* శారీరక అందాన్ని పెంచుకునేందుకు ఖరీదైన సౌందర్య సాధనాలను, బ్యూటీ క్లినిక్‌లను ఆశ్రయించనక్కర్లేదు. ఇంట్లో నిత్యం వాడే కూరగాయలు, పండ్లు, పూలతో అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. తరచూ క్యారట్ రసాన్ని ముఖానికి రాసుకుంటే నల్లమచ్చలు, మొటిమల బాధ తీరుతుంది.
* జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు, పొడి చర్మానికి తీయటి పండ్ల రసాలతో మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుచ్చకాయ, దోసకాయ, కమలా ఫలాల రసాన్ని ముఖానికి, మె డకు రాసుకుంటే మంచి నిగారింపు వస్తుంది.
* గులాబీ రేకులను పాలలో కలిపి ముద్దలా చేసుకుని ముఖభాగానికి బాగా పట్టించాలి. అరగంట తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. కొన్ని రోజుల పాటు ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.
* నీటిలో కాస్త వెన్న కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కమిలిపోవడం తగ్గుముఖం పడుతుంది.
* పుదీనా ఆకుల రసాన్ని తరచూ రాసుకుంటే చర్మానికి చల్లదనం, మెరుపుదనం వస్తుంది.
* బంతి, చేమంతి, గులాబీ రేకులను మెత్తగా ముద్దలా చేసుకుని రాసుకుంటే చర్మం నునుపుదనాన్ని సంతరించుకుంటుంది.
* కీరదోస రసంలో కాస్త నిమ్మరసం, పసుపు కలిపి మోచేతులు, పాదాలు, మెడపై రాసుకుంటే ఎలాంటి మచ్చలైనా తొలగిపోతాయి.
ఐడియా
సెలవులకు సార్థకత
సెలవుల్ని ఎంత సరదాగా గడపాలో నేటి యువతకు ఎవరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విందులు-వినోదాలతో, పర్యాటక స్థలాల్ని సందర్శించడంతో కాలక్షేపం చేయాలని కుర్రకారు ఆలోచించడం సర్వ సాధారణం. స్నేహితులతో ఆటపాటల్లో గడపడం, ‘ఫేస్‌బుక్’లోనో.. ‘ట్విటర్’లోనే నిత్యం మునిగి తేలడం నేటి యువతకు ప్రధాన వ్యాపకమైంది. అయితే, ఇందుకు భిన్నంగా అనాథ పిల్లల సేవలో సెలవుల్ని గడిపి- ఆమె ‘వార్తల్లో వ్యక్తి’గా నిలిచింది. స్వలాభం కోసం తప్ప, ఇతరుల గురించి ఆలోచించే తీరిక నేటి యువతకు లేదన్న మాటలను ఆమె తిప్పికొట్టింది. ముంబైకి చెందిన రేనా శ్రీవాత్సవ (16) టెక్సాస్ (అమెరికా)లోని ఫ్రిస్కో హైస్కూల్‌లో చదువుతోంది. ఇటీవల పాఠశాలకు వేసవి సెలవులిచ్చినపుడు ఆమె ముంబై వచ్చి అనాథ బాలలకు సేవలందించి అందరి ప్రశంసలను అందుకుంది. థానేలో అనాథ బాలికల కోసం నిర్వహిస్తున్న ‘దివ్యప్రభ హోం’కు వెళ్లి స్వచ్ఛందంగా సేవలందించింది. అనాథ బాలలకు సేవ చేయాలన్న తలంపు గత ఏడాది ముంబై వచ్చినపుడే తనలో కలిగిందని, ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని వారి కోసం పని చేయడం తనకు ఎంతో సంతృప్తిని మిగిల్చిందని ఆమె వివరించింది.
సంపన్న కుటుంబంలో పుట్టడంతో తనకు ఎలాంటి బాధలు లేవని, అయితే అనాథ బాలలు ఎన్నో రకాల సమస్యలతో సతమవుతున్నారని తెలిసి తాను స్వచ్ఛంద సేవకు ముందుకు వచ్చానని రేనా తెలిపింది. తన తల్లిదండ్రులు రాహుల్, వైశాలి మొదట విముఖత వ్యక్తం చేసినప్పటికీ, సమాజ సేవ చేసేందుకు చివరికి తనకు అనుమతి ఇచ్చారని ఆమె వివరించింది. పని చేయగలిగే శక్తి సామర్థ్యాలున్నపుడే ఇతరులకు సేవలందించాలని తండ్రి చెప్పిన మాటలు తనలో ఎంతో ధైర్యం నింపాయని రేనా తెలిపింది.
ఇంగ్లీష్‌లో మాట్లాడడం, పర్యావరణ పరిరక్షణ, విజ్ఞానం కోసం ఇంటర్నెట్‌ను వినియోగించడం వంటి విషయాలపై అనాథ బాలికలకు తర్ఫీదు ఇచ్చానని ఆమె తెలిపింది. తొమ్మిది నుంచి పదహారేళ్ల లోపు వయసు కలిగిన బాలికలకు గురువులా పాఠాలు బోధించడం తనకు వింత అనుభూతి కలిగించిందని, విజ్ఞానాన్ని తెలుసుకోవాలన్న ఆకాంక్ష వారిలో ఎంతో బలంగా ఉందని రేనా తన అనుభవాలను వివరిస్తోంది. నాలుగు వారాల పాటు అనాథ శరణాలయంలోనే ఉంటూ బాలికల చేత మొక్కలు నాటించానని, భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేలా అనేక అంశాలను వారికి తెలియజేయడం తనకెంతో ఆత్మసంతృప్తి ఇచ్చిందని అంటోంది. రేనా లాంటి వారు మరింతగా సేవలందిస్తే అనాథ బాలలు ధైర్యంగా జీవించగలుగుతారని ‘దివ్యప్రభ’ నిర్వాహకులు చెబుతున్నారు. విద్య ప్రాముఖ్యత తెలుసుకుంటే అనాథ బాలలైనా అద్భుతాలు సాధిస్తారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనాథ శరణాలయంలో మరుగుదొడ్లకు మరమ్మతులు చేయిస్తానని, బాలికలకు పుస్తకాలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అందజేసేందుకు అమెరికాలో తాను నిధులు సేకరిస్తానని రేనా చెబుతోంది. ఈసారి సెలవులకు వచ్చేలోగా తాను అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తానని ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
పుస్తకాల భారంతో కుంగుతున్న బాల్యం!
పసి మనసు మైనపు ముద్దలాంటిది. దాన్ని మనం ఏ విధంగా మలిస్తే ఆ విధంగా రూపు ది ద్దుకుంటుంది. చిన్నారుల హృదయాల్లో విజ్ఞానజ్యోతులను వెలిగించడానికి బదులు నేడు ర్యాంకుల ఆరాటంలో వారిని మానసికంగా, శారీరకంగా వ్యాధిగ్రస్తులను చేస్తున్నాం. ఇది సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఎంత మాత్రం మంచిది కాదు. తమ స్కూళ్లకు ఆకర్షణీయమైన పేర్లు పెడుతూ ప్రైవేటు యజమాన్యాలు వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయ. ఎన్ని ఎక్కువ పుస్తకాలు విద్యార్థుల చేత మోయిస్తే అది అంత మంచి పాఠాశాల అనే దురభిప్రాయం తల్లిదండ్రులలో సైతం నాటుకుపోవడం దురదృష్టకరం. పిల్లల అభ్యసన సామర్థ్యాన్ని పట్టించుకోకుండా వారి లేత మెదళ్లలోకి విజ్ఞానం ఎక్కిస్తున్నామని వత్తిడులకు గురి చేస్తున్నారు. దీంతో పసితనం నుంచే చిన్నారులు మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒక విద్యార్థి తన బరువులో పదిశాతం బరువుండే పుస్తకాలను మాత్రమే వారు మోయగలడని, ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వారికి ఎటువంటి శారీరక, మానసిక రుగ్మతలు కలగవని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే, వైద్యనిపుణుల సలహాలను అటు తల్లదండ్రులు గానీ, ఇటు పాఠశాల యాజమాన్యాలు గానీ పట్టించుకోవడం లేదు. దీంతో చిరుప్రాయంలోనే పిన్న వయసులోనే వారు వెన్ను,నడుం నొ ప్పులతో బాధపడుతున్నారు. ఈ వి పరిణామాలకు కారణం అధిక పుస్తకాల బరువు మాత్రమేనని ఎముకల వైద్యనిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు అంటే బండెడు పుస్తకాలు మోసే గాడిదలు కాదని, పుస్తకాల బరువును తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాలని దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీచేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇది చిన్నారులపాలిట శాపంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన విద్యాశాఖ ప్రేక్షకపాత్ర వహిస్తుండటం గమనార్హం. చిన్నారుల మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ర్యాంకుల మోజులో పడి పుస్తకాల బరువు విషయంలో ఎలాంటి కనికరం చూపించడంలేదు. ఇక, ప్రైవేటు విద్యాసంస్థల పనివేళల నియంత్రణ పట్ల కూడా విద్యాశాఖ అధికారులు ఎటువంటి శ్రద్ధ చూపించడం లేదు. ప్రైవేటు క్లాసులు, స్పెషల్ క్లాసులు పేరిట ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విద్యార్థులను పుస్తకాల పురుగులుగా మార్చివేస్తున్నారు. మార్కులు, ర్యాంకుల తపన కారణంగా చిన్నారులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రైవేటు పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను నిర్దేశించడం లేదు. ఇటువంటి పరిస్థితులలో పిల్లల భవిష్యత్‌పై ఆందోళన మేఘాలు కమ్ముకుంటున్నాయ. కేవలం ర్యాంక్‌లు మాత్రమే ప్రధానం కాదని పేరెంట్స్ గ్రహించాలి. చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. ఒక్కసారి సావధానంగా ఆలోచించి, చిన్నారుల గోడును పట్టించుకోండి.
ఫాస్ట్‌ఫుడ్‌తో ప్రాణాంతక రోగాలు!
కమ్మనైన అమ్మ చేతి వంట తింటే ఎలాంటి రోగాలూ దరిచేరవు. ఇది పా తకాలపు మాట. ఆధునిక యుగంలో అమ్మ చేతి వంట అంటేనే కొందరికి ముఖం మొత్తుతుంది. దుకాణాల్లో ఆకర్షణీయంగా కనిపించే ఫాస్ట్ఫుడ్స్ కోసం నేడు ఎంతోమంది వేలం వెర్రిగా ఎగబడుతున్నారు. ఫలితంగా ఊబకాయంతో నానా అగచాట్లు పడుతున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా శరీరానికి అవసరమైన విటమిన్లు, సూక్ష్మపోషకాలు, అమైనో ఆమ్లాలు తదితర పోషక పదార్థాలు సమపాళ్లలో తినాలి. రుచిగా ఉన్నాయని రిఫైన్డ్ పదార్థాలను, ఫాస్ట్ఫుడ్స్ తినేస్తుంటే శరీరానికి పోషకాలు అందకపోగా ఊబకాయం, మధుమేహం, రక్తపోటు లాంటి ప్రాణాంతక రుగ్మతలు ముంచుకొస్తాయి.
ప్రజల నాడిని గ్రహించి నేడు ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నూడుల్స్, పిజ్జాలు, బర్గర్లను స్పెషల్ ఆఫర్లు పెట్టి మరీ అమ్ముతున్నారు. వంటచేసుకునే బాధ లేకుండా ఎంచక్కా ఫాస్ట్ఫుడ్స్ తెచ్చుకొని తినేయటం, దాంతోపాటు ఓ కూల్‌డ్రింక్ తాగేస్తే ఇక ఆపూట గడిచిపోయిందనే ధోరణి నానాటికీ ప్రబలిపోతోంది. ముఖ్యంగా ఐటి ఉద్యోగులు ఏ రాత్రికో డ్యూటీ ముగించుకుని రావటం, ఆ సమయంలో వండి వడ్డించేవారు లేక వెంటతెచ్చుకున్న ఫాస్ట్ఫుడ్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారు. ఫా స్ట్ఫుడ్స్ కారణంగా ఊబకాయంతో ప్రపంచవ్యాప్తంగా 2.8 మిలియన్ల మంది బాధపడుతున్నారు. ఇది పెద్దవాళ్లలోనే కాదు, చిన్నపిల్లల్లోనూ కనిపిస్తోంది. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉం టారేమోగానీ, వయసు పెరిగేకొద్దీ ఊబకాయం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ‘చైనా నూడుల్స్’ అంటే చాలు మనం ఆబగా కొనుక్కొని కడుపునిండా లాగించేస్తాం. చైనా దేశంలోనే ఊబకాయంతో బాధపడేవారు ఎక్కువమంది ఉన్నారట. అక్కడ ఒక మిలియన్ మంది ఊబకాయంతో బాధపడుతున్నారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. ఆస్ట్రేలియాలో కూడా ఊబకాయంతో జనం నానా అగచాట్లు పడుతున్నారు. అక్కడి జనాభాలో దాదాపు 80 శాతం మంది అధిక బరువు తగ్గించుకోవటానికి ఇబ్బందులు పడుతున్నట్లు మోనాష్ యూనివర్శిటీ జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది.
పొట్ట బరువు తగ్గించుకోవటానికి ఆహార నియంత్రణ, వ్యాయామం అలవాటుగా చేసుకుంటున్నా ఊబకాయం అదుపులోకి రావటం లేదు. ఇవన్నీకాదని, పొట్ట తగ్గించుకుంటూనే బరువును నియంత్రించుకునేలా చేస్తే ఎలా ఉంటుందనే విషయమై ఆస్ట్రేలియాలో శాస్తవ్రేత్తలు విస్తృత పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ న్యూట్రీషియన్లతో ఓ సదస్సు ఏర్పాటు చేసి లోతుగా అధ్యయనం చేశారు.
నోరూరించే ఫాస్ట్ఫుడ్స్ వల్ల ఊబకాయం, పలురకాల రోగాలు వస్తున్నాయని, ఉప్పు, కొవ్వు, చక్కెర మోతాదుకు మించి ఫాస్ట్ఫుడ్‌లో ఉంటున్నట్లు న్యూట్రీషియన్లు వెల్లడించారు. మనం తినే ఆహారం వల్లే మనకు ఆరోగ్యమైనా, అనారోగ్యమైనా వస్తుంది. ఎంత మోతాదులో తినాలో మన శరీరంలోని హార్మోన్లు నియంత్రిస్తాయి. ఒక ప్రత్యేక హార్మోను మాత్రం మోతాదుకు మించి తినేలా చేస్తోంది. ఎంత తిన్నా ఆకలి తీరకుండా చేస్తోంది. దీనివల్ల మన బరువు విపరీతంగా పెరిగిపోతుంది. దాదాపు 359 మంది స్థూలకాయ బాధితుల్ని క్షుణ్ణంగా పరిశీలించి హార్మోన్ల ద్వారానే ఊబకాయాన్ని నియంత్రించేందుకు శాస్తవ్రేత్తలు ప్రయత్నిస్తున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలని భావించారు. మనిషి పొట్టలో రెండు రకాల హార్మోన్ల మోతాదును పెంచినట్లయితే జిహ్వ చాపల్యాన్ని నియంత్రించవచ్చని ఆస్ట్రేలియాలోని గార్వెన్ పరిశోధనా సంస్థ శాస్తవ్రేత్తలు తెలియజేస్తున్నారు. ఈ మేరకు పీవైవై 3-36,పీపీ అనే రెండు రకాల హార్మోన్లను ఎలుకల్లోకి పంపి పరిశోధనలు చేశారు. ఆ హార్మోన్లు పంపకముందు ఎలుకలు విపరీతంగా ఆహారం తినేవి. హార్మోన్లు పంపిన వెంటనే అవి తక్కువగా తినటం ప్రారంభించాయి. ఆస్ట్రేలియావాసుల కోసం ఈ తరహా హార్మోన్లను ఉత్పత్తిచేసే మందుల తయారీకి కొన్ని కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలనే కాదు భారత్‌ను కూడా ఊబకాయం పట్టి పీడిస్తోంది. విదేశీ సంస్కృతిలో భాగంగా దిగుమతైపోయన ఫాస్ట్ఫుడ్ పుణ్యమాని భారతీయుల ఆహారపు అలవాట్లలోనూ అనూహ్య మార్పులు వచ్చాయ.
ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు విచ్ఛన్నం కావటంతో ‘మేమిద్దరం-మాకిద్దరు’-అనుకుంటూ చిన్న చిన్న కుటుంబాలతో పాటు యువతీ యువకులు ఫాస్ట్ఫుడ్స్‌పైనే ఆధారపడుతున్నారు. మనదేశంలో 13 శాతం మంది మహిళలు, 9 శాతం మంది పురుషులు అధిక బరువుతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. ఊబకాయం వల్ల షుగర్, గుండె సంబంధ వ్యాధులూ వస్తున్నాయి. ఫలితంగా ప్రతి లక్షమందిలో 116.4 శాతం మంది గుండె సంబంధ వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. శరీరానికి అవసరమైన మేరకే తినాలి. ఎపుడూ నోరు ఆడిస్తూ ఉంటే- బొద్దుగా ముద్దొస్తామని అనుకుంటే పొరపాటే. ఇలాంటి ఆహారపు అలవాట్లు మనల్ని మృత్యు ముఖంలోకి నెడుతున్నాయని గ్రహించాలి.
మళ్లీ టైప్ రైటర్ల హవా!
‘టైప్ పరీక్షలు ప్యాసైందండీ! వంకాయ మెం తికూర దంచేస్తుందండీ! లతా మంగేష్కర్‌లా పాడుతుందండీ’.. వగైరా మాటలు గతం గతః. ‘మా అమ్మాయి- ‘టెక్కీ’ అండీ.. సెల్ క్వీన్ అండీ.. ట్వంటీఫోరవర్సూ కంప్యూటర్‌తోనే కాలక్షేపమండీ.. నెలకి లక్ష రూపాయలు ఇన్‌కమ్ అండీ!’’ వగైరా వగైరాలనాలి ఇపుడు. ఐతే- కంప్యూటర్లతో గొప్ప ఇబ్బంది వచ్చిందంటున్నారు రష్యన్ ప్రభుత్వ సీక్రెట్ సర్వీసు అధికారులు. ‘ఎంత పాస్‌వర్డ్‌లున్నా కంప్యూటర్ నుంచి రహస్య డాక్యుమెంట్లు- ‘వికీ లీక్స్’ అయిపోతున్నాయి. అంచేత మళ్లీ పాతకాలపు రెమింగ్‌టన్ టైప్ టైపురైటర్లని బుక్ చేయండి!’ అంటూ క్రె మ్లిన్ అథార్టీ ఆర్డర్స్ వేసింది. రహస్యాల్ని కాపాడాల్సిన ఫెడరల్ గార్డు సర్వీసు 4.86 లక్షల రూబుల్స్‌ను వెచ్చించి ఎలక్ట్రిక్ (ఎలక్ట్రానిక్ కాదు!) టైపురైటర్లను కొనుక్కుంటోందిట. టాప్ సీక్రెట్స్ హయ్యర్ లేదా అడ్వాన్స్‌డ్ టైప్ పరీక్షలు ప్యాసైనవారి చేత టపటపా కొట్టించేస్తేనే- గుట్టు దక్కుతుందనుకుంటున్నారట. ‘‘ఐతే, టైపిస్టులను నమ్మగలమా..?’’ అంటోంది- ఓ సాఫ్ట్‌వేర్ భామామణి. టెప్ రైటర్లు దంచుకో రష్యా..! డాక్యుమెంట్స్‌ని రక్షించుకో రష్యా..!
ప్రాణాంతక కోతుల దాడి...
మన హైదరాబాద్‌లోని విద్యానగర్, అడిక్‌మెట్, రామ్‌నగర్ వాసులకి కోతుల బెడద ఏమిటో బాగా తెలుసు. డాబాలపై ఆరేసిన గుడ్డలు చింపేస్తాయి. పూలకుండీలు పగులగొట్టేస్తాయి. పి ల్లల్నీ, పెద్దల్నీ బెదరగొడతాయి. ఇదే మాదిరి కోతుల దాడులు కాన్పూరులోనూ తప్పడం లేదట. జనరల్ గంజ్ అనే పేటలో 65 ఏళ్ల ఓ పెద్దాయన పేరు అవధేవ్ కుమార్ సింగ్- తన మూడో అంతస్తు డాబాపై వాటర్ ట్యాంక్ మూ తను కోతులు తోసేసి మంచినీళ్లను పాడుచేస్తున్నాయ. కోతుల మూక అతడి మీదికి లం ఘించాయి. భయంతో తప్పుకోబోయిన ఆ పెద్దమనిషి టెర్రస్‌పై నుంచి జారిపడి తీవ్ర గాయాలకు లోనై- ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు.
కోతులను పట్టే బృందాలున్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి శ్రద్ధ తీసుకోదన్నది హైదరాబాద్ వాసులకు బాగానే ఎరుక. కాన్పూర్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ‘కోతులు క్రూర జంతువుల కోవలోకే వస్తాయి. వాటిని అటవీశాఖ వారే పట్టుకోవాలి మరి’’ అన్నారుట! హైదరాబాద్‌లోనూ కోతులు పట్టే బృందాలు వున్నాయిట. కానీ, ఆ పనిని వాళ్లు చెయ్యరు. అంతే..!
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
టంగుటూరు, జూలై 23: మండలంలో మంగళవారం 15 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అన్ని గ్రామాల్లో ఎలాంటి అవాంఛీనయ సంఘటనలు జరుగకుండా సిఐ అశోక్‌వర్థన్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు దూర ప్రాంతాల నుండి వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి సుబ్రమణ్యం, తహశీల్దార్ వందనం పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. మండలంలో జరిగిన 15 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలలో కడపటి సమాచారం మేరకు 8 పంచాయతీలు తెలుగుదేశం పార్టీ, మూడు కాంగ్రెస్, రెండు వైఎస్‌ఆర్‌సిపి దక్కించుకున్నాయి. టంగుటూరు సర్పంచ్‌గా బెల్లం జయంతిబాబు, పొందూరు చిట్టినేని రంగారావు, కాకుటూరివారిపాలెం తెలుగుదేశం పార్టీకి చెందిన లింగాలు, వల్లూరు కాంగ్రెస్ పార్టీకి చెందిన చుండి సుబ్బమ్మ, జయవరం చుండి బంగారు( కాంగ్రెస్), అనంతవరం కసుకుర్తి సుందరరావు వైయస్‌ఆర్‌సిపి, వెలగపూడి డోలా చెన్నకేశవులు టిడిపి, వాసేపల్లిపాడు లింగంగుంట రవి టిడిపి, మల్లవరప్పాడు రాచగర్ల శ్రీలక్ష్మిలు గెలుపొందారు. ఈ ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు డిఎస్‌పి జాషువా, పిటిసి డిఎస్‌పి మురళీధర్, సిఐ అశోక్‌వర్థన్, టంగుటూరు ఎస్‌ఐ వైవి రమణయ్య, జరుగుమల్లి ఎస్‌ఐ షేక్‌షావలి, శింగరాయకొండ ఎస్‌ఐ పాండురంగారావు తదితరులు బందోబస్తు నిర్వహించారు.
కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి
* మాజీఎమ్మెల్యే కెపి కొండారెడ్డి
కొనకనమిట్ల, జూలై 23: మండల కేంద్రమైన కొనకనమిట్ల పంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసిన కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారు కళ్లం సుబ్బమ్మ గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మార్కాపురం మాజీఎమ్మెల్యే కెపి కొండారెడ్డి కోరారు. మంగళవారం కొనకనమిట్ల ఎస్సీకాలనీలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నిధులు మంజూరు చేసి రోడ్ల అభివృద్ధి చేస్తానని, తాగునీటి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. బుట్ట గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజారిటీతో సుబ్బమ్మను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈకార్యక్రమంలో మాజీమున్సిపల్ చైర్మన్ డి నాగూర్‌వలి, నాయకులు పి కొండారెడ్డి, ఎస్ పెద్దవెంకటరెడ్డి, బైరెడ్డి వెంకటరెడ్డి, కె దిబ్బారెడ్డి, ఏసోబు, ఏసు తదితరులు పాల్గొన్నారు.
రిసెప్షెన్ కేంద్రాలను జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయండి
* ఎంపిడిఓను ఆదేశించిన డిప్యూటీ కలెక్టర్ గ్లోరియా
కొమరోలు, జూలై 23: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సరంజామ పంపిణీ కేంద్రాన్ని సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బదిలీ చేయాలని వెలుగొండ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్, గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి పి గ్లోరియా ఎంపిడిఓ విజయకుమార్‌ను ఆదేశించారు. ఆమె కొమరోలుకు మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వహైస్కూల్, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న 15పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. మండలపరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ విజయకుమార్, తహశీల్దార్ మధుసూదనరావులతో సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో మంగళవారం జరిగిన తొలివిడత పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొన్న జిల్లాకలెక్టర్ విజయకుమార్ కొమరోలు మండలపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సరంజామ పంపిణీ కేంద్రంతోపాటు, ఎన్నికల అనంతరం సిబ్బంది నుంచి తీసుకోవాల్సిన బాక్స్‌లకు ఏర్పాటు చేసే రిసెప్షెన్ కేంద్రాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా తనను ఆదేశించినట్లు తెలిపారు. కేంద్రాల మార్పుకు అవసరమైన ఏర్పాట్లను చేయాల్సిందిగా ఎంపిడిఓ, తహశీల్దార్లను ఆదేశించారు. తాను మండలంలోని పలుపాఠశాలలను సందర్శించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించానని గ్లోరియా తెలిపారు.
కొండపి నియోజకవర్గంలో
60 పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌సిపి గెలుపు తథ్యం
ఎంఎల్‌సి జూపూడి ధీమా
మర్రిపూడి, జూలై 23: కొండపి నియోజకవర్గంలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో 60 గ్రామ పంచాయతీల్లో వైఎస్‌ఆర్‌సిపి గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ, కొండపి నియోజకవర్గం వైసిపి ఇన్‌చార్జి జూపూడి ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని చిమట, అయ్యపురాజుపాలెం, జగ్గరాజుపాలెం, మర్రిపూడి, గుండ్లసముద్రం గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బలహీన వర్గాల ప్రజలందరూ జగన్‌కు అండగా నిలుస్తున్నారన్నారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలు చేసినా గెలుపు వైయస్‌ఆర్‌సిపిదేనని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల వైసిపి కన్వీనర్ బి రమణారెడ్డి, వైయస్‌ఆర్‌సిపి నాయకులు మాచేపల్లి నాగయ్య, ఆయా గ్రామాల వైసిపి అభ్యర్థులు తదితరులు ఉన్నారు.
- నూజివీడు డివిజన్‌లో - గ్రామ సారథులు వీరే..
నూజివీడు, జూలై 23: జిల్లాలోని తొలివిడతగా మంగళవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఎక్కువ శాతం విజయం సాధించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి దిగజారింది. నూజివీడు నియోజకవర్గంలో అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యే ప్రధాన పోటీ జరిగినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. నూజివీడు మండలం జంగంగూడెం గ్రామ సర్పంచ్‌గా పున్నం స్వప్న (దేశం), పోలసానపల్లికి మారగాని పద్మ (దేశం), సిద్ధార్థనగర్ సర్పంచ్‌గా ఎం సంజయ్‌కుమార్ (వైకాపా), గొల్లపల్లి సర్పంచ్‌గా జి శ్రీనివాస్‌కుమార్ అప్పారావు(వైకాపా), యనమదల సర్పంచ్‌గా నల్లిబోయిన నాగలక్ష్మి (వైకాపా), తుక్కులూరు సర్పంచ్‌గా షేక్ నాగూర్ బీ (కాంగ్రెస్), సీతారామపురం సర్పంచ్‌గా లింగంనేని సత్యవాణి (కాంగ్రెస్), బూర్వంచ్ సర్పంచ్‌గా సయ్యద్ ఖాద్రీ (వైకాపా), దేవరగుంట సర్పంచ్‌గా టి చంద్రశేఖర్ (వైకాపా), తూర్పుదిగవల్లి సర్పంచ్‌గా నక్కబోయిన వెంకటేశ్వరరావు (వైకాపా), మర్రిబందం సర్పంచ్‌గా వి త్రినాధరావు (వైకాపా), దిగవల్లి సర్పంచ్‌గా ఎం గిరిబాబు (దేశం), బత్తులవారిగూడెం సర్పంచ్‌గా దుకార్పు భాగ్యరత్నం (దేశం), మిట్టగూడెం సర్పంచ్‌గా వెలివెల నాగేశ్వరరావు (వైకాపా), ముక్కొల్లుపాడు సర్పంచ్‌గా కంచర్ల సాయిబాబు (వైకాపా), హనుమంతులగూడెం సర్పంచ్‌గా చల్లగుళ్ళ నాగమణి (దేశం), పాతరావిచర్ల సర్పంచ్‌గా తులిమెల్లి సంజీవరావు (వైకాపా), రామన్నగూడెం సర్పంచ్‌గా శీలం అరుణ (వైకాపా), వెంకటాయపాలెం సర్పంచ్‌గా బాణావతు గోప్యా (దేశం), అన్నవరం సర్పంచ్‌గా వీరమాచనేని సత్యనారాయణ (దేశం), మీర్జాపురం సర్పంచ్‌గా కలపాల నాగమణి (దేశం), మొర్సపూడి సర్పంచ్‌గా వల్లూరి కుమారి (దేశం)లు ఎన్నికైనారు.
ముసునూరు మండల కొత్త సర్పంచ్‌లు వీరే
ముసునూరు: ముసునూరు మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను నామినేషన్ల పర్వంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కొర్లకుంట గ్రామానికి మందపాటి మనోజ్ ప్రభాకర్ (టిడిపి), లోపూడి గ్రామ పంచాయతీకి పేరం మద్దిరామయ్య (స్వతంత్ర)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా మంగళవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు వీరే. ముసునూరు గ్రామ సర్పంచ్‌గా రేగుల గోపాలకృష్ణ (స్వతంత్ర), చిల్లబోయినపల్లి గ్రామానికి బళ్ళా శాంతి (వైఎస్‌ఆర్‌సిపి), బలివే గ్రామానికి నాగుల శ్రీనివాసరావు(వైఎస్‌ఆర్‌సిపి), సురేపల్లికి కొల్లి అనిల్ (వైఎస్‌ఆర్‌సిపి), వేల్పుచర్లకు మేరుగు తెరేజమ్మ (వైఎస్‌ఆర్‌సిపి), చింతలవల్లికి పల్లెపాం కుటుంబరావు(వైఎస్‌ఆర్‌సిపి), కాట్రేనిపాడుకు సోంగా వెంకటేశ్వరరావు(వైఎస్‌ఆర్‌సిపి), చెక్కపల్లికి డోలా లక్ష్మీకాంతం (టిడిపి), అక్కిరెడ్డిగూడెంకు ఉలాస వెంకటేశ్వరమ్మ (టిడిపి), వలసపల్లికి గొల్లపల్లి యాకోబు (వైఎస్‌ఆర్‌సిపి), ఎల్లాపురంకు జలగం పద్మజ (వైఎస్‌ఆర్‌సిపి), రమణక్కపేటకు జుంజునూరి వెంకమ్మ (వైఎస్‌ఆర్‌సిపి), గుళ్ళపూడి సర్పంచ్‌గా ఊరకర్ణం వల్లీ శాంతకుమారి (వైఎస్‌ఆర్‌సిపి),
ఉంగుటూరు మండలంలో...
ఉంగుటూరు: తేలప్రోలు పంచాయతీ భీమవరపు అరుణకుమారి (టిడిపి), నాగవరప్పాడు సర్పంచ్‌గా కె ధనలక్ష్మి (దేశం), వెన్నుతల సర్పంచ్‌గా ఎన్ శివనాగేశ్వరరమ్మ (స్వతంత్ర), పొట్టిపాడు సర్పంచ్‌గా జి సుందరమ్మ (స్వతంత్ర), కొయ్యగురపాడు సర్పంచ్‌గా నర్ర ప్రసన్న జోసఫ్, (స్వతంత్ర), ముక్కపాడు సర్పంగా నెక్కంటి అంజనాదేవి (దేశం), పొనుకుమాడు సర్పంచ్‌గా చింతల శ్రీనివాసరావు (దేశం), ఉంగుటూరు సర్పంచ్ గా జి రవిబాబు (దేశం), లంకపల్లి సర్పంచ్‌గా కొండ్రు రత్నమాల (వైకాపా), వెలుకపాడు సర్పంచ్ గా అజ్మీర వెంకటేశ్వరరావు (సిపిఎం), వెల్దిపాడు సర్పంచ్‌గా జాలాది గీతాకుమారి (స్వతంత్ర), చాగంటిపాడు సర్పంచ్‌గా పసుపులేటి గణేష్‌కుమార్ (కాంగ్రెస్), తరిగొప్పల సర్పంచ్‌గా మరగాని చంద్ర (దేశం), నందమూరు సర్పంచ్‌గా పి లక్ష్మి (దేశం), ఇందుపల్లి సర్పంచ్‌గా పాలపర్తి కోటేశ్వరరమ్మ (దేశం), వేమండ సర్పంచ్‌గా ఎస్ సాంబశివరావు (వైకాపా) లు ఎన్నికైనారు.
రెడ్డిగూడెంలో
రెడ్డిగూడెం: పాతనాగులూరుకు బట్టా అలివేలుమంగమ్మ (వైఎస్‌ఆర్‌సిపి), కుదపకు కనపర్తి బీక్షాలు (టిడిపి), అనే్నరావుపేటకు మరీదు పుష్పావతి (టిడిపి), నరుకులపాడుకు వేముల వెంకయ్య (వైఎస్‌ఆర్‌సిపి), రుద్రవరంకు జెరబాల జమలయ్య (టిడిపి), కొత్తనాగులూరుకు మట్టగుంజా చంద్రకళ (టిడిపి), రంగాపురంకు అద్దేపల్లి జమలమ్మ (టిడిపి), ముచ్చెనపల్లికి విశంపల్లి రాంబాబు (టిడిపి), మద్దులపర్వకు కొమటి కృష్ణ (వైఎస్‌ఆర్, కాంగ్రెస్), కూనపరాజుపర్వకు గురిజాల లక్ష్మీనారాయణ (టిడిపి), రెడ్డిగూడెంకు ఊయ్యూరు అంజిరెడ్డి (టిడిపి).
గంపలగూడెం మండలంలో
గంపలగూడెం, జూలై 23: అమ్మిరెడ్డి గూడెం సర్పంచ్‌గా బజ్జూరి చంద్రశేఖర్ (వైఎస్‌ఆర్‌సిపి), పెదకొమిరకు దొంతాల రమాదేవి (టిడిపి), కొత్తపల్లికి నరేడ్ల వెంకటరావమ్మ (వైఎస్‌ఆర్ సిపి), వినగడపకు గగులోతు రాములు (టిడిపి) అనుమూల్లంకకు బాజినేని వీరబాబు (వైఎస్‌ఆర్‌సిపి) కనుమూరుకు యార్లగడ్డ వెంకటేశ్వర్లు (టిడిపి), సొబ్బాలకు పొంగులూరి రాంబాబు (టిడిపి), గుళ్ళపూడికి పోట్రు సత్యనారాయణ (కాంగ్రెస్), ఆర్లపాడుకు చేబ్రోలు భాగ్యమ్మ (టిడిపి), ఊటుకూరుకు చావా నిర్మల (టిడిపి), కొణీజర్లకు బొల్లా రాణీ (కాంగ్రెస్), నెమలికి కుంభగిరి ముత్తయ్య (కాంగ్రెస్), ఉమ్మడి దేవరపల్లికి కఠారు సుజాత (టిడిపి), తునికిపాడుకు చావా కృష్ణకుమారి (వైఎస్‌ఆర్‌సిపి), పెనుగొలనుకు బంధం రాజ్యలక్ష్మి (వైఎస్‌ఆర్‌సిపి), రాజవరం మోదుగు జ్ఞానమ్మ (టిడిపి), చింతలనర్వకు గద్దల సునందరావు(టిడిపి), మేడూరుకు అరిగెల ఏసోబు (వైఎస్‌ఆర్‌సిపి), గంపలగూడెంకు కొత్తగుండ్ల విశే్వశ్వరరావు (టిడిపి), జుంజిరాలపాడుకు మోదుగు సునీత (టిడిపి).
ఆగిరిపల్లిలో
ఆగిరిపల్లి: కొమ్మూరుకు కొవ్వలి రంగమ్మ (స్వతంత్య్ర అభ్యర్ధి), కృష్ణవరం మసిముక్కు రాంబాబు (టిడిపి), చినాగిరిపల్లి బడుగు సమాధానం (టిడిపి), చొప్పరమెట్లకు కోటా జ్యోతి (ఇండిపిండెంట్), సీతారామపురంకు అత్తి మురళీ మోహనరావు(వైఎస్‌ఆర్‌సి), బొద్దనపల్లి నక్కనబోయిన వేణు (టిడిపి), వడ్లమానుకు కొండ్రు విజయకుమారి (టిడిపి), సింహాద్రి అప్పారావుపేటకు కంచర్ల సాగర్‌కుమార్ (కాంగ్రెస్), నూగొండపల్లికి బోర్ల అరుణ (వైఎస్‌ఆర్‌సిపి), పోతవరప్పాడుకు తోటకూర సత్యవాణీ (స్వతంత్ర), పిన్నమరెడ్డిపల్లికి కొవ్వలి మాధవి (వైఎస్‌ఆర్‌సిపి), నెక్కలం గొల్లగూడెంకు నర్రా సాంబయ్య (టిడిపి), సూరవరంకు కోసూరు సుబ్బారాజు (స్వతంత్ర), సగ్గురు లాం విజయశ్రీ (వైఎస్‌ఆర్‌సిపి), ఈదులగూడెంకు ఈలప్రోలు మలేశ్వరి (వైఎస్‌ఆర్‌సిపి), నరసింగపాలెంకు జంగం మోహనరావు (స్వతంత్ర), తోటపల్లికి ఆరేపల్లి శ్రీనివాసరావు (టిడిపి), అమ్మవారిగూడెంకు జలసూత్రం కృష్ణ నారాయణరావు(వైఎస్‌ఆర్‌సిపి), కనసానిపల్లికి బాయన శేషగిరిరావు (స్వతంత్ర), అడవినెక్కలంకు ముక్కపాటి శైలజ (స్వతంత్ర).
తిరువూరు మండలంలో కొత్త సర్పంచ్‌లు వీరే
తిరువూరు: మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. వామకుంట్ల సర్పంచ్‌గా గోదా మంగమ్మ (టిడిపి),, కొత్తూరుకు దుబ్బాకా రమణమ్మ (టిడిపి), లక్ష్మిపురానికి వేముల సుజాత (కాంగ్రెస్), మల్లెలకు కలకొండ రవికుమార్ (వైఎస్‌ఆర్‌సిపి), కోకిలంపాడుకు కొర్ల కృష్ణకుమారి (వైఎస్‌ఆర్‌సిపి), ఆంజనేయపురానికి మామిడి కుటుంబరావు (వైఎస్‌ఆర్‌సిపి), పెద్దవరానికి చిలుకూరి తిరుపతమ్మ (కాంగ్రెస్), రోలుపడికి కిలారు రమేష్ (టిడిపి), చింతలపాడుకు చాట్ల చిన రాధ (వైఎస్‌ఆర్‌సిపి), ఎరుకోపాడుకు కొంగల జనార్ధనరావు (టిడిపి), అక్కపాలెంకు దోమతోటి వెంకటరమణ (కాంగ్రెస్), కొమ్మిరెడ్డిపల్లికి బంకా మాణిక్యమ్మ (కాంగ్రెస్), ముష్టికుంట్లకు దొబ్బల వెంకటేశ్వరరావు(టిడిపి), చిట్టేలకు తుమ్మలపల్లి విజయలక్ష్మి (టిడిపి), గానుగపాడుకు వేమిరెడ్డి నిర్మల (వైఎస్‌ఆర్‌సిపి), ఎర్రమాడుకు మద్దిబోయిన శ్రీను (టిడిపి), కాకర్లకు సగ్గుర్తి సత్యవతి (టిడిపి), మునుకుళ్ళకు నరసింగ్ నాగలక్ష్మి (వైఎస్‌ఆర్‌సిపి), సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయా పార్టీల ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఎ కొండూరు మండలంలో
ఎ కొండూరు: ఎ కొండూరుకు బలుమూరి నాగపద్మ (కాంగ్రెస్), కుమ్మరికుంట్లకు గుగులోతు చంద్రూనాయక్ (వైఎస్‌ఆర్‌సిపి), రేపూడి తండాకు భాణవతు రాంబాబు (వైఎస్‌ఆర్‌సిపి), గోపాలపురంకు దయ్యాల శ్రావణి (ఉమ్మడి అభ్యర్థి), జీళ్ళగుంటకు నూనె రామకృష్ణ (వైఎస్‌ఆర్‌సిపి), వల్లంపట్లకు శ్రీకాకుళపు రాంబాబు (టిడిపి), కోడూరుకు షేక్ నాగేంద్రమ్మ (టిడిపి), రామచంద్రాపురంకు చాట్ల రోశయ్య (టిడిపి), పోలిశెట్టిపాడుకు వాసం యశోద (టిడిపి), చీమలపాడుకు మోర్లా తిరుపతిరావు(టిడిపి), మాధవరంకు గాలం నాగరాజమ్మ (కాంగ్రెస్), గొల్లమందలకు నల్లిబోయిన లక్ష్మి (టిడిపి), కృష్ణారావుపాలెంకు పిన్నమనేని శ్రీనివాసరావు(టిడిపి), మారేపల్లికి ఇండ్ల రమాదేవి (టిడిపి).
బాపులపాడు మండలంలో....
హనుమాన్ జంక్షన్: శేరీనరసన్నపాలెంకు అడపా శివకుమారి (వైఎస్‌ఆర్‌సిపి), రామన్నగూడెంకు డికొల్లు రమేష్ (టిడిపి) రంగయ్య అప్పారావుపేటకు నన్నపనేని సరోజిని (కాంగ్రెస్), ఓగిరాలకు గొల్లపల్లి రంగమ్మ (టిడిపి), కొయ్యూరుకు కొల్లి రామచత్రుష్ణు (వైఎస్‌ఆర్‌సిపి), దంటగుంట్లకు కురిమిని శ్రీనివాసరావు(టిడిపి), అంపాపురంకు కాకాని సంజయ్ (కాంగ్రెస్), బిళ్ళనపల్లికి మాదాల కృష్ణకుమారి (కాంగ్రెస్), కొత్తపల్లికి బొకినాల క్రాంతికుమారి (కాంగ్రెస్), తిప్పనగుంటకు కలపాల బీమయ్య (టిడిపి), కె సీతారామపురంకు సుదిమెళ్ళ భాగ్యమ్మ (టిడిపి), కాకులపాడుకు వెలగపూడి సరితాకుమారి (టిడిపి), ఆరుగోలనుకు ఓబా వెంకటేశ్వరరావు(సంతోష్) (టిడిపి), బొమ్మునూరుకు మట్టా రాజేశ్వరి (వైఎస్‌ఆర్‌సిపి), పెరికీడుకు వేగిరెడ్డి ప్రసన్న (స్వతంత్ర), రేమల్లె కలపాల జగన్మోహనరావు(టిడిపి), బండారుగూడెంకు అబ్బూరి హేమలత (టిడిపి), మల్లవల్లి సాకిరి కొండలరావు(కాంగ్రెస్), ఎ సీతారామపురం కడగల శ్రీనివాసరావు(టిడిపి), సిరివాడకు మందల లక్ష్మి (టిడిపి), కానుమోలుకు కాటుమాల థెరిస్సా (వైఎస్‌ఆర్‌సిపి), వేలేరుకు బాణావతుల కుమారి (టిడిపి).
చాట్రాయి మండలంలో....
చాట్రాయి: చాట్రాయికు కోటా జోజి (స్వతంత్ర), చనుబండకు మోరంపూడి అనసూర్య (టిడిపి), కృష్ణారావుపాలెంకు గుడ్డల శ్రీనివాసరావు(వైఎస్‌ఆర్‌సిపి), నరసింహారావుపాలెంకు పుచ్చకాయల లక్ష్మీకాంతం (వైఎస్‌ఆర్‌సిపి), పర్వతాపురంకు కళ్ళివల్లి చెన్నారావు(వైఎస్‌ఆర్‌సిపి), బూరుగుగుడెంకు లంకా నిర్మల (వైఎస్‌ఆర్‌సిపి), చిన్నంపేటకు పరసా ధనలక్ష్మి (కాంగ్రెస్), చీపురుగూడెంకు ఘంటసాల మన్మధరావు(టిడిపి), కోటపాడుకు పరసా జ్యోతి (వైఎస్‌ఆర్‌సిపి), ఆరుగోలనుపేటకు యకతిరి పద్మ (వైఎస్‌ఆర్‌సిపి), జనార్ధనవరంకు పలగాని దుర్గారావు(టిడిపి), తుమ్మగూడెంకు మాదాల ఉషారాణి (వైఎస్‌ఆర్‌సిపి), కొత్తగూడెంకు చళ్ళగుళ్ళ రాజారత్నం (టిడిపి), చిత్తపూరు కొత్తపల్లిరామదాసు (టిడిపి), పోతనపల్లికి పేరం బసవయ్య ఏకగ్రీవం (వైఎస్‌ఆర్‌సిపి), మర్లపాలెంకు మట్టా పద్మజ్యోతి (కాంగ్రెస్), పోలవరంకు ఈదర సత్యనారాయణ (టిడిపి)లు సర్పంచ్‌లుగా ఎన్నికైనారు.
- పంచాయతీ ఎన్నికల పోలింగ్ - తొలివిడత ప్రశాంతం
నూజివీడు, జూలై 23: జిల్లాలో తొలివిడతగా పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నూజివీడు డివిజన్‌లో మంగళవారం జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగానే జరిగాయి. చాట్రాయి మండలం సోమవరం గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తారుమారు కావటంతో ఇద్దరు అభ్యర్థులు, గ్రామస్థుల అభీష్టం మేరకు ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒక్కరు కూడా ఓటు వేయలేదు. దీంతో సోమవరం గ్రామంలో ఎన్నికలు వాయిదా వేస్తూ ఈ నెల 31న నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు మంగళవారం సాయంత్రం ప్రకటించారు. సగటు పోలింగ్ శాతం 89.70గా నమోదయంది. రెడ్డిగూడెం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గ్రామంలో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీలకు పనిపెట్టారు. అదేవిధంగా నూజివీడు మండలం రామన్నగూడెం గ్రామంలో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మధ్య వాగ్వివాదం జరిగింది. మండలంలోని గొల్లపల్లి, మీర్జాపురం, పల్లెర్లమూడి గ్రామాల్లో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. డివిజన్ పరిధిలో చిన్న చిన్న సంఘటనలు మినహా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోలేదు. పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయటంతో చిన్న చిన్న సంఘటనలు జరినప్పటికీ వెంటనే రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. జిల్లా ఎస్‌పి జె ప్రభాకరరావు, నూజివీడు డిఎస్‌పి ఎ శంకరరెడ్డిలు నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు దాసరి కార్డియార్, నూజివీడు రెవెన్యూ డివిజన్ అధికారి బి సుబ్బారావు తదితరులు ఎన్నికల తీరును పరిశీలించారు. ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వారి మద్దతుదారులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఎంతో కృషి చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లు ప్రత్యేక వాహనాల్లో ఆయా గ్రామాలకు వచ్చి ఓట్లు వేశారు. నూజివీడు డివిజన్ పరిధిలో 246 గ్రామపంచాయతీలకు, 2,322 వార్డులకు ఎన్నికలు జరిగాయి. గ్రామ సర్పంచ్ పదవులకు 616 మంది, వార్డు సభ్యుల పదవులకు 5228 పోటీ పడ్డారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగింది. వికలాంగులు, వృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తిరువూరులో 93శాతం పోలింగ్
తిరువూరు, జూలై 23: తిరువూరు మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో 92.80 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కపాలెంలో 96 శాతం, ఆంజనేయపురంలో 80.96, చింతలపాడులో 93.8, చిట్టేలలో 94.3, చౌటపల్లిలో 96.61, ఎర్రమాడులో 93.7, ఎరుకోపాడులో 93, గానుగపాడులో 90.4
ఎన్నికల బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ
విజయనగరం (కంటోనె్మంట్), జూలై 23: పార్వతీపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో మంగళవారం జరిగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల బందోబస్తును జిల్లా ఎస్పీ కార్తికేయ పర్యవేక్షించారు. ఎన్నికలను పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యగా వివిధ విభాగాలకు చెందిన 2500 మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికల బందోబస్తుకు వినియోగించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ముందు జాగ్రత్త చర్యగా పటిష్టబందోబస్తు ఏర్పాట్లు చేయడంతో తొలివిడత ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో జిల్లా పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకుంది. ఇదే తరహాలో ఈ నెల 27న విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగే మలివిడ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రణాళికలు రూపొందించుకుంది. ముందు జాగ్రత్త చర్యగా సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేయడంతోపాటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు పటిష్టబందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీంతో కల్లోలిత ప్రాంతాలుగా భావించే మావోయిస్ట్, సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు మద్యం, డబ్బు, తదితర వాటిని అక్రమ రవాణా చేయకుండా వాహనాల తనిఖీలను ముమ్మరం చేసింది. వాహన తనిఖీలకు 20 బృందాలను జిల్లా పోలీస్ శాఖ నియమించింది. దీంతో జిల్లాలో దాదాపుగా అన్ని రహదారులు పోలీస్ దిగ్భందంలో ఉండటంతో తొలివిడత ఎన్నికలకు అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా చేయడంతో జిల్లా పోలీస్ శాఖ విజయం సాధించింది.
వరినారును ఆదుకున్న వర్షం
గజపతినగరం, జూలై 23 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి నైరుతి రుతుపవనాలు తోడు కావడంతో కురిసిన వర్షం వరినారుకు ఊపిరి పోసింది. గడచిన 24 గంటల్లో 23.6 మిల్లీమీటర్లు, సోమవారం ఉదయం వరకు 13.6 మిల్లీ మీటర్ల వర్షపాతం ఇక్కడ తహశీల్దార్ కార్యాలయంలో నమోదైంది. మండలం పరిధిలోగల గ్రామాల్లో పది రోజుల క్రిందట రైతులు సుమారు 10 వేల ఎకరాల్లో ఉబాలు జరపడానికి అవరమైన వరి నారు పోశారు.అప్పటి నుంచి వర్షం కురవని కారణంగా వరినారు మొలకెత్తే దశలలోనే పొతుందని ఆందోళన చెందుతున్న సమయంలో కురిసిన వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పినపెంకిలో వైకాపా, కాంగ్రెస్
వర్గాల ఘర్షణ?
బాడంగి/ తెర్లాం, జూలై 23: బాడంగి మండలం పినపెంకి గ్రామపంచాయతీ ఎన్నికలు కలకలం రేపాయి. పంచాయతీలో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీల బలపర్చిన అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఇందులో వైకాపా తరుపున జి గురుమూర్తి, కాంగ్రెస్‌పార్టీ తరుపున ఎ శివునాయుడు పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్య ఆధిక్యత రావడంతో ఘర్షణ జరిగినట్లు తెలిసింది. 10 వార్డు మెంబర్లకు ఐదు వార్డులు కాంగ్రెస్, మిగిలిన ఐదు వార్డులు వైకాపాలు బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఎ శివునాయుడుకు సుమారు 22 ఓట్లు ఆధిక్యతలో ఉండటంతో ఈ సమాచారం తెలుసుకున్న కొంతమంది వైకాపా కార్యకర్తలు పోలింగ్ కేంద్రంపై రాళ్లు రువ్వినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ వాసిరెడ్డి వరదారామారావు, అతని కుమారుడు కిరణ్‌కుమార్‌లు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లడంతో వారు గాయపడినట్లు తెలిసింది. ఈ మేరకు కిరణ్‌కుమార్‌ను వైద్యం నిమిత్తం తరలించినట్లు తెలిసింది. వీరిని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులు కూడా స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పినపెంకి పంచాయతీ ఎన్నికలు పోరును తలపించే రీతిలో కనిపిస్తున్నాయి. ఈ కేంద్రం వద్ద అర్ధ రాత్రి వరకు స్పెషల్ ఫోర్స్‌తోపాటు ప్రత్యేక బృందాన్ని గస్తీకి ఏర్పాటు చేశారు.
‘కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి’
విజయనగరం (్ఫర్టు), జూలై 23: కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, అభివృద్ధిని చూసి కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఓటు వేయాలని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్ధతులకు మంగళవారం విజయనగరం మండలం గొల్లలపేట, కోరుకొండ, చిల్లపేట, జొన్నవలస, రాకోడు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కోలగట్ల మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలను మభ్యపెట్టేవిధంగా ఆపార్టీ నాయకులు మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే వారి మాటలను నమ్మేస్థితిలో ప్రజలు లేరనే విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ప్రజలు తమ కష్టాలను చెప్పుకునేందుకు అశోక్ బంగ్లాకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధి గురించి ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, గొల్లలపేట గ్రామంలో ఎవరి ప్రభుత్వ హాయాంలో అభివృద్ధి జరిగిందో ఇదే వేదికపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి హామీపనులు, రేషన్‌కార్డులు, అమ్మహస్తం, పింఛన్లు వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. జిల్లామంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోను అభివృద్ధి చెందిందని, జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, యడ్ల ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అపశృతి
సాలూరు, జూలై 23: పంచాయతీ ఎన్నికలలో మంగళవారం అపశృతి దొర్లింది. ఓటు వేయడానికి మండలంలో నార్లవలస పంచాయతీ బొర్రాపనుకు గ్రామానికి చెందిన గిరిజనులు తిరుగు ప్రయాణంలో వ్యాన్ బోల్తాపడటంతో 30మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయాలపాలైన 10మందిని విజయనగరం కేంద్రం ఆసుపత్రికి తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. వారంతా ఓట్లు వేసి ఒక వ్యాన్‌లో తమ స్వగ్రామం బయలుదేరారు. వీరితోపాటు సి.పి.ఎం నాయకులు ఎన్.వై.నాయుడు, వి.లక్ష్మిలున్నారు. తాడిలోవ నుంచి కొద్దిదూరం వెళ్లిన వ్యాన్ నక్కడవలస సమీపంలో మలుపుతిరుగుతుండగా అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో వ్యాన్ బోల్తాపడింది. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 30మంది గిరిజనులు గాయాలపాలయ్యారు. వీరిని 108వాహనం, ఇతర వాహనాలలో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన చోడిపల్లి జరమ, సుహాసిని, రాజీవ్, కొర్రా తిలుచు, తులసి, చోడిపల్లి బూందే, మర్రి రత్తమ్మ, బి. లింగు, గెమ్మిలి ఇందిర, కొర్రా రాధమ్మలను విజయనగరం ఆసుపత్రికి తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజన్నదొర ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
పోలింగ్ ప్రశాంతం
విజయనగరం, జూలై 23: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ అపశ్రుతులు మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. మంగళవారం పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లోని 15 మండలాలకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వెబ్‌కాస్టింగ్ విధానం ద్వారా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిఐజి ఉమాపతి, ఎస్పీ కార్తికేయ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తొలి విడత పోలింగ్‌లో అత్యధికంగా రామభద్రాపురంలోని 95.38 శాతం పోలింగ్ జరిగింది. మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలించినట్టయితే పార్వతీపురం 88.69, గరుగుబిల్లిలో 90.37, సాలూరులో 90, పాచిపెంటలో 87.74, మక్కువలో 87.42, బొబ్బిలిలో 85, బలిజపేటలో 88.92, సీతానగరం 91, జియ్యమ్మవలస 87.83, బాడంగి 90, కొమరాడ 91, కురపాం 82, తెర్లాం 85, గుమ్మలక్ష్మిపురం 80 శాతం పోలింగ్ జరిగింది. రామభద్రాపురం మేజర్ పంచాయతీలో ఓటర్లు ఉదయం ఆరు గంటల నుంచే క్యూలో వేచి ఉండటం కన్పించింది. అక్కడ పోలింగ్ అనంతరం స్వల్ప ఘర్షణ మినహా అంతా ప్రశాంతంగా జరిగింది.
కాగా, ఉదయం ఆరు గంటల నుంచి ఆటోల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
ఓటింగ్ సమయంలో కొన్ని చోట్ల అభ్యర్థులు గుర్తులు తారుమారయ్యాయని బొబ్బిలి మండలం మెట్టవలస పంచాయతీ ఒకటో వార్డుకు బరిలో నిలిచిన అభ్యర్థులు మీసాల చంద్రశేఖరరావు, వెంకటరమణ శిఖలు పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దీనికి పోలింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ మీరు ఆరోజు ఒక గుర్తుకు వేరొక గుర్తు రాసుకొని ఉంటారని బదులిచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. ఇదిలా ఉండగా ఓటర్లు తమకు ఓటు వేశారా అని అడిగితే నిజం చెబుతారో లేదోనని ఆరికతోటలో వైకాపా నేతలు మరో ముందడుగు వేసి తమ నుంచి తాయిలాలు అందుకున్న ఓటర్లను తమ ఎదుట దైవసాక్షిగా ప్రమాణాలు చేయాలని వత్తిడి తెచ్చినట్టు సమాచారం. సాలూరు మండలం నేరెళ్లవలస పంచాయతీలో ఓటర్లను తీసుకెళ్తున్న వ్యాన్ మలుపు వద్ద బోల్తాపడటంతో 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయాలపాలైన 10 మందిని జిల్లా కేంద్రానికి తరలించారు. జియ్యమ్మవలసలోని దుడ్డికల్లులో తాగుబోతులు వీరంగం చేయడంతో పోలింగ్ కొద్దిసేపు నిలిపివేశారు. రామభద్రాపురం మండలం తారాపురంలో ఓటర్లకు బ్యాలెట్ పేపర్లను తప్పుగా మడతపెట్టి ఇవ్వడం వల్ల తాము వేసిన ఓటు ముద్ర రెండు గుర్తులపై పడి అవి చెల్లకుండా పోతాయని సుమారు 50 మంది మహిళా ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్ద గొడవకు దిగారు. చదువుకున్న వారు ఓటర్ల జాబితాలో సంతకాలు చేస్తే ఒకలాగా బ్యాలెట్ పేపరు మడతపెట్టి ఇస్తున్నారని, సంతకం రాని వారికి ఇంకొకలాగా బ్యాలెట్ పేపరు మడతపెడుతున్నారని వారు ఆరోపించారు. కురపాం మండలం పెద్దగొత్తిలిలో ఒక వార్డుకు ఉపయోగించాల్సిన బ్యాలట్‌లను వేరొకవార్డుకు ఉపయోగించడంతో ఆ వార్డులో ఓటర్లకు బ్యాలెట్లు చాలక ఓటర్లు ఓటువేయకుండా మిగిలిపోయారు. దీంతో అధికారులు జోక్యం చేసుకొని వివాదాన్ని పరిష్కరించారు. ఈ విధంగా చిన్న చిన్న సంఘర్షణలు మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
విజయనగరం (్ఫర్టు), జూలై 23: ఈనెల 27 తేదీన విజయనగరం డివిజన్‌లో జరుగనున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. పార్వతీపురం డివిజన్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి సత్యశ్రీనివాస్‌తో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్వతీపురం డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గిరిజన, శివారు ప్రాంతాల్లో చిన్నచిన్నలోపాలు జరిగాయన్నారు. అయితే విజయనగరం డివిజన్‌లో అలాంటి లోపాలు లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. విజయనగరం డివిజన్‌లో 73 పంచాయతీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనందున, అక్కడ సిబ్బందిని ఎన్నికలు జరిగే గ్రామాల్లో నియమించాలమన్నారు. పార్వతీపురం డివిజన్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై ఎప్పటికప్పుడు కలెక్టర్ ఆరా తీశారు. బొబ్బిలి సమీపంలో మెట్టవలసలో చిన్నపాటి అల్లరి సంఘటనలు జరిగినట్లు కలెక్టర్ దృష్టికి జిల్లా పంచాయతీ అధికారి తీసుకువెళ్లారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస ఏజెన్సీ మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. విజయనగరం డివిజన్‌లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
తొలివిడతలో కాంగ్రెస్‌దే హవా
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 23: జిల్లాలో తొలి విడత కింద 15 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక పంచాయతీలను కైవశం చేసుకుంది. రెండో స్థానంలో వైకాపా నిలిచింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గట్టి పోలీసు బందోబస్తు, పారా మిలటరీ బలగాలను వినియోగించారు. జిల్లాలో మొత్తం 921 పంచాయతీలు ఉండగా వాటిలో తొలి విడత కింద 409 పంచాయతీలకు, 3866 వార్డులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కాగా, వీటిలో 59 పంచాయతీలు, 1412 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 349 పంచాయతీలకు, 2419 వార్డులకు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌కు 148, టిడిపి 81, వైకాపాకు 113, ఇండిపెండెంట్లు ఇతరులు కలిపి 66 పంచాయతీలు దక్కాయి. సీతానగరం మండలం వియ్యంపేట పంచాయతీకి ఎన్నిక జరగలేదు. అలాగే ఈ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహించినప్పటికీ పార్టీల మద్దతుతో అభ్యర్థులు గెలుపొందిన విషయం విధితమే.
రేపటితో రెండో విడత ప్రచారం సమాప్తం
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జూలై 23: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత కింద ప్రచారానికి మరో రెండు రోజులే గడువు ఉంది. 25న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది. రెండో విడత కింద విజయనగరం డివిజన్‌లోని 19 మండలాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. వాటిలో విజయనగరం, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, దత్తిరాజేరు, మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల, నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం, గంట్యాడ, ఎస్.కోట, జామి, కొత్తవలస, ఎల్.కోట, వేపాడ మండలాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పోలింగ్ సామాగ్రిని ఈ నెల 25న ఉదయం అందజేయనున్నట్టు సమాచారం. కాగా, ఈ ఎన్నికలకు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు విజయనగరం మండలంలో పర్యటిస్తున్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కూడా కొన్ని మండలాల్లో పర్యటిస్తూ అభివృద్ధిని చూసి ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు నియోజకవర్గం, వైకాపా జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు నియోజకవర్గం ఉండటంతో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఇప్పటికే ఎన్నికల్లో గెలుపు కోసం తొలిసారిగా కత్తులు దూసుకున్నారు. జిల్లాలోని నెల్లిమర్ల మండలం దన్నానపేటకు చెందిన జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గేదెల రాజారావుపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. కాంగ్రెస్ వర్గీయులే అతనిపై దాడి చేశారని రాజారావు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా చీపురుపల్లిలో కాంగ్రెస్‌లోనే రెబెల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖరరావు సతీమణి బెల్లాన శ్రీదేవి చీపురుపల్లి మేజర్ పంచాయతీకి కాంగ్రెస్ నుంచి బరిలో నిలవగా, అదే పంచాయతీకి మరో కాంగ్రెస్ వర్గీయుడు మీసాల వరహాలరావు సతీమణి సరోజిని బరిలో దిగింది.
దీంతో నేతలు ఎవరిని ఓదార్చాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలు సరోజినికి మద్దతుపలికేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. దీంతో ఈ ఎన్నిక మలుపు ఎటుతిరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దత్తిరాజేరు, మానాపురం, గంట్యాడ, ఎస్.కోట, విజయనగరం మండలాల్లో నేతలు సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. ఏది ఏమైనా మరో రెండు రోజులే ప్రచారానికి గడువు ఉండటంతో నేతలు నానా హైరానా పడుతున్నారు.
అరగంట వ్యవధిలో తండ్రి, కూతురు హఠాన్మరణం
కురుపాం, జూలై 23: కూతురు చనిపోయిందన్న బాధను జీర్ణించుకోలేక తండ్రి చనిపోయిన సంఘటన ఇక్కడ జరిగింది. మంగళవారం కురుపాం పంచాయతీ శివ్వన్నపేటకు చెందిన కొత్తకోట కృష్ణారావు(48), అతని కుమార్తె నీలవేణి(10) ఇద్దరూ అరగంట వ్యవధిలో చనిపోయారు. నీలవేణికి మంగళవారం వేకువ జామున ఆస్త్మాతో ఊపిరి అందకపోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. కురుపాంలో ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో పార్వతీపురం తరలించారు. అక్కడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనిని చూసి తట్టుకోలేక తండ్రి కృష్ణారావు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బిపి తగ్గి అక్కడికక్కడే మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. అర గంట వ్యవధిలోనే చనిపోయిన వీరిద్దరి మృతదేహాలను మంగళవారం కురుపాం తీసుకువచ్చారు. తండ్రీకూతుళ్లు మృతిచెందిన విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆవేదన చెందారు. కృష్ణారావు చిరువ్యాపారి. ఈయనకు భార్య ఈశ్వరమ్మ, నలుగురు ఆడ పిల్లలు. ఇద్దరు ఆడ పిల్లలకు వివాహం జరిగింది. మిగిలిన ఇద్దరిలో నీలవేణి శివ్వన్నపేట పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేక కృష్ణారావు చనిపోయినట్లు బంధువులు తెలిపారు. ఆక్సిజన్ వెంటనే అందించకపోవడం, 108 సిబ్బంది సమ్మెలో ఉండటంతోనే చిన్నారి ప్రాణం పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. వీరి ఇద్దరి మరణంతో కురుపాం, శివ్వన్నపేట గ్రామాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి.
సర్పంచ్ స్థానాల్లో సైకిల్ స్పీడ్
శ్రీకాకుళం, జూలై 23: ఏడేళ్ల విరామం తరువాత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. జిల్లాలోని శ్రీకాకుళం డివిజన్ పరిధిలో మంగళవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులనే అధిక శాతం మంది ఓటర్లు సర్పంచ్‌లుగా ఎన్నుకున్నారు. సర్వసాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా స్థానిక ఎన్నికల ఫలితాలు రావడం పరిపాటి. అయితే ఈ ఎన్నికల్లో భిన్నమైన తీర్పును ఓటర్లు ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది. మంత్రులు, మాజీ మంత్రులు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం ప్రభంజనం సుస్పష్టమైంది. మరో పది నెలల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పంచాయతీ ఫలితాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వరుస అపజయాలతో అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎర్రన్న హఠాన్మరణం తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇటువంటి సంకట స్థితిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులకు పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అండగా నిలిచి అధికార పార్టీని హెచ్చరించారు. ప్రత్యేక పాలనలో పంచాయతీల్లో నివాసముంటున్న పౌరులు ప్రాథమిక అవసరాలు కూడా తీరకపోవడమే కాకుండా అధిక ధరలు, విద్యుత్ చార్జీల పెంపు, పెట్రోల్, డీజిల్ వడ్డనల కారణంగా ప్రజలపై మోపిన భారాలను నిట్టూరుస్తూ భరించిన ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడేలా తీర్పునిచ్చారు. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో మంగళవారం తొలివిడతగా 304 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రాత్రి పది గంటల సమయానికి అందిన సమాచారం మేరకు అధికార కాంగ్రెస్ పార్టీకి 117 సర్పంచ్ పదవులు లభించగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 143 మంది సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 62 స్థానాలకే పరిమితమైంది. మరో 28 స్థానాలను ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. ఆమదాలవలస మండలంలోఆరు కాంగ్రెస్, 17 తెలుగుదేశంపార్టీ, మూడు వైఎస్సార్‌సీపీ, రెండు ఇండిపెండెంట్లుగా ఎన్నికయ్యారు. బూర్జలో 12 కాంగ్రెస్, 11 టిడిపి, నాలుగు వైకాపాకు దక్కాయి. ఎచ్చెర్లలో ఆరు కాంగ్రెస్, 19 టిడిపి, మూడు ఇండిపెండెంట్లు, ఎల్.ఎన్.పేటలో ఏడు కాంగ్రెస్, నాలుగు టిడిపి, నాలుగు వైకాపా, నాలుగు ఇతరులు, లావేరులో తొమ్మిది కాంగ్రెస్, 13 టిడిపి, రెండు ఇండిపెండెంట్లు , నరసన్నపేటలో తొమ్మిది కాంగ్రెస్, తొమ్మిది టిడిపి, 16 వైకాపా, పోలాకిలో 12 కాంగ్రెస్, 11 టిడిపి, ఎనిమిది వైకాపా దక్కించుకున్నాయి. అదేవిధంగా పొందూరులో పది కాంగ్రెస్, 15 టిడిపి, మూడు ఇతరులు, సరుబుజ్జిలిలో ఏడు కాంగ్రెస్, ఆరు టిడిపి, ఆరు వైకాపా, రెండు స్థానాల్లో ఇతరులు కైవసం చేసుకున్నారు. శ్రీకాకుళంలో 14 కాంగ్రెస్, తొమ్మిది టిడిపి, రెండు ఇతరులు, గారలో ఎనిమిది కాంగ్రెస్, టిడిపి 11, రెండు వైకాపా, మూడు ఇతరులు, జి.సిగడాంలో 12 కాంగ్రెస్, పది టిడిపి , రెండు వైకాపా, ఏడు ఇతరులు, రణస్థలంలో ఐదు కాంగ్రెస్, ఎనిమిది టిడిపి, 17 స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. జనం ఇమేజ్ అధికంగా ఉందని భ్రమలలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలకు కూడా ఈ ఫలితాలు ప్రతికూలంగా నిలిచాయి. నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌లు పంచాయతీపోరులో సత్తా చాటుకున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో మూడు స్థానాలకు పరిమితం కాగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక్క సర్పంచ్ పదవి కూడా ఆ పార్టీకి దక్కకపోవడం ఇద్దరు సమన్వయకర్తల పనితనం ఏపాటిదో ఇట్టే అర్ధమవుతోంది. ఇలా పంచాయతీ ఫలితాలు రాజకీయ పార్టీలను, విశే్లషకులను హెచ్చరించినట్లయింది.
పంచాయతీ పోలింగ్ ప్రశాంతం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూలై 23: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. శ్రీకాకుళం డివిజన్‌లో జరిగిన 13 మండలాల్లో 5.15 లక్షల మంది ఓటర్లుండగా 4.39 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 89.29 శాతం పోలింగ్ నమోదైంది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగగా సాయంత్రానికి ఫలితాలు వెలువడ్డాయి. 304 పంచాయతీలకు గాను 741 సర్పంచ్‌లు, 2,153 వార్డుమెంబర్లకు గాను 4,751 మంది అభ్యర్థులు బరిలో దిగి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రతీ రెండు గంటల సమయానికి ఒకసారి డివిజన్‌లో ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రకటించారు. ఉదయం తొమ్మిది గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదు కాగా 11 గంటలకు 62 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 89.29 శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ ముగిసే సమయానికి జి.సిగడాంలో 88.49 శాతం, పొందూరులో 91, లావేరులో 92, రణస్థలంలో 93.6, ఎచ్చెర్లలో 90.43, శ్రీకాకుళంలో 90, పోలాకిలో 86.84, ఎల్.ఎన్.పేటలో 87.85, సరుబుజ్జిలిలో 90.1, బూర్జ 89.59, ఆమదాలవలసలో 88.85, గారలో 87.86, నరసన్నపేటలో 81 శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తొలివిడత జరిగిన శ్రీకాకుళం డివిజన్‌కు గాను పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక శ్రద్ధను కనబరిచారు. రణస్థలం మండలంలో 93.6 శాతం పోలింగ్ అత్యధికంగా నమోదు కాగా 81.25 శాతంతో నరసన్నపేట అత్యల్ప పోలింగ్ జరిగింది. జి.సిగడాం మండలంలో 39,688 మంది ఓటర్లు ఉండగా 35,120 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే పొందూరులో 73,890 మందికి గాను 47,371 ఓట్లు పోలవ్వగా లావేరు మండలంలో 45,032 మంది ఓటర్లకు గాను 41,407 ఓట్లు, రణస్థలంలో 51,289 మంది ఓటర్లకు గాను 48,020 ఓట్లు పోలయ్యాయి. ఎచ్చెర్ల మండలంలో 53,824 ఓట్లకు గాను 48,678 ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం మండలానికి సంబంధించి 39,820 ఓట్లకు గాను 35,879 ఓట్లు పోలవ్వగా గార మండలంలో 40,456 ఓట్లకు 35,555 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలాకి మండలంలో 37,055 మంది ఓటర్లు ఉండగా 32,178 ఓట్లు, నరసన్నపేట మండలంలో 48,868 మంది ఓటర్లు ఉండగా 39,709 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎల్.ఎన్.పేటకు సంబంధించి 14,808 మందికి గాను 13,009 ఓటర్లు, సరుబుజ్జిలి మండలంలో 19,899 మందికి గాను 17,903 మంది, బూర్జ మండలంలో 19,759 మందికి గాను 17,700 మంది, ఆమదాలవలసలో 30,825 ఓటర్లు ఉండగా 27,248 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. డివిజన్‌లో జరిగిన తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్పష్టంచేశారు.
ఇబ్రహీమ్‌బాద్‌లో
ఉద్రిక్తత
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూలై 23: జిల్లాలోని పంచాయతీ తొలివిడత పోరులో భాగంగా అక్కడక్కడ ఉద్రిక్తత పరిస్థితులు దారితీసాయి. అయితే కౌంటింగ్‌అనంతరం ఎచ్చెర్ల మండలం ఇబ్రహీమ్‌బాద్ గ్రామంలో మాజీ జెడ్పిటిసి సనపల నారాయణరావు (కాంగ్రెస్)కు చెందిన కొంతమంది తెలుగుదేశం పార్టీ వర్గీయులను దారికాసి దాడి చేశారు. ఈ దాడిలో సీపాన శంకరరావు, సీపాన సత్తిరాజులకు బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరూ రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. టిడిపి వర్గీయులు పోలింగ్ స్టేషన్ ఎదుట బైఠాయించి రీ-పోలింగ్ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మహిళలంతా పోలింగ్ తీరు అధికారులను తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎన్నికల ప్రత్యేకాధికారి రెడ్డి గున్నయ్య, తహశీల్దార్ బి.వెంకటరావు, ఎస్సై పి.వి. ఎస్. ఉదయ్‌కుమార్‌లు గ్రామానికి చేరుకుని స్థానికులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారంతా వినకుండా పోలింగ్ అధికారులను అటకాయించే మాదిరిగా వాహనాలకు ఎదురుగా నిరసనలకు దిగారు. ఇక్కడి పరిస్థితిని ఎస్సై పోలీసు ఉన్నతాధికారులకు చేరవేయగా హుటాహుటిన ఎన్నికల డి ఎస్పీ శ్రీనివాసరావు ఆందోళనకారుల వద్దకు చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారునిగా బరిలో నిలిచిన సీపాన విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ వావిలపల్లి రామస్వామి, మాజీ ఎం.పి.టి.సి చింతాడ రామారావులతో చర్చించారు. ఈ వివాదానికి కారణమైన మాజీ జడ్పిటిసితోపాటు ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై డి ఎస్పీ స్పందించి ఎక్సైజ్ కానిస్టేబుల్‌తోపాటు బాధ్యులుపై చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతల దృష్ట్యా పికెటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు.
రిమ్స్‌లో క్షతగాత్రులు
కాంగ్రెస్ వర్గీయుల దాడిలో గాయాల పాలైన క్షతగాత్రులు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన శంకరరావు, సత్తిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవుట్‌పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసి ఎచ్చెర్ల పోలీసులకు బదలాయించారు.
పశుసంవర్ధక శాఖ జెడి బాధ్యతలు స్వీకరణ
శ్రీకాకుళం(రూరల్), జూలై 23: పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులుగా పెరుమళ్ల నాగన్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వహించిన మెట్ట వెంకటేశ్వర్లు నాగన్నకు బాధ్యతలు అప్పగిస్తూ అభినందనలు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ఉపసంచాలకులుగా పనిచేస్తూ పదోన్నతిపై నాగన్న జిల్లాకు వచ్చారు. గతంలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈయన సేవలందించారు. కరవు ప్రభావితమైన జిల్లాల్లో క్యాటిల్ క్యాంపు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించి పశుమరణాలను నివారించారు. ఆత్మ, ఇతర సంస్థల ద్వారా అందుబాటులో ఉన్న వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుని రాష్ట్రంలో ఉన్న పాడి అభివృద్ధి సంస్థలకు, రైతులకు పరిచయం చేసి అవగాహన కల్పించారు.
దొడ్డిదారిన మద్యం అమ్మకాలు
* నివారించలేని ఆబ్కారీ శాఖ
శ్రీకాకుళం (టౌన్), జూలై 23: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ నిర్లిప్తత కారణంగా పట్టణంలో మద్యం దొడ్డిదారి అమ్మకాలు యదావిధిగా సాగాయి. మంగళవారం నిర్వహించనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలననుసరించి, ఆదివారం సాయంత్రం నుండే అన్ని మద్యం దుకాణాలకు ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారులు తాళాలు వేసి సీలుచేశారు. దీనిని ముందుగానే గ్రహించిన కొంతమంది బారు షాపు యజమానులు, వైన్ షాపు యజమానులు సరుకును పక్కదోవ పట్టించి షాపులకు వేసిన తాళాలు వేసినట్లే ఉండగా దొడ్డిదారిన యదావిధిగా అమ్మకాలు చేయడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలను నియంత్రించామని గత రెండు రోజులుగా సంబంధిత శాఖ పర్యవేక్షకాధికారులు ప్రకటనలు గుప్పిస్తుండగా ఆయా కార్యాలయానికి కూతవేటు దూరంలో పట్టణం నడిబొడ్డున సాగుతున్న అమ్మకాలను నియంత్రించలేని వారి పనితీరును పట్టణ పౌరులంతా హవ్వ అంటూ ముక్కున వేలేసుకున్నారు.
108 సమ్మె చట్టవిరుద్ధం
* జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శ్రీ్ధర్
శ్రీకాకుళం (టౌన్), జూలై 23: గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న 108 వాహన సిబ్బంది సమ్మె చట్టవిరుద్ధమని, వారి డిమాండ్లు అసమంజసమని 108 సేవల జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఎం.శ్రీ్ధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 108 సేవలకు విఘాతం కలిగిస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, తాజా నియామకాలు చేపట్టి కార్యకలాపాలను విస్తృత పరుస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే సేవలకు విఘాతం కలుగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని, మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి సేవలు అందిస్తామని అన్నారు.
* పారా మెడికల్, పైలట్ల నియామకాలు
108 అంబులెన్సు సేవల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్ధులకు పారామెడికల్, పైలట్ల నియామకాలు చేపడుతున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఎం.శ్రీ్ధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పైలట్లకు 12 గంటల పనిదినానికి 800 రూపాయలు చొప్పున చెల్లించనున్నామని అన్నారు. అర్హత కలిగిన వారు వెంటనే జివికె, ఈఎంఆర్‌ఐ జిల్లా, కేంద్ర కార్యాలయాలను సంప్రదించాలని కోరారు.
ఓటర్లకు తప్పని తిప్పలు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూలై 23: స్థానిక సంస్థల ఎన్నికల తొలి ఘట్టం ముగిసింది. శ్రీకాకుళం డివిజన్ 13 మండలాల్లో మంగళవారం జరిగిన ఎన్నికలు ఓటర్లకు తీపి గుర్తులను మిగిల్చిందనే చెప్పాలి. ఉదయం ఏడు గంటలకే ఓటు వేసేందుకు వృద్ధులు, వికలాంగులు బారులు తీరడం కనిపించింది. నిన్నటి వరకు కాస్తా వర్షాలు పడినప్పటికి, మంగళవారం ఉదయం నుంచే ఎండ వేడిమి అధికంగా కాసింది. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లుకు కనీసం ఎండ నుంచి టార్పానాలు కూడా లేకపోవడంతో ఒకింత అసహనానికి గురైయ్యారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బరిలో ఉన్న అభ్యర్థి వర్గాలు ఒకరిపై ఒకరు వాదులాటకు దిగారు. పొలీసుల జోక్యంతో సద్దుమణిగింది. ఈ దఫా ఎన్నికల్లో ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపించకపోవడం కొసమెరుపు. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు బరిలో ఉన్న అభ్యర్ధులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఓటర్ల ఇంటివద్దకు ఆటోలను తీసుకువెళ్లి పోలింగ్ కేంద్రాలకు రప్పించారు. మరికొన్ని కేందాల్లో ఉదయం సమయంలో ఓటర్లుకు పులిహోర, ఇడ్లీ వంటి అల్పాహారాన్ని ఏర్పాటు చేసారు. ఆమదాలవలస రాగోలు జెడ్పీ ఉన్నత పాఠశాల దరి ఓ వర్గం ఓటర్లకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. దూసి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, మహిళలు ఎండ వేడిమి భరించలేక ఇబ్బంది పడ్డారు. తొగరాం జెడ్పీ ఉన్నత పాఠశాల దరి పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలీసులు ఎక్కువగా విధులు నిర్వహించగా, ఓటర్ల మాత్రం తక్కువ సంఖ్యలో హాజరైయ్యారు. గార మండలం ఆరంగిపేటకు చెందిన పొట్నూరు మాణిక్యమ్మ(98) వృద్ధురాలు ఎంతో ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నీలాపుపేటకు చెందిన చిదపాన బోడెమ్మ ఎండవేడిమికి సొమ్మసిల్లిపడిపోయింది. అలాగే బోరవానిపేటకు చెందిన సబ్బి సూరమ్మ86), పట్నాన కన్నమ్మ(80)లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి హాజరైయ్యారు. ఇక మేజర్ పంచాయతీల పోలింగ్‌లో మాత్రం జాప్యం చోటుచేసుకుంది. పొందూరు, నరసన్నపేట, శ్రీకూర్మంలు మేజర్ పంచాయతీలో ఉండగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు బారులు తీరారు. సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.
ఇదిలా ఉండగా పొందూరు మండలం నందివాడలో అధికార పార్టీకి చెందిన వారు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ప్రత్యర్థులు వాదులాటకు దిగారు. పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది.
ఎవరికి మేలు చేకూర్చేందుకీ ప్రతిపాదన వైన భూములు కట్టబెట్టేందుకే
విశాఖపట్నం, జూలై 23: మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సొంతిల్లులేని నిరుపేదల కలను సాకారం చేసేక్రమంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు జివిఎంసి తీసుకున్న నిర్ణయం వివాదస్పదమవుతోంది. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం కింద నగర పరిధిలో 25వేల ఇళ్లను నిర్మించేందుకు వీలుగా తీసుకున్న నిర్ణయంలో పేదల పట్ల ప్రేమకన్నా, రియల్ ఎస్టేట్ సంస్థలకు మేలు చేకూర్చాలన్నదే ధ్యేయంగా కన్పిస్తోంది. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న రైల్వే స్థలాలతో పాటు పెందుర్తి, కొమ్మాది, చినముషిడివాడ, నరవ, మధురవాడ తదితర ప్రాంతాల్లో జివిఎంసితో పాటు ప్రభుత్వ రెవెన్యూ విభాగం నుంచి సేకరించిన 147 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈపథకానికి రూపకల్పన చేస్తున్నట్టు వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, ఇందిరమ్మ పథకాల కింద నగరంలో 15వేలకు పైచిలుకు ఇళ్లను నిర్మించిన జివిఎంసి కేవలం 9000 మందికి మాత్రమే వాటిని కేటాయించింది. ఈపథకం కింద ఇళ్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేటాయించిన వాటిలో అర్హులకన్నా, అనర్హులకే పెద్ద పీటవేశారన్న విమర్శలున్నాయి. ఇటీవల జరిపిన విచారణలో సైతం 25 శాతం అనర్హులు, నకిలీలు ఉన్నాయని గుర్తించారు. వీరికి నోటీసులు జారీ చేసి ఇళ్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టినా ఇంతవరకూ ఆచరణలో సాధ్యం కాలేదు. ఇక రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకం కింద నగరంలో పెద్దసంఖ్యలో ఇళ్లను నిర్మించేందుకు గతంలో ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ పథకం కావడం వల్ల నిబంధనలు, ఇతరత్రా కారణాల రీత్యా పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని, సత్వరమే నిరుపేదలైన అర్హులకు ఇళ్లను మంజూరు చేసేందుకు పిపిపి కింద ఇళ్లను నిర్మించడం మంచిదని జివిఎంసి యంత్రాంగం భావిస్తోంది. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి సేకరించిన 147 ఎకరాల భూమిమి ప్రైవేటు బిల్డర్లకు అప్పగించి వారు జి ప్లస్ త్రీ తీరులో నిర్మించే ఇళ్లను అర్హులకు కేటాయించాలన్నది ప్రతిపాదన. దీనిలో భాగంగా ప్రభుత్వానికి చెందిన కొంత భూమిని ఇదే లేఅవుట్‌లలో పథకం చేపట్టిన ప్రైవేటు నిర్మాణ సంస్థలకు అప్పగిస్తారు. ఈస్థలాల్లో వారు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది. విలువైన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఇంతకంటే మంచి మార్గం జివిఎంసికి లభించదు. అందుకే పిపిపి విధానంలో 147 ఎకరాల విలువైన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే వ్యూహ రచన సాగుతోంది. జిప్లస్‌త్రీ పద్ధతిలో 25 వేల ఇళ్లను నిర్మించేందుకు 147 ఎరకాలను కేటాయించాల్సిన అవసరం లేనప్పటికీ జివిఎంసి ఎందుకు ఈప్రతిపాదనను తెరపైకి తెచ్చిందన్నది మింగుడుపడట్లేదని వామపక్ష ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సిపిఎం నగర కమిటీ ప్రతినిధి విఎస్ పద్మనాభరాజు హెచ్చరించారు.
సహ దరఖాస్తులపై స్పందించండి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులపై సకాలంలో స్పందించాలని, దరఖాస్తుదారు అడిగిన సమాచారాన్ని విధిగా అందించాలని జివిఎంసి అదనపు కమిషనర్ కె రమేష్ స్పష్టం చేశారు. సహ దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. జోనల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో మంగళవారం సమావేశమైన ఆయన సహ చట్టం అమలుపై చర్చించారు. సహ చట్టం కింద దరఖాస్తుదారుడు అడిగిన సమాచారాన్ని నిర్ణీత కాలవ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించారు. సమాచార హక్కు చట్టం అమలును మెరుగుపరచాలని ఆయన అధికారులకు సూచించారు. జివిఎంసికి సంబంధించి పిఐఓగా వ్యవహరిస్తున్న కార్యదర్శి సన్యాసినాయుడు, అప్పిలేట్ అధికారిగా ఉన్న తనకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటి కప్పుడు సంబంధిత విభాగాలకు పంపుతున్నట్టు పేర్కొన్నారు. ఆయావిభాగాలకు చేరిన దరఖాస్తులపై విభాగాధిపతులు సకాలంలో స్పందించాలని సూచించారు. వీటిపై సహ కమిషనర్‌కు అందే ఫిర్యాదులకు సంబంధించి విభాగాధిపతులే హాజరుకావాల్సి ఉంటుందన్నారు. సహ చట్టం అమల్లో ఎదురయ్యే సందేహాలు, సమస్యలను నివృత్తి చేసుకునేందుకు తమను సంప్రదించాలని సూచించారు. దీనిపై పిఐఓ సన్యాసినాయుడు మాట్లాడుతూ సహ దరఖాస్తుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చట్టంలో నిర్ణయించిన విధంగా వచ్చిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో జోనల్ కమిషనర్లు విజయలక్ష్మి, శివాజీ, శ్రీనివాస్, సీనియర్ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
2022 నాటికి అందరికీ అందుబాటులో సౌరశక్తి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: దేశ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా 2022 నాటికి సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఎపి ట్రాన్స్‌కో రిటైర్డ్ ఎస్‌ఇ సోమన్‌గణపతి అభిప్రాయపడ్డారు. 13వ పంచవర్ష ప్రణాళికా కాలంలో 20 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. గీతం విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంధనం పొదుపుపై మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌరవిద్యుత్ ఉత్పిత్తిలో ప్రస్తుతం అవుతున్న వ్యయాన్ని నియంత్రించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. 2060 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సౌరవిద్యుత్ వినియోగం పెరిగి గ్రీన్‌హౌస్ వాయువులు నియంత్రణ సాధ్యమవుతుందని, తద్వారా పర్యావరణానికి మేలు చేకూరుతుందని అన్నారు. దేశంలో పెరుగుతున్న విద్యుత్ వాడకం వల్ల అదనపు ఉత్పత్తి అవసరం అవుతోందన్నారు. ఇంధన పొదుపు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేనిపక్షంలో భవిష్యత్‌లో ఎదురయ్యే విద్యుత్ అవసరాలను తీర్చడం కష్టతరమవుతుందన్నారు. ఇక ఆలయాలు, మత సంస్థల్లో విద్యుత్ వాడకం, ఆదాపై ప్రజల్లో చైతన్యం చేయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గీతం ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ కెఎస్ లింగమూర్తి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శిధిల భవనాలను తక్షణమే కూల్చండి
* జివిఎంసి కమిషనర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: జివిఎంసి పరిధిలో శిధిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను తక్షణమే కూల్చేయాలని కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మంగళవారం సమావేశమైన ఆయన నగర పరిధిలో 105 భవనాలు పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్నాయని, వీటిని తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. మున్సిపల్ చట్టం ప్రకారం ప్రమాదకర స్థితికి చేరుకున్న భవనాలను కూల్చేసే అధికారం కార్పొరేషన్‌కు ఉందని, ఇప్పటికే నగర పరిధిలో 516 భవనాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్న 105 భవనాలకు సంబంధించి యజమానులకు మరోసారి నోటీసులు జారీ చేయాలని, స్పందించని పక్షంలో వీటిని కూల్చివేసి, రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేసి, ఖర్చులను వారినుంచి వసూలు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం కారణంగా శిధిల భవనాల కారణంగా ఎటువంటి ప్రమాదాలు సంభవించికుండా చర్యలు తీసుకోవాలన్నారు. జోన్ 2 15 భవనాలు, జోన్ 3లో 36, జోన్ 4లో 20, జోన్ 5లో 17, జోన్ 6లో 16 భవనాలు పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్నట్టు గుర్తించడమైందన్నారు. కూల్చివేతకు ముందుకురాని భవనాలకు సంబంధించి కేసులను ఆర్డీఓ కోర్టులో దఖలు పరచాలని ఆదేశించారు. భవన యజమానులు తమకు చెందిన శిధిల భవనాలను కూల్చివేసి జివిఎంసికి సహకరించాలని కోరారు. మిగిలిన భవనాలను పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ జయరామిరెడ్డి, పట్టణ ముఖ్య ప్రణాళిక అధికారి బాలకృష్ణ, డిసిపి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు కౌంటర్లను ఏర్పాటు చేయండి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: జివిఎంసి పరిధిలోని ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలుగా తగినన్ని బ్యాంకు కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద ప్రస్తుతం ఐదు కౌంటర్లు మాత్రమే ఉన్నాయని, మరో 25 కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు బ్యాంకు అధికారులతో చర్చించాలని సూచించారు. జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని ఆడిటింగ్, ఐటి సెక్షన్లను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నాలుగు సౌకర్యం కేంద్రాలు, ఐదు బ్యాంకు కౌంటర్లతో పాటు ఇసేవ కేంద్రాల ద్వారా మాత్రమే పన్నులు వసూలు చేస్తున్నామని, పలు వర్గాల ప్రజలకు అనువైన రీతిలో సులభంగా పన్నులు చెల్లిచేందుకు మాద్యమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐటి కేంద్రాన్ని పరిశీలించిన ఆయన పన్నుల వసూళ్లు, జమలు పారదర్శకంగా జరుగుతున్నాయాలేదా అన్న అంశంపై దృష్టి సారించారు. వసూలు చేస్తున్న సొమ్ము ఆయావిభాగాలకు జమవుతున్న విధానాన్ని పరిశీలించారు. పౌరులు చెల్లిస్తున్న పన్నులు సక్రమంగా ఖాతాలకు జమచేయాలని, కార్పొరేషన్‌కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కమిషనర్ నాగేంద్ర కుమార్‌ను ఆదేశించారు. చెక్కుల రూపంలో చెల్లిస్తున్న మొత్తాలు సకాలంలో జివిఎంసికి జమవుతున్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా పన్నులు వసూళ్లను సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు పటిష్టవంతమైన ఏజెన్సీని టెండర్ల ద్వారా ఖరారు చేయాలన్నారు.
త్వరలోనే ఫ్లైఓవర్ అందుబాటులోకి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడే ఆశీల్‌మెట్ట జంక్షన్‌లో రద్దీని నియంత్రించేందుకు నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జివిఎంసి ఆధ్వర్యంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులు 90 కోట్లతో 1.8 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఆశీల్‌మెట్ట జంక్షన్‌లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజానీకం కష్టాలు త్వరలోనే తీరనున్నాయని అన్నారు. వేమన మందిరం నుంచి దొండపర్తికి మూడు నిముషాల్లో చేరుకునే వెసులుబాటు దక్కుతుందన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో కొంతమేర జాప్యం చోటుచేసుకున్నది వాస్తవమేనన్నారు. ఇక సింహాచలం, అడవివరం ప్రాంతాల్లో బిఆర్‌టిఎస్ పనుల్లో కూడా జాప్యం అనివార్యమైందని, స్వల్పసమస్యలు పరిష్కరించి త్వరలోనే బిఆర్‌టిఎస్ కారిడార్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు. జివిఎంసిలో భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనం ప్రక్రియ పూర్తయినట్టేనని పేర్కొన్నారు. రెండు మున్సిపాలిటీలు విలీనం కావడం ద్వారా విశాఖకు మెట్రో స్థాయిని సంతరించుకుంటుందని తద్వారా అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ఫ్లైఓవర్‌ను సందర్శించిన వారిలో గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, జివిఎంసి అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి పూర్తి స్థాయిలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: జివిఎంసి పరిధిలోని జోన్ 4లో తలపెట్టిన ఇంటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రారంభించనున్నట్టు కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. ఇళ్ల నుంచి తడి,పొడి వ్యర్థాలను సేకరించే ‘విశ్వం’ కార్యక్రమం ఈనెల 17 నుంచి లాంఛనంగా ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో వ్యర్ధాల సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. 19 వార్డుల్లో ఈకార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 285 రూట్లను గుర్తించి, అవసరమైన సామాగ్రిని సమకూర్చినట్టు ఆయన తెలిపారు. తడి,పొడి చెత్తలను వేరుగా ఇచ్చే గృహిణులను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు అందించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌సిసి కేడెట్ల సహకారం తీసుకుంటున్నామని, వీరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
200 పడకలకే విమ్స్ పరిమితం
* సగానికి తగ్గిన నిధులు
* చెల్లుబాటు కాని ప్రజా ప్రతినిధుల మాట
ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నం
ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా, ఒడిశా, చత్తీస్‌గడ్ ప్రాంతాల్లోని వారికి ఉచిత వైద్య సహాయాన్ని అందించే కింగ్ జార్జ్ ఆసుపత్రికి ధీటుగా కార్పొరేట్ ఆసుపత్రిని నిర్మించి, అంతకు మించిన వైద్యాన్ని పేదలకు అందించాలన్న ఉద్దేశంతో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (విమ్స్)కు 2007 జనవరి ఎనిమిదవ తేదీన శంకుస్థాపన చేశారు. 110.24 ఎకరాల స్థలంలో 1130 పడకల ఆసుపత్రిగా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే, 18.17 లక్షల చదరపు అడుగులలో 15 బ్లాకులతో విమ్స్ ఆసుపత్రి ఇప్పుడు మనకు దర్శనమిచ్చేది. ఇందులో 21 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి తేవాలని భావించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి విడత ఆసుపత్రి భవన నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన ఫైలు ఆయన వద్దకు వెళ్లింది. ఆ ఫైలుపై సంతకం చేయడానికి కొద్దిసేపు ముందు ఆయన చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి బయల్దేరి వెళ్లి తిరిగి రాలేదు. అంతే ఆ ఫైలు ఏమైందో ఇప్పటికీ తెలియదు. దీంతో ఆసుపత్రి నిర్మాణం కుంటుపడింది.
రోశయ్య ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత ఈ ఆసుపత్రిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కింద ఇచ్చేయాలని భావించారు. అయితే వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఎట్టకేలకు తొలి విడతలో 4.19 లక్షల చదరపు అడుగుల్లో ఆరు బ్లాకులలో 12 సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో జి ప్లస్ త్రీ భవనాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. ఇందుకోసం 50 కోట్ల రూపాయలకు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. జివిఎంసి ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని అంగీకరించింది. అందులో కొంత మొత్తం విడుదల కావడంతో పనులు ప్రారంభించారు. ఆ తరువాత ప్రభుత్వం మళ్లీ 115 కోట్ల రూపాయలకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. మొదట మంజూరు చేసిన 55 కోట్లూ ఇందులోనే కలిసి ఉన్నాయని చావు కబురు చల్లగా చెప్పింది. చివరకు 55 కోట్లను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకొంది. ఇంకా 60 కోట్ల కోసం ఆసుపత్రి వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఇందులో 30 కోట్లతో సివిల్ వర్క్స్ పూర్తి చేయాలని, 30 కోట్లతో ఆసుపత్రి ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కానీ చిల్లిగవ్వ కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఆసుపత్రి వర్గాలు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవలసి వచ్చింది. మరొక్క 50 కోట్ల రూపాయలు ఇస్తే, ఆసుపత్రిని పనిచేయిస్తామని అందరూ అర్థించినా ప్రభుత్వం చెలించలేదు.
ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో 1000 పడకల ఆసుపత్రిని 450 పడకలకు కుదించారు. ఈపాటి ఆసుపత్రి పనిచేయాలన్నా, కనీసం 70 కోట్లు కావాలని ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం కనె్నతె్తైనా చూడలేదు. 450 పడకల ఆసుపత్రి కనుక వచ్చి ఉంటే.. రోగులకు అందే వైద్యసేవలు ఇవి.
* న్యూరో మెడిసన్, న్యూరో సర్జరి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ట్రామా, ఆర్థోపెడిక్స్, యురాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఎమర్జన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్, బ్లడ్ బ్యాంక్, జనరల్ మెడిసన్, సర్జరీ విభాగాలు వస్తాయని ప్రతిపాదించారు. వీటికోసం 71 మంది డాక్టర్లు, 12 మంది ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 24 మంది సర్జన్స్ కావాలని ప్రతిపాదించారు. అలాగే 295 మంది నర్సులు, 52 మంది మినిస్టీరియల్ స్ట్ఫా, 364 మంది క్లాస్-4 టెక్నికల్ సిబ్బంది కావాలని ప్రతిపాదించారు.
దీనిపై ప్రభుత్వం తర్జన భర్జన పడింది. నిధులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. ఎట్టకేలకు మరో తాజా నిర్ణయాన్ని తీసుకుంది. కేవలం 200 పడకలతో విమ్స్ ఆసుపత్రి పనిచేసేలా చూడాలని నిర్ణయించింది. ఇప్పటికే 50 కోట్లను కేటాయించిన ప్రభుత్వం మరికాస్త నిధులు విదిల్చి, ఆసుపత్రి ప్రారంభించామనిపించుకోవాలని చూస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ఈ పనిని ఏదోవిధంగా పూర్తి చేసి చేతులు దులుపుకోవాలని భావిస్తోంది. గతంలో ఇచ్చిన 55 కోట్లు కాకుండా 30 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. దీనికి మరొక్క 15 కోట్లను జతచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 200 పడకల ఆసుపత్రే వస్తే రోగులకు అందే వైద్య సేవలు ఇవి.
* నెఫ్రాలజీ, యురాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గ్య్రాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్ గ్య్రాస్ట్రో ఎంట్రాలజీ, ట్రమటాలజీ, ఆరోగ్యశ్రీ, ఐసియు, పోస్ట్ ఆపరేటెడ్ విభాగం, క్యాజువాలిటీ మాత్రమే వస్తాయి. పైన ప్రతిపాదించిన సిబ్బంది సగానికి పైగా తగ్గిపోతారు. ఇప్పుడు నిర్మించిన ఆసుపత్రి భవనంలో కేవలం సగం మాత్రమే వినియోగించుకోవలసి ఉంటుంది. మిగిలిన భవనమంతా ఖాళీగా పడి ఉంటుంది. ఇదీ ప్రభుత్వ నిర్వాకం.
వాతావరణం చల్లబడింది....విద్యుత్ వాడకం తగ్గింది
* ఊపీరి పీల్చుకుంటున్న సంస్థ అధికారులు
విశాఖపట్నం, జూలై 23: వర్షాలు పడకపోయినా వాతావరణం చల్లబడటంతో విద్యుత్ వాడకం కాస్త తగ్గింది. దీంతో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఆపరేషన్ సర్కిల్ అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. వేసవి గట్టేక్కినా జిల్లాలో విద్యుత్ వాడకం తగ్గకపోవడం, పరిశ్రమలు, వ్యవసాయానికి తప్పనిసరిగా సరఫరా చేయాల్సిన పరిస్థితులు విద్యుత్ సంస్థకు పెద్ద పరీక్షనే మిగిల్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో గత నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడటం, రెండు రోజుల కిందట కురిసిన వర్షంతో రోజువారీ వాడకం కాస్త తగ్గిపోవడంతో సమస్యలు తప్పాయి. ఏసిల వాడకం మరీ పడిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపు పాటిస్తున్నారు. పగలు లైట్లు వేయడంలేదు. ఫ్యాన్లు మాత్రం తిరుగుతున్నాయి. విశాఖ జిల్లాకు దాదాపు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటాను కేటాయించగా, ఇంచుమించుగా దీనినే సద్వినియోగపర్చుకుంటున్నారు. వాస్తవానికి 16.90 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటుంది. అయితే అనేక రకాలుగా తీసుకుంటున్న పొదుపు చర్యలతో కేటాయించిన విద్యుత్‌తోనే సంస్థ సరిపెడుతోంది.
చందనం చెట్టు నరికివేత
సింహాచలం, జూలై 23: దేవస్థనం వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ఎదురుగా ఉన్న టివి టవర్ కాలనీ పై భాగంలో చందనం గుర్తు చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసారు. సమాచారం తెలుసుకున్న ఎఇఓ కృష్ణమాచార్యులు సిబ్బందితో పాటు సంఘటనా స్థలానికి వెళ్ళి పరిస్థితి పరిశీలించారు. నరికివేసిన చందనం చెట్టును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ చెట్టు అడివి చందనమని దీని వలన పెద్దగా ఉపయోగం లేదని అటవీశాఖ అధికారులు ధృవీకరించినట్లు ఎఇ తెలియజేశారు. ఎందుకంటే ఇలాంటి చందనం చెట్లు సింహగిరి చుట్టూ అనేకం ఉన్నాయని ఆయన చెప్పారు. ఏది ఏమైనా చెట్టు నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఆధ్యాత్మిక చైతన్యానికి నిదర్శనం సింహగిరి ప్రదక్షిణం
* సింహాచలం ఇఓ రామచంద్రమోహన్
సింహాచలం, జూలై 23: సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్న ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా సింహగిరి ప్రదక్షిణ నిలిచిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్ అభివర్ణించారు. ఆషాడ పౌర్ణమి వేడుక విజయవంతమైన సందర్భంగా ఇందుకు సహకరించిన ప్రభుత్వశాఖల అధికారులకు, ఉద్యోగులకు, భక్తులకు సేవా సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేవస్థానం చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో సుమారు 2 లక్షల మంది సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేయడం అద్భుత సన్నివేశమని ఆయన అన్నారు. భారతదేవంలో సింహగిరి ప్రదక్షిణ అరుదైన ఆధ్యాత్మిక వేడుకని ఆయన పేర్కొన్నారు. భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయాల్లోని లోతులను ఈ ప్రదక్షిణ రుజువు చేస్తుందని ఇఓ తెలిపారు. సుమారు 36 కిమీ నియమనిష్ఠలతో నృసింహుడి ధ్యానంతో ప్రదక్షిణ చేసిన భక్తులు ధన్యులని ఆయన అన్నారు. భగవంతుడిపై భారతీయులకు ఉన్న భక్తి విశ్వాసాలకు ఈ ప్రదక్షిణ సాక్షీభూతంగా నిలుస్తుందని ఆయన అన్నారు. భక్తిపారవశ్యంతో ప్రదక్షిణ చేసే భక్తులకు సేవా భావంతో దారిపొడవునా సౌకర్యాలు కల్పించిన స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఉత్సవం వైభవోపేతంగా జరగడానికి సహకరించిన పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, జివిఎంసి, ట్రాన్స్‌కో, ఫైర్‌సర్వీస్, ఆర్టీసీ సంస్థలకు దేవస్థానం తరఫున ఇఓ కృతజ్ఞతలు తెలిపారు.
మన్యంలో కాంగ్రెస్‌కు చెక్!
విశాఖపట్నం, జూలై 23: జిల్లాలో తొలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలపరచిన చాలా మంది అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అందరూ ఊహించిన విధంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన మెజార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. ఒకప్పుడు ఏజెన్సీలో పట్టున్న టిడిపి ఈ ఎన్నికల్లో అక్కడక్కడ మాత్రమే రెపరెపలాడింది. మంత్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయడం గమనార్హం. ఒక్క కొయ్యూరు మండలంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుంది. కొన్ని మండలాల్లో కాంగ్రెస్ ఆచూకీ కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలో మెజార్టీ పంచాయతీలను అధికార కాంగ్రెస్ పార్టీ చేజారిపోవడం పట్ల భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెన్సీలో పెద్దగా క్యాడర్ లేకపోయినా, మెజార్టీ పంచాయతీలను దక్కించుకుంది. ముఖ్యంగా అరకు మండలంలో ఎక్కువ పంచాయతీలను వైకాపా చేజిక్కించుకుంది. పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా ఆధిక్యతను సంపాదించుకోవడంతో ప్రత్యర్థులకు పాలుపోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి బలమైన పోటీ టిడిపి ఇస్తుందని అంతా భావించారు. కానీ పరిస్థితి తారుమారైంది. టిడిపి బలం కూడా అంతగా కనిపించలేదు. ఏ మండలంలోనూ టిడిపి మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకోలేకపోయిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏజెన్సీలో బాక్సైట్ ఉద్యమాన్ని నిర్వహించిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలూ కొద్దిపాటి సీట్లను దక్కించుకున్నాయి. బాక్సైట్ ఉద్యమ ప్రభావం ఈ పార్టీలపై పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ఏజెన్సీలో బిఎస్పీ కూడా కొన్ని స్థానాలను దక్కించుకుంది. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఆయా పార్టీల బలా బలాలు ఈవిధంగా ఉన్నాయి.
ఏజెన్సీలోని 11 మండలాల్లోని 244 పంచాయతీలకుగాను 23 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మూడు పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. మిగిలిన 218 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరిగింది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. నక్సల్స్ హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనడం గమనార్హం. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ కృష్ణ భాస్కర్ తదితరులు పరిశీలించారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతుంది.
మంత్రి గంటా శ్రీనివాసరావు
యలమంచిలి, జూలై 23: రాష్ట్రంలో తోవిడతగా జరుగుతున్న పంచాయితీల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో కూడ పార్టీ జైత్రయాత్ర కొనసాగిస్తుందని రాష్ట్ర ఓడరేవుల వౌళికవసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు నివాసంలో టీవి వీక్షీంచి ఫలితాలను తెలుసుకున్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలు అమ్మహస్తం నీరు పేదలకు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చరిత్రాత్మకమన్నారు. మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు పట్టంకడతారన్నారు. జిల్లాలోని 920 పంచాయితీల్లో 70 పంచాయితీలు ఏకగ్రీవం కాగా ఎన్నికయ్యాయన్నారు. ఎన్నికల జరిగిన వాటిలో అత్యంధిక స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధిస్తారన్నారు. చాల చోట్ల దేశం, వైఎస్‌ఆర్ సిపిలు తమ అభ్యర్ధులను పోటీకి దింపలేకపోయాయని ఆయన చెప్పారు.
నర్సీపట్నం డివిజన్‌లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
*ఆర్డీవో వసంతరాయుడు
నర్సీపట్నం,జూలై 23: డివిజన్‌లో ఈనెల 27వ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నర్సీపట్నం ఆర్డీవో , జిల్లా ఉప ఎన్నికల అధికారి ఎన్. ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. మంగళవారం ఆయన డివిజన్‌లోని పలు మండలాలను సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రవాణా, భోజన వతసి తదితర అంశాలపై తహశీలార్లు, ఎం.పి.డి. ఓ.లకు సూచనలు చేసారు. తనను కలిసిన విలేఖఱులతో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలు అన్ని మండలాలకు చేరాయన్నారు. 27వ తేదీన డివిజన్‌లోని 10 మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. 238 పంచాయతీల్లో 21 పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా, 217 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 121 వార్డులు ఏకగ్రీవం కాగా 2,224 వార్డులకు మెంబర్లను ఎన్నుకుంటారన్నారు. 4,30,297 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు పోలింగ్ నిర్వహనకు 248 ఎలక్షన్ అధికార్లు 5,335 మంది పోలింగ్ అధికార్లును వినియోగిస్తున్నాయని, తహశీల్దార్లు, ఎం.పి.డి. ఓ.లు పర్యవేక్షిస్తారని, వీరు కాకుండా జోనల్ అధికారులు, రూట్ అధికారులు ఇతర ప్రత్యేక విధులకు సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. 110 ఆర్టీసి బస్సులు, 76 జీపులు, 35 కార్లు వినియోగిస్తున్నామన్నారు. 25వ తేదీన సాయంత్రం ఐదు గంటల నుండి ప్రచారం నిర్వహించరాదన్నారు. గుర్తించిన 49 తీవ్ర సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 79 సమస్యాత్మక కేంద్రాల్లో సూక్ష్మపరిశీలకులు, వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ప్రజాభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరు
సబ్బవరం, జూలై 23: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా డబ్బు,మద్యం పంపిణీలతో ఓటర్లను ప్రభావం చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ప్రజాభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరని మాజీ మంత్రి, తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం వంగలి గ్రామంలో పర్యటించిన ఆయన టిడిపి మద్ధతుతో పోటీ చేస్తున్న సర్పంచు అభ్యర్ధి వేపాడ సోమునాయుడు గెలుపు తధ్యమన్నారు. గతంలో మాజీ సర్పంచుగా పనిచేసిన అనుభవంతోపాటు అప్పట్లో రోడ్లు,తాగునీరు, వైద్యసదుపాయాలు మెరుగుపరిచిన నేతను ఎవరూ మరిచిపోరన్నారు. అంతేకాకుండా ఎన్నడూ లేని విధంగా ఈసారి డబ్బును విచ్చల విడిగాఖర్చుచేస్తున్నారంటూ పేర్లు చెప్పకుండానే ఇదే మండలంలో ఒక పంచాయతీ సర్పంచు భర్త శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగం చేస్తూ తన భార్య ప్రచారానికి విచ్చల విడిగా ఖర్చుచేస్తున్నాడన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్ధులను ఎన్నుకుంటారుగానీ, అవసరానికి శ్రీకాకుళం వెళ్లలేరుగా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. సాధారణ ఎన్నికలను మరిపించే రీతిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయంటూ, ఈ ఎన్నికల తీరుపై ఎఐసిసిలో ప్రస్తావన రావటమే ఇందుకు కారణమన్నారు. ఆర్ధికంగా తమ పార్టీ మద్ధతు దారులు వెనుక బడి ఉన్నప్పటికీ ఓటర్ల తీర్పు తమపార్టీనే వరిస్తుందని జిల్లాలో అత్యధిక స్ధానాలు గెలుపొందుతామన్నారు. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు పార్టీని వీడిపోతారంటూ వస్తున్న కధనాలపై ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. ఈపర్యటనలోభాగంగా గ్రామంలో పర్యటించి ఓటర్లను పలకరిస్తూ ముందుకు సాగారు. సర్పంచుఅభ్యర్ధి వేపాడ సోమునాయుడు, మండల పార్టీప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీను,జెట్టిముత్యాలనాయుడు,పెంటారావు,అల్లం చంద్రరావులు పాల్గొన్నారు.
విచ్చలవిడిగా ఖర్చు చేస్తే గెలిచినా.. అనర్హత వేటు తప్పదు
* విశాఖ ఆర్డీవో రంగయ్య స్పష్టం
సబ్బవరం, జూలై 23: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్ధులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి విచ్చల విడిగా ఖర్చు చేశారంటే వారు గెలుపొందినప్పటికీ అనర్హత వేటు పడుతుందని విశాఖ ఆర్డీవో ఎ.రంగయ్య హెచ్చరించారు. మంగళవారం ఇక్కడికి వచ్చిన ఆయన సబ్బవరం పంచాయతీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సెంటర్లను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన తీరును పరిశీలించారు. ఈసందర్భంగా కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రవర్తనావళిని ఎంతో అప్రమత్తంగా అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. వారు ప్రచారానికి ఖర్చుచేస్తున్న డిజిటల్ హోర్డింగ్‌లు, కటౌట్‌లు, ఫ్లెక్సీలు, వాహనాలు, లౌడ్ స్పీకర్లను ఎప్పటి కప్పుడు వీడియో, ఫోటోగ్రఫీల ద్వారా రికార్డు చేస్తున్నామన్నారు. సర్పంచు ఎన్నికలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు అని జరుగుతున్న ప్రచారాన్ని ఆర్డీవో ఖండిస్తూ ప్రతీ వాల్‌పోస్టర్, డిజిటల్ ఫ్లెక్సీలకు ఖర్చును అభ్యర్ధిఖాతాలో జమ చేస్తున్నామన్నారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామ పంచాయతీలను గుర్తించిన చోట్ల వెబ్ కెమెరాలు, స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఇక ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన ఓటర్లకు స్లిప్‌ల పంపిణీ సక్రమంగా జరుగుతుందోలేదోననే అభ్యర్ధుల అనుమానాలపై ప్రశ్నించగా తాము గతంలో నియమించిన బూత్ లెవిల్ ఆఫీసర్లు సక్రమంగా పంపిణీ చేస్తారని, ఒకే రోజుతో సరిపెట్టకుండా ఇంటింటికి ఎన్నికల సమయం వరకు తిరిగి పంచుతారన్నారు. స్లిప్‌లు మిస్సయిన ఓటర్లకు పోలింగ్ బూత్ సమీపంలో ఒక అధికారిని నియమిస్తే బాగుంటుందని అడగ్గా స్పందించిన ఆర్డీవో ఆ ఏర్పాట్లుకూడా చేస్తామన్నారు. 10వేల లోపు జనాభా కలిగిన పంచాయతీ సర్పంచులు 40వేల రూపాయలు, పైబడిన జనాభా కలిగిన వారు 80వేల రూపాయల వరకు మాత్రమే ఎన్నికల్లో ఖర్చుచేయాల్సి ఉంటుందన్నారు. వార్డుమెంబర్లు 10వేలు, 8,వేలు ఖర్చుచేసుకోవాల్సి ఉంటుందన్నారు. సబ్బవరం మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ అధికారులకు 12 బస్సులను కేటాయించామని ఎంపిడివోను అడిగి చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్,పోలింగ్,కౌంటింగ్‌లకు తగిన ఏర్పాట్లుచేశామన్నారు. ఆయన వెంట తహశీల్దార్ ఎం.నాగభూషణరావు,మండల ఎన్నికల నిర్వాహణాధికారి ఎస్.త్రినాధరావు,పి.ప్రభాకరరావులు పాల్గొన్నారు.
ద్వితీయార్ధంలో పురోగతి శూన్యం
ముంబయి, జూలై 24: ఈ ఏడాది ద్వితీయార్ధంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పురోగతి కనిపించకపోవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడిస్‌కు చెందిన ఆర్థిక నిపుణులు విశే్లషించారు. ప్రథమార్ధంలో పెట్టుబడులు, తయారీ రంగంలో మందగమనం ప్రభావమని బుధవారం మూడీస్ విశే్లషకులు అభిప్రాయపడ్డారు. ఈ మందగమనం మరిన్ని రంగాలకు విస్తరించడం వల్ల ఆర్థిక పురోగతి కానరాదని మూడీస్ సీనియర్ ఆర్థిక విశే్లషకులు గ్లేన్ లెవిన్ తెలిపారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న క్రమంలో ఎన్నికలకు ముందు ఎలాంటి చెప్పుకోదగ్గ సంస్కరణలు ఉండకపోవచ్చన్నారు. గడిచిన 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పురోగతి 5 శాతం మాత్రమేనని, పారిశ్రామిక ప్రగతి గణాంకాల్లోనూ ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ వృద్ధి నమోదు కాలేదన్నారు. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి 6 శాతం నమోదవగలదనే ఆశాభావం ప్రభుత్వం నుంచి వ్యక్తమవుతుండగా, ఈసారి జిడిపి ఎంత ఉంటుందనేదానిపై మూడిస్ నిపుణులు ఎలాంటి అంచనాలు వెలిబుచ్చలేదు. అయితే డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమవుతుండటం, ద్రవ్యవిధానాన్ని ఆర్‌బిఐ సరళతరం చేయడంలో వెనుకాడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి 5 శాతంగానే అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ అంచనాలకు తగ్గట్లు మూడీస్ కూడా ఇప్పుడు ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఎలాంటి ఆర్థిక పురోగతి ఉండదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం ఆందోళన కలిగిస్తోంది.
నిరాశపరిచిన ‘హీరో’ ఫలితాలు
త్రైమాసిక ఫలితాలు
న్యూఢిల్లీ, జూలై 24: దేశీయ ఆటో రంగంలో ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ నికర లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 11 శాతం క్షీణించాయి. ఏప్రిల్-జూన్ వ్యవధిలో 548.58 కోట్ల రూపాయల నికర లాభాలను హీరో మోటోకార్ప్ ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 615.46 కోట్ల రూపాయల నికర లాభాలను ఈ సంస్థ అందుకుంది.
అధిక పన్నుల భారంతోపాటు ముందస్తు వర్షాకాలం అమ్మకాలను దెబ్బతీసిందని పేర్కొంది. కాగా, నికర అమ్మకాల విలువ క్రితంతో పోల్చితే ఈసారి 6,207.78 కోట్ల రూపాయల నుంచి 6,126.84 కోట్ల రూపాయలకు పడిపోయాయని సంస్థ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ ఏప్రిల్-జూన్ కాలంలో 15,59,282 యూనిట్ల అమ్మకాలు జరిగాయని, గతంలో 16,42,292 యూనిట్ల అమ్మకాలు జరిగాయని వివరించింది.
తగ్గిన కెయిర్న్
ఇండియా లాభాలు
చమురు రంగ సంస్థ కెయిర్న్ ఇండియా లాభాలు ఈ ఏప్రిల్-జూన్‌లో 18 శాతం పడిపోయాయి. పన్ను చెల్లింపుల తర్వాత సంస్థ నికర లాభాలు 3,127 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ఇంతకుముందు 3,826 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కెయిర్న్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. రాజస్థాన్ చమురు క్షేత్రాల్లో ప్రభుత్వ వాటా పెరగడం, చమురు ధరలు నిరాశాజనకంగా ఉండటం లాభాల క్షీణతకు కారణమని పేర్కొంది.
సెంట్రల్ బ్యాంక్
లాభాల్లో 93 శాతం క్షీణత
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభాలు ఏప్రిల్-జూన్ కాలంలో 93.5 శాతం క్షీణించాయి. ఈసారి 21.93 కోట్ల రూపాయల నికర లాభాలను మాత్రమే అందుకున్న ఈ సంస్థ.. క్రిందటిసారి 335.9 కోట్ల రూపాయల నికర లాభాలను సొంతం చేసుకుంది.
మొండి బకాయిలు పెరిగిపోవడమే లాభాల క్షీణతకు కారణమని బుధవారం తెలిపిం ది. అయితే ఆదాయం మా త్రం 5,62 4.97 కోట్ల రూపాయల నుంచి 6,44 3.45 కోట్ల రూపాయలకు పెరిగింది.
ఇండియాబుల్స్ సెక్యూరిటీస్ లాభాలు రెండింతలు
ఇండియాబుల్స్ సెక్యురిటీస్ ఏకీకృత నికర లాభాలు గతంతో పోల్చితే రెండింతలకుపైగా పెరిగాయి. సంస్థ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం ఈ జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో 21.42 కోట్ల రూపాయల నికర లాభాలను నమోదు చేసింది. అంతకుముందు 9.82 కోట్ల రూపాయల నికర లాభాలను పొందింది. ఆదాయం సైతం 41.23 కోట్ల రూపాయల నుంచి 63.13 కోట్ల రూపాయలకు పెరిగింది.
38 శాతం పెరిగిన
యెస్ బ్యాంక్ లాభాలు
ముంబయి: ప్రైవేట్‌రంగ బ్యాంకిం గ్ సంస్థ యెస్ బ్యాంక్ నికర లాభాలు ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 38.1 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 290.1 కోట్ల రూపాయల లాభాలను పొందిన ఈ సంస్థ ఇప్పుడు 400.8 కోట్ల నికర లాభాలను సొంతం చేసుకుంది. ఆదాయం కూడా క్రిందటిసారితో పోల్చితే 2,174.4 కోట్ల రూపాయల నుంచి 2,839.9 కోట్ల రూపాయలకు పెరిగింది.
వరుస లాభాలకు బ్రేక్
ముంబయి, జూలై 24: దేశీయ స్టాక్‌మార్కెట్లలో వరుస లాభాలకు బుధవారం బ్రేకులు పడ్డాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 211.45 పాయింట్లు నష్టపోయి 20,090.68 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 87.30 పాయింట్లు క్షీణించి 5,990.50 వద్దకు దిగజారాయి. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో మార్కెట్లు నష్టపోయాయి. నష్టపోయిన వాటిలో ప్రధానంగా జిందాల్ స్టీల్, లార్సెన్ షేర్లతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ తదితర షేర్లు ఉన్నాయి.
నెల గరిష్ఠానికి రూపాయి
రిజర్వ్ బ్యాంకు తీసుకున్న తాజా చర్యలతో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ నెల గరిష్ఠ స్థాయిని అందుకుంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో 63 పైసలు పెరిగి 59.13 వద్ద స్థిరపడింది.
ద్రవ్య చలామణిని అదుపు చేయొద్దు
కోల్‌కతా, జూలై 24: ద్రవ్య చలామణిని అదుపు చేయవద్దని ప్రభుత్వరంగ బ్యాంకిం గ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్మన్ ప్రతీప్ చౌధురి రిజర్వ్ బ్యాంకును కోరారు. బుధవారం ఇక్కడ ఫిక్కి నిర్వహించిన బ్యాంకింగ్ కన్‌క్లేవ్ ప్రారంభోత్సవ క్రమంలో పాల్గొన్న ఆయన ద్రవ్యోల్బణం చేజారిపోతుందనిపిస్తే వడ్డీరేట్లను పెంచండి తప్ప ద్రవ్య చలామణిని అదుపు చేయవద్దని ఆర్‌బిఐని కోరారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, రూపాయి విలువ క్షీణత నేపథ్యంలో ఆర్‌బిఐ ద్రవ్యివిధానంలో తీసుకుంటున్న మార్పులు బ్యాంకింగ్ విధానంలో కొన్ని విపత్కర పరిణామాలకు దారి తీస్తున్నాయనే ఆందోళనను ఆయన ఈ సందర్భంగా వ్యక్తంచేశారు.
ప్రతీప్ చౌధురికి గ్రీన్ సర్టిఫికెట్ అందిస్తున్న ఫిక్కి బెంగాల్ విభాగం చైర్మన్ గౌరవ్ స్వరూప్
ఫ్రెంచ్ సంస్థ కొనుగోలును పూర్తిచేసిన టిసిఎస్
న్యూఢిల్లీ, జూలై 24: ఫ్రాన్స్‌కు చెందిన ఆల్టి ఎస్‌ఎ కొనుగోలును పూర్తి చేసినట్లు ఐటి దిగ్గజం, టాటా గ్రూప్‌లోని టిసిఎస్ బుధవారం తెలిపింది. రూ.533 కోట్ల తో జరిగిన ఈ లావాదేవీలతో యూరప్‌లోని ఐటి మార్కెట్‌లో టిసిఎస్ ఇక కీలక పాత్ర పోషించనుంది. కాగా, దేశీయ ఐటి రంగంలో తనదైన పాత్ర పోషిస్తూ వృద్ధిపథంలో దూసుకెళ్తున్న టిసిఎస్ ప్రపంచవ్యాప్తంగానూ ఐటి రంగం లో తన దూకుడును ప్రదర్శించాల నుకుంటోంది. ఈ క్రమంలోనే విదేశీ సంస్థలను సొంతం చేసుకుంటోంది.
సహారాకు కోర్టు ధిక్కార నోటీసులు
* రెండు సంస్థలకు జారీ చేసిన సుప్రీం
* 30న సమాధానం చెప్పాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 24: సహారా గ్రూప్‌లోని రెండు సంస్థలకు కోర్టు ధిక్కార నోటీసులను బుధవారం సుప్రీం కోర్టు జారీ చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ద్వారా మదుపర్లకు 19,000 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలంటూ గతంలో చేసిన ఆదేశాన్ని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్‌తోపాటు సహారా హౌజింగ్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లు పాటించకపోవడాన్ని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. అయితే సహారాకు చెందిన రెండు సంస్థలు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందిస్తూ ఈ కేసును ఈ నెల 30కి వాయిదా వేసిన జస్టిస్ కెఎస్ రాధాక్రిష్ణన్, జస్టిస్ జెఎస్ ఖేహర్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. వచ్చే మంగళవారం దీనికి తప్పనిసరిగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈ కేసులో మరోసారి వాయిదా అంటూ ఉండదని, సమాధానం చెప్పేందుకు మరికొంత సమయం ఇచ్చే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా సహారా గ్రూప్‌నకు సుప్రీం తేల్చి చెప్పింది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి కోట్లాది రూపాయలను డిపాజిట్ల రూపంలో సేకరించారనే కేసులో గతంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను రెండు సంస్థలు పాటించలేదని సెబీ ఆరోపిస్తూ వేసిన పిటిషన్‌పై తాజా కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. 3 కోట్లకుపైగా ఉన్న మదుపర్లకు 15 శాతం వడ్డీతో 24,000 కోట్ల రూపాయలను చెల్లించాలని సహారాను గత డిసెంబర్ 5న సుప్రీం ఆదేశించింది. ఇందుకు తొమ్మిది వారాల గడువునివ్వగా, వెంటనే 5,120 కోట్ల రూపాయలను చెల్లించాలని, మిగతా సొమ్మును రెండు దఫాలుగా సెబీకి చెల్లించాలని సూచించింది. తొలి విడతగా 10,000 కోట్ల రూపాయలను జనవరి మొదటి వారంలో, రెండో విడతగా మిగతా సొమ్మును ఫిబ్రవరి మొదటి వారంలో చెల్లించాలంది. అయితే ఈ సూచనలను సహారా గ్రూప్‌లోని రెండు సంస్థలు ఆచరణలో పెట్టకపోవడంతో కోర్టు ధిక్కా ర నోటీసులు జారీ అయ్యాయి.
ఇన్ఫోసిస్‌లో పెరిగిన ఎల్‌ఐసి వాటా
న్యూఢిల్లీ, జూలై 24: దేశీయ ఐటి దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌లో ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి వాటా పెరిగింది. తాజాగా దాదాపు 1,200 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేసి వాటాను ఎల్‌ఐసి 6.72 శాతం పెంచుకుంది.
పెరిగిన ఒబిసి ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు
న్యూఢిల్లీ, జూలై 24: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి) బుధవారం ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లను 0.75 శాతం వరకు పెంచింది. ఎంపిక చేసిన కాలపరిమితి గల డిపాజిట్లపై పెరిగిన ఈ వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. తీవ్రమైన ద్రవ్యకొరతను అధిగమించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
ప్యాసింజర్ కోచ్‌ల తయారీకి రైల్వేతో సెయిల్ చర్చలు
న్యూఢిల్లీ, జూలై 24: ఉక్కు ఉత్పాదక దిగ్గజం సెయిల్, భారత రైల్వే శాఖతో ప్యాసింజర్ రైళ్ల కోచ్‌లను తయారుచేసే ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. సెయిల్, ఇండియన్ రైల్వే సంయుక్తంగా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్యాసింజర్ కోచ్‌ల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని భావిస్తున్నాయి. ఈ మేరకు సెయిల్ చైర్మన్ సిఎస్ వర్మ పిటిఐకి తెలిపారు. చక్రాలు, ఇరుసు, పట్టాలను రైల్వేకు సరఫరా చేస్తున్న సెయిల్.. ప్యాసింజర్ కోచ్‌లను మాత్రం అందించలేకపోతోంది. అందుకే ఆ లోటును కూడా తీర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది ముగింపుకల్లా గూడ్స్ వ్యాగన్ల తయారీనీ సెయిల్ చేపట్టనుంది.
అజీమ్ ప్రేమ్‌జీకి ఆసియన్ బిజినెస్ లీడర్స్ అవార్డ్
లండన్, జూలై 24: దేశీయ ఐటి రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో వ్యవస్థాపకులు, ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి ప్రస్తుత సంవత్సరం 2013కుగానూ ప్రతిష్ఠాత్మక ‘ఆసియన్ బిజినెస్ లీడర్స్ అవార్డ్’ దక్కింది. ఆకర్షణీయమైన వ్యాపార లక్షణాలతోపాటు ఆయనలోని సమాజ సేవ, మానవతా దృక్పథం ఈ అవార్డును తెచ్చిపెట్టాయి. ‘ఈ ఏడాది అవార్డుకు అజీమ్ ప్రేమ్‌జీ ఎంపికయ్యారు. ఆకట్టుకునే వ్యాపార లక్షణాలు కలిగిన ఆయన సమాజాభివృద్ధికి చేస్తున్న విశేష కృషి ఇతరులకు ఆదర్శనీయం’. అని అవార్డు ప్రకటించిన ఆసియా హౌజ్ పేర్కొంది. లండన్‌కు చెందిన ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈ మేరకు బుధవారం ఇక్కడ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాపారం, సంస్కృతి, విధానాల ద్వారా బ్రిటన్, ఆసియా దేశాలను దగ్గర చేయడమే లక్ష్యంగా ఆసియా హౌజ్ పనిచేస్తోంది. కాగా, ఈ అవార్డును అక్టోబర్ 14న లండన్‌లో జరిగే వేడుకల్లో ప్రదానం చేయనున్నారు. ఇదిలావుంటే ఇంతకుముందు ఈ అవార్డు టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాతోపాటు హెచ్‌ఎస్‌బిసి హోల్డిం గ్స్ గ్రూప్ మాజీ చైర్మన్, బ్రిటన్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ సహాయ మంత్రి లార్డ్ స్టిఫెన్ గ్రీన్‌కు లభించింది. 68 ఏళ్ల ప్రేమ్‌జీ అత్యుత్తమ వ్యాపారవేత్తగానేగాక, ఓ దాతగానూ సుపరిచితులు. బిల్‌గేట్స్, వారన్ బఫెట్ తరహాలో ప్రేమ్‌జీ సైతం తన సంపదలో మెజారిటీ భాగం సమాజానికి అంకితం చేస్తున్నారు.
జరిమానాలపై టెలికాం
ఆపరేటర్లకు ఊరట?
80 శాతం తగ్గించనున్న
టెలికాం శాఖ
న్యూఢిల్లీ, జూలై 24: టెలికాం ఆపరేటర్లకు గొప్ప ఊరట లభించనుంది. వినియోగదారులకు సంబంధించి అసంపూర్ణ పరిశీలన, వివరాల కేసుల్లో టెలికాం ఆపరేటర్లపై టెలికాం శాఖ విధించిన జరిమానాలు 80 శాతం తగ్గనున్నాయి మరి. ఇప్పటిదాకా 2.7 కోట్ల వినియోగదారుల ధ్రువ పత్రాలను టెలికాం ఎన్‌ఫోర్స్‌మెంట్, రీసోర్స్ అండ్ మానిటరింగ్ విభాగాలు పరిశీలించగా, 3,000 కోట్ల రూపాయల జరిమానా విధించడం జరిగింది.
అయితే టిడిశాట్ తీర్పు తర్వాత ఈ జరిమానా రీ-కాలిక్యులేట్ అవుతుండగా, అది దాదాపు 500 కోట్ల రూపాయలుగా ఉండనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర టెలికాం శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో వివిధ కేసులలో టెలికాం ఆపరేటర్లపై టెలికాం శాఖ విధించిన 3,000 కోట్ల రూపాయల జరిమానాలో 2,500 కోట్ల రూపాయల జరిమానా భారాన్ని టెలికాం సంస్థలు తప్పించుకోనున్నాయ.
ఎదుగుతున్న శక్తి భారత్
ముంబయి, జూలై 24: అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ భారత్‌ను ఎదుగుతున్న శక్తిగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించిన ఆయన భారత-అమెరికా దేశాల మధ్య విస్తృత వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు, పన్నుల విధానాల్లో వ్యత్యాసాలను రూపుమాపేందుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ చర్యలు ఇరు దేశాల వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు తీసుకుపోగలవని అభిప్రాయపడ్డారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా భారత్‌లో పర్యటిస్తున్న బిడెన్ బుధవారం ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ వద్ద ‘అమెరికా-్భరత్ భాగస్వామ్యం’పై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల భారత్ చేపట్టిన పలు ఆర్థిక సంస్కరణలను స్వాగతించారు. ముఖ్యంగా టెలికాం, రక్షణ, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకున్న నిబంధనలను సరళతరం చేయడాన్ని అభినందించారు. కాగా, గడిచిన మూడు దశాబ్దాల్లో భారత పర్యటనకు విచ్చేసిన తొలి అమెరికా ఉపాధ్యక్షుడిగా రికార్డు సృష్టించిన బిడెన్ ఇరు దేశాల ఆర్థిక సంబంధాల బలోపేతానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం గత 13 ఏళ్లలో ఐదింతలు పెరిగి 100 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరగడానికి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఒకప్పుడు 20 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ ఎగుమతులు 2012-13లో 300 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయన్నారు. దక్షిణాసియాలో భారత్ పాత్ర అభినందనీయమని వాఖ్యానించారు. మరోవైపు ముంబ యలో వ్యాపారవేత్తలతో జరిపిన రౌండ్ టేబుల్ సమావేశంలో బిడెన్ పాల్గొన్నారు.
వ్యాపారవేత్తల సమావేశంలో రతన్ టాటాతో బిడెన్