Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all 69482 articles
Browse latest View live

చార్జిషీటులో హన్సీ పేరా?

$
0
0

జొహానె్నస్‌బర్గ్, జూలై 24: మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో హన్సీ క్రానే పేరును ఢిల్లీ పోలీసులు చార్జిషీటులో చేర్చడంపై అతని తండ్రి ఇవీ క్రానే ఆగ్రహం వ్యక్తం చేశాడు. 13 ఏళ్ల క్రితం నాటి కేసులో ఇప్పుడు చార్జిషీటు దాఖలు చేయడం ఏమిటని అతను విలేఖరులతో మాట్లాడుతూ ప్రశ్నించాడు. 2002 జరిగిన విమాన ప్రమాదంలో హన్సీ మృతి చెందాడని, ఇప్పుడు అతని పేరును చార్జిషీటులోవ చేరుస్తారా అంటూ నిప్పులు చెరిగాడు. ఈ చర్య హాస్యా స్పదంగా ఉందని విమర్శించాడు. హన్సీపై విమర్శలు వచ్చినంత స్థాయిలో అతను నేరాలు ఏవీ చేయలేదని పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఒకరిద్దరితో సాధ్యం కాదని, మిగతా వారిని ఎందుకు వదిలేస్తున్నారని నిలదీశాడు. బుకీలను ముందుగా చట్టం ముందుకు తీసుకురావాలని సూచించాడు. ఇలావుంటే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత ఈ వ్యవహారంపై దక్షిణాఫ్రికా నియమించిన కింగ్స్ కమిషన్ ముందు హన్సీ వాంగ్మూలమిచ్చాడు. భారత్‌లో ఒక మ్యాచ్‌ని ఫిక్స్ చేయడానికి తాను బుకీల నుంచి డబ్బు స్వీకరించినట్టు అంగీకరించాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్‌తోపాటు మరి కొంత మంది క్రికెటర్ల పేర్లను కూడా అతను అప్పట్లో ప్రస్తావించాడు. దక్షిణాఫ్రికాకే చెందిన నికీ బోయే, హెర్చెల్ గిబ్స్, హెన్రీ విలియమ్స్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్‌కు సహకరించారని పేర్కొన్నాడు. కింగ్ కమిషన్ ముందు హన్సీ నేరాన్ని అంగీకరించిన వెంటనే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అతనిపై జీవితకాల నిషేధాన్ని విధించింది. అదే విధంగా గిబ్స్, విలియమ్స్‌లను కొంతకాలం సస్పెండ్ చేసింది. ఆతర్వాత గిబ్స్ మళ్లీ దక్షిణాఫ్రికా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. బోయే, విలియమ్స్ కెరీర్ అర్థాంతరంగానే ఆగిపోయింది.

ఆ నిర్ణయం సబబే
జ్వాలా కనీస ధర తగ్గింపుపై గోపీచంద్
దుర్గాపూర్, జూలై 24: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) వేలంలో డబుల్స్ స్పెషలిస్టు క్రీడాకారిణి జ్వాలా గుత్తా కనీస ధరను తగ్గించడం సరైన నిర్ణయమేనని భారత జాతీయ కోచ్, ఆల్ ఇంగ్లాండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశాడు. ఐబిఎల్ వేలం ప్రారంభానికి ముందు నిర్వాహకులు జ్వాలా, ఆమె డబుల్స్ భాగస్వామి అశ్వినీ పొన్నప్ప బేస్ ప్రైస్‌ను 50,000 డాలర్లుగా నిర్ధారించారు. అయితే, వేలం ఆరంభానికి ముందు ఈ మొత్తాన్ని 25,000 డాలర్లకు తగ్గించారు. ఈ పరిణామం తమను అవమాన పరచడమేనని జ్వాలా, అశ్వినీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఈ నిర్ణయంలో పొరపాటు లేదని బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ గోపీచంద్ అన్నాడు. క్రీడాకారుల్లో ఎవరికీ ఆర్థికంగా నష్టం వాటిల్ల కూడదన్న ఉద్దేశంతోనే ఐబిఎల్ కమిటీ జ్వాలా, అశ్వినీ బేస్ ప్రైస్‌ను తగ్గించిందని వివరించాడు. వాస్తవానికి ఐబిఎల్ వేలంలో ప్లేయర్లకు భారీ ధర పలుకుతుందని తాము ఊహించలేదని అన్నాడు. ఇది మన దేశంలో బాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నదని పేర్కొన్నాడు. రాబోయే తరాల క్రీడాకారులకు ఐబిఎల్ ఒక గొప్ప వేదిక అవుతుందని అన్నాడు.
వైదొలిగే ప్రసక్తి లేదు..
ఐబిఎల్ వేలంలో బేస్ ప్రైస్‌ను తగ్గించడం తనను అవమానపరచడమేనని పునరుద్ఘాటించిన జ్వాలా ఈ కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. బుధవారం ఆమె హైదరాబాద్‌లో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ, డబ్బు కోసం తాను వెంపర్లాడడం లేదని చెప్పింది. అయితే, కనీస ధరను మొదట 50,000 డాలర్లుగా పేర్కొని, ఆతర్వాత 25,000 డాలర్లకు తగ్గించడం తనను అవమానించడమేనని తెలిపింది. కనీస ధరను ఎందుకు తగ్గించారన్న ప్రశ్నపై స్పందిస్తూ, ఇది తనను అడగాల్సిన ప్రశ్న కాదని వ్యాఖ్యానించింది. నిర్వాహకులను అడిగితే బాగుంటుందని పేర్కొంది. ఐబిఎల్‌లో అవమానం జరిగిందన్న తన అభిప్రాయంలో మార్పులేదని తెలిపింది. కానీ, ఈ కారణంగా ఐబిఎల్‌కుగానీ, బాడ్మింటన్‌కుగానీ దూరం కానని తేల్చిచెప్పింది. తనకు ఆటపై ఎంతో మక్కువ ఉందని, కాబట్టి సాధ్యమైనంత వరకూ ఎక్కువ టోర్నీల్లో ఆడి, భారత్‌కు పతకాలను సాధించిపెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపింది.

హాస్యాస్పదమంటున్న క్రానే తండ్రి ఇవీ శఒక్కరితోనే ఫిక్సింగ్ సాధ్యం కాదని వ్యాఖ్య
english title: 
c

ప్రపంచ చాంపియన్‌షిప్స్ తర్వాత ఇసిన్బయేవా రిటైర్మెంట్

$
0
0

మాస్కో, జూలై 24: రెండు పర్యాయాలు ఒలింపిక్స్ పతకాలను కైవసం చేసుకున్న రష్యా పోల్‌వాల్ట్ రారాణి యెలెనా ఇసిన్బయేవా త్వరలోనే అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించనుంది. వచ్చేనెల మాస్కోలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ తర్వాత తాను కెరీర్‌కు గుడ్‌బై చెప్తాననిని ఆమె తెలిపింది. లుజ్నికీ ఎరెనాలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, ప్రపంచ పోటీల్లో టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డుతానని తెలిపింది. జాతీయ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడం తనకు ఇదే చివరిసారని, ఇందులో స్వర్ణ పతకాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. 2004, 2008 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సాధించిన ఇసిన్బయేవా మహిళల పోల్‌వాల్ట్ విభాగం 28 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. 5.06 మీటర్లతో ఆమె సృష్టించిన రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు. వలెరీ ఆడమ్స్, ఉసేన్ బోల్ట్, విక్టోరియా క్యాంప్‌బెల్ బ్రౌన్, జాక్వెస్ ఫ్రె టాస్, జనా పిట్‌మన్, డానీ శామ్యూల్స్, డేవిడ్ స్టోరీ మాదిరిగా జూనియర్స్, యూత్, సీనియర్స్ విభాగాల్లో ప్రపంచ చాంపియ న్‌షిప్ పోటీల్లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న అథ్లెట్‌గా ఆమె రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించింది.

రెండు పర్యాయాలు ఒలింపిక్స్ పతకాలను కైవసం చేసుకున్న
english title: 
r

బారత్‌లో అడుగుపెట్టను

$
0
0

న్యూఢిల్లీ, జూలై 24: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) వేలంలో ఎదురైన చేదు అనుభవం థాయిలాండ్ స్టార్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత మథియాస్ బొయేను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. వచ్చే ఏడాది జరిగే థామస్ కప్ పోటీలను మినహాయించి తాను భారత్‌లో అడుగుపెట్టబోనని అతను స్పష్టం చేశాడు. డబుల్స్ భాగస్వామి కార్‌స్టెన్ మోగెనె్సన్‌తో కలిసి 2011 ఆల్ ఇంగ్లాండ్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించిన బొయేకు ఐబిఎల్ నిర్వాహకులు బేస్ ప్రైస్‌ను 50,000 డాలర్లుగా నిర్ణయించారు. కానీ, 33 ఏళ్ల ఈ ఆటగాడిని తీసుకోవడానికి ఫ్రాంచైజీలేవీ ముందుకు రాలేదు. తనకు గొప్ప ధర పలుకుతుందని ఆశించిన బొయే ఈ పరిణామంతో నిరాశ చెందాడు. ఐబిఎల్‌కు మొదటి నుంచి మద్దతు పలుకుతున్న తనకు అందులో ఆడే అవకాశం రాకపోవడం దురదృష్టకరమని అతను ట్విటర్‌లో వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే థామస్ కప్‌లో ఆడతానని తెలిపాడు. ఆ తర్వాత తాను మళ్లీ భారత్‌లో అడుగుపెట్టనని శపథం చేశాడు. ఇలావుంటే, బొయే పార్ట్‌నర్ మోగెనె్సన్‌ను బంగా బీట్స్ (బెంగళూరు) ఫ్రాంచైజీ 50,000 డాలర్లకు కొనడం గమనార్హం. వాస్తవానికి అతని కంటే బొయేకే ఎక్కువ ధర పలకాలి. కానీ ఈ థాయిలాండ్ స్టార్ పట్ల ఎవరూ ఆసక్తి ప్రదర్శించలేదు. అతనితోపాటు థాయిలాండ్‌కే చెందిన బూన్సాక్ పొన్సానా, జపాన్ ఆటగాడు కెనెచి టాగో, ఇండోనేషియా స్టార్లు టామీ సుగియార్తో, సొనీ ద్వి కున్కొరో ప్రపంచ టాప్ ర్యాంకర్లను కూడా ఎవరూ కొనలేదు.

స్పాట్ ఫిక్సింగ్ కేసు

సిబిఐ విచారణకు
సుప్రీంకోర్టు తిరస్కృతి

న్యూఢిల్లీ, జూలై 24: ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు తలెత్తడంతో, ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. హై కోర్టుకే వెళ్లాలని పిటిషన్‌దారు షర్మిల గుహేకు న్యాయమూర్తులు బిఎస్ చౌహాన్, ఎస్‌ఎ బొబ్డేలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ సూచించింది. కోట్లాది మంది అభిమానుల విశ్వాసాన్ని ఐపిఎల్ దారుణంగా దెబ్బతీసిందని ముంబయికి చెందిన షర్మిల సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. క్రికెటర్లతోపాటు, సమాజంలో పేరుప్రతిష్టలున్న ఎంతో మందికి ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయాన్ని ఆమె ప్రస్తావించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో సంబంధిత అధికారులు ఒత్తిళ్లకు లొంగకుండా ఉండాలంటే, సిబిఐ విచారణ అవసరమని పేర్కొంది. పలు రాష్ట్రాల పోలీసు శాఖలు వేరువేరుగా చార్జిషీట్లను దాఖలు చేస్తున్నాయని ఆమె తెలిపింది. అదే విధంగా విచారణ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కొనసాగుతున్నదని పేర్కొంది. ఈ మొత్తం కేసును ఏక మొత్తంగా విచారించడానికి సిబిఐ విచారణ అవసరమని అభిప్రాయపడింది. పిటిషనర్ వాదనను పరిశీలించిన సుప్రీం కోర్టు బెంచ్ ఇది తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ముంబయి హైకోర్టును సంప్రదించాలని షర్మిలకు సూచించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కేసును ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు విచారిస్తుండగా, బిసిసిఐ సొంతంగా మరో విచారణకు ఆదేశించింది. ఇద్దరు మాజీ న్యాయమూర్తులు సుబ్రమణియన్, జయరామ్ చౌతాలతో కూడిన ప్యానెల్ బెట్టింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సిఇవో గురునాథ్ మెయ్యప్పన్ వ్యవహారంతోపాటు రాజస్థాన్ రాయల్స్‌లో చోటు చేసుకున్న పరిణామాలను కూడా విచారించనుంది. మరోవైపు బిసిసిఐ ఎసిఎస్‌యు కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి అరెస్టయ, ప్రస్తుతం బెయల్‌పై విడుదలైన పలువురు నిందితులు నిర్దోషులుగా బయటపడడం అసాధ్యం కనిపిస్తున్నది. అయతే, విచారణ ఎంత వరకూ పారదర్శకంగా సాగుతుందన్న అనుమానాలు లేకపోలేదు. అందుకే, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. షర్మిలకు ముంబయ హైకోర్టులో ఊరట లభిస్తే, కోట్లాది మందిని వేధిస్తున్న స్పాట్ ఫిక్సింగ్‌లో అసలు దోషులెవరో తేలడం ఖాయం. కేసును త్వరగా తేల్చాలన్నది అందరి అభిప్రాయం.

థాయిలాండ్ బాడ్మింటన్ స్టార్ బొయే
english title: 
b

పరువు తీస్తున్నవారిని శిక్షించాలి

$
0
0

న్యూఢిల్లీ, జూలై 24: వివిధ రకాలుగా క్రికెట్ పరువు తీస్తున్న ఆటగాళ్లను కఠినంగా శిక్షించాలని భారత మాజీ కెప్టెన్, 1983 వరల్డ్ కప్ విజేత జట్టుకు సారథ్యం వహించిన కపిల్ దేవ్ డిమాండ్ చేశాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్న వారిని ఉపేక్షిస్తే క్రికెట్ ప్రతిష్ఠ బజారున పడుతుందని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ హెచ్చరించాడు. ఆరో ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌సహా మొత్తం 29 మందిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన ఉదంతాన్ని అతను ప్రస్తావిస్తూ, ఇలాంటి సంఘటనలు క్రికెట్ అభివృద్ధికి, క్రీడాస్ఫూర్తికి గొడ్డలి పెట్టని అన్నాడు. పాక్ క్రికెటర్లు సల్మాన్ బట్, మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అమీర్ బ్రిటన్‌లో జైలు శిక్ష అనుభవించారని, ఈ విషయాన్ని గుర్తించి క్రికెటర్లు అక్రమ మార్గాలకు దూరంగా ఉండాలని హితవు పలికాడు. ఫిక్సింగ్ నేరాలకు పాల్పడడం క్షమార్హం కాదని అన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఢిల్లీ పేసర్ ప్రదీప్ సంగ్వాన్ డోప్ పరీక్షలో విఫలమైన విషయాన్ని కూడా కపిల్ ప్రస్తావించాడు. ఇలాంటి విషయాల్లో యువ క్రికెటర్లను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నాడు. క్రికెట్‌లో పోటీ పెరిగిందని, దీనిని తట్టుకోవడానికి మరింత కసితో శ్రమించాలే తప్ప ఉత్ప్రేరకాలను వాడడం వంటి వక్ర మార్గాలను అనుసరించడం తగదని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ తెండూల్కర్, అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్ వంటి మేటి క్రికెటర్లు అత్యున్నత శిఖరాలను అధిరోహించడం వెనుక వారి కృషి, అంకిత భావం కీలక పాత్ర పోషించిందని అన్నాడు. వారిని మార్గదర్శకంగా తీసుకోవాలని యువ ఆటగాళ్లకు అతను సూచించాడు. విజయాలకు దగ్గరి మా ర్గం ఉండదని వ్యాఖ్యానించాడు. కొన్ని సంఘ టనలను పాఠాలుగా స్వీకరించి, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించాడు. ఇలావుంటే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కూడా సమాచార చట్టం పరిధిలోకి రావాలని ఇటీవల వస్తున్న వాదనపై అడిగిన ప్రశ్నకు కపిల్ ఆచితూచి స్పందించాడు. క్రికెట్‌కు బోర్డు విశిష్ట సేవలు అందిస్తున్నదని కొనియాడాడు. అయితే, పాలనా వ్యవహారాలు మరింత పారదర్శకంగా ఉండేలా బోర్డు చర్యలు తీసుకోవాలని అన్నాడు. బోర్డు ఒక పార్లమెంటు లాంటిదని, మంచి వ్యక్తులు ఎన్నికైతే మంచి పాలన ఉంటుందన్నాడు. బోర్డులో పారదర్శకమైన విధానాలను అందరూ కోరుకుంటారని కపిల్ పేర్కొన్నాడు.

క్రికెట్ అధికారులకు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ డిమాండ్
english title: 
k

కెప్టెన్ కోహ్లీ సూపర్ సెంచరీ టీమిండియా బోణీ

$
0
0

హరారే, జూలై 24: ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి బోణీ చేసింది. మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో, అతని స్థానంలో జట్టుకు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ సెంచరీతో కదంతొక్కగా, కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన తెలుగు తేజం అంబటి రాయుడు అజేయంగా 63 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఇన్నాళ్లూ తనకు జాతీయ జట్టులో అవకాశం ఇవ్వకపోవడం సెలక్టర్ల పొరపాటని పరోక్షంగా చెప్పాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న భారత్ ఈ సిరీస్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగింది. చివరిదైన పదో స్థానంలో నిలిచిన జింబాబ్వే కనీసం పోరాటాన్ని కూడా ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, బ్రెండన్ టేలర్ నాయకత్వంలోని ఆ జట్టు కూడా సర్వశక్తులు ఒడ్డి ఆడడంతో తొలి వనే్డ ప్రేక్షకులను అలరించింది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 228 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉసి సిబాండ, సికందర్ రజా తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించారు. 72 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేసిన సిబాండను అమిత్ మిశ్రా ఎల్‌బి చేయడంతో జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. సుమారు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ వనే్డ ఆడిన మిశ్రాకు మొదటి వికెట్ లభించడం విశేషం. రజా క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్నప్పటికీ, సిన్ విలియమ్స్ (15), హామిల్టన్ మసకజా (11), కెప్టెన్ బ్రెండన్ టేలర్ (12), మాల్కం వాలర్ (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. రజా 112 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 82 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. చివరిలో ఎల్టన్ చిగుంబురా అజేయంగా 43 పరుగులు చేయగా, టిటెండ ముతొంబొజి ఎనిమిది పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రాస్పర్ ఉత్సేయ ఎనిమిది పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత బౌలర్లలో మిశ్రా అద్భుతంగా రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు. అంబటి రాయుడుతో పాటు కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన జయదేవ్ ఉనాద్కత్ 10 ఓవర్లలో 39 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. జింబాబ్వే నిర్దేశించిన 229 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 44.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శిఖర్ ధావన్ 17 పరుగులు చేసి కేల్ జార్విస్ బౌలింగ్‌లో వాలర్‌కు దొరికిపోయాడు. రోహిత్ శర్మ 20 పరుగులు సాధించి చిగుంబురా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ బ్రెండన్ టేలర్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు భారత్‌కు అండగా నిలిచారు. మైదానం నలువైపులా షాట్లతో అలరించిన కోహ్లీ 108 బంతులు ఎదుర్కొని 115 పరుగులు సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. సిబాండ క్యాచ్ అందుకోగా కోహ్లీని అవుట్ చేసిన ఉత్సేయ అదే ఓవర్‌లో సురేష్ రైనా (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. సికిందర్ రజా అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రైనా తన ఖాతాను తెరవకుండానే అయితే, అప్పటికే 216 పరుగులు చేసిన భారత్‌కు రాయుడు (నాటౌట్ 63), దినేష్ కార్తీక్ (నాటౌట్ 8) మరో వికెట్ నష్టం లేకుండా విజయాన్ని అందించారు. మరో 31 బంతులు మిగిలి ఉండగానే భారత్ గెలుపొంది, సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ముతొంబొజి వేసిన బంతిని బౌండరీకి తరలించి రాయుడు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కాగా, ఉత్సేయకు రెండు వికెట్లు లభించాయి. సెంచరీ హీరో కోహ్లీ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్తంగా స్కోర్లు
జింబాబ్వే ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 228 (సికందర్ రజా 82, సిబాండ 34, చిగుంబురా నాటౌట్ 43, అమిత్ మిశ్రా 3/43).
భారత్ ఇన్నింగ్స్: 44.5 ఓవర్లలో 4 వికెట్లకు 230 (కోహ్లీ 115, రాయుడు నాటౌట్ 63, ఉత్సేయ 2/34).

జింబాబ్వే టూర్‌లో రాణించిన తెలుగుతేజం రాయుడు
english title: 
s

దండుమైలారంలో ఉద్రిక్తత

$
0
0

ఇబ్రహీంపట్నం, జూలై 25: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక గెలుపొందిన వర్గీయులపై దాడి చేసి, యువకులపై హత్యాయత్నం చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ సమీపంలో పోలీసుల సాక్షిగా గురువారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన సహకార సంఘం చైర్మన్ ఈదులకంటి రాకేష్‌గౌడ్ తన అనుచరులతో కలిసి అదే గ్రామానికి చెందిన యువకులపై పోలీస్‌స్టేషన్ సమీపంలో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న ఏసిపి సురేందర్‌రెడ్డి, సిబ్బందితో స్వల్ప లాఠీఛార్జి జరిపి దాడిచేసిన రాకేష్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసిపి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలో మేజర్ గ్రామపంచాయతీ దండుమైలారంలో మంగళవారం సాయంత్రం జరిగిన కౌంటింగ్‌లో టిడిపి బలపరిచిన వార్డు సభ్యులు, సర్పంచ్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. ఓటమిని జీర్ణించుకోలేక, దండుమైలారం సహకార సంఘం చైర్మన్ ఈదులకంటి రాకేష్‌గౌడ్, తన సోదరుడు ఈదులకంటి నరేష్ అలియాస్ లచ్చిలు కొందరు యువకులపై దాడికి దిగారు. అక్కడే భారీగా మోహరించిన పోలీసులు లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. తెలుగుదేశం వర్గానికి చెందిన యువకులు దయానంద్, ఆంజనేయులు, నిట్టు రవివర్మ, ప్రకాశ్, జిలమోని వెంకటేశ్‌లను ఫోన్‌ద్వారా బెదిరించి రెండుమూడు రోజుల్లో మిమ్మల్ని చంపుతాం, మీరే ఎన్నికల్లో కీలక పాత్ర వహించారు. మీరు ఎక్కడ దొరికినా చంపేస్తామంటూ ఫోన్‌లు చేసి బెదిరించారు. ఫోన్‌కాల్స్‌కు భయపడ్డ పలెమోని దయానంద్, ఆంజనేయులు, రవివర్మ, ప్రకాశ్‌లు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గురువారం వచ్చారు. కాగా గ్రామంలో రెండవవార్డులో గెలుపొందిన జిలమోని యాదగిరి తమ్ముడు వెంకటేశ్ గున్‌గల్ తిరుమల డైరీలోడ్రైవర్‌గా పనిచేస్తూ డ్యూటీ పనిమీద ఇబ్రహీంపట్నంవచ్చి పోలీసుస్టేషన్ సమీపంలోని పంక్చర్ షాప్ వద్ద నిల్చొని ఉన్నాడు. అదే సమయంలో సహకారసంఘం చైర్మన్ రాకేష్‌గౌడ్, తన తమ్ముడు లచ్చి, అనుచరుడు చిన్నా, పరమేష్, రాజశేఖర్ తదితరులతో కలిసి కర్రలతో, రాళ్లతో వెంకటేశ్‌పై దాడికి దిగారు. వెంకటేశ్‌పై రాయి ఎత్తివేయగా తప్పించుకోగా నడుముకు తగిలింది. కర్రలతో కొట్టారు. పోలీసుస్టేషన్ దగ్గర నిలుచున్న ఆంజనేయులు, రవివర్మలను కర్రలతో కొట్టారు. పోలీసుస్టేషన్ సమీపంలో పెద్ద సంఖ్యలో గుమిగూడిన యువకులు దాడి చేస్తున్న లాఠీచార్జి జరిపి, దాడిని అడ్డుకున్నారు. రాకేష్‌గౌడ్, లచ్చి, చిన్న, పరమేశ్, రాజశేఖర్ తదితరులపై గాయపడ్డ యువకుల ఫిర్యాదుమేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు, స్పెషల్ బిఎస్‌ఎఫ్ ఫోర్స్‌ను మోహరించి స్టేషన్‌ముందు యువకులు గుమిగూడకుండా చెదరగొట్టారు. విలేఖరుల సమావేశంలో ఏసిపితోపాటు, సిఐ రాంకుమార్ పాల్గొన్నారు. ఆగస్టు 3వరకు గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు జరుపుకోవద్దని వారు హెచ్చరించారు.

పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక
english title: 
dandu mailaram

రూ. 5 కోట్ల అక్రమ ఆస్తులు

$
0
0

దిల్‌సుఖ్‌నగర్, జూలై 25: ఏసిబి వలలో ఒక అవినీతి ఉద్యోగి చిక్కాడు. వివరాల్లోకి వెళితే నాగోల్‌లోని సాయినగర్‌లో నివాసముంటున్న వెంకటేశ్వర్లు రెడ్డి కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి సమాచారం అందడంతో ఆ శాఖ అధికారులు గురువారం ఉదయం నాగోల్‌లోని అతని నివాసంపై దాడులు జరిపారు. ఐదుకోట్ల రూపాయల విలువచేసే అక్రమ ఆస్తులను వారు గుర్తించారు. దానికి సంబంధించిన కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆరు ప్లాట్లు, నాలుగుషాపులు, నాలుగు బహుళ అంతస్తుల భవనాలు, 110 తులాల బంగారు ఆభరణాలు, 56 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసిబి డిసిపి చంద్రశేఖర్ తెలిపారు. ఈ దాడుల్లో సిఐలు ప్రభాకర్, లక్ష్మి, వెంకటేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఏసిబి వలలో ఒక అవినీతి ఉద్యోగి చిక్కాడు
english title: 
acb

రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

$
0
0

హైదరాబాద్, జూలై 25: ఈ నెల 27న జరుగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టరు బి.శ్రీధర్ వెల్లడించారు. చేవెళ్ళ డివిజన్‌లోని 9 మండలాల్లో 222 గ్రామ పంచాయతీలకు, 2204 వార్డులకు ఎన్నిక జరుగనుందని తెలిపారు. డివిజన్‌ను 71 క్లస్టర్లుగా విభజించడం జరిగిందని, ఎన్నికల విధులు నిర్వహించేందుకు 80 స్టేజి-1 అధికారులను, 2204 మంది ప్రిసైడింగ్ అధికారులను, 2694 మంది పోలింగ్ అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. చేవెళ్ల డివిజన్‌లోగల మొత్తం 2204 పోలింగ్ స్టేషన్లలో 47 అతిసున్నిత, 71 సున్నిత పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, వాటికి అదనపు భద్రత కల్పించామని కలెక్టరు వెల్లడించారు. ఈ పోలింగ్ స్టేషన్లలో జరిగే పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్/వీడియోగ్రఫీ ద్వారా గమనించనున్నట్లు ఆయన పేర్కొంటూ 73 మంది సూక్ష్మ పరిశీలకులు కూడా పోలింగ్‌ను నిశితంగా గమనిస్తుంటారని తెలిపారు. చేవెళ్ల డివిజన్ ఆర్‌డిఓ నాగేందర్, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారిగాను, ఆయా మండలాల తహసీల్దార్లు, అధనపు సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపిడిఓలు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. మొత్తం 1,81,379 మంది పురుషులు, 1,75,220 మంది మహిళలు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నట్లు కలెక్టరు తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు పురస్కరించుకొని చేవెళ్ల డివిజన్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు ఈ నెల 27న స్థానిక సెలవు దినంగా ఇదివరకే ప్రకటించడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లుగా వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు పోలింగ్‌కు ఒక రోజు ముందు కూడా స్థానిక సెలవు దినంగా ప్రకటించామని పేర్కొన్నారు. ఓటర్లు ఫొటో గుర్తింపు కార్డులు తీసుకొని రావాలని సూచించారు. గుర్తింపు కార్డులు లేని పక్షంలో డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు తదితర 21 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకొని వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవలసిందిగా సూచించారు. జూలై 27న ఉ.గం.7.00ల నుండి మ.గం.1.00ల వరకు జరిగే పోలింగ్‌లో ఓటర్లందరూ సంబంధిత పోలింగ్ కేంద్రాలలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయాల్సిందిగా కలెక్టరు సూచించారు.
ఎన్నికల విధులకు ప్రైవేటు బస్సులు
దోమ, కుల్కచర్ల, గండీడ్, పరిగి మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి జిల్లా యంత్రాంగం ప్రైవేటు బస్సులను ఏర్పాటుచేసిందని రంగారెడ్డి జిల్లా కలెక్టరు బి.శ్రీ్ధర్ తెలిపారు. ఈ బస్సులన్ని జూలై 26న ఉ.గం.6.00లకు మెహిదీపట్నం నుండి బయలుదేరుతాయని అన్నారు. అదేవిధంగా మొయినాబాద్, చేవెళ్ల, షాబాదు మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని కూడా ఆయా మండల హెడ్ క్వార్టర్స్‌కు చేరేందుకు మెహిదీపట్నంలోని నానల్‌నగర్ జంక్షన్ వద్దగల ఆర్డీఓ కార్యాలయం నుండి శుక్రవారం ఉ.గం.6.00లకు ప్రైవేటు బస్సులను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. సంబంధిత పోలింగ్ సిబ్బంది శుక్రవారం ఉ.గం.6.00లకల్లా నిర్దేశిత స్థానాల్లో బస్సుల్లో ఎక్కి తమకు కేటాయించిన మండలాలకు చేరుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఈ విషయంలో సమయపాలనను కచ్చితంగా పాటించాలని లేని పక్షంలో పంచాయతీలకు వెళ్లడంలో ఆలస్యమవుతుందని ఆయన పోలింగ్ సిబ్బందికి స్పష్టం చేశారు.
ఎన్నికలకు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు: సివి ఆనంద్
గచ్చిబౌలి: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 27న జరగబోవు రెండో విడత ఎన్నికలకు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ తెలిపారు. కమిషనర్ విలేఖర్లతో మాట్లాడుతూ శనివారం జరిగే రెండో విడతలో 44 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నట్లు సిపి తెలిపారు. ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీచేయడం జరిగింది. పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించడంతో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతం జరిగాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శుక్రవారం ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తున్నట్లు సిపి తెలిపారు. ఎస్‌ఓటిని రెండు విభాగాలు చేసి అడిషనల్ డిసిపిలను నియమించి ప్రస్తుతం ఉన్న 15 మందికి బదులుగా 20 మంది సిబ్బందిని పెంచాలని యోచిస్తున్నట్లు సిపి తెలిపారు. ట్రాఫిక్ సమస్యను త్వరలో అధిగమిస్తామని చెప్పిన ఆయన ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని కమీషనర్ వెల్లడించారు. సైబరాబాద్‌లో పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుళ్లకు కూడా సిఆర్‌పి, ఐపిసిలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొందరు పోలీసు అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని విలేఖర్లు ప్రశ్నించగా పనిచేసే వారిపై విమర్శలు సహజమేనని, అయితే ప్రజల హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.

ఈ నెల 27న జరుగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ
english title: 
second round

ఈరోడ్లు మావి కావు!

$
0
0

* రోడ్లు,భవనాలకు చెందిన
రోడ్లు 189.48కి.మీలు
* జాతీయ రహదారులకు
చెందినవి 98.70 కి.మీలు
* రోడ్లపై బల్దియా వివరణ

హైదరాబాద్, జూలై 25: మహానగరంలో గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం కారణంగా పూర్తిగా గుంతలమయం కావటంతో పాటు రోడ్డుపై దుమ్ము, దూళి ఎగుస్తూ వాహనదారులను ప్రమాదాల బారిన పడేస్తున్న సంగతి తెల్సిందే! రోడ్లు బాగా లేని కారణంగా సికింద్రాబాద్‌లో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం, ఈ విషయంపై పలువురు మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేయటం వంటి పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఏ రోడ్డు ఏ విభాగానికి చెందిందో బల్దియా అధికారులు గురువారం స్పష్టమైన వివరాల్ని వెల్లడించారు.
ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందిన రోడ్డు తమ పరిధిలోకి రాదని, ఆ రోడ్డు రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి వస్తుందని కూడా అధికారులు వివరణ ఇచ్చుకోవల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ గ్రేటర్ పరిధిలో జాతీయ రహదార్లు, రోడ్లు, భవనాల శాఖకు చెందిన రహదార్లున్నా, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల తాకిడికి పలు రోడ్లకు బల్దియానే స్వల్ప మరమ్మతులు చేపట్టేది.
నగరంలో ప్రస్తుతమున్న రోడ్ల పరిస్థితి తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఇప్పటికైనా ఏ రోడ్డు ఎవరి పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని వెల్లడించేందుకు అధికారులు సిద్దమయ్యారు. గతంలో ఎవరడిగినా, వివరాలు చెప్పేందుకు తడబడే అధికారులు ఇపుడు స్వచ్చంథంగా ఆయా విభాగాలకు చెందిన రోడ్ల పూర్తి వివరాల్ని విడుదల చేయటం విశేషం.
ఈ అయితే గ్రేటర్ పరిధిలోని బిటి, సిసి రోడ్లన్నీ కూడా సుమారు 7వేల చదరపు కిలోమీటర్ల పొడువున ఉండవచ్చునని గతంలో వెల్లడించిన అధికారులు ప్రస్తుతమిచ్చిన వివరాల ప్రకారం రోడ్లు, భవనాల శాఖ, జాతీయ రహదారుల శాఖలకు సంబంధించి రోడ్లు కనీసం 300 చ.కి.మీలు కూడా లేవు. అంటే రోడ్లలో ఎక్కువ భాగంగా బల్దియా పరిధిలోకి వస్తుందని అర్థం. కానీ ఈ వివరాల్ని అధికారులు వెల్లడించకపోవటం గమనార్హం.
రోడ్లు, భవనాల శాఖ రహదార్లు ఇవే!
నగరంలో మొత్తం 189.48పొడువున రోడ్లు, భవనాల శాఖకు చెందిన రోడ్లున్నట్లు అధికారులు తెలిపారు. సరోజినీదేవి ఆస్పత్రి సమీపంలోని పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెవ్ హైవే, సరోజినీదేవి ఆస్పత్రి రోడ్డు, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెం. 1,2,3,జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36, మాదాపూర్ మెయిన్ రోడ్డు, హెచ్‌ఐసిసి వరకు మొత్తం 15 కి.మీల పొడువున రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు చెందిన రోడ్లున్నట్లు వెల్లడించారు. అలాగే మెహిదీపట్నం నుంచి టోలీచౌకీ, గచ్చిబౌలీ ఫ్లైవోవర్, కొండాపూర్‌ల మీదుగా హెచ్‌ఐసిసి వరకు సుమారు 9.60 కి.మీల పొడవున్న రోడ్డు, దీంతో పాటు ఎన్‌ఎఫ్‌సిఎల్ జంక్షన్, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, ఎస్పీ రోడ్డు, సంగీత్ జంక్షన్, తార్నాక, మెట్టుగూడ, ఉప్పల్ వరకు సుమారు 15.60 కి.మీల పొడువున్న రోడ్డు రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్ నుంచి మెదక్‌కు వెళ్లే దారిలో బాలానగర్, హెచ్‌ఎంటి, జీడిమెట్ల, బహద్దూర్‌పల్లి, గండిమైసమ్మ జంక్షన్ వరకు సుమారు 13కి.మీల రోడ్డు రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి వస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్లే దారిలో మలక్‌పేట, సైదాబాద్, సంతోష్‌నగర్, బైరామల్‌గూడ, బిఎన్‌రెడ్డినగర్ 7.40 కి.మీల రోడ్డు కూడా అదే శాఖ పరిధిలో ఉన్నట్లు వెల్లడించారు. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్, కాటేదాన్ నుంచి శివరాంపల్లి, అత్తాపూర్ నుంచి రేతీబౌలీ వరకు, మెహిదీపట్నం నుంచి మాసాబ్‌ట్యాంక్, కృష్ణాపురంల వరకు 36.40కి.మీల పొడువున్న ఇన్నర్ రింగురోడ్డులు, అలాగే కొండాపూర్ నుంచి హాఫీజ్‌పేట వరకు అంతర్గతంగా ఉన్న 20.20 కి.మీల రోడ్డు, మియాపూర్ నుంచి బాచిపల్లి మీదుగా దుండిగల్ వరకు సుమారు 9.50 కి.మీల అంతర్గత రోడ్లు, బహద్దూర్‌పల్లి, కొంపెల్లి వరకు 7 కి.మీలు, తిరుమల్‌గిరి నుంచి ఆర్‌కె పురం మీదుగా వౌలాలీ, కుషాయిగూడ జంక్షన్ వరకు 7.40 కి.మీలు, ఐడిఎ నాచారం నుంచి ఆర్‌ఆర్‌ల్యాబ్స్, మల్లాపూర్ రోడోవర్ బ్రిడ్జి వరకు 7.60కి.మీల రోడ్డు, హైదరాబాద్ నుంచి వౌలాలీ రోడ్డులోని ఇంజనీరింగ్ కాలేజీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తార్నాక, లాలాపేట, ఐడిఏ వౌలాలీ ఆర్వోబి, ఇసిఐఎల్ క్రాస్‌రోడ్డు వరకు 3.9కి.మీల రోడ్డుతో పాటు ఉప్పల్ స్టేడియం ఇంటర్ రోడ్డు 1.80కి.మీలు కూడా ఆ శాఖ పరిధిలోకే వస్తాయని అధికారులు తెలిపారు. 3.40 కి.మీల ఓల్డ్ ఎయిర్‌పోర్టు, 1.80.కి.మీల బాలానగర్ నుంచి ఫతేనగర్ రోడ్డు, 0.60కి.మీల ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాంప్లెక్సు రోడ్డు, 4 కి.మీల పాత కర్నూలు రోడ్డు, మూడు కి.మీల మిథానీ రోడ్డు, ఓ కిలోమీటరు మల్కాజ్‌గిరి రోడ్డు, ఓ కి.మీ పొడువున్న సనత్‌నగర్ గూడ్స్‌షెడ్ నుంచి మూసాపేట జంక్షన్ వరకు, 2.70కి.మీల ఉత్తమ్‌నగర్ జెడ్‌టిఎస్ క్రాస్‌రోడ్డు నుంచి మల్కాజ్‌గిరి వరకు, 5.30 కి.మీల మిరియాల్‌గూడ ఉంచి నెరెడ్‌మెట్ క్రాస్‌రోడ్డు, 5.30 కి.మీల కెబిఆర్ పార్కు చుట్టున్న రోడ్డు, అలాగే 0.60 కి.మీల చాదర్‌ఘాట్‌లోని లోతట్టు ప్రాంతంలోని రోడ్డు, 0.98కి.మీల ఐఆర్‌ఆర్ నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం, రామంతాపూర్, హబ్సిగూడ రోడ్డు కూడా రోడ్లు, భవనాల శాఖకు చెందినదిగా అధికారులు తెలిపారు.
ఇవి జాతీయ రహదార్ల రోడ్లు
నగరం నుంచి భూపాలపట్నంకు వెళ్లే జాతీయ రహదారి నెం. 202లోని చాదర్‌ఘాట్ బ్రిడ్జి, అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్, నల్లచెరువు వరకు దాదాపు 10.10కి.మీల రోడ్డు జాతీయ రహదార్ల శాఖకు చెందినదిగా తెలిపారు. అలాగే పూణె విజయవాడల జాతీయ రహదారి-9లోని ముత్తంగి, పటాన్‌చెరువు, కూకట్‌పల్లి, అమీర్‌పేట, అసెంబ్లీ, ఎం.జె.మార్కెట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ వరకు సుమారు 54కి.మీల రోడ్డు, అలాగే నాగ్‌పూర్, హైదరాబాద్ కర్నూలు జాతీయ రహదారి నెం. 7లోని కొంపల్లి, బోయిన్‌పల్లి,(ప్యారడైజ్ జంక్షన్), ట్యాంక్‌బండ్, అసెంబ్లీ, ఎం.జె.మార్కెట్, హైకోర్టు, జూపార్కు, ఆరంఘర్ వరకు 25.70కి.మీల రోడ్డుతో పాటు జాతీయ రహదారి 65లోని కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని బాలానగర్, బోయిన్‌పల్లి, ప్యారడైజ్ వరకు దాదాపు 8.90 కి.మీల రోడ్డును కలుపుకుని నగరంలో మొత్తం 98.70కి.మీల పొడువున జాతీయ రహదారుల శాఖ రోడ్లున్నట్లు అధికారులు తెలిపారు.

మహానగరంలో గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా
english title: 
roads

పోలీసులని చెప్పి.. నగలు చోరీ

$
0
0

నేరేడ్‌మెట్, జూలై 25: పోలీసులమని చెప్పి మహిళకు మాయమాటలు చెప్పి నగలు దోచుకెళ్లిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంత సరస్వతినగర్‌లో నివసించే వసంత (50) గురువారం ఉదయం గుడికి వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి తమను పోలీసులుగా పరిచయం చేసుకుని అమెకు మాయమాటలు చెప్పి అమె వద్ద ఉన్న నాలుగు తులాల బంగారం నగలు తీసుకుని పారిపోయారు. తను మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు
న్యూమిర్జాలగూడలో నివసించే పి.రాజు(42) మిల్క్‌సెంటర్ నిర్వహిస్తున్నాడు. పక్కనే నివసించే సాయమ్మ, లచ్చయ్యను తాగిన మత్తులో వారిపై దాడి చేసి గాయపరిచాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ జహంగీర్ యాదవ్ తెలిపారు.

పోలీసులమని చెప్పి మహిళకు మాయమాటలు చెప్పి
english title: 
police

రెండో విడతకు భారీ బందోబస్తు

$
0
0

వికారాబాద్, జూలై 25: రంగారెడ్డి జిల్లాలో రెండో విడతగా చేవెళ్ళ డివిజన్‌లో ఈనెల 27న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు భారీ పోలీసుబందోబస్తు ఏర్పాటు చేసినట్లు రంగారెడ్డి జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. గురువారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రచారం ముగిసినందున మద్యం దుకాణాలను మూయించామన్నారు. వాయిలెంట్ ఆఫ్ మోడల్ కండక్ట్‌లో భాగంగా స్టాటిక్ సర్వలెంట్ టీం పర్యటిస్తోందని, టీంలో ఎస్‌హెచ్‌వో, తహశీల్దార్ ఉంటారని ఫిర్యాదు వస్తే పరిశీలించి కేసు నమోదు చేస్తారన్నారు. ఎన్నికలు జరగున్న 167 గ్రామ పంచాయతీల్లో 1574 వార్డులున్నాయని తెలిపారు. అందులో 17 అతి సమస్యాత్మక, 76 సమస్యాత్మక, 74 సాధారణ గ్రామాలున్నాయని తెలిపారు. 46 రూట్లుగా విభజించి మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశామని, ప్రతి మొబైల్‌లో ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ళుంటారని తెలిపారు. బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు చేర్చే బాధ్యత మొబైల్‌పార్టీదేనని తెలిపారు. మొత్తం 338 పోలింగ్ స్టేషన్లున్నాయని తెలిపారు. పోలింగ్‌రోజు రూటు మొబైల్‌తో పాటు ఎస్కార్టు తిరుగుతుందన్నారు. ఇన్‌స్పెక్టర్లు ఇంచార్జిలుగా 60 మందితో కూడిన స్ట్రైకింగ్ ఫోర్స్, 45 మందితో కూడిన ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ బందోబస్తులో పాల్గొంటుందన్నారు. మండలానికో డిఎస్పీని ఇంచార్జిగా నియమించనున్నట్లు తెలిపారు. జిల్లాలో నాలుగు ప్లటూన్‌లుండగా, 300 మంది పోలీసులతో కూడిన 15 ప్లాటూన్‌లు ఏపిఎస్పీ నుండి రానున్నాయన్నారు. సిఐడి, వరంగల్, బీచ్‌పల్లి, ట్రెయినీకి చెందిన 20 మంది డిఎస్పీలు, 15 మంది సిఐలు, సైబరాబాద్ నుండి రెండు సాయుధ దళాలు, వికారాబాద్ డిటిసితో పాటు మెదక్, వరంగల్ పిటిసి, హైద్రాబాద్ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న వారితో పాటు 150 మంది ఎస్‌ఐలు, బయట నుండి వచ్చే 1200 మంది, జిల్లాకు చెందిన 800 మందితో కలిపి రెండు వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో 1349 మంది బైండోవర్
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు 155 కేసుల్లో 1349 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎన్నిలక కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఐదు కేసులు నమోదవగా, 22 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఎక్సైజ్‌కు సంబంధించి 25 కేసులను నమోదు చేసి దాదాపు నాలుగు లక్షల రూపాయల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఐదు లక్షల నగదును పట్టుకున్నామని, 50 లీటర్ల ఐడిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
ముమ్మరంగా పోలీసు తనిఖీలు
వికారాబాద్ డివిజన్‌లో మూడో విడతలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎన్నికలు జరుగుతున్న గ్రామాలకు పరిమితికి మించి మద్యం వెళ్ళకుండా వారు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వికారాబాద్ ఎస్‌ఐ హన్మ్యానాయక్ ఆధ్వర్యంలో బృందంతో హైద్రాబాద్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించారు.
మద్యం బాటిళ్ల పట్టివేత
షాబాద్: షాబాద్ మండల పరిధిలోని సర్దానగర్ సమీపంలో అనుమానస్పదంగా ఆటో దొరికిందని పోలీసులు తెలిపారు. ఆటోలో 196 మద్యం బాటిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. కక్కుదార్ గ్రామానికి చెందిన పట్నం శ్రీకాంత్, సర్దానగర్ గ్రామానికి చెందిన వెంకటేశంను అరెస్టు చేసినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతు అభ్యర్థులను గెలిపించడంలో భాగంగా మద్యం పంచడానికి తీసుకెళ్తున్నట్లు నిందితులు పేర్కొన్నారని పోలీసులు స్పష్టం చేశారు. పంచయతీ ఎన్నికలలో ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐలు సత్యనారాయణ, నాగరాజు పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామల్లో సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసామని తహశీల్దార్ యాదయ్య పేర్కొన్నారు. మల్లారెడ్డిగూడ, మక్తగూడ, ఎర్రలిల్లి, బోబిలింగం, చందనవెల్లిలో వీడియో కెమెరాలు, దామర్లపల్లి, మాచనపల్లి, నాగర్‌కుంట, రేగడిదోస్వాడ, షాబాద్, మద్దుర్, తాళ్లపల్లి, తిరుమలపూర్, సోలిపేట, సర్దానగర్, బోడంపహాడ్‌లో మైక్రో కెమెరాలను అమరుస్తామని తెలిపారు.
గ్రామాల్లో ఓటరు చిట్టీల పంపిణీ
ధారూర్: గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు ఎన్నికల ఓటరు చిట్టీలను సాక్షరభారత్ గ్రామ కోఆర్డినేటర్లు, అంగన్‌వాడి టీచర్లు పంపిణీ చేస్తున్నారు. ఓటరు చిట్టీలను గతంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే పంపిణీ చేసేవారు. చిట్టీల పంపిణీ సమయంలో ఓటర్లను అభ్యర్థులు ప్రభావితం చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రభుత్వమే ఈ చిట్టీల పంపిణీ బాధ్యతను చేపట్టింది. మండలంలో 22 గ్రామ పంచాయతీలలో చిట్టీల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది.

రంగారెడ్డి జిల్లాలో రెండో విడతగా చేవెళ్ళ డివిజన్‌లో ఈనెల 27న
english title: 
security

స్పోర్ట్స్ స్కూల్‌లో ఎంపిక పోటీలు ప్రారంభం

$
0
0

చాంద్రాయణగుట్ట, జూలై 25: హకీంపేట్‌లోని ఎపి స్పోర్ట్స్ స్కూల్‌లో రాష్ట్రంలోని వివిధ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశం కోసం 2013-14 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ఎంపిక పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఎంపిక పోటీలో భాగంగా జోన్-1 పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, గుంటూరు, నిజామాబాద్, కృష్ణా జిల్లా పోటీలు హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్వహించారు. ఈ పోటీలకు ఆరు జిల్లాల నుండి మొత్తం 147 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విరీలో 113 మంది బాలురు, 34 మంది బాలికలున్నారు. ఎంపిక పోటీలో భాగంగా విద్యార్థులకు వివిధ అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. ఎత్తు, బరువు, ఫ్లేక్సిబ్లిటీ, స్టాండింగ్ వర్టీకల్ జంప్, స్టాండింగ్ బోర్డు జంప్, మెడిసిన్ బాల్‌పూట్, 800 మీటర్ల పరుగు పందెంతో పాటు వివిధ పోటీలు నిర్వహించారు. పోటీలకు ముందు విద్యార్థుల సర్ట్ఫీకెట్లను పరిశీలించారు. ఈ ఎంపిక పోటీల ప్రక్రియాను ఎప్పటికప్పుడు పరిశీలించి తనిఖీ చేసిన వారీలో హకీంపేట్ ఎపి స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ డా.కె.నర్సయ్య, శాప్ డిప్యూటీ డైరెక్టర్ జిఎ.శోభ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరీఫ్ ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎంపిక పోటీలకు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం ప్రతినిధితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు క్రీడాకారులు హజరు కాకపోవడం విశేషం. ఎంపిక పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని స్పోర్ట్స్ స్కూల్ స్పెషలాఫీసర్ నర్సయ్య తెలిపారు. ఎంపిక పోటీల నిర్వహణ సందర్భంగా అయా క్రీడాంశాలకు చెందిన కోచ్‌లను కూడా నియమించిన్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీలు ఆగస్టు 1 వరకు కొనసాగుతాయని వెల్లడించారు.

హకీంపేట్‌లోని ఎపి స్పోర్ట్స్ స్కూల్‌లో రాష్ట్రంలోని వివిధ స్పోర్ట్స్
english title: 
sports school

సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు

$
0
0

ఖైరతాబాద్, జూలై 25: ప్రత్యేక రాష్ట్రంలో సీమాంధ్ర మిత్రులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భారత రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ పాలన కొనసాగినప్పుడు ఎవరి స్వేచ్ఛకూ భంగం కలగదని తెలంగాణ ఉద్యోగ సంఘం నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు జనం పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పరిషత్ అధ్యక్షుడు కంచర్ల జగన్మోహన్‌రావుతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ఇక్కడ ఏదో జరుగుతుందని పెట్టుబడిదారులైన కొంతమంది నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని, భారతదేశ రాజ్యాంగానికి లోబడే ఇక్కడి ప్రభుత్వం కొనసాగుతూ అన్ని ప్రాంతాల వారి శ్రేయస్సును చూసుకుంటుందని, ఇక్కడి పోలీస్ వ్యవస్థ అంతా యధావిధిగా కొనసాగుతాయని అన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో వందల సంవత్సరాల క్రితమే మహారాష్ట్ర, రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల వారు వచ్చి వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారని, వారికి లేని ఆందోళన ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన వారికి ఎందుకని ప్రశ్నించారు.. రెండు ప్రాంతాల్లోని ప్రజల శ్రేయస్సును పట్టించుకోని కొంతమంది నాయకులు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగుప్రజలు రెండు రాష్ట్రాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉండవచ్చునని, రాష్ట్రం ఏర్పడే ముందు మరోమారు తెలంగాణ ప్రజలపై విషం చిమ్మే విధంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్కరికైనా హాని చేయని తెలంగాణ ప్రజలు, వారి ఆకాంక్షను ఆత్మబలిదానాలతో మాత్ర మే వెల్లడించారన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, రంగారెడ్డి, రవీందర్ రావు, జోగారావు పాల్గొన్నారు.

వాహన దొంగల అరెస్ట్
గచ్చిబౌలి, జూలై 25: హోటళ్లు, స్టాళ్ల ముందు పార్కుచేసిన ద్విచక్రవాహనాలను అపహరించే రెండు ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 18 లక్షల విలువజేసే 35 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో క్రైం డిసిపి రంగారెడ్డి వివరాలను వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన పిట్ల మల్లేష్ (26) కరీంనగర్‌లో నివాసముంటున్నాడు. మెదక్ జిల్లా గంపల నారాయణ (35)తో కలిసి నగరంలో రద్దీ ప్రదేశాలలో పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను అపహరించి మెదక్‌లో నివాసముండే బోగం జంగయ్య ద్వారా విక్రయించే వారు. వీరిద్దరూ సైబరాబాద్, హైదరాబాద్‌తో పాటు మెదక్‌లో 30 స్ప్లెండర్ ప్లస్ బైక్‌లను అపహరించారు. నగరంలోని ఉప్పుగూడలో నివాసముంటే మహ్మద్ ముజాద్ (29), మహ్మద్ సమీర్ (26) కలిసి పార్కు చేసిన పల్సర్లు, ప్యాషన్ ప్రో వాహనాలను అపహరించి చైన్‌స్నాచర్లకు విక్రయించేవారు. వీరి నుంచి ఐదు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు ముఠాల నుంచి మొత్తం 18 లక్షల విలువచేసే 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. మల్కాజిగిరి, బాలానగర్ సిసిఎస్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. సమావేశంలో క్రైం అడిషనల్ డిసిపి జానకిరావు, ఏసిపి వెంకటేశ్వర్లు, సిఐలు మహ్మద్‌గౌస్, సంజీవ్‌రావు పాల్గొన్నారు.

-- హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని --
జెఎన్‌టియు విద్యార్థుల ధర్నా
కెపిహెచ్‌బి కాలనీ, జూలై 25: కూకట్‌పల్లి జెఎన్‌టియుహెచ్‌లోని హాస్టల్‌లో వౌలిక వసతులు కల్పించాలని హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెఎన్‌టియుహెచ్ యజమాన్య నిర్లక్ష్యం మూలంగా ఆవరణలో ఉన్న కినె్నర హస్టల్‌లోగత కొన్ని నెలలుగా సమస్యలు నెలకొని ఉండడంతో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ గదుల నుండి ప్రిన్సిపాల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి యజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్సిటీ విసి వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని వారు రోడ్డుపై బైఠాయించారు. ఇటీవల నూతనంగా నిర్మించిన బిల్డింగ్ సైతం పగుళ్లు ఏర్పడి పడుతున్న వర్షాలకు నీరుకారుతోందని దీంతో గదులలో వర్షపునీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామన్నారు. హాస్టల్‌లోవైఫై సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా డ్రైనేజీ పైపులైన్ పగిలి కొద్దిరోజులుగా దుర్వాసన వెదజల్లుతోందన్నారు. బాత్‌రూమ్‌లలో బండలు పగిలి విద్యార్థులు నానా యతన పడుతున్నప్పటికీ యజమాన్యం మొండివైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. కినె్నర హాస్టల్‌లో వౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. విద్యార్థులు చేస్తున్న ధర్నాతో దిగివచ్చిన ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వినయ్‌బాబు వారితో మాట్లాడి హాస్టల్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో నరేష్‌యాదవ్, సుధాకర్, సిద్ధార్థ, నర్సింహ్మ, చంద్రవౌళి పాల్గొన్నారు.

ప్రత్యేక రాష్ట్రంలో సీమాంధ్ర మిత్రులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని
english title: 
s

నేటి నుంచి పాతబస్తీలో బోనాల ఉత్సవాలు

$
0
0

చార్మినార్, జూలై 25: ఆష్ఢా మాసంలో తెలంగాణ ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు నేటి నుంచి పాతబస్తీలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పాతబస్తీలోని పలు చారిత్రక దేవాలయాలు అమ్మవారి బోనాల జాతరకు ముస్తాబవుతున్నాయి. నగరంలో ప్రతిష్టాత్మకమైన పాతబస్తీలోని లాల్‌దర్వాజ శ్రీ మహాంకాళీ అమ్మవారి దేవాలయంలో, శ్రీ అక్కన్నమాదన్న దేవాలయంలో నేటి నుంచి బోనాల ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు గురువారం రెండు దేవాలయాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అక్కన్నమాదన్న దేవాలయ కమిటీ ప్రతినిధులు జి. నిరంజన్, రాజారత్నం, దత్తాత్రేయ, సతీష్ మాట్లాడుతూ అక్కన్న మాదన్న దేవాయంలో శుక్రవారం ఉదయం అమ్మవారి అభిషేకం, కలశస్థాపన కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అనంతరం పదిన్నరకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి డా. జె. గీతారెడ్డి చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మాధిరిగానే ఈ సారి కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. లాల్‌దర్వాజ శ్రీ మహాంకాళీ అమ్మవారి దేవాలయ ప్రతినిధులు మహేష్‌గౌడ్, సదా ముదిరాజ్‌లు మాట్లాడుతూ శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం పదకొండు గంటలకు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ఆలయ గోపుర పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఏర్పాట్లు త్వరగా చేయండి
బోనాల ఉత్సవాలకు గడువు ముంచుకొస్తున్నా, నేటికీ ఏర్పాట్లు పూర్తి కాలేదని, ఉత్సవాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని పాతబస్తీలోని వివిధ దేవాలయాల కమిటీ ప్రతినిధులు జి. నిరంజన్, రాజారత్నంలు కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనాకు వినతిపత్రం సమర్పించారు. అలాగే జూపార్కు నుంచి అంబారీని కూడా సకాలంలో తెప్పించే విధంగా కృషి చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను కోరారు.
అంబర్‌పేట బోనాలకు భారీ ఏర్పాట్లు
అంబర్‌పేట: అంబర్‌పేటలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసేందుకు అంబర్‌పేట దేవస్థాన సేవా సమితి గురువారం మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌గౌడ్, చైర్మన్ కె దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, కార్పొరేటర్ పి జ్ఞానేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబర్‌పేట మహాంకాళి ఆలయ వేదికగా నిర్వహించే బోనాల పండుగను ప్రతియేటా జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు దేవస్థాన సేవాసమితి నిర్వహించనుందని వారు తెలిపారు. బోనాల సందర్భంగా మహంకాళి ఆలయం వద్ద పారిశుద్ధ్యం, నీటి సౌకర్యం వంటి సదుపాయాలు కల్పించనున్నట్టు దేవస్థాన సేవాసమితి తెలిపింది. రోడ్ల మరమ్మతు, వీధిలైట్ల ఏర్పాటు, పారిశుద్ధ్యంను మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బోనాలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నందున చైన్ స్నాచింగ్ జరిగే అవకాశాలు లేకపోలేదని, పోలీసులు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయాలని వారు పోలీసు ఉన్నతాధికారులను కోరుతూ సమావేశంలో తీర్మానించారు. అమ్మవారి ఘటం ఊరేగింపు కొనసాగుతుందని, ఆగస్టు, 4,5 తేదీల్లో నిర్వహించే బోనాలకు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.
గోల్కొండకోటపై అమ్మవారికి ఐదవ పూజలు
నార్సింగి: చారిత్రాత్మకమైన గోల్కొండ కోట శ్రీ జగదాంబిక మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఐదువ బోనాలను భక్తులు అమ్మవారికి అంగరంగావైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. కోటపై ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళీ అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు ఉత్సవాలు కావడంతో గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడింది.
కాగా ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుని వారివారి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ బోనాలు ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఆధార్ నెంబర్‌ను పొందుపర్చాలి
చాంద్రాయణగుట్ట, జూలై 25: ఉపకార వేతనాలు (రెన్యువల్, ప్రెస్) పొందే ప్రతి ఎస్‌సి, ఎస్టీ, ఇబిసి మైనార్టీ, వికలాంగ విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ యుఐడి నెంబరును ఈ-పాస్ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరు సమావేశమై ఆధార్ ఆధారిత ఉపకార వేతనాల అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో వివిధ జూనియర్, డిగ్రీ మరియు వృత్తి విద్యాకళాశాలలో చదువుతున్న విద్యార్థులందరు ఉపకార వేతనాలు పొందేందుకు ఆధార్ యు.ఐ.డి. తప్పకుండా కలిగి ఉండాలన్నారు. 2013-14 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాలను కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులతోపాటు రెన్యువల్ కోసం కూడా ఆధార్ యు.ఐ.డి. పొందుపరచాలన్నారు. ఈ-పాస్‌లో అప్‌లోడ్ చేసేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై మూడు విడతలలో అవగాహన సదస్సు ఏర్పాటుచేసి విద్యార్థుల్లో చైతన్యం కల్పించనున్నట్లు కలెక్టరు తెలిపారు. మొదటి విడతగా జూలై 27న 361 కాలేజీల్లో, రెండవ విడత ఆగస్టు 3న మరో 361 కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ రెండు విడతల్లో అప్‌లోడ్ చేసుకోని విద్యార్థుల కోసం ఆగస్టు 8న మరొకమారు 722 కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించి అప్‌లోడ్ చేస్తామన్నారు. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలలకు చెందిన సుమారు 1,32,524 విద్యార్థులు ఈ-పాస్‌లో యుఐడిని తప్పనిసరిగా పొందుపరిచేలా సంక్షేమ శాఖ అధికారులు కలెక్టరు ఆదేశించారు. 96443 విద్యార్థులకు యుఐడి ఉన్నాయని మరో 11238 మంది విద్యార్థులకు ఈఐడి ఉందని ఆయన తెలిపారు. వివిధ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగుల విద్యార్థులు తమ యుఐడి నంబరును స్కాన్‌చేసి ఈ-పాస్‌లో పొందుపరిచేలా సంక్షేమ శాఖాధికారులతోపాటు కళాశాల యాజమాన్యాలు కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు ప్లెక్సీ, పాంప్లేట్ విడుదల చేసారు. ఈ ప్లెక్సీలను విద్యార్థులకు అవగాహన కల్పించే నిమిత్తం కళాశాలలో ప్రదర్శించాలని డిడి సోషల్ వెల్ఫేర్ విజయ్ పాల్‌ను కలెక్టరు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిడి సోషల్ వెల్ఫేర్ విజయ్ పాల్, జిల్లా బిసి సంక్షేమ శాఖాధికారి భార్గవి, ఈడి మైనార్టీ కార్పొరేషన్ అక్రం అలీ తదితరులు పాల్గొన్నారు.

ఆష్ఢా మాసంలో తెలంగాణ ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే బోనాల
english title: 
bonalu

రైతుల ఆందోళన.. లాఠీచార్జి

$
0
0

కీసర, జూలై 25: గత వారం రోజులుగా కీసర దాయరలో వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని ఆగ్రహించిన రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. రోడ్డుపై రాళ్లు ఉంచి వాహనాల రాకపోకలకు అడ్డుతగిలారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదంటూ వాపోయారు. ట్రాన్స్‌కో ఏఇ కిషోర్‌కు ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్పారు. లైన్‌మెన్ స్పందన కూడా లేకపోవడంతో చివరికి విద్యుత్ కార్యాలయంలోకి వచ్చి అధికారులు లేకపోవడంతో రోడ్‌పై బైఠాయించి ధర్నాకు దిగారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు సరాసరి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి ధర్నా చేస్తున్న రైతులపై లాఠీచార్జి చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం 144 సెక్షన్ అమలులో ఉందని, ధర్నా విరమించకపోతే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్ హెచ్చరించడంతో రైతులు ధర్నా విరమించారు. లాఠీచార్జిలో రైతులు మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి గాయపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జి చేయడం పట్ల పలువురు మండిపడ్డారు.

కెమికల్ సెజ్‌ల ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి
ఘట్‌కేసర్, జూలై 25: ఘట్‌కేసర్ మండల పరిధిలో ఏర్పాటు చేయతలపెట్టిన కెమికల్ సెజ్‌లను వెంటనే విరమించుకోవాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహ్మరెడ్డి, ముచుకుందా ఫౌండేషన్ ప్రధానకార్యదర్శి పిట్టల శ్రీశైలం డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్‌లో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఘట్‌కేసర్ మండల పరిధి ఏదులాబాద్, మాదారం, అంకుషాపూర్ గ్రామాలలోని 630 ఎకరాలలో నగరంలోని నిషేధిత కెమికల్ కంపనీలను తరలించేందుకు ఏపిఐఐసి కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే మూసీనది కాలుష్యం బారిన పడి ఈ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారని, ఇదికాదని కాలుష్య కారక పరిశ్రమల్ని ఏదులాబాద్, అంకుషాపూర్, మాదారం గ్రామాలలో ఏర్పాటు చేసి 630 ఎకరాల్లో కెమికల్ హబ్ చేసే కుట్రల్ని ఈ ప్రాంత వాసులుగా భగ్నం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు కోరారు. కాలుష్య పూరిత పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తే గాలి, నీరు చివరికి ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. చెరువులు, కుంటలలో కెమికల్ నీరు చేరి భూగర్భ జలాలు కలుషితం అవుతాయని తెలిపారు. కావున ప్రజా సంఘాల ప్రతినిధులు ఏదులాబాద్, అంకుషాపూర్, మాదారం గ్రామాలలో ఆదివారం పర్యటించనున్నందున ఘట్‌కేసర్, బీబీనగర్, పోచంపల్లి మండలాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు కమిటీతో పంచుకోవాలని ఆయన కోరారు. ఈ పర్యటనలో పర్యావరణ వేత్త కెప్టెన్ జలగం రామారావు, జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ సరస్వతి కావుల, చేతన సొసైటీ డైరక్టర్ డాక్టర్ దొంతి నర్సింహ్మారెడ్డి, సేవ్ అవర్ అర్బన్ లేక్స్ ప్రతినిధులు చక్రవర్తి తదితరులు పాల్గొంటారని తెలిపారు.

వృద్ధుల బాగోగులను చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ
ఇబ్రహీంపట్నం, జూలై 25: వృద్ధ తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసం అనేక చట్టాలు అమలులో ఉన్నాయని మానవ హక్కుల కమిషన్ సభ్యుడు కాకుమాను పెదపేరిరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రం వినోభనగర్‌లో మాతాపితరుల సేవా సదనంలో బండారు చినరంగారెడ్డి స్మారక భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల మంచిచెడులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నేడు అనేకమంది పెళ్లిచేసుకుని తల్లిదండ్రులనుండి దూరంగా ఉంటూ వారి బాగోగులు చూసుకోవడంలో అలక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తోడు ఉండాల్సిన పిల్లలు వారి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడంతో వృద్ధాశ్రమాలలో చేరడం భారతీయ సంస్కృతికి గొడ్డలిపెట్టులాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల బాగోగులు చూడని పిల్లలపై చర్యలు తీసుకోవడం కోసం అనేక చట్టాలు అమలులో ఉన్నాయని అన్నారు. తమను బాగా చూసుకోవడం లేదని ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే, వారి బాగోగుల కోసం నెలకు సరిపడా ఖర్చులు పిల్లలనుండి ఇప్పించే అధికారం ఆర్డీఓకు ఉందని, ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాలను కోర్టుల్లో సవాల్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చట్టం చేసినట్టు చెప్పారు.
తల్లిదండ్రుల ఆస్తులు స్వాధీనం చేసుకుని అనుభవిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తే ఆ ఆస్తిని తిరిగి తల్లిదండ్రులు స్వాధీనం చేసుకునే చట్టాలు అమలులో ఉన్నాయని వివరించారు. వృద్ధ తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేసినా తమ కమిషన్ స్పందించి, తగు చర్యలు తీసుకుంటుందని వివరించారు.
వృద్ధాశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ స్థలం కేటాయించి, వృద్ధుల కోసం అనురాగ నిలయాలు నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘసంస్కర్తలు, రాజీవ్ రత్న అవార్డు గ్రహిత పివి చలపతిరావు, కృష్ణమూర్తి తదితరులను ఘనంగా సన్మానించారు.

గత వారం రోజులుగా కీసర దాయరలో వ్యవసాయ
english title: 
farmers

ఇసెట్ కౌనె్సలింగ్‌లో గోల్‌మాల్

$
0
0

హైదరాబాద్, జూలై 26: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి బి.ఎస్సీ, పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు నిర్వహించిన ఇసెట్ కౌనె్సలింగ్‌లో గోల్‌మాల్ జరగడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు గగ్గోలు పెట్టడంతో సాంకేతిక విద్యాశాఖ అధికారులు తేరుకుని పొరపాట్లను సరిదిద్దారు. తుది దశలో అలాట్ అయిన విద్యార్థులకు సవరించిన జాబితాను శుక్రవారం విడుదల చేశారు. తొలి దశ అడ్మిషన్లు జూన్ 10నే మొదలయ్యాయి. సర్ట్ఫికేట్ల పరిశీలన తర్వాత జూలై 12న వారికి సీట్లను అలాట్ చేశారు. అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య 42,478 కాగా అందులో సర్ట్ఫికేట్ల పరిశీలనకు 27,448 మంది మాత్రమే హాజరయ్యారు. కానీ సీట్లు మాత్రం 1,47,753 ఉన్నాయి. అందులో చివరికి 26509 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక తుది దశలో 27,883 మంది మాత్రమే సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరయ్యారు. అందులో 9235 మంది మాత్రమే తమ ఆప్షన్లను ఇచ్చారు. మొత్తం సీట్లు 1,47,768 కాగా, అందులో తొలి దశలో చేరిన వారు 23003 మంది మాత్రమే. దాంతో రెండో దశకు సీట్లు 1,24,765 మిగిలాయి. అందులో 3711 సీట్లు మాత్రమే రెండో దశలో భర్తీ అయ్యాయి. అంటే రెండు దశల్లో కలిపి 26714 మంది మాత్రమే సీట్లు తీసుకోగా, 1,21,054 సీట్లు మిగిలిపోయాయి. ఎక్కువ శాతం సీట్లు మిగిలిపోవడంతో కొన్ని యాజమాన్యాలు రంగంలోకి దిగాయి.
ఇంజనీరింగ్‌లో పదుల సంఖ్యలో మాత్రమే అడ్మిషన్లు పొందిన ఈ కాలేజీల యాజమాన్యాలు ఎఫ్‌డిహెచ్ అభ్యర్థులను సాంకేతికంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో విద్యార్థి ఎలాంటి ఆప్షన్ ఇవ్వకున్నా, నచ్చని కాలేజీల్లో కన్వీనర్ అలాట్ చేయడంతో విద్యార్థులు నివ్వెరపోయారు. దీనిపై కన్వీనర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు వందలాది విద్యార్థులు ఇసెట్ అడ్మిషన్ల కార్యాలయానికి చేరుకుని నిరసన తెలపడంతో అధికారులు పొరపాట్లు సరిదిద్దే కార్యక్రమం చేపట్టారు. దాదాపు వంద మందికి రివైజ్డ్ అలాట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చామని అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ రఘునాధ్ ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు.
ఆర్‌జియుకెటిలో 246 సీట్లు మిగులు
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నిర్వహించిన కౌనె్సలింగ్‌లో మొత్తం 246 సీట్లు మిగిలిపోయాయని విసి ప్రొఫెసర్ రాజ్‌కుమార్ చెప్పారు. బాసరలో 917 మంది, నూజివీడులో 923 మంది, ఆర్‌కె వ్యాలీలో 911 మంది చేరారని, బాసరలో 83, నూజివీడులో 76, ఆర్‌కె వ్యాలీలో 87 సీట్లు మిగిలిపోయాయని విసి పేర్కొన్నారు. వెయిట్ లిస్టు అభ్యర్థులకు జూలై 28న కౌనె్సలింగ్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కొత్తగా చేరిన విద్యార్ధులకు జూలై 26న తరగతులు ప్రారంభిస్తున్నట్టు ఆయన చెప్పారు.
నేడు ఐసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్
ఐసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను శనివారం జారీ చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొసర్ పి. జయప్రకాశ్‌రావు తెలిపారు. ఎపిఐసెట్ డాట్ నిక్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో దీనిని ఉంచుతామని ఆయన వెల్లడించారు. సర్ట్ఫికేట్ల పరిశీలన ఆగస్టు 3 నుండి ప్రారంభం అవుతుందని, ఆప్షన్ల ఎంట్రీ ఆగస్టు 6న ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మొత్తం 1,26,000 మంది విద్యార్ధులు ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఆయన వివరించారు.

సరిదిద్దిన అడ్మిషన్ల కన్వీనర్ భర్తీ 26వేలు, మిగులు 1.21 లక్షల సీట్లు
english title: 
i

తెలంగాణపై వెనక్కి తగ్గితే మళ్లీ సకలజనుల సమ్మె

$
0
0

హైదరాబాద్, జూలై 26: తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం వెనక్కి తగ్గితే గంటలో సమ్మెకు దిగుతామని తెలంగాణ నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం సంయుక్తంగా హెచ్చరించాయి. టిఎన్‌జివో భవన్‌లో శుక్రవారం టిఎన్‌జివో అధ్యక్షుడు దేవిప్రసాద్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్, రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఎపి ఎన్జీవోల సంఘం సమైక్య సభ నిర్వహిస్తే, అదే రోజు చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈసారి నిర్వహించే సకల జన సమ్మెలో అత్యవసర వైద్యసేవలు మినహా అన్ని విభాగాలు సమ్మెకు దిగుతాయని పేర్కొన్నారు. విభజనకు ఎపిఎన్జీవోల సంఘం సహకరించాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల ఇక్కడ స్థిరపడిన ప్రజలకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు స్పష్టం చేసారు. సీమాంధ్ర ఉద్యోగులకు మనోధైర్యం కల్పించేందుకు జూలై 29 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు సద్భావన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు టిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగులకు వ్యక్తిగతంగా కలిసి, రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరుతామని ఆయన తెలిపారు.

టిఎన్‌జివో భవన్‌లో శుక్రవారం సమావేశమైన అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న నేతలు

ముఖ్యమంత్రి రాజకీయ
కార్యదర్శితో డిజిపి భేటీ

రాష్ట్ర పరిస్థితులపై చర్చలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయ కార్యదర్శి శంకర్‌తో డిజిపి దినేష్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులపైనా, అలాగే రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ అధికారులతో రాష్ట్ర పరిస్థితులపై చర్చించిన దినేష్‌రెడ్డి.. శుక్రవారం హైదరాబాద్ చేరుకోగానే నేరుగా సచివాలయం వెళ్లి శంకర్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర విభజనపై వస్తున్న అంశాల గురించి చర్చించి ఉంటారని సమాచారం. అయితే రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో శాంతి భద్రతలపైనా చర్చలు జరిగాయని అధికారులు వెల్లడించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో చెదురుమదురుగా జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని రెండవ విడత ఎన్నికలకు బలగాలను సమాయత్తం చేస్తున్నారు. మావోల ప్రాబల్యం ఉన్న విశాఖ, అనంతపురంలోని గిరిజన ఏజెన్సీల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన బలగాలను పంపుతున్నారు. జంట నగరాల్లో బోనాలు, రంజాన్ పండుగల నేపథ్యంలో ప్రత్యేకంగా పోలీసు బలగాలను రంగంలోకి దింపుతున్నారు. అదీగాక రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడులు జరగవచ్చునని కేంద్ర ఇంటెలిజన్స్ బ్యూరో హెచ్చరించడంతో జంట నగరాల్లోని ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలను వేగవంతంగా ఏర్పాటు చేస్తున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఆక్టోపస్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

నాడు చంద్రబాబు, రోశయ్య.. నేడు కిరణ్, జగన్

ప్రత్యేక తెలంగాణను అడ్డుకుంటున్నారు

మండిపడ్డ టిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును నాడు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అడ్డుకుంటే, నేడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని టిఆర్‌ఎస్ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకుడు టి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆంధ్రా పార్టీలైనా కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు అడ్డుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. తమ పార్టీ ఎప్పటినుంచో ఈ మూడు పార్టీలు ఆంధ్రా పార్టీలనీ చెప్పిందని, మరోసారి అది రుజువైందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మళ్లీ రాజీనామాల డ్రామాలకు తెరతీశారన్నారు. తనకు ఏమి తెలియదన్నట్టుగా సచివాలయంలో ఒకవైపు అమ్మహస్తం పథకాన్ని సమీక్షిస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కమలాపూర్ ఎమ్మెల్యే వీరశివా రెడ్డితో, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలతో రాజీనామాలు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో సోనియాగాంధీకి లేఖ డ్రామాలను కిరణ్ ఆడించారని హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఈ ప్రాంతంలో ఆక్రమించుకున్న తన భూములు ఎక్కడ పోతాయోనన్న భయంతో ఆడాల ప్రభాకర్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తోన్నట్టు హడావుడి చేసారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆడాల ప్రభాకర్ రెడ్డిలాంటి నేతలు కబ్జా చేసిన తన భూములు పోతాయని భయపడుతున్నారు తప్పితే, సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయం లేదని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని, ఇందులో భాగంగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణపై వైఎస్‌ఆర్‌సిపి వైఖరి ఏమిటో విజయమ్మను ఆ పార్టీలోని ఈ ప్రాంత నేతలు నిలదీయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలకుగానీ, ఆ ప్రాంతానికి చెందిన ఉద్యోగస్తులకుగానీ ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. తెలంగాణను వ్యతిరేకించే శక్తులు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతూ, వారిలో లేని భయాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నీటి జలాల పంపిణికి ట్రిబ్యునళ్లు ఉన్నాయని, ఇక్కడ స్థిరపడిన ప్రజలకుగానీ, ఉద్యోగస్తులకుగానీ రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులు ఉంటాయనీ, వీటికి ఎవరు భయపడనవసరం లేదని ఆయన స్పష్టం చేసారు. తెలంగాణపై నిర్ణయాన్ని వెల్లడించే సమయంలో రాజీనామాలు చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుంటే, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు నోరు మెదపడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు.

ఇక్కడ సమైక్య సభ పెడితే, అదేరోజు చలో హైదరాబాద్ కేంద్రానికి, ఎపిఎన్జీవోలకు టిఎన్‌జివో నేతల అల్టిమేటమ్
english title: 
t

రిజర్వాయర్లలో నీటి హోరు!

$
0
0

హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు జల కళతో కొత్తదనం సంతరించుకున్నాయి. చాలాకాలం తరువాత వర్షాకాలం ప్రారంభమైన తొలిదశలోనే అనేక రిజర్వాయర్లు నీటితో కళకళలాడిపోతున్నాయి. కృష్ణా నదిపై ప్రాజెక్టులే కాకుండా గోదావరి నదిపైనున్న ప్రాజెక్టులు కూడా జల కళ సంతరించుకున్నాయి. అయితే పెన్నా బేసిన్‌లోని ప్రాజెక్టులు మాత్రం కొంత వెనుకబడి కనిపిస్తున్నాయి. నిర్మాణం జరిగి నేటితో ఏభై ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా దర్శనమిస్తోంది. ఈ ప్రాజెక్టులు వాస్తవ సామర్ధ్యం 90.31 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 86 టిఎంసిలకు నీటి నిల్వ చేరుకుంది. ఇంకా 1.30 లక్షల క్యూసెక్కుల నీరు తరలివస్తుండగా, 1.10 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఏభై ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో నీటిగలగలల అపూర్వ దృశ్యాన్ని తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు బారులు తీరుతున్నారు. కృష్ణా నదిపై ప్రధాన శ్రీశైలం ప్రాజెక్టులో గత ఏడాది కంటే ఈసారి భారీగా నీరు దర్శనమిస్తోంది. గత ఏడాది 26.52 టిఎంసిల నీరు మాత్రమే ఉండగా, ఇప్పుడు 80 టిఎంసిల వరకు నిల్వ చేరుకుంది. ఈ ప్రాజెక్టులోకి పైనుంచి వస్తున్న ఇన్‌ఫ్లో రోజురోజుకూ పెరుగుతుండడం విశేషం. గురువారం ఉదయానికి 1.76 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, శుక్రవారం ఇది 2.50 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. గోదావరిపైనున్న ప్రాజెక్టుకు సంబంధించి కడ్డెం, దిగువ మానేరు, నిజాం సాగర్, సింగూరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోకి గత ఏడాది కంటే అధికంగా నీరు చేరుకుంది. కడ్డెం ప్రాజెక్టు దాదాపు నిండిపోగా, దిగువమానేరు సగం నిండి కనిపిస్తోంది. నిజాం సాగర్‌లో గత ఏడాది కేవలం 2 టిఎంసిల నీరు ఉండగా ఇప్పుడు ఎనిమిది టిఎంసిలతో కళకళలాడుతోంది. ఇక శ్రీరాంసాగర్‌లో గత ఏడాది ఇదే రోజుకు కేవలం తొమ్మిది టిఎంసిలు మాత్రమే దర్శనమివ్వగా, ఇప్పుడు ఏకంగా 85 టిఎంసిల నీటినిల్వ కనిపించడం విశేషం. గోదావరి నదిలోకి తరలివస్తున్న వరద నీరు కారణంగా ఏకంగా 1764 టిఎంసిల నీటిని సముద్రంలోకి వృధాగా విడిచిపెట్టాల్సి వచ్చింది. తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మూడు రోజుల నుంచి డ్యాం 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు డ్యాంలోకి వస్తోంది.

శుక్రవారం జలాశయం నీటిమట్టం 1,631.87 అడుగులకు చేరింది.

వైకాపా ద్వంద్వ వైఖరి
మల్లు రవి విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: రాష్ట్ర విభజన విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి మల్లు రవి విమర్శించారు. రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ఆ పార్టీ స్పష్టంగా చెప్పిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనివార్యమైతే తాము పరిస్థితుల దృష్ట్యా తెలంగాణతోనే కొనసాగడానికి ఇష్టపడతామని అన్నారు. అయితే తాను సమైక్యవాదినని, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పారు.
విభజనకు అవకాశాలు కనిపించడం లేదని ఆయన తెలిపారు.

నిండుకుండగా ఏభై ఏళ్ల ఎస్సారెస్పీ మిగిలిన ప్రాజెక్టుల్లోనూ జలకళ గోదావరి ప్రాజెక్టులకూ వరద కళకళలాడుతున్న కడెం, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, దిగువ మానేరు ప్రాజెక్టులు సముద్రంలోకి 1764 టిఎంసిలు విడుదల
english title: 
r

శాంతిస్తున్న గోదావరి

$
0
0

రాజమండ్రి/్భద్రాచలం, జూలై 26: గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్డడంతో ధవళేశ్వరం వద్ద శుక్రవారం రాత్రి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో చెదురుమదురుగా మాత్రమే వర్షపాతం నమోదవటం, భద్రాచలం వద్ద గోదావరీ నీటిమట్టం గంటకు రెండు నుండి మూడు పాయింట్లు చొప్పున వేగంగా తగ్గుతుండటంతో ధవళేశ్వరం వద్ద కూడా ఉదయం 10గంటల నుండి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. అర్ధరాత్రి నుండి ఉదయం 9గంటల వరకు 17.20 అడుగుల వద్ద నిలకడగా ఉన్న నీటిమట్టం 10గంటల నుండి గంటకు పాయింటు చొప్పున తగ్గటం మొదలయింది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద సాయంత్రం 6గంటలకు 16.40 అడుగులకు చేరుకున్న నీటిమట్టం, రాత్రి 8గంటలకు 16.2 అడుగులకు చేరుకుంది. ఆ సమయంలో వరద ప్రవాహం కూడా 17 లక్షల క్యూసెక్కుల కన్నా దిగువకు చేరటంతో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. రానున్న 48 గంటల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోగానీ, ప్రధాన ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, పెన్‌గంగ తదితర నదులపై గానీ అధిక వర్షపాతం నమోదుకాకపోతే, వరద ఉద్ధృతి 48గంటల్లో మరింత వేగంగా తగ్గి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలంలోని గ్రామాలు కూడా ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నప్పటికీ, శనివారం రాత్రికి ఆ గ్రామాలకు రాకపోకలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ముంపులో ఉన్న లంక గ్రామాలకు రోజులు గడుస్తున్న కొద్దీ నష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే లంక గ్రామాల్లో కూరగాయలు, అరటి వంటి ఉద్యానపంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 8 రోజులుగా నీటిలోనే నానుతున్న ఇళ్లలో చాలా వరకు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి శాంతించింది. గురువారం 56.6 అడుగులకు చేరుకున్న నీటి మట్టం శుక్రవారం 47.4 అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు భద్రాచలం వద్ద రెండు, మూడో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 47.4 అడుగులకు చేరుకున్నప్పటికీ శుక్రవారం సైతం రవాణా పునః ప్రారంభం కాలేదు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 150 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం డిపోకు చెందిన 40 గ్రామీణ సర్వీసులు గత 9 రోజులుగా నిలిచిపోవడంతో సుమారు రూ.70 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఆర్టీసీ అంచనా వేసింది. కాగా, ఆర్టీసీ బస్సులు శనివారం నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అంతేకాక విద్యుత్, టెలిఫోను, నెట్ సౌకర్యాలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. గ్రామాల్లోని ప్రజలు అంధకారంలోనే మగ్గుతూ మంచినీరు, కిరోసిన్, పాలపొడి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వరుసగా రెండుసార్లు గోదావరి వరద రావడంతో వేల హెక్టార్లలో పత్తి, పునాస, వరి పైర్లు వరద నీటిలో మునిగిపోయాయి. 45 పునరావాస కేంద్రాలలో సుమారు 10 వేల మంది ఉన్నారు. శుక్రవారం సాయంత్రం భద్రాచలంకు ఎగువన గల ఏటూరునాగారం వద్ద వరద పెరుగుతున్నట్లు సబ్ కలెక్టర్ గుప్తా తెలిపారు.

రాజమండ్రిలో గోదావరి ప్రవాహం

తుడిచిపెట్టుకుపోయిన పంటలు * పెరుగుతున్న వరద నష్టాలు
english title: 
s

సమైక్య పోరు ఉద్ధృతం

$
0
0

విశాఖపట్నం, జూలై 26: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేక్రమంలో భాగంగా డిసెంబర్ 23న చేసిన ప్రకటనకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉండాలని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి డిమాండ్ చేసింది. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో విశాఖలోని ఆంధ్రాయూనివర్శిటీలో శుక్రవారం ఒకరోజు రిలేనిరాహార దీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ, వర్కింగ్ కమిటీ సమావేశాల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని జెఎసి ప్రతినిధులు ఆరేటి మహేష్, లగుడు గోవిందరావు తదితరులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి కన్వీనర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీసే ఎటువంటి నిర్ణయాన్ని తాము స్వాగతించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు తమ అధిష్ఠానాన్ని ఒప్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు 24 గంటల డెడ్‌లైన్ విధించారు. దీనిలో భాగంగా శనివారం విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిని ముట్టడించనున్నట్టు వారు వెల్లడించారు. సిపిఐ నారాయణ పిచ్చిప్రేలాపన కట్టిపెట్టాలని, లేని పక్షంలో సీమాంధ్రలో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. నారాయణ తన నోటిని అదుపులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపింది. అంతకు ముందు విద్యార్థి జెఎసి ఎయులోని గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ జరిపారు. కార్యక్రమంలో యువజన జెఎసి కన్వీనర్ కోటి రవికుమార్, సమైక్యాంధ్ర పోరాట సమితి జిఎ నారాయణ రావు, ఎపి ఎన్జీఓ ప్రతినిధులు కె కోటేశ్వరరావు, నాగేశ్వరరెడ్డి, ఎయు ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులు బి రామచందర్, ఎయు ప్రొఫెసర్లు వేణు, బాబూరావు, ప్రేమానంద్ తదితరులు పాల్గొన్నారు.
రగులుతున్న ఉద్యమం
అనంతపురం: అనంతపురం జిల్లాలో సమైక్య సెగ రగులుకుంది. కోర్‌కమిటీ సమావేశం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటన నేపధ్యంలో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలో ఆటోను ధ్వంసం చేశారు. పలు వాహనాలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజాప్రతినిధులు పిరికివారని ఆరోపించారు. నేతలను జిల్లాలో అడుగుపెట్టనీయమన్నారు.ర్యాలీ, రాస్తోరోకో నిర్వహించారు.
ఎమ్మెల్యేల రాజీనామాలు
నెల్లూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు జిల్లాలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డికి చెందిన స్థానిక అతిథిగృహంలో వారు విలేఖరుల సమక్షంలో తమ రాజీనామా పత్రాలపై సంతకాలు పెట్టారు. నెల్లూరు నగర శాసనసభ్యులు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి కూడా హాజరై ఆదాల బాటలోనే తాను కూడా అంటూ రాజీనామా పత్రంపై సంతకం చేశారు. ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపుతున్నట్లు వెల్లడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 27న విద్యాసంస్థల బంద్ చేపడుతున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వెల్లడించారు.
సోనియాకు పోస్టు కార్డులు
కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తొందరపడి ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి హెచ్చరించింది. శుక్రవారం శాప్స్ ఆధ్వర్యంలో తిరుపతిలో నగరంలోని ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులతో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రాంతీయ తపాల కార్యాలయం ఎదుట నిర్వహించారు. శాప్స్ ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తొలిరోజున 1200 మంది పోస్టుకార్డులను సోనియాగాంధీకి పంపారని, లక్ష కార్డులను తిరుపతి నుండే పంపనున్నట్లు తెలిపారు.
మంత్రి అహ్మదుల్లా ఇల్లు ముట్టడి
కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో మైనార్టీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ శాఖ మంత్రి హాజీ ఎస్‌ఎండి అహ్మదుల్లా ఇంటిని ముట్టడించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూల ప్రకటనలు వస్తున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజీనామా చేసి ఉద్యమంలోకి రాకుండా ఢిల్లీకి వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు.

నేడు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి * నిరాహార దీక్షలో విద్యార్థి జెఎసి
english title: 
s
Viewing all 69482 articles
Browse latest View live