవరైనా కోప్పడితే ఒప్పుకునేది కాదు. ఒకసారి బామ్మ స్నానం చేసి మడికట్టుకుని దేవుడి గదిలో పూజ చేసుకుంటోంది. సత్యం పరిగెత్తుకుంటూ వచ్చి బామ్మని వెనక నించీ పట్టుకుని ఊపుతూ
‘బామ్మా! బామ్మా! ముందు నాకు ప్రసాదం చేతిలో పెట్టి తరువాత పూజ చేసుకో. నేను వీధిలో ఆడుకోడానికి వెళ్లిపోవాలి’ అని మారాం చెయ్యడం మొదలుపెట్టాడు.
‘ఓరి భడవకానా! ఉండరా! మడిలో ఉన్నప్పుడు నన్ను ముట్టుకోకురా అంటే వినవు కదా! ఉండు మళ్లా స్నానం చేసి వచ్చి నీకు ప్రసాదం ఇస్తాను. అందాకా ప్రసాదం ముట్టుకోకు’ ఇదంతా చూసిన తండ్రి సత్యం వీపు మీద రెండు దెబ్బలు వేసి,
‘ఏరా! బామ్మ మడిలో ఉండగా ముట్టుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాలిరా! నువ్వు చేసిన పనికి చూడు ముసల్ది రెండోసారి మళ్లీ చన్నీళ్ల స్నానం చేస్తోంది. ఇప్పుడే ఆటలూ పాటలూ వద్దు. వెళ్లి పుస్తకం తీసి చదువుకో. రోజురోజుకీ నీ ముద్దు మరీ ఎక్కువై పోతోంది’ అని కేకలేశాడు.
‘ఒరే సుబ్బూ! వాణ్ణేం అనకురా. పసివాడు, వాడికేం తెలుస్తుంది మన మడులూ తడులూ. చూడు పాపం ఎలా ఏడుపు మొహం పెట్టాడో!’
‘ఆ.. అన్నీ వేషాలే. వాడికన్నీ తెలుసు. నువ్వనుకున్నంత అమాయకుడేం కాదు. అనవసరంగా ముద్దు చేసి వాణ్ణి మొద్దులా తయారుచేస్తున్నావు’ అని అక్కడ్నించి వెళ్లిపోయాడు తండ్రి.
తల్లిదండ్రుల దగ్గరకన్నా బామ్మ దగ్గరే పిల్లలిద్దరి బాల్యమంతా గడిచిపోయింది. వాళ్లకి అన్నం కలిపి ముద్దలు చేసి తినిపించేది. కథలు చెప్తూ జోలపాటలు పాడుతూ వాళ్లని పడుకోబెట్టేది. ఒకసారి మండువాలో చూరు కింద ఉన్న భోషాణం పెట్టె చూస్తూ సత్యం బామ్మని అడిగేడు.
‘బామ్మా! అంత పెద్ద పెట్టె మనింట్లోకి ఎలా వచ్చింది. ఎవరు తెచ్చేరు’
‘్భడవా! తెలిసే అడుగుతున్నావా? నా నోటినించి వినాలని మళ్లీ మళ్లీ అడుగుతుంటావు’
‘లేదు బామ్మా! ఒట్టు. నాకు నిజంగా తెలీదు. ఇంతకు ముందు నువ్వు చెప్పినప్పుడు నాకు నిద్రొచ్చింది. పడుకున్నాను. సరిగ్గా వినలేదు’
‘బామ్మా! బామ్మా! చెప్పవూ!’ సత్యం చెల్లి కూడా వంత పాడింది.
‘సరే, మీ సరదా ఎందుక్కాదనాలి. అది మీ తాతగారికి మా పుట్టింటి వాళ్లు పెట్టిన సారెతో వచ్చింది’
‘అంత పెద్ద పెట్టెందుకు? చిన్న సూట్‌కేసులు ఇవ్వొచ్చు కదా. ఎంచక్కా వాటిలో బట్టలూ, బొమ్మలూ పెట్టుకోవచ్చు కదా! ఇంత పెద్ద పెట్టె మూత కూడా తియ్యలేక పోతున్నాం’ అన్నాడు సత్యం.
‘అది బొమ్మలు, బట్టలు పెట్టుకోడానికి కాదురా! ఇత్తడి, కంచు సామాన్లు అవసరమైతే ధాన్యం పప్పులూ ఉప్పులూ దాచుకోవడానికి’
‘అంత పెద్ద పెట్టి తాతగారు ఎలా తీసుకొచ్చారు?’
‘అసలు తాతగారు వద్దనే అన్నారురా. అయినా మా వాళ్లు వినలేదు. అది మన సంప్రదాయం. భోషాణంతోపాటు సారె పంపకపోతే మా ఊళ్లో ఎంతో నామోషీ. నలుగురూ నానా రకాలుగా అనుకుంటారు అని పది మంది మనుషుల్ని సాయం ఇచ్చి మరీ పంపించారు. అదిగో అలాగొచ్చింది భోషాణం మనింటికి’
‘అయితే తాతగారి మాట నువ్వు వినలేదన్నమాట’ వెక్కిరించినట్టుగా అన్నాడు సత్యం.
‘నేను వినడమేమిటిరా భడవా! పెద్దవాళ్లు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. మధ్య నేనెవర్తిని. చచ్చి ఏ లోకంలో ఉన్నాడో మహానుభావుడు. నన్నిలా ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయాడు. ఆ భోషాణాన్ని చూస్తూ ఆయన్ని తలుచుకుంటూ ఏదో ఇలా గడిపేస్తున్నాను’
‘మేమందరం ఉన్నాం కదా! నువ్వొంటరి దానివెలా అయ్యావు?’ మనవడి మాటలకి మురిసిపోయిన ముసల్ది రెండు బుగ్గల మీదా ముద్దులు కురిపిస్తూ
‘అవునర్రా! మీరందరూ ఉండబట్టే నా ప్రాణం వెనక్కి లాగేస్తోంది. లేకుంటే ఎప్పుడో వెళ్లిపోయి మీ తాతగారిని కలుసుకొని ఉండేదాన్ని.
* * *
వెంటనే సెలవు కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. రెండు మూడు నెలలు పోయాక ఒకసారి ఆ ఊరు వెళ్లి వద్దామని బయల్దేరాడు. దారిలో అంతా బామ్మ గురించి తలచుకుంటూనే ఉన్నాడు. బామ్మ లేకపోయినా కనీసం భోషాణం చూస్తే బామ్మని చూసినట్లుగా ఉంటుందని అనుకున్నాడు. పది ఆరు మూడు అడుగుల భోషాణం మూత పైకి లేపాలంటే ముచ్చటగా ముగ్గురైనా ఉండాలి. బావురుకప్ప లాంటి పెద్ద ఇత్తడి తాళం. అది తెరవడానికి బారెడు పొడవైన చెవి. అన్ని పక్కలా ఇత్తడి నగిషీలు. ఇంటికొక అలంకారంగా ఉండేది.
చిన్ననాటి ఊరికి చేరువలోకి వచ్చేశాడు. అదిగో అదే వీధి. వీధి ముందు పెద్ద బావి. బావి చుట్టూ పచ్చని వృక్షాలు. చిన్నప్పుడూ ఊగుతూ ఆడుకొనే ఊడలమర్రి. ఇంకా అలాగే మరిన్ని ఊడలతో ఆహ్లాదంగా ఉంది. వృక్షాలను నరికేసే అన్యాయపు అభివృద్ధి ఛాయలు ఇంకా ఈ పల్లెకు చేరనందుకు సంతోషించాడు సత్యం. ఆడవాళ్లందరూ బావి చుట్టూ చేరి చేదలతో నీళ్లు తోడుకొని బిందెలు నింపుకుంటున్నారు. ఎవరితో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదుగాని నవ్వులూ ఎకసెక్కాలతో అంతా గోలగా ఉంది. సత్యం అటువేపు రావడం చూసి వాతావరణం ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయింది. అందరూ అతని వేపే చూస్తూ చెవులు కొరుక్కోవటం మొదలెట్టేరు. వాళ్ల చూపుల తూపులని తప్పించుకుంటూ గుసగుసల ప్రశ్నార్థకాలని వినీ విననట్టు నటిస్తూ, తన అంతరాంతరాల్లో నిత్యం విహరించే వీధిలోకి అడుగుపెట్టాడు సత్యం. అదిగో అదే ఇల్లు. పెద్దపెద్ద స్తంభాలూ, వెను వరండా లోగిలి, ముంగిట ముచ్చటైన ముగ్గులతో, జిగేలుమంటున్న జేగురు రంగు మెట్లతో పసిడి ఛాయతో మెరిసిపోతున్న గుమ్మం. దారుశిల్పాలతో ధగధగలాడుతున్న ద్వారం. కచేరీ చావడి దాటి మండువా లోగిలిలోకి అడుగుపెట్టాడు. అటూ ఇటూ చూచాడు. భోషాణం ఉండవలసిన జాగా బోసిపోయి ఉంది. నిరాశా, నిస్పృహ, నిస్త్రాణతో కుర్చీలో కూలబడ్డాడు. ఇంతలో పిన్ని వంటింట్లోంచి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ మంచి నీళ్లందించింది. చిన్నాన్న కూడా వీధిలోంచి వచ్చి
‘ఏరా! ఇప్పుడేనా రావడం? ముందుగా కబురు పంపించి వుంటే ఎవర్నైనా బండి ఇచ్చి స్టేషనుకి పంపించి ఉండేవాణ్ణి కదా! ఎండలో ఇంత దూరం నడుచుకొని వచ్చావా?’ పలకరించాడు.
‘్ఫర్వాలేదు చిన్నాన్నా. అనుకోకుండా సెలవు దొరికింది. వెంటనే బయల్దేరి వచ్చేశాను. అయినా నాకు తెలియని ఊరా ఏమిటి. పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ అన్నీ అలానే ఉన్నాయా ఏమైనా మార్పు వచ్చిందా అని చూసుకుంటూ తాపీగా వచ్చేను’
‘సరే స్నానం చేసిరా. భోజనం చేద్దువుగాని. ఏ వేళప్పుడు తిన్నావో ఏమిటో?’ అంది పిన్ని.
స్నానం చేసి, భోజనాలయ్యాక అప్పుడు తాపీగా భోషాణం గురించి అడిగేడు సత్యం. వినసొంపుగా లేని వింత కథ చెప్పాడు చిన్నాన్న.
‘్భషాణంలో పాత్రలు ఈ రోజుల్లో ఎవరు వాడుతున్నార్రా. అందుకని అవి అలా దాచి ఉంచడం ఎందుకని పెళ్లిళ్లకి, శుభకార్యాలకి వంటలు చేసే లక్ష్మాజీ అడిగితే అమ్మేసేను’ ఇంతలో పిన్ని అందుకుంది.
‘మన దగ్గర పనిచేసేవాడు పాలేరు అప్పిగాడు నీకు తెలుసు కదా! వాడి కూతురికి పెళ్లి సంబంధం కుదిరితే సారెగా ఇవ్వడానికి భోషాణం కావాలని అడిగేడు. మనం ఎలాగూ వాడటం లేదుకదా. పోనీ ఈ విధంగానేనా ఒక ఆడపిల్లకి సారెగా ఇస్తే పుణ్యమొస్తుందని వాడికిచ్చేశాం’
‘వాడికి ఊరికే ఇచ్చుండరు. ఎంతో కొంత వసూలు చేసే ఉంటారు’ అనుకున్నాడు సత్యం.
‘్భషాణం గురించి అడుగుతున్నావు. కొంపతీసి నీగ్గాని కావాలేమిట్రా చెప్పు. ఇక్కడ ఇంకెవరి దగ్గరన్నా ఉంటే తీసుకుంటాను’ అన్నాడు చిన్నాన్న.
‘ఏం లేదు చిన్నాన్నా. దాన్నిచూస్తే బామ్మని చూసినట్టుగా ఉంటుందని అలా అడిగేను. అంతేకానీ అపార్ట్‌మెంట్‌లో చిన్న ఫ్లాట్‌లో ఉంటున్న నేను భోషాణం ఎక్కడ పెట్టుకుంటాను. అది సరే పాలేరు అప్పిగాడు ఊరి చివర ఆ ఇంట్లోనే ఉంటున్నాడా?’
‘ఆ.. అక్కడే ఉంటున్నాడు. కానీ భోషాణం పిల్లకి సారెగా పంపించేసి ఉంటాడు. అది నీకెక్కడ కనిపిస్తుంది’ ప్రయత్నించడం అనవసరం అన్నట్టుగా మాట్లాడేడు చిన్నాన్న.
‘సరే నా ప్రయత్నం నేను చేస్తాను. భోషాణం ఒక్కసారి చూడాలని ఉంది’ అని పాలేరు ఇంటికి బయల్దేరేడు. పాలేరు అప్పిగాడు అది ఎంత కష్టం మీద పిల్లతో పంపించేడో వివరిస్తూ ఆ ఊరు ఎక్కడుందో చెప్పేడు. అది ఈ ఊరికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒక అద్దె సైకిల్ తీసుకుని ఆ ఊరికి బయల్దేరాడు సత్యం. అక్కడ వాకబు చేసుకుంటూ ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. ఇంటి లోపలి నుంచి ఒక పెద్ద మనిషి బయటికొచ్చి
‘ఎవరు కావాలి బాబూ?’ అని అడిగేడు. సత్యం పాలేరు పేరు చెప్పి అతను సారెగా ఇచ్చిన భోషాణం ఒక్కసారి చూసి పోదామని వచ్చేనని చెప్పేడు.
‘బోసానం సూడాలని ఉందా? సరే రా’ అని ఇంటి వెనక వైపు తీసికెళ్లాడు.
‘అదిగో అయే బోసానం బల్లలు. కొంపలో దాసుకోడానికి జాగా నేక ఆ పెట్టిని బయట్నే ఉంచీసినాం. ఎండకి ఎండి, ఓనకి తడిసి పాడైపోతూంతే సూడనేక ఇదిగో ఇనాగ కుర్చీలు, బల్లలూ సేస్తున్నాం’ అన్నాడు ఆ పెద్దమనిషి.
నీడనిచ్చి, పర్యావరణాన్ని రక్షించే వందల ఏళ్లనాటి పచ్చని చెట్లని నగరాభివృద్ధి నెపంతో మునిసిపాలిటీ వాళ్లు నిర్దాక్షిణ్యంగా, దుర్మార్గంగా నరికేస్తుంటే ఎంత బాధ పడ్డాడో మళ్లా అలాంటి బాధే ఇవాళ అనుభవించాడు సత్యం. భోషాణం భాగాలని రంపంతో కోస్తుంటే, బామ్మ శరీరాన్ని కోసేస్తున్నట్టుగా అనిపించి ఆ దృశ్యాన్ని చూడలేక, అక్కడ ఉండలేక వచ్చేశాడు సత్యం.
బామ్మని తలచుకుంటూ, భోషాణం విషాద గాథని జీర్ణించుకోలేక చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ ఆ ఊరితో రుణం తీరిపోయిందని నిట్టూరుస్తూ బరువెక్కిన హృదయంతో తిరుగు ప్రయాణం కట్టాడు. *

డా.దేవరకొండ సహదేవరావు
103, కుటీర్ అపార్ట్‌మెంట్స్, 9-29-22/1, బాలాజీనగర్,
సిరిపురం, విశాఖపట్నం - 530 003.
0891-2703129, 9393331562

అప్పుడే తెల్లారింది. ఇంకా పూర్తిగా మెలకువ రాలేదు
english title: 
katha
author: 
డా.దేవరకొండ సహదేవరావు

దిశ దశను మారుస్తుందా?

$
0
0

వాస్తుశాస్త్రం చాలా గొప్ప శాస్త్రం. చాలామంది మహర్షులు ఈ శాస్త్రాన్ని వారివారి గ్రంథాలయిన సంహితలలో ఉటంకించారు. రామాయణ, భారత, పురాణాలలో కూడా మనకు వాస్తు శాస్త్ర రీత్యా గృహ నిర్మాణాలు జరిపిన అంశాలు ఉటంకింపబడినవి.
దేవశిల్పి విశ్వకర్మ మనకు ఇతిహాస పురాణాలలో దేవతలకు గృహ నిర్మాణములు చేయించి ఇచ్చిన దృష్టాంతాలు ఎక్కువగా కనపడుతుంటాయి. తర్వాత స్థానం మయునిది. అంతటి గొప్ప శాస్త్రం ప్రకారం మనం ఇల్లు నిర్మించుకుంటే మనకు జాతకంలో వున్న చెడు యోగాలు పోవడం, మంచి యోగాలు రావడం జరుగుతాయా? అంటే బ్రహ్మ లిఖితం ప్రకారం వున్న యోగాలు పోవు కానీ చెడు సమయంలో వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది.
ప్రశాంత జీవనం కోసమే మనవారు శాస్త్రాల రూపాలలో వాస్తు శాస్త్రం, రత్నశాస్త్రం, యోగశాస్త్రం, వేదాంత శాస్త్రం, రుద్రాక్ష ధారణ, యంత్రముల గొర్చి ఆగమశాస్త్రం వంటివి యిచ్చారు. ఇవి అన్నీ మనిషికి ప్రశాంతతను అందిస్తాయి. కానీ లలాట లిఖితం మార్చదు. విశ్వకర్మ వాస్తుమయ వాస్తు గ్రంథాలు సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. రాముడు అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి జాతక యోగం ప్రకారం 14.10.2015న వివాహం అని ఉన్నది. అతను వాస్తు సరిగా లేని ఇంట ఉన్నాడు. అతనికి 2013 నుండి 2015 వరకు అనేక సంబంధాలు చూసి అవి ఏవీ కుదరక చివరకు వాడికి వివాహం కాదేమో అని భయపడి ఎన్నో పూజలు వ్రతాలు చేసి చాలా ఖర్చు చేసి విసుగు పొంది చివరకు 14.10.2015న వివాహం చేస్తారు. ఒకవేళ రాముడు వాస్తు ప్రకారం వున్న ఇంటిలో వుంటే చాలా సరదాగా సింపుల్‌గా ఒకటి లేదా రెండు సంబంధాలు చూసి 2015 అక్టోబర్ వరకు వివాహం కాలేదు అనే నిరాశ చెందక ఎటువంటి అనవసర ప్రయత్నాలు చేయకుండానే 14.10.2015న వివాహం చేసుకుంటాడు. వాస్తు ప్రకారం దాని ప్రభావం రాముడి మీద చూపించక మానదు. కానీ రాముడి జాతకంలో రాసి వున్న బ్రహ్మ లిఖితం మాత్రం మారదు. గమనించండి.
మరొక ఉదాహరణ. కృష్ణ అనే వ్యక్తికి అప్పులు వున్నాయి అనుకుందాం. అతడు వాస్తు బాగా వున్న ఇంటిలో వున్నాడు. అతడి జాతకరీత్యా 2018 నవంబర్‌కు అప్పులు తీరే అవకాశం లేదు. అలాంటప్పుడు అతడికి వాస్తు బాగా పనిచేసి అప్పులు ఇచ్చిన వారి నుండి ఏ విధమైన ప్రతిబంధకాలు రాకుండా వత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవనం చేసే అవకాశం వాస్తు గృహం కలుగజేస్తుంది. అదే ఒకవేళ వాస్తు బాగాలేని ఇంటిలో కృష్ణ నివసిస్తే అతడికి అప్పులు ఇచ్చినవారు అందరూ అతడి మీద వత్తిడి తీసుకురావడం, అతడికి ప్రశాంతత లేకుండా చేయడం, అంతేకాక చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో కూడా అతడి జాతకరీత్యా రాసి వున్న విధంగా 2018 నవంబర్‌కు అప్పులు తీరుస్తాడు. అప్పులు తీర్చే డేట్ మారదు.
వాస్తు ప్రభావంగా అప్పులు తీరేవరకు ప్రశాంతత, అశాంతి అనేవి వత్తిడి అనేది వాస్తు ప్రకారం ఉంటాయి. ప్రతి మానవుడికీ స్థానబలము చాలా అవసరం. రోజువారీ జరిగే ఘటనల ప్రభావంగా మనిషి నడవడి మారుతుంది. దానికి వాస్తు ప్రభావం పని చేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాఖ్య పురుషార్థ ఫలసిద్ధయే - శీతవాతాది రక్షార్థం వాస్తుపూర్ణ గృహే భవేత్ - మనిషి ప్రశాంతతకే వాస్తు కానీ మన లలాట లిఖితం కానీ యోగాలు వాస్తు ద్వారా మనకు అందవు. వాస్తు బాగున్న ఇంటిలో అందరూ సంతానవంతులు కానివారు ఉంటారు. అందరూ విద్యావంతులు కాని వారు ఉంటారు. వృత్తిరీత్యా స్థిరపడని వారుంటారు. అలాంటి దృష్టాంతాలలో బ్రహ్మలిఖితం తప్పదు అనే వాదన వస్తుంది.
అయితే ప్రతి మనిషి మీదా ఎంతవరకు వాస్తు ప్రభావం ఉంటుంది అనే విషయమై శాస్త్రాన్ని పూర్తిగా శోధించాలి. వాస్తురీత్యా ఇల్లు కట్టుకుంటే ఆయుర్దాయం పెరగడం, వాస్తురీత్యా కట్టకపోతే ఆయుర్దాయం తగ్గడం వంటివి వుండవు. పుట్టిననాడే ఆయుర్నిర్ణయం జరిగిపోతుంది. అలాగే ఆయుష్కాలం యొక్క ప్రశాంత జీవనానికి వాస్తు శాస్త్రం ఉపయోగపడుతుంది. *

సందేహాలు - సమాధానాలు
సుదర్శన్
ప్రశ్న: నేను ఏ దిశ సింహద్వారం వున్న ఇల్లు తీసుకోవాలి?
జ: పడమర ముఖంగా ఇంటి నుండి బయటకు వచ్చే విధంగా వున్న ఇల్లు మీకు బాగా నప్పుతుంది. అంటే పడమర సింహద్వారం నప్పుతుంది.
రాజేష్ (హైదరాబాద్)
ప్రశ్న: నైరుతిలో బీరువా తప్పక ఉంచాలా?
జ: ధనం నిల్వ వుంచే బీరువా అయితే నైరుతికి ప్రాధాన్యం లేదు. కేవలం బట్టలు, బీరువా, ఎత్తు కోసం, బరువు కోసం నైరుతిలో వుంచడం ప్రాధాన్యం చేశారు.
లక్ష్మి (నెల్లూరు)
ప్రశ్న: బాగా ఎత్తుగా ఉండే గేటు తూర్పు వైపు ఉంచవచ్చా?
జ: ‘అంతర్ద్వారాత్ బహిర్ద్వారం నోచ్ఛం నసంకటం’ అని శాస్త్రం. అనగా సింహద్వారం కంటే ప్రహరీ ద్వారం (గేటు) ఎత్తు ఉండకూడదు. అలాగే వెడల్పు తక్కువ వుండకూడదు. అందువల్ల ఇంటిలో వున్న ద్వారం కంటే ఎత్తు తక్కువగా వుండే ప్రహరీ ద్వారం ఉంచవచ్చు. ప్రహరీ ఎత్తుకంటే ఎక్కువ ఎత్తుగా ఉండే గేటు పెట్టరాదు.

వాస్తువాచకం
english title: 
vaasthu vaachakam
author: 
సుబ్బరామ సోమయాజులు

సిసింద్రీ

$
0
0

ఎవరి గొప్పవారిదే..! - కథ
-ఎన్నవెళ్లి రాజవౌళి
నా నడకల్లో హొయలుంది. నా పరుగులో సరిగమ ధ్వనులున్నాయ్. నాలో తేనె తీపి ఉందని పశుపక్ష్యాదులు, మానవులు నన్ను తాగకుండా ఉండలేరు. నాకంటె గొప్ప ఈ పృథ్విలోనే ఏదీ లేదని గొప్పలు పోతూ మురిసిపోయింది నది.
వంకలు తిరుగుతూ, పాయలు పాయలు గా నవ్వుతూ వుండే నాకంటె- కొండరాజు ఏమి గొప్పనో చెప్పడానికి నా దగ్గరకు రమ్మనమని ప్రశ్నలు సంధిస్తూ గాలితో కబురంపింది నదీమతల్లి.
ఆ మాటలతో కొండరాజు దగ్గరకు చేరిన వాయువు-
‘కొండరాజా.. కొండరాజా.. మీరున్న దగ్గరనే ఉంటారట. కదలడు మెదలలేడుట. ఒడ్డూ పొడవూ వుండగానే సరిపోదు. ఓ పాట లేదు. మాట లేదు. నాతో ఎందులో సరితూగగలడో వచ్చి నాతో చెప్పమంటుంది నదీమతల్లి’ అంది.
ఆ మాటతో నవ్వి ఊరుకున్నాడు గిరిరాజు.
‘చెప్పరేం రాజా.. నేను మళ్లీ నదీమతల్లి దగ్గరకు వెళ్లక తప్పదు. నదీమతల్లి తన ప్రశ్నలకు జవాబు తేలేదని నా దప్పిక తీర్చదేమో?’
‘ఆవేశమొద్దని చెప్పు మలయమారుతమా! కాలమే నిర్ణయిస్తుందని నా మాటగా చెప్పు’
‘మంచిది ప్రభూ! వెళ్లొస్తా’ అంటూ మలయమారుతం నమస్కరించి నదీమ తల్లి వద్దకు వెళ్లింది.
కొండరాజు తొణకకుండా కూర్చున్న దగ్గర నుండి లేవకుండానే, నిర్ణయాన్ని కాలానికే వదిలేసిన సంగతి చెప్పడంతో-
గాలి చెప్పిన మాటలకు నదీమతల్లి గలగల నవ్వింది.
‘అందుకే నీ కబుర్లను గాలి కబుర్లని మానవులు ఎగతాళి చేస్తారు. కాలమట.. కాలం.. ఏంజేస్తుంది కాలం. చేతకాక, చావలేక, తన బరువు తనకే బరువై కూర్చున్న దగ్గర నుంచీ లేవలేక అన్న మాటలివి.
నీకు అడుగ రాలేదు. గిరి రాజుకు చెప్ప రాలేదు’ అని అంటుండగానే-
మలయమారుతానికి కోపం తీవ్రమైంది. మలయమారుతానికి దుమారం తోడైంది. గాలి దుమారం విసుర్లకు చెట్లు విరిగి పడ్డాయి. సముద్రం తుపానై పొంగింది. కుంభవృష్టి కురిసి నదిలో కలిసింది.
నది ఎముకలు విరిగేటట్లు పరుగును పెట్టించింది. తాళలేక వెళ్లి పర్వతుని పాదాలపై పడింది నది.
అక్కడ కొంత సేదతీరిన తర్వాత-
‘క్షమించు గిరిరాజా. నీ పరాక్రమం తెలియక మలయమారుతంతో ఏవేవో అవాకులు చెవాకులు పేలాను. నీ చేతులే నన్ను ఆపకుంటే నా ఎముకలన్నీ నీళ్లలా మారేవి’
‘ఇందులో క్షమించాల్సింది ఏమీ లేదు నదీమతల్లి. నా అవసరం నీకెంత ఉందో.. నీ అవసరం నాకు అంతగానే ఉంది’
‘నా అవసరమా? అదెటుల’
‘నీ స్పర్శతో నాపైన ఔషధ మొలకలు పులకరిస్తాయి. చెట్లు చిగురిస్తాయి. ఇవి మానవాళి మనుగడకు ఉపకరిస్తాయి.
ఇంతేకాక, పశుపక్ష్యాదులకు, క్రిమి కీటకాదులకు, జంతుజాలానికి ప్రాణం పోస్తాయి. వాతావరణ సమతుల్యానికి ఆయువు పట్టవుతుంది. అందుకే నిన్ను నదీమ ‘తల్లీ’ అని సంబోధిస్తారు.’
‘ప్రకృతితో నా సంబంధం ఇంతగా ముడిపడి ఉందా?’
‘ప్రకృతితో నీ, నా సంబంధాలే కాక, సముద్రుడు, గాలి, సూర్యుడు, నేల, ఆకాశం కూడా ఉంటుంది. కాని నీలా ఏవీ విర్రవీగినా ప్రకృతి నాశనానికేగాని, శుభానికి కాదని గ్రహించాలి’
‘క్షమించు గిరిరాజా! చచ్చిన పామును చంపకు. నీ మాటలు ఈటెల్లా నాకు గుచ్చుకున్నాయి. మళ్లీ ఎప్పుడూ గర్వపడను’ అంటూ నదీమతల్లి వంకలలో, ఒర్రెలలో కలుస్తూ మెల్లగా సాగిపోతుండగా- గిరిరాజు వెళుతున్న నదీమతల్లిని చూస్తూ తనలో తనే ముసిముసిగా నవ్వుకున్నాడు. *

స్ఫూర్తి

పంజరం
ప్రతిజ్ఞ వేసవి సెలవుల్లో ఓ రోజు తన తల్లిదండ్రులతో నెహ్రూ జూపార్క్ చూడడానికి వచ్చింది. తల్లి ఇంటి దగ్గరే వండి, హాట్ బాక్స్‌లో లంచ్ తీసుకువచ్చింది.
అక్వేరియంలోని రంగురంగుల చేపలని, ఎన్‌క్లోజర్స్‌లోని మొసళ్లని, పాములని ఇంకా కుందేళ్లు, తెల్లటి ఎలుకలు, గినియా పిగ్స్‌ని చూశాక ప్రతిజ్ఞ తండ్రి చెప్పాడు.
‘ఇప్పుడు అడవి జంతువులని చూద్దాం పదండి’
వివిధ ఎన్‌క్లోజర్స్‌లోని పులులు, చిరుతలు, జీబ్రాలు, ఏనుగులు, నక్కలు, జింకలు, అడవి పిల్లులు.. ఇంకా అనేక ఇతర వన్య మృగాలని చూశాక వాళ్లు తిరిగి వస్తూ ఓ పంజరంలోని బాల్డ్ ఈగిల్‌ని చూసారు. నార్త్ అమెరికా ఖండానికి చెందిన అది గాయపడిందని, దాని పక్కన గల బోర్డు మీద రాసి ఉంది. అది చదివిన ప్రతిజ్ఞ చెప్పింది.
‘అరె పాపం! ఒంటరిగా ఉంది’
‘దానికి బాగయ్యాక తిరిగి ఇతర బాల్డ్ ఈగిల్స్ ఎన్‌క్లోజర్‌లో దాన్ని ఉంచుతారు’ ప్రతిజ్ఞ తల్లి చెప్పింది.
అంతా ఓ బెంచీ మీద కూర్చున్న ప్రతిజ్ఞ తల్లి డిస్పోజబుల్ ప్లేట్స్‌లో కాటీ రోల్స్ (గుజరాతీ వంటకం) వడ్డిస్తూంటే తండ్రి చెప్పాడు.
‘కొందరు మనుషులు కూడా పంజరాల్లో ఉంటారు’
‘నిజంగా? ఏరీ? లంచ్ అయ్యాక అక్కడికి తీసుకెళ్లి వాళ్లని చూపించు నాన్నా’ ప్రతిజ్ఞ ఆసక్తిగా అడిగింది.
‘జూలో అలాంటి మనుషులు లేరు. నేను పోల్చి చెప్పానంతే’
‘వివరంగా చెప్పు నాన్నా’
‘మనుషులు పాపం అనే పంజరంలో చిక్కుకుని కష్టాలని అనుభవిస్తూంటారు. ఆ పంజరం ఊచలని వంచేది ఒక్కటే. పుణ్యం. చెడ్డ పనులు చేస్తే దాని ఫలితంగా ఏర్పడే పంజరంలో మనిషి చిక్కుకుంటూంటాడు. మంచి పనులు చేస్తే ఫలితంగా లభించే పుణ్యం ఆ పంజరాన్ని ఛిన్నాభిన్నం చేసేస్తుంది. కాబట్టి మనం ఏం చెయ్యాలి?’
‘పాపపు పనులు చేయకుండా పుణ్యపు పనులు మాత్రమే చెయ్యాలి కదా?’
‘అవును’
‘ఐతే అమ్మకి పుణ్యం రాదు. జూకి వస్తూ ఇక్కడి కోతులకి తినిపించడానికి వేరుశెనగ పప్పు తెద్దామంటే అమ్మ వద్దంది’ ప్రతిజ్ఞ చెప్పింది.
‘తెచ్చి వాటికి తినిపిస్తే మనకి పాపం వచ్చేది. వాటికి అవసరమైన ఆహారాన్ని జూ వాళ్లే పెడతారు. సందర్శకులు తమకు తోచింది తాము తెచ్చి ఇష్టం వచ్చినట్లు పెడుతూంటే, వాటికి అనారోగ్యం చేస్తుంది. అది పాపమే అవుతుంది. అందుకే ‘డోంట్ ఫీడ్ ఏనిమల్స్’ అనే బోర్డుని జూలో ఉంచారు’ తండ్రి చెప్పాడు.
‘దీన్నిబట్టి నువ్వో పాఠం నేర్చుకోవచ్చు. మనం పాపం ఎందుకు చేస్తాం? అది మనకి ఆనందాన్ని ఇస్తుందని చేస్తాం. ఐతే అది ఇతరులకి దుఃఖాన్ని ఇస్తుందన్న సంగతి గ్రహించం. అందువల్లే మనుషులు పాపం అనే పంజరంలో చిక్కుపడుతుంటారు. ఏ పనైనా జాగ్రత్తగా ఆలోచించి, అందువల్ల మనకి ఆనందం కలుగుతుందని గాక, ఇతరులకి దుఃఖం కలుగుతుందా అని ఆలోచించి చేయడం నేర్చుకోవాలి’ ప్రతిజ్ఞ తల్లి వివరించింది.
-మల్లాది వెంకటకృష్ణమూర్తి

చేసి చూద్దాం
మీ కడుపుచేసే శబ్దాలు

మీ కడుపు చేసే శబ్దాలు ఎలా ఉంటాయి? ఒక్కొక్కప్పుడు కడుపులో శబ్దాలు విన్పిస్తూ ఉంటాయి. కడుపు విడుదల చేసే శబ్దాలు వినడానికి ఇలా చేసి చూడండి.
ఒక మైక్రోఫోన్‌ను టేపు రికార్డర్‌తో కలపండి. టేపురికార్డర్‌లోని రికార్డు బటన్‌ని నొక్కాలి. మైక్రోఫోన్‌పై ఎక్కువగా వత్తిడి కల్గించకుండా దానిని కడుపునకు అదిమి ఉంచాలి.
రికార్డింగ్ జరిగేటప్పుడు మైక్రోఫోన్‌ను కదపకూడదు. రికార్డింగ్ ఒక నిముష కాలం చేయాలి. ఆ తరువాత టేపును రివైండ్ చేసి ఏం రికార్డింగ్ అయినది వినాలి.
మీకు వినిపించే శబ్దాలన్నీ కడుపు చేసే శబ్దాలే! కడుపు ఎందుకు శబ్దాలు చేస్తుంది అనే సందేహం వస్తుంది. మనం భుజించిన ఆహారం కడుపులో జీర్ణం అవుతూ ఉంటుంది. ఇలా జీర్ణం అయ్యే సమయంలో విడుదలయ్యే వాయువులు చేసే శబ్దాలు ఇవన్నీ.

-సి.వి.సర్వేశ్వరశర్మ

ఎవరి గొప్పవారిదే..! - కథ
english title: 
sisindri

కిరణ్మయ కల 16

$
0
0

ఉపానం నుంచి స్తూపిదాకా- అంటే గోపురం దాకా దేవాలయంలో కొన్ని అంతస్తులు కనిపిస్తాయి. ఒక్కొక్క అంతస్తును ‘విమానం’ అంటారు.’’
ఇదో విశేషమా? అది చూపటానికా నన్ను మభ్యపెట్టి తీసుకువచ్చారు. మీ మగవాళ్లంతా ఇంతే’’.
‘‘మీ ఆడాళ్లేం తక్కువా? ముక్కుకు తాడు వేసి ఆడించటానికి మేమేమైనా డూడూబసవలమా?’’- ‘బోల్ రాధా బోల్’
కిరణ్మయి నవ్వుతూనే వున్నది. ఇప్పుడు ఆ నవ్వుచూచి ఆనందించటానికి వీల్లేదు. ఆ నవ్వు మెల్లగా బుగ్గసొట్టల్లోకి జారే వైనం మనోనేత్రానికి స్పష్టంగానే కనిపిస్తూ వున్నది.
‘‘నువ్వలా కూచుని డాన్స్ చేస్తే ఎలాగమ్మా? బండి బోల్తా కొడుతుంది’’.
‘‘కొడితే కొడుతుంది. అన్నీ చూచుకోటానికి మీరున్నారుగా’’
‘‘ఈసారి నువ్వు కళ్లు మూసుకుని పడితే నేను మాత్రం ఒప్పుకోను’’
‘‘పోనీ కళ్లు తెరుచుకుని పడనా?’’
‘‘నేను పడిపోయాను. విను. ఒకే చోట మూడు విమానాలు ఈ త్రికూటాచలంలో కనిపిస్తుంది. అదే విశేషం’’.
‘‘అయితే పడండి. హేమకూటం చూడాలని వుంది.’’
‘‘అలాగే కానివ్వండి. రాణీవారి ఆజ్ఞ. శిరసావహించక తప్పుతుందా?’’
‘‘హేమకూట సింహాసనం మీద శ్రీకృష్ణదేవరాయల్ని కూచోపెట్టి పురందరదాసు ఓ పాట రాశారు. మాయా మాళవగౌడ రాగం అది.’’
‘‘పాడు మరి. మన సింహాసనం ఇలా ముందుకు సాగుతూనే వుంటుంది.’’
‘‘ఉహు నాకు సిగ్గేస్తున్నది’’- స్కూటర్ పక్కన పడేసి ఇద్దరూ కాలినడకన హేమకూటం చేరుకున్నారు.
‘‘ ‘తాళం’ అంటే ఆ కనిపించే మొదటి అంతస్తు ‘మంటపం’ అంటే ఒక పెద్ద గదిలాంటిది. దేవాలయంలో ఎన్ని మంటపాలైనా వుండొచ్చు. ఆ దేవాలయం అధిష్టాన దేవతకు దగ్గరగా ఓ చిన్న గది వుంటుంది. అలా చూడు. అది అర్థమంటపం. దేవాలయానికి ఎదురుగా ప్రవేశమార్గంలో వున్న మంటపాన్ని ముఖమంటపం అని పిలుస్తారు. గుడిలా పైన కనిపిస్తున్న గూడు వుండే- దాని పేరు ‘పంజరం’.
ఇదుగో! ఇక్కడ రెక్టాంగులర్ షేప్‌లో వుంది చూడు. దీన్ని ‘శాల’ అని పిలుస్తారు.
‘‘తాళం ఏమిటో తెలిసింది. అంతరాళం అంటే?’’
‘‘మంటపాన్ని గర్భగుడిలో కలిపే మార్గం. నీ గుండెలోతులు కాదులే’’
ప్రత్యగాత్మ ఆలయ శిల్పశాస్త్రం గురించి చెబుతూ వుంటే కిరణ్మయిలో అనుమానం మరింత పెరుగుతున్నది. ఇతను మహారాజు. మారువేషంలో ఇలా మాయచేస్తున్నాడు. ద్వారబంధం దగ్గర కిరణ్మయి భుజం పట్టుకుని ఆపి, సీలింగు వైపు చూడమన్నాడు ప్రత్యగాత్మ.
****
నృత్యగణపతి, నాట్యభంగిమలో అమ్మవారు, రెండు ఏనుగులు, వాటి తొండాల మధ్య ఓ కుండ. దానిపైన పువ్వు. పువ్వు అడుగుభాగాన పద్మపీఠం కనువిందు చేశాయి. చుట్టూ బారెడు జడలతో మగరాయుళ్లు శంఖాలు పూరిస్తూ చుట్టూ తిరుగుతున్నారు. గణపతి విగ్రహాలు బోలెడు కనిపించాయి. గణపతి అంటే కిరణ్మయికి చాలా ఇష్టం.
‘‘మగాళ్లకి అంత పెద్ద జడలా?’’ అన్నది ముక్కుమీద వేలు వేసుకుని కిరణ్మయి. అనే్నసి బొజ్జగణపతి బుజ్జి విగ్రహాలు ఎక్కడా చూడలేదు.
‘‘అప్పుడు ఇలాంటి తేడాలుండేవి కాదు. అయినా తమరి జడకన్నా పెద్దది కాదుగా’’ పట్టుకుని లాగాడు.
‘‘అబ్బ.. వదలండి’’ అన్నది చిరుకోపంగా. ‘మగాడికి చనువిస్తే నిలువునా ముంచేస్తాడు’ అంటుంది మలయవాసిని.
‘‘ఇప్పుడు మాత్రం మీ ఆడాళ్లు ఏం తక్కువ తిన్నారని? జీన్స్ ప్యాంట్లు తగిలించుకుని మగరాయుళ్లని మించిపోయారు’’
ఆకస్మికంగా ఒక గబ్బిలపు కుటుంబం అమాంతం లేచి గుళ్లో నుంచి తలమీదుగా ఆకాశంలోకి ఎగిరింది. కిరణ్మయి కెవ్వుమంటూ భయంతో ప్రత్యగాత్మను వాటేసుకున్నది. ఆ చప్పుడు భయంకరంగా వున్నది’’.
‘‘మీసం ఒకటి తక్కువ. మేమూ మగాళ్లమే అంటారు పైగా. గబ్బిలాలు వెళ్లిపోయాయి. కళ్లు తెరవవచ్చు’’.
‘‘చూచింది చాలు. నన్ను రూంకి చేర్చండి. బట్టలు సర్దుకోవాలి’’.
కిరణ్మయి ప్రయాణం ప్రత్యగాత్మకీ బాధాకరంగా వుంది.
‘‘దయచెయ్యండి’’
‘‘నన్ను సాగనంపాలనుకుంటున్నారు కదూ?’’
‘‘అయ్యో! దేవుడా! నేనెప్పుడన్నాను. అయినా నేనూ ఆగమంటే ఆగిపోలేవా?’’
కిరణ్మయి బుంగబూతి చందం అలుకలోనే బాగుందనిపించింది. తనకీ వెళ్లాలని లేదు. కాని, వెళ్లక తప్పదు.
కిరణ్మయి బస్సెక్కించి అటు తిరిగి కిటికీ దగ్గర నుంచున్నాడు ప్రత్యగాత్మ. అది బయలుదేరటానికి సిద్ధంగానే వున్నది. విసిరేసినట్టు ప్యాసింజర్లు ఎక్కడపడితే అక్కడ కూచున్నారు. బస్సు సగం ఖాళీగానే వుంది. డ్రైవరు రెడీగానే వున్నాడు. కండక్టర్ కోసం ఎదురుచూస్తున్నట్లున్నది.
‘‘ఓ మాట అడగనా?’’- కిటికీ ఊచలు పట్టుకుని తల బయటికి పెట్టి అడిగింది కిరణ్మయి.
‘‘ఒకటేం ఖర్మ, అడగాలనుకున్నవన్నీ అడిగేయ్’’
‘‘మీరు నిజంగా టూరిస్టుగైడా? ఒట్టేసి చెప్పండి’’- ఊచలమధ్య కుడి చేయి చాచింది ముందుకు.

- ఇంకాఉంది

ఉపానం నుంచి స్తూపిదాకా- అంటే గోపురం దాకా దేవాలయంలో కొన్ని అంతస్తులు కనిపిస్తాయి.
english title: 
k
author: 
ఉప్పు రాఘవేంద్రరావు

రంగనాథ రామాయణం 279

$
0
0

వెంటనే రామదేవుడు ఒక దొనలోని శరాలు మరొక దొనలో దూరిన భంగి అతడి నోటి నిండుగా నిష్ఠుర నారాచాలు నింపివేశాడు. దానవుడు సింహనాదులు చేయ వీలు చిక్కక వికృత స్వరాలు, జంకెన చూపులు చూపుతూ దగ్గరగా వచ్చినాడు. అపుడు రాముడు ఆ కుంభకర్ణుడిని ఇంద్రాస్త్రంతో కొట్టాడు. రఘుపతి తీవ్ర విశిఖం వేయగా ఆది మధ్యాహ్న భాస్కరుడి చందంగా బ్రహ్మదండం మాదిరిగా- వేగంగా మంటలు క్రక్కే వాయువు రీతిగా ఎర్రని మంటలు చిమ్ముతూ వచ్చి దిక్కులు ప్రతిధ్వనించే పగిది కుంభకర్ణుడి రొమ్మును దూసుకొనిపోయి అవనిలో దూరింది.
అంతలోనే రామ ధరణీశ్వరుడు అంతకాస్త్రం సంధించి వదలాడు. అప్పుడు అఖిల దిక్కులు మారుమ్రోగ, బ్రహ్మాండాలు అవిసిపోగా, స్ఫుటంగా భూమి పటపట పగుల, సకల ప్రాణులు చైతన్యం కోల్పోవ నూరుకోట్ల కాల చక్రాలు ఒక్కటై రివ్వున వచ్చు రీతిగా, బడబాగ్ని వడివడిగా వ్యాపించే కరణి చౌలకూటం మృత్యురూపం గైకొన్న మాదిరి విచ్చలవిడిగా పరుగెత్తి వేగంగా వచ్చి ఆ ఘోర శరము గొప్పదైన నల్లని కొండ వైఖరి వున్న ఆ కుటిల రాక్షస వీరుడి శిరాన్ని త్రుంచివేసింది. ఆ విధంగా తెగిపోయిన అతడి తల బెడిదంగా సవ్వడులు చేస్తూ లంకలోపల పడింది.
అప్పుడు లంకలోని ఉన్నత గోపురాలు, హర్మ్యాలు పొడిపొడి అయి రాలి ధూళిలో కలిసిపోయాయి. ఆ దేహం పాటుకి పదివేల వానరులు మడిశారు. సముద్రంలోని జలచరయూధాలు బెదరిపోయాయి. ఆ కుంభకర్ణుడి కళేబరం సగం పృథివిపైన సగం జలధిలోను కూలి పడింది. ఆ భయంకర శబ్దానికి సముద్రాలు కల్లోలం అయాయి.
ధరణి కంపించింది. దిక్తటాలు పగిలాయి. లంకేశ్వరుడి ఉల్లం వ్రయ్యలు అయింది. లంకలో రాక్షసుల కోలాహలం అగ్గలం అయింది. లోకాలు సంతసించాయి. వానరాధిపులు సంతోష సాగరంలో ఓలలాడారు. జగద్విఖ్యాత వీరుడు రాముడు కుంభకర్ణుడిని చూసి తనలో తాను చిరునగవు తళుకొత్త ఈ పుడిమిని కూలిన కుంభకర్ణుడు దేవలకన్న, దిక్పతులకన్నా మించిన వీరుడు. ఇంక లోకాలకు ఎన్నడూ భీతి వుండదని ఆనందించాడు. విజయ లక్ష్మిని చేపట్టి రామభద్రుడు తేజరిల్లాడు. ఉగ్రరాహువు కబళించి విడిచిపెట్టగా ప్రకాశించే విమలార్కుడిలా వెలుగొందాడు.
అనంతరం దనుజులు మదులతో దుఃఖం మల్లడికొన, విన్నబోయి, వదనాలు వెలవెలపోయి, రావణాసురుడికి కుంభకర్ణుడి మరణ వర్తమానం విన్నవించడానికి పరుగులు పెట్టారు. రాక్షసులు హతశేషులు లంకశ్వరుడితో ‘‘దేవా! నీ అనుజుడు దేవతలను జయించినవాడు, దిశలు తానే అవుతూ అసమాన సాహహంతో ఆ హవ కేళి సల్పి పాల కడలిని మందరాత్రి కలచి తిరుగాడే క్రియ వానర సేనాజలధిని ఇటు అటు చేసి, ఇంద్రాది దేవతలు వెక్కసము పడిగా యుద్ధం కావించి తుదకు శ్రీరామ బాణాగ్నికి వివశుడై, దగ్ధుడయి ఉసురులు బాశాడు’’ అని విన్నపం చేశారు.
అంత రాక్షసేశ్వరుడు రామవిభుడి చేతిలో తన మరణం తథ్యం అన్నవిధంగా మూర్ఛిల్లి ధారణిమీద పడిపోయాడు. అతికాయుడు అధిక శోకతప్తుడు అయిపోయాడు. దేవాంతకుడు ధైర్యం కోల్పోయి శోకించాడు. త్రిశిరుడు దిక్కు చాలని మాడ్కి నివ్వెరపోయాడు. దనుజ వీరవరులు మహోదర మహాపార్శ్వులు చేష్టలుడిగి కొయ్యబొమ్మలు అయిపోయారు.
రావణుడు కుంభకర్ణడి
మరణమునకు శోకించుట
కొలది సమయానికి రావణుడు మూర్ఛతేరుకొని పలు పర్యాయాలు కుంభకర్ణుణ్ణి తలపోసికొంటూ దుర్వారుడై దుఃఖించాడు. దుర్భర శోకంతో కుమిలిపోయాడు. ఇంక నేను రాఘవ వైరాంబునిధిని ఏ తెప్పతో దాటుతాను? రామలక్ష్మణులను ఏ గతినైనా ఆజిలో హతామార్చి వేస్తానని నేను తలచుతూ వుండగా ఓ ఏకాంగవీరా! రాఘవుడి చటుల మహాశరవహ్ని జ్వాలలకు ఈ రీతిగా ఆహుతి కాగలవని కలనైనా తలపనయాను. ఓ నిర్ణిద్ర పరాక్రమా! నిద్రారతుడివి. నేడీ భంగి సుదీర్ఘ నిద్ర పాలపడి పోయావా?

-ఇంకాఉంది

వెంటనే రామదేవుడు ఒక దొనలోని శరాలు మరొక దొనలో దూరిన భంగి అతడి నోటి నిండుగా నిష్ఠుర నారాచాలు నింపివేశాడు.
english title: 
r
author: 
శ్రీపాద కృష్ణమూర్తి

సద్గురు సన్నిధి - శిష్యునికి పెన్నిధి!

$
0
0

‘దేవుడు ఉన్నాడా? ఉన్నచో అతనిని మనము చూడగలమా?’ అని మనసులో నాటుకున్న దృఢమైన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికై పరితపించుచున్న వివేకానందస్వామి (అసలుపేరు నరేంద్రనాథ్ దత్తా)కి రామకృష్ణ పరమహంస యొక్క దివ్య స్పర్శతో దేవుని ఉనికికి సంబంధించిన సమస్త సందేహాలూ పటాపంచలై భగవత్సాక్షాత్కారం లభించిన విశేషం ప్రతి భారతీయునికే కాక యావజ్జగత్తుకే సుపరిచితం. రామకృష్ణ పరమహంస వంటి సద్గురువు లభించుట వివేకానందుని పూర్వజన్మ సుకృతము. ఆధ్యాత్మిక మార్గానికి, దైవ సంబంధిత విశేషాలకు, దేవుని రూప గుణాది లక్షణాలకు, దైవలీలను చక్కగా కళ్ళకు కట్టినట్లుగా వివరించే పురాణేతిహాసాలకు... వీటన్నింటికీ సంబంధించిన లెక్కకు మిక్కిలి సందేహాలను శిష్యుల మనోఫలకములనుండి సంపూర్ణంగా తొలగించి వారి హృదయాలను భగవన్నిలయాలుగా తీర్చిదిద్దే మానవ రూప దైవమునకు పేరే సద్గురువు.
సద్గురువును సేవిస్తే సాక్షాత్తూ పరమేశ్వరుని సేవించినట్లే. సద్గురువు యొక్క పాద పద్మములు స్పర్శతో పాపాగ్ని పూర్తిగా ఆర్పివేయబడి దుర్లభమైన ముక్తిమార్గం సులభతరంగా లభించునని ఎందరి జీవితాలకో సంబంధించిన ఎన్నో యదార్థ సంఘటనలు సుస్పష్టం చేసాయి. వివేకానందునికి రామకృష్ణ పరమహంస యొక్క దర్శన భాగ్యం లభించకపోయినట్లైతే వివేకానందునిలో ఆవిర్భవించిన ‘దేవుడు ఉన్నాడా?.. ఉన్నచో అతనిని మనము చూడగలమా?’ అన్న అనుమానం సంవత్సరముల తరబడి అలాగే ఉండిపోయి వివేకానందుని ఆధ్యాత్మిక మార్గం ప్రారంభం కాకముందే అంతమై వుండెడిది. తత్ఫలితంగా వివేకానందుని అమూల్యమైన, అమృతతుల్యములైన బోధలు ప్రపంచానికి అందివుండెడివి కావు. ప్రపంచంలోని కోటానుకోట్ల యువకులను సన్మార్గంలో నడిపించి మహోన్నత శిఖరాలను అధిరోహించే రీతిలో దోహదపడే మహిమాన్వితమైన గ్రంథములు జీవం పోసుకొని అవనిజనులకు అందుబటులో ఉండెడివి కావు. భరతమాత తనువుకు అణువణువూ సహజసిద్ధంగా అలముకున్న ఆధ్యాత్మిక పరిమళములు ప్రపంచ దేశాలకు వెదజల్లబడి యుండెడివి కావు. భారతీయులలో సహజసిద్ధంగా నిక్షిప్తమైవున్న నీతి, నిజాయితీ, క్షమాగుణం, అతిథి సత్కాం, శరణాగత రక్షణ, ప్రత్యుపకారమే కాక అపకారికి సైతం ఉపకారం, ప్రతి జీవినీ దైవంగా పరిగణించి సేవించడం.. ఇత్యాది పరమ సాత్త్విక గుణాలు బాహ్య ప్రపంచానికి వెల్లడయ్యేవి కావు. భరతమాత కీర్తి పతాక విశ్వవినువీధులలో ఎగురవేయబడి సగటు భారతీయుని హృదయ సంద్రం నుండి ఆనందకెరటాలు ఉవ్వెత్తున ఎగసే అవకాశం లభించెడిది కాదు. ఇంతవరకూ మనం ఒక కోణంలో ఆలోచించాం.. ఇందుకు భిన్నమైన కోణం మరొకటి వుంది. అదేమిటంటే.. సద్గురువు లభించినంత మాత్రముననే శిష్యుని జీవితం ఆనందదాయకమవుతుందని, ఆ శిష్యుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించి పునీతుడవుతాడని, ఆదర్శప్రాయుడై భావితరాలచే స్మరించబడేటంత ఉన్నత స్థాయికి ఎదుగుతాడని భావించడం సబబు కాదు. ఏ వ్యక్తికైతే సద్గురు సన్నిధి లభించినదో ఆ వ్యక్తి మనసులో దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి, తల్లిదండ్రుల పట్ల భయభక్తులు.. ఇవన్నీ ఉండడంతో పాటు ఏదో సాధించాలి- ప్రపంచానికి నావలన కొంతైనా మేలు జరగాలి- నా భరతమాత నా ప్రవర్తనను చూసి సంతృప్తి చెందాలి అనే తపన ఉన్నప్పుడే శిష్యునికి లభించిన సద్గురు సన్నిధి పవిత్రతను సంతరించుకుంటుంది. మహత్తరమైన ఈ మానవ జన్మ భగవన్నామ స్మరణతో పులకించిపోతూ ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తువులోనూ దైవం యొక్క ప్రతిరూపాన్ని కనులారా తిలకించి తరించిపోతూ అర్థ, కామములను ధర్మబద్ధంగా స్వీకరించి మోక్షం పొందుటకు నిర్దేశింపబడిన ఉత్తమ మార్గమైన ఆధ్యాత్మిక మార్గంలో పయనించి అనిర్వచనీయమైన ఆనందానుభూతిని సొంతం చేసుకోవడానికై పరితపిస్తూ చివరికి దైవంలో ఐక్యం అయ్యే మహద్భాగ్యాన్ని సొంతం చేసుకోవడానికై ఉద్దేశింపబడి ప్రసాదింపబడినది. ఎందరో సద్గురువులకు, మరెందరో ఆణిముత్యాలైన శిష్యగణానికి నిలయం ఈ భారతావని. అటువంటి భరతమాతకు బిడ్డలై జన్మించుట పూర్వజన్మ సుకృతం.

మంచిమాట
english title: 
s
author: 
-అల్లాడి వేణుగోపాల్

రాశిఫలం

$
0
0
Date: 
Tuesday, July 23, 2013 - 22
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్ర్తిలు చేసే వ్యవహారాల్లో సమస్యలెదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది.
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. అకాల భోజనంవల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. కలహాలకు అవకాశముంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష) గృహంలో మార్పును కోరుకుంటారు. స్వల్ప అనారోగ్యం ఉంటుంది. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయ. స్ర్తిలతోతగాదాలు ఏర్పడవచ్చు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయ. కొన్ని పనులు వాయదా పడతాయ. ప్రయాణాలు లాభం ఉంటాయ.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతన కార్యాలు ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించరాదు.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. దైవకార్యాలు చేస్తారు.
దుర్ముహూర్తం: 
ఉ.08.24 నుండి 09.12 వరకు తిరిగి రా.10.48 నుండి 11.36 వరకు
రాహు కాలం: 
....................
వర్జ్యం: 
ఉ.11.16 నుండి 12.47 వరకు
నక్షత్రం: 
ఉత్తరాషాఢ .07.30
తిథి: 
బహుళ పాడ్యమి రా.09.42
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు.

.......

$
0
0
crossimage: 
Date: 
Tuesday, July 23, 2013
Viewing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>